Thread Rating:
  • 3 Vote(s) - 4.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అమ్మమ్మ కథలు - బామ్మ - వ్యాయామం పాఠం
#81
మాటల తోట
[Image: Picture1.png]
బామ్మ కథలు - 8
రచన: వసుంధర రాణి మునిపల్లె 


ఆ రోజు ఉదయం నీలిమ ఎంతో ఉత్సాహంగా ఉంది. తను అమెరికా నుండి వచ్చిన విశ్వకు చూపించాలని రంగురంగుల థర్మాకోల్ షీట్లతో ఒక అద్భుతమైన స్పేస్ స్టేషన్ మోడల్‌ను తయారు చేసింది. విశ్వ తన ఐప్యాడ్‌లో ఆ మోడల్ ఫోటోలు తీస్తుంటే, చింటూ ఆశ్చర్యంగా దాన్ని దగ్గరగా చూడటానికి వచ్చాడు. అక్కా ఇది నిజమైన అంతరిక్ష నౌకలాగే ఉంది, నేను ఒక్కసారి పట్టుకోనా అని చింటూ అడిగాడు. నీలిమ చూస్తుండగానే చింటూ దాన్ని అందుకోబోయాడు. కానీ సరిగ్గా అదే సమయంలో వాడి కాలు పక్కన ఉన్న వైరుకు తగిలి బ్యాలెన్స్ తప్పింది. వాడు పడిపోకుండా ఉండటానికి ఆ మోడల్‌ని గట్టిగా పట్టుకోబోయాడు, కానీ ఆ కంగారులో వాడి చేతులు తగిలి ఆ అందమైన ప్రాజెక్ట్ కాస్తా టేబుల్ మీద నుండి జారి కింద పడి ముక్కలైపోయింది.


నీలిమ కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. నువ్వు ఎప్పుడూ ఇంతే చింటూ, నీకు ఏదైనా పట్టుకోవడం తెలుసా అని గట్టిగా అరిచింది. అసలు నీకు బుద్ధి ఉందా, నువ్వు నా ప్రాజెక్టే కాదు నా సంతోషాన్ని కూడా పాడు చేస్తుంటావు, నువ్వు చాలా వరస్ట్ అని చాలా కఠినమైన మాటలతో చింటూను తిట్టేసింది. చింటూ కళ్లలో నీళ్లు తిరిగాయి. సారీ నీలిమక్కా నేను కావాలని చేయలేదు, చేయి జారిపోయింది అని చెప్పినా ఆమె వినలేదు. అంతటితో ఆగకుండా తను పక్కనే ఉన్న ఒక పెయింట్ డబ్బాను కూడా విసిరికొట్టింది. ఆ శబ్దానికి ఇంట్లో వాళ్లంతా కంగారుగా వచ్చారు. నీలిమ కోపం చూసి చింటూ ఏడుస్తూ తోటలోకి వెళ్ళిపోయాడు.


అది గమనించిన బామ్మ నీలిమను తన దగ్గరకు పిలిచింది. నీలిమా నీ ప్రాజెక్ట్ విరిగిపోయినందుకు నాకు బాధగానే ఉంది, కానీ నువ్వు అన్న మాటలు చింటూ మనసుని ఎంతలా గాయపరిచాయో తెలుసా అని అడిగింది. నీకు మన మాటల తోట గురించి తెలుసా అని బామ్మ తన కథను మొదలుపెట్టింది. నీలిమా మన అందరి మనసుల్లో ఒక అద్భుతమైన తోట ఉంటుంది. మనం ఎవరితోనైనా ప్రేమిస్తూ దయతో మాట్లాడితే మన తోటలో ఒక అందమైన పువ్వు విచ్చుకుంటుంది. కానీ మనం కోపంతో ఎవరినైనా గాయపరిస్తే మన మాటలు పదునైన విషపు ముళ్లుగా మారి ఆ తోటలో మొలుస్తాయి. ఆ మోడల్ చేయి జారి కింద పడింది అది ఒక ప్రమాదం, కానీ నువ్వు అన్న మాటలు కావాలని వదిలిన బాణాలు అని బామ్మ వివరించింది.


ఈ ముళ్లు ఎదుటివారిని మాత్రమే కాదు ఆ తోట యజమానివి అయిన నిన్ను కూడా గుచ్చుకుంటాయి, అందుకే నీకు ఇప్పుడు అంత అశాంతిగా భారంగా ఉంది అని బామ్మ చెప్పేసరికి నీలిమకు తన తప్పు అర్థమైంది. విశ్వ కూడా తన ఐప్యాడ్ పక్కన పెట్టి బామ్మ మాటలను శ్రద్ధగా విన్నాడు. విరిగిన మోడల్‌ని విశ్వ తన టెక్నాలజీతో మళ్ళీ సరిచేయగలడు, కానీ నువ్వు అన్న మాటలతో విరిగిన చింటూ మనసుని మాత్రం కేవలం నీ ప్రేమ మాత్రమే సరిచేయగలదు అని బామ్మ అన్న మాటలు నీలిమ మనసును కదిలించాయి.


నీలిమ వెంటనే తోటలోకి పరిగెత్తింది. చింటూ మామిడి చెట్టు కింద ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నాడు. నీలిమ మెల్లగా వాడి దగ్గరకు వెళ్లి, చింటూ నన్ను క్షమించురా, కోపంలో నిన్ను చాలా మాటలు అనేశాను, మనం ఇద్దరం కలిసి దాన్ని మళ్ళీ తయారు చేద్దాం అని ప్రేమగా అంది. చింటూ ముఖం ఒక్కసారిగా సంతోషంతో వెలిగిపోయింది. వాడు తన అక్కను హత్తుకున్నాడు. బామ్మ వరండా నుండి ఇది చూస్తూ నవ్వింది. నీలిమ మనసు అనే తోటలో ఇప్పుడు ఆ విషపు ముళ్లు మాయమైపోయి మళ్ళీ మల్లె పూలు విచ్చుకున్నట్లు ఆమెకు అనిపించింది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని, మన మాటలు ఇతరులకు ఆయుధాల్లా కాకుండా ఔషధాల్లా ఉండాలని పిల్లలు ఆ రోజు నేర్చుకున్నారు.
***
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#82
తెర వెనుక రాక్షసుడు
[Image: Picture1.png]
బామ్మ కథలు - 9
రచన: వసుంధర రాణి మునిపల్లె 

ఆ రోజు ఆదివారం కావడంతో విశ్వ, చింటూ, నీలిమ ముగ్గురూ హాల్‌లోనే ఉన్నారు. కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. విశ్వ తన ఐప్యాడ్‌లో కొత్త యుద్ధ విమానాల గేమ్ ఆడుతుంటే, చింటూ తన ఫోన్‌లో చిన్న చిన్న వీడియోలు చూస్తున్నాడు. నీలిమ తన ట్యాబ్‌లో డిజిటల్ పెయింటింగ్ వేస్తోంది. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది, కేవలం ఆ యంత్రాల నుండి వచ్చే శబ్దాలు తప్ప మనుషుల మాటలు వినిపించడం లేదు.


బయట ఒక్కసారిగా మబ్బులు పట్టి వర్షం మొదలైంది. గాలి వానకు ఉతికిన బట్టలన్నీ తడిసిపోతుంటే బామ్మ వంటగది నుండి, “పిల్లలూ, బయట వర్షం పడుతోంది. త్వరగా వెళ్లి బట్టలు తీయండి. లేకపోతే తడిసిపోతాయి” అని బిగ్గరగా అరిచింది. కానీ ఎవ్వరి దగ్గర నుండి సమాధానం రాలేదు. బామ్మ మళ్ళీ రెండు మూడు సార్లు పిలిచినా పిల్లలు పలకలేదు. ‘అసలు వీళ్ళు ముగ్గురూ ఏం చేస్తున్నారు’ అని బామ్మ గబగబా వసారాలోకి వచ్చింది. అక్కడ ముగ్గురూ ఎవరి లోకంలో వాళ్ళు మునిగిపోయి ఉండటం చూసి బామ్మ ఆశ్చర్యపోయింది.


పిల్లలూ! బయట వర్షం పడి ఆకాశంలో అందమైన ఇంద్రధనస్సు వచ్చింది చూడండి” అని పిలిచింది. 


విశ్వ తల కూడా పైకి ఎత్తకుండా నేను గూగుల్‌లో ఇంతకంటే మంచి ఇంద్రధనస్సు ఫోటోలు చూశాను బామ్మా” అని సమాధానం ఇచ్చాడు. 


చింటూ, నీలిమ కూడా తమ స్క్రీన్లకే అతుక్కుపోయారు. బామ్మ వారి పక్కన కూర్చుని మెల్లగా అంది, “పాపం మీ దగ్గర ఉన్న సమయాన్ని ఆ తెర వెనుక రాక్షసుడు దొంగిలిస్తున్నాడని మీకు తెలియడం లేదు. సమయం ఒక్కటే కాదు, మీ కంటి ఆరోగ్యాన్ని, అసలైన ఆనందాన్ని కూడా దొంగిలిస్తున్నాడు.”


ఆ తెర వెనుక రాక్షసుడు పేరు వినగానే పిల్లలు ఒక్కసారిగా తమ గ్యాడ్జెట్స్ పక్కన పెట్టి బామ్మ వైపు చూశారు. “ఎవరా రాక్షసుడు బామ్మా” అని అడిగాడు విశ్వ. 
బామ్మ తన కథను మొదలుపెట్టింది. 


పూర్వం ఒక మాయా లోకంలో ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడికి మనుషుల కళ్లలో ఉండే కాంతిని, వాళ్ల నవ్వుల్ని చూస్తే చాలా అసూయగా ఉండేది. అందుకే వాడు మనుషుల మధ్య మాయా అద్దాలను పెట్టాడు. మనుషులు ఆ అద్దాల్లో తమని తాము చూసుకుంటూ అందులో కనిపించే రంగుల లోకంలో మునిగిపోయేవారు. అలా వాళ్లు ఆ అద్దాల వైపు చూస్తున్న ప్రతి నిమిషం ఆ తెర వెనుక రాక్షసుడు వాళ్లకు తెలియకుండానే వాళ్ల జీవితంలోని సమయాన్ని దొంగిలించి ఒక పెద్ద చీకటి పెట్టెలో దాచేసేవాడు.
మనుషులు ఆ అద్దాలను చూస్తూ అలాగే ఉండిపోయేవారు. వాళ్ల పక్కన ఉన్న అమ్మ, నాన్న, స్నేహితులు పిలుస్తున్నా వాళ్లకు వినిపించేది కాదు. అలా సమయం గడిచేకొద్దీ వాళ్ల మధ్య ఉన్న ప్రేమ తగ్గిపోయి మనుషులు ఒకరికొకరు అపరిచితులుగా మారిపోయారు. ఆ రాక్షసుడు ఎంత సమయాన్ని దొంగిలిస్తే వాడు అంత బలవంతుడు అయ్యేవాడు. చివరికి ఆ రాజ్యంలో మనుషులు ఉన్నా మాటలు లేని ఒక నిశ్శబ్ద లోకంలా మారిపోయింది.”


విశ్వ తన ఐప్యాడ్ వైపు చూసి “బామ్మా! ఈ ఐప్యాడ్ కూడా ఆ మాయా అద్దం లాంటిదేనా” అని అడిగాడు. 


అవును విశ్వా” అని బామ్మ అంది. 


ఈ యంత్రాలు మన కళ్ళను కట్టిపడేసి మన చుట్టూ ఉన్న అందమైన లోకాన్ని, మన వాళ్లని దూరం చేస్తున్నాయి.
రాక్షసుడు దొంగిలించేది గడియారంలోని సమయం కాదు, మన జ్ఞాపకాల్లో ఉండాల్సిన సమయాన్ని. రేపు నువ్వు అమెరికా వెళ్లిపోయాక కూడా ఈ గేమ్ ఆడుకోవచ్చు, అప్పుడు అక్కడ ఆడుకుందామన్నా వీళ్లిద్దరూ నీ పక్కన ఉండరు. అప్పుడు నీకు నీ గేమ్ గుర్తుంటుంది కానీ నీ పక్కనే ఉన్న చింటూ, నీలిమలతో కలిసి నవ్వుతూ గడిపిన క్షణాలు మాత్రం గుర్తుండవు” అని బామ్మ వివరించింది. 


బామ్మ మాటలు వినగానే విశ్వకు తాను మనుషుల మధ్య ఉండి కూడా ఎంత ఒంటరిగా ఉన్నాడో అర్థమైంది. పిల్లలు ముగ్గురూ ఒక్కసారిగా తమ గ్యాడ్జెట్స్ పక్కన పడేశారు. విశ్వ గబగబా వెళ్లి వర్షంలో తడుస్తున్న బట్టలన్నీ తీసుకుని లోపలికి వచ్చాడు. ఆ రోజు వాళ్ళ జ్ఞాపకాల పెట్టెలో ఆ రాక్షసుడు దొంగిలించలేని ఎన్నో అందమైన క్షణాలు వచ్చి చేరాయి.


***
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#83
అనుభవం నేర్పిన పాఠం
[Image: Picture2.png]
రచన: వసుంధర రాణి మునిపల్లె 


అమెరికా నుంచి విశ్వా వెకేషన్‌కు రావడంతో చింటూ అల్లరి ఆకాశాన్ని తాకింది. విశ్వా తనతో తెచ్చిన మెరిసే చిప్స్ ప్యాకెట్లు, రంగురంగుల క్యాండీలను చూసి చింటూకి ఇంట్లో వంటలంటే అలుసైపోయింది.


ఒకరోజు మధ్యాహ్నం అమ్మ ఎంతో ప్రేమతో నీలిమ సాయంతో వంకాయ వేపుడు, ముద్దపప్పు, నెయ్యి, చారు వండి వడ్డించింది. కానీ చింటూ ప్లేటును పక్కకు తోసేస్తూ, "అక్కా! ఈ వంకాయ ఏంటి మెత్తగా ఉంది? విశ్వా వాళ్ల దేశంలో అన్నీ క్రంచీగా ఉంటాయట. నాకు బయట దొరికే ఆ ఎర్రటి మసాలా నూడుల్స్, పరోటాలు కావాలి, నేను ఇది తినను" అని మారాం చేశాడు.


విశ్వా కూడా చింటూని సపోర్ట్ చేస్తూ, "అవును నీలిమక్కా, ఇండియాలో వంటలు మరీ చప్పగా ఉన్నాయి" అన్నాడు. నీలిమ వాళ్లకు నచ్చజెప్పాలని చూసింది కానీ వాళ్లు వినలేదు. ఇది గమనించిన బామ్మ, "సరే పిల్లలు, ఈరోజు మీకు ఇష్టమైన బయట తిండి తిందురుగాని పదండి" అని వాళ్ళని తీసుకుని బజారుకు బయలుదేరింది.
అక్కడ ఒక హోటల్ ముందు వంటవాడు మైదా పిండిని సాగదీస్తూ పరోటాలు చేస్తుంటే, బామ్మ పిల్లలను ఆపి ఇలా అంది: "పిల్లలూ! ఈ మైదా పిండిని చూడండి. మా చిన్నతనంలో ఏదైనా పేపర్లను అంటించాలన్నా, వాల్ పోస్టర్లు వేయాలన్నా మైదా పిండిని ఉడకబెట్టి 'గమ్ము' (Gum) లాగా వాడేవాళ్ళం. అది దేన్నైనా గట్టిగా అతికించేస్తుంది."


"అప్పట్లో కేవలం పేపర్లను అతికించడానికి వాడిన ఆ గమ్ముని, ఇప్పుడు మీరు తింటున్నారు! ఆ మైదా పిండి మీ కడుపులోకి వెళ్లి లోపల పేగులకు కూడా అలాగే జిగురులా అతుక్కుపోతుంది. అందుకే అది అరగదు, మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అంతే కాకుండా, వాడిన నూనెనే మళ్ళీ మళ్ళీ వేడి చేసి వాడటం వల్ల క్యాన్సర్ కూడా వస్తుందట తెలుసా?" అని బామ్మ అంది.


అది విని చింటూ, "పో బామ్మా! నీకు అన్నీ అనుమానాలే. బయట తిన్నవాళ్ళందరికీ క్యాన్సర్ వచ్చి పోతున్నారా ఏంటి?" అంటూ బామ్మ మాటను కొట్టిపారేశాడు. చింటూ, విశ్వా ఇద్దరూ ఆ నూడుల్స్, పరోటాలు లాగించేశారు. "చూశావా అక్కా! నువ్వు తినకుండా చాలా మిస్ అవుతున్నావ్. ఎంత టేస్టీగా ఉన్నాయో ఈ నూడుల్స్. మనమ్మ చేసే వంకాయ కూర దీని ముందు వేస్ట్" అని నీలిమను వెక్కిరించారు.


కానీ అసలు సినిమా రాత్రి మొదలైంది. రాత్రి 11 గంటల సమయంలో చింటూ గట్టిగా ఏడుస్తూ లేచాడు. "అమ్మా.. కడుపులో ఎవరో సూదులతో పొడుస్తున్నట్టు ఉంది!" అని విలవిలలాడిపోయాడు. అటు విశ్వాకి కూడా విపరీతమైన వాంతులు మొదలయ్యాయి. ఆ మైదా 'గమ్ము' వాళ్ల చిన్న పొట్టల్లో అరగక నానా ఇబ్బంది పెడుతోంది.


బామ్మ వెంటనే వాళ్ళ దగ్గరకు వచ్చి పొట్ట మీద తైలం రాస్తూ, వేడివేడి వాము కషాయం తాగించింది. అప్పుడు అమ్మ తన చేత్తో చల్లని కమ్మని పెరుగు అన్నం, కొంచెం వాము పొడి కలిపి తెచ్చి ఇద్దరికీ గోరుముద్దలు తినిపించింది. ఆ ముద్ద నోట్లోకి వెళ్లగానే, కడుపులో ఉన్న మంట తగ్గి ఇద్దరికీ ఏదో తెలియని హాయి కలిగింది. ఆ క్షణంలో వాళ్లకు అర్థమైంది—ఏ హోటల్ తిండి కూడా అమ్మ ఇచ్చే ఈ తృప్తిని ఇవ్వలేదని.


చింటూ కళ్లలో నీళ్లు తిరిగాయి. "అమ్మ సారీ! నీ వంటకి ఎప్పుడూ వంకలు పెట్టాను. నీలిమక్క తినకుండా మంచి పని చేసింది. బామ్మ చెప్పినట్టు ఆ గమ్ము తిండి మనకి వద్దు. బయట మెరిసేదంతా రుచి కాదు, మన ఆరోగ్యాన్ని తినేసే రోగం అని ఈరోజు తెలిసొచ్చింది" అని అమ్మను హత్తుకున్నాడు. విశ్వా కూడా తన తప్పు తెలుసుకుని క్షమాపణ అడిగాడు.


చింటూ, విశ్వా ఇద్దరూ కలిసి ఇక మీదట అమ్మ వంటకి వంక పెట్టకుండా తింటామని, బయట తిండి జోలికి వెళ్లమని బామ్మకు, అమ్మకు ప్రామిస్ చేశారు. అప్పుడు బామ్మ నవ్వుతూ ఇలా అంది: "అమ్మ పిల్లల ఆరోగ్యం కోసం ఎంతో రుచిగా, శుచిగా వండుతుంది. బయట హోటల్ వాడు ఆదాయానికి ప్రాధాన్యత ఇస్తే.. అమ్మ మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తుంది."


పిల్లలు మారడం చూసి బామ్మ మనసులో.. "మనం ఎంత చెప్పినా అర్థం కానిది, ఒకసారి అనుభవంలోకి వస్తేనే బాగా అర్థమవుతుంది" అని అనుకుంది. ఆ రోజు నుంచి చింటూకి అమ్మ చేతి వంటే అమృతమైపోయింది.


***
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#84
బామ్మ - నమ్మకం విలువ
[Image: Picture2.png]
బామ్మ కథలు - 11
రచన: వసుంధర రాణి మునిపల్లె 

కాలేజ్ నుంచి రాగానే చింటూ ఎప్పుడూ లేనిది గబగబా గదిలోకి వెళ్లిపోయాడు. అది గమనించిన నీలిమ లోపలికి వెళ్లి చూసేసరికి, చింటూ తన బ్యాగ్ నుంచి ఒక వింతైన పెన్సిల్‌ తీసి రహస్యంగా చూసుకుంటున్నాడు. అది చాలా అందంగా ఉంది—దాని మీద రంగురంగుల మెరుపులు, పైన ఒక చిన్న తమాషా బొమ్మ ఉన్నాయి.


నీలిమ ఆశ్చర్యంగా, "చింటూ! ఈ పెన్సిల్ నీకెక్కడిది? అమ్మ నీకు కొనిచ్చిందా?" అని అడిగింది. 


చింటూ కంగారుగా దాన్ని వెనక్కి దాస్తూ, "రాహుల్ పెన్సిల్ అక్కా. అది నాకు చాలా నచ్చింది, అందుకే నా బ్యాగ్‌లో పెట్టేసుకున్నాను. వాడు చాలా పెన్సిల్స్ తెస్తాడులే, ఒకటి తీసుకుంటే ఏమవుతుంది?" అన్నాడు చాలా తేలికగా. వాడు తన తప్పును సమర్థించుకోవడం చూసి నీలిమ బామ్మకు ఈ విషయం చెప్పింది.


బామ్మ వెంటనే చింటూని దగ్గరకు పిలిచి, "చింటూ! ఒకరి వస్తువు వాళ్లకు తెలియకుండా తీసుకోవడం ఎంత తప్పో నీకు తెలుసా? అది చిన్న పెన్సిల్ అయినా సరే, నీది కానిది నీవు తీసుకోవడం అంటే అది 'దొంగతనం' కిందకే వస్తుంది" అని నెమ్మదిగా చెప్పింది. 


దానికి చింటూ విసుగ్గా, "పో బామ్మా! చిన్న పెన్సిల్‌కే దొంగతనం అంటావా? రాహుల్ దగ్గర ఇంకా చాలా ఉన్నాయి" అని ఎదురు సమాధానం చెప్పాడు.


అప్పుడు బామ్మ చింటూ కళ్లలోకి చూస్తూ ఇలా అడిగింది, "సరే చింటూ! నీకు ఒక విషయం చెప్తాను. నీకు అమ్మ రోజూ కాలేజ్‌కి ఎంతో ఇష్టమైన స్నాక్స్ బాక్స్ ఇస్తుంది కదా? ఒకరోజు నీకు బాగా ఆకలిగా ఉన్నప్పుడు, నీకు చెప్పకుండా నీ పక్క సీటు అబ్బాయి ఆ బాక్స్‌ని తీసుకుని మొత్తం తినేశాడు అనుకో. 'చింటూకి ఇంట్లో అమ్మ మళ్లీ చేసి పెడుతుంది కదా, ఇక్కడ నేను తింటే ఏమవుతుంది' అని వాడు అనుకుంటే నీకు ఎలా ఉంటుంది?"


చింటూ ముఖం వెంటనే మారిపోయింది. "అదేం బాగుంటుంది బామ్మా? నా బాక్స్‌లో నాకిష్టమైన కేక్ ముక్కలు ఉంటాయి. ఆకలిగా ఉన్నప్పుడు వాడు నా పర్మిషన్ లేకుండా అలా తీసుకుంటే నాకు ఏడుపొస్తుంది, వాడి మీద చాలా కోపం వస్తుంది" అన్నాడు దిగులుగా.


అప్పుడు బామ్మ బుజ్జగిస్తూ అసలు విషయం చెప్పింది, "రాహుల్‌కు నువ్వంటే నమ్మకం ఉంది కాబట్టే తన పెన్సిల్స్ అన్నీ నీకు చూపించాడు. కానీ నువ్వు ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నావు. నమ్మకం అనేది గాజు గ్లాసు లాంటిది చింటూ, ఒక్కసారి విరిగిపోతే మళ్లీ అతుక్కోదు. రేపు కాలేజ్లో ఇంకెవరిది ఏ చిన్న వస్తువు పోయినా, అందరూ 'చింటూనే తీసుంటాడు' అని నీ వైపు వేలు చూపిస్తారు. అప్పుడు నీ ఫ్రెండ్స్ ఎవరూ నిన్ను నమ్మరు, నీతో ఆడుకోవడానికి కూడా రారు. అది నీకు ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు."


బామ్మ చెప్పిన మాటలకు చింటూ కళ్లలో నీళ్లు తిరిగాయి. వాడు ఏడుస్తూ, "సారీ బామ్మా! ఆ పెన్సిల్ బాగుందని తీసుకున్నాను. కానీ వాడు నన్ను మంచి ఫ్రెండ్ అనుకుని అన్ని చూపించాడు కదా! ఇప్పుడు వాడు నా మీద కోపం తెచ్చుకుని నాతో ఆడుకోడేమో అని భయంగా ఉంది. నేను ఇప్పుడే వెళ్లి వాడికి ఇది ఇచ్చేస్తాను" అని చెప్పాడు.


బామ్మ చిరునవ్వుతో, "చాలా మంచి పని చింటూ. మనది కాని వస్తువు మీద ఆశ పడటం వల్ల వచ్చే సంతోషం కంటే, మన మీద అందరికీ ఉండే నమ్మకం వల్ల వచ్చే గౌరవం చాలా గొప్పది" అని మెచ్చుకుంది. చింటూ వెంటనే వెళ్లి రాహుల్‌కు పెన్సిల్ ఇచ్చి క్షమాపణ చెప్పాడు. తప్పును వెంటనే సరిదిద్దుకుని మళ్లీ నమ్మకాన్ని కాపాడుకున్నందుకు చింటూ మనసు చాలా తేలికపడింది.


అప్పుడే చింటూకు ఒక గొప్ప విషయం అర్థమైంది—వస్తువుల కంటే మనుషులు మన మీద పెట్టుకున్న నమ్మకమే చాలా విలువైనదని, ఆ నమ్మకాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకూడదని.


సమాప్తం. 
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#85
బామ్మ - నీటి పాఠం
[Image: Picture2.png]
బామ్మ కథలు - 12 బామ్మ - నీటి (నీతి) పాఠం 
రచన: వసుంధర రాణి మునిపల్లె 


శనివారం ఉదయం సూర్యుడు అప్పుడప్పుడే వస్తున్నాడు. చింటూ తన టైమ్ టేబుల్ చూసుకుని, ఈరోజు నా తోటకి నేనే రాజుని అనుకుంటూ గర్వంగా తోటలోకి వెళ్ళాడు. గబగబా వాటర్ పైపు తీసి ట్యాప్ ఫుల్లుగా తిప్పేశాడు. మొదట మొక్కలకి నీళ్లు పోస్తున్నా, వాడి దృష్టి అంతా పక్కనే ఉన్న గోడ మీద ఎగురుతున్న కాకి మీద పడింది.


పైపుని కాకి వైపు తిప్పి షూ.. షూ.. అంటూ నీళ్లతో దాన్ని కొట్టడం మొదలుపెట్టాడు. సరిగ్గా అదే సమయంలో నీలిమ కాలేజ్ యూనిఫామ్ వేసుకుని, బ్యాగ్ తగిలించుకుని అటుగా వస్తోంది. అల్లరి మూడ్ లో ఉన్న చింటూ, పైపుని అటువైపు తిప్పి నీలిమను కూడా తడిపేశాడు. నీలిమ ఒక్కసారిగా కేక వేస్తూ, చింటూ! ఏం చేస్తున్నావు? నేను కాలేజ్ కి వెళ్తున్నాను కదా, నా యూనిఫామ్ అంతా తడిచిపోయింది అని ఏడుపు మొహం పెట్టి అరిచింది. చింటూ మాత్రం నవ్వుతూ, అదిగో వాన వస్తోంది అక్కా! తడుచుకో అని ఇంకా పైపుతో నీళ్లు చిమ్మడం మొదలుపెట్టాడు. వాడు చేస్తున్న అల్లరికి తోటంతా బురదగా మారిపోయింది.


మొక్కల మొదళ్లలో నీళ్లు ఎక్కువైపోయి అవి భారంగా తలలు వాల్చేశాయి. వాడు మాత్రం హమ్మయ్య! వాన వస్తోంది అంటూ నీళ్లను వృధాగా గాలిలోకి కొడుతున్నాడు.
అంతలో బామ్మ అక్కడికి వచ్చి నిశ్శబ్దంగా ట్యాప్ కట్టేసింది. చింటూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి, అయ్యో బామ్మా! ఇంకా చాలా చోట్ల తడవలేదు, అప్పుడే ఎందుకు ఆపేశావు? అని అడిగాడు.


అప్పుడు బామ్మ తన చేతిలో ఉన్న ఒక ఖాళీ గ్లాసుని చింటూకి చూపిస్తూ ఇలా అంది, "చింటూ, ఈ ఖాళీ గ్లాసుని చూడు. నీకు దాహం వేసినప్పుడు ఈ గ్లాసుడు నీళ్లు ఇస్తే నీ ప్రాణం ఎంత లేచి వస్తుంది? కానీ, నువ్వు ఇందాక పైపుతో వృధా చేసిన నీళ్లతో ఇలాంటి వందల గ్లాసులను నింపొచ్చు. అంటే, నువ్వు వందల మంది దాహాన్ని వృధాగా కాలువలో పారబోశావు అన్నమాట! పైగా నీ అల్లరి వల్ల నీలిమ కాలేజ్ కి వెళ్లే టైమ్ లో ఇబ్బంది పడింది చూశావా?"


ఆ మాట వినగానే చింటూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. వాడు అల్లరిగా చేసిన పని వల్ల ఇంత నష్టం జరుగుతుందని వాడు అస్సలు అనుకోలేదు.


బామ్మ కొనసాగిస్తూ, "అంతే కాదు చింటూ! నీకు బాగా ఆకలిగా ఉన్నప్పుడు అమ్మ అన్నం పెడుతుంది కదా? ఒకవేళ నువ్వు వద్దంటున్నా నీ నోట్లో బలవంతంగా ముద్దలు పెడుతూనే ఉంటే నీకు ఎలా ఉంటుంది?" అని అడిగింది.


చింటూ ముఖం ముడుచుకుని, "అబ్బా! ఊపిరి ఆడదు బామ్మా, వాంతి వచ్చినట్టు ఉంటుంది" అన్నాడు.


"ఇప్పుడు ఈ మొక్కల పరిస్థితి కూడా అదే చింటూ! వాటికి కావాల్సింది ఒక గ్లాసుడు నీరైతే, నువ్వు పైపుతో ముంచెత్తుతున్నావు. ఆ చిన్న చిన్న మొక్కలు ఊపిరి ఆడక విలవిల్లాడుతున్నాయి. అవి నోరు తెరిచి చెప్పలేవు కానీ, వాటికి ఎంత కావాలో అంతకంటే ఎక్కువ నీరు పోస్తే అవి కుళ్ళిపోయి చనిపోతాయి.


ట్యాప్ లోకి నీళ్లు రావడానికి భూమి తన గర్భంలో ఎంతో నీటిని దాచుకోవాలి. మనం ఇలా వృధా చేస్తే, రేపు మనకు తాగడానికి చుక్క నీరు దొరకదు. అప్పుడు మనం అందరం ఎడారిలో ఉన్నట్టు ఉండాలి. నీకు అది ఇష్టమేనా?" అని గంభీరంగా అడిగింది.


ఎడారి మాట వినగానే చింటూకి భయం వేసింది. "వద్దు బామ్మా! నీళ్లు లేకపోతే నేను అస్సలు ఉండలేను. కానీ పైపుతో పోస్తేనే కదా ఫాస్ట్ గా అయిపోతుంది?" అని అడిగాడు.


అప్పుడు బామ్మ వాడికి ఒక చిన్న సవాల్ విసిరింది. "మనం ఒక పని చేద్దాం. ఈ పైపు పక్కన పెట్టి, ఈ చిన్న మగ్గుతో నీళ్లు పోయి. అప్పుడు ఏ మొక్కకి ఎంత కావాలో నీకే అర్థమవుతుంది. దాంతో నీరు ఆదా అవుతుంది, మొక్కలకి హాయిగా ఉంటుంది" అని చెప్పింది.


చింటూ సవాల్ ని స్వీకరించి మగ్గుతో నీళ్లు పోయడం మొదలుపెట్టాడు.


నీలిమ దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పాడు. తర్వాత ప్రతి మొక్క మొదట్లో కొంచెం నీరు పోస్తుంటే, ఆ మట్టి నుంచి వచ్చే ఆ మట్టి వాసన వాడికి ఎంతో హాయిని ఇచ్చింది. నీటిని పొదుపుగా వాడుతూ ప్రతి మొక్కను తాకుతుంటే, ఆ మొక్కలు తనతో మాట్లాడుతున్నట్టు చింటూకి అనిపించింది.


నీరు జీవనాధారం. ప్రకృతి మనకిచ్చిన ఈ గొప్ప సంపదను రేపటి తరం కోసం దాచి ఉంచడమే మన బాధ్యత.


సమాప్తం. 
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
#86
బామ్మ - వ్యాయామం పాఠం
[Image: Picture2.png]
బామ్మ కథలు - 13  
రచన: వసుంధర రాణి మునిపల్లె 


ఆదివారం ఉదయం కావడంతో చింటూ దుప్పటి ముసుగేసి గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. సెలవు రోజు కదా, హాయిగా పది గంటల వరకు పడుకోవచ్చని వాడి ప్లాన్. కానీ వాడి షెడ్యూల్ ప్రకారం ఈరోజు వ్యాయామం చేయాల్సిన రోజు. బామ్మ మెల్లగా గదిలోకి వచ్చి కిటికీ రెక్కలు తెరిచింది. సూర్యరశ్మి మొహం మీద పడటంతో చింటూ చిరాగ్గా ముఖం చాటేసుకున్నాడు.


"చింటూ! లేవమ్మా, ఆదివారం సూర్యభగవానుడి రోజు. ఈరోజు సూర్యుడు చాలా శక్తివంతంగా ఉంటాడు" అని బామ్మ పిలిచింది. 


చింటూ బద్ధకంగా మొహం పెట్టి, "అబ్బా బామ్మా! ఈ ఒక్కరోజే కదా సెలవు, నన్ను పడుకోనివ్వు. వ్యాయామం చేస్తే ఏమొస్తుంది? ఒళ్లంతా నొప్పులు పుడతాయి తప్ప" అని విసుక్కున్నాడు.


బామ్మ నవ్వి, వాడి మంచం మీద కూర్చుని ఇలా అంది, "సరే చింటూ! నువ్వు లేవక్కర్లేదు కానీ, నేను అడిగే ఒక చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పు. మన ఇంట్లో నా పాత సైకిల్ ఒకటి స్టోర్ రూమ్‌లో ఉంది కదా, అది ఇప్పుడు తొక్కడానికి వస్తుందా?" అని అడిగింది. 


చింటూ ఒక్కసారిగా లేచి కూర్చుని, "రాదు బామ్మా! దానికి తుప్పు పట్టేసింది, చైన్ కూడా తిరగదు. దాన్ని ఎవరూ వాడటం లేదు కదా, అందుకే అది పాడైపోయింది" అన్నాడు.


అప్పుడు బామ్మ చింటూ వైపు అర్థవంతంగా చూస్తూ, "మన శరీరం కూడా ఆ సైకిల్ లాంటిదే చింటూ! మనం దాన్ని సరిగ్గా వాడుకోకపోతే, మన కండరాలు కూడా ఆ సైకిల్ చైన్ లాగా బిగుసుకుపోయి తుప్పు పట్టేస్తాయి. యంత్రంలాగే మన శరీరం కూడా కదలిక లేకపోతే మొద్దుబారిపోతుంది. ముఖ్యంగా ఈరోజు ఆదివారం. సూర్యరశ్మి మన శరీరం మీద పడటం చాలా ముఖ్యం. పొద్దున్నే వచ్చే లేత ఎండలో విటమిన్-డి పుష్కలంగా ఉంటుంది. అది మన ఎముకలను గట్టిపరుస్తుంది. ఈరోజు సూర్యుడు చాలా పవర్ ఫుల్ గా ఉంటాడు. అటువంటి శక్తిని మనం వ్యాయామం ద్వారా మన శరీరంలోకి తీసుకోవాలి" అని వివరించింది.


చింటూ ఇంకా అయోమయంగా చూస్తూ, "కానీ బామ్మా! నేను కాలేజ్లో ఆటలు ఆడుకుంటాను కదా? మళ్ళీ ఇంట్లో ఈ వ్యాయామం ఎందుకు?" అని అడిగాడు.


బామ్మ వాడికి ఇంకా వివరంగా చెప్పడం మొదలుపెట్టింది, "ఆటలు ఆడటం వేరు, వ్యాయామం చేయడం వేరు చింటూ. వ్యాయామం వల్ల మన గుండె గట్టిపడుతుంది, రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నువ్వు రోజూ వ్యాయామం చేస్తే నీ మెదడుకు ఆక్సిజన్ బాగా అందుతుంది. దానివల్ల నీ జ్ఞాపకశక్తి పెరుగుతుంది, చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది. రోజంతా నువ్వు అలసిపోకుండా ఉత్సాహంగా ఉండాలంటే ఈ సూర్యరశ్మిలో చేసే వ్యాయామం ఒక టానిక్ లా పని చేస్తుంది" అని చెప్పింది.


బామ్మ చెప్పిన సైకిల్ ఉదాహరణ, సూర్యుడి నుంచి వచ్చే విటమిన్-డి గురించి విన్నాక చింటూకి ఉత్సాహం వచ్చింది. వాడు వెంటనే బద్ధకాన్ని వదిలించి మంచం దిగాడు. "బామ్మా! అయితే నేను కూడా సూర్య భగవానుడిలా పవర్ ఫుల్ గా తయారవ్వాలి" అని చెబుతూ వెంటనే ముఖం కడుక్కుని వచ్చాడు. తోటలోకి వెళ్లి బామ్మ నేర్పించిన సూర్య నమస్కారాలను ఎంతో శ్రద్ధగా చేయడం మొదలుపెట్టాడు. బామ్మ చెబుతున్న మంత్రాలను వింటూ, ప్రతి భంగిమను ఎంతో ఏకాగ్రతతో చేస్తూ సూర్యుడి శక్తిని తనలో నింపుకున్నాడు.


కాసేపటికే వాడి ముఖంలో ఒక వింతైన కాంతి, ఒంట్లో ఏదో తెలియని హుషారు వచ్చాయి. వ్యాయామం అంటే కేవలం కండరాలు పెంచడం కాదు, సూర్యుడి శక్తిని మన శరీరంలోకి నింపుకోవడం అని చింటూ ఆ రోజు తెలుసుకున్నాడు.


సమాప్తం. 
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply




Users browsing this thread: 1 Guest(s)