Posts: 898
Threads: 13
Likes Received: 7,038 in 832 posts
Likes Given: 1,545
Joined: Aug 2024
Reputation:
652
Part - 99
వైభవ్ ఫోన్ వైపు చూస్తూ కూర్చుంటాడు. ఎంతసేపు చూస్తున్నా ఫోన్లో ఏమీ కనిపించదు అన్నమాట వినిపించగానే వెనక తిరిగి చూస్తాడు.
అక్కడ తండ్రి ఉంటే నాన్న అని చంక ఎక్కి ఏడుస్తూ ఉంటాడు. ముందు దిగరా.. నువ్వు ఏమైనా చంటి పిల్లోడివి అనుకుంటున్నావా..
మొయ్యలేకపోతున్నాను. నేను ఏడుస్తూ ఉంటే ఓదార్చడం మానేసి తిడుతున్నారా.. అమ్మకు చెబుతాను. ముందు దిగాహే అని కిందకి దింపి ఇప్పుడు చెప్పు ఏమయిందో..
చందు నా ప్రేమనే అనుమానిస్తుంది.. సరిగ్గా చెప్పు చావు. అరే నేను ప్రేమిస్తున్నాను అంటే ఎవరితోనో బెట్ కట్టి నన్ను టీజ్ చేయాల్సిన అవసరం లేదు.
ఇలాంటి పిచ్చి పనులు మాను.. నేను బిజీ అని పెట్టేసింది. నేను ప్రేమిస్తున్నాను అని చెబితే అంత కామెడీగా ఉందా.. అసలు పట్టించుకోలేదు.
ప్రేమిస్తున్నాను అని చెబితే సరిపోదు రా దాన్ని సిన్సియర్‌గా ఎక్స్‌ప్రెస్ చేయడం రావాలి. ఏం చేయాలి నాన్న. అప్పటికి సినిమాలు చూశాను. బుక్స్ చదివాను. అవన్నీ ప్రిపేర్ అయ్యి మరీ చెప్పాను. అందుకే నీకు బెడిసి కొట్టింది.
మీ అన్నయ్యని చూడు ప్రేమిస్తున్నాను అని నోటితో చెప్పడం లేదు చేతల్లో చూపిస్తున్నాడు. పక్కనే ఉంటే మీ బాబి ఎంత భరోసాగా ఫీల్ అవుతుంది.
ఆ భరోసాని నువ్వు చందు కి ఇవ్వు. అర్థం అయింది. ఇప్పుడు చందు ఏదో వర్క్ లో బిజీగా ఉంది కదా...దానితోనే ఉంటూ ఆ వర్క్ లో అంతా హెల్ప్ చేయాలన్నమాట..
అంతే కదా.. ఇంచుమించు అలాంటిదే.. కాకపోతే సెటైర్లు వేయడం కామెడీ చేయడం తగ్గించు.. అయ్యో నాన్న దాన్ని చూడగానే నా నోరు ఆగదే.. అందుకే అది నిన్ను నమ్మడం లేదు.
వైభవ్ ముఖం చిట్లించి, కిందికి చూస్తాడు.
అంటే నాన్నా… నేను చాలా ఓవర్‌యాక్ట్ అవుతానన్నమాట?
వినయ్ నవ్వేస్తాడు. ఓవర్ యాక్ట్ కాదు రా… ఓవర్ లౌడ్. చందు ఎంత గలగల మాట్లాడేది అలాంటిది ఎందుకో సైలెంట్ అయిపోయింది.
అది ఎందుకో అర్థమైనా వైభవ్ కామ్ అవుతాడు. ఏంట్రా చందు కామ్ అయిందంటే నువ్వు సైలెంట్ అవుతున్నావు.
వైభవ్ మెల్లిగా నవ్వుతాడు. అలాగైతే నేను నోరు మూసుకుంటా.
అది కాదు రా..తండ్రి అతని భుజం మీద చేయి వేసి, చందుకి నువ్వు కోపంగా కాకుండా… సీరియస్ గా, హార్ట్ నుంచి మాట్లాడటం కావాలి. అదే నమ్మకం.
అంతలో వైభవ్ ఫోన్ తిరిగి చెక్ చేస్తాడు.
చందు నుంచి రిప్లై లేదు.
ఇంకా మెసేజ్ చేయలా? అంటూ వైభవ్ మెల్లిగా అనుకుంటాడు.
లేదురా… ఇప్పుడే నువ్వు ఫోన్ చేసి మాట్లాడిన తింగరవాగుడికి రిప్లై ఇవ్వడానికి సమయం కావాలి అమ్మాయికి. నువ్వు వెంట వెంటనే మెసేజ్ లు పెడితే అది మరీ… నీ ఖర్మ
స్టాకర్ లా కనిపిస్తానా…?
అదీ కాదు రా. కానీ నీ టెన్షన్ మొత్తం ఆమెకి ఫార్వర్డ్ అవుతుంది. కాస్త స్పేస్ ఇవ్వి. ఆ స్పేస్ లోనే నువ్వు నీ పని ఆలోచించు...ఆమెకి ఎలా భరోసా ఇవ్వాలో.
వైభవ్ కళ్లలో చిన్న మెరుపు పడుతుంది. నాన్న… నేను నిజంగానే చందు ను మిస్ అవుతున్నాను. ఫన్నీగా కాకుండా, రియల్‌గా చెప్పాలని ఉంది.
వినయ్ చిరునవ్వు. అదే రా ప్రేమ. ఇప్పుడు ఒక పని చేస్తావా?
ఏంటి నాన్న?
చందు ఎదో వర్క్ బిజీ లో ఉంది అని తెలిసినది కదా…? అసలు ఆమె ఏ బాధలో ఉందో, ఏ పనిలో బిజీగా ఉందో… ఆ సమయానికి ఆమెకి బెస్ట్‌గా ఏం హెల్ప్ అవుతుందో ఆలోచించు. నువ్వు వెళ్లి మాట్లాడడం కాదు… పని చాలా టైట్‌గా ఉంటే చిన్న థాట్ఫుల్ మెసేజ్, చిన్న హెల్పింగ్ యాక్ట్… అలాంటి జెస్టర్స్.
వైభవ్ చెవులు ముందుకు పెట్టి వింటూ ఉంటాడు.
అంటే… చందు పని తగ్గించడమా?
అవును రా. నీ ఫన్నీ జోక్స్ లో చిక్కుకోకుండా, ఆమె స్ట్రెస్ తీయడం నీ పని.
అది నేను చేస్తాను నాన్న! ఆమె పని, ఆమె డెడ్‌లైన్, ఏదైనా నేనేం సాయం చేయగలనో…
అంతలో ఉసురుమంటూ చూస్తూ.. కానీ ఒకటి చెప్పు నాన్న.. నేను సెటైర్లు మొత్తం ఆపేయాలా?
వినయ్ ఊపిరి తీసుకుంటూ.. పది లో ఏడు ఆపు.
అయ్యోఓఓ...
అదే ఎక్కువ రా… చందుకైతే అతి.
వైభవ్ నవ్వి తల గోక్కుంటాడు. సరే. ఈరోజు నుంచే పర్ఫెక్ట్ లవర్ అవుతా. చందు నన్ను తిరిగి నమ్మాలి.
వినయ్ అతని వెన్నుపై తడతాడు.
అదే కావాలి రా. నీ హృదయం సీరియస్‌గా ఉంటే… నీ మాటలు కూడా ఒక రోజు సీరియస్‌గా వినిపిస్తాయి.
వైభవ్ లోలోపల కాస్త కాన్ఫిడెన్స్ రావడం మొదలవుతుంది. నాన్నా… ఇప్పుడే వెళ్తా. చందు ఏం వర్క్ చేస్తుందో చెక్ చేస్తా… ఏదైనా హెల్ప్ కావాలంటే నేనే ముందు నిలబడతా.
వినయ్ నవ్వుతూ.. అయితే పో. కానీ...
మరేం నాన్న… అని వైభవ్ తిరిగి చూస్తాడు.
ఈ సారి ఫోన్ ముందు కూర్చుని ఏడవకు. అవసరం వచ్చినప్పుడు మాట్లాడి, సెన్సిబుల్‌గా హ్యాండిల్ చెయ్యి.
వైభవ్ చేతిని ఎత్తి సల్యూట్ పెట్టాడు.
యెస్ సర్.. అంటూ బయటకి ఉత్సాహంగా పరుగెత్తుతాడు.
కొడుకు అల్లరి చూసి నవ్వుకుంటాడు..ఇంత వయసు వచ్చిన వీడికి అల్లరి పోలేదు. నీకేమైనా తగ్గిందా. అరే నువ్వు ఎప్పుడు వచ్చావు పూజిత.
కొడుకుకి ప్రేమ పాటలు నేర్పిస్తున్నప్పుడు వచ్చాను. మనలాగా వాళ్ళు కూడా క్యూట్ లవర్స్ అవ్వాలి కదా..
మనం లవర్స్ అని ఎవరు చెప్పారు. నిజమే నువ్వు లవ్ చేసావు నేను చేయాల్సి వచ్చింది అంతే కదా.. మిమ్మల్ని అని చెయ్యెత్తితే అరిచేతి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ బంగారం.
ఈ వేషానికి ఏమీ తక్కువ లేదు. పదండి అని నవ్వుతుంది. నీ నవ్వు చాలే బతికేయడానికి..
వైభవ్ రాజ్ ఇంటికి వెళ్లి హాయ్ మావయ్య అని పిలిస్తే ఏంట్రా పొద్దున్నే నీ గాలి ఇటు మళ్ళింది. మా అత్తయ్య ఎలా ఉందో...నువ్వు ఎలా చూసుకుంటున్నావో అని బెంగపడి వచ్చాను మావయ్య.
ఒరేయ్ నువ్వు తిన్నగా మాట్లాడు. లేనిపోని మాటలు మాట్లాడి కొత్త అనుమానాలు పుట్టించి మా మధ్యన పుల్లలు పెట్టకు.
నివి వచ్చి ఒరేయ్ ఎంతసేపయిందిరా.. టిఫిన్ చేసావా వేడివేడిగా పూరీలు వెయ్యనా. మాకేమో ఇడ్లీలు నీ మేనల్లుడికి పూరీలా.
అబ్బా మీ వయసుకి ఇడ్లీయే తినాలి. డైజేషన్ బాగుంటది. వాడు వయసులో ఉన్నాడు. ఏది తిన్న అరుగుతుంది. నా వయసు ఏమన్నా ఎక్కువ.
ఏదో 70 ఏళ్ళు వయసు ఉన్న వాడిని అన్నట్టు చెబుతున్నావు.
అయ్యో మావయ్య మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈజీ డైజేషన్ వి తింటే ఎప్పటికీ యంగ్ డైనమిక్ గా ఉంటారని అత్తయ్య ఉద్దేశం.
అత్తయ్య మిమ్మల్ని హీరోలాగా చూడాలి అనుకుంటే దాన్ని మీరు తప్పుగా అనుకుంటున్నారు.
నివి ముక్కు చీదుతూ అంతే రా నేను ఎంత చేసినా మీ మావయ్య అలాగే పేర్లు పెడతారు.
రాజ్ ఒక నమస్కారం చేసి ఇద్దరూ కిచెన్ లోకి వెళ్లి ఏది కావాలో అది చేసుకోండి. నన్ను ఇన్వాల్వ్ చేయకండి.
ఇది బాగుంది. పద అత్తయ్య అని కిచెన్ లోకి తీసుకువెళతాడు.
నివి పూరీ కోసం పిండి కలుపుతుండగా వైభవ్ కూర్చుంటాడు.
రాజ్ నీళ్ళ గ్లాస్ పక్కకు తోసుకుంటూ... పక్కనే సెట్టిల్ అవుతాడు. మళ్లీ మీరు ఎందుకు వచ్చారు. మా ఆవిడ ఎంత అలసిపోతుందో చూద్దాం అని..
మీ మావయ్యకి ఒళ్లంతా వెటకారమే.. ఏమిటి మీ సింహ ఫ్యామిలీ కన్నానా..
మావయ్య మీకు ఏదైనా కావాలా.. టీ కావాలి. మీ ఇద్దరి గోలకి నా బ్రెయిన్ ఆన్ అవదు.
మావయ్య… మీ బ్రెయిన్ ఆఫ్ అయ్యే టైం ఏదైనా ఉందా? 24/7 పనిచేస్తుంది కదా. టర్బో మోడ్‌లో.
ఒరేయ్! నన్ను పొగిడుతున్నావా లేక పరోక్షంగా ఏమైనా తిడుతున్నావా..
పొగడ్తే మావయ్య. మీ లెవెల్‌కి రావాలంటే నేను రెండు జన్మలు ఎత్తాలి.
నివి నవ్వుతూ...రెండేమో… మూడు ఎత్తాలి. మీ మామయ్యకి ఈగో కూడా కాస్త ఎక్కువ.
నాకు ఈగో అని పైకి చూస్తాడు. ఏం లేదా మావయ్య..
ఎంతన్నా మాట్లాడండి… కానీ ఇప్పుడైనా ఒకరు టీ చేస్తారా? లేక నేనే చేసికోవాలా?
అయ్యో వద్దు మావయ్య… మీరు చేసిన టీ అంటే ప్యారాసిటమాల్ డ్రింక్‌లా ఉంటుంది. మీ చేతుల మీద నమ్మకం లేదయ్యా..
నువు చేసిందే టీనా? గతసారి చక్కర వేసినట్టు వేసావ్… కానీ రుచి మాత్రం పానకం..
చాలు మీ ఇద్దరూ! నేను చేస్తా… కానీ రాజ్ మీకు షుగర్ లేకుండా, వైభవ్‌కి స్పెషల్‌గా అదనంగా చక్కర.
నాకెందుకు షుగరు వద్దు. డైట్ అండి. తల పట్టుకుంటాడు.
ఏమయింది మామయ్య. హెడేక్ వస్తుందా. చందు ఉందా ఇంట్లో. ఇప్పుడు చందు తో నీకేం పని రా.. చందు ఉంటే మీ హెడేక్ కి మెడిసిన్ తెస్తుందేమో అని చందు చందు అని పిలుస్తూ ఉంటాడు.
చందు పలుకుతుందా........
Posts: 898
Threads: 13
Likes Received: 7,038 in 832 posts
Likes Given: 1,545
Joined: Aug 2024
Reputation:
652
Part - 100
ఏమయింది మామయ్య. హెడేక్ వస్తుందా. చందు ఉందా ఇంట్లో. ఇప్పుడు చందు తో నీకేం పని రా.. చందు ఉంటే మీ హెడేక్ కి మెడిసిన్ తెస్తుందేమో అని చందు చందు అని పిలుస్తూ ఉంటాడు.
అది లేదురా. పొద్దున్నే ఎక్కడికి వెళ్ళింది. దానికి కూడ పనులు ఉంటాయి కదా.. అబ్బా నెల పైనుంచి చూస్తున్న పనీ పనీ పనే అంటున్నారు కానీ ఏం పనో చెప్పడం లేదు.
చెబితే నేనేమైనా హెల్ప్ చేయడానికి ఉంటుంది కదా.. రాజ్ పైనుండి కిందకు చూస్తాడు. ఏంటి మామయ్య అంత ప్రేమగా చూస్తున్నావు. నీ మాటలేవో తేడాగా వినిపిస్తూ ఉంటే..
ఏ.. గ్రామర్ మిస్టేక్ వచ్చిందా.. కాద కాని.. సెంటెన్స్ ఫార్మేషన్ లో ఏవో తేడాలు కనిపిస్తున్నాయి. అందుకే డౌట్ వచ్చి చూస్తున్నాను. ఏంట్రా సంగతి.
కళ్ళు అటు ఇటు తిప్పుతూ ఏమంటుంది మామూలుగానే అడిగాను. ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళినా నన్ను టార్చర్ పెట్టి మరీ తీసుకువెళ్ళేది. కాకిలాగా అరుస్తూ నా బ్రెయిన్ తినేది.
నన్ను ఆలోచించుకోనివ్వకుండా పరుగులు పెట్టించేది. అలాంటిది ఈ మధ్యన అసలు నాకు చెప్పడం మానేసింది. మాట్లాడడం మానేసింది. సైలెంట్ గా చూస్తుంది.
ఏం జరుగుతుందో నాకు తెలియాలి తెలియాలి అని ఆ పూరి పిండి పైన గుద్దుతూ ఉంటాడు. ఒరేయ్ ఎక్కువగా నీ ప్రెస్టేషన్ చూపించకు రా బాబు..
ఆ పిండి మరీ మెత్తగా అయిపోతే ఆయిల్ పీల్చేస్తాయి అని నివి గబగబా తీసుకుంటుంది. అత్తయ్య నేనింత ఎమోషనల్ గా చెబుతూ ఉంటే నీ పిండి ఆయిల్ అని మాట్లాడుతావేమిటి..
రాజ్ నవ్వుతూ ఆడవాళ్లు అంటే ఏమనుకుంటున్నావు.. మన ఎమోషన్స్ కన్నా వాళ్ళ వర్క్ వాళ్ళకి ఇంపార్టెంట్. అవునవును నీ కూతుర్నే చూస్తే బాగా తెలుస్తుంది.
అది ఎక్కడికి వెళ్ళిందో చెప్పకుండా ఏదేదో చెబుతావేంటి మావయ్య అని విసుగ్గా అంటే... ఏరా నా కూతుర్ని అంతగా మిస్ అవుతున్నావా..
మిస్ అవ్వడం కాదు ఏమీ కాదు.. అది ఏం చేస్తుందో తెలియక ఎక్కడైనా ప్రాబ్లం లో ఉందా ఏమిటా అని అడుగుతున్నాను అంతే.
ఒరేయ్ నిజాలు చెప్పడానికి ఎంత ధైర్యం కావాలో... ఒప్పుకోవడానికి కూడా అంతే ధైర్యం కావాలి. ఆ రెండు లేనప్పుడు ప్రేమ ముందుకు వెళ్లదు.
ప్రేమ ఏంటి అని అడిగితే... కొయ్యి కొయ్యి మేము అందరం ఈ వయసు దాటి వచ్చిన వాళ్లము కాదా ఏమిటి..
ఉఫ్.. అనుకుని నడుం మీద చేతులు పెట్టుకొని ఓకే మీ ఇద్దరికీ మేటర్ అర్థమైందని నాకు అర్థం అవుతుంది. అవును అదంటే నాకు ఇష్టం.
ప్రేమిస్తున్నాను కానీ నేను చెబుతుంటే అది పిచ్చ లైట్ తీసుకుంటుంది. టీజ్ చేస్తున్నాను అనుకుంటుంది. ఎలా దానికి నా ప్రేమను తెలిపేది.
నువ్వు చెప్పు అత్తయ్య. చిన్నగా నవ్వుతూ నమ్మకం రా.. నాన్న కూడా ఇదే ముక్క చెబుతున్నారు. అరే నమ్మకం కలిగించాలి అంటే ఏం చేయాలి దాని కాళ్లు పట్టుకోవాలా..
కాళ్లు కాదు మనసు పట్టుకో. అది ఎలాగా అని అడుగుతున్నాను.
వైభవ్ చెంప మీద చెయ్యి వేసి నివి కాస్త దగ్గరికి వచ్చి మెల్లిగా నవ్వుతుంది…
మనసు పట్టుకోవడం అంటే… మాటలతో కాదు రా … నీ ప్రెసెన్స్ తో.
ఆమె నీ దగ్గర ఉన్నప్పుడు ఆమెకి వచ్చే ఫీలింగ్… అదే నమ్మకం.
అది ఎలా క్రియేట్ చేయాలి అత్తయ్య… నేను ఫీలింగ్స్ చెబితే అది సీరియస్‌గా తీసుకోదు… నవ్వేస్తుంది… టీజ్ చేస్తున్నాను. ఎవరితో బెట్టుకట్టి దీన్ని ఏడిపిస్తున్నాను అనుకుంటుంది . నేను నిజంగా చెప్పాలనుకున్నప్పుడు కూడా పిచ్చి ఫన్‌గా మార్చేస్తుంది.
అది అమ్మాయి. అలానే చేస్తుంది రా. భయపడుతుంది.
నీ మాటల్ని తప్పుగా అర్ధం చేసుకుంటే… అని ఊహించుకుని మౌనంగా ఉండిపోతుంది.
అమ్మాయిలకి కూడా భయం ఉంటుందా? అన్నట్టు నిజంగా ఆశ్చర్యపోతూ అడుగుతాడు.
ఎక్కువగానే ఉంటుంది. నీకు ఆమె మీద ఫీలింగ్ ఉందని తెలుసు.
కానీ ఆమెకు నీ ఫీలింగ్ ఎంత లోతుగా ఉందో తెలియదు.
అందుకే జోక్లోకి మార్చేస్తుంది… సేఫ్‌గానే ఫీల్ అవ్వడానికి.
వైభవ్ కాసేపు మౌనంగా కూర్చుంటాడు. చేతిలోని పూరి పిండి ని మెల్లగా గుద్దుతూ, తనలోనే ఏదో లెక్కేసుకుంటాడు.
అంటే నేను ఎప్పుడో ఒక రోజు డైరెక్ట్‌గా… సీరియస్‌గా… లైట్ లేకుండా చెబితేనేగా?
నివి కన్నుచూపుతో హమ్మయ్య ఇపుడు అర్థమైంది అన్నట్టు తల ఊపుతుంది.
సీరియస్‌గా చెప్పడం కాదు వైభవ్..
సరిగ్గా ఆమె ఒంటరిగా ఉన్నపుడు…
ఎవరూ లేకపోయినపుడు…
నీ మాటలు ఆమె హృదయానికి నేరుగా చేరేలా చెప్పాలి.
ఫన్నీ టైంలో ప్రేమ చెప్పావంటే… అది కూడా జోక్ అయ్యిపోతుంది.
వైభవ్ ఆలోచనగా పైకప్పు వైపు చూస్తాడు.
కానీ అత్తయ్య… ఈ మధ్యనే అది నాకు దూరమవుతున్నట్టు ఉంది. నాతో మాట్లాడడం తక్కువ… నా దగ్గర ఉండడం తక్కువ… ముందులా గిగిల్స్, ఫైట్, టీజ్ ఏమీ లేదు. అంతా సైలెంట్. ఇది ఎందుకు?
నివి ఉప్పు వేస్తూ చిన్నగా చిరునవ్వు నవ్వుతుంది.
ఒక అమ్మాయి అకస్మాత్తుగా సైలెంట్ అవుతుంది అంటే…
అది ఏం జరుగుతుందో తెలుసా?
వైభవ్ కళ్ళు పెద్దవిగా చేసి ఏమిటి అత్తయ్య? అని అడుగుతాడు.
అత్తయ్య జాగ్రత్తగా వైభవ్ వైపు చూసి… రెండు కారణాలు ఉంటాయి.
ఒకటి నీ మాటలకి, ప్రవర్తనకి దాని మనసు గాయమవుతే దూరంగా ఉండడం.
ఆ మాటకి వైభవ్ ఆలోచిస్తూ ఉంటాడు.
మరి రెండో విషయం..
నివి నవ్వుతూ..
అది తను నిన్ను అవాయిడ్ చేయడం కాదు రా…
తన ఫీలింగ్స్ ని హ్యాండిల్ చేయలేక… నీ నుండి దాచుకుంటుంది.
మీ మీద ప్రేమ పెరిగిపోయినప్పుడు అమ్మాయిలు ఇలా సైలెంట్ అవుతారు.
ఇప్పుడు ఆలోచించుకో మీ ఇద్దరి మధ్య ఉన్నది ఏమిటో..
వైభవ్ ఒక్కసారిగా నిశ్శబ్దమవుతాడు… ఆలోచిస్తూ ఉంటాడు చందుకే నా మీద ఉన్నది ఏమిటి.. ఏదో స్ట్రైక్ అయినట్టుగా.. అంటే చందుకి... నిజంగా నా మీద...
నివి నవ్వుతూ గిన్నె అందుకుంటుంది.
అవును. అదే తేడా. అదే భయం.
అదే నిశ్శబ్దం.
వైభవ్ చెవులు కొంచెం ఎర్రబడతాయి.
అత్తయ్య… నేను ఏం చేయాలి ఇప్పుడు?
ఒక మంచి టైం చూసి.. అది ఎందుకు అలా ఉంటుందో తెలుసుకో.. మాట్లాడదు.నీకు చెప్పకపోవచ్చు. అదే స్మైల్ మైంటైన్ చేస్తూ ఉంటుంది.
కానీ పట్టు వదలని విక్రమార్కుడు లాగ నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి . ఎందుకు దూరమవుతోంది…
ఏం ఫీలవుతోంది… అన్నీ నెమ్మదిగా అడుగు.
అవసరం అయితే కొంచెం దగ్గరికి తీసుకో…
నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావని… జస్ట్ లైట్ మాట కాదని… చందు ఫీలయ్యేలా చూపించు.
వైభవ్ లోపల ఏదో వెలిగినట్టు, కళ్ళల్లో కొత్త స్పార్క్.
సరే అత్తయ్య… ఈ రోజు చందుతో ఎలాగైనా మాట్లాడతాను.. ఇక లైట్‌గా కాదు.. నిజంగా మాట్లాడతా.
నివి నవ్వుతుంది. రాజ్ చంప పైన చేయి వేసుకుని ఇద్దరినీ చూస్తూ ఇక్కడ నేను ఒకడిని ఉన్నాను. అది ఏమైనా గుర్తిస్తున్నారా..
అబ్బా మావయ్య ఇప్పుడు నేను గుర్తించకపోయినా వచ్చే ప్రాబ్లం ఏమీ లేదు కానీ ఇంతకీ నీ ముద్దుల కూతురు ఎక్కడికి వెళ్ళింది ఇది మాత్రం నేను చెప్పాల.. చెప్పను పో అని ఇంకో పక్కకి తిరుగుతాడు.
నువ్వు చెప్పకపోతే ఏమైంది. మా అత్తయ్య చెబుతుంది కదా అని బుగ్గన ముద్దు ఇచ్చి చెప్పు అత్తయ్య సౌమ్య కాలేజ్ కి వెళ్ళింది.
అవును ఈ మధ్యన సౌమ్య కాలేజ్ చుట్టూ తిరుగుతుంది. ఎందుకు. వెళ్లి నువ్వే అడుగు. సరే బాయ్ అత్తయ్య. ఒరేయ్ తినేసి వెళ్లు రా.
అక్కడ నీ కూతురుతో తింటాలే మావయ్యకి పెట్టేసేయ్ అని వెళ్ళిపోతాడు.
చెయ్యమంటారా. ఎందుకు నాకు ఇడ్లీ పెట్టావు కదా.. వాడికే పూరి అన్నావు. వాడు వద్దు అన్నాడని నాకు పెడుతున్నావా. అబ్బా చిన్న పిల్లాడితో మీకేంటి అండి..
వైభవ్ కాలేజ్ ముందు బైక్ ఆపి సౌమ్యకి కాల్ చేస్తాడు. నవ్వుకుంటూ లిఫ్ట్ చేసి చెప్పు. ఎక్కడుంది అది. ఇక్కడే.. సరే నేను వస్తున్నాను అని సౌమ్య దగ్గరికి వెళతాడు.
వాళ్ల కూర్చున్న చోట వైభవ్ అక్కడ కుర్చీలో కూర్చొని గాగుల్స్ తీసి షర్టుకి తగిలిస్తాడు. చందు చూసిన చూడనట్టుగా సౌమ్య ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటుంది.
వైభవ్ మాత్రం ఇంటెన్సీగా చూస్తూ ఉంటే ఆ చూపులకి ఇబ్బంది పడుతూ హెయిర్ ని వెనక్కి అనుకుంటూ మాట తడబడుతూ మాట్లాడుతూ ఉంటుంది.
అదేంటి చందు ఇప్పటిదాకా బాగానే మాట్లాడావు కదా.. ఇప్పుడేంటి మాట తడబడుతుంది అని ఫ్రెండ్స్ అడిగితే ఏమీ లేదు.
మీకు చెప్పిన వర్క్ గురించి ఆలోచించండి. ఈ వీకెండ్ బయలుదేరాదాము. మనీ అవసరం ఉంటే చెప్పండి. ఇప్పటికి ఇన్వెస్ట్ చేసింది సరిపోతుంది ఏదన్నా ఉంటే చెబుతాము.
ఏం బిజినెస్ మొదలుపెట్టారు ఆ డాక్టర్ పాపాలు, డిజైనర్ కలిపి..
ఆ మాటకి చందు తలదించుకుంటే.. డాక్టర్స్.. హలో ఇది బిజినెస్ కాదమ్మా సర్వీస్. సర్వీస్ ఏం సర్వీస్ అని రిలాక్స్డ్ గా కూర్చుని అడుగుతాడు.
ఏం చందు నువ్వు చెప్పలేదా.. ఈ మధ్యన చెప్పడం తగ్గించిందిలే గాని మీరు చెప్పండి పాపలు.
చందు వచ్చిన ప్రాఫిట్ తో సర్వీస్ స్టార్ట్ చేసింది. దానికి మా హెల్ప్ అడిగింది. అదే ఏం సర్వీస్. మెడికల్ ట్రీట్మెంట్ సరిగ్గా లేని కొన్ని గ్రామాలు సెలెక్ట్ చేసింది.
వన్ బై వన్ ఆ గ్రామాలకు వెళ్లి ఏం అవసరం ఉందో అని చూసి.. చెకప్ చేసి ఇంకా ఫర్దర్గా ట్రీట్మెంట్ అవసరం ఉంటే హాస్పిటల్ లో అడ్మిట్ చేసే విధంగా ప్లాన్ చేస్తుంది.
ఆ మాటకి రిలాక్స్డ్ గా కూర్చున్న వైభవ్ స్టడీగా కూర్చుని చందు వైపు చూస్తాడు. చందు మాత్రం వైభవ్ వైపు అసలు చూడదు.
నిజంగానా అని ఆశ్చర్యంగా అడిగితే నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు ఏముందిరా అని సౌమ్య అంటుంది. మరి నువ్వు కూడా నాకు చెప్పలేదు. నువ్వు నన్ను అడగలేదు కదా..
వైభవ్ రియాక్షన్..
కథ కొనసాగుతుంది.........
The following 11 users Like SivaSai's post:11 users Like SivaSai's post
• ABC24, ash.enigma, gora, k3vv3, kkkhot86, Pilla, Sachin@10, Skv89, styleraja, Sunny73, yekalavyass
Posts: 1,159
Threads: 1
Likes Received: 732 in 475 posts
Likes Given: 11,272
Joined: Jun 2019
Reputation:
2
Posts: 1,700
Threads: 2
Likes Received: 1,020 in 780 posts
Likes Given: 2,418
Joined: May 2019
Reputation:
11
Always felt Vaibhav Chandu story would be eventful.
Living up to expectations!!!!
Posts: 1,700
Threads: 2
Likes Received: 1,020 in 780 posts
Likes Given: 2,418
Joined: May 2019
Reputation:
11
Endi Sivabhayya.. emaina weekend off aa? Okesari inni episodes pettav.
Bagundi.. ilage continue cheyandi!!
Posts: 293
Threads: 0
Likes Received: 213 in 150 posts
Likes Given: 1,241
Joined: Mar 2022
Reputation:
5
endi bhayya ivalla updates varada parincharu.
adbhudam. ee scene ki aa scene highlight
Posts: 898
Threads: 13
Likes Received: 7,038 in 832 posts
Likes Given: 1,545
Joined: Aug 2024
Reputation:
652
(01-05-2026, 02:45 PM)ash.enigma Wrote: Endi Sivabhayya.. emaina weekend off aa? Okesari inni episodes pettav.
Bagundi.. ilage continue cheyandi!!
Yes Going To Family Tour
E Weekend Antha Offline Unta
Next 2 Days No-Updates. But E Evening Ekkuva Updates Isthanuuu................
Posts: 4,141
Threads: 172
Likes Received: 13,022 in 2,574 posts
Likes Given: 8,557
Joined: Nov 2018
Reputation:
894
enjoy the break
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 898
Threads: 13
Likes Received: 7,038 in 832 posts
Likes Given: 1,545
Joined: Aug 2024
Reputation:
652
Part - 101
విశి, సూర్య ఒకరిని ఒకరు చూసుకుంటూనే నిద్రలోకి జారుకుంటారు. ఉదయం సూర్య తొందరగా లేచి విశి ని చూసి నవ్వుకొని ఫ్రెష్ అయ్యి వచ్చి మెల్లిగా లేపుతాడు.
కళ్ళు నలుపుకుంటూ గుడ్ మార్నింగ్ సార్ అంటుంది. ఇదేమన్నా హాస్టల.. లేకపోతే స్కూలా.. ఎప్పుడు చూసినా సార్ సార్.. అంటావు ఏమిటి..
దేవా అని పిలవచ్చు కదా. అయ్యో సార్ ని ఎవరైనా అలా పిలుస్తారా. సరే రెడీ అయ్యి రా. నీకు ఒక సర్ప్రైజ్ అంటాడు. మీకు కూడా ఒక సర్ప్రైస్ సార్ అని గబగబా వాష్ రూమ్ లోనికి పరిగెడుతుంది.
వెళుతున్న విశిని చూస్తూ నవ్వుకుంటూ రింగ్ అవుతున్న ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా. మేము కాదు నువ్వే చెప్పాలి. చెప్పావా మా చెల్లికి.
లేదు రా.. పోనీ మా చెల్లి నీకు చెప్పిందా. అబ్బా లేదురా.. ఇద్దరు రెండు రోజుల నుంచి తిరుగుతున్నారు ప్రపోజ్ చేసుకోవడానికి టైం ఏ లేదా అని శ్రీకర్ గట్టిగా అరుస్తాడు.
ఒక్కసారి ఫోన్ దూరంగా పెట్టి మళ్ళీ దగ్గరగా పెట్టుకుని ఎందుకు రా అలా అరుస్తావు. నా అరుపులే వినిపిస్తున్నాయి కానీ నా ప్రెస్స్టేషన్ కనిపించడం లేదా..
చెప్పాను కదా నాకు ఒక ఫాంటసీ ఉందని. ముందు మీ చెల్లి నోటితోనే వినాలి. అప్పుడు నా మనసులో మాట చెబుతాను.
నీ ఫాంటసీలు ఏమోగానీ.. ఆడపిల్ల ఎలా బయటపడుతుంది రా.. నువ్వే అర్థం చేసుకోవాలి. తనకి కూడా కొంచెం ఎక్కడో ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉండొచ్చు కదా...
ఆ గౌతమ్ విషయంలో నువ్వు ఏమనుకుంటున్నావో అని ఆలోచించొచ్చు కదా.. అప్పుడే స్నానం చేసి ముద్దమందారం లాగా ఫ్రెష్ గా బయటకు వచ్చిన విశి ని చూస్తూ అలాంటి ఫీలింగ్స్ ఏమీ లేవు.
అసలు గౌతమ్ మేటర్ మా మధ్యన లేదు. నువ్వు పెట్టేయ్. ఏరా మా చెల్లి వస్తుందా. మూసుకొని పెట్టెయ్ అని ఫోన్ పెట్టేస్తాడు.
రెడీ అయ్యి వచ్చినా విశిని అలాగే చూస్తూ ఉంటాడు. ఏంటి సార్ అలాగే చూస్తున్నారు. ఈ డ్రెస్ గుర్తుందా అని తల కిందకి వంచి అడుగుతుంది.
విశి సిగ్గు చూసి నవ్వుకుంటూ.. అది ఏమీ తెలియనట్టుగానే ఈ డ్రెస్సు అని కణతల మీద కొట్టుకుంటూ ఉంటాడు.
అయ్యో సార్ మర్చిపోయారా.. మనం వి. జె. స్ కంపెనితో ప్రజెంటేషన్ ఉంది అని షాపింగ్ కి వెళ్ళాము కదా.. అప్పుడు తీసుకున్నాను మీకు గుర్తులేదా..
హ.. గుర్తొచ్చింది. నైస్ చాలా బాగుంది..అప్పుడు ఇది మీరే సెలెక్ట్ చేశారు అని డ్రస్సును చూసుకుంటూ చెబుతుంది. నీకు అంత నచ్చిందా. కొన్ని కొన్ని ఇష్టాలు మాటల్లో చెప్పలేము. పోని చేతల్లో చూపించిన అర్థం చేసుకుంటాను.
చేతల్లో చూపిస్తే తప్పుగా అనుకుంటారేమో అని భయం. అసలు చూపిస్తేనే కదా అది తప్పో.. ఒప్పో తెలిసేది.
సరే పద అని ఇద్దరూ బయటికి వస్తారు. రూమ్ లాక్ చేసుకుని బ్రేక్‌ఫాస్ట్ చేసి ఇప్పుడు ఎక్కడికి అని ఆరామంగా కూర్చుని అడిగితే.. విశి టెన్షన్ గా చేతులు నలుపుకుంటూ ఉంటుంది.
అంత టెన్షన్ పడుతున్నావు. ఏదైనా ఎగ్జామ్ రాసావా ఏమిటి అని ఏమీ తెలియనట్టుగా అడిగితే.. సార్ అని బిక్క మొహం వేస్తుంది.
ఊరికినే అన్నాను కానీ విషయం ఏమిటో చెప్పు..ఇక్కడ కాదు అటు వెళదామా అని ఒక ప్లేస్ చూపిస్తుంది..సరే పద అని వెళతాడు.
గుడి కనిపించే విధంగా ఇద్దరూ ఒకచోట కూర్చుంటారు. చుట్టూ ఎవరూ ఉండరు. సరే ఇప్పుడు చెప్పు. టెన్షన్ గా అటు ఇటు తిరుగుతూ గోళ్ళు కొరికేస్తూ ఉంటుంది.
విశి టెన్షన్ ని ఎంజాయ్ చేస్తూ విశికే తెలియకుండా ఫొటోస్ తీస్తూ ఉంటాడు. ఎంతసేపు విశి ఏమిటో చెప్పు. ఐస్‌క్రీం తింటారా.. ఇంత పొద్దుటేనా. పోనీ కొబ్బరినీళ్లు.
విషయం చెప్పకుండా అనవసరంగా ఏదేదో మాట్లాడుతున్నావు.
విశి గట్టిగా శ్వాస తీసుకుని వదిలి ఇది నీ లైఫ్ కి సంబంధించిన విషయం..ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యి అని గుడి వైపు చూసి ఒక నమస్కారం చేసి సూర్య ముందు మోకాళ్ళ పైన కూర్చుంటుంది.
ఏయ్.. ఏమిటిది అని కంగారుగా అడిగితే.. ప్లీజ్ సార్.. నేను అసలే టెన్షన్ గా ఉన్నాను. డిస్టర్బ్ చెయ్యొద్దు అని వణికే చేతులతో సూర్య చేతులు పట్టుకుంటుంది.
సూర్య ఒక్క నిమిషం అలాగే ఉండిపోతాడు. సార్ నాకు సంబంధించిన ప్రతి ముఖ్యమైన విషయం ఈ గుడి దగ్గరే జరిగింది.
అప్పుడు ఎప్పుడూ తోడుగా నాన్న ఉండేవారు కానీ నా జీవితంలో నేను తీసుకుంటున్నా అతి ముఖ్యమైన విషయంలో పక్కన లేరు.. కాకపోతే ఆయన ఉన్నట్టే అనుకుని ధైర్యంతో మీతో ఈ విషయం చెబుతున్నాను.
కళ్ళు మూసుకుని ఐ లవ్ యు దేవా సార్ అని గట్టిగా అరుస్తూ చెబుతుంది. అది వినగానే సూర్య కి పట్టలేనంత ఆనందం.. గట్టిగా కౌగిలించుకోవాలి అనిపిస్తుంది గాని కంట్రోల్.. కంట్రోల్ అనుకుంటూ చూస్తూనే ఉంటాడు.
విశి మెల్లిగా కళ్ళు తెరిచి మీరంటే ఎందుకో తెలియదు చాలా ఇష్టం. మిమ్మల్ని చూడగానే మనిద్దరికీ ఎప్పుడో పరిచయం ఉంది అనిపించింది.
మీకు అనిపించవచ్చు గౌతమ్ తో ప్రేమ అని కొన్ని రోజులు తిరిగావు కదా ఇదేమిటి అని. ఆ మాటకి కొంచెం కోపంగా చూస్తాడు. ప్లీజ్ సర్ నన్ను చెప్పనివ్వండి.
గౌతమ్ కి నేను ఎప్పుడూ ప్రపోజ్ చేయలేదు. వాడే చెప్పాడు.. అప్పటి పరిస్థితుల్లో నేను మౌనంగా ఉండిపోయాను.
ఏరోజు మా మధ్యన ప్రేమ మాటలు గానీ ఇంకా ఏదీ జరగలేదు. ఒక బిజినెస్ డీల్ తప్ప. నాకు తెలుసు అంటాడు.
నాపైన అంత నమ్మకమా అన్నట్టుగా చూస్తుంది. సూర్య కళ్ళు అవును అన్నట్టుగా చెబుతాయి.
నా మనసులో మాట మీకు చెప్పాను. మీకు నచ్చకపోతే ఈ విషయంలో ఎటువంటి బలవంతం లేదు కానీ నాతో ఫ్రెండ్షిప్ మాత్రం కట్ చేయవద్దు.
మీరు మాట్లాడకపోయినా మిమ్మల్ని చూడకపోయినా నేను ఉండలేను అని కన్నీళ్లు పెట్టుకుంటుంది.
సూర్య విశి చేతుల్లో నుంచి తన చేతులు విడిపించుకుని మెల్లిగా లేచి నిలబడతాడు. విశి కూడా లేచి నిలబెట్టి టెన్షన్ గా చూస్తూ ఉంటే..
ఎటువంటి భావం లేకుండా విశి నే చూసి మెల్లిగా అడుగులు వేసుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెళుతున్న సూర్యనే చూస్తూ విశి మోకాళ్ళ మీద కూర్చుని దోసెట్లో మొఖం పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది.
చందు చేస్తున్న సర్వీస్ విని వైభవ్ ఆశ్చర్యపోతాడు. చందు వైపే అలాగే చూస్తూ ఉంటే.. ఏంట్రా చూపులతోనే మా చందు ని తినేస్తావా అని సౌమ్య అడిగితే..
నిజంగా దీనిలో ఈ కోణం కూడా ఉందా... ఇప్పటివరకు నాకు తెలియలేదే.. నువ్వు ఎప్పుడూ ఒకే కోణంలో చూసావు.
చిన్నప్పుడు చందు ఎలాగో ఇప్పుడు అలాగే అనుకున్నావు. అందుకే దానిలో ఉన్న టాలెంట్ నీకు తెలియలేదు.
నిజంగానే ఇది రోజు రోజుకి ఎక్కేస్తుంది. హలో లేడీస్ అని పిలుస్తాడు. డాక్టర్స్ చూసి ఏంటి మిస్టర్. ఇందులో నేను కూడా పార్టిసిపేట్ చేయవచ్చా.
ఇది మొత్తం ఆర్గనైజ్ చేసేది చందు. చందు కిష్టమైతే మాకేమీ ఇబ్బంది లేదు. ఓకే చందు బాయ్.. మళ్లీ మీట్ అవుదాం ఏదైనా అవసరం ఉంటే కాల్ చేస్తాము అని వెళ్ళిపోతారు.
చందు వైపు చూస్తూ నన్ను జాయిన్ చేసుకుంటావా మిస్ చంద్రిక అని అడుగుతాడు.
చందు సీరియస్‌గా చూస్తే వర్క్ వర్కే.. పర్సనల్ పర్సనలే.. రెండిటినీ కలపకూడదు.
చందు రియాక్షన్..
సూర్య ఎక్కడికి వెళ్ళాడు.....
Posts: 898
Threads: 13
Likes Received: 7,038 in 832 posts
Likes Given: 1,545
Joined: Aug 2024
Reputation:
652
Part - 102
విశి అక్కడే మోకాళ్ళ పైన చాలాసేపు కూర్చుండిపోతుంది మౌనంగా కూర్చునే ఉన్న విశి చెవులకి ఐ లవ్ యు విశిష్ట అని గట్టిగా వినపడుతుంది.
ఉలిక్కిపడి తల పైకెత్తి చూస్తే సూర్య రెడ్ రోసెస్ తో నిలబడి ఉంటాడు. విశి నమ్మలేకపోతోంది. మెల్లిగా లేచి నిలబడి అలాగే చూస్తూ ఉంటే.. విశిష్ట ఐ లవ్ యు వినిపిస్తుందా అని మళ్ళీ అరుస్తాడు.
వస్తున్న ఏడుపుని ఆపుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక్కసారిగా సూర్యా మీదకి జంప్ చేస్తుంది. అది ఊహించని సూర్య ఒక్క అడుగు వెనక్కి వేసి పడిపోకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ విశిష్ట నడుము చుట్టూ చెయ్యి వేసి గట్టిగా పట్టుకుంటాడు.
సూర్య మెడ చుట్టూ చేతులు వేసి ఒక్కసారిగా గట్టిగా ఏడ్చేస్తుంది . ఓయ్ క్యూటి ఎందుకు ఏడుస్తున్నావు. మీరు ఎందుకు సార్ నన్ను ఇలా ఏడిపించారు. ఎక్కడ మీరు దూరం అయిపోతారో అని నేను ఎంత భయపడ్డానో తెలుసా..
నీకోసమే వచ్చిన నేను ఎందుకు దూరం అవుతానే నా బంగారం అని ఇంకా గట్టిగా హత్తుకుంటాడు. ఎంతసేపు ఇద్దరు అలా ఉండిపోయారో అన్నది కాలమే చెప్పాలి.
వెళుతున్న జనం చూస్తూ నవ్వుకుంటూ ఉంటే.. విశి తేరుకుని సార్ అని ఇబ్బందిగా కదులుతూ ఉంటుంది. సూర్యా కూడా విశి పిలుపుకి చుట్టూ చూస్తూ విశి ని వదిలి తల వెనకాల రబ్ చేసుకుంటాడు.
సూర్య తల వెనకాల రబ్ చేసుకుంటూ చుట్టూ చూసి,
అయ్యో… అందరూ చూస్తున్నారు కదా అని మెల్లిగా నవ్వుతాడు.
విశి చెంపలు ఎర్రబడిపోతాయి. సార్… అందరూ చూస్తున్నారు అంటూ రెండు అడుగులు వెనక్కి వేస్తుంది.
కానీ ఆమె చెయ్యి మాత్రం ఇంకా సూర్య చేతిలోనే ఉంటుంది.
చూస్తే ఏమైంది? అని సూర్య కళ్ళల్లో అల్లరి మెరుపుతో,
ఇంతసేపు నా మీదకి జంప్ చేసినప్పుడు సిగ్గు రాలేదా మేడం? అంటాడు.
అది… అని మాట దొరకక తల వంచేస్తుంది విశి.
కళ్ళల్లో ఇంకా తడి ఉంది.
సూర్య ఒక్క అడుగు ముందుకు వచ్చి.. ఇదిగో… ఏడవద్దు. నువ్వు ఇలా బాధపడితే నాకు ఊపిరి ఆగినట్టు ఉంటుంది అని ఆమె కళ్ళలోకి చూస్తాడు.
విశి మెల్లిగా తల పైకెత్తి.. నిజంగా… మీరు వెళ్లిపోతారేమో అనిపించింది సార్. ఒక్క మాట కూడా చెప్పకుండా… అంటుంది వణికే గొంతుతో.
సూర్య ఆమె చేతిని రెండు చేతులతో పట్టుకుని,
నేను వెళ్లేది ఉంటే ఇంత దూరం వచ్చి రెడ్ రోజెస్ పట్టుకుని నిలబడతానా?
నిన్ను భయపెట్టినందుకు సారీ విశిష్ట… కానీ నీ ప్రేమ నాకు ఎంత విలువైనదో అర్థమైంది ఈ నిమిషంలో అంటాడు.
విశి కళ్ళలో వెలుగు మెరుస్తుంది. అంటే… మీరు నిజంగానే… అని మాట ఆగిపోతుంది.
సూర్య మెల్లిగా నవ్వుతూ.. అదే కదా నేను గట్టిగా అరచింది… ఐ లవ్ యు విశిష్ట అని మళ్లీ చెబుతాడు, ఈసారి నెమ్మదిగా… ఆమెకు మాత్రమే వినిపించేలా.
విశి గుండె ఒక్కసారిగా వేగం పెరుగుతుంది.
సార్…అని పిలిచి.. ఈసారి తానే ముందుకు వచ్చి అతని భుజం మీద తల వాల్చేస్తుంది.
సూర్య చుట్టూ జనాలు ఉన్నాయని మరిచిపోయి,
ఆమె జుట్టు మీద మెల్లిగా చెయ్యి వేస్తాడు.
ఇలా ఉంటేనే బాగుంటుంది నువ్వు… నా దగ్గర అంటాడు.
దూరంగా ఎవరో విజిల్ వేస్తే ఇద్దరూ ఒక్కసారిగా తేరుకుంటారు.
విశి వెంటనే దూరమవుతూ,
ఇంకా చాల్లేండి… అందరూ మనలని చూస్తున్నారు అంటుంది నవ్వుతూ.
సూర్య నవ్వుతూ...చూస్తే చూస్తారు… కానీ ఈ నవ్వు మళ్ళీ ఎప్పుడూ పోకుండా చూసుకోవాలి కదా అని రోజెస్ ఆమె చేతిలో పెడతాడు.
విశి రోజెస్ ని గుండెలకు హత్తుకుని,
సూర్య వైపు చూసి మౌనంగా నవ్వుతుంది.
ఆ నవ్వులో ప్రేమ ఉంది… భయం లేదు…
ముందు రోజులు కలిసి నడిచే ధైర్యం ఉంది.
నీకు ఒక సర్ప్రైజ్ క్యూటి.. క్యూటి నా అదేమిటి. అది నీకు నేను చిన్నప్పుడు పెట్టిన ముద్దు పేరు. హ అని అయోమయంగా చూస్తుంది. అర్థం కాలేదు కదా..
మనం మొదటిసారి ఎప్పుడు కలిసాము. హాస్పిటల్ లో... కాదు అని నవ్వుతూ.. నీకు మేబీ నాలుగు లేక ఐదు సంవత్సరాలు ఉండవచ్చు. అప్పుడు కలిశాను.
అర్థం కాలేదు కదా అని మొదటిసారి ఎక్కడ కలిశారో ఆ ప్లేస్ దగ్గరికి తీసుకు వెళ్లి నిలబడతాడు. ఇక్కడ నువ్వు మీ నాన్నగారు ఉన్నారు అప్పుడు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా..
ఆరోజు నీ పుట్టిన రోజు. పట్టు పరికిణి వేసుకుని బుట్ట బొమ్మలాగా ఉన్నావు. నాకు చూడగానే నీతో స్నేహం చేయాలి అనిపించి దగ్గరికి వచ్చేటప్పటికి కోతితో ఫైటింగ్ అని నవ్వుతాడు.
సార్ అప్పుడు నేను చిన్న పిల్లని కానీ మీరు అని కొంచెం ఎక్సైట్ మెంట్ తో అడుగుతుంది.
అప్పుడు కోతి నుంచి సేవ్ చేసింది మనమే అని కాలర్ ఎగరేస్తాడు. అవునా అని ఆశ్చర్యంగా అడిగితే.. ఇంకా నమ్మకం లేదా అని తన చైన్ కి ఉన్న రింగ్ చూపిస్తాడు.
ఇది అని అడిగితే.. అప్పుడు నా గుర్తుగా నీకు రింగ్ ఇస్తే మీ నాన్నగారు నీ రింగ్ నాకు ఇచ్చారు.
నమ్మలేనట్టుగా చూస్తూ తన మెడలో చైన్ బయటికి తీస్తుంది. సూర్యా దగ్గర ఉన్న రింగ్ చిన్నప్పుడు ఫొటోస్ లో ఉంది కానీ అది ఏమయిందో తెలియలేదు.
దగ్గరికంటా వెళ్లి ఆ రింగు పట్టుకొని చూస్తూ సంతోషంతో కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. ఏయ్.. పిచ్చి.. ప్రతిదానికి కన్నీళ్లేనా.. ఇది ఏడుపు కాదు సార్ ఆనందభాష్పాలు.
మా నాన్న నాతో ఉన్నన్ని రోజులు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. నిన్ను ఒక ఫ్రెండ్ సేవ్ చేసి ఇచ్చాడు. ఎప్పుడు తీయొద్దు అని కానీ మిమ్మల్ని నా కోసం సిద్ధం చేశారు అని ఊహించలేకపోయాను.
ఎమోషనల్ అవుతూ ఎక్కడ ఉన్నారో కూడా చూసుకోకుండా గట్టిగా హత్తుకుంటుంది. విశి చుట్టూ చేతులు వేసి క్యూటి మనల్ని అందరూ చూస్తున్నారు. పరవాలేదు అని గుండెల మీద తలపెట్టి కళ్ళు మూసుకుంటుంది.
వైభవ్ చందు ని చూస్తూ ఏం మాట్లాడవేమిటి. నేను అడుగుతున్నాను కదా.. అక్కడ వర్క్ చాలా డెడికేషన్ గా చేయాలి. కోతి లాగా ఎగిరితే కుదరదు.
అంటే ఏమిటి... నేను కోతి నా.. నువ్వు కోతి అని నేను ఆ జాతిని తక్కువ చేయలేను.
ఆ మాటకి సౌమ్య నవ్వుతుంది. వైభవ్ సౌమ్య వైపు కోపంగా చూసి నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నాను. నీకు ఆ విషయం తెలుసా అని ఒక ఉక్రోషంగా అడుగుతాడు.
తెలుసు అక్క దగ్గరే కదా.. నా వలన బాబీకి ఎంత ప్రాఫిట్ వచ్చిందో అదైనా తెలుసా..
చూడు వైభవ్ నీ దగ్గర టాలెంట్ లేదు అని నేను అనడం లేదు. జాబ్, ప్రొఫెషనల్ వేరు. సర్వీస్ వేరు. సర్వీస్ చేసేటప్పుడు చాలా సెన్సిటివ్ గా ఉంటుంది.
అది కూడా మెడికల్ క్యాంపు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న ఫెయిల్ అవడం పక్కన పెట్టు.. ఎవరికైనా ఏదైనా జరిగితే..
అంటే నేను సిన్సియర్‌గా ఉండను అని నీ ఉద్దేశమా.. డెడికేషన్ గా ఉండడం ముఖ్యం అంటున్నాను. ఓకే నీతో డీల్..
సౌమ్య చందు ఇద్దరూ డీల్ అని ఒకేసారి అంటారు. అవును. ఈ మెడికల్ క్యాంపు లో నీతో పాటే ట్రావెల్ చేస్తాను.
నేను ఎంత డెడికేషన్ గా ఉన్నానో అన్నది చూపిస్తాను. అలా ఉంటే కనుక.. హ ఉంటే అని సౌమ్య ఇంకా క్యూరియాసిటీతో అడుగుతుంది.
వైభవ్ చిరాకుగా చూపించవలసిన వాళ్ళు చూపిస్తే బాగుంటుందే నువ్వు కాస్త తట్టుకో అని ఇదిగో పిల్ల రాక్షసి.. సరిగ్గా విను.
నా డెడికేషన్ కి నువ్వు ఇంప్రెస్స్ అవ్వితే.. లైఫ్ లాంగ్ నువ్వు నాతోనే ఉండాలి. అర్థమవుతుందా.. అన్నయ్య పెళ్లి అవగానే మనం పెళ్లి చేసుకుందాం.
డీల్ ఓకే అని చెప్పి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. వైభవ్ చెప్పినదానికి చందు నోరు వదిలేసి చూస్తుంది. సౌమ్య ఏంటే వీడు ఇలా చెబుతున్నాడు.
చందు కోపంగా నా అభిప్రాయంతో వీడికి సంబంధం లేదా.. డెడికేషన్ వేరు లవ్ వేరు అది వీడికి అర్థం కావడం లేదా అని గట్టిగా అరుస్తుంది.
ష్.. అరవకే బాబు మనం క్యాంపస్ లో ఉన్నాము. నీకు కూడా వాడంటే ఇష్టమే కదా.. ఆ మాటకి చందు సైలెంట్ అయిపోతుంది.
సౌమ్య బ్యాగ్ తీసుకుని నిలబడి.. ఏదైనా ఆలోచించి అడుగు వెయ్యి. ఏప్పుడు ఒకేలాగా ఎవరూ ఉండరు. వాడికి బాధ్యత తెలుసు. నీ పైన ఇష్టం ఉంది.
ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లాగా ఎక్స్‌ప్రెస్ చేస్తారు. నీతోనే ఉంటాడు కదా చూడు.. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు. మీరు ఇద్దరు సంతోషంగా ఉంటే అందరూ హ్యాపీయే. బాయ్ అని వెళ్ళిపోతుంది.
చందు నిర్ణయం......
Posts: 898
Threads: 13
Likes Received: 7,038 in 832 posts
Likes Given: 1,545
Joined: Aug 2024
Reputation:
652
Part - 103
విశి, సూర్య సంతోషంగా టైం స్పెండ్ చేస్తారు. శ్రీకర్ కి ఫోన్ చేసి మొత్తం చెబుతాడు.. నువ్వే ఎవరో అన్నది కూడా చెప్పావా.. అప్పుడే కాదు.
విశి ప్రాజెక్ట్స్ సక్సెస్ అయిన తర్వాత నేను ఎవరో అన్నది చెబుతాను. ముందే చెబితే తన వర్క్ మీద ఫోకస్ పెట్టలేదు.
ఏదో నా వలన తన వర్క్ ఒకే చేశారు అనుకోని డౌన్ అయిన అవ్వచ్చు.. నువ్వు అన్నది కూడా నిజమేలే.. ఎప్పుడు బయలుదేరుతున్నారు ప్రేమ పక్షులు.
సాయంత్రం. అక్కడంతా ఓకేనా. ఆ ఓకే. వైభవ్ గాడు చందును ఒప్పించకుండా బెదిరిస్తున్నాడు. ఏదో ఒకటి. వాళ్ళిద్దరూ తిప్పలు వాళ్లే పడి ఈ మెడికల్ క్యాంపు అయ్యే లోపు ఒకటి అవుతే చాలు.
అప్పుడు మూడు పెళ్లిళ్లు ఒకేసారి జరిగిపోతాయి కదా బావ అని శ్రీకర్ అడిగితే... నాకేమీ పెళ్లి గురించి కంగారు లేదు.
నీకు లేకపోతే నాకు చాలా ఉంది. ఆ ముక్క చెప్పొచ్చు కదా.. అన్ని చెప్పరు బావ అర్థం చేసుకోవాలి భరత్ మామయ్య ఒప్పుకోవాలి కదా..
మా మామ గారిని ఎలా లైన్లో పెట్టుకోవాలో నాకు తెలుసు కానీ తమరు మా చెల్లి మీద ఫోకస్ పెట్టండి అని పెట్టేస్తాడు.
ఫోన్ పెట్టేసి నవ్వుకుంటూ విశి ని చూస్తాడు. పూలతో ఆడుతూ కనిపిస్తుంది. దగ్గరికి వెళ్లి క్యూటి ఏం చేస్తున్నావు.
మీరు ఫోన్ లో బిజీగా ఉన్నారు కదా అని ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. పర్వాలేదు నా పక్కన ఉండి విన్నా అభ్యంతరం లేదు.
ఆ మాటకి నవ్వుతూ.. ఎవరికీ వాళ్ళకే సం పర్సనల్ స్పేస్ ఇవ్వాలి సార్. ఎంత నేను లవరైనా మీకంటూ కొన్ని పర్సనల్స్ ఉంటాయి కదా..
అందులో ఇబ్బంది పెట్టడం కన్నా మీరు చెప్పినప్పుడు వింటే బాగుంటుంది. ఇదే నీలో నాకు బాగా నచ్చేది. ఎదుటివారిని అర్థం చేసుకోవడంలో ముందు ఉంటావు.ఆ మాటకి చిన్నగా నవ్వుతుంది.
సాయంత్రమే మన ప్రయాణం. సరే. లేకపోతే ఒక రెండు రోజులు ఉందామా. లేదు ఈ విషయం నేను నేరుగా అమ్మకి చెప్పాలి అమ్మ కళ్ళల్లోనే మెరుపు చూడాలి.
అయితే తర్వాత మళ్లీ ట్రిప్ ప్లాన్ చేయొచ్చు అన్నమాట.. అమ్మో కాదు కాదు నాకు ప్రాజెక్ట్ ఉంది. అది సక్సెస్ అవ్వాలి.
నీ ప్రాజెక్ట్ సక్సెస్ అయిన తర్వాత నీకు ఒక సర్ప్రైజ్ రెడీగా ఉంది..ఏమిటి అది.. సర్ప్రైజ్ అంటే ముందు చెప్పరే తింగరి అని తల మీద ఒకటి వేస్తాడు.
సార్ మీరు నన్ను కొడుతున్నారు. అబ్బా ఇంకా సార్ సార్ అని పిలుస్తావు ఏంటి. క్యూట్ గా దేవా అని పిలవచ్చు కదా అమ్మో నాకు సిగ్గు అని చేతుల్లో ముఖం దాచుకుంటుంది.
నువ్వలా సిగ్గుపడితే నాకు ఏదేదో అయిపోతుంది అని మెల్లిగా చెవిలో చెబుతాడు. చెవిలో చెప్పినప్పుడు సూర్య మీసాలు తగిలి గిలిగింతలు మొదలవుతాయి.
చెవిలో గిలిగింతలు మొదలవ్వగానే విశి ఉలిక్కిపడి ఒక్క అడుగు వెనక్కి వేస్తుంది.
ఇది ఫెయిర్ కాదు సార్…అని చెబుతూ ఉంటే.. బుగ్గలు ఎర్రగా కందిపోతాయి. అరే సడన్ గా నీ బుగ్గలు ఏంటి రెడ్ పెయింట్ వేసుకున్నాయి అని టచ్ చేస్తే సార్ అని దీనంగా పిలుస్తుంది..
మళ్లీ సార్ అంటావా? అంటూ సూర్య కళ్లతోనే హెచ్చరిస్తాడు.
విశి నవ్వు ఆపుకోలేక, సరే సరే… దేవా అని మెల్లిగా అంటుంది. ఆ పిలుపు పిలిచే లోపే ఇంకా సిగ్గుతో ముడుచుకుపోతుంది. పిలుపుకే ఇలాగైపోతే తర్వాత పనులకి ఇంకేం అయిపోతావు నా క్యూటీ..
మీరు నన్ను బాగా ఏడిపిస్తున్నారు. విశి సిగ్గుకి..పిలిచిన విధానానికి..
ఆ ఒక్క మాటకే సూర్య ముఖంలో ఏదో గెలిచిన ఆనందం.
ఇలానే పిలుస్తూ ఉంటే… నా రోజు మొత్తం సక్సెస్ అంటాడు.
చుట్టూ సాయంత్రం వెలుగు మెల్లిగా మాయమవుతూ ఉంటుంది. ఆకాశంలో నారింజ–పింక్ రంగులు.
విశి చేతిలో ఉన్న పూలను సూర్య చేతిలో పెడుతుంది.
ఇవి నీకే. ఈ ట్రిప్ గుర్తుగా.
పూలు కాదు క్యూటి … ఈ క్షణమే నాకు గుర్తు. నువ్వు ఇలా నవ్వుతూ నా పక్కన నిలబడ్డ క్షణం అంటాడు.
ఇద్దరు రూమ్ కి వెళ్లి లగేజ్ ప్యాక్ చేసుకొని బైక్ స్టార్ట్ చేస్తాడు. విశి కి ఈసారి కూర్చోవడానికి ఏదో తెలియని బేరుకు.
ఏమైంది క్యూటి. ఏమీ లేదు అని తల ఊపి మెల్లిగా కూర్చుంటుంది. హలో మేడం తమరేమి కొత్త పెళ్లికూతురు కాదు ఫ్రీగా కూర్చోవచ్చు.
ఆ మాటకి భుజం పైన మెల్లిగా చరిచి మీకు ప్రతిదీ వేళాకోళమే. నీతో కాక ఇంకెవరితో చేస్తారు బంగారం.
ఇద్దరు రిటన్ బయలుదేరతారు. మధ్య రాత్రిలో ఒక ప్లేస్‌లో స్టే చేసి మళ్లీ పొద్దుటే బయలుదేరుతారు.
హైదరాబాద్ చేరుకోగానే విశి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏమైంది క్యూటి ఎందుకు టెన్షన్ పడుతున్నావు. అమ్మకి చెప్పాలి అంటే ఏదో లాగా ఉంది.
అత్తయ్యకి తెలియదు అని నువ్వు అనుకుంటున్నావా అత్తయ్య అని ఆశ్చర్యంగా చూస్తే.. అవును నువ్వు నాకు కాబోయే శ్రీమతివి. మరి అప్పుడు మీ అమ్మగారు నాకు అత్తయ్యే కదా.
థాంక్యూ సార్. అదిగో మళ్ళీ.. ఓకే.. ఓకే.. థాంక్యూ దేవా అని వెనక నుండి హత్తుకుంటుంది. నువ్వు ఇలా ఎనర్జీ ఇస్తే బైక్ గాలిలో తేలుతుంది.
అత్తయ్యకి ఇద్దరం జంటగా వెళ్లి కనిపిద్దాము. సరే అని వెలిగిపోతున్న ముఖంతో చెబుతుంది.
బైక్ ఇంటి ముందు ఆగుతుంది. ఇద్దరూ బైక్ దిగి లోపలికి అడుగులు వేస్తూ ఉంటే టెన్షన్ గా సూర్య చెయ్యి పట్టుకుంటుంది.
ఏమైందిరా.. అమ్మకి తెలుసు అన్న విషయం నాకు తెలుసు కానీ ఏమిటో ఇలా చెప్పాలి అంటే చాలా టెన్షన్ వస్తుంది. ఇబ్బందిగా అనిపిస్తుంది.
టెన్షన్ నాకు వదిలెయ్యి. నీ కలలు నువ్వు సాధించు. నీ ప్రాజెక్ట్… నీ శ్రమ… అవే నీ అసలైన టెన్షన్ అంటాడు సీరియస్‌గా.
ఆ మాటలు వింటే విశి కళ్లలో నమ్మకం మెరుస్తుంది.
నాకెందుకో… మీరు ఉన్నంతవరకూ ఏదీ భయంగా అనిపించదు అంటుంది.
నీకు అదే చెబుతున్నాను. ఎదుట మనిషి మీద ఎక్కువ డిపెండ్ అవ్వద్దు అని.. మీరు నేను వేరు కాదు కదా దేవా అంటే.. అబ్బో మా మేడంగారిలో చాలా వేరియేషన్స్ ఉన్నాయే..
ఇద్దరూ వెళ్లేటప్పటికీ తలుపులు తెరిచే ఉంటాయి. అరే అమ్మ తెలుపు కూడా వేసుకోలేదా.. ఇక్కడ భయం ఏమీ ఉండదులే. ఇప్పుడు దాకా నేహా అంటీ ఏమైనా ఉండి వెళ్ళచ్చు అని ఇద్దరు లోపలికి అడుగుపెడతారు.
అటువైపు తిరిగి ఉన్న భానుమతిని అమ్మ అని పిలుస్తుంది.
వచ్చేసారా వస్తున్నాను అని వెనక్కి తిరుగుతుంది. అంతే భానుమతిని ఆలా చూడగానే చేతిలో ఉన్న బ్యాగ్ వదిలేసి బిగుసుకుపోతుంది.
ఏమి అయ్యింది రా అని భానుమతి ముందుకు వస్తే సూర్యకి కూడా ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా చూస్తూ ఉంటాడు.
కూతురు దగ్గరికి వచ్చి కదుపుతూ అలా ఉన్నావేమిటి విశి ఏమైంది. అమ్మ నువ్వు అని వేలు పెట్టి చూపిస్తూ భయంగా అడుగుతుంది.
భానుమతి ఎలా కనిపిస్తుంది..
కథ కొనసాగుతుంది.....
Posts: 898
Threads: 13
Likes Received: 7,038 in 832 posts
Likes Given: 1,545
Joined: Aug 2024
Reputation:
652
Part - 104
కూతురు దగ్గరికి వచ్చి కదుపుతూ అలా ఉన్నావేమిటి విశి ఏమైంది. అమ్మ నువ్వు అని వేలు పెట్టి చూపిస్తూ భయంగా అడుగుతుంది.
ఏమైంది అలా చూస్తున్నావు. నువ్వు. ఏంటమ్మా ఇలాగ ఉన్నావు. నుదుటిమీద చెయ్యి వేసుకుని ఇదా అని అక్కడ కుర్చీలో కూర్చుని నిజం తెలిసింది.
ఆ మాటకి భయంగా తల్లి దగ్గర మోకాళ్ళ మీద కూర్చుని ఏం మాట్లాడుతున్నావు అమ్మ. నాకు ఏదో అవుతుంది అని నిజం తెలియకుండా ఎన్ని రోజులని ఉంచుతావు విశి.
ఎవరు చెప్పారు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటుంది.
కళ్ళు తెరిచి కూతురు చెంప పైన చెయ్యి వేసి నువ్వు దేవా బాబు బయటికి వెళ్ళిన రోజునే తెలిసింది.
గౌతమ్ వచ్చాడు. ఆ మాటకి సూర్య గౌతమ్ అని అనుమానంగా చూస్తే.. నేహా కూడా అప్పుడే పైకి వస్తుంది. నేహా ని చూస్తే కళ్ళు అర్పుతుంది.
మీరిద్దరూ ప్రేమించుకున్నారు. నా ట్రీట్మెంట్ కోసం మనీ ఇచ్చింది అని ఏదేదో చెప్పాడు. నాకు నమ్మబుద్ధి అవ్వలేదు. కాదు అని గట్టిగా అరిస్తే...
మీ నాన్నగారు చనిపోయిన విషయం దగ్గర నుంచి అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఒక్క నిమిషం నా కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్టు అనిపించింది.
నాకోసం నువ్వు ఇంత కష్టపడ్డావు అని తెలిసినప్పుడు ఈ తల్లి హృదయం ఎన్ని ముక్కలు అయ్యిందో ఆ భగవంతుడికే తెలుసు.
నాకు కూతురిగా పుట్టి నాకు అమ్మగా మారావా విశి బంగారం అని నుదుటిన ముద్దు పెట్టుకుంటుంది. వెచ్చటి కన్నీళ్లు నుదిటన పడతాయి.
అమ్మ అని ఏడుపు గొంతుతో పిలిస్తే నాకేమీ అవదురా.. మీ నాన్నగారి బలం కూడా నాకే ఇచ్చారు. నిన్ను జాగ్రత్తగా చూసుకోని దేవా బాబు చేతుల్లో పెట్టాలి. అంతకుమించి నాకు ఏమీ అవసరం లేదు.
సూర్య విశి తో నేను ఇప్పుడే వస్తాను అని నేహా వైపు చూసి కిందకి వెళతాడు. నేహా కూడా వెనకాలే వెళుతుంది. అసలు ఏం జరిగింది ఆంటీ.
ఆ ఇడియట్ చాలా ఎక్కువ చేశాడు రా.. మావయ్య ఉన్నారు కాబట్టి రెండు పీకి పంపించారు.
ఏం జరిగింది ఆంటీ.ఆరోజు జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది.
గౌతమ్ వచ్చి తలుపు కొడతాడు. భానుమతి తలుపు తీసి ఎవరు అంటే.. నా పేరు గౌతమ్. ఆంటీ నేను మీతో మాట్లాడాలి.
మీరు ఎవరో నాకు తెలియదు. మా వారు ఉన్నప్పుడు రండి. దాని గురించే మాట్లాడాలి. మావారి గురించి నువ్వు మాట్లాడేది ఏమిటి. బయటికి వెళ్ళు.
నేను చెప్పేది వినండి. విశి మిమ్మల్ని మోసం చేస్తోంది. రేయ్ నా కూతురు గురించి ఏదైనా మాట్లాడావంటే ఊరుకోను.
నేహా.. నేహా అని పిలుస్తూ ఉంటే.. ప్లీజ్ ఆంటీ మీకు అంకుల్ గురించి కూడా తెలియాలి. అంకుల్ ఇంటికి వచ్చి ఎన్ని రోజులు అయింది. అనుమానంగా చూస్తుంది.
మీరు ఎలా చూసినా సరే మీకు ఒక నిజాన్ని చెబుతున్నాను. అంకుల్ లేరు. చనిపోయారు. ఆ మాటకి కోపంగా గౌతమ్ చెంప పైన కొడుతుంది.
మీరు నన్ను కొట్టిన సరే అదే నిజం. అంకుల్ యాక్సిడెంట్ లో చనిపోయి చాలా నెలలే అవుతుంది. మీ దగ్గర ఆ విషయం దాచి మేనేజ్ చేస్తుంది.
నువ్వు చెప్పేదంతా అబద్ధం. నిజం నా దగ్గరే ప్రాజెక్ట్ చేసింది. అలాగే రెస్టారెంట్ లో కూడా సర్వెంట్ జాబ్ చేసింది. నేను చెప్పేదంతా నిజం.
నాతో కొన్ని రోజులు ప్రేమ అని తిరిగింది. నాతో అవసరం తీరిపోయిన తర్వాత దేవా తో తిరుగుతుంది. నాకు విశి అంటే చాలా ఇష్టం. ప్లీజ్ ఆంటీ..
మీరే ఎలాగైనా నచ్చచెప్పి నాతో విశి పెళ్లి జరిగేలాగా చూడండి.
భానుమతికి బుర్ర పనిచేయడం మానేస్తుంది. అంతా శూన్యంగా కనిపిస్తూ ఉంటే.. తల పట్టుకుంటుంది. ఈ లోపు నేహా వచ్చి భానుమతిని పట్టుకుంటుంది.
నేహా వైపు చూసి.. ఇతను ఏదేదో చెబుతున్నాడు.
అతని మాటలేమీ పట్టించుకోవద్దు. విశి ఎలాంటిదో మనకి తెలియదా.
మీరు కూడా ఎందుకు ఆవిడని మోసం చేస్తున్నారు. నేను చెప్పేది ఇది అందరికీ తెలుసు. విశి బెస్ట్ ఫ్రెండ్ అయినా భవ్యకి కూడా తెలుసు.
మీ ఆస్తులన్నీ కూడా మీవారు చనిపోయిన తరువాత మీ బంధువుల అన్యాయంగా ఆక్రమించారు. అందుకే విశి నా దగ్గర ఉద్యోగం చేసింది.
ప్రతి నెల మీ ట్రీట్మెంట్ కి నేనే డబ్బులు సాయం చేశాను. అలాంటిది కృతజ్ఞత లేకుండా ఇప్పుడు వేరే వాళ్ళతో తిరుగుతుంది.
ఇదేనా మీ పెంపకం అని మాట్లాడుతూ ఉంటే.. వాసు గారు వచ్చి ఒక్కటి పీకుతారు. గౌతమ్ భయంగా చూస్తాడు. ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా..
నా కొడుకు వచ్చేటప్పటికి ఇక్కడి నుంచి వెళ్ళిపో.. లేదు అంటే నీకు భవిష్యత్ అన్నది ఉండదు. ఒక ఆడపిల్ల కష్టపడి తల్లిని చూసుకుంటూ.. తన కాళ్ళ మీద తను నిలబడితే చూడలేకపోతున్నావా...
సెక్యూరిటీని పిలిచి బయటకి గెంటిస్తాడు. ఇదిరా జరిగింది. పాపం అది తెలియగానే భానుమతి చాలాసేపటి వరకు మనిషి కాలేకపోయారు.
మెల్లిగా సర్దుకున్న తరువాత నా చేతులు పట్టుకుని అసలు ఏం జరిగిందో చెప్పరా ప్లీజ్ అని అడిగితే.. ఇప్పుడు అవన్నీ ఎందుకు అన్నా సరే గట్టిగా పట్టుబడ్డారు.
అత్తయ్య కూడా పక్కనే ఉండి చెప్పమన్నట్టుగా సైగ చేస్తే... మొత్తం జరిగింది చెప్పాను. విశి ఎంత కష్టపడిందో.. తన ఆరోగ్య విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుందో తెలిసి చాలా కుమిలిపోయారు రా.
అపురూపంగా పెంచాము. కాలికి మట్టి అంటితే ఎక్కడ కందిపోతుందో అన్న అంతగా వాళ్ళ నాన్నగారు గుండెల మీద పెట్టుకుని పెంచుకున్నారంట.. అలాంటి పిల్ల ఇలా కష్టపడుతుందని తెలిసి విలవిలలాడిపోయారు.
ఒక రోజంతా అలాగే మౌనంగా ఉండిపోయారు. నిన్నటికి సర్దుకుని ఇదిగో నేను చూసేటప్పటికి ఇలాగే కనిపించారు. అలా చూడగానే ముందు భయం వేసింది కానీ తర్వాత అర్థమయింది.
పరిస్థితులను అర్థం చేసుకొని నిలబడ్డారు అని. నా చేతులు పట్టుకుని థాంక్స్ చెబితే ఇబ్బందిగా అనిపించింది. కానీ ఆ గౌతమ్ గాడిని మాత్రం అస్సలు వదలకండి.
ఎందుకు విశి మీద అంత కక్ష కట్టాడు. రాస్కెల్.. ఒక ఆడపిల్ల కష్టపడి నిలబడుతూ ఉంటే చూడలేకపోతున్నాడు.
సూర్య ఆలోచిస్తూ ఉంటే.. ఏంట్రా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. ఏమీ లేదు అని తల ఊపి ఒక గుడ్ న్యూస్ చెప్పాలని వచ్చాము కానీ ఇలా అంటే..
మీరిద్దరూ ఇలాంటి గుడ్ న్యూస్ వస్తారని ముందే ఊహించాము. అందుకే నన్ను కూడా రానివ్వకుండా మొత్తం భానుమతి చాలా వెరైటీస్ చేసింది.
పద పైకి వెళ్తాము. నువ్వు కనిపించకపోతే తల్లి కూతుర్లు ఇద్దరు ఇంకా డల్ అయిపోతారు. మా అందరికీ కూడా పైనే భోజనాలు అని సూర్యని తీసుకుని వెళుతుంది.
వీళ్లిద్దరూ ఎలా ఉన్నారో అన్ని టెన్షన్ గా ఉన్న సూర్య లోపలికి వెళ్లి చూస్తాడు. వాళ్ళని చూడగానే పెదవులపై చిరునవ్వు వస్తుంది. నేహా వైపు చూస్తే... చెప్పాను కదా భానుమతి నిలబడింది అని.
సూర్య నవ్వుకుంటూ వెళ్లి ఏంటి ఆంటీ స్పెషల్స్. ఇంకా ఆంటీ అని పిలవకూడదు. అత్తయ్య అనాలి.సరే ఏం చేస్తున్నారు. లిస్ట్ మొత్తం చెబుతోంది. అన్ని నాకు ఇష్టమైనవే..
వాళ్ళిద్దరినీ చూస్తూ విశి తండ్రి ఫోటో వైపు చూస్తుంది. గోడమీద ఉన్న తండ్రి ఫోటో కి చనిపోయిన తరువాత ఇదే మొదటిసారి ధైర్యంగా దండా వేసి బొట్టు పెట్టడం.
బాబు మీ పెద్ద వాళ్ళని పిలిపిస్తే మీ ఇద్దరికీ పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తాను . ఆ మాటకి విశి ఉలిక్కిపడితే సూర్య నవ్వుతాడు.
ఏంటి బాబు ఏమి చెప్పడం లేదు. ఇప్పుడు కాదు.
దానికి ఇంకా కొంచెం టైం ఉంది పోనీ ఫోన్ నెంబరు ఇవ్వు మాట్లాడతాను.
సూర్య నెంబర్ ఇస్తాడా.......
Posts: 898
Threads: 13
Likes Received: 7,038 in 832 posts
Likes Given: 1,545
Joined: Aug 2024
Reputation:
652
Part - 105
ఫోన్ నెంబర్ ఇవ్వ బాబు మాట్లాడుతాను.. తప్పకుండా... రేపు డైరెక్ట్ గా అమ్మని తీసుకువస్తాను.
అమ్మ, మీరు ఎంత సేపు కావాలి అంటే అంత సేపు మాట్లాడుకోండి. సరేనా అత్తయ్య.. ప్రస్తుతానికి ఆకలి దంచేస్తుంది.
అయ్యో రండి అని అందరికీ వడ్డీస్తుంది. చాలా రోజుల తర్వాత చాలా తన చేతులతో వండి నలుగురికి పెడుతున్నందుకు భానుమతికి చాలా సంతోషంగా అనిపిస్తుంది.
భోజనం చేస్తూ ఆలోచిస్తున్నా సూర్య ని శ్రీకర్ కదిపి ఏమాలోచిస్తున్నావు బావ. ఆ గౌతమ్ గాడికి అర్జెంటుగా చెక్ పెట్టేయాలి. చాలా ఎక్కువ చేస్తున్నాడు.
విశి చేతులతోనే చెక్ పెట్టించాలి అనుకున్నాము కదా.. అందుకే ఓపిక పడుతున్నాను కానీ ఈరోజు ఆంటీ ధైర్యంగా నిలబడ్డారు కాబట్టి సరిపోయింది లేకపోతే విశి పరిస్థితి ఏమిటి..
రేపటి నుంచి వాడిని పరుగులు పెట్టేస్తాను.
గౌతమ్ డ్రింక్ చేస్తూ విశి వచ్చే ఉంటావు కదా. మీ అమ్మగారిని చూసి మీ ఫేస్ ఎలా ఉండు ఉంటుందో...
పాపం ఆవిడ ఇంకా తట్టుకుని నిలబడ్డారు అంటావా.. లేకపోతే హాస్పిటల్ లో ఎడ్మిట్ అయి ఉంటారా. నువ్వు నన్ను చీట్ చేసావు అని తెలుసుకుని నీ రెండు చెంపలు వాయించేస్తున్నారేమో..
కన్నింగ నవ్వుకుంటూ డ్రింక్ సిప్ చేస్తూ ఉంటే.. హిమ వచ్చి గౌతమ్ చేతిలో గ్లాస్ తీసుకుని తాగుతూ ఉంటుంది. హాయ్ బేబీ అంటే..
ఏమిటి చాలా హుషారుగా ఉన్నట్టున్నావు. హ.. ఆ విశిని వాళ్ళ అమ్మ దగ్గరే ఇరికించాను. రేపు వచ్చి నా కాళ్లు పట్టుకుని ఏడుస్తుంది చూడు..
అంత నమ్మకమా.. నేను చెప్పింది అలాగుంది.. ప్రూఫ్స్ చూపించాను. అవి చూస్తూనే ఆవిడ కళ్ళు తిరిగి పడిపోబోయింది.
పడిపోలేదు కదా.. అలాంటి వీక్ మెంటాలిటీ లేడీస్ ఈజీగా నమ్మేస్తారు.
నీ ప్లాన్ వర్క్ అవుట్ అవుతే విశి నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది అంటున్నావు. ఒకవేళ అవ్వకపోతే... అవ్వదు అనే ఆప్షన్ లేదు.
రేపు తెల్లారిన తర్వాత జరిగే సీన్ చూడు. కావాలి అంటే నీకు లైవ్ కూడా చూపిస్తాను.
సూర్య భోజనం చేసి వెళుతూ మంచి రోజు చూసి అమ్మని, నానమ్మని తీసుకు వస్తానని చెప్పి విశి కి కళ్ళతోనే బాయ్ చెప్పే శ్రీకర్ ని తీసుకుని వెళ్ళిపోతాడు.
ఇంటికి వెళ్లేటప్పటికీ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఏమిటి అందరు పనులు మానేసుకుని మరీ కూర్చున్నారు. నీ గురించే అన్నయ్య అని వైభవ్ అంటాడు.
నా గురించా.. ఎనీ స్పెషల్. అది నువ్వు చెప్పాలి. మా బాబికి ప్రపోజ్ చేసావా. చిన్నగా సిగ్గుపడతాడు. అబ్బో మా అన్నయ్య సిగ్గుపడ్డాడు అంటే అక్కడ ఓకే అయినట్టుంది. చెప్పు చెప్పు ఎవరు ముందు ప్రపోజ్ చేశారు.
ఇంకెవరు ప్రపోజ్ చేస్తారు రా బాబు. అమాయకురాలైన మా చెల్లి అని శ్రీకర్ అంటాడు. మీ చెల్లి అమాయకరాల అలా అనుకుంటే మేము అని వైభవ్ అంటే..
మీరు సింహాలు రా. పీల్చి పిప్పి చేస్తారు మమ్మల్ని. నా చెల్లిని ఎంత ఏడిపించాడో తెలుసా ఇడియట్ అని మెడ చుట్టూ చెయ్యి వేసి గట్టిగా నొక్కుతాడు.
అబ్బా వదలరా.. ఏదో కాస్త ఫన్ చేస్తే లైఫ్ లో గుర్తుండిపోతుంది అని. అందుకని విశిని అలా ఏడిపిస్తావా.
ఏం చేశావు అని అందరూ చుట్టూ ముగితే అబ్బా వీడు నోరు అసలు కుదిరిగా ఉండదే అని చూస్తే.. ఏంట్రా అని కళ్ళు ఎగరేస్తాడు.
చెప్పు అన్నయ్య ఏం చేసావు నేను టెన్షన్ భరించలేను. జరిగింది చెబుతాడు.. ఓ ముందు నువ్వే ఏడిపించి తర్వాత నువ్వే నవ్వించావా..
అయినా అదేం ఫాంటసీ అన్నయ్య. ముందు బాబి చెప్పాలని. ఒరేయ్ నాకేమీ నీలాగా మోర్ దెన్ గర్ల్ ఫ్రెండ్స్ ఏమీ లేరు.
నాకు ఏదైనా సరే క్యూటి నే.. ఏదో నాకంటూ కొన్ని సరదాలు ఉంటాయి కదా అని తల మీద కొట్టి రూమ్ కి వెళ్ళిపోతాడు.
అందుకే అన్నయ్య ఎక్కువమంది గర్ల్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేయాలి అని నోట్లో మాట బయటకు వస్తూ ఉన్నప్పుడే.. చందు లోపలికి వస్తుంది.
అంతే ఆ మాట గబుక్కున మింగేస్తున్నాడు గాని ఆల్రెడీ చందు అది విని కోపంగా చూసి అవని దగ్గరికి వెళుతుంది.
శ్రీకర్ నవ్వుతూ బాగా ఇరుక్కున్నట్టున్నావు కదా.. ఈ మధ్యన నా టైం అసలు బాగుండడం లేదు బావ. నేను సిన్సియర్‌గా ఉన్నప్పుడల్లా దీనికే దొరుకుతున్నాను.
గర్ల్స్ తో ఫ్లర్ట్ చేసిన అన్ని రోజులు ఎవరికి దొరకలేదు. ఛీ.. నా జీవితం ఏమిటో అని వాపోతే.. అదే రా సిన్సియర్ కి ఉన్న ఎక్సమ్.
అందులో మనం ఎంత హార్డ్ వర్క్ చేసి స్కోర్ కొడితే అంత మంచి రిజల్ట్ అని బుగ్గ మీద తట్టి సూర్య దగ్గరికి వెళ్ళిపోతాడు.
సూర్య దగ్గరికి వచ్చిన శ్రీకర్ నెమ్మదిగా చెబుతాడు.
బావ… నువ్వు స్ట్రాంగ్‌గా ఉన్నావు కానీ విశి ఇప్పుడు చాలా వల్నరబుల్ స్టేజ్‌లో ఉంది. రేపు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఆ ఇడియట్ ఒక ఆడపిల్ల మీద అలాంటి నిందలు వేయడం ఏమిటి. అసలే విశి సెన్సిటివ్.
సూర్య కళ్ళల్లో కాస్త కోపం.. నాకు తెలుసు శ్రీకర్. అందుకే రేపు నేను ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయను.
అదే సమయంలో హాల్లో భానుమతి.. విశి వైపే చూస్తూ ఉంటుంది. భానుమతి నెమ్మదిగా ఇలా రా బంగారం అంటే.. విశి వచ్చి భానుమతి ఒళ్ళో పడుకుంటుంది.
ఏరా ఆ గౌతమ్ మాటలకి బాధపడుతున్నావా..
విశి నవ్వే ప్రయత్నం చేస్తుంది. లేదమ్మా… కాస్త అలసట అంతే.
అమ్మ దగ్గరే మాట దాస్తున్నావా.. తల్లి చేతులు గట్టిగా పట్టుకొని వాడు చెప్పిందే నిజమని నువ్వు నమ్మితే.. నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది.
ఏ కష్టం అయినా లోపల దాచుకోకూడదు. నా అనుకున్న వాళ్ళకి చెప్పాలి. నీకు దేవా బాబు తోడుగా ఉన్నాడు. భయపడాల్సిన అవసరం లేదు.
ఆ మాటకి విశి కళ్ళు తడుస్తాయి కానీ మాట బయటికి రాదు.
సూర్య విక్రమ్ దగ్గరికి వెళ్లి డాడ్ అని పిలిస్తే...అరే వచ్చి ఎంత సేపు అయింది. ఎలా జరిగింది మీ ట్రిప్. హ్మ్..అని ముభావంగా చెబుతాడు.
ఏమైందిరా. శ్రీకర్ వచ్చి ఆ గౌతమ్ గాడు చాలా ఎక్కువ చేస్తున్నాడు అంకుల్. ఓ.. ఆ విషయమా... మీకు తెలిసి కూడా సైలెంట్ గా ఉన్నారా డాడ్.
నవ్వుతూ సైలెన్స్ చాలా డేంజర్ సూర్య. ఆవేశంగా మాట్లాడే దానికన్నా మౌనం 100 రెట్లు ఎక్కువ పని చేస్తుంది.
ఎగరని. ఎక్కడికి ఎగిరిన వాడు జుట్టు మన చేతుల్లోనే ఉంది. నువ్వు ఎవరో తెలియక ఎగిరెగిరి పడుతున్నాడు. నా కోడలు చేతే నువ్వు సమాధానం చెప్పించాలి అన్నావు అని వాడిని కాస్త వదులుతున్నాను కానీ లేకపోతే మీరు వచ్చేలోపే వాడు మొత్తం భూస్థాపితం అయిపోయేవాడు.
తండ్రిని హత్తుకుని కళ్ళు మూసుకుంటాడు. సూర్య చాలా ఎమోషనల్ అవుతున్నాడని అర్థమయ్యి ఏమైందిరా అని వెన్ను నిమురుతూ అడిగితే..
నేహా ఆంటీ పక్కన ఉన్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే అత్తయ్య పరిస్థితి ఏమిటి... అత్తయ్యకి ఏదైనా జరిగితే క్యూటి తట్టుకోగలుగుతుందా.
క్యూటి లేకపోతే నేను అంటే.. షట్ అప్ సూర్య. ఈ నాన్న ఉండగా అంత దూరం వస్తుందని నువ్వు అనుకుంటున్నావా..
నాకు తెలుసు డాడ్. మీరు రానివ్వరని.. కానీ ఒక్కసారిగా వినగానే నాకు భయమేసింది. తొందరగా క్యూటి ని తెచ్చేసుకోవాలి. తప్పకుండా..
అంకుల్ వాడు మీ దగ్గర ఇండైరెక్టుగా చెబుతున్నాడు. పెళ్లి మాటలు మాట్లాడమని. ఆంటీ అడిగితే.. అమ్మని నాన్నమ్మని తీసుకు వస్తాను అని బాబుగారు మాట ఇచ్చారు. అది ఎలా చెప్పాలో తెలియక ఇలా ఏదేదో మాట్లాడుతున్నాడు.
అప్పుడే లోపలికి వస్తున్న అవని ఎవరికి ఎవరు మాట ఇచ్చారు అని అడుగుతుంది.
సూర్య ఏం చెబుతాడు........
Posts: 4,141
Threads: 172
Likes Received: 13,022 in 2,574 posts
Likes Given: 8,557
Joined: Nov 2018
Reputation:
894
Happy vacation Sivasai garu
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 898
Threads: 13
Likes Received: 7,038 in 832 posts
Likes Given: 1,545
Joined: Aug 2024
Reputation:
652
Part - 106
ఎవరు ఎవరికి మాటిచ్చారు అని అవని అడిగితే.. సూర్య శ్రీకర్ వైపు కొరకొరా చూస్తూ అవని దగ్గరికి వెళ్లి భుజం మీద చేయి వేసి సో క్యూట్ మా అంటాడు.
పొగిడింది చాలుగాని విషయం ఏంటో చెప్పు నాన్న. అది అమ్మ అంటూ ఉంటే.. పెళ్లి మాటలా.. అరే ఎలా గెస్ చేశారు.
నువ్వు ఆడపిల్ల లాగా సిగ్గుపడుతుంటేనే అర్థం అవుతుంది. ఏమిటో రోజులు ఇలా మారిపోతాయని అనుకోలేదు అని విక్రమ్ పక్కన కూర్చుంటుంది.
అమ్మ అని గారంగా పిలిస్తే... నిజమేరా మా టైంలో మేము సిగ్గుపడే వాళ్ళము ఇప్పుడు అబ్బాయిలు సిగ్గుపడుతున్నారు అంతేనా అండి.
శ్రీమతి గారు ఏమి చెబితే అదే నిజం అంటాడు.. శ్రీకర్ వెంటనే ఆ రోజుల్లో ఆడవాళ్లు సిగ్గుపడితే మగవాళ్ళు మాట వినేవారు అనుకుంట..
ఇప్పుడు మగవాళ్ళు సిగ్గుపడుతున్నాం కాబట్టి ఆడవాళ్లు మాట వింటారు. ఒరేయ్ బావ నువ్వు ఇదే కంటిన్యూ చేసేయ్. మరి నువ్వు అంటే ఆల్రెడీ నేను సరెండర్ అయిపోయాను ఆంటీ అని ఒడిలో పడుకుంటాడు.
కోతలు కొయ్యకు. సౌమ్య చాలా సాఫ్ట్. అలాగే అనుకున్నాను అంటీ. ప్రపోజ్ చేసే వరకు బిక్కు బిక్కుమంటూ చూసింది.
అయ్యో అమాయకమైన నా బుజ్జి పప్పీ అని నేను మెల్ట్ అవ్వగానే ఆ బుజ్జి పప్పి నుంచి వైల్డ్ డాగ్ గా మారిపోయింది.
వైభవ్ కూడా పెద్దమ్మ అనుకుంటూ వస్తాడు. నీకేమైంది రా.. ఆ చందు దగ్గర మళ్లీ ఇరుకున్నాను. ఏం చేసావు. ఏదో ఇందాక పిచ్చా పాటిగా మాట్లాడుతూ ఉంటే అదే నిజం అనుకుని నన్ను కొరకరా చూసింది.
ఏం మాట్లాడావు అని శ్రీకర్ క అడిగితే మీరిద్దరూ ఉన్నచోట ఉండకుండా నీకు మోర్ దాన్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. నువ్వు ఏమైనా చెబుతావు అంటే... నేను ఫన్ గా తీసుకున్నాను. అది వింది ఇంకా అంతే అని తల మీద చేయి వేసుకుంటాడు.
ముగ్గురిని చూసి నవ్వుతూ ఆడవాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో మీ పెదనాన్ని అడగండి. కరెక్ట్ గా చెబుతారు. ఇది మరీ బాగుంది. నాకు అసలు రాదు.
వచ్చుంటే ఇలా ఎందుకుంటాను. అవునా మీకు రాకుండానే నన్ను హ్యాండిల్ చేశారా. అయ్యో నిన్ను నేనేంటి అప్పుడే పుట్టిన బేబీ అయినా హ్యాండిల్ చేస్తుంది.
భర్త వైపు గుర్రుగా చూస్తూ ఉంటే నన్ను రాత్రంతా చూడొచ్చు గాని ముందు వాళ్ళు ముగ్గురు పాట్లు చూడు బంగారం. నాకసలే నిద్ర అంటే.. ఇంకా ఆపండి అని సూర్య వైపు చూస్తుంది.
అవని చేతులు మడిచేసుకుని.. సరే సరే… ఎవరెవరికి మాటిచ్చారో ఒక్కొక్కరుగా చెప్పండి. లవ్ ప్రాబ్లమ్స్ ఏంటో చెబితే క్లియర్ చేయడానికి ట్రై చేస్తాము. ఇంటర్వ్యూ స్టార్ట్
సూర్య వెంటనే శ్రీకర్ వెనక దాక్కుంటూ.. ఫస్ట్ ప్రశ్నే నాకెందుకు అమ్మా... ఇంకా నేను అ ఆ లు దగ్గరే ఉన్నాను.
శ్రీకర్ సైడ్ చూసి.. ఏంటి రా… నిన్నే హీరో అనుకున్నా, ఇప్పుడే సైడ్ క్యారెక్టర్ అయిపోయావా?
విక్రమ్ నవ్వుతూ.. అప్పట్లో ప్రేమ అంటే లేఖలు, ఇప్పుడు ప్రేమ అంటే ఫ్యామిలీ మీటింగులు.
అవని తల ఊపుతూ... అందుకే అంటున్నా… ఈ జనరేషన్ చాలా డేంజర్. ప్రేమ ముందు, భయం తర్వాత.
అంతలో సౌమ్య లోపలికి వస్తే.. ముగ్గురూ ఒకేసారి సైలెంట్. ఏమైంది? కరెంట్ కట్ అయిందా లేక ధైర్యం కట్ అయిందా?
శ్రీకర్ వెంటనే చూడూ… ఇదే ఆ హ్యాండిలింగ్. మాటతోనే షట్‌డౌన్.
వైభవ్ కుర్చీలో కూర్చుంటూ పెద్దమ్మా… పెళ్లి తర్వాత మాకు ఇలాంటివే ఎదురవుతాయా?
ఎదురవుతాయా కాదు రా… ఎదురుచూస్తుంటాయి.
అందరూ నవ్వుతుంటే
సూర్య గట్టిగా.. ఒక విషయం క్లియర్… ఈ ఇంట్లో అబ్బాయిలకి హక్కు లేదు.
సౌమ్య కళ్లెత్తి.. ఉంది… వంటింట్లో ఏ కూర చేయాలో చెప్పే హక్కు.
అవని చప్పట్లు కొడుతూ.. శభాష్ సౌమ్య. ఇక నీకు ధైర్యంగా పెళ్లి చేసేయవచ్చు. థాంక్యూ అత్తయ్య అని శ్రీకర్ వైపుత చూస్తూ కళ్ళు ఎగరేస్తుంది.
శ్రీకర్ కక్కలేక మింగలేక చూస్తూ ఉంటాడు. శ్రీకర్ అవస్థ చూసి.. ఇప్పుడే ఇలా ఉంటే… ఇంక పెళ్లి తర్వాత నీ పరిస్థితి దేవుడికే తెలియాలి.
శ్రీకర్ చేతులు జోడించి... అందుకే పెళ్లి ముందు నుంచే సరెండర్ అయిపోయాం అంకుల్.
మా గొడవ ఎప్పుడూ ఉండేది లే కానీ సూర్య డైవర్ట్ చేయకుండా మేటర్ ఏంటో ఆంటీ కి చెప్పు అనగానే.. అబ్బా వీడు వదలడు కదా అనుకుని..
అమ్మ అని తల్లి ముందుకూర్చుంటాడు. చెప్పు నాన్న అని చెంప మీద చెయ్యి వేస్తె.. మరేమో అన్నవరం లో నేను క్యూటి కి ప్రపోజ్ చేశాను అంతా ఓకే అయ్యింది.
నువ్వు ప్రపోజ్ చేసావా.. మా చెల్లి ప్రపోజ్ చేసిందా అని శ్రీకర్ వెంటనే అందుకుంటే.. ఎవరు ప్రపోజ్ చేస్తే ఏంటి మా ఇద్దరికీ ఓకే అయింది ఇంక నువ్వు ముయ్యి.
సరే ఇప్పుడు నేనేం చేయాలి. విశి వాళ్ళ మదర్ మిమ్మల్ని కలవాలి అంటున్నారు. ఫోన్ నెంబర్ అడిగితే ముందు మీతో మాట్లాడే ఇవ్వచ్చు అని ఇవ్వలేదు అమ్మ.
సరే రేపు వెళ్ళి మాట్లాడదాము. కాకపోతే ఇక్కడొక చిన్న మెలిక ఉంది. మెలిక ఏమిట్రా..
మీరు జై సింహ ఫ్యామిలీ మెంబర్స్ లాగా కాకుండా ఒక సామాన్య లెక్చరర్ తల్లిగా మాత్రమే రావాలి. విక్రమ్ వైపు చూస్తే నాకేమీ సంబంధం లేదు అని భుజాలు ఎగరేస్తాడు.
ఇప్పుడు నాన్న రావాల్సిన అవసరం లేదు. ఓన్లీ లేడీస్ వరకే. అదేంటి. నాన్నని విశి చూసింది అమ్మ. చూస్తే ఏమైంది. ఎప్పటికైనా తెలియాల్సిందే కదా.
కానీ ఇప్పుడు కాదు. తను మన కంపెనీతో చేస్తున్న ప్రాజెక్టు సక్సెస్ అవ్వాలి. అప్పుడు నేను ఎవరో అన్నది రివిల్ చేస్తాను. ఇప్పుడే చెబితే ఏమైంది.
చెప్పొచ్చు కానీ తను ఓన్ టాలెంట్ తోనే ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటుంది. నేను ఎవరో తెలిస్తే నేనేమైనా రికమెండ్ చేశాను అనుకొని డిసప్పాయింట్ అవుతుంది. అది నాకు ఇష్టం లేదు.
నీదంతా మీ నాన్న పోలికే అని నుదుటన ముద్దుపెట్టుకుని.. సరే అత్తయ్య వాళ్ళతో నేను మాట్లాడతాను. మంచి రోజు చూసుకుని వెళదాము.
థాంక్యూ అమ్మ. గుడ్ నైట్ నాన్న అని చెప్పి శ్రీకర్, వైభవ్ ని లాక్కొని వెళ్ళిపోతాడు. వెళుతున్న ముగ్గురిని చూసి నవ్వుతూ భర్త వైపు చూస్తుంది.
భార్యని చూస్తూ కన్ను కొడితే ఏంటిది అని సిగ్గుపడుతుంది. నువ్వు సిగ్గుపడడం మానవ.. మీరు కన్ను కొట్టడం మానుతున్నారా.. అది ఎలాగో ఇది అంతే.
నేను కన్ను కొట్టినప్పుడు నువ్వు సిగ్గుపడుతుంటే భలే ఉంటుంది తెలుసా.. అప్పుడే మొదటిసారి ఇద్దరం కలిసామా అన్న ఫీలింగ్ వస్తుంది.
చాలు చాల్లే మీ సంబరం అని ఏదో గుర్తొచ్చినట్టుగా అవును ఇందాక ఏమన్నారు. నేనేమన్నాను అని అమాయకంగా ఫేస్ పెట్టి అడుగుతాడు.
భర్తను కోపంగా చూస్తూ నన్ను హేండిల్ చేయడం అప్పుడే పుట్టిన బేబీకి కూడా ఈజీనా.. అంటే నేను మరీ అంత తింగరిదాన్ని అనా.
అయ్యో నా ఉద్దేశం అది కాదు బంగారం. మరి ఏమిటి.. నువ్వంత మంచి దానివి అని. ఇలాంటి కహాని చెప్పమంటే మీ తర్వాతే.. పిల్లల ముందు అలాగంటారా..
నువ్వు ఇలా ఉడుక్కుంటే ఇంకా ముద్దుగా ఉంటావు అని చక్కెలగింతలు పెడతాడు. అబ్బా వదలండి. మా శ్రీమతి నువ్వే దాకా నేను ఈ చక్కెలగింతలు ఆపను అని పెడుతూ ఉంటాడు.
అవని కళ్ళ నీళ్లు వచ్చేలాగా నవ్వుతూ ప్లీజ్ ప్లీజ్ అని అంటూ ఉంటే.. దగ్గరికి తీసుకుని నుదుటిని ముద్దు పెట్టుకుని ఐ లవ్ యు సో మచ్ మై స్వీట్ హార్ట్ అని చెబుతాడు.
భర్తని అలాగే హగ్ చేసుకుని కళ్ళు మూసుకొని ఉండిపోతుంది. ఓయ్ శ్రీమతి నేను ఐ లవ్ యూ చెప్పాను. హ్మ్ అంటుంది.
ఐ టూ అని ఏమీ చెప్పవా.. ఇంతకన్నా ఎలా చెప్పాలో నాకు తెలియదు.
ప్రతి జంట అవని విక్రమ్ జంట లాగా ఉండాలని కోరుకుంటూ..........
Posts: 898
Threads: 13
Likes Received: 7,038 in 832 posts
Likes Given: 1,545
Joined: Aug 2024
Reputation:
652
Part - 107
ఉదయం ఉషస్సు కిరణాలు మీద పడేటప్పటికీ విశి మగతగా లేచి కిటికీ దగ్గరకి వెళ్లి నిలబడి సూర్యుడిని చూస్తూ ఉంటుంది.
నిన్నటికీ ఈ రోజుకి ఎంత తేడా.. దేవా సార్ తో లవ్ లో ఉన్నాను అంటేనే కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. నాన్నకి ముందే తెలుసు అనుకుంట..
దేవా సర్ నా లైఫ్ లోకి వస్తారు అని. అందుకే చిన్నప్పుడే చూసి పెట్టేసారు అని నవ్వుకుంటుంది. దేవా సార్ లేచి ఉంటారా ఇంకా పడుకునే ఉంటారా..
ఫోన్ చేయాలా వద్దా అని ఫోన్ చేతిలో పట్టుకొని ఊగుతూ ఉంటుంది. డిస్టర్బ్ చేస్తానేమో..
అయినా సార్ ఫోన్ చేయాలి కదా.. ప్రేమలో ఉన్న వాళ్ళందరూ ఇలాగే చేసి మాట్లాడుకోవాలి కదా.. ఎందుకు చేయలేదు సార్.
ఆలోచనలో ఉన్న విశి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఎవరు చేశారో చూసుకోకుండా హలో సార్ అని పిలుస్తుంది. మౌనం. సార్ వినిపిస్తుందా అన్న అదే మౌనం.
ఎవరా అని చూసి తల కొట్టుకుంటుంది. భవ్య.. హ్మ్.. ప్లీజ్ భవ్య మాట్లాడు. నీకు ఒక ఫ్రెండ్ ఉంది అని గుర్తుఉందా.. అలా అంటావేంటే.. నువ్వు నా బెస్టి కదా..
అందుకేనా ఇన్ని రోజులు ఫోన్ చేయలేదు. అలాకాదే దేవసార్ తో అన్నవరం వెళ్ళాను. అక్కడ. వద్దు. ఏమైందే.. నాకు ఇలా ఫోన్లో కాదు.
డైరెక్ట్‌గా కలిసి సేమ్ టు సేమ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి.
అప్పుడు నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ నేను చూడాలి. నువ్వు మరీ ఆడుకుంటున్నావు.
లేదు... ఇన్ని రోజులు నాకు ఫోన్ చేయనందుకు... నీకు ఇచ్చే పనిష్మెంట్. కరెక్ట్ గా నేను కాలేజ్ కి వచ్చేస్తాను. నువ్వు రా అర్థమయిందా.
విశి రెడీ అయ్యి సూర్య కోసం చూస్తూ ఉంటుంది. బైక్ సౌండ్ వినిపించగానే భానుమతికి ముద్దు పెట్టి బాయ్ అమ్మ అని పరిగెత్తుకుంటూ వెళుతుంది. పిచ్చి పిల్ల అని బుగ్గన తుడిచికొని నవ్వుతారు.
విశి సూర్య ముందుకు వెళ్లి ఆయాస పడుతూ ఉంటుంది. హేయ్.. కూల్.. ఎందుకు అంత కంగారు పడుతున్నావు.
నేనెప్పుడో రెడీ అయ్యాను.
మీ కోసమే వెయిటింగ్. బైక్ మీద కూర్చుని చేతులు కట్టుకొని అంత మిస్ అవుతున్నావా.. మరి కాదా మార్నింగ్ ఎంతసేపు వెయిట్ చేసానో తెలుసా... మీ దగ్గర నుంచి ఫోన్ వస్తుందేమో అని.
ఎందుకు వెయిట్ చేయడం. అయ్యో లవర్స్ అన్నాక రోజు ఫోన్ చేసుకోవాలి. బోళ్ళు కబుర్లు చెప్పుకోవాలి. ఇంకా... ఇంకా అప్పుడప్పుడు అని ఏం మాట్లాడబోతుందో అర్థం అయ్యి నాలుక కర్చుకుని తలదించుకుంటుంది.
నువ్వు నా ముందు ఇలా సిగ్గుపడుతూ ఉంటే తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది అని చెయ్యి పట్టుకుని దగ్గరకి లాక్కుంటాడు.
అయినా తలదించుకునే ఉంటే గెడ్డం కింద వేలు పెట్టి పైకి లేపుతాడు. కళ్ళు నీళ్లతో నిండి ఉంటే.. ఏమైంది అని ఇప్పుడు ఇలా ఏడుస్తున్నావు.
సార్ ఇదంతా నిజమే కదా.. కల కాదు కదా.. నీకు కలలాగా అనిపిస్తుందా అని ఆ కళ్ళు తుడుస్తాడు. ఏమో సార్ భయం వేస్తుంది.
ఒకవేళ ఇది కల అయితే తట్టుకోవడం నావల్ల కాదు.నీకు చాలా పెద్ద డౌటే వచ్చింది ఇది కల కాదు నిజం అని తెలిసేలాగా ఒక పని చేయాలి.
ఏమిటి సార్. దగ్గరికి రా.. దగ్గరకు వచ్చి చెప్పండి అంటుంది. బుగ్గ మీద గట్టిగా ముద్దు పెడతాడు. వెంటనే చుట్టూ చూస్తూ సార్ అని సిగ్గుపడుతుంది. ఇప్పుడు అర్థమైందా ఇది నిజమే అని..
మీరు మరీ అల్లరి చేస్తున్నారు. నా క్యూటి దగ్గరే కదా.. నో ప్రాబ్లం. వెళదామా. సరే అని బైక్ ఎక్కి టు సైడ్స్ కూర్చుని భుజాల మీద చెయ్యి వేస్తుంది.
హలో.... ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు భుజం మీద చెయ్యి వేయాలి. లవర్స్ గా ఉన్నప్పుడు ఇలా నడుం చుట్టూ చెయ్యి వేసి టైట్‌గా పట్టుకోవాలి.
మనం వెళ్లేది కాలేజీకి సార్. దగ్గరికి వెళ్ళాక తీసేయొచ్చులే అని చేతులు ముందుకు పట్టుకుంటాడు. ఇది చూసిన శ్రీకర్.. అమ్మ బావ.... ఎంత ముదిరిపోయావు నేనే అడ్వాన్స్ అవ్వాలి.
మళ్లీ ఆంటీ తో అ,ఆలు దగ్గరే ఉన్నాను అని చెబుతావా అని చూస్తూ ఉంటాడు.
బైక్ కాలేజ్ దగ్గరికి వచ్చేటప్పటికి విశి నార్మల్‌గా కూర్చుంటుంది. పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసి సూర్యా వెళ్ళిపోతాడు.
భవ్య కోసం చూస్తూ ఉంటే గొంతు సవరించుకున్న సౌండ్ వినపడుతుంది. వెనక్కి తిరిగి భవ్య అంటే... నేను మాట్లాడాను.
అబ్బా ఫోన్లో సోరి చెప్పాను కదా. ఆ సోరి నాకు సరిపోదు. సరే ఏం కావాలి. ట్రీట్ కావాలి. ఓకే కాలేజ్ బంక్ కొట్టేసి వెళదామా. వద్దు క్యాంటీన్లో కూర్చుందాం పద అని తీసుకువెళ్లి కూర్చోబెట్టి ఇప్పుడు చెప్పు. అన్నవరంలో ఏం జరిగింది.
విశి భవ్య చేతిని పట్టుకుని కాస్త దగ్గరగా కూర్చుంటుంది.
కళ్లల్లో ఇంకా ఆ ఉదయపు మెరుపు అలాగే ఉంది.
చెప్పు… అన్నవరంలో ఏం జరిగింది అని భవ్య కళ్ళు ముడుచుకుని అడిగితే,
విశి చిన్న నవ్వు నవ్వి క్షణం ఆగుతుంది. సిగ్గుపడుతున్న విశిని.. అబ్బా చెప్పవే టెన్షన్ తో చచ్చిపోతున్నాను. నువ్వు ఇలా టెన్షన్ పడకూడదు అనే ఫోన్లో చెబుతాను అన్నాను. అది ఫోనులో వింటే నీ ఎక్స్ప్రెషన్స్ మిస్
అయిపోను.
అది అలా ఫోన్లో చెప్పే విషయం కాదు అన్నాను కదా… భవ్య మాటలకు విసి సిగ్గుపడుతూ.. అక్కడ ప్రతి క్షణం నాకు ఇప్పటికీ గుండెల్లో తిరుగుతోంది అంటూ కాఫీ కప్పు చేతిలో తిప్పుకుంటుంది.
అయ్యో మొదలెట్టింది… సినిమా స్టైల్లో డైలాగులు అని భవ్య నవ్వినా.... అవేమీ పట్టించుకోకుండా ఒకటి ట్రాన్స్‌లో చెబుతూ ఉంటుంది.
అన్నవరం వెళ్లేటప్పుడే సార్… కాదు… దేవా సార్ నా పక్కన ఉన్నారు అన్న ఫీలింగ్ వేరుగా ఉంది భవ్య. జనాలు, గుడి, మెట్లు… కానీ నాకు కనిపించింది మాత్రం ఆయన చేయి నా చేతిలో ఉండటం మాత్రమే.
భవ్య కళ్లెత్తి చూస్తూ... ఓహో… చేయి పట్టుకున్నారా? అని కాస్త ఆటపట్టిస్తుంది.
విశి చెంపలు ఎర్రబడుతూ.. అంతే కాదు… గుడిలోకి వెళ్లాక ఆయన కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తుంటే… నాకు ఏం కోరాలో కూడా తెలియలేదు. ఆయన పక్కనే ఉండేలా ఇలానే ఉండిపోతే చాలు అనిపించింది.
భవ్య ఒక్కసారిగా సీరియస్ అవుతుంది. అంటే… నిజంగానే ప్రేమలో పడిపోయావు కదే.
విశి తల ఊపుతూ మెల్లిగా అంటుంది.
సార్ కి నేను అక్కడే ప్రపోజ్ చేశాను. ఎంత ధైర్యం వచ్చిందో నీకు అనే గుండెల మీద చేయి వేసుకుంటుంది. కానీ సార్ నన్ను ఎంత ఏడిపించారో తెలుసా? ఆమె జరిగింది చెబుతుంది. అమ్మో మన దేవ సార్ పైకి కనపడరు కానీ చాలా రొమాంటిక్ ఫెలో కదా..
కాలేజీకి వచ్చే ముందు పెట్టిన ముద్దు గుర్తొచ్చి చెంప పైన చెయ్యి వేసుకుంటుంది.
అవును… భయం కూడా ఉంది. ఇంత ఆనందం నాకు అలవాటు కాదు. అందుకే నిన్న రాత్రి నిద్రపట్టలేదు. ఇది కలేమో అనిపించింది.
నువ్వు ఫోన్ చేసినా అది దేవా సారే అనుకుని చూసుకోలేదు.
అందుకే ఉదయం సార్ మీద పడి ఏడ్చావా? అని భవ్య నవ్వితే.. సార్ మీద పడి ఏడవలేదు కానీ అంటే... అర్థం అయింది తర్వాత..
విశి బుగ్గ మీద చెయ్యి వేసుకుని ఇది అంతా నిజమే అని ప్రూఫ్ చూపించారు. ఎలా... ఎలా అంటే ఎలాగోలాగాలే. ఉహూ.. చెప్పాలి నాకు.
అది… ఆయన ముద్దు పెట్టి ప్రూఫ్ ఇచ్చారు అని చెబుతుంది.
భవ్య ఒక్కసారిగా ఆశ్చర్యంగా విశి వైపు చూస్తూ..
అమ్మో… విశి.. ఫుల్ రొమాంటిక్ హీరోయిన్ అయిపోయావే. ఇంకేం… పెళ్లి కార్డ్ డిజైన్ చేయడమే మిగిలింది అంటుంది.
విశి నవ్వుతూ భవ్య భుజంపై తల పెట్టుకుంటుంది.
అంత దూరం ఆలోచించలేను… ఇప్పటికి ఆయన నా పక్కన ఉంటే చాలు.
దూరంగా కాలేజ్ బెల్ మోగుతుంది.
భవ్య లేచి... పద హీరోయిన్ గారు… క్లాస్ కి లేట్ అవుతోంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో… ప్రేమలో ఉన్నప్పుడు భయం ఉంటేనే అది నిజం అంటుంది.
విశి నవ్వుతూ లేచి... అయితే ఇది నిజమైన ప్రేమే భవ్య అని కళ్లలో మెరుపుతో చెప్పుకుంటూ క్లాస్ వైపు నడుస్తుంది.
గౌతమ్ లేచినప్పటి నుంచి ఫోన్ చూస్తూనే ఉంటాడు. అది చూసినా హిమ ఏమైంది గౌతమ్ ఫోన్ తోనే కూర్చున్నావు అని పక్కన కూర్చుంటుంది.
ఆ విశి ఎందుకు ఫోన్ చేయలేదు. ఈ పాటికి ఫోన్ చేసి నన్ను బెగ్ చేసుకుంటూ ఏడుస్తుంది అనుకుంటే... ఇప్పటికీ ఫోను లేదు. ఏమనుకుంటుంది.
అది ఏమనుకుంటే మనకెందుకు.. మనకి పని అవ్వాలి కాబట్టి నువ్వే డైరెక్ట్ గా మీట్ అవ్వు. ఇది కరెక్ట్. ఈవినింగ్ కాలేజ్ కి వెళతాను.
ఈవినింగ్ వరకు ఎందుకు ఇప్పుడు వెళితే ఏదైనా దుర్ముహూర్తం ఉందా? మళ్ళీ సాయంత్రం ఎవరో దానికి సెక్యూరిటీ గార్డ్ లాగా ఉంటున్నాడు అంటున్నావు కదా.. నువ్వు చెప్పింది నిజమే అని ఫ్రెష్ అవ్వడానికి వెళుతాడు.
గౌతమ్ విశి నీ కలుస్తాడా.....
Posts: 898
Threads: 13
Likes Received: 7,038 in 832 posts
Likes Given: 1,545
Joined: Aug 2024
Reputation:
652
Part - 108
గౌతమ్ గబగబా రెడీ అయ్యే హిమకి బాయ్ చెప్పి వెళతాడు. వెళుతున్న గౌతమ్‌ని చూసి నవ్వుకుంటూ నీలాంటి వాడికి బిజినెస్ అవసరమా..
గొర్రె తల ఊపునట్లు ఊపుతావు.. ఇప్పుడు అక్కడికి వెళ్ళాక మాత్రం నీకు గట్టి సన్మానమే జరుగుతుంది చూద్దాం అని తండ్రికి ఫోన్ చేస్తుంది.
ఏమైంది రా. ఈ గొర్రె వెళ్ళింది కలవడానికి... నాకు తెలిసి అయితే ఆ విశిష్ట గట్టిగానే బయటికి గెంటుతుంది. ఇంకా వాడితో నీకు పని ఏమిటి రా...
నీకు కావలసిన పబ్లిసిటీ వచ్చేసింది కదా.. అన్ని చోట్ల హిమ అంటే బెస్ట్ ఆర్కిటెక్చర్ అన్న పేరు ఉంది. ఇంకా వాడి గురించి ఆలోచించడం అవసరమా..
ఏమైనా నాకు ఉపయోగపడతాడా అని చూస్తున్నాను. ఇక లేదు అనుకుంటే అప్పుడే వాడిని రోడ్డు మీదకి గెంటేస్తాను. వస్తున్నావా. హా ఇప్పుడే బయలుదేరుతున్న అని హిమ ఇంటికి స్టార్ట్ అవుతుంది.
గౌతమ్ కాలేజ్ కి వెళ్ళి ఎప్పుడు కలిసే చోట నిలబడి విశికి కబురు పంపిస్తాడు.
విశి, భవ్య వైపు చూస్తూ ఎవరై ఉంటారు. ఏమో చూద్దాం పద అని ఇద్దరు గ్రౌండ్లోకి వస్తారు.
అక్కడ గౌతమ్ ని చూసి వీడేంటి ఇక్కడ అని భవ్య అడిగితే.. విశి కి మాత్రం చాలా కోపం వస్తుంది. ఎందుకు నాకు కబురు పంపావు గౌతమ్ అని కోపంగా అడుగుతుంది.
గౌతమ్ విశిని చూసి ఆశ్చర్యపోతాడు. ఏడుస్తూ ఉంటుంది నేను కనిపించగానే నన్ను బెగ్ చేసుకుంటుంది అన్న ఊహల్లో ఉన్న గౌతమ్ నేల మీదకి వస్తూ..
విశి ఆర్ యు ఆల్ రైట్ అని అడిగితే.. నాకేం.. నేను బాగానే ఉన్నాను. తమరు వచ్చిన కారణమేమిటో చెబుతారా అని కొంచెం వెటకారంగా అడుగుతుంది.
గౌతమ్ ఆలోచిస్తూ.. ఏమిటి ఎప్పుడూ లేని కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుంది. వాళ్ళ మదర్ ఏమీ చెప్పలేదా.. లేక చెప్పినా ఇది కన్విన్స్ చేసేసిందా అని ఆలోచిస్తూ ఉంటే...
ముఖం మీద చిటికెలు వేసి.. మమ్మల్ని పిలిపించి నువ్వేమీ మాట్లాడవేమిటి?అని భవ్య అనగానే
గౌతమ్ ఒక్కసారిగా తేరుకుని భవ్యని కోపంగా చూస్తాడు. మళ్లీ వెంటనే చూపు మార్చుకుని.. విశి… నీతో కొంచెం మాట్లాడాలి అంటాడు మెల్లగా.
విశి చేతులు ఛాతీ మీద మడత వేసుకుని.. ఇక్కడే చెప్పండి. ప్రైవేట్‌గా చెప్పాల్సినంత విషయం అయితే ముందే చెప్పాల్సింది అంటుంది సూటిగా.
భవ్య ఆశ్చర్యంగా చూస్తుంది. ఇది విశియేనా? అన్నట్టుగా.
గౌతమ్ స్వరం కాస్త తగ్గించి
నీ మదర్ తో … నేను మాట్లాడాను. నీ గురించి కొన్ని విషయాలు చెప్పింది అంటాడు.
విశి నవ్వుతుంది.
నా మదర్ ఎప్పుడూ నా గురించి చాలా విషయాలు చెప్తూనే ఉంటారు.
అయితే మీరు ఏ వెర్షన్ చెప్పారో చెప్పండి అంటుంది.
గౌతమ్ కాస్త అసహనంగా.. నువ్వు నన్ను ప్రేమించి ఇంకొకడుతో తిరుగుతూ ఉంటే ఎలా చూస్తూ ఉంటాను. అందుకే మీ మదర్ దగ్గరికి వెళ్లి మనిద్దరి ప్రేమ విషయం చెప్పాను.
ప్రేమా.. మనమా.. ఎప్పుడు ప్రేమించుకున్నాము.. ఎలా ప్రేమించుకున్నాము..
విశి నువ్వు ఇంకా స్టూడెంట్‌వి. ఫ్యూచర్ అర్థం కాదు. ఎమోషనల్‌గా డిసిషన్స్ తీసుకుంటున్నావు అనబోతుంటే...
విశి మధ్యలోనే కట్ చేస్తుంది. స్టూడెంట్‌ని కాబట్టే నేర్చుకుంటున్నాను..ఎమోషనల్‌ని కాబట్టే మనుషుల్ని అర్థం చేసుకోగలుగుతున్నాను.
మీరు చెప్పిన లోపాలే నాకు ప్లస్ పాయింట్స్.
గౌతమ్ నోట మాట రాదు.
భవ్య మెల్లగా.. విశి… కూల్ డౌన్ అంటుంది.
విశి తల అడ్డంగా ఊపి... లేదు భవ్య.
ఇన్నాళ్లు అందరూ నా తరపున మాట్లాడారు.
ఈరోజు నేను మాట్లాడాలి.
తిరిగి గౌతమ్ వైపు చూసి మీరు ఎందుకు వచ్చారు?
సోరి చెప్పడానికా? లేదా ఇంకోసారి కంట్రోల్ చేయడానికా? అంటుంది.
గౌతమ్ లోపల కలవరం మొదలవుతుంది.
ఇది నేను ఊహించిన అమ్మాయి కాదు…
ఇది బ్రేక్ అయిపోయిన విశి కాదు…
నేను నీ మంచికే... అనగానే..
మంచా.. అంటే ఏమిటి మిస్టర్. చూడు విశి. నేను మీ మదర్ తో చెప్పానని నీకు కోపంగా ఉండవచ్చు. నేను వెల్ సెటిల్ బిజినెస్ మాన్ ని.
ఏది కోరుకున్న నా కాళ్ళ దగ్గరే ఉంటుంది. అలాంటిది నన్ను కాదని ఆఫ్టర్ నెల జీతానికి పనిచేసే ఒక లెక్చరర్ వెంట పడుతున్నావు. ఇది నీ కెరియర్ కి అసలు మంచిది కాదు.
విశి గట్టిగా.. నాకు ఏది మంచిదో ఆలోచించుకునే హక్కు ఉంది.
మీరు కాదు… నా మదర్ కాదు… ఇంకా ఎవరెవరో కాదు..
నేను.
ఆ మాటలకు గౌతమ్ వెనక్కి ఒక అడుగు వేస్తాడు.
భవ్య చిరునవ్వుతో.. ఇప్పుడు అర్థమైందా ఎందుకు విశి మారిందో? అంటుంది.
విశి చివరిగా మీరు ఇంకేమైనా చెప్పాలంటే చెప్పండి.
లేదంటే… మాకు క్లాస్ ఉంది అని తిరగబోతుంది.
గౌతమ్ గొంతులో తొలిసారి భయం.విశి… నువ్వు ఇలా ఉంటావని అనుకోలేదు. ఐ లవ్ యు..
విశి వెనక్కి తిరిగి... మీరు వెల్ సెటిల్ బిజినెస్ మాన్. మీరు ఏది కోరుకున్న మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. అలాంటిది మీరు ఇలా రావడం కరెక్ట్ కాదేమో..
నిన్ను మిస్ అవుతానేమో అని భయం వేసే మీ మదర్ తో మాట్లాడాను కానీ నిన్ను తక్కువ చేయాలనే కాదు అని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు.
ఎప్పుడూ తక్కువగా అంచనా వేసినవాళ్లు
ఒక్కసారిగా ఎదురు నిలబడితే ఇలానే భయపడతారు. నా మీద ప్రేమతో కాదు ఆ విషయం మీకు తెలుసు నాకు తెలుసు.. అని చెప్పి వెళ్ళిపోతుంది.
గౌతమ్ అక్కడే నిలబడిపోతాడు.
గ్రౌండ్ లో శబ్దాలు… కానీ అతని చెవుల్లో మాత్రం
విశి మాటలే మోగుతుంటాయి.
వీళ్ళకి తెలియకుండా ఇదంతా విన్న సూర్య మాత్రం నవ్వుకుంటాడు. పర్వాలేదు క్యూటీ నాతో పూర్తి ప్రేమలో పడ్డాక నీలో బాగానే ధైర్యం వచ్చింది.
విశి అక్కడినుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా
గౌతమ్ అదే చోట నిలబడి ఉంటాడు.
ఇది ఇలా అయిపోతుందా?
నన్ను చూసి ఏడుస్తుంది అనుకున్నాను…
కానీ నన్నే చిన్నబుచ్చింది…
అంతలో వెనుక నుంచి కార్ బ్రేక్ సౌండ్.
గౌతమ్ తల ఎత్తి చూస్తాడు.
బ్లాక్ స్ యూ వి.
డోర్ ఓపెన్ అవుతుంది.
హిమ దిగుతుంది.
సింపుల్ కానీ పవర్ ఉన్న లుక్.
కళ్లలో పొగరు … నడకలో రెక్లేస్..
గౌతమ్ గుండె ఒక్కసారి దడదడ.
ఇక్కడ ఎందుకు? ఇప్పుడేనా?
హిమ చుట్టూ చూసి
ఇదేనా నువ్వు చాలా ఉత్సాహంగా చెప్పిన కాలేజ్?
గౌతమ్ తడబడుతూ
హిమ… నువ్వు ఇక్కడికి...
నీ పని అయిందా? సూటిగా అడుగుతుంది హిమ.
గౌతమ్ మాట మార్చాలని చూస్తూ అదే… కొంచెం మిస్ అండర్స్టాండింగ్.. విశి ఎదురు తిరిగింది అని హిమ ముందు ఒప్పుకోలేకపోతూ ఉంటాడు.
హిమ నవ్వుతుంది.
అది నవ్వు కాదు…. ఒక రకమైన హేళన..
విశి బ్రేక్ అయి ఉంటుందని వచ్చావు కదా?
కంట్రోల్ చేద్దాం అనుకున్నావు కదా? నిన్ను బెగ్ చేస్తుంది అని చాలా కలలతో వచ్చావు కదా?
గౌతమ్ కళ్ళు పక్కకి తిప్పుతాడు.
ఇప్పుడెలా ఉంది? నీ స్ట్రాటజీ వర్క్ అయిందా? అని అడుగుతుంది.
గౌతమ్ నెమ్మదిగా హిమ… నేను అనుకున్నట్టు లేదు అంటాడు.
హిమ ఒక్క అడుగు ముందుకు వచ్చి.. అనుకున్నట్టు లేదంటే? అంటుంది.
ఆ విశి … చాలా మారిపోయింది. నాకే ఎదురు తిరుగుతుంది వార్నింగ్ ఇచ్చింది అని చెబుతాడు.
హిమ నవ్వి తండ్రికి ఫోన్ చేస్తుంది. నాన్న… మనం అనుకున్నట్టే జరిగింది.
ఫోన్ లోంచి తండ్రి స్వరం
ఏమైంది? గొర్రెకి కొమ్మలు వచ్చాయా?
హిమ కళ్ళు గౌతమ్ మీదే పెట్టి
కొమ్మలు కాదు నాన్న… అవి విరిగిపోయి..
ఇప్పుడు ఆ గొర్రె ఎవరో కూడా తెలియదు అంటుంది.
గౌతమ్ ముఖం ఎర్రబడుతుంది.
హిమ కాల్ కట్ చేసి... చూడు గౌతమ్, నీకు ఒక మాట చెప్పాలి.
నువ్వు ఎప్పుడూ మనుషుల్ని అండర్‌ఎస్టిమేట్ చేస్తావు.
అది నీ పెద్ద ఫెయిల్యూర్. నిన్ను చూసి నువ్వే గొప్ప అనుకుంటావు.
కానీ నిన్ను చూసి ఎదుటివాళ్లు ఎదగడం మొదలెడితే
అప్పుడు నువ్వు పనికిరావు.
గౌతమ్ నిస్సహాయంగా నాకు కొంచెం టైమ్ ఇవ్వు అంటాడు.
హిమ గట్టిగా.. టైమ్ ఇవ్వడానికి నువ్వేమీ ప్రాజెక్ట్ కాదు.
తిరిగి వెళ్ళిపోతూ... ఒక రకంగా నీకు థాంక్స్ చెప్పాలి. నీవల్లనే నాకు ఈరోజు..పబ్లిసిటీ వచ్చింది.
ఒక బిజినెస్ ఉమెన్ గా అవసరం లేదు అనుకుంటే ఏదైనా వదిలేయాలి సో.. నీ అవసరం అయిపోయింది.
స్ యూ వి లోకి ఎక్కుతూ.. ఇక నీతో నాకు బిజినెస్ లేదు అంటుంది.
కారు వెళ్ళిపోతుంది.
గౌతమ్ ఒంటరిగా గ్రౌండ్ మధ్యలో నిలబడి ఉంటాడు.
చుట్టూ విద్యార్థుల నవ్వులు…
ఆటల శబ్దాలు…
కానీ అతని లోపల మాత్రం
పూర్తి సైలెన్స్.
ఇవాళ ఇద్దరూ చేతులిచ్చి వెళ్లిపోయారు.
ఒకటి ప్రేమ కాదు… ఇంకొకటి బిజినెస్ కాదు…
రెండింట్లోనూ నేను ఫెయిల్ అయ్యాను.
ఫస్ట్ టైమ్.. అతని కళ్ళలో భయం.
గౌతమ్ పరిస్థితి...........
Posts: 898
Threads: 13
Likes Received: 7,038 in 832 posts
Likes Given: 1,545
Joined: Aug 2024
Reputation:
652
Part - 109
గౌతమ్ లో మొదట భయం మొదలవుతుంది. తర్వాత అది ఒక అసహనంగా మారి కోపంగా రూపాంతరం చెందుతుంది.
బానిసలాగా పడి ఉంటుంది అనుకున్న విశి ఎదురు తిరిగింది. హిమ ని పెళ్లి చేసుకుని సోషల్ స్టేటస్ పెంచుకోవాలి అనుకుంటే అది వదిలేసి వెళ్ళిపోయింది.
ఆ హిమని నిలబెట్టడం కోసం విశి టాలెంట్ అంతా హిమకి వాడాను.. అది దానితో తను బెస్ట్ ఆర్కిటెక్చర్ అనే బ్రాండ్ నేమ్ తెచ్చుకుని నా అవసరం లేదు అంటూ వెళ్ళిపోయింది.
ఇటు విశి వర్క్ లేదు. ఆటు సోషల్ స్టేటస్ లేదు. ఎలాగైనా వి. జె. స్ కంపెనీ ప్రాజెక్ట్ ఓకే చేయించుకోవాలి.. అప్పుడే వెళ్లిన ఇద్దరు వెనక్కి తిరిగి వస్తారు.. అప్పుడు చెబుతాను.
ఈ లోపు హిమ పొగరంతా అనగతొక్కలి అని పళ్ళు నూరుతూ అక్కడ నుండి వెళ్లిపోతాడు.
హిమ కార్ డ్రైవ్ చేస్తూ సూర్య ని ఎలాగైనా లైన్లో పెట్టుకోవాలి. ఇక ఈ గౌతమ్ వేస్ట్. అఫ్కోర్స్ వీడు వల్ల ఎంత ఉపయోగం ఉన్నా వాడిని పెళ్లి చేసుకునేది ఏమీ లేదు.
సూర్యతో అయితేనే నా లైఫ్ బాగుంటుంది. అటు పేరుకు పేరు. స్టేటస్ కి స్టేటస్.. హిమ సూర్యా దేవాన్ష్ జైసింహ అంటే ఆ క్రేజే వేరు కదా అని అప్పుడే ఊహల్లోకి వెళ్ళిపోతుంది.
హిమ ఊహల నుంచి ఒక్కసారిగా బ్రేక్ పడుతుంది.
ముందు సిగ్నల్ రెడ్.
బ్రేక్ మీద కాలు నొక్కుతూ స్టీరింగ్‌ను గట్టిగా పట్టుకుంటుంది. సూర్య…
ఆ పేరు పెదవుల మీద నుంచి జారుతుంది.
సూర్య నాకు కాల్ చేస్తానని చెప్పి చాలా రోజులైంది. ఇప్పటివరకు ఫోను లేదు. అసలు గుర్తున్నానా లేక నన్ను అవాయిడ్ చేయడానికి చెప్పాడా.
అలా అనుకోవడం కూడా హిమకి నచ్చదు. లేదు తను ఫుల్ బిజీ పర్సన్ కదా.. అందుకే గుర్తుండదు. నేనే వెళ్లి మాట్లాడతాను అని కార్ ని ఆఫీస్ వైపు తిప్పుతుంది.
విశి, భవ్య క్లాస్ కి వెళ్ళిపోతారు.
డెస్క్ మీద డ్రాయింగ్ షీట్స్ అలా పడి ఉంటాయి.
విశి ఒక్కొక్క షీట్ తీస్తూ చూస్తుంది.
తన టాలెంట్…
తన ఐడెంటిటీ…
నేను ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు.
లోతుగా శ్వాస తీసుకుంటుంది.
గౌతమ్ ఇలాగే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి భయపెట్టడానికి చూసిన నేను ధైర్యంగా నిలబడాలి.
నాకు నా కెరీర్ ముఖ్యం. నా గోల్ ముఖ్యం.
ఆ క్షణంలోనే డిసిషన్.
ఫోన్ తీసి మెయిల్ ఓపెన్ చేస్తుంది.
సబ్జెక్ట్ లైన్ టైప్ చేస్తుంది.
ఇండిపెండెంట్ ఆర్చిటెక్చరల్ ప్రపోసల్... విశి
సెండ్ బటన్ నొక్కే ముందు క్షణం ఆగుతుంది.
కళ్లలో ఒక చిన్న తడిమి…
తర్వాత గట్టి నిశ్చయం.
వి. జె. స్ కంపెనీకి పంపించి సూర్యకి మెసేజ్ చేస్తుంది అది చూసి సూర్య నవ్వుకుంటూ ఆల్ ద బెస్ట్ అని మెసేజ్ చేస్తాడు.
సూర్య నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉందని మెసేజ్ చేసి ఆఫీస్ కి వెళ్తాడు. ఇంపార్టెంట్ మీటింగ్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉంటే సార్ మీ కోసం హిమ అనే ఒక లేడీ వెయిట్ చేస్తున్నారు అని చెబుతాడు.
పంపించవని చెబుతాడు. ప్యూన్ వెళ్ళగానే హిమ లోపలికి వచ్చి హాయ్ సూర్య అని హస్కీ గా పిలుస్తుంది. చూడకుండానే సీట్ హిమ అంటే..
ఏంటి సూర్య కాల్ చేస్తాను అన్నావు కానీ ఫోన్ లేదు. ఏమైపోయావు అని గారంగా అడుగుతుంది.
ఓరి నీ దీన వేషాలో అనుకోని.. చూస్తున్నావు కదా ఎంత బిజీగా ఉన్నానో. నువ్వు వచ్చి ఇంతసేపైనా నీ వైపు చూడలేదంటే అర్థం చేసుకోవాలి.
ఐ నో సూర్య నీలాంటి బిజినెస్ పర్సన్స్ ఇలాగే బిజీగా ఉంటారు. అప్పుడే కదా మన స్టేటస్ ఇంకా పెరిగేది. మన కాదు నా అంటాడు. అదే అదే అని కంగారు కప్పిపుచ్చుకుని లంచ్ కి వెళదామా..
ఎనీ స్పెషల్. నొథింగ్. నీతో కలిసి లంచ్ చేయడమే స్పెషల్. బట్ సోరి హిమ నా వర్క్ చూస్తున్నావు కదా.. లంచ్ కి బయటికి వచ్చి టైం వేస్ట్ చేసే అంత ఖాళీగా లేను. పోనీ ఇక్కడే చేద్దాము.
ఇది వదిలేటట్టు లేదు అనుకుని ప్యూన్ కి చెప్పి జ్యూస్ తెప్పిస్తాడు. జ్యూస్ ఏమిటి.. నేను అడుగుతుంది లంచ్. చెప్పాను కదా నాకు లంచ్ చేసే అంత టైం లేదు అని సో జ్యూస్ తాగేసి వెళ్ళు.
ఈ జ్యూస్ నేను తాగాలేనా... నువ్వు ఇప్పిస్తే గాని అని కొంచెం రోషంగా అడుగుతుంది. చేస్తున్న వర్క్ పక్కన పెట్టి నువ్వు వచ్చిన పర్పస్... లంచ్ కి వెళదామని.
నాకు కుదరదు అని చెప్పాను. అక్కడితో టాపిక్ కట్ అవ్వాలి. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతున్నావు ఏంటి అని కొంచెం సీరియస్‌గా అడుగుతాడు.
వెంటనే హిమ కంట్రోల్ చేసుకుంటూ అయ్యో సూర్య నా ఉద్దేశం అది కాదు. ఓకే నువ్వు ఎప్పుడు ఫ్రీ గా ఉంటావో చెప్పు. అప్పుడే వెళదాము.
బట్ నీతో డేట్ కి వెళ్లాలని నాకు చాలా కోరికగా ఉంది. నేను ఎప్పుడు ఫ్రీ అవుతానో నీకు ఇన్ఫార్మ్ చేస్తాను అప్పుడు వెళదాంలే.
ఎప్పుడు ఇలాగే చెబుతున్నావు గాని నువ్వు ఫోన్ చేయడం లేదు. నీ నెంబర్ నాకు ఇవ్వు. నేనే చేస్తాను. ఇక వదిలేటట్టు లేదు అని... ఒక నెంబర్ చెబుతాడు.
థాంక్యూ థాంక్యూ అనుకుంటూ వెళ్ళిపోతుంది. అయ్యబాబోయ్ గౌతమ్ గాడు ఇన్ని రోజులు దీన్ని ఎలా భరించాడో కానీ ఒక అరగంటకే నా బుర్ర హీటెక్కిపోయింది.
అదే నా విశి బంగారం చూడు... క్యూట్‌గా మాట్లాడుతుంది. ఎంతసేపు మాట్లాడినా బోర్ కొట్టదు. ఆడపిల్లలంటే అలాగా ఉండాలి అని విశిని తలుచుకుని మురిసిపోతూ ఉంటాడు.
వైభవ్ సౌమ్య దగ్గరికి వస్తాడు. ఏంట్రా. నీతో కొంచెం మాట్లాడాలి. కూర్చో ఏం మాట్లాడాలి. అసలు చందు ఏం ప్రాజెక్ట్ చేస్తుంది. ఆ సర్వీస్ దాని గురించి నాకు డీటెయిల్స్ కావాలి. ఎందుకు. అబ్బా అన్ని తెలిసే అడుగుతావేమిటి..
మెడికల్ క్యాంపు పెడుతుంది. అది నాకు తెలుసు కానీ సడన్‌గా ఎందుకు ఆ డిసిషన్ తీసుకుంది. సడన్‌గా ఏమీ కాదు. దానికి ఆల్రెడీ 2 ఇయర్స్ నుంచి ప్లాన్ ఉంది.
వచ్చే ఇన్‌కంలో సంమ్ అమౌంటుతో ఏదో ఒక సర్వీస్ చేయాలి అని. సో.. ఎర్నింగ్ స్టార్ట్ చేసింది. ఆటోమేటిక్‌గా ఈ స్టెప్ తీసుకుంది. దానికి పిన్ని బాబాయ్ కూడా సపోర్ట్ ఇచ్చారు. కొంత అమౌంట్ దానిది. అయితే కొంత అమౌంట్ ఫ్యామిలీ నుంచి.
ఎవరైనా డొనేషన్స్ ఇస్తే దానికి తగ్గట్టుగా సర్వీస్ చేసి డీటెయిల్స్ వాళ్లకు పంపించేటట్టుగా ప్లాన్ చేస్తోంది.. సడన్‌గా దానికి ఇంత మంచి బుద్ధి ఏమిటి?
అది ఎప్పుడూ మంచిగానే ఉంది. నీకు అర్థం అవ్వడానికే టైం పట్టింది. ఏదో చిన్నప్పుడు గొడవలు బుర్రలో పెట్టుకొని పెద్దయ్యాక కూడా అలాగే ఉంటారు అనుకుంటే ఇదిగో నీ లాగానే కన్ఫ్యూషన్ బాక్స్ లో ఉంటారు.
అంటే నేను కన్ఫ్యూషన్.. చందు క్లారిటీ నా.. నువ్వు ఫీల్ అవ్వనంటే మాత్రం అది నిజమే. ఫీల్ అయితే మాత్రం నిజం అబద్ధం అవుతుందా ఏంటి అంటాడు.
చిన్నప్పటి చందు నా కళ్ల ముందు అలా ఫిక్స్ అయిపోయింది అనుకుంట. చందు అంత మెచ్యూర్ గా ఆలోచిస్తుంది అని ఊహించలేకపోయాను. ఇన్ఫాక్ట్ ఇప్పటికీ నమ్మకం కలగడం లేదు.
చందు మారలేదు నువ్వు ఆలోచించే విధానం మారింది.
నీకెప్పుడూ కనిపించనంతగా అప్పుడూ ఉంది.
నువ్వు చూసేలా ఆమె నీ ముందు నిలబడలేదు అంతే.
అది విన్న వైభవ్ చిన్నగా నవ్వుతాడు. కానీ ఆ నవ్వులో తేలిక లేదు.
నేను ఇప్పటికీ పాత ఫైల్స్ ఓపెన్ చేసి కూర్చున్నానా?
అవును.
మిగతావాళ్లు అప్డేట్స్ తీసుకుంటుంటే నువ్వు మాత్రం క్యాష్ క్లియర్ చేయకుండా అదే వెర్షన్ చూస్తున్నావు.
వైభవ్ నిట్టూర్చి వెనక్కి వాలుతాడు.
ఆ మెడికల్ క్యాంప్… అది నిజంగా వర్క్ అవుతుందా? దానికి ఏమీ రిస్క్ అవ్వదు కదా... అంటే నా ఉద్దేశం అది సరిగ్గ కండక్ట్ చేయలేదు అని కాదు. మెడికల్ క్యాంపు అంటే చాలా ప్రొసీజర్స్ ఉంటాయి కదా..
సౌమ్య నవ్వుతూ.. వర్క్ అవుతుంది.
ఎందుకంటే అది డబ్బు కోసం కాదు… పేరు కోసమో కాదు.
ఒక అప్పు తీర్చుకున్నట్టు చేస్తోంది.
ఎవరికీ?
సౌమ్య కాసేపు ఆగి, నిదానంగా..... తనకే.
అర్థం కాలేదు. మనం వచ్చినందుకు చుట్టూ ఉన్న వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా. అప్పుడే మనకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు గాడ్ కి థాంక్స్ చెప్పుకోవడానికి ఉంటుంది అని చందు ఆలోచన.
ఆ మాట వైభవ్‌ని గట్టిగా తాకుతుంది. ఏమీ మాట్లాడకుండా కిందకి చూస్తాడు.
నువ్వు తెలుసుకోవాలనుకుంటే ప్రాజెక్ట్ డీటెయిల్స్ నేను ఇస్తాను.
కానీ ఒకటే క్లియర్ చేసుకో…
ఏంటి?
చందుని అర్థం చేసుకోవాలా… లేదా జడ్జ్ చేయాలా?
మౌనం.
దూరంగా చందు నవ్వుతున్న శబ్దం వినిపిస్తున్నట్టుగా ఉంటుంది.
వైభవ్ చూపు అటు వైపు వెళ్తుంది.
ఈసారి ఆ చూపులో సందేహం లేదు… మొదటి సారి ఆసక్తి ఉంది.
అర్థం చేసుకుని దానితో ట్రావెలింగ్ చేస్తాను అని కళ్ళ ముందు మెదులుతున్న చందు ని చూస్తూ చెబుతాడు.
ఆల్ ద బెస్ట్ వైభవ్ ??
Posts: 898
Threads: 13
Likes Received: 7,038 in 832 posts
Likes Given: 1,545
Joined: Aug 2024
Reputation:
652
Part - 110
కాలేజ్ అయ్యే టైంకి సూర్య బైక్ తో సిద్ధంగా ఉంటాడు. విశి సంతోషంగా వచ్చి దేవ సార్ ఈరోజు నేను ఎంత ధైర్యంగా మాట్లాడానో తెలుసా..
అవునా అని ఏమీ తెలియనట్టుగా అంటాడు. పక్కనే ఉన్న శ్రీకర్ మాత్రం పైనుంచి కిందకి చూస్తూ వీడు వేషాలు ఎక్కువైపోతున్నాయి. ముందు ప్రేమలో పడ్డా నేను కూడా ఇంత బిల్డప్ ఇవ్వలేదు కదా..
ఏం జరిగిందో అని అడగరా.. మేము అడగకపోయినా నువ్వు చెప్తావు కదా విశి అని శ్రీకర్ అంటాడు. సూర్య కోపంగా చూస్తే.. నిజమే అన్నయ్య మీ ఇద్దరికీ కాక ఇంకెవరికి చెబుతాను అని గౌతమ్ వచ్చినప్పుడు నుంచి జరిగిన విషయం మొత్తం చెబుతుంది.
శ్రీకర్ కి మాత్రం అప్పుడే తెలియడం. ఆశ్చర్యంగా చూస్తూ నువ్వేనా విశి. అవును అన్నయ్య. చాలా ధైర్యంగా మాట్లాడాను.
ఇదంతా దేవా సార్ నాతో ఉండడం వలన వచ్చింది. అదిగో మళ్ళీ క్రెడిట్ అంత నాకే ఇచ్చేస్తున్నావు..బేసిగ్గా అది నీలోనే ఉంది.
నీ చుట్టూ ఒక సంతోషకరమైన వాతావరణం ఉండేటప్పటికీ అది బయటికి వస్తుంది అంతే. అబ్బా మీరిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారా..
మాకు ట్రీట్ ఇచ్చేది ఏమైనా ఉందా. చెప్పండి సార్. ఏంట్రీట్ కావాలి. పెద్దగా ఏమి అవసరం లేదులే కానీ సౌమ్య ని తీసుకు వస్తాను అలా లాంగ్ డ్రైవ్ కి వెళదామా..
అమ్మో అన్నయ్య నాకు భయం. అవునా మా అందరితో కలిసి రావడానికి భయం కానీ మీ దేవా సార్ తో మాత్రం అన్నవరం దాకా వెళ్లడానికి భయం లేదా.
అది వేరు ఇది వేరు అన్నయ్య..అంతేలే మాతో ఎందుకు వస్తారు. ఒరేయ్ నువ్వు చేసిన ఓవరాక్షన్ చాలు కానీ విశి ప్రాజెక్ట్ సక్సెస్ అయిన తర్వాత అప్పుడు మూడు జంటలు హ్యాపీగా వెళదాము.
భవ్య వచ్చి మరి నేను అంటే నీ పార్ట్నర్ సెట్ అయిన తర్వాత మళ్లీ ట్రిప్ పెట్టుకుని నాలుగు జంటలు వెళదాము.
శ్రీకర్ మాట వినగానే భవ్య ఒక్కసారిగా బ్లష్ అవుతుంది.
ఏంటీ భవ్యా… నువ్వు కూడా మొదలెట్టావా అనగానే.. కాస్త ఇబ్బందిగా నవ్వుతుంది.
అదేంటి భవ్య… నిజమే కదా. నీ పార్ట్నర్ ఎవరో మాకూ తెలుసుకోవాలి అని విశి కళ్లతోనే అల్లరి చేస్తుంది.
శ్రీకర్ వెంటనే కట్ చేస్తూ… ఓయ్ ఓయ్… కాలేజ్ గేట్ దగ్గర నిలబడి ఇలాంటి టాపిక్స్ అవసరమా… ముందు ఇంటికి వెళ్లండి అన్నాడు.
దేవా బైక్ స్టార్ట్ చేస్తూ… శ్రీకర్ చెప్పింది కరెక్ట్. రేపు ప్రాజెక్ట్ మీటింగ్ ఉంది. ఈరోజు ఎక్కువ ఎగ్జైట్ అయి మళ్లీ టెన్షన్ పడకు.
రేపు వి. జె. స్. కంపెనీ కి వెళ్ళాలి.
శ్రీకర్ మాత్రం వదలకుండా… కానీ ఒక మాట ఫిక్స్. ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ట్రిప్ గ్యారెంటీ. నువ్వే లీడ్ విశి. నీ ధైర్యానికి అదే రివార్డ్ అంటాడు.
విశి కాస్త సీరియస్ అయి… అవును అన్నయ్య. ఈసారి వెనక్కి తగ్గను. ఈ ప్రాజెక్ట్ నా వల్లే కాదు… మన అందరి వల్ల వచ్చింది.నాతో పాటు భవ్య కూడా ప్రాజెక్టులో ఉంటుంది.
ఆ మాటలు విన్న దేవా కాస్త ఆశ్చర్యంగా చూసి, చిన్న నవ్వుతో… ఇదే మార్పు. ఇదే నమ్మకం. నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే… సక్సెస్ దగ్గర్లోనే ఉంది అంటాడు.
గుర్తుపెట్టుకో విశి. ధైర్యం అంటే అరవడం కాదు. నువ్వు చేసినట్టు సరైన టైమ్‌లో, సరైన మాట మాట్లాడటం. ఈరోజు నువ్వు అదే చేశావు అంటాడు.
విశి కళ్లలో కృతజ్ఞత… సార్… మీరు లేకపోతే నేను ఇంత దూరం రాలేనేమో అంటుంది.
అదే మళ్లీ క్రెడిట్ డైలాగ్… అంటూ సూర్య నవ్వుతాడు.
నీ దారిలో నువ్వు నడిచావు. నేను పక్కనే ఉన్నాను అంతే.
అప్పుడే కాలేజ్ బెల్ సౌండ్…
అందరూ ఒక్కసారి గేట్ వైపు చూస్తారు.
సూర్య బైక్ ఎక్కుతూ… సరే . రేపు కొత్త రోజు. కొత్త స్టెప్. ఎవరికీ డౌట్ ఉండకూడదు అంటాడు.
విశి లోపలే నిర్ణయం తీసుకున్నట్టుగా….ఈసారి ఎవరి ముందు తల వంచను… నా మాటకి నా పని సాక్ష్యం అవుతుంది అనుకుంటుంది.
భవ్య వైపు చూసే నువ్వు రేపు డైరెక్ట్‌గా కంపెనీ దగ్గరకి వచ్చేసేయ్ అని చెప్పి దేవా బైక్ మీద కూర్చుంటుంది.
బైక్‌లు ఒకదాని వెంట ఒకటి బయటికి వెళ్తుంటే…
విశి ముఖంలో ఒక కొత్త కాన్ఫిడెన్స్…
దూరంగా భవిష్యత్తు స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా ఉంటుంది.
మరునాడు విశి రెడీ అయ్యి సూర్యతో కలిసి ఆఫీస్ దగ్గరికి వెళుతుంది. సూర్య మాస్క్ పెట్టుకునే ఉంటాడు. ఎందుకు సార్ అంటే డస్ట్ ఎలర్జీ అని చెబుతాడు. భవ్య కూడా అక్కడే ఉంటుంది ఇద్దరూ కలిసి లోపలికి వెళతారు.
గౌతమ్ కూడా అక్కడికి వస్తాడు..వీడేంటి ఇప్పుడు అని ఆలోచిస్తూ మేనేజర్ కి కాల్ చేసి అడిగితే... ప్రాజెక్టు గురించి మళ్ళీ మాట్లాడతాను అని వచ్చారు సార్. ఎంత చెప్పినా వినడం లేదు.
విశి లోపలికి వెళ్తుంటే గౌతమ్ మేనేజర్ ని రిక్వెస్ట్ చేయడం చూస్తుంది కానీ పట్టించుకోదు.
సార్ నేను వచ్చేశాను. ప్రాజెక్ట్ లో కొన్ని పాయింట్స్ మళ్లీ క్లియర్ చేయాలి. అవును… ఇప్పుడే.
విశి ఆ మాటలు విన్నా ఆగదు.
సూర్య వైపు ఒక్కసారి చూసి… నడుస్తూనే ఉంటుంది.
మీటింగ్ రూమ్. మేనేజర్, రాజ్, వినయ్ కూర్చుని ఉంటారు.
విశి ఫైల్ టేబుల్ మీద పెట్టగానే మేనేజర్ చూస్తూ…
విశి, రెడీనా? అంటాడు.
అవును సార్. ప్రాజెక్ట్ ఫైనల్ డెలివరీ కోసం వచ్చాను.
ఈసారి ఆమె గొంతులో ఎలాంటి తడబాటు లేదు.
అదే టైమ్ కి గౌతమ్ లోపలికి వస్తాడు.
సార్… ఒక నిమిషం… నేను చెప్పాల్సిన కొన్ని రిస్క్ పాయింట్స్ ఉన్నాయి.
మేనేజర్ కాస్త అసహనంగా… పర్మిషన్ లేకుండా లోపలికి ఎందుకు వచ్చారు. ఈ ప్రాజెక్టు విశి కన్నా నాదే బాగుంటుంది. ఆ మాటకి విశి కోపంగా చూసి మిస్ విశిష్ట అని చెబుతుంది.
గౌతమ్, ఇవన్నీ మీరు ఇప్పటికే మూడుసార్లు చెప్పారు. కొత్తగా ఏమైనా ఉందా?
గౌతమ్ కాస్త తడబడి…
అదే సార్… క్లయింట్ ఎక్స్పెక్టేషన్స్…
విశి మధ్యలోనే…
సార్, క్లయింట్ ఎక్స్పెక్టేషన్స్ డాక్యుమెంట్ ఇదే.
అన్నీ రిక్వైర్మెంట్స్ ఇక్కడ సైన్ చేశారు.
ఇది ఫైనల్ వెర్షన్. ఎలాంటి చేంజ్ లేదు అని క్లియర్ గా చెబుతుంది.
టేబుల్ మీద ఫైల్ ఓపెన్ చేస్తూ ప్రతి పాయింట్ చూపిస్తుంది.
డేటా, టైమ్‌లైన్, బడ్జెట్… అన్నీ స్పష్టంగా.
మేనేజర్ సైలెంట్ గా వింటాడు. రాజ్, వినయ్ కూడా విశి ప్లాన్ కి ముచ్చట పడతారు.
గౌతమ్ ముఖంలో నెమ్మదిగా టెన్షన్ పెరుగుతుంది.
ఇంత క్లియర్ గా… ఇలా మాట్లాడుతుందని ఊహించలేదు.
విశి చివరిగా…
ఈ ప్రాజెక్ట్ నేను ఒంటరిగా చేయలేదు సార్.
టీమ్ వర్క్. కానీ డెలివరీకి పూర్తి బాధ్యత నాది.
మీరు ఓకే అంటే ఇప్పుడే హ్యాండ్ ఓవర్ చేస్తాను.
కొన్ని క్షణాలు నిశ్శబ్దం.
మేనేజర్ ఫైల్ క్లోజ్ చేసి… రాజ్ చేతికి ఇస్తే మొత్తం చెక్ చేసి..
ఓకే విశి. ప్రాజెక్ట్ అప్రూవ్డ్.
ఇప్పుడే హ్యాండ్ ఓవర్ ప్రాసెస్ మొదలుపెట్టండి.
ఆ మాట వినగానే విశి కళ్లలో వెలుగు.
సూర్య మాస్క్ వెనక చిన్న నవ్వు.
గౌతమ్ మాత్రం షాక్.
సార్… కానీ… కానీ ఏమి లేదు గౌతమ్. మీరు మాతో ప్రాజెక్ట్ డీల్ చేయాలి అనుకున్నారు. బట్ మీ ప్రాజెక్టులో కంటెంట్ స్ట్రాంగ్ గా లేదు
.మేము అడుగుతున్న డౌట్స్ కి మీరు సరిగ్గా క్లియర్ చేయలేకపోతున్నారు.
విశిష్ట తన పని తానే ప్రూవ్ చేసింది.
విశి ఫైల్ హ్యాండ్ ఓవర్ చేస్తుంది.
సైన్ పెడుతుంది.
ఆ క్షణంలో గౌతమ్ కి అది ఎదురు దెబ్బ.
ఇంతకాలం తక్కువగా చూసిన అమ్మాయి…
ఈరోజు అతని ముందు నిలబడి గెలిచింది.
మీటింగ్ రూమ్ బయటకి వచ్చాక… సూర్య నెమ్మదిగా…
ఇదే ధైర్యం విశి. నిన్న చెప్పిన మాటే గుర్తు పెట్టుకో.
సరైన టైమ్ లో సరైన మాట.
విశి చిరునవ్వుతో…
ఈరోజు నా మాట కాదు సార్.
నా పని మాట్లాడింది.
భవ్య విశి ని గట్టిగా హగ్ చేసుకుని కంగ్రాట్స్ విశి నీ సక్సెస్ కి ఎదురేలేదు. నా సక్సెస్ లో... నాతోపాటు నువ్వు కూడా ఉన్నావు ఇద్దరం కలిసే అడుగులు వేస్తాము.
భవ్య భాయ్ చెప్పి స్కూటీ తీసుకుని వెళ్ళిపోతోంది.
ఆఫీస్ గేటు దాటుతూ…
విశి అడుగులు మరింత బలంగా పడతాయి.
ఇప్పుడామె వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు.
గౌతమ్ డల్ గా బయటికి వచ్చి కారులో కూర్చుని గట్టిగా అరుస్తాడు.
అందుకే అంటారు ఎప్పుడూ ఎదుటి మనిషిని తక్కువ అంచనా వేయకూడదు అని..
కథ కొనసాగుతుంది................
Posts: 1,159
Threads: 1
Likes Received: 732 in 475 posts
Likes Given: 11,272
Joined: Jun 2019
Reputation:
2
Wonderful multi episode... Great going...
|