Posts: 898
Threads: 13
Likes Received: 7,010 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
రుద్రం భజే! ఎపిసోడ్ 19
మనుషుల రూపంలోకి మరి హోటల్ దగ్గరికి వస్తున్న యోదని కలిసి కోడ్ చెప్పి నాయక్ పంపించిన ఆఫీసర్లుగా పరిచయం చేసుకుని భూషణ్, నంద, క్యూబ్ అని పేర్లు చెప్పడంతో రెస్టారెంట్లో వెయిట్ చేయండి టెన్ మినిట్స్ లో నా టీం తో కలిసి వస్తాను అని చెప్పి హోటల్ లోపలికి వెళ్ళాడు యోధ.
**************
హోటల్ లోపలికి వెళుతున్న ఈ యోధని చూస్తూ "పేరుకు తగ్గట్లు యోధుడు లానే ఉన్నాడు, మీరు ఆఫీసర్లు లాగా బానే ఉన్నారు నేనే పొట్టిగా లావుగా ఉన్నావు అతను నన్ను ఆఫీసర్ అని నమ్మాడు అంటారా..?" అని అనుమానం అడిగాడు క్యూబ్.
"అవును కుబేర! నీ పేరు క్యూబ్ అని చెప్పావు, చాలా విచిత్రంగా ఉంది అర్థం ఏమిటి?" అని అడిగాడు నంది.
"మీ ఇద్దరు పేర్లుల లో ఉన్న అక్షరాలను బట్టి భూషణ్ నంద అని బానే చెప్పారు, నా పేరు కుబేరుడు ఏం చెప్పాలో అర్థం కాక క్యూబ్ అని చెప్పాను బాలేదా..?" అని అడిగాడు కుబేరుడు.
"నీ పేరు చాలా అందంగా ఉంది కానీ పదండి రెస్టారెంట్ దగ్గర వెయిట్ చేద్దాము." అని ఇద్దర్ని తీసుకువెళ్లాడు విభీషణుడు.
ముగ్గురు కూర్చున్న టేబుల్ దగ్గరికి వచ్చి "సార్ ఆర్డర్!" అని అడిగాడు సర్వర్.
"మూడు స్ట్రాంగ్ టీ తీసుకురా..!" అని చెప్పాడు విభీషణుడు.
ఆ మాట విని "భూలోకంలో అన్ని విషయాలు బానే తెలుసుకున్నావు, నంది శివయ్య దగ్గర భక్తుల కోరికలు వింటూ, నేను నా లోకంలో ఎవరు అప్పు అడుగుతారా అని చూస్తూ భూలోకంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకోలేకపోయాము." అని చెప్పాడు కుబేరుడు.
"నేను ఈ భూమి మీదే కదా ఉండేది నాకు అన్ని విషయాలు తెలుసు!" అని చెప్పాడు విభీషణుడు.
"నేను భూలోకం వస్తూ ఉంటాను కానీ నాకు ప్రసాదంగా అరటి పండు తప్పితే ఇంకా ఏమి పెట్టరు." అని సర్వర్ తెచ్చిన టీ తాగుతూ "ఇది వేడి వేడిగా బానే ఉంది దీనిని కైలాస పర్వతం దగ్గర తాగితే ఇంకా బాగుంటుంది." అని చెప్పాడు నంది.
"నీకు అరటిపండు అయినా పెడుతున్నారు నాకు అది కూడా పెట్టరు." అని టీ తాగుతూ "చాలా బాగుంది." అని చెప్పాడు కుబేరుడు.
"అవును! హనుమంతుడి శక్తి ఆ పద్మం దగ్గరికి వచ్చే ఉంటుంది అన్నావు కదా! అది ఏ మనిషిలో ఉందో కనిపెట్టావా..?" అని అడిగాడు నంది.
"అది హనుమంతుడు శక్తి తెలుసుకోవడం అంత తేలికగా కాదు." అని చెప్పాడు విభీషణుడు.
************
అదే సమయంలో హవేలీ హోటల్లోకి వెళ్లి కౌంటర్ దగ్గర మనిషిని చూసి "ముస్తఫా ని కలవాలి." అని చెప్పాడు ముష్రు.
ఆ మాటకి కళ్ళు అర్పకుండా చూస్తూ రూమ్ కీస్ తీసి కౌంటర్ మీద పెట్టి "లోపల వెయిట్ చేయండి." అని చెప్పాడు ఆ వ్యక్తి.
కీస్ తీసుకుని లిఫ్ట్ లో పైకి వెళ్లి రూమ్ డోర్ ఓపెన్ చేస్తున్న ముష్రు దగ్గరికి క్లీన్ చేస్తున్న మనిషికి వచ్చి "నీకు కావలసినవి అన్ని రూమ్ లోకి వస్తాయి బయటకు రావద్దు." అని చెప్పాడు.
"సరే!" అని లోపలికి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకుని కిటికీ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న హోటల్ వైపు చూశాడు ముష్రు.
ఆపోజిట్ హోటల్ రూమ్ లో నుంచి బైనో క్లోర్ లో చూస్తూ "మేడం! ముష్రు కనిపించాడు." అని చెప్పాడు పుష్కర్.
"గుడ్! ఆ రూమ్ ని వాచ్ చేస్తూ ఉండండి అక్కడికి ఎవరు వచ్చిన సరే నాకు తెలియాలి." అని చెప్పింది నీతూ.
అక్కడికి వచ్చి పుష్కర్ చేతిలో బైనో క్లోర్ తీసుకుని చూస్తూ "నాకు తెలిసి ముస్తఫా అనేది మనిషి పేరు కాదు కోడ్ అనుకుంటా..!" అని చెప్పాడు యోధ.
"అలా అయితే మనం ముస్తఫా పేరు మీద ఉన్న మనిషిని వెతకడం అనవసరం ఆ రూమ్ లోకి ఎవరు వస్తున్నారో చూడడమే బెటర్!" అని చెప్పింది నీతూ
"రూమ్ కి ఎవరైనా వచ్చి ముష్రు దగ్గర ఆ ఐటమ్ కోసం చెక్ చేస్తే ప్రాబ్లం కదా!" అని అడిగింది దీప్తి.
"నాకు తెలిసి ఈ ముస్తఫా కోడ్ గ్యాంగ్ పని ముష్రుని బోర్డర్ దాటించడం మాత్రమే వాళ్లకి కూడా ఆ ఐటెమ్ గురించి తెలియకపోవచ్చు!" అని చెప్పాడు యోధ.
"ఒకవేళ ఇక్కడికి కళింగ మనుషులు వస్తే!" అని డౌట్ గా అడిగింది పూజా.
ఆ మాట విని ఆలోచించి "కళింగ మనుషులు కాదు కళింగ డైరెక్ట్ గా వస్తాడేమో!" అని చెప్పింది నీతూ.
"నో ఛాన్స్! మీర్జా చనిపోయినట్లు కళింగకి తెలిసే ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ముష్రుని నమ్మడు కానీ మనం నమ్మించాలి ఈ వస్తువు లాంటిది సేమ్ డమ్మీది ఒకటి చేసి ముష్రూ దగ్గరికి పంపించాలి." అని చెప్పాడు యోధ.
"డాడ్ పంపించిన ఆఫీసర్స్ ఉన్నారు కదా వాళ్లకి ఈ పని అప్పచెప్పు!" అని చెప్పింది దీప్తి.
"అవును! ఇంతకీ ఆ ముగ్గురు ఆఫీసర్స్ ఎక్కడ?" అని అడిగింది పూజా.
"ఆ ముగ్గురు ఆల్రెడీ నన్ను మీట్ అయ్యారు రెస్టారెంట్లో వెయిట్ చేయమన్నాను పదండి వెళదాము." అని చెప్పాడు యోధ.
"పదండి పదండి నాకు కూడా బాగా ఆకలిగా ఉంది హ్యాపీగా కూర్చుని పని చేయడమే తప్పితే కష్టపడడం తెలియదు కదా ఈమధ్య బాగా అలసిపోతున్నాను." అని చెప్పింది పూజా.
మంచం మీద తీరికగా పడుకుని చిప్స్ ప్యాకెట్ తింటున్న పూజా ని చూసి "అవును! బాగా కష్టపడుతున్నావు నిన్ను ఇక్కడ కాదు హిమాలయాలకు తీసుకువెళ్లి వదిలేయాలి అప్పుడు బాగా సుఖపడతావు." అని చెప్పి రూమ్ బయటికి వెళ్ళాడు యోధ.
"ఏంటి? నన్ను హిమాలయాలలో వదిలేస్తావా..? అప్పుడు నీ వీపు ఎక్కి కిందకి దిగను అక్కడ ఉన్నన్ని రోజులు నన్ను నువ్వే మోయాలి." అని చెప్పి యోధ వెనకాల వెళ్ళింది పూజా.
ఆ మాటకి నవ్వుతూ రూమ్ లో నుంచి వెళుతూ "ఏకవీర! మీ ఇద్దరు ముష్రుని ఎప్పుడు వాచ్ చేస్తూనే ఉండాలి ఫుడ్ కూడా ఇక్కడికే పంపిస్తాను." అని చెప్పి దీప్తితో కలిసి వెళ్ళింది నీతూ.
"ఓకే మేడం!" అని ముష్రు ఉన్న రూమ్ వైపు చూస్తూ "పుష్కర్! అసలు ఇదంతా నిజమేనంటావా..? ఆ చిన్న వస్తువుతో అలకాపురి డోర్స్ ఓపెన్ అవుతాయా..? అసలు అక్కడ ఇప్పటికీ కుబేరుడి నగరం ఉందా..?" అని అడిగాడు ఏకవీర.
"యోధ సార్ దగ్గర ఉన్న వస్తువు కోసం ఇంత మంది వెతుకుతున్నారంటే తప్పకుండా ఉండే ఉంటుంది. భగవంతుడు ఉన్నది నిజమైతే ఇది కూడా నిజమే!" అని చెప్పాడు పుష్కర్.
"ఆ ముష్రు గాడు చూడు ఎంత హ్యాపీగా పడుకున్నాడో!" అని చెప్పాడు ఏకవీర.
బైనో క్లోర్ తీసుకుని చూస్తూ "హ్యాపీగా పడుకోవడం కాదు మనం చంపుతామో వాళ్లు చంపుతారో అర్థం కాక అయోమయంలో ఉన్నాడు." అని చెప్పాడు పుష్కర్.
"అదికూడా కరెక్ట్! నాకు ఎప్పటి నుంచో కైలాస పర్వతం చూడాలని కోరిక ఈ కేసు పుణ్యానైన అక్కడికి వెళితే బాగుండు." అని చెప్పాడు ఏకవీర.
"ఎందుకు అలకాపురి డోర్స్ ఓపెన్ అయితే బంగారం తెచ్చుకోవడానికా..!" అని నవ్వుతూ అడిగాడు పుష్కర్.
"కాదు కుబేరుడు నిజంగా ఎలా ఉంటాదో ఒకసారి చూడాలి." అని నవ్వుతూ చెప్పాడు ఏకవీర.
**********
పుష్కర్ వాళ్ళ మాటలు రెస్టారెంట్ లో కూర్చుని వింటూ "నా మీద జోకులు బానే వేసుకుంటున్నారు మీకు సరదాగా ఉంది కదా! కైలాస పర్వత దర్శన ప్రాప్తిరస్తు!" అని చెప్పాడు కుబేరుడు.
"ఏమిటి కుబేర! ఎవరికి అంత అదృష్టం ఇస్తున్నావు." అని అడిగాడు నంది.
"అది నిజంగానే అదృష్టమే! కానీ మనిషికి అదృష్టం వరించాలి అంటే కష్టాలు పడక తప్పదు కదా అందుకే ఆ వరం ఇచ్చాను." అని చెప్పాడు కుబేరుడు.
రెస్టారెంట్ దగ్గరికి వస్తున్న యోధ వాళ్ళని చూసి "కాస్త ఈ లోకంలోకి రండి." అని చెప్పాడు విభీషణుడు.
రెస్టారెంట్లోకి వచ్చి ముగ్గురు కూర్చున్న టేబుల్ దగ్గర కూర్చొని నీతూ వాళ్ళ ముగ్గురిని పరిచయం చేశాడు యోధ.
ముగ్గురికి వైపు చూస్తూ "మీకు ఈ కేస్ డీటెయిల్స్ ఫుల్ గా తెలుసు కదా!" అని అడిగింది నీతూ.
"మాకు మొత్తం తెలుసు ఇంతకీ ఆ పద్మం మీ దగ్గరే ఉందా..?" అని అడిగాడు నంద.
"ఆ పద్మం యోధ బ్యాగ్ లో ఉంది నేను చూశాను." అని చెప్పాడు క్యూబ్.
ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "బానే కనిపెట్టారు మాకు అలాంటిదే డూప్లికేట్ కావాలి." అని చెప్పాడు యోధ.
"ఆ వస్తువుని పద్మం అని పిలుస్తున్నారు దాని పేరు మీకు తెలుసా?" అని అడిగింది పూజా.
"ఆ వస్తువు గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాము పురాణాల ప్రకారం దాని పేరు ఆకర్షణ పద్మం!" అని చెప్పాడు విభీషణుడు.
"అలా అయితే ఇలాంటి పద్మం ఇంకొకటి ఎక్కడ ఉందో తెలిసిందా..?" అని అడిగింది దీప్తి.
"బంగారు లంకలో సేఫ్ గా ఉంది." అని చెప్పాడు విభీషణుడు.
"మిస్టర్ భూషణ్! బంగారు లంక ఇంకా ఉందా..?" అని అనుమానంగా అడిగింది దీప్తి.
"విభీషణుడు ఉన్నంతకాలం బంగారు లంక ఉంటుంది కానీ దానిని ఎవరు కనిపెట్టలేరు." అని చెప్పాడు భూషణ్.
టేబుల్ దగ్గరికి సర్వర్ రావడంతో ఆర్డర్ చెప్పి "మీ ముగ్గురు ఏమైనా తింటారా..?" అని అడిగింది పూజా.
"మా పూజ అయిపోయింది ప్రసాదం కూడా తిన్నాము ఇంకా ఏమీ తినము." అని చెప్పాడు నంద.
"ఏంటి? దేవుడు కేస్ అని సార్ భక్తి ఎక్కువ ఉన్న ఏజెంట్ లని పంపించారా..!" అని నవ్వుతూ అడిగింది నీతూ.
"సరేగాని! ఆ పద్మము లాంటి డూప్లికేట్ దానిని తీసుకురావడానికి మీకు ఎంత టైం పడుతుంది?" అని అడిగాడు యోధ.
"మనకి అలాంటి డూప్లికేట్ వస్తువు అవసరం అవుతుందని తెలుసు అందుకే రెడీగా ఉంచాము." అని తన జేబులో నుంచి తీసి టేబుల్ మీద పెట్టాడు నంద.
టేబుల్ మీద సేమ్ వస్తువు ఉండడం చూసి "గుడ్! మీరు చాలా ఫాస్ట్ గా ఉన్నారు. " అని కుబేరుడు వైపు చూసి
"మిస్టర్ క్యూబ్! మీరు ఏజెంట్ అంటే నమ్మలేకపోతున్నాను అసలు ఈ జాబ్ మీకు ఎలా వచ్చింది?" అని డౌట్ గా అడిగింది పూజా.
"మా క్యూబ్ గుంరించి ముందు ముందు తెలుస్తుంది అతను లేకపోతే అన్ని పనులు ఆగిపోతాయి." అని చెప్పాడు భూషణ్.
అంతలో సర్వర్ పారిసిల్స్ కూడా తేవడంతో డబ్బులు ఇవ్వడానికి పర్స్ బయటకు తీస్తున్నా నీతూ వైపు చూసి
"ఆగండి ఈ కేస్ కంప్లీట్ అయ్యేంతవరకు ఎంత ఖర్చు అయినా సరే క్యూబ్ చూసుకుంటాడు." అని చెప్పాడు నంద.
ఆ మాట విని క్యూబ్ వైపు చూస్తూ "మాకు భలే ఛాన్స్ దొరికింది." అని చెప్పింది పూజా.
బిల్ పే చేస్తూ "నాకు అప్పు ఇవ్వడమే తెలుసు మొదటిసారి ఖర్చు పెడుతున్నారు." అని చెప్పాడు క్యూబ్.
నంద ఇచ్చిన డూప్లికేట్ పద్మాన్ని చూస్తూ "దీనిని ఎలాగైనా ఆ హోటల్ రూమ్లో ఉన్న మష్రూ దగ్గరకి చేర్చాలి." అని చెప్పాడు యోధ.
"ఆ పని నేను చూసుకుంటాను మీరు రూమ్ కి వెళ్ళండి." అని డూప్లికేట్ పద్మాన్ని తీసుకుని హవేలీ హోటల్ దగ్గరికి బయలుదేరాడు భూషణ్.
Posts: 898
Threads: 13
Likes Received: 7,010 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
రుద్రం భజే! ఎపిసోడ్ 20
రెస్టారెంట్ లో నంది ఇచ్చిన డూప్లికేట్ పద్మం తీసుకుని యోధ వాళ్లని రూమ్ కి వెళ్ళమని చెప్పి హవేలీ హోటల్ లో ఉన్న ముష్రు దగ్గరికి బయలుదేరాడు విభీషణుడు.
**********
రెస్టారెంట్ దగ్గర నుంచి వాళ్ళ రూమ్స్ కి వెళ్ళుతు హవేలి హోటల్ లోపలికి వెళుతున్న నలుగురిని చూసి "యోధ! ఆ లోపలికి వెళుతున్న వాళ్ళని చూస్తుంటే అనుమానంగా ఉంది." అని చెప్పింది నీతూ.
"నీకు అనుమానం ఎందుకు వచ్చింది? వాళ్ళను ఎప్పుడైనా చూసావా?" అని అడిగింది దీప్తి.
"ఆ నలుగురిలో ఒకడి పేరు భూపాల్ సింగ్! పంజాబ్ అల్లర్ల కేసులో అరెస్ట్ అయ్యాడు తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని అనుమానంతో మూడు నెలలు కస్టడీలో ఉన్నాడు." అని చెప్పింది నీతూ.
"ఒకవేళ అతను మష్రూ రూమ్ కి వెళితే!"అని కంగారుగా నంద వైపు చూసి "భూషణ్ కి కాల్ చేసి త్వరగా వెనక్కి రమ్మనండి." అని చెప్పింది పూజా.
"భూషణ్ దగ్గర మొబైల్ లేదు అయ్యినా మీరేమి కంగారు పడకండి అతను అంత తేలికగా వాళ్లకి కనపడడు." అని చెప్పాడు నంద.
"సరే! మీరందరూ రూమ్ లోకి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూసి నాకు ఇన్ఫామ్ చేయండి. భూషణ్ బయటికి వచ్చేవరకు ఇక్కడే ఉంటాను ఏదైనా తేడా వస్తే ఎంటర్ అవుతాను." అని చెప్పాడు యోధ.
"టేక్ కేర్!" అని చెప్పి మిగతా వాళ్ళని తీసుకుని రూమ్ కి వెళ్ళింది నీతూ.
*************
ముష్రు రూమ్ దగ్గరికి వెళ్లి డోర్ క్లోజ్ చేసి ఉండడం చూసి అదృశ్య రూపంలో లోపలికి వెళ్లి తన దగ్గర ఉన్న డూప్లికేట్ పద్మాన్ని బ్యాగ్ లో పెడుతూ కాలింగ్ బెల్ సౌండ్ అవడంతో అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాడు విభీషణుడు.
కాలింగ్ బెల్ సౌండ్ విని డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న నలుగురు వైపు చూసి "ఎవరు మీరు?" అని అడిగాడు ముష్షు.
"సయ్యద్ భాయ్ కాల్ చేశాడు నిన్ను సేవ్ గా బోర్డర్ దాటించడానికి వచ్చాము." అని చెప్పాడు భూపాల్ సింగ్.
ఆ మాట విని అనుమానంగా చూస్తూ "అసలు! సయ్యద్ ఎవరో కూడా నాకు తెలియదు నేను ముస్తఫాని కలవడానికి వచ్చాను." అని చెప్పాడు ముష్రు.
ఆ మాటకి నవ్వుతూ "ముస్తఫా అనేది బోర్డర్ దాటి వెళ్లడానికి కోడ్!" అని తన బ్యాగ్ లో నుంచి ల్యాప్టాప్ తీసి తీసి వీడియో కాల్ చేశాడు భూపాల్.
అదృశ్య రూపంలో అక్కడ ఉన్న సోఫాలో కూర్చుని జరిగేదంతా చూస్తూ ఉన్నాడు విభీషణుడు.
రూమ్ కి వెళ్లి బైనోక్లోర్ లో ముష్రూ ని చూస్తూ "పుష్కర్ వీళ్ళ నలుగురు కాకుండా రూమ్ లోకి ఎవరైనా వచ్చారా..?" అని అడిగింది నీతూ.
"నో మేడం! ఇప్పటివరకు ముష్రుని కలవడానికి ఎవరు రాలేదు ఇప్పుడే ఈ నలుగురు వచ్చారు." అని చెప్పాడు పుష్కర్.
"మరి భూషణ్ ఎక్కడికి వెళ్లినట్లు!" అని ఫోన్ తీసి యోధ కి కాల్ చేసింది నీతూ.
ఫోన్ లిఫ్ట్ చేసి "టెల్ మీ నీతూ? అక్కడ ఏం జరుగుతుంది." అని అడిగాడు యోధ.
"మనం చూసిన నలుగురు ముష్రు రూమ్లోకి వెళ్లి లాప్టాప్ లో ఆన్ చేసారు, భూషణ్ ఇంకా అక్కడకి వెళ్ళలేదు ఒకవేళ వీడియోలో కళింగ ఆపద్మం చూపించమంటే మన ప్లాన్ ఫెయిల్ అవుతుంది." అని టెన్షన్ గా చెప్పింది నీతూ.
"సరే! నేను హోటల్ లోపలికి వెళుతున్నాను ఫోన్ లైన్ లోనే ఉండు ఒకవేళ ముష్రు మీద ఎటాక్ చేస్తే వెంటనే చెప్పు నేను రూమ్ లోకి ఎంటర్ అవుతాను." అని చెప్పాడు యోధ.
"ఓకే డన్!" అని చెప్పి రూమ్ లో జరిగేది యోధ కి చెబుతూ ఉంది నీతూ.
వీడియో కాల్ ఆన్ అవడంతో "సలాం మలేకుం సయ్యద్ భాయ్! ముష్రు దగ్గరికి వచ్చాము ఇతను ముస్తఫా కోసం ఎదురుచూస్తున్నాడు." అని నవ్వుతూ చెప్పాడు భూపాల్.
"ఒకసారి వాడిని వీడియో కాల్ లో చూపించండి." అని చెప్పాడు సయ్యద్.
"సరే బాయ్!" అని లాప్టాప్ ముష్రు వైపు తిప్పి "మాట్లాడు." అని చెప్పాడు భూపాల్.
వీడియో కాల్ లో ఉన్న సయ్యద్ వైపు చూసి "నేను కళింగ సార్ తో మాత్రమే మాట్లాడుతాను." అని చెప్పాడు ముష్రు.
ఆ మాట విని వీడియో కాల్ లోకి వచ్చి "హలో ముష్రు! హౌ ఆర్ యు? మీర్జా గ్యాంగ్ మొత్తం చనిపోయారు కదా నువ్వు సేఫ్ గా ఎలా బయటపడ్డావు? " అని అడిగాడు కళింగ.
"నమస్తే సార్! మేము ఉన్న గెస్ట్ హౌస్ దగ్గరికి ఆఫీసర్స్ రావడం చూసి నేను ఆ వస్తువుని తీసుకుని వెనకనుంచి పారిపోయాను, మీర్జా వాళ్ళు చనిపోయారని మీరు చెప్పే వరకు నాకు కూడా తెలియదు." అని చెప్పాడు ముష్రు.
"గుడ్! ఇప్పుడు ఆ వస్తువు నీ దగ్గరే ఉంది కదా ఒకసారి చూపించు." అని అడిగాడు కళింగ.
ఆ మాటకి షాక్ అయి బ్యాగ్ దగ్గరికి వెళ్లి ఓపెన్ చేసి లోపల ఉన్న గన్ బయటకు తీయబోయి పక్కనే పద్మం కనిపించడంతో 'ఇది నా బ్యాగ్ లోకి ఎలా వచ్చింది.' అనుకోని దానిని తీసి కళింగకి చూపించాడు ముష్రు.
బైనో క్లోర్ లో చూస్తూ ఫోన్ లైన్ లో ఉన్న యోధ తో మాట్లాడుతూ "మనం పంపించిన డూప్లికేట్ వస్తువు ముష్రూ బ్యాగా లో ఉంది నువ్వు వెంటనే వెనక్కి వచ్చేయ్!" అని చెప్పింది నీతూ.
"అవునా? మరి భూషణ్ రూమ్ లోకి వెళ్ళలేదు అని చెప్పావు, మరి ఆ పద్మం బ్యాగులోకి ఎలా వచ్చింది?" అని డౌట్ గా అడిగాడు యోధ.
"యా.. అదే అర్థం కావడం లేదు, మనవాళ్లు చూస్తూనే ఉన్నారు అతను రూమ్ లోకి రాలేదు అని చెప్పారు నీకు భూషణ్ ఎక్కడైనా కనిపించడా..?" అని అడిగింది నీతూ.
"నో!'అని చెప్పి అక్కడి నుంచి వెనక్కి వచ్చి కౌంటర్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాడు యోధ.
వీడియో కాల్ లో ముష్రు చేతిలో ఉన్న పద్మాన్ని సంతోషంగా చూస్తూ "నిన్ను వాళ్ళు సేఫ్ గా నా దగ్గరికి తీసుకు వస్తారు అప్పటివరకు దానిని జాగ్రత్తగా ఉంచు, అది మిస్ అయిందో నీ ప్రాణాలు మిస్ అయిపోతాయి." అని చెప్పాడు కళింగ.
"ఓకే సార్!" అని కంగారుగా చెప్పాడు ముష్రు.
వీడియో కాల్ లో పద్మాన్ని చూస్తూ "ఆ మనిషిని జాగ్రత్తగా మీకు పంపించిన లోకేషన్ కి తీసుకురండి." అని చెప్పాడు చింగ్ యా.
"ఓకే సార్!' అని లాప్టాప్ క్లోజ్ చేసి ముష్రు వైపు చూసి "రెడీగా ఉండు సాయంత్రం నిన్ను పికప్ చేసుకోవడానికి ఒక మనిషి వస్తాడు." అని ఒక ప్యాకెట్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్లిపోయారు నలుగురు.
రూమ్ లో నుంచి చూస్తూ "యోధ! వాళ్ళు బయటికి వస్తున్నారు." అని చెప్పింది నీతూ.
"ఓకే!" అని చెప్పి నోట్లో బబుల్ గమ్ వేసుకుని ఫాస్ట్ గా బయటికి వెళ్లి భూపాల్ వాళ్ళు వచ్చిన కారు దగ్గరికి వచ్చి నోట్లో ఉన్న బాబుల్ గమ్ తీసి దానికి లోకేషన్ ట్రాకర్ చిప్ పెట్టి కారుకి అతికించి ఫాస్ట్ గా రెస్టారెంట్ లోకి వచ్చి
"నీతూ! వాళ్ళ కార్ కి చిప్ పెట్టాను నా లాప్టాప్ ఆన్ చేసి వాళ్ళ లోకేషన్ ట్రేస్ చేయండి." అని చెప్పాడు యోధ.
"గుడ్!" అని చెప్పి యోధ బ్యాగ్ లో ఉన్న ల్యాప్టాప్ బయటికి తీసి ఆన్ చేసి "కోడ్!" అని అడిగింది నీతూ.
"జై హనుమాన్!" అని చెప్పాడు యోధ.
"ఓకే! చీప్ ఆక్టివేట్ అయింది. ఇంక వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే మనకి లొకేషన్ తెలుస్తుంది." అని సంతోషంగా చెప్పింది నీతూ.
అంతలో రెస్టారెంట్ లో కూర్చున్న యోధ భుజం మీద చెయ్యి పడడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగి "మిస్టర్ భూషణ్! మీరు రూమ్ లోకి ఎప్పుడు వెళ్లారు? బయటికి ఎప్పుడు వచ్చారు?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు యోధ.
కారు ఎక్కుతున్న నలుగురు వైపు చూసి "వాళ్ళు రూమ్ లోకి వచ్చినప్పుడు నేను దాక్కుని అక్కడే ఉన్నాను." అని చెప్పాడు భూషణ్.
"అవునా? అయితే వీడియో కాల్ లో మాట్లాడింది విన్నారు కదా వాళ్లు ఉన్న లొకేషన్ గురించి ఏమైనా తెలిసిందా..?" అని అడిగాడు యోధ.
"కళింగతో పాటు మిగతా వాళ్ళు కజకిస్తాన్ లో సముద్ర తీర ప్రాంతంలో ఉన్నారు." అని చెప్పాడు భూషణ్.
రెస్టారెంట్ దగ్గర నుంచి రూమ్ కి వెళ్ళుతు "అవునా? అసలు వీళ్ళందరూ కజకిస్తాన్ లో ఏం చేస్తున్నారు? " అని అనుమానంగా అడిగాడు యోధ.
అంతలో ఫోన్ రింగ్ అవ్వడం చూసి "ముష్రు హోటల్ రూమ్ నుంచి కాల్ చేస్తున్నాడు." అని చెప్పి లిఫ్ట్ చేసి "హలో ముష్రు! సేఫ్ గానే ఉన్నావు కదా!" అని అడిగింది నీతూ.
"యా.. సేఫ్ గానే ఉన్నాను కాసేపు ప్రాణాలు పోయినంత పని అయింది. ఆ వస్తువుని నా బ్యాగ్ లో ఎప్పుడు పెట్టారు? అది లేకపోతే ఈరోజు నన్ను చంపేసేవారు." అని ఊపిరి పీల్చుకుంటూ చెప్పాడు ముష్రు.
నీతూ చేతిలో ఫోన్ తీసుకుని "ఆ విషయం తర్వాత చెబుతాలే కానీ కళింగ ఎక్కడ ఉన్నాడు?" అని అడిగాడు యోధ.
"వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు వెనకాల ఉన్న ప్లేస్ చూశాను అది కజకిస్తాన్లో ఉంది. కళింగ కనిపెట్టిన కొత్త వైరస్ ని సముద్రంలో ప్రయోగం చేయాలి అన్నాడు అందుకే అక్కడకి వెళ్లి ఉంటారు." అని చెప్పాడు ముష్రు.
"అవునా?" అని ఫోన్ కట్ చేసి "ఆ ప్రయోగం ఎలాగైనా ఆపాలి." అని చెప్పాడు యోధ.
"అలా అయితే మనం అక్కడికి వెళ్లి ఆ ప్రయోగాన్ని ఆపుదాము." అని చెప్పాడు నంద.
ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "మనం వెళ్లి అ ప్రయోగం ఆపుదామా? అంత ఫాస్ట్ గా అక్కడకి ఎలా వెళ్లగలము, నీ దగ్గర ఏదైనా మంత్రం ఉందా?" అని వెటకారంగా చూస్తూ అడిగింది పూజా.
"మా దగ్గర మంత్రం లేదు కానీ యోధ దగ్గర అసలైన పద్మం ఉంది కదా దాని ద్వారా వెళదాము." అని చెప్పాడు క్యూబ్.
ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు అందరూ.
" రుద్రం భజే! ఎపిసోడ్ 20 " రచనకు రేటింగ్ ఇవ్వండి....
The following 12 users Like SivaSai's post:12 users Like SivaSai's post
• ABC24, ash.enigma, Bullet bullet, gora, k3vv3, kamadas69, ramanasv, Reddy 211993, Sachin@10, styleraja, Sunny73, vikas123
Posts: 4,805
Threads: 9
Likes Received: 3,183 in 2,464 posts
Likes Given: 11,248
Joined: Sep 2019
Reputation:
31
Posts: 1,626
Threads: 2
Likes Received: 964 in 741 posts
Likes Given: 2,159
Joined: May 2019
Reputation:
11
Now we will know aa padmam ento!!
Posts: 1,156
Threads: 1
Likes Received: 730 in 473 posts
Likes Given: 10,935
Joined: Jun 2019
Reputation:
2
Good development in the story...
Posts: 898
Threads: 13
Likes Received: 7,010 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
రుద్రం భజే! ఎపిసోడ్ 21
మనం అంత ఫాస్ట్ గా కజకిస్తాన్ వెళ్లడానికి నీ దగ్గర ఏమైనా మంత్రాలు ఉన్నాయా అని అడిగిన పూజ వైపు చూసి యోధ దగ్గర పద్మం ఉంది కదా అని చెప్పాడు క్యూబ్స్.
***************
క్యూబ్స్ చెప్పిన మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "నా దగ్గర ఉన్న పద్మం ద్వారా ఎలా వెళ్తాము?" అని అడిగాడు యోధ.
"మేము తెలుసుకున్న దాని బట్టి ఆ పద్మం యాక్టివేట్ అయితే బ్లాక్ హోల్ ఓపెన్ అవుతుంది అప్పుడు మనం ఏ ప్లేస్ కి కావాలి అంటే ఆ ప్లేస్ కి ఈజీగా వెళ్లొచ్చు!" అని చెప్పాడు నంద.
'బ్లాక్ హోల్ లోకి మనం వెళితే ఎక్కడికి వెళుతున్నామో కుడా తెలియదు అటువంటిది మనం అనుకున్న ప్లేస్ కి ఎలా వెళ్లగలము?" అని డౌట్ గా అడిగింది దీప్తి.
"ఆ పద్మానికి ఉన్న ప్రత్యేకత అదే మనం అనుకున్న ప్లేస్ కి తీసుకు వెళుతుంది." అని చెప్పాడు భూషణ్.
"మరి పద్మాన్ని ఆక్టివేట్ చేస్తే అలకాపురి నగరం తలుపులు తెరుచుకుంటాయి అని చెప్పారు." అని అనుమానంగా అడిగింది నీతూ.
"కైలాస పర్వతంలో అలంకాపురి నగరం ఎక్కడ ఉందో ఎవ్వరు కనిపెట్టలేరు కానీ ఈ పద్మం వాళ్ళ ఏర్పడిన బ్లాక్ హోల్ ద్వారా ఆ నగరనికి చేరుకోవచ్చు తర్వాత అక్కడ ఉన్న సైన్యాన్ని గెలిస్తే ఆ నగరంలోకి ఎంటర్ అవుతారు." అని చెప్పాడు నంద.
"అంటే! అప్పుడు రావణాసురుడు పంపించిన రాక్షసులు ఈ పద్మం ద్వారా ఏర్పడిన బ్లాక్ కోల్ నుంచి ఆ నగరం దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న శివగణాల చేతిలో ఓడిపోయారా..?" అని అడిగింది పూజా.
"కచ్చితంగా అలాగే జరిగి ఉంటుంది ఎందుకంటే అప్పుడు మనం ఎవరం లేము కదా!" అని చెప్పాడు క్యూబ్స్.
"ఈ పద్మం యాక్టివేట్ చేయాలి అంటే లేజర్ కిరణాలు ఉండాలి కదా!" అని డౌట్ గా అడిగాడు పుష్కర్.
"సూర్యకిరణం కన్నా లేజర్ కిరణం పవర్ ఫుల్ ఆ..!" అని నవ్వుతూ అడిగాడు భూషణ్.
"మీరు చెప్పింది కరెక్టే! లేజర్ కిరణాలు కన్నా సూర్యకిరణాలే పవర్ఫుల్, కానీ ఈ పద్మం గురించి ఇప్పటివరకు ఎవరకి తెలియదు మీ ముగ్గురికి ఎలా తెలిసింది?" అని అనుమానంగా అడిగింది దీప్తి.
"మన క్యూబ్స్ ఉన్నాడు కదా ఇటువంటి విషయాలు కనిపెట్టడంలో దిట్ట!" అని చెప్పాడు నంద.
"ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి మనం ఈ పద్మం ద్వారా ఓపెన్ అయిన బ్లాక్ హోల్ లోంచి వెళ్లి మళ్లీ ఆ పద్మం ద్వారా ఏర్పడిన బ్లాక్ హోల్ ద్వారానే వెనక్కి రావాలి అలా జరగకపోతే మన ప్రాణాలకు ప్రమాదం!" అని చెప్పాడు క్యూబ్స్
"అంటే! ఆ పద్మం మన దగ్గర నుంచి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు." అని చెప్పాడు యోధ.
"కరెక్ట్! అంతే కాదు పద్మాన్ని యాక్టివేట్ చేసి మొదట ఎవరైతే లోపలికి ఎంటర్ అయ్యారో మనం రిటన్ అయ్యేటప్పుడు కూడా ఆ మనిషే ఫస్ట్ ఏంట్రార్ అవ్వాలి." అని చెప్పాడు క్యూబ్స్.
"అబ్బో!:ఈ పద్మానికి చాలా రూల్స్ ఉన్నాయి కాస్త జాగ్రత్తగా వాడాలి లేకపోతే మనం మటష్!" అని చెప్పింది పూజా.
"మనం ఇన్ని మాట్లాడుకుంటున్నాము అసలు ఈ పద్మం ఎప్పటిదో కదా వర్కింగ్ లో ఉందో లేదో!" అని డౌట్ గా అడిగాడు ఏకవీర.
"ఆ పద్మం మధ్యలో సూర్యకిరణం పడేటట్లు ఉంచండి పనిచేస్తుందో లేదో అర్థమవుతుంది." అని చెప్పాడు భూషణ్.
"మనం ఈ పద్మాన్ని యూస్ చేసే ముందు సార్ కి ఒక మాట చెప్పాలి." అని చెప్పింది నీతూ.
"మనం కొన్ని విషయాలలో ఓన్ డెసిషన్ తీసుకోవాలి ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తే జరగాల్సింది జరిగిపోతుంది. అసలు వీళ్ళు చెప్పేది ఎంతవరకు నిజమో తెలియాలి కదా!" అని తన బ్యాగ్ లో ఉన్న పద్మాన్ని బయటకి తీసాడు యోధ.
"సన్ లైట్ పడాలి కదా!" అని రూమ్ కిటికీ ఓపెన్ చేసింది పూజా.
పద్మం మీద సూర్యకిరణాలు పడగానే యోధ చాతి మీద ఉన్న గద సింబల్ మెరుస్తూ కనిపించడంతో క్యూబ్స్ వైపు చూసి సైగ చేశాడు భూషణ్.
అది చూసి యోధ వైపు తిరిగి ఛాతి మీద ఉన్న సింబల్ చూస్తూ 'నాకు సహాయం చేయడానికి హనుమంతుని శక్తి ముందే వచ్చిందా..?' అని సంతోషంగా మనసులో అనుకున్నడు కుబేరుడు.
"యోధ! ఆ సూర్యకిరణాలు పద్మం మీద సరిగ్గా పడేటట్లు ఉంచు అప్పుడే ఆక్టివేట్ అవుతుంది." అని చెప్పాడు భూషణ్.
"సరే!" అని కిరణాలు పద్మం మధ్యలో పడేటట్లు ఉంచాడు యోధ.
కాసేపటికి రూమ్ మధ్యలో తెల్లటి కాంతి కనిపించడంతో "వండర్ఫుల్! నేను నమ్మలేకపోతున్నాను అసలు ఇదంతా నిజంగా జరుగుతుందా..?" అని ఆశ్చర్యంగా చూస్తూ అంది దీప్తి.
"యోధ! ఆ పద్మాన్ని చేతిలోకి తీసుకుని మనం ఎక్కడికి వెళ్లాలి అనుకుంటున్నామో మనసులో తలుచుకుని ఆ వెలుతురులో అడుగు పెట్టు వెనకాల మేమందరం కూడా వస్తాము." అని చెప్పాడు క్యూబ్స్.
"సరే!"అని పద్మాన్ని చేతిలోకి తీసుకుని తెల్లని కాంతి వైపు ఆశ్చర్యంగా చూస్తూ "కజకిస్తాన్ లో ప్రయోగం జరిగే చోటుకి వెళ్లాలి.." అని లోపలికి అడుగుపెట్టాడు యోధ.
ఆ తెల్లటి కాంతి లోపలికి అడుగు పెట్టిన వెళ్ళిన యోధ కనిపించకపోవడంతో వెనకాలే వెళ్ళింది నీతూ.
"మనం కూడా వెళదాం పద!" అని దీప్తి చేయ్యి పట్టుకుని కాంతిలోకి వెళ్ళింది పూజా.
"మేడం వాళ్లతో పాటు మనం!" అని ఏకవీరని తీసుకుని కాంతి లోపలికి వెళుతూ "ఇన్ని విషయాలు చెప్పిన మీరు రాకపోతే ఎట్లా త్వరగా రండి." అని లోపలికి వెళ్ళాడు పుష్కర్.
అందరూ కాంతి లోపలికి వెళ్లడంతో "నంది, కుబేర వెళ్లండి హనుమంతుని శక్తి వెనకాలే మనం!" అని చెప్పాడు విభీషణుడు.
"హనుమంతుడికి తన శక్తి తనకి తెలియదు యోధ లోపల దాగి ఉన్న హనుమంతుడి శక్తిని మనం బయటకు తీయాలి అప్పుడే సృష్టికర్యం మొదలవుతుంది." అని కాంతిలోకి అడుగు పెట్టాడు నంది.
"కుబేరుడు వైపు చూసే హనుమంతుడికి తన శక్తి తనకి తెలియదు నిజమే! కానీ ఎప్పుడు ఏమి చేయాలో మాత్రం బాగా తెలుసు!" అని తెల్లటి కాంతులోకి కుబేరుడుతో కలిసి వెళ్ళాడు విభీషణుడు.
ఆ తెల్లటి కాంతి లో నుంచి అందరూ సముద్రపు ఒడ్డుకి రావడంతో యోధ వైపు చూసి "ఆ పద్మాన్ని ఈ బ్లాక్ హోల్ దగ్గర పెట్టు మూసుకుపోతుంది." అని చెప్పాడు భూషణ్.
తన జేబులో ఉన్న పద్మాన్ని తీసి బ్లాక్ హోల్ దగ్గర పెట్టడంతోనే క్లోజ్ అవ్వడం చూసి "నువ్వు వచ్చేటప్పుడు కరెక్ట్ గానే చెప్పవా.? మనం కరెక్ట్ ప్లేస్ కి వచ్చామ?" అని చుట్టూ ఉన్న సముద్రాన్ని చూస్తూ అడిగింది పూజా.
"నేను కరెక్ట్ గానే చెప్పాను ఈ ఏరియా మొత్తం చూస్తే వాళ్ళు ఉన్నారో లేదో తెలుస్తుంది లేకపోతే వెనక్కి వెళ్ళిపోదాము." అని చెప్పాడు యోధ.
"క్యూబ్స్! దీనికి టైం లిమిట్ ఏమీ లేదు కదా!" అని డౌట్ గా అడిగింది దీప్తి.
"నో" ఇది అన్ లిమిటెడ్ ఆ పద్మం మన దగ్గర ఉంటే చాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవచ్చు!" అని చెప్పాడు క్యూబ్స్.
"మన దగ్గర పాస్పోర్ట్ వీసా ఏమీ లేదు చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరికైనా దొరికేమో అంతే సంగతులు!" అని చెప్పింది నీతూ.
ఆ మాట విని "కరెక్టే కదా! నేను ఇంకా షాపింగ్ కి వెళ్దాము అనుకున్నాను" అని చెప్పింది పూజా.
"మనం ఫాస్ట్ గా ఇక్కడ వర్క్ కంప్లీట్ చేసుకుని వెనక్కి వెళ్ళాలి మళ్లీ సాయంత్రం ముష్రుని తీసుకెళ్లడానికి మనుషులు వస్తారు." అని చెప్పాడు యోధ.
"మనం ఎక్కడని వెతుకుతాము కనీసం ఇక్కడ తిరగడానికి మన దగ్గర ఈ కంట్రీ కరెన్సీ కూడా లేదు." అని చెప్పింది దీప్తి.
"మీరేమీ కంగారు పడకండి ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్లిన డబ్బు మార్చుకునే ఏటీఎం కార్డు మన క్యూబ్ దగ్గర ఉంది." అని చెప్పాడు నంద.
"మనం కరెక్ట్ ప్లేస్ కి వచ్చాము ఈ చుట్టుపక్కల మొత్తం వెతికితే సరిపోతుంది వాళ్ళు ఇక్కడే ఎక్కడో ప్రయోగం చేస్తూ ఉంటారు." అని చెప్పి దీప్తి వాళ్ళ వైపు చూసి
"మీరు ఎక్కడైనా వెయిట్ చేయండి యోధ తో కలిసి మేము ముగ్గురం వెళ్లి వెతుకుతాము వాళ్లు కనబడ్డ తర్వాత ఏం చేయాలో ప్లాన్ చేద్దాము." అని చెప్పాడు భూషణ్.
"వెయిట్! ఇది '' కంట్రీ మీ మోహన బొట్టులు మెడలో గొలుసులు చూస్తే ఈ దేశం వాళ్లు కాదని వెంటనే కనిపెట్టేస్తారు, మేము ముగ్గురం వేషాలు మార్చుకుని వెళ్లి వెతుకుతాము ఎవరికి అనుమానం రాదు కాకపోతే కాస్తా షాపింగ్ చేయాలి." అని చెప్పింది పూజా.
ఆ మాటకు క్యూబ్ వైపు చూసి "వెళదామా!" అని అడిగాను అందరు.
"ఒప్పుకున్న తర్వాత తప్పుతుందా అవసరం నాది పదండి షాపింగ్ కి వెళ్దాము." అని చెప్పాడు క్యూబ్.
అక్కడినుంచి షాపింగ్ కి బయలుదేరి "అవును! అవసరం నాది అంటున్నావు ఏంటి?" అని డౌట్ గా అడిగాడు యోధ.
"ఈ కేసు సక్సెస్ అయితే ప్రమోషన్ ఇస్తానని క్యూబ్ కి సార్ మాట ఇచ్చారు అందుకే అవసరం నాది అంటున్నాడు." అని చెప్పాడు నంది.
"అవునా? అలా అయితే కచ్చితంగా నీకు ప్రమోషన్ వస్తుంది." అని చెప్పాడు యోధ.
షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరకు వెళ్లి "ఈ పద్మం, క్యూబ్ ఉంటే చాలు పాస్పోర్ట్ వీసా లేకుండా ఏ దేశమైనా వెళ్ళచ్చు ఎక్కడైనా షాపింగ్ చేయొచ్చు!" అని సంతోషంగా లోపలికి వెళ్ళింది పూజా.
షాపింగ్ చేస్తూ ఉండగా దూరంగా ఉన్న ఒక మనిషిని చూసి "ఒకసారి అతన్ని చూడండి చైనా వాడిలాగా ఉన్నాడు నాకెందుకో వాళ్ళ మనిషేమో అని డౌట్ గా ఉంది." అని చెప్పాడు యోధ.
"మీరు షాపింగ్ చేయండి నేను తెలుసుకుంటాను." అని చెప్పి దూరంగా ఉన్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు భూషణ్.
షాపింగ్ చేస్తూ దూరంగా ఉన్న వ్యక్తిని గమనిస్తూ ఉన్నాడు యోధ.
కాసేపటికి యోధ వాళ్ల దగ్గరికి వచ్చి "నీ అనుమానం నిజమే! అతని పేరు జింగ్ పర్సులో చైనా మిలిటరీ ఐడి ఉంది మనం అతన్ని ఫాలో అయితే ప్రయోగం చేసే ప్లేస్ తెలిసే ఛాన్స్ ఉంది." అని చెప్పాడు భూషణ్.
అంతలో పంజాబీ డ్రెస్సులు వేసుకుని తల మీద చున్ని కట్టుకుని అక్కడికి వస్తూ "ఫాలో చేయడానికి మేము రెడీ." అని చెప్పింది పూజా............
Posts: 898
Threads: 13
Likes Received: 7,010 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
రుద్రం భజే! ఎపిసోడ్ 22
షాపింగ్ మాల్లో కనిపించిన వ్యక్తిని దగ్గరకి వెళ్లి చూసి యోధ దగ్గరకి వచ్చి అతని దగ్గర చైనా మిలిటరీ ఐడి కార్డు ఉంది పేరు జింగ్ అతన్ని ఫాలో అయితే ప్రయోగం ఎక్కడ జరుగుతుందో మనం తెలుసుకోవచ్చు అని చెప్పాడు భూషణ్.
***************
షాపింగ్ మాల్ లో డ్రస్ చేంజ్ చేసుకుని యోధ వాళ్ల దగ్గరికి వచ్చి "అతన్ని ఫాలో అవడానికి మేము రెడీ! మా మీద ఇంకా ఎవరికి అనుమానం రాదు." అని తల మీద చున్ని కట్టుకుంటూ చెప్పింది పూజా.
"నువ్వు అచ్చు ఏ దేశం అమ్మాయి లానే ఉన్నావు." అని చెప్పి అక్కడికి వస్తున్న నీతూ వాళ్ళ వైపు చూసి "జాగ్రత్తగా ఫాలో అవుతారా..?" అని అడిగాడు యోధ.
"యా.. అతనికి ఏ మాత్రం అనుమానం రాదు పుష్కర్ ఏకవీర మాకు బ్యాకప్ గా ఉంటారు మీరు వేరే వైపు చూడండి." అని చెప్పింది నీతూ.
"గుడ్! ఫాలో అయ్యేటప్పుడు వెపన్ హ్యాండిల్ చేయకండి ఒకవేళ దొరికిపోయిన అనుమానం రాకుండా ఉంటుంది." అని చెప్పి పుష్కర్ వైపు చూసి "మీరు ఇద్దరు ఎలర్ట్ గా ఉండండి." అని చెప్పాడు యోధ.
"ఓకే సార్! ఏదైనా ప్రాబ్లం అయితే కమ్యూనికేషన్ చేయడానికి ఫోన్లు కూడా ఏమి పని చేయడం లేదు లోకల్ సిమ్ తీసుకుందాము అంటే పాస్పోర్ట్ కూడా లేదు." అని చెప్పాడు పుష్కర్.
తన జేబులో నుంచి ఒక కాయిన్ తీసి నీతూ చేతిలో పెట్టి "ఇది కొత్త టెక్నాలజీతో తయారు చేసింది ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే ఆ కాయిన్ గట్టిగా ప్రెస్ చేయండి. మీరు ఉన్న లొకేషన్ మాకు తెలిసిపోతుంది." అని చెప్పాడు క్యూబ్.
ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ "క్యూబ్! నీ గురించి భూషణ్ చెబుతుంటే ఏమో అనుకున్నాను నువ్వు నిజంగా గ్రేట్!" అని కాయిన్ వైపు చూస్తూ చెప్పింది దీప్తి.
"పొట్టి వాళ్ళు ఎప్పుడు గట్టివాళ్లే!" అని కాయిన్ తీసుకొని తన జేబులో పెట్టుకుంది పూజా.
"త్వరగా వెళ్ళండి జింగ్ ఇక్కడి నుంచి బయలుదేరాడు." అని కజకిస్తాన్ కరెన్సీ ఇచ్చాడు క్యూబ్.
అది చూసి మనం ఇక్కడే ఉన్నాము కదా నువ్వు ఎప్పుడు వెళ్లి విత్ డ్రా చేసావు." అని అనుమానంగా అడిగాడు యోధ.
"ఆ విషయం చెప్తాలే కానీ ముందు మీరు వెళ్ళండి." అని అక్కడి నుంచి నీతూ వాళ్ళని పంపించాడు క్యూబ్.
జింక్ కారు వెనకాలే టాక్సీలో ఫాలో అవుతూ వెళ్లారు నీతూ వాళ్ళు.
నీతూ వాళ్ళ వెనకలే వేరే టాక్సీలో ఫాలో అవుతూ వేళ్లారు పుష్కర్, ఏకవీర.
"మనం వేరే వైపు వెతుకుదామా?" అని అడిగాడు నంద.
"సరే!" అని షాపింగ్ మాల్ లో నుంచి సముద్రం దగ్గరికి వెళ్లి ముగ్గురు వైపు అనుమానంగా చూస్తూ "మీ మాటలు చేతలు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, మీరు కచ్చితంగా ఏజెంట్స్ కాదు ఎవరు మీరు?" అని డౌట్ గా చూస్తూ అడిగాడు యోధ.
"నాయక్ సర్ నీకు కాల్ చేసి మమ్మల్ని పంపిస్తున్నాను అని చెప్పారు కదా మళ్లీ ఎవరు అని అడుగుతావేమిటి?" అని కంగారుగా చూస్తూ అడిగాడు నంద.
"మాకు హెల్ప్ చేస్తున్నారు కానీ మీరు ఏజెంట్స్ కాదు, ఆ పద్మం ఎలా పనిచేస్తుందో దొరికిన సాధువులకి తెలియదు, ప్రయోగం చేయడానికి రెడీ అయిన రెండు దేశాలకి తెలియదు, కానీ మీ ముగ్గురికి ఆ పద్మం గురించి అన్ని విషయాలు తెలుసు!" అని భూషణ్ వైపు చూస్తూ
"ముష్రూ రూమ్లో ఎవరికి కనపడకుండా వెళ్లి బ్యాగులో వస్తువుని పెట్టావు, జింగ్ పర్సు బయటకు తీయకుండానే అతని దగ్గర మిలిటరీ ఐడి ఉందని చెప్పావు,ముష్రు చెప్పకుండానే ఆ ప్రయోగం కజకిస్తాన్ లో జరుగుతుంది అని చెప్పావు." అని క్యూబ్ వైపు చూసి
"నువ్వు ఇక్కడి నుంచి కదలకుండానే ఈ దేశం కరెన్సీ బయటికి తీస్తున్నావు ఏవో కాయిన్స్ ఇచ్చి కొత్త టెక్నాలజీ అని నాతోనే కబుర్లు చెబుతున్నవు ఇంతకీ మీరు ముగ్గురు ఆ వస్తువును దొంగిలించడానికి వచ్చిన మాంత్రికుల లేక రావణాసురుడి సైన్యంలో రాక్షసులా..?" అని అడిగాడు యోధ.
ఆ మాటకి నవ్వుతూ "నీలో ఉన్న శక్తి ఇచ్చిన మాటకి సహాయం చేయడానికి వచ్చాము." అని చెప్పాడు నంద.
"ఏంటి? నాలో ఉన్న శక్తి ఇచ్చిన మాటకా..! అసలు నాలో ఏ శక్తి లేదు." అని చెప్పాడు యోధ.
యోధ షర్ట్ ని పక్కకు జరిపి ఛాతి మీద ఉన్న గద సింబల్ ని చూపించి "నీలో ఉన్న శక్తి ఇదే!" అని చెప్పాడు భూషణ్.
"అవును! నీ తండ్రి ఆ వస్తువుని దుర్మార్గుల బారి నుంచి కాపాడినప్పుడే ఆ శక్తీ నీ తల్లి గర్భంలోకి ప్రవేశించి తన దగ్గరకు వచ్చేటట్లు చేసుకుంది. అందుకే నువ్వు ఆ ఆంజనేయుడు సన్నిధిలోనే పెరిగావు." అని చెప్పాడు క్యూబ్స్.
"నేను హనుమ భక్తుడినే కానీ మీ మాటలు ఎలా నమ్మాలి అసలు మీ ముగ్గురు ఎవరు?" అని అడిగాడు యోధ.
"నీ శరీరంలో ఉన్న శక్తి యాక్టివేట్ అయినప్పుడు మీము ముగ్గురం ఎవరమో నీకు తెలుస్తుంది. అప్పటివరకు మమ్మల్ని నమ్మి ముందుకు నడువు అలాగే ఈ విషయం ఎవరికీ తెలియకూడదు." అని చెప్పాడు భూషణ్.
"నాలో ఉన్న శక్తి హనుమంతుడిది అంటున్నారు అంటే ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆ పద్మాన్ని కుబేరుడి నగరానికి చేర్చాలి అంతే కదా!" అని అడిగాడు యోధ.
"అవును! అది నీ చేతుల మీదే జరగాలి ఇది విధి నిర్ణయం కానీ దానికి చాలా అడ్డంకులు ఉన్నాయి వాటిని దాటుకుని నువ్వు ముందుకు వెళ్లాలి నీకు మార్గం చూపడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాము." అని చెప్పాడు నంద.
"ఆ పద్మ నా దగ్గరే ఉంది మీకు ఇస్తాను తీసుకువెళ్లి అలకాపురిలో భద్రంగా ఉంచండి." అని చెప్పాడు యోధ.
ఆ మాటకి నవ్వుతూ "హిమాలయాలలో ఉన్న ఆ పద్మాన్ని వెతికి కుబేరుడికి ఇవ్వడం దైవానికి చేతకాక కాదు, సృష్టిలో జరిగే ప్రతి పనికి ఏదో ఒక కారణం ఉంటుంది.
అలాగే ఆ పద్మం నీ ద్వారా అక్కడికి చేరుకోవడానికి కూడా ఏదో ఒక కారణం కచ్చితంగా ఉండే ఉంటుంది." అని చెప్పాడు నంద.
"అవును! రావణాసురుని సంహరించడానికి నారాయణడు మానవ అవతారం ఎత్తి 14 ఏళ్లు వనవాసం చేసి లక్ష్మీ మాతను దూరం చేసుకుని వనరుల సహాయం తీసుకుని సముద్రం దాటి వెళ్లి యుద్ధం చేయవలసిన అవసరం లేదు.
ఆయన తలుచుకుంటే సుదర్శన చక్రంతో అంతం చేసేవారు కానీ ఆ 14 సంవత్సరాల వనవాసంలో కొన్ని లక్షల మంది రాక్షసులను సంహరించారు దైవానికే కాదు మానవుడికి కూడా ఏదైనా సాధ్యమని నిరూపించారు.
నాయకుడు ఎలా ఉండాలో చూపించారు ప్రజలను ఎలా పరిపాలించాలో నేర్పించారు కానీ మనకు కనిపించేది రావణాసురుని అంతం చేయడం మాత్రమే వెనుకల చాలా ఉంటుంది." అని చెప్పాడు భూషణ్.
"అంటే! ఈ పద్మాన్ని తీసుకుని అలకాపురి నగరానికి వెళ్లే మధ్యలో మనకి చాలామంది ఎదురవుతారు అన్నమాట!" అని చెప్పాడు యోధ.
"అవును! ఈ కలికాలంలో సృష్టిని నాశనం చేయడానికి చాలా దుష్టశక్తులు మానవ రూపంలో ప్రయత్నిస్తూ ఉంటాయి వాడిని అంతం చేసే పని కుడా మానవుడిదే అతనికి దైవం సహాయం మాత్రం చేస్తుంది." అని చెప్పాడు నంద.
"అంటే! మీరు నాకు హెల్ప్ చేయడానికి వచ్చిన దేవుళ్ల!" అని అడిగాడు యోధ.
"నువ్వు ఎలాగైనా అనుకో ఈ పని పూర్తి వరకు నీకు తోడుగా ఉంటాము." అని చెప్పాడు క్యూబ్స్.
"మీరు నాకు సహాయం చేసిన చేయకపోయినా నా స్వామి ఇచ్చిన మాట కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే! ఎంతమంది నా దారికి అడ్డు వచ్చినా ఈ పద్మాన్ని అలకపురికి చేర్చే బాధ్యత నాది." అని చెప్పాడు యోధ.
************
జింగ్ వెనకాల వెళుతూ అతను కారు దిగి ఒక హోటల్లోకి వెళ్లడం చూసి "మనం కూడా లోపలికి వెళదాము." అని చెప్పింది నీతూ.
హోటల్ లోపలికి వెళుతున్న ఒక అమ్మాయిని చూసి "దీప్తి! మనం వేసుకున్న డ్రస్సులు హోటల్లో సర్వార్స్ వేసుకునేది." ఆ చికాకుగా చూస్తూ చెప్పింది పూజా.
ఆ మాట విని "అది కూడా మనం మంచికే నేను సర్వర్ లాగా లోపలికి వెళ్ళి జింగ్ ఏం చేస్తున్నాడో ఎవరిని కలుస్తున్నాడో చూస్తాను." అని చెప్పింది నీతూ.
"ఓకే! మేమిద్దరం ఇక్కడే వెయిట్ చేస్తాము ఏదైనా అవసరమైతే సిగ్నల్ ఇవ్వు చాలు!" అని చెప్పింది పూజా.
"సరే!" అని లోపలికి వెళ్లి జింగ్ ఒక టేబుల్ దగ్గర కూర్చోవడం చూసి అక్కడ ఉన్న వాటర్ బాటిల్ తీసుకువెళ్లి టేబుల్ మీద పెట్టి "సార్ ఆర్డర్!" అని అడిగింది నీతూ.
"వన్ మినిట్!" అని తన టేబుల్ దగ్గరికి వస్తున్న మనిషిని చూసి "హాయ్ యంగ్! మెడిసిన్ వేసుకున్నావా..?" అని అడిగాడు జింగ్.
"ఎస్ సార్! సముద్రంలోకి వెళ్లడానికి నేను రెడీ మీరు చెప్పినట్లు నా ఫ్యామిలీ కి డబ్బు అందింది." అని సంతోషంగా చెప్పాడు యాంగ్.
ఆ మాటకి నవ్వుతూ ఫోన్ తీసి కాల్ చేసి "మిస్టర్ కళింగ! సముద్రంలో మీరు చెప్పిన ప్లేస్ కి వెళ్లడానికి రెడీ అవుతున్నాము." అని చెప్పాడు జింగ్.
"గుడ్! నువ్వు యాంగ్ ని సముద్రం మధ్యలో వదిలిపెట్టి వెనక్కి వచ్చేయ్! అక్కడ నిన్ను పికప్ చేసుకోని ఎయిర్ పోర్ట్ లో డ్రాప్ చేయడానికి మనిషి రెడీగా ఉంటాడు." అని చెప్పాడు కళింగ.
"ఓకే థాంక్యూ!" అని నీతూ వైపే చూసి "టూ సూప్స్!" అని చెప్పాడు జింగ్.
"ఓకే సార్! అక్కడినుంచి హడావుడిగా దీప్తి వాళ్ళ దగ్గరికివచ్చి "కాయిన్ ప్రెస్ చెయ్! మన అనుమానం నిజమే అతను కళింగతో మాట్లాడాడు, ఇప్పుడు సముద్రంలోకి ఒక మనిషిని పంపించబోతున్నారు." అని కంగారుగా చెప్పింది నీతూ.
అంతలో నలుగురు అక్కడికి వచ్చి నీతూ వెనకాల గన్ పెట్టి "సైలెంట్ గా వచ్చి కార్ ఎక్కండి." అని చెప్పాడు వాళ్లలో ఒకడు.
ఆ మాట విని టెన్షన్ గా చూస్తూ "కూల్ కూల్ గన్ లోపల పెట్టు!" అని చెప్పి కారు దగ్గరికి వెళుతూ జేబులో ఉన్న కాయిన్ ప్రెస్ చేసింది పూజా.
అంతలో కారు దిగి అక్కడికి వస్తున్న పుష్కర్ వైపు చూసి సైగ చేసింది నీతూ.
" రుద్రం భజే! ఎపిసోడ్ 22 " రచనకు రేటింగ్ ఇవ్వండి......
Posts: 4,805
Threads: 9
Likes Received: 3,183 in 2,464 posts
Likes Given: 11,248
Joined: Sep 2019
Reputation:
31
Posts: 1,156
Threads: 1
Likes Received: 730 in 473 posts
Likes Given: 10,935
Joined: Jun 2019
Reputation:
2
Posts: 1,626
Threads: 2
Likes Received: 964 in 741 posts
Likes Given: 2,159
Joined: May 2019
Reputation:
11
Sooper undi. Socio fantasy episode
Posts: 194
Threads: 0
Likes Received: 122 in 107 posts
Likes Given: 1,093
Joined: Apr 2026
Reputation:
0
Posts: 898
Threads: 13
Likes Received: 7,010 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
రుద్రం భజే! ఎపిసోడ్ 23
భూషణ్ వాళ్ళ ముగ్గురు మీద అనుమానం వచ్చి మీరు ఏజెంట్లు కాదు ఎవరు మీరు అని అడిగిన యోధతో నీలో ఉన్న శక్తి ఇచ్చిన మాటకి సహాయం చేయడానికి వచ్చాము ఆ పద్మాన్ని అలకాపురికి చేర్చే బాధ్యత నీదే అని చెప్పారు.
నలుగురు వ్యక్తులు వచ్చి నీతూ వాళ్ళని రౌండ్ అప్ చేసి గన్ చూపించి కారు ఎక్కండి అని బెదిరించడంతో వెళ్ళుతు తన దగ్గర ఉన్న కాయిన్ ని ప్రెస్ చేసింది పూజా.
**************
కారు దగ్గరికి వెళుతూ దూరంగా ఉన్న పుష్కర్ వాళ్ళ వైపు చూసి సైగ చేసిన నీతూ ని చూసి "మేడం వాళ్ళని ఎవరో కిడ్నాప్ చేస్తున్నారు ఎలాగైనా కాపాడాలి." అని కారు వైపు వెళ్లారు ఇద్దరు.
చుట్టూ ఉన్న నలుగురు వైపు చూసి "అసలు ఎవరు మీరు? మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు?" అని అడిగింది దీప్తి.
"యంగ్ తో పాటు సముద్రంలోకి వెళ్లడానికి బుక్ చేసిన అమ్మాయిలు మీ ముగ్గురే కదా! వెనక్కి వెళ్ళిపోతున్నారు ఎందుకు?" అని అడిగాడు నలుగురులో ఒక వ్యక్తి.
ఆ మాట విని 'మన గురించి వీళ్ళకి తెలీదు.' అనుకుని "మేము వెనక్కి వెళ్లడం లేదు లగేజ్ తీసుకోవడానికి వెళుతున్నము." అని చెప్పింది పూజా.
"అయినా మమల్ని బెదిరిస్తున్నారు ఎందుకు? మీతో పాటు మేమురాము." అని కోపంగా చెప్పింది నీతూ.
అంతలో జింగ్ తో పాటు కారు దగ్గరికి వచ్చి నలుగురితో గొడవ పడుతున్న నీతూ వాళ్ళని చూసి "ఈ అమ్మాయిలు నాకు నచ్చలేదు నాతో పాటు సముద్రంలోకి వద్దు." అని చెప్పాడు యాంగ్.
"సరే!' అని నలుగురు వైపు చూసి "ఆ ముగ్గురిని పంపించేయండి మనకి లేట్ అవుతుంది స్పీడ్ గా వెళ్లాలి." అని చెప్పాడు జింగ్.
ఆ మాట విని ముగ్గురు ఊపిరి పీల్చుకుంటూ ఉండగా స్పీడ్ గా అక్కడికి వచ్చి నలుగురులో ఒక వ్యక్తి తలకి గన్ పెట్టి "మర్యాదగా మా మేడం వాళ్ళని వదలి పెట్టండి." అని చెప్పాడు ఏకవీర.
"మేడం! మేము వచ్చేసాము మీరు టెన్షన్ పడకండి." అని చెప్తున్న పుష్కర వైపు చూసి "ఒరేయ్! మీరు కరెక్ట్ టైం కి రాలేదు పానకంలో పుడకల్లాగా వచ్చారు." అని కంగారుగా చూస్తూ చెప్పింది పూజా.
"మేడం అంటున్నాడు ఏమిటి?" అని ముగ్గురి వైపు అనుమానంగా చూస్తూ మొహం మీద ఉన్న చున్నీ తీసి "వీళ్ళు ఈ దేశం వాళ్ళు కాదు మనల్ని ఫాలో అవుతూ వచ్చినట్లు ఉన్నారు పట్టుకోండి." అని చెప్పాడు జింగ్.
ఆ మాట విని ఏకవీర చేతిని వెనక్కి విరిచి గన్ తీసుకొని
ఐదుగురు చేతులు కట్టేసి కార్ లో కూర్చోబెట్టి జింగ్ వైపు చూసి "సార్! వీళ్ళని ఏం చేద్దాము." అని అడిగాడు నలుగురిలో ఒకడు.
"నేను యంగ్ ని తీసుకుని సముద్రం దగ్గరికి వెళుతున్నను వీళ్లను కూడా అక్కడికి తీసుకురండి మనల్ని ఎందుకు ఫాలో అవుతున్నారో తెలుసుకుందాము." అని చెప్పాడు జింగ్.
"ఓకే సార్!" అని కార్ స్టార్ట్ చేసి నీతూ వాళ్ళని ఎక్కించి జింగ్ కార్ వెనకాలే బయలుదేరారు నలుగురు.
పుష్కర్ వైపు కోపంగా చూస్తూ "మీరు మాకు బ్యాకప్ కాదు మమ్మల్ని పట్టించడానికి వచ్చారు, చక్కగా విడిచిపెట్టారు అనుకున్నాము అంతలో వచ్చి చచ్చారు." అని ఏడుపు ముఖం పెట్టుకుని చెప్పింది పూజా.
"మాకు ఏమి తెలుసు నీతూ మేడం సైగ చేసారు వచ్చేసాము." అని చెప్పాడు పుష్కర్.
"టెన్షన్ పడకు కాయిన్ ప్రెస్ చేశావు కదా! యోధ వాళ్ళు వస్తారు." అని చెప్పింది దీప్తి.
నలుగురి వైపు చూస్తూ "ఏంటి మేడం! వీళ్ళు మనుషులు కదా అలా బిగుసుకుపోయి ఉన్నారు." అని డౌట్ గా అడిగాడు ఏకవీర.
"నాకు అదే డౌట్ గా ఉంది జింగ్ చెప్పిన మాట మాత్రమే వింటున్నారు. " అని నలుగురు వైపు చూస్తూ ఉంది నీతూ.
***********
యోధ వైపు చూసి "మనవాళ్లు డేంజర్ లో ఉన్నారు మనం వెంటనే వెళ్లాలి." అని చెప్పాడు క్యూబ్స్.
"మనం ఎక్కడికి వెళ్లనవసరం లేదు వాళ్లే ఇక్కడికి వస్తున్నారు." అని అక్కడకి వస్తున్నా రెండు కార్ల వైపు చూపించాడు భూషణ్.
"ఆ వెనక ఉన్న కార్లో మన వాళ్ళు ఉన్నారు." అని చెప్పాడు నంద.
"సరే! నేను ఆ కారు అపుతాను మీరు ముందు వచ్చే కార్ ని ఆపండి." అని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు యోధ.
భూషణ్, నంద వైపు చూసి "నాకు యుద్ధం చేయడం రాదు వాళ్ళ సంగతి మీ ఇద్దరూ చూసుకోండి నేను చూస్తూ ఉంటాను." అని చెప్పాడు క్యూబ్స్.
"సరే!" అని తుమ్మెదలాగా మరి ఎగురుకుంటూ జింగ్ వాళ్ళ కార్ లోకి వెళ్లి వెనక సీట్ లో కూర్చున్నాడు భూషణ్.
డ్రైవింగ్ చేస్తూ అద్దంలో నుంచి వెనక సీట్లో ఉన్న మనిషిని చూసి షాక్ అయ్యి సడన్ బ్రేక్ వేసి వెనక్కి తిరిగి "ఎవరు నువ్వు? అసలు కార్లోకి ఎలా వచ్చావు?" అని కంగారుగా గన్ చూపించి అడిగాడు జింగ్.
చేతిలో ఉన్న గన్ చూసి "అసలు మనుషులు ప్రతిదానికి దీనిని ఎందుకు వాడతారు?" అని గన్ ని పట్టుకుని రెండు ముక్కలు చేశాడు భూషణ్.
గన్ రెండు ముక్కలు అవడం భయంతో యంగ్ వైపు చూసి "కారు దిగు పారిపోదాము." అని కంగారుగా చెప్పాడు జింగ్.
పరిగెత్తుతున్న ఇద్దరిని చూసి "చిన్న విషయానికి పారిపోతున్నారు ఇక వీళ్ళు యుద్ధం ఏమి చేస్తారు." అనుకుంటూ కారు దిగాడు భూషణ్.
కారుకి ఎదురుగా నిలబడ్డ యోధని చూసి "మన బీమ్ బాయ్ వచ్చేసాడు ఇంక మనం సేఫ్!" అని సంతోషంగా చెప్పింది పూజా.
కార్ లో ఫాస్ట్ గా వెళుతూ ఎదురుగా ఉన్న యోధని చూసి డ్రైవింగ్ చేస్తున్న మనిషి వైపు తిరిగి "వాడిని తొక్కించెయ్!" అని చెప్పాడు జింగ్ మనిషి.
కారు ఫాస్ట్ గా యోధ మీదికి వెళ్లడం చూసి గట్టిగా అరుస్తూ కళ్ళు మూసుకున్నారు నీతూ వాళ్ళు.
యోధ దగ్గరకి కారు ఫాస్ట్ గా రావడం చూసి వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్లి నంది రూపంలోకి మారి కంటి రెప్ప వ్యవధిలో తన కొమ్ములతో కారుని పైకి లేపి వెనక్కి తిప్పి కింద పెట్టి మామూలు మనిషిగా మరిగి యోధ వెనక నుంచున్నాడు నంద.
కారు బోర్లా పడి ఉండడం చూసి ఏమైందో అర్థం కాక వెనక్కి తిరిగి నంద వైపు చూస్తూ "నువ్వే ఏదో చేసావు నాకు అర్థమైంది. లోపల మన వాళ్లు కూడా ఉన్నారు మర్చిపోయావా..?" అంటూ కార్ దగ్గరికి వెళ్లి నీతూ వాళ్ళని బయటికి తీసాడు యోధ.
మరొకవైపు నుంచి పుష్కర్ వాళ్లని బయటికి లాగుతూ "ఎవ్వరికి ఏమీ అవ్వదు నిదానంగా వెనక్కి తిప్పి పెట్టాను." అని చెప్పాడు నంద.
బయటికి వచ్చి డ్రైవింగ్ సీట్లో ఉన్న వాడి వైపు కోపంగా చూస్తూ "నీకు డ్రైవింగ్ చేయడం కూడా రాదా గాడిద లాగా ఉన్నావు." అని కాలితో తంతు అడిగింది పూజా.
బయటికి వచ్చి ఊపిరి పీల్చుకుంటూ "ఇంక నయం కారు పిల్టీలు కొట్టిన మాకు ఏమీ అవలేదు అందుకే ఇసుకలో డ్రైవింగ్ చేయకూడదు అంటారు." అని భయంగా చూస్తూ చెప్పాడు పుష్కర్.
డ్రైవర్ ని కొడుతున్న పూజని పట్టుకుని చేతి కట్లు విప్పి "సేఫ్ గానే ఉన్నావు కదా ఇంక వాడిని కొట్టడం ఆపు!" అని చెప్పాడు యోధ.
ఆ మాటకి నవ్వుతూ "దానికి భయం వేస్తే అంతే పిచ్చి కోపం వస్తుంది. అయినా సడన్ కారు అలా వెనక్కి ఎలా తిరిగిపోయింది." అని డౌట్ గా అడిగింది దీప్తి.
"కజకిస్తాన్ లో అంతే త్వరగా పదండి అసలైన వాళ్ళు పారిపోతున్నారు." అని బోట్ ఎక్కుతున్న జింగ్ వాళ్ళని చూపించాడు నంద.
యంగ్ తో కలిసి వేగంగా బోట్ దగ్గరికి వెళ్లి లోపల ఉన్న క్యూబ్స్ ని చూసి "ఎవడ్రా నువ్వు?" అని అడిగాడు జింగ్.
"మీ ఇద్దరిని జాగ్రత్తగా తీసుకు వెళ్ళడానికి వచ్చాను." అని బోర్డ్ స్టార్ట్ చేశాడు క్యూబ్స్.
"కరెక్ట్ టైం కి వచ్చావు." అని లోపలకి ఎక్కి కూర్చుని "స్పీడ్ గా సముద్రం మధ్యలోకి వేళ్ళు!" అని చెప్పాడు జింగ్.
"సరే!" అని బోట్ ని ఒడ్డున అటు ఇటు తిప్పుతూ ఉన్నాడు క్యూబ్స్.
అది చూసి "సముద్రం మధ్యలోకి వెళ్ళమంటే ఒడ్డున అటు ఇటు తిరుగుతున్నావు ఏమిటి?" అని కోపంగా అడిగాడు జింగ్.
"సార్! నాకు సముద్రం మధ్యలోకి వెళ్లడం అంటే భయం నేను మునిగిపోతే మళ్ళీ బయటికి రావాలి అంటే పర్వతాన్ని తీసుకువచ్చి సముద్రం మదనం చేయాలి." అని చెప్పాడు క్యూబ్స్.
"అసలు ఏం మాట్లాడుతున్నావు ఒక్క ముక్క అర్థం కాలేదు, మర్యాదగా సముద్రం మధ్యలోకి వేళ్ళు లేకపోతే చంపేస్తాను." అని తన చేతిలో ఉన్న సగం ముక్క గన్ ని చూపించాడు జింగ్.
నవ్వుతూ "మా యోధుడు వస్తున్నాడు కాస్త ప్రశాంతంగా ఉండండి." అని చెప్పాడు క్యూబ్స్.
అంతలో వేగంగా బోట్ దగ్గరికి వచ్చి లోపల ఉన్న ఇద్దరిని రెండు చేతులతో పట్టుకుని ఒడ్డుకి తీసుకువచ్చాడు యోధ.
జింగ్, యంగ్ ని రెండు చేతులతో పట్టుకొని వస్తున్నా యోదని చూసి "ఒక్కడే 24 మందిని ఎలా చంపేశాడో ఇప్పుడు అర్థమైంది. వీళ్ళు ఒక్కొక్కడు యోధ చేతి సైజు కూడా లేరు." అని నవ్వుతూ చెప్పింది పూజా.
ఇద్దరిని కింద పడేసి కాలితో తొక్కుతున్న యోధని ఆపి యంగ్ ని పైకి లేపి "ఇతని మీద ప్రయోగం చేశారు అదేంటో మనం తెలుసుకోవాలి." అని చెప్పింది నీతూ.
"సరే! అయితే వీడిని చంపేస్తాను." అని జింగ్ వైపు చూసాడు యోధ.
ఆ మాట విని తన జేబులో ఉన్న ఐడీ కార్డు చూపిస్తూ "నేను మిలిటరీ ఆఫీసర్ ని నన్ను చంపితే మీరు రిస్క్ లో పడతారు.' అని భయంగా చూస్తూ అక్కడికి వస్తున్న తన మనుషులు వైపు చూసి "వీడిని చంపేసి నన్ను కాపాడండి." అని గట్టిగా అరిచాడు జింగ్.
అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తున్న వాళ్ళని చూసి "యోధ! ఆ నలుగురికి ఏలాంటి ఫీలింగ్స్ లేవు జింగ్ చెప్పిన పని మాత్రమే చేస్తున్నారు నాకెందుకో డౌట్ గా ఉంది." అని చెప్పింది దీప్తి.
ఆ మాట విని కింద పడి ఉన్న జింగ్ రెండు కాళ్లు పట్టుకుని వెనక్కి తిప్పి వెన్నుపూస మీద కాలు పెట్టి ఒక్క తొక్కు తొక్కి పైకి లేపి సముద్రంలోకి గిరాటు వేసి నలుగురు వైపు చూశాడు యోధ.................
Posts: 898
Threads: 13
Likes Received: 7,010 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
రుద్రం భజే! ఎపిసోడ్ 24
ఆ నలుగురు జింగ్ చెప్పిన మాట మాత్రమే వింటున్నారు అని నీతూ చెప్పడంతో జింగ్ రెండు కాళ్లు పట్టుకొని వెనక్కి తిప్పి వెన్నుముక మీద ఒక్క తొక్కు తొక్కి సముద్రంలోకి గిరాటు వేశాడు యోధ.
*************
గాలిలో ఎగిరి సముద్రంలో పడిన జింగ్ ని చూసి కోపంతో యోధ మీదికి పరిగెత్తుకుంటూ వచ్చారు నలుగురు.
అది చూసి పుష్కర్ చేతిలో ఉన్న గన్ తీసుకుని నలుగురిని షూట్ చేసింది నీతూ.
బుల్లెట్ దిగిన ఆగకుండా పరిగెత్తుకుంటూ వస్తున్నా నలుగురిని చూసి "ఏంటి? వాళ్లకి బ్లడ్ కూడా రావడం లేదు నిజంగా మనుషులు కాదా!" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది నీతూ.
"ఒకవేళ రాక్షసులు ఏమో!" అని భయంగా చూస్తూ చెప్పింది పూజా.
నలుగురిని ఆపడానికి వెళుతున్న నందని అపి "యోధ ని పోరాడనివ్వు తన లో ఉన్న శక్తి బయటికి రావాలి కదా!" అని చెప్పాడు భూషణ్.
ఆ మాట విని ఆశ్చర్యంగా భూషణ్ వైపు చూసి "అంటే! ఆ నలుగురు మనుషులు కదా!" అని అడిగాడు క్యూబ్స్.
"నాకు వాళ్ళ దగ్గర రేపాలా తాంత్రికుడి వాసన వస్తుంది అతను మనిషిని కుడా రాక్షసుడుగా చేయగలడు." అని చెప్పాడు భూషణ్.
"అసలు ఈ రేపాల ఎవరు?" అని అనుమానంగా అడిగాడు క్యూబ్స్.
"రావణాసురుడి సైన్యంలో తాంత్రిక విద్యలు తెలిసిన హిడాచి వంశానికి చెందినవాడు, వాళ్ళ దగ్గర రావణుడు కుడా చాలా విద్యలు నేర్చుకున్నాడు యుద్ధంలో ఆ హిడాచి వంశం వాళ్ళని ఆంజనేయుడు హతమార్చాడు.
ఒక మహిళ గర్భంతో ఉంది అని దయతలిచాడు దానికి పర్యవసానం ఆ వంశం వృద్ధి చెంది ఇప్పుడు రెపాల రూపంలో మన ముందుకు వచ్చడు." అని చెప్పాడు భూషణ్.
"అంటే! రేపాలా కి తన పూర్వీకులకుల శక్తి వచ్చిందా..?" అని అనుమానంగా అడిగాడు క్యూబ్స్.
"దైవ శక్తి భూమి మీదకి వచ్చినప్పుడు క్షుద్ర శక్తి కూడా వస్తుంది కదా!" అని చెప్పాడు భూషణ్.
నలుగురిని కొడుతూ మళ్లీ మీదకి వస్తున్న వాళ్ళ వైపు ఆశ్చర్యంగా చూస్తూ "నేను కొట్టిన దెబ్బలు వీళ్ళకి తగులుతున్నాయా లేదా? తిరిగి మళ్లీ వస్తున్నారు." అని అనుమానంగా చూస్తూ అడిగాడు యోధ.
నలుగురు కలిసి ఒక్కసారిగా యోధ మీద పడడంతో "ఎవరైనా వెళ్లి తనకి హెల్ప్ చేయండి." అని కంగారు చెప్పింది పూజా.
నలుగురిని రెండు చేతులతో ఎత్తి గిరాటు వేసిన యోధ దగ్గరకు వెళ్లి "పుర్రె పగిలితే కానీ దారిలోకి రారు, నీ శక్తి మొత్తం చేతిలోకి తీసుకుని తల మీద బలంగా ఒక్క దెబ్బ కొట్టు!" అని చెప్పాడు నంద.
అంతలో యోధ ఛాతి మీద ఉన్న సింబల్ మెరవడం చూసి "హనుమంతుడి శక్తి బయటికి వస్తుంది." అని సంతోషంగా చూస్తూ చెప్పాడు భూషణ్.
మీదకి వచ్చిన నలుగురిలో ఒకడి తల మీద తన మోచేతితో బలంగా ఒక్క దెబ్బ కొట్టాడు యోధ.
ఆ దెబ్బకి పుర్రె పగిలి చెవులు ముక్కు కళ్ళలో నుంచి రక్తం రావడం చూసి "గుడ్ షాట్!" అని చెప్పిన దీప్తి.
నలుగురులో ఒకడు చనిపోవడం చూసి అక్కడ నుంచి పారిపోతున్న ముగ్గురు వెంటపడి మరి పట్టుకొని తలలు పగలగొట్టాడు యోధ.
నలుగురు దారుణంగా చావడం చూసి భయంతో దగ్గరికి వచ్చి "నాకు చావాలని లేదు ఎలాగైనా బతికించండి." అని ఏడుస్తూ అడిగాడు యంగ్.
"మాయ వదిలినట్లు ఉంది." అని మనసులో అనుకున్నడు క్యూబ్.
"యోధ! మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి." అని చెప్పాడు భూషణ్.
"ఆ కళింగ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు కదా ఒక్కసారి కలిసి వద్దాము." అని చెప్పాడు యోధ.
"ఆ టైమ్ ఇంకా రాలేదు సూర్యాస్తమయం అయ్యే టైమ్ అయ్యింది కిరణాలు లేకపోతే మనం ఇక్కడి నుంచి వెళ్లలేము." అని చెప్పాడు భూషణ్
"సరే!" అని తన దగ్గర ఉన్న పద్మాన్ని తీసి సూర్యకిరణం పడేటట్లు పెట్టి బ్లాక్ హోల్ ఓపెన్ అవ్వడంతో యంగ్ చెయ్యి పట్టుకుని అడుగుపెడుతూ మేము వచ్చిన ప్లేస్ కి వెళ్ళాలి." అని చెప్పాడు యోధ.
వెనకాల మిగతా వాళ్ళు కూడా బ్లాక్ హోల్ లోకి వెళ్లిపోయారు.
************
కిజికిస్తాన్ లో ఆ ప్లేస్ కి దూరంగా ఉన్న గెస్ట్ హౌస్ లో రూమ్ లో నుంచి హడావుడిగా బయటకి వచ్చి కళింగ వైపు చూసి "సముద్రంలోకి వెళ్లడానికి బయలుదేరిన నా మనుషులు నలుగురు చనిపోయారు." అని కంగారుగా చెప్పాడు రేపాలా.
ఆ మాటకి షాక్ అయి చూస్తు "ఆ నలుగురిని ఎవరు చంపలేరు అని చెప్పావు కదా!" అని టెన్షన్ గా చూస్తూ జింగ్ సెల్ కి కాల్ చేసి నాట్ రీచబుల్ రావడంతో సయ్యద్ వైపు చూసి
"వెంటనే అక్కడికి మనుషుల్ని పంపించండి ఏం జరిగిందో నాకు తెలియాలి." అని చెప్పాడు కలింగ.
"అది మాత్రమే కాదు చనిపోయిన నలుగురు శరీరాలు కూడా మన దగ్గరికి రావాలి అప్పుడు వాళ్ళని చంపింది ఎవరో నేను తెలుసుకుంటాను." అని చెప్పాడు రేపాలా.
పక్కనే ఉన్న చింగ్ యా వైపు చూసి "యంగ్ ని ఎలాగైనా పట్టుకోండి నాకు వాడి బాడీలో ఉన్న చివరి రక్తపు బొట్టు వరకు కావాలి." అని కోపంగా చూస్తూ చెప్పాడు కళింగ.
"సరే!' అని చెప్పి తన మనుషులను తీసుకుని సముద్రం దగ్గరికి బయలుదేరాడు సయ్యద్.
*************
ఢిల్లీ హోటల్ రూమ్ లోకి రావడంతో బ్లాక్ హోల్ క్లోజ్ చేసి యంగ్ వైపు చూసి "ఇప్పుడు వీడిని ఏం చేద్దాము?" అని అడిగాడు యోధ.
"యుంగ్ ని అర్జెంటుగా ల్యాబ్ కి తీసుకెళ్లి బాడీలో ఎటువంటి వైరస్ ఉందొ తెలుసుకోవాలి." అని చెప్పింది దీప్తి.
"నా శరీరంలో ఉన్న వైరస్ గురించి నాకు తెలుసు!" అని చెప్పాడు యంగ్.
ఆ మాటకి యంగ్ వైపు చూస్తూ "అసలు ఎవరు నువ్వు? నిన్ను సముద్రంలోకి తీసుకెళ్లి ఏమి చేయబోతున్నారు?" అని అడిగింది దీప్తి.
"నా పేరు షిలో యంగ్! నాది బీజింగ్ దగ్గర చిన్న పల్లెటూరు తండ్రి చనిపోవడంతో కుటుంబ భారం మొత్తం నా మీద పడింది. ఎక్కువ డబ్బులు వచ్చే ఉద్యోగం కోసం వెతుకుతూ జింగ్ ని కలిసాను.
అతను ఒక ఆర్కియాలజిస్ట్ పురాతన నిధులు కోసం వెతుకుతూ ఉండేవాడు వాటి కోసం ఎక్కడెక్కడికో తిరిగేవాడు అది చూసి అతని దగ్గర పనిచేయడానికి ఎవరు ముందుకు రాలేదు అందుకే ఎక్కువ జీతం ఇస్తానని అనౌన్స్మెంట్ ఇచ్చాడు.
నా కుటుంబాన్ని కాపాడుకోవడం జింగ్ దగ్గర పనిలో చేరాను కొన్ని రోజులకి నా వర్క్ నచ్చడంతో కళింగ దగ్గరికి తీసుకువెళ్లాడు.
ఒకరోజు టిబెట్లో హిమాలయాల దగ్గర కొన్ని జంతువుల కళేబరాలు దొరికాయి అవి అంతరించిపోయిన భయంకరమైన జంతువులు అని తెలుసుకుని వాటి డిఎన్ఏ తో కళింగ ప్రయోగం చేయడం మొదలుపెట్టాడు.
ఆ ప్రయోగానికి మనిషి కావాలని ఎంత డబ్బు అయినా ఇస్తాను చూడమని నాతో చెప్పాడు అప్పుడు నా ఇద్దరు అక్కల పెళ్లికి సహాయం చేస్తే ఆ ప్రయోగం నామీద చేయడానికి ఒప్పుకుంటానని ముందుకు వచ్చాను.
ఆ డీల్ కి సరే అని నన్ను కొరకారం పర్వతాల్లో ఉన్న ల్యాబ్ దగ్గరికి తీసుకువెళ్లి రెండు సంవత్సరాలు అన్ని రకాల ప్రయోగాలు చేశారు అక్కడకి ఒక తాంత్రికుడుని కూడా తీసుకువచ్చారు కానీ ప్రయోగం విఫలమైంది ఆ కళేబరాలకు ప్రాణం రాలేదు.
అనుకోకుండా ఒక రోజు ఎక్వేరియం ఫుడ్ వేస్తూ ఉండగా నా చెయ్యి తెగి బ్లడ్ వాటర్ లో పడింది కొన్ని నిమిషాలకి లోపల ఉన్న చేపలు మొత్తం రాక్షసా చేపల్లాగా మారిపోయాయి.
అది చూసి వాటిల్లో ఒక చేపని టెస్ట్ చేసి తన ప్రయోగం సక్సెస్ అయిందని నా రక్తంతో నీటిలో ఉన్న జంతువులను రాక్షస జంతువులుగా మార్చవచ్చని తెలుసుకున్నాడు.
ఆ ప్రయోగం చేయడానికి కజకిస్తాన్ ని ఎంచుకున్నాడు నన్ను సముద్రం మధ్యలోకి తీసుకువెళ్లి వదిలేస్తారు అక్కడ ఉన్న చేపలు మిగతా జంతువులు నా శరీరాన్ని తినడం వల్ల రాక్షసా జంతువులుగా మారతాయి. " అని చెప్పాడు యంగ్.
ఆదివిని కోపంగా చూస్తూ "నీ ఫ్యామిలీ సుఖంగా ఉండడం కోసం వందల మంది ప్రాణాలు తీయడానికి రెడీ అయ్యావా.?" అని అడిగాడు యోధ.
"నేనేం చేస్తున్నానో నాకే తెలియని మైకంలో ఉన్నాను నువ్వు ఆ నలుగురిని చంపిన తర్వాతే మత్తు వదిలినట్లు అయింది నేను చేస్తుంది తప్పు అని తెలుసుకున్నాను." అని ఏడుస్తూ చెప్పాడు యంగ్.
"యోధ! ఇది ఇతని తప్పు కాదు కళింగ దగ్గర ఉండే తాంత్రికుడు రేపాలా చేసిన మాయ అతను మనిషిని తన ఆధీనంలో ఉంచుకోగలడు." అని చెప్పాడు భూషణ్.
ఆ మాట విని యంగ్ వైపు విచిత్రంగా చూస్తూ "అలా అయితే ఇప్పుడు నీ బ్లడ్ డేంజర్స్ వేపన్ ఆ..!" అని అడిగింది పూజా.
"అవును" నన్ను ఎలాగైనా మళ్ళీ మామూలు మనిషిని చేయండి నాకోసం నా ఫ్యామిలీ ఎదురు చూస్తూ ఉంటుంది." అని రిక్వెస్ట్ గా అడిగాడు యంగ్.
అంతలో ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేసి "హలో ముష్రు చెప్పు!" అని అడిగింది నీతూ.
"నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్లడానికి వస్తున్నానని భూపాల్ సింగ్ ఫోన్ చేశాడు ఇప్పుడేం చేయమంటారు." అని అడిగాడు ముష్రు.
"ఒక్క నిమిషం లైన్లో ఉండు అని యోధ వైపు చూసి "ముష్రుని ఏం చేయమంటావు?" అని అడిగింది నీతూ.
ఫోన్ తీసుకుని "నీ దగ్గర ఆ వస్తువు ఉంది కదా ధైర్యంగా భూపాల్ సింగ్ తో పాటు వేళ్ళు!" అని చెప్పాడు యోధ.
"మీరు నిజంగానే చెబుతున్నారా..? ఈ వస్తువుని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమంటారా?" అని కంగారుగా అడిగాడు ముష్రు.
"నేను చెబుతున్న కదా హ్యాపీగా వెళ్లి ఆ వస్తువు ఇచ్చి అక్కడే ఉండు నేను వచ్చి కలుస్తాను." అని చెప్పాడు యోధ.
ఆ మాటకి నవ్వుతూ "అర్థమైంది మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు ముష్రు.
ఫోన్ పెట్టేసిన యోధ వైపు చూసి "అది డూప్లికేట్ అని తెలిస్తే ముష్రుని చంపేస్తారు." అని కంగారుగా చెప్పింది దీప్తి.
"ఆ పద్మం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు తెలిసిన జింగ్ చనిపోయాడు." అని నవ్వుతూ చెప్పాడు యోధ.
"ఆ వస్తువు అసలైంది కాదు అని రేపాల కనిపెట్టగలడు." అని చెప్పాడు భూషణ్.
" రుద్రం భజే! ఎపిసోడ్ 24 " రచనకు రేటింగ్ ఇవ్వండి....
Posts: 4,805
Threads: 9
Likes Received: 3,183 in 2,464 posts
Likes Given: 11,248
Joined: Sep 2019
Reputation:
31
Posts: 1,626
Threads: 2
Likes Received: 964 in 741 posts
Likes Given: 2,159
Joined: May 2019
Reputation:
11
ఏటో ఏటో పోతుంది.. but మస్తుగా ఉంది
Posts: 1,156
Threads: 1
Likes Received: 730 in 473 posts
Likes Given: 10,935
Joined: Jun 2019
Reputation:
2
Posts: 194
Threads: 0
Likes Received: 122 in 107 posts
Likes Given: 1,093
Joined: Apr 2026
Reputation:
0
Super. Engaging story. Keep rocking
Posts: 11
Threads: 0
Likes Received: 11 in 11 posts
Likes Given: 0
Joined: Apr 2026
Reputation:
0
Your update Shiva garu waiting for
Posts: 77
Threads: 0
Likes Received: 31 in 29 posts
Likes Given: 23
Joined: Jun 2019
Reputation:
3
Supeer series... keep i tup
Posts: 898
Threads: 13
Likes Received: 7,010 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
రుద్రం భజే! ఎపిసోడ్ 25
హోటల్ రూమ్ లో నుంచి ముష్రుతో ఫోన్లో మాట్లాడి ఆ వస్తువుల గురించి తెలిసిన జింగ్ చనిపోయాడు కాబట్టి దాని గురించి ఎవరికీ తెలీదు అని చెప్పాడు యోధ.
***********
"ముష్రు దగ్గర ఉన్న పద్మాన్ని చూసిన వెంటనే అది అసలైంది కాదు అని రేపాలా కనిపెడతాడు, అంతేకాదు నువ్వు చంపిన నలుగురిని చూసి చాలా విషయాలు తెలుసుకుంటాడు." అని చెప్పాడు భూషణ్.
"అలా అయితే ఆ పద్మం వాళ్ళ చేతికి వెళ్లినట్లే ఉండాలి కానీ వెళ్ళకూడదు దానికి ఏదైనా ఐడియా ఆలోచించండి." అని చెప్పింది పూజా.
"ముష్రు ఇక్కడి నుంచి బయలుదేరిన వెంటనే తన దగ్గర ఉన్న పద్మాన్ని భూపాల్ సింగ్ కి ఇవ్వమని చెప్పండి చాలు నేను చూసుకుంటాను." అని చెప్పాడు భూషణ్.
అంతలో ఫోన్ రింగ్ అవ్వడం చూసి "టైమ్ కి ముష్రు కాల్ చేసాడు." అని యోధాకి ఫోన్ ఇచ్చింది లేదు నీతూ.
ఫోన్ లిఫ్ట్ చేసి "చెప్పు ముష్రు!" అని అడిగాడు యోధ.
"సార్! నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్లడానికి భూపాల్ సింగ్ వచ్చే టైమ్ అయింది." అని చెప్పాడు ముష్రు.
"నాకు తెలుసు! నువ్వు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడే ఆ వస్తువుని భూపాల్ సింగ్ కి ఇవ్వు ఆ విషయం కళింగకు కూడా తెలిసేటట్లు చెయ్! తర్వాత సంగతి మేము చూసుకుంటాము ఇంక నువ్వు సేఫ్ గా ఉంటావు." అని చెప్పాడు యోధ.
"సార్! మీ ప్లాన్ ఏమిటో నాకు అర్థం కావడం లేదు నేనయితే సేఫ్ గా ఉంటా కదా!" అని కంగారుగా అడిగాడు ముష్రు.
"నేను నీకు మాట ఇచ్చాను కదా నువ్వు సేఫ్ గా ఇండియాలోనే ఉంటావు." అని చెప్పాడు యోధ.
"ఓకే సర్ థాంక్యూ!" అని ఫోన్ పెట్టేసాను ముష్రు.
భూషణ్ వైపు చూసి "మీరు ఇక్కడే ఉండండి మేము వెళ్లి ఒకసారి నాయక్ సార్ కలిసి వస్తాము పుష్కర్ వాళ్లు కూడా మీతో పాటే ఉంటారు." అని చెప్పాడు యోధ.
"సరే! నువ్వు వచ్చేసరికి జరగవలసినదంతా జరిగిపోతుంది." అని చెప్పాడు నంద.
"యోధ! నీ దగ్గర ఉన్న పద్మం జాగ్రత్త!" అని చెప్పాడు క్యూబ్స్.
"ఆ రెండు దేశాల ఆర్మీ మొత్తం వచ్చిన సరే నా దగ్గర నుంచి ఈ పద్మన్ని తీసుకు వెళ్ళలేరు." అని నవ్వుతూ నీతూ వాళ్లతో కలిసి అక్కడనుంచి వెళ్ళాడు యోధ.
**************
కజకిస్తాన్ గెస్ట్ హౌస్ దగ్గరికి నలుగురి శవాన్ని తీసుకుని వస్తున్న సయ్యద్ వైపు చూసి "యంగ్ అక్కడ?" అని టెన్షన్ గా చూస్తూ అడిగాడు కళింగ.
"సముద్రం దగ్గర నలుగురి శవాలు బోర్ల పడిన కార్ లో డ్రైవర్ తప్పితే ఎవరు కనిపించలేదు." అని చెప్పాడు సయ్యద్.
"మరి జింగ్ ఏమైపోయాడు?" అని అడిగాడు చింగ్ యా.
"ఆ ఇద్దరు ఎక్కడికి వెళ్లారో తెలియదు ఈ డ్రైవర్ మాత్రం షాక్ లో ఉన్నాడు ఎంత అడిగినా ఏమి మాట్లాడలేదు." అని చెప్పాడు సయ్యద్.
అక్కడికి వస్తూ చేతిలో నీళ్లు తీసుకుని డ్రైవర్ మోహన కొట్టి కంగారుగా చూస్తున్న అతని వైపు చూసి "అక్కడ ఏం జరిగింది?" అని అడిగాడు రేపాల.
"సార్! మేము సముద్రం దగ్గరికి బయలుదేరే ముందు ముగ్గురు లేడీస్ ఇద్దరు జెంట్స్ వచ్చారు. వాళ్ళ చేతులు కట్టేసి కార్లు కూర్చోబెట్టి సముద్రం దగ్గరికి తీసుకు వెళ్ళమని జింగ్ గారు చెప్పారు.
మేము సముద్రం దగ్గరికి వెళ్లేసరికి ఏమైందో తెలియదు ఎవరో వచ్చి తిప్పినట్టు సడన్గా మా కారు బోర్ల పడింది. అప్పుడక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు నా మీద డబల్ ఉన్నడు.
బోట్ లో సముద్రంలోకి వెళుతున్న జింగ్, యంగ్ ని రెండు చేతులతో ఒడ్డుకు తీసుకువచ్చి జింగ్ వెన్నుపూస విరకొట్టి సముద్రంలోకి గిరాటు వేశాడు ఈ నలుగురిని ఒక్క దెబ్బతో చంపేసాడు.
తరువాత గాల్లో ఒక డోర్ ఓపెన్ తీసుకుని దాంట్లోకి యంగ్ ని తీసుకుని అందరూ వెళ్ళిపోయారు అంతం మాయ లాగా ఉంది ఏం జరిగిందో కూడా నాకు అర్థం కాలేదు." అని టెన్షన్ గా చూస్తూ చెప్పాడు డ్రైవర్.
అతని మాటలు విని "వీడు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు మైండ్ దొబ్బినట్లు ఉంది. గాలిలో డోర్ ఓపెన్ అవ్వడం ఏమిటి! దాంట్లోకి అందరూ వెళ్లడం ఏమిటి!" అని విసుగ్గా చెప్పాడు చింగ్ యా.
చనిపోయిన నలుగురు దగ్గరికి వెళ్లి తల మీద చేయ్యి పెట్టి చూసి "వీళ్లని చంపింది మనిషే కానీ అతనికి ఏదో శక్తి తోడుగా ఉంది. డ్రైవర్ చెప్పేది నిజమే!" అని చెప్పాడు రేపాలా.
ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ లాప్టాప్ ఓపెన్ చేసి చూస్తూ "యంగ్ బాడీలో ఉన్న చిప్ లొకేషన్ ఇండియాలో చూపిస్తుంది." అని చెప్పాడు కళింగ.
"ఏంటి? లోకేషన్ ఇండియాలో చూపిస్తుందా? అప్పుడే ఎలా వెళ్లగలరు." అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు సయ్యద్.
"కాలంలో ప్రయాణం ఆ పద్మం ద్వారా సాధ్యమవుతుంది నా శక్తి గురించి, ఆ పద్మం గురించి తెలిసిన వాళ్ళు ఎవరో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సహాయం చేస్తున్నారు." అని చెప్పాడు రేపాలా.
"ఏంటి? ఆ వస్తువు ద్వారా కాలంలో ప్రయాణం చేయాచ్చా మరి ఈ విషయం ఇప్పుటీ వరకు నాతో ఎందుకు చెప్పలేదు." అని అడిగాడు చింగ్ యా.
"ఆ విషయం నాకు కూడా తెలుసు అంతే, నేను కూడా ఆ పద్మాన్ని ఎప్పుడు ఉపయోగించలేదు కదా! ముందు అది మన మనిషి దగ్గర ఉందో లేదో తెలుసుకోండి." అని చెప్పాడు రేపాలా.
సయ్యద్ వైపు చూసి "భూపాల్ సింగ్ కి కాల్ చెయ్ ఇమీడియట్ గా ముష్రు దగ్గరికి వెళ్లి వీడియో కాల్ చేయమను." అని చెప్పాడు కళింగ.
"నాకు తెలిసి ఈ టైంకి అక్కడే ఉంటాడు." అని కాల్ చేసి "భూపాల్ ఎక్కడ ఉన్నావు? ముష్రు దగ్గరికి వెళ్ళావా?" అని అడిగాడు సయ్యద్.
"బాయ్! ముష్రు రూమ్ డోర్ కొడుతున్నాను నువ్వు కాల్ చేసావు కాసేపట్లో ఇక్కడ నుంచి కుడా స్టార్ట్ అవుతాము." అని చెప్పాడు భూపాల్.
"రూమ్ లోపలికి వెళ్లి అర్జెంటుగా వీడియో కాల్ చెయ్, నేను లైన్ లోనే ఉంటాను." అని చెప్పాడు సయ్యద్.
"సరే!" అని ముష్రు డోర్ ఓపెనింగ్ చేయడంతో లోపలికి వెళ్లి లాప్టాప్ ఆన్ చేసి వీడియో కాల్ చేసి "ఏమైంది భాయ్! అంత టెన్షన్ పడుతున్నావు?" అని అడిగాడు భూపాల్.
వీడియో కాల్ లో చూస్తూ "ముష్రు నీ దగ్గర ఉన్న వస్తువు భూపాల్ కి ఇవ్వు!" అని చెప్పాడు కళింగ.
"ఓకే సార్!" అని బ్యాగ్ లో ఉన్న వస్తువు తీసి భుపాల్ చేతికి ఇచ్చి ఇప్పుడు నాకు పెద్ద భారం దిగినట్లు ఉంది." అని ఊపిరి పీల్చుకున్నాడు ముష్రు.
వీడియో కాల్ లో భోపాల్ చేతిలో పద్మాన్ని చూసి "ఆ వస్తువు అక్కడే ఉంటే మరి ఇక్కడికి ఎలా వచ్చారు? మనవాళ్ళని ఎలా చంపారు? ఎలా వెళ్ళిపోయారు?" అని అనుమానంగా చూస్తూ అడిగాడు సయ్యద్.
"ఆ విషయం నేను తెలుసుకుంటాను." అని చనిపోయిన నలుగురు తలల మీద ఉన్న రక్తాన్ని తీసుకుని గదిలోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకున్నారు రేపాలా.
వీడియో కాల్ లో భూపాల్ వైపు చూసి "ఇమ్మీడియేట్ గా అక్కడ నుంచి స్టార్ట్ అవ్వండి." అని చెప్పాడు కళింగ.
"ఓకే సార్!" అని కాల్ కట్ చేసి ముష్రుతో కలిసి రూమ్ దగ్గర నుంచి బయలుదేరాడు భూపాల్ సింగ్.
వీడియో కాల్ కట్ అవడంతో చింగ్ యా వైపు చూసి "ఇండియాలో ఉన్న యంగ్ ని కనిపెట్టి ఎలాగైనా మన దగ్గరికి తీసుకురావాలి." అని చెప్పాడు కళింగ.
"యంగ్ బాడీ లో ఉన్న వైరస్ గురించి తెలుసుకున్నారు అంటే మన పని అవుట్! అసలు ఇక్కడ నుంచి అంత స్పీడ్ గా ఇండియా ఎలా వెళ్లారు ముందు అది తెలుసుకోండి." అని చెప్పాడు చింగ్ యా.
"రేపాలా గదిలో నుంచి బయటికి వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి." అని వెయిట్ చేస్తూ ఉన్నాడు కళింగ.
************
అదే సమయంలో రూమ్ లో నుంచి బైనో క్లోర్ లో ముష్రు రూమ్లో జరిగిందంతా చూసి భూషణ్ వైపు తిరిగి "మనం అనుకున్నట్లు ఆ వస్తువు భూపాల్ దగ్గరికి వెళ్ళింది ఇప్పుడు దానిని ఎలా తీసుకువస్తారు?" అని అడిగాడు పుష్కర్.
"మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్లి ఆ వస్తువుని ఎలాగైనా తీసుకువస్తాను." అని చెప్పి రూమ్ నుంచి వెళ్ళాడు భూషణ్.
ఆ మాటకి నందా వైపు చూసి "భూషణ్ కి మ్యాజిక్ ఏమైనా తెలుసా! భూపాల్ దగ్గర నుంచి అంత తేలిక వస్తువులు తీసుకొస్తానని చెప్పి ఒక్కడే వెళ్ళాడు." అని అడిగాడు ఏకవీర.
"ఎవరికి కనిపించకుండా పెట్టిన వస్తువుని కనిపించకుండా తీయలేడా?" అని అడిగాడు నంద.
"కరెక్ట్ కదా! అసలు ఎలా పెట్టాడు ఇప్పుడు ఎలా తీసుకొస్తాడు." అని ఆలోచిస్తూ ఉన్నాడు పుష్కర్.
"నువ్వు నోరు మూసుకొని కూర్చో, ఏ చేత్తో అయితే పెట్టాడో ఆ చేతితోనే తీసుకువస్తాడు." అని చెప్పాడు క్యూబ్
*************
అదే సమయంలో నాయక్ దగ్గరికి వెళ్లి సెల్యూట్ చేసి తన దగ్గర ఉన్న పద్మాన్ని టేబుల్ మీద పెట్టి పక్కన ఉన్న యంగ్ ని చూపించి జరిగిన విషయం మొత్తం చెప్పాడు యోధ.
చెప్పింది మొత్తం విని ఆశ్చర్యంగా చూస్తూ "ఏంటి? ఈ ప్లేట్ ద్వారా కజకిస్తాన్ వెళ్లి అక్కడి నుంచి ఈ మనిషిని తీసుకువచ్చారా?
ఇతని ఒంట్లో ఉన్న బ్లడ్ తాగితే జంతువులు రాక్షసా జంతువులుగా మారిపోతాయా? అసలు మీ అందరికీ ఏమైంది బానే ఉన్నారా?" అని అడిగాడు నాయక్.
"డాడ్! మేము చెప్పేది నిజం నేను కూడా వెళ్లాను." అని చెప్పింది దీప్తి.
"సార్! మీకు చూపించడానికి ఇప్పుడు సూర్యకిరణాలు కూడా లేవు ఈ పద్మం పనిచేయదు కావాలి అంటే యంగ్ బాడీలో ఉన్న బ్లడ్ టెస్ట్ చేయించండి మీకు అర్థం అవుతుంది." అని చెప్పాడు యోధ.
నీతూ వైపు చూసి "మీ ఇద్దరి అసిస్టెంట్స్ ఎక్కడ కజకిస్తాన్లో వదిలేసి వచ్చారా?' అని వెటకారంగా నవ్వుతూ అడిగాడు నాయక్.
"సార్! మేము చెప్పిన మాట మీరు నమ్మడం లేదు కదూ!" అని అడిగాడు యోధ.
నేను కాదు ఈ మాట ఎవరికీ చెప్పిన నమ్మరు మీకు ఈ కట్టు కథ చెప్పి మిమ్మల్ని ఎవరో పిచ్చోళ్లను చేస్తున్నారు ముందు ఆ విషయం తెలుసుకోండి." అని చెప్పాడు నాయక్.
"సార్! అయితే ఒక్కసారి ఇటు వైపు చూడండి." అని చెప్పి తన దగ్గర ఉన్న కత్తితో యంగ్ వేలుని కోసి బ్లడ్ టేబుల్ మీద పడేటట్లు చేసి కింద పాకుతున్న చీమను తీసుకొచ్చి ఆ బ్లడ్ లో వేసాడు యోధ.
టేబుల్ మీద బ్లడ్ లో అటు ఇటు కొట్టుకుంటున్న చీమను చూసి నవ్వుతూ ఉన్నాడు నాయక్.
|