Posts: 898
Threads: 13
Likes Received: 7,010 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
రుద్రం భజే! ఎపిసోడ్ 26
బ్యాగ్ లో ఉన్న పద్మాని భూపాల్ సింగ్ ఇచ్చి తనతో పాటు రూమ్ నుంచి బయలుదేరాడు ముష్రు, వాళ్ళ వెనకాలే బయలుదేరి వెళ్లాడు భూషణ్.
మిలిటరీ హెడ్ క్వార్టర్స్ లో జరిగిన విషయం చెప్పిన నాయక్ నమ్మకపోవడంతో యంగ్ బ్లడ్ ని టేబుల్ మీద వేసి దాంట్లో చీమని వేసాడు యోధ.
**************
టేబుల్ మీద బ్లడ్ లో చీమ అటు ఇటు కొట్టుకుంటూ ఉండటం చూసి నవ్వుతూ "మిమ్మల్ని ఎవరో పిచ్చోళ్లని చేశారు." అని నవ్వుతూ చెప్పాడు నాయక్.
ఆ మాటకి అయోమయంగా చూస్తూ ఉండగా బాటిల్ లో ఉన్న వాటర్ ని టేబుల్ మీద పోసాడు యంగ్.
వాటర్ పడ్డ కాసేపటికి చీమ కొంచెం కొంచెం పెరుగుతూ ఉండడం ఆశ్చర్యంగా చూస్తూ "ఏంటి? దీనికి సైజు పెరుగుతుంది." అని దూరంగా జరుగుతూ అడిగాడు నాయక్.
అది చూసి "ఈ చీమ ఇప్పుడు డైనోసార్ అవుతుందా ఏంటి?" అని కంగారుగా అడిగింది పూజా.
యోధ వైపు చూస్తూ "ముందు యంగ్ చేతికి బ్లడ్ కారకుండా కట్టు కట్టండి." అని కంగారుగా చెప్పాడు నాయక్.
చీమ ఇంకా పెరగడం చూసి "ముందు దీనిని చంపేయాలి లేకపోతే చాలా డేంజర్!" అని చెప్పాడు యంగ్.
టేబుల్ మీద నుంచి కింద పడి నెమ్మదిగా నడుస్తూ సైజు పెరుగుతున్న ఉన్న చీమను చూసి కాలుతో తొక్కి "సార్! ఇప్పటికైనా మేము చెప్పిన విషయం నమ్ముతారా..?" అని అడిగాడు యోధ.
పద్మం వైపు చూసి "మీరు దీంట్లో నుంచి ఓపెన్ అయిన బ్లాక్ హోల్ లో కజ్జికిస్తాన్ వెళ్లి సముద్రంలో జరిగే ప్రయోగం ఆపి యంగ్ ని తీసుకొచ్చారు అంతే కదా! ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి." అని చెమటలు తుడుచుకుంటూ అడిగాడు నాయక్.
"సార్! యంగ్ మళ్ళీ వాళ్ళ చేతికి దొరికాడు అంటే ఎంత డేంజరో చూశారు కదా! తనని ఒక బంకర్లో సేఫ్ గా ఉంచి మామూలు మనిషిగా ఎలా చేయాలో ఆలోచించండి." అని చెప్పాడు యోధ.
"ఓకే!"అని హడావుడిగా ఫోన్ తీసి కాల్ చేసి "సైంటిస్ట్ ఉన్ని కృష్ణనాన్ ఇమీడియట్ గా ఇక్కడికి తీసుకురండి." అని చెప్పి యోధ వైపు చూసి "మరి ఈ పద్మం సంగతి ఏమిటి!" అని అడిగాడు నాయక్.
"ఈ పద్మం కోసం, యంగ్ కోసం రెండు దేశాలు మన మీద యుద్ధం ప్రకటించిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు ముందు బోర్డర్ లో ఎమర్జెన్సీ అనౌన్స్ చేయండి ఒక్కడు కూడా లోపలికి రాకూడదు." అని చెప్పాడు యోధ.
"మనం ఎంత కాలం ఎమర్జెన్సీ అనౌన్స్ చేస్తాము దీనికి ఏదైనా సొల్యూషన్ చూడాలి." అని అడిగాడు నాయక్.
"మీరు పర్మిషన్ ఇస్తే బోర్డర్ దాటి నేను వెళతాను, ఈ పద్మన్ని చేరవలసిన ప్లేస్ కి చేర్చి ఈ ప్రయోగం చేసే కళింగ ల్యాబ్ కి వెళ్లి ఒక్కసారి చూసి వస్తాను." అని చెప్పాడు యోధ.
"నువ్వు చూసి రావడం అంటే కాల్చిరావడమే అంత రిస్క్ నేను చేయలేను." అని చెప్పాడు నాయక్
"సార్! మనం రిస్క్ చేయకపోతే యంగ్ లాంటి వాళ్ళు ఇంకొక 10 మంది పుట్టుకు వస్తారు." అని చెప్పింది నీతూ.
"కరెక్ట్ కానీ నేను అఫీషియల్గా ఈ వర్క్ చేయడం కుదరదు." అని చెప్పాడు నాయక్.
"సార్! నా టీం తో మానస సరోవరం దగ్గరికి వెళతాను దానికి కావలసిన పర్మిషన్స్ ఇప్పించండి చాలు మిగతా విషయం నేను చూసుకుంటాను." అని చెప్పాడు యోధ.
ఆ మాటకి ఆలోచిస్తూ "నాకు వన్ వీక్ టైమ్ ఇవ్వు!" అని చెప్పి అక్కడికి వచ్చిన ఉన్ని కృష్ణనాన్ వైపు చూసి
"హాయ్! నీ కోసమే వెయిట్ చేస్తున్నాను." అని యంగ్ ని చూపించి "ఇతను ఒక విచిత్రమైన మనిషి తన బ్లడ్ ఒక భయంకరమైన వెపన్ లాంటిది.
తనని మన సీక్రెట్ ల్యాబ్ కి తీసుకువెళ్లి టెస్ట్ చేయండి ఎలా క్యూర్ చేయాలో చూడండి ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో బయటికి రాకూడదు." అని చెప్పాడు నాయక్.
"ఓకే సార్! యంగ్ ని టెస్ట్ చేసి మీకు మార్నింగ్ కి రిజల్ట్ చెప్తాను." అని చెప్పాడు ఉన్ని కృష్ణనాన్.
"ఆల్రెడీ రిజల్ట్ నేను చూశాను." అని చనిపోయిన చీమను చూపించి జరిగిందంతా చెప్పి "కేర్ ఫుల్ గా హ్యాండిల్ చేయండి." అని చెప్పాడు నాయక్.
"ఓకే సార్!" అని మిలటరీ జీప్ లో యంగ్ తీసుకుని ల్యాబ్ దగ్గరికి బయలుదేరాడు ఉన్నికృష్ణన్.
అంతలో ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసి "భూషణ్ ఏమైంది?" అని అడిగాడు యోధ.
"నా వర్క్ కంప్లీట్ అయ్యింది ఇంక మీ పని మొదలు పెట్టండి." అని చెప్పాడు భూషణ్.
"ఓకే గుడ్!" అని చెప్పి ఫోన్ పెట్టేసి నాయక్ వైపు చూసి "సార్! మన దేశంలో ఉంటూ పరాయి దేశానికి సహాయం చేసే కొంతమందిని కనిపెట్టాము, వాళ్ళని క్లోజ్ చేసే ఛాన్స్ వచ్చింది మీరు పర్మిషన్ ఇస్తే ఈ వారం రోజుల్లో ఆ వర్క్ కంప్లీట్ చేస్తాను." అని చెప్పాడు యోధ.
"బోర్డర్ లోపల నీ ఇష్టం అలాంటి వాళ్ళందరినీ ఏరిపారేయ్ కావాలి అంటే ఫోర్స్ కూడా తీసుకువెళ్లు!" అని చెప్పాడు నాయక్.
"థాంక్యూ సర్!" అని చెప్పి టేబుల్ మీద ఉన్న పద్మాన్ని తీసుకుని నీతూ వాళ్ళతో కలిసి అక్కడి నుంచి రూమ్ కి బయలుదేరాడు యోధ.
************
రూమ్ కి వచ్చిన భూషణ్ వైపు చూసి "డూప్లికేట్ పద్మాన్ని తీసుకువచ్చావా..? నీ మీద ఎవరికీ అనుమానం రాలేదు కదా!" అని అడిగాడు ఏకవీర.
"మా భూషణ్ ఏది చేసిన పర్ఫెక్ట్ గా ఉంటుంది." అని చెప్పాడు క్యూబ్స్.
అంతలో రూమ్ లోకి వచ్చిన యోధ వాళ్ళని చూసి "యంగ్ ని సేవ్ గా ఉంచారు కదా!" అని అడిగాడు నంద.
"ఎస్! సేఫ్ గా ఉన్నాడు ఇంక మనం అతని గురించి భయపడాల్సిన పనిలేదు ఇప్పుడు చేయవలసిన పని చాలా ఉంది." అని చెప్పాడు యోధ.
"భూపాల్ సింగ్ ని మన కస్టడీ లోకి తీసుకుందామా.?" అని అడిగింది నీతూ.
"భూపాల్ సింగ్ ని మాత్రమే కస్టడీలోకి తీసుకుందాము వాడిని వెతుక్కుంటూ వచ్చిన ప్రతి ఒక్కడిని లేపేద్దాము, ఈ ఛాన్స్ మిస్ అయ్యితే మళ్ళీ వాళ్ళు మనకి అంత ఈజీగా దొరకరు." అని చెప్పాడు యోధ.
ఆ మాటకి అనుమానంగా చూస్తూ "ఇప్పుడు మాత్రం ఎలా దొరుకుతారు?" అని అడిగాడు ఏకవీర.
"నా దగ్గర ప్లాన్ రెడీగా ఉంది." అని దీప్తి, పూజ వైపు చూసి "మీరు మాతో ఉండడం కొంచెం రిస్క్!" అని చెప్పాడు యోధ.
"అవునా? కొన్ని రోజులకి స్పేస్ లో కూడా యుద్ధం జరుగుతుంది అన్నావు మేము ట్రైనింగ్ అవ్వాలి కదా!" అని చెప్పింది దీప్తి.
"యోధ! మేము ఉన్నాం కదా వీళ్ళని సేఫ్ గా ఉంచే బాధ్యత మాది." అని చెప్పాడు నంద.
"సరే! అని కారులో వెళుతూ లాప్టాప్ ఓపెన్ చేసి చూస్తూ "భూపాల్ సింగ్ వాళ్ళు నేపాల్ వైపు వెళుతున్నారు." అని చెప్పాడు యోధ.
"ఓకే!" అని కాల్ చేసి "హలో! గబ్బర్ సింగ్ నీకు కార్ నెంబర్ సెండ్ చేశాను చెప్పింది గుర్తుంది కదా ఈ పని నువ్వు పర్ఫెక్ట్ గా చేస్తే మా టీమ్ లోకి వస్తావు." అని చెప్పింది నీతూ.
"ఎస్ మేడం!" అని ఫోన్ పెట్టేసి స్టాఫ్ ని తీసుకొని లోకేషన్ వైపు వెళ్ళాడు గబ్బర్ సింగ్.
ఫోన్ కట్ అవడంతో యోధా వైపు చూసి "ముష్రుకి మెసేజ్ పంపించు." అని చెప్పింది నీతూ
*************
కారులో వెళ్ళుతు తన పేజర్ కి మెసేజ్ రావడం చూసి కాసేపటి తర్వాత హైవేలో సెక్యూరిటీ ఆఫీసర్లు కనిపించడంతో డ్రైవింగ్ చేస్తున్న భూపాల్ సింగ్ వైపు తిరిగి " బోర్డర్ లో సెక్యూరిటీ అధికారి చెకింగ్ ఉంటుంది ఆ వస్తువు జాగ్రత్తగా ఉంది కదా!" అని అడిగాడు ముష్రు.
"నో ప్రాబ్లం! సీట్ కింద సేఫ్ గా ఉంది ఎవ్వరు కనిపెట్టలేరు." అని చెప్పి సెక్యూరిటీ అధికారి చెకింగ్ దగ్గర కార్ స్లో చేసాడు భూపాల్ సింగ్.
కార్ దగ్గరికి వచ్చి ఇద్దరి వైపు చూసి "ఐడీలు చూపించండి." అని అడిగాడు గబ్బర్ సింగ్.
తన ఐడి చూపించి "మా ఫ్రెండ్ వచ్చాడని సరదాగా నేపాల్ కి వెళుతున్నాము సార్!" అని చెప్పాడు భూపాల్.
ఐడి చూస్తూ "మీ ఇద్దరిని చూస్తుంటే టెర్రరిస్టులు అని డౌట్ గా ఉంది కారు దిగండి చెక్ చేయాలి." అని చెప్పాడు గబ్బర్ సింగ్.
కార్ దిగుతూ గబ్బర్ సింగ్ వైపు చూసి సైగ చేసి డ్రైవింగ్ సీట్ చూపించాడు ముష్రు.
సైగ చేయడం చూసి స్మైల్ ఇచ్చి కార్ చెక్ చేస్తున్న కానిస్టేబుల్స్ దగ్గరికి వెళ్లి "ఆ సీట్ కింద కూడా చూడండి." అని చెప్పాడు గబ్బర్ సింగ్.
ఆ మాట విని కంగారుగా దగ్గరికి వెళ్లి "సార్! దాని కింద ఏమీ లేదు." అని డబ్బులు చేతిలో పెట్టాడు భూపాల్.
"నువ్వు డబ్బులు ఇస్తున్నావు అంటే ఈ సీటు కింద ఏదో ఉంది." అని చెయ్యి పెట్టి వెతికి ప్యాకెట్ బయటికి తీసి "దీంట్లో ఆర్డిఎక్స్ ఉందా డ్రగ్స్ ఉన్నాయా?" అని అడిగాడు గబ్బర్ సింగ్.
"ఆ ప్యాకెట్ లో ఏమీ లేదు సర్ తినడానికి బిర్యానీ పెట్టుకున్నాను." అని చెప్పాడు భూపాల్.
"అవునా? నాకు బాగా ఆకలిగా ఉంది." అని ఓపెన్ చేసాడు గబ్బర్ సింగ్.
ప్యాకెట్ లో ఉన్న బిరియాని వైపు ఆశ్చర్యంగా చూస్తూ 'బిర్యానీ ఎలా వచ్చింది.' అనుకున్నాడు భూపాల్.
ప్యాకెట్ లో ఉన్న బిర్యానీ తింటూ "టేస్ట్ బాగుందిరా..!" అని చెప్పాడు గబ్బర్ సింగ్.
బిర్యానీ తీసుకుని చూసి పక్కన పడేసి సీట్ కింద వెతికి ముష్రు వైపు కంగారుగా చూస్తూ "నువ్వు ఇచ్చిన వస్తువు ఏమైపోయింది?" అని అడిగాడు భూపాల్.
"నన్ను అడుగుతావేంటి నాకేం తెలుసు!" అని చెప్పాడు ముష్రు.
అంతలో అక్కడికి కార్ లో వస్తున్న నీతూ వాళ్లని చూసి "చెకింగ్ అయిపోయింది ఇంక మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు!" అని నవ్వుతూ జీప్ దగ్గరికి వెళ్ళాడు గబ్బర్ సింగ్.
" రుద్రం భజే! ఎపిసోడ్ 26 " రచనకు రేటింగ్ ఇవ్వండి
Posts: 4,805
Threads: 9
Likes Received: 3,183 in 2,464 posts
Likes Given: 11,248
Joined: Sep 2019
Reputation:
31
Posts: 1,626
Threads: 2
Likes Received: 964 in 741 posts
Likes Given: 2,159
Joined: May 2019
Reputation:
11
India lo operation cleanup start
Posts: 1,156
Threads: 1
Likes Received: 730 in 473 posts
Likes Given: 10,935
Joined: Jun 2019
Reputation:
2
Posts: 898
Threads: 13
Likes Received: 7,010 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
రుద్రం భజే! ఎపిసోడ్ 27
కార్ సీటు కింద పాకెట్ లో పద్మం బదులు బిరియాని ఉండడంతో భూపాల్ సింగ్ వెతుకుతూ ఉండగా అక్కడికి కార్ లో వస్తున్న నీతూ వాళ్లను చూసి చెకింగ్ అయిపోయింది ఇంక మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పి తన జీప్ దగ్గరికి వెళ్ళాడు గబ్బర్ సింగ్.
************
కారు మొత్తం వెతికి కింద పాడేసినా బిర్యానీ ప్యాకెట్ లో చూసి 'ఆ చెకింగ్ చేసినా ఆఫీసర్ ఏదో చేసాడు.' అనుకోని కోపంగా గబ్బర్ సింగ్ దగ్గరికి వెళ్లి "ఆ బిర్యానీ ప్లేసులో నా వస్తువు ఉండాలి నువ్వే తీసావు మర్యాదగా ఇస్తావా లేదా!)?" అని అడిగాడు భూపాల్.
"ఏంట్రా! గట్టిగా మాట్లాడుతున్నావు బిర్యానీ టేస్ట్ బాగుంది అన్నానని అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా..?" అని వెటకారంగా చూస్తూ అడిగాడు గబ్బర్ సింగ్.
"నా గురించి నీకు సరిగ్గా తెలీదు మర్యాద సీటు కింద తీసిన వస్తువు ఇవ్వు!" అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు భూపాల్.
అది చూసే హడావిడిగా అక్కడికి వెళ్లి "భూపాల్! ఆఫీసర్ గారు సీట్ కింద నుంచి ప్యాకెట్ తీసింది మన ముందే కదా! నువ్వు బిర్యానీ ఉంది అని చెప్పావు అలాగే అందులో బిర్యానీ ఉంది నువ్వే ఎక్కడో పెట్టి మర్చిపోయావు ఉంటావు." అని చెప్పాడు ముష్రు.
ఆ మాటకి టెన్షన్ అటు ఇటు తిరుగుతూ "నేను సీటు కింద పెట్టాను ఏమైపోయిందో అర్థం కావడం లేదు, ఈ విషయం సయ్యద్ బాయ్ కి తెలిసిందో నన్ను చంపేస్తాడు." అని కంగారుగా చూస్తూ చెప్పాడు భూపాల్.
అంతలో కార్లో ఉన్న ఫోన్ రింగ్ అవ్వడం చూసి "సయ్యద్ ఫోన్ చేస్తున్నాడు." అని చెప్పాడు ముష్రు.
ఫోన్ వైపు టెన్షన్ గా చూస్తున్నా భూపాల్ ని చూసి అక్కడకి వచ్చి భుజం మీద చెయ్యి వేసి "నువ్వు ఇండియా దాటి బయటికి వెళ్ళకూడదు అని కోర్ట్ ఆర్డర్ ఉంది కదా ఎక్కడికి వెళ్తున్నావు?" అని అడిగాడు పుష్కర్.
ఆ మాట విని భూపాల్ వైపు చూసి "ఏంట్రా? నువ్వు నిజంగానే టెర్రరిస్ట్ వా.." నాకు ముందే డౌట్ వచ్చింది తప్పించుకోవడానికి నా వస్తువు పోయింది పర్స్ పోయింది అని డ్రామాలాడుతున్నావా..?" అని అడిగాడు గబ్బర్ సింగ్.
మళ్లీ ఫోన్ రింగ్ అవడంతో టెన్షన్ పడుతున్న భూపాల్ దగ్గరికి వచ్చి "ఏంటి సయ్యద్ కాల్ చేస్తున్నాడా..?" అని అడిగాడు యోధ.
ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "ఎవరు నువ్వు? సయ్యద్ కాల్ చేస్తున్నాడని నీకు తెలుసు?" అని భయంగా చూస్తూ అడిగాడు భూపాల్.
అక్కడికి వచ్చిన నీతూ ని చూసి "గుడ్ ఈవెనింగ్ మేడం! సార్ ఎవరు అంత ఉన్నారు." అని యోధవైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు గబ్బర్ సింగ్.
"నువ్వు జాయిన్ అయ్యేది సార్ టీమ్ లోనే!" అని చెప్పింది నీతూ.
తల పైకి ఎత్తి యోధవైపు చూసి "సార్! చేతికి కొంచెం దూరంగా ఉండాలి." అని గుటకలు మింగుతూ చూశాడు గబ్బర్ సింగ్.
భూపాల్ భుజం మీద చెయ్యి వేసి పక్కకు తీసుకువెళ్లి "సయ్యద్ గురించి నాకు ఎలా తెలుసో తర్వాత చెప్తాను ఇప్పుడు నిన్ను సేఫ్ గా ఉంచగలిగింది నేను మాత్రమే బతకాలి అంటే మాతో పాటు రా..!" అని చెప్పాడు యోధ.
"సార్! నేను సయ్యద్ బాయ్ వస్తువు పోగొట్టెను ఇప్పుడు అది తిరిగి ఇవ్వకపోతే నన్ను ఎక్కడ ఉన్నా చంపేస్తారు." అని కంగారుగా చెప్పాడు భూపాల్.
"నేను చెప్పేది కూడా అదే నిన్ను సేఫ్ గా ఉంచుతాను కాకపోతే నేను చెప్పినట్లు చేయాలి." అని చెప్పాడు యోధ.
"ఓకే సార్! మీరు ఏది చెప్తే అది చేస్తాను నన్ను మాత్రం కాపాడండి." అని ఊపిరి పీల్చుకుంటూ చెప్పాడు భూపాల్.
ఏకవీర వైపు చూసి "భూపాల్ ని తీసుకెళ్లి కార్ లో కూర్చోబెట్టండి." అని చెప్పి ముష్రు దగ్గరకు వెళ్లి "ఫోన్ లిఫ్ట్ చేసి ఏమి చెప్పాలో తెలుసు కదా!" అని అడిగాడు యోధ.
"ఎస్ సార్!" అని ఫోన్ లిఫ్ట్ చేసి "సయ్యద్ బాయ్! నేను ముష్రుని మాట్లాడుతున్నాను." అని చెప్పాడు.
"భూపాల్ ఎక్కడ? బోర్డర్ దాటారా..?" అని అడిగాడు సయ్యద్.
"బాయ్! నన్ను కార్ లో కూర్చోబెట్టి ఫోన్ ఇచ్చి ఇప్పుడే వస్తానని వెళ్ళాడు అతని కోసమే వెయిట్ చేస్తున్నను." అని చెప్పాడు ముష్రు.
"అవునా? ఎక్కడికి వెళ్లి ఉంటాడు." అని కాసేపు ఆలోచించి "ఆ వస్తువు ఎక్కడ ఉంది?" అని అనుమానంగా అడిగాడు సయ్యద్.
"వీడియో కాల్ లో ఉన్నప్పుడే కళింగ సర్ ఆ వస్తువుని భూపాల్ కి ఇమ్మన్నారు కదా ఇచ్చేసాను, ఇప్పుడు అతని దగ్గరే ఉంది అందుకే నాకు కూడా కంగారుగా ఉంది." అని చెప్పాడు ముష్రు.
"భూపాల్ అలాంటివాడు కాదు అక్కడే ఉండు వస్తాడు ఫోన్ నీ దగ్గరే ఉంచు మళ్ళీ కాల్ చేస్తాను." అని ఫోన్ పెట్టేసాడు సయ్యద్.
ఫోన్ కట్ చేసిన ముష్రు వైపు చూసి "నువ్వు సేఫ్! భూపాల్ కోసం ఇండియాలో కనపడకుండా దాక్కున్న ఏలుకలు బయటకు వచ్చి నిన్ను కలుస్తాయి వాళ్లని నేను చెప్పిన ప్లేస్ కి తీసుకు వస్తూ ఉండు." అని చెప్పాడు యోధ.
"ఓకే సార్" నాదొక చిన్న డౌట్ ఆ వస్తువు ఉన్న ప్లేస్ లోకి బిర్యానీ ఎలా వచ్చింది?" అని అడిగాడు ముష్రు.
"నీకు అవసరం లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తే నువ్వు భూపాల్ ప్లేస్ లో ఉంటావు." అని చెప్పాడు యోధ.
"సారీ సార్!" అని కార్లో ఎక్కి కూర్చున్నాడు ముష్రు.
అక్కడి నుంచి వెళుతూ గబ్బర్ సింగ్ వైపు చూసి "ఈ రోజు నుంచి నువ్వు కూడా నా టీం లో నెంబర్!" అని పక్కన ఉన్న భూషణ్ వైపు చూపించి "వీళ్ళతో పాటు ఉండు." అని చెప్పాడు యోధ.
ఆ మాటకి సంతోషంగా చూస్తూ "థాంక్యూ సార్!" అని సెల్యూట్ చేసి భూషణ్ వాళ్ళ తో పాటు కార్ ఎక్కడు గబ్బర్ సింగ్.
కార్ ఎక్కుతూ ఇప్పుడు భూపాల్ ని ఎక్కడ ఉంచుదాము?" అని అడిగింది దీప్తి.
డ్రైవింగ్ సీట్లో ఉన్న నీతూ వైపు చూసి "ల్యాబ్ కి వెళ్ళు యంగ్ తోపాటు అక్కడే ఉంటాడు." అని చెప్పాడు యోధ.
కారులో వెళుతూ భూషణ్, నంద వాళ్ళని చూసి 'ఒక్కొక్కరు ఇంత ఉన్నారు ఏంటి?' అనుకుంటూ క్యూబ్ వైపు చూసి 'మన సైజుకి సరిపోతాడు.' అనుకుని స్మైల్ ఇచ్చి "హాయ్ సర్! మై నేమ్ ఇస్ గబ్బర్ సింగ్ మీ టీమ్ లో ఈ రొజే జాయిన్ అయ్యాను." అని చెప్పాడు.
" కంగ్రాట్స్! అయితే నువ్వు కూడా మాతో పాటు హిమాలయాలకు వస్తావన్నమాట!" అని చెప్పాడు క్యూబ్.
ఆ మాట విని విచిత్రంగా చూస్తు "ఏంటి హిమాలయాలకా..! ఇంతకీ ఈ కేస్ ఏంటి?" అని అడిగాడు గబ్బర్ సింగ్.
"ఏమీ తెలియకుండా టీం లో జాయిన్ అయ్యావా..?" అని అడిగాడు నంద.
ఆ మాట విని కంగారుగా చూస్తూ "ఏదో తేడాగా ఉంది ఒక్కసారి కార్ ఆపుతారా ప్లీజ్!" అని అడిగాడు గబ్బర్ సింగ్.
"ఈ టీమ్ లో జాయిన్ అయ్యినా తర్వాత బయటికి వెళ్లడం కుదరదు సైలెంట్ గా కూర్చో!" అని చెప్పాడు భూషణ్.
పుష్కర వైపు చూసి "ఇంతకీ కేసు ఏమిటి సార్!" అని అడిగాడు గబ్బర్ సింగ్.
"కాసేపు వెయిట్ చెయ్! ల్యాబ్ కి వెళ్తున్నాము కదా అక్కడ నీకు అన్ని విషయాలు తెలుస్తాయి." అని చెప్పాడు పుష్కర్.
"నేను సెక్యూరిటీ అధికారి సార్ ల్యాబ్ కి ఎందుకు?" అని కంగారుగా అడిగాడు గబ్బర్ సింగ్.
"మిస్టర్ గబ్బర్ సింగ్! నీకు అర్థం అయ్యేటట్లు నేను చెబుతాను." అని భుజం మీద చెయ్యి వేసి యంగ్ గురించి వివరంగా చెప్పి
"ఈ విషయం బయటకు తెలిసిందో ఆ మిలటరీ ఆఫీసర్ ని చూసావు కదా ఎలా ఉన్నాడో రెండు చేతుల మధ్యలో నీ తల పెట్టి ఒక్క నొక్కు నొక్కుతాడు." అని చెప్పాడు క్యూబ్.
ఆ మాటకి అయోమయంగా చూస్తు నా టైమ్ బాగుండి ఈ కేసులోకి వచ్చానో, టైమ్ బాలేక ఈ కేసులోకి వచ్చానో అర్థం కావడం లేదు. రెండు చేతుల మధ్యలో తలపెట్టి నొక్కుతారా..?" అని టెన్షన్ చూస్తూ ఉన్నాడు గబ్బర్ సింగ్.
అంతలో ల్యాబ్ దగ్గరికి రావడంతో కార్ దిగి భూపాల్ ని తీసుకొని లోపలికి వెళ్లి ఉన్న ఉన్ని కృష్ణన్ వైపు చూసి "యంగ్ గురించి ఏమైనా తెలుసుకున్నారా..?" అని అడిగాడు యోధ.
"తన బాడీలో ఒక చీప్ ఉందని మాత్రం తెలుసుకున్నాను బయటికి తీసాను లొకేషన్ ట్రేసింగ్ చిప్ అనుకుంటా!" అని చూపించాడు ఉన్నికృష్ణన్.
చిప్ తీసుకుని చూసి భూషణ్ ఇచ్చి "జాగ్రత్త చెయ్! దీనికోసం వచ్చే వాళ్ళకి చాక్లెట్స్ ఇవ్వాలి." అని చెప్పేడు యోధ.
"సరే!" అని చిప్ తీసుకుని గబ్బర్ సింగ్ జేబులో పెట్టాడు భూషణ్.
నీతూ దగ్గరికి వెళ్లి "మేడం! మిలటరీ వాళ్ళు చాక్లెట్స్ కూడా ఇస్తారా..? ఇంతకీ ఈ చీప్ కోసం ఎవరు వస్తారు?" అని అడిగాడు గబ్బర్ సింగ్.
"ఆ చిఫ్ కోసం కాదు అది బాడీలో ఉన్న యంగ్ కోసం టెర్రరిస్టులు వస్తారు వాళ్లకి ఇచ్చేవి చాక్లెట్స్ కాదు బుల్లెట్స్!" అని చెప్పింది నీతూ.
"అంటే! ఈ చీప్ ఇప్పుడు నా జేబులో ఉంది టెర్రరిస్టులు నన్ను వెతుక్కుంటూ వస్తారా..! అయ్యినా ఈ చిప్ ని అతను బాడీలో ఎందుకు పెట్టారు?" అని కంగారుగా అడిగాడు గబ్బర్ సింగ్.
"నేను చెప్పిన బ్లడ్ వేపన్ మనిషి అతనే!" అని చెప్పాడు క్యూబ్స్.
"ఏంటి? వీడి గురించెనా మీరు చెప్పింది? మరి వాడేంటి అంతా అమాయకంగా ఫేస్ పెట్టుకుని కూర్చున్నాడు." అని టెన్షన్ గా ఒక పక్కన నుంచున్న భూపాల్ సింగ్ దగ్గరికి వెళ్లి
"ఒరేయ్ దరిద్రుడా..! ఇంతకీ నువ్వు దాచిపెట్టిన ఆ వస్తువు ఏమిటి రా..?" అని అడిగాడు గబ్బర్ సింగ్.
"నాకు తెలియదు సర్! దానికోసం రెండు దేశాల ఆర్మీ వాళ్ళు ఎదురు చూస్తున్నారని మాత్రం తెలుసు అది మిస్ అయ్యింది అని తెలిస్తే వాళ్ళు నన్ను ముక్కలు ముక్కలు చేస్తారు." అని భయంగా చూస్తూ చెప్పాడు భూపాల్ సింగ్.
ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ "ఏంట్రా! అంత ఇంపార్టెంట్ వస్తువుని పడేసి బిర్యానీ ప్యాకెట్ దాచుకున్నావా..?" అని అడిగాడు గబ్బర్ సింగ్.
"నీకు ఇంకా విషయం అర్థం కాలేదా.! ఆ వస్తువుని అక్కడి నుంచి తీసి బిర్యానీ ప్యాకెట్ పెట్టింది మన భూషణ్!" అని నవ్వుతూ చెప్పాడు క్యూబ్.
"ఎంత సంతోషంగా ఉన్నావురా.. కారణం ఏమిటి?" అని అడిగాడు గబ్బర్ సింగ్.
" రుద్రం భజే! ఎపిసోడ్ 27 " రచనకు రేటింగ్ ఇవ్వండి
Posts: 898
Threads: 13
Likes Received: 7,010 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
రుద్రం భజే! ఎపిసోడ్ 28
ఆ వస్తువుని తీసి బిర్యానీ ప్యాకెట్ పెట్టింది మన భూషణ్ అని క్యూబ్ నవ్వుతూ చెప్పడంతో ఎంత సంతోషంగా నవ్వుతున్నావురా కారణమేమిటి అని అడిగాడు గబ్బర్ సింగ్
**************
గబ్బర్ సింగ్ కారణమేమిటి అని అడగడంతో "భూపాల్ సింగ్ దగ్గర ఉన్న వస్తువు కోసం, నీ దగ్గర ఉన్న చీఫ్ లోకేషన్ చూసి యంగ్ కోసం టెర్రరిస్టులు, ఆ రెండు దేశాలకి హెల్ప్ చేసేవాళ్లు వెతుక్కుంటూ వస్తారు వాళ్ళకి యోధ చాక్లెట్లు తినిపిస్తాడు భలే సరదాగా ఉంటుంది." అని సంతోషం గా చెప్పాడు క్యూబ్.
ఆ మాటకి విచిత్రంగా చూస్తూ "ఓరిని సరదా చెరువులో కలవా..!" అని హడావుడిగా నీతూ దగ్గరికి వెళ్లి "మేడం! ఈ చిప్ నా దగ్గర వద్దు ఎవడో ఒకడు నామీద బాంబు వేస్తాడు." అని కంగారుగా చెప్పాడు గబ్బర్ సింగ్.
అక్కడికి వచ్చి "అంత భయమెందుకు?" అని గబ్బర్ సింగ్ చేతిలో ఉన్న చిప్ తీసుకొని అరటి పండులో పెట్టుకుని తినేసాడు నంద.
అది చూసి "మేడం! ఇక్కడ అందరూ చాలా వైలెంట్ గా ఉన్నారు నేను ఈ టీమ్ లో అవసరమంటారా..?" అని అడిగాడు గబ్బర్ సింగ్.
"నీ అవసరం మాకు చాలా ఉంది నీలాంటి ధైర్యవంతులు మాతో పాటు ఉండాలి." అని చెప్పాడు భూషణ్.
"నా బొంద ధైర్యం!" అని యంగ్ చేతి నుంచి బ్లడ్ తీస్తున్న ఉన్ని కృష్ణన్ వైపు చూసి "ఇప్పుడు ఆ రక్తం తో ఏం చేస్తారు?" అని అడిగాడు గబ్బర్ సింగ్.
ఉన్ని కృష్ణన్ దగ్గరికి వెళ్లి "మళ్లీ బ్లడ్ తో టెస్ట్ చెయ్యడం అవసరమంటారా..?" అని అడిగాడు యోధ.
"ఈ బ్లడ్ వల్ల జంతువుల్లో వచ్చే మార్పు చూసి వాటి బ్లడ్ కుడా టెస్ట్ చేస్తేనే యంగ్ ని క్యూర్ చేయగలను, అయ్యినా మీరేమి కంగారు పడకండి నేను సేఫ్టీ చూసుకుంటాను." అని చెప్పి
ఒక గ్లాస్ బాక్స్ లో రెండు ఎలుకలని ఉంచి వాటి మీద బ్లడ్ పోసి వాటర్ పోసి డోర్ క్లోజ్ చేసాడు ఉన్నికృష్ణన్.
కాసేపటికి ఎలుకల సైజు పెరగడం ఆశ్చర్యంగా చూస్తూ యంగ్ దగ్గరికి వెళ్లి "ఏమి తినేసి చచ్చావురా.. నీ బ్లడ్ అలా తయారైంది?" అని అడిగాడు గబ్బర్ సింగ్.
"నామీద టూ ఇయర్స్ టెస్టింగ్ చేశారు అందుకనే ఇలా తయారయ్యాను." అని చెప్పాడు యంగ్.
"ఏంటి? రెండు సంవత్సరాలు టెస్ట్ చేశారా..!" అని అడుగుతూ ఎలుకలు పెద్దగా మారి గట్టిగా అరుస్తూ గ్లాసులు పగలగొట్టడానికి ట్రై చేయడం భయంగా చూస్తూ
"ఈ ఎలుకలు ఇలా తయారయ్యాయి అంటే వీడి రక్తం ఏ కుక్క అయ్యినా నాకింది అంటే పరిస్థితి ఏమిటి?" అని కంగారుగా చూస్తూ వెనక్కి వచ్చాడు గబ్బర్ సింగ్.
మిషన్ ద్వారా ఆ రెండు ఎలుకల బ్లడ్ ని తీసి టెస్ట్ చేసి యోధా వైపు చూసి "యంగ్ బాడీలో ఉన్న బ్లడ్ డేంజర్ కానీ ఆ బ్లడ్ తో తయారైన జంతువుల బ్లడ్ ఇంకా డేంజర్!" అని చెప్పాడు ఉన్నికృష్ణన్.
ఆ మాట విని డౌట్ గా చూస్తూ "డేంజర్ అంటే ఏం జరుగుతుంది?" అని అడిగాడు యోధ.
"నాకు వన్ డే టైమ్ ఇస్తే అన్ని విషయాలు చెబుతాను." అని చెప్పాడు ఉన్ని కృష్ణన్.
"సరే!"అని యంగ్ ని భూపాల్ సింగ్ ని పక్కపక్కన కూర్చోబెట్టి వీడియో తీసి భూపాల్ ని ఒక రూమ్ లోకి పంపించి "నువ్వు ఇక్కడ సేఫ్ గా ఉంటావు." అని చెప్పి అక్కడి నుంచి తన టీమ్ తో బయటికి వచ్చాడు యోధ.
*************
కజకిస్తాన్ గెస్ట్ హౌస్ లో రూమ్ లో నుంచి రేపాలా ఎప్పుడు బయటకు వస్తాడా అని వెయిట్ చేస్తున్న కళింగ చింగ్ యా దగ్గరకు వెళ్లి టెన్షన్ గా చూస్తూ
"ఆ వస్తువుని మీ అసిస్టెంట్ ముష్రు దగ్గర ఉంచితేనే బాగుండేది అనుకుంట!" అని నెమ్మదిగా చెప్పాడు సయ్యద్.
ఆ మాట విని "ఇప్పుడు ఏమైంది? భూపాల్ సింగ్ మీ మనిషే కదా!" అని అడిగాడు కళింగ.
కంగారుగా ఉన్న సయ్యద్ ని చూసి "భూపాల్ సింగ్ టచ్ లో లేడు అని మాత్రం చెప్పకు!" అని సీరియస్ చెప్పాడు చింగ్ యా.
"ముష్రుని బోర్డర్ దగ్గర కారులో ఉండమని ఫోన్ కూడా వదిలేసి వెళ్లిపోయాడు ఇంకా నాకెందుకో అనుమానంగా ఉంది." అని స్లోగా చెప్పాడు సయ్యద్.
ఆ మాటకి అనుమానంగా కళింగ వైపు చూసి "యంగ్ లోకేషన్ ఆ వస్తువు లొకేషన్ ఎక్కడ ఉన్నాయో చూడు." అని చెప్పాడు చింగ్ యా.
"ఓకే!" అని లాప్టాప్ ఆన్ చేసి లొకేషన్స్ చూసి "ఆ వస్తువు లొకేషన్ యంగ్ లోకేషన్ ఒక్క దగ్గరే ఉన్నాయి, అంటే యంగ్ ని ఇక్కడి నుంచి తీసుకువెళ్లింది భూపాల్ సింగ్ ఆ..!" అని డౌట్ గా సయ్యద్ వైపు చూసి "అసలు ఎవరు వాడు? నీకు ఎలా తెలుసు?" అని కోపంగా అడిగాడు కళింగ.
ఆ మాటకి టెన్షన్ గా చూస్తూ "భూపాల్ సింగ్ జలందర్ కి చెందిన వాడు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లో ఫాస్ట్ గా ఉండేవాడు చాలా నమ్మకస్తుడు.
నాలుగైదు బ్లాస్టులు కూడా చేశాడు ఒకసారి పాకిస్తాన్ కూడా వచ్చి వెళ్ళాడు ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కావడం లేదు." అని చెప్పాడు సయ్యద్.
"ఇండియాలో ఉన్న మీ మనుషులందరినీ యాక్టివేట్ చేయండి వాళ్ళిద్దరూ ఎక్కడ ఉన్న పట్టుకోమని చెప్పండి అందరికీ లొకేషన్స్ షేర్ చేయండి." అని చెప్పాడు కళింగ.
"సైంటిస్ట్" మనం తొందరపడుతున్నారేమో నాకు ఎక్కడో తేడా కొడుతుంది. " అని చెప్పాడు సయ్యద్.
ఆ మాటకి కోపంగా చూస్తూ "నీకు తేడా కొట్టడం కాదు యంగ్ మన చేతికి రాకపోతే ఫార్మా కంపెనీ వాళ్ళు చేతిలో నాకు తేడా కొడుతుంది." అని చెప్పాడు కళింగ.
"ఆ వస్తువు దొరికింది అని నేను ప్రెసిడెంట్ కి కూడా చెప్పేసాను ఇప్పుడు మిస్ అయింది అని చెప్తే నా పని అవుట్!" అని చెప్పాడు చింగ్ యా.
"సరే! లొకేషన్స్ నాకు పంపించు." అని చెప్పి ఫోన్లు చేస్తూ ఉన్నాడు సయ్యద్.
అంతలో గది తలుపు సౌండ్ అవడంతో బయటికి వస్తున్న రేపాల వైపు చూసి "ఇంత సేపు లోపల ఏం చేసావు? ఆ నలుగురి రక్తంతో ఏం తెలుసుకున్నావు?" అని అడిగాడు చింగ్ యా.
"ఈ నలుగురిని చంపింది మనిషే కానీ అతనికి దైవ శక్తి తోడుగా ఉంది. నా శక్తి మొత్తాన్ని బయటికి తీసే రోజు దగ్గరకు వచ్చింది మనం వెంటనే కారకొరం పర్వతాలకి వెళ్ళాలి." అని చెప్పాడు రేపాలా.
ఫోన్లో మాట్లాడుతూ ఆ మాట విని నవ్వుతూ "ఏంటి? దేవుడు సహాయం చేయడానికి వచ్చాడా?" అని అడిగాడు సయ్యద్.
నవ్వుతున్న చింగ్ యా వైపు చూసి నవ్వకు అని సైగ చేసాడు కళింగ.
సైగ చెయ్యడం తో సీరియస్ గా ఉన్న రేపాల వైపు చూసి సైలెంట్ గా ఉన్నడు చింగ్ యా.
"నా మాటలు మీకు నవ్వు తెప్పిస్తున్నాయి కదా! నా శక్తి ఏమిటో ఇప్పుడే చూపిస్తాను." అని చెప్పి అని స్పీడ్ గా నడుచుకుంటూ బయటికి వెళ్లాడు రేపాలా.
అది చూసి "ఆగు రేపాలా! నీ శక్తి గురించి నాకు బాగా తెలుసు!" అంటూ వెనకాలే వెళ్లాడు కళింగ.
గెస్ట్ హౌస్ దగ్గర నుంచి సముద్రం దగ్గరికి వెళ్లి మంత్రాలు చదువుతూ ఉన్నడు రేపాలా.
ఏమి జరుగుతుందా అని టెన్షన్ గా చూస్తూ ఉండగా సముద్రం లోపల నుంచి జింగ్ పైకి వచ్చి నీళ్ల మీద నడుచుకుంటూ ఒడ్డు కి రావడం చూసి
"అసలు వీడు నీళ్ల మీద ఎలా నడుస్తున్నాడు?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు సయ్యద్.
ఆ మాటకి నవ్వుతూ "సముద్ర నుంచి బయటికి వస్తుంది జింగ్ బాడీ మాత్రమే అతనిలో ఉన్నది రేపాలా ఆధీనంలో ఉన్న రాక్షసుల ఆత్మలలో ఒక ఆత్మ !" అని చెప్పాడు కళింగ.
తన ముందు ఉన్న జింగ్ వైపు చూసి "వండర్ఫుల్! నేను కూడా రేపాలా శక్తిని తక్కువ అంచనా వేసాను, ఇతను మనకు తోడుగా ఉంటే ఏదైనా చేయొచ్చు!" అని సంతోషంగా చూస్తూ చెప్పాడు చింగ్ యా.
"మన ల్యాబ్ చుట్టూ సెక్యూరిటీగా ఉన్నది మీ ఆర్మీ వాళ్ళు టెర్రరిస్టులు అనుకున్నరా..! వాళ్లు ఆ మంచుకి ఎప్పుడో చచ్చారు.
అక్కడ వాళ్ళ బాడీ లు మాత్రమే ఉన్నాయి లోపల రేపాలా పంపిన రాక్షసుల ఆత్మలు ఉన్నాయి అందుకే ఆకలి దప్పిక నిద్ర లేకుండా కాపలా కాస్తున్నారు." అని చెప్పాడు కళింగ.
"మరి రేపాలా అలా అంత శక్తివంతుడు కదా ఆలకాపూరి దగ్గరికి వెళ్లడానికి ఆ వస్తువు కోసం ఎందుకు ఎదురు వెయిట్ చేస్తున్నాడు." అని అడిగాడు చింగ్ యా.
ఆ మాట విని కోపంగా వెనక్కి తిరిగి "అలాకాపురి నగరం ఉంది నీ ఇంటి పక్కన అనుకున్నావా..? కైలాస పర్వతంలో అది ఎక్కడ ఉందో తెలుసుకోవడం ముల్లోకాలను జయించిన రావణబ్రహ్మకి కూడా సాధ్యం కాలేదు.
ఆ వస్తువు మన దగ్గర ఉంటేనే ఆ నగరానికి వెళ్లగలము తలుపులు తెరవగలము అది కూడా దైవంతో యుద్ధం చేసి మాత్రమే!" అని చెప్పాడు రేపాలా.
"ఆ నగరం దగ్గర యుద్ధం చేసేది మన ఆర్మీ కాదు రేపాలా ఆర్మీ తన పూర్వీకుల ఆత్మలు మొత్తం దైవం మీద విజయం సాధించాలని ఎదురుచూస్తున్నాయి.
అంతే కాదు యంగ్ ని నేను సృష్టించాను కానీ దానికి కావలసిన ప్రతి విషయం రేపాలా ద్వారానే తెలుసుకున్నాను." అని చెప్పాడు కళింగ.
"మనం వెంటనే పర్వతాల దగ్గరికి వెళ్లాలి మీ మనుషుల ద్వారా యంగ్ ని ఆ వస్తువుని తీసుకురావడం సాధ్యం అయ్యితే సరే లేకపోతే నా సైన్యాన్ని రంగంలోకి దింపుతాను." అని చెప్పాడు రేపాలా.
"నా మనుషుల అందరితో మాట్లాడాను ఆ ఇద్దరు ఎక్కడ ఉన్నా పట్టుకుంటారు, అవసరమైతే ఇండియాలో అల్లకల్లోలం సృష్టిస్తారు." అని కసిగా చూస్తూ చెప్పాడు సయ్యద్.
" రుద్రం భజే! ఎపిసోడ్ 28 " రచనకు రేటింగ్ ఇవ్వండి.........
Posts: 1,626
Threads: 2
Likes Received: 964 in 741 posts
Likes Given: 2,159
Joined: May 2019
Reputation:
11
Top gear lo ki vachindi.
Thanks Sivagaru, for the regular updates
Posts: 4,805
Threads: 9
Likes Received: 3,183 in 2,464 posts
Likes Given: 11,248
Joined: Sep 2019
Reputation:
31
Posts: 194
Threads: 0
Likes Received: 122 in 107 posts
Likes Given: 1,093
Joined: Apr 2026
Reputation:
0
Posts: 1,156
Threads: 1
Likes Received: 730 in 473 posts
Likes Given: 10,935
Joined: Jun 2019
Reputation:
2
Story entering a critical phase ...
Posts: 898
Threads: 13
Likes Received: 7,010 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
రుద్రం భజే! ఎపిసోడ్ 29
తన శక్తి ద్వారా జింగ్ ని సముద్రంలో నుంచి బయటకు తీసుకువచ్చి మీ మనుషులు ఆ వస్తువుని, యంగ్ ని తీసుకురాగలిగితే సరి లేకపోతే నా సైన్యాన్ని రంగంలోకి దింపుతాను అని చెప్పాడు రేపాలా.
**************
సముద్రం దగ్గర నుంచి గెస్ట్ హౌస్ కి వచ్చి "నా మనుషులందరికి మెసేజ్ ఫార్వర్డ్ చేశాను స్లిప్పర్స్ సెల్స్ కూడా యాక్టివేట్ అవుతారు ఆ ఇద్దరిని ఎలాగైనా పట్టుకుని మన దగ్గరికి తీసుకు వస్తారు." అని చెప్పాడు సయ్యద్.
"ఇండియన్ గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకువస్తే ఇంకా ఈజీ అవుతుంది వాళ్లే పట్టుకుని ఆ ఇద్దరిని మనకి అప్ప చెపుతారు." అని చెప్పాడు కళింగ.
"నా దగ్గర ఒక ప్లాన్ ఉంది మనం ల్యాబ్ కి వెళ్ళిన వెంటనే ఇండియన్ అంబాసితో మాట్లాడతాను." అని చెప్పాడు చింగ్ యా.
"నేను త్వరగా పర్వతాలు దగ్గరికి వెళ్ళాలి వాళ్లకి సహాయం చేసే దైవ శక్తిని ఆపే ప్రయత్నం చేస్తాను." అని చెప్పాడు రేపాలా.
"సరే! హాఫ్ ఆన్ అవర్ లో స్టార్ట్ అవుదాము రెడీ అవ్వండి." అని చెప్పాడు చింగ్ యా.
అంతలో తన ఫోన్ రింగ్ అవ్వడం చూసి "ఇండియా నుంచి కాల్ వచ్చింది." అని లిఫ్ట్ చేసి "బషీర్! మెసేజ్ అందింది కదా!
నీకు పంపిన ఫోటోలో ఉన్న ఇద్దరు మీకు చూపిస్తున్న లొకేషన్ లో ఉంటారు వాళ్ళు నాకు ప్రాణాలతో కావాలి ఇండియాలో ముసుగులో ఉన్న మన మనుషులందరినీ పంపించండి.
అవసరమైతే మీకు ఇచ్చిన నెంబర్ కి కాల్ చేయండి ముష్రు కలుస్తాడు మీకు హెల్ప్ గా ఉంటాడు." అని చెప్పాడు సయ్యద్.
"సరే బాయ్! మనవాళ్ళతో పాటు స్లీపర్ సేల్స్ ని కూడా యాక్టివేట్ చేస్తాను ఎలాగైనా ఇద్దరిని పట్టుకుని బోర్డర్ దాటి వస్తాను." అని చెప్పాడు బషీర్.
"శభాష్! ఇది మన ఇజ్జత్ కి సంబంధించిన విషయం మిస్ అవ్వకూడదు." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు సయ్యద్.
************
బోర్డర్ వెళ్లే రూట్లో నుంచి కార్ లో హోటల్ రూమ్ కి చేరుకుని యోధాకి కాల్ చేసి "సార్! ఎవరెవరో కాల్ చేస్తున్నారు నన్ను కలవడానికి వస్తాను అంటున్నారు చాలా భయంగా ఉంది." అని చెప్పాడు ముష్రు.
"టెన్షన్ పడకు నీ దగ్గరికి ఎవరు వచ్చినా నేను సెండ్ చేసినా లొకేషన్ కి తీసుకురా.. నువ్వు భూపాల్ సింగ్ కారు మాత్రమే యూస్ చెయ్!" అని చెప్పాడు యోధ.
"ఓకే సార్! ప్రెసెంట్ నేను హోటల్ రూమ్ లోనే ఉన్నాను." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు ముష్రు.
నోయిడా లో ఉన్న ఒక పాత ఫ్యాక్టరీ దగ్గరికి చేరుకుని "నాయక్ సర్ మానససరోవరం వెళ్లడానికి వన్ వీక్ వెయిట్ చేయమన్నారు, అప్పటివరకు మనం ఇక్కడే ఉంటాము ఇదే మన వార్ గ్రౌండ్!" అని చెప్పాడు యోధ.
"నాకు తెలిసి ఇక్కడికి అందరూ టెర్రరిస్టులే వస్తారు వాళ్ళని ఫేస్ చేయాలి అంటే మనకి వెపన్స్ కావాలి." అని చెప్పింది నీతూ.
"మనకి కావాల్సిన వెపన్స్ తీసుకుని నా కొలీగ్స్ కాసేపట్లో ఇక్కడ ఉంటారు అందరికీ గన్ హ్యాండిల్ చేయడం వచ్చు కదా!" అని అడిగాడు యోధ.
"ఎస్! నాకు షూటింగ్ వచ్చు కాకపోతే నువ్వు షూట్ చేసిన అంత పర్ఫెక్ట్ గా షూట్ చేయలేను." అని చెప్పింది పూజా.
"అంత పర్ఫెక్ట్ గా షూట్ చేయడానికి ఇది ఏమైనా ట్రైనింగ్ ప్రోగ్రామా వచ్చిన వాడికి బుల్లెట్ ఎక్కడ తగిలినా చాలు!" అని చెప్పాడు యోధ.
"నేను షూటింగ్లో పర్ఫెక్ట్!" అని చెప్పింది దీప్తి.
"మాకు ఎటువంటి వెపన్ అవసరం లేదు మా వాటాకి వచ్చినవి కూడా మీరే యూస్ చేసుకోండి." అని చెప్పాడు క్యూబ్స్.
"సార్" నాకు ఇంకొక పిస్టల్ ఇప్పించండి." అని తన దగ్గర ఉన్న పిస్టల్ చూపిస్తూ "ఇది నేను డ్యూటీలో జాయిన్ అయినప్పుడు ఇచ్చారు పేలుతుందో లేదో కూడా తెలీదు." అని చెప్పాడు గబ్బర్ సింగ్.
"అవునా?" అని పిస్టల్ తీసుకుని చూస్తూ "దీని మూతి ఏంటి వంకర పోయింది ఇంటి దగ్గర కుంకుడు కాయలు కొట్టావా..?" అని అడిగాడు నంద.
"నేను డ్యూటీ చేసే ఏరియాలో బాదం చెట్లు ఎక్కువ ఆ కాయలు పగలగొట్టుకుని తినడానికి యూస్ చేశాను." అని సిగ్గుపడుతూ చెప్పాడు గబ్బర్ సింగ్.
"అసలు వీడిని మన టీమ్ లో ఎందుకు జాయిన్ చేసావు?' అని నీతూ వైపు చూసాడు యోధ.
"ఈ టెన్షన్స్ కి బుర్ర హీట్ ఎక్కిపోతుంది కాస్త రిలాక్స్ గా ఉంటుందని గబ్బర్ సింగ్ ని టీమ్ లో యాడ్ చేశాను." అని చెప్పింది నీతూ.
"అంటే! నన్ను కాలక్షేపానికి పిలిపించుకున్నారా..! ఇంక నాతో అవసరం ఉంది అనుకున్నాను." అని విచిత్రంగా చూస్తూ
"సార్! ఇంతకీ భుపాల్ సింగ్ దగ్గర ఉన్న వస్తువు ఏంటి? దానికోసం రెండు దేశాల వాళ్ళు ఎందుకు వెతుకుతున్నారు?" అని డౌట్ గా చూస్తూ అడిగాడు గబ్బర్ సింగ్.
"నువ్వు ఇప్పుడు మా టీమ్ లో మెంబర్ కాబట్టి ఆ విషయం నేను చెప్తాను, మేము ఆ వస్తువుతో నుంచి ఓపెన్ అయ్యినా బ్లాక్ హోల్ లో మధ్యాహ్నం కజకిస్తాన్ వెళ్లి యంగ్ ని తీసుకొని సాయంత్రం ఇక్కడకి వచ్చేసాము." అని చెప్పింది పూజా.
ఆ మాట విని వెటకారంగా చూస్తూ "ఓహో! మీకు నేనే దొరికేనా... వినేవాడు ఉంటే ఇంగ్లీషులో కూడా రామాయణం చెప్తారు." అని కోపంగా చూస్తూ వెళ్లి భూషణ్ పక్కన కూర్చున్నాడు గబ్బర్ సింగ్.
"నేను నిజం చెప్పిన నమ్మట్లేదు." అని యోధ వైపు చూసి "నాకు బాగా ఆకలిగా ఉంది." అని చెప్పింది పూజా.
"అవునా?" అని జేబులో నుంచి రెండు బాదం పప్పులు తీసి చేతిలో పెట్టి "ఈవి తిని మంచినీళ్లు తాగు ఎనర్జీ వస్తుంది." అని చెప్పాడు యోధ.
చేతిలో ఉన్న రెండు బాదంపప్పులు వైపు విచిత్రంగా చూస్తూ "ఏంటి? వీటిని తిని మంచినీళ్లు తాగి పడుకోవాలా..! స్పేస్ లోకి వెళ్ళినప్పుడు కూడా ఇంతకన్నా ఎక్కువ పెడతారు." అని చెప్పింది పూజా.
"మేము టెర్రరిస్టులు పట్టుకోడానికి వెళ్ళినప్పుడు ఫీల్డ్ లో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మాకు అదే ఫుడ్! కొన్నిసార్లు అది కూడా ఉండదు, అయినా ఏడవకులే వెపన్స్ తో పాటు ఫుడ్ కూడా వస్తుంది." అని చెప్పాడు యోధ.
"ఆ రెండు బాదం పప్పులు తిని ఊరుకుంది అంటే, దానికి వచ్చే కోపానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళ మీద పులి పిల్ల లాగా పడుతుంది." అని నవ్వుతూ చెప్పింది దీప్తి.
"అలా అయితే ఇంకేం మరి ఈ వారం రోజులు పూజకి ఆ ఫుడ్ పెడదాము మనం రిలాక్స్ గా ఉండొచ్చు!" అని చెప్పాడు క్యూబ్.
ఆ మాటకి కోపంగా చూస్తూ "షాపింగ్ కి వెళ్ళినప్పుడు నేను కొన్న వాటికీ డబ్బులు ఇచ్చావు కాబట్టి ఏమీ మాట్లాడలేదు." అని చెప్పింది పూజా.
"నేను డబ్బులు ఊరికే ఇవ్వను అప్పు మాత్రమే ఇస్తాను తర్వాత వసూలు చేస్తాను." అని చెప్పి క్యూబ్.
"అవును! మా క్యూబ్స్ ఒక్కసారి ఇచ్చాడంటే జీవితకాలం వసూలు చేస్తూనే ఉంటాడు." అని చెప్పాడు భూషణ్.
"సార్! మీ ముగ్గురికి వెపన్స్ అవసరం లేదు అన్నారు మరి ఎవరైనా వస్తే ఎలా ఫేస్ చేస్తారు?" అని అడిగాడు గబ్బర్ సింగ్.
"మా ముగ్గురికి సెక్యూరిటీ నువ్వు ఉన్నావు కదా!" అని నవ్వుతూ చెప్పాడు నంద.
"ఆ యంగ్ గాడి బాడీలో ఉన్న చిప్ ని అరటి పండులో పెట్టుకుని మరీ తిన్నావు, ఎవరు వచ్చినా ఫస్ట్ నీ దగ్గరికి వస్తారు. నేను నీకు సెక్యూరిటీ ఏమిటి!" అని ఏడుపు మొహం పెట్టాడు గబ్బర్ సింగ్.
అంతలో అక్కడికి కారు రావడం చూసి "నా కొలీగ్స్ వచ్చారు." అని చెప్పాడు యోధ.
ఆ మాట విని "ముందు నా పిస్టల్ తీసుకోవాలి." అని కార్ దగ్గరికి వెళ్లి దిగిన ముగ్గురు వైపు తల పైకెత్తి చూస్తూ "వీళ్లు కూడా ఈ ఇంత ఉన్నారేమిటి" అందరికీ నేను ఆటలో అరటిపండు అయిపోతానేమో!" అనుకున్నడు గబ్బర్ సింగ్.
కారు దిగి గబ్బర్ సింగ్ చేతిలో కీస్ పెట్టి "డిక్కిలో వెపన్స్ ఉన్నాయి లోపలికి తీసుకురా..!" అని చెప్పి యోధ దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారు ముగ్గురు.
ముగ్గురిని నీతూ వాళ్ళకి పరిచయం చేస్తూ "రాఖి, వర్ధన్, సుహా! ఈ మిషన్ కంప్లీట్ అయ్యేవరకు మనతోపాటే ఉంటారు." అని చెప్పాడు యోధ.
పుష్కర్, ఏకవీరతో కలిసి డిక్కీలో ఉన్న బాక్స్ లు మొత్తం తీసుకు వస్తున్న గబ్బర్ సింగ్ వైపు చూసి "గుడ్! అక్కడ పెట్టండి." అని చెప్పి ఫ్యాక్టరీ చుట్టూ చూస్తూ
"ఈ ఫ్యాక్టరీ చుట్టూ కెమెరాస్ ఫిట్ చేస్తాను లోపలికి ఎవరు వచ్చినా మనకి తెలుస్తుంది వెంటనే వాడి ఫేస్ కూడా రికగ్నైజ్ అవుతుంది." అని చెప్పింది సుహా.
"ఓకే! నీకు మా ముగ్గురి అసిస్టెంట్స్ హెల్ప్ చేస్తారు." అని గబ్బర్ సింగ్ వాళ్ళ వైపు చూపించింది నీతూ.
భూషణ్ వాళ్ళ వైపు డౌట్ గా చూస్తూ "ఆ ముగ్గురు ఎవరు డిపార్ట్మెంట్ వాళ్ళ లాగా లేరు." అని అడిగాడు రాఖి.
"RAW ఏజెంట్స్! వాళ్లకి ఈ మిషన్ గురించి ప్రతి విషయం తెలుసు నాయక్ సర్ పంపించారు." అని చెప్పాడు యోధ.
బాక్స్ లో నుంచి పిస్టల్ తీసి సంతోషంగా చూస్తూ "మేడం! నేను దీనిని ఉంచుకుంటాను చాలా బాగుంది." అని చెప్పాడు గబ్బర్ సింగ్.
"అది చూడడానికి చిన్న పిస్టల్ లానే కనపడుతుంది కానీ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. నీ భుజం లో బలం లేకపోతే షూట్ చేసిన వెంటనే నీకు చెయ్యి వెళ్లి కిలోమీటర్ దూరంలో పడుతుంది." అని చెప్పింది సుహా.
"మేడమ్! అలా అయితే నా చెయ్యి నా దగ్గర ఉండే ఫిస్టల్ ఇవ్వండి. అయ్యినా నేను మీ వెనకాల ఉంటే ఎవరికి కనపడను." అని చేతిలో ఉన్న పిస్టల్ నెమ్మదిగా బాక్స్ లో పెట్టాడు గబ్బర్ సింగ్.
మెయిన్ గేట్ వైపు చూస్తూ "ఎవరు రావడం లేదేమిటి! వార్ మూడ్ లోకి వచ్చి ఖాళీగా ఉండాలి అంటే ఇరిటేషన్ గా ఉంటుంది." అని చెప్పాడు వర్ధన్.
"వెయిట్ అండ్ సీ! ఉదయనికి ఇక్కడ దీపావళి స్టార్ట్ అవుతుంది." అని చెప్పి బాక్స్ లో నుంచి ఫుడ్ పాకెట్స్ తీసి దీప్తి, పూజా లకి ఇచ్చాడు యోధ......
Posts: 898
Threads: 13
Likes Received: 7,010 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
రుద్రం భజే! ఎపిసోడ్ 30
ఫ్యాక్టరీ దగ్గరికి వెపన్స్ ఫుడ్ తీసుకువచ్చి ఇంకా ఎవరు రావడం లేదేమిటి వార్ లోకి దిగిన తర్వాత ఖాళీగా ఉంటే ఇరిటేషన్ వస్తుంది అని చెప్పాడు వర్ధన్.
**************
వర్ధన్ చెప్పింది విని "కంగారు పడకు ఉదయానికి ఇక్కడ దీపావళి స్టార్ట్ అవుతుంది." అని బాక్స్ లో ఉన్న ఫుడ్ ప్యాకెట్స్ తీసి దీప్తి, పూజాలకి ఇచ్చాడు యోధ.
"దీపావళి స్టార్ట్ అవ్వడం ఏమిటి రేపు శ్రీరామనవమి కదా!" అని డౌట్ గా అడిగింది పూజా.
అక్కడికి వచ్చి ఫుడ్ ప్యాకెట్ తీసుకుంటూ "ఏదైనా పండగే కదా!" అని చెప్పాడు గబ్బర్ సింగ్.
ఆ మాటకి నవ్వుతూ భూషణ్ వాళ్ళ దగ్గరికి వెళ్లి "మీరు కూడా తినండి." అని అని ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చాడు యోధ.
"మా ఇద్దరికీ అవసరం లేదు భూషణ్ కి ఇవ్వు!" అని చెప్పాడు నంద.
ఫుడ్ ప్యాకెట్ తీసుకుంటూ "మీరు రెస్ట్ తీసుకోండి మేము చూస్తూ ఉంటాం మళ్ళీ ఉదయం మీకు చాలా పెద్ద పని ఉంది." అని చెప్పాడు భూషణ్.
"అంటే! రేపు ఇక్కడికి వచ్చే వాళ్ళతో మీరు ఫైట్ చేయరా?" అని అడిగాడు యోధ.
"మేము ముందే చెప్పాము కదా నీకు సహాయం మాత్రమే చేస్తాము మా చేతులతో ఎవరిని చంపము." అని చెప్పాడు నంద.
"సరే మీ ఇష్టం!" అని అక్కడికి వస్తున్న సుహా, రాఖి వైపు చూసి "అంత రెడీ అయిందా?" అని అడిగాడు యోధ.
"ఎస్! ఈ ఏరియాలోకి ఎవరు వచ్చిన మనకి తెలుస్తుంది ఎంట్రెన్స్ గేట్ తప్పితే మిగతా ప్లేస్ మొత్తం ల్యాండ్ మైన్స్ పెట్టాము దొంగ చాటుగా రావాలనుకుంటే చస్తారు." అని చెప్పింది సుహా.
"సరే! వాళ్ళ ముగ్గురు సెక్యూరిటీగా ఉంటారు మనం రెస్ట్ తీసుకుందాము పదండి." అని లోపలికి తీసుకువెళ్లాడు యోధ.
అక్కడికి తింటూ వచ్చిన గబ్బర్ సింగ్ వైపు చూసి "ఒక చేత్తో తినవయ్యా! అంత కంగారు ఎందుకు?" అని చెప్పాడు క్యూబ్.
"మా బామ్మ చిన్నప్పుడు నేను రెండు చేతులతో తినే అంత సంపాదిస్తావురా అనేది. అందుకనే అప్పటినుంచి రెండు చేతులతో తింటున్నాను." అని నవ్వుతు చెప్పాడు గబ్బర్ సింగ్.
ఆ మాట విని షాక్ అయ్యి చూస్తూ "నువ్వు చాలా తెలివైన వాడివి అందుకే నిన్ను ఈ టీమ్ లో జాయిన్ చేసుకున్నారు." అని చెప్పాడు క్యూబ్.
"థాంక్యూ సర్! కానీ ఇక్కడ అందరిని చూస్తుంటే నాకు కాస్త భయంగా ఉంది." అని చెప్పాడు గబ్బర్ సింగ్.
"స్ట్రాంగ్ గా ఉండు ముందు ముందు మన మీద ఎటాక్ చేయడానికి వచ్చే వాళ్ళని చూస్తే గుండె ఆగి చస్తావు." అని చెప్పాడు నంద.
"నేను మరి అంత పిరికి వాడిని కాదులే సార్! నేపాల్ బోర్డర్ లో నా పేరు చెబితే టెర్రరిస్టులు గడగడలాడి పోతారు." అని గొప్పగా చెబుతూ మెయిన్ గేట్ వైపు చూసి
"సార్! ఎవరో ఇద్దరు ఇటువైపు వస్తున్నారు." అని కంగారుగా లోపలికి పరిగెత్తాడు గబ్బర్ సింగ్.
ఫ్యాక్టరీ లోపలికి హడావిడిగా వస్తున్న గబ్బర్ సింగ్ ని చూసి "ఏమైంది?" అని అడిగాడు వర్ధన్.
"సార్! ఎవరో ఇద్దరూ ఫ్యాక్టరీ ఎంట్రెన్స్ గేట్ లో నుంచి లోపలకి వస్తున్నారు." అని టెన్షన్ గా చెప్పాడు గబ్బర్ సింగ్.
ఆ మాట విని సిసి ఫుటేజ్ చూస్తూ "అక్కడ ఎవరు కనబడడం లేదు కదా!" అని అనుమానంగా అడిగింది సుహా.
"మేడం! ఇద్దరు లోపలికి రావడం నా కళ్లారా చూశాను." అని చెప్పాడు గబ్బర్ సింగ్.
గన్స్ తీసుకుని బయటికి వెళ్లడానికి రెడీ అవుతున్న రాఖీ వాళ్ళని ఆపి "ఆ ముగ్గురు ఉండగా ఎవరు లోపలికి రాలేరు నేను వెళ్లి చూసి వస్తాను." అని బయటికి వెళ్ళాడు యోధ.
కంప్యూటర్ స్క్రీన్ మీద చూసి "నేను ఇద్దరు రావడం చూశాను దీంట్లో కనబడడం లేదు ఏమిటి!" అని అయోమయంగా చూస్తూ ఉన్నాడు గబ్బర్ సింగ్.
"మీ బామ్మ చెప్పింది అని రెండు చేతులతో తింటున్నావు కదా తినే కంగారులో ఆ రెండు చేతులు ఇద్దరు మనుషుల్లాగా కనిపించారేమో!" అని నవ్వుతూ చెప్పింది పూజా.
ఆ మాటకి నవ్వుతూ నీతూ వైపు చూసి "నువ్వు చెప్పింది కరెక్టే! ఇలాంటి వాడు టీమ్ లో ఒకడు ఉండాలి సిల్లీ ఫెలో!" అని చెప్పాడు రాఖి.
అంతలో అక్కడికి వస్తున్న ఇద్దరి దగ్గరికి వెళ్లి "నమస్కారం యమధర్మ రాజా! నమస్కారం చిత్రగుప్త! ఏంటి మీరే డైరెక్ట్ గా వచ్చారు?" అని అడిగాడు క్యూబ్.
"భూమి మీద పాపం పెరిగి బొడ్డులు బాగా బాగా బిజీ అయిపోయారు ఇక్కడ రేపు చాలామంది చస్తున్నారు అందుకే నేనే డైరెక్ట్ గా వచ్చాను.
మళ్లీ లెక్క తేడా రాకూడదు అని చిత్రగుప్తుడిని కుడా తీసుకువచ్చాను, అవును ఎప్పుడు కలవని మీ ముగ్గురు కలిసి ఇక్కడికి వచ్చారు ఏమిటి?" అని అనుమానంగా అడిగాడు యమధర్మరాజు.
"చాలా పెద్ద స్టోరీ ఉంది కానీ ఇక్కడ ఉండాలి అంటే మీ భాష పేర్లు మార్చుకోవాలి మేము మానవుల తో కలిసి ఉంటున్నాము." అని చెప్పాడు నంద.
ఆ మాట విని "అర్థం అయింది బ్రహ్మ దేవుడు మళ్లీ ఏదో ఒక వరం ఇచ్చి ఉంటారు, లోక కళ్యాణం కోసం వీళ్ళ ముగ్గురు మానవులకు సహాయం చేయడానికి వచ్చి ఉంటారు." అని చెప్పాడు చిత్రగుప్తుడు.
"అవును! ఇది కలికాలం కదా మంచేనా చెడైనా మానవుడే చేస్తాడు." అని చెప్పాడు యమధర్మరాజు.
అంతలో అక్కడికి వచ్చి నంద వైపు చూసి "వీళ్ళిద్దరూ మీకు తెలుసా? ఇక్కడికి ఎందుకు వచ్చారు?" అని అడిగాడు యోధ.
"మాకు బాగా తెలిసిన వాళ్ళు చిన్న పని ఉండి వచ్చారు రెండు రోజుల్లో వెళ్ళిపోతారు." అని చెప్పి యమధర్మరాజు, చిత్రగుప్తుడికి వైపు చూపించి "మిస్టర్ ధర్మ, మిస్టర్ గుప్తా టాప్ ఏజెంట్స్! ఎంతమందిని చంపారో లెక్కేలేదు." అని చెప్పాడు భూషణ్.
"అవునా?" అని ఇద్దరు వైపు చూసి "నేనెప్పుడూ వీళ్ళని చూడలేదు, అయ్యినా వీళ్ళు సీసీ కెమెరాలలో కనబడలేదు ఏమిటి?" అని అనుమానంగా అడిగాడు యోధ.
ఆ మాటకి నవ్వుతూ "మా మనుషులే అని చెప్పాము కదా ఎలా కనపడతారు." అని చెప్పాడు భూషణ్.
"ఓహో! మీరు దైవ శక్తి పంపించిన వాళ్లు కాదు సరే కేర్ ఫుల్ గా ఉండండి." అని చెప్పి లోపలికి వెళ్ళాడు యోధ.
లోపలికి వెళుతున్న యోధ వైపు చూసి సూట్ కేసులో ఉన్నా బుక్ ఓపెన్ చేసి చూస్తూ "రేపు సగం మంది ఇతని చేతిలోనే పోతారు." అని చెప్పాడు గుప్తా.
"మీ ముగ్గురు గురించి యోదకి తెలుసా?" అని డౌట్ గా అడిగాడు ధర్మ.
"పూర్తి విషయం తెలియదు కానీ కాస్త తెలుసు!" అని చెప్పాడు క్యూబ్.
"అతను మానవుడే కదా మిమ్మల్ని ఎలా కనిపెట్టాడు?" అని డౌట్ గా అడిగాడు గుప్తా.
"అతను మానవుడే కానీ అతని లోపల హనుమంతుడి శక్తి ఉంది." అని చెప్పాడు భూషణ్.
"అవునా? కలికాలం మహా పురుషులు మొత్తం ఏకమవుతున్నారు ఏదో పెద్ద పనే పడింది. ఇంక మాకు రెస్ట్ ఉండదు అన్నమాట!" అంటూ ముగ్గురు తో కలిసి వెళ్లి అక్కడ ఉన్న ట్యాంక్ మీద కూర్చున్నాడు ధర్మ.
గోడౌన్ లోపలికి వెళ్లి "మనకి తెలిసిన వాళ్లే వచ్చారులే టెన్షన్ పడకండి అందరూ రెస్ట్ తీసుకోండి." అని చెప్పాడు యోధ.
"మరి సిసి ఫుటేజ్ లో కనపడలేదు ఏమిటి?" అని డౌట్ గా అడిగింది సుహా.
"రోజుకి ఒక కొత్త టెక్నాలజీ వస్తుంది అందులో వాళ్ళిద్దరూ ఏజెంట్స్ ఇంకా ఫాస్ట్ టెక్నాలజీ ఉంటుంది." అని చెప్పాడు యోధ.
ఆ మాట విని గబగబా బయటికి వెళ్లి క్యూబ్ తో మాట్లాడుతున్న ధర్మ, గుప్తాలని చూసి "నమస్తే సార్! మీ దగ్గర చాలా ఫార్వర్డ్ టెక్నాలజీ ఉందని విన్నాను మీరు ఏ ఏరియాలో డ్యూటీ చేస్తారు?" అని అడిగాడు గబ్బర్ సింగ్.
"ఆ ఇద్దరు డ్యూటీ ఒక చోట ఉండదులే మళ్లీ వీళ్ళు నీకు కనబడాలి అంటే!" అని గుప్తా వైపు చూసాడు క్యూబ్.
బుక్ ఓపెన్ చేసి చూసి "మళ్లీ నీకు మేమిద్దరం 30 ఏళ్ల తర్వాత కనపడతాము." అని చెప్పాడు గుప్తా.
"చాలా విచిత్రంగా ఉంది. ఆ బుక్ లో నా జాతకం మొత్తం చూసుకోవడం కుదురుతుందా?" అని అడిగాడు గబ్బర్ సింగ్.
"ఆ పుస్తకంలో నీ జాతకం ఉండదు నువ్వు చేసిన మిస్టేక్స్ నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు అనేది మాత్రమే ఉంటుంది." అని చెప్పాడు నంద.
"ఓహో! ఈ టైపు టెక్నాలజీ కూడా వచ్చిందా..? సర్లే ఇప్పుడు చూడాల్సిన అవసరం ఏమీ లేదు, నాకు భలే కాండిడేట్లు తగులుతున్నారు." అనుకుంటూ లోపలికి వెళ్ళాడు గబ్బర్ సింగ్.
************
ఉదయం హోటల్ రూమ్ లో ఉన్న ముష్రు దగ్గరికి వచ్చి" నా పేరు బషీర్! సయ్యద్ భాయ్ మిమ్మల్ని కలవమని చెప్పాడు భూపాల్ గురించి ఏమైనా తెలిసిందా?' అని అడిగాడు సయ్యద్.
"నాకు ఉదయం కాల్ చేసాడు నోయిడా దగ్గర ఏదో పాత ఫ్యాక్టరీ లో ఉన్నాను రమ్మని లొకేషన్ పంపించాడు, కానీ ఒక్కడినే వెళితే చంపేస్తాడు అని భయం వేసి వెళ్లలేదు." అని చెప్పాడు ముష్రు.
"అవునా?" అని తన దగ్గర ఉన్న ట్యాబ్ ఓపెన్ చేసి సయ్యద్ పంపించిన లొకేషన్ చూసి "నువ్వు చెప్పింది కరెక్టే! ఇద్దరు నోయిడా ఏరియా లోనే ఉన్నారు త్వరగా వర్క్ కంప్లీట్ చేయాలి పద వెళదాము." అని ముష్రూ చేతికి గన్ ఇచ్చాడు బషీర్.
"ఏంటి మనిద్దరమేనా? నాకు గన్ యూస్ చేయడం కూడా సరిగ్గా రాదు." అని కంగారుగా చెప్పాడు ముష్రు.
"మనం వెళ్లేసరికి నా మనుషులు మొత్తం అక్కడే ఉంటారు అందరికీ లొకేషన్ షేర్ చేశాను." అని నవ్వుతూ హోటల్ నుంచి బయటికి వచ్చి కార్ ఎక్కడు బషీర్.
రూమ్ డోర్ క్లోజ్ చేస్తూ యోధకి మెసేజ్ చేసి కిందకు వెళ్లి కార్ డ్రైవింగ్ సీట్లో ఎక్కాడు ముష్రు.
" రుద్రం భజే! ఎపిసోడ్ 30 " రచనకు రేటింగ్ ఇవ్వండి...
Posts: 1,626
Threads: 2
Likes Received: 964 in 741 posts
Likes Given: 2,159
Joined: May 2019
Reputation:
11
The Rudra dance.. "రుద్రతాండవం" start..
Posts: 1,156
Threads: 1
Likes Received: 730 in 473 posts
Likes Given: 10,935
Joined: Jun 2019
Reputation:
2
Posts: 4,805
Threads: 9
Likes Received: 3,183 in 2,464 posts
Likes Given: 11,248
Joined: Sep 2019
Reputation:
31
Posts: 205
Threads: 2
Likes Received: 194 in 109 posts
Likes Given: 535
Joined: Jun 2019
Reputation:
4
Posts: 898
Threads: 13
Likes Received: 7,010 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
రుద్రం భజే! ఎపిసోడ్ 31
రూమ్ దగ్గరికి వచ్చి ముష్రుని కలిసి పరిచయం చేసుకుని చెప్పింది విని లొకేషన్ చూసి కరెక్ట్ గానే ఉంది నా మనుషులందరికి లొకేషన్ ఫార్వర్డ్ చేశాను మనం వెళ్లేసరికి అందరూ అక్కడే ఉంటరు అని కారు దగ్గరికి వెళ్ళాడు బషీర్.
రూమ్ డోర్ లాక్ చేస్తూ యోద కి మెసేజ్ చేసి కార్ దగ్గరకి వెళ్లి డ్రైవింగ్ సీట్ లోకి ఎక్కడు ముష్రు.
************
ఫ్యాక్టరీ దగ్గర గన్ క్లీన్ చేస్తూ మెసేజ్ రావడం చూసి చప్పట్లు కొడుతూ "ఎవరి ప్లేస్ కి వాళ్ళు వెళ్లి ఎలర్ట్ గా ఉండండి టెర్రరిస్టులు స్టార్ట్ అయ్యారు." అని చెప్పాడు యోధ.
ఆ మాట విని "వెధవలకి పని పాట లేదనుకుంటా పోద్దు పొద్దున్నే తయారవుతున్నారు." అని కంప్యూటర్ దగ్గర ఉన్న సుహా దగ్గరికి వెళ్లి
"మేడం! మీరు ఎటాక్ చేయడానికి వెళతారు కదా నేను వాచ్ చేస్తూ ఉండనా..?" అని అడిగాడు గబ్బర్ సింగ్.
"సరే! ఎప్పటికప్పుడు లోపలికి ఎంత మంది వస్తున్నారు అనే విషయం మాకు ఇన్ఫామ్ చేస్తూ ఉండు." అని చెప్పి పూజ వైపు చూసి "నువ్వు కుడా హెల్ప్ గా ఉండు." అని గన్ తీసుకొని వెళ్ళింది సుహా.
"ఓకే!" అని కంప్యూటర్ ముందు ఉన్న చైర్ లో కూర్చుని గబ్బర్ సింగ్ వైపు చూసి "నువ్వు కూడా ఒక చైర్ తెచ్చుకో వీడియో గేమ్ ఆడుకుందాము." అని చెప్పింది పూజా.
ఆ మాటకి సంతోషంగా చూస్తూ చైర్ పక్కనే వేసుకోని "మేడమ్ పబ్జి గేమ్ ఆడుకుందామా..?" అని అడిగాడు గబ్బర్ సింగ్.
"మనం ఆడనవసరం లేదు చూడడం వరకే వాళ్ళు ఆడుకుంటారు మనం బెట్టింగ్ వేసుకుందాము." అని చెప్పింది పూజా.
అక్కడకి వస్తు "డబ్బుతో ఆటలు అంటే నాకు భలే ఇష్టం! నేను కూడా జాయిన్ అవుతాను." అని పక్కన చైర్ వేసుకుని కూర్చున్నాడు క్యూబ్.
బయటకు వచ్చిన అందరి వైపు చూస్తూ "నీతు, దీప్తి మీరిద్దరు స్నైపర్ గన్స్ తీసుకుని పైకి వెళ్ళండి. ఒక్కడికి ఒక బుల్లెట్ మాత్రమే వేస్ట్ అవ్వకూడదు." అని చెప్పాడు యోధ.
భూషణ్ వాళ్ళతో పాటు కూర్చుని ఆ మాట విని "ఆహా! యోధ కి చాలా జాగ్రత్త ఎక్కువ!" అని చెప్పాడు గుప్తా.
"నీకు అర్థం కాలేదనుకుంటా! హెడ్ షాట్ కొట్టమని అర్ధం ఒక్క బుల్లెట్ దెబ్బకి చచ్చిపోవాలి అని చెప్తున్నాడు." అని చెప్పాడు భూషణ్.
"పుష్కర్, ఏకవీర మీరు వెపన్స్ దగ్గర ఉండండి ఎవరికి ఏది అవసరమైన వెంటనే తీసుకువెళ్లి ఇవ్వాలి అందరూ కాన్ఫరెన్స్ లో ఉండండి." అని చెప్పాడు యోధ.
భూషణ్ వాళ్ళ వైపు చూసి "మరి వాళ్ళు ఫీల్డ్ లోకి రారా...!" అని అడిగాడు రాఖి.
"వస్తారు కానీ వెపన్ యూస్ చేయరు మనకి హెల్ప్ గా ఉంటారు." అని చెప్పాడు యోధ.
"కెప్టెన్! నేను ఫీల్ లోకి వస్తాను.' అని చెప్పాడు ధర్మ.
"ఓకే థాంక్యూ! మీకు ఏ వెపన్ కావాలి అంటే అది తెచ్చుకోండి." అని చెప్పాడు యోధ.
"మీ వెపన్స్ నాకు అవసరం లేదు నా వెపన్ నా దగ్గర ఉంది." అని చేతిలో ఉన్న కర్ర నీకు చూపించడు ధర్మ.
అంతలో ఫోన్ రింగ్ అవ్వడం చూసి "నాయక్ సర్ కాల్ చేస్తున్నారు సైలెంట్ గా ఉండండి." అని చెప్పి లిఫ్ట్ చేసి "జైహింద్ సార్!" అని చెప్పాడు యోధ.
"జై హింద్ యోధ!" అని కంప్యూటర్ లోకేషన్ చూస్తూ "మీరందరూ పాత ఫ్యాక్టరీ దగ్గర ఏం చేస్తున్నారు ఇంటిలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది ఇప్పటివరకు అండర్ గ్రౌండ్ లో ఉన్న టెర్రరిస్ట్ గ్యాంగ్ లు మొత్తం బయటికి వస్తున్నాయి.
సిటీ మొత్తం రెడ్ అలార్ట్ ఎనౌన్స్ చేశారు మీరు అర్జెంటుగా మిలిటరీ హెడ్ కోటర్స్ కు రండి." అని చెప్పాడు నాయక్.
"సార్! వాళ్ళందరూ బయటికి వచ్చిందే మేము ఉన్న లొకేషన్ కి రావడానికి ఎవరికి డిస్టబెన్స్ లేకుండా అందర్నీ లేపేస్తాము నా టీమ్ కూడా ఇక్కడికి వచ్చింది." అని చెప్పాడు యోధ.
"నాకు విషయం అర్థమైంది టెర్రరిస్టులు మూర్ఖులే కానీ మూర్ఖంగా ఆలోచిస్తారని మాత్రం అనుకోకు, మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు చనిపోతున్నారు అని అర్థం అవ్వగానే వాళ్లకి కావలసింది అక్కడ లేదని తెలుసుకుంటారు.
కచ్చితంగా మిలటరీ ల్యాబ్ ని వెతుక్కుంటూ వస్తారు అక్కడ స్ట్రాంగ్ సెక్యూరిటీ ఉండాలి ఎవరిని పంపిస్తే బాగుంటుందో ఆలోచించు." అని చెప్పాడు నాయక్.
"ఓకే సార్! అభీర్ కి కి కాల్ చేసి వాళ్ల టీమ్ నుంచి ఇద్దరు ఏజెంట్స్ ని ల్యాబ్ దగ్గరికి సెక్యూరిటీగా పంపించమని చెప్తాను." అని చెప్పాడు యోధ.
"గుడ్ థింకింగ్! వెంటనే కాల్ చెయ్ చైనా అంబాసి నుంచి కాల్ వచ్చింది అర్జెంట్ మీటింగ్ అని ఇన్ఫామ్ చేసారు, నేను వెళుతున్నాను ఏదైనా అవసరమైతే మెసేజ్ చెయ్!" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు నాయక్.
ఫోన్ కట్ అవ్వడంతో "ఈ అభీర్ ఏ దేశంలో ఉన్నాడో!" అని కాల్ చేసాడు యోధ.
ఫోన్ లిఫ్ట్ చేసి "హాయ్ యోధ! హౌ ఆర్ యు?" అని అడిగాడు అభీర్.
"గుడ్ మార్నింగ్ అభీర్! స్టోరీ చెప్పే అంత టైం లేదు అర్జెంటుగా మిలిటరీ ల్యాబ్ దగ్గరికి ఇద్దరు చాకు లాంటి ఏజెంట్స్ వెళ్లాలి, అక్కడ టెర్రరిస్ట్ ఎటాక్ జరిగే ఛాన్స్ ఉంది వాళ్ళని చూస్తే ఎవరికి అనుమానం రాకూడదు." అని చెప్పాడు యోధ.
"ఓకే! లింగు, గుడ్డు అని ఇద్దరు ఏజెంట్స్ ఉన్నారు వాళ్ళని చూస్తే ఎవరికి అనుమానం రాదు 15 మినిట్స్ లో అక్కడ ఉంటారు." అని చెప్పాడు అభీర్.
"థాంక్యూ! ఈ మిషన్ ఫైనల్ స్టేజ్ కి వచ్చినపుడు మీ అభీర్ సేనా అవసరం ఉంటుంది." అని చెప్పాడు యోధ.
"దేశం కోసం ఎప్పుడు మా అభీర్ సేనా సిద్ధంగా ఉంటుంది. ఒక్క పిలుపు చాలు క్షణాల్లో వాలిపోతాము జైహింద్!" అని ఫోన్ పెట్టేసాడు అభీర్.
ఫోన్ కట్ అవ్వడంతో నవ్వుతూ జేబులో పెట్టుకుని వర్ధన్ వాళ్ళ వైపు చూసి "అభీర్ మాట ఇచ్చాడు అంటే తిరుగు ఉండదు ఇంక ల్యాబ్ దగ్గరికి ఒక్కడు కూడా వెళ్లలేడు." అని చెప్పాడు యోధ.
*************
కారకొరం పర్వతాల దగ్గర ఉన్న ల్యాబ్ కి చేరుకుని "ఇండియన్ అంబాసీ తో చైనా అంబాసి ఎమర్జెన్సీ మీటింగ్ స్టార్ట్ అవుతుంది నేను లైవ్ కాల్ లో అక్కడి ఆఫీసర్స్ మాట్లాడి
భూపాల్ సింగ్, యంగ్ అనే ఇద్దరు మన ల్యాబ్ నుంచి ఒక విలువైన వస్తువుని దొంగలించి పారిపోయారు వాళ్ళు ఇండియాలో ఉన్నారు అని తెలిసింది అప్ప చెప్పమని అడుగుతాను." అని చెప్పాడు చింగ్ యా.
"నువ్వు చెప్పిన మాట ఇండియన్ గవర్నమెంట్ అంత ఈజీగా నమ్ముతుంది అనుకుంటున్నావా..?" అని అడిగాడు కళింగ.
"ప్రజెంట్" ఇండియా చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని చూస్తుంది. ఈ టైమ్ లో ఎటువంటి డిస్కషన్ పెట్టుకోదు. ఒకవేళ వాళ్ళిద్దరినీ పట్టుకున్న ఆ వస్తువు గురించి యంగ్ గురించి వాళ్ళు తెలుసుకోలేరు." అని చెప్పాడు చింగ్ యా.
"ఆల్రెడీ ఆ వస్తువుతో మనం ప్రయోగం చేస్తున్నామని ఇండియన్ మిలిటరీ కి తెలిసిందాని నువ్వే చెప్పావు కదా!" అని అడిగాడు సయ్యద్.
"కరెక్టే! అందుకే ల్యాబ్ నుంచి వస్తువు దొంగిలించారు అని చెబుతున్నాము కదా! రెండు మాటలు కరెక్ట్ గా సింక్ అవుతాయి వాళ్లు కచ్చితంగా నమ్ముతారు." అని చెప్పాడు చింగ్ యా.
"మన ప్రయోగం గురించి వాళ్ళకి తెలిసేలాగా మనమే చెప్పడం అవసరమా? వాళ్ళకి కచ్చితంగా అనుమానం వస్తుంది ఎలాగో సయ్యద్ మనుషులు వెళ్లారు కదా!" అని అడిగాడు కళింగ.
"భూపాల్ సింగ్ దగ్గర ఆ వస్తువు ఉంది దాన్ని ఎలా యూస్ చేయాలో కూడా తెలుసుకున్నాడు ఇప్పుడు సయ్యద్ మనుషులు వెళ్లినంత మాత్రాన దొరుకుతాడు అనుకుంటున్నావా..?" అని అడిగాడు చింగ్ యా.
"యంగ్ ఒంట్లో ఉన్న రక్తం గురించి ఇండియన్ ఆర్మీ వాళ్ళు తెలుసుకున్నారు అంటే మనం చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాము." అని చెప్పాడు కళింగ.
"సయ్యద్ మనుషులు ఆ ఇద్దరి కోసం ట్రై చేయడం వల్ల టెర్రరిస్టుల గోలా కుడా ఎక్కువైందని ఇండియన్ గవర్నమెంట్ యంగ్ వాళ్ళని పట్టుకుని పువ్వుల్లో పెట్టి మన దగ్గరకి పంపిస్తుంది చూస్తూ ఉండు." అని చెప్పాడు చింగ్ యా.
"ఇండియాలో ఎప్పటినుంచో బ్లాస్ట్ లు గొడవలు చేయాలి అనుకుంటున్నాము వాళ్ల ఇద్దరి వల్ల మా వాళ్ళు అందరూ బయటికి వస్తున్నారు ఇప్పుడు రెండు విధాల ఉపయోగపడుతుంది." అని నవ్వుతూ చెప్పాడు సయ్యద్.
"మీ ప్రయత్నాలు మీరు చేయండి అక్కడ దైవం ఎవరికో సహాయం చేస్తుంది వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి తీరుతారు, ఈ లోపు నా సైన్యాన్ని నిద్ర లేపుతాను." అని చెప్పి అక్కడి నుంచి జింగ్ ని తీసుకుని వెళ్ళాడు రేపాలా.
అంతలో తన దగ్గర ఉన్న శాటిలైట్ ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేసి "బషీర్! ఏమైంది? వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిసిందా?" అని అడిగాడు సయ్యద్.
"బాయ్! లొకేషన్ తెలుసుకున్నాము ముష్రుతో కలిసి వెళుతున్నాను మనవాళ్ళందరూ ఆ ఫ్యాక్టరీ ఉన్న ప్లేస్ ని చుట్టూ ముడుతున్నారు కాసేపట్లో ఇద్దరినీ హ్యాండ్ఓవర్ చేసుకుని నీకు కాల్ చేస్తాను." అని చెప్పాడు బషీర్.
"చాలా మంచి విషయం చెప్పావు నిన్ను అలా చల్లగా చూస్తాడు." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు సయ్యద్.
ఫోన్ కట్ చేసి ముష్రు వైపు చూసి "ఫాస్ట్గా వేళ్ళు మన వాళ్ళందరూ ఫ్యాక్టరీ దగ్గరికి చేరుకున్నారు." అని చెప్పాడు బషీర్.
"ఓకే!" అని ఫాస్ట్ గా వెళుతూ లోకేషన్ చూసి "వచ్చేసాము." అని స్లో చేసాడు ముష్రు.
కారు దిగి అక్కడ ఉన్న తన మనుషులని దగ్గరకు పిలిచి ట్యాబ్ ఓపెన్ చేసి ఇద్దరు లొకేషన్ చూపించి "రజాక్!నువ్వు ఫ్రంట్ డోర్ లో నుంచి లోపలకి వేళ్ళు, ఖాసీం నువ్వు లెఫ్ట్ లో నుంచి వేళ్ళు, షారుక్ నువ్వు రైట్ లో నుంచి వేళ్ళు, నేను బ్యాక్ సైడ్ నుంచి వస్తాను.
నాకు తెలిసి వాళ్ళ దగ్గర కూడా వెపన్స్ ఉంటాయి మనుషులు కుడా ఉంటారు కేర్ ఫుల్ గా ఉండండి ఎవరు చచ్చిన పర్వాలేదు, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు ఇద్దరు మాత్రం ప్రాణాలతో కావాలి." అని అక్కడ ఉన్న వాళ్ళకీ చూపించాడు బషీర్.
"సరే బాయ్!" అని తన వాళ్ళ వైపు చూసి "ఫ్రెంట్ డోర్ పగలగొట్టుకుని లోపలికి వెళ్ళండి." అని చెప్పాడు రజాక్.
"స్పీడ్ గా ఈ వర్క్ కంప్లీట్ చేయాలి మనం అందరం ఇక్కడ ఉన్నామని ఇంటిలిజెన్స్ వాళ్ళకి తెలిసింది అంటే మిలిటరీ ఎంటర్ అవుతుంది." అని చెప్పి కొంతమందిని తీసుకుని ఫ్యాక్టరీ బ్యాక్ సైడ్ కి వెళ్ళాడు బషీర్.
ఫ్రంట్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వస్తున్న కొంత మందిని చూసి కాన్ఫరెన్స్ లో ఉన్న అందరికీ "అలర్ట్!" అని చెప్పి మొదటగా లోపలికి అడుగుపెట్టిన వాడిని షూట్ చేసింది సుహా.
Posts: 898
Threads: 13
Likes Received: 7,010 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
రుద్రం భజే! ఎపిసోడ్ 32
నోయిడాలో ఉన్నా గోడౌన్స్ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న తన మనుషులకి భూపాల్ సింగ్, యంగ్ ఫోటోలు చూపించి ఎంతమంది చనిపోయిన పర్వాలేదు వీళ్ళిద్దరూ ప్రాణాలతో కావాలి అని నాలుగు బ్యాచులుగా విడిపోయి నాలుగు వైపుల నుంచి లోపలికి వెళ్లడానికి రెడీ చేసాడు బషీర్.
***********
ఫ్యాక్టరీ ఫ్రంట్ గేట్స్ పగలగొట్టి "బషీర్ భాయ్ చూపించిన ఫోటోలు చూశారు కదా! వాళ్లు తప్పితే ఎవరు కనిపించిన చంపేయండి." అని ఆవేశంగా చెప్పాడు రజాక్.
ఫ్రెంట్ గేట్లో నుంచి లోపలికి వస్తున్న వాళ్ళని చూసి "సుహా! నీ బోని బాగుంటుంది షూట్ చెయ్!" అని చెప్పాడు యోధ.
ఆ మాట విని "చంపడంలో కూడా మంచి చెడు ఉంటుందా..?" అని కంప్యూటర్లో చూస్తూ "ఫస్ట్ బుల్లెట్ తగిలి కింద పడేవాడు ఆ గడ్డం వాడు వంద నా పందెం!" అని చెప్పాడు గబ్బర్ సింగ్.
"కాదు" ఆ తలపాగా కట్టుకున్నవాడు ఫస్ట్ బుల్లెట్ తగిలి కింద పడతాడు." అని పందెం కలిపేడు క్యూబ్.
లోపలికి వస్తున్న వాళ్ళని చూసి రెండు చేతుల్లోకి గన్స్ తీసుకుని ముందు వచ్చిన ఇద్దరినీ షూట్ చేసింది సుహా.
కంప్యూటర్లో చూస్తూ "ఇద్దరు చచ్చారు ఎవరి డబ్బులు వాళ్ళు తీసుకోండి." అని నవ్వుతూ చెప్పింది పూజా.
ట్యాంక్ మీద కూర్చుని చూస్తున్న యమధర్మరాజు దగ్గరికి వెళ్లి "ప్రభు! ఇంక మీ పాశనికి పని చెప్పండి ఈ యుద్ధం పూర్తయ్య లోపులో మీ భుజం వాసిపోయేటట్లు ఉంది నేను వెళ్లి జండుబాంబ్ తీసుకొస్తాను." అని చెప్పాడు చిత్రగుప్తుడు.
"సరే!" అని చనిపోయిన ఇద్దరికి వైపు తన చేతిలో ఉన్న కర్రని చూపించి ఆత్మలను లాక్కున్నాడు యమధర్మరాజు.
లోపలికి వస్తున్న వాళ్ళని చూసి మరొక ఇద్దరినీ షూట్ చేశారు దీప్తి, నీతులు.
అది చూసి "గుడ్ షాట్! బుల్లెట్స్ వేస్ట్ అవ్వకుండా బానే షూట్ చేస్తున్నారు." అని చెప్పాడు యోధ.
అంతలో రైట్ సైడ్ నుంచి కొంతమంది గోడ దుకడంతోనే ల్యాండ్ మైన్స్ మీద కాలు వేయగానే బ్లాస్ట్ అయ్యి ముక్కలు ముక్కలు అవ్వడం చూసి "వీళ్ళు చాలా ప్లాన్డ్ గా ఉన్నారు జాగ్రత్తగా ఉండండి." అని తన వాళ్ళ వైపు చూస్తూ చెప్పాడు షారుఖ్.
బ్లాస్ట్ అవ్వడం చూసి "ఎవరు గోడ దూకకండి ల్యాండ్ మైన్స్ పెట్టినట్లు ఉన్నారు, అందరూ ముందు వైపు నుంచి వెళ్దాము పదండి." అని తనతో పాటు ఉన్న వాళ్లకి చెప్పాడు ఖాసీం.
కంప్యూటర్లో చూస్తూ "వాళ్ళు గోడ దూకరు అక్కడి నుంచి వెళ్లి ఫ్రంట్ గేట్ నుంచి వస్తారు నా పందెం వెయ్యి రూపాయలు!" అని చెప్పాడు గబ్బర్ సింగ్.
"అవునా? వాళ్ళు ఇటువైపే వస్తారు చస్తారు." అని చెప్పి నంద వైపు చూశాడు క్యూబ్.
ఆ మాట విని నవ్వుతూ అక్కడ నుంచి మాయం అయ్యి ఎడమవైపు గోడ బయటకు వెళ్లి నంది రూపంలోకి మారి వేగంగా రంకే వేస్తూ అక్కడ ఉన్న వాళ్ళని తన తలతో ఒక్క కుమ్ము కుమ్మి మాయమై మళ్ళీ భూషణ్ పక్కకు వచ్చి కూర్చున్నాడు నంద.
ఆ దెబ్బకి అక్కడ ఉన్న వాళ్ళందరూ గోడతో సహా వెళ్లి ల్యాండ్ మైన్స్ మీద పడడంతో బ్లాస్ట్ అవ్వడం చూసి షాక్ అయ్యి
"వెళ్ళిపోతున్నారు కదరా! మళ్ళి గోడ పగలకొట్టుకొని లోపలికి ఎందుకు వచ్చి చచ్చారు, ఇప్పుడు నా వెయ్యి రూపాయలకి కాళ్లు వచ్చాయి." అని క్యూబ్ చేతిలో ఏడుస్తూ పెట్టాడు గబ్బర్ సింగ్.
"నంద వైపు చూసి ఎవర్ని చంపాను అని చెప్పావు!" అనుమానంగా చూస్తూ అడిగాడు ధర్మ.
"నేను వాళ్ళని చంపలేదు నా కొమ్ములతో ఒక్కసారి అదిలించను వాళ్లే వెళ్లి అక్కడ పడి చచ్చారు నాకు సంబంధం లేదు." అని చెప్పాడు నంద.
ఆ మాటకి నవ్వుతూ తన చేతిలో ఉన్న కర్ర ని గట్టిగా పట్టుకుని "ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎన్ని పాపాలు చేశారో నా యమపాశం కూడా అలసిపోతుంది." అని చెప్పాడు ధర్మ.
మూడు వైపుల నుంచి అందరూ ఒకేసారి రావడం చూసి "ల్యాండ్ మైన్స్ కంప్లీట్ అయిపోయాయి ఇంకా మనం మొదలుపెట్టాలి." అని చెప్పాడు రాఖి.
గోడ పక్కన నుంచుని షూట్ చేస్తూ "వీళ్ళ దగ్గర కూడా న్యూ మోడల్ గన్సే ఉన్నాయి." అని చెప్పాడు వర్ధన్.
కాన్ఫరెన్స్ లో ఆ మాట విని "అందుకే కదా మాకు ఇన్ని తిప్పలు!" అని చెప్పింది నీతూ.
షూట్ చేస్తూ "ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ చంపకుండా రాకెట్ లో ఎక్కించి స్పేస్ లోకి పంపిస్తే సరిపోతుంది అక్కడ హ్యాపీగా ఉంటారు." అని చెప్పింది దీప్తి.
కప్యూటర్ లో చూస్తూ "యోధ! వెనుక వైపు నుంచి చాలామంది వస్తున్నారు వాళ్లలో ముష్రు కూడా ఉన్నాడు." అని చెప్పింది పూజా.
"ఓకే!" అని చెప్పి ఐరన్ డోర్ ఒకటి చేత్తో పట్టుకుని వెనకవైపుకి వెళ్లి మీదకి వస్తున్న బుల్లెట్స్ కి డోర్ అడ్డంగా పెట్టి షూట్ చేస్తూ ఉన్నాడు యోధ.
అది చూసి ముష్రు చెయ్యి పట్టుకుని వెనక్కి లాగి "ఇది మిలిటరీ ట్రాప్ ఇక్కడ మనకి కావాల్సిన వాళ్ళు లేరు పద బయటికి వెళ్లి పోదాము." అని చెప్పాడు బషీర్.
"నో! ఆ వస్తువు సిగ్నల్ ఇక్కడే వస్తుంది నేను లోపలికి వెళ్లి ఎలాగైనా దానిని తీసుకోస్తాను." అని చెప్పాడు ముష్రు.
"సరే నీ కర్మ! మనం వాళ్ళని రౌండ్ అప్ చెయ్యడం కాదు మనల్ని లోపలికి రప్పించి మరి చంపుతున్నారు." అని అక్కడి నుంచి వెనక్కి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు బషీర్.
లోపలికి పరుగెత్తుకుంటూ వస్తున్న ముష్రుని చూసి వేగంగా వెళ్లి చెయ్యి పట్టుకుని లాగి తన వెనక్కి తీసుకువచ్చి వెపన్ రూమ్ లో ఉన్న పుష్కర వైపు చూసి "రాకెట్ లాంచర్ తీసుకురా..!" అని చెప్పాడు యోధ.
"సార్! బషీర్ కి విషయం అర్థమై వెన్నక్కి పారిపోయాడు." అని చెప్పాడు ముష్రు.
"అవునా?" అని కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ "వాళ్ళకి విషయం అర్థమైంది పారిపోవడానికి ట్రై చేస్తారు ఒక్కడు కూడా ప్రాణాలతో మీగలకూడదు." అని చెప్పి పుష్కర్ తెచ్చిన రాకెట్ లోంచి తీసుకుని అక్కడికి వస్తున్నా వాళ్ల మీదకి షూట్ చేశాడు యోధ.
"నువ్వు చెప్పింది కరెక్టే బషీర్ పరిగెత్తుకుంటూ కార్ దగ్గరికి వెళ్ళాడు అతన్ని చూసి కొంతమంది వెనక్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు." అని చెప్పింది నీతూ.
అందరి మాటలు వింటూ బుక్ ఓపెన్ చేసి చూస్తూ "ఇక్కడి నుంచి నలుగురు మాత్రమే బయటికి వెళ్తారు." అని చెప్పాడు గుప్తా.
కంప్యూటర్ ముందు దిగాలుగా కూర్చుని క్యూబ్ వైపు చూసి "నా శాలరీ మొత్తం కొట్టేసావు ఇంక నా దగ్గర డబ్బులు కూడా లేవు!" అని చెప్పాడు గబ్బర్ సింగ్.
"సరే! ఆఖరి పందెం ఇక్కడి నుంచి నలుగురు మాత్రం బతికి బయటికి వెళ్తారు మిగతా వాళ్ళందరూ చచ్చిపోతారు ఇప్పటివరకు గెలిచింది మొత్తం పందెంలో పెడుతున్నాను." అని చెప్పాడు క్యూబ్.
ఆ మాట విని అందరు బుల్లెట్స్ తగిలి కింద పడుతూ ఉండడం కంప్యూటర్లో చూసి "ఒక్కడు కూడా తప్పించుకునే ఛాన్స్ లేదు పందెం ఓకే కానీ నేను ఓడిపోతే డబ్బులు తర్వాత ఇస్తాను." అని చెప్పాడు గబ్బర్ సింగ్.
"సరే సరే! నాకు అప్పు ఇవ్వడం అంటే భలే సరదా!" అని పందెం కలిపాడు క్యూబ్.
కంప్యూటర్ లోకి చూస్తూ సంతోషంగా చప్పట్లు కొడుతున్న పూజా వైపు చూసి "నువ్వు ఒక్క పందెం కూడా వేయడం లేదు ఏమిటి?" అని డౌటుగా అడిగాడు గబ్బర్ సింగ్.
"నేను ఎంజాయ్ చేసేటప్పుడు టెన్షన్ పెట్టుకోలేను." అని కంప్యూటర్ వైపు చూస్తూ "రైట్ సైడ్ చూడండి వెనక్కి పారిపోతున్నారు త్వరగా షూట్ చేయండి." అని ఆనందంగా చూస్తూ ఫోన్ లో చెప్పింది పూజా.
అది చూసి "ఏమీ ఆనందం తల్లి నీది!" అని కంప్యూటర్ వైపు చూస్తూ "పారిపోనివ్వకండి చంపండి రా.. నాయనా... నా డబ్బులు మొత్తం వీడు దొబ్బేస్తున్నాడు ." అని ఏడుస్తూ చెప్పాడు గబ్బర్ సింగ్.
"నాకు ఒక విషయం అర్థం అవడం లేదు బుల్లెట్ తగిలిన తర్వాత కనీసం గిలగిలా కూడా కొట్టుకోవడం లేదు వెంటనే చచ్చిపోతున్నారు ఎందువల్ల అంటావు?" అని అడిగింది పూజా.
ఆ మాట విని 'యమధర్మరాజు రెడీగా ఉంటే ఇంకా ఎందుకు గిలగిల కొట్టుకుంటారు.' అని మనసులో అనుకున్నాడు క్యూబ్.
పరుగెత్తుకుంటూ కారు దగ్గరికి వచ్చి షారుక్ వైపు చూసి "మనవాళ్లందరి వెనక్కి రమ్మని చెప్పండి లోపల మిలటరీ ఉంది." అని కంగారుగా చెప్పాడు బషీర్.
ఆ మాట విని రజాక్, ఖాసీం లని తీసుకుని పరిగెత్తుకుంటూ కారు దగ్గరికి వెళ్ళాడు షారుఖ్.
అంతలో వెనక వైపు నుంచి షూట్ చేసుకుంటూ వస్తున్న యోధని చూసి "ఇక్కడ ఉంటే మనం కుడా పోతాము." అని కారు స్టార్ట్ చేశాడు ఖాసీం.
పైనుంచి అది చూసి "యోధ! నలుగురు కారులో పారిపోతున్నారు వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా బయటికి వస్తున్నారు." అని చెప్పింది నీతూ.
ఆ మాట విని స్పీడ్ గా పరిగెత్తుకుంటూ ఫ్రంట్ గేట్ దగ్గరికి వెళ్లి పరిగెత్తుకుంటూ వస్తున్న వాళ్ళని షూట్ చేస్తూ ఉన్నాడు యోధ.
కంప్యూటర్లో చూస్తూ "ఏంటి? బుల్లెట్స్ యోధ దగ్గరికి వెళ్లి కింద పడిపోతున్నాయి." అని కళ్ళు నలుపుకుంటూ అడిగాడు గబ్బర్ సింగ్.
"కరెక్ట్ గా చూడు బుల్లెట్స్ యోధ దగ్గరికి వెళ్లడం లేదు మధ్యలోనే ఆగిపోతున్నాయి, వాళ్ల చేతిలో ఉన్న గన్స్ అంత పవర్ఫుల్ కాదు అనుకుంటా!" అని చెప్పింది పూజా.
కుర్చీలోంచి లేచి "సరే! నువ్వు నాకు నెల జీతం బాకీ గుర్తుపెట్టుకో!" అని చెప్పాడు క్యూబ్.
ఆ మాట విని "మర్చిపోయా అంత చిన్న అమౌంట్ ఆ.. అయినా నాకు తీసుకోవడమే గాని తిరిగి ఇవ్వడం తెలియదు." అని నవ్వుతూ చెప్పేడు గబ్బర్ సింగ్.
"నాకు వసూలు చేయడం ఎలాగో బాగా తెలుసు!" అని చెప్పాడు క్యూబ్.
అక్కడినుంచి కార్ పారిపోతూ ఫోన్ తీసి సయ్యద్ కి కాల్ చేసాడు బషీర్.
ల్యాబ్ లో ఫోన్ కోసం వెయిట్ చేస్తూ రింగ్ అవడం చూసి హడావుడిగా లిఫ్ట్ చేసి "బషీర్! ఇద్దరు దొరికారా..?" అని సంతోషంగా అడిగాడు సయ్యద్.
"ఏంటి భాయ్ దొరికేది నువ్వు పంపించిన లొకేషన్ లో మిలటరీ వాళ్ళు ఉన్నారు నలుగురం మాత్రమే తప్పించుకున్నము మిగతా వాళ్ళందరూ చచ్చిపోయారు." అని టెన్షన్ గా చెప్పాడు బషీర్.
ఆ మాట విని షాక్ అయ్యి చూస్తున్న సయ్యద్ దగ్గర ఫోన్ తీసుకుని "మీకు మిలిటరీ ల్యాబ్ లొకేషన్ పంపుతాను అక్కడికి వెళ్ళండి నాకు తెలిసి ఇద్దరు అక్కడే ఉంటారు." అని చెప్పాడు కళింగ.
"ఓకే!" అని ఫోన్ పెట్టేసి వచ్చిన మెసేజ్ చూసి డ్రైవింగ్ చేస్తున్న షారుక్ వైపు తిరిగి "ఈ లొకేషన్ కి ఫాస్ట్ గా వేళ్ళు!" అని చెప్పాడు బషీర్.
" రుద్రం భజే! ఎపిసోడ్ 32 " రచనకు రేటింగ్ ఇవ్వండి
Posts: 1,156
Threads: 1
Likes Received: 730 in 473 posts
Likes Given: 10,935
Joined: Jun 2019
Reputation:
2
As expected diwali by Rudra and his team
Posts: 4,805
Threads: 9
Likes Received: 3,183 in 2,464 posts
Likes Given: 11,248
Joined: Sep 2019
Reputation:
31
Excellent update and abheeera ni kooda include chesaru waiting for next update
|