Thread Rating:
  • 25 Vote(s) - 3.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Excellent update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Super update...
[+] 1 user Likes Sunny73's post
Like Reply
appudu bhargavi.. ippudu hima.

bhargavi paschattapam tho jeevitanni vadilestundi.
hima kooda ade hysteria lo undi.

chooddam.. emavutundo!!
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Part - 131



హిమ ని సెక్యూరిటీ ఆఫీసర్లు తీసుకువెళ్తే రమేష్ వెనకాల పరిగెత్తుకుంటూ వెళతాడు.. చెప్పాను కదా బేబీ ఆపేయమని.  ప్రమాదం అని చెప్పినా నువ్వు వినలేదు.

ఇప్పుడు కూడా నేను ఓడిపోను డాడ్ అని సెక్యూరిటీ ఆఫీసర్లతో కలిసి జైలుకు వెళుతుంది.
సెక్యూరిటీ అధికారి జీప్ దూరంగా వెళ్లిపోతుంటే…
హిమ కళ్లల్లో కన్నీళ్లు ఆగిపోయాయి.
అవి ఇప్పుడు చల్లని అగ్నిగా మారాయి.

జైలు గదిలో ఒంటరిగా కూర్చుని గోడను చూస్తూ ఉంటుంది.
సూర్య మాటలు చెవుల్లో మార్మోగుతుంటాయి.
నిజం వెనకాల చట్టం ఉంది...హిమ నెమ్మదిగా నవ్వుతుంది.

చట్టం నీ వెనకాల ఉండొచ్చు సూర్య…
కాని బలహీనతలు నా వెనకాల ఉంటాయి.
కొన్ని నెలల తర్వాత… హిమ బెయిల్ మీద బయటకు వస్తుంది.
పబ్లిక్ అపాలజీ పెట్టింది… కౌన్సెలింగ్ హాజరైంది…
బయటికి మాత్రం మారిపోయిన అమ్మాయిలా నటిస్తోంది.
రమేష్ ఊపిరి పీల్చుకుంటాడు..  ఇప్పుడైనా మర్చిపో హిమ…..హిమ సైలెంట్ గా తల ఊపుతుంది.

ఒక వారం రోజులు పూర్తయిన తర్వాత రమేష్ దగ్గరికి వచ్చి డాడ్ అని పిలుస్తుంది.. చెప్పు బేబీ. నేనొక్కసారి గౌతమ్ నీ కలవాలి.

గౌతమ్ నా.. ఇప్పుడెందుకు అని కంగారుగా అడిగితే.. సోరి చెబుదామని..ఏమంటున్నావు బేబీ. అవును డాడ్. సోరి చెబుతాను.

నా వల్ల ఏ కదా... తను సఫర్ అయ్యాడు. నేను గౌతమ్ ని మీట్ అవ్వకపోయి ఉంటే.. తను ఈ రోజు ఫాల్స్ ప్రెస్టేజ్ లోకి వచ్చేవాడు కాదు.

ఈ రంగు రంగుల ప్రపంచాన్ని చూసి తన లైఫ్ ఏదో గొప్పగా ఉంటుంది అని విశిష్టని దూరం చేసుకున్నాడు.

నావల్లనే తన  బిజినెస్ అన్ని కొలాప్స్ అయిపోయాయి. జైలుకు వెళ్లాడు. అందుకే ఒకసారి సోరి చెబుదామని. నువ్వు నిజం చెబుతున్నావా బేబీ.

నువ్వు కూడా నన్ను నమ్మడం లేదా అని బాధగా చూస్తుంది..నో బేబీ నిన్ను జైల్ నుంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను కదా..

నాకు ఒకప్పటి హిమ కనిపించడం లేదు.. ఇప్పుడే వెళదాం పద అని కూతుర్ని తీసుకుని వెళ్తాడు.. గౌతమ్ ఆఫీస్ లో ఉంటాడు.. చిన్న చిన్న వర్క్స్ వస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. అది కూడా సూర్య సజెషన్ మీదే..

రమేష్ హిమ ఇద్దరూ గౌతమ్ ఆఫీస్ కి వస్తారు. ఏమిటి ఇద్దరూ ఇలా వచ్చారు.  ఎనీ సర్ప్రైజ్ అని గౌతమ్ అడుగుతాడు.

నీకు సోరి చెప్పాలని వచ్చాను అని హిమ తలవంచుకుని చెబుతుంది. ఇది నిజంగా వండర్.  ఊహించని సర్ప్రైజ్. నువ్వు నాకు సోరి చెప్పడం అని లేచి నిలబడతాడు. నిజంగానే నీకు సోరి చెబుదామనే వచ్చాను.

నేనే కదా నీకు విశిష్ఠాకి మధ్యలో వచ్చాను. అందుకే నేనే తప్పుకుంటున్నాను. విశిష్ట కి నీకు మధ్యలో ఇంకా ఎప్పటికీ రాను.

వెంటనే గౌతమ్ చెయ్యి పెట్టి ఆపుతూ నీ వలన నాకు విశిష్ట దూరం అవ్వలేదు.  నా అహంకారం వలన నాకు దూరం అయింది.

ఒక రకంగా చెప్పాలి అంటే నేను విశిష్టని ప్రేమించలేదు. తన వర్క్ ని వాడుకోవాలి అనుకున్నాను. అందుకే మా ఇద్దరికీ కనెక్ట్ అవ్వలేదు.

నావల్లనే దూరం అయ్యిందేమో అని కాస్త గిల్టీగా ఫీలయ్యాను. ఇప్పుడు కొంచెం బెటర్ గా ఉంది. సోరి అని చెప్పి...డాడ్ వెల్దామా అని వెనక్కి తిరుగుతుంది.

గౌతమ్ అనుమానంగానే చూస్తూ ఉంటాడు.  హిమ మనస్సులో గౌతమ్ ఇదే సింపతీతో మళ్ళీ నీకు దగ్గరవుతాను.

నీ ద్వారానే ఆ సూర్య విశిష్టతని పూర్తిగా నాశనం చేస్తాను. వెళుతున్న హిమని చూస్తూ నువ్వు నిజంగా మారావు అంటే ఎవ్వరు నమ్మరు.

ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేస్తున్నావు అని గౌతమ్ మనసులో అనుకుంటాడు.  హిమ కార్‌లో కూర్చుని ఉంటుంది.
రమేష్ డ్రైవ్ చేస్తున్నాడు.

చూసావుగా బేబీ… గౌతమ్ ఎంత మంచి మనసుతో మాట్లాడాడు. ఇప్పుడు అంతా సెట్ అవుతుంది.
హిమ నెమ్మదిగా నవ్వుతుంది.

అవును డాడ్… ఇప్పుడు అన్నీ సెట్ అవుతాయి.
ఆ నవ్వులో విషానికి మించినా తీయదనం పూసుకున్న  నవ్వు.


హిమ వెళ్లిన వెంటనే గౌతమ్ ఫోన్ తీసుకుంటాడు.
సూర్య… హిమ ఇప్పుడే నన్ను కలిసింది.
అవతల సూర్య నిశ్శబ్దం.

సోరి చెప్పింది. కానీ ఆమె కళ్లల్లో నిజమైన పశ్చాత్తాపం లేదు. ప్లాన్ ఉంది.  సూర్య చిన్నగా నవ్వుతాడు.
నాకు తెలుసు. ఆమె జైలు వెళ్లి వచ్చాక సైలెంట్ అయ్యింది అంటే అదే పెద్ద వార్నింగ్.

జాగ్రత్తగా ఉండు గౌతమ్. ఆమె ఇప్పుడు నేరుగా దాడి చేయదు. మనల్ని మనమే అనుమానించేలాగా చేస్తుంది.
విశిష్ట జాగ్రత్త సూర్య.. అది నేను చూసుకుంటాను.

హిమ ల్యాప్‌టాప్ ఓపెన్ చేస్తుంది. కొన్ని పాత ఫైళ్లు… కొన్ని ఫోటోలు… కొన్ని బిజినెస్ డేటా.
గౌతమ్ నీ కృతజ్ఞత …
సూర్య నీ నీతి…
విశిష్ట నీ నమ్మకం…
ఈ మూడూ కలిసే ఒక రోజు పేలిపోతాయి.

ఆమె ఒక కొత్త కంపెనీ పేరు రిజిస్టర్ చేస్తుంది. పేరుకి వెనుక ఒక షాడో పార్ట్నర్.

ఒక వారం తర్వాత…  గౌతమ్ బిజినెస్ కి అకస్మాత్తుగా పెద్ద ఆర్డర్ వస్తుంది.  అడ్వాన్స్ పేమెంట్ కూడా.
గౌతమ్ ఆశ్చర్యంగా చూస్తాడు.

ఇంత పెద్ద కాంట్రాక్ట్ ఒక్కసారిగా? అనుమానం వచ్చి సూర్యాకి కాల్ చేస్తాడు.
సూర్య ఆలోచిస్తూ..  చెక్ చేయి. ఎవరి ద్వారా వచ్చింది?
ఇన్వెస్టర్ పేరు చూసి గౌతమ్ కళ్లల్లో అనుమానం.
కంపెనీ పేరు కొత్తది.

కాని డైరెక్టర్ పేరు… ఫేక్. సూర్య నవ్వుతూ  ఇది హిమ పని కావచ్చు. ఇప్పుడేం చేద్దాం.  వెయిట్ చేద్దాం ఏం చేయాలనుకుంటుందో తెలుస్తుంది కదా..

హిమ ఫోన్ లో మాట్లాడుతుంది.  మొదటి అడుగు పడింది.  గౌతమ్ తిరిగి లేగాలి. ఎత్తుకు ఎగరాలి.
అప్పుడు పడిపోవడం ఇంకా భయంకరం అవుతుంది.
ఆమె కళ్లలో ప్రతీకారం.

హిమ కోరుకున్నట్టుగా గౌతమ్ బలవుతాడా......
[+] 8 users Like SivaSai's post
Like Reply
Part - 132



గౌతమ్ పంపిన ఫైళ్లు చూస్తూ సూర్య కళ్లల్లో స్పష్టత.
ఇది హిమ స్టైల్ కాదు…ఇది ఆమె కొత్త వెర్షన్ స్టైల్. బయటికి శాంతి… లోపల వ్యూహం.

విశిష్ట దగ్గర కూర్చుని చూస్తోంది.  మీరు ఏం అనుకుంటున్నారు ? అని అడుగుతుంది.
ఆమె గౌతమ్ ని ఎత్తుకు ఎక్కిస్తోంది.  అక్కడి నుంచి కూల్చేయడానికి.

విశిష్ట కళ్లల్లో ఓ కఠిన నిర్ణయం.  అయితే మనం పడిపోవడం నటిద్దాం.
సూర్య ఒక్కసారిగా ఆమె వైపు చూస్తాడు.


సూర్య, గౌతమ్ కలిసి ఆ ఫేక్ కంపెనీ డేటా ట్రేస్ చేస్తారు.
బినామీ అకౌంట్స్… షెల్ ట్రాన్సాక్షన్స్…  అవి నేరుగా హిమ దగ్గరకు వెళ్లవు.
కాని ఒక పాత కాంటాక్ట్ దగ్గరకు వెళ్తాయి.

సూర్య సైలెంట్ గా చెబుతాడు.  ఆమె మనల్ని లీగల్‌గా కాదు… మానసికంగా కొట్టాలని చూస్తోంది.


విశిష్ట ఒక్క నిర్ణయం తీసుకుంటుంది.  ఆమె నేరుగా హిమని కలుస్తుంది. హిమ షాక్ అవుతుంది.
నువ్వేంటి ఇక్కడ?  విశిష్ట ప్రశాంతంగా:
నువ్వు గౌతమ్ ని వాడుకోవాలనుకుంటున్నావు.
కాని ఈసారి నేను మౌనంగా ఉండను.

హిమ నవ్వుతుంది.  నువ్వు ఇంకా అమాయకురాలివే విశిష్ట.  విశిష్ట దగ్గరకి వచ్చి మెల్లగా చెబుతుంది:
నువ్వు నా జీవితాన్ని ఒకసారి డిస్టర్బ్ చేశావు.
ఇప్పుడు నా చేతుల్లో చట్టం లేదు…
కాని సాక్ష్యాలు ఉన్నాయి.

హిమ కళ్లలో మొదటి సారి చిన్న భయం మెరుస్తుంది.
విశిష్ట ఇప్పటికే ఆ ఫేక్ కంపెనీలో షేర్ హోల్డర్ గా ఎంటర్ అయింది.  సైలెంట్ ఇన్వెస్టర్ గా.  అంటే…
హిమ వేసిన వలలో  హిమే భాగస్వామి అయిపోయింది.

సూర్య కౌంటర్ స్ట్రాటజీ తయారు చేస్తాడు. గౌతమ్ ట్రాప్ లో పడినట్టు నటిస్తాడు.  విశిష్ట లీగల్ గా హిమను బ్లాక్ చేస్తుంది.

గౌతమ్ ఆఫీస్‌లో పెద్ద మీటింగ్ జరుగుతోంది.  కొత్త ఇన్వెస్టర్లు, పెద్ద డీల్, మీడియా కూడా.  హిమ దూరంగా కూర్చొని చూస్తోంది.

ఆమె ప్లాన్ సింపుల్...  డీల్ సైన్ అయిన వెంటనే అకౌంట్స్ ఫ్రీజ్ అవ్వాలి.  ఫ్రాడ్ అలర్ట్ వెళ్లాలి.  గౌతమ్ మళ్లీ అవమానంతో కూలిపోవాలి.

అతని ద్వారా సూర్య, విశిష్ట ఇద్దరూ షాక్ అవ్వాలి.
ఈసారి తప్పించుకోలేవు…అని తనలోనే అనుకుంటుంది.
అదే సమయంలో…

సూర్య ఫోన్‌లో ఒక కాల్.  ఇప్పుడే స్టార్ట్ చేయండి.
అంతే.  మీటింగ్ మధ్యలో ఒక లీగల్ టీమ్ లోపలికి వస్తుంది.

మిస్టర్ గౌతమ్, ఈ డీల్‌కు సంబంధించిన ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ అవసరం ఉంది.

హిమ కళ్లల్లో మెరుపు.  పడ్డాడు…అని లోపల నవ్వుతుంది.
కాని…

లీగల్ టీమ్ నేరుగా హిమ వైపు తిరుగుతుంది.
మేడమ్ హిమ… ఈ షెల్ కంపెనీ డైరెక్టర్‌గా మీరు సైలెంట్ షేర్‌హోల్డర్ అని మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి.

హిమ ఒక్కసారిగా నిలబడిపోతుంది. వాట్? ఇది నాన్సెన్స్. సూర్య విశిష్ట ఇద్దరు ఆఫీస్ లోపలికి వస్తారు.
సూర్య ముందుకు వస్తాడు.
నువ్వు గౌతమ్‌ని ఎత్తుకు ఎక్కించావు.  అక్కడి నుంచి తోసేయాలనుకున్నావు.  కాని నువ్వు వాడిన ప్రతి డాక్యుమెంట్‌ను మేము ట్రాక్ చేశాం.

విశిష్ట ఫైల్ తీసి చూపిస్తుంది.  ఈ కంపెనీలో నేను కూడా షేర్‌హోల్డర్‌ని.  నువ్వు వేసిన వలలో నువ్వే చిక్కుకున్నావు.


చుట్టూ ఉన్నవాళ్లు గుసగుసలు.  మీడియా కెమెరాలు.
గౌతమ్ నిశ్శబ్దంగా చూస్తున్నాడు.  ఎందుకు హిమ? అని మెల్లగా అడుగుతాడు.
నువ్వు మారడం, సోరి చెప్పడం అన్నీ అబద్ధమే కదా... నాతో పాటు అంకుల్ ని కూడా మోసం చేశావు ఏమి సాధించావు.
ఆ ఒక్క మాట ఆమెను లోపల పగలగొడుతుంది.
ఆమె కళ్లలో నీళ్లు మొదటిసారి బలహీనంగా వస్తాయి.
ఎందుకంటే… నేను ఓడిపోయాను అని అరుస్తుంది.

నువ్వు విశిష్టని ఎంచుకున్న రోజు నుంచి…  నన్ను కాదు… నా అహంకారాన్ని కాదు…  నా అస్థిత్వాన్ని తృణీకరించావు అనిపించింది.

సూర్య ప్రశాంతంగా...అది ప్రేమ కాదు హిమ. అది అహంకారం.

హిమ తల ఊపుతుంది.  అవును… నాకు ప్రేమ తెలియదు.  నాకు గెలవడం మాత్రమే తెలుసు.
ఆమె నవ్వుతుంది.  కానీ ఆ నవ్వులో శూన్యం.

ఎలా సూర్య నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా మీదే గెలుపు అవుతుంది. ఎందుకంటే మా వైపున న్యాయం ఉంది. నీవు వైపున ఏముందో నీకే తెలియాలి.

సెక్యూరిటీ ఆఫీసర్లు మళ్లీ దగ్గరకి వస్తారు. ఈసారి ఆమె ఎదిరించదు. రమేష్ దూరంగా నిలబడి చూస్తున్నాడు… కళ్లలో నీళ్లు.

డాడ్… ఈసారి నిజంగా ఓడిపోయాను. రమేష్ దగ్గరికి వచ్చి చెబుతాడు. గెలవడం అంటే ఇతరులను పడగొట్టడం కాదు బేబీ…  మనసును నిలబెట్టుకోవడం.

ఆ విషయంలో నేనే ఫెయిల్ అయ్యాను..ఇంక నీకేమి నేర్పించగలను. నేర్పించాలి అనుకునే సమయానికి నువ్వు అన్ని స్టేజీలు దాటిపోయావు.

హిమ కళ్లల్లో చివరి సారి అహంకారం చచ్చిపోతుంది.
ఆమె నిశ్శబ్దంగా చేతులు ముందుకు చాచి అరెస్ట్ అవుతుంది.

జైలు గది.
మొదట్లో గోడను చూస్తూ ప్రతీకారం ప్లాన్ చేసిన హిమ…
ఇప్పుడు అదే గోడను చూస్తూ నిశ్శబ్దంగా కూర్చుంది.
కానీ ఈసారి కళ్లలో అగ్ని లేదు.
శూన్యం.
బయట…
సూర్య, విశిష్ట, గౌతమ్ ముగ్గురూ కొత్త ఆరంభం వైపు నడుస్తున్నారు.
హిమ కథ ముగిసింది.
కాని వాళ్ల జీవితం మొదలైంది......
[+] 7 users Like SivaSai's post
Like Reply
Part - 133



సాయంత్రం సూర్యాస్తమయం.. చిన్న హిల్ టాప్ మీద సూర్య, విశిష్ట నిశ్శబ్దంగా కూర్చున్నారు.
గాలి మెల్లగా వీచుతోంది.

విశిష్ట చేతిలో టీ కప్పు.  సూర్య ఆకాశాన్ని చూస్తూ…
ఎంత తుపాను వచ్చినా… చివరికి ప్రశాంతత వస్తుందా? అని అడుగుతాడు.

విశిష్ట చిరునవ్వు.  ప్రశాంతత బయట నుంచి రాదు దేవా సార్ … మనలో నుంచి రావాలి.
వారి జీవితం ఇప్పుడు…

గౌతమ్ బిజినెస్ మెల్లగా స్టేబుల్ అయింది.
ఈసారి అతను అహంకారం కాదు… విలువ నేర్చుకున్నాడు.

హిమ కేసు ముగిసింది.  ఆమె పేరు ఇప్పుడు వార్తల్లో లేదు.
సూర్య తన సోషల్ వర్క్‌ను మళ్లీ మొదలుపెట్టాడు.
విశిష్ట తన ప్రాజెక్ట్‌పై ఫోకస్ చేస్తోంది.
కాని ఈసారి ఇద్దరూ ఒక్కరికొకరు దూరంగా కాదు…
పక్కపక్కనే.

విశిష్ట ఒక చిన్న పేపర్ తీసి సూర్యకి ఇస్తుంది.
ఇది ఏమిటి? అని అడుగుతాడు.
మన కొత్త ఆరంభం.

సూర్య చూస్తాడు..  ఒక చిన్న ట్రస్ట్ పేరు రాసి ఉంది.
అందులో ట్యాగ్ లైన్...  నమ్మకం… ప్రేమ కంటే గొప్పది.
సూర్య కళ్లలో తడి...
ఇంతగా నన్ను నమ్ముతున్నావా? అని నవ్వుతూ అడుగుతాడు.

విశిష్ట అతని వైపు చూసి మెల్లగా చెబుతుంది..  నిన్ను కాదు…  మనల్ని.

సూర్య చేతిని ముందుకు చాపుతాడు.  ఇకపై సమస్యలు వచ్చినా…  మనిద్దరం ఒకే టీమ్ కదా?
విశిష్ట అతని చెయ్యి పట్టుకుంటుంది.

ఇప్పుడే కాదు… ఎప్పటికీ. ఆమె కళ్లలో ఇప్పుడు భయం లేదు. అనుమానం లేదు.
పూర్తి నమ్మకం.


సూర్యాస్తమయం ముగుస్తోంది. చీకటి పడుతోంది.  కాని వాళ్లిద్దరి మధ్య వెలుగు ఉంది.

సూర్య మెల్లగా చెబుతాడు..  హిమ మనకు ఒక విషయం నేర్పింది.

ఏమిటి? అని విశిష్ట అడుగుతుంది.
ప్రేమను కాపాడుకోవడం అంటే పోరాడడం కాదు…
అర్థం చేసుకోవడం.

విశిష్ట తల అతని భుజంపై ఆనిస్తుంది. చంద్రుడు చిన్నగా మొదలై పెద్దగా మారతాడు.. వారి బంధం లాగానే
ముగింపు కాదు…
మనసులు ఒకరికొకరు తోడుగా ఉంటే
ప్రతి రోజు కొత్త ప్రారంభమే.

ఒకరోజు ఆఫీసులో విశి సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. సూర్య వచ్చింది కూడా పట్టించుకోదు. ఎదురుగా ఉన్న చైర్ లో కూర్చుని ఏమైంది క్యూటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు.

మీరు ఎప్పుడు వచ్చారు దేవా సార్. నేను ఎప్పుడు వస్తే ఏమైంది లే..  దేని గురించి ఆలోచిస్తున్నావు. గౌతమ్ గురించి. గౌతమ్ గురించి ఇప్పుడు అంత స్పెషల్ గా ఏముంది.

చెబితే మీరు కోప్పడరు కదా. నీ మీద నేను ఎప్పుడైనా కోపం చూపించానా.. లేదనుకో బట్ ఇది ఎలా తీసుకుంటారో అర్థం కాక ఆలోచిస్తున్నావు.

ముందు నువ్వు బయటికి చెప్పు.  అప్పుడు నేను అది ఎంతవరకు అర్థమయ్యే విషయమో తెలుసుకుంటాను.

గౌతమ్ లో చాలా మార్పు వచ్చింది కదా.. విలువలతో బిజినెస్ చేసుకుంటున్నాడు కదా. అవును గౌతమ్ కి భవ్యకి జంట కలిపితే ఎలా ఉంటుంది.

సూర్య సీరియస్గా చూస్తాడు. అదిగో మీరు అలా చూస్తారని నేను చెప్పను అన్నాను..నీకు అన్నీ ఇలాంటి వెరైటీ ఐడియాస్ ఎలా వస్తాయి క్యూటి.

ఇప్పుడు మీకు నచ్చిందా నచ్చలేదా... చాలా బాగుంది. భవ్యకి  కూడా దూరంగా వెళ్లడానికి  ఇష్టం లేదు.  వీళ్ళిద్దరికీ జంట చేస్తే బాగానే ఉంటుంది.

ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది.. ఏముంది.  గౌతమ్ ఒకసారి జైలుకి వెళ్లి వచ్చాడు. ఆ విషయాన్ని అంకుల్ వాళ్ళు ఎలా తీసుకుంటారో తెలియడం లేదు. నేను మాట్లాడతాను.

ముందు గౌతమ్ తో మాట్లాడతాను.  గౌతమ్ భవ్య విషయంలో ఎలా ఫీలవుతున్నాడో తెలిస్తే అప్పుడు మనిద్దరం వెళ్లి భవ్య పేరెంట్స్ తో మాట్లాడదాము. ఏమంటావు క్యూటి. మీరు ఎలా చెబితే అలా దేవా సార్.

సూర్య గౌతమ్‌కి కాల్ చేస్తాడు...ఫ్రీగా ఉన్నావా? కాఫీకి బయటకి వస్తావా?

గౌతమ్ నవ్వుతూ... ఇంత సీరియస్ టోన్‌లో అడిగితే భయంగా ఉంది. వస్తాను.

గౌతమ్ ముందే వచ్చి కూర్చుంటాడు..సూర్య ఎదురుగా కూర్చుంటాడు.  ఏమైంది సూర్య ? మళ్లీ ఏదైనా సోషల్ రీఫార్మ్ ప్లాన్ చేస్తున్నావా? అని సరదాగా అడుగుతాడు.

సూర్య నేరుగా విషయానికి వస్తాడు.భవ్య గురించి ఏమనుకుంటున్నావు?  గౌతమ్ ఒక్కసారిగా సైలెంట్ అవుతాడు.

ఎందుకు ఒక్కసారిగా ఆ ప్రశ్న?  సింపుల్.  మీ ఇద్దరికీ జంట బాగుంటుంది అని మా ఒపీనియన్ కానీ నీ నిర్ణయం తెలుసుకోకుండా ముందుకే అడిగేయలేమ కదా..

గౌతమ్ లోతుగా ఊపిరి పీల్చుకుంటాడు. నాకు ఆమెంటే గౌరవం ఉంది.  ఆమె నన్ను నా పాస్ట్‌తో కాదు… నా ప్రెజెంట్‌తో చూస్తుంది. కాని నా జైలు విషయాన్ని వాళ్లు అంగీకరిస్తారా?

సూర్య చిన్నగా నవ్వుతాడు. నీ గతం శిక్ష పడింది.
ఇప్పుడు నీ జీవితం విలువలు నేర్చుకుంది.  ఇది ఎవరికైనా చెప్పడానికి నాకు గర్వమే.
గౌతమ్ కళ్లలో నిజమైన కృతజ్ఞత.
అయితే… నువ్వు ఓకే అనుకుంటే… నేను రెడీ.


విశిష్ట ఆనందంగా సూర్యని చూస్తుంది. అంటే గౌతమ్ ఓకే అన్నాడా? అవును క్యూటి… కానీ ఇప్పుడు అసలు టెస్ట్ స్టార్ట్ అవుతుంది.

భవ్య తండ్రి కాస్త గంభీరంగా కూర్చున్నారు. సూర్య, విశిష్ట ఇద్దరూ ఎదుట. మీరు చెప్పింది మంచి ఆలోచనే.
కాని గౌతమ్ గతం…  అతను ఆగిపోతాడు.
సూర్య ప్రశాంతంగా... అంకుల్… ఒక మనిషి తప్పు చేసినప్పుడు శిక్ష పడాలి. కాని శిక్ష తర్వాత కూడా అతను జీవితాంతం నిందపడాలా? లేక మార్పుకు అవకాశం ఇవ్వాలా?

విశిష్ట కూడా మెల్లగా చెబుతుంది.  గౌతమ్ ఇప్పుడు విలువలతో నిలబడుతున్నాడు. భవ్య అతని పక్కన ఉంటే… అతను ఇంకా బలంగా మారుతాడు.
భవ్య తండ్రి కొంతసేపు ఆలోచిస్తారు. అంతలో భవ్య ముందుకు వస్తుంది.

డాడ్… నేను అతన్ని అతని గతం కోసం కాదు…
ఇప్పటి మనసు కోసం ఇష్టపడుతున్నాను. ఆ ఒక్క మాట గదిలోని వాతావరణాన్ని మార్చేస్తుంది.


కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత… సరే అని భవ్య తండ్రి చెబుతారు.

గౌతమ్ నిజంగా మారాడని మీరు ఇద్దరూ చెబుతున్నారంటే… నాకు నమ్మకం ఉంది.
విశిష్ట ఆనందంతో సూర్య వైపు చూస్తుంది.

సూర్య కళ్లతోనే చెబుతాడు... టీమ్ వర్క్ సక్సెస్.

ఎంగేజ్‌మెంట్ రోజు.  గౌతమ్, భవ్య పక్కపక్కనే నిలబడి ఉన్నారు.  సూర్య, విశిష్ట కొంచెం దూరంగా నిలబడి చూస్తున్నారు.

చూశావా క్యూటి… మనం పోరాడి కాపాడుకున్న ప్రేమ…
ఇప్పుడు ఇంకో ప్రేమకి దారి చూపుతోంది.  విశిష్ట చిరునవ్వు.

అందుకే చెప్పాను కదా దేవా సార్…  ప్రశాంతత మనలో నుంచే మొదలవుతుంది.  సూర్య ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుంటాడు.

ఈసారి వాళ్ల కథలో డ్రామా లేదు.
ప్రతీకారం లేదు.
అనుమానం లేదు.
కేవలం నమ్మకం…
మరియు పక్కన నడిచే తోడు.

కొన్ని కథలు గెలుపుతో ముగుస్తాయి.
కొన్ని కథలు ప్రేమతో నిలుస్తాయి.
సూర్య❤️ విశిష్ట కథ… నమ్మకంతో ముందుకు సాగుతుంది.
[+] 7 users Like SivaSai's post
Like Reply
Part - 134



శ్రీకర్, వైభవ్ ఇద్దరు సీరియస్గా సూర్య దగ్గరికి వస్తారు. ఏమైందిరా ఇద్దరు వర్కు మానేసి ఇటు వచ్చారు.. నీకు ఎప్పుడు చూసినా వర్క్, ప్రాజెక్టు..జంటలు కలపడం తప్ప మా గురించి ఆలోచన ఉందా.

ఇప్పుడు మీ ఇద్దరికీ ఏమయింది అని చేస్తున్న వర్క్ ఆపేసి అడుగుతాడు.  మీరు ఎప్పుడో భూమి పుట్టకముందు అన్నవరం వెళ్లి వచ్చారు.

మేము అడిగితే అందరం కలిసి ఎక్కడికైనా ట్రిప్ వెళదాం అన్నావు కానీ ఇప్పటివరకు ప్లాన్ చేయలేదు.  మేము చేద్దామన్న నువ్వు దొరకడం లేదు.

ఓ అదా మీ సమస్య.  సరే ఈ వీకెండ్ వికారాబాద్ ఫారెస్ట్ కి వెళదాము. నిజంగానా.  నిజంగా.  మన నలుగురు జంటలు. నాలుగు బైక్స్ ప్లాన్ చేయండి.
వైభవ్ గంతులు వేస్తూ నువ్వు సూపర్ అన్నయ్య ఇప్పుడే.. ఇప్పుడే ప్లాన్ చేస్తాను. ఉత్సాహంగా బయటికి వెళుతూ చందు కి కాల్  చేస్తాడు.

ఫ్రైడే సాయంత్రం నాలుగు జంటలు నాలుగు బైక్ స్..

సూర్య, విశిష్ట..
శ్రీకర్, సౌమ్య..
వైభవ్, చంద్రిక...
గౌతమ్, భవ్య...

నలుగురు సరదాగా ట్రిప్ కి బయలుదేరుతారు.
ఫ్రైడే సాయంత్రం.
నాలుగు బైక్స్ వరుసగా రోడ్ మీద దూసుకుపోతున్నాయి.
ముందు సూర్య–విశిష్ట.
వెనుక శ్రీకర్–సౌమ్య.
అదే స్పీడ్‌లో వైభవ్–చంద్రిక నవ్వుకుంటూ.
చివరగా గౌతమ్–భవ్య సైలెంట్ స్మైల్స్‌తో.

గాలి వేగంగా ముఖాన్ని తాకుతోంది... విశిష్ట సూర్య భుజం గట్టిగా పట్టుకుని,..దేవా సార్… కొంచెం స్లోగా వెళ్ళండి. నేను సినిమా హీరోయిన్ కాదులే.
సూర్య నవ్వుతూ,
నీకు హెల్మెట్ లో కూడా డ్రామా తగ్గదు క్యూటి.


అందరూ ఒక చిన్న ఓపెన్ స్పాట్ దగ్గర బైక్స్ ఆపుతారు.
వైభవ్ గట్టిగా అరుస్తాడు. వీకెండ్ ఆఫ్ ది ఇయర్ స్టార్ట్ అయ్యింది.

శ్రీకర్ వెంటనే...  ముందు టెంట్లు ఎవరు సెట్ చేస్తారు?
సూర్య నవ్వుతూ..  జంటలు కలసి పని చేస్తేనే డిన్నర్.
వైభవ్ టెంట్ పెట్టడానికి ప్రయత్నిస్తుంటే చందు సూచనలు ఇస్తుంది..అది అలా కాదు, ఇలా పెట్టాలి.
నువ్వు యూట్యూబ్ వీడియోలా మాట్లాడకు… వచ్చి హెల్ప్ చెయ్యి.  అందరూ నవ్వుతారు.

ఇంకో వైపు గౌతమ్ టెంట్ సెట్ చేస్తుంటే భవ్య నిశ్శబ్దంగా హోల్డ్ చేస్తుంది.. థ్యాంక్స్ అని గౌతమ్ మెల్లగా చెబుతాడు.
నీలో చాలా మార్పు వచ్చింది గౌతమ్, ఇలా టెంట్ సెట్ చేయడం కష్టంగా అనిపించడం లేదా..
ఇష్టమైన సఖీ పక్కన ఉంటే ఎంత కష్టమైనా కంఫర్ట్ గానే ఉంటుంది.

కొంచెం దూరంగా ఒక చిన్న వ్యూ పాయింట్ దగ్గర సూర్య, విశిష్ట నిలబడి ఉంటారు.  కింద అడవి విస్తరించి ఉంది.
సూర్య విశి నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరగా లాక్కుంటాడు. విశి సూర్య భుజాల పైన తలవాల్సి ప్రకృతిని చూస్తూ ఉంటుంది.

ఇవాళ వీళ్లందర్ని చూస్తుంటే… మనం ఇన్ని తుపాన్లు ఎదుర్కొన్నామన్నది నమ్మలేకపోతున్నాను.
విశిష్ట చిరునవ్వు..
తుపాను లేకపోతే చెట్టు బలంగా పెరగదు కదా.
సూర్య ఆమె చెయ్యి పట్టుకుంటాడు.
ఈ టీమ్ లేకపోతే మనం ఇంత దూరం రాలేం.

రాత్రి.  మధ్యలో క్యాంప్ ఫైర్.  వైభవ్ గిటార్ తీసుకొచ్చాడు.
ప్రతి జంట ఒక్కో సీక్రెట్ చెప్పాలి అని రూల్ పెడతాడు.

మొదట రౌండ్ శ్రీకర్ దగ్గరే ఆగుతుంది. ఎప్పుడు నేనేనా..  ఎవరు వస్తే వాళ్లే చెప్పాలమ్మా వైభవ్ వెక్కిరిస్తాడు.

సౌమ్యకి కోపం వచ్చినప్పుడు నేను కాఫీ చేసిస్తే వెంటనే కూల్ అవుతుంది.  అది కోపం పోవడం కాదు… నీ మీద జాలి.
అందరూ నవ్వుతారు.

వైభవ్ ఇప్పుడు నీ టైం..  చందు నన్ను మొదట చూసినప్పుడు నన్ను సీరియస్‌గా తీసుకోలేదు.
చందు వెంటనే...  ఇప్పటికీ తీసుకోను.
మళ్లీ నవ్వులు.


గౌతమ్ కొంచెం సీరియస్‌గా...  నాకు ఒకసారి అనిపించింది… నా లైఫ్ మళ్లీ స్టార్ట్ అవ్వదనుకున్నాను.
కాని భవ్య ఒకసారి నీ మీద నమ్మకం ఉంది అన్న రోజు… నేను మళ్లీ బ్రతకడం మొదలుపెట్టాను.
భవ్య కళ్లలో తడి.
భవ్య ముందు మోకాళ్ళ మీద కూర్చుని ఆ చేతులు పట్టుకుని నేను నిజంగా నిజం చెబుతున్నాను. విశి మీద నాకు ఎటువంటి ప్రేమ లేదు.. అది జస్ట్ తన వర్క్ ని వాడుకోవాలి అన్న స్వార్థం.

తర్వాత హిమని పెళ్లి చేసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోవచ్చు అని అవివేకం. ఎప్పుడైతే నేను నిజాయితీగా ఉండడం మొదలుపెట్టానో,. అప్పుడే అన్నీ నా దగ్గరికి వస్తున్నాయి. ఇంత నిజమైన ప్రేమ కూడా. ఎప్పటికీ నిన్ను తప్ప ఎవరిని నా జీవితం లోనికి రానివ్వను అని మాట ఇస్తున్నాను.

అందరూ గట్టిగా క్లాప్స్ కొడితే భవ్య సిగ్గుపడుతుంది.

అందరూ అలసిపోయి టెంట్స్ దగ్గర కూర్చుంటారు.
ఆకాశంలో నక్షత్రాలు.
వైభవ్ గట్టిగా చెబుతాడు....మన గ్రూప్ కి ఒక పేరు పెట్టాలి.

శ్రీకర్ వెంటనే..  స్టార్మ్ సర్వైవర్స్.
సూర్య నవ్వుతూ...  కాదు… నమ్మకం బ్యాచ్.
విశిష్ట మెల్లగా చెబుతుంది...  కాదు… ‘మనవాళ్లు సరిపోతుంది.

అందరూ ఒకేసారి చేతులు కలుపుతారు.

క్యాంప్ ఫైర్ మెల్లగా ఆరిపోతుంది.
కాని వారి నవ్వులు అడవిలో మార్మోగుతుంటాయి.
తుపాన్లు ముగిశాయి.

ఇప్పుడు జీవితం ఆనందంగా ప్రవహిస్తోంది.
అందరూ డిన్నర్ అయిపోయి ఫైర్ చుట్టూ కూర్చున్నారు.
వైభవ్ అకస్మాత్తుగా లేచి ఇప్పుడు కపుల్ డ్యాన్స్ కాంపిటిషన్ అని ప్రకటిస్తాడు.

శ్రీకర్ చిరాకుగా...  అడవిలో డ్యాన్స్ ఏంటి రా?
ఫారెస్ట్ కి కూడా రొమాన్స్ కావాలి. అంటాడు వైభవ్.

గిటార్ స్లో ట్యూన్.

శ్రీకర్ చాలా సీరియస్‌గా స్టెప్స్ వేయడానికి ప్రయత్నిస్తుంటే సౌమ్య నవ్వుకుంటూ,
ఇది డ్యాన్స్ కాదు పీటీ పీరియడ్ లాగా ఉంది. అంటుంది.
అందరూ చప్పట్లు.

వైభవ్ ఓవర్ యాక్టింగ్ స్టెప్స్ వేస్తాడు.  చందు సీరియస్ గా చూస్తూ.....ఇంకా రెండు స్టెప్స్ వేస్తే నేనే అడవిలో వదిలేసి వెళ్తాను... నీతో ఉంటే అడవే స్వర్గం.అంటాడు వైభవ్ డ్రామాటిక్‌గా.
అందరూ  అబ్బో అంటూ ఆటపట్టిస్తారు.

ఇద్దరూ మొదట సిగ్గుగా.  గౌతమ్ మెల్లగా చెబుతాడు
నాకీ డ్యాన్స్ అంత రాదు. భవ్య నవ్వుతుంది.
నాకు స్టెప్స్ అవసరం లేదు… నువ్వు పక్కన ఉంటే చాలు.
ఇద్దరూ స్లోగా ఒకరికొకరు దగ్గరగా కదులుతుంటారు.
మిగతావాళ్లు క్లాప్ చేస్తారు.
సూర్య మెల్లగా చెబుతాడు
చూడమ్మా క్యూటి… ఈ జంట సీరియస్‌గా గెలుస్తారు.

చివరగా సూర్య చెయ్యి ముందుకు చాపుతాడు.
మేడమ్… డ్యాన్స్?  విశిష్ట స్మైల్.
మీరు లీడ్ చేస్తేనే...సూర్య ఆమె నడుము దగ్గరగా చెయ్యి వేసి మెల్లగా దగ్గరకి తీసుకుంటాడు.  విశిష్ట గుండె వేగంగా కొట్టుకుంటుంది.

ఇంత దగ్గరగా ఉన్నా… ఇంకా నిన్ను మిస్ అవుతుంటాను. అని సూర్య మెల్లగా చెబుతాడు...విశిష్ట కళ్లలో ప్రేమ.
నేను ఎక్కడికీ వెళ్లను దేవా సార్.
ఇద్దరూ నెమ్మదిగా నక్షత్రాల కింద డ్యాన్స్ చేస్తుంటారు.
మిగతావాళ్లు నిశ్శబ్దంగా చూస్తారు.

డ్యాన్స్ తర్వాత వైభవ్ మళ్లీ లేచి,. ఇప్పుడు ట్రూత్ ఆర్ డేర్.
శ్రీకర్ కంగారుగా... ఇది ప్రమాదకరం.
మొదట టర్న్ సౌమ్యకి.
ట్రూత్.
శ్రీకర్ లో నీకు ఎక్కువగా నచ్చేది ఏంటి?
సౌమ్య వెంటనే.....అతను బయట సీరియస్‌గా ఉంటాడు… కానీ నాతో చిన్న పిల్లాడిలా మారిపోతాడు.
శ్రీకర్ సిగ్గుపడతాడు.

సూర్య టర్న్ వస్తుంది.. ట్రూత్ అంటాడు సూర్య.
వైభవ్ కుతూహలంగా... బాబి..విశిష్ట లేకపోతే నీ లైఫ్ ఎలా ఉండేది?

సూర్య క్షణం ఆలోచించి….. పూర్తిగా ఖాళీ.
అందరూ సైలెంట్...విశిష్ట కళ్లలో నీళ్లు.
నాకు ఆమె ప్రేమ కాదు…. ఆమె నమ్మకం అవసరం.
విశిష్ట అతని భుజంపై తల ఆనిస్తుంది.

అందరూ టెంట్స్‌లోకి వెళ్లిపోతారు.
సూర్య, విశిష్ట టెంట్ బయట కూర్చుని ఆకాశం చూస్తున్నారు.

నక్షత్రాలు మెరుస్తున్నాయి...ఇలా ప్రతి ఏడాది ఒక ట్రిప్ ఫిక్స్ చేద్దామా?.అని విశిష్ట అడుగుతుంది.
ప్రతి ఏడాది కాదు… ప్రతి సమస్య తర్వాత. అంటాడు సూర్య నవ్వుతూ.
ఆమె చెయ్యి అతని చేతిలో కలుస్తుంది.
దూరంగా అడవిలో గాలి మెల్లగా వీచుతోంది.

ఈసారి కథలో డ్రామా లేదు.
కేవలం నవ్వులు… ప్రేమ… స్నేహం.
ఆ రాత్రి నలుగురు జంటలు నిద్రపోయారు.
కాని వారి బంధం… మరింత మేల్కొంది..........
[+] 8 users Like SivaSai's post
Like Reply
Part - 135



రెండు రోజులు హ్యాపీగా గడిపిన నాలుగు జంటలు మళ్లీ తమ తమ గూటికి చేరతారు.
ఆ మధుర క్షణాలు గుర్తులుగా మిగిలిపోయినా… జీవితమే ఇప్పుడు వాళ్లను సీరియస్‌గా ముందుకు నడిపిస్తోంది.

సౌమ్య మెడిసిన్‌లో తనదైన మార్క్ క్రియేట్ చేస్తోంది.
రాత్రింబవళ్లు స్టడీ చేస్తూ, కేసులు హ్యాండిల్ చేస్తూ… పేషెంట్స్ కి ఆశగా మారుతుంది.
ఒక రోజు హాస్పిటల్‌లో ఒక క్రిటికల్ కేస్ హ్యాండిల్ చేసిన తర్వాత సీనియర్ డాక్టర్ ఆమెను చూస్తూ,
యు హావ్ లీడర్షిప్ క్వాలిటీస్ , డాక్టర్ . సౌమ్య .
అంటే ఆమె కళ్లల్లో వెలుగు మెరుస్తుంది.

ఇదే సమయంలో చందు తన ఫ్యాషన్ డిజైనింగ్‌లో కొత్త కలెక్షన్ లాంచ్ చేస్తుంది.
తన బ్రాండ్ కి పేరు పెడుతుంది..  చంద్ర
సింపుల్ స్టార్ట్… కానీ కాన్సెప్ట్ డిఫరెంట్.
సోషల్ మీడియాలో రీచ్ పెరుగుతుంది.
అమ్మాయిల కోసం సస్టైనబుల్ ఫ్యాషన్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేస్తుంది.

సౌమ్య ఆమెని చూస్తూ గర్వంగా అనుకుంటుంది.
ఇది నా చందు… కలల్ని నిజం చేసుకునే అమ్మాయి.

విశి జీవితంలో పెద్ద మార్పు మొదలవుతుంది.
ఇప్పటి వరకు భయంతో వెనక్కి తగ్గిన ఆమె… ఇప్పుడు డెసిషన్ తీసుకునే ముందు ఒక్క క్షణం కూడా డౌట్ పడదు.
ఒక బిజినెస్ మీటింగ్‌లో ఎవరైనా ఆమెను అండర్ ఎస్టిమేట్ చేస్తే…
ఐ డోంట్ నీడ్ అప్రూవల్ . ఐ నీడ్ రిజల్ట్స్ .
అంటూ స్ట్రాంగ్‌గా నిలబడుతుంది.
ఆమె ఆత్మవిశ్వాసం చూసి అందరూ షాక్ అవుతారు.
ఇంతకు ముందు మెత్తగా ఉండే విశి… ఇప్పుడు ఒక స్ట్రాంగ్ లీడర్ గా మారుతోంది.
కానీ ఆమె హార్ట్ లో మాత్రం ఒక సీక్రెట్ ఫియర్ ఇంకా ఉంది…
దాన్ని ఎప్పుడో ఒక రోజు ఫేస్ చేయాల్సిందే.


భవ్య గౌతమ్ దగ్గరే జాయిన్ అవుతుంది.
ఆఫీస్‌లో గౌతమ్ కి రైట్ హ్యాండ్‌గా మారుతుంది.
ఒక ప్రాజెక్ట్ క్రిటికల్ స్టేజ్ లో ఉన్నప్పుడు గౌతమ్ కొంచెం టెన్షన్ పడుతాడు.
భవ్య సైలెంట్‌గా ఫైల్స్ సర్దుకుని, ప్లాన్ రెడీ చేసి…
మీరు కేవలం మీ విజన్ పై ఫోకస్ చేయండి… బ్యాక్ ఎండ్ నేను చూసుకుంటాను.

ఆ రోజు గౌతమ్ ఆమెని చూసి అనుకుంటాడు...
పెళ్లి తర్వాత కాదు… పెళ్లికి ముందే నా జీవితానికి ఇది బ్యాక్ బోన్.
ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ మరింత స్ట్రాంగ్ అవుతుంది.

మిగిలిన జంటలు కూడా తమ తమ రంగాల్లో బిజీ అయిపోతారు.
కానీ ప్రతి వీకెండ్ ఒక చిన్న గెట్ టుగెదర్ మాత్రం మిస్ అవ్వరు.
అందరూ నవ్వుతూ, కలలు ప్లాన్ చేస్తూ ఉంటారు.

ఒకరోజు పెద్దవాళ్లందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు. మూడు జంటలకి ఒకేసారి నిశ్చితార్థం చెయ్యాలి అని. విశిష్ట కి శ్రీ, నేహా తల్లిదండ్రుల స్థానంలో నిలబడి కన్యాదానం చేస్తాము మీకు ఏమి ఇబ్బంది లేదు కదా భానుమతి అని అడుగుతారు.. దానికి భానుమతి కళ్ళు తుడుచుకుంటూ..

అడగకుండానే భగవంతుడు వరం ఇస్తాను అంటే కాదంటానా... ఆ మాటకి నేహా భానుమతి చేతులు పట్టుకొని నువ్వే వరము ఇస్తున్నావు ఆడపిల్లలు లేని మాకు కన్యాదానం  చేసే అదృష్టాన్ని  ఇచ్చావు.

నిశ్చితార్థం కూడా జై సింహ మాన్షన్ లో చెయ్యాలి అని ఫిక్స్ అయిపోతారు.

సూర్య విశిష్ట,  వైభవ్ చందు,  శ్రీకర్ సౌమ్య మూడు జంటలు నిశ్చితార్ధానికి కావలసినవన్నీ షాపింగ్ చేస్తూ ఉంటారు.
అందరూ ఒకేసారి నిశ్చితార్థం అనగానే… ఆ ఇంట్లో ఎక్సైట్మెంట్ ఎక్కడికక్కడ పూస్తుంది.

జై సింహ మాన్షన్‌లో వేడుక అంటే చిన్న విషయం కాదు. అందుకే షాపింగ్ కూడా గ్రాండ్ గానే ప్లాన్ అవుతుంది.
మూడు జంటల్ని వాళ్ళకి నచ్చినవి షాపింగ్ చేసుకోమని మిగిలిన పనులు పెద్దవాళ్లు చక్క పెట్టుకుంటాము అని క్లియర్గా చెప్పేస్తారు.

విశిష్ట కోసం సూర్య ప్రత్యేకంగా డిజైనర్ స్టోర్‌కి తీసుకెళ్తాడు.  ఆమెకు పీచ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో హ్యాండ్ వర్క్ సారీ చూపిస్తారు.
విశి మొదట సింపుల్ సారీనే ఎంచుకోవాలని చూస్తుంది.
సూర్య ఆమెని చూసి నవ్వుతూ,
ఇది నీ రోజు విశి… నీలోని క్వీన్ బయటకు రావాలి అంటాడు.
ఆ మాటకి ఆమె కళ్లలో మృదువైన వెలుగు మెరుస్తుంది.
సూర్య తనకోసం ఐవరీ షెర్వాణీ సెలెక్ట్ చేస్తాడు…
విశిష్ట చేతితో బటన్ తడుముకుంటూ,  నీకిదే బెస్ట్ అంటుంది.
ఇద్దరి మధ్య మాటల్లో చెప్పని బంధం మరింత గాఢమవుతుంది.

చందు మాత్రం ఫుల్ జోష్ లో ఉంటుంది.  తనకోసం పాస్టల్ గ్రీన్ లెహంగా ట్రై చేస్తుంది.  సస్టైనబుల్ ఫ్యాషన్ స్టార్ట్ చేసిన అమ్మాయి కాబట్టి…  ఆమె ఎంపిక కూడా హ్యాండ్ లూమ్, ఎకో ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్.

వైభవ్ సరదాగా  నిశ్చితార్థం కూడా బ్రాండ్ ప్రమోషన్‌లా చేస్తున్నావా? అంటాడు.

చందు వెంటనే,  నా లైఫ్ ఈవెంట్స్ కూడా కాన్సెప్ట్ తోనే అంటుంది.  వైభవ్ తన కోసం డార్క్ గ్రీన్ ఇండో-వెస్ట్రన్ తీసుకుంటాడు.
ఇద్దరూ మిర్రర్ ముందు నిలబడి ఒకరినొకరు చూసుకుని నవ్వుతారు.

సౌమ్యకు షాపింగ్ కన్నా సింప్లిసిటీ ఇష్టం.  ఆమె లైట్ పింక్ కాంచీపట్టు సారీ చూసి ముద్దుగా చిరునవ్వు నవ్వుతుంది.
శ్రీకర్ ఆమెను చూస్తూ, డాక్టర్ గారూ… ఆపరేషన్ థియేటర్ లో సీరియస్‌గా ఉంటారు,

ఇక్కడ మాత్రం ఇలా సిగ్గుపడతారా? అంటాడు.  సౌమ్య చెంపలు ఎర్రబడి,  పేషెంట్స్ ముందు కాదు… నీ ముందు మాత్రమే అంటుంది.

శ్రీకర్ తనకోసం క్లాసిక్ క్రీమ్ కుర్తా-షెర్వాణీ తీసుకుంటాడు.
ఇద్దరి మధ్య నిశ్శబ్దమైన ప్రేమ మరింత స్పష్టమవుతుంది.


మూడూ జంటలు కలిసి రింగ్స్ సెలెక్ట్ చేయడానికి వెళ్తారు.
విశిష్ట సింపుల్ డైమండ్ రింగ్ తీసుకుంటుంది.
సూర్య మాత్రం ఆమె కోసం ఒక చిన్న హార్ట్ ఎంగ్రేవ్ చేయమంటాడు.

చందు,  వైభవ్ రింగ్స్‌లో వారి పేర్ల మొదటి అక్షరాలు చెక్కించుకుంటారు.
సౌమ్య, శ్రీకర్ మాత్రం లోపల చిన్న మెడికల్ సింబల్ పెట్టించుకుంటారు...  వారి ప్రేమకు ఒక ప్రత్యేక గుర్తు.

డెకరేషన్ కోసం థీమ్ ఫిక్స్ అవుతుంది..
గోల్డ్, వైట్ ఎలిగెంట్ థీమ్.  ఎంట్రన్స్ దగ్గర పెద్ద ఫ్లవర్ ఆర్చ్.
మధ్యలో మూడు జంటల కోసం ప్రత్యేక స్టేజ్.
మాధవి లలిత  ప్రతి ఏర్పాటును కళ్లతో చూసుకుంటూ ఉంటారు.

వాళ్ళ మనసులో ఒకే మాట....  నా పిల్లల ఆనందం… ఇదే మా పండుగ.
భానుమతి అంతా చూస్తూ భర్తని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది.
నేహా దగ్గరికి వచ్చి ఆమె భుజం మీద చేయి వేసి,
ఇది కేవలం నిశ్చితార్థం కాదు… మూడు ఇళ్ల కలయిక అంటుంది.
కళ్ళు తుడుచుకుంటూ అవును చాలా సంతోషంగా ఉంది. నా కూతురికి  ఇంత గొప్ప జీవితం దక్కినందుకు.

షాపింగ్ ముగిసాక ముగ్గురు అబ్బాయిలు ఒక్కసారి కలిసి కూర్చుంటారు.
సూర్య సీరియస్‌గా అంటాడు,  ఇకపై మన లైఫ్ కేవలం మనది కాదు… వాళ్లది కూడా.

వైభవ్ నవ్వుతూ,  అయినా మన లవ్ స్టోరీలు ఇక్కడితో ఆగవు.అంటాడు.

శ్రీకర్ మాత్రం నిశ్శబ్దంగా,..మనం ఇచ్చే హామీలు నిలబెట్టుకోవాలి. అంటాడు.
అదే సమయంలో ముగ్గురు అమ్మాయిలు కూడా వేరే చోట కూర్చుని…
విశిష్ట మెల్లగా అంటుంది,  మన జీవితాలు మారబోతున్నాయి.

సౌమ్య చిరునవ్వుతో,  మార్పు మంచి దిశలోనే ఉంది అంటుంది.

చందు ఉత్సాహంగా,  జై సింహ మాన్షన్ లో మన నిశ్చితార్థం… హిస్టరీ క్రియేట్ అవుతుంది అంటుంది.
ముగ్గురూ చేతులు పట్టుకుని నవ్వుకుంటారు.

నిశ్చితార్థ వేడుకలు...

కథ కొనసాగుతుంది,.......
[+] 9 users Like SivaSai's post
Like Reply
Vishi లోపల secret fear??!!
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Thanks Sivagaru, intha regular గా updates istunnaru
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Excellent... Seems the story is getting concluded in next few episodes... Good to see 4 couples settle in their lives... Waiting for how the writer ends the story... Excellent writing. And thank you for giving us wonderful back to back stories which really touch the heart.
[+] 1 user Likes Sunny73's post
Like Reply
super story.. keep going
[+] 1 user Likes masalakiss's post
Like Reply
Super story.
[+] 1 user Likes styleraja's post
Like Reply
GOUTHAM BHAVYA LA ENGAGEMENT YEPPUDU?
[+] 1 user Likes yekalavyass's post
Like Reply
Super.....
[+] 1 user Likes styleraja's post
Like Reply
Excellent update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
Part - 136



సింహ మాన్షన్ ఆ రోజు ఉదయం చాలా త్వరగా లేచింది.
సూర్యుడు ఇంకా పూర్తిగా ఉదయించకముందే… ఇంటి ముందు తోరణాలు కట్టే వాళ్లు, పూల సువాసనలు, మంగళవాయిద్యాల స్వరాలు కలిసిపోతాయి.

లలిత తెల్లవారుజామునే లేచి దీపం వెలిగిస్తుంది.
ఆమె కళ్లలో ఆనందం… హృదయంలో కృతజ్ఞత.
ఇంత సంతోషం ఒకేసారి వస్తుందని అనుకోలేదే భగవంతుడా….అని మౌనంగా ప్రార్థిస్తుంది.

మూడు గదుల్లో మూడు భావాలు…
విశి కిటికీ దగ్గర నిలబడి ఉదయాన్ని చూస్తుంది.
బయట శుభకార్యాల సందడి… లోపల ఆమె హార్ట్ మాత్రం వేగంగా కొడుతోంది.

అద్దం ముందు కూర్చుని రెడీ అవుతుంటే... అద్దంలో చూసుకుని ఆశ్చర్యపోతుంది. ఇది నేనేనా.. ఇంతటి అదృష్టం నా జీవితంలోకి వచ్చిందా.

నాన్న చూస్తున్నారు కదా అని ఎమోషనల్ అవుతుంది. భానుమతి అది చూసి ఈరోజు నీకు చాలా ముఖ్యమైన రోజు ఇలా కంటి నీరు పెట్టుకోకూడదు అని ఆ కళ్ళు తుడిస్తే అమ్మ ఇదంతా నాన్నగారు చూస్తూ ఉంటారు కదా తప్పకుండా...
ఆ మాటతో విశి కళ్లలో ధైర్యం పెరుగుతుంది.

చందు మాత్రం ఫుల్ ఎక్సైట్మెంట్ మోడ్ లో ఉంటుంది.
మేకప్ ఆర్టిస్ట్‌తో మాట్లాడుతూ కూడా తన బ్రాండ్ గురించి మాట్లాడుతూనే ఉంటుంది.

ఈ లెహంగా కూడా నా కాన్సెప్ట్ లైన్ లో భాగమే తెలుసా? అని చెప్పగానే  అందరూ నవ్వుతారు.
వైభవ్ కి వీడియో కాల్ చేస్తూ,
లేట్ అవ్వకు… నీ ఎంట్రీ కూడా గ్రాండ్ ఉండాలి అంటుంది.

సౌమ్య మాత్రం ప్రశాంతంగా ఉంటుంది.
ఆమె చేతుల్లో చిన్న పుస్తకం –...నిన్న రాత్రి చదివిన మెడికల్ నోట్స్.
భరత్ వచ్చి చూసి ఏమిట్రా ఈరోజు కూడా చదువుతున్నావా..  కొంచెం ఇంపార్టెంట్ నోట్స్ నాన్న.  ఒక పేషెంట్ కి సంబంధించినది చదువుతున్నాను కానీ ఈరోజు నీకు నిశ్చితార్థం. గుర్తుంది నాన్న అని చిన్నగా  నవ్వుతుంది.


సూర్య, వైభవ్, శ్రీకర్ ముగ్గురు ఒకే గదిలో రెడీ అవుతున్నారు.
సూర్య అద్దంలో తనని చూసుకుని లోతుగా ఊపిరి తీసుకుంటాడు.
ఇది కేవలం నిశ్చితార్థం కాదు… నా లైఫ్ కి కమిట్‌మెంట్.
వైభవ్ సరదాగా,  నిన్ను ఇంత సీరియస్‌గా చూడటం ఇదే మొదటిసారి అంటాడు.
శ్రీకర్ వెంటనే నువ్వు మాత్రం ఇదే కామెడీ మెయింటైన్ చెయ్.  లేకపోతే చందు పెట్టే రూల్స్ కి బేర్ మన్నావు అనుకో అందరికీ తెలిసిపోతుంది.

చందు నాకేం పెట్టింది.  ఆహా నేను చూడలేదా..  వీడియో కాల్ చేసి మరి నువ్వు ఎలా రావాలో కూడా చెబుతుంటే...

వెంటనే వినయ్.. ఇప్పుడు నుంచే నా కొడుకు అలవాటు పడుతున్నాడు మధ్యలో నీకేంటి రా నొప్పి. నాన్న అంటే... తప్పదురా కన్నా రెడీ అవ్వండి.
శ్రీకర్ మెల్లగా  మన మాటలు ఈ రోజు నుంచి హామీలవుతాయి అంటాడు.
ముగ్గురూ ఒకరినొకరు చూసుకుని మౌనంగా నవ్వుతారు.

స్టేజ్ మీద మూడు అందమైన కుర్చీలు.
గోల్డ్, వైట్ థీమ్ మధ్యలో పూల వర్షం లాంటి డెకరేషన్.
అతిథులు ఒక్కొక్కరుగా రావడం మొదలవుతుంది.
పెద్దవాళ్లు ముహూర్తం టైమ్ చెక్ చేస్తూ ఉంటారు.
లలిత, కళ్యాణ్.. మాధవి, రమేష్... పార్ధు, కరుణ... స్టేజ్ నందు ఉన్న సోఫాలో కూర్చుని వచ్చిన వాళ్ళందరినీ చిరునవ్వుతో విష్ చేస్తూ ఉంటారు.

విశిష్ట స్టేజ్ వెనుక నిలబడి ఉంటుంది. సూర్య ఆమె వైపు చూస్తాడు.  ఇద్దరి కళ్లలో మాటలు లేకుండా ఒకే భావం..
ఇక మనం ఒకరికొకరం.  మంగళవాయిద్యాల శబ్దం పెరుగుతుంది.
పెద్దవాళ్లు పిలుస్తారు…
మూడు జంటలు స్టేజ్ పైకి రండి.

విక్రమ్ అవని... సూర్యని తీసుకువస్తారు.
వినయ్ పూజిత...  వైభవ్ ని తీసుకువస్తారు.
శ్రీ,, నేహా..   ఒక పక్కన శ్రీకర్ ని, మరొక పక్కన విశిష్ట ని తీసుకుని స్టేజ్ మీదకి వస్తారు.
భరత్ విద్య... సౌమ్య ని తీసుకునివస్తారు.
రాజ్ నివేదిత... చంద్రికని తీసుకునివస్తారు.

భవ్య గౌతమ్ ఫంక్షన్ దగ్గర అన్ని చక్కబెడుతూ ఉంటారు.
మూడు జంటల్ని అలా చూసి భానుమతి కూడా ఆనందపడుతుంది లలిత పిలిచి  నువ్వు స్టేజి మీదకి వెళ్ళు అంటే వద్దు పిన్ని గారు నేను ఇక్కడే ఉంటాను అని పక్కనే కూర్చుంటుంది

ఆ ఉదయం…
మూడు ప్రేమ కథలు ఒక కొత్త అధ్యాయంలోకి అడుగు పెడతాయి.

జంటలను కూర్చోబెట్టండి అంటే మూడు జంటల్ని కూర్చోబెట్టి ముందు విఘ్నేశ్వరుడి పూజ చేయిపిస్తారు.

విఘ్నేశ్వరుడి పూజ పూర్తయ్యాక పండితుల మంత్రోచ్ఛారణలతో వాతావరణం మరింత పవిత్రంగా మారుతుంది.

అక్షింతలు చేతుల్లో పట్టుకుని పెద్దవాళ్లు ఒక్కొక్కరిగా ఆశీర్వదిస్తారు.
మొదటగా విక్రమ్ – అవని, వినయ్ – పూజిత కలిసి మూడు జంటల చేతుల్లో తాంబూలాలు ఇస్తారు.
పెద్దల చేతుల్లోంచి ఆశీర్వాదం అందుకుంటూ ముగ్గురు అబ్బాయిల కళ్లలో ఒకే భావం...
ఇప్పటి నుంచి బాధ్యత మొదలైంది.


ముహూర్తం సమయం దగ్గరపడుతుంటే మంగళవాయిద్యాల శబ్దం ఒక్కసారిగా పెరుగుతుంది.
మొదటగా సూర్య ... విశిష్ట.
సూర్య చేతుల్లో చిన్న వెల్వెట్ బాక్స్.
విశిష్ట చేతులు కొద్దిగా వణుకుతుంటే… సూర్య మెల్లగా ఆమె చేతిని పట్టుకుని,
ఇక నీకు భయం ఉండకూడదు… అని కళ్లతోనే చెప్పేస్తాడు.
రింగ్ వేస్తూనే చప్పట్ల వర్షం.
పూల వర్షం.
లలిత కళ్లలో ఆనంద బాష్పాలు.
భానుమతి తల పైకి ఎత్తి, చూస్తున్నారా… మీ అమ్మాయి సంతోషంగా ఉంది అని మౌనంగా అంటుంది.

తర్వాత వైభవ్... చంద్రిక.
చందు రింగ్ పెట్టే ముందు,  లేట్ అవ్వకు అన్నాను కదా… కానీ టైమింగ్ మాత్రం పర్ఫెక్ట్ గా వచ్చింది  అని చెవిలో గుసగుసగా చెబుతుంది.

వైభవ్ నవ్వుకుంటూ, ఇప్పటి నుంచి నీ షెడ్యూల్ కి నేనూ అడ్జస్ట్ అవుతా మేడమ్ అంటాడు.

రాజ్ గుండెల మీద చెయ్యి వేసుకుని వీడు కూడా నా ఖాతాలోకి వచ్చేసాడు.. నాకు ఇంకా ఏ టెన్షన్ లేదు. ఆ మాటకి అందరూ నవ్వుతారు.

మూడోగా శ్రీకర్... సౌమ్య.
సౌమ్య ప్రశాంతంగా రింగ్ తీసుకుంటే, శ్రీకర్ మెల్లగా,
నువ్వు చదువు ఆపకూడదు… నీ కలలకి నేనే ఫస్ట్ సపోర్ట్ అంటాడు.
సౌమ్య కళ్లలో గౌరవం, ప్రేమ కలిసిన వెలుగు.

రింగ్స్ అయిపోయాక చిన్నపిల్లలు స్టేజ్ మీదకి పరుగెత్తుకుంటూ వస్తారు.
భవ్య, గౌతమ్ వాళ్లను కంట్రోల్ చేయాలని చూస్తే…
వినయ్ నవ్వుతూ వాళ్లు కూడా సెలబ్రేట్ చేయనివ్వు అంటాడు.

ఫోటోగ్రాఫర్ పెద్దగా, స్మైల్ ప్లీజ్… ఒక గ్రూప్ ఫోటో..
అంటే వైభవ్,  మనం సీరియస్ గా నిలబడితేనే ఫన్నీగా కనిపిస్తాం అంటాడు.

శ్రీకర్ వెంటనే,  అవును… మా వైభవ్ గారు కామెడీ లేకపోతే ఫంక్షన్ కం‌ప్లీట్ కాదు అంటాడు.


మాధవి, రమేష్ స్పెషల్ గా ఆర్డర్ చేసిన పెద్ద కేక్ స్టేజ్ మీదకి తీసుకొస్తారు.  మూడు జంటలు కలిసి కట్ చేయాలి అంటారు.

మూడు జంటలు ఒకేసారి కట్ చేస్తే…  మళ్ళీ చప్పట్లు, హర్షధ్వానాలు.
చందు తన బ్రాండ్ లో డిజైన్ చేసిన చిన్న గిఫ్ట్ హ్యాంపర్లు అతిథులకు ఇస్తుంది.

ఇది నా ఫస్ట్ ఆఫిషియల్ కలెక్షన్ అంటుంది గర్వంగా.
వైభవ్ చూస్తూ  ఇక నేను బ్రాండ్ అంబాసిడర్ అయ్యాను కదా?  అంటాడు.

సూర్య పక్కన నిలబడి ఉన్న విశిష్ట వైపు చూసి,  ఈ రోజు నుంచి నువ్వు నా ఫ్యామిలీ మాత్రమే కాదు… నా స్ట్రెంగ్త్ అంటాడు.
విశిష్ట మెల్లగా మనం ఇద్దరం ఒకరికి ఒకరం స్ట్రెంగ్త్ అంటుంది.

లలిత, కళ్యాణ్…
మాధవి, రమేష్...
వాసు, కరుణ...
విక్రమ్, అవని...
భానుమతి…
శ్రీ, నేహా...
విద్య, భరత్…
రాజ్, నివేదిత…
అందరూ ఒకే భావంతో చూస్తుంటారు.
మన పిల్లలు మనకన్నా మెచ్యూర్ గా ఉన్నారు అని వినయ్ అంటాడు.
భానుమతి లలిత చేతిని పట్టుకుని,  ఇది నిజంగా శుభదినం అంటుంది.


సూర్యాస్తమయం కాకముందే,
మూడు జంటలు కుటుంబాల మధ్య కూర్చుని నవ్వులు పంచుకుంటుంటారు.

మంగళవాయిద్యాల స్వరం మెల్లగా తగ్గిపోతుంది…
కానీ ఆ రోజు నవ్వులు, ఆశలు, హామీలు మాత్రం
ప్రతి ఒక్కరి హృదయంలో ఘనంగా నిలిచిపోతాయి.
ఆ నిశ్చితార్థం కేవలం ఉంగరాల మార్పిడి కాదు…
మూడు ప్రేమ కథలు అధికారికంగా ఒకే కుటుంబంగా మారిన రోజు.......
[+] 5 users Like SivaSai's post
Like Reply
Part - 137



ఫంక్షన్ ముగిసేసరికి కూడా ఇంట్లో సందడి తగ్గలేదు.
పెద్దలందరూ డైనింగ్ హాల్‌లో కూర్చుని డిన్నర్ చేస్తుంటే… చిన్నవాళ్లు మాత్రం గార్డెన్‌లో లైట్స్ మధ్య ఫోటోలు, రీల్స్, నవ్వులు.

వినయ్ ప్లేట్ తీసుకుని కూర్చుంటే,
మాధవి నవ్వుతూ...  ఇప్పటినుంచి ఇక్కడ ఇద్దరూ  కోడళ్ళు… నీకు స్పెషల్ కేర్ అంటుంది.
సౌమ్య అక్కడి కోడలు అవుతుంది.. ఏది ఏమైనా మన పిల్లలు నలగకుండా మన ఇంట్లోనే ఉన్నారు అందుకు చాలా సంతోషంగా ఉంది.
రాజ్ ఆ మాటకి మీరు భలేవారే పిన్ని గారు. మీ అమ్మాయిలు బయటికి వెళ్లినా సరే మేము సింహా ఫ్యామిలీ మెంబర్స్ అని లొంగదీస్తారు కానీ వాళ్ళు ఏమీ నలగరు.
నివి వెంటనే ఇప్పుడు మీకేం తక్కువగా అయింది అని అడుగుతుంది. నేను తక్కువైందన్న మాట ఎక్కడన్నాను నివి బంగారం . పిన్ని గారు అలా ఫీలవుతుంటే మీరు భయపడకండి అని నన్ను నేను చూపిస్తున్నాను అంతే అంతే కదా పిన్నిగారు అంటే...ఆ మాటకు అందరూ గట్టిగా నవ్వుతారు.

లలిత నిశ్శబ్దంగా ముగ్గురు జంటల్ని చూస్తూ ఉంటుంది.
ఆమె హృదయంలో ఒకే మాట...
ఇంటి లోపల నవ్వులు ఇలా ఎప్పటికీ ఉండాలి.

భవ్య, గౌతమ్ డీజే సెట్ పెట్టేస్తారు.
లైట్ మ్యూజిక్ మొదలవుతుంది.
శ్రీకర్ వైభవ్ ని లాగి డ్యాన్స్ ఫ్లోర్ కి తీసుకెళ్తాడు.
ఇప్పుడే అలవాటు పడు రా… ఫ్యూచర్‌లో ఫంక్షన్స్ ఎక్కువే అంటాడు.
సూర్య మాత్రం కొంచెం సైలెంట్‌గా నిలబడి విశిష్టని చూస్తుంటాడు.

చందు గమనించి    అయ్యో… ఈ లవ్ లుక్ చూసి మ్యూజిక్ స్లో అవ్వాలి అంటుంది.
మళ్లీ నవ్వులు.


గార్డెన్‌లోని ఒక మూలలో… సూర్య, విశి...
చంద్రకాంతి కింద ఇద్దరూ నిశ్శబ్దంగా నిలబడి ఉంటారు.
సూర్య మెల్లగా,  ఈ రోజు నుంచి నువ్వు ఏ సమస్య అయినా ఒంటరిగా ఫేస్ చేయకూడదు అంటాడు.
విశిష్ట కళ్లలో నీరు మెరుస్తుంది.
నన్ను నమ్మినందుకు థాంక్యూ… అంటుంది.
సూర్య నవ్వుతూ, నిన్ను నమ్మడం కాదు… నువ్వే నేను అయ్యాను అంటాడు.
ఆ మాటతో విశిష్ట ముఖంలో ధైర్యం స్పష్టంగా కనిపిస్తుంది.

బాల్కనీ దగ్గర నిలబడి చందు ఫోన్‌లో ఫంక్షన్ ఫోటోలు చూస్తుంటే… వైభవ్ వెనుకనుంచి వచ్చి,
ఇన్ని డ్రీమ్స్ ఉన్న అమ్మాయిని నేను మిస్ చేసుకునే ఛాన్స్ లేదు అంటాడు.
చందు సరదాగా,  అయితే నా బ్రాండ్ కి ఇన్వెస్ట్ చేయాలి ముందుగా అంటుంది.

నీ డ్రీమ్ ఏదైనా… నేను ఫస్ట్ కస్టమర్ అంటాడు.
ఆమె నవ్వు మరింత విరిసిపోతుంది.

ఇంట్లోని లైబ్రరీ రూమ్‌లో…  సౌమ్య చేతిలో ఇంకా అదే చిన్న నోట్‌బుక్.  శ్రీకర్ వచ్చి కూర్చుని,
నీ కలలు… నీ ప్రొఫెషన్… ఇవన్నీ నా గర్వం అవ్వాలి అంటాడు.

సౌమ్య ప్రశాంతంగా,  మనిద్దరం ఒకరికొకరం స్పేస్ ఇస్తే చాలు అంటుంది.  శ్రీకర్ చేతిని ముందుకు చాపి,
డీల్? అంటాడు.
సౌమ్య నవ్వుతూ చేతిని అతని చేతిలో ఉంచుతుంది.

భవ్య గౌతమ్ ఇద్దరూ ఇంటికి బయలుదేరుతారు. ఆ కారులో వెళుతూ చల్లగాలికి కార్ విండో దించి ఆ వెదర్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.

అది చూసిన గౌతమ్ ఖచ్చితంగా ప్రతి వీకెండ్ నిన్ను నేను ఇలా తీసుకు వస్తాను. ఆ మాటకి భవ్య చిన్నగా నవ్వుతుంది.

ఇంట్లో లైట్స్ ఒక్కొక్కటిగా ఆరిపోతుంటే…
మూడు జంటల హృదయాల్లో మాత్రం కొత్త వెలుగు వెలుగుతోంది.

ఆ రోజు నిశ్చితార్థం కేవలం ఉంగరాల మార్పిడి కాదు…
మూడు కుటుంబాలు ఒకటైన రాత్రి.
మూడు ప్రేమ కథలు భవిష్యత్తు వైపు మొదటి నిశ్చిత అడుగు వేసిన రాత్రి.

నిశ్చితార్థం అయిపోయి వారం కూడా గడవలేదు…
ఇప్పటికే సింహ మాన్షన్‌లో మళ్లీ మీటింగ్స్, లిస్టులు, డెకరేషన్ క్యాటలాగ్స్.

లలిత పెద్ద డైరీ తీసుకుని కూర్చుంది. కోడళ్ళు కూతుళ్లు చుట్టూ చారతారు ఎవరికి ఏమి కావాలో అన్నది లిస్టు చెబుతూఉంటారు.

మూడు పెళ్లిళ్లు అంటే మూడు రెట్లు ప్లానింగ్ అంటుంది.
వినయ్ వెంటనే,  మూడు కాదు… ఆరు రెట్లు. ఎందుకంటే ప్రతి జంటకి స్పెషల్ కావాలి అంటాడు.
విక్రమ్ తల్లిని చూస్తూ మీరు ఏమి టెన్షన్ పడకండి.  అన్ని టైంకి జరిగిపోతాయి. మన మాన్షన్ లో చాలా రోజుల తర్వాత జరుగుతున్న పెళ్లి.  ఒకేసారి జరుగుతున్నాయి. ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలో అంత గ్రాండ్ జరుగుతుంది.

చందు తన ల్యాప్‌టాప్ తెరిచి ప్రెజెంటేషన్ మొదలుపెడుతుంది.

నా పెళ్లి థీమ్.. రాయల్ పీచ్ & గోల్డ్.  బ్రాండ్ లాంచ్ లా గ్రాండ్ గా ఉండాలి.
వైభవ్  చందు ని చూస్తూ...  పెళ్లా? లేక ఫ్యాషన్ వీక్ ఆ?
అందరూ నవ్వుతారు.

ఇంతలో విశిష్ట,  నాకు మాత్రం సింపుల్ వైట్ & జాస్మిన్ థీమ్ చాలు…అంటుంది.
సూర్య వెంటనే,  విశికి ఏది కంఫర్ట్ అయితే అదే అంటాడు.

చందు చేతులు పైకెత్తి,  సరే! మూడు థీమ్‌లు...  మూడు రోజులు ప్రాబ్లమ్ సాల్వ్.

భవ్య, గౌతమ్ ముందుండి ఫ్యామిలీ డ్యాన్స్ ప్లాన్ చేస్తారు.
శ్రీకర్ రిహార్సల్‌లో రెండు స్టెప్స్ మిస్ అవుతాడు.
సౌమ్య నవ్వుతూ,  సర్జరీ కంటే డ్యాన్స్ కష్టం అనిపిస్తుందా? అంటుంది.


అవును. ఇక్కడ ఎలాంటి అనస్థీషియా లేదు. అది డాక్టర్ అమ్మకే తెలియాలి బిజినెస్ చేసుకునే మాకు ఎలా తెలుస్తుంది చెప్పు.

వైభవ్ మాత్రం పూర్తి ఎనర్జీతో స్టెప్స్ వేస్తుంటే,  చందు వీడియో తీసి,  ఇది రీల్స్ కి పెడతా అంటుంది.
వైభవ్ వెంటనే స్టెప్ మార్చి,  కాపీరైట్ నా దగ్గర ఉంది అంటాడు.

షాపింగ్ కి వెళ్లిన రోజు…  సౌమ్య సింపుల్ సిల్క్ చీర ఎంచుకుంటే,  విశిష్ట కొంచెం క్లాసిక్ డిజైన్ చూస్తుంది.
చందు మాత్రం ఐదు లెహంగా ట్రయల్ చేస్తూ,
ఇది కాదు… లైట్ తక్కువగా ఉంది. ఇది కాదు… ఫాల్ సరిగ్గా లేదు.

వైభవ్ బయట కూర్చుని,  ఇదే నా పేషెన్స్ టెస్ట్ అంటాడు.
సూర్య నవ్వుతూ,  మనం జీవితాంతం ఈ టెస్ట్ రాయాలి అంటాడు.
వైభవ్ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తే ఓపెన్ చేసి చూస్తాడు. రాజ్ అయిందా.. నీకు బాగా తీరినట్టు ఉంది అని ఏమోజి పంపిస్తాడు.  అది చూసి  మామ అనుకుంటూ యాంగిరీ ఏమోజి పంపిస్తాడు.


లలిత, మాధవి ఇద్దరూ లిస్ట్ చూసుకుంటూ…  ఈ వాళ్లను పిలవాలా?  వాళ్లు రాకపోతే మనమే ఫీలవుతాం.
భరత్ ఒక సలహా ఇస్తాడు...  ఎవరు నిజంగా మన సంతోషంలో ఉండాలనుకుంటారో వాళ్లే చాలు.
అందరూ అంగీకరిస్తారు.


సూర్య రాత్రి కాల్ చేస్తాడు.  మన పెళ్లి కార్డ్ డిజైన్ చూశావా?
ఇప్పుడే చూడాలి.
అందులో నా పేరు నీ పేరుతో కలిపి చూసాకే రియాలిటీ ఫీలైంది.

చందు కొత్త బ్లౌజ్ డిజైన్ చూపిస్తే,
వైభవ్....ఇది ట్రెండ్ అవుతుందా?
మన పెళ్లి రోజు వేసిందే ట్రెండ్ అవుతుంది.
రాజ్ రిలాక్స్ కార్టూన్ మూవీ చూస్తూ పాప్కాన్ తింటూ ఉంటాడు.  పక్కన కూర్చుని ఎలా మావయ్య ఈ టార్చర్ అంతా భరించావు.

అందుకే చెప్పాను  వీళ్ళిద్దరి మధ్య అప్పడం లాగా నలిగి పోయాను. మాటకి తమరు ఏమన్నారు. నేను నీలాగా కాదు. కార్డు ఇచ్చేస్తాను మీ తిప్పలు మీరు పడండి అని చెబుతాను అన్నావు.
మావయ్య అని గారంగా పిలిస్తే... అదేరా ప్రేమంటే. మన అనుకునే వాళ్ళ దగ్గర ఎంత టార్చర్ అయినా భరిస్తాము. ఎందుకంటే వాళ్ళు చూపించే ప్రేమ అంత గొప్పగా ఉంటుంది.

కాబట్టి చిన్న చిన్న మైనెస్ లు కనిపించకూడదు కనిపించిన వాటిని భూతద్దంలో పెట్టి చూడకూడదు.

సౌమ్య ఇంకా పేషెంట్ కేస్ చదువుతుంటే... శ్రీకర్ హాస్పిటల్ దగ్గరికి వస్తాడు సౌమ్య క్యాబిన్ కి వెళ్లి డోర్ తీసి.. డాక్టర్ గారూ, పెళ్లి తర్వాత అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలా?
సౌమ్య నవ్వుతూ లైఫ్‌టైమ్ ఫ్రీ సర్వీస్.


ఇంట్లో ఎక్కడ చూసినా రంగులు, నవ్వులు, ప్లాన్లు.
ఎవరూ ఒత్తిడిగా లేరు.
ప్రతి చిన్న విభేదం చివరికి నవ్వులే.

లలిత ఒకసారి నిశ్శబ్దంగా చూస్తూ,
మన ఇంట్లో ఈ ఎనర్జీ ఎప్పటికీ తగ్గకూడదు  అంటుంది.
మాధవి లలిత తో అవును వదిన ఈ ఎనర్జీ ఎప్పటికీ తగ్గకూడదు.
వినయ్... వాళ్ళిద్దరి మాటలు విని
ఇది మొదటిది మాత్రమే… ఇంకా పెళ్లి రోజు మిగిలే ఉంది అంటాడు.
పెళ్లి పనులు మొదలుపెడదాం........
[+] 6 users Like SivaSai's post
Like Reply
Part - 138



సింహ ఫ్యామిలీలో పెళ్లి హడావిడి జరుగుతూ ఉండగానే భవ్య, గౌతమ్ పెళ్లి డేట్ కూడా వచ్చేస్తుంది.

గౌతమ్ ని పెళ్లికొడుకుగా రెడీ చేస్తారు. సూర్య అది చూసి సూపర్ ఉన్నావు..మంచి హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నావు. సూర్యని హత్తుకుని ఎమోషనల్ అవుతాడు.

నా తప్పు నీ క్షమించి నన్ను నీ స్నేహితుడిగా చేసుకున్నావు.  ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను. ఆ మాటకి సూర్య కూడా బుజం పైన చేయి వేసి..

నీ తప్పు నువ్వు తెలుసుకుని రియలైజ్ అయ్యావు. కాబట్టే నా పక్కన ఉండే అవకాశం ఇచ్చాను.  లేకపోతే హిమలాగానే ఉండేది కదా..

ఇప్పుడు జరిగిపోయిన విషయాలు గురించి మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు.  నీ ముందు ఉన్న భవిష్యత్తు గురించి ఆలోచించు.

భవ్య కంటతడి పెట్టకుండ చూసుకో.  అదే నువ్వు నాకు ఇచ్చే పెద్ద గిఫ్ట్. ఎందుకంటే వాళ్లు నాన్నగారికి నీ విషయంలో స్ట్రాంగ్ గా నిలబడి హామీ ఇచ్చాను. తప్పకుండా భవ్య నా ప్రాణం. నీ స్నేహం నా ఊపిరి.

ఇక మరో గదిలో…
భవ్యకి పసుపు రంగు కాన్జీవరం చీర కట్టిస్తున్నారు.
చందు, విశిష్ట, సౌమ్య ముగ్గురూ ఆమె చుట్టూ తిరుగుతూ సెటప్ చెక్ చేస్తున్నారు.

చందు..  నీ జడ డిజైన్ నా బ్రాండ్ స్టాండర్డ్ కి తగ్గట్టే ఉంది అంటుంది.

సౌమ్య నవ్వుతూ.. డాక్టర్ అప్రూవ్ చేసింది అంటే పర్ఫెక్ట్.
విశిష్ట మెల్లగా భవ్య చెవిలో...  ఇవాళ నువ్వు కేవలం పెళ్లికూతురు కాదు… మన ఫ్యామిలీకి లక్కీ చార్మ్.
భవ్య నవ్వుతూ...  నేను ఏడవను. హామీ.

బ్యాండ్ బాజాలతో గౌతమ్ ఎంట్రీ ఇస్తాడు.
వైభవ్ డ్యాన్స్ మొదలు పెడితే… శ్రీకర్ కూడా జాయిన్ అవుతాడు.
సూర్య మాత్రం మధ్యలో స్టెప్స్ వేసి అందరినీ షాక్ చేస్తాడు.

లలిత నవ్వుతూ   మన ఇంటి అబ్బాయిలు ఇలా డ్యాన్స్ చేస్తారని ఊహించలేదు.

స్టేజ్ మీద భవ్య.. గౌతమ్ ఎదురెదురుగా నిలబడతారు.
వైభవ్, శ్రీకర్ ఇద్దరూ గౌతమ్ ని పైకి లేపేస్తారు.
చందు, విశిష్ట భవ్యకి సపోర్ట్ చేస్తారు.
ఇది ఫేర్ కాదు  అంటుంది భవ్య నవ్వుతూ.

చివరికి గౌతమ్ వంగి.... ఇప్పటినుంచి ఎప్పుడూ నీకు ఈజీ చేస్తా అంటాడు.  మాలలు మార్చుకుంటారు.
పూల వర్షం.
అది చూసిన భవ్య తల్లిదండ్రులకి కూడా ధైర్యంగా అనిపిస్తుంది.  సూర్య వైపు చూసి సంతోషాన్ని వ్యక్తం  చేస్తారు.

పండితుల మంత్రాల మధ్య…  గౌతమ్ తాళి కట్టే సమయం.  సూర్య వెనుక నిలబడి అతని భుజం మీద చేయి ఉంచుతాడు.
ఒక సైలెంట్ సపోర్ట్.

తాళి కట్టగానే…  మంగళవాయిద్యాల గోల, చప్పట్లు, హర్షధ్వానాలు.  భవ్య నవ్వుతూనే గౌతమ్ వైపు చూస్తుంది.  ఎక్కడా కన్నీళ్లు లేవు.
కేవలం ఆనందం మాత్రమే.


సాయంత్రం రిసెప్షన్‌లో డీజే నైట్.
చందు, వైభవ్ కపుల్ డ్యాన్స్.
సౌమ్య, శ్రీకర్ క్లాసిక్ స్టెప్స్.
విశిష్ట, సూర్య స్లో రొమాంటిక్ మ్యూజిక్ కి డ్యాన్స్ చేస్తుంటే… అందరూ వాళ్లని చూస్తూ హర్షిస్తారు.

గౌతమ్, భవ్య స్టేజ్ మీద కూర్చుని అందరినీ చూస్తూ…
ఇంత ప్రేమ మధ్య పెళ్లి కావడం నా అదృష్టం అంటాడు గౌతమ్.
భవ్య... గౌతమ్ చెయ్యి పట్టుకుని..  ఇది మొదలు మాత్రమే.


పెళ్లి వేడుక ముగిసేసరికి…  సింహ ఫ్యామిలీ ఒకచోట చేరి గ్రూప్ ఫోటో దిగుతుంది.
వినయ్ గర్వంగా...  మన ఇంటి బంధాలు ఇలా బలంగా ఉండాలి.
లలిత తల ఊపుతూ   ఇది నిజంగా శుభ సమయం.
సూర్య గౌతమ్ వైపు చూసి నవ్వుతాడు.
అది కేవలం స్నేహితుడి నవ్వు కాదు…
ఒక కొత్త కుటుంబ సభ్యుడిని గర్వంగా అంగీకరించిన నవ్వు.

విక్రమ్ అవనీ భుజం మీద చెయ్యి వేసి.. ఏమిటి భార్యామణి గారు సంతోషంతో కళ్ళల్లోంచి నీళ్లు కారుతూ ఉన్నట్టు ఉన్నాయి.  అవునండి మన కుటుంబం మొత్తం సంతోషంగా ఉండడం చూస్తూ ఉంటే కడుపు నిండిపోతుంది.

మన సూర్య కూడా మీలాగానే సైలెంట్ గా ఉంటాడు. ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి ఎంత సపోర్ట్ ఇవ్వాలో అంతా ఇస్తాడు. కానీ ముందుకు రాడు. బ్యాక్ బోన్ లాగా నిలబడి కుటుంబాన్ని నిలబెడుతున్నాడు.

ఉదయం సూర్య కిరణాలు కిటికీ గుండా లోపలికి వస్తుంటాయి.. కొత్త ఇంటి హాల్‌లో ఇంకా పూల సువాసన, కొత్త ఫర్నిచర్ వాసన కలిసిపోతాయి.
భవ్య చేతిలో పాలు గ్లాస్ తీసుకుని లోపలికి వస్తుంది.
గౌతమ్ ఇంకా సోఫాలో కూర్చుని హాల్ చుట్టూ చూస్తుంటాడు.

ఏమిటి ఇంత సీరియస్‌గా?.అంటుంది భవ్య.
గౌతమ్ నవ్వుతూ..... ఇది నిజంగా మన ఇల్లు అనిపిస్తోంది.

నిన్నటి వరకూ నేను ఒంటరిగా ప్లాన్ చేసుకున్న ఫ్యూచర్…
ఇప్పుడది మనిద్దరి ఫ్యూచర్.  భవ్య టేబుల్ మీద చిన్న గణపతి విగ్రహం పెట్టి దీపం వెలిగిస్తుంది.

ఇక్కడ నుంచి మన స్టార్ట్ పాజిటివ్ గా ఉండాలి.
గౌతమ్ ఆమె దగ్గరకు వచ్చి...  నీ నవ్వు ఈ ఇంటి లైటింగ్ కంటే బ్రైట్‌గా ఉంది  అంటాడు.

భవ్య నవ్వుతూ... ఇలా పొగడ్తలు చెప్పి బ్రేక్‌ఫాస్ట్ తప్పించుకోలేవు...ఇద్దరూ కలిసి కిచెన్‌లో మొదటి కాఫీ తయారు చేస్తారు.
చిన్నగా చిందులు పడినా… ఇద్దరూ నవ్వుకుంటారు.
అది ఒక పర్ఫెక్ట్ స్టార్ట్.


ఇంతలో సింహ మాన్షన్‌లో…
లలిత, మాధవి పెద్ద హాల్ మధ్యలో డెకరేషన్ శాంపిల్స్ చూసుకుంటు ఉంటారు.
చందు...  నివి భుజం చుట్టూ చెయ్యి వేసి.. నా మెహందీ ఫంక్షన్ ఓపెన్ లాన్‌లో ఉండాలి. ఫెయిరీ లైట్స్, ఫ్లోరల్ జార్స్.
వైభవ్.. చందు చెప్పిన దానికి చూస్తూ..  సరే… కానీ డీజే వాల్యూమ్ కంట్రోల్ నా దగ్గర ఉంటుంది.
పూజిత కొడుకు తల మీద ఒకటి వేసి మెహేందిలో మీ మగవాళ్ళ గొడవ ఏమిటి. ఆ మాటకి చందు నాలుక బయటపెట్టి వెక్కిరిస్తుంది.

అమ్మ నాకు ఇంకా పెళ్లి అవుతుంది. ఇప్పుడు కూడా నువ్వు ఇలాగే కొడతావా.. నీ పిల్లలకు పెళ్లి అవుతున్న నా చేతిలో దెబ్బలు ఇలాగే తింటావు.

సౌమ్య మాత్రం క్యాలెండర్ చూస్తూ...  ముహూర్తం టైమ్ కి ముందు హాస్పిటల్ షిఫ్ట్ క్లియర్ చేసుకోవాలి.

శ్రీకర్ వెంటనే   నీ షెడ్యూల్ కి పెళ్లి షెడ్యూల్ అడ్జస్ట్ అవుతుంది.

విశిష్ట సైలెంట్‌గా కార్డ్ డిజైన్ చూసి...  ఇది చాలా గ్రేస్‌ఫుల్‌గా ఉంది.

సూర్య మెల్లగా ఆమె దగ్గరకి వచ్చి..  నీకు నచ్చిందే ఫైనల్.

సాయంత్రం భవ్య, గౌతమ్ కొత్త ఇంటి నుంచి సింహ మాన్షన్‌కి వస్తారు.  అందరూ చప్పట్లతో వెల్‌కమ్ చెబుతారు.
చందు సరదాగా...  మరి కొత్త కపుల్ సలహా ఏమిటి?
భవ్య నవ్వుతూ...  ఒక్కటే. ఒకరిని ఒకరు వినాలి. మిగతా వన్నీ ఆటోమేటిక్‌గా సెట్ అవుతాయి.
గౌతమ్ సూర్య వైపు చూసి చిన్నగా తల ఊపుతాడు.
అది థాంక్స్ చెప్పినట్టు.


రాత్రి అందరూ ఒకచోట కూర్చుని పెళ్లి ప్లాన్స్ మాట్లాడుకుంటుంటారు.
వినయ్..  ఈసారి మూడు పెళ్లిళ్లు ఇంకా గ్రాండ్‌గా జరగాలి.
విద్యా వెంటనే.. కానీ ఒత్తిడి లేకుండా. భరత్ భార్య చెయ్యి పట్టుకుని..  మన ఇంట్లో టెన్షన్ ఉండదు. కేవలం ప్లానింగ్ మాత్రమే ఉంటుంది.
అందరూ నవ్వుతారు.

భవ్య గమనిస్తుంది. ఇది కేవలం కుటుంబం కాదు…
ఇది ఒక టీమ్.

పెళ్లి పనులు మొదలు అయ్యాయి....
[+] 6 users Like SivaSai's post
Like Reply
Part - 139



లాన్ అంతా గ్రీన్ & యెల్లో థీమ్.
మర్రి చెట్లకి వేలాడుతున్న పూల హారాలు, ఫెయిరీ లైట్స్, రంగురంగుల దిండు సెటప్.
చందు ప్లాన్ చేసిన డెకర్ నిజంగా ఫ్యాషన్ షో లా ఉంది.
భవ్య గమనిస్తూ... ఇది మెహందీనా లేక ఫెస్టివల్ ఆ? అంటుంది.

చందు గర్వంగా..  నా ఫంక్షన్ అంటే ఇదే స్టాండర్డ్. మా మామయ్యలు నేను ఏది అడిగినా కాదనరు.


విశిష్ట సింపుల్ గ్రీన్ లెహంగా లో క్లాసిక్‌గా.
సౌమ్య లైట్ పాస్టెల్ లో ఎలిగెంట్‌గా.
చందు మాత్రం బ్రైట్ యెల్లోలో ఫుల్ గ్లామ్.
మెహందీ ఆర్టిస్ట్ చేతుల్లో అద్భుతమైన డిజైన్స్ మొదలవుతాయి.
ధనుంజయ్ శిల్పా ఉదయ్ దివ్య వస్తారు. అవni ఎదురు వెళ్లి ఏంటి నాన్న ఇప్పటిదాకా రాలేదు. కొంచెం పొలం పనులు ఉండే ఆగిపోయాను రా.. టైం కి వచ్చేసాం కదా.

నువ్వైనా ముందు రావాలి కదా శిల్ప.  దివ్య కి ఎగ్జామ్స్ అని ఆగాను అక్క.  ఇప్పటినుంచి నెల రోజులు ఇక్కడే ఉంటాను నేను.

ఉదయ్ ఉంటే ఉంటారు లేకపోతే లేదు. ఆ మాటకి ఉదయ్ నవ్వుతూ ఇక్కడ పనులు చక్కపేట్టకపోతే ఎలా.. బాగున్నావా అవని.  చాలా బాగున్నాను.

ఈ లోపు సూర్య వచ్చి  ధనుంజయ్ ని హత్తుకొని ఏంటి తాత ఇంత ఆలస్యంగా వచ్చేది.  నిశ్చితార్దానికి వచ్చి వెళ్ళాము కదరా పనులు కూడా ఉంటాయి.

చందు డిజైన్ సెలెక్ట్ చేసుకుంటుంది.  వైభవ్ దగ్గరకు వచ్చి
నా పేరు బిగ్‌గా రాయించు. వెతకడం కష్టం కాకూడదు.
చందు వెంటనే...  సర్, మీ పేరు వెతకడానికి మీరు టెస్ట్ పాస్ అవ్వాలి.

శ్రీకర్ సౌమ్య దగ్గరకి వచ్చి   నాకు అయితే చిన్నగా రాసినా పర్లేదు. నేను కనుక్కుంటాను.
సౌమ్య నవ్వుతూ...  డాక్టర్ కి ఆబ్జర్వేషన్ స్కిల్స్ ఉండాలి కదా. అలాగే డాక్టర్ భర్తకి ఓపిక ఉండాలి.

సూర్య విశిష్ట చేతిని చూసి మెల్లగా...  నా పేరు ఎక్కడ దాచావు? విశిష్ట కళ్లతోనే చూపిస్తుంది..
నువ్వే కనుక్కో.

భవ్య, గౌతమ్ మొదట స్టార్ట్ చేస్తారు.
తర్వాత ఒక్కసారిగా డీజే బీట్ పెరుగుతుంది.
వైభవ్, శ్రీకర్ ఇద్దరూ పోటీగా స్టెప్స్ వేస్తారు.
సూర్య మధ్యలో జాయిన్ అయ్యి సడెన్‌గా ట్రెండింగ్ స్టెప్ వేస్తాడు.
చందు షాక్ అయి... ఇది ఎవరు నేర్పారు? బావ..
సూర్య  నవ్వుతూ...  గోప్యంగా ప్రాక్టీస్ చేశా.
అందరూ నవ్వులతో కేకలు.

పెళ్లికూతుళ్ల చేతుల్లో పేర్లు దాచిన డిజైన్.
మొదట వైభవ్ ప్రయత్నిస్తాడు. తప్పుగా మరో అక్షరం చూపిస్తాడు.
చందు...  ఇదిగో… నీ పేరు కూడా సరిగా తెలియదా?
నీ అందమైన చేతులు చూసి ఆ మైకంలో పడిపోయాను చందు. అందుకే నన్ను నేను గుర్తించలేకపోయాను.
అందరూ నవ్వుతారు.

సూర్య మాత్రం శాంతంగా వెతికి కరెక్ట్ స్పాట్ చూపిస్తాడు.
విశిష్ట సైలెంట్ స్మైల్.
శ్రీకర్ కూడా సౌమ్య చేతిలో తన పేరు కనుక్కుంటాడు.
డీల్ విన్నర్ అంటాడు.

మెహందీ అయిపోయాక…
లలిత పెద్ద టేబుల్ మీద మూడు డిజైన్స్ కార్డులు ఉంచుతుంది.

గోల్డ్ ఎంబాస్ డిజైన్ – సూర్య & విశిష్ట.
మోడర్న్ ఎలిగెంట్ – వైభవ్ & చంద్రిక.
క్లాసిక్ ట్రెడిషనల్ – శ్రీకర్ & సౌమ్య.

వినయ్ కార్డ్ తీసుకుని చదువుతాడు...
ఇది కేవలం ఆహ్వానం కాదు… మన ఆనందాన్ని పంచుకోవాలని కోరడం.
భవ్య సరదాగా.....
ఇప్పుడు ఇంటింటికీ వెళ్లి ఇవ్వాలి కదా?
వైభవ్...  అదే అసలు టూర్ మొదలు.
సూర్య విశిష్ట వైపు చూసి....
మనం కలిసి మొదటి కార్డ్ ఎవరికిస్తాం?
విశిష్ట....
మనకి బలంగా నిలిచిన వాళ్లకి.
అందరూ ఒకే మాట...
ఇది కేవలం పెళ్లి కాదు… ఫ్యామిలీ సెలబ్రేషన్.
సింహ మాన్షన్ ముందు మూడు కార్లు రెడీ.
వినయ్....
ఈ రోజు ఆఫీస్, మీటింగ్స్ అన్నీ క్యాన్సిల్. ఫ్యామిలీ మిషన్.
చందు గ్లాసెస్ పెట్టుకుని...
ఇది వెడ్డింగ్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ కాదు… రోడ్ ట్రిప్.
వైభవ్ వెంటనే... డ్రైవింగ్ నేను.
శ్రీకర్....  లేదురా, నీ డ్రైవింగ్ అంటే మనం పెళ్లికి ముందే అడ్వెంచర్ స్టోరీ అవుతాం.
అందరూ నవ్వుతారు.

మొదటి కార్డ్ కుటుంబానికి చాలా సపోర్ట్ చేసిన పెద్దవారికి.
సూర్య, విశిష్ట కలిసి కార్డ్ ఇస్తారు.
మీ ఆశీర్వాదం తప్పనిసరి అంటారు వైభవ్  గౌరవంగా.
పెద్దవారు నవ్వుతూ...
మూడు పెళ్లిళ్లు ఒకేసారి? సింహ ఫ్యామిలీ స్టైల్ వేరు.
చందు చిన్నగా...  ట్రెండ్ సెట్ చేస్తాం.

శ్రీకర్ సూర్య పాత ఫ్రెండ్స్ దగ్గరకు వెళ్తారు.
వాళ్లు కార్డ్ చూసి...  ఒకే బ్యాచ్‌లో ఇంత హ్యాపీ ఎండింగ్స్ అరుదు.
శ్రీకర్...  ఇది ఎండింగ్ కాదు. అసలు స్టార్ట్.

మధ్యలో చిన్న హిల్ రోడ్ దగ్గర ఆగుతారు.
సౌమ్య..  టీ తాగకుండా ట్రిప్ కంప్లీట్ కాదు.  చిన్న టీ స్టాల్ వద్ద అందరూ కూర్చుంటారు.

చందు వీడియో తీస్తూ...  బ్రైడ్స్ ఆన్ రోడ్.
సౌమ్య మెల్లగా.. ఇలా కలిసి బయటికి రావడం చాలా రేర్.
శ్రీకర్...  పెళ్లి తర్వాత కూడా ఇదే కంటిన్యూ.

ఒక ఇంట్లో కార్డ్ ఇవ్వడానికి వెళ్లగా…  ఒక చిన్న పిల్లాడు అడుగుతాడు
అంకుల్, మీరు ఎవరు పెళ్లి చేసుకుంటున్నారు?
వైభవ్...  ముగ్గురు.
పిల్లాడు షాక్ అయి...  అయ్యో  అందరూ పెద్దగా నవ్వుతారు.


సూర్యాస్తమయం అవుతుంటే…
మూడో కార్‌ లు ఇంటివైపు బయలుదేరతాయి. సూర్య & విశిష్ట సైలెంట్‌గా కూర్చుంటారు.
ఇది మన పెళ్లి ప్రయాణం మొదటి రోజు లాంటిదే కదా అంటుంది విశిష్ట.
సూర్య..  అవును. కానీ మనం ఒంటరిగా కాదు. ఫ్యామిలీతో.

ఇంటికి చేరేసరికి అలసట ఉన్నా… హృదయం ఫుల్.
లలిత కార్డుల బాక్స్ చూసి...  ఇంకా అరవై ఇళ్లు మిగిలే ఉన్నాయి.

చందు   అంటే ఇంకా రెండు ట్రిప్స్.
వైభవ్ నవ్వుతూ   హల్దీకి ముందు ఒక రిహార్సల్ మాత్రమే ఇది.

అందరూ ఒకేసారి...  హల్దీ మస్తీకి రెడీ.

హల్దీ కి అందరూ ఆహ్వానితులే...........
[+] 5 users Like SivaSai's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)