Thread Rating:
  • 25 Vote(s) - 3.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
(01-05-2026, 04:36 PM)SivaSai Wrote: Yes Going To Family Tour 

E Weekend Antha Offline Unta 

Next 2 Days No-Updates. But E Evening Ekkuva Updates Isthanuuu................

Have a great time with your family. Enjoy Sivagaru
And thanks for theeeeeese many episodes!!!

We will be waiting for you Sivagaru
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
adiri poindi shiva garu
Like Reply
Excellent updates
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
Part - 111


విశి, సూర్య తో తో బయటకి వచ్చి చాలా హ్యాపీగా ఉంటుంది.  మేడమ్ మాకేమి ట్రీట్ లేదా. సర్ ఈ వీకెండ్ నా చేతిలో తో నేనే వంట చేస్తాను.

అవన్నీ తర్వాత....సరదాగా ఎక్కడికైనా వెళదామా అని విశి చేతి వేళ్ళతో ఆడుతూ అడుగుతాడు..అబ్బో అయ్యగారికి గాలి మళ్ళీనట్టు ఉంది.

మరి ప్రేమలో పడ్డాక బోళ్ళు ఉంటాయి.  అచికబుచ్చుకలు ఆడుకోవాలి. లేట్ నైట్ దాకా ఫోన్లో మాట్లాడుకోవాలి. అందరూ కన్నా ముందు ఫోన్ చేసి విష్ చేయాలి. అబ్బా చాలు చాలు నా డైలాగ్స్ అని నాకే తిరిగి చెప్తున్నారు.

లేదు క్యూటి ఇవన్నీ నేను సర్చ్ చేసినవే.. అవ్వ ఇలాంటి ఎవరైనా సెర్చ్ చేస్తారా...  లేకపోతే మనకేమైనా ఎక్స్పీరియన్స్ వస్తుందా ఏమిటి..

ఇద్దరూ అలా నవ్వుకుంటూ మాట్లాడటం చూసినా గౌతమ్ మాత్రం బరుస్ట్ అయిపోతూ ఉంటాడు. ఎలాగైనా సరే విశి రిప్యుటేషన్ దెబ్బతీయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు.

ఇప్పటికే లేట్ అయింది పద అని సూర్య విశి ని ఇంటికి తీసుకు వస్తాడు.  లోపలికి వెళ్ళేటప్పటికీ  మాటలు వినిపిస్తూ ఉంటే ఎవరివో కొత్త గొంతులు అంటుంది.

అవునా పదా అని సూర్య నవ్వుతూ వెనకాలే వస్తాడు. లోపల చాలామంది ఆడవాళ్ళని చూసి విశి కంగారుగా భానుమతి వైపు చూస్తుంది.

భానుమతి నవ్వుతూ మాట్లాడడం చూసి రిలాక్స్ అయ్యి.. వెళ్లి తల్లి పక్కన నిలబడుతుంది. వచ్చారా అని...రా బాబు అని సూర్యని పిలవగానే వెళ్లి అక్కడ ఒక పెద్ద ఆవిడ పక్కన కూర్చుంటాడు.

విశి అలాగే చూస్తూ ఉంటుంది.. ఏమిటి అలా చూస్తున్నావు. అమ్మ వీళ్ళు... నీకు చెప్పలేదు కదా..  ఈరోజు మాటలు మాట్లాడుకోవడానికి దేవా సార్ వాళ్ళ అమ్మగారు వాళ్ళు వచ్చారు.

సూర్య వెంటనే అత్తయ్య నేను పరిచయం చేస్తాను అని లలిత గారి భుజం చుట్టూ చెయ్యవేసి మై స్వీట్ నానమ్మ..
మాధవిని చూపిస్తూ అమ్మమ్మ అని అవనినీ అమ్మ అని పరిచయం చేస్తాడు.

నివి నీ అత్తయ్య గా పరిచయం చేస్తాడు.  విద్య అత్తయ్య సౌమ్య మదర్ అని చెబుతాడు. పూజిత ని  మై రౌడీ లవ్లీ పిన్ని అని పరిచయం చేస్తే అందరికీ ఒక్కసారిగా నమస్కారం చేస్తుంది.

పూజిత సూర్య భుజం మీద ఒక్కటి వేసి ఇలా రారా అని పక్కన కూర్చోబెట్టుకుంటుంది. విశి భయంగా చూస్తూ ఉంటే నువ్వు అసలు టెన్షన్ పడవలసిన అవసరమే లేదు.

మనది జాయింట్ ఫ్యామిలీ అయినా సరే ఫుల్ గా ఎంజాయ్ చేయడమే.. రిస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ లేవు అంతే కదా అత్తయ్య అని లలిత వైపు చూస్తే..

మా డైలాగులు కూడా నువ్వే చెప్పేసావు కదా అని అంతే నమ్మ అంటారు..అందరూ సరదాగా నవ్వుకుంటూ ఉంటే విశి ని వాళ్ళందరి మధ్యన చూసిన భానుమతికి చాలా తృప్తిగా అనిపిస్తుంది.

అవనికి కూడా విశి బాగా నచ్చుతుంది. సూర్య అవని పక్కన కూర్చుని ఎలా ఉందమ్మా నీ కోడలు. బంగారు బొమ్మలాగ ఉంది.

జాగ్రత్తగా చూసుకో.. లలిత భానుమతి వైపు తిరిగి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి.  దానికి నువ్వు ఒప్పుకోవాలి.

అయ్యో అమ్మ ఆర్డర్ వేయాలి కానీ ఇలా అడగకూడదు. ఆ మాటకి నవ్వుతూ మనలో అలా ఆర్డర్ వేసుకోవడం ఏమీ లేదు. అందరికీ నచ్చే అడుగు ముందుకు వేయడమే.

సరే చెప్పండమ్మా. రేపు విశి పెళ్లి అయిన తర్వాత నువ్వు కూడా మాతో పాటే ఉండాలి.. అది అని ఇబ్బందిగా చూస్తూ ఉంటే..  ఇంకా ఎక్కువ ఆలోచించకు.

నీకున్నది ఒక్కతే కూతురు. ఇక అల్లుడు అయినా కొడుకైన అంతా దేవా నే కదా.. ఇంకా ఎందుకు ఎక్కువ ఆలోచిస్తున్నావు.

ఒక్కదానివే ఎక్కడ ఉంటావు.. ఈ విషయంలో మేము అందరం నిర్ణయం తీసేసుకున్నాము. మగవాళ్ళు కూడా రావాలి కానీ కొన్ని రోజులు సమయం పడుతుంది. ఈలోపు మిగిలిన విషయాలన్నీ మాట్లాడుకుందాం.

లలిత గారి మాటలు విన్న విశి మనసులోని దిగులు కూడా మాయమవుతుంది. సూర్య వైపు కృతజ్ఞతగా చూస్తోంది.

సూర్య మాత్రం కోపంగా చూసి బయటకి వెళ్ళిపోతాడు.  ఏమైంది సార్ కి. అమ్మ ఇప్పుడే వస్తాను అని సూర్య వెనకాల వచ్చి సార్  అని పిలిస్తే..

అలాగే చూస్తూ ఉంటాడు. ఇప్పుడు మీరు ఎందుకు అలిగారో చెప్పొచ్చు కదా.. చెప్పను అని మళ్లీ ఇంకో పక్కకి తిరుగుతాడు. ముందుకు వచ్చి చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది.

నా వైపు నువ్వు ఎందుకు అలా చూసావు. నేను ఎలా చూశాను అని ఒక నిమిషం ఆలోచిస్తూ ఉంటుంది. అది గుర్తుకు రావడం లేదు. ఎప్పుడు చూసాను..  ఎలా చూశాను.

నానమ్మ విషయం చెప్పగానే నువ్వు నా వైపు ఏదో థాంక్స్ అన్నట్టుగా చూసావు.  అది నాకు నచ్చలేదు.  ఆ మాటకి దేవా చేతులు పట్టుకుని ఎమోషనల్ అవుతూ...

మీకు నచ్చకపోయినా ఆ విషయంలో మీకు థాంక్స్ చెబుతాను..అమ్మ గురించి నాకు చాలా దిగులుగానే ఉంది. నా పెళ్లయిపోతే అమ్మ ఒక్కతే ఎలా ఉంటుంది. అసలు బ్రతకడం కూడా తెలియదు.. బయట ప్రపంచం తెలియదు.  ఏమైపోతుందో అని చాలా టెన్షన్ పడ్డాను.

ఈ విషయం గురించి మీతో ఎలా మాట్లాడాలో  అర్థం కాలేదు కానీ నేను మాట్లాడకుండానే నా మనసులో బాధ తెలుసుకుని సాల్వ్ చేశారు...

కన్నీళ్ళని ఆపుకుంటూ చెబుతూ ఉంటే. పిచ్చి ఏమిటిది అని ఆ కళ్ళు తుడిచి.. అత్తయ్య అని నేను ఏదో పెదాలతోనే చెప్పలేదు.

మా అమ్మ తర్వాత అమ్మ స్థానం అత్తయ్యది. అలాంటిది ఒంటరిగా ఎందుకు వదిలేస్తాను..నువ్వు నా దగ్గర చెప్పడానికి ఆలోచిస్తున్నావు అంటే ఇంకా నువ్వు హక్కుగా ఫీల్ అవ్వలేదు అని అర్థమవుతుంది.

ఈ విషయం నేను సీరియస్ గా ఆలోచించాలి అంటాడు. భలేవారే సార్. మీ దగ్గరగా హక్కుగా ఫీల్ అవ్వకపోతేనే మీతో పాటు బైక్ మీద తిరుగుతానా..

హగ్ చేసుకుని కూర్చుంటానా... అయినా సరే నువ్వు చెప్పడం లేదు అంటే ఇంకొక స్టెప్ ముందుకు వెళ్లాల్సిందే అని నడుం పట్టుకుని దగ్గరికి లాగుతాడు.

ఇద్దరి మధ్యన చేతులు పెట్టి సార్ ఏమిటిది అందరూ ఉన్నారు అని సిగ్గుపడుతూ ఉంటే...ఎవరూ లేకపోతే ఓకేనా..


సార్ మీరు ఏదేదో మాట్లాడుతున్నారు.  నాకు భయం వేస్తుంది. ఆ భయం పోయింది అనుకో హక్కుగా ఫీల్ అవుతావు ఒకే ఒక్కసారి అంటాడు.

ఏమిటి అని భయంగా కళ్ళు టప టపా కొడుతూ ఉంటే.. ఒక్కసారి క్యూటి అంటాడు. దేని గురించి మాట్లాడుతున్నారు.

పెళ్లికి ముందు ఒక్కసారి రుచి చూడాలని ఉంది. అర్థమయ్యేటట్టుగా చెప్పండి సార్ . ఈ లేత గులాబీ రేకులను చప్పరించాలని ఉంది అని పెదవులపై వేళ్ళతో ట్యాప్ చేస్తూ ఉంటే.. సార్ అని సిగ్గుపడుతూ ఉంటే..

అబ్బా క్యూటి భయంకరంగా టెంప్ చేస్తున్నావు కదా.. ఎవరో దగ్గిన సౌండ్ వినపడుతుంది..వెంటనే సూర్యని ఒక తోపు తోసి పక్కకి నిలబడుతుంది.

శ్రీకర్ వచ్చి ఒరేయ్ ప్రేమలో పడి ఎన్నో రోజుల అవ్వలేదు అప్పుడే ఇంత అడ్వాన్స్ అయిపోతే ఎలాగా..  శ్రీకర్ ని చూడగానే అక్కడ నుంచి పరుగు అందుకుంటుంది.

పానకం లో పుడకలాగా ఇప్పుడే రాకపోతే కాసేపు ఆగి రావొచ్చు కదా... అలాగే అనుకున్నాను కానీ ఆంటీ భయపడ్డారు.

నువ్వు ఎక్కడ అడ్వాన్స్ అయిపోతావో అని. అమ్మ పంపించిందా..  లేకపోతే నేనెందుకు వస్తాను.
ఇద్దరూ లోపలికి వెళ్తారు.
అక్కడ విశి మాత్రం భానుమతి పక్కన కూర్చుని ఇంకా సిగ్గుతోనే ఉంటుంది.
చెవులు ఎర్రబడి, చేతులతో దుపట్టా ముడి వేసుకుంటూ ఉంటుంది.
ఏమైంది అమ్మా… అలా కందిపోయావు ?.భానుమతి మెల్లగా అడిగితే...


ఏమీలేదు అమ్మ… కాస్త గాలి తగిలింది  అని తల వంచి చెబుతుంది.
లలిత గారు ఆ సిగ్గును గమనించి చిరునవ్వుతో,
పెళ్లి మాటలు కదా ఇలాగే ఉంటుంది లే అమ్మా…
ఇవి భయాలు కాదు, మధురమైన ఆత్రుతలు అంటారు.

ఆ మాటలు వినగానే విశి మనసు కాస్త తేలిక అవుతుంది.
ఇంతలో సూర్య లోపలికి వస్తాడు.
విశి వైపు చూడగానే ఇద్దరి కళ్లూ క్షణం పాటు కలుస్తాయి.
అది మాటలేని సంభాషణ.
నేను ఉన్నాను...  నాకు తెలుసు...  అన్నట్టుగా.

అవని సూర్యను పిలిచి.. రేయ్ విశి వాలకం చూస్తే నువ్వు ఏదో చేసినట్టే ఉన్నావు ఇప్పటినుంచి భయపెట్టే ప్రోగ్రాములు పెట్టుకోకు అర్థమవుతుందా..

నేనా… అసలు భయం ఎవరికొచ్చిందో నాకు కూడా అర్థం కాలేదు అమ్మ అని నవ్వుతూ చెబుతాడు.
అందరూ నవ్వుతారు.
పూజిత మాత్రం విశి దగ్గరకు వచ్చి,
చూడు కోడలు పిల్ల … మా వాడి మాటలు వినిపించుకో
కానీ గుండె మాత్రం నీ చేతుల్లోనే పెట్టుకో. కొంగుకు గట్టిగా కట్టేసుకో అర్థమవుతుందా.. ఆ మాటలకి విశి సిగ్గుతో తలదించుకుంటుంది.
భోజనాలు అయ్యాక.. అందరూ మాటల్లో బిజీగా ఉన్నప్పుడు... సూర్య మెల్లగా విశి దగ్గరికి వచ్చి,
ఇప్పుడైనా భయం తగ్గిందా క్యూటి? అని అడుగుతాడు.

విశి తల ఊపుతూ.. భయం కాదు సార్…
ఇప్పుడు నమ్మకం ఎక్కువైంది అంటుంది. మీకు ఎప్పుడూ చెప్పే మాట అయినా సరే మళ్లీ మళ్లీ చెబుతాను అది మీకు కోపం వచ్చినా సరే..  మీరు నా పక్కన ఉంటే నాకు ధైర్యం భరోసా ఈరోజు నేను ఇంత సంతోషంగా ఉన్నాను అంటే దానికి కారణం మీరే..
ఆ ఒక్క మాట సూర్య ముఖంలో గర్వం, ప్రేమ రెండింటినీ తెస్తుంది.
అయితే అదే చాలూ… అంటూ దూరంగా నిలబడతాడు.
ఈసారి హద్దులు దాటకుండా.
కానీ మనసులు మరింత దగ్గరగా.
అక్కడ నుంచే
వాళ్ల పెళ్లి కాదు…
వాళ్ల కుటుంబం మొదలైనట్టు
అందరికీ అనిపిస్తుంది.

అందరి సంతోషాల నడుమ గౌతమ్ రివెంజ్ ప్లాన్.........
[+] 8 users Like SivaSai's post
Like Reply
Part - 112



చందు క్యాంపుకు వెళ్లడానికి అన్ని సర్దుకుంటుంది. సౌమ్య కి ఫోన్ చేసి  అన్ని విషయాలు చెబుతుంది. జాగ్రత్త. ఏదైనా అవసరం ఉంటే వెంటనే కాల్ చెయ్యి.

నేను కూడా వస్తాను. ఇట్స్ ఓకే.. అవసరం ఉంటే తప్పకుండా చెబుతాను.  మీ ఫ్రెండ్స్ వస్తున్నారు కదా.. అక్కడ క్యాంపు బాగా జరుగుతుందన్న నమ్మకం ఉంది.

ఆ నమ్మకం మాకు ఉందనుకో..  కానీ మీరు వెళ్ళేది మారుమూల ప్రాంతం. ఒక్కోసారి ఫోన్స్ కూడా కలవక పోవచ్చు.

డాడీ అన్ని అరేంజ్మెంట్స్ చేశారు. డోంట్ వర్రీ అని చందు మిగిలిన ఫ్రెండ్స్ తో కలిసి మెడికల్ క్యాంపు దగ్గరికి వెళుతుంది.

వైభవ్ సౌమ్య దగ్గరికి వచ్చి క్యాంప్ కి ఎప్పుడు వెళుతున్నారు. అదేంటి నీకు తెలియదా..  ఆల్రెడీ చందు వెళ్లిపోయింది కదా..

కోపంగా అసలు ఎన్నిసార్లు చెప్పాను.  నేనంటే అసలు లెక్కలేదు. ఒక్క మాట కూడా చెప్పకుండా అలా ఎలా వెళ్ళిపోయింది.

నమ్మకం కలిగించలేదు ఏమో.. నమ్మకం కలిగించక పోవడం ఏమిటి. అప్పటికే చెబుతున్నాను కదా ఐ లవ్ యు..  లవ్ యు అని.

ఒరేయ్ బాబు ఐ లవ్ యు అని చెప్పినంత మాత్రాన నమ్మకం కలిగించడం కాదురా... నీ కోతి చేష్టలకి దానికి నమ్మకం కలగడం లేదేమో..

లేకపోతే అంతకు ముందు నీ మాటలు, ప్రవర్తనకి అది డీప్ గా హర్ట్ అయిందేమో ఎవరికి తెలుసు? అరే ఎప్పుడో జరిగిపోయింది బుర్రలో పెట్టుకొని ఇప్పుడు నన్ను ఎవాయిడ్ చేస్తే ఎలాగా..

ఇంతకీ ఏ ప్లేస్ కి వెళ్ళింది అండ్ ఎప్పుడు వెళ్ళింది. ఈరోజు మార్నింగ్ ఏ బయలుదేరారు.  ఇక్కడ నుంచి సిక్స్ అవర్స్ పడుతుంది. ఇప్పుడే ఫోన్ చేస్తాను.

ఫోన్ చేస్తే చేశావు కానీ సాఫ్ట్ గా మాట్లాడు రా.  ఇలా భూయో... భూయో అని అరవకు.  మాకు తెలుసులే అని ఫోన్ చేస్తాడు.

వైభవ్ ఫోన్ డయల్ చేస్తూ చేతులు వణుకుతాయి.
రింగ్… ఒకసారి… రెండుసార్లు…
అటు వైపు ఎత్తదు.

సౌమ్య వైపు చూసి చూశావా… నెట్ వర్క్ లేదేమో… అంటాడు అసహనంగా. స్టార్ట్ అయి ఎంతసేపు అయింది. నాలుగు గంటల అయ్యుండొచ్చు. వెళుతుంది మారుమూల ప్రాంతం కదా సిగ్నల్స్ లేవేమో కంగారు పడుతూ ఉంటాడు.

మూడోసారి కాల్ చేస్తే  సడన్‌గా కనెక్ట్ అవుతుంది.
హలో…  చందు వాయిస్… కానీ చాలా దూరంగా… చాలా అలసటగా.

వైభవ్ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటాడు.  చందూ… ఎక్కడున్నావ్? నేను వైభవ్… అటు వైపు చిన్న నిశ్శబ్దం.
తర్వాత మెల్లిగా చెప్పు…అంటుంది.

ఆ ఒక్క మాటే వైభవ్ గుండెల్లో ఏదో గుచ్చినట్టవుతుంది.
ఇలా చెప్పకుండా వెళ్లిపోవడం ఏంటి చందూ?
నువ్వు ఎక్కడ ఉన్నావు… ఏమనుకుంటున్నావు …
అసలు నాకు విలువే లేదా?

చందు విండో బయట అడవిని చూస్తూ ఉంటుంది.
జీప్ బంప్స్ కి ఊగుతుంది.  వైభవ్… ఇది క్యాంప్.
పేషెంట్స్ ఉన్నారు. డాక్టర్స్ ఉన్నారు అందరిని మానిటర్ చేయాలి.

ఇప్పుడు ఇవన్నీ మాట్లాడడానికి నాకు మూడ్ లేదు.
మూడ్ లేదంటే అంతేనా?  నేను ప్రేమిస్తున్నాను అన్న మాటకి కూడా విలువ లేదా?

చందు కళ్ళు మూసుకుంటుంది. ఒక్క సెకండ్ నిశ్శబ్దం తర్వాత… లవ్ యు అని చెప్పడం సరిపోదు వైభవ్. నువ్వు చెప్పేది ఎంతవరకు నిజమో అన్నది నాకు తెలియడం లేదు.

నన్ను ఫూల్ చేయడానికి చెబుతున్నావో.. సిన్సియర్గా చెబుతున్నావో నేను తెలుసుకోలేక పోతున్నాను.
నాకు భరోసా కావాలి.  నీ మాటల్లో… నీ పనుల్లో…
అటు వైపు సిగ్నల్ ఒక్కసారిగా కట్ అవుతుంది.

హలో… హలో… వైభవ్ గట్టిగా అంటాడు.
కాల్స్ డిస్కనెక్ట్.  వైభవ్ ఫోన్ ని చేతిలో బిగపట్టి
సౌమ్య వైపు చూస్తాడు.

చూశావా…  నన్ను తప్పించుకోవడమే దాని ప్లాన్.
సౌమ్య గట్టిగా అంటుంది. ఇది తప్పించుకోవడం కాదు వైభవ్.  ఇది హర్ట్.

చందు పడే మనోవేదన నీ మనసుకు చేరడం లేదా...  చేరిన ఒప్పుకోలేకపోతున్నావా. అది చేరలేదు అంటే నీ ప్రేమలో ఇంకా ఏదో తేడా ఉంది అని అర్థం.

చేరితే ఆ బాధను తీర్చడానికి ప్రయత్నం చేయి. ఆటోమేటిగ్గా ఆ నమ్మకం భరోసా కలుగుతాయి.  అంతేగాని ఇలా  నీలో నువ్వే ప్రెస్టేట్ అయిపోయి ఒకప్పుడు నవ్వుతూ ఉండే మా వైభవ్ నీ దూరం చేయకు అర్థం  అవుతుందా..

అదే సమయంలో  మారుమూల ప్రాంతంలో…
జీప్ ఆగుతుంది.  ఇదే క్యాంప్ సైట్ అని ఎవరో చెబుతారు.
చందు దిగుతూ ఉంటుంది.

చుట్టూ అడవి… నెట్‌వర్క్ బార్స్ జీరో.
ఫోన్ స్క్రీన్ వైపు చూస్తూ, వైభవ్ పేరు మిస్ కాల్స్ లో కనిపిస్తుంది.

ఆ పేరు చూసి చందు హార్ట్ ఒక్కసారిగా బరువెక్కుతుంది. ఎందుకురా నాలో మాయమైపోయిన ఆశలకి మళ్ళీ ఊపిరి పోయడానికి చూస్తున్నావు.

నువ్వు నన్ను ఫ్లర్ట్ చేస్తున్నావో..  సీరియస్గా చెబుతున్నావో అర్థం కాక నలిగిపోతున్నాను.  నాకు ఒకప్పుడు చందు గా ఉండాలని ఉంది. కానీ నీ మాటలతో చాలా దూరం చేసేసావు.

ఇప్పుడు కాదు వైభవ్…  ఇప్పుడు కాదు… ఈ క్యాంపు అయ్యేలోపు నాకు ఒక క్లారిటీ వస్తుంది అప్పుడు..
అనుకుంటూ ఫోన్ బ్యాగ్ లో పెట్టేస్తుంది.

కానీ… అక్కడి నిశ్శబ్దంలో
దూరంగా ఏదో అనుమానాస్పదమైన శబ్దం…  చందు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది.

అక్కడ ప్రాంతపు ప్రజలు ఉంటారు. చందు అందరికీ నమస్కారం చేసి ఆ గూడెం పెద్ద దగ్గరికి వెళుతుంది. ఎవరు అమ్మ మీరు... ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అనుమానంగా చూస్తే..

మేము సిటీ నుంచి వచ్చాము.. వీళ్ళందరూ డాక్టర్స్.  మీ ఆరోగ్యం గురించి పరీక్షలు చేసి మంచి మంచి మందులు ఇస్తారు..ఇంకేదైనా అవసరం అయితే పెద్ద ఆసుపత్రుల్లో జాయిన్ చేస్తారు.

ఆ మాటకి ఆ ప్రజలందరూ ఒకరి మొఖాలు ఒకరు చూసుకుని మాకు ఎటువంటి మందులు అవసరం లేదు. మేమందరం చాలా బాగున్నాము.  మీరు ఇక్కడ నుండి వెళ్లిపోండి అని కోపంగా చెబుతారు.

ఆ మాట విన్న వెంటనే చందు క్షణం పాటు నిశ్చలంగా నిలబడిపోతుంది.  ముందు నిలబడ్డ గూడెం పెద్ద కళ్లలో అనుమానం… వెనక ఉన్న జనాల్లో అసహనం.

చందు మెల్లిగా నవ్వుతూ, రెండు చేతులు జోడించి అమ్మా… మేము మీకు బలవంతంగా ఏమీ చేయడానికి రాలేదు.  మీ ఆరోగ్యం గురించి ఒక్కసారి చూసి చెప్పాలన్న ఉద్దేశమే.

ఒక మధ్య వయసు వ్యక్తి ముందుకు వచ్చి మాకు మా నాటు వైద్యుడు ఉన్నాడు..ఏ వ్యాధి వచ్చినా ఆయనే చూసుకుంటాడు.  మీ మందులు మాకు పనికిరావు అంటాడు కఠినంగా.

చందు కూర్చుని.... తన స్థాయి తగ్గించి మాట్లాడుతుంది.
మీ వైద్యుడు తప్పు అని నేను అనడం లేదు అన్నయ్య.
చాలా కాలంగా పనిచేస్తున్న పద్ధతులు…  అవి మంచివే.
ఆ మాటకి జనాల్లో కొంచెం చలనం.

కానీ…  చందు కళ్ళలో సిన్సియరిటీ తో మనం తెలియకుండానే ప్రకృతిని కలుషితం చేస్తున్నాము.. దానితో తెలియని..  కొన్ని వ్యాధులు కనిపించకుండా లోపల పెరుగుతున్నాయి.


అవి ముందే తెలిస్తే...  మంచి మందులతో పెద్ద సమస్యలు రాకుండా ఆపొచ్చు. గూడెం పెద్ద మెల్లిగా అడుగుతాడు.
మీ మాటలు ఎలా నమ్మాలి.  మాకు తెలియకుండా మమ్మల్ని ఏదైనా చేస్తారేమో..

చందు వెంటనే..   మీకు ఏం ఇబ్బంది లేదు అంటేనే …
మేము ముందుకు అడుగు వేస్తాము.  మీకు ఏమాత్రం అనుమానంగా అనిపించిన ఇక్కడే ఆగిపోతాము.

  మేమందరము కూడా ఇక్కడే ఉంటాము. మీ  కనుసన్నల్లోనే ఉంటాము కాబట్టి మీరు భయపడవలసిన అవసరం లేదు.
ఒక్కసారి పరీక్షలు మాత్రమే.
మందులు తీసుకోవాలా వద్దా అనేది మీ ఇష్టం.

ఆమె మాటల్లోని ఓర్పు…  ఆమె కూర్చునే విధానం…
ఎవరిపైన కూడా పైచేయి చూపించని ధోరణి
జనాల్లోని కోపాన్ని కాస్త కరిగిస్తుంది.

ఒక వృద్ధ మహిళ దగ్గరకి వచ్చి... నాకు చాలా రోజులుగా ఊపిరి ఆడటం కష్టంగా ఉంది బిడ్డా…అంటుంది.

చందు వెంటనే లేచి... అమ్మా… మీరు కూర్చోండి.
మెల్లిగా చూస్తాం అని చెబుతుంది.
ఆ వృద్ధమ్మను చూసి మిగతావాళ్లు ఒకరిని ఒకరు చూస్తారు.
వచ్చిన డాక్టర్స్ ఒకళ్ళ తర్వాత ఒకరిని చూస్తూ వాళ్లకున్న ఇబ్బందులు చెబుతూ ఉంటారు.

గూడెం పెద్ద గంభీరంగా  సరే…
ఒక్కరోజు.  ఏం చేస్తారో చూద్దాం.
ఏమైనా ఇబ్బంది అయితే…  మీరు వెంటనే వెళ్లిపోవాలి అంటాడు.

చందు తల ఊపుతూ... మీ మాటే మాకు ఆజ్ఞ అంటుంది.
క్యాంప్ మొదలవుతుంది.
కానీ…  దూరంగా అడవిలోంచి  మళ్లీ అదే అనుమానాస్పదమైన శబ్దం…

ఈసారి చందు మాత్రమే కాదు…
ఆ గూడెం పెద్ద కూడా ఒక్కసారిగా ఆ శబ్దం వైపు చూస్తాడు.
ఆ శబ్దం…
సాధారణమా?
లేదా
ఈ క్యాంప్ కి రాబోయే పెద్ద సమస్యకు సంకేతమా…?
[+] 8 users Like SivaSai's post
Like Reply
Part - 113



చందు చెప్పకుండా వెళ్లడం..   వైభవ్ తీసుకోలేకపోయాడు. నిజంగా నా ప్రేమను చూడలేకపోతున్నావా.. ఇంకా నిన్ను ఏడిపిస్తున్నాను అని అనుకుంటున్నావా..

ఎలా చూపించాలి అనుకుని.. చందు దగ్గరికి వెళుతున్నాను అని వినయ్ పూజిత కి చెప్పి బైక్ తీసుకొని స్టార్ట్ అవుతాడు.

వెళుతున్న వైభవ్ ని చూస్తూ ఉన్న వినయ్ భుజం మీద భరత్  చేయ్యి వేసి ఎక్కడికి వెళుతున్నాడు రా..  ప్రేమ యుద్ధం చేయడానికి.

అంటే...  చందు వీడి ప్రేమని నమ్మాలా లేదా అన్న సంశయంలో ఉంది.  ఏం చేస్తే నమ్ముతుందా అని యుద్ధం చేయడానికి వెళుతున్నాడు.

ఎలాగైనా ఆడవాళ్లు చాలా గ్రేట్ రా అని భరత్ అంటాడు. దేనికి బావ. మనమే లవ్ చేయాలి. మనమే ప్రపోజ్ చేయాలి.  మనమే గిఫ్ట్ ఇవ్వాలి.

కానీ అలకలు మాత్రం వాళ్ళవి. బ్రతిమాలడం మాత్రం మనవి. మనల్ని ఒక్కసారైనా వీళ్లు బ్రతిమాలుతార..  ఆ మాట నువ్వు చెబితే అస్సలు బాగోలేదు బావ.

ఏరా. పూజిత విషయంలో నేను అనుకున్న పరవాలేదు కానీ విద్య విషయంలో నువ్వు అనుకోకు.  అసలు సూట్ కాదు.
పెళ్లి అయినప్పటి నుంచి ప్రతిసారి విద్యా నే కదా..
నిన్ను బ్రతిమాలేది.  అదంతా పై పైన. లోపల అంతా మేమే బ్రతిమాలుకోవాలి.

అక్కడ మనం బ్రతిమాలపోతే పనులు అవ్వవు కదా అని కన్ను కొడతాడు. ఒరేయ్ ఈ మాట పెద్ద బావ విన్నాడంటే మన ఇద్దరి వీపులు విమానం మోత ఎక్కిస్తాడు అవసరమా అని నవ్వుకుంటారు.

వాళ్ల నవ్వులు ఆగేలోపే…..దూరంగా బైక్ స్టార్ట్ అవుతున్న శబ్దం మెల్లిగా మాయమవుతుంది.
భరత్ ఒక్కసారిగా సీరియస్‌గా మారి అంటాడు.

కానీ నిజంగా చెప్పాలంటే రా… వైభవ్ చేస్తున్నది చిన్న విషయం కాదు. చందు ఊరుకే వెళ్లిపోయింది కాదు. ఆమె లోపల ఏదో భయం ఉంది. క్యాంప్ కి వెళ్లే ముందు వీడికి చెప్పాల్సిందేమో..

వినయ్ ఊపిరి తీసుకుంటూ...అదే కదా… ప్రేమని మాటలతో కాదు రా… పనులతో చూపించాలి. ఇప్పుడే వైభవ్ అదే చేయబోతున్నాడు.

అటు వైపు…  రోడ్డు మీద బైక్ వేగంగా దూసుకుపోతుంది.
వైభవ్ కళ్ళ ముందు ఒక్క చందు ముఖమే తిరుగుతుంది.
నువ్వు వెళ్లిపోయావు… కానీ నన్ను నమ్మకుండా వెళ్లిపోయావు చందు.  అది తట్టుకోలేకపోతున్నాను.

మన మధ్యన సరదాగా ఉండే గిల్లికజ్జాలు ఇప్పుడు లేవు. నేను అన్న మాటలు నువ్వు ఇంత డీప్ గా హర్ట్ అవుతావని అనుకోలేదు. బైక్ హ్యాండిల్ గట్టిగా పట్టుకుంటాడు.

నీ ప్రేమపై నీకు సందేహం రావచ్చు….కానీ నా ప్రేమపై నీకు సందేహం రావడానికి నేను కారణం కాకూడదు.

చందు ఉన్న చోట… మెడికల్ క్యాంపు జరుగుతూ ఉంటే అన్ని ఆర్గనైజ్ చేసి ఒక చోట... ఒంటరిగా కూర్చుని ఉంటుంది.

ఫోన్ చేతిలోనే ఉంది… కానీ స్క్రీన్ లాక్‌లోనే. వైభవ్ నిజంగా నన్ను ప్రేమిస్తే… నేను చెప్పకపోయినా నేను వచ్చేది తెలుసుకునేవాడు.  నన్ను ఆపేవాడు… లేదా నాతో పాటు వచ్చేవాడు...  లేదా ఇప్పుడైనా వస్తాడా…
అనుకుంటూనే కన్నీటి బొట్టు చెంప మీద జారుతుంది.

అప్పుడే… దూరంగా బైక్ శబ్దం.  చందు తలెత్తి చూస్తుంది.
హార్ట్ ఒక్కసారిగా బలంగా కొట్టుకుంటుంది.

అతడా…?  బైక్ ఆగుతుంది. వైభవ్ అయితే బాగుండును అనుకుంటుంది.  అమ్మో వద్దు.  ఈ ప్లేస్ అంత సేఫ్గా లేదు. వాడు వేసే తుంటరి వేషాలకి ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ఊహె భరించలేక పోతుంది.

హెల్మెట్ తీస్తూ వైభవ్ ముందుకు వస్తాడు. ఇద్దరి మధ్య కొన్ని అడుగుల దూరం.  మాటలు లేవు… కళ్లలోనే వేల ప్రశ్నలు.

వైభవ్ నెమ్మదిగా అంటాడు.. నువ్వు చెప్పకుండా వచ్చేసావు.  కానీ నేను నిన్ను వదిలేయలేను చందు.
చందు కళ్లలో కోపం… బాధ… ప్రేమ అన్నీ కలిసిపోయి,
నన్ను నమ్మించడానికి ఇంత దూరం రావాలా వైభవ్…
లేకపోతే నీ ప్రేమ అంత బలహీనమా…?

వైభవ్ ఒక్క అడుగు ముందుకు వేసి.. నా ప్రేమ బలహీనమని నువ్వు అనుకుంటే… అది తప్పు అని నిరూపించడానికి  ఎంత దూరమైనా వస్తాను.

చందు కళ్ళు తడుస్తాయి. వెంటనే కళ్ళు తుడుచుకుని వెళ్ళిపో అంటుంది.  లేదు నీ క్యాంప్ అయ్యే వరకు ఇక్కడే ఉంటాను.

ఇది అంత సేఫ్ ప్లేస్ కాదు. నువ్వు కుదురుగా ఉండవు. కోతి లాగా ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీద దూకినట్టుగా తిరుగుతావు.

ఆ మాటకి ఒకసారిగా నోరు వదిలేసి చూసి... మళ్ళీ వెంటనే తమాయించుకుని నీ కళ్ళకి నేను కోతిలాగా కనిపిస్తున్నానా.

మరి కాదా.. ఎక్కడైనా కుదురుగా ఉంటావా..  అలాగే ఇక్కడ ఉన్న అమ్మాయిలతో ఏదైనా పిచ్చ వేషాలు వేస్తే అక్కడే చెట్టు కి కట్టేస్తారు.

ఇంకా నిన్ను మేము చూడడం కూడా ఉండదు అర్థమవుతుందా... అయ్యో పిల్ల రాక్షసి నా గురించి నువ్వు ఇంత కంగారు పడుతున్నావా...
ఇప్పుడే…  ప్రేమ యుద్ధం మొదలైంది.

వైభవ్ మాటకి చందు క్షణం నిశ్శబ్దంగా నిలబడిపోతుంది.
కోపంగా మాట్లాడినా… అతడి మీద ఉన్న కంగారు మాటల మధ్యలో జారిపోయిందని తనకే అర్థమవుతుంది.

అయ్యో పిల్ల రాక్షసి… నా గురించి నువ్వు ఇంతగా ఆలోచిస్తావా? అని నవ్వుతూ అన్న వైభవ్ మాటల్లో సరదా ఉన్నా కళ్లలో మాత్రం అపురూపం.

చందు ముఖం తిప్పుకుని,.అలా కాదు… నువ్వు అంటేనే నాకు భయం. ఏదైనా జరిగితే… మాట పూర్తి కాకముందే ఆగిపోతుంది.

వైభవ్ గంభీరంగా మారి....చందు… నన్ను నువ్వు ప్రేమిస్తున్నావో లేదో తెలియదు.. కానీ నిన్ను నేను ఎంత ప్రేమిస్తున్నానో… మాటలతో కాదు… ఇక్కడే చూపిస్తాను.

మెడికల్ క్యాంప్ – అడవి మధ్యలో
ఉదయం మొదలవుతుంది.
చిన్న టెంట్లు… మందుల బాక్సులు… చుట్టూ గ్రామస్తుల సందడి.
చందు పనిలో మునిగిపోతుంది. డాక్టర్స్ వర్క్ చేస్తూ ఉంటారు. వచ్చిన పేషెంట్స్ ని చెక్ చేస్తూ ఉంటే చందు అందరినీ ఆర్గనైజ్ చేస్తూ ఉంటుంది.
ఎవరికి జ్వరం… ఎవరికి గాయం… ఎవరికి భయం.
వైభవ్ మొదట సరదాగా చూస్తూ ఉంటాడు.

కానీ ఒక్కసారిగా ఒక చిన్న పాప కాలు కోసుకుపోయి ఏడుస్తుంటే… చందు కంగారుపడుతుంది.
బ్యాండేజ్ బాక్స్ కనిపించదు. చందు… ఇదేనా కావలసింది? వెనక నుంచే వైభవ్ చేతిలో బాక్స్ పట్టుకుని నిలబడతాడు.

ఆమె కళ్లలో ఆశ్చర్యం. నీకు ఇది ఎక్కడ దొరికింది?
నువ్వు పరుగెత్తేలోపే నేను చూసా. నీకు అవసరం అవుతుందని తెలుసు.
చందు థాంక్స్ చెప్పి ఆ బాక్స్ తీసుకుని పాపకి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది..పక్కనే మోకాళ్ళ పైన కూర్చుని నీ సబ్జెక్టు ఇది కాదు కదా..  నీకు ఎలా తెలుసు.

మెడికల్ క్యాంపు చేయాలి అనుకున్నప్పుడే సౌమ్య దగ్గర చిన్న చిన్న టిప్స్ నేర్చుకున్నాను.. ఫస్ట్ ఎయిడ్ చేయడం వరికేలే....మిగిలిన మెడిసిన్స్ అన్నీ అదుగో ఆ డాక్టర్స్ హ్యాండిల్ చేస్తారు.

అదే మొదటి సారి….చందు మనసులో చిన్న గుబులు.
ఇతడు కేవలం తుంటరి కాదు… కాస్త బాధ్యత కూడా ఉందిలే అనుకుంటుంది కానీ బయటపడదు.

ఒక వృద్ధుడికి ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది. చందు భయంతో చుట్టూ చూస్తుంది. ఒక డాక్టర్ చెక్ చేసి హాస్పిటల్ కి తీసుకు వెళితే బెటర్ చందు అని చెబుతారు.
అంబులెన్స్ రావడానికి టైం పడుతుంది.

వైభవ్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా,  వృద్ధుడిని ఎత్తుకుని వేరే డాక్టర్ సహాయంతో బైక్ మీద అడ్జస్ట్ చేసుకుంటాడు.
వైభవ్… ఆగు… అడవి దారి ప్రమాదం… అని అరుస్తుంది.
అసలే మధ్యాహ్నం దాటింది.

వెనక్కి తిరిగి....నీకు భయం వస్తే… నేను భయపడాల్సిన పనిలేదు చందు.  అంటూ నవ్వి ముందుకు వెళ్తాడు.
ఆ క్షణంలోనే… చందు గుండె లోపల ఏదో కరుగుతుంది.

సాయంత్రం. చిన్నపాటి వర్షం.  టెంట్ల మీద నీళ్లు కారుతాయి. అందరూ టెంట్ లోపలకి వెళ్లి నిలబడతారు. చందు చూపు మాత్రం రోడ్డు వైపుకే ఉంటుంది.

వైభవ్ బైక్ పార్క్ చేసి డాక్టర్ తో వస్తాడు.  చందు పక్కనే నిలబడి ఆ పెద్దాయన బాగానే ఉన్నారు. డోంట్ వర్రీ అని చెబుతాడు.

బుద్ధుందా అలా వెళ్ళిపోతావా. ఎంత భయం వేసిందో తెలుసా.  అయ్యో నా పిల్ల రాక్షసి నా గురించి భయపడిందా అని నవ్వుతాడు.  చందు మౌనంగా ఉండిపోతుంది.

చందు చలితో వణుకుతూ ఉంటుంది. తన షాల్ ఎక్కడో పడిపోయింది.  ఎప్పుడో పక్కనే వచ్చి.. తన జాకెట్ తీసి ఆమె భుజాల మీద వేసేస్తాడు వైభవ్.

నేను అడిగానా? అని గట్టిగా అంటుంది.
అడిగితే ఇవ్వడం… అడగకుండానే ఇవ్వడం… ఈ రెండింటికీ తేడా ఉంటుందా ప్రేమలో?  అని మెల్లిగా చెబుతాడు.

చందు ఏమీ మాట్లాడలేకపోతుంది.  కళ్లే సమాధానం చెబుతాయి.

చినుకులు తగ్గి మెల్లిగా నక్షత్రాలు వస్తూ ఉంటాయి.
అడవి నిశ్శబ్దం.  దూరంగా జంతువుల శబ్దాలు.
చందు భయంతో టెంట్ బయటకు రాదు. డాక్టర్స్ కూడా ఎవరు టెంట్ లో వాళ్ళు ఉంటారు.

వైభవ్ బయట ఫైర్ ఏర్పాటు చేసి..  భయపడకు…
నీ టెంట్ బయట నేనున్నాను.  నీ నిద్ర వచ్చేదాకా ఇక్కడే ఉంటాను.

చందు కళ్ళు మూస్తుంది.  మొదటిసారి…
పూర్తిగా నమ్మకంతో. మాటలతో కాదు…
నా ప్రతి చిన్న భయానికి అండగా నిలబడి  తన ప్రేమని నిరూపిస్తున్నాడు…
వైభవ్ అని పిలుస్తుంది. ఏమిటి.  లోపలికి వచ్చి పడుకో.  బాగోదు అంటాడు.  పరవాలేదు. ఈ వర్షంలో ఎక్కడని నిలబడతావు.

నువ్వు వస్తావని తెలియలేదు లేదంటే ఎగస్ట్రా టెంట్ ప్లాన్ చేసేదాన్ని.  ఇబ్బంది లేదు కదా . లేదు రా అంటుంది.  సరే అని వెళ్లి థాంక్యూ అని ఒక పక్కగా పడుకుని చందు నే చూస్తూ నిద్రపోతాడు.

అడవిలో…  మెడికల్ క్యాంప్ లో… చిన్న చిన్న సమస్యల మధ్య వైభవ్ ప్రేమ నెమ్మదిగా చందు మనసులో చోటు చేసుకుంటుంది.

వీరి ప్రేమ ప్రయాణం........
[+] 8 users Like SivaSai's post
Like Reply
Part - 114

నువ్వు వస్తావని తెలియలేదు లేదంటే ఎగస్ట్రా టెంట్ ప్లాన్ చేసేదాన్ని.  ఇబ్బంది లేదు కదా . లేదు రా అంటుంది.  సరే అని వెళ్లి థాంక్యూ అని ఒక పక్కగా పడుకుని చందు నే చూస్తూ నిద్రపోతాడు.

అడవిలో…  మెడికల్ క్యాంప్ లో… చిన్న చిన్న సమస్యల మధ్య వైభవ్ ప్రేమ నెమ్మదిగా చందు మనసులో చోటు చేసుకుంటుంది.

చందు లోపలికి వచ్చి పడుకోమన్నప్పుడు ఒక్క నిమిషం ఆలోచించి వైభవ్ సరే  అంటూ  బయటకి వెళ్లి చేతులు కడుక్కొని వచ్చి.. థాంక్యూ అని చెప్పి, టెంట్ లో ఒక పక్కగా పడుకుంటాడు.

మధ్యలో కొంచెం గ్యాప్.  ఎవరూ ఎవరిని తాకరు.
కానీ ఇద్దరి మధ్య మౌనం మాత్రం బాగా మాట్లాడుతుంది.
చందు కళ్లుమూసుకుంటుంది.

వైభవ్ వైపు వెనక్కి తిరిగి పడుకుని, ఆమె ముఖాన్ని చూడకుండా… ఆమె శ్వాస శబ్దాన్ని వింటూ ఉంటాడు.
అడవిలో రాత్రి శబ్దాలు.  దూరంగా జంతువుల కదలికలు.
చిన్నగా చలి.  చందు ఒక్కసారిగా చలి వేస్తోంది అని అంటుంది.

వైభవ్ మాట లేకుండా తన షాల్ ని ఆమె వైపు జరుపుతాడు.  ఆ క్షణంలో  చందు కి అర్థమవుతుంది..
ఇది జాలి కాదు… ఇది కేర్.

మెడికల్ క్యాంప్ లో రోజంతా చూసిన చిన్న చిన్న బాధలు…  పిల్లల జ్వరం…  వృద్ధుల చేతులు…
అన్నింటి మధ్య వైభవ్ ఎలా నిశ్శబ్దంగా సహాయం చేశాడో ఆమెకు గుర్తొస్తుంది.

ప్రేమ అలా పెద్దగా రావడం కాదు అనిపిస్తుంది.
ఇలానే…  నిశ్శబ్దంగా…
నిద్ర మధ్యలో మనసులోకి వచ్చి కూర్చుంటుంది.
చందు మెల్లగా.. గుడ్ నైట్ వైభవ్  అంటుంది.
అతను కూడా అదే నిశ్శబ్దంలో  గుడ్ నైట్ చందు  అని అంటాడు.

అడవిలో…  చీకట్లో…
ఒకే టెంట్ లో…
రెండు హృదయాలు
మొదటిసారి ఒకరిని ఒకరు సేఫ్‌గా అనిపించుకుంటూ నిద్రపోతాయి.

అడవిలో తెల్లవారింది. చెట్ల మధ్య నుంచి వచ్చే సూర్యకాంతి టెంట్ లోకి పలుచగా జారుతుంది.
ముందుగా లేచిన చందుకి వైభవ్ దగ్గరగా కనిపిస్తాడు . కళ్ళు తెరిచిన వెంటనే  నిన్న రాత్రి భయం కాదు…
ఒక ప్రశాంతత మాత్రమే ఉంటుంది.

పక్కకు చూసినప్పుడు వైభవ్ ఇంకా నిద్రలోనే ఉన్నాడు.
తల కొంచెం వంగి,  చేతులు ఒడిలో ముడుచుకుని…
అంత నిశ్శబ్దంగా.  చందు ఒక్క క్షణం అలాగే చూస్తూ ఉంటుంది.

మెడికల్ క్యాంప్ లో అతను మాట్లాడిన తీరు కాదు…
పని చేసిన తీరు… ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు వెనక్కి తగ్గని విధానం… అన్నీ ఒకేసారి గుర్తుకొస్తాయి.

కాళ్లు రెండు దగ్గరగా ముడుచుకుని తల కాళ్ల పైన పెట్టుకుని..  వైభవ్ నే చూస్తూ నువ్వు కోతివి అనుకున్నాను కానీ పరవాలేదు మంచి కోతివే. నీలో కూడా కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి అని నవ్వుకుంటుంది.

అప్పుడే ఆమెకు అర్థమవుతుంది..  నాకు నీ మీద ఇష్టం ఎప్పుడు వచ్చిందో తెలియదు. అది ఎప్పుడు పెరిగి పెద్దదయిందో తెలియలేదు..   కానీ ఇప్పుడు మాత్రం ఉన్నది...

బయట పక్షుల శబ్దం.  ఆ శబ్దంతో వైభవ్ మెల్లగా మేల్కొంటాడు. కళ్ళు తెరిచే సరికి  ముందు కనిపించినది చందు ముఖమే.

రెండుసెకన్లు ఇద్దరూ ఏం మాట్లాడరు.  ఆ మౌనం అసౌకర్యంగా కాదు…  కొంచెం కొత్తగా ఉంటుంది.
వైభవ్ తల నిమిరుతూ గుడ్ మోర్నింగ్ అంటాడు.

చందు నవ్వుతూ.. మోర్నింగ్ అంటుంది.
అంతే.  కానీ ఆ ఒక్క మాటలో  నిన్న రాత్రి టెంట్…
షాల్…  నిశ్శబ్దం…  అన్నీ తిరిగి వచ్చేస్తాయి.

చందు లేచి బయటకి వెళ్తుంది. చిన్నగా మంట వేసి టీ పెట్టాలని చూస్తుంది.  వైభవ్ కూడా బయటకి వచ్చి
ఏం మాట్లాడకుండా  తన చేతిలో ఉన్న బిస్కెట్లు తీసి ఆమె వైపు పెడతాడు.

చందు ఆశ్చర్యంగా చూసి  నేను చెప్పలేదు…
కానీ థాంక్యూ.  వైభవ్ నెమ్మదిగా నిన్ను సేఫ్ గా ఫీల్ అయ్యేలా చేయగలిగితే…  అదే నాకు చాలు అంటాడు.

ఆ మాటతో  చందు గుండె ఒక్కసారిగా బరువుగా మారుతుంది.  ప్రేమ అంటే  పెద్ద డైలాగ్ కాదు. అది మన చేతల్లో కనిపించే చిన్న చిన్న పనులే  అని ఆమెకి అర్థమవుతుంది.

అడవిలో…  సాధారణ ఉదయం…
చిన్న టీ కప్పుల మధ్య…  చందు మనసులో వైభవ్ పేరు
మౌనంగా స్థిరపడుతుంది.

అప్పటికే  రెండు హృదయాలు ఒకరి వైపు ఒకరు
తిరగడం మొదలుపెడతాయి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం కూడా మొదలుపెడతాయి.

ఇద్దరూ రెడీ అయ్యి క్యాంపుకు వెళ్లడానికి బయటకి వస్తారు.  అడవిలో ఒక చిన్న అలజడి.  దూరంగా పిల్లలు నవ్వుతూ పరుగులు తీయడం.

మెడికల్ క్యాంప్ మళ్లీ మొదలవుతోంది.  చందు నీళ్ల బాటిల్ పట్టుకుని చిన్న కొండ దారిలో నడుస్తూ ఉంటుంది.
వైభవ్ పక్కనే నడుస్తూ  ఏదో మాట్లాడబోతూ…
ఆపేసుకుంటాడు.

ఒక్కసారిగా..   చందు కాలి కింద మట్టి జారుతుంది.
చందూ..  వైభవ్ అరవడానికి కూడా టైమ్ దొరకదు.
ఆమె కాస్త ముందుకు ఒరిగిపోతుంది.
అంతే.

ఒక బలమైన చేయి  ఆమె చేతిని గట్టిగా పట్టుకుంటుంది.
ఆమె నేలకి పడిపోకుండా  తన ఛాతీకి లాగేసుకుంటాడు.
రెండుసెకన్లు...

ఆ అడవిలో  గాలి ఆగిపోయినట్టుగా ఉంటుంది.
చందు గుండె వేగంగా కొట్టుకుంటోంది.
భయం వల్ల కాదు.  వైభవ్ ఆమెని వదలకుండా
ఏం అయ్యిందీ? నొప్పిగా ఉందా? అని అడుగుతాడు.

అతని కళ్ళలో  భయం ఉంది…  ఆందోళన ఉంది…
ఏం జరిగిందో తెలియని వణుకు ఉంది.  చందు తల ఊపుతూ.. లేదు… నేను బాగానే ఉన్నాను అంటుంది.
కానీ అతను ఇంకా వదలడు.
వైభవ్ కి మాత్రం గుండె దడ తగ్గదు.  ఒక్క నిమిషం చందు కి ఏదైనా జరిగి ఉంటే ఆ ఊహ కూడా భరించలేక పోతాడు ఇంకా గట్టిగా పట్టుకుంటాడు.

ఆమె కాళ్లను చూసి  చిన్న గాయం ఉందని గమనిస్తాడు.
తక్షణమే ఆమెని కూర్చోబెట్టి  తన మెడికల్ కిట్ తీస్తాడు.
చందు మౌనంగా చూస్తూ ఉంటుంది.

నిన్న రాత్రి టెంట్ లో ఉన్న నిశ్శబ్దం…  ఇప్పుడు అతని చేతుల్లో ఉన్న జాగ్రత్తగా మారింది.  బ్యాండేజ్ కట్టేటప్పుడు
వైభవ్ చేతులు కాస్త వణుకుతాయి.

చందు మెల్లగా.. ఇంత టెన్షన్ ఎందుకు? అని అడుగుతుంది.  వైభవ్ కళ్ళెత్తి ఆమె వైపు చూసి
ఒక్క క్షణం ఆగిపోతాడు.

తర్వాత నెమ్మదిగా  నిన్న రాత్రి నుంచి…
నిన్ను ఇలా చూసుకోవాలి అనిపిస్తోంది అంటాడు.
అంతే.

ఆ మాటకి  చందు లోపల ఏదో కరిగిపోతుంది.
ఆమె మెల్లగా  తన చేయి అతని చేతి మీద ఉంచుతుంది.
అంటే…  నాకు ఒక్కసారిగా అర్థమైంది.  నేను ఒంటరిగా లేను అని అంటుంది.

వైభవ్ ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తాడు.ఆ అడవిలో
ఆ చిన్న ప్రమాదం  వాళ్లిద్దరి మధ్య ఉన్న సందేహాన్ని
పూర్తిగా తొలగిస్తుంది.

పెద్ద మాటలు లేవు.  పెద్ద ఒప్పుకోలు లేవు.
కానీ  ఇప్పుడిద్దరికీ తెలుసు.  ఇది స్నేహం కాదు.
ఇది కేవలం జాలి కాదు. ఇది వైభవ్ సరదాగా ఏడిపిస్తున్న సన్నివేశము కాదు.

ఇది నిశ్శబ్దంగా అంగీకరించిన ప్రేమ.

చందు, వైభవ్, మిగిలిన డాక్టర్స్ తో తో కలిసి మెడికల్ క్యాంప్ సెట్‌అప్ చేస్తున్నారు.
పిల్లలు, వృద్ధులు, పలు చిన్న చిన్న సమస్యలతో అందరూ ఎదురుచూస్తున్నారు.

అప్పుడే చిన్న బాలిక ఏడుస్తూ వచ్చి, చేతితో గాయమై ఉన్న పాదాన్ని చూపిస్తుంది.   బాగా నొప్పి వస్తుంది అని ఏడుస్తూఉంటుంది.

చందు వెంటనే నడక ఆపి, వైభవ్ వైపు చూస్తుంది.
వైభవ్ కళ్ళు కొంచెం గట్టిగా తెరిచి, వెంటనే పరుగెత్తుతాడు.
అతను బాలికను కూర్చోబెట్టి, గాయాన్ని పరిశీలిస్తున్నప్పుడు, చందు మెల్లగా దగ్గరగా రాగానే, అతని చేతి పక్కన కూర్చుంది.

చందు కళ్ళలో ప్రశాంతతతో భయం, బాధ, బాధ్యత అన్నీ కలసి ఉన్నట్లుగా ఉంటుంది.  వైభవ్ చేతులు కాస్త కంపించటం గమనిస్తుంది.

ఒక డాక్టర్ వచ్చి వైభవ్ చేతుల్లో ఉన్న పాప కాలుని చెక్ చేసి బ్యాండేజ్ వేసి చిన్న ఇంజక్షన్ చేస్తారు.  పాపని గుండెలకి హత్తుకుని ఏమీ అవ్వదు తగ్గిపోతుంది.  ఏడవకు అని ఊరుకో పెడుతూ ఉంటాడు.

చందు చిన్న చిరునవ్వుతో… నీలో చాలా మార్పు కనిపిస్తుంది.    వైభవ్ కొంచెం లెగ్ కదిలి ఆమె వైపు చూస్తాడు.

మాటలు అవసరం లేవు, కానీ ఆ కేర్, ఆ భద్రత
చందు గుండెలో నేరుగా వెళ్లిపోతుంది. తల్లి బాలికను ఓ వైపు తీసుకెళ్తే, చందు అటు వైపు చూస్తూ మెల్లగా అడుగుతుంది.

నువ్వు నిజంగా… ఇంత కేర్ చూపిస్తావని అర్థం కాలేదు. ఏప్పుడు సరదాగా మాట్లాడుతూ ఉంటే నన్ను ఆట పట్టిస్తాకే చెబుతున్నావు అనుకున్నాను కానీ అని ఆగిపోతుంది.

వైభవ్ తల కొంచెం వంగి, చిన్న నవ్వుతో... నిన్న రాత్రి కచ్చితంగా ఆలోచించలేదు… కానీ ఇప్పుడు…
ఏదైనా జరిగితే, నువ్వు సేఫ్‌గా ఉండాలి అని మాత్రమే చూస్తున్నా.

చందు గుండె ఒక్కసారిగా మెల్లగా కదులుతుంది.
నిశ్శబ్దం, రియాలిటీ, ప్రేమ—అన్నీ ఒక్క క్షణంలో స్పష్టమైపోతాయి.

చిన్న పిల్లల చిరునవ్వులు, తల్లుల శాంతమైన చూపులు
రెండు హృదయాల మధ్య ఉన్న అర్థం స్పష్టంగా చేస్తాయి.
ఆరోజు ఉదయం నుండి, చందు తెలుసుకుంటుంది.

ఇది కేవలం జాలి కాదు.  ఇది నిజమైన ప్రేమ.
వైభవ్ కోసం, వైభవ్ తన హృదయంలో సురక్షితం.
వైభవ్ కూడా ఇప్పుడు తెలుసుకున్నాడు.  చందు కళ్ళలో, ఆ చిన్న చిన్న కేర్ గమనంలో..

తన మాటలు, ప్రవర్తన, మౌనమే ప్రేమను వ్యక్తం చేస్తున్నాయంటే…  ఆమె కూడా అదే భావనలో ఉంది.
అడవిలో, చిన్న పిల్లల నవ్వులు,  నవ్వుతూ కాపాడిన చిన్న గాయాలు…  రెండు హృదయాల మధ్య ఒక నిశ్శబ్ద ఒప్పందం ఏర్పడుతుంది.


మెడికల్ క్యాంపు పూర్తి చేసుకుని అందరూ రిటన్ బయలుదేరుతారు. వ అడివిలో ఉన్న ఆ మనుషులందరూ ఎంతో కృతజ్ఞత తెలుపుతూ అక్కడ పండిన రకరకాల పళ్లు అన్ని వెహికల్లో పెడతారు.

అందరూ వెహికల్ ఎక్కితే వైభవ్ బైక్ స్టార్ట్ చేస్తాడు.  చందు ఎటు అడుగు వేయాలో తెలియక అక్కడే నిలబడుతుంది.

వెహికల్ లో ఉన్న డాక్టర్స్ చందు రా అని పిలుస్తూ ఉంటే వైభవ్ కదలకుండా బైక్ రైస్ చేస్తూ ఉంటాడు.

చందు అడుగు..........
[+] 8 users Like SivaSai's post
Like Reply
Part - 115



వెహికల్ లో ఉన్న డాక్టర్స్ చందు రా అని పిలుస్తూ ఉంటే వైభవ్ కదలకుండా బైక్ రైస్ చేస్తూ ఉంటాడు.
చందు వచ్చి వైభవ్ బైక్ ఎక్కుతుంది..అంతే వైభవ్ బైక్ గాలిలో ఎగురుతూ దూసుకు వెళ్ళిపోతుంది..డాక్టర్స్ నవ్వుకుంటారు.

ఒక లేడీ డాక్టర్ సౌమ్య కి కాల్ చేసి  విషయం చెబుతుంది.  ఎలాగైతేనే మా వాడు పడేసాడు అన్నమాట.  చాలా సిన్సియర్గా ట్రై చేశాడు.

వాడి ప్రేమ నిజమే.  కాకపోతే వాడి అల్లరికి చందు కొంచెం కన్ఫ్యూజ్ అయింది.  ఇప్పుడు చందుకీ కూడా క్లారిటీ వచ్చింది.

థాంక్యూ అని చెప్పి ఫోన్ పెట్టేసి... వెంటనే శ్రీకర్ కి కాల్ చేస్తుంది. బిజీగా ఉన్న శ్రీకర్ రెండు సార్లు కి లిఫ్ట్ చేస్తాడు. శ్రీకర్ అని గట్టిగా అరుస్తుంది.

అబ్బా అని ఫోన్ దూరంగా పెట్టి చెవులు మూసుకుంటాడు. రాక్షసి..  నేను ప్రపోజ్ చేశాక నీకు ఎలాగైనా ధైర్యం ఎక్కువైపోయింది.

అంతకుముందు పిల్లిలాగా ఉండే దానివి. ఇప్పుడు మాత్రం రివర్స్ లో ఉన్నావని తిట్టుకుంటూ ఎందుకే అలా అరుస్తున్నావు అని అడుగుతాడు.

చందు వైభవ్ ని యాక్సెప్ట్ చేసింది అని గంతులు వేస్తూ చెబుతుంది. అవునా అని సింపుల్ గా అంటాడు.  ఏంటి నేను ఇంత హ్యాపీ న్యూస్ చెప్తే అలా తీసి పడేసావు.

ఈ విషయం మాకు ఎప్పుడో తెలుసు. అదే ఎలా.. అది అంతే. మా అబ్బాయిలు సిన్సియర్గా ప్రేమిస్తే ఎదుటివారిని ఎలాగైనా మార్చగలరు.

ఫర్ సపోజ్ నిన్ను మార్చలేదు. నన్నా..  నేనేం మారాను. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళు అని వేళ్ళు  తిప్పుతూ ఉంటాడు.

నాకేం మగ్గు గుర్తుకు రావడం లేదు. అవునులే..  పిల్లి పులి అయిన తర్వాత పిల్లి గురించి ఏం గుర్తు పెట్టుకుంటుంది. నేను కనిపిస్తే పారిపోయే దానివి.

చాటుగా చూసే దానివి. అలాంటిది నేను ప్రపోజ్ చేశాక ఎలా రెచ్చిపోతున్నావో. ఓ.. అదా..  నిన్ను చూసి కాదు. మరి.

మా నాన్నను చూసి. మధ్యలో మావయ్య ఎందుకు వచ్చాడు. మా నాన్న ఒప్పుకున్నారు కాబట్టి నేను ఓకే చేశాను.

మా నాన్నకి నచ్చావు కాబట్టి నేను రెచ్చిపోతున్నాను. అంతేగాని నా ప్రేమ ఏమీ లేదు అంటావు.  ఆ మాట నేను అనలేదే...

మా నాన్న ఒప్పుకున్నారు అని చెబుతున్నాను.  రాక్షసి ఎంతైనా ఆడపిల్లలు ఎప్పుడూ నాన్న నాన్న అనే కలవరిస్తారే..

థాంక్స్ అర్థం చేసుకున్నందుకు.  అందుకే ఫ్యూచర్లో మనకి ఎంతమంది పిల్లలు పుట్టిన అందరూ ఆడపిల్లలే కావాలి. వాళ్ళందరూ నా వైపే మాట్లాడాలి.

అప్పుడు నువ్వు ఎంత జలస్ ఫీల్ అవుతావో చూడాలి అని ప్రస్టేషన్తో అంటాడు.  అయ్యబాబోయ్ అంతమంది పిల్లలు అంటే నేను కనలేను శ్రీకర్.


మనకి ముచ్చటగా ఒక్కళ్లు చాలు అని గారంగా చెబుతూ ఉంటుంది.  ఆ మాటలకి మెల్ట్ అవుతూ మరీ ఒక్కళ్ళే అంటే ఏలాగే.

పదిమంది అయినా ఉంటే బాగుంటుందేమో.  చూడు అక్కడ నువ్వు ఒక్కదానివే. ఇక్కడ నేను ఒక్కడినే. అమ్మో వద్దు.

ఒక్కళ్ళు చాలు.  అది అబ్బాయి అయితే చాలు అంతే. వెంటనే సీరియస్ అయిపోయి అబ్బాయి అయితే ఏముంటుంది.

పండగ అయినా హాలిడే అయినా అదే  షార్ట్, టీషర్టు వేసుకుని తిరుగుతారు. అదే అమ్మాయిలైతే సీజన్ కి తగ్గట్టుగా రెడీ అవుతారు.

పట్టుపరికిణి వేసుకుని నగలన్నీ పెట్టుకుని నాన్న అని పరిగెత్తుకొని వస్తూ ఉంటే అని ఒక మైమరపుతో చెబుతూ ఉంటాడు.

హలో హలో ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టున్నారు. మనకి ఎంగేజ్మెంట్ కూడా అవలేదు.  అది ముందు దృష్టిలో పెట్టుకో అని ఫోన్ పెట్టేస్తుంది.

ఫోన్ వైపు చూస్తూ నేనేంటి ఇలా మాట్లాడుతున్నాను అమ్మో ఇది మరీ మాయ చేస్తుంది అనుకుంటూ వర్క్ లోపడతాడు.

సూర్య ఆఫీస్ కి వచ్చి శ్రీకర్ దగ్గరికి వెళతాడు..ఏంట్రా ఇలా వచ్చావు. నీ ఫేస్ ఏంటి రకరకాల ఎక్స్ప్రెషన్స్ తో ఉంది. చేస్తున్న వర్క్ పక్కన పెట్టి... వర్క్ మధ్యలో పొరపాటున కూడా ఆడవాళ్ళతో మాట్లాడకూడదు.

ముఖ్యంగా మన లైఫ్ పార్ట్నర్ తో.  ఇప్పుడు సౌమ్యతో వచ్చిన ప్రాబ్లం ఏమిటి. అది చెప్పినా  నీకు అర్థం కాదులే గాని తమరి ఏంటి ఇలా వచ్చారు.

కాలేజీకి వెళ్లడం లేదా..  ఇంకా కాలేజ్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. నువ్వు ఎవరో విశికి రివిల్ చేస్తావా..  అప్పుడే కాదు.

తను ప్రాజెక్ట్ ఓకే అయ్యి.. నలుగురిలో గర్వంగా నిలబెట్టాలి అప్పుడు. కానీ ఈ లోపు గౌతమ్ గాడు ఏదైనా చేస్తే..  వాడి చుట్టూ నా మనషులు  ఉన్నారు.

ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మరి ప్రాజెక్ట్ తొందరగా ఓకే చేయొచ్చు కదా...

అది నా పని కాదు. నాన్న క్యూటి డిసైడ్ చేసుకోవాల్సింది. ఇలాగైతే మీ పెళ్ళెప్పుడు జరగాలి.  వెనకాల ఉన్న మా జంటలు అందరు పెళ్లిళ్లు ఎప్పుడు జరగాలి.

అంతే కంగారుగా ఉంటే చేసేసుకోవచ్చు కదా.. హలో అక్కడ మాట్లాడితే ముందు మా బావ పెళ్లి... మా బావ పెళ్లి అని కలవరిస్తుంది.  వయసుతో వచ్చే ప్రాబ్లమ్స్ నువ్వు అర్థం చేసుకుంటే మంచిది.

ఈ వయసుకే ఇంత ఫిలాసఫీ వచ్చిందంటే… మీ నాన్న వయసుకు నువ్వు ఏమవుతావో భయం వేస్తుంది.

అప్పటికి నాకు పెళ్లి అయి…  పిల్లలు కాలేజీలో…
నేను మాత్రం మా అమ్మాయి పెళ్లెప్పుడు అని తిరుగుతుంటాను.

సూర్య నవ్వుతూ... అది జరగాలంటే ముందు నువ్వు పెళ్లి పీటలు ఎక్కాలి కదా..
తమరి క్లియర్ చేస్తే మేము పీటలు ఎక్కుతాము. ఎక్కాక పడితే కష్టమని నేను వెయిట్ చేస్తున్నాను.

శ్రీకర్ సీరియస్‌గా...  పడితే లేచి నిలబడే పరిస్థితి ఉండాలి.
నీలా లైఫ్ అంతా ప్లాన్ చేసి ఉండాలి.

ప్లాన్ కాదు రా…  ఇది ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్.

అదేంట్రా… ప్రేమని కూడా ప్రాజెక్ట్‌లా ట్రీట్ చేస్తావా..

రిస్క్ అనాలిసిస్, టైమ్‌లైన్, సెక్యూరిటీ…  అన్నీ ఉన్నాయి.
ఒక్క క్లయింట్ మాత్రమే ఎమోషనల్.
శ్రీకర్ నవ్వు ఆపుకుంటూ...
అయితే విశి నీ లైఫ్‌లో క్లయింట్ ఆ?

సూర్య చూపు విసురుతూ..  జాగ్రత్త… ఆ క్లయింట్ నిన్ను అన్నయ్య అంటుంది.

శ్రీకర్ తక్షణమే మాట మార్చుతూ....  నీ క్లయింట్ ఇన్నోసెంట్ కాబట్టి ఎన్నైనా చెబుతావు.  అదే నాకు క్లయింట్ ఉంది చూసావా బాబు నోట్లో నుంచి ఊడి పడింది.

సూర్య నవ్వుతూ..  అందుకే నీకు పెళ్లి ఆలస్యం అవుతోంది.

నాకు ఆలస్యం కాదు రా…  నీకు స్పీడ్ ఎక్కువ. విశి ని ఎక్కడ ఎలా మౌల్డ్ చేయాలో నీకు బాగా తెలుసు అది ప్రేమ భాషరా..

నీ భాష ఆ వైభవ్గాడికి కూడా వచ్చింది. ఏమిటి ఆళ్ళిద్దరూ ప్యాచ్ అప్ అయిపోయారా.. అవ్వడమే కాదు.
ఒకే బైక్ మీద వస్తున్నారు.

నువ్వేమో అన్నవరం. వీడు ఫారెస్ట్ నుంచి హైదరాబాద్. ఏదేమైనా అన్నదమ్ములు ఇద్దరు మచ్చ వేసుకుని పుట్టారు రా.. ఒకళ్ళు ప్రపోజ్ చేయకముందు.. మరొకళ్ళు ప్రపోజ్ చేసిన తర్వాత..
మీ అంత స్పీడు లేక ఇదిగో మా బండి ఇలా స్లో గా ఉంది అని దీనంగా చెబుతాడు.

స్పీడ్ కాదు…  డైరెక్షన్ క్లియర్.
శ్రీకర్ టైం చూస్తూ..  సరే సరే…
ఈ డైరెక్షన్ క్లియర్ అయిన ప్రేమతో ఆఫీస్‌లో ఎన్ని గంటలు కూర్చుంటావో చూద్దాం.

సూర్య..  వర్క్ అయిపోతే వెళ్లిపోతాను.
శ్రీకర్ అల్లరిగా..  అదేంట్రా… ఏదో ప్రాజెక్టు అనాలసిస్ అని చెప్పావు.  ఇప్పుడు విశి తో మాట్లాడడానికి వెళుతున్నావా..

క్లైంట్ అపాయింట్మెంట్ ఉంటే గాని మాట్లాడకూడదు ఏమో అని టీజ్ చేస్తాడు.
సూర్య సీరియస్ ఫేస్‌తో...  మాట్లాడను…  చూస్తాను.
శ్రీకర్ షాక్‌గా...  ఏమిట్రా ఆ లాజిక్?


మాట్లాడితే ప్రాబ్లం.  చూస్తే మోటివేషన్.
శ్రీకర్ చేతులు జోడిస్తూ...  సార్… మీ ప్రేమకు ఒక సెల్యూట్

మా లాంటి వాళ్ళు ఇది సిలబస్‌లో పెట్టాలి.
సూర్య ఫోన్ తీసుకుంటూ... ముందు నీ సిలబస్‌లో సౌమ్య ని కూల్ చేయడం నేర్చుకో.

శ్రీకర్ నవ్వుతూ...  నీ పెళ్లయ్యాక  నీ పిల్లలకే నేనే ఫన్నీ అంకుల్.
సూర్య డోర్ వైపు నడుస్తూ... అప్పుడు కూడా నువ్వు ఇదే ఆఫీస్‌లో  ఇదే కుర్చీలో ఉంటావ్.
శ్రీకర్...  అంటే నా కెరీర్ స్టేబుల్ అన్నమాట
సూర్య నవ్వుతూ..  కెరీర్ స్టేబుల్…
మ్యారేజ్ మాత్రం పెండింగ్..

ఒరేయ్ దుర్మార్గుడా ఆగురా అని వెనకాలే పరిగెడతాడు.

కథ కొనసాగుతుంది........
[+] 7 users Like SivaSai's post
Like Reply
Excellent update... Good to see Vaibhav & Chandu have some clarity now... How they proceed further in the future episodes is lookout for...
[+] 1 user Likes Sunny73's post
Like Reply
Excellent update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
Atlast Chandu n Vaibhav.
Felt a bit more spicy emotional scenes like in the forest.. going behind her proving himself!!

But good!!
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Part - 116



వైభవ్ చందు విషయం తెలిసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు.  పోనీలే ఇప్పటికైనా వాళ్ళిద్దరి మనసులో ఉన్నది వాళ్ళకి అర్థం అయింది అనుకుంటారు.

అర్ధరాత్రి సమయానికి చందు ఇంటి దగ్గరికి వస్తారు. చందు బైక్ దిగి థాంక్యూ అంటుంది. చందు ని సూటిగా చూస్తూ చెయ్యి పట్టి లాగుతాడు.

హేయ్.. ఏం చేస్తున్నావు అని కంగారుగా అడుగుతుంది. ఇంకా ఏమీ చేయలేదు కానీ ఇంకొకసారి థాంక్స్ అని చెప్పావు అనుకో ఆ చెప్పిన చోటే ముద్దు పెట్టేస్తాను అర్థమవుతుందా..

ఆ మాటకి కళ్ళు పెద్దవి చేసి అయ్యగారికి చాలా ధైర్యం వచ్చినట్టు ఉంది.  అది ఎప్పుడూ ఉంది.. నువ్వు ఓకే చేసిన తర్వాత ఇంకా ఎక్కువ అయింది.

నేనేమీ ఓకే చెయ్యలేదే.. నా బైకు ఎక్కి కాన్ఫిడెంట్గా నా భుజం పైన చేయి వేసినప్పుడే నాకు అర్థమైంది కానీ ఓవరాక్షన్ ఆపి వెళ్లి రెస్ట్ తీసుకో.

రేపు ఫుల్లుగా రెస్ట్ తీసుకో ఎల్లుండి ఏటైనా వెళదాము. ఇప్పటివరకు తిరిగింది చాలదా.. అది ఒకరికి ఒకరం ఇష్టమని తెలిసినా దూరంగా ఉన్నప్పుడు. ఇది దగ్గర అయినప్పుడు.

రెండింటికి చాలా తేడా ఉంది. తెలియకపోతే వెళ్లి మా అత్తయ్య దగ్గర ట్రైనింగ్ తీసుకో.. పొరపాటున కూడా మీ నాన్న దగ్గర తీసుకోకే..

బుంగమూతి పెడుతూ మా నాన్న చాలా గ్రేట్ తెలుసా.. అవును.. అవును..  మీ ఇద్దరిని భరించడం అంటే మాటలు కాదు కదా. ఇదిగో అని వేలు పెట్టి చూపిస్తుంది.

అప్పుడే ఇంట్లో అన్ని లైట్లు వెలుగుతాయి.  రాజ్ బయటకు వచ్చి ఇంట్లోకి వచ్చి మాట్లాడుకోండి లేదా గుడ్ నైట్ చెప్పుకుని ఎవరింటికి వాళ్లు వెళ్ళండి.

అలా రోడ్డు మీద ఉంటే చండాలంగా ఉంటుంది. చెప్పేనా ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలో అని బాయ్... ఐ లవ్ యు అని అరుచుకుంటూ వెళతాడు.
వెళ్తున్న వైభవ్ ని చూసి నవ్వుకుంటూ కూతురు భుజం పైన చేయి వేసి  ట్రిప్ ఎలా జరిగింది రా..చాలా బాగా జరిగింది నాన్న అని హగ్ చేసుకుంటుంది.

ఇప్పటికైనా వాడి మనసు అర్థం అయిందా..  పైకి అల్లరిగా ఉంటాడు కానీ చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు.  నాకు ఈ రెండు రోజుల్లో అదే తెలిసింది నాన్న అని ఇద్దరు లోపలికి వెళతారు.

గదిలోకి వెళ్లి స్నానం చేసి మంచం పైన వాలిపోతుంది. రెండు రోజుల నుంచి జరిగినవన్నీ తలుచుకుంటూ ప్రశాంతంగా నిద్రపోతుంది.

వైభవ్ ఇంటికి వచ్చేటప్పటికి అందరూ హాల్లోనే ఉంటారు. ఏమిటి ఇంత అర్ధరాత్రి అయినా ఎవరూ పడుకోకుండా దెయ్యాల్లాగా కాపు కాసారు.

పూజిత వెంటనే ఒక మగ దెయ్యం రావాలి.  ఇంకా రాలేదేమిటా అని ఎదురు చూస్తున్నాము. అమ్మ అని గారంగా పిలుస్తాడు.  నోరు ముయ్యరా...

చందు ఓకే చేసిన వెంటనే ఫోన్ చేసి చెప్పకుండా ఇంత అర్ధరాత్రి వచ్చి అమ్మ అని గారాలు పోతున్నావా..  అరే అక్కడ సిగ్నల్స్ లేవు.

సిగ్నల్స్ లేకుండానే సౌమ్య కి ఫోను వచ్చిందా..  ఎవరు చేశారు.  మీతో పాటు వచ్చిన డాక్టర్స్ అని కళ్ళు ఎగరేస్తుంది.

మా వెనకాల స్పై పెట్టావా అని కోపంగా అడుగుతాడు.  నీకు అంత అవసరం లేదు గాని ఎందుకు ఫోన్ చేయలేదు చెప్పు.

చేద్దామనుకునే సమయానికి  సిగ్నల్స్ లేవు.  సిగ్నల్స్ వచ్చే సమయానికి... మనసు అదుపులో లేదు అంతేనా అని వినయ్ అందిస్తాడు.

నాన్న మీరు కూడా నా.. లవ్ లో ఉన్న వాళ్ళని టీస్ చేస్తే అదొక మజారా..  నా కొడుకుని టీస్ చేసే అవకాశం వచ్చినప్పుడు నేను ఎందుకు వదిలేసుకుంటాను.

తండ్రిని గట్టిగా హగ్ చేసుకుని మీరన్నది నిజమే నాన్న. ప్రేమించడం గొప్ప కాదు నమ్మకాన్ని ఇవ్వడమే ప్రేమ అని చెప్పారు.

ఈ రెండు రోజుల్లో చందుకి నేను అదే చూపించాను. థాంక్యూ ఫర్ యువర్ గైడెన్స్.  చుట్టూ చేతులు వేసుకొని ఇప్పుడు హ్యాపీయేనా..

చాలా అంటే చాలా.  పెళ్లి చేసేయండి నాన్న అని అడుగుతాడు.  ఆ మాటకి అందరూ ఒరేయ్ ఇప్పుడే కదరా లవ్ లో పడ్డావు అప్పుడే పెళ్లంటే..

మేము చిన్నప్పటినుంచి లవ్ లోనే ఉన్నాము.  అది అర్థం చేసుకోవడానికి ఇంత టైం పట్టింది అంతే. మా అన్నయ్య ఎప్పుడు చేసుకుంటాడో నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఇప్పుడే పెళ్లి కావాలి.

దీనితో చెయ్యనా అని పూజిత చీపిరి కట్ట తీసుకు వస్తుంది. వద్దమ్మా నువ్వు అలాంటి వైలెంట్ డెసిషన్స్ తీసుకోకు.

బాగా అలసిపోయాను గుడ్ నైట్ అని పరుగు అందుకుంటాడు. అందరూ నవ్వుకుంటూ వీడు ఒక్కరోజు లేకపోతేనే ఇల్లు బోసిపోయినట్టు ఉంటుంది కదా అనుకుంటారు.

మర్నాడు జిమ్ చేసే సమయంలో సూర్య విక్రమ్ తో మాట్లాడుతాడు.  ప్రాజెక్టు తొందరగా ఓకే చేసేయండి నాన్న. ఏరా నీకు అంత కంగారుగా ఉందా.

నాకు కాదు నా వెనకాల ఉన్న వీళ్ళకి కంగారుగా ఉంది. నేను పెళ్లి చేసుకుంటే గాని సౌమ్య,  చందు ముందుకు అడుగువేయరు.

ఇక్కడ వీడు అక్కడ శ్రీకర్ ఇద్దరు విలవిల లాడిపోతున్నారు. ఆ మాటకి నవ్వుతూ వయసు ప్రభావాలు అలాగే ఉంటాయి.

పెళ్లయితే గానీ తెలియదు ఆ టార్చర్ ఏమిటో.  శ్రీకర్ కి ఎప్పుడో స్టార్ట్ అయింది గాని ఇంకా ఇంకా కావాలి అనుకుంటున్నాడు అని సూర్య నవ్వుతాడు.

భరత్ వచ్చి మరి నా కూతుర్ని చేసుకోవాలి అంటే ఒక అదృష్టం ఉండాలి రా...  అలాగే ఇంకా ఇంకా కావాలి అనుకుంటారు.

మావయ్య నీ మీద వాడైతే గట్టిగా అలిగాడు.  వై.. నేనేం చేశాను వాడు అలగడానికి...  ఏది మాట్లాడినా సౌమ్య మా నాన్న గ్రేట్.. మా నాన్న ఒప్పుకున్నారు కాబట్టి అని చెబుతూ ఉంటే వాడికి ఎక్కడో కాలుతుంది.

వాడెప్పుడో ఫిక్స్ అయిపోయాడు.  ఎంతమంది పుట్టిన ఆడపిల్లలే కావాలి అంట.  అలా పుట్టాలి అంటే అదృష్టం ఉండాలి రా..

భరత్ ఆ మాట అన్నాక జిమ్ అంతా నవ్వులతో నిండిపోతుంది.  విక్రమ్ బార్బెల్ దించుతూ
అదృష్టం కాదు రా… ప్లాన్ ఉండాలి.  అమ్మాయి అయినా అబ్బాయి అయినా మనం పెంచే విధానంలో ఉంటుంది. ఫ్యామిలీ వాల్యూస్ చూసే నేర్చుకుంటారు.

వినయ్ నవ్వుతూ శ్రీకర్ గాడికి ఎంతమంది కావాలి అంట.. వాడి లిస్టులో పదిమంది దాకా ఉన్నారు బాబాయ్ అని సూర్య కూడా నవ్వుతాడు.

ఒకటి కాదు, ఇద్దరు కాదు…  అంత మంది పిల్లలంటే వీడు  ప్రాజెక్ట్ మీద ప్రాజెక్ట్ చేస్తూ ఆఫీసులోనే ఉండిపోవాలి ఎందుకంటే ఆ ఇల్లు ఒక కిష్కిందకాండ లాగా ఉంటుంది.

సూర్య కళ్లెత్తి.. ఏంటి నాన్నా… ప్రాజెక్ట్ కాదు … లైఫ్‌టైం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అని నవ్వుతాడు.

అంతలో ట్రెడ్‌మిల్ మీద ఉన్న వైభవ్ వినిపించేలా
పెదనాన్న … పెళ్లయితే అర్థమవుతుంది అంటున్నారు కదా… మీరు మాత్రం సేఫ్. మా పెద్దమ్మ లాంటి లక్కీ గర్ల్ వచ్చింది.

ఎప్పుడు పక్కన వాళ్లది చూస్తే చాలా హ్యాపీగా కనిపిస్తుంది రా.  కానీ ఎవరే లోటుపాట్లు వాళ్లకే కనిపిస్తాయి.   ఉన్నదాంట్లో తృప్తి పడితే సంతోషంగా ఉంటాము.  లేని దానికోసం పరుగులు పెడితే అంతే..

రోజు గొడవలే  ఈ విషయంలో మాత్రం మన ఫ్యామిలీ అంతా లక్కీ ఫెలోసే..
భరత్ చేతిలో టవల్ తిప్పుతూ.. అదే కదా… పెళ్లంటే ఒకటి కాదు రా. అమ్మాయిల కుటుంబం, అబ్బాయి కుటుంబం… మధ్యలో ఈ అబ్బాయిలు. జిమ్ కంటే ఇంట్లోనే ఎక్కువ కార్డియో అవుతుంది అంటాడు.

విక్రమ్ చిరునవ్వుతో.. అందుకే మీ అందరికీ ఒకే సలహా. పెళ్లి ముందు జిమ్‌లో బలం పెంచుకోండి. తర్వాత మానసిక బలం కావాలి అంటాడు.

సూర్య వెంటనే... అయితే శ్రీకర్‌కి డబుల్ డోస్ ఇవ్వాలి నాన్న. ఒకటి ఫిజికల్… ఇంకొకటి సౌమ్య మాటలకు తట్టుకునేలా  అంటాడు.
భరత్ వెంటనే..  నువ్వు కూడా విశి ని పెళ్లి చేసుకుంటే తెలుస్తుంది. అప్పటివరకు నవ్వు అని రివర్స్ వేస్తాడు.

అంతలో విక్రమ్ మొబైల్ చూసి  ఓహో… ఇదిగో కాల్. మీ అత్తయ్య. వీళ్ళిద్దరి లవ్ తెలిసిన తరువాత నివి అసలు ఊరుకోదు.

అర్జెంటుగా నేను విశి ప్రాజెక్ట్ ఓకే చేయాలి.  లేకపోతే నివి వెళ్లి విశి కి అంతా చెప్పి మన ఇంటికి తీసుకు వచ్చిన తీసుకోవచ్చేస్తుంది.

అందరూ ఒక్కసారిగా  అయ్యో…అని కలిసి అంటారు.
సూర్య నవ్వుతూ..  జిమ్ లో వెయిట్స్ ఎత్తాం నాన్న… కానీ ఈ ఫ్యామిలీ టాపిక్స్ ఎత్తడం మన వల్ల కాదు అంటాడు.

భరత్.. ఏం కాదు రా… ఇదే ఫన్. ఇదే ఫ్యామిలీ. నవ్వుకుంటూ భరించడమే  అంటాడు. అందరూ మళ్లీ వర్కౌట్‌కి తిరిగిపోతారు…

వైభవ్ ఆలోచిస్తున్నట్టుగా ఫేస్ పెట్టి రాజ్ మావయ్య చాలా త్యాగశీలి కదా నాన్న.  ఇప్పుడు మీ రాజ్ మావయ్య ఎందుకు గుర్తొచ్చాడు.

నివి అత్తని, ఆ చందు ని భరించడం అంటే మాటలా.. ఫ్యాషన్ షో కి ఎన్ని చోట్ల తిప్పి ఉంటాడు.  మరీ ఎక్కువ జాలి పడకరా..

ఫ్యూచర్లో తమరు కూడా అంతే. అప్పుడు నిన్ను చూసి మేము జాలిపడాలి. నేనేమి రాజ్ మావయ్య లాగా తిరగను.

ముందే చెప్పేస్తాను. నీ షాపింగ్ ఏదైనా ఉంటే చూసుకో గాని నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దు అని. అందరూ ఒకేసారి  అబ్బా ఛ అంటారు.

ఏంటి డౌటా.. వైభవ్ తల మీద వెంట్రుకలు తీసి చూపిస్తూ ఇంతమందిని చూసామురా... అప్పుడే ఏమైపోయింది అని నవ్వుకుంటారు.
నవ్వుల మధ్య పెళ్లి ప్రాజెక్టులు మాత్రం ఇంకా  పరుగెడుతూనే ఉంటాయి.

ఆఫీస్ వెళ్లిన తరువాత విక్రమ్ పీఏతో విశి కి ఫోన్ చేయిపించి ప్రాజెక్ట్ డేట్ ఫిక్స్ చేయిపిస్తాడు.  సూర్యకి కాల్ చేస్తుంది.

సూర్య మీటింగులో ఉండి ఫోన్ సైలెంట్ లో ఉంటుంది. సార్ ఏంటి నేను ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు.  కాలేజ్ కి కూడా వచ్చినట్టు లేరు ఏమయింది అని టెన్షన్ పడుతూ అవని కి కాల్ చేస్తుంది.

విశి కాల్ చేస్తుందేమిటి అని ఆలోచిస్తూ లిఫ్ట్ చేసి చెప్పరా.. అత్తయ్య దేవా సార్ బాగానే ఉన్నాడా అని కంగారుగా అడుగుతుంది.

విశి మాటలో కంగారు చూసి అవనికి కూడా కంగారు వస్తుంది. వాడికేమైంది పొద్దున్నే బానే ఆఫీస్ కి వెళ్ళాడు కదా అని అడుగుతుంది. ఆఫీసా అని ఆగిపోతుంది.

విశి తెలుసుకోగలుగుతుందా........
[+] 8 users Like SivaSai's post
Like Reply
Part - 117



ఆఫీసా..  ఆఫీస్ ఏమిటి అత్తయ్య.  అప్పుడుగాని అవని కి గుర్తుకు రాదు. ఓ..  వేరే జాబ్ ట్రయల్స్ చేస్తాను అన్నాడు. ఒకవేళ ఆ పనిలో బిజీగా అటెండ్ అవుతూ ఫోన్ సైలెంట్ గా పెట్టినట్టున్నట్టున్నాడు.

అవునా.. నాకు పిచ్చ టెన్షన్ వచ్చింది. లిఫ్ట్ చేయకపోయేటప్పటికి. ఇంతకీ ఊరికినేనా లేక ఏదైనా ఇంపార్టెంట్  పనా..

నాకు వి. జె. స్. కంపెనీ నుంచి ఆఫర్ వచ్చింది అత్తయ్య.  ఏదైనా దేవా సార్ తో వెళ్తేనే నాకు ఒక ధైర్యం ఉంటుంది. అది చెబుదామని ట్రై చేస్తూ ఉంటే దొరకడం లేదు.

సరేలే వాడే చూసుకొని చేస్తాడు.  అనవసరంగా టెన్షన్ పడకు. సరే అని ఫోన్ పెట్టేస్తుంది.. అవని హమ్మయ్య ఎంతలో ఎంత ప్రమాదం తప్పింది అని అంటుంది.

ఎవరు అవని అని లలిత అడిగితే..  విశి అత్తయ్య. కొంచెం ఉంటే నేను సూర్య పోసిషన్ చెప్పేసేదాన్ని.  అనవసరంగా ఇద్దరి మధ్యన మిస్అండర్స్టాండింగ్  వచ్చేవి. వీడు తొందరగా ఓపెన్ అయితే బాగుంటుంది. నాకు అలాగే అనిపిస్తుంది.

ఈ ఇంట్లో పెళ్లిళ్లు చూడాలని మాకు చాలా కోరికగా ఉంది. ఒక్కసారే అందరూ పెళ్లిళ్లు చేసేద్దాం అత్తయ్య.  అప్పుడు వచ్చే చుట్టాలని ఆపగలమా..

జై సింహా ఫ్యామిలీ లో లేదు అన్న మాట ఉండదు కదా..  అది నిజమేలే.  అంతా నా పెద్దకొడుకు హ్యాండిల్ చేయగలుగుతాడు అని గర్వంగా చెబుతుంది.

మీటింగ్ ఫినిష్ అయిన తరువాత సూర్య ఫోన్ తీసి చూస్తాడు. విశి నుంచి చాలా మిస్డ్ కాల్స్ ఉంటాయి. ఏమైంది క్యూటి ఇన్నిసార్లు ఫోన్ చేస్తుంది అని కంగారుగా చేస్తాడు.

దేవ నుంచి వస్తున్న ఫోన్ చూసి నవ్వుతూ లిఫ్ట్ చేసి..  మీ ఇంటర్వ్యూ ఏమైందిసార్  అని అడుగుతుంది.. ఇంటర్వ్యూ నా. అత్తయ్య చెప్పారు.

ఏదో ఇంటర్వ్యూ కి వెళ్ళారని. అమ్మ నీకు ఎప్పుడు కలిసింది. మీరు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అత్తయ్యకి చేశాను. అప్పుడు అన్నారు.

అవునా..  పర్వాలేదు బాగానే అయింది. ఇంతకీ నువ్వు ఎందుకు చేసావో చెప్పలేదు కదా. ఓ అదా.. వి. జె. స్. కంపెనీ నుంచి ఆఫర్ వచ్చింది.

ఈరోజు ఆఫ్టర్నూన్ ప్రాజెక్ట్ ఫైనల్ చేయడానికి రమ్మన్నారు. మీరు ఉంటే బాగుంటుంది కదా అని కాల్ చేశాను. సరే డైరెక్ట్ గా నువ్వు ఆఫీసుకు వచ్చేసేయ్. నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. మీరు అక్కడే ఉన్నారా..  దగ్గర్లో ఉన్నాను ప్రాబ్లం లేదు.

ఓకే సార్..  సూర్య ఫోన్ పెట్టేసిన తర్వాత శ్రీకర్ అడుగుతాడు. నువ్వు వెళ్లి తీసుకురావచ్చు కదా అని.  లేదు రా ప్రతిదీ నామీద బాగా డిపెండ్ అయిపోతుంది.

నేను ఉంటేనే ధైర్యం. నేను వస్తేనే వెళ్లాలి అని.  ఆ డిపెండెన్స్ తగ్గించాలి. ఒంటరిగా అడుగులు వేయడం  మెల్లిమెల్లిగా అలవాటు చేస్తాను.

నేను రాకముందు తన అన్ని ఇండివిడ్యువల్ గానే చేసింది కదా..  నా మీద ఎక్కువ డిపెండ్ అయ్యి మళ్ళీ బలహీన పడకూడదు. నేను తన బలం కావాలి కానీ బలహీనత అవ్వకూడదు.

ప్యూన్ వచ్చి సార్ అని పిలిస్తే..  ఏంటి అన్నట్టుగా చూస్తాడు. మిమ్మల్ని కలవాలి అని హిమ అంట.. బయట వెయిట్ చేస్తున్నారు.

మీరు బిజీగా ఉన్నారు అని చెప్పినా వినడం లేదు.  నాకు సూర్య బాగా తెలుసు. నేను వచ్చాను అని చెబితే చాలు అన్ని పనులు మానుకొని నాకోసం ఎదురు వస్తాడు అని ఏదేదో మాట్లాడుతున్నారు.

నాకు భయం వేసింది. అందుకే మీ దగ్గరికి వచ్చాను సార్. భయమా.  భయం ఎందుకు అని శ్రీకర్ అడిగితే.. మీకు బాగా కావలసిన వాళ్లు అయితే ఆపినందుకు కోపం చూపిస్తారేమో అని.

ఆ మాటకి నవ్వుతూ..  అలాంటిదేమీ లేదు. నేను ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను.  అసలు నిన్ను దరిదాపుల్లో కూడా సెక్యూరిటీ ఆలో చేయలేదు.

వెయిట్ చేయగలిగితే చేయమను.  లేకపోతే రేపు వచ్చి కలవమన్నారు అని చెప్పు. ఓకే సార్ అని వెళ్లిపోతాడు. శ్రీకర్, సూర్య..  హిమని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు.

రేపు ఫ్యూచర్లో ఈ కంపెనీ ఓనర్ ని అవుతున్నాను.  సూర్య కి ఫ్యూచర్ లో కాబోయే భార్యని.  అలాంటిది నాతో ఇలా చెబుతున్నావు.  నీ జాబ్ తీసేస్తాను అని గంతులు వేస్తుంది.

అబ్బో పాపకి చాలా కోరికలు ఉన్నాయి రా. ఏకంగా ఈ కంపెనీకి ఓనర్ అయిపోతుంది అంట.  ఇప్పుడు దాకా ఈ మాట అవని ఆంటీ కూడా అన్నట్టు లేరు.

అందుకే అంటారు అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది.  ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అని ఇలాంటి వాళ్ళని చూసే చెప్పి ఉంటారు.

అప్పుడే విక్రమ్ కారు అక్కడ ఆగుతుంది. డ్రైవర్ డోర్ తీయగానే విక్రమ్ దిగి.. ఏమిటి గొడవ అని అడుగుతాడు. అంతే విక్రమ్ చూడగానే సైలెంట్ అయిపోతుంది.

ఎవరి ఈ అమ్మాయి అని అడిగితే.. సూర్య సార్ కి కాబోయే భార్య అంట సార్ అని అక్కడ సెక్యూరిటీ చెబుతారు.

వాట్ నా కొడుకుకి కాబోయే భార్య..  అని పైనుంచి కిందకి చూస్తూ ఏ విధంగా చూసినా నా కొడుకు పక్కన నువ్వు సెట్ కావు.

అలాంటిది వాడికి కాబోయే భార్య అని ఎలా చెప్పుకొని తిరుగుతున్నావు. ఇంకొకసారి నా కొడుకు దరిదాపుల్లో కనిపించావు అంటే మీ బాబు కంపెనీ ఎక్కడ ఉంటుందో ఎవరు ఊహించలేరు.

అర్థమైంది అనుకుంటా అని నవ్వుతూ చెబుతాడు.  కానీ ఆ మాటల్లో ఉన్న ఫైర్ అర్థమయ్యి వణుకుతూ అర్థమైంది అంకుల్.

అంకుల్ కాదు కాల్ మీ విక్రమ్ సార్. ఓకే అని అక్కడ నుంచి పరుగు అందుకుంటుంది.  అది చూసిన శ్రీకర్ ఎలా అయినా విక్రమ్ అంకుల్ లో ఆ ఫైర్ తగ్గలేదు రా..

ఆ హిమనీ కొన్ని రోజులు ఆడుకుందాము అనుకుంటే అంకుల్ వెంటనే కట్ చేసేసారు..దాన్ని కట్ చేయకపోతే మీ ముగ్గురు పెళ్లిళ్లు ఇంకా లేట్ అవుతాయి  పరవాలేదా అన్న వాయిస్ వినపడుతుంది. అబ్బా అంకుల్ అని వెనక్కి తిరుగుతాడు.

మీవి మరీ పాము చెవులు అయిపోయినాయి.  అంతలేదు. మీ వాయిస్ లౌడ్ స్పీకర్ అయ్యింది. అయినా ఆ హిమ ఏమి అంత తొందరగా వదిలేయదు.

దాని మనసులో ఉన్న ఫీలింగ్ చెప్పనా..  సూర్యని పెళ్లి చేసుకొని మమ్మల్ని అందరినీ వేళ్ళు మీద ఆడించాలి అన్నది ఇప్పుడు దాని మైండ్ లో రన్ అవుతుంది.

అది జరిగే పనేనా.. అది మనకి తెలుసు కానీ దానికి తెలియదు కదా అని నవ్వుకుంటారు.

విశి ఫోన్ చేసిందా. ఆ..  మధ్యాహ్నం అరేంజ్ చేశారంట  కదా. ఇంత తొందరగా ఏమిటి. చెప్పాను కదా. మీ ముగ్గురు పెళ్లిళ్లు అర్జెంటుగా చేశాలని ఫిక్స్ అయ్యాము.

అందుగురించే. ఈ ప్రాజెక్టు ఎంత ఫాస్ట్గా ఫినిష్ అవుతే అంత తొందరగా నీ గురించి రివీల్ చేసి నా కోడల్ని తెచ్చేసుకుంటాము.

తర్వాత మీ ఇష్టం మీదే. అలా అని పరుగులు పెడితే క్యూటి తర్వాత ఫీల్ అవుతుంది నాన్న.  ఒరేయ్ నీ బాబుని రా.

ఎవరి టాలెంట్ ఏమిటి అన్నది నాకు తెలుసు.  విశి టాలెంట్ కి తగ్గట్టుగానే తనకి గుర్తింపును తీసుకొస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ ఆ గౌతమ్ చాలా క్రూయల్ ప్లాన్స్ వేసాడు.

ఏమిటి అని కళ్ళు చిన్నవి చేసి అడిగితే.. విశి పరువు కాలేజీలో డ్యామేజ్ చేయాలని చూస్తున్నాడు.  ఆ మాటకి సూర్యకి చాలా కోపం వస్తుంది.

వాడికి ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చిన బుద్ధి రావడం లేదు నాన్న.  నీది మీ అమ్మలాగ సున్నితత్వం అందరినీ ఒకేలాగా హ్యాండిల్ చేయకూడదు.

వాడి దృష్టిలో నువ్వు ఒక లెక్చరర్ వి అందుకే వాడు అలా రెచ్చిపోతున్నాడు.  మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోకండి నాన్న. నేను హ్యాండిల్ చేస్తాను.  ఓకే.

భోజనాలు అయినాయా.  విశి వచ్చే టైం అయింది.  మీరు చేసేయండి.  నీకేమైంది.  క్యూటి నా కోసం బాక్స్ తెస్తది.

అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెబుతున్నావు.  అది అంతే. నేను ఇంటర్వ్యూ కి వచ్చాను అనుకుంటుంది.  ఒకవేళ తీసుకురాకపోతే..  నా ప్రేమ మీద నాకు నమ్మకం ఉంది. అయితే చూద్దాం అని వెయిట్ చేస్తూ ఉంటారు.

ఈలోపు విశి స్కూటీ వేసుకుని వస్తుంది. అక్కడ పార్క్ చేసి పర్మిషన్స్ అన్ని తీసుకొని లోపలికి వస్తుంది. సూర్య ఎదురు వచ్చి హాయ్ క్యూటీ అంటే..

హాయ్ సార్ మీరిక్కడే ఉన్నారా.  నీ కోసమని వచ్చాను. బ్యాగ్ లో నుంచి బాక్స్ తీసి తినండి.  ఏమిటి అని ఏమీ తెలియనట్టుగానే అడుగుతాడు.

మీరు ఎప్పుడో పొద్దుటే వచ్చుంటారు కదా.  ఇంటర్వ్యూ టెన్షన్ లో ఏం తిన్నారో ఏమో తెలియదు. అందుకే మీ కోసం ఫ్రైడ్ రైస్ చేసి తెచ్చాను.  తినండి అని చేతికి ఇస్తుంది.

థాంక్యూ మన మధ్యన కూడా ఈ ఫార్మాలిటీ అవసరమా.  సరే నీ మీటింగ్ కి వెళ్ళు.  నేను ఫినిష్ చేస్తాను. ఒక్క మెతుకు కూడా వదలకుండా తినాలి.

సరే ఎవరికీ పెట్టకుండా తింటాను వెళ్ళు. ఆల్ ద బెస్ట్ అని చెప్పి పంపిస్తాడు. కేబిన్ కి వెళ్లి ఇప్పుడేమంటారు. లక్కీ ఫెలో అంటాము అని విక్రమ్ వెళ్ళిపోతాడు.

శ్రీకర్ ఆలోచిస్తూ ఉంటే ఏంట్రా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు.. ఫ్యూచర్లో సౌమ్య కూడా నా కోసం ఇలాగే తీసుకు వస్తుందంటావా..

సూర్య సమాధానం.......
[+] 8 users Like SivaSai's post
Like Reply
Part - 118



శ్రీకర్ ఆలోచిస్తూ ఉంటే ఏంట్రా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు.. ఫ్యూచర్లో సౌమ్య కూడా నా కోసం ఇలాగే తీసుకు వస్తుందంటావా..

ఫోన్ చేసి అడగమంటావా.. వద్దులే ఇప్పుడు నీకోసం నేను వంట నేర్చుకోవాలా అని నా మీద అరుస్తుంది. మరి తెలిసి ఎందుకురా..

ఎందుకురా ఈ అమ్మాయిలు ముందు పిల్లల్లాగా ఉండి తర్వాత పులుల్లాగా మారిపోతారు.  ప్రొపోజ్ చేయకముందు ఎంత క్యూట్ గా.. దొంగ చూపులు చూస్తూ నేను మాట్లాడడానికి ట్రై చేస్తే పారిపోతూ.. అబ్బబ్బ ఆ ఫీల్ ఎంత బాగుంది.

ఇప్పుడు చూడు నేను పరిగెత్తాలి వస్తుంది.  ఏదైనా అంటే గేయ్యమని అరుస్తుంది.

అప్పుడు నువ్వు లైన్లోకి వస్తావో లేదో అని భయపడుతూ ఉండిఉంటది రా.  ఇప్పుడు ఇంకా ప్రాబ్లం లేదు కదా ఒరిజినల్టి బయటికి చూపిస్తుంది అని నవ్వుతూఉంటే..

ఒరేయ్ మిత్ర ద్రోహి చిన్నప్పటినుంచి అందరం ఒకే చోట ఉన్నాము కదా.. ఆ మాత్రం తెలియదా. తెలిసి కూడా అనుమానం పడుతున్నావు అంటే ఏమనుకోవాలి రా.

నీ దగ్గర తనకి ఆ స్వతంత్రం వచ్చింది. మన అనుకున్నప్పుడే ఎలాగైనా మాట్లాడతారు ఆ ఫీల్ కంఫర్ట్ నువ్వు ఇచ్చావు కాబట్టే సౌమ్య తనలాగే ఉండగలుగుతుంది.

అర్థమైందా మొద్దు.  అర్థమయింది దేవా సార్ అని సాగదీస్తూ నమస్కారం చేస్తాడు. ఏడిచావులే కానీ మీటింగ్ ఎంతవరకు వచ్చింది కనుక్కో..

అబ్బో ఎందుకు అంత కంగారు. ఔటింగ్ కి వెళ్ళదామని. దీనికి నేను ఒప్పుకోను.  మా మేడం ఫుల్ బిజీగా ఉంది. దానికి నేనేం చేస్తాను రా. మరి నువ్వు అలా వెళ్ళిపోతే నేను ఎలా.

పైనుంచి కిందకి చూస్తూ ఏం మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా.  మీరు అన్నవరం వెళ్లే ముందు ఏం చెప్పారు రా..

వైభవ్ ది కూడా క్లియర్ అయిపోతే మూడు జంటలు జాలీగా వెళదాం అన్నావు కానీ మమ్మల్ని అందరినీ వదిలేసి నువ్వు మాత్రం తిరుగుతున్నావు.

మీరు ప్లాన్ చేస్తే నేను వద్దంటానా..  గట్టిగా ప్లాన్ చేయండి. వికారాబాద్ ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళదాం. ఇది బాగుంది. ఈ వీకెండ్ ఫిక్స్ అయిపోదాం.

మనం అనుకుంటే సరిపోదు మన హీరోయిన్స్ కూడా ఓకే చేయాలి వాళ్లు మనకన్నా బిజీ అయిపోతున్నారు కదా.

విశి దగ్గర నుంచి ఫోన్ వస్తుంటే సైలన్స్ అని చెప్పి లిఫ్ట్ చేసి చెప్పు క్యూటి.   ఎక్కడున్నారు సార్ అని ఆనందంతో ఎగురుతుంది.

ఏంటి మేడం గారు చాలా హ్యాపీగా ఉన్నారు.  చాలా చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఎక్కడున్నారు చెప్పండి ప్లీజ్.

నువ్వెక్కడున్నావో చెప్పు.  నేనే వస్తాను. నిలబడిన ప్లేస్ చెప్తుంది.  సరే వెయిట్ చేయి వస్తాను అని ఫేస్ కి మాస్క్ పెట్టుకునే వెళతాడు.

సూర్య ని చూడగానే దగ్గరికి వెళ్లి దేవా సార్ అని హగ్ చేసుకుంటుంది. ఏమిటి. ఎనీ గుడ్ న్యూస్. నా ప్రాజెక్టు ఓకే అయింది.

మీకు ఒక విషయం తెలుసా..నన్ను ఇక్కడ జాబ్ చేయమనడం లేదు. నాతో కొలాబరేట్ అవుతున్నారు. ఇది నా సెల్ఫ్ వర్క్ కింద తీసుకుంటాము అన్నారు.

ప్రాఫిట్ లో 75% నాకే ఇస్తున్నారు అని సంతోషంగా చెబుతోంది.  సూర్య కళ్ళతోనే విక్రమ్ ని వెతుకుతాడు. దూరంగా నిలబడి చూసి నవ్వుతూ ఉంటే...థాంక్యూ అని లిప్ మూమెంట్ ఇస్తే.  పోరా అని చేత్తో చూపించి వెళ్ళిపోతాడు.

శ్రీకర్ వచ్చి కంగ్రాట్స్ విశి అంటే సూర్యని వదిలి థాంక్యూ అన్నయ్య..మరి మాకు పార్టీ లేదా.  చెప్పండి ఏది కావాలో చిటికెలో చేసేస్తాను.

అబ్బా ఇంట్లో ఎప్పుడైనా చేస్తావు.  ఈ వీకెండ్ మన మూడు జంటలు అలా అలా జాలీగా వెళదాము. ఆ మాటకి సూర్య వైపు చూస్తే నవ్వుతూ ఉంటాడు.

ఏదైనా దేవా సార్  ఇష్టమే అని తలవంచుకుని చెబుతుంది.  నా బంగారు చెల్లె.  పెళ్లికి ముందే అన్నీ మా బావ ఇష్టమని చెబుతున్నావు.

అదే నా బుజ్జి పప్పీ ఉంది చూసావు ఏదైనా మా నాన్న ఇష్టమే అని చెబుతుంది.  ఆ మాటకి ఒక్కసారిగా డల్ అవుతుంది.

శ్రీకర్ ఏం మాట్లాడాడో అర్థమయి.. నాలుక కర్చుకుని అంటే అది కాదు బంగారం ఇట్స్ ఓకే అన్నయ్య. తండ్రి ఉన్నప్పుడు ఎవరినైనా అదే చెబుతారు.

ఇప్పుడు నాకు తండ్రి అయినా, స్నేహితుడైన భర్త అయినా అంతా దేవాసారే కదా అని చేయి పట్టుకుంటుంది.

ఇన్ని రోజులు నువ్వు లక్కీ ఫెలో అనుకున్నాను కానీ అసలు లక్కీ ఫెలో మా వాడే. అదేమీ కాదు అన్నయ్య నేనే లక్కీ అంటుంది.

అయ్యో నీకు అర్థం కావడం లేదు రా అని ఇద్దరు వాదించుకుంటూ ఉంటే. మీ ఇద్దరూ వాదన ఆపితే మనం బయటికి వెళదాం.

ఇక్కడ స్టాఫ్ అందరు మనల్ని చూస్తున్నారు. పద పదా అని బయటికి వచ్చేస్తారు.

బయటికి రాగానే భానుమతికి ఫోన్ చేసి విషయం చెబుతుంది.  అలాగే అవనికి కూడా చేసి చెబుతుంది.

అది చూసిన శ్రీకర్ అమ్మకి ఫోన్ చేశావు అంటే ఒక అర్థం ఉంది. అవని ఆంటీ కి కూడా ఎందుకు చేసావు. సూర్య వైపు నవ్వుతూ చూస్తూ..

మేమిద్దరం ఒకటే అయినప్పుడు అత్తయ్య కూడా నాకు అమ్మే కదా.. మరి అమ్మకి చేసి చెప్పడంలో వింత ఏముంది.

ఆ మాటకి సూర్య చాలా ప్రౌడ్ గా చూస్తాడు. నేను ఊహించిన దానికన్నా ఎప్పుడూ ఒక మెట్టు పైనే ఉంటున్నావు క్యూటీ అనుకుంటాడు.

సరే సరే పొగడ్తల కార్యక్రమం అయిపోతే అలా స్నాక్స్ తిని అలా అలా తిరిగి ఇంటికి వెళదాము..మీ ఇద్దరి మధ్య నేను ఎందుకు ఎంజాయ్ అని శ్రీకర్ వెళ్ళిపోతాడు.

శ్రీకర్ వెళ్ళిపోయిన వెంటనే క్షణం పాటు నిశ్శబ్దం పడుతుంది. సూర్య చేతిలో ఉన్న ఫోన్‌ని జేబులో పెట్టుకుంటూ చూశావా… వాడి టైమింగ్ అని నవ్వుతాడు.

విశి కూడా నవ్వే ప్రయత్నం చేస్తుంది కానీ కళ్ళలో ఇంకో భావం దాగి ఉంటుంది.  ఏమైంది? అని అడుగుతాడు సూర్య.

ఏం లేదు దేవా సార్  అని తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది.  సూర్య ఆగిపోతాడు.
క్యూటి … నన్ను దేవా సార్ అని పిలిచినప్పుడు నువ్వు ఇలా కళ్ళు దాచుకుంటే నాకు భయం వేస్తుంది. నీ కళ్ళల్లో ఎప్పుడూ నన్ను చూడగానే కనిపించే మెరుపు మాయం అవితే నాకు ఆందోళనగా ఉంటుంది ఏమైందిరా నాకు చెప్పవా అని లాలనగా అడుగుతాడు.

ఆ మాటకి విశి కళ్ళు తడుస్తాయి.  నాకు భయం లేదు…
కానీ ఈరోజు అన్నయ్య అన్న మాటకి, నాన్న అన్న మాటకి…  ఒక్కసారిగా నాన్న గుర్తొచ్చారు.  నా గెలుపుని ఆయన సంతోషంగా మలుచుకుని మురిసిపోవడం గుర్తుకు వచ్చింది  అంతే...

సూర్య మెల్లగా ఆమె దగ్గరకి వచ్చి,  నువ్వు ఒంటరిగా లేవు క్యూటి..  నువ్వు నాన్నని మిస్ అయితే…
నేను నీకు లవర్ గా కాదు, ముందు నీకు భద్రతగా ఉంటాను.

ఆ మాటలు వింటూనే ఆమె చేయి గట్టిగా పట్టుకుంటుంది.
అందుకే కదా…  నాకు ఈ విజయం వచ్చినప్పుడు మొదట మీ ముఖమే చూడాలి అనుకున్నాను.

నాన్నకి చెప్పాలి అనిపించినప్పుడు కూడా మీకే చెప్పాను.
సూర్య కళ్ళలో తడి నిలుస్తుంది.  ఈ రోజు నీ ప్రాజెక్ట్ ఓకే అయిందని కాదు క్యూటి...  నువ్వు నిన్ను నువ్వే నిలబెట్టుకున్న రోజు ఇది.

విశి నవ్వుతుంది.  అయితే ఈ సెలబ్రేషన్ స్నాక్స్‌తో సరిపోతుందా?  లేదు, అని సూర్య గట్టిగా చెబుతాడు.
ఈ వీకెండ్ వికారాబాద్ ఫారెస్ట్‌లో…  మూడు జంటలు, ఒకే నవ్వు, ఒకే కథ.

విశి కళ్ళు మెరిసిపోతాయి.  అయితే నేను కూడా ఓకే అంటున్నా…  మా వారి ఇష్టమే.  అని అల్లరి గా చెప్పగానే
సూర్య నవ్వుతూ...

ఇంకా పెళ్లి కాలేదు క్యూటీ…  ఇప్పటికే ఇలా ఉంటే పెళ్లి తర్వాత నా పరిస్థితి ఏంటో  అంటాడు.

విశి అతని భుజంపై తల ఆనిస్తుంది. పరిస్థితి కాదు దేవా సార్…  జీవితం అంటారు దాన్ని.

ఆ మాటతో ఇద్దరూ ముందుకు నడుస్తారు.  వెనక సూర్య కళ్లలో మాత్రం ఒక్క ఆలోచనే. నా క్యూటి ని నేను ఎప్పుడూ ఒంటరిగా అనిపించనివ్వకూడదు.

బైక్ స్టార్ట్ చేయగానే విశి టూ సైడ్స్ కి కూర్చుంటుంది. సరదాగా తిరిగి డిన్నర్ కూడా బయటే కంప్లీట్ చేసి విశి ని ఇంటి దగ్గర దింపుతాడు.

గుడ్ నైట్ క్యూటి. టేక్ కేర్.  నైట్ ఫుల్ గా పడుకో ఓకేనా అని జాగ్రత్తలు చెప్పి ఇంటికి బయలుదేరుతాడు.

ఇదంతా దూరం నుంచి చూస్తున్న గౌతమ్ మాత్రం కోపంతో రగిలిపోతాడు.  ఆఫీస్ నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి ఫాలో అవుతూనే ఉంటాడు.

ఇంటికి వెళ్ళి గట్టిగా అరుస్తూ ఉంటాడు.  ప్రాజెక్టు చేజారిపోయింది అది విశి  చేతికి వెళ్ళింది అని తెలిసిన తర్వాత ఇంకా కోపం పెంచుకుంటాడు.

సూర్య ఇంటికి వెళ్లేటప్పటికి అందరూ హాల్లోనే ఉంటారు. డైరెక్టుగా వెళ్లే విక్రమ్ ని హగ్ చేసుకుని థాంక్యూ నాన్న. దేనికి రా అని అవని అడుగుతుంది.

ఆఫీసులో జరిగింది మొత్తం చెబుతాడు. అది విని విక్రమ్ ఒరేయ్ విశి నా కోడలు అని నేను ఈ ఫేవర్ చేయలేదు. బిజినెస్ బిజినెసే.  రిలేషన్ రిలేషనే.

తనకి చాలా టాలెంట్ ఉంది.  సో ఆ టాలెంట్ మన కంపెనీకి యూస్ అవ్వాలి. చేజారి పోకూడదు కాబట్టి... ఆ ఆఫర్ ఇచ్చాము.

ఇలాంటి ఆఫర్స్ అంతకుముందు కూడా చాలా  ఇచ్చాము. కావాలి అంటే మీ మావయ్యని, బాబాయిని అడుగు .

నువ్వు ఇంకా పూర్తిగా బిజినెస్ లోకి రాలేదు కదా సో ఈ బిజినెస్ డీల్సు నీకు తెలియదు.

హిమ ఇంటికి వెళ్లి అరుస్తూ ఉంటుంది.. రమేష్ వచ్చి ఏమైంది బేబీ అలా అరుస్తున్నావు. ఆ విక్రమ్ కి ఎంత ధైర్యం డాడీ.

సెక్యూరిటీ ముందు నన్ను అవమానిస్తున్నాడు. రేపు ఆ జై సింహ ఫ్యామిలీకి కాబోయే కోడలని.. అందరూ నేను చెప్పినట్టు వినాలి..

అలాంటిది నన్ను ఏ విధంగా నువ్వు నా కొడుకు పక్కన సెట్ అవుతావు అని క్యూస్షన్ చేస్తాడా ఎంత ధైర్యం.

రమేష్ స్పందన......
[+] 7 users Like SivaSai's post
Like Reply
Part - 119



నా రేంజ్ ఏంటో తెలియక ఆ విక్రమ్ ఎగిరెగిరి పడుతున్నాడు అని ఆవేశపడుతుంది.  ఏమో బేబీ నువ్వు ఎక్కువ ఆలోచించుకుంటున్నావేమో..

ఆ విక్రమ్ కళ్ళు మన మీద పడకపోతేనే బెటర్.  కమాన్ డాడ్ ఏమి మాట్లాడుతున్నారు. ఆ సూర్య నేనంటే పడి చచ్చిపోతాడు.

అసలు నన్ను చూస్తేనే చొంగలు కార్చుతాడు. నిజమా అన్నట్టుగా చూస్తాడు. ఏంటి నమ్మకం లేదా..  సూర్య తో నాకు పెళ్లి అవ్వని.

ఆ విక్రమ్ తో రోజు సర్వీస్ చేయించుకుంటాను.   మార్నింగ్ బెడ్ కాఫీ కప్పు దగ్గరనుంచి నైట్ డిన్నర్ దాకా విక్రమ్ తోనే సర్వ్ చేయించుకుంటాను.

ఎక్కువ ఊహించుకుంటున్నావు బేబీ. నో డాడ్ ఇది ఖచ్చితంగా జరుగుతుంది.

అవని పడుకునే ముందు విక్రమ్ ని కదుపుతుంది.  ఏమైందే... ఎలాగు విశి ప్రాజెక్ట్ ఓకే అయిపోయింది కదా..
నిశ్చితార్థం పెట్టేసుకుందామండి. పెళ్లిళ్లు చేసేద్దాం. చాలా కంగారుగా ఉన్నట్టు ఉండదా..

సూర్య పుట్టగానే నాకు తెలియకుండా మీరు ఫ్యామిలీ ప్లానింగ్ చేయించేసుకున్నారు.  ఆ రోజు నువ్వు చాలా సఫర్ అయ్యావే.

చూడలేకపోయాను.  ఎవ్వరికైనా డెలివరీ టైమ్ లో కామన్. నాకు చాలా సరదాలు ఉన్నాయి. ఏమీ తీరలేదు. సూర్య విషయంలో బానే హ్యాండిల్ చేశావు కదా.

అబ్బా ఒక్కరికి చేసింది వేరు.  నలుగురికి చేసేది వేరు కదా... పడుకున్న విక్రమ్ లేచి కూర్చుని అంటే ఏమిటి ఇప్పుడు..

నీ కొడుకు నలుగురు ఐదుగురిని కనాల.  పాపమే విశి నీలాగానే సన్నగా ఉంటుంది.  పరవాలేదు దగ్గరుండి మరి మా అత్తగారు పెట్టినట్టుగా డ్రైఫ్రూట్ మిల్క్ షేక్ ఇస్తాను.

అంతేగాని ఆ పిల్లల కాన్సెప్ట్ మానవా.  ఒకవేళ విశి.. నాకు ఒక్కళ్ళే చాలు అంటే ఏం చేస్తావు. ఏం చేస్తాను మీ ఇష్టం అమ్మ అని సైలెంట్ అవుతాను.

సూర్య లోపలికి వస్తూ నేను జాయిన్ అవ్వచ్చా. ఎక్కువ చేశావు కానీ రా...రా..  ఇక్కడ మీ అమ్మ పిల్లలు ప్రోగ్రాం పెట్టింది.

పిల్లలు ప్రోగ్రామా అదేమిటి అంటూ వచ్చి తల్లి ఒళ్లో పడుకుంటాడు.  నీకు తక్కువలో తక్కువ ఒక ఐదుగురు పిల్లలు పుట్టాలంట.  ఆ మాటకి ఒక్కసారిగా పులమారుతుంది.

ఏమైందిరా అని వెన్ను నిమురుతుంది. అదేం కోరిక అమ్మ. ఏరా నిన్ను నేనేమైనా మణులు అడిగానా..  మాణిక్యాలు అడిగానా..

ఒక ఐదుగురు పిల్లల్నే కదా అడిగాను.  మణులు మాణిక్యాలు ఈజీ. అయిదుగురు పిల్లలు అంటే అమ్మో నేను అప్పుడు కిండర్ గార్డెన్ పెట్టుకోవాలి.

పర్వాలేదు ప్రిన్సిపల్ గా ఉండి పిల్లల్ని హ్యాండిల్ చేస్తాను.
ముగ్గురు పిల్లల గురించి సరదాగా మాట్లాడుకుంటారు.

రోజులు ముందుకు కదులుతూ  ఉంటాయి.  విశి ప్రాజెక్ట్ స్టార్ చేస్తుంది.  విశి కి సపోర్టర్ గా  భవ్యతోపాటు నలుగురు ఎంప్లాయిస్ కూడా  జాయిన్ అవుతారు.

విక్రమ్ డైరెక్షన్ విశి తనని తాను షైన్ చేసుకుంటూ ఉంటుంది. సూర్య బ్యాక్  సపోర్టు స్ట్రాంగ్ గా ఉంటాడు.

గౌతమ్ ఎక్కడ అవకాశం దొరుకుతుందా.. విశి ని లాక్ చేయాలా అని చూస్తూ ఉంటాడు.

ఒకరోజు విశి సూర్య కి దగ్గరిగా నిలబడి మాట్లాడుతూ ఉంటే ఫొటోస్ తీస్తాడు.  అందులో విశి ఫేసు క్లియర్ గా ఉండేటట్టుగా సూర్య బ్యాక్ ఉండేటట్టుగా సెట్ చేసుకుని మరీ తీస్తాడు.

ఆ ఫొటోస్ అన్ని విశి కి పంపించి ఏమిటి విశిష్ట..  ఎవరితో రొమాన్స్ చేస్తున్నావు అని వంకరగా మాట్లాడతాడు. పిచ్చిపిచ్చి వేషాలు వేయకు గౌతమ్ అని కోపంగా అంటే..

అరే నువ్వు చేసిన పని చెబితే ఎందుకు కోపం వస్తుంది. వి. జె. ఎస్ కంపెనీలో ఎలా ప్రాజెక్టు వచ్చిందా అని ఆశ్చర్యపోయాను.

నీ సొంత టాలెంట్ ఏమో అప్రిషియేట్ చేద్దామనుకున్నాను. కానీ అక్కడ ఎవరినో పట్టావు అనుకుంట.  అందుకే నీకు లైన్ దొరికింది.

బాగుంది ముందు నన్ను.  తర్వాత ఆ లెక్చరర్ దేవాని.. ఇప్పుడు ఇంకొకడిని.

అక్కడితో ఆగావా లేక పైన ఉన్న వాళ్ళని కూడా.. చెంప పైన కొడుతుంది.  నన్నే కొడతావా.  కొట్టక..  ఏది పడితే అది మాట్లాడడమేనా.

ఒక ఆడపిల్ల కష్టపడి నిలబడితే దానికి ఇన్ని వంకలు వెతకాల.  అయినా నేను ఎవరితో తిరిగితే నీకెందుకు..

నీకు నా జీవితంపై ఏ హక్కూ లేదు గౌతమ్.  అంటూ విశి కళ్లలో నీళ్లు తిరుగుతాయి.

కానీ ఆ కన్నీళ్లు బలహీనతవి కావు…  అవి కోపంతో, ఆత్మగౌరవంతో ఉప్పొంగుతున్నవి.

గౌతమ్ చిరునవ్వుతో దగ్గరకి వస్తాడు.
హక్కా…?
అవును ఉంది.
నిన్ను నీలా తయారుచేసింది నేనే అని అనుకుంటున్నాను.

అంతే…
చెంప మీద మళ్లీ ఒక చప్పుడైన దెబ్బ.
ఇది నిన్ను కాదు…  నీ ఆలోచనల్ని కొట్టింది.
నువ్వు నన్ను ఏ స్థాయిలో చూస్తున్నావో  అదే నీ మానసిక స్థాయి.

నా కెరీర్, నా సక్సెస్  ఏ మగాడి భిక్ష కాదు.
అంతలో సూర్య అక్కడికి వస్తాడు.
విశి చేతులు వణుకుతున్నాయన్నది అతని కళ్లకి వెంటనే కనిపిస్తుంది.

ఏమైంది విశి…?  అని అడిగే లోపే
గౌతమ్ తాను గొప్పవాడినన్నట్టు మాట్లాడతాడు.
హలో దేవా..  నీ వల్లే ఈమెకు ప్రాజెక్ట్స్ వస్తున్నాయట.
నువ్వు లేకపోతే ఈమె జీరో. పైగా ఆఫీసులో కూడా ఎవరినో ఆ మాట పూర్తయ్యేలోపు సూర్య చూసిన చూపుకి మింగేస్తాడు.

సూర్య ఒక్క క్షణం కూడా ఆలోచించడు.  అవును.
నేను సపోర్ట్ ఇచ్చాను.  ఎందుకంటే ఆమెకు టాలెంట్ ఉంది.

టాలెంట్ లేని వాళ్లకి  ఎన్ని డోర్లు తెరిచినా  లోపలికి వెళ్లలేరు. అని గట్టిగా చెబుతాడు.
గౌతమ్ ముఖంలో రంగులు మారుతాయి.

నీకు తెలియదేమో… ఈ ప్రాజెక్ట్ మొత్తం విశి ఒంటరిగా పగలనక రాత్రనక  కష్టపడి నిలబెట్టింది.

నేను చేశింది ఒక్కటే…  వెనక నిలబడి ఆమె పడిపోకుండా చూడటం.  ఇక చాలంటూ విశి ముందుకు వస్తుంది.
ఇదే నా లాస్ట్ వార్నింగ్ గౌతమ్.

మళ్లీ నా మీద,  నా క్యారెక్టర్ మీద  ఒక్క మాట మాట్లాడినా  లీగల్ గా కాదు…
ప్రొఫెషనల్ గా కూడా నీ కెరీర్ ఇక్కడితో క్లోజ్.

నువ్వు నన్ను భయపెడతావా…?  అని నవ్వుతాడు గౌతమ్.  విశి ప్రశాంతంగా ఫోన్ తీస్తుంది.
ఆ ఫొటోలు…  ఆ మెసేజ్ లు…  అన్నీ స్క్రీన్ మీద చూపిస్తుంది.

ఇవి చాలు.  వీటితో నువ్వు నన్ను కాదు… నీ నిజ స్వరూపాన్ని చూపించావు.  సూర్య ఆమె చేతిని పట్టుకుంటాడు.

ఇక చాలు విశి.  ఇక్కడ ఉండాల్సిన పని లేదు.
వెళ్లిపోతూ విశి ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తుంది.
ఒక ఆడపిల్ల ఎదుగుతుంటే  దాన్ని కూల్చాలనుకునే వాళ్లు
అప్పుడూ ఉంటారు.

కానీ నన్ను కూల్చడం కాదు…  నన్ను ఇంకా బలంగా చేస్తారు.  అంటూ బయటకి నడుస్తుంది.
వెళుతున్న విశి నే చూస్తూ చెంపపై చెయ్యి వేసుకుంటాడు.

గౌతమ్ మాత్రం అలా నిలబడిపోడు.  కుర్చీలో కూర్చుని,
చెంప మీద పడిన దెబ్బని కాదు…  తన అహంకారానికి తగిలిన గాయాన్ని తడుముకుంటాడు.

నన్ను అవమానించిందా…? నా ముందు… నా ముందు ఆడపిల్ల…?  ఫోన్ తీస్తాడు.  ఒక నెంబర్ కి డయల్ చేస్తాడు.
హలో…  చెప్పండి సార్.. వి.జె.ఎస్ ప్రాజెక్ట్ కదా…  డాక్యుమెంట్స్ అన్నీ నీ దగ్గరే ఉన్నాయా?

అటు నుంచి చిరునవ్వుతో వాయిస్.  ఉన్నాయి సార్.
మీరు చెప్పినట్టే…  ఫస్ట్ డ్రాఫ్ట్ నుంచి లాస్ట్ అప్రూవల్ వరకు.

గౌతమ్ కళ్లలో చీకటి మెరుపు.  బాగుంది.  చిన్న మార్పు చేయాలి.  చాలా చిన్నది.  కానీ దాని ఎఫెక్ట్…  పెద్దది కావాలి.

అదే రోజు సాయంత్రం  విశి ఇంట్లో ఉంటుంది.
ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి కొత్త ఐడియాస్ నోట్ చేసుకుంటూ….

అందులో ఒక చిరునవ్వు. ఇది నా కెరీర్ టర్నింగ్ పాయింట్…

అంతలో ఫోన్ మోగుతుంది.
అన్నోన్ నెంబర్...
లిఫ్ట్ చేస్తుంది.

మీరు విశిష్ట కదా…?
అవును. ఎవరు…?

మీ ప్రాజెక్ట్ మీద  రేపు బోర్డ్ మీటింగ్ ఉంది.  మీరు ఇచ్చిన డేటాలో  కొన్ని డిస్క్రిపెన్సీస్ కనిపిస్తున్నాయి.
విశి ముఖం ఒక్కసారిగా మారుతుంది.

అది ఇంపాజిబుల్.  అన్ని ఫైల్స్ నేను స్వయంగా చెక్ చేశాను. అయితే రేపు తెలిసిపోతుంది మేడం.
రెడీగా ఉండండి.

కాల్ కట్.

విశి చేతులు వణుకుతాయి.  కానీ వెంటనే తనని తాను కంట్రోల్ చేసుకుంటుంది.

అదే సమయం...

గౌతమ్ బాల్కనీలో నిలబడి నైట్ సిటీని చూస్తూ…
ఇప్పుడు చూద్దాం విశిష్ట… నీ టాలెంట్ ఎంత స్ట్రాంగో
లేక నీ సపోర్ట్ ఎంత వరకూ వస్తుందో…  అంటూ స్మైల్ చేస్తాడు.

విశిష్ట ఈ ప్రాబ్లం నుంచి బయటపడగలుగుతుందా..
[+] 8 users Like SivaSai's post
Like Reply
Part - 120



విశి కి వచ్చిన కాల్ తో ఊపిరి ఆడదు.. కుదురుగా ఉండలేక పోతుంది.  ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే సూర్యకి కాల్ చేస్తుంది.

ఈ టైం లో విశి ఫోన్ ఏమిటని లిఫ్ట్ చేస్తే..  టెన్షన్ గా హలో దేవా సార్ అంటుంది.  ఏమైంది విశి అంత టెన్షన్ గా ఉన్నావు.

సార్ ఇప్పుడే ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. ఈ టైం లోన.. ఏమిటి. జరిగింది మొత్తం చెబుతుంది. అదంతా విని నేను కనుక్కుంటాను.

మీకు ఆ కంపెనీ లో ఎవరో తెలియదు కదా సార్. నేను కనుక్కుంటాను నాకు ఉండే దారులు నాకు ఉంటాయి. టెన్షన్ పడకు.

బి కూల్ అని పెట్టేసి తండ్రి దగ్గరికి వెళతాడు. ఈ టైం లో ఏంట్రా విశికి కాల్ వచ్చిన విషయం చెబుతాడు. విక్రమ్ ఆశ్చర్యంగా విశి ప్రాజెక్ట్..  నేనే హ్యాండిల్ చేస్తున్నాను కదా.

నేను కాకుండా  కాల్ వచ్చిందంటే.. పీఏ కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కావాలి అని చెబుతాడు.. జస్ట్ టెన్ మినిట్స్ సార్..  మొత్తం కనుక్కొని విక్రమ్ కి మెసేజ్ పాస్ చేస్తాడు.

అదంతా చూసి విక్రమ్ సైడ్ స్మైల్ ఇస్తాడు.  ఏమైంది డాడీ.. నథింగ్ మనం విశి ప్రాజెక్ట్ లో కొంతమందిని రిక్రూట్ చేశాము కదా..  వాళ్లలో ఒకడా గౌతమ్ కి అమ్ముడుపోయాడు.

డోంట్ వర్రీ రేపు ఓకే దెబ్బకి రెండు పిట్టలు విశి ప్రాజెక్టు మీద వాళ్ళు పెట్టిన ఎలిగేషన్స్ కి క్లియరెన్స్ ఇవ్వడం.  నిన్ను కంపెనీ డైరెక్టర్ గా అనౌన్స్ చేయడం.

ప్లీజ్ డాడ్.. నాకు ఇప్పుడే అవేమీ వద్దు లేదు. ఇప్పటికే లేట్ చేశావు. నువ్వు ఎవరో అన్నది తెలిస్తేనే ఆ గౌతమ్ క్లోజ్ అవుతాడు. ఆ హిమ నోరు మూస్తుంది.

కానీ క్యూటీ అంటే.. అది నీ పర్సనల్ ప్రాబ్లం రోయ్..  నువ్వు సాల్వ్ చేసుకోవాలి.. ఎంతసేపు లవ్ లవ్ అని తిరగడమే కాదు దాని పట్టాలు కూడా ఎక్కించి మూడు ముళ్ళు వేయడానికి కూడా అడుగు ముందుకు వేయాలి.

సరే డాడ్ మీ ఇష్టం. ఏదైనా మీరు ఆలోచించే చేస్తారు.  నేను క్యూటీ కి కాల్ చేస్తాను.. ఇప్పటికే టెన్షన్ తో జుట్టు పీక్కుంటూ ఉంటుంది అని ఫోన్ చేస్తాడు.

చెప్పండి దేవా సార్. నో ప్రాబ్లం అంతా సాల్వ్ అయ్యింది. రేపు నువ్వు మీటింగ్ కి అటెండ్ అవ్వు.అలాగే ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది.

సర్ప్రైజ్ ఏమిటి సార్ అని టెన్షన్ పడుతోంది.. అబ్బా నువ్వు టెన్షన్ పడేది కాదు. హ్యాపీగా ఫీల్ అయ్యేదే..
ఓకే సార్ మీరు చెప్పారు అంటే అది హ్యాపీ న్యూసే.

ఏమిటి అని అడగవా..  అడగవలసిన అవసరం లేదు. చిన్నగా నవ్వుకుంటాడు.  సరే టేక్ రెస్ట్. రేపు ఆఫీసులో కలుద్దాం అని ఫోన్ పెట్టేస్తాడు.

గౌతమ్ నువ్వు ఇప్పటివరకు ఎన్ని వేషాలు వేసిన నీ లైఫ్ స్పాయిల్ అవ్వకూడదు అని వార్నింగ్ ఇచ్చాను.. బట్ నీకు ఆ వార్నింగ్ సరిపోలేదు. సో రేపటితో నీకు శుభం కార్డు వేస్తాను అని సూర్య మనసులో అనుకుంటాడు.

ఉదయమే తొందరగా లేచి విశి ఫాస్ట్ గా రెడీ అయ్యి... భవ్యకి కాల్ చేసి డైరెక్ట్ గా ఆఫీస్ కి వచ్చేయమనీ... రోజు వెళ్ళే టైం కన్నా ముందే వెళుతుంది.


మీటింగ్ హాల్ మొత్తం సైలెంట్. విశి చేతిలో ఫైల్ పట్టుకుని కూర్చుంది.  ముఖంలో భయం…
ఏం జరగబోతుందో… అనే ఆలోచన. బోర్డ్ మెంబర్స్ ఎంటర్ అవుతారు.

చివరగా విక్రమ్ లోపలికి వస్తాడు. విక్రమ్ గంభీరంగా చూస్తూ... రావడంతోనే అందరినీ చూస్తాడు విశి  ప్రాజెక్టులో ఉన్న మెంబర్స్ అందరినీ కూడా అక్కడ ఉండమని ఆర్డర్ వేస్తాడు.

విశి ప్రాజెక్ట్ మీద వచ్చిన ఎలిగేషన్స్ గురించి ముందుగా మాట్లాడుదాం అని అందరినీ చూస్తూ అనుమానం ఉన్న వ్యక్తి వైపు కిల్లింగ్ లుక్ ఇస్తాడు.  ఆ లుక్ కి ఆ వ్యక్తికి గుండె జారిపోతుంది.

విశి గుండె జోరుగా కొట్టుకుంటుంది. విక్రమ్ సిగ్నల్ ఇవ్వగానే స్క్రీన్ ఆన్ అవుతుంది.
డేటా… మెయిల్స్… కాల్ లాగ్స్… ఫుటేజ్…
గౌతమ్ చేయించిన మానిప్యులేషన్ మొత్తం బయటపడుతుంది.

బోర్డ్ మెంబర్ ఒకరు...  ఇది క్లియర్‌గా ప్లాన్డ్ అటాక్. విశి ఇందులో ఇన్వాల్వ్ కాదు.
మరో వ్యక్తి
ఆమె ప్రాజెక్ట్ కాకుండా కంపెనీ మీదే మచ్చ వేయాలని చూశారు.

విక్రమ్ స్ట్రాంగ్‌గా చెబుతాడు...
ఇప్పటితో విశి మీద ఉన్న అన్ని ఎలిగేషన్స్ పూర్తిగా క్లియర్.
విశి కళ్లల్లో నీళ్లు…
ఆశ్చర్యం…
రిలీఫ్…
అన్నీ ఒకేసారి.
ఈ పని చేయడానికి పాల్పడిన వ్యక్తిని మన కంపెనీ నుంచి పూర్తిగా బయటికి గెంటేస్తున్నాను.. అలాగే ఈ ఫ్రాడ్ చేసినందుకు సెక్యూరిటీ ఆఫీసర్లు కూడా సన్మానం చేస్తారు.

ప్లీజ్ సార్ ప్లీజ్ అని బ్రతిమాలుతాడు.  నో మిస్టర్.  నిన్ను ఆ గౌతమ్ మేనిప్లేట్ చేస్తున్నప్పుడు నా దగ్గరికి వచ్చి చెప్పి ఉంటే నీకు ఈరోజు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు.

ఒక ఆడపిల్లని ఇబ్బంది పెట్టడానికి సపోర్ట్ ఇచ్చావు చూడు అది నేను ఎవ్వరైనా సరే ఒప్పుకోను.

విక్రమ్ చిన్న పాజ్ తీసుకుని...  ఇప్పుడు రెండో అనౌన్స్‌మెంట్.  అందరూ చూస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్‌ను బ్యాక్ ఎండ్ నుంచి లీడ్ చేసిన వ్యక్తి…
ఈ కంపెనీకి కొత్త డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకోబోతున్నాడు.

డోర్ ఓపెన్ అవుతుంది.  లోపలికి అడుగుపెడతాడు…
సూర్య.  విశి ఒక్కసారిగా స్టిఫ్ అయిపోతుంది.
దేవా సార్… ఇక్కడ?

విక్రమ్ నవ్వుతూ..  విశి వైపు చూస్తూ సూర్య భుజం పైన చేయి వేసి.. దేవా సార్ అని పిలిచిన వ్యక్తే…
సూర్య దేవాన్ష్ జై సింహ..
జై సింహ ఎంపైర్ వారసుడు మా తరువాత కంపెనీలు హ్యాండిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
అక్కడ శ్రీకర్ వైభవ్ కూడా ఉంటారు. వాళ్ళని కూడా పరిచయం చేస్తాడు.

విశి కి మాటలు రావు.  కళ్లల్లో నమ్మలేని షాక్.  సూర్య ఆమెవైపు చూసి చిన్నగా నవ్వుతాడు.  అదే నవ్వు…
ఫోన్‌లో ఎప్పుడూ వినిపించే ధైర్యం. కంటికి కనిపించే నమ్మకం.


మీటింగ్ అయిపోతుంది.  అందరూ బయటకి వెళుతూ ఉంటారు. విశి కూడా నెమ్మదిగా వెళుతూ ఉంటే ఆల్ ద బెస్ట్ అని వైభవ్, శ్రీకర్ కామ్ గా వెళ్ళిపోతారు.

వెళుతున్న విశి నీ క్యూటీ అని పిలుస్తాడు. ఆగిపోతుంది. ఏమీ అడగవా.. ఏమి అడగాలి సార్. నీ మనసులో ఉన్న ప్రశ్న.  ఏదైనా..

నన్ను అడిగే హక్కు అధికారం స్వతంత్రం స్వేచ్ఛ ఏదైనా పేరు పెట్టుకో.. అన్ని ఉన్న నా జీవితంలో ఉన్న ఒకే ఒక్క ప్రాణానివి.

విశి నెమ్మదిగా అడుగుతుంది..  అంటే… మీరు… దేవా సార్… సూర్య…
నిన్ను భయపెట్టకూడదని చెప్పలేదు విశి.
నిన్ను కాపాడాలన్నది మాత్రమే నిజం.

మీటింగ్ రూమ్  ని రిమోట్ తో లాక్ చేసి విశి చెయ్యి పట్టుకుని దగ్గరికి తీసుకుంటాడు.  అక్కడ కుర్చీలో కూర్చుని వడిలో కూర్చోపెట్టుకుంటాడు. తల కింద కు దించుకునే ఉంటుంది.

విశి కళ్లలో నీళ్లు జారుతాయి. చిన్నప్పటి స్నేహమైన క్యూటీని వెతుకుతున్న దారిలో నువ్వే క్యూటివి అని తెలిసింది.

నేను ఎవరో అన్నది చెప్పినా నీకు తెలియదు అని నీతో స్నేహం చేయాలి అని దేవాగా పరిచయం చేసుకున్నాను.
నీకు దగ్గరవుతూ నీ చుట్టూ ఉన్న సమస్యలకి చెక్ పెడుతూ వచ్చాను. మరి ఈ ప్రాజెక్టు.  మదర్ ప్రామిస్. ఇది మొత్తం నీ టాలంటే.

డాడీ ఎప్పుడైనా సపోర్ట్ ఇస్తారు గానీ రికమండేషన్ అంటే కొడుకును అని కూడా చూడరు. నీ ప్రాజెక్ట్ ని పర్సనల్ గా హ్యాండిల్ చేశారు.

నన్ను నమ్మారు కదా…  సూర్య స్ట్రాంగ్‌గా.. నా ప్రాణాన్ని నేను నమ్మకుండా ఉంటానా.  నీ టాలెంట్ మీదే నువ్వు ఇది తెచ్చుకున్నావు.

మరి ఇప్పటివరకు.  ప్లీజ్ చెప్పాను కదా చెబితే ఎలా రియాక్ట్ అవుతావో అని చెప్పలేదు అంతే. ఈ ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ అయ్యి.. ప్రపంచానికి నువ్వు తెలిసిన తర్వాతే నేను అన్నది నీ ముందుకు రావాలి అనుకున్నాను.

ఆ ఇడియట్ గౌతమ్ వలన నీ ప్రాజెక్ట్ మిడ్ లోనే నేను రావాల్సి వచ్చింది.  ఇది కూడా ఒక రకంగా మంచిదే అనుకో.  ఎలా..

ఎలా ఏమిటి..  మన పెళ్లి జరిగిపోతుంది.  మన పెళ్లి అవుతే వెనకాల ఉన్న జంటలన్నీ రెడీగా ఉన్నారు.  ఆ మాటకి చిన్నగా నవ్వుతుంది. ఇలా నవ్వుతూ ఉండు చాలు అని హగ్ చేసుకుంటాడు.

సూర్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటే... విశి కంగారుగా లెగబోతుంది.  నువ్వు ఇలాగే కూర్చో నాకు కంఫర్ట్ గా ఉంది అని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా.

బావ ఇంకా బయటికి వస్తే లంచ్ చేయొచ్చు.  అంకుల్,  అందరూ వెయిట్ చేస్తున్నారు..ఇప్పుడే వస్తున్నాము అని క్యూటి వెళదామా.

డాడీ వెయిట్ చేస్తున్నారు. అమ్మో దేవ సార్..  నాకు సార్ అంటే చాలా భయం.  ఆ మాటకి నవ్వుతూ డాడీ మీటింగ్స్ లో వేరు.  ఫ్యామిలీ లైఫ్ లో వేరు.

రా అది కూడా టేస్ట్ చూడు అని చేయబట్టుకుని తీసుకువెళ్తాడు.

ఆ రూమ్ లోకి వెళ్ళగానే ఒక్కసారిగా బెలూన్స్ పేలాతాయి.  వెల్కమ్ టు అవర్ స్వీట్ హోమ్ అని అందరూ గట్టిగా అరుస్తారు.

ఆ అరుపులు కి బిత్తర చూపులు చూస్తూ సూర్య చేతిని గట్టిగా పట్టుకుంటుంది.

విశి రియాక్షన్...

కథ కొనసాగుతుంది.........
[+] 9 users Like SivaSai's post
Like Reply
Excellent update
[+] 2 users Like Sachin@10's post
Like Reply
Awesome development in the story...
[+] 1 user Likes Sunny73's post
Like Reply
Awesome unnay all the updates.
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Marvelous
[+] 1 user Likes styleraja's post
Like Reply




Users browsing this thread: