Thread Rating:
  • 40 Vote(s) - 2.63 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
(22-07-2019, 04:31 PM)Chiranjeevi Wrote: మిత్రమా మీకు వీలుంటే మీ అమూల్యమైన అప్డేట్ పోస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మీ శ్రమ్మకు మేము పొందే ఆనందం అంతా ఇంతా కాదు మీ అమూల్యమైన కథలు కాదు కాదు నవల్లు గ్రంధాలు ఆపూర్వ రాత మీది మా ఆనందం కోసం కేటాయించిన సమయం మేము మీకు తిరిగి ఇవలేనిధి

రేపు ఉదయం అప్డేట్ తో మీ ముందుకు వస్తాను మిత్రమా. Stay tuned.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
ధన్యవాదాలు మిత్రమా
Like Reply
సుబ రాత్రి
[+] 1 user Likes Chiranjeevi's post
Like Reply
ధన్యవాదములు మహేష్ గారూ
Like Reply
Thanks and waiting for update
Like Reply
(21-07-2019, 09:03 AM)rajusatya16 Wrote: What a update really it's very nice and heart touching

Heartfully thanks మిత్రమా.
Like Reply
(20-07-2019, 04:19 PM)saleem8026 Wrote: Nice story nice updates

Thank you so much.
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
అమ్మ మరియు మహి నవ్వులకు మెలకువరాగా సమయం చూడగా 8 గంటలు అవుతుండగా లేచి బయట వాళ్ళ దగ్గరకు వెళ్లి మహి సంతోషాన్ని చూసి మురిసిపోతూ అమ్మ భుజం పై తల వాల్చి తన నవ్వునే చూస్తూ లవ్ యు మా అనగా , గుడ్ మార్నింగ్ కన్నయ్యా అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టగా , మహి కూడా గుడ్ మార్నింగ్ చెప్పగా , గుడ్ మార్నింగ్ అంటూ అమ్మ టిఫిన్ కు ఏంటి అని అడుగగా పూరి చేసాము కన్నయ్యా మధ్యాహ్నానికి మహికి నాకు చికెన్ బిరియాని తినాలని ఉంది అనగానే లోపలకు వెళ్లి కారు తాళాలు అందుకొని అమ్మా చికెన్ తెస్తాను బిరియాని అధిరిపోవాలి అంటూ బయలుదేరగా , మహేష్ టిఫిన్ తిని వెళ్లు అనగా ఆగిపోయి ,



బాత్రూం లోకి దూరిపోయి స్నానం చేసి వచ్చి సోఫాలో చేతులు కట్టుకొని కూర్చోగా , వంట గదిలో నుండి చూసి మహి కన్నయ్య అలా కూర్చున్నాడంటే మనమే తినిపించాలి లేకపోతే అస్సలు తినడు చూడు కావాలంటే ఈ ప్లేట్ తీసుకొనివెళ్లి ఎదురుగా ఉంచు అనగా , మహి నవ్వుతూ అలాగే పెట్టి అమ్మ దగ్గరకు వెళ్లగా తినకుండా ప్లేట్ నే చూస్తూ కూర్చోగా ఇద్దరూ లోపల నుండి చూస్తూ చిలిపిగా నవ్వుకుని ఉండండి అంటీ అంటూ హాల్ లోకి వచ్చి మహేష్ ఏంటి ఇంకా తినలేదు ఆకలిగా లేదా లేక రుచిగా లేవా చాలా కష్టపడి నీకోసం ఇష్టపడి చేసాను , అయినా నీకు నచ్చలేదు అంటూ బాధపడుతున్నట్లుగా నటించగా , మహి నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను అంటూ అందుకొని తినబోగా ,



అందంగా నవ్వుతూ నా చెయ్యి ఆపి sorry మహేష్ అంటీ మీరు రావచ్చు అని పిలువగా వచ్చి  నన్నే చూస్తూ మహి చిన్నప్పటి నుండి ఇప్పటివరకూ ఇలా మారాము చేసినప్పుడు నేను తినిపించకపోతే తినకుండా అలాగే ఉండే కన్నయ్య నువ్వు బాధపడతావని స్వయంగా తనే తినబోయాడు అంటూ ఓర కంటితో చిరుకోపంతో చూడగా చిలిపిగా నవ్వుతూ తలదించుకోగా , ఎన్నోసార్లు నన్ను ఇలా ఇబ్బందిపెట్టి అమ్మను నేను బ్రతిమిలాడినా బెట్టు దిగని కన్నయ్య నీకోసం అంటుండగా , మరి friendship అంటే అంతే అత్త..........అంటీ అనగా , అమ్మ కళ్ళల్లో ఒక్కసారిగా ఆనందబాస్పాలు రాగా చూసి , ఏమి చెయ్యాలో తెలియక లేచి అమ్మను నా గుండెలపై వాల్చుకోగా , కంగారుపడుతూ మహి లేచి అంటీ ఏమయ్యింది అంటూ అమ్మ చేతిని అందుకొని ప్రేమగా స్పృశిస్తూ , కళ్ళతోనే ఏమయ్యింది మహేష్ అని అడుగగా ,



అమ్మ ఒకరిని ప్రాణంగా చూసుకోవాలని ఆశపడ్డారు తను గుర్తుకువచ్చింది అందుకే ఉద్వేగానికి లోనయ్యింది అంటూ అమ్మను ఓదార్చి అమ్మా ఆకలి వేస్తోంది అనగా అయ్యో నా మతిమండా అంటూ నన్ను సోఫాలో కూర్చోబెట్టి నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి కన్నీళ్లను తుడుచుకుని sorry రా మహి నిన్ను కంగారుపెట్టాను అనగా , అంటీ ఆ అదృష్టవంతురాలు ఎవరు అని అడుగగా ను.............అమ్మా ........నీలాంటి అందమైన గుణవంతురాలు మహి అంటూ మహి చెంపపై ప్రేమగా తాకుతూ చెప్పగా , హమ్మయ్యా అంటూ గుండెలపై చేతిని వేసుకోగా , అంటీ తనను నాకు కూడా చూడాలని చాలా చాలా ఆత్రంగా ఉంది అంటీ పరిచయం చేస్తారా అని అడుగగా , ఇప్పుడు తను మాకు అందనంత దూరంగా ఉంది మహి అంటూ మరింత ఉద్వేగానికి లోనయ్యి ఎక్కడ మేము బాధపడతామో అని కంట్రోల్ చేసుకొని కన్నయ్యా తిను అంటూ నవ్వుతూ తినిపించగా , అంటీ మరి నాకు అంటూ బుంగమూతిపెట్టుకోగా సంతోషంగా నవ్వుతూ తనకు కూడా తినిపించగా , 



కడుపు నిండా తినేసి అమ్మా వెళ్లి చికెన్ మరియు బిరియానికి కావాల్సినవన్నీ తెచ్చేస్తాను బిరియాని ఎలా ఉండాలంటే జీవితంలో మరిచిపోకూడదు అంటూ ఫీల్ అవుతూ చెప్పగా , ఈరోజు మహి చేస్తోంది నేను సహాయం మాత్రమే చేస్తాను అనగా అయితే టేస్ట్ మరింత అదిరిపోతుంది అంటూ ఫీల్ అవుతుండగా , అమ్మ అంటే ఇప్పటివరకూ నేను చేసిన బిరియాని అంత టేస్ట్ గా ఉండేది కాదన్నమాట అంటూ చిలిపిగా బాధపడగా , అలా కాదమ్మా మా అమ్మ ఒక్కరే చేసినప్పుడే అద్భుతంగా ఉండేది ఇప్పుడు మహి కూడా జతకలిసి చెయ్యబోతుండగా ఇంకెంత రుచిగా ఉండబోతోంది అన్నాను అంతే అంటూ అమ్మ నుదుటిపై ముద్దుపెట్టగానే , పెదాలపై చిరునవ్వు రాగా మహి మా ఇద్దరి అనురాగాన్ని చూసి సంతోషన్గా మురిసిపోయింది.



బయటకు కారులో వెళుతూ కృష్ణ గాడికి కూడా కాల్ చేసి రమ్మని చెప్పి చికెన్ తోపాటుగా కావాల్సినవన్నీ తీసుకొని ఇంటికి చేరుకోగా మహి , అమ్మ బిరియాని తయారుచేయడంలో మునిగిపోగా మసాలా స్మెల్ ఆస్వాదిస్తూ టీవీ చూస్తూ కూర్చోగా కొద్దిసేపటి తరువాత అమ్మా అమ్మా .........ఏమి ఘుమఘుమలు అంటూ కృష్ణ గాడు లోపలికి రాగా కృష్ణా ఎలా ఉన్నావు ఎన్ని రోజులయ్యింది నిన్ను చూసి అంటూ వంట గదిలో నుండి రాగా , అమ్మా అంటూ పాదాలకు నమస్కరించగా సంతోషిస్తూ మహిని పిలిచి మహేష్ కాలేజ్ లో బెస్ట్ ఫ్రెండ్ అంటూ పరిచయం చెయ్యగా , నావైపు చూసి తనేనా అంటూ కళ్ళతోనే అడుగగా అవునని సమాధానమివ్వగా సిస్టర్ నమస్తే అంటూ రెండు చేతులతో నమస్కరించగా , మహి నవ్వగా అమ్మా ఆకలి చంపేస్తుంది వాడు మీరు బిరియాని చేస్తున్నారు అనగానే టిఫిన్ కూడా తినకుండా వచ్చేసాను అనగా , కృష్ణ మహేష్ తో మాట్లాడుతూ ఉండు త్వరగా వండేస్తాము అనగా థాంక్స్ అమ్మా అంటూ నా ప్రక్కనే కూర్చుని ఏంట్రా విషయం ఇక తనను జన్మలో కలవలెనేమో అన్నావు అంటూ గుసాగుసలాడగా , 



తను ఎందుకు వచ్చిందో బయటకు పిలుచుకొనివచ్చి వివరించి ఒక ఫ్రెండ్ లా తనకు దగ్గరయ్యి తనను సంతోషంగా ఉంచుతున్నాను రా అంతకంటే ప్రాణంగా ప్రేమించిన నేను ఏమి చెయ్యనురా అని చెప్పగా ,నీమాటలు వింటుంటే ఒరేయ్ సిస్టర్ కు వాడంటే ఇష్టం లేనట్లుగా ఉంది అమ్మకు తనంటే ప్రాణం అంటున్నావు ఏదో ఒకటి చేసి తనకి నీ ప్రేమ విషయం చెప్పి ఈ సంతోషాన్ని తన జీవితాంతం అనుభవించేలా చేయరా ఇంకా ఆలోచిస్తావేంటి అని ఆత్రంగా చెప్పగా , 



ఒరేయ్ ఈ విషయాన్ని తన నోటి నుండి చెప్పనీ రా అప్పుడు ఎవ్వరు అడ్డువచ్చినా ఎదురించి తనను నా దానిని చేసుకుంటాను అనగా , రేయ్...........అంటుండగా ఇది ఇంతేరా వదిలేయ్ అంటూ జాబ్ గురించి ఫ్రెండ్స్ గురించి మాట్లాడుతుండగా , కృష్ణ , మహేష్ బిరియాని రెడి అని పిలువగా , ఆ.......అమ్మా తినడానికి మేము కూడా రెడీ అంటూ ఆ దేవుడే ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపాలిరా అంటూ ఇద్దరమూ లోపలకువచ్చి  ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ పై కూర్చోగా వాసనకే నోరూరిపోతున్నట్లుగా లొట్టలేస్తుండగా అమ్మ బిరియాని చిల్లి చికెన్ కబాబ్ వడ్డించగా ఆహా...........అమ్మా నువ్వు నిజంగా దేవతవమ్మా అంటూ సంతోషం పట్టలేక తిని అమోఘం అద్భుతం అంటూ గబగబా తినగా , రేయ్ అది ఎక్కడికీ వెల్లదురా నెమ్మదిగా నీ ఇష్టం వచ్చినంత తినరా అంటూ తింటూ నేను కూడా అలాగే ప్రశంశించగా , ఇప్పుడేమంటావురా అమ్మ రుచిగా వండింది కాబట్టి పొగడటంలో తప్పే లేదు అంటూ అన్నింటినీ లాగిస్తుండగా ,



కృష్ణ ఈరోజు బిరియాని వండింది నేను కాదు మహి అనగా , సిస్టర్ వండారా చాలా చాలా రుచిగా ఉంది అంటూ నోట్లో కుక్కుకునే మాట్లాడుతుండగా , నా మాట కోసం నవ్వుతూ నావైపు చూస్తుండగా వేళ్ళతో అమోఘం అన్నట్లుగా ఫీల్ అవుతూ చెప్పి తినగా మురిసిపోతుండగా , అమ్మ చూసి ఫ్రెండ్స్ లా ఉంటేనే ఇంత సంతోషన్గా అనిపిస్తుందే ఇక ...........అంటూ ఆగిపోయి బాధపడి మాకు కనిపించనీయకుండా నీళ్లు తెస్తాను అంటూ లోపలకు వెళ్లగా అమ్మ పరిస్థితి అర్థమయ్యినా ఏమీ చేయలేక నీళ్లు తెచ్చిన అమ్మ చేతిని అందుకొని ఓదార్చగా , sorry కన్నయ్యా అంటూ తలపై ముద్దుపెట్టి మహి వడ్డించు అనగా అలాగే అంటీ అంటూ చాలంటున్నా , కడుపు నిండింది అంటున్నా అంత బాగుందని పొగిడారు అదంతా అపద్దమా అంటూ వడ్డించగా , మాట రానట్లుగా చేతులు ప్రక్కకు తీసేయ్యగా అందంగా నవ్వుతూ వడ్డించగా మొత్తం తినేసి నీళ్లు తాగి నడవడానికి కూడా ఇద్దరమూ ఇబ్బందిపడగా ఇద్దరూ ముసిముసి నవ్వులు నవ్వగా వరండా నీడలో సోఫాలో మాట్లాడుకుంటూ కూర్చున్నాము. అమ్మా , మహి కూడా తినేసి లోపల మాట్లాడుతూ టీవీ చూస్తూ ఉండిపోయారు.
Like Reply
కన్నయ్యా 7 గంటలకు ఫ్లైట్ అని చెప్పి రెడీ అవుతుండగా మహి బాధపడుతుండగా మనసులో నువ్వు నా సొంత కోడలు అయ్యి ఉంటే జాబ్ చేసే పని ఏంటి మా ఇంటికి పిలుచుకొనివెళ్లి ప్రాణంగా చూసుకునేదానిని మహి అంటూ నుదుటిపై ప్రేమగా ముద్దుపెట్టి 5 గంటలకు నలుగురమూ ఎయిర్పోర్ట్ కు బయలుదేరగా వెనుక కూర్చున్న మహి అమ్మ చేతి చుట్టూ చేతులు వేసి భుజo పై వాలిపోయి బాధలో మాటలు కూడా రాక మౌనంగా ఉండిపోగా మిర్రర్ లో చూసి ఒరేయ్ చూడరా చాలా పెద్ద తప్పు చేస్తున్నావురా ఒకసారి ఆలోచించారా ఎంత డబ్బయినా వాడికి పడేసి సిస్టర్ ను అమ్మకు బహుమతిగా ఇవ్వరా అని చెప్పగా , లోలోపల చాలా సంఘర్షణలను ఎదుర్కొంటూ చెప్పాను కదరా ఒక్క మాట ఒకే ఒక్క మాట తను నాకు నువ్వంటే ఇష్టమని చెప్పనీ తరువాత నేనేంటో చూపిస్తాను అంటూ ముందుచూసి డ్రైవ్ చేస్తుండగా ,



పోనీ నేను అనేంతలో నామీద ఒట్టు అనగానే రేయ్ పోరా అంటూ కోపంతో అటువైపు తిరుగగా , ఎయిర్పోర్ట్ చేరుకొన్నా కూడా అమ్మను ఒక్క క్షణం కూడా వదలకుండా పట్టుకోగా ఫ్లైట్ అనౌన్స్మెంట్ వినపడుతుండగా మహి కళ్ళల్లో ఒక్కసారిగా కన్నీళ్లు కారగా , నా హృదయం ఏమీ చెయ్యలేనన్నట్లుగా దహించుకొనిపోతుండగా , మహి వెళ్ళిరానా అనగానే అత్త..............అంటీ అంటూ అమాంతం అమ్మ గుండెలాపై వాలిపోగా జాగ్రత్త అనిచెప్పి బ్యాగు అందుకొని నా తలపై ప్రేమగా నిమిరి లోపలకు వెళ్లిపోగా , మహి ప్రక్కనే కుర్చీలో కూర్చొని బాధపడుతుండగా , ఒకవైపు కృష్ణగాడు ఒట్టేశానని ఏమీ చేయలేక మౌనంగా బాధపడుతుండగా , మహి వెళదామా అని అడుగగానే నీకేమి ఫీలింగ్ లేదా అన్నట్లుగా నావైపు కోపంగా చూసి ఒక్క నిమిషం అంటూ చేతితో కన్నీళ్లను తుడుచుకుని కుర్చీలో నుండి పైకి లేచి బయటకు కార్ వైపు నడవగా ,



నాన్నకు కాల్ చేసి అమ్మను ఇప్పుడే ఫ్లైట్ ఎక్కించానని చెప్పగా సరే నాన్న ఎయిర్పోర్ట్ కు వెళ్లి రిసీవ్ చేసుకుంటాను నువ్వు జాగ్రత్త నాన్నా అని చెప్పి కాల్ కట్ చెయ్యగా కారు దగ్గరకు చేరుకునేటప్పటికి కారులో వెనుక కోపంతో కూర్చుని ఉండగా , సిస్టర్ ను అలా చూసి నేను తట్టుకోలేను నేను రూమ్ కు బస్ లో వెళ్లిపోతాను నీ ఇష్టం రా నాయనా అంటూనే వచ్చి కౌగిలించుకొని సిస్టర్ జాగ్రత్త అని చెప్పి వెళ్లిపోగా , కారు ఎక్కి ఇంటివైపుకు పోనిస్తూ ఇద్దరమూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా కారులో మౌనం రాజ్యమేలుతుండగా , ఐస్ క్రీమ్ షాప్ దగ్గర కారు ఆపి బోలెడన్ని తీసుకువచ్చి మహికి ఇవ్వగా వద్దు అంటూ ప్రక్కన పెట్టెయ్యగా , కొద్దిగా ముందుకు వెళ్లి ఒక షాప్ లో రకరకాల పెద్ద పెద్ద చాక్లెట్ లు తీసుకువచ్చి ఇచ్చినా ప్రక్కకు పెట్టెయ్యగా , చిన్నగా నవ్వుకుని ఇంకొంచెం ముందుకువెళ్లి షాపింగ్ మాల్ లో పెద్ద టెడ్డి బేర్ తీసుకొని తనకి ఇవ్వగా , ముందు సంతోషంగా అందుకోబోయి నాకేమీ వద్దు అంటూ అందుకొని ప్రక్కన పెట్టెయ్యగా , నాలో నేను తియ్యగా నవ్వుకుని అపార్ట్మెంట్ చేరుకునేసరికి 9:30 అవ్వగా డోర్ తీసుకొని ఒక్క మాట కూడా మాట్లాడకుండా పైకి వెళ్లిపోగా ,



టెడ్డి బేర్ తో సహా అన్నింటినీ తీసుకొని పైకి వెళుతుండగా మొబైల్ రింగ్ అవ్వగా నాన్నా అమ్మ వచ్చేసింది కారులో వెళుతున్నాము అని చెప్పగా లవ్ యు dad అంటూ కట్ చేసి పైకి చేరుకోగా మహి వరండా చివరన ఒక్కటే బాధపడుతుండగా ముచ్చటేసి దగ్గరకు వెళ్లి మహి రేపు ఆఫీస్ ఉందిగా భోజనం చేసి పడుకొందువుగాని లోపలకు వెళదాము అని పిలువగా , కదలకుండా అటువైపు తిరిగి అలాగే నిలబడి ఉండగా , ఇప్పుడెలా అని ఆలోచించగా అమ్మ .........అంటూ వెంటనే వీడియో కాల్ చేసి  అమ్మా ప్రయాణం బాగా జరిగిందా అనగానే , నవ్వుతూ మహి నావైపు తిరుగగా , ఇదిగో నువ్వు వెళ్లిపోయావని నీ ఫ్రెండ్ నాతో ఒక్కమాట కూడా మాట్లాడకుండా బాధపడుతోంది అనగానే , బుజ్జి ముందు మహికి ఫోన్ ఇవ్వు అనగా ఇవ్వగా అమ్మను మొబైల్ లో చూసిన వెంటనే ఆనందబాస్పాలతో అత్త............అంటీ జాగ్రత్తగా చేరారా , వెళ్ళగానే భోజనం చెయ్యండి అంటూ సంతోషన్గా మాట్లాడుతూనే ఉండగా తన సంతోషాన్నే చూస్తూ అక్కడే నిలబడిపోగా , మాట్లాడుతూ మాట్లాడుతూ గట్టిగా నవ్వుతూ ఇది నాకోసం అంటూ నా చేతిలోని టెడ్డి బేర్ లాక్కొని గట్టిగా గుండెలపై హత్తుకొని , ఆకలి అంటూ చాక్లెట్ , ఐస్ క్రీమ్ తీసుకొని సోఫాలో కూర్చుని తింటూ అమ్మతో మాట్లాడుతుండగా ,



లోపలకు వెళ్లి చేతులు కడుక్కొని బిరియాని వేడి చేసి ప్లేట్ లో వడ్డించుకొని మహి దగ్గరకు వచ్చి ప్రక్కనే సోఫాలో కూర్చోగా , అంటీతో మాట్లాడుతున్నానుగా తినిపించు అనగా అమ్మతోపాటుగా నేను షాక్ తిన్నట్లుగా ఆశ్చర్యపోతుండగా , ముందుగా అమ్మే కన్నయ్యా మహికి ఆకలిగా ఉన్నట్లుంది తినిపించు అనగా , సరే అమ్మా అంటూ లోలోపల మాటల్లో చెప్పలేనంతగా మురిసిపోతూ తన్నుకొస్తున్న సంతోషాన్ని ఆపుకుంటూ చేతిలోకి చేసుకొని తన నోటికి ప్రేమగా అందిస్తూ మెతుకులు తన మీద పడకుండా మరొకచేతిని తన నోటి కింద అడ్డుగా పెట్టగానే , నా వేళ్ళతో సహా మొత్తం నోటిలోకి తీసుకోగానే నా ఒళ్ళంతా ఒక్కసారిగా కరెంట్ పాస్ అయినట్లుగా తియ్యగా జలదరిస్తూ మహినే ప్రేమగా చూస్తుండటం చూసి అమ్మ కళ్ళల్లో ఆనందబాస్పాలతో మురిసిపోతుండగా , ఆనందిస్తూ తినిపిస్తుండగా నములుతూనే అమ్మతో సంతోషన్గా మాట్లాడుతూ నువ్వు కూడా తిను మహేష్ అనగా , నేను తరువాత తింటానులే అన్నా వినకుండా నువ్వు తింటేనే నేను కూడా తినేది అంటూ బుంగమూతి పెట్టుకోగా , ఇదిగో తింటున్నాను అంటూ తన పెదాలు తగిలిన వేళ్ళతో నోట్లోకి తీసుకొని కళ్ళుమూసుకుని ఫీల్ అవుతూ తినేసి sooooo tasty అనగా , మధ్యాహ్నమే చెప్పావుగా అనగా షాక్ లో వెక్కిళ్ళు రాగా నేను తీసుకొచ్చిన నీళ్లు నోటికి అందించి నెమ్మది అంటూ తలపై సున్నితంగా తట్టగా , ఒక్కసారిగా ఆనందంతో కళ్ళల్లో నీళ్ళు కారగా ఏమయ్యింది కారంగా ఉందా అని అడుగగా లేదు లేదు మహి అంటూ కన్నీళ్లను తుడుచుకుని తనకు తినిపించు నేను తినడంతో మా ఇద్దరి మధ్య మహి మనసులో ఎలాంటి బంధం ఉందొ తెలియక సగం బాధ సగం సంతోషన్గా మాట్లాడుతూ ఇక చాలు మహేష్ అనగా చివరి ముద్ద అంటూ తినిపించగా , నీళ్లు తాగి నాకు కూడా తాగించి ముందుగా నా నోటిని తన కొంగుతో తుడిచి తానూ తుడుచుకోగా అన్నింటినీ తీసుకొని వంట గదిలోకి వెళ్లి కడిగి యధాస్థానంలో ఉంచేసి మహి దగ్గరకు రాగా టెడ్డి బేర్ అమ్మకు చూపించి మహేష్ గిఫ్ట్ ఇచ్చాడని మురిసిపోతూ సమయమనేదే తెలియకుండా సంతోషన్గా నవ్వుతూ మాట్లాడుతూ మాట్లాడుతూ మహి నిద్రలోకి జారుకోగా , తననే చూస్తూ అమ్మా చలిగా ఉంది ఇక్కడ బై రేపు మాట్లాడదాం అని చెప్పగా , నా ఫ్రెండ్ ను ఇలాగే జాగ్రత్తగా చూసుకో అని సంతోషిస్తూ లవ్ యు కన్నయ్యా అని చెప్పగా లవ్ యు మా బై అంటూ కట్ చేసి ఇక చేసేది లేక తనను నెమ్మదిగా ఎత్తుకొని రూంలో బెడ్ పై పడుకోబెట్టి భుజాల వరకూ దుప్పటి కప్పి గుడ్ నైట్ మహి అంటూ చిన్న లైట్ మాత్రమే ఉంచి AC on చేసి తలుపు ముందుకువేసి సోఫాలో చిరునవ్వుతో వాలిపోగా , కృష్ణ గాడి నుండి కాల్ చెల్లెమ్మ శాంతించిందా అని అడుగగా , శాంతించడమే కాదు అంటూ జరిగిందంతా చెప్పగా చాలా సంతోషం రా గుడ్ నైట్ అని చెప్పగా గుడ్ నైట్ చెప్పి నిద్రలోకి జారుకున్నాను.



అక్కడ అమ్మా నాన్నలు భోజనం చేసిన తరువాత బెడ్ పై వాలిపోగా అమ్మ నాన్నకు జరిగిందంతా వివరించగా , అంటే మహేష్ ప్రేమించింది అవునండి అప్పుడూ మరియు ఇప్పుడు కూడా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తూ తన కళ్ళల్లో కన్నీరు రాకుండా చూసుకుంటున్నాడు , జానకి ఏమి చేద్దాము అని అడుగగా ఒకే ఒక్కటి అండి వాళ్ళిద్దరి సంతోషం కోసం మనం ఏమైతే చెయ్యగలమో అది చెయ్యాలి అనగానే , జానకి ఇప్పటికే ఆలస్యం చేసాము ఇక ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయరాదు ముందుగా మహి అమ్మగారిని కలవాలి నువ్వు ok అంటే ఇప్పుడే గుంటూరు బయలుదేరుదాము అనగానే నవ్వుతూ లేచి బట్టలు సర్దుతుండగా , డ్రైవర్ కు కాల్ చేసి కార్ రెడి చెయ్యి గుంటూరుకు వెళ్ళాలి అని చెప్పి నైట్ డ్రెస్ లొనే గుంటూరుకు రాత్రికి రాత్రే ఉత్సాహంగా బయలుదేరారు.



 తెల్లవారుఘామున గుంటూరు చేరుకొని హోటల్ లో రెడీ అయ్యి నేరుగా మహి అమ్మను కలిసి మొత్తం వివరించగా సంతోషిస్తూ అమ్మా నాన్నలకు పెళ్ళైన తరువాత రాత్రి జరిగిన సంఘటనను వివరించి నేను కూడా ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తున్నానని చెప్పగానే అమ్మ సంతోషం పట్టలేక అమాంతం ఆమెను కౌగిలించుకొని మనం ఆలస్యం చేయకూడదని ముగ్గురూ ఫ్లైట్ లో తిరుపతి అక్కడి నుండి చంద్రగిరి ఇంటికి చేరుకోగా చెల్లి అమ్మా నాన్నలను చూసి ఏడుస్తూ వచ్చి కౌగిలించుకోగా ఓదార్చి 5 రోజులు అక్కడే ఉండి సమస్యని పరిష్కరించి కొన్ని పత్రాలతో తండ్రి కొడుకులతో సంతకాలు చేయించుకొని చెల్లిని , పెద్దమ్మను , మహి అమ్మగారిని వాళ్ళతోపాటుగా నేరుగా వైజాగ్ ఇంటికి పిలుచుకొనివెళ్లి అందరూ ఒక నిర్ణయానికి వచ్చి మాకు ఏమీ తెలియనివ్వకుండా మామూలుగా అమ్మానాన్నలు వైజాగ్ నుండి , మహి అమ్మగారు గుంటూరు నుండి , చెల్లి మరియు పెద్దమ్మ చంద్రగిరిలో నుండి మాట్లాడుతున్నట్లుగా మాట్లాడసాగారు.



ఇక్కడ ఉదయం లేచేసరికి మహి రోజూలాగే కాఫీ అందించి స్నానం చేసి రెడీ సవ్వు అంతలో టిఫిన్ చేసేస్తాను అంటూ అందంగా నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెప్పగా , లవ్లీ మార్నింగ్ మహి అంటూ నవ్వుతూ లేచి చుట్టూ చూడగా శుభ్రన్గా ఉండగా కాఫీ తాగుతూ బయటకువెళ్లి జిమ్ చేసివచ్చి బట్టలు , టవల్ అందుకొని బాత్రూం లోకి వెళ్లి రెడీ అయ్యి వచ్చేటప్పటికి మహి అమ్మ కొనిచ్చిన చీర కట్టుకొని అందంగా అలంకరించుకొని ఎలా ఉన్నాను అని అడుగగా కన్నార్పకుండా తననే చూస్తూ కదలకుండా ఉండిపోగా , మహేష్ , మహేష్........అంటున్నా కదలకపోవడంతో వచ్చి భుజం కదపగా తేరుకొని beautiful మహి అనగానే తియ్యగా సిగ్గుపడి థాంక్స్ మహేష్ అంటూ మురిసిపోతూ టిఫిన్ రెడీ అనగా ఇద్దరమూ ఒకరికొకరు వడ్డించుకొని తన సంతోషాన్ని చూడకుండా ఉండలేక తననే దొంగచూపులు చూస్తూ తను చూడగానే తల దించేసుకుంటూ తినేసి ఇద్దరమూ రొటీన్ గా ఆఫీస్ బయలుదేరాము.



మళ్లీ సాయంత్రం వెళ్లి మహిని పిక్ చేసుకోవడం పిల్లలు డౌట్స్ తో సాయంత్రం మహి దగ్గరకు రావడం నేర్చుకున్నాక మహితో సరదాగా కాసేపు అడ్డుకోవడంతో కొన్నిరోజుల్లోనే అపార్ట్మెంట్ పిల్లలందరికీ మహి అంటే చాలా చాలా ఇష్టంగా మారిపోయింది. కాలేజ్ బస్ దిగగానే పుస్తకాల బ్యాగ్స్ తోపాటుగా నేరుగా మహి అక్కా , మహి అంటీ , మహి మిస్ , మహి మేడం అంటూ చుట్టూ చేరిపోయి బుజ్జి బుజ్జి పాపాయిలు అయితే ఆప్యాయంగా మహి బుగ్గలపై ముద్దులుపెట్టడం చూసి happy మూమెంట్స్ అన్నింటినీ మొబైల్ లో బంధించి వెంటనే అమ్మకు పంపించేవాడిని తరువాత అమ్మ కాల్ చేసి ఆ సంతోషాన్ని పంచుకొని మురిసిపోయేది.



ఇక పిల్లల అమ్మావాళ్ళు అయితే మహి మా పిల్లలకు మాకంటే నువ్వంటేనే ఇష్టం , ప్రాణం అంటూ చిన్న పిల్లలకు బట్టలు పైకే తీసుకువచ్చి యూనిఫార్మ్ మార్చి మహితో సరదాగా మాట్లాడుతూ రోజూ మహితో ఒక్కసారైనా మాట్లాడితే గాని వాళ్లకు రోజు గడవదు అంటూ అపార్ట్మెంట్ ప్రతి ఇంటికి మహిని నేరుగా పిలుచుకొనివేళ్లడం వాళ్ళు మొహమాటం లేకుండా మా ఇంటికి వచ్చి వాళ్లకు తెలిసిన రకరకాల వంటలు చెయ్యడం , నేర్చుకోవడం , నేర్పించడంతో రోజులు వేగంగా గడిచిపోతూ మహేష్ ఇదంతా ఈ సంతోషం అంతా నీవల్లనే అంటూ ఆనంబాస్పాలతో పొంగిపోయింది. అలాగే మా ఇద్దరి మధ్య బంధం రోజురోజుకూ పెరుగుతూ friendship లో ఒరేయ్ , రా దగ్గరకు వెళ్లగా మురిసిపోతూ వీటన్నింటినీ  పడుకునేముందు , ఉదయం మళ్లీ ఆఫీస్ లంచ్ బ్రేక్ లో ఇలా రోజుకు మూడుసార్ల కంటే ఎక్కువగా వాయిస్ కాల్స్ , వీడియో కాల్స్ ,మెసేజెస్ , చాటింగ్ లతో నాతో ఎప్పుడో కానీ అమ్మ మాట్లాడకపోగా ఒకరోజు భోజనం చేసి మహి రూంలోకి వెళ్లిపోగా అమ్మకు కాల్ చేద్దామని మొబైల్ అందుకొని చెయ్యగా బిజీ అని రాగా , 5 నిమిషాల తరువాత చెయ్యగా మళ్లీ బిజీ రాగా , అలా అర గంటసేపు 5 నిమిషాలకొకసారి చేసినా బిజీగానే వస్తుండగా ,



రూంలో నుండి మహి మొబైల్ లో మాట్లాడుతున్నట్లుగా మాటలు గట్టిగా నవ్వులు వినిపిస్తుండగా ఓ ఇదా విషయం అప్పటి నుండి ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారా అంటూ వెంటనే లేచి రూమ్ డోర్ దగ్గరకు వెళ్లి చిన్నగా తట్టగా అంటీ ఒక్కనిమిషం అంటూ తలుపు తెరిచి చిరుకోపంతో చూస్తున్న నన్ను చూసి ఏమయ్యింది రా అలా ఉన్నావు అని అడుగగా , మేడం మీరు కాసేపు మీ ఫ్రెండ్ తో మాట్లాడటం ఆపితే నేను కూడా మా అమ్మతో కొద్దిగా అంటే కొద్దిసేపు మాట్లాడి ఇక మీఇద్దరినీ ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యను అనగానే లౌడ్ స్పీకర్లో ఉన్నట్లుగా మహితోపాటుగా అమ్మకూడా గట్టిగా నవ్వుతూనే అంటీ మీ కన్నయ్యతో కూడా కాసేపు మాట్లాడండి అంటూ బై చెప్పేసి కట్ చేసి మళ్లీ నా ముఖాన్ని చూసి మూసిముసినవ్వులు అందంగా నవ్వుతూ బెడ్ పై వాలిపోగా , తలుపు వేసి పెదాలపై చిరునవ్వుతో అమ్మతో కాసేపు మాట్లాడగానే అంతేకదా అయిపోయిందా నువ్వు పెట్టేస్తే నేను నా మహితో మాట్లాడాలి అనగా అలాగే అనగా అమ్మ నవ్వుతూ లవ్ యు కన్నయ్యా అంటూ కాల్ కట్ చెయ్యగా , లవ్ యు మా అంటూ సోఫాలో నిద్రపోయాను.
Like Reply
అలా రోజులు గడిచిపోతుండగా ఒకరోజు ఆఫీస్ కు బయలుదేరుతుండగా మహేష్ ఒక విషయం అడుగునా అనగా , నాదగ్గర దాపరికాలెందుకు నువ్వు నన్ను ఏదైనా అడగొచ్చు you are my best best best best ఫ్రెండ్ అని బదులివ్వగా , మోహమాటపడుతూనే మహేష్ , మహేష్............నువ్వు ఎవరి ప్రేమలో పడలేదా ,నీకు లవర్ లేదా అని అడుగగానే ఆశ్చర్యపోతూ రోడ్ మధ్యలోనే సడెన్ బ్రేక్ వేసి తనవైపే చూస్తుండగా , మహి తల దించుకుని నా సమాధానం కొరకు కంగారుపడుతూ చేతివేళ్ళను లాక్కుంటూ మౌనంగా ఉండిపోగా , వెనుక వెహికల్స్ horn వినిపించగా గేర్ మార్చి నెమ్మదిగా ముందుకు పోనివ్వగా ,



నేను మాట్లాడేలోపు నీ అంత మంచివాన్ని , హ్యాండ్సమ్ అండ్ లవ్లీ ఫ్రెండ్ ను నా జీవితంలో ఇప్పటికీ కలవలేదు నిన్ను చూసి కాలేజ్ లో కానీ బయట గాని ఎవరూ ప్రపోజ్ చేయలేదా ,అమ్మానాన్నలతో , కృష్ణ అన్నయ్యతో , నాతో తప్ప ఫోన్లో గంటలు గంటలు మాట్లాడవు , చాటింగ్ కూడా చెయ్యవు అని అడుగగా ,ఇప్పటివరకూ కాలేజ్ లో మరియు వైజాగ్ లో చాలామంది ప్రపోజ్ చేశారు నిజం చెప్పాలంటే నాకు ప్రేమ మీద నమ్మకం లేదు నాకు తెలిసిందల్లా మా అమ్మానాన్నల స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే అనగా నావైపు గర్వపడుతూ చూస్తుండగా ఇక నా జీవితంలో నేను ఇక ప్రేమలో పడనేమో అనుకుంటుండగా రీసెంట్ గా ఒక పెళ్లిలో ఒక బాపు బొమ్మలాంటి , స్వచ్ఛమైన మనసుతో కళ్లాకపటం ఎరుగని సుగుణాల రాశిని క్షణకాలంలో చూసి నా హృదయమంతా నింపేసుకొని బ్రతికితే జీవితాంతం తనకోసమే తన సంతోషం కోసమే జీవించాలని నిర్ణయించుకొని గుండెలపై చేతిని వేసుకొని కళ్ళుమూసి తెరిచేలోపు మాయం అయిపోయింది , పెళ్లి మండపం మరియు విడిదులు ఒక్క అడుగు కూడా వదలకుండా తనకోసం వెతికాను ,



రేయ్ తొందరగా చెప్పరా తను కనిపించిందా తనను కలిసావా అంటూ ఆత్రంగా అడుగగా లేదు అన్నట్లుగా బాధపడుతూ తలఊపి కన్నీళ్లను తుడుచుకుని love at first సైట్ అంటారు కదా అదే అంటూ నవ్వుతూ చెప్పగా , రేయ్ ప్రపంచంలో తనొక్కటేనా ఉన్నది నువ్వు చిటికె వేస్తే ఎంత అందగత్తెలయినా ప్రేమలో పడటానికి రెడీగా ఉంటారు అని చెప్పగా , నా గుండెలపై చేతిని వేసుకొని నీ........అదే తన అందమైన రూపాన్ని ఇక్కడ నుండి తీసివేయ్యాడమంటూ జరిగితే అది నా ప్రాణం పోయాకనే అంటూ ఫీల్ అవుతూ చెప్పగా , మహి ఏదో చెప్పబోయి ఆగిపోగా నా ప్రాణమున్నంతవరకూ తనకోసమే జీవిస్తాను ,నీ......... తన సంతోషం కోసo ఏమైనా చేస్తాను చివరికి నా ప్రాణాలైనా అర్పిస్తానురా ........అంటూ తన కళ్ళల్లోకే చెప్పలేనంత ప్రేమతో చూస్తూ అర్థమయ్యిందా రా అని అడుగగా , తను కూడా నామాటలకు ట్రాన్స్ లోకి వెళ్లిపోయినట్లుగా అలాగే అన్నట్లుగా తల ఊపి వెంటనే తేరుకొని ఏదో చెప్పబోతూ , I am proud of you రా అంటూ భుజం తట్టి , నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ గా దొరకటం నా పూర్వ జన్మ జన్మల అదృష్టం అంటూ మురోసిపోతూ ఆఫీస్ రాగానే సాయంత్రం కలుద్దాము అని దిగి లోపలకు వెళ్లగా , ఆఫీస్ వైపు వెళుతూ కనీసం ఇలాగైనా నా మనసులోని మాటను చెప్పినందుకు నా మనసు కాస్త కుదుటపడినట్లుగా నవ్వుతూ ఆఫీస్ చేరుకున్నాను.



మూడు వారాల తరువాత గురువారం ఆఫీస్ అవ్వగానే మహి ఆఫీస్ దగ్గరకు చేరుకోగా పెదాలపై చిరునవ్వు లేక మౌనంగా వచ్చి కారు ఎక్కగా , ఏంటి మేడం ఈరోజు జీవితంలో తొలి సంపాదన సాలరీగా అకౌంట్ లోకి పడింది చాలా ఉత్సాహంగా ఉంటారు పార్టీ అడుగుదామనుకుంటే ఇలా డల్ గా ఉన్నారేంటి అని అడుగగా , ఏమి లేదు మహేష్ కొద్దిగా తల నొప్పిగా ఉంది ఇంటికి పోనివ్వు అనగా , కంగారుపడుతూ డాక్టర్ దగ్గరకు వెళదామా అని అడుగగా , కొద్దిగానే zandu balm పూస్తే సరిపోతుంది అని బదులివ్వగా , తనను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక AC పెంచి సీట్ ప్లేన్ గా మార్చి మహి రెస్ట్ తీసుకో అని చెప్పగా వెనక్కు వాలిపోయి కళ్ళుమూసుకోగా నెమ్మదిగా పోనిస్తూ ఇంటికి చేరుకోగానే దిగి నేరుగా తన రూం కు వెళ్లి బెడ్ పై వాలిపోగా ,



ఫ్రిడ్జ్ లోని పాలు తీసుకొని వేడిచేసి గ్లాస్ లో పోసుకొని కేక్ ప్లేట్ లో పెట్టుకొని తలుపు తట్టిన పలుకకపోవడంతో డోర్ తీసుకొని లోపలకు వెళ్లి మహి కొద్దిగా ఈ పాలు తాగావంటే శక్తి వచ్చి తల నొప్పి ఎగిరిపోతుంది , నువ్వు రెస్ట్ తీసుకో నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అంటుండగా కదలకపోవడంతో తన ముఖాన్ని చూడగా ఏడ్చి ఏడ్చి నిద్రపోయినట్లుగా బుగ్గలపై మరియు దుప్పటిపై కన్నీళ్లు కారి తడిచిపోయినట్లుగా తడిగా కనిపించగా , నొప్పి ఎక్కువగా ఉందేమో అని పిల్లలు రాగానే అక్కను తల నొప్పిగా ఉందట చూస్తూ ఉండండి డాక్టర్ ను పిలుచుకువస్తాను అని చెప్పగా , అవునా అన్నయ్యా అంటూ పిల్లలు కూడా బాధపడుతూ తొందరగా పిలుచుకొనిరండి మేము జాగ్రత్తగా చూస్తుంటాము అని ముద్దుముద్దుగా చెప్పగా , 



క్యూట్ ఏంజెల్స్ అంటూ కారులో దగ్గరలోని క్లినిక్ కు వెళ్లి లేడీ డాక్టర్ గారిని ప్రాధేయపడి పిలుచుకొనిరాగా నర్సుతో పాటుగా వచ్చి పడుకున్న మహిని పూర్తిగా పరిశీలించి ఆశ్చర్యపోయి  తనకు ఎటువంటి నొప్పి లేదు అంటూ తన గురించి అడుగగా ఉదయం ఆఫీస్ కు సంతోషన్గా వెళ్ళింది సాయంత్రం పిక్ చేసుకోవడానికి వెళితే మూడీగా  కొద్దిగా తలనొప్పిగా ఉంది అంటూ ఏమీ మాట్లాడలేదు అనగా, నాకు తెలిసి ఆఫీస్ లొనే ఏదో జరిగి ఉంటుంది అంతే తప్ప మరేమీ లేదు అనిచెప్పి కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని వెళ్లిపోతుండగా ఫీజ్ ఇచ్చేసి డ్రాప్ చెయ్యడానికి వెనుకే రాగా తనను చూసుకోండి దగ్గరేగా ఆటోలో వెళతాము అనగా థాంక్స్ చెప్పేసి మహి దగ్గరకు వెళ్లగా పిల్లలు మహి పాదాలను సున్నితంగా వొత్తుతూ మరియు కీర్తి తలను సున్నితంగా స్పృశిస్తుండగా లవ్ యు కీర్తి అంటూ సంతోషిస్తూ ,



ఆఫీస్ లో ఏమి జరిగి ఉంటుంది అని వెంటనే సెక్యూరిటీకి కాల్ చేసి ఆఫీస్ లో ఏదైనా unusual గా జరిగినట్లుగా తెలిసిందా మేడం అని అడుగగా , నాకు తెలిసి అలాంటిదేమీ లేదు మహేష్ రోజూ లాగే everything is fine అనగా , మహి గురించి వివరించగా , అయితే తన టీమ్ మెంబెర్స్ ఎవరికైనా కాల్ చేస్తే తెలుస్తుందేమో అనగానే thank you sooooo మచ్ మేడం అంటూ మహి మొబైల్ ను తన హ్యాండ్ బ్యాగ్ లో నుండి తీసి బయటకు వచ్చి ముందుగా ఎవరెవరితో మాట్లాడిందో చూడగా ఉదయం నుండి cruel animal అనే contact నెంబర్ కు లెక్కలేనన్ని సార్లు చేసినా అటువైపు నుండి రెస్పాన్స్ లేకపోవడంతో ఆ కిందే బెస్ట్ ఫ్రెండ్ అంటే నాకు అన్నేసార్లు చేసినట్లుగా ఉండగా నాకు చేసిందా అంటూ నా మొబైల్ చూసుకోగా ఎలాంటి కాల్స్ తన నుండి రాలేదే అంటే నాకు చేసి ఏదోచెప్పాలనుకొని రింగ్ అయ్యేలోపల కట్ చేసిందన్నమాట , 



Cruel animal ఎవడ్రా వాడు అంటూ కాల్ చెయ్యగా నెంబర్ not in active అని రాగా ఈ పేరుని ఎక్కడో చూసినట్లుగా నా మొబైల్ తీసి contacts చూడగా నా మొబైల్ లో కూడా animal harsha అని ఉండగా చూడగా same నెంబర్ అంటే ఎందుకో వాడికి కాల్ చేసి వాడు అసలు అందుబాటులో లేకపోవడంతో నాకు చేసిందని ఏదో మహి నా దగ్గర దాస్తోందని చూడరాదు అయినా నెల రోజులు తను ఎవరెవరికి కాల్ చేసిందో చూడగా నాకు , అంటీ అంటే అమ్మకు , అమ్మ అంటే మహి వాళ్ళ అమ్మకు తప్ప ఇంకెవ్వరికీ ఆ animal కు కూడా కాల్ చేసినట్లుగా లేకపోగా అంటే హర్ష గాడికి ఈరోజు మాత్రమే చేసింది ఎందుకు అని ఆలోచించగా ATM కార్డ్ వాడు పట్టుకుపోయాడు కదూ salary అందులోనే పడి ఉంటుంది డబ్బుకోసం కాల్ చేసి ఉంటుంది అది ok మరి నాకు అన్ని సార్లు కాల్ చెయ్యబోయి ఎందుకు కట్ చేసింది అని ఎంత ఆలోచించినా తట్టకపోవడంతో ,



సెక్యురిటి చెప్పినట్లుగా మహి టీం మెంబెర్స్ కు కాల్ చేస్తే సరిపోతుంది అని మహి కాంటాక్ట్స్ చూడగా నాకు ఎక్కువ ఇబ్బంది లేకుండా పట్టుమని 15 కాంటాక్ట్స్ కూడా లేవు మొదటగా టీం లీడర్ అంకిత అని ఉండగా మహి మొబైల్ నుండే కాల్ చేయగానే మహి advanced happy birthday రెండు రోజుల ముందే చెబుతున్నాను ఏమీ అనుకోకు ఎందుకంటే నువ్విస్తున్న పార్టీకి నేను అందుబాటులో ఉంటానో లేదో తెలియదు , నాకైతే మీ గుంటూరు రుచులను ఇష్టంగా రుచి చూడాలని ఉంది కాని ఆరోజే మన ప్రాజెక్ట్ కోసం ముంబై బ్రాంచ్ కు వెళ్లాల్సి రావచ్చు ఇంకా కంఫర్మ్ కాలేదనుకో అది పోస్టుఫోన్ అయితే కచ్చితంగా వచ్చి మీ గుంటూరు రుచులను అదికూడా స్వయంగా నీచేతితో వండే రుచులను ఒక్కటి కూడా వదలకుండా కుమ్మేస్తాను అంటూ వడవడా వాగుతూనే ఉండగా ,



 రెండురోజుల్లో మహి పుట్టినరోజా అనగానే వొళ్ళంతా పలకరిస్తూ పెదాలపై చిరునవ్వుతో మేడం మేడం .............ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను తన ఫ్రెండ్ అనగానే మహేష్ .........కదా నీ గురించే అలా ఇలా అంటూ గొప్పలు చెబుతూనే ఉంటుంది ఫైనల్లీ నీతో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషం అనగా me టూ మేడం అండ్ థాంక్స్ మీరు ఫ్రీగా ఉంటే ఒక విషయం అడగొచ్చా , ఏమిటి మహేష్ అనగా పార్టీ అంటున్నారు ఎక్కడ ఎవరు ఇస్తున్నారు అని అడుగగా , మహి లేదా , కొద్దిగా తలనొప్పిగా ఉంటే పడుకొంది మేడం అని చెప్పగా , అయితే విను మా టీం లో నాతోకలిసి 11 మంది ఎవరి birthday వచ్చినా వారి ప్రాంతం యొక్క లోకల్ రుచులను వాళ్లే స్వయంగా వండి పార్టీ ఇవ్వాలనేది ఎప్పటి నుండో వస్తున్న ఆనవాయితీ , మహి birthday విషయం తెలియగానే తనది గుంటూరు అని మాకు ముందే తెలుసు కాబట్టి తను జాయిన్ అయినప్పటి నుండి తన birthday కోసం ఎదురుచూసాము here it is దానితోపాటుగా ఫస్ట్ salary కూడా అందుకోబోతున్నందుకు grand గా పార్టీ ఇవ్వాలని అందరూ చాలాసేపు బ్రతిమాలి ఒప్పించారు వెంటనే నాకు ప్రాజెక్ట్ టూర్ తెలిసింది ఏమి చెయ్యాలో అర్థం కావట్లేదు దేవుణ్ణి గట్టిగా ప్రార్థిస్తున్నాను టూర్ postpone అవ్వాలని , థాంక్స్ మేడం చెప్పినందుకు నేను కూడా చెబుతున్నాను కచ్చితంగా పోస్టుఫోన్ అయ్యి తీరుతుందంతే saturday మీరు పార్టీకి వస్తున్నారు అంతే అనగా ఉమ్మ్మ........thank you soooo much మహేష్ , now i know మహి నిన్ను అంతలా ఎందుకు పొగుడుతుందో అని సంతోషిస్తుండగా బై మేడం get ready to paaaaaaarty అని చెప్పి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతూ కాల్ కట్ చేసి వెనక్కు తిరుగగా ,
Like Reply
కీర్తి నవ్వుతూ అన్నయ్యా అక్క birthday నా ఎప్పుడు అని అడుగగా ష్........నెమ్మదిగా అక్కయ్య లేస్తుంది అనగా , ఓ ఓ........సర్ప్రైజ్ ప్లాన్ చెయ్యబోతున్నారా wow సూపర్ అంటూ సంతోషన్గా నవ్వగా , అవునురా కీర్తి అంటూ ఎత్తుకొని మీ అక్కయ్య అంటే ఎంత ప్రేమ అంటూ ముద్దుచేయ్యగా , నవ్వుతూ అన్నయ్యా మీకోక విషయం తెలుసా అపార్ట్మెంట్ లో ఎవరి birthday ఉన్నా ముందే అపార్ట్మెంట్ మేనేజర్ కు inform చేస్తే మనం నెలనెలా కడుతున్న అపార్ట్మెంట్ ఫండ్ నుండి birthday కేక్ వారే తెచ్చి స్వీట్స్ mixture కూడా ఇస్తారు తెలుసా అంటూ అమాయకంగా గుసాగుసలాడుతూ చెప్పగా అయితే అలా కూడా చేద్దాము ఎందుకంటే మీ అక్కయ్య అంటే అపార్ట్మెంట్ అంతా ఇష్టము కదా అనగా అయితే రేపు ఉదయమే ఆయనను కలవండి అన్నయ్యా అక్క birthday అంటే ఘనంగా జరగాలి నువ్వే చూస్తావుగా కానీ ఈ విషయం మీ అక్కయ్యకు అస్సలు తెలియకూడదు మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పు అంటూ లోపలకు వెళ్లి ఫ్రిడ్జ్ ఎమున్నాయో చూసి vegitabuls చాలా ఉండగా కీర్తితో చిన్నగా మాట్లాడుతూ కట్ చేస్తుండగా ,



చూసి అన్నయ్యా నీకు వంట కూడా చెయ్యడం వచ్చా అని అడుగగా కాలేజ్ డేస్ గురించి వివరించగా నువ్వు గ్రేట్  అన్నయ్యా నేను సహాయం చేస్తాను అంటూ కట్ చేసినవన్నీ ఒక్కొక్కటే అందించగా కుక్కర్ లోకి వేస్తూ వేయించి మసాలాలు అన్నీ వేసి రైస్ కడిగి వేసి మూతపెట్టేసి కొన్ని విజిల్స్ తరువాత దించి మూత తెరవగా కీర్తి చూసి wow అన్నయ్యా చూస్తుంటేనే నోరూరిపోతోంది అనగా అయితే పదా మీ అక్కతోపాటుగా నువ్వు తిందువుగాని అంటూ తనకూ ఒక చిన్న ప్లేట్ లో వడ్డించి ఇచ్చి మరొక ప్లేట్ లో వడ్డించుకొని చల్లారిపోయిన పాలను మరొకసారి వేడిచేసుకొని రూంలోకి వెళ్లి బెడ్ పై ప్రక్కనే కూర్చొనగా ఆకలిగా ఉన్నట్లుగా కడుపుపై చేతులు పట్టుకొని పడుకొని ఉండగా చూసి అన్నయ్యా అక్కయ్యకు చాలా ఆకలిగా ఉన్నట్లుంది పాపం అనగా అయితే లేవు మరి తినిపిద్దాము అనేంతలో తన ప్లేట్ పక్కనే టేబుల్ పై ఉంచి బెడ్ పైకి చేరి మహి ప్రక్కనే కూర్చుని ,



ప్రేమగా కురులను స్పృశిస్తూ నుదుటిపై ముద్దుపెట్టి తనంటే ఎంత ఇష్టమో తెలుపుతూ నెమ్మదిగా అక్కా , అక్కా ...........అంటూ పిలువగా మ్మ్మ్.........అంటూ నిద్రలోనే కలవరించగా అక్కా నీకు ఆకలి అవుతోంది లేచి తిని మళ్లీ పడుకో అనగానే నేరుగా ఆ మాటలు మెదడుకు చేరినట్లుగా అవును చాలా ఆకలి వేస్తోంది అంటూ సడెన్ గా లేచి కూర్చోగా , సూపర్ కీర్తి బుగ్గపై చేతితో ముద్దుపెట్టి మేడం గారు ముందు తినండి అంటూ ప్లేట్ అందివ్వగా , మహేష్ నాకు ఆకలిగా లేదు అంటూ బాధపడుతూ తల దించుకోగా , ఇద్దరమూ నవ్వుతూ అక్కయ్యా నీమాట అపద్దo చెప్పినా నీ మనసు మాకు నిజమే చెప్పింది ,అన్నయ్య మీకోసం కష్టపడి ఇష్టంగా వండారు పాపం చెమటలు కూడా పట్టాయి అలాగే నాకు కూడా చాలా ఆకలిగా ఉంది అని చిన్న ప్లేటులో తెచ్చాను మీరు తినకపోతే నేను కూడా తినను అంతే అంటూ అలిగినట్లుగా ప్లేట్ పక్కనపెట్టెయ్యగా , లవ్ యు రా కీర్తి అంటూ మనసులో అనుకొని నేను కూడా తినను ఆకలితోనే ముగ్గురూ ఉండిపోదాము మన వల్ల కీర్తి వాళ్ళమ్మ తనను తిడుతుంది కొడుతుంది కూడా అనగా నేను తింటాను అనగానే అన్నయ్యా ఇంకా చూస్తున్నావేంటి తినిపించు అనగా ,



తినిపించనా అని సైగ చెయ్యగా తల ఊపగా నవ్వుతూ కీర్తి నుదుటిపై ఆనందంతో ముద్దుపెట్టి చేతిలోకి తీసుకొని తినిపించగా బాగా ఆకలిగా ఉన్నట్లుగా గబగబా తినెయ్యగా అన్నయ్యా నాకొక ముద్ద అనగా నా బంగారం రా నువ్వు నీకు తినిపించనా అంటూ తనకూ తినిపించి ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వగా ఇంకొంచెం తీసుకురానా అని అడుగగా కడుపు నిండకపోయినా చాలు అని మౌనంగా తలదించుకోగా , చేతులు కడుక్కొని వచ్చి నీళ్లు తాగించి ఇప్పుడు చెప్పు అని అడుగగా , ఏమిటన్నట్లుగా ఆశ్చర్యంగా చూస్తుండగా నీ బాధకు కారణం ఏంటి అని అడుగగా కొద్దిగా తలనొప్పి అనగానే తలపై సడెన్ గా కొట్టగా అమ్మా అనగా sorry రా నొప్పిస్తోందా అంటూ రుద్దుతుండగా ,



కీర్తి మూసిముసినవ్వులు నవ్వుతూ అక్కా అపద్దo చెబుతున్నావు అన్నయ్య డాక్టర్ ని కూడా పిలుచుకొనివచ్చారు డాక్టర్ ఎలాంటి నొప్పి లేదని ఎందుకో బాధపడుతోంది అని చెప్పి వెళ్ళిపోయింది ఇక దాచి లాభం లేదు చెప్పాల్సిందే అనగా పార్టీ గురించి మొత్తం వివరించి హర్షకు డబ్బు కోసం కాల్ చేస్తే అసలు నెంబర్ మనుగడలో లేదు అని వస్తోంది , నేను ఎంత వారించినా వినకుండా మా టీమ్ మెంబెర్స్ అందరూ పార్టీకి రెడి అయిపోయారు ఏమి చెయ్యాలో తోచక , ఏడుస్తూ పడుకొన్నావు నిన్ను ఇంకో దెబ్బ కొట్టినా తప్పులేదు నాకు కూడా అన్ని సార్లు కాల్ చెయ్యబోయావు ఒక్క రింగు ఇచ్చినా నేనే కాల్ చేసేవాణ్ణి , అంటే నన్ను నీ బెస్ట్ ఫ్రెండ్ గా అనుకోవట్లేదు అని ఫీల్ అవుతున్నట్లుగా act చెయ్యగా , 



అధికాదురా ఇప్పటికే నాకోసం చాలా చేసావు పార్టీకి చాలా ఖర్చు అవుతుంది అందుకే , ఎంత అవుతుంది ఎంతైనా పర్లేదు నా బెస్ట్ ఫ్రెండ్ సంతోషం కోసం ఎంతైనా చేస్తాను , తను ఏదో చెప్పబోగా ఆపి నీ మనసు ఒప్పుకోదు తెలుసు నెమ్మదిగా నెలనెలా salary లో తిరిగి ఇచ్చేద్దువు కానీ అనగా పెదాలపై చిరునవ్వు రాగా హమ్మయ్యా అంటూ గుండెలపై చేతిని వేసుకొని నీ ఇష్టం ఎంతమందినైనా రేపు ఆఫీస్ కు వెళ్లి పిలువు , అంతమందినా అధికాదురా వాళ్లకు .........నాకు తెలుసు స్వయంగా నీచేతులతో మీ గుంటూరు రుచులను వాండాలి అంతేకదా నేను , కృష్ణ గాడు అటువైపే కదా ముగ్గురూ కలిసి వండేద్దాము అనగా , మీరా మీకు వంట వచ్చా అంటూ నవ్వుతూ అడుగగా vegitable బాత్ ఎలా ఉంది అని అడుగగా soooo tasty అనగా , అది వండింది అన్నయ్యగా అక్కా చెప్పానుగా అనగా మీ అన్నయ్య గాడు ఇంకా బాగా వండుతాడు అనగా నవ్వుతూ నాకు ఇంకా తినాలని ఉందిరా అని అడుగగా ఆనందబాస్పాలతో క్షణాల్లో వెళ్లి తీసుకువచ్చి ఇద్దరికీ తినిపించగా నువ్వు కూడా తిను అనగా మురిసిపోతూ తిని మళ్లీ ఒకసారి తెచ్చి తినిపించగా చాలా రుచిగా వండావురా ఇక రోజూ నువ్వే వండాలి నేను దర్జాగా కూర్చుని తినాలి అంటూ నవ్వుతూ చెప్పగా నీ పెదాలపై చిరునవ్వు కోసం ఏమైనా చేస్తానురా అంటూ నీళ్లు అందించి బయటకురాగా నావైపే ఆరాధనగా చూస్తూ కీర్తిని సంతోషంగా హత్తుకొని మురిసిపోయింది.



రూంలోకి వెళ్లగా నన్నే కొత్తగా చూస్తుండగా మేడం గారు కొద్దిగా ఫ్రెష్ అయ్యి వస్తే పార్టీలో ఏ ఏ ఐటమ్స్ చేద్దామో లిస్ట్ తయారుచేస్తే రేపు ఆఫీస్ నుండి వస్తూ అన్నీ తెచ్చేయ్యొచ్చు అని చెప్పగా తియ్యగా నవ్వుతూ కన్నార్పకుండా అలాగే చూస్తూ అలాగే sir అంటూ తియ్యగా ఒక మాధుర్యంతో బదులివ్వగా వొళ్ళంతా తియ్యగా జలదరించగా లెవబోతుండగా మహి ఓడిలోనే కీర్తి హాయిగా నిద్రపోతుండగా ఎత్తుకొని నువ్వు ఫ్రెష్ అయ్యేలోపు వాళ్ళింట్లో వదిలేసి వస్తాను అంటూ కీర్తి బుగ్గపై ముద్దుపెట్టి మళ్లీ ఒకసారి తనవైపు చూడగా అంతే ఘాడంగా చూస్తుండగా ఆశ్చర్యపోతూ కిందకు వచ్చి వాళ్ళమ్మకు అందించి కీర్తి భోజనం కూడా చేసింది అని చెప్పగా థాంక్స్ మహేష్ అంటూ అందుకోగా అంకుల్ కు hi చెప్పి పైకి వచ్చేటప్పటికి వెన్నెలలో బయట సోఫాలో పేపర్ పెన్ పెట్టుకొని కూర్చొని నాకోసం ఎదురుచూస్తూ నన్ను చూసి అందంగా నవ్వుతూ మహేష్ ఇక్కడే బాగుంది అనగా , నీ ఇష్టమే నా ఇష్టం అంటూ ప్రక్కనే కూర్చున్నాను.



చాలాసేపు డిస్కస్ చేసిన తరువాత పార్టీ మధ్యాహ్నం ఫిక్స్ చేసి వెజ్ , నాన్ వెజ్ తో కలిపి 10 రకాల ఐటమ్స్ లిస్ట్ రెడి చేసి వాటితోపాటుగా సాఫ్ట్ డ్రింక్స్ , వంటకు ఏమేమి అవసరమో కింద రాసుకొని రేపు సాయంత్రం purchase చేద్దామని చెప్పి happy నా మేడం ఇంతదానికి ఏడ్చుకుంటూ పడుకొని నన్ను కంగారుపెట్టేశారు అనగా sorry రా అంటూ అమ్మకు కాల్ చేసి మాట్లాడుతూ మాట్లాడుతూ అలాగే నిద్రలోకి జారుకోగా ఎత్తుకొని బెడ్ పై పడుకోబెట్టి నేను పడుకున్నాను.



ఉదయం యధావిధిగా నవ్వుతూ కాఫీ తో నిద్రలేపగా గుడ్ మార్నింగ్ చెప్పుకొని పర్సు అందుకొని జిమ్ కోసమని వెళ్లి అపార్ట్మెంట్ మేనేజర్ ను కలిసి మేడం.......... అనేంతలో మహి birthday రిజిస్టర్ అయిపోయింది ఎప్పుడు arrange చేయమంటారు అని అడుగగా , ఆశ్చర్యపోతుండగా తెల్లవారుఘామునే ఇంటి తలుపు కొట్టగా చూస్తే కీర్తి అనగానే మొత్తం అర్థమైపోగా లవ్ యు కీర్తి అంటూ మనసులో అనుకొని రేపు రాత్రికి మధ్యాహ్నం  మేడం, చాలా సర్ప్రైజ్ గా ఉండాలి రేపు మధ్యాహ్నం 3 గంటల తరువాత decoration మొదలెట్టాలి స్టేజి ఏర్పాటుచేయ్యాలి , dj పెట్టించాలి పిల్లల డాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి  

 కాంపౌండ్ మొత్తం విద్యుత్ కాంతులతో వెలిగిపోతూ decoration అద్భుతంగా ఉండాలి మహికి అపార్ట్మెంట్ లో ఉన్నవాళ్ళంతా తెలుసు నాకు కూడా మహేష్ అంటూ నవ్వుతూ చెప్పగా , yes మేడం అందరినీ ఆహ్వానించబోతున్నాను కేక్ కట్టింగ్ తరువాత అందరికోసం వెజ్ మరియు నాన్ వెజ్ లో రకరకాల వంటలు చేయించాలి , మహి birthday సెలబ్రేషన్ ను అపార్ట్మెంట్ వాసులంతా జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి అని సంతోషంగా చెబుతుండగా,



సర్ అలా చెయ్యాలంటే .............అంటూ నీళ్లు నములుతుండగా బడ్జెట్ సరిపోదు అంటారు అంతేకదా మీరేమీ బయపడకండి అంటూ పర్సులో నుండి మరియు జేబులో నుండి పెద్దమొత్తం లో డబ్బు ఇచ్చి సరిపోకపోతే మోహమాటపడకుండా కాల్ చెయ్యండి అంటూ టేబుల్ సై ఉన్న పేపర్ పై నా నెంబర్ , పేరు రాసి ఫంక్షన్ మాత్రం అధిరిపోవాలి అనగా , మహేష్ ఇప్పటి వరకూ మేము ఎన్ని చెయ్యలేదు కానీ ఇది మాత్రం ప్రత్యేకంగా నేనే దగ్గరుండి ఏర్పాటు చేయిస్తాను మీరు దైర్యంగా ఉండండి అని సంతోషంగా చెప్పగా thank you so much మేడం అంటూ చెయ్యి కలిపి చెప్పానుకదా మేడం ఏర్పాట్లు మాత్రం మధ్యాహ్నం తరువాత చెయ్యాలి మహికి ఏమాత్రం తెలియరాదు అని చెప్పి పైకివెళ్లి రెడీ అయ్యి మహిని ఆఫీస్ దగ్గర వదిలి కిందకు దిగి మహి నీకు ఎవరెవరు తెలుసో అందరినీ పిలువు ఏమాత్రం ఆలోచించకు అని చెప్పి తను లోపలకు వెళ్ళగానే , 



సెక్యురిటి మేడం దగ్గరకు వెళ్లి hi మేడం అని పలకరించగా మహేష్ అంతా ok కదా అని అడుగగా , everything is fine మేడం రేపు మీకు సెలవేనా అని అడుగగా , వీకెండ్ హాలిడే అని చెప్పగా చాలా సంతోషం మేడం రేపు మహి birthday పార్టీ మీరు ఖచ్చితంగా రావాలి మొదటగా మీకే చెబుతున్నాను ఎందుకంటే మీకు కాల్ చెయ్యడం వల్లనే నా మహి birthday అని నాకు తెలిసింది అంటూ గుండెలపై చేతిని వేసుకొని చెప్పగా , అయితే తప్పకుండా వస్తాను మహేష్ అనగా తన మొబైల్ కు అపార్ట్మెంట్ అడ్రస్ పంపించి అక్కడకు వచ్చి మహి అంటే చాలు అనగా sure మహేష్ అనగా థాంక్స్ మేడం అంటూ కారు దగ్గరకు వచ్చి కృష్ణ గాడికి కాల్ చేసి ఎక్కడ ఉన్నావురా అని అడుగగా అర్జంట్ వర్క్ ఉందని ఆఫీస్ నుండి కాల్ వస్తే ఇపుడే ఎంటర్ అవుతున్నాను అని చెప్పగా , bad luck రా నీ చెల్లెలి birthday రేపు ఏమైనా హెల్ప్ చేస్తావేమో అని కాల్ చేసాను నువ్వు పని చూసుకో నేను ముందుగా అపార్ట్మెంట్ అంతా invite చెయ్యాలి అని చెప్పి కాల్ కట్ చేసి ఆఫీస్ కు సెలవు పెట్టి నేరుగా అపార్ట్మెంట్ చేరుకున్నాను.



ఎంటర్ అవడమే మొదటగా కీర్తి ఇంటి కాలింగ్ బెల్ నొక్కగా కీర్తి నాన్న గారు డోర్ తెరిచి మహేష్ లోపలకు రా అని ఆహ్వానించగా అంకుల్ రేపు మహి birthday తెలుసు మహేష్ ఉదయం లేచిన దగ్గర నుండి కీర్తి పదే పదే చెబుతూనే ఉంది రేపు రాత్రికి ఫంక్షన్ భోజనాలు కూడా అక్కడే అనగా , హమ్మయ్యా ఒక్కరోజైనా మీ అక్క ఫుడ్ తప్పించుకునే వీలు దొరికింది అనగా అక్క చిరుకోపంతో చూస్తుండగా అంకుల్ తోపాటుగా నవ్వి అందరూ రావాలి అని చెప్పి వరుసగా ఇంటింటినీ invite చేస్తూ ప్రతి ఒక్కరూ మహి బర్త్డే ని తన ఇంట్లో వాళ్ళ birthday గా ముందుగానే వచ్చి ఏర్పాట్లలో సహాయం కూడా చేస్తామని సంతోషన్గా చెప్పగా మురిసిపోతూ కింద ఫ్లోర్ ముగించుకొని ఫస్ట్ ఫ్లోర్ ఎక్కుతుండగా క్యాబ్ లో కృష్ణ గాడు దిగి డబ్బు పే చేసి ఆనందంతో డాన్స్ చేస్తూ రేయ్ మామా వచ్చేసారా అంటూ నా దగ్గరకు రాగా ,



ఏరా అర్జెంట్ వర్క్ అన్నావు ? , నువ్వు చెల్లెమ్మ birthday అన్నావు కదరా మరేదీ నాకు ఇంపార్టెంట్ కాదురా లీవ్ పెట్టేసాను అంటూ హుషారుగా చెప్పగా లవ్ యు రా మామా అంటూ గంటలో అపార్ట్మెంట్ మొత్తం ఆహ్వానించగా , నెక్స్ట్ ఏంటి రా అంటూ ఉత్సాహంగా అడుగగా , 



ఫస్ట్ : నైట్ 12 గంటలకు సర్ప్రైజ్ కేక్ కట్టింగ్ అది మామూలుగా కాదు అంటూ మొత్తం వివరించగా వాడి ఆనందానికి అవధులు లేనట్లుగా ఆనందిస్తుండగా , 



సెకండ్ :మహి ఆఫీస్ టీం మెంబెర్స్ తో పార్టీ వంట మనమే చెయ్యాలని చెప్పగా , వాహ్............మళ్లీ మన కాలేజ్ ఫుడ్ బొనాంజా ప్లానింగ్ అన్నమాట నేను రెడీ ,



థర్డ్ : సాయంత్రం అపార్ట్మెంట్ ఫ్యామిలిస్ తో ఘనంగా సెలబ్రేషన్, dj , డాన్స్ లు , భోజనాలు అని చెబుతుండగా , హ్యాట్సాఫ్ రా మామా అద్భుతం ఒకటి తరువాత ఒక సర్ప్రైజ్ తో చెల్లెమ్మ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోవాలి జీవితంలో నువ్వు ఇస్తున్న birthday గిఫ్ట్ ను మరిచిపోకూడదు అంటూ అమాంతo కౌగిలించుకోగా , 



సంతోషిస్తూ ముందుగా నైట్ సర్ప్రైజ్ కోసం కేక్ మరియు decoration కోసం రంగురంగుల పూలు , లైట్స్ ........ఇలా బోలెడన్ని కొనాలి అని చెప్పగా అయితే పదా సిటీకి అంటూ వెళుతూ దగ్గరలోని కేక్ పాయింట్ లో సాయంత్రానికి ఒక చిన్న కేక్ మరియు రేపటి కోసం ఒక పెద్ద స్టెప్ బై స్టెప్ కేక్ మరియు decoration candils  ఆర్డర్ చేసి అటునుండీ సిటీకి చేరుకొని షాప్స్ , షాపింగ్ మాల్స్ తిరుగుతూ కావాల్సినవన్నీ మరియు మహి కోసం అద్భుతమైన డిజైన్ గల costly లెహంగా మరియు నాకు ఇష్టమైన చీరలు , అందమైన గిఫ్ట్  తీసుకొని అన్నింటినీ కారు లోపల మరియు పైన సెట్ చేసి decorate చేసే వాళ్లదగ్గరకు వెళ్లి సరిగ్గా ఈరోజు రాత్రి 12 గంటలకు అపార్ట్మెంట్ అడ్రస్ చెప్పి  చుట్టూ సిగ్నల్ ఇవ్వగానే వందల్లో ఫ్లైయింగ్ చైనీస్ లాంతర్న్స్ ఆకాశంలో మిరుమిట్లుగొలిపేలా ఎగరేయ్యాలని చెప్పగా , 



సర్ దానికి బోలెడంత మంది పనివాళ్లను పెట్టాలి చాలా ఖర్చు అవుతుంది అనగా అడ్వాన్స్ అంటూ ఒక కట్ట ఇచ్చి మిగతాది ఎగరేసిన వెంటనే మా ఫ్రెండ్ మీ పక్కనే ఉండి ఇచ్చేస్తాడు అని చెప్పగా , then ప్రాబ్లెమ్ solved అంటూ అడ్రస్ నోట్ చేసుకోగా చేతులు కలిసి be రెడి at time అని మరీ మరీ చెప్పగా బిల్ వేసి అందులో మా నెంబర్ ఉందని సమయానికి ఉంటామని చెప్పగా అక్కడే హోటల్ లో భోజనం చేసి ఇంటికి చేరుకొని నైట్ సర్ప్రైజ్ కోసం తెచ్చినవి మాత్రం దాచిపెట్టి మిగతావి మాత్రం హాల్ లో ఉంచి , ఇంకేమైనా మరిచిపోయామారా అంటూ సోఫాలో కూర్చుని ఆలోచించి మరిచిపోయాను ఉదయానికల్లా నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఫ్రెష్ గా కొట్టించుకొని పెద్ద గ్యాస్ స్టవ్ మరియు ఈ లిస్ట్ లో ఉన్న పాత్రలన్నీ అందుబాటులో ఉంచెయ్ అంటూ డబ్బు ఇవ్వబోగా రేయ్ ఉన్నాయిరా అనగా అలా కాదురా మామా మహి birthday నా డబ్బుతోనే అంటూ గుండెలపై చేతిని వేసుకొని చెప్పగా , అలా అయితే ok అంటూ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని నువ్వు చెల్లెమ్మను పిక్ చేసుకొని అటు నుండి షాపింగ్ కు పిలుచుకొనివేళ్ళు నేను కేక్ తోపాటు మిగిలినవి తెస్తాను అంటూ క్యాబ్ లో వెళ్ళాడు.
Like Reply
ఆఫీస్ బయట wait చేస్తుండగా కొద్దిమందితో సంతోషన్గా మాట్లాడుతూ బయటకువచ్చి నన్ను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి నా కళ్ళల్లోకే కొత్తగా చూస్తూ వెంటనే వాళ్ళవైపు తిరిగి అందరినీ పిలిచి మహేష్ అంటూ అందరికీ పరిచయం చెయ్యగా , wow ఏంటే ఇంత handsome గా ఉన్నాడు అంటూ అమ్మాయిలు మహిని తోసుకుంటూ వచ్చి నా చేతులు అందుకొని కౌగిలించుకోబోగా సిస్టర్ సిస్టర్ ...............అంటూ వెనక్కు వెళ్ళగానే పో మహేష్ అంటూ బాధగా వెనక్కు రాగా , తిక్క కుదిరిందా అంటూ మహి వాళ్ళవైపు మూసిముసినవ్వులు నవ్వుతూ నావైపు కొత్తగా ఒక ఫీల్ తో చూస్తుండగా నాకు ఏదేదో అయిపోతుండగా , టీం లీడర్ అంకిత గారు ముందుకువచ్చి తనను తాను పరిచయం చేసుకోగా చేతులు కలిపి మేడం రేపు...........అనగానే , బాధపడుతున్నట్లుగా నటిస్తూ వెంటనే postponed మహేష్ అంటూ ఎగిరి గెంతులేసినట్లుగా సంతోషంగా చెప్పగా , చoపేశారు పోండి మేడం చాలా సంతోషం మహి చెప్పిన సమయం కంటే ముందుగానే వచ్చెయ్యండి we'll do lot of fun అని చెప్పి మహి మనకు చాలా పని ఉంది షాపింగ్ చెయ్యాలి వెళదామా అని అడుగగా , సరే అన్నట్లుగా నా వైపు తన కళ్ళను తిప్పుకోకుండా ఘాడంగా చూస్తూనే తల ఊపగా వెళ్లి కార్ డోర్ తెరవగా ల...........థాంక్స్ రా అంటూ చిలిపిగా నవ్వుతూ కూర్చోగా అటువైపు వస్తూ బై సిస్టర్స్ we'll meet tommorrow at party అని చెప్పి వాళ్ళను చుట్టూ ఉన్నవారు ఆటపట్టిస్తుండగా నవ్వుతూ కారును ముందుకు పోనిచ్చాను.



ముందుగా మార్కెట్ కు వెళ్లి మహి చూపించిన అన్నింటినీ తీసుకొని అటు నుండి షాపింగ్ మాల్ కు తీసుకెళ్లి నీ ఇష్టం ఎన్ని చీరలు డ్రెస్ లు ఇంకా ఇంకా........అంటూ నవ్వుతూ తీసుకోమని చెప్పి gents సెక్షన్ కు వెళ్లగా మహి తియ్యగా సిగ్గుపడుతూ నవ్వుతూ సెలెక్ట్ చేస్తుండగా నాకు మరియు కృష్ణ గాడికి తీసుకొని తను కనబడేలా కాస్త దూరంగా కూర్చొని తననే చూస్తూ ఆనందించాను. త్వరగానే అయిపోయింది అంటూ రాగా నిజంగానేనా నేను నమ్మలేకపోతున్నాను అనగా , మహేష్.......అంటూ కొట్టబోగా తన స్పర్శ తగిలినా అదృష్టమే అని భుజం చూపించగా పోరా అంటూ నవ్వుతూ వెళదామా అంటూ నా చెయ్యి అందుకొని లేపగా సరే మేడం అంటూ పే చేసి కారు వెనుక ఉంచి బయటే భోజనం చేసి ఇంటికి చేరుకునేటప్పటికి 8 గంటలు అవ్వగా ,మహి  అమ్మతో కాసేపు మాట్లాడగా ,మొబైల్ అందుకొని మహి రేపు చాలా చెయ్యాలి  ఈరోజు తొందరగా పడుకో అని చెప్పగా అలాగే అంటూ నా కళ్ళల్లోకే అర్థం కానంత ఘాడంగా చూస్తూ తల ఊపి లోపలకు తన రూంలోకి వెళ్లగా కాసేపాగిన తరువాత లోపలకు వెళ్లి మహి హాయిగా నిద్రపోతుండగా తలుపువేసి గడి పెట్టేసి దాచిపెట్టినవన్నీ తీసుకొని బయటకు వస్తూ కృష్ణగాడికి కాల్ చేసి పైకి రమ్మనగా 10 నిమిషాల తరువాత వచ్చాడు.



వరండా మధ్యలో నిలబడి ఇక్కడే decorate చెయ్యాలి అంటూ వాడికి మాత్రమే వినిపించేలా చెప్పి , వాడు కూడా అలాగే మాట్లాడుతూ మందమైన రాడ్స్ తో కొంతమంది మనుషులు పట్టేంతలా టెంట్ ఏర్పాటుచేసి దానిని మొత్తం రకరకాల పూలు పెద్దమొత్తం లో కృష్ణగాడు తెచ్చిన ఎర్రటి గులాబీలతో మరియు రంగురంగుల విద్యత్ బల్బులతో రొమాంటిక్ గా మిరుమిట్లుగొలిపేలా అందంగా తయారుచేసాము. సమయం 11 గంటలకు ఫ్లైయింగ్ క్యాండీల్స్ ఎగరేయ్యడం కోసం చాలామంది వచ్చినట్లుగా సెక్యురిటి కాల్ చేసి చెప్పడంతో కృష్ణగాడు వెళ్లి అపార్ట్మెంట్ చుట్టూ places చూపించి కేక్ మరియు క్యాండీల్స్ తీసుకువచ్చి నాకు అందించి మొత్తం ఒకసారి టెస్ట్ చేసి చూసి చెల్లెమ్మ ఇలా చూసిందంటే ఫ్లాట్ అయిపోతుందిరా all the best అని చెప్పి కింద ఏర్పాట్లు చూసుకొని అంతా పూర్తయిన తరువాత వెళ్లి తెల్లవారుఘామునే వచ్చేస్తానురా అంటూ వెళుతుండగా ,



రేయ్ మామా నువ్వు ఉండరా అని పిలిచాను , అంత నటించక్కర్లేదురా ఇంకో 10 నిమిషాలు నేను ఇక్కడగాని ఉండి ఉంటే నన్ను ఇక్కడి నుండి కిందకు తోసేసినా తోసేస్తావు నీకో దండం రా నాయనా తెల్లవారకముందే వచ్చేస్తానుగా ఎంజాయ్ అంటూ చెల్లెమ్మ ఎంత ఆనందిస్తుందో అంటూ మురిసిపోతూ కిందకు వెళ్ళిపోయాడు. ఇడియట్ కు నా మనసు బాగా తెలుసు అంటూ నవ్వుకుని వరండా మొత్తం శుభ్రం చేసి ఇంటి తలుపు దగ్గర నుండి ఫ్లవర్ decoration టెంట్ వరకూ పూలతో మందంగా దారి పరిచి క్షణం ఒక యుగంలా watch చూస్తూ సరిగ్గా 11:45 అవ్వగానే కృష్ణ గాడికి కాల్ చేసి రెడీగా ఉండండి అని చెప్పి టెంట్ లో కేక్ ను అందంగా పూలతో అలంకరించిన టేబుల్ పై ఉంచి చుట్టూ colourful క్యాండీల్స్ వెలిగించి , కేక్ మధ్యలో ఫ్లవర్ క్యాండిల్ ఉంచి సెట్ అంటూ బయట ఇంటిలోపల లైట్స్ అన్నింటినీ ఆఫ్ చేసి సరిగ్గా 11: 57 కు మహి పడుకున్న రూమ్ గొళ్ళెం తెరిచి తలుపును తను భయపడేలా గట్టిగా కొట్టగా లోపల తను సడెన్ గా లేచి మహేష్ అంటూ కేక వేసింది . Sorry రా అంటూ మళ్లీ అదేవిధంగా గట్టిగా కొట్టి పరిగెత్తుతూ బయటకు వచ్చేసాను.



భయపడుతూ మహేష్ , మహేష్ అని పిలుస్తూ హాల్ లోకి వేగంగా వచ్చి చుట్టూ చీకటిగా ఉండటంతో సోఫా దగ్గరకు వచ్చి చూసినా నేను లేకపోవడంతో మరింత భయపడుతూ బిక్కుబిక్కుమంటూ చుట్టూ చూడగా మెయిన్ డోర్ తెరిచి ఉండగా మరింత భయపడుతూ నేను ఎక్కడికి వెళ్ళాను అని అడుగులో అడుగు  వేసుకుంటూ బయటకు వచ్చిందో లేదో ఇంట్లో నుండి 12 గంటలు అయినట్లుగా గడియారం టింగ్ టింగ్.........మంటూ మ్రోగుతుండగా , 



Many many Happy returns of the day రా మహి Happy Birthday to my best friend అని విష్ చేయగానే ఆకాశంలోకి సుయ్ , సుయ్.........మంటూ ఆపకుండా చీకటిని మరియు తన జీవితంలో ఇక చీకటనేదే లేకున్నట్లుగా చుట్టూ స్పార్కిల్ వెలుగు పరుచుకోగా లవ్..............థాంక్స్ మహేష్ అంటూ నోటికి చేతులను అడ్డుగా పెట్టుకొని తల పైకెత్తి ఆశ్చర్యపోతుండగానే ఆ వెంటనే ఫ్లైయింగ్ చైనీస్ లాంతర్న్స్ వాటితోపాటుగా బెలూన్స్ అపార్ట్మెంట్ చుట్టూ ఆకాశంలో చీకటిని తరిమేస్తున్నట్లుగా వందల్లో పైపైకి వెళుతూనే ఉండగా సంభ్రమాశ్చర్యానికి లోనయ్యి నా దగ్గరకు పూలపై నడుస్తూ వచ్చి ఆనందబాస్పాలతో నావైపు మరియు ఆకాశం వైపు చుట్టూ తిరుగుతూ చూస్తూ సంతోషం పట్టలేక ఉబ్బితబ్బిబ్బవుతూ థాంక్స్ థాంక్స్ , thank you so so soooooooo much రా అంటూ మైమరిచిపోతూ నా జీవితంలో ఇలాంటి birthday చేసుకుంటానని కలలో కూడా ఊహించలేదు అంటూ నాకళ్ళల్లోకే పట్టరాని సంతోషంతో చూస్తూ మురిసిపోయింది.



ఇంతలో మొబైల్ మ్రోగగా వీడియో కాల్ ముందుగా అమ్మ చెప్పలేనంత ప్రేమతో Happy birthday friend అని విష్ చేసి మహి నవ్వును చూస్తూ జీవితాంతం ఇలాగే సంతోషన్గా నవ్వుతూ ఉండాలిరా అంటూ నాన్నకు ఇవ్వగా అలాగే విష్ చేశారు , మహి వాళ్ళ అమ్మ కూడా ప్రక్కనే ఉన్నా మాకు తెలియరాదని మహి మొబైల్ కు కాల్ చేసినట్లుగా లోపల నుండి మొబైల్ చప్పుడు వినిపించడంతో మహేష్ ఒక్క నిమిషం అంటూ పరిగెత్తుకుంటువెళ్లి తన అమ్మతో మాట్లాడుతూ బయటకు వచ్చి బై చెప్పేసి కట్ చెయ్యగా , ఆ వెంటనే పెద్దమ్మ , చెల్లి కాల్ చేసి విష్ చేసి వైజాగ్ లో సంతోషించారు. కింద ఉన్న కృష్ణ గాడు నా మొబైల్ కు కాల్ చేసి Happy birthday చెల్లెమ్మా ఉదయమే వచ్చేస్తాను అని చెప్పడంతో థాంక్స్ అన్నయ్యా అంటూ తన జీవితంలో ఇలా ఈసమయంలో ఇంతమంది విష్ చెయ్యడం అని మురిసిపోతూ దీనికంతటికీ కారణం నువ్వేరా అంటూ నా చేతిని రెండు చేతులతో అందుకొని ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్ గా లభించావు నీ రుణం ఎలా తీర్చుకోనురా అంటూ కన్నీళ్లు కార్చింది.



అమ్మా నీ కళ్ళల్లో కన్నీళ్లు చూడటానికా ఇదంతా చేసింది ఇలా కానీ అమ్మ చూసిందంటే నాకు బడితపూజే అనగానే అందంగా నవ్వగా , ఆ నవ్వు చాలు అంటూ ఇంకా ఆకాశంలో లాంతర్న్స్ మరియు బెలూన్స్ క్రేకేర్స్ పేళుతుండగా , మేడం కేక్ కొద్దామా అని అడుగగా తియ్యగా నవ్వింది . అమ్మకు వీడియో కాల్ చేసి కేక్ ఎదురుగా ఉంచి మహికి కత్తి ఇచ్చి ఫ్లవర్ క్యాండిల్ వెలిగించగా birthday మ్యూజిక్ రాగా మూసిముసినవ్వులు నవ్వుతూ కేక్ కట్ చెయ్యడంతో అమ్మతోపాటుగా విష్ చేసాము. కేక్ ముక్క అందుకొని Happy birthday అంటూ నోటికి అందించగా తిని థాంక్స్ రా అంటూ నాకు తినిపించింది. 



A స్మాల్ గిఫ్ట్ for my best friend అంటూ జ్యూవెల్లరీ బాక్స్ ఇవ్వగా లోపల ప్లాటినం చైన్ చూసి ఆనందబాస్పాలతో మురిసిపోతూ నాకళ్ళల్లోకి ఆరాధనగా చూసి నాచెయ్యి అందుకొని టెంట్ నుండి బయటకు వచ్చి ఆకాశం వైపు మొత్తం అయిపోయేంతవరకూ సంతోషపడుతూ చూస్తూనే మళ్లీ చీకటిపడగానే సంతోషంతో నన్ను కౌగిలించుకోబోయి ఏదో గుర్తుకువచ్చినట్లుగా ఆగిపోయింది. Once again happy birthday మహి అని చెప్పి ఉదయమే లేవాలి పడుకొందాము అంటూ తనతోపాటుగా లోపలకు వచ్చి డోర్స్ లాక్ చేసి సోఫాలో పెదాలపై చిరునవ్వుతో తన ఆనందాన్నే గుర్తుచేసుకుంటూ నిద్రపోయాను. లోపల మహి పరిస్థితి ఏమిటో తనకే అంతుపట్టకుండా ఉంది మహేష్ మనసులో తను ప్రేమించిన అమ్మాయి ఉండగా వేరే ఉద్దేశ్యంతో కౌగిలించుకోవడం తప్పు అంటూ బెడ్ పై వాలిపోయి నిద్రపట్టక అటూ ఇటూ తిరుగుతూ చివరగా టెడ్డి బేర్ తన గుండెలపై హత్తుకొనగానే హాయిగా నిద్రపట్టేసింది.



కాలింగ్ బెల్ మ్రోగిన చప్పుడుకు నిద్రలేచి సమయం చూస్తే 5 గంటలు కళ్ళు తిక్కుకుంటూ వెళ్లి తలుపు తెరిచి చూస్తే కృష్ణ గాడు సెక్యూరిటీ సహాయంతో వంట చెయ్యడానికి ఏమేమి అవసరమో పెద్ద పెద్ద రెండు గ్యాస్ స్టవ్ లు , సైజ్ లను బట్టి చాలా పాత్రలు గరిటెలు పైకి తీసుకువచ్చాడు , లవ్ యు రా మామా అంటూ వొళ్ళువిరుచుకొని ఫేస్ వాష్ చేసుకొని ఎక్కడ వంటలు చెయ్యాలో ప్లేస్ చూసి ఒక మూలన సెట్ చేసాము వరండా మొత్తం షామియానా వేయించి గెస్ట్స్ కోసం welcome బోర్డ్ తగిలించి . ఒరేయ్ నేను వెళ్లి లిస్ట్ లో ఉన్న నాన్ వెజ్ తెచ్చేస్తాను మిగతావి చూస్తూ ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంతలో కీర్తి పరిగెత్తుకుంటూ వచ్చి అక్కయ్య లేచిందా అని అడుగగా ఇంకా లేదు అని చెప్పడంతో , ఫ్లవర్ టెంట్ చూసి అన్నయ్యా సర్ప్రైజ్ కు అక్కయ్య ఎలా ఆనందించింది అని అడుగగా , గుండెలపై చెయ్యి వేసుకొని పెదాలపై చిరునవ్వుతో మాటల్లో వర్ణించలేను కీర్తి , నవ్వుతూ ఈ ఫీలింగ్ చాలు అన్నయ్యా అక్క ఎంత మురిసిపోయిందో తెలిసిపోతోంది , ఈరోజు సెలవు పెట్టేసాను ఈరోజంతా అక్కతోనే అంటూ లోపలకు వెళ్ళింది.



కొద్దిసేపటి తరువాత కీర్తితోపాటుగా నవ్వుతూ మహి వచ్చి గుడ్ మార్నింగ్ మహేష్ అంటూ విష్ చెయ్యగా happy birthday మేడం , ఇప్పటికే చాలాసార్లు చెప్పావు రా నా ఇష్టం ఈరోజంతా చెబుతూనే ఉంటాను అనగానే మూసిముసినవ్వులు నవ్వుతూ అన్నీ తెచ్చేసావే అంటూ ఒక్కొక్కటే చూస్తూ సరిగ్గా సరిపోతాయి , ఇవన్నీ మీ అన్నయ్యే తెచ్చాడు ఎక్కడ అన్నయ్య అని చుట్టూ చూసినా లేకపోగా , నాన్ వెజ్ తీసుకురావడానికి వెళ్ళాడు వచ్చేస్తూ ఉంటాడు , తమరు రెడీ అయితే మొదలుపెట్టేయొచ్చు అని చెప్పడంతో half an hour అంటూ కీర్తితో పాటు లోపలకు వెళ్ళిపోయింది. కృష్ణగాడు వచ్చేలోపు నేను కూడా రెడీ అవ్వడానికి వెళ్ళాను. 



అర గంటలొనే  ఇద్దరమూ రెడీ అయ్యి బయటకు రాగానే ముందుగా కృష్ణగాడు happy birthday అంటూ విష్ చేసి ఇలాగే నవ్వుతూ ఉండాలి చెల్లెమ్మ అంటూ సంతోషించాడు. కీర్తి అమ్మ మా అందరి కోసం టిఫిన్ తీసుకువచ్చి కీర్తి మొత్తం చెప్పింది మీకు నేను కూడా సహాయం చేస్తాను అంటూ మహికి విష్ చేసి కృష్ణగాడు ఫ్రెష్ అయ్యి వచ్చాక టిఫిన్ చేసి అందరమూ హైఫై కొట్టుకొని వంటలు చెయ్యడానికి రంగం లోకి దిగాము.వివాహ బోజనంబు అనే పాటతో మొదలుపెట్టి మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉత్సాహంగా మూడు గంటలలో మొత్తం ఐటమ్స్ తయ్యారుచేస్తూ వచ్చిన గెస్ట్ లను సంతోషన్గా ఆహ్వానిస్తూ మహికి విష్ చేసి వారుకూడా వారికి తోచిన సహాయం చెయ్యడంతో 12 గంటలలోపు గెస్ట్ లంతా రావడం , వంటలు పూర్తవ్వడం , కృష్ణగాడు వెళ్లి కేక్ మరియు స్ప్రే లు తేవడంతో , మహి మేము బఫె ఏర్పాటుచేస్తాము అక్కతోపాటుగా వెళ్లి రెడీ అయ్యి రా అని చెప్పడంతో నవ్వుతూ లోపలకు వెళ్ళిపోయింది. 



ఏంటి బ్రదర్ వంటలు పిచ్చెక్కించినట్లున్నారే అంటూ మహి టీం లోని సిస్టర్స్ సువాసనను పీలుస్తూ చెప్పగా , మా respectd గెస్ట్స్ కోసం ఆమాత్రం లేకపోతే మా పరువు ఏమి కావాలి అంటూ వేడిగా ఉండేలా బఫె ఏర్పాటుచేస్తుండగా , అంకిత మేడం మరియు సెక్యూరిటీ మేడం కూడా రావడంతో మహి వచ్చేలోపు కృష్ణ గాడు , నేను వెళ్లి కొత్తబట్టలు వేసుకొని కేక్ arrange చేస్తుండగా పట్టుచీరలో దేవకన్యలా అందంగా అలంకరించుకొని మహి , కీర్తి చెయ్యిపట్టుకొని రాగా షాక్ లో కన్నార్పకుండా తననే ప్రేమగా చూస్తుండగా , రేయ్ మామ కంట్రోల్ అనగా తల దించుకోగా మహి చూసి తియ్యగా నవ్వుకొంది.  గెస్ట్స్ అంతా చూసి wow మహి బ్యూటిఫుల్ అంటూ కేక్ చుట్టూ రాగా ఫ్లవర్ క్యాండిల్ వెలిగించగానే అందరి చేతుల్లో స్ప్రే ఉన్నట్లుగా happy birthday పాట పాడుతూ గాలిలోకి స్ప్రే చెయ్యగా సంతోషం పట్టలేక మురిసిపోతూ థాంక్స్ చెప్పి కేక్ కట్ చేసి ముందుగా నాకు తినిపించగా , మరొక గిఫ్ట్ ఇచ్చి విష్ చేసి కేక్ తినిపించాను. 



తరువాత కృష్ణకు తినిపించగా happy బర్త్డే చెల్లి అంటూ కేక్ తినిపించి డైమండ్ జ్యూవెల్లరీ ఇవ్వగా ఆనందబాస్పాలతో ఆప్యాయంగా కౌగిలించుకొంది. నెక్స్ట్ కీర్తి చిన్న గిఫ్ట్ ఇచ్చి విష్ చెయ్యగా మోకాళ్లపై కూర్చొని థాంక్స్ కీర్తి అంటూ ముద్దుపెట్టి , కీర్తి ముద్దు అందుకొని కేక్ తినిపించి తన చేతి ద్వారా కేక్ తిని ఇక గెస్ట్ లందరూ ఒక్కొక్కరే వచ్చి విష్ చేసి గిఫ్ట్స్ అందివ్వగా , మురిసిపోతూ థాంక్స్ చెప్పి కాసేపు సంతోషంగా మాట్లాడుతూ వాసనకు ఆగలేకపోతున్నాము అని ఒక సిస్టర్ తట్టుకోలేక చెప్పగా అందరమూ గట్టిగా నవ్వుకుని my dear guests వెజ్ ఇటువైపు నాన్ వెజ్ అటువైపు మీరు చెప్పినట్లుగానే గుంటూరు రుచులనే ఏర్పాటుచేసాము ఎంజాయ్ అని చెప్పగానే , థాంక్స్ మహి , మహేష్ అంటూ ప్లేట్స్ అందుకొని వడ్డించుకొని తింటూ spicy but soooo tasty అద్భుతం అంటూ పొగుడుతూ లొట్టలేసుకుంటూ ఏమాత్రం మోహమాటపడకుండా తృప్తిగా తినేసి మహి ఇప్పటివరకూ ఇలాంటి రుచులను తినలేదు అంటూ మహి మీరు కూడా తినండి అని చెప్పి వాళ్లంతా గుంపుగా కూర్చొని సరదాగా మాట్లాడుతూ ఎంజాయ్ చేశారు.
Like Reply
మహి స్వయంగా తన చేతులతో మా నలుగురికీ వడ్డించగా , మేము నలుగురమూ సంతోషన్గా నవ్వుతూ తనకు వడ్డించి చుట్టూ కూర్చొని తింటూ వడ్డించుకుంటూ తినేసి గెస్ట్ లతో కూడా కొద్దిసేపు మాట్లాడుతూ 3 గంటలకు ఇక వెళ్ళొస్తాము మహి , మహేష్ we enjoyed a lot ఎప్పటికీ మరిచిపోలేనంతలా విందు ఇచ్చారు అంటూ సంతోషన్గా కౌగిలించుకొని అందరూ వెళ్లిపోయారు. మహి అలసిపోయావు నువ్వు కూడా రెస్ట్ తీసుకో మేము శుభ్రం చేసేస్తాము వెళ్ళు అని చెప్పగా , నా కళ్ళల్లోకే చూస్తూ రూంలోకి వెళుతూ కీర్తి రా అని పిలువగా అక్కయ్యా నాకు కూడా కొద్దిగా పని ఉంది అంటూ నావైపు చూసి కన్నుకొట్టి నవ్వింది. రాత్రి సెలబ్రేషన్ మరియు ఇప్పుడు జరిగింది గుర్తుచేసుకుంటూ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతూ మహేష్ నువ్వు జీవితంలో మరిచిపోలేని గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను కానీ నీమనసులో వేరే అమ్మాయి ఉందని ఆగిపోతున్నాను అంటూ బాధపడుతూ వెంటనే నామాటలు గుర్తుకువచ్చి లేదు మహేష్ ఈరోజు అస్సలు బాధపడను కానీ సంతోషం నీవల్లే దానికి తగ్గట్లు బాధ నీవల్లే ఏమి చెయ్యాలి దేవుడా అంటూ అలసిపోయినట్లుగా వెంటనే నిద్రలోకి జారుకొంది. 



కింద చప్పుడు వినిపించగానే కీర్తి పరిగెత్తుకుంటూ వెళ్లి పైనుండే కంపౌండ్ లో చూసి అన్నయ్యా స్టార్ట్ చేసేసారు అంటూ చిన్నగా గుసాగుసలాడగా ,గిఫ్ట్స్ అన్నింటినీ లోపల ఉంచి కృష్ణగాడు పిలుచుకొనివచ్చిన పనివాళ్ళతో అన్నింటినీ శుభ్రం చేయించి వరండాను నీళ్లతో శుభ్రంగా కడిగించి finished అంటూ మినీ లారీ లో వేసి డబ్బు ఇచ్చి పంపించేశాడు. మామా ఫైనల్ సెలెబ్రేషన్స్ ఇంకా పాతాకస్థాయిలో దుమ్ములేచిపోవాలిరా అంటూ తలుపు ముందుకువేసి కిందకు వెళ్లి ఒకవైపు చాలామంది పెద్ద పెద్ద పాత్రలలో వంటలు మొదలెట్టడంతో చకచకా ఏర్పాట్లు చేయించేసాము. చీకటిపడటంతో లైట్స్ on చేయగానే మిరుమిట్లుగొలుపుతూ కంపౌండ్ మొత్తం వెలిగిపోయింది. 



పైకివచ్చి ఫ్రెష్ అయ్యి కీర్తి మీ అక్కను లేపి ఫంక్షన్ కు రెడీ చెయ్యమని తనకోసం కూడా తెచ్చిన కొత్త డ్రెస్ ఇచ్చాను. లవ్ యు అన్నయ్యా అంటూ అమాంతం కౌగిలించుకొని రూంలోకి పరిగెత్తింది. మేము కిందకు దిగివచ్చి పెద్దవాళ్ళందరినీ ఆహ్వానించి స్టేజి ఎదురుగా సోఫాలలో కూర్చోబెట్టాము. 



అక్కా , అక్కా లే అక్కా ఫంక్షన్ కు సమయం అవుతోంది అని లేపడానికి ప్రయత్నించగా , బెడ్ పై నుండే కీర్తి ఫంక్షన్ మధ్యాహ్నమే అయిపోయింది కదమ్మా , మొత్తం మూడు సెలెబ్రేషన్స్ అందులో అన్నయ్య రెండు surprises ఉండేలా ప్లాన్ చేశారు ఒకటి రాత్రి జరిగిపోయింది రెండవది ఇప్పుడు కింద మొత్తం అపార్ట్మెంట్ లోని ఫ్యామిలిస్ అంతా మీకోసం  ఆశగా ఎదురుచూస్తున్నారు అని చెప్పింది. మహేష్ అంటూ కళ్ళల్లో చెమ్మతో లేచి కూర్చొని నేనంటే ఎందుకురా అంత ప్రాణం నీకు , నేనేమైనా రిటర్న్ ఇద్దామంటే తన మనసులో ఎవరో ఉన్నారు ఎలా భగవంతుడా అని ఆలోచిస్తుండగా , అక్కా ఇదిగో కొత్తచీర తొందరగా కుందనపు బొమ్మలా రెడీ అవ్వండి అంటూ బెడ్ దిగి చెయ్యి అందుకొని లాగింది. ఒక మనిషి అనుభవించే maximum సంతోషాన్ని ఒక్కరోజులో ఇచ్చేసాడు ఇంకా ఇంకా ఇస్తూనే ఉన్నాడు నా మహేష్ అంటూ తన గురించే ఆలోచిస్తూ టవల్ అందుకొని బాత్రూం లోకి వెళ్ళింది.



నా ఆలోచనలతోనే చాలాసేపు స్నానం చేసి కొత్తచీర కట్టుకొని బయటకు వచ్చి కీర్తి కొత్త డ్రెస్ లో చాలా బాగున్నావమ్మా ,నీ birthday అని అన్నయ్య నాకోసం తెచ్చాడక్కా , మీరు కూడా పట్టుచీరలో చాలా అందంగా ఉన్నారు దానికి తోడు కొద్దిగా అలంకరించుకుంటే దేవతలా మారిపోతారు అని చెప్పింది.నాకొరిక ఎలాగో తీరదు కనీసం నీకోరిక తీరుస్తాను కీర్తి అంటూ మనసులో అనుకొని అందంగా అలంకరించుకొని తాళిని లోపల దాచేసుకొని నేను ఇచ్చిన గిఫ్ట్స్ అందుకొని ఒకదానిలో చైన్ వేసుకొని మరొక బాక్స్ లో ఉన్న అద్భుతమైన డిజైన్ గల గాజులు చూసి ఇద్దరమూ ఒకేసారి wow అంటూ మీ అన్నయ్య గిఫ్ట్ అనగానే సూపర్ అక్కయ్యా నువ్వు వేసుకుంటే వాటికే అందం వస్తుంది . మా కీర్తికి నేనంటే ఎంత ప్రేమో అంటూ ముద్దుపెట్టి తను సగం నేను సగం వేసుకొని ఇద్దరమూ ఒకసారి అద్దం లో చూసుకొని బ్యూటిఫుల్ అని ఒకేసారి అంటూ చిలిపిగా నవ్వుతూ పదా వెళదాము అంటూ లిఫ్ట్ లో కిందకు రావడం రావడంతోనే ,



 అప్పటివరకూ స్టేజి పై డాన్సులు చేస్తున్న పిల్లలు చూసి అక్కా , అంటీ , మేడం అంటూ మహి దగ్గరకు పరిగెత్తగా గులాబీ రంగు పట్టుచీరలో దేవకన్యలా అందంగా నడుచుకుంటూ రావడాన్ని కన్నార్పకుండా చూస్తుండగా నేను గమనించాలి అని చేతులు ఎత్తి గాజులను మరియు చైన్ సవరించుకోగా చూసి మరింత ఆనందిస్తుండగా పిల్లలంతా ప్రేమగా కేక్ దగ్గరకు పిలుచుకొనివెల్లగా అందరూ పైకిలేచి సంతోషిస్తుండగా ఆంతమందినీ చూసి మురిసిపోతూ నావైపు ఆనందబాస్పాలతో చూస్తూ ఉండిపోగా , కానివ్వు అంటూ సైగ చెయ్యడంతో కేక్ కట్ చేసి అందరూ birthday విష్ చేస్తుండటంతో కీర్తికి తినిపించగా అందరూ వచ్చి విష్ చేస్తూ గిఫ్ట్స్ అందించి తరువాత మళ్లీ డాన్స్ స్టార్ట్ అవ్వగా మహి నాదగ్గరకు వచ్చి ఇంకెన్ని సర్ప్రైజ్ లు ఇస్తావురా అన్నట్లుగా కళ్ళతోనేఆడిగింది. నా ఫ్రెండ్ కోసం ఎన్నైనా ఇస్తూనే ఉంటాను అనగానే కళ్ళల్లో ఆనందబాస్పాలతో తియ్యగా చలించిపోతూ ఇక తనవల్ల కాక రేయ్ అంటూ చిరుకోపంతో ఎవరో ఒక్క క్షణం చూసిన అమ్మాయి కోసం ఇప్పటికీ మనసులోనే ఉంచుకొని తనకోసమే ఎదురుచూస్తే ఎలాగరా అంటూ చూస్తుండగా , ఏంటి రా అని అడుగగా ఏమీ లేదు అంటూ కోపంగా చెప్పి మొబైల్ పైనే మరిచిపోయాను తెస్తాను అంటూ వెళ్ళింది. నేను రానా అనగా వద్దు అంటూ కోపంతో వెనక్కు తిరక్కుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. కీర్తి అంటూ పిలిచి అక్క వెంట వెల్లు అని పంపించాను.



నేరుగా ఏడుస్తూ రూంలోకి వెళ్లి మొబైల్ అందుకొని అమ్మకు వీడియో కాల్ చేయగా మహి కన్నీళ్లను చూసి అమ్మ కంగారుపడుతూ మహి ఏమయ్యింది బంగారు ఆ కన్నీళ్లు ఏంటమ్మా అంటూ అమ్మకూడా కన్నీళ్ళతో ఇంతకీ కన్నయ్య ఎక్కడ అని అడిగింది. అత్త..........అంటీ.........కాదు అత్తయ్యా , అత్తయ్యా........అంటూ ఏడుస్తూనే పిలవడంతో మహి ఏమని పిలిచావు అత్తయ్యా ..............అంటూ మురిసిపోతూనే ఏమి జరిగిందిరా బంగారు అని అడిగింది. అత్తయ్యా నా మనసులో ఉన్నది ముందుగా మీకే చెబుతున్నాను అంటూ కన్నీళ్లను తుడుచుకుని I love మహేష్ అత్తయ్యా , ఆవును నేను మహేష్ ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను , వాడు లేకుండా నేను జీవించలేను అంటూ వెక్కిళ్ళతో ఏడుస్తూ ఆగకుండా కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ చెప్పింది.



ఫ్రెండ్ కాదు కాదు కోడలా నీ నోటి నుండి ఈ మాట ఎప్పుడెప్పుడు వింటామా అని నేను , మీ అమ్మ , మా అక్క, ప్రమీల మరియు మా ఆయన 3 వారాల నుండి ఎంతగా ఎదురుచూస్తున్నామో తెలుసా అంటూ మహి అమ్మను , ప్రమీలను మరియు పెద్దమ్మను వీడియో కాల్ లో చూపించగా అందరూ గుండెలపై చేతులు వేసుకొని మురిసిపోతూ అవును తల్లి , అవును వదినా అంటూ ఒకరినొకరు సంతోషం పట్టలేక కౌగిలించుకోగా , అమ్మా , ప్రమీలా అంటూ అందరినీ ఓకేదగ్గర చూసి ఆశ్చర్యపోతూ మీరు అక్కడ అని అడిగింది. 



నేను చెబుతాను కోడలు పిల్లా నేను బెంగళూరు నుండి వైజాగ్ వచ్చిన రాత్రికి రాత్రే మా ఆయన అదే మీ మామయ్య గారితో పాటు మీరిద్దరూ కలిసేలా ఏదో ఒకటి చెయ్యాలని గుంటూరుకు వెళ్లి మీ అమ్మను కలువగా , తాను కూడా నిన్ను ఆ వెధవ నుండి విడిపించడానికే ప్రయత్నిస్తున్నానని మీ శోభనం రాత్రి జరిగిన సంఘటన చెప్పింది . దేవుడున్నాడని ప్రార్థించి అటునుండి ఆటే చంద్రగిరికి వెళ్లగా హర్ష గాన్ని పోలిసులు చాలామందిని మోసం చేశాడని తండ్రీకొడుకులు కలిసి హత్య కూడా చెయ్యబోయారని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.అక్కయ్యను , ప్రమీలను ఇక అక్కడ ఉంచడం కరెక్ట్ కాదని మాతోనే పిలుచుకొని వెళ్లాలని నిర్ణశయించుకొని , జైల్ కు వెళ్లగా మమ్మల్ని చూసి కాళ్ళా వెళ్ళా పడగా వెంటనే విడిపిస్తే తెలిసిరాదని కొన్ని నెలల తరువాత జైల్ నుండి రిలీజ్ అయ్యేలా లాయర్ లను సంప్రదించి అలా ప్లాన్ చేసాము. 



అందుకుగాను నీతో డివోర్స్ తీసుకుంటున్నట్లుగా పేపర్స్ పై సంతకాలు చేయించి ఇక జీవితంలో ప్రమీల వాళ్ళను కలవరాదని ప్రయత్నిస్తే మళ్లీ మీకు జైలే గతి అని లాయర్ చెప్పగా అలాగే చేస్తాము అనగా త్వరలో బెయిల్ ఏర్పాటుచేస్తాను అని ఆయనకు డబ్బు ఇచ్చి అందరమూ వైజాగ్ వచ్చేసాము. అప్పటి నుండి నీ నోటి ద్వారా ఈ మాట వినాలని రోజూ ప్రార్థిస్తున్నాము రా , ఇంకేంటి ఇంకా ఏడుస్తావు వెళ్లి నీ మహేష్ కు ఇదే విషయం చెప్పు , వెళ్లి చెప్పమ్మా అంటూ మహి అమ్మ , చెప్పేయ్ వదినా అంటూ ప్రమీల సంతోషంగా చెప్పింది.



లేదు అత్తయ్యా మహేష్ మనసులో ఒక దేవత గూడుకట్టుకొని ఉంది , ఎవరో పెళ్లిలో చూసి ప్రేమించాడట , తను ఇప్పటికీ కనిపించకపోయినా తననే హృదయమంతా నింపుకొని పూజిస్తున్నాడు , ఆరాధిస్తున్నాడు . ఏమి చెయ్యాలో అర్థం కావట్లేదు అత్తయ్యా , ప్రమీలా అనగానే అందరూ గట్టిగా నవ్వడం మొదలెట్టగా ఆశ్చర్యంగా చూస్తుండగా , 



ఆ దేవత ఎవరో కాదే పిచ్చిపిల్ల.............ఎవరత్తయ్యా మీకు కూడా తెలుసా , నాకే కాదు మా అందరికీ తెలుసు అనగానే , గుండెల్లో నుండి బాధ తన్నుకొస్తున్నట్లుగా తను ఎవరో తెలుసుకోవాలని ఇష్టంగా లేకపోయినా మహేష్ సంతోషన్గా ఉంటే అదే చాలు అంటూ తలదించుకొని చిన్నగా ఎవరత్తయ్యా అని అడుగగా , మరెవరో కాదే స్వయానా నాకు కాబోయే కోడలే అర్థo కానట్లుగా చూడగా , వదినా ఆ కోడలు నువ్వే అని చెప్పింది. అప్పటివరకూ ఉన్న కోపం బాధ మొత్తం పోయి పెదాలపై చిరునవ్వుతో అత్తయ్యా ఏంటి మీరనేది , అవునే పిచ్చిపిల్ల నువ్వే ఆ పెళ్లి ఎవరిదో కాదు నీ పెళ్లిలోనే , నీ పెళ్ళికోసం వచ్చి నీ ప్రేమలోనే పడ్డాడు కన్నయ్య అని చెప్పినా ఇంకా అర్థం కానట్లుగా చూస్తుండటంతో , కోడలా బాగా గుర్తుతెచ్చుకో పెళ్లికి ముందురోజు గెస్ట్ లకోసం ఒక కాలేజ్ లో విడిది ఏర్పాటు చేసిందైనా గుర్తుంది కదా , గుర్తుంది అత్తయ్యా , రాత్రి ఏదో తీసుకురావాలని ప్రమీలతోపాటుగా ................ ఆ వచ్చాను అత్తయ్యా ,వేగంగా మెట్లు దిగుతూ ఒక అబ్బాయిని గుద్దావు నువ్వు పడబోతే చేతితో పట్టుకున్నాడు ......ఆ అత్తయ్యా గుర్తుకువచ్చింది నన్ను పట్టుకొని కన్నార్పకుండా చూస్తూ మైమర్చిపోయినట్లుగా కళ్ళుమూసుకోవడంతో నవ్వి థాంక్స్ చెప్పి పెళ్ళిమండపానికి వచ్చేసాను. ఇక నేను చెప్పేదేముంది ఆ క్షణం నిన్ను నీ అందాన్ని చూసి కన్నయ్య ఫ్లాట్ అయిపోయి గుండెలపై చేతిని వేసుకొని మాదగ్గరికిరాగానే అర్థమైపోయింది కన్నయ్య deeply ప్రేమలో పడిపోయాడని , విషయం చెప్పినవెంటనే నీకోసం వెతకని ప్లేస్ లేదు చివరగా పెళ్లికూతురు గదిలో అదే నీ గదిలో ఏమైనా ఉందేమోనని నేను వచ్చినప్పుడే మనం కలిసింది అని చెబుతున్నంతసేపు మహి ఆనందానికి అవధులు లేనట్లుగా పరవశించిపోతుండగా , రాత్రి కూడా నిద్రపోకుండా పెళ్లి మండపం లొనే నీకోసమే చలిలో ముగ్గురమూ వేచిచూస్తూ కూర్చున్నాము.



మాకోసం మాకు చలి వేస్తుందని వచ్చి విడిదిలో పడుకొని తెల్లవారకముందే రెడీ అయ్యి కచ్చితంగా నువ్వు పెళ్లికి వస్తావని మండపానికి చేరుకొని ఆతృతగా మొత్తం తిరిగి చూస్తూ చివరగా పెళ్లికూతురిని తీసుకురండి అని పంతులు చెప్పడంతో నిన్ను చూసి మురిసిపోతూ వెంటనే నువ్వే పెళ్లికూతురని తెలిసి గుండెలు పగిలిపోయేలా బాధను లొలొపలే దాచుకొని నీ సంతోషాన్ని చూసి కన్నయ్య కోరుకున్నది కూడా నిన్ను జీవితాంతం సంతోషంగా చూసుకోవాలనే కదా అంటూ చివరగా ఒకసారి మనసారా చూసి పెళ్ళిమండపం నుండి చెప్పలేనంత బాధతో వెళ్ళిపోయాడు అప్పుడు గాయపడిన మనసు మళ్లీ నెల ముందు ఫ్రెండ్ గా తన జీవితంలోకి వచ్చిన తరువాతనే నాతో కూడా నవ్వుతూ మాట్లాడింది నువ్వంటే ప్రాణం రా కోడలా కన్నయ్యకు నాకు కూడా అనుకో అని చెప్పగానే అప్పటివరకూ కన్నీళ్ళతో విని వెంటనే చిరునవ్వులు చిందించింది.



డోర్ దగ్గర నిలబడి నవ్వితే నవ్వుతూ , ఏడిస్తే ఏడుస్తూ మొత్తం విని సంతోషిస్తూ కన్నీళ్లను తుడుచుకుని పరిగెత్తుకుంటూ వెళ్లి పైనుండే అన్నయ్యా తొందరగా పైకిరా అని పిలవడంతో ఏమైందో అని కంగారుపడుతూ వేగంగా మెట్లు ఎక్కి ఆయాసపడుతూ పైకి చేరుకొని కీర్తి ఏమైంది .......కీర్తి సంతోషన్గా నవ్వుతూ చేతితో లోపలకు చూపించింది. మహి మహి .............అంటూ లోపలకు అడుగుపెట్టడం పెట్టడమే మహేష్ అంటూ ప్రేమగా పిలుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి అమాంతం రెండు చేతులను నాచుట్టూ వేసి నా కౌగిలిలోకి వాలిపోయి గుండెలపై వెచ్చగా ముద్దులుపెడుతూ I LOVE YOU మహేష్ అంటూ సంతోషంతో మాటలు తడబడుతూ చెప్పింది.
Like Reply
super super................excellent.............extraordinary..............................................................................
[+] 1 user Likes Veeranjaneyu's post
Like Reply
really i loved to read your story i am fan of you
[+] 1 user Likes Veeranjaneyu's post
Like Reply
Maheshhhhhhhh brooooooo.......

Super .....super........super........ excellent update bro.......

Chala chala baga nachindi ee episode.....Loved it

Meeku Mahi...Keerhi....Krishna ane names chala istama bro???
❤️ Sunny ❤️
[+] 1 user Likes sunyy21's post
Like Reply
Super update bro..... Really I loved it......
మీ
Umesh
[+] 1 user Likes Umesh5251's post
Like Reply
Mahesh bro...

Super awesome update...

No words to describe this episode bayya...
చాలా చాలా బాగా రాశారు...
ప్రేమ, అనురాగం explain చేయడం లో మీకు మీరే సాటి bro..

Thanks for this beautiful update..

I am big fan of you Mahesh bro...

మీ
నాగ్....
[+] 1 user Likes sweetdumbu's post
Like Reply
కెరటం ఎంత ఎత్తుకు వెళ్ళిన, మళ్లీ కిందికి దిగి,1 క్షణం తర్వాత మళ్లీ స్టార్ట్ అవుతుంది కదా..! అది ఎలా కాకుండా మొత్తం పైకి వెళితే??? మీ కథ కూడా కెరటాలే అనుకుంటే.... కాస్త ఫుల్ స్టాప్, కామాస్ వాడండి బ్రో... కథ ఎంత బాగున్న కూడా చదవడానికి కాస్త ఇబ్బంది అవుతుంది.. సంభాషణ ఎవరు చేస్తున్నారో కూడా అర్థం కావడానికి టైమ్ పడుతుంది.. ఇదేదో తప్పుగా అనుకునేరు.. నాకు వచ్చినట్లు చెప్పిన అంతే... పాజిటివ్ గా తీసుకోండి.. కథ అయితే సూపర్..
[+] 1 user Likes Ramya nani's post
Like Reply
భయ్యా ఏమని వర్ణించగలం భయ్యా నీ అప్డేట్లని పదాలను వేతకడమే రాని మాకు మీ అప్డేట్ గురింఉంచి ఏమని వర్ణించగలం నేనైతే మరి మిమ్మల్ని మీ రచనాశైలి ని పొగడటం మానేద్దాం అని అనుకుంటున్నా ఇంత బాగా ప్రతి అప్డేట్స్ ఇస్తే పదాలని ఎక్కడ నుండి తీసుకొనిరావాలి ఏదైనా మళ్ళీ తొందరగా ఇంకొక అప్డేట్ తో మళ్ళీ మా ముందు ఉంటారని ఆసిస్తూ
మీ 
నిక్123
[+] 1 user Likes Nick 123's post
Like Reply




Users browsing this thread: 366 Guest(s)