Thread Rating:
  • 21 Vote(s) - 3.05 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance బెంగళూరులో మొదలైన ప్రేమ
కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ హాస్టల్‌ నుంచి కాలేజ్‌కు బయలుదేరారు.
బయటకు వచ్చినా వాళ్లిద్దరి మనసుల్లో మాత్రం ఆ స్వీపర్‌ గురించిన భయం అలాగే ఉంది.
పుష్ప మెల్లగా అంది.
“వహీదా... కృష్ణకు చెప్పాక కొంచెం ధైర్యంగా ఉంది. కానీ ఆ ఫొటోలు అతని దగ్గర ఉన్నాయన్న విషయం గుర్తొస్తే మళ్లీ భయంగా ఉంది.”
“నాకూ అలాగే ఉంది.”
“ఏం చేస్తాడో?”
“ఏదైనా చేస్తే కృష్ణ మనకు సహాయం చేస్తానన్నాడు కదా.”
“హ్మ్...”
ఇద్దరూ నడుచుకుంటూ కాలేజ్‌ వైపు వెళ్తుండగా...
టింగ్...
అంటూ పుష్ప ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది.
ఆమె ఫోన్‌ తీసి చూసింది.
అదే స్వీపర్‌ నంబర్‌.
మెసేజ్‌ చదివిన వెంటనే ఆమె ముఖం మారిపోయింది.
“ఏమైంది?”
అని వహీదా అడిగింది.
పుష్ప ఫోన్‌ ఆమెకు చూపించింది.
“మధ్యాహ్నం 2 గంటలకు పార్కింగ్‌లో ఉన్న టీ రూమ్‌ దగ్గరకు ఇద్దరూ రావాలి.”
వహీదా ముఖంలో కూడా భయం కనిపించింది.
“మళ్లీ పిలుస్తున్నాడు.”
“అవును.”
“ఇప్పుడు?”
“ముందు కృష్ణకు చెప్పాలి.”
అంటూ ఇద్దరూ వేగంగా కాలేజ్‌ వైపు నడిచారు.
కానీ వాళ్లకు తెలియకుండా...
హాస్టల్‌ నుంచి కొంత దూరంలోనే ఆ స్వీపర్‌ నిలబడి వాళ్లను గమనిస్తున్నాడు.
వాళ్లు కాలేజ్‌ ఎంట్రన్స్‌ దగ్గరకు చేరుకునే సమయానికి అతను కూడా అక్కడికి వచ్చాడు.
పుష్ప, వహీదాలను చూసి...
ఫోన్‌ వైపు చూపిస్తూ...
“మెసేజ్‌ చూశారా?”
అన్నట్టుగా సైగ చేశాడు.
ఆ సైగ చూసిన ఇద్దరికీ మరోసారి వెన్నులో వణుకు పుట్టింది.
వాళ్లు ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్లిపోయారు.
ఇక నేరుగా కృష్ణను కలవాలని నిర్ణయించుకున్నారు.

కాలేజ్‌లోకి వెళ్లిన వెంటనే పుష్ప, వహీదా ఇద్దరూ నేరుగా కృష్ణ కోసం వెతికారు.

కృష్ణ ఒక చోట నిలబడి ఫోన్‌ చూస్తూ కనిపించాడు.

“కృష్ణ...”

అని పుష్ప పిలవడంతో అతను ఫోన్‌ పక్కన పెట్టి వాళ్ల వైపు చూశాడు.

“ఏమైంది?”

పుష్ప తన ఫోన్‌ తీసి స్వీపర్‌ పంపిన మెసేజ్‌ చూపించింది.

“ఇది ఇప్పుడే పంపాడు.”

కృష్ణ మెసేజ్‌ చదివాడు.

“మధ్యాహ్నం 2 గంటలకు పార్కింగ్‌లో ఉన్న టీ రూమ్‌ దగ్గరకు ఇద్దరూ రావాలి.”

కృష్ణ ముఖం ఒక్కసారిగా సీరియస్‌గా మారింది.

“మీరు భయపడకండి.”

“కృష్ణ... వాడు మమ్మల్ని మళ్లీ ఎందుకు పిలుస్తున్నాడో అర్థం కావడం లేదు.”

అని వహీదా భయంగా అంది.

“అందుకే మనం తొందరపడకూడదు.”

అని కృష్ణ చెప్పాడు.

“ఇప్పుడు మీరు ఇద్దరూ నా మాట జాగ్రత్తగా వినండి.”

అంటూ తన బ్యాగ్‌ తెరిచి రెండు చిన్న బ్లూటూత్‌ ఇయర్‌పీస్‌లు బయటకు తీశాడు.

“ఇవి తీసుకోండి.”

పుష్ప వాటిని చేతిలోకి తీసుకుని ఆశ్చర్యంగా చూసింది.

“ఇవి ఎందుకు?”

“మీరు అక్కడికి వెళ్లినప్పుడు ఇవి ఆన్‌ చేసి పెట్టుకోండి. మీరు మాట్లాడేది నాకు వినిపించేలా కనెక్షన్‌లో ఉంచుతాను.”

వహీదా వెంటనే అడిగింది.

“నువ్వు కూడా అక్కడికి వస్తావా?”

“నేను మీతో పాటు కనిపించేలా రాను. బయట ఉంటాను.”

“అతనికి తెలిస్తే?”

“అందుకే జాగ్రత్తగా ఉండాలి.”

కృష్ణ ఇద్దరి వైపు చూస్తూ చెప్పాడు.

“ఇందులో చాలా రిస్క్‌ ఉంది. ఏ చిన్న పొరపాటు జరిగినా మీ ఫొటోలు బయటకు వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి మీరు అక్కడికి వెళ్లిన తర్వాత మీకు ఏం జరిగినా తొందరపడి స్పందించకండి.”

“నేను చెప్పే వరకు ఏ నిర్ణయం తీసుకోకండి.”

అని కృష్ణ స్పష్టంగా చెప్పాడు.

పుష్ప మౌనంగా తల ఊపింది.

కృష్ణ ఆమె ముఖంలో ఇంకా భయం గమనించాడు.

“పుష్ప...”

ఆమె అతని వైపు చూసింది.

“భయపడకు.”

“కానీ...”

“పుష్ప... నువ్వు మాత్రం ఒక్కటి గుర్తుపెట్టుకో.”

కృష్ణ స్వరం మెల్లగా మారింది.

“భయపడినప్పుడు నీకు ఎవరైనా గుర్తొస్తే... అది నేనే అయి ఉండాలి. నువ్వు నన్ను నమ్మి ఒక్క అడుగు ముందుకు వేస్తే, ఆ అడుగు మధ్యలో నిన్ను ఒంటరిగా వదిలేయను.”

పుష్ప ఒక్కసారిగా మౌనంగా అయిపోయింది.

ఆ మాటలు విన్న వెంటనే ఆమె కళ్లలోని భయం కొంచెం తగ్గినట్టైంది.

పక్కనే ఉన్న వహీదా కూడా కృష్ణ వైపు చూస్తూ కాసేపు ఏమీ మాట్లాడలేకపోయింది.

కృష్ణ మాత్రం వాళ్లిద్దరి ముఖాలు చూసి...

“ఏంటి అలా చూస్తున్నారు?”

అని సాధారణంగా అడిగాడు.

వహీదా వెంటనే చూపు పక్కకు తిప్పుకుంది.

“ఏం లేదు.”

“సరే. నేను బయట ఉంటాను.”

అని కృష్ణ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

కృష్ణ వెళ్లిపోయిన వెంటనే వహీదా పుష్ప వైపు చూసి చిలిపిగా నవ్వింది.

“అబ్బా... నీకు మాత్రం స్పెషల్‌ డైలాగ్‌!”

పుష్ప అర్థం కాక...

“ఏంటి?”

వహీదా కృష్ణ మాటలను అనుకరిస్తూ...

“భయపడినప్పుడు నీకు ఎవరైనా గుర్తొస్తే... అది నేనే అయి ఉండాలి!”

అంది.

పుష్ప ముఖం ఒక్కసారిగా ఎర్రబడింది.

“వహీదా... అతను సీరియస్‌గా అన్నాడు.”

“అవును... నాకు కూడా సీరియస్‌గానే అనిపించింది.”

అని నవ్వింది.

“కానీ నాకేమో ‘నువ్వు వేసే ప్రతి అడుగుకి నేను నీతో ఉంటాను’ అన్నాడు. నీకేమో... ‘ఆ అడుగు మధ్యలో నిన్ను ఒంటరిగా వదిలేయను’ అంట!”

పుష్ప ఏమీ మాట్లాడలేదు.

వహీదా మళ్లీ ఆటపట్టిస్తూ...

“నిన్న ఎగ్‌ దోస... ఈరోజు స్పెషల్‌ డైలాగ్‌... ఇంకా ఎన్ని ఎపిసోడ్లు ఉన్నాయో!”

“అయ్యో వహీదా... నువ్వు ఆపవా?”

అంటూ పుష్ప నవ్వింది.

అయితే ఆ నవ్వు వెనుక ఆమె మనసులో మాత్రం కృష్ణ చెప్పిన మాటే పదేపదే వినిపిస్తోంది.

“నిన్ను ఒంటరిగా వదిలేయను.”


---

సమయం నెమ్మదిగా మధ్యాహ్నం వైపు కదిలింది.

2:15 గంటలు.

అప్పుడే పుష్ప ఫోన్‌ మోగింది.

స్క్రీన్‌పై అదే నంబర్‌.

స్వీపర్‌.

పుష్ప, వహీదా ఒకరినొకరు చూసుకున్నారు.

పుష్ప కాల్‌ లిఫ్ట్‌ చేసింది.

“హలో...”

అవతల నుంచి చల్లటి స్వరం వినిపించింది.

“ఇంకో పదిహేను నిమిషాల్లో నేను చెప్పిన చోటికి రావాలి.”

పుష్ప ఏమీ మాట్లాడలేదు.

“ఆలస్యం చేయకండి.”

అని చెప్పి అతను కాల్‌ కట్‌ చేశాడు.

పుష్ప ఫోన్‌ కిందికి దించింది.

వహీదా మెల్లగా అడిగింది.

“ఇంకో పదిహేను నిమిషాల్లోనా?”

“హ్మ్...”

పుష్ప తన చెవిలో ఉన్న బ్లూటూత్‌ను సరిచేసుకుంది.

వహీదా కూడా మరో ఇయర్‌పీస్‌ పెట్టుకుంది.

ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు.

ఇప్పుడు వాళ్ల ముందున్నది భయపెట్టే ఫోన్‌కాల్‌ మాత్రమే కాదు...

తమను ఇంతకాలం బెదిరించిన వ్యక్తిని ఎదుర్కొనే సమయం.

అదే సమయంలో కాలేజ్‌ బయట...

కృష్ణ తన ఫోన్‌ స్క్రీన్‌ వైపు చూస్తూ నిలబడ్డాడు.

అతని ముఖంలో ఒక్కటే ఆలోచన.

“ఇక నుంచి వాళ్లిద్దరూ వేసే ప్రతి అడుగు... నా దృష్టిలోనే ఉండాలి.”
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
All suspence
Like Reply
Nice update andi
Like Reply
Good going!!!
[+] 1 user Likes readersp's post
Like Reply
Nice update
Like Reply
Super update
Like Reply
వహీదా, పుష్ప ఇద్దరికీ బ్లూటూత్‌ ఇయర్‌పీస్‌లు ఇచ్చిన తర్వాత కృష్ణ వాళ్లకు మరోసారి కొన్ని జాగ్రత్తలు చెప్పాడు.

“నేను చెప్పే వరకు మీరు ఏమీ మాట్లాడకండి. అక్కడ ఏం జరిగినా ముందుగా నాకు వినిపించాలి. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకండి.”

అని చెప్పి కృష్ణ అక్కడి నుంచి బయటకు వచ్చాడు.

కాలేజ్‌ బయటకు వచ్చిన కృష్ణ నేరుగా అక్కడే ఉన్న ఒక బేకరీ దగ్గరకు వెళ్లి నిలబడ్డాడు.

మొబైల్‌ తీసి సమీపంలో ఉన్న ఇన్వర్టర్‌, బ్యాటరీ షాపుల కోసం సెర్చ్‌ చేశాడు.

కొద్దిసేపు వెతికిన తర్వాత కాలేజ్‌కు దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఒక టాటా గ్రీన్‌ బ్యాటరీ షాప్‌ కనిపించింది.

“ఇదే సరిపోతుంది.”

అనుకున్న కృష్ణ అక్కడికి వెళ్లాడు.

తనకు కావాల్సిన సామాగ్రి తీసుకున్న తర్వాత మళ్లీ కాలేజ్‌ పరిసరాలకు వచ్చి, పుష్ప–వహీదాల నుంచి ఫోన్‌ కోసం ఎదురుచూడసాగాడు.

సమయం నెమ్మదిగా మధ్యాహ్నం రెండు గంటలకు దగ్గరవుతోంది.

బేకరీ బయట నిలబడి ఉన్న కృష్ణ మొబైల్‌ తీసుకున్నాడు.

అప్పటికే అతని ఫోన్‌లో బాలయ్య నటించిన ‘సమరసింహారెడ్డి’ సినిమాలోని “రావయ్యా ముద్దుల మామ...” పాట ప్లే అవుతోంది.

పాట చివరి దశకు చేరుకుంది.

అప్పుడే...

ట్రింగ్...

కృష్ణ ఫోన్‌ మోగింది.

స్క్రీన్‌పై...

పుష్ప.

కృష్ణ వెంటనే కాల్‌ లిఫ్ట్‌ చేశాడు.

“హలో?”

“కృష్ణ...”

పుష్ప స్వరంలో భయం స్పష్టంగా వినిపించింది.

“వాడు మళ్లీ కాల్‌ చేశాడు. ఇంకో పదిహేను నిమిషాల్లో చెప్పిన చోటికి రావాలని అన్నాడు.”

కృష్ణ కాసేపు ఆలోచించాడు.

“సరే.”

అని ప్రశాంతంగా అన్నాడు.

“మీరు ఇద్దరూ వెళ్లండి.”

“నువ్వు?”

“నేను వస్తాను. కానీ ఒక విషయం మాత్రం మర్చిపోకండి.”

“ఏంటి?”

“మీరు పెట్టుకున్న బ్లూటూత్‌ నా మొబైల్‌కు కనెక్ట్‌ అయ్యింది.”

పుష్ప, వహీదా ఒకరినొకరు చూసుకున్నారు.

కృష్ణ స్వరం మరింత సీరియస్‌గా మారింది.

“కానీ మీరు ఇద్దరూ ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ మాట్లాడకండి. నేను చెప్పినప్పుడు మాత్రమే స్పందించండి. మీకు ఏదైనా అడిగినా ముందుగా నా మాట వినండి. మీరు మాట్లాడకపోవడమే ఇప్పుడు మీకు పెద్ద రక్షణ.”

“సరే కృష్ణ.”

అని పుష్ప చెప్పింది.

“జాగ్రత్త.”

అని కృష్ణ చెప్పి కాల్‌ కట్‌ చేశాడు.


“మీరు మాట్లాడకపోవడమే ఇప్పుడు మీకు పెద్ద రక్షణ.”

అని కృష్ణ చివరిగా చెప్పాడు.

“సరే కృష్ణ.”

అని పుష్ప మెల్లగా సమాధానం ఇచ్చింది.

“జాగ్రత్త.”

అని చెప్పి కృష్ణ కాల్‌ కట్‌ చేశాడు.

కాల్‌ కట్‌ అయిన తర్వాత పుష్ప, వహీదా ఇద్దరూ కొద్దిసేపు మౌనంగా ఒకరినొకరు చూసుకున్నారు.

కృష్ణ చెప్పిన మాటలు వాళ్లకు ధైర్యాన్ని ఇచ్చాయి.

అయితే ఆ క్షణంలో...

ఇద్దరి మనసుల్లోనూ ఒకే వ్యక్తి.

కృష్ణ.

ఇద్దరికీ తెలియని ఒక చిన్న విషయం ఉంది.

ఇద్దరూ తమ తమ ఫోన్‌ గ్యాలరీలో, ఒకరికొకరు తెలియకుండా కృష్ణ ఫోటోను దాచుకున్నారు.

అది కృష్ణ కాలేజ్‌లో సరదాగా ఫోటో దిగిన స్టిల్‌.

‘మిర్చి’ సినిమాలో ప్రభాస్‌ రెండు ప్యాంట్‌ జేబుల్లో చేతులు పెట్టుకుని స్టైలిష్‌గా నిలబడినట్టుగా...

కృష్ణ కూడా రెండు చేతులను ప్యాంట్‌ జేబుల్లో పెట్టుకుని, కాస్త సీరియస్‌గా, తనదైన స్టైల్లో నిలబడి ఉన్న ఫోటో.

పుష్ప నడుస్తూ ఉండగా ఒక్కసారిగా తన ఫోన్‌ తీసి గ్యాలరీ ఓపెన్‌ చేసింది.

కృష్ణ ఫోటో కనిపించగానే ఆమె ముఖంలో తెలియకుండానే చిన్న చిరునవ్వు వచ్చింది.

“నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే వెళ్తున్నాను...”

అని మనసులో అనుకుంది.

ఎవరూ చూడకుండా ఆ ఫోటోను స్క్రీన్‌పై కాసేపు చూసింది.

తర్వాత చాలా మెల్లగా ఫోన్‌ స్క్రీన్‌పై ఉన్న కృష్ణ ఫోటోకు ఒక చిన్న ముద్దు పెట్టింది.

వెంటనే ఫోన్‌ లాక్‌ చేసి...

ఏమీ జరగనట్టుగా వహీదా పక్కన నడవసాగింది.

అదే సమయంలో వహీదా కూడా తన ఫోన్‌ను చేతిలోకి తీసుకుంది.

ఆమె గ్యాలరీలో కూడా అదే ఫోటో.

కృష్ణ రెండు చేతులు జేబుల్లో పెట్టుకుని స్టైల్‌గా నిలబడి ఉన్న ఫోటో.

ఆమె కూడా ఆ ఫోటోను చూస్తూ చిన్నగా నవ్వుకుంది.

“నువ్వు చెప్పినట్టే చేస్తాను కృష్ణ...”

అని మనసులో అనుకుంది.

తర్వాత ఎవరూ చూడకుండా ఆ ఫోటోకు మెల్లగా ఒక ముద్దు పెట్టి ఫోన్‌ లాక్‌ చేసింది.

ఇద్దరూ ఒకరి వైపు ఒకరు చూసుకున్నారు.

కానీ...

తమ ఫోన్‌లలో కృష్ణ ఫోటో ఉందన్న విషయం మాత్రం ఇద్దరికీ తెలియదు.

ఇద్దరూ మళ్లీ ముందుకు నడవడం ప్రారంభించారు.

వాళ్లకు తెలియకుండా...

వారి మధ్య కృష్ణపై ఉన్న భావాలు మాత్రం ఒక చిన్న రహస్యంగా పెరుగుతున్నాయి.

ముందు ఏం జరుగుతుందో తెలియదు.

కానీ ఈసారి...

వాళ్ల అడుగుల్లో భయం కంటే, కృష్ణపై ఉన్న నమ్మకమే కాస్త ఎక్కువగా ఉంది.
---

స్వీపర్‌ చెప్పిన ప్రదేశం

కృష్ణ ముందుగా స్వీపర్‌ చెప్పిన ప్రదేశానికి వెళ్లాడు.

అది కాలేజ్‌ క్యాంపస్‌కు దాదాపు 500 మీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న పాత కొట్టంలాంటి నిర్మాణం.

కాలేజ్‌ నిర్మాణ పనులు జరిగిన సమయంలో ఉపయోగించినట్టుగా కనిపిస్తోంది.

ఆ తర్వాత నుంచి ఆ ప్రదేశాన్ని కొంతమంది విద్యార్థులు అప్పుడప్పుడు సిగరెట్లు తాగడానికి మాత్రమే ఉపయోగించుకునేవారు.

లోపల పెద్దగా ఏమీ లేదు.

ఒక చిన్న చెక్క బల్ల...

ఒక చిన్న మంచంలా రాళ్లతో నిర్మించిన భాగం...

అంతే.

కృష్ణ చుట్టూ ఒకసారి జాగ్రత్తగా పరిశీలించాడు.

“బయటి వాళ్లు సాధారణంగా వచ్చే ప్రదేశం కాదు.”

అని తనలో తాను అనుకున్నాడు.

స్వీపర్‌ ఈ ప్రదేశాన్ని ఎంచుకోవడానికి ఇదే కారణమని అతనికి అర్థమైంది.

కృష్ణ ఆ చిన్న నిర్మాణం వెనుక వైపుకు వెళ్లాడు.

అక్కడ తడకలతో చేసినట్టుగా కనిపించే ఒక చిన్న తలుపు ఉంది.

దాని వెనుకవైపు ఒక పెద్ద చింతచెట్టు కనిపించింది.

కృష్ణ చెట్టు చుట్టూ ఒకసారి తిరిగి చూశాడు.

తర్వాత పైకి చూసాడు.

“ఇదే...”

అనుకున్నాడు.

చెట్టుపైకి ఎక్కితే కింద జరుగుతున్నది స్పష్టంగా కనిపిస్తుంది.

అదే సమయంలో కింద ఉన్న వాళ్లకు తాను కనిపించే అవకాశం కూడా తక్కువ.

కృష్ణ చెట్టు ఎక్కి కిందికి పరిశీలించాడు.

అక్కడి నుంచి మొత్తం ప్రదేశం దాదాపు స్పష్టంగా కనిపిస్తోంది.

అతను మళ్లీ కిందకు దిగాడు.

తాను కూర్చోవాల్సిన ప్రదేశాన్ని గుర్తుపట్టేందుకు నేలపై ఒక చిన్న మార్క్‌ పెట్టాడు.

తర్వాత చెట్టు కింద నిలబడి పైకి చూశాడు.

కింద నుంచి చూస్తే చెట్టు మీద ఎవరైనా ఉన్నట్టు అంత సులభంగా కనిపించడం లేదు.

కృష్ణ చిన్నగా నవ్వుకున్నాడు.

“ఇదే సరైన ప్లేస్‌.”

అని అనుకున్నాడు.

స్వీపర్‌ రాకముందే మళ్లీ చెట్టు ఎక్కి ఒక కొమ్మపై జాగ్రత్తగా కూర్చున్నాడు.

మొబైల్‌ సైలెంట్‌లో పెట్టుకున్నాడు.

బ్లూటూత్‌ కనెక్షన్‌ మరోసారి చెక్‌ చేశాడు.

అన్నీ సరిగ్గా ఉన్నాయి.

ఇప్పుడు కృష్ణ చేయాల్సిందల్లా...

వేచి చూడటం.

---

దాదాపు ఐదు నిమిషాలు గడిచాయి.

దూరంగా ఎవరో నడుచుకుంటూ వస్తున్నట్టు కనిపించింది.

కృష్ణ కళ్లు ఆ వ్యక్తిపై నిలిచిపోయాయి.

సుమారు యాభై ఏళ్ల వయస్సు.

కాకీ రంగు దుస్తులు.

నడకలో ఒకరకమైన ధీమా.

కృష్ణకు వెంటనే అర్థమైంది.

“వీడే...”

ఆ వ్యక్తి చుట్టూ చూసుకుంటూ నేరుగా ఆ చిన్న కొట్టం దగ్గరకు వచ్చాడు.

అతను అక్కడ ఉన్న చెక్క బల్లపై కూర్చున్నాడు.

చుట్టూ ఒకసారి చూశాడు.

ఎవరూ లేరని నిర్ధారించుకున్నట్టుగా తల తిప్పి చూశాడు.

ఈ ప్రదేశానికి తనకు బాగా పరిచయం ఉండటంతో అతనికి ఎలాంటి అనుమానం లేదు.

“ఇక్కడికి బయట వాళ్లు ఎవరూ రారు.”

అనే ధైర్యం అతని ముఖంలో కనిపిస్తోంది.

కృష్ణ మాత్రం చెట్టు మీద నుంచి అతని ప్రతి కదలికను గమనిస్తున్నాడు.

మరో పది నిమిషాలు గడిచాయి.

అప్పుడే దూరంగా ఇద్దరు అమ్మాయిలు కనిపించారు.

పుష్ప...

వహీదా...

ఇద్దరూ భయంతో చుట్టూ చూస్తూ నెమ్మదిగా ఆ ప్రదేశం వైపు వస్తున్నారు.

కృష్ణ వెంటనే వాళ్లను గుర్తించాడు.

బ్లూటూత్‌ కనెక్షన్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది.

పుష్ప, వహీదాలు ఆ ప్రదేశానికి దగ్గరయ్యే కొద్దీ వారి అడుగులు నెమ్మదించాయి.

ఆ చిన్న కొట్టం కనిపించగానే ఇద్దరి ముఖాల్లో భయం మరింత పెరిగింది.

పుష్ప చేతులు చెమటతో తడిసిపోయాయి.

వహీదా కూడా తనను తాను కంట్రోల్‌ చేసుకునే ప్రయత్నం చేస్తోంది.

ఇదే ప్రదేశంలో తమను ఇంతకాలం బెదిరించిన వ్యక్తిని ఎదుర్కోవాల్సి ఉందనే ఆలోచనతో ఇద్దరికీ చమటలు పట్టాయి.

స్వీపర్‌ కూడా వాళ్లను గమనించాడు.

అతను వెంటనే చెక్క బల్లపై నుంచి లేచాడు.

నెమ్మదిగా రాళ్లతో చేసిన ఆ చిన్న మంచం పక్కకు వెళ్లి నిలబడ్డాడు.

పుష్ప, వహీదా అక్కడికి చేరుకుని ఆగిపోయారు.

కొన్ని క్షణాలు...

ఎవరూ మాట్లాడలేదు.

పై నుంచి చెట్టు కొమ్మల్లో దాక్కుని ఉన్న కృష్ణ మాత్రం ప్రతి క్షణాన్ని గమనిస్తున్నాడు.

అతని చేతిలో మొబైల్‌ గట్టిగా పట్టుకుని ఉంది.

ఇప్పటివరకు వాళ్లను భయపెట్టింది ఆ వ్యక్తి.

ఇక నుంచి అతనికి తెలియకుండా అతని ప్రతి మాటకు సాక్షిగా నిలబడబోయేది కృష్ణ.

ఆ ప్రదేశంలో ఏర్పడిన నిశ్శబ్దం...

తుఫాను రాకముందు ఉండే నిశ్శబ్దంలా అనిపించింది.
Like Reply
కధ బ్రహ్మాండం గా ఉంది
Like Reply
Sooper ga raastunnaru.. oka chakkati thriller laga.
Plan matram artham kavatam ledu.
Like Reply
Super update
Like Reply
Nice update andi... Next em jarugitundi ane tension undi andi
Like Reply
Good, sex aakaraledu, chakkaga adventurous ga, romantic love ,faction,thriller ga continue cheyyandi
Like Reply
Excellent update
Like Reply
Super update
Like Reply
ఆ కొట్టం దగ్గరకు పుష్ప, వహీదా ఇద్దరూ చేరుకోగానే స్వీపర్ వాళ్లను లోపలకు రమ్మని చెప్పాడు. వాళ్లు లోపలికి వెళ్లిన తర్వాత స్వీపర్ వాళ్లిద్దరినీ చూస్తూ మాట్లాడటం మొదలుపెట్టాడు.

స్వీపర్: “చూడండి... మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, నాకు కావాల్సింది మీరు ఇచ్చేదాకా నేను మిమ్మల్ని వదలను. నాకు ఏదైనా కొంచెం కొంచెం కొరుక్కుతినడం అలవాటు. అందుకే మిమ్మల్ని అప్పుడప్పుడు పిలుస్తూ నాకు ఉన్న ఫాంటసీలను తీర్చుకుంటున్నాను.”

ఆ మాటలకు పుష్ప, వహీదా ఇద్దరూ భయపడిపోయారు. వెంటనే బ్లూటూత్‌లో కృష్ణ చెబుతున్నట్టుగానే స్వీపర్‌ను వేడుకోవడం మొదలుపెట్టారు.

పుష్ప, వహీదా: “దయచేసి మమ్మల్ని వదిలేయ్. మా ఫొటోలు, వీడియోలు డిలీట్ చేయ్. ఇక ఎప్పుడూ నీ దగ్గరకు రాము.”

వాళ్ల మాటలు పూర్తయ్యేలోపే స్వీపర్ అడ్డుపడి—

స్వీపర్: “మీరు ఎన్ని చేసినా, ఎన్ని చెప్పినా నాకు కావాల్సింది వచ్చేవరకు అస్సలు డిలీట్ చేయను.”

అంటూ వాళ్లను మరింత వేధించాడు.

బ్లూటూత్‌లో కృష్ణ వాళ్లిద్దరితో నెమ్మదిగా మాట్లాడుతూ—

కృష్ణ: “ఇంకా వాడిని రిక్వెస్ట్ చేస్తే ప్రయోజనం లేదు. ఫొటోలు బయటకు వస్తే మేము చనిపోవాల్సి వస్తుందని చెప్పండి. అయినా వాడు వినకపోతే... ఇక వాడికి అసలు ఏం కావాలో నేరుగా అడగండి.”

కృష్ణ చెప్పినట్టుగానే పుష్ప, వహీదా స్వీపర్‌ను చూస్తూ—

పుష్ప: “మా ఫొటోలు బయటకు వస్తే మా జీవితాలు నాశనం అవుతాయి. దయచేసి వాటిని బయటకు పంపించకు.”

వహీదా: “అవి బయటకు వస్తే మేము బతకలేం. నీకు ఏం కావాలో చెప్పు... కానీ మా ఫొటోలు, వీడియోలు మాత్రం డిలీట్ చేయ్.”

వాళ్ల మాటలు విన్న స్వీపర్ వెటకారంగా నవ్వాడు.

స్వీపర్: “చూడండి... నాకు ఇలాంటి బెదిరింపులు కొత్త కాదు. మీతో పాటు ఇంకా చాలామంది స్టూడెంట్స్‌తో పాటు ఇక్కడ పని చేసే ఫ్యాకల్టీ వాళ్ల ఫొటోలు, వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది నాకు కావాల్సింది ఇచ్చి వాళ్ల ఫొటోలు డిలీట్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు... మీ తర్వాత కూడా ఇంకా చాలా మంది ఉన్నారు.”

అతని మాటలు విన్న పుష్ప, వహీదా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఇక వీడిని ఎంత రిక్వెస్ట్ చేసినా ప్రయోజనం లేదని కృష్ణకు అర్థమైంది. కాసేపు ఆలోచించిన తర్వాత బ్లూటూత్‌లో వాళ్లతో మాట్లాడుతూ—

కృష్ణ: “ఇంకా వాడిని బ్రతిమిలాడకండి. వాడు మన భయాన్ని అడ్డం పెట్టుకుని ఆడుకుంటున్నాడు. ఇప్పుడు వాడికి అసలు ఏం కావాలో నేరుగా అడగండి. వాడు ఏం చెప్పబోతున్నాడో ముందు తెలుసుకుందాం.”

కృష్ణ మాటలు విన్న పుష్ప ధైర్యం తెచ్చుకుని స్వీపర్ వైపు చూసింది.

పుష్ప: “సరే... నీకు మా దగ్గర నుంచి ఏం కావాలో నేరుగా చెప్పు. మా ఫొటోలు, వీడియోలు డిలీట్ చేయడానికి మాతో ఏం చేయించుకోవాలనుకుంటున్నావు?”

వెంటనే వహీదా కూడా—

వహీదా: “అవును... నీకు ఏం కావాలో స్పష్టంగా చెప్పు.”

అని అడిగింది.

స్వీపర్ వాళ్లిద్దరినీ కాసేపు మౌనంగా చూస్తూ, పెదాలపై చిరునవ్వు తెచ్చుకున్నాడు.

స్వీపర్: “ఇన్నాళ్లకు అసలు విషయం అడిగారు... సరే. నాకు ఏం కావాలో చెబుతాను.”

అంటూ వాళ్లకు దగ్గరగా వచ్చాడు.

బ్లూటూత్‌లో కృష్ణ మాత్రం అతని మాటలను ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వింటూ ఉన్నాడు.

కృష్ణ మనసులో: “ఇప్పుడు వాడు ఏం అడగబోతున్నాడో తెలుసుకోవాలి... అదే మనకు దారి చూపిస్తుంది.”
Like Reply
Good update
Like Reply
Malla suspencea
Like Reply
Note:- దయచేసి కథకు తగ్గ ఫోటోలు పెట్టండి. మీకు నచ్చుతుంది కదా ఫొటోలు ఉంటే
Like Reply
(30-08-2026, 08:11 PM)రైలు222 Wrote: గమనిక:- దయచేసి కథకు తగ్గ ఫోటోలు పెట్టండి. మీకు నచ్చుతుంది కదా ఫొటోలు ఉంటే

Ee kadhaki photolu pedithe kadha padavutundi, sorry sir this is my personal opinion, different people have different opinions, I don't put my opinion on them plz
Like Reply
Nice update andi suspense lo peetaru
Like Reply




Users browsing this thread: ramukjar, 2 Guest(s)