Thread Rating:
  • 25 Vote(s) - 3.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Part - 121



ఆ అరుపులకి గోలకి విశి బిత్తర చూపులు చూస్తూ ఉంటుంది. సూర్య నవ్వుతూ ఏమయ్యింది. ఏమిటి ఇలా ఉన్నారు..

చెప్పాను కదా...బిజినెస్ వేరే.. ఫ్యామిలీ వేరు అని. భరత్ దగ్గరికి వచ్చి భుజం చుట్టూ చెయ్యి వేసి నాకు ఇప్పటినుంచి సౌమ్యాతో పాటు ఇంకొక కూతురు కూడా ఉంది.

ఒరేయ్ ముందే చెబుతున్నాను నా కూతుళ్ళని ఎవరైనా ఏడిపించారే అనుకో అని శ్రీకర్ వైపు చూస్తాడు. సైలెంట్ గా ఒక నమస్కారం పెడితే అందరూ గట్టిగా నవ్వుతారు.

వైభవ్ మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు. అది చూసిన వినయ్ నువ్వేంటి రా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు.  ఏమీ లేదు నాన్న.

భరత్ మావయ్య వాళ్ళ కూతుళ్ళని ఏడిపిస్తే అంటున్నాడు. మరి అల్లుళ్ళని ఏడిపిస్తే ఆ మాటకి శ్రీకర్ మొఖం వెలిగిపోతుంది.

రాజ్ వైభవ్ భుజం మీద చెయ్యి వేసి.. ఒరేయ్ మీ అత్తలు టార్చర్ పెడుతున్నారు.. మేము పైకి ఏమైనా చెబుతున్నామా..

పళ్లు ఇకిలిస్తూ తిరగడం లేదా.. మీరు అంతే.. ఇది అన్యాయం మావయ్య.. మేము ఒప్పుకోము అని శ్రీకర్ గట్టిగా అంటాడు.

ఏది ఒప్పుకోరు రా.. వాళ్లకైతే ఒక న్యాయము మాకైతే ఇంకొక న్యాయమా..
అంతేగా అంతేగా..

విక్రమ్ వచ్చి ఇంకా ఆపండి.. కోడలు పిల్లని భయపెట్టకండి.  రారా బంగారం. ఈరోజు నుంచి జై సింహా ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యావు.

సో ఎంజాయ్ అని అన్నం కలిపి నోట్లో ముద్ద పెడతాడు. అది చూడగానే విశి కి కళ్ళు నీళ్లు తిరుగుతాయి.  ఆ కళ్ళు ఇంకొక చేత్తో తూడుస్తూ...  మేమంతా నీ వాళ్ళము సరదాగా కూడా నీ కళ్ళల్లో ఇవి చూడకూడదు అర్థమవుతుందా అని తినిపిస్తాడు.

వైభవ్ వచ్చి పెదనాన్న నాకు అంటే.. మీకు లేకుండానా అందరికీ తినిపిస్తాడు. అది చూసిన విశికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది.

విశి చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది అది అర్థం అయిన సూర్య అక్కడ ఉన్నంతసేపు కంట్రోల్ లో ఉంటాడు.

భోజనాలు అయిన తర్వాత సూర్య విశిని తన కాబిన్ కి తీసుకువెళతాడు. లాక్ చేయగానే వెంటనే గట్టిగా హగ్ చేసుకుంటుంది.

తల మీద చేయి వేసి ఏమైందిరా. చాలా థాంక్యూ దేవా సార్. ఇది నేను ఊహించలేదు..ఇంత మంచి ఫ్యామిలీ నాకోసం ఉంటుంది అని అస్సలు అనుకోలేదు తెలుసా..

నాన్న దూరమైన తరువాత అమ్మతో ప్రతిరోజు దిన దిన గండం గానే బ్రతికాను. ఇటు అమ్మకి ఏమవుతుందో..  రేపు తెల్లారితే ఖర్చులు ఎలాగా అన్న టెన్షన్ తోనే గడిపేసాను.

కానీ మీరు నా జీవితంలోకి వచ్చాక అని ఎక్కిళ్ళు పెడుతూ ఉంటే.. ష్.. అని నోటి మీద వేలు పెడతాడు. ఇప్పుడేనా డాడీ చెప్పారు సరదాగా కూడా నీ కళ్ళ వెంట ఇవి రాకూడదు అని.

కళ్ళు తుడుచుకుంటూ అవే వచ్చేస్తున్నాయి సార్ అంటుంది.  ఆ వెచ్చటి కన్నీళ్లపైన పెదవులు ఉంచుతాడు.
సూర్య ఆమె కన్నీళ్లపై పెదవులు ఉంచిన క్షణం…
విశి గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అవుతుంది.

ఆమె ముఖాన్ని రెండు చేతులతో మెల్లగా పట్టుకుని, నుదిటిపై తల పెట్టి నిశ్శబ్దంగా ఉంటాడు. మాటలు అవసరం లేని నిశ్శబ్దం అది.

విశి మాత్రం అతని షర్ట్ కాలర్ ని బిగించి పట్టుకుని ఇంకా దగ్గరగా చేరుతుంది.
సార్…
ఆ స్వరం కంపిస్తుంది.

ఇంకా సార్ అంటావా? అని చాలా సాఫ్ట్‌గా అడుగుతాడు. కోపం లేదు, హక్కు మాత్రమే.

ఆమె కళ్లలోకి చూస్తూ... ఇక్కడ నువ్వు ఒంటరిది కాదు విశి. భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను ఏడిపించిన ప్రపంచం ముందు నువ్వు ఒంటరిగా నిలబడాల్సిన పని కూడా లేదు అంటాడు.

విశి తల ఊపుతూ…  అంత ధైర్యం నాకు ఎప్పుడూ రాలేదు సర్. మొదటిసారి… ఎవరో నన్ను ఇలా చూసుకుంటున్నారు అన్న ఫీలింగ్ వస్తోంది అంటుంది.

అతను ఆమెను తన ఛాతికి దగ్గరగా తీసుకుని, జుట్టులోకి వేళ్లు జారుస్తూ  అది చూసుకోవడం కాదు… అంగీకరించడం. నిన్ను నువ్వుగా అంగీకరించడం అంటాడు.

ఆ మాటకి ఆమె మరింత బిగించి అతన్ని హగ్ చేస్తుంది.
ఆమె కన్నీళ్లు అతని షర్ట్ ని తడిపేస్తాయి.
ఇప్పుడు కూడా ఏడుస్తున్నావు అని మెల్లగా నవ్వుతాడు.

ఇవి బాధ కన్నీళ్లు కావు సర్… రిలీఫ్ కన్నీళ్లు అంటుంది.
అతను ఆమెను కొంచెం వెనక్కి తీసి, చెంప మీద బొటనవేలు తో కన్నీటి గీతను తుడుస్తూ
అయితే ఇవి చివరివి. ఇక ముందు నీ కళ్ళలో ఉంటాయి నవ్వులే అంటాడు.

విశి పెదవులు స్వల్పంగా వణుకుతాయి.  మీరు ఉన్నంతవరకు కదా… అంటుంది అణుకువగా.

సూర్య నవ్వుతూ  నేను ఉన్నంతవరకు కాదు విశి… నువ్వు నిన్ను నమ్మేంతవరకు. కానీ ఆ దాకా నేను నీ పక్కనే ఉంటాను అంటాడు.

ఆ మాటలకి ఆమె కళ్ళు వెలిగిపోతాయి.  మెల్లగా అతని భుజంపై తల పెట్టేస్తుంది. అతను ఆమె నుదిటిపై చిన్నగా ఒక ముద్దు పెట్టి  ఇలా… ఇదే సరిపోతుంది. ఎక్కువేమీ అవసరం లేదు అంటాడు.

క్యాబిన్ లో బయట ప్రపంచం గోలంతా మాయమైపోయి
ఆ ఇద్దరి మధ్యన మాత్రం  సాఫ్ట్ గా… వెచ్చగా…
భద్రత అనే భావమే మిగిలి ఉంటుంది.

గౌతమ్ ఫోన్ స్క్రీన్ వైపు అలా చూస్తూ నిలబడి పోతాడు.
చెవుల్లో ఇంకా అదే మాట మారుమోగుతోంది.
సూర్య దేవా ఒక్కరే…
సూర్య దేవాన్ష్ జై సింహ..
అంతే.
గుండె ఒక్కసారిగా దడపడుతుంది.
ఇన్నాళ్లూ అతడు నమ్ముకున్న కథ కూలిపోయింది.

సూర్య దేవా అంటే...
ఒక గ్రూప్.
ఒక నెట్‌వర్క్.
వెనుక ఎన్నో చేతులు.
కానీ ఇప్పుడు…
ఒక్కరే.
ఒక్క మనిషే.
గౌతమ్ నుదుటిపై చెమట చుక్క పడుతుంది.

ఒక్కడే అయితే…  నన్ను ట్రేస్ చేయడం ఎంత టైం పడుతుంది?
అతడి మెదడు స్పీడ్ గా పరుగు పెడుతుంది .
అతడు చేసిన పనులు…
ఫేక్ డాక్యుమెంట్స్…
షెల్ కంపెనీలు…
మధ్యలో వేసిన మనుషులు…
అన్నిటికీ మూలం చివరికి గౌతమ్ అనే పేరు దగ్గరే ఆగుతుంది.

అతడు వెంటనే ల్యాప్‌టాప్ మూసేస్తాడు.  రూమ్ లో అటూ ఇటూ తిరుగుతాడు.
విక్రమ్ జై సింహ..
సూర్య దేవాన్ష్ జై సింహా...
విశిష్ట....
మూడు పేర్లు…
మూడు ముప్పులు.
అతడికి అర్థమవుతుంది.

ఇప్పుడు నేరుగా ఎదురెళ్లడం ఆత్మహత్య. తప్పించుకోవాలి. కానీ పారిపోవడం కాదు.
గౌతమ్ ఫోన్ తీసుకుని ఒక నెంబర్ డయల్ చేస్తాడు.

అటు పక్కనుంచి లిఫ్ట్ చేయగానే ప్లీజ్ సేవ్ మీ. మా వల్ల కాదు. నువ్వు పెట్టుకుంది జై సింహా ఫ్యామిలీతో. మాకు ఎప్పుడూ ఫోన్ చేయొద్దు అని పెట్టేస్తారు.

ఏమి చెయ్యాలో అర్థం కాదు..దేవా ఇచ్చిన వార్నింగ్ గుర్తుకు వస్తుంది..అప్పుడు దేవా ఒక ఆర్డినరీ లెక్చరర్ అనుకుని విర్రవిగాను కానీ ఇంత బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని కేవలం ఆ విశి కోసం ఒక లెక్చరర్ గా వచ్చాడా..

ఒక్కరోజులోనే ఫ్రాడ్ చేసిన వ్యక్తిని పట్టుకున్నారు అంటే నన్ను నాశనం చేయడం వాళ్లకి చిటికె వేసిన అంత పని. ఈలోపే నేను ఇక్కడి నుండి తప్పించుకోవాలి అని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ సర్దుతూ ఉంటాడు.

కానీ ఈలోపే జరగవలసిన అనర్థం మొత్తం జరిగిపోతుంది. గౌతమ్ కంపెనీ తో డిల్స్ కుదుర్చుకున్న అందరూ క్యాన్సిల్ చేసుకుని రిటర్న్ మనీ ఇమ్మని గొడవ చేస్తూ ఉంటారు.  షేర్స్ మొత్తం పడిపోతాయి.

బయటికి అడుగుపెట్టే సమయానికి సెక్యూరిటీ ఆఫీసర్లు రెడీగా ఉంటారు.

ఒకటికి నాలుగు కేసులు బుక్ అవుతాయి. మొదటిది విశిష్ట ని హెర్రాస్ చేయడం.. రెండు కంపెనీ లో ఫేక్ ఆర్కిటెక్చర్ ని పెట్టుకుని వేరే కంపెనీస్ ని మోసం చేయడం.

మూడు లేని ఫండ్స్ ని ఉన్నవిగా క్రియేట్ చేయడం నాలుగు వి. జె. స్ కంపెనీ లో ప్రాజెక్టు విషయంలో చీట్ చేయడం.

బెయిల్ కూడా దొరకనంత పకడ్బందీగా కేసు ఫైల్ చేస్తారు. అంతా అయిపోయింది అని గౌతమ్ కి అర్థమవుతుంది. అక్కడ ఉన్న సూర్యా మనిషికి కాల్ వస్తే...

లిఫ్ట్ చేసి ఓకే సార్ అని వీడియో కాల్ ఆన్ చేసి గౌతమ్ ముందు పెడతాడు. ఏంటి మిస్టర్ గౌతమ్ ఎలా ఉన్నావు. సూర్య అని పిడికిలి బిగిస్తాడు.

ఎస్ సూర్య దేవాన్ష్ జై సింహ అని పొగరుగా చెబుతాడు. నీకు ఆ రోజే వార్నింగ్ ఇచ్చాను విశి జోలికి రావద్దు అని. వార్నింగ్ వదిలేస్తున్నాడు వీడేమి చేస్తాడు అని లైట్ తీసుకున్నావు.

కానీ ఏమి జరిగింది.  డెవలప్ అవుతున్నావు కదా నీ లైఫ్ స్పాయిల్ చేయడం ఎందుకు అని వార్నింగ్ ఇస్తే లెక్క చేయలేదు.

ఆఖరికి మా కంపెనీలోనే చీట్ చేయడానికి కూడా రెడీ అయ్యావు.. ఇంకా నిన్ను వదులుతాను అని ఎలా అనుకున్నావు మిస్టర్.

గౌతమ్ చిన్నగా నువ్వు ఎవరో ముందే చెప్పి ఉండి ఉంటే ఇంత వరకు వచ్చేది కాదు కదా..  ఆ మాటకి గట్టిగా నవ్వుతూ మనిషి పొజిషన్ బట్టి విలువ ఇవ్వడం కాదు.

వాళ్ల వ్యక్తిత్వాన్ని బట్టి విలువ ఇవ్వాలి.  నేనెవరో తెలిస్తే నా అడుగులకి మడుగులు వత్తేవాడివి.. నేను ఎవరో తెలియదు కాబట్టే నీ క్యారెక్టర్ మాకు తెలిసింది.

ఇప్పుడైనా జైల్లో బుద్ధిగా ఉండు.  నీ ప్రవర్తన బాగుంది అంటే బయటకు వచ్చాక నువ్వు నిలబడడానికి హెల్ప్ చేస్తాను.. లేదు ఇలాంటి వేషాలే వేస్తాను అంటే జైల్లోనే ఆ పొగలో మాయమైపోతావు.

సూర్య మనిషి ఫోన్ తీసుకుని వెళ్ళిపోతాడు. గౌతమ్ సైలెంట్ గా సెక్యూరిటీ ఆఫీసర్లకి సరెండర్ అయ్యి జైలుకి వెళతాడు.

రమేష్ కంగారుగా హిమా... హిమా అని అరుస్తూ వస్తాడు. నెయిల్ పాలిష్ వేసుకుంటున్నా హిమ ఏమైంది డాడీ ఎందుకు అలా అరుస్తున్నారు.

నీకు ఈ విషయం తెలిసిందా... ఏ విషయం గురించి. ఆ గౌతమ్ ని అరెస్టు చేశారంట. అది మనం ముందే ఊహించము కదా. ఇప్పుడు ఎందుకు అంత కంగారు పడుతున్నారు.

కంగారు పడవలసిన విషయమే ఉంది. ఆ కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అయినా ఆ దేవా ఎవరో కాదు సూర్యనే..

హిమ రియాక్షన్......
[+] 8 users Like SivaSai's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Part - 122



కంగారు పడవలసిన విషయమే ఉంది. ఆ కాలేజీలో లెక్చరర్ గా జాయిన్ అయినా ఆ దేవా ఎవరో కాదు సూర్యనే..

రమేష్ ఆ మాట చెప్పగానే హిమ చేతిలో నైల్ పాలిష్ బాటిల్ నేలపైన పడుతుంది. ఏమంటున్నారు డాడీ అని దగ్గరికి వచ్చి కంగారుగా అడుగుతుంది.

అవును బేబీ ఆ సూర్య,  దేవా ఇద్దరూ ఒక్కటే. అలా జరగడానికి వీలు లేదు ఆ దేవ ఒక నార్మల్ ఎంప్లాయ్.  మీకు సరిగ్గా ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండదు.

లేదు బేబీ ఈరోజు ఆ విక్రమ్ అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేసాడంట.  అంతే హిమ ఆశలన్నీ పేక ముక్కల లాగా కూలిపోతాయి.

అలా ఎలా జరుగుతుంది డాడీ ఆ దేవ ఆ ఇడియట్ విశిష్ట వెనుక తిరుగుతాడు. తనతో ఉంటాడు.  అంటే విశిష్ట కోసం సూర్య ఒక నార్మల్  ఎంప్లొయ్ గా వచ్చాడా..

గౌతమ్ నుంచి ప్రతిసారి ప్రొటెక్ట్ చేస్తున్నాడా... నేలపైన కూర్చుండి పోయి..  తలలో చేతులు పెట్టుకొని జుట్టు పీక్కుకుంటూ ఉంటుంది.

హిమ ఒక్కసారిగా నేల మీదే కూర్చుంటుంది.
చేతులతో తల పట్టుకుని జుట్టు పీక్కుంటూ ఉంటుంది.
హిమ హిస్టారికల్‌గా అరుస్తూ...  అంటే… అర్థమవుతుందా డాడీ…  నేను నమ్మినదంతా అబద్ధమా?
సూర్య… దేవా… నా కోసం కాదు…
విశిష్ట కోసం…  ఆ అమ్మాయి కోసం…

కళ్లల్లో నీళ్లు కాదు… మండుతున్న అగ్ని.
బ్రేక్ అయిన ఆశలు ఒక్కొక్కటి గుర్తుకు వస్తాయి.
సూర్య నవ్వు…
తనని చూడగానే మారిన అతని చూపు…
ప్రతిసారి గౌతమ్ దగ్గర నుంచి విశి ని కాపాడిన తీరు…

హిమ గట్టిగా అరుస్తూ....  అంతా నాటకం డాడీ
నేను ఎర్రి పువ్వు ని.  అతను నా కోసం కాదు…
ఆ విశిష్టని కాపాడడానికి ఇక్కడికి వచ్చాడు.

దానికోసమే నాతో నవ్వుతూ మాట్లాడాడు.  ఆఫీస్ లో కలవకుండా ఫోన్ నెంబర్ నాకు దొరకకుండా ప్లాన్ చేశాడు.
టేబుల్ మీద ఉన్న నైల్ పాలిష్ బాటిల్స్ ‌ను గట్టిగా గోడకి విసిరేస్తుంది.

చిన్న చిన్న గాజు ముక్కలు చెల్లాచెదురవుతాయి...  హిమ హృదయంలానే.  రమేష్ వెంటనే దగ్గరికి వెళ్లి ఆమె భుజాలు పట్టుకుంటాడు.
రమేష్  రగిలిపోతూ...  హిమ! కంట్రోల్ యువర్ సెల్ఫ్..
హిమ వణుకుతూ...  నేను ఎలా కంట్రోల్ అవ్వాలి డాడీ?
ఆ అమ్మాయి ఏం చేసిందని?  ఏం ఉంది ఆమె దగ్గర?
నాకన్నా ఏం ఎక్కువ??
నా దగ్గర ఉన్నట్టుగా డబ్బు లేదు.  సోషల్ స్టేటస్ లేదు. ఏమి చూసి ఆ విశిష్ట వెనకాల పడ్డాడు.

అసూయ…
అవమానం…
అహంకారం…
అన్నీ కలిసిపోతాయి.
హిమ పళ్ళు బిగించి...  విశిష్ట వల్లే నాకు అన్నీ పోయాయి.
సూర్యని… నా లైఫ్‌ని…  అతన్ని కూడా ఆమె నుంచే దూరం చేయాలి.

అప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న రమేష్ కళ్లలో ఒక మెరుపు.
బిజినెస్ మైండ్ ఆన్ అవుతుంది.
రమేష్ వంకరగా నవ్వుతూ... అందుకే నువ్వు నా కూతురివి హిమ.
ఏడవడం కాదు…
ఎదుటివాడిని నేలకొరిగించడం మన స్టైల్.

హిమ అతని వైపు చూస్తుంది.  కళ్లల్లో ఆశ కాదు… ప్రతీకారం. విశి నీ ఎలాగైనా నాశనం చేయాలి అన్న అసూయ.

ఏం చేయాలి డాడీ?  నాకు ఆ విశిష్ట ముఖం చూడగానే కోపం వస్తోంది. గౌతమ్ నాతో ఉన్నప్పుడు కూడా కూల్ గా ఉంది అంటే అప్పటికే అది సూర్య తో రిలేషన్ లో ఉన్నట్టుంది డాడీ.

రమేష్ కుర్చీలో కూర్చొని వేళ్లను కలిపి ఆలోచిస్తాడు.
రమేష్ స్లోగా...  విశిష్ట బలహీనత ఏంటో తెలుసా?
ఆమె ఇమేజ్.  ఆఫీస్ లో ఆమెని పర్ఫెక్ట్ గర్ల్ గా చూస్తారు.

ఆమె అమ్మ కూడా బలహీనతే కదా..

కొంచెం ముందుకు వాలి…  ఆ ఇమేజ్‌ని ఒక్కసారి పగలగొడితే…  సూర్యే కాదు…  ఈ ఆఫీస్ మొత్తం ఆమే ని తప్పుగా చూస్తుంది.

హిమ కళ్లలో క్రూరమైన సంతోషం మెరుస్తుంది.
హిమ చెప్పలేనంత ఆనందంతో...
అంటే…  ఆమెనే తప్పు చేసినట్టు చూపించాలా?

రమేష్ చిరునవ్వు...  అది ప్రేమ కాదు, విషం.
తప్పు చేసినట్టు కాదు హిమ…  తప్పు చేయాల్సిన పరిస్థితిలోకి నెట్టాలి.  హిమ నెమ్మదిగా లేచి నిలబడుతుంది.

ఇప్పుడామె విరిగిపోయిన అమ్మాయి కాదు…
ప్లాన్‌లో భాగమైన శత్రువు.

హిమ.కూల్ గా నవ్వుతూ...  సూర్య నావాడు కాకపోయినా…  విశిష్టకి మాత్రం దక్కనివ్వను అని నిరూపిస్తాను డాడీ.

హిమ కళ్లలో అసూయ…
రమేష్ కళ్లలో కుట్ర…

ఆఫీసులో మనకి హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా... డబ్బులు ఇస్తే ఎవరైనా చేస్తారు బేబీ .అయితే ఇమీడియట్ గా కొనేయండి.

ఒకసారి గౌతమ్ నీ కలిస్తే అని రమేష్ అడుగుతాడు. అవసరం లేదు డాడ్ వాడొక వేస్ట్ ఫెలో.

ఒక్కొక్కసారి వేస్ట్ ఫెలోస్ తో కూడా పని అవుతాయి నువ్వే వెళ్లి నాలుగు సింపతి మాటలు మాట్లాడి విషయం కనుక్కో అప్పుడు మనం ఎలాంటి స్టెప్ వేయాలి అన్నది ఆలోచిద్దాం.

హిమ సరే అని గౌతమ్ ని కలవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని వెళుతుంది. జైల్లో చూడగానే ఏమిటి గౌతమ్ ఇలాగయింది అని రాని కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటుంది.

నువ్వు వచ్చిన పని ఏమిటో చెప్పు అని చిరాకుగా అడుగుతాడు.  అలా మాట్లాడతావేమిటి. మనిద్దరం పెళ్లి చేసుకోవాలి అనుకున్నాము.

అలాంటిది నువ్వు జైల్లో ఉంటే నాకు ఎంత బాధగా ఉంటుందో చెప్పు. దీని అంతటికీ కారణం విశిష్ట నే కదా. వదలను.

నీ పగ నా పగ కలిపి నాశనం చేస్తాను అని అక్కడ ఊచలు పట్టుకొని ఆవేశంగా చెబుతుంది.  ఆ మాటకి గౌతమ్ గట్టిగా నవ్వుతూ నువ్వు ఇంకా ఊహల్లోనే ఉన్నావా...

నా ఊహలన్నీ మబ్బులు విడినట్టుగా విడి ఇదిగో ఇక్కడికి వచ్చి పడ్డాను.  నువ్వు ఆ విశిష్ట జోలికి వెళ్ళావు అంటే ఆడదానివి అని కూడా చూడకుండా నా పక్క సెల్లోనే కూర్చో పెడతారు.  ఏం మాట్లాడుతున్నావు నువ్వు.

నిజమే చెబుతున్నాను. మొత్తం ఆ జై సింహ ఫ్యామిలీ మొత్తం విశిష్ట కి సపోర్టుగా ఉన్నారు.  ఒక్కరోజులోనే నేను పెట్టిన మనిషిని పట్టుకోవడంతో పాటు నా కంపెనీని కూడా క్లోజ్ చేసారు.

అలాంటిది నువ్వు వెళతావా.. ఏ నేనెందుకు చేయలేను అని పొగరుగా అడుగుతుంది. అసలు నీ దగ్గర ఏముందని వెళ్లి ఢీకొట్టగలవు.

టాలెంట్ ఉందా లేదు. పోనీ నిజాయితీ ఉందా సున్నా. ఇంకా ఎలా వెళతావు.

గౌతమ్ నువ్వు నన్ను అవమానిస్తున్నావు. అవమానించడం లేదు నిజమే చెబుతున్నాను. నువ్వు ఈరోజు ఒక పాపులర్ ఆర్కిటెక్చర్ గా మారావు అంటే దానికి కారణం విశిష్ట వర్క్.

తన టాలెంట్ ని వాడుకునే నువ్వు ఇక్కడ వరకు వచ్చావు. నాకున్న అత్యాశతో విశిష్ట ని చీట్ చేశాను. నువ్వు నన్ను చీట్ చేసి ఆ సూర్య చెయ్యి పట్టుకోవాలి అనుకుంటున్నావు.

హిమ కంగారుగా నువ్వు పొరపాటు పడుతున్నావు.  ఆ సూర్య చెయ్యి నేను ఎందుకు పట్టుకోవాలి అనుకుంటాను. నీ గురించి నాకు తెలుసు.

ఒక తోడేలకి ఇంకో తోడేలు గురించి తెలియదా...  ఇప్పుడు నీకు విశిష్ట మీద కోపం కూడా..  సూర్య విశిష్టాని ప్రేమించాడు అన్న విషయం మీదే.. అంతేగాని నా గురించే కాదు కదా..

నీ మంచి కోసమే చెబుతున్నాను. ఇప్పటికీ వచ్చిన పేరుని వాడుకుంటూ నీ కంపెనీ గ్రోత్ కి ఏదో ఒకటి చేసుకో. అంతేగాని విశిష్ట జోలికి వెళ్లడం కానీ సూర్య మీద మోజుతో గానే ఉన్నావు  అనుకో...

నెక్స్ట్ నువ్వు మీ బాబు ఇద్దరూ వచ్చి నా పక్కనే కూర్చుంటారు. జాగ్రత్త అని వెళ్ళిపోతాడు. వెళుతున్న గౌతమ్ ని చూస్తూ ఆ ఊచలు గట్టిగా పట్టుకుని నాకే అడ్వైస్ ఇస్తావా..

నేనంటే ఏమిటో చూపిస్తాను. ఆ విశి ని నలుగురిలో తలెత్తుకో లేకుండా చేస్తాను  అని అక్కడ నుండి వెళ్లిపోతుంది.

విశి రోజు వెళ్లినట్టే గానే ఆరోజు కూడా ఆఫీస్ కి వెళుతుంది. స్కూటీ పార్క్ చేసి భవ్య కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది.

భవ్య పరిగెత్తుకుంటూ వచ్చి సారీ లేట్అయ్యానా.. మరి కాదా పదా అని నవ్వుతూ వెళుతూఉంటారు.  వీళ్లిద్దరూ వెళుతూ ఉంటే పక్కన ఒక లేడీ ఎంప్లాయి మీరు లేటుగా వస్తే ఏమయింది..

సూర్య సార్ మీ గ్రిప్ లో ఉన్నారు కదా అని వెటకారంగా మాట్లాడుతుంది. భవ్య కోపంగా అనబోతే విశి చేయి పట్టుకుని ఆపుతుంది.

చూడండి మీరు ఏదేదో మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు. ఆ ఎంప్లాయ్ కోపంగా నన్ను కరెక్ట్ కాదు అంటున్నావా.  ఎలా అనగలుగుతావు.

నేనిక్కడ ఎప్పటినుంచో వర్క్ చేస్తున్నాను. నువ్వు బ్యాక్ డోర్ నుంచి ప్రాజెక్ట్ పట్టుకుని వచ్చావు. సూర్య సార్ తో నీకున్న రిలేషన్ బట్టే కదా ఇక్కడ ప్రాజెక్ట్ నీకు ఇచ్చారు. లేకపోతే విక్రమ్  సార్ మీ వైపు చూస్తారా..

ఆ మాటకి విశికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇది నేను బ్యాక్ డోర్ నుంచి వచ్చింది కాదు. నా వర్క్ జెన్యూన్ గా ఉంది కాబట్టే విక్రమ్ సార్ తీసుకున్నారు.

మీకు నా గురించి తెలియకపోవచ్చు కానీ విక్రమ్ సార్ గురించి తెలుసు కదా.. ఎందుకు తెలియదు. సార్ గురించి మా అందరికీ బాగా తెలుసు కానీ నువ్వు సూర్య సార్ ని ఎలా ట్రాప్ చేసావో మాకు తెలియదు కదా.

ఆయన కొడుకు మీద ఉన్న ప్రేమతో ఒప్పుకొని ఉండవచ్చు. లేకపోతే స్టడీస్ అవ్వకుండానే నీతో ప్రాజెక్ట్ కోలాబరేట్ అవ్వడమా..

నీకన్నా బెస్ట్ ఆర్కిటెక్చర్ మన కంపెనీలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ పక్కనే పెట్టి నీకే ఎందుకు ఈ ప్రాజెక్టు ఇచ్చారు. ఏముంది నీలో అంత స్పెషల్.

భవ్య కోపంగా మీకు విశి గురించి ఏమి తెలుసు అని మాట్లాడుతున్నారు.  తను ఇదే కాదు ఇప్పటికే చాలా ప్రాజెక్ట్ చేసింది.

కాలేజీలోనే తను చాలా బెస్ట్ స్టూడెంట్.  బెస్ట్ స్టూడెంట్ అయినంత మాత్రాన ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇస్తారా ఆ ఎంప్లాయ్ ఇంకా చులకనగా మాట్లాడుతుంది.

ఏం జరుగుతుంది ఇక్కడ అన్న వాయిస్ వినపడగానే... ఆ ఎంప్లాయ్ భయపడుతూ చూస్తుంది.

వచ్చింది ఎవరు......
[+] 7 users Like SivaSai's post
Like Reply
Part - 123



అడుగుల శబ్దానికి ఎంప్లాయ్ గుండె దడదడలాడుతుంది. చుట్టూ చూస్తూ ఉన్న ఎంప్లాయిస్ అందరూ ఒక పక్కకి వెళ్ళిపోతారు.

విశి కన్నీళ్ళతో నిలబడి ఉంటుంది. ఎదురుగా వచ్చి నిలబడిన వ్యక్తి విశిని చూస్తాడు..మిస్ విశిష్ట అని పిలవగానే తల పైకెత్తి చూస్తుంది.

అక్కడ విక్రమ్ కోపంగా నిలబడి ఉంటాడు.. తప్పు చేసిన వాళ్ళే తలదించుకోవాలి మీరు ఏం తప్పు చేశారు అని అడిగితే..

సార్ ఈ అమ్మాయి అని మాటలు కష్టంగా కూడా తీసుకుంటూ ఉంటుంది. ఒక్కళ్ళు ఎదుగుతూ ఉంటే నిందలు వేయడం సహజం అలా అని ఆ నిందలకే భయపడి కూర్చుని ఏడుస్తూ ఉంటారా లేకపోతే ఆ ఫాల్స్ ఎలగేషన్స్ ని తిప్పి కొడతావా..

సూర్య క్యాబిల్లో కూర్చుని ఇదంతా చూస్తూ ఉంటాడు.  శ్రీకర్ పక్కనే కూర్చుని..  ఏమిటి బావ నువ్వు వెళ్లొచ్చు కదా. నువ్వు ఉంటే ధైర్యంగా ఉంటుంది.

లేదు బావ.  అస్తమాను నావైపే చూస్తుంది. తనకి టాలెంట్ ఉన్నా సరే తన మీద నమ్మకం లేకపోతే ఎలా... నన్ను చూస్తేనే ధైర్యం. నేను పక్కనుంటేనే మాట్లాడగలడం ఎలా.

రేపు తను సెల్ఫ్ గా ఇక్కడ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేయాలి.   మాట్లాడడం అనే విషయంలో భయపడి వెనక్కి అడుగు వేస్తుంది.

ఇప్పుడు నీ ఉద్దేశం ఏమిటి బావ.  విశినే తన ప్రాబ్లం నుంచి బయటికి రావాలా. అవును.  ఖచ్చితంగా రావాలి. కానీ ఇంత పెద్ద ఆఫీసులో తను అని..  శ్రీకర్ ఆలోచన ఆగిపోతూ..

ఏదో స్ట్రైక్ అయినట్టుగా సూర్య వైపు చూస్తాడు.  అంటే ఇదంతా బాబు కొడుకుల ప్లానా... ఆ మాటకి సూర్య చిన్నగా నవ్వుతూ కొంతవరకు నిజము. కాకపోతే కలిసి వచ్చింది.

అర్థం కాలేదు ఆ ఎంప్లాయ్ ని హిమ కొనేసింది. కావాలని గొడవ మొదలు పెట్టింది. సో అది మనకు అనుకూలంగా మార్చుకున్నాను అంతే.

రిలాక్స్డ్ గా కూర్చుని ఏమిటా సూర్య బాబు విశి ని అలా సెంటర్లో వదిలేసాడా అనుకున్నాను. వెనక ఇంత ప్లాన్ ఉందా..  లేకపోతే క్యూటి ఏడుస్తూ ఉంటే నేనిక్కడ ఇంత రిలాక్స్డ్ గా ఉంటానా..

విక్రమ్ ఆ ఎంప్లాయ్ వైపు చూస్తూ ఏమిటి ప్రాబ్లం చెప్పు అని గట్టిగా అడుగుతాడు.  సార్ అది అన్ని టెన్షన్ పడుతూ ఉంటే ఫ్లోర్ మేనేజర్ వచ్చి అక్కడ చైర్ వేస్తాడు.

విక్రమ్ కూర్చొని ఏ విషయమైనా సరే ఓపెన్ గా మాట్లాడండి.. అప్పుడే ప్రాబ్లం ఏమిటి అన్నది తెలుస్తుంది నా కంపెనీలో చిన్న మిస్టేక్ జరిగిన ఒప్పుకోను.

ఆ ఎంప్లొయ్ ధైర్యం చేసుకుని సార్ ఈ అమ్మాయి వి రీసెంట్గా స్టడీస్ కంప్లీట్ అయ్యాయి కానీ ఇంత పెద్ద ప్రాజెక్టు అమ్మాయికి మీరు ఎలా ఇచ్చారు.

అంతకన్నా బెస్ట్ ఆర్కిటెక్ట్ స్ మన కంపెనీలో చాలామంది ఉన్నారు. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లు ఉన్నారు కానీ అందరినీ పక్కనపెట్టి ఇప్పటివరకు మన ఆఫీసులో చూడని ఈ అమ్మాయికి ఎలా ఇంత పెద్ద ప్రాజెక్టు హ్యాండోవర్ చేశారు.

రేపు ఏదైనా జరిగితే మన కంపెనీకి ఎంత బాడ్ నేమ్. వెల్...  ఇప్పుడు మీరు కంపెనీ గురించి ఆలోచించి విశిష్ట ని ఇక్కడ ఆఫీస్ లో ఇంత బ్యాడ్ గా మాట్లాడుతున్నారన్నమాట గుడ్.

సో నా నిర్ణయం తప్పు అని ఒక ఎంప్లాయ్ జడ్జిమెంట్ ఇచ్చింది.  ఆ ఎంప్లాయ్ కంగారుగా సార్ నా ఉద్దేశం అది కాదు . పరవాలేదు చెప్పండి.

ఆ ఎంప్లాయ్ భయంగా చూస్తుంది. పరవాలేదు మాట్లాడండి అని కొంచెం గట్టిగా అనే విక్రమ్ అడుగుతాడు. ఇక ఏదైతే అది అయింది అని ఈ అమ్మాయికి మీ అబ్బాయి సూర్య సార్ కి ఎఫైర్ ఉంది అని టాక్ ఉంది సార్.

సో ఆ ఎఫైర్ తోనే తను బ్యాక్ డోర్ నుంచి వచ్చి ఇంత పెద్ద ప్రాజెక్టు హ్యాండ్ ఓవర్ చేసుకుంది అని ఇక్కడ చాలామంది ఎంప్లాయిస్ మాట్లాడుకుంటున్నారు.  ఆ విషయమే నేను అడిగాను.


చాలామంది ఎంప్లాయిస్. ఎవరు.. ఒక ఇద్దరిని నా ముందుకి తీసుకురా.. మీ ముందుకంటే భయపడతారు కదా.

మీరు చాలా ధైర్యవంతురాలు కాబట్టి నా ముందు ఇంత ధైర్యంగా మాట్లాడి నా తప్పును ఎత్తి చూపించారన్నమాట..

పి ఎ  ని పిలుస్తాడు. చెప్పండి సార్ అనగానే...  మన ఆఫీసులో ది బెస్ట్ ఆర్కిటెక్చర్ అని అవార్డు తీసుకున్న ప్రతి ఎంప్లాయ్ ని నా ముందుకు తీసుకురండి అని చెబుతాడు.

ఎంప్లాయిస్ అందరూ వస్తారు. మేనేజర్ వైపు చూడగానే ఎస్సార్ అని ఒక ప్రాజెక్టు తీసుకు ఫైల్ తీసుకువచ్చి...  అక్కడ పెడతారు.

అందరూ వైపు చూసి ఇప్పటివరకు మన కంపెనీలో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు తీసుకున్న వాళ్ళు మీరు.

సో ఇప్పుడు ఒక టాస్క్ మీ ముందు ఉంది ఈ అమ్మాయి పేరు విశిష్ట ఒక ప్రాజెక్ట్ విషయంలో కొలాబరేట్ అయ్యాము.

నా నిర్ణయం తప్పు అని ఒక ఎంప్లాయ్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ మాటకి ఆ ఎంప్లాయ్ ఒళ్లంతా చెమటలు పట్టేస్తాయి.

అందరూ సార్ అని ఒక్కసారిగా పిలుస్తారు.  ఇట్స్ ఓకే ఇప్పుడు మిమ్మల్ని పిలిచింది దేనికి అంటే.. మీ ముందు పెడుతున్న ఫైల్ చాలా ప్రెస్టేజ్ ఇష్యూ  ది.

మీ వర్క్ అని మేనేజర్ వైపు చూడగానే... ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన కాపీస్ అని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఇస్తాడు.  ఇంక్లూడింగ్ విశిష్ట తో సహా..

ఫోర్ డేస్ టైం ఇస్తున్నాను అందరూ ఎవరు సెల్ఫ్ ప్రెజెంటేషన్ వాళ్లు నాకు ఇవ్వాలి. ఈ ఎంప్లాయ్ అక్కడ జడ్జిమెంట్ ఇస్తుంది ఓకేనా అని..

ఎంప్లాయ్ వైపు తిరిగి అడుగుతాడు.  ఆ మాటకు ఎంప్లాయ్ నా ఉద్దేశం.. నా ఉద్దేశం...అని తడబడుతూ ఉంటే మీరు అడిగిన దానికి సమాధానం ఇవ్వాలి కదా.

నా నిర్ణయం తప్పు అయితే గనక మీకు మన అడ్వైస్ డిపార్ట్మెంట్లో ఊహించని పోస్ట్ ఇస్తాను. అదే నీ నిర్ణయం తప్పయితే అని ఒక ఈవెల్ స్మైల్ ఇస్తాడు.

ఆ స్మైల్ కి తన ఫ్యూచర్ ఏమిటో అర్థం అవుతుంది. విక్రమ్ ఎవరి వైపు చూడకుండా అక్కడ నుంచి తన క్యాబిన్ కి వెళ్ళిపోతాడు.

ఫ్లోర్ మొత్తం మెల్లిగా ఖాళీ అవుతుంది.విశిష్ట చేతిలో ఫైల్ పట్టుకుని నిలబడి ఉంటుంది.  కళ్లలో కన్నీళ్లు ఆగిపోయాయి… కానీ లోపల ఏదో బలంగా కుదురుకుంటోంది.

సూర్య క్యాబిన్ వైపు ఒక్కసారి చూస్తుంది. అక్కడ నుంచి ఏ రియాక్షన్ లేదు.  అదే కావాలి అన్నట్టు… తల దించుకుని తన డెస్క్ వైపు నడుస్తుంది.

శ్రీకర్ లోపలే... ఇప్పుడే మొదలైంది… సూర్య నే చూస్తూ తమరు ఏమిటి స్పందించారా. ఈ నాలుగు రోజులు నేను క్యూటికి అసలు కనిపించను.

ఒరేయ్ అదేం డెసిషన్ రా... అవును తను ఎంత స్ట్రాంగ్ గా నిలబడగలదో అన్నది తనకే తెలియాలి. సో నేను కనిపించడం కానీ మెసేజ్లు చేయడం కానీ చెయ్యను కానీ చూస్తాను.
దీనినే శాడిజం అంటారు. నువ్వు ఏదైనా అనుకో.  నేను ఎప్పుడూ  బ్యాక్ బోన్ గా నిలబడతాను ఉంటాను అంతే.

నాలుగు రోజులు... అందరూ సీరియస్ వర్క్ లో ఉంటారు. ఆఫీస్ ఎప్పుడు సైలెంట్ గానే ఉంటుంది కానీ ఈ ప్రాజెక్టుతో ఇంకా సైలెన్స్ లోకి వెళ్ళిపోతుంది.  ఎప్పుడు ఏం జరుగుతుందా అని టెన్షన్ గా చూస్తూ ఉంటారు.

ఆఫీస్ టైం అయిపోయాక కూడా విశిష్ట డెస్క్ లైట్ ఆన్ గానే ఉంటుంది.
స్కెచెస్…
ఎలివేషన్స్…
స్ట్రక్చరల్ ఇన్నోవేషన్స్…
సస్టైనబుల్ డిజైన్ నోట్స్…

ప్రతి లైన్ వెనుక  నువ్వు ఇక్కడికి అర్హురాలివే అన్న మాట దాగి ఉంటుంది.

రాత్రి ఆఫీస్.  విశిష్ట కాఫీ కప్ పక్కన పెట్టి, స్క్రీన్ వైపు చూస్తూ ఉంటుంది.  ఫోన్ వైపు చూస్తుంది…
దేవా సార్ పేరు కనిపిస్తుంది.
కాలింగ్ రాదు.
మెసేజ్ రాదు.
ప్యూన్.. వచ్చి అమ్మ డిన్నర్ అని అక్కడ పెడతాడు.
చిన్న చిరునవ్వు.
ఇంతే చాలు.

నాలుగు రోజులు పూర్తవుతాయి. ఆ రోజు ఉదయం విశిష్ట చాలా కాన్ఫిడెంట్ గా నిద్ర లెగుస్తుంది.
బోర్డు రూమ్.  విక్రమ్ హెడ్ చైర్‌లో.
అవార్డు విన్నర్స్ అందరూ ఒక వైపు.
ఆ ఎంప్లాయ్ చివర్లో కూర్చుంది..  కళ్లలో టెన్షన్.

విక్రమ్ మేనేజర్ వైపు చూస్తాడు. మేనేజర్ కళ్లు ఆర్పి..
ఫస్ట్… మిస్ విశిష్ట.  ఒక్క క్షణం సైలెన్స్.
విశిష్ట లేచి నిలబడుతుంది.

ఈసారి చేతులు వణకవు.  ప్రొజెక్టర్ ఆన్ అవుతుంది.
విశిష్ట  స్టెడీ వాయిస్ తో...  ఈ ప్రాజెక్ట్‌ని నేను బిల్డింగ్‌గా కాదు…  ఒక లివింగ్ స్పేస్‌గా చూశాను, సర్.

స్లైడ్స్ మారుతాయి.
కాస్ట్ ఆప్టిమైజేషన్
నేచురల్ లైటింగ్ యూజ్
ఎనర్జీ ఎఫిషియెన్సీ
ఫ్యూచర్ ఎక్స్‌పాంశన్ ప్లాన్
అవార్డు విన్నర్స్ ఒకరికొకరు చూసుకుంటారు.

ఒక సీనియర్ ఆర్కిటెక్ట్ తక్కువ స్వరంలో...
ఇది… చాలా మెచ్యూర్ థింకింగ్.
మేనేజర్ అందరి వైపు చూసి ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి అని చెబుతాడు. విక్రమ్ కూడా రాయల్ గా కూర్చొని చూస్తూ ఉంటాడు.

ఒకరు అడుగుతారు.  విశిష్ట క్లియర్‌గా ఆన్సర్ ఇస్తుంది.
మరోకరు ఛాలెంజ్ చేస్తారు.  విశిష్ట స్మైల్ చేస్తూ
డ్రాయింగ్ ఓపెన్ చేస్తుంది.

మీరు చెప్పిన రిస్క్…  నేను ఇక్కడే క్యాల్కులేట్ చేశాను.
రూమ్‌లో నెమ్మదిగా అడ్మిరేషన్ పెరుగుతుంది.
విక్రమ్ ముందుకు వాలుతూ...
ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా?
సైలెన్స్.  విక్రమ్ ఆ ఎంప్లాయ్ వైపు చూస్తాడు.

మీరు ఇచ్చిన జడ్జిమెంట్…  ఇప్పటికీ స్టాండ్ చేస్తారా?
ఆమె తల దించుకుంటుంది.

ఎంప్లాయ్ తడబడుతూ... సారీ సర్…  నేను… తప్పు అనుకున్నాను.

విక్రమ్ తల ఊపుతాడు.  అనుకోవడం కాదు.
ఇది ప్రూవ్ అయింది.
అందరి వైపు చూస్తూ... మిస్ విశిష్ట
ఈ ప్రాజెక్ట్ లీడ్.

ఒక్క క్షణం తర్వాత...
క్లాప్స్.
నిజమైనవి.  ఫార్మల్ కాదు.

విశిష్ట కళ్ళు తడుస్తాయి.  ఈసారి బాధతో కాదు.
బయటికి వస్తూ సూర్య వైపు చూస్తుంది.
సూర్య చిన్నగా నవ్వి తల ఊపుతాడు.
ఇప్పుడు… నీ మీద  నీకు నమ్మకం వచ్చిందా...

విశి సమాధానం......
[+] 8 users Like SivaSai's post
Like Reply
Part - 124



విక్రమ్ క్యాబిన్.  డోర్ క్లోజ్ అవుతుంది.
ఆ ఎంప్లాయ్ ఎదురుగా నిలబడి ఉంటుంది.
ఇప్పుడా ధైర్యం లేదు...కళ్లలో భయం మాత్రమే.

విక్రమ్ చాలా కూల్ గా...  మీరు అడ్వైస్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడారు కదా…
ఆమె తల ఎత్తదు.

విక్రమ్ చైర్ లో తిరుగుతూ... కంపెనీకి మంచిదని అనిపించినప్పుడు ప్రశ్నించడంలో తప్పు లేదు.
కానీ పర్సనల్ క్యారెక్టర్ మీద టాక్ స్ప్రెడ్ చేయడం…

ఒక్క క్షణం ఆగి.. అది ప్రొఫెషనలిజం కాదు.
పాయిజన్.  ఫైల్ ఒకటి ముందుకు జరిపేస్తాడు.

మీరు ఇకపై డిజైన్ టీమ్‌లో ఉండరు. ఇన్నర్ ఆడిట్ & డాక్యుమెంటేషన్.
ఆమె ఒక్కసారిగా తల ఎత్తుతుంది.

సర్ ప్లీజ్....
విక్రమ్ గట్టిగా కాదు… కానీ ఫైనల్‌గా... మీరు ఆ హిమతో చేతులు కలపకముందు ఆలోచించవలసింది. ఆ మాటకి భయంగా చూస్తుంది..

ఏమిటి నాకు ఎలా తెలుసు అనుకుంటున్నావా.  నా కంపెనీలో ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు అని ఎలా అనుకుంటున్నావు నువ్వు.

నావి డేగ కళ్ళు. ప్రతీదీ నా కను సన్నల్లోనే ఉంటుంది.
మీ గురించి ఎంక్వైరీ చేశాను.  ఇప్పటివరకు ఎటువంటి బ్యాడ్ రిమార్క్ లేదు కాబట్టే ఈమాత్రం అయినా ఎక్స్క్యూజ్ చేస్తున్నాను లేదు అంటే నా పనిష్మెంట్స్ ఎలా ఉంటాయో మీకు ఒక ఐడియా ఉందనే అనుకుంటున్నాను.

ఇది శిక్ష కాదు.  లిమిట్.
డోర్ ఓపెన్ అవుతుంది.
బయటికి నడుస్తూ ఆమెకి అర్థమవుతుంది
పోస్ట్ పోయింది కాదు… గౌరవం పోయింది.

ఆఫీస్ రూఫ్‌టాప్.  సన్ సెట్.  విశిష్ట రైలింగ్ దగ్గర నిలబడి ఉంటుంది. చేతిలో ఫైల్ లేదు.

మొదటిసారి… ఖాళీ. వెనక అడుగుల శబ్దం. సూర్య వచ్చి పక్కనే నిలబడతాడు.  మాట లేదు.
కొన్ని సెకన్లు గాలి మాత్రమే.

విశిష్ట  మెల్లిగా... మీరు ఇప్పుడు కూడా ఏమీ మాట్లాడడం లేదు.
సూర్య చిరునవ్వు.
చెప్పాల్సిన పని నీ వర్క్ చేసింది.
మళ్లీ సైలెన్స్.

విశిష్ట కళ్లలో నీళ్లు. ఆ ఇన్సిడెంట్ జరగగానే నా కళ్ళు మీకోసమే వెతికాయి. తెలుసు.
మీరు ఎందుకు రాలేదు.  మీరు ఉంటే నాకు ఎంత ధైర్యంగా ఉంటుందో కూడా తెలుసు కదా.. అయినా నన్ను ఒంటరిగా వదిలేసారా..
సూర్య ఆమె వైపు తిరిగి... నిన్ను ఒంటరిగా వదిలాను.
కానీ ఒంటరిగా పడిపోవడానికి కాదు.
ఆమె తల వంచుతుంది.

సూర్య చాలా  నెమ్మదిగా....  నువ్వు నన్ను చూసి మాట్లాడితే…  ఇవాళ ఇది నీ విజయం కాదు.
మనది అయ్యేది.
నాకు నీ విజయం కావాలి.
విశిష్ట నవ్వుతుంది. కన్నీళ్ల మధ్య.
ఇప్పుడు…  ఇది నాదే కదా?
సూర్య తల ఊపుతాడు.

ఇప్పటినుంచి…  నువ్వు ముందు నడుస్తావు. విశిష్ట సూర్య కౌగిలిలో  ఒదిగిపోతుంది.
సన్ పూర్తిగా అస్తమిస్తుంది.

మర్నింగ్.
ఆఫీస్ లో గలగల.  విశిష్ట వాక్ చేస్తూ వస్తుంది.
ఈసారి తల దించుకోదు.  టీమ్ మీటింగ్ రూమ్.
అందరూ కూర్చున్నారు.

కొంతమంది ఆసక్తిగా.  కొంతమంది టెస్ట్ చేయాలని.
విశిష్ట ముందుకు వచ్చి నిలబడుతుంది.

గుడ్ మోర్నింగ్.  నేను మీ లీడ్.
ఒక్క క్షణం సైలెన్స్.
తర్వాత
విశిష్ట అందరినీ చూస్తూ కంటిన్యూ చేస్తుంది.

నేను పర్ఫెక్ట్ కాదు.  కానీ ఈ ప్రాజెక్ట్ కోసం  నా 100% ఇస్తాను.

స్లైడ్ ఓపెన్ చేస్తుంది.  ఇది నా ప్లాన్ కాదు.
మనది.

ఒక జూనియర్ చేయ్యి ఎత్తుతాడు.
మేడం… మీరు మాతో సైట్‌కి కూడా వస్తారా?
విశిష్ట చిన్నగా నవ్వుతుంది.


ముందుగా నేను వస్తాను.  తర్వాత మీరు.  రూమ్‌లో ఒక నమ్మకం సెటిల్ అవుతుంది.

బయట గ్లాస్ వాల్ అవతల  సూర్య చూస్తూ ఉంటాడు.
మాట్లాడడు.  ఇప్పుడు అవసరం లేదు.  విశిష్ట నిలబడగలదు.

విశిష్ట సైట్ విజిట్ కి వెళుతుంది ప్రతీది చెక్ చేస్తూ ఉంటుంది.
అండర్-కన్స్ట్రక్షన్ ఫ్లోర్.  ఒక్కసారిగా హడావుడి.
సైట్ ఇంజినీర్ భయంగా...
మేడం… ఈ కాలమ్ రీడింగ్ మిస్‌మ్యాచ్ అవుతోంది.
టీమ్ మొత్తం ఆగిపోతుంది.

ఒక సీనియర్ ఆర్కిటెక్ట్ ఫైల్ చూస్తూ...  ఇది డిజైన్ డివియేషన్.  స్టాప్ చేయాలి.
విశిష్ట కళ్లలో ఒక్క క్షణం పానిక్. అందరూ ఆమె వైపు చూస్తున్నారు.

వెంటనే ధైర్యం తెచ్చుకుని ఫ్లోర్ పైన కూర్చుంటుంది.
ఆమె ఫ్లోర్ మీద కూర్చుని డ్రాయింగ్ ఓపెన్ చేస్తుంది.
ఆపనవసరం లేదు.  ఇది ఎర్రర్ కాదు… అంచనా తప్పు.
అందరూ షాక్.
సీనియర్... విశిష్ట వైపు చూస్తూ.  మిస్ విశిష్ట… రిస్క్ తీసుకుంటున్నాం.
విశిష్ట తల ఎత్తి చూస్తుంది.

విశిష్ట ధైర్యంగా ఒక కాన్ఫిడెంట్ వాయిస్ తో..
రిస్క్ కాదు.  రెస్పాన్సిబిలిటీ.  కొత్త క్యాల్క్యులేషన్ చెబుతుంది.

ఆన్-స్పాట్ మాడిఫికేషన్.

కొన్ని నిమిషాల తర్వాత...  సైట్ ఇంజినీర్:
మేడం… స్టేబుల్.  టీమ్‌లో ఊపిరి.
అందరూ విశిష్ట ని ప్రిషియేట్ చేస్తే చిన్న చిరునవ్వు నవ్వి వర్క్ కంటిన్యూ చేస్తుంది.

సైట్ దగ్గర జరిగిన ఇష్యూ తెలిసి సూర్యా విశిష్ట కి కాల్ చేస్తాడు. విశి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి దేవా సార్. ఇంకా దేవాసార్ ఏనా అని నవ్వుతాడు. నాకు అదే అలవాటైపోయింది.
నేను విన్నాను.  ఇది పెద్ద రిస్క్.
విశిష్ట ఒక్క క్షణం ఆగి...  అవును. కానీ వెనక్కి వెళ్లే రిస్క్ ఇంకా పెద్దది.
సూర్య మౌనం.  నీకు నమ్మకమా?
విశిష్ట ఖచ్చితంగా... నాపై కాదు. నా టీమ్ మీద.
ఒక్క చిన్న నవ్వు వినిపిస్తుంది.

ఓకే. నేను సపోర్ట్ చేస్తాను.
కాల్ కట్.
శ్రీకర్ సూర్య ని చూస్తూ విశి చాలా ధైర్యంగా ఉన్నట్టు ఉంది అవును కాన్ఫిడెంట్ బాగా పెరిగింది.  ఫెయిల్ అయితే... నో ప్రాబ్లం ప్రాఫిట్ లాస్ అవుతుంది కానీ తనకున్న కాన్ఫిడెంట్ ని వెనక్కి లాగలేను ఏదో ఒకటి ట్రై చేస్తుంది కదా..


ఇది మొదటిసారి… అనుకుంటా నిన్ను అడగకుండా డెసిషన్ తీసుకోవడం. నేను కోరుకుంది కూడా ఇదే కదా. నేను పక్కన లేకపోయినా తను ధైర్యంగా నిలబడాలి అని.

హిమ, రమేష్ క్యాబిన్ లో అటు ఇటు తిరుగుతూ ఉంది డాడీ ఎవరు ఇంకా ఫోన్ చేయలేదు అని కంగారు పడుతుంది.

వెయిట్ బేబీ ప్రతిదానికి కంగారు పడితే ఎలా.  మనం చేసింది చిన్నాచితక విషయం కాదు కదా... ఏదైనా తేడా వస్తే జై సింహ కంపెనీస్ మొత్తం షేక్ అయిపోతాయి.

ఈ దెబ్బతో అటు విశి ని కంపెనీ నుంచి తీసేయడం సూర్యా నీ వాడు అవడం రెండో జరిగిపోతాయి.

ల్యాప్‌టాప్ స్క్రీన్ మీద సైట్ అప్‌డేట్ వస్తూ ఉంటుంది రమేష్ అది చూసి ఏదో అప్డేట్ వచ్చింది అనగానే గబగబా వచ్చి లాప్టాప్ ముందు వంగుని  చూస్తుంది.
ప్రాజెక్ట్ స్టాభిలైజడ్ అండర్ విశిష్ట లీడ్.
హిమ చేయ్యి కీబోర్డు మీద ఆగిపోతుంది. స్క్రీన్ మీద కనిపించేది నమ్మలేనట్టుగా తుడుస్తూ మళ్ళీ మళ్ళీ చదువుతుంది.

హిమ వెనక్కి తూలుతూ కుర్చీలో కూలబడుతుంది. ఎలా జరిగింది డాడీ..  అది… ఇంత త్వరగా?
రమేష్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ విశి టాలెంటెడ్ అనుకుంట..  అందుకే గౌతమ్ కాలేజీలో ఉండగానే ప్రాజెక్ట్ ఇచ్చేవాడు అని మెల్లిగా అంటాడు.

ఫోన్ తీసుకుంటుంది. ఫోన్ చేస్తుంది.  అవతలి నుంచి లిఫ్ట్ చేసి సోరి మేడం ఆ విశిష్ట టాస్క్ ని చాలా అవలీలగా  కంప్లీట్ చేశారు.
అదే ఎలా మిస్టర్.  సైట్ దగ్గర ప్రెషర్ ఇస్తే భయపడుతుంది. ఆ భయం లో బుర్ర సరిగా పనిచేయక తప్పుల మీద తప్పులు చేసి కూలిపోతుంది అనుకున్నాను. కానీ ఏం జరిగింది...

సోరి మేడం నేను చేయవలసింది చేసాము. బట్ అటు పక్కన ఉన్న ఆ విశిష్ట  మల్టీ టాలెంటెడ్ అయితే ఎవరము ఏమి చేయలేము అని ఫోన్ పెట్టేస్తారు.
హిమ కోపంతో ఫోన్ నేలకేసి కొట్టి గట్టిగా విశిష్ట అని అరుస్తుంది.

సైట్ మీద విశిష్ట నిలబడి ఉంటుంది.  హెల్మెట్ చేతిలో.
టీమ్ ఆమె చుట్టూ.
మేడం… మీరు లేకపోతే…  విశిష్ట తల ఊపుతుంది.

నేను లేకపోయినా…  మీరు ఇదే చేయాలి.
ఆ మాటలో లీడర్ ఉంది.
సూర్య ఎప్పుడూ చెప్పే మాటలు గుర్తుకు వస్తాయి.  నేను పక్కన లేకపోయినా నువ్వు ధైర్యంగా నిలబడాలి.  నేను ఎక్కడ ఉన్నా నీతోనే ఉన్నట్టు అని. అది గుర్తుకు రాగానే విశి పెదవుల పైన చిన్న చిరునవ్వు వస్తుంది.

సూర్య దూరంగా నిలబడి విశి ని చూస్తూ ఉంటాడు.  విసి నిలబడే విధానంలోనే తన కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ కనపడుతూ ఉంటాయి.

సూర్య కారులో  కూర్చోగానే  శ్రీకర్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమిటి అంటే.. ఆ హిమ కి,  రమేష్ కి ఫుల్ గా చెక్ పెట్టేయడమే.

ఎలా...  వెరీ సింపుల్.  తను ఆర్కిటెక్చర్ కాకపోయిన.. విశి వర్క్ తీసుకుని పాపులర్ అయింది కదా.  సో అది ఫేక్ అని,  ఇటు విశిష్ట ని చీట్ చేశారు అని న్యూస్ లో వస్తే చాలు.


ఆటోమేటిగ్గా తనికి వచ్చిన ఫాల్స్ ప్రెస్టేజ్ అంతా కూడా ఇలా భూమిలోకి వెళ్ళిపోతుంది అని చేతులతో చూపిస్తాడు.

కానీ దానికి కొన్ని ప్రూఫ్స్ కావాలి కదా.  పేపర్స్ ఇస్తాడు.  అవి చూసి గౌతమ్ ఎప్పుడు సైన్ చేసాడు. జైలుకి వెళ్లిన తరువాత.

ఆహిమ గౌతమ్ ని కలిసి క్యూటీని పతనం చేయాలి అని ప్లాన్స్ వేసింది. గౌతమ్ దానికి ఒప్పుకోలేదు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా నాకు పంపించాడు.

మరి ఎప్పుడు న్యూస్ వస్తుంది. ఆల్రెడీ స్క్రోల్ అవుతుంది. సోషల్ మీడియాలో  వస్తుంది. అలాగే న్యూస్ చానల్స్ లోను వస్తుంది. ఎప్పుడు చేసావురా ఇదంతా.

చిన్నగా నవ్వుతాడు. ఆ న్యూస్ చూస్తున్న హిమ, రమేష్  వణికి పోతారు. ఏమిటి ఇలా జరుగుతుంది. ఎవరిచ్చారు ఈ న్యూస్.

మన ప్రెస్టేజ్ మొత్తం బయట డామేజ్ అయిపోతుంది కదా బేబీ అని భయపడతాడు.. అసలు ఈ న్యూస్ బయటికి ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ ఇదంతా గౌతమ్ పని.

నా మీద అనుమానం వచ్చింది. నేను సూర్యని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని గెస్ చేశాడు. అందుకే నన్ను డౌన్ చేయడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు.


హిమ బయటపడగలుగుతుందా లేక మునిగిపోతుందా.........
[+] 8 users Like SivaSai's post
Like Reply
Part - 125



హిమ ఆ న్యూస్ చూస్తూ భయంతో డాడీ ఇప్పుడు ఏం చేయాలి. అదే నాకు అర్థం కావడం లేదు. ఒకసారి గౌతమ్ ని కలిస్తే.. ఉపయోగం లేదు.

గౌతమ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే న్యూస్ ఛానల్స్ కి ఎలా తెలుస్తుంది.. ఇది ఒక గౌతమ్ హస్తమేనా లేక జై సింహ ఫ్యామిలీ హస్తం కూడా ఉందా..

సూర్య హస్తమైతే ఖచ్చితంగా ఉంటుంది. మనం ఆ విశిష్ట జోలికి వెళ్ళాము కదా అని చెమటలు పడుతూ ఉంటే టెన్షన్ గా తిరుగుతూ ఉంటుంది.

రమేష్ ఫోను సెకండ్.. సెకండ్ కి రింగ్ అవుతూనే ఉంటుంది.  ఏమిటండి మీ అమ్మాయివి ఒరిజినల్ ఆర్కిటెక్చర్ కాదా.

ఎవరిదో వర్క్ చూపించ్చుకొని హిమ పాపులర్ అయ్యిందా అని వరుసగా ఫోన్లు వస్తూ ఉంటే ఇక విసుగువచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు.

న్యూస్ ఛానల్ మొత్తం ఈ న్యూస్ తో మోగిపోతూ ఉంటుంది.

హిమ ప్లానుతో కన్స్ట్రక్షన్ అయిన బిల్డర్స్ కేస్ ఫైల్ చేస్తారు.

న్యూస్ ఛానల్స్ స్క్రీన్ మీద అదే బ్రేకింగ్ బ్యానర్ తిరుగుతూ ఉంటుంది…
యువ ఆర్కిటెక్ట్ హిమపై ప్లేజరిజం ఆరోపణలు..
కాపీ డిజైన్ తో కోట్ల ప్రాజెక్ట్?

హిమ చేతుల్లో రిమోట్ ఉన్నా… ఛానల్ మార్చే ధైర్యం కూడా ఉండదు.
ఆమె కళ్ళలో భయం, అవమానం, గందరగోళం… అన్నీ కలిసిపోతాయి.

డాడీ… నేను కాపీ చేయలేదు... ఆ గౌతమ్ ఆ వర్క్ ఇచ్చాడు.  ఎక్కడినుంచి తెచ్చి ఇచ్చాడో నాకు తెలియదు కదా..  బేబీ ఐ లైక్ యు. ఈ వర్క్ మీద నీ పేరే ఉంటుంది నీ బ్రాండ్ క్రియేట్ అవుతుంది అంటే మురిసిపోయాను కానీ ఇప్పుడు ఇలా అని తల పట్టుకుంటుంది.

రమేష్ ముఖం గట్టిగా పెట్టుకున్నా లోపల కూలిపోతుంటాడు.

నాకు తెలుసు హిమ… కానీ ఇప్పుడు విషయం మనం నిజం చెప్పుకోవడం కాదు… వాళ్లు ఏం ప్రూవ్ చేస్తారన్నది.

సోషల్ మీడియాలో పోస్టులు వరుసగా పడుతుంటాయి.
పాత డిజైన్ ఒకటి స్క్రీన్ మీద చూపిస్తూ    ఇది రెండు సంవత్సరాల క్రితం గౌతమ్ ఫర్మ్ ప్రెజెంటేషన్
ఇది ఇప్పుడు హిమ ప్రాజెక్ట్. గౌతమ్ కంపెనీ లో వర్క్ చేసిన విశిష్ట అనే ఒక స్టూడెంట్  ది.  ఆ వర్క్ హిమ పేరు మీదకి ఎలా వచ్చింది.

రెండు డిజైన్స్ ని పక్కపక్కన పెట్టి చూపిస్తారు.  సామాన్యతలు స్పష్టంగా కనిపించేలా ఎడిట్ చేస్తారు.
హిమ చేతులు వణుకుతాయి.
గట్టిగా అరుస్తూ.. లేదు ఇది విశిష్టది కాదు.
ఇది నా కాన్సెప్ట్ డాడీ… నేను... నా ఐడియా చెబితే.. దానిని గౌతమ్ విశిష్టతో డెవలప్ చేయించాడు నా దగ్గర ఆ వర్క్ ఉంది.

అవి మన దగ్గర ఉండొచ్చు… కానీ వాళ్ల దగ్గర ముందున్న టైమ్ స్టాంప్ ఉంటే… మనం ఇబ్బందిలో పడతాం.
హిమ భయంగా చూస్తే.... నిజం బేబీ నీ దగ్గర జస్ట్ ఐడియా మాత్రమే కానీ దాని ఇంప్లిమెంట్ చేసింది మొత్తం ఆ విశిష్ట. దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని ఆ గౌతమ్ న్యూస్ ఛానల్స్ కి ఇచ్చినట్టు ఉన్నాడు.  వీడు సడన్గా ఎందుకు ఇలా చేశాడు.

మరుసటి రోజు ఉదయం…  బిల్డర్స్ లాయర్ ఆఫీస్ నుంచి నోటీస్.  కాంట్రాక్ట్ క్యాన్సిలేషన్.. ఫైనాన్షియల్ డ్యామేజెస్ క్లెయిమ్...ఫ్రాడ్ & మిస్‌రిప్రజెంటేషన్ కేస్.

హిమ కాళ్లు బలహీనంగా మారిపోతాయి.  ఆమె కుర్చీలో కూర్చుని కన్నీళ్లు ఆపుకోలేకపోతుంది.  డాడీ… నేను మీ పేరు కూడా చెడగొట్టేశానా?

రమేష్ ఒక్కసారి గట్టిగా అరిచేంత టెన్షన్ లో ఉన్నా…
ఆమె కన్నీళ్లు చూసి మౌనంగా తలదించుకుంటాడు.  ఇట్స్ ఓకే బేబీ అంటాడు కానీ పేరు ప్రతిష్ట డబ్బు అన్నీ ఒక్కసారిగా కుప్ప కూలిపోయాయి.

గౌతమ్ ఫర్మ్ నుంచి అధికారిక కంప్లయింట్.  ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ థెఫ్ట్.  సాయంత్రం సెక్యూరిటీ అధికారి జీప్ ఇంటి ముందు ఆగుతుంది.

మొబైల్ కెమెరాలు ఆన్ అవడం…  హిమ గుండె బలంగా కొట్టుకుంటుంది.  ఇన్స్పెక్టర్ లోపలికి వచ్చి నేరుగా మాట్లాడతాడు.

మిస్ హిమ… మీరు స్టేషన్ కి రావాలి. విచారణ కోసం.
రమేష్ వెంటనే స్పందిస్తాడు.  నేను కూడా వస్తాను.


చిన్న గది. ఒక టేబుల్.  ఒక లైట్ కింద హిమ కూర్చుని ఉంటుంది.  ఈ డిజైన్ మీద మీకు ప్రూఫ్ ఏంటి?
ఈ స్కెచ్ ఎప్పుడు క్రియేట్ చేశారు?  గౌతమ్ ఫర్మ్ లో పని చేసిన ఎవరైనా మీతో కనెక్ట్ అయ్యారా?
ప్రశ్నల వర్షం.

హిమ ధైర్యంగా సమాధానాలు చెప్పాలి అనుకుంటుంది. కానీ వాళ్ళు అడిగే ప్రశ్నలకి దేనికి హిమ దగ్గర సమాధానం లేదు.

ఆ డిజైన్ ఐడియా ఉంటేనే కదా ఎలా డ్రా చేసిందో చెప్పగలిగేది. తన నేమ్ క్రియేట్ అయింది చాలు అనుకుంది.  ఇప్పుడు గౌతమ్ వర్క్ ఇచ్చాడు అని చెప్పినా ఎవరూ నమ్మరు.

కానీ ఒక్కొక్కటి కత్తిలా గుండెల్లో దిగుతుంటాయి.
ఎందుకంటే…..వాళ్లు చూపిస్తున్న ఫైల్ డేట్స్…  వాళ్లు చూపిస్తున్న మెయిల్స్…  ఏదో ప్లాన్ చేసి చేసినట్టే ఉంటాయి.  రమేష్ బయట కూర్చుని చెమటలు పట్టి వేచి ఉంటాడు.

కేస్ సీరియస్ అని…  కోర్ట్ ముందు ప్రొడ్యూస్ చేయాలనే నిర్ణయం.  సెక్యూరిటీ అధికారి అధికారికంగా అరెస్ట్ నోటీసు చదువుతాడు.

హిమ చెవులు మూసుకుపోయినట్టవుతుంది.  డాడీ… అని మాత్రమే అంటుంది.  రమేష్ కూడా సహకరించలేదనే కారణంతో…  ఎవిడెన్స్ మానిప్యులేషన్  అనుమానంతో
ఆయననూ డిటైన్ చేస్తారు.

చల్లని గది. ఇనుప కంచెలు. హిమ నేల మీద కూర్చుని ఉంటుంది.  ఆమె మెదడులో ఒక్క మాట మాత్రమే తిరుగుతుంది.

నేను చేయలేదు…  అవమానం కన్నా…  తండ్రిని కూడా ఈ పరిస్థితిలోకి తెచ్చాననే బాధ ఎక్కువ. రమేష్ మరో సెల్ లో కూర్చుని గోడను చూస్తూ ఉంటాడు.

ఎక్కడ తప్పు చేశాను? ఎవర్ని నమ్మకూడదో నమ్మానా?
విశిష్ట పేరు గుర్తొస్తుంది.  సూర్య పేరు గుర్తొస్తుంది.  గౌతమ్ ముఖం గుర్తొస్తుంది.

ఇది యాదృచ్ఛికం కాదు.  ఎవరో బాగా ప్లాన్ చేశారు.

హిమ ఉత్సాహం పోయింది.  ఆమె కళ్ళలో వెలుగు లేదు.
ఆత్మవిశ్వాసం ముక్కలైంది.
ఒకప్పుడు బిల్డింగ్ డిజైన్ చూస్తూ భవిష్యత్తు ఊహించిన అమ్మాయి…  ఇప్పుడు తన భవిష్యత్తే కనిపించదు.
డాడీ… నేను మళ్లీ  నిలబడగలనా...

నా నేమ్ దేశం మొత్తం పాపులర్ అయ్యింది.  ఒకప్పుడు గొప్పగా పాపులర్ అవుతే ఇప్పుడు అవమానంగా పాపులర్  అయ్యింది.

రమేష్ కళ్ళలో కన్నీరు. అనవసరంగా సూర్య ని కదిపినట్టు ఉన్నాము. హెచ్చులకు పోతే వచ్చి ఇక్కడ పడ్డామా. ఆ గౌతమ్ వార్నింగ్ ఇచ్చినప్పుడైనా ఆగి ఉంటే బాగుండేది. ఒంటి మీద వాలిన దోమని కొట్టుకుంటూ ఉంటాడు.

ఇద్దరినీ కోర్ట్ కి తీసుకు వెళుతూ ఉంటే గౌతమ్ చూసి నవ్వుతాడు. చెప్పాను కదా హిమ అనవసరంగా విశిష్ట జోలికి వెళ్ళకు.

వెళితే నా పక్క సెల్ లోనే వచ్చి కూర్చుంటారు అని. నా మాట పెడచెవిని పెట్టావు.  ఇప్పుడు ఏమియ్యింది. ఆ మాటకు హిమ కోపంగా అప్పుడే అన్ని అయిపోలేదు గౌతమ్.

ఇంకా నీ పొగరు తగ్గలేదా అయితే ఇంకా సినిమా ఉంది ఎంజాయ్.. నాకు బెయిల్ వచ్చింది నేను వెళుతున్నాను అని బయటకు వెళతాడు.

వైభవ్ రాజ్ ఇంటికి వెళతాడు.  అత్త అత్త అని అరుస్తూ లోపలికి వెళ్తాడు.  ఏమైందిరా అలా అరుస్తున్నావు.. నేను అలిగాను.  ఎందుకు అని పక్కనే కూర్చుని అడుగుతుంది.

నీ కూతురికి అసలు నేనంటే లెక్కలేదు. అరే.. ప్రపోజ్ చేసిన తర్వాత ఇంటికి తీసుకువచ్చానా... ఎప్పుడు ఫోన్ చేసినా నేనే చేయాలి. బయటికి వెళ్లాలి అన్న నేనే అడగాలి.

తనకి టైం ఉంటే వస్తాను అంటుంది లేకపోతే కుదరదు అని ముఖం మీద చెబుతుంది.. ఇలాగైతే ఎలాగ అత్తయ్య. మన సింహా ఫ్యామిలీ పరువు ఏం కావాలి.

ఆ మాటకి కోపంగా ఇదంతా మీ మావయ్య ట్రైనింగ్ రా.. మావయ్య ఇలా కూడా చేస్తున్నారా అని షర్టు చేతులు మడత పెడుతూ ఉంటాడు.

అప్పట్లో నన్ను సాధించలేనిది అంతా ఇప్పుడు కూతురు రూపంలో మన ఫ్యామిలీ మీద సాధిస్తున్నారు.  ఇంటికి రాని చెబుతాను.

నువ్వు మావయ్య వచ్చిన తర్వాత చూసుకో. ఇప్పుడు నీ కూతురు ఎక్కడ ఉంది..  గదిలో కూర్చుని ఏదో డ్రాయింగ్ చేస్తూ ఉంది.

సరే నేను వెళుతున్నాను.. గదిలో నుంచి అరుపులు అనిపించిన  కేకలు వినిపించిన నువ్వు టెన్షన్ పడకు. కంగారుగా ఏం చేస్తావురా..

అబ్బా అత్తయ్య నువ్వు ఊహించిందేమీ కాదు.నాలుగు దెబ్బలు వేసి కాబోయే మొగుడితో ఎలా ఉండాలో నేర్పిస్తాను. మరి గట్టిగా కొట్టకురా..

నేను నీలాగే సున్నితం అత్తయ్య అని చందు గదిలోకి వెళతాడు.

తలుపు తీసి లోపలికి వెళ్లి అలాగే ఉండిపోతాడు. మాటరాని బొమ్మలాగా బిగుసుకుపోయి చందు నే చూస్తూ ఉంటాడు.

మంచం మీద బోర్లా కొడుకుని మోకాళ్ళ వరకు కాళ్లు పైకి పెట్టి ఊపుతూ..  ఒక చేతిలో ని చాక్లెట్ తింటూ..  మరొక చేతుల్లో ఉన్న ఫోన్ ని స్క్రోల్ చేస్తూ ఉంటుంది.

వైభవ్ కాళ్లు కదల్లేదు ఒక్క క్షణం.
గదిలోకి వచ్చేటప్పటి ఆ అగ్రెసివ్ ఫీలింగ్ ఒక్కసారిగా ఆగిపోయింది.
మంచం మీద బోర్లా పడుకుని… కాళ్లు గాల్లో ఊపుతూ… ఒక చేతిలో చాక్లెట్, ఇంకో చేతిలో ఫోన్… జుట్టు అల్లకల్లోలంగా చెంప మీద పడుతూ… అమాయకంగా నవ్వుకుంటూ ఏదో రీల్ చూస్తూ ఉంది చందు.

వైభవ్ గుండె ఒక్కసారిగా స్కిప్ అయ్యింది.  ఇది నేనడగబోయే సీరియస్ మీటింగ్ గదినా… లేక క్యూట్‌నెస్ డిపార్ట్‌మెంట్ ఆఫీసా? అని లోపలే అనుకుంటాడు.

తలుపు దగ్గర నిలబడి చూస్తూ ఉండిపోతాడు. చందు ఒక్కసారి పైకి చూసి అతన్ని గమనిస్తుంది.
ఏంటి… గది బయటే స్ట్యాచ్యూ అయిపోయావా? అని కనుబొమ్మ ఎత్తి అడుగుతుంది.

వైభవ్ కాస్త దగ్గరికి వచ్చి మంచం అంచున కూర్చుంటాడు.
నువ్వు చాలా డేంజర్ తెలుసా? అంటాడు సీరియస్ ఫేస్ పెట్టుకుని.
నేనా? ఏమి చేసాను ఇప్పుడు? అంటూ చాక్లెట్ ముక్క నోట్లో వేసుకుంటుంది.

నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నాలుగు దెబ్బలు వేసి డిసిప్లిన్ నేర్పించాలని వచ్చాను.
చందు వెంటనే ఫోన్ పక్కన పెట్టి తిరిగి అతన్ని చూస్తుంది.
అబ్బో! ముందే చెప్పాలి కదా. నేను పిల్లోగా బెల్ట్ తీసుకురావాలా… లేక డైరీ రాసుకోవాలా?  అంటుంది.
వైభవ్ నవ్వుతూ..

నీకు అసలు నేనంటే లెక్కే లేదు. ఫోన్ నేను చేయాలి బయటికి నేను అడగాలి. టైం ఉంటే వస్తాను అంటావు…
చందు మంచం మీదే కొంచెం జారుకుని అతని దగ్గరికి వస్తుంది.
ఓహ్… అసలు విషయం ఇది కదా? అంటూ అతని ముఖం దగ్గరకి చూస్తుంది.
నిన్ను లెక్క చేయకపోతే… నా కోసం నీ ఫేవరెట్ చాక్లెట్ స్టాక్ పెట్టుకుంటానా? అంటుంది.

వైభవ పరిస్థితి.. పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదు సుమా..

కథ కొనసాగుతుంది.........
[+] 10 users Like SivaSai's post
Like Reply
Gautham, Hima episode closed... Vishi is able to stand and take decisions on her own... Great story... Great writing...
[+] 1 user Likes Sunny73's post
Like Reply
Excellent update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
Always in love with Chandu Vaibhav episodes..
.. best fire brand couple .. :)
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
As usual ga chinchi padesaaru
[+] 2 users Like styleraja's post
Like Reply
Super story.. chandu, vaibhav di kooda chala baghundi..Ippuduvaibhav paristhitientoo ..
[+] 1 user Likes masalakiss's post
Like Reply
No updates today?
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
(07-05-2026, 02:52 PM)ash.enigma Wrote: No updates today?

Writer could be busy in his personal work... He is a person who doesn't miss. Let's give him some breathing space.
[+] 1 user Likes Sunny73's post
Like Reply
(07-05-2026, 03:42 PM)Sunny73 Wrote: Writer could be busy in his personal work... He is a person who doesn't miss. Let's give him some breathing space.

Completely agree.
Just wondering!! ?
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Sorry Friends Office Work Pressure Valla Update Ivvaleka Poyanu 

Tomorrow Update Is Confirm
[+] 7 users Like SivaSai's post
Like Reply
It's ok siva garu feel free
[+] 1 user Likes Ajayu2's post
Like Reply
Part - 126



వైభవ్ గట్టిగా మాట్లాడాలనుకుని… ఆ కళ్లలో పడిపోతాడు.
అయితే కొంచెం అటెన్షన్ ఇవ్వాలి కదా మేడమ్…
అటెన్షన్ కావాలా?
చందు మెల్లిగా పక్కకి జరగి మంచం మీద అతనికి స్పేస్ ఇస్తుంది.

రా… ఇక్కడ పడుకో. ఫోన్ స్క్రోల్ చేస్తూ నీ మీదే కామెంట్ చేస్తాను. ఫుల్ అటెన్షన్.
వైభవ్ నటనగా గొణుగుతూ పక్కనే పడుకుంటాడు.
నేను సీరియస్‌గా వచ్చాను.
అదే నా ప్రాబ్లమ్. నువ్వు సీరియస్ గా వచ్చాను అన్నా సరే నాకు కామెడీగా కనిపిస్తుంది. ఏమిటో చిన్నప్పటినుంచి అదే అలవాటైపోయింది.

మన సింహా ఫ్యామిలీ పరువు గురించి నేను మాట్లాడుతుంటే...  మన సింహా ఫ్యామిలీకి ముందు… నా ఫ్యూచర్ హస్బెండ్ స్మైల్ ముఖ్యం. అంటుంది చందు కన్ను కొడుతూ..

వైభవ్ కొంచెం షాక్ అవుతాడు.  అంటే…
అంటే… నేను నిన్ను ఇబ్బంది పెట్టడానికి కాదు రా. నీ మీద నమ్మకం ఉంది. అందుకే నీకు టైం ఇచ్చేస్తాను. నువ్వు వస్తావు. నువ్వు ఫోన్ చేస్తావు. నువ్వే అడుగుతావు. ఎందుకంటే నువ్వు చేస్తావని నాకు తెలుసు.
వైభవ్ ఆమె వైపు తిరిగి పడుకుంటాడు.

అంటే నన్ను టెస్ట్ చేస్తున్నావా?  లవ్‌లో చిన్న చిన్న టెస్టులు ఉండాలి కదా… అంటూ చిరునవ్వు నవ్వుతుంది.
వైభవ్ నిట్టూర్పు విడిచాడు.
అత్తయ్యకి చెప్పేశాను గదిలో కేకలు వినిపించినా టెన్షన్ పడకూడదని.
చందు ఒక్కసారిగా నవ్వుతుంది.
ఎవరివి నీవా..  ఆ మాటకి కాదు నీవి అని దగ్గరికి లాక్కుంటాడు.  అయ్యో! నువ్వు ఏం చేయబోతున్నావ్?
ఇంకా ఏమీ అనుకోలేదు నువ్వు సలహా ఇస్తే అదే చేస్తాను.
ఆ మాటకి చందు మొఖం ఎర్రగా కందిపోతుంది. ఏమయింది  పిల్ల రాక్షసి అలా సిగ్గుపడుతున్నావు.

వెంటనే సర్దుకుని మర్యాదగా చెయ్యి తీసి బయటకు వెళ్ళు. వెళ్ళను.  చేయాలి అని ఫిక్స్ అయ్యాను.ఏమి చేయాలని ఈసారి బెదిరే కళ్ళతో చూస్తుంది.

చెప్పను.. ఇప్పుడే చేయబోతున్నాను…
ఏంటి?  నీ పక్కనే ఇలాగే ఉండిపోతాను. అంతే. నిన్ను చూసుకుంటూ.
చందు  ఉఫ్... అనుకొని వైభవ్ వైపు చూస్తుంది. ఏమిటి చాలా ఎక్స్పెక్ట్ చేసినట్టు ఉన్నావు కదా అని టీస్ చేస్తాడు. నేనేమీ అలా అనుకోలేదు.  నువ్వు ఏమనుకున్నావు అని అడుగుతాడు.
ఒక్క క్షణం ఆగి అతని చేతిని పట్టుకుంటుంది. నువ్వు అనుకున్నదే.. నేనేమనుకున్నానో నీకు తెలుసా అని ఇంకా దగ్గరికి జరుగుతాడు.

ఇంకా దగ్గరికి వచ్చావు అంటే మా నాన్నకి చెబుతాను. మీ ఆడపిల్లలందరికి నాన్న అన్నది ఒక ఊత పదమా..

మమ్మల్ని చూడండి.  మీరు ఎంత దగ్గరగా వచ్చినా..  మీరు మమ్మల్ని కిస్ చేసిన సరే కోపరేట్ చేస్తాం కానీ నాన్నకి చెబుతాము..  అమ్మకి చెబుతాము అని అంటామా..

ఆ మాటకి కోపంగా చూస్తూ మీది మాది ఒకటేనా. ఏ ఎందుకు కాదు నీకు నాకు మధ్యన ఉన్న ప్రేమ ఒకటే. నువ్వు నేను ఒకటే.

అలాంటప్పుడు ఈ విషయం ఎందుకు ఒకటి కాదు అని ఇంకా దగ్గరికి జరుగుతాడు.  అయ్యో వైభవ్ నీకు తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా. అన్ని తెలిసే మాట్లాడుతున్నాను.

మీరు మా దగ్గరగా వచ్చి కిస్ చేయండి ఎంత హ్యాపీగా ఫీల్ అయి కోపరేట్ చేస్తామో..

రాజ్ అప్పుడే ఇంటికి వచ్చి రిలాక్స్డ్ గా కూర్చుంటాడు. నివి కాఫీ తీసుకువచ్చి ఇస్తుంది.  కాఫీ తాగుతూ చందు ఏం చేస్తుంది.

వర్క్ ఏదో ఫినిష్ అవ్వాలి అంది. అయ్యిందా అని అడిగితే...  హా అయినట్టు ఉంది.  రూమ్ లో ఉంది. అవునా అని పిలవాలని చూస్తాడు.

ఎందుకు ఇప్పుడు డిస్టర్బ్ చేస్తున్నారు. ఏమైంది. వైభవ్ వచ్చాడు. ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు. ఈ లోపు చందు అరుపు గట్టిగా వినిపిస్తుంది.

కాఫీ తాగుతున్న రాజ్ కంగారుగా కప్పు పక్కనపెట్టి అది ఎందుకో అరుస్తుందని వెళ్లబోతు అంటాడు. నివి చెయ్యి పట్టుకుని ఆపేస్తూ..  ఎందుకు అంత కంగారు పడుతున్నారు.

ఒసేయ్ అక్కడ చందు అరుస్తుంది. నీ మేనల్లుడు ఏదో చేస్తున్నాడు. వాడు నాకు ముందే చెప్పాడు.  చందు అరిచినా నువ్వు గదిలోకి రావొద్దు అని..

ఆ మాటకి ఫ్యూస్ లు ఎగిరినట్టుగా చూస్తాడు. ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా. వాడు రావద్దు అంటే మానేస్తావా.. అక్కడ చందు అరుస్తుంది వినిపించడం లేదా..

వినిపిస్తుంది. నా మేనల్లుడు నీ కూతురికి భయం చెబుతున్నాడు. వాడు భయం చెప్పడం ఏమిటి.. కాస్త అర్థమయ్యేటట్టుగా చెప్పు.  ఇదంతా మీరు చేస్తున్నది కాదా..

నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు. మీ ట్రైనింగ్ లోనే చందు అలా తయారయింది. తల గోక్కుంటూ నీకు దండం పెడతానే..  కాస్త తెలుగులో మాట్లాడవా..


నేను ఇప్పుడు మాట్లాడేది తెలుగే గా. కానీ అర్థం కాకుండా మాట్లాడుతున్నావు. వైభవే ఫోన్ చేస్తున్నాడు. వాడే బయటికి వెళ్లాలి అని అడుగుతున్నాడు.

దీనికి ఇష్టమైతే వస్తాను అంటుంది అంటూ లేకపోతే లేదు అంట. పాపం వాడు ఎంత బాధ పడుతున్నాడో..  ఇదంతా మీరు చెప్పబట్టే కదా అది అలా చేస్తుంది.

నేనేం చెప్పానే. మా ఫ్యామిలీ మీద రివెంజ్ తీర్చుకోవాలనే కదా.  చందు ని మీరు అలా ట్రైన్ చేశారు. నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా..  నాకు బాగానే తెలుస్తుంది.

అప్పుడు నన్ను సాధించలేక ఇప్పుడు చందుని అడ్డుపెట్టుకుంటున్నారు. ఒక మాట అడుగుతాను చెప్పవే. అప్పుడే నేనే అడిగేవాడిని కదా.

ఒక్క షాపింగ్ పని ఉన్నప్పుడు తప్ప ఎప్పుడైనా కాల్ చేసే దానివా.  అదే..  అదే... మీరు మనసులో పెట్టుకున్నారు. పెట్టుకొని ఇప్పుడు చందుతో మీరు ఇలా చేయిస్తున్నారు. మీకు మా పుట్టింటి వాళ్ళు ఏం తక్కువ చేశారు అండి అని ముక్కు చీదుతుంది.

ఆ మాట నేనెప్పుడన్నాను.  మీరు అనక్కర్లేదు మీ ప్రవర్తనే చెబుతుంది. పాపం వైభవ్ ఎంత బాధ పడుతున్నాడో. అత్త ఎవరి దగ్గర తగ్గని నేను..

నీ కూతురు కోసం ఎన్ని తగ్గుతున్నాను.  మావయ్య అలాగా ట్రైనింగ్ ఇస్తే ఎలాగా అని ఎంత బాధ పడిపోయాడో పాపం.

ఉఫ్.. అనుకొని ఇంకా ఆపుతావా అంటాడు.  చూశారా నేను ఏడుస్తున్న సరే మీకు బాధ లేదు. మనసులో ఎంజాయ్ చేస్తున్నారు కదా.

హే.. హే ఆపు. పుట్టింటి పేరు చెబితే చాలు. ముందు వెనక చూడకుండా తడిపేసుకుంటారు. వాడేదో ఏదో కహాని చెబితే అది పట్టుకుని నన్ను టార్చర్ పెడుతున్నావు.

అక్కడ చందు ఎందుకు అరుస్తుందో తెలియదు.  వాడు నాలుగు దెబ్బలు వేస్తానన్నాడండి. ఒసేయ్ ఆ మాట పట్టుకుని ఇక్కడ నన్ను ఆపి టార్చర్ పెడుతున్నావా.

బుర్ర పెట్టి ఆలోచించు.  వాడు అసలు కొడతాడా.. నీకు ఏదో స్టోరీ చెప్పి  చందు గదిలోకి రాకుండా ఆపేసాడు. నువ్వేమో అదే పట్టుకుని ముక్కు చీదుతూ నన్ను వెళ్ళనివ్వకుండా ఆపేస్తున్నావు అని స్పీడ్ గా మెట్లు ఎక్కుతాడు.

ఏవండీ ఆయాసం వస్తుంది.  లిఫ్ట్ లో వెళదాము. నువ్వు రా లిఫ్ట్ లో.. అక్కడ నా కూతురు ఎలా ఉందో అని పరుగు అందుకుంటాడు.

ఎప్పుడు చూడు మా పుట్టింటి వాళ్ళ మీద అనుమానమే అని లిఫ్ట్ లో వెళుతుంది.

రాజ్ చందు గది ముందు నిలబడి డోర్ కొడుతూ..  అమ్మా చందు తలుపు తీయరా. ఆ వెధవ ఏం చేస్తున్నాడు  నిన్ను అని కంగారుపడుతూ ఉంటే డోర్ తీస్తోంది.

తల్లి నువ్వు బాగానే ఉన్నావా అని వైభవ్ వైపు కోపంగా చూస్తాడు. మంచం మీద ఆరామంగా కూర్చుని చందు తిన్న మిగిలిన చాక్లెట్ తింటూ ఉంటాడు.  ఏరా ఏం చేస్తున్నావు.

చాక్లెట్ తింటున్నాను మావయ్య. చందు ఎందుకు అరిచింది.  ఆ మాటకి లేచి నిలబడి మెలికలు తిరుగుతూ రాజ్ దగ్గరికి వస్తాడు.

ఏరా నేను అడుగుతూ ఉంటే...  మెలికలు తిరుగుతావు  ఏమిటి చెప్పు అని టెన్షన్ పడుతూ ఉంటాడు.  బుగ్గన పొడుస్తూ చిలిపి.  ఎందుకు అరిచిందో నన్ను అడుగుతావేమిటి అరిచిన నీ కూతురిని అడుగు.

చందు వైపు చేసి ఏరా.. వీడు నిన్ను ఏమైనా చేశాడా అని బుగ్గల పట్టుకుని చూస్తాడు. చేతులు పట్టుకుని చూస్తాడు. ఈ లోపు అక్కడికి నివి వస్తుంది. అమాయకంగా వెళ్లి నివి పక్కన నిలబడతాడు.

నాన్న నాకు ఏమీ కాలేదు.  మరి ఎందుకు అరిచావు. వైభవ్ నివి తో చూసావా అత్తయ్య. నేను నీ కూతురిని ఏదో చేసేసాను అని మావయ్య ఎన్ని మాటలు అంటున్నాడో..

చూస్తున్నాను రా కింద నన్ను అన్నారు.  ఇప్పుడు ఇక్కడ నిన్ను అంటున్నారు.  ఎప్పుడు చూసిన మన మీద పడి అనడమే సరిపోతుంది మనిషికి.

నిజంగానే ఏమీ కాలేదు నాన్న. మరి ఎందుకు అరిచావు తల్లి. ఆదా ఆ వైభవ్ దేనికో భయపెట్టాడు.  దానికి జడుచుకుని అరిచాను అంతే.

నిజంగా అంతే కదా... మీకు అబద్ధం చెబుతానా నాన్న. నాకు నీ మీద నమ్మకమే రా కానీ కొంతమంది ఉన్నారే అని వైభవ్ వైపు చూసి పళ్ళునూరుతాడు.


ఇప్పటికైనా మమ్మల్ని నమ్మండి మేము ఏది చేసిన డైరెక్ట్ గా చేస్తాము నువ్వు రారా అని తీసుకువెళ్లిపోతుంది.

రాజ్ నివి వెళ్లిన వైపు చూస్తూ ఉంటే..  ఏమైంది నాన్న అమ్మ ఏదేదో మాట్లాడుతుంది.  ఉన్నాడుగా నాకు మొగుడు.  కింద నిప్పు పెట్టి పైకి వచ్చి చలికాచుకుంటున్నాడు.

అప్పట్లో వీడి నాన్న...  ఇప్పుడు వీడు.  ఇద్దరికీ ఇద్దరే నా ప్రాణానికే అని అక్కడ మంచం మీద కూర్చుంటాడు. మంచినీళ్లు బాటిల్ ఇస్తే థాంక్స్ రా బంగారం అని వాటర్ తాగి కాస్త రిలాక్స్ అవుతాడు.

మీరు ఎక్కువ టెన్షన్ పడకండి నాన్న.  నా లిమిట్స్ నాకు తెలుసు. ఛ.. ఛ..  నీకు తెలియదని కాదురా..

తండ్రిగా నాదో ఒక భయం అంతే. మీరు దేనికి అరిచిన ఈ తండ్రి గుండె భయంతో వణికి పోతుంది. వైభవ్ కొంచెం మంచివాడే నాన్న అని తలదించుకుని చెబుతుంది

ఆ మాటకి కూతురు గెడ్డం పట్టుకుని లేపుతూ వాడి గురించి నువ్వు సర్టిఫికెట్ ఇస్తున్నావా. వాడి గురించి ఏమీ తెలియకుండానే నిన్ను వాడి చేతుల్లో పెడుతున్నాను అనుకుంటున్నావా..

చందు ఏం చెప్పబోతుంది...........
[+] 6 users Like SivaSai's post
Like Reply
Part - 127


వాడు మంచివాడు కాబట్టే నిన్ను వైభవ్ చేతిలో పెడుతున్నాను లేకపోతే నీ చుట్టుపక్కల కూడా ఉండనిచ్చే వాడిని కాదు.

వాడు అల్లరి చేస్తాడు కానీ అల్లరి పాలు చేయడు.  వీడి నాన్న కూడా అంతే. అప్పట్లో మా ప్రేమ మొదలైనప్పుడు చూడాలి.

ఏమైంది నాన్న అని పిల్లో ని ఒళ్ళో పెట్టికుని కూర్చుంటుంది. మీ అమ్మని లంగా వోనిలో చూసి ఇంత క్యూట్ గర్ల్ ని మిస్ అవుతే ఎలాగా అని టెంప్ట్ అయ్యాను.

ఆ భరత్,  వినయ్ ఇద్దరు డైరెక్టుగా చెప్పకుండా నువ్వు ఫిక్స్ అయిపోయావా నీ మీద జాలి పడుతున్నాము అని ఏవేవో డైలాగులు లేసారు.

ప్రేమ మైకం లో ఉండి అవేమీ వినిపించలేదు. ఇప్పుడు మీరు నన్ను పెళ్లి చేసుకున్నందుకు బాధపడుతున్నారా.. చందు వైపు చూసి సడెన్ చేంజ్ ఏమిటి...

మీ అమ్మ గొంతులాగా మారిపోయింది. వెనక్కి వేలు పెట్టి చూపిస్తుంది.  అక్కడ నివి ఉగ్రరూపంలో కనిపిస్తూ ఉంటే.. టక్కున లేచి వెళ్లినదానివి ఎప్పుడు వెనక్కి వచ్చావు.

నేను ఎప్పుడు వచ్చాను అన్నది ముఖ్యం కాదు.  నన్ను పెళ్లి చేసుకున్నందుకు మీరు ఇంత ఫీలవుతున్నారు  అని అనుకోలేదు అని మళ్లీ ముక్కు చీదుతూ ఉంటే..

అబ్బా నివి నేను ఎందుకు అలా అంటానే..  ఇప్పుడే కదా ప్రేమ మైకంలో పడి మోసపోయాను అని చందు కి చెబుతున్నారు.

వెనకాల వైభవ్ చాక్లెట్ తింటూ కనిపిస్తాడు. ఇదంతా నీ పనేనా.. అయ్యో మావయ్య నేనేమీ చెయ్యలేదు. అత్తయ్యతో మావయ్య ఫీల్ అవుతున్నట్టు ఉన్నారు.

నువ్వే దగ్గరుండి తీసుకురా అని చెప్పాను.  కానీ మీరు పైన ఇలాంటి బాంబు వేస్తున్నారని నేను ఎలా ఊహించగలను.

నువ్వు ఏదో ఊహించకుండానే చిచ్చు పెడతావు అని నివి దగ్గరికి వెళ్లి అది కాదే...  అప్పుడు నువ్వు లంగా వోనిలో ఉన్న ఫోటో ఇప్పటికే నా దగ్గర ఉంది.

కావాలంటే చూడు అని ఫోన్ ఓపెన్ చేసి చూపిస్తాడు.  అందులో ముద్దుగా కనిపిస్తున్న తనని చూసుకొని మురిసిపోతూ...

సరేలే... డిన్నర్ టైం అయింది ఇంక రండి అని వెళ్ళిపోతుంది.  వైభవ్ రాజ్ దగ్గరికి వచ్చి నీకు అత్తయ్యని కూల్ చేయడం బాగా తెలుసు కదా..

నీకు చిచ్చు పెట్టడం ఎంత బాగా తెలుసో.. నాకు కూల్ చేయడం అంత బాగా తెలుసు.

శ్రీకర్ సైలెంట్ గా సౌమ్య గదిలోకి దూరతాడు.  మంచం మీద పడుకుని రీల్స్ చూస్తన్న సౌమ్య పక్కన ఏదో బరువుగా అనిపిస్తుంది అని చూసి... నువ్వేంటి ఇక్కడ ఎలా వచ్చావు అని కంగారు పడుతుంది.

ఎలా వస్తాను.  సింహద్వారం నుంచి దర్జాగా నడుచుకుంటూ వచ్చాను.  నాన్న చూడలేదా అని కంగారుగా తలుపు వైపు చూస్తుంది.మీ నాన్న చూస్తే నాకేమైనా భయమా..

సడన్ గా నీకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది.  నాకెప్పుడూ ధైర్యం ఉంది. ఏదో నువ్వు ఫీల్ అవ్వకూడదు అని మావయ్య అంటే కాస్త భయం ఉన్నట్టుగా యాక్ట్ చేశాను అంతే. అబ్బ చా అని మంచం మీద నుంచి లేచి నిలబడుతుంది.

ఎందుకు పప్పీ అలా లేచావు. పడుకోవచ్చు కదా.. కాసేపు అచ్చిక బుచ్చుకలు ఆడుకుందాం. అబ్బో అబ్బాయి గారికి చాలా కోరికలు ఉన్నాయే..

పెళ్ళికి ముందు ఇలాంటివి చాలా బాగుంటాయి పప్పీ. తొందరలో మన పెళ్లి అయిపోతుంది.. అప్పుడు ఇలా దొంగ చాటుగా కలుసుకోవడం సరదాగా మాట్లాడుకోవడం కుదరదు కదా..

ఇప్పుడే సింహాద్వారం నుంచి వచ్చాను అన్నావు.  అవును వచ్చాను.  ఎవరు చూడలేదు కాబట్టి లోపలికి వచ్చేసాను. చూసి ఉంటే మాయ చేసి రావాల్సి వచ్చేది.

సౌమ్య కళ్ళు పెద్దవిగా చేస్తూ చేతులు నడుముపై పెట్టి నిలబడుతుంది. మాయ చేసి వచ్చేవాడివా? నువ్వు ఎవరివి...  జాదూగాడివా?

శ్రీకర్ ఛాతీ విరుచుకుని...  జాదూగాడు కాదు… నీ ప్రేమలో పడిపోయిన పిచ్చోడు. ప్రేమలో ఉన్నవాళ్లకి సూపర్ పవర్స్ ఉంటాయంటారు.

అయ్యో పాపం… సూపర్ పవర్స్ ఉంటే ముందుగా నీ హెయిర్ స్టైల్ సెట్ చేసుకో. తల గాలి తాకినట్టు ఉంది.
అది స్టైల్ పప్పీ… ఇంటికి దొంగగా వచ్చిన హీరో లుక్.

హీరో అంటావా? హీరోలు ఇలా అమ్మాయి గదిలోకి దూరరు.  హీరోలు కాదు… ఫ్యూచర్ హస్బండ్స్ దూరుతారు.

ఆ మాటకి సౌమ్య చెంపలు ఎర్రబడతాయి. కానీ బయటికి మాత్రం..  ఫ్యూచర్ హస్బండ్ కదా… ఇప్పుడు మర్యాదగా బయట కూర్చోండి  హస్బెండ్ గారు.

శ్రీకర్ వెంటనే మంచం మీద మరింత సర్దుకుని కూర్చుంటాడు.  ఇది నా ఫ్యూచర్ బెడ్ కదా… ముందే అడ్జస్ట్ అవుతున్నాను.

శ్రీకర్  అని దిండు తీసుకుని కొడుతుంది.  అతడు ఆ దిండు పట్టుకుని దగ్గరకు లాగేస్తాడు.

సౌమ్య… నిజంగా చెబుతున్నా… పెళ్లయ్యాక ఇలా దొంగగా రావడం కుదరదు. అప్పుడంతా కుటుంబం, బాధ్యతలు… కానీ ఈ దొంగతనం ఫీల్… ఈ టెన్షన్… మావయ్య చూస్తారేమో అన్న ఫన్… ఇవన్నీ మిస్ అవుతాయి.

సౌమ్య కొంచెం సీరియస్ అవుతుంది.అయితే మిస్ అవకుండా చూసుకోవాలి.  ఎలా?
పెళ్లయ్యాక కూడా రాత్రి రాత్రి ఇలా నా గదిలోకి దొంగలా రా.
అప్పుడు మీ నాన్న కాదు… మన పిల్లలు పట్టేస్తారు.
అయ్యో! పిల్లల దాకా వెళ్లేవా?

అవును. ఇద్దరు. ఒకరు నా లాంటి అల్లరి… ఇంకొకరు నీ లాంటి క్యూట్.
నీ లాంటి అల్లరి అంటున్నావా? అంటే వాళ్లు కూడా ఇలా దొంగలా అమ్మాయిల గదుల్లోకి వస్తారా?

ఓహ్ నో… వాళ్లకి నేను స్ట్రిక్ట్ ఫాదర్. మీ నాన్న, మా నాన్న లాగా ఉంటాను.  హ్మ్… ఇప్పుడే నాన్నకి భయపడి యాక్ట్ చేసినోడు కదా..

శ్రీకర్ నవ్వుతూ దగ్గరకు వాలి...  నీ కోసం యాక్ట్ చేశాను. కానీ నీ దగ్గర మాత్రం యాక్టింగ్ లేదు. నిజంగానే నువ్వు నాకు చాలా ఇష్టం.

సౌమ్య కాసేపు మౌనం.  తర్వాత చప్పున   నాకూ. ఈ ప్రేమ మన చిన్నప్పుడే మొదలయ్యింది.

అంతలో బయట నుండి భరత్ గొంతు..  సౌమ్య… తలుపు వేసుకున్నావా?  ఇద్దరూ ఒక్కసారిగా షాక్.  శ్రీకర్ ఫాస్ట్ గా లేచి చుట్టూ చూస్తాడు.

ఎక్కడ దాక్కోవాలి? ఎందుకు దాక్కోవడం.. అక్కడ మావయ్య వచ్చి పిలుస్తున్నారు. దాక్కోక... భయం లేదు అన్నావు కదా..  ఇప్పుడు సెటైర్లు వేసే టైమా.. ఎక్కడ దాక్కోవాలో అర్జెంటుగా చెప్పు.

బాల్కనీకి వెళ్లు...  అయ్యో అక్కడి నుంచి కింద పడిపోతే?
అయితే కర్టెన్ వెనకాల  శ్రీకర్ కర్టెన్ వెనక దాక్కుంటాడు. సౌమ్య తలుపు తెరుస్తుంది.

భరత్  లోపలికి వస్తాడు. ఈ టైంలో ఏమిటి నాన్న..
ఏమిటి ఇంత శబ్దం?  రీల్స్ చూస్తున్నా నాన్న…
నవ్వులు బాగా వినిపించాయి. గది మొత్తం చూస్తూ ఉంటాడు.

అది కామెడీ వీడియో. సరే గుడ్ నైట్. గుడ్ నైట్ నాన్న. భరత్ వెళ్ళిపోతాడు.  తలుపు మూసిన వెంటనే… కర్టెన్ వెనక నుంచి శ్రీకర్ జారిపడి బయటకు వస్తాడు.

ఈ టెన్షన్… ఈ థ్రిల్… పెళ్లయ్యాక ఉండదు పప్పీ.. నీకు టెన్షన్ కావాల్సి వచ్చిందా...  నాన్న చూస్తే ఎంత ఇబ్బందిగా అనిపించేది.

ఇందులో ఏముంది... కాబోయే మొగుడు పెళ్ళాలు మాట్లాడుకుంటున్నారు అనుకుంటాడు. అవునా అలా అనుకున్న వాడివి ఎందుకు దాక్కున్నావు.  ఇప్పుడు అవన్నీ అవసరమా..

అవును… పెళ్లయ్యాక నేరుగా హాల్‌లో కూర్చోబెడతాను. దొంగతనం లేదు.  అంటే… ఇప్పటివరకు ఉన్న రొమాన్స్ మొత్తం ఆపేస్తావా?

సౌమ్య కాస్త దగ్గరకు వచ్చి… అతని కాలర్ పట్టుకుని..
ఆపను… అప్పుడైతే అధికారికంగా రొమాన్స్.

శ్రీకర్ చిరునవ్వుతో...  అయితే ఇప్పుడిది ట్రైలర్ అన్నమాట.  అవును… ఫుల్ మూవీ త్వరలో.

రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది కదా?  మాట్లాడకు… నాన్న చూసే లోపు  బయటికి వెళ్లిపో ముందుగా..

సరే పప్పీ… కానీ వెళ్లే ముందు ఒక హగ్.
శ్రీకర్..  అని సిగ్గుపడుతుంది.
సరే సరే… హగ్ లేకపోయినా… ఒక ఫ్లయింగ్ కిస్..
సౌమ్య నవ్వుతూ ఇస్తుంది.

శ్రీకర్ తలుపు దగ్గరికి వెళ్లి తిరిగి చూస్తాడు.
సౌమ్య…  ఏమిటి?
సింహద్వారం నుంచి వచ్చాను కదా… ఇప్పుడు గుండె ద్వారం నుంచి వెళ్తున్నా.

డైలాగ్ కింగ్..  నీ కింగ్.
అతడు జాగ్రత్తగా  గది బయటికి వెళతాడు.
సౌమ్య మంచం మీద కూర్చుని ఫోన్ తీసుకుని రీల్స్ ఓపెన్ చేస్తుంది… కానీ ముఖంలో మాత్రం అదే సిగ్గు నవ్వు.

హమ్మయ్య ఎవరు చూడలేదు అని పిల్లి లాగా వెళుతూ ఉంటే ఒరేయ్ అన్న పిలుపు వినిపిస్తుంది. అబ్బా మావయ్యకి దొరికేసాను కదా అని ఒక వెనక్కి తిరిగి చూసి మావయ్య ఇంకా నువ్వు పడుకోలేదా అని ఒక తింగరి నువ్వు నవ్వుతాడు.

నవ్వింది చాలు కానీ ఇలా వచ్చి కూర్చో.. ఎందుకు మావయ్య.  రా కూర్చో ... చెబుతాను.. పెద్దవాళ్ళు అంటే నాకు గౌరవం.  మీ ముందు నేను కూర్చోలేను.

ఒరేయ్ నువ్వు ఓవరాక్షన్ ఆపలేదనుకో... నేను నిజంగానే బెల్ట్ తీస్తాను.  కాబోయే అల్లుడ్ని కొడితే బాగోదు మావయ్య. అందుకే మూసుకుని కూర్చో.

కూర్చుని చెప్పండి మావయ్య.  ఎందుకురా నా కూతురు గదిలోకి దూరావు.  ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ...  నేను అక్కడే ఉన్నానని నీకు తెలుసా..

తెలుసు. కర్టెన్ వెనకాల దాకున్నావు కదా... కనపడకుండా దాక్కున్నాను కదా ఎలా కనిపెట్టారు అబ్బా అని ఆలోచిస్తూ ఉంటే..

నువ్వు ఏమన్నా కుక్క పిల్ల సైజులో ఉన్నావా.  ఆరడుగులు ఉన్నావు తెలియదా..

మరి అప్పుడే పట్టుకోకుండా నేను బయటకు వచ్చేదాకా వెయిట్ చేసి ఇప్పుడడుగుతారేమిటి.  నిన్ను అక్కడే పట్టుకుంటే సౌమ్య ఇబ్బంది పడుతోంది.

ఏదో తప్పు చేసినట్టుగా నా ముందు తలదించుకుంటుంది. అది నాకు ఇష్టం లేదు.

నువ్వు సూపర్ మావయ్య.  అందుకే నువ్వంటే నాకు రెస్పెక్ట్.  ఇంకేంటి నేను బయలుదేరనా అని కుర్చీలోంచి లెగుస్తూ ఉంటే.... నేను అడిగిన దానికి తమరు ఇంకా సమాధానం చెప్పలేదు.

జస్ట్ ఊరికినే... నువ్వు పట్టుకుంటావో లేదో అని టెస్ట్ చేద్దామని.  అవునా ఇప్పుడే మీ అమ్మకి కూడా కాల్ చేశాను. వస్తుంది.

మావయ్య అని కంగారుగా పిలుస్తాడు. ఏమైందిరా.. నాన్నకు చేయొచ్చు కదా.  ఇంత చీకట్లో అమ్మ ఎలా వస్తుంది.

మీ నాన్న వస్తే నువ్వు బురిడీ కొట్టిస్తావు.  మీ అమ్మయితే నా చేతిలో ఉన్న బెల్టు మీ అమ్మ చేతిలోకి వెళుతుంది.

శ్రీకర్ పరిస్థితి......
[+] 6 users Like SivaSai's post
Like Reply
Part - 128



ఇది అన్యాయం మావయ్య.. మీరు అమ్మకి ఎందుకు ఫోన్ చేశారు అని శ్రీకర్ ఏడుపు ముఖంతో అడుగుతాడు. అప్పుడే సూర్య వైభవ్ ఇద్దరూ విజిల్స్ వేసుకుంటూ వస్తారు.

వాళ్ళిద్దర్నీ చూడండి లవర్స్ తో ఎంజాయ్ చేసి వస్తున్నారు. నేనేమైనా బయటికి తీసుకువెళ్లానా.  వైభవ్ వచ్చి మేము ఎక్కడ ఎంజాయ్ చేసాము.

నేను మా అత్తయ్యతో టైం స్పెండ్ చేసి వచ్చాను. కావాలంటే ఫోన్ చెయ్యి.   ఒరేయ్ నన్ను ఇరికించకురా..

సూర్య..  ఏమైంది మావయ్య అని భరత్ ని అడిగితే.. నీ ఫ్రెండ్ ని అడుగు.. ఇంత రాత్రిపూట వచ్చి సౌమ్య గదిలోకి దూరాడు.

మళ్ళీ నన్ను కనిపెట్టేసావా సరే వెళతాను అని నాకే కౌంటర్ వేస్తున్నాడు. ఆ మాటకి సూర్య చిన్నగా నవ్వుతూ మొదటిసారి కదా వదిలేసేయ్ మావయ్య.

ఏది..  నాకు దొరకడమా. ఒకరకంగా అలాగే అనుకో. ఏదో సూర్య చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నాను.  పెళ్లి అయ్యే వరకు నా కూతురు దగ్గరికి వచ్చావే అనుకో...

శ్రీకర్ సీరియస్ గా లేచి నిలబడి నీ కూతురు దగ్గరికి నేను రాను మావయ్య.  నాకు కాబోయే పెళ్ళాం దగ్గరికి వస్తాను అని గట్టిగా ముద్దు పెట్టి తుర్రుమని పరిగెడతాడు.

ఇడియట్.. చిన్నపిల్లోడి వేషాలు పోలేదు అని నవ్వుకుంటాడు.

అంత నవ్వుకునే వాడివి ఎందుకు మావయ్య వాడిని అంత టెన్షన్ పట్టావు అని వైభవ్ అడిగితే... ఆమాత్రం భయం పెట్టలేదు అనుకో 24 గంటలు ఇక్కడే మకాం వేస్తాడు.
ఆ టెన్షన్ మనకు అవసరమా.. ఇక్కడ నువ్వు,  అక్కడ రాజ్ మావయ్య.. ఇద్దరు ఒకేలాగా ఆలోచిస్తున్నారు. ఆడపిల్లల తండ్రులం బాబు.

మా జాగ్రత్తలో మేము ఉండాలి లేకపోతే కోతులులాగా ఉన్న మీరు ఆగుతారా.. మీ బాబు అంటే లక్కీ ఫెలో.. కొడుకును కానీ ఎంజాయ్ చేస్తున్నాడు.

ఆ మాటకి అప్పుడే అక్కడికి వచ్చిన వినయ్ ఏది బావ ఒకసారి నా మొఖం చూసి ఆ మాట చెప్పు. మేము ఎంజాయ్ చేస్తున్నామా.  ఎంత టెన్షన్ ఉంటుందో తెలుసా..

ఎందుకు టెన్షన్ వినయ్.  టెన్షన్ కాక ఏముంటుంది చెప్పు.  ఆడపిల్లలకు నేర్పించకపోయిన ఒక పద్ధతిగా పెరుగుతారు. బాగా చదువుకుంటే వాళ్లు ఒక పొజిషన్ కి వెళ్లే వరకు మనం సపోర్టుగా నిలబడతాము.

ఏదో యావరేజ్ గా చదివితే మన స్టేటస్ కి  తగ్గట్టుగా సంబంధం చూసి పెళ్లి చేస్తాము.. అదే అబ్బాయిలు కనుక సరిగ్గా చదవలేదు అనుకో...

స్టేటస్ సంగతి పక్కన పెట్టు . కూరగాయలు అమ్ముకునే వాళ్ళ పిల్లను కూడా చేయరు.. ఈ లోపు ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అవుతాయి ఏమో అని ప్రతి రోజు చెక్ చేసుకోవాలి.

వాళ్ళు పడుకున్నాక బెడ్ రూమ్ లో చూడాలి. వాళ్ళ బైక్ లో చూడాలి. అబ్బబ్బ మామూలు టార్చర్ అనుకుంటున్నావా అది.

వైభవ్ కోపంగా నా మీద నమ్మకం లేదా అని అడుగుతాడు. నీ మీద నమ్మకం ఉంది రా.  కానీ నీ వయసు మీద నమ్మకం లేదు.

మీరు కూడా మా వయసులో ఇలాగే చేసేవారా.  ఇదిగో ఇలా అడుగుతారు కొడుకులైతే. అదే కూతుర్లనుకో ఏ విషయానికైనా మా నాన్న గ్రేట్ అని మాట్లాడుతారు. ఇప్పుడు అర్థమవుతుందా కొడుకుకి కూతురికి ఉన్న తేడా.. ఎవరి అదృష్టవంతులు అన్నది.

సర్లే ఇప్పటికే బాగా లేట్ అయింది వెళ్లి పడుకోండి అని భరత్ లేచి నుంచి ఉంటాడు.. సూర్య గదిలోకి వెళ్లి మంచం పైన వాలతాడు.

కింద వాళ్ళు మాట్లాడకుండా మాటలన్నీ గుర్తుకు వచ్చి నవ్వుకుంటూ క్యూటి ఏం చేస్తున్నావు.. నిద్రపోయావా... అసలు ఆఫీసులో ఫుల్ బిజీ అయిపోతున్నావు.

అందరినీ పరుగులు పెట్టిస్తున్నావు కదా.. ఫోన్ చేయాలా వద్దా అని ఫోన్ చేతిలో పట్టుకుని ఆలోచిస్తూ ఉంటాడు.
సూర్య ఫోన్ స్క్రీన్ వైపు చూస్తూ…

కాల్ చేయాలా… లేక మెసేజ్ పెట్టాలా… అని తనతోనే మాట్లాడుకుంటాడు.  ఇప్పుడే కాల్ చేస్తే ఇంత లేట్ అయ్యాక గుర్తొచ్చానా?.అంటుంది.

మెసేజ్ పెడితే సీన్ చేసి రిప్లై ఇవ్వకుండా ఉంచేస్తుంది… అని మొహం ముడుస్తాడు.
చివరికి ధైర్యం చేసి టైప్ చేస్తాడు...

క్యూటీ… మిస్ అవుతున్నసెండ్ చేయగానే గుండె దడదడలాడుతుంది.
ఒక్క నిమిషం… రెండు నిమిషాలు… రిప్లై లేదు.
చూడు ఇదేంటో… ఆఫీసులో ఫుల్ బిజీ అని చెప్పి ఇప్పుడు నన్నే టెన్షన్ పెట్టిస్తుంది.

అప్పుడే ఫోన్ వైబ్రేట్ అవుతుంది.
స్క్రీన్ మీద మెసేజ్.. హలో దేవా సార్..
సూర్య మొహం మీద స్మైల్ విరుస్తుంది.

అయ్యో దేవుడా… ఇంకా నిద్రపోలేదు అంటే ఛాన్స్ ఉంది.
వెంటనే కాల్ చేస్తాడు.  అవతల విశి వాయిస్ కాస్త స్వీట్ గా..  ఇంత లేట్‌గా కాల్ చేసారు. ఇంకా పడుకోలేదా..

నీ వాయిస్ వినాలి అనిపించింది.
శ్రీకర్ అన్నయ్యకి కోటింగ్ పడిందంట కదా..  అదేంటి నీకు ఎవరు చెప్పారు?

వైభవ్ ఇప్పుడే కాల్ చేసి ఫుల్ స్టోరీ చెప్పాడు. భరత్ అంకుల్ టెన్షన్..  అన్నయ్య ముద్దు పెట్టుకుని పరిగెత్తడం…అన్నీ.

సూర్య నవ్వు ఆగదు.  అబ్బో… మీ ఫ్రెండ్స్ ఇద్దరు సీక్రెట్ సర్వీసులే.  సరే… నువ్వు అంత హ్యాపీగా ఉన్నావంటే నాకూ సంతోషమే.

కాసేపు ఇద్దరు మాట్లాడుకొని... గుడ్ నైట్ చెప్పుకుని పడుకోండి పోతారు............
[+] 7 users Like SivaSai's post
Like Reply
Part - 129



హిమ, రమేష్ ఇద్దరూ బెయిల్ మీద బయటికి వస్తారు.
బయటికి వెళ్లలేక ఇంట్లోనే ఉండిపోతారు.  హిమ గదిలో కూర్చుని పగతో రగిలిపోతూ ఉంటుంది.

ఆ విశిష్ట ని ఎలాగైనా నాశనం చేయాలి. సూర్య పక్కన నేనే ఉండాలి అని పిచ్చపిచ్చ కలలు కంటూ ఉంటుంది.

హిమ కళ్లలో ఆవేశం మరింత ముదురుతుంది. గది మొత్తం చీకటిగా ఉన్నా… ఆమె మనసులో మాత్రం ప్రతీకారం అగ్ని జ్వాలల్లా మండుతుంది.

విశిష్ట… నువ్వు నన్ను తక్కువ అంచనా వేసావు. సూర్య పక్కన నిలబడేది నేనే… నువ్వు కాదు అంటూ అద్దంలో తన ప్రతిబింబాన్ని చూస్తూ పగతో నవ్వుతుంది.

రమేష్ బయట హాల్లో ఆలోచనల్లో మునిగిపోయి ఉంటాడు. బెయిల్ మీద బయటికి వచ్చారు కానీ వారి మీద నమ్మకం ఎవరికీ లేదు. ఇంటి బయటకు వెళ్తే మీడియా, సెక్యూరిటీ ఆఫీసర్ల కంట్రోల్. అందుకే జాగ్రత్తగా ఉండాల్సిందే.

హిమ గది తలుపు తెరిచి బయటికి వస్తుంది...నాన్న… మనం ఇక్కడ కూర్చుని ఏమీ సాధించలేం. విశిష్టను నేరుగా ఎదుర్కొంటే ప్రయోజనం లేదు. ఆమెను సూర్య కళ్లలోనే పడగొట్టాలి అంటుంది గట్టిగా.

రమేష్ సందేహంగా చూస్తాడు. ఏం చేయాలనుకుంటున్నావు?

హిమ కళ్లలో క్రూరమైన మెరుపు.  విశిష్ట గతం… ఆమె కుటుంబం… ఆమె బలహీనతలు… అన్నీ తవ్వాలి. సూర్యకి ఆమె మీద నమ్మకం చెడిపోవాలి. అతను ఆమెను అనుమానించాలి. అప్పుడు నేనే అతనికి ఓదార్పుగా కనిపిస్తాను.

రమేష్ కాసేపు మౌనంగా ఉంటాడు. ఇది ప్రమాదకరం హిమ.
ప్రేమలో, యుద్ధంలో… అన్నీ సమర్థమే అని చల్లగా నవ్వుతుంది.
అలాగే మనలకి నమ్మకం ద్రోహం చేసిన గౌతమ్ ని కూడా సర్వనాశనం చేయాలి.  వాడి దగ్గర ఇంక ఏముంది.  అలా తక్కువ అంచన వెయ్యకూడదు.

వాడికి ఇప్పుడు సూర్య సపోర్ట్ ఉంది. నన్ను ముంచడంలో హెల్ప్ చేశాడు.  ఇంకా సూర్య వెనకాల నిలబడుతున్నాడు.
ఆ రాత్రే హిమ ఒక ప్రైవేట్ డిటెక్టివ్‌కు ఫోన్ చేస్తుంది. విశిష్ట గురించి ప్రతి చిన్న విషయం కావాలని ఆదేశిస్తుంది. కాల్ ముగిసిన తర్వాత ఆమె ముఖంలో సంతృప్తి.
అంతటితో ఆగదు.

సోషల్ మీడియా ద్వారా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి.... సూర్యకి  దగ్గరవ్వాలని ప్లాన్ చేస్తుంది.
ముందు నమ్మకం… తర్వాత దెబ్బ అని తనతోనే అనుకుంటుంది.

మరోవైపు సూర్య విశిష్టతో సంతోషంగా మాట్లాడుతున్న ఫోటోలు చూసి హిమ గుండెల్లో అసూయ మంట మరింత పెరుగుతుంది.

ఆ నవ్వు… త్వరలో ఆగిపోతుంది అని కఠినంగా అనుకుంటుంది.
విశిష్ట జీవితాన్ని ఒక్కసారిగా కాదు… నెమ్మదిగా, నిశ్శబ్దంగా చెదరగొట్టాలి.

రెండు రోజుల్లో డిటెక్టివ్ కాల్ చేస్తాడు. విశిష్ట కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం చెబుతాడు.

దీన్ని లైఫ్ లో రిమార్క్ అంటూ ఏమీ లేదే. ఉన్నదే ఒక అమ్మ..  ఆవిడే  బలం,  బలహీనత.

సూర్య కి ఫేక్ అకౌంట్ తో మెయిల్ చేస్తుంది. టెక్నాలజీ ఉపయోగించి క్రియేట్ చేసిన విశిష్ట ఫోటోలు.  మెయిల్ ఫార్వర్డ్ చేసి సోషల్ మీడియాలో కూడా అప్లోడ్ చేస్తుంది.

కొత్త అకౌంట్ నుంచి మెయిల్ ఏమిటా అన్న డౌట్ తో ఓపెన్ చేస్తాడు.  అందులో విశిష్ట ఫోటోలు చిరాకుగా కనిపిస్తాయి. అవి చూడగానే సూర్యాకి చాలా కోపం వస్తుం. ది ఎవరు పంపారా ? సెర్చ్ చేస్తూ డీటెయిల్స్ ఏమీ తెలియదు.

సోషల్ మీడియాలో కూడా రావడం చూస్తాడు.  ఓ మై గాడ్ ఇవి క్యూటి చూస్తే ఇంకా అంతే సంగతులు. క్యూటి చూడకముందే ఇవన్నీ క్లియర్ చేయి మీడియాలో ఎక్కడ రాకుండా చూస్తాడు.

హిమ మీదే సూర్యకి డౌటు వస్తుంది కానీ సాక్షాలతో పట్టుకుంటే తప్ప ఉపయోగం లేదు అని ఆలోచిస్తూ ఉంటాడు.

ఈ లోపు విశిష్ట సూర్య క్యాబిన్ కి వస్తుంది.  కన్నీళ్ళతో ఉన్న విశిని చూడగానే మేటర్ అర్థమవుతుంది కానీ సూర్య మనసులో ఆల్రెడీ అప్పటికే ఒక ప్లాన్ తో ఉంటాడు.

సైలెంట్ గా చూస్తూ ఉంటే దేవా సార్ మీరు ఇది నమ్ముతున్నారా..  ఆ ఫొటోస్  గురించి నిజంగా నాకు ఏమీ తెలియదు అని ఏడుస్తూ ఉంటుంది.

దగ్గరికి వెళ్లి కూల్ క్యూటి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు.  మీరు నమ్మలేదు కదా నన్ను నమ్ముతున్నారు కదా అని బేలాగా అడుగుతుంది.

సూర్యా ఆలోచిస్తూ ఉంటాడు. నిన్ను ఈ విషయంలో నమ్ముతున్నాను అంటే ధైర్యంగా బయటకు వెళుతుంది. కానీ విశి లో ఆ కాన్ఫిడెన్స్ కనిపిస్తే ఈ ప్లాన్ చేసిన వాళ్లు ఇంకా క్రూయల్ గా బిహేవ్ చేయవచ్చు.

అదే ఇప్పుడు క్యూటి ఏడుస్తూ ఉంటే నేను అవాయిడ్ చేశాను అనుకుంటారు. సో కష్టమైనా సరే ప్రెసెంట్ అదే ఇంప్లిమెంటరీ చేయాలి అనుకుంటూ విశిష్టాని చూస్తాడు.

విశి సూర్య ఏం చెబుతాడా అని చూస్తూ ఉంటుంది.

విశిష్ట ఎదుట నిలబడి సూర్య గట్టిగా అంటాడు..
నాకు టైమ్ కావాలి.  ఆ మాట విన్న విశిష్ట గుండె పగిలినట్టవుతుంది.

సూర్య వెనక్కి తిరిగి నిలబడతాడు.
అదే సమయంలో…  అతని కళ్లలో మాత్రం ఒక నిర్ణయం  ఉంటుంది.  నిన్ను నేను నమ్ముతున్నాను క్యూటి …
కానీ ఎవరు ఈ గేమ్ ఆడుతున్నారు తెలుసుకోవాలి.

సూర్య నుంచి అలాంటి సమాధానం ఊహించని విశి నీరు కారిపోతుంది. మౌనంగా అక్కడి నుండి బయటకి వచ్చేస్తుంది.

ఆలోచిస్తున్న సూర్య దగ్గరికి ప్యూన్ వస్తాడు. సార్ మీ కోసం ఎవరో హిమ అంట. వెయిట్ చేస్తున్నాను అని చెప్పమన్నారు.
రమ్మను అని డల్ గా కూర్చుని ఉంటాడు. హిమ చుడీదార్ వేసుకుని వస్తుంది. హాయ్ సూర్య అంటే హాయ్ హిమ అని బాధగా ఎక్స్ప్రెషన్ పెడతాడు.
ఏమైంది అలా ఉన్నావు. నీకు తెలియదా... సోషల్ మీడియాలో నేను చూశాను. ఆ ఫోటోలు చూశాకే నాకు ఇలా.. అని కొంచెం బాధతో మాట్లాడుతాడు.
కొన్ని నిజాలు చాలా లేట్‌గా తెలుస్తాయి హిమ…
అంటాడు.
హిమ మనసులో ఆనందం.
ప్లాన్ వర్క్ అవుతోంది”అని అనుకుంటుంది.

కాసేపు ఓదార్పు యాత్ర చేసి హిమ అక్కడ నుండి వెళ్ళిపోతుంది.. వెళుతున్న హిమను చూస్తూ నాకు తెలుసు ఇందులో నీ హస్తము ఉండి ఉంటుంది అని కానీ క్లియర్ గా నిన్ను పట్టుకుంటాను.

సూర్య తన నమ్మకమైన ఫ్రెండ్‌కి ఆ అజ్ఞాత మెయిల్ ట్రేస్ చేయమని చెబుతాడు.
ఐపీ అడ్రెస్… ఫేక్ అకౌంట్… క్రమంగా లింక్ హిమ వైపు వెళ్తుంది.
అతను బయటకు ఎలాంటి రియాక్షన్ చూపించడు.

ఒక రాత్రి…  శ్రీకర్ ఇంటి ముందు కారు ఆగుతుంది.  సూర్య దిగి విశి ఇంటి తలుపు కొడతాడు. తలుపు తీసిన విశి సూర్య ని చూసి అలాగే నిలబడిపోతుంది.

సూర్యకి కూడా విశి ని అలా చూడగానే మనసు కలుక్కుమంటుంది. ఏడ్చి ఏడ్చి మొఖం ఊపిరి ఉంటుంది.
నన్ను నమ్ముతున్నావా?అని ఆమె అడుగుతుంది ఏడుస్తూ.
సూర్య దగ్గరికి వచ్చి మెల్లగా హత్తుకుంటూ...  నేను నిన్ను ఎప్పుడూ అనుమానించలేదు.  కానీ మన మధ్యకి ఎవరో వచ్చారు.  నేను వాళ్లని బయటపెడతాను.
వాళ్లని బయట పెట్టడానికే నీతో మార్నింగ్ అలా మాట్లాడవలసి వచ్చింది అంతే కానీ నా బంగారాన్ని నేను అనుమానిస్తానా అని ఆ కళ్ళు తుడుస్తాడు.
విశిష్ట కళ్లలో ఆశ కాంతి తిరిగి వెలుగుతుంది

హిమ నెక్స్ట్ రోజు మళ్ళీ ఆఫీస్ కి వచ్చి సూర్య ని కలుస్తుంది.  సూర్య హిమ ముందే ఒక ప్లాన్ వేస్తాడు.
విశిష్ట గురించి ఇంకా ఏమైనా తెలుసా? అని ఇన్‌టెన్షనల్‌గా అడుగుతాడు.

హిమ అహంకారంతో మరికొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ చూపిస్తుంది.  అదే సాక్ష్యం అవుతుంది.
సూర్య కూల్ గా నవ్వుతూ అంటాడు
అంటే… ఈమెయిల్ కూడా నువ్వే పంపావా?
హిమ షాక్.

హిమ తడబడుతూ నేనెందుకు పంపిస్తాను నాకేమీ అవసరం.  సూర్య కోపం గా లాగిపెట్టి ఒక్కటి కొడతాడు. నువ్వు ఏమనుకుంటున్నావు.

నీ గురించి ట్రెడిషనల్ గా రెడీ అయి వస్తే నీ క్యారెక్టర్ ఏమిటో నాకు తెలియదు అనుకుంటున్నావా.  సడన్గా సానుభూతి మాటలు వలకబోస్తూ ఉంటే నీ నటన అర్థం చేసుకోలేను అనుకుంటున్నావా..
ముందు అమాయకంగా నటించిన సూర్య కనిపెట్టేసాడు అని తెలిసేటప్పటికీ కోపంతో ఊగిపోతుంది.

అవును! ఎందుకంటే నువ్వు నాకే కావాలి అని అరుస్తుంది ఈ స్టేటస్ హోదా ఈ బ్రాండ్ అన్ని నాకే సొంతం కావాలి. అంతేకానీ ఊరు పేరు తెలియని ఓ అనమకురాలకి కాదు.

సూర్య తీసుకునే నిర్ణయం.......
[+] 6 users Like SivaSai's post
Like Reply
Part - 130


హిమని కోపంగా చూస్తూ ఏమిటి ఈ స్టేటస్ హోదా కావాలా.. అవి కావాలి అనుకుంటే కష్టపడాలి లేదా నిజాయితీగా ఉండాలి అంతేగానీ ఇలా అడ్డదారుల్లో వస్తే రోజు చిప్ప కూడు తినడమే.


నాకు ఆ గతి పట్టలేదు. ఆ గతి విశిష్ట కే పట్టిస్తాను అని దొరికిపోయినందుకు అవమానంతో ఏం మాట్లాడుతుందో తెలియక పిచ్చెక్కినట్టుగా అరుస్తూ ఉంటుంది.

సూర్య నవ్వుతూ నీ కాన్ఫిడెన్స్ కి మెచ్చుకోవాలి. విశి
  వెనకాల నేను ఉన్నాను అయినా నువ్వు ధైర్యం చేసావు. విశి నాకు ఏమవుతుందో అన్న విషయం సింహా ఫ్యామిలీ మొత్తానికి తెలుసు.

అంటే విశిష్ట వెనకాల ఈ సింహ ఫ్యామిలీ మొత్తం ఉంది. అలాంటి విశిష్ట ని నువ్వు ఏదో చేయాలి అనుకుంటే మేము చూస్తూ ఉంటాము అని ఎలా అనుకున్నావు అని చేయి పట్టుకుని బయటికి లాక్కొచ్చి విసురుగా తోస్తాడు.

ఆఫీస్ క్యారిడార్  లో కింద పడుతుంది..చుట్టూ ఉన్న స్టాఫ్ అందరు చూసి సూర్య ని చూసి భయంగా వెళ్ళిపోతూ ఉంటారు.

సూర్య చిటికె వేస్తాడు.  అందరూ ఆగి చూస్తూ ఉంటే.. ఇక్కడ జరిగే ప్రతి సీను ప్రతి ఒక్కళ్ళు చూడాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి చీప్ పనులు చేయాలి అంటే వెన్నుల్లో వణుకు పుట్టాలి.  అది ఆడవాళ్ళైనా మగవాళ్ళు అయినా సరే..

హిమ అవమానంతో లేచి సూర్య అని గట్టిగా అరుస్తుంది. జస్ట్ షట్ అప్ అని నోటి మీద వేలు వేసుకుని చూపిస్తాడు.
హిమ అవమానంతో లేచి నిలబడుతుంది. కళ్లల్లో కన్నీళ్లు… కానీ లోపల మాత్రం మండే అగ్ని.

సూర్య… నువ్వు నన్ను ఇలా అందరి ముందు అవమానించావ్. దీని ఫలితం చూస్తావ్… అని గట్టిగా అంటుంది.

సూర్య దగ్గరకు నెమ్మదిగా వచ్చి కూల్ గా చూస్తాడు.
ఫలితం? నువ్వే ఇప్పుడు ఫలితం చూస్తున్నావు హిమ. ఇది కేవలం స్టార్ట్ మాత్రమే.

స్టాఫ్ అందరూ నిశ్శబ్దంగా చూస్తూ ఉంటారు.
సూర్య రిసెప్షన్ వైపు తిరిగి...  మిస్టర్ రాఘవ్… లాయర్ ని కాల్ చేయండి. అలాగే సైబర్ క్రైమ్ సెల్ కి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి.

హిమ ఒక్కసారిగా కంగారు పడుతుంది . ఏమిటి? సైబర్ క్రైమ్ ఆ?  సూర్య ఫోన్ తీసి స్క్రీన్ చూపిస్తాడు.
విశిష్ట ఫోటోలు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ క్రియేట్ చేసింది నువ్వే. ఫేక్ అకౌంట్స్, ట్రోల్స్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్..  అన్నీ ట్రేస్ అయ్యాయి. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు ఈ గేమ్.

హిమ ముఖం పాలిపోతుంది.  ప్రూఫ్ ఉందా? అని కొంచెం ధైర్యం చూపిస్తుంది.  అప్పుడే లోపలికి అడుగుపెడతాడు డిటెక్టివ్ అరవింద్.

ప్రూఫ్ మాత్రమే కాదు… డిజిటల్ ఫుట్‌ప్రింట్స్ మొత్తం మా దగ్గర ఉన్నాయి. నీ ల్యాప్‌టాప్ నుంచి లాగిన ఐపీ అడ్రస్స్, నీ పర్సనల్ మెయిల్ నుంచి చేసిన పేమెంట్స్, ట్రోల్ టీమ్ కి పంపిన ఇన్‌స్ట్రక్షన్స్... అన్నీ రికార్డ్ అయ్యాయి.

సూర్య కళ్లలో కోపం...  నువ్వు విశిని అవమానించలేదు హిమ… నువ్వు ఒక అమ్మాయి గౌరవం, ఒక కుటుంబ ప్రతిష్ట, ఒక మహిళ భద్రత మీద దాడి చేసావ్. అది సోషల్ మీడియాలో అయినా రియల్ లైఫ్ లో అయినా...  క్రైమ్ క్రైమే..


హిమ గొంతు వణుకుతుంది..  సూర్య ప్లీజ్… కేసు వేయకు…  నువ్వు ఫేక్ న్యూస్ పెట్టిన రోజు విశి కూడా ఇలాగే ఏడ్చింది. కానీ విశి ఏడుపులో న్యాయం ఉంది నీ ఏడుపులో కపటం ఉంది.

అప్పుడే ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్లు లోపలికి వస్తారు.
సూర్య స్పష్టంగా చెబుతాడు.  ఐటీ యాక్ట్, డిఫమేషన్, మోర్ఫింగ్, ఆన్‌లైన్ హరాస్మెంట్...  అన్నీ కలిపి కంప్లయింట్ ఫైల్ అవుతుంది. ఇంకా…

కొంచెం ఆగి హిమ వైపు చూస్తాడు.  ఇక్కడ పని చేసే ప్రతి ఒక్కరికీ ఒక మెసేజ్ వెళ్తుంది..  టాలెంట్ లేకపోతే ట్రాప్ వేయొద్దు. అసూయతో నకిలీ వార్తలు క్రియేట్ చేస్తే ఫలితం జైలు గదే.

హిమ కాళ్లు బలహీనంగా వణుకుతాయి.  సూర్య చివరిగా చెబుతాడు..  నీ పనిష్మెంట్ కేవలం లీగల్ మాత్రమే కాదు… నువ్వు సోషల్ మీడియాలో పబ్లిక్ అపాలజీ పోస్ట్ చేయాలి.

నువ్వే చేసిన ఫేక్ న్యూస్ అని అంగీకరించి, విశిష్టకి క్షమాపణ చెప్పాలి. అది కోర్ట్ ఆర్డర్ గా ఉంటుంది.
హిమ పూర్తిగా కూలిపోతుంది.

స్టాప్ మొత్తం నిలబడి చూస్తూ ఉంటారు.
భయం… గౌరవం… మరియు ఒక క్లియర్ మెసేజ్.
సూర్య నెమ్మదిగా చెబుతాడు.  విశి వెనకాల నేను ఉన్నాను. కానీ నిజం వెనకాల చట్టం ఉంది.

రమేష్ పరిగెత్తుకుంటూ వస్తాడు.  కూతురు చేతులకి బేడీలు వేసి ఉండడం చూసి సూర్యా ముందు మోకాళ్ళ మీద కూర్చుండిపోతాడు.

ప్లీజ్ సూర్య ఈ ఒక్కసారికి క్షమించు.  నీ దరిదాపుల్లోకి రాకుండా చూసుకుంటాను. ఆ మాటకి సూర్య కోపంగా ఈ ఒక్కసారిగా...

ఎన్నిసార్లు ఒక్కసారి అవ్వాలి. ఒకసారి విశి జోలి lకి వచ్చినందుకే ఊసలు లెక్కపెట్టించాను. బెయిల్ మీద బయటికి వచ్చినప్పుడు కామ్ గా ఉండకుండా మళ్ళీ విశి అభిమానం మీద దెబ్బ కొట్టడానికి  సిద్ధపడింది.

వెనక నేనున్నానని తెలిసి కూడా ధైర్యంగా అడుగులు వేసింది అంటే ఏమనుకోవాలి.. నాకు ఏమీ తెలియదు అనుకుంటుందా లేక నేను చేతగానివాడిని అనుకుంటుందా..

రమేష్ చేతులు జోడించి మళ్లీ వేడుకుంటాడు.  సూర్యా… నేను తండ్రిని. నా కూతురు తప్పు చేసింది. కానీ జైలు జీవితం ఆమెని పూర్తిగా పాడు చేస్తుంది. నీకు ఎంత కోపం ఉన్నా… ఒక అవకాశం ఇవ్వు. నేను ఆమెని ఈ సిటీ నుంచి తీసుకెళ్తాను. ఇక మీ జీవితాల్లోకి రాదు.

సూర్య కళ్లల్లో ఒక్క క్షణం కూడా మెత్తదనం కనిపించదు.
మిస్టర్ రమేష్… మీరు తండ్రి కాబట్టి ఇలా అడుగుతున్నారు. కానీ నేను కూడా ఒక అమ్మాయి గౌరవం కోసం నిలబడిన మనిషిని.
మీ కూతురు చేసింది చిన్న తప్పు కాదు. ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేసే కుట్ర.

రమేష్ కన్నీళ్లు పెట్టుకుంటూ...  నేను డబ్బు ఇస్తాను… నష్టపరిహారం ఇస్తాను… పబ్లిక్ అపాలజీ ఇప్పుడే వేయిస్తాను. కేసు మాత్రం తీసేసేయ్. ఇప్పటికే పరువు పోయి బయటపడి పెట్టలేకపోతున్నాము.

సూర్య ఒక్కసారిగా గట్టిగా...  ఇది డబ్బుతో క్లోజ్ చేసే డీల్ కాదు. ఇది ఒక మెసేజ్.  ఇవాళ విశిష్ట. రేపు ఇంకెవరైనా.
ప్రతి సారి డబ్బు పెట్టి తప్పించుకుంటే… న్యాయం అనే మాట విలువ కోల్పోతుంది.

హిమ కన్నీళ్లతో తండ్రిని చూస్తుంది.  డాడ్… నన్ను కాపాడు… అని..  రమేష్ మళ్లీ మోకాళ్ల మీద పడబోతుంటే సూర్య వెనక్కి అడుగు వేస్తాడు.

ప్లీజ్… అలా చేయొద్దు. మీ గౌరవం మీ దగ్గరే ఉండాలి.
కాని లా ప్రాసెస్ ఆగదు.
కొద్దిసేపు నిశ్శబ్దం.

సూర్య కొంచెం కూల్ గా...  ఒక్క అవకాశం ఇవ్వమన్నారుగా… సరే.  కోర్టులో ఆమె తప్పు అంగీకరిస్తే… పబ్లిక్ అపాలజీ పెడితే… కౌన్సెలింగ్ కి హాజరవుతే… నేను స్ట్రిక్ట్ పన్నిష్మెంట్ కి ప్రెజర్ చేయను.  కాని కేసు మాత్రం వెనక్కి తీసుకోను.

రమేష్ ఆశ్చర్యంగా చూస్తాడు.
అంటే…?
అంటే… ఆమె చేసిన నేరం రికార్డ్ అవుతుంది.
కాని ఆమె జీవితాన్ని పూర్తిగా నాశనం చేయాలని నాకు అవసరం లేదు.
అయితే నిజంగా మారాలని ప్రూవ్ చేయాలి.

హిమ కళ్లలో మొదటిసారి అహంకారం కరుగుతుంది.
అవమానం… భయం…
సెక్యూరిటీ ఆఫీసర్లు ఆమెను తీసుకెళ్తారు.

రమేష్ వెనక్కి తిరిగి చివరిసారి చూస్తాడు.
సూర్య నెమ్మదిగా స్టాఫ్ వైపు తిరిగి....  ఇది ప్రతీకారం కాదు. ఇది బౌండరీ.  మన దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరికి ఒక సేఫ్ స్పేస్ ఉండాలి.  ఎవరైనా దాన్ని దెబ్బతీస్తే… ఫలితం తప్పదు.

క్యారిడార్‌లో గంభీర నిశ్శబ్దం.
సూర్య ఫోన్ తీసుకుని ఒక మెసేజ్ టైప్ చేస్తాడు..
విశి… నువ్వు స్ట్రాంగ్ గా ఉండు.  ఇక మీదట నీపై ఎవరూ వేలెత్తలేరు.
ఈ విషయం తెలిసిన విక్రమ్ నవ్వుకుంటాడు. శ్రీ అది చూసి నీ కొడుకు కూడా నీలాగా కామ్ గా ఉన్నట్టుంటాడు కానీ అవసరం వచ్చినప్పుడు నిజంగానే సింహం లాగా విరగబడతాడు కదా..

హిమ మారుతుందా..

కథ కొనసాగుతుంది...
[+] 8 users Like SivaSai's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)