Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
(03-09-2019, 10:44 AM)HitmanA007 Wrote: మహేష్ గారు అప్డేట్ ఎప్పుడు ఉంటుంది వెయిటింగ్ మహేష్ గారు తొందరగా ఇస్తారని ఆశిస్తున్నాను

Sooooooo sorry friends and bros ...........ఫెస్టివల్ mode , నిమజ్జనం తరువాతనే రాయడం మొదలెట్టాలి.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(03-09-2019, 10:44 AM)HitmanA007 Wrote: మహేష్ గారు అప్డేట్ ఎప్పుడు ఉంటుంది వెయిటింగ్ మహేష్ గారు తొందరగా ఇస్తారని ఆశిస్తున్నాను

త్వరలోనే మిత్రమా with బిగ్గెస్ట్ update.
Like Reply
Waiting for update bro
మీ
Umesh
Like Reply
(06-09-2019, 06:50 PM)Umesh5251 Wrote: Waiting for update bro

11 గంటలలోపు .
Like Reply
(07-09-2019, 07:19 AM)Mahesh.thehero Wrote: 11 గంటలలోపు .

Thanks bro ...... IAM waiting
మీ
Umesh
[+] 1 user Likes Umesh5251's post
Like Reply
Thank you
              అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి 
Like Reply
(07-09-2019, 07:19 AM)Mahesh.thehero Wrote: 11 గంటలలోపు .

Waiting
Like Reply
మేము పెట్టిన కేకలకు నిట్టుపడి ఏమిజరిగిందో అని అమ్మ , అమ్మమ్మా మరియు అత్తయ్యా పరిగెత్తుకుంటూ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న మా గదిలోకి వచ్చి ముందు నా చేతికి అంటిన రక్తాన్ని చూసి మహేష్ ఏమయ్యింది నాన్నా అంత రక్తం చేతులకి అంటూ కళ్ళల్లో కన్నీళ్ళతో నా చేతులను సున్నితంగా అందుకొని భయంతో కంపిస్తున్న నన్ను మోకాళ్లపై కూర్చుని హత్తుకొని చేతులకి ఎక్కడా గాయం అవ్వకపోవడంతో రక్తం ఎక్కడిది అని అనుకునేంతలో ,



మహి అమ్మా ........అని నొప్పితో ఏడుస్తూ పిలిచి స్పృహతప్పి అమాంతం వెనక్కు సోఫాలో పడిపోయింది. మహి అంటూ ముగ్గురూ తనవైపు చూసి తన పొత్తికడుపులో గుచ్చుకున్న విభాగినిని చూసి , నోట్లో మాట పడిపోయినట్లు మ...... మ........ అంటూ వేగంగా వెళ్లి ఏమయ్యిందిరా బంగారు , ఎలా జరిగింది అంటూ రోధిస్తుండటంతో ,అమ్మమ్మ కూడా కళ్ళల్లో నీళ్లతో బాధపడుతూ ఏమిచెయ్యాలో తోచక చేతులు కాళ్ళు ఆడకపోవడంతో ,  ఇందు దాని సూదులు మాత్రమే గుచ్చుకున్నాయి నెమ్మదిగా ఎత్తుకొని కిందకు రా నేను కారు తీస్తాను రేణుకా మేడం దగ్గరికి వెళదాము అని చెప్పడంతో కన్నీళ్ళతోనే అమ్మ మహిని ఎత్తుకొని , నా చేతిని అమ్మమ్మ పట్టుకొని అప్పుడే గాలికి ఎగిరిన పేపర్ కింద ఉన్న బాక్స్ చూసి దీనివల్లనే ఇదంతా జరిగి ఉంటుంది అని హుటాహుటిన కిందకు వచ్చి కారులో వెళుతూనే అమ్మమ్మ డాక్టర్ అంటీకి కాల్ చేసి విషయం చెప్పింది.



లౌడ్ స్పీకర్ on చెయ్యమని చెప్పి ఇందు ఏమీ కంగారుపడకు మీరు చెప్పినదాని బట్టి సూదులు మాత్రమే గుచ్చుకున్నాయి , కేవలం పదే పది నిమిషాల్లో ట్రీట్మెంట్ చేసేస్తాను , నెనున్నానుగా అని ధైర్యం ఇవ్వడంతో అమ్మ కన్నీళ్లను తుడుచుకుని గిరిజా తొందరగా పోనివ్వమని చెప్పి మహి బుగ్గలను ప్రేమగా స్పృశిస్తోంది.



ట్రాఫిక్ ఉండటం వలన అర గంటలో చేరుకొని నేరుగా ICU కి మహిని ఎత్తుకొనివెళ్లాము. అమ్మ చేతులలోని మహిని ఎత్తుకొని సూదులు గుచ్చుకోవటమే కాదు పొట్లాటలో అటూ ఇటూ కదలడం వలన రంద్రం వెడల్పు అయ్యి ఉండటం చూసి అమ్మను కంగారుపెట్టకూడదని , అమ్మా ఇందుని అలా కూర్చోబెట్టు చిన్నదంటే చిన్న గాయమే పదే పది నిమిషాలు అని చెప్పి నర్సు చెప్పినవన్నీ రెడీ చెయ్యండి అని చెప్పి లోపలకు తీసుకువెళ్లింది. 



అమ్మ మాత్రం కన్నీళ్లు కారుస్తూ మిర్రర్ లోనుండి లోపలకు చూస్తూనే ఉంది. అంటీ మహికి మత్తు ఇంజక్షన్ వేస్తూ అమ్మను చూసి నర్సుని పంపించింది.నర్సు బయటకువచ్చి మేడం కంగారుపడకుండా అలా కూర్చోండి అని చెప్పి అమ్మమ్మకు చూసుకోండి అని చెప్పి లోపలకు వెళ్ళింది. అమ్మ మళ్లీ లెవబోతుండటంతో ఇందు రేణుక తన సొంత కూతురు కంటే బాగా ట్రీట్ చేస్తుంది , కొద్దిసేపు గుండె ధైర్యం తెచ్చుకో మహికి ఏమీ కాదు అంటూ కన్నీళ్లను తుడిచి తలపై ముద్దుపెట్టి  చెప్పింది. అమ్మా .........అంటూ బాధపడుతూనే అమ్మమ్మ చేతిని చుట్టేసి భుజం పై వాలిపోయింది.



నా చేతిని పెట్టుకొన్న అత్తయ్యకు నేను భయంతో వనికిపోతుండటం తెలిసి అమ్మమ్మ ప్రక్కనే కుర్చీలో కూర్చోబెట్టి మహికి ఏమీ కాదు మరికొద్దిసేపట్లో నవ్వుతూ నడుచుకుంటూ వచ్చేస్తుంది అని చెప్పింది. అత్తయ్యా అంతా నావల్లనే అంటూ కళ్ళను చేతులతో తుడుచుకుంటూ వెక్కి వెక్కి ఏడవటం మొదలెట్టాను. అదేమీ కాదు ఏదో accidental గా జరిగిపోయి ఉంటుంది అంటూ నా కన్నీళ్లను తుడిచి అత్తయ్య తన గుండెలపై నన్ను హత్తుకొంది. 



ఐదు నిమిషాల తరువాత నా ఏడుపు ఆపడంతో అమ్మమ్మ తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఎలా జరిగింది అని అడగడమే ఆలస్యం మళ్లీ ఒక్కసారిగా నా కళ్లల్లో కన్నీళ్లు కారి , జరిగిందంతా వెక్కివెక్కి ఏడుస్తూ తడబడుతూ వణుకుతూ చెప్పాను. అలా జరిగిందా డివైడర్ ను మహి స్కూల్ లో ఎక్కడో పెట్టి మరిచిపోయి ఇంటికి వచ్చింది , బాక్స్ చూసి డివైడర్ మిస్ అవ్వడంతో స్కూల్ లో నువ్వు బాక్స్ మొత్తం చూడటం గుర్తుకువచ్చి నువ్వే తీసుకున్నావేమో అని పరుగుపరుగున అమ్మ దగ్గర నుండి నీదగ్గరకు వచ్చి , అదే సమయానికి నేను ఇచ్చిన బాక్స్ లో నుండి నువ్వు పరిశీలిస్తున్న డివైడర్ ను చూసి , మరొక బాక్స్ నీకోసం కొన్న విషయం తెలియని మహి నాది అంటూ లాక్కునేటప్పుడు కడుపులో గుచ్చుకుంది అంతే ఇందులో నీతప్పు ఏమీ లేదు బుజ్జికన్నా , సరిగ్గా తను వేగంగా లోపలికిరావడంతో గాలికి ప్రక్కనే ఉన్న పేపర్ బాక్స్ మీద పడటంతో అది చూడకపోవడంతో ఇదంతా జరిగింది అంతే అంటూ నాతలపై ముద్దుపెట్టి ఓదార్చింది.



లేదు అమ్మమ్మా తప్పంతా నాదే చూడండి రక్తం నాచేతులకు ఎలా అంటుకుందో , నేనే చెల్లిని..........కాదు కాదు అక్కయ్యను పొడిచాను , అక్కయ్యను తమ్ముళ్లు ఎవరైనా ప్రాణంగా చూసుకోవాలి కానీ నేను ఇలాచేసాను నాకు పెద్ద శిక్ష పడాల్సిందే అంటూ అమ్మమ్మ గుండెలపై వాలిపోయాను. నేను అక్కయ్య అని మొదటిసారిగా పిలవడంతో ముగ్గురూ ఒకరిముఖాలుమరొకరు చూసి ఆనందిస్తూ ముగ్గురూ నాచుట్టూ చేరి మేము చెబుతున్నాము కదా మహేష్ ఇందులో నీతప్పేమీ లేదు. గిరిజా ముందు మహేష్ చేతులను శుభ్రన్గా కడుక్కొని రా అని చెప్పడంతో , అలాగే అమ్మగారు అంటూ నన్ను పిలుచుకొనివెళ్లి వాష్రూమ్ లో చేతులను సబ్బుతో శుభ్రం చేసి dettol పట్టించి కడిగి అమ్మ దగ్గరికి తీసుకువచ్చిన మరుక్షణమే , ICU లోనుండి అంటీ బయటకువచ్చి సమయం చూసి 10 నిమిషాలు ఎక్కువ అయ్యింది sorry రా ఇందు , రెండంటే రెండే రెండు కుట్లువేశాను మరో 10 నిమిషాల్లో స్పృహలోకి వస్తుంది , వారం రోజుల్లో స్కూల్ కి కూడా వెళ్ళిపోతుంది అనిచెప్పి, అందరినీ లోపలకు పంపించి గిరిజా చెయ్యి అందుకొని ఎలా జరిగిందో తెలుసుకొని లోపలికివచ్చి మహేష్ మీ అక్కయ్యకు ఏమీ కాలేదు నిద్రపోతోంది అంతే అంటూ తలపై నిమిరి , దీనివాళ్లనైనా ఇద్దరూ కలిసిపోతారేమో అమ్మా అని ఆశ పెంచింది.
[+] 12 users Like Mahesh.thehero's post
Like Reply
కడుపు చుట్టూ బ్యాండేజ్ వేసి ఉండటం చూసి కళ్ళల్లో కన్నీళ్ళతో అమ్మా అమ్మమ్మా బెడ్ కు చెరొకవైపు కూర్చుని మహి చేతులను తమ చేతులతో సున్నితంగా స్పృశిస్తూ మరొక చేతులతో బుగ్గలను రెండువైపులా ప్రేమగా స్పృశిస్తూ , బుజ్జికన్నా ఇలా రా అంటూ అమ్మమ్మ తన పై కూర్చోబెట్టుకుంది. మహి చేతిని అక్కయ్యా అంటూ సున్నితంగా అందుకోగానే , నా స్పర్శకే మహి కదిలి స్పృహలోకి వచ్చినట్లు నెమ్మదిగా కళ్ళుతెరిచి ముందుగా నన్ను చూడగానే చె...........అక్కా , అక్కా.....అంటూ సంతోషంతో పిలిచి అమ్మా , అమ్మమ్మా అక్కయ్య కళ్ళుతెరిచి నన్ను చూస్తోంది అని చెప్పాను.



మహి పూర్తిగా కళ్ళుతెరిచి నా చేతుల్లో ఉన్న తన చేతిని కోపంతో లాగేసుకోగానే , ఒక్కసారిగా నాకళ్ళల్లో కన్నీళ్లు కారి , తట్టుకోలేక అక్కా నావల్లనే ఇదంతా జరిగింది , sorry అక్కా అలా కోపంగా మాత్రం చూడకు నేను తట్టుకోలేను , నేనే ఆ డివైడర్ ను స్కూల్ లో నీ బాక్స్ లోనుండి దొంగతనం చేసాను ,బుజ్జికన్నా .......అంటూ అమ్మమ్మ మాట్లాడేంతలో ఆపి , ఇంకెప్పుడూ అలా చేయను అక్కా నువ్వెలా చెబితే అలా వింటాను , ఏమి చెబితే అది చేస్తాను , నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పు అక్కా అంటూ కన్నీళ్ళతో మాట్లాడుతుండటం చూసి అమ్మవాళ్ళంతా మురిసిపోతూ ఇక ఇద్దరూ జీవితంలో పొట్లాడరు అని ఆనందించేంతలో ,



తన చేతిని నానుండి దాచేసుకొని అంటీ నా కడుపులో గుచ్చుకున్న డివైడర్ ఎక్కడ ఉంచారు అని కోపంతో అడిగింది. ప్రక్కనే టేబుల్ పై రక్తపు నీళ్ళల్లో ఉన్నాకూడా బంగారుకొండ దానిని డస్ట్ బిన్ లో పడేశాము అని బదులిచ్చింది. అంటీ please ఎలాగైనా సరే దానిని తెప్పించండి అని అడిగింది. మహి డస్ట్ బిన్ ను కూడా క్లీనర్లు తీసుకువెళ్లిపోయారు నువ్వు రెస్ట్ తీసుకో ఇంటికి వెళ్ళగానే కొత్త బాక్స్ బాక్స్ కొనిస్తాను అంటూ నుదుటిపై ప్రేమగా ముద్దుపెట్టి చెప్పింది. లేదు అంటీ నాకు అదే కావాలి తెప్పిస్తారా లేదా అంటూ గోల గోల చేస్తూ నాకు అదే కావాలి అదే కావాలి అంటూ గట్టిగా కేకలువేస్తూ అటూ ఇటూ కదులుతుండటంతో ,అమ్మా మరియు అమ్మమ్మా ఎంత ఓదార్చినా వినడం లేదు , అప్పుడే వేసిన కుట్లు  ఎక్కడ ఊడిపోయి రక్తం వస్తుందేమో అని , 



మహి రెండు నిమిషాల్లో తెప్పిస్తాను అనిచెప్పి మొబైల్ అందుకొని బ్లాంక్ కాల్ చేసి ఏమిచేస్తారో తెలియదు డివైడర్ తీసుకురండి అని ఆర్డర్ వేసి , మహి వచ్చేస్తుంది నువ్వు రెస్ట్ తీసుకో లేకపోతే కుట్లు ఊడిపోయి మరింత నొప్పి వేస్తుంది అనిచెప్పి రక్తం నీళ్లను గిన్నెతోపాటు బయటకు తీసుకెళ్లింది. 



బంగారుతల్లి ఇప్పుడు అది ఎందుకురా అంటూ అమ్మ మహి కన్నీళ్లను తుడిచి వొంగి నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి , తప్పు తనదే అని మహేష్ చెబుతున్నాడు కదా , నిన్ను అక్కా అని కూడా పిలిచాడు జరిగిందంతా పీడకలలా మరిచిపోయి తమ్ముడిని క్షమించురా అని ప్రేమతో ముద్దులుపెడుతూ చెప్పింది. అమ్మా అంటూ తన బుగ్గలను స్పృశిస్తూ ఇదే విషయం అప్పుడు చెప్పి ఉంటే వాడిని నేనే అన్నయ్యా అని ప్రేమతో పిలిచేవాడిని , అంటీ అంటీ........ఇంకా దొరకలేదా అంటూ గట్టిగా కేకవేయ్యడంతో బయటే ఉన్న అంటీ డివైడర్ తోపాటు లోపలికి వచ్చి ఇదిగో అంటూ చూపించి , ఇప్పుడు వద్దులే బంగారు ఇంటికివెళ్లాక ఇస్తాను అని చెప్పింది. 



అంటీ ఇలా ఇవ్వండి ఏమీ బయపడకండి నేనేమీ వాడికి గుచ్చను అని చెప్పడంతో , అమ్మమ్మ ఇవ్వమని సైగ చెయ్యడంతో సరే జాగ్రత్త అంటూ డివైడర్ సూదులకు సేఫ్టీ ప్లాస్టిక్ క్యాప్స్ వేసి మహికి అందించింది. దాన్ని పూర్తిగా చూసి రేయ్ దీనిని నేను పెరిగి పెద్దది అయ్యేంతవరకూ ఫ్రేమ్ కట్టించుకొని రూంలో గోడపై తగిలిస్తాను ఇది చూసినప్పుడల్లా నువ్వు చేసిన తప్పు నీకు గుర్తుకురావాలి ఇదే నేను నీకు విధించే శిక్ష , అలాగే నన్ను అక్కా , చెల్లి అని మాత్రం పిలవద్దు అని కోపంతో చెప్పి , నా ముఖం కూడా చూడటం ఇష్టం లేనట్లు అమ్మవైపు తిరిగింది.



తన మాటలకు ఒక్కసారిగా నాకళ్ళల్లో కన్నీళ్లు ఆగకుండా వరదలా కారుతూ అక్కా ...........అనబోయి అక్కడితో ఆగిపోయాను. మహి ఏంట్రా ఇది వాడి తప్పు ఏమీ లేదురా .........అని నిజం చెప్పేంతలో అమ్మా వద్దు అని వారించాను. అమ్మా ఇది ఫైనల్ అంతే ఇది కానీ నేను ఇంటికి వెల్లెలోపు గోడపై లేదంటే నేను ఏమి చేసుకుంటానో నాకే తెలియదు అని కోపంతో చెప్పి నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను అంటూ కళ్ళుమూసుకుంది. Sorry sorry........... అని ఎంత వేడుకుంటున్నా కళ్ళుతెరువకపోవడంతో చిన్నతనం కాబట్టి ఏది మంచో ఏది చెడో తెలియక పోవే ఇంత బిల్డ్ అప్ ఇస్తావా నేనే నిన్ను అలా పిలవను అంటూ కోపంగా చెప్పి అమ్మమ్మ ఒడిలో నుండి కిందకు దిగి వేగంగా బయటకు వచ్చేసాను. అమ్మగారు నేను చూసుకుంటాను అంటూ అత్తయ్య కూడా నాతోపాటు బయటకు వచ్చింది.



మహి తప్పు తనదే అంటున్నాడు కదరా ఈ ఒక్కసారికీ క్షమించేయ్ అని కళ్ళుమూసుకున్న మహి చెయ్యి అందుకొని ప్రేమతో స్పృశిస్తూ అమ్మమ్మతోపాటు అడిగింది. ఊహూ ........ఎంతనొప్పి వేసిందో తెలుసా , అంటీకి నేనంటే ప్రాణం కాబట్టి నొప్పి మొత్తం నిమిషాల్లో పోగొట్టింది. ఇందులో నా డెసిషన్ మారదు , మీరు ప్రతిసారీ వాడినే వెనకేసుకొస్తారు , నాకంటే వాడంటేనే మీకు ప్రేమ ఎక్కువ అని బాధపడుతూ అంటీ నన్ను రెస్ట్ తీసుకోమని చెప్పారుగా మీరు మాటలు ఆపేస్తే నిద్రపోతాను అని ముద్దుముద్దుగా చెప్పింది.



మహి మాకు ఇద్దరూ సమానమేరా ఒకరు ఎక్కువా ఒకరు తక్కువా కాదు , ok ok అమ్మా నాకు తెలుసు ఆమాట అన్నందుకు sorry అంటూ కళ్ళుతెరిచి లెవబోయి , నొప్పివలన అమ్మా అంటూ బుగ్గలను అందుకొని ముఖాన్ని తన పెదాల వరకూ వచ్చేలా లాక్కొని అమ్మ నుదుటిపై sorry అంటూ ముద్దుపెట్టి , ఇక నిద్రపోతాను అని చెప్పింది. 



ఈప్రేమకేమీ తక్కువ లేదు అంటూ పెదాలపై చిరునవ్వుతో మహి నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి , అధికాదురా.......అని చెప్పేంతలో , రేణుకా అంటీ అమ్మను ఆపి నొప్పివలన మహి కోపంగా ఉండటంలో తప్పులేదు , రెస్ట్ తీసుకుంటే నొప్పి పూర్తిగా తగ్గి మహేష్ పై కోపాన్ని తగ్గిపోయేలా తనే తెలుసుకుంటుంది అని చెవిలో గుసగుసలాడి , భుజాలవరకూ గుడ్డ కప్పి హాయిగా రెస్ట్ తీసుకో బంగారు కొద్దిసేపు తరువాత వస్తాను అనిచెప్పి వెళ్లిపోబోతుండగా , అమ్మ అంటీతోపాటు బయటకువచ్చి జగదీష్ వస్తే ఎలా జరిగిందో.............ఇందు నాకు తెలుసుకదా నేను చూసుకుంటాను మీరు ఏమిచెబితే దానికి తల ఊపుతాను అని చెప్పి మహి తొందరగా కొలుకుంటుంది తన గురించి కంగారుపడి నువ్వు బాధపడవద్దు సరేనా అని చెప్పి వెళ్ళిపోయింది.



మొబైల్ తీసి జగదీష్ కు కాల్ చేసి డ్రాయింగ్ వేస్తూ డివైడర్ అనుకోకుండా మహికి గుచ్చుకుంది , హాస్పిటల్ లో ఉన్నాము ట్రీట్మెంట్ జరిగి తను హాయిగా నిద్రపోతోంది అని చెప్పడంతో , ఇద్దరు పిల్లలను చూసుకోవడం కూడా రాదు అంటూ ఇందుని తిట్టి నేను రావడం కుదరదు బిజినెస్ పనిమీద అప్పుడే ముంబై ఫ్లైట్ లో ఉన్నాను అని బదులివ్వడంతో , ఒక్కసారి చూసివెళ్తే మహి ఆనందిస్తుంది అని చెప్పడంతో చెప్పానుగా నేను ఫ్లైట్ లో ఉన్నానని , ముంబై వెళ్ళాక స్కైప్ లో మాట్లాడతాను అని చెప్పి , accidental గా జరిగిందా లేక ఇద్దరూ పొట్లాడటం వల్ల జరిగిందా అని అనుమానంగా బాంబ్ పేల్చడంతో , లేదు కావాలంటే వచ్చి చూడండి అని కాన్ఫిడెంట్ గా బదులివ్వడంతో , సరే సరే నేను రావడానికి వారం రోజులు పడుతుంది బై అని చెప్పి కాల్ కట్ చేసాడు. కోపంతో లోపలికి వచ్చి అమ్మమ్మకు విషయం చెప్పి మహి ప్రక్కనే కూర్చుని ప్రేమగా తన కురులను స్పృశిస్తూ జోల పాడింది.

నేను ఏకంగా హాస్పిటల్ బయటకువెళ్లి చీకటిలోనే పార్క్ లోని బెంచి మీద బాధపడుతూ కూర్చున్నాను. అత్తయ్య నా వెనుకే వచ్చి ప్రక్కనే కూర్చుని నా తలపై చేయివేసి ప్రేమతో స్పృశిస్తూ , మహేష్ నొప్పివలన మహి కోపంతో అలా అని ఉంటుంది. ఉదయానికల్లా తనే తను ఏమిచేసానో , ఏమి మాట్లాడానో తెలుసుకుని నీదగ్గరికే వస్తుంది చూడు అదే అక్కాతమ్ముడూ లేక అన్నాచెల్లెలు మధ్య ఉన్న మ్యాజిక్ మన ప్రాణమైన వాళ్లకోసం మనం ఎంత తగ్గినా తప్పులేదు అని చెప్పడంతో , 



నాకోపం మొత్తం చల్లారి అక్కయ్య నాతో మళ్లీ మాట్లాడుతుందా అత్తయ్యా , అదే జరిగితే తను ఏది చెబితే అలా చేస్తాను , తన మాట వింటాను అని మాటఇచ్చాను. మా మంచి మహేష్ అంటూ నన్ను హత్తుకొని తలపై ప్రేమతో ముద్దుపెట్టి మహి దగ్గరకు వెళదామా అని చెప్పడంతో , సరే అంటూ ముందుగా బయట ఉన్న షాప్ కు పిలుచుకొనివెళ్లి dairymilk పెద్ద చాక్లెట్ కొనుక్కొని అక్కయ్యకోసం అని చెప్పి హాస్పిటల్ లోపలికి నడిచాము. మా మహేష్ కు మహి అక్కయ్య అంటే ఎంత ప్రాణమే అంటూ కురులను నిమురుతూ నవ్విస్తూ ICU కి చేరుకున్నాము.



మహి ఇంకా నిద్రపోతుండటంతో వెళ్లి అమ్మ ఒడిలో కూర్చున్నాను. అమ్మా అమ్మమ్మా అత్తయ్య వైపు చూడటంతో all set అంటూ వేలితో సైగ చేసింది. థాంక్స్ రేణుకా అంటూ నవ్వి నన్ను సంతోషన్గా హత్తుకొని చాక్లెట్ ఎవరికోసం నాన్నా అని అడిగింది. అక్క కోసం అమ్మా అని బదులిచ్చాను. అప్పుడే అంటీ కూడా లోపలికివచ్చి మహేష్ సూపర్ అయితే అక్కచేతిలో పెట్టు అని చెప్పింది.



 తన ఒక చేతిలో డివైడర్ ను చూసి తలదించుకొని , అలాగే అంటీ అంటూ చాక్లెట్ చేతిలో పెట్టడానికి నా చెయ్యితో మహి మరొక చేతిని తాకగానే కదలటంతో , తన మాటలు గుర్తుకువచ్చి వెంటనే నా చేతిని వెనక్కు తీసేసుకున్నాను. 



బుజ్జికన్నా మహి లేచినట్లు ఉంది అక్కా అని ప్రేమతో పిలిచి sorry అని చెప్పి చాక్లెట్ ఇవ్వు అని చెప్పింది. అక్కా అక్కా.........అని పిలవడంతో కళ్ళుతెరిచింది. అమ్మా , అమ్మమ్మా .........అక్క నాపిలుపుకి అక్కయ్య కళ్ళుతెరిచింది అని సంతోషిస్తూ , అక్కా sorry అక్కా ఇప్పటి నుండి మనం క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ చాక్లెట్ అందించాను. నామాటలకు తనకు కట్టలు తెంచుకునేలా కోపం వస్తున్నా ఆశతో చూస్తున్న అమ్మా , అమ్మమ్మా ఎక్కడ బాధపడతారో అని కళ్ళుమూసుకుని కంట్రోల్ చేసుకొని తాకాలేక తాకుతూ అందుకొని ప్రక్కనే పెట్టేసింది.



అందరూ మురిసిపోయి ఆనందిస్తుండటంతో అంటీ మహిని పరిశీలించి , మహి రాత్రన్తా ఇక్కడే ఉంటావా ఇంటికి వెళతావా అని అడిగింది. అంటీ నావల్ల కాదు నేను ఇంటికే వెళ్ళిపోయి అమ్మ ప్రక్కనే హాయిగా రెస్ట్ తీసుకుంటాను అని బదులివ్వడంతో , నీ ఇష్టం నా బంగారుకొండ అంటూ నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టి టాబ్లెట్స్ రాసిచ్చి డిశ్చార్జ్ చేస్తున్నట్లు సంతకం చేసింది. 



అక్కా ఒక్కరోజైనా ..............అవసరం లేదు ఇందు ఉదయమే నేను వస్తానుగా, తనకు ఇష్టమొచ్చిన దగ్గర సంతోషన్గా ఉంటే మరింత త్వరగా కొలుకుంటుంది. అమ్మ ఒడి కన్నా safest ప్లేస్ ఈ ప్రపంచంలో ఎక్కడ ఉంది చెప్పు అని చెప్పి , మహి ఇంటికివెళ్లి కడుపునిండా తిని హాయిగా పడుకో నేను రేపు ఉదయం ఈ వారం రోజులు ఆడుకోవడానికి ఒక పెద్ద గిఫ్ట్ తెస్తాను అని చెప్పింది. WOw గిఫ్ట్ లవ్ యు అంటీ ఉదయం వరకూ ఆశగా ఎదురుచూస్తుంటాను అని సంతోషంతో నవ్వుతూ అమ్మా ఎత్తుకో వెళదాము అని చెప్పింది. 



అమ్మ నెమ్మదిగా రెండు చేతులతో అడ్డంగా ఎత్తుకొని తన చిరునవ్వులను చూసి మురిసిపోతూ మా మహి బంగారం అంటూ బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టింది. మహి నీ తమ్ముడు ప్రేమతో ఇచ్చిన చాక్లెట్ అంటూ అమ్మమ్మ తన చేతికి అందించింది. ఒక్కసారిగా చిరునవ్వు మాయం అయ్యి ముఖంలో కోపంతో అందుకొని నావైపు పెద్దకళ్ళతో చురచురమంటూ చూసింది. 



అమ్మగారు కారు తీసుకువస్తాను అని చెప్పి అత్తయ్య ముందు వెళ్ళిపోయింది , అమ్మ మహిని ఎత్తుకొని తన వెనుకే ప్రేమగా మాట్లాడుతూ నవ్విస్తూ వెళుతోంది. అమ్మమ్మ నాచేతిని పట్టుకొని అంటీతో టాబ్లెట్స్ ఎప్పుడెప్పుడు వేయాలో , ఏమేమి తినిపించాలో మాట్లాడుతూ అమ్మవెనుకాలే హాస్పిటల్ బయటకు నడుస్తున్నారు. 



మహి కోపంతో తల తిప్పి నావైపు చూసి నేను మాత్రమే తనను చూస్తున్నప్పుడు మెయిన్ గేట్ ప్రక్కనే ఉన్న డస్ట్ బిన్ లో చాక్లెట్ పడేసి చెప్పాను కదరా అన్నట్లు డివైడర్ చూపించి అటువైపు తిరిగింది. తన చర్యలకు నాకు కూడా కోపం వచ్చి తనకే అంత ఉంటే నాకెంత ఉండాలి అని ఒక్కమాట కూడా మాట్లాడకుండా కారులో ముందు ఎక్కి కూర్చున్నాను. మహితోపాటు నెమ్మదిగా అమ్మ , అమ్మమ్మా వెనుక కూర్చుని రేణుకా ఆలస్యం అయినా పర్లేదు నెమ్మదిగా వెళ్ళమని చెప్పింది. అమ్మ చెప్పినట్లుగానే నెమ్మదిగా కారుని పోనివ్వడంతో ఇంటికి చేరుకునేసరికి 9 గంటలు అయ్యింది. ఇందు నువ్వు మహిని నీరూమ్ కు పిలుచుకొనివెళ్లి తనతోపాటే ఉండు అర గంటలో రేణుకతోపాటు వంట చేసి అక్కడికే తీసుకువస్తాము అని చెప్పి పంపి , బుజ్జికన్నా నువ్వుకూడా వెళ్లి మీ అక్కయ్యకు బోర్ కొట్టకుండా నవ్వించు అని చెప్పినా , dont care అన్నట్లు నారూమ్ కు వెళ్లి టీవీ చూస్తూ కూర్చున్నాను.



కొద్దిసేపటి తరువాత అత్తయ్య నేను అక్కడే ఉన్నానని రెండు ప్లేట్లలో వడ్డించుకొని వచ్చి మహికి తినిపించమని అమ్మకు ఒక ప్లేట్ అందించింది. బంగారు చేతులు కడుక్కొని వస్తాను అనిచెప్పి అమ్మ బయటకు వెళ్ళగానే , అత్తయ్యా అని పిలిచి డివైడర్ అందించి రేపటికల్లా ఫ్రేమ్ చేయించి తీసుకురండి , అమ్మా అమ్మమ్మకు తెలియనివ్వద్దు అని చెప్పింది. మహి వద్దమ్మా ........అనేంతలో అమ్మ లోపలికి రావడంతో అత్తయ్యా దాచుకోండి రెపటికల్లా అని చెప్పి పంపించేసింది. ప్లేట్ అందుకొని నారూమ్లోకి వచ్చి జరిగిందంతా తెలుసుకొని బాధపడి , దేవుడా నువ్వే చూసుకోవాలి అని ప్రార్థించి నాకు తినిపించి , ఉదయానికల్లా సర్దుకుంటుంది అని చెప్పి పడుకోబెట్టింది. అమ్మ మహికి ప్రేమతో తినిపించి టాబ్లెట్ వేసి హాయిగా పడుకో అంటూ జోకొట్టి పడుకోబెట్టి నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి వచ్చి భోజనం చేసి మహి ప్రక్కనే పడుకుంది.
[+] 9 users Like Mahesh.thehero's post
Like Reply
మహికి మెలకువ వచ్చేలోపు తన ప్రక్కనే ఉండాలని తెల్లవారుఘామునే లేచి ప్రశాంతంగా AC లో హాయిగా నిద్రపోతున్న మహి నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి కురులను సున్నితంగా స్పృశించి వెంటనే స్నానం చేసి వచ్చేస్తానురా అని చెప్పి టవల్ , బట్టలు అందుకొని బాత్రూం లోకి స్నానం చేసి వచ్చి మహి ప్రక్కనే కూర్చుంది. అమ్మమ్మ కూడా వచ్చి రాత్రి నొప్పితో ఏమైనా లేచిందా అని అమ్మను అడిగింది. లేదమ్మా రాత్రి పడుకుందే ఇప్పటికీ హాయిగా నిద్రపోతోంది. ట్రీట్మెంట్ చేసింది ఎవరు వీళ్ళంటే ప్రాణమైన అక్కయ్య అంటూ సంతోషన్గా చెప్పింది. 



ఎంతసేపయినా పర్లేదు రెస్ట్ తీసుకోని , నేను రెడీ అయ్యి మహికి ఇష్టమైన టిఫిన్ చేస్తాను అని చెప్పి మహి నుదుటిపై ముద్దుపెట్టి వెళ్ళింది. నేను కూడా కాలేజ్ కు లీవ్ పెడతానమ్మా అని చెప్పి మొబైల్ అందుకొని రూమ్ బయటకువచ్చి కాలేజ్ ప్రిన్సిపాల్ మేడం కు కాల్ చేసి accidental గా నిన్న మహి కడుపులో చిన్న పిన్ గుచ్చుకుంది తను రికవరీ అయ్యేంతవరకూ ................ఇందు అది నేను చూసుకుంటాను కానీ , ఇప్పుడు మహి ఎలా ఉంది అని కంగారుపడుతూ అడిగింది. ఇప్పుడు బాగుంది మేడం అని బదులివ్వడంతో సరే వీలుచూసుకొని వస్తాను , ఎన్నిరోజులైనా పర్లేదు మహిని జాగ్రత్తగా చూసుకొమ్మని చెప్పింది. థాంక్స్ మేడం అనిచెప్పి మొబైల్ పెట్టేసింది.



నేను నిద్రలేచి మహిని ఒకసారి ఎలా ఉందో చూడాలని కూడా పట్టించుకోకుండా రోజూలాగానే స్కూల్ కి రెడీ అయ్యి స్కూల్ డ్రెస్ వేసుకొని బ్యాగుతోపాటు కిందకు వచ్చేసరికి 8:30 అయ్యింది. బుజ్జికన్నా టిఫిన్ రెడీ బ్యాగు ప్రక్కన పెట్టేసి ఒకసారి అక్కయ్యను చూసిరమ్మని చెప్పింది. నేను వెళ్ళను అమ్మమ్మా స్కూల్ కి టైం అవుతోంది టిఫిన్ పెట్టు వెళతాను అని ప్లేట్ డైనింగ్ టేబుల్ పై కొడుతూ చెప్పాను. ఏమైంది బుజ్జికన్నా నిన్న అక్కా అని ప్రేమతో పిలిచి చాక్లెట్ కూడా ఇచ్చావుగా , ఇంకెక్కడ చాక్లెట్ అమ్మమ్మా మీరు బాధపడతారని తీసుకుంది అంతే , నేను చూస్తుండగానే హాస్పిటల్ లోని డస్ట్ బిన్ లో పడేసింది , తను నన్ను క్షమించినది అన్నది అపద్ధము అని చెప్పి టిఫిన్ అంటూ అరిచాను. ఒక్కనిమిషం అంటూ బాధపడుతూనే వంటింట్లోకి వెళ్ళింది. అమ్మమ్మ వెనుకే అత్తయ్య వెళ్లి అవును అమ్మగారు , మహి రాత్రి ఇది అంటూ డివైడర్ ను చూపించి ఫ్రేమ్ కట్టించుకొనిరమ్మని చేతికి ఇచ్చింది అని చెప్పడంతో , భగవంతుడా ఇది ఎక్కడకు వెళుతుంది అని బాధపడింది.



అమ్మమ్మా ఎంతసేపు అని కేక వేయడంతో , వస్తున్నా బుజ్జికన్నా అంటూ పరుగున టిఫిన్ తీసుకొచ్చి ప్రక్కనే కూర్చుని కడుపునిండా తినేలా వడ్డించింది. ఇంతలో డాక్టర్ అంటీ , అంకుల్ మరియు వారి పిల్లలతో పాటు నాఎత్తు ఉన్న టెడ్డి బేర్ తీసుకొని వచ్చి మహేష్ అప్పుడే స్కూల్ కి రెడీ అయిపోయావా గుడ్ అంటూ తలపై ముద్దుపెట్టింది , అవునత్తయ్యా నిన్న PET రాకపోవడంతో ప్రాక్టీస్ చెయ్యలేదు ఈరోజు తొందరగా వెళ్లాలి అంటూ hi అని పిల్లలను పాలకరించాను . నవ్వుతూ ఇంతకీ అక్కయ్య ఎక్కడ అని అడిగినా పట్టించుకోకుండా తింటూనే ఉండటంతో , ఏమైంది అంటూ అమ్మమ్మ వైపు సైగ చెయ్యడంతో ,



మేడం మహి లోపల ఉంది రండి అంటూ మామధ్యన జరిగిందంతా వివరించింది.అంటే చాక్లెట్ తీసుకోవడం..........అంతా మన భ్రమ అంటూ రూంలోకి పికుచుకొనివెళ్లింది. అప్పుడే మహి లేచినట్లు అమ్మతో మాట్లాడుతూ అంటీ మాటలు విని అంటీ నా గిఫ్ట్ తెచ్చారా అని బయటకు వినపడేలా గట్టిగా అరిచింది. నా మహి కోసం తీసుకురాకుండా ఎలా ఉంటాను ఇదిగో అంటూ తలుపు తెరిచి పింక్ టెడ్డి బేర్ ను చూపిస్తూ బెడ్ దగ్గరికి పిల్లలతోపాటు వచ్చింది. Wow అంటీ బ్యూటిఫుల్ అంటూ లెవబోతూ కొద్దిగా నొప్పి ఉన్నట్లు కుట్లుపడిన చోట చెయ్యపట్టుకోవడంతో , అంటీ పరిగెత్తుకుంటూ వచ్చి మహి రెండు దిండ్లు మహి వెనుక పెట్టమని చెప్పి మహిని వెనుక ఆనుకునేలా కూర్చోబెట్టింది. టెడ్డి బేర్ అందుకొని ఎంత పెద్దగా ఉందొ చాలా బాగుంది లవ్ యు అంటీ అంటూ వేలితో దగ్గరకు రమ్మని చెప్పి బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టింది.



ఈ ముద్దుకోసమేరా నీకోసం పెద్దది తీసుకువచ్చాను అనిచెప్పి తమ పిల్లలను బెడ్ పై మహి ప్రక్కనే కూర్చోబెట్టింది. మహి ఇప్పుడు ఎలా ఉంది అని అంకుల్ అడిగారు. మా అంటీ నాకు నొప్పిలేకుండా చేసేసింది అంటూ నవ్వుతూ చెప్పింది. మహితో మార్కులు కొట్టేశారు డాక్టర్ శ్రీమతి గారు అనగానే మహితోపాటు అమ్మకూడా నవ్వి , అన్నయ్యా కూర్చోండి అని చెప్పి సంతోషన్గా మాట్లాడుతున్నారు. అమ్మమ్మా వెళదామా అని అడగడంతో , బుజ్జి కన్నా ఈరోజు నువ్వు అంటీతో వెళ్లు మహిని చూసుకోవడానికి ఇద్దరు కచ్చితంగా ఉండాలి అని బదులివ్వడంతో , అనుకున్నాను.........అంటూ కోపంతో బ్యాగు అందుకొని వెళ్లి కారులో కూర్చున్నాను. అమ్మమ్మా అంటీ నవ్వుకుని లంచ్ బాక్స్ తీసుకొని అంటీ రావడంతో స్కూల్ కి చేరుకున్నాను.

 గాయం చూస్తే అమ్మ కంగారుపడుతుందని బయటకు పంపించి డాక్టర్స్ బాక్స్ ఓపెన్ చేసి బ్యాండేజ్ నెమ్మదిగా తీసి గాయాన్ని dettol తో శుభ్రం చేసి మళ్లీ కట్టుకట్టి , మహి త్వరగా మానిపోతుంది అని నుదుటిపై ముద్దుపెట్టి హాస్పిటల్ కు సమయం అవ్వడం వల్ల మళ్లీ సాయంత్రం వస్తానని చెప్పి వెళ్లిపోబోతుండగా , అంటీ లవ్ యు sooooo మచ్ for the టెడ్డి బేర్ అంటూ గట్టిగా దాన్ని హత్తుకొంది. లవ్ యు టూ మహి తొందరగా బ్రష్ చేసి టిఫిన్ చేసి టాబ్లెట్స్ వేసుకొని హాయిగా నిద్రపో అని చెప్పి వెళ్లిపోయారు.



 అమ్మ కాలేజ్ ప్రిన్సిపాల్ కాలేజ్ కు వెళ్లి స్టాఫ్ ఓకేఒక్కరితో మహికి గాయం అయినట్లు చెప్పీచెప్పగానే కొన్ని నిమిషాల్లోనే స్టూడెంట్స్ తోసహా కాలేజ్ మొత్తం తెలిసిపోయి , అమ్మ మీద అభిమానంతో సాయంత్రం వరకూ గ్రూప్ గ్రూప్ లుగా , లీజర్ సమయంలో , లంచ్ సమయంలో స్టాఫ్ మరియు స్టూడెంట్స్ స్వయంగా ఇంటికివచ్చి మహి త్వరగా కోలుకోవాలని చాక్లెట్ లు ,గిఫ్ట్ లు ఇచ్చి మహిని నవ్వించి వెళ్లిపోతుంటే అమ్మా మరియు అమ్మమ్మ ఆనందానికి అవధులే లేవు. అమ్మా కాలేజ్ లో అందరికీ నువ్వంటే చాలా ఇష్టం , నీ కూతురిగా పుట్టినందుకు నేను కూడా వాళ్లకు చాలా చాలా ఇష్టం , లవ్ యు అమ్మా అంటూ అమ్మ చెయ్యిని తన బుగ్గలపై ఉంచుకొని ఇలాగే హాయిగా ఉందమ్మా అంటూ సంతోషించింది.



సాయంత్రం అమ్మమ్మ కూడా స్కూల్ కి రావడంతో ఆనందించి స్పోర్ట్స్ గురించి మాట్లాడుతూ ఇంటికి చేరుకున్నాము. బుజ్జికన్నా ఇప్పుడైనా అక్కయ్యను ఒకసారి మాట్లాడించు నాన్నా అంటూ కళ్ళల్లో చెమ్మతో బ్రతిమాలడంతో , సరే అమ్మమ్మా అంటూ కన్నీళ్లను తుడిచి అమ్మ రూమ్ డోర్ తెరిచి లోపలకు అడుగుపెట్టానో లేదో , అప్పటివరకూ టెడ్డిబేర్ సంతోషన్గా ఆడుకుంటున్న మహి నన్ను చూడగానే కోపంతో ముఖం మార్చేసుకొని టెడ్డిబేర్ తోపాటు దుప్పటి కప్పుకొని పడుకోవడంతో , అమ్మమ్మా ఇక నావల్ల కాదు అంటూ బయటకు వచ్చి బ్యాగును సోఫాలో విసిరేసి పైకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. అత్తయ్యకు ఇష్టం లేకపోయినా మహి ఏమి చేసుకుంటుందో అని భయపడి ఎవ్వరూ చూడకుండా  చీరకొంగులో దాచుకున్న ఫ్రేమ్ కట్టించిన డివైడర్ ను చూపించింది. నో నో నో.........దాచేయ్యండి అమ్మ చూస్తుంది. ఇలాగే వెళ్లి పైన మా రూంలో నా బెడ్ ప్రక్కనే ఉన్న డ్రా లో దాచేయ్యండి , నేను కోలుకున్న తరువాత దాని సంగతి చూస్తాను అని చెప్పింది.



మహికి నయమయ్యేసరికి వారం రోజులు పట్టింది. అంటీ పూర్తిగా పరిశీలించి you are perfectly alright బంగారు అంటూ లోపల కుట్లు కరిగిపోవడంతో బయట కనిపిస్తున్న కుట్లను సున్నితంగా లాగగానే వచ్చేసాయి . అందరినీ పిలిచి మానిపోయిందని చూపించి రేపటి నుండి తనకు ఇష్టమైన స్టడీస్ మీద concentrate చేయొచ్చని చెప్పి ప్రేమతో ముద్దుపెట్టి కొద్దిసేపు మాట్లాడి వెళ్ళిపోయింది. అమ్మా  , అమ్మమ్మా , అంటీ అంటూ వారం రోజుల తరువాత మహి అమ్మను మనఃస్ఫూర్తిగా కౌగిలించుకొని నొప్పి ఏమాత్రం లేదు రేపటి నుండి నేను స్కూల్ కి , మీరు కాలేజ్ కు సంతోషన్గా వెళ్లొచ్చు అని చెప్పింది. అమ్మ మహిని మనసారా తన గుండెలపై హత్తుకొని తలపై ప్రేమతో నిమురుతూ ఆనందబాస్పాలతో మహి ముఖమంతా ముద్దులతో ముంచెత్తింది. తరువాత అమ్మమ్మ ప్రాణంగా హత్తుకొని నా బంగారుకొండ రేపటి నుండి తన ఇష్టప్రకారం స్కూల్ కి వెళ్లొచ్చు , తన ఫ్రెండ్స్ తో ఆడుకోవచ్చు ......ఇంకా ఇంకా ఏమైనా చెయ్యొచ్చు అని బుగ్గపై ముద్దుపెట్టి , అంతకంటే ముందు నా బంగారుకొండకి స్నానం చేయించాలి వాసన వస్తోంది అని చెప్పడంతో , అమ్మా మరియు అంటీ నవ్వుతుండటంతో అమ్మమ్మా ......నిన్నూ వాసన వస్తోందా అంటూ తన బుగ్గలను మరియు శరీరాన్ని అమ్మమ్మకు పూసేస్తూ అందరూ గట్టిగా నవ్వుకున్నారు. అమ్మ మహిని పిలుచుకొనివెళ్లి శుభ్రన్గా తలస్నానం చేయించి కొత్తబట్టలు వేసి , నన్ను కూడా పిలిచి గుడికి పిలుచుకొనివెళ్లి ఇద్దరి పేర్ల మీద పూజ జరిపించింది.



 గుడిలో ఇద్దరమూ ఎడ మొహం పెడ మొహంతో ఉండటం చూసి దేవుడా నువ్వే ఎలాగైనా వీళ్ళు కలిసిపోయేలా చెయ్యాలని ముగ్గురూ పొర్లు దండాలతో పూజించారు. గుడిలోనే కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని , మహి మహేష్ కు కొబ్బరి అందివ్వు అంటూ ఇచ్చింది , కొబ్బరిని తాకేతాకనట్లు పట్టుకొని నామీదకు విసిరి చేతులను దులుపుకుంది. నువ్వే తినవే అంటూ తనమీదకు విసిరేసి అమ్మా నాకు కూడా నువ్వే ఇవ్వమ్మా అంటూ తన ప్రక్కనే కూర్చున్నాను.  వస్తూ వస్తూ మాల్ లోకి పిలుచుకొనివెళ్లి కొత్త బాక్స్ లతోపాటు కొత్త బ్యాగులు , పెన్స్ , పెన్సిల్స్.............ఇలా ఏమేమి అవసరమో అన్నింటినీ ఇద్దరూ చూస్తుండగానే కొనిచ్చి బోలెడన్ని ఐస్ క్రీమ్స్ , చాక్లెట్ లు తీసుకొని ఇంటికి చేరుకున్నాము. రాత్రికి అందరమూ డైనింగ్ టేబుల్ లో భోజనం చేసి అమ్మా నేను కూడా పైన రూంలోనే పడుకుంటాను అని చెప్పడంతో , ఇద్దరూ ఒకే గదిలోనా అంటూ మురిసిపోయింది.



పైన గదిలో ప్రక్కప్రక్కనే ఉన్న బెడ్లను పడుకోవడానికి రెడీ చేసి మా ఇద్దరి నుదుటిపై ప్రాణంగా ముద్దులుపెట్టి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయింది. అమ్మ కిందకు వెళ్లిపోగానే త బెడ్ ప్రక్కనే ఉన్న టేబుల్ డ్రా లో నుండి అత్తయ్య ఉంచిన ఫ్రేమ్ ను తీసి రేయ్ అంటూ పిలిచి మరీ చూపించింది. దాన్ని చూడగానే ఎక్కడలేని కోపం తన్నుకువచ్చి ఏమీ చేయలేక మౌనంగా తల దించుకుని కూర్చుంది. ఏంట్రా దీనిని నీకు అనుక్షణం కనపడేలా , నువ్వు చేసిన తప్పు తెలిసేలా గోడపై వ్రేలాడదీయమంటావా అని అడిగింది.



ఎక్కడైనా వ్రేలాడదీసుకో పోవే నాకేంటి మొత్తం తప్పు నాది మాత్రమే కాదు అంటూనే .......దానిని చూస్తే అమ్మా అమ్మమ్మలు ఎక్కడ బాధపడతారో అని బాధతో కన్నీళ్లు రావడం చూసి , నాకు కూడా అదొక్కటే బాధరా లేకపోతే ఉదయమే గోడపై తగిలించేదాన్ని , ఈ శిక్షను నువ్వు మాత్రమే అనుభవించాలి ఎలాగా , ఎలాగా ..........అంటూ ఆలోచించి , ఆ .........నువ్వు రోజూ ఉదయమే లేచిన వెంటనే ఇప్పటివరకూ సాధించిన స్పోర్ట్స్ షీల్డ్స్ , కప్స్ చూసి మురిసిపోతుంటావు కదా అంటూ షోకేస్ మిర్రర్ ప్రక్కకు జరిపి ఒక దగ్గర సెట్ చేసింది. తీక్షణంగా చూస్తే కానీ కనిపించదు , కానీ మహి ఇదిగోరా ఇక్కడ పెట్టాను నువ్వు రోజూ చూడాలి , తప్పు గుర్తుచేసుకుంటూనే ఉండాలి . నేను లేనప్పుడు తీసి బయట పడేద్దాము అనుకుంటున్నావేమో దాన్ని టచ్ చేసినా అమ్మ మీద ఒట్టు అని ఏమాత్రం ఆలోచించకుండా చెప్పేసింది. ఒసేయ్ నీకు బుద్దున్ధా............. ముందు అమ్మ మీద ఒట్టు వెనక్కు తీసుకో నేను దానిని టచ్ చెయ్యను అని మాటిస్తున్నాను అని ఉద్వేగంతో చెప్పాను. సరే సరే వెనక్కు తీసుకున్నాను sorry మా లవ్ యు వీడివల్లనే ఆ మాట నా నోటిలో నుండి వచ్చింది అని తనను తాను తిట్టుకుంటూ , కలిసి ఉన్న బెడ్ లను జరపడానికి కష్టపడుతుంటే నా బెడ్ నే దూరంగా జరిపి కనీసం లేవగానే దెయ్యంలా ఉన్న నీ ముఖాన్ని అతిదగ్గరగా చూడకుండా చేసావు థాంక్స్ అంటూ లైట్స్ ఆఫ్ చేసి పడుకున్నాను. నాది కూడా అదే ఫీలింగ్ goo........ చెప్పబోయి అక్కడితో ఆపేసి తనవైపు ఉన్న లైట్స్ ఆఫ్ చేసి నిద్రపోయింది.



ఉదయం 5 గంటల అలారం చప్పుడుకు లేచి లైట్స్ on చేసి షోకేస్ వైపు గర్వంగా పెదాలపై చిరునవ్వుతో చూస్తూ ఫ్రేమ్  కనపడటంతో సంతోషం మాయమై ఏమీ చేయలేక జాగింగ్ షూస్ మరియు డ్రెస్ వేసుకొని యధావిధిగా గ్రౌండ్ కు అటునుండి జిమ్ కు వెళ్లి రెండు గంటలపాటు సంతోషన్గా కష్టపడి వొళ్ళంతా చేమటలతో ఇంటికి చేరుకొని వంట గదిలో వంట చేస్తున్న అమ్మా మరియు అమ్మమ్మ తలలపై ప్రేమతో ముద్దులుపెట్టి గుడ్ మార్నింగ్ చెప్పి నేరుగా రూమ్ కు వెళ్లి ఇంకా దున్నపోతులా నిద్రపోతున్న మహిని చూసి పట్టించుకోకుండా బాత్రూం కు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి వచ్చేసరికి , మహి బట్టలు మరియు టవల్ చేతిలో పెట్టుకొని బాత్రూం లోకి వెళ్లాలని ఎదురుచూస్తుండటంతో , 



అయ్యో అది wait చేస్తోందని తెలిసి ఉంటే ఇంకో గంటసేపు బాత్రూం లోనే ఉండేవాన్ని అని నాలో నేను గుసగుసలాడటం తనకు వినిపించడంతో నావైపు కోపంతో చూస్తుండటంతో వెల్లవే వెళ్లు అంటూ కళ్లతో సైగ చేసి నాలో నేను నవ్వుకున్నాను. స్కూల్ డ్రెస్ వేసుకొని స్పోర్ట్స్ డ్రెస్ ను స్కూల్ బ్యాగులో పెట్టుకొని కిందకు వెళ్లి అమ్మా టిఫిన్ అని అరిచాను. నాన్నా మహి రాగానే అందరమూ కలిసి తిందాము అని వంటగదిలో నుండి మాటలు వినబడటంతో , దానికోసం మనం wait చెయ్యాలా అని అనబోయి అమ్మావాళ్ళు బాధపడకూడదని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ టీవీ చూస్తూ కూర్చున్నాను. 



మహి కూడా స్కూల్ డ్రెస్ తో రెడీ అయ్యి వచ్చి నన్ను చూసి చిలిపిగా నవ్వి ఎంత తొందరగా రెడీ అయినా నేను వచ్చేన్తవరకూ అమ్మ ఎవ్వరికీ టిఫిన్ పెట్టదురా ముందు అది తెలుసుకో అని చెప్పి వంట గదిలోకి వెళ్లి అమ్మను వెనుక నుండి హత్తుకొని గుడ్ మార్నింగ్ అమ్మా అంటూ అమ్మ వీపుపై ముద్దుపెట్టింది. అమ్మతోపాటు అమ్మమ్మ కూడా గుడ్ మార్నింగ్ చెప్పి తలపై ప్రేమతో నిమిరి వంటలన్నీ డైనింగ్ టేబుల్ పైకి మార్చేసి అత్తయ్యను పిలిచి అందరమూ ఒకరికొకరు వడ్డించుకొని తినేసి స్కూల్ కు బ్యాగులు తీసుకొని ఇంట్లో నుండి బయటకు వస్తుండగా అమ్మా........నొప్పి అంటూ మహి బ్యాగుని వదిలేసి కడుపు కింద రెండు చేతులను పట్టుకొని కింద నేలపై నెమ్మదిగా కూర్చుండిపోయింది. నేను ప్రక్కనే నిలబడి చూస్తూ ఉండిపోయాను. అమ్మమ్మ విషయం తెలుసుకుని కంగారుపడుతూ వచ్చిన అమ్మచెవిలో సంతోషమైన వార్త చెప్పినట్లు , మా బంగారుతల్లి అంటూ బుగ్గలను ప్రేమతో అందుకొని నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి కన్నయ్యా ఈరోజు నుండి మహి కొన్నిరోజులు స్కూల్ కి రావడం లేదు నేను మీ క్లాస్ టీచర్ కు కాల్ చేసి చెబుతాను నువ్వు అత్తయ్య వెంట వెళ్లు అని అమ్మ చెప్పింది. ఎందుకమ్మా అని అడిగాను. బుజ్జికన్నా నువ్వు పెద్దయ్యాక నీకు తెలుస్తుంది అని అమ్మమ్మ చెప్పి పంపించేసింది. అమ్మ మహి ప్రక్కనే కూర్చుని బంగారు మేము చెప్పేంతవరకూ నువ్వు ఇల్లు దాటి వెళ్లకూడదు అని చెప్పి అంటీకి ముందుగా కాల్ చేసి విషయం చెప్పడంతో ,మంచి శుభవార్త చెప్పావు ఇందు వెంటనే వచ్చేస్తున్నాను మా బంగారుతల్లి అప్పుడే పెద్దదైపోయిందన్నమాట అని చెప్పింది.



అంటీ వచ్చిన తరువాత చూసి కంఫర్మ్ చేసి పైన తన రూం కు పిలుచుకొనివెళ్లి స్నానం చేయించి బట్టలువేసి చాపపై కూర్చోబెట్టారు. సాయంత్రం వరకూ సాంప్రదాయం ప్రకారం కార్యక్రమాలు పూర్తి చేశారు. స్కూల్ కి కాల్ చేసి విషయం చెప్పడంతో , మొత్తం పూర్తయిన తరువాతనే పంపించండి అని పర్మిషన్ ఇచ్చారు. తరువాత బంధువులందరికీ కాల్ చేసి సంతోషన్గా తెలిపారు.



నేను స్కూల్ నుండి వచ్చి యధాప్రకారం ఫ్రెష్ అవ్వడానికి పైకి వెళ్లబోతుండటం చూసి అత్తయ్య అమ్మకు చెప్పింది. చూడు గిరిజా వాళ్ళు కలిసే పుట్టారు వాళ్ళను వేరుచెయ్యడానికి మనకు ఏమి అర్హత ఉంది వెళ్ళనివ్వు అని చెప్పడంతో , అలాగే అని బదులిచ్చింది. పైకి వెళ్లి చాపపై కాళ్ళను ముడుచుకొని తలను మోకాళ్లపై ఉంచి కూర్చున్న మహిని చూసి గట్టిగా నవ్వేసాను , ఒరేయ్ నువ్వు రూంలోకి రారాదు వెళ్లు అని తిట్టింది. పోవే ఇది నారూమ్ కూడా అంటూ టవల్ అందుకొని మహి తలపై కొట్టి బాత్రూం లోకి వెళ్ళాను. అమ్మా వీడు చూడు నన్ను ఆటపట్టిస్తున్నాడు అని కేక వేయడంతో అమ్మవచ్చి నవ్వుకుని ఫ్రెష్ అయ్యి వచ్చిన నన్ను కిందకు పిలుచుకొనివచ్చేసింది. రాత్రి మాత్రం పైకి వెళ్లే పడుకున్నాను.


ఫంక్షన్ ఒకరోజు ఫిక్స్ చెయ్యడంతో ఇల్లు మొత్తం బంధువులతో మరియు మహి ఫ్రెండ్స్ మరియు అమ్మలతో నిండిపోయింది. మహికి చీర కట్టించి అలంకరించిన సోఫాలో కూర్చోబెట్టి పద్ధతి ప్రకారం ఘనంగా ఫంక్షన్ జరిపించారు , తనకు వచ్చిన డ్రెస్ మరియు గిఫ్ట్ లతో ఒక రూమ్ మొత్తం నిండిపోయింది. భోజనాలు చేసిన తరువాత అందరూ వెళ్లిపోయారు. మహి అలసిపోయినట్లు లేచి పైకి వెళుతూ చీరను carry చెయ్యలేక జారిపోవడంతో నాకైతే నవ్వు ఆగలేదు. అత్తయ్య పరుగున వచ్చి మహిని ఎత్తుకొని రూమ్ లోకి వెళ్ళిపోయింది . ఆరోజుతో మహికి చీర అంటే విరక్తి వచ్చేసింది. కొన్ని రోజుల తరువాత యధాప్రకారం స్కూల్ కి వెళ్ళింది.





స్కూల్ కి చేరుకొని యధావిధిగా తను క్లాస్ లోకి నేను బ్యాగుతోపాటు గ్రౌండ్ లోని PET దగ్గరకు వెళ్లి ఆయన చెప్పినట్లు ప్రాక్టీస్ చెయ్యసాగాము. ఇంటర్వెల్ తరువాత బ్యాగును క్లాస్ లో పెడదామని అందరితోపాటు వెళ్ళాను. మొదటిసారి మహి మేము రోజూ కలిసి కూర్చుంటున్న బెంచ్ లో కాకుండా వేరే బెంచ్ లో తోటి ఫ్రెండ్స్ తో కూర్చోవడం చూసి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఎవ్వరూ చూడకుండా తుడిచేసుకొని పోవే అంటూ చేతితో సైగ చేసి నేను కూడా ఆ బెంచ్ లో కూర్చోకుండా మా ఫ్రెండ్స్ తో కూర్చున్నాను. క్లాస్ మొత్తం మేము దూరం దూరం కూర్చోవడం చూసి ఆశ్చర్యపోయి గుసగుసలాడారు. మహి ప్రక్కనే కూర్చున్న క్లోజ్ ఫ్రెండ్ ఎమిటే ఏమయ్యింది అని అడగడంతో , డివైడర్ గుచ్చుకున్న విషయం దాచేసి , వాడు నా బాక్స్ లోని డివైడర్ దొంగతనం చేసి నాది అని దబాయిస్తున్నాడు అందుకే ఇలా అని బదులిచ్చింది. ఇది ఆనోటా ఈ నోటా ప్రక్కప్రక్కనే వెలుతూ ఆరోజు డివైడర్ దొంగిలించిన పద్మజ చెవిన పడి , ముఖమంతా చెమటతో కంగారెత్తిపోయింది. తనవల్ల ఒకరొకరు ప్రాణంగా ఉండేవాళ్ళు దూరం అయిపోవడం తనను బాధిస్తున్నా, ఇప్పుడు చెబితే స్కూల్ మొత్తం తనను ముద్దాయిని చేస్తుందని తల వంచుకొని మౌనంగా ఉండిపోయింది.
[+] 12 users Like Mahesh.thehero's post
Like Reply
అలా ఇద్దరమూ మాట్లాడుకోకుండా పొట్లాడుతూ , అమ్మా అమ్మమ్మ ప్రక్కన ఉన్నప్పుడు మాత్రం సైలెంట్ ఉన్నట్లు నటిస్తూ, రూంలో ఉదయం అంతా బెడ్స్ కలిపి రాత్రి అమ్మ గుడ్ నైట్ చెప్పి వెళ్లిపోగానే కోపంతో చురచురా చూసుకుని దూరంగా జరిపి పడుకొని , ఉదయం లేవగానే బాత్రూం లో ఒకరోజు తను ఆలస్యం చేసి నన్ను ఇబ్బందిపెట్టడం , మరొకరోజు నేను అదేపనిగా ఆలస్యం చేసి తనను ఇబ్బందిపెట్టడం , క్లాస్ లో దూరం దూరం కూర్చోవడం , తను స్టడీస్ లో టాప్ ఉండటం , నేను స్పోర్ట్స్ లో నెంబర్ వన్ కానీ స్టడీస్ లో కేవలం టీచర్స్ దయ వల్ల పాస్ మార్కులతో గట్టెక్కి టెన్త్ క్లాస్ చేరుకున్నాము.



సెలవులలో అమ్మమ్మ పల్లెకు వెళ్లి స్వచ్ఛమైన పచ్చటి తోటలలో రెండు నెలలపాటు సిటీకి దూరంగా , నాన్నతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎంజాయ్ చేసాము. ఆ రెండు నెలలు వ్యవసాయం గురించి తెలుసుకొని వరి నాట్లు ఎలా పెట్టడమే నేర్చుకున్నాను. రైతులతో పాటు ఉదయం నుండి సాయంత్రం వరకూ పొలాలలోనే కష్టపడటం నేర్చుకున్నాను. దానివల్ల ఆరెండు నెలలు ప్రత్యేకంగా జాగింగ్ మరియు జిమ్ కు వెళ్లాల్సిన అవసరం లేకపోయింది. ఫ్రెష్ వెజిటబుల్స్ తిని ఆరోగ్యానికి ఆరోగ్యంతోపాటు పొలంలో విశ్రమించకుండా కష్టపడటం వల్ల స్ట్రాంగ్ గా తయారయ్యాను. నా వయసుకు మించిన బరువును మోయటం , పొలాల్లో అడ్డుగా ఉన్న పెద్ద పెద్ద బండరాళ్లను ఎత్తి కంచె దగ్గర అవలీలగా వెయ్యడం చూసి అమ్మమ్మ చాలా సంతోషించింది. మహి మాత్రం అమ్మమ్మా పని వాడిలా ఉన్నాడు , వీడికి సరిగ్గా సరిపోయే జాబ్ ఇదే , చదువు మానేసి ఇక్కడే ఉంచి వొళ్ళు వొంచేలా పనిచేయించడం మంచిది అని చెప్పడంతో , అమ్మావాళ్ళు విని సంతోషంగా నవ్వుకున్నారు. 



కోపంగా వెళ్లిపోవడం చూసి బుజ్జికన్నా , నాన్నా వ్యవసాయం గురించి తనకేమీ తెలుసు ఇప్పటివరకూ నువ్వు కష్టపడి చెయ్యడం వల్ల కొన్ని నెలల తరువాత బియ్యంగా మారి ప్రపంచమంతా సులభంగా తినేలా ఇంటికి చేరుతాయి. అందుకే రైతే రాజు అన్నారు , నువ్వు తన మాటలను పట్టించుకోకు, నువ్వు చాలా గొప్ప పని చేస్తున్నావు అని పొగడటంతో , లవ్ యు అమ్మమ్మా అంటూ మరింత ఉత్సాహంతో రైతులతోపాటు సంతోషంగా పని పూర్తిచేసాను. రెండు నెలలు రెండు రోజులులా గడిచిపోవడంతో సిటీకి బయలుదేరుతూ,  పంట జాగ్రత్త అని మరీ మరీ అమ్మమ్మ వాళ్లకు చెప్పింది.



స్కూల్ కి వెళ్లిన మొదటిరోజే 10 th క్లాస్ స్టేట్ ర్యాంక్ తెచ్చుకోవాలని , అమ్మా మరియు అమ్మమ్మ కళ్ళల్లో సంతోషం చూడాలని నిర్ణయానికి వచ్చినట్లు అందుకు అనుగుణంగా టైం టేబుల్ వేసుకొని మరీ రాత్రి పగలూ చదవడం మొదలెట్టింది. 



స్కూల్ లోకి అడుగుపెట్టగానే PET నాతోపాటు స్పోర్ట్స్ ఎంచుకున్న వాళ్ళందరినీ పిలిపించి నెక్స్ట్ month state ఛాంపియన్ షిప్ జరగబోతోంది కాబట్టి మీరు ప్రాక్టీస్ మరింత పెంచి మనమే అన్ని స్పోర్ట్స్ , అథ్లెటిక్స్ లో రాణించి ఛాంపియన్ షిప్ ను మన స్కూల్ కి వచ్చేలా చెయ్యాలి. మనం ఈ స్కూల్ లో ఉండబోయేది ఇక కేవలం ఒక సంవత్సరం మాత్రమే , మీరు స్కూల్ వదికివెళ్లిన మరుక్షణం మీరు ఎవరన్నది స్కూల్ మొత్తం మరిచిపోతుంది. అలా కాదు స్కూల్ ఉన్నంతకాలం మీపేర్లు స్పోర్ట్స్ బోర్డ్ పై చిరస్థాయిగా నిలిచిపోవాలంటే మీ ముందు ఉన్న ఏకైక గమ్యం ఈ స్టేట్ ఛాంపియన్ షిప్ , ఇప్పుడు చెప్పండి మీరు ఏమి చేయబోతున్నారు అని అడుగగానే ,ఒక్క స్వరంతో మనం స్టేట్ ఛాంపియన్స్ అంటూ గట్టిగా అరిచిమరీ చెప్పడంతో , గుడ్ బాయ్స్ ఈరోజు నుండి మనకు స్పోర్ట్స్ తప్ప మరొక దానిమీద ధ్యాస ఉండకూడదు అని మోటివేషన్ స్పీచ్ కు అందరూ గొప్పగా ఫీల్ అయ్యి విశ్రమించకుండా ప్రాక్టీస్ లో మునిగిపోయాము. మహేష్ నా hopes అన్నీ నీమీదనే అని గర్వంగా చెప్పి , సెలవులో బాగా స్ట్రాంగ్ గా తయారయ్యావు గుడ్ ఒక స్పోర్ట్స్ బాయ్ ఎలా ఉండాలో ఇప్పుడు exact గా అలా ఉన్నావు అంటూ భుజం తట్టి ప్రశంశించారు. Thank యు సర్ కచ్చితంగా నావంతు శాయశక్తులా ప్రయత్నిస్తాను సర్ అని చెప్పి  అమ్మమ్మా అంతా నీవల్లనే లవ్ యు అంటూ మనసులో అనుకోని మురిసిపోయి ప్రాక్టీస్ మొదలెట్టాను.



సాయంత్రం 4 గంటల వరకూ స్కూల్ లో PET కింద చెయ్యడంతో పాటు అమ్మ కాలేజ్ కు చేరుకొని , అమ్మ పరిచయం చేసిన కాలేజ్ PET అంటీని కలిసి స్టేట్ ఛాంపియన్ షిప్ పోటీల గురించి వివరిస్తుండగానే , మహేష్ నేనే నీకు కాల్ చేసి విషయం చెబుదామనుకున్నాను , ఏకంగా నువ్వే వచ్చేసావు అని చెప్పింది. అంటీ మా స్కూల్ సర్ కూడా బాగానే ప్రాక్టీస్ చేయిస్తున్నారు కానీ అన్నింటిలో ఫస్ట్ ఉండాలంటే నాకు మీ గైడెన్స్ కూడా కావాలి అని అడగడంతో , sure మహేష్ ఇలాగే నెలరోజులపాటు స్కూల్ అయిపోగానే వచ్చెయ్ ఇక్కడ ప్రాక్టీస్ చేసేద్దాము అని బదులివ్వడంతో , థాంక్స్ అంటీ అంటూ అమ్మావాళ్లను ఇంటికి వెళ్ళమని చెప్పాను. అత్తయ్య మాత్రం నేను అంటీతో ప్రాక్టీస్ చేసేంతవరకూ ఉండి చూసి మురిసిపోయి , మా మహేష్ బంగారం అంటూ తలపై ప్రేమతో నిమిరి ఇంటికి వస్తూ దారిలో ఫ్రూట్ జ్యూస్ తాగించింది.



మైండ్ లో ఛాంపియన్ షిప్ కొట్టడం మాత్రమే పెట్టుకొని ఉదయం 4 గంటలకు గ్రౌండ్ మరియు జిమ్ కు వెళ్లిపోవడం , పుష్టిగా తిని స్కూల్ కు వెళ్లిపోవడం సాయంత్రం వరకూ స్కూల్ లోనే అన్ని గేమ్స్ అలుపులేకుండా , రెస్ట్ తీసుకోకుండా ఆడడం , స్కూల్ వదలగానే నేరుగా అంటీ దగ్గరికి అత్తయ్య పిలుచుకొనివెళ్లి పూర్తిగా శక్తిలేనంతవరకూ అంటీతోపాటు ప్రాక్టీస్ చేసి అలసిపోయి చిన్న చిన్న దెబ్బలతో ఇంటికి చేరడం , అమ్మావాళ్ళు ఒకవైపు చెప్పలేనంత సంతోషం మరొకవైపు గాయాలను రక్తాన్ని చూసి కళ్ళల్లో నీళ్లతో బాధపడుతూ మందురాయడం . 



ఎందుకమ్మా బాధపడతావు అంటూ అమ్మ కన్నీళ్లను తుడిచి ఇప్పుడు ఎంత కష్టపడితే నెల తరువాత పోటీలలో ఒక్కొక్కటే గెలుస్తుంటే అంత ఆనందం మీ కళ్ళల్లో చూడాలనేదే అమ్మా నాకొరిక అనిచెప్పి అమ్మా మీ ఒడిలో కాసేపు పడుకుంటే నొప్పులన్నీ వెళ్లిపోతాయి అని నవ్వుతూ చెప్పడంతో , రెండు చేతులు చాపి రా నాన్నా అని పిలిచి తన ఒడిలో పడుకోబెట్టుకొని కురులను ప్రేమతో నిమురుతూ ,మా మహేష్ బంగారం అంటూ నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టింది. ఆహా.........ఎంత హాయిగా ఉందమ్మా అంటూ అమ్మ నడుము చుట్టూ చేతులువేసి గట్టిగా హత్తుకొని ఏఏ ఆటలలో పోటీపడుతున్నానో వివరించాను. మా బుజ్జి కన్నయ్యే అన్నింటిలో ఫస్ట్ వస్తాడు అంటూ మురిసిపోయింది. మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తానమ్మా అని చెప్పి రేపటి నుండి మరింత ప్రాక్టీస్ పెంచాలి అని మనసులో అనుకొని , అమ్మా రేపు తొందరగా లేవాలి అనిచెప్పి భోజనం చేసి పైకివెళ్లి తొందరగా పడుకున్నాను. కొద్దిసేపటి తరువాత మహి వచ్చి బుక్స్ తెరిచి చదువుకోబోతుండగా , నేను తొందరగా లేవాలి నాకు లైట్స్ ఉంటే నిద్రపట్టదు అని కోపంతో చెప్పాను. అది తెలిసే లైట్స్ అన్నింటినీ on చేసి చదువుకుంటున్నాను మూసుకొని రగ్గు నిండుగా కప్పుకొని పడుకో అని చిలిపిగా నవ్వుకొంది.



కొవ్వు అంటూ మళ్లీ ఒకసారి చెప్పినా వినకపోవడంతో అమ్మా అమ్మా.........అంటూ గట్టిగా అరవడంతో, ఒరేయ్ అమ్మను ఎందుకురా పిలుస్తావు అంటూ లేచి లైట్స్ అన్నింటినీ ఒఫ్చేసి టేబుల్ లైట్ మాత్రమే వేసుకొని చాలాసేపటివరకూ చదువుకుంది. 



అలా అలా 28 రోజులు గడిచిపోవడంతో పోటీలు తిరుపతిలో కాబట్టి మా అందరికీ స్కూల్ తరుపు నుండి ట్రైన్ రిజర్వేషన్స్ చెయ్యడంతో , రెండు రోజుల ముందు అమ్మావాళ్ళంతా మరియు కాలేజ్ అంటీ , డాక్టర్ అంటీ స్టేషన్ కు వచ్చి all the best అని చెప్పి , మహి మహేష్ కు all the బెస్ట్ చెప్పమనడంతో , ఇంట్లోనే చెప్పానమ్మా అని అనడంతో , ఏమీ పర్లేదు మళ్లీ చెప్పమని ఫోర్స్ చెయ్యడంతో నావైపుకు చూడకుండా all the best అని చెప్పింది. నీ బోడి విషెస్ ఎవరికి కావాలి పోవే అన్నట్లు కళ్ళతో సైగ చేసి , ట్రైన్ horn సౌండ్ విని లవ్ యు అమ్మా , లవ్ యు అమ్మమ్మా , లవ్ యు అత్తయ్యా , లవ్ యు.........పోవే అంటూ కళ్ళతో సైగ చేసి ట్రైన్ అందరమూ ఎక్కాక పిల్లల పేరెంట్స్ అందరికీ నేను అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి మా సర్ ఎక్కారు.



తిరుపతి చేరుకొని అక్కడి పరిస్తులకు ఒక్కరోజులో అలవాటు పడి మాకు allot చేసిన గ్రౌండ్ లో చివరిసారి ప్రాక్టీస్ చేసి పోటీల రోజు సర్ useful స్పీచ్ విని , షెడ్యూల్ ప్రకారం 10 రోజులపాటు రోజుకు రెండు మూడు గేమ్స్ లో పోటీపడి స్టేట్ లెవెల్ లో చాలా పోటీ ఉన్నప్పటికీ అమ్మ కాలేజ్ PET అంటీ దగ్గర నేర్చుకున్నదీ మరియు ప్రాక్టీస్ చేసినది మరింత సహాయపడి ఎక్కడా తగ్గకుండా దాదాపు 75% గేమ్స్ , స్పోర్ట్స్ మరియు అథ్లెటిక్స్ లో మొదటి బహుమతులను మరియు నేను పోటీ చేసిన అన్నింటిలో దాదాపు అన్నింటిలో గోల్డ్ మెడల్స్ సాధించడంతో, మా సర్ ఆనందానికి అవధులు లేక అందరూ వచ్చి నన్ను సంతోషం పట్టలేక అమాంతం పైకి ఎత్తి సంబరాలు చేసుకున్నాము. 



మా స్కూల్ తో పాటు తిరుపతి నుండి ఒకటి , అనంతపురం నుండి ఒక స్కూల్ మరియు తూ గో స్కూల్ ఓవర్ అల్ ఛాంపియన్షిప్ కోసం దాదాపు ఒకే స్టేజి లో ఉండటంతో స్టేట్ స్పోర్ట్స్ కమిటీ ఎవరికి అనౌన్స్ చెయ్యబోతున్నారో అని ఒకటే టెన్షన్ పడుతుంటే సాయంత్రం 5 గంటలకు ఒక నిర్ణయానికి వచ్చినట్లు స్టేజి మీదకు వచ్చి అదే విషయం చెప్పి , ముందుగా పోటీలు succussful గా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపి , 



Overall స్టేట్ థర్డ్ ప్లేస్ గోస్ టు - తూ గో ..........స్కూల్.



సెకండ్ ప్లేస్ గోస్ టు - తిరుపతి..........స్కూల్ . 



అండ్ ఫైనల్లీ much awaited స్టేట్ overall ఫస్ట్ ప్లేస్ అండ్ ఛాంపియన్షిప్ గోస్ టు ఇక్కడ రెండు స్కూల్స్ పొటాపోటీని చూపిమ్చాడంతో ఇద్దరికీ ఇవ్వాల్సిందిగా కమిటీ నిర్ణయించింది అవి - వైజాగ్.........స్కూల్ మరియు అనంతపురం........స్కూల్ అని అనౌన్స్ చెయ్యగానే , మహేష్ నా చిరకాల కల సాధించిపెట్టావు అంటూ ఆనందబాస్పాలతో అమాంతం కౌగిలించుకొని మురిసిపోయారు. మిగతా పిల్లలంతా  మహేష్ , మహేష్ , మహేష్..........అంటూ గ్రౌండ్ మొత్తం దద్దరిల్లేలా సంతోషంతో కేకలుపెట్టారు. 



కొద్దిసేపటి తరువాత ప్రైజెస్ అందుకోవడానికి థర్డ్ , సెకండ్ తరువాత ఓవర్ అల్ ఛాంపియన్స్ అంటూ మా రెండు స్కూల్ లను విడివిడిగా పిలవడంతో సర్ తోపాటు అందరమూ వెళ్లి పెద్ద షీల్డ్ ను రాష్ట్ర క్రీడా మంత్రి నుండి అందుకొని , మహేష్ అంటే నువ్వేనా అని అడగడంతో అందరూ ఆశ్చర్యపోతుండగానే స్పెషల్ ప్రైజ్ అనౌన్స్ చేసి ఆయనే స్వయంగా అందించారు . ఫోటోలు మరియు సెల్ఫీ లు దిగి సంతోషంతో ఒకరినొకరు కౌగిలించుకొని కిందకు దిగి, సర్ మొబైల్ తీసుకొని ఫస్ట్ ఇంటికి కాల్ చేసి విషయం చెప్పగానే అమ్మవాళ్ళంతా నోటి మాట రానట్లు పులకించిపోయి ఆనందాన్ని పంచుకున్నారు , అమ్మా అంటీ కి కూడా చెప్పండి అనేంతలో ........బుజ్జికన్నా నువ్వు కచ్చితంగా సాధిస్థావని నమ్మకంతో ఎప్పుడెప్పుడు కాల్ చేస్తావా అని ఉదయం నుండి ఇక్కడే ఉన్నారు అని చెప్పి ఫోన్ అందించింది. 



అంటీ ఒక్కటి మాత్రం చెబుతున్నాను స్కూల్ ప్రాక్టీస్ తోపాటు అతిముఖ్యమైన మీ దగ్గర నేర్చుకున్న మెళకువలు అడుగడుగునా ఉపయోగపడ్డాయి thank యు so so sooooo మచ్ అంటీ అంటూ సంతోషంతో చెప్పగానే , తన కళ్ళల్లో కారుతున్న ఆనందబాస్పాలను చూసి అమ్మావాళ్ళు అంటీని మనసారా కౌగిలించుకొన్నారు , అమ్మా ఇక్కడ సరిగ్గా వినపడటం లేదు తరువాత కాల్ చేస్తాను , ముందు దానికి చెప్పండి కుళ్ళుకోవాలి అని చెప్పడంతో , అప్పటివరకూ ఒక చెవితో వింటున్న మహి కోపంతో పళ్ళు కోరుక్కుంటుండటం చూసి అమ్మావాళ్ళు మూసిముసినవ్వులు వినిపించి ఏమిజరిగింతుందో ఊహించి లవ్ యు మా బై అని చెప్పి కట్ చేసి సంబరాలు చేసుకుంటున్న ఫ్రెండ్స్ తో కలిసిపోయి ఎంజాయ్ చేసాను. అలాగే అందరికీ ఒక గుడ్ న్యూస్ ఇప్పుడే వచ్చింది మీకు ఇంటరెస్ట్ ఉంటే తిరుమల స్వామి వారిని ఏ విధమైన ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకునేలా వీలు కల్పించాము వచ్చి స్కూల్ పేర్లు ఇవ్వండి వారికి సమయం ఎప్పుడో చెబుతాము అని అనౌన్స్ రావడంతో , మహేష్ అందరూ ఇక్కడే ఉండండి ఫస్ట్ మన స్కూల్ పేరు ఇచ్చివస్తాను ఎందుకంటే రేపే వైజాగ్ ప్రయాణం అని చెప్పి స్టేజి పైకి అందరికంటే ముందు చేరుకొనివచ్చి సంతోషంతో నవ్వుతూ మరో రెండు గంటల్లో దర్శనం బస్ నేరుగా మనకు allot చేసిన స్కూల్ దగ్గరికి వస్తుంది గంటలో అందరూ రెడీ అయిపోవాలి అని సర్ ను అన్ని స్కూల్ వాళ్ళు అభినందిస్తుండగా మురిసిపోతూ స్కూల్ చేరుకున్నాము.



సర్ చెప్పినట్లు గంటలో రెడీ అయ్యి అమ్మకు కాల్ చేసి దర్శనానికి వెళుతున్న విషయం చెప్పాను , చాలా సంతోషం నాన్నా నువ్వు చిన్నప్పుడుగా ఉన్నప్పుడు వెళ్ళాము మళ్లీ లైఫ్ లో ఒక మెట్టు ఎక్కి వెళుతున్నావు అని చెప్పింది. బయట వేచిచూస్తుండగానే బస్ రావడంతో లవ్ యు బై అని చెప్పేసి సర్ కు మొబైల్ ఇచ్చి ఏడుకొండల అందాలను ప్రకృతిని వీక్షిస్తూ పైకి చేరుకొని ప్రశాంతంగా ఎక్కడా ఆగకుండా వెళ్లి దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని కిందకు దిగి భోజనాలు చేసి చాలాసేపు అమ్మా , అమ్మమ్మా , డాక్టర్ అంటీతో మాట్లాడి , ఇదిగో నాన్న ఉన్నారు మాట్లాడు అని అందివ్వబోతుంటే , ఇందు పార్టీకి వెళుతున్నాను రేపు వస్తాడుగా మాట్లాడతాలే అని వెళ్ళిపోయాడు. అమ్మా నేను మాట్లాడతానని చెప్పనా , నాకు మా అమ్మ , అమ్మమ్మా , అత్తయ్యా అంతే అంటూ కోపంతో చెప్పి బై రేపు రాత్రికి వైజాగ్ చేరుకుంటాము అని చెప్పి కట్ చేసాను. రాత్రంతా సర్ మేము సాధించిన పతకాలను , కప్పులను మరియు  షీల్డ్స్ ను చూస్తూ మురిసిపోతూ అలాగే నిద్రలోకి జారుకున్నారు. 



ఉదయం తెల్లవారకముందే లేచి రెడీ అయ్యి అన్నింటినీ జాగ్రత్తగా ప్యాక్ చేసి బస్ లో స్టేషన్ చేరుకొని పోటీల గురించి చర్చిస్తూ చిన్న చిన్న పోరాపాట్లకు నవ్వుకుంటూ టిఫిన్ , భోజనాలు ట్రైన్ లోనే చేసి రాత్రి 8 గంటలకు వైజాగ్ చేరుకున్నాము. విండో లో నుండే అమ్మావాళ్లను చూసి అమ్మా , అమ్మమ్మా అని గట్టిగా పిలిచాను. సర్ వెంటనే ప్యాక్ చేసిన ప్రైజెస్ బయటకు తీసి అందరికీ ఒక్కొక్కటి ఇచ్చి చివరగా నాకు overall ఛాంపియన్షిప్ షీల్డ్ ఇచ్చి , సంతోషన్గా మీ వాళ్లకు చూపించి రేపు స్కూల్ కి తీసుకురండి అని చెప్పడంతో , thank you sir అంటూ ట్రైన్ ఆగగానే బ్యాగు భుజం మీదకు వేసుకొని అందరమూ దిగి అమ్మా ఇది నీకోసమే అంటూ అందించగానే , నా కోరిక తీర్చావు కన్నా అంటూ ఆనందబాస్పాలతో అమ్మ కౌగిలించుకొని పరవశించిపోయింది. అమ్మమ్మా సాధించాను అంటూ hifi కొట్టి ప్రక్కనే అంటీని చూసి ఆనందంతో పాదాలకు నమస్కరించి మీరు లేకపోతే ఇది సాధించేవాణ్ణి కాదు అంటీ అని మనఃస్ఫూర్తిగా చెప్పాను.



ఇదిచాలు మహేష్ అంటూ లేపి తలపై ఆప్యాయంగా నిమిరి నేను చేసింది ఏమీ లేదు నువ్వు పడిన శ్రమే నిన్ను గెలిపించింది అంటూ నీ లాంటి శిష్యుడు ఒక్కరు ఉన్నా చాలు మహేష్ అంటూ పొంగిపోతూ తన గుండెలకు హత్తుకొని మురిసిపోయింది. ప్రక్కనే ఉన్న మహి ఏంట్రా ఈ ఓవర్ ఏక్షన్ నేను చూడలేకపోతున్నాను అంటూ చూసింది. కారులో ఇంటికి వెళుతూ 10 రోజులు జరిగిన గేమ్స్ గురించి వివరిస్తూ , ఏకంగా స్పోర్ట్స్ మినిస్టర్ మాకు షీల్డ్ బహుకరించడమే కాదు నాకు స్పెషల్ షీల్డ్ కూడా ఇచ్చారమ్మా అంటూ వాట్సాప్ లో అమ్మకు పంపిన ఫోటో మరియు షీల్డ్ చూపించాను. మా బుజ్జికన్నయ్య గ్రేట్ అయితే అంటూ అమ్మమ్మ సంతోషన్గా ముద్దుపెట్టింది. ముందు కూర్చున్న మహి అంతేకదా అన్నట్లు తన ఫీలింగ్స్ పెట్టింది.



ఇంటికి చేరి అమ్మ వంట 10 రోజుల తరువాత తృప్తిగా తిని మళ్లీ స్పోర్ట్స్ మినిస్టర్ స్పోర్ట్స్ మినిస్టర్ అని గర్వంగా చెబుతుండటంతో , రేయ్ ఆఫ్టర్ అల్ ఒక మినిస్టర్ తో కప్పు అందుకొని ఎందుకంత బిల్డప్ ఇస్తున్నావు , 8 నెలలు wait చెయ్యి ఏకంగా చీఫ్ మినిస్టర్ తో నామెడలో పతకం మరియు ప్రతిభా అవార్డ్ అందుకుంటాను , నీ రెండు కళ్ళతో చూసి తరించడానికి రెడీగా ఉండు అని చెప్పి అమ్మా నేను చదువుకోవాలి వెళుతున్నాను అంటూ పైన రూంవైపు వెళుతోంది. All the బెస్ట్ ఊరికే మాట్లాడటం కాదు సాధించి చూపించి అప్పుడు నన్ను తక్కువ చేసి మాట్లాడు అని చెప్పాను. అలా చేసి చూపిస్తాను అంటూ వెళ్ళిపోయింది. మహి కచ్చితంగా సాధిస్తుంది , దానికి మూలకారణం మాత్రం నా ఛాలెంజ్ అవ్వడం తో  అమ్మా , అమ్మమ్మా ఆనందాలకు అవధులు లేవు.
[+] 11 users Like Mahesh.thehero's post
Like Reply
సాధించి చూపాలని ఆరాత్రి నుండే ఏరోజు జరిగిన కాన్సెప్ట్స్ ఆరోజే అర్థం చేసుకొని చదివి , క్లాస్ లో కాన్సంట్రేషన్ తో వింటూ డౌట్స్ clarify చేసుకుంటూ ,ఇక మరొకవైపు నెక్స్ట్ రోజు స్కూల్ లో అడుగుపెట్టగానే మొత్తం స్టూడెంట్స్ వచ్చి కంగ్రాట్స్ తేలుతూ పైకి ఎత్తి గ్రౌండ్ మొత్తం రౌండ్ వేశారు. ఇక స్కూల్ హీరో అయిపోయానని చదువు గాలికి వదిలేసి ఓన్లీ స్పోర్ట్స్ పైననే దృష్టిపెట్టి , ఎక్కడ పోటీలు జరిగినా సర్ నన్ను పిలుచుకొనివెళ్లి ఆడించి జగజ్జేతగా తిరిగి వచ్చేవాళ్ళము. సర్ కు నేను ఫేవరేట్ స్టూడెంట్ నాకోసం ఏమైనా చేసేవారు , ఏ టీచర్ నైనా ఎదిరించేవారు. టెస్ట్స్ మరియు క్వార్టర్లీ , హాఫ్ yearly , pre ఫైనల్ exams లో ఏమీ రాయకపోయినా PET సర్ మాయ చేసి నాకు ఫస్ట్ క్లాస్ అంటే 60 marks వేయించేవారు. అమ్మా వాళ్ళు ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి నాన్నకు చూపించగానే తలదించుకొని వెళ్లిపోయారు. అమ్మా వాడేమీ చదువుకొని రాస్తే వచ్చిన మార్కులు కావు అవి అంటూ ఎలా వచ్చాయో వివరించడంతో , కన్నయ్యా అంటూ నావైపు చూడటంతో సిగ్గుతో తలదించుకున్నాను. ఒసేయ్ ముందు మీ ఆయన వెళ్ళాడో లేడో చూడు .........వెళ్ళాడు అమ్మా , హమ్మయ్యా అనుకొని చదువులో వీడు అంతేలేవే , నీది చూపించు అని చూసి 99.9% మా మహి నువ్వు చదువుల తల్లి అంటూ హత్తుకొని మురిసిపోయారు.



కాలం సరదాగా గడిచిపోతూ ఫైనల్ పబ్లిక్ exams రానే వచ్చాయి జంబ్లింగ్ పద్ధతి వలన మా స్కూల్ వాళ్లంతా మరొక స్కూల్ లో exam రాయవలసి వచ్చింది. PET సర్ స్కూల్ ఏదో కనుక్కుని నేరుగా వెళ్ళిపోయి , మొత్తం నాకోసం సెట్ చేసి వచ్చి భుజం పై చెయ్యి వేసి అంతా సెట్ చూసేసాను మనకు తెలిసినవాళ్లే , exam లో స్క్వాడ్ వచ్చి వెళ్ళిపోయాక invigilator మొత్తం చూసుకుంటారు నువ్వేమీ కంగారుపడకు , అప్పటివరకూ క్వశ్చన్ పేపర్ చదువుతూ కాలక్షేపం చెయ్యి అని చెప్పడంతో , థాంక్స్ సర్ అనిచెప్పి ఇంటికివెళ్లి కడుపునిండా తిని హాయిగా నిద్రపోయాను. బుజ్జికన్నా నువ్వు చదువుకోవా రేపటి నుండే కదా exams అని అమ్మమ్మ బెడ్ పై కూర్చుని ప్రేమగా కురులను నిమురుతూ చెప్పింది. మహి చదువుతూ వాడు చదవాల్సిన పరిస్థితి లేదు అమ్మమ్మా , exam సెంటర్ లోనే కాపీ లు వచ్చేలా అన్నీ సెట్ చేసేసుకున్నాడు , ఇంకా వాడికి exam లో నిద్రవస్తే హాయిగా పడుకొనిచ్చి invigilator స్వయంగా వాడి exam రాసినా రాసేస్తారు , అంత గూండాగిరి వాడు స్కూల్ హీరో కదా అని మహి చెప్పింది . బెడ్ పై కూర్చున్న అమ్మమ్మా , బయట డోర్ దగ్గర వింటున్న అమ్మ మూసిముసినవ్వులు నవ్వుతూ కిందకు వెళ్లి పడుకున్నారు.



మహి 4 గంటలకే లేచి రివిజన్ చేస్తుండగా , 5 గంటలకు వొళ్ళువిరుస్తూ లేచి exam గురించి ఏమి టెన్షన్ పడకుండా యధావిధిగా షూస్ వేసుకొని కిందకు దిగి, మాకోసం తొందరగా లేచి టిఫిన్ చేస్తున్న అమ్మ చూసి నవ్వుకుని కన్నయ్యా కాస్త తొందరగానే రా , exam ఉందికదా అని గుర్తుచేసింది . Sure మా అంటూ గంటలో జిమ్ కూడా చూసుకొని వచ్చేసి రెడీ అయ్యి , exams బాగా రాయాలని అమ్మ పూజ చేసి , దండం పెట్టుకోమని ఇద్దరికీ చెప్పింది. అమ్మను బాధపెట్టారాదని మహితోపాటు మొక్కి , exam కోసం పూజలో ఉంచిన పెన్ , pad........... అందుకొని కారులో సెంటర్ కు చేరుకొని , all the బెస్ట్ అంటూ నవ్వుతూ చెప్పడంతో ,లవ్ యు అమ్మా అంటూ కౌగిలించుకొన్నాను. అది చూసి మహి వెనక్కు వచ్చి లవ్ యు మా అంటూ పాదాలకు నమస్కరించడంతో , you can do it తల్లి అంటూ నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి నవ్వుతూ పంపించింది.



ఇద్దరమూ ముందూ వెనుక పడ్డాము . క్వశ్చన్ పేపర్ అందుకోవడం ఆలస్యం ఒకసారి పూర్తిగా questions చదివి పెదాలపై చిరునవ్వుతో మహి రాయడం మొదలెట్టేసింది. ఏంటి అంత ఈజీగా ఉందా అంటూ క్వశ్చన్ లు ఒక్కొక్కటి చదువుతుంటే ఏమీ అర్థం కాక చైనా language చూస్తున్నట్లు ముఖం పెట్టి , స్క్వాడ్ వచ్చి వెళ్లేంతవరకూ పెన్నుతో ఆడుకుంటూ కూర్చున్నాను. కొద్దిసేపు తరువాత అటెండర్ పరుగుపరుగున వచ్చి స్క్వాడ్ వస్తున్నాడు అని అన్ని రూంలకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ వెళ్ళిపోయాడు . చూడండి ఎవరైనా కాపీ చిట్స్ తెచ్చి ఉంటే తొందరగా ఇచ్చెయ్యండి కావాలంటే వాళ్ళు వెళ్ళిపోయాక ఇస్తాను అని చెప్పాడు. సర్ మేము బాగా చదువుకున్నాము మాకు ఆ అవసరం లేదు అని అందరూ కొరస్ పాడటంతో , అంటే చదువుకోని వేస్ట్ ఫెల్లో నేనొక్కడినే అన్నమాట అంటూ చప్పుడు చెయ్యకుండా కూర్చున్నాను. స్క్వాడ్ వచ్చి డోర్ ప్రక్కనే ఉన్న ఇద్దరిని చెక్ చేసి usual warnings ఇచ్చి వెళ్లిపోయారు.



10 నిమిషాల తరువాత మహేష్ ఎవరు అని నెమ్మదిగా పిలవడంతో , సర్ here అంటూ చేతిని ఎత్తాను. వీడి టైం స్టార్ట్ అయ్యింది అంటూ నావైపు చీప్ గా చూసి అటువైపు తిరిగి తన పని తాను చూసుకుంటుండగా , సర్ ఏకంగా బుక్ తీసుకువచ్చి ఇచ్చి ఎన్ని కావాలంటే అన్ని రాసుకో , పేపర్స్ మడిచిన దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి అని చెప్పి వెళ్లిపోయారు. థాంక్స్ సర్ పాస్ మార్కులు చాలు అంటూ దర్జాగా తలవంచినది ఎత్తకుండా రాస్తూనే ఉన్నాను. ఒక గంట తరువాత స్కూల్ హెడ్ మాస్టర్ చెక్ చెయ్యడానికి రావడంతో , మహి సర్ అంటూ పిలిచి నా వెనుక ఏకంగా బుక్ పెట్టి రాస్తున్నాడు అని కంప్లైంట్ చేసింది. నాకు ఫ్యుజ్ లు ఎగిరిపోయి వొళ్ళంతా చెమటలు పట్టాయి , సర్ నా ఫ్రెండ్ చెప్పినది అవును సర్ ఇతడే మహేష్ అని బదులివ్వడంతో , చూడమ్మా అంటూ పేపర్ పై పేరుచూసి మహి ,మహేష్ కానీ పాస్ అవ్వకపోతే మీ PET సర్ నన్ను మా స్కూల్ కి వచ్చి రఫ్ఫాడిస్తాడు , కాబట్టి వదిలేయ్ అమ్మా కావాలంటే నువ్వు కూడా చూసి రాసుకో అని చెప్పడంతో , కోపంగా చూస్తూ అందరూ తోడు దొంగలు అని మనసులో అనుకొని కూర్చుంది. 



Sorry అమ్మా నువ్వు రాసుకో అని చెప్పి , నా దగ్గరకు వచ్చి ఏమి పర్లేదు చెమటను తుడుచుకుని 100 marks రాసేయ్ అనిచెప్పి భుజం తట్టి వెళ్లిపోయారు. రాక్షసి అంటూ కోపంతో తిట్టి ఇంటికి రావే నీపని చెబుతాను అంటూ 60 marks నీటి గా attempt చేసి థాంక్స్ సర్ అని చెప్పి కోపంగా తననే చూస్తూ బయటకు వచ్చి ఏమీ మాట్లాడకుండా కారులో కూర్చున్నాను. అమ్మమ్మ ఎలా రాశావు బుజ్జికన్నా అని అడిగింది. తల ఊపి మౌనంగా కూర్చున్నాను. మహి వచ్చాక తల్లి ఎలా రాశావు అని అడుగగానే సూపర్ అమ్మమ్మా అంటూ గుండెలపై వాలి ఇంటికి చేరుకున్నాము. లోపలికి వెళ్ళగానే డైనింగ్ టేబుల్ పై ఉన్న decoration ఐటమ్స్ పగలగొట్టి జరిగింది మొత్తం కోపంగా చెబుతున్నా , మహి మాత్రం స్నాక్స్ తింటూ దర్జాగా కూర్చుంది. అమ్మ నన్ను ఎలాగోలా శాంతిoపజేసి భోజనం తినిపించింది. మహి నీ తమ్ముడే కదరా అలా చేయడం తప్పు కదా అని ప్రేమతోనే చెప్పింది , అమ్మా నేను చదువుకోవాలి వాడేమీ బుక్ ముందుపెట్టుకొని రాసేస్తాడు అని చెప్పి పైకి వెళ్ళిపోయింది. అమ్మా తమ్ముడు కాదు అని కోపంతో చెప్పి ఆరోజు అమ్మమ్మ గదిలోనే టీవీ చూస్తూ ఉండిపోయాను. అమ్మ కళ్ళల్లో బాధతో కన్నీళ్లు చూసి అమ్మమ్మ ఓదార్చి దేవుడా ఇంకా ఎన్ని రోజులు అంటూ ప్రార్థించింది.



ప్రతి exam లో స్క్వాడ్ వెళ్లిపోగానే బుక్ తెచ్చి ఇవ్వడం ఓపిక ఉన్నంతవరకూ రాసి వచ్చెయ్యడం చేస్తూ ఎలాగోలా exams పూర్తి అయ్యాయి . మా ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగింది . నెక్స్ట్ రోజు నాన్న బిజినెస్ టూర్ వెళ్లడం , మేము అమ్మమ్మ ఊరికి వచ్చేసి నాకు ఇష్టమైన వ్యవసాయంలో మునిగిపోవడం.విరివిగా పెరిగి పంట కూడా చేతికి రావడంతో కోతలు కోసి పూజ చేసి మంచి రావడంతో లాభాలకు అమ్మి అమ్మమ్మ లేని సమయంలో జాగ్రత్తగా చూసుకున్న అందరికీ వారి కష్టానికి ప్రతిఫలం రెండింతలు ఇచ్చి , ఇంకా చాలా మొత్తంలో డబ్బు చూయించి బుజ్జికన్నా ఇందులో నీ కష్టం కూడా ఉంది కాబట్టి మొత్తం నీకే అని అందించింది. నేనేమి చేసుకోవాలి అమ్మమ్మా అవసరం అయినప్పుడు అడుగుతాను అని ఇచ్చేసాను. అయితే జాగ్రత్తగా దాచుతాను అని చెప్పి తీసుకుంది.



అక్కడ ఉండగానే results అనౌన్స్ చెయ్యడం , స్కూల్ ప్రిన్సిపాల్ నుండి వెంటనే కాల్ రావడం , మహి స్టేట్ ఫస్ట్ వచ్చిందని చెప్పడం , మరో 10 రోజుల్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రతిభా పురస్కారo అందుకోబోతున్నట్లు ఆహ్వానం వచ్చినట్లు కూడా చెప్పడంతో , విజయ గర్వంతో మహి ఇప్పుడేమంటావురా అని చూసింది. మా బంగారుతల్లి అనుకున్నది సాధించింది అంటూ అమ్మా , అమ్మమ్మా చెప్పలేనంత ఆనందంతో మురిసిపోయి ప్రేమతో హత్తుకొని , ఊరుఊరుని మొత్తం పిలిపించి యాటలు కొట్టి భోజనాలు పెట్టింది. నేను ఎలాగోలా 60% తో 10 th క్లాస్ గట్టెక్కిపోయాను. 



తరువాత రోజు వైజాగ్ చేరుకున్నామో లేదో డాక్టర్ అంటీ మరియు కాలేజ్ అంటీతో సహా మొత్తం స్టాఫ్ వచ్చి మహికి కంగ్రాట్స్ తెలపడంతో , అమ్మావాళ్ళు పులకించిపోయి బోలెడన్ని స్వీట్స్ తెప్పించి పంచింది. నాన్నకు తెలిసి తాగిన మత్తులోనే వచ్చి గుడ్ జాబ్ అని చెప్పి వెళ్లి పడుకున్నాడు. అలా 10 రోజులూ ఇంట్లో సందడి వాతావరణం నెలకొని , ప్రోగ్రాం గుంటూరులో ఉండటంతో అందరమూ కారులో బయలుదేరి స్టేజి కి ముందువరుసలో కూర్చున్నాము. మహి పేరు వినపడగానే నాన్నే మహిని ఇంత స్థాయికి తీసుకువచ్చినట్లు అత్యుత్సాహం చూపిస్తూ అమ్మతోపాటు స్టేజి పైకి వెళ్లారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా మెడల్ మరియు ప్రతిభా పురస్కారం అందుకొని అక్కడి నుండే ఏరా ఇప్పుడు ఏమంటావు అంటూ ఒక చూపు చూసింది. నాకే తెలియకుండానే అందరితోపాటు చప్పట్లు కొడుతూ తను చూడగానే ఆపేసాను. విజయ గర్వంతో మళ్లీ ఒక నవ్వు నవ్వి CM ను అడిగి మరీ ఒక సెల్ఫీ తీసుకొని వచ్చి , అమ్మమ్మా ఈయనే CM అంటే అని నాకు వినబడేలా చెప్పింది. ఒడిపోయినట్లు మౌనంగా తలదించుకున్నాను.



గుంటూరు లోని చూడదగ్గ ప్రదేశాలు మరియు విజయవాడ దుర్గమ్మ దర్శనం చేసుకొని వద్దాము అని నాన్నకు అమ్మ చెప్పింది. ఇప్పుడు కుదరదు అంటూ నెక్స్ట్ రోజు ఉదయానికల్లా వైజాగ్ పిలుచుకొని వచ్చేసారు. మేము వైజాగ్ వచ్చిన విషయం తెలుసుకుని మా స్కూల్ ప్రిన్సిపాల్ ఫ్యామిలీలీతోపాటు  వచ్చి బోలెడన్ని గిఫ్ట్స్ మహికి అందించి , కంగ్రాట్స్ చెప్పి ,అమ్మతో మేడం మా స్కూల్ స్టార్ట్ చేసి 15 years అవుతోంది మొదటిసారి మహి వలన స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించగలిగాము, అందుకే  స్కూల్ తరుపున మహికి మరియు తల్లిదండ్రులను సత్కరించుకోవాలని ఫంక్షన్ arrange చెయ్యాలనుకుంటున్నాము , మీకు ఎప్పుడు వీలౌతుందో చెబితే అప్పుడే పెట్టుకుంటాము అని వినయంగా అడిగారు. మొత్తం తన క్లాస్ mates మరియు వారి పేరెంట్స్ ను కూడా పిలిపిస్తున్నాము అని చెప్పారు.



మీ ఇష్టం ప్రిన్సిపాల్ గారు మీరు ఇప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాము అని అమ్మ బదులివ్వడంతో , సెలవుల తరువాత స్కూల్ రెండు రోజుల్లో స్టార్ట్ కాబోతోంది ఆరోజే ఫంక్షన్ ok నా అని అడిగారు , వచ్చేస్తాము అని బదులివ్వడంతో సంతోషంతో thank you so sooo much మేడం , మొత్తం arrange చేసి కాల్ చేస్తాను అనిచెప్పి వెళ్లిపోయారు.



నెక్స్ట్ రోజు ప్రిన్సిపాల్ ఇంటికి స్వయంగా వచ్చి మేడం రేపు ఉదయం 10 గంటలకు మహితోపాటు మీరందరూ తప్పకుండా రావాలి అనిచెప్పి వెళ్లిపోయారు. రేపటి ప్రోగ్రామ్ కోసం కొత్తబట్టలు తీసుకోవాలని అమ్మ షాపింగ్ తీసుకువెళ్లి మహి సెలెక్ట్ చేసినవన్నీ కనింది. నేను మాత్రం ఒకటే ఒకటి తీసుకొన్నాను. ఒసేయ్ మరి నువ్వెంత బిల్డప్ ఇస్తున్నావే , నన్ను ఆరోజు అన్నావు అని కోపంతో చూసాను. పోరా నాఇష్టం అంటూ ఛాన్స్ దొరికిందని షాప్ మొత్తం సెలెక్ట్ చేసేసింది. అమ్మమ్మ మాత్రం మహి నీఇష్టం తల్లి నీ వలన కలిగిన కలుగుతున్న సంతోషానికి నువ్వేది అడిగినా కాదనము అంటూ సంతోషన్గా మురిసిపోయింది.



నెక్స్ట్ రోజు తెల్లవారుఘామునే నాకంటే ముందుగానే లేచి రెడీ అవుతుండగా , నేను వాళ్ళను పట్టించుకోకుండా జాగింగ్ వెళ్లివచ్చి ,సన్మానం అనేసరికి నాన్న ముందుగానే రెడీ అయ్యి కూర్చున్నారు. కన్నయ్యా అందరూ వెళుతున్నాము మీ ఫ్రెండ్స్ కూడా వస్తారు అని అమ్మ చెప్పడంతో , ఆ చివరి లైన్ నచ్చి ఫ్రెష్ అయ్యి కొత్తబట్టలు వేసుకొని టిఫిన్ చేసి 10 గంటలకల్లా కారులో బయలుదేరి ప్రతి సర్కిల్ లో స్కూల్ మరియు మహి స్టేట్ ఫస్ట్ బ్యానర్ లు కనిపిస్తుండటంతో అమ్మావాళ్ళ ఆనందానికి అవధులు లేనట్లు పరవశించిపోయారు , సమయానికే స్కూల్ చేరుకున్నాము. స్వయంగా ప్రిన్సిపాల్ తోపాటు స్టాఫ్ మొత్తo వచ్చి గౌరవంగా స్కూల్ ఫంక్షన్ హాల్ వరకూ పిలుచుకొనివేళ్ళారు. స్కూల్ చుట్టూ మహి లెక్కలేనన్ని బ్యానర్ లు నిలబెట్టారు.



హాల్ లోకి అడుగుపెట్టగానే స్టూడెంట్స్ , పేరెంట్స్ , స్టాఫ్ మొత్తం లేచి మహిని చప్పట్లతో సంతోషంతో ఆహ్వానించారు. తన ఫ్రెండ్స్ అయితే తన చుట్టూ చేరి కంగ్రాట్స్ చెప్పి కౌగిలించుకొని పక్కనే కూర్చుని సంతోషన్గా మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ సర్ మైకు అందుకొని సభకు నమస్కరించి ప్రిన్సిపాల్ తోపాటు చీఫ్ గెస్ట్ ను స్టేజి మీదకు ఆహ్వానించి కూర్చోబెట్టారు. తరువాత మహి గొప్పతనం వివరించి అమ్మానాన్నతో పాటు స్టేజి మీదకు రావాలని పిలువగానే హాల్ మొత్తం చప్పట్లతో , కేకలతో హోరెత్తిపోతుండటం చూసి నవ్వుతూ , ఇదిరా స్టడీస్ కు ఉన్న రెస్పెక్ట్ అంటూ నావైపు చిన్నచూపు చూసి నవ్వి అమ్మ చెయ్యి అందుకొని స్టేజి మీదకు వెళ్లి చీఫ్ గెస్ట్ లేచి మహిని అభినందించి , you are very lucky father అని నాన్నతో కరచాలనం చేయగానే మొత్తం తనే మహిని చదివించినట్లు బిల్డప్ ఇవ్వడం చూసి నా ప్రక్కనే కూర్చున్న అమ్మ , దీనికోసమేనేమో మాకంటే ముందుగా లేచి రెడీ అయిపోయాడు సిగ్గేలేదు అంటూ గుసగుసలాడింది.



మన మహితోపాటు మరొకరు కూడా మన స్కూల్ ను స్టేట్ లెవెల్ కు తీసుకువెళ్లాడు , చిన్న తప్పు వలన ఆ స్టూడెంట్ గురించి బ్యానర్ లలో వెయ్యలేదు క్షమించమని మనవి. ఆ స్టూడెంట్ ఎవరో తెలుసుకదా ...........అంటూ గట్టిగా స్టూడెంట్స్ నే అడగడం ఆలస్యం , అందరూ లేచి ఒక్క గొంతుతో మహేష్ , మహేష్, మహేష్.........అని మొత్తం స్కూల్ దద్దరిల్లిపోయేట్లు కేకలు వేస్తుండటంతో , yes he is our sports ఛాంపియన్ అండ్ స్టేట్ ఛాంపియన్ మహేష్ ....., మహేష్ ను స్టేజి మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము అని చెప్పారు. బుజ్జికన్నా వెళ్లు అంటూ అమ్మమ్మ నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి పంపింది. నేను స్టేజి మీదకు వెళ్లి మహి ప్రక్కన కూర్చునేంత వరకూ హాల్ మొత్తం మహేష్ , మహేష్ ,మహేష్........అంటూ ఆగకుండా ధ్వనులు ప్రతిధ్వనులతో మారుమ్రోగిపోయింది. వేలితో మహి చేతిపై తాకి ఒసేయ్ స్పోర్ట్స్ మాస్ అంటే ఇలా ఉంటుంది అని చెప్పాను. పోరా......పోవే అంటూ ఇద్దరమూ చెరొకవైపు చూస్తూ కూర్చున్నాము. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మన స్కూల్ ను స్టడీస్ లో మరియు స్పోర్ట్స్ లో నెంబర్ వన్ గా నిలిపిన మహి మరియు మహేష్ లిద్దరూ ఈ గొప్ప తల్లిదండ్రుల ట్విన్స్ అని చెబుతున్నందుకు చాలా గర్వపడుతున్నాను , ఆ తల్లిదండ్రుల జన్మ ధన్యం అయి ఉంటుందని మనసారా అనుకుంటున్నాను అని చెప్పి మమ్మల్ని మరియు అమ్మానాన్నలను ఘనంగా స్కూల్ తరుపున సత్కరించారు. అమ్మా , అమ్మమ్మా కళ్ళల్లో ఆనందబాస్పాలతో మాఇద్దరివైపు చూసి ఈజన్మకు ఇది చాలు అంటూ మురిసిపోయారు.



సన్మానం పూర్తవగానే పని ఉందని నాన్న వెళ్లిపోయారు. ప్రోగ్రాం కి వచ్చిన పేరెంట్స్ అందరూ అమ్మను మనసారా అభినందించారు.  భోజనాల ఏర్పాట్లు కూడా చేసి ఉండటంతో అక్కడే తినేసి ప్రిన్సిపాల్ కు వెళ్ళొస్తామని బయలుదేరాము , నేను మా PET సర్ తో మాట్లాడుతూ బయటకు వచ్చాను. ప్రోగ్రాం మొత్తం డల్ గా ఉన్న మహి డివైడర్ కొట్టేసిన అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి , మహి నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని ప్రక్కకు పిలుచుకొనివెళ్లి ......నేనే అది కొట్టేసింది , మహేష్ ఏ తప్పూ చెయ్యలేదు నావల్లనే మీరిద్దరూ విడిపోయారు అని చెప్పబోతుండగా , మహి మహేష్ అంటూ మా classmates అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఒక సెల్ఫీ నే మళ్లీ ఇప్పుడు కలుస్తామో అని కోరడంతో , చెప్పకుండా ఆగిపోయింది.



స్కూల్ background లో బోలెడన్ని సెల్ఫీలు తీసుకొని , సంతోషన్గా అందరమూ కౌగిలించుకొని మొబైల్ నెంబర్లు తీసుకొని కాంటాక్ట్ లో ఉండమని చెప్పి విడిపోయి , నీలిమా ఏదో చెప్పాలన్నావు అని మహి అడిగింది. ఏమీ లేదే all the best for your future అని చెప్పి కౌగిలించుకొని మనసులోనే i am really sorry మహి , ఇప్పుడు చెప్పలేను అని చెప్పి కళ్ళల్లో నీళ్లతో వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. నీకు కూడా వే అని చెప్పి మాదగ్గరకు వచ్చింది. కారులో అమ్మకు ఇరువైపులా మేము కూర్చున్నాము. My లవ్లీ ట్విన్స్ మీరు ఈరోజు ఇచ్చిన ఆనందాన్ని మా జీవితాంతం అనుభవిస్తూనే ఉంటాము అంటూ మాఇద్దరి తలలపై చేతులువేసి తన తలపై ఆనిచ్చి ప్రేమతో ముద్దులుపెట్టి , అలాగే మీరిద్దరూ కూడా కలిసిపోతే..............అంటుండగానే , చిరుకోపంతో అమ్మా , అమ్మా ఈ సంతోష సమయంలో ఇప్పుడు అవసరమా అని ఇద్దరమూ ఒకేసారి అమ్మవైపు చూస్తూ చెప్పడంతో , అక్కడితో ఆగిపోయి సరే సరే .....అంటూ మాఇద్దరినీ ప్రాణంగా హత్తుకొంది. 



వైజాగ్ లోనే టాప్ ఇంటర్మీడియట్ ప్రైవేట్ కాలేజ్ నుండి ఫ్రీ గా చదువుకునే ఆఫర్ రావడంతో , అదికూడా మంచి కాలేజ్ అని పేరు ఉండటం మరియు మహి కూడా ఇంటరెస్ట్ చూపడంతో , మహి ఫ్రీగా నేను డబ్బులు కట్టి జాయిన్ అయ్యాము. అమ్మ కోరిక ఒక్కటే ఎక్కడ చేరిన మేమిద్దరమూ ఒకే దగ్గర ఉండాలనేదే. మనం అక్కడ కూడా classes వదిలి గ్రౌండ్ లోనే ఎక్కువ సమయం గడిపేసి స్పోర్ట్స్ లలో కాలేజ్ కు బోలెడన్ని కప్పులు సాధించిపెట్టాను , అక్కడ కూడా pet సర్ మన ఫ్యాన్ అయిపోయారు . మహి యధాప్రకారం కాలేజ్ లో ఫస్ట్ వస్తూ ఎంసెట్ , aieee , ఐఐటీ .........ఇలా ఒకేసారి అన్నింటికీ ప్రిపేర్ అవ్వసాగింది. 



ఇక్కడ కూడా PET సర్ వల్లనే ఇంటర్ ఫస్ట్ క్లాస్ లో ఎలాగోలా గట్టెక్కేసి , అప్లై చేసిన ఒకేఒక్క ఎంసెట్ లో మాత్రం 6 అంకెల ర్యాంకును సాధించాను. మహి ఇంటర్ ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ కూడా స్టేట్ ర్యాంకులతో, aieee మరియు ఐఐటీ ఎంట్రన్స్ లో 50 లోపు ర్యాంకులతో దేశంలోని అన్ని క్యాంపస్ లలో సీట్ సాధించింది , ఎంసెట్ లో అయితే age డిఫరెన్స్ వల్ల సెకండ్ ర్యాంక్ తెచ్చుకొంది. ఇక తనకు ఏది నచ్చిందో సెలెక్ట్ చేసుకోవడం మాత్రమే మిగిలింది. రాసిన అన్ని ఎంట్రన్స్ results వచ్చిన తరువాత అన్నింటినీ ప్రింటౌట్ తీసుకొచ్చి అమ్మా , అమ్మమ్మా ఎదురుగా ఉంచింది. అమ్మా ఇవన్నీ నీ ముద్దుల కూతురు సాధించినవి , ఇది ఆ వేస్ట్ ఫెల్లో సాధించింది అంటూ ఎంసెట్ ఒకే ఒక ప్రింటౌట్ ను చూపించింది. ఒసేయ్ నాగురించి ఎందుకే నీకు నీది నువ్వు చూసుకో అని కోపంతో చెప్పి అమ్మమ్మ ఒడిలో పడుకొని క్రికెట్ చూస్తున్నాను. అమ్మా నాకయితే దేశంలోనే నెంబర్ వన్ ఐఐటీ క్యాంపస్ లో చేరాలని ఉంది అని చెప్పింది.
[+] 10 users Like Mahesh.thehero's post
Like Reply
అమ్మ మహి ప్రింటౌట్ లన్నింటినీ చూసి పక్కన పెట్టేస్తూ చివరగా తన ఎంసెట్ ర్యాంక్ ప్రింటౌట్ తో ఆగిపోయి మరియు నా ఎంసెట్ ర్యాంక్ ప్రింటౌట్ అందుకొని , మహి ఎంసెట్ ద్వారా మాత్రమే నువ్వు కాలేజ్ లో చేరబోతున్నావు కాబట్టి వైజాగ్ మరియు చుట్టుప్రక్కల ఉన్న నీకు ఇష్టమైన కాలేజ్ సెలెక్ట్ చెయ్యి అందులో సంతోషంగా జాయిన్ అవుదువు అని మహి బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి  చెప్పింది. 



మహి తను ఏమి విన్నదో అర్థం కాక షాక్ లో కదలకుండా ఉండిపోయింది . మహి బంగారు నీకు ఇష్టమేగా వెళ్లి ఏ కాలేజ్ కావాలో సెలెక్ట్ చేసి చెప్పు అని భుజం తాకింది. అమ్మా.........నేను ఐఐటీ అంటుంటే మీరు ఆఫ్ట్రాల్ ఎంసెట్ ద్వారా కాలేజ్ అంటున్నారు అని మాట్లాడింది. చూడు తల్లి మహేష్ ఎక్కడ చదివితే అక్కడే నువ్వుకూడా చదవాలనేదే నా ఏకైక కోరిక అని నీకు తెలుసుకదా , కన్నయ్య ఎంసెట్ ద్వారా మాత్రమే పై చదువులకు అర్హత సాధించాడు కాబట్టి , మీరిద్దరూ ఒకే దగ్గర చదువుకోవాలి కాబట్టి , ఎంసెట్ ద్వారానే నువ్వుకూడా కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అని చెప్పేసింది. అమ్మా..........అనేంతలో , ఇది ఫైనల్ అని బల్లగుద్దినట్లు చెప్పింది.



అమ్మమ్మా మీరైనా చెప్పండి ఎంతో కష్టపడి అన్ని ఐఐటీ క్యాంపస్ లలో సెలెక్ట్ అయ్యే ర్యాంకు సాధించాను. ఇప్పుడు ఎంసెట్ లో చివరి ర్యాంకు సంపాదించిన వాడితోపాటు స్టేట్ కాలేజీలో జాయిన్ అవ్వాలా చూడండి వాడు ఎలా నవ్వుతున్నాడో అని చూపించింది. ఇలా రా నా బంగారు తల్లి అంటూ మహి చెయ్యి అందుకొని ప్రక్కనే కూర్చోబెట్టుకొని , మూసిముసినవ్వులు నవ్వుతున్న నన్ను సున్నితంగా కొట్టి బుజ్జికన్నా నువ్వు నీరూమ్ కు వెళ్లి క్రికెట్ చూడు అని చిరుకోపంతో చెప్పగానే , ok అంటూ అమ్మమ్మ తలపై ముద్దుపెట్టి మహివైపు చూసి కవ్విస్తున్నట్లు నవ్వి పైకి వెళ్ళిపోయాను. మహి అంటూ భుజం చుట్టూ చేయివేసి ప్రేమతో నిమురుతూ , నాకూతురు అదే మీ అమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా మీ మంచికోసమే తీసుకుంటుంది. బయట ఎక్కడా సేఫ్టీ లేదమ్మా , మేము ఇక్కడ నువ్వు అక్కడ హాస్టల్ లో ఒక్కటే ఉంటే ప్రతిరోజు , ప్రతి క్షణమూ నీ గురించే ఆలోచిస్తూ ఇక్కడ ప్రశాంతంగా ఉండగలమా . మీ తమ్ము.........sorry అదే మహేష్ తోడుగా ఉంటే మేము ఏ భయం లేకుండా ఉంటాము. నా బంగారుతల్లికి ఉన్న టాలెంట్ కు ఐఐటీ లలో చదివినా ఇక్కడే ఉండి చదివినా ఫ్యూచర్ ఓకేవిదంగా ఉంటుంది కాబట్టి అమ్మచెప్పినట్లు వినమ్మా నా బంగారుకొండ కదూ అంటూ నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టి చెప్పింది. 



నేనేంటి స్టడీస్ అంటే ఏమాత్రం ఇంటరెస్ట్ లేని ఆ వేస్ట్ ఫెల్లో తోపాటు ఈ వేస్ట్ కాలేజీలలో చడవడo ఏంటి .......noway అని తెగేసి చెప్పడంతో , అమ్మా నా కూతురికి నామీద ఏమాత్రం ప్రేమ లేదు అంటూ కళ్ళల్లో నీళ్ళు కూడా రాక ఏడుపు నటిస్తూ ...........అమ్మా నేనెప్పుడైనా ....పుట్టినప్పటి నుండి ఇప్పటివరకూ నీ మాట కాదన్నానా , నీ మాటకు ఎదురు నిలిచానా అంటూ బోరున ఏడుపు నటిస్తూ , వీల్లే నా ప్రాణం అనుకున్నాను కదమ్మా , వీళ్ళు నా మాట ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తను దూరంగా వెళ్లిపోతే తనకోసం తన సేఫ్టీ కోసం తిండి తిప్పలు లేకుండా బాధపడుతూ అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరాలనే కదా వీళ్ళ కోరిక , అయితే అదే జరగనీ నేనేమైనా పర్లేదు నా ప్రాణానికి ప్రాణమైన నా పిల్లలు సంతోషంగా ఉంటే నాలు అదే చాలు , మహి నీ ఇష్ట ప్రకారమే మాకు దూరంగా కష్టపడి సాధించిన ఆ గ్రేట్ ఐఐటీ లోనే చేరి హాయిగా ఉండు , ఇక్కడ మీ అమ్మ , అమ్మమ్మా సంతోషన్గా , అదే చెప్పలేని సంతోషంతో ఉంటాము అని చెప్పి ఏడుస్తూ అమ్మా తను ఏమి అడిగితే , ఎంత డబ్బు అడిగినా ఇచ్చెయ్ అని చెప్పి పరిగెత్తుకుంటూ తన రూంలోకి వెళ్లి  బెడ్ పై బోర్లాపడి బయట హాల్ లోకి వినపడేలా ఏడుస్తూనే ఉంది. ఇందు కుంభస్థలం బద్ధలుకొట్టావు కంటిన్యూ అంటూ వస్తున్న నవ్వుని బలవంతంగా ఆపుకుని , నీఇష్టం రా బంగారు అనిచెప్పి మధ్యాహ్నానికి వంట చెయ్యడానికి అత్తయ్యతోపాటు వెళ్ళింది.



అమ్మను అంతగా బాధపెట్టానా అని బాధపడుతూ త్వరగా ఏదో ఒకటి నిర్ణయించుకోవాలని పైన మా రూమ్ కు వచ్చి క్రికెట్ ఎంజాయ్ చేస్తున్న నన్ను చూసి , వీడి బొంగులో ర్యాంకుకు కాలేజ్ లో కూడా చేర్చుకుంటారా ?. అమ్మకు నేనంటే ప్రాణం కొద్దిసేపు అయితే తానే అర్థం చేసుకుంటుంది అని ఆనుకొని ఐఐటీ క్యాంపస్ లతోపాటు వైజాగ్ లోని కాలేజీలను ఒకసారి లాప్టాప్ లో సెర్చ్ చేసింది. అమ్మ ఒంటి గంటకే రూంలో కడుపునిండా తిని అమ్మమ్మతోపాటు తన రూంలోని టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తోంది. మధ్యాహ్నం 2 గంటలకు నాతోపాటు మహి కిందకురాగానే అత్తయ్య ద్వారా మెసేజ్ వెళ్లిపోవడంతో , టీవీ ఆఫ్ చేసి అమ్మ బెడ్ పై ఏడుపు నటించడం , అమ్మమ్మ భోజనం ప్లేట్ పట్టుకొని ప్రక్కనే కూర్చుంది.



అత్తయ్యా అమ్మ భోజనం చేసిందా అని మహి అడిగింది. అత్తయ్య నటనలో phd చేసినట్లు మరింతగా పండిస్తూ , ఎక్కడ బంగారు ఆ రూమ్ నుండి బయటకు వస్తే కదా , మీ అమ్మ ఎప్పుడూ ఇంత బాధపడటం చూడలేదు , ఏమిచేస్తావో నీఇష్టం రా అనిచెప్పి మీకు వడ్డించినా , మీరైనా తృప్తిగా తినండి అని చెప్పింది. ఏంటి అమ్మ భోజనం చెయ్యకుండా బాధపడుతోందా , దీనివల్లనేనా అయ్యే ఉంటుంది లే , అమ్మా అమ్మా..........అంటూ పరుగున అమ్మ దగ్గరికి కంగారుపడుతూ వెళ్ళాను. అమ్మమ్మ acting అని చిన్నగా చెప్పింది. మొత్తం అర్థమైపోయి నేను కూడా నావంతు జీవించడం మొదలెట్టాను. మహి లోపలకు రావడం చూసి ఇందు కొద్దిగా తినవే లేకుంటే నీరసం వచ్చేస్తుంది అంటూ అమ్మమ్మ ముద్దకలుపుతూ బ్రతిమిలాడింది. 



నా ప్రాణానికి ప్రాణమైన నీ మనవరాలే నామాట వినడం లేదు ఇక నేను ఎవరికోసం తినాలమ్మా నాకు వద్దు అని ప్లేట్ ప్రక్కకు తోసేసింది. అమ్మా నీమాట నేను వింటాను ఆర్డర్ వెయ్యమ్మా మీకోసం ఏమైనా చేస్తాను , ఒసేయ్ చదువులో ఫస్ట్ వస్తే సరిపోదే అమ్మ అంటే దేవత , దేవత మాట మనకు బాధ కలిగించినా వినాలి . తరువాత తెలుస్తుంది తను ఎందుకు అలా చెయ్యమందో , అమ్మ ఏదీచేసినా అది మన మంచికోసమే అని తెలుసుకో అని చెప్పి, అమ్మా దీనికోసమా మీరు బాధపడుతున్నది చూడు మనం ఎంతబాధపడుతున్నా కొద్దిగా అయినా ఫీల్ అవుతోందా , నేనొక్కడినే అమ్మా మిమ్మల్ని ప్రేమగా చూసుకునేది అని చెప్పాను. మా మాటలకు కొద్దికొద్దిగా కరిగినా మళ్లీ నన్ను చూసి వీడికోసమా నావల్ల కాదు అంటూ భోజనం చేయకుండానే పైకి వెళ్ళిపోయింది. అమ్మా అది తినకుండా వెళ్ళిపోయింది .......ఇందు నేనున్నాను కదా అంటూ ప్లేట్ లో వడ్డించుకొని వెళ్లి ఏవో మాయమాటలు చెప్పి తినిపించింది. అమ్మమ్మ ఖాళీ ప్లేట్ తో రావడం చూసి లవ్ యు అమ్మా అంటూ అమ్మమ్మను బెడ్ పైనే కౌగిలించుకుంది.



రాత్రి కూడా మహి కిందకు రాకముందే కడుపునిండా తినేసి ఎవరికి తగ్గట్లు వారు మళ్లీ నాటకం మొదలెట్టాము. మహి కిందకువచ్చి అత్తయ్యా అమ్మ తినిందా అని నెమ్మదిగా అడిగింది . లేదు మహి అమ్మమ్మ ఎంత బ్రతిమాలినా తినకుండా ఆ రూమ్ వదిలిరాకుండా బెడ్ మీదనే ఉండిపోయింది. అందుకనే మీ డాక్టర్ అంటీకి కాల్ చేసాము అని మాట్లాడుతుండగానే అంటీ లోపలికి వచ్చి hi మహి అమ్మ ఎక్కడ అంటూ తన భుజం చుట్టూ చేయివేసి రూంలోకి వచ్చారు. అమ్మను చూసి ఇందు .........ఏంటి అలా ఉన్నావు అంటూ తన స్టైల్ లో అంతా తెలిసినా నాటకం పండిస్తూ , కిట్ తెరిచి కంగారుకంగారుగా BP , షుగర్ లెవెల్స్ టెస్ట్ చేసి , అంతా పర్ఫెక్ట్ గా ఉన్నప్పటికీ , అమ్మా BP పెరిగిపోతోంది , షుగర్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి వెంటనే భోజనం అన్నా చెయ్యాలి లేకపోతే గ్లూకోజ్ ఎక్కించాలి అని చెప్పింది. 



అక్కా నాకేమీ కాలేదు నేను తినను , గ్లూకోజ్ ఎక్కించుకోను నా ప్రాణమైన కూతురే నామాట వినడం లేదు , నన్ను ఇలాగే వదిలేసి మీరుకూడా వెళ్లిపోండి అని నీరసంగా నటిస్తూ చెప్పింది. ఎవరు మహి నీమాట వినడం లేదా నేను నమ్మను , నీకోసం ప్రాణాలైనా అర్పించడానికి రెడీగా ఉన్నారు ఏమంటావు మహి అని అడిగింది. అది కాదు అంటీ అని ఐఐటీ గురించి చెప్పేంతలో .........మహి నిజమే అన్నమాట ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. అధికాదు అంటీ ........మహి రీజన్ ఏమైనా కానీ నాకు వినాలని లేదు. మరొక గంటలో మీ అమ్మ నేను చెప్పినట్లు చెయ్యకపోతే స్పృహ కోల్పోతుంది అప్పుడు హాస్పిటల్ కు పిలుచుకొనివెళ్లాలి నీఇష్టం అంటూ వెళ్లిపోతుండగా , మహి కళ్ళల్లో కన్నీళ్ళతో అంటీ ఆగండి అమ్మమాట వింటాను అనిచెప్పి అమ్మా నన్ను క్షమించు అంటూ పాదాలను తాకి మీరు చెప్పినట్లుగానే ఇక్కడే చదువుకుంటాను ,మీకు ఏమైనా అయితే ఈ హృదయం తట్టుకోలేదు అనిచెప్పింది. తన మాటలకు అందరూ లొలొపలే సంతోషిస్తూ అమ్మ అమాంతం లేచికూర్చోని మా బంగారుతల్లి అంటూ కౌగిలించుకుంది. మనసారా కౌగిలించుకొని ఆత్రంగా వెళ్లి ప్లేట్ నిండా భోజనం తీసుకువచ్చి, అమ్మా నాచేతులతో తినిపిస్తాను ఈమొత్తం తినేయ్యాలి అంటూ కన్నీళ్లను తుడుచుకుని తినిపించడం మొదలెట్టింది.



అప్పటికే కడుపునిండా తిని ఉండటం వల్ల నోటిలో నుండి ఒక సౌండ్ కూడా వచ్చి , అమ్మా ...............అని అమ్మమ్మ వైపు సైగ చేసింది. అమ్మమ్మా మరియు అత్తయ్య చిలిపిగా నవ్వుతూ మీ తల్లికూతుళ్ళ ప్రేమ మధ్యన మేమెందుకు రేణుకా , బుజ్జికన్నా వెళదాము పదా అంటూ నవ్వుతూనే బయటకు వచ్చేసాము. 



ఆ రాత్రికే వైజాగ్ లోని నెంబర్ వన్ కాలేజ్ లో అమ్మ చూస్తుండగానే అప్లై చేసింది. నా బంగారుతల్లి అంటూ నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి ,అలాగే మహి నీ తమ్ముడికి అదే కాలేజ్ లో పేమెంట్ సీట్ కు అప్లై చెయ్యి అని చెప్పింది. అమ్మా ఆ పని మాత్రం నేను చేయలేను తాటిచెట్టులా ఆరడగులు పెరిగాడు అదికూడా చెయ్యలేడా  , మా బంగారుతల్లి కదూ మా బుజ్జి కదూ అంటూ బుగ్గలు పట్టుకొని బ్రతిమాలడంతో , అమ్మా వాడికోసం మీరెందుకు బ్రతిమాలడం చేస్తానులే అంటూ చకచకా అప్లై మరియు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు సంతోషమేనా అయితే నవ్వు అని చెప్పింది. అమ్మ నవ్వగానే లవ్ యు మా అంటూ ఒడిలో వాలిపోయి మీరు ఎప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి నాకు నిద్రవస్తుంది అని చెప్పి పైకి వెళ్ళిపోతూ , అప్లై చెయ్యడానికి కూడా రాదు వెధవకి అంటూ కోపంతో నన్ను చూస్తూ వెళ్ళిపోయింది. అందరమూ సంతోషం పట్టలేక గట్టిగా కేకలతో అరిచి చిందులెయ్యబోయి మహి వింటుందని ఆగిపోయి ఒకరినొకరు కౌగిలించుకొన్నాము.



కాలేజ్ జాయిన్ అవ్వడానికి ఇంకా రెండునెలల సమయం ఉండటంతో నేను , మహి విడివిడిగా వేరు వేరు డ్రైవింగ్ లెర్నింగ్ లలో కారు డ్రైవింగ్ నేర్చుకున్నాము. అమ్మమ్మ మాకోసం తీసిపెట్టిన డబ్బులతో నాకు పెద్ద కారు మహికి సరిపోయే చిన్న కారు కొనివ్వడంతో సంతోషం పట్టలేక నా పెద్ద కారులో అందరినీ ఎక్కించి టెన్త్ క్లాస్ లో  విజయవాడకు వెళ్లినా నాన్న, దుర్గమ్మ దర్శనం చేయించకుండా తీసుకువచ్చిన సంగతి గుర్తుకువచ్చి , విజయవాడ తీసుకెళ్లి దర్శనం చేయించి అమ్మకళ్ళల్లో ఆనందం చూసి పొంగిపోయాను. రెండురోజులు విజయవాడ మొత్తం చుట్టేసి ఇంటికి చేరుకున్నాము. 



 మా కాలేజ్ కు రెండువారాల ముందుగానే అమ్మ కాలేజ్ స్టార్ట్ అవ్వడం ,అక్కడ పంట వెయ్యడం కోసం తొలిపూజకు అమ్మమ్మను పల్లెకు పిలవడంతో అత్తయ్యను అమ్మదగ్గరే వదిలి అమ్మమ్మ కోరిక ప్రకారం మహితో పూజ జరిపించాలని రాత్రికల్లా వచ్చేస్తామని చెప్పి అమ్మని కౌగిలించుకొని , నేను అమ్మమ్మా , మహి పల్లెకు చేరుకున్నాము. పొలంలో పండగ వాతావరణం నెలకొన్నట్లు కన్నుల పండుగగా మాకోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. మహిని రైతులు పిలుచుకొనివెళ్లి పూజ చేయించి పనులు ప్రారంభించారు. మహి సంతోషన్గా వాళ్ళతోపాటు మధ్యాహ్నం వరకూ కలిసిపోయి గడిపి ,అక్కడే భోజనం చేసి అమ్మమ్మ ఇంటికి చేరుకొని సాయంత్రం వరకూ రెస్ట్ తీసుకొని చీకటిలోనే వైజాగ్ బయలుదేరాము. నెమ్మదిగా చినుకులు పడి వర్షం పెద్దది అయ్యింది. బుజ్జికన్నా నెమ్మదిగానే వెళ్లు ఎంత ఆలస్యం అయినా పర్లేదు అని అమ్మమ్మ చెప్పడంతో , అలాగే అమ్మమ్మా అంటూ వేగం పూర్తిగా తగ్గించేసాను.



అమ్మమ్మా పొలంలో ఉన్నవాళ్ళంతా చాలా మంచివాళ్ళు నేనంటే చాలా ఇష్టం వాళ్లకు అంటూ వాళ్ళ పేర్లూ కూడా చెబుతూ సంతోషన్గా వెనుక కూర్చుని మాట్లాడుతూ సడెన్ గా ఒరేయ్ కారు ఆపరా అని గట్టిగా కేక వేయడంతో , సడెన్ బ్రేక్ వెయ్యగానే అమ్మమ్మా మీరు ఇక్కడే ఉండండి , ఒరేయ్ నాతోపాటు రా అంటూ డోర్ తీసుకొని దిగిపోయి వర్షం లోనే తడుస్తూ పరిగెత్తింది. ఏమైంది దీనికి అంటూ కారు ప్రక్కకు తీసుకెళ్లి ఆపి కంగారుపడుతున్న అమ్మమ్మను చూసి అమ్మమ్మా నేను వెళ్లి చూస్తాను అంటూ కారు దిగి వెనక్కు చూస్తే ఆ చీకటిలో మహి కనిపించకపోవడంతో , గుండె వేగం అమాంతం పెరిగిపోయి వెనక్కు పరిగెత్తాను . 



ఒరేయ్ ఇక్కడ తొందరగా రారా అన్న మహి పిలుపుకు శాంతించి అటువైపు చూసాను. ఒక కారు రోడ్ ప్రక్కకు దూసుకుపోయి చెట్టుకి గుద్దుకొని హెడ్ లైట్స్ మరియు రెడ్ లైట్స్ వెలుగుతూ ఆగిపోతుండటం చూసి పరిగెత్తుకుంటుపోయాను. చెట్టుకి బలంగా గుద్దుకొని ఇంజిన్ లోనుండి అంత వర్షం లో కూడా మంటలు వస్తుండటం చూసి మహి చెయ్యి అందుకొని వెనక్కు లాగేసి ఇక్కడే ఉండు నేను చూస్తాను అంటూ దూరంగా నిలబెట్టాను. కారుపైన చాలా బ్యాగులు ఉండటం చూసి , వెనుక అద్దం లోనుండి చూస్తే లోపల చిన్నగా మూలుగుతూ నలుగురు కనిపించడంతో , అందరూ కదులుతున్నారు నువ్వెల్లి కారుని వెనక్కు తీసుకురా అని చెప్పి డోర్ ఎంత లాగినా రాకపోవడంతో అద్దం పగలగొట్టి లోపలి నుండి డోర్ తెరిచాను. వెనుక ఉన్నవాన్ని అందుకోబోగా స.......ర్.......మాకేమీ కాలేదు ముందు మా ఫ్రెండ్స్ ......అంటూ చేతితో చూపించి దిగబోతుండగా , ఇద్దరినీ చెయ్యి అందుకొని దింపాను చిన్న చిన్న గాయాలతో ముఖం పై రక్తంతో మంటలను చూసి మరింత భయపడుతుండటంతో,మహి  కారుని నేరుగా మాదగ్గరికి తీసుకువచ్చి ఆపి అమ్మమ్మతోపాటు కిందకు దిగి నిలబడలేకపోతున్న ఇద్దరినీ కారులో వెనుక కూర్చోబెట్టాను. 



 బుజ్జికన్నా జాగ్రత్త మంటలు అని అమ్మమ్మ మాటలు వినపడుతుండగానే కారు ముందు డోర్ ను శక్తినంతా ఉపయోగించి లాగేసి వొళ్ళంతా రక్తంతో స్పృహ కోల్పోయిన ఇద్దరినీ ఒకరితరువాత మరొకరిని భుజం మీద వేసుకొని వెనుక పెద్ద డోర్ తెరిచి కింద పడుకోబెట్టి డోర్ వేసి , వెనక్కు వాళ్ళ ఫ్రెండ్స్ ను చూసి బాధపడుతున్న ఇద్దరి ప్రక్కనే కూర్చుని మహి వేగంగా పోనివ్వు అని , ఊపిరాడుతోంది బ్రదర్ ఏమీ పర్లేదు 10 నిమిషాల్లో హాస్పిటల్ కు తీసుకెళ్లిపోతాము అని ధైర్యం చెప్పాను , 100 కు కాల్ చేసి ఆక్సిడెంట్ విషయం చెప్పాను. మహి నాకంటే బాగా , వేగంగా డ్రైవ్ చేసి సిటీకి చేరుకొని కనిపించిన హాస్పిటల్ లోకి పోనిచ్చి డాక్టర్ డాక్టర్ .........ఎమర్జెన్సీ అని పిలవడంతో , స్టాఫ్ వర్షంలోనే స్ట్రెచర్ తీసుకువచ్చి వెనుక ఉన్న ఇద్దరినీ మరియు నా ప్రక్కనే ఉన్న ఇద్దరినీ నేను మరియు మరొక స్టాఫ్ భుజం పై వేసుకొని లోపలికి తీసుకువెళుతుండగా , బ్రదర్ మీరెవరో తెగేలియదు కానీ దేవుల్లా వచ్చారు అని మాట్లాడుతుండగా , ఇప్పుడు అవన్నీ ఎందుకు బ్రదర్ అనిచెప్పి ICU కు తీసుకువెళ్లాము. 



5 నిమిషాల తరువాత డాక్టర్ వచ్చి ఇద్దరికి చిన్న చిన్న దెబ్బలు మాత్రమే అని మిగతా ఇద్దరికీ తలకు తగిలి రక్తం చాలా పోయింది వేరే హాస్పిటల్ నుండి తెప్పించాలి సమయం లేదు అని చెప్పడంతో , మహి నేను ఒక్కసారిగా అయితే మా రక్తం తీసుకోండి అని చెప్పి అమ్మమ్మను కుర్చీలో కూర్చోబెట్టి అంటీకి అమ్మకు కాల్ చెయ్యమని చెప్పి బ్లడ్ ఇవ్వడం చూసి కొలుకున్నవారిద్దరూ దండం పెట్టడంతో , మీ వాళ్లకు ఏమీ కాదు అనిచెప్పి బ్లడ్ ఇవ్వడం పూర్తవగానే  అంటీ నేరుగా ICU లోకి వచ్చి చుట్టుచూసి ముందుగా స్పృహలో లేనివారి కండిషన్ చూసి బ్లడ్ ఎక్కించి హాస్పిటల్ డాక్టర్లతోపాటు ట్రీట్మెంట్ చేసి , మాదగ్గరికి వచ్చి they are safe my హీరోస్ అని చెప్పడంతో మిగిలిన ఇద్దరూ హమ్మయ్యా అంటూ ఊపిరిపీల్చుకున్నారు. వారి దగ్గరకువెళ్లి మొబైల్ ఇవ్వడంతో ఇంటికి కాల్ చేసి విషయం చెప్పారు. బ్రదర్స్ రెస్ట్ తీసుకోండి అని చెప్పి అంటీతోపాటు బయటకు రాగానే అమ్మ చిన్నగా వణుకుతున్న మహికి జర్కిన్ వేసి , నా బంగారం అంటూ కౌగిలించుకొని టవల్ నాకు అందించింది. అమ్మా మీరు వెళ్ళండి నేను వస్తాను అనిచెప్పాను. వెళ్లడం ఇష్టం లేకపోయినా మహి , అమ్మమ్మ చలికి వణుకుతుండటం చూసి జాగ్రత్త కన్నయ్యా అనిచెప్పి అక్కా ఏదైనా టాబ్లెట్ ఇవ్వు వీళ్ళకి అనిచెప్పి అంటీతోపాటు బయటకు వెళ్లారు.



కొద్దిసేపటి తరువాత కట్లతోనే ఇద్దరూ బయటకు రావడంతో బ్రదర్స్ రెస్ట్ తీసుకోవచ్చుగా , మేము ok ఇంకొద్దిసేపు ఆలస్యం అయి ఉంటే మా ఫ్రెండ్స్......అంటూ కన్నీళ్ళతో బాధపడుతుండటంతో , ఇద్దరినీ కూర్చోబెట్టి ఇప్పుడు వాళ్లకు ఏమీకాలేదు మీరు బాధపడకండి అని చెప్పాను. ఇంతలో వాళ్ళ పేరెంట్స్ రావడంతో కౌగిలించుకొని లోపాలకువెళ్లి చూసివచ్చి నన్ను చూపించడంతో , రెండు చేతులతో నమస్కరించడంతో మీరు పెద్దవారు వాళ్లకు ఏమీ కాదు ట్రీట్మెంట్ చేసింది మా అంటీ , త్వరలోనే కొలుకుంటారు అని ధైర్యం చెప్పి చాలాసేపు ఉండీ వాళ్ళు స్పృహలోకి వచ్చిన తరువాత వారి సంతోషం చూసి రేపు వస్తాను అనిచెప్పి 10 గంటలకి ఇంటికి వచ్చేసాను. నేను వచ్చేన్తవరకూ అందరూ భోజనం కూడా చెయ్యకుండా వేచి చూస్తుండటంతో వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకొనివచ్చి , నుదుటిపై ప్రాణంగా అమ్మ ముద్దు అందుకొని భోజనం చేసి అమ్మమ్మా మీరు ok కదా అని అడిగాను. మా బుజ్జికన్నా అంటూ నుదుటిపై ముద్దుపెట్టింది. నవ్వుతూ మహివైపు చూసి అందరూ స్పృహలోకి వచ్చారు గుడ్ జాబ్ అని చెప్పాను. పోరా నీ బోడి పొగడ్తలు ఎవరికి కావాలి అని వెచ్చగా అమ్మ ఓడిలోనే పడుకొంది. థాంక్స్ god అంటూ మొక్కి మహికి జోకొట్టింది. 



నెక్స్ట్ రోజు ఉదయమే హాస్పిటల్ కు వెళ్ళాను. కానీ అప్పటికే  వాళ్ళు ok అని తెలుసుకొని పెద్ద హాస్పిటల్ కు వెళ్లిపోయారని , ఎక్కడికి వెళ్లారో తెలియదని చెప్పడంతో , వాళ్ళు కొలుకున్నారు అది చాలు అనుకొని ఇంటికివచ్చేసాను. 



రెండువారాలు సరదాగా గడిచిపోవడంతో మరో రెండు రోజుల్లో కాలేజ్ ఓపెనింగ్ అని మెసేజ్ రావడంతో షాపింగ్ కు వెళ్లి బట్టలతోపాటు ఏమేమి కావాలో అన్నీ తీసుకొని చివరగా మహి నీకు ఎలాంటి చీరలంటే ఇష్టం అని అమ్మ ఆడిగింది. అమ్మా చీరలా నాకా వద్దే వద్దు , నాకు carry చెయ్యడం రానేరాదు నన్ను వదిలెయ్యండి అంటూ దండం పెట్టడంతో , ఒసేయ్ చీరలు కట్టుకోవడం నేర్చుకోకపోతే ఎలానే అమ్మాయిలకు చీరలే కదా అందం అని అమ్మమ్మ చెప్పినా వద్దే వద్దు కావాలంటే మరిన్ని డ్రెస్ లు కొనివ్వండి అని బదులిచ్చింది. ఒకసారి అప్పటికే సెలెక్ట్ చేసినవి చూసి ఆశ్చర్యపోతూ కానీ నీ ఇష్టం షాప్ మొత్తం కొనేయ్ అంటూ నవ్వుతూ తనకు ఇష్టమైనవన్నీ కొనేసి కారులో పట్టకపోవడంతో మామీద కూడా పెట్టుకొని సంతోషన్గా నవ్వుతూ ఇంటికి చేరుకున్నాము. 



భోజనం చేసి అలసిపోయి రూంలోకి వచ్చి బెడ్ పై వాలిపోతూ ఎదురుగా ఉన్న నిలువెత్తు అద్దం లో తనను చూసుకొని ఆగిపోయి , కన్నార్పకుండా చూస్తూ ఐఐటీ లో ఉండాల్సిన దాన్ని ఇక్కడ వేస్ట్ కాలేజ్ లో చేరబోతున్నావా అని మనసు మాటలు వినిపించినట్లు ఒక్కసారిగా చిరునవ్వు మాయమై తన్నుకొస్తున్న బాధతో బెడ్ పై బోర్లా పడిపోయి కళ్ళల్లో నీళ్లతో బాధపడింది , లేచి షోకేస్ లో ఉన్న డివైడర్ ఫ్రేమ్ అందుకొని అంతా వీడివల్లనే అని కోపంతో రగిలిపోయింది. నేను రూంలోకి రాగానే నేను చూస్తుండగానే దానిని నాకు గుర్తుచేస్తున్నట్లు అక్కడే పెట్టేసి బెడ్ పై వాలిపోయింది. ఇది ఇంకా మనసులోనే పెట్టుకుంది ఏమి చేస్తాం అంటూ లైట్స్ ఆఫ్ చేసి పడుకున్నాను. తరువాత రోజంతా కూడా మూడీగానే ఉంది. అమ్మావాళ్ళు ఏమైందని అడిగినప్పుడు మాత్రం నవ్వుతోంది.
[+] 10 users Like Mahesh.thehero's post
Like Reply
నెక్స్ట్ రోజు తెల్లవారకముందే లేచి జాగింగ్ , జిమ్ చేసివచ్చి స్నానం పూర్తిచేసి కిందకు వచ్చినా మహి ఇంకా నిద్రపోతుండటంతో , అమ్మ వెళ్లి నుదుటిపై చేతితో తాకి మహి కాలేజ్ కు సమయం అవుతోంది లేమ్మా అంటూ లేపి బాత్రూం లోకి పంపింది. అమ్మను బాధపెట్టడం ఇష్టం లేక రెడీ అయ్యి కొత్తబట్టలు వేసుకొని కిందకు రావడం చూసి అమ్మమ్మ దగ్గరకువెళ్లి ఎంత అందంగా , లక్షనంగా ఉన్నావు రా అంటూ తలపై ప్రేమతో ముద్దుపెట్టింది. టిఫిన్ చేసిన తరువాత మహి బ్యాగును భుజం పై వేసుకొని అమ్మను కౌగిలించుకొని వెళ్ళొస్తానమ్మా అనిచెప్పి కారు తాళాలు అందుకొంది. మహి ఇద్దరూ ఒకే కారులో వెళ్లొచ్చు కదమ్మా అని అమ్మ చెప్పింది. వాడితో అదికూడా పేమెంట్ బోలెడంత కట్టిన వాడితో ఎవరైనా వెళతారా , నావల్ల కాదు నాకు ఒక రేంజ్ ఉంది అంటూ తాళాలు తిప్పుతూ స్టైల్ గా బయటకు వెళ్లిపోతుంటే , పోవే నీతో ఎవరు వస్తారు అంటూ అమ్మమ్మ పాదాలను తాకాను. బాగా చదువుకో బుజ్జికన్నా ...........అమ్మమ్మా .........sorry నా బుజ్జికన్నా దానికి చెప్పేది నీకు చెప్పాను. నువ్వుమాత్రం బాగా ఎంజాయ్ చెయ్యి , అప్పుడప్పుడూ మాత్రం దానిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పింది. దానిజోలికి ఎవడైనా వచ్చెoదుకే భయపడతారు , lady బ్రూస్లీ అది మీరేమీ బయపడకండి అనిచెప్పి ఇద్దరమూ మా మా కార్లలో తనకంటే వేగంగా కాలేజ్ చేరుకొని బిల్డింగ్ , పార్క్స్ చూసి ఇది నిజంగా వైజాగ్ నా లేక ఫారినా అంటూ ఆశ్చర్యపోయాను.



 అలాగే చూస్తూ కారుని పార్క్ చేసి కిందకు దిగడానికి డోర్ వేగంగా తెరిచాను. ఒకడు బైక్ లో కారుప్రక్కనే వెళుతూ డోర్ చూసి సడెన్ బ్రేక్ వేసి పడిపోయాడు. Sorry బాస్ అంటూ వచ్చి బైకు లేపి, బైకుకు ఏమైనా అయ్యిందా అని చూసి, sorry ఏమీ కాలేదు కదా బాస్ అని అడిగాను. ఏమీ కాలేదు నాపేరు కృష్ణ ఏమీ కంగారుపడకండి , బైకుకు ఏమైనా అయినా మా అయ్య వెంటనే కొత్తది కొనిస్తాడు అని నవ్వుతూనే బదులిచ్చాడు. Sorry కృష్ణ గారు నా పేరు మహేష్ ఈరోజే జాయిన్ అయ్యాను. నేను కూడా మహేష్ .....జస్ట్ కృష్ణ అని పిలువు మనం కలవాలనే ఇలా జరిగింది , ఇంతకీ ఏ బ్రాంచ్ ******* , నాది కూడా అదే అంటూ ఫ్రెండ్స్ అంటూ సంతోషంతో ఒకరినొకరు కౌగిలించుకున్నాము. ఇద్దరమూ నవ్వుకుంటూ మాట్లాడుతూ లోపలికి వెళదామా అని అడిగాను. అక్కడి నుండే వస్తున్నాను మహేష్ ఫుల్ గా ర్యాగింగ్ చేస్తున్నారు , నాకు చచ్చేoత భయం అని చెప్పాడు. 



చూడు కృష్ణ దానిని కూడా ఎంజాయ్ చెయ్యాలి నెక్స్ట్ ఇయర్ మనమూ చెయ్యాలా వద్దా  , నేను కూడా ఉన్నాను కదా అని పిలిచాను. అధికాదు మహేష్ మా అక్కయ్య కూడా ఇక్కడే సెకండ్ ఇయర్ చదువుతోంది , అలాగే మా అక్కను చేసుకోబోయే మా బావగారు కూడా ఇక్కడే ఫోర్త్ ఇయర్ చదువుతున్నారు , నిన్ననే ఫోన్ లో మాట్లాడుకుంటుంటే దొంగచాటుగా విన్నాను నన్ను ఎలాగైనా ఆటపట్టించాలని నవ్వుకున్నారు అని చెప్పాడు. అంటే నాలాగే మీ అక్కయ్య అంటే నీకు కూడా కోపమా ?..........నో నో నో......అలాంటిదేమీ లేదు మా అక్కాబావలకు నేనంటే ప్రాణం , నేనెప్పుడూ మూడీగా ఉంటానని నన్ను ఎలాగైనా ఆక్టివ్ చెయ్యాలనేదే వారి తపనంతా , అందుకే ఈ ర్యాగింగ్ ను అలుసుగా తీసుకుంటున్నారు , వారు ఏమి చేయబోతున్నారని భయంగా ఉంది అంతే , నాకు ఇక్కడ సీట్ రాకున్నా బోలెడంత డబ్బు కట్టి పేమెంట్ సీట్ ద్వారా జాయిన్ చేయించారు. రేయ్ కృష్ణా నేను కూడా same to same పేమెంట్ సీట్  అంటూ నవ్వుతూ మా ట్విన్స్ మధ్యన ఉన్న పగలు ప్రతీకారాలు మరియు కోపాలను వివరించాను. కలిసి 10 నిమిషాలు కాలేదు రేయ్.........ok బాగుంది అంటూ ఇద్దరమూ రేయ్ రేయ్ అని పలకరించుకొని క్లోజ్ అయిపోయాము.



అదే సమయానికి నేను కాలేజ్ లో ఎంటర్ అయిన రెండు నిమిషాలకు మహి కూడా కాలేజ్ పరిసరాలను చూసి ఆశ్చర్యపోతూ లేడీస్ పార్కింగ్ దగ్గర కారు ఆపి ఏదో లోకంలో ఉన్నట్లు డోర్ తెరవడం వలన స్కూటీ మీద వచ్చిన ఒక స్టూడెంట్ ను కిందపడేసి నాలాగే రియాక్ట్ అయ్యి క్లోజ్ అయిపోయి దివ్య సెకండ్ ఇయర్ , మహి న్యూ జాయినింగ్ అంటూ నవ్వుతూ మాట్లాడుతూ మహి యు అర్ sooooo బ్యూటిఫుల్ నిన్ను ఎక్కడో చూసాను.........గుర్తుకురావడం లేదు అని ఆలోచిస్తూనే, నిన్ను కానీ మన కాలేజ్ స్టూడెంట్స్ చూశారంటే అందరూ ఫ్లాట్ అయిపోవడం గ్యారంటీ అని చెప్పేంతలో , 



మహి నవ్వుని చూసి అప్పుడే ఎంటర్ అయిన అబ్బాయిల గ్రూప్ లో ఒకడు ఒరేయ్ మామా అలియా భట్ రా కాలేజ్ ఓపెనింగ్ కోసం మనేజ్మెంట్ పిలిపించి ఉంటుంది అంటూ మొబైల్స్ తీసి అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ కు కాల్ చేసి చెప్పడం వాళ్ళు మరొకరికి చెప్పడం ఇలా కాలేజ్ మొత్తం నిమిషాల్లో తెలిసిపోవడంతో , 



లేడీస్ పార్కింగ్ వైపు స్టూడెంట్స్ మొత్తం సంతోషంతో మా ముందుగానే పరుగులు పెట్టడం చూసి , ఒకడిని చెయ్యి పట్టుకొని ఆపి బ్రదర్ ఎక్కడికి అని ఆడిగాము. వాడు గసపడుతూ కాలే....జ్ కి అలియా భట్ వచ్చిందంట , లేడీస్ పార్కింగ్ దగ్గర ఉంది అని చెప్పగానే , కృష్ణ గాడు రేయ్ మామా మనమూ వెళదాము అని ఆతృత చూపాడు. దీనికి అందరూ ఫ్లాట్ అయిపోయారు , ఇప్పుడు కొండెక్కి కూర్చుంటుంది అని ఎక్కడో ఆలోచిస్తున్నాను. రేయ్ రేయ్ తొందరగా వెళదాము రారా అని భుజం కదపడంతో , రేయ్ అంత ఓవర్ చెయ్యకు ఆ అలియా భట్ ఎవ్వరో కాదు నా చెల్లెలే అయి ఉంటుంది , ఈ క్షణం నుండి నీకు కూడా చెల్లెలే పదా వెళదాము అని చెప్పడంతో , సరే బ్రదర్ చెల్లెల్ని పరిచయం చెయ్యాలి కదా పదా అంటూ బైకులో వెళ్ళాము.



మహి అది మొన్న సినిమాలో చూసాను అలియా భట్ అచ్చం అలానే ఉన్నావు అంటూ దివ్య చెప్పడంతో అక్కా మరీ నన్ను ఎత్తేస్తున్నారు అని మాట్లాడేంతలో కాలేజ్ అబ్బాయిలు  మొత్తం దివ్య మహిల చుట్టూ చేరిపోయి అవునురా మామా అంటూ ఎగబడి చూస్తుండటంతో , రేయ్ రేయ్ .......అక్కడితో ఆగండి తన పేరు మహి న్యూ జాయినింగ్ అని దివ్య చెప్పడంతో , wow అలియా భట్ కంటే అందంగా ఉంది అంటూ పొగుడుతుండటంతో మహి మరింత పరవశించిపోయింది. ఇంతలో సీనియర్ గర్ల్స్ గుంపు లోపలికి వచ్చి వెళ్ళండి అని చెప్పినా వినకపోవడంతో , వాళ్ళ ఫ్రెండ్స్ కి కాల్ చెయ్యడంతో ఇంటి నుండి బయలుదేరిన వాళ్ళు 5 minuites అంటూ వచ్చి , రేయ్ రాండ్ర రండి ర్యాగింగ్ కు భలే దొరికారు అంటూ వెనుక ఉన్న గ్రౌండ్ కి న్యూ జాయినింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ను తీసుకువెళ్లారు. 



 గ్రౌండ్ వైపు వెళుతున్న మహిని చూపించి అదే రా మన చెల్లెలు అలియా భట్ .......అలియాస్ మహి అని చెప్పాను. మహేష్ ప్రక్కన ఉన్నదే మన దివ్యక్క అని చెప్పడంతో , అయితే పరిచయం చేసుకుందాము పదా అంటూ వారివైపు వెళ్లేందుకు బైకు స్టార్ట్ చేసేంతలో ఒక సీనియర్ వచ్చి కీస్ తీసేసుకొని తోసుకుంటూ గ్రౌండ్ లోకి వచ్చెయ్యండి అంటూ బైకులో వెళ్ళిపోయాడు. ఇక తప్పదు అన్నట్లు తోసుకుంటూ గ్రౌండ్ చేరుకొని చుట్టూ చూసి వాహ్...........ఇది కదరా నేను కోరుకున్న గ్రౌండ్ - పెద్ద క్రికెట్ గ్రౌండ్ చుట్టూ ట్రాక్ దానిచుట్టూ స్టేజి మరియు స్టాండ్స్ , అటువైపు చివరన బాస్కెట్ బాల్ , వాలీ బాల్ ..........ఇలా అన్ని ఉండటం చూసి మురిసిపోతూ చూడటానికి వెళ్లిపోతుండగా , ఒకరు ఆపి రమ్మని పిలిచారు , వెళుతూ రేయ్ కృష్ణా మన బావగారు ఎక్కడరా అని అడిగాను. చుట్టూ చూసి రెండు వారాల కింద ఒక ఆక్సిడెంట్ అయ్యింది కాబట్టి వస్తారో లేదో తెలియదు అని చెప్పాడు. ఆక్సిడెంట్ ........ఇప్పుడెలా ఉన్నారురా ? , పూర్తిగా కొలుకున్నారు అని చెప్పడంతో సంతోషించాను.



 న్యూ జాయినింగ్ అందరూ రకరకాల టాస్క్ లు చేస్తుండటం చూసి నవ్వడంతో, మా ఇద్దరి దగ్గరికి ముగ్గురు సీనియర్లు వచ్చి , ఒరేయ్ ఏంట్రా ఇంత హైట్ ఉన్నావు ఏమి తింటావురా అని అడిగి మోకాళ్లపై కూర్చోరా అని చెప్పాడు. As you say బ్రో అంటూ అలాగే కూర్చున్నాను. బ్రో.........రేయ్ వీడికి చాలా బలుపు ఉందిరోయి తగ్గిద్దాము , వీడితో ఏమి చేయిద్దాము అని ఆలోచించేంతలో , బైకు మీద మరొక ఇద్దరు వచ్చి బైకుని కిందకు వదిలేసి మాదగ్గరికి వస్తుండటం చూసి , అదిగోరా బావగారు కిషోర్ అని చెప్పి బావా అంటూ కృష్ణ గాడు ముందుకు వెళ్ళాడు. వాణ్ణి పక్కకు జరిపి బ్రదర్ నువ్వెంటి ఇక్కడ , ఇలా కూర్చున్నావేంటి అంటూ లేపి , నిన్ను ర్యాగింగ్ చెయ్యడమా , అంత ధైర్యం చేసింది ఎవర్రా అంటూ గట్టిగా అరవడంతో , మేమే sorry అన్నా మీవాళ్ళు అని తెలియదు అని భయంతో చెప్పారు. Sorry బ్రదర్ అంటూ అమాంతం కౌగిలించుకొని సంతోషం పట్టలేక మిగతా ముగ్గురికి కాల్ చేసి మనల్ని కాపాడిన దేవుడు మన కాలేజ్ లోనే జాయిన్ అయ్యారురా అని పూర్తిగా చెప్పేంతలో కాల్ కట్ చేసినట్లు హెలో , హెలో.......అని కట్ చేసి , మా పేరెంట్స్ వల్ల ఉదయమే హాస్పిటల్ వదిలి వెళ్లిపోయాము , వారం తరువాత పూర్తిగా కోలుకుని మీకోసం హాస్పిటల్ దగ్గర నుండి చాలా చోట్ల వెతికాము , మా అదృష్టం కొద్దీ మళ్లీ మాకు కనిపించారు అంటూ ఆనందించాడు. ఇప్పుడెలా ఉంది కిషోర్ బావ అని అడిగాను.



నాపేరు మరియు బావనా ........అని ఆశ్చర్యపోయి మీకెలా తెలుసు అని అడిగాడు. కృష్ణ గాడి భుజం చుట్టూ చెయ్యి వేసి ఫ్రెండ్ కం బ్రదర్ , దివ్యక్కను చూయించి అక్క కాబట్టి మీరు నాకు బావగారు అని చెప్పాను. బావగారు మీ అందరినీ కాపాడింది మన మహేష్ నేనా .............రేయ్ అంటూ రెండు చేతులతో నమస్కరించాడు. రేయ్ ఏంట్రా ఇది అంటూ ఆపి కౌగిలించుకున్నాను. మిగతా ముగ్గురు వచ్చి బ్రదర్ atlast we met అంటూ సంతోషించి , దూరంగా కనపడుతున్న మహిని చూసి రేయ్ తను కూడా మన కాలేజ్ నేరా అని సంతోషించేంతలో , కృష్ణగాడు మహిని నా చెల్లినే అని చెప్పబోతుండగా ఆపి , బావగారు ఒక చిన్న కోరిక అని అడిగాను . మీరు అడగడమూ నేను చెయ్యకపోవడమా చెప్పండి మేము ఏమైనా చేస్తాము అని ముందుకొచ్చారు. 



ఏమీ లేదు మిమ్మల్ని రక్షించిన అమ్మాయి పేరు మహి, మీరు కొద్దిసేపు దూరంగా ఉండి మీ ఫ్రెండ్స్ సహాయంతో తన చేత నన్ను అన్నయ్యా అని అనిపించాలి , ముఖ్యమైన విషయం భయపెట్టారాదు , ఫోర్స్ చేయరాదు . హమ్మయ్యా బ్రతిపోయాము మా ప్రాణాలను రక్షించిన దేవతను ఎక్కడ ర్యాగింగ్ చెయ్యమంటారో అని అనుకున్నాము , అదేంతసేపు క్షణాల్లో చెప్పిస్తాము అంటూ వాళ్ళ క్లాస్ అమ్మాయిలకు కాల్ చేసి విషయం చెప్పి దూరం వెళ్లబోయారు.  బావగారు ప్రపంచంలో దీనికన్నా కష్టమైనది మరొకటి ఉండదు అని తెలుసుకుంటారు అని కృష్ణగాడు నవ్వుతూ చెప్పాడు. కోరిక కోరింది ఎవరు .......తప్పకుండా అమలయ్యేలా తను మహేష్ ని అన్నయ్యా అని పిలిచేలా చేస్తాము అని మాట ఇచ్చారు.



దివ్యక్క ప్రొటెక్షన్ లో సేఫ్ గా ఉన్న మహి దగ్గరికి దివ్యక్క సీనియర్స్ చేరి నువ్వేనా కాలేజ్ మొదటిరోజునే కాలేజ్ మొత్తాన్ని నీ అందంతో ఫ్లాట్ చేసింది , నిన్ను చూస్తుంటే మాకే ముద్దొస్తున్నావు ఇక ఈ వెదవలు .......తప్పులేదు . దివ్యా నీ క్లోజ్ అని కూడా తెలిసింది , కానీ పైనుండి ఆర్డర్ ( అదే నీ ప్రియమైన బావ దగ్గర నుండి అని చెవిలో గుసాగుసలాడి ) చిన్న టాస్క్ అంతే అని చెప్పడంతో , దివ్యక్క go on అంటూ నవ్వుతూ చెప్పింది. మహి కంగారుపడేంతలో మహి నేను నీ ప్రక్కనే ఉంటాను కదా ఎంజాయ్ చెయ్యి అంతే అని ధైర్యాన్ని ఇచ్చింది. మహి ఏమీ లేదు అటువైపు చివరగా ఉన్న స్టూడెంట్ ను అన్నయ్యా అని పిలిచి వచ్చెయ్ అంతే అని చెప్పింది. ఎవరబ్బా అంటూ తొంగి చూస్తుండటంతో కృష్ణ గాడి వెనుక దాచుకున్నాను. మహి ఇలా వెళ్లి అన్నయ్యా అని పిలిచి అలా వచ్చెయ్ అయిపోతుంది అని చెప్పారు. అంతేనా నేనేమో అనుకున్నాను మహి తొందరగా వెళ్లి వచ్చెయ్ అని స్నేహపూర్వకంగా చెప్పింది. 



సరే అంటూ అమ్మాయిలనందరినీ దాటి నడవగానే అబ్బాయిలంతా ర్యాగింగ్ అనుభవిస్తూనే కళ్ళప్పగించి మహి వైపు చూస్తుండటంతో , బాయ్స్ అందరూ వెనక్కు తిరగండి అని గట్టిగా కేక వినపడటంతో అందరితోపాటు చివరన నిలబడిన నేను కూడా వెనక్కు తిరిగాను. మహి నవ్వుకుని వెనక్కు తిరిగి థాంక్స్ దివ్యక్కా అనిచెప్పడంతో , మహి దగ్గరకు వచ్చి చెయ్యి అందుకొని చివరికి వచ్చి నా హైట్ వెనుక నుండి చూసి , మా వెధవ ఉన్నట్లుగా ఉన్నాడే........ వాడే, సర్ నటించింది చాలు ఇటువైపు తిరగరా .....అని చెప్పడంతో తల దించుకుని నవ్వుతూ తిరిగాను. అప్పుడే అందరినీ బుట్టలో వేసేసుకున్నావా ? , అంటే నిన్ను అ.........అని పిలవాలా? సరే పిలుస్తున్నాను అనడంతో ఆశ్చర్యపోయి స్టైల్ గా నిలబడ్డాను. 



ఆ.......ఆ.......తమ్ముడు అని పిలిచింది. ప్రక్కనే ఉన్న కృష్ణగాడి నవ్వు ఆగలేదు. దివ్యక్క మహికి ఏదో చెప్పబోయేంతలో కృష్ణగాడు తన చెవిలో ఇద్దరూ ట్విన్స్ అని చిన్నప్పటి నుండి గొడవలే అని చెప్పి , బావగారిని ఆక్సిడెంట్ నుండి కాపాడింది కూడా ఎవరో కాదు మన ట్విన్స్ అని చెప్పగానే , ఒక్కసారిగా ఆనందబాస్పాలతో మహికి రెండు చేతులతో మొక్కి , ఈ క్షణం నుండి నువ్వు ఇక్కడ ఉంటావు అంటూ కౌగిలించుకొంది. దివ్యక్కా ఏమయ్యింది అని ఆశ్చర్యపోతుండగా , బావ అంటూ నలుగురినీ పిలిచింది. చూసి సంతోషిస్తూ ఎలా ఉన్నారు అని అడిగింది. మీ ఇద్దరి రక్తం మ్యాజిక్ చేసింది చెల్లెమ్మా , అంతచేసినా నన్ను ర్యాగింగ్ చేశారు అది ఈ వెధవ మాటలు విని అనగానే , చెల్లెమ్మా మమ్మల్ని క్షమించు అంటూ నలుగురూ పాదాలపై పడిపోయారు , బావగారు అంత ఈజీ కాదు మాట ఇవ్వద్దు అని చెప్పనా లేదా లేవండి అంటూ కృష్ణగాడు పైకి లేపాడు , రేయ్ అంటూ నావైపు చూసి సిగ్గుండాలి కొంచెమైనా , తమ్ముడు కాబట్టే బుద్ధులేని పనులు చేసావు అని తిట్టి దివ్యక్కా వెళదాము పదా అని చెప్పింది. మహి నువ్వు కాపాడింది ఎవరినో కాదు నాకు కాబోయే వారిని మా బావను అంటూ కిషోర్ గుండెలపై వాలిపోయి చెప్పి , బావ మహేష్ - మహి the బ్యూటిఫుల్ ట్విన్స్ మిమ్మల్ని రక్షించిన దైవాలు కానీ ఇద్దరికీ ఒకరంటే మరొకరికి పడదు లవ్లీ ఫైట్స్ అంటూ చెవిలో చెప్పి తరువాత కలుస్తాను బావ అని నడుము గిల్లి మహితోపాటు వెళ్లి ఈరోజుకు చాలు క్లాస్ లకు వెళ్లిపోండి అని సీనియర్స్ చెప్పడంతో అందరూ వెళ్లిపోయారు. నాకొరిక తీరనందుకు నలుగురూ తలదించుకొని ఉండటంతో , బావగారు మా ఇద్దరి మధ్య ఇది మామూలే వదిలెయ్యండి అని చెప్పి cheer up చేసాను. రేయ్ మహేష్ ఇక క్లాస్ కు వెళదామా అని కృష్ణగాడు అడిగాడు. క్లాసా నేనా.............. నా జీవితమంతా గ్రౌండ్ కే అంకితం ఇచ్చాను రా , స్పోర్ట్స్ నా ప్రాణం అని నువ్వు కావాలంటే వెళ్లు అని బదులిచ్చాను. అందుకేనా ఇంత హైట్ పెరిగిపోయావు నాకు కూడా క్లాస్సెస్ అంటే ఇంటరెస్ట్ లేదు ఎలాగోలా డిగ్రీ పూర్తి చేసి మా నాన్న బిజినెస్ లో చేరిపోవడమే అనిచెప్పి అప్పుడే గ్రౌండ్ లోకి వచ్చిన సర్ ను కలిసి కోచ్ అని తెలియడంతో మరింత సంతోషిస్తూ  మాటల్లో మునిగిపోయాము.



అక్కడ క్లాస్ లో ఫస్ట్ క్లాస్ కు కాలేజ్ మేనేజ్మెంట్ మొత్తం వచ్చి ఏమాత్రం ఈ కాలేజ్ లో ఉండటం ఇష్టం లేని మహిని పిలిచి క్లాస్ అంతా పరిచయం చేసి , మహి సాధించిన ర్యాంక్ లను వివరించి మన కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం మన కాలేజ్ కే గర్వకారణం , తను ఇంకా ఉన్నతస్థాయికి చేరుకొని మన కాలేజ్ కు కూడా మంచిపేరు తేవాలని మనసారా అభినందించి క్లాస్ మొత్తం చప్పట్లతో మారుమ్రోగడంతో keep it up మహి అని చెప్పి సంతోషంతో వెళ్లిపోయారు. ఆరోజు మొత్తం నేను గ్రౌండ్ లో మహికి ఇంటరెస్ట్ లేని క్లాస్ లో తోటివాళ్ళు మహిని ఫ్రెండ్స్ చేసుకోవాలని ఇంటరెస్ట్ చూపినా పట్టించుకోకుండా ఎలాగోలా మధ్యాహ్నం వరకూ గడిపేసి afternoon క్లాస్సెస్ మొదటిరోజే జరగవు అని చెప్పడంతో ఇంటికి బయలుదేరుతుండగా .



ధైర్యం ఉన్న అబ్బాయిలు మహి దగ్గరికి పువ్వుతో వచ్చి లవర్స్ డే వరకూ ఆగలేము అంటూ ఒకరి తరువాత మరొకరు లవ్ ప్రపోజ్ చేశారు. చూడండి ఫ్రెండ్స్ మన క్లాస్ లో తాటిచెట్టులా పెరిగిన ఒక కోతి ఉన్నాడు కొంతమంది ర్యాగింగ్ లో చూసే ఉంటారు వాడు నా తమ్ముడు వాడి ఒక్కడితోనే వేగలేకపోతున్నాను , ఇక ఇంతమంది కోతుల మధ్య ఎలా ఉండాలో అర్థం కావడం లేదు అని డైరెక్ట్ గా చెప్పుదెబ్బ కొట్టినట్లు చెప్పెయ్యడంతో మరొకడు ధైర్యం చెయ్యలేదు. దివ్యక్క వెనుక నుండి విని మహి అంటూ వచ్చి ప్రేమ అంటే నమ్మకం లేదా అని అడిగింది. ఎందుకు లేదక్కా నా హృదయమంతా మా అమ్మ , అమ్మమ్మ స్వచ్ఛమైన ప్రేమతో నిండిపోయింది ఇక ఎవ్వరికీ స్థానం లేదు , మరి మీ అన్న.........అదే మహేష్ కు స్థానం లేదా?, వాడికా ఇసుక రేణువంత కూడా ఇక్కడ స్థానం లేదు అంటూ కోపంతో చెప్పడంతో , సరే చూద్దాము అంటూ మా అడ్రస్ కనుక్కుని బై చెప్పేసి వెళ్ళిపోయింది. మహి కారులో నేరుగా ఇంటికి చేరుకొంది. 



మధ్యాహ్నం వరకూ కోచ్ తో గ్రౌండ్ లోనే గడిపి మధ్యాహ్నం తరువాత ఇంట్రస్ట్ ఉన్నవాళ్ళతో అలుపు లేకుండా ప్రాక్టీస్ చేసి , కొద్దిసేపు కిషోర్ బావ వాళ్ళతో కాలేజ్ గురించి , స్పోర్ట్స్ గురించి తెలుసుకొని అన్నీ ఉంటాయని సంతోషంతో రేయ్ మామా రేపు కలుద్దాము అని చెప్పి వొళ్ళంతా చేమటలతో ఇంటికి చేరుకున్నాను.గంటసేపు చల్లని నీళ్ల కింద స్నానం చేసి రెడీ అయ్యి కిందకు వచ్చాను. అప్పటికే కిషోర్ బావ ఫ్యామిలీ , కృష్ణ గాడి ఫామిలీ మరియు రక్షించిన మిగతా ముగ్గురి ఫ్యామిలీలు ఇంటికి వచ్చి ఇండటం చూసి సంతోషిస్తూ , రేయ్ కృష్ణా ఎప్పుడు వచ్చారు అమ్మా నాన్న గారా అయితే ఆశీర్వదించండి అంటూ పాదాలకు నమస్కరించాను. ఇద్దరూ ఆనందబాస్పాలతో బాబు మహేష్ నిన్ను కలవడానికి వస్తే నువ్వే మమ్మల్ని తరించిపోయేలా చేసావు చాలా సంతోషం , అంతా ఆ పుణ్య దేవతల పెంపకం అంటూ అమ్మ మరియు అమ్మమ్మకు రెండు చేతులు జోడించి నమస్కరించారు. అన్నయ్య గారు అవన్నీ మనలో మనకి ఎందుకండి, దివ్య చెప్పింది ఒక్కరొజులోనే పిల్లలంతా అందరూ కలిసిపోయారు ఆ సంతోషం చాలు అంటూ సంతోషన్గా మాట్లాడి అందరూ తలా ఒక చెయ్యి వేసి వంట చెయ్యడంతో కలిసి భోజనం చేసి , మేము థాంక్స్ చెబుదామని వస్తే మీరు మా రుణాన్ని మరింత పెంచేశారు వీలు చూసుకొని ఇంటికి రండి అనిచెప్పి సంతోషన్గా వెళ్లిపోయారు.



ఆ తరువాత నుండి నలుగురమూ అమ్మా , అమ్మా అంటూ మేము దివ్యక్క ఇంటికి వాళ్ళు మా ఇంటికి వెళ్లడం మామూలైపోయింది. దివ్యక్క , కృష్ణలు నేరుగా మా రూంలోకి రావడం మేము వాళ్ళ రూంలోకి వెళ్లిపోవడం కూడా , ఒకరోజు మహి దివ్యక్క రూమ్ లోకి వెళ్లి మూలన ఉన్న తాళం వేసి రూమ్ చూపించింది. ఆదా స్టోర్ రూమ్ అని దాటవేసింది. 



మహి ఇంటరెస్ట్ లేని క్లాస్ లను ఎలాగోలా వెల్లగొడుతూ , నేను గ్రౌండ్ లో మరింత ఇష్టంగా మెరుగవుతూ రెండు నెలల్లో కోచ్ కు నా గురించి మొత్తం తెలిసిపోయి మహేష్ నిన్ను nationals , internationals తీసుకువెళ్లడమే నా గోల్ అని చెప్పడంతో thank you soooooo మచ్ సర్ అని చెప్పి , సర్ అండర్ లో పూర్తి శిక్షణను తీసుకున్నాను. కృష్ణ గాడు సగం నాదగ్గరా సగం సమయం క్లాస్ లలో ఎంజాయ్ తప్ప మరేమీ చెయ్యడం లేదు మేమిద్దరమూ ఎప్పుడు ట్విన్స్ లా ప్రేమగా కలుస్తామా అని ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నాడు. తొలి ఇంటర్నల్స్ రానే వచ్చాయి మహికి ఇంటరెస్ట్ లేకపోవడం వల్ల exams లో ఒక్క అక్షరం కూడా రాయకపోవడంతో జీవితంలో తొలిసారి fail మార్కులు సాధించింది. నాకు తెలియకుండానే కోచ్ నాకు 90% మార్కులు వేయించారు. మహి 0 మార్కులను చూసి ఆరోజు క్లాస్ మొత్తం ఆశ్చర్యపోయింది . కొందరైతే ఐఐటీ ర్యాంకులను కూడా కాఫీ కొట్టి సాధించినట్లు ఉంది అని గుసగుసలాడటంతో కృష్ణ గాడికి కోపం వచ్చి వాళ్ళ చెంపలు వాయించి నాకు చెప్పినా ఎందుకు ఎలా ఈ కాలేజ్ లో ఇష్టం లేకుండా జాయిన్ అయ్యిందో చెప్పి పట్టించికోకపోవడంతో , దివ్యక్కకు చెప్పాడు. 



మనేజ్మెంట్ కూడా క్లాస్ లోకి వచ్చి మహి fully disappointed అని బాధపడుతుండటంతో , దివ్యక్క నేరుగా క్లాస్ లోకి వచ్చి సర్ wait for main exams అని కాన్ఫిడెంట్ గా చెప్పి మహి చెయ్యి అందుకొని లాక్కుంటూ కారులో తన ఇంటికి తన రూం కు పిలుచుకొని వెళ్లి , ఇంతకు ముందు ఆడిగావు కదా ఈ రూమ్ ఏంటని అంటూ తాళం తెరిచి లైట్స్ అన్నింటినీ on చేసి గోడలపై వ్రేలాడదీసిన ఫ్రేమ్ లను , సాధించిన అవార్డులను చూడమని చెప్పింది. టెన్త్ నుండి కూడా మహిలాగే స్టేట్ ర్యాంకులతో ఇంటర్ తరువాత మహిలాగే ఐఐటీ , niit లలో సీట్ వచ్చినా ఫ్యామిలీ కోసం బావ కోసం ఇక్కడే జాయిన్ అవ్వాల్సి వచ్చింది. మొదట్లో నేను కూడా నీలాగే 0 మార్కులు తెచ్చుకున్నాను , ఇలాగే మా సీనియర్ నన్ను లాక్కుంటూ వెళ్లి ఇలాంటివే చూపించి ఫామిలీ తరువాతనే ఏమైనా , ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో తెలుస్తుంది అని చెప్పింది. నేను మారిపోయి ఫ్యామిలీ సంతోషం కోసం ఐఐటీ లో చదివేది ఇక్కడే రీచ్ అవుతున్నాను , now i am fully happy than any ఐఐటీ పర్సన్ అని చెప్పి ఇక నీఇష్టం అంటూ తాగడానికి నీళ్లు అందించి కొద్దిసేపు ఒంటరిగా వదిలేసింది. దివ్యక్కా అమ్మావాళ్ళు బాధపడేలోపు నా కళ్ళు తెరిపించావు అంటూ కౌగిలించుకొని కన్నీళ్లను తుదుచుకొని ఇంటికి చేరుకుంది. నేను కోచ్ దగ్గరికి వెళ్లి సర్ నాపై మీ ప్రేమకు చాలా సంతోషం సర్ కానీ నాకు పాస్ మార్కులు చాలు సర్ ఇన్ని మార్కులు నేను తట్టుకోలేను అని చెప్పడంతో నవ్వుతూ సరే అని చెప్పారు. థాంక్స్ సర్ అంటూ కౌగిలించుకొని ఇంటికి చేరుకొని అమ్మా అమ్మమ్మా నాకు 90% , దానికి 0 అని నవ్వుతూ చెప్పాను. చూడు కన్నయ్యా నీకు ఎలా వచ్చాయో మాకు తెలుసు అంటూ చెవులు పిండి , నా బంగారు తల్లి 0 మార్కులు తెచ్చుకుంది ఎందుకంటే జీవితంలో అన్ని సక్సెస్ లే కాదు fail అనుభవాన్ని కూడా పొంది జీవితంలో మరింత దృడంగా ఉండాలని అలా చేసి ఉంటుంది అన్న అమ్మ మాటలను తలుపు బయట నిలబడి విని పరిగెత్తుకుంటూ వచ్చి కళ్ళల్లో నీళ్లతో అమ్మా అమ్మా.........అని తడబడుతూ చెప్పబోతుండగా , నేను నీ తల్లినిరా బంగారు నువ్వు explain చెయ్యాల్సిన పనిలేదు అంటూ కన్నీళ్లను తుడిచి ఫ్రెష్ అయ్యిరాపో స్నాక్స్ తిందువు అని ప్రాణంగా కౌగిలించుకొని చెప్పింది. లవ్ యు అమ్మా అంటూ పాదాలను నమస్కరించి sorry అని చెప్పడంతో , నా బంగారుతల్లి తప్పు చెయ్యదు అని చెప్పి పైకి పంపింది. అమ్మా రేపటి నుండి నా కొత్త కూతురిని చూస్తారు అంటూ గర్వంగా చెప్పింది.
[+] 11 users Like Mahesh.thehero's post
Like Reply
చూడు అమ్మమ్మా నేను 90% తెచ్చుకున్నా పట్టించుకోకుండా fail అయిన దాన్ని అదేదో గొప్ప అన్నట్లు వెనకేసుకొస్తున్నారు అని చెప్పడంతో , బుజ్జికన్నా నిన్ను అంటూ కొట్టడానికి రావడంతో స్టెప్స్ వైపు పరిగెత్తి , నేను అనుకుంటే మా కోచ్ కు ఒక్క మాట చెప్పాను అంటే 100 మర్క్స్ వచ్చేలా చేస్తారు అప్పుడు నన్ను అభినందిస్తారా అని నోరు జారడంతో , అమ్మా అమ్మమ్మా గట్టిగా నవ్వడం చూసి నేనే చెప్పేసానా అంటూ నన్ను నేను తిట్టుకుంటూ పైకి వెళ్ళిపోయాను. 



ఆ తరువాత రోజు నుండి క్లాస్ ఇంట్రస్ట్ తో వింటూ లెక్చరర్ మరియు ప్రొఫెసర్స్ కే ఛాలెంజింగ్ ప్రశ్నలు వేసి క్లాస్ మొత్తం అవాక్కయ్యేలా చెయ్యడంతో , ఏంటి సర్ ఆన్సర్ తెలియదా ...........my sister you రాక్స్........అంటూ కాలేజ్ మొత్తం వినిపించేలా కృష్ణగాడు విజిల్ వేయడంతో , సర్ గెటౌట్ అనడంతో ఈ ఆనందం చాలు సిస్టర్ అని మహివైపు నవ్వుతూ చూసి బయటకువచ్చి , దివ్యక్క క్లాస్ లోపలికి వెళ్ళి లెక్చరర్ ను కూడా పట్టించుకోకుండా సక్సెస్ అని చేతులు పైకెత్తి చెప్పడంతో , దివ్య గెటౌట్ అని చెప్పడంతో , thank యు సర్ అంటూ కృష్ణ గాడితోపాటు బయటకు వచ్చి క్లాస్ అయిపోయేంతవరకూ బయటే wait చేసి సర్ వెళ్లిపోగానే లోపలికి వెళ్ళి , ఇద్దరూ మహి - దివ్యక్కా అంటూ సంతోషం పట్టలేక కౌగిలించుకొని ఇక మా మహికి తిరుగులేదు అని మురిసిపోయింది. దివ్యక్కా అంతా నీవల్లనే అని చెప్పడంతో , చెప్పాను కదా మహి మీరిద్దరూ ఇక్కడ ఉంటారని అంటూ హృదయాన్ని చూపించింది. 



కృష్ణగాడు అమ్మకు కాల్ చేసి నిన్న జరిగింది మరియు ఈరోజు క్లాస్ లో జరిగింది వివరించడంతో , అమ్మా నీ మనవరాలు is back అంటూ సంతోషం పట్టలేక కౌగిలించుకొని మురిసిపోయింది. అది నా మనవరాలే అంటూ గర్వంతో పొంగిపోయింది. వెంటనే దివ్యక్కకు కాల్ చేసి చాలాసేపు సంతోషన్గా మాట్లాడారు.



నెక్స్ట్ పెట్టిన ఇంటర్నల్స్ అన్నింటిలో 100 మార్క్స్ తక్కువ కాకుండా తెచ్చుకొని ఫస్ట్ ఇయర్ మెయిన్ exams లో University కే ఫస్ట్ రావడం , స్పోర్ట్స్ లో స్టేట్ లోని University లన్నింటి ఛాంపియన్షిప్ లో అన్నింటినీ మాక్సిమం క్లీన్ స్వీప్ చేసి విజయంతో తిరిగివచ్చాము,  మేనేజ్మెంట్ తొలిసారి University లెవెల్ లో రెండింటిలో అటు స్టడీస్ లో మరియు స్పోర్ట్స్ లలో స్టేట్ లేవీలో లో గుర్తింపు రావడంతో  ఏకంగా ఇంటికి వచ్చిమరీ మా ఇద్దరినీ అభినందించారు. కాలేజ్ ఓపెన్ అయ్యిన తరువాత అందరి సమక్షంలో అభినందన సభ ఉంటుంది మళ్లీ కాలేజ్ తరుపున గౌరవంగా వచ్చి ఆహ్వానిస్తాము అని చెప్పడంతో ఇంట్లో అందరి ఆనందానికి అవధులు లేకపోయాయి. దివ్యక్క ఇంటికి వెల్లిమరీ మహి తన ఆనందాన్ని పంచుకొంది. కృష్ణగాడు ఏకంగా ఇంటి దగ్గరికి డోలు వాయించేవాళ్లను పిలుచుకొనివచ్చి మా ఏరియా మొత్తం తెలిసేలా చేసాడు.



కాలేజ్ రీ ఓపెన్ అయ్యిన తరువాత కాలేజ్ మొత్తం ఇద్దరినీ అభినందించి. ఫ్రెండ్లీ ర్యాగింగ్ తో జూనియర్స్ తో కలిసిపోయాము. ఫ్రెషర్స్ డే రోజునే సన్మానం కూడా జరిపించాలని నిర్ణయించుకొని , కాలేజ్ యాజమాన్యం ఇంటికి మరియు నాన్న ఆఫీస్ కు వెళ్లి గౌరవంగా అందరినీ ఆహ్వానించారు. 



ముందురోజు షాపింగ్ వెళ్లి అన్నీ డ్రెస్ లే కొంటుండటంతో,  బంగారు రేపు అచ్చ తెలుగు అమ్మాయిలా చీర కట్టుకో చాలా బాగుంటుంది అని అమ్మ బ్రతిమాలింది. దానికి సమాధానం కూడా ఇవ్వకుండా నా షాపింగ్ అయిపోయింది బయలుదేరుదాము అంటూ ఇంటికి చేరుకున్నాము. 



మరుసటి ఉదయం కాలేజ్ నుండే వెహికల్ రావడంతో అమ్మావాళ్లను అందులో పంపించి వెనుక కారులో కాలేజ్ చేరుకున్నాము. మెయిన్ గేట్ దగ్గర నుండి ప్రిన్సిపాల్ దగ్గరుండి లోపలికి పిలుచుకొనివెళ్లారు. University వైస్ ఛాన్సలర్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. ముందుగా స్టేజి మీద ఆయన్ను సత్కరించుకున్న తరువాత ఆయనను స్టేజీపై గౌరవంతో కూర్చోబెట్టి , ప్రిన్సిపాల్ మైకు దగ్గరకువెళ్లి ఈ సంవత్సరం ఫ్రెషర్స్ మాత్రమే కాదు మన కాలేజీని స్టేట్ లెవెల్ లో రెండు విభాగాల్లో  ఉన్నతస్థాయిలో నిలిపి మన కాలేజ్ పేరును ప్రతి university లో మారుమ్రోగేలా చేసిన మన గ్రేట్ ట్విన్స్ మహి , మహేష్ లను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అని చెప్పగానే స్టేడియం మొత్తం కరతాళధ్వనులతో దద్దరిల్లింది. వారి విజయానికి  ఇంతకంటే ఏమనిచెప్పగలను అంటూ అందరితోపాటు ఆయన మరియు వైస్ ఛాన్సలర్ కూడా లేచి మరీ చప్పట్లు కొట్టడం చూసి అమ్మా అమ్మమ్మల ఆనందానికి అవధులు లేవు. ముందుగా వారి పేరెంట్స్ ను సాదరంగా స్టేజి మీదకు ఆహ్వానిస్తున్నాము అని చెప్పడంతో యాజమాన్యం వచ్చి అమ్మానాన్నలను స్టేజి మీదకు తీసుకెళ్లి వైస్ ఛాన్సలర్ చేతులమీదుగా సన్మానం జరిపించి కిందకు పిలుచుకొనివస్తుండగా , మీరు కూడా స్టేజి మీద కూర్చుని మరెంతో మంది పేరెంట్స్ కు మార్గదర్శకం ఇవ్వాలని వైస్ ఛాన్సలర్ కోరడంతో ప్రిన్సిపాల్ మరింత సంతోషంతో ఆయన ప్రక్కనే కుర్చీలు వేయించి అమ్మానాన్నలను కూర్చోబెట్టారు. మా మధ్యన కూర్చున్న అమ్మమ్మ అమ్మ సంతోషాన్ని చూసి ఆనందబాస్పాలతో మా ఒక్కొక్క చేతిని అందుకొని మురిసిపోయింది.



ప్రిన్సిపాల్ సంతోషాన్ని వ్యక్తపరిచి ఇప్పుడు మన ట్విన్స్ సాధించిన ట్రోఫీలను వైస్ ఛాన్సలర్ చేతుల మీదుగా వారికి బహుకరణ అంటూ ఒకటి కాదు రెండు కాదు వరుసపెట్టి స్పోర్ట్స్ మరియు అథ్లెటిక్స్ పేరు చెప్పడం నేను వెళ్లి కప్పులను , ట్రోఫీలను మరియు షీల్డ్ లను టీం తోపాటు అందుకోవడం , బాయ్స్ మొత్తం తమ విజయంగా గోల గోల చేస్తూ గర్ల్స్ ను ఆటపట్టించారు. 



తరువాత ప్రిన్సిపాల్ ముఖం వెలిగిపోతూ ఇప్పటివరకూ , ఇక ముందైనా మన కాలేజ్ university టాప్ ర్యాంక్ సాధిస్తుందా అనే ఆశగానే మిగిలిపోతుందేమో అనుకున్న మాకు వజ్రం లా కాలేజ్ గౌరవాన్ని అమాంతం పెంచేందుకు అడుగుపెట్టి మొదటి సంవత్సరం లోనే ఆ ఘనతను కాలేజ్ కు సాధించిపెట్టిన మహిని స్టేజి మీదకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము అన్న మాటలు వినిపించగానే ముందుగా దివ్యక్క మరియు కృష్ణగాడు లేచి సంతోషం పట్టలేక చేతులు పైకెత్తి మరీ చప్పట్లు కొట్టారు. అంతే అధిచూసి నేను తప్ప స్టేడియం మొత్తం లేచి స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చి కాలేజ్ మొత్తం దద్దరిల్లిపోయేలా చీర్ చేశారు. వైస్ ఛాన్సలర్ నుండి నా బుల్లి బుల్లి కప్పులు అన్నీ కలిపినా అంతుందని అతిపెద్ద కప్పుని మహికి బహుకరించబోతుండగా సర్ మీ చేతుల మీదుగా అందుకోబోతున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను కానీ ఈ విజయాన్ని మా అమ్మా అమ్మమ్మల చేతులమీదుగా అందుకోవాలని ఆశగా ఉంది మీరు పర్మిషన్ ఇస్తే అనేంతలో చాలా సంతోషం తల్లి అమ్మను మించిన దేవతలు మరెవరున్నారు నాకు కూడా మా అమ్మ అంటే ప్రాణం అలాగే కానివ్వండి అని చెప్పారు. మహి అమ్మా , అమ్మమ్మ అంటూ పిలిచి , వైస్ ఛాన్సలర్ నాన్నను కూడా ముందుకు వెళ్ళమని చెప్పారు. అమ్మ , అమ్మమ్మా పాదాలకు నమస్కరించి ఆనందబాస్పాలతో కప్పు అందుకొనిమావైపు ఇంతకంటే సంతోషం మరొకటి లేదు అంటూ చూపించింది. , గర్ల్స్ మొత్తం కప్ అంటే అధిరా అంటూ బాయ్స్ ను ఎగతాళి చేశారు. ఆ తరువాత స్టేజి ఎదురుగా సోఫాలలో కూర్చోమని చెప్పి ఫ్రెషర్స్ డే లో ఫ్రెషేర్స్ టాలెంట్స్ , డాన్స్ ప్రోగ్రామ్స్ సంతోషన్గా జరిగిపోయి భోజనం చేసి ఇంటికి చేరుకున్నాము. అమ్మ మాఇద్దరి చేతులను సంతోషంతో వదిలితే ఒట్టు .



అలా తరువాత రెండు సంవత్సరాలు కూడా కాలేజ్ పేరుని మేము నేషనల్ లెవెల్స్ కు తీసుకెళ్లాము. మాఇద్దరి మధ్య గిల్లికజ్జాలు ఏమాత్రం తగ్గకుండానే ఫైనల్ ఇయర్ కు చేరిపోయాము. కాలేజ్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కోసం నోటీస్ కూడా వచ్చింది. మా classmate ప్రమీల ఏమాత్రం ఆలోచించకుండా మహి నేను ప్రెసిడెంట్ గా పోటీ చెయ్యాలనుకుంటున్నాను నీ సపోర్ట్ ఉంటే చాలు అని కోరడంతో , నీకంటే అర్హులు ఈ ఫైనల్ ఇయర్ లో ఎవరున్నారే మా అందరి సపోర్ట్ నీకే ఏమంటావు అంటూ లేచి క్లాస్ లో అనౌన్స్ చేసింది. వెంటనే నేను లేచి ప్రెసిడెంట్ అంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అప్పుడప్పుడూ university కాలేజ్ లకు కూడా వెళ్లాల్సి వస్తుంది , అమ్మాయిలు వాటిని రీచ్ కాలేరు కాబట్టి మన కల్చరల్ స్టార్ vineeth ను ప్రెసిడెంట్ గా చేద్దామని నిర్ణయించుకున్నాము అని అనౌన్స్ చేసాను ,బాయ్స్ మొత్తం వినీత్ వినీత్ అని తమ సపోర్ట్ తెలిపారు , రేయ్ మామా నాకు ఇంటరెస్ట్ కూడా లేదురా ప్రమీలా నా హార్ట్ రా మా ఇద్దరి మధ్య టైం చూసి చిచ్చు పెట్టావు కదరా అని చెవిలో గుసాగుసలాడాడు. వాడిని పట్టించుకోకుండా వినీత్ కు కూడా ఇష్టమే అంటూ వాడిచేతిని పైకి ఎత్తడం , ప్రమీల వాడివైపు కోపంగా చూడటం , మహి నన్ను మరింత కోపంగా చూసి ప్రమీలా కూడా పోటీగా నిలబడుతుంది అని తన చేతిని ఎత్తడం , మా ఇద్దరితోపాటు క్లాస్ మొత్తం నిమిషాల్లో కాలేజ్ మొత్తం అబ్బాయిలంతా వినీత్ వైపు అమ్మాయిలంతా ప్రమీలా వైపు సపోర్ట్ గా నిలబడి సాయంత్రం లోపు రాజకీయం కాలేజ్ అంతా పాకి ఎక్కడచూసినా గొడవలే తారసపడ్డాయి. ఇద్దరమూ వేరువేరుగా నామినేషన్ కూడా వేసేశాము.



చివరికి ప్రిన్సిపాల్ యాజమాన్యం దృష్టికి చేరిపోయి వెంటనే ఇంటికి కాల్ వెళ్ళిపోయి ఎవరైతే మా కాలేజ్ గౌరవాన్ని తారాస్థాయికి తీసుకెళ్లారో ఇప్పుడు వాళ్లే కాలేజ్ మొత్తం రెండుగా చీలి కొట్టుకోవడం తప్ప అన్నీ చేస్తున్నారు మేడం అంటూ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి వివరించడంతో , అమ్మా అంటూ అమ్మమ్మను పిలిచి ఏదైతే జరగకూడదు అనుకున్నానో అది ఇద్దరి మధ్య జరిగిపోతోంది. ఇప్పటివరకూ అయితే చిన్న చిన్న గోడలతో ఆగిపోయింది ఇప్పుడు ఎలక్షన్స్ రాజకీయం ఇద్దరూ ముందుండి నడిపిస్తున్నారు , పోటీలో ఎవరు గెలిచినా మరొకరు మరింత కోపంతో ఇద్దరూ ఏమి చేసుకుంటారో అని భయంతో స్పృహ తప్పి కింద పడిపోయింది. ఇందు అంటూ వెళ్లి వెంటనే అత్తయ్య సహాయంతో రేణుకా అంటీ హాస్పిటల్ కు తీసుకువెళ్లి మహికి తెలిస్తే తట్టుకోలేదని ముందుగా అమ్మమ్మ నాకు కాల్ చేసి చెప్పడంతో అన్నీ వదిలేసి మొదటిసారి దేవుడిని ప్రార్థిస్తూ హాస్పిటల్ చేరుకున్నాను. అప్పటికే అమ్మ బెడ్ పై కూర్చొని అంటీతో మాట్లాడుతోంది. అమ్మా అంటూ చెయ్యి అందుకొని కళ్ళల్లో కన్నీళ్ళతో ఏమయ్యింది అమ్మా అని అడిగాను. ఏమీ లేదు కన్నయ్యా నీరసంగా ఉండి స్పృహతప్పి పడిపోయాను అంతే అంటూ నాకన్నీళ్లను తుడిచింది. ఒసేయ్ ఇందు ఇలా ప్రేమ చూపించడం వల్లనే వీళ్ళిద్దరూ అలా తయారయ్యారు. ఇక నాకు వదిలేయ్ అంటూ నా చెయ్యి అందుకొని తన రూం కు పిలుచుకొనివెళ్లింది.



నేరుగా ప్రెజ్ఞన్సీ వార్డ్ కు పిలుచుకొనివెళ్లి కడుపుతో ఉన్న తల్లులను చూపించింది. మొదటి తల్లి అయితే బిడ్డ లోపల తంతున్నట్లుగా నొప్పితో కళ్ళల్లో నీళ్ళు వస్తున్నా కూడా పంటి బిగువున భరిస్తూ , చేతులను తమ కడుపుపై వేసి ప్రేమతో స్పృశిస్తూ చిరునవ్వులు చిందిస్తోంది. ఆ ప్రక్కనే ఇంకా బలంగా కదిలినట్లు అమ్మా అని నొప్పితో విలవిలలాడుతూనే బిడ్డతో కళ్ళుమూసుకుని సంతోషన్గా మాట్లాడుతోంది. ఒక చివరన అయితే నొప్పికి తట్టుకోలేక ఏడవడం..........ఇలా అందరినీ చూపించి , 



మహేష్ ఈ తల్లుల కడుపులలో ఒక్క బిడ్డ మామూలుగా కదిలితేనే నొప్పితో అలా అల్లాడిపోతున్నారు , మీ అమ్మ కడుపులో మీరు ఇద్దరూ ఏకంగా చేతులు కాళ్లతో పొట్లాడారు తెలుసా ? , ఈ విషయం ఇప్పటివరకూ మీకు తెలియదు. పాపం ఇందు ఎంత నొప్పిని భరించిందో అంటూ లాక్కుంటూ తన పెర్సనల్ క్యాబిన్ కు పిలుచుకొనివెళ్లి ఆరోజు తీసిన స్కానింగ్ పూర్తిగా చూపించి , ఇది నువ్వు అది మహి ఎలా పొట్లాడుకుంటున్నారో చూడు , ఇక ఊహించుకో మీ అమ్మ ఎంత నొప్పిని భరించి ఏడ్చి ఉంటుందో అని అంటీ చెప్పగానే , ఒక్కసారిగా అమ్మా అని నా పెదాలు కదిలి హృదయం నుండి కన్నీళ్లు ఆగకుండా కారాయి. 



మహేష్ మీరు ట్విన్స్ అని లోపల ( ముందు మేము అనుకున్నది ) మీరు ఒకరొకరు ఆడుకుంటున్నారని తెలియగానే ( ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలుసా ఒక అగ్నిపర్వతం మీ అమ్మ కడుపులో బద్దలయినంత, అమ్మా అంటూ కన్నీళ్లు కార్చాను )  ఒక్కసారిగా అంత నొప్పిని లోపలే దాచేసుకొని ఎంత సంతోషించిందో తెలుసా ? చూస్తావా? అంటూ అప్పటి రికార్డ్ అయిన సీసీ కెమెరా footage చూపించింది. అమ్మ ఆనందబాస్పాలను చూసి చాలా సంతోషించాను. ఆ రెండు నెలలు మీరిద్దరూ ఊరుకుంటే ఒట్టు ఒకటే పొట్లాటలు , అయినా ఆ నొప్పిని హాయిగా భరించింది. కానీ ఇప్పుడు మీరు ఎలక్షన్స్ వల్ల రాజకీయ నాయకుల్లా ఇక జీవితంలో కలవని పరిస్థితి ఏర్పడుతోంది అని తెలియగానే , అగ్నిపర్వతాన్నే తట్టుకున్న ఇందు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. తను బ్రతుకుతున్నదే మీకోసం , మీరే రోజురోజుకీ పొట్లాటలతో దూరం పెంచుకుంటూ పోతుంటే మీ అమ్మ ఏమౌతుందో నీ ఊహకే వదిలేస్తున్నాను. 



అంటీ అలా జరగడానికి వీలులేదు ............ఇప్పుడు నేను అమ్మ సంతోషం కోసం మరియు మా అందరి సంతోషం కోసం ఏమిచెయ్యాలో నాకు తెలుసు . 



మహేష్ ముందుగా ఈ విషయం మహి కంటే నీకే ఎందుకు ముందుగా చెబుతున్నానంటే , మీ అమ్మ కడుపులో నుండి ముందుగా వచ్చినది నువ్వే కాబట్టి , ఇద్దరిలో నీవే పెద్దవాడివి కాబట్టి ........., మీ అమ్మ స్పృహ కోల్పోవడానికి మరొక కారణం మీ నాన్న కూడా , సన్మానాలను మీ అమ్మతో సమానంగా అనుభవించి , ప్రిన్సిపాల్ కాలేజ్ లో గొడవల గురించి చెప్పగానే మొత్తం నిందను మీ అమ్మపై వేసి బాధపెట్టాడు. ఆ నిందను పోగొట్టే బాధ్యత ఇక నీదే ఏమి చేస్తావో నీఇష్టం అని పుట్టినప్పటి నుండి మాకు ఊహ తెలిసేంతవరకూ జరిగిన చిలిపి సంఘటనలను కూడా వివరించడంతో , పెదాలపై చిరునవ్వుతో thank యు sooooo మచ్ అంటీ అంటూ కౌగిలించుకొని , నా కళ్ళు తెరిపించారు ఇంటి పెద్ద కొడుకుగా ఇప్పటి నుండి ఏమి చేస్తానో చూడండి అంటూ అంటీ కన్నీళ్లను తుడిచి , అంటీతోపాటు అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ రెండు పాదాలను చేతులతో సున్నితంగా పట్టుకొని తలను తాకించి కన్నీళ్లను పాదాలపై కార్చగానే , అంటీ చిరునవ్వుతో సైగ చేసింది.



కన్నయ్యా అంటూ అమ్మ నన్ను దగ్గరకు తీసుకొని నా కన్నీళ్లను తిడిచింది. అమ్మా ఇప్పటివరకూ నేను మూర్ఖంగా మిమ్మల్ని బాధపెట్టాను నన్ను క్షమించు అమ్మా అని చెప్పాను. నా కన్నయ్య ఏ తప్పు చెయ్యలేదు అంటూ నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టింది. అమ్మా ఇంకొన్ని రోజులు ఓపిక పట్టు అక్కయ్య నేను ఒకరికొకరు ప్రాణమిచ్చుకొనేలా కలిసి మా అమ్మ ఆశీర్వాదం తీసుకుంటాము అని వాగ్ధానం చేసాను. కన్నయ్యా తను నీకు చెల్లి..........లేదమ్మా అక్కయ్యే అంటూ అమ్మ నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి ఇంటికి చేరుకున్నాము. కాలేజ్ వదలదానికి మరొక గంట మాత్రమే ఉండటంతో అమ్మా జాగ్రత్త అని చెప్పి కారులో వేగంగా కాలేజ్ చేరుకొని , తన లవ్ దూరమైనందుకు బాధపడుతున్న వినీత్ గాడిని కౌగిలించుకొని sorry రా మామా , నువ్వెల్లి నామినేషన్ వెనక్కు తీసుకో మీ ఇద్దరినీ కలిపే బాధ్యత నాది అనిచెప్పి , మా బ్యానర్లను మరియు పోస్టర్లను చింపేయ్యడం చూసి కృష్ణగాడు ఆనందిస్తూ విషయం తెలుసుకుని ఇన్నాళ్లకు మా కోరిక తీరబోతోందా అంటూ ఉత్సాహంగా అందరినీ పిలిచి చూస్తారెంట్రా తీసేయ్యండి అని చెప్పడంతో నిమిషాల్లో మా వాటినన్నింటినీ తొలగించాము. ఈ న్యూస్ వేగంగా వెళ్లి ప్రమీలా మరియు మహికి చేరింది. 



నేరుగా క్లాస్ లోకి వెళ్లి సర్ we need your time అండ్ క్లాస్ అని రిక్వెస్ట్ చెయ్యడంతో , go on మహేష్ అంటూ బుక్స్ అందుకొని వెళ్లిపోయారు. My dear ఫ్రెండ్స్ , boys and గర్ల్స్ ......నేను ఉదయం చాలా పెద్ద తప్పు చేశాను . ఒకరిపై ఉన్న కోపంతో అంటూ కన్నీళ్లను కార్చి మహివైపు చూసి , ప్రెసిడెంట్ గా ఉండటానికి అర్హత ఉన్న ఏకైక స్టూడెంట్ ప్రమీలా అని తెలిసి కూడా మూర్ఖత్వంతో మరొకరిని పోటీగా నిలబెట్టి నిన్నటివరకూ కలిసి ఉన్న మనలో గొడవలు రేపాను నన్ను మన్నించండి అంటూ మోకాళ్లపై కూర్చుని క్షమాపణలు కోరాను. రేయ్ మామా ఏంటిది ..........ఫ్రెండ్స్ మహేష్ ఇంత వేడుకున్నా మీరు కనికరించరా అని కృష్ణగాడు బాధపడుతూ చెప్పగానే , ప్రమీలా మహి తప్ప క్లాస్ మొత్తం నా చుట్టూ చేరి నన్ను లేపి సంతోషంతో మన్నిస్తున్నట్లు నా భుజం పై చేతులు వేశారు.
[+] 9 users Like Mahesh.thehero's post
Like Reply
బాయ్స్ అండ్ గర్ల్స్ రండి అందరమూ అన్ని క్లాస్ లకు వెళ్లి ఈ విషయం చెబుదాము అని కృష్ణగాడు పిలిచాడు. అప్పటికే సీక్రెట్ గా తీసిన వీడియో కాలేజ్ మొత్తం స్ప్రెడ్ అవ్వడం , అందరూ మా క్లాస్ వైపు పరుగులు తీయడం , ప్రిన్సిపాల్ కు కూడా చేరి సంతోషించి వెంటనే అమ్మకు కాల్ చెయ్యడంతో అమ్మమ్మతో సంతోషాన్ని పంచుకొని ఇక ట్విన్స్ కలవడమే మిగిలింది అని చెప్పింది. ఇందు నా బుజ్జికన్న అతిత్వరలో మనం ఎప్పటినుండో ఆశగా ఎదురుచూస్తున్న కోరిక కూడా తీరబోతోంది అని అమ్మమ్మ బదులిచ్చింది.



ముందుగా ప్రమీలా దగ్గరికి వెళ్లి I am really really sorry ప్రమీలా , రెండు విధాలుగా నిన్ను బాధపెట్టాను. వీళ్ళందరూ క్షమించినా నువ్వు మాత్రం నన్ను క్షమించకు , నన్ను ఏమైనా చేసే అర్హత నీకు మాత్రమే ఉంది. కానీ వినీత్ అమాయకుడు తను ఎంత వద్దు అని వారించినా వినకుండా నేనే ఇదంతా చేసాను , వాణ్ణి మాత్రం దూరంగా పెట్టొద్దు , వాడు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు , తప్పు నా ఒక్కడిది మాత్రమే , నామినేషన్ కూడా వెనక్కు తీసుకొన్నాము అంటూ వినీత్ గాడిని పిలిచాను . మొదటి పోస్టర్ చింపారని తెలియగానే క్షమి...........అయినా మన ఫ్రెండ్స్ మధ్యన క్షమాపణలు ఎందుకు అంటూ నా చెయ్యి అందుకొని సంతోషన్గా ఊపి , వినీత్ దగ్గరకు వెళ్లి I love you too అంటూ ప్రేమతో కౌగిలించుకొంది. వాడి సంతోషాన్ని చూసి మురిసిపోయి , ఇక మిగిలిన మహి దగ్గరికి వెళ్ళాను.



అక్కయ్యా అంటూ వణుకుతున్న గొంతుతో ప్రాణం పెట్టి పిలిచి చిన్నప్పటి నుండి ఒకరికొకరు ప్రాణంగా పెరగవలసిన మనం కేవలం నావల్ల ప్రతి క్షణం గోడవలుపడుతూనే పెరిగాము. క్షమించు అనే మాట అడగడానికి కూడా నీ తమ్ముడు అనర్హుడు అని చెబుతుండగానే ,అక్కా..........మళ్లీ ఇదో కొత్త నాటకమా ? , రేయ్ నీ నాటకాలు నాదగ్గర కాదు అంటూ నన్ను దాటుకుని వెళ్ళిపోయింది. 



సంతోషాన్ని పంచుకోవడానికి వచ్చిన అందరూ ఒక్కసారిగా నామాటలకు ఫీల్ అయిపోయి బాధపడుతున్నారు. కృష్ణగాడు వచ్చి రేయ్ వెనుకే వెళ్లి బ్రతిమిలాడరా అని చెప్పడంతో , థాంక్స్ రా మామా అంటూ అందరినీ దాటుకుని పార్కింగ్ వైపు వెళుతున్న అక్కయ్య దగ్గరికి పరుగున వెళ్లి , అక్కా ఒక్కసారి నాకళ్ళల్లోకి చూడు అక్కా నేను మారిపోయాను అంటూ బ్రతిమాలుతూనే తన కారు దగ్గరికి వెళ్లి కారు డోర్ కూడా తెరిచి , అక్కా ఈ క్షణం నుండి నీమాటే వింటాను ,నువ్వు చెప్పినట్లే నడుచుకుంటాను అని ప్రాధేయపడ్డాను. రేయ్ ప్రక్కకు తప్పుకో అనిచెప్పి కారులో ఇంటికి బయలుదేరింది. 



కృష్ణ గాడు కారు తీసుకొనిరావడంతో ఎక్కి అక్కయ్య వెనుకే ఇంటికి చేరుకున్నాము. అక్కయ్య లోపలికి వెళ్ళి అమ్మమ్మా వాడు మల్లీ ఒక కొత్త నాటకం మొదలెట్టాడు , ఈరోజు నుండి ఇక గోడవపడను , నీ మాటే వింటాను అక్కయ్యా అనికూడా పిలుస్తున్నాడు , నేనైతే అస్సలు నమ్మను అని చెప్పి పైకి వెళ్లబోయింది. 



అక్కయ్యా నేను మారిపోయాను నువ్వు చెప్పింది అక్షరాలా పాటిస్తాను అని మళ్ళీ మళ్ళీ చెప్పాను. మహి నేను చెబుతున్నాను కదా మహేష్ కళ్ళల్లో నిజాయితీ కనిపిస్తోంది , ముందులా కోపం ఏమాత్రం లేదు . ప్రతి ఒక్కరికీ ఒకరోజు జ్ఞానోదయం అవుతుంది వీడికి ఈరోజు ఆ భాగంతుని వల్ల అయ్యింది . నువ్వు నమ్మకపోతే ఒక్క చాన్స్ ఇచ్చిచూడు అప్పుడు నీకే తెలుస్తుంది కదా అని కృష్ణగాడు చెప్పాడు.



నాకైతే నమ్మకం లేదు కానీ నీపై ఉన్న నమ్మకంతో try చేస్తాను అంటూ , రేయ్ వారం లోపు మన ఇంటిచుట్టూ కాంపౌండ్ లోపల ఇప్పటివరకూ సంవత్సరాలుగా శుభ్రం చెయ్యలేదు వెళ్లి క్లీన్ చెయ్యి ఒక్కడివే అని ఆర్డర్ వేసింది. మహి అది పనివాళ్లకే చాలా కష్టమే వాడు మీ అన్న....... తమ్ముడే ........, అమ్మమ్మా అక్కయ్య ఆర్డర్ వేసింది ఎలాగైనా పూర్తి చేస్తాను అంటూ అమ్మమ్మను సంతోషంతో కౌగిలించుకొని ,  అక్కయ్యా చూస్తావుగా ఛాన్స్ ఇచ్చినందుకు థాంక్స్ అంటూ నైట్ డ్రెస్ లోకి మారిపోయి క్లీన్ చెయ్యడానికి వెళ్ళాను. కృష్ణ గాడు సహాయం చేయడానికి వచ్చినా ఆపి అక్క నాకు ఇచ్చిన టాస్క్ సంతోషన్గా చేస్తాను అంటూ పనిముట్లన్నీ తీసుకొని సాయంత్రం , రాత్రి నిద్రపోకుండా పనిచేస్తూనే అమ్మ చేతితో అన్నం తినేసి లోపలికి పంపించేసి ఉదయానికల్లా పూర్తిచేసి మెట్లపైనే పడుకున్నాను. 



తెల్లవారాక మహి చూసి ఆశ్చర్యపోయి రేయ్ పనివాళ్లకే వారం పడుతుంది , ఒక్క రాత్రిలో నువ్వు ఈ పని చూసావంటే నేను నమ్మను అంటూ లోపలికి వెళ్లిపోతుండగా , మరొక పని ఇవ్వు అక్కా నీ ముందే చేస్తాను అని చెప్పాను. అయితే మరో నెలలో ఇంటర్నల్స్ వస్తున్నాయి ఎవ్వరి సహాయం లేకుండా , కాపీ కొట్టకుండా చదివి నీకిష్టమైన ఒకేఒక సబ్జెక్ట్ లో పాస్ మార్కులు తెచ్చుకో చాలు నిన్ను తమ్ముడిగా accept చేస్తాను అని చెప్పింది. బంగారు కొండల్ని పిండి చెయ్యమను సంతోషన్గా చేస్తాడు కానీ చదువుకోవడం అని చెప్పడం ......కన్నయ్య వల్ల కాదే ......., అందుకే అమ్మా ఆ టాస్క్ ఇచ్చాను వాడు ఇందులో ఫైల్ అవ్వడం గ్యారంటీ , చదువుకోవడం ఎంత కష్టమో వాడికి తెలియాలి ,అక్కా ఏమైనా చేస్తాను అన్నాడుకదా ఈ ఒక్కడానిలో పాస్ అవ్వమనంది చాలు అనిచెప్పి లోపలకు వెళ్ళిపోయింది. అమ్మా పాస్ అవుతాను అంటూ రెడీ అయ్యి నేరుగా దివ్యక్క దగ్గరికి వెళ్లి విషయం చెప్పి , అన్ని సబ్జెక్ట్ లలో ఈజీ మీరే సెలెక్ట్ చేసి టీచ్ చెయ్యాలి అని అడిగాను.



కృష్ణ అంతా చెప్పాడు మీ ఇద్దరూ కలవడం చూడ్డం కంటే నాకు మరొక సంతోషం ఏముంటుంది. పాస్ మార్కులు కాదు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యేలా నిన్ను తయారుచేస్తాను అంటూ సుమారు 4 గంటలసేపు స్టడీస్ లో నా నాలెడ్జి టెస్ట్ చేసి చాలా కష్టం అంటూ , బావగారిని కూడా పిలిపించి ఆ రోజంతా నా మైండ్ లో ఎక్కడో దాగిన దానిని లాగి ఇద్దరూ hi fi కొట్టుకొని , మహేష్ నీకు తెలిసిన కొద్దిపాటి నాలెడ్జి కు సరిపోయేది ఈ సబ్జెక్టు మాత్రమే అని చెప్పి ఆ క్షణం నుండి నా మట్టి బుర్రకు టీచ్ చెయ్యడం మొదలెట్టారు. 



కాలేజ్ కు వెళ్ళగానే నా విషయం తెలిసినట్లు అందరూ all the best చెప్పడమే కాకుండా ఎవరికి తోచిన సలహాలు ఇస్తూనే ఉన్నారు. స్టాఫ్ కూడా సంతోషిస్తూ ఏ doubt వచ్చినా నేరుగా ఇంటికి వచ్చయినా అడగమని ప్రోత్సహించారు. నాకు హెల్ప్ చెయ్యడం కోసం కాలేజ్ మొత్తం లైబ్రరీల చుట్టూ తిరగడం చూసి యాజమాన్యం కూడా సంతోషించింది. నెల రోజుల పాటు ఇంటికి కూడా వెళ్లకుండా దివ్యక్క మరియు బావగారి ఇంట్లోనే ఉండిపోయి చదువుకున్నాను. అక్కయ్యతో తమ్ముడు అని ప్రేమతో అనిపించుకోవాలనే ఏకైక గమ్యంతో , దివ్యక్క టీచ్ చేసింది కాంసెంట్రేషన్ తో వింటూ అర్థం చేసుకొని చదివాను.



ఆరోజు రానే వచ్చింది , అమ్మావాళ్ళ దగ్గర నుండి దివ్యక్క .........కాలేజ్ మొత్తం నేను ఎలాగైనా పాస్ మార్కులు తెచ్చుకోవాలని గుడికి వెళ్లి పూజలు జరిపించి నా నుదుటి మొత్తం కుంకుమతో నింపేసి బలిచ్చే పోతులా సిద్ధం చేసి పంపారు.



సర్ మా అక్కయ్యకు నేను కనపడేలా కూర్చోబెట్టండి అని చెప్పాను. OK గ్రాంటెడ్ మహేష్ all the best అని చెప్పి ప్రక్కనే కూర్చోమన్నారు . సర్ ఒకసారి నన్ను చెక్ చెయ్యమని అడిగాను , మహి కోసం పూర్తిగా చెక్ చేసి nothing అంటూ కూర్చోబెట్టారు. 



అక్కా మీరు కూడా all the best చెబితే నాకు తిరుగుండదు అని ప్రేమతో అడిగాను. నావైపు అదోలా చూసి all the best అంటూ దారిలో పోయే దానయ్యకు చెప్పినట్లు చెప్పింది. Thank you so so sooooo మచ్ అక్కా అంటూ మొదటిసారి exam ముందు ప్రశాంతంగా కూర్చున్నాను. లెక్చరర్ నుండి క్వశ్చన్ పేపర్ అందుకొని మొత్తం చదివేసి(చదువుతున్నంతసేపు కృష్ణ గాడు టెన్షన్ టెన్షన్ తో నా వైపే చూస్తున్నాడు) చదివి అర్థం చేసుకున్నవే వచ్చినందుకు ఆనందం పట్టలేక యాహూ .......అంటూ లేచిమరీ అరవడంతో ,కృష్ణగాడితోపాటు అందరూ హమ్మయ్యా మహేష్ పాస్ అయిపోతున్నాడు అంటూ ఊపిరి పీల్చుకున్నారు.



థాంక్స్ ఫర్ the విషెస్ అక్కా అంటూ నీట్ గా నాకు వచ్చినవి రాసేసి మొదటిసారి సమయం పూర్తి అయ్యేంతవరకూ ఉండి బయటకు వస్తుండగా , ప్రిన్సిపాల్ వచ్చి ఈరోజు exam ప్రాధాన్యత తెలిసింది అందుకోసమే ఈ సబ్జెక్ట్ results సాయంత్రం లోపల ఆ సబ్జెక్ట్ టీచర్ వాల్యుయేషన్ చేసి చెప్పేస్తారు అని చెప్పడంతో , అందరూ సంతోషంతో కేకలు వేశారు. అమ్మా మహి మహేష్ పేపర్ ను లెక్చరర్ తో పాటు నువ్వు కూడా వాల్యుయేషన్ చేస్తున్నావు అంటూ సబ్జెక్ట్ టీచర్ తోపాటు పంపించారు.



ఆరోజంతా exam పూర్తి అయినా కాలేజ్ నుండి ఏ ఒక్కరూ గేట్ దాటి బయటకు వెళ్ళలేదు , canteen లోనే tea సమోసాలతో కాలం గడిపేశారు. యాజమాన్యానికి విషయం తెలిసి స్టూడెంట్స్ మొత్తానికి భోజనాలు తయారుచేయించారు. తినేసి అందరూ ఆత్రంగా టెన్షన్ పడుతూ ఎదురుచూస్తుండగానే మహితోపాటు ప్రిన్సిపాల్ కూడా వచ్చి మహేష్ మహేష్ మహేష్........అంటూ టెన్షన్ పెట్టి పాస్ అనగానే అందరూ ఎగిరి గెంతులేశారు. మహి వాల్యుయేషన్ లో సెకండ్ క్లాస్ , సబ్జెక్ట్ టీచర్ వాల్యుయేషన్ లో distinction లో పాస్ అయ్యాడు అని చెప్పగానే అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పైకి ఎత్తేసి ఆనందాన్ని పంచుకున్నారు. అక్కయ్య మాత్రం ఒక్కమాటకూడా మాట్లాడకుండా పార్కింగ్ దగ్గరకువెళ్లి కారులో ఇంటికి వెళ్ళిపోయింది. 



ఫ్రెండ్స్ తరువాత కలుద్దాము అనిచెప్పి కృష్ణగాడితోపాటు కారులో పాస్ అయినట్లు దివ్యక్కకు బావకు చెప్పి ఇక మేము కలిసి మీ దగ్గరికి సంతోషన్గా వస్తాము అంటూ ఇంటికి చేరుకొని అమ్మా పాస్ అక్కయ్య నన్ను తమ్ముడూ అని పిలుస్తుంది. ఆ సంతోషం ఎలా ఉంటుందో చెప్పలేను రండి చూద్దురంట అని పైకి మారూమ్ కు రారా అంటూ పిలుచుకొనివెళ్లి , ముఖం తుడుచుకుంటున్న అక్క ముందు నిలబడి తన నోటిలో నుండి ప్రేమతో పిలిచే పిలుపు కోసం చెప్పలేని ఉత్సాహంతో తనవైపే చూస్తున్నాను. నన్ను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతోంది. అమ్మావాళ్లకు అర్థమై తల దించుకుని బెడ్ పై మౌనంగా ఉండిపోయారు.



అక్కా నువ్వు చెప్పినట్లే నాకు ప్రాణమైన స్పోర్ట్స్ ను వదిలి చదువుకొని పాస్ అయ్యాను కదా అక్కా , తమ్ముడూ ..........అని......, రేయ్ నిన్ను అలా పిలవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదురా , అందుకే నువ్వు కచ్చితంగా fail అవుతావని తెలిసి నీకు ఆ టాస్క్ ఇచ్చాను. నువ్వుమాత్రం అందరిముందూ నన్ను ఓడించాలని మనసులో దృఢంగా అనుకొని అలాగే నిలబెట్టావు అని కోపంతో చెప్పింది. అక్కా అలాంటి ఉద్దేశ్యం నాకు ఏమాత్రం లేదక్కా , మా అక్కయ్య గెలవాలనే నీ మాటను నిలబెట్టాను అంతే అంటూ మోకాళ్లపై కూర్చొని , నీ ప్రకారం అయితే తప్పు మళ్లీ నాదే నువ్వు ఏశిక్ష విధించిన సంతోషన్గా అనుభవిస్తాను కానీ తమ్ముడూ అని ఒక్కసారి పిలు అక్కా అని ప్రాధేయపడుతుండటం చూసి , కృష్ణగాడు కన్నీళ్ళతో బయటకువెళ్లి గోడకు ఆనుకొని బాధపడ్డాడు. 



అమ్మావాళ్ళు బాధపడుతూ కిందకు వెళ్లిపోయారు. అమ్మా అమ్మమ్మా వెళ్ళిపోయాక తలుపేసి రేయ్ ఇప్పుడు చెబుతున్నాను నువ్వు ఎంత ఏడ్చినా , ఏమి చేసినా నా మనసు కరుగదు. నువ్వు ఆ డివైడర్ ను నా దగ్గర నుండే దొంగిలించి నన్నే ఇక్కడ గుచ్చినప్పుడు ఎంత నొప్పిని అనుభవించానో నాకు తెలుసు , అది జీవితాంతం గుర్తు ఉంటుంది. ఆఖరి క్షణం వరకూ నువ్వు దానినే తలుచుకొని బాధపడాలి అంతే, నేను చదువుకోవాలి నువ్వు వెళ్లు అంటూ కోపంతో చెప్పింది.



అక్కా నీ కోరిక అదే అయితే అలాగే కానివ్వు.........అంటూ షోకేస్ దగ్గరికివెళ్లి మిర్రర్ ప్రక్కకు జరిపి డివైడర్ ఫ్రేమ్ అందుకొని , టేబుల్ పై ఉంచి చేతితో అద్ధాన్ని పగలగొట్టి రక్తం కారుతున్న చేతితోనే తోనే తనకు ఎక్కడైతే గుచ్చుకుందో అక్కడ పొడుచుకుని అమ్మా...........అని నొప్పితో అరిచాను. రేయ్ అమ్మను ఎందు.............పిలు......స్తా......అన్న మాట నోటిలోనే ఆగిపోయి నోటిలో నుండి మాట కూడా రానట్లు చూస్తుండిపోయింది . అక్కా నీకు కావాల్సింది ఇదే కదా చెప్పు ఇంకా నీ కోపం చల్లారకపోతే అంటూ ఫ్రేమ్ పై పగిలిన అద్దాన్ని చేతిలోకి తీసుకొని డివైడర్ పైన గుచ్చుకున్నాను. 



అన్నయ్యా.................అంటూ ఒక్కసారిగా ఆర్య2 లో కాజల్ పిలుపు కంటే ప్రేమతో , ప్రాణంగా పిలుస్తూ నావైపు పరిగెత్తింది. పెదాలపై చిరునవ్వుతో వెనక్కు దబ్ మని పడిపోయాను.
Like Reply
Nice update.... I loved it
మీ
Umesh
Like Reply
Thank you so soooo much మిత్రమా.
Like Reply
సుపర్బ్ అప్డేట్
              అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి 
Like Reply
SUPER AND EXCELLENT UPDATE MAHES GARU..........................
Like Reply




Users browsing this thread: 25 Guest(s)