Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బిడ్డకు సంతోషం - స్వామికి తృప్తి*
#1
????????????

   _*బిడ్డకు సంతోషం - స్వామికి తృప్తి*_                    
                     ➖➖➖✍

1970లలో ఒక రోజు కంచి మఠంలో స్వామి వారు శ్రీ త్రిపురసుందరి చంద్రమౌళీశ్వర పూజ చేస్తున్నారు. 

వేలాది మంది భక్తులు కనురెప్పలు కొట్టడం కూడా మరచి అత్యంత శ్రద్ధతో పూజను తిలకిస్తున్నారు. త్రిపురసుందరీ దేవి అమ్మవారికి అలంకరించిన పట్టుచీర అందరినీ ఆకర్షిస్తున్నది.

_వేదికకు దూరముగా ఒక మూలన బిడ్డతో సహా కూర్చొని ఒక తల్లి స్వామివారు శ్రద్ధగా చేస్తున్న పూజను తిలకిస్తోంది. తల్లిఒడిలో కూర్చున్న చిన్నపిల్ల అమ్మవారికి కట్టిన చీరను చూసింది. చూడటంతోనే ఆ చీరకావాలని తల్లిని వేధించడం మొదలుపెట్టింది అమాయకంగా. తల్లి కూతురిని ఎంతో బుజ్జగించింది, మందలించింది, విన్నదికాదు కూతురు. అలా అడిగితే అమ్మవారు కోప్పడుతుందని మంచి పిల్లలు అలా మారాం చెయ్యరాదని, భక్తితో అమ్మను ప్రార్థించమని చెప్పింది._ 

_కాని ఆ పిల్ల ఆ మాటలేవి వినిపించుకోలేదు. అమ్మను వేధిస్తూనే ఉంది ఆ చీర కోసం. ఆవిడ బుజ్జగించడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఎంత చెప్పినా ఆ పిల్ల వినకపోవడంతో  ఆమె ఆపిల్లని కాస్త గట్టిగా మందలించి, మాట వినకపోతే తనని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతానని చెప్పింది. ఆ పిల్ల భయపడిపోయి, కళ్ళనిండా నీళ్ళతో అమ్మను చూస్తూ ఉంది. పిల్లను వేంటనే గుండెలకు హత్తుకొని కళ్ళ నీరు తుడిచి, చిన్ని చేతులను నమస్కార ముద్రలో ఉంచి అమ్మవారి శ్లోకాలు చెప్పసాగింది. ఆ శ్లోకాలు వింటూ అమ్మని అమ్మవారిని తదేకంగా చూస్తూ ఉండిపోయింది._

_పూజ ముగిసిన తరువాత స్వామివారు అందరికీ తీర్థం ఇస్తున్నారు. క్యూలో నిలబడ్డ అందరూ తీర్ధం పుచ్చుకుంటున్నారు. ఆ తల్లి పిల్లతో సహా తీర్ధం అందుకోవడానికి అందరితోపాటు వేదికమీదకు వచ్చినది. హఠాత్తుగా స్వామివారు తీర్ధం ఇవ్వడం ఆపేశారు. ఎందుకో ఎవరికి అర్ధం కాలేదు. స్వామివారు లేచి గర్భగృహంలోకి వెళ్ళి, అందరిని ఆశ్చర్యపరుస్తూ అమ్మవారికి కట్టిన పట్టుచీరను తెచ్చి, ఆ పిల్లకు ఇచ్చారు. తరువాత తీర్ధం ఇవ్వడం మొదలు పెట్టారు. ఇదంతా చూస్తున్న ఆ పిల్ల తల్లి విస్తుబోయింది, ఎక్కడో దూరాన ఒకమూలన కూర్చొని ఉన్న తన పిల్ల యొక్క కోరిక మహా స్వామివారికి ఎలా తెలిసిందా అని స్థాణువై చూస్తున్న ఆ తల్లితో స్వామివారు, “పిల్లలు దైవస్వరూపులు. ఏది అడగాలో అడగకూడదో వాళ్ళకు ఎలా తెలుసు ? భగవంతుని సృష్టి మొత్తం వాళ్ళదే అని, వాళ్ళకోసమే అని వాళ్ళు అనుకుంటారు. పిల్లని ఎప్పుడూ కోప్పడవద్దు. నువ్వు కన్న తల్లివి మాత్రమే. ఆవిడే అందరికి నిజమైన తల్లి” అని అన్నారు._

_ఇద్దరూ స్వామివారికి నేలపై పడి నమస్కరించి స్వామి ఆశీస్సులు అందుకొని వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన తరువాత స్వామివారు అక్కడున్న శిష్యులతో, *“తన చీరను తీసుకోవడానికి త్రిపురసుందరి అమ్మవారే వచ్చింది. అది ఆవిడది. ఇవ్వను అనడానికి నేనెవర్ని. అందుకే అమ్మవారికే ఇచ్చివేశా” అని అన్నారు.*_

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం 
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం॥

టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.

http://' paramacharya vaibhavam

#KanchiParamacharyaVaibhavam
#కంచిపరమాచార్యవైభవం✍

                     ???

   ?లోకా సమస్తా సుఖినోభవన్తు!?

????????????
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
మహదానందం కలిగించారు
Like Reply




Users browsing this thread: 1 Guest(s)