అప్డేట్ 019
శివ, స్నేహ కి బై చెప్పి అక్కడి నుండి బయలుదేరాడు. శివ వెళ్లే దారిలో అవే విషయాల గురించి ఆలోచిస్తూ నడుచుకుంటూ వెళుతున్నాడు. ఈరోజు అతను ఒకటి తెలుసుకున్నాడు, ఒక అమ్మాయితో, అబ్బాయికి ఎలాంటి సంబంధాలు ఉంటాయి అని. చూడటానికి స్నేహ ఎంత ముద్దుగా, అమాయకంగా ఉంది కానీ అయినాసరే ఆమె ఇదంతా చేస్తోంది. ఎలా ఆమె తనతో పూర్తిగా నగ్నంగా ఉంది. బహుశా అమ్మాయిలకి కూడా మజా వస్తుందేమో, శివకి ఇదంతా చేయడం వల్ల ఎలా అయితే మజా వచ్చిందో వాళ్లకి కూడా అంతేనేమో. శివ ఇలా ఆలోచిస్తూ నడుచుకుంటూ వెళ్తుంటే అతనికి బృంద మేడం కనిపించింది. ఆమె చేతిలో సామాను ఉంది, ఆమె దాన్ని ఎత్తుకుని నడుస్తోంది. శివ ఆమె దగ్గరికి వెళ్ళాడు........
జూహి తన వూరిలో వున్న తన సొంతఇంటికి వచ్చింది. సాయంత్రం ఆమె, ఆమె వదిన ఇద్దరూ ఇంట్లోని వరండాలో మంచం మీద కూర్చున్నారు. ఆమె వదిన కూరగాయలు కోస్తోంది, జూహి సల్వార్ కమీజ్ లని వేసుకుని తన వదిన పక్కన కూర్చుంది.
జూహి : అప్పుడప్పుడు అమ్మ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది, ఇలా అకస్మాత్తుగా ఫోన్ చేసి నన్ను ఇంటికి పిలిపించింది. ఎలాంటి ఆపద వచ్చిందోనని, నన్ను ఇంత అర్జెంటు గా పిలిచిందని నేను భయపడిపోయాను. ఇక్కడికి వస్తే చూడు ఏం జరిగిందో. నేను ఇప్పుడే పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదని ఎన్నిసార్లు చెప్పినా సరే ఎవరూ నన్ను అర్థం చేసుకోవడానికి రెడీగా లేరు.
మమత వదిన : పెళ్లి ఎందుకు చేసుకోవు ? ఇప్పుడు నువ్వు పెద్దదానివి అయ్యావు, అలాగే ఉద్యోగం కూడా చేస్తున్నావు. ఇప్పుడు ఏంటి సమస్య ? నీ ఎత్తుని చూస్తే, ఆ లెక్క ప్రకారం నీకు అబ్బాయి దొరకడం చాలా కష్టం. నీ అంత ఎత్తున్న వాళ్ళు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు. నిన్ను చూడటానికి వచ్చిన అబ్బాయి చాలా మంచి కుటుంబంలోంచి వచ్చాడు. ఆస్తిపాస్తులు కూడా బాగానే ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. ఎత్తులో కూడా దాదాపు నీకు సమానంగానే అనిపిస్తున్నాడు. ఇలాంటి సంబంధం మళ్లీ దొరకదు.
జూహి : బహుశా అమ్మ కొద్ది రోజుల ముందే చెప్పి ఉంటే నేను కూడా ఒప్పుకునేదాన్ని. కానీ ఇప్పుడు నేను ఒక నిర్ణయానికి వచ్చాను, ఇకపై నేను నా స్పోర్ట్స్ కెరియర్ లోనే ముందుకి వెళ్తాను.
మమత : ఇప్పుడు అంతలా ఏం జరిగిపోయింది ?
జూహి : నాకు ఒక అబ్బాయి దొరికాడు.
మమత : ఏంటి ? అబ్బాయా ? అంటే నువ్వు అతన్ని పెళ్లి చేసుకోబోతున్నావా ? పిచ్చిపట్టిందా నీకు, ఇంట్లో గొడవ అయిపోతుంది. నలుగురికీ ఏం సమాధానం చెబుతాము ?
జూహి : అరే వదినా ఆగు.. అంతముందుకి వెళ్ళిపోకు, నేను పెళ్లి గురించి చెప్పడం లేదు, అదీగాక అతను నాకంటే చిన్నోడు. నేను చెప్పేదేమిటంటే నేను అతనికి శిక్షణని ఇస్తున్నాను, ఒకవేళ భవిష్యత్తులో అతను ఆటల్లో పేరు తెచ్చుకుంటే అతనితో పాటు నా పేరు కూడా ఫేమస్ అవుతుంది. క్రీడా రంగంలో నా పేరు కూడా వినిపిస్తుంది.
మమత : అదా సంగతి, కానీ నువ్వు అంటున్నావు కదా అతను నీకంటే చిన్నోడిని, నువ్వు అమ్మాయివై ఉండి ఇంత పొడుగ్గా ఉన్నా కూడా స్టేట్ లెవెల్ కంటే ముందుకి వెళ్లలేకపోయావు, మరి అతను అబ్బాయి కదా, అతను ఎలా వెళతాడు ?
జూహి : అతను చిన్నోడు అంటే నా ఉద్దేశం, వయసులో చిన్నోడిని, ఎత్తులో మాత్రం అతను నాకంటే 6 అంగుళాలు పొడుగ్గా ఉన్నాడు.
మమత : (తన నోటి మీద చేయి పెట్టుకుంది) ఏంటి ? నీకంటే కూడా పొడవా ? నువ్వు ఎంత పొడుగ్గా వున్నావంటే మీ అన్నయ్య కూడా నీ అంత వుండరు. చాలాసేపు నిలబడి నీతో మాట్లాడితే నా మెడ కండరాలు బిగుసుకుపోతాయి, అలాంటిది అతను నీకంటే కూడా పొడవా ? బాబోయ్, ఎలా కనిపిస్తాడు అసలు ?
జూహి : నీకు చూడాలని ఉందా ?
మమత : ఏంటి ? నీ దగ్గర అతని ఫోటో కూడా ఉందా ? అయితే చూపించు.
జూహి తన మొబైల్‌లో శివ ఫోటోని చూపించింది, అందులో శివ ఆమెతో కలిసి నిలబడ్డాడు.
మమత : ఓరి దేవుడా, నిజంగానే, ఇతను నీకంటే కూడా పొడుగ్గా ఉన్నాడు, చూడటానికి కూడా ఎంత అందంగా ఉన్నాడు, మా ఆడపడుచు మనసు ఇతనికి పడిపోయినట్లుంది.
జూహి : (సిగ్గుపడింది) ఏంటి వదినా నువ్వు కూడా. అలాంటిదేం లేదు, నేను చెప్పాను కదా అతను నాకంటే చిన్నోడని.
మమత : అయితే ఏమైంది, అతను మరీ అంత చిన్నవాడిలా నాకు అనిపించడం లేదు, బహుశా ఒకటి రెండు సంవత్సరాల తేడా మాత్రమే ఉంటుంది. ఆ ఫోటోని కొద్దిగా పెద్దగా చెయ్యి, అతని ముఖాన్ని దగ్గరగా చూపించు.
జూహి : చూస్తుంటే నీ మనసు కూడా అతనికి పడిపోయినట్లుంది ?
జూహి నవ్వడం మొదలుపెట్టింది.
మమత : (జూహిని కొడుతూ) నువ్వు దయ్యానివి, ఒకవేళ నా మనసు ఇతని మీద పడితే మరి మీ అన్నయ్య పరిస్థితి ఏంటి ? అలాగే నీ పరిస్థితి ఏంటి ? (అని కిలకిలా నవ్వడం మొదలుపెట్టింది) నేను అందుకోసం చెప్పడం లేదు, ఇతని మొహం నాకు బాగా పరిచయం ఉన్నట్లు అనిపిస్తోంది, అందుకే అలా అడిగాను.
జూహి : ఏంటి వదినా నువ్వు కూడా, ఇతని మొహం నీకు ఎలా పరిచయం ఉన్నట్లు అనిపిస్తుంది ? ఇతను ఇక్కడికి ఎంత దూరంలో ఉంటాడు, ఎప్పుడూ ఇతను ఇక్కడికి రాలేదు, అలాగే నువ్వు ఎప్పుడూ ఆ వైపు వెళ్లలేదు.
మమత : (ఆలోచిస్తూ, ఆమె శ్రద్ధగా శివ ముఖాన్ని చూసింది) నువ్వు చెప్పేది నిజమే, కానీ ఎందుకో తెలియదు ఇతని మొహం బాగా పరిచయం ఉన్నట్లు అనిపిస్తోంది, గుర్తుకి రావడం లేదు కానీ నేను ఇతన్ని ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది.
(ఈ సంఘటనే ముందుముందు ఈ కథలో చాలా మలుపులకి కారణం అయింది. అదెలాగో మీకు కథ ముందుకెళ్ళేకొద్దీ తెలుస్తుంది).
జూహి : ఏంటి వదినా, ఇంకానా ? నేను చెప్పాను కదా ఇతను ఎప్పుడూ ఇక్కడికి రాలేదని, అదీగాక ఇతను ఒక అనాథ. అనాథాశ్రమంలోనే పెరిగి పెద్దయ్యాడు.
మమత : అయ్యో పాపం, దేవుడు కూడా ఎలాంటి ఆటలు ఆడిస్తాడో ఎవరికి తెలుసు.
జూహి : అవన్నీ వదిలేయి, అమ్మ ఇంకా ఎందుకు రాలేదు, ఒకవేళ ఇక నా అవసరం లేకపోతే నేను తిరిగి వెళ్ళిపోవాలి.
మమత : అరే, ఇంత కాలం తర్వాత వచ్చావు, కొద్ది రోజులు మాతో పాటు ఉండు. నువ్వు వస్తే నాకు ఎంత బాగుంటుందో, లేకపోతే అత్తమ్మ తన పనిలో బిజీగా ఉంటుంది, మీ అన్నయ్య గురించి నీకు తెలిసే ఉంటుంది, ఆయన, ఆయన పని. అత్తమ్మ ఎవరిదో సీమంతం ఉంటే వెళ్ళింది, తనకి కొద్దిగా ఆలస్యం అవుతుంది.
జూహి : మరి నువ్వు వెళ్ళలేదా వదినా ?
మమత : (ఆమె ముఖంలో బాధ కనిపించింది) లేదు, నేను వెళ్లలేను.
జూహి : నువ్వు వెళ్ళలేవా ? అలా ఎందుకు వదినా ?
మమత : అవన్నీ వదిలేయి, నువ్వు చెప్పు, ఈరోజు ఏం తింటావు ? నీకు ఇష్టమైనది ఏదైనా చేస్తాను.
జూహి : (వదిన చేతి మీద తన చేయి పెట్టింది) ఏమైంది వదినా ? నువ్వు ఎందుకు బాధపడుతున్నావు ?
మమత : (ఆమె కళ్లలో నీరు నిండింది) ఏమీ లేదు, ఆ సంగతి వదిలెయ్యి.
జూహి : ప్లీజ్ వదినా, చెప్పు ఏంటి విషయం ? చెప్పకపోతే నా మీద ఒట్టే.
మమత : అరే, దీనికి ఒట్టు ఎందుకు పెడుతున్నావు ? నీమీద ఒట్టు పెట్టుకునేంత విషయమేమీ లేదు, లక్షల్లో ఒక్కటి నా ఆడపడుచు. మొదట్లో నేను కూడా వెళ్లేదాన్ని కానీ...
జూహి : ఇప్పుడు ఏమైంది వదినా ?
మమత : (కన్నీళ్లు కారుతున్నాయి) మొదట్లో అందరూ ప్రేమగా పిలిచేవాళ్ళు, కానీ ఇప్పుడు చాటుగా మాట్లాడుకుంటున్నారు, ఎవరూ ముఖం మీద అనే ధైర్యం చేయలేరు కానీ...
మమత చెబుతూ చెబుతూ ఆగిపోయింది, జూహి ఏదో గంభీరమైన విషయం ఉందని అనుకుని, తన వదిన చేతిని తన చేత్తో గట్టిగా నొక్కింది.
మమత : ఇప్పుడు జనం నన్ను గొడ్రాలు అని పిలవడం మొదలుపెట్టారు, పెళ్లై ఇన్ని సంవత్సరాలు అయింది కదా, నేను ఇంకా తల్లిని కాలేకపోయాను.
మమత తన కళ్లని అరచేత్తో దాచుకుంది కానీ కన్నీళ్లు కారి ఆమె చీర మీద పడుతున్నాయి.
జూహి : మనసు చిన్నది చేసుకోకు వదినా. నువ్వు కూడా త్వరలోనే తల్లివి అవుతావు. అసలు నీ పెళ్లై ఎంత కాలం అయింది ? మీరు ఎందుకు ఒక మంచి డాక్టర్ కి చూపించుకోరు ?
మమత : నేను మీ అన్నయ్యకి చెప్పాను, కానీ ఆయన ఒప్పుకోవడం లేదు. ఆయన తనలో ఎలాంటి లోపం లేదని అంటున్నారు, ఒకవేళ చికిత్స చేయించుకోవాలంటే నువ్వు నీకోసం చేపించుకో అని అంటున్నారు.
జూహి : అన్నయ్యని రానివ్వు, నేను మాట్లాడతాను.
మమత : (భయపడిపోయింది) వద్దు వద్దు, నువ్వు ఆయనతో అలాంటి మాటలు మాట్లాడకు, ఆయన నామీద కోప్పడతారు. నువ్వు ఈ విషయాన్ని వదిలెయ్యి, నా జాతకంలో ఏముంటే అదే జరుగుతుంది. (టాపిక్ ని మార్చుతూ) అందుకే చెబుతున్నాను, నువ్వు పెళ్లి చేసుకో, ఇదే కరెక్ట్ వయసు పెళ్లి చేసుకోవడానికి, నీకు బిడ్డ పుడితే నేను ఆ బిడ్డని నా బిడ్డలా అనుకుంటాను.
జూహి : (సిగ్గుపడింది) ఏంటి వదినా నువ్వు కూడా, నువ్వు బాధపడకు, నేను దేవుడికి మొక్కుకుంటాను, త్వరలోనే ఆయన నీకు నీ పేరు తగ్గట్టుగా మమత సుఖం యొక్క ఆశీర్వాదాన్ని ఇస్తాడు.
మమత : (నవ్వుతూ) చూశావా నేను చెప్పాను కదా, నా ఆడపడుచు ఎంత తెలివైందో.
తర్వాత ఇద్దరూ కిలకిలలాడుతూ నవ్వడం మొదలుపెట్టారు.
*****
శివ, స్నేహ మేడం ఇంటి నుండి తన ఇంటికి వెళుతున్నప్పుడు అతనికి మార్కెట్లో బృందా మేడం కనిపించింది, ఆమె చాలా సామానుని పట్టుకుని నడుస్తోంది. ఆమెని చూసి శివ పరుగెత్తుకుంటూ బృంద దగ్గరికి చేరుకున్నాడు.
శివ : గుడ్ ఈవెనింగ్ మేడం.
బృంద మేడం : (శివని చూస్తూ) ఓహ్ ! శివా, గుడ్ ఈవెనింగ్.
శివ : ఇవ్వండి మేడం, నేను తీసుకొస్తాను.
శివ ఆమె చేతిలో నుండి సామానుని తీసుకోబోయాడు.
బృంద మేడం : అరే వద్దు ! వదిలెయ్యి, ఎలాంటి అవసరం లేదు.
శివ : (సామానుని తీసుకుంటూ) అలా ఎలా మేడం, మీరు వీటిని పట్టుకుని నడుస్తుంటే, నన్ను చూస్తూ ఊరుకోమంటారా ?
శివ ఆ సామానుని తీసుకున్నాడు, కొన్ని బ్యాగులు ఉన్నాయి.
బృంద మేడం : అరే, నేను రిక్షాని వెతుకుతున్నాను, కాసేపట్లో దొరుకుతుంది, ఇది అంత బరువుగా కూడా లేదు, ఈమాత్రం నేను కూడా మోయగలను.
శివ : మీరు మోయగలరు కానీ నేను ఇక్కడ ఉండి మీరు మొయ్యడం అసలు బాగోదు కదా.
బృంద మేడం : ఇంకా మీ ఇంటికి వెళ్లలేదా ? కాలేజ్ బ్యాగ్ ని పట్టుకుని తిరుగుతున్నావు.
శివ : అవును, అది.. చిన్న పని ఉంటే వెళ్ళాను లేకపోతే ఈ టైంలో నేను జిమ్‌కి వెళ్ళాలి.
బృంద మేడం : ఓహో జిమ్, బాడీని మంచిగా తయారు చేయాలనే ఆలోచన ఉందా ? అవును, ఈమధ్య అందరికీ ఈ సరదా పట్టుకుంది, అందరూ తమ బాడీని మంచిగా తయారు చేసుకుని హీరోలా కనిపించాలనుకుంటారు.
శివ : లేదు మేడం, నేను జిమ్‌లో ఉద్యోగం చేస్తాను.
బృంద మేడం : ఏంటి ? నువ్వు ఉద్యోగం చేస్తున్నావా ? అరే వాహ్ ! చాలా మంచి విషయం.
శివ అనాథ అని, డబ్బుల అవసరం కోసం ఉద్యోగం చేయాల్సి వస్తోందని ఆమెకి తెలుసు.
బృంద మేడం : సరే శివా, ఇప్పుడు నీకు టైం ఉంటే నా ఇంటికి రాగలవా ?
శివ : హా హా అయ్యో ఎందుకు రాను మేడం, మీకు నాతో ఏమైనా పనుందా ?
బృంద మేడం : నువ్వు రా, నేను చెబుతాను.
శివ అక్కడ ఒక రిక్షా కనిపిస్తే గట్టిగా కేక పెట్టి దాన్ని ఆపాడు.
శివ సామానుని కాళ్ళు పెట్టుకునే దగ్గర పెట్టాడు, మేడం కూర్చున్నాక, అతను ఆమె పక్కన కూర్చున్నాడు.
తర్వాత ఇద్దరూ రిక్షాలో కూర్చుని బృంద మేడం ఇంటికి వెళ్లారు. అది ఒక సొసైటీ. ఎదురెదురుగా వరుసలో ఇళ్లు ఉన్నాయి. చీకటి పడుతుండటంతో బయట జనాలు తక్కువగా ఉన్నారు. ఒక ఇంటి ముందు బృంద మేడం రిక్షాని ఆపించింది. శివ కిందికి దిగి ఆ ఇంటిని చూస్తున్నాడు. ఆ ఇంటికి గ్రౌండ్ ఫ్లోరే వుంది, ముందు కొద్దిగా స్థలం ఉంది, తలుపుకి తాళం వేసి ఉంది. బృంద మేడం తాళం తీసింది.
బృంద మేడం : రా శివా.
శివ : (లోపలికి వెళ్తూ) ఇంటికి ఎందుకు తాళం వేశారు మేడం, ఇంట్లో ఇంకెవరు లేరా ?
బృంద మేడం : లేదు, ఉద్యోగం చేస్తున్నందువల్ల నేను ఇక్కడ వంటరిగా ఉంటున్నాను. నువ్వు కూర్చో, నేను ఇప్పుడే వస్తాను.
శివ అక్కడ సోఫాలో కూర్చున్నాడు, స్నేహ మేడం ఇంటితో పోలిస్తే ఇది చిన్నగా ఉంది, సామాగ్రి కూడా తక్కువే ఉంది. ఎదురుగా ఒక గది తలుపు తెరుచుకుని కనిపించింది, అక్కడ ఒక మూలలో టేబుల్ మీద కంప్యూటర్ ఉంది, ముందు గదిలో టీవీ, అలాగే కొన్ని వస్తువులు. కాసేపటికి చేతిలో కొన్ని డబ్బులు పట్టుకుని బృంద మేడం వచ్చింది.
బృంద మేడం : (శివకి ఎదురుగా కూర్చుంటూ) నేను ట్రై చేసాను శివా కానీ నీ యూనిఫామ్ దొరకలేదు. ఈ డబ్బులు తీసుకో, వీటితో కొత్తది కుట్టించుకో.
శివ ఒకసారి డబ్బులని చూస్తున్నాడు మరోసారి ఆమెని చూస్తున్నాడు. ఇంతకుముందే స్నేహ మేడం అతనికి డబ్బులు ఇచ్చింది.
శివ : వద్దు మేడం ఆ విషయం మర్చిపోండి, నాకు ఇప్పుడు అవసరం లేదు.
బృంద మేడం : వద్దని చెప్పకు, నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు అనాధవని నాకు తెలుసు, నీకోసం నువ్వు డబ్బులు సంపాదించుకోవడం అంత ఈజీ కాదు. కానీ నువ్వు ఉద్యోగం చేస్తున్నానని నాతో చెప్పావు కదా, మరి ఎందుకు పాతది కావాలని అడుగుతున్నావు ?
శివ : నేను ఉద్యోగం చేస్తున్నాననేది నిజమే, కానీ ఉద్యోగం నేను ఇప్పుడే మొదలుపెట్టాను, 2500 రూపాయల జీతం ఇస్తారు కానీ ఇంకా నెల పూర్తి కాలేదు. నాతో పాటు పాఠశాలలో చదువుతున్న మరో ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. వాళ్ళ కోసం కూడా నేను యూనిఫామ్ లని తీసుకోవాలి. యూనిఫామ్ అంటే యూనిఫార్మే కదా. పాతదైతే మాత్రం ఏమైంది, ఎలాగైనా మేము, వేరేవాళ్లు ఇచ్చిన పాత బట్టలనే వేసుకుంటాము. యూనిఫామ్ కొనుక్కోకుండా డబ్బులు మిగిలితే అవి వేరే పుస్తకాలు, నోట్‌బుక్‌లు కొనుక్కోవడానికి పనికొస్తాయి.
బృంద మేడం : (ఆమె శివని చాలా గౌరవంగా చూసింది) అరే వాహ్ ! ఇంత చిన్న వయసులోనే ఇంత బాధ్యతతో ఉంటున్నావు, చాలా మంచి విషయం. అందుకే నేను చెబుతున్నాను ఈ డబ్బులు దాచుకో నీకు ఉపయోగపడతాయి.
శివ : ఆ అవసరం లేదు మేడం, నేను ఎక్కడ ఉద్యోగం చేస్తున్నానో వాళ్ళని డబ్బులు అడిగితే వాళ్ళు ఇచ్చారు.
బృంద మేడం : అయినా సరే ఉంచుకో, నీకు ఉపయోగపడతాయి. (శివ చేతిలో బలవంతంగా డబ్బులు పెడుతూ) నువ్వు కూర్చో, నేను షర్బత్ చేస్తాను. ఎండ కూడా ఎంత ఎక్కువగా వుందో చూడు.
శివ : వద్దులే మేడం, మీరు ఎందుకు శ్రమ పడుతున్నారు ?
బృంద మేడం : ఇందులో శ్రమ ఏముంది. నేను రోజూ కాలేజ్ నుండి వచ్చిన తర్వాత నాకోసం చేసుకుంటూనే ఉంటాను, ఈరోజు నాకు కంపెనీ దొరికింది. రోజూ నేను ఒంటరిగానే తాగుతాను.
శివ ఇంక ఏమీ అనలేదు. బృంద మేడం వంటిట్లోకి వెళ్లిపోయింది. శివ డబ్బులని చూసాడు. వాటిని లెక్కపెడితే మొత్తం 3000 రూపాయలు ఉన్నాయి. స్నేహ మేడం డబ్బులు ఇచ్చినప్పుడు శివని ఏమి కోరింది ? మరి ఇప్పుడు ఈ మేడం డబ్బులు ఇస్తోంది. ఈమె ఏం కోరుకుంటుందో తెలియదు, ఇలా ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకోవడం కరెక్టే నా, బహుశా కరెక్ట్ కాదేమో. ఇలాంటి ఆలోచనల్లో శివ మునిగిపోయాడు. బృంద షర్బత్ చేసి తీసుకుని రావడాన్ని అతను గమనించనేలేదు. శివ అలా ఆలోచనల్లో మునిగిపోయి ఉండటాన్ని చూసి…
బృంద మేడం : ఏం ఆలోచిస్తున్నావు ?
షర్బత్ ని, టిఫిన్ ని టేబుల్ మీద పెడుతూ అడిగింది.
శివ : అదే మేడం, ఈ డబ్బులు నేను ఎలా తిరిగి ఎలా ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను.
బృంద మేడం : ఎలాంటి అవసరం లేదు. నువ్వు టిఫిన్ చెయ్యి.
శివ : కానీ మేడం....
బృంద మేడం : నేను చెప్పాను కదా తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని. నువ్వు షర్బత్ తాగు.
బృంద మేడం నిజంగా చాలా మంచిదని శివ అనుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ టిఫిన్ చేశారు. మాటల ద్వారా ఆమె భర్త వేరే సిటీలో ఉంటారని అతనికి తెలిసింది. బృంద మేడం భర్తకి కూడా ఉద్యోగం ఉంది, ఆయన కూడా టీచరే. గత సంవత్సరమే ఆమెకి ఇక్కడ ఉద్యోగం వచ్చింది దాంతో తను ఇక్కడ ఒంటరిగా ఉంటోంది. ఆమె చూడటానికి ఎంత అందంగా వుందో, ఆమె మనసు కూడా అంతే మంచిది. ఆమె శివతో చాలా బాగా మాట్లాడింది.
శివ : (కంప్యూటర్ వైపు చూస్తూ) మీకు కంప్యూటర్ వచ్చా మేడం ?
బృంద మేడం : వచ్చు కొద్దిగా కొద్దిగా, కాలేజ్‌కి సంబంధించిన చిన్న చిన్న పనులు ఉంటాయి. ఉదాహరణకి రిజల్ట్ తయారు చేయడం లాంటివి, అవన్నీ కంప్యూటర్‌తో ఈజీగా అయిపోతాయి. ఏంటి, నీకు కంప్యూటర్ రాదా ? ఇప్పుడు కాలేజ్స్ లో కూడా నేర్పిస్తున్నారు కదా.
శివ : కాలేజ్‌లో సబ్జెక్ట్ అయితే ఉండేది కానీ దానికోసం ప్రత్యేకంగా ఫీజు కట్టాల్సి ఉండేది, కాబట్టి నేను నేర్చుకోలేకపోయాను.
బృంద మేడం : కంప్యూటర్లు మాత్రం ఈ రోజుల్లో ప్రతిచోటా ఉంటున్నాయి, నువ్వు ఇది నేర్చుకోవాలి, ఎక్కువ కాకపోయినా బేసిక్స్ అయితే కచ్చితంగా నేర్చుకోవాలి, రేపు వెళ్లి నువ్వు ఎక్కడైనా ఉద్యోగం చేస్తే నీకు ఉపయోగపడుతుంది. ఒకవేళ నీకు నేర్చుకోవాలని ఉంటే, నువ్వు ఇక్కడికి రావచ్చు.
శివ : (సంతోషపడుతూ) నిజంగానా మేడం ? మీరు నాకు నేర్పిస్తారా ?
బృంద మేడం : అవును, ఎందుకు నేర్పించను, కాలేజ్ టైం కాకుండా మిగిలిన టైం నాకు బోరుగా గడుస్తుంది, నువ్వు రావచ్చు.
శివ : అది.. మేడం, కాలేజ్ టైం కాకుండా నేను జిమ్‌కి కూడా వెళ్లాల్సి ఉంటుంది, అలా ఎందుకంటే అక్కడ నా ట్రైనింగ్ కూడా నడుస్తోంది, దానితో పాటు నేను ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది. రోజూ అయితే అవకాశం కుదరదు, ప్రస్తుతానికి కేవలం ఆదివారం మాత్రమే కుదురుతుంది.
బృంద మేడం : (ఆశ్చర్యంతో) నువ్వు దేనికోసం ట్రైనింగ్ చేస్తున్నావు ?
శివ : అది.. ఒక మేడం వుంది, పేరు జూహి మేడం. ఆమె నాకు అథ్లెట్ కావడానికి ట్రైనింగ్ ఇస్తోంది. నేను మంచి రన్నర్ ని కాగలనని ఆమె అంటోంది.
బృంద మేడం : అయ్యబాబోయ్ ! నువ్వు ఎంత చేస్తున్నావు, నీ వయసులో పిల్లలు అల్లరి చిల్లరగా తిరుగుతూ పాడైపోతుంటారు కానీ నువ్వు..... ఇది చాలా మంచి విషయం, నిన్ను చూస్తే నువ్వు సరైన దారిలో ఉన్నావనిపిస్తోంది. నిజంగా నువ్వు ఎంత పొడుగ్గా ఉన్నావు, నువ్వు ఇది తప్పకుండా సాధించగలవు.
శివ : (సిగ్గుపడుతూ) ఏంటి మేడం మీరు కూడా, నేను అంత పొడవేమీ లేను.
బృంద మేడం : (నవ్వుతూ) పొడవా ! నువ్వు ఒక కరెంటు స్తంభం అంత పొడుగ్గా ఉంటావు.
బృంద మేడం గలగలా నవ్వింది, శివ ఆమె అలా నవ్వడాన్ని చూస్తున్నాడు, కాలేజ్‌లో సీరియస్‌గా ఉండే మేడం నవ్వుతుంటే చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది, ఆమె తనని తాను నవ్వుకోవడాన్ని ఆపుకుంటూ..
బృంద మేడం : సారీ, నా ఉద్దేశం ఏమిటంటే నీ హైట్ చాలా బాగుంది, నేను కూడా మా ఇంట్లో అందరికంటే పొడుగ్గా ఉంటానని నీకు తెలుసా ? అయితే నిన్ను చూసాక నాకు నేను ఎంత చిన్నదాన్నో అనిపించింది. నువ్వు నిజంగా చాలా బాగుంటావు.
శివ : లేదు మేడం, బాగుండేది మీరే. మీకు తెలుసా, అందరూ అబ్బాయిలు కాలేజ్‌లో...
శివ తను ఏం అంటున్నాడో ఒక్కసారిగా గుర్తుకొచ్చి చెబుతూ చెబుతూ మధ్యలో ఆగిపోయాడు.
బృంద మేడం : (ఆశ్చర్యంతో) ఏంటి ? అబ్బాయిలందరూ కాలేజ్‌లో...?
శివ : (భయపడుతూ) లేదు, ఏమీ లేదు...
బృంద మేడం : (కోపంగా చూస్తూ) శివా, ఏం చెప్పబోతున్నావు ?
శివ : మీ మనసు నొచ్చుకుంటుంది మేడం.
బృంద మేడం : (నవ్వుతూ) అయితే చెప్పు మరి ! నేను ఏమాత్రం కోప్పడను.
శివ : (మాటలని తడుముకుంటూ) మేడం, వాళ్ళు చాలా మాటలు చెబుతారు, ఆ మాటలన్నీ నేను మీకు చెప్పలేను కానీ వాటన్నింటి అర్థం ఒక్కటే, అదేమిటంటే మీరు చాలా ఎక్కువ అందంగా ఇంకా ఆకర్షణీయంగా ఉంటారని.
బృంద మేడం ని పొగడటం ఆమెకి చాలా ఇష్టం, ఆమె కిలకిలా నవ్వింది, ఆ తర్వాత నవ్వుని ఆపుకుని శివ వైపు చూసింది.
బృంద మేడం : మిగిలిన అందరికీ నేను అందంగా కనిపిస్తాను, అంటే నీకు కనిపించనట్టేనా ?
శివ : (తడబడుతూ) లేదు మేడం, నా ఉద్దేశం.. మీరు అందంగానే ఉన్నారు, కానీ... కానీ.... నేను అలాంటివేవీ మాట్లాడను.
బృంద మేడం : (నవ్వుతూ) నేను ఊరికే సరదాగా అంటున్నాను.
శివ : ఒక మాట చెప్పనా మేడం, మీరు కాలేజ్‌లో ఎలా ఉంటారో, ఇక్కడ దానికి పూర్తిగా భిన్నంగా ఉన్నారు.
బృంద మేడం : అదెలా ?
శివ : కాలేజ్‌లో మీరు ఎంత సీరియస్‌గా కనిపిస్తారు, నాకైతే మీరు అసలు నవ్వరేమో అనిపించింది, కానీ ఇక్కడ మీరు ఎలా నవ్వుతున్నారు, ఎంత అంద... నా ఉద్దేశం ఏమిటంటే మీరు నవ్వుతున్నప్పుడు చాలా బాగుంటారు.
బృంద మేడం : (శివ వైపు చూసి నవ్వుతూ) అది కాలేజ్ కదా, నిజం చెప్పాలంటే ఈరోజు నేను చాలా రోజుల తర్వాత ఇలా నవ్వాను. ఒంటరిగా ఉండి ఉండి బోర్ కొట్టేస్తుంది. అందుకే అంటున్నాను, నీకు టైం దొరికితే ఇక్కడికి వస్తూ ఉండు.
శివ : సరే మేడం, ఇకపై రాక తప్పదు, కంప్యూటర్ నేర్చుకోవాలి కదా.
ఇలాగే వాళ్లిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు, ఆ తర్వాత శివ అక్కడి నుండి అనాథాశ్రమానికి వచ్చేసాడు. శివ లోపలికి వెళ్తుంటే సరితక్క ఎదురుపడింది.
సరిత : ఏంటి సంగతి, కాలేజ్ నుండి నేరుగా ఇంటికి రాకుండా ఎక్కడికైనా వెళ్ళావా ?
శివ : అవునక్కా, అదీ.... చిన్న పని ఉంటే వెళ్ళాను.
సరిత : నీ లతక్క ఎప్పటినుంచో నీకోసం ఎదురుచూస్తోంది, ఎన్నిసార్లు అడిగిందో, 'శివ వచ్చాడా, శివ వచ్చాడా' ? అని.