Thread Rating:
  • 7 Vote(s) - 4.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller రుద్రం భజే! ( POWER OF YODHA )
bagundi story!!!
kotha kotha characters digutunnay.
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Naradudnii comedy  kosam irokinchakunda loka kalyanam kosam vaadadam baagundi
[+] 1 user Likes styleraja's post
Like Reply
రుద్రం భజే! ఎపిసోడ్ 46



[Image: cover?seriesId=1269749&version=025903d2-...3a476c64b6]
నారదుడుతో కలిసి శిమిరా ని చంపడానికి కొండమీదికి బయలుదేరారు యోధ టీమ్.

భూషణ్ ని చూడడంతో కింద కూర్చున్న తోడేళ్లని చూసి ఒరేయ్ రేపాలా బిస్కెట్లు పట్టుకురా... అని పిలిచాడు గబ్బర్ సింగ్.

**************

గబ్బర్ సింగ్ బిస్కెట్లు తీసుకురమ్మని అరవడంతో కింద కూర్చున్న తోడేళ్ళ వైపు ఆశ్చర్యంగా చూస్తూ "సైంటిస్ట్! వీడు నిజంగా పెద్దమాంత్రికుడే మన తోడేళ్ళని కుక్క పిల్లలు లాగా ట్రీట్ చేస్తున్నాడు." అని చెప్పాడు సయ్యద్.

అది చూసి "రేపాలా! తోడేళ్లు హిడిచి మీదకి కూడా చంపడానికి దూకాయి కదా! మరి ఆ గబ్బర్ ని చూస్తే అలా కూర్చున్నయ్ ఏమిటి?" అని డౌట్ గా అడిగాడు కళింగ.

"ఆ విషయమే నాకు అర్థం కావడం లేదు అవి మనిషిని చూస్తే చాలు కసిగా మీదగా దూకుతాయి అందుకే నేను కూడా లోపలికి వచ్చాను.

"కానీ!" అని ఆలోచిస్తూ "కచ్చితంగా ఈ గబ్బర్ కి దైవ శక్తి లేదా రాక్షస శక్తి సహాయం చేస్తుంది.
అదే ఏమిటో నేను కనిపెడతాను అప్పటి వరకు వాడు ఏం చేసినా సరే కాస్త ఓపిక పట్టండి." అని చెప్పాడు రేపాలా.

"సరే!" అని గబ్బర్ వైపు చూసి "మీ శక్తి మాకు తెలిసింది లోపలికి రండి కూర్చుని మాట్లాడుకుందాము." అని చెప్పాడు కళింగ.

ఆ మాటవిని"హమ్మయ్య! బతికిపోయాను ఇంకా టైం ఉంది కదా!" అని తోడేళ్ళ వైపు చూసి "బాయ్!" అని చెప్పి లోపలికి వెళ్ళాడు గబ్బర్ సింగ్.

ల్యాబ్ లోకి వస్తున్న గబ్బర్ సింగ్ వైపు చూసి "గబ్బర్ గారు! ఇక్కడికి కొంతమంది ఫార్మా కంపెనీ వాళ్లు వస్తున్నారు వాళ్ళతో మీటింగ్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాము అప్పటివరకు ఆ గదిలో రెస్ట్ తీసుకోండి." అని చెప్పాడు కళింగ.

"సరే! నా రూమ్ లోకి ఎవరూ రాకండి నేను కాసేపు మెడిటేషన్ చేసుకోవాలి!" అని సూట్ కేస్ ని గట్టిగా పట్టుకుని లోపలకి వెళ్ళాడు గబ్బర్.

అది చూసి 'కచ్చితంగా ఆ వస్తువు సూట్ కేసులోనే ఉంది   ఎలాగైనా కొట్టేయాలి!' అనుకున్నాడు సయ్యద్.

ల్యాబ్ లోపలికి వెళుతూ ముష్రు వైపు చూసి "యంగ్ ని రెడీ చెయ్ ఫార్మా కంపెనీ వాళ్లకి ట్రైల్ చూపించాలి!" అని చెప్పాడు కళింగ.

"ఓకే సార్!" అని కంగారుగా ధర్మ వాళ్ళు ఉన్న రూంలోకి వెళ్లి విషయం చెప్పాడు ముష్రు.

ఆ మాట విని "నువ్వేమి టెన్షన్ పడకు అదంతా గుప్తా చూసుకుంటాడు." అని చెప్పాడు ధర్మ.

"నా ఒంట్లో కాస్త రక్తం తీస్తారు అంతే కదా! ఏం చేయాలో నాకు బాగా తెలుసు పద!" అని ముష్రు వెనకాల ల్యాబ్ లోకి వెళ్ళాడు యంగ్ రూపంలో ఉన్న గుప్తా.

*********

నారదుడితోపాటు కొండపైకి వెళుతూ "స్వామి! ఆ రాక్షసుడికి పవర్స్ ఏమైనా ఉంటాయా..?" అని డౌట్ గా అడిగింది పూజా.

"ఇంద్ర భగవానుడితో యుద్ధం చేశాడు అంటే కాస్త కూస్తో శక్తి ఉంటుంది కదా! అయినా అక్కడికే వెళుతున్నావు కదా కళ్ళారా చూడు." అని చెప్పాడు నారదుడు.

కొండమీదకి వెళుతూ "స్వామి! కింద అంత చల్లగా ఉంటే పైకి వెళుతున్న కొద్ది వేడి పెరుగుతుంది ఏమిటి!" అని అనుమానంగా అని అడిగాడు యోధ.

"ఈ శిమిరా శక్తితోనే రేపాలా ఈ హిమాలయాలను కరిగించి అడుగున ఉన్న క్షుద్ర శక్తులను బయటకు తీసుకురావాలని చూస్తున్నాడు." అని చెప్పాడు నారదుడు.

ఆ మాట విని "మరి ల్యాబ్ లో మంచు కరిగించడానికి ప్రయోగం చేసి ఏదో కనిపెడుతున్నారని తెలిసింది." అని డౌట్ గా అడిగింది నీతూ.

"శిమిరా! స్వేదాం రేపలాకి దొరికింది అప్పుడే వేరే లోకాలనుంచి శిమిరా భూమి మీదకి వచ్చాడని తెలుసుకున్నాడు ఆ స్వేదంతోనే తన పూర్వీకులు ఉన్న చోటికి వెళ్లగలిగాడు.

ఇప్పుడు రేపాలా కనిపెట్టాలి అనుకుంది మంచును కలిగించే మందుని కాదు ఈ హిమాలయాలలో శిమిరా ఎక్కడ ఉన్నాడు అనే విషయాన్ని ఈలోపు మీరు అతన్ని అంతం చేయాలి." అని చెప్పాడు నారదుడు.

ఆ మాట విని "స్వామి! మిమ్మల్ని మా దగ్గరికి భూషణ్ వాళ్ళు పంపించారా..?" అని అడిగాడు యోధ.

ఆ మాట విని "అవునవును! క్యూబ్ నాకు మంచి స్నేహితుడు అతనే మీ దగ్గరికి పంపించి ల్యాబ్ కి తీసుకు రమ్మని చెప్పాడు దారిలో ఈ పని చూస్తే అయిపోతుంది కదా అని ఇక్కడికి తీసుకొచ్చాను." అని చెప్పాడు నారదుడు.

"అవునా?" అని నారుదుడి వైపు చూసి "మీకు ఆంజనేయ స్వామి వారు ఎక్కడ తపస్సు చేసుకుంటున్నారో తెలుసా?" అని అడిగాడు యోధ.

"ఆ విషయం తెలిసిన అక్కడికి వెళ్లడం అసాధ్యం! మీకు సహాయం చేయాలి అనుకుంటే ఆయన తప్పకుండా వస్తాడు.

అయినా! రామనామం ఎక్కడ ఉంటే అక్కడే హనుమంతుడు ఉంటాడు నువ్వు శిమిరా తో యుద్ధం చేసేటప్పుడు రామనామం పలుకు ఆ హనుమంతుడు నీతోనే ఉంటాడు." అని చెప్పాడు నారదుడు.

"స్వామి! మనం ఇంకా ఎంత దూరం వెళ్లాలి?" అని అడిగింది సుహా.

"ఇదిగో వచ్చేసాము మీరు సిద్ధం అవ్వండి నేను శిమిరా ఎక్కడ ఉన్నాడో చూసి వస్తాను." అని వెళ్ళాడు నారదుడు.

అక్కడినుంచి సాధువు వెళ్లడంతో "ఈ స్వామీజీని చూస్తుంటే సినిమాల్లో నారదుడిని చూసినట్లే ఉంది చేతిలో వీణ మాత్రమే లేదు." అని చెప్పాడు పుష్కర్.

"ఓకే ఓకే! అందరు కేర్ ఫుల్ గా ఉండండి మనమందరం ఒకే చోట ఉండకూడదు, శిమిరా రూపం ఎలా ఉన్నా సరే ఎవరు భయపడకండి." అని చెప్పాడు యోధ.

"ఎస్! గ్రహాంతరవాసులు కొంచెం విచిత్రంగానే ఉంటారు." అని చెప్పాడు రాఖి.

కొండపైకి వెళ్లి నిద్రపోతున్న శిమిరా ని చూసి తన రూపంలోకి మారి "నారాయణ నారాయణ! ఏమిటయ్యా మొద్దు నిద్ర నువ్వు! కొండమీదికి ఎవరు వస్తున్నారో కనీసం చూసుకోవా..?" అని అడిగాడు నారదుడు.

ఆ మాటకి కళ్ళు తెరిచి "నీతో పాటు మానవులు వస్తున్నారు నాకు వాసన వచ్చింది నా కోసం ఆహారం తీసుకొచ్చావా అంత ప్రేమ ఏమిటి!" అని అడిగాడు శిమిరా.

"నేను ముల్లోకాలు తిరుగుతూ ఉంటాను నీకు ఆకలి వేసి నన్ను ఎక్కడ పట్టుకుంటావో అని భయం వేసి కొంతమంది యాత్రికులు కనపడితే తీసుకువచ్చాను.

వాళ్లు కాస్త ధైర్యవంతులే నిన్ను ఎదిరించి పోరాడతారేమో కాస్త చూసుకో మారి!" అని చెప్పాడు నారదుడు.

ఆ మాటకి నవ్వుతూ "నా గురించి తెలిసే మాట్లాడుతున్నావా నారదా! నాతో యుద్ధం చేయలేక  ఇంద్రుడు నన్ను ఒక లోకంలో బంధించాడు మర్చిపోయావా..?" అని అడిగాడు శిమిరా.

"ఆ మాట మూడు యుగాలా క్రితం ఇప్పుడు కలికాలం నడుస్తుంది ఏ శక్తినైనా మానవులు వసపరుచుకోగలరు తెలుసు కదా కాస్త జాగ్రత్త!" అని ముక్కు మూసుకుని "కాస్త శుభ్రంగా ఉండడం నేర్చుకో!" అని యోధ వాళ్ల దగ్గరికి వెళ్ళాడు నారదుడు.

అక్కడికి వస్తున్న సాధువుని చూసి "స్వామి మీరు చెప్పిన రాక్షసుడు ఉన్నాడా..?" అని అడిగాడు యోధ.

"ఆ ఆ సిద్ధంగా ఉన్నాడు వెళ్ళండి విజయీభవ!" అని చెప్పాడు నారదుడు.

కొండమీదకి వెళ్లి అక్కడ పడుకుని ఉన్న శిమిరని చూసి "వీడు సగం డైనోసార్ సగం మనిషి బుల్లెట్స్ తో పని అవ్వదు." అని కత్తిని బయటికి తీసి తన కాళ్ల దగ్గరికి వచ్చిన తోకని బలంగా నరికేడు యోధ.

తోక తెగడంతో గట్టిగా అరుస్తూ భారీ ఆకారంలోకి మారి "ఒక్కొక్కరిని గుటుక్కుమని మింగుతాను." అని భయంకరంగా అరుస్తూ చెప్పాడు శిమిరా.

భయంకరంగా అరుస్తున్న శిమిరా ని చూసి "అయ్యబాబోయ్! ఏంటి ఇలా ఉన్నాడు సినిమాల్లో గ్రహాంతరవాసులు చాలా చిన్నగా ఉంటారు కదా!" అని భయంగా చూస్తూ అడిగింది పూజా.

"ఆది సినిమా ఇది రియల్!" అని తన దగ్గర ఉన్న బేరల్ గన్ లోడ్ చేసి శిమిరా తలవైపు షూట్ చేసింది సుహా.

ఆ బుల్లెట్ చెవికి తగలడంతో "ఈ నారదుడు అబద్దాలకోరు నన్ను చంపడానికి మనుషుల్ని తీసుకువచ్చి ఆహారం తీసుకువచ్చానని చెప్పాడు మళ్లీ నాకు దొరక్కపోడు అప్పుడు చెబుతాను." అని కోపంగా అక్కడ ఉన్న బండరాళ్లు తీసుకుని యోధ వాళ్ళ మీదికి గిరాటు వేస్తూ ఉన్నాడు శిమిరా.

ఆ అరుపులు విని "నారాయణ నారాయణ! మళ్లీ నీకు  నేను నీకు ఎక్కడ దొరుకుతాను." అని అక్కడి నుంచి దూరంగా పరిగెత్తాడు నారదుడు.

బండరాలను తప్పించుకుని పరిగెత్తుకుంటు వెళ్లి "రౌండ్ అప్ వేయండి." అని  చెప్పి "జైశ్రీరామ్!" అంటూ శిమిరా కాలు బొటనా వేలుని తన చేతిలో ఉన్న కత్తితో బలంగా నరికాడు యోధ.

యోధ కత్తితో నరుకుతున్నప్పుడు తన ఛాతి మీద ఉన్న సింబల్ మెరవడం దూరం నుంచి చూస్తూ "కలియుగ బ్రహ్మ శక్తి! నారాయణ నారాయణ!" అనుకున్నాడు నారదుడు.

తన చేతిలో ఉన్న కత్తి పట్టుకుని శిమిరా కాలు నరం కోస్తూ  "ఈ రాక్షసుడికి ఎటువంటి శక్తి లేదు ఒక జంతువు లాంటివాడు అందరూ ఒక్కసారిగా ఎటాక్ చేయండి." అని చెప్పాడు యోధ.

అందరూ ఒక్కాసారిగా షూట్ చేయడంతో భయంకరంగా అరుస్తున్న శిమిరాని చూసి "కలియుగంలో ఒక అబలా చేతిలో మరణం సంభవిస్తుంది అని నీకు ఇచ్చిన వరంలోనే శాపం ఉంది మర్చిపోయాడనుకుంటా!" అని నవ్వుతూ

"ఇక్కడ ఉన్న అమ్మాయిలలో ఎవరి చేతిలో చావు రాసిపెట్టి ఉందో!" అని అనుకున్నాడు నారదుడు.

అందరూ ఒక్కసారిగా అటాక్ చేయడంతో కోపంతో రగిలిపోతూ నోటి నుంచి మంటలు ఊదుతూ చెదరగొడుతూ ఉన్నాడు శిమిరా.

అది చూసి "ఓరి నాయనో! వీడు నోట్లో నుంచి మంటలు వదులుతున్నాడు పూర్తి డైనోసార్ లాగా మారిపోతాడా ఏంటి!" అని అక్కడ ఉన్న కత్తి పట్టుకుని భయంగా చూస్తూ ఉంది పూజా.

అందరూ షూట్ చేస్తూ ఉండగా శిమిరా తోక పట్టుకుని పైకి ఎక్కుతూ ఉన్న ఈ యోదాని చూసి "ఆ రాక్షసుడి శక్తి వెన్నుపూసలో ఉంది." అని వినపడేటట్లు అరిచాడు నారదుడు.

ఆ మాట విని "దీప్తి! ఆ కత్తి నా వైపుకి విసురు!" అని గట్టిగా అరిచాడు యోధ.

శిమిరా భుజాల మీద ఉన్న యోధాని ఆశ్చర్యంగా చూస్తూ తన చేతిలో ఉన్న కత్తిని పైకి విసిరింది దీప్తి.

గాలిలో ఎగురుతున్న కత్తిని పట్టుకుని తన రెండు చేతులతో రెండు కత్తులను వెన్నుపూసలో పొడుస్తూ "జైశ్రీరామ్!" అని గట్టిగా అరిచాడు యోధ.

వెన్నుపూసలో కత్తులు దిగడతో బాధగా అరుస్తూ  ముందుకి పడ్డాడు శిమిరా.

అది చూసి "సార్! ఈ రాక్షసుడు కింద పూజ మేడం ఉండిపోయారు." అని కంగారుగా చెప్పాడు పుష్కర్.



[+] 6 users Like SivaSai's post
Like Reply
రుద్రం భజే! ఎపిసోడ్ 47


[Image: cover?seriesId=1269749&version=025903d2-...3a476c64b6]



ఫార్మా కంపెనీ వాళ్ళు వస్తున్నారు ట్రయిల్ చూపించాలి యంగ్ ని తీసుకురమ్మని కళింగ చెప్పడంతో గుప్తాని తీసుకుని ల్యాబ్ లోకి వెళ్లేడు ముష్రు.

శిమిరా కింద పడిపోవడంతో సార్ ఈ రాక్షసుడు కింద పూజ మేడం ఉండిపోయారు అని కంగారుగా చెప్పాడు పుష్కర్.

*************

రాక్షసుడు కింద పూజ ఉందని చెప్పడంతోనే కంగారుగా వచ్చి శిమిరా ని పక్కకు లేపడానికి ట్రై చేస్తూ ఉన్నారు అందరు.

సంతోషంగా అక్కడకు వచ్చి "హమ్మయ్య! ప్రాణం పోయింది నాకు ఆపద తప్పింది." అని చెప్పాడు నారదుడు.

ఆ మాట విని "ఏంటి? మా పూజ చచ్చిపోయిందా..?" అని కంగారుగా అడిగింది దీప్తి.

"నేను చెప్పింది రాక్షసుడి ప్రాణం తల్లి! ఆ బాలిక చేతిలో ఉన్న ఖడ్గం శిమిరా గుండెల్లో దిగిన వెంటనే అతను ప్రాణం విడిచాడు.

త్వరగా ఈ రాక్షసుడి శరీరాన్ని పక్కకి తీయండి లేకపోతే ఆ బాలిక కూడా ఈ రాక్షసుడితో పాటు కాలిపోతుంది." అని చెప్పాడు నారదుడు.

"అవునా?" అని అందరూ కలిసి బలంగా పట్టుకుని శిమిరా ని పైకి లేపడంతో కింద ఉన్న పూజాని బయటికి లాగాడు యోధ.

స్పృహ తప్పిన పూజ మొహం మీద తన కలేశం లో నీళ్లు తీసి జల్లెడు నారదుడు.

మొహం మీద చల్లని నీళ్లు పడడంతోనే స్పృహలోకి వచ్చి "ఏంటి! అందరూ కలిసి ఆ డైనోసార్ గాడిని నా మీద పడేసారు." అని భయంగా చూస్తూ అడిగింది పూజా.

"కత్తి పట్టుకుని రెడీగా ఉన్నావు కదా అని అటువైపుకి పడేసాము నువ్వు కూడా కరెక్ట్ గా శిమిరా గుండెల్లో పొడిచావు చచ్చాడు." అని చెప్పాడు యోధ.

ఆ మాట విని చేతిలో ఉన్న కత్తిని కింద పడేసి భయంగా చూస్తూ "ఏంటి! రాక్షసుడు నా చేతిలో చచ్చాడా..!" అని శిమిరా దగ్గరికి వెళ్లి కాలుతో తంతు "మళ్ళీ లెగడు కదా!" అని డౌట్ గా అడిగింది పూజా.

నారదుడి వైపు చూస్తూ "స్వామి! నేను ఎన్ని సార్లు పొడిచిన చావలేదు పూజ చేతీలో చిన్న కత్తి గుచ్చుకుని చచ్చిపోయాడు ఏమిటి!" అని అడిగాడు యోధ.

అంతలో శిమిరా శరీరం బూడిద అవడం చూసి "కొండ దిగుతూ మాట్లాడుకుందాము." అని చెప్పి కిందకి దిగుతూ

"ఈ శిమిరా కి ఒక శాపం ఉంది ఏడవ నెలలో పుట్టిన బాలిక తన రెండు చేతులతో ఖడ్గాని పట్టుకుని గుండెల్లో పొడిస్తే మరణం సంభవిస్తుంది ఆది ఇప్పటికి జరిగింది." అని చెప్పాడు నారదుడు.

ఆ మాట విని పూజ వైపు ఆశ్చర్యంగా చూస్తూ "నువ్వు ఏడో నెలలో పుట్టావా..?"అని అడిగాడు యోధ.

"అవును! ఏ అప్పుడు పుట్టకూడదా..! ఆ చూపు ఏమిటి  నేను ఆ రాక్షసుడిని చంపానని నీకు కుళ్ళు!" అని చెప్పింది పూజా.

నవ్వుతూ "ఏడో నెలలో పుట్టిన వాళ్ళు బ్రతకడం కష్టం నువ్వు గట్టి పిండానివి అ రాక్షసుడు చావు కోసమే బతికావు అనుకుంట!" అని చెప్పాడు యోధ.

"ప్రతి మానవుడి పుట్టుక వెనక ఏదో కారణం ఉండే ఉంటుంది అది సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది." అని చెప్పాడు నారదుడు.

"నేను పుట్టిన కారణం ఇప్పుడు తెలిసింది." అని గొప్పగా చెప్పింది పూజ

"స్వామి! ఇప్పుడు ల్యాబ్ దగ్గరికి వెళుతున్నామ?" అని అడిగాడు యోధ.

"హ! అక్కడికే వెళుతున్నము మధ్యలో కాస్త చిన్న పని ఉంది అది చూసుకుని వెళ్ళిపోదాము." అని చెప్పాడు నారదుడు.

ఆ మాట విని "ఇంకొక రాక్షసుడు ఏమైనా ఉన్నాడా ఏంటి స్వామి!" అని డౌట్ గా అడిగింది దీప్తి.

ఆ మాటకి నవ్వుతూ "ఇది కలికాలం మనుషులే రాక్షసుల లాగా తయారవుతున్నారు ఒకవేళ  మనకి ఎదురు పడతారేమో! నారాయణ నారాయణ!" అంటూ నడుస్తూ ఉన్నాడు నారదుడు.

అంతలో శాటిలైట్ ఫోన్ రింగ్ అవ్వడం చూసి "యోధ! డాడ్ కాల్ చేస్తున్నారు." అని ఇచ్చింది దీప్తి.

ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేసి "జైహింద్ సార్! భూషణ్ వాళ్ళు గబ్బర్ సింగ్ తో కలిసి ల్యాబ్ దగ్గరకి వెళ్లారు, మేము కూడా అక్కడికి వెళుతున్నాము అనుకోకుండా ఒక ఇంపార్టెంట్ మిషన్ కంప్లీట్ చేశాము." అని చెప్పాడు యోధ.

"గుడ్! మిమ్మల్ని మన సాటిలైట్ టీమ్ వాచ్ చేస్తూన్నారు మీ సిగ్నల్స్ ఏ కంట్రీ సాటిలైట్ కి దొరక్కుండా మన హ్యాకింక్ టీమ్ చూస్తుంది. ఆ విషయం చైనా మిలటరీ కనిపెట్టే లోపు మీరు వర్క్ కంప్లీట్ చేయాలి." అని చెప్పాడు నాయక్.

"ఓకే సార్! ల్యాబ్ దగ్గరికి స్టార్ట్ అయ్యాము వర్క్ కంప్లీట్ చేసుకుని మీకు కాల్ చేస్తాను." అని చెప్పాడు యోధ.

"మరొక ఇంపార్టెంట్ విషయం పిఓకే నుంచి కొంతమంది టెర్రరిస్టులు మీరు ఉన్న రూట్ వైపు వస్తున్నట్లు శాటిలైట్ పిక్చర్స్ చూపిస్తున్నాయి స్క్రీన్స్ మీకు సెండ్ చేస్తున్నాను కేర్ఫుల్ గా ఉండండి." అని చెప్పాడు నాయక్.

"ఎస్ సార్! వాళ్లు మాకు ఎదురుపడితే మళ్ళీ మీకు శాటిలైట్ లో కనిపించరు." అని చెప్పి ఫోన్ పెట్టేసి దీప్తి వైపు చూసి "సాటిలైట్ స్క్రీన్ షాట్స్ వచ్చాయి చూడు!"  అని చెప్పాడు  యోధ.

"ఓకే!" అని చెప్పి లాప్టాప్ ఆన్ చేసి పిక్చర్స్ చూస్తూ "ఓ మై గాడ్! మన వైపే ఎవరో వస్తున్నారు ఈ రూట్లో ముందుకు వెళితే వాళ్ళు ఎదురుపడతారు." అని కంగారుగా చూస్తూ చెప్పింది దీప్తి.

"స్వామీజీ చెప్పినట్లు మనుషుల రూపంలో ఉన్న రాక్షసులనుకుంట! రానివ్వండి  చూసుకుందాము." అని కోపంగా  చూస్తూ చెప్పాడు వర్ధన్.

"మరి అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనిచేయదు మనం వాళ్ళ ప్లేస్ లో ఉన్నాము." అని పిక్చర్స్ చూసి "వీళ్ళు ఈ రూట్ లో వస్తున్నారు మనం రైట్ సైడ్ నుంచి వెళదాము అప్పుడు వాళ్ళ వెనకాలకి వెళతాము ఎటాకింగ్  మోడ్ ఈజీ అవుతుంది ఒక్కడు కూడా మిగలడు." అని చెప్పింది సుహా.

"అదంతా ఓకే! ల్యాబ్ దగ్గర మన వాళ్ళ పొజిషన్ ఎలా ఉందో!" అని డౌట్ గా అడిగింది నీతూ.

"ఆ విషయంలో మీరేమీ కంగారు పడకండి భూషణ్, క్యూబ్, నంద ఉన్నారు కదా అది కాకుండా ధర్మ, గుప్తాలు కూడా వెళ్లారు మీరు అనుకున్న పని కానివ్వండి." అని చెప్పాడు నారదుడు.

ఆ మాట విని "మీరు కూడా ఏజెంటేనా ఏంటి? మా వాళ్ల పేర్లు టకటక చెప్తున్నారు?" అని డౌట్ గా అడిగాడు రాఖి.

"కాసేపు యుద్ధం చేయని ఏజెంట్ అనుకో పోయేదేముంది. రండి కూడివైపు నుంచి వాళ్ళ వెనక్కి వెళదాము దారిలో మీకు ఒక మంచి ప్రదేశం కూడా చూపిస్తాను." అని చెప్పాడు నారదుడు.

"లెట్స్ గో!" అని పూజ వైపు చూసి తన దగ్గర ఉన్న గన్ ఇచ్చి "నీ చేతిలో ఒక రాక్షసుడు చచ్చాడు కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉండకు నా వెనకాలే ఉండు." అని చెప్పాడు యోధ.

ఆ మాట విని డల్ గా చూస్తూ "సంతోషం మొత్తం ఆవిరి అయిపోయింది. ఒక డేంజరస్ రాక్షసుడిని చంపిన నన్ను ఎవరు గుర్తించడం లేదు." అని యోధ వెనకాల నడుస్తూ కోపంగా చూస్తూ చెప్పింది పూజా.

**************

ల్యాబ్ రూమ్లో ఉన్న గబ్బర్ సింగ్ దగ్గరికి వెళ్లి "నీకు ఎవరో హెల్ప్ చేస్తున్నారని రేపాలా కి అనుమానం వచ్చింది ఇక్కడి నుంచి వెళ్లే వరకు అతను చేత్తో ఇచ్చింది ఏమీ తినకు!" అని చెప్పాడు నంద.

ఆ మాట విని మంచం మీద నుంచి కింద కూర్చుని భూషణ్ వైపు చూసి "మహారాజా! నేనేమీ వాళ్లకి అనుమానం వచ్చేటట్లు చేయలేదు కదా!" అని అడిగాడు గబ్బర్ సింగ్.

భూషణ్ పక్కన కూర్చుంటూ "నువ్వు ఏమి చేయనవసరం లేదు నీ మొహం చూస్తేనే అనుమానం వస్తుంది. ఆ రేపాలా ని ఒరేయ్ తురేయ్ అంటున్నావు కాస్త జాగ్రత్త వాడు పెద్ద మాంత్రికుడు." అని చెప్పాడు క్యూబ్.

ఆ మాటకి నవ్వుతూ "వాడు మాంత్రికుడు ఏంటి వాడి బొంద! ఆ పక్కన ఉన్నా హిడిచి ఎవరు సార్ నా వైపు ఉ.. అని గుర్రుగా చూస్తున్నాడు మీరు చెప్పినట్లు ఆ పొట్టోడికి అంత సీను ఉందా..?" అని అనుమానంగా అడిగాడు గబ్బర్ సింగ్.

ఆ మాటకి నవ్వుతూ "గబ్బర్! నీకు కాస్త నోటి దూల ఎక్కువే యోధవాళ్ళు వచ్చేవరకు కాస్త ఓపిక పట్టు!" అని చెప్పాడు నంద.

"సార్" మీరు ఉ.. అంటే ఆ సయ్యద్ గాడి తో కాసేపు ఆడుకుంటాను వాడి చూపు మొత్తం నా చేతిలో ఉన్న సూట్ కేసు మీదే ఉంది. అలాగే మన సోల్జర్స్ ఎక్కడ ఉన్నారో కూడా తెలుసుకుంటాను." అని అడిగాడు గబ్బర్ సింగ్.

"అబ్బో.. దేశం మీద ప్రేమ ఎక్కువే! సరే నీ వెనకాల మేము ఉంటాము ఏం చేయాలనుకున్నావో చేసేయ్!" అని చెప్పాడు క్యూబ్.

************

ల్యాబ్లో కు వచ్చిన గుప్తాని ని ఒక బెడ్ మీద పడుకోబెట్టి బ్లడ్ తీస్తూ "ముష్రు! మెడిసిన్ ఇచ్చావా..?" అని అడిగాడు కళింగ.

ఆ మాటకి కంగారుగా చూస్తున్న ముష్రు వైపు చూసి కళ్ళతో సైగ చేసి "సైంటిస్ట్! ఒక డబ్బా మింగాను కావాలి అంటే చెప్పు ఇంకొక డబ్బా మింగుతాను." అని చెప్పాడు గుప్త.

ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ "నోటి వెంట మాటే రాదు  ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి!" అని అనుమానంగా చూస్తూ తీసిన బ్లడ్ ని గ్లాస్ బాక్స్ లో ఉన్న ఎలుక మీద పోశాడు కళింగ.

ఎలుక వైపు చూస్తూ 'తెలిసిపోతుందేమో!' అని టెన్షన్ గా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ముష్రు.

అంతలో అక్కడికి వచ్చిన ఫార్మా కంపెనీ వాళ్ళని లోపల తీసుకొస్తూ "సైంటిస్ట్! మన వాళ్ళు వచ్చేసారు." అని సంతోషంగా చూస్తూ చెప్పాడు సయ్యద్.

"వెల్కమ్! మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ సీట్ డౌన్! జరగబోయే విచిత్రాన్ని కళ్ళరా చూడండి." అని గ్లాస్ బాక్స్ లో ఉన్న ఏలుక వైపు చూపించడు కళింగ.

గ్లాస్ బాక్స్ లో ఉన్న ఎలుక సైజు పెరగడం ఫార్మా కంపెనీ వాళ్లతో పాటు ఆశ్చర్యంగా చూస్తూ 'ఇది ఎలా జరుగుతుంది.' అనుకున్నడు ముష్రు.




" రుద్రం భజే! ఎపిసోడ్ 47 " రచనకు రేటింగ్ ఇవ్వండి
[+] 9 users Like SivaSai's post
Like Reply
Excellent update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
Narayana Narayana ?
[+] 1 user Likes Sunny73's post
Like Reply
naradudu choopistanu anna manchi pradesham ento?
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Iragadeesaaru
[+] 1 user Likes styleraja's post
Like Reply
రుద్రం భజే? ఎపిసోడ్ 48




[Image: cover?seriesId=1269749&version=025903d2-...3a476c64b6]

నాయక్ పంపించిన శాటిలైట్ పిక్చర్స్ చూసి టెర్రరిస్టుల మీద అటాక్ చేయడానికి వేరే రూట్లో బయలుదేరారు యోధ వాళ్ళు.

గుప్తా బ్లడ్ తీసి ఎలుక మీద పోయడంతో దాని సైజు పెరగడం చూసి ఫార్మా కంపెనీ వాళ్ళతో పాటు ముష్రు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు.

**************

ఎలుక సైజు పెరగడం చూసి 'గుప్త రక్తం పోస్తే సైజు పెరుగుతుంది ఏంటి అసలు ఇలా ఎలా జరుగుతుంది?' అని మనసులో అనుకున్నడు ముష్రు.

పెద్దది అవుతున్న ఏలుక ని చూసి నవ్వుతూ ఉన్నాడు గుప్తా.

ఫార్మ కంపెనీ వాళ్ళ వైపు చూసి "మిస్టర్ జార్జ్! కిజికిస్థాన్ లో ప్రయోగం ఆగినందుకు కంగారు పడ్డావు కదా ఇప్పుడు సంతోషంగా ఉందా..?" అని అడిగాడు కళింగ.

సైజు పెరుగుతున్న ఎలుక వైపు ఆశ్చర్యంగా చూస్తూ "వండర్ఫుల్! నెక్స్ట్ ఏం జరుగుతుంది?" అని ఆత్రుతగా అడిగాడు జార్జ్.

"ఆ ఎలుక భయంకరంగా తయారవుతుంది తనకు ఎదురుపడిన వాళ్ళని చంపుకు తింటుంది 24 గంటల తర్వాత చనిపోతుంది.

అప్పుడు మీకు కావలసిన వైరస్ దాని బాడీ నుండి బయటకు వచ్చి గాలిలో కలిసిపోతుంది దానిని ఎవరు కనిపెట్టలేరు.

ఆ వైరస్ వల్ల మనిషి ఒక్కసారిగా చావడు బాడీలో ఒక్కొక్క పార్ట్ పాడైపోతూ మీ మందులు వాడుతూ అతని దగ్గర మందులు కొనడానికి డబ్బులు లేక చనిపోతాడు." అని నవ్వుతూ చెప్పాడు కళింగ.

"గుడ్! ఆ వైరస్ ని తగ్గించే మెడిసిన్ కూడా నాకు కావాలి బ్రతకాలి అని ఆశ ఉన్నవాడు ఎన్ని కోట్లు అయినా ఖర్చు పెడతాడు అతడి కోసం నాకు యాంటీ డోస్ కావాలి." అని అడిగాడు జార్జ్.

"షూర్! కన్ఫామ్ గా ఇస్తాను మనం అనుకున్న ఫస్ట్ పేమెంట్ నా స్విస్ అకౌంట్ కి ట్రాన్సర్ చేయండి." అని అడిగాడు కలింగ.

"వన్ మినిట్!" అని తన లాప్టాప్ ఓపెన్ చేశాడు జార్జ్.

అది చూసి గ్లాస్ బాక్స్ లో ఉన్న ఎలుక వైపు చూసి రెండు వేళ్ళు పైకి లేపాడు గుప్తా.

ఆ సైగతో అప్పటివరకు పెరిగిన దాని సైజు కన్నా రెట్టింపు సైజు పెరిగి గ్లాస్ బాక్స్ బద్దలు కొట్టుకుని బయటికి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళ మీద ఎటాక్ చేసి జార్జ్ చేతిలో ఉన్న లాప్టాప్ ని దాని పళ్ళతో ముక్కలు ముక్కలు చేసి భయంకరంగా అరుస్తూ ఉంది ఆ ఎలుక.

భయంకరంగా ఉన్న ఎలుకని చూసి భయంతో అక్కడి నుంచి బయటికి పరుగు తీశారు ఫార్మ కంపెనీ వాళ్ళు.

అది చూసి గుప్తా వెనక్కి వెళ్లి "సడన్ గా దీనికి ఏమైంది? రక్తం ఏమైనా కాస్త ఎక్కువ అయిందా..?" అని భయంగా చూస్తూ అడిగాడు సయ్యద్.

"నాకు అర్థం కావడం లేదు." అని తన దగ్గర ఉన్న గన్ తీసి ఎలుకని షూట్ చేస్తూ బిగుసుకుపోయి చూస్తున్న ముష్రు ని చూసి "బయటికి వెళ్లి తొందరగా హిడిచి ని తీసుకురా..!" అని అరుస్తూ చెప్పాడు కళింగ.

ఆ మాట విని బయటకు పరిగెత్తి "హిడిచి హీడిచి!" అని అరుస్తూ వెళ్ళాడు ముష్రు.

ఆ అరుపులు విని "నేను ఉండగా వాడిని ఎందుకు పిలుస్తున్నారు." అంటూ రూమ్ లో నుంచి బయటికి వచ్చి ల్యాబ్ లోపలికి వెళ్లి వీరంగం వేస్తున్న ఎలుకను ఆశ్చర్యంగా "ఓరి మీ దుంప తెగ! ఆ ఎలుకను ఏమి చేశార్రా... అంత సైజు పెరిగింది." అని నవ్వుతున్న గుప్త వైపు చూసి

'తమరి మహత్యమ స్వామి!' అనుకుని షూట్ చేస్తున్న కలింగ దగ్గరికి వెళ్లి భుజం మీద కొట్టి "నువ్వు తప్పుకో నేను చూసుకుంటాను." అని చెప్పాడు గబ్బర్ సింగ్.

ఆ మాట విని "గబ్బర్ జాగ్రత్త! అది కరిస్తే వైరస్ ఎటాక్ అవుతుంది దానికి ఇంకా నేను యాంటీ డోస్  కనిపెట్టలేదు." అని చెప్పాడు కళింగ.

"అవునా?" అని ఏలుక వైపు భయంగా చూస్తూ గుప్తా వైపు చూసి 'స్వామి ప్లీజ్! ఒక్కసారి!' అని అడిగాడు గబ్బర్ సింగ్.

ఆ సైగ చూసి "సరే!" అని తల ఊపుతూ పైకి ఎత్తిన రెండు వేళ్లు కిందకి దించాడు గుప్తా.

అది చూసి "హమ్మయ్య!" అనుకోని ఎలుక దగ్గరికి వెళ్ళాడు గబ్బర్ సింగ్.

దగ్గరికి వస్తున్న గబ్బర్ సింగ్ ని చూసి అక్కడ ఉన్న గ్లాస్ బాక్స్ లోకి వెళ్లి సైలెంట్ గా ఉంది ఎలుక.

అది చూసి ఊపిరిపీల్చుకుని "కళింగ! ఇంకా ప్రాబ్లం లేదు నేను మంత్రం వేసాను అది నువ్వు చెప్పినట్లు వింటుంది." అని చెప్పాడు గబ్బర్ సింగ్.

ఆ మాట విని గ్లాస్ బాక్స్ లో సైలంట్ గా ఉన్న ఎలుక వైపు ఆశ్చర్యంగా చూస్తూ "గబ్బర్ గారు!  మీరు నిజంగా గ్రేట్!" అని సంతోషంగా చూస్తూ చెప్పాడు కళింగ.

అంతలో ముష్రు తో పాటు పరిగెత్తుకుంటూ వచ్చి గ్లాస్ బాక్స్ లో ఉన్న ఏలుక ని పట్టుకుని తింటూ ఉన్నాడు హిడిచి.

అది చూసి "ఒరేయ్ దరిద్రుడా! దాంట్లో వైరస్ ఉందంట ఆకలి వేస్తే అక్కడ కుక్క బిస్కెట్లు ఉన్నాయి వెళ్లి తిను అడ్డమైనవి తినకు!" అని తిడుతూ చెప్పాడు గబ్బర్ సింగ్.

ముష్రు వైపు చూసి "గబ్బర్ గారిని యంగ్ ని ఇక్కడినుంచి తీసుకువెళ్లు!" అని చెప్పి బయట ఉన్న ఫార్మ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్లి "సారి ఫర్ ద డిస్టబెన్స్ దానికి కాస్త డోస్ ఎక్కువైంది. పేమెంట్ ట్రాన్స్ఫర్ చేస్తే మిగతా విషయాలు మాట్లాడుకుందాము." అని నవ్వుతూ అడిగాడు కళింగ.

"ఆ వైరస్ కి యాంటీడోస్ ఇంకా కనిపెట్టలేదని ఇప్పుడేగా చెప్పావు అది కూడా అయిన తర్వాత కాల్ చెయ్! అప్పుడు పేమెంట్ విషయం చూద్దాము." అని చెప్పి తన మనుషులని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు జార్జ్.

అది విని డల్ గా కళింగ దగ్గరికి వచ్చి "సైంటిస్ట్! మరి ఇప్పుడు విరుగుడు మందు ఎలా..! రెండు రోజుల్లో కనిపెట్టేస్తావా..? చేతికి వచ్చిన డబ్బు వెనక్కి వెళ్ళిపోతుంది." అని నిరాశగా చూస్తూ అడిగాడు సయ్యద్.

అక్కడికి వచ్చి హీడిచి ని తీసుకు వెళుతూ "ఈ వైరస్ కి విరుగుడు మందు కనిపెట్టడం అసాధ్యం!  అని చెప్పాడు రేపాలా.

ఆ మాట విని కంగారుగా చూస్తూ "అయితే! మనం ఇన్నాళ్లు పడ్డ కష్టం ఈ మంచు కొండల్లో కరిగిపోయినట్టేనా..?" అని అడిగాడు సయ్యద్

"గబ్బర్ దగ్గర ఉన్న పద్మం లో ప్రయాణించి అలకాపురి నగరానికి చేరుకొని లోపల ఉన్న కల్పవృక్షాన్ని మనం స్వాధీనం చేసుకుంటే విరుగుడు మందు దొరికినట్లే!" అని చెప్పాడు రేపాలా.

"ఎస్! గబ్బర్ తో డీల్ చేసుకుని త్వరగా ఆ పద్మం మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి చేతికి వచ్చిన డబ్బు వెనక్కి వెళ్ళిపోయింది." అని కోపంగా చూస్తూ చెప్పాడు కళింగ.

రూమ్ లో నుంచి వాళ్ళ మాటలు వింటూ 'అమ్మ వెధవల్లారా..! దానికోసమే పద్మం కావాలని ఆరాటపడుతున్నారు రండి రండి నాతో డీల్ అంటే మూడు చెరువుల నీళ్లు తాగినట్లే!' అని మనసులో అనుకున్నడు గబ్బర్ సింగ్.

"సయ్యద్! గబ్బర్ ని మచ్చికా చేసుకుని అసలు అతనికి ఏం కావాలో అడుగు." అని చెప్పాడు రేపాలా.

"ఆ సంగతి నేను చూసుకుంటాను ఇప్పుడే వెళ్లి క్షణాల్లో తెలుసుకుని పద్మం తీసుకుని వస్తాను." అని చెప్పాడు సయ్యద్.

"సరేగాని! నేను తయారుచేసిన మెడిసిన్ టెస్ట్ చేయడానికి టెర్రరిస్టులు కావాలి అని అడిగాను వస్తున్నారా..!" అని అడిగాడు కళింగ.

"కాసేపట్లో ఇక్కడే ఉంటారు నీకు ఎంతమంది కావాలో అంత మందిని వాడుకో మిగతా వాళ్ళని తీసుకెళ్లి ఇండియా బోర్డర్లో వదిలిపెడతాను." అని నవ్వుతూ చెప్పాడు సయ్యద్.

అక్కడికి వస్తూ "ఆ టెర్రరిస్టులతో పాటు మన దగ్గర ఉన్న 12 మంది ఇండియన్ సోల్జర్స్ కూడా ఆ మెడిసిన్ ఇచ్చి బోర్డర్ దగ్గర వదిలిపెట్టండి." అని చెప్పాడు చింగ్ యా.

ఆ మాటలు విని రూమ్ లో ఉన్న ముష్రు వైపు చూసి "ఆ మెడిసిన్ ఏమిటి! ఎలా పనిచేస్తుంది?" అని అడిగాడు గబ్బర్ సింగ్.

"ఆ మెడిసిన్ కళింగ ఐదు సంవత్సరాలు కష్టపడి హిమాలయాల కింద దొరికిన జంతువుల డిఎన్ఏ నుంచి  కనిపెట్టాడు.

అది మనిషి శరీరంలోకి వెళ్లిన వెంటనే అతను రాక్షసుడుగా మారిపోతాడు ఎవర్ని గుర్తుపట్టలేదు ఎదురుగా మనిషి కనిపిస్తే చాలు చంపేస్తాడు మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ఒక జాంబీలాగ తయారవుతాడు." అని చెప్పాడు ముష్రు.

ఆ మాటవిని భూషణ్ వాళ్ళ వైపు భయంగా చూస్తూ "మహారాజ! ఇప్పుడు పరిస్థితి ఏంటి! యోధా సార్ వాళ్లు కూడా ఇంకా ఇక్కడికి రాలేదు." అని కంగారుగా అడిగాడు గబ్బర్ సింగ్.

"సయ్యద్ నీతో మాట్లాడడానికి వస్తున్నాడు కదా! నీ స్టైల్ లో మాట్లాడు జరగాల్సింది మేము చూసుకుంటాము." అని చెప్పాడు క్యూబ్.

గబ్బర్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ "సార్! ఎవరితో మాట్లాడుతున్నారు?" అని డౌట్ గా అడిగాడు ముష్రు.

"మా తాతయ్యతో ఆ విషయాన్ని నీకు ఎందుకురా..! నేను మెడిటేషన్ లో ఉంటాను ఆ సయ్యద్ గాడు వస్తే పిలువు!" అని చెప్పి కళ్ళు మూసుకుని పడుకున్నాడు గబ్బర్ సింగ్.

*************

నారదుడితోపాటు వేరే రూట్లో తీవ్రవాదుల వెనక్కి వచ్చి చూస్తూ "గైస్! వాళ్ళు కాస్త ఎక్కువ మంది ఉన్నారు మీరు కొంచెం కష్టపడాలి." అని చెప్పాడు యోధ.

ఆ మాటవిని చేతిలో ఉన్న గన్ తీప్పుతూ "నో ప్రాబ్లం! అంత పెద్ద రాక్షసుడిని చంపిన దాన్ని వీళ్ళను చంపలేనా..!" అని ధైర్యంగా చూస్తూ చెప్పింది పూజా.

"ఈ రాక్షసులకు ఎటువంటి శాపాలు ఉన్నాయో నాకు మాత్రం తెలియదు." అని చెప్పాడు నారదుడు.

"స్వామి! వీళ్ళకి మా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి శాపం ఉంది." అని గన్ తీసి మధ్యలో ఉన్న టెర్రరిస్ట్ తల మీద షూట్ చేశాడు యోధ.

బుల్లెట్ తగిలిన మనిషి కింద పడడం చూసి వెనక్కి తిరిగిన ముగ్గురి తలలో షూట్ చేశారు సుహా వాళ్ళు.

అది చూసి "నారాయణ నారాయణ! ఈ ఆయుధం చాలా బాగుంది కలికాలంలో నారాయణుడు అవతారం ఎత్తినప్పుడు కూడా ఈ ఆయుధాలు వాడుతారు అనుకుంటా! వెళ్లేటప్పుడు ఒకటి తీసుకువెళ్లి ముక్కోటి దేవతలకు చూపించాలి.' అనుకున్నాడు నారదుడు.

అంతలో టెర్రరిస్టులు కూడా తిరిగి ఫైరింగ్ చేయడంతో అక్కడ ఉన్న రాళ్ల వెనుకా ఉండి ఫైరింగ్ చేస్తూ ఉన్నారు యోధ వాళ్ళు.

ఒక రాయి వెనకాల దాక్కుని "స్వామీజీ ఎక్కడ? ఆయనకి బుల్లెట్ తగిలితే మనకి ల్యాబ్ దారి చూపించే వాళ్ళు ఉండరు." అనుకుని తలతిప్పి నారదుడు బాడీలో నుంచి బుల్లెట్స్ బయటికి వెళ్లడం చూసి

"స్వామీజీకి  బుల్లెట్ తగిలిన ఏమీ అవడం లేదు ఏమిటి!" అని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది పూజా.


[+] 7 users Like SivaSai's post
Like Reply
రుద్రం భజే! ఎపిసోడ్ 49




[Image: cover?seriesId=1269749&version=025903d2-...3a476c64b6]

టెర్రరిస్టులు కుడా ఫైరింగ్ చెయ్యడతో రాళ్ల వెనుక ఉండి ఫైరింగ్ చేస్తూ నారదుడు ఒంట్లోకి బుల్లెట్స్ వెళ్లి బయటికి రావడం చూసి స్వామీజీకి బుల్లెట్స్ తగిలిన ఏమీ అవడం లేదు ఏమిటి అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంది  పూజ.

**************

నారదుడి వైపు ఆశ్చర్యంగా చూస్తూ తన పక్కన ఉన్న యోధ భుజం మీద కొట్టి "ఒకసారి స్వామీజీని చూడు." అని కంగారుగా పిలిచింది పూజా.

"నువ్వు ముందు తల కిందకి ఉంచు లేకపోతే పుచ్చకాయ లాగా పగిలిపోతుంది." అని చెప్పి టెర్రరిస్ట్ లని షూట్ చేస్తూ ముందుకు వెళ్లడు యోధ.

పూజా దగ్గరకు వెళ్లి "ఏంటి బాలికా! ఎందుకు కంగారు పడుతున్నవు?" అని అడిగాడు నారదుడు.

"మీ బాడీకి బుల్లెట్ తగిలిన ఏమీ అవ్వడం లేదు ఏమిటి?" అని విచిత్రంగా చూస్తూ అడిగింది పూజా.

"ఆ విషయం గురించి తరువాత చెప్తానుగాని ముందు నీ దగ్గర ఉన్న ఆయుధంతో యుద్ధం చెయ్యి!" అని చెప్పాడు నారదుడు.

"నేను ట్రై చేస్తూనే ఉన్నాను స్వామి! ఈ గన్ పనిచేయడం లేదు." అని తన ముందు ఉన్న రాయికి వేసి కొడుతూ ఉంది పూజా.

"ఒక్కసారి ఇటు ఇవ్వు నేను చూస్తాను." అని పూజ చేతిలో గన్ తీసుకుని కమండలంలో నీళ్లతో కడిగి "ఇప్పుడు ప్రయత్నించు!" అని ఇచ్చాడు నారదుడు.

"సరే!" అని గన్ తీసుకుని తనకి కొంచెం దూరంలో ఉన్న టెర్రరిస్ట్ చూసి కళ్ళు మూసుకుని షూట్ చేస్తూ ఉంది పూజా.

అది చూసి "ఇప్పుడు బాగా పని చేస్తుంది అలాగే ముందుకు నడువు నీకు తోడుగా నేను ఉంటాను." అని చెప్పాడు నారదుడు.

గన్ లోనుంచి బుల్లెట్స్ నాన్ స్టాప్ వస్తూ అక్కడ ఉన్న టెర్రరిస్టులకి తగులుతు ఉండగా నారదుడితో కలిసి నడుస్తూ ముందుకు వెళుతూ ఉంది పూజా.

అది చూసి "ఏకవీర! మేడం చేతిలో ఉన్న గన్ లో 12 బుల్లెట్లు ఉంటాయి మరి అన్ని బుల్లెట్స్ బయటికి వస్తున్నాయి ఏంటి?" అని డౌట్ గా అడిగాడు పుష్కర్.

"కరెక్టే కదా! మనం కూడా పూజ మేడం వాళ్ళ వెనకాల వెళదాము పద!" అని నారదుడు వెనక్కి వచ్చారు ఇద్దరు.

అక్కడి నుంచి పరుగెడుతున్న టెర్రరిస్టులను చూసి "ఒక్కడు కూడా తప్పించుకో కూడదు రౌండ్ అప్ వేయండి." అని రాఖి వాళ్ళతో చెప్పాడు యోధ.

అంతలో ఆగకుండా బుల్లెట్స్ రావడం చూసి "ak47 తో ఎవరు ఫైర్ చేస్తున్నారు? అందరూ ఇక్కడే ఉన్నాం కదా!" అని డౌట్ గా అడిగింది సుహా.

గన్ పట్టుకుని కళ్ళు మూసుకుని ముందుకు వస్తున్న పూజని ఆశ్చర్యంగా చూస్తూ "ముందు తనని ఆపండి మనల్ని కూడా షూట్ చేసేటట్లు ఉంది." అని కంగారుగా చెప్పాడు వర్ధన్.

పారిపోతున్న టెర్రరిస్టులు వైపు యోధ వాళ్ళు పరిగెట్టడంతో పూజా దగ్గరికి వెళ్లి గట్టిగా పట్టుకుని ఊపుతూ "ఏమైందే నీకు? అయిన పిస్టల్ నుంచి అన్ని బుల్లెట్స్ ఎలా వస్తున్నాయి?" అని డౌట్ గా అడిగింది దీప్తి.

ఆ మాటకి కళ్ళు తెరిచి చూస్తూ "అదంతా స్వామీజీ మహత్యం! కమండలంలో నీళ్లతో గన్ ని కడిగి ఇచ్చారు అంతే నాన్ స్టాప్ గా బుల్లెట్స్ వస్తున్నాయి." అని ఆనందంగా  ఏగురుతు చెప్పింది పూజా.

ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ "సరే పద!" అని చెయ్యి పట్టుకుని యోధ వాళ్ళ వెనకాల పరిగెత్తింది దీప్తి.

అక్కడినుంచి పరిగెడుతూ కింద పడి ఉన్న టెర్రరిస్టుల వైపు చూసి "వీళ్ళందర్నీ నేనే చంపానా..?" అని అడిగింది పూజా.

"నీ బొంద! నువ్వు షూట్ చేసినా బుల్లెట్స్ టెర్రరిస్టులకు తగల్లేదు వాళ్ళ దగ్గర ఉన్న బాంబులకి తగిలి పేలిపోయాయి.

దాంతో భయపడి ఇక్కడి నుంచి పారిపోయారు వాళ్ళ వెనకాల యోధ వాళ్ళు వెళ్లారు." అని చెప్పింది దీప్తి.

పూజ వాళ్లతో పాటు వెళ్ళుతు "హమ్మా! నాకు ఆయాసంగా ఉంది కాసేపు ఆగండి." అని అక్కడ ఉన్న ఒక కొండ దగ్గర కూర్చున్నాడు నారదుడు.

వెనక్కి వస్తూ దీప్తి వాళ్ళ వైపు చూసి " ఇక్కడే ఆగండి టెర్రరిస్టులు అందరూ పోయారు వాళ్ళ దగ్గర ఏమైనా ఉన్నాయేమోనని యోధ చెక్ చేస్తున్నాడు వాళ్లు కూడా ఇటువైపే వస్తారు ." అని చెప్పింది నీతూ.

"సరే!" అని దీప్తితో పాటు వెళ్లి నారదుడు పక్కనే కూర్చుని "స్వామి! మీ కమండలంలో వాటర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారో చెప్పండి వెళ్లేటప్పుడు తీసుకువెళ్లి మా మిలిటరీ కి ఇస్తాము." అని అడిగింది పూజా.

"సరే సరే! బాగా మంచు కురుస్తుంది అక్కడ గుహ ఉంది కదా లోపలికి వెళ్ళండి. నేను వెళ్లి మిగతా వాళ్ళని తీసుకు వస్తాను." అని చెప్పాడు నారదుడు.

"సరే స్వామి!" అని గుహ దగ్గరికి వెళ్లారు దీప్తి వాళ్ళు.

ఒక టెర్రరిస్ట్ ని యోధ ప్రాణాలతో పట్టుకోవడంతో లాప్టాప్ లో ఫేస్ ఐడెంటిఫై చేసి "వీడి పేరు ముస్తఫా! ఇండియాకి చెందిన వాడే!" అని చెప్పింది సుహా.

"మన దేశానికి బయట వాళ్లతో ప్రమాదం కాన్న లోపల ఉన్న వాళ్ళతోనే ఎక్కువ ప్రమాదం!" అని ముస్తఫా జుట్టు పట్టుకుని పైకి లేపి "మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు?" అని మొహం మీద ఒక్క గుద్దు గుద్దాడు యోధ.

ఆ దెబ్బకి రక్తంతో పాటు నోట్లో పళ్ళు కుడా ఊడి పడడంతో యోధవైపు భయంగా చూస్తూ

"మమ్మల్ని అందరినీ ల్యాబ్ దగ్గరికి తీసుకు వెళుతున్నారు అక్కడ మా బాడీలోకి ఏదో మెడిసిన్ పంపిస్తారంట! దాంతో మేము సూపర్ హీరోస్ అవుతాము బుల్లెట్స్ తగిలిన ఏమి అవ్వదు అన్నారు." అని కింద పడ్డ తన పళ్ళని చూసుకుని ఏడుస్తూ చెప్పాడు ముస్తఫా.

అక్కడికి వస్తూ "నారాయణ నారాయణ! వీళ్ళని రాక్షసులుగా తయారు చేసి మీ దగ్గర ఉన్న పద్మం సహాయంతో అలకాపురి నగరానికి చేరుకుని కైవసం చేసుకోవాలని రేపాలా ఎదురుచూస్తున్నాడు." అని చెప్పాడు నారదుడు.

ఆ మాట విని "అలకాపురి నగరాన్ని కైవసం చేసుకోవడమా అక్కడ అడుగుపెట్టడానికి కూడా వీళ్ళకి అర్హత లేదు." అని ముస్తఫా మేడని వెనక్కి తిప్పాడు యోధ.

ముస్తఫా చనిపోవడం చూసి "అల్ క్లియర్! ఇంక ల్యాబ్ దగ్గరికి వెళదాము." అని వెనక్కి చూసి  "మిగతా వాళ్ళందరూ ఏమైపోయారు?" అని అడిగాడు రాఖి.

"అక్కడ ఒక పురాతనమైన గుహ కనబడితే చూస్తాము అన్నారు వెళ్ళమన్నాను మీరు కూడా వచ్చి చూడండి." అని చెప్పాడు నారదుడు.

**********

ల్యాబ్ లో గదిలో భూషణ్ వైపు చూసి "శిమిరా సంహారం పూర్తి అయ్యింది. అలకాపురి మీద దండెత్తడానికి వస్తున్న సైన్యం కుడా అంతం అయ్యారు.

ఇప్పుడు నారదుల వారు యోధ ని చేర్చవలసిన చోటికి చేరుస్తున్నారు ఇక అసలైన యుద్ధం మొదలవుతుంది." అని చెప్పాడు నంద.

అక్కడికి వస్తూ "మనం ఇక్కడ నుంచి బయల్దేరే సమయం వచ్చింది. రేపాలా పూజ మొదలుపెట్టాడు ఈ ప్రదేశం చుట్టూ బంధనం వెయ్యబోతున్నాడు దేవత శక్తి ఇక్కడ ఉండలేదు." అని చెప్పాడు ధర్మ.

ఆ మాట విని "అయితే! ఇక్కడ భూషణ్ ఒక్కడు మాత్రమే ఉండగలడు." అని చెప్పి భూషణ్ వైపు చూస్తూ "గబ్బర్ ని జాగ్రత్తగా చూసుకో!' అని చెప్పాడు నంద.

"సరే! రేపాలా శక్తి పెరగకముందే యోధ ని ఇక్కడికి పంపించండి మళ్ళీ ఆలాకాపూరి దగ్గర కలుసుకుందాము." అని చెప్పాడు భూషణ్.

"గురక పెట్టి నిద్రపోతున్న గబ్బర్ వైపు చూసి నవ్వుతూ అక్కడ నుంచి అదృశ్యమయ్యారు నంద, క్యూబ్ లు.

గబ్బర్ చేతిలో ఉన్న కర్ర, సూట్ కేసులో నుంచి శక్తిని తీసుకుని అక్కడి నుంచి అదృశ్యం అయ్యారు ధర్మ గుప్తాలు.

నిద్రపోతున్న గబ్బర్ వైపు చూసి "ఈ ప్రదేశం మొత్తం ఒకసారి చూసి వద్దాము." అని అక్కడి నుంచి బయటికి వెళ్లాడు భూషణ్.

*********

నారదుడితోపాటు గుహ దగ్గరికి వెళ్లి లోపల ఉన్న దీప్తి వాళ్ళను చూసి " త్వరగా రండి స్టార్ట్ అవుదాము." అని పిలిచాడు యోధ.

ఆ మాట విని బయటికి చూసి "యోధ! ఒకసారి లోపలికి రా.. ఇక్కడ గోడల మీద  చాలా పెయింటింగ్స్ ఉన్నాయి చూడడానికి చాలా విచిత్రంగా ఉంది." అని చెప్పింది దీప్తి.

ఆ మాట విని నారదుడి వైపు చూసి "స్వామి! ఈ గుహ గురించి మీకు ఏమైనా తెలుసా?" అని అడిగాడు యోధ.

"ఈ గుహ లోపల కలికాలంలో జరిగే కొన్ని సంఘటనలను దేవతలు చిత్రీకరించారు అని చెబుతారు, ఒకసారి లోపలికి వెళ్లి చూడండి మీకేమైనా అర్థమవుతుంది ఏమో!" అని చెప్పాడు నారదుడు.

గుహ లోపలికి వెళ్లి టార్చ్ లైట్స్ ఆన్ చేసి అక్కడ ఉన్న పెయింటింగ్స్ చూస్తూ ఉన్నారు అందరూ.

"ఒకసారి  అందరు ఇక్కడ చూడండి ఈ పెయింటింగ్ లో ఉన్న మనిషి ఛాతి మీద సేమ్ యోధ కి ఉన్నట్లు సింబల్ ఉంది ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి." అని చెప్పింది దీప్తి.

ఆ మాట వి పెయింటింగ్ దగ్గరికి వెళ్లి చూస్తూ తన చాతి మీద ఉన్న సింబల్ చూసుకుని "ఎస్! ఈ గోడల మీద ఉన్న పెయింటింగ్స్ మొత్తం చూడండి." అని చెప్పాడు యోధ.

"మనం చంపిన శిమిరా పెయింటింగ్ కూడా ఈ గోడ మీద ఉంది.' అని ఆశ్చర్యంగా చూస్తూ చెప్పింది పూజా.

"ఇక్కడ చాలా చీకటిగా ఉంది లైటింగ్  ఉంటే మనకి ఇంకా క్లియర్ గా కనబడుతుంది." అని చెప్పింది సుహా.

ఆ మాట విని "బాగా చలిగా ఉంది కదా నుప్పు రాచేసి మంట వెయ్యండి వేడి వస్తుంది. వెలుతురు వస్తుంది." అని చెప్పాడు నారదుడు.

"సరే!" అని మంట వేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉండగా దీప్తి దగ్గరికి వెళ్లి "అసలు ఈ స్వామీజీ ఎవరు? మనకి యూజ్ అయ్యే ప్రతి ప్లేస్ కి తీసుకొస్తున్నారు." అని డౌట్ గా అడిగింది నీతూ.

"మనం వచ్చేటప్పుడు డాడ్ ఒక మాట చెప్పారు గుర్తుందా..? మీరు దైవ కార్యక్రమం మీద వెళుతున్నారు  ఆ దైవమే మీకు సహాయం చేస్తుంది అన్నారు అదే జరుగుతుంది అనుకుంట!" అని చెప్పింది దీప్తి.

"అంటే! ఈ స్వామీజీ దేవుడా..?" అని ఆశ్చర్యంగా చూస్తూ  అడిగింది నీతూ.

అక్కడికి వస్తూ "ఎస్! ఆయన దేవుడే! బుల్లెట్స్ తగిలిన  ఏమీ కాలేదు నేను చూశాను." అని చెప్పింది పూజా.

అంతలో పుష్కర్ వాళ్ళు మంట వెలిగించడంతో లోపల ఉన్న పెయింట్స్ మెరుస్తూ కనిపించడం ఆశ్చర్యంగా చూస్తూ "అప్పట్లోనే ఇంత టెక్నాలజీతో పెయింట్స్ వేశారా..?" అని విచిత్రంగా చూస్తూ చెప్పింది సుహా.

అక్కడ ఉన్న పెయింట్స్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ "ఇప్పుటి వరకు మనకు జరిగింది మొత్తం ఇక్కడ క్లియర్ గా ఉంది. అంతేకాదు జరగబోయేది కూడా ఉంది." అని  చెప్పింది దీప్తి.




" రుద్రం భజే! ఎపిసోడ్ 49 " రచనకు రేటింగ్ ఇవ్వండి
[+] 9 users Like SivaSai's post
Like Reply
రుద్రం భజే ?
[+] 1 user Likes Sunny73's post
Like Reply
As usual ga chinch padesav bro
[+] 1 user Likes styleraja's post
Like Reply
Great going...
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Excellent update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
రుద్రం భజే? ఎపిసోడ్ 50




[Image: cover?seriesId=1269749&version=025903d2-...3a476c64b6]


రేపాలా పూజ మొదలుపెట్టడంతో అక్కడి నుంచి దేవత శక్తి ఉన్న నంద వాళ్ళందరూ వెళ్లిపోయారు.

నారదుడు చూపించిన గుహలోకి వెళ్లి పెయింటింగ్స్ చూస్తూ ఇప్పటివరకు జరిగింది ముందు జరగబోయేది ఇక్కడ ఉంది అని చెప్పింది దీప్తి.

*************

గోడల మీద ఉన్న పెయింట్స్ చూస్తూ "ఇక్కడ ఉన్న బొమ్మలని బట్టి  మనం వెళ్లే ప్లేస్ లో చాలా పెద్ద ఫైటింగ్ జరుగుతుంది అనిపిస్తుంది. దీంట్లో మనం ఫేస్ చేసే వాళ్ళు ఎవరు మనుషుల్లాగా కనిపించడం లేదు." అని చెప్పింది నీతూ.

"కరెక్టే! కానీ ఈ పెయింటింగ్స్ చూస్తుంటే అర్థమవుతున్నట్లే ఉంది కానీ ఏమీ అర్థం కావడం లేదు." అని అయోమయంగా చూస్తూ చెప్పింది దీప్తి.

ఆ మాటకి అక్కడ ఉన్న నారాదుడు వైపు చూసి "స్వామి! ఈ పెయింటింగ్స్ చూసి మీరు ఏమైనా చెప్పగలరా..?" అని అడిగాడు యోధ.

ఆ మాటకి నవ్వుతూ "ఇది కలికాలం కలిపురుషుడు రాజ్యమేలుతూ ఉంటాడు మనిషిలో ఉన్న రాక్షస గుణాన్ని బయటకు తీస్తాడు, అలా కలి చేతిలో కీలుబొమ్మలుగా మారిన కొంతమంది మనుషులు చేసే వికృతి చేష్టలవల్ల ప్రకృతి విలయతాండవం చేస్తుంది.

అలా జరగకుండా ఉండాలి అంటే రాక్షసులుగా మారిన మనుషులని ఆదిలోనే అంతం చేయాలి, రేపాలా లాంటి మూర్ఖులని తుదముట్టించాలి లేనిపక్షంలో జరిగే అనర్ధాలు చాలా విపరీతంగా ఉంటాయి.

అంతు తెలియని రోగాలు ప్రపంచాన్ని చుట్టుముడతాయి ఈ భూమి మీద గాలి కూడా కలుషితం అవుతుంది ఇప్పుడు నీరు కొనుక్కొని తాగుతున్నారు అప్పుడు గాలి కూడా కొనుక్కునే పరిస్థితి వస్తుంది.

అధికారం డబ్బు కోసం కాకుండా ఆహారం కోసం దేశాల మధ్య యుద్ధాలు జరుగుతాయి ఆ మంటలలో కొంతమంది చలికాచుకుంటారు." అని చెప్పాడు నారదుడు.

"స్వామి! మరి ఇంత జరుగుతుంటే దేవుడు చూస్తూ ఊరుకుంటాడా వాళ్ళని ఆపలేడా..?" అని అడిగింది దీప్తి.

"ప్రతి మనిషిలో మంచి చెడు లాగా దైవత్వం రాక్షసత్వం రెండు ఉంటాయి పరిస్థితులను బట్టి అవి బయటకు వస్తాయి,

మనసుని, కోరికలని అదుపులో ఉంచుకునేవాడు దేవుడు అవుతాడు అదుపులో ఉంచుకోలేని వాడు రాక్షసుడు అవుతాడు. దేవుడు ఎక్కడో ఉండడు మనిషి రూపంలోనే ఉంటాడు." అని చెప్పాడు నారదుడు.

"అంటే! మేము దేవుళ్లమా..? ఆ రాక్షసులని ఆపగలమా..?" అని అడిగాడు రాఖి.

"మనిషి తలుచుకుంటే చేయలేనిదేముంది మీలో ఉన్న దైవం మీకు తోడుగా ఉంటుంది ఎటువంటి శక్తినైనా మీరు ఎదిరించగలరు ఆ విషయమే ఇక్కడ ఉన్న చిత్రాలలో ఉంది సరిగ్గా చూడండి.

ఆ దైవం మీకు దారి చూపించగలదు అంతే సాధించాల్సింది మాత్రం మీరే! కొన్ని కోట్ల మంది జీవితం ఇప్పుడు మీ చేతుల్లో ఉన్నాయి గుర్తుంచుకొని పోరాడండి చెడుని నాశనం చేయండి." అని చెప్పాడు నారదుడు.

"స్వామీజీ చెప్పింది నిజం" దేవుడు వస్తాడు కాపాడుతాడు అని చూస్తూ కూర్చోకూడదు మన ప్రయత్నం మనం చేయాలి ఆ రాక్షసులను సృష్టించింది కూడా మనిషేకదా!

సృష్టించిన వాడికి నాశనం చేయడం కూడా వచ్చు ఆ పని మనం చేద్దాము, పోతే మన 10 మంది ప్రాణాలు తిరిగి వస్తే కొన్ని కోట్ల మంది జీవితాలు చివరి శ్వాస వరకు పోరాడదాము పదండి. " అని చెప్పాడు యోధ.

"కరెక్ట్! మనం పుట్టినందుకు ఏదో ఒకటి సాధించాలి నా ఒంట్లో చివరి శ్వాస ఉన్నంతవరకు పోరాడుతూనే ఉంటాను." అని చెప్పాడు వర్ధన్.

"మీకు ఆ దైవం అండగా ఉంటుంది విజయోస్తు! నాతోపాటు వస్తే ల్యాబ్ దగ్గరకు తీసుకువెళ్తాను." అని చెప్పాడు నారదుడు.

దీప్తి దగ్గర ఫోన్ తీసుకుని నాయక్ కాల్ చేసి "జైహింద్ సార్! మీకు శాటిలైట్ లో కనిపించిన టెర్రరిస్టులు అందరూ చనిపోయారు ఫైనల్ బ్యాటిల్ కి రెడీ అయ్యాము నాతో పాటు వచ్చిన అందరిని వెనక్కి పంపిస్తాను." అని చెప్పాడు యోధ.

"నువ్వు కూడా తిరిగి వస్తావు ఆ నమ్మకం నాకు ఉంది ఇప్పుడు నీకు ఫుల్ పర్మిషన్ ఇస్తున్నాను అక్కడ ఎవ్వడు బతికి ఉండకూడదు." అని చెప్పాడు నాయక్.

"ఎస్ సార్!" అని చెప్పి ఫోన్ పెట్టేసి నారదుడు వెనకాల ల్యాబ్ దగ్గరికి బయలుదేరాడు యోధ.

************

ల్యాబ్ లో ఇంజక్షన్స్ రెడీ చేస్తూ సయ్యద్ వైపు చూసి "నీ మనుషులు ఎక్కడ ఇంకా రాలేదు?" అని అడిగాడు కళింగ.

"ఈ టైమ్ కి ఇక్కడకు వచ్చేయాలి కచ్చితంగా వస్తారు నువ్వు మెడిసిన్ రెడీ చెయ్!" అని చెప్పాడు సయ్యద్.

అక్కడకి వస్తూ "నా పూజ పూర్తయింది ఈ ప్రదేశంలోకి ఎటువంటి దైవ శక్తి ఇంకా అడుగుపెట్టలేదు, ఆ గబ్బర్ దగ్గర ఉన్న వస్తువులు తీసుకోండి ఇప్పుడు ఏ శక్తి అతనికి అండగా ఉంటుందో  చూద్దాము." అని చెప్పాడు రేపాలా.

ఫోన్ మాట్లాడుతూ అక్కడికి వచ్చి "ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది  ల్యాబ్ దగ్గరికి వస్తున్న సయ్యద్ మనుషుల్ని చంపేశారు  వాళ్లు కచ్చితంగా మన ల్యాబ్ దగ్గరికి వస్తారు." అని చెప్పాడు చింగ్ యా.

"ల్యాబ్ దగ్గరికి వచ్చిన వాళ్లు ఎవరూ ప్రాణాలతో బయటికి వెళ్లారు." అని అక్కడ ఉన్న బ్లూ కలర్ బటన్ ప్రెస్ చేశాడు కళింగ.

ల్యాబ్ కింద ఉన్న అండర్ గ్రౌండ్ గేట్ ఓపెన్ అవడంతో దాంట్లో నుంచి మనుషులు బయటికి రావడం చూసి "వీళ్ళందరూ చాలా వింతగా నడుస్తున్నారు నువ్వు కనిపెట్టిన మెడిసిన్ ఇంజెక్ట్ చేసావా..?" అని అడిగాడు చింగ్ యా.

"అవును! ఒక్కొక్కడు పదిమంది సోల్జర్స్ తో సమానం బుల్లెట్స్ కి కూడా వాళ్ళు చావరు ఒంట్లో నుంచి రక్తం బయటకు వస్తే శక్తి మరింత పెరుగుతుంది.

అంతేకాదు వాళ్ళ మైండ్ మొత్తం నా కంట్రోల్ లోనే ఉంటుంది నేను ఏది చెప్తే అది చేస్తారు." అని నవ్వుతూ చెప్పాడు కళింగ.

"ఒకవేళ! వాళ్ళని కూడా దాటుకుని ఆ సోల్జర్స్ లోపలికి వస్తే తోడేళ్లు ఒక్కొక్కరిని చీల్చి చెండాడుతాయి." అని కసిగా చూస్తూ చెప్పాడు సయ్యద్.

"ఆ తోడేళ్లని కూడా దాటగలిగితే హిడిచి నీ ఎదుర్కోవాలి అది ఎవరి తరం కాదు." అని చెప్పాడు రేపాలా.

"సయ్యద్" నువ్వు వెళ్లి ఆ గబ్బర్ ని తీసుకురా ఆ పద్మం నుంచి అలకాపురి నగరం దగ్గరికి వెళదాము." అని చెప్పాడు రేపాలా.

"మరి అక్కడ మనకి తోడుగా ఎవరు ఉంటారు? సయ్యద్ మనుషులు రాలేదు కదా!" అని అనుమానంగా అడిగాడు చింగ్ యా.

"మన దగ్గర ఇండియన్ సోల్జర్స్ 12 మంది ఉన్నారు కదా వాళ్ళని మనకి సెక్యూరిటీగా తయారు చేస్తాను అవసరం అయితే రేపాలా తన పూర్వీకులను నిద్ర లేపుతాడు." అని చెప్పాడు కళింగ.

"అది ఆఖరి అస్త్రం మన ప్రాణాల మీదకి వచ్చింది అంటేనే దానిని ఉపయోగించాలి వాళ్లతో రాబోయే కాలంలో చాలా పని ఉంది." అని చెప్పాడు రేపాలా.

"సరే! నేను వెళ్లి ఆ పద్మన్ని తీసుకువస్తాను." అని రూమ్ లోకి వెళ్లి గురక పెట్టి నిద్రపోతున్న గబ్బర్ ని చూసి దగ్గరకు వెళ్లి

"సార్! రెస్ట్ తీసుకుంటున్నారా..? మనం డీల్ మాట్లాడుకుందాము అన్నారు." అంటూ చుట్టూ చూసి "యంగ్ భూపాల్ సింగ్ ఎటు పోయారు." అని కంగారుగా బయటికి వచ్చి "సైంటిస్ట్! లోపల యంగ్ లేడు." అని చెప్పాడు సయ్యద్.

"ఈ ల్యాబ్ లో నుంచి ఎక్కడికి పోతాడు సరిగ్గా చూడు ఏ రూమ్ లోనే ఉంటాడు." అని చెప్పాడు చింగ్ యా.

ఆ మాట విని లోపల ఉన్న రూమ్స్ మొత్తం చెక్ చేసి "ఎక్కడ లేడు  ఈ గబ్బర్ తన శక్తితో యంగ్ ని ఎక్కడో దాచాడు." అని చెప్పాడు సయ్యద్.

"అవునా? ముందు వాడిని నిద్ర లేపు ఆ గురక సౌండ్ వింటేనే ఇరిటేషన్ వస్తుంది." అని కోపంగా చూస్తూ చెప్పాడు కళింగ.

ఆ మాట విని గ్లాస్ తో నీళ్లు తెచ్చి గబ్బర్ మోహనా కొట్టేడు చింగ్ యా.

నీళ్లు పడడంతో ఉలిక్కిపడి లేచి ఎదురుగా ఉన్న రేపాలా  వాళ్ళని చికాకు చూస్తూ "ఏంట్రా! పిచ్చిపిచ్చి వేషాలు వేస్తున్నారు నాకు కోపం వస్తే అందరిని మడతపెట్టి సంకలో పెట్టుకుని వెళ్ళిపోతాను." అని అక్కడ ఉన్న చింగ్ యా వైపు చూసి

"వీడెవాడు ఇక్కడ గుర్కా నా..? నా వైపు అదోలా చూస్తున్నాడు ఎందుకు, అయ్యినా వీడిని నా రూమ్ లోకి ఎందుకు తీసుకువచ్చారు?" అని కోపంగా అడిగాడు గబ్బర్.

ఆ మాట విని కోపంగా చూస్తూ "ఏంటి! నన్ను గుర్కా అంటావా..?" అని అడిగాడు చింగ్ యా.

"సరే కానీ!  మనం డీల్ మాట్లాడుకుందాం అనుకున్నాము కదా యంగ్ ఎక్కడ?" అని అడిగాడు కళింగ.

ఆ మాటకి చుట్టూ చూస్తూ "నాకు మాత్రం ఏం తెలుసు ఇప్పటి దాకా ఇక్కడే ఉన్నారు కదా! గాలి పీల్చుకోవడానికి బయటకి వెళ్ళారేమో వస్తారు." అని చెప్పాడు గబ్బర్.

రేపాలా సైగ చేయడం చూసి గబ్బర్ పక్కన ఉన్న సూట్ కేస్ తీసుకుని ఓపెన్ చేసి "సైంటిస్ట్! దింట్లో చిత్తు కాగితాలు ఉన్నాయి వీడు మనల్ని మోసం చేస్తున్నాడు." అని కోపంగా చూస్తూ చెప్పాడు సయ్యద్.

ఆ మాట విని కోపంగా చూస్తూ గన్ తీసి గబ్బర్ నెత్తి మీద పెట్టి "ఆ వస్తువు ఎక్కడ? యంగ్ ఏం చేసావు?" అని అడిగాడు చింగ్ యా.

"నేను మిమ్మల్ని మోసం చేయడం కాదు నన్ను అందరూ కలిసి మోసం చేశారు, కావాలంటే ఈ యామపాశం ఉంచుకొని నన్ను వదిలేయండి." అని కర్ర ని చింగ్ యా చేతికి ఇచ్చాడు గబ్బర్.

ఆ కర్రని తీసుకొని రెండు ముక్కలు చేసి గిరాటు వేసి "నేను చెబుతూనే ఉన్నావు కదా! వీడికి ఏదో శక్తీ సహాయం చేసింది." అని గబ్బర్ వైపు కోపంగా చూస్తూ.

"నన్ను ఒరేయ్ రేపాలా అని పిలుస్తావా? కుక్క బిస్కెట్లు తినమంటావా..? ఇప్పుడు నీ సంగతి చెప్తాను హిడిచి వీడిని రెండు ముక్కలుగా చేసి తినేసేయ్!" అని చెప్పాడు రేపాలా.

ఆ మాట విని కంగారుగా చూస్తూ "నన్ను తినడం ఏమిట్రా మిమ్మల్ని తగలెయ్య!" అని ఏడుస్తూ "మిమ్మల్ని అని ఉపయోగం లేదు మా తాతని అనాలి నాకి ఈ శక్తి ఇవ్వడం వల్లే ఇది అంతా జరిగింది." అని  ఏడుస్తూ చెప్పాడు గబ్బర్.

"రేపాలా! వీడిని చంపకు ఆ సోల్జర్స్ తో పాటు ఉంచండి వీడి ఒంట్లో వైరస్ డబల్ డోస్ ఎక్కిస్తాను." అని కోపంగా చూస్తూ చెప్పాడు కళింగ.

"సరే సైంటిస్ట్!' అని గబ్బర్ ని తీసుకువెళ్లి సోల్జర్స్ ఉన్న రూమ్లో ఉంచాడు సయ్యద్.

అక్కడ స్పృహ లేకుండా ఉన్న సోల్జర్స్ ని చూసి "మహారాజా! నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయరు, ఒకడు రెండు ముక్కలు చేసుకుని తినేస్తాను అంటున్నాడు.

ఒకడు వైరస్ ని డబల్ డోరస్ ఎక్కిస్తాను అంటున్నాడు ఆఖరికి గుర్కా కూడా నా వైపు కోపంగా చూస్తున్నాడు." అని దిగాలుగా కూర్చున్నాడు గబ్బర్ సింగ్.




" రుద్రం భజే? ఎపిసోడ్ 50 " రచనకు రేటింగ్ ఇవ్వండి
[+] 6 users Like SivaSai's post
Like Reply
రుద్రం భజే! ఎపిసోడ్ 51




[Image: cover?seriesId=1269749&version=025903d2-...3a476c64b6]

గుహలో పెయింటింగ్స్ చూసి జరగబోయేది ఎలా ఉంటుందో తెలుసుకుని నారదుడి తో కలిసి ల్యాబ్ దగ్గరికి బయలుదేరారు యోధ వాళ్ళు

గబ్బర్ సింగ్ కి పవర్ లేదు అని తెలియడంతో తీసుకువెళ్లి సోల్జర్స్ ఉన్న రూమ్లో బంధించాడు సయ్యద్.

***********

చీకటి గదిలో ఏడుస్తూ ఉండగా "గబ్బర్ బాధ పడుతున్నావా..?" అని మాట వినిపించి "మహారాజా వచ్చారా..! నా పరిస్థితి చూడండి." అని చుట్టూ చూస్తూ చెప్పాడు గబ్బర్.

"చీకటి గదిలో పది నిమిషాలు ఉన్నందుకే ఇంత బాధపడుతున్నావు ఆ సోల్జర్స్ ఎన్ని రోజులుగా ఉంటున్నారు వాళ్ల గురించి ఆలోచించవా..?" అని అడిగాడు భూషణ్.

"మహారాజా నా పరిస్థితే బాలేదు నేను ఆ సోల్జర్స్ ని ఎలా కాపాడగలను,అయ్యినా ఈ చీకటి గదిలో ఏమి కనబడడం లేదు, మీరు కూడా నాకు కనబడడం లేదు." అని చెప్పాడు గబ్బర్.

"ఎదుటివాళ్లకి మంచి చేయాలి అని నీ మనసులో అనుకో చీకటిని చీల్చుకుని వెలుతురు వస్తుంది." అని చెప్పాడు భూషణ్.

"సరే మహారాజా!" అని చెప్పి తలుపు మధ్యలో నుంచి వెలుతురు పడడం చూసి అక్కడి నుంచి బయటికి చూసి యోధ కత్తి పట్టుకుని ఉండడం కనిపించి "మా సార్ వచ్చేసారు ఇంకా అందరూ పని అయిపోయింది." అని సంతోషం గా తలుపు మీద మ్యూజిక్ వాయిస్తూ ఉన్నాడు గబ్బర్.

"ఆగు ఆగు కంగారు పడకు నువ్వు ఒక్కడివే ప్రాణాలతో ఇక్కడి నుంచి వెళితే సరిపోతుందా..?" అని అడిగాడు భూషణ్.

"నాతో పాటు సోల్జర్స్ ని కూడా తీసుకువెళతాను మహారాజ!' అని అక్కడ ఉన్న వాళ్ళ కట్లు విప్పుతూ ఉన్నాడు గబ్బర్.

*************

అంతలో నారదుడి తో పాటు అక్కడికి వచ్చి ల్యాబ్ కనిపించడంతో "స్వామి! మీరు చెప్పిన రాక్షసులందరూ ఇక్కడే ఉంటారు కదా!" అని అడిగాడు యోధ.

"అవును" ఒక్కరు కూడా పొల్లు పోకుండా ఇక్కడే ఉంటారు. " అని చెప్పాడు యోధ.

అక్కడినుంచి బైనో క్లోర్ లో చూస్తూ "యోధ! ముష్రుని చంపడానికి ఎవరో వెంటపడుతున్నారు, మనవాళ్లు దొరికిపోయినట్లున్నారు." అని చెప్పింది సుహా.

"ఈ ల్యాబ్ దగ్గర్నుంచి బయటకు వెళ్లే వరకు రూల్స్ మర్చిపోండి." అని చెప్పి అక్కడి నుంచి ముందుకి దూకాడు యోధ.

తన వెనకాల పడుతున్న కళింగ తయారు చేసిన మనుషుల్ని తప్పించుకుంటూ వచ్చి ఈ యోధ కి తగిలి ఆగి "సార్! ప్లీజ్ హెల్ప్ మీ వీళ్ళు మనుషులు కాదు రాక్షసులు!" అని భయంగా చూస్తూ చెప్పాడు ముష్రు.

తన మీదకి వస్తున్న వాడని చేతిలో గన్ తీసి తల మీద షూట్ చేసి చావకుండా ముందుకు రావడం చూసి "గాయ్స్! వీళ్ళకి బుల్లెట్స్ తో పనిలేదు." అని తన వెనకాల ఉన్న కత్తిని తీసి గాలిలో తిప్పుతూ దగ్గరికి వస్తున్న వాడి తల నరికాడు యోధ.

తల ఈ ఎగిరి వెళ్లి చింగ్ యా కాళ్ళ ముందు పడడంతో ఉలిక్కిపడి చూసి "ఇండియన్ మిలిటరీ వచ్చేసింది." అని కంగారుగా చెప్పాడు.

ఆ మాట విని లోపల ఉన్న రెండు బటన్స్ ప్రెస్ చేశాడు కళింగ.

రాక్షసులు లాగా వికృత రూపాలతో పరిగెత్తుకుంటూ వస్తున్న మనుషుల్ని చూసి "వీళ్ళని ఎలా చంపాలో పెయింటింగ్స్ లో చూశాం కదా! ఒక్క దెబ్బకి తల రెండు ముక్కలు అవ్వాలి!' అని చెప్పి తమ దగ్గరికి వచ్చిన ఇద్దరి తలలని ఒకే దెబ్బకి నరికేడు యోధ.

అది చూసి ఏకవీర, పుష్కర్ లని పిలిచి "మనకి అంత బలం లేదు కాబట్టి ముగ్గురం కలిసి ఒక్కొక్కడిని చంపుదాము, మీరిద్దరూ వచ్చేవాడిని గట్టిగా పట్టుకోండి నేను తల నరుకుతాను." అని చెప్పింది పూజా.

"ఓకే మేడం!" అని మీదకు వస్తున్న ఒక రాక్షసుడిని గట్టిగా పట్టుకుని "మేడం! తల నరకండి." అని అరుస్తూ ఉన్నాడు పుష్కర్.

"ఒక్క నిమిషం!" అని తన దగ్గర ఉన్న కత్తి తీసుకెళ్లి మెడ దగ్గర బలంగా కొట్టి "వీడు ముదిరిపోయిన బెండకాయ లాగా ఉన్నాడు తల తెగడం లేదు, ఇప్పుడు ఏం చేయాలి!" అని కంగారుగా చూస్తూ ఉంది పూజా.

అంతలో ఫాస్ట్ గా అక్కడికి వచ్చి పుష్కర్ వాళ్ళ చేతిలో ఉన్న వాడి తల నరికి "బ్యాగ్ లో బ్యారల్ గన్స్ ఉన్నాయి  తీసుకుని గురి చూసి చూసి తల మీద కాల్చండి దెబ్బకి ముక్కలు ముక్కలు అవుతుంది." అని చెప్పింది సుహా.

"ఈ ఐడియా బాగుంది." అని కత్తి అక్కడ పడేసి బ్యాగ్ దగ్గరికి పరిగెత్తింది పూజా.

ల్యాబ్ లో నుంచి చూస్తూ యోధ వైపు చూపించి "కళింగ! ఆ పద్మం అతని దగ్గరే ఉంది ఎలాగైనా కైవసం చేసుకోవాలి నీ మనుషులందరినీ ఒకేసారి పంపించు!" అని చెప్పాడు రేపాలా.

"సరే!" అని కంప్యూటర్ దగ్గరికి వెళ్లి ఆర్డర్స్ ఇస్తూ సయ్యద్ వైపు చూసి "సోల్జర్స్ ని తీసుకురా మెడిసిన్ ఇద్దాము." అని చెప్పాడు కళింగ.

"సరే సైంటిస్ట్!" అని చెప్పి సోల్జర్స్ ఉన్న రూమ్ దగ్గరికి బయలుదేరాడు సయ్యద్.

అక్కడ ఉన్న రాక్షసుడు లాంటి మనుషులందరూ యోధ వైపుకు వెళ్లడం చూసి "ఆ పద్మం యోధ దగ్గర ఉందని వాళ్ళు కనిపెట్టినట్లు ఉన్నారు అందుకే అందరూ ఒకేసారి తన ఎటాక్ చేస్తున్నారు." అని చెప్పింది  దీప్తి.

అంతలో అక్కడికి వచ్చి "మీ దగ్గర ఉన్న మరో పద్మాన్ని  బయటకు తీయండి." అని చెప్పాడు భూషణ్.

ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ బ్యాగ్ ఓపెన్ చేసి లోపల ఉన్న పద్మాన్ని చూసి యోధ వైపుకు వెళుతున్న వాళ్లకి చూపించింది పూజా.

పద్మం కనిపించడంతో అటువైపుకి పరిగెత్తుకుంటూ వస్తున్నా కళింగ మనుషుల తలలు నరుకుతూ ఉన్నారు రాఖీ వాళ్ళు.

పద్మాన్ని చూసి ఉరుకుతున్న కళింగ మనుషులని చూసి "పూజా! నీ చేతిలో ఉన్న పద్మాన్ని వాళ్లలో ఒకరి మీదకి గిరాటువేయ్!" అని చెప్పాడు యోధ.

"సరే!" అని తన చేతిలో ఉన్న పద్మాన్ని అక్కడ ఉన్న కళింగ మనిషి మీద విసిరింది పూజా.

తన ముందు పడ్డ పద్మం వైపు సంతోషంగా చూస్తూ తీసుకుని ల్యాబ్ లోపలికి పరుగెత్తాడు కళింగ మనిషి.

అది చూసి "సైంటిస్ట్! మనవాడు సాధించాడు పద్మం మన చేతికి వచ్చింది." అని సంతోషంగా చెప్పాడు చింగ్ యా.

ఆ పద్మాన్ని చూసి "నా కల నెరవేరే రోజు దగ్గర పడింది." అని తీసుకువెళ్లి  సూర్యకిరణాలు పడేటట్టు ఒక మిషన్ లో పెట్టి ఆన్ చేసాడు రేపాలా.

శాటిలైట్ ఫోన్ తీసి "సయ్యద్! త్వరగా సోల్జర్స్ ని తీసుకురా.. పద్మం మన చేతికి వచ్చింది." అని చెప్పాడు కళింగ.

ఆ మాట విని హడావిడిగా రూమ్ దగ్గరికి వెళ్లి తలుపు ఓపెన్ చేసి లోపల ఉన్న గబ్బర్ వైపు గన్ పెట్టి "పారిపోదాము అనుకుంటున్నావా..? నిన్ను ఒక కొత్త లోకానికి తీసుకు వెళ్తాను." అని నవ్వుతూ చెప్పాడు సయ్యద్.

అంతలో సయ్యద్ వెనకాలకు వచ్చి తల మీద చేతులు పెట్టి చూస్తూ "కొంచెం పక్కకి తప్పుకోండి సార్! నాకు కనపడదు మా తమ్ముడికి వినపడదు." అని చెప్పాడు లింగి.

ఆ మాట విని వెనక్కి తిరిగి అక్కడ ఉన్న ఇద్దరి వైపు చూసి "ఎవర్రా మీరు? ఇక్కడికి ఎలా వచ్చారు?" అని కోపంగా చూస్తూ అడిగాడు సయ్యద్.

ఆ మాటకి కర్రతో తడుముకుంటూ ముందుకు వచ్చి "ఏమో సార్ నాకు కనబడదు, మా తమ్ముడికి వినపడదు అలా నడుచుకుంటూ ఇక్కడికి వచ్చేసాము." అని చెప్పాడు లింగి.

ఇద్దరిని ఆశ్చర్యంగా చూస్తూ "ఒరేయ్! మీరు ఇక్కడికి ఎలా వచ్చారురా...!" అని నవ్వుతూ సయ్యద్ వైపు చూసి "నీకు కరెక్ట్ మొగుళ్ళు వీళ్ళిద్దరే! నువ్వు నిజంగా టెర్రరిస్టు వైతే వాళ్లని ఫేస్ చెయ్!" అని చెప్పాడు గబ్బర్.

ఆ మాట విని కోపంగా లింగు తల మీద గన్ పెట్టి "ఎవర్రా మీరు? ఇక్కడికి ఎవరు పంపించారు? చెప్పకపోతే కాల్చి పారదొబ్బుతాను." అని ఆవేశంగా అరుస్తూ చెప్పాడు సయ్యద్.

ఆ మాటకి తడుముకుంటూ సయ్యద్ చెయ్యి పట్టుకుని వెనక్కి తిప్పి గన్ తీసుకుని "మాట్లాడుతున్నను కదా సారు! అసలే నా తమ్ముడికి వినపడదు భయపడతాడు." అని చెప్పాడు లింగు.

చెయ్యి వెనక్కి విరవడంతో బాధతో అరుస్తూ "వాడికి వినపడదు కదరా మరి ఎలా భయపడతాడు?" అని అడిగాడు సయ్యద్.

"ఏమో సార్! నాకు కనపడదు." అని చెప్పాడు లింగి.

ఆ మాటకి కోపంతో అరుస్తూ "ఒరేయ్! ఇటు రండి వీళ్ళిద్దరిని చంపేయండి." అని చెయ్యి పట్టుకుని బాధగా అరుస్తూ చెప్పాడు  సయ్యద్.

ఆ మాట విని ఇద్దరు సయ్యద్ దగ్గరికి రావడంతో  "అన్నయ్య! వీళ్ళని చూస్తుంటే నాకు భయం వేస్తుంది." అని చెప్పి ఎగిరి ఒకడి భుజాల మీద కూర్చుని నెత్తి మీద మోచేత్తో ఒక్క దెబ్బ కొట్టాడు గుడ్డు.

తల పగిలి కింద పడి గిల గిల కొట్టుకుంటున్న వాడి వైపు ఆశ్చర్యంగా చూస్తూ "మా గుడ్డుకి భయమేస్తే అంతే!" అని నవ్వుతూ చెప్పాడు గబ్బర్.

అది చూసి భయంకరంగా అరుస్తూ గుడ్డు మీదికి వెళుతున్న ఇంకొకడి తల నరికేసి సయ్యద్ ముందుకు వచ్చి

"మేము ఎవరో తెలియాలి అంతే కదా! అభీర్ సేనా పేరు ఎప్పుడైనా విన్నావా? ఆ సేనలో ఒక సైనికుడిని!" అని చెప్పాడు లింగు.

"అభీర్ సేన!" అని ఆశ్చర్యంగా చూస్తున్న సయ్యద్ గుండెల్లో కత్తి దింపి "అవున్రా.. వాళ్ళ చేతిలో చచ్చే అదృష్టం నీకు ఇవ్వను.

నన్ను కొత్త లోకాలకు తీసుకువెళ్తావా.. ఇప్పుడు నిన్ను వేరే లోకానికి పంపిస్తున్నాను అక్కడ వెళ్లి ప్రశాంతంగా బతుకు!" అని చెప్పాడు గబ్బర్

"గబ్బర్ గారు! సోల్జర్స్ అందరికీ ఈ టాబ్లెట్స్ ఇవ్వండి శక్తి పుంజుకుని  యుద్ధ రంగలోకి దూకుతారు."  అని చెప్పాడు లింగు.

"సూపర్!" అని టాబ్లెట్స్ తీసుకుని సోల్జర్స్ కి ఇచ్చి "నేను కూడా ఒకటి వేసుకొనా..?" అని అడిగాడు గబ్బర్.

"మీ ఇష్టం! అది మింగితే ఎటువంటి వాడినైనా ఎత్తి గిరాటు వేస్తారు." అని చెప్పాడు గుడ్డు.

************

కలింగ మనుషుల తలలు తెగిపడడం చూసి "సైంటిస్ట్" తోడేళ్ళను వదులు మన వాళ్ళందరూ చచ్చిపోతున్నారు." అని చెప్పాడు చింగ్ యా.

ఆ మాట విని రెడ్ బటన్  ప్రెస్ చేసాడు కళింగ.

డోర్స్ ఓపెన్ అయ్యి తోడేళ్లు మొత్తం బయటికి రావడంతో వాటి వైపు భయంగా చూస్తూ "బాబోయ్! ఒక్కొక్కటి ఇంత ఉంది ఏమిటి!" అని కంగారు చెప్పింది పూజా.

తోడేళ్ళ వైపు చూస్తూ "యోధ! వీటిని మనం చంపగలమా..?" అని డౌట్ గా అడిగింది నీతూ.

అంతలో ఒక తోడేలు దూరంగా ఉన్న పుష్కర్ వాళ్ళ వైపు పరిగెత్తుకుంటూ వెళ్లి మీదకి దూకడంతో భయంతో గట్టిగా అరుస్తూ కళ్ళు మూసుకుని

"కుయ్ కుయ్!" మని సౌండ్ రావడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి రక్తం మడుగులో రెండు ముక్కలు అయ్యి ఉన్న తోడేలు చూసి "మనవాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు మారి దీనిని చంపింది ఎవరు?" అని భయంగా అడిగాడు ఏకవీర.

తోడేలు రక్తంతో తడిసిన కత్తిని పట్టుకుని ఆవేశంగా చూస్తున్న మనిషిని చూపిస్తూ "నా స్నేహితుడు అభీర్ వచ్చాడు." అని చెప్పాడు యోధ.




" రుద్రం భజే! ఎపిసోడ్ 51 " రచనకు రేటింగ్ ఇవ్వండి
[+] 6 users Like SivaSai's post
Like Reply
రుద్రం భజే! ఎపిసోడ్ 52 సమాప్తం




[Image: cover?seriesId=1269749&version=025903d2-...3a476c64b6]


తన మీదకు దూకుతున్న తోడేలు రెండు ముక్కలు అవ్వడం చూసి మీరందరూ అక్కడే ఉన్నారు దీనిని చంపింది ఎవరు అని అడిగిన ఏకవీర మాట విని కత్తి పట్టుకుని నుంచున్న మనిషిని చూపించి నా ఫ్రెండ్ అభీర్ వచ్చాడు అని చెప్పాడు యోధ.

**************

"నా ఫ్రెండ్ అభీర్ వచ్చాడు." అంటూ దగ్గరికి వెళ్లి చేతీలో చెయ్యి వేసి "అన్న మాట ప్రకారం కరెక్ట్ టైం కి వచ్చావు." అని చెప్పాడు యోధ.

"దేశం కోసం, స్నేహం కోసం, ఇచ్చిన మాట కోసం ఈ అభీర్ ఎక్కడికైనా వస్తాడు." అని చెప్పి తోడేళ్ల గుంపు రావడం చూసి "ఇక్కడ చాలా పెద్ద పని పడింది." అని మీదకు దూకిన తోడలుని తన చేతిలో ఉన్న కత్తితో పొడిచాడు అభీర్.

కత్తి దిగి అరుస్తున్న తోడేలు తల నరికి తన టీమ్ వైపు చూసి "తోడేలు నోటికి దొరక్కుండా ఫైట్ చేయండి." అని చెప్పాడు యోధ.

సోల్జర్స్ తో కలిసి అక్కడికి వచ్చి "యోధ, అభీర్ ల వైపు చూసి "కటౌట్స్ కాంబినేషన్ అదిరిపోయింది. అని సంతోషంగా చెప్పి "సార్! సోల్జర్స్ ని లింగు,గుడ్డుతో కలిసి సేవ్ చేశాను." అని చెప్పాడు గబ్బర్.

"గుడ్! నీతో పాటు వచ్చిన మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు." అని అడిగాడు యోధ.

అక్కడికి వస్తు "అందరూ క్షేమంగా ఉన్నారు ల్యాబ్ లోపల రేపాలా ఒక క్షుద్ర బంధనం వేశాడు దానిని ఎలాగైనా తొలగించాలి." అని చెప్పాడు భూషణ్.

"ఆ బంధనం సంగతి మా సింబా చూసుకుంటాడు." అని ఆకాశం వైపు చూసి సిగ్నల్ ఇచ్చాడు అభీర్.

ఆ సిగ్నల్ విని వేగంగా అక్కడికి వస్తున్న సింబా వైపు ఆశ్చర్యంగా చూస్తూ "ఇంత పెద్ద పక్షిని  నేను ఇప్పటివరకు  చూడలేదు." అని చెప్పింది పూజా.

"గరుడ శక్తి ముందు ఏ క్షుద్ర శక్తి పనిచేయదు." అని సంతోషంగా చెప్పాడు భూషణ్.

అక్కడికి వచ్చి "తోడేళ్లు చాలా ఉన్నాయి గుంపుగా ఉంటే మనం చంపడం చాలా కష్టం వాటిని ఎలాగైనా చెల్లాచెదురు చేయాలి." అని చెప్పింది సుహా.

"అవును! ఆ తోడేళ్లతో పాటు కళింగ తయారు చేసిన మనుషులు కూడా వస్తున్నారు వాళ్ళని అర్జెంటుగా చంపాలి లేకపోతే వాళ్ళ బాడీ మొత్తం పాయిజన్ అయిపోతుంది తర్వాత చాలా ప్రాబ్లం అవుతుంది." అని చెప్పాడు ముష్రు.

ఆ మాట విని అక్కడికి గుంపులుగా పరిగెత్తుకుంటూ వస్తున్న తోడేళ్లు వైపు చూసి భయంకరంగా అరుస్తూ ఒక వింత శబ్దం చేసాడు అభీర్.

ఆ ఆరూపుకి రెండు అడుగులు వెనక్కి వేసి భయంతో అటు ఇటు పరుగులు తీస్తూ ఉన్నాయి తోడేళ్లు.

"మంచి పని చేశావు!' అని కత్తి పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్లి తన వైపుకు పరిగెత్తుకొస్తున్న తోడేలు కాళ్ల మధ్యలో దూరి కత్తితో పొడిచి రెండు ముక్కలు చేశాడు యోధ.

అంతలో సుహా వాళ్ళు కూడా అక్కడికి వస్తున్న మనుషుల్ని చంపడం చూసి పూజ దగ్గరికి వెళ్లి

"మేడం! మనకి అంత స్పీడ్ గా ఫైట్ చేసే సీన్ లేదు కాబట్టి ఒక పని చేద్దాము నా దగ్గర తోడేలు తినే బిస్కెట్లు ఉన్నాయి వాటికి బాంబులు కట్టి వాటి దగ్గరికి వేద్దాము." అని నవ్వుతూ చెప్పాడు గబ్బర్.

"గుడ్ ఐడియా! ఇప్పటీ వరకు నువ్వు లేక మాకు ఇలాంటి ఐడియాలు రాలేదు." అని బ్యాగ్ లో ఉన్న బాంబ్స్ బయటికి తీసింది పూజా.

అక్కడికి వస్తున్న లింగు, గుడ్డు వైపు చూసి "గబ్బర్ గారు! పాపం తనకి కళ్ళు లేవు కదా మీరే కాపాడారా..!" అని అడిగాడు పుష్కర్.

ఆ మాటకి కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ "నీకు అలా అనిపించిందా..!" అని అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తున్న కళింగ మనిషి తల నరికిన లింగుని చూపించి

"వాళ్ళ పవర్ ఏమిటో అర్థమైందా..? ఏదైనా అడిగావు అనుకో నాకు కనపడదు మా తమ్ముడికి వినపడదు అంటాడు అందుకని మాట్లాడకుండా సైలెంట్ గా ఉండు." అని బాంబుకి బిస్కెట్ కట్టి తోడేలు దగ్గరకి గిరాటు వేసాడు గబ్బర్.

ఆ బిస్కెట్ చూసి నోటితో పట్టుకుని కొరక్కకుండా పరిగెత్తుకుంటూ గబ్బర్ దగ్గరికి వస్తూ ఉంది ఆ తోడేలు.

అది చూసి "ఓరి బాబోయ్! ఇది బిస్కెట్ తినకుండా నోటితో  పట్టుకొని నా దగ్గరికి వస్తుంది ఏమిటి!" అని భయంగా గుడ్డు వెనకాల నుంచున్నాడు గబ్బర్.

నవ్వుతూ "అవి మనకన్నా తెలివైనవి అంత ఈజీగా మోసపోవు!" అని పరిగెత్తుకుంటూ వెళ్లి తోడేలు తల మీద ఒక తన్ను తన్ని మళ్ళీ వెనక్కి దూకేడు గుడ్డు.

ఆ దెబ్బకి నోరు నొక్కుకోవడంతో బ్లాస్ట్ అయి తోడేలు ముక్కలు ముక్కలు అవడం చూసి "నా ప్లాన్ సగం వర్క్ అవుట్ అయింది." అని సంతోషంగా చెప్పాడు గబ్బర్.

తోడేళ్లు తను తయారు చేసిన మనుషులు చనిపోవడం చూసి "రేపాలా! ఇంకా హిడిచి ని పంపించే టైమ్ వచ్చింది. అలాగే ఆ పద్మాన్ని ఆక్టివేట్ చెయ్ మనం ఎక్కడి నుంచి వెళ్లిపోవాలి." అని చెప్పాడు కళింగ.

"సరే! అని హిడిచి  వైపు చూసి "అక్కడ ఉన్న అందర్నీ నాశనం చేసిరా....!" అని చెప్పాడు రేపాలా.

ల్యాబ్ లో నుంచి బయటికి వచ్చి తనకి అడ్డంగా ఉన్న ఇద్దరు కలింగ మనుషుల్ని గిరాటువేసి వస్తున్న హిడిచి వైపు చూసి "వీడేంటి సడన్గా ఇలా మారిపోయాడు?" అని చెప్పి బ్యాగ్ లో నుంచి బాంబు తీసి విసిరాడు గబ్బర్.

గాల్లో వస్తున్న బాంబుని చేత్తో పట్టుకుని నోట్లో వేసుకుని పరిగెత్తుకుంటూ వస్తున్నా హిడిచి వైపు చూసి "బాబోయ్! వీడు మనిషి కాదు." అని భయంతో అక్కడినుంచి పరిగెత్తుకుంటూ "యోధ యోధ!" అని అరుస్తూ దూరంగా వెళ్లారు పూజ వాళ్ళు.

"యోధ! ఆ రాక్షసుడుని నువ్వు మాత్రమే ఎదుర్కోగలవు." అని చెప్పాడు భూషణ్.

ఆ మాట విని "మిత్రమా! నువ్వు వెళ్ళు ఈ తోడేళ్ల సంగతి మేము చూసుకుంటాము." అని చెప్పి రాఖీ వాళ్ళతో కలిసి తోడేళ్ళకి ఎదురుగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అభీర్.

అంతలో ల్యాబ్ లోకి దూసుకు వెళ్లి అక్కడ ఉన్న క్షుద్ర బంధనన్ని చెల్లా చెదురుచేసి భయంకరంగా అరుస్తూ ఉన్నాడు సింబా.

అది చూసి "ఈ పక్షి ఎక్కడి నుంచి వచ్చింది." అని కంగారుగా అడిగాడు చింగ్ యా.

"రేపాలా! ఆ పద్మాన్ని త్వరగా ఆక్టివేట్ చేసి ఇక్కడి నుంచి వెళ్లిపోదాము." అని కంగారుగా చూస్తూ చెప్పాడు కళింగ.

"ఆ ప్రయత్నంలోనే ఉన్నాను." అని సూర్యకిరణాలు పడేటట్లు పద్మాన్ని పెడుతూ ఉన్నాడు రేపాలా.

పూజ వాళ్ల మీదకు వెళుతున్న హిడిచి కి ఎదురుగా వెళ్లి గుండెల మీద ఒక్క గుద్దు గుద్దాడు యోధ.

ఆ దెబ్బకు హిడిచి ఎగిరి అవతల పడడంతో "మనం ల్యాబ్ లోపలికి వెళ్ళిపోదాము." అని లింగు, పూజ వాళ్ళతో  అక్కడ నుంచి పరిగెత్తడు గబ్బర్.

కింద పడి భయంకరంగా అరుస్తూ పైకి లేచి షర్టు విప్పిన హిడిచి ఛాతి మీద ఉన్న సింబల్ ని ఆశ్చర్యంగా చూస్తూ  "యోధాకి ఉన్నట్లు తనకి కుడా సింబల్ ఉంది అసలు ఎవరితను?" అని డౌట్ గా చూస్తూ అడిగింది దీప్తి.

క్షుద్ర బంధనం విడిపోవడంతో అక్కడికి వచ్చి "మిమ్మల్ని ఆపడానికి రేపాలా సృష్టించిన శక్తి!  పేరు హిడిచి మన యోద శక్తికి సమానమైన వాడు ఈ ఇద్దరిలో ఎవరు జీవించి ఉంటే వాళ్ళు గెలిచినట్లు!" అని చెప్పాడు నారదుడు.

ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "అవును స్వామి" ఇప్పటివరకు మీరు ఏమైపోయారు? " అని అనుమానంగా అడిగింది నీతూ.

"మిమ్మల్ని వెతుక్కుంటూ దారితప్పిన క్యూబ్ వాళ్ళని ఇక్కడికి తీసుకు వచ్చాను." అని అక్కడికి వస్తున్న నంద వాళ్ళని చూపించాడు నారదుడు.

భయంకరంగా అరుస్తూ వికృత రూపంలోకి మీదకి వస్తున్న హిడిచి ని తన కత్తితో గుండెల్లో పొడిచి నవ్వుతూ ఉండడం ఆశ్చర్యంగా చూస్తూ "ఈ రాక్షసుడు చావు ఏ పార్ట్ లో  ఉందో!" అని ఎగిరి ఒక తన్ను తన్నాడు యోధ.

ల్యాబ్ లోపలికి వెళ్లి పద్మాన్ని మిషన్ లో పెట్టి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్న కళింగ వాళ్ళని చూసి "ఒరేయ్ రేపాలా! ఏంట్రా గుర్కా గాడితో కలిసి ఏదో చేస్తున్నావు?" అని వెటకారంగా చూస్తూ అడిగాడు గబ్బర్.

ఆ మాట విని గబ్బర్ వైపు కోపంగా చూస్తూ "నన్ను గుర్కా అంటవా..! నేను చైనా ఆర్మీ మేజర్!"  అని చెప్పాడు చింగ్ యా.

"అవునా? మరి ఈ లుచ్చా పనులు ఏమిటిరా..!" అని లింగు వెనక్కి వెళుతూ అడిగాడు గబ్బర్.

అది చూసి అరుస్తున్న సింబా ని చూసి "ముందు ఆ పక్షిని షూట్ చేయండి." అని చెప్పాడు చింగ్ యా.

"నోరులేని ఆ పక్షి ఏం చేసింది సారూ!" అని చింగ్ యా మొహం మీద చేతులు పెడుతూ అడిగాడు లింగు.

"ఈ కళ్ళు లేని వాడి హెల్ప్ తీసుకుని మా దగ్గరికి వస్తావా..! నీ సంగతి చూస్తాను." అని గన్ బయటికి తీసాడు చింగ్ యా.

అది చూసి చింగ్ యా చేతిలో గన్ లాక్కుని అటు ఇటు తిప్పి చూస్తూ ఉన్నాడు గుడ్డు.

"కళింగ! వీడు నా చేతిలో గన్ తీసుకొని చంపాలని చూస్తున్నాడు కెమికల్ బాంబు ఒకటి తీసుకురా మన పవర్ ఏమిటో చూపిద్దాము." అని చెప్పాడు చింగ్ యా.

"కాస్త చల్లబడండి సారు! నా తమ్ముడికి వినపడదు నాకు కనపడదు, మీకు గన్ కావాలి అంతే కదా!" అని గుడ్డు చేతిలో గన్ తీసుకుని చిటికలో బుల్లెట్స్ మొత్తం తీసి ఖాళీ గన్ ఇచ్చాడు లింగు.

"మీరు ఇక్కడ ఎన్ని వేషాలు వేసిన అక్కడ మీ కెప్టెన్ ని  నా మనిషి చంపి ఇక్కడికి వస్తాడు మీలో ఒక్కడు కూడా మీగలడు." అని నవ్వుతూ చెప్పిడా రేపాలా.

"మా బీమ్ బోయ్ ని కొట్టేవాడు కూడా ఉన్నాడా..?" అని ల్యాబ్ లో నుంచి బయటికి చూసి హిడిచి మొహం మీద యోధ పిడిగుద్దులు గుద్దడం చూస్తూ "వీడిని ఎంత కొట్టిన చావడం లేదు ఏమిటి!" అని డౌట్ గా చూస్తూ ఉంది పూజా.

అంతలో బయట ఉన్న తోడేళ్లు కలింగ మనుషులందరూ చనిపోవడంతో ముష్రుతో కలిసి ల్యాబ్ లోపలికి వచ్చి చింగ్ యా వైపు చూసి "ఆరోజు బోర్డర్లో మా సోల్జర్స్ చేతిలో నుంచి తప్పించుకుని పారిపోయింది నువ్వే కదా లేకపోతే ఆ రోజే నీ వెన్నుపూస విరిగిపోయేది." అని చెప్పింది సుహా.

ఆ మాటకి కంగారుగా చూస్తున్న చింగ్ యా ని పక్కకు తోసి రేపాలా దగ్గరికి వెళ్లి పద్మాన్ని తీసుకొని కాలు కింద వేసి తొక్కి "ఇది అసలైంది కాదులే పనిచేయదు." అని నవ్వుతూ చెప్పాడు వర్ధన్.

ఆ మాట విని ల్యాబ్ లోకి పరిగెత్తి డోర్స్ క్లోజ్ చేసుకున్నాడు కళింగ.

తన దగ్గరికి వస్తున్న అభీర్, నీతు వాళ్ళ వైపు చూసి "ఈ రాక్షసుడుని ఎంత కొట్టినా చావడం లేదు." అని విసుగ్గా చూస్తూ చెప్పాడు యోధ.

అక్కడికి వచ్చి "అతని గుండెల మీద ఉన్న సింబల్ ని చేతులతో పేకలించు ఆ రాక్షసుడు శక్తి మొత్తం అక్కడే ఉంది." అని చెప్పాడు నారదుడు.

ఆ మాట విని కింద పడి పైకి లేచి పరిగెత్తుకుంటూ వస్తున్న హిడిచి వైపు చూసి కోపంగా పరిగెత్తుకుంటూ వెళ్లి గుండెల మీద ఉన్న సింబల్  దగ్గర చేత్తో గట్టిగా పట్టుకుని అరుస్తూ చేతి వేళ్ళని లోపలికి గూచ్చి సింబల్ తీసి గిరాటు వేశాడు యోధ.

తన ఒంటి మీద నుంచి సింబల్ వేరు అవ్వడంతో భయంకరంగా అరుస్తూ వికృతి రూపంలోకి మారిన  హిడిచి ని చూసి "యోధ! నీ చేతులే ఆయుధం!" అని చెప్పాడు నంద.

ఆ మాట విని పరిగెత్తుకుంటూ వెళ్లి గాలిలోకి ఎగిరి తల మీద రెండు చేతులతో  బలంగా ఒక్క గుద్దు గుద్దాడు యోధ.

ఆ దెబ్బకి కపాలం పగిలి బాధతో అరుస్తూ కింద పడి బూడిద అయిపోయాడు హిడిచి.

ల్యాబ్ లో నుంచి చూస్తూ "హిడిచి కుడా చనిపోయాడు ఇంక నీ సైన్యాన్ని నిద్ర లేపు!" అని రేపాలా వైపు చూసి కంగారుగా చెప్పాడు చింగ్ యా

హిడిచి చనిపోవడంతో కోపంగా చూస్తూ "శిమిరా ని నిద్ర లేపుతాను మిమ్మల్ని అందరిని నాశనం చేస్తాను, ఈ హిమాలయాలు లేకుండా చేస్తాను." అని ఆవేశంగా అరుస్తూ మంత్రాలు చదువుతూ ఉన్నాడు రేపాలా.

"నీ మంత్రాలకు చింతకాయలు కూడా రాలవు నువ్వు పిలుస్తున్న శిమిరా ఎప్పుడో పోయాడు నేనే చంపాను." అని నవ్వుతూ చెప్పింది పూజా.

ఆ మాట విని రేపాల వైపు చూసి "నువ్వు అంత గొప్పగా చెప్పిన సైన్యాన్ని ఈ అమ్మాయి చంపిందా..?" అని విచిత్రంగా చూస్తూ అడిగాడు చింగ్ యా.

ల్యాబ్ లోనుంచి బయటికి వస్తూ "నేను ఎలాగో చనిపోతాను నాతో పాటు అందరూ చనిపోవాలి." అని తన దగ్గర ఉన్న కెమికల్ చూపిస్తూ ఆక్రోషంగా చెప్పాడు కళింగ.

ల్యాబ్ లోనుంచి బయటకి వస్తూ "మీ కోరిక తీరదు సార్! ఆ కెమికల్ మీరు అనుకున్నది కాదు." అని చెప్పాడు ముష్రు.

ఆ మాట విని ముష్రూ వైపు కోపంగా చూస్తూ "నా వెనకాల ఉండి నన్ను మోసం చేస్తావా..?" అని అడిగాడు కళింగ.

అక్కడికి వస్తూ "నువ్వు పుట్టిన దేశాన్ని మోసం చేశావు నిన్ను మోసం చేస్తే ఎటువంటి తప్పులేదు." అని చెప్పాడు యోధ.

అక్కడికి వస్తున్న యోధ ఛాతి మీద ఉన్న సింబల్ చూస్తూ "హనుమ శక్తి!" అని భయంగా తన కళ్ళకి చేతిని అడ్డంగా పెట్టుకున్నాడు రేపాలా.

"సరే మిత్రమా! ఇంక మేము బయలుదేరుతున్నాం వీళ్ళ సంగతి చూసుకోండి మాకు చైనా బోర్డర్ లో లో వేరే మిషన్ ఉంది." అని చెప్పాడు అభీర్.

"కరెక్ట్ టైం కి వచ్చినందుకు థాంక్స్ మిత్రమా!" అని చేతీలో చేయి వేసి చెప్పాడు యోధ.

"అది నా బాధ్యత!" అని సింబ వైపు చూసి "బయలుదేరదామా?" అని అడిగాడు అభీర్.

గబ్బర్ సింగ్ వాళ్ళ వైపు చూస్తూ "ఇంక మేము కూడా వెళతాము మిత్రమా మళ్లీ కలుసుకుందాము." అని గుడ్డుని తన భుజాల మీద ఎక్కించుకుని సింబా కాలు గట్టిగా పట్టుకున్నాడు లింగు.

అభీర్ ని లింగు వాళ్ళని తీసుకుని అక్కడి నుంచి గాల్లో ఎగురుకుంటూ వెళ్లిపోయాడు సింబా.

ఆకాశంలోకి ఆశ్చర్యంగా చూస్తూ "ఈ వెహికల్ ఏదో బాగుంది పెట్రోల్ ఖర్చు కూడా ఉండదు." అని చెప్పింది పూజా.

యోధ దగ్గరికి వచ్చి "సార్! ఈ మెడిసిన్ ని అందరి బాడీలోకి ఎక్కించి నరకం చూపించడు దీనివల్ల చాలామంది అమాయకులు కూడా చనిపోయారు." అని చెప్పాడు ముష్రు.

"అవునా? ముగ్గురికి హ్యాండ్ కప్స్ వేసి ఆ మెడిసిన్ ఎక్కించండి ఆ బాధ ఏంటో వీళ్ళకి కూడా తెలియాలి కదా!" అని చెప్పాడు యోధ.

బ్యాగ్ లో ఉన్న హ్యాండ్ కప్ తీసి ముగ్గురికి వేస్తూ ఉన్నాడు రాఖి.

"యోధ!  ప్లీజ్ ఆ మెడిసిన్ మాకు ఇవ్వకండి మేము లొంగిపోతాము." అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు కళింగ.

"నువ్వు తయారు చేసిన మెడిసినే కదా ఎంజాయ్ చెయ్!" అని ముష్రు చేతిలో ఉన్న ఇంజక్షన్ తీసుకుని కళింగ గొంతులో పొడిచింది సుహా.

"ఈ ల్యాబ్ అనమాలు కుడా లేకుండా చేయమలి అని సార్ మరీ మరీ చెప్పారు." అని బ్యాగ్ లో నుంచి నాయక్ ఇచ్చిన బాక్స్ తీసే ఓపెన్ చేసి చూసి

"ఇండియన్ టెక్నాలజీ తో తయారైన లేటెస్ట్ బాంబు చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ బ్లాస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. ఫస్ట్ మీ మీద ప్రయోగిస్తున్నాను." అని నవ్వుతు టేబుల్ మీద పెట్టాడు యోధ.

"మరి దీనిని ఆపరేట్ చేయడం ఎలాగా?" అని డౌట్ గా అడిగింది నీతూ.

అక్కడ ఉన్న కంప్యూటర్లో కోడింగ్ మర్చి "ఇప్పుడు శాటిలైట్ సిగ్నల్ మనం మిలిటరీకి అందుతుంది మనం ఎక్కడ ఉన్నామో వాళ్లకు తెలుస్తుంది." అని చెప్పింది దీప్తి.

మిలట్రీ సాటిలైట్ రూమ్ లో కూర్చుని బాంబు ఆక్టివేట్ అయ్యి శాటిలైట్ సిగ్నల్ రావడంతో యోధ వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని "మనవాళ్ళు వెళ్లిన వర్క్ కంప్లీట్ అయింది." అని నవ్వుతూ ఫోన్ తీసి కాల్ చేసాడు నాయక్.

ఫోన్ లిఫ్ట్ చేసి "జైహింద్ సార్! మా వర్క్ కంప్లీట్ అయింది అలకాపురి దగ్గరికి బయలుదేరుతున్నము ఈ ముగ్గురిని చంపే ఛాన్స్ మీకు ఇస్తున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత బటన్ ప్రెస్ చేయండి ల్యాబ్ కుడా ఆనమాలు కూడా లేకుండా పోతుంది." అని చెప్పాడు యోధ.

"గుడ్! త్వరగా అక్కడి నుంచి వెళ్లండి. అది బ్లాస్ట్ అయితే బూడిద తప్పితే ఏమీ మిగలదు." అని చెప్పాడు నాయక్.

"ఓకే సార్!" అని తన దగ్గర ఉన్న పద్మాన్ని తీసి సూర్యకిరణం పడేటట్లు చేసి బ్లాక్ హోల్ ఓపెన్ అవడంతో అక్కడ ఉన్న క్యూబ్ వాళ్ళ వైపు చూసి "బయలుదేరదామా?" అని అడిగాడు యోధ.

పద్మం వైపు చూసి "నా కోరిక నెరవేరలేదు కానీ దానిని కళ్ళరా చూడగలిగాను." అని సంతోషంగా చూస్తూ ఉన్నాడు రేపాలా.

బ్లాక్ హోల్ ఓపెన్ అవ్వడం తో "త్వరగా రండి." అని చెప్పి లోపలికి అడుగు పెట్టాడు యోధ.

అందరూ లోపలికి వెళ్లడంతో రేపాలా చేతిలో కుక్క బిస్కెట్స్ పెట్టి బ్లాక్ హోల్ లోకి పరిగెత్తాడు గబ్బర్.

బ్లాక్ హోల్ లోకి ఆఖరిగా వెళుతూ అసలు రూపంలోకి మారినా భూషణ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ "మహారాజా మీ దర్శనమైంది నా జన్మ ధన్యం!" అని చెప్పాడు రేపాలా.

ఆ మాటకి నవ్వుతూ "వచ్చే జన్మలోనైనా మంచి చేయడానికి జన్మించు." అని బ్లాక్ హోల్ లోకి వెళ్ళాడు విభీషుణుడు.

ఫైవ్ మినిట్స్ టైం అవ్వడంతో బటన్ ప్రెస్ చేశాడు నాయక్.

శాటిలైట్ లో చూస్తూ "సార్! ఆ ప్లేస్లో భారీ బ్లాస్ట్ అయింది మళ్లీ పాకిస్తాన్ ఏడుపు మొదలవుతుంది." అని నవ్వుతూ చెప్పాడు ఆఫీసర్.

"అది ఎప్పుడూ ఉండేదే కదా! ఈవినింగ్ యోధ టీమ్తో ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్లాలి అపాయింట్మెంట్ తీసుకోండి." అని చెప్పాడు నాయక్.

బ్లాక్ హోల్ లో కైలాస పర్వతం దగ్గరికి వచ్చి పద్మాన్ని చేతిలోకి తీసుకుని "అలకాపురి నగరం ఎక్కడ ఉంది ఈ పద్మాన్ని ఎవరికి ఇవ్వాలి?' అని చుట్టూ చూస్తూ ఉన్నాడు యోధ.

"మీరు వచ్చిన కార్యం పూర్తయింది మీకు సహాయం చేసే అదృష్టం మాకు లభించింది." అని కుబేరుడు రూపంలోకి మారి "ఆ పద్మాన్ని ఇవ్వండి." అని అడిగాడు క్యూబ్.

ఆ మాట విని కుబేరుడు వైపు ఆశ్చర్యంగా చూస్తూ పద్మాన్ని చేతిలో పెట్టి "ఇన్ని రోజులు మాతోపాటు నిజంగానే దైవం ఉందా..?" అని అడిగాడు యోధ.

నంది రూపంలోకి మారి "ఎప్పుడు దైవం మీతో పాటే ఉంటుంది మిమ్మల్ని విభీషణ మహారాజు పుష్పక విమానంలో గమ్యానికి చేరుస్తారు." అని చెప్పాడు నంద.

ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ "విభీషణులు వారు ఎక్కడ..?" అని భూషణ్ రూపం మారడం విచిత్రంగా చూస్తూ ఉన్నారు అందరు.

అంతలో గాల్లో పుష్పక విమానం రావడం చూసి "మీకు వాళ్ళ గుంరించి ఇప్పుడు తెలుసు! నాకు ఎప్పుడో తెలుసు ఫస్ట్ సీట్ నాది!" అని విమానంలోకి ఎక్కడు గబ్బర్.

"మీ అందరినీ పుష్పక విమానం చేర్చవలసిన చోటికి చేరుస్తుంది." అని చెప్పాడు విభీషణుడు.

"మహారాజా! అంత బాగుంది కానీ ఆంజనేయ స్వామి వారి దర్శనం అవుతుంది అనుకున్నాను." అని ఆశగా అడిగాడు యోధ.

నారదుడి రూపంలోకి మారి "నారాయణ నారాయణ! ఆయన కలియుగ బ్రహ్మ రామనామం ఎక్కడ ఉంటే అక్కడ హనుమంతుడు ఉంటాడు వెళ్లి రండి మీకు దర్శన భాగ్యం లభిస్తుంది." అని చెప్పాడు నారదుడు.

"జైశ్రీరామ్!" అంటూ పుష్ప విమానంలోకి వెళ్ళాడు యోధ.

అందరూ ఎక్కడంతో పుష్పక విమానం  గాల్లో ఎగురుతూ ఉండగా హిమాలయాల దగ్గర తపస్సు చేసుకుంటున్న ఆంజనేయ స్వామి వారిని ఆశ్చర్యంగా చూస్తూ నమస్కారం చేసుకున్నారు అందరు.

యోధ వైపు చూసి "నీ ఛాతి మీద సింబల్  మాయమైపోయింది ఏంటి!" విచిత్రంగా చూస్తూ అడిగింది పూజా.

కైలాస పర్వతం మీద నుంచొని పూజ వైపు చూస్తూ "హనుమంతుని శక్తి యోధలో ఉంటే నీకు దగ్గర ఎలా అవుతాడు? నా చెవిలో చెప్పిన నీ కోరిక తీరాలి కదా!" అని చెప్పాడు నంద.

ఆ మాటకి సిగ్గుపడుతూ యోధ ని గట్టిగా పట్టుకుంది పూజా.

అది చూసి "మేడం! మీరైనా బాడీ పెంచాలి లేదా యోధ సార్ అయ్యినా డైటింగ్ చేయాలి." అని నవ్వుతూ చెప్పాడు గబ్బర్.

"ఏమి అవసరం లేదు నా బీమ్ బాయ్ ఇలా ఉంటేనే బాగుంటాడు." అని నవ్వుతూ చెప్పింది పూజా.

యోధ వాళ్ళని మిలటరీ హెడ్ కోటర్స్ దగ్గర దింపి అదృశ్యమైంది పుష్పక విమానం.

సృష్టిని నాశనం చేయాలి అనుకున్న వారిని నాశనం చేయడానికి దైవం ఏదో ఒక రూపంలో మనిషికి సహాయం చేస్తూనే ఉంటుంది "జైశ్రీరామ్!"

సమాప్తం...




" రుద్రం భజే! ఎపిసోడ్ 52 సమాప్తం " రచనకు రేటింగ్ ఇవ్వండి...
[+] 8 users Like SivaSai's post
Like Reply
Such a wonderful story. Nice ending. Successful ga inkoka story ni complete chesinanduku dhanyavaadaalu.
[+] 1 user Likes styleraja's post
Like Reply
Excellent story...
[+] 1 user Likes Sunny73's post
Like Reply
Abhira story undha
[+] 1 user Likes Bullet bullet's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)