Thread Rating:
  • 30 Vote(s) - 2.7 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance శృంగార కథామాళిక
#41
మిత్రమా మీకు వీలుంటే మీ అమూల్యమైన అప్డేట్ పోస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
Very nice narration
Like Reply
#43
Waiting for update bro
మీ
Umesh
Like Reply
#44
(13-07-2019, 10:44 PM)nkp929 Wrote: కొత్త కథ తో మమ్మల్ని అలరించడానికి వచ్చారా మిత్రమా .  ఆరంభమే ఆదరగొట్టేసారూ .మీ బలం కథ ,, కథనం
మీరు నడిపించే విధానమే అద్భుతం , ప్రతీ  విషయాన్ని పూస గుచ్చినట్టు .., దండ కట్టినట్టు   అందంగా  రాస్తారు  , మరొక్క కథ తో మా ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు

అలాగే  ఈ  కథ తో పాటు  జన్మనిచ్చిన  కథను  కూడా  సమయానికి updatelatho అలరిస్తారని  ఆసిస్తూ...,,,,,

హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా.
Like Reply
#45
(13-07-2019, 11:36 PM)Mahesh61283 Wrote: Bro new story super

Thanks మిత్రమా.
Like Reply
#46
(14-07-2019, 03:54 AM)Vicky845277 Wrote: Bhayya ee story lo kuda kick undi,
Continue cheyyandi bhayya,
Manchi suspense lo aapesaru,
Story chala bagundhi bhayya,
Eagerly waiting for next update SmileSmileSmileSmileSmileSmileSmileSmile

హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా.
Like Reply
#47
(14-07-2019, 11:15 AM)raki3969 Wrote: Super ga vundi. Continue cheyadhi

Thank you so much మిత్రమా.
Like Reply
#48
(14-07-2019, 04:59 PM)Umesh5251 Wrote: Super ga unndi bro.... Please weekly twice update cheyandi bro

Thank you so much మిత్రమా. I ll definitely try.
Like Reply
#49
(16-07-2019, 10:52 PM)Umesh5251 Wrote: Waiting for update bro

రేపు ఉదయం ఇచ్చేస్తాను బ్రో.
Like Reply
#50
(14-07-2019, 08:07 PM)jackwithu Wrote: మిత్రమ మహెశ్ నీ రచన సైలి కి జొహరులు నీ రచనలు ఒక మహ అద్భుత కావ్యలు, కలకండలు. నీ రచనలొ భంధవయలకు, అత్మియ్థల్కు, మనవత విలవలుకు పెద పట వెస్థవు అలనె నీ రచన నాకు తెలిసి నీ కథ చదివిన వాలు సమజం లొ ఎలా వుండలొ ఒక మర్గ్దర్సకముగ వుంటుది. అందుకె నీ రచనలుకు నెను అంత బనిసను అయ్యిపొయను Heart .

ఈ కథ కుడ చలా అధ్బుథంగ రాస్తునవు ఈ కథ్ లొ మునిగిపొయి జన్మనిచిన తల్లి కొసం ప్రయనాము అపెవు? దాని అప్దటె కుడ వెలయినపుడు ఇస్థువుండు. 

హృదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా.
Like Reply
#51
కారులో అలాగే నిద్రపోయినట్లుగా  మొబైల్ మ్రోగిన చప్పుడుకు  నిట్టుపడి లేచి చూడగా నాన్న గారి నుండి వెంటనే లిఫ్ట్ చేసి గొంతులో నుండి బాధగా మాటరాగానే నాన్నా ఎక్కడ ఉన్నావు is everything alright అని అడుగగా , కన్నీళ్లను తుడుచుకుని అదేమీ లేదు నాన్నగారు అంటూ సమయం చూడగా సాయంత్రం 6 గంటలు అవుతుండగా , నాన్నగారు పెళ్లి .............అంటూ బాధను దిగమింగుకుంటూ కంట్రోల్ చేసుకొంటూ అడుగగా అయిపోయింది భోజనాలు కూడా అయిపోయాయి అనగానే ఒక్కసారిగా కన్నీళ్లు కారగా తుదుచుకొని నాన్న గారు అక్కడి నుండి దారిలో వచ్చేస్తూ ఉండండి నేను పిక్ చేసుకుంటాను అని చెప్పగా ,



 ఏదో చెప్పబోయి సరే అనగా నీళ్ల బాటిల్ అందుకొని కారు దిగి ముఖం కడుక్కొని మొహంలో ఎక్కడా బాధకనిపించకుండా నావల్ల అమ్మ వాళ్ళు బాధపడరాదని ఆద్దo లో చూసుకుంటూ doubt రాకుండా నవ్వడం practice చేసి బాధపడితే అనుకున్నది జరగదు కదా అని నన్ను నేను మనసు కుదుటపరుచుకొని తను నా జీవితంలో తియ్యటి passing క్లౌడ్ అనుకోని నవ్వుతూ దీనికోసం ప్రాణమైన నా తల్లిదండ్రులను బాధపెట్టడం ఏమాత్రం మంచిది కాదు అని వెంటనే అమ్మకు కాల్ చేసి నవ్వుతూ మాట్లాడుతూ అమ్మా వచ్చేస్తున్నాను అంటూ కారులో వేగంగా చంద్రగిరివైపు 15 నిమిషాలలో రాగా ,



అమ్మానాన్నలిద్దరూ ఊరిబయటకు వచ్చేసి ఉండగా ప్రక్కనే బ్యాగుపట్టుకొని చెల్లి కూడా తోడుగా నడుచుకొనివస్తుండగా , దగ్గరకువెళ్లి కారు ఆపి sorry మా అర్జెంట్ పని అంటూ నవ్వుతూ కౌగిలించుకొని థాంక్స్ రా ప్రమీలా అంటూ చేతిలోని బరువైన బ్యాగును అందుకొని వెనుక కారులో ఉంచి ఆప్యాయంగా కౌగిలించుకొని గుర్తుపెట్టుకో నీకు ఈ అన్నయ్య ఉన్నాడని అంటూ ముందు డోర్ తెరిచి కూర్చోమని చెప్పగా లవ్ యు అన్నయ్యా అంటూ ఎక్కి కూర్చోగా అమ్మానాన్నలు కూర్చున్న తరువాత జాగ్రత్తగా డోర్స్ వేసి తను దారి చూపిస్తుండగా ఇంటికి కాస్త దూరం లోనే వదిలి ఇంటిని చూసి ఆశ్చర్యపోతూ ,



వెంటనే చెల్లివైపు తిరిగి గుర్తుపెట్టుకో మళ్లీ మళ్లీ చెబుతున్నాను ఎటువంటి అవసరం , కష్టం వచ్చినా ఈ అమ్మా నాన్న అన్నయ్య ఉన్నాడని మరిచిపోకు అంటూ చేతులుపట్టుకొని చెప్పగా , అన్నయ్యా అంటూ ఆనందబాస్పాలతో కౌగిలించుకొని  మన బంధువులందరికీ స్వయంగా వెళ్లి ఆహ్వానించినా ఎవ్వరూ రాలేదు మీరు వచ్చారు మాకు అది చాలు  జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పగా , చెంపపై సున్నితంగా కొట్టి నేను చెప్పింది విన్నావా లేదా అని కోపంగా అడుగగా కన్నీళ్ళతోనే అలాగే అన్నయ్యా అంటూ తలఊపగా సరే వెళ్లు అని చెప్పగా అమ్మానాన్నలకు చెప్పి కారు దిగి ఇంటిలోకి వెళ్లేంతవరకూ చూసి dad వెళదామా అని అడుగగా సరే నాన్నా ఎక్కడా అగకుండా తిరుమలకు పోనివ్వు అని బదులివ్వగా కారు వెనక్కు తిప్పి  పోనిస్తూ నాన్న గారు తాతయ్య వదిలేసిన అంత పెద్ద ఇంటిని వదిలేసి ఇంత చిన్న ఇంటిలో ఉంటున్నారా అని అడుగగా , ఇంకెక్కడ ఆ పెద్ద ఇల్లు నాన్నా జూదంలో మొత్తం పోగొట్టుకొని చివరికి ఇక్కడ చంద్రగిరిలో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు మా నాన్నగారు అదే మీ తాతయ్య ఇలా జరుగుతుందని ముందే ఊహించి మీ పెద్దమ్మ మరియు ప్రమీలకు కొంత భూమిని ఆస్తిగా రాసిచ్చారు ఇప్పుడు వాటిమీదనే ఆధారపదుతున్నారు , నాన్న గారు కొంపదీసి వాటిని కూడా వాళ్ళు అనేంతలో ,నేను కూడా ఇలాగే అడిగితే వాళ్ళ ప్రాణం పోయినా వాటిని వధులుకొము అని గట్టిగా చెప్పారు వాటిమీదకు వస్తే నాకు చెప్పండి నేను చూసుకుంటాను అని దైర్యంగా చెప్పి మరీ వచ్చాను అనగా చాలా మంచిపని చేశారు నాన్నగారు అని సంతోషిస్తుండగా ,



అయినా అలాంటివాడికి కుందనపు బొమ్మలాంటి అమ్మాయి ఏంటండి పాపం నమ్మించి గొంతు కోయడం అంటే ఇది కాకపోతే ఇంకేంటి అని బాధగా చెబుతూ , నిన్న తన రూం కు వెళ్ళినప్పుడు మాట్లాడాను అండి ఎంతమంచి సుగుణాల రాసి ఆ అమ్మాయే నా కోడ..........అనబోయి మన కన్నయ్యకు అలాంటి అమ్మాయే అదే నా కోడలిగా రావాలని కోరికగా ఉందండి అనగానే నా కళ్లల్లో నుండి ఆగకుండా కన్నీళ్ళు కారగా తుడుచుకుని డ్రైవ్ చేస్తుండగా , మరొక విషయం వాళ్ళది గుంటూరు ఈ చుట్టుపక్కల ఎవ్వరూ వాడికి పిల్లను ఇవ్వకపోవడంతో పెళ్లిళ్ల బ్రోకర్ సహాయంతో వీళ్ళ గురించి తెలియని దూరంగా ఉన్న అమాయకులను నమ్మించి పెళ్లికి ఒప్పించారు.



 పాపం వాళ్ళ నాన్న తన చిన్నప్పుడే చనిపోతే తన అమ్మ చాలా చాలా కష్టపడి మరియ దాతల సహాయంతో తనను MBA చదివించింది జాబ్ కూడా వచ్చిందంట , ఇలాంటి రౌడి వెధవ ఎలా సెట్ అయ్యాడో అంటుండగా , శ్రీమతి గారు వాడు కూడా MCA పూర్తిచేసాడని వాడు మరియు వాడి తండ్రి వాళ్ళను నమ్మించాడట పాపం నాకు ఇపుడే ఈ విషయం తెలిసింది ముందుగా తెలిసి ఉంటే తప్పకుండా పెళ్లిని ఆపేవాడిని మీ అక్కయ్యను మరియు ప్రమీలను కూడా మేమిద్దరమూ చనిపోతామని భయపెట్టి పెళ్లి జరిపించేశారు , అవును పెద్దమ్మ కూడా అదే చెప్పి బాధపడింది అని నామనసులో అనుకోని పాపం ఎన్ని కష్టాలను అనుభవిస్తోందో నాకు తెలిసి పెద్దమ్మ , చెల్లి బాగా చూసుకుంటారని నా నమ్మకం అంటూ తిరుపతి చేరుకొని 

 గంటలో తిరుమల చేరుకొని స్వామి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి తెల్లవారుఘాము అవ్వగా ప్రసాదం తీసుకొని కిందకు దిగి అమ్మానాన్నలను ఫ్లైట్ ఎక్కించి కారులో బెంగళూరు బయలుదేరాను.



మధ్యాహ్నానికల్లా బెంగళూరు చేరుకొని అమ్మకు కాల్ చేసి చెప్పి పడుకున్నవాణ్ణి కడుపులో విపరీతంగా ఆకలి వేస్తుండగా మెలకువ వచ్చి చూడగా రూమ్ మొత్తం చీకటి కమ్ముకొని ఉండగా వెంటనే లేచి ఉన్న లైట్స్ అన్నింటినీ on చేసి సమయం చూడగా రాత్రి 8 గంటలు అవుతుండగా ముందు వెళ్లి ఫ్రిడ్జ్ లో మిగిలిఉన్న fruits మరియు ఐస్ క్రీమ్స్ తినేసి , i think she is happy నేను తనను పొందినా ఇలాగే చూసుకోవాలనే కదా ఇంకెందుకు బాధపడటం జీవితం ఇక్కడితో ఆగిపోదు నా గోల్ చేరడమే ఇపుడు నా కర్తవ్యం అనుకోని ముందుగా బయటకు వెళ్లి కుమ్మేసి రావాలి అనుకోని వెళ్లి తృప్తిగా తినేసి వచ్చి టీవీ చూస్తూ చాలాసేపు కృష్ణగాడితో మాట్లాడుతూ హైదరాబాద్ లో చేసిన రచ్చను గుర్తుచేసుకొని గట్టిగా మనసారా నవ్వుకుని బాధనంతా మరిచిపోయి థాంక్స్ రా మామా అని చెప్పి అలానే మాట్లాడుతూ సోఫాలోనే హాయిగా నిద్రపోయాను.



మధ్యాహ్నానికల్లా బెంగళూరు చేరుకొని అమ్మకు కాల్ చేసి పడుకున్నవాణ్ణి కడుపులో విపరీతంగా ఆకలి వేస్తుండగా మెలకువ వచ్చి చూడగా రూమ్ మొత్తం చీకటి కమ్ముకొని ఉండగా వెంటనే లేచి ఉన్న లైట్స్ అన్నింటినీ on చేసి సమయం చూడగా రాత్రి 8 గంటలు అవుతుండగా ముందు వెళ్లి ఫ్రిడ్జ్ లో మిగిలిఉన్న fruits మరియు ఐస్ క్రీమ్స్ తినేసి , i think she is happy నేను తనను పొందినా ఇలాగే చూసుకోవాలనే కదా ఇంకెందుకు బాధపడటం జీవితం ఇక్కడితో ఆగిపోదు నా గోల్ చేరడమే ఇపుడు నా కర్తవ్యం అనుకోని ముందుగా బయటకు వెళ్లి కుమ్మేసి రావాలి అనుకోని వెళ్లి తృప్తిగా తినేసి వచ్చి టీవీ చూస్తూ చాలాసేపు కృష్ణగాడితో మాట్లాడుతూ హైదరాబాద్ లో చేసిన రచ్చను గుర్తుచేసుకొని గట్టిగా మనసారా నవ్వుకుని బాధనంతా మరిచిపోయి థాంక్స్ రా మామా  అని చెప్పి అలానే మాట్లాడుతూ సోఫాలోనే హాయిగా నిద్రపోయాను.



నెక్స్ట్ వర్కింగ్ డే నుండి బిజీ అయిపోతూ వీకెండ్స్ ఫ్రెండ్స్ తో పార్టీలతో మరియు బెంగళూరు మరియు చుట్టూ ఉన్న టూరిస్ట్ ప్రదేశాలను చుట్టేసి జరిగిందంతా మరిచిపోయి మామూలుస్థితిలోకి వచ్చేసి కాలం అలా సాగిపోతుండగా మూడు వారాలు తరువాత ఒకరోజు వర్క్ ముగించుకొని ఇంటికి కారులో వస్తుండగా unknown నెంబర్ నుండి కాల్ రాగా సైడ్ కు ఆపి లిఫ్ట్ చేసి హలో హలో అంటున్నా అవతలివైపు నుండి response లేకపోవడంతో కోపంగా ఎవడ్రా కాల్ చేసి మాట్లాడటం లేదు వెధవ అని వినపడేలాగే తిట్టగా , మహేష్ నేను అని మాట్లాడగా ఆప్పటికి కోపంగానే ఉంటూ నేను అంటే ఎవరు పేరు లేదా అనగానే , అదే నేను మహేష్  హర్ష నీకు అన్నయ్యనవుతాను అనగా వీడేంటి నాకు కాల్ చేసాడు, వెధవ అని సరిగ్గానే అన్నాను అనుకోని నవ్వుతూ వీడికి నా నెంబర్ ఎలా...... చెల్లితో తీసుకునిఉంటాడు వెధవ అనుకోని అయినా ఇలా నెమ్మదిగా మాట్లాడుతున్నాడు ఏదో ఉంది అనుకోని వాణ్ణి తగ్గిస్తూనే ,



హర్షనా నాకు తెలిసి నా ఫ్రెండ్స్ లో గాని , బంధువులలో గాని అలాంటివాడు ఎవడూ లేడే అంటూ చిలిపిగా లొలొపలే నవ్వుకుని చెప్పగా , తాతయ్య దగ్గర నుండి మొదలెట్టి మొత్తం చెప్పి చిన్నప్పుడు మనం ఆడుకున్నాము అది నేనే మహేష్ అని వివారిస్తుండగా ఆపకుండా నవ్వుతూనే ఒరేయ్ నువ్వా అనగానే హమ్మయ్యా గుర్తుకొచ్చానా అది చాలు , మహేష్ ఒక సహాయం కావాలి అని అడుగగా , ఏమిటిరోయ్ అని వెటకారంగా అనగానే ఇప్పుడే చెబితే నేను చెయ్యనేమో అని ఇప్పుడు కాదు రేపు ఉదయం బెంగళూరు వస్తున్నాము నీ అడ్రస్ చెబుతావా మహేష్ అని అడుగగా , కొద్దిసేపు ఆలోచించి చూద్దాము ఎలాంటి సహాయమో మంచిదైతే చేద్దాము చెడుదైతే అలాగే చెప్పుదెబ్బ తగిలేలా ఘాటుగా రిప్లై ఇచ్చి పంపించేద్దాం అనుకోని రేయ్ మొబైల్ కు పంపిస్తాను చూసుకో అని చెప్పగా ఒక థాంక్స్ లేదు బై లేదు కాల్ కట్ చెయ్యగా తిక్కరేగి రేపు వస్తాడుగా అప్పుడు చూద్దాము అనుకోని ఇంటివైపుకు కారును పోనిస్తూ వాడు వస్తాను అన్నాడా వస్తాము అన్నాడా వాడి మీద కోపంతో సరిగ్గా వినలేదు .
Like Reply
#52
ఉదయం అలారం చప్పుడుకు ముందే మొబైల్ రింగ్ అవుతున్న చప్పుడుకు నిద్రమత్తులోనే లేచి మొబైల్ అందుకొని చూడగా వాడే ఇంత పొద్దున్నే చేసాడు ఏంటి అనుకోని కొద్దిగా కోపంగా ఎత్తగానే మహేష్ నువ్విచ్చిన అడ్రస్ బస్ స్టాప్ లో దిగాము అనగా వార్ని వీడు రాత్రే ఎక్కేసినట్లున్నాడు అనుకుని అక్కడే ఉండు వచ్చేస్తున్నాను నన్ను గుర్తుపడతావా అని అడుగగా లేదు అనగా బ్రౌన్ జర్కిన్ వేసుకొని వస్తాను  అంటూ కాల్ కట్ చేసి బెడ్ దిగుతూ అక్కడినుండే కాల్ చేసి మంచిపనే చేసాడు నచ్చకపోతే అటునుండి ఆటే పంపించేయొచ్చు అంటూ టీ షర్ట్ పై జర్కిన్ వేసుకొని షార్ట్ మీదనే బయటకు వచ్చి చలి చంపేస్తుండగా నిద్రమత్తులోనే చేతులు చరచుకుంటూ వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి నడుచుకుంటూ బస్ స్టాప్ చేరుకుంటుండగా దూరం నుండి వాడు వాడి ప్రక్కనే కొంగును తలకు చుట్టుకొన్న అమ్మాయి చాలా లగేజీతో వచ్చినట్లుగా కనిపించగా ,

దగ్గరకు వెళుతున్నకొద్దీ అమ్మాయి ముఖం కొద్దికెద్ధిగా కనిపిస్తూ వాడు నన్ను తనకు చూయించినట్లుగా మాట్లాడగా ఆ అమ్మాయి నావైపు చూడగానే ఆ కళ్ళను చూడగానే అక్కడికక్కడే రోడ్ మధ్యలో ఆగిపోతూ నన్ను నేనే మరిచిపోయి వేగంగా కొట్టుకుంటున్న గుండెతో షాక్ లో ఉన్నట్లుగా నిలబడిపోగా , వేగంగా వస్తున్న బైకు నన్ను చూసి ఆత్రంగా ప్రక్కకు తిప్పుతూ హ్యాండిల్ మాత్రమే నాచేతికి తగులగా వాడు నాకేమి అన్నట్లుగా చూస్తుండగా , తను మాత్రం జాగ్రత్త అంటూ చేతితో చూపించగా వెంటనే తేరుకొని తననే కన్నార్పకుండా చూస్తూ బస్ స్టాప్ దగ్గరకు రాగా దెబ్బేమైనా తగిలిందా అండి అంటూ బాధకలిగిన వాయిస్ తో మాట్లాడినా నాకు మాత్రo తియ్యగా వినిపించగా అదేమీ లేదు ఎలా ఉన్నారు అని అడగబోతూ ఆగిపోయి వాడివైపు తిరుగగా 

మోహమాటమే లేనట్లుగా ఏదో చేప్పబోతుండగా ప్రక్కనే తను చలికి చిన్నగా వణుకుతుండగా , వాడి పేరు కూడా పిలవడం ఇష్టం లేక చలి ఎక్కువగా ఉన్నట్లుంది ఇంటికి వెళ్లి మాట్లాడదాము అదిగో దూరంగా కనిపిస్తోందే అదే మన అపార్ట్మెంట్ అని  చెప్పగా , అయితే వెళదాము అని అంటూ తననూ మరియు లాగేజీని కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోగా , ఆశ్చర్యపోతూ కారు తెచ్చి ఉంటే బాగుండేది అనుకోని వెంటనే ఆటోని పిలిచి లగేజీ మొత్తం ఒక వైపుకు పెట్టి  మీరు కూడా కూర్చోండి అని చెప్పగా చిన్నగా వణుకుతూ కూర్చోగా డ్రైవర్ దగ్గరకు వెళ్లి అపార్ట్మెంట్ పేరు చెప్పి అక్కడ ఆగి వైట్ చెయ్యమని చెప్పగా , yes సర్ అంటూ నెమ్మదిగా వెళ్లిపోగా , తను నాకు దగ్గరగా ఉన్న ప్రతి క్షణం ఏదో తియ్యటి అనుభూతి తోపాటుగా గుండె ఎంత వేగంగా కొట్టుకుంటోందో లెక్కించడం కూడా కష్టమన్నట్లుగా , జస్ట్ కళ్ళను మాత్రమే చూస్తుంటేనే ఇలా అయితే చిరునవ్వుతో ఉన్న తన ముఖం చూశానంటే ఏమయిపోతానో అంటూ వాడి దగ్గరకు వెళ్లగా ,

వెళుతూ ఇప్పుడు తనకు పెళ్లి అయ్యింది తన గురించి ఆలోచించడం కూడా తప్పు అనుకొని లెంపలేసుకొని సెక్యూరిటీకి కాల్ చేసి ఆటోను లోపలకు పంపించమని చెప్పి  ఇద్దరమూ మాట్లాడుకోకుండా అపార్ట్మెంట్ చేరుకొని టాప్ ఫ్లోర్ లో ఇల్లు అని చెప్పగా వాడు లిఫ్ట్ లో వెళ్లిపోగా , మీరుకూడా వెళ్ళండి లగేజీ నేను తీసుకువస్తాను అని చెప్పగా దిగి వెనక్కు తిరిగి చూస్తూ లిఫ్ట్ దగ్గరకు వెళ్లగా ఆటోకి డబ్బులు ఇచ్చేసి సెక్యూరిటీ సహాయంతో మొత్తం లాగేజీని లిఫ్ట్ లో పైకి తీసుకువచ్చి హాల్ లో పెట్టించి కూర్చోమని చెప్పగా , మహేష్ నీ దగ్గరకు రావడానికి కారణం ఏమిటంటే దీనికి బెంగళూరులో జాబ్ వచ్చింది , ఆడవాళ్లు జాబ్ చెయ్యడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు కానీ అమ్మ ఖర్చులకు డబ్బు ఇవ్వడం మానేసింది బయట ఫ్రెండ్స్ తో మరియు క్లబ్ లలో కార్డ్స్ ఆడటానికి డబ్బులు లేక అని చిన్నగా గుసగుసలాడుతూ ,ఏంట్రా అంటూ కోపంగా అడుగగానే కాదు కాదు నన్ను జాబ్ నుండి తీసేసారు ఇల్లు గడవాలి కదా అందుకే ఇది జాబ్ చెయ్యడానికి ఒప్పుకున్నాను అంటూ ప్రతిసారి తనని ఇది , దీన్ని ..........అంటూ భార్యగా ఇవ్వాల్సిన కాస్త గౌరవం కూడా ఇవ్వకుండా తనవైపు కోపంగా చూస్తూ మాట్లాడుతూ ,

నాకు ఇక్కడ తెలిసినవాళ్ళు ఎవరూ లేరు లేడీస్ హాస్టల్ లో చేర్పించాలంటే డబ్బులు లేవు అదే సేఫ్టీ ఉండదు ప్రమీల సలహాతో దీన్ని ఇక్కడ నుండే జాబ్ చేసుకునేలా నిన్ను అడుగుదామని వచ్చాను అని అడుగగా , చెల్లెమ్మ చెప్పిందా చాలా సంతోషం తనకు ఇష్టం అయితే నిశ్చింతగా ఉండవచ్చు అని చెప్పగా , తను ఏదో మాట్లాడబోగా వాడు తనవైపు కోపంగా చూస్తూ బయటకు రమ్మని సైగ చేయగా ఇద్దరూ బయటకు వెళ్లి తనపై కొప్పాడటం లోపల వరకూ వినిపిస్తుండగా బాదేసి బయటకు వెళ్లగా నన్ను చూసి అక్కడితో ఆపేస్తూ మహేష్ ఒప్పుకున్నాడు కదా అంటూ తనచేతిలో ఉన్న ATM లాగేసుకొని , తాను ఏమైనా ఇబ్బందిపడుతోందా అని అడుగగా , అదేమీ లేదు మహేష్ తనకు కూడా ఇష్టమే అని కన్నింగ్ గా చెప్పగా , ATM ఏంటి అని అడుగగా , తన salary ఇందులోనే పడుతుంది ఆడవాళ్ళతో డబ్బు ఉండటం మంచిదికాదు , అది కూడా కాక ఇంటిదగ్గర చాలా ఖర్చులు ఉంటాయి నాదగ్గరే ఉంచుకుంటాను అంటూ తడబడుతూ చెప్పగా ,

అయితే మరి తన అవసరాలకు డబ్బు కావాలికదా అని అడుగగా నామాటలకు కొంగు కప్పుకునే తలెత్తి నావైపు చూస్తుండగా , దానికేమి ఖర్చులు ఉంటాయి మహేష్ ఉండటానికి ఈ ఇల్లు ఉంది , తినడానికి కూడా నువ్వు తెచ్చుకున్న వాటితో ఇక్కడే వండుకుంటుంది , ఇక ఆఫీస్ అంటావా ఇక్కడ నుండి 10 km దూరం మాత్రమే నడుచుకుంటూ లేకపోతే బస్ లో వెళ్ళిపోతుంది అనగానే , వాడిని ఒకరకమైన చూపుతో చూస్తూ అసలు నువ్వు మనిషివేనా అని అడగబోతూ అలా వాడిని అడగడం కూడా నాకు ఇష్టం లేక కోపంగా చూస్తుండగా , తల దించేసుకొని అంతగా అవసరం అయితే నీ అకౌంట్ లోకి పంపిస్తాను అకౌంట్ నెంబర్ ఇవ్వు  అంటూ చిన్నగా మాట్లాడగా , తు నీ బతుకు రేయ్ ఒక్క ఛాన్స్ దొరకాలి ఎలా కొడతానో నాకే తెలియదు అంటూ వాడివైపే చూస్తుండగా , తనవైపు చూస్తూ లోపలకు వెళ్లి తొందరగా రెడి అయ్యి రా నిన్ను ఆఫీస్ దగ్గర వదిలి నేను ఊరికి వెళ్లిపోవాలి చాలా పనులున్నాయి నాకోసం చాలామంది ఎదురుచూస్తుంటారు అంటూ తనతోపాటు లోపలకువెళ్లిపోయాడు వెదవన్నర వెధవ.

కింద అపార్ట్మెంట్ జిమ్ కు వెళ్లి కసరత్తులు చేసి 8 గంటలకు పైకిరాగా అప్పటివరకూ తనపై కోప్పడుతూ నేను లోపలకు అడుగుపెట్టగానే ఆపేసి భయంతో తలదించేసుకోగా లొలొపలే నవ్వుతున్నట్లుగా తను నావైపు తిరుగగా ఆఫీస్ కు రెడీ అయ్యిందే కానీ ఆరోజు స్టెప్స్ దగ్గర మరియు తాళికట్టకముందు చూసిన చిరునవ్వు , సంతోషం , తేజస్సు తనలో కొద్దిగా కూడా కనపడకపోవడంతో , అమ్మకు నచ్చిన గుణవంతురాలు , అందలరాసి తప్పు తప్పు అంటూ తలదించేసుకొని ఇలాంటివాడికి అంటూ బాధపడుతూ లోపలికి వెళుతుండగా , మహేష్ మేము వెళతాము తనను ఆఫీస్ దగ్గర వదిలేసి నేను ఊరు వెళ్లిపోతాను అనగా , అలాగే రా నాయనా నీ ముఖం చూడాలంటేనే నాకు పరమ అసహ్యంగా ఉంది తొందరగా దొబ్బేయ్ అంటూ తలమాత్రమే ఊపగా ఆఫీస్ కు ఏమి అవసరమో తీసుకొని వెళ్లిపోగా ,

తన లగేజీ అంతా హాల్ లోనే ఉండగా మొదటిసారిగా డబల్ బెడ్రూం ఇల్లు ఎందుకు choose చేసుకోలేదని బాధపడుతూ ఒక అమ్మాయి హాల్ లో .........చాలా ఇబ్బందిగా ఉంటుందని తనకు రూమ్ ఇచ్చేద్దామని నిర్ణయించుకొని వెంటనే ఆఫీస్ కు కాల్ చేసి afternoon వస్తానని చెప్పి నా వస్తువులు , కప్ బోర్డ్ లో ఉన్న బట్టలు అన్నింటినీ హాల్ లోకి మార్చేస్తూ తన విషయం అమ్మకు చెప్పాలని వెంటనే కాల్ చేసి మాట్లాడగా , నాకు ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉంది బుజ్జి కన్నా తోడుగా ఒకరు ఉంటున్నందుకు అంటూ ఆనందిస్తూ ఈ శనివారం వచ్చి తనను కలుస్తాను అని చెప్పగా సరే అమ్మా కొద్దిగా పని ఉంది తరువాత చేస్తాను అని కట్ చేసి రూమ్ మొత్తం శుభ్రం చేసి బెడ్ పై దుప్పట్లన్నీ కొత్తవి పరిచి సువాసన వచ్చేలా freshner రూమ్ అంతా కొట్టి హాల్ లో ఉన్న తన లగేజీ అంతా రూంలోకి బెడ్ పై షిఫ్ట్ చేసి finished అంటూ పెదాలపై చిరునవ్వుతో ఫ్రెష్ అయ్యి రెడి అయ్యేసరికి ఒంటి గంట అవ్వగా తాళం వేసుకొని తనకు ఆఫీస్ తొందరగా అయిపోతే వచ్చేస్తే ఎలా అంటూ వాడికి కాల్ చెయ్యగా బస్ లో ఉన్నానని చెప్పగా , తన ఫోన్ నెంబర్ ఇవ్వమనగా కొద్దిసేపు మౌనం తరువాత తనతో మొబైల్ లేదు , ఏంట్రా మొబైల్ లేదా ఒరేయ్ ఇది సిటీ రా మొబైల్ లేకపోతే ఎలారా నీయబ్బా అంటూ కోపంలో ఎలపడితే అలా తిట్టి తన ఆఫీస్ పేరు అడుగగా ఉండు చెబుతాను అంటూ జేబులో వెతుకుతున్నట్లుగా ఆలస్యం చేస్తుండగా , ఒరేయ్ ఆఫీస్ కూడా తెలియదా తనను అలా గాలికి వదిలేసి వెళ్లిపోయావా ఏమైనా అయితే అంటూ ఆ ఊహనే నా గుండెలలో కంగారు మొదలవ్వగా , ఆ దొరికింది అంటూ పేపర్లో రాసినది చెప్పగా ,

వెంటనే కట్ చేసి ఇంటికి తాళం వేసి వేగంగా కారు దగ్గరకు చేరుకొని దారిలో షాప్ లో మొబైల్ మరియు sim తీసుకొని వెంటనే activate చెయ్యమని డబల్ అమౌంట్ ఇచ్చి ఆఫీస్ కు చేరుకొని నా నెంబర్ అందులో save చేసి లోపలకు వెళుతుండగా సెక్యూరిటీ ఆపి ఐడెంటిటీ కార్డ్ అడుగగా , మా ఆఫీస్ దే ఆత్రంలో ఇంట్లో వదిలేసి రాగా కనీసం అది ఉన్నా visitor గా రిజిస్టర్ చేసుకొని పంపించేవాడు , నా బాధను చూసి ఒక లేడీ సెక్యురిటి వచ్చి నిన్ను లోపలకు పంపించడం వీలుకాదు పని ఏంటో చెప్పు నా వీలైతే చేస్తాను అనగా థాంక్స్ మేడం అంటూ మొబైల్ మరియు స్పేర్ ఇంటితాళాలు అందించి ఈరోజే కొత్తగా జాయిన్ అయిన అమ్మాయికి అందించాలి అని చెప్పగా , అంతేగా నేను అందిస్తాను అమ్మాయి పేరేంటి అని అడుగగా , పేరు................ అంటూ shit తన పేరు కూడా తెలుసుకోలేదు అవసరంకూడా రాలేదు అంటూ వాడికి కాల్ చేద్దామా వాడితో మాట్లాడటం కంటే తన ఆఫీస్ అయ్యేంతవరకూ ఇక్కడే ఉండటం బెటర్ అని ఆలోచిస్తుండగా ,

బాబు అమ్మాయి పేరు ఏమిటి అని అడుగగా మేడం ఒక్కనిమిషం అంటూ ప్రశాంతంగా ఆలోచించగా అమ్మ గుర్తుకురాగా వెంటనే కాల్  చేసి జరిగిందంతా చెప్పి తన పేరు అడుగగా అమ్మకూడా వాడిని తిట్టి బుజ్జికన్నా తన పేరు మరేదో కాదు నీలో సగం అని చెప్పగా , అమ్మా..............అదే కన్నా నీ పేరులో సగం మహేష్ -- మహి , తన పేరు మహి అని అమ్మ చెప్పిన విధానానికి పెదాలపై చిరునవ్వు మనసు ఎందుకో తియ్యగా తెలిపోతున్నట్లుగా వెంటనే తేరుకొని లవ్ యు మా అంటూ ముద్దుపెట్టి మేడం తన పేరు మహే............కాదు కాదు మహి అని చెప్పగా ఇక్కడే ఉండు ఇచ్చేసి వస్తాను అంటూ లోపలికి వెళుతూ ఇంతకీ ఎవరు ఇచ్చారని చెప్పాలి అంటూ నావైపు తిరిగి అడుగగా , మహి...............అయ్యో మహేష్ మేడం మహేష్ అని తడబడుతూ మహేష్ తన relative అని చెప్పగా , మేడం నవ్వుతూ వెళుతుండగా మేడం ఒక్కనిమిషం అంటూ కారులో ఒక పేపర్ అందుకొని రాసి వాడు తనకు కచ్చితంగా డబ్బు ఇచ్చి ఉండడు అంటూ పర్సు తీసి కొంత డబ్బు పేపర్లో మడిచి మహికి ఇవ్వమని చెప్పి నా తృప్తి కోసం మీరు ఉంచండి అంటూ డబ్బు ఇవ్వగా , గిఫ్టే కదా అంటూ నవ్వుతూ లోపలకు వెళ్లి 10 నిమిషాల తరువాత వచ్చి తను మీటింగ్ లో ఉంది అయినా  ఇచ్చేసాను అని చెప్పగా థాంక్స్ మేడం అంటూ మా ఆఫీస్ కు వచ్చి canteen లో భోజనం చేసి ప్రాజెక్ట్ లో మ్యూనిగిపోయాను.

అక్కడ కంపెనీ ఇంట్రడక్షన్ మీటింగ్ అవ్వగానే తనకు అల్లాట్ చేసిన క్యాబిన్ లో కూర్చొని హ్యాండ్ బ్యాగులోనుండి మొబైల్ , ఇంటితాళం మరియు డబ్బు ఫోల్డ్ చేసిన పేపర్ ను డెస్క్ పై ఉంచి ముందుగా పేపర్ తెరవగా డబ్బు ఉండగా ఆశ్చర్యపోతూ పేపర్లో రాసినది చదువుతూ 

మహి గారు ఉదయం గమనించినదాన్ని బట్టి ఒక ఒంటరి మగాడితో మీరే కాదు ఏ మహిళ ఉండటానికి ఇష్టపడదు , ఒక్కటి మాత్రం చెప్పగలను మా అమ్మ అంటే నాకు ప్రాణం తన మీద ఒట్టేసి చెబుతున్నాను నావల్ల మీకు ఎటువంటి హాని కానీ ఇబ్బంది కానీ ఉండదు , మా అమ్మ ఎప్పుడూ చెబుతూ ఉండేది ఒక ఆడదాని సమ్మతం లేకుండా మనం వారిని వారికి అయిష్టంగా తప్పకుండా అదే చెయ్యమని ఫోర్స్ చెయ్యకూడదు అని , ఇప్పుడున్న బెంగళూరు పరిస్థితులలో బయట స్టే చెయ్యడం చాలా అపాయం , కావాలంటే నేను వరండాలో ఉండిపోతాను ఏమంటారు , అది మీఇల్లే అనుకోండి అది ఇంటి తాళం ఇక మొబైల్ అంటారా ఈ అనంతమైన మహానగరంలో మొబైల్ లేకుండా అడుగు కూడా బయటపెట్టనేరాదు , డబ్బును మీ సాలరీ వచ్చిన తరువాత వాడితో అన్నదానిని కొట్టేసి మీ ఆయనతో తీసుకుంటాను , ఏదైనా అవసరం అయితే మొబైల్లో నా నెంబర్ ఉంది ఎటువంటి చిన్నది అయినా కాల్ చెయ్యండి వచ్చేస్తాను మీ ఆఫీస్ కు దగ్గరలోనే మా ఆఫీస్ కూడా , 

నా మాటలను మన్నిస్తే సాయంత్రం ఇంటికి చేరుకున్నాక మిగతావిషయాలను మాట్లాడుకుందాము మీకు ఇష్టం అయితేనే అంటూ ఇట్లు మీకు ఏమీ కానీ మహేష్ అంటూ స్మైల్ symbal ఉండగా చూసి పెళ్ళైన తరువాత మొదటిసారిగా చిరునవ్వు నవ్వినట్లుగా బుగ్గలు నొప్పి పుట్టగా తన బ్రేక్ టైంల్ నాకు కాల్ రాగా unknown నెంబర్ ఎక్కడో చూసినట్లుగా అనిపించగా , ఎత్తి హలో ఎవరు అనగా కాసేపు మౌనం తరువాత మహేష్ గారు అనగానే గుర్తుపట్టి కొత్త సిమ్ తీసుకున్నాక సేవ్ చేసుకోలేదు మహిగారు క్షమించండి అనగా , తియ్యగా నవ్వగానే ఆరోజు నవ్వుతున్న తన ముఖమే గుర్తుకురాగా , మాట్లాడకుండా కళ్ళుమూసుకోగా , హలో మహేష్ గారు ఉన్నారా అని అడుగగా sorry మహి గారు ఆఫీస్ అంతా ok కదా అని అడుగగా , ఆ ఇపుడే క్యాబిన్ , టీం లోకి మార్చారు , మహేష్.......గారు......చాలా థాంక్స్ అని చెప్పగా , 

హమ్మయ్యా accept చేసారన్నమాట నామీద కోపం ఉందేమో ఎక్కడ వాటిని తీసుకోరేమో అని చాలా కంగారుపడ్డాను , ఎందుకు కంగారు నేరుగా మా ఆఫీస్ దగ్గరకు వచ్చారంట ముఖమంతా చెమట్లతో నన్ను వెంటనే కలవాలని ఆపితే చాలా బాధపడ్డారంట అని సూటిగా అడుగగా , అదే అదే అదే..................ఒకవేళ మీ పని తొందరగా అయిపోతే నాకంటే ముందుగా వచ్చేస్తే ఇంటి తాళాలు మరియు అడ్రస్ మరిచిపోతే నాకు కాల్ చెయ్యడానికి మొబైల్ తోపాటుగా నెంబర్ కూడాలేకపోతే ఎలా మరియు రీసెంట్ గా బెంగళూరులో అమ్మాయిలపై దాడులు జరుగుతున్నాయి అందుకే కంగారుపడ్డాను అని బదులివ్వగా సంతోషంగా నవ్వుతూ అయితే మనఃస్ఫూర్తిగా థాంక్స్ అంటూ మాట్లాడుతూ మహేష్ గారు భోజనం చేశారా అని అడుగగా , ఇంతకుముందే చేసాను మీరు అని అడుగగా ఇప్పుడే మీటింగ్ అయిపోయింది canteen లో కూర్చున్నాను , ఆలస్యం అయ్యింది అని అడుగగా , మొదటిరోజు కదా ఆలస్యం అవుతుందని ముందే చెప్పి మీటింగ్ జరుగుతున్నప్పుడే స్నాక్స్ మరియు డ్రింక్స్ ఇచ్చారు ఆకలిగా అయితే లేదు మహేష్ గారు అని బదులివ్వగా ,

 కాసేపు నవ్వుతూ మాట్లాడుతూ తాను కూడా చాలారోజుల తరువాత ఇలా సంతోషన్గా మాట్లాడుతున్నానని నవ్వుతూ మాట్లాడుతూనే ,మహిగారు మీరు ఏమీ అనుకోకపోతే ఒక చిన్న మనవి నాకింకా పెళ్లి కాలేదు so మహేష్ గారు అని పిలుస్తుంటే middle age కి వచ్చేసానా అని మనసులో బాధగా ఉంది అంటూ ఫీల్ అవుతున్నట్లుగా ముఖం పెట్టి వెంటనే నవ్వగా , అంటే నేను ఆ ఏజ్ లో ఉన్నాననే కదా మీరు కూడా మహిగారు అని పిలుస్తున్నారు అంటూ నాలాగే ఫీల్ అయినట్లుగా పో మహేష్ నాకు కూడా నీ వయసే అంటూ బుంగమూతిపెట్టుకొని చెప్పగా , మహేష్...........ఇప్పుడు నేను ఇంకా యూత్ అని.........చూడు ఎంత హాయిగా ఉంది మహి అనగా , మహి ............బాగుంది అలాగే పిలుచుకుందాము అంటూ నవ్వుకుని ఏమి ఆర్డర్ ఇచ్చారు అని అడుగగా అదిగో వచ్చింది చపాతీ కూర్మా , పళ్లెం , చట్నీ అని చెప్పగా వింటూంటేనే నాకు నోరూరుతోంది మహి , నీకోసం రాత్రికి నాచేతులతో వాటినే చెయ్యనా అని అడుగగా , అంతకంటే భాగ్యమా roommate డిన్నర్ కోసం వెయ్యికళ్ళతో వేచి చూస్తాను అంటూ తను తినేంతవరకూ మాట్లాడగా టీం మెంబెర్స్ పిలుస్తున్నారు మహేష్ బై అని చెప్పగా బై చెప్పేసి కుర్చీలో వెనక్కు వాలిపోయి పెదాలపై చిరునవ్వుతో చాలా సంతోషంతో వర్క్ చకచకా చేసేస్తుండగా టీం అంతా ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు.
Like Reply
#53
5 గంటలకల్లా మహి ఆఫీస్ అయిపోగా మొదటిరోజు ఆఫీస్ మరియు మహేష్ తో మాటలు సంతృప్తినిచ్చాయని బస్ లో అపార్ట్మెంట్ దగ్గరలోని బస్ స్టాప్ లో దిగి ఇంటికి చేరుకొని తాళం తెరిచి హాల్ లోకి రాగా తన లగేజీ కనిపించకపోగా ఇల్లుమొత్తం వెతుకుతూ బెడ్రూం లోకి వెళ్ళాలా వద్దా అని కొద్దిగా తలుపు తీసి లోపలకు తొంగిచూడగా బెడ్ పై తన బ్యాగులన్నీ ఉండగా ఆశ్చర్యంగా లోపలకు వెళ్లి చుట్టూ చూడగా ఉదయం ఉన్న  వస్తువులు మరియు కప్ బోర్డ్ లోని బట్టలన్నీ తనకోసం తనకు రూమ్ కేటాయించినట్లుగా హాల్ లో మార్చేసి ఉండటం చూసి మహేష్ నాకోసం అంటూ సంతోషంగా మురిసిపోతూ వెంటనే తాను వచ్చినందుకే కదా ఇలా మహేష్ హాల్ లోకి మారిపోవాల్సివచ్చిందని బాధపడుతూ  నాకోసం సంతోషంగా వేచి చూసి వేచి చూసి రాకపోవడంతో కాల్ చెయ్యగా , 

సమయం చూసి మహి ఎక్కడ ఉన్నావు అని అడుగగా ఇంటికి వచ్చేసాను అనగా నవ్వుతూ  మహి ఉదయం ఆలస్యంగా రావడం వల్ల వర్క్ మిగిలిపోయింది పూర్తి చేసుకొని వెంటనే వచ్చేస్తాను అప్పటివరకూ జాగ్రత్త అని చెప్పగా , తన ఏడుపు వినిపించగా మహి ఏమయ్యింది అంటూ కంగారుగా అడుగగా , మహేష్ ఇదంతా నావల్లనే కదా నాకోసం రూమ్ వధులుకోవడమే కాక ఆఫీస్ కు కూడా వెళ్లకుండా మొత్తం శుభ్రం చేసావు అని బాధపడుతూ చెప్పగా ,హమ్మయ్యా ఆదా విషయం ఇంకేదో అనుకోని భయపడ్డాను , మహి మీరు ఆఫీస్ కు వెళ్లగానే అమ్మకు కాల్ చేసి ఇన్నిరోజులు సింగిల్ గా ఉన్నాను ఇప్పుడు కొత్తగా ఒకరు వచ్చారు అని చెప్పగానే , ఎవరు అని అడుగగా మహి అని చెప్పగానే , సంతోషం పట్టలేక బుజ్జికన్నా మా అమ్మ ప్రేమగా అలాగే పిలుస్తుందిలే అని చెప్పగా మహి కూడా చిన్నగా నవ్వగా , బుజ్జికన్నా వెంటనే తనకు రూమ్ ఇచ్చేసి తను పర్మిషన్ ఇస్తే హాల్ లో లేకపోతే నవ్వుతూ వెళ్లి వరండాలో నీ వస్తువులు మరియు బట్టలు తీసుకొని బయటే ఉండిపో అని ఆర్డర్ వేసేసింది నువ్వంటే తనకు అంత ఇష్టం అంటూ బాధగా చెప్పగా ,

ఫోన్ లోనే గట్టిగా నవ్వుతుండగా మాట్లాడితే నవ్వడం ఎక్కడ ఆపేస్తుందో అని వింటూ ఉండిపోగా , మహేష్ మీ అమ్మ ఎవరు నాకు వెంటనే మాట్లాడాలని ఉంది అని అడుగగా , మాట్లాడటమేంటి మహి నాలుగురోజులు ఆగు నిన్ను కలవాలని నీకంటే ఆత్రంగా ఎదురుచూస్తోంది అమ్మ వీకెండ్ ఉదయమే వచ్చేస్తుంది అని చెప్పగా , నాలుగురోజులు ఆగాలా అంటూ బాధగా చెప్పగా , అలా అలా గడిచిపోతాయి అంటుండగా , ఫోన్ లో మాట్లాడటం కుదరదా అని అడుగగా సర్ప్రైజ్ కావాలంటే నాలుగురోజులు ఆగాల్సిందే , సరే అయితే తొందరగా వచ్చేయి నాకు బోర్ కొడుతోంది అనగా , ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ వర్క్ అవ్వగానే వచ్చేస్తాను , ఇంతకీ మేడం గారు పర్మిషన్ ఇస్తారా అని అడుగగా , ఎందుకు మహేష్ అని ఆశ్చర్యంగా అడుగగా , అదే హాల్ లో ఉండాలా లేక బయట ఉండాలా అని అడుగగా , మహేష్............నిన్నూ అంటూ చిరుకోపంతో నవ్వుతూ ఉండగానే ,అయితే మహి పర్మిషన్ ఇచ్చినట్లే వెంటనే అమ్మకు కాల్ చేసి చెప్పాలి అంటూ ఇద్దరమూ నవ్వుతూ పెట్టేసి ,

థాంక్స్ అంటీ మీవల్ల చాలారోజుల తరువాత నాకు ఒక జీవితం ఉందని గుర్తుచేస్తున్నారు అంటూ వస్తున్న కన్నీళ్లను తుడుచుకుని మధ్యాహ్నం మహేష్ ఇష్టపడిన వంటలన్నీ చేసేయ్యాలని ఫ్రెష్ అయ్యి వచ్చి వంట గదిలో , ఫ్రిడ్జ్ లో చూడగా కొన్ని కూరగాయలు లేకపోవడంతో బస్ స్టాప్ దగ్గర కూరగాయల బండి చూసినట్లుగా గుర్తురాగా బ్యాగు అందుకొని ఇంటికి తాళం వేసి నడుచుకుంటూ వెళ్లి ఇప్పటికీ మరియు ఉదయానికి కూడా ఏమేమి కావాలో తీసుకొని సంతోషంగా అపార్ట్మెంట్ చేరుకోగా పిల్లలంతా కంపౌండ్ లోపల ఆడుకుంటుండటం చూసి తన మధురమైన బాల్యం గుర్తుకురాగా కాసేపు చూస్తూ ఉండిపోగా పిల్లల అమ్మలు చూసి కొత్తగా వచ్చారా అని అడుగగా , అవునని పైన ఇంటికి వచ్చాను అంటూ మాట్లాడుతూ వాళ్ళల్లో కలిసిపోగా , పిల్లలు రాగా అంటీకి hi చెప్పమనగా hi అంటీ అంటూ నవ్వుతూ పలకరించగా ఒక అమ్మాయి స్టెప్స్ దగ్గర నుండి వచ్చి అమ్మా రేపు exam ఉంది మాథ్స్ కష్టంగా ఉంది కాస్త హెల్ప్ చేయమ్మా అంటూ ప్రాబ్లెమ్ చూపిస్తూ అడుగగా , 

నేను మాథ్స్ లో poor అంటే poor తల్లి వేరే ఏ సబ్జెక్ట్ అయినా అడుగు చెప్పేస్తాను maths నావల్ల కాదు రాత్రికి మీ డాడీ వస్తారుగా ఆయనను వెళ్లి అడుగు అని చెప్పగా , డాడీ నా రావడం రావడమే అలసిపోయి వస్తారు రేపు చూద్దాము తల్లి నాబంగారు కదూ వెళ్లి పడుకొమ్మా అంటూ పడుకుండిపోతారు ఉదయం నేను లెవకముందే వెళ్ళిపోతారు , ప్రతీ exam లో నేనే లాస్ట్ వస్తున్నానని క్లాస్ అంతా నవ్వుతున్నారు అమ్మా , నన్ను హేళన చేస్తూ ఏడిపించారు కూడా అని చెప్పగా ,

Geometry soooo easy అంటూ ప్రాబ్లెమ్ చూసి ఫార్ములా చెప్పి x equals to ....., y equals to...... , z equals to ........అని చెబుతూ పెన్ పెట్టుకోకుండానే చకచకా నోటితోనే అర నిమిషంలో solve చేసేసి the answer is one అంటూ మహి సైలెంట్ అయిపోగా నోట్బుక్ పక్కన పెట్టేసి టెక్స్ట్ బుక్ లో geometry చాప్టర్ తెరిచి పేపర్ లను ఫాస్ట్ గా తిప్పి ఆన్సర్ లను చూసి ఆశ్చర్యపోతూ అమ్మా రైట్ ఆన్సర్ అంటూనే అంటీ అంటీ ఇంకా కొన్ని ఇంతకంటే కష్టంగా ఉన్నాయి నాకు నేర్పిస్తారు అని అడుగగా , please అన్నట్లుగా పాప అమ్మ కూడా వేడుకుంటుండగా, నేను వంట చెయ్యాలి అనగా అంటీ మీరు వంట చేస్తూ చెప్పినా సరే నేర్చుకుంటాను please please అంటీ అని అడుగగా , సరే మా ఇంటికే వెళదాము బుక్స్ తీసుకొని పైకి వచ్చేయి అని చెప్పగానే , thank you sooo much అంటీ అంటూ ఇంట్లోకి పరిగెత్తగా , హమ్మయ్యా రక్షించారు నాపేరు స్వప్న అంటూ పరిచయం చేసుకోగా , నాపేరు మహి అక్కా అంటూ కలిసిపోగా మాట్లాడుతుండగా పాప రాగా లిఫ్ట్ లో పైకి వెళ్లి లైట్స్ అన్నింటినీ on చేసి వంట చేస్తూనే తనకు నేర్పించగా ,

ఇంత easy నా అంటీ మా స్కూల్లో మాథ్స్ టీచర్ చెబుతారు నాకు కొద్దిగా కూడా అర్థం కావు అంటూ దాని కింద ఉన్న రిలేటెడ్ problems అన్నింటినీ వంట గదిలోనే కుర్చీలో కూర్చుని చేస్తూ , ఆఅహ్హ్హ్...........ఏమి వాసన అంటీ వాసనకే నోరూరిపోతోంది అంటూ పొగుడగా , మహి మురిసిపోతూ ఈరోజు నువ్వు కూడా ఇక్కడే తిని వెళ్ళాలి అనగా ఇలాంటి ఐటమ్స్ ఎవరైనా వదులుకుంటారా అంటూ తల ఊపి వంటలో నిమగ్నమవ్వగా , వర్క్ ఫినిష్ అవ్వడంతో ఆత్రంగా బయటకు వచ్చి కారులో వేగంగా వస్తూ దారిలో fruits , కూల్ డ్రింక్స్ , ఐస్ క్రీమ్స్ , చాక్లెట్ లు తీసుకొని అపార్ట్మెంట్ చేరుకొని కారు పార్క్ చేసి పైకి రాగా  పసందైన కమ్మటి వాసన వరండా వరకూ వస్తున్నట్లుగా లిఫ్ట్ నుండి అడుగుపెట్టగానే ముక్కుకు తగులగా wow అద్భుతం అమ్మ ఏమైనా వచ్చిందా అంటూ లోపలకు వచ్చి చూడగా మహి అటువైపు తిరిగి వంటలో నిమగ్నమైనట్లుగా కనిపించగా అమ్మా నువ్వు చెప్పినది నిజమే అన్నీ తెలిసిన గుణవంతురాలు అంటూ గుండెలపై చేతిని వేసుకొని దేవుడా ఎంత అన్యాయం చేసావు అంటూ బాధపడుతూ చూస్తూ ఉండగా, పాప నన్ను చూసి hi అనగా ష్............. అంటూ సైగ చేసి ఆ రుచిని వెంటనే చూడాలని టవల్ మరియు నైట్ డ్రెస్ అందుకొని బయట బాత్రూం లోకి వెళ్లి క్షణాల్లో ఫ్రెష్ అయ్యి వచ్చి వంట గది తలుపు దగ్గర నిలబడి వస్తున్న కమ్మటి వాసనను పీలుస్తూ మైమరిచిపోతుండటం చూసి పాప మూసిముసినవ్వులు నవ్వుతుండటంతో కీర్తి problem అంత తమాషాగా ఉందా అంటూ మావైపుకు తిరుగగా ,

నన్ను చూసి కళ్ళుపెద్దవిగా చేసుకొని పెదాలపై చిరునవ్వుతో మహేష్ గారు ఎప్పుడు వచ్చారు అనగానే అప్పటివరకూ నవ్వుతున్న నేను వెంటనే చిరుకోపంతో చూడగా , sorry sorry............... అంటూ సున్నితంగా లెంపలేసుకుంటూ మహేష్ ఎప్పుడొచ్చావు అని అడుగగా , తన చర్యలను చూసి పాప ఆపకుండా నవ్వుతూ అంకుల్ వచ్చి చాలాసేపయింది అంటీ మీ వంట యొక్క కమ్మటి సువాసనను పీలుస్తూ మైమరిచిపోయి అలాగే నిల్చుండిపోయారు అని నవ్వుతూనే చెప్పగా , ఆకలవుతోంది అంటూ కడుపుపై చేయివేసి దీనంగా సైగ చెయ్యగా తియ్యగా నవ్వుతూ 10 minuites అంతే మహేష్ సోఫాలో టీవీ చూస్తూ కూర్చో వడ్డిస్తాను అంటూ మళ్లీ తనలో మొదటిసారి చూసిన సంతోషం కనిపించగా లొలొపలే మురిసిపోతూ సోఫా దగ్గరకు వెళ్తుండగా ,

అంటీ ఈ ప్రాబ్లెమ్ చూడండి అని పిలువగా వెనక్కు తిరిగి కీర్తి కదా కీర్తి మీ మేడం గారి చెప్పాలా నేను చెప్పినా సరిపోతుందా అని అడుగగా ,అంకుల్ అంటీ వంట చేస్తోంది కదా మీరే చెప్పండి అంటూ నాదగ్గరకు రాగా డేరింగ్ కిడ్ అంటూ సోఫాలో కూర్చుని మహి ప్రాసెస్ ఒకసారి చూసి అలాగే సులభ పద్ధతిలో వివరించగా , అంతేనా అంకుల్ చాలా ఈసీ అయితే అంకుల్ మీరిద్దరూ మాథ్స్ మొత్తాన్ని తినేసారా అంటూ నవ్వుతూ చకచకా చేసేస్తూ మిగిలినవాటినన్నింటినీ 10 నిమిషాల్లో పూర్తి చేసి అంకుల్ ఇప్పటివరకూ ఏ exam కు ఇంత తక్కువ సమయంలో సిలబస్ పూర్తిగా చదవలేదు మీ ఇద్దరి వల్ల రేపు exam లో ఎలాంటి ప్రాబ్లెమ్ వచ్చినా చేసేస్తాను అంటూ బుక్స్ మూసేసి థాంక్స్ అంకుల్ అంటూ అంటీ దగ్గరకు వెళ్లి అంటీ నా పని పూర్తయ్యింది మీపనిలో ఏమైనా సహాయం చెయ్యాలా అని అడుగగా , sooooo క్యూట్ నా పని కూడా అయిపోయింది చేతులు కడుక్కొని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేయి వేడివేడిగా అంకుల్ తో పాటుగా తిందువుగాని అనగా , అలాగే అంటీ అంటూ కడుక్కొని డైనింగ్ టేబుల్ పై కూర్చొగా అంకుల్ మీరు కూడా రండి అని పిలువగా ,

Why not అంటూ వెంటనే రుచి చూడాలి అంటూ పాప ప్రక్కనే కూర్చొని మహి ఒక్కొక్కటే టేబుల్ పై పెడుతుండగా ప్లేట్ ఎత్తి చూసి మధ్యాహ్నం చెప్పినట్లుగానే అన్ని ఐటమ్స్ చేసినట్లుగా ఆఅహ్హ్హ్..........సూపర్ థాంక్స్ మహి అంటూ మనసులో ఆనుకొని కమాన్ కమాన్ ........అని ఆత్రం చెయ్యగా పాప చూసి నవ్వుతుండగా , చాలారోజుల తరువాత అమ్మ రుచులను చూడబోతున్నాను అనగా మహి విని మురిసిపోతూ ప్లేట్స్ తెచ్చి ఇద్దరికి మాత్రమే వడ్డించగా , మహి నువ్వు కూడా కూర్చో అనగా మీరు తిన్న తరువాత తింటానులే మహేష్ అని బదులివ్వగా , కీర్తికి కన్నుకొట్టగా అర్థమయినట్లుగా నువ్వు కూడా మాతోపాటు తినాలి లేకపోతే మేము కూడా తినము అవునుఅంటీ తినము అంటూ చేతులు కట్టుకొని మౌనంగా కూర్చోగా ,

 చంద్రగిరిలో మొగుడు రోజూ తాగివచ్చి ఏ రోజూ ఏ పూటా తనను పట్టించుకోకుండా తిని పడుకోవడానికి వెళ్లిపోవడం గుర్తుకుతెచ్చుకొని ఒక్కసారిగా తన కళ్ళల్లో నీళ్ళు కారగా కీర్తితో పాటుగా లేచి అంటీ మహి ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి అనగా , ఇవి కన్నీళ్లు కాదు బంగారు ఆనందబాస్పాలు మీరు కూర్చోండి , మరి మీరు అనగా కన్నీళ్లను తుదుచుకొని సంతోషంగా నవ్వుతూ మీతోపాటే తింటాను అంటూ వడ్డించి వడ్డించుకొని తింటూ మధ్యమధ్యలో నన్నే చూస్తూ ఆనందబాస్పాలతో ఆడిగిమరీ వడ్డించగా , మహి అమ్మను గుర్తుచేశావు ఎలా ఉన్నాయి కీర్తి అని అడుగగా , మా అమ్మ కంటే బాగా చేశారు అంటీ అంటూ వేళ్ళను కూడా నోటిలోకి తీసుకొని చప్పరిస్తుండగా చూసి ఇద్దరమూ నవ్వుతూ నేను కూడా అలాగే చెయ్యగా చూసి నవ్వి నవ్వి ........తన కళ్ళల్లో నీళ్ళు రాగా మహేష్ ఇక జీవితంలో ఇంత సంతోషంగా నవ్వుతాను అని కలలో కూడా అనుకోలేదు అంతా నీ వల్లనే అంటూ సంతోషంగా మాట్లాడుతూ  చాలారోజుల తరువాత కడుపు నిండా తిని ,

నేను కీర్తి వెళ్లి సోఫాలో కూర్చుని మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అని అడుగగా , నాన్న , అమ్మా , నేను , నా చిన్న తమ్ముడు అని చెప్పి మీరు అంకుల్ అని అడుగగా ప్రాణంగా చూసుకునే అమ్మానాన్నలు అంతే , మరి అంటీకి ఎవరూ లేరా అని అడుగగా మహి వచ్చి నాకు అమ్మ , అత్తయ్యా , ప్రమీల మరియు ఈరోజే కలిసిన ఒక క్లోజ్ ఫ్రెండ్ అంతే అనగా వాడి పేరు చెప్పకపోవడంతో ఆశ్చర్యం వేసినా చాలా చాలా ఆనందం వేసింది , ముగ్గురమూ నవ్వుతూ మాట్లాడుతూ కీర్తి సమయం చూసి అమ్మో 9 గంటలు తొందరగా నిద్రపోయి ఉదయం లేచి ఓసారి రివిజన్ చేసుకోవాలి అంటూ బుక్స్ అందుకొని వెళ్లిపోతుండగా నేను తెచ్చిన ఐస్ క్రీమ్స్ మరియు చాక్లెట్ రెండు రెండు ఇచ్చి నీకు మీ చిన్న తమ్ముడుకి అంటూ ఇచ్చి పదా ఇంటిదాకా వధులుతాను అంటూ లిఫ్ట్ లో గ్రౌండ్ ఫ్లోర్ కు వచ్చి అదే మాఇల్లు అని చూపించగా గుడ్ నైట్ కీర్తి అని చెప్పగా గుడ్ నైట్ అంకుల్ అంటూ వచ్చి కౌగిలించుకొని లోపలకు వెళ్లి చిన్నూ చిన్నూ అంటూ చాక్లెట్ , ఐస్ క్రీమ్ ఇవ్వగా , 

ఎవరిచ్చారు కీర్తి అంటూ వాళ్ళ నాన్న అడుగగా జరిగిందంతా చెప్పి అంటీ , అంకుల్ చాలా మంచివాళ్ళు ఎటువంటి ప్రాబ్లెమ్ అయినా చిటికెలో చేసేస్తారు , హమ్మయ్యా ఈరోజు నుండి నేను బ్రతికిపోయాను అంటూ బుగ్గపై ముద్దుపెట్టగా మా ఇద్దరినీ పొగుడుతూ నిద్రలోకి జారుకుంది. 

పైకి రాగా మహి కంపౌండ్ గోడలపై చేతులు ఉంచి చంద్రుడి వెన్నెలను , చుక్కలను చూసి ఆనందిస్తుండగా లోపలికి వెళ్ళి రెండు కోన్ ఐస్ క్రీమ్స్ తెచ్చి మహి అంటూ అందివ్వగా తీసుకొని తింటూ ఇలా ఒక్కరోజులో నాకు ఇంత మంచి ఫ్రెండ్ , roommate దొరకడం నా అదృష్టం అంటూ సంతోషంగా మురిసిపోతూ మహేష్ చూడు ఆకాశం ఎంత అందంగా ఉందొ , చంద్రుడు ఎలా వెన్నెల కురిపిస్తున్నాడో అని ఆనందంతో చెబుతూ ఆశ్చర్యపోతున్న నన్ను చూసి అవును అవి ఎప్పుడూ అలాగే ఉంటాయి కానీ నీవల్ల ఈరోజు నేను మళ్ళీ పుట్టినట్లుగా నాకు కొత్తగా , అందంగా కనిపిస్తోంది అంటూ గలగలా మాట్లాడుతూనే బోర్ కొట్టిస్తున్నానా అయినా సరే ఈరోజు నా సంతోషాన్ని నా మాటలను నువ్వు పడుకోకుండా ఉండాల్సిందే ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్ అంటే అలాగే ఉండాలి అని చెప్పగా ,

వెంటనే లోపలకు పరిగెత్తగా పాపం నిద్రవస్తోందేమో అనవసరంగా ఏదేదో వాగాను అంటూ తలవంచుకొని బాధపడుతుండగా , బరబరా అంటూ సోఫాను వరండాలోకి లాక్కొని వస్తుండగా శబ్దానికి నావైపు చూసి ఆశ్చర్యపోతుండగా , సోఫా తన దగ్గరకు తెచ్చి మహి ఎంతసేపు నిలబడతావు కూర్చొని ఎంతసేపయినా నీ సంతోషాన్ని మాటల రూపంలో వ్యక్తపరుచు ఆనందంగా వింటాను చలిగా కూడా ఉంది ఇది కప్పుకో అంటూ మందమైన దుప్పటి ఇవ్వగా  , పెదాలపై చిరునవ్వుతో థాంక్స్ మహేష్ అవును చాలివేస్తోందికి అంటూ అందుకొని వెనుక చుట్టూ కప్పుకుని కూర్చొని నువ్వు కూడా కూర్చో అని పక్కనే చూపించగా తనకు దూరంగా సోఫా చివరన కూర్చోగా , తనకు మధ్యాహ్నం నుండి ఆనందం క్షణక్షణానానికి ఎక్కడా తగ్గకుండా పెరుగుతూనే ఉన్నట్లుగా తన మనసులో ఎక్కడో దాగి ఉన్న స్మృతులను ఒకసారి చిన్ననాటివి చెబుతూ వెంటనే ఉత్సాహంగా కాలేజ్ డేస్ మధురమైన స్మృతులను గుర్తుచేసుకొని నాతో పంచుకుంటుండగా , తన ఆనందాన్నే చూస్తూ ఇంకా చూడాలన్నట్లుగా కళ్ళతోనే తెలుపగా , మరింత ఉత్సాహంతో మాట్లాడుతూ మాట్లాడుతూ నిద్రలోకి జారుకోగా , లేచి మహి మహి అంటూ పిలువగా , నువ్వు నా ఫ్రెండ్ గా దొరకడం నా అదృష్టం మహేష్ అంటూ కలవరిస్తుండగా , లోపల రూంలో పడుకొందువు పదా అనగా , మళ్లీ మళ్లీ అదే మాట్లాడగా , చలి కూడా ఎక్కువ అవుతుండగా మహి నన్ను క్షమించు నీ పర్మిషన్ లేకుండా ముట్టుకుంటున్నాను అంటూ ఎత్తుకొని తన వెచ్చటి మృదువైన స్పర్శకు వొళ్ళంతా తియ్యగా జలదరించగా , తప్పురా మహేష్ అంటూ లోపలకు వెళ్లి బెడ్ పై పడుకోబెట్టి దుప్పటి కప్పి AC రూమ్ temperature కు సెట్ చేసి చిన్న లైట్ మాత్రమే ఉంచి గుడ్ నైట్ మహి అని చెప్పి తలుపు వేసి ఇంటి తలుపులు వేసి హాల్ లోని  సోఫాలో వాలిపోయి తన మాటలను బట్టి పెళ్లికి ముందు చాలా సంతోషంగా పెళ్ళైన తరువాత వాడి వల్ల నరకంలో ఉన్నట్లుగా ఇప్పుడు మళ్లీ తన పాత జీవితాన్ని పొందుతున్నట్లుగా దేవుడా తను ఇక జీవితాంత ఇలాగే సంతోషన్గా ఉండాలి దానికోసం ఏమైనా చెయ్యి కావాలంటే తన తలరాతను సంతోషన్గా మార్చేయ్ అంటూ తనతో ఉన్న ప్రతీ క్షణాన్ని తలుచుకుంటూ పెదాలపై చిరునవ్వుతో హాయిగా నిద్రపోయాను.
Like Reply
#54
రాత్రి ఆలస్యం అవ్వడం వల్ల అలారం పెట్టకపోవడంతో కమ్మటి కాఫీ వాసనకు మెలకువ వచ్చి సోఫాలో లేచి కూర్చోగా నామీద దుప్పటి ఎదురుగా టీ టేబుల్ పై వేడివేడిగా బెడ్  కాఫీ ,చుట్టూ చూడగా ఇల్లంతా శుభ్రన్గా ఊడ్చేసి పూజ కూడా చేసినట్లుగా దేవుడి గదిలో నుండి హారతి పొగ వస్తుండగా లేచి వొళ్ళువిరుచుకొని కాఫీ తాగుతూ d విటమిన్ కోసం బయటకు రాగా వరండాలో రంగురంగుల ముగ్గు తొక్కబోతూ వెంటనే ఆగిపోయి ప్రక్కకు వచ్చేసి wow బ్యూటిఫుల్ అంటూ పెదాలపై చిరునవ్వుతో మహి అంటూ గుండెలపై చేతిని వేసుకొని మురిసిపోతుండగా  వంట గదిలో చప్పుడుకు వెంటనే వెళ్లగా తలంటు స్నానం చేసినట్లుగా టవల్ కురులకు చుట్టుకొని టిఫిన్ కూడా ప్రిపేర్ చేస్తుండగా ,



ఒక్కరోజులోనే ఇన్ని అదృష్టాలా అంటూ లోపలకు వెళ్లగా నా అడుగుల చప్పుడుకే గుడ్ మార్నింగ్ my బెస్ట్ ఫ్రెండ్ అంటూ నవ్వుతూ నావైపుకు తిరుగగా కళ్ళల్లో చెమ్మతో కనిపించగా , మహేష్ ఏమయ్యింది ఏమైనా ఎక్కువ చేశానా అని తలదించుకొని అడుగగా , మహి ఇంటి వాతావరణాన్ని , అమ్మను గుర్తుకుతెస్తున్నావు అంటూ సంతోషిస్తూ గుడ్ మార్నింగ్ మహి ఏంటి టిఫిన్ అని అడుగగా థాంక్స్ మహేష్ అంటూ నవ్వుతూ దోస అనగా , wow నాకు చాలా ఇష్టం వెంటనే రెడీ అయ్యి వచ్చేస్తాను అంటూ బయట బాత్రూం లోకి వెళ్లి ఫ్రెష్ గా స్నానం చేసి అక్కడే బట్టలు కూడ వేసుకొని రాగా వేడివేడిగా దోసెలు వెయ్యగా నేను తిన్న తరువాత తానూ తింటుండగా , 



మహి బయట వేయడానికి ముగ్గు , పూజా సామాగ్రి , నిన్న మరియు ఇప్పుడు దోసకు కావాల్సిన వస్తువులు ఇంట్లో లేవే అని అడుగగా , నిన్న ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాక నువ్వు రావడం ఆలస్యం అవుతుందని చెప్పడంతో మధ్యాహ్నం నేను తిన్నవి నీకు కూడా వండుదామని బస్ స్టాప్ దగ్గరకు వెళ్లి కావాల్సినవన్నీ తీసుకువచ్చాను అని బదులివ్వగా , మహి నాకోసం ఇవన్నీ చేశావా అంటూ  ఆనందంలో నాకు మాట కూడా రావడం లేదు అంటూ మురిసిపోతుండగా , తను మాత్రం అందంగా నవ్వుతూ తినేసి క్లోజ్ ఫ్రెండ్ కోసం ఆ మాత్రం చెయ్యకపోతే ఎలా అంటూ మొత్తం శుభ్రం చేసి ఆఫీస్ కు బయలేదేరుతునట్లుగా చెప్పగా , మహి కారులో వదలనా అని అడగబోయి మళ్లీ అపార్థం చేసుకుంటుందేమో , friendship ఎక్కడ చెడిపోతుందో అని ఆగిపోగా , తను బయటకు వెళుతూ వెనక్కు తిరిగి తిరిగి నావైపు చూస్తూ వెళ్లిపోగా ,



రెండు నిమిషాల్లో రెడి అయ్యి కారు తాళాలు అందుకొని ఇంటికి తాళాలు వేసి కారులో బస్ స్టాప్ గుండా ఆఫీస్ కు బయలుదేరుతూ మహి ఇంకా బస్ స్టాప్ లోనే బస్ కోసం ఎదురుచూస్తుండగా , తన బస్ వచ్చేవరకూ అక్కడే ఆగి తననే చూస్తుండగా ఎందుకో ముఖంలో కోపం కనిపిస్తూ వెంటనే బస్ స్టాప్ అటు చివరకు వేగంగా వెళ్లి కాలేజ్ అమ్మాయిలను అల్లరి చేస్తున్న ఇద్దరు పోకిరీలను తిడుతూ అమ్మాయిలను వాళ్ళ నుండి దూరంగా తీసుకురాగా , వాళ్ళ వెనుకే పోకిరీ వెధవలు వస్తూ వాళ్ళను కాదే నిన్ను ఏదైనా చేస్తే నిన్ను ఎవడు కాపాడతాడే అంటూ ముందుకువచ్చి మహి మీదకు చెయ్యివేయ్యబోతుండగా , మెరుపువేగంతో అక్కడకు చేరి వెయ్యబోతున్న చేతిని పట్టుకొని వాడివెనక్కు వేగంగా లాగగా ఎముక విరిగినట్లుగా చప్పుడు వినిపించి నొప్పితో వాడు గట్టిగా కేకలువేస్తుండగా పక్కకు తోసేసి మావాణ్ణే కొడతావారా అంటూ ముందుకువస్తున్న వాడి కడుపులో ఒక్క గుద్దు గుద్దగా నోటిలో నుండి రక్తం కారుతూ అమ్మా అంటూ నేలపై పడి ఇద్దరూ వివిలలాడుతుండగా ,



అల్లరి చెయ్యడం చూసి ఎవరో సెక్యూరిటీ అధికారి లకు కాల్ చేసినట్లుగా వెంటనే సైరెన్ మ్రోగుతూ జీప్ రాగా ఎవరు ఇక్కడ అల్లరి చేస్తున్నది అని అడుగగా అక్కడ ఉన్నవారంతా కిందపడి దొర్లుతున్న ఇద్దరినీ చూపించగా , చూసి మంచిపని చేశారు మళ్లీ ఎవరువచ్చినా కుమ్మేయ్యండి మిగతాది నేను చూసుకుంటాను ఈ సర్కిల్ లో ఒక కానిస్టేబుల్ ను పెడతాను అంటూ ఇద్దరినీ జీప్ లో ఎక్కించుకొనివెళ్లిపోగా అందరూ మంచిపని చేసావు బాబు రోజూ ఇలాగే వచ్చి స్కూల్ పిల్లలను అల్లరి చేస్తున్నారు అంటూ అభినందించగా , మహి పిల్లలతో మాట్లాడుతూ కారు దగ్గరకు పిలుచుకొనివచ్చి కారులో వెనుక కూర్చోబెట్టి ఒక్క మాట కూడా మాట్లాడకుండా చిరుకోపంతో నన్ను చూస్తూ కారులో ముందు కూర్చోగా , నవ్వుతూ వెళ్లి కూర్చుని కారు స్టార్ట్ చేసి , గర్ల్స్ ఎక్కడ మీ కాలేజ్ అని అడుగగా పేరు చెప్పగా దారిలోనే అయితే అంటూ పోనిస్తూ ,



మహి దెబ్బలేమైనా తగిలాయా అని అడుగగా చిన్నపిల్లలా నా చేతిపై సున్నితంగా కొడుతూ కారు ఉంది కదా ఇద్దరి ఆఫీస్ లు కూడా దగ్గరే కదా డ్రాప్ చేస్తాను అని ఒక్కమాటైనా ఆడిగావా , అలా అడుగుతావని ఇంటి గుమ్మం నుండి లిఫ్ట్ వరకూ వెనక్కు ఎన్నిసార్లు తిరిగి చూసాను , సరైన సమయానికి వచ్చావు కాబట్టి సరిపోయింది లేకపోతే ఎంత భయం వేసిందో తెలుసా, నిన్న హీరోలాగా సిటీలో అమ్మాయిలకు అంత సేఫ్ కాదని లెటర్ కూడా పంపావుగా , ఫ్రెండ్ కోసం ఒక అర గంట సమయం కూడా కేటాయించలేవా ? , అంటూ ఆపకుండా చిరుకోపంతో మాట్లాడుతూనే ఉండగా ,



నవ్వుతూ మహి నువ్వు చాలా ధైర్యవంతురాలు తెలుసా , బస్ స్టాప్ లో వందలమంది ఉన్నా పట్టించుకోకపోయినా దైర్యంగా వాళ్లకు ఎదురునిలిచి ఇద్దరు స్టూడెంట్స్ ను ప్రొటెక్ట్ చేసావు ఏమంటారు గర్ల్స్ అనగా , అవ్వునక్కా చాలా చాలా థాంక్స్ నువ్వు లేకపోతే వాళ్ళు మమ్మల్ని ఎక్కడెక్కడో తాకేవాళ్ళు మీరు నిజంగా చాలా దైర్యంగా మమ్మల్ని వారిబారి నుండి కాపాడారు , అన్నయ్యా మీకు కూడా థాంక్స్ అనగా మహి మురిసిపోతూ అటువైపు తిరిగి చిన్నగా నవ్వగా , హమ్మయ్యా నా ఫ్రెండ్ నవ్వింది ఈ రోజు నుండి నేనే కారులో తీసుకువెళతాను , ఆఫీస్ అవ్వగానే వచ్చి రిసీవ్ చేసుకుంటాను అనగానే నవ్వగా , కాలేజ్ దగ్గర కారు ఆపగా చాలా థాంక్స్ అక్కా , అన్నయ్యా అంటూ లోపలికివెల్లగా , 



మహి ఆఫీస్ వైపుకు పోనివ్వగా మహేష్ వాళ్ళను అంతలా రక్తం వచ్చేలా కొట్టాలా , ఇంతకీ వాళ్ళు అల్లరి చేశారని కొట్టావా లేక లేక..............నామీద చెయ్యి వెయ్యబోతే కొట్టావా అని అడుగగా , నవ్వుతూ వదిలేయ్ మహి అంటూ ముందుచూస్తూ డ్రైవ్ చేస్తుండగా , ఆరాధనగా నావైపే కన్నార్పకుండా చూస్తుండగా తన ఆఫీస్ దగ్గర కారు ఆపగా నేను చూసేలోపల వెంటనే తేరుకొని తడబడుతూ కాపాడినందుకు థాంక్స్ అని చెప్పగా , ఫ్రెండ్స్ మధ్యలో థాంక్స్ , sorry లు ఉండవు అని చెప్పగా , నవ్వుతూ కారు దిగి సాయంత్రం కాల్ చేస్తాను వచ్చేయ్యాలి అని ఆర్డర్ వెయ్యగా , అలాగే మేడం గారు అంటూ నవ్వుతూ తను లోపలకు వెళ్ళేoతవరకూ ఉండి 20 నిమిషాలలో ఆఫీస్ చేరుకొని వర్క్ లో మునిగిపోగా , లంచ్ టైం లో మహి నుండి కాల్ లంచ్ ఆర్డర్ చేసి హలో అనగా మహేష్ తిన్నావా అని అడుగగా , ఇప్పుడే ఆర్డర్ చేసాను నువ్వు అని అడుగగా తీసుకొంటున్నాను అంటూ తినేంతవరకూ మాట్లాడగా తనే కాల్ చేసినందుకు మురిసిపోతూ ఆఫీస్ ముగించుకొని తను వేచి చూస్తుంటుంది అని వేగంగా తన ఆఫీస్ దగ్గరకు వెళ్లగా ,



నాకు సహాయం చేసిన లేడీ సెక్యూరిటీతో మాట్లాడుతుండగా వచ్చి కారు ఎక్కగా , మహి ఒక్కనిమిషం అంటూ సెక్యూరిటీ దగ్గరకువెళ్లి రోజూ  నేను వచ్చేవరకూ తనను సేఫ్ గా చూసుకోండి అంటూ పర్సు లోనుండి కొంత డబ్బును తీసి వారించినా ఇవ్వగా , నేను చూసుకుంటాను అంటూ అభయం ఇవ్వగా థాంక్స్ మేడం అంటూ నవ్వుతూ వచ్చి కారు స్టార్ట్ చేసి మహి ఆఫీస్ వర్క్ ఎలా ఉంది అని అడుగగా టీం లో ఎక్కువమంది మన తెలుగువాళ్లే నాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు టెన్షన్ ఏమీ లేదు అంటూ నవ్వుతూ చెప్పి మహేష్ నాకు గుడికి వెళ్లాలని ఉంది అని అడుగగా , ఏంటి మేడం స్పెషల్ అని అడుగగా నన్ను ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్న మంచి ఫ్రెండ్ దొరికినందుకు దేవుళ్ళకు థాంక్స్ చెప్పుకోవాలి అందుకు అనగా అయితే నేను కూడా థాంక్స్ చెప్పుకోవాలి అనగా ఎందుకు అన్నట్లుగా నావైపు చూస్తుండగా , నీలాంటి మంచి ఫ్రెండ్ తోపాటుగా మంచి అమ్మ చేతి రుచిని చూపిస్తున్న అంటూ చిలిపిగా నవ్వుతూ వంట మనిషి , ఇంటిని శుభ్రం చేసే ఇంటి మనిషి మరీ ముఖ్యన్గా ఎవరైనా రౌడీలు నన్ను అల్లరి చెయ్యడానికి వస్తే కాపాడటానికి ఒక daring అండ్ డైనమిక్ ఫ్రెండ్ ను ఇచ్చినందుకు అనగానే , మహేష్...........అంటూ నా చేతిపై , భుజం పై కొడుతుండగా నువ్వు కొట్టినా సరే దేవుడికి ఇలాగే థాంక్స్ చెబుతాను అనగా కళ్ళల్లో నీళ్ళు వచ్చేలాగా సంతోషంగా నవ్వుతూనే ఉండగా , మహి....... నువ్వు ఎప్పుడూ ఇలా సంతోషంగా నవ్వుతూనే ఉండాలి అని చెప్పగా , నేను ఇక్కడ ఉండేంతవరకే ఈ సంతోషం మహేష్ అక్కడికి వెళ్ళానో బాధ తప్ప నాలో ఏమీ మిగలదు అంటూ మనసులో ఆనుకొని కన్నీళ్ళతో బాధపడుతుండగా వెంటనే మాటమార్చి తను నవ్వేలా చేసి ఇంటికి చేరుకొని స్నానం చేసి దారిలో పూజ వస్తువులు తీసుకొని దగ్గరలోని గుడికివెళ్లి ప్రార్థించి ప్రశాంతంగా కొద్దిసేపు కూర్చొని ఆలస్యం అవ్వడం వల్ల హోటల్ లో భోజనం చేసి ఇంటికి చేరుకునేసరికి అలసిపోయినట్లుగా మహేష్ నాకు నిద్రవస్తుంది అంటూ సోఫాలోనే పడుకొంటుండగా , రూంలోకి వెళ్లి పడుకొమ్మని ఎంతచెప్పినా ఉలుకూ పలుకూ లేకుండా హాయిగా నిద్రపోగా మళ్లీ తప్పదని ఎత్తుకొని వెళ్లి పడుకోబెట్టి తియ్యగా జలధరించినట్లుగా ఫీల్ అయ్యి వెంటనే బయటకువచ్చి సోఫాలో వాలిపోయాను.



అలారం చప్పుడుకు లెవగా అప్పటికే మహి లేచినట్లుగా బాత్రూమ్ నుండి నీళ్లచెప్పుడు వినిపించగా వాకింగ్ వెళుతున్నానని లెటర్ రాసి ఫ్రిడ్జ్ పై అంటించి తలుపు ముందుకువేసుకొని బయటకు వచ్చి దగ్గరలోని గ్రౌండ్ లో రన్నింగ్ చేసివచ్చి అపార్ట్మెంట్ జిమ్ లో జిమ్ చేసి పైకివచ్చేసరికి నిన్నటిలాగే శుభ్రం చేసి ముగ్గులువేసి టిఫిన్ ప్రిపేర్ చేస్తూ గుడ్ మార్నింగ్ అంటూ కాఫీ  అందివ్వగా గుడ్ మార్నింగ్ మహి అంటూ తాగేసి స్నానం చేసివచ్చి తినేసి ఇద్దరమూ ఆఫీస్ కు బయలుదేరుతూ బస్ స్టాప్ లో కానిస్టేబుల్ ను చూసి అంతా మీవల్లనే మేడం చూడండి బస్ స్టాప్ ఎంత ప్రశాంతంగా ఉందొ అంటుండగా , మహేష్ పిల్లలు అని చూపించగా కారు ఆపగా దిగి రండి అంటూ పిలువగా , వచ్చి అక్కా మాకు ఇంకేమీ భయం లేదు బస్ లో వెళతాము అనగా ఏమీ పర్లేదు ఎక్కండి అంటూ డోర్స్ తెరిచి ఎక్కగానే వెళుతూ , అక్కా మీవల్ల సెక్యూరిటీ అధికారి ని కూడా ఏర్పాటుచేశారు అక్కడ ఉన్నవాళ్ళంతా మిమ్మల్నే తలుచుకుంటున్నారు అని సంతోషంగా చెప్పగా , చెప్పానా మేడం మీవల్ల మీ ధైర్యం వల్ల ఎంతమందికి మంచి కలిగింది అనగా , అంతా నీవల్లనే రా అంటూ మనసులో అనుకోని నావైపే చూస్తుండగా పిల్లలను వదిలి , తననూ వదిలి నా ఆఫీస్ చేరుకున్నాను. 



ఇలాగే సంతోషన్గా రోజులు గడిచిపోతూ శుక్రవారం సాయంత్రం మహిని రిసీవ్ చేసుకొని ఆఫీస్ గురించి మాట్లాడుతూ అపార్ట్మెంట్ చేరుకొని కారు పార్క్ చేసి ఇద్దరమూ లిఫ్ట్ లో పైకి రాగా అంటీ అంటూ కీర్తి పరిగెత్తుకుంటూ వచ్చి అమాంతం హత్తుకొని చాలా చాలా థాంక్స్ అంటీ అంటూ సంతోషంతో చెప్పగా , మహి మోకాళ్లపై కూర్చొని ఎందుకురా కీర్తి అని అడుగగా ఈరోజు exam పేపర్స్ ఇచ్చారు అంటీ ఏమి జరిగిందో తెలుసా ముందుగా మాథ్స్ పేపర్స్ తీసుకొని సర్ క్లాస్ లోకి వచ్చి రాగానే కీర్తి స్టాండ్ అప్ అనగానే classmates అందరూ లాస్ట్ లాస్ట్ ........ఫెయిల్ ఫెయిల్............... అంటూ హేళన చేస్తుండగా , స్టూడెంట్స్ సైలెన్స్ అనగా క్లాస్ మొత్తం నిశ్శబ్దం అయిపోగా నాకేమి భయం నవ్వుతూ లేచి నిలబడగా ,



డిసెండింగ్ ఆర్డర్లో తక్కువ వచ్చిన మార్కుల నుండి పేర్లు చదువుతాను వచ్చి పేపర్స్ తీసుకోండి ముందుగా అనగానే క్లాస్ మొత్తం కీర్తి కీర్తి..........అంటుండగా , హర్ష 10 ఔట్ ఆఫ్ హండ్రెడ్ ఫైల్ అంటూ వాడు రాగానే 10 టైమ్స్ క్వశ్చన్ పేపర్ ఆన్సర్స్ రాసుకొనిరా అనటమే కాకుండా కర్రతో దెబ్బలు కూడా పడగా , నేను కాకపోయేసరికి అందరూ నిశ్శబ్దం అయిపోయి , నెక్స్ట్ అనగానే ఇది కచ్చితంగా కీర్తినే అంటూ సగం మంది అరవగా అది కూడా కాక వాళ్లకు పనిష్మెంట్ ఇస్తూ ఫెయిల్ నుండి పాస్ మార్కుల వాళ్ళను పిలిచి ఇంకా బాగా చదవాలి అంటూ చిన్న చిన్న హోమ్ వర్క్ ఇస్తున్న ప్రతిసారి క్లాస్ లో కీర్తి కీర్తి అనేవారి సంఖ్య తగ్గిపోతూ చివరగా టాప్ three ఆఫ్ the క్లాస్ థర్డ్ ప్లేస్ అనగానే ఆశ్చర్యంగా అందరూ నావైపు చూస్తుండగా , అది కూడా కాక , సెకండ్ ప్లేస్ అనగానే క్లాస్ మొత్తం నిట్టూరుస్తూ నావైపు చూడగా అదికూడా కాక , నౌ టాపర్ of the క్లాస్ హండ్రెడ్ ఔట్ ఆఫ్ హండ్రెడ్ is none other than అంటుండగా ఇక మిగిలింది నేనే కాబట్టి చాలామంది నెమ్మదిగా  కీర్తి అని తలలు దించుకోగా సర్ గట్టిగా yes yes.......... క్లాస్ new టాపర్ కీర్తి give her big క్లాప్స్ అంటూ తానూ చప్పట్లుకొడుతూ అభినందిస్తూ దగ్గరకు పిలిచి పేపర్ అందించి కీర్తి keep it up , i am impressed your solving స్కిల్స్ అంటూ మళ్లీ చప్పట్లతో అభినందించగా ,



మేము ఒప్పుకొము సర్ అంటూ థర్డ్ వచ్చిన అమ్మాయి , సెకండ్ వచ్చిన అబ్బాయి లేచి అసూయతో ప్రతి మాథ్స్ exam లో చివర వచ్చే కీర్తి ఇప్పుడు టాపర్ అంటే మేము నమ్మము కాపీ కొట్టి అన్ని మార్కులు తెచ్చుకొంది అనగా , క్లాస్ మొత్తం వంతపాడగా , సర్ ఇద్దరినీ పిలిచి కాపీనా ఎవరి దాంట్లో అని అడుగగా ఇంకెవరు exam లో తన చుట్టూ పడిన ఫ్రెండ్స్ పేపర్స్ నుండి అనగా , సర్ నావైపు చూసి నవ్వుతూ కీర్తి నెనున్నానుగా అంటూ వారిని లేపి మార్కులు అడుగగా ఇద్దరు ఫెయిల్ , ఇద్దరు జస్ట్ పాస్ అని తెలియగానే ఫెయిల్ అయిన వాళ్ళ నుoడి హండ్రెడ్ మర్క్స్ ఎలా కాపీ కొట్టవచ్చో మీరే చెప్పండి అనగానే అందరూ ఆ ఇద్దరినీ చూసి నవ్వగా , తడబడుతూ చిట్స్ తెచ్చి రాసి ఉంటుంది సర్ అనగా ఒకసారి తన solving methods చూడండి చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నాయి నేను కూడా టీచ్ చెయ్యలేదు , గైడ్స్ లో కూడా ఉండవు మీకు ఇలా చెబితే అర్థం కాదు కీర్తి బోర్డ్ దగ్గరకు వెళ్లు క్లాస్ అంతా నాతోపాటుగా ఒకవైపు తను ఒకవైపు మీకు మాథ్స్ లో తెలిసినవి , కష్టమైనవి ఫార్ములాస్ , problems ఏవైనా తనను అడగండి ఒకటి తప్పుచేప్పినా ఇక్కడే తనకు హండ్రెడ్ కు జీరో వేస్తాను సరేనా అనగా , yes సర్ అంటూ కన్నింగ్ గా నవ్వుతూ వెళ్లి కూర్చోగా , కీర్తి are you ready అని అడుగగా మిమ్మల్ని తలుచుకొని yes సర్ అంటూ కాన్ఫిడెంట్ గా చెప్పగా , 



I know కీర్తి అంటూ సర్ కూడా క్లాస్ మధ్యలో కూర్చొని go ahead అనగా ముందుగా ఆ ఇద్దరు తమకు తెలిసిన మధ్యలో కూర్చొని go ahead అనగా ముందుగా ఆ ఇద్దరు తమకు తెలిసిన కష్టమైనవి అడుగగా ఆలోచించకుండా చెప్పెయ్యగా ముందుగా నాకే ఆశ్చర్యం వేసిందక్కా , ఇక ధైర్యం రాగా క్లాస్ మొత్తమే కాకుండా సర్ అడిగిన వాటికి కూడా చకచకా చెబుతూ బోర్డ్ పై solve చేసేయ్యగానే క్లాస్ మొత్తం అమాంతం లేచి కీర్తి కీర్తి ...........అంటూ చప్పట్లతో రూమ్ దద్దరిల్లిపోయిందనుకో చాలా చాలా థాంక్స్ అంటీ కాదు కాదు మేడం అనగా , మేడం ఏంటి కొత్తగా , ఓహ్........ఆదా కీర్తి నీ సక్సెస్ కు ఎవరు కారణం అని అడుగగా మా అంటీ , అంకుల్ అని చెప్పగా , అయితే వాళ్ళు నాకన్నా గొప్పవాళ్ళు వాళ్ళను సర్ , మేడం అని పిలవాలి అని చెప్పారనగా , మాకు అంటీ అని ప్రేమగా పిలవడమే బాగుంది అనగా , అయితే అలాగే పిలుస్తాను అంటీ అనగా మా మంచి కీర్తి అంటూ నావైపు చూస్తూ కీర్తికి ముద్దుపెట్టి , చుట్టూ చాలామంది పిల్లలను చూసి వీళ్లంతా ఎవరు నీ స్నేహితులా అని అడుగగా మీ గురించి తెలియగానే అపార్ట్మెంట్ పిల్లలంతా మీతోనే నేర్చుకోవాలని వచ్చారు అనగా అలాగే అంటూ కీర్తిని ఎత్తుకోగా , వెనుక ఉన్న కీర్తి అమ్మ వచ్చి చాలా సంతోషం మహి అంటూ పిల్లల అమ్మలకు పరిచయం చెయ్యగా నిన్నటివరకూ ఒక్కరే ఇపుడు అపార్ట్మెంట్ మొత్తం మహికి క్లోజ్ అయిపోగా , పిల్లలకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నా దగ్గరకు రండి అని చెప్పగా అలాగే మేడం అంటూ వెళ్లిపోగా , కీర్తి అమ్మ స్వప్న గారు డిన్నర్ కు ఆహ్వానించగా మహి నావైపు చూసి వెళదాము అంటూ కళ్ళతోనే అడుగగా నీ కోరిక కాదంటానా అంటూ నవ్వగా, రెడీ అయ్యి ఫ్లవర్స్ తో వెళ్లగా కీర్తి అమ్మానాన్నలు సంతోషంగా ఆహ్వానించి పరిచయాలు తరువాత తినేసి కాసేపు మాట్లాడి ఇక ఉంటాము అని చెప్పి కీర్తికి ముద్దుపెట్టి పైకి స్టెప్స్ ఎక్కుతూ వస్తుండగా అమ్మ నుండి కాల్ రేపు ఉదయమే మహిని చూడటానికి వస్తున్నాను అని చెప్పగా మహికి చెప్పగా చాలా చాలా సంతోషిస్తూ tired అయినట్లుగా మళ్లీ సోఫాలోనే నిద్రపోగా యధావిధిగా ఎత్తుకొని రూంలో పడుకోబెట్టి సోఫాలో పడుకున్నాను.



ఉదయం నేను లేచేసరికి ఇప్పటివరకూ కంటే ఇంకా శుభ్రన్గా ఇంటిని మార్చేసినట్లుగా ఎక్కడికక్కడ అందంగా సెట్ చేసి బయట రంగురంగుల ముగ్గువేసి ఉండగా , ఏమిటి విషయం ఏదైనా పండగనా నా కాఫీ ఏది అని అడుగగా , అవును పండగే అంటీ వస్తున్నారుగా అంటూ సంతోషన్గా నవ్వుతూ చెప్పగా , ఎవరి అంటీ అంటూ నిద్రమత్తులో అడుగగా , నిన్న అంటీ కాల్ చేశారు కదా మహేష్ వస్తున్నారని మరిచిపోయావా అనగానే , అమ్మ...........అంటూ సమయం చూడగా 5 గంటలు అవుతుండగా ఫ్లైట్ మరో గంటలో వచ్చేస్తుంది , నీ friendship తో అమ్మానాన్నలనే మైమరిపించావు ఈ విషయం కూడా అమ్మకు చెప్పాలి అంటూ నవ్వుతూ ఆత్రంగా లేచి ముఖానికి నీళ్లు కొట్టుకొని బయటకు వస్తుండగా తానూ రాగా ,



మహి నువ్వుకూడా వస్తావా ఇంత పొద్దున్నే మరి ఊరికే రెడీ అయ్యాను అనుకుంటున్నావా అంటీని కలవడం కోసం ఆరోజు నుండి ఎదురుచూస్తున్నాను పదా అంటూ నన్ను తోసుకుని లిఫ్ట్ దగ్గరకు వెళ్లగా , ok అంటూ కిందకువచ్చి కారులో మాట్లాడుతూ ఎయిర్పోర్ట్ చేరుకునేసరికి గంట దాటగా మహి నువ్వు లోపలకువెల్లు నేను పార్క్ చేసేసి వస్తాను అనగానే అమ్మ ను ఎలా గుర్తుపట్టడం అని అడగకుండా ఆత్రంగా లోపలకువెల్లగా , వైజాగ్ ఫ్లైట్ ల్యాండ్ అయినట్లుగా బయటకు అందరూ వస్తుండగా , అమ్మను మా అమ్మ అని తెలియని మహి పెళ్లిలో పెళ్లికూతురు రూంలో తనతో మాట్లాడిన అంటీ అంటూ దగ్గరకు వెళ్లి అంటీ నన్ను గుర్తుపట్టారా అని అడుగగా , మహి అనేంతలో నేను అంటీ మీరు మా పెళ్లికి కూడా వచ్చారు రూంలో చాలాసేపు మాట్లాడాము అనగా , అంటే మహేష్ తన కొడుకు అని ఇంకా చెప్పలేదన్నమాట , అయినా ఎందుకు చెప్పలేదు కన్నయ్య ఏదో దాస్తున్నాడు తరువాత ఒంటరిగా ఉన్నప్పుడు కనుక్కోవాలి అని మనసులో ఆనుకొని మహి ఎలా ఉన్నావు నన్ను ఇంకా గుర్తుపెట్టుకున్నావన్నమాట , ఎలా మరిచిపోతాను అంటీ నామాటలకు మీరు నన్ను పొగుడుతుంటే నేను అంత మంచిదాన్నా అని నాకే డౌట్ వచ్చింది ఆరోజు మీతో మాట్లాడిన కొద్దిసేపే అయినా చాలా ప్రేమగా మాట్లాడారు అంటూ అమ్మచేతిలోని బ్యాగు అందుకొని ,



ఒక్క నిమిషం అంటీ మా అంటీ కూడా ఇదే ఫ్లైట్ లో వచ్చారు ఎక్కడా కనిపించడం లేదు అనగా తను నీకు తెలుసా అని అడుగగా లేదు అంటీ మా ఫ్రెండ్ అమ్మగారు మొదటిసారి కలవబోతున్నాము , ఫ్రెండ్ అంటే అమ్మాయా కాదు అంటీ మహేష్ ఏదీ ఎక్కడ అని అడుగగా , వాళ్ళ అమ్మగారు రాత్రి కాల్ చేసి వస్తున్నాను అని చెప్పినా ఉదయం లేవకుండా హాయిగా నిద్రపోతుండగా లేపగా , అమ్మ వస్తున్నారనే విషయం మరిచిపోయి రోజూ ఆడిగినట్లుగా కాఫీ అడిగాడు అంటూ తియ్యగా నవ్వుతూ విషయం చెప్పగానే నీతో ఉంటే అమ్మానాన్నలనే మరిచిపోయాను అన్నాడు అంటీ అంత మంచి ఫ్రెండ్ వారం రోజుల్లోనే నన్ను ఇంత సంతోషంగా ఉండేలా మార్చేశాడు బంగారం తను అంటూ తల్లిముందే కొడుకు మంచితనాన్ని ఎవరెస్టు అంత పొగుడుతుండగా మురిసిపోతూ ,మొదటిది మహికి నేనెవరో చెప్పలేదు రెండవది రోజుకు రెండు మూడు సార్లు నాతో మాట్లాడకుండా ఉందని కన్నయ్య నాలుగురోజులు ఒక మెసేజ్ కూడా పెట్టలేదు మూడవది తనని సంతోషన్గా మార్చేశాడు అంటోంది కచ్చితంగా ఏదో ఉంది అంటూ ఆలోచిస్తుండగా ,



అంటీ అంటీ ........అంటూ పిలువగా , తేరుకొని చూస్తాను ఉండు మహి అంటూ ఆవిడా , ఈవిడా ........అంటూ చూపించగా ఏమో అంటీ పార్క్ చెయ్యడానికి వెళ్లిన మహేష్ రావాల్సిందే అంటూ లోపల నుండి వస్తున్న వారినీ , నాకోసం గేట్ వంక మార్చి మార్చి చూస్తుండగా , అప్పుడే నేను లోపలకు రాగా అమ్మ దూరం నుండే తల అడ్డంగా ఊపుతుండగా , మహేష్ అంటీ ఎవరో గుర్తుపట్టలేకపోతున్నాను అంటూ అంటీ మహేష్ చెప్పానుకదా ఫ్రెండ్ అని పరిచయం చెయ్యగా అమ్మా అని పిలువగా , షాక్ కొట్టినట్లుగా నెమ్మదిగా మహేష్ వంక చూస్తూ అమ్మ అదే అంటీ అని అడుగగా , అవును అమ్మ వైజాగ్ నుండి వచ్చింది అనగానే వెంటనే నావెనుక  సిగ్గుపడుతూ దాచుకోగా , మహి ఇటు రా అని అడుగగా నెమ్మదిగా వచ్చి అంటీ అంటూ పాదాలకు నమస్కరించగా , సంతోషంగా ఉండు తల్లి అని ఆశీర్వదించి లేపి కౌగిలించుకోగా , అంటీ నేను పొగిడినట్లుగా మహేష్ కు చెప్పొద్దు నాకు సిగ్గు అనగా , కళ్ళతోనే సరే అంటూ మనసారా కౌగిలించుకొని ,



ఏంటి కన్నయ్యా లేట్ ఫ్లైట్ ల్యాండ్ అయ్యి చాలాసమయం అయ్యింది తెలుసా ఈ మధ్యన అమ్మ మీద ప్రేమ తగ్గినట్లుంది అనగా , మా అమ్మ మీదనా నువ్వు నా ప్రాణం అమ్మా నేను ఎప్పుడూ నీబుజ్జికన్నయ్యనే అంటూ అమ్మను కౌగిలించుకోగా ,చూద్దాము ఏమి చెబుతాడో అని మరి అయితే నువ్వు నాకు కాల్ చేసి నాలుగు రోజులవుతోంది తెలుసా అని బుంగమూతి పెట్టుకోగా , లేదమ్మా ఆఫీస్ లో వర్క్ ఎక్కువగా ఉంది అంటూ అపద్దo చెబుతున్నట్లుగా తల దించుకోగా , మహి కూడా ఆశ్చర్యపోగా , ఫిక్స్ ఏదో ఉంది సరే వెళదామా అనగా అమ్మా నాన్నగారు ఎక్కడ అని అడుగగా , కొత్త బిసినెస్ పనులలో బిజీగా ఉండటంతో నేను మాత్రం నిన్ను కాదులే మహిని నా ఫ్రెండ్ ను చూడటానికి వచ్చేసాను అంటూ బ్యాగు క్రిందపడేసి తీసుకురా కన్నయ్యా అంటూ మహితో మాట్లాడుతూ బయటకు నడువగా , నాన్నకు ఫోన్ చేసి మాట్లాడుతూ బ్యాగు అందుకొని కారు తీసుకొనిరాగా , ఇద్దరూ వెనుక కూర్చొని మాట్లాడుతూ , సంతోషంగా నవ్వుతూ ఇంటికి చేరుకోగా బయట నుండి లోపలివరకూ చూసి మురిసిపోతూ నిజమే మహి ఇంటివాతావరణాన్నే మార్చేసింది అంటూ చాలా చాలా థాంక్స్ మహి నువ్వు వచ్చాక కన్నయ్య ఇక్కడ ఒంటరిగా ఎలా ఉంటాడు అన్న ఆలోచనే రావడం లేదు నువ్వు చెప్పినది కూడా నిజమే అంటూ కన్నుకొట్టి మహి బుగ్గలను అందుకొని నుదుటిపై ప్రేమగా ముద్దుపెట్టగా , థాంక్స్ అంటీ ప్రయాణంలో అలసిపోయి ఉంటారు స్నానం చేసి రండి టిఫిన్ చేసేస్తాను అనగా అలాగే అంటూ రూంలోకి వెళ్ళింది , 



మహేష్ నువ్వు కూడా అనగా అలాగే మేడం అంటూ టవల్ మరియు బట్టలు అందుకొని బయట బాత్రూం లోకి వెళ్లి రెడీ అయ్యి వచ్చి హాల్ లో టీవీ చూస్తూ కూర్చోగా , అమ్మ వచ్చి వంటలో సహాయం చెయ్యగా ముగ్గురూ తిన్న తరువాత వంట గది శుభ్రం చేస్తూ మహి వచ్చిన దగ్గర నుండి బెంగళూరులో ఏమేమి చూశావు అని అడుగగా , ఎక్కడ అంటీ ఆఫీస్ నుండి వచ్చేసరికి అలసిపోతాము ఒకరోజు మాత్రం గుడికి వెళ్ళాము అనగా , కన్నయ్యా ఉండు నీపని చెబుతాను అంటూ హాల్ లోకి వచ్చి మహిని ఎక్కడికీ పిలుచుకొని వెళ్లలేదంట మాకు బెంగళూరు మొత్తం చుట్టేయాలని ఉంది అనగా నేను ఎప్పుడో రెడీ మీరే రెడీ అవ్వాలి అని చెప్పగా , మా కన్నయ్య బంగారం అంటూ నుదుటిపై ప్రాణంగా ముద్దుపెట్టి బెడ్రూం లోకి పిలుచుకొనివెల్లి తన బట్టలన్నీ చూసి మహి నువ్వు సిటీ లో ఉంటున్నావా అసలు అనగా అధికాదు అంటీ ఇప్పుడు ఏదో ఒకటి కట్టుకొని రెడీ అవ్వు అంటూ రెడీ అయ్యి కిందకు వచ్చి కారులో కూర్చోగా ముందు ఎక్కడికి అమ్మ అని అడుగగా ఇస్కాన్ టెంపుల్ బుజ్జి అనగా పోనివ్వగా ,
Like Reply
#55
వెనుక ఇద్దరూ చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అన్నట్లుగా ఆపకుండా మాట్లాడుతూ మహి అయితే తను వచ్చిన రోజు దగ్గర నుండి ఒక్కొక్క రోజే జరిగిన అన్నివిషయాలను వివారిస్తుండగా , ఓహ్........అలాగా అవునా అలా చేసాడా అంటూ ఓర కంటితో నా రియాక్షన్స్ గమనిస్తూ టెంపుల్ చేరుకొని ముగ్గురమూ వెళ్లి దర్శించుకొని ప్రశాంతంగా బయటకు వచ్చి మధ్యాహ్నం అవ్వగా హోటల్ లో లంచ్ చేసేసి అమ్మా నెక్స్ట్ అనగా , మహి నువ్వు చెప్పు అని అమ్మ అడుగగా అంటీ లాల్ బాగ్ అంటూ నవ్వుతూ చెప్పగా చేరుకొని సాయంత్రం వరకూ చూసి వరండాలో పెంచడానికి రంగురంగుల పూల విత్తనాలు తీసుకొని బయటకు వచ్చి అమ్మా అనగా కన్నయ్యా మాంచి షాపింగ్ మాల్ కు తీసుకెళ్లు అన్ని దొరకాలి అనగా అది నాకు వదిలేయ్ అమ్మా అంటూ కృష్ణగాడితో పాటుగా బయటకు వెళ్ళినప్పుడు విసిట్ చేసిన షాపింగ్ మాల్ కు తీసుకెళ్లగా , 



బయట చూసే అమ్మ ఆశ్చర్యపోతూ చాలా పెద్దది కన్నయ్యా అంటూ లోపలకు వెళ్లి మొదటగా చీరల సెలక్షన్ దగ్గరకు తీసుకెళ్లి పట్టుచీరల దగ్గర నుండి మోడరన్ చీరల వరకూ మొత్తం చూయించండి అని చెప్పగా , మేడం ఏ రేంజ్ లో చూపించమంటారు అని అడుగగా , మీ షాప్ లో ఉన్న బెస్ట్ అండ్ highest రేంజ్ చూపించండి ఏమంటావు బుజ్జికన్నా అమ్మా నువ్వు సూపర్ నేను ఇందులో అస్సలు involve అవ్వను చివరగా పే మాత్రం చేస్తాను అంతే అంటూ gents సెక్షన్ వైపు వెళ్లి షర్ట్స్ చూస్తుండగా , షాప్ లోనే ఉన్న costliest చీరలను చూయించగా మహి నీకు ఏవి నచ్చాయో చూడు అనగా , అంటీ వద్దు మీరు తీసుకోండి అనగా మీ అంకుల్ కొనిచ్చిన వాటితోనే ఒక రూమ్ నిండిపోయింది , 



నువ్వు సెలక్షన్ మాత్రమే చెయ్యి ఇంకేమీ మాట్లాడకు నామీద ఒట్టు అంటూ ఇది ఇది అది అంటూ చూపిస్తూ ఇంకా తెప్పించండి అంటూ రకానికి తనకు నచ్చిన కొన్ని చీరలను పక్కన పెడుతూ చాలా తీసుకొని ప్యాక్ చేయించమని చెప్పగా అంటీ కొన్ని లక్షలు , మహి డ్రెస్సెస్ వేస్తావు కదా అంటూ తనకు నచ్చినవి తీసుకొని ఇంకా ఏమేమి కావాలో అన్నింటినీ తీసుకొని ప్యాక్ చేయించి కన్నయ్యా అని పిలువగా అమ్మా అయిపోయిందా అని అడుగగా ఇప్పటికి అలసిపోయాము మళ్లీ రేపు వద్దాము అంటూ చూపించగా , అమ్మా అన్నీ మహి కోసమేనా అవును కన్నయ్యా అనగానే లవ్ యూ మా అంటూ సంతోషం పట్టలేక అమాంతం కౌగిలించుకోగా కచ్చితంగా కన్నయ్య మనసులో ఏదో ఉంది ఈరోజే కనుక్కోవాలి అని మనసులో అనుకోగా , అంటీ చాలు అనగా , కన్నయ్యా తను అలాగే అంటుంది అంటూ బిల్ పే చెయ్యగా అన్నింటినీ కారు పైన సెట్ చెయ్యగా , మహేష్ బిల్ ఎంత అయ్యింది అని అడుగగా నాతోపాటుగా అమ్మ నవ్వుతూ అక్కడే డిన్నర్ చేసి ఇంటికి చేరుకునేసరికి అలసిపోయినట్లుగా ఇద్దరూ పడుకోవడానికి రూంలోకి వెళ్లిపోగా ,



అంకుల్ షాపింగ్ చాలా చేశారే హెల్ప్ చెయ్యమంటారా అని చాలామంది పిల్లలు  అడుగగా , ఒక్కొక్కరికి రెండు రెండు కవర్లు అందివ్వగా పైకి ఇంట్లోకి అన్నీ చేర్చగా పిల్లలందరికీ ఫ్రిడ్జ్ లో ఉన్న చాక్లెట్ , ఐస్ క్రీమ్స్ ఇవ్వగా థాంక్స్ అంకుల్ అంటూ కిందకు వెళ్లిపోగా , పిల్లల చప్పుడుకు అమ్మ లేచి రూమ్ తలుపు వేసి బయట సంతోషన్గా మురిసిపోతున్న నాదగ్గరికి వచ్చి , బుజ్జి ఏంటి చాలా సంతోషంగా ఉన్నావు అని అడుగగా , అవునమ్మా ఎందుకో తెలియదు చాలారోజుల తరువాత ...........అమ్మా పడుకోలేదా అని అడుగగా , అదే ఎందుకు కన్నయ్యా సంతోషం మహి happy గా నవ్వుతుంటే నువ్వు సంతోషిస్తున్నావు , అదేమీ లేదు............ అంటుండగా ఆపి , ఇదే సంతోషాన్ని నేను మహి పెళ్లికి వెళ్ళినప్పుడు నువ్వు విడిది దగ్గరకు ఎవరో అమ్మాయిని చూసాను అమ్మా హృదయం తియ్యగా జలదరించింది అని చెప్పినప్పుడు చూసాను మళ్లీ మహి వచ్చాక చూస్తున్నాను.



తన పెళ్లి సమయానికి కూడా నువ్వు కళ్యాణ మండపం లో లేవు సాయంత్రం వచ్చాక నీ ముఖం లో బాధను చూసాను మేము ఎక్కడ బాధపడతామో అని బాధను లొలొపలే దాచేసుకొని పైపైన నవ్వడం , అమ్మా.......అదే........కన్నయ్యా నేను నీకు అమ్మను రా నాకొడుకు గురించి నాకు తెలియదా , పెళ్లి తరువాత నుండి నాకు కాల్ చేసినా బాధను దిగమింగుతూ మాట్లాడుతున్నట్లుగానే మాట్లాడావు , ఎప్పుడైతే మహి వచ్చిందో ఆ వెంటనే నాకు కాల్ చేసావు నీ మాటలలో ఆనందాన్ని వర్ణించలేను కన్నయ్యా చాలా సంతోషించాను అప్పుడు నామనసు కుదుటపడింది ఈ విషయం మీనాన్నకు కూడా చెప్పలేదు , ఇప్పుడు మహికి నేను ఎవరో చెప్పకుండా సర్ప్రైజ్ చేసి తన ఆనందానికి మురిసిపోయావు , అమ్మా .........అంటుండగా నా దగ్గరకు వచ్చి నా చెయ్యి అందుకొని ఒట్టు నిజం చెప్పు నీ సంతోషమే నేను కోరుకునేది అనగా , 



అమ్మా అంటూ కన్నీళ్ళతో తనను ఇంటికి దూరంగా తీసుకువచ్చి పెళ్లిలో నేను మనసు పడింది ........ఆ మనసు పడింది ఎవరో కాదమ్మా మహినే అంటూ అమ్మను అమాంతం కౌగిలించుకొని తను పెళ్లికూతురు అని తెలియదమ్మా , ఉదయం పెళ్లి పీఠలపై చూడగానే గుండె ఆగిపోయిందనుకో , కొద్దిసేపు నాకు ఏమయిందో కూడా తెలియలేదు కన్నీళ్లు ఆగలేదు ఇక అక్కడ ఉండటం ఇష్టం లేక మీ సంతోషాన్ని దూరం చెయ్యలేక వచ్చేసాను , తరువాత అమ్మ నాన్నల ప్రేమతో పోలిస్తే నా ప్రేమ చాలా చాలా తక్కువ ఆనుకొని తనను గుండెల్లోనే ఒక పాసింగ్ క్లౌడ్ గా దాచేసుకున్నానమ్మా , నావల్ల మీరు బాధపడరాదు అని చెప్పగా , కన్నయ్యా అంటూ ఆనందబాస్పాలతో నువ్వు మా కడుపున పుట్టడం మా అదృష్టం అంటూ కన్నీళ్ళతో మనసారా కౌగిలించుకొని మరి ఇప్పుడు ఎలా కన్నయ్య అని అడుగగా తనను జీవితాంతం సంతోషన్గా ఉంచాలని దేవుణ్ణి కోరుకున్నానమ్మా ప్రస్తుతానికి అయితే అదే చేస్తున్నాను , ఇప్పుడు తను లేకుండా బ్రతకలేనమ్మా అంటూ కన్నీళ్ళతో అమ్మ గుండెలపై వాలిపోగా తను ఎప్పుడు వెళ్లిపోతుందో ఆరోజు మాత్రం నువ్వు నా ప్రక్కనే మాత్రం ఉండాలమ్మా అనగా, ఓదారుస్తూ లోపలకు పిలుచుకొనివచ్చి సోఫాలో తన ఒడిలో పడుకోబెట్టుకొని జోకొడుతుండగా , అమ్మా ఈ విషయాలను మహికి తెలియనివ్వకు అని మాట తీసుకొని అలాగే నిద్రపోయాను.
Like Reply
#56
Good and heart touching update eagerly waiting for next update
Like Reply
#57
Nice update bro ?????????
మీ
Umesh
Like Reply
#58
Very good story n narration
Like Reply
#59
గ్రేట్ అప్డేట్ మహేష్ గారు ఎన్ని ప్రేమలు గుండెల్లో పుట్టిన ఫస్ట్ లవ్ నే క్లాసికల్ కదా అలానే ఉంది మీ అప్డేట్
Like Reply
#60
Chala bagundhi bro story....really heart touching episode.....waiting for next update....

Alage జన్మనిచ్చిన తల్లికోసం ప్రయాణం story lage....ee story kuda naaku chala chala baga nachindi bro....
❤️ Sunny ❤️
Like Reply




Users browsing this thread: 43 Guest(s)