Thread Rating:
  • 7 Vote(s) - 4.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller రుద్రం భజే! ( POWER OF YODHA )
#21
Excellent buildup of story
[+] 2 users Like Sunny73's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
Sooper story. Chala bagundi. Thanks Sivagaru
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
#23
Excellent update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
#24
Super update
[+] 1 user Likes sri012015's post
Like Reply
#25
రుద్రం భజే! ఎపిసోడ్ - 6



ఇంట్లో ఉన్న దీప్తి వాళ్ళ దగ్గరకి వచ్చి తన పేరు జీతిన్ ఏజెంట్ అని పరిచయం చేసుకొని యోధ గురించి వివరంగా చెప్పి ఉదయం బయలుదేరడానికి రెడీగా ఉండండి మిషన్స్ జాగ్రత్తగా పెట్టుకోండి  ఏమాత్రం అనుమానం వచ్చినా యోధ కనిపెట్టేస్తాడు అని చెప్పాడు.

************

జితేన్ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఫోన్ తీసి నాయక్ కి కాల్ చేసింది దీప్తి.

ఫోన్ లిఫ్ట్ చేసి "హాయ్ బేబీ జితిన్ కలిసాడా..?" అని అడిగాడు నాయక్.

"యా.. ఇప్పుడే మాట్లాడాము, డాడ్! ఇక్కడ యోధ ఉండగా మేము రావాల్సిన అవసరం ఏముంది తనకి ఒక్క మాట చెపితే చాలు ఆ వస్తువు ఎక్కడ ఉన్నా సరే తీసుకువచ్చి మీ చేతిలో పెడతాడు." అని చెప్పింది దీప్తి.

"ఆ విషయం నాకు కూడా తెలుసు! యోధ హనుమంతుడు లాంటివాడు చూసి రమ్మంటే కాల్చి వస్తాడు ఇది చాలా సెన్సిటివ్ మేటర్!

అది కాకుండా ఇది దైవ మహిమ లేక అనుకోకుండా జరుగుతుందో నాకు తెలియదు ఈ కేసుతో లింక్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ వస్తువు గురించి తెలుస్తుంది అని నాకు అనిపించింది.

ఎందుకంటే 25 సంవత్సరాలుగా ఎవరికి దొరకని ఆ కెమెరా ఇప్పుడు యోధకి దొరికింది. అలాగే ఆ వస్తువు గురించి కూడా నీకు నీతూ కి తెలుస్తుంది అనుకుంటున్నాను." అని చెప్పాడు నాయక్.

ఆ మాటకి కాసేపు ఆలోచించి "ఈ కేసుతో నాకు నీతూ కి లింక్ ఏమిటి?" అని డౌట్ గా అడిగింది దీప్తి.

"ఆ విషయం మీరు ఆ వస్తువుని సంపాదించి దాని గురించి తెలుసుకున్న తర్వాత వివరంగా చెబుతాను, బెస్ట్ ఆఫ్ లక్!" అని చెప్పి ఫోన్ పెట్టేసాడు నాయక్.

ఫోన్ పెట్టేసి నీతూ వైపు చూసి "ఈ మిలటరీ వాళ్ళు ఉన్నారే ఏ విషయం క్లారిటీగా చెప్పరు." అని చెప్పింది దీప్తి.

"ఆ విషయం నిజమే! కానీ వాళ్లు క్లారిటీగా చెప్తే కొన్ని విషయాలు విని మనం తట్టుకోలేము." అని చెప్పి అక్కడికి గౌరీ రావడం చూసి "హాయ్!" అని చెప్పింది నీతూ.

****************

అదే సమయంలో హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ముంబై నుంచి వచ్చిన ఫ్లైట్ ల్యాండ్ అవ్వడంతో బయటికి వస్తున్న జనాల వైపు చూస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి.

అతని దగ్గరికి వచ్చి "మిస్టర్ అజీజ్! చీప్ గా టాక్సీ దొరుకుతుందా..?" అని అడిగాడు సూట్ లో స్టైల్ గా ఉన్న ఒక వ్యక్తి.

ఆ మాట విని "రెడీగా ఉంది రండి." అని లగేజ్ తీసుకుని కార్ దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడనుంచి వెళుతు "మీర్జా బాయ్! మిమ్మల్ని నేను గుర్తు పట్టలేదు చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది కదా మీరు పంపించిన కోడ్ బాగా ఉపయోగపడింది."  అని నవ్వుతూ చెప్పాడు అజిజ్.

"నన్ను గుర్తుపట్టలేదు కాబట్టి  నువ్వు ఇంకా బతికి ఉన్నావు, బ్రహ్మం ఎలా ఉన్నాడు.?" అని అడిగాడు మీర్జా.

"అచ్చ బాయ్! మీకోసం గెస్ట్ హౌస్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు." అని చెప్పాడు అజిజ్.

కాసేపటికి గెస్ట్ హౌస్ దగ్గర కార్ ఆగడంతో వెళ్లి డోర్ ఓపెన్ చేసి లోపల ఉన్న మనిషి వైపు చూసి "నమస్తే మీర్జా భాయ్" వెల్కమ్ టు హైదరాబాద్!" అని చెప్పాడు బ్రహ్మం.

కారులో నుంచి కిందకు దిగుతూ "ఏంటి? చాలా సంవత్సరాల తర్వాత చూసినా నన్ను బానే గుర్తుపట్టావు." అని అడిగాడు మీర్జా.

"బాయ్! నిజం చెప్పనా..? అజిజ్ వెళ్ళింది మిమ్మల్ని తీసుకురావడానికి ఏ కదా, ఈ కారులో మీతో పాటు ఎక్కే ధైర్యం కూడా ఎవరు చేయరు అందుకే చూడగానే గుర్తు పట్టినట్లు యాక్షన్ చేశాను." అని నవ్వుతూ చెప్పాడు బ్రహ్మం.

"గుడ్! నిజం ఒప్పుకుని ప్రాణాలు కాపాడుకున్నావు ఇంతకీ నేను పంపించిన లొకేషన్ తెలుసుకున్నారా..?" అని అడిగాడు మీర్జా.

"ఆ ఏరియాలో ఆల్రెడీ మన టీమ్ దిగింది బాయ్! విషయం ఏమిటో చెబితే వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తాను ఒక్కరోజులో పని క్లోజ్ చేసుకుని వచ్చేస్తారు చాకు లాంటి కుర్రాళ్ళని పంపించాను." అని చెప్పాడు బ్రహ్మం.

"అవునా?" అని తన దగ్గర ఉన్న ఫోటో చూపించి "ఈ వస్తువు 25 సంవత్సరాల క్రితం అక్కడ మిస్ అయింది దానిని వెతికి పట్టుకోవాలి ఒకరోజులో అయిపోతుందా..?" అని అడిగాడు మీర్జా.

ఆ ఫోటో చూస్తూ "ఏంటి బాయ్! మీరు మాట్లాడేది 25 సంవత్సరాల క్రితం పోయిన వస్తువుని ఇప్పుడు మనం వెతకాల? అసలు అక్కడ ఉందో లేకపోతే ఎవరికైనా దొరికితే పట్టుకుపోయారో ఈ డీల్ మనం తీసుకోవడం కూడా టైం వేస్ట్ బాయ్!" అని చెప్పాడు అజిజ్.

"ఈ కాంట్రాక్టు మనకి ఇచ్చిన వాళ్ళకి ఆ వస్తువు ఆ ఏరియా లోనే ఉన్నట్లు సిగ్నల్ అందింది. కానీ ఎక్కడ ఉందో కన్ఫామ్ గా చెప్పలేకపోతున్నారు, నేను ఎలాగైనా దానిని పట్టుకుని వస్తాను అని మాట ఇచ్చాను." అని చెప్పాడు మీర్జా.

"అసలు ఇది ఏమిటి బాయ్! చూడడానికి ఏదో చిన్న ప్లేట్ లాగా ఉంది దానికోసం నువ్వు రంగంలోకి దిగాల్సిన పని ఏముంది?" అని డౌట్ గా అడిగాడు బ్రహ్మం.

"ఆ వస్తువు తీసుకువెళ్లి వాళ్ళ చేతిలో పెడితే మన అకౌంట్ లో...!" అని చెప్పడం ఆపి "మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు?" అని అడిగాడు మీర్జా.

"నువ్వు మినిమం 10 కోట్లు లేకుండా అడుగు బయటకు పెట్టవు ఆ విషయం నాకు తెలుసు!" అని నవ్వుతూ చెప్పాడు బ్రహ్మం.

ఆ మాటకి పగలబడి నవ్వుతూ "నీ కింద ఎంతమంది మనుషులు ఉన్నారు?" అని అడిగాడు మీర్జా.

"నా గ్యాంగ్ లో ఎటువంటి పనినైనా చేయగలిగిన వాళ్ళు  వందమంది ఉన్నారు బాయ్ చిల్లర రౌడీలు అయితే లెక్కేలేదు." అని గొప్పగా చెప్పాడు బ్రహ్మం.

"ఆ వస్తువు నువ్వు కనిపెడితే నీ దగ్గర ఉన్న ఒక్కొక్కడికి కోటి రూపాయలు ఇస్తాను, మీ ఇద్దరికీ చేరుకో 50 కోట్లు ఇస్తాను మొత్తం రెండు వందల కోట్లు సరిపోతుందా..?" అని అడిగాడు మీర్జా.

ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ "భాయ్! నువ్వు అదే మాట మీద ఉండు ఈరోజు నుంచి మా కుర్రాళ్ళ పని మా పని ఆ వస్తువుని కనిపెట్టడమే!" అని సంతోషంగా చెప్పాడు అజిజ్.

"బాయ్! నాకు ఒక చిన్న డౌట్, ఇంత చిన్న వస్తువుకి అంత పెద్ద అమౌంట్ ఇస్తున్నారు ఇంతకీ ఇది దేనికి ఉపయోగపడుతుంది?" అని అనుమానంగా అడిగాడు బ్రహ్మం.

"ఈ కాంట్రాక్ట్ ఫస్ట్ ఇబ్రహీం దగ్గరకు వెళ్ళింది దీని డీటెయిల్స్ తెలుసుకోవడానికి ట్రై చేశాడు సడన్గా యాక్సిడెంట్ లో చనిపోయాడు ఇంకా నీకు డీటెయిల్స్ కావాలా..?" అని అడిగాడు మీర్జా

ఆ మాటకి భయంగా చూస్తూ "అవసరం లేదు బాయ్! నాకు డబ్బులే కావాలి, డీటెయిల్స్ మొత్తం ఇవ్వండి మా కుర్రాళ్ళకి పంపిస్తాను." అని ఫోన్ తీసి కాల్ చేశాడు అజిజ్.

జీప్ లో వెళుతూ ఫోన్ రింగ్ అవ్వడం చూసి "అజిజ్ బాయ్ కాల్ చేస్తున్నాడు స్లో చేయరా..!" అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసి "నమస్తే బాయ్! మీరు చెప్పిన ఏరియాకి వెళుతున్నాము ఇంతకీ పనేమిటో చెప్పలేదు." అని అడిగాడు కార్లో ఉన్న వ్యక్తి.

"ఒరేయ్ సత్తి! నీకు ఒక ఫోటో పంపించాను దాంట్లో కనిపించే వస్తువు ఏ ఏరియాలో మిస్ అయ్యిందో  డీటెయిల్స్ పంపించాను, ఆది కచ్చితంగా అక్కడే ఉంది దానిని కనిపెడితే మనిషికి కోటి రూపాయలు!" అని చెప్పాడు అజిజ్.

"బాయ్! ఇలాంటి ఆఫర్ ఇప్పటీవరకు నేను వినలేదు ఆ ఫోటోలో ఉన్న వస్తువు దొరికే వరకు ఈ ఏరియాలోనే ఉంటాము." అని సంతోషంగా చెప్పాడు సత్తి.

"రెండు రోజుల్లో మేము కూడా రంగంలోకి దిగుతున్నాము ఈలోపు ఆ ఏరియా మొత్తం ఒక్క రౌండ్ వేయండి విషయం చాలా సీక్రెట్ గా ఉండాలి." అని చెప్పాడు అజిజ్.

"ఓకే బాయ్!" అని చెప్పి ఫోన్ పెట్టేసి జీప్ లో ఉన్న తన మనుషులు వైపు తిరిగి "ఒరేయ్! ఈ ఫోటోలో కనిపించే వస్తువు సంపాదిస్తే మనిషికి కోటి రూపాయలు అంట!" అని సంతోషంగా చూస్తూ చెప్పాడు సత్తి.

ఆ మాట విని మొబైల్ లాక్కుని ఫోటో వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు అందరు.

*************

జీజ్ యాంగ్ ఏరియా ఉన్న చైనా ఆర్మీ పోస్టు దగ్గరకి వచ్చి అక్కడ ఉన్న జింగ్ వైపు చూసి "మనం ప్రయోగం కోసం వెతుకుతున్న ఆ ఐటమ్ ఎలా ఉంటుందో ఇండియన్ ఆర్మీకి తెలిసింది." అని చెప్పాడు మిలిటరీ జనరల్ చింగ్ యా.

ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "ఆ ఐటమ్ ఎలా ఉంటుందో మనవాళ్ళకే సరిగ్గా తెలియదు వాళ్లకి ఎలా తెలిసింది? మనం చేసే ప్రయోగం గురించి కూడా తెలిసిపోయిందా..?" అని కంగారుగా అడిగాడు జింగ్.

"పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రెండు దేశాలు కలిసి ఏదో ఒక ప్రయోగం చేస్తున్నాయి దానికి కావాల్సిన ఐటమ్ అది అని మాత్రమే వాళ్ళకి తెలుసు!

ఒకవేళ ప్రయోగం గురించి కూడా వివరాలు తెలిస్తే ఖచ్చితంగా అంతర్జాతీయ సదస్సులో దాని గురించి మాట్లాడేవారు, మాట్లాడలేదు కాబట్టి వాళ్లకి పూర్తి వివరాలు వాళ్ళకి తెలియదు." అని చెప్పాడు చింగ్ యా.

"ఆరోజు ఇండియన్ ఏంజెంట్ నా దగ్గర నుంచి తీసుకెళ్లిన ఫైల్ ఢీకొట్ చేస్తే మనం చేసే ప్రయోగం గురించి వాళ్లు కచ్చితంగా కనిపెడతారు." అని చెప్పాడు జింగ్.

"ఇండియన్ ఆర్మీ దీని గురించి తెలుసుకునే లోపల మనం  ఈ ప్రయోగం కంప్లీట్ చేయాలి ఇండియాలో మనకి వచ్చిన సిగ్నల్ ని బట్టి అక్కడకి ఒక టీమ్ ని పంపించాను, ఇక్కడ కూడా వెతకడం స్పీడ్ చేయండి ఎలాగైనా మనం అనుకున్నది సాధించాలి." అని చెప్పాడు చింగ్ యా.

"ఓకే జనరల్! ఈరోజే కొత్త మిషన్ రీ దిగింది ఆ ఐటమ్ ఎంత లోతులో ఉన్నాయి కొండల లోపల ఉన్న కనిపెడుతుంది. మీరు టిబెట్ ని కంట్రోల్ చేయండి చాలు మనం వాళ్ళ పని సాఫీగా అయిపోతుంది." అని చెప్పాడు జింగ్.

అక్కడికి వస్తూ "ఆ ప్రయోగం వల్ల నా దేశానికీ ఏ లాభం లేకపోయినా పర్వాలేదు నాకేమైనా లాభం ఉంటుందా..?" అని అడిగాడు పాకిస్తాన్ మిలటరీ జనరల్ సయ్యద్.

"కచ్చితంగా ఉంటుంది అందుకే కదా ఆ ప్రయోగం మీ దేశంలో చేసేది ఆది కనుక సక్సెస్ అయితే నువ్వు ఎక్కడో ఉంటావు." అని చెప్పాడు చింగ్ యా.
[+] 6 users Like SivaSai's post
Like Reply
#26
రుద్రం భజే! ఎపిసోడ్ - 7

చైనా ఆర్మీ పోస్ట్ లో ఉన్న జింగ్ దగ్గరికి వచ్చి మన దగ్గర మిస్ అయిన ఐటమ్ ఎలా ఉంటుందో ఇండియన్ ఆర్మీకి తెలిసిపోయింది  వాళ్లకు మన ప్రయోగం గురించి తెలిసేలోపు మనం అనుకున్నది ఎలాగైనా సాధించాలి  అని చెప్పాడు మిలటరీ జనరల్  చింగ్ యా.

******************

అరవకొండ ఉదయం గుడి దగ్గరికి వెళ్లి "యోధ! ఢిల్లీ నుంచి వచ్చిన అమ్మాయిలు బయటకు వెళ్లడానికి రెడీగా ఉన్నారు నువ్వు రావడమే లేట్!" అని చెప్పాడు జితిన్.

"నువ్వు ఉన్నావు కదా మళ్ళీ నేను ఎందుకు?" అని చెప్పాడు యోధ.

అక్కడికి వస్తు "డాడ్! ఇక్కడికి వచ్చే ముందే చెప్పారు నీ హెల్ప్ తీసుకుని మాత్రమే బయటికి వెళ్ళమన్నారు నువ్వు రాను అంటే చెప్పు డాడ్ కి కాల్ చేస్తాను." అని చెప్పింది దీప్తి.

"సార్ ఆర్డర్స్  ఫాలో చేయకుండా ఎప్పుడు లేను." అని చెప్పి ఇంటి లోపల వెళ్లి డ్రస్ చేంజ్ చేసుకుని వచ్చి కార్ ఫ్రంట్ సీట్ లో కూర్చున్నాడు యోధ.

కార్లో వెళుతూ "సార్ ఆర్డర్ ఫాలో చేయకుండా ఎప్పుడూ లేను అని చెప్పావు, మరి బోర్డర్లో ఫాలో చెయ్యకపోవడం వల్లే కదా సస్పెండ్ అయ్యావు?" అని అడిగింది నీతూ.

"ఆరోజు భగవంతుడి ఆర్డర్ ఫాలో అయ్యాను ఆ ప్లేస్లో నాయక్ సార్ ఉన్న అలానే చేసేవారు." అని చెప్పాడు యోధ.

సీట్లో కొంచెం ముందుకు జరిగి యోధ మజిల్స్ మీద నొక్కుతూ "నీ బాడీ ఇంత స్ట్రాంగ్ గా ఉంది ఏం తింటావు?" అని ఆశ్చర్యగా చూస్తూ అడిగింది పూజ.

"నువ్వు కూడా నాలాగే తయారవ్వాలి అనుకుంటున్నావా? ఆర్మీలో జాయిన్ అవుతాను అంటే చెప్పు ట్రైనింగ్ ఇస్తాను." అని అడిగాడు యోధ.

"నేను అంత రిస్క్ చేయలేను అంతరిక్షం లోకి చూసుకుంటూ హ్యాపీ గా జీవితం గడిచిపోతే చాలు!" అని చెప్పింది పూజా.

ఆ మాటకి నవ్వుతూ "కొన్ని సంవత్సరాల తరువాత అక్కడ కూడా యుద్ధలు మొదలవుతాయి." అని చెప్పాడు యోధ.

"ఆ మటనిజమే! ఇప్పటికే స్పేస్ మొత్తం సాటిలైట్స్ తో నిండిపోయింది కొత్త సాటిలైట్స్ పెట్టుకోవడానికి ప్లేసుల కోసం యుద్ధం మొదలవొచ్చు కూడా!" అని చెప్పింది దీప్తి.

అలా మాట్లాడుకుంటూ ఉండగా యోధ తల్లిదండ్రులు ఉన్నా ఇంటి దగ్గరికి వచ్చి నీతూ వైపు చూసి సైగ చేశాడు జీతిన్.

అది చూసి "జీతిన్ ఇక్కడ స్లో చెయ్! ఈ ఏరియా చూడడానికి చాలా బాగుంది ఫొటోస్ దిగుదాము." అని చెప్పింది నీతూ.

"ఓకే మేడం!" అని కార్ స్లో చేయడంతో యోధ కిందకి దిగడం చూసి మిషన్స్ ఆన్ చేసి పాకెట్లో పెట్టుకుని కిందకు దిగారు ఐదుగురు.

అక్కడ ఫోటోలు దిగుతూ "ఈ ఇల్లు ఎవరిది అలా పాడుబడిపోయి ఉంది?" అని అడుగుతూ దగ్గరకు వెళ్ళింది దీప్తి.

"చాలా సంవత్సరాలుగా అలాగే ఉంది మేడం ఎవరిదో తెలియదు." అని చెప్పాడు జీతిన్.

అంతలో అక్కడికి రెండు జీపులు వచ్చి ఆగడం చూసి "ఎవరు వాళ్ళు చాలామంది ఉన్నారు?" అని అనుమానంగా చూస్తూ అడిగింది నీతూ.

"మీలాగా వచ్చిన టూరిస్టులు అయి ఉంటారు ఫోటోలు దిగడం అయ్యితే దగ్గరలో వాటర్ ఫాల్స్ ఉన్నాయి వెళదాము." అని చెప్పి జీప్ దిగి వస్తున్న ఒక వ్యక్తి బ్యాక్ పాకెట్ లో గన్ ఉండడం చూశాడు యోధ.

జీప్ దిగి ఇంటి దగ్గరికి వచ్చి వెతుకుతూ ఉన్న మనుషుల్ని చూసి దగ్గరికి వెళ్లి "ఈ ఏరియాలో మిమ్మల్ని ఎప్పుడు చూసినట్టు లేదు, ఏంటి వెతుకుతున్నారు? ఏమైనా పోగొట్టుకున్నారా..?" అని అడిగాడు జీతిన్.

"మేము హైదరాబాద్ నుంచి వచ్చాము మా వాడి మొబైల్ కనపడడం లేదు ఇక్కడ ఏమైనా పడిపోయిందేమోనని వెతుకుతున్నము." అని చెప్పాడు సత్తి.

"అవునా? నేను ఈ ఏరియాలోనే తిరుగుతూ ఉంటాను మీ నెంబర్ ఇవ్వండి ఎక్కడైనా ఫోన్ దొరికితే కాల్ చేస్తాను." అని చెప్పాడు జీతిన్.

ఆ మాటకి సీరియస్గా చూస్తూ "అవసరం లేదు." అని చెప్పాడు సత్తి.

అంతలో జీపు దగ్గర ఉన్న వ్యక్తి ఫోటోలు తీయడం చూసి దగ్గరికి వెళ్లి "హలో! మమ్మల్ని ఫోటో తీస్తున్నావు ఏమిటి మేనస్ లేదా..? మర్యాదగా డిలీట్ చెయ్!" అని సీరియస్గా చెప్పింది పూజా.

ఆ మాటకి నవ్వుతూ "ఫోటోనేగా తీశాను జీపులో ఎక్కించుకుని వెళ్లలేదు కదా!" అని వెటకారంగా చూస్తూ చెప్పాడు సత్తి మనిషి.

అక్కడికి వస్తూ "హలో బాస్! ఇది టూరిస్ట్ ఏరియా ఇలాంటి పనులు చేయకూడదు మర్యాదగా ఫోటోలు డిలీట్ చేయండి." అని చెప్పాడు జీతిన్.

"మా ఫోన్ లోకి ఎక్కడమే కానీ తీయడం ఉండదు." అని నవ్వుతూ చెప్పాడు పక్కన ఉన్న మరొక వ్యక్తి.

అంతలో అతని చేతిలో ఉన్న ఫోన్ లాక్కుని పుష్కర్ కి ఇచ్చి "ఫొటోస్ మొత్తం డిలీట్ చెయ్!" అని చెప్పింది నీతూ.

"ఆ ఫోన్ లో ఒక్క ఫోటో డిలీట్ అయిన మీ ముగ్గురిని గెస్ట్ హౌస్ కి తీసుకుపోతాము అప్పుడు ఫోటో చూసుకుని ఎంజాయ్ చేయనవసరం ఉండదు డైరెక్ట్ గా ఎంజాయ్ చేయొచ్చు!" అంటూ నీతూ చెయ్యి పట్టుకున్నాడు సత్తి మనిషి.

చెయ్యి పట్టుకున్న వాడి వైపు సీరియస్ గా చూస్తూ చేతిని వెనక్కి తిప్పి "ఇలాంటి వాళ్ళని నా సర్వీస్ లో చాలామందిని చూశాను, ఎగస్ట్రాలు చేసావంటే తినడానికి కడుక్కోవడానికి ఒక్క చెయ్యి మాత్రమే ఉంటుంది." అని వార్నింగ్ ఇచ్చింది నీతూ.

నొప్పితో అరుస్తున్న వాడి బ్యాక్ ప్యాకెట్ లో గన్ చూసి బయటకు తీసి అక్కడికి వస్తున్న సత్తి వైపు చూస్తూ "మీరు మొబైల్ వెతకడానికి వచ్చినట్లు లేదే!" అని డౌట్ గా అడిగాడు జీతిన్.

"ఆ గన్, మొబైల్ ఇచ్చి ఇక్కడినుంచి మర్యాదగా వెళ్లిపోండి మేము వచ్చిన పని కాకుండా వేరే పని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది." అని సీరియస్గా చూస్తూ జీతిన్ షర్ట్ పట్టుకున్నాడు సత్తి.

"కూల్ కూల్!ఫస్ట్ తప్పు చేసింది మీ వాడు, మా మేడం వాళ్ళని ఫోటోలు తీసాడు అవి డిలీట్ చేసి మీ మొబైల్ మీకు ఇస్తాము." అని చెప్పాడు జీతిన్.

మొబైల్లో ఫోటోలు చూస్తూ వెతకడానికి వచ్చిన ఐటమ్ ఫోటో కనబడడంతో "మేడం! ఒకసారి చూడండి." అని చూపించాడు పుష్కర్.

ఫోటో చూసి జీతిన్ వైపు చూసి సైగ చేసింది నీతూ.

తన చేతిలో ఉన్న గన్ సత్తి వైపు చూపించి "ఎవరు మీరు? ఆ ఆ ఫోటో మీ మొబైల్ లో ఎందుకు ఉంది?" అని అడిగాడు జీతిన్.

ఆ మాట విని జీతిన్ చేతిలో గన్ లాక్కొని తన మనుషుల వైపు చూసి "ఒరేయ్! అందరిని కాళ్లు చేతులు కట్టి జీపులో పడేయండి మనలానే ఆ ఐటెమ్ కోసం వెతుక్కుంటూ వచ్చినట్లు ఉన్నారు." అని చెప్పాడు సత్తి.

తన మీదకి వస్తున్న మనిషిని చూసి దీప్తి చేయ్యి పట్టుకుని వెనక్కి అడుగులు వేస్తూ మనిషి తగలడంతో తలపైకి ఎత్తి చూసి "మా భీమ్ బాయ్ వచ్చాడు ఇంక మీ పని అవుట్ !" అని చెప్పింది పూజా.

తన ఎదురుగా ఉన్న యోధని చూసి గన్ బయటికి తీసాడు సత్తి మనిషి.

గన్ లోడ్ చేసే లోపు ఫాస్ట్ గా తీసుకుని చూసి దీంట్లో బుల్లెట్స్ లేవు అని పక్కన పడేసి సత్తి మనిషిని రెండు చేతులతో ఎత్తి జీపు మీదకి గిరాటు వేసి నీతూ మీదకి వస్తున్న సత్తి ఎదురుగా వెళ్లి నుంచున్నాడు యోధ.

తన ఎదురుగా ఉన్న యోధ ని చూసి "ఇలా ఉన్నావు ఏమిటి? మా మొబైల్ ఇస్తే వెళ్ళిపోతాము." అని భయంగా చూస్తూ చెప్పాడు సత్తి.

"వెపన్ హ్యాండిల్ చేస్తున్నారు చూడడానికి డిపార్ట్మెంట్ వాళ్ళ లాగ కంపడడం లేదు ఎవరు మీరు?" అని సీరియస్ గా చూస్తూ అడిగాడు యోధ.

"భయ్యా! వాళ్ళని భయపెట్టడానికి చూపించాము అంతే దీంట్లో బుల్లెట్స్ లేవు కావాలంటే చూడు." అని తన గన్ ఓపెన్ చేసి చూపించాడు సత్తి.

అక్కడికి వచ్చి "యోధ వీళ్ళు నన్ను ఫోటో తీశారు." అని కోపంగా చూస్తూ చెప్పింది పూజా.

"అవునా?" అని పుష్కర్ చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని ఫోటోలు చూస్తూ ఆర చేతీలో పెట్టుకుని గట్టిగా నొక్కి విరిగిన ఫోన్ ని కిందపడేసి "ఇంకొక్కసారి ఈ ఏరియాలో కనపడకండి." అని చెప్పాడు యోధ.

ఆ మాట పూర్తయ్యలోపు జీపులో ఎక్కి ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయారు సత్తి వాళ్ళు.

జీప్ లు వెళ్లిపోవడంతో నీతూ వైపు చూసి "పదిమంది మీదకి వస్తేనే హడలిపోతున్నారు అలా అయ్యితే నాయక్ సర్ అప్పచెప్పిన వర్క్ ఎలా కంప్లీట్ చేస్తారు?" అని అడిగాడు యోధ.

ఆ మాటకి ఆశ్చర్యంగా చూస్తూ "నేను ఆఫీసర్ ని అని ఎలా కనిపెట్టావు?" అని డౌట్ గా అడిగింది నీతూ.

"నీ చెయ్యి పట్టుకున్న వాడిని హ్యాండిల్ చేసిన స్టైల్ చూసి నువ్వు డిపార్ట్మెంట్ అని తెలుసుకున్నను, వాడి దగ్గర ఉన్న గన్ హ్యాండిల్ చేస్తున్న విధానం చూసి జీతిన్ ఏజెంట్ అని అర్థమైంది.

మీరందరూ ఫ్రెండ్స్ అని నాతో చెప్పారు కానీ పుష్కర్ మొబైల్ లో ఏదో ఫోటో చూసి మేడం అని నీకు చూపించాడు, మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలియదు కానీ ఇస్రో వాళ్ళని కూడా తీసుకురావాల్సిన అవసరం ఏముంది?" అని అడిగాడు యోధ.

ఆ మాటలు వింటూ "జీనియస్! ఇంకా యోధ దగ్గర మన పప్పులు ఉడకవు యాక్షన్ చేయడం ఆపేసి ఫ్రీగా ఉండండి." అని చెప్పింది నీతూ.

"మరి ఇన్ని తెలిసిన వాడివి వాళ్ళని ఎందుకు వదిలేసావు? మేము దేనికోసం వెటతుకుంటూ ఇక్కడికి వచ్చామో వాళ్ళు కూడా దాని కోసమే ఇక్కడికి వచ్చారు?" అని చెప్పింది దీప్తి.

"అంటే! వాడి మొబైల్ లో చూసిన ఫొటో లో ఉన్న వస్తువు కోసం మీరు కూడా వెతుకుతున్నారా..?" అని డౌట్ గా అడిగాడు యోధ.

"ఎస్! దాని గురించి నీకు తెలుసా?" అని అనుమానంగా చూస్తూ అడిగింది నీతూ.



" రుద్రం భజే! ఎపిసోడ్ 7 " రచనకు రేటింగ్ ఇవ్వండి
[+] 10 users Like SivaSai's post
Like Reply
#27
Excellent update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
#28
కథ ఇంక రసవత్తరంగా సాగపోతుంది అని అర్థమవుతుంది
Great going
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
#29
Excellent narration
[+] 2 users Like Sunny73's post
Like Reply
#30
always waiting for your stories. Nice update
[+] 1 user Likes vikas123's post
Like Reply
#31
Wearing for your update
[+] 1 user Likes Ajayu2's post
Like Reply
#32
super story
Like Reply
#33
రుద్రం భజే! ఎపిసోడ్ 8

మీరు ఆఫీసర్లు అని నాకు అర్థమైంది ఆ ఫోటో లో ఉన్న వస్తువుని వెతుకుతూ ఇక్కడికి వచ్చారా అని నీతూ వాళ్ళని అడిగాడు యోధ.

ఆ మాట విని నీకు ఆ వస్తువు గురించి తెలుసా? అని అడిగింది దీప్తి.

***************

"ఆ ఫోటోలో కనిపించిన ఐటెమ్ గురించి నాకు తెలియదు కానీ దానికోసమే పాకిస్తాన్, చైనా ఆర్మీ  హిమాలయాస్ దగ్గర వెతుకుతున్నారని మాత్రం తెలుసు!

నేను మన ఏజెంట్స్ ని కాపాడడానికి అక్కడికి వెళ్ళినప్పుడు పాకిస్తాన్ సోల్జర్ మొబైల్ లో ఆ ఫోటో  చూశాను దాని కోసమే ఇక్కడ వెతుకుతున్నము అని అతను చెప్పాడు.

అది సరే వాళ్ళు అక్కడ వెతుకుతుంటే వీళ్ళు ఆ ఫోటో పట్టుకుని ఇక్కడ వెతుకుతున్నారు ఎందుకు? మీరు కూడా దానిని వెతుక్కుంటూ  ఇక్కడికి ఎందుకు వచ్చారు?" అని అనుమానంగా అడిగాడు యోధ.

"ఆ విధమైన వస్తువు ఈ ఏరియాలో కూడా ఒకటి ఉందని తెలిసింది దాని సిగ్నల్ చైనా ఆర్మీ కనిపెట్టింది అందుకే వాళ్ళు వెతకడానికి మనుషుల్ని పంపిస్తున్నారు వాళ్ల కంటే ముందే మనం దానిని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి." అని చెప్పింది నీతూ.

"అంత చిన్న వస్తువుని దేనికి ఉపయోగిస్తారు? దానికోసం రెండు దేశాల ఆర్మీ వాళ్ళు వెతకవలసిన పనేముంది?" అని డౌట్ గా అడిగాడు యోధ.

"ఆ విషయం తెలుసుకోవడానికి మేము కూడా వచ్చాము ఆ వస్తువుతో ఆ రెండు దేశాల వాళ్ళు కలిసి ఏదో ప్రయోగం చేయాలని చూస్తున్నారు." అని చెప్పింది దీప్తి.

"ఆ ఫోటో ఒకసారి నాకు చూపించండి?' అని అడిగాడు యోధ.

తన మొబైల్ ఓపెన్ చేసి ఫోటో చూపించింది నీతూ.

ఫోటో చూస్తూ "ఒకవేళ ఈ వస్తువు ఇక్కడ ఉంటే వెతకడం చాలా కష్టం! అసలు ఆది ఇక్కడికి ఎలా వచ్చింది?" అని అడిగాడు యోధ.

"ఆ వస్తువుని 25 సంవత్సరాల క్రితం మన ఏజెంట్  ఫ్యామిలీ ఇక్కడికి తీసుకు వచ్చారు అప్పుడే వాళ్ళు చనిపోయారు, కానీ దానికి సంబంధించిన ఫైల్  అతని దగ్గర దొరికింది కాబట్టి ఆ వస్తువును కూడా సేఫ్ గా ఉంచాడు అనుకుంటున్నాము." అని చెప్పాడు జీతిన్.

"అలా అయితే ఆ ఫైల్ తో అతను ఎక్కడ కనిపించాడో ఆ వస్తువు కూడా అక్కడే ఉంటుంది ఇలా తిరగడం వేస్ట్!" అని చెప్పాడు యోధ.

"అయితే! ఆ గుడి దగ్గరే ఆ వస్తువు ఉంటుంది. కానీ మాకు ఆ ఏరియా లో ఎక్కడ సిగ్నల్ దొరకలేదు." అని చెప్పింది దీప్తి.

"మా గుడి దగ్గర? అంటే మీరు చెప్పేది నాకు తల్లిదండ్రుల గురించా..?" అని అడిగాడు యోధ.

"అవును! నీ తల్లిదండ్రుల గురించి నీకు తెలుసో లేదో అని మేము చెప్పలేదు." అని అన్నాడు జీతిన్.

"నాకు తెలుసు! మా తల్లిదండ్రులు దేశం కోసం చనిపోయారని నాన్నగారు చెప్పారు ఆ ఫైల్ నేను ఒకసారి చూడొచ్చా?" అని అడిగాడు యోధ.

"హార్డ్ కాపీ లేదు సాఫ్ట్ కాపీ ఉంది దాంట్లో ప్రయోగం ఎలా చేయాలో తీరి మాత్రమే ఉంది అది దేనికి ఉపయోగపడుతుంది అనే విషయం మాత్రం లేదు." అని మొబైల్ లో ఉన్న ఫైల్ చూపించింది దీప్తి.

ఫైల్ చూస్తూ "మీరు గుడి దగ్గర చెక్ చేశాను అని చెప్పారు కదా మీరు ఉపయోగించే మిషన్ ఏమిటి?" అని అడిగాడు యోధ.

"ఆ రెండు దేశాల వాళ్ళు హిమాలయాస్ లో రేడియేషన్ పసిగట్టే మిషన్స్ అందుకనే మేము కూడా అటువంటి మిషన్ తోనే ఇక్కడ సిగ్నల్ కోసం చూస్తున్నాము." అని చెప్పింది పూజా.

"ఒకవేళ ఈ వస్తువు గుడి దగ్గర ఉన్న మీ మిషన్స్ పనిచేయు ఎందుకంటే గుడి ముందు ధ్వజస్తంభం ఉంటుంది దానివల్ల  ఆకాశం నుంచి ఎంతటి శక్తివంతమైన తరంగాలు వచ్చినా ఆ ధ్వజం ఐక్యం చేసుకుని గుడి మొత్తానికి స్ప్రెడ్ చేస్తుంది అందుకే ప్రతి గుడిలో ఆ పవిత్రత ప్రశాంతత ఉంటుంది.

ఈ ఫోటోలో ఆ వస్తువు మీద పవర్ జనరేట్ అవ్వగానే తరంగాలు ఆకాశంలోకి భూమిలోకి వెళుతున్నట్లు కనిపిస్తుంది ఆ వస్తువు నుంచి వచ్చే తరంగాల్ని ఆ ధ్వజస్తంభం తీసుకుంటుంది కాబట్టి మీకు సిగ్నల్ దొరకదు." అని చెప్పాడు యోధ.

ఆ మాట విని "అందుకేనా ఏ గుడిలోకి వెళ్ళిన పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది?" అని అడిగింది దీప్తి.

"మన దేవాలయాలు కూడా సైన్స్ తో ముడిపడి ఉంటాయి ప్రతి గుడిలో ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అందువల్ల అక్కడ ఉన్న శక్తి ఇంక ఎక్కడ ఉండదు, అది తెలియక మాన వాళ్ళు పురాతన దేవాలయాలను పట్టించుకోవడమే మానేశారు అవి ప్రకృతికి మనకి అనుసంధానమై ఉంటాయి దానివల్ల ఎటువంటి విపత్తులు రాకుండా  ఆపుతాయి."  అని చెప్పాడు యోధ.

"నువ్వు చిన్నతనం నుంచి ఆ గుడిలోనే ఉన్నావు కదా ఇటువంటి వస్తువులు ఎప్పుడైనా చూసావా?" అని అడిగింది నీతూ.

"నో! మీరు సార్ దగ్గర పర్మిషన్ తీసుకోండి ఈ ఫోటో నాన్నగారికి చూపిద్దాం ఆయనకు తెలిసి ఉంటుంది." అని చెప్పాడు యోధ.

"మనం ఆ వస్తువు కోసం ఇక్కడ వెతుకుతున్నామని మీర్జా గ్యాంగ్ కి తెలిసిపోయింది కచ్చితంగా వాళ్ళు మళ్ళీ వస్తారు ఈలోపు ఆ వస్తువు ఎక్కడ ఉన్నాము మనం తెలుసుకోవాలి ఎటువంటి పరిస్థితిలో వాళ్ళ చేతికి వెళ్ళకూడదు." అని చెప్పాడు జీతిన్.

"ఒకవేళ ఆ వస్తువు అనేది ఇక్కడ ఉంటే దానిని నన్ను దాటి ఎవరు పట్టుకు వెళ్ళలేరు పదండి ఇంటికి వెళదాము." అని చెప్పాడు యోధ.

**************

యోధ వాళ్ల దగ్గర నుంచి పారిపోయి వాళ్ళు ఉండే గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్లి అజీజ్ కి కాల్ చేశాడు సత్తి.

ఫోన్ లిఫ్ట్ చేసి "ఫస్ట్ లొకేషన్ దగ్గరికి వెళ్లారా..?" అని అడిగాడు అజిజ్.

"బాయ్! మీరు పంపించిన ఫోటోలో వస్తువు కోసం వేరే వాళ్ళు కూడా వెతుకుతున్నారు వాళ్లలో ఒకడు ఉన్నాడు బాయ్, మేము వాడి చెయ్యి సైజు కూడా లేము, వాడు కొట్టిన దెబ్బలకి మనవాళ్ళు ఎముకలు విరిగిపోయాయి." అని చెప్పాడు సత్తి.

"మీరు ఆ వస్తువు కోసం వెతుకుతున్నట్లు వాళ్లకు తెలిసిందా..?" అని అడిగాడు అజిజ్.

"అవును బాయ్! మా మొబైల్లో ఫోటో చూశాడు వాళ్ళు చూడడానికి ఆఫీసర్ లు లాగా ఉన్నారు ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు?" అని అడిగాడు అజిజ్.

"ఒక్క నిమిషం లైన్లో ఉండు." అని మీర్జా వైపు చూసి "ఆ ఐటెమ్ కోసం ఆఫీసర్లు కూడా రంగంలోని దిగారు ఇంక మనం ఎంట్రవ్వాలి." అని చెప్పాడు అజిజ్.

"సరే! సాయంత్రానికి మిషన్స్ వస్తున్నాయి ఉదయం బయలుదేరుదాము ఈలోపు అసలు వాళ్ళు ఎవరో తెలుసుకోమను." అని చెప్పాడు మీర్జా.

ఫోన్లో మాట్లాడుతూ " సత్తి! వినబడింది కదా ఆ పని మీద ఉండండి. ఉదయానికి మేము అక్కడే ఉంటాము వాడి సంగతి చూద్దాము." అని చెప్పాడు అజిజ్.

"సరే బాయ్! త్వరగా రండి." అని చెప్పి ఫోన్ పెట్టేసి తన వాళ్ళ వైపు చూసి "ఒరేయ్ ఇద్దరు వెళ్లి అసలు వాళ్ళు ఎవరో తెలుసుకోండి. రేపు ఉదయానికి మన గ్యాంగ్ మొత్తం ఇక్కడకు దిగుతుంది వాళ్ల సంగతి చూద్దాము." అని కోపంగా చెప్పాడు సత్తి.

"సరే అన్న!" అని చెప్పి బైక్ తీసుకుని బయలుదేరి వెళ్లారు ఇద్దరు.

************

రూమ్ కి వెళ్లి నాయక్ కాల్ చేశాడు జీతిన్.

ఫోన్ లిఫ్ట్ చేసి "టెల్ మీ జీతిన్? మిమ్మల్ని యోధ కనిపెట్టేసాడా?" అని అడిగాడు నాయక్.

"ఎస్ సార్! ఈ విషయం మీకు ఎలా తెలిసింది?" అని డౌట్ గా అడిగాడు జీతిన్.

"నాకు యోధ గురించి బాగా తెలుసు" ఆదికాకుండా నీ దగ్గరనుంచి ఈ టైంలో కాల్ వచ్చింది అంటే అదే అనుకున్నాను ఇంతకీ ఏంటి విషయం? " అని అడిగాడు నాయక్.

"సార్! యోధ చెప్పిందాన్ని బట్టి మనం వెతుకుతున్న వస్తువు ఆ గుడిలోనే ఉంటుంది ఈ ఫోటో నారాయణ రావు గారికి చూపించి అడుగుదాము అనుకుంటున్నాము మీ పర్మిషన్ కోసం కాల్ చేశాను, ఆది కాకుండా దానిని వెతుక్కుంటూ మీర్జా గ్యాంగ్ కూడా ఎంటర్ అయ్యారు." అని చెప్పాడు జీతిన్.

"సరే! నారాయణ రావు గారికి విషయం చెప్పి ఆ వస్తువు గుడిలో ఉందేమో తెలుసుకోమను నువ్వు వెంటనే హైదరాబాద్ బయలుదేరు మీర్జా అక్కడికి వస్తున్నాడని  ఇన్ఫర్మేషన్ వచ్చింది. నీకు హెల్ప్ చేయడానికి అక్కడ మన ఆఫీసర్ ప్రదీప్ ఉండడు." అని చెప్పాడు నాయక్.

"సార్! మరి నేను హైదరాబాద్ వెళ్తే ఇక్కడకి మీర్జా మనుషులు వస్తే..?" అని డౌట్ గా అడిగాడు జీతిన్.

"యోధ కి విషయం తెలిసిపోయింది కదా ఇంక వాడు చూసుకుంటాడు, నువ్వు వెంటనే బయలుదేరు నాకు మీర్జా ప్రజెంట్ ఫోటో కావాలి, నెక్స్ట్ ఈ కాంట్రాక్ట్ వాళ్ళకి ఎవరు ఇచ్చారో తెలియాలి." అని చెప్పాడు నాయక్.

"ఓకే సార్!" అని ఫోన్ పెట్టేసి  నీతూ దగ్గరికి వెళ్లి "నారాయణ రావు గారితో ఆ వస్తువు గురించి మాట్లాడడానికి సార్ పర్మిషన్ ఇచ్చారు నేను ఒక చిన్న పని మీద బయటకు వెళుతున్నాను అవసరం అయితే కాల్ చేయండి." అని చెప్పాడు జీతిన్.

"ఓకే నో ప్రాబ్లం! నేను చూసుకుంటాను నువ్వు వెళ్లిరా..!" అని చెప్పి యోధ తో కలిసి తన ఇంటికి బయలుదేరారు నీతూ వాళ్ళు

ఇంటి దగ్గరికి వస్తున్న దీప్తి వాళ్ళని చూసి" ఏంటమ్మా అప్పుడే వచ్చేసారు? ఊరు చూడడం అయిపోయిందా..? " అని అడిగాడు నారాయణ రావు.

"నో అంకుల్! మీతో ఒక చిన్న విషయం మాట్లాడాలి అందుకే వచ్చాము." అని చెప్పింది దీప్తి.

"అవునా? విషయం ఏమిటో  చెప్పండమ్మా?" అని అడిగాడు నారాయణ రావు.

మొబైల్ లో ఫోటో చూపిస్తూ "నాన్నగారు! ఈ ఫోటోలో ఉన్న వస్తువుని మీరు ఎప్పుడైనా చూశారా? ఇలాంటిది మన గుడి దగ్గర ఏమైనా ఉందా?" అని అడిగాడు యోధ.

ఆ ఫోటో చూస్తూ "ఇది స్వామి వారి పాదాల దగ్గర ఉంటుంది దీనిని ఎవరో ఒక భక్తుడు హుండీలో వేశారు దేనికి ఉపయోగపడుతుందో అర్థం కాక స్వామివారి పాదాలు దగ్గర ఉంచాను అప్పటినుంచి అక్కడే ఉంది." అని చెప్పాడు నారాయణ రావు.

ఆ మాట విని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు అందరూ.
[+] 6 users Like SivaSai's post
Like Reply
#34
రుద్రం భజే! ఎపిసోడ్ 9

నీతూ మొబైల్ లో ఉన్న ఫోటో చూసి ఈ వస్తువుని ఎవరో హుండీలో వేశారు అది ఏమిటో తెలియక శుభ్రం చేసి స్వామివారి పాదాల దగ్గర ఉంచాను ఇప్పుడు కూడా అక్కడే ఉంది అని చెప్పాడు నారాయణ రావు.

*************

నారాయణ రావు చెప్పిన మాట విని ఆశ్చర్యంగా చూస్తూ "25 సంవత్సరాలుగా దొరకని సిగ్నల్  ఇప్పుడు ఎలా దొరికింది?" అని అనుమానంగా అడిగింది దీప్తి.

"నాన్నగారు! ఈ మధ్యలో ఏమైనా గర్భగుడిలో స్వామి వారి దగ్గర ఉన్న వస్తువులు మొత్తం బయటకు తీసుకు వచ్చారా..?" అని అడిగాడు యోధ.

"నాలుగు నెలల క్రితం భూపతివర్మ గారు గర్భగుడిలో టైల్స్ వేయిస్తాను అంటే స్వామి వారి విగ్రహాన్ని తప్ప మిగతా వస్తువులు మొత్తం బయటికి తీసుకొచ్చాము." అని చెప్పాడు నారాయణ రావు.

ఆ మాట విని "ఎస్! అప్పుడు ఆ వస్తువు సిగ్నల్ వాళ్ళకి దొరికింది. ఇంకా దానిని ఇక్కడ ఉంచడం మంచిది కాదు  వెంటనే మిలిటరీ హెడ్ క్వార్టర్స్ కి తీసుకువెళ్లదాము." అని చెప్పింది నీతూ.

"అసలు! ఆ వస్తువు ఏమిటమ్మా? దాని గురించి అంత కంగారు ఎందుకు పడుతున్నారు?" అని అనుమానంగా అడిగాడు నారాయణ రావు.

"ఆ వస్తువుతో రెండు దేశాల వాళ్ళు హిమాలయాల దగ్గర ప్రయోగం చేస్తున్నప్పుడు యోధ తండ్రిగారైన ఏజెంట్ ప్రకాష్ దానిని వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని ఇక్కడికి వచ్చారు.

మళ్లీ ఇలాంటి వస్తువు కోసం కైలాస పర్వతం దగ్గర నుంచి మనస సరోవరం వరకు రెండు దేశాల మిలిటరీ వెతుకుతున్నారు  దీనికోసం ఇక్కడికి కుడా మనుషుల్ని పంపించారు." అని చెప్పింది నీతూ.

"అలా అయితే స్వామి వారి దగ్గర ఉన్న వస్తువు కూడా కచ్చితంగా కైలాస పర్వతం దగ్గరే వాళ్ళకి దొరికి ఉంటుంది. కైలాస పర్వతం అంటే పరమశివుడు నివాసం ఉండే స్థలం ఇది కూడా ఆయనకి సంబంధించింది అయ్యుంటుంది.

దీనిని కాపాడడానికి అప్పుడు యోధ తండ్రి పంపించాడు ఇప్పుడు కూడా ఎవరో ఒకరిని పంపించే ఉంటాడు ఆ శివయ్య!"  అని చెప్పాడు నారాయణ రావు.

"ఆ వస్తువుని బయటికి తీసిన వెంటనే వాళ్ళకి సిగ్నల్ అందుతుంది ఈ టైమ్ లో తీసుకుని వెళ్లడం అంత సేఫ్ కాదు మనం ఉదయం బయలుదేరుదాము అప్పటివరకు గుడిలోనే ఉండనివ్వండి." అని చెప్పింది దీప్తి.

"ఈ విషయం వెంటనే సార్ కి చెప్పాలి." అని ఫోన్ తీసి నాయక్ కి కాల్ చేసింది నీతూ.

ఫోన్ లిఫ్ట్ చేసి టెల్ "నీతూ ఎనీ అప్డేట్!":అని అడిగాడు నాయక్.

"జైహింద్ సార్! మనం వెతుకుతున్న వస్తువు ఇక్కడ గుడిలో స్వామివారి పాదాల దగ్గరే ఉంది. నాలుగు నెలల క్రితం దానిని బయటకు తీసుకురావడం వల్ల సిగ్నల్ వాళ్ళకి అంది ఉంటుంది అనుకుంటున్నాము, దానిని తీసుకుని ఉదయం బయలుదేరి వస్తాము." అని చెప్పింది నీతూ.

"గుడ్! ఆ వస్తువు మిలిటరీ హెడ్ కోటర్స్ వచ్చే వరకు చాలా కేర్ఫుల్ గా ఉండండి. ఆల్రెడీ మీర్జా హైదరాబాదులో దిగాడు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడి చేతిలోకి వెళ్ళింది అంటే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది." అని చెప్పాడు నాయక్.

"ఓకే సార్! నైట్ కి గుడి దగ్గర పుష్కర్, ఏకవీర ని సెక్యూరిటీగా ఉంచుతాను దాన్ని తీసుకుని మార్నింగ్ మేము స్టార్ట్ అవుతాము." అని చెప్పింది నీతూ.

"ఓకే! వచ్చేటప్పుడు మీతో యోధని కూడా తీసుకురండి." అని చెప్పి ఫోన్ పెట్టేసాడు నాయక్.

ఫోన్ పెట్టేసి యోధ వైపు చూసి "సార్! మాతో పాటు నిన్ను కూడా రమ్మన్నారు." అని చెప్పి పుష్కర్ వాళ్ళ వైపు చూసి "రేపు ఉదయం మనం బయలుదేరే వరకు మీరిద్దరు ఈ గుడి దగ్గరే ఉండాలి ఎవరైనా అడిగితే నిద్ర చేస్తున్నాము అని చెప్పండి." అని చెప్పింది నీతూ.

"ఓకే మేడం!" అని చెప్పారు ఇద్దరు.

"మీరేమీ కంగారు పడకండి ఈ గుడి దగ్గరికి ఎవరు రారు ఒకవేళ వచ్చిన స్వామి వారి దగ్గరికి వెళ్లడానికి ధైర్యం చేయరు ఆయనే దానికి రక్షణగా ఉంటారు." అని చెప్పాడు నారాయణ రావు.

"నిజమే రావు గారు! కానీ మా డ్యూటీ ప్రకారం మేము ఉండాలి ఆ ఇద్దరిని ఇక్కడ ఉండనివ్వండి." అని చెప్పింది నీతూ.

"సరే మీ ఇష్టం!" అని చెప్పాడు నారాయణ రావు.

పుష్కర్ వాళ్ళ ఇద్దరినీ గుడి దగ్గర ఉంచి యోధాతో పాటు తన ఇంటికి వెళ్లి మొబైల్ లో ఫైల్ ఓపెన్ చేసి చూస్తూ "అసలు ఈ వస్తువుతో ప్రయోగం చేస్తే ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు." అని చెప్పింది పూజా.

అన్నం వడ్డిస్తూ "మీరెందుకు దాని గురించి హైరానా పడతారు? వాళ్ళ దగ్గరికి మా యోధని పంపించండి నాలుగు తగిలించి అసలు విషయం తెలుసుకుంటాడు కైలాస పర్వతం దగ్గర ఎవరైనా ఇటువంటి పనులు చేస్తారా..?" అని దీర్ఘం తీసుకుంటూ చెప్పింది అన్నపూర్ణ.

"ఆ కైలాస పర్వతం, మానస సరోవరం పవిత్రత మనకి తెలుసు వాళ్ళకి తెలియదు కదా! ప్రతిఫలం అనుభవిస్తారు." అని చెప్పాడు నారాయణ రావు.

అన్నం తింటూ "అంకుల్! కైలాస పర్వతం దగ్గరనుంచి వేరే లోకాలకు మార్గం ఉంది అని అంటుంటారు నిజమేనా..? పురాణాలలో దాని గురించి మీరు ఎప్పుడైనా చదివారా..?" అని అడిగింది దీప్తి.

"త్రేతయుగంలో మూనులు, ఋషులు, మహర్షులు హిమాలయాల్లో తపస్సు చేసుకుని అక్కడి నుంచి కైలాస పర్వతం దగ్గర కొలువై ఉన్న పార్వతీ పరమేశ్వరులని దర్శనం చేసుకునేవారు.

 అలాగే భూమి కింద ఉన్న 14 లోకాలలో ఉన్న రాక్షసులు అసురులు, సర్పాలు కుడా దర్శనం కోసం అక్కడికి వచ్చేవారు

ఏ లోకానికైనా మార్గం అక్కడినుంచి ఉంటుంది అంటారు అందుకే ఆ పర్వతాన్ని అంత పవిత్రంగా కొలుస్తారు ఇప్పుడు కలికాలం కదా పాపం పెరిగిపోయింది భగవంతుడిని మనం కంటితో చూడలేము ఒకవేళ చూసినా తట్టుకోలేము." అని చెప్పాడు నారాయణ రావు.

"ఒకవేళ ఈ వస్తువుతో ఆ లోకాలకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారేమో!" అని డౌట్ గా అడిగింది పూజా.

"ఆ మాటే నిజమైతే వాళ్లు ఆ పరమశివుడి ఆగ్రహానికి గురై అక్కడే భస్మం అవుతారు." అని చెప్పింది అన్నపూర్ణ.

"ఒక వేళ భూమి అడుగున ఉన్న 14 లోకాలు వెళ్లడానికి ట్రై చేస్తున్నారేమో!" అని డౌట్ గా అడిగింది దీప్తి.

"అంత చిన్న వస్తువుని ఆక్టివేట్ చేసి ఆ లోకాలకు ఎలా వెళతారు? పురాణాలలో ఉన్నది  అంకుల్ మనకి చెబుతున్నారు, అక్కడ ఉన్న లోకాలన ఎవరు చూడలేదు, కనీసం కంటికి కనిపించే కైలాస పర్వతం మీదకి కుడా ఎవరు వెళ్ళలేదు." అని చెప్పింది నీతూ.

"అమ్మ గౌరీ! గుడి దగ్గర ఉన్న ఇద్దరికీ కూడా భోజనం తీసుకువెళ్ళు!" అని చెప్పి దీప్తి వాళ్ళ వైపు చూసి" కైలాస పర్వతం మీదకి వెళ్లడం అనేది ఆసాధ్యం!

ఆ శక్తీ మానవులకు లేదు, చాలామంది ప్రయత్నించారు కొంతమంది మరణించారు కొంతమందికి విరమించుకుని వెనక్కి వచ్చారు." అని చెప్పాడు నారాయణ రావు.

"అవును! ఆ పర్వతం మీద నుంచి వెళ్లిన చైనా మిలటరీ హెలికాప్టర్ ఏమైందో ఇప్పటికీ తెలియదు అప్పటినుంచి ఆ పర్వతం మీద  హెలికాప్టర్స్ వెళ్లడం నిషేధించారు.

సాటిలైట్ లో ఆ పర్వతం దగ్గర ఏముందో చూడడానికి ట్రై చేసి ఓంకారం శబ్దం వినిపించి తెల్లటి వెలుతురు మాత్రమే కనిపించడంతో  వెనక్కి తగ్గి మళ్ళీ ఆ ప్రయత్నం కుడా చేయలేదు." అని చెప్పాడు యోధ.

"అక్కడ అంత శక్తి ఉందని తెలిసిన తర్వాత కూడా ఆ ప్రదేశంలో దొరికిన వస్తువుతో ప్రయోగం చేస్తున్నారు అంటే వాళ్ళు ఏదో కనిపెట్టారు." అని చెప్పింది దీప్తి.

పుష్కర్ వాళ్ళకి అన్నం ఇచ్చి వస్తూ "వాళ్ళు ఏది కనిపెట్టిన అక్కడ ఆంజనేయ స్వామి రక్షణగా తప్పస్సు చేసుకుంటూ ఉంటారు ఎవరి పప్పులు ఉడకవు తోకతో చుట్టి గిరాటు వేస్తారు." అని చెప్పింది గౌరీ.

"మీకు దైవం! మాకు సైన్స్! ఏది ఏమైనా అటువంటి ప్రయోగాలు చేయకుండా అడ్డుకోవాలి." అని చెప్పిన దీప్తి.

"అసలు ఈ బాధంతా ఎందుకు ఇండియన్ గవర్నమెంట్ మాకు పర్మిషన్ ఇస్తే రెండు రోజుల్లో ఆ ఏరియా ఇండియా భూభాగం అవుతుంది." అని చెప్పాడు యోధ.

ఆ మాటకి నవ్వుతూ "యోధ వెర్షన్ బాగుంది అప్పుడు ఈ టెన్షన్ ఉండదు ఆ 24 మంది లాగా అక్కడ ఇంకెవరూ కనిపించరు." అని చెప్పింది పూజా.

"అది సరే కానీ! ఆ 24 మందిని కొంపదీసి కైలాస పర్వతం పైకి దగ్గరికి పంపించావా ఏంటి?" అని అడిగింది దీప్తి.

"ఆ మూర్ఖులకి అంత అదృష్టం లేదు." అని చెప్పాడు యోధ.

భోజనం కంప్లీట్ అవడంతో "థాంక్యూ ఆంటీ! ఫుడ్ చాలా బాగుంది ఇక్కడికి వచ్చిన వర్క్ కంప్లీట్ అయింది కాబట్టి మార్నింగ్ మేము స్టార్ట్ అవుతాము, మీ చేతి వంట తినడానికి తప్పకుండా మళ్ళీ వస్తాము." అని చెప్పింది దీప్తి.

"చాలా సంతోషం! ఉదయం పూజా కార్యక్రమాలు అయిన తర్వాత స్వామివారి పాదాలు దగ్గర ఉన్న వస్తువుని మీకు చేతికి ఇస్తాను." అని చెప్పాడు నారాయణ రావు.

"సరే అంకుల్!"అని చెప్పి అక్కడినుంచి వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్లారు ముగ్గురు.

**********

హైదరాబాద్ రాత్రి 12 దాటిన తర్వాత మిషనరీ లోడ్ చేసుకుని బ్రహ్మం వాళ్లతో కలిసి బయలుదేరాడు మీర్జా.

ఆ విషయం తెలుసుకుని ప్రదీప్ తో కలిసి హైవేలో వెహికల్స్ చెక్ చేస్తూ మిషన్స్ తో వెళుతున్న వ్యాన్ ఆపి  "ఎక్కడికి వెళ్తున్నారు? ఈ మిషన్స్ ఏమిటి?" అని అడిగాడు జీతిన్.

అక్కడికి కార్ లో వచ్చి కిందకి దిగి ఇది "సార్! ఇది సోలార్ ఎక్విప్మెంట్ దీనిని ఎందుకు ఆపారు? మా దగ్గర బిల్స్ కూడా ఉన్నాయి." అని చూపించాడు అజిజ్.

"అవునా?" అని బిల్స్ చూస్తూ కార్ దగ్గరికి వెళ్లి లోపల ఉన్న మీర్జా వైపు చూసి "మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు ఉంది పేరేమిటి?" అని అడిగాడు జీతిన్.

"నా పేరు అబ్రహం! సోలార్ మిషన్స్ ఫిట్ చేసే ఇంజనీర్!" చెప్పాడు మీర్జా.

"ఓకే!" అని ప్రదీప్ వైపు చూసి సైగ చేశాడు జీతిన్.

"సార్! ఈ బిల్స్ చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది స్టేషన్ దగ్గరికి తీసుకు వెళ్లి కంప్లీట్ గా చెక్ చేసిన తర్వాత వదులుదాము." అని చెప్పాడు ప్రదీప్.

ఆ మాట విని బ్రహ్మం వైపు కోపంగా చూస్తూ "మనం వెంటనే వెళ్లాలి ఇప్పటికే లేట్ అయింది." అని చెప్పాడు మీర్జా.

ఆ మాట విని కిందకు దిగి జీతిన్ దగ్గరికి వెళ్లి "సార్! మనం పక్కకు వెళ్లి మాట్లాడుకుందామా?" అని అడిగాడు బ్రహ్మం.

"ఓకే!" అని ప్రదీప్ దగ్గరికి వచ్చి "ఆ కార్ లో ఉన్న మనిషి ఫోటో తీసావా..?" అని నెమ్మదిగా అడిగాడు జీతిన్.

"ఎస్! ఆల్ యాంగిల్స్ లో తీసాను సార్ కి కూడా సెండ్ చేశాను." అని చెప్పాడు ప్రదీప్.

"ఓకే!" అని చెప్పి బ్రహ్మం దగ్గరికి వెళ్లి "చెప్పండి ఏంటి విషయం?" అని అడిగాడు జీతిన్.

"మీకు ఎంత కావాలో చెప్పండి మేము అర్జెంటుగా వెళ్లాలి." అని చెప్పాడు బ్రహ్మం.

"మిషనరీ చూస్తుంటే చాలా వాల్యూ ఉన్నట్లు ఉంది. మా సార్ తో మాట్లాడి చెబుతాను ఒక్క నిమిషం ఉండండి." అని చెప్పి పక్కకు వెళ్లి నాయకి కాల్ చేశాడు జీతిన్.

ఫోన్ లిఫ్ట్ చేసి "ఫొటోస్ వచ్చాయి అతను మీర్జా నే కన్ఫామ్! వాడు అరవకొండ వెళ్లడానికి వీల్లేదు అవకాశం ఉంటే అక్కడే లేపేయ్!" అని చెప్పాడు నాయక్.



" రుద్రం భజే! ఎపిసోడ్ 9 " రచనకు రేటింగ్ ఇవ్వండి....
[+] 10 users Like SivaSai's post
Like Reply
#35
So, mirza story the end!! or kaalpullo.. jitin potadu!
chooddam emavutundo!
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
#36
Exciting update
[+] 1 user Likes Sunny73's post
Like Reply
#37
Me update kosam eduru chustu untam Shiva garu
[+] 1 user Likes Ajayu2's post
Like Reply
#38
రుద్రం భజే! ఎపిసోడ్ 10



జితిన్ నుంచి ఫోన్ రావడంతో మీరు పంపించిన ఫోటోలో ఉంది మీర్జా నే కన్ఫామ్ వాడు అరవకొండ వెళ్లకూడదు అవకాశం ఉంటే అక్కడే లేపేయండి అని చెప్పాడు నాయక్.

************

నాయక్ తో ఫోన్ మాట్లాడి బ్రహ్మం దగ్గరికి వచ్చి "మీ ఆఫర్ ఏంటో చెప్పండి?" అని అడిగాడు జీతిన్.

కారు దిగి అక్కడికి వచ్చి "మీ ఇద్దరికీ మంచి ఆఫర్ ఇద్దామనుకున్నాను కానీ నా గురించి తెలిసిన వాళ్ళని ప్రాణాలతో ఉంచడం నాకు అలవాటు లేదు." అని ప్రదీప్ తల మీద షూట్ చేశాడు మీర్జా.

అది చూసి అక్కడ నుంచి పారిపోవడానికి ట్రై చేస్తున్న జీతిన్ పట్టుకున్నారు అజిజ్ తన మనుషులు.

జీతిన్ చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని చూస్తూ "నాయక్ ఇంకా నన్ను వెంటాడుతూనే ఉన్నాడా? ఎప్పటి నుంచో అతనికి మంచి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాను." అని బ్రహ్మం వైపు చూసి "ఇద్దరినీ ప్యాక్ చేయండి పంపిద్దాము." అని చెప్పాడు మీర్జా.

ఆ మాట పూర్తి అయ్యో లోపు జీతిన్ గొంతులో పొడిచి "బాయ్! అరవకొండలో మన మనుషులను కొట్టిన వాళ్లలో వీడు కూడా ఉన్నాడు." అని ఫోటో చూపించాడు అజిజ్.

"అవునా?" అని ఫోటో చూస్తూ జితిన్ ఫోన్ రింగ్ అవడం చూసి కట్ చేసి "ఇంపార్టెంట్ వర్క్ ప్లీజ్ మెసేజ్!" అని పంపించాడు మీర్జా.

కాసేపటికి "హాయ్ ఐ ఆమ్ నీతూ! మనం వెతుకుతున్న వస్తువు దొరికింది. మేము ఉదయం అరవకొండా నుంచి ఢిల్లీ బయలుదేరుతున్నాము." అని మెసేజ్ పెట్టింది నీతూ.

"గ్రేట్ అచీవ్మెంట్!  ఆ వస్తువు ఎక్కడ దొరికింది." అని మళ్లీ మెసేజ్ పెట్టాడు మీర్జా.

"హనుమాన్ టెంపుల్ లో స్వామివారి పాదాల దగ్గరే ఉంది. మార్నింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాము మనవాళ్ళిద్దరూ సెక్యూరిటీగా ఉన్నారు." అని మెసేజ్ పెట్టింది నీతూ.

"టేక్ కేర్! గుడ్ నైట్!" అని రిప్లై ఇచ్చి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి జితిన్ జేబులో పెట్టి "ఇద్దరి బాడీలు ఏమైపోయాయో కూడా తెలియకూడదు." అని చెప్పి అజిజ్ వైపు చూసి "సత్తికి కాల్ చెయ్!" అని చెప్పాడు మీర్జా.

"సరే బాయ్!" అని సత్తి కి కాల్ చేశాడు అజీజ్.

గెస్ట్ హౌస్ బయట సిగరెట్ తాగుతూ  ఫోన్ రింగ్ అవ్వడం చూసి హడావుడిగా లిఫ్ట్ చేసి "బాయ్! మీఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను స్టార్ట్ అయ్యారా?" అని అడిగాడు సత్తి.

"హ.. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము, నువ్వు ఎప్పటినుంచో మీర్జా బాయ్ తో మాట్లాడాలి అని అడుగుతున్నావు కదా నీ అదృష్టం బాగుంది ఒకసారి మాట్లాడు." అని ఫోన్ ఇచ్చాడు అజిజ్.

ఆ మాట విని సంతోషంగా "బాయ్! నిజంగా నాతో మీర్జా బాయ్ మాట్లాడతారా..?" అని కంగారుగా అడిగాడు సత్తి.

ఫోన్ తీసుకొని "సత్తి! నేను మీర్జాని మాట్లాడుతున్నాను నీతో గొడవ పడిన వాళ్ళు అక్కడ ఆంజనేయస్వామి గుడి దగ్గర ఉన్నారు ఆ వస్తువు కూడా గుడి లోపల విగ్రహం
పాదాల దగ్గర ఉంది.

ఉదయం దానిని తీసుకుని బయలుదేరడానికి రెడీ అవుతున్నారు ఈలోపు అక్కడి నుంచి దానిని మీరు తీసుకోవాలి ఎంతమందిని చంపిన పర్వాలేదు కానీ అది నాకు కావాలి.

ఈ పని నువ్వు చేస్తే నీ లెవెల్ మారిపోతుంది మీర్జా మాట ఇచ్చాడు అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా!" అని చెప్పాడు.

"బాయ్!  నా పనితనం ఏమిటో చూపిస్తాను అజీజ్ బుల్లెట్ వాడొద్దు అన్నాడని ఖాళీ తుపాకులు పట్టుకుని తిరుగుతున్నాము, మీరు ఆర్డర్ ఇచ్చారు కాబట్టి బుల్లెట్స్ లోడ్ చేస్తాము ఆల్రెడీ వాళ్ళని ఫాలో చేస్తూ మనవాళ్ళు ఇద్దరు వెళ్లారు ఏది ఏమైనా సరే ఆ వస్తువుని సంపాదించి  మళ్ళీ మీకు కాల్ చేస్తాను." అని చెప్పాడు సత్తి.

"మేము అరవకొండా వైపు వస్తూ ఉంటాము మీరు ఆ ఐటమ్ పట్టుకుని మాకు ఎదురు రావాలి." అని చెప్పాడు మీర్జా.

"సరే బాయ్!" అని చెప్పి ఫోన్ పెట్టేసి నిద్రపోతున్న తన మనుషుల్ని లేపి "ఒరేయ్! మన మీద చేయి చేసుకున్న వాళ్ళు గుడి దగ్గరికి వెళ్లారు అన్నావు కదా అక్కడికి వెళదాం పదండి." అని చెప్పి గన్ లో బుల్లెట్స్ లోడ్ చేసి సైలెన్సర్ ఫిట్ చేశాడు సత్తి.

"అన్న! ఉదయం వెళ్ళచ్చు కదా!" అని మత్తుగా అడిగాడు నిద్ర లేచిన మనిషి.

"ఒరేయ్! మనం వెతుకుతున్న వస్తువు ఆ గుడిలో ఉంది డబ్బులు కావలసిన వాళ్ళు నాతో పాటు రండి అవసరం లేని వాళ్ళు ప్రశాంతంగా ఇక్కడే చావండి." అని నలుగురు తో కలిసి బయలుదేరాడు సత్తి.

ఆ మాట విని నిద్రమత్తు వదిలి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చి "అన్న! వాళ్లలో ఇద్దరు గుడి దగ్గర సెక్యూరిటీగా పడుకున్నారు చప్పుడు కాకుండా పని జరిగిపోవాలి ఆ మిలిటరీ వాడు మనల్ని అక్కడ చూశాడు అంటే ఈసారి చంపేస్తాడు." అని చెప్పాడు సత్తి మనిషి.

"అన్న! గుడి దగ్గరకి వెళ్లి కాపు కాసి రెండు గంటలకి ఎంటర్ అవుదాము అప్పుడైతే అందరూ మంచి నిద్రలో ఉంటారు పని ఈజీగా అయిపోతుంది." అని చెప్పాడు వాళ్ళలో ఒకడు.

"సరే! పదండి." అని జీప్ ఎక్కి "గుడికి దూరంగా ఆపండి ఎటువంటి సౌండ్ రాకూడదు." అని చెప్పాడు సత్తి.

"సరే అన్న!" అని జీప్ స్టార్ట్ చేసి గుడి దగ్గరికి బయలుదేరారు అందరు.

**********

ఢిల్లీ ఇంటి దగ్గర జితిన్ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ "ఓన్ అవర్ అవుతుంది ఫోను రాలేదు." అని ఫోన్ చేసి ఇద్దరీ ఫోన్ లు స్విచాఫ్ రావడంతో హడావిడిగా మిలిటరీ హెడ్ క్వార్టర్స్ కి కాల్ చేసాడు నాయక్.

ఫోన్ లిఫ్ట్ చేసి చేయండి "జైహింద్ సార్!" అని చెప్పాడు అక్కడ ఉన్నా ఆఫీసర్.

"జైహింద్! వన్ అవర్ బ్యాక్ నా మొబైల్ కి ఒక ఆఫీసర్ కాల్ చేశాడు ఇప్పుడు అతని ఫోన్ కలవడం లేదు, ఆ ఏరియాలో వేరే నెంబర్స్ ఏమైనా ఉన్నాయేమో ట్రేస్ చేసి ప్రెసెంట్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకోండి." అని చెప్పాడు నాయక్.

"ఓకే సార్! అని కంప్యూటర్ లో చెక్ చేసి "సార్! మీకు కాల్ వచ్చిన టైమ్ కి ఆ ఏరియాలో మొత్తం 10 నెంబర్స్ యాక్టివ్ గా ఉన్నాయి వాటిలో ఆరు నెంబర్లు హైవేలో కర్నూలు వైపు వెళుతున్నట్లు చూపిస్తున్నాయి." అని చెప్పాడు ఆఫీసర్.

"ఓకే థాంక్యూ!" అని ఫోన్ పెట్టేసి కాసేపు ఆలోచించి మొబైల్లో నెంబర్స్ చూస్తూ యోధ నెంబర్ కి కాల్ చేశాడు నాయక్.

ఒక్క రింగ్ లో లిఫ్ట్ చేసి "జైహింద్ సర్!" అని చెప్పాడు యోధ.

"మన ఏజెంట్, మీర్జాని అరెస్టు చేస్తున్నాను అని ఫోన్ చేశాడు తర్వాత నుంచి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆ ప్లేస్ నుంచి కొన్ని నెంబర్లు కర్నూలు వైపు వస్తున్న సిగ్నల్ కనిపించింది. నాకు తెలిసి వాళ్ళు అరవకొండా వస్తున్నారు బి అలెర్ట్!" అని చెప్పాడు నాయక్.

"సార్! నేను ఒక్క రింగులోనే ఫోన్ లిఫ్ట్ చేసినప్పుడే మీకు అర్థం అయి ఉంటుంది. స్వామివారి పాదాల దగ్గర ఉన్న ఆ వస్తువుని ఇక్కడి నుంచి ఎవ్వరు పట్టుకు వెళ్ళలేరు." అని తన ఇంటి పైనుంచి స్నైపర్ గన్ లో గుడిలో పడుకున్న పుష్కర్ వాళ్ళని చూస్తూ చెప్పాడు యోధ.

"గుడ్! ఆ వస్తువు కోసం నీ తండ్రి ప్రాణాలు వదిలాడు అతని త్యాగం వృధా కాకూడదు ఆ ఐటమ్ ఎలాగైనా  మిలిటరీ హెడ్ క్వార్టర్స్ కి చేరుకోవాలి." అని చెప్పాడు నాయక్.

"ఓకే సార్! మీరు ప్రశాంతంగా పడుకోండి ఆ వస్తువు శత్రువుల చేతిలో పడింది అంటే నేను చనిపోయినట్లు అర్థం!" అని ఫోన్ పెట్టేసి స్నైపర్ గన్ కి సైలెన్సర్ ఫిట్ చేసి  జూమ్ చేసి చూస్తూ దూరంగా రెండు జీపులు ఆగడం చూసాడు యోధ.
[+] 6 users Like SivaSai's post
Like Reply
#39
రుద్రం భజే! ఎపిసోడ్ 11



నాయక్ తో ఫోన్లో మాట్లాడి గన్ కి సైలెన్సర్ బిగించి ఇంటి పైనుంచి  దూరంగా ఆగిన జీప్ ని స్నైపర్ లో జూమ్ చెసి చూస్తూ ఉన్నాడు యోధ.

*************

గుడికి దూరంగా జీప్ ఆపి స్లోగా నడుచుకుంటూ వస్తూ తన మనుషుల వైపు చూసి "ఇద్దరు వెళ్లి గుడిలో ఎంతమంది ఉన్నారో చూసి రండి." అని చెప్పాడు సత్తి.

గుడి దగ్గరికి వస్తున్న ఇద్దరి మనుషుల్ని చూసి పుష్కర్ కి కాల్ చేసి "అక్కడి ఏం జరిగినా సరే నేను చెప్పే వరకు పడుకునే ఉండండి కళ్ళు తెరవకండి ఫోన్ లైన్ లోనే ఉంటాను." అని చెప్పాడు యోధ.

"ఓకే సార్!" అని చెప్పి ఏకవీర వైపు చూసి "కళ్ళు మూసుకుని ఉండు ఏం జరిగినా సరే మాట్లాడకు!" అని సైలెంట్ గా పడుకున్నాడు పుష్కర్.

అంతలో నీతూ వాళ్ళని కాన్ఫరెన్స్ లోకి తీసుకుని "ఇంటి వెనక వైపు నుంచి మెయిన్ రోడ్ ఎక్కి జీప్ దగ్గరకి వెళ్ళండి ఇక్కడ నుంచి ఎవరు తప్పించుకోకూడదు." అని చెప్పాడు యోధ.

"ఓకే!" అని చెప్పి దీప్తి, పూజా లతో కలిసి ఇంటి వెనకనుంచి బయలుదేరింది నీతూ.

చీకటిలో నడుచుకుంటూ నీతూ వెనకాల వెళుతూ "ఈ మిలిటరీ వాళ్ళు ఎప్పుడు అంతే ప్రాణాల అంచుల వరకు తీసుకువెళ్తారు, అయ్యినా వచ్చే వెధవలు ఉదయం రావచ్చు కదా ఈ టైంలో వచ్చి నిద్ర చెడగొట్టకపోతే!" అని విసుక్కుంటూ వెళ్ళింది పూజా.

"ఉదయం అయితే నీ బీమ్ బాయ్ ఉంటాడని వాళ్లకి తెలుసు!" అని చెప్పింది నీతూ.

"అసలు ఇంతకీ యోధ ఎక్కడి నుంచి చూస్తున్నాడు." అని డౌట్ గా అడిగింది దీప్తి.

అంతలో ఇద్దరు గుడి దగ్గరికి వచ్చి లోపలికి వెళ్ళడానికి గేటు ఓపెన్ చేయడం చూసి షూట్ చేశాడు యోధ.

గేటు ఓపెన్ చేస్తూ బుల్లెట్ తగలడంతో నోటి వెంట మాట కూడా రాకుండా కింద పడ్డ వాడి వైపు చూసి 'ఏమైందా?' అని ఆలోచించే లోపు మరొక బుల్లెట్ వచ్చి తలలో దిగి అక్కడే కుప్పు కులేడు సత్తి మనిషి.

గుడి దగ్గరికి వెళ్లిన ఇద్దరు ఎంతసేపటికి రాకపోవడంతో మరో ఇద్దరి వైపు చూసి "ఒరేయ్! మీరు ఫ్రంట్ గేట్ నుంచి కాకుండా పక్కన ఉన్న గోడ దూకి లోపలికి వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళని లేపేసి గేటు ఓపెన్ చేయండి." అని చెప్పాడు  సత్తి.

"సరే అన్న!" అని గుడి దగ్గరికి వెళ్ళారు ఇద్దరు.

ఇంటి దగ్గర నుంచి రోడ్డు మీదకి వచ్చి చూస్తూ "యోధ! జీప్ కనిపించింది." అని చెప్పి దగ్గరికి వెళ్లి "తాళాలు కూడా దీనికే ఉన్నాయి." అని తీసి జేబులో వేసుకుంది నీతూ.

"ఓకే!" అని చెప్పి గుడి గోడ దూకడానికి ట్రై చేస్తున్న ఇద్దరిని చూస్తూ ఫస్ట్ లోపల దూకిన వాడిని షూట్ చేసి  "మీరు జీప్ దగ్గరే ఉండండి." అని చెప్పి వెనకాలే దూకుతున్న రెండో వాడిని కుడా షూట్ చేసి

"నలుగురు చచ్చారు  ఇంకా నలుగురు ఉన్నారు మీ ముగ్గురు ఎంతమందిని ఎదుర్కోగలరు." అని అడిగాడు యోధ.

ఫోన్ లైన్ లో ఉండి ఆ మాట విని నీతూ వైపు చూసి "ఒక్కరు!" అని వేలు చూపించింది పూజా.

"యోధ! నేను ఒక్కరిని ఎదుర్కొంటాను దీప్తి, పూజ కలిసి ఒక్కరిని ఎదుర్కొంటారు, ఇంకొక ఇద్దరు సంగతి నువ్వే చూడాలి." అని చెప్పింది నీతూ.

"సరే! ముగ్గురు బయటికి కనిపించకుండా జీప్ వెనకాల ఉండండి. అక్కడికి ఎవరైనా వస్తే వెంటనే మీకు చెబుతాను." అని చెప్పి దూరంగా వెయిట్ చేస్తున్న నలుగురుని స్నైపర్లో చూస్తూ ఉన్నాడు యోధ.

గుడి లోపల నిద్రపోతున్నట్లు నటిస్తూ "సార్! బుల్లెట్ సౌండ్ అయ్యితే వినపడలేదు కానీ మనుషులు కింద పడుతున్న సౌండ్  వినిపిస్తుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుంది?" అని ఫోన్ లైన్ లో ఉన్న యోధని అడిగాడు పుష్కర్.

"మీ ఇద్దరిని చంపడానికి వచ్చిన నలుగురిని చంపేశాను మరొక ఇద్దరు వస్తున్నారు సైలెంట్ గా ఉండండి." అని చెప్పాడు యోధ.

ఫోన్లో పుష్కర్ మాటలు విని "కాసేపు సైలెంట్ గా ఉండలేవా.?" అని అడిగింది నీతూ.

"మేడం! నేను నక్సలైట్  ఏరియాలో పనిచేసినప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదు, యోధ సార్ బుల్లెట్ గురు తప్పితే ఇక్కడికి వచ్చిన వాడి కత్తి మా పీక మీద ఉంటుంది." అని భయంగా చెప్పాడు పుష్కర్.

"మిస్టర్ పుష్కర్! నా సర్వీస్ లో ఇప్పటివరకు ఒక్క బుల్లెట్ కూడా వేస్ట్ చేయలేదు, నా గన్ లో నుంచి బయటికి వచ్చినా బుల్లెట్ కచ్చితంగా  మనిషిని బాడీ లోకి వెళ్లి ప్రశాంతంగా కూర్చుంటుంది." అని చెప్పి రెండు వైపులా వస్తున్న మరొక ఇద్దరిని చూసి

ఫస్ట్ గేట్ దగ్గరికి వచ్చిన వాడిని షూట్ చేసి మరొకడు గోడ దూకి లోపలికి వచ్చి మనుషులు చనిపోయి ఉండడం చూసి కంగారుగా వెనక్కి వెళుతున్న వాడికి తలలోకి బులెట్ దింపాడు యోధ.

గుడి దగ్గరికి వెళ్ళిన ఆరుగురు తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి " ముష్రు! మనం ఇక్కడ ఉండకూడదు పద!" అని తనతో పాటు ఉన్న మనిషిని తీసుకుని జీప్ దగ్గరికి పరిగెత్తాడు సత్తి.

అది చూసి "నీతూ అలర్ట్! ఆ ఇద్దరు నాకు ప్రాణాలతో కావాలి." అని చెప్పి గన్ పక్కనపెట్టి బిల్డింగ్ మీద నుంచి కిందకు దూకి వేగంగా పరిగెత్తాడు యోధ.

అంతలో పరుగెత్తుకుంటూ వెళ్లి జీప్ ఎక్కి స్టార్ట్ చేయడానికి చూసి "అన్న! తాళాలు ఏమైయాయి ఇక్కడ లేవు అని కంగారుగా చెప్పాడు ముష్రు.

అంతలో దీప్తి వాళ్ళతో కలిసి ముందుకు వచ్చి గన్ ఎయిమ్ చేసి "సైలెంట్ గా కిందకు దిగండి లేకపోతే చచ్చిపోతారు." అని వార్నింగ్ ఇచ్చి దీప్తి వాళ్ళ వైపు చూసి "ఇద్దరికి హ్యాండ్ కప్స్ వేయండి." అని చెప్పింది నీతూ.

ఆ మాట విని తనకు దగ్గరకి హ్యాండ్ కప్స్ తీసుకుని వస్తున్న పూజని చూసి గన్ తల మీద పెట్టి "మర్యాదగా జీప్ తాళాలు ఇచ్చి ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళండి లేకపోతే దీని బుర్ర పేలిపోతుంది." అని చెప్పాడు సత్తి.

అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి పూజ తల మీద గన్ ఉండడం చూసి దగ్గరికి వెళుతూ "షూట్ చేసుకో ఆ అమ్మాయి పోయిన పర్వాలేదు." అని చెప్పాడు యోధ.

ఆ మాటకి షాక్ అయ్యి చూస్తూ ఉండిపోయింది పూజా.

యోధ దగ్గరికి రావడం చూసి కంగారుపడుతూ పూజా ని పక్కకు తోసి గన్ తో యోధ ని షూట్ చేశాడు సత్తి.

మీదికి వస్తున్న బుల్లెట్ కి పక్కకి తప్పుకుని వేగంగా వెళ్లి సత్తి చెయ్యి పట్టుకుని వెనక్కి విరిచి గన్ తన చేతిలోకి తీసుకోని డ్రైవింగ్ సీట్లో ముష్రు  వైపు చూసి "కిందకి దిగు!" అని సీరియస్ గా చెప్పాడు యోధ.

బాధతో అరుస్తున్న సత్తిని చూసి భయంతో కిందకి దిగి రెండు చేతులు పైకెత్తి "నన్నేమీ చేయకండి నా దగ్గర గన్ కూడా లేదు." అని చెప్పాడు ముష్రు.

డ్రైవింగ్ సీట్ లో నుంచి దిగిన ముష్రుకి హ్యాండ్ కప్స్ వేసి పూజ వైపు చూసి "నీకేమీ కాలేదు కదా!" అని అడిగింది నీతూ.

"ఆ వెధవకి చంపే ఆలోచన లేకపోయినా యోధ చంపమనేటట్లు ఉన్నాడు." అని భయంగా చూస్తూ చెప్పింది పూజా.

"ఒకవేళ వీడు నిజంగా షూట్ చేసిన నువ్వు చావవు వాడి గన్ యాంగిల్ నీ భుజానికి ఉంది." అని నవ్వుతూ చెప్పాడు యోధ.

"నా భుజం లో బుల్లెట్ దిగినా చాలు నేను చచ్చిపోతాను తెలుసా!' అని కంగారుగా చెప్పింది పూజా.

"అవునా? బుల్లెట్ భుజం లో దిగితే చచ్చిపోతారా..? నాకు ఆ విషయం తెలియదే!" అని తన చేతిలో ఉన్న గన్ తో సత్తి భుజం మీద షూట్ చేశాడు యోధ.

భుజం లో బుల్లెట్ దిగడంతో కిందపడి గిలగిల కొట్టుకుంటూ బాధగా అరుస్తూ "నన్ను చంపకు!' అని రిక్వెస్ట్ చేశాడు సత్తి.

పూజ వైపు చూసి "చూసావా.! భుజం లో బుల్లెట్ దిగినా చావలేదు మాట్లాడుతూనే ఉన్నాడు." అని చెప్పాడు యోధ.

బాధతో అరుస్తున్న సత్తి వైపు చూసి "యోధ! అతను చనిపోయేటట్లు ఉన్నాడు ఫస్ట్ ఎయిడ్ చేసి మనకు కావలసిన విషయాలు తెలుసుకుందాము." అని చెప్పింది దీప్తి.

"సరే! ఫస్ట్ ఎయిడ్ చేయండి." అని ముష్రు వైపు చూసి "వీడితో మన ఉపయోగం లేదు చంపేయనా...?" అని అడిగాడు యోధ.

ఆ మాట విని "భయ్యా! నాకు అన్ని విషయాలు తెలుసు ఇక్కడికి మీర్జాతో పాటు చాలామంది వస్తున్నారు మమ్మల్ని ఆ గుడిలో ఉన్న వస్తువు తీసుకురమ్మని చెప్పారు, కానీ అది ఎందుకో మాత్రం నాకు కూడా తెలియదు." అని భయంగా చూస్తూ చెప్పాడు ఆ వ్యక్తి.

"గుడ్! నీకు ప్రాణాల మీద చాలా ఆశ ఉంది." అని చెప్పి సత్తి జేబులో ఉన్న మొబైల్ రింగ్ అవడం చూసి ముష్రు  వైపు చూసి

"ఫోన్ లిఫ్ట్ చేసి వస్తువు హ్యాండ్ ఓవర్ అయింది గెస్ట్ హౌస్ దగ్గరకి వచ్చేసాము  దాని కోసం వచ్చిన  ఆఫీసర్లు కూడా మన హ్యాండ్ లోనే ఉన్నారు త్వరగా రండి అని చెప్పాలి." అని ఫోన్ ఇచ్చాడు యోధ.

"సరే!" అని భయంగా చూస్తూ ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేసి "భయ్యా! నేను ముష్రుని మాట్లాడుతున్నాను, ఆ గుడిలో ఉన్న వస్తువు తీసుకుని గెస్ట్ హౌస్ కి వచ్చేసాము దానికోసం వచ్చిన ఆఫీసర్లు కూడా మన దగ్గరే ఉన్నారు వాళ్ళకి సత్తి అన్న కోటింగ్ ఇస్తున్నాడు త్వరగా వచ్చేయండి." అని చెప్పాడు.

ఫోన్లో ఆ మాట విని "ఆ ఆఫీసర్లని చంపకండి వాళ్లతో నేను మాట్లాడాలి." అని చెప్పాడు మీర్జా.

"సరే బాయ్!" అని చెప్పి ఫోన్ పెట్టేసి యోధ చేతికి ఇచ్చాడు ముష్రు.

ఫోన్ తీసుకుని పుష్కర్ వాళ్ళు ఇంకా గుడి దగ్గర పడుకునే ఉన్నారా..? " అని చుట్టూ చూస్తూ అడిగాడు యోధ.



" రుద్రం భజే! ఎపిసోడ్ 11 " రచనకు రేటింగ్ ఇవ్వండి...
[+] 9 users Like SivaSai's post
Like Reply
#40
ee story tho oka superhero movie cheyachu.

appatlo HanuMan ani vachindi.. tarvatha edo Mirai ani vachindi.

ippudu idi teeyochu!!!
[+] 1 user Likes ash.enigma's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)