Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
thanks mahesh garu
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
చాలా సంతోషం మహేష్ గారు అప్డేట్ కోసం వెయిటింగ్... ఈ కథ pdf ఉందా మహేష్ గారు
Like Reply
స్వాగటం
Like Reply
Welcome Mahesh garu,we are waiting for ur new story.
Like Reply
(21-08-2019, 03:11 PM)saleem8026 Wrote: Nice story

Thanks మిత్రమా.
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(25-08-2019, 11:26 AM)HitmanA007 Wrote: చాలా సంతోషం మహేష్ గారు అప్డేట్ కోసం వెయిటింగ్... ఈ కథ pdf ఉందా మహేష్ గారు

 Pdf లేదు మిత్రమా , సమయం కుదరటం లేదు.
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(20-08-2019, 10:41 AM)Umesh5251 Wrote: Nice update bro.. I loved it.....

HEartful thanks for first reply మిత్రమా.
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(20-08-2019, 12:55 PM)sweetdumbu Wrote: WOW.... Lovely Update and Awesome Story bro....
ఇలానే మీ శృంగార కధలతో మీరు అప్రగడముగా సాగిపోవాలని కోరుకుంటునాను బ్రో...
Thanks for your cutest story..

మీ కోరిక ప్రకారం సాగిపోదాం మిత్రమా.
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
"మహిమాన్వితం" ను చదివి మనఃస్ఫూర్తిగా రిప్లై లతో నాలో ఉత్సాహం నింపిన xossipy మిత్రులకు మరియు సోదరులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు..........
[+] 2 users Like Mahesh.thehero's post
Like Reply
                TWINS



సమయం ఉదయం 11 గంటలు, అది వైజాగ్ MVP కాలనీలోని మోడరన్ బిల్డింగ్ చుట్టూ పెద్ద కంపౌండ్ , కంపౌండ్ మొత్తం పూల తోటలు పచ్చగడ్డితో చూడగానే మనసుకు ఆహ్లాదాన్ని పంచేలా ఉంది. ఇంటిలోపల వంట గదిలో 50 సంవత్సరాల వయసున్న ఆమె తన కడుపుతో ఉన్న కూతురు కోసం పాలు కాచి దానిలో బిడ్డ మాంచి రంగులో అందంగా పుట్టాలని గ్యాస్ ఆఫ్ చేసి పాలలో కుంకుమ పువ్వు కలుపుతోంది. 



ఇంతలో అమ్మా............నొప్పి అంటూ కేక వినిపించడంతో పాలు అక్కడికక్కడ వదిలేసి హాల్ లో సోఫాలో కూర్చున్న తన కూతురు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఇందు ఏమయ్యిందమ్మా అంటూ ప్రక్కనే కూర్చుని సున్నితంగా చేతిని అందుకొని కంగారుపడుతూ నిమురుతూ అడిగింది.



అమ్మా కడుపులో బిడ్డ తంతున్నట్లుగా చాలా నొప్పి వేస్తోందమ్మా అంటూ కళ్ళల్లో నీళ్ళు కారుస్తూ బాధపడుతుండటం చూసి , వెంటనే గిరిజా , గిరిజా ..........అంటూ గట్టిగా అరిచి కారు తియ్యమని చెప్పడంతో , 



బయటి నుండి హాల్ లోకొచ్చి చూసి 8 వ నెల కదమ్మా ఇలాంటి నొప్పులు వస్తాయని తెలిసి కారుని ఎప్పుడూ రెడీగా ఉండేలా డోర్ ముందే పార్క్ చేసాను అని చెప్పి వడివడిగా వచ్చి , అమ్మగారు నేను చూసుకుంటాను మీరు తొందరగా మీ అల్లుడుగారికి మరియు మన డాక్టర్ అమ్మగారికి వస్తున్నామని కాల్ చెయ్యండి అని చెబుతూనే నొప్పులకు అల్లాడిపోతున్న ఇందుని అమాంతం రెండుచేతులతో నెమ్మదిగా ఎత్తుకొని బయటకువచ్చి  కారులో కూర్చోబెట్టి కొంచెం ఓర్చుకో ఇందు అంటూ నుదుటిపై పడుతున్న చెమటను తన చీర కొంగుతో తుడిచి ధైర్యం చెబుతోంది. 



తన అల్లుడు గురించి తెలిసి కారులోకి ఎక్కి ఇందుని జాగ్రత్తగా తన ఒడిలో పడుకోబెట్టుకొని ముందుగా తమ ఫామిలీ డాక్టర్ కు కాల్ చేయగానే , అమ్మా ఇందు పరిస్థితి తెలిసి ఇందు ఎలా ఉంది అని అడిగింది , విషయం తెలిపి వచ్చేస్తున్నాము అని చెప్పడంతో , తనకు ఇంకా 8 వ నెలలోకి నిన్ననే కదా పడింది అప్పుడే నొప్పులు వస్తున్నాయా , ముందు త్వరగా వచ్చెయ్యండి ఇక్కడ అంతా రెడీ చేస్తాను అంటూ కాల్ కట్ చేసింది. అప్పటికే గిరిజా కారుని హాస్పిటల్ వైపు జాగ్రత్తగా పోనిస్తోంది. అల్లుడుగారికి తెలపాలని కాల్ చెయ్యగా మొదటి రింగుకే కట్ చేసి , I am in ఇంపార్టెంట్ మీటింగ్ అని మెసేజ్ రిప్లై పెట్టడంతో వీడు మారడు అని లొలొపలే తిట్టుకుంటూ , తన కూతురు నొప్పులవలన కారుతున్న కన్నీళ్లను తుడిచి నా బంగారం కదూ కొద్దిగా ఓర్చుకొమ్మా అక్కడ రేణుక అంతా రెడీగా ఉంచేస్తోంది అని చెప్పి తలపై ప్రేమగా స్పృశిస్తూ గిరిజా ట్రాఫిక్ లో ఎక్కడా ఆగకు ఏమైనా తరువాత చూసుకుందాము అని చెప్పింది.



అలాగే అమ్మగారు ఇంతకీ మీ అల్లుడుగారికి కాల్ చేశారా వస్తున్నారా అని గిరిజ డ్రైవ్ చేస్తూనే అడిగింది. నిజం చెప్పి తన కూతురిని మరింత బాధపెట్టడం ఇష్టం లేక ఆ ఆ ఆ........వచ్చేస్తున్నాడులేవే నువ్వు ముందు తొందరగా హాస్పిటల్ కు పోనివ్వు అంటూ ఇందుని ఓదారుస్తూ చెప్పింది. 15 నిమిషాలలో హాస్పిటల్ కు చేరుకోవడంతో డాక్టర్ రేణుక గారే స్వయంగా బయట మాకోసం స్ట్రేచర్ తోపాటు వేచి చూస్తూ ఉండటంతో గిరిజ నేరుగా తీసుకెళ్లి అక్కడే ఆపి వేగంగా కిందకు దిగివచ్చి ఇందుని కారులోనుండి ఎత్తుకొని మెల్లగా స్ట్రెచర్ పై పడుకోబెట్టింది. ఇందుని అక్కడే పరీక్షించి డెలివరీ నొప్పులు అయితే కాదు అమ్మా స్కానింగ్ చేద్దాము కంగారుపడాల్సిన అవసరం ఏమీ లేదు అని ఇద్దరికీ ధైర్యం చెప్పి ,



బాయ్స్ తొందరగా ICU కి తీసుకురండి అని చెప్పి డాక్టర్ వేగంగా ముందుముందు వెళుతుంటే ఇందుని వెనుకే ఆవెనుకే ఇద్దరూ ICU దగ్గరకు వెళ్లి బయటే టెన్షన్ టెన్షన్ గా అటూ ఇటూ తిరుగుతూ వేచి చూస్తున్నారు. 



20 నిమిషాల తరువాత నర్సు బయటకువచ్చి డాక్టర్ గారు పిలుస్తున్నారు అని చెప్పడంతో గిరిజాతోపాటు తానూ లోపలికివెళ్లింది. నొప్పులు తగ్గినట్లు ఇందు బెడ్ పై హాయిగా రెస్ట్ తీసుకోవడం చూసి హమ్మయ్యా అనుకొని ఇద్దరూ ఊపిరిపీల్చుకొన్నారు ,రేణుక బెడ్ పక్కనే కూర్చొని ఇందు చెయ్యిపట్టుకొని ఏమి కాలేదు , అమ్మా రండి అంటూ సంతోషన్గా నవ్వుతూ పిలిచి బెడ్ పక్కనే కూర్చోమని చెప్పి  కంగారుపడాల్సినది ఏమీ లేదమ్మా అంటూ మళ్లీ నవ్వుతూ , అమ్మా ఇందుకి "కవలలు" పుట్టబోతున్నారు ఒక ఆడ ఒక మగ కవలలు అంటూ ఇందు చెయ్యిని ప్రేమతో నిమురుతూ చెప్పింది. 



మాతల్లే అంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న ఇందు బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రేమగా ఇందు తల్లి ముద్దుపెట్టి , అంతా మా కులదైవం ఆశీర్వాదం అంటూ మురిసిపోతూ గిరిజాతో పాటు మాటల్లో చెప్పలేని సంతోషాన్ని పంచుకోండి. ఎంత శుభవార్త చెప్పావే రేణుక అంటూ అటువైపుకువెళ్లి డాక్టర్ ను సంతోషం పట్టలేక అమాంతం కౌగిలించుకొంది.



ఇంతలో మళ్లీ అమ్మా........నొప్పి అంటూ పొట్టపై చేతిని వేసుకొని తాకుతూ కళ్ళల్లో కన్నీళ్ళతో బాధపడుతుండటం చూసి ఇద్దరినీ ప్రక్కనే ఉండమని చెప్పి ఓర్చుకోరా ఇందు అంటూ బుగ్గను ప్రేమతో స్పృశిస్తూ , ఈ నొప్పులను డాక్టర్ గా నేను తగ్గించలేను , లోపల ఉన్నవాళ్లు నీ ప్రాణమైన కవలలు నీమాటే వింటారు కాబట్టి నువ్వే దేవుడిపై భారం వేసి ఎలాగోలా వాళ్ళను శాంతపరుచు అని చెప్పింది.



ఏంటే రేణుకా నువ్వనేది అని ఆతృతగా అడగడంతో, అవునమ్మా లోపల కవలలు అప్పుడే ఒకరితోమరొకరు ఆడుకుంటున్నారు , ఆ కదలికల వల్లనే ఇందుకు నొప్పిగా అనిపిస్తోంది అంతే అంటూ casual గా చెప్పింది. ఇద్దరూ ఒకరిముఖాలు మరొకరు చూస్తూ ఇంకా వాళ్ళు ఈ ప్రపంచాన్నే చూడలేదు అప్పుడే ఆడుకోవడమా అని ఆశ్చర్యపోతుండటంతో , అవునమ్మా ఇదొక అద్భుతమనే చెప్పొచ్చు , మీరు నమ్మడం లేదు కదూ అంటూ ఇద్దరినీ బెడ్ పక్కనే కూర్చోబెట్టి , ఇందుని బెడ్ పైకి లేపి కూర్చోబెట్టి ,



అల్ట్రా సౌండ్ స్కానింగ్ లో ఇంతకుముందు ఇద్దరూ బయట ఉన్నప్పుడు రికార్డ్ చేసిన వీడియోను ప్లే చేసి చూపించడంతో , స్క్రీన్ పై పిల్లలు చేతులను మరియు కాళ్లను కదిలిస్తూ ఒకరినొకరు తాకుతుండటం , పట్టుకోవడం క్లియర్ గా కనిపిస్తుండటం చూసి మరింత ఆశ్చర్యపోతూ ఇందువైపు అందరూ చూసారు.



అప్పటివరకూ నొప్పితో విలవిలలాడిపోతున్న ఇందు ఆ దృశ్యాలను చూసి వెంటనే కన్నీళ్లను తుడుచుకుని నోటిపై చేతిని మూసుకొని ఆనందబాస్పాలతో అమ్మా , గిరిజా , రేణుకా అక్కా,, my బ్యూటిఫుల్ ట్విన్స్ లోపల ఉండగానే ఎంత అందంగా ఆడుకుంటున్నారు అంటూ మళ్లీ లోపల కాదులుతున్నట్లుగా నొప్పిగా అనిపించినా నా పిల్లలు అంటూ చేతులతో సున్నితంగా తాకుతూ సంతోషంతో మురిసిపోయింది. డాక్టర్ ఇందు చేతిని అందుకొని నీకు డెలివరీ అయ్యేంతవరకూ ఈ తియ్యటి నొప్పిని అనుభవించాల్సిందే , లేకపోతే నువ్వే వాళ్ళను కంట్రోల్ లో పెట్టాలి అంటూ సంతోషంతో నవ్వుతూ చెప్పింది. 



లోపల వాళ్ళు ఆడుకుంటున్నారు అక్కా ఇక ఎంత నొప్పి కలిగినా సంతోషన్గా భరిస్తాను అంటూ పరవశించిపోతూ పొట్టపై చేతులు వేసి కళ్ళుమూసుకుని కాసేపటి తరువాత , అమ్మా ఇద్దరూ నా మాట విన్నారు చూడండి కదలడం ఆపేశారు అని చెప్పగానే ,



డాక్టర్ మళ్లీ స్కానింగ్ చేస్తూ లైవ్ దృశ్యాలను స్క్రీన్ పై చూసి చూపిస్తూ అవునే ఇందు చూడు నీమాట విని ఎలా హాయిగా నిద్రపోతున్నారో నీ కవలలకు నీమాట వేదం లా ఉంది వాళ్ళు పెరిగి పెద్దయ్యాక నిన్ను ప్రాణంగా చూసుకుంటారు , నీకళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకుంటారు కాసేపు రెస్ట్ తీసుకో ఇంటికి వెళ్లిపోవచ్చు అని చెప్పింది. 



గిరిజా ఇక్కడే ఉండి చూసుకో నర్సు కూడా తోడు ఉంటుంది అని చెప్పి అమ్మా టాబ్లెట్స్ రాసేస్తాను నాతో రండి అని బయటకు వచ్చి జగదీష్ ఎక్కడ ఈ సమయంలో కూడా ప్రక్కన లేకపోతే ఎలా అమ్మా , ఏమి చెయ్యమంటావ్ కాల్ చేస్తే కట్ చేసి బిజీగా ఉన్నానని మెసేజ్ పెట్టాడు , పెళ్లి చేసుకొని కడుపు పండించడం అనే మంచిపని తప్ప తనను సంతోషన్గా చూసుకుందామనేదే లేదు ఎప్పుడూ బిజినెస్ , బిజినెస్ అంటూ తిరగడం తప్ప తనతో ప్రేమగా ఉండటం నేనెప్పుడూ చూడలేదు , అదే విషయంలో ఇందు బాధపడుతుంటే పుట్టబోయే బిడ్డకు మంచిదికాదు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి అని బలవంతంగా నవ్విస్తున్నాను నీకు తెలిసిందేగా అది వదిలేయ్ , ఇందుకి ఎలా ఉంది ఏవో టాబ్లెట్స్ అన్నావు అని కంగారుపడుతుండటంతో , 



అమ్మా చెప్పాను కదా ఇందుకి ఎటువంటి ప్రాబ్లెమ్ లేదు , మీరే చూశారుగా తన పిల్లలను ఎంత తొందరగా ప్రేమతో పడుకోబెట్టిందో , జగదీష్ ను చాలా సంవత్సరాలుగా చూస్తున్నాను డబ్బే ప్రపంచం , ఇందుకి బాధ మరికొన్ని రోజులేలే ఆ కవలలు పుట్టారంటే వాళ్లే తన ప్రపంచం అయిపోతుంది , బాధపడటానికి కూడా సమయం ఉండదు అని చెప్పగానే , చల్లని మాట చెప్పావు అంటూ ప్రేమగా కౌగిలించుకొని , ఇందు లేచిన తరువాత సంతోషన్గా కారులో ఇంటికివెళుతూ గిరిజా నేను కవలలకు అమ్మమ్మను కాబోతున్నాను అంటూ సంతోషం పట్టలేక కారులోనే డాన్స్ చేస్తూ లవ్ యు రా ఇందు అంటూ రెండు చేతులతో బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి , 



ఇందు ఇప్పుడు ఒక్కరు కాదు ఇద్దరు కాబట్టి మరింత సంతోషంగా సమయానికి డబల్ ఆహారం తీసుకోవాలి సరేనా అని చెప్పడంతో ఆనందంతో మురిసిపోతూ అలాగే అమ్మా వీల్లే నా ప్రాణం మీరే చూస్తారుగా అంటూ కౌగిలించుకుంది.
[+] 12 users Like Mahesh.thehero's post
Like Reply
ఇంటికి చేరిన క్షణం నుండి ఇందు ఆనందానికి అవధులు లేకపోవడం తన తల్లి , గిరిజా చూసి సంతోషంతో మురిసిపోతూ నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి పక్కనే సోఫాలో కూర్చుని కడుపుపై చేతితో సున్నితంగా స్పృశిస్తూ , ఇన్నిరోజులూ మీరు ట్విన్స్ అని చెప్పకుండా మీఅమ్మను ఎంత బాధపెట్టారు అంటూ వొంగి ఆనందం పట్టలేక ముద్దుల వర్షం కురిపించి , మీ అన్నాచెల్లెళ్ళు లేదా అక్కాతమ్ముళ్ళకు అప్పుడే ఒకరంటే ఒకరు ప్రాణంలా లోపలే సంతోషన్గా ఆడుకుంటున్నారా ? , అప్పటివరకూ నొప్పితో మీ అమ్మ ఎంత బాధపడిందో మీ విషయం తెలిసి అంతగా సంతోషిస్తుంది. 



మీరు ఇక మీ అమ్మను ఏమాత్రం ఇబ్బందిపెట్టకుండా సులభంగా ఈ ప్రపంచంలోకి వచ్చి మేము మా ఊరుకు వెళ్ళిపోయాక మీరే మీ అమ్మను ప్రాణం లా చూసుకోవాలి సరేనా అనగానే , లోపల కవలలు కదిలినట్లు అమ్మా నీమాటలు విని రెస్పాన్స్ కూడా ఇస్తున్నారమ్మా అంటూ కదిలిన చోట ప్రేమతో స్పృశిస్తూ ఆనందబాస్పాలతో చెప్పింది. అమ్మో ...........అంటూ ఆశ్చర్యపోతూ నా మనవాడూ మనవరాళ్లకు మన 100 ఎకరాల తోటనూ , ఆస్థులన్నీ రాసేస్తాను అనడంతో , మళ్లీ కదిలినట్లు అమ్మా సరే అంటున్నారు , అమ్మో అమ్మో...........వీళ్ళు మామూలోళ్లు కాదు అంటూ సాయంత్రం వరకూ ఇందు ఏ ఒక్క క్షణం కూడా తన భర్తను తలుచుకొని రోజూలాగే బాధపడనేలేదు. 



తన తల్లి మరియు గిరిజా పాదం కింద పెట్టుకోకుండా చూసుకుంటూ తినడానికి , తాగడానికి మాంచి పౌష్టికాహారం మామూలుకంటే రెండింతలు అందిస్తూ ఇందు ప్రక్కనే ఉంటూ జాగ్రత్తగా చూసుకొనసాగారు. 



ఎప్పుడో చీకటిపడ్డాక ఇంటికివచ్చిన అల్లుడికి భోజనం వడ్డించమంటారా అని ఇందు తల్లి అడిగింది. ఆఫీస్ లోపార్టీ ఉండటం వల్ల అక్కడే భోజనం చేసానునని ఫుల్ గా తగినట్లు ఊగుతూ ఇందుకోసం కిందకే మార్చిన బెడ్రూం లోకి వెళ్ళాడు. ఇందు కూడా భోజనం గురించి అడగడంతో అదే సమాధానం ఇచ్చాడు. ఏముండి ఒక గుడ్ న్యూస్ చెప్పాలని మధ్యాహ్నం నుండి వేచిచూస్తున్నాను అని చెప్పగానే , wow ఇందు వాళ్ళు ఆఫీస్ కు కాకుండా నేరుగా ఇంట్లో ఉన్న landline కు కాల్ చేసి చెప్పారన్నమాట , ఉదయం నుండి ఆ ఆఫర్ మనకు వస్తుందో రాదో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా , కాల్ చేసి ఏమి చెప్పారు ? , 



ఆఫర్ ఏంటండి ................, అయితే నువ్వు చెప్పబోతున్నది నా బిజినెస్ గురించి కాదా ? అంటూ నిరుత్సాహపడిపోయాడు ,మందువాసన గుప్పుమనడంతో నోటికి మరియు ముక్కుకు చీరకొంగును అడ్డుగా పెట్టుకొని  కాదండి అంతకంటే ముఖ్యమైన మరియు అత్యంత సంతోషమైన విషయం . ఏమిటా ముఖ్యమైన విషయం అంటూ ఏమాత్రం వినడానికి ఆసక్తి లేనట్లుగా తల వంచుకొని అడిగాడు.



అయినా సంతోషంతో ఏముండి మనకు ట్విన్స్ పుట్టబోతున్నారండి స్కానింగ్ చేసి రేణుక అక్క చెప్పింది అంటూ సిగ్గుపడుతూ తన భర్త సంతోషమైన రియాక్షన్ కోసం atleast నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టి సెలబ్రేట్ చేసుకుంటాడేమో అని చెప్పి వేచి చూస్తూ ఉంది. అంతేనా నేను ఇంకా ఏమో అనుకున్నాను , positive చెబుతావనుకుంటే నెగటివ్ చెప్పి సంతోషించమంతున్నావన్నమాట .



నెగటివ్ ఏంటండి అని ఆశ్చర్యపోతూ అడిగింది. ఒక్కరు పడతారని బిడ్డ కోసం మనీ మొత్తం calculate చేసాను ఇప్పుడు ఇద్దరు పడుతున్నారు కదా డబల్ అవుతోంది కదా అందుకే నెగటివ్ అన్నాను. 



 తన భర్త మాటలకు ఒక్కసారిగా బాధ లోపల నుండి తన్నుకువచ్చి ఆపకుండా కన్నీళ్లను కారుస్తూ  మనకు లెక్కలేనంత ఆస్తి ఉంది కదండి పుట్టబోయే పిల్లల మీద calculation ఏమిటండి అని చిరుకోపంతో అడిగింది. చూడు ఇందు నేను ఈ సిటీలోనే నెంబర్ 1 అవ్వాలని రాత్రి పగలూ కష్టపడుతున్నాను , దానికోసం ఏది అడ్డుగా వచ్చినా అది నాకు మైనస్ కిందకు లెక్క , ఇక ఇప్పుడెమీ చెయ్యలేముగా ఉదయం మరొకరికి కూడా add చేసి మరింతగా కష్టపడతాను , anyways ట్విన్స్ పుడుతున్నందుకు నువ్వు సంతోషమే కదా గుడ్ అంటూ బెడ్ పై మత్తుగా వెనక్కు వాలిపోయి ఘాడనిద్రలోకి జారుకున్నాడు.



తాగి ఉండటం వలన తన కూతురిపై చెయ్యి ఏమైనా చేసుకుంటాడేమో అని తలుపు దగ్గరే ఉండి మొత్తo విని బాధను దిగమింగుకొని లోపలకు రావడంతోనే , అమ్మా అంటూ లేచి బాధపడుతూ కౌగిలించుకొంది. పిచ్చి పిల్లా ఇదేమైనా కొత్తనా రోజూ జరిగేదే కదా నీకు ఏమి చెప్పాను పిల్లల కోసం ఇలా బాధపడరాదు అని చెప్పనా లేదా , నీ పిల్లలే ఇక నీ ప్రాణం అని నువ్వు కూడా అన్నావుగా , పిల్లలూ మీ అమ్మ ఏడుస్తోంది మేమున్నాము అని గుర్తుచేయ్యండి అని వొంగి గుసగుసలాడటంతో లోపల కదలటంతో , అమ్మా.........అంటూ కడుపుపై స్పృశిస్తూ వెంటనే చిరునవ్వులు చిందించింది. అది అలా సంతోషన్గా ఉండాలి రా నా రూంలో పడుకుందాము అని నెమ్మదిగా నడిపించుకుంటూ వెళ్లి బెడ్ పై కూర్చోబెట్టి , తడి టవల్ తో కన్నీళ్లను ముఖాన్ని తుడిచి తాగడానికి నీళ్లు అందించి , ఇక నీ ఆలోచనలన్నీ నా మనవడు మనవరాళ్ల గురించే ఉంటూ సంతోషన్గా నిద్రపో అనిచెప్పి పక్కనే పడుకొని కొద్దిసేపు జోకొట్టడంతో , నిద్రలోనే కవలలు గురించి తలుచుకుంటూ పెదాలపై చిరునవ్వులు చిందిస్తూ హాయిగా నిద్రపోయింది.



 పెదాలపై చిరునవ్వుతో ప్రశాంతంగా నిద్రపోతున్న  తన కూతురు బుగ్గపై ప్రేమతో స్పృశిస్తూ .........మీ నాన్నగారు నువ్వు పసికందుగా ఉన్నప్పుడే మనల్ని విడిచి దేవుడి దగ్గరకు వెళ్లిపోయినా ఆయన మనకు ఏలోటు లేకుండా సమకూర్చారు. నా ప్రాణంగా ప్రేమతో నిన్ను బాగా చదివించి , తను స్వయంగా కష్టపడటం చూసి నిన్ను ప్రేమతో చూసుకుంటాడాని జగదీష్ తో , నీ ఇష్టమే నా ఇష్టం అమ్మా అని నా మాటకు విలువిచ్చి పెళ్లికి ఒప్పుకున్నావు . 



ఘనంగా పెళ్లి జరిగిన తరువాత శోభనం మూడు రాత్రులు కలిసిందే తప్ప నెక్స్ట్ రోజు నుండి ఒక ముద్దూ ముచ్చట లేదు ,పాపం నాకు కూడా చెప్పకుండా లొలొపలే బాధను దాచుకొని దాచుకొని ఇంట్లో ఒక్కటే ఉండటం ఇష్టం లేక కష్టపడి చదివి govt లెక్చరర్ జాబ్ కొట్టింది. ఇదే విషయం అల్లుడికి చెప్పగానే ముందు నిరాకరించి తరువాత లేడీస్ govt కాలేజ్ అని తెలిసిన తరువాత జాబ్ చెయ్యడానికి ఒప్పుకున్నాడు. మళ్లీ అప్పటికి నా ఇందు పెదాలపై చిరునవ్వు వచ్చి వెంటనే నాకు కాల్ చేసి విషయం చెప్పడంతో , బాధ సంతోషం రెండింటినీ ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలియక తన సంతోషమే కదా కావాల్సింది అని సంతోషిస్తూ , ఇందు ఏమి జరిగినా ప్రాణంగా చూసుకునే ఈ అమ్మ ఉందని మాత్రం మరిచిపోకు అని చెప్పాను. 



అలా రెండు నెలలు స్టూడెంట్స్ తో కలిసిపోయి కాలేజ్ లో నవ్వుతూ ఇంటికి వచ్చాక భర్త ప్రేమ లేక బాధపడుతూ , ఎలాగోలా మన కులదైవం ఆశీర్వాదం వల్ల కడుపులో కాయపడింది. స్వయంగా బోలెడన్ని పిండివంటలు తయారుచేసి కూతురు , అల్లుడిని ఊరికి పిలుచుకొనివెళ్లి ఘనంగా శ్రీమంతం జరిపించాను. ఆ ఫంక్షన్ లో కూడా శ్రీమంతానికి వచ్చిన గెస్ట్ లాగా దూరంగా ఉంటూ క్షణం తీరికాలేకుండా మొబైల్లో బిజినెస్ గురించే మాట్లాడుతున్నాడు. 



మాది పల్లెటూరు కాబట్టి సరైన హాస్పిటల్ సౌకర్యం ఉండదని వైజాగ్ లోనే పురుడు పోసుకుంటుంది అల్లుడు గారు నేను కూడా తనకు తోడుగా డెలివరీ అయ్యేంతవరకూ మీతోనే ఉంటాను అని అడిగాను. దానికోసం కూడా చాలాసేపు ఆలోచించి సరే అన్నాడు , ఇందు చాలా సంతోషించింది. ఇందు పెళ్లిచేసుకొని వెళ్లిపోయిన తరువాత గిరిజానే నాకు తోడుగా ఉండేది. పొలాన్ని నమ్మకస్థులకు అప్పగించి గిరిజాతోపాటు వైజాగ్ వచ్చాము. మరో రెండు నెలలు కాలేజ్ కు వెళుతూ ఆ తరువాత ప్రెజ్ఞన్సీ లీవ్ తీసుకొని ఇంట్లోనే ఉండిపోయింది. Sorry తప్ప మరేమీ చెప్పలేనురా అంటూ కన్నీళ్లను తుడుచుకుని జోకొడుతూనే ఇందు తల్లి నిద్రలోకి జారుకుంది.



నెక్స్ట్ రోజు నుండి అన్నింటినీ మరిచిపోయి కేవలం తన కవలల గురించి మాత్రమే సంతోషన్గా ఆలోచిస్తూ ఈ ప్రపంచం లోకి అడుపుపెట్టిన క్షణం నుండి ఐదేళ్ల వరకూ ఏమేమి కావాలో అన్నింటినీ తన తల్లి మరియు గిరిజాతో తెప్పించి , పిల్లల కోసమే ఒక గదిని రంగురంగుల కలర్లతో , రూమ్ మొత్తం బొమ్మలతో .............నింపేసి రెడీ చేయించింది. నెలరోజుల రెగులర్ చెకప్స్ తరువాత ఒక రోజు ఉదయం 2 గంటలకు ఇందు పండంటి ఆరోగ్యమైన కవలలకు జన్మనిచ్చింది.బయట టెన్షన్ పడుతూ అటూ ఇటూ తిరుగుతున్న ఇందుఅమ్మ మరియు గిరిజా పిల్లల ఏడుపులు విని రెండు చేతులను జోడించి తమ కులదైవాన్ని మొక్కుకొని వచ్చి మొక్కు తీర్చుకుంటాము తల్లి అని చెబుతుండగానే నర్సు వచ్చి తల్లి మరియు కవలలు పూర్తి ఆరోగ్యంతో ఉన్నారన్న సంతోషమైన వార్తను చెప్పగానే ఉబ్బితబ్బిబ్బవుతూ వెలికున్న బంగారు ఉంగరాన్ని ఏ మాత్రం ఆలోచించకుండా ఇచ్చేసింది. నర్సు ఆశ్చర్యపోయి థాంక్స్ చెప్పేసి లోపలకు వెళ్ళిపోయింది. గిరిజా అంటూ ఇద్దరూ సంతోషన్గా కౌగిలించుకొని,  వెయిటింగ్ కుర్చీలో గురకపెట్టి నిద్రపోతున్న జగదీష్ ను లేపి విషయం చెప్పింది. కార్చులేకుండా డెలివరీ అయ్యిందన్నమాట అని చెప్పి చూడొచ్చని చెప్పారా ........, లేదు అల్లుడు......అయితే లోపలకు పిలిచినప్పుడు లెపండి అని మళ్ళీ నిద్రలోకి జారుకున్నారు. వీడు మారడు అని మనసులో కోపంతో డోర్ దగ్గర రేణుక పిలుపు కోసం ఆతృతగా ఎదురుచూస్తూ నిలబడ్డారు.
Like Reply
కొద్దిసేపటి తరువాత నర్సు బయటకు వచ్చి మేడం డాక్టర్ గారు పిలుస్తున్నారు అని నర్సు లోపలికి పిలవడంతో,  రా గిరిజా అంటూ లోపలికి వెళుతుండటంతో అమ్మగారు మీ అల్లుడు గారు లేపమన్నారు కదా అని గుర్తుచేసింది. నా అల్లుడికి తన పిల్లలను చూడటం కంటే నిద్రపోవడమే ముఖ్యం అన్నట్లుగా ఒకవైపు భార్య డెలివరీ జరుగుతుంటే హాయిగా పడుకున్నాడు , చూడు ఇప్పటికీ ఎలా నిద్రపోతున్నాడో , నాకూతురు పిలవమంటే అప్పుడు చూద్దాములే ముందు నువ్వు రా పిల్లలను చూడకుండా మరొక్క క్షణం కూడా ఉండలేను అంటూ ఉత్సాహంతో తలుపు తోసుకుని లోపలికి వెళ్లారు.



ఇందు ఒకరిని మాత్రమే మెత్తటి గుడ్డతో ఎత్తుకొని , మనవడు మాత్రం ఇంకా పక్కనే ఊయలలోనే ఉండటం , మనవరాలిని ఆనందబాస్పాలతో ముద్దుచేస్తుండటం చూసి ఇందు తల్లి మురిసిపోతుండగా , అమ్మా ఇదిగో మీ మనవళ్లు అంటూ తన గుండెలపై ప్రాణంగా ఎత్తుకున్న మనవరాలిని చూపించింది.



పసికందుని మరియు తన కూతురి సంతోషాన్ని చూసి ఆనందబాస్పాలతో ఒకవైపు సంతోషిస్తూనే , ఒసేయ్ ఇందు కూతురిని మాత్రమే ఎత్తుకున్నావు మరి మన వారసున్ని ఊయలలోనే వదిలేశావు అప్పుడే వారిద్దరి ప్రేమలో ఎక్కువా తక్కువా చూపిస్తున్నావా అని చిరుకోపంతో బాధపడుతున్నట్లు చూడవే గిరిజా అని ఫీల్ అయ్యింది.



ఆ మాటలు విని ప్రక్కనే నిలబడిన రేణుక గారితోపాటు గట్టిగా కళ్ళల్లో నీళ్ళు వచ్చేట్లుగా ఆపకుండా నవ్వుతూనే ఉండటంతో , ఇద్దరూ ఒకరిముఖాలు మరొకరు ఆశ్చర్యంగా చూసుకొని రేణుకా ఏమయ్యింది నేనేమైనా జోక్ చేశానా అంతలా నవ్వడానికి అంటూ అడిగింది.



అదేమీ లేదమ్మా అంటూ మళ్లీ మూసిముసినవ్వులు నవ్వుతూ ఇందు అమ్మ తియ్యటి కోపం చూసి బలవంతంగా కంట్రోల్ చేసుకొని , అమ్మా అమ్మా.........చెబుతాను ......అంటూ చెప్పడం మొదలెట్టింది. నెల కిందట ఇందు కడుపును స్కాన్ చేసినప్పుడు ఈ కవలలు ఏమి చేస్తుండటం మనం చూసాము.



ఆడుకోవడం  చూసాము...... అని గిరిజాని చూస్తూ బదులిచ్చింది. అప్పుడు మనమందరం పొరబడ్డాము అమ్మా ఈ చిచ్చరపిడుగులు ఇందు కడుపులో ఆడుకోవడం లేదు ..........మరి ఏమి చేస్తున్నారు అని లేచి ఆత్రంగా అడగడంతో , కంగారుపడాల్సిన పని లేదమ్మా వాల్లు ఆదుకోవడం లేదు ఒకరొకరి పొట్లాడుకుంటున్నారు అని డాక్టర్ గారే స్వయంగా చెప్పడంతో నోరెళ్ళబెట్టి నిజమే అయ్యి ఉంటుందని ఆశ్చర్యపోతున్నారు.



కావాలంటే చూడండి అంటూ తన చేతిలో ఉన్న మగ పిల్లాన్ని మరియు ఇందు చేతిలో ఉన్న ఆడ పిల్లను ఊయలలో పక్కపక్కనే పడుకోబెట్టగానే , ఒకరొకరి చేతుల స్పర్శ తగిలిందో లేదో ఇద్దరూ ఎదురెదురు తిరిగి గలగలా నవ్వుతూ చేతులు కాళ్ళు కదిలిస్తూ పొట్లాడుతున్నట్లు ప్రస్ఫుటంగా తెలుస్తుండటంతో , ఇందు ఇద్దరినీ చూసి మా బుజ్జి పాపాయిలు అంటూ మురిసిపోతూ అక్కా ఇక చాలు వాడిని నా చేతులలోకి ఇవ్వండి అంటూ అందుకోగానే , రేణుకా ఇప్పుడెమీ చేద్దాము అని కంగారుపడుతూ అడుగుతుండగా , అమ్మా ఇంకా ఉంది చూడండి అంటూ చేతి సైగతో ఆపగానే , 



ఊయలలోని బిడ్డకు మరియు ఇందు చేతిలోని బిడ్డకు తనకు ప్రక్కనే ట్విన్ బ్రదర్ , సిస్టర్ స్పర్శ తగలకపోయేసరికి ఒక్కసారిగా ఇద్దరూ గట్టిగా ఏడవడం మొదలెట్టారు. దీనిని బట్టి ఏమి అర్థమయ్యింది అమ్మా అంటూ పాపను ఎత్తుకొని ముద్దుచేసి నవ్విస్తూ  రేణుక ఇందు తల్లిని అడిగింది.మొత్తం అర్థమైనట్లు కళ్ళు పెద్దవిగా చేసుకొని  ఇద్దరూ పక్కపక్కనే ఉంటే పొట్లాడుతున్నారు , దూరం పెడితే ఒకరికోసం మరొకరు ప్రాణమన్నట్లు ఎదుస్తున్నారు.వీళ్ళతో నాకూతురు ఎలా వేగుతుందో ఏమిటో అంటూ నవ్వుతూ చేతులను శుభ్రన్గా కడుక్కొని వచ్చి ఎత్తుకొని , ఏరా బుజ్జికన్నా ఇంతలేవు మీ చెల్లెలు అంటే అంత ప్రేమ ఉంది కూడా ఎందుకురా ఇద్దరూ కొట్లాడుతున్నారు , మీరిద్దరూ ఎప్పుడూ కలిసి ఉండాలి అని నుదుటిపై ముద్దుపెట్టి చెబుతుండగానే తనమీదకు అంతెత్తుకు ఎగిరెలా పాస్ పొయ్యడంతో ICU మొత్తం నవ్వులతో నిండిపోయింది. అమ్మా పెద్దయ్యాక వాళ్ళు వాళ్ళు చూసుకుంటారులే లెక్చర్ ఇస్తే వాళ్లకు కోపం వస్తుంది , ఇంతకుముందే నాకు కూడా ఆ శాస్తి అయ్యింది మీ మనవరాలితో అంటూ తన డ్రెస్ పై తడిని చూపించి సంతోషన్గా నవ్వుకుంది.



అమ్మా రౌండ్స్ కు వెళ్లి వస్తాను , నర్స్ ఎక్కడికీ వెళ్లకుండా ఇక్కడే ఉండి చూసుకో వీళ్ళంటే నాకు ఇంత ప్రాణమే తెలుసుగా అని చెప్పి వెళ్ళిపోయింది. మీకే కాదు డాక్టర్ గారు నాకు కూడా అంటూ బంగారు ఉంగరం తాకి అక్కడే కుర్చీ వేసుకొని కూర్చుంది. పిల్లల మధ్య చిలిపి అల్లరిని , ప్రేమను ముగ్గురూ చూస్తూ మురిసిపోతుండగానే తెల్లవారిపోయింది . మిర్రర్ లోనుండి పడుతున్న వెలుగుని చూసి నా మనవళ్ళతో ఉంటే సమయమే తెలియడం లేదు అంటూ తమ తమ గుండెలపైనే లాలిపాడుతూ నిద్రపోనిచ్చారు. 



నిద్రపోయాక ఇద్దరినీ ఊయలలో వేసి ఇందు బెడ్ పై వెనక్కు ఆనుకొని కూర్చొని నెమ్మదిగా ఊపుతూ వారినే చూస్తూ తన తల్లి , గిరిజాతోపాటు ప్రపంచంలోని సంతోషం మొత్తం తనదగ్గరే ఉన్నట్లు పరవశించిపోసాగింది. బంగారం లాంటి మనవళ్లను ఇచ్చావురా ఇందు అంటూ నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి , నాకూతురు ఈ భూమి మీదనే అదృష్టవంతురాలు అంటూ మురిసిపోయింది.



సమయం 7 గంటలు అవుతుండటంతో రేణుక వచ్చి ఇందుని మరియు ట్విన్స్ ను పరీక్షించి అమ్మా ఇందుకి నీరసంగా ఉన్నట్లుంది ఏమైనా తినిపించండి , ఈ బ్యూటిఫుల్ ట్విన్స్ కు చాలా మొత్తంలో పాలు కావాలిగా అని చెప్పి , ఇందు everything is alright టిఫిన్ తిని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇంటికి వెళ్లిపోవచ్చు , రోజుకు రెండుసార్లు నేనే స్వయంగా ఇంటికివస్తాను అని చెప్పడంతో లవ్ యు sooooo మచ్ అక్కా అంటూ బెడ్ పైనే ఆప్యాయంగా కౌగిలించుకొంది.



గిరిజా తొందరగా వెళ్లి వేడివేడిగా తీసుకురా అని చెప్పి పంపించి హాయిగా ఊయలలో పక్కపక్కనే నిద్రపోతున్న కవలలను సంతోషంతో చూస్తూ , ఇందు మీవారికి వీరిని చూపించాలని లేదా అని అడగడంతో , అమ్మా వీళ్ళు ఈ భూమి మీదకు వచ్చి ఇప్పటికి 5 గంటలు అయ్యింది , ఆయనకే ఇంట్రెస్ట్ లేనప్పుడు నేనేమి చేస్తాను అని మామూలుగానే చెప్పింది. 



అర గంట తరువాత గిరిజా టిఫిన్ తో రావడంతో ఇందుకి తినిపించింది. గిరిజా వెళ్లు అల్లుడిని లేపి పిలుచుకొనిరా అని పంపించింది. బయటకువెళ్లి ఇంకా గురకలతో నిద్రపోతున్న జగదీష్ ను లేపి లోపలకు పిలిచారు అని చెప్పడంతో, నిద్ర డిస్టర్బ్ చేసినందుకు చిరాకుపడుతూ లేచి నిద్రమత్తులోనే లోపలికి ఎంటర్ అవ్వడం చూసి ఇందూతల్లి మరియు గిరిజా వాళ్లకు ప్రైవసీ ఇవ్వడం కోసం బయటకు వచ్చారు. 



వెళ్లి బెడ్ ప్రక్కనే కూర్చుని కవలలను చూసి థాంక్స్ ఇందు సుఖప్రసవం వల్ల ఎంత ఖర్చు మిగిల్చావో తెలుసా అంటూ పిల్లలను తాకాబోతుండటంతో , ఆ మాటలకు చిర్రెత్తుకొచ్చి ఏముండీ ముందు చేతులను శుభ్రన్గా డేటాల్ తో కడుక్కొని రండి అని చెప్పింది. ఓహ్........మరిచిపోయాను అంటూ సింక్ దగ్గరకువెళ్లి కడుక్కొని వచ్చి నిద్రపోతున్న పిల్లలను స్పృశిస్తూ చేతికున్న వాచ్ లో సమయం చూసి ఆఫీస్ లో ఇంపార్టెంట్ వర్క్ ఉంది intime కి వెళ్ళాలి బై అని చెప్పి హడావిడిగా బయటకు వెళ్ళిపోయాడు. 



ఏంటమ్మగారు అంత ఆత్రంగా వెళ్లిపోతున్నాడు , ఆదా సమయం చూడు వాడికి తన భార్య పిల్లల కంటే ఆఫీస్ మాత్రమే ముఖ్యం అని బదులివ్వడంతో , అమ్మగారు లోపల ఇందు బాధపడుతుంటుందేమో అని కంగారుపడుతూ లోపలకు వచ్చి ఇందు సంతోషన్గా పిల్లలతో బుజ్జి బుజ్జిగా మాట్లాడుతుండటం చూసి ఆశ్చర్యపోతూ , బెడ్ దగ్గరికివెళ్లి హమ్మయ్యా అల్లుడి వల్ల బాధపడుతుంటావాని అనుకున్నాము .

అమ్మా నా ప్రాణమైన పిల్లలు ఉండగా నేనెందుకు అనవసరమైన విషయాల గురించి బాధపడాలి అంటూ నవ్వుతూ చెప్పింది. ఇందు ఈమాటతో నా గుండెల్లో ఉన్న భారాన్నంతా దింపేశావురా అంటూ సంతోషం పట్టలేక ప్రేమతో కౌగిలించుకొని ఇక నా బంగారానికి భవిష్యత్తు అంతా సంతోషమే అని చెప్పి నుదుటిపై ప్రేమగా ముద్దుపెట్టడంతో ,  లవ్ యు అమ్మా అంతా నువ్విచ్చిన ధైర్యం మరియు నా ప్రాణమైన కవలల వల్లనే అని చెప్పి మురిసిపోయింది. తల్లికూతుళ్ళ సంతోషాన్ని చూసి గిరిజా ఆనందబాస్పాలతో పొంగిపోయింది.
[+] 12 users Like Mahesh.thehero's post
Like Reply
10 గంటలకు మళ్లీ రేణుక వచ్చి ముగ్గురినీ పూర్తిగా చెక్ చేసి పిల్లలకు ఎప్పటి నుండి పాలు ఇవ్వాలి , ఎలా చూసుకోవాలో జాగ్రత్తలు అందరికీ వివరించి డిశ్చార్జ్ చెయ్యడంతో కవలలను రేణుక మరియు ఇందూతల్లి ప్రేమతో సున్నితంగా వెచ్చటి మందమైన టవల్ లలో ఎత్తుకొని ముద్దుచేస్తూ , గిరిజా ఇందుని నెమ్మదిగా వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని బయటకువచ్చి కారులో వెనుక కూర్చోబెట్టి రేణుక చేతిలోని పసికందుని చిరునవ్వులు చిందిస్తూ అందుకొంది. 



ఇందూతల్లి మగపిల్లాన్ని ఎత్తుకొని తన కూతురు ప్రక్కనే కూర్చుని , ఇందు చెప్పడం మరిచిపోయాను నీ చేతిలోని నా మనవరాలిని చూస్తుంటే నువ్వు పసికందుగా నాచేతిలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉంది , ఆ ముక్కు , చెవులు మరియు కళ్ళు నా కూతురే మళ్లీ ఒకసారి నా మనవరాలిగా పుట్టినట్లుంది , నీకు ఒక తమ్ముడో , అన్నయ్య ఉండి ఉంటే వీళ్లిద్దరి లాగానే కొట్లాడేవారేమో అంటూ సంతోషన్గా నవ్వుతూ చెప్పింది. 



అమ్మగారు ఇప్పుడు ఎంతగా ఒకరొకరు పొట్లాడుతారో పెద్దయ్యాక అంతకంటే ఎక్కువ ప్రాణంగా ఒకరినొకరు చూసుకుంటారు అనే నమ్మకం నాకుంది అని గిరిజా సంతోషాన్ని పంచుకొని పోనివ్వమంటారా అని అడిగింది. నీ మాటలే నిజం అవ్వాలి గిరిజా .........పోనివ్వు అని చెప్పి , నా ప్రాణమైన బుజ్జి పాపాయిలు ఎందుకమ్మా కడుపులో ఉండగా ప్పట్లాడారు ఇప్పుడు ఈ ప్రపంచం లోకి అడుగుపెట్టాక కూడా అలాగే చేస్తున్నారు అంటూ ఇద్దరి బుగ్గలపై ప్రాణంగా ముద్దులుపెట్టి ,మీరు ఎలాఉన్నా ఈ అమ్మకు ఇష్టమే మీ ఇష్టమొచ్చినట్లు ఉండండి , మిమ్మల్ని ప్రాణంగా ఏ లోటూ లేకుండా చూసుకునే బాధ్యత మాది అని చెప్పగానే , ఇంతలేరు తల్లిమాటలు అర్థమైనట్లు చిరునవ్వులు చిందిస్తూ చేతులు కాళ్ళను సంతోషంతో కదిలించడం చూసి ఆశ్చర్యంతో మురిసిపోతూ ,



ఇందు వీళ్లకు ఎవరైనా ఇలాగే ఉండండి అని చెబితే పాస్ పోసి కసి తీర్చుకుంటారు ,మీ ఇష్టమొచ్చినట్లుగా ఉండండి అని నువ్వు చెప్పగానే చూడు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో , పిల్లలకు తగ్గ తల్లి దొరికింది ఇక వీళ్ళ చిలిపి రచ్చ ఎలా ఉండబోతోందో ఆ దేవుడికే తెలియాలి అంటూ మా బంగారుకొండ అంటూ గుండెలకు హత్తుకొని సంతోషంతో ఇంటికి చేరగానే, గిరిజా కారు ఆపి వేగంగా లోపలికి వెళ్ళి ఎర్ర నీళ్లు తీసుకొచ్చి దిష్టి తీసి సంతోషన్గా ఇంట్లోకి అడుగుపెట్టు ఇందు అని చెప్పి పారేయ్యడానికి బయటకువెళ్లింది.



గిరిజా పైకి వెళ్లి కవలల కోసం కొన్న బొమ్మలు వ్రేలాడబడి లోపల వెచ్చగా ఉండేలా చెప్పి మరీ తయారుచేయించిన అందమైన ఊయలను కింద ఇందు రూంలోకి తీసుకువచ్చింది. కాసేపు పడుకోబెట్టడానికి నవ్వులు చిందిస్తున్న కవలలిద్దరినీ ఊయలలో ప్రక్కప్రక్కనే అలా పడుకోబెట్టారో లేదో స్పర్శ తగిలి హాస్పిటల్ లో లాగానే పొట్లాడటడం మొదలెట్టడంతో , అప్పుడే మొదలెట్టేశారు ఇందు వీళ్ళను ఇలా కాదు అంటూ గిరిజా రెండో ఊయల కూడా తీసుకురా అని చెప్పడంతో పరుగునవెళ్లి తీసుకువచ్చి మొదటి ఊయల ప్రక్కనే ఉంచింది. 



 అప్పటివరకూ చేతులను మధ్యలో అడ్డుపెట్టి ఇద్దరి చిలిపి చర్యలను ఆపి వెంటనే వారసున్ని ఎత్తి మరొకదానిలో పడుకోబెట్టారో లేదో రెండుప్రక్కలా చేతులను , కాళ్ళను కదిలిస్తూ ఇద్దరి స్పర్శ తగలకపోవడంతో రూమ్ దద్దరిల్లిపోయేలా ఏడుపు లంకించడంతో పెద్ద చిక్కే వచ్చిపడిందే ఇందు అంటూ ఇద్దరినీ వాళ్ళ తల్లి చేతికి అందించింది . ఇప్పుడే ఎంత అల్లరి చేస్తున్నారు నా బుజ్జికన్నయ్యలు అంటూ ముద్దులతో నవ్వులు చిందిస్తూ , చూడండి మీ అమ్మమ్మ మీవల్ల ఎన్ని షాక్ లు చూస్తోందో అంటూ నవ్వుతూ లాలిపాడి నిద్రపోనిచ్చి లవ్ యు లవ్ యు sooooooo మచ్ my lovely లిటిల్ ఏంజెల్స్ మీ అమ్మను నవ్వించడానికే ఈ భూమి మీదకు వచ్చారురా అంటూ ఆనందబాస్పాలతో హాయిగా నిద్రపోతున్న ఇద్దరినీ ఒకే ఊయలలో ప్రక్కప్రక్కనే పడుకోబెట్టి అమ్మా వీళ్ళు లేచేలోపల ఫ్రెష్ అయ్యి వస్తాను చూస్తూ ఉండు అనిచెప్పి టవల్ మరియు బట్టలు తీసుకొని పిల్లలిద్దరి నుదుటిపై వెచ్చగా ముద్దుపెట్టి వాళ్లనే చూస్తూ మురిసిపోతూ బాత్రూం లోకి వెళ్ళింది.



రెడీ అయ్యి వచ్చి అమ్మా నువ్వెళ్ళు నేను చూసుకుంటాను అని చెప్పి అల్లరి చెయ్యకుండా హాయిగా నిద్రపోతున్నారా అంటూ మళ్లీ వెచ్చగా ముద్దులుపెట్టి బెడ్ పై కూర్చుని నెమ్మదిగా ఊయలను ఊపుతూ పిల్లలనే చూస్తూ ప్రేమతో మాట్లాడుతూ , వాళ్ళతో ఉన్నంతసేపు ఆనందం అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడంలేదు ఇందుకి. 



కొద్దిసేపటి తరువాత ఆకలివేసినట్లు ఇద్దరూ ఒకేసారి ఏడుస్తూ లెవడంతో నా బుజ్జిలు అంటూ ఎత్తుకొని తన ఒక్కొక్క పాలపొంగును ఒక్కొక్కరి నోటికి అందించి , వాళ్ళ పెదాలు స్పృశించగానే తల్లిగా తన బిడ్డలకు తొలిసారి పాలు అందించే అదృష్టాన్ని వర్ణించలేని సంతోషంతో పారవశ్యం పొందుతూ కడుపు నిండా తాగండి అంటూ ఆనందబాస్పాలతో ఇద్దరి నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి పరవశించిపోసాగింది.



ఇందూతల్లి స్నానం చేసి వచ్చి ఆ దృశ్యాన్ని చూసి మరియు తన కూతురు పొందుతున్న మాటల్లో వర్ణించలేని ఆనందాన్ని , ఆనందబాస్పాలను భవిష్యత్తులో చూసుకోవడానికి తన కూతిరికి తెలియకుండా మొబైల్ లో వీడియో రికార్డ్ అయ్యేట్లుగా టేబుల్ పై ఉంచి , కప్ బోర్డ్ లోని కెమెరా అందుకొని చాలా ఫోటోలు తీసి అక్కడే ఉంచేసి , తన కూతురు దగ్గరకువెళ్లి ఈ ఆనందం చూడటానికేరా నేను బ్రతికి ఉన్నది ఇదంతా నా బుల్లి మనవళ్లు వల్లనే అంటూ ముగ్గురి నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి వంట చెయ్యడానికి వెళ్ళింది.



పిల్లలతో ఉన్నంతసేపు సమయమనేదే తెలియనట్లు పొట్లాడినప్పుడు ఎత్తుకొని బుజ్జగిస్తూ , ఏడ్చినప్పుడల్లా పాలు అందించి , పాల కోసం విటమిన్ , ప్రోటీన్ ఫుడ్ బలంగా తింటూ రాత్రి అయిపోయింది. రోజూలాగే జగదీష్ అలసిపోయి తాగివచ్చి ఊయలలో హాయిగా నిద్రపోతున్న పిల్లలను చూసి కనీసం పలకరించకుండా బెడ్ పై వాలిపోయాడు.



పిల్లల ఏడుపు విని పరిగెత్తుకుంటూ వచ్చి రూమ్ మొత్తం మందువాసన వస్తుండటంతో కోపంతో తన భర్తవైపు చూసి పిల్లలను వెంటనే ఎత్తుకొని బయటకువచ్చి , ఎందుకు ఏడుస్తున్నారో తన తల్లికి చెప్పి ఊయలలను పర్మనెంట్ గా తన తల్లి రూంలోకి మార్చి తను కూడా ఇక తన భర్త రూంలోకి అడుగుపెట్టారాదని తనకు సంబంధించిన వస్తువులను మరియు బట్టలను గిరిజా సహాయంతో తన తల్లి రూంలోకి మార్చేసింది. కళ్ళల్లో కన్నీళ్ళతో పిల్లలను ఎలాగోలా పాలిచ్చి పడుకోబెట్టి , sorry ఏంజెల్స్ ఇక ఎప్పుడూ ఆ రూంలో మిమ్మల్ని వదలను ప్రామిస్ అంటూ ప్రాణంగా ముద్దుపెట్టి హాయిగా నిద్రపోవడం చూసి కన్నీళ్లను తుడుచుకుని ఆనందించింది.
[+] 11 users Like Mahesh.thehero's post
Like Reply
చెప్పినట్లుగానే డాక్టర్ రేణుక రోజూ ఉదయం ఒకసారి డ్యూటీ అయిపోయాక ఒకసారి వచ్చి కవలలను చూసి ఆరోజు చేసిన అల్లరి విని సంతోషిస్తూ అలా కొన్ని నెలలు అమ్మ ఓడిలోనే ప్రేమను అనుభవిస్తూ పాలు తాగుతూ సంతోషన్గా గడిచిపోయాయి.



అప్పటివరకూ ముద్దుముద్దుగా పిలుచుకుంటూ ఇక కవలలకు పేర్లు పెట్టాలని నిర్ణయించుకొని జాతకాలు చూయించడంతో ఇద్దరికీ " మ" అనే అక్షరంతోనే పేర్లు పెట్టాలని రావడంతో ముగ్గురూ రెండురోజులపాటు మ తో మొదలయ్యే పేర్లన్నీ తిరగేసి ముగ్గురికీ నచ్చిన రెండు పేర్లను తన ప్రాణమైన పిల్లలకు పెట్టాలని ఒక శుభ ముహూర్తాన్ని పంతులుతో తెలుసుకొని , బంధువులందరినీ మరియు ఇరుగుపొరుగువారిని స్వయంగా వెళ్లి ఫంక్షన్ కు ఆహ్వానించి అందరి సమక్షంలో ఇంటిని మొత్తం పూలతో decorate చేయించి అంగరంగవైభవంగా కవలల మొదటి ఫంక్షన్ జరిపిస్తూ, పంతులు గారు ఇందుని పిలిచి పేర్లను పిల్లల చెవిలో పలకమని చెప్పారు.



ఇందు సంతోషంతో మురిసిపోతూ పిల్లలిద్దరినీ ఎత్తుకొని కొడుకుకి మహేష్ అని మరియు కూతురికి మహి అని చెవిలో చెప్పి సంతోషం పట్టలేక ఇద్దరి బుగ్గలపై ప్రాణంగా ముద్దుపెట్టి చెప్పి పూజలో కూర్చుంది. 



ఇక చెప్పాల్సింది ఏముంది " ఈ కథకి హీరో మహేష్ అంటే నేను నా ముద్దుల పొట్లాడే చెల్లెలు or అక్క మహి మా అందరి ప్రాణం ". 



 ఇద్దరమూ అమ్మ కళ్ళల్లోకే చూస్తూ చీరను గట్టిగా పట్టుకొన్నాము. తరువాత అమ్మమ్మ , నాన్న , గిరిజా ఒకరి తరువాత మరొకరు వచ్చి మా చెవులలో పేర్లతో పిలిచి అమ్మమ్మ మా ఇద్దరి మెడలలో బంగారు గొలుసులు వేసి నవ్వుని చూసి నా మనవడు మనవరాళ్లకు పేర్లు నచ్చినట్లుగా ఉన్నాయి అని సంతోషంతో బుగ్గలపై చెరొక ముద్దుపెట్టింది.



నెక్స్ట్ వచ్చిన గెస్ట్స్ అందరూ గిఫ్ట్స్ ఇచ్చి మహేష్ , మహి అంటూ పిలిచి ఫోటోలు దిగి నిండు నూరేళ్లు సంతోషన్గా ఉండండి అని దీవించి గిఫ్ట్స్ ఇచ్చి ఫంక్షన్ తరువాత భోజనాలు చేసి బ్యూటిఫుల్ ట్విన్స్ అంటూ అమ్మకు చెప్పి అమ్మలో మరింత సంతోషాన్ని నింపి వెళ్లిపోయారు.



ఆరోజు నుండి ఇల్లు మొత్తం మహేష్ , మహి అన్న పేర్లు తియ్యగా మారుమ్రోగుతూ అమ్మా , అమ్మమ్మా మా ఇద్దరినీ విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేకపోయారు. 



అప్పటికే బొమ్మలతో ప్లేయింగ్ బిగ్ ఐటమ్స్ తో ఒక పెద్ద రూమ్ నిండిపోయినా రోజూ కొత్త కొత్త బొమ్మలను మ్యూజిక్ వెహికల్స్ ను అమ్మమ్మ తెస్తూ మాకు అందించి మురిసిపోతూనే ఉంది .



ఒక సంవత్సరం తరువాత తొలి వెంట్రుకలు తియ్యడానికి బంధువులతోపాటు తిరుమలకు వెళదామని అమ్మ నాన్న గారిని కోరడంతో , ఆఫీస్ లో ఫుల్ బిజీ మొత్తం arrange చేస్తాను మీరే వెళ్ళిరండి అని చెప్పి అక్కడికక్కడే date కనుక్కుని ఎంతమందో తెలుసుకొని ఫ్లైట్ బుక్ చెయ్యబోతుండగా , ఏముండి ఇదికూడా మేము చూసుకుంటాము మీరు మీ ఆఫీస్ తోనే కాపురం చెయ్యండి అని చెప్పడం ఆలస్యం కేస్ అందుకొని వెళ్ళిపోయాడు.



వెంటనే అమ్మ తో సహా అమ్మమ్మకు మరియు గిరిజాకు మరియు మాకు తిరుపతికి టికెట్స్ బుక్ చేసి అక్కడ ఏమి ఇబ్బంది రాకుండా ట్రావెల్స్ సహాయంతో అన్ని ఏర్పాట్లు చేసి రెండు రోజుల తరువాత తిరుపతి వెళ్ళడానికి వైజాగ్ ఎయిర్పోర్ట్ చేరుకొని అమ్మమ్మ నన్ను ఎత్తుకొని పెద్ద విమానం చూపించింది. చూడగానే నవ్వడంతో మా బుజ్జి కన్నయ్యకు అన్ని తెలుసు ఎందుకంటే అమ్మ ప్రతిరోజు పిల్లల బుక్స్ లలో బస్ , కార్ ..........ఇలా బోలెడన్ని చూపించి నిద్రపుచ్చేది.



మహేష్ ఇప్పుడు మనo అందులోకి ఎక్కి గాలిలో ప్రయాణిస్తాము అని చెప్పినా నాకు ఏమి అర్థం కాకపోయినా అమ్మమ్మ నవ్వడంతో నేనూ నవ్వాను. ఫ్లైట్ లో తిరుపతికి చేరుకోగానే ట్రావెల్స్ వెహికల్ బయట రెడీగా ఉండటంతో ఎయిర్పోర్ట్ నుండి హోటల్ కు చేరుకొని ఫ్రెష్ అయ్యి నేరుగా తిరుమలకు చేరుకొని మొదట ఒకసారి స్వామివారిని దర్శించుకుని చూడగానే ఆటోమేటిక్ గా నా చేతులు కలిపి మొక్కడం అమ్మ చూసి మహేష్ నా బంగారం రా నువ్వు అంటూ తలపై ప్రేమగా నిమిరి సంతోషన్గా బయటకువచ్చి మొదటగా నా వెంట్రుకలను తియ్యగానే నా గుండుని చూసి మహి నవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతూ ముద్దుచేశారు , ఆ వెంటనే మహికి గుండు తీయడంతో ప్రతీకారం అన్నట్లు మరింత గట్టిగా నవ్వడం చూసి మీరు పొట్లాడటం ఇన్నిరోజులు మరిచిపోయారు అనుకున్నాము అది మాతప్పు అంటూ ప్రేమగా ముద్దుపెట్టి స్నానాలు చేయించి మరొకసారి దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని యధావిధిగా ఫ్లైట్ లో వైజాగ్ కు ప్రయాణిస్తూ మా ఇద్దరినీ ఒకే సీట్లో పక్కపక్కనే కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టి అమ్మా మరియు అమ్మమ్మా చెరొకవైపు కూర్చుని చేతులను మామీద వేసి పడిపోకుండా సపోర్ట్ గా పట్టుకున్నారు. అలా ఒక నిమిషం అయ్యిందో లేదో అప్పుడే మోలుస్తున్న గొర్లతో చేతులపై మరియు కాళ్లపై గీక్కోవడం అదికూడా చిరునవ్వులు చిందిస్తూ , మళ్లీ మొదలెట్టారా అంటూ ఇద్దరూ ఒకరొకరిని ఎత్తుకొని , స్వామి నీ దర్శనం తరువాత పిల్లలు ఇలా అవ్వడం ఏమిటి అంతా నీమాయ భారమంతా నీదే అంటూ హ్యాండ్ బ్యాగులోని స్వామి కుంకుమ తీసి మాఇద్దరికీ పెట్టింది.



ఇంటికి చేరుకున్న కోన్నిరోజులకు  మహితోపాటు ఇద్దరమూ బుడి బుడి అడుగులు వేస్తూ ఇద్దరూ ఒకేసారి ఆ....మ్మా.........అని పిలువగానే ఇద్దరినీ మనసారా గుండెలకు హత్తుకొని ముద్దులతో ముంచెత్తుతూ  వంటింట్లో ఉన్న అమ్మను మరియు గిరిజాని కేక వేసి పిలిచింది. ఇప్పుడు పిలవండి అమ్మా........అమ్మా.........అనండి అని అడగడంతో , ఆ..మ్మా....అంటూ అమ్మ జుట్టు పీకుతూ ముద్దుగా పిలువగానే, అమ్మమ్మ మహిని ఎత్తుకొని సంతోషంతో నవ్వుతూ అమ్మమ్మా......అను అమ్మమ్మా......అని బ్రతిమాలినా అమ్మా........అనే పలకడంతో నా బంగారుకొండలు మీ అమ్మ ఇక్కడే ఉందిలే ప్లీస్ ప్లీస్ ...........అమ్మమ్మా , అమ్మమ్మా .........అని చాలాసార్లు చెవిలో చెబుతూ బొమ్మలతో ఆడించడంతో రెండు రోజుల తరువాత అమ్మమ్మా.........అని గిరిజాని అత్తయ్యా అని ఇద్దరమూ పిలువగానే ఇద్దరి కళ్ళల్లో ఒక్కసారిగా ఆనందబాస్పాలు కారాయి.



సంవత్సరం కంటే ఎక్కువనే కాలేజ్ కు సెలవు పెట్టడంతో స్టూడెంట్స్ అందరూ అమ్మ సబ్జెక్ట్ లో వెనుకబడిపోయారని వీలైనంత తొందరగా కాలేజ్ కు టీచ్ చెయ్యడానికి రావాలని ప్రిన్సిపాల్ నుండి లెటర్ విత్ పిల్లల సంతకాలతో రావడంతో , స్టూడెంట్స్ కు తనపై ఉన్న అభిమానానికి ఒకవైపు సంతోషించినా మా ఇద్దరినీ విడిచి ఉదయం నుండి సాయంత్రం ఎలా ఉండాలని బాధపడుతుండగా , ఇందు వాళ్ళ అమ్మమ్మను నేను కొత్తగా అత్తయ్య అంట గిరిజా అంటూ నవ్వుతూ ఇద్దరమూ ఉన్నాము ఇంకెందుకు ఆలోచిస్తున్నావు సంతోషంగా వెళ్లు , మధ్యాహ్నం లంచ్ తీసుకొని పిల్లలతోపాటు కాలేజ్ కు రోజూ వస్తాము అని చెప్పడంతో లవ్ యు అమ్మా అంటూ కౌగిలించుకొని , మా ఇద్దరినీ ఎత్తుకొని గుండెలకు హత్తుకొని రేపటి నుండి ఉదయమంతా మిమ్మల్ని విడిచి కాలేజ్ కు వెళ్ళాలి మీకు ok నా అని బాధపడుతూ అడిగింది.



అమ్మా , అమ్మా.........అంటూ ఇద్దరమూ అమ్మ బుగ్గలపై చెరొకవైపు ముద్దుపెట్టి , ఒకరికొకరు చేతులతో బుగ్గలపై కొట్టుకున్నట్లు తాకి ,  పొట్లాడుతూ అమ్మమ్మతో సంతోషంగా ఉంటాము అనే అర్థం వచ్చేట్లు సైగలు చెయ్యడంతో , అమ్మా అంటూ అమ్మమ్మ వైపు మూసిముసినవ్వులు నవ్వుతూ అమ్మమ్మ ను మీ అల్లరితో ఏడిపించేయ్యండి అని బుగ్గలపై గట్టిగా ముద్దులుపెట్టి చెప్పడంతో , మహితోపాటు ఇద్దరమూ సరే అన్నట్లు ముద్దుగా నవ్వడం చూసి , నా పని అయిపోయింది అంటూ మాఇద్దరినీ ఎత్తుకొని మిమ్మల్ని బొమ్మలతో ఎలా ఆడించాలో నాకు తెలుసు అంటూ ఎత్తుకొని కంపౌండ్ లోని తోటలోకి వచ్చింది.



తరువాత రోజు ఉదయమే కాలేజ్ కు రెడీ అయ్యి మాఇద్దరికీ కడుపునిండా పాలు అందించి టైం అయ్యేంతవరకూ బొమ్మలతో ఆడించి తన కారువరకూ ఎత్తుకొని ముద్దుచేస్తూ వచ్చి అమ్మమ్మా , అత్తయ్యలతో అల్లరి చెయ్యకుండా ఆడుకోవాలి అని చెప్పడంతో ఇద్దరమూ దీనంగా ఉండటం చూసి , ఒసేయ్ ఇందు నా మనవడు మనవరాలిని మాకు అందించి పోయి నీ టీచింగ్ నువ్వు చేసుకో వాళ్ళు ఎలా ఉండాలో చెప్పే పనిలేదు అంటూ అందుకొని , వీళ్ళు ఎంత అల్లరి చేస్తే మాకు అంత ఆనందం అని బాదులివ్వగానే ,



ఇద్దరమూ సంతోషన్గా నవ్వడం చూసి ఉమ్మా....ఉమ్మా......అంటూ మాకు చెరొక ముద్దుపెట్టి , మహేష్ మహి మీ అమ్మకు టాటా చెప్పి పంపించేయ్యండి మనం రచ్చ చేద్దాము అంటూ అమ్మమ్మ టాటా చెయ్యడం చూసి మేము కూడా టాటా చెయ్యడంతో , మీరంతా ఒకటైపోయారన్నమాట అంటూ దీనంగా నటిస్తూ ముఖం పెట్టి టాటా చెప్పి నవ్వుతూ సంతోషంతో టాటా చెప్పి వెళ్ళిపోయింది. 



మాకు సపోర్ట్ చేస్తూ ఆనందించిన అమ్మమ్మ లోపలికి వెళ్ళాక ఎలాంటి రచ్చ చేస్తారో ఆలోచిస్తూ లొలొపలే కాస్త జంకసాగింది. తను భయపడినట్లుగానే ఇద్దరమూ పొట్లాడుతూ ఇల్లుపీకి పందిరి వేస్తుండటాన్ని చూస్తూ ఉండటం తప్ప అమ్మమ్మా , అత్తయ్యా ఏమి చేయలేకపోయారు. మధ్యాహ్నానికల్లా భోజనం తయారుచేసి అమ్మ దగ్గరకు వెళదామా అని అడుగగానే అమ్మమ్మ మీదకు ఎగిరాము. సరే సరే అంటూ నలుగురమూ కాలేజ్ కు వెళ్ళగానే బ్రేక్ లో మాకోసమే ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు మాకారు కనిపించగానే వేగంగా వచ్చి అమ్మమ్మ చేతిలోని మాఇద్దరినీ ఎత్తుకొని హ్యాండ్ బ్యాగ్ లోని చాక్లెట్ బార్ లను అందించడంతో అమ్మా , అమ్మా..........అంటూ చీరను గట్టిగా పట్టుకొన్నాము. 



 మాతోపాటు కారులోకి ఎక్కి ముందుగా మాకు పాలు ఇచ్చి కాలేజ్ లో ఉన్న పార్క్ దగ్గరికి భోజనం చెయ్యడానికి కూర్చున్నారు. ఇంతలో చాలా మంది కాలేజ్ అమ్మాయిలు అమ్మదగ్గరికి వచ్చి మేడం ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నారు మీ ట్విన్స్ అంటున్నారే కానీ కేవలం నన్ను మాత్రమే ఎత్తుకొని , ఎందుకంటే అది లేడీస్ కాలేజ్ కాబట్టి ప్రతి ఒక్కరూ మార్చి మార్చి ఎత్తుకొని ముద్దులతో ముంచెత్తుతూ , హౌ స్వీట్ కొరుక్కుని తినేయ్యాలని ఉంది మేడం , మేడం పేరు అని అడగడంతో అమ్మ చెప్పేంతలో అమ్మమ్మ ఆపి వాడినే అడగండి అంటూ చిలిపిగా చెప్పింది. ఎంత ముద్దొస్తున్నావురా ఇంతకీ నీ పేరు ఏంటి కన్నా , బుజ్జి , బాబు , హీరో................... అంటూ లెక్కలేనన్ని ముద్దుపేర్లతో చాక్లెట్ లు అందిస్తూ అడిగారు.



ముందు కంగారుపడినా వాళ్ళ ప్రేమకు దాసుడైపోయినట్లు నవ్వుతూ ఎంజాయ్ చెయ్యడం మహి చూస్తూ కోపంతో అమ్మమ్మను గట్టిగా పట్టుకోవడంతో మొత్తం అర్థమై ఏమిచెయ్యాలో తెలియక బ్యాగులోని బొమ్మలను తీసి ఆడించబోయినా వినకుండా ఏడవడం మొదలెట్టింది. భోజనం చేస్తూనే అమ్మా ఇటివ్వు అంటూ ఒడిలో పడుకోబెట్టుకొని బుజ్జగించింది. నీ పేరేమిటో మాకు చెప్పవా హీరో ప్లీస్ ప్లీస్ అంటూ వారందరి పేర్లు చెప్పి ఇప్పుడు నీ పేరు అని అడిగారు. ఆగకుండా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఊహూ......ఊహూ.........అంటూ తల అడ్డంగా ఊపడం మొదలెట్టాను. మేడం చెప్పడం లేదు మీరే చెప్పండి బాబు పేరేమిటి అని అడిగారు. మా కన్నయ్యా ఊరికే ఎలా చెబుతాడు ఏదైనా valueble ఇచ్చి అడగండి అప్పుడు చెప్పకపోతే అడగండి అని బదులిచ్చింది. మేము తెచ్చినవన్నీ ఇచ్చేసాము ఏమే ఎవరితోనైనా ఏమైనా ఉన్నాయా అని నన్ను ఎత్తుకున్న అమ్మాయి అడిగింది. ప్చ్ ప్చ్...........అంటూ అందరూ ఖాళీ చేతులు చూప్పించారు.



బాగా ఆలోచించండి ......అంటూ తన బుగ్గపై చేతిని చూపించి గుర్తుచేసింది .ఆలోచించి..... అమ్మో ఈ హీరో సామాన్యుడు కాదు అంటూ ముందుగా ఎత్తుకున్న అమ్మాయి లేతగా బుగ్గపై ముద్దుపెట్టింది. ఇప్పుడు చెప్పు హీరో .............ఒసేయ్ నువ్వొక్కటే ముద్దుపెడితే చెప్పేస్తాడా , మేము కూడా ముద్దులుపెడితేనే చేబుతాడేమో అంటూ ఎత్తుకొని అందరూ ముద్దులతో ముంచెత్తుతుండటంతో , అమ్మా ఏంటిది అంటూ అమ్మమ్మతోపాటు అమ్మా మరియు గిరిజా చిలిపిగా నవ్వుతుండటం చూసి ఈ కాలేజ్ అమ్మాయిలకు అబ్బాయిలే కావాలేమో అన్నట్లు మహి కోపంతో అందరివైపు చూసి అటువైపు తిరిగింది. హీరో ఇంతకంటే మాదగ్గర valubles లేవు ఇప్పుడైనా చెప్పరా అని తియ్యగా బ్రతిమాలడంతో , అమ్మవైపు ఒకసారి చూసాను , చెప్పు నాన్నా అంటూ కళ్ళతో సైగ చెయ్యడంతో  మ హే ష్ ......అంటూ ముద్దుముద్దుగా చెప్పగానే , wow మహేష్ ..........ఆపేరు లోనే ఒక ఫీల్ లవ్ ఉంది అంటూ మళ్లీ ముద్దులతో ముంచెత్తుతూ ,



మరి నీ పేరు ఏంటి హీరోయిన్ అంటూ ఎత్తుకొని అడగడంతో శాంతించినట్లు ముద్దుగా మహి అని చెప్పడంతో , మహేష్ -- మహి లవ్లీ నేమ్స్ అంటూ మహిని కూడా ముద్దులతో ముంచెత్తి , మేడం మీరు భోజనం చెయ్యండి మహి మహేష్ లకు కాలేజ్ చూపించి వస్తాము అంటూ ఎత్తుకొని వెళ్లి వాళ్ళ క్లాస్ చూపించి మిగతావాళ్లకు కూడా మేడం ట్విన్స్ అని చెప్పగానే , అమ్మపై ఎంత అభిమానం ఉంది అంతా మా ఇద్దరి మీద చూపించి క్లాస్ సమయానికి అమ్మ దగ్గరికి తీసుకువచ్చి , మేడం రోజూ వస్తారా అని ఆతృతగా అడిగారు. అవును అని బదులివ్వడంతో హీరో రేపు ఇదే సమయానికి ఇక్కడే కలుద్దాము అని మేము కారులో బయలుదేరేంతవరకూ నన్ను ముద్దులతో ముంచెత్తి , మహేష్ రేపటి వరకూ ఆగడం మావల్ల కాదు అంటూ చిరుబాధతో అమ్మమ్మకు మా ఇద్దరినీ అందించి అమ్మతోపాటు క్లాస్ కు సంతోషంతో నవ్వుతూ వెళ్లిపోయారు.



గిరిజా అత్తయ్య కారు స్టార్ట్ చేయగానే మహి నా బుగ్గపై చేతితో కొట్టడం చూసి మంచిపని చేశావురా మహి లేకపోతే నిన్ను ఒంటరిగా వదిలి అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తాడా మీ అన్నయ్య తమ్ముడు అంటూ తన చెవిలో గుసగుసలాడి , ఇద్దరినీ ప్రాణంగా గుండెలపై హత్తుకొని మహేష్ మీ అక్కయ్యచెల్లిని అలా ఎప్పుడూ ఒంటరిని చెయ్యకూడదు అని ముద్దుచేస్తూ చెప్పినా , ఇద్దరూ చేతులతో ఒకరినొకరు కొట్టుకోవడం చూసి , వీళ్లకు లెక్చర్ ఇస్తే ఏమాత్రం నచ్చదు అంటూ నవ్వుతూ, కాలేజ్ అమ్మాయిలు ఇచ్చిన చాక్లెట్ లను మా ఇద్దరి రెండు చేతులలో పెట్టడంతో చేతులు ఖాళీ లేక చాక్లెట్ కవర్ ను కొరుకుతూ జరిగింది మరిచిపోవడంతో హమ్మయ్యా అంటూ కారు విండో లోనుండి బయట అందాలను చూపిస్తూ నవ్వించింది. 



కారులోనే అమ్మమ్మ గుండెలపై నిద్రపోవడంతో గిరిజా నెమ్మదిగా పోనివ్వమని చెప్పి ఇంటికి చేరుకొని బెడ్ పై తన ప్రక్కనే పడుకోబెట్టుకొని ఇద్దరికీ జోకొడుతూ సాయంత్రం అమ్మ వచ్చేన్తవరకూ నిద్రలోనే ఉన్నాము. అమ్మ వచ్చి నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టడంతో లేచి పాలుతాగి అర్ధరాత్రి వరకూ పొట్లాడుతూ అమ్మా , అమ్మమ్మలతో ఆడుకొని హాయిగా నిద్రపోయాము. మమ్మల్ని మధ్యలో పడుకోబెట్టుకొని సున్నితంగా జోకొడుతూ నిద్రలోకి జారుకున్నారు.
[+] 12 users Like Mahesh.thehero's post
Like Reply
రోజూ అదేవిదంగా జరుగుతూ ఎప్పుడో కానీ నాన్నతో గడుపుతూ , వీకెండ్స్ టెంపుల్స్ , picnics , zoo , beach............ఇలా ఒక్కోదానికి అమ్మ పిలుచుకొనివెళ్ళేది. ఎక్కడకు వెళ్లినా మా మధ్య మాత్రం చిలిపి అల్లరి జరుగుతూనే ఉండేది.



అలా మూడేళ్లు అమ్మా మరియు అమ్మమ్మ కౌగిలిలో ఆడుకున్న మేము కాలేజ్ లో చేరే ఆసన్నమయ్యింది.మాతో బాసరలో అక్షరాబ్యాసం చేయించి , అమ్మ కాలేజ్ కు దగ్గరలోని ఇంటర్నేషనల్ కాలేజ్ లో మా ఇష్టప్రకారమే జాయిన్ చేయించి , జాయినింగ్ రోజు కాలేజ్ డ్రెస్ లలో అందంగా మాఇద్దరినీ రెడీ చేసి , ముందుగా గుడికివెళ్లి మా పేర్ల మీద పూజ చేయించి అటునుండి నేరుగా కాలేజ్ చేరి , అందరి పిల్లల్లా ఏడవడం కాకుండా నవ్వడం చూసి మురిసిపోతూ , my ఏంజెల్స్ బంగారం అంటూ అమ్మ ముద్దులుపెట్టి అందరూ చెప్పేలాగా బాగా చదువుకోండి అని కాకుండా , కాలేజ్ లో బాగా ఆడుకోండి అని నవ్వుతూ చెప్పగానే అమ్మను గట్టిగా హత్తుకొని ఇద్దరమూ ముద్దులుపెడుతూ , ముందు నేనంటే నేను అంటూ ఒకరినోటికి ఒకరు చేతిని అడ్డుపెట్టి కోపంతో చూసుకొని ఒకేసారి చెరొకవైపు ముద్దుపెట్టాము.



మహేష్ -- మహి మీరు ఈరోజు నుండి కాలేజ్ లో చేరుతున్నారు , ఇప్పటి నుండైనా పొట్లాడుకోవడం ఆపి శ్రద్ధగా చదివి పెద్ద స్థానాలకు ఎదగాలి.........అంటూ లెక్చర్ ఇచ్చింది. అమ్మమ్మా అంటూ ఇద్దరమూ మాదగ్గరకు వేలు చూపించి పిలవడంతో , మా బంగారుకొండలు నాకు కూడా ప్రేమతో ముద్దుపెడతారేమో అంటూ మాదగ్గరికి వస్తుండగా , అమ్మకు మరియు అత్తయ్యకు మా ప్లాన్ అర్థమైనట్లు నోటికి చేతిని అడ్డంగా పెట్టుకొని మూసిముసినవ్వులు నవ్వుతున్నారు. అమ్మమ్మ దగ్గరకు రాగానే వొంగమని చెప్పి కల్లుమోసుకోగానే చెరొక చెంపపై చేతితో కొట్టి నవ్వుతూ బై అమ్మా , బై అమ్మమ్మా , బై అత్తయ్యా అంటూ బ్యాగులతోపాటు లోపలికివెళ్లిపోయాము. మీరు పిల్లలు కాదు పిడుగులు అంటూ షాక్ లో ఉన్న అమ్మమ్మను చూసి అమ్మ , గిరిజా అత్తయ్యా గట్టిగా నవ్వుకుని , అమ్మ అటునుండి కాలేజ్ వెళ్లడంతో అమ్మమ్మా , గిరిజా మొదటిరోజు కదా మేము కాలేజ్ లో ఏమైనా ఇబ్బందిపడతామేమో అని కాలేజ్ బయట కారులోనే మాట్లాడుతూ మద్యహం వరకూ కూర్చున్నారు.



కాలేజ్ లో కూడా మా చిలిపి పొట్లాటలు యధావిధిగా కొనసాగాయి , మధ్యాహ్నం కాలేజ్ బెల్ కొట్టగానే అమ్మమ్మా , అత్తయ్యా మాకోసం లోపలకు రావడంతో అమ్మమ్మా అంటూ పరిగెత్తుకుంటూ కాలేజ్ బాగుంది అని సంతోషంతో చెప్పాము. ఎందుకు బాగుండదు అంటూ మా క్లాస్ మిస్ అమ్మమ్మ దగ్గరికివచ్చి వీళ్ళిద్దరూ మీ మనవడూ మనవరాల్లా మరి క్లాస్ లో ఎవరెవరో అన్నట్లు ఒకటే చేతులతో కొట్టుకోవడం , మహా అల్లరి , అలా చేస్తున్నారని దూరం దూరం కూర్చోబెడితే ఒకటే ఏడుపు తరువాత అర్థమయ్యి ప్రక్కప్రక్కనే కూర్చోబెట్టగానే మళ్లీ అల్లరి మొదలు అని చెప్పగానే , అమ్మమ్మ గట్టిగా నవ్వి పిల్లలు కదా అంతే వదిలెయ్యండి కొన్నిరోజులు పోతే మా అందమైన ట్విన్స్ తెలుసుకుంటారు అని మరొక షాక్ ఇచ్చింది. ఏంటి వీళ్ళు కవలలా అందుకే అలా రోజూ నాపని అయిపోయినట్లే కానీ వీళ్ళ సంతోషమైన అల్లరి వల్ల మొదటిరోజు ఏడుస్తూ వచ్చిన మిగతా పిల్లలందరూ కాలేజ్ అంటే కొట్టడమే కాదు సంతోషన్గా ఏమైనా చెయ్యొచ్చు అని తెలుసుకొని కాలేజ్ పై ఉన్న అభిప్రాయాన్ని మార్చి మంచిపనే చేశారు గుడ్ మహేష్ - మహి , రేపటి నుండి మీ క్లాస్ పిల్లలంతా ఇంట్లో నుండి సంతోషంతో రావడం చూసి వాళ్ళ పేరెంట్స్ షాక్ చెందడం మాత్రం గ్యారంటీ , ఆ మొత్తం క్రెడిట్ మీదే అంటూ బుగ్గలపై ఆప్యాయంగా నిమిరి మధ్యాహ్నం కలుద్దాము అని చెప్పి నవ్వుతూ వెళ్ళిపోయింది. మొదటిరోజే మీ పొట్లాటలతో హీరోలు అయిపోయారు అంటూ మురిసిపోతూ ముద్దులుపెట్టి మీ అమ్మ దగ్గరికి వెళదాము అంటూ వెళ్లి అమ్మమ్మ జరిగిందంతా అమ్మకు చెప్పడంతో ప్రాణంగా హత్తుకొని ముద్దులతో ముంచెత్తింది.



రోజులు గడుస్తున్న కొద్ది చదువులో నేను యావరేజ్ అని మహి మాత్రం ఎప్పుడూ చాలా ఆక్టివ్ గా వినేది. కొన్ని నెలల తరువాత exams టైం టేబుల్ రావడంతో మహి అమ్మ ఒడిలో కూర్చొని బుక్ తీసుకొని చదివేది నేను మాత్రం అమ్మమ్మతో హాల్ లో ఆడుకునేవాడిని , కాలేజ్ లో చిన్నపిల్లలకు exams లో మొత్తం మిస్ స్వయంగా చెప్పి రాయించడం మామూలే కాబట్టి , తను dictate చేసినట్లల్లా చకచకా అందరూ రాసేస్తుండగా , మహికి అది నచ్చక క్లాస్ బయటకువెళ్లి సొంతంగా రాయడం చూసి స్టాఫ్ మొత్తం చూసి ఆశ్చర్యపోయి పొగడ్తలతో ముంచెత్తారు.



కొన్ని రోజుల తరువాత ప్రోగ్రెస్ రిపోర్ట్స్ తో ఇంటికి వచ్చాము. కాపీ కొట్టి అన్ని రాయడం వల్ల తనకంటే ఎక్కువ మార్కులు రావడంతో , అమ్మమ్మకు ఈ విషయం తెలియక మహేష్ నీకే ఎక్కువ వచ్చాయి కంగ్రాట్స్ అంటూ ముద్దులతో ముంచెత్తడం చూసి నాపై మరింత కోపంతో ఏడుస్తూ అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయింది. ఏమయ్యింది మహి అంటూ రిపోర్ట్స్ చూసి నాకు మొత్తం తెలుసు మీ మిస్ నాకు కాల్ చేసి మొత్తం చెప్పింది. నీకెన్ని మార్కులు వచ్చినా you should feel proud అంటూ ముద్దుచేసి కంగ్రాట్స్ అంటూ పెద్ద చాక్లెట్ ఇచ్చింది. రాత్రి వచ్చాక నాన్నకు చూపిస్తే గుడ్ అని మాత్రమే చెప్పేసి మైకంతో రూమ్ లోకి వెళ్లిపోయారు.



ఇక నెక్స్ట్ రోజు నుండి మా పొట్లాట అల్లరి అంతకంతకూ పెరుగుతూ పండగల సెలవులకూ , వేసవి సెలవులకూ అమ్మమ్మ ఊరికి వెళ్లి సరదాగా తోటలలో గడిపేవాళ్ళము. నేను చదువుని neglect చేస్తూ మహి చదువులో రాణిస్తూ , చూచిరాతలతో నెగ్గుకువచ్చి ఎలిమెంట్రీ పూర్తిచేసాము.



వేసవి సెలవులో సౌత్ ఇండియా టూర్ ఎంజాయ్ చేసి సెకండరీ కాలేజ్ లో జాయిన్ అయ్యాము. అక్కడా అలాగే ఉంటుందని ఏమీ చదువుకోకుండా exam కు వెళ్లి టీచర్స్ నుండి ఎటువంటి సహాయం లేకపోవడంతో తెలిసినవి , క్లాస్ లో విన్నవి గుర్తుకురావడంతో అవి మాత్రమే attempt చేసి exams పూర్తి చేసి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ తో ఇంటికి చేరుకున్నాము. మహి క్లాస్ ఫస్ట్ అని తెలియడంతో అందరూ సంతోషంతో మురిసిపోయారు , నాది అడగడంతో మహి ఇప్పుడు తెలిసిందా ఎవరు గ్రేట్ అని గర్వంతో చూస్తూ నవ్వుతుండటంతో , అప్పుడే నాన్న వచ్చి చూసి జస్ట్ పాస్ నిన్ను ఇలా కాదు అంటూ ఆఫీస్ టెన్షన్ ను నాపై కొట్టి తీర్చుకుంటుండగా , మహి వెళ్లి తమ్ముడిని కొట్టొద్దు నాన్నా అంటూ నాతోపాటు ఏడుస్తుండటంతో , వెంటనే అమ్మా , అమ్మమ్మా వచ్చి మమ్మల్ని నాన్న నుండి ఎత్తుకొని పిల్లలతో ప్రేమగా ఒక్కరోజు కూడా గడపలేదు కానీ కొట్టడానికి మాత్రం రెడీ అయిపోయావురా అనగానే అమ్మవైపు మరియు నావైపు కోపంతో చూస్తూ లోపల రూంలోకి వెళ్ళిపోయాడు. 



మహి వల్లనే నాకు దెబ్బలు తగిలాయని తనవైపు కోపం మరింత పెంచుకున్నాను. అమ్మ నన్ను ఓదార్చి బుజ్జి కన్నా నీకు చదువు మీద ఇంటరెస్ట్ లేదని నాకు ఎప్పుడో తెలుసు , ఈ ప్రపంచంలో అందరూ ఫస్ట్ రావాలంటే కుదరదు. నీకు లెక్చర్ ఇవ్వడం నచ్చదు అని తెలుసు నా బుజ్జికన్నా , ప్రతి ఒక్కరూ చదువుకునే పై స్థాయిలోకి రాలేదు , సగం మంది స్పోర్ట్స్ ద్వారా కూడా ఆ స్థాయిలను చేరుకున్నారు. నీకు ఆడుకోవడం అంటే ఇష్టము కదా బుజ్జికన్నా కాబట్టి ఒక్కటీ వదలకుండా అన్ని స్పోర్ట్స్ లలో నువ్వు ఫస్ట్ ఉన్నావానుకో మీ అక్కయ్య మహితోపాటు సమానంగా ఉండవచ్చు. కావాలంటే మా కాలేజ్ లో నేషనల్ స్థాయిలో ఎంతోమందిని తీర్చిదిద్దిన PET మేడం ను నీకు పరిచయం చేస్తాను తన సలహాలతో నువ్వు కూడా నేషనల్ స్థాయికి ఎదగవచ్చు అని చెప్పగానే , ఇప్పటికి నా గోల్ దొరికిందని సంతోషన్గా నవ్వుతూ మా అమ్మ ఎలా చెబితే అలా అంటూ గట్టిగా కౌగిలించుకొని , వెంటనే వదిలి అది నాకు అక్క ఏంటి ఈరోజు నుండి నాకు చెల్లి అంటూ అమ్మ నుండి కిందకు దిగి , ఒసేయ్ చదువులో ఫస్ట్ వచ్చావని ఫోజ్ కొట్టి నాన్న నన్ను కొట్టేలా చేస్తావుకాదూ , రేపటి నుండి చూడు స్పోర్ట్స్ లో నీకంటే మంచి పేరు ఎలా సంపాధిస్తానో అని ఛాలెంజ్ విసిరాను.



నన్ను చెల్లి అని పిలుస్తావా మనమిద్దరము ఒకేసారి పుట్టాము , లేడీస్ ఫస్ట్ కాబట్టి అమ్మ నన్ను ముందుగా కని ఉంటుంది కాబట్టి నువ్వు నీ పొగరుని తగ్గించుకొని నన్ను అక్కా అని పిలవాల్సిందే అంటూ గర్వంగా చెప్పింది. అదేమీ కాదు నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలంటే అన్నయ్య ఉంటేనే మంచిదని అమ్మ నన్ను ముందుగా కనింది , నిన్ను కంటికి రెప్పలా చూసుకోవాల్సింది నేనే  కాబట్టి నోర్మూసుకొని అన్నయ్యా అని పిలువు .............అని మాటలతోనే పిల్ల మనస్సుతో పొట్లాడుకోవడం చూసి ముగ్గురూ నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు.



లేదు నేనే అక్కయ్యను ......లేదు నేనే నీకు అన్నయ్యను ........అంటూ ఇద్దరమూ అమ్మ దగ్గరకు వెళ్లి నువ్వే చెప్పమ్మా మాఇద్దరిలో ఎవరు పెద్ద అని అడుగగానే , అటు తిప్పి ఇటు తీపి నన్ను బలిపశువును చేస్తున్నారా ..........అయినా నాకు ఎలా తెలుస్తుంది నేను స్పృహలో లేను కదా ......., మరి ఎవరికి తెలుసమ్మా అంటూ కోపంగా సడెన్ గా ఆడిగేసరికి, అది అది........అంటూ ఆ..... మీకిష్టమైన , మీరంటే చెప్పలేనంత ప్రేమను పెంచుకున్న మీ అంటీ డాక్టర్ రేణుక కు తెలుసు అని మాట జారింది. అయితే అంటీ కి కాల్ చేసి అడుగమ్మా ఇది ఇక్కడితో తెలిపోవాలి అంటూ ఇద్దరూ మొండిగా ఉండటంతో , ఇక తప్పదన్నట్లు అంటీకి కాల్ చేయగానే , నా అల్లరి పిడుగులు ఏమి చేస్తున్నారు అంటూ నవ్వుతూ అడిగింది. వాళ్లకేమి బాగా ఉన్నారు ......,  అక్కా పెద్ద సమస్య వచ్చి పడింది , జాగ్రత్తగా వినండి చాలా చాలా సున్నితమైనది అంటూ మాట్లాడుతుండగానే మహి చిన్న మొబైల్ అందుకొని స్పీకర్ on చేసి అంటీ మాఇద్దరిలో ఎవరు పెద్ద ముందుగా అధీమాత్రమే చెప్పండి అని కోపంతో అడగడంతో ,



పరిస్థితి మొత్తం అర్థమైపోయి ఇందు చివరగా నన్ను ఇన్వాల్వ్ చేసారన్నమాట అని నవ్వుకుని ఆలోచించి, మహి ఏంజెల్ చాలా సంవత్సరాలైపోయింది కదరా సరిగ్గా గుర్తులేదు అనగానే ముగ్గురూ గుండెలపై చేతులను వేసుకొని థాంక్స్ అక్కా , రేణుకా అంటూ ఊపిరిపీల్చుకున్నారు. అంటీ వీడితో అదే నా ముద్దుల తమ్ముడితో ఇదే సమస్య బాగా ఆలోచించి నేనే వాడి అక్కయ్యను అని వాడికి చెప్పండి అని మాట్లాడుతుండగానే , మొబైల్ లాక్కొని అంటీ నేనే తనకు అన్నయ్యను అని చెప్పండి అంటూ మహి తలపై సున్నితంగా మొట్టికాయ వేసి చెప్పాను. అమ్మా చూడమ్మా వాడు అంటూ అమ్మప్రక్కకు చేరిపోయింది. నవ్వుతూ అలా అమ్మ కొంగులో దాచుకో అని చెప్పి , అంటీ ఏమిచేస్తారో తెలియదు బాగా ఆలోచించి చెప్పండి బై అంటూ కాల్ కట్ చేసాను.



అమ్మ దగ్గరకు మొబైల్ తీసుకెళ్లి అమ్మా పదా మేడం ను కలిసి వద్దాము అని చెయ్యిపట్టి లాగాను. ఇప్పుడా చీకటిపడుతోంది రేపు లంచ్ సమయంలో కలుదిద్దాములే కన్నయ్యా ........., రెపటివరకూ ఆగడం నావల్ల కాదు ఇప్పుడు కలిసి రేపు ఉదయం నుండి రంగంలోకి దిగాల్సిందే అంటూ బయటకు లాక్కొనివేళ్ళాను. గిరిజా అత్తయ్య కారు తాళాలు తెచ్చి ఇవ్వడంతో కారులో మేడం ఇంటికి చేరుకున్నాము. ఇందు ఇన్నాళ్లకు మాఇంటికి వచ్చావు లోపలకు రా అని పిలిచి మర్యాదలు చేసిన తరువాత , అమ్మ విషయం చెప్పడంతో నవ్వుకుని పిల్లలిద్దరూ పొట్లాడి ఆవేశంలో తీసుకున్న నిర్ణయం అయి ఉంటుంది ఉదయానికల్లా అంతా మరిచిపోతారు అని చెబుతుండగానే , అంటీ ఆవేశంలో తీసుకున్నది కాదు ......మీరు సహాయం చేస్తారని వచ్చాము అని కోపంతో బదులిచ్చాను. 



మేడం ఆశ్చర్యపోయి నాకళ్ళల్లో ఒక స్పార్క్ కనిపించినట్లు sorry మహేష్ నాతోరా అంటూ అవలీలగా నన్ను ఎత్తుకొని బయటకు నడిచి నీ ఫ్యూచర్ నాకు కనబడుతోంది , స్పోర్ట్స్ లలో రాణించాలంటే ముందు ఫిట్నెస్ గా ఉండాలి , దానికోసం ఏమి చెయ్యాలి మేడం ...., ఇప్పటిదాకా అంటీ అని పిలిచావు కదా అలాగే పిలు మహేష్ అంటూ బుగ్గపై ముద్దుపెట్టి , ఉదయం నుండి ఏమేమి చెయ్యాలో ఎనర్జీ కోసం ఎటువంటి ఫుడ్ తీసుకోవాలో ........వివరించి ముందు ఇలా కొన్ని నెలలపాటు చేస్తూ స్పోర్ట్స్ , గేమ్స్ గురించి మొత్తం తెలుసుకోవాలి అని చెప్పింది. అంత కష్టపడాలన్నమాట అని కొన్ని క్షణాలు ఆలోచించి ఏది ఏమైనా సరే అంటీ నేను రెడీ ముందు మీరు చెప్పినట్లు చేస్తాను అని చెప్పి బలవంతం చెయ్యడంతో అమ్మతోపాటు అక్కడే భోజనం చేసి ఇంటికి చేరుకొని రేపటి నుండి చూడు చెల్లి అంటూ మహివైపు నవ్వుతూ చూసి వెళ్లి మాఇద్దరి రూంలో అప్పటివరకూ బెడ్ లను దూరం జరిపి ఒకదానిపై పడుకున్నాను.



ఉదయం తెల్లవారక ముందే లేచి ఇంటితలుపులు తీసుకొని సెక్యూరిటీకి జాగింగ్ వెళుతున్నానని చెప్పి దగ్గరలోని గ్రౌండ్ వైపు చిన్నగా పరిగెత్తాను. వెంటనే సెక్యూరిటీ గేట్ కు తాళం వేసి నా వెనుకనే నన్ను సేఫ్ గా చూసుకోవడానికన్నట్లు గ్రౌండ్ కు వచ్చారు. గ్రౌండ్ కు చేరుకొని మొదటిరోజు కాబట్టి గ్రౌండ్ చుట్టూ ఒకేఒక రౌండ్ మరియు కొన్ని pushup లు తీసి తెల్లవారాక ఇంటికి చేరుకోవడంతో , నేను ఎక్కడా కనబడక , ఇంటి తలుపు తెరిచి ఉండటం మరియు సెక్యూరిటీ కూడా లేకపోవడం వల్ల అమ్మా , అమ్మమ్మా కంగారుపడుతుండటం చూసి సెక్యూరిటీతోపాటు గేట్ తాళం తీసుకొని వచ్చి అమ్మా అంటూ వొళ్ళంతా చేమటలతో పిలువగానే కన్నయ్యా అంటూ అమాంతం సంతోషంతో కౌగిలించుకొని విషయం తెలుసుకుని అప్పుడే మొదలెట్టేసావా అంటూ ముద్దులతో ముంచెత్తుతుండగా , అమ్మా చెమట పెదాలకు అంటుకుంటుంది. ఈ అమ్మ అంటే ఎంతప్రేమ అంటూ చెమటపైనే ముద్దుల వర్షం కురిపించి కంగారుపడుతున్న అమ్మమ్మకు అందించి , సెక్యూరిటీ దగ్గరకు వెళ్లి రెండు చేతులతో నమస్కరించి థాంక్స్ చెప్పింది. ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. 



ఆరోజు నుండి అంటీ మొబైల్లో మరియు లంచ్ సమయంలో చెప్పినట్లు చేస్తూ కాలేజ్ PET ఆశ్చర్యపోయేలా ప్రతి గేమ్ గురించి రూల్స్ మొత్తం తెలిసినట్లు నాకంటే పెద్దవారితో కోకో , కబడ్డీ , క్రికెట్ , వాలీ బాల్ ........ మరియు అథ్లెటిక్స్ లో పోటీపడుతూ ముందుగా చివరన వస్తూ రెండేళ్లు గడిచేకొద్దీ ఇంట్లో విటమిన్ ఫుడ్ మరియు స్పోర్ట్స్ వల్ల పూర్తి ఫిట్నెస్ సాధించి థర్డ్ , సెకండ్ చివరగా ఫస్ట్ రావడంతో కాలేజ్ మొత్తం నా పేరు మారుమ్రోగిపోవడంతో ఇంట్లో మరియు అంటీ ఆనందానికి అవధులు లేవు. మహి క్లాస్ లో మాత్రమే ఫస్ట్ నేను కాలేజ్ కే స్పోర్ట్స్ లో ఫస్ట్ వచ్చినట్లు పెద్ద కప్ అందుకొని గర్వంగా మహివైపు కాలర్ ఎగరేస్తూ , నాన్నకు కూడా నవ్వుతూ చూపించి అమ్మకు అందించాను. నా కూతురు చదువులో నెంబర్ వన్ , నా కన్నయ్య స్పోర్ట్స్ లో నెంబర్ వన్ అంటూ ప్రాణంగా గుండెలకు హత్తుకొని ఆనందబాస్పాలతో మురిసిపోవడం చూసి అమ్మమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.



త్వరలో exams రాబోతున్నాయిగా తమ్ముడి ఎలా రాస్తాడో చూద్దాము అని తను కాలర్ ఎగరేస్తూ అమ్మామ్మా షాపింగ్ వెళ్ళాలి పదా అంటూ కారులో ఇద్దరే గిరిజాతోపాటు మాల్ కు వెళ్లి ఒక మంచి జామెట్రీ బాక్స్ తీసుకొంది. మరి మీ అన్న............ కాదు కాదు అంటూ లెంపలేసుకొని మీ తమ్ముడికి అని అడిగింది. వాడు క్లాస్ లో ఎప్పుడు ఉన్నాడు గనుక ఎప్పుడూ PET తో గ్రౌండ్ లో ఉంటాడు , రేపటి నుండి డయాగ్రామ్స్ స్టార్ట్ చేస్తున్నారు అందరూ జామెట్రీ బాక్స్ తీసుకురమ్మని మాథ్స్ మేడం చెప్పింది , వాడికి తీసుకుంటే డబ్బుకు వేస్ట్ గ్రౌండ్ లో పడేస్తాడు పదండి అంటి ఒక్కటే తీసుకొని పే చేసి  బయటకు వచ్చి కారులో కూర్చోంది. మహి కొద్దిగా తల నొప్పిస్తోంది zandubalm తీసుకొస్తానని కారులోనే కూర్చోమని గిరిజా జాగ్రత్త ఇప్పుడే వచ్చేస్తానని మాల్ లోపలికివెళ్లి మరొక జామెట్రీ బాక్స్ తీసుకొని చీరలో దాచుకొనివచ్చి మహికి కనిపించకుండా గిరిజాకు దాచమని ఇచ్చిమహితోపాటు వెనుక కూర్చొని ఇంటికి చేరుకున్నాము.



తరువాతిరోజు కాలేజ్ చేరుకోగానే నేను నేరుగా గ్రౌండ్ లోకి మహి క్లాస్ కు వెళ్లాము. ఆరోజు PET లీవ్ లో ఉండటంతో ఏమిచెయ్యాలో తోచక క్లాస్ కు వెళ్ళాను. మొదటి పీరియడ్ నే మాథ్స్ అందరూ జామెట్రీ బాక్స్ తెచ్చుకున్నారా అని చెక్ చేస్తుండగా నాతో లేకపోవడంతో లేపి స్పోర్ట్స్ మాత్రమే కాదు హీరో చదువు కూడా ఉండాలి అంటూ రెండు దెబ్బలు కొట్టి రేపటి నుండి బాక్స్ తెస్తేనే క్లాస్ కు రమ్మని బయటకు పంపడంతో అందరితోపాటు మహికూడా గట్టిగా నవ్వడం నాకు మరింత కోపాన్ని పెంచింది. అందుకేనా షాపింగ్ వెళ్ళింది నాకుకూడా ఒకటి తేవచ్చు కదే దెయ్యం అంటూ కోపంతో చూస్తూ గ్రౌండ్ లోకి వెళ్లి ఒక్కడినే బాస్కెట్బాల్ అందుకున్నాను. మహి ప్రక్కనే కూర్చున్న ఫ్రెండ్ మహి బాక్స్ చూసి ఎంతబాగుంది,  మానాన్నను బాక్స్ కొనివ్వమంటే , 7th క్లాస్ కే బాక్స్ లో అన్ని అవసరం లేదని విడివిడిగా కొనిచ్చారు ఇది ఇది.........అంటూ చూపించి , డివైడర్ అందుకొని నాన్నగారు ఇది అవసరం లేదని కొనివ్వలేదే ఎంతబాగుంది అంటూ వంకరలు తిప్పుతూ చూసి క్లాస్ అయిపోగానే మహికి తెలియకుండా తీసుకొని దాచేసుకుంది. మాథ్స్ క్లాస్ అయిపోయిందని చూడకుండానే బ్యాగులో పెట్టేసింది.



గ్రౌండ్ లో ఒక్కడినే బోర్ కొట్టి క్లాస్ లోకి వచ్చి మహి పక్కనే కూర్చుని జామెట్రీ బాక్స్ లాక్కొని మొత్తం చూసి , నువ్వు చెల్లివి కాబట్టి ఈ అన్నయ్య గురించి ఆలోచించలేదు , అదే నేనయ్యుంటే నా రాక్షసి చెల్లెలి కోసం కూడా తెచ్చేవాణ్ణి ఇప్పటికైనా అన్నా అని పిలు అంటూ నెత్తిపై మొట్టికాయ వేసి బాక్స్ తన బ్యాగులో పెట్టేసి ఎలాగోలా సాయంత్రం వరకూ క్లాస్ లో కూర్చొని కాలేజ్ వదలగానే కారు దగ్గరకు చేరి అమ్మమ్మా , అమ్మమ్మా ......బాక్స్ తేలేదని తమ్ముడి చేతులపై రెండు గట్టి దెబ్బలు పడ్డాయి అంటూ సంతోషన్గా నవ్వుతూ చెప్పింది. అమ్మమ్మ ఎంతపని చేసాను బాక్స్ ఇవ్వడం మరిచిపోయానే ఏదీ చూడనివ్వు అని చూసి దెబ్బపడిన చోట కన్నీళ్ళతో ముద్దులుపెట్టడం చూసి , మహి కూడా బాధపడింది. అమ్మమ్మా ఏడవకు నొప్పి ఏమీ లేదులే అంటూ చేతులను మడిచి చూపించడంతో ,నువ్వు స్ట్రాంగ్ కన్నయ్యా అంటూ హత్తుకొని ప్రేమగా ముద్దుపెట్టింది.



ఇంటికి చేరుకోగానే మహి అమ్మకు చెప్పడానికి కారు దిగి లోపలకు పరిగెత్తింది. Sorry కన్నయ్యా నిన్ననే కొన్నాను ఇవ్వడం మరిచిపోయాను అని బాధగా చెప్పింది. లవ్ యు అమ్మమ్మా అంటూ బుగ్గపై ముద్దుపెట్టి లోపలకు రూంలోకి వెళ్లి తెరిచి ఒక్కొక్కటే చూస్తున్నాను. అమ్మా ఈ బాక్స్ లేదని అంటూ బాక్స్ తీసి డివైడర్ లేకపోవడం చూసి ఉండమ్మా వాడే తీసుకొని ఉంటాడు అని రేయ్ రేయ్ అంటూ ఇల్లంతా వెతికి మా రూంకు రావడం గాలికి జామెట్రీ బాక్స్ పై పేపర్ అడ్డుపడటం , అదే సమయానికి డివైడర్ తో ఏంటి పని అని చూస్తుండటం చూసి కోపంగా లోపలకువచ్చి నా చెంపపై దెబ్బ వేసి నాదే దొంగతనం చేస్తావా అంటూ లాక్కొని అందుకేరా నిన్ను తమ్ముడూ అని పిలిచేది అంటూ వెళ్లిపోతుండటంతో, రాక్షసి అది నాది అంటూ లాక్కొని ప్రాసెస్ లో గుచ్చుకుంటుంది అని కూడా పట్టించుకోక ఇద్దరమూ గట్టిగా చెరొకవైపు పట్టుకొని లాగుతూ లాగుతూ తనకంటే బలం ప్రయోగించడంతో మహి కడుపులో రెండు డివైడర్ కు ముందు ఉండే సూదులు దిగిపోయి ఇద్దరమూ కదలటంతో ప్రక్కనే చీలిపోయి  నొప్పి వలన అమ్మా అంటూ బిల్డింగ్ మొత్తం వినిపించేలా బాధతో అరిచింది. చేతులలో రక్తం చూసి డివైడర్ ను వదిలేసి అమ్మా అని నేను కూడా గట్టిగా అరిచి షాక్ లో కదలకుండా తన కన్నీటిని చూస్తూ ఉండిపోయాను.
Like Reply
కొత్త కథ తో మమ్మల్ని అలరించడానికి వత్సవా సోదరా .ఆరంభం అదిరిపోయింది .
ఇప్పుడు మహి చెల్లి(అక్క) గా అలరిస్తుంది మీరు ఎ కథ అయిన మీ కథనం మాత్రం అద్భుతమే. చాలా చక్కగా అందంగా వర్ణిస్తారు.
వీలైనంత వరకు కథలో పాత్రలతో మాకు అనుబంధాన్ని కలిగించేలా రాస్తారు. ఎప్పుడు మహి కి మహేష్ ప్రాణం కానీ ఇప్పుడు ఇద్దరి మధ్య గిల్లికజ్జాలు తో మొదలు పెట్టారు. చూద్దాం ముందు ముందు ఎలా అలరిస్తారో
Like Reply
Thank you soooooo much mithrama.
Like Reply
Nice story and eagerly waiting for next update
Like Reply
(26-08-2019, 11:49 AM)nkp929 Wrote: కొత్త కథ తో మమ్మల్ని అలరించడానికి వత్సవా సోదరా .ఆరంభం అదిరిపోయింది .
ఇప్పుడు మహి చెల్లి(అక్క) గా అలరిస్తుంది  మీరు ఎ కథ అయిన మీ కథనం మాత్రం అద్భుతమే.  చాలా చక్కగా అందంగా వర్ణిస్తారు.
వీలైనంత వరకు కథలో      పాత్రలతో మాకు అనుబంధాన్ని కలిగించేలా రాస్తారు. ఎప్పుడు మహి కి మహేష్ ప్రాణం కానీ ఇప్పుడు ఇద్దరి మధ్య గిల్లికజ్జాలు తో మొదలు పెట్టారు. చూద్దాం ముందు ముందు ఎలా అలరిస్తారో

హృదయపూర్వక ధన్యవాదాలు సోదరా nkp.
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
Nice update bro..... Nice starting
మీ
Umesh
Like Reply




Users browsing this thread: 348 Guest(s)