Thread Rating:
  • 25 Vote(s) - 3.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Part - 140



లాన్ అంతా పసుపు & తెలుపు థీమ్.
మధ్యలో పెద్ద గంగాళం పెట్టుకోవాలి  పాత్రల్లో పసుపు, చుట్టూ మల్లెపూల హారాలు.
మూడు పెళ్లికొడుకులు ఒక వైపు…
మూడు పెళ్లికూతుళ్లు మరో వైపు.
గౌతమ్  మైక్ పట్టుకుని...
ఇది సాధారణ హల్దీ కాదు. ఇది సింహ ఫ్యామిలీ హల్దీ.
అందరూ చప్పట్లు కొడతారు.

హల్దీ  హంగామా మొదలవుతుంది.
ఇక చందు వంతు.  వైభవ్ ముందే అనుమానం తో...
నువ్వు ఏదో ప్లాన్ చేస్తున్నావు.
చందు పెద్దగా నవ్వి…
ఒక్కసారిగా పసుపు బౌల్ తీసుకుని వైభవ్ చేతుల మీద మొత్తం పోస్తుంది.
స్టైల్ తో ఉండాలి అంటుంది.
వైభవ్ షాక్ అయ్యి..  ఇది ఫంక్షన్ కాదు… అటాక్.

సూర్య దగ్గరకు విశిష్ట నెమ్మదిగా వస్తుంది. ముందు మెల్లగా చెంపపై పసుపు పెడుతుంది.  సూర్య చిరునవ్వు.
తర్వాత ఒక్కసారిగా సూర్య ముక్కు మీద చిన్న పసుపు డాట్ పెడుతుంది. ఇప్పుడు ఈవెన్.
అందరూ ఓహ్ అంటారు.
భవ్య పసుపు తీసుకొని శ్రీకర్ హృదయం పైన పెడుతుంది. ఏమిటి డాక్టర్ అమ్మ ముందే నా గుండె చెక్ చేస్తున్నావా. ఇది నా అమ్మని అందరికీ గర్వంగా చూపిస్తున్నాను.


శ్రీకర్, వైభవ్, సూర్య ముగ్గురూ కలిసి ప్లాన్ చేస్తారు.
ఒక్కసారిగా ముగ్గురు పెళ్లికూతుళ్ల మీద లైట్‌గా పసుపు చల్లి పారిపోతారు.

చందు...  స్టాప్! ఇది ఫెయిర్ కాదు.
భవ్య...  రౌండ్ టూ
లాన్ అంతా నవ్వులు, పరుగులు.

భవ్య ప్రకటిస్తుంది...  ఇప్పుడు గేమ్. ఎవరు తమ పార్ట్నర్ గురించి మూడు కరెక్ట్ ఫ్యాక్ట్స్ చెప్పగలరో వాళ్లే విన్నర్స్.


సూర్య   విశి ని చూస్తూ... నా క్యూటి కి   జాస్మిన్ స్మెల్ ఇష్టం.
స్ట్రెస్ లో ఉన్నప్పుడు సైలెంట్ అవుతుంది.
కానీ ఫ్యామిలీ కోసం ఎప్పుడూ స్ట్రాంగ్.
విశిష్ట నవ్వుతుంది.
పర్ఫెక్ట్.


వైభవ్  చందు భుజం పైన చెయ్యి వేసి.. ఆమెకి ఫ్యాషన్ అంటే ప్యాషన్ కాదు… జీవితం.
లేట్ అయ్యే వాళ్లని ఇష్టం ఉండదు.
నన్ను మాత్రం ఓపికగా హ్యాండిల్ చేస్తుంది.
చందు చేతులతో  మెల్లిగా చప్పట్లు కొడుతూ...
అప్రూవ్డ్.


శ్రీకర్ పాకెట్లో చేతులు పెట్టుకుని సౌమ్యానే చూస్తూ..
ఆమె డాక్టర్ మాత్రమే కాదు… నా మోటివేషన్.
చదువు మిస్ చేయదు.  నవ్వితే చుట్టూ వాళ్లందరూ కంఫర్ట్ ఫీల్ అవుతారు.
సౌమ్య చిన్నగా....  డీల్ సేఫ్.
ఇది పెళ్లి ముందుమాట మాత్రమే.
లలిత నవ్వుతూ....
ఇంకా అసలు వేడుక మిగిలే ఉంది.

చివరగా అందరూ ఒకచోట చేరి గ్రూప్ ఫోటో.
పసుపు రంగులో మెరిసిపోతూ…  అందరి ముఖాల్లో ఒకే భావం ... ప్యూర్ హ్యాపినెస్.
వినయ్ గర్వంగా.... విక్రమ్ భుజం పైన చేయి వేసి అన్నయ్య చాలా సంతోషంగా ఉంది. మనం ఎలాగైతే కలిసి ఉన్నామో.. మన పిల్లలు కూడా అదే దారిలో వెళుతున్నారు.

ఆ మాటలు విన్న ధనుంజయ్ అంతే కదా అల్లుడుగారు... మనం ఏ బాటైతే చూపిస్తామో పిల్లలు కూడా తెలియకుండా అందులోనే అడుగులు వేస్తారు. మొదట కష్టంగా ఉండవచ్చు కానీ నడుస్తూ ఉంటే ఆ దారే నలిగి ఉసులు అవుతుంది.
విక్రమ్ గర్వంగా ఫ్యామిలీ అంతటినీ చూస్తాడు.  కళ్యాణ్ కళ్ళల్లో కూడా నీళ్లు కనిపిస్తూ ఉంటే దగ్గరికి వెళ్లి ఏమైంది నాన్న.

కొడుకు భుజం మీద చెయ్యి వేసి మా అమ్మకి నేను ఇచ్చిన మాటని నువ్వు నిలబెట్టావు రా. ఎప్పటికీ ఈ సింహ ఫ్యామిలీ ఇలాగే కలిసి ఉండాలి.  తప్పకుండా..

అవని, పూజిత, విద్యా, నివి, నేహ ఎవరినీ పట్టించుకోకుండా చిన్నపిల్లల్లాగా ఆ హల్దీ నీళ్ళల్లో తడిసి ముద్ద అవుతారు.

భార్యలను అలా చూస్తున్న భర్తలు చిన్నగా నవ్వుకుంటారు. విక్రమ్ కి ఒక చిలిపి ఆలోచన వస్తుంది.

లాన్‌ అంతా ఇంకా పసుపు వాసనతో మెరిసిపోతుంది…
నవ్వులు, ఫోటోలు, చప్పట్లు క్రమంగా తగ్గిపోతుంటే సాయంత్రపు గాలి మల్లెపూల పరిమళంతో నిండిపోతుంది.
అందరూ లోపలికి వెళ్లి డ్రెస్సులు మార్చుకోవాలని వెళ్లిపోతారు.

లాన్‌లో మాత్రం ఇంకా కొంచెం పసుపు నీళ్లు, తడి అడుగుల ముద్రలు, ఇంకా ఆ మధుర హడావుడి గుర్తులు.
విక్రమ్ నిశ్శబ్దంగా అవని వైపు చూస్తూ నిలబడి ఉంటాడు.
అవని జుట్టులో మల్లెపూలు తడిసి పసుపు తగిలి మరింత అందంగా కనిపిస్తోంది.

విక్రమ్ దగ్గరికి నెమ్మదిగా నడుస్తాడు. విక్రమ్ చిలిపిగా...
ఇంకా హల్దీ కంప్లీట్ కాలేదనుకుంటా…  అవని కన్నెత్తి చూస్తూ...  ఏమిటి? ఇంకా ఎవరి మీద అటాక్ చేయాలి?

విక్రమ్ చిన్నగా నవ్వి… నేలపై పడిపోయిన పసుపు బౌల్ తీసుకుంటాడు.  అవని వెంటనే వెనక్కి ఒక అడుగు వేస్తుంది.
స్టాప్ అండీ … ప్లీజ్. ఇప్పుడే స్నానం చేసి వచ్చాను.
విక్రమ్ మెల్లగా దగ్గరకు వస్తూ…nఅందరితో సరదాగా చేసుకున్నాం. కానీ… ఇది నా టర్న్.

అవని గుండె వేగం కొంచెం పెరుగుతుంది. ఆమె కళ్ళలో నవ్వు, కానీ లోపల కొంచెం సిగ్గు.  విక్రమ్ బౌల్‌లో ఉన్న కొంచెం పసుపు తీసుకుని…  ముందుగా అవని చెంపపై చాలా నెమ్మదిగా ఒక చిన్న రేఖలా పెడతాడు.
ఇది… నా భార్యకి.

అవని కళ్ళు మూసుకుని ఆ స్పర్శను ఫీల్ అవుతుంది.
అది హంగామా కాదు… హడావిడి కాదు…
ఒక మృదువైన హక్కు.

తర్వాత విక్రమ్ ఆమె చేతిని పట్టుకుని…  ఆమె చేతిలో కూడా కొంచెం పసుపు పెడతాడు.  ఇప్పుడు ఈవెన్.
అవని చిరునవ్వుతో…  ఆ పసుపుని తీసుకుని విక్రమ్ ముక్కు మీద చిన్న డాట్ పెడుతుంది.  ఇప్పుడు పర్ఫెక్ట్.
ఇద్దరూ ఒక్కసారి ఒకరికొకరు చూస్తారు.
వాతావరణం ఒక్కసారిగా నిశ్శబ్దమవుతుంది.
దూరంలో పిల్లలు ఇంకా ఆడుకుంటున్నారు…
లోపల పెద్దలు మాట్లాడుకుంటున్నారు…
కానీ ఈ క్షణం మాత్రం వాళ్లిద్దరికే.
అవని మెల్లగా... మీకు తెలుసా … ఈ ఫ్యామిలీ ఇంత స్ట్రాంగ్ గా ఉండటానికి కారణం మీరే...
విక్రమ్ తల ఊపుతూ…  కాదు అవని… మనం.
నువ్వు నా పక్కన నిలబడ్డ ప్రతి సారి… నేను గెలిచాను.
అవని కళ్ళల్లో కృతజ్ఞత, ప్రేమ కలిసిపోతాయి.
విక్రమ్ ఆమె జుట్టులో చిక్కుకున్న మల్లెపువ్వు సరిచేస్తాడు.
సాయంత్రపు గాలి వీచి… మల్లె పరిమళం మళ్లీ చుట్టూ వ్యాపిస్తుంది.

అవని అతని భుజంపై తల ఆనిస్తుంది.  విక్రమ్ ఆమెను దగ్గరగా తీసుకుంటాడు.  ఎటువంటి డైలాగ్ అవసరం లేదు.

పసుపు రంగులో మెరిసిన ఆ రోజు…  ఇప్పుడు ప్రేమ రంగులో ముగుస్తుంది. దూరం నుంచి కళ్యాణ్ చూసి చిన్నగా నవ్వుకుంటాడు.

ఇది సింహ ఫ్యామిలీ హల్దీ… కానీ అసలు బలం ఇదే.
పసుపు, మల్లె, నవ్వులు…
మధ్యలో ఒక జంట – నిశ్శబ్దంగా ఒకరికొకరు ఇచ్చుకున్న వాగ్దానం.

సంగీత్ కి రెడీ అవ్వండి..

కథ కొనసాగుతుంది.........
[+] 6 users Like SivaSai's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Bagundi.. emotions baaga describe chesaru
Actually.. konchem ekkuva అనిపించింది
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
ఇంట్లో పెళ్లి వాతావరణ అంటే ఇలా ఉండాలి అని చక్కగా రాసారు.
[+] 1 user Likes Sunny73's post
Like Reply
Excellent update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
Part - 141



స్టేజ్ మీద మొదట పిల్లలు డాన్స్ చేస్తారు.
ఆ తర్వాత అకస్మాత్తుగా మ్యూజిక్ స్లో అవుతుంది.
వినయ్ మైక్ పట్టుకుని మాట్లాడటం మొదలుపెడతాడు.

మన కుటుంబం చాలా స్ట్రాంగ్...కానీ ఈ స్ట్రెంగ్త్ ఒక్క రోజులో రాలేదు.
మన పెద్దల కష్టాలు, త్యాగాలు, ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం వల్ల వచ్చింది.

అంతలో స్క్రీన్ మీద చిన్నప్పటి ఫోటోలు ప్లే అవుతాయి.
ముగ్గురు పెళ్లికొడుకులు చిన్నపిల్లలుగా…
ముగ్గురు పెళ్లికూతుళ్లు తమ తమ బాల్య క్షణాల్లో…
లలిత, మాధవి కళ్ళల్లో నీళ్లు మెరిసిపోతాయి.

విక్రమ్ ముందుకు వచ్చి…  ఈ రోజు మన పిల్లలు జీవితంలో కొత్త అడుగు వేస్తున్నారు.
కానీ ఒక మాట గుర్తుంచుకోండి…
పెళ్లి అంటే ఇద్దరు కాదు… రెండు కుటుంబాలు.

సూర్య, వైభవ్, శ్రీకర్ ముగ్గురూ ఒకేసారి తమ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి పాదాలు తాకుతారు...అందరూ స్టేజ్ మీదే ఒక్కసారిగా కౌగిలించుకుంటారు.

మ్యూజిక్ మెల్లగా అమ్మా నాన్నా.థీమ్ లాగా ప్లే అవుతుంది.
ఆ క్షణం…
నవ్వుల మధ్య కన్నీళ్లు…
కన్నీళ్లలో గర్వం.



టెర్రస్ మీద చంద్రకాంతి.  సూర్య మెల్లగా చెబుతాడు.
నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నేను కాస్త సైలెంట్ అయ్యాను… కానీ స్ట్రాంగ్ అయ్యాను.
విశిష్ట చిరునవ్వు.
నేను స్ట్రెస్ లో సైలెంట్ అవుతాను… నువ్వు మాట్లాడాలి.
సూర్య చేతిని ముందుకు చాపి...  డీల్. ఎప్పుడైనా నువ్వు మౌనం అయితే… నేను నీ గుండె వినిపిస్తాను.

చందు ఇంకా మిర్రర్ ముందు జ్యువెలరీ సర్దుకుంటోంది.
వైభవ్ వెనుక నుంచి... నువ్వు ఫ్యాషన్ ని ప్రేమించావు… కానీ నేను నీ సింప్లిసిటీని ప్రేమించాను.
చందు నెమ్మదిగా తిరిగి...  నన్ను హ్యాండిల్ చేయడం ఈజీ కాదు.  వైభవ్ నవ్వుతూ...  అందుకే నేనే సెలెక్ట్ అయ్యాను.
ఇద్దరూ చిన్నగా నవ్వుకుంటారు.


సౌమ్య బాల్కనీ దగ్గర నిలబడి ఉంది.
శ్రీకర్ దగ్గరికి వచ్చి..  డాక్టర్ గారూ… నా జీవితానికి కూడా ట్రీట్‌మెంట్ ఇస్తారా?
సౌమ్య చిన్నగా నవ్వి..  నీకు ఒక ప్రిస్క్రిప్షన్.  ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి.
శ్రీకర్ సీరియస్ గా...  నువ్వు నా పక్కన ఉంటే… నేను తప్పు దారి వెళ్లను.  సౌమ్య అతని భుజంపై తల ఆనిస్తుంది.

సంగీత్ స్టేజ్ మీద మళ్లీ ఫుల్ బీట్.  ముగ్గురు జంటలు కలిసి ఒక ఫైనల్ డాన్స్. పెద్దలు కింద నిలబడి చప్పట్లు కొడుతూ.

విక్రమ్ అవనిని చూసి మెల్లగా చెబుతాడు... మన ప్రేమ కథ మొదలైన రోజు గుర్తుందా?
అవని చిరునవ్వు తో   ఇంకా ముగియలేదు. ముగియదు కూడా.. అంత నమ్మకమా.  తన హృదయం పైన చెయ్యి పెట్టుకుని చూపిస్తుంది.

లైట్‌లు మెరుస్తూ…  మూడుసార్లు సింహ ఫ్యామిలీ అంటూ డీజే షౌట్ అవుతాడు.
పెళ్లి ఇంకొక రోజు ఉంది అనగా పెద్దల పర్మిషన్తో అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు సెపరేట్గా బ్యాచిలర్ పార్టీ అరేంజ్ చేసుకుంటారు.

సూర్య, వైభవ్, శ్రీకర్, గౌతమ్... ఒక ప్రైవేట్ ఫార్మ్ హౌస్‌లో.
ఫెయిరీ లైట్స్, బార్బెక్యూ సెటప్, లైట్ మ్యూజిక్.
వైభవ్ గ్లాస్ ఎత్తి...  ఈ రోజు తర్వాత మనం అధికారికంగా హజ్బండ్స్.

శ్రీకర్..  అంటే ఫ్రీడమ్ ఫినిష్ అన్నమాట?
సూర్య నవ్వుతూ..  ఫ్రీడమ్ కాదు… అప్‌గ్రేడ్.
గౌతమ్ మెల్లగా....  మనమంతా ఇంత దగ్గరగా ఇలా కూర్చోవడం చివరిసారి సింగిల్స్‌గా.
కొద్దిసేపు అందరూ సైలెంట్‌గా నవ్వుకుంటారు.

ఎవరు తమ ఫ్యూచర్ వైఫ్ గురించి ఎక్కువ తెలుసుకుంటారు?
ఇప్పుడు అవి అవసరమా గౌతమ్.. సరదాగా నాకంటే పెళ్లయిపోయింది కాబట్టి నాకు ఆ ప్రాబ్లం లేదు.  మీ ముగ్గురు చెప్పాలి.

నీకు తొందరగా పెళ్లి అవ్వచ్చు గాని మేము ముగ్గురుము ఎప్పుడో లవ్లో పడ్డాము అయితే ఇంకా ఈజీగా చెప్పగలరు  వైభవ్ నువ్వు స్టార్ట్ చెయ్.

వైభవ్ ఓవర్ కాన్ఫిడెంట్‌గా మొదలు పెడతాడు…  కానీ చందు ఫేవరెట్ డెజర్ట్ తప్పుగా చెబుతాడు.
అందరూ కేకలు
సూర్య మాత్రం కరెక్ట్‌గా విశిష్ట ఫేవరెట్ బుక్, కలర్ చెబుతాడు.
శ్రీకర్ సౌమ్య గురించి...  ఆమె టైమ్ మేనేజ్‌మెంట్ మీదే ప్రపంచం తిరుగుతుంది  అంటాడు.

గౌతమ్ సైలెంట్‌గా   భవ్య నవ్వు ఆగిపోతే, నేను తప్పు చేశానని అర్థం.
అందరూ ఒకేసారి   రొమాంటిక్..

ఇక సింహ మాన్షన్ టెర్రస్ మీద…  భవ్య, చందు, విశిష్ట, సౌమ్య...  లైట్ పింక్ & వైట్ థీమ్.
చందు డ్యాన్స్ స్టార్ట్ చేస్తుంది.  ఈ రోజు తర్వాత మిస్ కాదు… మిసెస్.

భవ్య నవ్వుతూ   కానీ మన గర్ల్స్ గ్రూప్ ఎప్పటికీ అలాగే.
గర్ల్ టాక్ మూమెంట్స్
సౌమ్య...  పెళ్లి తర్వాత కూడా మన కలలు ఆగకూడదు.
విశిష్ట...  మనందరికీ పార్ట్నర్స్ సపోర్ట్ ఉన్నారు. అదృష్టం.
చందు... నా బ్రాండ్ లాంచ్ పెళ్లి తర్వాత మొదటి ప్రాజెక్ట్.
భవ్య చేతులు చాపి...  మనం ఒకరికొకరం బ్యాక్‌బోన్.
అందరూ హగ్ చేసుకుంటారు.


బాయ్స్ ఫార్మ్ హౌస్ నుంచి వీడియో కాల్ చేస్తారు.
వైభవ్...  మీ పార్టీ ఎక్కువ సైలెంట్‌గా ఉంది అనుకుంటా.
చందు వెంటనే కెమెరా తిప్పి డీజే చూపిస్తుంది.
సైలెంట్ అంటావా?

సూర్య...  సరే, చివరి 10 నిమిషాలు కలిసి సెలబ్రేట్ చేద్దాం.
అందరూ ఒకేసారి ఒకే పాటకు డ్యాన్స్ చేస్తారు...
స్క్రీన్ రెండు వైపులా నవ్వులు, హర్షధ్వానాలు.

రాత్రి చివర్లో…  సూర్య మెల్లగా..  రేపటి నుంచి కొత్త ఛాప్టర్.
విశిష్ట...  కానీ ఈ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ మారదు.
అందరూ ఒకే మాట...  సింహ ఫ్యామిలీ ఫరెవర్.

మధురం మధురం స్నేహం మధురం....
[+] 7 users Like SivaSai's post
Like Reply
Part - 142



సంగీత రాత్రి ముగిసేసరికి…
ఇంట్లోని లైట్లు మెల్లగా డిమ్ అవుతాయి.
డ్యాన్స్, నవ్వులు, చప్పట్ల హంగామా ఆగిపోయినా…
హృదయాల్లో మాత్రం తీయని శబ్దం ఇంకా వినిపిస్తూనే ఉంటుంది.
ఆ రాత్రి…
యువ జంటల గదుల్లో ప్రేమ మాటలు మొదలవుతుంటే,
పెద్దవాళ్ల గదుల్లో జ్ఞాపకాల దీపాలు వెలుగుతాయి.


వినయ్ బాల్కనీలో నిలబడి సైలెంట్‌గా ఆకాశం చూస్తుంటాడు.  పూజిత వెనుక నుంచి వచ్చి
ఏమయింది ఇంత   సీరియస్‌గా ఆలోచిస్తున్నావు?

వినయ్ మెల్లగా నవ్వి...  మన పెళ్లి రోజు గుర్తొస్తోంది.
అప్పుడు మనం కూడా ఇలానే కలలు కంటూ కూర్చున్నాం.
పూజిత కుర్చీలో కూర్చుని...  అప్పుడు మన దగ్గర ప్లాన్లు మాత్రమే ఉన్నాయి.  ఇప్పుడు మన దగ్గర ఫ్యామిలీ ఉంది.

వినయ్ ఆమె చేయి పట్టుకుని...  మనం సరిగ్గా పెంచామా? అని చిన్నగా అడుగుతాడు.
పూజిత చిరునవ్వుతో...  మన పిల్లలు ప్రేమతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. అది మన గెలుపు.


శ్రీ షర్ట్ బటన్లు విప్పుకుంటూ నవ్వుతాడు.  మన పెళ్లి ముందు ఇలా సంగీతం చేసుకునే ఛాన్స్ ఎక్కడ?
నేహ నవ్వుతూ...  మన కాలంలో ఫోటోలు కూడా బ్లాక్ & వైట్.  ఇద్దరూ ఒకరినొకరు చూస్తారు.
మీది పల్లెటూరు అవ్వడం. మావయ్య గారు స్క్రిప్ట్ గా ఉండడం.  తమరు బయటకి రాకపోవడం ఓ మై గాడ్ నా ప్రేమ స్టోరీ ఎక్కడ మొదలైందో పెళ్లి అయ్యేవరకు అక్కడే ఉండిపోయింది.
మన మధ్య పెద్దగా లవ్ స్టోరీ లేకపోయినా…  మన లైఫ్ మాత్రం స్ట్రాంగ్ స్టోరీ అయింది.
నేహ మెల్లగా....  ప్రేమను ప్రకటించకపోయినా…
మన బంధం దాన్ని ప్రతి రోజూ నిరూపించింది.


భరత్ పడకపై కూర్చుని...  సౌమ్య పెళ్లి అయ్యాక కూడా చదువు ఆపదని చెప్పింది. నువ్వు కూడా అప్పట్లో అలాగే పోరాడావు కదా?
విద్య నవ్వుతూ...  అవును. నువ్వు నా వెనుక నిలబడ్డావు కాబట్టే.
భరత్...  ఇప్పుడు మన కూతురు కూడా తన కలలతో పెళ్లి చేసుకుంటోంది.  అది చూసి గర్వంగా ఉంది.
విద్య  పక్కనే కూర్చుంటూ..  పెళ్లి అంటే కలలు ఆగిపోవడం కాదు అని  మన పిల్లలు నిరూపిస్తున్నారు.

రాజ్ మంచం అంచున కూర్చుని...  మన లైఫ్ లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసాం.  నివి అతని భుజంపై తల పెట్టి...
కానీ విడువలేదు.
రాజ్ నవ్వి...  ఇప్పుడు మన పిల్లలు అంత స్ట్రాంగ్‌గా ఉన్నారు అంటే…  అది మనం కలిసి నిలబడిన ఫలితం.
నివి...  ఇప్పుడు వాళ్లకు మనం వెనుక ఉన్నామనే నమ్మకం ఉంటే చాలు.

ఇంట్లో నిశ్శబ్దం.  లలిత కిటికీ దగ్గర నిలబడి లాన్ వైపు చూస్తుంది.  మన మూడో తరం వచ్చేసింది కదా… అంటుంది మెల్లగా.

కళ్యాణ్ నవ్వుతూ..  ఇంకా మనం యంగ్‌నే.
లలిత చిరునవ్వుతో...  పిల్లల పిల్లల్ని ఆడించడానికి రెడీ అవ్వాలి.

కళ్యాణ్...  మన ఇంటి బంధం ఇలాగే ప్రేమతో ఉండాలి.
అదే మన సంపద.
లలిత మెల్లగా...  ఇంత ఆనందం ఒకేసారి రావడం అరుదు.

మాధవి జడ తీస్తూ...  మన పెళ్లి రోజు నేను ఎంత టెన్షన్ పడ్డానో గుర్తుందా?
రమేష్ నవ్వి...  నువ్వు టెన్షన్ పడితే నేను స్ట్రాంగ్‌గా నటించేవాడిని.
మాధవి  ఆశ్చర్యంగా..  ఇప్పుడు మన పిల్లలు ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో చూస్తే…  మన పెళ్లి రోజుల కష్టం ఫలించింది అనిపిస్తోంది.

రమేష్ తల ఊపుతూ..  ప్రేమ అంటే పెద్ద మాటలు కాదు.
కలిసి నడిచిన సంవత్సరాలు.

సింహ మాన్షన్ అంతా నిశ్శబ్దంగా ఉంది.  కానీ ప్రతి గదిలో ఒకే భావం  కృతజ్ఞత.
పాత తరం ప్రేమను నిలబెట్టింది.
ఇప్పటి తరం ప్రేమను సెలబ్రేట్ చేస్తోంది.
రాబోయే తరం ప్రేమను నేర్చుకోబోతోంది.
ఆ రాత్రి ఎవరూ ఏడవలేదు.
ఎవరూ బాధపడలేదు.

కేవలం ఒక సంతోషకరమైన అవగాహన మాత్రమే.
ప్రేమ మారుతుంది… రూపం మారుతుంది…
కానీ బంధం మాత్రం తరాల్ని దాటుకుంటూ ముందుకు సాగుతుంది.

విశిష్ట జుట్టు విప్పుకుని కిటికీ దగ్గర కూర్చుంది.
ఫోన్ వైబ్రేట్ అవుతుంది.
సూర్య దగ్గర నుంచి కాల్ ..  నిద్రపోలేదా?
విశిష్ట అది విని రిప్లై ఇస్తుంది.  ఇంత పెద్ద రోజు ముందు ఎలా నిద్రపడుతుంది?
సూర్య నవ్వుతాడు.  రేపటి నుంచి నువ్వు నా బాధ్యత.
విశిష్ట వెంటనే...  బాధ్యత కాదు. పార్ట్నర్.

సూర్య కాసేపు సైలెంట్.  నువ్వు నా లైఫ్‌లోకి వచ్చాక నేనెంతో కామ్ అయ్యాను.  రేపటి నుంచి నీ సపోర్ట్‌తో ఇంకా బెటర్ అవుతాను.

విశిష్ట మెల్లగా... నువ్వు ఇప్పటికే సరిపోతావు.
నేను నీతో నడవడానికి వస్తున్నాను… మార్చడానికి కాదు.
ఆ మాటల తర్వాత ఇద్దరూ కాసేపు మాట్లాడకుండా ఒకరిని ఒకరు వినిపించుకుంటారు.
అది మాటల కంటే ఎక్కువ.


చందు మంచంపై పడుకుని నవ్వుకుంటోంది.  వైభవ్ మెసేజ్ పంపుతాడు.. రేపు నన్ను ఏడిపించకూడదు.
చందు వెంటనే కాల్ చేస్తుంది.  ఎవరిని? నిన్నా? అసాధ్యం.
వైభవ్... నువ్వు నవ్వితే చాలు నాకు టెన్షన్ పోతుంది.
చందు.. నువ్వు ఎప్పుడూ నా ఫ్రెండ్‌లా ఉండాలి.
హజ్బండ్ ట్యాగ్ వేసుకుని సీరియస్ అవ్వొద్దు.
వైభవ్ నవ్వి...  మన లైఫ్‌లో డ్రామా వస్తే…
ముందు నవ్వుకుందాం, తర్వాత సాల్వ్ చేద్దాం. ఓకే?
చందు చేయి గుండెపై పెట్టుకుని...  ప్రామిస్.
ఇది లవ్ స్టోరీ కంటే ఫ్రెండ్‌షిప్ స్టోరీ ఎక్కువ.
అదే వాళ్ల బలం.

సౌమ్య అద్దం ముందు తన మెహందీని చూస్తోంది.
డోర్ దగ్గర మెత్తగా ట్యాప్... శ్రీకర్ వీడియో కాల్‌లో.
రేపటి నుంచి నిన్ను నా ఇంటికి తీసుకెళ్తున్నాను… రెడీనా?

సౌమ్య నవ్వి..  ఇంటి మార్పు భయం లేదు.
నీతో జీవితం ప్రారంభం అవుతోంది అనేది పెద్దగా అనిపిస్తోంది.

శ్రీకర్...  నువ్వు నీ కెరీర్, నీ ఐడెంటిటీ అలాగే కొనసాగాలి.
నా పేరు నీకు అదనంగా ఉండాలి… భారం కాదు.
సౌమ్య కళ్లలో వెలుగు.  నన్ను అలా అర్థం చేసుకున్నావంటే చాలు.

శ్రీకర్ మెల్లగా...  ప్రతి నెల ఒక డేట్ నైట్ ఫిక్స్.
ప్రతి ఏడాది ఒక కొత్త డ్రీమ్.మనిద్దరం కలిసి.
సౌమ్య   డీల్.


మూడు జంటలు.
మూడు వేరే స్వభావాలు.
సూర్య–విశిష్ట — పరస్పర గౌరవం.
వైభవ్–చందు — నవ్వుల ప్రేమ.
శ్రీకర్–సౌమ్య — కలల భాగస్వామ్యం.
రేపు మంత్రాలు, మంగళసూత్రం, ఆశీర్వాదాలు.
ఈ రాత్రి మాత్రం…
మౌనంగా ఇచ్చుకున్న నమ్మకం.

పెళ్లికి అందరూ ఆహ్వానితులే........
[+] 7 users Like SivaSai's post
Like Reply
Part - 143



తెల్లవారుఝామున…
సూర్యకిరణాలు మెల్లగా కిటికీ తెరల గుండా లోపలికి జారుకుంటాయి.
పూల వాసన… మంగళవాయిద్యాల స్వరాలు దూరంగా వినిపిస్తున్నాయి.
ఇంటి ఆవరణలో పనివాళ్ల హడావిడి.
కానీ బ్రైడల్ రూమ్‌లో మాత్రం ఒక ప్రశాంతమైన నిశ్శబ్దం.
విశిష్ట  అద్దం ముందు కూర్చుంది.
జుట్టులో జడచుట్టే వేళ… ఆమె కళ్లలో ఒక కొత్త ప్రకాశం.
మేకప్ ఆర్టిస్ట్ స్మైల్ ప్లీజ్ అంటుంటే
ఆమె కేవలం తలలో ఒకే ఆలోచన...  ఇది నా కొత్త ప్రారంభం.
మెహందీపై సూర్య పేరు మెత్తగా కనిపిస్తుంది.
ఆమె వేళ్లు దానిని తాకుతాయి.
చిన్న చిరునవ్వు.
కూతురిని పెళ్ళికూతురి అలంకరణలో చూసిన భానుమతికి కళ్ళల్లో ఆనందం.

చందు గదిలో మాత్రం నవ్వులు.  ఇంకా టైం ఉంది కదా? అని ఫ్రెండ్స్‌ను అడుగుతుంది.  కానీ అద్దం ముందు ఒక్కసారి ఒంటరిగా నిలబడి..  గంభీరంగా తనను తాను చూస్తుంది.  ఇప్పటి నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ నా జీవిత భాగస్వామి అవుతున్నాడు.
ఆమె కళ్లలో భయం కాదు…
ఎగ్జైట్మెంట్.


సౌమ్య శాంతంగా కూర్చుంది.  పెళ్లి చీర కడుతూ ఉంటే ఆమె అమ్మ వెనుక నిలబడి చూస్తుంది.
నువ్వు ఎప్పుడూ ఇలాగే స్ట్రాంగ్‌గా ఉండాలి అని విద్య చెబుతుంది.
సౌమ్య నవ్వి...  నాకొక స్ట్రాంగ్ పార్ట్నర్ ఉన్నాడు.
ఆమె మెడలో ఆభరణాలు పెట్టిన క్షణం...
ఒక చిన్న గౌరవభావం.
ఇది కేవలం పెళ్లి కాదు.
ఇది ఆమె ఎంపిక చేసిన జీవితం.

ఇంటి బయట…
మంగళవాయిద్యాల శబ్దం కాస్త గట్టిగా.
బంధువులు వస్తున్నారు.
పూలతో అలంకరించిన మండపం సూర్యకాంతిలో మెరిసిపోతోంది.
మూడు బ్రైడ్స్ మూడు గదుల్లో రెడీ అవుతుండగా..
ముగ్గురు కళ్ళల్లో..
నవ్వు.
ఆత్మవిశ్వాసం.
శాంతి.

బయట బాండ్ సౌండ్ ఒక్కసారిగా పెరుగుతుంది.
డ్రమ్స్… వీణలు… విజిల్స్… కేరింతలు..

సూర్య ఫ్రెండ్స్ డాన్సులు వేస్తూ.. అరే వరుడూ… సీరియస్ ఫేస్ వద్దు అంటూ  సూర్యను చుట్టుముట్టి డ్యాన్స్ మొదలుపెడతారు.

ఒక ఫ్రెండ్ గాగుల్స్ పెట్టి...  ఈ రోజు నుంచి నీ సింగిల్ లైఫ్ ఫినిష్.
సూర్య నవ్వుతూ...  నాకు అప్‌గ్రేడ్ వస్తోంది బాస్.
అందరూ హర్షధ్వానాలు.


వైభవ్ షెర్వానీ సరిచేసుకుంటూ వస్తుంటే వెనుక నుంచి ఫ్రెండ్స్ రంగు పూలు విసురుతారు.  చందు దగ్గర లేట్ అయితే ఫైన్ పడుతుంది ని ఒకరు.
వైభవ్...  నాకు బైల్ ఎవరు పెడతారు?
అందరూ నవ్వులు.


శ్రీకర్ కాస్త సైలెంట్‌గా ఉంటే  ఫ్రెండ్ ఒకరు భుజం తట్టి..
ఇంకా టైమ్ ఉంది, పారిపోవాలంటే ఇప్పుడే..
శ్రీకర్ చిరునవ్వుతో..  పారిపోవడం కాదు… ముందుకు పరుగెత్తుతున్నా.
అందరూ వాహ్ అంటూ చప్పట్లు.


ముగ్గురు పెళ్ళికొడుకులు  ఒకే లైన్‌లో నిలబడతారు.
వెనుక ఫ్రెండ్స్ డ్యాన్స్ చేస్తూ.
ముందు మండపం.
పూలతో అలంకరించిన మార్గం.
ఒక ఫ్రెండ్ గట్టిగా...  రెడీనా బాయ్స్?
రెడీ
డ్రమ్స్ బీట్ పెరుగుతుంది.
స్నేహితులు డాన్స్ చేస్తూ పెళ్లికొడుకులు ముగ్గురిని మండపంలోనికి తీసుకువస్తారు. పెద్దలు వాళ్ళ సరదాని చూసి నవ్వుకుంటారు ముగ్గురిని మండపంలో కూర్చో పెడతారు.

మంగళవాయిద్యాల శబ్దం ఒక్కసారిగా మెల్లగా తగ్గుతుంది.అందరూ వెనక్కి తిరిగి చూస్తారు.
దూరంగా…   వధువులు మేలు ముసగులతో నడుస్తూ వస్తున్నారు. వారి అడుగులు నెమ్మదిగా.
వారి చీరల అంచులు నేలను ముద్దాడుతున్నాయి.

సూర్య కళ్లలో ఒక్కసారిగా ఆత్రం.  అదేనా…? అని తనలోనే...విశిష్ట ముసుగు వెనుక నుంచి స్వల్పంగా తలెత్తి చూస్తుంది. సూర్య కళ్లతో ఆమెను వెతుకుతాడు.
ముసుగు లోనుంచి చూస్తున్న విశి కళ్లు సూర్య కళ్ల తో కలుసుకుంటాయి.
ఇద్దరి కళ్లూ కలుస్తాయి.  ఆ క్షణం…  శబ్దాలు అన్నీ మాయం.  కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం మాత్రమే.
సూర్య చిన్నగా తల ఊపుతాడు.  నేను ఇక్కడే ఉన్నాను.
విశిష్ట కళ్లలో నవ్వు.


వైభవ్ కాస్త ముందుకు వాలి చూస్తాడు.  చందు ఏది? అని ఫ్రెండ్‌ను అడుగుతాడు.
ఫ్రెండ్ నవ్వుతూ... అంత త్వరగా కనుక్కుంటే ఫన్ ఎక్కడ?
చందు ముసుగు వెనుక నవ్వు దాచుకుంటుంది.
ఆమె మెహందీ చేతులు కొంచెం పైకెత్తినప్పుడు
వైభవ్ వెంటనే గుర్తుపడతాడు.
అదే నా పిచ్చి.
ముసుగులో నుంచే చందు కోపంగా చూస్తుంది.
ఆత్రం కన్నా ఎగ్జైట్మెంట్ ఎక్కువ.

శ్రీకర్ మాత్రం ప్రశాంతంగా చూస్తూ ఉంటాడు.
కానీ అతని వేళ్లు గట్టిగా కలిపి ఉన్నాయి  టెన్షన్.
సౌమ్య నడుస్తూ వస్తూ  ఒక్క క్షణం ఆగి…
ముసుగు కింద నుంచి అతన్ని చూసి చిన్నగా నవ్వుతుంది.
ఆ నవ్వు చూసిన వెంటనే  శ్రీకర్ గుండె చప్పుళ్లు తగ్గిపోతాయి.  ఇదే నా జీవితం అని తనలోనే అనుకుంటాడు.


మూడు జంటలు.
పూల వర్షం.
మంగళవాయిద్యాలు మళ్లీ గట్టిగా.
ఆత్రం → ప్రశాంతం.
ఆందోళన → నమ్మకం.
మూడు జంటలు మండపం మధ్య నిలబడతారు.
వధువుల ముఖం ఇంకా ముసుగులోనే.
కళ్లే మాత్రమే స్వల్పంగా కనిపిస్తున్నాయి.


సూర్య కొంచెం ముందుకు వాలి చూసే ప్రయత్నం చేస్తాడు.
ఫ్రెండ్స్ వెంటనే అడ్డుకుంటారు.
అరే ఇప్పుడే చూడకూడదు.
విశిష్ట చేతిలో  వరమాల.
సూర్య ఎత్తుగా నిలబడి ఉండగా...
ఫ్రెండ్స్ అతన్ని పైకి ఎత్తేస్తారు.
విశిష్ట నవ్వు ముసుగులోనే దాగిపోతుంది.
ఆమె చేతులు కాస్త వణుకుతాయి.
చివరికి వరమాల అతని మెడలో పడుతుంది.

సూర్య తనవంతు వరమాల వేస్తూ..  ముఖం చూడకపోయినా… నా హృదయం ముందే తెలుసుకుంది.
ముసుగులో విశిష్ట కళ్లలో వెలుగు.

ఇక్కడ ఫుల్ ఫన్.  చందు వరమాల వేయబోతుంటే
వైభవ్ ఫ్రెండ్స్ అతన్ని ఎత్తేస్తారు.
చందు కూడా తగ్గదు.ఒక్కసారి దిగనివ్వండి  అని నవ్వుతుంది.

చివరికి వైభవ్ వంగి...ఇంకా చూడలేదు కానీ… ఈ నవ్వే చాలూ.
ముసుగు వెనుక నుంచి చందు కళ్లతోనే సమాధానం.
అది చూసిన రాజ్ నివి తో హమ్మయ్య...ఇన్ని రోజులుకి సింహ ఫ్యామిలీ లొంగ తీయడానికి నా కూతురు వచ్చింది ఇంకా ప్రతిరోజు నేను ప్రశాంతంగా పడుకుంటాను.

ఆ మాటికి నివి కోపంగా చేస్తుంది. ఇక ఎలా చూసినా సరే నేను భయపడను. ఇక పెత్తనం అంతా మా అమ్మాయిలిదే.

అక్కడ ఉన్నది నా మేనల్లుళ్లు తగ్గినట్టే తగ్గి లొంగదీస్తారు. కొంచెం కూడా ఒప్పుకోవే. పుట్టింటినంటే నేనే కాదు ఎవరు ఒప్పుకోరు అని పెళ్లిని చూస్తూ ఉంటుంది.


ఇద్దరూ చాలా ప్రశాంతంగా. ముసుగు వెనుక సౌమ్య తల వంచి ఉంది.  శ్రీకర్ వరమాల వేయబోతూ కాసేపు ఆగుతాడు.

ఇంకా నీ ముఖం చూడలేదు… కానీ నీతో జీవితం గడపాలని ఎన్నోసార్లు ఊహించుకున్నా.  సౌమ్య చేతులు కాస్త గట్టిగా పట్టుకుంటాయి.

వరమాల మార్పిడి...  పూల వర్షం.

మండపంలో హోమగుండం ముందు కూర్చుంటారు.
ముసుగులు అలాగే..మంత్రాల మధ్య వరులు ఒక్కసారి కూడా పూర్తిగా చూడలేరు.
కేవలం కళ్లే.

ఆ కళ్లలోనే మాటలు.  మంగళసూత్రం కట్టే క్షణం...
పెళ్లి కొడుకులు  చేతులు కాస్త వణుకుతాయి.
పెద్దవాళ్లు ఆశీర్వదిస్తారు.
కానీ ఇంకా ముసుగు అలాగే.
ఇది ఒక ఆత్రాన్ని పెంచే ప్రయాణం.
మొదటి రాత్రి వరకూ నిలిచే ఆసక్తి.

పెళ్లి పూర్తయింది.
వధువులు కొత్త ఇంట్లోకి అడుగుపెడతారు.
ఇంకా ముసుగు అలాగే.
వరులు ఒక్కసారి కూడా పూర్తి ముఖం చూడలేదు.
ఇద్దరి మధ్య ఒక మధురమైన ఆత్రం.
ఇంకా కొద్దిసేపే… అనే భావన.

గృహప్రవేశ వేడుకలు....
[+] 5 users Like SivaSai's post
Like Reply
Part - 144



సూర్య–విశిష్ట
వైభవ్–చందు
ఇంటి ముందు రంగవల్లులు, దీపాలు, పూలతో అలంకారం.
దివ్య ఇద్దరికీ ఆడపడుచుగా హారతి పట్టుకొని నిలబడుతుంది.

విశిష్ట, చందు ఇద్దరూ మేలు ముసుగులోనే నిలబడతారు.
ముందు జంటలు పేర్లు చెప్పుకొని అప్పుడు లోపలికి రావాలి అనగానే... సూర్య నవ్వుతూ సూర్యదేవాన్ష్ జై సింహ అనే నేను నా క్యూటీ అయిన నా భార్య విశిష్టతో కలిసి వచ్చాను అని చెబుతాడు.
విశి చిన్నగా సిగ్గుపడుతూ విశిష్ట అయిన నేను నా భర్త దేవా సార్ తో కలిసి వచ్చాను.  ఇప్పుడు కూడా నీకు దేవాసార్ నేనా.. అని చిన్నగా అడుగుతాడు.  అదే అలవాటు అయిపోయింది ఏం చేయమంటారు.

వైభవ్ నవ్వుతూ వైభవ్ జై సింహా అనే నేను మా పిల్ల రాక్షసి అయిన చంద్రికతో కలిసి వచ్చాను అని చెబుతాడు. ఆ మాటకి చందు మెల్లిగా చేయ్యి గిల్లుతుంది.

చెప్పానా.. ఇది పిల్ల రాక్షసి అని. అప్పుడే గిల్లడం మొదలు పెట్టింది. ఆ మాటకి సిగ్గుపడుతూ చంద్రిక అనే నేను నా కోతి బావ అయినా వైభవ్ తో కలిసి వచ్చాను అని చెబుతోంది.

నేను కోతినా అని అక్కడే అరుస్తూ ఉంటే.. పూజిత కర్ర కావాలా అని అడుగుతుంది. అమ్మ ఈ టైంలో కర్రలతో రాకూడదు అమ్మ అని బిక్క మొఖం వేస్తాడు.  అందరూ నవ్వులే నవ్వులు.

కుడి కాలు ముందుకు పెట్టాలి అమ్మా…  అత్తగారు సున్నితంగా చెబుతుంది. విశిష్ట మెల్లగా అడుగు వేస్తుంది.
సూర్య పక్కనే నిలబడి చూస్తాడు…
ఇంకా ముఖం చూడలేదు.
చందు లోపలికి అడుగు వేస్తుంటే
వైభవ్ మెల్లగా...  జాగ్రత్త… నేల జారి పోతుంది.
చందు నవ్వుతుంది...  నేను జారినా పట్టుకునే వాళ్లు ఉన్నారు కదా.
ఫ్యామిలీ నవ్వులు.

పాలలో ఉంగరం వేసి వెతకమంటారు.  విశిష్ట చేతి ముసుగు కింద నుంచి స్వల్పంగా కదులుతుంది.
సూర్య కూడా వెతుకుతాడు. ఇద్దరి వేళ్లు ఒకదానిని ఒకటి తాకిన క్షణం..  ఒక చిన్న షాక్ లాంటి ఫీల్.
ఎవరు గెలిచారు? అని అందరూ.
విశిష్ట ఉంగరం పట్టుకుంటుంది.
సూర్య నవ్వి...  ఇప్పటి నుంచే డామినేషన్ స్టార్ట్ అయింది.

శ్రీకర్ సౌమ్య గృహప్రవేశం..  శాంతమైన వాతావరణం.
నివి దీపం పట్టుకుని ముందుంటుంది. సౌమ్య ముసుగులో తలవంచి లోపలికి అడుగు వేస్తుంది. శ్రీకర్ కళ్లతో మాత్రమే ఆమెను చూసుకుంటాడు.

అక్కడ కూడా ఉంగరం ఆట. ఈసారి శ్రీకర్ గెలుస్తాడు.
సౌమ్య మెల్లగా   ఓకే… మొదటి రౌండ్ నీది.
ఇద్దరి మధ్య నిశ్శబ్దంలోనే సరదా.

సాంప్రదాయం ప్రకారం…వధువులు వేరే గదుల్లో విశ్రాంతి.
వరులు కూడా వేరే గదుల్లో.. ముసుగులు ఇంకా అలాగే.
సూర్య ఫోన్‌లో మెసేజ్... ఇంకా రెండు రోజులు.
విశిష్ట సమాధానం..
ఆత్రం పెంచడం కూడా సాంప్రదాయం అనుకుంటా.
వైభవ్  ఫోన్ తీసుకుంటాడు..  చందు, నువ్వు నవ్వుతుంటే ఎలా ఉంటావో ఊహించుకుంటున్నా.
చందు...  ఊహే కదా… ఇంకాస్త ఓపిక.
శ్రీకర్...  సౌమ్య, నీ కళ్లలో ఈ రోజు ప్రశాంతం కనిపించింది.
సౌమ్య...  నీ వల్లే.

పెద్దవాళ్ల మధ్య సాంప్రదాయ క్రమం.
వధువులు ఇంకా ముసుగులోనే.
మంత్రాలు, ఆశీర్వాదాలు, పసుపు కుంకుమ.
ఇది ఓపిక పరీక్ష.
వరులు ఒక్కసారి కూడా పూర్తిగా చూడలేరు.


గదులు పూలతో అలంకరించబడ్డాయి.
దీపాల వెలుగు.
జాస్మిన్ వాసన.
ముసుగు ఇంకా అలాగే.
తలుపు మెల్లగా మూసుకుంటుంది.
ఆత్రం, గౌరవం, కొత్త బంధం.
దీపాల వెలుగు.
పూల సువాసన.
తలుపులు మెల్లగా మూసుకుపోతాయి.


విశిష్ట మంచం అంచున కూర్చుంది.
మేలు ముసుగు ముఖాన్ని కప్పి ఉంది.
సూర్య నెమ్మదిగా దగ్గరకు వచ్చి కూర్చుంటాడు.
కొద్దిసేపు మాటలు లేవు.
ఇంత రోజులు ఎదురు చూశాను…
అతని స్వరం మృదువుగా.
విశిష్ట చిన్నగా ... నువ్వు నమ్మకంగా ఉంటావని తెలుసు… అందుకే భయం లేదు.
సూర్య చేతులు ముందుకు సాగి
ముసుగును మెల్లగా పట్టుకుంటాయి.
ఇది తొలిసారి… నిన్ను పూర్తిగా చూడబోతున్నాను.
ముసుగు నెమ్మదిగా తొలగుతుంది.
విశిష్ట కళ్లలో స్వచ్ఛమైన నమ్మకం.
సూర్య ఒక క్షణం మాటలు రాక నిలబడిపోతాడు.
ఇదేనా నా జీవిత భాగస్వామి…అని చిరునవ్వు.


చందు కాస్త టెన్షన్‌గా నవ్వుకుంటోంది.  వైభవ్ లోపలికి వచ్చి తలుపు వేసి..ఇంకా నవ్వుతూనే ఉన్నావా?
నవ్వకపోతే భయం పెరుగుతుంది, అంటుంది చందు.
వైభవ్ కాస్త దూరంగా కూర్చుని... మన మధ్య ఎప్పటిలాగే ఫ్రెండ్‌షిప్ మొదట.  చందు తల ఊపుతుంది.
వైభవ్ ముసుగును మెల్లగా లేపుతాడు.
ఆమె ముఖం కనిపించే క్షణం   ఇదే నా పిచ్చి నవ్వు.
చందు సిగ్గుతో తలవంచుతుంది.
ఇద్దరి మధ్య నవ్వే బ్రిడ్జ్.


సౌమ్య ప్రశాంతంగా కూర్చుంది.
దీపాల వెలుగులో ఆమె ముసుగు స్వల్పంగా మెరుస్తోంది.
శ్రీకర్ నెమ్మదిగా వచ్చి ఆమె ముందే కూర్చుంటాడు.
నీ కళ్లే చాలాసార్లు చూసాను… ఈ రోజు ముఖం కూడా చూస్తాను.

సౌమ్య స్వల్పంగా శ్వాస తీసుకుంటుంది.
అతను ముసుగును మెల్లగా తొలగిస్తాడు.
ఆమె ముఖం వెలుగులో మెరిసే క్షణం..
శ్రీకర్ కళ్లలో గౌరవం.
నీ నవ్వు అలాగే ఉండాలి.  నేను చూసుకునే బాధ్యత నా మీద.
సౌమ్య చిరునవ్వు.

మూడు గదుల్లో మూడు వాతావరణాలు:
ఒకటి నమ్మకంతో నిండిన ప్రశాంత ప్రేమ.
ఒకటి నవ్వులతో మొదలైన స్నేహ ప్రేమ.
ఒకటి గౌరవంతో బలపడిన భాగస్వామ్యం.
ముసుగులు తొలగిపోయాయి.
కానీ పరస్పర గౌరవం మాత్రం అలాగే.
దీపాల వెలుగు మెల్లగా తగ్గుతుంది…
రాత్రి ఆ కొత్త బంధాలను ఆలింగనం చేసుకుంటుంది.........
[+] 5 users Like SivaSai's post
Like Reply
Part - 145


ఇంటి ఆవరణలో పక్షుల కిలకిల.
వంటగదిలో పాత్రల చప్పుళ్లు.

విశిష్ట ముందుగా లేచి  స్నానం చేసి సాదాసీదాగా వచ్చేస్తుంది.
చందు మాత్రం కాస్త ఆలస్యంగా… జడ అల్లకల్లోలంగా.
లలిత నవ్వుతూ ఇంకా నువ్వు చిన్నపిల్లవు అనుకుంటున్నావా చందు ఇది మా అమ్మమ్మ ఇల్లే కదా అని లలిత మెడ చుట్టూ చేతులేస్తుంది. నివి కోపంగా పెళ్లయిన తర్వాత ఆడపిల్లలు  ముందు స్నానం చేయాలి. వెళ్లి స్నానం చేసి రా అని కోపం చూపిస్తుంది.. మా అమ్మకి కోపం అనే ఫుడ్డు ఎక్కువ పెట్టేసినట్టున్నావ్ అమ్మమ్మ అనే గదిలోకి వెళుతుంది.
ఇద్దరూ ఇలా సైలెంట్‌గా వచ్చేస్తే సరిపోదు. కొత్త కోడళ్ళ ఎంట్రీకి శబ్దం ఉండాలి.
చందు వెంటనే...
అయితే రేపటి నుంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెట్టిస్తాం.
అందరూ నవ్వుతారు.

చందు స్నానం చేసి వచ్చిన తర్వాత ఇద్దరి చేత పూజ గదిలో దీపం పెట్టిస్తారు. ఇప్పుడు మీరు ఇద్దరూ స్వీట్ చేయండి. ఏం కావాలన్నా అదిగో మీ అత్తగారులు ఇద్దరూ పక్కన నిలబడి సలహాలు ఇస్తారు అని లలిత చెబుతుంది.
ఒకళ్ళు డ్రైఫ్రూట్ హల్వా చేస్తే ఇంకొకరు బ్రెడ్ హల్వా చేస్తారు.
రెండు డైనింగ్ టేబుల్ మీద పెడితే మాధవి అది చూసి ఇంతకీ ఏ స్వీట్ ఎవరు చేశారు. ఆ మాటకి చందు విశి ఒకరినొకరు చూసుకుంటూ ఇద్దరు కలిపే చేసాము కాబట్టి ఇది ఎవరి చేశారు అన్న క్వశ్చన్ లేదు. ఆ మాటకి కుటుంబం మొత్తం తృప్తిగా చూస్తుంది.

సూర్య దూరంగా చూస్తూ...  ఇప్పటికే ఇంటి మూడ్ మారిపోయింది.
వైభవ్ చందును చూస్తూ   ఈరోజు నువ్వే టిఫిన్?. చేసావా..
చందు  చీర చెంగు తిప్పుతూ..  ముందు నేర్చుకోవాలి సర్.
ఫ్యామిలీ నవ్వుల్లో ఉదయం ప్రారంభమవుతుంది.


సౌమ్య తెల్లవారుఝామునే లేచి పూజ గది దగ్గర దీపం వెలిగిస్తుంది. నేహా నెమ్మదిగా వచ్చి చూస్తుంది.
ఇంత త్వరగా లేవాల్సిన అవసరం లేదు సౌమ్య..
సౌమ్య చిరునవ్వుతో —
ఇది మన ఇల్లు కూడా కదా అత్తయ్య..
శ్రీకర్ కిందకి వచ్చి ఆమెను చూసి ఒక చిన్న స్మైల్ ఇస్తాడు.
ఆ స్మైల్‌లో గర్వం.
నేహా అత్తగారు వైపు చూసి నవ్వుతుంది కరుణకి కూడా సౌమ్య ప్రవర్తన గర్వంగా అనిపిస్తుంది.

టిఫిన్స్ పూర్తయిన తర్వాత అందరూ కూర్చుని ఉంటే లలిత సరదాగా..  ఈరోజు ఎవరి భర్త వాళ్ల పేరుతో ఎలా పిలుస్తాడో చూద్దాం.
వైభవ్ క్యారెట్ నములుతూ ఈ కొత్త ఆటేమిటి గ్రాని.  ఆల్రెడీ ఆ పిల్ల రాక్షసిని  ఎప్పుడూ పిలుస్తాను కదా. ఒరేయ్ ఇంక ఇలా పిల్ల రాక్షసి, కోతి అని పిలుపులు కాదు. గౌరవంగా పద్ధతిగా పిలవాలి.  అవునా ఎలా పిలవాలి ఒకసారి అన్నయ్యతో మొదలు పెట్టించు చూద్దాం

పని కట్టుకుని అలా పిలవాలి అంటే సూర్యకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. రోజు పిలిచే పిలుపైన సరే..సూర్య కాస్త సిగ్గుతో...
విశిష్ట…
అది చూసిన వైభవ్ ఇంతే కదా అని..
వైభవ్ గట్టిగా...
చందూ
విశిష్ట చిన్నగా నవ్వుకుంటే చందు కోపంగా చూస్తుంది.  నివి భర్త వైపు చూస్తూ చెప్పాను కదా...నా అల్లుళ్ళు తగ్గినట్టే ఉంటారు కానీ ఎక్కడ నొక్కాలో వాళ్ళకి బాగా తెలుసు అని  పైట ని తిప్పుతూ చెబుతుంది. ఆ మాటకి రాజ్ కోపంగా పెళ్ళాం వైపు చూస్తే.. ఆ.. అని లైట్ తీసుకుంటుంది.
కోడళ్ళు ఒక్కసారిగా తలవంచి నవ్వుతారు.

అరగంట తర్వాత…
లలిత, కళ్యాణ్ పక్కన కూర్చొని చూస్తారు.
నిన్నవరకూ అమ్మాయిలు… ఈరోజు ఇంటి బాధ్యత తీసుకునే కోడళ్ళు.
లలిత కళ్లలో సంతోషం.

ఇక శ్రీ నేహా ఇంట్లో   నేహా కరుణ ని చూస్తూ చూస్తూ
సౌమ్య కళ్లలో ఓ నమ్మకం వచ్చింది అత్తయ్య..
కరుణ మెల్లగా..  అది భర్త మీద ఉన్న విశ్వాసం.
నేహా కొడుకు వైపు గర్వంగా చూస్తూ....ఇదంతా మీరు నేర్పించిన సంస్కారమే కదా.

మీ పెంపకంలోనే మీ అబ్బాయి అలాగా ఉన్నారు.. అదే గుణం మీ మనవడికి వచ్చింది..అందుకే అంటారు ఏమో అందరూ కలిసి ఉంటే పెద్దవాళ్ల దగ్గర నుంచి పిల్లలు తెలియకుండానే నేర్చుకుంటారు అని.


ఇది కేవలం కొత్త కోడళ్ళ ఉదయం కాదు.
మూడు అమ్మాయిల జీవితం కొత్త దశలోకి అడుగు పెట్టిన ఉదయం.
నవ్వులు అలాగే ఉన్నాయి.
కానీ ఇప్పుడు వాటిలో బాధ్యత కూడా కలిసింది.
వంటగది మొత్తం పూలతో అలంకరించబడింది.
లలిత, మాధవి...  ఈ రోజు మీ ఇద్దరి చేతుల వంట తింటాం.
విశిష్ట రెసిపీ సీరియస్‌గా ఫాలో అవుతోంది.
చందు మాత్రం మధ్యలో చాట్ చేస్తూ. ఉప్పు వేసావా? అని విశిష్ట. ఓహ్… అది కూడా వేయాలా?
పక్కనే సూర్య, వైభవ్ దొంగచూపులు.

వైభవ్... చందు కిచెన్‌లో ఉందంటే నేడు సాహసం.
సూర్య నవ్వుతూ  నమ్మకం ఉంది. రుచి కంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది.
బాబీ వంటల్లో ఎక్స్పెక్ట్ కాబట్టి నీకు భయం లేదు అన్నయ్య.  కానీ చందు వంట తినాలి అంటే నాకు చాలా భయం తింటే ఒక రకమైన ఇబ్బంది తినకపోతే ఇంకొక రకమైన ఇబ్బంది.

ఒక కర్రీ కాస్త ఎక్కువ కారం.
మరొకటి పర్ఫెక్ట్.
అందరూ కూర్చుని తినడం మొదలుపెడతారు. కోడలు ఇద్దరు చెప్పకపోయినా ఏ కూర ఎవరు చేశారో అన్నది ఈజీగా తెలిసిపోతుంది.
రుచి కన్నా మీరు కలిసి చేసిందంటే చాలు.
చందు నిశ్శబ్దంగా వైభవ్ వైపు చూసి... సారీ…
వైభవ్   ఇది మన ఫస్ట్ కుకింగ్ మెమరీ.

సౌమ్య సైలెంట్‌గా అన్నీ ప్లాన్ చేసి చేస్తుంది.
శ్రీకర్ గమనిస్తూ.. నీకు టెన్షన్ ఉందా?
నాకు కాదు… నీకు ఎలా అనిపిస్తుందో అనిపిస్తోంది.
వంట రెడీ.
శ్రీకర్ మొదటి ముక్క తిని..  ఇది హోటల్ కంటే బెటర్.
సౌమ్య రిలాక్స్ అవుతుంది.  నేహా గర్వంగా చూస్తుంది.

సాయంత్రం…
మూడు భర్తలు ఒక్కచోట కలుస్తారు.
సూర్య... ఇన్ని రోజులు ఫ్యామిలీ హడావిడి… ఇప్పుడు వాళ్లకు టైమ్ ఇవ్వాలి.

వైభవ్
హనీమూన్?
శ్రీకర్ చిరునవ్వు..
టికెట్స్ రెడీ.

ముగ్గురు ఎవరి గదిలో వాళ్ళు భార్యల కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
సూర్య.. రేపు ఉదయం మనం ట్రావెల్.
విశిష్ట...  ఎక్కడికి?
వైభవ్ టికెట్స్ చూపిస్తూ...  హనీమూన్ మేడమ్.
చందు గట్టిగా...  సీరియస్‌గా?
సౌమ్య కళ్లలో సంతోషం. శ్రీకర్ సంతోషాన్ని చూస్తూ..
ఇది అవసరం అనుకుంటాడు.

మూడు జంటలు…
లగేజ్ ప్యాక్ చేస్తూ నవ్వులు.
కొత్త దశ ప్రారంభం.
ఇప్పుడు ప్రేమకు ఫ్యామిలీ హడావిడి మధ్యలో కాదు
ఒంటరిగా సమయం. ఏకాంత సమయం. మనసు.. మనసు మౌనంగా మాట్లాడుకుంటూ ఇంకా దగ్గరయ్యే రతి సమ్మేళనం......
[+] 7 users Like SivaSai's post
Like Reply
Part - 146



మొదటి స్టాప్ ఊటీ  వెళతారు.
మబ్బులతో కప్పుకున్న కొండలు.
చల్లని గాలి.
మార్నింగ్ మిస్ట్‌లో మూడు జంటలు రిసార్ట్ బాల్కనీలో నిలబడి.

విశిష్ట షాల్ చుట్టుకుని నిలబడి ఉంది.
సూర్య వెనుక నుంచి దగ్గరకు వచ్చి...
చలిగా ఉందా?
కొంచెం.
అతను తన జాకెట్ ఆమెకు వేస్తాడు.
ఇద్దరూ కలిసి టీ తాగుతూ లోయను చూస్తారు.
నిశ్శబ్దం.
ఇది మాటలు అవసరం లేని ప్రేమ.

చందు మబ్బుల్లో పరుగెడుతోంది.
పట్టుకోగలిగితే పట్టుకో..
వైభవ్ వెంటపడతాడు.
చివరికి పట్టుకుని దగ్గరికి లాగి...
ఇంత ఫ్రీడమ్ ఇచ్చేశాను కదా. అవును ఆ మేఘాలను తాకే అంతగా.. ఇద్దరి నవ్వులు కొండల్లో ప్రతిధ్వనిస్తాయి.


సౌమ్య వ్యూ పాయింట్ దగ్గర నిలబడి....
ఇక్కడికి రావడం సరైన నిర్ణయం.
శ్రీకర్...  మన లైఫ్ కూడా ఇలా స్టెప్ బై స్టెప్ ఎక్కాలి.
ఇద్దరూ చేతులు పట్టుకుని ఫోటో.

కొన్ని రోజులకు… మూడు జంటలు గోవాకి వెళతారు.
సూర్యాస్తమయం.
గాలి.
అలల శబ్దం.

సూర్య, విశిష్ట ఒకరి చెయ్యి ఒకరి పట్టుకొని నడుస్తూ ఉంటారు.
బీచ్ వద్ద నడుస్తూ.
విశిష్ట... ఇక్కడ నాకు చిన్నపిల్లలా అనిపిస్తోంది.
సూర్య...  అలా ఉండి పోవచ్చు. నేను ఉన్నాను.
అలలు కాళ్లను తాకుతాయి.
ఇద్దరూ ఒకరిని ఒకరు చూస్తూ నవ్వుకుంటారు.


బీచ్ గేమ్స్, షెల్స్ కలెక్ట్ చేయడం.
చందు ఇసుకలో  V ❤️ C రాస్తుంది.
వైభవ్..  ఇది డిలీట్ చేయలేని మెమరీ.
సెల్ఫీ తీసుకుంటారు.


సాయంత్రం సూర్యాస్తమయం చూస్తూ కూర్చుంటారు.
సౌమ్య...  ఇది మన మొదటి ప్రయాణం.
శ్రీకర్... ఇది మొదటి మాత్రమే. ఇంకా చాలా.
అలల మధ్య ప్రశాంతత.

హిల్ స్టేషన్ – ప్రేమకు నిశ్శబ్ద గీతం.
బీచ్ – ప్రేమకు స్వేచ్ఛ గాలి.
మూడు జంటలు.
ఇప్పుడు ఫ్యామిలీ హడావిడి లేకుండా…
ఒకరితో ఒకరు నిజంగా సమయం గడుపుతున్నారు.

సాయంత్రం బీచ్ షాక్ దగ్గర లైట్లు, మ్యూజిక్.
మూడు జంటలు కలిసి కూర్చుంటారు.
చందు ఐడియా వేస్తుంది...
ఒక్కో జంటకి ఒక ఛాలెంజ్. ఎవరు బెటర్ కపుల్ అనేది చూద్దాం
వైభవ్..
విన్నర్స్‌కు ఐస్‌క్రీం ట్రీట్.

హూ నోస్ మీ బెటర్

విశిష్టకు ఫేవరెట్ టైమ్?
సూర్య వెంటనే...  వేకువజామున. ఎందుకంటే ఆమెకి కొత్త ప్రారంభాలు ఇష్టం.
విశిష్ట స్మైల్.
కరెక్ట్.

చందు కోపంగా ఉంటే ఎలా కూల్ అవుతుంది వైభవ్..
వైభవ్... చాక్లెట్ ఇచ్చి నవ్విస్తే సరిపోతుంది.
చందు...  అది పాత టెక్నిక్. ఇప్పుడు డేట్ ప్లాన్ చేయాలి.
అందరూ నవ్వులు.

సౌమ్యకి పెద్ద భయం ఏది..
శ్రీకర్ కాసేపు ఆలోచించి
తన కలలు ఆగిపోతాయేమో అన్న భయం.
సౌమ్య కళ్లలో మెత్తని వెలుగు.
నువ్వు నిజంగా తెలుసుకున్నావు.

ఓకే ఇప్పుడు సెకండ్ టాస్క్ అని.. బ్లైండఫోల్డ్ ట్రస్ట్ వాక్
ఈసారి భార్యలు కళ్లకు గంత కట్టుకుంటారు.
భర్తలు మార్గం చూపాలి.


చందు గంత కట్టుకుని నడుస్తుంటే వైభవ్ కాస్త ఆలస్యంగా గైడ్ చేస్తాడు.  ఎవరితో మాట్లాడుతున్నావు? అని చందు నవ్వుతూ అడుగుతుంది.
అరే గైడ్ నేనే..
పక్కనే సూర్య విశిష్టను జాగ్రత్తగా పట్టుకుని నడిపిస్తుంటే
చందు... వావ్, ఎంత కేర్..
వైభవ్ నటిస్తూ... అయ్యో పోలికలు మొదలయ్యాయి.
అందరూ నవ్వులు.

గేమ్ అయిపోయిన తర్వాత మూడు జంటలు బీచ్ వద్ద కూర్చుంటారు.
విశిష్ట  అందరినీ చూస్తూ...మనమందరం వేరేలా ఉన్నా… బంధం మాత్రం బలంగా ఉంది.
సౌమ్య... ఇది హనీమూన్ కంటే ఎక్కువ… మన మొదటి జ్ఞాపకాలు.
చందు...  ఇక మీదట ప్రతి ఏడాది ఇలా ట్రిప్ ఫిక్స్.
భర్తలు ఒకరినొకరు చూసి తల ఊపుతారు.


అలలు తాకుతుంటే మూడు జంటలు చేతులు పట్టుకుని సూర్యాస్తమయం చూస్తారు.
ఫన్…
చిన్న జెలసీ…
కానీ చివరికి మరింత దగ్గరైన హృదయాలు.
మూడు జంటలు ఇంటికి వస్తారు.
సూట్‌కేసులు, ఫోటోలు, నవ్వులు.
సింహ ఫ్యామిలీ ఇంటి ముందు రంగవల్లులు మళ్లీ వేయబడ్డాయి.
చందు   మళ్లీ రిసెప్షన్ ఏమైనా ఉందా?
పూజిత నవ్వుతుంది...  మీ అందరికోసం ఒక చిన్న సర్‌ప్రైజ్.


హాల్‌లో పెద్ద ఫ్రేమ్. హనీమూన్ ఫోటోలు ఇప్పటికే ప్రింట్ చేసి అలంకరించి పెట్టారు.
సూర్య ఆశ్చర్యంగా...  ఇంత త్వరగా ఎలా?
వైభవ్...  మన ఫ్యామిలీ నెట్‌వర్క్ స్పీడ్ సూపర్.
అందరూ నవ్వుతారు.

కళ్యాణ్ ముందుకు వచ్చి  ఇప్పటివరకు మీరు పిల్లలు…
ఇప్పటి నుంచి మా ఇంటి కొత్త బాధ్యతదారులు.
సింహ ఫ్యామిలీ ఒక నిర్ణయం తీసుకుంది.

సూర్య–విశిష్ట కి ఫ్యామిలీ ట్రస్ట్ బాధ్యత.
వైభవ్–చందు కి కొత్త బిజినెస్ బ్రాంచ్ స్టార్ట్ చేసే అవకాశం.
ఇక శ్రీ నేహా ఇంట్లో...  నేహా సౌమ్య చేతిని పట్టుకుని
ఈ ఇంటి ఫైనాన్స్ ప్లానింగ్ నువ్వు చూసుకోవాలి.
శ్రీకర్ గర్వంగా చూస్తాడు.


విశిష్ట మెల్లగా... ఇంత త్వరగా ఇంత నమ్మకం?
లలిత...  మీ కళ్లలో  మెచ్యూరిటీ  కనిపిస్తోంది.
చందు కూడా సీరియస్‌గా..  మేము ట్రై చేస్తాం.
సౌమ్య...  ఇది బాధ్యత కాదు… గౌరవం.

హనీమూన్ వాళ్లని దగ్గర చేసింది. ఇప్పుడు ఫ్యామిలీ నమ్మకం వాళ్లని ఎదగనిస్తోంది.
ఇది ప్రేమ నుంచి బాధ్యతకు మారిన దశ.
కానీ నవ్వులు ఇంకా అలాగే.......
[+] 7 users Like SivaSai's post
Like Reply
Part - 147


జీవితంలో ఎన్నో తుఫాన్లు చూసినా… చివరకు కుటుంబం ఒక్కటే అన్న నిజం గ్రహించారు.
ఇప్పుడు వారి పిల్లల పెళ్లిళ్లు చేసి, మనవళ్ళు చుట్టూ తిరుగుతుంటే… అవని కళ్లలో ఆనంద బాష్పాలు.
విక్రమ్ మెల్లగా.... ఇంతకంటే నాకు ఇంకేం కావాలి…

ఎప్పుడూ నవ్వులే వారి బలం.
ఇప్పుడు కోడళ్ళను కూతుళ్లలా చూసుకుంటూ… అల్లుళ్లను కొడుకుల్లా అక్కున చేర్చుకుంటూ జీవిస్తున్నారు.
పూజిత చెబుతుంది.. మన పిల్లల హ్యాపీనెస్‌నే మన రివార్డ్.


శాంతంగా… స్థిరంగా జీవితం నిర్మించిన జంట.
వారి పెళ్లిళ్లు, పిల్లల పెళ్లిళ్లు అన్నీ ప్రేమతో జరిగాయి.
నేహా నవ్వుతూ... మన సంసారం ఒక మంచి పాఠం అయిందంటే చాలు.


భరత్ కష్టపడి నిలబెట్టిన కుటుంబం… విద్య ప్రేమతో కాపాడిన ఇల్లు… ఇప్పుడు మనవలు ఇంటి ఆవరణలో పరుగులు తీస్తుంటే   మన జీవితం వృథా కాలేదే  అని ఇద్దరూ అనుకుంటారు.


ఎప్పుడూ ఒకరికి ఒకరు సపోర్ట్.  ఇప్పుడు పిల్లల పెళ్లిళ్లు చేసి… బాధ్యతల్ని వారికే అప్పగించి… సాయంత్రం కాఫీ తాగుతూ పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ…
నివి... మన ప్రయాణం ఎంత అందంగా ఉందో రాజ్…
రాజ్   ఇంకా ఉంది… మనవలతో కొత్త చాప్టర్.


అన్ని జంటల్ని కలిపి పెళ్లిళ్లు చేసి…
ఇప్పుడు వారి పిల్లల పెళ్లిళ్లు చూసి గర్వంగా నిలుస్తారు.
లలిత మెల్లగా...
మన వల్ల ఒక ఇంటి కాదు… ఎన్నో ఇళ్లు వెలిగాయి.
కళ్యాణ్... ఇదే నిజమైన సంపాదన.

అమ్మగా… అత్తగా… మార్గదర్శిగా…
మాధవి అందరికీ ఆశ్రయం.
రమేష్ గర్వంగా చూస్తూ
నువ్వే ఈ ఇంటి హృదయం.


సాధారణ జీవితం… కానీ అసాధారణ ప్రేమ.
వారి పిల్లలు, మనవలు కలిసి ఉండటం… వారికే పరమానందం.


సూర్య  విశిష్ట
ప్రేమతో మొదలై విశ్వాసంతో నిలిచిన జంట.
ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా అదే విలువలతో పెరుగుతున్నారు.
సూర్య...
ప్రేమించడమే కాదు… నిలబెట్టడం ముఖ్యం.
విశిష్ట గర్వంగా నవ్వుతుంది.

శ్రీకర్   సౌమ్య
ఒకరికి ఒకరు బలం.
సౌమ్య తన కెరీర్‌లో మెరిసి… కుటుంబాన్నీ సమానంగా చూసుకుంది.
శ్రీకర్... నువ్వే నా గర్వం. అని మాటలతో కాకుండా చేతులతోనే చూపిస్తాడు.

వైభవ్   చందు
డ్రీమ్స్‌ను కలిసి నెరవేర్చుకున్న జంట.
బిజినెస్, సోషల్ సర్వీస్… ప్రేమతో జీవితం.
చందు... మన ఇద్దరం కలిసుంటే ఏదైనా సాధ్యం.

గౌతమ్   భవ్య
సింపుల్ ప్రేమ… క్లియర్ అండర్‌స్టాండింగ్.
వారి ఇల్లు ఎప్పుడూ నవ్వులతో నిండిపోయి ఉంటుంది.

ఇంటి వెలుతురు మెరిసిపోతుంది…
ఇది ముగింపు కాదు…
ఇది ప్రేమతో కొనసాగుతున్న జీవితం.
సాయంత్రం వేళ…
ఇంటి ముందర దీపాలు వెలిగించబడ్డాయి.
పెద్ద ఆవరణలో అందరూ చేరారు.
పిల్లలు పరుగులు…
మనవలు నవ్వులు…
పెద్దల కళ్లలో తృప్తి.
లలిత మెల్లగా కళ్యాణ్ చేతిని పట్టుకుంటుంది.
మన చేతుల మీదుగా ఎన్నో పెళ్లిళ్లు చేశాం…
ఇప్పుడు వాళ్ల పిల్లల పెళ్లిళ్లు కూడా చూసాం…
ఇంకా దేవుడి దగ్గర ఏం అడగాలి?
కళ్యాణ్ నవ్వుతాడు.
మన కుటుంబం ఇలా కలిసే ఉండాలి… అంతే.
మాధవి  రమేష్ ఒకరిని ఒకరు చూసుకుంటూ సైలెంట్‌గా ఆనందిస్తారు.
వాసు – కరుణ మనవల్ని ఎత్తుకుని ఆడిస్తుంటారు.

విక్రమ్ – అవని
వినయ్ – పూజిత
శ్రీ – నేహా
భరత్ – విద్య
రాజ్ – నివి
అందరూ ఒకరినొకరు చూసుకుంటూ…
మన నిర్ణయాలు సరిగానే ఉన్నాయి అన్న గర్వం.
నివి కాఫీ గ్లాస్ పట్టుకుని రాజ్ వైపు చూసి...
మన ప్రయాణం ఎంత అందంగా మలిచిందో చూడూ…

సూర్య – విశిష్ట
శ్రీకర్ – సౌమ్య
వైభవ్ – చందు
గౌతమ్ – భవ్య
అందరూ తమ పిల్లల్ని చూస్తూ నవ్వుతారు.
సూర్య మెల్లగా...
ప్రేమ అనేది ఒక రోజు కాదు… జీవితకాలం బాధ్యత.
సౌమ్య... కుటుంబం అంటే మనసులు కలిసిన చోటు.
చందు నవ్వుతూ... మన కథలు ఇక్కడితో ఆగవు… కొత్త కథలు మొదలవుతాయి.


ఫోటోగ్రాఫర్ చెబుతాడు... అందరూ దగ్గరగా రండి…
పెద్దలు మధ్యలో కూర్చుంటారు. మధ్య తరాలు వెనుక నిలబడతారు.
యువ జంటలు పిల్లలతో ముందుకు.
కెమెరా ఫ్లాష్.
అందరి ముఖాల్లో ఒకే భావం
తృప్తి.

ప్రేమతో కలిసిన హృదయాలు…
నమ్మకంతో నిలిచిన బంధాలు…
తరం మారినా విలువలు మారవు…
ఇదే ఈ కుటుంబ గాథ.

ఇంటి దీపాలు మెరుస్తుంటాయి…
ఇది ముగింపు కాదు…
ఇది ఆనందంగా కొనసాగుతున్న జీవితం.
[+] 7 users Like SivaSai's post
Like Reply
Part - 148



ప్రేమ ఒక చూపులో మొదలవుతుంది…
కానీ ఒక జీవితమంతా నిలబడుతుంది…
స్నేహం ఒక మాటతో మొదలవుతుంది…
కానీ నిశ్శబ్దంలో కూడా అర్థమవుతుంది…
బంధం రక్తంతో మాత్రమే కాదు…
మనసులు కలిసిన చోటే పుడుతుంది…
పెళ్లి ఒక వేడుక కాదు…
రెండు కలలకి ఒకే దారి చూపే ప్రతిజ్ఞ…
చేతిలో చెయ్యి వేసుకున్న ఆ క్షణం నుంచి
నేను అనే మాట నెమ్మదిగా మనము అవుతుంది…
సంతోషాల్లో నవ్వులు పంచుకుంటూ…
బాధల్లో భుజం అవుతూ…
రోజులు గడవవు…
జ్ఞాపకాలు తయారవుతాయి…
పిల్లలు పుడితే
ప్రేమకు కొత్త రూపం వస్తుంది…
మన కళ్లలో కనిపించే భవిష్యత్తు
వాళ్ల చిరునవ్వులో నివసిస్తుంది…
తల్లిదండ్రులు ఆశీర్వాదమై నిలుస్తారు…
పెద్దలు నీడలై కాపాడుతారు…
ఇంటి గోడలు ఇటుకలతో కాదు…
అనురాగంతో నిలుస్తాయి…
కాలం మారినా…
తరాలు మారినా…
ప్రేమ మారదు…
విలువలు తగ్గవు…
ఒకప్పుడు చేతులు పట్టుకుని నడిచిన వాళ్లు…
ఇప్పుడు పిల్లల పెళ్లిళ్లు చేసి
మనవల్ని ఎత్తుకుని
తృప్తిగా నవ్వుతారు…
మన వల్ల వెలిగిన దీపాలు
ఇంకా ఎన్నో ఇళ్లను వెలిగిస్తాయి…
ఇదే జీవితం…
ఇదే సంసారం…
ఇదే ప్రేమ గాధ…
ముగింపు కాదు ఇది…
కొత్త తరానికి అందించిన
ఒక అందమైన ఆరంభం…
ఒక మాట…
ఒక చిన్న చిరునవ్వు…
అక్కడే మొదలైంది ఈ ప్రయాణం…
స్నేహంగా దగ్గరై…
ఆప్యాయంగా మారి…
ప్రేమగా వికసించి…
బంధంగా నిలిచింది…
పెళ్లి మంత్రాల మధ్య కట్టిన మూడు ముళ్లు
మూడు జన్మల కథలు కాదు…
ఒక హృదయం… రెండు శ్వాసలుగా మారిన క్షణం…
చేతిలో చేతి వేడి ఉన్నంత వరకూ
ప్రపంచం ఎంత పెద్దదైనా భయం ఉండదు…
కన్నీళ్లు వచ్చినా
భుజం ఉంటే బాధలు భారంగా అనిపించవు…
కాలం తన వేగంలో పరుగెత్తింది…
జుట్టులో వెండి రేఖలు పూశాయి…
కానీ ప్రేమ మాత్రం
మొదటి రోజు చూపులానే మెరిసింది…
పిల్లలు పుట్టినప్పుడు
మన హృదయం బయటికి వచ్చి నవ్వినట్టు అనిపించింది…
వాళ్ల మొదటి అడుగులో
మన జీవితానికి అర్థం కనిపించింది…
తల్లిదండ్రుల ఆశీర్వాదం
మన అడుగులకు దారిగా నిలిచింది…
పెద్దల నీడ
మన ఇంటిని ఆలయంగా మార్చింది…
ఒక రోజు…
మన చేతుల మీదుగా
మన పిల్లల పెళ్లిళ్లు జరిపాం…
వాళ్లు కూడా “మనము” అయ్యారు…
అప్పుడు తెలిసింది —
ప్రేమ ఒక జంటకే కాదు…
ఒక కుటుంబానికి పుట్టిన వెలుగు…
ఇప్పుడా వెలుగు
మనవల నవ్వుల్లో మెరుస్తోంది…
మన కథలు
వాళ్ల భవిష్యత్తులో జీవిస్తున్నాయి…
ఇది ముగింపు కాదు…
ఒక తరం నుంచి మరో తరానికి
అందించిన అనురాగ వారసత్వం…
మన చేతులు వణికినా
మన హృదయం గర్వంగా చెబుతుంది —
మన ప్రేమ వృథా కాలేదు…
మన బంధాలు నిలిచాయి…
మన కుటుంబం…
మన కల…
ఇప్పటికీ సజీవంగా ఉంది…

మా సీరియల్ ని ఇంత బాగా ఆదరించినందుకు విక్రమ్,  అవని కృతజ్ఞతలు తెలుపుతున్నారు. జై సింహా ఫ్యామిలీ మొత్తం ప్రతి ప్రేక్షకులకి కృతజ్ఞత తెలుపుతుంది.

సమాప్తం ???


[+] 8 users Like SivaSai's post
Like Reply
Wow... Excellent writing... Thank you once again for giving us a wonderful family oriented story.
[+] 1 user Likes Sunny73's post
Like Reply
Excellent story waiting for more stories from you siva gaaru
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
Next Story Indian Agent Gurenchi. Story Chaduvtunte Rommulu Nikkapoduchukuntayi
[+] 3 users Like SivaSai's post
Like Reply
(11-05-2026, 02:59 PM)SivaSai Wrote:
Next Story Indian Agent Gurenchi. Story Chaduvtunte Rommulu Nikkapoduchukuntayi

Waiting bro
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
Wonderful poetic Ending!!!
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
(11-05-2026, 02:59 PM)SivaSai Wrote:
Next Story Indian Agent Gurenchi. Story Chaduvtunte Rommulu Nikkapoduchukuntayi

We are waiting Siva garu.
But already Rudrambhaje tho romaalu nikkaboduchukuntunnay (rommulu kaadu ;-) l

If you ask me.. ee combination of stories bagunnay.. first ninchi..
..okati family emotional saga.. inkoti mass masala action drama..

..ippudu rendu oke genre aa!?!

But we always welcome your choice of stories Siva garu!!!
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Excellent writing skills. First of all congratulations for completing the story. Tremendous efforts. Thankyou.
[+] 1 user Likes styleraja's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)