Thread Rating:
  • 7 Vote(s) - 4.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller రుద్రం భజే! ( POWER OF YODHA )
#41
(29-04-2026, 10:02 AM)ash.enigma Wrote: So, mirza story the end!! or kaalpullo.. jitin potadu!
chooddam emavutundo!

By the way my prediction is right!!! fishing fishing
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
Excellent action oriented episode
[+] 1 user Likes Sunny73's post
Like Reply
#43
Good morning
Today update kosam waiting
[+] 1 user Likes Ajayu2's post
Like Reply
#44
రుద్రం భజే! ఎపిసోడ్ 12

సత్తితో పాటు ఉన్న మనిషి ముష్రుతో మీర్జా వాళ్ళకి కాల్ చేయించి ఆ వస్తువు దొరికింది ఆఫీసర్లని కూడా పట్టుకున్నాము గెస్ట్ హౌస్ దగ్గర ఉంటాము త్వరగా రండి  అని చెప్పించడు యోధ.

***************

సత్తి, ముష్రు లను జీప్ లో పడేసి హ్యాండ్ కప్స్ వేసి దీప్తి వాళ్ళ వైపు చూసి "పుష్కర్ వాళ్ళు ఇంకా గుడిలోనే పడుకుని ఉన్నారు అనుకుంటా వెళ్లి లేపండి." అని చెప్పేడు యోధ.

ఆ మాట విని "నేను వెళ్లి లేపుతాను." అని హుషారుగా పరిగెత్తుకుంటూ గుడి దగ్గరికి వెళ్ళింది పూజా.

యోధ వైపు చూసి "అసలు ఈ మీర్జా ఎవరు? ఈ వస్తువు కోసం అతను ఎందుకు వస్తున్నాడు?" అని డౌట్ గా అడిగింది దీప్తి.

"వన్ మినిట్!" అని చెప్పి ఫోన్ తీసి నాయక్ కి కాల్ చేసి "జైహింద్ సర్! ఇక్కడ అంత క్లియర్ ఉదయానికి మీర్జా కూడా నా చేతిలో ఉంటాడు." అని చెప్పాడు యోధ.

"గుడ్! మీర్జా దగ్గర జీతిన్ తో పాటు మరో ఆఫీసర్ ఉండి ఉంటాడు ఎలాగైనా వాళ్ళని సేఫ్ గా తీసుకురా..! అలాగే మీర్జాకి ఈ కాంట్రాక్ట్ ఎవరు ఇచ్చారు, ఆ వస్తువుతో వాళ్ళు ఎటువంటి ప్రయోగం చేయబోతున్నారో కూడా మనకి తెలియాలి." అని చెప్పాడు నాయక్.

"సార్! నేను వాళ్ళ మనిషితో మీర్జా కి కాల్ చేయించి ఆ వస్తువు మా హ్యాండ్ ఓవర్ లోనే ఉంది అని చెప్పించాను, వాడు కచ్చితంగా ఆ విషయం కాంట్రాక్ట్ ఇచ్చిన వాడికి కాల్ చేసి చెప్తాడు.

మీరు కర్నూలు హైవే లో ఆరు నెంబర్లు ట్రేస్ చేశాము అని చెప్పారు కదా వాటిని అబ్జర్వేషన్ లో పెట్టండి ఖచ్చితంగా మీర్జా కి కాంట్రాక్ట్ ఇచ్చిన పర్సన్  నెంబర్ ట్రేస్ అవుతుంది." అని చెప్పాడు యోధ.

"గుడ్ ఐడియా! నేను ఆ పనిలో ఉంటాను కానీ మీర్జాని తక్కువ అంచనా వేయకు వాడు ఒక జిత్తుల మారి నక్క!" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు నాయక్.

ఫోన్ కట్ అవడంతో దీప్తి వైపు చూసి "మీర్జా ఎవరు అని అడిగావు కదా" వాడు ఒక మాఫియా లీడర్! నీకు అర్థమయ్యేటట్లు చెప్పాలి అంటే భారతదేశంలో పుట్టి శత్రు దేశానికి సహాయం చేసే ఒక వెధవ!" అని కోపంగా చెప్పాడు యోధ.

"ఎస్! వాడు ఇండియన్ గవర్నమెంట్ హిట్ లిస్ట్ లో ఉన్నాడు కానీ ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు అందుకనే తప్పించుకుని తిరుగుతున్నాడు కానీ ఇంకా కుదరదు." అని చెప్పింది నీతూ.

అంతలో గుడి దగ్గరికి వెళ్లి బయట ఉన్న కర్ర తీసుకుని లోపలకి వెళ్లి పుష్కర్, ఏకవీర లని దాంతో కొడుతూ "మర్యాదగా కళ్ళు తెరవండి లేకపోతే ఇంకా జీవితాంతం తెరవలేరు." అని గొంతు మార్చి చెప్పింది పూజా.

ఆ మాట విని భయంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసి "మేడం" మీరా ఇంకా ఎవరో వచ్చారు అనుకున్నాను పై ప్రాణాలు పైనే పోయాయి. " అని పక్కన గురకబెట్టి నిద్రపోతున్న ఏకవీర ని  ఒక్క తన్నుతాన్ని "పడుకుంది చాలు ఇంకా పద!" అని చెప్పాడు పుష్కర్.

ఆ మాటకి ఉలిక్కిపడి లేచి "ఏంటి ఆపరేషన్ కంప్లీట్ అయిందా? లేక నేను కూడా ఫీల్డ్ లోకి వెళ్ళాలా..?" అని అడిగాడు ఏకవీర.

"మీర్జా అంట ఎవరో ఇక్కడికి వస్తున్నాడు వాడిని పట్టుకోడానికి మీరిద్దరూ  వెళ్లాలంట ప్రిపేర్ అవ్వండి." అని చెప్పి గుడి బయటకు వచ్చింది పూజా.

ఆ మాట విని మత్తు వదిలి వెనకాలే వచ్చి నీతూ వైపు చూసి "మేడం! మీర్జా ని పట్టుకోడానికి మేము వెళ్ళాలా..?" అని కంగారుగా అడిగాడు పుష్కర్.

నవ్వుతున్న పూజ వైపు చూసి "కంగారు పడకండి మీరు వెళ్ళనవసరం లేదులే!" అని చెప్పింది నీతూ.

అక్కడికి వచ్చి జీపులో చెయ్యి వెనక్కి తిరిగి ఉన్న సత్తి వైపు చూసి "మేడం! హ్యాండ్ కప్ సరిగ్గా వేయలేదు చెయ్యి వెనక్కి తిరిగింది." అని చెప్పాడు ఏకవీర.

"అది కరెక్ట్ గానే ఉంది నేనే చేతిని వెనక్కి తిప్పెను, గుడి దగ్గర ఐదు బాడీలు ఉన్నాయి తీసుకొచ్చి జీపులో పడేయండి మళ్లీ ఉదయం నాన్నగారు చూస్తే కంగారు పడతారు." అని చెప్పాడు యోధ.

ఆ మాట విని "ఓకే సార్!" అని బాడీలని తీసుకురావడానికి వెళ్లారు ఇద్దరు.

అంతలో ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిఫ్ట్ చేసి "జైహింద్ సర్!" అని చెప్పాడు యోధ.

"జై హింద్ యోధ! నువ్వు చెప్పినట్లు ఆరు నెంబర్ల లో ఒక నెంబర్ కి మీరు ఉన్న ఏరియా నుంచి కాల్ వచ్చింది కానీ వాళ్లు మళ్లీ తిరిగి కాల్ చేయలేదు.

నాకు తెలిసి అక్కడికి వచ్చి ఆ వస్తువుని చూసుకుని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే కాల్ చేస్తాడు అనుకుంటున్నాను కేర్ ఫుల్ గా ఉండండి." అని చెప్పాడు నాయక్.

"ఓకే సార్!" అని జీపులో ఉన్న సత్తి వైపు చూసి ఆలోచిస్తూ ఉన్నాడు యోధ.

************

ఆదే సమయంలో కారులో అరవకొండ వైపు వస్తూ ముష్రుతో ఫోన్లో మాట్లాడి "ఆ వస్తువు మనవాళ్ళ దగ్గరికి వచ్చింది త్వరగా వెళ్లాలి." అని చెప్పాడు మీర్జా.

"నాకు తెలుసు బాయ్ మన సత్తి గాడు సాధిస్తాడు." అని సంతోషంగా చెప్పాడు అజిజ్.

మీర్జా వైపు సంతోషంగా చూస్తూ "బాయ్! నీకు కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళకి కాల్ చేసి డబ్బులు రెడీ చేసుకోమను." అని నవ్వుతూ చెప్పాడు బ్రహ్మం.

ఇద్దరి మాటలు వింటూ సైలెంట్ గా లాప్టాప్ లోకి చూస్తూ "ఆ వస్తువు ఇంకా బయటికి రాలేదు  మీ మనుషుల అబద్ధం చెప్పారు, ఒకవేళ వస్తువు బయటకి వస్తే నాకు సిగ్నల్ కనబడుతుంది." అని సీరియస్ గా చూస్తూ చెప్పాడు మీర్జా.

ఆ మాట విని షాక్ అయ్యి చూస్తూ "సత్తి అలాంటోడు కాదు బాయ్! సిగ్నల్ అందడం లేదేమో సరిగ్గా చూడు కచ్చితంగా వస్తావు మన వాళ్ళ దగ్గరే ఉంటుంది." అని చెప్పాడు అజిజ్.

"నో! ఆ వస్తువు సిగ్నల్ కనబడడం లేదు నీ మనిషి తలమీద  బ్లాక్ పాయింట్ లో గన్ పెడితే ఏది చెప్పమంటే అది చెబుతాడు కదా!" అని అడిగాడు మీర్జా.

"అది కూడా నిజమే బాయ్! నీతో మాట్లాడింది సత్తి కాదు ముష్రు వాడు నాతో అంత డేర్ గా ఇప్పటివరకు మాట్లాడలేదు." అని అనుమానంగా చూస్తూ చెప్పాడు అజిజ్.

"అంటే! అక్కడికి వెళ్ళిన మనవాళ్లని ఆఫీసర్లు పట్టుకున్నారంటవా..?" అని డౌట్ గా అడిగాడు బ్రహ్మం.

"ఎస్! ఖచ్చితంగా అదే జరిగింది మనల్ని పట్టుకోడానికి కూడా వల విసిరారు." అని ఆవేశంగా చూస్తూ చెప్పాడు మీర్జా.

"మరి ఇప్పుడు ఏం చేద్దాము? ఇక్కడ ఆగిపోదామా..?" అని అడిగాడు అజిజ్.

"మధ్యలో ఆగడం అనేది ఈ మీర్జా లైఫ్ లో లేదు అరవకొండ దగ్గరికి వెళ్ళండి ఏం చేయాలో నేను చెబుతాను." అని చెప్పాడు మీర్జా.

*************

అదే సమయంలో జీప్ మీద కూర్చొని ఆలోచిస్తున్న యోధ దగ్గరికి వచ్చి "ఏమైంది? అంత సీరియస్ గా థింక్ చేస్తున్నావు?" అని అడిగింది దీప్తి.

"మీర్జా కి ఫోన్ వెళ్లిన తనకి కాంటాక్ట్ ఇచ్చిన వాడికి కాల్ చేయలేదు అంటే వీళ్ళు చెప్పిన మాట వాళ్ళు నమ్మలేదు కచ్చితంగా అనుమానం వచ్చి ఉంటుంది వాళ్లకి నమ్మకం కలిగేటట్లు చేసి ఇక్కడికి రప్పించాలి." అని చెప్పాడు యోధ.

ఆ మాటకి ఆలోచిస్తూ "వాళ్లకి నమ్మకం కుదరాలి అంటే మనం ఏం చేయాలి?" అని అడిగింది నీతూ.

"ఆ గుడిలో ఉన్న వస్తువుని బయటికి తీసుకురావాలి అప్పుడు వాళ్లకి సిగ్నల్ అందుతుంది వీళ్ళు చెప్పిన మాట నమ్ముతారు." అని చెప్పింది దీప్తి.

"ఎస్! నువ్వు చెప్పింది కరెక్ట్! ఆ వస్తువు సిగ్నల్ అందబట్టే వెతుక్కుంటూ ఈ ఏరియాకి వస్తున్నారు, మళ్లీ దానిని గుడి లోనుంచి బయటికి తీసుకు వస్తేనే వాళ్లకి నమ్మకం కుదురుతుంది మనం చెప్పిన ప్లేస్ కి వస్తారు." అని చెప్పాడు యోధ.

"కరెక్టే కాని మనం డేంజరస్ గేమ్ ఆడుతున్నామేమో!" అని కంగారుగా చెప్పింది పూజా.

"ఎస్! ఇది కచ్చితంగా డేంజరస్ గేమ్! కానీ మనకి కాదు." అని చెప్పి సుప్రభాతం టైం అవడంతో గుడి తలుపులు తెరవడానికి వస్తున్న తండ్రిని చూసి జీప్ మీద నుంచి కిందకు దిగి దగ్గరికి వెళ్ళాడు యోధ.

గుడి దగ్గరికి వస్తున్న యోధ ని వెనకాల ఉన్న దీప్తి వాళ్ళని చూసి "ఏంటి? మీరందరూ ఇక్కడ ఉన్నారు?" అని అనుమానంగా చూస్తూ అడిగాడు నారాయణ రావు.

"నాకు నిద్ర పట్టలేదు నాన్నగారు!" అని చెప్పాడు యోధ.

ఆ మాట విని "ఒక సైనికుడికి నిద్ర పట్టలేదు అంటే ప్రమాద ఘడియలు ముందు ఉన్నాయని అర్థం!" అని చెప్పి మంత్రాలు చదువుతూ గర్భగుడి తలుపులు తెరిచి స్వామివారికి నమస్కరించి

"మీరు వెతుకుతున్న ఆ వస్తువు ఇదే!" అని స్వామివారి పాదాల వైపు చూపించాడు నారాయణ రావు.

సింధూరం రంగులో మెరిసిపోతున్న వస్తువుని చూసి "ఆంజనేయ స్వామి వారి ఆయుధం లాగా ఉంది." అని మెరుస్తున్న కళ్ళతో చూస్తూ చెప్పింది పూజా.

"నాన్న గారు! 25 సంవత్సరాలుగా స్వామివారి రక్షణలో ఉన్న ఆ వస్తువుని ఇక్కడి నుంచి తీసుకు వెళ్లే సమయం వచ్చింది." అని చెప్పాడు యోధ.

ఆ మాట విని "ఆ భగవంతుడి  ఆజ్ఞ అనుకుంటాను." అని మంత్రాలు చదువుతూ పాదాల దగ్గర ఉన్న ఆ వస్తువుని తీసి యోధ చేతిలో పెట్టి "ఇకనుంచి దీని రక్షణ బాధ్యత ఆ స్వామి నీకు ఇస్తున్నారు." అని చెప్పాడు నారాయణ రావు.

"సరే నాన్నగారు!" అని వస్తూవుని చేతిలోకి తీసుకుని కళ్ళకు అద్దుకొని నీతూ వాళ్ళ వైపు చూసి సైగ చేసి గుడి బయటికి వచ్చాడు యోధ.

**********

కార్ లో అరవకొండ వైపుకి వస్తూ లాప్ టాప్ లో సిగ్నల్ రావడం సంతోషంగా చూస్తూ "మీ మనుషులు సాధించారు." అని గట్టిగా అరిచాడు మీర్జా.

ఆ మాట విని సంతోషంగా కేరింతలు కొడుతూ "బాయ్ చెప్పాను కదా! మన సత్తి గాడు సాధిస్తాడు." అని డ్రైవర్ వైపు చూసి "స్పీడ్ గా వేళ్ళు!" అని చెప్పాడు అజిజ్.
[+] 8 users Like SivaSai's post
Like Reply
#45
రుద్రం భజే! ఎపిసోడ్ 13



గుడిలో స్వామివారి పాదాల దగ్గర ఉన్న వస్తువుని తీసి యోధ చేతికి ఇచ్చి ఈరోజు నుంచి దీని రక్షణ బాధ్యత నీదే అని చెప్పాడు నారాయణ రావు

యోధ తన చేతిలో ఉన్న వస్తువుని గుడి బయటకు తీసుకురావడంతోనే లాప్టాప్ లో సిగ్నల్ కనిపించి ఆ వస్తువు మన వాళ్ళ చేతికి వచ్చింది అని సంతోషంగా చెప్పాడు మీర్జా.

***************

యోధ చేతిలో ఉన్న వస్తువు తీసుకుని అటు ఇటు తిప్పి చూస్తూ "అసలు ఈ పొట్టి వెధవలు దీంతో ఏం ప్రయోగం చేయాలనుకున్నారు?" అని అడిగింది పూజా.

"జీప్ లో గెస్ట్ హౌస్ దగ్గరికి బయలుదేరి సత్తి వైపు చూసి "ఈ వస్తువుని తీసుకువస్తే మీకు ఎంత ఇస్తానని చెప్పారు?' అని అడిగాడు యోధ.

"మాకు మనిషికి కోటి రూపాయలు ఇస్తామని చెప్పారు  ఆ డబ్బులు అవసరం లేదు ప్రాణాలతో ఉంటే చాలు మమ్మల్ని వదిలేయ్ భయ్యా!" అని రిక్వెస్ట్ గా అడిగాడు సత్తి.

"మీరిద్దరూ ప్రాణాలతో ఉండాలి అంటే నేను చెప్పినట్లు చేయండి." అని గెస్ట్ హౌస్ దగ్గర ఆగి జీప్ దిగి పుష్కర్ వాళ్ళ వైపు చూసి "బాడీల్ని ఒక రూమ్ లో ఉంచండి." అని చెప్పి ముష్రు వైపు చూసి

"ఇక్కడికి వచ్చిన మీ బాస్ వాళ్ళకి ఏ మాత్రం అనుమానం రాకూడదు అందరూ గెస్ట్ హౌస్ దగ్గరికి రావాలి పిచ్చి పిచ్చి వేషాలు వేసావో వీళ్ళతో పాటు రూమ్ లో ఉంటావు." అని చెప్పిన యోధ.

"సరే!" అని గెస్ట్ హౌస్ కి కొంచెం దూరంగా నిలబడి అజిజ్ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు ముష్రు.

సత్తి వైపు చూసి "నువ్వు పట్టుకున్న ఆఫీసర్స్ వీళ్ళిద్దరూ!" అని పుష్కర్, ఏకవీర వైపు చూపించి నీతూ వాళ్ళ వైపు చూసి "వాళ్ళిద్దని చైర్ కూర్చోబెట్టి కట్టేయండి." అని చెప్పాడు యోధ.

ఆ మాట విని చేర్ లో కూర్చొని "సార్! మాకు ప్రాబ్లం ఏమి ఉండదు కదా!" అని కంగారుగా అడిగాడు పుష్కర్.

"నువ్వు ఒక సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ దేశం కోసం  ప్రాణాలు ఇవ్వలేవా..?" అని అడిగాడు యోధ.

అది విని "సార్! నాకు ఇద్దరు పిల్లలు!" అని భయంగా చూస్తూ చెప్పాడు ఏకవీర.

"నేను ప్రాణాలతో ఉన్నంతవరకు మీకు ఏమీ అవ్వదు." అని చెప్పాడు యోధ.

ఇద్దరినీ చైర్ లో కూర్చోబెట్టి కడుతూ "యోధ! అసలు నీ ప్లాన్ ఏమిటి?" అని అడిగింది నీతూ.

"నేను ఎప్పుడు బోర్డర్ దాటి వెళ్ళినా ప్లాన్ అంటూ ఏమీ ఉండదు కనపడిన వాడిని చంపుకుంటూ వెళ్లిపోవడమే కానీ ఇప్పడు సార్ ఈ వస్తువు గురించి, దీని ప్రయోగం వెనక ఉన్న వాళ్ల గురించి డీటెయిల్స్ కావాలని చెప్పారు కాబట్టి కొంచెం ఆలోచిస్తున్నాను." అని సత్తి వైపు చూసి "ఇక్కడికి ఎంతమంది వస్తున్నారు." అని అడిగాడు యోధ.

"నాకు తెలిసి 15 మంది దాకా రావచ్చు వాళ్లతో పాటు  మిషన్ రి కూడా ఉంది." అని చెప్పాడు సత్తి.

"ఆ మిషన్స్ ఈ వస్తూవుని వెతకడం కోసం అనుకుంటా!" అని చెప్పింది దీప్తి.

"సరే" మీ ముగ్గురు జీపులో ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళండి మళ్లీ కాల్ చేసిన తర్వాతే ఇక్కడికి రావాలి. " అని చెప్పాడు యోధ.

"అవును! మీర్జా ఇక్కడికి వస్తున్నాడు అతని కోసం వెళ్లిన జితిన్ ఏమైపోయాడు?" అని డౌట్ గా అడిగింది దీప్తి.

"నాకు తెలిసి జీతిన్ చనిపోయాడు." అని చెప్పాడు యోధ.

"ఏంటి? జితిన్ చనిపోయాడా..?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది నీతూ.

"ఎస్! ఒకవేళ జీతిన్ బతికుంటే మీర్జా ఇక్కడ దాక వచ్చేవాడు కాదు." అని ముగ్గురిని జీప్ ఎక్కించాడు యోధ.

జీప్ స్టార్ట్ చేసే అక్కడి నుంచి దూరంగా వెళ్లి బైనో క్లోర్స్ లో చూస్తూ ఉన్నారు ముగ్గురు.

కాసేపటికి అక్కడ ఒక వ్యాన్ తో పాటు రెండు కార్లు ఆగడంతో చెయ్యి ఊపుతూ సైగ చేశాడు ముష్రు.

కారు దిగివచ్చి "సత్తి ఎక్కడ? ఆ వస్తువు జాగ్రత్తగా ఉంచారు కదా!" అని ఆత్రుతగా అడిగాడు బ్రహ్మం.

"సత్తి అన్న! ఆఫీసర్లతో పాటు ఉన్నాడు ఆ వస్తువు కూడా తన దగ్గరే ఉంది." అని చెప్పాడు ముష్రు.

"సరే!' అని కారు వైపు చూసి "సేఫ్!" అని మీర్జాకి  సైగ చెప్పాడు అజిజ్.

ఆ సైగ చూసి కార్ దిగి సిగరెట్ వెలిగించి గెస్ట్ హౌస్ లోపలికి వెళ్లి చైర్ లో ఉన్న పుష్కర్ వాళ్ళ వైపు చూసి "వీళ్ళతో నాకు చాలా పని ఉంది లోపల ఉన్న నా మనుషుల్ని బయటకు రప్పించాలి." అని చెప్పాడు మీర్జా.

రూమ్ లో నుంచి వస్తు "మరి నిన్ను ఎవరు విడిపిస్తారు." అని చెప్పాడు యోధ.

ఆ మాట విని రూమ్ లో నుంచి వస్తున్న యోధ వైపు చూసి "ఎవడ్రా వీడు? ఇంత ఉన్నాడు." అని కంగారుగా అడిగాడు బ్రహ్మం.

"మిలటరీ వాడు బాయ్! మనవాళ్ళందరిని చంపేశాడు నా చెయ్యి కూడా విరగొట్టాడు ఆ వస్తువు కూడా వాడి దగ్గరే ఉంది." అని ఏడుస్తూ చెప్పాడు సత్తి.

ఆ మాట విని గన్ బయటికి తీస్తున్నా మీర్జా వైపు చూసి "కాస్త ప్రశాంతంగా ఉండు ఈ గెస్ట్ హౌస్ చుట్టూ బాంబ్స్ ఫిక్స్ చేశాను బయటికి వెళ్లాలని చూసినా గన్ సౌండ్ వినపడిన దూరంగా ఉన్న నా మనుషులు బటన్ ప్రెస్ చేస్తారు అందరూ చచ్చిపోతారు.

కాబట్టి నేను అడిగినదానికి సమాధానం చెబుతూ ప్రాణాలు కాపాడుకోండి." అని చెప్పి నీతూ కి కాల్ చేసి "రెడీగా ఉన్నారు కదా!' అని అడిగాడు యోధ.

"ఎస్! మేము రెడీ గానే ఉన్నావు అక్కడ ఏం జరుగుతుందో కూడా మాకు కనబడుతుంది." అని చెప్పింది నీతూ.

మీర్జా వైపు తన మనుషుల వైపు చూసి "మీ గన్స్ మొత్తం అక్కడ పడేయండి." అని చెప్పి పుష్కర వాళ్ళ చేతుల కట్లు విప్పి "ఆ గన్స్ మొత్తం తీసుకుని ఒక పక్కన పెట్టండి ఇక్కడ ఎవరైనా పిచ్చి వేషాలు వేసిన అందరూ చస్తారు." అని చెప్పాడు యోధ.

"బాయ్! వీడి మాటలు నమ్మకు బాంబ్ బ్లాస్ట్ అయితే మనతోపాటు వాడు పోతాడు కావాలని మనల్ని భయపెడుతున్నాడు." అని చెప్పాడు అజిజ్.

"ఒరేయ్ లుచ్చా! నువ్వు సెక్యూరిటీ అధికారి ఆఫీసర్లని చూసి ఉంటావు కానీ నేను మిలటరీ బ్లాక్ క్యాట్ కమెండో! ఈ బాంబులకి భయపడే రకాన్ని కాదు, నీ పక్కన ఉన్న మీర్జా ని అడుగు వాడికి బాగా తెలుసు." అని చెప్పాడు యోధ.

పుష్కర్ వాళ్ళ చేతికి గన్ ఇస్తూ యోధ వైపు చూసి "నీకు ఏమి కావాలన్నా ఇస్తాను ఆ వస్తువు మాత్రం నాకు కావాలి." అని చెప్పాడు మీర్జా.

"ఫస్ట్! నీ దగ్గర ఉన్న మా ఇద్దరి ఏజెంట్లని సేఫ్ గా రిలీజ్ చెయ్!" అని చెప్పాడు యోధ.

అంతలో అక్కడికి వస్తున్న నీతూ వైపు చూసి
"టూ లేట్! వాళ్ళిద్దరని చంపేశాను." అని చెప్పాడు మీర్జా.

ఆ మాట విని బాధగా చూసింది నీతూ.

పుష్కర్ వాళ్ళ వైపు చూసి "అందరి కాళ్లు చేతులు కట్టేయండి." అని చెప్పి మీర్జా ని చైర్ లో కూర్చోబెట్టి "నీ నోటి వెంట ఆ మాట వచ్చిన వెంటనే చంపేసేవాడిని, కానీ నీతో కొంచెం పని ఉంది అందుకే వెయిట్ చేస్తున్నాను." అని నీతూ వైపు చూసి "దీప్తి వాళ్ళని కూడా ఇక్కడికి వచ్చేయమను." అని చెప్పి నాయక్ కి వీడియో కాల్ చేశాడు యోధ.

ఫోన్ లిఫ్ట్ చేసి వీడియో కాల్ లో చైర్ లో ఉన్న మీర్జా వైపు చూసి నవ్వుతూ "నువ్వు ఎవరికి దొరకాలో వాడికే దొరికావు, నిన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టను రెండే కొచ్చన్స్!

నీకు ఈ కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు? ఆ వస్తువుతో వాళ్లు ఎటువంటి ప్రయోగం చేయాలి అనుకుంటున్నారు?" అని అడిగాడు నాయక్.

వీడియో కాల్ చూస్తూ "మిస్టర్ నాయక్! నీ వృత్తి ధర్మం ఎలాంటిదో నావృత్తి ధర్మం కూడా అలాంటిదే నా నోటి నుంచి ఒక్క మాట కూడా బయటికి రాదు." అని పొగరుగా చూస్తూ చెప్పాడు మీర్జా.

ఆ మాట వి "యోధ! నాకు కావలసినవి ఆ రెండు ప్రశ్నలకు సమాధానాలు మాత్రమే!" అని చెప్పాడు నాయక్.

ఓకే సార్! ఆ ప్రశ్నలకు సమాధానం చెబుతున్నప్పుడు మళ్ళీ మీకు వీడియో కాల్ చేస్తాను. " అని చెప్పి కాల్ కట్ చేసి పుష్కర్ వైపు చూసి "అందరి చంపేయండి." అని చెప్పాడు యోధ.

ఆ మాట విని షాక్ అయ్యి చూస్తూ "అందరిని చంపేయాలా..? ఎందుకు? అరెస్టు చేస్తే సరిపోతుంది కదా! వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా విషయాలు తెలుసుకోవాలి." అని చెప్పింది నీతూ.

"నాకు తెలిసి మీర్జాకి తప్పితే ఇక్కడ ఉన్న ఎవ్వరికీ దీని గురించి తెలియదు డబ్బు కోసం మాత్రమే వచ్చారు ఇలాంటి వాడికి సహాయం చేసేవాడు ఎవ్వడు కూడా బతికి ఉండడానికి వీల్లేదు." అని చెప్పాడు యోధ.

"యోధ! నువ్వు నా మనుషుల్లో ఒక్కరిని చంపిన సరే తర్వాత చాలా బాధపడతావు." అని వార్నింగ్ ఇస్తున్నట్లు చెప్పాడు మీర్జా.

ఆ మాట విని నవ్వుతున్న అజీజ్ వైపు చూసి మొహం మీద కాలు పెట్టి ఒక తొక్కుతోక్కాడు యోధ.

మెడ వెనక్కి విరిగి కదలకుండా ఉన్న అజీజ్ ని చూసి "మీర్జా బాయ్! వీడు మన అజీజ్ ని చంపేశాడు." అని ఏడుస్తూ చెప్పాడు బ్రహ్మం.

అది చూసి కోపంతో చైర్ లో నుంచి లెగిసి మీదకి వస్తున్నా మీర్జాని మొహం మీద పిడికిలితో ఒక్క గుద్దు గుద్దాడు యోధ.

ఆ దెబ్బకి నోటివెంట రక్తం కారుతు కళ్ళు బైర్లు కమ్మి చేర్ లో కూర్చున్నాడు మీర్జా.

అది చూసి దీప్తి దగ్గరికి వచ్చి "నాకు కాస్త భయంగా ఉంది నేను బయట వెయిట్ చేస్తాను." అని చెప్పి బయటకు పరిగెత్తింది పూజా.

మీర్జా జేబులో ఉన్న మొబైల్ తీసుకుని నీతూ కి ఇచ్చి "డేటా మొత్తం బయటికి తీయండి." అని చెప్పాడు  యోధ.



" రుద్రం భజే! ఎపిసోడ్ 13 " రచనకు రేటింగ్ ఇవ్వండి
[+] 10 users Like SivaSai's post
Like Reply
#46
ఓస్థాయికి చేరిందీ కథ
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
#47
Kirrak episodes!!!
Manchi ranjuga saagutundi story
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
#48
Mirza is just a pawn in the big network. Yodha is going the right way...
[+] 1 user Likes Sunny73's post
Like Reply
#49
రుద్రం భజే! ఎపిసోడ్ 14



నాయక్ కి వీడియో కాల్ చేసి మీర్జా తో మాట్లాడించి తన నోటి వెంట నిజాలు తెలుసుకోవడానికి అజిజ్ ని తొక్కి చంపి మీర్జా మొహం పగలగొట్టి జేబులో ఫోన్ తీసుకుని నీతూ కి ఇచ్చి డేటా చెక్ చేయమని చెప్పాడు యోధ.

***************

అక్కడ జరిగేదంతా చూసి భయంతో గెస్ట్ హౌస్ బయటకి వచ్చి ఆగి ఉన్న వ్యాన్ చూసి "వీళ్ళు ఏ మిషన్స్ తీసుకువచ్చారు." అనుకుంటూ దగ్గరికి వెళ్లి డోర్ ఓపెన్ చేసి లోపల ఉన్న మిషన్స్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ హడావిడిగా గెస్ట్ హౌస్ లోకి వెళ్లి

"యోధ! వీళ్ళు తీసుకొచ్చిన మిషన్స్ రేడియేషన్  కనిపెట్టేవి కాదు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి." అని చెప్పింది పూజా.

ఆ మాట విని బయటికి వెళ్లి వ్యాన్లో ఉన్న మిషన్స్ చూస్తూ "ఎస్! ఇవి రేడియేషన్ కనిపెట్టేవి కాదు లేజర్ కిరణాలు ప్రొడ్యూస్ చేసేవి అసలు వీటిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు?" అని డౌట్ గా అడిగింది దీప్తి.

"ఒకవేళ ఆ వస్తువు మీద ఈ మిషన్ నుంచి వచ్చే కిరణాలు పడేటట్లు చేసి ఇక్కడే ప్రయోగం చేయాలి అనుకున్నారేమో!" అని చెప్పింది నీతూ.

"అలా అయితే ఇక్కడికి వీళ్లు కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు." అని కంగారుగా చూస్తూ లోపలికి వెళ్లి యోధ తో విషయం చెప్పింది దీప్తి.

తను చెప్పింది విని కాసేపు ఆలోచించి నీతూ! ఫోన్లో ఏమైనా డీటెయిల్స్ దొరికాయా?" అని అడిగాడు యోధ.

"ఫోన్ ఆన్ చేయడంతోనే లొకేషన్ సెండ్ అయింది. మీర్జా ఉన్న ప్లేస్ అటువైపు వాళ్ళకి తెలుస్తుంది కచ్చితంగా ఇక్కడికి ఎవరో వస్తున్నారు." అని చెప్పింది నీతూ.

ఆ మాట విని నోట్లోంచి కారుతున్న రక్తాన్ని చేతితో తుడుచుకుని "ఈ మీర్జా ఒంటరిగా వస్తాడు అని మీరు ఎలా అనుకున్నారు, కాసేపటిలో రాక్షసులు లాంటి నా మనుషులు ఇక్కడికి దిగుతారు ఈ ఊరిని హ్యాండ్ అవుర్ చేసుకుంటారు దొరికిన వాళ్ళని దొరికినట్లు చంపి నన్ను ఆ వస్తువుని తీసుకువెళ్లి పోతారు." అని చెప్పాడు మీర్జా.

నీతూ చేతిలో ఫోన్ తీసుకుని చనిపోయిన అజీజ్ జేబులో పెట్టి "ఏకవీర! ఈ బాడీని అడవిలోకి తీసుకువెళ్ళి నీకు నచ్చిన ప్లేస్ లో ఉంచి వెనక్కి వచ్చేయ్!" అని చెప్పాడు యోధ.

"సార్! నాతో పాటు పుష్కర్ ని కూడా తీసుకెళ్తాను." అని చెప్పి అజిజ్ బాడీ ని జీప్ లో ఎక్కించుకుని అడవిలోకి బయలుదేరాడు ఏకవీర.

భయంగా నుంచుని చూస్తున్న ముష్రు ని పిలిచి "నీకు బతకాలని ఉందా..?" అని అడిగాడు యోధ.

"సార్! మీరు ఏది చెబితే అది చేస్తాను నన్ను మాత్రం ప్రాణాలతో వదిలేయండి చాలు!" అని చెప్పాడు ముష్రు.

"సరే! ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక రూమ్ లోకి తీసుకువెళ్ళు!" అని చెప్పి వంట గదిలో ఉన్న రెండు గ్యాస్ సిలిండర్స్ ని తీసుకువచ్చి రూమ్ లో ఉంచి మీర్జా వైపు చూసి

"ఇక్కడికి వచ్చిన వాళ్లకి మీరు ఎక్కడ ఉన్నారో ఏమైపోయారో కూడా తెలియకుండా చేస్తాను ఒక్కడు కూడా ఈ ఊరు దాటీ బయటకు వెళ్ళలేరు." అని కాళ్లు చేతులు కట్టేసి ఉన్న బ్రహ్మన్ని ఎత్తి రూంలోకి గిరాటు వేసాడు యోధ.

"ఒరేయ్! ఏం చేస్తున్నావ్ రా...?" అని కంగారుగా అడిగాడు మీర్జా.

"బాయ్! ఆ విషయం ఏదో చెప్పేసేయ్ లేకపోతే వీడు అందరిని చంపేసేటట్లు ఉన్నాడు."  అని గదిలో నుంచి అరుస్తూ ఉన్నాడు బ్రహ్మం.

"నాకు ఇప్పుడు కావాల్సింది ఆ మేటర్ కాదు ఇక్కడికి ఎవరు వస్తున్నారో తెలియలి." అని చెప్పాడు యోధ.

"మనం ఈ ఏరియా సెక్యూరిటీ అధికారి కి ఇన్ఫామ్ చేస్తే బెటర్ ఎలర్ట్ అవుతారు." అని చెప్పింది నీతూ.

"ఎవ్వరికి చెప్పనవసరం లేదు ఈ గెస్ట్ హౌస్ లో గ్యాస్ సిలిండర్ పేలి లోపల ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు వచ్చే వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను." అని మీర్జా రెండు చేతులు కుర్చీకి కట్టి  "పదండి బయటికి వెళ్దాము." అని చెప్పాడు యోధ.

ఆ మాట విని కంగారుపడుతూ "ఒరేయ్! మెంటల్ నా కొడకా నన్ను కుడా చంపేస్తావా ఏంటి? తరువాత నీకు ఏ విషయం తెలీదు." అని చెప్పాడు మీర్జా.

"నాకు ఏమి తెలియనవసరం లేదు నువ్వు ఏమి చెప్పనవసరం లేదు, ఎలా తెలుసుకోవాలో నాకు బాగా తెలుసు!" అని చెప్పాడు యోధ.

"ఒక్క నిమిషం! నేను నాయక్ తో మాట్లాడాలి నా ప్రాణానికి హామీ ఇస్తేనే నేను అన్ని విషయాలు చెబుతాను." అని చెప్పాడు మీర్జా.

ఏమి మాట్లాడకుండా డోర్స్ క్లోజ్ చేస్తున్న యోధ దగ్గరికి వెళ్లి "తొందర పడకు ఒక్కసారి డాడ్ కి కాల్ చెయ్, వీళ్లు తీసుకువచ్చిన మిషన్స్ చాలా డేంజరస్! అసలు ఆ వస్తువుతో వీళ్ళు ఏ ప్రయోగం చేస్తారో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్!" అని చెప్పింది దీప్తి.

"అసలు మేటర్ అది కాదు ఇక్కడికి ఎవరు వస్తున్నారో తెలుసుకోవాలి." అని చెప్పింది నీతూ.

"ఇక్కడికి ఎవరూ రావడం లేదు ఆ వస్తువు దొరికింది అని నాకు కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యక్తికి మెసేజ్ వెళ్ళింది ఇంకా అతను చేయవలసింది చేస్తాడు." అని చెప్పాడు మీర్జా.

"నీకు కాంట్రాక్ట్ ఇచ్చింది ఏ దేశం వాళ్ళు?" అని అడిగింది నీతూ.

"నాకు ఈ కాంట్రాక్టు ఇచ్చింది ఈ దేశం వాడే అతని పేరు కళింగ! ఆ వస్తువుతో ఏం చేయడానికి చూస్తున్నాడో మాత్రం నాకు కూడా తెలియదు." అని చెప్పాడు మీర్జా.

"మరి ఈ మిషన్స్ ని ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు?" అని అడిగింది దీప్తి.

"ఆ వస్తువు దొరికిన తర్వాత దానిని ఈ మిషన్ లో పెట్టి ఆన్ చేయమన్నాడు తర్వాత ఏం జరుగుతుందో అనే విషయం కూడా నాకు తెలియదు." అని చెప్పాడు మీర్జా.

"అసలు ఈ కళింగ ఎవరు?" అని అడిగాడు యోధ.

"కళింగ ఒక సైంటిస్ట్! చాలా విచిత్రమైన ప్రయోగాలు చేస్తూ ఉంటాడు అందుకే అంతర్జాతీయ  సైంటిస్ట్ అసోసియేషన్ అతని లైసెన్స్ క్యాన్సిల్ చేసింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి లండన్ వెళ్ళిపోయాడు అసలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు." అని చెప్పింది దీప్తి.

"విచిత్రమైన ప్రయోగాలు అంటే ఏం చేస్తాడు?" అని డౌట్ గా అడిగాడు యోధ.

"హిమాలయాల అడుగున కొన్ని లక్షల సంవత్సరాల క్రితం  చనిపోయిన జీవులు కళేబరాలు ఉన్నాయి వాటిలో కొత్త కొత్త వైరస్ లు ఉన్నాయని మన శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు.

కాలుష్యం వల్ల హిమాలయాలు కరిగి ఆ వైరస్ బయటకు వచ్చే ప్రమాదం ఉంది అని తెలిసి ఆ ఏరియాలో రెస్పెక్ట్డ్ ఏరియాగా ప్రకటించి అక్కడ ఉన్న మంచు కరగకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.

కానీ కళింగ చైనా, పాకిస్తాన్ సహాయంతో కొన్ని కళేబరాలను సంపాదించి దాంట్లో నుంచి వింత వైరస్ కనిపెట్టాడు అది తెలిసి ఇండియన్ గవర్నమెంట్  అతని మీద సీరియస్ యాక్షన్ తీసుకోమని చెప్పింది.

అంతర్జాతీయ మండలి కుడా అతని లైసెన్స్ రద్దుచేసి ఎటువంటి ప్రయోగాలు చేయకుండా నిషేధం విధించింది అప్పటినుంచి అతను ఏమైపోయాడో ఎవరకి తెలియదు." అని చెప్పింది దీప్తి.

ఆ మాట విని మీర్జా వైపు చూసి "ఇప్పుడు కళింగ ఎక్కడ ఉన్నాడు?" అని అడిగాడు యోధ.

"నేను కుడా ఒక్కసారి మాత్రమే అతనితో ఫోన్లో మాట్లాడాను నాకు తెలిసి ఇండియాలోనే ఉన్నాడు." అని చెప్పాడు మీర్జా.

ఫోన్ తీసి కాల్ చేసి "డాడ్! ఈ ప్రయోగం వెనకాల ఉంది కళింగ! అతన్ని పట్టుకుంటే అన్ని విషయాలు తెలుస్తాయి." అని చెప్పింది దీప్తి.

"ఒకసారి యోధ కి ఫోన్ ఇవ్వు!" అని చెప్పాడు నాయక్.

ఫోన్ ఇవ్వడంతో తీసుకుని "జైహింద్ సార్!" అని చెప్పాడు యోధ.

"కళింగ ఇస్ ఏ మోస్ట్ డేంజర్స్ పర్సన్" నీ దగ్గర ఉన్న వస్తువు కోసం ఏమి చేయడానికి అయ్యినా వెనుకడడు బి ఎలర్ట్ గా ఉండు.

నీ దగ్గర ఉన్న ఐటమ్ ఎట్టి పరిస్థితుల అతని చేతికి వెళ్ళకూడదు కలింగ గురించి అన్ని డీటెయిల్స్ నీకు 30 మినిట్స్ లో సెండ్ చేస్తాను, నెక్స్ట్ మీర్జా వాళ్ళని ఏం చేయాలో నువ్వే డిసైడ్ చెయ్!" అని చెప్పాడు నాయక్.

"ఓకే సార్!' అని చెప్పి ఫోన్ పెట్టేసి దీప్తి వైపు చూసి "ఒకసారి బయటికి రండి మనం మాట్లాడుకోవాలి." అని చెప్పి డోర్స్ క్లోజ్ చేసే అందర్నీ వ్యాన్ దగ్గరికి తీసుకువెళ్లి కిటికి లోనుంచి గ్యాస్ సిలిండర్ ని షూట్ చేశాడు యోధ.

గెస్ట్ హౌస్ వేలిపోవడంతో ఒక్కసారి షాక్ అయ్యి చూస్తూ "మీర్జా కుడా చచ్చిపోయాడు." అని కంగారుగా చెప్పింది నీతూ.

"ఎస్! డిసిషన్ నన్నే తీసుకోమని సార్ చెప్పారు నా డిసిషన్  ఇలానే ఉంటుంది." అని చెప్పాడు యోధ.

"అసలు మీర్జా నిజమే చెప్పాడని నమ్మకం ఏమిటి!" అని డౌట్ గా అడిగింది పూజ.

"చావు ముందు ఉన్నప్పుడు నోటి వెంట నిజమే వస్తుంది అబద్ధం రాదు." అని చెప్పి వ్యాన్ లో ఉన్న మిషన్ దగ్గరికి వెళ్ళాడు యోధ
[+] 7 users Like SivaSai's post
Like Reply
#50
రుద్రం భజే! ఎపిసోడ్ 15



గెస్ట్ హౌస్ లో నుంచి దీప్తి వాళ్ళని తీసుకుని బయటికి వచ్చి కిటికీలో నుంచి గ్యాస్ సిలిండర్ షూట్ చేసి మీర్జా విషయంలో డిసిషన్ సార్ నాకు ఇచ్చారు అని చెప్పి వ్యాన్ లో ఉన్న మిషన్ దగ్గరికి వచ్చాడు యోధ.

**************

బ్లాస్ట్ అయిన గెస్ట్ హౌస్ వైపు చూస్తూ "ఈ మీర్జా ఒక్కడే వస్తాడు అనుకున్నావా అని పొగరుగా చెప్పాడు, అందుకే పోయేటప్పుడు కూడా ఒక్కడే పోలేదు, రెస్ట్ ఇన్ పీస్ పైకి వెళ్ళిన తర్వాత అయినా ప్రశాంతంగా ఉండు." అనుకుంటూ యోధ వాళ్ళ దగ్గరికి వచ్చింది పూజా.

వ్యాన్లో మిషన్ వైపు చూస్తూ "దీప్తి! నువ్వు చెప్పినట్లు  హిమాలయాలలో ఉన్న వైరస్ ని బయటికి తీసే ప్రయోగం కోసం ఈ వస్తువుని వెతకడం లేదు అంతకన్నా పెద్దది ఏదో చేయడానికి ట్రై చేస్తున్నారు.

అతని ఎక్స్పరిమెంట్ ల గురించి మొత్తం స్టడీ చెయ్ ఎక్కడైనా ఈ వస్తువుతో  ప్రయోగం గురించి మెన్షన్ చేశాడేమో తెలుస్తుంది." అని చెప్పాడు యోధ.

"మనం ఈ మిషన్స్ ని ఆన్ చేసి ఆ వస్తువుని పెట్టి చూస్తే ఏమవుతుందో తెలుస్తుంది కదా!" అని అడిగింది నీతూ.

"నో నో! అసలు ఈ ప్రయోగం ఏమిటో తెలుసుకోకుండా ఆ తప్పు చేయకూడదు చాలా డేంజర్!" అని చెప్పింది దీప్తి.

అంతలో అక్కడికి వచ్చి "సార్! మీరు చెప్పినట్లే అజీజ్ బాడిని  అడవిలో ఒక కొండ దగ్గర ఉంచాము." అని చెప్పి గెస్ట్ హౌస్ బ్లాస్ట్ అయ్యి ఉండడం చూసి నీతూ దగ్గరికి వెళ్లి "మేడం! అందరూ పోయారా..? ఎవరైనా ఉన్నారా..?" అని నెమ్మదిగా అడిగాడు పుష్కర్.

"ఆ ముష్రు గాడు ఒక్కడు మిగిలాడు." అని చూపించింది నీతూ.

"అవునా?" అని వ్యాన్ దగ్గర ఉన్న ముష్రుని చూసి "నీ లక్కు బాగుందిరా.. వీళ్ళ గ్యాంగ్ లో జాయిన్ అయ్యి ఎన్ని సంవత్సరం అవుతుంది?" అని అడిగాడు ఏకవీర.

వ్యాన్ దగ్గర నుంచి వస్తు "అసలు వీడు వాళ్ళ గ్యాంగ్ లో మనిషే కాదు." అని చెప్పాడు యోధ.

ఆ మాట విని కంగారుగా చూస్తున్న ముష్రు వైపు చూసి "మరి ఎవరు అతను?" అని డౌట్ గా అడిగింది నీతూ.

"ఆ విషయం ముష్రు నోటి వెంట విందాము." అని గన్ లో బుల్లెట్స్ చూస్తూ చెప్పాడు యోధ.

"నన్నేమి చేయకండి వీళ్ళ దగ్గరికి నన్ను కలింగ సార్ పంపించారు." అని టెన్షన్ గా చూస్తూ చెప్పాడు ముష్రు.

ఆ మాట విని షాక్ అయ్యి "నువ్వు కళింగ మనిషివా..?" అంటూ యోధ వైపు చూసి "ఆ విషయం నువ్వు ఎలా కనిపెట్టావు?" అని ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది దీప్తి.

"గెస్ట్ హౌస్ లో మీర్జా మనుషులందరినీ ఒక రూమ్ లోకి తీసుకు వెళ్ళమని వీడికి చెప్పాను అప్పుడే మీర్జా నోటి వెంట కలింగం పేరు బయటికి వచ్చింది.

వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ ముష్రు వైపే చూశారు అప్పుడే నాకు అనుమానం వచ్చింది అందుకే వీడిని ప్రాణాలతో ఉంచాను." అని చెప్పాడు యోధ.

"నాకు అప్పుడే డౌట్ వచ్చింది వీడి మీద అంత ప్రేమ ఏమిటి అబ్బా అనుకున్నాను ఇప్పుడు వీడి చావుకు వచ్చింది అందరి దెబ్బలు ఒక్కడికే పడతాయి." అని చెప్పింది పూజా.

ముష్రు దగ్గరికి వెళ్లి "కళింగ ఎక్కడ ఉన్నాడు? ఈ వస్తువుని ఆ మిషన్ లో పెడితే ఏం జరుగుతుంది?" అని అడిగింది నీతూ.

"కళింగ సర్ నాకు ఫోన్లో ఆర్డర్స్ ఇచ్చారు వీళ్ళతోపాటు వెళ్లి ఆ వస్తువు దొరికిన వెంటనే మిషన్ లో పెట్టి ఆన్ చేయమని చెప్పారు అంతకు మించి నాకు కూడా ఏమీ తెలియదు." అని చెప్పాడు ముష్రు.

"మీరు అంత నెమ్మదిగా అడిగితే వాడి నోటి వెంట ఒక్క ముక్క కూడా బయటికి రాదు." అని గన్ లోడ్ చేశాడు యోధ.

తన చేతిలో గన్ తీసుకుని "వీడు కూడా పోతే కళింగ ఎక్కడ ఉన్నాడో అసలు ఈ ప్రయోగం ఏమిటో కుడా తెలియదు." అని చెప్పి ముష్రు దగ్గరకు వెళ్లి

"నిన్ను ఇక్కడికి పంపించాడు అంటే కచ్చితంగా ఈ ప్రయోగం గురించి నీకు తెలిసే ఉంటుంది అదేమిటో చెప్పు ప్రాణాలతో ఉంటావు." అని అడిగింది దీప్తి.

సైలెంట్ గా ఉన్న ముష్రు దగ్గరికి వెళ్లి "దీప్తి! నువ్వు చెప్పింది కూడా కరెక్టే! బుల్లెట్ వేస్ట్ చేయకూడదు." అని చెప్పి పుష్కర్ జేబులో ఉన్న పెన్ను తీసి ముష్రు కాలులో పొడిచాడు యోధ.

కాలులో పెన్ను దిగడంతో బాధతో గట్టిగా అరుస్తున్న ముష్రు గొంతు కన్నా భయంతో గట్టిగా అరిచిన పూజా గొంతు రీసౌండ్ రావడంతో కంగారుగా వెనక్కి తిరిగి "బానే ఉన్నావు కదా!" అని అడిగింది నీతూ.

టెన్షన్ గా చూస్తూ "నేను బానే ఉన్నాను ఇలాంటివి చేసేటప్పుడు కాస్త చెప్పి చేయండి." అని ముష్రు కాలివైపు చూసి "పెన్ను ని ఇలా కూడా ఉపయోగిస్తారని నాకు ఇప్పుడే తెలిసింది." అని కంగారుగా చెప్పింది పూజా.

పుష్కర్ వైపు చూసి "తెల్లారిపోయింది మనం ఈ ప్లేస్ లో ఇంక ఉండకూడదు, నీ పెన్ను తీసుకోని వాడిని జీపులో ఎక్కించండి." అని చెప్పాడు యోధ.

"మరి ఈ మిషన్స్ ని ఏం చేద్దాము?" అని డౌట్ గా అడిగింది దీప్తి.

"ఏకవీర! ఆ వ్యాన్ తీసుకుని మా వెనకాల రా..!" అని చెప్పి జీప్ ఎక్కడు యోధ.

ముష్రుని జీపులో ఎక్కించి డ్రైవింగ్ సీట్లోకి వెళ్లి స్టార్ట్ చేసి పక్క సీట్లో ఉన్న యోధ వైపు చూసి "ఎక్కడికి వెళ్ళమంటారు?" అని అడిగాడు పుష్కర్.

"మన గుడి దాటిన తర్వాత పాడుబడిన ఒక కోట ఉంది అక్కడికి వెళదాము ఆ ప్లేస్ కి ఊరు వాళ్ళు కూడా ఎవరు రారు." అని చెప్పాడు యోధ.

కాసేపటికి కోట దగ్గరికి చేరుకుని మిషన్ ఉన్న వ్యాన్ ఎవరికీ కనబడకుండా ఒక పక్కకు పెట్టి జీప్ లో ఉన్న ముష్రుని దింపి కోట లోపలికి తీసుకువెళ్లి "నిజంగానా వీడికి కలింగ గురించి ఏమీ తెలియదు అనుకుంటా!" అని చెప్పింది నీతూ.

"అలా అయితే ఇంక వీడితో మనకు పనే ఉంది చంపేయండి." అని చెప్పాడు యోధ.

వన్ మినిట్! డాడ్ కళింగ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ పంపించారు."  అని లాప్టాప్ లో చూస్తూ

"యోధ! ఈ ఫోటో ఒక్కసారి చూడు ముష్రూ మనతో అబద్ధం చెప్పాడు ఇతను కళింగ తో చాలా క్లోజ్ ఉన్నాడు అంటే ఈ ప్రయోగం గురించి తనకి తెలిసే ఉంటుంది." అని చూపించింది దీప్తి.

లాప్టాప్ లో ఫోటో చూసి ముష్రు వైపు తిరిగి "ఈ వస్తువుతో ఏం చేయాలి అనుకుంటున్నారో చెప్పకపోతే థర్డ్ డిగ్రీ కి మించిన డిగ్రీ నీకు చూపిస్తాను దానికన్నా చచ్చిపోవడం మేలు అనిపిస్తుంది." అని కోపంగా చూస్తూ చెప్పాడు యోధ.

ఆ మాట విని భయంగా చూస్తూ "నాకు ఆ బ్రతుకు వద్దు తెలిసింది మొత్తం చెబుతాను, 1995 లో కైలాస పర్వతం నుంచి మానససరోవరం వెళ్లే దారిలో తపస్సు చేసుకునే బౌద్ధ సన్యాసులకు ఒక గుహలో కొన్ని తాళపత్ర గ్రంధాలు దొరికాయి.

వాటిలో దైవ లిపిలో రాసి ఉండడం చూసి దుష్టుల కంటపడితే ప్రమాదం అని భావించి ఆ గ్రంథాలని టిబెట్లో ఒక ఆశ్రమంలో భద్రపరిచారు

చింగ్ యా అని చైనా మిలటరీ జనరల్  కైలాస పర్వతం మిస్టరీ చేదించి అక్కడ ఉన్న అతీంద్రియ శక్తుల గురించి తెలుసుకోవాలని అక్కడ రహస్యంగా ఉన్న నగరానికి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు.

ఆ గ్రంధాలు దొరికిన విషయం తెలుసుకుని తనకి ఉన్న పవర్ తో టిబెట్ గవర్నమెంట్ ని భయపెట్టి ఆశ్రమంలో ఉన్న గ్రంధాలు హ్యాండ్ ఓవర్ చేసుకుని జింగ్ అనే ఒక ఆర్కియాలజిస్ట్ ద్వారా ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేశాడు.

ఆ గ్రంథాలలో ఉన్న కైలాస పర్వతం రహస్యం గురించి తెలుసుకోలేకపోయారు కానీ, నీ దగ్గర ఉన్న వస్తువు ఎక్కడ ఉందో దాని దగ్గరకు ఎలా వెళ్లాలో తెలుసుకున్నారు.

మూడు సంవత్సరాలు కష్టపడి కైలాస పర్వతం దగ్గర వెతికి 400 మంది సైనికులు మరణం అనంతరం ఆ వస్తువుని కనుక్కున్నారు, అది దొరికిన ప్లేస్ లో ఉన్న ఆధారాలను బట్టి ఆ వస్తువు ఒక నగరానికి దారి చూపుతుంది అని తెలుసుకున్నారు.

ఆ ప్రయోగం చేయడానికి అనువైన ప్రదేశం పాకిస్తాన్లో ఉందని తెలుసుకొని ఆ దేశాన్ని ఒప్పించి కారకొరం పర్వతాల దగ్గర ప్రయోగం మొదలుపెట్టారు కానీ ఇండియన్ ఏజెంట్స్ వల్ల అది ఫెయిల్ అయింది ఆ వస్తువు కూడా మిస్ అయ్యింది.

ఆ గ్రంథాలలో ఉన్న దాన్ని బట్టి అలాంటిది మరొక వస్తువు ఆ ప్రదేశంలోనే ఉందని తెలుసుకుని దానికోసం చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఎక్కడ దొరకలేదు.

2015లో చైనా సైంటిస్టుల సహాయం తో కళింగ సార్ హిమాలయాల అడుగున ఉన్న కళేబరాలను బయటకు తీసి కొత్త రకం వైరస్ ని కనిపెట్టడంలో సక్సెస్ అయ్యారు.

అప్పుడు అన్ని దేశాలు ఆయనను బహిష్కరించడంతో చైనా దగ్గరికి తీసుకుంది. అప్పుడే మిలిటరీ జనరల్  చింగ్ యా ఈ వస్తువు గురించి అక్కడ దొరికిన ఆధారాలు గ్రంధాలు చూపించాడు.

అవి చూసి కళింగా సార్ నేను ఈ వస్తువు గురించి తెలుసుకోవడానికి ఐదు సంవత్సరాలు హిమాలయాల్లోనే ఉన్నాము. అక్కడ తపస్సు చేసుకుంటున్న చాలామంది వ్యక్తులను కలిసి వివరాలు సంపాదించడం మొదలుపెట్టాము.

అప్పుడే రేపాలి అనే టీబేట్ తాంత్రికుడుని కలిసాము ఆయన చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఆ వస్తువు ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ఒక మిషన్ తయారుచేసి దాని సిగ్నల్ కోసం వెతకడం ప్రారంభించాము.

నాలుగు నెలల క్రితం అనుకొని విధంగా ఆ వస్తువు సిగ్నల్ దొరికింది దానికోసం చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ సార్ ఇండియాలో అడుగుపెట్టారు." అని చెప్పాడు ముష్రు.

"ఆ వస్తువు కోసం చైనా అంత ఫండింగ్ ఎందుకు చేస్తుంది? ఈ వస్తువు ద్వారా ఏ నగరం కనిపిస్తుంది." అని అడిగాడు యోధ.

"ఆ వస్తువుని ఆక్టివేట్ చేస్తే  కైలాస పర్వతంలో ఉన్న కుబేరుడు నగరం అయ్యినా అలకాపురి ద్వారాలు తెరుచుకుంటాయి. దానికి సంబంధించిన ఆధారాలు కళింగ సార్ దగ్గర ఉన్నాయి." అని చెప్పాడు ముష్రు.

ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ కుబేరుడి నగరం "అలకాపురి డోర్స్ ఓపెన్ అవుతాయా..?" అని అడిగింది దీప్తి.
[+] 8 users Like SivaSai's post
Like Reply
#51
రుద్రం భజే! ఎపిసోడ్ 16



ఆ వస్తూవు ఆక్టివేట్ అయితే కుబేరుడి నగరం అలకాపురి తలుపులు తెరుచుకుంటాయి అని చెప్పాడు ముష్రు.

**************
ముష్రు చెప్పింది విని ఆశ్చర్యంగా చూస్తూ "ఒరేయ్! ఏకంగా కుబేరుడు కే టెండర్ పెట్టాలని చూస్తున్నారు కదారా..!" అని చెప్పింది పూజా.

"ఆ నగరం కోసం ఇప్పుడు వెతకడం కాదు 1951 సంవత్సరం నుంచి వెతుకుతూనే ఉన్నారు మొదట రష్యా జపాన్, తర్వాత అమెరికా, ఇప్పుడు చైనా, పాకిస్తాన్ కానీ ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోతోంది.

ఈసారి కళింగ రంగంలోకి దిగాడు తనకి రేపాల అనే తాంత్రికుడు సహాయంగా ఉన్నాడు ఇద్దరు కలిసి కచ్చితంగా సాధిస్తారు అనుకున్నను, కానీ ఈసారి యోధ రూపంలో వాళ్లకి పెద్ద ఆటంకం ఏర్పడింది." అని చెప్పాడు  ముష్రు.

"నా రూపంలోనా..? వాళ్ళు ఇంకా నాకు ఎదురు పడలేదు కదా! ఎదురుపడితే ఆటంకం కాదు ఎవరు ప్రాణాలతో ఉండరు." అని చెప్పాడు యోధ.

"నువ్వు అన్నదే జరిగింది ఆ రోజు ఇండియన్ గవర్నమెంట్ తరఫున బందీలుగా ఉన్నవాళ్లని రిలీజ్ చేయించడానికి వచ్చావు కదా! అప్పుడు నువ్వు చంపిన వాళ్లలో సోల్జర్స్ మాత్రమే కాదు రెపాలా మనుషులు కూడా ఉన్నారు.

ఆ ముందు రోజే కాల్ చేసి ఇలాంటి వస్తువు మరొకటి ఎక్కడ ఉందో తెలిసింది అని చెప్పారు కానీ అప్పుడే నువ్వు ఎంటర్ అయ్యావు ఆ విషయం తెలిసిన వాళ్ళందరినీ చంపేసావు." అని చెప్పాడు ముష్రు.

"యోధ! నువ్వు తెలియకుండా చేసినా మంచే జరిగింది." అని సంతోషంగా చెప్పింది దీప్తి.

"అలా అయితే కళింగ ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాడా..?" అని అడిగాడు యోధ.

"కళింగ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో నిజంగా నాకు కూడా తెలియదు, కానీ ఇక్కడ వస్తువు ఉన్న విషయం మాత్రం తెలిసింది. ఖచ్చితంగ దీనికోసం ఏం చేయడానికి అయ్యినా రెడీ అవుతాడు." అని చెప్పాడు ముష్రూ.

"కళింగ ఏం చేసినా సరే నా చేతిలో నుంచి ఈ వస్తువుని దీనిని తీసుకోవడం ఎవరికి తరంకాదు." అని చెప్పాడు యోధ.

"నువ్వేంటో నాకు తెలుసు! కానీ కళింగ గురించి మీకు ఎవరికి తెలియదు, వాడు ఒక మాంత్రికుడు లాంటి సైంటిస్ట్ తనకి కావాల్సిందని కోసం ఏమైనా చేస్తాడు." అని చెప్పాడు ముష్రు.

"మాంత్రికుడు లాంటి సైంటిస్ట్ అంటే? ఏం ప్రయోగాలు చేస్తాడు?" అని అనుమానంగా అడిగింది పూజా.

"హిమాలయాల అడుగునా ఉన్న పురాతనమైన జీవుల కళేబరాలు బయటకు తీస్తున్నాడు అనే విషయం తెలిసి   అంతర్జాతీయ సైంటిస్ట్ యూనియన్ కళింగ లైసెన్స్ క్యాన్సిల్ చేయడంతో చైనా మిలటరీ సాయంతో పాకిస్తాన్ లో ఉన్న కారకొరం పర్వతాలలో తన ల్యాబ్ ఓపెన్ చేసాడు.

 ఆ ప్లేస్ కి ఇండియన్ మిలిటరీ వెళ్లలేదు కాబట్టి తన ఇష్టం వచ్చినట్లు ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాడు, కళేబరాల నుంచి తీసిన వైరస్ ని మనుషులకి ఎక్కించి మొదటి ప్రయోగం చేసాడు.

అది సక్సెస్ అయ్యి ప్రపంచన్ని ఒక కుదుపు కుదిపింది దాంతో ప్రపంచ దేశాలు ఆర్థికంగా నష్టం పోయిన కొన్ని ఫార్మా కంపెనీలు మాత్రం విపరీతంగా లాభపడ్డాయి.

ఆ ఫార్మా కంపెనీలు కళింగకి ఫండింగ్ చేయడం మొదలుపెట్టాయి దాంతో అక్కడ వింత వింత ప్రయోగాలు చేయడం మొదలు పెట్టాడు.

ఆ ప్లేస్ కి ఎవ్వరూ రాకుండా చైనా పాకిస్తాన్ ఆర్మీ ఇండియాకి వ్యతిరేకంగా ఉన్న తీవ్రవాదులు సెక్యూరిటీగా ఉన్నారు.

ఇప్పుడు చేసే కళింగ ప్రయోగం సక్సెస్ అయితే భారతదేశానికి రక్షణ కవచంగా ఉన్నా హిమాలయాలు ఇంకా ఉండవు అదేవిధంగా కైలాస పర్వతంలో రహస్యంగా ఉన్న అలకపురి లాంటి నగరాలు బయటకు వస్తాయి.

తను అనుకున్నది సాధిస్తాడు భారత్ కి శత్రు దేశాలైన రెండు దేశాలకి సహాయం చేసిన వాడు అవుతాడు." అని చెప్పాడు ముష్రు.

తను చెప్పింది విని కోపంగా చూస్తూ "అలాంటివి మనిషి బతికి ఉండకూడదు." అని చెప్పింది నీతూ.

"చావు దగ్గర పడి కైలాస పర్వతం జోలికి వెళ్లారు." అని చెప్పి ఫోన్ రింగ్ అవ్వడం చూసి లిప్ట్ చేసి "జైహింద్ సార్! ఈ వస్తువుతో వాళ్లు ఏమి చేయబోతున్నారో తెలిసింది. అంతే కాదు కళింగ గురించి భయంకరమైన నిజాలు తెలిసాయి." అని వివరంగా చెప్పాడు యోధ.

"ఓ మై గాడ్! మీరు ఇమీడియట్ గా ఆ వస్తువుని కళింగ మనిషిని తీసుకుని మిలిటరీ హెడ్ క్వార్టర్స్ కి బయలుదేరండి." అని చెప్పాడు నాయక్.

"ఓకే సార్!" అని ఫోన్ పెట్టేసి నీతూ వైపు చూసి "మనం వెంటనే ఢిల్లీ బయలుదేరాలి." అని చెప్పాడు యోధ.

"మనం వెళ్ళిన తర్వాత కళింగ మనుషులు ఇక్కడికి వస్తే!" అని డౌట్ గా అడిగింది దీప్తి.

ఆ మాటకి ముష్రు వైపు చూసి "కళింగతో ఎలా కాంటాక్ట్ అవుతావు?" అని అడిగాడు యోధ.

తన జేబులో నుంచి పేజర్ తీసి చూపించి "ఏ విషయమైనా మెసేజ్ మాత్రమే ఫోన్ లో మాట్లాడు." అని చెప్పాడు ముష్రు.

"ఓకే!" అని అలోచించి "ఆ వస్తూవు హ్యాండ్ ఓవర్ అయింది కానీ యాక్టివేట్ చేయడం కుదరలేదు దానిని తీసుకుని ఢిల్లీ బయలుదేరాను అని మెసేజ్ చెయ్!" అని చెప్పాడు యోధ.

తను చెప్పింది విని మెసేజ్ టైప్ చేసి యోధ వైపు చూసి "మీరు చెప్పింది చెప్పినట్లు చేస్తున్నాను, నాకు తెలిసిన విషయాలన్నీ చెప్తున్నాను నా ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మీదే!" అని చెప్పి సెండ్ చేసాడు ముష్రు.

తన చేతిలో ఉన్న ప్లెజర్ తీసుకుని "నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు." అని పుష్కర్ వాళ్ళ వైపు చూసి "ముష్రుని మీ రూమ్ కి తీసుకెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేసి బయలుదేరడానికి ప్రిపేర్ అవ్వండి." అని చెప్పాడు యోధ.

"మరి ఈ మిషన్ ఏం చేద్దాము?" అని డౌట్ గా అడిగింది నీతూ.

"ఆ మిషన్ ఇక్కడే ఉంటుంది పదండి." అని చెప్పి వెళ్లి జీప్ ఎక్కడు యోధ.

**************

కారకొరం పర్వతాలలో గిల్లెట్ ప్రాంతంలో ఉన్న ల్యాబ్ లో  గ్లాస్ రూమ్ లో ఉన్న మనిషికి వైరస్ ఇంజక్ట్ చేసి చింగ్ యా దగ్గరికి వచ్చి పేజర్ లో ముష్రు  పంపిన మెసేజ్ చూపించాడు కళింగ.

"సైంటిస్ట్! నీ మనిషిని ఢిల్లీ హవేలీ హోటల్ కి వెళ్లి ముస్తఫాని కలవమను అతను అన్ని ఏర్పాటు చేసి భద్రంగా ఇక్కడికి పంపిస్తాడు." అని చెప్పాడు సయ్యద్.

"మీర్జా దగ్గర ఉన్న మొబైల్ ఆన్ అయినట్టు సిగ్నల్ వచ్చింది అంటే అతను ఆఫీసర్స్ కి దొరికిపోయాడు అని అర్ధం!

అయినా సరే ముష్రూ ఆ వస్తువుని తీసుకుని వస్తున్నాడు అంటే వాళ్లే అతనితో ఈ మెసేజ్ పెట్టించి ఉండాలి, లేకపోతే అక్కడ నుంచి తప్పించుకునైనా ఉండాలి.

కాబట్టి నా అసిస్టెంట్ తీసుకురావడానికి కరెక్ట్ పర్సన్ ని పంపండి ఇండియన్ ఆర్మీ కి ఎట్టి పరిస్థితిలో ఈ ప్లేస్ గురించి తెలియకూడదు." అని చెప్పాడు కళింగ.

"ఒకవేళ తెలిసిన వాళ్ళు ఏమి చేయలేరు ఇక్కడికి వాళ్ళ యుద్ధ విమానాలు రావడానికి పర్మిషన్ లేదు, సర్జికల్ స్ట్రైక్ లాంటిది చేయడానికి సోల్జర్స్ ని పంపిన ప్రాణాలతో తిరిగి వెళ్ళరు." అని చెప్పాడు చింగ్ యా.

"మీరు చెప్పింది కరెక్ట్ జనరల్! కానీ ఇండియన్ మిలిటరీని తక్కువ అంచనా వేయకూడదు ఒక్కడు 24 మందిని చంపి శరీరాలు కూడా కనపడకుండా చేశాడు మర్చిపోయారా..?" అని చెప్పాడు కళింగ.

"మీరేమీ ఫిగర్ అవ్వకండి మీ మనిషి ముస్తఫాని కలిస్తే చాలు బోర్డర్ దాటినట్లే! ఒకవేళ అక్కడికి ఎవరైనా ఆఫీసర్లు వచ్చిన వాడు చూసుకుంటాడు." అని చెప్పాడు  సయ్యద్.

"సరే!'" అని చేప్పి సయ్యద్ చెప్పిన అడ్రస్ ని ముష్రు కి మెసేజ్ పంపించాడు కళింగ.

గ్లాస్ రూమ్ లో ఉన్న మనిషిని చూసి "ఈ ప్రయోగం ఎంతవరకు వచ్చింది? ఫార్మ కంపెనీ వాళ్ళు కాల్ చేస్తున్నారు." అని అడిగాడు జింగ్.

"టుడేస్ లో రెడీ అవుతుంది ట్రైల్ వేయడానికి ఒక మంచి ప్లేస్ చూడండి సముద్రం అయితే బెస్ట్!" అని చెప్పాడు కళింగ.

"ఓకే! ఎక్కడ టెస్ట్ చేయాలో నేను డిసైడ్ చేస్తాను." అని చెప్పాడు చింగ్ యా.

****************

ఆదే సమయంలో అరవకొండాలో జీప్ లో గుడి దగ్గరికి వచ్చి పుష్కర్ వాళ్ళని ఇంటికి వెళ్ళమని చెప్పి అక్కడ ఉన్న నారాయణ రావు వైపు చూసి స్మైల్ ఇచ్చి "అంకుల్! మీకు కుబేరుడి నగరం అలాకాపూరి గురించి తెలుసా?" అని అడిగింది దీప్తి.

"కుబేరుడు! యక్షరాజు ధనాధిపతి, పరమశివుడు కొలువైనటువంటి కైలాస పర్వతం దగ్గర ఆయన నగరం అలాకాపూరి ఉంటుంది.

అక్కడే కల్పవృక్షం కుడా ఉంటుంది  కానీ అక్కడికి మానవ మాత్రులకి ప్రవేశం ఉండదు, ధనం మీద ఆశ లేనటువంటి మునులకు, ఋషులకు మాత్రమే అనుమతి ఉంటుంది." అని చెప్పి అనుమానంగా చూస్తూ

"అవును! ఇప్పుడెందుకు దాని గురించి అడుగుతున్నారు." అని అడిగాడు నారాయణ రావు.

"నాన్నగారు! స్వామి వారి పాదాల దగ్గర ఉన్న వస్తువుతో అలాకాపూరి నగరం తలుపులు తేరవడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసింది.

ఆది కాకుండా ఇలాంటి వస్తువే మరొకటి ఉంది దాని గురించి వెతుకుతున్నారని తెలిసింది  అసలు ఇదంతా నిజమేనా అంటారా..?" అని అడిగాడు యోధ.

ఆ మాట విని కాసేపు ఆలోచించి "ఒక్క నిమిషం ఉండండి." అని చెప్పి గర్భగుడిలోకి వెళ్లి  ఒక రాగి రేకుని తీసుకువచ్చి
"ఆ వస్తువు ఇక్కడికి ఎందుకు వచ్చిందో ఇప్పుడు అర్థమైంది." అని సంతోషంగా చూస్తూ చెప్పాడు నారాయణ రావు.

"అంకుల్! ఆ రేకు ఏమిటి దానిమీద ఏదో రాసి ఉంది." అని అనుమానంగా అడిగింది పూజా.

"ఇది కుబేరుడు స్వహస్తాలతో రాసిన పత్రం అంటారు." అని చెప్పాడు  నారాయణ రావు.

ఆ మాట విని ఆ రాగి రేకు వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు అందరు.......
[+] 8 users Like SivaSai's post
Like Reply
#52
రుద్రం భజే! ఎపిసోడ్ 17


గుడి దగ్గరికి వచ్చిన దీప్తి వాళ్ళు చెప్పింది విని గర్భగుడి నుంచి ఒక రాగి రేకుని తీసుకువచ్చి ఆ వస్తువు ఇక్కడికి ఎందుకు చేరుకుందో ఇప్పుడు అర్థమైంది. ఇది కుబేరుడు స్వయంగా రాసిన పత్రం అని చూపించాడు నారాయణ రావు.

**************

నారాయణ రావు చెప్పింది విని చేతిలో ఉన్న రాగి రేకుని చూసి "నాన్నగారు! మీరు చెప్పింది ఏమి అర్థం కాలేదు. కుబేరులు వారు స్వయంగా రాయడం ఏమిటి? అది ఈ గుడిలో ఉండడం ఏమిటి?" అని అనుమానంగా అడిగాడు యోధ.

"మా పూర్వీకుల నుంచి అందరు ఈ స్వామివారి సన్నిధిలోనే ఉండేవారు. మా ముత్తాత గారి సమయంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి శిష్యులు దేవాలయాలు సందర్శిస్తూ,  ఈ వీరాంజనేయ స్వామి వారి దేవాలయం దర్శించుకుని గర్భగుడిలో స్వామివారి సన్నిధిలో ఉన్న  తామ్ర  పత్రాన్ని చూసి ఈ స్థల పురాణం గురించి వివరంగా చెప్పారు." అని చెప్పాడు నారాయణ రావు.

"ఏమని చెప్పారు?" అని అందరు ఆత్రుత గా చూసారు.

యక్షరాజు కుబేరుడి తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ఆయనను ధనానికి అధిపతిని చేశాడు.
కుబేరుడి మొదటి నివాస స్థలం బంగారు లంకా నగరం.

రావణుడు దేవతలను జయించి లంకా నగరానికి చేరుకొని కుబేరుడుని అక్కడి నుంచి పంపించి, ఆ నగరాన్ని సొంతం చేసుకున్నాడు.

తనకు జరిగిన అన్యాయాన్ని పరమశివుడికి విన్నవించుకోగా, తన నివాస స్థలమైన  కైలాస పర్వతం దగ్గర ఉండే అలకాపురి నగరాన్ని ప్రసాదించి, శివగణాలను రక్షణగా ఉంచాడు.
అప్పట్నుంచి అలకాపురి కుబేరుడి నగరం అయ్యింది.

ఒకసారి రావణాసురుడు పరమశివుడి దర్శనానికి కైలాస పర్వతం దగ్గరికి వచ్చి అనుమతి లభించక పోవడంతో ఆ పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు.

అది చూసి కుబేరుడు అపహస్యం చేయడంతో, అలకాపురి మీద దండయాత్ర చేయాలి అనుకున్నాడు. కానీ శివగణాలు రక్షణగా ఉండడంతో ఆ ప్రయత్నంలో కూడా విఫలమయ్యాడు రావణబ్రహ్మ.

ఎలాగైనా అలకాపురి మీద దండయాత్ర చేసి అక్కడ ఉన్న కల్పవృక్షాన్ని తన లంకలో ఉంచాలి అని నిశ్చయించుకుని  తపస్సు చేసి ఆ నగరం ద్వారాలను తెరిచే శక్తివంతమైన రెండు వస్తువులను సంపాదించి ఒకదానిని తన రాక్షస సైన్యానికి ఇచ్చి అలకాపురి మీద యుద్దానికి పంపించాడు.

కైలాస పర్వతం దగ్గరికి చేరుకున్న రాక్షసులను శివగణాలు అంతం చేయడంతో, వారి రక్తంతో ఆ ప్రదేశంలో ఒక సరస్సు ఏర్పడింది.
దానిని రాక్షసాల్ సరస్సు అంటారు. కైలాస పర్వతాన్ని దర్శించుకోవడానికి వెళ్ళిన వారు మానస సరోవరంలో  నీటిని సేవిస్తారు కానీ, రాక్షసాల్ సరస్సులో నీటిని సేవించరు.

ఆ రాక్షసులతో పాటు శక్తివంతమైన ఆ వస్తువు కూడా,  ఆ హిమాలయాలలో అంతర్ధానం అయిపోయింది. కొంత కాలానికి శ్రీరాముల వారి చేతిలో రావణాసురుడు మరణించడంతో, విభీషణుడికి పట్టాభిషేకం చేశారు. అప్పుడు ఆ రెండో వస్తువు లంకా నగరంలో ఆయన దగ్గర ఉండిపోయింది.

కొంతకాలం తరువాత తన నగరాన్ని తెరిచే శక్తివంతమైన వస్తువులు లంకలో ఉన్నాయని వాటి వల్ల కలికాలoలో ప్రమాదం వాటిల్లుతుందని, కాపాడగలిగింది విభీషణుడు అని తెలుసుకున్న కుబేరుడు  లంకకు బయలుదేరి వెళ్లి విభీషణుడుని కలిశాడు .

తన దగ్గరికి వచ్చిన కుబేరుడు చెప్పింది విని, తన దగ్గర ఉన్న వస్తువు కి తాను రక్షణగా ఉంటానని మాట ఇచ్చి మరొక వస్తువు హిమాలయాలలో అంతరార్థమైంది కాబట్టి త్వరలో అక్కడ తపస్సు చేసుకోవడానికి వచ్చే హనుమంతుడిని కలవమని చెప్పాడు విభీషణుడు.

ఆ మాటకి సంతోషంగా అరవకొండ మీద తపస్సులో ఉన్న  ఆంజనేయ స్వామి వారి దగ్గరికి వచ్చి శరణు వేడాడు  కుబేరుడు.

అప్పుడు స్వామి వారు అనుగ్రహించి హిమాలయాలలో అంతరార్థమైన ఆ వస్తువు కలికాలంలో బయటకు వచ్చి ఈ ప్రదేశానికి చేరుకుంటుంది. దానికి నేను రక్షణగా ఉండి నీ దగ్గరికి చేరుస్తాను. అని మాట ఇచ్చారు.

కుబేరుడికి ఏది అయినా సరే నోటి మాటతో సరిపోదు సాక్షాత్తు కలియుగ దైవం  వెంకటేశ్వర స్వామి వారి దగ్గరే పత్రం రాయించుకున్నాడు. అలాగే ఆంజనేయస్వామి వారు ఇచ్చిన మాట మర్చిపోకూడదు అని తామ్ర పత్రం మీద రాసి తపస్సు చేసుకునే ప్రదేశంలో ఉంచి తన నగరానికి ప్రయాణమయ్యాడు

అప్పుడు స్వామి వారు చెప్పినట్టు ఆ వస్తువు హిమాలయాలలో దొరికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఆయన రక్షణలో ఉంది. ఇప్పుడు అలకాపురి నగరానికి చేరుకునే సమయం వచ్చింది అనుకుంటా.

ఈ ప్రయాణంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అంజనీ పుత్రుడు హనుమయ్య పటాపంచలు చేస్తాడు. శివగణాలు కూడా తోడుగా ఉంటాయి." అని వివరంగా చెప్పాడు నారాయణరావు.

అతను చెప్పిన కథ మొత్తం విని "అంటే! మరొక వస్తువు విభీషణుడి దగ్గర ఉందా..? ఆయన కుడా ఇంకా బ్రతికే ఉన్నారా..?" అని అడిగింది పూజా.

"కలికాలంలో కలిపురుషుడిని అంతం చేయడానికి ఆ నారాయణడు మరొక అవతారం ఎత్తుతాడు. అప్పుడు సప్త చిరంజీవులు అయిన అశ్వత్థామ, బలి, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు, వ్యాసుడు  ఆయనకి తోడుగా ఉండడానికి చిరంజీవులుగా వర ప్రసాదంతో జన్మించారు. కలికాలం పూర్తయ్యేంతవరకు వారు ఈ భూమి మీద ఉంటారు."  అని చెప్పాడు నారాయణ రావు.

"అంకుల్! వీళ్ళని ఇప్పటి వరకు ఎవరైనా చూశారా..?" అని అనుమానంగా అడిగింది దీప్తి.

"రామనామం ఎక్కడ జరుగుతుందో అక్కడకి హనుమంతుడు, విభీషుణుడు వస్తారు కానీ వారిని గుర్తించడం మన వల్ల కాదు." అని నవ్వుతూ చెప్పాడు నారాయణ రావు.

"నాన్నగారు! ఈ వస్తువును తీసుకుని మేము ఢిల్లీ వెళ్తున్నాము. ఇది ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుతుంది." అని చెప్పాడు యోధ.

"శుభం వెళ్ళిరండి, ఆ స్వామి ఇచ్చిన మాట నెరవేర్చుకోవడానికి ఆయనే మీకు తోడుగా ఉంటాడు." అని చెప్పాడు నారాయణ రావు.

ఆ వస్తువుని ముష్రుని తీసుకొని  అరవకొండ నుంచి ఢిల్లీ వెళ్లడానికి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కి బయలుదేరారు యోధ వాళ్ళు.

కార్ లో వెళుతూ "నిజంగా సప్త చిరంజీవులు ఉన్నారా..? వాళ్ళని మనం చూడాలంటే ఏం చేయాలి?" అని అడిగింది పూజా.

ఆ మాట విని వెనక్కి తిరిగి చూసి "హిమాలయాలకు వెళ్లి భక్తితో వెతికితే కనిపిస్తారు." అని చెప్పాడు యోధ.

"అలా అయితే మనం ఆ వస్తువుని తీసుకుని కైలాస పర్వతం దగ్గరకు వెళ్లి, కుబేరుడికి ఇద్దాము. అప్పుడు అందరూ కనపడతారు." అని ఉత్సాహంగా చెప్పింది పూజా.

"యోధ! నువ్వు చాలాసార్లు  హిమాలయాలకి  వెళ్లావు కదా నీకు ఎవరైనా కనిపించారా..?" అని అడిగింది దీప్తి.

"నేను వెళ్ళినప్పుడు నా దృష్టంత  శత్రువుల మీద ఉంది తప్పితే, స్వామిని చూడాలని ఎప్పుడూ అనుకోలేదు. ఒకవేళ ఈ వస్తువు మన చేతుల మీద గానే అలకాపురికి చేరాలని ఉంటే తప్పకుండా వారి దర్శనం అవుతుంది." అని చెప్పాడు యోధ.

**************

హిమాలయాలలో కైలాస పర్వతం దగ్గర తెల్లటి మంచు పర్వతాలు పక్కకి జరిగి, బంగారు వర్ణంలో ఉన్న కాంతి రూపంలో  బయటికి వచ్చి మామూలు మనిషిగా మారి ముందుకి నడుస్తూ,

"ప్రతి ఒక్కరికి నా నగరంలోకి ప్రవేశించాలని కోరిక, నా ధనం మీదే ఆశ! ఈ ఆపద నుండి గట్టిెక్కిస్తాను అని  త్రేతాయుగంలో  హనుమంతుడు నాకు మాట ఇచ్చాడు.

ఆ విషయం ఆయనకి గుర్తు ఉందో లేదో  వెళ్లి ఒకసారి గుర్తు చేయాలి, ఇప్పుడు ఈ పర్వతాలలో ఎక్కడ తపస్సు చేసుకుంటున్నడో ఏమిటో, ముందు ఆ పరమేశ్వరుడి దర్శనం చేసుకుని నంది సహాయం అడగాలి." అని ఆయాస పడుతూ ఎదురుగా ఉన్న బంగారు పర్వతం ఎక్కుతూ అనుకున్నాడు కుబేరుడు.

కైలాస పర్వతం మీద అటు ఇటు తిరుగుతూ "నేను కాపలాగా ఉన్నాను అని తెలిసి కూడా, ఇక్కడికి రావడానికి ప్రయత్నిస్తున్నాడు ఎంత ధైర్యం!" అని కోపంతో రంకెలు వేసుకుంటూ వేగంగా పొడవడానికి వెళ్ళాడు నంది.

తెల్లటి ఆకారం తన వైపుకి వేగంగా రావడం చూసి "నంది! ఆగు ఆగు నేను కుబేరుడిని, స్వామి వారి దర్శనానికి వస్తున్నాను." అని కంగారుగా చెప్పాడు కుబేరుడు.

ఆ మాట విని ఆగి మామూలు రూపంలోకి మారి "కుబేర నువ్వా!  బొజ్జ ఇంకా పెరిగింది కదా గుర్తుపట్టలేకపోయాను ఏంటి నీ దగ్గర ఉన్న ధనం సరిపోలేదా.? మళ్లీ స్వామిని అడగడానికి వస్తున్నావా..?" అని అడిగాడు నంది.

ఆయశపడుతూ అక్కడ ఉన్న రాయి మీద కూర్చుని "ఇది కలికాలం మానవులకు ఎంత ధనం ఉన్నా సరిపోదు ఇంకా కావాలి అంటున్నారు.

అప్పుడు రావణాసురుడు ఒక్కడు ఉండేవాడు. ఇప్పుడు అలాంటి వాళ్ళు వంద మంది ఉన్నారు, సరేగాని నీకోసం అరటి పండు తెచ్చాను తీసుకో  నేను ఒకసారి స్వామి వారిని కలిసి నా కష్టం చెప్పుకోవాలి." అని చెప్పాడు కుబేరుడు.

అరటిపండు తీసుకుని తింటూ "ఇప్పుడు స్వామిని కలవడం కుదరదు నీ విన్నపం ఏమిటో నాతో చెప్పు స్వామికి చేరవేస్తాను." అని చెప్పాడు నంది.

"నా అలకాపురి నగరం తలుపులు తెరిచి నా ధనాన్ని తస్కరించాలని మానవులు ప్రయత్నిస్తున్నారు. ఆ విషయం స్వామికి చెప్పి మళ్ళీ శివగణాలను తోడుగా పంపించమని అడగాలి." అని చెప్పాడు కుబేరుడు.

"ఆ విషయం స్వామి దాకా ఎందుకు నీకు కలికాలంలో సహాయం చేస్తానని హనుమంతుడు మాట ఇచ్చాడు కదా!" అని చెప్పాడు నంది.

"ఆ మాట వాస్తవమే కానీ, ఆయన ఇప్పుడు తపస్సులో ఉన్నాడు. నారాయణుడు అవతారం దాల్చిన తర్వాతే ఆయన  అక్కడ నుంచి బయటికి వస్తాడు. ఈ లోపు నేను అక్కడికి వెళ్లాను అనుకో తోకతో చుట్టి గిరాటు వేస్తాడేమోనని భయం!" అని చెప్పాడు కుబేరుడు.

"అది కూడా వాస్తవమే! దానికి ఒక మార్గం ఉంది హనుమంతుడు తో మాట్లాడగలిగిన వారు ఆయన స్నేహితుడు విభీషణుడు మాత్రమే. వెళ్లి సహాయం అడుగు తప్పకుండా చేస్తాడు." అని చెప్పాడు నంది.

"నేను ఆ విభీషణుడిని ఎక్కడని వెతకను. ఇప్పుడు లంకా రాజ్యం లేదు. ఆయన ఎక్కడ దొరుకుతాడో తెలీదు." అని చెప్పాడు కుబేరుడు.

"ఈ విషయంలో నేను నీకు సహాయం చేస్తాను. విభీషుణుడు ఇప్పటికీ శ్రీరంగంలో రాత్రివేళ స్వామివారి సేవించడానికి వస్తాడు. అక్కడికి వెళ్లి కలిసి నీ బాధ విన్నవించుకుంటే తప్పకుండా సహాయం చేస్తాడు." అని చెప్పాడు నంది.

"అవునా? పరమేశ్వరుడు నా నగరాన్ని కాపాడడానికి శివగణాలు తోడుగా ఉంటాయని సెలవిచ్చారు కాబట్టి నువ్వు నాకు తోడుగారా.. వెళ్లి విభీషణుని కలుద్దాము." అని అడిగాడు కుబేరుడు.

ఆ మాట విని కాసేపు ఆలోచించి "సరే పద! నాకు కూడా ఆడవిడుపుగా ఉంటుంది." అని చెప్పి వెనక్కి తిరిగి కైలాస పర్వతానికి నమస్కరించి కుబేరుడుతో పాటు శ్రీరంగం బయలుదేరాడు నంది.
[+] 8 users Like SivaSai's post
Like Reply
#53
రుద్రం భజే! ఎపిసోడ్ 18



స్వామివారి పాదాల దగ్గర ఉన్న వస్తువుని ముష్రుని తీసుకుని ఢిల్లీ వెళ్లడానికి హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కి బయలుదేరారు యోధ వాళ్ళు.

శ్రీరంగం గుడిలో రాత్రి సమయంలో స్వామివారిని పూజించడానికి వచ్చే విభీషుడిని కలవడానికి నంది తో కలిసి బయలుదేరాడు కుబేరుడు.

***************

హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకుని నాయక్ కి కాల్ చేసి "జైహింద్ సార్! మేము ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నాము ఫ్లైట్ 30 మినిట్స్ లేట్! ఢిల్లీ చేరుకునేసరికి నైట్ అవుతుంది." అని చెప్పాడు యోధ.

"ఓకే! మీరు ఫ్లైట్ దిగే టైమ్ కి అక్కడ ముగ్గురు ఏజెంట్లు రెడీగా ఉంటారు." అని చెప్పాడు నాయక్.

"సార్! కళింగ దగ్గర నుంచి ముష్రు కి మెసేజ్ వచ్చింది హవేలీ హోటల్ కి వెళ్లి ముస్తఫా ని కలవమని చెప్పాడు.
నాకు తెలిసి అతను ఐఎస్ఐ ఏజెంట్ అనుకుంటున్నాను.

మేము ఫ్లైట్ దిగిన వెంటనే ముష్రుని వాళ్ళు ఫాలో చేసే ఛాన్స్ ఉంది కాబట్టి మిలటరీ హెడ్ క్వార్టర్స్ కి రావడం కుదరదు డైరెక్ట్ గా హవేలీ హోటల్ కి వెళతాము." అని చెప్పాడు యోధ.

"ఓకే! మీరు ఆపోజిట్ హోటల్ లో స్టే చేయండి మన ఏజెంట్లు మిమ్మల్ని అక్కడే కలుస్తారు." అని చెప్పాడు నాయక్.

"సర్! వాళ్ళని గుర్తుపట్టడానికి కోడ్!" అని అడిగాడు యోధ.

"నీ ఫేవరెట్ కోడ్ ఉంది కదా జైశ్రీరామ్!" అని ఫోన్ పెట్టేసాడు నాయక్.

ఫ్లైట్ ఎక్కడానికి వెళుతూ దీప్తి వాళ్ళ వైపు చూసి "మనం ఢిల్లీలో దిగిన వెంటనే హవేలీ హోటల్  ఆపోజిట్ హోటల్ లో రూమ్స్ తీసుకుందాము." అని చెప్పి ముష్రు  వైపు చూసి

"నువ్వు హవేలీ హోటల్ కి వెళ్ళు తెలివితేటలు చూపించావో నా సంగతి తెలుసు కదా పాకిస్తాన్లో ఉన్న సరే వచ్చి చంపేస్తాను." అని చెప్పాడు యోధ.

"సార్! మిమ్మల్ని మోసం చేసి నేను వాళ్ళ దగ్గరికి వెళ్లిన ఆ వస్తువు నా దగ్గర లేదని తెలిస్తే చంపేస్తారు, మీరు నన్ను వదిలేసిన మిమ్మల్ని నేను వదలను." అని చెప్పాడు ముష్రు.

"అలకాపురి తరుపులు తెరిచే అంత పవర్ఫుల్ ఐటమ్ కి పేరేమీ లేదా? వస్తువు అంటుంటే బాలేదు." అని అడిగింది పూజా.

"నాకు కూడా పేరేమిటో తెలీదు మేడమ్!" అని చెప్పాడు ముష్రు.

"ఆ ఐటమ్ పేరు విభీషణుడికి మాత్రమే తెలియాలి ఎందుకంటే మరొక వస్తువు ఆయన దగ్గరే ఉంది కదా!" అని చెప్పింది దీప్తి.

"నాకు రాకెట్ లో స్పేస్ లోకి వెళ్లి దానికన్నా ఈ కేసు గురించి తెలుసుకుంటుంటే భలే మజా ఉంది. మనకి ఒక్క గాడ్ అయ్యినా కనపడితే బాగుండు." అని చెప్పింది పూజా.

"మేడం! కుబేరుడికి సంబంధించిన వస్తువు మన దగ్గర ఉంది కాబట్టి ఆయన కనబడితే బెటర్ మనకు కూడా లాభం ఉంటుంది." అని నవ్వుతూ చెప్పాడు ఏకవీర.

"అవునా? అయితే ఆయన కనబడినప్పుడు ఏమేమి అడగాలో లిస్ట్ రాసి ఉంచుకో!" అని నవ్వుతూ చెప్పింది పూజా.

"నిజంగా దేవుడు మన ఎదురుగా వచ్చి నుంచుంటే నోటి నుంచి ఒక్క మాట కూడా రాదు చూస్తూ ఉండిపోతాము." అని చెప్పింది నీతూ.

"మన ఎదురుగా వచ్చి నుంచుంటే ఆయన దేవుడు అని  మనం గుర్తుపట్టాలి కదా!" అని చెప్పింది దీప్తి.

"ఎందుకు గుర్తుపట్టము మనం ఆ దేవుళ్ళని రోజు చూస్తూనే ఉంటున్నాము కదా!" అని చెప్పింది పూజా.

ఆ మాటకి నవ్వుతూ "ఆ రోజుల్లో అందరూ అలా ఉండేవారు కాబట్టి అలా ఉన్నారు ఇప్పుడు మనం ఎలా ఉన్నామో దేవుళ్ళు కుడా అలాగే ఉంటారు ఏదైనా వాళ్ళు సృష్టించింది కదా!" అని చెప్పాడు యోధ.

"కరెక్టే! అలా ఐతే గుర్తుపట్టడం చాలా కష్టం!" అని చెప్పింది పూజా.

"సరే! ఫ్లైట్ అనౌన్స్ మెంట్ వస్తుంది పదండి వెళదాము మనకి ఆ దేవుడు కనిపించినప్పుడు సంగతి కదా అప్పుడు చూద్దాము." అని చెప్పింది నీతూ.

**************

హిమాలయాల దగ్గర్నుంచి అదృశ్య రూపంలో నంది తో కలిసి శ్రీరంగం గుడి దగ్గరికి వెళ్లి వెయిట్ చేస్తూ "గుడి కూడా కట్టేశారు ఈ విభీషుణుడు ఇంకెప్పుడు వస్తాడు. " అని అడిగాడు కుబేరుడు.

"కంగారు పడకు కుబేర! ఈ గుడిలో స్వామివారిని పూజించడానికి ప్రతిరోజు విభీషణుడు కచ్చితంగా వస్తాడు." అని చెప్పాడు నంది.

"రాత్రి సమయంలో లంక నగరం నుంచి ఆ మహా సముద్రాన్ని దాటి ఈ గుడిలో ఉన్న స్వామివారిని పూజించడానికి విభీషుణుడు ఎందుకు వస్తున్నాడు?" అని అనుమానంగా అడిగాడు కుబేరుడు.

శ్రీరాముల వారి పట్టాభిషేకం అయిన తర్వాత విభీషుణుడు  లంకకు బయలుదేరి వెళుతూ ఉండగా ఈ గుడిలో ఉన్న స్వామివారి విగ్రహం దొరికింది.

ఆ విగ్రహాన్ని లంకకు తీసుకుని వెళదాము అనుకుని కావేరి నది ఒడ్డున ఉంచాడు, కానీ ఆ స్వామి అక్కడి నుంచి కదలలేదు అందుకే అప్పటినుంచి ప్రతి రోజు పూజించడానికి ఇక్కడికి వస్తున్నాడు.

ఇది కలికాలం అవడం వల్ల అందరికీ కనపడకూడదు అందుకే రాత్రి సమయంలో వచ్చి పూజ చేసుకొని వెళుతున్నాడు. " అని చెప్పాడు నంది.

"అలా అయితే! ఈరోజు విభీషణుడు తప్పకుండా మనకి కలుస్తాడు." అని గుడి మెయిన్ గేట్ వైపు చూస్తూ "నంది! ఏదో తుమ్మెద గుడిలోకి వచ్చి గర్భగుడి వైపుకు వెళుతుంది చూడు." అని చెప్పాడు కుబేరుడు.

ఆ మాట విని చూస్తూ "అది తుమ్మెద కాదు విభీషణుడు సూక్ష్మ రూపంలో వస్తున్నాడు, ఆయన రాక్షసుడు నిజరూపం చూస్తే మనుషులు తట్టుకోలేరు." అని కుబేరుడుతో పాటు గర్భగుడిలోకి వెళ్ళాడు నంది.

గర్భగుడిలో స్వామి వారి ముందుకు వెళ్లి తన అసలు రూపం లోకి వచ్చి పూజ చేస్తున్న విభీషుణుడు  దగ్గరికి వెళ్లి స్వర్ణ లంక మహారాజుకి వందనాలు." అని చెప్పాడు కుబేరుడు.

ఆ మాట విని స్వామి వారి పాదాల ముందు పూలు ఉంచి నమస్కరించి కళ్ళు తెరిచి తల పక్కకి తిప్పి చూసి "కుబేర, నంది! ఏమిటి ఈ సమయంలో మీరు కూడా స్వామివారి దర్శనానికి వచ్చారా..?" అని అడిగాడు విభీషణుడు.

"విషయం అది కాదు విభీషణ! నా అలకాపురి నగరం తలుపులు తెరిచే శక్తివంతమైన వస్తువు ఒకటి మీ దగ్గర ఉంది కదా మరొకటి హిమాలయాలలో ఉంది.

అది ఈ కలికాలంలో మానవుల చేతికి వెళుతుంది అని చెప్పాను నీకు గుర్తు ఉందా? ఆ సమయం రానే వచ్చింది." అని చెప్పాడు కుబేరుడు.

ఆ మాట విని కాసేపు ఆలోచించి "మా అన్న రావణుడికి బ్రహ్మ దేవుడు ప్రసాదించిన ఆకర్షణ పద్మాలు, అందులో ఒకటి నా దగ్గర భద్రంగా ఉంది. మరోటి నీ దగ్గరికి చేరుస్తానని హనుమంతుడు మాట ఇచ్చాడు కదా!" అని చెప్పాడు విభీషణుడు.

"ఇది కలికాలం మనం అనుకున్నట్లు జరగదు అసలు ఈ విషయం హనుమంతుడికి గుర్తుందో లేదో నా నగరం తలుపులు తెరవాలని చాలామంది ఎదురుచూస్తున్నారు ఆదే జరిగిందో నా పరిస్థితి ఏమిటి ఒక్కసారి ఆలోచించు,

అందుకే తపస్సులో ఉన్న హనుమంతుడి దగ్గరికి నీ సాయంతో వెళ్లాలి అనుకుంటున్నాను." అని చెప్పాడు కుబేరుడు.

ఆ మాటకి నవ్వుతూ "హనుమంతుడు తపస్సులో ఉన్న ఇచ్చిన మాట కోసం తన ఆత్మ శక్తి ఎప్పుడో బయలుదేరి ఉంటుంది ఇంతకీ ఇప్పుడు ఆ పద్మం ఎవరి దగ్గర ఉంది?" అని అడిగాడు విభీషణుడు.

"యోధ అని ఒక సైనికుడు మంచి వ్యక్తి దగ్గరే ఉంది కానీ అతను చుట్టూ ప్రమాదం కమ్ముకుని ఉంది. మనం కూడా వెళ్లి కాస్త సహాయం చేస్తే కుబేరుడు ప్రశాంతంగా ఉంటాడు ఈ లోకం కూడా ప్రశాంతంగా ఉంటుంది." అని చెప్పాడు నంది.

"విభీషణ! ఈ పనిలో నువ్వు నాకు సహాయం చేయాల్సిందే!" అని అడిగాడు కుబేరుడు.

"సరే! కైలాసంలో ఉండే నందినే తీసుకొచ్చావు నన్ను వదులుతావా..? మనం ఈ రూపాలలో కాదు వేషం, భాష అని మారిపోవాలి ఆ పద్మాన్ని నీ లోకానికి తీసుకు రాగలిగే  శక్తీ ఉన్న మానవుడికి మనం మార్గం మాత్రమే చూపాలి అతని చేతులు మీదుగానే ఆ పద్మం నీ దగ్గరికి చేరాలి బాగా గుర్తుంచుకోండి." అని చెప్పాడు విభీషణుడు.

"ఆ విషయం నాకు తెలుసు! ఇది కలికాలం మానవులకి మనం మార్గం మాత్రమే చూపించగలము ప్రయత్నం వాళ్లే చేయాలి." అని చెప్పాడు కుబేరుడు.

"హనుమంతుడు ఈ కార్యానికి ఏ మానవుడిని ఎంచుకున్నాడో మనకి ఎలా తెలుస్తుంది?" అని అడిగాడు నంది.

"ఆ విషయం నేను చూసుకుంటాను." అని చెప్పి స్వామివారికి నమస్కరించి "ఇంక ఆ పద్మం ఉన్న చోటికి  బయలుదేరుదామా?" అని అడిగాడు విభీషణుడు.

"సరే!" అని స్వామివారికి నమస్కరించి అక్కడ నుంచి గుడి బయటకు వచ్చి "ఆ బ్రహ్మ ఈ పద్మాలను రావణాసురుడికి ఇచ్చాడు  ఆయన మరణించాడు కదా అయ్యినా ఈ పరీక్ష మళ్ళీ నాకు ఎందుకు పెట్టాడు?" అని అడిగాడు కుబేరుడు.

"ప్రతి దానికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కలిపురుషుడు మానవులతో చేయించే ప్రయత్నాలు ఆపడానికి ఆ భగవంతుడు ఇలాంటి పరీక్షలు పెడతాడు." అని చెప్పాడు నంది.

"మనం ఇప్పుడు యోధ దగ్గరికి ఆఫీసర్లు లాగా వెళ్లాలి మానవ రూపంలోకి మారండి." అని చెప్పి ఢిల్లీ లో హోటల్ దగ్గరికి తీసుకువెళ్లాడు విభీషణుడు.

"మనం ఆ ఆఫీసర్స్  ప్లేస్లోకి వచ్చాము మరి వాళ్ల సంగతి ఏమిటి?" అని అడిగాడు నంది.

"మన పని పూర్తి అయ్యే వరకు వాళ్లు నా లంక నగరంలో నిద్రపోతూ ఉంటారు." అని చెప్పాడు విభీషణుడు.

అక్కడ ఉన్న జనాలను చూసి "నేను ఇచ్చిన డబ్బుని ఇలా తగలేస్తున్నారు ఏంటి?" అని చుట్టూ చూస్తూ అడిగాడు కుబేరుడు.

"ఇది కలికాలం కుబేర  ఇలాంటి ఘోరాలు ముందు ముందు చాలా చూడాలి, యోధ అతని మనుషులు హోటల్ దగ్గరికి వస్తున్నారు అనుమానం రాకుండా జాగ్రత్తగా మాట్లాడండి." అని చెప్పి యోధ దగ్గరికి వెళ్లి "జైశ్రీరామ్!" అని చెప్పాడు విభీషణుడు.

ఆ కోడ్ విని "సార్ పంపించిన ఆఫీసర్స్ మీ ముగ్గురేనా?  పేర్లు ఏమిటి?" అని అడిగాడు యోధ.

"నా పేరు భూషణ్ అని చెప్పాడు విభీషణుడు, నా పేరు నంద అని చెప్పాడు నంది, నా పేరు క్యూబ్ అని చెప్పాడు కుబేరుడు.

"గుడ్! మీరు ఆ రెస్టారెంట్లో వెయిట్ చేయండి నేను పది నిమిషాల్లో నా టీమ్ తో కలిసి వస్తాను." అని చెప్పి హోటల్ లోపలికి వెళ్ళాడు యోధ.

హోటల్ లోపలికి వెళ్తున్న యోధ వైపు చూసి "ఆ ఆకర్షణ పద్మం అతని చేతిలో ఉన్న బ్యాగ్ లో ఉంది." అని చెప్పాడు కుబేరుడు.



" రుద్రం భజే! ఎపిసోడ్ 18 " రచనకు రేటింగ్ ఇవ్వండి.......................
[+] 12 users Like SivaSai's post
Like Reply
#54
Kuberuni story chala realistic ga chepparu.
Khachitanga.. puranalu konchemaina telisi undali writer gariki!!
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
#55
Excellent update with deep knowledge
[+] 1 user Likes Sunny73's post
Like Reply
#56
Story super ga undhi
Ilage konasgimchandi
[+] 1 user Likes Ajayu2's post
Like Reply
#57
Excellent updates
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
#58
waiting for next update
[+] 1 user Likes vikas123's post
Like Reply
#59
Hello siva garu today update istara
[+] 1 user Likes Ajayu2's post
Like Reply
#60
(04-05-2026, 10:09 AM)Ajayu2 Wrote: Hello siva garu today update istara

Update in  10 mins
Like Reply




Users browsing this thread: 1 Guest(s)