Thread Rating:
  • 7 Vote(s) - 4.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller రుద్రం భజే! ( POWER OF YODHA )
రుద్రం భజే! ఎపిసోడ్ 39



కళింగ, రేపాలా తో ఫోన్లో మాట్లాడిన యోధ వైపు చూసి అక్కడికి వెళ్లడానికి నీతో పాటు వచ్చే టీమ్ మెంబర్స్ ఎవరెవరు అని అడిగాడు నాయక్.

ఆ విషయం నేను చెబుతాను అని సూట్ కేస్ పట్టుకొని యంగ్ రూపంలో బయటికి వచ్చాడు గుప్తా.

************

రూమ్ లో నుంచి బయటికి వచ్చిన గుప్త వైపు చూసి "యంగ్ పోలికలు ఉన్నాయి కానీ ఇంకా సెట్ చేయాలి." అని చెప్పాడు నాయక్.

అంతలో రూమ్ లో నుంచి బయటకి వస్తూ "సార్! నా పని ఇంకా పూర్తవలేదు మీ మాటలు విని టీమ్ ని సెట్ చేయాలి అంటూ హడావుడిగా బయటికి వచ్చాడు." అని చెప్పాడు విఠల్.

"గుడ్! డ్యూటీ మీద ఆ మాత్రం ఇంట్రెస్ట్ ఉండాలి." అని చెప్పి గుప్తా వైపు చూసి "సరే! మొదలు పెట్టావు కదా ఎవరెవరు వెళ్లాలో నువ్వే చెప్పు!" అని అడిగాడు నాయక్.

"మీరు అరవకొండ పంపించిన టీమ్ మా టీమ్ కలిసి యోధతో పాటు వెళ్లి మిషన్ కంప్లీట్ చేసుకొని వస్తాము." అని చెప్పాడు గుప్తా.

"ఆ ప్లేస్ కి లేడీస్ ని పంపించాలా నెవర్! అవసరమైతే మరో నలుగురు సోల్జర్స్ ని టీమ్ లో యాడ్ చేస్తాను." అని చెప్పాడు నాయక్.

ఆ మాట విని నంద వైపు చూసి "నందీశ్వర! మాయని సృష్టించు నాయక్ గారితో మనం మాట్లాడే మాటలు ఎవరు వినకూడదు." అని చెప్పాడు భూషణ్.

"సరే!" అని చెప్పి తన చేతిని పైకి ఎత్తాడు నంద.

ఫ్యాక్టరీ లోపల అంత మాయా కమ్మడంతో నాయక్ వైపు చూసి "నేను చెప్పిన వారు కాకుండా అక్కడకి ఎవరు వచ్చిన ప్రాణాలతో తిరిగిరారు." అని చెప్పాడు గుప్తా.

"ఆ విషయం నీకు ఎలా తెలుసు? అయినా నా కూతుర్ని ప్రమాదంలోకి పంపడం నాకు ఇష్టం లేదు, తను సోల్జర్ కూడా కాదు ఒక సైంటిస్ట్!"   అని చెప్పాడు నాయక్

"దీప్తి, నీతూ లు కచ్చితంగా యోధతో పాటు ఉండాలి వారికి ఈ పద్మానికి ఉన్న బంధం అటువంటిది." అని చెప్పాడు గుప్తా.

"నా కూతురికి ఆ పద్మానికి ఎటువంటి సంబంధం లేదు." అని చెప్పాడు నాయక్.

"ఆ విషయం మీరు ఎలా చెప్తారు దీప్తి మీ కూతురు కాదు కదా! ఆ పద్మాన్ని తీసుకొచ్చే ప్రమాదంలో చనిపోయిన ఏజెంట్ సాదిక్ కూతురు." అని చెప్పాడు గుప్తా.

ఆ మాటకి షాక్ అయి చూస్తూ "నాకు మాత్రమే తెలిసిన ఈ విషయం మీకు ఎలా తెలిసింది?" అని అడిగి అందరూ బొమ్మలాగా నిలబడి ఉండడం చూసి "ఏమైంది?ఎవరు మాట్లాడలేదు." అని కంగారుగా చూస్తూ అడిగాడు నాయక్.

"నేను చెబుతాను." అని అక్కడికి భారీ ఆకారంలో నడుచుకుంటూ వచ్చాడు విభీషణుడు.

ఆ మాట విని వెనక్కి తిరిగి భారీ ఆకారంలో ఉన్న విభీషుడి వైపు ఆశ్చర్యంగా చూస్తు "ఎవరు నువ్వు!" అని కంగారుగా అడిగాడు నాయక్.

"స్వర్ణ లంకాధిపతి విభీషుణుడు!" అని చెప్పాడు గుప్తా.

ఆ మాట విని "ఏంటి విభీషణుడా..?" అని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు నాయక్.

"అవును! మీరు ధైర్యంగా వాళ్ళని పంపించండి సృష్టికార్యం ఎవరి చేతులు మీద జరగాలో దైవం నిర్వహించింది  దానిని ఆపే ప్రయత్నం చేయకండి వారికి ఆ భగవంతుడు తోడుగా ఉంటాడు." అని చెప్పాడు విభీషణుడు.

"నేను చూస్తుంది మీరు చెబుతుంది నిజమేనా..? నమ్మలేకపోతున్నాను." అని టెన్షన్ గా చూస్తూ చెప్పాడు నాయక్.

"మీరు జరుగుతున్న ఏ విషయాలన్నీ నమ్మలేరు, పద్మన్ని కాపాడిన సాధిక్ కూతురు దీప్తి, పాండే కూతురు నీతూ, ప్రకాష్ కొడుకు యోధ లని ఈ కార్యానికి దైవం ఎంచుకుంది.

ఆ ముగ్గురికి సహాయం చేయడానికి దైవమే కదిలి వస్తుంది వారి చేతుల మీద గానే ఆ పద్మం అలకాపురికి చేరాలి ఇది ఆ భగవంతుడు వాళ్ల నుదుటినా రాసిన తలరాత దీనిని ఎవరు మార్చలేరు." అని చెప్పాడు విభీషణుడు.

"నా కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచాను తను జీవితం సుఖంగా ఉండాలని సోల్జర్ అవుతాను అని చెప్పిన ఒప్పించి సైంటిస్ట్ చేశాను, కానీ నేనే మళ్ళీ ఆ పద్మం మీద రీసెర్చ్ కోసం పంపించాను అలా చేయకుండా ఉన్న బాగుండేదేమో!"  అన్నాడు నాయక్.

"మానవుడు ప్రతి పని నేను చేశాను అనుకుంటాడు కానీ దైవ నిర్ణయం ఎలా ఉంటే ఆలా జరుగుతుంది. పెంచిన ప్రేమతో దీప్తి కాళ్ళకి బంధాలు వేస్తే సృష్టి వినాశనం జరుగుతుంది." అని చెప్పాడు విభీషణుడు.

"నావల్ల ఆ తప్పు జరగనివ్వను." అని నమస్కారం చేస్తూ  చెప్పాడు నాయక్.

ఆ మాట పూర్తవడంతోనే మాయ తొలిగి నాయక్ వైపు చూసి "సార్! అలా మాట్లాడుతున్నారు లేడీస్ అని మమ్మల్ని తక్కువ చేసి చేస్తున్నారు." అని అడిగింది నీతూ.

"నో నో! నేను అలా అనడం లేదు ఇది రిస్కీ మిషన్ మీరు సోల్జర్స్ కాదు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో మీకు తెలియదు, అందుకే మిమ్మల్ని అడిగిన తర్వాత చెబుదామని అలా అన్నాను." అని చెప్పాడు నాయక్.

"డాడ్! నేను సైంటిస్ట్ అయినా మీ ట్రైనింగ్ లో ఒక సోల్జర్ గానే పెరిగాను  మీరు కంగారు పడకండి యోధ తోడు ఉంటే ఏదైనా చేయగలము." అని చెప్పింది దీప్తి.

"ఓకే ఓకే! మీరు ప్రిపేర్ అవ్వండి." అని చెప్పి భూషణ్ వైపు చూసి "అంత మీ మీదే భారం!" అని చెప్పాడు నాయక్.

"మిషన్ కంప్లీట్ అయ్యేంతవరకు యోధ టీం తోనే మేము కూడా ఉంటాము సార్!" అని చెప్పాడు భూషణ్.

గుప్తా వైపు చూసి "సార్!  మీరు లోపలికి రండి మేకప్ లేట్ అయిపోతుంది." అని తీసుకువెళ్లాడు విఠల్.

"నాకు కాల్ వస్తుంది అర్జెంటుగా వెళ్లాలి మీరు వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు వచ్చేస్తాను రెడీగా ఉండండి." అని కార్ దగ్గరికి వెళ్ళాడు నాయక్.

"సార్ ని డ్రాప్ చేసి వస్తాను." అని చెప్పాడు యోధ.

కారు అక్కడ నుంచి వెళ్లడంతో "నాయక్ సర్ ఇక్కడ ఉంటే గబ్బర్ సింగ్ ఏంటి ప్రశాంతంగా పడుకున్నాడు."  అని డౌట్ గా చూస్తూ అడిగింది పూజా.

"గబ్బర్ సింగ్ సంగతి నేను చూసుకుంటాను మీరు మీ వర్క్ చూసుకోండి." అని చెప్పి మోహనా నీళ్లు చల్లాడు క్యూబ్.

స్పృహలోకి వచ్చి భూషణ్  వైపు భయంగా చూస్తూ "మీరు ఏజెంట్లు కాదు అని తెలుసు! కానీ మనుషులే కాదు అని తెలుసుకోలేకపోయాను, బాబోయ్ నన్ను వదిలేయండి." అని ఏడుస్తూ అడిగాడు గబ్బర్ సింగ్.

"మనం పక్కకు వెళ్లి మాట్లాడుకుందామా?" అని గబ్బర్ సింగ్ భుజం మీద చెయ్యి వేసి తీసుకు వెళ్ళాడు భూషణ్.

గబ్బర్ సింగ్ వైపు చూసి "ఆ ముగ్గురితో బాగా కలిసిపోయావే!" అని నవ్వుతూ అడిగింది నీతూ.

"నేను కలిసిపోవడం ఏమిటి మేడమ్ అడుగు కూడా వేయడం లేదు వాళ్లే తీసుకు వెళ్లిపోతున్నారు." అని ఏడుపు మొహం పెట్టుకుని చెప్పాడు గబ్బర్ సింగ్.

ఆ మాట విని నవ్వుతూ వెళ్ళిపోతున్న నీతూ వైపు ఆశ్చర్యంగా చూస్తున్న గబ్బర్ సింగ్ ని చూసి "నువ్వు మాట్లాడేది ఏమీ వాళ్లకి వినపడదు సైలెంట్ గా ఉండు." అని చెప్పాడు క్యూబ్.

"సార్! నన్ను వదిలేస్తే నేను పారిపోతాను ఈ విషయం కూడా ఎక్కడ చెప్పను." అని టెన్షన్ గా చూస్తూ చెప్పాడు గబ్బర్ సింగ్.

"నీకు మాయని చేదించి చూసే శక్తి ఉంది అందుకే నిన్ను ఇక్కడికి తీసుకు వచ్చాము ముందు ముందు నీతో చాలా పని ఉంది." అని చెప్పాడు నంద.

"అవునా? నాకు ఒక చిన్న డౌట్స్ మీరు నిజంగా రావణాసురుడి తమ్ముడు విభీషణుడు గారా..?" అని వేలుతో నొక్కుతూ అడిగాడు గబ్బర్ సింగ్.

"అవును! నీకు ఏదైనా అనుమానం ఉంటే చెప్పు బంగారు లంక కి తీసుకు వెళ్లి చూపిస్తాను." అని చెప్పాడు భూషణ్.

ఆ మాటకి భయంగా చూస్తూ "అవసరం లేదు సార్! ఇందాక మీ అసలు రూపం చూశాను కదా! ఇంతకీ మీ ఇద్దరు ఎవరు?" అని క్యూబ్ వాళ్ళ వైపు చూసి అడిగాడు గబ్బర్ సింగ్.

"ముందు ముందుం ప్రయాణం మాతోనే కదా నీకే తెలుస్తుందిలే!" అని నవ్వుతూ చెప్పాడు క్యూబ్.

"అసలు నాకే ఈ బంపర్ ఎవరు ఎందుకు వచ్చింది." అని అనుమానంగా అడిగాడు గబ్బర్ సింగ్.

"మీ పూర్వీకులు తపస్సు చేసి ఈ శక్తిని సంపాదించారు వాళ్ల తపస్సు ఫలితం వారసుడువి అయిన నీకు మళ్ళీ ఆ శక్తీ వచ్చింది." అని చెప్పాడు నంద.

"అబ్బో! ఆస్తులు ఇవ్వకపోయినా ఈ శక్తి ఇచ్చారు అన్నమాట! ఇంక మీ ముగ్గురు నన్ను వదలరు నా పక్కనే ఉంటారు అర్థమైంది.

మిమల్ని వదిలి పారిపోవడానికి కూడా కుదరదు క్షణాల్లో పట్టుకుంటారు." అని ఏడుస్తూ భూషణ్ వాళ్ళతో పాటు ట్యాంక్ మీద కూర్చుని క్యూబ్ వైపు చూసి

"మీ ఇద్దరి గురించి చెప్పలేదు సరే ధర్మ, గుప్తా ఎవరో కనీసం అదైనా చెప్పండి." అని అడిగాడు గబ్బర్ సింగ్.

"యమధర్మరాజు చిత్రగుప్తుడు." అని చెప్పాడు భూషణ్.

ఆ మాటకి షాక్ అయి చూస్తూ "ఏంటి? డైరెక్ట్ గా యమధర్మరాజులా వారు వచ్చేసారా? ఇంక మాతో పని ఏంటి సార్ వాళ్ళు చూసుకుంటారు కదా!" అని నవ్వుతూ అడిగాడు గబ్బర్ సింగ్.

"మేము మీకు దారి మాత్రం చూపిస్తాము వెళ్ళవలసింది మీరే!" అని చెప్పాడు నంద.

"ఓహో! మాకు ఈ ఆఫర్ కూడా ఉందా..? అక్కడికి వెళ్లిన తర్వాత మనిషి రెండు ముక్కలు చేసే తోడేలుని చూపిస్తారు దానిని చంపే బాధ్యత మాది అంతే కదా!" అని అడిగాడు గబ్బర్ సింగ్.

"అవును! నువ్వు చాలా తెలివైన వాడివి నిన్నే అందరికంటే ముందు నడిపిస్తాము." అని చెప్పాడు క్యూబ్.

"సార్! యమధర్మరాజుల వారు మనతోపాటే ఉన్నారు కాబట్టి  నాకు ఈ శక్తి ఇచ్చిన మా ముత్తాతని ఒక్కసారి చూపించండి ప్లీజ్!" అని అడిగాడు గబ్బర్ సింగ్.
[+] 7 users Like SivaSai's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
రుద్రం భజే! ఎపిసోడ్ 40



ఫ్యాక్టరీ దగ్గర వచ్చిన నాయక్ కి అతని అసలు రూపం చూపించి యోధ తో పాటు దీప్తి, నీతూ లు వెళ్లడానికి ఒప్పించాడు విభీషణుడు.

భూషణ్ అసలు రూపం చూసిన గబ్బర్ సింగ్ ని పక్కకు తీసుకువెళ్లి తనకి ఆ శక్తి ఎలా వచ్చిందో చెప్పి ముందు ముందు నీతో చాలా అవసరం ఉందని చెప్పాడు నంద.

************

కారులో నాయక్ ని తీసుకు వెళుతూ "సార్! మీరు ఇంత ఈజీగా దీప్తి వాళ్ళని పంపించడానికి ఒప్పుకుంటారు అనుకోలేదు." అని చెప్పాడు యోధ.

"నేను అంత ఈజీగా ఒప్పుకోలేదు భూషణ్ వాళ్ళు ఒప్పించారు." అని చెప్పాడు నాయక్.

"ఆ ముగ్గురు ఏజెంట్స్  మీకు ఎక్కడ దొరికారు సార్! భలే మనుషులు దైవం మమ్మల్ని పంపించింది అని చెబుతున్నారు." అని నవ్వుతూ అన్నాడు యోధ.

"నిజమే అనుకుంట! దైవమే మిమ్మల్ని అందరిని ఒకచోటికి చేర్చినట్లు ఉంది. ఆ పద్మన్ని తీసుకొచ్చే క్రమంలో నీ తండ్రి తో పాటు వెళ్లిన ఇద్దరు ఏజెంట్లు సాదిక్, పాండే అక్కడే చనిపోయారు.

ఆ ఇద్దరి  ఏజెంట్ లా పిల్లలే దీప్తి, నీతూలు అందుకే అనుకుంటా మళ్లీ ఆ పద్మాన్ని గమ్యానికి చేర్చడానికి మళ్లీ మీ ముగ్గురు కలిశారు." అని చెప్పాడు నాయక్.

ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "సార్! అంటే దీప్తి మీ అమ్మాయి కదా!" అని అడిగాడు యోధ.

"నో! సాదిక్ కుతురు అతను చనిపోయాడు అని చెప్పడానికి నేనే డైరెక్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అప్పటికే అతని భార్య చనిపోయింది.

దేశం కోసం చనిపోయిన ఒక ఏజెంట్ కూతురు అనాధల పెరగకూడదు అని నా సొంత కూతురు లాగా పెంచాను, ఈ విషయం దీప్తికి కూడా తెలియదు." అని చెప్పాడు నాయక్.

"మరి నీతూకి తన తండ్రి ఏజెంట్ అని ఈ మిషన్ లో  చనిపోయాడని తెలుసా?" అని అడిగాడు యోధ.

"అసలు నీతూ కి తన తండ్రి ఏజెంట్ అనే విషయం తెలీదు వాళ్ళ అమ్మ కూడా తనకి చెప్పొద్దు అంది. కానీ కాలం తనని సెక్యూరిటీ అధికారి గా చేసి ఇక్కడకు తీసుకుని వచ్చింది." అని చెప్పాడు నాయక్.

ఆ మాట విని "అలా అయితే! ఆ పద్మాన్ని అలాకపురికి చేర్చడం మా ముగ్గురి బాధ్యత అన్నమాట!" అని చెప్పాడు యోధ.

కార్ స్లో అవ్వడం తో కిందకి దిగుతూ "ఎస్! అది మీ ముగ్గురి బాధ్యత! మిషన్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిన వాళ్ళందరి సేఫ్గా తీసుకువస్తావని నీ మీద నాకు నమ్మకం ఉంది." అని చెప్పాడు నాయక్.

"ఎస్ సార్! మీకు మాటిస్తున్నాను అందర్నీ సేఫ్గా వెనక్కి తీసుకొస్తాను, నాకు తోడుగా నా ఇష్టదైవం ఎప్పుడూ ఉంటుంది." అని గుండెల మీద ఉన్న సింబల్ ని చూపించాడు యోధ.

చాతి మీద ఉన్న గదా సింబల్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ "గుడ్ లక్!" అని చెప్పి హడావిడిగా ఆఫీసులోకి వెళ్లి లాకర్ ఓపెన్ చేసి ఫైల్ చూస్తూ ఫోన్ తీసి కాల్ చేసి "మిస్టర్ ముకుంద్! అర్జెంటు ఒకసారి నాకు క్యాబిన్ కి రండి." అని చెప్పాడు నాయక్.

"ఓకే సర్ ఫైవ్ మినిట్స్!" అని చెప్పి ఫోన్ పెట్టేసి ఆఫీసులో ఉన్న నాయక్ దగ్గరికి వచ్చి "వాట్ హప్పెండ్ సార్! అర్జెంట్గా రమ్మన్నారు?" అని అడిగాడు ముకుంద్.

"25 సంవత్సరాల క్రితం మీకు నేను ఒక ఫైల్ చూపించను దాని మీద స్టడీ చేయడానికి మీరు చాలా ప్లేస్ లు తిరిగారు మీరు ఇచ్చిన రిపోర్ట్ లో ఛాతి మీద గద సింబల్ ఉన్న పెయింటింగ్ ఫోటో ఒకటి కనిపించింది దాని గురించి నేను తెలుసుకోవాలి." అని అడిగాడు నాయక్.

"సర్! ఆ ఫైల్ లో ఉన్న కొన్ని వివరాలను బట్టి నేను హిమాలయాస్ దగ్గరకు వెళ్ళాను నేను చెప్పిన దాన్ని బట్టి  ఒక సాధువు నన్ను అక్కడకి దూరంగా ఉన్న గుహలోకి తీసుకువెళ్లాడు అక్కడ గోడ మీద ఈ  ఈ పెయింటింగ్స్ కనిపించాయి." అని చెప్పాడు ముకుంద్.

"ఆ సాధువు ఈ పెయింటింగ్స్ గురించి ఏమైనా చెప్పాడా?" అని ఆత్రుతగా అడిగాడు నాయక్.

"ఎస్ సార్!  ఆ సాధువు మీరు వెతుకుతున్న దానికి సమాధానం ఛాతి మీద ఈ గుర్తు ఉన్న వ్యక్తి ద్వారానే తెలుస్తుంది అతనికి సహాయం చేయడానికి దైవమే భూమి మీదకి వస్తుంది అని చెప్పాడు.

అప్పుడు నేను దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు కానీ నాకు ఆ పెయింటింగ్స్ చూసిన తర్వాత భవిష్యత్తులో ఏదో ప్రమాదం రాబోతుంది దానిని అడ్డుకోవడానికి దైవం ఆ సింబల్ ఉన్న మనిషిని ఎంచుకుంది అని అర్థం వచ్చే విధంగా ఉన్నాయి  అనిపించింది అందుకే వాటిని ఫొటోస్ తీసాను." అని చెప్పాడు ముకుంద్.

"మీ గెస్సింగ్ ప్రకారం ఆ పెయింటింగ్స్ ఎన్ని సంవత్సరాల క్రితం గీశారు అనిపించింది. " అని అడిగాడు నాయక్.

"అది అంచనా వేయడం చాలా కష్టం సార్! నాకు తెలిసి యుగలకి ముందు గీసి ఉండొచ్చు!" అని చెప్పాడు ముకుంద్.

ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "అంటే! ఇలా జరుగుతుందని అప్పుడే ఈ పెయింటింగ్స్ వేసారా?" అని అక్కడ ఉన్న దేవుడి ఫోటో చూసి నమస్కరించి "భారతదేశ పుణ్యభూమి అనే మరొకసారి నిరూపితమైంది." అని సంతోషంగా చూస్తూ చెప్పాడు నాయక్.

"ఏమైంది సార్! అంత ఎంగేజ్మెంట్ గా ఉన్నారు." అని అడిగాడు ముకుంద్.

"పెయింటింగ్ లో ఛాతి మీద సింబల్ ఉన్న మనిషిని నేను డైరెక్ట్ గా చూశాను." అని చెప్పాడు నాయక్.

ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ "ఇంపాజిబుల్! మీరు చెప్పింది నిజమైతే ఆ సాధువు చెప్పినట్లు అతనికి సహాయం చేయడానికి దైవమే కదలి వస్తుంది." అని చెప్పాడు ముకుంద్.

"ఎస్! ఆ దైవంతో పాటు మనం కూడా అతనికి హెల్ప్ చేద్దాము వెంటనే ప్రైమ్ మినిస్టర్ గారిని కలవాలి పదండీ." అని చెప్పి హడావిడిగా అక్కడి నుంచి వెళ్ళాడు నాయక్.

**************

ల్యాబ్ దగ్గర దీర్ఘ ఆలోచనలో ఉన్న రేపాలా దగ్గరికి వెళ్లి "నీతో ఫోన్లో మాట్లాడింది ఎవరు? అసలు నీ గురించి  అతనికి ఎలా తెలిసింది?" అని అనుమానంగా అడిగాడు కళింగ.

"ఆ విషయమే నాకు కూడా అర్థం కావడం లేదు నేను బాల్యంలో నా గురువుని కలిసిన తర్వాత బాహ్య ప్రపంచంలోకి రాలేదు, నేను కలిసిన మొదటి వ్యక్తి వి నువ్వే!

నీకు కూడా నా గురించి అన్ని విషయాలు తెలియదు, కానీ అతను నా వంశం గురించి కూడా చెప్పాడు." అని ఆశ్చర్యంగా చూస్తూ చెప్పాడు రేపాలా.

"నువ్వు ఎదుటి వ్యక్తి మాట వింటే చాలు కదా అతను ఎవరో వెంటనే కనిపెడతావు అలాంటిది అతని గురించి తెలుసుకోలేకపోయావా..?" అని అడిగాడు సయ్యద్.

"ఒకవేళ నువ్వు వెతుకుతున్న సింబల్ ఉన్న మనిషి కాదు కదా!" అని అనుమానంగా అడిగాడు కళింగ.

"నాకు అదే అనుమానం వచ్చింది ఒకవేళ ఆ గుర్తు ఉన్న మనిషి అయితే మనం వశపరచుకోవడం కష్టం! అతని శక్తికి సమవుజ్జి అయిన శక్తిని తయారు చెయ్యాలి." అని చెప్పాడు రేపాలా.

"నువ్వు ఆ పనిలో ఉండు వాడు మన ప్లేస్ లోకి ఎంటర్ అవ్వగానే ఏం చేయాలో నాకు బాగా తెలుసు!" అని చెప్పాడు సయ్యద్.

"యంగ్ వాళ్ళని కిడ్నాప్ చేసింది ఇండియన్ మిలిటరీ అనుకుని సోల్జర్స్ ని కిడ్నాప్ చేసి తప్పు చేశాము." అని చెప్పాడు చింగ్ యా.

"ఆ సోల్జర్స్ ని చంపేసి కనపడకుండా సమాధి చేసేయండి." అని చెప్పాడు కళింగ.

"నో నో!  ఆ మిస్టేక్ చేయకూడదు వాళ్లు బతికున్నంత సేపు మనం సేఫ్ గా ఉంటాము, నాకు తెలిసి వాళ్ళ కోసం ఇండియన్ మిలట్రీ శాటిలైట్ లో వెతకడం స్టార్ట్ చేసి ఉంటుంది.

ఈ ఏరియాలోనే ఉన్నారని తెలుసుకుంటారు రెండు దేశాలతో ఈ విషయం గురించి ఇండియన్ గవర్నమెంట్ మాట్లాడుతుంది మనం చిన్న పొరపాటు చేసిన ఇరుక్కుపోతాము." అని చెప్పాడు చింగ్ యా.

"అవును! వాళ్లు బతికి ఉంటేనే మనం సేఫ్ ఇప్పుడు ఇండియాలో ఉంది పాత గవర్నమెంట్ కాదు ఏ చిన్న పొరపాటు జరిగిన  వాళ్ళ మిలటరీ  పాకిస్తాన్ లోకి కుడా వచ్చి క అటాక్ చేస్తున్నారు." అని చెప్పాడు సయ్యద్.

"సరే! సోల్జర్స్ ని శాటిలైట్ సిగ్నల్ కి దొరకకుండా ఉండే ప్లేస్ లో ఉంచి మంచు తోడేళ్ళని కాపలాగా పెడతాను, మీరు ఇక్కడికి వచ్చే వాళ్ళ దగ్గర నుంచి ఆ వస్తువుని యంగ్ ని సేఫ్ గా తీసుకురండి." అని చెప్పాడు కళింగ.

"ఆ సంగతి నేను చూసుకుంటాను." అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడు సయ్యద్.

చింగ్ యా వైపు చూసి "ఇండియన్ మిలిటరీ కి ఈ ప్లేస్ గురించి తెలియకూడదు." అని చెప్పాడు కళింగ.

"ఓకే! ఆ విషయం నేను చూసుకుంటాను." అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడు చింగ్ యా.

కళింగ వైపు చూస్తూ "నేను అనుమానించినట్లే మనతో మాట్లాడిన వ్యక్తికి దైవం సహాయం చేస్తుంది." అని సీరియస్ గా చూస్తూ చెప్పాడు రేపాలా.

"అవునా? మరి ఇప్పుడు ఏం చేద్దాము?" అని అడిగాడు కళింగ.

"ఇలా జరుగుతుందని నేను ముందే చెప్పా కదా! అందుకే నా శక్తిని ఉపయోగించి తయారు చేసిన ఆయుధాలను సిద్ధంగా ఉంచు వాళ్లకి దైవం మార్గం మాత్రమే చూపించగలదు నా మంత్ర శక్తి ముందు మానవ శక్తి నిలబడలేదు." అని నవ్వుతూ చెప్పాడు రేపాలా.

***********

ఢిల్లీ ఫ్యాక్టరీ దగ్గర ఉదయం ధర్మ, గుప్తాలని చూసి "సూపర్! సేమ్ యంగ్, భూపాల్ సింగ్ లానే ఉన్నారు నిజమైన వాళ్ళని ఇక్కడికి తీసుకు వస్తే మేము కూడా గుర్తుపట్టలేము." అని చెప్పింది నీతూ.

ఆ మాటకి అక్కడ ఉన్న వాళ్ళవైపు చూస్తూ "రియల్ గా  చెప్పాలి అంటే సరిగ్గా కుదరలేదు అనుకున్నాను కంప్లీట్ అయిన తర్వాత చూస్తే వీళ్ళకి నేనే మేకప్ వేసానా అనిపించింది." అని ఆశ్చర్యంగా చూస్తూ చెప్పాడు విఠల్.

ఆ మాటకి సైలెంట్ గా చూస్తూ "అసలు విషయం తెలిస్తే గుండె ఆగి చస్తాడు, వాళ్లకి నువ్వు మేకప్ వేయడం ఏంటి రా... వాళ్ళు ఎలా కావాలంటే మారిపోతారు. " అని మనసులో అనుకున్నడు గబ్బర్ సింగ్.

ఆ మాట విని ఒక్కసారిగా గబ్బర్ సింగ్ వైపు తలతిప్పి చూసి "ఏంటి అంటున్నావు?" అని అడిగారు అందరు.

అది చూసి 'నాకు మనసులో అనుకునే అదృష్టం కూడా లేదు కదా!' అని దిగాలు గా పేస్ పెట్టాడు గబ్బర్ సింగ్.
[+] 7 users Like SivaSai's post
Like Reply
రుద్రంభజే! ఎపిసోడ్ 41



ఫ్యాక్టరీ దగ్గర యంగ్ వాళ్ల రూపంలో ఉన్న ధర్మ వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తూ విఠల్ ని అందరు మెచ్చుకుంటూ ఉండగా వాళ్లకి మేకప్ వేయ్యాలా ఏమిటి వీడి బొంద ఎలా కావాలంటే అలా మారిపోతారు అని మనసులో అనుకున్నాడు గబ్బర్ సింగ్.

**************

ఆ మాటకి అందరూ తన వైపు కోపంగా చూస్తూ ఉండడం చూసి "నాకు మనసులో అనుకునే అదృష్టం కూడా లేదు కదా మర్చిపోయాను." అని గుటకలు మింగుతూ ఉన్న గబ్బర్ సింగ్ వైపు చూసి

"నీకు ఏది కరెక్ట్ గా మాట్లాడడం రాదా!" అని కోపంగా అడిగింది నీతూ.

"సారీ మేడం! మనసులో అనుకునేది బయటకి అనేసాను." అని విఠల్ వైపు కంగారుగా చూస్తూ "మీరు బాగా మేకప్ చేశారు సార్!" అని చెప్పాడు గబ్బర్ సింగ్.

"థాంక్యూ!" అని చెప్పి "నేను వేసిన మేకప్ త్రీ డేస్ ఉంటుంది తర్వాత టచ్ అప్ ఇవ్వకపోతే వీళ్ళని ఎవరైనా ఈజీగా గుర్తుపడతారు మీరు ఈ లోపు వర్కు కంప్లీట్ చేసుకోవాలి." అని చెప్పాడు విఠల్.

"మీరేమీ కంగారు పడకండి ఆ ఇద్దరికి మేకప్ టచ్ అప్ ఇవ్వడానికి మా క్యూబ్ ఉన్నడు." అని చెప్పాడు నంద.

"ఎస్! ఆ విషయం నేను చూసుకుంటాను ఇప్పుడు మనం వాళ్ళ ప్లేస్ కి వెళ్లిన తర్వాత ఎవరెవరు ఏం చేయాలో ముందుగా అనుకుంటే బాగుంటుంది." అని చెప్పాడు క్యూబ్.

"అవును! రేపాలా తో మాట్లాడిన యోధని ముందు పెట్టడం మంచిది కాదు కాబట్టి నాయకుడి స్థానంలో గబ్బర్ సింగ్ ఉంటాడు మనం వెనక ఉండి చేయవలసిన పని చేద్దాము." అని చెప్పాడు భూషణ్.

ఆ మాట విని "ఏంటి? నేను ముందు నడవాలా..! మహారాజా మీకు ఇది న్యాయమా!" అని ఏడుపు మొహం పెట్టుకుని అడిగాడు గబ్బర్ సింగ్.

"ఏంటి భూషణ్ ని మహారాజుని చేసావు?" అని నవ్వుతూ అడిగింది పూజా.

"నాకు భయం వేసినప్పుడు అలాగే మాట్లాడుతాను నువ్వు ఉండవమ్మా!" అని టెన్షన్ గా చూస్తూ చెప్పాడు గబ్బర్ సింగ్.

దగ్గరికి వెళ్లి "యామాధర్మరాజు తోడు ఉండగా నీకు భయమెందుకు నీతో పటే ఉంటారు కదా!" అని చెప్పాడు క్యూబ్.

"అవునా? అయితే నేనే ముందుంటాను." అని సంతోషం గా చెప్పాడు గబ్బర్ సింగ్.

"ఓకే! వీళ్ళిద్దరితోపాటు గబ్బర్ సింగ్ ఉంటాడు." అని చెప్పి ఎవరెవరు ఏం చేయాలో వివరంగా చెప్పాడు యోధ.

అంతలో మిలటరీ వ్యాన్ రావడంతో  "స్టార్ట్ అవుదామా? మనకోసం సార్ వెయిట్ చేస్తూ ఉంటారు." అని చెప్పింది నీతూ.

"సరే! ఈ ఆట చాలా బాగుంది." అని చెప్పి తన చేతిలో ఉన్న కర్రని గబ్బర్ సింగ్ చేతిలో పెట్టి వ్యాన్ ఎక్కాడు ధర్మ.

గుప్తా తో పాటు వ్యాన్ ఎక్కుతూ "సార్! ఇది యమ పాశమ?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు గబ్బర్ సింగ్.

"అవును!" అని చెప్పి సూట్ కేస్ చేతిలో పెట్టి "ఇది అందరి లెక్కలు రాసే పుస్తకం రెండు జాగ్రత్తగా ఉంచు." అని చెప్పాడు గుప్తా.

ఒక చేతిలో సూట్ కేస్, ఒక చేతిలో కర్ర చూసి "వీటిని మోయడానికి నన్ను వీళ్ళతో పాటు ఉంచుకున్నట్లు ఉన్నారు." అనుకుంటూ "బాబోయ్! మనసులో అనుకున్న వినపడుతుంది కదా!" అని వ్యాన్ ఎక్కడు గబ్బర్ సింగ్.

వ్యాన్ ఎక్కుతూ "పుష్కర్! మన వస్తువులు మొత్తం తీసుకొచ్చేయండి ఇక్కడ ఏమి ఉండకూడదు." అని చెప్పాడు యోధ.

"ఓకే సార్!" అని చెప్పి అక్కడ ఉన్నవి మొత్తం వ్యాన్లో ఎక్కించి మిలిటరీ హెడ్ క్వార్టర్స్ దగ్గరికి బయలుదేరారు అందరు.

మిలిటరీ హెడ్ కోటర్స్ వచ్చి వ్యాన్ దిగుతున్న యోధ వాళ్ల దగ్గరికి వెళ్లి "బోర్డర్ దాటి వెళుతున్న మీ అందరి ఐడెంటిటీ ఇండియన్ మిలిటరీ కి వెళ్ళింది మిమ్మల్ని ఎవరు ఆపరు
కానీ బోర్డర్ దాటినా తర్వాత మీరే హ్యాండిల్ చేసుకోవాలి!" అని చెప్పి ఒక బాక్స్ చేతిలో పెట్టి

"మీరు సేఫ్గా అక్కడి నుంచి బయటికి వచ్చిన తర్వాత దీనిని ఓపెన్ చెయ్!" అని చెప్పాడు నాయక్.

"ఓకే సార్!" అని సెల్యూట్ చేసి అక్కడ రెడీగా ఉన్న మిలటరీ చాపర్ వైపు చూసి "మాకు వెళ్లడానికి ఇవి అవసరం లేదు సార్!" అని చెప్పాడు యోధ.

ఆ మాటకి అనుమానంగా చూస్తూ "మరి బోర్డర్ దగ్గరికి ఎలా వెళ్తారు?" అని అడిగాడు నాయక్.

"మాకు సూర్య భగవానుడు తోడు ఉంటాడు." అని నవ్వుతూ చెప్పాడు నంద.

"సూర్యభగవానుడు తోడు ఉంటాడా..? ఉంటే మాత్రం ఎలా వెళ్తారు?" అని అనుమానంగా చూస్తున్న నాయక్ ని చూసి తన దగ్గర ఉన్న పద్మాన్ని బయటకు తీసి

"సార్! మేము దీని ద్వారా వెళతాము." అని చెప్పాడు యోధ.

ఆ మాటకి నవ్వుతూ అక్కడ ఉన్న ఆఫీసర్ వైపు చూసి "అందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి చాపర్ కుడా ఇక్కడి నుంచి పంపించేయండి." అని చెప్పాడు నాయక్.

"ఓకే సార్!' అని సెల్యూట్ చేసి చాపర్ ని అక్కడి నుంచి పంపించి సోల్జర్స్ మొత్తం మొత్తం బయటికి వెళ్లిపోయారు.

అక్కడినుంచి అందరూ బయటికి వెళ్లడంతో తన దగ్గర ఉన్న పద్మన్ని బయటకి తీసి సూర్యకిరణం పడేటట్టు చేసి బ్లాక్ హోల్ ఓపెన్ అవడంతో నాయక్ వైపు చూసి "సార్! విజయంతో తిరిగి వస్తాము." అని మొదటగా లోపల అడుగు పెట్టాడు యోధ.

లోపలికి వెళ్ళిన యోధ కనిపించకపోవడంతో ఆశ్చర్యంగా చూస్తున్న నాయక్ దగ్గరికి వెళ్లి "వండర్ సార్" దేవుడు ఉన్నాడో లేడో నాకు తెలియదు.

కానీ మన పూర్వీకులు మన కన్నా గొప్ప సైంటిస్టులు అని మాత్రం తెలుసుకున్నాను." అని కళ్ళు ఆర్పకుండా చూస్తూ  చెప్పాడు ముకుంద్.

"ఎస్!" అని చెప్పి బ్లాక్ హోల్ లోకి వెళ్లడానికి రెడీ అవుతున్న  కూతురు దగ్గరికి వెళ్లి "ఈ మిషన్ లో నుంచి నీకు వెనక్కి వచ్చేయాలి అనిపించినప్పుడు ఈ కవరు ఓపెన్ చెయ్!" అని చేతికి ఇచ్చాడు నాయక్.

"ఓకే డాడ్!" అని హగ్ ఇచ్చి యోధ వెనకాల బ్లాక్ హోల్ లోపలికి వెళ్ళింది దీప్తి.

భూషణ్ వైపు చూసి "అంత మీమేదే భారం!" అని చెప్పాడు నాయక్.

ఆ మాటకి నవ్వుతూ "దేవుడి మీద భారం వేసి మనిషి మీద నమ్మకం ఉంచండి." అని చెప్పాడు భూషణ్.

నాయక్ దగ్గరికి వచ్చి సెల్యూట్ చేసి "సార్! నా తండ్రి గురించి యోధ నాకు అన్ని విషయాలు చెప్పాడు, నా బాధ్యత నెరవేర్చడానికి వెళుతున్నాను." అని చెప్పి బ్లాక్ హోల్ లోకి వెళ్ళింది నీతూ.

అక్కడ ఉన్న ధర్మ, గుప్తాల వైపు చూసి "మీరు చూపించిన ధైర్యం దేశం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది జాగ్రత్తగా తిరిగి రండి." అని చెప్పాడు నాయక్.

"సార్! నాకు కూడా బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి ఎందుకంటే వాళ్ళిద్దరితోపాటు టెర్రరిస్టుల దగ్గరికి వెళ్ళేది నేనే!" అని చెప్పాడు గబ్బర్ సింగ్.

"పదపద! నీకు పరమవీరచక్ర ఇస్తారులే!" అని గబ్బర్ సింగ్ చెయ్యి పట్టుకుని బ్లాక్ హోల్ లోకి తీసుకువెళ్ళాడు క్యూబ్.

అక్కడ ఉన్న మిగతా వాళ్ళు కూడా బ్లాక్ హోల్ లోకి వెళ్లడంతో క్లోజ్ అవ్వడం చూసి "సార్! వీళ్ళలో నలుగురు మాత్రమే మిలిటరీ లాగా కనబడుతున్నారు ప్రాబ్లం ఏమి ఉండదు కదా!" అని అడిగాడు ముకుంద్.

ఆ మాటకి ధైర్యంగా చూస్తూ "యుద్ధం చేయడాకి లంక సముద్ర తీరంలో ఉన్న రాముల వారి సైన్యాన్ని చూసి మామూలు మనుషులు వానరులు వచ్చారు వీళ్ల నాతో యుద్ధం చేసేది అని తక్కువగా అంచిన వేసి మనసులో నవ్వుకున్నాడు అంట రావణాసురుడు.

ఎవరిలో ఏ శక్తి ఉందో యుద్ధ రంగంలోకి దిగితేనే కదా తెలిసేది. ఆ దైవమే వీళ్ళని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళింది మనం కళ్ళారా చూశాం కదా! ఇంకా వీళ్ళకి ఆ దైవమే తోడు ఉంటుంది." అని చెప్పి ఫోన్ తీసి కాల్ చేసి

"త్రివిదా దళాలను ఎలర్ట్ చెయ్యండి. బోర్డర్ శాటిలైట్స్ మొత్తం ఆన్ చేయండి శత్రు దేశాల సైనికుల కదలికలు ఎప్పటికప్పుడు మనకి తెలియాలి." అని చెప్పాడు నాయక్.

**************

పర్వతాలు దగ్గర ఉన్న ల్యాబ్ లో కలింగ దగ్గరకు వచ్చి "ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది బోర్డర్లో సోల్జర్స్ అలర్ట్  గా ఉన్నారు రెండు దేశాల వైపు ఆయుధాలు ఎయిమ్ చేసి ఉంచారు.

మిలిటరీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఎలర్ట్ మెసేజ్ వచ్చింది మన దగ్గర సైనికులు ఎవరు ఉండడం కుదరదు అందరూ క్యాంప్స్ దగ్గరికి వెళ్లాలి  శాటిలైట్ లో ఇక్కడ సోల్జర్స్ ఉన్నట్లు  ఇండియన్ మిలిటరీ చూసారు అంటే వెంటనే అటాక్ చేస్తారు." అని చెప్పాడు చింగ్ యా.

"ఈ ల్యాబ్ కి నా సైన్యం రక్షణ చాలు మీ సైన్యాన్ని వెనక్కి పంపించండి." అని చెప్పాడు రేపాలా.

"అసలు వాళ్ళు పర్వతాలు దాటి ల్యాబ్ వరకు రావాలి కదా సయ్యద్ తన మనుషులతో రెడీగా ఉన్నాడు." అని చెప్పాడు కళింగ.

"ఎస్! ఈ ల్యాబ్ కి రేడార్ సిస్టం పెట్టించాను ఇండియన్ మిలిటరీ ఎయిర్ ఎటాక్ చేయలేరు ఒకవేళ ఎటాక్ చేయాలి అంటే డైరెక్ట్ గా రావాల్సిందే!" అని చెప్పాడు చింగ్ యా.

ఆ మాటకి నవ్వుతూ " డైరెక్ట్ గా ల్యాబ్ దగ్గరికి వచ్చి బతికే ఛాన్స్ లేదు నేను తయారు చేసిన జంతువులు  lఆకలితో ఉన్నాయి." అని నవ్వుతూ చెప్పాడు కళింగ.

"ఓకే గుడ్! ఇప్పుటి వరకు ఇండియన్ బోర్డర్ దాటి మన బోర్డర్ లోకి ఎవరు ఎంటర్ అయినట్టు ఇంటిమేషన్ లేదు అసలు వాళ్ళు బయలుదేరారా..?" అని అడిగాడు చింగ్ యా.

"నాతో మాట్లాడిన వ్యక్తి మాటలను బట్టి కచ్చితంగా వస్తారు." అని తనతో పాటు ఉన్న మనిషి చాతి మీద సింబల్ ని చూపించి

"నేను సృష్టించిన శక్తి హిడిచి అతన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు." అని నవ్వుతూ చెప్పాడు రేపాలా.

హిడిచి వైపు ఆశ్చర్యంగా చూస్తూ "జింగ్ ని ఇలా తయారు చేసావా..?" అని అడిగాడు కళింగ.

"అవును! జింగ్ శరీరంలోకి నా పూర్వీకుల శక్తిని పంపించాను ఇతన్ని జయించడం ఎవరి తరం కాదు! వాళ్లు రావడం ఆలస్యం ఆ వస్తువుని చేజిక్కించుకొని అలకాపురి లో నా పాదం పెడతాను." అని నవ్వుతూ చెప్పాడు రేపాలా.



" రుద్రంభజే! ఎపిసోడ్ 41 " రచనకు రేటింగ్ ఇవ్వండి
[+] 10 users Like SivaSai's post
Like Reply
Sooper thrilling ga undi.. chaduvutunte
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Excellent update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
Mee writing skills takul ni ploi unnayi. Excellent update.
[+] 1 user Likes styleraja's post
Like Reply
Patriotic thriller story
[+] 1 user Likes Sunny73's post
Like Reply
(15-05-2026, 06:44 PM)styleraja Wrote: Mee writing skills takul ni ploi unnayi. Excellent update.

Vadhu Ayana Chala Pedda Manisi Naku Chala Istam Takul Gari Stories Ante

Please Don't Compare With Others
[+] 1 user Likes SivaSai's post
Like Reply
రుద్రం భజే! ఎపిసోడ్ 42



ల్యాబ్ లోకి జింగ్ ని తీసుకొచ్చి తన చాతి మీద ఉన్న సింబల్ చూపించి ఇకనుంచి ఇతని పేరు హిడిచి ఇతని శరీరంలోకి నా పూర్వీకుల శక్తిని ప్రవేశపెట్టాను అని చెప్పాడు రేపాలా.

************

హిడిచి ని ఎవరు ఎదుర్కోలేరు అని చెప్పిన రేపాలా వైపు చూసి "జింగ్ పిరికివాడు కళింగ సృష్టించిన తోడేలు అరుపు వింటేనే వణికిపోయేవాడు,

అలాంటిది వచ్చే వాడు నీతో సమానమైన వాడు అనుకుంటున్నావు మారి ధైర్యంగా ఎలా ఎదుర్కొంటాడు?" అని అనుమానంగా అడిగాడు చింగ్ యా.

ఆ మాటకి చింగ్ యా వైపు చూసి "రేపాలా శక్తి మీద డౌట్ వద్దు అతను ఏదైనా చేయగలడు." అని కాన్ఫిడెంట్ గా చెప్పాడు కళింగ.

"నాశక్తి మాటలతో కాదు చేతలతో చూపిస్తాను, కళింగ నువ్వు సృష్టించిన రెండు తోడేళ్ళని బయటికి వదులు హిడిచి వాటితో పోరాడుతాడు." అని చెప్పాడు రేపాలా.

"నువ్వు చింగ్ యా మాటలు పట్టించుకోకు అనవసరంగా రెండు తోడేళ్ళని మనం నష్టపోతాము." అని చెప్పాడు కళింగ.

"ఆ తోడేళ్ల కన్నా శక్తివంతమైన మనుషుల్ని సృష్టించి  ఇస్తాను వాటిని బయటకు వదులు నా శక్తిని తక్కువ అంచనా వేసినా వాళ్లకి నేను ఏమిటో చూపించే వరకు
నా మనసు ప్రశాంతంగా ఉండదు." అని కోపంగా చూస్తూ చెప్పాడు రేపాలా.

"సరే!" అని అక్కడ ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేశాడు కళింగ.

బటన్ ప్రెస్ అవడంతో డోర్ ఓపెన్ అయ్యి భయంకరంగా అరుస్తూ భారీ తోడేళ్లు రెండు బయటికి వచ్చి ఖాళీ ప్లేస్ లో ఆవేశంగా పరిగెడుతూ ఉన్నాయి.

మంచు తోడేళ్ల వైపు చూస్తూ "వీటి బాడీలోకి బుల్లెట్స్ కూడా దిగావు, దాని పంజా దెబ్బ తగిలితే మనిషి పైకి లెగలేడు." అని ఆనందంగా చూస్తూ చెప్పాడు కళింగ.

హిడిచి వైపు చూసి "ఆ రెండు తోడేళ్ళని చీల్చి చెండాడి వాటి రక్తం తాగి నీ శక్తిని చూపించు!" అని కసిగా చెప్పాడు రేపాలా.

ఆ మాట విని షర్టు విప్పి శరీరాన్ని భారీ ఆకారంలోకి మార్చుకుని వేగంగా పరిగెడు తోడేళ్లు దగ్గరికి వెళ్ళాడు హిడిచి.

అక్కడికి వచ్చిన హిడిచి వైపు ఎర్రటి కళ్ళతో కసిగా చూస్తూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాయి రెండు తోడేళ్లు.

ఏమి జరుగుతుందా అని టెన్షన్ గా చూస్తూ ఉన్నాడు చింగ్ యా.

వేగంగా పరిగెత్తుకుంటూ వస్తున్న తోడేళ్లను చూసి ఒక కాలు మడిచి కొంచెం వంగి ముందుగా వచ్చిన తోడేలుని రెండు చేతులతో పట్టుకొని పైకి లేపి భయంకరంగా అరుస్తూ రెండు భాగాలుగా చేసి రక్తం తాగి "నా దాహం కాస్తా తీరింది." అని సంతోషంగా అరుస్తూ ఉన్నాడు హిడిచి.

అది చూసి చెమటలు తుడుచుకుని "రేపాలా! నీ శక్తి మీద నమ్మకం వచ్చింది జింగ్ ని మామూలు మనిషిగా మారమను నాకు చాలా భయంగా ఉంది." అని చెప్పాడు చింగ్ యా.

ఆ మాటకి నవ్వుతూ "అతని రక్త దాహం తీరితే గాని మళ్లీ మామూలు మనిషిగా మారడు." అని చెప్పి మరొక తోడేలు హిడిచి మీద ఎటాక్ చేయడం చూస్తూ ఉన్నాడు రేపాలా.

గాలిలోకి ఎగిరిన రెండో తోడేలు ని చూసి తను కూడా గాలిలోకి ఎగిరి దాని మెడ పట్టుకుని రక్తం తాగుతూ నేల మీదకి తీసుకువచ్చి బలంగా రెండు చేతులతో తోడేలు తలని వేరుచేసి దూరంగా గిరాటు వేసి

భయంకరంగా అరుస్తూ మళ్ళీ మామూలు మనిషిగా మారి తోడేళ్ల కోసం ఉంచిన నీళ్లతో స్నానం చేసి ల్యాబ్ లోపలికి వచ్చాడు హిడిచి.

ల్యాబ్ లోపలికి వచ్చిన హిడిచి భుజం మీద చేయి వేసి సంతోషంగా చూస్తూ "నా నమ్మకాన్ని నిలబెట్టావు!" అని కళింగ వైపు చూసి

"ఆ రెండు తోడేళ్ల ప్రాణాలని ఇద్దరి మనుషుల శరీరాల్లోకి పంపిస్తాను సిద్ధంచెయ్ ! వాళ్ళు హిడిచి కి సేవకులుగా ఉంటారు." అని చెప్పాడు రేపాలా.

ఆ మాటకి చింగ్ యా వైపు చూసి "రెండు మనుషుల బాడీ లు కావాలి!" అని చెప్పాడు కళింగ.

"ఈవినింగ్ కి ఏరేంజ్ చేస్తాను." అని చెప్పి హిడిచి వైపు భయంగా చూస్తూ ల్యాబ్ నుంచి బయటికి వెళ్ళాడు చింగ్ యా.

రేపాలా వైపు చూస్తూ "ఇక్కడ రెండు దేశాల ఆర్మీ ఉండదు ఒకవేళ ఇండియన్ మిలిటరీ ఎటాక్ చేస్తే  మనం ల్యాబ్ నీ కాపాడుకోవాలి నీ సైన్యాన్ని నిద్రలో నుంచి బయటకు తీసుకురా..!" అని చెప్పాడు కళింగ.

"నువ్వు అధైర్య పడకు మిత్రమా! నేను ఉండగా ల్యాబ్ దగ్గరికి ఎవరు రాలేరు నా సైన్యాన్ని నిద్ర లేపే సమయం వచ్చినప్పుడు తప్పకుండా పిలుస్తాను." అని చెప్పాడు రేపాలా.

"సరే!" అని ల్యాబ్ లోపలకి వెళ్లి తన ప్రయోగాలు చేసుకుంటూ ఉన్నాడు కళింగ.

************

బ్లాక్ హోల్ లో నుంచి బయటకువచ్చి తన వెనకాల అందరూ రావడం చూసి పద్మాన్ని జేబులో పెట్టుకున్నాడు యోధ.

బ్లాక్ హోల్ క్లోజ్ అవడంతో బ్యాగ్ లో నుంచి స్వెటర్ తీసి వేసుకుంటూ "చాలా చలిగా ఉంది మనం వాళ్ల ప్లేస్ కి వచ్చేసామా..?" అని డౌట్ గా చుట్టూ చూస్తూ అడిగింది పూజా.

"కళింగ మనకి పంపించిన లోకేషన్ కి ఇంకా కొంచెం దూరం వెళ్ళాలి, దగ్గర్లో ఉన్న గుడి దగ్గరికి రావాలని అనుకున్నాను కానీ ఇక్కడ గుడి ఏమీ కనపడటం లేదు." అని చుట్టూ చూస్తూ అడిగాడు యోధ.

ఆ మాటకి నవ్వుతూ అక్కడ ఉన్న మొక్కలు పక్కకి జరిపి "అదిగో శివాలయం! ఇక్కడ రోజు అశ్వద్ధామ వచ్చి పూజ చేసుకుంటాడు అంటారు.

అందుకే జనాలు ఎవరు లేని ప్లేస్ లో కూడా శివయ్యకి మారేడు దళాలు నందీశ్వరుడికి అరటి పళ్ళు పెట్టి ఉంచారు." అని చూపించడు భూషణ్.

"అవునా?" అని ఆశ్చర్యంగా చూస్తూ "పదండి దర్శనం చేసుకుని వాళ్ళు చెప్పిన ప్లేస్ కి స్టార్ట్ అవుదాము." అని చెప్పాడు యోధ.

"సరే!" అని అందరూ దర్శనం చేసుకుంటూ ఉండగా నందీశ్వరుడు దగ్గర ఉన్న రెండు అరటిపళ్లు తీసుకుని తింటూ ఉన్నాడు గబ్బర్ సింగ్.

అది చూసి "ఏంటయ్యా! నాకోసం పెట్టినా పళ్ళు నువ్వు తింటున్నావు?" అని అడిగాడు నంద.

ఆ మాటకి తినడం ఆపి ఆశ్చర్యంగా చూస్తూ "ఈ పళ్ళు మీకోసం పెట్టలేదు సార్! నందీశ్వరుడికి పెట్టారు ప్రసాదం కదా అని తీసుకుని కళ్ళకు అద్దుకొని మరి తింటున్నాను." అని నవ్వుతూ చెప్పాడు గబ్బర్ సింగ్.

"సరే తిను తిను! ప్రసాదం పెట్టి మేము తినే వరకు ఎవరు అగుతారు వెంటనే తీసుకొని తినేస్తారు కదా!" అని నిట్టూరుస్తూ చెప్పాడు నంద.

ఆ మాటకి క్యూబ్ దగ్గరికి వెళ్లి "మీరు ఇద్దరు విభీషణ మహా రాజు గారి సైన్యం కదా! మారి తనే నందీశ్వరుడు అయ్యినట్లు బాధపడుతున్నాడు ఏంటి?" అని నెమ్మదిగా అడిగాడు గబ్బర్ సింగ్.

అంతలో నందీశ్వరుడు చెవులో చెబుతున్న పూజా ని చూసి "నీ కోరిక శివయ్య దగ్గరికి చేరుతుందిలే తప్పకుండా తీరుతుంది." అని నవ్వుతూ చెప్పాడు నంద.

"అవునా థాంక్యూ!" అని సిగ్గుపడుతూ చెప్పింది పూజా.

ఆ మాట విని నంద దగ్గరికి వెళ్లి "ఏంటి? ఎవరైనా మనసులో అనుకుంటే నీకు వినపడుతుందా..?" అని అనుమానంగా అడిగాడు గబ్బర్ సింగ్.

"మనసులో అనుకుంటే వినపడదు నా చెవిలో చెబితే వినబడుతుంది." అని చెప్పాడు నంద.

"మనసులో అనుకుంటే నాకు వినపడుతుంది." అని షర్ట్ సరి చేసుకుంటూ చెప్పాడు గుప్తా.

"మీకు అన్ని వినబడతాయి ఇంతకీ ఆ అమ్మాయి ఏం కోరుకుంది?" అని ఆత్రుతగా అడిగాడు గబ్బర్ సింగ్.

"ఆ విషయాలన్ని నీకెందుకయ్యా! గబ్బర్ సింగ్ పోయిన పర్వాలేదు నేను క్షేమంగా వెనక్కి వెళ్ళాలి అనుకుంది." అని వెటకారంగా చూస్తూ చెప్పాడు క్యూబ్.

ఆ మాటకి నవ్వుతూ "ధర్మ గారు, గుప్తా గారు తోడు ఉండగా నాకేమీ అవుతుంది." అని ధైర్యంగా చెప్పాడు గబ్బర్ సింగ్.

"సరేగాని! నీకు మనం వెళ్లే దారిలో మాయ రూపంలో ఎవరైనా ఎదురుపడితే వెంటనే నాతో చెప్పు!" అని చెప్పాడు క్యూబ్.

"ఆ ఆఫర్ నా ఒక్కడికే ఉందా..! వాళ్లు మీకు కనపడరా..?" అని భయంగా చూస్తూ అడిగాడు గబ్బర్ సింగ్.

"ఇక్కడ అతీత శక్తులు ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళ మాయా ని మేము ఒక్కొక్కసారి కనిపెట్టలేము కానీ నీ కంటికి అందరూ కనపడతారు."  అని చెప్పాడు భూషణ్.

ఆ మాటకి భయంగా చూస్తూ "మిమ్మల్ని కాదు సార్! నాకు ఈ శక్తి ఇచ్చినందుకు మా ముత్తాతని అనాలి, పెద్ద పులి కోసం వేటగాడు మేకని వదిలినట్లు మీరు అందరూ కలిసి నన్ను వదులుతున్నారు ముందు ముందు ఏం జరుగుతుందో ఏమిటో!" అని టెన్షన్ గా చూస్తూ చెప్పాడు గబ్బర్ సింగ్.

"సరే ఇంక స్టార్ట్ అవుదామా? వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు." అని చెప్పి గబ్బర్ సింగ్ వైపు చూసి

"ముందు నువ్వు ఉండు నీ వెనకాల ధర్మ, గుప్తా, ముష్రు  వస్తారు మేము కొంచెం దూరంగా ఉంటాము, మీ దగ్గరికి ఎవరు వచ్చారో చూసిన తర్వాత మేము ఎంటర్ అవుతాము." అని చెప్పి ముష్రు చేతికి మైక్రోఫోన్ ఇచ్చి "ఎప్పటికప్పుడు మాకు ఇంటిమేషన్ ఇస్తూ ఉండు." అని చెప్పాడు యోధ.

"ఓకే సార్!' అని మైక్రో ఫోన్ ని తన చేతికి ఉన్న రింగ్ కింద పెట్టుకుని గబ్బర్ సింగ్ వైపు చూసి "రెడీ!" అని చెప్పాడు ముష్రు.

ఆ మాట విని వెటకారంగా చూస్తూ "రెడీ అంట రెడీ! వీడి సోమ్ము ఏం పోయింది పోతే నేనే కదా!" అని మనసులో అనుకున్నాడు గబ్బర్ సింగ్.

ఆ మాట విని "నువ్వు పోవులే కానీ మీకోసం వచ్చే వాళ్ళకి  అనుమానం రాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి నీ ఫేస్ లో భయం కనిపించింది అంటే వాళ్ళు ఈజీగా కనిపెట్టేస్తారు." అని చెప్పింది నీతూ.

"ఓకే మేడం!' అని ధర్మ ఇచ్చిన కర్ర, గుప్తా ఇచ్చిన సూట్ కేసు పట్టుకుని "భయపడకూడదు అంట! వచ్చే వాళ్ళు ఏమన్నా నా బెస్ట్ ఫ్రెండ్స్ ఆ..!" అనుకుంటూ ముందుకి వెళ్ళాడు గబ్బర్ సింగ్.

"యోధ! మేము ధర్మ వాళ్ళ వెనకాల వెళతాము మీరు వేరే వైపు నుంచి రండి." అని చెప్పి నంద, క్యూబ్ తో కలిసి వెళ్ళాడు భూషణ్.

"సరే!" అని నీతూ వాళ్ళని తీసుకుని వేరే వైపు నుంచి వెళుతూ "నేను చెప్పే వరకు ఎవరు గన్ యూస్ చేయకండి. అసలు వాళ్ళు ఎటాక్ మోడ్ లో ఉన్నారా నార్మల్ మోడ్ లో ఉన్నారో తెలుసుకోవాలి." అని చెప్పాడు యోధ.

కాసేపటికి కర్ర పట్టుకుని దర్జాగా నడిచి వస్తున్న గబ్బర్ సింగ్ ని చూసి "వీడే అనుకుంటా రేపాలా తో ఫోన్లో మాట్లాడింది. యంగ్ వాళ్ళని తీసుకొని ధైర్యంగానే వస్తున్నాడు.

పవర్ ఫుల్ మాంత్రికుడు అనుకుంటా చేతిలో మంత్రదండం కూడా ఉంది ఆ సూట్ కేసులో ఆ వస్తువు ఉందనుకుంటా!" అని మనసులో అనుకున్నడు సయ్యద్.



" రుద్రం భజే! ఎపిసోడ్ 42 " రచనకు రేటింగ్ ఇవ్వండి
[+] 8 users Like SivaSai's post
Like Reply
రుద్రం భజే! ఎపిసోడ్ 43




పర్వతాల దగ్గరలో కళింగ పంపిన లొకేషన్ కి ఒక చేతిలో కర్ర ఒక చేతిలో సూట్ కేసు పట్టుకుని నడిచి వస్తున్న గబ్బర్ సింగ్ ని దూరం నుంచి చూస్తూ వీడు పెద్ద మాంత్రికుడు లాగా ఉన్నాడు అనుకున్నడు సయ్యద్.

***********

దూరం నుంచి గబ్బర్ సింగ్ ని చూసి తన మనుషులని రెడీగా ఉండమని చెప్పి కళింగ కి కాల్ చేశాడు సయ్యద్.

ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి "సయ్యద్ టెల్ మీ? యంగ్ వాళ్ళు కనిపించరా..?" అని ఆత్రుతగా  అడిగాడు కళింగ.

"సైంటిస్ట్! యంగ్, భూపాల్ సింగ్, ముష్రు లని తీసుకుని ఒక్కడే వస్తున్నాడు, పెద్ద మాంత్రికుడు లాగా ఉన్నాడు ఒక చేతిలో మంత్రదండం మరొక చేతిలో సూట్కేస్ ఉంది. అందులో మనకు కావాల్సిన వస్తువు ఉందనుకుంటా ఏం చేయమంటావు?" అని అడిగాడు సయ్యద్.

ఫోన్ దగ్గరికి వచ్చి "అక్కడ ఎటువంటి పొరపాటు చేయకండి వాళ్ళని జాగ్రత్తగా ల్యాబ్ దగ్గరికి తీసుకురండి అసలు వాడి శక్తి ఏమిటో నేను తెలుసుకోవాలి." అని చెప్పాడు రేపాలా.

"వన్ మినిట్ సయ్యద్! అసలు వాడు ఒక్కడే ఉన్నాడా..! వెనకాల ఎవరైనా ఉన్నారా... కరెక్ట్ గా చూడు." అని చెప్పాడు కళింగ.

"సరే!" అని బైనో క్లోర్ లో చూస్తూ ఉన్నాడు సయ్యద్.

గబ్బర్ సింగ్ వెనకాలే వస్తూ "మేము వాళ్లకు కనపడాము ధైర్యంగా ముందుకి వేళ్ళు ఒకవేళ ఎవరైనా నీకు ఎదురుపడిన భయపడకు ధైర్యంగా మాట్లాడు." అని చెప్పాడు భూషణ్.

"మహారాజా! మీరు ఆమాత్రం హింట్ ఇచ్చారంటే చాలారేగిపోను  మీరందరూ ఉండగా నాకేమీ అవుతుంది." అని సంతోషంగా ముందుకు వెళుతూ ఉన్నాడు గబ్బర్ సింగ్.

సయ్యద్ బైనో క్లోర్ లో చూడడం చూసి "అందరూ కనపడకుండా దాక్కోండి." అని యోధ వాళ్ళ వైపు చూసి చెప్పింది సుహా.

గబ్బర్ సింగ్ చుట్టూ చూసి "సైంటిస్ట్! మనవాళ్లు ముగ్గురు తప్పితే అతని వెనకాల ఎవరూ లేరు." అని చెప్పాడు సయ్యద్.

"మన గురించి తెలిసిన తర్వాత కూడా అంత ధైర్యంగా ఒక్కడే వస్తున్నాడు అంటే వాడి దగ్గర నిజంగా ఏదో శక్తి ఉంది మంచి గా మాట్లాడి ల్యాబ్ దగ్గరికి తీసుకురండి." అని చెప్పాడు కళింగ.

"సరే!" అని ఫోన్ పెట్టేసి దూరంగా ఉన్న తన వాళ్ళ వైపు చూసి గన్స్ దించమని చెప్పి నిదానంగా నడుచుకుంటూ వెళ్ళాడు సయ్యద్.

అది చూసి "మన దగ్గరికి వస్తున్నదని సయ్యద్! పాకిస్తాన్ కి చెందినా టెర్రరిస్ట్ గ్రూప్ లీడర్ చాలా డేంజరస్ పర్సన్!" అని చెప్పాడు ముష్రు.

"గబ్బర్ సింగ్! నువ్వు అతని దృష్టిలో ఒక పెద్ద మాంత్రికుడివి ఏమాత్రం తగ్గకు నిన్ను అతను ఏమీ చేయడు." అని చెప్పాడు క్యూబ్.

"మన వాళ్ళ దగ్గరికి సయ్యద్ వస్తున్నాడు అందరూ ఎలర్ట్ గా ఉండండి." అని చెప్పాడు రాఖి.

"ఎవరు తొందరపడకండి అతని మనుషులు గన్స్ కిందకి దింపారు సయ్యద్ మన వాళ్ళతో మాట్లాడడానికి వస్తున్నాడు అనుకుంటా!" అని బైనో క్లోర్ లో చూస్తూ చెప్పాడు యోధ.

"ఇప్పుడు మనవాళ్ళని తనతో పాటు తీసుకు వెళితే మనం ఏం చేయాలి?" అని డౌట్ గా అడిగింది పూజా.

ముష్రు దగ్గర లొకేషన్ ట్రేస్ ట్రాన్స్ మిషన్ ఉంది దాని సిగ్నల్ ద్వారా మనం కూడా అక్కడికి వెళ్లడమే!" అని చెప్పింది సుహా.

"మరి అక్కడ మంచు తోడేళ్లు సెక్యూరిటీ గా ఉంటాయేమో!" అని భయంగా చూస్తూ అడిగింది పూజా.

"ఆ తోడేళ్లని చంపడానికి మేము ఉన్నాము కదా!" అని చెప్పి సుహా వైపు చూసి "ట్రాన్స్ మిషన్ ఆక్టివేట్ చెయ్ సయ్యద్ ఏం మాట్లాడుతున్నాడో మనం కూడా వినాలి." అని చెప్పాడు యోధ.

తన దగ్గరకి వస్తున్న సయ్యద్ వైపు వేటకారంగా చూస్తూ "ఏంట్రా" నువ్వు వచ్చావు? రేపాలా గాడు రాలేదా..? " అని అడిగాడు గబ్బర్ సింగ్.

ఆ మాటకి కంగారుగా చూస్తూ "సయ్యద్ బాయ్!" అని దగ్గరికి వెళ్లి కౌగిలించుకుని "ఆయన పేరు గబ్బర్ సింగ్ చాలా పవర్ఫుల్ పర్సన్ కొంచెం జాగ్రత్తగా మాట్లాడు." అని చెప్పాడు ముష్రు.

"సరే!" అని గబ్బర్ సింగ్ వైపు చూసి "మీకోసమే వెయిట్ చేస్తున్నాను సాబ్! వెహికల్స్ రెడీగా ఉన్నాయి వెళదాము పదండి." అని చెప్పాడు సయ్యద్.

ఆ మాటకి గబ్బర్ సింగ్ వైపు చూసి "మనం వెళ్ళేది ల్యాబ్ దగ్గరకే కదా!" అని అడుగు అని చెప్పాడు భూషణ్.

"సరే!" అని తల ఊపుతూ సయ్యద్ వైపు చూసి "మనం వెళ్లేది ల్యాబ్ దగ్గరికి కదా!" అని అడిగాడు గబ్బర్ సింగ్.

"అవును సాబ్! ల్యాబ్ దగ్గర  సైంటిస్ట్, రేపాలా మీకోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు." అని చెప్పాడు సయ్యద్.

ఆ మాటకి కంగారుగా క్యూబ్ దగ్గరికి వెళ్లి "నీకు డబ్బులు ఇవ్వలేదని నా మీద రివెంజ్ ప్లానింగ్ చేయలేదు కదా!" అని అడిగాడు గబ్బర్ సింగ్.

ఆ మాటకి కోపంగా చూస్తూ "నువ్వు అక్కడికి వెళ్లిన తర్వాత ఇలాగే మాట్లాడితే రేపాలా వెంటనే కనిపెడతాడు అప్పుడు కళింగ నీ మీద ప్రయోగం చేస్తాడు జాగ్రత్త!" అని చెప్పాడు క్యూబ్.

కారు దగ్గరికి వెళుతూ వెనక్కి తిరిగి గబ్బర్ సింగ్ వైపు చూసి "ఎవరితో మాట్లాడుతున్నారు సాబ్!" అని అనుమానంగా అడిగాడు సయ్యద్.

"ఆయన గాల్లోకి చూస్తూ శక్తులతో మాట్లాడుతూ ఉంటారు డిస్టర్బ్ చేయకూడదు మళ్ళీ కోపం వస్తుంది." అని చెప్పి గబ్బర్ సింగ్ దగ్గరికి వచ్చి "ఇంతకీ మీరు ఎవరితో మాట్లాడుతున్నారు?" అని నెమ్మదిగా అడిగాడు ముష్రు.

ఆ మాటకి ఆలోచిస్తూ 'నీకు కుడా వీళ్ళు కనపడడం లేదా!' అని మనసులో అనుకుని "నిజంగానే శక్తులతో మాట్లాడుతున్నాను నోరు మూసుకుని వేళ్ళు!" అని చెప్పాడు గబ్బర్ సింగ్.

అందరూ వెహికల్స్ లో అక్కడ నుంచి స్టార్ట్ అవ్వడం చూసి "అప్పుడే బయటకు రాకండి వాళ్ళ మనుషులు చూస్తూ ఉంటారు." అని చెప్పాడు యోధ.

ఓకే అని మిషన్ సిగ్నల్ చూస్తూ "యోధ! ట్రాన్స్మిషన్ సిగ్నల్ వీక్ అవుతుంది మనం వాళ్ళని మిస్ అవుతాము." అని కంగారుగా చెప్పింది సుహా.

"అవునా?" అని లాప్టాప్ లో చూస్తూ కాసేపటికి సిగ్నల్ కంప్లీట్ గా పోవడంతో  "ల్యాబ్ ఉన్న ఫేస్ లో సాటిలైట్ సిగ్నల్ కూడా పనిచేయడం లేదు.

అందుకే ఆ ప్లేస్ ని ఇండియన్ ఆర్మీ కనిపెట్టలేక పోతుంది వెహికల్స్ మార్క్స్ ని  ఫాలో అయ్యి వెళదాము." అని చెప్పాడు యోధ.

"గబ్బర్ సింగ్ తప్పితే అందరూ ఏజెంట్స్ ఏ కదా! మనం ల్యాబ్ దగ్గరికి చేరుకోవడానికి ఏదో ఒక మార్క్స్ వదులుతారు చూద్దాము." అని చెప్పాడు వర్ధన్.

"ఓకే!" అని చెప్పి వెహికల్స్ వెళ్లిన రూట్ లో వెళ్ళుతు ఉన్నారు యోధ వాళ్ళు.

**************

మధ్యలో ఉన్న వెహికల్ లో వెళుతూ "యోధ సార్ వాళ్లు వస్తున్నట్లు కనపడటం లేదు." అని అడిగాడు ముష్రు.

"మనం వెళ్లే ప్లేస్ కి వాళ్ళు ఎలాగైనా చేరుకుంటారు." అని చెప్పాడు ధర్మ.

"మనకి ఇంకా వాళ్లతో పనేముంది సార్! మీరందరూ ఉన్నారు కదా మిషన్ కంప్లీట్ చేసుకుని వద్దాము." అని కాన్ఫిడెంట్గా చెప్పాడు గబ్బర్ సింగ్.

"మేము రూట్ చూపిస్తాము హెల్ప్ చేస్తాము కానీ ఎవరిని చంపము అని నీకు ముందే చెప్పాము కదా! యోధ వాళ్ళు రాకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరిని నువ్వే పేస్ చెయ్యాలి." అని చెప్పాడు నంద.

ఆ మాటకి బిక్క మొహం వేసుకుని చూస్తూ "ఒక్కొక్కళ్ళు దున్నపోతు లాగా ఉన్నారు వాళ్ళని నేను ఫేస్ చేయడం ఏంటి సార్" అయినా అక్కడ మంచు తోడేళ్లు కూడా ఉన్నాయేమో!" అని కంగారుగా అడిగాడు గబ్బర్ సింగ్.

"ఆ.. ఉన్నాయి! చాలా భయంకరంగా ఉంటాయి. అయినా నీకు మేము తోడుగా ఉంటాము కదా!" అని చెప్పాడు క్యూబ్.

ఆ మాటకి ఏడుపు మొహం పెట్టి "ఎందుకు నా శవాన్ని తీసుకువెళ్లడానికా..?" అని అడిగాడు గబ్బర్ సింగ్.

"నీ శక్తి నీకు తెలియడం లేదు గబ్బర్!" అని చెప్పాడు ధర్మ.

"మీరు ఊరుకోండి సార్! యామపాశం లోకి మొదటి వెళ్లే ఆత్మ నాదే అనిపిస్తుంది." అని చెప్పాడు గబ్బర్ సింగ్.

"నువ్వు అధైర్య పడకు నీ వెనకాల మేము అండగా ఉంటాము చెప్పినట్లు చేయ్యి చాలు! ఈలోపు యోధ వాళ్ళు అక్కడికి వచ్చి పని ముగిస్తారు." అని చెప్పాడు నంద.

"సరే! అంతా మీ మీదే భారం!" అని చెప్పాడు గబ్బర్ సింగ్.

ఆ మాటలు విని గబ్బర్ సింగ్ వైపు చూసి "ఏంటి సార్!  మీలో మీరు మాట్లాడుకుంటున్నారు ఇక్కడ వాళ్ళ మనుషులు ఎవరూ లేరు కదా!" అని నవ్వుతూ అడిగాడు ముష్రు.

"ఆ విషయాలన్నీ నీకెందుకురా... వాళ్ళ ముందు ఎలా మాట్లాడాలో ట్రైనింగ్ అవుతున్నాను, ఆ రేపాలా గాడు నీలాగా ఏమైనా పిచ్చి పుల్కా అనుకున్నావా...!" అని టెన్షన్ గా చూస్తూ చెప్పాడు గబ్బర్ సింగ్.

అంతలో జీప్ స్లో అవ్వడంతో "ల్యాబ్ దగ్గరికి వచ్చాము కిందకు దిగండి." అని చెప్పాడు ముష్రు.

ఆ మాట విని కిందకి దిగి చుట్టూ చూస్తూ 'ఈ కొండల మధ్యలో ఎలా కట్టి చచ్చారురా... అసలు ఇక్కడ ఎలా ఉంటున్నారు.' అని మనసులో అనుకున్నడు గబ్బర్ సింగ్.

అక్కడికి వస్తున్న వాళ్ళని చూసి "కుడివైపు ఉన్నది రేపాలా! ఎడమవైపు ఉన్నది కళింగ! జాగ్రత్తగా మాట్లాడండి." అని చెప్పాడు ముష్రు.

అక్కడికి వచ్చి "మిస్టర్ గబ్బర్ సింగ్ వెల్కమ్ టు మై ల్యాబ్! ఇకనుంచి మీరు మా గెస్ట్!" అని చెప్పాడు కళింగ.

"థాంక్యూ! అని రేపాలా వైపు చూసి "ఏంటి నీ చుట్టూ అంతమందిని సెక్యూరిటీగా పెట్టుకున్నవు?" అని అనుమానంగా చూస్తూ అడిగాడు గబ్బర్ సింగ్.

ఆ మాటకి కళింగ వైపు ఆశ్చర్యంగా చూస్తు "నా చుట్టూ ఎప్పుడు శక్తివంతమైన ప్రేతాత్మలు ఉంటాయి ఆ విషయం ఎవరికీ తెలీదు వాళ్ళు ఎవరికి కనపడరు అది కనిపెట్టాడు అంటే ఇతను చాలా శక్తివంతుడు." అని చెప్పాడు రేపాలా.

గబ్బర్ సింగ్ వైపు చూసి "రేపాలా చుట్టూ ఎవరూ లేరు కదా!" అని అడిగాడు సయ్యద్.

ఆ మాటకి కంగారుగా చూస్తూ 'ఎవరికి కనిపించడం లేదు నాకు మాత్రమే కనిపిస్తున్నాయి అంటే అవి దెయ్యాలా..!' అనుకున్నడు గబ్బర్ సింగ్.

"మీ శక్తి గురించి వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది రండి లోపలికి వెళదాము." అని చెప్పాడు కళింగ.

ల్యాబ్ లోపలికి వెళుతు నంద వైపు చూసి "యోధ వాళ్లు ఇప్పుడు ఈ ప్లేస్ ఎలా కనిపెడతారు? వాళ్ళను ఇక్కడికి ఎవరు తీసుకొస్తారు?" అని అనుమానంగా అడిగాడు భూషణ్.

"సృష్టికర్యం దగ్గర ఉండి జరిపించడానికి  యోధ వాళ్ళని సరైన మార్గంలో నడిపించడానికి నారద మహర్షుల వారు  బయలుదేరారు." అని నవ్వుతూ చెప్పాడు కుబేరుడు.

ఆ మాటకి నవ్వుతూ "అయితే!  ఆయనా వాళ్ళని సరైన ప్లేస్ కి తీసుకెళ్తారు." అని చెప్పాడు భూషణ్.



" రుద్రం భజే! ఎపిసోడ్ 43 " రచనకు రేటింగ్ ఇవ్వండి
[+] 10 users Like SivaSai's post
Like Reply
Excellent update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
పురాణ పురుషులని రచయిత సందర్భోచితంగా వాడడం నచ్చింది మిత్రమా!
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
మామూలుగా.. గుప్తా గారు అంటేనే.. మనకి comedy పండుద్ది..
ఇక.. "నారాయణ.. నారాయణ.." ఎలా ఉంటుందో!!

But story లో గబ్బర్ తప్పించి.. comedy పాలు కొంచెం తక్కువగా అనిపించింది!!
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Just style gurinchi cheppa
[+] 1 user Likes styleraja's post
Like Reply
Excellent update
[+] 1 user Likes styleraja's post
Like Reply
Next episode will be action oriented
[+] 1 user Likes Sunny73's post
Like Reply
రుద్రం భజే! ఎపిసోడ్ 44


[Image: cover?seriesId=1269749&version=025903d2-...3a476c64b6]




పర్వతాల్లో ఉన్న ల్యాబ్ లోకి గబ్బర్ సింగ్ వెనకాలే వెళుతూ నంద వాళ్ళ వైపు చూసి యోధ వాళ్లకి దారి చూపించడానికి ఎవరు వెళ్తున్నారు అని అడిగాడు భూషణ్.

ఆ కార్యం నారదల మహర్షుల వారి భుజాల మీద వేసుకున్నారు అని చెప్పాడు నంద.

**************

నంద చెప్పిన మాటకి నవ్వుతూ నారదుల వారికీ బాగా తెలుసు యోధ వాళ్లని ఎక్కడకు తీసుకువెళ్లాలో!" అని చెప్పాడు భూషణ్.

"కలహ ప్రియుడే కానీ సృష్టికర్యం కోసమే! నారదుల వారితో ఈ యోధ వాళ్ళు ఎలా వేగుతారో ఏమో!" అన్నాడు క్యూబ్.

ల్యాబ్ లోపలికి వెళ్లి చూస్తూ "అంతా బానే సెటప్ చేసుకున్నారు." అని అక్కడ ఉన్న బిస్కెట్స్ తింటు ఉన్నాడు గబ్బర్ సింగ్.

అది చూసి కళింగ దగ్గరికి వెళ్లి "సైంటిస్ట్! వీడు ఏంటి తోడేళ్ల  బిస్కెట్లు తింటున్నాడు నాకెందుకు అనుమానంగా ఉంది. అసలు మీరు అనుకున్నట్లు ఈ పొట్టోడికి శక్తి ఉందా..?" అని అనుమానం గా అడిగాడు సయ్యద్.

"ఆ సంగతి ఇప్పుడే తేలుస్తాను నువ్వు యంగ్ వాళ్ళని ఒక గదిలోకి తీసుకువెళ్ళి సేఫ్ గా ఉంచు." అని చెప్పాడు కళింగ.

"సరే!" అని ఇద్దరిని ఒక రూమ్ లోకి తీసుకు వెళుతూ "భూపాల్! నన్ను మోసం చేసేవు అనుకున్నాను అయినా ఆ పొట్టి మాంత్రికుడు వలలో మీరు ఎలా పడ్డారు?" అని అడిగాడు సయ్యద్.

వెనకలే రూమ్ లోకి వస్తూ "అదంతా పెద్ద స్టోరీ బాయ్! వాళ్ళిద్దరూ పిచ్చ టెన్షన్లో ఉన్నారు ఇప్పుడు ఏమి మాట్లాడించాకు కాసేపు రెస్ట్ తీసుకుంటారు."  అని చెప్పాడు ముష్రు.

"సరే సరే! అక్కడ టీ, ఫుడ్ ఉంది కావాలంటే తీసుకోండి." అని చెప్పి యంగ్ వైపు చూసి "నువ్వు ఈ టాబ్లెట్స్ వేసుకో!" అని ఇచ్చాడు సయ్యద్.

వేసుకోవద్దు అని సైగ చేస్తున్న ముష్రు ని చూసి 'ఏమవుతుందిలే!' అనుకోని డబ్బాలో ఉన్న టాబ్లెట్స్ మొత్తం చేతిలో పోసుకుని ఒక్క దెబ్బకి మింగేసాడు గుప్తా.

అది చూసి "నాకు ఒకటి కూడా మిగల్చకుండా మింగేసావు ఏంటి?" అని కోపంగా అడిగాడు ధర్మ.

అది చూసి "ఆ టాబ్లెట్ నువ్వు వేసుకోకూడదులే!" అని యంగ్ వైపు కంగారుగా చూస్తూ "ఏంటి అన్ని టాబ్లెట్స్ ఒక్కసారి వేసుకున్నావా..?" అని అడిగాడు సయ్యద్.

"బాయ్! చాలా రోజుల బట్టి వేసుకోలేదు కదా నేనే వేసుకోమన్నాను ప్రాబ్లం ఏమి ఉండదు." అని చెప్పాడు ముష్రు.

"సరే!"అని ముష్రు, భూపాల్ వైపు చూసి "యంగ్ ని జాగ్రత్తగా చూసుకోండి ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వకూడదు ఆ మాంత్రికుడు పిలిచినా సరే పంపించకండి." అని చెప్పాడు సయ్యద్.

"నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను బాయ్ ఒకవేళ వెళితే నిన్ను కూడా తీసుకువెళ్ళిపోతాను టైమ్ చూడ్డానికి బుక్ లేదు." అని చెప్పాడు గుప్తా.

అది విని "పాపం టెన్షన్ లో ఏదేదో మాట్లాడుతున్నాడు." అని డోర్ క్లోజ్ చేసుకుని బయటికి వచ్చాడు సయ్యద్.

ముష్రు వైపు చూసి "టాబ్లెట్స్ ఇంత టేస్ట్ గా ఉంటే వేసుకోవద్దు అని చెబుతావేమిటి! ఇంకొక డబ్బా పట్టుకురా.. మా గురువుగారికి కావాలంట!" అని చెప్పాడు గుప్త.

"సార్! ఆ మెడిసిన్ వేసుకోకూడదు చాలా డేంజర్ మీ బ్లడ్ లో తేడా వస్తుంది." అని కంగారుగా చెప్పాడు ముష్రు.

ఆ మాటకి కోపంగా చూస్తూ "ఏంటి? నా రక్తంలోనే తేడా వస్తుంది అంటావా..! అంత గొప్ప మందా అది పట్టుకురా చూద్దాము." అని చెప్పాడు ధర్మ.

"సార్! మీరిద్దరు కొంచెం సైలెంట్ గా ఉండండి లేకపోతే వాళ్ళు కనిపెట్టేస్తారు." అని కంగారుగా చెప్పాడు ముష్రు.

"సరే సరే!" అని గుప్తా వైపు చూసి "అక్కడ ఏదో ఉంది కాస్తా ఇటు పంపించు టేస్ట్ చేస్తాను." అని చెప్పాడు ధర్మ.

"సరే ప్రభు!" అని అక్కడ టీ ఫ్లాస్క్ ధర్మ కి ఇచ్చాడు గుప్తా.

*********

బిస్కెట్స్ తింటూ ఉన్న గబ్బర్ సింగ్ దగ్గరికి వెళ్లి "ఇంకా తినడం ఆపవయ్యా బాబు! అవి తోడేళ్లు తినే బిస్కెట్లు వాళ్లు నీ శక్తి ని పరీక్షించాలి అనుకుంటున్నారు జాగ్రత్తగా మాట్లాడు." అని చెప్పాడు క్యూబ్.

"అవునా?" అని నవ్వుతూ చేతిలో ఉన్న బిస్కెట్స్ టేబుల్ మీద పడేసి 'తింగరి వెధవలు తోడేళ్లు తినే బిస్కెట్లు ఇక్కడ పెట్టారు ఎందుకు!" అని చికాకుగా రేపాలా వైపు చూసి

"బిస్కెట్స్ టేస్ట్ బానే ఉన్నాయి కానీ తోడేళ్ళకి ఇంకా బలమైన ఫుడ్ పెట్టండి." అని చెప్పాడు గబ్బర్ సింగ్.

ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "ఇక్కడ తోడేళ్లు  ఉన్నాయని మీకు ఎలా తెలిసింది?" అని అడిగాడు కళింగ.

"పిచ్చోడా! నాకు అన్ని విషయాలు అలాగే తెలిసిపోతాయి." అని స్టైల్ చెబుతూ అక్కడకి వస్తున్న హిడిచి ని చూసి

"వీడెవాడు? ఉడతలు పట్టేవాడు లాగ ఉన్నాడు." అని వెటకారంగా చూస్తూ అడిగాడు గబ్బర్ సింగ్.

అక్కడికి వస్తున్న హిడిచి వైపు చూసి "రేపాలా తన పూర్వీకుల శక్తిని ఆ వ్యక్తి శరీరంలోకి పంపించి మహాశక్తివంతుడిని చేశాడు ఇప్పుడు అతను 100 మంది బ్రహ్మ రాక్షసులతో సమానం దేవతలతో కూడా యుద్ధం చేయగలడు." అని చెప్పాడు భూషణ్.

ఆ మాట విని టెన్షన్ గా చూస్తూ వెనక్కి తిరిగి "ఆ మాట ముందే చెప్పొచ్చు కదా! అనవసరంగా నోరు జారాను, మీరు ఉన్నారని నాకు మరియు ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది." అని కళింగ వైపు చూసి నవ్వుతూ ఉన్నాడు గబ్బర్ సింగ్.

దగ్గరకు వచ్చి "గబ్బర్ గారు! మీరు ఎవరితో మాట్లాడుతున్నారు?" అని అనుమానంగా అడిగాడు సయ్యద్.

ఆ మాటకి కంగారుగా చూస్తూ "నేను అష్టదిక్పాలకులతో నవగ్రహాలతో మాట్లాడుతూ వాళ్ల దగ్గర నుంచి శక్తి తీసుకుంటూ ఉంటాను." అని చెప్పాడు గబ్బర్ సింగ్

"చాలా మంచి విషయం రండి మా హిడిచి పట్టుకునే ఉడతలని చూపిస్తాను." అని ల్యాబ్ పక్కన ఉన్న గ్రౌండ్లోకి తీసుకువెళ్లాడు రేపాలా.

ఆ మాటకి కంగారుగా "ఇప్పుడు ఉడతలు చూడడం అవసరం అంటారా..!" అని అడిగాడు గబ్బర్ సింగ్.

***********

పర్వతాలు దగ్గర వెహికల్స్ వెళ్లిన రూట్ లో టైర్ మార్క్స్ చూసుకుంటూ వెళుతూ "మన వాళ్ళు ఎటువంటి గుర్తులు వదల్లేదు ఇక్కడి నుంచి టైర్ మార్క్స్ కూడా కనబడడం లేదు." అని నిరాశ చెప్పింది సుహా.

"ఈ ప్లేస్ లో ఎక్కడని వెతుకుతాము అనవసరంగా మన వాళ్ళని మిస్ చేసుకున్నము." అని చెప్పాడు రాఖి.

"మన దగ్గర ఉన్న శాటిలైట్ ఫోన్స్ సిగ్నల్ ఉన్నాయి కానీ ముష్రూ దగ్గర ఉన్న ట్రాన్స్ మిషన్ సిగ్నల్ లేదు అంటే ల్యాబ్ సాటిలైట్ కి కుడా దొరక్కుండా ఉన్న ప్లేస్ లో ఉంది." అని చూస్తూ చెప్పింది దీప్తి.

"మన టార్గెట్ ఆ ల్యాబ్ ని నాశనం చేయడమే! అది కనిపించేంతవరకు వెతుకుతూనే ఉండాలి, ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో ఒక చోట ఉంటుంది." అని బైనో క్లోర్ లో చూస్తూ చెప్పాడు యోధ.

"మనం కరెక్ట్ రూట్లో వెళుతున్నామా!" అని డౌట్ గా అడిగాడు వర్ధన్.

చాక్లెట్ తింటూ "మీ ఇష్టం ఎంతసేపైనా వెతకండి నేను ఇంకా ఆఫెన్ అవర్ మాత్రమే నడవగలను తర్వాత యోధ భుజలు ఏకేస్తాను." అని చెప్పింది పూజా.

ఆయాస పడుతు నడుస్తూ నీతూ దగ్గరకు వెళ్లి "మేడం! హిమాలయాలు టీవీలో చూడడానికి చాలా బాగున్నాయి కానీ డైరెక్ట్ గా చూస్తుంటే  కాస్త భయంగా ఉంది." అని చెప్పాడు పుష్కర్.

ఆ మాట విని నవ్వుతూ "ప్రకృతి ఎప్పుడూ అందంగానే ఉంటుంది మనం చూసే విధానాన్ని బట్టి దాని రూపం మారుతుంది. ఇప్పుడు నీ మనసులో భయం మొదలైంది అందుకే హిమాలయాలు కూడా భయంకరంగా కనిపిస్తున్నాయి." అని చెప్పాడు యోధ.

"ఇక్కడ రూట్ తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే బాగుండు కాస్త మనకి హెల్ప్ ఫుల్ గా ఉంటుంది." అని చెప్పింది నీతూ.

ఆ మాట విని కైలాస పర్వతనికి నమస్కరించుకుని  "పిలుపు వచ్చింది ఇంక నేను బయలుదేరుతున్నాను స్వామి!" అని కిందకి దిగుతూ

"నారాయణ నారాయణ!" అనుకుంటూ సాధువు రూపంలోకి మారి యోధ వాళ్లకి కనపడేటట్లు దూరంగా ప్రత్యక్షమై నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నాడు నారద మహర్షి.

బైనో క్లోర్ లో చూస్తూ "దూరంగా ఎవరో సాధువు కనిపిస్తున్నారు వాళ్లకి ఇక్కడ అన్ని ప్లేసులు అన్ని తెలుస్తాయి హెల్ప్ అడుగుదాము." అని చెప్పాడు యోధ.

ఆ మాట విని "హిమాలయాల్లో తపస్సు చేసుకునే సాధువుల్ని నేను ఎప్పటినుంచో డైరెక్ట్ గా చూడాలి  అనుకుంటున్నాను." అని సంతోషంగా చెప్పింది పూజా.

"మేడం! వాళ్ళకి చాలా పవర్స్ ఉంటాయంట కొంచెం జాగ్రత్తగా ఉండండి." అని చెప్పాడు ఏకవీర.

"సాధువుల పవర్స్ లేడీస్ మీద పనిచేయవంట! నీకు ఆ విషయం తెలియదా..?" అని చెప్పి యోధ వెనకాల పరిగెడుతూ ఉంది పూజా.

నడుచుకుంటూ వస్తున్న సాధువుని చూసి "అతన్ని చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది ఈ ఏరియాలో సాధువులు ఉన్నట్లు ఎప్పుడు వినలేదు." అని చెప్పాడు రాఖి.

"ఒక్కసారి మాట్లాడితే క్లారిటీ వస్తుంది పదండి స్పీడుగా వెళదాము." అని చెప్పాడు యోధ.

తన వైపే వస్తున్న యోధ వాళ్ళని చూసి "రండి రండి మీ కోసమే వస్తున్నాను మీతో చాలా పని ఉంది."  అనుకుంటూ ఉన్నాడు నారద మహర్షి.

దగ్గరకు వచ్చి "స్వామి! మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఈ ఏరియాలో తప్పు చేసుకునే స్వామీజీలు ఎవరు ఉండరు కదా!" అని డౌట్ గా అడిగాడు యోధ.

ఆ మాటకి నవ్వుతూ "నేను నడుస్తూ తపస్సు చేసుకునే సాధవుని అందుకే అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంటాను." అని చెప్పాడు నారదుడు.

" స్వామి! మీ పేరేమిటి?" అని అడిగింది సుహా.

"స్వామి అని పిలిచావు కదమ్మా! అలాగే పిలువు ఇంతకీ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు?" అని అడిగాడు నారదుడు.

"మేము టూరిస్టులం స్వామి! ఈ ఏరియాలో ఒక ల్యాబ్ ఉందని తెలిసి చూడడానికి వస్తు దారి తప్పేము అది ఎక్కడుందో మీకు తెలుసా..?" అని అడిగాడు యోధ.

"మీరు టూరిస్ట్ లా.. అయితే నాతో పాటు రండి హిమాలయాలు చూపిస్తు ల్యాబ్ దగ్గరికి తీసుకువెళ్తాను." అని చెప్పాడు నారదుడు.


[+] 6 users Like SivaSai's post
Like Reply
రుద్రం భజే? ఎపిసోడ్ 45


[Image: cover?seriesId=1269749&version=025903d2-...3a476c64b6]



యోధ వాళ్ళు టూరిస్టులం ల్యాబ్ కోసం వెతుకుతున్నామని చెప్పడంతో అవునా అయితే నా వెనకాల రండి హిమాలయాలు చూపిస్తూ ల్యాబ్ దగ్గరికి తీసుకెళ్తాను అని చెప్పాడు నారదుడు.

***********

'నారాయణ నారాయణ!' అంటూ నడుస్తూ ఉన్న సాధువు దగ్గరికి వెళ్లి "స్వామి! మీకు ల్యాబ్ ఎక్కడ ఉందో  తెలుసా..?" అని అడిగింది పూజా.

"నాకు ఈ హిమాలయాలు మాత్రమే కాదు ముల్లోకాలు తెలుసు తిరుగుతూనే ఉంటా కదా!" అని చెప్పాడు నారదుడు.

"మీకు ఈ ఏరియాలో గన్స్ పట్టుకుని తిరుగుతూన్న మనుషులు ఎవరైనా కనిపించారా..?" అని అడిగింది సుహా.

ఆ మాటకి యోధ వైపు చూసి "అతని దగ్గర మూడు గన్స్ ఉన్నాయి మీ అందరి దగ్గర కుడా ఉన్నాయి నాతోపాటు తిరుగుతూ మళ్లీ నన్నే అడుగుతున్నారా..?" అని నవ్వుతూ అడిగాడు నారదుడు.

ఆ మాట విని పూజ దగ్గరికి వెళ్లి "మేడం! నేను ముందే చెప్పాను కదా వీళ్ళకి పవర్స్ ఉంటాయి మన దగ్గర గన్స్ ఉన్నాయి అని ఎలా కనిపెట్టేసాడో చూడండి." నెమ్మదిగా చెప్పాడు పుష్కర్.

"నీ బొంద! మన బీమ్ బాయ్ ని చూస్తే ఎవరైనా కనిపెట్టేస్తారు ఆ ఫిగర్ అటువంటిది చేతిలో గన్ లేకపోయినా సరే పట్టుకున్నట్లు కనిపిస్తూనే ఉంటుంది." అని చెప్పింది పూజా.

"స్వామి! మనం చాలా లోపలికి వెళుతున్నట్లు ఉన్నాము." అని డౌట్ గా చూస్తూ అడిగాడు యోధ.

ఆ మాటకి నవ్వుకుంటూ "ఏంటి! ఈ ప్లేస్ చూసినట్లు ఉందా..?" అని అడిగాడు నారదుడు.

"యోధ! మనం ఏజెంట్స్ ని సేవ్ చేయడానికి వచ్చినప్పుడు నువ్వు 24 మందిని చంపావు కదా ఆ ప్లేస్ దగ్గరికి వెళుతున్నము." అని చెప్పింది సుహా.

అక్కడ ఉన్న రాయి వైపు చూసి "యోధ! మనం పెన్ డ్రైవ్ లో చూసినా ప్లేస్ ఇదే! 25 సంవత్సరాల క్రితం ఆ పద్మంతో ప్రయోగం ఇక్కడే చేసారు." అని చెప్పింది దీప్తి.

ఆ ప్లేస్ వైపు చూస్తూ "ఎస్! ఈ సాధువు మనల్ని ఇక్కడికి తీసుకు వస్తున్నాడు ఎందుకు?" అని డౌట్ గా అడిగింది నీతూ.

"ఆ సాధువు మమ్మల్ని కావాలని ప్లేస్ కి తీసుకు వెళుతున్నారు." అని చెప్పి దగ్గరకు వెళ్లి "స్వామి! మీరు  25 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏమైనా చూసారా..?" అని అడిగాడు యోధ.

"25 సంవత్సరాల క్రితం చూసాను కొంతకాలం క్రితం నువ్వు ఇక్కడ కొంతమందిని మట్టు పెట్టడం చూశాను, వారి శరీరాలను కోపంతో ఆ కొండమీదికి గిరాటు వేయడం కూడా చూశాను." అని చెప్పాడు నారదుడు.

ఆ మాట విని దూరంగా ఉన్న కొండ వైపు ఆశ్చర్యంగా చూస్తూ "ఏంటి? ఆ 24 మందిని చంపి ఇక్కడ నుంచి అక్కడికి గిరాటు వేసావా..?" అని అడిగింది పూజా.

"నిజంగానే అంత దూరం ఎలా విసిరావు?' అని యోధ వైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది దీప్తి.

"ఆరోజు క్లాత్ మీద ఉన్న జైశ్రీరామ్ అనే అక్షరాలని తొక్కలని చూసారు పిచ్చి కోపం వచ్చింది ఒక్కొక్కడి వెన్నుపూసలు విరకొట్టి కాళ్లు పట్టుకుని గిరాటు వేస్తుంటే అక్కడికి వెళ్లి పడ్డారు." అని చెప్పాడు యోధ.

"ఇంక నయం చేతికి వీలుగా ఉంది కదా అని ఇటువైపు విసిరితే వెళ్లి మన బోర్డర్లో పడేవారు." అని చెప్పింది దీప్తి.

"నువ్వు మంచి పని చేశావు కానీ దీంట్లో ఒక ప్రమాదం దాగి ఉంది. అది తెలియాలి అంటే మీకు ఒక చిన్న కథ చెప్పాలి!" అన్నాడు నారదుడు.

ఆ మాట విని "నాకు కథలంటే భలే ఇష్టం చెప్పండి చెప్పండి." అని సంతోషంగా ముందుకు వచ్చింది పూజా.

"పూర్వం రావణబ్రహ్మ తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు కొన్ని వరాలను ప్రసాదించాడు వాటిలో శక్తివంతమైన రెండు పద్మలు కూడా ఉన్నాయి వాటి ద్వారా ఏ లోకానికైనా వెళ్లే మార్గం తెరుచుకుంటుంది.

రావణాసురుడు ఆ పద్మాన్ని హిడిచి జాతికి చెందిన రాక్షసులకి ఇచ్చి కుబేరుడు నగరమైన అలకాపురని కైవసం చేసుకోమని పంపించాడు.

అప్పుడు ఆ పద్మం ద్వారా రాక్షసులు కైలాస పర్వతం  దగ్గరికి చేరుకుని అలకాపురి నగరానికి వెళ్లడానికి ప్రయత్నించారు.

ఆ నగరానికి రక్షణగా ఉన్న శివగణాలు ఆ రాక్షసులను  ఎదుర్కొన్నారు వారి నుంచి తప్పించుకోని పారిపోవడానికి పద్మలోకి వెళ్లడానికి ప్రయత్నించారు, కానీ శివగణాలు వాళ్లని పద్మ లోపలికి వెళ్ళనివ్వకుండా ఒక గుహలోకి పంపించి భూస్థాపితం చేశారు.

అప్పుడే ఆ పద్మంలో ఒక లోకం తలుపులు తెరుచుకున్నాయి అక్కడ శిమిరా అనే ఒక శక్తివంతమైన రాక్షసుడుని ఇంద్రుడు బంధించి ఉంచాడు.

ఆ విషయం తెలుసుకున్న శివగణాలు ఆ శిమిరా ని బయటికి రానివ్వకుండా పద్మాన్ని కూడా హిమాలయాలలో భూస్థాపితం చేశారు.

కానీ శిమిరా ఆ లోకం నుంచి బయటికి వచ్చి పద్మంలో తిష్ట వేసుకుని ఎప్పుడూ బయటికి వద్దామా అని ఎదురుచూస్తూ ఉన్నాడు.

కలికాలంలో ఆరోజు రానే వచ్చింది కొందరి దుర్మార్గుల చేతికి ఆ పద్మం చేరింది దాని శక్తి తెలుసుకోవడానికి చేయరాని ప్రయోగాలు చేశారు ఆ క్రమంలోని శిమిరా భూమి మీదకు వచ్చి ఆ కొండ మీదకి చేరుకున్నాడు.

అదృష్టవశాత్తు ఆ పద్మాన్ని ముగ్గురు మహావీరులు ఆ దుర్మార్గుల చెంత నుంచి కాపాడి తీసుకువెళ్లేరు కానీ భూమి మీదకి వచ్చిన శిమిరా ఆ కొండమీదే ఉన్నాడు.

నువ్వు అక్కడికి 24 మంది మానవులను పంపించి అతని ఆకలి తీర్చి కాస్త శక్తిని ఇచ్చావు." అని చెప్పాడు నారదుడు.

"అంటే స్వామి! ఇప్పుడు ఆ శిమిరా వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటుందా..?" అని డౌట్ గా అడిగింది సుహా.

"రేపలా అని హిడిచి వంశానికి చెందిన ఒక మాంత్రికుడు శిమిరా భూమి మీదకి వచ్చాడు అనే విషయం తెలుసుకుని అతని కోసం వెతుకుతూ ఉన్నాడు ఒకవేళ ఇద్దరూ కలిస్తే కాస్త ఇబ్బంది ఎదురవుతుంది." అని చెప్పాడు నారదుడు.

"స్వామి! ఆ శిమిరా ని పద్మ లో నుంచి ఆ లోకానికి పంపిస్తే సరిపోతుంది కదా!" అని అడిగాడు యోధ.

"ఆ పద్మం మీ దగ్గర ఉంటే ఆ పని చేయొచ్చు కానీ నువ్వు చేసిన పని వల్ల అతనికి కాస్త శక్తి వచ్చింది కాబట్టి ఆ లోకానికి తిరిగి పంపించడం కన్నా పై లోకాలకు పంపించడం మంచిది." అని చెప్పాడు నారదుడు.

ఆ మాట విని "రాక్షసుడు అంటున్నారు మనుషుల చేతిలో చస్తాడా..?" అని డౌట్ గా అడిగాడు వర్ధన్.

"మరణం లేని జీవి ఉందా ఒక యుగం కాకపోతే మరో యుగంలో అయ్యినా మరణం తప్పదు." అని చెప్పాడు నారదుడు.

"స్వామి! నేను ఆ రేపాలా వెన్నుపూస మీద నా కాలు వేసి తొక్కడనికి ఇక్కడికి వచ్చాను వాడికి హెల్ప్ చేస్తాడు అని తెలిసిన తర్వాత రాక్షసుడు అయితే ఏంటి చంపేయడమే!" అని కసిగా చెప్పాడు యోధ.

"చాలా సంతోషం మీకు నేను కూడా కాస్త సహాయం చేస్తాను మనం ఆ కొండమీదికి చేరుకుంటే ఆ ల్యాబ్ దగ్గరికి కుడా సులభంగా వెళ్లొచ్చు!" అని చెప్పాడు నారదుడు.

ఆ మాట విని భయంగా నీతూ దగ్గరికి వచ్చి "మేడం! ఒక్కసారి ఆలోచించండి ఆ రాక్షసుడికి మనల్ని ఆహారంగా వేయాలని ఈ సాధువు ప్లాన్ వేయలేదు కదా!" అని డౌట్ గా అడిగాడు ఏకవీర.

"నారాయణ నారాయణ! నేను మంచి వైఫై ఉంటాను గాని చెడు వైపు ఉండను." అని చెప్పాడు నారదుడు.

"కరెక్ట్! నేను చాలా సినిమాల్లో చూశాను నారాయణ నారాయణ అన్న వాళ్ళు రాక్షసులకి యాంటీగా ఉంటారు." అని చెప్పింది పూజా.

"నాకు తెలిసి అతను రాక్షసుడు కాదు ఏ గ్రహాంతరవాసి అయి ఉంటాడు పదండి వెళ్లి లేపేద్దాము." అని చెప్పాడు రాఖి.

"విజ్ఞానం పెరిగింది కాబట్టి కొత్త పేర్లు ఏదైనా ఒకటే కదా వేరే లోకం నుంచి ఈ లోకానికి వచ్చిన వాడు అని నేను చెప్పాను, మీరు గ్రహాంతరవాసి అనుకోండి నేను రాక్షసుడు అనుకుంటాను మట్టు పెట్టడమే మనకు కావలసింది." అని చెప్పాడు నారదుడు.

"సరే! అక్కడికి వెళ్లి రూట్ చూపించండి ఆ శిమిరాని చంపి ల్యాబ్ దగ్గరికి వెళదాము అందరికీ ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది." అని చెప్పాడు యోధ.

"నారాయణ నారాయణ!" అంటూ కొండమీదికి వెళ్లే రూట్లో బయలుదేరాడు నారదుడు.

*************

ల్యాబ్ దగ్గర బయట ఉన్న గ్రౌండ్ లోకి తీసుకువెళ్లి బోన్ లో ఉన్న తోడేళ్లని చూపించి "గబ్బర్ గారు! మా హిడిచి పట్టుకునే ఉడతలు ఇవే!

ఈ రెండు తోడేళ్లని మచ్చికా చేసుకుని మీ శక్తిని చూపించండి అప్పుడు కూర్చుని అన్ని విషయాలు మాట్లాడుకుందాము." అని చెప్పి అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయడు రేపాలా.

భారీ ఆకారంలో నోరు తెరుచుకుని భయంకరంగా అరుస్తున్న బోన్ లో ఉన్న రెండు తోడేళ్ల వైపు చూస్తూ భయంతో బిగిసుకుపోయి

"ఒరేయ్ దరిద్రుడా! తోడేళ్ళ ముందు నిలబెట్టి ఉడతలు అంటావేమిటిరా..! వీటిని చూస్తేనే గుండె ఆగిపోయేటట్లు ఉంది.

బాబోయ్! ఈరోజు నా పని అవుట్! గుప్తా చెప్పినట్లు నా పెళ్ళాం చేతిలో కాదు ఈ తోడేళ్ల పంటి కింద పడి చచ్చిపోయేటట్లు ఉన్నాను. " అని భయంతో వణుకుతూ ఉన్నాడు గబ్బర్ సింగ్.

అక్కడికి వచ్చి గబ్బర్ సింగ్ భుజం మీద చేయి వేసి "భయపడకు నేను ఉన్న కదా!" అని చెప్పాడు భూషణ్.

"ఈ తోడేళ్లకి కు మీరు మహారాజు అని తెలియదు కదా!" అని భయంగా చూస్తూ అడిగాడు గబ్బర్.

"ఆ రెండు తోడేళ్లు బయటికి వచ్చిన తర్వాత భయపడకుండా ధైర్యంగా చూస్తూ ఉండు." అని చెప్పాడు భూషణ్.

ల్యాబ్ లోపలకి వచ్చిన రేపాలని చూసి బాటన్ ప్రెస్ చేసి "ఇప్పుడు ఈ గబ్బర్ సింగ్ పవర్ ఏమిటో తెలుస్తుంది." అని నవ్వుతూ చెప్పాడు కళింగ.

బోన్లో నుంచి రెండు తోడేళ్లు గబ్బర్ సింగ్ వైపు పరిగెత్తుకు రావడం చూసి టెన్షన్ గా చూస్తూ ఉన్నాడు ముష్రు.

వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి భూషణ్ వైపు చూసి తోక ఊపుకుంటూ గబ్బర్ సింగ్ ముందు సైలెంట్ గా కూర్చున్నాయి రెండు తోడేళ్లు.

"గబ్బర్! ఇప్పుడు ధైర్యం వచ్చిందా నేను వాటిని 30 నిమిషాలు మాత్రమే ఆపగలను ఈలోపు నువ్వు ఏం చేస్తావో నీ ఇష్టం!" అని చెప్పాడు భూషణ్.

"మహారాజ! ఆమాత్రం టైమ్ చాలు చాలారేగిపోతాను చూడండి." అని సంతోషంగా చూస్తూ "ఒరేయ్ రేపాలా! ఆ బిస్కెట్లు పట్టుకురా...!" అని గట్టిగా అరిచాడు గబ్బర్ సింగ్.



" రుద్రం భజే? ఎపిసోడ్ 45 " రచనకు రేటింగ్ ఇవ్వండి
[+] 9 users Like SivaSai's post
Like Reply
Excellent update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
Great story buildup
[+] 1 user Likes Sunny73's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)