అడ్మిన్ గారు , స్పేస్ మేనేజ్ మెంట్ అసలు బాలేదు .. ఫుల్ ఎడిట్ మోడ్ లో ఎడిట్ విండో కి చాల తక్కువ స్పేస్ ఇచ్చారు .. పైన ఐకాన్స్ కి కూడా అంతే స్పేస్ ఇచ్చారు . అసలు మనం ఐకాన్స్ వాడేది తక్కువ . వాటి సైజు తగ్గించి ఎడిట్ విండో పెంచాలి
అలాగే థ్రెడ్ వ్యూ కూడా గందరగోళంగా ఉంది .. అన్నటికి ఒకటే సైజు ఇవ్వకూడదు . మనకి కావాల్సింది థ్రెడ్ పేరు , పేజీ నంబర్స్ .. మిగతా సోది అంతా అనవసరం , వాటికీ తక్కువ సైజు ఇవ్వాలి . ఇంతకుముందు మనం ఆ థ్రెడ్ లోకి ఆల్రెడీ వెళ్ళాం , ఆ తర్వాత కొత్త అప్డేట్ యూ లేకపోతే , థ్రెడ్ వ్యూ లో ఆ థ్రెడ్ లైన్ ఫోకస్ తక్కువ గా ఉండేది, వేరే కలర్ లో ఉండేది , దాన్ని బట్టి మనకి తెలిసేది , ఆ థ్రెడ్ లో కొత్త అప్డేట్ లేదని . కానీ ఇప్పుడు ఆ ఫీచర్ లేదు . థ్రెడ్ లోకి ఊరికూరికే వెళ్ళాలి , కొత్త అప్డేట్ ఏదన్నా వచ్చిందా అని
డెవలపర్ ని ఒక యూజర్ లా ఆలోచించమని చెప్పండి ..
కలర్ థీమ్ కిందన ఇచ్చారు .. కానీ థ్రెడ్ లో కొందరు టెక్స్ట్ కలర్ కూడా మారుస్తున్నారు కదా , అలాంటప్పుడు ఆ టెక్స్ట్ కలర్ , థీమ్ కలర్ బ్యాక్ గ్రౌండ్ కి సెట్ కాకపోతే చదవడం కష్టం .
ఈ కొత్త అప్డేట్ వల్ల కొత్తగా సాధించేదామన్నా ఉందా అంటే లేదనే చెప్పాలి
సింపుల్ గా డార్క్ థీమ్ , లైట్ థీమ్ మాత్రమే ఇచ్చి , మిగతాది మొత్తం పాత స్టైల్ లో ఉంచితే బాగుండేది
ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే
వీలైతే , డెవలపర్ ని ఒక నెల రోజులు ఇక్కడ కథలు చదివి , రాసి , అప్పుడు డిజైన్ చేయమని చెప్పండి
అన్నిటికి ఒకే సైజు పెట్టడం అన్యాయం .. మనకి ఏది ముఖ్యమో దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి , మిగిలిన సోది సైడ్ న పడుండాలి (పాత స్టైల్ లో అలానే ఉండేది )
ఏది ఏమైనా మీరు ఈ సైట్ కి చేస్తున్న సేవ అమోఘం