16-11-2018, 09:23 AM
అప్డేట్ సూపర్ గా ఉంది రావు గారు
Poll: Plz Give The Rating For This Story You do not have permission to vote in this poll. |
|||
Very Good | 634 | 87.45% | |
Good | 72 | 9.93% | |
Bad | 19 | 2.62% | |
Total | 725 vote(s) | 100% |
* You voted for this item. | [Show Results] |
Fantasy నా ఆటోగ్రాఫ్.....స్వీట్ మొమరీస్ - completed
|
16-11-2018, 09:23 AM
అప్డేట్ సూపర్ గా ఉంది రావు గారు
16-11-2018, 09:38 AM
Update bro
16-11-2018, 12:18 PM
(15-11-2018, 02:11 PM)Pinkymunna Wrote: Super broo awesome Chala kastapaddanu login avadaniki mothaniki ayanu reply pettanu waiting for next update broo thanks for continuing story చాలా థాంక్స్ పింకీ గారు..... ఒక్కోసారి ఐడి క్రియేట్ చేసుకోవడానికి విసుగొస్తుంది.....మొత్తానికి క్రియేట్ చేసుకుని కామెంట్ పెట్టినందుకు చాలా ఆనందంగా ఉన్నది.....
16-11-2018, 12:19 PM
16-11-2018, 12:20 PM
Prasad rao gaaru hai
_______________________________________________________________________________________________
నా కథలు పూర్తి అవుతాయి అని అనుకునే పాఠకులు,
స్టోరీ చదివాక ఫీడ్ బ్యాక్ ఇస్తారు అని నమ్మే రచయితలు,
ఇద్దరూ ఒకటే, కాబట్టి రాసినంత వరకు చదివి కొట్టుకుని పో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు..
16-11-2018, 12:20 PM
16-11-2018, 12:21 PM
16-11-2018, 12:22 PM
16-11-2018, 12:22 PM
16-11-2018, 12:23 PM
16-11-2018, 12:53 PM
(This post was last modified: 22-03-2019, 02:25 PM by prasad_rao16. Edited 1 time in total. Edited 1 time in total.)
Episode : 8
రాముని చూడగానే అప్పటి దాకా డల్ గా ఉన్న రేణుక మొహంలో సంతోషం కనిపించింది. రాము రేణుక దగ్గరకు వచ్చి ప్రొఫెసర్ ని విష్ చేసి రేణుక వైపు తిరిగి, “నీకు చెక్లెట్లు అంటే ఇష్టమని తీసుకొచ్చాను,” అంటూ తన చేతిలో ఉన్న గిఫ్ట్ ప్యాక్ రేణుకకి ఇచ్చాదు. రేణుక సంతోషంగా రాము వైపు చూసి నవ్వుతూ, “థాంక్స్ రాము,” అంటూ ఆ గిఫ్ట్ ప్యాక్ తీసుకున్నది. ఇదంతా ప్రొఫెసర్ సుందర్ అసహనంగా చూస్తున్నాడు….అతని మొహంలో కోపం స్పష్టంగా కనిపిస్తున్నది. సుందర్ : ఈ మధ్య రేణుకతో నువ్వు చాలా ఎక్కువగా కనిపిస్తున్నావు… రాము : ఏం లేదు ప్రొఫెసర్ గారు….ఇక్కడకు కొత్తగా వచ్చాను….జాబ్ కోసం వెతుక్కుంటున్నాను…. సుందర్ : తొందరగా వెతుక్కుని జాబ్ తో జాయిన్ అవ్వు…. రాము : నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం సుందర్ గారు…మీకు అభ్యంతరం లేకపోతే నేను ఇక్కడే కూర్చుని మ్యూజిక్ వింటాను. అంటూ అక్కడ పియానో ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. రాము అక్కడే తన ఎదురుగా కూర్చునే సరికి రేణుక ఆనందంగా అలాగే అన్నట్టు తల ఊపింది. కాని ప్రొఫెసర్ సుందర్ మాత్రం కోపంగా రాము వైపు చుస్తూ, “కాని నాకు మాత్రం ఇష్టం లేదు….నాకు, నా స్టూడెంట్ కి మధ్య ఎవరైనా ఉండటం నాకు అసలు ఇష్టం ఉండదు…” అన్నాడు. ప్రొఫెసర్ అలా అనేసరికి రేణుక ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. దాంతో రాము సోఫాలో నుండి లేచి సుందర్ దగ్గరకు వచ్చి, “నాకు అర్ధమయింది,” అంటూ రేణుక వైపు చూసి, “నేను ఇక్కడే బయట కారిడార్ లో కూర్చుని ఉంటాను…అప్పుడు సుందర్ గారికి తన స్టూడెంట్ మధ్య నేను ఉండను కదా….అక్కడ కూర్చుని నేను మ్యూజిక్ వింటుంటాను….నువ్వు క్లాస్ ఫినిష్ చేసుకుని వచ్చేయ్,” అన్నాడు. రేణుక సరె అన్నట్టు తల ఊపింది. రాము ఆ రూమ్ లోనుండి బయటకు వెళ్ళి అక్కడ ఉన్న సోఫాలో కూర్చుని ఏదో జరగబోతున్నది అని ఆలోచిస్తున్నాడు. రాము బయటకు వెళ్లగానే సుందర్ రేణుక వైపు తిరిగి, “ఇక నువ్వు ప్లే చెయ్యి,” అన్నాడు. బయట కారిడార్ లో నిల్చున్న రాము అక్కడ గ్లాసెస్ లోనుండి బయటకు చూస్తున్నాడు. అలా ఐదు నిముషాలు గడిచేసరికి రాముకి తన వెనకాల ఎవరో వచ్చినట్టు అనిపించి వెనక్కు తిరిగి చూసాడు. కాని ఊహించని విధంగా ప్రొఫెసర్ సుందర్ అక్కడ ఉన్న హాకీ స్టిక్ తీసుకుని రాము తప్పించుకోవడానికి అవకాశం ఇవ్వకుండా గట్టిగా అతని మొహం మీద కొట్టాడు. దాంతో రాము కారిడార్ అద్దాలు పగలగొట్టుకుని లాన్ లో పడిపోయాడు. అది చూసిన రేణుక లోపలి నుండి పరిగెత్తుకుంటూ వచ్చింది….అప్పటికే రాము నేల మీద పడిపోయి తల పట్టుకుని బాధతో మెలికలు తిరిగిపోతున్నాడు. రాము అలా మెలికలు తిరగడం చూసిన రేణుక, “రాము…” అంటూ గట్టిగా అరుస్తూ అతని దగ్గరకు రాబోయింది. ఇంతలో ప్రొఫెసర్ సుందర్ తన చేతిలో ఉన్న హాకీ స్టిక్ ని పక్కన పడేసి రాము దగ్గరకు పరిగెత్తి వెళ్ళబోతున్న రేణుక చెయ్యి పట్టుకుని ఆపేసి ఆమె నడుం పట్టుకుని లోపలికి లాక్కెళ్తున్నాడు. రేణుకకి ఏం జరుగుతుందో అర్ధం కాక సుందర్ చేతుల్లో నుండి బయట పడటానికి గింజుకుంటూ, “ప్రొఫెసర్ సుందర్….ఏం చేస్తున్నారు….” అంటుంది. సుందర్ రేణుకని అలాగే పట్టుకుని రూమ్ లోపలికి తీసుకెళ్తూ, “నీకు నాకు మధ్యలో ఎవరొచ్చినా ఊరుకోను,” అంటూ రేణుకని గది లోకి లాగి డోర్ లాక్ చేసాడు.
16-11-2018, 12:55 PM
అంతలో కింద పడిన రాము పైకి లేచి నడవబోయాడు…కాని తల మీద గట్టిగా దెబ్బ తగలడంతో మళ్ళీ కింద పడిపోయాడు.
గది లోపల నుండి రేణుక సుందర్ ని ఏం చెయ్యొద్దు అంటూ బ్రతిమలాడుతున్న మాటలు వినిపిస్తున్నాయి. దాంతో రాముకి సుందర్ రేణుక మీద రేప్ అటెంప్ట్ చేస్తున్నాడని అర్ధమయింది. వెంటనే రాము కింద నుండి లేచి బెడ్ రూమ్ డోర్ దగ్గరకు వచ్చి గ్లాసెల్ లోనుండి చూసాడు. లోపల రేణుక కింద పడి….సుందర్ వైపు భయంగా చూసి వెనక్కు జరుగుతూ, “సుందర్ గారు….ఏమయింది మీకు ఇవ్వాళ…ఏం చేస్తున్నారో మీకు అర్ధమవుతుందా….ముందు ఇక్కడ నుండి వెళ్ళిపోండి…” అంటూ ఏడుస్తున్నది. రేణుక ఏడుపుని పట్టించుకోకుండా సుందర్ ఆమె దగ్గరకు వస్తూ, “రేణుక….నువ్వు నాకే సొంతం….నువ్వు నాకు మాత్రమే దక్కాలి,” అంటూ తన కాలుని రేణుక కాలు మీద పెట్టి నొక్కుతూ ఆమెను ఆపాడు. సుందర్ కాలు తన కాలి మీద పెట్టి గట్టిగా నొక్కే సరికి రేణుక నొప్పితో విలవిలలాడిపోయి ఏడుస్తూ కేకలు పెడుతున్నది. రాము ఆ రూమ్ డోర్ తీయడానికి ట్రై చేస్తున్నాడు…కాని అది లోపలినుండి లాక్ చేసి ఉండటంతో ఎంత గట్టిగా ట్రై చేసినా తెరుచుకోవడం లేదు. రేణుక ఏడుపును చూసి సుందర్, “రేణుక….నువ్వు నన్నెందుకు అర్ధం చేసుకోవడం లేదు….నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు అర్ధం కావడం లేదు…” అంటూ ఆమె మీద పడుకుని గట్టిగా వాటేసుకుని అందిన చోటల్లా ముద్దులు పెడుతూ ఆమె సళ్ళ మీద చెయ్యి వేసాడు. దాంతో రేణుకకు జరుగుతున్నది అర్ధం అయ్యి గట్టిగా అరుస్తూ మళ్ళీ తన మీద పడుకున్న సుందర్ ని గట్టిగా పక్కకు తోసేసింది. సుందర్ రేణుక మీద నుండి నాలుగడుగులు దూరంగా పడ్డాడు. తలుపులు తెరుచుకోకపోవడంతో రాము తలుపుకున్న గ్లాస్ పగలగొట్టి లోపల చెయ్యి పెట్టబోతున్నాడు. తన మీద ఉన్న సుందర్ ని పక్కకు తోసేసిన రేణుక వెంటనే పైకి లేచి అక్కడ టేబుల్ మీద ఉన్న క్యాండిల్ స్టాండ్ ని తన చేతిలోకి తీసుకున్నది. అప్పటికే జరుగుతున్నది అర్ధం చేసుకున్న రాము రేణుక వైపు చూస్తూ, “రేణుక….వద్దు….కొట్టొద్దు….రేణుక….వద్దు,” అంటూ పగిలిన గ్లాస్ లోనుండి చెయ్యి లోపలికి పెట్టి పైన ఉన్న బోల్ట్ తీసుకుని లోపలికి వచ్చాడు. కాని అప్పటికే రేణుక తన చేతిలో ఉన్న క్యాండిల్ స్టాండ్ తీసుకుని అప్పుడే కింద నుండి లేవబోతున్న సుందర్ తల మీద గట్టిగా తన బలం మొత్తం ఉపయోగించి కొట్టింది. తల మీద గట్టిగా దెబ్బ తగలడంతో సుందర్ పెద్దగా అరుస్తూ గోడ వైపుకు పడ్డాడు. అది చూసి రేణుక భయంతో తన చేతిలో ఉన్న క్యాండిల్ స్టాండ్ ని పక్కకు విసిరేసి సుందర్ వైపు చూస్తున్నది. సుందర్ చిన్నగా గోడ పట్టుకుని పైకి లేచి రేణుక వైపు అడుగులు వేస్తున్నాడు….అతని అడుగులు తడబడుతున్నాయి. రేణుక సుందర్ వైపు భయంతో చూస్తూ వెనక్కు అడుగులు వేస్తూ చూస్తున్నది.
16-11-2018, 12:57 PM
సుందర్ రెండడుగులు వేయగానే అతని తల నుండి రక్తం ధారగా కారడం మొదలయింది.
అప్పటికే రాము కూడా లోపలికి వచ్చి సుందర్ తల మీద నుండి రక్తం కారుతుంటే ఏం చేయాలో తెలియక అలాగే చూస్తున్నాడు. సుందర్ అలా తల నుండి రక్తం ధారగా కారడం చూసి రేణుక కూడా భయంతో గోడకు ఆనుకుని అలాగే చూస్తున్నది. సుందర్ చిన్నగా అలాగే ఇంకో రెండడుగులు ముందుకు వేసి రేణుక మీద పడి పోయాడు. రేణుక భయంతో సుందర్ ని తన మీద నుండి కిందకు తోసింది…..అప్పటికే సుందర్ చనిపోయి కింద పడిపోయాడు. తన మీద నుండి సుందర్ ని తోసేసిన తరువాత రేణుక ఏడుస్తూ రాము వైపు చూసింది. ఏది జరక్కుండా ఆపుదామని వారం రోజుల నుండి రేణుక వెన్నంటే ఉండి కాపాడుకుంటూ వచ్చాడో….అదే జరిగే సరికి రాముకి కూడా ఏం చేయాలో తోచక తల మీద తగిలిన దెబ్బ విపరీతంగా బాధ పెడుతుంటే నిస్సహాయంగా అలాగే వెనక్కి అడుగులు వేస్తూ గది లోనుండి బయటకు వచ్చి కారిడార్ లో కూర్చుండిపోయాడు. గదిలో ఉన్న రేణుక రాము ఏమీ మాట్లాడకుండా ఉండే సరికి ఆమె కూడా ఏంచేయాలో తెలియక రాము వైపు ఏడుస్తూ చూస్తున్నది. బయట కూర్చున్న రాము అలాగే పక్కకు వాలిపోయి సృహ తప్పి పడిపోయాడు. *********** తరువాత మెలుకువ వచ్చి చూసే సరికి తను హాస్పిటల్ లో బెడ్ మీద ఉన్నట్టు, తన తలకు కట్టు కట్టినట్టు గమనించాడు రాము. తల మీద తగిలిన దెబ్బకు రాముకి తల చాలా భారంగా ఉన్నట్టు అనిపించడంతో చిన్నగా కళ్ళు తెరిచి చూసాడు. ఎదురుగా బెడ్ పక్కనే చైర్ లో రేణుక కూర్చుని ఉన్నది….ఆమె పక్కనే సునీత నిల్చుని ఉన్నది. వాళ్ళిద్దరూ కంగారుగా రాము ఎప్పుడు కళ్ళు తెరుస్తాడా అన్నట్టు ఆత్రంగా చూస్తున్నారు. రేణుక కళ్ళల్లో అయితే నీళ్ళు కారుతున్నాయి. రాము కళ్ళు తెరవడం చూసి రేణుక ఆనందంగా దగ్గరకు వచ్చి అతని చేయి పట్టుకుని నిమురుతూ, ఇంకో చేతిని రాము మొహం మీద పెట్టి చిన్నగా నిమురుతూ, “ఇప్పుడు ఎలా ఉన్నది రాము,” అనడిగింది. సునీత కూడా సంతోషంగా, “ఎలా ఉన్నది రాము….రెండు మూడు రోజుల్లో నువ్వు లేచి తిరుగుతావని డాక్టర్ గారు చెప్పారు,” అన్నది. కాని రాము తల మీద తగిలిన దెబ్బతో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు. రాము తన కళ్ళు బలవంతంగా తెరిచి రేణుక వైపు చూస్తూ, “అతను….అతను….ఇక్కడే ఉన్నాడు….వాడు....ఇప్పుడు….వాడు ఇప్పుడు ప్రేతాత్మ అయిపోయాడు,” అంటూ చిన్నగా మాట్లాడుతున్నాడు. రాము ఏం చెబుతున్నాడో అర్ధం కాని రేణుక, “రాము….ఏం మాట్లాడుతున్నావు….నువ్వు ఏం చెబుతున్నావో మాకు అసలు అర్ధం కావడం లేదు,” అనడిగింది. సునీత కూడా రాము మాట్లాడుతున్నది అర్ధం కాక అలాగే చూస్తున్నది.
16-11-2018, 12:59 PM
కాని రాముకి అప్పటికే మాట్లాడే ఓపిక లేక మత్తుతో కళ్ళు మూసుకున్నాడు.
రాము కళ్ళు మూసుకోవడం చూసి సునీత రేణుక భుజం మీద చెయ్యి వేసి, “పద….ఇక వెళ్దాం,” అన్నది. కాని రేణుకకు రాముని అలా వదిలేసి వెళ్లడానికి మనసొప్పలేదు. “మీరు వెళ్లండి సునీత….నేను కొద్దిసేపు ఆగి వస్తాను,” అన్నది రేణుక. “అది కాదు రేణుక….రాము మత్తులో ఉన్నాడు కదా….నువ్వు ఇక్కడ ఉండి కూడా ఉపయోగం లేదు….అతనికి సృహ రాగానే డాక్టర్ మనకు కబురు పెడతాడు….అప్పుడు మళ్ళి వద్దువు గాని,” అన్నది సునీత. దాంతో రేణుక చైర్ లో నుండి లేచి సునీత తో కలిసి హాస్పిటల్ నుండి వెళ్ళిపోయింది. అలా పడుకుండి పోయిన రాముకి తనను ఎవరో పిలుస్తున్నట్టు అనిపించడంతో మెలుకువ వచ్చి పక్కకు తిరిగిచూసాడు. హాస్పిటల్ అంతా చీకటిగా ఉన్నది….అక్కడక్కడ బెడ్ లైట్లు వేసి ఉన్నాయి. టైం రాత్రి పదకొండు గంటలు అయినట్టుగా అక్కడ గోడకి ఉన్న గడియారం చూపిస్తున్నది. రాము చిన్నగా తనను పిలుస్తున్న వైపు తల తిప్పి చూసాడు. పక్క బెడ్ మీద అతను రాము తన వైపు చూడగానే, “నీకు ఒక విషయం చెప్పాలి….” అన్నాడు. రాము ఏంటది అన్నట్టు చూసాడు “ఉదయం నిన్ను చూడటానికి ఒక అమ్మాయి వచ్చింది కదా….ఆమెకు చాలా పెద్ద దెబ్బలు తగిలాయి…నువ్వు తల మీద దెబ్బతో మత్తుగా నిద్ర పోతున్నప్పుడు…కొంతమంది ఆ అమ్మాయి చాలా సీరియస్ కండీషన్ లో ఉన్నప్పుడు హాస్పిటల్ కి తీసుకొచ్చారు. అ అమ్మాయిని ఆడవాళ్ళ వార్డ్ లోకి తీసుకెళ్ళారు,” అని చెప్పాడు అతను. ఆ మాట వినగానే రాము కంగారుగా ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు…కాని తల మీద దెబ్బ బాగా నొప్పి పుట్టడంతో రాము తన చేత్తో దెబ్బ తగిలిన చోట పట్టుకుని తూలుతూ మంచం మీద నుండి కిందకు దిగాడు. అలా తూలుతూనే నడుస్తూ….మధ్యమధ్యలో ఆసరాగా అక్కడ ఉన్న మంచాలను పట్టుకుంటూ తనుండే వార్డ్ నుండి బయటకు వచ్చి ఆడవాళ్ళ వార్డ్ వైపుకు నడుస్తున్నాడు. రాము వార్డ్ నుండి బయటకు రావడం చూసి అక్కడ ఉన్న డ్యూటీ నర్స్ అతన్ని పిలుస్తూ, “excuse me…sir…ఎక్కడకి వెళ్తున్నారు….మీరు అలా వెళ్ళకూడదు,” అని పిలుస్తున్నది. కాని రాము ఆమె మాటలను పట్టించుకోకుండా ఆడవాళ్ల వార్డ్ లోకి వెళ్ళి రేణుక కోసం కంగారుగా వెతుకుతున్నాడు. అలా వెతుకుతున్న రాముకి ఒక బెడ్ మీద రేణుక సృహ లేకుండా పడి ఉండటం చూసి ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ స్టూల్ మీద కూర్చుని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ఆమెను పైనుండి కిందదాకా చూస్తూ, “రేణుక….రేణుక… ఇదంతా ఎలా…..” అని అడగబోతుండగా…. బెడ్ మీద ఉన్న రేణుక మాయమైపోయి ఆమె ప్లేసులో సుందర్ ప్రేతాత్మ లేచి కూర్చున్నది. రాము ఒక్కసారిగా సుందర్ ప్రేతాత్మను చూసి అదిరిపడ్డాడు.
16-11-2018, 01:02 PM
సుందర్ ప్రేతాత్మ రాము గొంతు పట్టుకుని అతని వైపు క్రూరంగా చూస్తూ, “నువ్వు ఇక్కడకు యాభై ఏళ్ళు వెనక్కు వచ్చావని నాకు తెలుసు…రేణుకను రక్షించడానికి వచ్చావని నాకు తెలుసు…నాకు రేణుకకు మధ్యలో ఎవరూ రాలేరు….రేణుక నాది…రేణుకని రక్షించడానికి వచ్చిన నువ్వు ఆ ఇంటి పనివాడు కిషన్ ని కూడా రక్షించలేకపోయావు….టెలిగ్రామ్ పంపించడానికి వచ్చిన అతన్ని పైకి పంపించాను,” అంటూ రాము గొంతుని గట్టిగా నొక్కుతూ నవ్వుతున్నాడు.
రాము ఊపిరాడక సుందర్ ప్రేతాత్మ చేతి పట్టు నుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. రాము తన చేతి పట్టులో నుండి గింజుకోవడం చూసిన సుందర్ ప్రేతాత్మ గట్టిగా నవ్వుతున్నది. దాంతో బెడ్ మీద పడుకున్న రాము ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. ఒక్కసారి రాము తల తిప్పి చుట్టూ చూసాడు…అంతా ప్రశాంతంగా ఉండటంతో తాను చూసింది కల అని రాముకి అర్ధమయింది. అంతలో పక్కనే బెడ్ మీద ఉన్న అతను దగ్గుతూ ఉండటంతో రాముకి సడన్ గా కిషన్ చనిపోతాడన్న సంగతి గుర్తుకొచ్చి అతన్ని కాపాడటానికి బెడ్ మీద నుండి దిగి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు. రాము అలా పరిగెత్తుకుంటూ బయటకు రావడం చూసిన అక్కడ డ్యూటీ డాక్టర్, “ఏయ్ మిస్టర్…..ఎక్కడకు వెళ్తున్నావు,” అని గట్టిగా అరిచాడు. కాని రాము డాక్టర్ మాటలు పట్టించుకోకుండా హాస్పిటల్ నుండి బయటకు వచ్చాడు. హాస్పటల్ నుండి బయటకు వచ్చిన రాము చుట్టూ చూసి అక్కడ ఒక సైకి కనిపించడంతో అది ఎక్కి తొక్కుంటూ రేణుక వాళ్ళుండే ఎస్టేట్ వైపు స్పీడుగా పోనిస్తున్నాడు. ఎస్టేట్ కి వెళ్ళే దారి రాగానే రాము ఒక్కసారి సైకిల్ ఆపి ఆ దారి గుండా వెళ్తే లేటవుతుంది అనుకుని సైకిల్ అక్కడే పడేసి పక్కనే ఒక నడక దారి కనిపించడంతో ఆ దారి గుండా ఎస్టేట్ లోకి వెళ్లాడు. అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిన రాము అప్పటికే విల్లా నుండి గేట్ వైపుకి వెళ్తున్న దారి లోకి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి కొద్ది దూరంలో రేణుక నిల్చుని గేట్ వైపు చూసి గట్టిగా ఏడుస్తూ భయంతా కేకలు పెట్టడం చూసాడు. ఆమెను అలా చూసిన రాముకి పరిస్థితి అర్ధం అయింది….గేటు వైపు చూస్తూ చిన్నగా నడుచుకుంటూ ముందు వస్తున్నాడు. రేణుకకి నాలుగడుగుల ముందు సునీత, సునీత కి నాలుగడుగుల ముందు డ్రైవర్ ముగ్గురూ నిల్చుని భయంతో గేటుకి వేలాడదీసి ఉన్న కిషన్ తల వైపు చూస్తున్నారు. కిషన్ తల గేటుకి వేలాడదీసి ఉండటం చూసిన రాము అతన్ని కాపాడలేకపోయానన్న బాధతో అలా చూస్తుండిపోయాడు. రెండు రోజుల తరువాత హాస్పిటల్ నుండి డిస్చార్జ్ అయిన తరువాత రాము రేణుక వాళ్ళింటికి వచ్చాడు. రాము హాస్పిటల్ నుండి వచ్చేయడం చూసిన రేణుక అతనికి ఎదురెళ్ళి గట్టిగా వాటేసుకుని అతని పెదవుల మీద ముద్దు పెట్టి, “ఇప్పుడు ఎలా ఉన్నది….నేను, సునీత నిన్ను తీసుకొద్దామని ఇప్పుడే బయలుదేరబోతున్నాము,” అన్నది.
16-11-2018, 01:03 PM
update ఇచ్చేసాను.....ఎలా ఉన్నదో చెప్పడం ఇక మీ కామెంట్ల రూపంలో పెడితే ఆనందంగా ఉంటుంది.......రేటింగ్ ఇవ్వడం మర్చిపోకండి.....
16-11-2018, 01:24 PM
Nice update
16-11-2018, 02:03 PM
Super update
|
« Next Oldest | Next Newest »
|