Posts: 146
Threads: 4
Likes Received: 3,362 in 153 posts
Likes Given: 487
Joined: Feb 2026
Reputation:
369
27-02-2026, 04:01 PM
(This post was last modified: 07-07-2026, 10:57 PM by Raagaa. Edited 3 times in total. Edited 3 times in total.)
రావు గారి ఇల్లు. కుటుంబ సభ్యులు అంతా హాల్లో మెట్ల మీదా ఎక్కడ చోటు దొరికితే అక్కడ కూర్చున్నారు. పెద్ద వాళ్లంతా సోఫాలో కూర్చుని ఉన్నారు. రావు మోటర్స్. ఇండియాలోనే నెంబర్ వన్ కంపెనీ. నిన్న సాయంత్రం కొత్త డిజైన్ డేటా లీక్ అయ్యింది. అదీ ఇంట్లో వాళ్ళ వల్లే. అందుకే ఈ సమావేశం.
★ వారసుడు ★
The following 12 users Like Raagaa's post:12 users Like Raagaa's post
• Babu_07, DasuLucky, Eswar99, Gurrala Rakesh, Kman50459, Nautyking, Pilla, Raja_theking, ramd420, Ranjith62, sexykrish69, Uday
Posts: 146
Threads: 4
Likes Received: 3,362 in 153 posts
Likes Given: 487
Joined: Feb 2026
Reputation:
369
27-02-2026, 04:45 PM
(This post was last modified: 27-02-2026, 04:50 PM by Raagaa. Edited 1 time in total. Edited 1 time in total.)
ఇంత పెద్ద కుటుంబంలో ఒక్కడు చెడబుట్టాడు. వీడు నా కొడుకని చెప్పుకోవాలంటేనే చచ్చిపోవాలనిపిస్తుంది. ఎందుకు పనికిరాని వాడిని సంకన పెట్టుకుంటే ఇలాగే సంక నాకి పోతాం. అసలు వీడు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఇంకా ఏం మొహం పెట్టుకుని ఇక్కడున్నావ్. పో బైటికి. అరిచేసాడు.
జగపతిరావు తన మూడో కొడుకు గోపిని తిడుతుంటే రావు కుటుంబంలో ఉన్న మిగతా నలభై ఐదు మంది చోద్యం చూస్తున్నారు. అందులో పని వాళ్ళు కూడా ఉన్నారు. ఎవ్వరికి తనంటే ఇష్టం లేదు. ఒకరినొకరు తోడుగా చేసుకుని అందరూ తన మీద నిజాలు, అబద్దాలు చెపుతుంటే తల్లి తన కోసం నిలబడుతుందేమో, మాట్లాడుతుందేమోనని చూసాడు. ఆమె అసలు కొడుకు వైపు చూడలేదు. గోపి తల దించేసాడు. మెట్ల మీద నిలుచున్న అమృత మాత్రం గోపి వైపే చూస్తుంది. జరిగిన దాంట్లో గోపి తప్పు లేదని ఆమెకి మాత్రమే తెలుసు కానీ నోరు విప్పలేదు. విప్పితే తనకి సమస్య, అందుకే మౌనంగా చూస్తుంది.
గోపి లేచి తల్లి దెగ్గరికి నడిచాడు. జనని అసలు గోపి మొహం చూడలేదు. పది సెకండ్లు తల్లి వైపే చూసి ఇంటి నుంచి వెళ్లిపోవడానికి వెనుతిరిగాడు. ఈ చోద్యం జరుగుతుండగానే పెద్దాయన రాజారావు లోపలికి వచ్చాడు. తాతా మనవళ్లు ఇద్దరు ఎదురు పడి చూసుకున్నాక గోపి వెళ్ళిపోతుంటే ఎక్కడికి అని అడిగాడు కళ్ళజోడు తీస్తూ. వెళ్లిపొమ్మన్నారు అని బైటికి వెళుతుంటే ఆగమన్నాడు.
ఓసారి అందరినీ చూసి, నా ఇద్దరు కొడుకులు, కూతురు, అల్లుడు, జనని, అమృత తప్పించి మిగతా వాళ్లంతా వెళ్లి పనులు చూసుకోండి అనగానే అందరూ తమ గదుల్లోకి వెళ్లిపోయారు. పెద్దాయన సోఫాలో కూర్చుంటే మిగతావాళ్ళు పక్కన కుర్చీల్లో కూర్చున్నారు. జనని ఒక పక్కన నిలబడింది. అమృత వాళ్ళ అమ్మ సురభి ఇంకో వైపున నిలుచుంది. అమృత తాతయ్య ఎదురుగా నిలబడింది. గోపి తలుపు దెగ్గరే ఉన్నాడు. అమృతకి భయమేసింది. నిన్న రాత్రి జరిగింది గుర్తుకువచ్చింది.
స్నేహితులతో పార్టీకి వెళుతూ ఎంజాయిమెంట్లో పడి కాన్ఫిడెన్షియల్ డేటాని కారులోనే వదిలేసింది. దాన్ని ఎవరో కొట్టేసారు. తన దెగ్గర బ్యాకప్ ఉన్నందున వెంటనే అలాంటి పెన్ డ్రైవ్ ఇంకొకటి కొని అందులో కాపీ చేసి గోపిని పిలిచి ఇంట్లో తాతయ్యకి ఇవ్వమని చెప్పింది. తప్పు అమృత దెగ్గర జరిగినా నింద మాత్రం గోపి మీద పడింది. అమృత గోపి ఏమైనా మాట్లాడతాడేమోనని భయంగా చూస్తుంటే గోపి మాత్రం గడప దెగ్గర నుంచి బైట గార్డెన్‌లో కనిపించే చెట్లని చూస్తున్నాడు.
తప్పు అమృత దెగ్గరే జరిగిందని గోపికి నిన్న రాత్రే తెలుసు, తన మొహంలో చెమటలు, మాటలో వణుకు అన్నీ చెపుతూనే ఉన్నాయి. తనకంటే రెండేళ్లు పెద్దది అయినా వరసే అవుతుంది, అందులో అమృత అంటే తనకి ఇష్టం. వీటన్నిటికంటే ఇంట్లో వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం, వాదించడం గోపికి నచ్చదు. చిన్నప్పటి నుంచి అందరూ తనని చులకనగా చూస్తారు అనే కోపం ఉంది వాడిలో, ఇంట్లో జరిగే ఉల్లిపాయ రాజకీయాలు చెయ్యడం గోపీకి చేతకాదు, అసలు పట్టించుకోడు. పెద్దనాన్నకి ఒక కొడుకు, కూతురు రఘు, రమ్య. తనకంటే ముందు పుట్టిన ఇద్దరు అన్నయ్యలు శ్రీధర్, విష్ణు. మేనత్తకి ఇద్దరు పిల్లలు ఒకరు పవన్ ఇంకొకరు అమృత. నలుగురు అన్నదమ్ములకు ఒక్కటే మరదలు. గోపి చిన్న వాడు, చేతకానివాడు గనక రేసులో అసలు గోపి వంక చూడరు. మిగతా ముగ్గురు మాత్రం ఎవరు ఎక్కువ పేరు సంపాదిద్దాం, ఎవరు సీఈఓ అవ్వాలి, ఎవరు అమృతని దక్కించుకోవాలి అనే గోలలో వాళ్లలో వాళ్ళే గోతులు తోవ్వుకుంటున్నారు. ఇక పెద్ద వాళ్ళు నాన్న జగపతి రావు, పెద్దనాన్న రాధరావు మావయ్య మురళి వీళ్లందరికి తాతయ్య సృష్టించిన గద్దె మీద ఒక్కసారి కూర్చోవాలని ఉంది. బైటకి బానే ఉన్నా లోపల ఒకరంటే ఒకరికి విషం. అమ్మ జననికి అత్తయ్య సురభికి పెద్దమ్మ కావ్యకి కూడా అదే కోరిక కానీ వాళ్లకి అవకాశం ఇవ్వరని తెలుసు, మొగుడి గెలుపే తమ గెలుపని వాళ్ళు మౌన యుద్ధం చేస్తున్నారు. అధికారం, డబ్బు వ్యామోహంలో పడి కంపెనీ సమగ్రతతని ఏనాడో తగ్గించేశారు. ఎవ్వరిలోనూ ఐకమత్యం లేదు, అందుకే గోపీకి వీళ్ళు నచ్చరు. ఆలోచిస్తుంటే వెనక తాతయ్య మాటలు వినిపించాయి.
డేటా చివరిగా ఎవరి దెగ్గరికి వెళ్ళింది అని అడిగాడు రాజారావు. అమృత వాళ్ళ నాన్న మురళి లేచి నిలబడి పెద్ద బావ నాకు ఇచ్చాడు. నేను అమృతకి ఇచ్చాను. అమృత గోపికి ఇచ్చి ఇంట్లో ఉన్న మీకు ఇవ్వమంది. అని అమృత వైపు చూస్తే అమృత అవునని తల ఊపింది. అందరూ గోపీ వైపు చూసారు. గోపి బైట చూస్తున్నాడు.
అంత ఇంపార్టెంట్ మ్యాటర్ని గోపికి ఎందుకు ఇచ్చావ్ అమృతా అని అడిగాడు రాజారావు. నిన్న ఇంపార్టెంట్ పార్టీ అటెండ్ అవ్వాల్సి వచ్చింది అందుకే.. అని ఆపేసింది. రాజారావు అసహనంగా నీకు కంపెనీ కంటే పార్టీ ముఖ్యం అనమాట అన్నాడు. గోపి వాళ్ళ అమ్మ జనని వెంటనే తప్పు చేసింది అమృత కాదుగా మావయ్య గారు అంది. ఆ మాట వినిపించగానే చివుక్కుమంది గోపీ మనసు. ఇవన్నీ తనకి అలవాటే.. తల్లి అలా ఎందుకు మాట్లాడిందో కూడా గోపికి బాగా తెలుసు.
కంపెనీ 100%లో
30% వాటా రాజారావుది
23% డైరెక్ట్ ఫ్యామిలీది
12% మిగతా కుటుంబ సభ్యులు అంటే మాది
25% పబ్లిక్ షేర్ హోల్డర్స్
10% ఇన్వెస్టర్స్
ఈ 23%లో జగపతిరావు, రాధారావు, సురభి ముగ్గురికి 7% చప్పున 21% శాతం ఉండేది. ఏడుగురు పిల్లలకి తలా 2% ఉండేది. ఇక్కడే జనని ఒక అడుగు ముందుకు వేసింది, చిన్న కొడుకుని చులకన చేసి, వాడి మీద కోపం పెంచుకుని మెంటల్‌గా కొడుకుని ఏడిపించి గోపి రెండు శాతం వాటాని తన పేరు మీద రాయించుకుంది. తద్వారా ఆమె కంపెనీ విషయాల్లోకి జోక్యం దొరకడమే కాకుండా మొగుడు జగపతిరావుకి కొంచెం బలం కూడా పెరిగింది, రేపు అమృతని తన ఇద్దరు కొడుకుల్లో ఎవరో ఒకరికి ఇచ్చి చేసుకుంటే తన బలం మరింత రెట్టింపు అవుతుందని ఆమె ఆలోచన. ఆ విషయం అక్కడున్న అందరికీ తెలుసు.
ఇంట్లో మనుషులు ఎలా ఆలోచిస్తున్నారో రాజారావుకి బాగా తెలుసు, తన కంపెనీకి వీళ్లెవ్వరు అర్హులు కారని ఆయన నమ్మకం రోజురోజుకి పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. చివరిగా గోపి వంక చూసాడు. వీళ్లంతా వాడిని తరిమెయ్యాలని చూస్తున్నారు కానీ అదీ నాకు మొలిచిన కొమ్మే కదా అని రాజారావు ఆలోచన. గోపిని ఇంట్లో నుంచి పంపించెయ్యడాన్ని ఎంత మంది ఆమోదిస్తున్నారు అని అడిగితే అందరూ చేతులు లేపారు. జనని కూడా !
రాజారావు రెండు విషయాలకి ఆశ్చర్యపోయాడు. ఒకటి కన్న తల్లి చెయ్యి ఎత్తడం, రెండవది అమృత చెయ్యి ఎత్తకపోవడం. అమృత వైపు చూసాడు. తనకి డేటా లీక్ అయిన విషయం తెలిసిన వెంటనే మొత్తం ఆరా తీసాడు రాజారావు. ఇప్పుడు అమృత చెయ్యి ఎత్తకపోయేసరికి తప్పు ఎక్కడ జరిగిందో ఆయనకి అర్ధమైంది. ఈ విషయం గోపీకి తెలిసే మౌనంగా ఉన్నాడా లేదా తెలీక మౌనంగా ఉన్నాడా అనేది గోపితో మాట్లాడితే మాత్రమే తెలుస్తుందని అనిపించింది. సరే అన్నాడు.
మీరంతా వెళ్లిపోండి అని లేచి నిలబడి తన గదిలోకి వెళుతూ గోపీ.. లోపలికి రా అని వెళ్ళిపోయాడు. గోపి లోపలికి నడుస్తూ అందరినీ చూస్తూ వెళుతుంటే అమృత తల దించుకుంది. జనని మొహం తిప్పుకుంది. తలుపు తీసుకుని లోపలికి వెళ్ళాడు. రాజారావు మంచం మీద కూర్చుని ఉన్నాడు. గోపి తలుపు పెట్టేసి తాతయ్యకి ఎదురు నిలుచున్నాడు.
ఎందుకు తప్పు నీ మీద వేసుకున్నావ్, సూటిగా అడిగాడు మనవడిని చూసి. గోపి చిన్నగా ఆశ్చర్యపోతూ ఓహ్ తెలిసిపోయిందా అని మెల్లగా నవ్వాడు. ఎందుకురా అంటే ఇంటి నుంచి బయటికి పంపించేస్తారుగా.. అందుకని తాపీగా సమాధానం చెప్పాడు.
నేను పంపను
అదేంటి అందరూ ఓటింగ్ వేశారుగా, నేను వెళ్ళిపోవాలిగా!
బుల్ షిట్. నేను చెప్పిందే జరుగుతుంది ఆఖరికి
వదిలేయ్యచ్చుగా నన్ను
సరే.. నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోవచ్చు
కానీ..
ఏంటి కానీ ?
ఏదో ఫిట్టింగ్ పెడుతున్నారుగా.. కానీ ?
రేపటి నుంచి నువ్వు నాకు డ్రైవరుగా రావాలి
నేను రాను
అయితే నువ్వెక్కడికి వెళ్లడం లేదు
అయితే నన్ను ప్రశ్నించే హక్కు ఇక మీకెవ్వరికి లేదు, మీరు పోయాక నా దారి నాది. నాకు ఈ కుటుంబానికి సంబంధం లేదు. దీనికి ఒప్పుకుంటే నేనూ ఒప్పుకుంటున్నాను.
అగ్రిమెంట్ సైన్ చెయ్యాలా ?
అవసరం లేదు, మాటివ్వండి చాలు
సరే
అలాగే అయితే
నువ్వు ఉండడానికి ఏర్పాట్లు చేస్తాను.
అవసరం లేదు, నా జీతం నాకిస్తే చాలు
మనవడు ఆనందంగా వెళ్లిపోతుంటే ఆశ్చర్యం వేసింది, అంతలోనే బాధా వేసింది. వీడిలా కరకుగా మారడానికి కారణం ఇంట్లో వాళ్ళేగా అనుకున్నాడు. వెళ్లిపోతున్న మనవడిని చూస్తూ ఉన్నాడు.
తాతయ్య గది నుంచి బైటికి వచ్చేసాక నేరుగా బైటికి నడుస్తుంటే అప్పటికే జరిగిన విషయం అంతా తెలుసుకున్న అందరూ కిందకి దిగారు. గోపిని చూడగానే రమ్య దెగ్గరికి వచ్చి చెయ్యి పట్టుకుంది. ప్రేమగా తన చేతి మీద చెయ్యేసి దెగ్గరికి తీసుకుని నుదిటి మీద ముద్దు పెట్టాడు. నీ పక్కన ఎవ్వరు లేనప్పుడు, నీకు భయం వేసినప్పుడు, నీకు కష్టం వచ్చినప్పుడు.. ఒక్క ఫోన్ చెయ్యి నీకోసం వస్తాను అని చేతిలో చెయ్యేసి నవ్వుతూ చెప్పాడు. బైటికి వెళ్ళిపోతూ అమ్మ వైపు, అమృత వైపు చూసాడు. అమృత మళ్ళీ తల దించుకోవడం చూడగానే నవ్వొచ్చింది గోపికి. లాన్ నుంచి నడుస్తూ తను పెట్టిన చెట్లని తడుముతూ సెక్యూరిటీని దాటి గేటు దాటుకుని బైటికి నడిచాడు.
The following 68 users Like Raagaa's post:68 users Like Raagaa's post
• ABC24, Arjun0410, arkumar69, ash.enigma, Babu143, Babu_07, Bujji69, Chinni@843, coolguy, DasuLucky, Donkrish011, Eswar99, gora, Gova@123, Gurrala Rakesh, hijames, Hrlucky, Introvertt, Iron man 0206, Ishowspeedy, jackroy63, Jammy@34567, Jaygun69, Jola, kaibeen, King1969, kingnani, Kman50459, krish782482, lucky81, Madhu, Mahesh12345, maheshvijay, Manavaadu, Manoj1, masti.bhai, mattbrian, meeabhimaani, murali1978, Naga raj, Nandu123, Nani666, Nautyking, Nivas348, nomercy316sa, Pilla, Pinkymunna, puku pichi, Rajarani1973, Raju777, ramd420, Ranjith62, Rathnakar, Raviraj45, Rishithejabsj, Saibabugvs, Saikarthik, Satya9, sexykrish69, sunilserene, Terminator619, TheCaptain1983, The_Villain, Uday, Venrao, Vizzus009, wraith, గరుడ
Posts: 1,635
Threads: 0
Likes Received: 1,264 in 997 posts
Likes Given: 2,863
Joined: Sep 2019
Reputation:
23
Nice family story please continue
Posts: 537
Threads: 0
Likes Received: 566 in 377 posts
Likes Given: 1,298
Joined: Nov 2018
Reputation:
13
Nice start...plz continue
Msr@441
Posts: 1,580
Threads: 0
Likes Received: 1,218 in 988 posts
Likes Given: 1,488
Joined: Sep 2021
Reputation:
13
Posts: 207
Threads: 0
Likes Received: 155 in 125 posts
Likes Given: 74
Joined: Mar 2019
Reputation:
1
Posts: 1,293
Threads: 0
Likes Received: 925 in 691 posts
Likes Given: 1,013
Joined: Nov 2018
Reputation:
14
Posts: 420
Threads: 0
Likes Received: 198 in 169 posts
Likes Given: 824
Joined: May 2019
Reputation:
2
Posts: 3,459
Threads: 0
Likes Received: 1,742 in 1,421 posts
Likes Given: 75
Joined: Jan 2019
Reputation:
21
Good concept very interesting
Posts: 859
Threads: 0
Likes Received: 782 in 595 posts
Likes Given: 6,405
Joined: Aug 2022
Reputation:
11
Good luck for the new story
Posts: 942
Threads: 0
Likes Received: 789 in 615 posts
Likes Given: 183
Joined: Aug 2024
Reputation:
23
Posts: 9,238
Threads: 2
Likes Received: 7,827 in 5,107 posts
Likes Given: 55,782
Joined: Nov 2018
Reputation:
125
Posts: 1,647
Threads: 2
Likes Received: 988 in 763 posts
Likes Given: 2,254
Joined: May 2019
Reputation:
11
story ine chala baaga undi. continue cheyandi
Posts: 1,723
Threads: 0
Likes Received: 1,253 in 1,058 posts
Likes Given: 8,435
Joined: Aug 2021
Reputation:
10
Posts: 375
Threads: 0
Likes Received: 184 in 141 posts
Likes Given: 1,372
Joined: Jan 2022
Reputation:
4
Posts: 77
Threads: 0
Likes Received: 28 in 24 posts
Likes Given: 11
Joined: Oct 2025
Reputation:
0
Posts: 768
Threads: 0
Likes Received: 654 in 563 posts
Likes Given: 2,885
Joined: May 2019
Reputation:
8
Posts: 1,647
Threads: 2
Likes Received: 988 in 763 posts
Likes Given: 2,254
Joined: May 2019
Reputation:
11
Posts: 9,903
Threads: 51
Likes Received: 49,630 in 8,732 posts
Likes Given: 9,648
Joined: May 2021
Reputation:
3,195
Amrutha
Posts: 1,580
Threads: 0
Likes Received: 1,218 in 988 posts
Likes Given: 1,488
Joined: Sep 2021
Reputation:
13
|