Thread Rating:
  • 3 Vote(s) - 4.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేను చదివిన కథలు - ప్రశ్న
నెత్తి మీద నీటి కుండ చిల్లు పడ్డట్టు, ఉబికిన కన్నీటిని అదుపు చేసుకుంటూ సుశీల హాల్ నుండి బెడ్ రూమ్ వైపు నడక అనే పరుగు పెట్టింది. వెనువెంటనే కాంతామణి “వదినా, ఎందుకు బాధ పడతారు. మనం వేరే చూద్దాం” అంటూ ఓదారుస్తూ వెంబడించింది. 



బెడ్రూమ్లో కూర్చున్న తండ్రీ కూతుళ్ళిద్దరూ వీరి హఠాత్ ఆగమనంతో లేచి, “ఏమైంది? ఎందుకని ఏడుస్తున్నారు?” 



కాంతమణి “మా వదిన ఎన్నో ఆశల పెట్టుకుంది, మీతో వియ్యం ఖాయం చేసుకోవాలని, కానీ మీ వాళ్ళు ముందుకు సాగనివ్వడం లేదు” దుఃఖ ధ్వని పరిమాణం పెరిగింది. 



ప్రకాశరావు తట్టుకోలేక “మీరు ఏడిస్తే సమస్య పూడ్చుకోదు. ముందుగానే మేము మా స్థితి విన్నవించాము. పైగా కట్నం మా మనోభావాలకు విరుద్దం. మా కోడలు నుండి పైసా ఆశించలేదు. ఇప్పుడు నా ఇల్లు స్వర్గసీమ! నా బిడ్డను కూడా అలాగే చూడాలని కోరిక.”



కొన్ని క్షణాలనంతరం ఎక్కిళ్ళ ఏడుపు ఆగింది. “మీరు పెద్ద మనసున్న వారు, ఇంత చల్లగా మాట్లాడుతూ వుంటే ఇంకా వినాలని వుంది. నా మాట, ఒక్కటి కాదనకండి..”



“చెప్పండి,” సుశీల బదులు కాంతామణి జవాబు ఇచ్చింది. “మా వదిన పేరుకు తగ్గట్టు సౌశీల్యవతి! మా వారు అదే బయట కూర్చున్న గంగారామ్ గారికి అన్నీ ‘ఎస్’ అనే సమాధానాలు కావాలి. కనుక దయచేసి వారి ముందు మాత్రం కట్నం ఇస్తామని ఒప్పుకోండి ప్లీజ్ అంతే!”



“అష్టలక్ష్మీ అయిన కోడల్ని ధనంతో తూచలేము. నాకెందుకండీ మీ డబ్బు! పైగా హైదరాబాద్లో గవర్నమెంట్ జాబ్. కళ్లకద్దుకుని కన్యాదానం స్వీకరిస్తాం!” సుశీల గ్యారెంటీ ఇచ్చింది. 



ఉద్దేశ్యం నిర్ధారణ అయితే దేవేంద్ర భవనం కూడా దెయ్యాల కొంపె! ఆడపెళ్ళి వారిని తప్పు పట్టే ఆనవాయితీ! “ఎలా వేగుతావమ్మా ఈ నస-బుస అత్తతో” అన్న అనుమానంతో సాగనంపారు. గవర్నమెంట్ జాబ్ అంటే కామధేనువు అని హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు.



***
 
“హలో మయూరి.. చీకటి పడుతున్నది, ఇంకా రాలేదేమిటి?”



“నేను మా పుట్టింటికి వెళుతున్నాను. ఇంకో ఐదు నిమిషాల్లో బస్సు కదులుతుంది.”



“ఆ.. అదేంటి అంత సడన్ డిసిషన్! కొంచెం ముందుగా చెబితే నేనూ వచ్చేవాడిని. ఏమైంది, నీ ఆరోగ్యం ఓకే కదా?”



“ఐయం ఫైన్. ‘ఇన్నాళ్ళూ ఓపిక పట్టాను. మీ ఇంటికి పోయి.., నీ ఇష్టమని’ నువ్వేగా అన్నావు, అందుకే ఇష్టంగా వెళ్లి, యిష్టం ఉన్నప్పుడు వస్తాను.”



“అరే! మన మధ్య ఎన్నో అనుకుంటాం, అన్నిటినీ సిరీయస్ తీసుకుంటే కాపురం చేయగలమా!? ప్లీజ్, బస్ దిగేసి వెయిట్ చేయి, వితిన్ నో టైమ్ వస్తాను.”



“బస్ కదిలింది. బై!” మయూరికి కోపం వచ్చిందంటే కోటలు దాటుతుంది. కృపాకర్ ఆలోచనల్లో అల్లుకు పోయాడు. ఇద్దరి మధ్య అరమరికలు, ఆర్థిక యిబ్బందుల్లేవు; మన్మధ సామ్రాజ్యంలో ఎవరికి వారే సాటి. అన్ని విధాల దైవమిచ్చిన, తామెచ్చిన నెచ్చెలిని అప్పుడప్పుడు కట్నం ముల్లుకర్రతో గుచ్చడం ఔన్నత్య శూన్యత నిదర్శనం. 



అమ్మకు డబ్బు ఆశ ఉండవచ్చు, ఉన్నపళాన నేనెందుకు స్పందించాలి! ఉన్న దాంట్లో తృప్తిగా కాలం గడపక. మా ఇద్దరి మధ్య పెట్రోలు పోసి, నేనెందుకు అగ్గితో తలకొరివి పెట్టుకోవాలి! 



అమ్మ ధన్ధాహంతో కర్ణభేరిని తూట్లు పొడిచే మాటలను విన్న నేను మరో చెవి నుంచి ఉద్వాసన చెప్పక, నా బుర్రలో బూజు పట్టించు కోవడం అవసరమా?



అమ్మ ఆజ్ఞ ఇవ్వగానే శిరసావహించడం అలవాటై మయూరిని ఇరుకున పెట్టానే గాని, అన్యథా కాదు. అంటే ఒకర్ని సంతోషపెట్టడం కోసం మరొకరిని బాధ పెట్టె తత్త్వమా నాది. ఛీ.. ఇది పద్ధతి కాదు. రాబోవు రోజుల్లో నేను ‘హెడ్ ఆఫ్ ది ఫ్యామిలి’.. ఇప్పుడు లేని ఆదర్శం అప్పుడేలా అబ్బుతుంది. 



నొప్పించక తానొవ్వక ఎక్కడ టాపిక్ అక్కడ మేనేజ్ చేయాలి. ప్రైవేటు కంపెనీ మేనేజర్ పోస్ట్ అనగానే మురిసిపోయాను. మేనేజ్ చేయడమంటే మురిపం కాదు, మెదడుకు పని, మెలకువగా మెరవాలి. నా సహజీవన సమవుజ్జీ విశ్వాసాన్ని గెలవాలి. 



ముసిరిన ఆలోచనలతో నిద్ర రాక తల భారంగా ఉంది. టైమ్ మూడు కావస్తోంది. ఆన్లైన్లో వైజాగ్ బస్సుల్లో స్లీపర్ లేవు అన్నీ సిటింగ్! అదే సిటింగ్ ఇంకొంచెం విలాసవంతంగా వెళ్లొచ్చు, నా కోసం నేను సుఖపడాలి! సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి వందేభారత్ ట్రైన్ మధ్యాహ్నం వుంది, లేని హుషారు కదం తొక్కింది.



వేడినీళ్లకు అలవాటు పడ్డ శరీరాన్ని చన్నీళ్లతో ముఖం కడుక్కొని, ఎప్పుడూ చేసే వ్యాయామం కానిచ్చి, ఇల్లంతా శుభ్రం పర్చి, షవర్ స్నానం తర్వాత బాలభానుడుకి మొక్కుకున్నాడు. విరిసిన పూలతో సోమశేఖరుని అలంకరించి దీపం వెలిగించాడు. ఇది వరకటి సోమరితనం ఏమైంది? ఇవన్నీ మయూరి చేసేది. అందుకే అన్ని పనుల్లో శక్తివంతంగా ఉండేది.
 
హుషారుగా ఆఫీసుకెళ్ళి జరిగిన పనుల్లో తప్పులు ఎత్తి చూపలేదు, జరగని పనుల్లో చిరాకు పడలేదు. చిరునవ్వుతో బుజం మీద చేయి వేస్తూ, బుజం తట్టి సరి చేస్తున్నాడు. నాణ్యత సరితూగే హామీలకు షేక్ హ్యాండ్ యిస్తూ మెచ్చుకున్నాడు. కృపాకర్ సమైక్యతకు స్టాఫ్ ఆనందాశ్చర్యులయ్యారు. 



***
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
“మయూరి ఏదైనా గుడ్ న్యూస్?”



“లేదు వదినా, మిమ్మల్ని చూడాలని వచ్చాను. నేను రావడమే గుడ్ న్యూస్.”



“అవుననుకో, కనీసం ఫోన్ కూడా చేయక వస్తే..”



“నువ్వు గుడ్ న్యూస్ దాచిపెట్టి, నన్ను అడుగుతున్నావు? ఎనీ వేస్ కంగ్రాట్స్!”



“థాంక్స్, నేనే చెబుదామనుకున్నా, మీ అన్నయ్య చెప్పేశాడు.”



“మా మధ్య నో సీక్రెట్స్!” నవ్వుతూ వాగ్దేవిని హత్తుకుంది. నాన్నను పలకరించడానికి వెళ్ళింది. టాబ్లెట్స్ మహిమ కాబోలు మంచి నిద్రలో ఉన్నారు. 



రీడింగ్ టేబుల్ పైన అటుఇటుగా వున్న మాగజైన్స్ సర్దింది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అని చెప్పలేక ‘నో సీక్రెట్స్’ అని వదినతో అబద్ధం చెప్పింది. సంతోషం అందరికి పంచాలి, దుఃఖం మాత్రం అమ్మనాన్నలతో; కానీ నాన్న ఆరోగ్యం అంతంత మాత్రం. అత్తారింట్లో కట్నం పిశాచని ఎలా చెప్పను?



‘మీ పేరెంట్స్ తో ముఖాముఖి మాట్లాడాలి’ అని వచ్చాను కానీ ఇక్కడ ఇంట్లో అందర్ని సమావేశ పర్చాలి. ఈ ఆవేశపూరితమైన సీన్ ఆందోళన కలిగిస్తుంది. 



నిస్సత్తువ ప్రవాహంలా ముంచేస్తున్న నీరసం, వదిన ఇచ్చిన కాఫీ వల్ల రిలాక్స్ అయింది. నాదే తప్పు, ఆనాడే కొంచెం కఠినంగా ఉండి, ఈ పెళ్లి కాన్సిల్ చేస్తే బాగుండేది. ప్రకాశరావు నిదుర లేచి మయూరిని చూసి చాలా ఆనంద పడ్డారు. 



నా పట్ల సుహృద్భావంతో వున్న వీరిని క్లేశ పర్చటం న్యాయం కాదు. సమయం చూసి వరుణన్నతో చెప్పి, నాన్నకు తెలియకుండా జాగ్రత్త తీసుకోవాలి. నాన్న మెల్లిగా గోడవారగా వున్న ఈజీ చైర్ లో కూర్చున్నారు. మనసులోని మాట నవ్వుతున్న అమ్మ ఫోటోతో చెప్పుకుంది. మానసిక ఒంటరి జీవితం దుర్భరం! 



కృప మంచివాడు అని సద్దుకున్నా, ఇంటి నుంచి ఫోన్ రాగానే మారిపోతాడు. మళ్లీ మామూలు స్థితికి రావడానికి టైం పడుతుంది. ప్రతిసారి ఇదే గోల. కుదురుగా ఉండలేమా? వేయి ప్రశ్నలు, లక్ష అనుమానాలు! 



స్నానం చేసి, “వదినా ఈ రోజు నేనే వంట చేస్తాను. నేనున్నన్ని రోజులు నీకు రెస్ట్.”
“నేను నీకో విషయం చెప్పాలి.. ఏమీ అనుకోవద్దు.”
“మన మధ్యలో అనుకోవడల్లేవు వదినా..”
“నాకు ఈ మధ్య కొంచెం నలతగా, వికారంగా ఉంటుంది. కొన్ని రోజులు ఇక్కడే వుండగలవా?”
“నువ్వింత ప్రాధేయ పడుతూ అడగలా, ఉంటాను.”
“పుట్టింటికి వెళ్తానంటే మీ అన్నయ్య ఒప్పుకోవడం లేదు.” 
“ఎందుకు ఒప్పుకోవడం లేదో, కూడా చెప్పాలి..” వరుణ్ కల్పించుకున్నాడు. 
“మరేం లేదు, అమ్మకు ఈ మధ్య ఆరోగ్యం బాగా లేదు.” 
“అవునా, ఏమైంది?” 
“చూపు తగ్గింది; కాళ్ళ వాపులు. కూర్చుంటే నిలవడం కష్టం, నిలుచుంటే కూర్చోవడం కష్టం. మనిషిని పెట్టుకొని కాలం గడుపుతుంది. అమ్మకు భారం కావద్దని ఇక్కడ ఉందామనుకున్నా.”
“వదినా, నాకు సంజాయిషీ ఎందుకు, నేను వుంటాను.”
“అదే.. మరి నీ ఆఫీస్?” 
“సెలవు పెడతా..”
“ఒకమాట బావగారితో చెప్తే బావుంటుందేమో..” వరుణ్ సందేహం.
“చెప్తాను.. అయినా నేను తీసుకున్న నిర్ణయాన్ని కృప కాదనడు. ఇట్స్ ఓకే.”
“నిన్ను ఎలా అడగాలో, నీ నుండి మాకు కావాల్సిన జవాబు వస్తుందో, రాదో అని మేమిద్దర చాలా తికమక పడ్డాము. థాంక్స్” వాగ్దేవి మాటల్లోనే కాదు కళ్ళల్లో కృతజ్ఞత. 
***



“మాట మాత్రం చెప్పక సడన్గా.. యిలా వచ్చావేం కృపా?” 



“మయూరి తోడుగా వచ్చాను. తను అటు వెళ్ళింది, నేనిటు..”



“ఇద్దరూ కలిసి వచ్చి, ఇక్కడ విడిపోవటం ఏమిటీ?” పురుషోత్తమరావు నచ్చని మాట అనేశారు. 



“నాకు మిమ్మల్ని చూడాలని ఆతృత, మయూరికి వాళ్ళ వాళ్ళని .. అంతే.”



“సరే, ఫ్రెష్ ఐయి, టిఫిన్ తిను.” తల్లికి కొడుకు ఆకలి ముందుగా కనిపిస్తుంది. ఆ తర్వాతే అన్నీ. టిఫిన్ చేసి, మయూరితో ఫోన్లో మాట్లాడాలని “ఇక్కడ ఫోన్ డిస్టర్బన్స్ చాలా ఉంది” వరండాలోకి వెళ్ళాడు. 



వెనువెంటనే సుశీల కూడా వచ్చింది. “కలిసే వచ్చారు, అప్పుడే ఫోన్లు; మనకు రావలసిన డబ్బులు ఏమైనా వచ్చే దారి దొరికిందా?” సహనానికి సున్నా చుట్టింది. 
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
 
ప్రేమగా బుజాలు పట్టుకొని “అమ్మా, మయూరి వాళ్ళు కట్నం వద్దన్న పెళ్లి సంబంధాలకే ప్రాధాన్యత ఇచ్చారు. ‘అంపకం మాట్రిమోనియల్’ వాళ్ళు ఆదర్శవంతమైన వివాహం చేసుకున్నామని ఇద్దరి మేరేజ్ ఫోటో జత చేస్తూ రెండు వాక్యాల్లో ఒపీనియన్ అడిగారు. ఆ వివరాలన్నీ ఇచ్చామనుకో. ‘బెస్ట్ కపుల్’ అని ప్రశంసాపత్రం కూడా ఇచ్చారు. నీకు డబ్బులు కావాలంటే నేను ఏదైనా లోన్ తీసుకొని ఇస్తాను.”

“అవునా, కంగ్రాచులేషన్స్! లోన్లు-డైమండ్లు వద్దు. పద నాన్నతో చెప్తాలి,” ఉత్సాహంగా అన్నది. 

శ్రీమతి ఫోన్ ముచ్చట్లు తృప్తి తీరలేదు. ప్రత్యక్ష ఏకాంతం కోసం సాయంత్రానికల్లా ముందున్నాడు. ఎంతో ఆప్యాయతతో నిండిన స్పర్శ సేద తీరుస్తున్నట్లున్నది. ఇరువురి ప్రవర్తనలో సాన్నిహిత్యం, సరళత్వం కనిపిస్తున్నాయి. ఆమె మెడ వంపులో తలదించుకున్నాడు. అంతటా నిశ్శబ్దం, మనోహరమైన ప్రశాంతత.
*****
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
మీనాక్షి టీచర్.. !
రచన: పెనుమాక వసంత




మీనాక్షి అసలు పేరు కాని అందరూ ‘మీనాా!’ అని పిలుస్తారు మీనాక్షిని. పేరుకు తగ్గట్లే పెద్దకళ్లు, పెద్ద జడ.. ఇద్దరు మగపిల్లల తర్వాత పుట్టిందేమో.. ! బాగా గారాబంగా పెరిగింది. 
 
మీనాక్షి ఏది అడిగితే అది కొని ఇవ్వాల్సిందే. కాలు కింద పెట్టకుండా పెరిగింది. డిగ్రీ వరకు చదివించారు. ఇక పెళ్లి చేద్దామని ప్రయత్నాలు మొదలెట్టారు. అపుడు ఇప్పటి లాగా అమ్మాయిలకి డిమాండ్ లేదు, అబ్బాయిలకు ఉంది. 
 
ముందు చెల్లికి పెళ్లి చేసి మేము చేసుకుంటామని అన్నలిద్దరూ పెళ్లి చేసుకోలేదు. మీనా కొంచం కలర్ తక్కువ అవ్వటం వల్ల, తొందరగా అబ్బాయిల కంట్లో పడేది కాదు. 
 
కొంతమంది అబ్బాయిలకు మీనాా నచ్చినా కూడా, వాళ్ళకు ఆస్తి లేదనీ, మీనాా అమ్మనాన్నకు వాళ్ళు నచ్చేవారు కాదు. ఉద్యోగం వుంటే, ఆస్థి లేక, ఆస్తీ ఉంటే ఉద్యోగం లేక, ఇలా ముప్పై ఏళ్లు వచ్చేవరకు మీనాాకు పెళ్లి కాలేదు. 
 
మీనాాకు పెళ్లి చేసి తాము చేసుకోవాలని కూర్చున్న అన్నలకు, పెళ్లి కాక ముదిరి పోయారు. వాళ్ల కోసమన్నా మీనాాకు త్వరగా పెళ్లి చేయాలని చివరకు ఆస్తి బాగ ఉందని, ఒక పెద్ద కుటుంబంలోని పెద్దకొడుకు మాధవ్ కి మీనాాను ఇచ్చి పెళ్లి చేశారు. వ్యవసాయం చేస్తూ.. మాధవ్ ఆ ఊరిలో ఒక కాలేజ్ కూడా రన్ చేస్తున్నాడు. 
 
మీనాా, అత్తవారు చాలా మంచివారు. మాధవ్ కూడా మీనాాను బాగా చూసుకునేవాడు. మీనాా పెద్ద కోడలిగా ఇంటి బాధ్యతలు స్వీకరించింది. మాధవ్ కు ఒక తమ్ముడు, ఒక అక్క, చెల్లి, ఉన్నారు. 
 
మాధవ్ పొలం వెళితే.. మాధవ్ కాలేజ్ కి వెళ్లి పాఠాలు చెప్పేది మీనా. ఆ చుట్టుపక్కల మంచి కాలేజ్ లేకపోవటం వల్ల మాధవ్ కాలేజ్ కి బాగా డిమాండ్. సాయంత్రం ఇంట్లో పిల్లలు ట్యూషన్ కి వచ్చేవారు. పిల్లలతో ఇల్లు కళకళ లాడుతుందేది. 
 
మాధవ్ అక్కకు పెళ్లి అయింది. కాని చెల్లి విమలకు పోలియో వల్ల కాలు కొంచం పెద్ద అడుగులు వేసి నడుస్తుంది, అందువల్ల పెళ్లి కాలేదు. విమలకు టీచర్ ట్రైనింగ్ పూర్తయింది. వీళ్ల కాలేజ్లోనే టీచర్ గా పని చేస్తుంది. మరిది ముంబైలో జాబ్ చేస్తాడు. 
 
మరిది పెళ్లి భాద్యతలు తనే నెత్తిన వేసుకుని చక్కగా చేసింది. మీనాకు పిల్లలు పుట్టలేదు. మరిది పిల్లలను, తన సొంత పిల్లలుగా భావించేది. వాళ్ళు సెలవులకు ఇంటికి వస్తె, వాళ్లతో సరదాగా గడిపేది. మీనాకి పిల్లలు లేక పోవటం చూసి మీనాా అమ్మానాన్న, అన్నలు, దిగులు పడ్డారు. వాళ్లకి దైర్యం చెప్పేది. మరిది పిల్లలు నా పిల్లలే.. ! అనేది. ఇంకా కాలేజ్ పిల్లలు కూడా నా పిల్లలే.. ! అనేది. "
 
 మాధవ్ వాళ్ల నాన్న పోయినప్పుడు.. “మీనాా..  నాకేమైనా అయితే నువ్వు అమ్మని, మా చెల్లిని, మన కాలేజ్ని బాగా చూసుకోవాలి.. !" అనేవాడు మాధవ్. 
"అలా అనకండి.. !” అని మాధవ్ ని తిట్టేది. “మీరు లేకపోతే నేనూ లేను అనేది" మీనాా. 
 
 మీనాా సంతోషాన్ని చూడలేక ఆ దేవుడు మాధవ్ ని హార్ట్ ఎటాక్ రూపంలో తన దగ్గరికి తీసుకెళ్ళాడు. కొన్నాళ్ళు డిప్రెషన్ లో ఉంది మీనా. 
 
 మీనాా అమ్మానాన్న, “మన ఇంటికి వచ్చి వుండు తల్లీ.. ! అత్తంటితో నీకు ఋణం తీరింది”, అంటే మీనాా, ఒప్పుకొలేదు. 


“పుట్టిల్లుతో నా బంధం పెళ్లితోనే తీరిపోయింది. ఇక్కడే.. ఉంటాను. రాలేను నాన్నా.. ! వచ్చినా చుట్టపు చూపుగానే వస్తానే.. తప్ప అక్కడ శాశ్వతంగా వుండలేను” అంది. 
 
“మాధవ్ తో నాకున్న ఈ ఇంటి జ్ఞాపకాలను, మాధవ్ కి ఇష్టమైన ఈ కాలేజ్ ని వదిలి రాలేను. కాలేజ్ లోని పిల్లలందరూ..  నా పిల్లలే నాన్న. వాళ్లకి ఇపుడు పరీక్షలు కూడా.. ! ఇపుడు నేను వాళ్ళని వదిలి మీతో వస్తె.. వాళ్ల భవిష్యత్ ఏమి కాను?” 


చేసేది లేక మీనాా, అమ్మానాన్నా మీనాా ను వదలలేక వెళ్ళారు


తర్వాత అత్తగారికి ధైర్యం చెపుతూ వుండేది. కాలేజ్ కెళ్ళి పిల్లలతో గడపటం వల్ల మాధవ్ లేని బాధని మర్చిపోయేది. డిస్టెన్సు లో బీఎడ్ చేసింది. పూర్తిగా కాలేజ్ పై దృష్టి పెట్టింది. 


ఒక పక్క కాలేజ్ చూస్తూ, అపుడప్పుడు పొలం వెళ్ళి చూసి వస్తూ వుండేది. కాలేజ్లో మాధవ్ విగ్రహం పెట్టించింది. ప్రతి రోజూ మాధవ్ విగ్రహం ముందు ‘మీతో గడిపింది, పది సంవత్సరాలైనా.. ! పది యుగాలు మీతో గడిపనట్లుగా వుంది. మీ కాలేజీను, మీరు చెప్పినట్లే చూసుకుంటున్నాను’ అనేది. 
 
 ఆ ఊరి వారు అందరూ మీనాాను మెచ్చుకొన్నారు. ‘మా అబ్బాయిలని తీసుకుని ఉన్న ఊరిలోనే మా కోడళ్ళు మా ఎదురుగా వేరు కాపురాలు పెడుతుంటే మీనాా భర్త పోయినా ఆ కుటుంబంలోనే వుంటూ అత్తగారిని, ఆడపడుచును, చూసుకోవటం ఎంత మంచితనము’ అని ఆశ్చర్యపోయారు. 
 
 అత్తగారు కూడా " నాకు మీనా కూతురు, కోడలు కాదు" అని మురిసిపోయేది. అత్తగారు మీనాా చేతిలోనే పోయారు. 'మాధవ్.. ! మీరు చెప్పినట్లే అత్తగారిని చూసుకున్నా’నని మనసులో అనుకున్నది. 
 
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
 మళ్ళీ మీనాా అమ్మానాన్న వచ్చారు. "మీనాా.. ! రామ్మా ఇంటికి వెళ్దాము. మీ ఆడపడచు భాధ్యత మీ మరిది చూసుకుంటాడు. నువ్వు మాతో రావచ్చుగా.. ! నిన్ను ఎంత గారాబంగా పెంచాము. ఇక్కడ నువ్వు వీళ్ల కోసం కష్టపడటం చూడలేకపోతున్నాము. హాయిగా అక్కడ ఉందువుగాని రా అమ్మా.. !" అన్నారు. 
 
 "ఇది కష్టపడటమని నేను అనుకోవటం లేదు నాన్నా.. ! నా కిష్టమైన పని కష్టపడటం ఎలా అవుతుంది నాన్న.. ! పదే పదే అడగకండి నాన్నా..  ఆడపడుచు, నేను ఉంటాం ఈ ఇంట్లో. భయం లేదు, సాయంత్రం పిల్లలు వచ్చి చదువుకుంటూ.. ,  ఇక్కడే పడుకుంటారు. పక్కనే మా చిన మామగారు వాళ్ళు ఉంటారు. అపుడప్పుడు మీరూ, అన్నయ్యలు వచ్చి చూసి పొండి. మా మరిది వాళ్ళు కూడా వస్తు పోతుంటారు" అంది. 
 
 "వదినా.. ! నువ్వు అత్తయ్య, మామయ్యాతో నీ పుట్టింటికి వెళ్ళు వదినా.. ! చిన్న అన్నయ్య దగ్గరికి వెళ్తాలే.. నేను.. !" అంది కళ్ల నీళ్ళు తుడుచుకుంటూ ఆడపడుచు విమల. 
 
 "లేదు. మీ అన్నయ్య ‘మనకు పిల్లలు లేకపోయినా.. మా అమ్మ, చెల్లి, మన కాలేజీ పిల్లలు మన పిల్లలే.. !’ అని చెప్పేవారు. మీ అమ్మ కూడా నిన్ను వదిలి నన్ను ఎక్కడికి వెళ్లవద్దన్నారు. నేను వెళ్ళను..  నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు” అంది మీనాా. 
 
 ఆ ఊరి వారందరూ..  "మీనా టీచర్ గారు మా పిల్లలకి నాలుగు అక్షరం ముక్కలు నేర్పుతున్నారు. ఆమెను చూసుకొనే భాద్యత మా అందరిదీ. మావూరి ఆడపడుచు మీనమ్మ. మీరు దైర్యంగా వెళ్లం”డని.. మీనా అమ్మానాన్నను సాగనంపారు.


 విమలకు గవర్నమెంటు టీచర్ జాబ్ రావటంతో, మీనాా..  హ్యాపీగా ఫీల్ అయింది. జాబ్ ఉండటం వల్ల విమలతో పనిచేసే టీచర్ పెళ్లి చేసుకుంటానన్నాడు. విమల పెళ్ళికి ఒప్పుకోలేదు. కానీ మీనాా ఒప్పించి విమలకు పెళ్లి చేసింది. 


'మాధవ్, విమలకు పెళ్లి అవ్వదని భయపడేవాళ్లము. ఇపుడు విమల ఒక ఇంటిది అయింది. మీ చేత్తో పెట్టిన వృక్షాలు పెరిగి పెద్దవయ్యాయి, కానీ మీరే లేరు, ఎందుకు నన్నొదిలి వెళ్లారు, మీకు నా మీద ప్రేమ లేదా?’ అని బాధ పడింది విమల. 


 మీనాా, అన్నయ్య వచ్చి "మీనాా.. ! ఇపుడు మీ ఆడపడుచు కూడా లేదు, నువ్వొక దానివే ఎందుకు? ఇక్కడ మన ఇంటికి రా.. !" అన్నాడు. 


 "లేదు అన్నయ్యా.. ! అప్పటి కన్నా ఇపుడు.. నా అవసరం ఇక్కడ వుంది. మా మరిది వాళ్ల అబ్బాయి సాగర్ ని, నేను ఒక్క దాన్నే అని ఇక్కడ మా కాలేజ్ లో జాయిన్ చేసాడు. 


 సాగర్ అచ్చు మా ఆయన లాగే వుంటాడు. ఇపుడు ఒంటరి దాన్ననే..  ప్రసక్తి లేదు. వాడిలో మాధవ్ ను చూసుకుంటూ.. 
ఉన్నతముగా తీర్చి దిద్దుతా సాగర్ ను. మనకు పిల్లలుంటే, ఒకరిని డాక్టర్ చేస్తా.. అనేవారు మీ బావ. వీడిని డాక్టర్ను చేసి, ఆయన కోరిక నెరవేర్చుతా.. ! నాన్న పోయి అమ్మ ఒక్కతే..  అయింది. నీకు వీలైతే, అమ్మను ఇక్కడకు పంపు, నాకు తోడుగా వుంటుంది”. 


 ఏమి చేసేది లేక మీనాా, అన్నయ్య..  వాళ్ల అమ్మను మీనాా దగ్గర వదిలి వెళ్లాడు. 


 మీనాాకు ఉత్తమ ఉపాధ్యాయురాలిగా బహుమతి వచ్చింది. కాలేజ్ కు కూడా ఉత్తమ కాలేజ్ గా పేరు వచ్చింది. దాన్ని తన దివంగత భర్తకు అంకితమని గర్వంగా చెప్పింది. 


 సాగర్ ను డాక్టర్ చేసి ఆ వూళ్ళోనే మాధవ్ పేరు మీద హాస్పిటల్ కట్టించింది. ఈవిధముగా మెట్టిన ఊరిలో పేరును సంపాదించుకుంది. ఇపుడు ‘టీచర్ మీనాక్షి..’  అంటే, తెలియని వారు లేరు ఆ చుట్టుపక్కల వూళ్లలో. 
***
 
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
అంతా మీ మంచికే


రచన: తాత మోహనకృష్ణ




రామస్వామి పుట్టి, పెరిగింది అంతా అగ్రహారంలోనే. తండ్రి గొప్ప జ్యోతిష్య పండితుడు కావడం, చిన్నప్పటినుంచి తండ్రి చాటున ఉండి అన్నీ గమనించిన రామస్వామి, జ్యోతిష్యం మీద.. ఆచార వ్యవహారాల పైన నమ్మకం చాలా ఎక్కువ. పెళ్ళైన తర్వాత.. ఇంకా పట్టింపు చాలా ఎక్కువ అయింది. తండ్రి పౌరోహిత్యం, జ్యోతిష్యం నేర్చుకోమన్నా, వద్దని, సాఫ్ట్వేర్ జాబ్ లో జాయిన్ అయ్యాడు రామస్వామి. 


ఇప్పుడు అగ్రహారం నుంచి సిటీ లో కాపురం పెట్టాడు రామస్వామి. సిటీ లో అంతా హడావిడి జీవితమే; ఆచారాలు, గ్రహాలూ, అనుగ్రహాలు గురించి అంతగా ఆలోచించేవారు అక్కడ లేరని గ్రహించాడు రామస్వామి. ప్రతిదానికీ తండ్రిని అడగడానికి ఆయన ఇప్పుడు బతికిలేరు. రామస్వామి భార్య కి అంతగా వీటి గురించి తెలియదు.. పైగా అంత నమ్మకం కుడా లేదు. 


ఇలాంటి సమయంలో, రామస్వామికి ఉన్న ఒకే మార్గం, టీవీ లో రాశిఫలాలు ఫాలో అవడమే. ఉదయమే నిద్ర లేచి.. వచ్చే రాశిఫలాలు చూడడం.. దానిలో చెప్పేది ఫాలో అయిపోవడం చేసేవాడు. అలా, కొన్ని రోజులు ఫాలో అవగానే, కొన్ని బాగా జరగడంతో ఇక రోజూ అదే పని. 


"ఏమండీ.. ! సాఫ్ట్వేర్ మేనేజర్ అయి ఉండి కుడా ఏమిటండీ.. ఈ రాశిఫలాలు అవీ.. రోజు ఫాలో అవడం. అవడమే కాదు.. వాళ్ళు చెప్పినట్టు చెయ్యడం అంత అవసరమా.. ?" అడిగింది భార్య కాంతం 


"మనకి బాగా కలిసి రావాలంటే, అన్నీ ఫాలో అవాలి కదా.. !" అన్నాడు రామస్వామి


"మా అమ్మ ఏదో నోముకి నన్ను రమ్మని పిలిచింది. నేను మా ఇంటికి వెళ్తున్నాను.. నా పుట్టిల్లు ఇక్కడే కావడం నా అదృష్టం" అంది కాంతం 


"వెళ్ళు గానీ కాంతం.. నీ రాశి ప్రకారం.. ఈ రోజు నువ్వు ఆకుపచ్చ రంగు చీర కట్టుకుంటే మంచిది.. పైగా తూర్పు దిశ లో ఉన్న బస్ స్టాప్ లో బస్సు ఎక్కితే, అంతా శుభమే.. "


"నా ఖర్మ.. ! నాకు ఆకుపచ్చ రంగు చీరే లేదు. నా లక్కీ కలర్ ఎరుపు అని చెప్పి, ఎప్పుడూ ఆ కలర్ షేడ్స్ లోనే చీరలు కొన్నారు గా.. ! ఇంటి పక్కనే ఉన్న బస్ స్టాప్ వదిలేసి, ఎక్కడో కిలోమీటర్ దూరంలో ఉన్న బస్ స్టాప్ కి నడచి వెళ్లి బస్సు ఎక్కాలా.. ? మీ చాదస్తం మీరూ.. " అంటూ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని పుట్టింటికి బయల్దేరింది కాంతం 


కాంతం.. బస్సు ఎక్కి పుట్టింటికి వెళ్ళింది.. 


"అమ్మా.. ! నేను వచ్చేసానే.. "
"ఏమిటే పిల్లా అలా ఉన్నావు.. ? అల్లుడు ఏమైనా అన్నాడా.. ?" అడిగింది తల్లి జానకమ్మ
"ఆయన ఎప్పుడూ ఏదో అంటూనే ఉంటారు అమ్మా.. !"
"అయితే మరి ఏమైందో చెప్పు.. !"


"ఈ మధ్య మా ఆయనకి.. ఈ దిన ఫలాలు, వార ఫలాల పిచ్చి బాగా ముదిరిపోయింది. ఉదయాన్నే నిద్ర లేవడం.. టీవీ లో ఆ ఛానెల్, ఈ ఛానల్ పెట్టడం.. అందులో చెప్పిన విధంగా.. ఆ రోజు ఏ చొక్కా వేసుకోమంటే అదే రంగు చొక్కా వేసుకోవడం.. ఏ దిక్కు కి వెళ్ళమంటే.. ఆ రోజు అదే దిక్కు వైపు వెళ్లడం చేస్తున్నారు. ఒక రోజు ఆఫీస్ కి టైం అయిపోతున్నాసరే.. దిక్కు కోసం రెండు కిలోమీటర్లు ఎక్కువ వెళ్ళారు. 


ఇంకా.. ఒక రోజు అదేదో రంగు చొక్కా వేసుకోమని టీవీ లో చెప్పారు. ఆ రంగు నేను ఎక్కడా వినేలేదు. అప్పుడు మా ఆయనని చూడాలి.. ఈయన గూగుల్ లో సెర్చ్ చెయ్యడం మొదలుపెట్టారు. ఆ రోజు ఆఫీస్ లో ఇంపార్టెంట్ ప్రమోషన్ ఇంటర్వ్యూ ఉందని.. అందుకే ఆ చొక్కా కోసం.. ఊరంతా తిరిగారు. చివరికి దానిని కొని మరీ వేసుకున్నారు. ఇంకోసారి అయితే, చెప్పిన రంగు చొక్కా ఎక్కడా దొరకకా.. నా చీర అదే రంగు లో ఉందని.. దానిని కట్ చేసి చొక్కా కుట్టించుకున్నారు తెలుసా.. ?"


"పోనీలేవే.. ! మీ ఆయన బాగుంటే, నువ్వూ బాగునట్టే కదా.. ! అంతా మీ మంచికే.. " అంది జానకమ్మ 


"నేను గమనించనేలేదు.. ! నువ్వేంటే, బాగా చిక్కినట్టున్నావు.. తిండి తినట్లేదా ఏమిటి.. ?"
"ఏం చెప్పనే అమ్మా.. ! అప్పుడప్పుడు ఆ రోజు గ్రహాలు బాగోలేకపొతే, పూజలు అవీ చేయించమంటే, నైవేద్యం కోసం రోజుకొక రకమైన వంటకం చెయ్యమంటారే మా ఆయన.. ఉదయాన్నే నిద్ర లేచి చెయ్యాలి. ఆ గ్రహాలు శాంతించాయి లేదో నాకు తెలియదు గానీ, నాకు మాత్రం బొత్తిగా శాంతి లేదే అమ్మా.. !"


"మీ మావయ్యగారు కుడా ఇలాగే అన్నీ పాటించేవారని మీ అత్తగారు నాకు చాలా సార్లు చెప్పారు. ఆయన అడుగు జాడ లోనే నడుస్తున్నాడు కాబోలు మీ ఆయన. మీ మావయ్యగారి చేతికి మొత్తం అన్నీ ఉంగరాలే తెలుసా.. ! చూసి నేనూ, మీ నాన్న చాలా ఆశ్చర్యపోయాము.. ఒకొక్క ఉంగరం ఒకొక్క గ్రహం కోసమని విన్నాను.. "


"ఉంగరాలంటే గుర్తొచ్చిందే అమ్మా.. ! పోయిన నెలలో టీవీ లో అదేదో ఉంగరం పెట్టుకుంటే బాగుంటుందని చెప్పారు. అదీ బంగారం లోనే అంటా.. ! నా దగ్గర ఉన్న ఉంగరం కాస్తా చెరిపించి, ఆయన కొత్త ఉంగరం చేయించుకున్నారే.. !


మొన్నటికి మొన్న.. రాశి ఫలాలలో, శని కోసం ఉంగరం పెట్టుకుంటే, అంతా బాగుంటుందని చెబితే, ఇంకొక ఉంగరం చేయించుకున్నారు. ఈ సారి పెళ్ళికి మీరు పెట్టిన ఉంగరం ఖర్చు పెట్టేసారే అమ్మా.. " అంటూ దీనంగా చెప్పింది కాంతం 


"పోనీలేవే.. ! మీ ఆయన బాగుంటే, నువ్వూ బాగునట్టే కదా.. ! అంతా మీ మంచికే.. "


"ఏం బాగో.. ! సాఫ్ట్వేర్ ఉద్యోగం కాబట్టి.. ఇంకా ఇలాగైనా ఉన్నాము.. !"


"మీ ఆయన ఫోన్ చేస్తున్నట్టు ఉన్నాడే.. ! ఎత్తి మాట్లాడు.. అదేంటే మీ ఆయన పేరు ఫోన్ లో అలా సేవ్ చేసావు.. ?" అడిగింది తల్లి 


"నీకు ఇంకా ఆ ముచ్చట చెప్పలేదు కదా.. ! ఈ మధ్య పేరు లో బలం తగ్గిందని ఎవరో చెబితే.. న్యూమరాలజీ కుడా ఫాలో అవుతున్నారు మీ అల్లుడుగారు. రామస్వామి పేరుని కాస్త రామసామి గా మార్చుకుంటే, దురదృష్టం పోయి.. అదృష్టం పరిగెత్తుకుంటూ వస్తుందని, అదేదో ఛానల్ లో చెబితే పేరుని అలా వంకరగా మార్చుకున్నారు. నా ఫోన్ లో కుడా తన పేరుని అలాగే మార్చమని మరీ చెప్పారు.. "


"అవునా.. ?" అంటూ దీర్ఘం తీసింది జానకమ్మ 


"ఇంకా చెబుతాను.. విను అమ్మా.. !"


కొత్త పెళ్ళాం తో వారంలో మూడు రోజులు మాట్లాడకపోతే, ఆయుష్షు రెట్టింపు అవుతుందని ఎవరో స్వామిజీ చెబితే.. నాతో మాట్లాడడం మానేసారు. నాతో అన్నీ సైగలే.. ఆ మూడు రోజులు.. "


"అయితే వారంలో మూడు రోజులు ప్రశాంతంగా ఉంటుందనమాట మీ ఇల్లు.. " అంది తల్లి 


"ఇదింకా నయం.. ఇంకొకటి చెబితే.. నువ్వు ముక్కు మీద వేలు వేసుకుంటావు.. ! ప్రతి అమావాస్యకి, పౌర్ణమికి నా ముఖము చూడకపోతే.. గ్రహాలూ అనుకూలించి సంసారం చాలా బాగుంటుందని ఎవరో అంటేనూ.. నా ముఖం కనిపించకుండా గుడ్డ తో కప్పుకోమని ఆర్డర్ వేసారే మీ అల్లుడుగారు.. "


"పోనీలేవే.. ! మీ ఆయన బాగుంటే, నువ్వూ బాగునట్టే కదా.. ! అంతా మీ మంచికే.. "


"ఏం బాగో.. ! ఆలస్యం అవుతోంది.. " అంటూ ఇంటికి బయల్దేరింది కాంతం 


*************
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
ప్రేమ ప్రేమే

[Image: Picture1.png]
రచన: బివిడి ప్రసాదరావు 

 
పార్వతి వాదన ఆపడం లేదు.
శ్రీకంఠ అసహనం వీడడం లేదు.
సరిత అయోమయం పోవడం లేదు.
పార్వతి.. శ్రీకంఠ దంపతులు. వాళ్ల బిడ్డ సరిత.
శ్రీకంఠ ఓ ప్రయివేట్ కంపెనీ యజమాని.
సరిత ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్.
***
ఐదేళ్ల ఆరు మాసాల క్రితం..
"మీ అభిరుచులు." అడిగాడు శ్రీకంఠ.


"ఓన్లీ ఒన్.. స్వయం ఉపాధి." చెప్పింది పార్వతి.


"అంటే.. స్వంతంగా ఓ కంపెనీ లాంటిది నిర్వహించ.." అడుగుతున్న శ్రీకంఠకు..
అడ్డై.. "అబ్బే. ఆ వైపు కాదు. అట్టివి కావు." చెప్పింది పార్వతి.


శ్రీకంఠ విస్మయమయ్యాడు. పార్వతినే చూస్తున్నాడు.
అప్పుడే వచ్చి.. నిల్చుంది పార్వతి తల్లి.. ఆ గది డోర్ కర్టెన్ చాటున.. ఆ ఇంటి హాలు వైపున.
"తల్లీ.. ఓ మారు బయటికి రా." మృదువుగా పార్వతిని పిలిచింది.


"అమ్మ పిలుస్తోంది." ఆ గది నుండి బయటికి వచ్చింది పార్వతి.


పార్వతి.. శ్రీకంఠల పెళ్లి చూపులు కార్యక్రమం జరుగుతోంది.. ముప్పావు గంట నుండి.
తనే అడగడంతో.. పార్వతితో మాట్లాడుకునే సౌలభ్యం పెద్దల అంగీకారంతో శ్రీకంఠకి కుదిరింది.
ఆ ఇద్దరూ ఆ గదిన కూర్చొని మాట్లాడుకుంటున్నారు.. రమారమీ ఇరవై ఐదు నిముషాల లగాయతు.
రెండు కాఫీ కప్పులు ఉన్న ట్రేతో తిరిగి ఆ గదిలోకి వచ్చింది పార్వతి.


ఆ గది డోర్ కర్టెన్ సర్దేసి హాలు వైపు నడిచింది పార్వతి తల్లి.
ఆ చోటున సోఫాల్లో ఇరు కుటుంబాల పెద్దలు, మధ్యవర్తి కూర్చొని ఉన్నారు. కాఫీ తాగుతున్నారు. ముచ్చటించుకుంటున్నారు.
వాళ్ల ముచ్చట్లు పంచుకోవుటకు పార్వతి తల్లి.. భర్త పక్కన కూర్చొంది.
ఆ గదిన..
పార్వతి కాఫీ తాగుతోంది.
"మీరు చెప్పలేదు." అన్నాడు శ్రీకంఠ. అతడు పార్వతినే చూస్తున్నాడు.


"కాఫీ చల్లారుతోంది. ముందు తాగండి." చక్కగా నవ్వింది పార్వతి.


శ్రీకంఠ సర్దుకున్నాడు. అప్పటికే పార్వతి అందించిన.. తన చేతిలోని కాఫీ కప్పు వంక చూస్తూ.. 
"వేడిగా ఉంది." చెప్పాడు.


"ఇంటిన ఉండే.. నా అంతట నేను.. నిర్వహించ తగ్గది ఎంపిక చేసుకోవాలి అన్నది నా తలంపు." మెల్లి మెల్లిగా చెప్పింది పార్వతి. తను కాఫీ తాగుతోంది.


అప్పటికే కాఫీ కప్పు వైపు నుండి చూపు మార్చుకొని.. పార్వతినే చూస్తున్న శ్రీకంఠ..
"అర్ధం కావడం లేదు." చెప్పాడు. చిన్నగా కదిలాడు.


"లైక్.. కాటేజ్ ఇన్డస్ట్రీస్ లాంటివి." చెప్పింది పార్వతి. తన చేతి లోని అప్పుడే ఖాళీ ఐన కాఫీ కప్పుని టీపాయ్ మీద పెట్టింది.


"యూ మీన్.. కుటీర పరిశ్రమలు." సంశయమవుతాడు శ్రీకంఠ.


"యయ. లైక్ థట్." పార్వతి అనేసింది.


ఆ వెంబడే..
"నేనే ఏమీ తేల్చుకోలేదు. ఇప్పటికిప్పుడు నేను ఏమీ చెప్పలేను. కానీ దానికి అందుబాటు పడేలానే కొత్తింటిని నాన్నతో కట్టించుకుంటున్నాను." చెప్పింది.


"ఏదీ.. కన్ష్ట్రక్సన్ లో ఉన్న ఆ ప్లేఓవర్ పక్కదా." అడిగాడు శ్రీకంఠ.


"అవునవును. అది నా కోసం నాన్న కట్టి ఇస్తున్నారు. మీకు చెప్పి ఉన్నారుగా." చెప్పింది పార్వతి.
"చెప్పారు చెప్పారు." అనేసాడు శ్రీకంఠ.


"కాఫీ చల్లారి ఉంటుంది. ఇలా ఇవ్వండి. మార్చి వేడిది తెస్తాను." సోఫా కుర్చీలోంచి లేచింది పార్వతి.


"నో నో. ప్లీజ్. కూర్చొండి. ఇది తాగేస్తాను." తడబడ్డాడు శ్రీకంఠ. ఆ వెంబడే.. గడగడా కాఫీ తాగేస్తున్నాడు.


పార్వతి కూర్చొంది.
ఖాళీ కాఫీ కప్పుని టీపాయ్ మీద పెట్టేసాడు శ్రీకంఠ.


"చాలాసేపు గడిచింది. అమ్మ కూడా కాఫీ కప్పులు ఇస్తూ చెప్పింది.. వాళ్లు మన కోసమే చూస్తున్నారని. మరి.. మనం వెళ్దామా." మెల్లి మెల్లిగా అడిగింది పార్వతి.


"ఇంకా మాట్లాడుకోమా." నసిగాడు శ్రీకంఠ.


"మీరే లాగ్ లతో కాలయాపన చేసారు." మృదువుగానే పార్వతి చెప్పింది.


"మరోసారి మాట్లాడుకోవచ్చా." శ్రీకంఠ నంగిరయ్యాడు.


"అవసరమా." అడిగింది పార్వతి.


"ఏదో.. ఈ మీటింగ్ అసంపూర్తిగా తోస్తోంది నాకు." చెప్పాడు శ్రీకంఠ.


"అన్నీ కుదిరితే.. తిరిగి మాట్లాడుకోగలం." చెప్పింది పార్వతి. లేచింది.


తప్పక లేచాడు శ్రీకంఠ.
ఆ ఇద్దరూ.. ఆ గది నుండి హాలు లోకి వచ్చారు.
తమ తమ తల్లిదండ్రుల పక్కన చేరారు.
మధ్యవర్తి చొరవతో..
తొలుత పార్వతి తల్లిదండ్రులు లేచారు. కూతురుని తీసుకొని తమ గదిలోకి వెళ్లారు.


అప్పుడే.. 
"అబ్బాయితో మాట్లాడండి. అతడి అభిప్రాయం తెలుసుకోండి." మధ్యవర్తి చెప్పగా..
"ఏమంటావు." అడిగింది శ్రీకంఠ తల్లి.. కొడుకును చూస్తూ.


శ్రీకంఠ ఏమీ చెప్పక పోయే సరికి..
"చెప్రా. అమ్మాయితో మాట్లాడావుగా. నీ అభిప్రాయం చెప్పు." అన్నాడు శ్రీకంఠ తండ్రి.. కొడుకునే చూస్తూ.


"అమ్మాయి నచ్చింది." చెప్పాడు శ్రీకంఠ.


ఆ వెంబడే..
"కానీ.. ఇంకా మాట్లాడాలి." అన్నాడు.


"అంటే.." చికాకవుతోంది శ్రీకంఠ తల్లి.


"చాలా సమయం ఉన్నారుగా. ఏమీ మాట్లాడలేదా." చిరాకయ్యాడు శ్రీకంఠ తండ్రి.


"మాట్లాడేను." చెప్పాడు శ్రీకంఠ.


"మరి. ఇంకేం." మధ్యవర్తి కలగచేసుకున్నాడు.


శ్రీకంఠ ఏమీ చెప్ప లేదు.
"పెద్దలు మాటలు కుదిరాయి. మీ పిల్లల ఇష్టం కొరకు వీళ్లు ఆగారు." చెప్పాడు మధ్యవర్తి.


అంతలోనే పార్వతి తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు.
పార్వతి రాలేదు.
పార్వతి తల్లిదండ్రులు కూర్చున్నాక..
"అమ్మాయి ఏమంది." అడిగాడు మధ్యవర్తి.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
"అబ్బాయి ఏం చెప్పాడు." అడిగాడు పార్వతి తండ్రి.


శ్రీకంఠ తల్లిదండ్రులతో పాటుగా మధ్యవర్తి సతమతమయ్యాడు.
శ్రీకంఠ ప్రేక్షకుడు మాదిరయ్యాడు.
ముందుగా మధ్యవర్తి అప్పుడే తేరుకున్నట్టు కదిలి..
"అమ్మాయితో అబ్బాయి ఇంకా మాట్లాడాలట." చెప్పాడు.


"అమ్మాయి చెప్పింది.. అబ్బాయి ఇంకా మాట్లాడాలన్నాడని." చెప్పాడు పార్వతి తండ్రి.


"మరి.. వాళ్లకి మరోమారు మాట్లాడుకునే అవకాశం ఇస్తే బాగుంటుందిగా." గుసగుసల్లా చెప్పాడు మధ్యవర్తి.


అప్పుడు శ్రీకంఠ కలగచేసుకున్నాడు.
"లేదు లేదు. ఇనఫ్. చెప్పాగా.. నాకు అమ్మాయి నచ్చింది." అనేసాడు.


"మా అమ్మాయి తన సమ్మతిని తెల్పింది." పార్వతి తల్లి కలగచేసుకుంది.


"అవునా. మరేం. అబ్బాయికి మళ్లీ మాట్లాడే అవసరం లేదంటున్నాడుగా. ఇద్దరూ నచ్చుకునేక.. మరేం ఉంది. శుభమ్." గలగలా అనేసాడు మధ్యవర్తి. 


దాంతో.. ఆ పెద్దల మాటలు ముహూర్తల వైపుకు మళ్లాయి. 
ఆ తోవనే పంతులుగారిని కలవడానికి వాళ్లు అనుకూలంగా అంగీకరించు కున్నారు.
పక్షం ఒక రోజు తర్వాత..


శోభనం రాత్రి..
ఆ గదిన..
మంచం అంచున..
పార్వతి.. శ్రీకంఠ కూర్చొని ఉన్నారు.
పార్వతి తల దించుకొని ఉంది.
"నువ్వు నాకు పాలు గ్లాస్ తేలేదు." చిన్నగా అన్నాడు శ్రీకంఠ.


పార్వతి తలెత్తింది. శ్రీకంఠని తికమకతో చూస్తోంది.
శ్రీకంఠ సన్నగా నవ్వుతున్నాడు.
చూపు మార్చుకుంటూ.. "అట్టివి మీడియాల్లోనే ఏమో." అమాయకంగా అంది పార్వతి.


ఆ వెంబడే..
"తామంతా వెళ్లేక.. గది తలుపేసుకో.. చెప్పింది మా అమ్మ. నేనలానే చేసి వచ్చాను." బిడియంగా చెప్పింది.


శ్రీకంఠ చిన్నగా నవ్వేసి.. జరిగి.. పార్వతిని దరిగా తీసుకోబోయాడు.
పార్వతి చిన్నగా వెనుక్కు వంగి.. "మీతో మాట్లాడాలి." చెప్పింది.


శ్రీకంఠ తగ్గాడు.
"చెప్పు." అన్నాడు.


"అదే. మీరు పెళ్లి చూపులు నాడు చెప్పారుగా.. ఇంకా నాతో మాట్లాడాలని. అదే.. ఏ మాటలు అవి." నెమ్మది నెమ్మదిగా అడుగుతోంది పార్వతి.


శ్రీకంఠ ఏమీ మాట్లాడ లేదు. 
ఎప్పటికీ శ్రీకంఠ ఏమీ చెప్పక పోయే సరికి..
పార్వతి మెల్లిగా తలెత్తి.. శ్రీకంఠని చూస్తోంది.
"ఇంకా అదే ఆలోచన చేస్తున్నావా. అబ్బే. ఏ మాటలు లేవు." చెప్పాడు శ్రీకంఠ.


"మరి.. మరెందుకు అలా అప్పుడు అన్నారు." అడిగేయగలిగింది పార్వతి.


చిన్నగా నవ్వేస్తూ..
"మరేమో.. నిన్ను చూస్తూ మరి కొంత సేపు ఉండాలని. మాటలు ఆడాలనేసాను." హస్కీగా చెప్పేసాడు శ్రీకంఠ.


పార్వతి మురిసింది. కను రెప్పలను టపటపా లాడిస్తూ.. శ్రీకంఠనే చూస్తోంది.
శ్రీకంఠ మెత్తగా నవ్వుతూనే..
"అంతే. అదే కారణం. నీ నుండి వెళ్ల బుద్ధి కాలేదప్పుడు." మెల్లిగా చెప్పాడు.


పార్వతి మరింత సిగ్గయ్యిపోతోంది.
ఆ తోవలోనే.. 
శ్రీకంఠచే అతడి బాహువుల్లోకి సుతిమెత్తగా పార్వతి లాక్కోబడింది.
  రోజులు గడుస్తున్నాయి.


ఇరువురుది ఒకే ఊరు కావడంతో.. పైగా ఇరువురు ఇళ్ల మధ్య దూరాలు నిమానం కావడంతో.. 
శ్రీకంఠ తన పనికి బయటికి వెళ్లేక.. పార్వతి.. తన అత్తవారింటి.. తన కన్నవారింటి మధ్య తరచు తిరుగుతూ చాన్నాళ్లు జాలీగా గడిపేసింది. ఆ తోవన తల్లి కూడా అయ్యిపోయింది.


తన తండ్రి కట్టి ఇచ్చిన కొత్తింటికి చేరేక.. పార్వతి తిరుగుళ్లు బాగా తగ్గిపోయాయి. కారణాలు.. తమ ఇళ్ల మధ్య దూరాలు.. అందుకు తగ్గట్టు ట్రాఫిక్ అవస్తలు.. సరిత సంరక్షణ బాధ్యతలు.


ఆ పై.. సరితని ఎల్కేజీలో చేర్చేక.. సరితని స్కూటీ మీద కాన్వెంట్ కు రోజూ తీసుకు వెళ్లడంలో.. తీసుకు రావడంలో.. ఇంటిన సరిత చేత హోం వర్క్స్ చేయించడంలో పడింది పార్వతి. అలా యుకేజీ వరకు జరిగేక.. సరిత ఫస్ట్ స్టాండర్డ్ కు వచ్చేక.. పార్వతికి ఆ తిరుగుళ్లు కూడా ఆగిపోయాయి.
శ్రీకంఠ తను నిర్వహిస్తున్న కంపెనీ వైపు రాక పోకలు కొత్తింటి నుండే అవుతున్నాయి. దూరం.. ట్రాఫిక్ అవస్తల మూలంగా.. అతడు ఉదయం వెళ్లడాలు.. సాయంకాలంకి రావడాలు జరుగుతున్నాయి.


సరిత కాలేజీకు.. వారంలో ఆరు రోజులు.. ఉదయం ఎనిమిదింటికి వెళ్లడాలు.. సాయంకాలం ఐదింటికి రావడాలు.. కాలేజీ బస్సులో కొనసాగుతున్నాయి.
శ్రీకంఠ తన పని కై.. సరిత తన చదువు కై.. వెళ్తుండడంతో..
పార్వతి ఆ కొత్తింట రోజూ చాలా సమయం ఒంటరిగా ఉండడం అవుతోంది.


దాంతో పెళ్లికి ముందు తను అనుకున్న దాని వైపు తిరిగి మెల్లి మెల్లిగా మొగ్గడం మొదలెట్టింది.
తన ఇంటన తను ఎట్టిది చేపట్టి.. తన స్వయం ఉపాధి కాంక్షను నెఱువు కోవాలన్న తంటాలు పడుతోంది.


ఎన్నెన్నో తన మట్టుకు తానే తర్కించుకుంటుంది. ఏదీ ఆమెను స్తిమిత పర్చడం లేదు.
శ్రీకంఠ సాయం కోరుతోంది.


శ్రీకంఠ.. 'హాయిగా ఉండు. నీకెందుకు శ్రమ.' అనేసే వాడు.


పార్వతి మాత్రం తగ్గడం లేదు.
దాంతో.. ఆ భార్యాభర్తల మధ్య పోరు పెనుగులాట మెల్లిగా చోరబడుతోంది.


ఇంటికి వస్తే.. పార్వతి నస తప్పడం లేదని.. శ్రీకంఠ.. రాత్రులు రావడాలు ఆలస్యం చేస్తున్నాడు. ఉదయాలు వెళ్లపోవడాలు త్వరగా చేస్తున్నాడు.


తల్లిదండ్రులు కలిస్తే.. తను బెదిరిపోవడం తప్పదని.. వాళ్లు కలవక ముందే.. నిద్రకై పక్క ఎక్కేస్తోంది పాపం.. ఆ చిన్నారి సరిత.
***
వర్తమానం. 
"మామ్.. ఐ హేవ్ టు గో టు కాలేజ్. ఐ హేవ్ ఏన్ ఎగ్జామ్ టుడే." సరిత బేలగా అంది.. పార్వతిని చూస్తూ.


"అవునవును. లేచింది మొదలు నీ సొదే." నసిగాడు శ్రీకంఠ.


"మీరు ఈ మధ్య నాకు దొరికేది ఎక్కడ. తొందర తొందరగా వెళ్లి పోతున్నారాయే. ఏ రాత్రికో వస్తున్నారాయే." అరిచింది పార్వతి.


సరిత తనను జాలితో చూడడం గుర్తించిన శ్రీకంఠ.. 
"సరే. పాపను తయారు చేసి కాలేజీకు తొలుత పంపు. నేను ఈ రోజు ఆలస్యంగా బయటికి వెళ్తాను. కాదంటే ఉండిపోతాను కూడా. మనిద్దరం మాట్లాడుకుందాం." చెప్పాడు.


పార్వతి వినుకుంది.
సరితను తీసుకొని బాత్రూం వైపుకు నడిచింది.
గంటన్నర తర్వాత..
పార్వతి.. శ్రీకంఠ.. ఇద్దరే ఆ ఇంట ఉన్నారు.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
శ్రీకంఠకు ఒక కాఫీ కప్పు ఇచ్చి.. తను ఒక కాఫీ కప్పుతో.. హాలులో కూర్చుంది పార్వతి.
కాఫీని సిప్ చేస్తూ..
"రతీ.." ఏదో చెప్పబోయాడు శ్రీకంఠ.


అడ్డై.. "ఆఁ. ఆఁ. చాలు చాలు. మీ ముద్దు పిలుపులు చాలించండి. నేను పార్వతిని. కాల్ మి పార్వతి." సర్రున అంది పార్వతి.


శ్రీకంఠ చిన్నపాటి కదలిక పిమ్మట..
"కూల్ పార్వతీ." అన్నాడు.


పార్వతి కాఫీ తాగుతోంది.
"ఇప్పటికీ నీకంటూ ఒక క్లారటీ లేదు. ఏం పెట్టబోతున్నావో చెప్పలేక పోతున్నావు.." చెప్పుతున్నాడు శ్రీకంఠ.


అడ్డై.. ఏదో చెప్పబోతోంది పార్వతి.
"ప్లీజ్. పార్వతీ.. నన్ను మాట్లాడనీవు. ప్లీజ్." అన్నాడు శ్రీకంఠ.


పార్వతి ఏమీ మాట్లాడక పోవడంతో..
"పార్వతీ.. నువ్వు ఒక గాడీలో పడు. దానికి ముందు నేను చెప్పేది విను. నువ్వు కష్ట పడడం నాకు ఇష్టం కాదు. అలానే నీ ఒంటరితనంని అర్థం చేసుకున్నాను. నిజమే.. నేను.. సరిత వెళ్లేక నువ్వు చాలా గంటలు ఇంటిలో ఒంటరిగా ఉండడం నీకు పరమ ఇబ్బందే. ఐ నో." ఆగాడు శ్రీకంఠ.


పార్వతి కాఫీ తాగేసి.. ఖాళీ కప్పును పక్కన పెట్టింది.
శ్రీకంఠ కాఫీ తాగక.. చేతిలోని కప్పుని పక్కన పెట్టక.. మాట్లాడుతున్నాడు.


అది గుర్తించినా.. పార్వతి ఏమీ అనక.. అతడినే చూస్తూ ఉంటుంది.
"నేను ఒక సలహా ఇస్తాను. నచ్చితే చేపట్టు. ఈ ఇంటి చుట్టూ ఖాళీ స్థలం బాగానే ఉంది. ఆ స్థలాన్ని నువ్వు వినియోగించుకో. ఎలా అంటే.. మిద్దె పంటలు వినే ఉంటావు. ఆ మాదిరిగా.. ఈ ఇంటి చుట్టూ ఖాళీ స్థలంలో కిచెన్ గార్డెనింగ్ మొదలెట్టు." ఆగాడు శ్రీకంఠ.


భార్య వింటున్నట్టు గుర్తించాడు.
"నా వంతు సాయంగా.. నిన్ను కర్షక సేవా కేంద్రంకి తీసుకు వెళ్తాను. నీకు ఇట్టి వాటి యందు అవగాహన కల్పిస్తాను. తోడుగా ఒకరిద్దరు మనుష్యులను సమకూరుస్తాను. నీవు అనుకున్నట్టు ఇంటిన ఉంటూ.. ఇంటిన నీ స్వయం ఉపాధి కార్యక్రమాల్ని కానిచ్చుకోవచ్చు. కూల్ గా ఆలోచించు." చెప్పడం ఆపాడు శ్రీకంఠ.


భార్యనే చూస్తు్న్నాడు.
రమారమీ అర నిముషం తర్వాత..
"ఇలా నాతో ఈ మధ్య మాట్లాడ వచ్చుగా." నసిగింది పార్వతి.


"చెప్పాగా. నువ్వు కష్ట పడకూడదని నేను తొలుత నుండి అభిలషిస్తున్నాను. నువ్వు నాకు వికసించే పువ్వు మాదిరి. కానీ నా మాట వినవని గ్రహించాను. నీ పట్టు నీదేలా అనిపించింది. ఈ మధ్యన పేపరులో న్యూస్ చూసాక.. ఒక ఆలోచన చేసాను. మిద్దె పంటల వైపు నీకు బాగుంటుందని అనుకున్నాను. అందుకే అట్టి సంబంధీకులను కలిసాను. సాధకబాధకాలు తెలుసుకున్నాను. ఐనా ఆగాను. కానీ మరి తప్పదని.. మరి ఆగక.. నీ వాదనకు బ్రేక్ వేయాలనే ఇప్పుడు ఇది నీ ముందు పెట్టేసాను. బయలు దేరు. అక్కడికి నిన్ను తీసుకు వెళ్తాను. నీకూ ఐడియా వస్తోంది." చెప్పాడు శ్రీకంఠ.


పార్వతి తెములుకుంటుంది.
శ్రీకంఠ కాఫీ తాగబోతుండగా.. లేచి.. అతడి చేతిలోని కప్పును తీసుకుంది.


"చల్లారిపోయి ఉంటుంది. మరో వేడి కాఫీ ఇస్తాను." అంది. కప్పుతో అక్కడి నుండి కదిలింది కిచెన్ వైపుకు.


శ్రీకంఠ చిన్నగా నవ్వుకుంటాడు.
మూడు గంటల తర్వాత..
కర్షక సేవా కేంద్రం నుండి ఇంటికి తిరిగి వస్తున్నారు పార్వతి.. శ్రీకంఠ.. కారులో.
దారిలో..


"నేను కిచెన్ గార్డెనింగ్ చేపట్టగలను." చెప్పింది పార్వతి ఉత్సాహంగా.


"నేను వాళ్ల నుండి విత్తనాలు, మొక్కలు, సేంద్రియ ఎరువులు, గోకృపామృతం లాంటివి నీకు సమకూర్చిపెట్టగలను." చెప్పాడు శ్రీకంఠ.


శ్రీకంఠ కుడి అర చేతిని.. తన అర చేతుల్లోకి తీసుకొని మృదువుగా నొక్కి..
"థాంక్సండీ." అంది పార్వతి తృప్తిగా.


ఆ ఇద్దరూ బేక్ సీటున ఉన్నారు. 
చిన్నగా నవ్వేసాడు శ్రీకంఠ.
అర నిముషం తర్వాత..
"కృపాకర్.. చెప్పానుగా. ఇద్దరు పనిమంతులైన.. ఒబ్బిడి కలిగిన పనివాళ్లని అమ్మగారికి ఒప్ప చెప్పు. వచ్చే వారం నుండే అమ్మగారి పనులు మొదలవుతాయి." చెప్పాడు శ్రీకంఠ.. డ్రయివర్ ని చూస్తూ.


"సర్.. అలానే." ఒప్పుకున్నాడు కృపాకర్.


పార్వతి తేలకవుతోంది. తొలినాళ్లలా శ్రీకంఠని రిసీవ్ చేసుకుంటుంది.
సుమారు అర గంట తర్వాత.. ఆ దంపతులు ఇద్దరూ ఇంటిని చేరారు.
ఇంట్లోకి వెళ్లాక..
"పార్వతీ.. నేను కంపెనీ వైపు వెళ్లి వస్తాను." చెప్పాడు తన బేగ్ ను తీసుకుంటూ.


"అలా కాదు." పార్వతి బిడియమవుతోంది.


"వెళ్లొద్దా." అడిగాడు శ్రీకంఠ.


"అది కాదు. పార్వతీ అనొద్దు." తల దించుకుంది పార్వతి.


"మరి." శ్రీకంఠ ఆసక్తుడయ్యాడు.


"ఉఁ. మీరు.. మీరు.. పిలిచే వారే.. ఇది వరకటిలానే నన్ను పిలవరూ." దేవరింపులా చెప్పింది పార్వతి.


చిన్నగా నవ్వేస్తూ.. "అలా పిలవడమే నాకు ఇష్టం.. ఆ పిలుపు నా బలం.. రతీ." చాలా సొగసుగా చెప్పాడు శ్రీకంఠ.


పార్వతి కళ్లల్లో నీళ్లూరుతున్నాయి.
కదిలి, శ్రీకంఠని కౌగలించుకుంటుంది.


రెండు నిముషాల తర్వాత..
"నేను తొందరగా సాయంకాలమే వచ్చేస్తాను. సరితను తీసుకొని మనం అలా బయటికి వెళ్దాం. తను కూడా మన మూలంగా ఇన్నాళ్లు సఫరయ్యింది." చెప్పాడు మెల్లిగా శ్రీకంఠ.


కౌగిలి నుండి బయటికి వచ్చి.. 'సరే' అన్నట్టు తలాడించింది పార్వతి.
శ్రీకంఠ.. తన కుడి చూపుడు వేలుతో.. పార్వతి కన్నీరును తుడిచి.. "బై రతీ." నిండుగా అన్నాడు. బేగ్ తో కదిలాడు.


పార్వతి అతడినే చూస్తూ ఉండిపోయింది.
 ***  
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
ప్రమోషన్ డిమోషన్
 
[Image: Picture2.png]

రచన: M. లక్ష్మా రెడ్డి

ఉల్లిపాయలు సన్నగా కట్ చేయాలా అన్న నా ప్రశ్నకి.. సన్నగా.. చిన్నగా కూడా అన్న తన సమాధానంతో ఓ మూడు ఉల్లిపాయలు తీస్కొని.. వాటిని ప్రేమగా ముక్కలు ముక్కలు చేసే పనిలో పడ్డా.. 


 ఎన్ని సార్లు చెప్పినా మీకు గుర్తుండదు గా.. అంటూ.. ఓ చిన్న ఉల్లిపాయ పొర తీసి నా జుట్టుపై పెట్టి.. ఇలా ఐతే నీకు కన్నీళ్లు రావు.. నీతో కంటతడి పెట్టించా అనే బాధ నాకు ఉండదు.. అన్న ఆవిడ మాటలకి.. మనసు మూలల్లో నవ్వొస్తున్నా.. పైకి మాత్రం కాస్త గంభీరంగా ఉండడానికి ప్రయత్నాల్లో పడి ఉన్నా.. గంభీరమే కాదు కాస్త చిరాకు.. ఇంకొంచెం కోపం.. ఇవన్నీ మన ముఖానికి నప్పవు కానీ. ఏదో మానవ ప్రయత్నం.. 


ఎందుకంత కష్టం అనే మీ ప్రశ్నకి.. నిన్నటి మా సంభాషణే జవాబు.. 


నీకు వంటలో సాయం చేస్తూనే ఉన్నాగా అనే నా దయార్ద్ర హృదయానికి.. ఒక్క చికెన్ వండడం తప్ప.. ఇంకేమన్నా వచ్చా.. ? అది కూడా మొహమాటానికి మేం తింటాం కానీ.. ఆ పెరుగు వేయడం ఏంటి.. ? పుల్లటి చికెన్ అని ఒక రకం ఉంటే.. ఇది అందులో వేయాల్సిన మహా వంటకం.. తన సమాధానం.. 
 ఈ సమాధానానికి కాస్త కోపం వచ్చిన మాట నిజమే.. అయినా. తమాయించుకుని మరి తినేప్పుడు ఆహా ఓహో అని అంటారుగా.. నా జ్ఞాపకాల పుటల్లోంచి వాళ్ల అభినందనల బాణం తీసి నేరుగా వాళ్ల మీదకే ప్రయోగించా.. 
జవాబుగా.. గంట మీ కష్టానికి.. కనీసం ఆ మాట అనకుంటే.. ఆ రోజంతా మీ వికార ముఖ సౌందర్యాన్ని మేం తట్టుకోలేంగా.. అన్న పంచ్ పడేసరికి.. 


సరే.. ఇప్పటినుండి నా అందమైన ఈ ముఖాన్ని ఈ కిచెన్ కి.. ఆ చికెన్ కి చూపించను.. అని భీకర ప్రతిజ్ఞ చేసితిని.. 


కట్ చేస్తే.. మళ్ళీ ఈవేళ ఉల్లిపాయల చేతిలో బందీగా.. 
మా ఆవిడ మాటల పోరాటంలో అస్త్ర సన్యాసం చేసిన కట్టప్పలా.. అర్థం అయింది కదా.. 
సరే ప్రస్తుతంలోకి వద్దాం.. 


గతమేమన్న ఘనమా.. అదే గతంలో మునకలేయడానికి.. 
నూనెలో ఆ ఉల్లిపాయలు వేసి.. దోరగా వేయించండి.. అన్న హుకుం జారీ కాబడేసరికి.. చేతిలో గరిటెతో.. పూలమ్మిన చోటే కట్టెలమ్మడం అనుకుంటూ.. గరిటెను లయబద్ధంగా.. తిప్పసాగా.. 
ఇదే డిమోషన్ మరి.. 


నిన్నటిదాకా కుక్ ను.. ఈవేళ ఏమనాలి నా లక్కును.. 
దోరగా.. వేగాలి అన్న దొరసాని మాటలు గుర్తొచ్చి.. 
దోరగా.. తగినంత.. మీక్కావలసినంత అనే పదాలు వంట చేసేప్పుడు తెప్పించే కోపం కాస్త మా ఇల్లాలికి కనబడకుండా ప్రదర్శించి.. గూగులమ్మని అడిగా.. దోరగా అనే రంగుకి చిత్రములు చూపమని.. ఆ చిత్ర విచిత్రాలు అర్థమై అవక.. లేత బ్రౌన్.. ముదురు గోధుమ మధ్య ఏదో అటూ ఇటూ కాని రంగని ఏదో అర్థమై.. అలా దోరగా వేగిన తర్వాత.. 


అల్లంవెల్లుల్లి పేస్ట్ కాస్త.. కొన్ని పుదీనా రెక్కలు, లెక్కలేయకుండా ఇంకొన్ని మేతి ఆకులు.. వేసేసి బాణలికి కింద అంటుకోకుండా వేగించే.. నను వేధించే ప్రహసనం విజయవంతంగా ముగించా.. !


థాంక్స్.. ఇక మీరు దయ చేయొచ్చు అన్న ఆవిడ గారి విడుదల వ్యాఖ్యతో కుందేలు పిల్లలా తుర్రున జారి.. హాల్ వరకు బెన్ జాన్సన్లా లగెత్తి టీవీ ముందు కూలబడ్దా.. 
ఆహలో విద్యా వాసుల వివాహ వైభోగం వీక్షించసాగా.. 
ఓ అరగంట తర్వాత అద్భుతమైన ఘుమఘుమలాడే 
చికెన్ కూర, బగారా రైస్ తో.. నాలుగ్గంటల మా ఆకలి మీద యుద్ధానికి సిద్దం.. 


రెండో ముద్దకి  ఎలా ఉంది అని కనుసైగలతో తను అడిగిన ప్రశ్నకి.. 
ఒక్క పది సెకన్ల తర్వాత, ఈ వంటల వల్లే కదా.. నా ఈ తరగని ఆస్తి.. కరగని మస్తీ అంటూ.. పొట్టని చూపించా.. 


తన అందమే ఆ నవ్వు.. మళ్ళీ ఆ సముద్రంలో మునిగిపోయా.. దిన దిన ప్రవర్దమానం అంటారే.. పాతికేళ్లుగా తన నవ్వులకి అచ్చంగా సరిపోయే పదప్రయోగం అది.. 
అయినా ‘నే చేసినా బావుంటుంది అన్నా’.. నా కుక్ నుండి ఆనియన్ కట్టర్ డిమోషన్ని భరించలేక.. 


“ఏమండోయ్.. మీరు చేసేది బావోక కాదు.. మిమ్మల్ని మరీ కిచెన్ కి అంకితం చేస్తున్నా.. అని నాకే కాస్త బాధగా.. మరికాస్త గిల్టీగా.. కొంచెం ఇంకేదోగా అనిపించి.. మీరు అలా చెప్తే వినరని.. మీ ఈగో తో చిన్న గేమ్ ఆడాను.. నేను ఊహించినట్టే.. మీకు రెస్ట్..”
 
“మరి ఆ ఆనియన్ కోసే జాబ్ ఎందుకో” అన్నాను.. ఇంకా తగ్గని నా చచ్చిన ఈగో ఇంపాక్ట్ వల్ల వచ్చిన పిచ్చి ఫ్రస్ట్రేషన్ వల్ల.. ఆ భావన కనబడనీయలేదు సుమీ. 


“మీరు లేకుండా.. నేను ఉండగలనా.. ఏదో ఓ రకంగా నాతో ఉంటారని.. మీ మాటల్తో.. నా పెదాల పూలు వికసించేలా చేస్తారని.. మీ చలోక్తులతో.. నా అలసట ఆవిరయ్యేలా చేస్తారని..”


మా ఆవిడ కూడా భలే పొయిటిక్ గా మాటడుతుందే.. 


అంతలో.. మా చిన్నాడు.. “ఇక్కడ మేమిద్దరం కూడా ఉన్నాం..” అనడంతో.. శ్రీమతి బుగ్గల సిగ్గుల జల్లులో నన్నేను మరిచా.. ఈగో ఎక్కడో చచ్చి పడి ఉన్నట్టుంది.. ఇక ఆ వేపు చూసే ఉద్దేశ్యం కూడా లేదు.. శ్రీమతి ప్రేమ ప్రదర్శనతో.. డిమోషన్ కాదు డబల్ ప్రమోషనే.. అన్న భావనతో.. ఆకలి మీద యుద్ధం.. సాగించా.. పెళ్ళాం ప్రేమలో మునకలేస్తూ.. 
***
 
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
నేనూ అంతేగా?!

[Image: Picture4.png]

రచన: భాగవతుల భారతి




అవును! అదిగో వానలో తడిసిన ఆ పిచ్చుక 
ఆ చెట్టు మీద వాలి రెక్కలు గిలగిలలాడించి, ముక్కుతో రెక్కల్లో పొడుచుకుని, తడి ఆరబెట్టుకుంటోంది, 
కానీ నేనున్న ఆ పరిస్థితిలో ఆ పిచ్చుక గిలగిల కొట్టుకుంటున్నట్లు కనబడింది.. నామనసులా.. 


అంతేగా! ఎంతో చదివాడు నాన్న. సంస్క్రతాధ్రాలను ఔపోసన పడ్డాడు. 


కాదంబరి వర్ణనలు పుస్తకం చూడకుండానే అప్పజెప్పేవాడు. 
ఇక 'అప్పకవీయం', 'వసుచరిత్ర' 'మనుచరిత్ర' కరతలామలకమే! 


నాతో సహా ఎంతోమంది తెలుగు పండిట్ లను తయారు జేసాడు. నాటికలూ రాసాడు. నాటకాలూ రాసాడు. శతకమూ రాసాడు. ఉపనిషత్తులు చదివి అర్దాలూ విడమర్చి చెప్పాడు. నిలువెత్తు సాహిత్యచైతన్యం.. 


ఎన్నో పుస్తకాలూ కొన్నాడు. విపరీతంగా చదివాడు.. 


అన్నయ్య ఫోన్ చేసాడు. 
"ఇల్లు ఖాళీ చేసి కొత్తింటికి మారుతున్నాము. నాన్ననూ, అమ్మనూ తీసుకెడుతున్నాను. సామానంతా బోలెడు ఉంది. అమ్మేస్తున్నాను " అని. 


"అంతేగా! అమ్మేయక ఏంచేస్తావ్? కానీలే!.. 
కానీ మేమూ వచ్చేస్తున్నామ్. సహాయం చేస్తాం.. " సామానుసర్దే సహాయానికి వెళ్ళా. 


నేను వెళ్ళేటప్పటికి, పసిపిల్లాడల్లే, కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తున్న నాన్న.. పక్కనే అమాయకంగా నిలబడ్డ అమ్మ. 


బి. పి అనుకోకుండా పెరిగిందో, అశ్రద్ధవల్లో గానీ, బ్రైన్ స్ట్రోక్ వచ్చి, ఫార్టీ పర్సెంట్ మెదడు డామేజ్ అయిందని డాక్టర్ చెప్పేవరకూ తెలుసుకోలేక పోయిన దురదృష్టం వల్లనేమో, 
కొన్ని నెలలుగా నాన్నకి ఆరోగ్యం సరిగాలేదు. 


మైండ్ సరిగా పనిచేయట్లేదు. మథ్య మథ్య లో మతితెరిపి వస్తోంది. వచ్చినప్పుడు మనుషుల్ని గుర్తుపట్టటం, మరుపు వచ్చినప్పుడు మరిచిపోయి, నువ్వు ఎవరు? అవి అడగటం, కలిచివేస్తోంది. 


ఇదంతా వయసు మళ్ళాక సహజమే అని సరిపెట్టుకున్నా.. ఓ శతకము కర్త ఇలాంటి స్థితికి.. 


మాకు కళ్ళు చెమర్చినాయి. 


"ఏరా! నేను రాసిన శతకం పుస్తకం ఏదిరా? పేరుకూడా మరిచిపోయా! "


"రామలింగేశ్వర శతకం.. ఇదిగోనాన్నా! దీనిని రామలింగేశ్వర స్వామి గుళ్ళో దేవుడికి అంకితమిచ్చావుగా! గుడివారు నీకు ఘనసన్మానం చేసారు గుర్తుందా? నాన్నా! ఇదిగో సన్మాన పత్రం! ఇదిగో ఫొటో! ఇదిగో అప్పుడు వాళ్ళు కప్పిన శాలువా!


ఇవిగో! మిగతాచోట్ల సన్మానపత్రాలూ, శాలువాలు. గుర్తుపట్టావా!? దాచిపెడతాలే!"


"గుర్తులేదురా!మిగతా పుస్తకాలు ఏవో ఉండాలిరా.. అవీ పేర్లు గుర్తులేవు.. "


అన్నీ మర్చిపోయి.. అన్నీ కోల్పోయినట్లున్న నాన్న.. 


ఎంత పండితుడూ!ఎంతమేధావీ! కాలమా! నీకు జేజేలమ్మా! 


కవిసార్వభౌముడైన శ్రీనాథునే కాడిభుజాన పెట్టించి దుక్కిదున్నించావే! సంకెళ్ళమాటిన కట్టేసావే!?


ఈరోజు భక్తరామదాసని కీర్తిస్తున్న గోపన్న ను అన్ని సంవత్సరాలు కారాగారవాసం చేయించావే!? 


ఇలా కాలానికి ఎదురీది బ్రతికి గెలిచిన ధీరులేరీ!? 


నేను ఆడీపాడిన, ఇల్లు, మా కోసం కొన్నఆటవస్తువులు, మేం పెరిగి పెద్దవాళ్లమయ్యేకొద్దీ, మాతో పాటే పెరిగిన సామాను, తెలుగు, సంస్కృత పుస్తకాలూ.. 


కొన్ని మార్వాడీకి అమ్ముడయినాయ్. 
కొన్ని కుప్పతొట్టిలోకి పోయినాయ్. కొన్ని పుస్తకాలు నాన్నకు తెలీకుండా తగులబెట్టబడ్డాయి. 
వేరే ఇంటికి వెళ్ళిపోయాక సామానుల్లో, తను పదిలంగా దాచుకున్న వస్తువుల జాడలకోసం..


 "అదెక్కడుందిరా? అదెక్కడుందిరా?!" అని పసివాడికి మల్లే వెదుక్కుంటున్న నాన్నని చూస్తే గుండె పిండేసింది. ఆ పిచ్చుకలా మనసు విలవిలలాడింది. 


మానసిక సంఘర్షణ.. ఇప్పుడు ఏదైతే జరిగిందో.. అది పగతోనో, ద్వేషంతోనో జరగలా!? అన్నయ్య చాలా మంచివాడు. 


నాకు కష్టం కలిగించకుండా నాన్నను తనదగ్గరే ఉంచుకుని ఎంత ప్రేమగా చూసుకుంటాడనీ?! 


రాజులు పోయారు. సామ్రాజ్యాలూ, సంస్థానాలూ పోయాయి. ఎంత పురావస్తుశాఖవారైనా, ఎన్ని ఙ్ఞాపకాలను భద్రపరచగలరు. మేమూ అంతేగా!? కాలం తనగర్భంలో ఎన్ని దాచుకుందో!


కొన్ని వస్తువులను మాత్రం ఙ్ఞాపకాలుగా తీసుకుని భారమైన మనసుతో ఇల్లు జేరాను. ఇవీ ఏదోనాటికి పోతాయిగా!
ఏమనిషితో వచ్చిన వస్తువైనా, ఆమనిషితోనే అంతమౌతుందా? ఇవన్నీ మనవి కావు ప్రపంచానివే! అక్కడికే చేరతాయి. 


మనసులో ఏదో ఎడతెగని సంఘర్షణ. 


విలువైన పట్టుబట్టలు కోరి కడతాం 
తర్వాత ఇంకేదో భవిష్యత్తు ఉన్నదని, కట్టుకోవచ్చని దాస్తాం. 
వయసు చివరికి నూలు బట్ట కూడా బరువే
పలుచని బట్ట తప్ప, ఏ బట్టా కట్టుకుని నిలవలేం. స్మశానంలో అదీ తీసేస్తారు. 


ఆఖరికి అదికూడా తొలగింపే. 
చిన్న పలుచని అంగోస్త్రం లో నాన్నని గుర్తుచేసుకుని, వైరాగ్యంతో నిట్టూర్చా. 


ఇంటికి వచ్చి, ఎందుకో నేను నివసిస్తున్న ఇంటివైపు చూసాను. కష్టార్జితంతో కట్టి, 'నేనే కట్టానహో' అని విర్రవీగుతున్న లంకంత ఇల్లు. ఇంట్లో ప్రతివస్తువు మీద విరక్తిలాంటి భావం. వనజ నా భార్య. నా ప్రమోషన్ లెటర్ చేతిలోపెట్టి 
"మీకు ప్రమోషన్ వచ్చిందండీ ఎంత గొప్ప విషయమండీ! ఎంత అదృష్టం అండీ!".. ఏదేదో చెబుతోంది. నా చెవికి చేరట్లేదు. 
 
నాన్న లాగే నేనూ రచయితను కూడా.. మనసుపడి ఎన్నో రచనలు ప్రచురించుకున్నా! అవార్డ్ లూ తెచ్చుకున్నా.. 
శాలువాలూ కప్పించుకున్నా.. 


ఇప్పుడు నాన్నకి ఏదైతే జరిగిందో. అదిరేపు నాకే. ఇప్పుడు ఏదైతే నాన్నో, అదిరేపు నేనే. 


ఇల్లు మారుతుంది. కొన్ని వస్తువులు, పుస్తకాలూ కాలిపోతాయి. కొన్ని అమ్ముడవుతాయ్. 
కొన్ని దానం చేయబడతాయి. 


మరికొన్ని పారవేయబడతాయ్.. మరి దేనికోసం ఈ వెంపర్లాట? దేనికీ తాపత్రయం? 


అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత 
అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా//


భగవద్గీతలోని గీతాచార్యుని బోధ గుర్తుకువచ్చింది. 


ప్రాణులన్నియును పుట్టుకకు ముందు కంటికి కనిపించనివి. ఇంద్రియ గోచరములు కావు. (అవ్యక్తములు) 
మరణానంతరం అవి అవ్యక్తములే. 


ఈ జననమరణ మధ్యకాలమునందు మాత్రమే ప్రకటితములు. (ఇంద్రియ గోచరములు)అగుచున్నవి. ఇట్టి
స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనము. 
కానీ మనసు ఊరుకుంటుందా? ఎవరి జీవితమైనా కడకు ఇంతేనని మనసు అంగీకరిస్తుందా?


ఇంక మనసుతో సంఘర్షించే ఓపికలేక.. 
స్నానంచేసి.. సంధ్యావందనానికి కూర్చున్నాను. 
ఆధ్యాత్మికతైనా సాంత్వనమిస్తుందేమోనని.. 


నేను తెలుసుకున్నా! 
జననానికీ, మరణానికీ మధ్యలోని కాలక్షేపమే జీవితమనీ!ఇంక మరేమీ కాదనీ! లేదనీ!


 ===========
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
కొందరు కుర్రవాళ్ళు పుట్టుకతో బద్ధకస్తులు
[Image: Picture2.png] 


రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు
 
పన్నగభూషణరావు ఆ ప్రాంతంలో గొప్ప విజ్ఞానిగా పేరుపొందాడు. అతనికి చాలా మంది శిష్యగణం ఉన్నారు. అసమర్ధులను సమర్థులుగా ఆకతాయిలను మంచివాళ్ళుగా తీర్చిదిద్దడంలో పన్నగభూషణరావు పెట్టింది పేరుగా ప్రసిద్ధి చెందాడు. 


ఆ క్రమంలో అతన్ని ఆట పట్టించాలని ప్రయత్నించే వాళ్ళు కూడా కొంతమంది తయారయ్యారు. అలాంటి వాళ్లను సైతం పన్నగభూషణరావు ఇట్టే గ్రహించి.. ఎవరికి ఏ రకంగా చివాట్లు పెట్టాలో, ఎవరికి ఏ రకంగా విజ్ఞానం బోధించాలో, ఎవరిని ఏ గాడిలో పెట్టాలో అలా పెడుతుండేవాడు. 


అలా జరుగుతుండగా ఒక రోజు అతని దగ్గరకు కరట కదమనకరావు అనే వ్యక్తి ప్రవేశించాడు. గురువుగారు.. అంటూ ఆయన కాళ్లపై పడి పైకి లేవకుండా అలాగే ఉండిపోయాడు. పన్నగభూషణరావుకు ఆ వచ్చిన వ్యక్తి విషయం ఇట్టే అర్థమయిపోయింది. వాడేదో టక్కు టమాటాగాడు అని ఇట్టే గ్రహించేసాడు. 


''చూడబ్బాయి నువ్వు ఎందుకు వచ్చావు నాకు తెలియదు గానీ నువ్వు కాస్తంత పైకి లెగిస్తే నేను ఈ కాలు ను ఇలా సదురుకుంటాను. '' అంటూనే ఆ వ్యక్తి భుజాలు పట్టుకుని తనే పైకి లేవదీశాడు పన్నగభూషణ రావు. 


''గురువుగారు.. మీరే దిక్కు. నేను ఏ కళలోనూ గొప్ప వాడిని కాదు. కానీ ఏదో ఒక కళలో రాణించాలని గట్టి పట్టుతో మీ దగ్గరికి వచ్చాను. లేకుంటే ఈ ప్రపంచంలో బ్రతకలేము కదా. నిజం గురువుగారు అబద్ధం కాదు నేను మిమ్మల్ని బోల్తా కొట్టించడానికి వచ్చిన వాడిని కాదు.. గురువుగారు.. అన్న భక్తితోనే వచ్చాను. ఇదిగో ఈ కొబ్బరికాయ, అరటిపళ్ళు, పువ్వులు మీకోసం తెచ్చాను. స్వీకరించి నన్ను ధన్యుడు ని చేయండి'' అంటూ తన బ్యాగ్ లోంచి తీసి గురువుగారి ఒడిలో అవన్నీ పెట్టాడు. 


''ఓరి బడవ.. నువ్వు తింగర అంగర బడుద్దాయి వి ఏమీ కాదు. నువ్వు కాకపట్టు అనే పెద్ద కళలో ఇప్ప టికే 100% మార్కులు సంపాదించేసిన గొప్ప కళాకారు డువి అన్నమాట. లేకపోతే ఏమిటి రా. బతికున్న నా ఒడిలో చచ్చిపోయిన వాళ్లకు పెట్టినట్లు పెడుతున్నావ్ ఏంటి ఇవన్నీ. స్వీట్లు అయితే పరవాలేదు కానీ కొబ్బరి కాయ అరటిపళ్ళు పువ్వులు ఒడిలో పెట్టకూడదురా.. అప్రాచ్యుడా. 


సరే.. నీ విషయం ఏమిటో చెప్పు నువ్వు ఏ కళలో ప్రావీణ్యత సంపాదించుకోవాలనుకుంటున్నావు. ''


అంటూ కరటకదమనకరావు మీద కొంచెం జాలిపడి
అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. 


'' గురువుగారు, అసలు కళలు ఎన్ని? వాటి ప్రాముఖ్యత ఏమిటి? కొంచెం విశదీకరించండి. ఆ తర్వాత నేను నిర్ణయించుకుంటాను.. '' అంటూ వినయంగా అడిగాడు చేతులు కట్టుకొని గురువుగారి ముందు బాచీమట్టం వేసి కూర్చున్న కరటకదమనకరావు. 


''బాగుందిరా. నీకు చిన్న పిల్లాడికి పాఠం చెప్పినట్టు చెప్పి అన్ని అర్థమయ్యేటట్టు వివరించాలని ఉంది నాకు.. జాగ్రత్తగా విను నోట్ చేసుకోవాలనుకుంటే నోట్ చేసుకో.. 


కళలు 64. అందులో మూడు కళలు అసలు ప్రస్తుత దేశ కాలమాన పరిస్థితిలో ఎవరో కానీ సాధించలేనివి. అది నీకు అనవసరం అనుకో కానీ వాట్ల గురించి ముందుగా తెలుసుకుంటే.. 


1. జలస్తంభన.. అంటే.. నీళ్లను గడ్డకట్టించి దానిపై నడిచే కళ.. అది నువ్వు చేయలేవు కదా. 


2. ఖడ్గ స్తంభన.. ఇతరుల ఖడ్గాలను పనిచేయ కుండ ఆపుచేసే కళ. 


3. వాయు స్తంభన.. గాలిలో తేలియాడే కళ.. ఇది కూడా నువ్వు ఎంత సాధన చేసిన సక్సెస్ కాలేవు. 
ఋషులు యోగులకే ఈ కళలు అలవాటు కాబడ తాయి


అర్థం అయింది కదా. ఈ మూడు ప్రస్తుత సమాజంలో మానవులకు బాగా దూరంగా ఉన్న కళలు. వీట్లను సాధించాలంటే ప్రత్యేక మైన కఠోర జీవితసాధన అవ సరం అవుతుంది. కనుక ఆ వైపు ఎవరో కానీ చూడటం లేదు. మహాఋషిలాంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు ఎవరైనా ఒకచో సాధన చేసి అలవాటు చేసుకున్నప్ప టికీ.. వాటి వల్ల మానవ వ్యక్తిత్వ అభివృద్ధికి ఉప యోగం శూన్యం. ఈ అద్భుతమైన కళల గురించి ఒక పక్కన పెట్టేయ్. 


ఇంతవరకు నీకు అర్థమైంది కదా. 


ఇక మిగిలిన కళలన్నీ మానవులతో మమేకమై ఉన్నా యి. 


వాట్లలో మానవులకు కీడు కలిగించే కళలు కూడా కొన్ని ఉన్నాయి రా. వీట్లవల్ల మానవుల వ్యక్తిత్వం అధోగతి పాలు అవుతుంది. ఇవి అనుసరించే శాతం చాలా ఎక్కువగానే ఉంది.. ప్రస్తుత సమాజంలో. 


ఆ కళలు ఏమిటో ముందు తెలుసుకో కానీ అదే కావాలని పిచ్చి కోరిక కోరకు. 


1. విద్వేషణము.. పరులకు విరోధము కలిగించడం


2. మారణము.. పరులకు ప్రాణహాని కలిగించడం. 


3. కాలవంచనము.. కాలముగాని కాలమున పరి స్థితుల్లో పెను మార్పులు కలిగించడం. 


4. చౌర్యకళ.. దొంగతనము చేయడంలో నేర్పరి తనం. 


5. జూద కళ.. ఇది అందరికీ తెలుసున్న మహా గొప్ప చెడు వ్యసనం. ఈ వ్యసన కళ లో ఆరితేరిన వెధవలు మన ఊళ్లో చాలామంది ఉన్నారు కదా.. నీకు తెలుసు కదా


ఇవన్నీ మానవుల మానసిక, వ్యక్తిత్వ విజయానికి కించిత్తు దోషపూరితమైన కళలు. 


ఇవన్నీ కూడా ఒక పక్కన పెట్టేయ్. 


ఇక కళలలో సరదా కళలు కూడా రెండు మూడు ఉన్నాయి. 


1. పాదుకా సిద్ధి కళ.. ఇంద్రజాల, మహేంద్రజాలం, తలచిన చోటుకు వెళ్లడం, కావలసిన వాటిని సృష్టిం చడం.. వీట్లని అందరూ గారడివిద్య కళలు అంటారు. 


2. అదృశ్య కరణి కళ.. పరులకు కనిపించకుండా మెలగడం


ఇలాంటి కళలన్నీ కేవలం సరదాకళలు మాత్రమే. 
వీట్ల వల్ల మానవలోకానికి ఉపయోగముందాఅంటే.. ఉపయోగముంది.. ఉపయోగం లేదు అంటే ఉపయో గం లేదు. మరి ఇలాంటి కళలు వల్ల మానసిక వ్యక్తిత్వ వికాసం ఎలా జరు గుతుంది.. అసలు జరగదు అని కచ్చితంగా చెప్ప వచ్చు. 




తర్వాత అధ్యాయం,, 64 కళలలో అవసరం కళలు కూడా ఉన్నాయి. 


1. కామశాస్త్రకళ.. 


2. రతి కళ.. ఈ కళలు మానవులకు అవసరమే, ప్రాణ ప్రదమైనవే కానీ.. వీట్లలో ఆరోగ్య పవనాలు.. అనా రోగ్య పవనాలు కూడా ఉంటాయి. ఆయా వ్యక్తులు వాటిలని ఉపయోగించే విధానాన్ని బట్టి అది ఆధార పడి ఉంటుంది. 


కామశాస్త్ర కళ, రతి కళ అనే సరికి చొంగలు కారుస్తూ చూస్తున్నావు.. ఈ తరం కుర్రాళ్ళు బాగుపడాలంటే అంటే చాలా కష్టం రా. 


రకరకాల వ్యసన కళలు కంప్యూటర్ రంగంలో వచ్చే సాయి. వాటిలలో నూటికి అరవై పాళ్లు మనుషుల
ప్రాణాలు తీసే అంత భయంకరమైన చెడు వ్యసన కళలు. ఏం చేస్తాం అభివృద్ధి అలా వక్రమార్గాన పయ నిస్తుంది ప్రస్తుతకాలం లో. 


సరే ఇవన్నీ నీకు నేను వివరంగా చెప్పవలసిన పని లేదులే నువ్వే నాకు చెప్తావు. 


ఇక లెసన్ లోకి వద్దాం. 
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
ఇంకొన్ని కళలు కొన్నికొన్ని వృత్తులకు వారు వాట్లను నమ్ముకొని అమోఘంగా జీవన విధానం సాగిస్తున్నా రు. తరతరాలుగా కుటుంబాలను పోషించుకుంటు న్నారు. ఆయా కళలలో ఇమిడిపోయి మానసికంగా కూడా అభివృద్ధి చెంది ఉన్నత శిఖరాలను అధిరోహి స్తున్నవాళ్లు కోట్ల మంది అన్నారు. 


ఆ కళలే పాదుకాసిద్ధి, మంత్రసిద్ధి, ఔషధసిద్ధి, అంబర, చర్మ, వేలు, దారు, పాషాణ, లోహా, చిత్ర, మృగయ, యుద్ధ, లాపుకర్మ, ఆసవకర్మ, 


 ఇంకా చాలా ఉన్నాయిరోయ్ అవి ఏమిటంట.. కృషి, పాశుపల్యము, వాణిజ్య, మల్ల యుద్ధ, పాకకర్మ, గంధవాదము, ధాతువాదం, దోహళము, ఖనివాదము, రసవాదము, సాముద్రి కము, రత్నపరీక్ష, స్వర్ణపరీక్ష, 
అశ్వలక్షణము, గజ లక్షణం, లిపికర్మ, వాచకము, సర్వశాస్త్రము, సమస్త అవధానము, దేశభాష జ్ఞానము.. 


ఈ కళలన్నీ మానవులకు మానసిక వికాసమే కాదు.. వారి మానసిక పరిపక్వత, వారి మేధోసంపత్తి, వారి వ్యక్తిత్వ వికాసపు అభివృద్ధికి నూటికి నూరుపాళ్ళు ఉపయోగిస్తూ మానవలోకాన్ని ముందుకు తీసుకువెళు తున్న మహోన్నత మైన కళలు. 


ఇకపోతే వేద వేదాంగ ఇతిహాస ఆగమ న్యాయ శాస్త్ర కళలన్నీ.. మానవులకు ప్రాణం పోసే కళలు. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఎప్పుడైనా మనిషి మృగంగా మారి నప్పుడు ఆ మనిషిని మృగస్థానం నుండి మామూలు మనిషి స్థానానికి తీసుకురావడానికి మహోన్నతమైన ఈ కళలన్నీ దోహదపడుతున్నాయి. ఈ కళలు లేకపోతే మనుషులు ఉండరు అందరూ మృగాలే. మరి కళలు మానవుల పాలిటి ప్రాణవాయువులు కాదనగలమా. 


ఇకపోతే.. మానవులకు బాగా తెలుస్తున్నవి. అభిమా నించేవి, ఆదరించేవి నాలుగు మాత్రమే. 


1. నాటక
2. గాన
3. కవిత్వ
4. కావ్యాలంకారము.. అంటే సాహిత్యము అన్నమాట


ప్రస్తుత సమాజంలో నటన, గాన, కవిత్వ, సాహిత్య కళలలో మేధావి వర్గానికి సంబంధించిన కొందరు మానవులు బాగా ఆకర్షింపబడి వాట్లను ప్రేమిస్తూ, నమ్ముకుంటూ, అభిమానిస్తూ బ్రతకడం నేర్చుకు న్నారు. 


ఈ నాలుగు కళలు మానవులకు పొట్ట నింపకపోవచ్చు. 
కానీ వాళ్లను మేరుపర్వతం మీద కూర్చో బెడుతు న్నాయి. సూర్యుడు ఉదయించే ప్రతి భూభాగంలో వాళ్ల కు మహోన్నతమైన గౌరవ మర్యాదలను తెచ్చిపెడుతు న్నాయి. వాట్ల ద్వారా మనిషి మానసికంగా, వ్యక్తిత్వ పరంగా మహోన్నతశిఖరం అధిరోహించడానికి అవ కాశం కలుగుతుంది. 


ఆ విజయాలతో అతను కొత్త ఊపిరి పోసుకుంటూ ఆహారం తినకపోయినా బ్రతికేయగలిగే అంత శక్తి వంతుడు కాగలుగుతున్నాడు. ఇవి నమ్ముకుని పాడై పోయిన వాళ్ళు ఎవరూ లేరు. 


అర్థమవుతుంది కదా మరి నీ మొఖం అలా పెట్టావు ఏమిటి రా ప్రశ్నార్ధక మార్కులాగా.. జాగ్రత్తగా విను.. 


అయితే ప్రస్తుతం దేశ కాలమాన పరిస్థితులను బట్టి
ఈ నాటక గాన కవిత్వ సాహిత్య కళలు రూపాంతరం చెందాయి. సినిమా అనే ఒక వ్యాపార రంగం వైపు ఈ కళలు మళ్లించబడ్డాయి. దాంతో మనిషికి మానసిక వ్యక్తిత్వ వికాసాన్ని నూటికి నూరుపాళ్ళు అందించే ఈ రకమైన కళలు అపభ్రంశం అయిపోయాయి. 


రంగస్థలం మీద అమోఘమైన నటన చేస్తూ మహా నటుడుగా తన నటనను నిరూపించుకునే శక్తి పూర్వం లో మనుషులకు ఉండేది. నటనే జీవనంగా అప్పుడు బ్రతికేవారు. అప్పట్లో వాళ్లకు ఆ నటన బ్రతుకు కూడా ఇచ్చేది. రారాజు భోగం కూడా అనుభవించారు. మరి ఈ నటన అనే కళ సినిమాలలో డ్రమెటిక్ గా మారిపో యింది. మనిషి నటించకుండా కెమెరా మనిషిని నటిం ప చేసేస్తోంది. అసలు మనిషే లేకుండా నటనే లేకుండా మనిషి నటించినట్లు చూపించగలిగే శక్తి ప్రస్తుత టెక్నాల జీకి వచ్చేసింది. దాంతో నటన అనే పదమే మరుగై పోయింది. నటన అనే కళ నిజం చెప్పాలంటే భూస్థాపితం అయిపోయింది. 


అదిగో అప్పుడే.. సమాజంలోనే ఇతరులతో సహజంగా నటించడం నేర్చేసుకున్నారు ప్రజలు. ఇదిగో నీలాగా అన్నమాట. దగా, కుళ్ళు, కుట్ర, అన్యాయాలు.. నటిం చేస్తున్నారు తెగ నటించేస్తున్నారు. తండ్రి కొడుకు మధ్య నటన, భార్యాభర్త మధ్య నటన, గురుశిష్యుల మధ్యనటన. దేవుడు భక్తుడు మధ్య నటన. ఈ ప్రపంచమే నాటక రంగం అయిపోయింది. నాటక కళ.. దానిష్టమొచ్చి నట్లు నవరస నాట్యం చేసేస్తుంది. మరి ఇలాంటి కళవల్ల మానవుల వ్యక్తిత్వ మానసిక వికాసం ఎలా జరుగుతుంది. 


అందుచేత ప్రస్తుతం నటనతో మనిషి కచ్చితంగా మానసికంగా వ్యక్తిత్వపరంగా ఎదగలేడు. 


రెండవది గానకళ. ఇది అజరామరమైన కళ. ఇంతటి గొప్ప కళ మరొకటి లేదు అని కూడా కచ్చితంగా చెప్ప వచ్చు. ఈ కళను నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. 


అప్పుడే పుట్టిన పిల్లవాడు ఏడవడం కూడా ఒక గాన కళ లాంటిదే. మనిషి ఏడుపు, నవ్వులలో కూడా.. అత్యద్భుతమైన గాన కళలు మనకు వినిపిస్తూ ఉంటాయి. 


పురాణాలలో పాట పాడితే కొండలు కరిగిపోయిన కథలు చదివాము. రావణాసురుడు తన పేగులతో సంగీత గానకళ ద్వారా ఆ మహాశివుడునీ ప్రత్యక్షం అయ్యేటట్లు చేసుకోగలిగిన కథలు చదివాము. అంతెం దుకు ప్రశాంతసమయంలో మంచి గానం వినడం ద్వారా మనుషుల రోగాలు సైతం మాయం అవుతాయి అని మన సైన్సు చెప్పుతున్న ఉదంతాలు మనకు తెలుసు. అలాంటి మహోన్నతమైన ఈ గాన కళ మనుష్యులకు దేవుడు కోరకుండ ఇచ్చిన వరం. ఈ కళ వల్ల మనుషుల మానసిక వ్యక్తిత్వ అభివృద్ధి చెందడమే కాకుండా.. ఆయు ఆరోగ్యాలతోటి చిరకాలం బతుకు సాగిస్తారు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. 


మిగిలినది కవిత్వ కళ.. మరియు కావ్యాలంకారము అనగా సాహిత్యకళ అంటే రచనా వ్యాసాంగం అన్న మాట. 


ఒకప్పుడు అయితే ఈ కళ ఆరోగ్యదాయకంగా ఉండేది. ఇప్పుడు కుంటిగా అనారోగ్యం పాలు అయ్యిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇలా నేను అంటుంటే స్వచ్ఛమైన తెలుగు మాట్లాడే వాళ్ళకి రాసే వాళ్ళకి నా మీద పీకలోతు కోపం రావచ్చు. 


ఏం చేస్తాము నిజాన్ని నిర్భయంగా చెప్పక తప్పదు. 
ఇంగ్లీషుభాష తప్పకుండా అభివృద్ధి చెందడం అనే పరిస్థితి ఏర్పడడంతో తెలుగు భాష మీద అది నేర్చుకునే వాళ్ల మీద మొట్టికాయలు పడ్డాయి. ఇప్పుడు నూటికి 90 మంది మాట్లాడేది రాసేది సగం సగం
తెలుగే.. !
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
ఈ పరిస్థితులలో ఒక మంచికథ మంచికవిత్వం మంచి వ్యాసం ఎలా పుట్టగలదు? ఇక్కడ కొత్తగా రాసేవాళ్ల ను నీరసపరచడం కాదు గాని వాళ్లు సరైన పునాదులు వేసుకోవడం లేదు. బహుగ్రంథాల పఠనం చేయడం లేదు. పోనీ పెద్దలు చెప్పిన మాటలు వినడం లేదు పెద్దలను గౌరవించడం లేదు. తాను రాసిన ఒక కథ గాని ఒక కవిత్వం గాని ఎలాగోలా ప్రచురణ, పబ్లిష్ అయ్యాక తాను చలం అంతటివాడు, శ్రీశ్రీ అంతటివాడు అయి పోయాను అని ఫీల్ అవుతున్నాడు. 


అయితే ఇందులో తప్పు వాళ్ళది ఏ మాత్రం కాదు. 
ఈ కళలను అభ్యసించాలి అన్న ఉత్సాహంవాళ్ళది. 
వాళ్లను సక్రమమైన మార్గంలో నడిపించవలసిన బాధ్య త సీనియర్లది. మీదు మిక్కిలి ప్రచురణ, పబ్లిష్, సాహి త్య సంస్థలది. వాళ్లు నడుము కట్టడం లేదు ఎవరి స్వార్థం వాళ్లు చూసుకుంటున్నారు. పైగా జూనియర్లను విమర్శిస్తున్నారు, చిన్నబుచ్చుతున్నారు. అందరిలో ఓర్పు సహనం అంతరించిపోతున్నాయి. 


ఒక యావతో సాహిత్య సంస్థలు సొంత డబ్బుతో నడిపే మహానుభావులు కూడా ఉన్నారు. వాళ్లకు శతకోటి దండాలు. వాళ్లు నిస్వార్థ జీవులు అన్నమాట. తన స్వార్థం మాత్రమే చూసుకోకుండా తమ సంస్థకు సేవలు అందించే రచయితల, కవులను కూడా అంతో ఇంతో ఎంతోకొంత బహుమతులతో తృప్తి పరుస్తుంటారు. 
ఇక్కడే చిక్కు వచ్చి పడింది. ఇలాంటి వాళ్లను.. అట్లాంటి వాళ్లను ఎదగనివ్వరు.. సాటి సంస్థల యజమానులు. కుటిల, కుట్ర స్వభావాలు. 


ఇప్పుడు ఆలోచిస్తే కవిత్వము, సాహిత్యము అనే కళలు ద్వారా ఎంతమాత్రము మనిషి మానసిక పరిపక్వత, వ్యక్తిత్వ వికాసము పొందలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితి మారితేనే కానీ ఈ కళలు రాణించవు. 


మేధావి వర్గానికి సంబంధించిన అద్భుతమైన ఈ కళలు రాణిస్తేనే గాని మానవులు మానసిక, వ్యక్తిత్వ వికాసం పొందలేరు. ''


ఇప్పుడు చెప్పు ఈ మొత్తం 64 కళలలో నువ్వు ఏ కళలో ప్రావీణ్యం సంపాదించి అభివృద్ధి సాధించాలను కుంటున్నావు.. ?''


అంటూ ప్రశ్నించి గురువు పన్నగభూషణరావు వివరాలు తెలుసుకోవడానికి తన దగ్గరకు వచ్చిన కరటక దమనకరావు చూశాడు కళ్ళు తెరచి. 


పాపం అప్పటివరకు ఆయన తదేక దీక్షతో శిష్యుడికి విషయమంతా చెప్పి న్యాయం చేయాలి అన్న ఒక పద్ధతిలో కళ్ళు మూసుకుని వివరిస్తున్నారు పాపం. 
ఒక ఆధ్యాత్మిక విధానంతో. 


అలా ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి ఇంకెక్కడ కరట కదమనకరావు.. కనుచూపుమేరలో అతని ఆచూకీ లేదు. 


ఇలాంటి సంఘటనలు పన్నగభూషణరావు కొత్త కాదు కనుక అంతగా ఆశ్చర్య పడలేదు.. పైకి లేచి.. నేటి యువతరం తీరు ఇంతగొప్పగా ఉందన్నమాట అని నవ్వుకుంటూ తన పనిలో నిమగ్నమయ్యారు గురువు గారు. 


**
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply
ప్రశ్న - isun finn

[Image: p.jpg]
బెంచ్ మీద నల్లటి డైరీ తెరిచి ఉంది.
పక్కనే నీలి రంగు కలం.
కిటికీ అద్దం మీద వర్షపు చినుకులు జారుతున్నాయి.
గదిలో లైట్ వెలుగుతోంది.
అయినా అపర్ణ కూర్చున్న చోట మాత్రం ఏదో చీకటి కమ్ముకున్నట్టుంది.
ఆమె డైరీలోని ఖాళీ పేజీనే చూస్తోంది.
రాయడానికి ఏమీ లేక కాదు.
చాలా ఉంది.
కానీ...
దేనితో మొదలుపెట్టాలో తెలియడం లేదు.
కలం పేజీని తాకిందఒక చిన్న గీత.
అక్కడే ఆగిపోయింది.
అపర్ణ వెనక్కి వాలింది.
“నేను నిజంగా ఏం కోరుకుంటున్నాను?”
ఆ ప్రశ్న చాలా రోజులుగా ఆమె మనసులో తిరుగుతోంది.
దాని వెంట మరో ప్రశ్న.
“నేను చేస్తున్నది సరైనదేనా?”
మరోటి.
“నేను ఇంతకంటే బాగా చేయగలనా?”
చివరికి—
“లేక... నేను అనుకున్నంత సామర్థ్యం నాకు లేదా?”
ఆమె పెదవుల మీద చిన్న నవ్వు మెరిసింది.
తనకే తన ప్రశ్నలు భరించలేనట్టుగా.
చిన్నప్పటి నుంచి అపర్ణకు ప్రశ్నలంటే ఇష్టం.
ఎందుకు?
ఎలా?
ఇలా ఎందుకు జరుగుతుంది?
అలా చేస్తే ఏమవుతుంది?
ప్రశ్న అడిగితే సమాధానం వెతికేది.
కానీ కొంతకాలంగా...
ప్రశ్నలు బయటివాళ్లను కాదు, తననే వెంటాడుతున్నాయి.
అక్కడి నుంచే సమస్య మొదలైంది.
ఫోన్ మోగింది.
స్క్రీన్ మీద పేరు చూసి వెంటనే తీసుకుంది.
“హలో అక్క, ఎక్కడున్నావ్?”
“రూమ్‌లోనే ఉన్నాను యతిన్. ఏమైంది?”
“నువ్వు జాబ్ మానేస్తున్నావంట... నిజమేనా?”
అపర్ణ కాసేపు మౌనంగా ఉంది.
“అవును.”
“ఎందుకు?”
“ప్యాక్ చేసుకుంటున్నాను. ఇంటికి వెళ్లిపోతున్నాను.”
“అది కాదు. జాబ్ ఎందుకు మానేస్తున్నావు?”
“అలా అనిపించింది.”
“మొన్నటిదాకా ఆ జాబ్ గురించి బాగానే చెప్పావుగా?”
“అవును... కానీ...”
“కానీ?”
అపర్ణ కిటికీ వైపు చూసింది.
“నేను చేస్తున్న పనికి వస్తున్న జీతం... నా పొజిషన్... వాటికి నేను అంత అర్హురాలిని కాదేమో అనిపిస్తోంది.”
అటువైపు నిశ్శబ్దం.
“అక్క...”
“హ్మ్.”
“ఎవరైనా జీతం ఎక్కువ వస్తుందని జాబ్ మానేస్తారా?”
అపర్ణ చిన్నగా నవ్వింది.
“నాకు సంతోషంగా అనిపించలేదు.”
“అసలు ఏమైంది?”
“ఏమీ లేదు యతిన్.”
“నిజంగా ఏమీ లేదా?”
“...ఉంటే చెప్తాను.”
“ఎప్పుడు?”
“తెలియదు.”
ఈసారి యతిన్ ఏమీ అడగలేదు.
“సరే.”
కొద్దిసేపటి తర్వాత మెల్లగా అన్నాడు—
“ఎప్పుడైనా చెప్పాలనిపిస్తే ఫోన్ చేయి.”
“హ్మ్.”
“అక్క?”
“ఏంటి?”
“నువ్వు ఒంటరిగా లేవు.”
అపర్ణ కళ్ళు మూసుకుంది.
“తెలుసు యతిన్.”
“నేను రానా నీ దగ్గరికి?”
“లేదు. వద్దు.”
“మాట్లాడుకుందాం.”
“నీకు ఆఫీస్ ఉంది కదా.”
“అది రేపు కూడా ఉంటుంది.”
అపర్ణ కొద్దిసేపు మౌనంగా ఉంది.
“వీకెండ్‌కి ఇంటికి రా. అప్పుడు మాట్లాడుకుందాం.”
“అంతేనా?”
“అంతే.”
“ఇంకేం లేదా?”
అపర్ణ చిన్నగా నవ్వింది.
“నువ్వు తిన్నావా?”
“అది ఎందుకు?”
“ల్యాప్‌టాప్ ముందేసుకుని పని చేస్తూ టైం ఎంతైందో కూడా తెలియదు నీకు. ఎప్పుడు తింటున్నావో, ఎప్పుడు నిద్రపోతున్నావో కూడా తెలియదు.”
“తిన్నాను అక్క.”
“నిజమా?”
“నిజం. ఫ్రెండ్స్‌తో బయట ఉన్నాను.”
“అదే కదా...”
“ఏంటి?”
“ఏమీ కాదు.”
“కానీ ఈరోజు బిల్ ఒక్కడే కట్టాలి.”
“నీ టర్నా?”
“అవును. నా జేబు ఖాళీ అయిపోయింది.”
అపర్ణకి చిన్నగా నవ్వొచ్చింది.
“అందుకే వీళ్లతో అంటున్నాను. డబ్బులు ఖర్చు చేయకుండా అన్ని ఐటమ్స్ తెచ్చి రూమ్‌లోనే వండిపెడతానని.”
“నువ్వు బాగా వండుతావ్ యతిన్.”
“ఉండు అక్క. స్పీకర్‌లో పెడతా. మళ్లీ చెప్పు.”
కొద్దిసేపటికి ఫోన్‌లో మరికొన్ని గొంతులు వినిపించాయి.
“యతిన్ నిజంగా బాగా వంట చేస్తాడు,” అపర్ణ అంది. “స్పెషల్‌గా చికెన్ ఫ్రై, మటన్ బిర్యానీ చాలా బాగా చేస్తాడు.”
అటువైపు నవ్వులు వినిపించాయి.
“థాంక్యూ అక్క!”
“మోస్ట్ వెల్‌కమ్.”
కొద్దిసేపటి తర్వాత యతిన్ మళ్లీ మాట్లాడాడు.
“మరి ఎలా వెళ్తున్నావు ఇంటికి?”
“క్యాబ్ బుక్ చేశాను. రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతాను.”
“సరే. జాగ్రత్తగా వెళ్లు.”
“హ్మ్.”
“అక్క?”
“ఏంటి?”
“ఏదైనా చెప్పాలనిపిస్తే... నాతో మొదలుపెట్టు.”
కాల్ కట్ అయింది.
ఫోన్ పక్కన పెట్టేసరికి ఆమె కళ్ళల్లో మళ్లీ నీళ్లు తిరిగాయి.
తమ్ముడికి చెప్పాలనుకున్న నిజమైన విషయం...
అతనితో కూడా చెప్పలేకపోయింది.
మరుసటి రోజు రాత్రికి అపర్ణ ఇంటికి చేరుకుంది.
గేటు తీసి లోపలికి అడుగు పెట్టగానే అమ్మ బయటకు వచ్చింది.
“వచ్చావా?”
అపర్ణ బ్యాగ్ కింద పెట్టి అమ్మను గట్టిగా హత్తుకుంది.
“లవ్ యు అమ్మ.”
అమ్మ నవ్వింది.
“ఏమైంది?”
“ఏమీ లేదమ్మా. ఊరికే.”
అమ్మ ఆమె ముఖాన్ని చూసింది.
“నీ కళ్ళు ఉబ్బినట్టున్నాయే.”
“నిద్ర సరిగ్గా పోలేదు.”
“ఉద్యోగం వల్లా?”
“హ్మ్.”
అమ్మ మరేం అడగలేదు.
“లోపలికి రా. తినేద్దువు.”
ఆ ఒక్క మాటలోనే అమ్మ అడగాల్సిన వంద ప్రశ్నలు దాగున్నాయి.
హాల్‌లో నాన్న పేపర్ చదువుతున్నాడు.
“అపర్ణా!”
“వస్తున్నా నాన్న.”
ఆమె ఆయన పక్కన కూర్చుంది.
“తర్వాత ఏం చేయాలనుకుంటున్నావ్?”
“ఏదైనా చిన్న జాబ్ వెతుకుదాం అనుకుంటున్నా.”
“చిన్నదా?”
“అవును.”
“ఎందుకు చిన్నది?”
అపర్ణ సమాధానం చెప్పలేదు.
“నీకు అంతకంటే మంచి ఉద్యోగమే వస్తుంది.”
“ఏమో నాన్న.”
“ఏమో అంటే?”
అపర్ణ తలదించుకుంది.
“నేను అంత తెలివైనదాన్ని కాదేమో.”
“నువ్వు ఎప్పుడు ఇలా మాట్లాడటం మొదలుపెట్టావు?”
“నాకు అనిపిస్తోంది అంతే.”
“నువ్వు నీ గురించి అనుకున్నదానికంటే చాలా ఎక్కువ చేయగలవు.”
అపర్ణ ఏమీ మాట్లాడలేదు.
“ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వు ఏం చేసినా మేము సపోర్ట్ చేస్తాం. కానీ నువ్వు నీ మీద నమ్మకం మాత్రం కోల్పోకు.”
అపర్ణ తల ఊపింది.
ఆ మాటకు సమాధానం చెప్పలేదు.
కానీ ఆ మాట మాత్రం ఆమెతోపాటు గదిలోకి వెళ్లింది.
ఆ రాత్రి నిద్ర రాలేదు.
గది చీకటిగా ఉంది.
ఒక్కొక్క సంఘటన గుర్తొచ్చింది.
మీటింగ్.
రిపోర్ట్.
క్రెడిట్.
ప్రశంస.
తన సమాధానాల మీద అనుమానం.
చివరికి ఆమె తనను తాను అడిగింది.
“నాకు నిజంగా పని మీద సమస్య ఉందా?”
కొంతసేపు ఆలోచించింది.
లేదు.
పనంటే తనకు ఇష్టం.
అయితే?
ఆమె మెల్లగా అంది—
“నాకు... నా మీదే సమస్య ఉందా?”
ఈసారి కూడా సమాధానం రాలేదు.
వీకెండ్‌కి యతిన్ ఇంటికి వచ్చాడు.
అతన్ని చూసిన వెంటనే అపర్ణ నవ్వింది.
“అక్క! ఎలా ఉన్నావు?”
“బాగున్నాను.”
“అబద్ధం.”
“ఏంటి?”
“నీ ముఖం చూస్తేనే తెలుస్తోంది.”
అపర్ణ నవ్వింది.
“నువ్వు పెద్ద సైకాలజిస్ట్ అయిపోయావా?”
“అది కాదు. నేను నీ తమ్ముడిని.”
ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు.
టీవీ ఆన్‌లో ఉంది.
కానీ ఎవరూ చూడడం లేదు.
కొద్దిసేపటి తర్వాత యతిన్ రిమోట్ పక్కన పెట్టాడు.
“ఇప్పుడు చెప్పు.”
అపర్ణ గ్లాస్‌లో నీళ్లు పోసుకుంది.
“యతిన్... నేను ఉద్యోగం వల్లే రాలేదు.”
“మరి?”
“నాకు నేను సరిపోవట్లేదనిపించింది.”
యతిన్ ఏమీ మాట్లాడలేదు.
“ఎవరైనా ఏదైనా అడిగితే... నా సమాధానం సరైనదో కాదో అనుమానమే.”
“హ్మ్.”
“ఏదైనా రాస్తే మళ్లీ ఎవరికైనా చూపించాలి.”
“హ్మ్.”
“నేను చేసిన పని మీద కూడా నాకు నమ్మకం ఉండేది కాదు.”
ఆమె గొంతు కాస్త వణికింది.
“నేను చేసిన పనికి క్రెడిట్ వేరేవాళ్లు తీసుకున్నా... ‘ఇది నేను చేశాను’ అని చెప్పలేకపోయాను.”
“ఎందుకు?”
“వాళ్లు నన్ను సెల్ఫిష్ అనుకుంటారేమో.”
యతిన్ ఆమె వైపు చూశాడు.
“అక్క...”
“హ్మ్?”
“అందరూ నిన్ను మంచి అమ్మాయిగా అనుకోవాలా?”
అపర్ణ అతని వైపు చూసింది.
“అలా కాదు.”
“మరి?”
“తెలియదు.”
యతిన్ కొద్దిసేపు ఆలోచించాడు.
“నువ్వు అందరూ నిన్ను ఎలా చూస్తారో చూసుకుంటూ... నువ్వు నిన్ను ఎలా చూస్తున్నావో మర్చిపోయావేమో.”
అపర్ణ ఏమీ మాట్లాడలేదు.
కొద్దిసేపటి తర్వాత యతిన్ అడిగాడు.
“ఇప్పుడు నీకు ఏం కావాలి?”
“తెలియదు.”
“కొత్త ఉద్యోగమా?”
“తెలియదు.”
“కొంతకాలం ఏమీ చేయకుండా ఉండాలా?”
“అదీ తెలియదు.”
యతిన్ నవ్వాడు.
“అయితే ఒక పని చెయ్యి.”
“ఏంటి?”
“ఇప్పుడే ఏ నిర్ణయమూ తీసుకోకు.”
“నాన్న అడుగుతారు.”
“అడగనివ్వు.”
“అమ్మ అడుగుతుంది.”
“అడగనివ్వు.”
“నువ్వు?”
“నేను కూడా అడుగుతాను.”
అపర్ణ నవ్వింది.
“కానీ నీకు సమాధానం తెలియకపోతే ‘తెలియదు’ అని చెప్పే హక్కు నీకు ఉంది.”
ఆమె అతని వైపు చూసింది.
యతిన్ మెల్లగా అన్నాడు—
“నువ్వు ఉద్యోగం కోసం కాదు అక్క... నీకోసం కొంచెం టైమ్ తీసుకోవాలి.”
ఆ తర్వాత అపర్ణ ఖాళీగా ఉండలేక తనకు ఆసక్తి ఉన్న సైకాలజీ గురించి చదవడం మొదలుపెట్టింది.
మొదట తనను తాను అర్థం చేసుకోవడానికే.
ఒక రోజు ఒక పుస్తకంలో ఆమె కళ్ళు ఒక వాక్యం దగ్గర ఆగిపోయాయి.
“కొన్నిసార్లు నమ్మడానికి అత్యంత కష్టమైన వ్యక్తి మీరే.“
ఆమె పుస్తకం మూసేసింది.
కొద్దిసేపు అలాగే కూర్చుంది.
మళ్లీ తెరిచింది.
ఆ రోజు మొదటిసారి “ఆత్మగౌరవం” అనే పదాన్ని తన జీవితంలోని కొన్ని సంఘటనలతో కలిపి చూసింది.
తర్వాత “హద్దులు”.
తర్వాత “ఆమోదం”.
పుస్తకంలోని ప్రతి పదం తన జీవితంలో ఎక్కడో ఒక తలుపు తెరిచినట్టుగా అనిపించింది.
కానీ ఈసారి ఆమె తనకు ఏదో ఒక పేరు పెట్టుకోవడానికి తొందరపడలేదు.
కేవలం గమనించింది.
ఎప్పుడు తన మాటను వెనక్కి తీసుకుంటోంది?
ఎప్పుడు భయంతో “బహుశా” అంటోంది?
ఎప్పుడు ఎదుటివాళ్ల అభిప్రాయం తన అభిప్రాయం కంటే ముఖ్యమవుతోంది?
సమాధానాల కోసం తొందరపడలేదు.
మొదటిసారి తనను తాను గమనించడం మొదలుపెట్టింది.
ఒక రోజు చదువుకు సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఒక మెసేజ్ వచ్చింది.
“మీ ఆన్సర్ రైటింగ్ చాలా బాగుంది. మనం ఫ్రెండ్స్ గా ఉంటూ డౌట్స్ షేర్ చేసుకుందామా? “
పేరు—దిశాంత్.
అపర్ణ కొద్దిసేపు ఆలోచించి,
“సరే.”
అని రిప్లై చేసింది.
మొదట మాటలు చదువు గురించే.
పుస్తకాలు.
టాపిక్స్.
ఆన్సర్ రైటింగ్.
నోట్స్.
కొన్ని రోజుల తర్వాత—
“నీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంది?”
అపర్ణ రిప్లై చేయలేదు.
మళ్లీ మెసేజ్.
“రిలేషన్షిప్లో ఉన్నావా?”
ఈసారి ఆమె టైప్ చేసింది.
“దిశాంత్, మనం చదువు గురించి మాత్రమే మాట్లాడుకుందాం.”
“అంత ఫార్మల్ గా ఎందుకు ఉంటావు?”
“నాకు కంఫోర్టాబుల్గా లేదు.”
“సరే... నీ ఫోటో అయినా పంపుతావా?”
అపర్ణ ఫోన్ పక్కన పెట్టింది.
కొద్దిసేపటి తర్వాత మళ్లీ తీసుకుంది.
మెసేజ్‌ను చూసింది.
ఈసారి పాత ప్రశ్న రాలేదు.
“నేను ఓవర్ రియాక్ట్ అవుతున్నానా?”
దాని బదులు మరో ప్రశ్న వచ్చింది.
“నాకు ఇది నచ్చడం లేదా?”
సమాధానం స్పష్టంగా ఉంది.
అవును.
ఆమె చాట్‌ను బ్లాక్ చేసింది.
ఫోన్ పక్కన పెట్టింది.
గుండె వేగంగా కొట్టుకుంటూనే ఉంది.
తన నిర్ణయం సరైందో కాదో ఎవరినీ అడగలేదు.
అదే ఆమెకు కొత్తగా అనిపించింది.
ఆ రాత్రి ఆమెకు ఎవరో ఒకరితో మాట్లాడాలనిపించింది.
తన గురించి ఏమీ తెలియని వ్యక్తితో.
ఒక అనానిమస్ చాట్ లోకి వెళ్లింది.
మొదటి ప్రశ్నలే—
“జెండర్?”
“ఫోటో?”
“వేర్ డూ యు లివ్?”
“వాట్సాప్?”
ఆమె ఒక్కొక్క చాట్ క్లోజ్ చేసింది.
చివరికి ఒక వ్యక్తి మాత్రమే ఏమీ అడగకుండా రాశాడు.
“ఏం మాట్లాడాలి?”
అపర్ణ చాలా సేపు టైప్ చేయలేదు.
చివరికి—
“ఏమీ లేదు.”
“అయితే ఇక్కడ ఎందుకు ఉన్నావు?”
“ఎవరితోనైనా మాట్లాడాలని.”
“ఏ విషయం గురించి?”
“తెలియదు.”
కొద్దిసేపటి తర్వాత రిప్లై వచ్చింది.
“సరే. తెలియకపోయినా మాట్లాడొచ్చు.”
అపర్ణ స్క్రీన్‌నే చూస్తూ ఉండిపోయింది.
ఎవరో మొదటిసారి తన దగ్గర సమాధానం అడగలేదు.
ఏదైనా నిరూపించమని అడగలేదు.
ఆమె ఎవరో కూడా అడగలేదు.
అందుకే ఆమె ఒక చిన్న నిజం చెప్పింది.
“నాకు ఎవరినైనా నమ్మాలని ఉంది.”
“ఎందుకు భయపడుతున్నావు?”
“నమ్మితే వాళ్లు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారేమో.”
కొద్దిసేపటి తర్వాత రిప్లై వచ్చింది.
“అయితే ఒక్కసారిగా నమ్మాల్సిన అవసరం లేదు.”
అపర్ణ ఆగింది.
“మరి?”
“కొంచెం కొంచెంగా నమ్మొచ్చు.”
“ఎలా?”
“ముందు వాళ్లు నీ ‘లేదు’ని గౌరవిస్తారా చూడు.”
అపర్ణ స్క్రీన్ వైపు చూస్తూ ఉండిపోయింది.
కొద్దిసేపటి తర్వాత టైప్ చేసింది—
“నన్ను అర్థం చేసుకోవడానికి ముందు... నేను నన్ను అర్థం చేసుకోవాలా?”
చాలా సేపటి తర్వాత రిప్లై వచ్చింది.
“బహుశా.”
మళ్లీ—
“కానీ ఆ పని నువ్వు ఒంటరిగానే చేయాల్సిన అవసరం లేదు.”
అపర్ణ ఏమీ రాయలేదు.
ఫోన్ స్క్రీన్ ఆరిపోయింది.
ఆమె దాన్ని మళ్లీ ఆన్ చేయలేదు.
కానీ ఆ రాత్రి చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయింది.
ఆ తర్వాత ఆమె డైరీలో ప్రతిరోజూ ఏదో ఒకటి రాయడం మొదలుపెట్టింది.
“ఈ రోజు నాకు కోపం వచ్చింది.”
“ఈ రోజు నాకు భయం వేసింది.”
“ఈ రోజు నేను ‘లేదు’ అని చెప్పగలిగాను.”
“ఈ రోజు నాకు ఏమీ చేయాలని అనిపించలేదు.”
“ఈ రోజు నేను తప్పు చేశాను.”
ఆ వాక్యం రాసిన తర్వాత చాలా సేపు పేజీని చూసింది.
ముందైతే ఆ తప్పును సరిదిద్దేందుకు మరో పేజీ రాసేది.
ఈసారి మాత్రం—
“తప్పు చేశాను. అంతే.”
అని రాసింది.
మరొక రోజు:
“ఈ రోజు నాకు నేను నచ్చాను.”
ఆ వాక్యం రాయడానికి మాత్రం ఆమెకు చాలా సమయం పట్టింది.
రాసిన తర్వాత దాన్ని కొట్టేయాలనిపించింది.
కలం పేజీ మీదే ఆగిపోయింది.
చివరికి కలం పక్కన పెట్టింది.
వాక్యాన్ని అలాగే వదిలేసింది.
కొన్ని నెలలు గడిచాయి.
అపర్ణ మళ్లీ ఉద్యోగం వెతకడం మొదలుపెట్టింది.
ఈసారి—
“ఏదైనా చిన్న జాబ్” కోసం కాదు.
తనకు నచ్చిన పని కోసం.
ఒక ఇంటర్వ్యూలో మేనేజర్ అడిగాడు.
“మీ ప్రీవియస్ జాబ్ ఎందుకు వదిలేశారు?”
అపర్ణ కాసేపు ఆలోచించింది.
ముందైతే ఆమె ముందే తయారు చేసుకున్న సమాధానం చెప్పేది.
ఈసారి మాత్రం—
“కొంతకాలం నా గురించి నేను కొన్ని విషయాలు అర్థం చేసుకోవాల్సి వచ్చింది.”
మేనేజర్ ఆశ్చర్యంగా చూశాడు.
“ఏ విషయాలు?”
అపర్ణ చిన్నగా నవ్వింది.
“అన్నీ ఇప్పటికీ అర్థం కాలేదు.”
ఒక్క క్షణం ఆగి చెప్పింది—
“కానీ నేర్చుకుంటున్నాను.”
మేనేజర్ తల ఊపాడు.
తర్వాతి ప్రశ్న అడిగాడు.
అపర్ణ సమాధానం చెప్పింది.
ఈసారి తన సమాధానం ఎలా వినిపిస్తుందో తెలుసుకోవడానికి ఎదుటివాడి ముఖం వైపు చూడలేదు.
ఆ రాత్రి ఇంటికి వచ్చి డైరీ తెరిచింది.
మొదటి పేజీల్లో గందరగోళమైన వాక్యాలు.
ప్రశ్నలు.
భయాలు.
తన మీద కోపం.
తనను తాను చిన్నచూపు చూసుకున్న మాటలు.
కొత్త పేజీ తెరిచింది.
రాసింది.
“ఈ రోజు నేను ఒక ఇంటర్వ్యూలో ‘నాకు అన్నీ తెలియవు’ అని చెప్పాను.”
కొద్దిసేపు ఆగింది.
తర్వాత రాసింది.
“అది చెప్పినందుకు నాకు సిగ్గుగా అనిపించలేదు.”
ఆమె నవ్వింది.
అదే సమయంలో యతిన్ ఫోన్ చేశాడు.
“అక్క, ఎలా జరిగింది?”
“బాగానే.”
“జాబ్ వస్తుందా?”
“తెలియదు.”
“మళ్లీ అదే ‘తెలియదు’.”
అపర్ణ నవ్వింది.
“అవును.”
“ఇప్పుడైనా భయంగా ఉందా?”
“ఉంది.”
“అయితే?”
అపర్ణ కిటికీ బయట చూసింది.
“ఉండనివ్వు.”
అటువైపు కొద్దిసేపు నిశ్శబ్దం.
“ఏం మారింది?”
అపర్ణ మెల్లగా అంది—
“ముందు భయం వస్తే... నేను వెనక్కి వెళ్లేదాన్ని.”
“ఇప్పుడు?”
“ఇప్పుడు భయంతోనే ముందుకు వెళ్తున్నాను.”
యతిన్ నవ్వాడు.
“అదే చాలు అక్క.”
ఆ రాత్రి మళ్లీ వర్షం పడుతోంది.
అపర్ణ అదే బెంచ్ దగ్గర కూర్చుంది.
అదే నల్లటి డైరీ.
అదే నీలి రంగు కలం.
కొన్ని నెలల క్రితం ఖాళీగా ఉన్న పేజీలు ఇప్పుడు గందరగోళమైన గీతలతో, ప్రశ్నలతో, చిన్న చిన్న సమాధానాలతో నిండిపోయాయి.
ఆమె మరో కొత్త పేజీ తెరిచింది.
కలం చేతిలోకి తీసుకుంది.
ఈసారి ఎక్కువసేపు ఆలోచించలేదు.
రాసింది.
“నాకు ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి.”
ఆమె ఆగింది.
కిటికీ బయట చూసింది.
వర్షం అద్దం మీద నెమ్మదిగా కొడుతోంది.
మళ్లీ రాసింది.
“అన్నింటికీ సమాధానాలు ఇప్పుడే తెలియాల్సిన అవసరం లేదు.”
కొద్దిసేపు కలం ఆగింది.
మూడో వాక్యం రాసింది.
“కానీ ఈసారి నా ప్రశ్నల నుంచి నేను పారిపోను.”
ఆమె ఆ వాక్యాన్ని చాలాసేపు చూస్తూ ఉంది.
దాన్ని కొట్టేయాలనిపించలేదు.
డైరీని మెల్లగా మూసేసింది.
కిటికీ బయట వర్షం నెమ్మదిగా ఆగిపోతోంది.
చల్లటి గాలి గదిలోకి వచ్చింది.
ఆమె దగ్గర ఇంకా అన్ని సమాధానాలు లేవు.
రేపు ఏం జరుగుతుందో తెలియదు.
ఏ ఉద్యోగం వస్తుందో తెలియదు.
ఎవరిని పూర్తిగా నమ్మగలదో తెలియదు.
రేపు మళ్లీ తన నిర్ణయాన్ని అనుమానించదని కూడా చెప్పలేను.
బహుశా మళ్లీ అనుమానిస్తుంది.
బహుశా మళ్లీ భయపడుతుంది.
బహుశా మళ్లీ ఒకరోజు—
“నేను సరిపోతున్నానా?”
అని తనను తాను అడుగుతుంది.
కానీ ఇప్పుడు ఒక చిన్న తేడా ఉంది.
ఆ ప్రశ్న వచ్చినప్పుడు...
ఆమె దాని నుంచి పారిపోదు.
సమాధానం తెలియకపోతే—
“తెలియదు.”
అని చెప్పుకుంటుంది.
తప్పు చేస్తే—
“తప్పు చేశాను.”
అని అంగీకరిస్తుంది.
అసౌకర్యంగా అనిపిస్తే—
“లేదు.”
అని చెబుతుంది.
ఎవరైనా తనను తప్పుగా అర్థం చేసుకున్నా...
తనకు తాను నిజంగా ఉండటాన్ని ఆపదు.
ఎందుకంటే ఆమెకు చివరికి ఒక విషయం అర్థమైంది.
తన మీద నమ్మకం అంటే—
తనకు ఎప్పుడూ అనుమానం రాకపోవడం కాదు.
అనుమానం వచ్చిన ప్రతిసారీ తనను తాను వదిలిపెట్టకపోవడం.
అపర్ణ డైరీని చూసింది.
చిన్నగా నవ్వింది.
ఈసారి ఖాళీ పేజీ ఆమెను భయపెట్టలేదు.
ఎందుకంటే రాయాల్సిన సమాధానాలు ఇంకా లేకపోయినా...
ప్రశ్నలతో కూర్చోవడం ఆమె నేర్చుకుంది.
అదే బహుశా—
ఆమె తన మీద పెట్టుకున్న మొదటి నిజమైన నమ్మకం.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
Like Reply




Users browsing this thread: