29-04-2026, 12:47 PM
Nice update super
|
పాణిగ్రహణం
|
|
30-04-2026, 09:05 AM
Supero super.. healthy family comedy ..hats off siva garu.. waiting for next episodes..
30-04-2026, 10:08 AM
E Roju Ma Village Lo Festival So Signal's Levu afternoon 1:00 P.M Lopu Update Istanu
30-04-2026, 11:12 AM
Part - 90
సౌమ్య... శ్రీకర్ ని కొరకొరా చూసి వెళ్ళిపోతుంది. అబ్బా అలకలే తెలియని నా బుజ్జి పప్పీ ప్రేమలో పడిన దగ్గరనుంచి అలకల మీద అలకలు చూపిస్తుంది.
దేవుడా.. ఆడవాళ్ళకి ప్రేమలో పడేటప్పటికీ అలకలు ఎక్కువ అవుతాయి... ఓపిక లేని మగవాళ్ళకి బుజ్జగించడం వస్తుంది అంటే ఏదో అనుకున్నాను కానీ మా ఇద్దరినీ చూస్తుంటే అదే అని అర్థమవుతుంది. ఇప్పుడు ఎలా బుజ్జగించాలి గదిలోకి వెళ్ళిన సౌమ్య ని చూస్తూ వెళ్లబోతూ ఉంటే... భరత్ ఎక్కడికి రా.. నువ్వు పెట్టిన మంటకి నీ కూతురు అలిగి కూర్చుంది. బుజ్జగించుకోవాలి కదా.. ఆ బుజ్జగింపులు అన్ని బయట. గదిలోకి వెళ్ళావంటే కాళ్ళు ఇరగ్గకొడతాను. మరి దాన్ని బయటికి రమ్మని చెప్పు మావయ్య..అది నేను ఎలా చెబుతాను రా.. పక్కనే కూర్చుని ఎందుకు చెప్పలేవు. ఇది నీ కూతురు లైఫ్ కి సంబంధించింది కదా.. చిన్న కరెక్షన్ రా. కాబోయే అల్లుడు లైఫ్ కి సంబంధించింది. అర్థం కాలేదు మావయ్య.. ఒరేయ్ ఇప్పుడు ఎవ్వడు ఎవరిని బ్రతిమాలడానికి చూస్తున్నారు. నేను సౌమ్యని అని... ఇది నువ్వు కావాలనే పెట్టావు కదా... ఎస్.. ఎందుకు మావయ్య అలా చేసావు. అసలు అలకలే తెలియని.. నా బుజ్జి పప్పీ ఎలా అలుగుతుందో తెలుసా.. నీ తోకేదో అన్నాడు కదురా.. ఎలా హ్యాండిల్ చేస్తామో చూడాలి అని. అలాగే మీరు మా అమ్మాయిలని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో అన్నది మాకు తెలియాలి కదా.. శ్రీకర్ నెత్తి మీద చేతులు వేసుకుని కూర్చుంటాడు. అల్లుడు ఢమాల్ మావగారు రాక్.. సూర్య విక్రమ్ దగ్గరికి వెళ్లి నాన్న అని పిలుస్తాడు. ఏంట్రా.. రా.. ఈరోజు.. క్యూటి తో నేను చేతితోనే బైక్ డ్రైవ్ చేస్తున్నట్టుగా చూపిస్తాడు. అప్పుడే ఫస్ట్ డేటింగ్ మొదలైంది అన్నమాట.. చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. నాన్న ఏమన్నా టిప్స్ చెప్పచ్చు కదా.. ఒరేయ్ ప్రేమలో ఎవరిని సలహాలు అడగకూడదు. నీ మనసుకి ఆ నిమిషం ఎలా అనిపిస్తే అలా ఫాలోఅయ్యిపో.. అలానే అడ్వాన్స్ అవ్వకు. ఎప్పుడు అందం అప్పుడే.. విక్రమ్ ని హాగ్ చేసుకుని.. నువ్వు బెస్ట్ నాన్నవి. పొగిడింది చాలు కానీ.. అన్ని అరేంజ్మెంట్స్ చేసేసాను. జాగ్రత్తగా వెళ్లి రండి. థాంక్యూ అని ముద్దుపెడితే.. మీ అమ్మకి చెప్పరోయ్.. లేకపోతే మనిద్దరం ఏదో గుడుపుఠాణి చేసేసాము అని రాత్రంతా ముక్కు చీదుతూ ఉంటుంది. ఆ మాటకి నవ్వుతూ అమ్మని మాత్రం భలే హ్యాండిల్ చేస్తారు నాన్న. ఎంత అలిగిన వెంటనే కూల్ అయిపోతుంది. అక్కడ సోఫాలో కూర్చుంటూ.. మీ అమ్మది చిన్నపిల్లల మనస్తత్వం. పెళ్ళికి ముందు తన కోరికలు ఏమీ తీరలేదు. బిక్కుబిక్కు మంటూ బ్రతికింది. ఒక పక్కన తనని తాను కాపాడుకోవడం.. స్టడీస్.. సెల్ఫ్ రెస్పెక్ట్ వదలకుండా బతకడం అంటే ఒక ఆడపిల్లకి మాటలు కాదు. మనసులో బాధ చెప్పుకోవడానికి తోడు లేకపోతే అది ఇంకా నరకం. మీ అమ్మ ప్రతిదీ ధైర్యంగా ఎదుర్కొంది. మా పెళ్లి జరిగిన విధానం తెలుసు కదా.. ఒక్కరోజులోనే తను నన్ను పూర్తిగా నమ్మింది.. నేను వస్తాను తన చెయ్యి పట్టుకుంటాను అని నమ్మకంతో ఉంది. ఆ నమ్మకమే మీ అమ్మ నా ప్రాణమైపోయింది. ఏరోజు కూడా తన తండ్రిని ద్వేషించలేదు. విరక్తితో అతనికి దూరంగా జరిగింది.. మీ తాతయ్య కూడా నిజ నిజాలు తెలుసుకోకుండా అవని కి దూరంగా ఉన్నారు. మీ తాతయ్య తెలుసుకునేటప్పటికి తన లైఫ్లో చాలా మిస్ అయిపోయింది. అందుకే మీ అమ్మ అలిగిన.. మారం చేసినా.. ఏది చేసినా సరే.. ఒక చిన్న పిల్లని హ్యాండిల్ చేసినట్టే చేస్తాను. మీ అమ్మ అలకలైన చిరుబురులైన నా దగ్గర మాత్రమే. ఇంకెవరి దగ్గర చూపించదు. ఎందుకో తెలుసా.. ఏ లైఫ్ పార్టనర్ కైనా అర్థం చేసుకునే లైఫ్ పార్ట్నర్ ఉంటే.. వాళ్లే పిల్లలు అవుతారు. తల్లి అవుతారు. తండ్రి, స్నేహితుడు అన్ని రిలేషన్స్ వాళ్ళలోనే ఉంటాయి. అందుకే బయట వెతుక్కోవలసిన అవసరం ఉండదు. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. భార్యలకి చీరలు కొనిచ్చి కూల్ చేస్తే సరిపోతుంది. నగలు తెచ్చిస్తే సరిపోతుంది. ఏది కొన్న వీళ్ళకి తృప్తి ఉండదు అని కామెంట్స్ చేస్తారు.. బట్ రియాలిటీ ఏమిటో తెలుసా.. మాట. సూర్య చూస్తూ ఉంటే అర్థం కాలేదు కదా.. లేదు అన్నట్టుగా తల ఊపితే.. అలసిపోయి ఉన్నప్పుడు ఏరా ఈరోజు పని ఎక్కువయిందా రెస్ట్ తీసుకోపోయావా అని అడుగుతూ.. కాళ్లు పట్టడంలో తప్పులేదు. బయట నుంచి మనం వచ్చేటప్పటికి ఎదురుగా వాళ్ళు ఉండాలని ఎలా కోరుకుంటామో.. వాళ్ళ చిన్న చిన్న ఆనందాలు కూడా మనతో షేర్ చేసుకోవాలని వాళ్ళు ఎదురుచూస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, బిజినెస్, మీ పార్టీ స్ అని టైమ్ స్పెండ్ చేస్తాము. జస్ట్ ఆ టైంలో ఒక్క ఆఫెన్ అవర్ వాళ్ళకి ఇస్తే చాలు. ప్రపంచంలో ఉన్న సంతోషం మొత్తం మన ముందు ఉంచుతారు. ప్రతిరోజు చేసే వంట అయినా సరే సూపర్ ఉంది అంటే చాలు.. వాళ్ళ మొఖాలు వెలిగిపోతాయి. అది నువ్వు హార్ట్ ఫుల్ గానే చెప్పాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏమిటో తెలుసా.. బాగున్న రోజున చెప్పేది ఏముందిలే అనుకుని ఏరోజైతే బాగోదో ఆ రోజే చెబుతారు. అంటే పెళ్ళాలో ప్రెస్టేషన్ క్యారెక్టర్ బయటకు వచ్చేస్తుంది. వాళ్లు తినేటప్పుడు తెలియదా బాగుందో లేదో.. మనం బాగుంది అని చెప్పాము అంటే బాగోపోయిన బాగుంది అన్నారు నేను బాధపడకూడదు అనే కదా.. రేపటి నుంచి ఇంకా జాగ్రత్తగా చేయాలి అని ఆలోచిస్తారు. మనం చేయాల్సిన అంత చిన్న చిన్న మాటలే రా.. అది చాలు కుటుంబం సంతోషంగా వెళ్లిపోతుంది. మన సంసారం హాయిగా ఉంటుంది. సూర్య తండ్రిని అబ్బురంగా చూస్తూ.. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు. విక్రమ్ నవ్వుతూ జీవితమే అన్నీ నేర్పిస్తుంది.. ప్రతిదీ పుస్తకాల్లో ఉండవు. యూనివర్సిటీస్ చెప్పవు. కుటుంబం నేర్పిస్తుంది. నువ్వు రోజు వెనకాలే తిరుగుతూ ఇలా చేయి ఇలా చేయి అంటే ఎవరికైనా విసుగొస్తుంది. అదే నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు అనుకో నిన్ను చూసి ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. మా తాతగారిని చూసి మా నాన్నగారు... మా నాన్నగారిని చూసి మేము అంతే.. నా నుంచి నువ్వు నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకోవాలి అంటే నేను కరెక్ట్ గా ఉండాలి. నేను కరెక్ట్ గా లేకుండా నువ్వు అలా ఉండు.. ఇలా ఉండు.. అని చెప్పితే అర్థమే లేదు. తండ్రిని చూసి బయట ప్రపంచం లో కొడుకు నేర్చుకుంటాడు. తల్లిని చూసి కూతురు ఇంటిలో నేర్చుకుంటుంది. నువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసావో లేదో కానీ మీ అత్తయ్య అయినా.. పిన్నులైనా ఎవరైనా సరే... సరదాగా ఇంట్లో భర్తల్ని ఏడిపిస్తూ గొడవ గొడవ చేస్తారు కానీ బయట ఎక్కడ తగ్గనివ్వరు. అందుకే మేమందరం వాళ్లకి అలా సరెండర్ అయిపోతుంది. లేకపోతే మీ నివి అత్త గోలకి కి మీ రాజ్ మావయ్య ఎప్పుడో అని నవ్వుతాడు. సూర్య కూడా ఆ నవ్వులో శృతి కలిపి థాంక్యూ నాన్న. మీతో ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే ఉంటాను. సరే నాకు టైం అవుతుంది. క్యూటి వెయిట్ చేస్తూ ఉంటుంది అని అమ్మ అరుస్తూ వెళ్తాడు. కిచెన్ లో ఉన్న అవని ఎందుకురా అలా అరుస్తున్నావు. మెడ చుట్టూ చేతులు వేసి.. నీ కోడలతో కలిసి బైక్ మీద టుడేస్ ట్రిప్ కి వెళుతున్నాను. గరిటి పుచ్చుకొని వెనక్కి తిరుగుతుంది. ఎందుకు అమ్మ అలా చూస్తున్నావు. ఎక్కడికి రా పెళ్లికి ముందు తిరిగేది. అయ్యో అమ్మ.. మేము వెళ్ళేది అన్నవరం. నీ కోడలికి ప్రతిదీ సెంటిమెంటే. మన కంపెనీతో తన ప్రాజెక్ట్ ఓకే అయింది కదా.. అన్నవరం వెళ్ళాలి అని తన కోరిక. ఎప్పుడూ వాళ్ళ నాన్నగారు ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి కదా. ఒక్కతే వెళ్లడానికి భయపడుతుంది. మొహమాటపడుతుంది. అది అర్థం చేసుకుని నేనే ఒక అడుగు ముందుకు వేశాను. తప్పా అమ్మ నీ కోడలు కోరిక తీర్చడం. ఫేస్ అమాయకంగా పెట్టి అడుగుతాడు. వెంటనే గరిట పక్కన పెట్టి.. తప్పు లేదురా తీసుకువెళ్ళు. కానీ జాగ్రత్త. అమ్మాయి ఏమి ఇబ్బంది పడకుండా చూడు. సరేనా. అందుకే అమ్మ నువ్వంటే నాకంత ఇష్టం. పరిస్థితిని చక్కగా అర్థం చేసుకుంటావు అని బుగ్గన ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు. వెళుతున్న కొడుకుని చూసి నవ్వుకుంటుంది. సూర్య రెడీ అయ్యి బ్యాగ్ తో కిందకి వచ్చి.. రాయల్ ఎంఫిల్డ్ క్లాసిక్ 350 తీస్తాడు . అది చూసి నవ్వుకుంటూ ఈరోజు నా క్యూటి నోరు వదిలేస్తుంది. రోజు నార్మల్ బైక్ లో వచ్చి ఈరోజు ఈ బైక్ ఏమిటా అని కూడా అడుగుతుంది. వైభవ్ చూస్తూ ఉంటాడు. ఏంట్రా ఆ చూపు.. నువ్వు మాత్రం మా బాబితో రయ్.. రయ్..అని వెళ్ళిపోతున్నావు. కానీ నేనే... మేము వచ్చేటప్పటికి సెట్ చేసుకో. మూడు జంటలు కలిసి ఇంకో ట్రిప్ వేయవచ్చు. బాయ్ అని బైక్ ని ముందుకి దూకిస్తాడు. చలో హైదరాబాద్ టు వైజాగ్ ?️?️...
30-04-2026, 11:14 AM
Part - 91
విశి బ్యాగ్ సర్దుకొని రెడీ అయ్యి సూర్య కోసం చూస్తూ ఉంటుంది. అబ్బాయిని ఎక్కువ ఇబ్బంది పెట్టకు. నీ మనసులో మాట క్లియర్గా చెప్పు.
అమ్మ భయం వేస్తుంది. ప్రేమ ఉన్నచోట భయమే ఉంటుంది. కానీ భయపడుతూ ఉంటే ప్రేమ ఎలా గెలుస్తుంది. నేను చెప్పిన తర్వాత సార్ నో అంటే... అంటారని నువ్వు అనుకుంటున్నావా. అనరు కానీ... నీ మీద ఒక సింపతితోనే ఇవన్నీ చేశాను అంటే తట్టుకోలేను అమ్మ. నీకు నువ్వే ఏదో ఊహించేసుకుని మీ దేవా సార్ ప్రేమని అనుమానించకు. మీ దేవా సార్ కి కూడా నువ్వంటే ప్రేమే. నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో మీ సార్ కూడా అలాగే ఆలోచించవచ్చు. ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యి. నేహా గుమ్మం దగ్గరే ఉంటుంది. రా నేహా అని భానుమతి పిలిస్తే.. విన్నాను. అమ్మ చెప్పింది నిజమే. దేవా కీ నువ్వంటే చాలా ఇష్టం. ఈ ట్రిప్ నుంచి వచ్చేలోపు ఇద్దరు మనస్సులు విప్పుకొని మాట్లాడుకుని మా ముందుకు శుభవార్తతో రండి. మేము పెళ్లి ముహూర్తాలతో సిద్ధంగా ఉంటాము. ఆంటీ అని సిగ్గుపడితే ఇలా సిగ్గుపడుతూ ఉంటే కష్టం. భాను మీరు మిగిలిన పనులు చూసుకోండి. విశి కి నేను కొన్ని టిప్స్ చెప్తాను. సరే అని భానుమతి అక్కడ నుంచి వెళుతుంది. భానుమతి వెళ్లిన వెంటనే, నేహా తలుపు మూసి విశి దగ్గరకి వచ్చి రెండు చేతులు నడుముపై పెట్టుకుని.. ఎలా చెబుతానో అని టెన్షన్ పడుతున్నావు కానీ, డైలాగ్ కంటే ఫీలింగ్ ముఖ్యం. నీ కళ్లే హాఫ్ వర్క్ చేస్తాయి. నాకు చెప్పే టైంలో వోయిస్ కంపించేస్తుంది ఏమో అని భయం వేస్తుంది ఆంటీ. ఆ కంపించడం అందంగా ఉంటుంది. పాపం.. అబ్బాయిలు నిజమైన భావాలు ఉన్నప్పుడు వచ్చే ఆ చిన్న వణుకు చూసి మరీ మెదిలిపోతారు. కానీ… నువ్వు మాత్రం కనీసం ఇలా మూడు పాయింట్లు ఫాలో అవ్వాలి. క్యూట్, సింపుల్, వర్కౌట్ అయ్యే టిప్స్. ఏమిటి అర్థం కాలేదా సరే అయితే క్లియర్ గా చెబుతాను విను.. మొదటే ‘ఐ లవ్ యు ’ బాంబు వెయ్యకు. మొదట ఇలా చెప్పు... సార్ మీతో మాట్లాడాలి… ప్లీజ్ నేను చెప్పేది మనసుపెట్టి వినండి. ఇలా నువ్వు సీరియస్‌గా చెప్తే వాళ్ల అటెన్షన్ నీ మీద ఫిక్స్ అయిపోతుంది. నీ గురించి నీకు పూర్తిగా తెలుసు.. నేహా విశి చిన్‌కి చిన్నగా తట్టి... నువ్వు అందంగా ఉన్నావ్… ఇంటెలిజెంట్… లవింగ్… ఇవన్నీ దేవా కి తెలిసే ఉన్నాయి. కాబట్టి నా మాట వినాలి సార్… ఈ విషయం మీకు చెప్పడానికి నేను భయపడుతున్నాను కానీ చెప్పాలి అని నిజాయితీగా చెప్పు. నిజాయితీకి ఎవరు తల ఒగ్గరు చెప్పు.. క్లైమాక్స్ సింపుల్‌గా, నీ స్టైల్లో.. అంతా చెప్పాక, ఒక చిన్న రోస్ తీసుకో… అప్పుడే నువ్వు ఇలా చెప్పు.. నన్ను మీరు.. ప్రేమగా చూస్తారు అనిపిస్తుంది. మీ మాటల్లో మీ చూపుల్లో నా పైన ప్రేమే కనపడుతుంది. అదే నిజం అని నామనసు చెబుతుంది అని ఇంకా నీకు ఏమేమి అనిపిస్తుందో అదే ఆ ఫ్లోలో చెప్పేసేయ్. అంతే. ఆంటీ అని సిగ్గు పడితే.. హ.. ఇలా సిగ్గుపడు. ఇలా సిగ్గుగా, సాఫ్ట్‌గా చెప్తే దేవా కరిగిపోతాడు. నేహా చెప్పింది వినేసరికి విశి చెవుల వరకూ ఎర్రబడిపోతుంది. విశి చిన్నగా … ఇలా మాట్లాడగలనా నేను.. నేహా.. చిన్నగా జుట్టు సరిచేస్తూ... తప్పకుండా మాట్లాడగలవు. ప్రేమ నీది.. భయం నీది. అలాగే దేవా కూడా నీ వాడే.. మరి… దేవా సార్ నిన్ను చూసే చూపు… నేను పది సార్లు గమనించాను. ఆ చూపు ప్రేమ లేకుంటే రాదు. కాబట్టి నీ పని ఒక్కటే.. భయంతో పాటు ధైర్యాన్ని కూడా తీసుకెళ్లు. విశి లోతుగా ఊపిరి తీసుకుంటుంది. థాంక్స్ ఆంటీ అని హాగ్ చేసుకుంటుంది. పిచ్చి పిల్ల.. ఈ ట్రిప్ నుంచి వచ్చేసరికి… నీ చీక్స్ మీద ఈ సిగ్గు, నీ కళ్లలో ఈ వణుకు, నీ పెదవుల మీద ఆ చిన్న నవ్వు అన్నీ సార్‌కే చెప్పి వస్తాయి. నువ్వు ఒక్క ‘స్టార్ట్’ చేయ్… ఆ తర్వాత దేవా హ్యాండిల్ చేసుకుంటాడు. విశి గమ్మత్తుగా నవ్వుకుంటుంది. బ్యాగ్ మూసి పట్టుకునే టైంలో… చేతులు ఇంకా కొంచెం వణుకుతూనే ఉంటాయి. భానుమతి గది దగ్గరకు వచ్చి మీ దేవా సార్ వచ్చారు. హా వస్తున్న అని గదిలో నుంచి బయటికి వస్తుంది. దేవా అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే.. వెళ్ళొస్తాము అంటీ.. విశిని జాగ్రత్తగా తీసుకువెళ్లి తీసుకువచ్చే బాధ్యత నాది.. వెళదామా. సరే అని తల్లి వైపు చూస్తోంది. కళ్ళతోనే ధైర్యం చెబితే.. నేహా ఆల్ ద బెస్ట్ అని హాండ్స్ తో చూపిస్తుంది. బైక్ దగ్గరికి వచ్చి చూస్తూ నిలబడిపోతుంది. ఏంటి అలా చూస్తున్నావు. మీరు రోజు వచ్చేది దీనిమీద కాదు కదా..ఆ బైక్ మీద అంత దూరం జర్నీ చేయగలమా.. డ్రైవింగ్ కష్టమే వెనక కూర్చునే నీకు కష్టమే. ఇది అయితే కంఫర్ట్ గా ఉంటుంది. లగేజ్ కూడా ఇబ్బంది లేకుండా పెట్టుకోవచ్చు. లగేజ్ వెనకాల గట్టిగా కట్టి బైక్ స్టార్ట్ చేస్తాడు. విశి ఒక పక్కకి కూర్చోబోతు ఉంటే.. హలో మేడం మనమేమి కాలేజీకి వెళ్లడం లేదు. టూ సైడ్స్ కి కూర్చో ఇబ్బంది లేకుండా ఉంటుంది. విశి ఆలోచిస్తూ ఉంటే సూర్య బైక్ రైస్ చేస్తూ ఉంటాడు. సరే అని టూ సైడ్స్ కి కూర్చుని వెనక హ్యాండిల్ పట్టుకుంటుంది. ఇద్దరూ బైక్ మీద వెళుతూ సిగ్నల్ దగ్గర ఆగుతారు. సూర్య ఏదో చెబుతూ ఉంటే విశి నవ్వుతూ ఉంటుంది. ఆపోజిట్ లో వెళుతున్న గౌతమ్ వీళ్లిద్దరినీ చూస్తాడు. బైకు, లగేజ్ చూస్తూ ఉంటే ఇద్దరూ ఎక్కడికో వెళుతున్నట్టున్నారు. నేను చెయ్యి పట్టుకోవాలని చూసినా టచ్ మీ నాట్ అన్నట్టు ఉండేది. వీడితో మాత్రం ఇకఇకలు.. పకపకలు. చూస్తాను ఎంత దూరం వెళతావో అని సిగ్నల్ పడగానే కార్ స్టార్ట్ చేస్తాడు. శ్రీకర్ సౌమ్యని బ్రతిమాలికొనే ప్రోగ్రాంలో ఉంటాడు. బుజ్జి తలుపు తీయవే.. నా బుజ్జి పప్పీవి కదు.. నా బంగారం కదు. కొంచెం తలుపు తీసి.. అయ్యో సార్ మీ మీద అంటే నమ్మకం ఉంటుంది. మళ్లీ నాతో తిరిగితే ఆ నమ్మకం ఏమైపోవాలి చెప్పు. అందుకే పెళ్లి అయ్యే వరకు నువ్వు నువ్వే.. నేను నేనే అని మళ్ళీ తలుపు వేస్తుంది. ఏదో సరదాగా అన్నాను నీ గురించి నాకు తెలియదా.. మావయ్యకి నీ మీద పూర్తిగా నమ్మకం ఉంది కదా.. అలాగే నన్ను నమ్మాలని అలా చెప్పాను అంతే. కావాలంటే మావయ్యని అడుగు అని ఏం మావయ్య అంతే కదా అని రిక్వెస్టింగ్ గా చూస్తాడు. భరత్... విద్యా అని పిలిస్తే.. చెప్పండి అంటుంది. నాకు మంచి స్వీట్ చేసి తీసుకుని రా.. ఈ ఆనంద సమయంలో స్వీట్ ఎంజాయ్ చేయాలి. మావయ్య అని ఏడుపు మొఖంతో పిలుస్తాడు. ఏంట్రా.. నువ్వు చెబితే వింటుంది. ఒరేయ్ మనుషుల మధ్యన, బిజినెస్ లో రాయబారాలు ఉండొచ్చు గాని ప్రేమలో అస్సలు రాయబారం ఉండకూడదు. ఈరోజు నువ్వు నా కూతుర్ని ఎలా కన్విన్స్ చేస్తావో చూస్తాను. నా కూతురు కన్విన్స్ అయ్యి బయటకు వచ్చి నిన్ను గనక ఎక్స్క్యూజ్ చేస్తే.. బంపర్ ఆఫర్. ఏంటి మావయ్య... ఆఫర్ ఏమిటో చెప్పు. దాన్ని బట్టి నేను ప్లాన్ చేస్తాను. చెబితే ఇక్కడే పడిపోతావేమో.. పడిపోతే పట్టుకోవడానికి నువ్వు ఉన్నావు కదా. చెప్పు అని మోకాళ్ళ మీద కూర్చుని అడుగుతాడు. సూర్య వెళ్లినట్టే.. మిమ్మల్ని పంపిస్తాను. నిజంగా మావయ్య అని కళ్ళల్లో మెరుపులు కురిపిస్తూ అడుగుతాడు. నేను ఎప్పుడైనా మాట తప్పానా.. అయితే చూసుకోండి మావయ్య. ఒక్క అరగంటలో నీ కూతురు బయటకి వస్తుంది. అది చూస్తాను అని అక్కడే కూర్చుంటాడు. మీరు ఇక్కడే కూర్చుంటే సౌమ్య ఎలా బయటకు వస్తుంది. అది నీ ప్రాబ్లం నాది కాదు. ఇదే మరి.. ఎదురుగా తీపి పెట్టి తిను అని దాని చుట్టూ కాపలాగా కుక్కని పెట్టినట్టు ఉంది. ఒరేయ్ నన్ను కుక్క అంటావా.. ఛీ.. ఛీ.. మిమ్మల్ని కాదు మావయ్య అలాగుంది అని చెబుతున్నాను అంతే. వెళితే నాకేంటి రా.. రేపు పుట్టబోయే నా కొడుక్కి నీ పేరే పెట్టుకుంటాను. ఇది కొంచెం ఎక్కువ అవ్వలేదా.. ప్లీజ్ మావయ్య.. సరే అని ఆఫీసు రూమ్ లోకి వెళ్ళిపోతాడు. హమ్మయ్య అనుకుని ఫస్ట్ మెసేజ్ పంపిస్తాడు. ఇక్కడ మావయ్య లేడు వెళ్ళిపోయాడు అని దానికి యాంగ్రీ ఎమోజి పంపిస్తుంది. ప్లీజ్ బుజ్జి పప్పీ తలుపు తీయవే.. ఇంకెప్పుడు ఇలా మాట్లాడను. నీకు ఏది కావాలంటే అది కొంటాను. నిన్ను ఎప్పుడు ఎక్కడకి తిప్పమంటే అలా తిప్పుతాను. అయినా తలుపు తీయదు. ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ.. విక్రమ్ అంకుల్ అయితేనే కరెక్ట్ గా దీనికి సొల్యూషన్ ఇవ్వగలరని విక్రమ్ కోసం పరుగు పెడతాడు. లాప్టాప్ లో వర్క్ చేసుకుంటున్నా విక్రమ్.. ముందు ఆయాస పడుతూ మోకాళ్ళపై కూర్చుంటాడు. ఏంట్రా ఏమైంది అని కంగారుగా అడిగితే.. ప్లీజ్ అంకుల్ చిన్న హెల్ప్ కావాలి. ఏం కావాలి. ముందు పైకి లేగు.. అంకుల్ ఆడవాళ్ళని ఎలా కూల్ చేయాలి. ఆ ప్రశ్నకి పైనుంచి కిందికి చూస్తూ ఉంటాడు. ఏంటి అంకుల్ మాట్లాడకుండా చూస్తున్నారు. ఇది నువ్వేనా అని డౌట్ వచ్చి.. నేనే... నాకే కావాలి. దేనికి రా. అబ్బా ప్లీజ్ చెప్పండి. ముందు ప్రాబ్లం ఏమిటో చెబితే దాని తగ్గ సొల్యూషన్ చెప్పొచ్చు. ఆడవాళ్ళని కూల్ చేయడం అంటే చాలా రకాలు ఉంటాయి. ఇంతకీ నీకు ఏ టైప్ కూలింగ్ కావాలి. అక్కడే కింద చతికిలపడి జరిగింది మొత్తం చెప్పి తల పైన చెయ్యి వేసుకుంటాడు. శ్రీకర్ చెప్పిన దానికి విక్రమ్ గట్టిగా నవ్వుతాడు. ప్లీజ్ అంకుల్ మీరు అలా నవ్వకండి. సొల్యూషన్ మాత్రమే చెప్పండి. విక్రమ్ ఏం చెబుతాడు.......
30-04-2026, 11:16 AM
Part - 92
ప్లీజ్ అంకుల్ మీరు అలా నవ్వకండి.. సొల్యూషన్ మాత్రమే చెప్పండి అని శ్రీకర్ దిగులుగా అడిగితే.. ఓ మై గాడ్ శ్రీకర్ నువ్వు ఇలా అయిపోతావు అని అస్సలు ఊహించలేదు తెలుసా..
అందుకే అంటారు ఏమో.. ఎంతటి వారైనా కాంతాదాసులే అని.. ఇప్పుడు మీరు కొటేషన్స్ చెప్పడం అవసరమా.. సరే ఇప్పుడు నీకు ఏం కావాలి..సౌమ్య ని ఎలా కూల్ చేయాలో చెప్పండి అంకుల్ ప్లీజ్ ప్లీజ్. తనకు ఏది ఇష్టమో అది చెయ్యి. అయ్యో చేద్దామని ట్రై చేస్తున్నాను బట్ అది కోపరేట్ చేయడం లేదు. ఏయ్.. అంకుల్ మీరు డబల్ మీనింగ్ కి వెళ్ళకండి. షాపింగ్ తీసుకెళ్లడం అనుకున్న.. బట్ అది తలుపులు వేసుకుని కూర్చుంది. అయితే ఒక పని చెయ్యి.. అని చెవిలో చెబుతాడు. అందుకే అంకుల్ మీరు సూపర్ అనేది అని కిచెన్ లోకి పరుగు పెడతాడు. కిచెన్లో ఉన్న లేడీస్ అందర్నీ బయటికి గెంటేస్తాడు. ఏమైంది వీడికి. వెనకాల వచ్చిన విక్రమ్ ప్రియసఖి కోపాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ మాటకి విద్య నోరు వదిలేసి చూస్తుంది. ఏమైందిరా అని విక్రమ్ అడిగితే... అన్నయ్య మీ బావమరిది ఎప్పుడు నా కోసమేమీ ఇలా చేయలేదు. చూడండి నా అల్లుడు అప్పుడే కాబోయే భార్య కోసం ఎంత చేస్తున్నాడో అని మెటికలు విరుస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన భరత్ గుర్రుగా శ్రీకర్ ని చూస్తాడు. పక్కనే ఉన్న వినయ్ ఎందుకు బావ నీ అల్లుడిని అంత ప్రేమగా చూస్తున్నావు. అల్లుడు అవ్వకముందే మా మధ్యన పుల్లలు పెడుతున్నాడు. వాడికి టాస్క్ ఇచ్చింది ఎవరు? నువ్వే కదా.. మళ్లీ ఎందుకు హైరానా పడుతున్నావు. నేనిచ్చింది నా కూతుర్ని కూల్ చేసుకోమని... అంతేగాని మా ఆవిడ మనసుని నా వైపుకు రివర్స్లో తిప్పమని కాదు. ఇది దారుణం కాదా బావ. దేనికి రా.. నీ కూతుర్ని మాత్రం ఉఫ్.. ఉఫ్.. అని చూడాలా.. అదే మా చెల్లి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మా చెల్లి నిన్ను ఉఫ్.. ఉఫ్.. అని చూడాలా.. అంతే కదా.. మామాటే పైనుంటే మాకు అదో తృప్తి. శ్రీకర్ కిచెన్ లో కుస్తీ పడుతూ ఉంటే వినయ్ శ్రీకి లైవ్ పెడతాడు..అది చూసి నేహా కోపంగా శ్రీ వైపు చూస్తుంది. ఏమిటి శ్రీమతి నాపై అంత ప్రేమ కలిగింది. అలా చూస్తున్నావు.. అక్కడ మీ సుపుత్రుడిని చూడండి. చూస్తున్నాను కదా.. ఏం చేస్తున్నాడు. వంట చేస్తున్నాడు. అదే ఎందుకు చేస్తున్నాడు. ఎందుకు అంటే.. సౌమ్య అలిగిందంట. కూల్ చేసుకోవాలని వాడి తాపత్రయం. వెంటనే పక్కన కూర్చున్నది లేచి పైట కొంగుని నడుం దగ్గర దోపుకుని ఏరోజైనా మీరు నా కోసం అలా చేశారా.. ఎట్లిస్ట్ ఒక కప్పు కాఫీ, టీ ఏదైనా చేసి ఇచ్చారా.. లేదే.. అలిగిన అరిచినా కోప్పడిన ఏదైనా నేనే చేయాలి. అక్కడ నా కొడుకుని చూడండి. ప్రేమించిన అమ్మాయి కోసం ఎంత తాపత్రయ పడుతున్నాడో.. మీరు ఉన్నారు ప్రేమించాను ప్రేమించానని చెప్పి అన్ని నాతోనే చేయించుకుంటున్నారు. మావయ్య అనుకుంటూ వెళ్ళిపోతుంది.. అంతే... కొడుకు వైపు కోపంగా చూస్తూ ఒరేయ్ నీ ప్రేమ సంగతి ఏమోగాని మా మధ్యన చిచ్చు పెడుతున్నావు రా. ఒరేయ్ వినయ్ గా నువ్వు ముందు ఆపేయ్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. కట్ అయిన ఫోన్ చూసి వినయ్ నవ్వుకుంటూ ఉంటే.. ఏమైంది అని భరత్ అడుగుతాడు.. అక్కడ నేహ చేతిలో శ్రీకేదో గట్టిగా ముడినట్టు ఉంది. నీకు ఇదేమి ఆనందం రా.. అదో కిక్కు బావ. ఆ వైభవ్ గాడు అలా ఉండడంలో తప్పే లేదు.. మీ ఇద్దరితో పూజిత ఎలా వేగుతుందో ఏమిటో.. రేపు చందు బలి. పో బావ.. నువ్వు అన్ని అలా నిజాలు చెబుతావు. అందుకే ఐ లైక్ యు అని.. నీ అల్లుడు ఏం చేస్తున్నాడో చూద్దాం పద అని కిచెన్లోకి వెళ్తాడు. శ్రీకర్ పక్కన నిలబడి ఏం చేస్తున్నావు నాన్న. ప్లీజ్ అంకుల్ డిస్టర్బ్ చేయకండి. ఏం వెరైటీలు చేస్తున్నావు. చూపించవచ్చు కదా.. స్మెల్ మాత్రం అదిరిపోతుంది. చెమటలు తుడుచుకుంటూ ఒక స్వీట్ చేశాను. రసం పెట్టాను. ఇంకా ఆలూ ఫ్రై చేసి రైస్ పెట్టాను ఇంకా ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఒరేయ్ నీ చెయ్యి కాలింది రా అని వేళ్ళు చూస్తే.. పర్వాలేదులే. దాని కోపం ముందు ఈ బర్నింగ్ పెద్ద నొప్పిగా లేదు. ఏడ్చేవు ఒక్క నిమిషం ఉండు అని చెప్పి హ్యాండ్ వాష్ చేసి వెన్న రాస్తాడు. అంకుల్ నేనేమైనా ఆడపిల్లనా.. ఆడపిల్లలకైతేనే నొప్పి ఉంటుందా అని పట్టు అని మంట తగ్గిందా.. యువర్ సో స్వీట్ అంకుల్ అందుకే పూజిత ఆంటీ మీకు అలా పడిపోయింది. ఇప్పుడు నా వైపు టర్న్ తిరిగావా.. వెళ్లి నీ లవర్ ని కూల్ చేసుకో. అక్కడ మా బావ...నువ్వు ఎలా కూల్ చేస్తావా అని తెగ వేయిటింగ్. మొత్తం అన్ని ట్రే లో నీట్ గా సర్ది.. పక్కనే రోజెస్ పెట్టి సర్వెంట్ ని పిలుస్తాడు. అదేంట్రా నువ్వు పట్టికెళ్ళావా. నా మొహం మీద తలుపేస్తూఉంటే.. ఇవి పట్టుకెళ్లిన చూస్తుందా. ప్లేట్ విసురు కొడుతుంది. అది నిజమేలే. ఈ ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం. మన మగవాళ్ళు కష్టాలు ఎప్పటికీ తీరుతాయో అని డ్రామాటిక్ గా చెబుతాడు. ఇది మీకు అస్సలు సూట్ అవ్వలేదు అంకుల్. అవునా.. ఫీలవుతున్నావ్ కదా నా ఒరిజినల్ వెర్షన్ లోకి వచ్చేస్తాను. సర్వెంట్ ని పిలిచి ఆ ట్రే ఇచ్చి పంపిస్తాడు. సర్వెంట్ కి వెళ్లి తలుపు కొడితే... ఏమిటి అని గట్టిగా అరుస్తుంది. మేడం మీ కోసం ఫుడ్ తీసుకోవచ్చాను. డోర్ తీయండి. అది ప్రిపేర్ చేసిన వాడిని తీసుకుని రమ్మను. నువ్వు కాదు. అంతే...ఆ మాటకి వెనకాల నిలబడిన శ్రీకర్ దీనికి ఎలా తెలిసిందబ్బా అని ఆలోచిస్తూ.. సరే అని ట్రే వచ్చుకుని సర్వెంట్ ని వెళ్ళమని కళ్ళతోనే చెబుతాడు. శ్రీకర అ ట్రే పట్టుకుని తలుపు కొడతాడు. ఎవరు అని అంటే.. నేనే బంగారం తలుపు తీయి. నా మీద కోపంతో నువ్వు ఏమి తినకుండా కూర్చుంటే ఎలా చెప్పు. అసలే డాక్టర్ వి. ఆకలితో ఉంటే ఎన్ని ఇష్యూస్ వస్తాయో నీకు తెలుసు కదా. నా బంగారం అలా బాధపడుతూ ఉంటే నేను చూడగలనా. తలుపు తీయరా అని బ్రతిమాలుతూ ఉంటాడు. అది చూసి భరత్ నోరు వదిలేస్తే.. విద్య మోచేతులతో మొగుడు పొట్టలో పొడుస్తు.. నా అల్లుడుని చూసి నేర్చుకోండి. అప్పుడే నా కూతుర్ని ఎంత గారాబంగా చూస్తున్నాడో.. మీరు ఉన్నారు. ఎప్పుడు చూసినా.. ఏయ్, ఏంటే, తీసుకురా అని అరవడం తప్ప ఎప్పుడైనా అలా ప్రేమగా మాట్లాడారా. పిలిచారా మళ్ళీ లవ్ మ్యారేజ్ అని మూతి తిప్పుకొని వెళ్ళిపోతుంది. సౌమ్య తలుపులు తీస్తోంది. హమ్మయ్య తీసావా.. నీకోసమే.. నా సహస్రాలతో వంట చేశాను. తెలుసు అని పక్కకి తప్పుకుంటుంది. లోపలికి రావచ్చా అంటే కళ్లతోనే చెబుతుంది .థాంక్యూ అని వెనక్కి తిరిగి భరత్ ని చూసి కళ్ళు ఎగరేస్తాడు. భరత్ పళ్ళునూరుతూ ఉంటే.. వినయ్ వచ్చి ఏంటి బావ వాడి క్యారెక్టర్ ఇది కాదే.. సౌమ్యనే వచ్చి బ్రతిమాలే వరకు బెట్టు చేస్తాడు. అలాంటిది ఇంత సాఫ్ట్ గా మాట్లాడుతున్నాడు అంటే సంథింగ్ తేడా జరిగింది బావ. ఏమి జరిగింది. వాడు ఎలాగా టాస్క్ గెలవలేడు కదా అని నా కూతురుని కన్విన్స్ చేస్తే మిమ్మల్ని కూడా సూర్య ని పంపినట్టు పంపుతాను అన్నాను అంతే.. భరత్ ని పైనుంచి కిందకి చూస్తూ అది తెలివైన వాళ్ళు ఎక్కడో వెళ్లి పడతారంట. అలాగుంది నీ గొడవ. నువ్వు ఏదో చేద్దామనుకొని.. కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చినట్టు నీ కూతుర్ని వాడి చేతిలో పెట్టావు. ఊరుకుంటాడా.. అందులో వయసులో ఉన్నవాడు. ఎలా దక్కించుకోవాలో తెలియదా ఏంటి బావ... వయసు అయ్యే కొలది నీ బుర్ర కూడా కిందకి దిగిపోతుందా ఏమిటి. ఒరేయ్.. నాకసలే ఒళ్ళు మండిపోతుంది. నువ్వు ఇలాంటి అప్పుడు ఎదవ సెటైర్లు వేయకు. ఇదే మరి.. ఉన్నది చెబితే ఉలుకెక్కువ అంట. అందుకే నా చెల్లి అలిగి వెళ్లినట్టుంది. ముందు వెళ్లి విద్యని కూల్ చేసుకో. లేకపోతే... లేకపోతే ఏం చేస్తుంది. కాసేపటికి విద్యనే వస్తుంది. అదే నీకు అర్థమైంది. ఆడవాళ్ళు చాలా సున్నిత మనస్సు కలవాళ్లు బావ. అప్పుడప్పుడు మనం ఆ మనసు మీద వెన్న, బట్టర్ రాస్తూ ఉండాలి. ఏమిటి ఆలోచిస్తున్నావు బావ. శ్రీకర్ గాడికి ఈ ఐడియా ఎలా వచ్చిందా అని ఆలోచిస్తున్నా. మాక్సిమం షాపింగ్ తీసుకువెళ్ళడానికి ట్రై చేయడం.. లేకపోతే ఏ బొకే నో తెచ్చి బ్రతిమాలుతాడు అనుకున్నాను. కానీ ఇలా కుకింగ్ చేసి నా కూతుర్ని కూల్ చేయొచ్చు అని ఐడియా ఎలా వచ్చిందంటావు. ఒకసారి అటు తిరుగు అని విక్రమ్ వైపు కి ఫేస్ తిప్పుతాడు. అక్కడ మాధవి, లలితతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు.. అంటే ఇదంతా బావ పనా.. మరి సలహా ఇచ్చింది అన్నయ్య. కిచెన్ లో జరిగేది మొత్తం సౌమ్యకి వీడియో కాల్ చేసి చూపించింది కూడా అన్నయ్యే. లేకపోతే ఎవరు చేశారో వాళ్ళనే తీసుకురమ్మని అని ఎలా చెబుతుంది. విక్రమ్ ముందుకు వెళ్లి బావ అని కోపంగా పిలుస్తాడు. ఏమైందిరా నువ్వు శ్రీకరర్ కి ఎందుకు సలహా ఇచ్చావు. నేనేమిచ్చాను రా.. నాకు అంతా తెలుసుగాని అని పక్కన కూర్చుంటాడు. ఒరేయ్ కూతురు పెళ్లి అవుతుంటే నువ్వు అలుగుతావేంట్రా.. నాకన్నా బాగా నీ చెల్లి అలుగుతుంది.. అల్లుడిని చూసి నేర్చుకోండి అని అలకపానుపు ఎక్కింది.. ఆ మాటకి నవ్వుతూ ఇప్పుడు నీ బాధంతా విద్య అలిగిందనా.. వెళ్లి కూల్ చెయ్. ఒక్కొక్కసారి మనం కూల్ చేసేది కూడా తర్వాత మంచి కిక్ ఇస్తుందని కన్ను కొడతాడు. భరత్ రియాక్షన్.....
30-04-2026, 11:19 AM
Part - 93
నాకన్నా బాగా నీ చెల్లి అలుగుతుంది.. అల్లుడిని చూసి నేర్చుకోండి అని అలకపానుపు ఎక్కింది.. ఆ మాటకి నవ్వుతూ ఇప్పుడు నీ బాధంతా విద్య అలిగిందనా..
వెళ్లి కూల్ చెయ్. ఒక్కొక్కసారి మనం కూల్ చేసేది కూడా తర్వాత మంచి కిక్ ఇస్తుందని కన్ను కొడతాడు. బావ అని నోరు వదిలేస్తాడు. ఏంట్రా. అసలు నీతో అవని ఎలా వేగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఆ మాటకి విక్రమ్ చిరుకోపంగా చూస్తే.. నువ్వు ఎలా చూసినా సరే. ఈ వయసులో కూడా ఇంత రొమాంటిక్ ఆలోచనల. నెత్తి మీద ఒకటి కొట్టి.. వయసుకి రొమాన్స్ కి సంబంధం ఏమిటి. మన మనసు ఉల్లాసంగా ఉండడం ముఖ్యం. అయినా ఇప్పుడు నాకు పెద్ద వయసు ఏమైపోయింది. అవునవును అందరూ అదే అనుకుంటున్నారు. నీకోసం ఒక పెళ్లి సంబంధం కూడా వచ్చిందంట కదా.. అప్పుడే అవని అటూ వస్తూ ఆ మాటలు విని ఎవరికి పెళ్లి సంబంధాలు. భరత్... విక్రమ్ వైపు చూసి నవ్వుతూ మనకి బాగా కావాల్సిన వాళ్ళకిలే. అదే ఎవరు. అత్తయ్య ఎవరికో పెళ్లి సంబంధం అంట. విక్రమ్ తల కొట్టుకుంటూ పూర్తిగా వినవా.. పెళ్లి అనగానే ఎగురుకుంటూ పిలిచేస్తున్నావు. అయ్యో పెళ్ళంటే వినడానికి బాగుంటుంది. ఎవరికి అన్నయ్య.. ఎవరుకో అయితే నేనెందుకు చెబుతాను చెల్లెమ్మ. మీ ఆయనకే. ఆ మాటకి అవని ఉగ్రరూపం దాల్చి మీ మగాళ్ళ అందరికీ ఏమయింది. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తున్నారా.. మొన్న రాజ్ అన్నయ్య.. ఇప్పుడు మీరు. ఏం తక్కువ అయ్యింది అని రెండో పెళ్లి మాట ఎత్తుతున్నారు హా అని అరుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మాధవి ఎందుకే అలా అరుస్తున్నావు. చూడు అమ్మ మీ అల్లుడికి రెండో పెళ్లి కావాలంట. ఆ మాటకి భరత్ నవ్వుతూ ఉంటే విక్రమ్ చేతులు కట్టుకుని సీరియస్ గా చూస్తూ ఉంటాడు. అవని తల మీద ఒకటి వేసి.. నువ్వు ఎవరినైనా అనుమానించు గాని నా మేనల్లుడు అనుమానిస్తే బాగోదు. వాడు మేలిమి బంగారం. ఎవరు ఏది చెప్తే అది నమ్మేయడమేనా అంతే... ఆ మాటకి అవని విక్రమ్ వైపు చూసి తన గోక్కుంటూ తింగరి నువ్వు నవ్వుతుంది. విక్రమ్ సీరియస్గా లేచి వెళ్ళిపోతాడు. భరత్ వైపు కోపంగా చూస్తే.. ఏంట్రా.. ఎందుకన్నయ్య ఇలా ఇరికించావు. లేకపోతే నా కూతుర్ని ఎలా కూల్ చేసుకోవాలా అని పెళ్లికి ముందే నా అల్లుడికి ట్రైనింగ్ ఇస్తున్నాడు. మంచిదే కదా.. ఏం మంచిది. వాళ్ళిద్దరూ గదిలోకి వెళ్లారు ఇక్కడ నాకు టెన్షన్. శ్రీకర్ మీద అలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన సౌమ్య మీద పెట్టుకోవాలా.. ఛీ.. ఛీ.. నా ఉద్దేశం అది కాదు. ఎప్పుడైనా స్టెప్ అబ్బాయిలే కదా అని. ఉండు అన్నయ్య.. ఇప్పుడు మా ఆయన కూల్ చేసుకోవాలి అని పరుగుపడుతుంది. శ్రీకర్ ట్రై తో గదిలోకి వెళతాడు. సౌమ్య అక్కడ సోఫాలో కూర్చుని చేతివేళ్లు చేసుకుంటూ ఉంటే.. బంగారం అని పిలిస్తే ఒక లుక్ ఇస్తుంది. భోజనం బంగారం. ఎలా చేయాలి? నువ్వు అలాగా ఒలింపిక్ జ్యోతి లాగా ట్రై చేతిలో పెట్టుకొని ఉంటే నేను అక్కడికి వచ్చి నిలబడి తిననా? అయ్యో నీకెందుకు అంత శ్రమ. టేబుల్ మీద పెట్టి ప్లేట్లో అన్ని వడ్డించి ఇస్తాడు. మళ్ళీ చూస్తూ ఉంటే.. ఏమైంది. కూర్చో అని కళ్ళతో చెబుతోంది. సరే అని పక్కనే కూర్చోంటాడు. ఇది కొంచెం ఎక్కువ అవ్వలేదా.. ఏది బంగారం. నువ్వు ఇలా ఓవర్ ఓబీయిడింట్ గా ఉండడం. నచ్చలేదా.. కొంచెం ఎక్కువ అయింది. ఆ ప్లేట్ తీసుకొని కలిపి ముద్ద శ్రీకర్ నోటు దగ్గర పెడుతుంది. అయ్యో నీకోసం చేశాను. మూసుకుని తిను. నీ వేలు కాలింది కదా.. నీకెలా తెలుసు. మాకు అలాగే తెలుస్తాయి లే గాని తిను అని తినిపిస్తుంది. మరి నువ్వు శ్రీకర్ కి తినిపిస్తూ తను తింటుంది. భోజనం అయిన తర్వాత ఆ వేలుకి ఆయింట్మెంట్ రాసి వచ్చిన పని అయింది కదా ఇంకా వెళ్ళు. బంగారం అలా ఎలా వెళ్ళిపోతాను. నువ్వు కూల్ అవ్వాలి కదా.. కూల్ చేసుకునే ప్రాసెస్లో పడతాడు. ఇక విశిష్ట సూర్య బైక్ మీద ట్రావెలింగ్ మొదలు పెడతారు. సూర్య ఫుల్ కాన్ఫిడెన్స్ తో డ్రైవ్ చేస్తుంటాడు. విశిష్ట గాలి ఇయర్ పక్కగా కొడుతుంటే ఎంజాయ్ చేస్తుంది. మీ డ్రైవింగ్‌పై ఇంత నమ్మకం ఎలా పెరిగింది సార్.. సూర్య నవ్వుతూ నీ నమ్మకం వల్లే పెరిగింది. ఆ ఒక డైలాగ్ ఆమెను సైలెంట్ చేస్తుంది. చిన్న బ్లష్, కానీ వెంటనే సర్దుకొని.. అయితే సేఫ్ గా డ్రైవ్ చెయ్యాలి. నేను చిన్నగా అయినా దెబ్బ తింటే… మీకే మొదటి చెబుతాను నేనుండగా నీకు దెబ్బ తగలని ఇస్తాన. దాంతో ఆమె చిరునవ్వు పెంచుకుంటూ బైక్ మీద కంఫర్ట్‌గా సెటిల్ అవుతుంది. హైదరాబాద్ దాటి ఓపెన్ హైవేలోకి వెళ్ళాక… దేవా సార్, ఒక సాంగ్ ప్లే చెయ్యరా.. నేను డ్రైవింగ్ లో ఉన్నాను. నీకు నచ్చిన సాంగ్ పెట్టు. విశిష్ట ప్లే చేసే మొదటి పాట.. సాఫ్ట్ రొమాంటిక్ ట్రాక్. సూర్య తల తిప్పి చూస్తాడు. నీ ప్లేలిస్ట్ కూడా నీకు తగ్గట్టుగానే ఉన్నాయి... సైలెంటుగా ఉంటూ లోపల మాత్రం ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. విశి సూర్యనే చూస్తూ.. మీకు ఏం తెలుసు… నా ఎమోషన్స్ అన్నీ. అందుకే నేనే అర్థం చేసుకుంటాను. మళ్లీ ఆ ఇద్దరూ సైలెంట్. కానీ ఆ సైలెన్స్‌లోనే దగ్గరితనం ఉంటుంది. ఒక చిన్న హైవే షాప్ దగ్గర ఆపుతాడు సూర్య. సూర్య బైక్ స్టాండ్ వేస్తూ: పాదాలు స్ట్రెచ్ చెయ్. చాలా దూరం వెళ్ళాలి ఇంకా. విషిష్ట కప్పు పట్టుకుని చూస్తుంది... ఆమె జుట్టు, బైక్ రైడ్ గాలి వల్ల అన్నీ స్కాటర్ అయ్యాయి. సూర్య నవ్వుతూ... ఓహో హీరోయిన్లా వచ్చేశావే. విశి తన రిఫ్లక్షన్ లో జుట్టు సెట్ చేస్తూ: నేను అందంగా ఉండటం మీకు ప్రాబ్లమా? ప్రాబ్లం కాదు… కాన్సంట్రేషన్ కాస్త డిస్టర్బ్ అవుతుంది అంతే. విశిష్ట దగ్గరగా వచ్చి నెమ్మదిగా చెప్పుతుంది. కానీ మీకు ఏ మాత్రం తప్పు దారిలో కాన్సంట్రేషన్ పోనివ్వను… మీరు డ్రైవ్ చేయాలి కదా... మిమ్మల్ని క్షేమంగా ఇంటికి తీసుకువెళ్లి మీ పేరెంట్స్ కి అప్ప చెప్పాలి కదా.. సూర్య ఒక చిన్న ప్రౌడ్ స్మైల్. అతను ఆమెను గౌరవంతోనే చూస్తాడు. అది లవర్ లుక్ కాదు, ఫ్రెండ్షిప్ కి మించి ఉన్న ట్రస్ట్ లుక్. మళ్లీ ఇద్దరూ జర్నీ స్టార్ట్ చేస్తారు కొంచెం దూరం వెళ్ళిన తరువాత... సూర్య వేగం తగ్గిస్తాడు. నువ్వు అలిసిపోయావా? లేదు సార్ మీ మీద వాలి ఉన్నాను. ఇంకా మీరే అలసిపోయిఉన్నారు. మీకు అలసటగా లేదా నువ్వు నా పక్కన ఉంటే అలసట ఏముంటుంది అని మనసులో అనుకుంటూ..నాకు అలవాటే అని చెబుతాడు. మీరు లేకపోతే నాకే జర్నీ చాలా కష్టం అయ్యేది. చెప్పాను కదా… సేఫ్ గా తీసుకెళ్తానని. నమ్మేను. మీతో రైడ్… ఏ ప్రయాణమయినా ఓ కథల్లా ఉంటుంది. సూర్య బైక్‌ను కొంచెం స్లో చేస్తాడు. వాతావరణం కూల్ … చుట్టూ పచ్చటి పొలాలు. విశిష్ట అతని భుజానికి సైలెంట్‌గా తలను ఆనిస్తుంది. అతను ఏ మాటా మాట్లాడడు, అదే రెస్పెక్ట్. అదే లవ్. అదే ఫ్రెండ్షిప్ బాండ్. వీరి ప్రయాణం ఏ తీరానికి చేరనందో... కథ కొనసాగుతుంది.....
30-04-2026, 12:43 PM
Vaibhav Okkadu Chandu tho settle avte, story lo next-gen kuda settle
01-05-2026, 08:21 AM
nice updates bhayya
mothaniki ee roju vishi propose chestadi
01-05-2026, 09:31 AM
01-05-2026, 10:32 AM
01-05-2026, 10:37 AM
01-05-2026, 10:48 AM
01-05-2026, 11:46 AM
Part - 94
సూర్య ఒకచోట బైక్ ఆపి.. ఆమెకు చూస్తూ... మనిద్దరం ఇంతదూరం వచ్చాం… కానీ అసలు జర్నీ ఇప్పుడే మొదలవుతుంది విశి.. ఆమె కళ్లలో ఒక చిన్న మెరుపు. దేవా సార్...నాతో ఇలా ఎప్పటికీ ఉండారా.. అతను స్మైల్. నువ్వు వెనక్కి చూస్తే… నేను ఎప్పుడూ అక్కడే ఉంటాను. ఎలా సార్.. మళ్లీ బైక్ స్టార్ట్ చేస్తాడు. బైక్ మీద మొదలైన ప్రయాణం… వారి హృదయాల్లో కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టింది. నేను ఉంటాను అంటే.. నువ్వు ఆర్గ్యు ఎందుకు చేస్తావు? బైక్ మీద బాడీని ఒక్కసారిగా స్ట్రెచ్ చేస్తుంది. విశిష్ట చేతులు కొంచెం లూస్ అవుతాయి. హే జాగ్రత్త గట్టిగా పట్టుకో. పరవాలేదు సార్ మీరు ఎక్కువ కంగారు పడుతున్నారు. నీ గురించి కంగారు కాకపోతే ఇంకా ఎవరి గురించి ఉంటుంది. విశిష్ట ఆ మాటకి చిన్నగా బ్లష్ అవుతూ సార్ మీరు ఎలా చెబుతూ ఉంటే ఏదో మూవీలో హీరో హీరోయిన్స్ ఇలా బైక్ మీద వెళుతూ ఉంటే.. హీరో మీలాగే చెబుతూ ఉంటే...అప్పుడు హీరోయిన్ డ్రైవింగ్ మీద ఫోకస్ పెట్టు ఎందుకు అనవసరమైన రొమాంటిక్ డైలాగులు చెబుతావు అంటుంది. దానికి సూర్య నవ్వుతూ అప్పుడు హీరో కూడా చెప్పిండాలే నువ్వే ఎక్కువ రొమాంటిక్ విషయాలు గురించి ఆలోచిస్తున్నావు అని.. అవునా నేను చెప్పకపోతే మీ వాయిస్ చెప్పడం లేదా.. సూర్య స్మైల్. నేను కేర్ చేస్తున్నానని చెబుతుంది. అది నాకు ఆల్రెడీ తెలుసు… కానీ ఆర్గ్యు మాత్రం చేస్తాను. ఎందుకో తెలుసా మన జర్నీ బోర్ కొట్టకుండా ఉండడానికి.. సూర్య చిన్నగా మిర్రర్ లోకి చూసి ఆమె ఎలా ఉన్నదో చెక్ చేస్తాడు. విశిష్ట గమనిస్తుంది. ఏం చూసారు ఇప్పుడు.. నువ్వు ఎలా ఉన్నావో చూసా. ఎలా అంటే? నేను ఎగిరిపోయానేమో అనుకున్నారా.. అదిగో... ఇలా ఆర్గ్యు చేస్తావేమోనని చూసా. నేను చూశానని నీకు ఎలా తెలుసు.. నన్ను మిర్రర్ లో చూశారంటే… నేను ఎందుకు చూడకూడదు. సూర్య నవ్వి... అలా రెస్పాండ్ అవుతావు కాబట్టే చూశాను. నన్ను ఆర్గ్యు మోడ్ లో చూసుకోవడమే గోల్ ఆ... అవును....క్యూట్ గా ఉంటావు. విశిష్ట మనసులో... క్యూట్ అంటే… నేను ఓకే. బట్ మీరు చెప్పినప్పుడు ఎందుకో హార్ట్ బీట్ పెరుగుతుంది… అది ఓకే కాదు. విశి మనసులో మాట అర్థమైనట్టుగా సూర్య..అది నాకు ఓకే. సూర్య హైవేలో స్పీడ్ కాస్త పెంచుతాడు. స్లో చేయండి సార్. ఈ రోడ్ సేఫ్.. ఎటువంటి రిస్క్ లేదు. మీరు సేఫ్ అనుకున్నా… నాకు భయం ఉంటుంది… అనేది అర్థం చేసుకోండి ప్లీజ్.. సూర్య వెంటనే స్పీడ్ తగ్గిస్తాడు. కాసేపు నిశ్శబ్దం. సోరి... భయపడ్డావా.. మీరు ఉండగా నాకు భయం ఎందుకు సార్. మీరు నా విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు అది మీ మనసుపెట్టి ఆలోచిస్తారు. నీ విషయంలో మనసుపెట్టి ఆలోచించడమే నాకు ఇష్టం. విశి మౌనంగా ఉంటుంది. ఏమిటి నేను అలా ఉండడం తప్పా విశి చిన్నగా తప్పు కాదు... మీరు అలా ఉంటే నేను కంగారులో ఏమి మాట్లాడతానో.. ఏం తప్పు చేస్తానో అని భయం. నేనుండగా నువ్వు ఆ భయాన్ని దగ్గరికి రానివ్వాల్సిన అవసరం లేదు. కాఫీ షాప్ కనిపిస్తే బ్రేక్ ఇచ్చి బైక్ ఆపుతాడు. ఇద్దరూ కాఫీ తాగుతుంటారు. సూర్య ఫోన్ తో విశి ని ఫోటో తీసుకొని చూస్తాడు. అది చూసిన విశి ఏం చేస్తున్నారు సార్. నా ఫోటో ఎందుకు తీసారు. లైట్ లో బాగా కనిపిస్తున్నావు. బాగున్నావు అని తీశాను నీకు పంపించాను చూడు. ఫోటోలో క్యూట్ గా కనిపిస్తూ ఉంటే … నేను ఎప్పుడూ సీరియస్ గా ఉండలేను.ఉండాలని ప్రయత్నించిన అవడం లేదు. నాకు నీలో ఉండే ప్రతి యాంగిల్ ఇష్టమే. విశిష్ట వెంటనే వెనక్కి తిరుగుతుంది. ముక్కు నెమ్మదిగా పింక్. మీరెలా మాట్లాడితే నేను కోపం చూపించాల్సి వస్తుంది. నీ మాటకి చేష్టలకి సంబంధమే లేదు. కోపం అంటున్నావు కానీ బ్లష్ అవుతూ లేని కోపాన్ని చూపిస్తున్నావు అనిపిస్తుంది. అంతలేదు. బ్లష్ అవ్వాల్సిన అవసరం నాకేమిటి. అవునా... మరి కలర్ చేంజ్ అవుతున్నా చెవులు ఎవ్వరి అంటావు. విశిష్ట చేతితో చెవులు దాచుకుంటూ.. ఏమో నాకేం తెలుసు. సూర్య ఒక్క నిమిషం సైలెంట్ అవుతాడు. ఇద్దరూ కాఫీ తాగి మళ్ళీ బైక్ ఎక్కుతారు. బైక్ మీద, విశిష్ట చోరవుగా సూర్య బ్యాక్ కి వాలి ఉంటుంది. సూర్య ఆ చొరవ కి చిన్నగా నవ్వుకుంటాడు. ఎందుకు నవ్వుతున్నారు సార్.. అరే నవ్వే స్వాతంత్రం కూడా లేదా.. సందర్భం లేకుండా నవ్వు వస్తుంది అంటే ఎలా.. హ్మ్.. నువ్వు కంఫర్టబుల్గా చొరవుగా ఉన్నావు కాబట్టి నవ్వుకున్నాను చాలా.. అంటే నేను అలా ఉండకూడదా.. అలా అని నేను అన్నానా.. నువ్వు నాపై ఇలా వాలితే... నాకు కూడా కొంచెం... ఏమో… ఏమో అంటే నువ్వే చెప్పాలి. నేను చెప్పానంటే... పరిస్థితులు ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతాయి. ఆల్రెడీ వెళుతున్నయేమో అనిపిస్తుంది. ఇద్దరు చిన్నగా నవ్వుకుంటారు. ఒక బ్రిడ్జి దగ్గర చిన్న చెట్ల దగ్గర కోతులు కూర్చుంటాయి. సూర్య బైక్ స్లో చేస్తాడు. విశిష్ట వెంటనే... స్లో చేయకండి సార్. అక్కడ కోతులు చాలా ఉన్నాయి. నా చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకుంటే ఇంకా అంతే సంగతులు. అవి నీ బ్యాగ్ కోసం చూడడం లేదు. మరి... నిన్ను చూసి కన్ఫ్యూజ్ అవుతున్నాయి. నన్ను చూసా.. ఎందుకు.. వాటి జాతి ఏమిటా బైక్ మీద కూర్చుంది అని చూస్తున్నాయి. సార్ అని ఉక్రోషంగా పిలుస్తుంది. ఒక కోతి దగ్గరకి రాగానే .. విశిష్ట సూర్య బ్యాక్ ని గట్టి గా పట్టుకుంటుంది. ఓహో... కోతి రాగానే నా మీద చాలా ఎఫెక్షన్ పెరిగినట్టుంది. ఎఫెక్షను కాదు ఏమీ కాదు. భయం సార్. విశి పరిస్థితి చూసి సూర్య నవ్వు ఆపుకోలేక పోతాడు. నువ్వు ఇలా క్యూట్ గా భయపడితే... కోతులు కూడా సిగ్గుపడుతున్నాయి. ప్లీజ్ సార్ తొందరగా వెళ్ళండి సరే టెన్షన్ పడకు అని బైక్ స్పీడ్ పెంచుతాడు. హమ్మయ్య అనుకునని రిలాక్స్ అవుతుంది. హైవేలో ఒక పెద్ద ఆవు స్ట్రైటుగా రోడ్డుకి మధ్యలో నిలబడుతుంది. సూర్య అది చూసి ఇది ఇక్కడ నిలబెడడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చి ఉంటారు. విశి కూడా ఆలోచిస్తూ వాటికి ఎక్కడైనా నిలబడచ్చు అని గవర్నమెంట్ సర్టిఫికెట్ ఉండి ఉంటది. ఆవు బైక్ వైపూ చూస్తుంది. దేవా సార్ ఆపండి. ఆవు ఆగు... అద్భుతమైన చూపులు. ఒకరినొకరు చూసుకుంటూన్నట్టుగా ఆవు ముందుకు వస్తూ ఉంటుంది. దయ చేసి దగ్గరికి రాకు పరువు పోతుంది. సూర్య రెండు చేతులు పైకి లేపి.. మేడం మనం ఒక కష్టతరమైన ట్రాఫిక్ ని దాటాలి అనుకుంటా సార్ అని ఏడుపు ముఖంతో చూస్తుంది. ఆవు చివరకు పక్కకి వెళ్తుంది. ఇదే అసలు రోడ్డుపై డామినేషన్. ఏం చేస్తాం సర్ మీ స్పీడ్ కన్నా ఆవు కున్న ఆటిట్యూడ్ ఎక్కువగా ఉంది. ఇద్దరికీ తెలియకుండానే ఈ జర్నీలో ఇంకా దగ్గరవుతూ ఉంటారు.....
01-05-2026, 11:48 AM
Part - 95
అవని విక్రమ్ నీ వెతుక్కుంటూ గదిలోకి వెళుతుంది. బాల్కనీలో నిలబడి సీరియస్ గా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు.
వెనకనించి వెళ్లి హత్తుకుని సోరి అంటుంది. నేను మళ్ళీ కాల్ చేస్తానని ఫోన్ పెట్టేసి దేనికి.. ఇందాక మిమ్మల్ని బాధ పెట్టాను కదా అందుకు. ఇందాక బాధపెట్టి ఇప్పుడు వచ్చి సోరి చెబుతున్నావా.. అయినా నా పైన నమ్మకం లేనప్పుడు ఈ సోరీలు,పూరీలు నాకెందుకు. మీ పైన నమ్మకం లేదు అని నేను అన్నానా అని ఏడుపు గొంతుతో అడుగుతుంది. మరి భరత్ అనగానే మా ఆయన అలాంటివారు కాదు అనకుండా నాపైన ఒక రాక్షసిలాగా పడిపోయావు. రెండో పెళ్లి కావాలా మీకు అని చిందులు వేశావు. అది మీ పైన అనుమానం కాదు మరి జలస్ అనుకోవచ్చు కదా.. పొరపాటున కూడా మీ పక్కన నేను ఎవ్వరిని ఊహించుకోలేను. ఆ ఆలోచన కూడా భరించలేను. ఒక్కసారిగా పెళ్లి అనేటప్పటికీ అని తలకిందకి దించేస్తుంది. నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కుని పిచ్చిదానా.. రాముడు సీతని అడివిలోకి పంపిన తరువాత అశ్వమేధ యాగం తలపెట్టినప్పుడు సీతకి అనుమానం వచ్చింది పక్కన భార్య లేకుండా యాగం ఎలా చేస్తారు అని. ఎక్కడ రాముడు రెండో పెళ్లి చేసుకున్నాడో అని కంగారు పడింది. తన మనసుకి తెలుసు రాముడు తనని తప్ప పొరపాటున కూడా ఏ స్త్రీ వైపు కన్నెత్తి చూడడు అని కానీ ఎక్కడా చేసుకున్నాడో అని ఒక భయం. అది అనుమానం కాదు ప్రేమ ఎక్కువై వచ్చిన భయం మాత్రమే. ఆ భయంతోనే వెళ్లి చూసి వచ్చి సమాధాన పడింది. తప్పుగా ఆలోచించినందుకు.. ఇదిగో ఇలాగే నీలాగే ఈ గిల్టీగా ఫీల్ అయింది కానీ రాముడు సీతని దూరం చేసుకున్నా బంగారు సీతని తయారు చేసుకుని.. అక్కడే కాలం గడిపాడు. రాముడికి ఉన్న బాధ్యతలు కోసమో.. మరి ఏ కారణాలైనా అవ్వని.. దూరమైన సీతను తలుచుకుంటూ బ్రతికాడేమో కానీ.. నీ రాముడు నువ్వు దూరం అవుతే ఆ మరుక్షణమే ఎన్ని బంధాల మధ్యన ఉన్న, బాధ్యతలు మధ్యన ఉన్నా సరే ఉండలేడు. నువ్వు ఎక్కడుంటే అక్కడికే నీ రాముడి ప్రయాణం అర్థమవుతుందా... అర్థమవుతుంది అని విక్రమ్ చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుంటుంది. అబ్బో మా శ్రీమతికి పెళ్లిఅయ్యి ఇన్ని సంవత్సరాలకి మొగుణ్ణి హత్తుకోవాలి అనిపించింది. ఇది వండరే...వండర్ ఏమి కాదు ప్రేమ ఎక్కువై. అలాగే హత్తుకుని మీకు నా పైన కోపం రాలేదా.. ఎందుకు. అందరి ముందు అరిచాను కదా.. అలా అరిచినందుకే కదా ఇలా వచ్చి హత్తుకున్నావు. అబ్బా సీరియస్ అండి. రాలేదు. మా ఆవిడలో కనిపించిన ఇంకొక యాంగిల్ కి నవ్వు వచ్చింది. మరి ఎందుకు వచ్చేసారు. అందరి ముందు అలా నవ్వితే నువ్వు ఫీల్ అవుతావు కదా.. అప్పుడు ఇలా వచ్చేసాను కాబట్టే ఇదిగో ఏరుకోరి మరి నా శ్రీమతి నాకు ఇంత బిగి కౌగిలి ఇచ్చింది. మీరు బంగారం అండి.. ఇలా మాటలతోనే కాలక్షేపం చేస్తావా.. మీకు అసలు సిగ్గులేదు అని చాతి మీద చిన్నగా ఒక దెబ్బ వేసి.. విడిపించుకుని బయటికి వస్తుంది. వెళుతున్న అవనిను చూసి నవ్వుకుంటూ మళ్లీ ఫోన్లో బిజీ అయిపోతాడు. మధ్యలో ఒక రోడ్డుసైడ్ చాయ్ బండి కనిపిస్తుంది సార్ ఒక టీ తాగి వెళదామా అంటే సరే అని బైక్ ఆపుతాడు. వీళ్లిద్దరూ దిగగానే.. టీ మాస్టర్ గట్టిగా ప్రేమజంట వచ్చారు. రెండు స్ట్రాంగ్ టీ ఇవ్వమంటారా.. ఆ మాటకి విశిష్ట ఆశ్చర్యపోయి చూస్తుంది. సూర్య చిన్నగా దగ్గుతూ.. విశిష్టనీ ఈ లోకంలోనికి తీసుకు వస్తాడు. సార్ ఈ టీ మాస్టర్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు. మన గురించి తప్పుగా అనుకుంటున్నాడు. కాదని చెబుదామా.. ఏమని చెబుతావు. మీరు లెక్చరర్ నేను స్టూడెంట్ అని. అప్పుడు గాని మనిద్దరిని పైనుంచి కిందకి చూడడు. ఒక టీ తాగి వెళ్ళిపోతాము. మళ్ళీ అతను ఎవరో... మనము ఎవరో.. రా అని తీసుకువెళ్తాడు. ఇద్దరూ కూర్చోగానే సార్ ఒకే కప్పులో టీనా లేక.. అన్న మేము ఇద్దరం ఫ్రెండ్స్ ఓకే. అవునా కానీ మిమ్మల్ని చూస్తే ఫ్రెండ్స్ లాగా లేరు సార్ మంచి లవర్స్లాగా ఉన్నారు. టీ కప్పు తీసుకుంటున్న విశి కంగారుపడుతుంది. ఆ కంగారులో కప్ ఆల్మోస్ట్ పడబోతు ఉంటే... గట్టిగా పట్టుకుని కంట్రోల్ విశి.. నీ ఎక్స్ప్రెషన్ తో అందరికీ దొరికిపోయేటట్టు ఉన్నావు. ఎవరైనా చూశారా అంటే ఇంకా అంతే. సూర్యాకి ఆ మాటలు అర్థం అయినట్టు.. కంగారుపడకు. నీ బ్లష్ చూస్తే ఎవరికైనా తెలిసిపోతుంది. ఏంటి సార్. అదే మన ఫ్రెండ్షిప్ గురించి. ఓ అవునా... నేను అదే అనుకున్నాను అంటూ మెల్లిగా ఫినిష్ చేస్తుంది. సూర్య నవ్వుకుంటూ తాగి బయలుదేరిదామా అంటే సరే సార్ అని వెనకాలే వెళుతుంది. ఒక ట్రావెలర్ వాన్‌లో ఉన్న వయసు మీద మనిషి వీళ్ళిద్దర్ని చూస్తూ స్మైల్‌తో ఫోటో తీసేస్తాడు. విశిష్ట భయంగా హలో ఎవరు మీరు... ఎందుకు మా ఫొటోస్ తీస్తున్నారు అని అడుగుతుంది. సూర్య హే.. కూల్. భయపడకు. మేబి వాళ్ళు ట్రావెల్ వ్లాగ్ చేస్తూ ఉండొచ్చు. విశి పక్కకు తల తిప్పి.. వ్లాగ్ లో మేమే ట్రావెలింగ్ కపుల్స్ లాగా ఫేమస్ అవుతామో ఏమో... కపుల్ కాదు… సైలెంట్ క్రష్ ట్రావెలర్స్ అని మెన్షన్ చేస్తారు. సార్ నేను భయపడుతూ ఉంటే మీరు జోక్స్ వేస్తున్నారా అని భుజంపై మెల్లిగా కొడుతుంది. పక్కన నేను ఉండగా కూడా భయపడుతున్నావా... ఆ మాటకి చిన్నగా నవ్వుకుంటూ తలవాల్చుతుంది. కొంచెం దూరం వెళ్ళాక సార్ అని పిలుస్తుంది. ఏంటి. చిన్న రిక్వెస్ట్ సార్. వాష్ రూమ్ కి వెళ్లాలా.. కాదు సార్.. ప్లీజ్ విషయం ఏమిటో చెప్పు. నాకు డ్రైవింగ్ చేయాలని ఉంది నేర్పిస్తారా. వాట్ అని సైడ్ కు తిరిగి అడుగుతాడు. అవును సార్. మా నాన్న ఉండగా అడిగితే చిన్నపిల్లవు భయపడతావు పడిపోతావు దెబ్బలు తగులుతాయి అని నేర్పించలేదు. తర్వాత ఫోకస్ చేయడం కుదరలేదు. ప్లీజ్... ప్లీజ్... నువ్వు ఇంత ముద్దుగా అడిగితే నేను కాదంటానా అని బైక్ ని సైడ్ కి ఆపుతాడు. విశి బైక్ దిగగానే సూర్య వెనక్కి జరిగి అడ్జస్ట్ చేస్తాడు. కళ్ళతోనే కూర్చొ అని చెప్పగానే.. ఎక్సైట్మెంట్ విశి కూర్చుని హ్యాండిల్ పట్టుకుంటుంది. క్లచ్ బ్రేక్ ఎక్సలేటర్ అన్ని చూపిస్తూ ఎలా స్టార్ట్ చేయాలో కూడా చెబుతాడు. బైక్ స్టార్ట్ చేసి మెల్లిగా వెళుతూ ముందు కన్ఫ్యూజ్ అవుతుంది. హ్యాండిల్స్ అటు ఇటు తిప్పేస్తూ ఉంటే... ఆ చేతులు మీద సూర్య చేతులు వేసి కూల్.. టెన్షన్ పడకు అని చెబుతాడు. సూర్య చేతులు అలా తగలగానే విశి బాడీ ఒక్కసారిగా జర్క్ ఇస్తుంది. సూర్యకి కూడా ఆ ఫీల్ బాగా నచ్చుతుంది. బైక్ ఇద్దరి డ్రైవింగ్ తో స్లోగా ముందుకు వెళుతూ ఉంటుంది. విశి తేరుకుని సార్ మనం ఇలా 20 లో వెళితే సైకిల్ వేసుకెల్లేవాళ్ళు కూడా మన కన్నా ముందే వెళ్లిపోతారు. నో ప్రాబ్లం ఇలా బాగుంది కదా... ఏం బాగుంది. అదే స్టార్టింగ్ నేర్చుకునేటప్పుడు ఇలాగే స్లోగా వెళ్ళాలి పర్ఫెక్ట్ అనుకున్నాక స్పీడ్ పెంచాలి. మెల్లిగా సూర్య తన చేతులను తీసేస్తాడు. కొంచెం స్పీడు పెంచి డ్రైవ్ చేస్తూ సార్ నాకు వచ్చేసింది అని సంతోషంగా అరుస్తుంది. విశి సంతోషంలోనే తన ఆనందాన్ని వెతుకుతున్న సూర్యకి అదొక చెప్పలేని తృప్తి. చాలా దూరం వెళ్ళిన తర్వాత దాబా కనిపిస్తుంది. అది చూసిన సూర్య అక్కడ ఆపమని చెబుతాడు. బైక్ పార్క్ చేసి సార్ నేను చాలా కాన్ఫిడెంట్గా డ్రైవ్ చేశాను. ఫుడ్ తిన్న తర్వాత మళ్లీ నేనే డ్రైవ్ చేస్తాను. ఆ మాటకి సూర్య నవ్వుతూ మళ్లీ నువ్వు డ్రైవ్ చేస్తే మనం అనుకున్న టైం కి వెళ్లలేము. రిటర్న్లో డ్రైవ్ చేయొచ్చు కం అని తీసుకువెళ్తాడు. ఇద్దరూ కూర్చున్న తర్వాత విశి కాన్ఫిడెంట్గా ఆర్డర్ ఇస్తుంది. అన్నా… కారం తక్కువగా వెయ్యండి. సర్వర్ కారం కాన్సెప్ట్ ని పూర్తిగా రివర్స్లో అర్థం చేసుకుంటాడు. ఫుడ్ వస్తుంది.. ఆ ఫుడ్డు చూడగానే ఇద్దరికీ కళ్ళు తిరిగినంతా పని అవుతుంది. అది అచ్చు ఒక ఎర్రటి లావా పొంగుతున్నంత ఎర్రగా కనిపిస్తుంది. సూర్య ఒక స్పూన్ నోట్లో పెట్టుకుని... అమ్మో.. ఇవేనా కారం తక్కువ ఐటమ్స్.. విశిష్ట చిన్నగా ఆ ఫుడ్ ని చూస్తూ తనలో తానే.. ఇదే తక్కువ అయితే మరి ఎక్కువ అయితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. సర్వర్ సీరియస్‌గా... మేడమ్, మా దగ్గర కారం స్కేల్ ఇలానే ఉంటుంది ఎలా.. తక్కువ – మామూలు మంట మోస్తరు – కంటతడి ఎక్కువ – హాస్పిటల్ కి పంపించేవి. సూర్య నోరు తడుముకుంటూ.. అవును… ఈ తక్కువే చాలు సార్. విశిష్ట నీళ్లు గ్లాస్ గ్లాస్ గా తాగుతూ... దేవా సార్.. నాకు ఇప్పుడు ఎమోషనల్ ఫ్లాషబాక్స్ గుర్తుకు వస్తున్నాయి. ఇద్దరూ కష్టంగా తిని బయటకి వస్తారు. సార్ ఎక్కడైనా కొబ్బరి బొండాలి కనిపిస్తే తాగాల్సిందే.. లేకపోతే ఈ మంటతో అయిపోతాము. పెద్ద ఏదో కాన్ఫిడెంట్గా ఆర్డర్ ఇచ్చావు. కారం తక్కువ వేయండి అన్న అని.. తక్కువ వేయమన్నాను కాబట్టి ఇలా ఉంది. అది నార్మల్ గా చెప్పి ఉంటే మన పరిస్థితి ఏమిటి సార్.. అర్థం చేసుకోవాలి. అవును.. అవును.. బాగా అర్థం చేసుకుంటున్నాను. దారిలో కొబ్బరిబండాలు తాగి మళ్లీ ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తారు. చీకటి పడుతున్న సమయానికి ఎక్కడైనా రూమ్ తీసుకుని ఆ నైట్ ఆగాలి అని డిసైడ్ అవుతారు. ఇద్దరూ ఒక హోటల్ దగ్గరికి వెళ్లి రూమ్స్ తీసుకుంటారు. ఒక రూమ్ తీసుకోవాలా.. రెండు రూమ్స్ తీసుకోవాలో అర్థం కాకుండా ఉంటుంది. పెళ్లి కాకుండా ఇద్దరూ ఒక రూమ్ లో ఉండడం ఎలా అని.. ఒక వైపు విశిని ఒక దాన్నే రూమ్ లో ఉంచడం కరెక్ట్ కాదు అని మరోవైపు.. ఒక రూమా లేక రెండు రూమ్స్ ఆ ?......
01-05-2026, 11:51 AM
Part - 96
పెళ్లి కాకుండా ఇద్దరూ ఒక రూమ్ లో ఉండడం ఎలా అని.. ఒక వైపు విశిని ఒక దాన్నే రూమ్ లో ఉంచడం కరెక్ట్ కాదు అని మరోవైపు..
ఇద్దరం ఒకే రూమ్ లో ఉందాము అంటే విశి ఎలా రియాక్ట్ అవుతుందో అని ఆలోచిస్తూ ఉంటాడు. విశి కి కూడా పరిస్థితి అర్థం అయ్యి సార్ అని పిలుస్తుంది. హ అని చూస్తే ఒక రూమ్ తీసుకోండి. పర్వాలేదా మీ మీద నాకు నమ్మకం ఉంది. విశి చెప్పినదానికి చిన్నగా నవ్వుకుంటూ ముందుకు నడుస్తాడు. ఇద్దరూ లిఫ్ట్ నుంచి బయటికి వచ్చి రూమ్ డోర్ తెరుస్తారు. అందంగా, శుభ్రంగా, సేఫ్ సూట్ రూమ్. లోపల అడుగు పెట్టిన విశి కళ్లే పెద్దవై... సార్… ఇది చాలా కాస్ట్ అయి ఉంటుంది అనుకుంటా… సూర్య తల ఊపుతూ.... ఇట్స్ ఓకే విశి… సేఫ్టీ కన్నా ఏదీ ఇంపార్టెంట్ కాదు. రెండు సపరేట్ బెడ్స్ చూసి విశి ఊపిరి తీసుకుంటూ ఒక బెడ్‌పై కూర్చుంది. సూర్య బ్యాగ్‌ను ఓపెన్ చేస్తూ... ఫ్రెష్ అయి వచ్చేస్తావా? హా సార్. విశి డ్రెస్ తీసుకొని వాష్ రూమ్ కి వెళుతుంది. వాష్‌రూమ్ కి వెళ్లిన విశి కొద్ది సేపటి తర్వాత హాయిగా స్నానం చేసి, సింపుల్ నైట్‌డ్రెస్ వేసుకుని బయటకు వస్తుంది. సూర్యను చూసి కొంచెం ఎంబరాస్మెంట్‌గా తలదించుకొని వెళ్లి మంచం పైన కూర్చుంటుంది. ఫోన్ తీసుకుని భానుమతికి మెసేజ్ చేస్తుంది. అంతలో సూర్య కూడా ఫ్రెష్ అయ్యి నైట్ ట్రాక్ వేసుకుని బయటకు వచ్చేస్తాడు. ఏమైనా తింటావా? అని అడుగుతాడు. విశి చేతులు ఊపుతూ... అమ్మో వద్దు సార్… చాలా హెవీ అయిపోయింది. ఒక్క దుప్పటి ముసుగేస్తే కళ్లే మూసుకుంటున్నాయి. నిద్ర దేవి వెంట తీసుకెళుతోంది. ఆ మాటకి సూర్య నవ్వుతాడు. సార్… మీరు ఏమైనా తినండి. నాది సేమ్ పొజిషన్. నేను అలసిపోయాను తలగడ ఒళ్ళో పెట్టుకుని ఇద్దరూ కొంచెం టైమ్ ఫ్రెండ్లా మాట్లాడుకుంటారు. ఎక్కడ ఆగాలో ఇద్దరికీ అర్థమే... మర్యాద, గౌరవం, బౌండరీలు అన్నీ తెలిసిన ఒక ప్రేమ జంట. రేపు లాంగ్ డ్రైవ్ ఉంది కదా… 6 కి రెడీ అవ్వాలి. అయ్యో అంత ఎర్లీనా? ఏం లెగలేవా.. ఎందుకు లెగలేను సార్.. మీ గురించే ఆలోచిస్తున్నాను. అంత ఎర్లీగా అంటే మీరు డ్రైవింగ్ చేయగలరో లేదో అని. నా గురించి నేను చూసుకుంటాను గాని.. లేడీస్ రెడీ అవ్వడానికి చాలా టైం తీసుకుంటారు కదా.. నువ్వు తొందరగా లేచి రెడీ అవ్వు. హలో సార్ నేను అసలు మేకప్ వేసుకోను. నిజమా.. మీరు ఎప్పుడూ నన్ను అబ్జర్వ్ చేయలేదా అని చిన్న బుచ్చుకున్నట్టుగా అడుగుతుంది. విశి ముద్దు మొహాన్ని చూసి నవ్వుకుంటూ అమ్మాయిలని నేను ఎప్పుడు పట్టికలర్గా అబ్జర్వ్ చేయలేదు. అందరూ అనుకునే మాటే నేను అడిగాను. సో నీలాంటి స్పెషల్ ఎక్స్ట్రా కాండిడేట్స్ ఉంటారు అని ఇప్పుడే అర్థమైంది. సూర్య కాంప్లిమెంట్ కి చిన్నగా సిగ్గుపడుతుంది. కాసేపు నవ్వులు, చిన్న చిన్న జోక్స్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ విశి. రూమ్‌లో కేవలం ఏసీ హమ్, కర్టన్‌ల స్లయిట్ కదలికలు, మరియు ఇద్దరికీ వచ్చిన నిజమైన… ప్రశాంత నిద్ర. రూమ్‌లో కర్టన్ గ్యాప్ నుంచి సూర్యకాంతి నెమ్మదిగా లోపలికి చేరుతోంది. విశి ఇంకా దుప్పటి ముసుగేసి గాఢంగా నిద్రపోతుంది. సూర్య ముందుగానే లేచిపోయి, కుర్చీలో కూర్చుని ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి ఏదో పని చూస్తుంటాడు. సడన్‌గా బెడ్ పక్కన నుండి.... హ్మ్మ్మ్.. అని చిన్నగా మూలుగినట్టుగా విశి టర్నింగ్ అవుతుంది. అమ్మ కర్టిన్ దగ్గరికి లాగు అని దుప్పటిని పైకి లాక్కుంటుంది. సూర్య నవ్వు ఆపుకుంటూ చూస్తాడు. కొంచెం తర్వాత విశి ఒక్కసారిగా కళ్లప్పగించి లేచి కూర్చుంటుంది. సార్!! నేను నిన్న రాత్రి ఇలా నిద్రపోయానా? అని తన జుట్టు మొత్తం గాలివాన తాకినట్టు అయిపోయినట్టు హడావుడిగా సరి చేసుకుంటుంది. సూర్య నవ్వుకుంటూ... విశి… రిలాక్స్. ఏం ఏమీ కాదు. నిద్రపోయావంతే. విశి ఇంకా పక్క బెడ్ కవర్ చూస్తూ... ఓహ్ గాడ్… నేను ఇలా పడుకున్నానా? కనీసం గుడ్ మార్నింగ్ సార్ అనడానికి ముందు నా హెయిర్ ఇలా? అని ముఖం చేతుల్లో దాచుకుంటుంది. సూర్య నవ్వు ఆపుకోలేక... ఏంటి విశి సిగ్గుపడుతున్నావా అయినా నేనేమీ అనుకోవడం లేదు. చాలా క్యూట్ గా నిద్రపోయావు. విశి కళ్ళని చిన్నగాపెట్టి సార్... మీరు నన్ను ఏడిపిస్తున్నారు. సూర్య లైట్‌గా... చాలా క్యూట్‌గా నిద్రపోయావంటే నమ్మవా... వెంటనే విశి ముఖం టమాటో రెడ్ అయిపోతుంది. సార్… ఇలాంటివి చెప్పకండి ప్లీజ్… టైం చూసుకుని సార్ అని అరుస్తుంది. మళ్ళీ ఏమైంది అప్పుడే సెవెన్ అయిపోయింది. అవును మనం సిక్స్ కే బయలుదేరాలి అనుకున్నాము కదా.. మీరు ఎప్పుడో లేచారు. లేపాల్సింది అని గిల్టీగా అంటుంది. ఇప్పుడు ఏమైంది మన సెల్ఫ్ డ్రైవింగ్ ఏ కదా.. కొంచెం లేటుగా వెళతాము. బాగా అలసిపోయి ఉన్నావు.. పడుకున్నావు. లేపాలి అనిపించలేదు. కానీ డ్రైవింగ్ చేసిందంతా మీరే. నేను బ్యాక్ కూర్చున్నాను. నేనేం అలిసిపోయి ఉంటాను సార్.ఎలాగైనా జర్నీ కదా. నో ప్రాబ్లం వెళ్లి ఫ్రెష్ అవ్వు. బ్రేక్‌ఫాస్ట్ కి వెళ్దాం. షాల్ సరిచేసుకుంటూ అర్జంట్‌గా వాష్‌రూమ్ వైపు నడుస్తుంది. సూర్య మాత్రం తల ఊపుకుంటూ, చిరునవ్వుతో... గుడ్ మార్నింగ్ విశి.. అని కాస్త గట్టిగా అంటాడు. విశి డోర్ మూసే మధ్యలోనే.. గుడ్ మార్నింగ్ సార్… అని సగం సిగ్గుతో.. సగం ఇబ్బందితో తలుపు వేస్తుంది. తలుపు మూసిన తర్వాత తానలో తాను... ఛ… ఎందుకిలా అయిపోయిందబ్బా… విశి రెడీ అయ్యి వచ్చేటప్పటికి రూమ్ లోకి బ్రేక్ ఫాస్ట్ కాఫీ ఆర్డర్ పెడతాడు. విశి టేబుల్ దగ్గరకి వస్తుంది. సూర్య అప్పటికే కూర్చుని కాఫీ ఆర్డర్ చేసి వెయిటింగ్. విశి చైర్ దగ్గర కూర్చునే సమయంలో సూర్య ఆమెను ఒకసారి పై నుంచి కింద దాకా చూసి... హ్మ్… ఇప్పుడు మాత్రం పూర్తిగా అమ్మాయిలాగా ఉన్నావు. ఏం సార్! నేను ముందు ఇలాగే ఉన్నాను కదా.. సూర్య కాఫీ తాగుతూ... నిన్న రూమ్‌లో లేచినప్పుడు చూశానుగా… హరికేన్ విశి వెర్షన్. విశి కళ్లను పెద్దవిగా చేసి... సార్ ప్లీజ్… అది నిద్ర వల్లే. అవి చెప్పక్కర్లేదుగా. సూర్య నవ్వుతూనే... నిన్ను చూస్తే నాకు అర్థం అయ్యింది ఏమిటంటే … నిద్ర అంటే నిజంగా నీకు దేవతలా ఉంటుంది. నిద్ర పోయేటప్పుడు ప్రపంచం, ఇమేజ్, బౌండరీలు అన్నీ ఆఫ్ అయ్యిపోతాయి. విశి ప్లేట్‌లో ఉన్న ఇడ్లీని చూస్తూ... సార్… ఇలా చాలా టీజ్ చేస్తుంటే… నేను మాట్లాడను. అలుగుతాను. అవునా నీలో అలక అనే యాంగిల్ ఇప్పుడు వరకు చూడలేదు ప్లీజ్ ఒక్కసారి అలగవ అని టీజింగ్ వాయిస్ తో అడుగుతాడు. విశి చేతులు జోడించి... ఈ ఒక్కరోజు నన్ను టీజ్ చేయకుండా ఉండండి, చూద్దాం మీ వల్ల అవుతుందా? సూర్య వెంటనే నవ్వి.... ఒక్కరోజా? అది అసాధ్యం. నీ ఎక్సప్రెషన్స్ చూడగానే ఆటో టీసింగ్ మోడ్ ఆన్ అయిపోతుంది. ఏమి చేయమంటావు చెప్పు.. విశి ప్లేట్‌తోనే అతన్ని కొట్టాలనుకున్నట్టుగా.. సార్… చాలా ఇబ్బంది పెడుతున్నారు. అయితే నీకు ఒక్క ఛాలెంజ్. ఇవాళ్టి ట్రిప్‌లో నువ్వు నన్ను ఒక్కసారి అయినా టీజ్ చేస్తే… నేను నిన్ను ఇక టీజ్ చేయను. విశి ఐబ్రో రైజ్ చేస్తూ.. మిమ్మల్ని చేయలేను అనుకుంటున్నారా... అరే చేయమనే కదా నేను అంటున్నాను. ఇప్పటివరకు నన్ను టీజ్ చేసే అవకాశం ఏ అమ్మాయికి ఇవ్వలేదు ఫస్ట్ నీకే ఇస్తున్నాను కాబట్టి యూస్ చేసుకో. సూర్య ముఖం చూడటం కష్టమయ్యేలా అటు చూసి... మీకు ఎందుకు సార్ నన్ను టీజ్ చెయ్యాలి అనిపిస్తుంది. కాఫీ తాగుతూ నేను టీజ్ చేస్తున్న సరే ఎందుకు అబ్జెక్ట్ చెప్పకుండా నీలో నువ్వు నవ్వుకుంటున్నావు. ఏంటి… నేను అలా నవ్వుకుంటున్నానా.. విశి తలవంచుకొని చిన్నగా సార్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే నా పని అంతే. ఏం ఆలోచిస్తున్నావు.. సీరియస్గా పెట్టాను అనుకోని సూర్యని చూస్తూ.. సార్… మీరు ఆలా ఎలా చెప్పేశారు. సూర్య కప్పు పెట్టి... సరే... లెట్స్ ఈట్. అదేంటంటే.. టీజ్ చేస్తున్నప్పుడు....నీవు క్యూట్‌గా రెయాక్ట్ అవుతావు. విశి ముఖం వెంటనే పింక్ అయిపోతుంది. సార్… ప్లీజ్ … ఇంకో మాట మాట్లాడితే టేబుల్ వదిలి వెళ్తాను సూర్య చిన్నగా సైరన్‌లా ఓకే, ఓకే… అని చేతులు ఎత్తేస్తాడు. కానీ ఆమె ప్లేట్‌లో దోసె కట్ చేస్తుండగా అతను మళ్ళీ నెమ్మదిగా... బై ది వే... గుడ్ మార్నింగ్... హరికెన్ వెర్షన్ కాదు... నార్మల్ క్యూట్ వెర్షన్. సార్… సూర్య నవ్వి చేతిలో నాప్‌కిన్ పెడతాడు. ఇద్దరూ నవ్వుకుంటూ బ్రేక్‌ఫాస్ట్ ఫినిష్ చేస్తారు. మధ్యలో వచ్చే చిన్న చిన్న ఐ కాంటాక్ట్స్ … కంఫరటబుల్ సైలెన్స్ … అలిగినట్టు నటించే విశి… హర్ టీజ్ ఛాలెంజ్ ఇన్ మైండ్ … ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఇంకా దగ్గరవుతుంది. లగేజ్ ప్యాక్ చేసుకుని... రూమ్ చెక్ అవుట్ చేసి మళ్లీ స్టార్ట్ అవుతారు. వైభవ్ మార్నింగ్ లేచి జిమ్ చేసి వచ్చి ప్రోటీన్ షేక్ తాగుతూ అందరినీ చూస్తూ ఉంటాడు. లేడీస్ భర్త ల కోసం హైరానా పడుతూ ఉంటే... సౌమ్య సైలెంట్ గా శ్రీకర్ తో ఫోన్ లో బిజీగా ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ కపుల్స్ మీద సెటైర్లు వేస్తూ ఉంటారు. అందరూ వాళ్ళ పెయిర్ తో ఎంజాయ్ చేస్తున్నారు. నేనే ఒంటికాయ సొంటికొమ్ములాగ ఇలా చూస్తూ ఉంటున్నాను. ఇంతకీ నా చందు బేబీ ఏం చేస్తుందో ఏమిటో.. ఫోన్ చేయాలి. హ అదే చేయొచ్చు కదా.. నేను చేస్తే లోకువైపోతానేమో. అంతరాత్మ బయటికి వచ్చి ఏడ్చావులే... చందు నీకెందుకు ఫోన్ చేస్తుంది. మేమిద్దరం లవర్స్ అయ్యాము కదా..... అది నువ్వు అనుకుంటున్నావు. ఇంకా నీ పిల్ల రాక్షసి ఫిక్స్ అవ్వలేదు. ఎందుకు ఫిక్స్ అవ్వలేదు. ఇప్పుడే ఫోన్ చేసి అడుగుతాను అని రూమ్ కి వెళ్లి ఫోన్ చేస్తాడు. చందు ఫోన్ లిఫ్ట్ చేస్తుందా.....
01-05-2026, 11:53 AM
Part - 97
నీ పిల్ల రాక్షసి ఫిక్స్ అవ్వలేదు. ఎందుకు ఫిక్స్ అవ్వలేదు. ఇప్పుడే ఫోన్ చేసి అడుగుతాను అని రూమ్ కి వెళ్లి ఫోన్ చేస్తాడు.
మత్తుగా నిద్రపోతున్న చందు లాస్ట్ రింగ్ కి లిఫ్ట్ చేసి కళ్లు తెలవకుండానే హలో అని ఉంటుంది. ఏమిటే తెల్లారి ఇంతసేపైనా లవర్ కి ఫోన్ చేయాలని తెలియదా అని గట్టిగా అరుస్తాడు. ఆ అరుపులకి నిద్రమత్తు వదిలిపోయి ఫోన్ వైపు చూస్తుంది. మంకీ అని సేవ్ చేసి ఉన్న నెంబర్ నుంచి కాల్ వస్తుంటే లేచి తల పట్టుకుని... ఎవరికీ ఎవరు లవర్స్ రా.. ఏం మాట్లాడుతున్నావు. రాత్రి ఏమైనా తాగావా... తాగింది దిగలేదా.. అమ్మ.. నీ..ఎంత మాట అన్నావే. నీ ఫోన్ కోసం చకోరి పక్షిలాగా ఎదురు చూస్తూ ఉంటే నన్ను తాగుబోతు అంటావా. నా ఫోన్ కోసం నువ్వు ఎందుకు ఎదురు చూడాలి. అంత ఇంపార్టెంట్ మేటర్ ఏముంది.. ఇంపార్టెంట్ మేటర్ అని అంత మెల్లిగా అడుగుతావేమిటి... లవర్స్ అంటే ఎప్పుడు ఫోన్ లోనే ఉండాలి.. సౌమ్య, శ్రీకర్ ని ఇద్దరిని చూసి నేర్చుకో. నిజమే లవర్స్ అయితే అలాగే మాట్లాడుకోవాలి కానీ మనం ఎనిమిస్ కదా ఎలా మాట్లాడుకుంటాము.. వైభవ్ మనసులో... ఇది పాత విషయాలన్నీ మనసులో పెట్టేసుకుంది రాక్షసి.. ఇప్పుడు సమయం వచ్చిందని నన్ను ఫ్రై చేయడం మొదలు పెట్టింది. దీనిని ఎలాగైనా లైన్లో పెట్టుకోవాలి అనుకుని చందు అని గారంగా పిలుస్తాడు. ఒరేయ్ నువ్వు ఖాళీగా ఉండి ఏడిపించడానికి ఎవరూ దొరకలేదా.. పొద్దుపొద్దునే నాకు ఫోన్ చేశావు. నేనెక్కడ ఖాళీగా ఉన్నాను ఫుల్ బిజీ. అయితే ఆ బిజీలో ఉండు. ఫోన్ పెట్టేయ్. నాకు చాలా పని ఉంది. నాకు తెలియక అడుగుతాను. పని పని అని కొన్ని రోజుల నుంచి చాలా బిజీగా తిరుగుతున్నావు. ఏం పని.. ఫ్యాషన్ షో ఏమైనా కండక్ట్ చేస్తున్నావా.. నేనేది చేస్తే నీకెందుకు. అరే లవర్స్ అన్నాక చెప్పుకోవాలి కదా... ఏమన్నా పర్మిషన్స్ అవసరం ఉంటే హెల్ప్ చేస్తాను. నాకేదైనా అవసరం ఉంటే చూసుకోవడానికి మా అమ్మ నాన్న ఉన్నారు. అంతేకానీ ఎనిమీస్ దగ్గర హెల్ప్ తీసుకుని అంత విశాల హృదయం నాకు లేదు. ఐ యాం సారీ చందు. దేనికి నిన్ను ఇంతకుముందు చాలాసార్లు రాష్ గా మాట్లాడి హార్ట్ చేశాను కదా.. దానికే కదా నువ్వు నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. ఆ మాటకి ఒక నిమిషం సైలెంట్ అయిపోతుంది. నేను చెబుతుంది నిజమే కదా.. చూడు వైభవ్ నువ్వు నీ మనసులో మాటలు నువ్వు ఓపెన్ గా చెప్పావు. అది పూర్తిగా నీ ఇష్టం. దానికి నేను రియలైజ్ అయ్యి దూరంగా ఉండాలి కదా.. అది నా ఆత్మ అభిమానం . ఇంక నన్ను ఏడిపించింది.. టీజ్ చేసింది చాలు. నువ్వు ఎవరితో బెట్ కట్టావో నాకు తెలియదు కానీ ఇలా ప్రేమా ప్రేమా అని లేని ఫీలింగ్స్ తెచ్చుకొని నన్ను ఇబ్బంది పెట్టకు బాయ్ అని ఫోన్ పెట్టేస్తోంది. పెట్టేసిన ఫోన్ వైపు చూస్తూ ఇదేమిటి నేను లవ్ చేస్తున్నాను అంటే ఎవరితోనో బెట్ కట్టి దీన్ని టీజ్ చేస్తున్నాను అనుకుంటుంది. ఏంటి రా ఇది… ప్రేమ పోరాటం స్టార్ట్ కాకముందే ఓడిపోయానేమో.. విశిష్ట సూర్య బైక్ డ్రైవింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ముందు రోజు కన్నా ఈ రోజు ఇద్దరిలో కాస్తచనువు పెరుగుతుంది. ఒకరినొకరు కామెంట్ చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. ఎలాగైనా సూర్యని టీజ్ చెయ్యాలి అని విశిష్ట ఆలోచిస్తూ ఉంటే విశి ఆలోచనలు అర్థమయ్యి సూర్య నవ్వుకుంటాడు. ఇద్దరూ మెల్లిగా అన్నవరం చేరుకుంటారు. కిందే బైక్ ఒక పక్కకి పార్క్ చేసి అక్కడ దండం పెట్టుకుంటారు. సార్ మీరు బైక్ తీసుకొని వచ్చేయండి..నేను స్టెప్స్ ఎక్కి మెల్లిగా వస్తూ ఉంటాను. నేను నడిచి వస్తాను అంటే స్వామి వద్దంటారా ఏమిటి.. అయ్యో నా ఉద్దేశం అది కాదు.. బైక్ ఇక్కడే ఉంటే ఎలా.. డోంట్ వర్రీ నా అరేంజ్మెంట్స్ నేను చేసుకుంటాను అని కాల్ చేసి మాట్లాడి వచ్చి వెళదామా. మరి బైకు అది మనం వెళ్లేటప్పటికీ పైకి వచ్చేస్తుంది పద అని అక్కడ కుంకం పెట్టుకొని నడక మొదలు పెడతారు. ఇద్దరూ స్టెప్స్ ఎక్కుతూ విశి చుట్టూ చూస్తూ ఎమోషనల్ అవుతుంది. సూర్య ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాడు. అప్పుడు విశి ని చూసిన రూపం గుర్తుతెచ్చుకొని నవ్వుకుంటాడు. కొంచెం దూరం వెళ్లిన తర్వాత విశి గట్టు పైన కూర్చుంటుంది. సూర్యా విశి ఫేస్ ని అబ్జర్వ్ చేస్తూ కొంచెం దూరంగా కూర్చుని ఏమి ఆలోచిస్తున్నావు. ఈ గుడి తో నాకు చాలా అనుబంధం ఉంది సార్. మా పేరెంట్స్ కి చాలా రోజులు వరకు పిల్లలు లేకపోతే.. ఈ స్వామికి దండం పెట్టుకున్న తర్వాత నేను పుట్టాను అంట. అందుకే నా ప్రతి పుట్టినరోజుకి నాన్నగారు ఇక్కడికే తీసుకువచ్చేవారు. నాకు సంబంధించి ప్రతి ముఖ్య కార్యక్రమం ఇక్కడే మొదలుపెట్టేవారు. నాకు నాలుగు, అయిదు సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు ఈ గుడికి వచ్చాము అంట. అప్పుడు ఒక కోతి ఇబ్బంది పెడుతూ ఉంటే ఒక ఫ్రెండ్ హెల్ప్ చేశారు అని నాన్నగారు అన్నారు. ఆ ఫ్రెండ్ ఇచ్చినా రింగ్ నా మెడలో వేశారు. దీనిని ఎప్పుడూ తీయొద్దు అని నాన్నగారు మరి మరీ చెప్పేవారు. నాన్న ఉన్నన్ని రోజులు ఎప్పుడూ తీయలేదు కానీ... నాన్న దూరమయ్యాక ఎందుకో ఉంచుకోవాలి అనిపించలేదు..మళ్ళీ మీరు పరిచయం అయ్యాక ఇది నా మెడలోకి వచ్చింది మళ్ళీ నా సంతోషాలన్నీ ఒక దాని వెనకాల ఒకటి వస్తున్నాయి. విశి చెబుతూ ఉంటే సూర్య మెడలో ఉన్న రింగ్ ని చేతితో పట్టుకొని ఇంకా కొన్ని గంటలే విశి. నీ నోటితో చెప్పించి ఆ చిన్ననాటి స్నేహితుడిని నేనే అని చూపిస్తాను.. సంతోషాలు తిరిగి వస్తున్నప్పుడు ఈ విచారం ఎందుకు. నాన్న గుర్తొచ్చారు. ఎప్పుడు నా చెయ్యి పట్టుకుని నడిపించేవారు అని అరచేతుల్ని చూసుకుంటుంది. ఏ నిమిషమైనా నేను నీ పక్కనే ఉంటాను అని ధైర్యం చెప్పిన నాన్న ఒక్కసారిగా దూరమయ్యేసరికి ఈ చేతులు బలహీన పడిపోయాయి. సూర్య ఏ శబ్దం చేయకుండా విశి చేతులను తన చేతుల్లోకి తీసుకుంటాడు. అతని పట్టులో ఒక అర్థం… ఒక నమ్మకం… ఒక హత్తుకునే వెచ్చదనం ఉంటుంది. సూర్య చాలా మృదువుగా.... ఇక నీ చేతులు బలహీనంగా ఉండవు విశి. నీ నాన్నలా… కాకపోయినా… నిన్ను ధైర్యం చెప్పేలా… నీ పక్కనే నిలబడి ఉండే వాడి అవసరం నీకు ఉన్నప్పుడు.. నేను ఇక్కడే ఉంటాను. అతని స్వరం గుడి గంటల శబ్దంలో కలిసిపోతుంది. ఆ మాటల్లో ఒక తండ్రి ఇచ్చే భరోసా... ఒక స్నేహితుడు ఇచ్చే అండ… ఒక ప్రేమించే మనసు ఇచ్చే అర్థం... అన్నీ ఉంటాయి. విశి కళ్లలో కన్నీరు రాలబోతే.. సూర్య ఆ కన్నీళ్లు తుడిచి.. నీ సంతోషాలు ఇప్పుడు నీవే కాదు విశి… మనిద్దరికీ వస్తున్నాయి. విశి అర్థం కాకుండా చూస్తే అదే నీతో పాటు ఈ గుడికి వచ్చాను కదా అందుకే సంతోషాలు మనిద్దరికీ అని చెబుతున్నాను. విశి ఆ నవ్వులోనే తన బాధ మర్చిపోతుంది. సూర్య మాటల్లో నాన్న ఇచ్చిన ఆ భరోసా… మళ్ళీ తన జీవితంలోకి తిరిగి వచ్చినట్లుగా అనిపిస్తుంది. సూర్య ఆ మాటలు చెప్పిన తర్వాత గుడి మెట్లు మీద ఒక్కసారిగా నిశ్శబ్దం పెరుగుతుంది. గాలి కూడా నెమ్మదిగా వీచుతూ వారి మధ్య ఉన్న ఆ క్షణాన్ని గౌరవించినట్టుగా ఉంటుంది. విశి మాటలు రావట్లేదు. కన్నీళ్లు మాత్రం కళ్ల పొరల్లో నెమ్మదిగా చేరుతున్నాయి. సూర్య ఆమె చేతులను విడిచిపెట్టకుండా... లేచి నిలబడి ఉన్న విశి ని ఒక చిన్న మెట్టుపై కూర్చోమని చిన్నగా చెబుతాడు. విశి నెమ్మదిగా కూర్చుంటోంది. సూర్య కూడా ఆమె పక్కనే.. కానీ తాకకుండా, దూరంగా కాకుండా అచ్చం ఆమెకి సపోర్ట్ అయ్యేంత దూరంలో కూర్చుంటాడు. కొన్ని క్షణాలు ఇద్దరూ ఏ మాటా మాట్లాడరు. వారి శ్వాసలు మాత్రమే వినిపిస్తున్నాయి. గుడి గంటల శబ్దం దూరంగా ఆలపిస్తుంది. విశి తన తలను కాస్త ముందుకు వంచి కన్నీరు చిందకుండా ఆపుకుంటోంది. అది చూసిన సూర్య నెమ్మదిగా ఆమె భుజం వైపు తన చెయ్యిని తీసుకెళ్తాడు… ఒక్క క్షణం ఆపేసి... తన చెయ్యి ఆమెకు నిజంగా సాంత్వనం ఇస్తుందా అని అన్నట్టు నిశ్శబ్దంగా చూస్తాడు. విశి మాత్రం నెమ్మదిగా స్వల్పంగా తన భుజం అతని వైపు వాలుస్తుంది. అదొక్క సంకేతమే సూర్యకి. సూర్య తన చేతిని ఆమె భుజంపై సున్నితంగా ఉంచుతాడు. ఏ ఒత్తిడి లేకుండా, ఒక భరోసా ఉన్న స్పర్శలా. విశి కళ్లలోంచి చిన్నచిన్న కన్నీటి బిందువులు జారిపడతాయి… కానీ ఈసారి అవి బాధ కన్నీళ్లు కావు.. విడిచిపెట్టిన బాధ... చేరుకున్న సాంత్వనం. సూర్య ఏ మాట మాట్లాడడు. విశి ఏడుపు వినిపించకపోయినా ఆమె శ్వాసలోని వణుకు అతనికి తెలిసిపోతుంది. అతను నెమ్మదిగా తన బొటనవేలు తో ఆమె భుజంపై చిన్న సర్కిల్స్ వేస్తాడు.. ఆ మాటలకన్నా గొప్ప ఓదార్పు. కొద్దిసేపటికి విశి తన కళ్లను మూసుకుని సూర్య భుజంపై తలను వాలుస్తుంది. ఆ వాలుడు... తన నాన్న చెయ్యి కోల్పోయిన తర్వాత మొదటిసారి ఎవరిదో ఆధారంగా అనిపించే క్షణం. సూర్య తల కిందికి వంచి ఆమె తలపైకి చూడుతూ ఒక చిన్న, ప్రశాంతమైన చిరునవ్వు ఇస్తాడు. నేను ఉన్నా… నువ్వు ఒంటరిగా లేవు అని ఆయన కళ్లే చెబుతున్నట్టు. ఆ ఇద్దరి చుట్టూ గాలి కూడా కొంచెం వెచ్చగా అనిపిస్తుంది. అలా మాటల్లేకుండా… వారి హృదయాలు మాట్లాడుతాయి. విశి కాసేపటికి తేరుకుంది అనుకున్నాక ఇక వెళదామా అని అడుగుతాడు. హ్మ్.. అనిల్ లేచి నిలబడుతుంది. విశి నడుస్తూ ఉంటే.. దూరంగా, దగ్గరగా కానీ రక్షణలా ఉన్న సైడ్ లో నడుస్తాడు. వాళ్లు నడుస్తూ ఉంటే ఒక చిన్న పిల్ల అమ్మాయి అకస్మాత్తుగా జారిపడుతుంది. విశిష్ట వెంటనే రియాక్ట్ అయ్యి ఆమెను పట్టుకుంటుంది. సూర్య కాసేపు ఆశ్చర్యంగా చూసి... హీరోయిన్ క్వాలిటీస్ స్లోలీ బయటకు వస్తున్నాయ్. ఇది హీరోయిజం కాదు... ఒక మనిషిగా మరో మనిషికి చేస్తున్న సాయం. అవునా అని నవ్వుకుంటాడు విశి పూర్తిగా నార్మల్ అయ్యింది అని మనసు తేలిక పడుతుంది. ఇద్దరూ మెట్లకి హమ్మయ్య అనుకుని చూస్తూ ఉంటారు. సరే ముందు రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యి అప్పుడు గుడికి వెళదాము అదే రూమ్ కి వెళ్తారు. రూమ్ కి వెళ్ళేటప్పటికి బైక్ అక్కడే ఉంటుంది. అరె సార్ మీరు చెప్పినట్టుగా బైకు వచ్చేసింది. మీకు మాయలు మంత్రాలు తెలుసా. దీనికి కూడా మాయలు.. మంత్రాలు కావాలా.. కాల్ చేసాము. బైక్ తెచ్చేవాళ్ళు తెచ్చి పెట్టేసారు అంతే.. పద స్నానాలు చేద్దాము అని రూమ్ కి తీసుకు వెళతాడు. ఇద్దరు స్నానం చేసి రెడీ అవుతారు. విశిష్ట చిలకపచ్చ రంగు పట్టు చీర కట్టుకుంటే.. సూర్య పట్టు పంచే, బనేను వేసుకుని పట్టు కండువా చుట్టూ కప్పుకుంటాడు. ఒకరినొకరు అలా చూస్తూ నిలబడిపోతారు. చూపులు కలిసిన శుభవేళ......
01-05-2026, 11:55 AM
Part - 98
ఎంతసేపు నిలబడి చూస్తూ ఉన్న ఇద్దరికీ తనివి తీరడం లేదు. తలుపు కొడుతున్న శబ్దం వినపడి ఈ లోకంలోనికి వస్తారు.
ఇద్దరూ ఒకరినొకరు ఇబ్బందిగా చూసుకొని నవ్వుకుంటారు. సూర్య వెళ్లి తలుపు తీస్తే... సార్ మిమ్మల్ని గుడికి తీసుకువెళ్లి పూజ ఏర్పాట్లు చూడడానికి వచ్చాము. సరే పదండి అని.. విశి కం అంటే సార్ ఇలాగంటే చాలా ఖర్చవుతుంది కదా... ఇక్కడ నా ఫ్రెండ్ కి రిలేటివ్స్ ఉన్నారు. అరేంజ్ చేశాడు అని చెబితే... అవునా అని సూర్య వెనకాలే వెళుతుంది. నేను ఏది చెప్పినా నమ్మేస్తావా... అది నిజమా కాదా అని అడగవా.. అడగవలసిన అవసరం లేదు సార్ పదండి అంటుంది అంత నమ్మకం ఏమిటో.. ఆ నమ్మకం ఉంది కాబట్టే మీతో ఇంత దూరం వచ్చాను ఇంకా ప్రశ్నలు ఆపీ దర్శనానికి పదండి అని నవ్వుతుంది. దీపాల వెలుగు, గంటల మోగుతున్న శబ్దం… ఇద్దరు జంటగా వెళుతూ ఉంటారు స్వామి ముందుకు వెళ్లగానే.. విశిష్ట చేతులు కలిపి నమస్కారం చేస్తోంది. సూర్య ఆమెను చూస్తూ నెమ్మదిగా తన చూపు కిందకు వంచి నమస్కారం చేస్తాడు. కాసేపు వారిద్దరూ పక్కపక్కనే నిశ్శబ్దంగా నిలబడుతారు. పూజారి తులసి తీర్థం ఇస్తాడు. తులసి మాల విశిష్ట చేతికి ఇచ్చి సూర్యకి వేయమని చెబుతారు. విశిష్ట రెండు చేతులతో తీసుకుని సూర్య వైపు చూస్తుంది. మెల్లిగా వేసుకో… పూజారి గారు చెప్పింది నీకు వినపడలేదు అనుకుంటా నీ చేతులతో నా మెడలో వేయమన్నారు. ఆ మాటలకి విశి బుగ్గలు సిగ్గుతో కందిపోతాయి. చేతులు వణుకుతూ ఉంటాయి. ఆ సిగ్గుని ఎంజాయ్ చేస్తూ ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక.. ఆమె చేతుల్లోనుంచి తులసి మాల ని తీసుకుంటూ అతని వేళ్లు ఆమె వేళ్లను కేవలం ఒక సెకను తాకుతాయి… విశిష్ట గుండె లైట్‌గా జారిపోతుంది. వాళ్లు సైడ్ కారిడోర్ లో నిలబడి ఉంటారు. బాక్గ్రౌండ్ లో మంత్రాలు వినపడుతూ ఉంటాయి. నిజం చెప్పానా విశి.. హ్మ్.. నీతో ఇక్కడ ఇలా నిలబడ్డానంటే… చాలా ప్రశాంతంగా ఆశ్చర్యంగా ఉంది. విశి సూర్య వైపు చూస్తూ నాకు అలాగే ఉంది. ప్రసాదం తీసుకున్న తర్వాత వాళ్ళని తీసుకు వచ్చిన వాళ్ళకి థాంక్స్ చెప్పి ఒకచోట కూర్చుంటారు.. ఇద్దరూ కలిసి దిగువ మెట్లు వైపు నడుస్తారు. సైలెంట్.. ప్రశాంతత కానీ చాలా దగ్గరగా.. వాళ్లు మెట్లు దిగుతున్నప్పుడు విశిష్ట ప్రసాదం కవర్ తీసి ఓ చిన్న ముక్క తీసుకుంటుంది. సూర్య చేతిలోని కవర్ ఆమెకు చూపిస్తూ... నువ్వు తీసుకో… నా దగ్గర కూడా ఉంది. కానీ సూర్య మనసులో విశి చేతిలో ఉన్న కొంచెం ప్రసాదం లోనే షేర్ చేసుకోవాలని ఉంటుంది. అవసరం లేదు… ఇంత చిన్నది. కలిపి షేర్ చేసుకున్నాకే టేస్ట్ బాగుంటుంది తలవంచుకుని చెబుతుంది. సూర్య విశి వైపు తిరిగి... షేర్ …? నువ్వు నిజమే చెబుతున్నావా అని వస్తున్నా ఆనందాన్ని అనిచిపెట్టి అడుగుతాడు. కళ్ళు మాత్రమే పైకి ఎత్తి అలా ఎందుకనుకుంటున్నారు. అంటే నీ చేతిలో చాలా తక్కువ ఉంది కదా.. అదే నాకు షేర్ చేస్తాను అంటే డౌట్ వచ్చి... మీకు ఇష్టమైతేనే తీసుకోండి అని చేయి వెనక్కి తీసుకోబోతుంది. వెంటనే చెయ్యి పట్టుకుని అందులో ప్రసాదం నోట్లో వేసుకుంటాడు. టెంపుల్ ఎంట్రన్స్ పక్కన వచ్చే గోడ ముందు సన్ ఫ్లవర్ యెల్లో లైట్ పడుతుంది. సూర్య ఫోన్ తీసి... ఫొటోస్ తీసుకుందాం? టెంపుల్ లో సెల్ఫీస్ తీసుకోకూడదు. టెంపుల్ లో కాదు మేడం.. పక్కన ఈ షాడో గ్లో లో తీసుకుందాం.. సూర్య కెమెరా అడ్జస్ట్ చేస్తూ.. స్మైల్ … కానీ టూ మచ్ కాదు. చిన్నగా స్మైల్ చేస్తుంది. చీరలో తలలో పువ్వులతో.. సూర్య మనసు కొల్లగొడుతుంది. క్లిక్. క్లిక్. ఓసారి ఫోన్ స్క్రీన్ చూపిస్తాడు. యాక్టుల్లి … ఒకే గానే వచ్చింది. ఒకే కాదు. నెక్స్ట్ వన్ … నాతో కలిపి. విశి కళ్ళల్లో మెరుపు కానీ సూర్య మనసులో ఏముందో తెలుసుకోవాలి అని ఏం… ఫ్రెండ్షిప్ మూమెంట్. రిలాక్స్ … రెస్పెక్ట్ఫుల్ డిస్టెన్స్ మైంటైన్ చేస్తా. సెల్ఫీ లో ఇద్దరి ఫేసస్ దగ్గరగా కాకపోయినా… బాక్గ్రౌండ్ గ్లో వాళ్ల క్లోసనెస్ ను చాలా దగ్గరగా చూపిస్తుంది. క్యూట్. ఫోటో గురించా... అవును… మోస్టలీ. విశిష్ట ఉలిక్కిపడి మాట మారుస్తుంది. ప్రసాదం ఫినిష్ అయిన వెంటనే, వాళ్లు చెప్పులు వేసుకుంటూ ఉంటారు. టెంపుల్ లోకి వచ్చిన తర్వాత నీవు ఏదో డిఫరెంట్ గా ఉన్నావు. ఎలా? సాఫ్ట్. కామ్. నాతో ఏదైనా చెప్పాలా అని ఆపోజిట్ లో నడుస్తూ అడుగుతాడు. విశిష్ట కళ్ళు గుండ్రంగా తిప్పుతూ సరే… ఇప్పుడే రోడ్ కి వచ్చాం. బ్యాక్ టు నార్మల్. సూర్య నవ్వుకుంటూ నడుస్తాడు. కొన్ని అడుగులు నడిచి అకస్మాత్తుగా ఆగి.. ఒక్క నిమిషం. అతను తన జుట్టు సరిచేసుకుని, ఆమె షోల్డర్ దగ్గర ఒక చిన్న పూల రేకు పడినట్టు తీసి... ఇది… నిన్ను డిస్టర్బ్ చేస్తోంది. విశిష్ట గుండె కొట్టుకుంటూ, మాట తడబడుతూ ... అది పూలరేకే కదా మీరెందుకు తీస్తున్నారు. ఎందుకంటే… నన్నే నమ్మి వదిలేశావుగా.... అని అర్ధం కానంత నెమ్మదిగా చెప్పి ముందుకు నడుస్తాడు. విశిష్ట అక్కడే రెండు సెకన్లు నిలబడి... అలాగే చూస్తూ ఉండిపోతుంది. నిలబడింది చాలు గానీ రా అని పిలుస్తాడు. రూమ్ కి వచ్చి ఫ్రెష్ అయ్యి ఒకరు మంచం మీద, మరొకరు కుర్చీలో సెటిల్ అవుతారు. బయట అక్కడక్కడా వచ్చిన గుడి గంటల శబ్దం. గదిలో డిం యెల్లో లైట్ … ఒకే ఫ్యాన్ స్టేడీ గా తిరుగుతూ… ఆ సైలెన్స్ లో వాళ్లిద్దరే ఉన్నట్టు అనిపిస్తుంది. సూర్య చూపు నుంచి తప్పించుకోవాలని తప్పించుకోవాలని... విశిష్ట విండో దగ్గర నిలబడి బయటకు చూస్తోంది. అన్నవరం హిల్ లైట్స్ అలా పూసిన ఫైర్ ఫ్లైస్ లాగా మెరుస్తున్నాయి. సూర్య ఆమెను చూసి కాసేపు ఏమీ మాట్లాడకుండా నిలబడతాడు. ఆమె నిశ్శబ్దం అతనిలోని నిగ్రహానికి పరీక్ష పెడుతూ ఉంటుంది. సూర్య కష్టంగా అలసిపోయావా అని అడుగుతాడు. విశిష్ట నవ్వి కొంచెం. కానీ ఈ అలసట బాగుంది ప్రశాంతంగా అనిపిస్తుంది. సూర్య కుర్చీలో కూర్చుని ఆమె వైపు చూస్తూ ఉంటాడు. విశిష్ట జడ విప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది. జడ చిన్నగా ముడిపడి విప్పుకోవడానికి అవస్థలు పడుతూ ఉంటుంది. విశి అవస్థ ద చూసి సూర్యా మెల్లిగా దగ్గరికి వస్తాడు. ఇస్తావా.. ఏమిటి.. నీ జడతో ఇబ్బంది పడుతున్నావు కదా హెల్ప్ చేస్తాను. మీరు.. అవును. డోంట్ వర్రీ. నేను ఏం నీ జడని చిక్కులు చెయ్యను. విశిష్ట జడను వెనక్కి వేస్తుంది. ఆ బ్రాడ్ నెక్ పైన ఉన్న జడ ని చూసి సూర్యాకి చెమటలు పడతాయి. అతను చాలా నెమ్మదిగా.. విశి ఇబ్బంది పడకుండా ఆ చిక్కులన్నీ వేళ్ళతో తీస్తాడు. ఆమెకు అతని శ్వాస కూడా ఫీల్ కాకుండా... సూర్య చాలా రెస్పెక్ట్ఫుల్ డిస్టెన్స్ మైంటైన్ చేస్తాడు. ఇదిగో… అయిపోయింది. విశిష్ట.చిన్నగా థాంక్స్ … ఆ ఒక్క మృదువైన స్పర్శ.. ఆ ఒక్క నిశ్శబ్దమైన దగ్గరతనం. ఆమె హృదయ స్పందనని పరుగులు పెట్టించింది. రూమ్ లో ఒక బెడ్, ఒక సోఫా.. మీరు మంచం మీద పడుకోండి నేను సోఫాలో పడుకుంటాను. అవసరం లేదు. నాకు సోఫా సరిపోతుంది నీకే నిద్రంటే ప్రాణం అని నవ్వుతాడు. ఆ మాటకి బుంగమూతి పెట్టుకొని డ్రైవింగ్ చేసేది మీరు అలాంటప్పుడు రెస్ట్ కావాల్సింది మీకే కదా.. నేను ఎలా ఉన్నా అడ్జస్ట్ అవ్వగలను కానీ అతి సుకుమారివి నువ్వే అడ్జస్ట్ అవ్వగలవా.. ఆ మాటతో ఆమె ఒక సెకను మాటేరాని బొమ్మ అవుతుంది ప్రతి మాటలోనూ ప్రతి చర్యలోనూ తన తండ్రి గుర్తుకు వస్తున్నాడు ఇది ఒక అద్భుతమే కదా అనుకుంటూ చూస్తూ ఉంటుంది. లైట్స్ ఆఫ్ చేసి విండో నుంచి వచ్చే చందమామ వెలుగుని చూస్తూ మాట్లాదూకుంటారు. చాలా థాంక్స్ సార్. దేనికి. ఎందుకో మీకు తెలుసు. కానీ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకో... ఆ థాంక్స్ మనిద్దరి మధ్యన దూరం పెంచుతుంది. నీకు కావాలేమో గాని నాకు అక్కర్లేదు అని తన మనసులో మాట చెప్పకనే చెబుతాడు. విశిష్ట బ్లష్ అవుతుంది. ఆమె సైలెంట్ గా నవ్వుతుంది. కళ్ళు మూతలు పడుతూ ఉంటే వారిద్దరి మధ్యన సైలెన్స్ ముందుకు వెళ్ళను అని మారం చేస్తూ ఉంటుంది. గుడ్ నైట్ … సార్ గుడ్ నైట్... విశి. ఇద్దరూ నిద్రపోయినా… ఆ రాత్రి వాళ్లు దూరంగా కాదు. శబ్ధం లేకుండా దగ్గరయ్యారు. గది నిశ్శబ్దంగా ఉంది. ఫ్యాన్ శబ్దం స్టేడీ … బయటి నుంచి వచ్చే టెంపుల్ హిల్ బ్రీజీ కిటికీని కొంచెం కొట్టుకుంటోంది. విశిష్ట పడుకున్నా నిద్ర మాత్రం రాదు. గుండెల్లో ఏదో తెలియని కొత్త బరువు. ఇది కొత్త ప్లేస్ అవడం వలన లేక దేవ సార్ తో ఉండడం వలన.. మే బి సార్ వలన ఏమో.. కొంతసేపు తిరుగుతూ చివరికి మెల్లగా సోఫా వైపు చూస్తుంది. సూర్య అక్కడ నిద్రలో.. ఒక చేతిని తలకి వెనక పెట్టుకుని.. నిద్రపోతూ ఉంటాడు ఆ శ్వాస చెబుతూ ఉంది సూర్య డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోయాడు అని. సూర్యని అలా చూడగానే విశికి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కానీ ఆ ప్రశాంతతలో తెలియని అలజడి. సార్ రోజు రోజుకి నాకు తెలియకుండానే మీకు దగ్గర అయిపోతున్నాను. నచ్చేస్తున్నారు. ఎంతగా అంటే ఆలోచిస్తూ మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఈ నిమిషం ఇలా మీ దగ్గరికి వచ్చి గట్టిగా హత్తుకుని ఐ లవ్ యు సార్ అని చెప్పాలని ఉంది. చెప్పాక మీరు ఏమనుకుంటారో అని భయంగా ఉంది కానీ ఎలాగైనా సరే ఈ కొండపైన మీకు నేను ప్రపోజ్ చేస్తాను నా ప్రేమ మొత్తం చూపిస్తాను. విశి కోరిక తీరుతుందా........... |
|
« Next Oldest | Next Newest »
|