Thread Rating:
  • 15 Vote(s) - 2.73 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance Veera
#61
(09-09-2025, 10:45 PM)Dragon09 Wrote: Nice update bro...

Thanks bro
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
ఏంటండి "వీర" మీద కోపం వస్తోందా?? స్వప్న కి బలవంతంగా తాళి కట్టాడని...ఏం చేస్తాం... తప్పదు కదా అలా వుంది మరి.. కధ మొత్తం చదవకుండా ఒక నిర్ణయానికి రాకండి....

బట్ ఒక్కటి అండి.... ఇప్పుడు తను రౌడి, స్మగ్లర్... కావొచ్చు . లాస్ట్ లో మీరు ఊహించని ట్విస్ట్ ఇస్తాడు... చూడండి... అదే అదే చదవండి...

ఇంకో ముఖ్యమైన విషయం .. కధ నచ్చితే చదవండి... నచ్చటం లేదా??? ఏం పర్లేదు.. అయినా చదవండి...,

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

బామ్మ చెప్పింది విని...

సుచిత్ర "తను అలా ఎలా ఒప్పుకుంటుంది??? అన్నది కంగారుగా.

స్వప్న లోపలికి వచ్చి...ముందు సుదీప్ తో... 'నాన్నా నా వలన ఈరోజు మీ పరువు పోయింది.. అందుకు క్షమించండి.. అనగానే

సుదీప్ బాధగా చూశాడు... కానీ ఏం మాట్లాడలేదు..

సుచిత్ర 'నీ వలన అంటావేంటి??? వీర .. వాడు ఆ వీర వలన పోయింది....అన్నది కోపంగా...

స్వప్న ఏం మాట్లాడలేదు...

గౌతమి చేయి పట్టుకొని "అమ్మా... నేను వెళ్తా.. నువ్వు ఒప్పుకోవాలి... అన్నది కళ్ళ వెంబడి నీళ్ళు తిరుగుతూ...

గౌతమి ' స్వప్న ను కౌగిలించుకొని "వద్దు... నువ్వు వెళ్ళొద్దు.. నేను ఒప్పుకోలేను.. అంటూ ఏడ్చేసింది..

స్వప్న గౌతమి విడిపించుకుని 'తప్పదు అమ్మా... వెళ్ళాలి..అయినా నేనేమీ భయంతో వెళ్ళటం లేదు..

శృతి వచ్చి 'అక్కా! అలా అని నువ్వు ఇష్టంతో కూడా వెళ్ళటం లేదు... అన్నది ఆవేశంగా.....

బామ్మ అందుకొని 'ఇప్పుడు కష్టంతో వెళ్ళినా... తరువాత ఇష్టపడొచ్చు....

శృతి కోపంగా 'బామ్మా!! నువ్వు ఆపు... నువ్వే ఏదో చెప్పి.. అక్కని ఆ రాక్షసుడు తో పంపుతున్నావు. ఐ హేట్ యు.. అంటూ ఏడ్చేసింది..

స్వప్న కళ్ళు తుడుచుకుంటూ ' శృతి... బామ్మ తప్పేం లేదు.. నువ్వు కూడా ఒప్పుకోవాలి..

సుచిత్ర ' స్వప్న!!! ఆర్ యు మ్యాడ్.... అమ్మ పాతకాలం చాదస్తం తో నిన్ను తప్పుదారి పట్టిస్తోంది...

స్వప్న "అదేం లేదు... అత్తా..

సురేంద్ర 'సుచిత్రా.. నువ్వు ఆగు... ఇందాకటి నుండి చూస్తున్నా... ఓ తెగ ఇన్వాల్వ్ అయిపోతున్నావ్...

ఇక్కడ మ్యాటర్ స్వప్న 'వీర' తో వెళ్ళాలా? వద్దా?.. ఇది స్వప్న ఇంకా సుదీప్, గౌతమి నిర్ణయించుకుంటారు.. అంటూ సీరియస్ గా చెప్పాడు..

సుచిత్ర 'అది కాదు సూరి... తను నా కోడలు..

సురేంద్ర ' తప్పు... మేనకోడలు... తను ఇప్పుడు వేరొకరి ఇంటి కోడలు... అంటూ కోపంగా చెప్పేసరికి...

సుచిత్ర ఇంకేమి మాట్లాడలేకపోయింది.

శృతి "అయితే ఆహ్ రౌడీ తో వెళ్తాను అంటావ్ ఏంటి అక్క.!!!!

స్వప్న 'చూడు శృతి...పెళ్ళి ఎలా జరిగినా... తను తాళి కట్టాడు... నా భర్త... అన్నది కోపం గా..

శృతి 'ఎవరు??? ఆ రౌడీ నా??? వాడు...

స్వప్న ' శృతి... తను నా హాస్బెండ్ అని ఇప్పుడే చెప్పా... గివ్ హిమ్ రెస్పెక్ట్.. అంటూ సుదీప్ వైపు చూసింది

స్వప్న " నాన్న.. ఆయన మీద మీరు పెట్టిన కేసులు నీ withdraw చేసుకోండి.. నా కోసం

సుదీప్"స్వప్న....సరే

స్వప్న అందరి వైపు చూసి ఇప్పుడే వస్తాను అని రూమ్ లోకి వెళ్ళి  పెళ్ళి చీర మార్చేసి... సింపుల్ శారీ... తో మెడలో తాళితో... కళ్యాణ తిలకం తో... మాత్రమే బయటికి వచ్చింది

బయట ఉన్న వీర దగ్గరకు వచ్చింది.... తను కాళితో ఏదో మాట్లాడుతున్నాడు.

వీర ని చూడగానే భయం వేస్తోంది... కాని లైఫ్ లాంగ్ తనతోనే వుండాలి.... తప్పదు...

వీర తనని చూస్తూ... దగ్గరకు వచ్చి " వెళదామా ?? అని అడిగాడు చాలా నార్మల్ గా...

స్వప్న తన వైపు చూడకుండా... ఎటో చూస్తూ...అది మా పేరెంట్స్ దగ్గర... మా బామ్మ తాతయ్య దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుందాం.... అన్నది లో వాయిస్ తో....

వీర "ఎందుకుటా??? అని అడిగాడు సీరియస్ ఫేస్ తో..

స్వప్న 'పెళ్ళి... అయ్యింది కదా

వీర "చూడు... స్వప్న!! నీకు ఆరోజు చెప్పాను... నాకు ఇలాంటి తొక్కలో సెంటిమెంట్స్ ఇష్టం వుండవు అని.... అన్నాడు చిరాగ్గా..

స్వప్న "సరే... మీ ఇష్టం... అంటూ లోపలికి వెళ్తుంటే
ఫంక్షన్ హాల్  గేట్ ఎంట్రెన్స్ లోకి అంబులెన్స్ ఎంటర్ అవుతుంటే దాన్ని చూస్తూ లోపలి వెళ్ళింది.

లోపలి నుంచి ఫోన్ మాట్లాడుకుంటూ రిషి బయటకు వస్తున్నాడు

అక్కడే ఉన్న వీర,కాళీ కూడా అంబులెన్స్ రావడం చూసారు.

కాళీ " నీతో గొడవ పడిన అమ్మాయి కోసం అనుకుంటా..వీర

సుబ్బు " మరి వీర చేతి దెబ్బ తిన్న ఎవరు ఐన అంబులెన్స్ ఎక్కలిసిందే,.!! అని గర్వంగా అన్నాడు

కాళీ వీర వైపు చూసాడు.

వీర ఏం మాట్లాడలేదు

ఇద్దరు మాట్లాడకపోయేసరికి సుబ్బు కొంచెం దూరంలో ఉన్న సింహ దగ్గరికి వెళ్ళాడు..

సుబ్బు 'సింహా' తో... "ఎంటో రా!!!! నాకైతే తప్పిపోయిన జింక పిల్ల సింహం గుహ లోకి వచ్చిందని అనిపిస్తోంది అన్నాడు..స్వప్న నీ ఉద్దేశించి

సింహా 'మరి నాకు ఏంటి ఇంకోలా అనిపిస్తోంది... ..

సుబ్బు 'ఇంకోలా అంటే...

'సింహా' ఆ సింహం కొన్ని రోజుల తరువాత... కుక్క పిల్లలా మారిపోయి.. ఆ జింక వెనకే వెళ్ళిపోతుందేమే... అని!!!

సుబ్బు 'ఏయ్!!! అక్కడ వీరా... నో ఛాన్స్.... చూశావ్ గా.. జైల్లో అన్ని దెబ్బలు తిన్నాగాని.... ఏ మాత్రం తగ్గకుండా.. అంతమంది ముందు ధైర్యం గా తాళి కట్టాడు...

సింహా 'హ.హ. అది ఇప్పటి పరిస్థితి... బట్ అన్ని రోజులు ఒకేలా ఉండవు...

లోపల...

స్వప్న లోపలికి వచ్చి అత్త అంబులెన్స్ వచ్చింది..లాస్య కోసమా.!?

సుచిత్ర " హ మీ మావయ్య కాల్ చేశాడు రమ్మని...సరే నువ్వు బ్లెస్సింగ్స్ తీసుకో అందరి దగ్గర..!(అంబులెన్స్ కి కాల్ చేసింది రిషి)

సురేంద్ర ~ సుచిత్ర,బామ్మ ~తాతయ్య,సుదీప్~గౌతమి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంది.

తరువాత గౌతమి తో "అమ్మా! ఆయన వేయిట్ చేస్తున్నారు..నేను వెళ్తున్నా... అన్నది.

బామ్మ తప్ప అందరూ ఒక్కసారిగా 'ఎక్కడికి??? అని అడిగారు..

స్వప్న 'తనతో పాటు... తన ఇంటికి.. అన్నది

సురేంద్ర గెస్ట్స్ అందరితో "మీరంతా భోజనాలకి వెళ్ళండి... అని చెప్పటంతో... చేసేది లేక నెమ్మదిగా కదిలారు.....

సుచిత్ర 'చూడు....  స్వప్న. పెళ్ళి కి నువ్వు ఇచ్చిన వాల్యూ ఓకే... బట్ అతనితో పంపడం కుదరదు..

సుదీప్ 'అవును.. కుదరదు... అన్నాడు సీరియస్ గా..

గౌతమి ' స్వప్న.. అయినా మంచి రోజు చూసుకుని అప్పుడు ఆలోచిస్తాం... అతన్ని వెళ్ళమని చెప్పు... అన్నది

స్వప్న (మంచిరోజు... ఇంక నా లైఫ్ లో అన్ని బ్యాడ్ డేసే)

పైకి మాత్రం

"అమ్మా! ఈ రోజు మంచిరోజు అనే కదా... పెళ్ళి ఫిక్స్.. చేశారు. మళ్ళీ మంచిరోజు ఏంటి??? అని అడిగింది..

అందరు స్వప్న ని కన్విన్స్ చేసే పనిలో పడ్డారు.

బయట వీర కి చిరాకుగా ఉంది ఇంకెంత సేపు వెయిట్ చేయాలి అని
'ఇప్పుడు లోపలికి వెళితే ఆ ఫ్యామిలీ డ్రామా చూడాలి... వీర కి స్వప్న తప్ప ఎవరు నచ్చలేదు..

ఫైనల్ గా సురేంద్ర 'సరే... మేము ఇంత చెప్పినా నువ్వు వినటం లేదంటే ఏదో బలమైన కారణం వుంటుంది... కాని నీతో నేను, అత్త వస్తాము....

అసలు అతని ఇల్లు... పేరేంట్స్ అన్ని చూడాలి... దీనికి మాత్రం నువ్వు ఒప్పుకోవాలి.. అన్నాడు సీరియస్ గా..

స్వప్న నువ్వు అత్త నాతో వస్తె లాస్య తో హాస్పిటల్ కి ఎవరు వెళ్తారు.?

సుదీప్ " నేను మీ అమ్మ వెళ్తాం.

స్వప్న సరే అని తల వూపింది..

శృతి 'నేను వస్తాను... అన్నది...

సురేంద్ర 'ఇప్పుడు కాదు ... శృతి... ముందు మమల్ని వెళ్ళని అన్నాడు..

సుదీప్ తన పి.ఏ ని పిలిచాడు..చెక్ బుక్ తీసుకుని... సైన్ చేసి స్వప్న చేతికి ఇచ్చాడు..

స్వప్న తీసుకోకుండా... 'ఏమి వద్దు.... నాన్న అంటూ ఫాస్ట్ గా బయటకు వెళ్ళి పోయింది..

అందరు తన వెనుకే వెళ్ళారు..

స్వప్న వీర దగ్గరకు వచ్చి నిల్చుగానే.... తను బైక్ తీసి స్టార్ట్ చేసాడు...

స్వప్న తన వైపే చూస్తుంటే... "ఎక్కు... ఏంటి చూస్తున్నావ్!? అని అడిగాడు.

సుచిత్ర 'ఓయ్! అంటూ చిటికె వేసింది..

వీర 'ఏంటి??? అన్నట్లు సీరియస్ లుక్కు ఇచ్చాడు..

సుచిత్ర 'మేము... వస్తున్నాము... నీ బైక్ మీద నలుగురం పట్టం కాదు కానీ... కారు తేలేదా??? అని అడిగింది.

వీర 'మీరంతా ఎక్కడికి??? ఏమి అవసరం లేదు... అనగానే

సురేంద్ర 'చూడు... నువ్వు నీ పాటికి తాళి కట్టి నా భార్య అంటే ఊరుకున్నాము కదా అని...

నీతో తన ఒక్కదాన్నే ఎలా పంపిస్తా మనుకుంటున్నావు??? అని అడిగాడు..

వీర 'ఏంటయ్యా!! నువ్వు... వచ్చేది ఎక్కడికి??? అంటూ బైక్ దిగాడు...

సుచిత్ర 'హలో!!! ఇక్కడ మాట్లాడు.. నువ్వు మమల్ని రావొద్దంటే  స్వప్న ని నీతో పంపటం కుదరదు...అన్నది సూటిగా...

వీర 'సుచిత్ర' ని ఎగాదిగా చూశాడు.

సుచిత్ర 'నీ చూపుకు భయపడే రకం కాదు ఈ సుచిత్ర ..

వీర 'నీ మాటలకి బెదిరే రకం కాదు ఈ వీర....

సురేంద్ర వెళ్ళి కారు తీసుకుని వచ్చాడు... స్వప్న నువ్వు మాతో కారు ఎక్కు... అనేగానే..

స్వప్న మారు మాట్లాడకుండా కారు ఎక్కేసింది..

సుచిత్ర వీర వైపు చూసి కళ్ళు ఎగరేసి కారు ఎక్కింది .

శృతి (అక్కా... సారి.. నిన్ను మా నుంచి దూరం చేసిన ఆ వీర కి నిన్ను దూరం చేసి నీకు గుడ్ లైఫ్ ఇస్తాను.)

బామ్మ (హమ్మయ్యా... నేను అనుకున్నట్టు జరిగితే... చాలు)

గౌతమి, సుదీప్ మాత్రం కారు దగ్గరకు వచ్చి... స్వప్న నుదుటన ముద్దు పెట్టారు..

గౌతమి 'ఫోన్... చేస్తూనే వుండు!!! అన్నది... ఏడుస్తూ స్వప్న తల వూపింది..

అప్పుడే రిషి,అంబులెన్స్ డ్రైవర్ లాస్య నీ అంబులెన్స్ లోకి ఎక్కించారు..

రిషి(స్వప్న తో పెళ్ళి జరిపించాలని లాస్య తీసుకొచ్చిన అతను)

అంబులెన్స్ డ్రైవర్ " ఇంకెవరైనా వస్తారా సార్ అని రిషి ని అడిగాడు ..

రిషి ఒకసారి వీర వైపు,లాస్య రిలేటివ్స్ వైపు చూసి " లేదు త్వరగా పోనివండి..

వీర అందరిని కోపం గా చూసి కాళికి సైగ చేసాడు.. తను ఎక్కగానే బైక్ స్టార్ట్ చేసాడు... కారు వాళ్ళ వెనకే ఫాలో అయ్యింది..

లాస్య వున్న అంబులెన్స్ ,స్వప్న వున్న కార్ చేరో వైపు వెళ్ళాయి.

స్వప్న 'సుచిత్ర' భుజం పై తల వాల్చింది
ఆలోచనలు వెనక్కి వెళ్ళాయి..
[+] 5 users Like Ranvijaysingh2's post
Like Reply
#63
3 months back అంటే flashback  :)

ముందు వీర వెర్షన్ లో చూద్దాం:

ఒకసారి ఎప్పటిలాగే సూర్యా బాబు కేమ్...... బట్ మబ్బులు ఆల్సో.... అక్కడక్కడా. వాన పడే సూచన కూడా వున్నది.....

వీర,కాళి ఏదో పని మీద "బర్కత్ పురా" వెళ్ళారు..

అక్కడ పని అయిపోయి రిటర్న్ అవుతున్నప్పుడు....

కాళి 'వీరా! మా తమ్ముడు చదివే కాలేజి ఇక్కడే... ఒకసారి తనని కలిసి ఎగ్జామ్ ఫీజ్ కి మని ఇచ్చేసి వస్తా!!! అన్నాడు..

వీర 'మ్.... తొందరగా రా!!! నాకు వేయిట్ చేయడం అంటే చిరాకు.... అన్నాడు

కాళి సరే... నువ్వు ఆ బేకరిలో వేయిట్ చేయి నేను పావుగంట లో వస్తా... అనేసి వెళ్ళి పోయాడు..

వీర అక్కడే వున్న బేకరి లోకి వెళ్ళాడు. ఆ బేకరి తనకేమి కొత్త కాదు... ఇది వరకు వెళ్ళాడు.

అక్కడే మన స్వప్న అండ్ ఫ్రెండ్స్... బిందు బర్త్ డే సందర్భంగా... పార్టీ చేసుకుంటున్నారు..

అయితే..... వీర వెళ్ళి టేబుల్ మీద కాళ్ళు పెట్టి చైర్ లో వెనక్కి వాలాడు....

తన వెనుక టేబుల్ లో... స్వప్న అండ్ ఫ్రెండ్స్ కూర్చున్నారు అందరు "వీర" వెనుక వున్నారు.... సో తను కనపడే ఛాన్స్ లేదు.

వాళ్ళంతా వాళ్ళ ఎంజాయ్ లో వున్నారు..

బేకరి ఓనర్ వైపు చూసి 'వీర' ఓయ్! ఇటు రా బే... అంటూ పిలిచాడు..

అతను కి వీర తెలుసు... ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు సదరు బేకరి ఓనర్ కి మనోడు చెంప మీద సైన్ చేశాడులే..

అందుకే అతను యమా స్పీడుగా వచ్చి "అన్నా!!! అన్నాడు అతి భయంతో

వీర 'ఏక్ స్క్రైట్.... అన్నాడు...అతను ఫ్రీజ్ లో నుండి తీసి వీర చేతికి ఇచ్చాడు.

తను తాగుతుంటే ...

బిందు కేక్ కట్ చేసింది ... అందరు అరుస్తూ చప్పట్లు కొడుతూ "యాపీ బర్త్ డే సాంగ్ పాడారు.

అంతే అసలు ఈ అరుపులు, కేకలు మనోడికి చెడ్డ చిరాకు సుమి....

దాంతో తను తాగే స్ట్రైట్ బాటిల్ విసిరి నేల మీద కొట్టాడు.

అంతే అవతల అందరూ 'ఏమైందా అని... చూసేసరికి.... సీసా పగిలి కనపడింది....

బేకరి బాబు కి విషయం అర్ధం అయ్యింది..

స్వప్న వాళ్ళతో 'మేడమ్... కొంచెం చిన్నగా.... ప్లీజ్ అన్నాడు

విశాల్ 'ఏ??? ఎందుకు??? అని అడిగాడు ఆశ్చర్యంగా...

బేకరి బాబు... 'వీర' వైపు భయంగా చూసి.... ఏం చెప్తే ఎక్కడ తంతాడో అని...

"అది.... మిగతా కస్టమర్లకు ఇబ్బంది కలగకూడదని... అంటూ నీళ్ళు నమిలాడు...

నటాషా 'హలో!!! ఎవడికి ఇబ్బంది అయితే వాళ్ళని దొబ్బేయమను.... మేమైతే ఇలాగే చేస్తాం... అన్నది కోపం గా..

విశాల్, బిందు 'అవును... అన్నారు ఒకసారే...

వీర కి కోపం పీక్స్ కి వచ్చి.... పైకి లేవబోయాడు..

అంతే మన స్వప్న తన గొంతుకు పని చెప్పింది..

"అలా అంటే ఎలా??? ఇది పబ్లిక్ ప్లేస్... కొంతమందికి మన ఎంజాయ్మెంట్ డిస్టర్బ్ అవ్వకూడదు... అంటూ తన వెనుకే వున్న 'వీర' వైపు తిరిగింది...

బట్ వీర అటు వైపు తిరిగి వుండటం వలన ... తను కనపడటం లేదు..

స్వప్న 'ఎక్స్క్యూజ్మీ... సారి అండి..... అన్నది స్వీట్ వాయిస్ తో...

వీర ఏం మాట్లాడలేదు... పైకి లేవబోయిన వాడు కూర్చున్నాడు...

బిందు వెంటనే "ఏయ్!! స్వప్న నువ్వు ఎందుకే అనవసరంగా సారి చెప్పటం.... అసలు మనమేమి చేశాము అన్నది.

విశాల్, రవి "అవును... అన్నారు..

స్వప్న నవ్వుతూ "సరే తినడం పూర్తి చేస్తే... వెళ్ళాం....

నటాషా 'నువ్వు.... మారవే..... అంటూ నవ్వేసింది..

అందరు ఫాస్ట్ గా తినేసి బిల్ పే చేసి బయటకు వెళ్తుంటే...

స్వప్న చున్నీ కి వున్న చిన్న చిన్న బాల్స్ వీర' కూర్చున్న చైర్ లో ఇరుక్కున్నాయి... దాంతో తను చున్నీ కూడా ఇరుక్కుపోయింది.

స్వప్న 'వీర' కి దగ్గరగా వచ్చింది... తను లాగుతుంటే రాలేదు..

వీర కి ఒక ఆడపిల్ల ని అంత దగ్గరగా చూసేసరికి... ముందు ఏ ఫీలింగ్ కలగలేదు... అ

తరువాత... బిందు బయట నుంచి  " స్వప్న... రా!!! అంటూ కేక వేసింది..

స్వప్న తన చున్నీ తీసే ప్రయత్నం లో వీర కొంచెం కూడా హెల్ప్ చేయలేదు సరికదా అసలు తన వైపు కూడా సరిగా చూడటం లేదు

స్వప్న నే చున్ని లాగుతూ... ఫోర్స్ గా పైకి లేచేసరికి....వెనుక నుండి... నటాషా హడావిడిగా స్వప్న ని తోసేసింది.తను వెళ్ళి వీర మీద పడింది...

అంతే మనోడికి కోపం వచ్చింది... లాగిపెట్టి ఒక్కటి ఇద్దాం అని తన వైపు చూశాడు...

కాని ఎందుకో కొట్టలేకపోయాడు...

స్వప్న "సారి...అండి అంటూ చున్ని తీసుకుని వెళ్లి పోయింది...

తను కనీసం వీర వైపు కూడా చూడలేదు..

నటాషా అక్కడ టేబుల్ వున్న తన పర్స్ తీసుకొని స్వప్న వెనకే వచ్చి సారి... యార్!! చూడలేదు... అన్నది స్వప్న నవ్వుతూ 'ఇట్స్ ఓకే... అన్నది...

వీర మాత్రం విసుగ్గా పైకి లేచి... బయటకు వెళ్ళాడు..

"ఈ కాళి గాడు ఇంకా రాలేదు.... అంటూ సిగరెట్ తీసి వెలిగించాడు...

వాన మొదలైంది... తనకి వాన కూడా చిరాకే.. ( బాబు వీర ఇంకేమేమి చిరాకులో ఓ లిస్ట్ ఇవ్వు... తేపతేపకి నేను చెప్పలేను)

కొంచెం దూరంలో. స్వప్న వాన లో తడుస్తూ.... అరుస్తోంది...

బిందు, నటాషా కారులో నుంచి...

"స్వప్న!!!! రావే... ఎందుకు అలా తడుస్తున్నావు..... అని అడిగుతుంటే...

కేరింతలు కొడుతుంటే...

వీర 'ఏంటి ఈ పిల్ల....నేను బాటిల్ విసిరేస్తే తనే సారి చెప్పింది... పొరపాటున నా మీద పడి.... సారి చెప్పింది.

ఎందుకు??? నాకు ఆ అమ్మాయి నే చూడాలి అనిపిస్తోంది?అనుకుంటూ చూపు తిప్పకుండా స్వప్న నే చూస్తున్నాడు.

కాళి పరిగెత్తుకుంటూ వచ్చాడు... 'వీర' తో... 'చిన్న వానేగా వెళ్లామా??? అని అడిగాడు..

అబ్బే... మనోడు చూపు తిప్పడం లేదు...

కాళి 'వీర' ఎటు చూస్తున్నాడా?? అని చూసేసరికి స్వప్న కనపడింది...

కాళి కి ముందు షాకే... ఎందుకంటే తను చిన్నప్పటి నుంచి వీర తోనే వున్నాడు..

ఏనాడు వీర ఆడపిల్లల వైపు చూడలేదు... సరికదా వాళ్ళు చూసిన కూడా పెద్ద పట్టించుకోడు...

స్వప్న ఆడటం ఆపేసి... కారు ఎక్కింది...

కారు స్టార్ట్ అయి వెళ్ళిపోతుంటే.... వీర సడెన్ గా ఎన్ ఫీల్డ్ స్టార్ట్ చేసాడు..

కారు వెళ్ళిపోయింది... తన బండి మాత్రం స్టార్ట్ అవ్వలేదు...

వీర కోపంగా దిగి... బైక్ ని ఒకతన్ను తన్నాడు...

కాళి తల గోక్కుంటూ.. వీరా!!! అని పిలిచాడు...

వీర 'ఆటో' ని పిలిచి ఎక్కేసాడు..

కాళి బైక్ తీసి స్టార్ట్ చేసాడు.. ఆటో వెనకే వెళ్ళాడు...

ఇంటికి వెళ్ళాక వీర లోపలికి వెళ్ళి... సోఫాలో కూర్చున్నాడు..

కాళి తన వెనుకే వచ్చి... 'ఏమైంది వీరా!? ఎవరు ఆ అమ్మాయి??? అని అడిగాడు కంగారుగా...

వీర 'ప్స్!!! అన్నాడు.

కాళి 'నీకు తెలుసా???? అదే ఇంతకు ముందు ఎప్పుడైనా చూశావా????

వీర "మ్.. హు

కాళి 'మరి ఎందుకు తననే చూస్తున్నావు??? అని అడిగాడు ఆశ్చర్యంగా..

వీర 'చిట్టీ!!! అని కేక వేశాడు..

చిట్టి వచ్చి వీర షూస్ విప్పాడు..

కాళి వీర పక్కనే కూర్చోని 'నిన్నే ఎందుకు తననే చూశావ్???

వీర 'తెలియదు బే... అన్నాడు చిరాగ్గా.

కాళి 'నచ్చిందా??? అని అడిగాడు ఇంకా ఆశ్చర్యంగా..

వీర "అంటే??? అని అడిగాడు కాళి వైపు తీక్షణంగా చూస్తూ...

కాళి 'అది... మరి... ఆ... లవ్ ఎట్ ఫస్ట్ సైట్... అంటారే... అదేనా??? అని అడిగాడు వుత్సాహంగా...

వీర 'లవ్ అంటే??? అని అడిగాడు చాలా చాలా నార్మల్ గా (దేవుడా!!! ఏం పిల్లాడివి నువ్వు )

కాళి 'చిట్టీ!!! వేడి వేడి టీ తీసుకురా!!!!

వీర 'నాకు మందు తీసుకురా!!!

కాళి 'ష్!!! అది కాదు ఆ అమ్మాయిని ఎందుకు చూశావ్???

వీర 'ఎదురుగా వానలో ఎగురుతుంటే చూశాను...

కాళి 'అయితే... నార్మల్ గా చూశా అంటావ్... అంతేనా???

వీర 'రేయ్!!! నువ్వు దెంగెయ్ రా.. నా బుర్ర తినమాకు... అంటూ లేచి వెళ్ళి పోయాడు..

కాళి (ఉఫ్!!! ఇంకా వీడు తేడాగా చూస్తుంటే... లవ్ అనుకున్నా!!! అయినా లవ్ అంటే ఏంటి?? అని అడుగుతున్నాడు.. ఏమనాలి వీడిని)

వారం తరువాత:

ఆహ్ రోజు హోలీ పండగ

వీర, కాళి, సుబ్బు, సింహా నలుగురు.... త్రినాధ్ ఇంటి దగ్గరకు వచ్చారు...

అయితే ఆ పక్కనే... వున్న ఇన్స్టిట్యూట్ లో మన స్వప్న పాప ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేస్తోంది... నటాషా, బిందు కూడా.....

వీర, త్రినాధ్ లు మాట్లాడుకుంటూ బయటకు వచ్చారు...

త్రినాధ్ ఏదో చెప్తుంటే... వీర సీరియస్ గా వింటున్నాడు...

స్వప్న వాళ్ళు ఇన్స్టిట్యూట్ లో నుండి బయటకు రాగానే.. కొందరు లఫంగి వెధవలు.... బైక్స్ మీద వెళుతూ... స్వప్న వాళ్ళ మీద కలర్ వాటర్ స్ప్రే చేశారు...

అంతే.. నటాషా, బిందు 'రేయ్!!! నీ అయ్యా... అంటూ పెద్దగా అరిచారు..

ఆ అరుపులు వీర వాళ్ళకి వినపడి చూసేసరికి...

ఆ లఫంగి వెధవలు 'హే.... అంటూ అరుచుకుంటూ... వీర ముందు నుంచే వెళ్ళారు..

వీర వెనక్కి చూసేసరికి.... స్వప్న తన డ్రెస్ చూసుకుంటూ... బాధ గా కనపడింది.

నటాషా, బిందు 'చెత్త వెధవలు.... మ్యానెర్స్ లేదు.. అన్నారు..

స్వప్న మన టైం బ్యాడ్... ఏం చేస్తాం... అంటూ తన కారు దగ్గరకు వచ్చింది...

ఈలోపు ఎవరో ఫ్రెండ్ వచ్చి స్వప్న!! ఈ డిజైన్స్.. చూడు... నీకు నచ్చితే వీటిని ఇంప్లిమెంట్ చేద్దాం.... అన్నది....

స్వప్న 'అరే..ఎందుకు మళ్ళీ మార్చడం... నటాషా వేసిన డిజైన్స్ కూడా బాగున్నాయి.... అవే ఫైనల్ చేయి...

ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ లోపలికి వెళ్ళారు.

(ఈ సీన్ కొంచెం గుర్తు పెట్టుకోండి...)

వీర కోపంగా అప్పటికే తన ఎన్ ఫీల్డ్ స్టార్ట్ చేసి... ఆ పోకిరిల వెనుక వెళ్ళాడు...

వాళ్ళు ఒకచోట ఆగి వాటర్ తాగుతూ... నవ్వుకుంటున్నారు ..

వీర వచ్చి బండి ఆపి వాళ్ళ పక్కనే నిల్చున్నాడు కామ్ గా.... అయితే తన వెనుకే కాళ్ళి సుబ్బు, సింహా కూడా త్రిబుల్స్ వచ్చారు...

అందులో ఒకడు 'ఆ ఎల్లో డ్రెస్ అమ్మాయి (స్వప్న) ఏముంది రా???? అందానికే కేరాఫ్ లా ఉంది.
నేను స్ప్రే చేశాక కూడా... ఏమి అనలేదు... ఈసారి తను దొరకాలి అంటూ వెకిలిగా నవ్వాడు..

ఇంకో లఫంగి "నాకైతే ఆ బ్లాక్ చుడీదార్ నచ్చింది... (నటాషా)

మొదటి లఫంగి 'ఏహే.. నాకైతే ఆ ఎల్లో చుడిదార్ అయితే పిచ్చ పిచ్చిగా అని ఇంకా మాట పూర్తిగా కూడా రాలేదు పిచ్చి సన్నాసికి...

కాళి వీర వైపు చూస్తూ (ఇప్పుడు ఎంటో వీడి రియాక్షన్)

సుబ్బు,సింహా లకి మ్యాటర్ తెలియక... వీర వాళ్ళ వెనుక ఎందుకు వచ్చాడని చూస్తున్నారు...

వీర ఎవడైతే స్వప్న నచ్చింది అన్నాడో... వాడి దగ్గరకు వెళ్ళి సడెన్ గా ముక్కు మీద ఇచ్చాడు..

ఆ ఫోర్స్ కి వాడు తాగే వాటర్ బాటిల్ నోట్లోకి దూరిపోయింది... వాడేమో వెనక్కి పడ్డాడు..

వాడి ఫ్రెండ్స్ మిగతా ఔలా గాళ్ళు... ముందు షాకై వీర మీదకు వచ్చారు..

వీర వాళ్ళని తోశాడు బలంగా... కానీ ఆ మొదటి లఫంగి గాడిని మాత్రం ఓ రేంజ్ లో వాయ తీశాడు...

పాపం వాడి ముక్కు అయితే... మూడు ముక్కలు అయ్యింది..

సుబ్బు 'కాళి' తో 'రేయ్!! ఎందుకు వీర వాళ్ళని అలా కొడుతున్నాడు... ఏమైంది అసలు??? నాకు అర్థం కాలేదు... అని అడిగాడు అయోమయంగా..

సింహా 'నాది సేమ్ క్వశ్చన్ తెలుగులో... అనగానే,

కాళి 'ఆగండహే... అని వీరతో "ఇంకా కొట్టకు. ముక్కు చూడు... నీ దెబ్బకు ముక్కలైంది.. అంటూ వాడిని పైకి లేపాడు.

మిగతా వాళ్ళు జంప్ జిలానీ...

వీర అక్కడే వున్న పార్క్ గోడ మీద ఎక్కి... "ఇటు రా బే!!! అంటూ చిటికె వేశాడు..

వాడు మెల్లగా వచ్చి... "ఏంటి??? అన్నట్లు చూశాడు...

వీర 'ఇంకోసారి ఈ చుట్టుపక్కల చూశానో.. నా కొడకా... ఏం చేస్తానో నాకే తెలియదు... ఆ అమ్మాయి వైపు కన్నెత్తి చూశావో... కళ్ళు పీకేస్తా... ఇంక పో.. అన్నాడు సీరియస్ గా..

వాడు పడతా లేస్తా... వెళ్ళిపోయాడు...

కాళి కూడా గోడ ఎక్కి 'ఆ... ఇది కన్ఫామ్ గా లవ్ వీరా... అన్నాడు..

వీర 'కాళి' ని సీరియస్ గా చూసి 'గోడ' మీద నుంచి తోశాడు..

కాళి టపీమని కింద పడ్డాడు...

సుబ్బు, సింహా వచ్చి తనని పైకి లేపారు...

కాళి కాలు విదిలిస్తూ (నువ్వు నాకు అర్థం కావురో )

వీర తను దూకి... వేలు చూపించి... 'లవ్ లేదు ఏమి లేదు.. ఆ అమ్మాయి నాది.... అంటూ తన ఎన్ ఫీల్డ్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు

సింహా 'అసలు ఏమైంది??? అని అడిగాడు...

కాళి'నాకు తెలియదు రా అయ్యా... ఆ మధ్య మా తమ్ముడి కాలేజీ ఫీజు కట్టి వస్తా... నువ్వు ఈ బేకరిలో వుండు అని వీర కి చెప్పి వెళ్ళా...

అంతే... ఏమైందో తెలియదు.. నేను వచ్చేసరికి మనోడు ఆ పిల్ల ని చూస్తూ నిల్చున్నాడు... అని చెప్తుంటే...

సుబ్బు 'ఏ పిల్లని రా!!! అని అడిగాడు..

సింహా 'సుబ్బు' నెత్తిన ఒకటి పీకి "అదేరా... ఇందాక ఈ పోరాగాళ్ళు.... కలర్ వాటర్ పోశారే... యల్లో డ్రస్ పోరి... అన్నాడు..

సుబ్బు కళ్ళజోడు తీసి తుడుచుకుంటూ... "ఓహో!! ఆ పిల్ల... అయితే బేకరి లో ఏం జరిగిందో నువ్వు వీర ని అడగలేదా???? అన్నాడు కాళితో...

కాళి' అడిగారా... అయ్యా... వాడు చెప్పడని తెలిసి కూడా అడిగా....

సింహా 'ఇంకేటి నువ్వు అడిగేది... తను చెప్పేది... నేను చెప్తా చూడు... మనోడు గా పోరిని... బేకరి లో చూసినాడు.. నచ్చి వుంటుంది... అయితే... లవ్ చేస్తున్నాడని తనకి తెలియదు అన్నాడు చేతులు పైకి లేపి... విదిలిస్తూ..

కాళి అదే కదా... వీడు ఆడపిల్లని చూడటం ఏంటో?? నాకైతే అర్థం కావటం లేదు...

సుబ్బు 'టైం బాబు టైం... వాడికి పెళ్ళి టైం తోసుకొచ్చింది....

సింహా 'ఏహే... వురుకోరా భయ్..... వాడేమో... ఇష్క్ అంటుంటే... నువ్వు పెళ్ళి వరకు వెళ్ళిపోయావు...

కాళి 'అసలు ఇవన్ని కాదు రా... నాకు ఎందుకో తేడా కొడుతోంది... వీరా కి ఏమి నచ్చవు... నచ్చితే వదలడు...

సుబ్బు 'అయితే ఏమంటావ్??? ఆ పిల్లని ఎత్తుకొస్తాడంటావా????

కాళి 'అదే చూడాలి... సరే పదండి... మళ్ళీ లేట్ గా వెళితే అదో గొడవ... అన్నాడు

ముగ్గురు బైక్ ఎక్కి వెళ్ళిపోయారు..

&&&&&&&

ఆ తర్వాత..వీర రెండు సార్లు... ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి స్వప్న గురించి ఎంక్వైరీ చేస్తే ఏమి డీటేయిల్స్ ఇవ్వలేదు..

తను ఇది విషయం... నా ఫిలింగ్స్ ఇవి అంటే.... హెల్ప్ చేయడానికి కాళి, సుబ్బు, సింహా... రెడినే...

వీర అసలు ఏమి చెప్పలేదు.. కాని తన మనసులో స్వప్న రూపం... ముఖ్యంగా వానలో తడిసినపుడు,

తన మీద పడ్డప్పుడు... తాకినపుడు... గుర్తొచ్చినపుడు.... మాత్రం పిల్లోడు బాగా డిస్టర్బ్ అవుతున్నాడు...

మరి అవ్వకుండా ఎట్లా వుంటాడు... అంత అందం, మంచితనం... రెండు చూశాక ..కాకపోతే విశిష్ట మంచితనం తనకి కొత్తగా అనిపించింది...

ఆ తర్వాత... వీర,కాళి "స్వప్న" వాళ్ళు వైజాగ్ టూర్ వెళినపుడే...

త్రినాథ్ కూడా వీర కి కొన్ని డైమండ్స్ ఇచ్చి...

వైజాగ్ పోర్ట్ లో... ఒకతనికి ఇమ్మని చెప్పాడు...

వీర,కాళి ఇద్దరూ కారులో బయలుదేరారు...దారిలో... లంచ్ కని ఒక దాభా దగ్గర ఆగారు...తినే టైంలో... అక్కడ టివి ఆన్ చేసి వున్నది... వీళ్ళు లంచ్ చేస్తూ..వుంటే... న్యూస్ ఛానల్ లో...

హైదరాబాద్ లో జరిగిన ఫ్యాషన్ పెరేడ్ విన్నర్ మాట్లాడుతోంది...

తన డ్రెస్ ని డిజైన్ చేసిన... స్వప్న ని స్టేజ్ మీద హగ్ చేసుకుంటోంది... ఆ మోడల్ పాప...

అంతే... వీర సడెన్ గా తనని చూసేసరికి... మొహంలో ఫీలింగ్స్ మారిపోయాయి...

చూసే.. కాళి కి మాత్రం... అది ఆనందమా??? షాకా అని అర్థం అవ్వటానికి రెండు నిమిషాలు పట్టింది.

లైట్ గా షాక్... దాంట్లో ఆనందం కలిపాడు..
[+] 6 users Like Ranvijaysingh2's post
Like Reply
#64
ఈలోపు ఎవరో ఛానల్ చేంజ్ చేశారు..

వీర "రేయ్!!! ఎవడ్రా... అని అరిచాడు.. అందరు అదిరిపడ్డారు ఆ అరుపుకి....

దాబా ఓనర్ వచ్చి 'ఎందుకు అలా అరిచావ్??? అని అడిగాడు కంగారుగా..

కాళి 'బాబు... మీ టివి రిమోట్ ఏది??? అని అడిగాడు.. అతను తన చేతిలోని రిమోట్ చూపిస్తూ... ఏం??? అని అడిగాడు... 

వీర వెంటనే అది తీసుకుని బ్యాక్ ప్రెస్ చేశాడు.. ప్స్! ప్స్! ఇంకెదో న్యూస్ వస్తోంది... వీర కోపంగా ఆ రిమోట్ విరగొట్టాడు...

ఆ ఓనర్ 'ఇది ఏంటయ్యా!!! రిమోట్ అలా ఇరగొట్టావ్??? అంటూ అడిగాడు కోపం గా....

కాళీ " మరి చూస్తుంటే...ఛానెల్ ఎందుకు మార్చావ్??!! అని అడిగాడు..నవ్వు ఆపుకుంటూ

అతను " ఇది మరి బాగుంది..నా టీవీ ..నా రిమోట్ నా ఇష్టం..అన్నాడు..చిరాగ్గా

వీర ' టీవీ నీదే...రిమోట్ నీదే ... కానీ అందులో వచ్చిన పిల్ల నాది... అంటూ వెళ్ళిపోయాడు....

అతనికి ఏమి అర్ధం కాలేదు.. తల గోక్కుంటూ... కాళి తో 'ఏంటి అయ్యా!!! అతని కోపం??? అని అడిగాడు.. 

కాళి 'అదేదో నీకు ఎందుకు గాని... నీ రిమోట్ కి కలిపి తీసుకో... అంటూ బిల్ పే చేసి వెళ్ళిపోయాడు... 

దారిలో... వీర సీరియస్ గా డ్రైవ్ చేస్తుంటే... 

కాళి "వీరా!!! అని పిలిచాడు... 

మనోడు 'మ్.... 

కాళి 'నీకు కోపం రాదంటే... నేను కొన్ని విషయాలు అడగనా???

వీర ' హ్మ్మ్ 

కాళి 'అసలు ఆ అమ్మాయిని ఎక్కడ చూశావ్??

వీర ' బేకరీలో.. ఆరోజే..

కాళి 'అంటే... వాన పడుతున్నప్పుడు నేను వచ్చాను.. అప్పుడా???? 

వీర 'మ్.హూ.. లోపల నా మీద పడ్డప్పుడు....

కాళి కళ్ళు ఎగరేస్తూ 'అబ్బో... అనుకోని... నువ్వు ఏమి అనలేదా????

వీర 'సిగరెట్' వెలిగించి... పొగ వదుల్తూ....'కోపం వచ్చింది... కొట్టాలని అనుకున్నా... కాని కొట్టలేకపోయా....

కాళి 'ఓహో... అయితే ఆ అమ్మాయి నీకు నచ్చింది.. అందుకే బయట ఆ అమ్మాయినే చూస్తున్నావ్.....

వీర కోపం గా చూసేసరికి..

కాళీ 'అరే... అన్నింటికీ కోపం అయితే ఎలా వీరా???? నేను చెప్పేది కరెక్టో కాదో తెలియదు కానీ...'ఆ అమ్మాయిని చూడగానే ఇష్టపడ్డావ్!!! అందుకే... ఆ పోకిరి గాళ్ళని కొట్టావ్!!!! తనని కామెంట్ చేశాడనే గా.. అతన్ని బాగా తన్నావ్...

వీర 'ఏం మాట్లాడలేదు... సైలెంట్ గా డ్రైవ్ చేస్తున్నాడు..

కాళి 'సరే... రా!!! పాయింట్ కి వస్తా... ఆ అమ్మాయి అంటే నీకు ఎంత ఇష్టమో... ఇందాక ధాబాలోనే అర్ధం అయ్యింది...

ఆ అమ్మాయి ని చూస్తే బాగా చదువుకున్న అమ్మాయి.. ఫుల్ సౌండ్ పార్టీ పిల్లలా ఉంది....తనకి ఇబ్బంది కలిగించినా కూడా కోపం రాలేదు ఆ లఫంగి గాళ్ళు మీద.. దీని బట్టి చూస్తే... చాలా మంచి అమ్మాయి లా అనిపిస్తోంది...

వీర 'ఆ పిల్ల కి వున్న లక్షణాల గురించి నాకు ఎందుకు చెప్తున్నావ్??? అందుకు పూర్తి భిన్నంగా వున్నా అని గుర్తు చేయడానికా??? అని అడిగాడు....

కాళి 'ఛా!! అదేం లేదు... కాకపోతే.. నువ్వు ముందు ఆ విషయంలో ఒక కరెక్ట్ ఒపినియన్ కి రా..!!

వీర 'అంటే???? అని అడిగాడు విసుగ్గా...

కాళి 'ఇలాంటి విసుగులు, చిరాకులు పక్కన పెట్టు... ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టమా???ప్రేమా!?? తేల్చుకో..ఆ తరవాత నీ మనసులో విషయం ఆ అమ్మాయికి చెప్పు ..

వీర ' అదేరా..ఎలా చెప్పను!?

కాలి 'చూశావా??? నీకు ప్రేమ కాబట్టి.... ఎలా చెప్పాలి??? అనేదాకా వచ్చావ్!!!!!! సరే... వైజాగ్ నుంచి వచ్చాక.... తనని గట్టిగా వెతుకుదాము.... అప్పుడు ఆలోచిద్దాం... సరే నా????

వీర 'సరే... అంటూ కారు స్పీడ్ పెంచాడు...

వైజాగ్ వెళ్ళాక,.... ఆ డైమండ్స్ తీసుకొనే అతను... ప్లేస్ మార్చి లంబసింగి రమ్మన్నాడు.

(అతను ఎందుకు మార్చాడో... ఎవరు మార్చమన్నారో.... మీకేమైనా తెలుసా :))

అయితే... వీర కి కాల్ రావడంతో... కారులో తనకి సిగ్నెల్స్ రాక... కారు దిగి పక్కకి వెళ్ళి మాట్లాడుతుంటే..

ఆ టైం కే... ఆ కారుకి యాక్సిడెంట్ అయ్యింది.. వీర కాల్ మాట్లాడి... వాష్ రూమ్ కి వెళ్ళి... తీరిగ్గా వచ్చేసరికి..

కారు లోనే వున్న కాళికి దెబ్బలు తగిలాయి.. అయితే స్వప్న ముందుకు వచ్చి కాళి కి చున్ని కట్టడం చూశాడు.. సరే... చుద్దాం ఏం చేస్తారో??? అని అక్కడే ఆగాడు...

అటు తరువాత.. కాళి ని హాస్పిటల్ లో చేర్చాక... తను వెళ్ళేసరికే... స్వప్న.. రిసెప్షన్ లో ఎమోంట్ పే చేస్తోంది... తరువాత 'కాళి' కి ఆపరేషన్ జరుగుతుంటే... అక్కడే కూర్చుంది. వీర తన వెనుకే కూర్చోని తననే గమనిస్తూనే వున్నాడు.. కాళికి యాక్సిడెంట అవ్వటం వీర కొంచెం కూడా బాధ కలిగించలేదు°_°

ఈ పిల్ల... నేను అనుకున్న దానికంటే టింగరి పిల్లలా వున్నదే... ముక్కు మొహం తెలియని వాళ్ళు కోసం ముప్పై వేలు కట్టేసింది...

పావుగంట తర్వాత.. రిసనిస్ట్ "మిస్... స్వప్న అని పిలిచింది...

అటు తర్వాత... స్వప్న లోపలికి వెళ్ళి కాళి ని చూసి... రాగానే ఫిక్స్ అయ్యాడు... అప్పుడే ప్రపోజ్ చేయాలని.... అందుకే అక్కడే ప్రపోజ్ చేశాడు..

తను భయపడి వెళ్ళగానే... తను కొంచెం కూడా ఫీల్ అవ్వలేదు.... మళ్ళీ తన వెనుకే వెళ్ళి తననే చూస్తూ గడిపాడు.

అందుకే ఫోటోస్ లో కనిపించాడు...

తను కూడా ఫోటోలు తీశాడు...

అంతేకాదు... వాళ్ళని ఫాలో అయ్యి

నెక్స్ట్ డే.. అంతేకాదు ఆరోజు వాళ్ళని ఫాలో అయ్యి... వాళ్ళు వుండే గెస్ట్ హౌస్ చూశాడు... వాచ్మెన్ కి డబ్బులు ఇచ్చి... డీటేయిల్స్ అడిగాడు.. ముఖ్యంగా స్వప్న గురించి...

ఆ వాచ్మెన్ అంతకన్నా... ఓవర్ చేస్తూ... నెక్స్ట్ డే... స్వప్న డాన్స్ చేస్తుంటే ఫోటోస్ తీశాడు...

ఎవరు గమనించలేదు... ఆరోజు ఈవెనింగ్ వీర మళ్ళి వస్తే అవి ఇచ్చాడు డబ్బులు ఇస్తాడేమో..... అని ఎక్స్ పెక్ట్ చేశాడు..

కాని వీర ఆ వాచ్మెన్ చెంప నగులకొట్టి... ఆ ఫోటోన్ తన ఫోన్ లోకి సెండ్ చేసుకొని... వాచ్మెన్ ఫోన్ లో డిలిట్ చేశాడు...

 ఆ తర్వాత... మళ్ళీ రెస్టారెంట్ కి వచ్చి స్వప్న తో మాట్లాడే ప్రయత్నం చేశాడు... కాని అప్పుడే డైమండ్స్ తీసుకున్న వ్యక్తి.. సెక్యూరిటీ ఆఫీసర్లకి దొరికాడు అనే మెసేజ్ వచ్చింది... అందుకే విశాల్ సెక్యూరిటీ ఆఫీసర్లకి ఫోన్ చేయగానే అక్కడ నుంచి వెళ్ళిపోయాడు....

అయితే.... కాళి ఒక ...ఒక వారం తరువాత డిశ్చార్జ్ అయ్యాక ఇద్దరూ హైదరాబాద్ వచ్చాక...

వీర అసలు సంగతి చెప్పాడు.... తనను సేవ్ చేసింది స్వప్న అని.. అంతే... కాళికి ' స్వప్న ' అంటే చెప్పలేని అభిమానం వచ్చేసింది... 

వీర తను స్వప్న కి ప్రపోజ్ చేసిన విషయం చెప్పాడు... అది విని కాళి, సుబ్బు, సింహా... ఆశ్చర్యంగా చూశారు ..

వీర 'ఏంటి??? ఆ చూపు అని అడిగాడు ముగ్గురిని సీరియస్ గాన సుబ్బు అంటే... నువ్వు ప్రపోజ్ చేశానని అనుకుంటున్నావా??? అని అడిగాడు...

వీర పై నుంచి కిందకి ఓ లుక్ ఇచ్చాడు.

కాళి 'అవునురా.... నువ్వు నీ ప్రేమ గురించి తనకి అలా చెప్పడం..నాకు నచ్చలేదు..అన్నాడు..

వీర 'ఓహో!!! అలాగా నాకు అలా చెప్పడమే వచ్చు.... అంటూ సీరియస్ గా చూశాడు... 

సుబ్బు, సింహా బయటకు వచ్చి నవ్వుకున్నారు..... 

సుబ్బు ' ఆ అమ్మాయి వీరా ని ఎప్పటికీ లవ్ చేయదు..... 

సింహా 'చూద్దాం... అన్నాడు... 

అటు తర్వాత.... రవి ఫోన్ నెంబర్ ఆధారంగా... రవి ఇంటి నుంచి కాలేజీకి వెళ్ళారు...

 ఒకరోజు.. వీర, కాళి, సింహ బయట వేయిట్ చేస్తుంటే.... సుబ్బు లోపలికి వెళ్ళి స్వప్న గురించి డీటేయిల్స్ తెలుసుకొచ్చాడు... అయితే... వైజాగ్ నుంచి వచ్చాక... స్వప్న 'వీర' గురించి ఆలోచించడం తగ్గించింది... 

ఇంక ఈవెనింగ్ కాలేజీ నుండి బయటకు వచ్చేసరికి.... తన కారు కి అడ్డంగా తన బైక్ ని ఆపాడు వీర.. స్వప్న కారు డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు... కోపంగా దిగి "ఎవడ్రా నువ్వు??? అంటూ వీర మీదకు వచ్చాడు.. 

సింహా ఆ డ్రైవర్ బాబు ని పక్కకి లాకెళ్ళాడు.. స్వప్న కారు దిగి 'వీర' ని చూసి షాకైయింది....

 వీర 'అదేంటి?
?? స్వప్న వైజాగ్ నుంచి వచ్చిన దగ్గర్నుంచి వెతుకున్నా... ఇప్పుడు కనపడ్డవ్' అని అడిగాడు.

ఇప్పుడు స్వప్న కోణంలో ఏం జరిగిందో చూద్దాం!
[+] 6 users Like Ranvijaysingh2's post
Like Reply
#65
Nice update
[+] 1 user Likes lohith22's post
Like Reply
#66
బానే ఉంది కానీ ఓవర్ యాక్షన్ ఎక్కువ అనిపించింది నా అభిప్రాయం మాత్రమే తప్పుగా అర్థం చేసుకోకండి
[+] 1 user Likes 9888943338's post
Like Reply
#67
స్వప్న వైజాగ్ నుంచి వచ్చాక వీర గురించి కొంత మర్చిపోవడం....

ఆ తర్వాత ఇంట్లో అందరూ విమ్ము అంకుల్ కి దొరకడం....

లాస్ట్ ఎపిసోడ్స్ లో చూశాం...

అయితే ఒకరోజు వీర ' స్వప్న ' కారు కి అడ్డంగా బైక్ ఆపుతాడు..

కోపంతో కారు లో నుండి డ్రైవర్ దిగి నీర మీదకు రాబోతుంటే సింహా అతన్ని పక్కకి తీసుకెళ్తాడు...

ఆ తర్వాత:

వీర ని చూసి స్వప్న భయపడుతూ కారు లో నుండి కిందకి దిగింది..

వీర 'ఏంటి స్వప్న ?? అంత భయం వేస్తోందా నన్ను చూస్తుంటే.. అని అడిగాడు సేమ్ మాడిపోయిన పెనం మొహం తోనే

స్వప్న 'చూడండి... మీరు అలా చెప్పడం ఏ మాత్రం కరెక్ట్ కాదు.. నాకు మీ మీద లవ్ కలగదు.... ఇంకెప్పుడూ నన్ను కలిసే ప్రయత్నం చేయకండి.... మా డ్రైవర్ ని వదలండి ప్లీజ్... అన్నది కళ్ళ వెంబడి నీళ్ళతో...

వీర 'ఏయ్! ముందు ఏడుపు ఆపు... నాకు చిరాకు.... సరే... నువ్వు నాకు నచ్చావ్... అదేదో ప్రేమ అంటగా... మా కాళి గాడు అంటున్నాడు.

నాకు ఎందుకో నువ్వు బాగా గుర్తు వస్తున్నావు...? నాకు నిన్నే ఎప్పుడు చూడాలి అనిపిస్తోంది... అంటూ సిగరెట్ వెలిగించాడు..

స్వప్న 'వీర' వైపు భయంగా చూసింది..

బ్లాక్ జీన్స్ ప్యాంట్... లైట్ గ్రీన్ కలర్ షర్ట్
షేవింగ్ లేదు... కళ్ళు మాత్రం కోపంగానో విసుగ్గా నో చూస్తుంటాయి..

వీర 'పొగ' వదుల్తూ...

"చూడు స్వప్న..... నువ్వు నన్ను ఎలా చూసినా... నా గెటప్ మారదు... నా ప్రవర్తన మారదు... నా గురించి నీకు ఏమి తెలియదు కదా.. నేనే చెప్తా... అంటుండగా....

ఈలోపు బైక్ మీద కాలేజి నుండి బయటకు వచ్చిన రవి, విశాల్ 'వీర' ని చూసి అటు వైపు వచ్చారు..

బిందు, నటాషా కూడా వెనకే వచ్చారు..

రవి బైక్ ఆపి దిగి 'వీర' వైపు వచ్చి కోపం గా "ఏయ్!! నువ్వు వీర కదా... అన్నాడు...

నటషా, బిందు ఇద్దరూ స్వప్న ని "ఆర్ యూ ఓకే... అని అడిగారు...

వీర అసలు రవి వైపు చూడకపోగా.... బిందు తో 'ఓ పిల్లా... నా స్వప్న నా దగ్గర సేఫే.... నువ్వెమి పరేషాన్ అవ్వకు... అన్నాడు

రవి " నువ్వే తనని ఇబ్బంది పెడుతూ ఎంటిరా నాటకాలు ఆడుతున్నావ్???? అంటూ వీర ను తోశాడు..

వీర 'ఏంటిరా!!! వీర గాడినే తోస్తావా??? నా మీద చేయి పడితే నాకు సంఖ్య తిరుగుతుంది అంటూ సిగరెట్ అవతల పడేసి

రవి షర్ట్ పట్టుకొని దగ్గర కు లాగి తన తలతో రవి నెత్తి మీద ఒక్కటి ఇచ్చాడు..

అది చూసి విశాల్ తన ఫోన్ తీసి వాళ్ళ ఫ్రెండ్ కి కాల్ చేసి..

"రేయ్!!! మన వాళ్ళందరిని తీసుకురా..... ఇక్కడ ఎవడో రౌడీ రాస్కెల్ స్వప్న ని ఏడిపిస్తూ... రవి ని కొడుతున్నాడు.... అనగానే..

సింహా వచ్చి 'వీరా!!! వెళ్ళి పోదాం రా... స్టూడెంట్స్ పోరగాళ్ళు అంటే మస్తు మంది రావొచ్చు... అంటూ చేయి పట్టుకొని

లాగాడు..

వీర 'ఆగు ... ఇక్కడ వున్నది వీరా... ఎవడికి భయపడడు అంటూ స్వప్న వైపు చూస్తూ.

"రానీ... ఒక్కక్కడికి బెండు తీస్తా... అనేసి

స్వప్న వైపు చూసి..

"స్వప్న!! నేను ఏమి రౌడిని కాదు. నాకు చదువు లేదు..పదో తరగతి తప్పా...-కాకపోతే డైమండ్స్ స్మగ్లింగ్ లో కింగ్ నీ..

ఇళ్ళు, సైట్స్ నచ్చాయి అనుకో... కబ్జా చేస్తా... అంటూ కళ్ళు ఎగరేశాడు..!

రవి తల విదిలిస్తూ.... 'రేయ్!!! నీదేమైనా సెలబ్రెటీ ఆటోబయోగ్రఫీ నా???? తెగ చెప్తున్నావ్???? అన్నాడు

స్వప్న 'చూడండి వీర గారు... మీదు వెళ్ళండి... ప్లీజ్ మా డ్రైవర్ ని వదలండి... అనగానే..

ఈలోపు కాలేజీ లో నుండి 'ఏ.... అంటు పొలో మంటు ఓ 20 మంది కాలేజి పిలకాయలు క్రికెట్ బ్యాట్స్ పట్టుకొని వచ్చేశారు...

ఎక్కడ నుంచో కాళి, సుబ్బు వచ్చారు...

వీర,సింహా నలుగురు కలిసి అందరినీ కలిసి ఐదు నిమిషాల్లో ఉతికి ఆరేశారు.

'సింహా అయితే 'విశాల్' ని పట్టుకొని "ఏరా ఒక్క నాయాలా!! నువ్వే కదా కాల్ చేసి పిలిచినావ్ వీళ్ళందరిని అంటూ ముక్కు మీద ఒక్కటి పీకాడు...

విశాల్ ముక్కు నుంచి బ్లడ్ బరబరా కారింది...

బిందు అయితే బక్కచిక్కి పోయింది..

వీర తమ వైపై రావడం చూసి.. స్వప్న కన్నా భయంగా వణికిపోయింది...

వీర కాలర్ వెనక్కి నెట్టుకొని 'ఏ పిల్ల !!! ఇంకా ఎవరైనా వుంటే పిలు... అన్నాడు సీరియస్ గా..

స్వప్న తమ ఫ్రెండ్స్ అందరు అలా తన్నులు తినడం చూసి చాలా బాధ పడిపోయి..

'ప్లీజ్ అండి.... వాళ్ళందరిని వదిలేయండి... అన్నది..

వీర ' స్వప్న... నేనా కొట్టాను??? వాళ్ళే వచ్చారు... నువ్వు చూశావుగా.... అంటూ స్వప్న వెనుక దాక్కున బిందు తో

'ఏ అమ్మాయి! అంతేనా???? నేను చెప్పింది కరెక్టే నా???? అని అడిగాడు..

బిందు 'హ.హ. అంటూ నీళ్ళు నమిలింది...

వీర 'సరే... స్వప్న నేను అయితే చెప్పేశా... నాకు నువ్వు కావాలి... కాళి గాడు అన్నాడు పెళ్ళి అయితే నువ్వు నాతో వుంటావ్ అని చెప్పాడు ..

కాబట్టి నీకు వారం టైం... తరువాత మళ్ళీ వస్తా.... నీ అభిప్రాయం చెప్పు... అంటూ రవి వైపు కోపం గా చూస్తూ ...తన బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు

' స్వప్న 'రవి' తో 'ఐయామ్ సారి రవి... నా వల్లే మీ అందరికీ దెబ్బలు తగిలాయి.... అన్నది ఏడుస్తూ...

రవి 'హే.. ఊరుకో స్వప్న... అలాంటిది ఏమి లేదు.... నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు... అంటూ తనని కారు ఎక్కించాడు.. అక్కడ భయంగా ఇదంతా చూస్తున్న డ్రైవర్ బాబుతో..

రవి 'నువ్వు ఇక్కడ జరిగింది ఏది ఇంట్లో చెప్పకు.... భయపడతారు... అనేగానే అతను సరేనని తల వూపి కారెక్కాడు......

రవి 'విశాల్' తో "అయ్యాయో... ముక్కు కి బాగా దెబ్బ తగిలే సింది... నువ్వు డాక్టర్ దగ్గరకు వెళ్లు... నేను స్వప్న వెనకే వెళ్తా అంటూ స్వప్న కారు వెనకే వెళ్ళాడు..

డ్రైవర్ ఫాస్ట్ గా కారు ని పోనిచ్చాడు

&&&&&&&&&&&&&&&&

స్వప్న కళ్ళు తుడుచుకుంటూ 'రాము... ఈ విషయం ఇంట్లో చెప్పకు... నీకు తెలుసు కదా నాన్నగారికి తెలిస్తే ఇంక కాలేజీ కి పంపించరు... అనేగానే

అతను "అది కాదు మేడమ్... వాడు రౌడీ లాగా వున్నాడు..... ఇప్పుడు కాని ఈ విషయం మీరు చెప్పకపోతే మిమల్ని ఇంకా టార్చర్ పెడతామో...

స్వప్న 'సరే... ఈసారి చుద్దాం... నువ్వు మాత్రం ఎవరితో అనకు.... అన్నది

&&&&&&&&&&&&&&&&&

ఇంటికి వెళ్ళాక తన భాద ని, టెన్షన్ ని లోపల దాచి అందరితో నవ్వుతూ మాట్లాడింది...

ఆ నెక్స్ట్ డే సుచిత్ర, లాస్య "యూకే" వెళ్ళిపోతున్నారు...

వాళ్ళ కోసం జాను, గౌతమి, తాతగారు పచ్చళ్ళు, పిండివంటలు ప్యాక్ చేసే పనిలో పడ్డారు...

స్వప్న ఫ్రెష్ అయ్యి వచ్చి తను కూడా హెల్ప్ చేసే పనిలోపడింది..

అసలు స్వప్న స్పెషల్ ఏంటి అంటే... ఎంత బాధని అయినా లోపల దాచేస్తుంది...

సుచిత్ర 'ఏ మాటకి ఆ మాటే అమ్మా.... ప్రపంచంలో అందరి కన్నా అదృష్టవంతురాలైన అత్తగారు ఎవరంటే.. నేనే అని గర్వంగా చెప్తా..... అన్నది..

జాను 'అబ్బో... నీ కన్నా ముందు ప్లేస్ నాది.... అన్నది మూతి తిప్పుతూ

లాస్య కిందికి వచ్చి 'మామ్!!!! నాకు బయట పని వుంది... వెళ్ళేసి వస్తా..... స్వప్న ని కూడా నాతో తీసుకెళ్తా.... అని అడిగాడు...

స్వప్న కి హార్ట్ బీట్ పెరిగింది..

"ఎవరు ఒప్పుకోకపోతే బాగుండు.... అసలే ఆ వీర ఇచ్చిన షాక్ కి భయపడి చూస్తుంటే... మళ్ళీ లాస్య తో బయటకా???? వీర మళ్ళీ నన్ను చూస్తే ఇంకేమైనా వుందా???? అనుకున్నది...

సుచిత్ర ' స్వప్న '' వైపు చూసి... 'ఏ స్వప్న.... నీకు ఓకేనా???? అని అడిగింది...

స్వప్న 'లేదు అత్తా.... కొంచెం హెడ్ ఎక్ గా వుంది.... అన్నది..

లాస్య 'వుండదా మరి.... ఎప్పుడు చూడు .. కాలేజీ ఇల్లు... ఇల్లు కాలేజీ.... ఫ్రెండ్స్ సరదాలు షికార్లు వుండాలి...

జాను ' అయ్యో.. లాస్య.. స్వప్న కి ఫ్రెండ్స్ లేరని ఎందుకు అనుకుంటున్నావ్????

దానికి సరదాలు, షికార్లు కూడా ఎక్కువే..

కాకపోతే విమ్ము కి నచ్చవు కాబట్టి ఇవన్ని చెప్పము... అంతే..

లాస్య 'ఓఫో!!! గ్రాని.... మా జనరేషన్ వాళ్ళతో చూసుకుంటే స్వప్న చాలా తక్కువ ఎంజాయ్ చేస్తుంది

అదే ఆ రాక్షసి శృతి చూడు... కాలేజి పేరు చెప్పి.... నైట్ వరకు సినిమాలు, షికార్లు.... అన్నాడు

తాతయ్య " లాస్య... దాని సంగతి నీకు ఎందుకు ?! వినదంటే ఉప్పు పాత్ర వేస్తుంది.

లాస్య 'నాతో కాదు తన వేషాలు...

(అసలే స్వప్న కోసం తెచ్చిన చైన్ తీసుకుని తన మెడలో వేసుకుంది దెయ్యం మొహంది )

గౌతమి 'ఇదంతా కాదు కానీ... స్వప్న లాస్య అంతలా అడుగుతుంటే... ఎందుకు వెళ్ళనంటున్నావ్!! లే రెడి అయ్యి వెళ్ళేసి రా!!!

సుచిత్ర 'ఆ.. బంగారం మొహం చూడు ఎలా అయిపోయిందో... బయట అలా తిరిగి ఏదైనా రెస్టారెంట్ లో డిన్నర్ చేసి రండి.....

జాను 'అవును..... తల్లి లే వెళ్ళు అనగానే...

స్వప్న చేసేది లేక... తన రూం లోకి వెళ్లింది...

సుచిత్ర 'మ్.... అసలు రిషి వాళ్ళ ఫ్యామిలీని కూడా పిలిపించి రిషి కి,స్వప్న కి ఎంగేజ్మెంట్ చేసుకొని వెళదాం... అంటే సురేంద్ర ఇప్పుడు కాదు... అర్జెంట్ పని వుంది... రమ్మన్నాడు... ఏం చేస్తాం అంటూ నిట్టూర్చింది.

గౌతమి ' అలా అంటావ్ ఏంటి సూచి..!స్వప్న మా దగ్గర ఉండేది కొన్ని రోజులేగా..తరవాత తన బాధ్యత నీదే కదా.! 

జాను 'అవును.. సుచి నువ్వేమి ఫీల్ అవ్వకు.... ఈసారి ఏకంగా పెళ్ళి కి ముహుర్తాలు పెట్టించేద్దాం.


స్వప్న తన రూమ్ కి వెళ్ళాక...

శృతి కి కాల్ చేసింది...

శృతి లిఫ్ట్ చేసి.. "అక్కా!!! ఏంటి??? ఈ టైం లో అని అడిగింది....

స్వప్న ' శృతి... ఎక్కడ వున్నావ్??? అని అడిగింది..

శృతి 'బ్యూటి పార్లర్ లో.... పెడిక్యుర్....

స్వప్న ' లాస్య .. బయటకు వెళదాం అంటూ అమ్మ వాళ్ళ ద్వారా చెప్పించింది... అన్నది డల్ గా..

శృతి "అక్కా!!! నీకు ఎన్ని సార్లు చెప్పాను... నీకు నచ్చని పని ఎవరికోసం ఒప్పుకోకు... అని... చెప్పేసేయ్... రానని...

స్వప్న చూడు శృతి నీకు తెలుసు అమ్మ నాన్న ఏదైనా చెప్తే యస్ అనడమే కానీ... నో అనడం నాకు రాదని....

శృతి 'ఇష్.... నిన్ను బాగు చేయడం నా వల్ల కాదు అక్కా... ఇప్పుడు ఏం చేయమంటావ్???

స్వప్న 'మేము ఎక్కడికి వెళ్ళేది లొకేషన్ షేర్ చేస్తాను... రెస్టారెంట్ కి వెళ్ళగానే... నువ్వు వచ్చేయి...

శృతి 'అక్కా... నాకు ఓ డౌట్... అడగనా??? 'నీకు రిషి నీ పెళ్ళి చేసుకోవడం ఇష్టమా? కాదా?అంటే రిషి తో నీ పెళ్లి విషయం కూడా తెచ్చింది లాస్య నే కదా..

లాస్య తో బయటికి వెళ్ళడానికే ఇంత ఇబ్బంది పడుతున్నావ్..! ఒకవేళ లాస్య తీసుకువచ్చిన రిషి మ్యారేజ్ ప్రపోజల్ యాక్సెప్ట్ చేసి మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఏం ఐన ఇబ్బంది వస్తె ఏం చేస్తావ్...!?

స్వప్న ' నాకు అత్త, మామ ఎలాగో ,లాస్య అంతే..... ఇంక పెళ్ళి అంటావా??? చెప్పాగా 'నాన్న' అమ్మ తాత, బామ్మ ముఖ్యంగా అత్త కోసం ఒప్పుకున్నా...

పెళ్ళి అయ్యాకా రిషిని నా భర్త గా ఇష్టపడతాను...

శృతి ' హ్మ్మ్.... సరే నువ్వు అయితే లొకేషన్ షేర్ చెయి.... బాయ్ అంటూ కాల్ కట్ చేసింది ..

తరువాత స్వప్న,లాస్య స్వప్న కారులో బయటకు వెళ్ళారు...

లాస్య డ్రైవర్ ని వద్దని చెప్పటంతో.... అతను ఆగిపోయాడు..

గౌతమికి చెప్పేసి డ్యూటీ దిగి... ఇంటికి బయలు దేరాడు..

కొంత దూరం వెళ్ళేసరికి... శృతి నుంచి కాల్ వచ్చింది..

లిఫ్ట్ చేసి 'మేడమ్... అన్నాడు..

శృతి 'రాము... కారులో మొన్న కొన్ని పేపర్స్ పెట్టాను.. నువ్వు ఎటు ఇప్పుడు బయటకు వెళ్తున్నావు కదా... జిరాక్స్ తీసి సేమ్ ప్లేస్ లో పెట్టు.... అనేగానే

రాము 'మేడమ్... లాస్య మేడమ్ నన్ను వద్దని ఆవిడే డ్రైవ్ చేస్తానన్నారు .. నేను రేపు మార్నింగ్ తీయించుతా... మేడమ్... అనేగానే.

శృతి 'ఓ.... అవునా సరే... అంటూ ఫోన్ కట్ చేయబోతుంటే..

రాము 'మేడమ్..... మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి... అంటూ నీళ్ళు నమిలాడు...

శృతి 'ఏంటి రాము??? అని అడిగింది ఆశ్చర్యంగా... రాము 'మేడమ్ అది మరి... అంటూ వీర సంగతి చెప్పేశాడు.. అంతా విని శృతి ఒక్క నిమిషం షాక్... వెంటనే తేరుకుని "వ్వాట్... అంత పెద్ద ఇష్యూ జరిగితే... ఇంట్లో చెప్పలేదా??? అని అడిగింది పెద్దగా..

రాము ' స్వప్న మేడమ్ వద్దన్నారు అంటూ సైలెంట్ అయ్యాడు...

శృతి 'షిట్!!! అక్క అలా ఎలా అన్నది... సరే కనీసం నాకైనా చెప్పావ్...

అవును వాడి పేరు ఏమన్నావ్???

రాము 'వీర.... అంటమ్మా...

శృతి 'ఫోటో తీశావా???

రాము 'నేను ఫోన్ కారులో పెట్టాను... మేడమ్... వాడు సడెన్ గా వచ్చేసరికి.. దిగి అతన్ని కొట్టబోతుంటే అతని మనుషులు నన్ను పక్కకి తోసేశారు..

శృతి 'రవి వాళ్ళంతా ఓకే నా????

రాము 'అతను పర్లేదు కానీ విశాల్ బాబుకి ముక్కు పగిలిపోయింది....

శృతి 'అజజో.... సరే... నాకు వదిలేయ్... నేను చూసుకుంటా.. నువ్వు ఒక పని చేయి..

ఈసారి వాడు వస్తే... అడ్రస్ షేర్ చేయి... అండ్ వాడి ఫోటో తీయి... అంటూ కాల్ కట్ చేసింది..

వెంటనే రవి కి చేసే 'రవి||| ఎంటి ఎవడో రౌడి రాస్కెల్ వచ్చాడంటా??? అంటూ హడావిడిగా అడిగింది.. రవి రాము చెప్పాడా శృతి... అని అడిగాడు కంగారుగా..

శృతి 'హా!!!

రవి పక్కనే వున్న విశాల్ ' శృతి ' నేమ్ వినగానే గుండె గంట కొట్టింది...

శృతి 'హ... రవి అసలు ఎవడాడు??? అక్క ని ఎక్కడ చూశాడు???

రవి 'ఎక్కడ చూశాడో! ఎప్పుడు చూశాడో! తెలియదు... శృతి..

మాకు మాత్రం వైజాగ్ లో తగిలాడు...అంటూ జరిగింది చెప్పాడు...

అంతా విని శృతి 'ఓ మై గాడ్... ఇంత జరిగినా అక్క మాకు ఎందుకు ఏమి చెప్పలేదు.... అని అడిగింది కంగారుగా..

రని 'మేము వాడు వైజాగ్ లోకల్ వాడెమో.... అక్కడేదో తగిలాడు... ఇక్కడికి రాడు అనుకొని వదిలేశాము..

కాని.... మా అంచనాలను తల క్రిందులు చేస్తూ ఇవాళ ఇక్కడ ప్రత్యక్షం అయ్యాడు...

పక్కనుంచి విశాల్ 'ముక్కు' చూపిస్తూ నాకు దెబ్బ తగిలింది అని చెప్పు అని సైగ చేసాడు..

రవి (ఆగరా....బాబు నువ్వు ఒకడివి అంటూ తల కొట్టుకున్నాడు)

శృతి 'ఇప్పుడు ఏం చేద్దాం... వాడు మళ్ళీ వస్తే....ఎలా???

రవి 'అదే ఆలోచిస్తున్నా... ఎటు ఎల్లుండి తో ఎగ్జామ్స్ అయిపోయాయి ... వాడెమో ఒన్ వీక్ టైం ఇచ్చాడు.. నువ్వు ఎల్లుండి వచ్చేసేయ్...ఏం చేయాలో ప్లాన్ చేద్దాం.... ఓకేనా??? అని అడిగాడు.

శృతి 'ఓకే... అవును... విశాల్ కి ఎలా వుంది??? అని
 అడిగింది నార్మల్ గా..

రవి 'ఇదిగో వాడి దగ్గరే వున్నా... ఇస్తున్నా అంటూ ఫోన్ ఇచ్చాడు... విశాల్ మొహం వెలిగిపోయింది.

ఫోన్ తీసుకుని "హలో... శృతి!!! అన్నాడు

శృతి 'ఆ... విశాల్ ఎలా వున్నావ్ బ్రో!!! అని అడిగింది

అంతే మనోడు షాక్ :|

తేరుకోవడానికి టైం పడుతుంది.... 
[+] 9 users Like Ranvijaysingh2's post
Like Reply
#68
sooper undi story.
Just read the whole story!! Sooper interesting and intriguing!!

Last lo reveal ayye secret gurinchi subtle hints istoo.. chala tight ga but jovial ga raastunnaru!!
Wonderful writing style bro!!!

The best part.. ippati varaku sex kaadu kada.. kaneesam romance vaasana kooda lekunda raastunnav.

Take a bow bro!!
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
#69
Nice update
[+] 1 user Likes lohith22's post
Like Reply
#70
VERY GOOD UPDATE! PLEASE CONTINUE GIVING UPDATES!!
[+] 1 user Likes yekalavyass's post
Like Reply
#71
అప్డేట్ ఎలా ఉందో కామెంట్స్ ద్వారా తెలియజేస్తున్న తోటి సైట్ సభ్యులకు ధన్యవాదాలు :)
[+] 2 users Like Ranvijaysingh2's post
Like Reply
#72
(09-06-2026, 01:06 PM)Ranvijaysingh2 Wrote: అప్డేట్ ఎలా ఉందో కామెంట్స్ ద్వారా తెలియజేస్తున్న  తోటి సైట్ సభ్యులకు ధన్యవాదాలు :)

విశాల్ 'హలో... హలో.. అంటూ కావాలని కాల్ కట్ చేసి...

"ఇదేంటిరా బ్రో అనేసింది... అంటూ ఏడుపు మొహం పెట్టాడు..

రవి 'లేకపోతే డార్లింగ్ అంటుందా... ఊరుకోరా... శృతి అక్కడ.... తేడా వస్తే వాయ తీస్తుంది.... 

విశాల్' ఎల్లుండి నేను వెళ్ళాక రమ్మను... తనని అంటూ కళ్ళు మూసుకున్నాడు...

 రవి 'అది సరేరా... అస్సలు వీర సంగతి ఏమి చేయాలో అర్ధం కావటం లేదు... వాడిని చూశావా??? ఎంత స్ట్రాంగ్ గా వున్నాడో... మనందరిని ఉతికి ఆరేశాడు...

విశాల్ 'వాడికి తోడు మూడు దున్నపోతులు..

నా ముక్కు పగలకొట్టాడే ఆ గన్నాయి గాడు వాడిని మాత్రం వదలను రా!!! అంటూ పళ్ళు కొరికాడు...

రవి 'అవునురా!!! పోలిస్ కంప్లైంట్ ఇద్దామంటే అంకుల్ కి తెలుస్తుంది...

విశాల్ "మరి ఏం చేద్దాం.... అంటూ ముక్కు పట్టుకున్నాడు...

రవి 'సరే.... వన్ వీక్ అన్నాడు గా.... చూద్దాం...

&&&&&&&&&&

లాస్య కారు డ్రైవ్ చేస్తుంటే...

స్వప్న తన చైన్ ని ఒక చేత్తో పట్టుకొని... రెండో చేతిని.. బుగ్గ మీద పెట్టుకొని బయటకు చూస్తోంది..

తనకి వీర నే గుర్తు వస్తున్నాడు...
ఆ గడ్డం...ఆ మాటలు....
అబ్బా... లవ్ ఏంటి???? అసలు అలా ఎలా అంటాడు పెళ్ళి అని???
అతనికి ఏమైనా మెంటలా????ఎలా తప్పించుకోవాలి???
దేవుడా.... ప్లీజ్ అతన్ని నా లైఫ్ లోకి రాకుండా చూడు అంటూ కళ్ళు మూసుకుంది.

అది చూసి లాస్య "ఏంటి స్వప్న!!!అలా ఉన్నావ్.!? తలనొప్పి ఆహ్?

స్వప్న ' అదేం లేదు లాస్య... నాకు బయటకు వచ్చే మూడ్ లేదు ...కొంచెం uneasy గా ఉంది

లాస్య ' వాటర్ తాగుతావా అంటూ స్వప్న కి వాటర్ బాటిల్ ఇచ్చింది..
స్వప్న బాటిల్ తీసుకొని పక్కన పెట్టేసింది.

లాస్య "రేపు నేను వెళ్ళిపోతున్నా కదా స్వప్న ...నీతో కొంచెం సేపు ఐన టైమ్ స్పెండ్ చేద్దాం అని...

స్వప్న ' కరెక్ట్ ey లాస్య...బయటికి వెళ్దామని నన్ను అడగకుండా అమ్మ వాళ్ళ చేత ఎందుకు అడిగించావ్?? నాకు అటు స్టడీస్ లో... ఇటు ఫ్యాషన్ డిజైనింగ్ లో ప్రాబ్లమ్స్..

అందుకే ఎదో మూడ్ ఆఫ్.... అని అబద్దం చెప్పింది..

లాస్య ' నీకు ఒకే అయితే నీ పెళ్లి తరవాత రిషి నీ అడిగి నీ చేత పెద్ద బొటిక్ ఓపెన్ చేయిస్తా... నీ కింద వర్క్ చేయడానికి వర్కర్స్ ని పెడతా... ఏం అంటావ్?

స్వప్న కి మైండ్ నిండా వీర ఆలోచనలే. లాస్య పాప మాటలు ఎక్కడం లేదు.

ఈలోపు నెమ్మదిగా ఫోన్ తీసి శృతి కి లొకేషన్ షేర్ చేసింది.

శృతి నుంచి మెసేజ్ ' లాస్య బుర్ర తింటుందా???

స్వప్న 'అదేం లేదు.... నాకే మూడ్ ఆఫ్ 

శృతి 'మూడ్ ఆఫ్ దేనికి అక్కా... ఆర్ యూ ఓకే????

స్వప్న ' హ్మ్మ్..సరేలే గాని నువ్వు తొందరగా వచ్చేయి..

&&&&&&&&&&

లాస్య ఒక పెద్ద శారి సెంటర్ ముందు కారు ఆపింది... స్వప్న అది చూసి... "ఇక్కడికి ఎందుకు లాస్య???? అని అడిగింది...

లాస్య 'శారీ షాప్ కి ఎందుకు వస్తారు ఎవరైనా??? దిగు.. అంటూ తను కారు దిగగానే....

స్వప్న కూడా నెమ్మదిగా దిగింది..

యల్లో కలర్ చుడిదార్...తనకి ఎప్పుడూ పెద్ద జడ...
చక్కగా అల్లుకొని...బొమ్మలాగా ముద్దుగా వుంటుంది..
కళ్ళకి కాటుక అసలు మిస్ చేయదు...
 ఏ కలర్ డ్రస్ వేస్తే సేమ్ కలర్ బ్యాంగిల్స్, స్టికర్ కంపల్సరీ... 
నెమలి కూడా జలస్ అయ్యేంత వయ్యారంగా నడుస్తూ.... 
జడ లయ బద్దంగా అటు ఇటు కదులుతూ...
మొహంలో చిరునవ్వు పోనివ్వకుండా...
వుంటుంది మన ఫ్యాషన్ డిజైనర్ పాప....

ఇక మనోడి గెటప్ నిన్న చూశారు... 

స్వప్న మాట మృదువుగా..

వీర మాట కటువుగా...

ఇలా ప్రతీది ఆపోజిట్...

లోపలికి వెళ్ళాక లాస్య 'సేల్స్ గర్ల్ తో తనకి ఇష్టమైన కలర్స్ తో శారీస్ తిపించాడు... స్వప్న కి ఏమి చూడాలనిపించటమే లేదు.....స్వప్న చూడకపోవడం తో 

లాస్య ' స్వప్న నీకు నచ్చిన కలర్స్ లో తీసుకో అన్నింది 

లాస్య ' స్వప్న!!! నీకు ఈ శారి ఓకేనా?? ఆ శారి ఓకేనా?? అంటూ తన భుజం పై శారీ వేసి చూపిస్తూ ఉంటే ... స్వప్న 'నీ ఇష్టం లాస్య నీకు ఏది నచ్చితే అదే తీసుకో... అని చెప్పింది...

లాస్య ఒకసారి శారీస్ నీ చూసి దబదబా ఓ ఇరవై శారీలు చూసి ఓ పది శారీలు ప్యాక్ చేయించమన్నది.

స్వప్న " లాస్య... శృతి కి తీసుకోవా!? అని అడిగింది.

లాస్య 'నేనా!? తనకా!? నో ఛాన్స్... అంటూ పైకి లేచింది.

స్వప్న 'అది కాదు లాస్య.... చిన్నప్పటినుంచి నేను ఏది కొనుక్కున్న తనకి.... తను ఏమి కొన్న నాకు తీసుకొస్తాము...

లాస్య ' ... అది వేరు.. ఇది వేరు...వీటిలో ఎవరికి షేరింగ్స్ ఇవ్వను.... అనగానే

స్వప్న 'వీటిలో నుంచి వద్దు... సరే లే నీకు ఇష్టం లేకుండా అడగటం కూడా కరెక్ట్ కాదు... నేనే తీసుకుంటా... అని వాళ్ళతో 'డ్రెస్ లు ఏ ఫ్లోర్??? అని అడిగింది...

వాళ్ళు 3 ఫ్లోర్ అనగానే.

స్వప్న ' లాస్య నేను 10 నిమిషాల్లో వస్తాను..నువ్వే ఇక్కడే వెయిట్ చేయ్ అంటూ ఫాస్ట్ గా వెళ్ళిపోయింది.

లాస్య 'ఛీ. ఛీ.. ఆ శృతి ఎక్కడికీ వెళ్ళినా వదలదు... రాక్షసి... చిన్నప్పటినుంచి అంతే... నన్ను టీజ్ చేసేది...అయినా స్వప్న ది కూడా వున్నదిలే తప్పు....
ఎప్పుడు చూడు... చెల్లి చెల్లి అంటూ ఆ రాకాసిని నెత్తిన పెట్టుకొని మోస్తుంది..

పెళ్ళి అవనివ్వండి చెప్తా... మీ అక్కా చెల్లెళ్ళని కొన్ని రోజులు దూరంగా వుంచకపోతే నా పేరు లాస్య కాదు ... అనుకుంటూ పళ్ళు కొరుకుతూ... కారాలు మిరియాలు నూరుతూ అటు ఇటు తిరుగుతుంది..

స్వప్న 3 ఫ్లోర్ కి వెళ్ళింది....

సేల్స్ గర్ల్ ఎదురొచ్చి "యస్... మేడమ్.. అనగానే..

స్వప్న 'ఆ... లెహంగాస్!!!! అని అడిగింది.. ఈ అమ్మాయి రండి అంటూ తీసుకెళ్ళింది.. అయితే కాళికి ఒక చెల్లి వుంది ..

తన పేరు సుమ.... ఆ అమ్మాయికి పెళ్లి కుదిరింది... ఆ అమ్మాయే ఈ సేల్స్ గర్ల్... సుమ తన కౌంటర్ లో వున్న లెహంగాస్ అన్నీ తీసి చూపిస్తోంది.. స్వప్న అన్నీ చూస్తూ.... పది నిమిషాలలో రెండు సెలెక్ట్ చేసింది.. ఈ లోపు లాస్య నుంచి ఫోన్ వస్తే మాట్లాడుతూ... తన పర్స్ అక్కడే మర్చిపోయి వెళ్ళి పోయింది...

లాస్య అప్పటికే తను కొన్న శారీస్ కి బిల్ పే చేసింది

స్వప్న తో 'ఏవి.? మీ ఏంజిల్ గారి డ్రెస్సులు?? అని ఒక రకమైన ఎక్స్ప్రెషన్ తో అడిగింది.

లాస్య ఎక్స్ప్రెషన్ నీ చూసి స్వప్న కి నవ్వు వచ్చింది...కానీ కంట్రోల్ చేసుకుంది.

 'ఇవిగో' అంటూ సుమ చేతిలోని కవర్స్ తీసుకుని కౌంటర్ లో ఇవ్వగానే...

లాస్య తన కార్డ్ ఇస్తుంటే..

స్వప్న "ఏమి అవసరం లేదు .. శృతి కి నేను కొంటాలే.... అన్నది. సీరియస్ గా.

చేతిలో చూస్తే... వాలెట్ కనపడలేదు.."తెచ్చానా!? తీసుకురాలేదా?! అంటూ ఆలోచనలో పడింది..

మాములుగా అయితే స్వప్నకి గుర్తే... కాని వీర ఇచ్చిన జలకి కి మర్చిపోయింది...

లాస్య 'ఏం పర్లేదు... నేను ఇస్తా... అంటూ పే చేసింది..

ఇద్దరూ వెళ్లిపోయాక... సుమ పైకి వెళ్ళి అన్ని సర్దుతుంటే... స్వప్న వాలెట్ కనపడింది..

చేతిలోకి తీసుకొని "అయ్యో... ఇది ఇప్పుడు వచ్చిన మేడమ్ గారిది అనుకుంటా... అని చూస్తుంటే....

అక్కడి గ్రౌండ్ సూపర్ వైజర్ వచ్చి "ఏంటి సుమ?? ఎవరిది ఆ పర్స్??? అని అడిగాడు..

సుమ "ఇందాక ఒక మేడమ్ వచ్చారు కదా సార్... బహుశా ఆమెది ఎమో.... అంటూ కిందికి వెళ్ళింది...

అప్పటికే వాళ్ళు వెళ్ళిపోయారు...

తను పైకి వచ్చి .... 'సార్... ఆమె లేరు... వెళ్ళిపోయారు..

ఆయన 'అయ్యో!! అవునా... సరే జాగ్రత్తగా నీ దగ్గరే వుంచు... వాళ్ళు ఈసారి వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చేసేయ్...అన్నాడు

సుమ సరేనని ఆ వాలెట్ ని తన హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంది.

లాస్య ఎదో ఒకటి మాట్లాడుతూనే ఉంది...

స్వప్న 'ఊ... కొడుతునే వుంది...

ఆ తర్వాత... లాస్య 'రెస్టారెంట్' దగ్గర కారు ఆపింది

ఇద్దరూ లోపల కూర్చున తరువాత.

లాస్య " స్వప్న.... నీవు ఇంకెప్పుడూ నాన్ వెజ్ తినవా???? అని అడిగింది....

స్వప్న 'తినను.. లాస్య

లాస్య 'పోనీ వండుతావా ????

స్వప్న 'పర్లేదు... 

లాస్య ' ఇంకేంటి స్వప్న.

స్వప్న 'ఇంటి నుంచి వచ్చే అప్పుడు పర్స్ తెచ్చినట్లు గుర్తు ... షాప్ లో చూస్తే చేతిలో లేదు... అసలు తెచ్చనా...లేదా .!?

లాస్య 'ఆ మాట ఏదో అక్కడే చెప్తే.... ఒకసారి చూసే వాళ్ళము కదా!!!!

స్వప్న 'సరే... చుద్దాం... ఆర్డర్ ఇవ్వు .... అనేగానే.. లాస్య 'ఆర్డర్ కోసం మెనూ చూస్తుంటే స్వప్న ఎక్కడో చూస్తుంది

లాస్య ' స్వప్న ఇక్కడ మాట్లాడుతుంటే ఎక్కడో చూస్తున్నావ్??? అని అడిగింది.ఒకసారి నన్ను చూడు..

స్వప్న కామ్ గా అప్పటివరకు లాస్య నీ చూడకుండా ఆపుకున్న నవ్వుని లాస్య ఫేస్ నీ (ఇంతకముందు శారీస్ దగ్గర లాస్య ఇచ్చిన ఎక్స్ప్రెషన్ గుర్తు తెచ్చుకొని) చూసి ఒక్కసారిగా నవ్వింది..

స్వప్న ఎందుకు నవ్వుతుందో అర్థంకాలేదు లాస్య కి...కొంచెం కన్ఫ్యూషన్ లో ఉంది...ఐన స్వప్న నవ్వుతుంది కదా అని లాస్య కూడా నవ్వటం స్టార్ట్ చేసింది...లాస్య నవ్వటంతో స్వప్న ఇంకా గట్టిగా నవ్వుతుంది...

అప్పుడే అక్కడికి వచ్చిన శృతి స్వప్న,లాస్య నవ్వటం చూసి శృతి ఫాస్ట్ గా వచ్చి లాస్య నెత్తి మీద ఒక్కటి పీకింది...

లాస్య 'అబ్బా.... అంటూ తల రుద్దుకుంటూ తల పైకెత్తి చూసి..

"నువ్వా!!!! ... శృతి 'కమాన్... గర్ల్స్.... అనేగానే తన ఫ్రెండ్స్ ఒక 6 గురు వచ్చారు.. అందరు రావడంతోనే ..

హాయ్! అక్కా.... హాయ్ లాస్య... అంటూ అరిచారు గట్టిగా

లాస్య చెవులు మూసుకుని 'అబ్బా.... ఇయ్య.... అంటూ పైకి లేచింది

ఇప్పుడే వస్తా... అంటూ శృతి వైపు కోపంగా చూస్తూ పక్కకి వెళ్ళింది.

స్వప్న తో "ఏంటి అక్కా... మీరిద్దరూ ఇక్కడ??? ఓ నవ్వుతున్నారు.. అని అడిగింది ఏమి తెలియనట్లుగా...

లాస్య (అంటే.... స్వప్న కి కూడా తెలియదా వీళ్ళు వస్తున్నట్లు...)

స్వప్న ' లాస్య నేను బయటకు వచ్చాము.... సరే... ఒకేసారి డిన్నర్ చేయచ్చంటే... ఇలా వచ్చాము

లాస్య వచ్చి చైర్ లో కూర్చుని.... "నువ్వేంటి శృతి... ఇక్కడ ఈ టైంలో??

శృతి 'మేము పని మీద బయటకు వచ్చాము ... బయట మా కారు కనిపించేసరికి లోపలికి వచ్చా...

సరే... వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అంటూ అందరిని పరిచయం చేసింది.

స్వప్న శృతి ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంది...లాస్య ఫోన్ చూస్తున్నట్టు స్వప్న నీ చూస్తుంది..

శృతి తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ లాస్య నీ చూసింది...అబ్బే ఏదో తేడా కొడుతుంది అంటూ లాస్య అని పిలిచింది..

లాస్య ' హా

శృతి ' తినడానికి ఆర్డర్ ఇద్దామా!?

లాస్య ' ఏం కావాలి మీకు !?

శృతి ' నేనే ఆర్డర్ ఇస్తా అని శృతి అందరికీ ఆర్డర్ ఇచ్చింది... లాస్య తో సహా...

లాస్య "ఓయ్!!! అదేంటి... నేను ఏం తింటానో నేను చెప్తాగా అన్నింది సీరియస్ గా..

శృతి 'హ.హ. నువ్వు ఏం తింటావో నాకు తెలుసుగా 
అందుకే నేనే ఇచ్చేశాలే ఆర్డర్....
ఈసారికి ఇలా కానీ..
లాస్య కి పిచ్చ కోపం వచ్చింది.... తమాయించుకుంది.

అందరు ఫుల్గా తినేశాక శృతి ఫ్రెండ్స్ వెళ్ళి పోయారు...

శృతి 'సరే... పదండి మనం కూడా లాగిద్దాం....అనగానే.

లాస్య ఇప్పుడేగా లాగించాము... ఇంకేమి తింటాం... అన్నింది వెటకారంగా....

శృతి 'అయ్యో!!!లాస్య లాగించటం అంటే వెళదాం అని.... లే లే అంటూ లాస్య చేతిలోని కారు కీస్ లాక్కొని వెళ్ళి డోర్ ఓపెన్ చేసి డ్రైవింగ్ సీట్లో కూర్చుంది...

లాస్య 'ఓయ్.. నేను ఎక్కడ కూర్చోవాలి??? అని అడిగింది ఆశ్చర్యంగా...

శృతి 'నా పక్కన కూర్చో 

లాస్య 'ఏమి పర్లేదు... నువ్వు డ్రైవ్ చేయి... నేను, స్వప్న వెనుక కూర్చుంటాము... అన్నింది వెటకారంగా..

శృతి భుజాలెగరేసి "నీ ఇష్టం... అనగానే..

స్వప్న ' శృతి... లే లాస్య కి కీస్ ఇచ్చేసి నువ్వు వెనక్కి వెళ్ళు!!! అన్నది సీరియస్ గా..

లాస్య 'ఓహోహో.... ఇది మరి బాగుంది... మీ ఇద్దరూ వెనకా??? నేనేమైనా మీ డ్రైవర్ నా?? అని అడిగింది.. కోపం గా

శృతి 'అందుకే... ఎంచక్క నా పక్కన కూర్చో అన్నాను...

లాస్య 'చూశావా స్వప్న... అందుకే అందుకే ఈ రాక్షసి నచ్చదు.. నువ్వెమో చెల్లి చెల్లి అంటూ నెత్తిన పెట్టుకొని ఊరేగుతావు....

తను నీ మాటకు వాల్యూ కూడా ఇవ్వదు..

శృతి 'ఇప్పుడు నేనేం చేశాను??? అంటూ కోపం గా చూసింది లాస్యనీ!!!!

లాస్య 'ఆహ్హ... చూడమ్మ ఏమి తెలియనట్లు ఎలా అడుగుతుందో...

ఆరోజు అంతే కావాలని చైన్ లాక్కున్నావు....
ఇప్పుడు మేము ఎక్కడ వున్నామో కనిపెట్టి మరి వచ్చావు..
ఎప్పుడూ నాతో గొడవ పెట్టుకోవాలి..నన్ను బ్యాడ్ గా చేయాలి అని చేస్తావ్..!

శృతి ' హోల్డ్ యువర్ టంగ్ లాస్య... అన్నది పిచ్చ కోపం తో...!

స్వప్న 'ష్!!! ఆపండి ఇద్దరూ..... శృతి వెనక్కి వెళ్ళు....లాస్య డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది కాబట్టి లాస్యనే చేయనివ్వు...నువ్వు లే... అన్నది చాలా నెమ్మదిగా....

లాస్య (భలే దొరికింది.... స్వప్న మాట వినకపోతే బాగుండు)

శృతి 'అక్కా... కారు దొరక్క దొరక్క దొరికింది నేను డ్రైవ్ చేస్తా.... ప్లీజ్ అక్కా.....

స్వప్న 'అబ్బా... శృతి నాకు అసలే హెల్త్ బాగోలేదు... నువ్వు విసిగించకుండా... వెనక్కి పదా!!!

లాస్య 'పోనీలే... స్వప్న వదిలేయ్.. తనకు నీ మాటంటే వాల్యూ లేదు..

శృతి ' లాస్య!!! ఆపు నీ నారద పనులు... పుల్లలు పెడుతున్నావు..... అంటూ కారు లో నుండి దిగి వెనక్కి వెళ్ళింది....

లాస్య '(హమ్మయ్యా... మొత్తానికి నా మాటే నెగ్గింది..) అని విజిల్ వేసుకుంటూ

డ్రైవింగ్ సీట్లో కూర్చుంది..

స్వప్న కామ్ గా లాస్య పక్కన కూర్చుంది...

లాస్య సీట్ బెల్ట్ పెట్టుకొని డ్రైవింగ్ స్టార్ట్ చేసింది.

కొంత దూరం వెళ్ళేసరికి రోడ్డుకు అడ్డంగా సడెన్గా కుక్క అడ్డం వచ్చేసరికి సడెన్ బ్రేక్ వేసింది. స్వప్న సీట్ బెల్ట్ పెట్టుకోలేదు... ముందుకు పడింది..

శృతి 'అక్కా..... అంటూ అరిచింది పెద్దగా....

లాస్య స్వప్న తల ని పైకి లేపింది.

తలకి కొంచెం గీసుకొని బ్లెడ్ వస్తోంది.

శృతి 'అయ్యో... అంటూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి అందులోనుంచి కాటన్ పెట్టింది...

లాస్య ' శృతి నేను ఫస్ట్ ఎయిడ్ చేస్తా ఇటు ఇవ్వు..

శృతి ' .......

లాస్య 'సీట్ బెల్ట్ పెట్టుకోలేదా స్వప్న... అని అడిగింది కంగారుగా..

శృతి నువ్వు ఆపు... నువ్వు నీ తొక్కలో సానుభూతి... అంటూ లాస్య ని కొరకొరా చూసి...' ఓకే... కదా అక్కా.. అని అడిగింది...

లాస్య ' సారీ స్వప్న ..చూసుకోలేదు... నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకున్నావ్ అనుకున్న

శృతి 'ఓహో... అలా సింపతీ కొట్టేద్దామనా మా అక్క దగ్గర ...ఏంటి ఆ గబ్బిలం మొహం వేసుకొని ఇంక స్టార్ట్ చేయి..... అన్నది.

లాస్య సీట్ బెల్ట్ తీయబోతుంటే....

స్వప్న 'ఇట్స్ ఓకే... లాస్య. నేను పెట్టుకుంటాను... అని లాస్య చేతిని తోసింది .

శృతి పుసుక్కున నవ్వింది ..

శృతి ఒకసారి స్వప్న వైపు చూసింది..స్వప్న సీట్ బెల్ట్ పెట్టుకొని బయటికి చూస్తుంది.. లాస్య కారు ముందుకు పోనించింది

ఆ నెక్స్ట్ డే మార్నింగ్ .... సుచిత్ర, లాస్య లండన్ వెళ్ళిపోయారు...

వెళ్ళేటప్పుడు సుచిత్ర, స్వప్న చాలా ఎమోషనల్ అయ్యారు

వాళ్ళు వెళ్ళాక "స్వప్న "! వాలెట్ కోసం వెతికింది ..

కనపడలేదు

అందులో 20000/- క్యాష్.... తన డెబిట్ కార్డు ఒకటి.... ఇంకా తను,శృతి కలిసి వుండే ఫోటో హైకాలేజ్ డేస్ ది ఒకటి వున్నాయి...

కాలేజికి ఆరోజు నెక్స్ట్ డే ఎగ్జామ్ కావడంతో ఆరోజు హాలిడేనే..
శృతి ఎదో వర్క్ లో వుంది....

స్వప్న వచ్చి ' శృతి.. నా వాలెట్ నిన్న షాపింగ్ లో మర్చిపోయా.. వెళ్ళి తెచ్చుకుందాం... పదా అని అడిగింది...

శృతి 'అయ్యో... అక్కా.... ప్రాజెక్టు సబ్మిషన్ కి రేపే లాస్ట్ డేట్.... కొంచెం బిజీ... తాతయ్య వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి రాగానే తోడు తీసుకెళ్ళు... అన్నది....

“స్వప్న సరే... నని వెళ్ళేసరికి తాతయ్య, జాను అటు నుంచి పని మీద బయటకు వెళ్తాం.... అని చెప్పి వుండటంతో.... గౌతమి ఆ విషయమే చెప్పింది...

స్వప్న కారు లోనే వాళ్ళు వెళ్ళడంతో...

గౌతమికి చెప్పేసి.... శృతి 'స్కూటీ' తీసుకుని బయలుదేరింది....

ఫేస్ కి స్కార్ఫ్ కట్టింది....

ఆ శారీ సెంటర్ కి వెళ్ళి... విషయం చెప్పగానే.... వాళ్ళు పైన సుమ ని పిలవమన్నారు..

ఫ్లోర్ సూపర్వైజర్ వచ్చి 'మేడమ్.... ఆ అమ్మాయి దగ్గరే వుంది.... మీ పర్స్.... అయితే తనకి పెళ్ళి కుదిరింది... ఇవాల్టి నుంచి సెలవులో వుంది.

నాకు ఆ విషయం గుర్తు లేక తన దగ్గర వుంచాను అని చెప్పాడు.

స్వప్న 'అవునా!? తన ఫోన్ నెంబర్ ఇస్తారా???? నేను మాట్లాడతాను... అనేసరికి..

అతను 'సుమ' నెంబర్ ఇచ్చాడు..

స్వప్న బయటకు వచ్చి ఆ నెంబర్ కి కాల్ చేసింది... సుమ లిఫ్ట్ చేసి 'హలో'.... అనేగానే స్వప్న 'నేను అండి. నా పర్స్ మీ దగ్గర .... సుమ 'హా.... మేడమ్... సారి అండి.... నేను లివ్ లో వున్నాను.... స్వప్న 'చెప్పారన్మూ... మీ ఇంటి అడ్రస్ చెప్తే.... నేనే వస్తాను... సుమ 'అవునా మేడమ్ సరే.... అంటూ అడ్రస్ చెప్పింది.

స్వప్న ఆ అడ్రస్ కి బయలుదేరింది...

ఇంక కాళి వాళ్ళ ఇంట్లో:
వాళ్ళది బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ...
కాలి పేరెంట్స్ కూడా వర్క్ చేస్తారు...
కాళి తమ్ముడు చదువుకుంటున్నాడని మనకి తెలుసు...
చెల్లి సుమ...
అయితే కాలి ఏం పని చేస్తాడు అనేది మాత్రం.... ఇంట్లో చెప్పడు...
ఎదో బిజినెస్...
వీర కింద పని చేస్తాడని తెలుసు...
స్వతహాగా కాళి చాలా మంచివాడు..
పేదరికం.... అతన్ని ఆ దారిలో వెళ్ళేలా చేసింది..
ఆయితే సుమ కి పెళ్లి చేయడానికి చాలా డబ్బులు వెనకేశాడు...
తనకి యాక్సిడెంట్ అవ్వటం...

స్వప్న అనే అమ్మాయి తనని హాస్పిటల్ లో జాయిన్ చేసి అంత ఎమోంట్ ఖర్చు పెట్టిందని ఇంట్లో చెప్పడంతో..

స్వప్న ఎవరో తెలియకుండానే వాళ్ళందరూ తన మీద అభిమానం పెంచుకున్నారు...

స్వప్న 'సుమ' ఇంటి దగ్గరకు వచ్చి.... కాల్ చేసింది...

తను లిఫ్ట్ చేసి... 'అప్పుడే వచ్చారా??? మేడమ్... నేను ఇక్కడే బయటకు వచ్చాను... మీరు ఒక్క పది నిమిషాలు వేయిట్ చేయండి... అని చెప్పింది...

 స్వప్న 'సరే... నని అలాగే బండి మీద కూర్చోని చూస్తోంది...

కరెక్ట్ సుమ వాళ్ళింటికి నాలుగు ఇళ్ళు ముందర......

మొహానికి స్కార్ఫ్ అలాగే వుంది....

వీర ఎన్ ఫీల్డ్ మీద కాళితో వస్తున్నాడు.

ఆ సౌండ్ డగ్ డగ్ మని దగ్గరయ్యేకొద్ది.

స్వప్న కి ఏదో తెలియని గుబులు మొదలైంది...

వీళ్ళు తనని పాస్ అయ్యి... కాళి ఇంటి ముందు బండి ఆపారు..

కాళి బండి దిగి 'లోపలికి రారా!!! కాస్తా టీ తాగేసి వెళ్ళిపోదాం.... అన్నాడు ..

వీర 'నాకు వద్దులే కాని నువ్వు తాగేసి రా!!!! ఐదు నిమిషాల్లో రా... నేను అక్కడ వేయిట్ చేస్తూ ఉంటా... అని బండి రివర్స్ చేసి.....

కరెక్ట్ గా స్వప్న పక్కన ఆపాడు బండి...

స్వప్న ని చూడలేదు...

స్వప్న ఎందుకో తల తిప్పి చూసేసరికి.... వీర బైక్ స్టాండ్ వేసి... దిగి చేతులు రబ్ చేసి....

ఒళ్ళు విరుచుకుంటూ.... స్వప్న వైపు అప్పుడు చూసాడు...
[+] 5 users Like Ranvijaysingh2's post
Like Reply
#73
Font size penchandi
Mr. V
[+] 1 user Likes VijayPK's post
Like Reply
#74
Update super ga undhi
[+] 1 user Likes Durga reddy's post
Like Reply
#75
Sooper update Ranvijaysingh garu
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
#76
Super update
[+] 1 user Likes lohith22's post
Like Reply
#77
వీర ' స్వప్న ' ' వైపు నార్మల్ గా చూసేసరికి...

వీర ఫోన్ రింగ్ అయ్యింది ....

స్వప్న గుండె లో అలజడి మొదలైంది...

వీర లిఫ్ట్ చేసి... "చెప్పు... అన్నాడు సీమ్ మాడిపోయిన పెనం మొహం తోనే

స్వప్న "అమ్మో... ఇతనేంటి??? ఇక్కడ అంటూ లటుకున్న బండి స్టార్ట్ చేయబోయింది.

అబ్బే మనోళ్ళు అంటున్నట్లు డిజైనర్ పాప కి టైం అస్సలు బాగోలేదు...బండి స్టార్ట్ అవ్వలేదు...

వీర 'సింహా' తో టాకింగ్ చేస్తూ...

'రేపే వెళ్ళమంటే... ఎలాగా??? దొబ్బేయను బే... అంటూ అరుస్తున్నాడు..

డిజైనర్ పాప ఎంత ట్రై చేసినా....

బండి స్టార్ట్ అవ్వటం లేదు...

వీర సార్ కి సంఖ్య తిరుగుతోంది..

ఒక్కపక్క సింహా ముఖ్యమైన పని మీద.... త్రినాధ్ అంకుల్... 'వీర' ని అర్జెంట్ గా చెన్నై వెళ్ళమని చెప్పాడంట....

వీర ఏమో ఇంకో డీల్ కోసం... ఇక్కడ వేరే ప్లాన్ వేసుకొని వున్నాడు .... అవతల ఎమౌంట్ కూడా తక్కువ ఏమి కాదు... ఈ చిరాకులో... ఆ బండి సౌండ్ విని... 

వీర 'ఏయ్!!! పిల్లా... జరా ఆపు. ఆ సౌండ్ బండి స్టార్ట్ అవ్వకపోతే.... నడిపించుకుంటూ పో.... అంటూ అరిచాడు..

స్వప్న (కదా... ఛా.... ఇతన్ని దెబ్బకి నా మైండ్ పని చేయడం లేదు...) అనుకుంటూ బండి నడిపించుకుంటూ కొంచెం దూరం వెళ్ళాక... 

సుమ వచ్చి 'వీర' ని చూస్తూ.... "అన్నా... ఇక్కడకి ఒక మేడమ్ వచ్చారా??? అని అడిగింది.

వీర 'ఫోన్' మాట్లాడుతూ... "చూడలేదు"... అంటూ సైగ చేసాడు... సుమ ఫోన్ తీసి... "స్వప్న" నెంబర్ కి కాల్ చేసింది... స్వప్న మళ్ళీ మళ్ళీ ట్రై చేసేసరికి బండి స్టార్ట్ అయ్యింది.. హమ్మయ్యా.... అనుకుంటూ వెళ్తుంటే .... ఫోన్ రింగ్ అయ్యింది.... సుమ కి వినబడింది ఆ సౌండ్... వెనుక నుండి చూసి... ఈ మేడమేనా అనుకుంటూ... 'మేడమ్.... అంటూ పిలిచింది... స్వప్న 'అమ్మో... ఈ పిల్ల వచ్చినట్లుంది... అంటూ బండి స్పీడ్ పెంచింది .

సుమ 'ఇదేంటి... ఈమె కి వినపడలేదా??? అనుకుంటూ వీర తో 'అన్నా... ఆ మేడమ్ కలవాలి... కాస్తా వెళ్లామా??? అని అడిగింది...

వీర 'పోన్' పెట్టేసి... 'తప్పదా??? అంటూ అడిగాడు చిరాగ్గా ఫేస్ పెట్టి....

సుమ 'తప్పదు... అనేసరికి..

వీర 'సరే... పదా... అని బండి స్టార్ట్ చేసాడు... సుమ ఎక్కగానే....బండి స్టార్ట్ చేసాడు....

స్వప్న కొంచెం ముందుకు వెళ్ళి... బండి స్లో... చేసింది..

అంతే వెనుక నుంచి ఎన్ ఫీల్డ్ "డగ్ డగ్" మని సౌండ్ చేస్తూ వచ్చేసరికి....గుండె గుభేల్ మన్నది....

"అమ్మో... ఈ పిల్ల 'వీర' తో వస్తోందా? లేక.... అతను నన్ను గుర్తు పట్టాడా??? అంటూ బండ్ ఫాస్ట్ పెంచింది...

సుమ 'మేడమ్.... అంటూ పెద్దగా పిలిచింది.. వీర చెవి గుయ్యిమంది.. 'ఏహే! ఎందుకు అలా అరుస్తావ్???? అంటూ సుమ కేసి కోపం గా చూసి.. రెండు నిమిషాలలో ' స్వప్న ' ని క్రాస్ చేసి.... తనకి అడ్డంగా బండి ఆపాడు.. 

స్వప్న 'అయిపోయా.... ఇవాల్టి తో నా చాప్టర్ క్లోజ్.... అంటూ ఆగింది..
సుమ బండి దిగి 'మేడమ్... మీరేనా??? అని అడిగింది.

స్వప్న "వీర" వైపు చూస్తూ.... "కాదు... అవును... కాదు... అంటూ ఎదోదే చెప్తుంటే..

సుమ వాలెట్' ఇస్తూ... తీసుకోండి మేడమ్... అన్నది...

అంతే స్వప్న స్కార్స్ లూజ్ అయింది.... వీర 'ఇచ్చావ్ గా... ఇక పదా... అన్నాడు...

 సుమ ' స్వప్న ఏమి మాట్లాడకపోవడం చూసి..... 'ఏమైంది ఈమెకి???? అనుకుంటూ... వీర వెనుక ఎక్కాగానే వీర రివర్స్ చేయగానే.... స్వప్న స్కార్ఫ్ వూడిపోయింది.

స్వప్న ఫాస్ట్ గా స్కూటి స్టార్ట్ చేసి ... వెళ్లి పోయింది...

వీర కి ఎందుకో తేడా కొట్టింది.. ఆ కళ్ళు... ఎక్కడో చూశానే.... అనుకుంటూ... సుమని దిగమని బండి మళ్ళీ రివర్స్ చేసి.... ముందుకు వెళ్ళాడు... రోడ్డు డెండ్ ఎండ్ వరకు వెళ్ళాడు... స్వప్న కనపడలేదు...

'వచ్చింది స్వప్న నా!? కాదా!? అనుకుంటూ అన్ని గల్లీలు తిరిగాడు... ఎక్కడ కనపడలేదు...

మళ్ళీ 'కాళి' వాళ్ళ ఇంటికి వచ్చాడు...

కాళీ బయటకు వచ్చి 'పదా!!! వెళ్తాం అనగానే...

వీర లోపలికి వెళ్ళి... సుమా! అంటూ పిలిచాడు...

సుమ ఎదో ఫోటో చూస్తూ.... 'ఆ... అన్నా.... అన్నది...

వీర 'నువ్వు పర్స్ ఇచ్చింది... స్వప్న కా!!! అని అడిగాడు.. లైట్ గా ఆశ్చర్యంగా.... (వీర సార్ కి ఆశ్చర్చాలు, ఆనందాలు.... ఇంకా ఎక్కలేదులే)

సుమ ఆశ్చర్యంగా ఫేస్ పెట్టి 'ఆ మేడమ్ పేరు నాకు తెలియదు... అనగానే...

వీర 'అసలు తన పర్స్ నీ దగ్గరకు ఎలా వచ్చింది??? అని అడిగాడు...

సుమ జరిగింది చెప్పింది...
వెనుకే వున్న కాళి మొత్తం విని ఆనందంగా... "సుమా! ఆ మేడమే నన్ను వైజాగ్ లో హాస్పిటల్ చేర్చి.... తన పైసలతో నాకు ఆపరేషన్ చేపించింది.... అన్నాడు

వీర 'నీకు ఆపరేషన్... నాకు పరేషాన్ అంటూ గుండె రుద్దుకున్నాడు...

'సుకు 'అవునా అన్నా... ఈ ఫోటో రాత్రి మేడమ్ పర్స్ లో చూసినా... అంటూ ఫోటో చూపించింది..

కాలి కన్నా ముందు వీర లాక్కొని చూశాడు...

స్వప్న,శృతి ఫోటో....

అంతే వీర ఆ ఫోటో ని మధ్యలో కి చింపి శృతి వున్న ముక్కని కింద పడేసి...

స్వప్న వున్న ఫోటోని జేబులో వేసుకుని చక్కాపోయాడు...

సుమ నోరు వెళ్ళి పెట్టుకొని చూస్తుంటే..

''కాళి' వీర ప్రేమించాడని చెప్పానే... ఈ స్వప్న నే... అంటూ వెళ్లిపోయాడు..

సుమ షాక్ తో... కూర్చోని... స్వప్నని గుర్తు తెచ్చుకుంది...

'మేడమ్ ఎక్కడ??? వీర అన్న ఎక్కడ??? అయ్యయ్యో... ఇప్పుడు ఎలా??? అందుకా... మేడమ్ కంగారుగా వెళ్ళిపోయారు..

ఈ లోపు వీర ఫాస్ట్ గా వచ్చి 'నీ ఫోన్ ఏది??? అని అడిగాడు..

సును ఎందుకు??? అని అడిగింది కంగారుగా..

వీర ఇవ్వేహే... అనగానే..సుమ ఫోన్ ఇచ్చింది..

పేర అందులో లాస్ట్ డెయిల్ నెంబర్ చూసి...తన ఫోన్ లో సేవ్ చేసుకున్నాడు...

మై జాన్ .. అని

సుమ 'అయ్యో... వీర అన్నా.... అలా ఎలా నెంబర్ తీసుకుంటావు??? తప్పు కదూ... అని అడిగింది కంగారుగా...

వీర 'ఫోన్ నెంబర్ ఎవరిదో కాదు.. మీ వదినదే అంటూ కాలర్ వెనక్కి తోసి.... వెళ్ళిపోయాడు..

సుమ 'చచ్చా... ఇప్పుడు ఈయన ఫోన్ చేసి... ఏమన్నా అంటే నా మీదకే వస్తుంది... ఇప్పుడు ఎలా??? అంటూ తల పట్టుకుని కూర్చుంది..

స్వప్న ఇంట్లోకి వెళ్లి గటగటా వాటర్ తాగింది...

తన రూమ్ లో కి వెళ్లి.... పర్స్ తీసి చూసింది...
డబ్బులు వున్నాయి... ఫోటో లేదు..
అంతే షాక్...

శృతి 'ఏమైంది అక్కా... అని అడిగింది...

స్వప్న 'ఏమి లేదు.. అంటూ బెడ్ మీద అలా కూర్చున్నది...

"ఫోటో వుండాలి కదా!!! ఏమైంది??? ఎలా మిస్ అయ్యింది???అంటూ టెన్షన్ పడుతుంటే... చెమటలు కారుతున్నాయి...

అది చూసి శృతి బుక్స్ పక్కన పెట్టి..."అక్కా!! ఆర్ యూ ఓకే!? అని అడిగింది భుజంపై చెయ్యి వేసి...

స్వప్న 'హ. ఓకే అంటూ బాత్ రూమ్ లో కి వెళ్ళింది...

శృతి ' సమ్థింగ్ ఈజ్ రాంగ్... బయటకు వెళ్ళేటప్పుడు బాగానే ఉంది... వచ్చాక ఎందుకో పానిక్ అవుతోంది..

కొంపదీసి ఆ రౌడీ మళ్ళీ వెంటపడ్డాడా??? అంటూ ఎదో ఆలోచన రాగానే..

స్వప్న ఫోన్ తీసి చెక్ చేసింది..

లాస్ట్ నెంబర్ తీసుకుని... ట్రూ కాలర్ చెక్ చేసింది..

సుమ అని వున్నది...

ఆ నెంబర్ తన ఫోన్ లో సేవ్ చేసి సైలెంట్ గా కూర్చుంది...

&&&

వీర ఇంట్లో:

 8.00pm

వాకిట్లో నుండి అరుపులు..

"రేయ్!!! వీర... నిన్నే రా!!! కన్న తండ్రి ని అని చూడకుండా నన్నే గెంటేస్తావా????

రారా బయటికి..... రారేయ్.... అని వీర వాళ్ళ నాన్న..

"సైదులు" ఒకటే గొడవ...

వీర హాల్లో తన ఫోన్ లో.... స్వప్న నెంబర్ చూస్తున్నాడు..

ఆ గొడవ అసలు తన చెవులకి ఎక్కడం లేదు..

కాళి 'ఏంటిరా!!! మీ అయ్య లొల్లి... నువ్వెమో.... ఆయన్ని ఇక్కడ వుండనీయవు....

ఆయనేమో... డబ్బులు కావాల్సినపుడు.... వచ్చి రచ్చ చేస్తాడు... నువ్వు డబ్బులు ఇస్తావు... కాని ఆయన మొహం చూడవు... మధ్యలో నేను అయిపోతున్నా... అంటూ లేచి వెళ్ళి.... 'సైదులు' చేతిలో ఓ వెయ్యి రూపాయలు వుంచాడు..

వెంటనే సదరు సైదులు.'వీర... నువ్వు దేవుడు... నా బంగారు తండ్రి.. అంటూ తూలుతూ వెళ్ళి పోయాడు.

కాళి లోపలికి వచ్చి "ఏరా!! స్వప్న కి ఫోన్ చేస్తావా??? అని అడిగాడు....

వీర 'చేయను.... అన్నాడు సీరియస్ గా...

కాళి 'మరి నెంబర్ ఎందుకు తీసుకున్నావు.. అని అడిగాడు ఆశ్చర్యంగా..

వీర 'నా జాను.... నా స్వప్న నెంబర్ కాబట్టి... నా దగ్గర వుండాలి కాబట్టి.... అంటూ తన రూమ్ లో కి వెళ్ళి పోయాడు..

కాళి తల గోక్కుంటూ... "వీడు కొన్ని విషయాల్లో నాకు ఎప్పటికీ అర్ధం కాడు... అనుకున్నాడు..

&&& 

Next day ... స్వప్న వాళ్ళ కాలేజీ లో...

ఆరోజు తో... వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయాయి...

స్వప్న తప్ప అందరూ హుషారుగా బయటకు వచ్చారు...

నటాషా 'హమ్మయ్యా... మొత్తానికి యమ్.బి.ఏ ఫినిష్ చేశాము... అన్నది ఆనందంగా...

విశాల్ ముక్కు చూసుకుంటూ... (అమ్మో... ఈ రవి గాడు శృతి ని రమ్మన్నాడు.... తను వచ్చిదంటే.. అన్నయ్యా.... అంటూ వరుసలు కలుపితే.... నేను ఎస్కేప్ అయిపోతా)..

"సరే... గైస్.... నాకు అర్జెంట్ పని వుంది... నేను వెళ్తున్నా.... మరో రోజు కలుద్దాం... అనేగానే...

బిందు 'ఓ... హలో..... ఎక్కడికి??? ఱగు మూవికి వెళదాం... అనగానే...

నటాషా' ఆ.... అటు నుంచి రెస్టారెంట్ కి వెళ్ళి ఎంచక్కా ఫుడ్ తినేసి వెళదాం....

స్వప్న డల్ గా వుండటం చూసి...

రవి అపూతారా... స్వప్న అలా డల్ గా వుండటం చూసి కూడా... ఎలా ప్లాన్స్ వేస్తున్నారు??? ఫ్రెండ్సే నా మీరు?? అన్నాడు..చిరాగ్గా...

" స్వప్న.... ఇదంతా కాదు.... నీకు ఒక మాట చెప్పాలి... శృతి కి వీర సంగతి తెలిసిపోయింది... అంటూ ఆగాడు..

స్వప్న 'ఏంటి... శృతికి తెలిసిందా??? ఎలా??? అని అడిగింది కంగారుగా...

రవి 'మీ డ్రైవర్ చెప్పాడు.....స్వప్న తను నాతో ఏమి అనలేదు.... అసలు ఏమి అడగలేదు... అనగానే... ఈలోపు శృతి స్కూటీ వచ్చి విశాల్ ముందు ఆగింది...

శృతి అందరితో 'హాయ్!!! అంటూ చేయి వూపింది... 

రవి 'నీ గురించే మాట్లాడుకుంటున్నాం... అనగానే. శృతి బండి దిగి.. "ఏమని??? అని అడిగింది... స్వప్న ' శృతి!!! నువ్వు ఇంట్లో ఎవరితో అనలేదు కదా... అని అడిగింది... కంగారుగా.. 

శృతి 'అనలేదు అక్కా.... అయినా నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు... అన్నది
కోపం గా..

బిందు 'చెప్తే మాత్రం ఏం చేస్తావ్!? అతను ఆ వీర ఎంత రౌడీ అనుకున్నావ్???? అంటూ ...

శృతి' ' శృతి... ఇక్కడ... ఎంత రౌడీ అయినా... నేనేమి భయపడను...

నటాషా 'నువ్వు పడక్కర్లేదు... అతను భయపెడతాడు.. అలా వుంటాడు... అంటూ మొహం మాడ్చేసింది....

శృతి 'రవి.. ఏంటి మీ ప్లాన్... ఎక్కడికి వెళదాం... అని అడిగింది..

 విశాల్ 'యూ'... పీపుల్ క్యారీ ఆన్... అంటూ వెళ్ళిపోతుంటే..

శృతి 'విశాల్ బ్రో... ఎక్కడికి???? అని అడిగింది కళ్ళు ఎగరేస్తూ..

విశాల్ (ఛీ... నా బతుకు... నేను ఇష్టపడే అమ్మాయి 'బ్రో' అని పిలవటం )

రవి నవ్వు ఆపుకుంటూ..

"వాడికి ఏదో పని వుందిలే.... వదిలేయ్... అనేగానే.

విశాల్ 'సరే.... బై అంటూ వెళ్లిపోయాడు...

రవి 'చూడు... శృతి... మేము ఎగ్జామ్స్ అవ్వగానే ఏం చేయాలి?! అని ప్లాన్ వేసుకున్నాము... బట్ స్వప్న అలా డల్ గా వుంటే.... ఏమి చేయాలో అర్థం కావటం లేదు... అన్నాడు...

 స్వప్న 'అక్కా... ఆ రౌడీ సంగతి నాకు వదిలేసి... నువ్వు రిలాక్స్ అవ్వు...m అలా డల్ గా వుండకు... పదా మూవికి వెళదాం... అన్నది...

స్వప్న 'అది కాదు.... నిన్న ఏం జరిగింది అంటే...

శృతి 'ఏం జరిగింది??? నువ్వు నీ వాలెట్ కోసం వెళ్తే ఆ వీర కనపడ్డాడు... అంతేనా??? అన్నది కూల్ గా..

స్వప్న 'నీకు ఎలా తెలుసు??? అన్నది ఆశ్చర్యంగా... శృతి 'సుమ చెప్పింది.. అనేగానే... స్వప్న కోపం గా 'అంటే నువ్వు తనని కలిశావా?? అని అడిగింది... 

శృతి 'ష్!!! అక్కా... నేను కలవలేదు... జస్ట్ కాల్ చేశా... అంతే... అనగానే... 

స్వప్న ' అ అమ్మాయి... అతని చెల్లి అనుకుంటా.... అనగానే.. బిందు 'హలో... సిస్టర్స్ కాస్త తెలుగులో మాట్లాడతారా????

శృతి 'బిందు అక్కా... టూ మచ్ చేయకు. మేము మాట్లాడేది తమిళమా????

నటాషా 'అది కాదు... అసలు సుమ ఎవరు?7? ఏం జరిగింది??? చెప్పమని దీని బాధ అంటూ బిందు నెత్తి మీద ఒక్కటి ລ້໐໖...

స్వప్న జరిగింది చెప్పింది....

అంతా విని బిందు'అంటే... ఆ రాక్షసుడు నిన్ను గుర్తు పట్టలేదా??? అంటూ వణుకుతూ అడిగింది..

స్వప్న 'ఏమో... నేను అయితే... చాలా స్పీడ్ గా వచ్చేశా..... బిందు 'అయినా... వదలడే.... అన్నది ఎటో చూస్తూ.. నటాషా 'అవునే... కరెక్టే... అడుగో వచ్చేశాడు....

బిందు 'అమ్మో... అంటూ స్వప్న కారు వెనుక దాక్కుంది...

స్వప్న టెన్షన్ గా చూసేసరికి వీర కనపడలేదు.

నటాషా నవ్వుతూ... 'చూశారా.. పారిపోవాల్సిన స్వప్న ఇక్కడే వుంది... బిందు దాక్కుంది... అనగానే...

రవి 'ఏహే... ఆపు... నువ్వు నీ వేషాలు... అనగానే బిందు వచ్చి "నటాషా" వీపు ని మోత మోగించింది.

శృతి 'రవి... ఇక్కడ కాదు... పదండి ఏదైనా రెస్టారెంట్ కి వెళ్ళి... ఫుల్గా తినేసి అప్పుడు ఆలోచిద్దాం.....

స్వప్న 'వద్దు... ఇంటికి వెళ్ళిపోదాం పదా.... ఎగ్జామ్స్ అయిపోయాయి... ఇప్పట్లో కాలేజీకి రాను.. అతనికి కాలేజి,నా పేరు తప్ప ఇంకేమి తెలియవు...

సో..కనపడ..డు..అంటూ ఆగి అందరి వైపు టెన్షన్ గా చూసింది..

రవి 'ఏమైంది???? అంటూ కళ్ళు ఎగరేశాడు..

స్వప్న 'ఒకవేళ సుమ అతని చెల్లి అయితే... నా ఫోన్ నెంబర్ తీసుకుంటే..

శృతి 'ఊరుకో... అక్కా ఆ రౌడి కి అంత తెలివి వుంటుందని నేను అనుకోవడం లేదు...

నటాషా 'నేను కూడా... అదే అనుకుంటున్నాను.... బిందు 'నేను అయితే... స్వప్న చెప్పిందే కరెక్ట్.. అనుకుంటున్నా....

రవి 'ఏంటి కరెక్ట్??? ఒకవేళ తీసుకొని వుంటే... ఈపాటికి కాల్ చేసేవాడు కదా

శృతి "అదే కదా... సో.. మై డియర్ స్వీట్ అక్కా... ఇంక నువ్వు ఆ విషయం మర్చిపో....

స్వప్న 'సరే.... కాని రెస్టారెంట్స్ అవి వద్దు....

బిందు 'సరే... అయితే మా ఇంటికి వెళ్లాం పదండి... అమ్మ నాన్న... కి నో ప్రాబ్లం... అనేగానే..

శృతి 'అలా అయితే... వంట మాత్రం నువ్వు చేయకూడదు.. అన్నది నువ్వు ఆపుకుంటూ...

బిందు కళ్ళ' తోనే సైగ చేసింది... నో అని..

నటాషా 'ఏయ్....ఎదో వుంది... చెప్పండి అనగానే...

స్వప్న 'అదేం లేదు... పదండి వెళ్లాం... అంటూ తను కారు ఎక్కింది... శృతి 'రాము... ఏడి అక్కా.... అని అడిగింది

స్వప్న తన ఫోన్ తో డ్రైవర్ రాముడుకి రింగ్ ఇచ్చింది..

అతను రెండు నిమిషాల్లో వచ్చాడు..

శృతి 'రాము... నువ్వు స్కూటీ వేసుకొని ఇంటికి వెళ్ళు... కారు కీస్ ఇటివ్వు.... అనగానే...అతను ఇచ్చాడు..

బిందు 'ఎవడో చచ్చాడు... అన్నది....

శృతి 'నీ వంట తిని చచ్చేకన్నా నా డ్రైవింగ్ వలన చావడం నయం...అంటూ కారు ఎక్కింది...

బిందు, నటాషా కుడా కారు ఎక్కారు...తన బైక్ స్టార్ట్ చేయగానే..విశాల్ వచ్చి వెనుక ఎక్కాడు..

 రవి 'వెళ్తా... అన్నావ్.. విశాల్' ఆ... అనే వెళ్ళా... బట్ బిందు, స్వప్న, నటాషా ల కోసం మళ్ళీ వచ్చా.... రవి 'అంతేనా... లేకపోతే.... శృతి.... విశాల్ ' నువ్వు పోని.... అన్నాడు సీరియస్ గా.. అందరు బిందు వాళ్ళ ఇంటికి కి వెళ్ళారు. 

&&&&&&&&&&&&&&

త్రినాధ్ ఫామ్ హౌస్....రోని 'ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలి... వాడి కోసం... నీకు లక్ష సార్లు చెప్పా... దాదా.... వాడు చేసే ఏం పని అయినా... నేను చేయగలను... అంటూ కల్లు తాగినా కోతిలా... చిందులేస్తున్నాడు...

త్రినాధ్ పిఏ.... పెద్దగా నవ్వటం చూసి...

రోనికి ఇంకా కోపం పెరిగింది..

అంతే అతని దగ్గరకు వెళ్లి కాలర్ పట్టుకుని 'ఎరా!! తమాషా గా వుందా??? అన్నాడు కోపం ח..

పిఏ బాబు 'ఉట్టికి ఎక్కలేనమ్మా.... స్వర్గానికి ఎక్కుతా... అన్నాడంట నీలాంటి వాడే... అంటూ కాలర్ విడిపించుకున్నాడు....

ఫోన్ లో ఏదో సీరియస్ గా చూస్తున్న త్రినాధ్ తో 'చూశావా... నీకే నేనంటే లెక్క లేదు... అందుకే ప్రతి ఔలాగాడికి చులకన అయిపోయా... అంటూ ఫోన్ లాక్కున్నాడు..

త్రినాధ్ 'ఎహే... ఇటివ్వు.... అంటూ ఫోన్ తీసుకుని..

'ఏంటిరా!? నీ ప్రాబ్లం??? అని అడిగాడు...

రోని 'ఈరోజు... వీర గాడిని చెన్నై పంపిస్తున్నావంట..... ఏం??? నేను చేయలేనా??? ఆ మాత్రం డీలింగ్స్!!!! అంటూ పళ్ళు కొరికాడు...

త్రినాధ్ 'చేయలేవు... నీ వల్ల కాదు... అది కేవలం వీర మాత్రమే చేస్తాడు... నెక్స్ట్!? అంటూ ఫోన్ లో తల దూర్చాడు...

దోని 'నేను కొంచెం లేట్ వస్తే ఓ మస్త్ తిడతావ్.... వాడు ఎంత లేట్ వచ్చినా... ఏమి అనవు... ఎందుకు??? అనగానే..

"ఎందుకంటే.... నువ్వు దాదా కింద పని చేసే.... పనివాడివి.. అని వినపడి పక్కకి చూసేసరికి..

వీర తను వైపే సీరియస్ గా చూస్తూ వచ్చి త్రినాధ్ పక్కనే వున్నా చైర్ లో కూర్చుని కాలు మీద కాలు వేసాడు..

రోని 'త్రినాధ్' వైపు చూసి...

"చూశావా!!! నేను పని వాడిని అంటా... మరి వాడు???

వీర 'రేయ్!!! తాట తీస్తా... నేను ఎవరి కిందా పని చేయను... నీకు నాకు మస్తు తేడా.... నేను... కింగ్.... నా రూల్స్ నాకు వుంటాయి......అంటూ సిగరెట్ తీశాడు..

రోని 'చూశావా! నువ్వు వాడిని నెత్తిన పెట్టుకున్నావు....ఎదో ఒకరోజు నిన్ను బద్నామ్ చేస్తాడు

వీర 'ఆపు .... అంటూ త్రినాధ్ తో 'చెన్నై లో ఎక్కడా???? అని అడిగాడు...

త్రినాథ్ పిఏ వైపు చూశాడు... అతను చిన్న స్లిప్ ఇచ్చాడు..... వీర అది చూసి... ఓకే.... అయితే ఈసారి రిస్క్ ఎక్కువగా వుంది.... 60-40 వేస్కో... అంటూ పైకి లేచాడు... రోని, పిఏ బాబు నోరు తెరచి 'త్రినాథ్' వైపు చూశారు... 

త్రినాధ్ 'సరే... ఆ సుదీప్ సైట్ విషయం ఏమి తేల్చావ్???? అన్నాడు..

వీర "సైట్ మాత్రమేనా??? వాళ్ళ ఇల్లు కూడా కొట్టేస్తా

రేని 'హా.. మరే... నువ్వు ఏమైనా అల్లుడివా??? పిల్లతో పాటు ఆస్తులు ఇవ్వటానికి.... అన్నాడు వెటకారంగా...

వీర ' చూడు... !!! చెన్నై నుంచి రాగానే ఆ సుదీప్ సంగతి చూస్తా.... అంటూ వెళ్ళిపోయాడు...

రోని 'హ.హ. నేను చెప్పానా???? నువ్వు చెప్పాల్సిన పర్సెంటేజ్ వాడు డిసైడ్ చేశాడు.... నాకు మాత్రం 30 ఇస్తావ్... అంటూ ఉడుకున్నాడు....

త్రినాధ్ 'రోని.... నీకు ఆలోచన తక్కువ... ఆవేశం ఎక్కువ...

సరే.... నీకు ఒక ఛాన్స్ ఇస్తా!!!! వీర రావడానికి ఎంత కాదన్నా 3,4 రోజులు పడుతుంది...ఈలోపు ఆ సుదీప్ సైట్...పేపర్స్ నా పేరు మీద పెట్టించు.... చూద్దాం!!!! అన్నాడు...

దీని 'అదెంత పని... రేపు ఈపాటికి నీ ముందు వుంటా... అంటూ వెళ్లిపోయాడు.. పిఏ బాబు "సార్.... వర్క్ అవుతుందటారా!? నాకు ఎందుకో డౌటే... 

త్రినాథ్ ' సుదీప్ తో అంత ఈజీ కాదు... అది కేవలం వీర మాత్రమే సాధిస్తాడు... పిఏ అన్నట్లు... మనోడు ఫోన్ చేశాడు... ఆ పిల్ల ది ఈ ఊరు అంటా.... వీర వెళ్ళి ప్రేమ పెళ్లి అని గొడవ చేశాడంట..... త్రినాథ్ నవ్వుతూ.... "చూద్దాం... ఏమవుతుందో... అన్నాడు..

&&&
 
X నుంచి రోని కి ఫోన్ వచ్చింది...

రోని 'చెప్పండి..... చాలా రోజుల తర్వాత...

X ' నీతో చిన్న పని పడింది... అందుకే చేశా....

రోని 'ఏం పనో..

X 'నీకో అడ్రస్ చెప్తా... వెళ్ళి 'వీర' పంపాడని... చెప్పి అక్కడ స్వప్న అని ఓ అమ్మాయి వుంటుంది.... ఆ అమ్మాయి తో 'పెళ్ళి' గురించి ఏం డిసైడ్ చేశావ్???? మర్యాదగా ఒప్పుకో.... లేకపోతే వీర సంగతి నీకు తెలియదు... అంటూ బెదిరించు..

 రోని 'అమ్మాయా!? వీర పంపటం ఏంటి ... నాకు అంతా గలాటా ఉంది.....

X 'హ.హ నా ప్లాన్ లో భాగంగా వీర ' స్వప్న ' అనే బ్యూటిఫుల్ అండ్ సౌండ్ పార్టీ పిల్ల ప్రేమలో ప
డ్డాడు

రోని 'అర్థం అయ్యింది... ఆ పిల్ల ఒప్పుకోలేదు... కాబట్టి నేను ఎంటర్ అయ్యి వీర మీద ఇంకా కోపం పెంచాలి....

X "అంతే..... సరే నీ ఎకౌంటు లో 2 లాక్స్ వేశా.. అడ్రస్ పంపుతా.... చూడు అంటూ కాల్ కట్ చేశారు..

రెండు నిమిషాల తర్వాత తన ఫోన్ లో వచ్చిన అడ్రస్ చూసి "అరే... ఇది ఆ సుదీప్ ఇంటి అడ్రస్...

అంటే వీర లవ్ చేస్తోంది సుదీప్ కూతురినా!?

అయితే నా పని ఇంకా ఈజీ.... అనుకున్నాడు..
[+] 5 users Like Ranvijaysingh2's post
Like Reply
#78
Excellent update Ranvijaysingh bro!!!
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
#79
Nice update
[+] 1 user Likes lohith22's post
Like Reply
#80
Nice update keep going
Mr. V
[+] 1 user Likes VijayPK's post
Like Reply




Users browsing this thread: