27-04-2026, 01:27 PM
Excellent writing...
|
పాణిగ్రహణం
|
|
27-04-2026, 01:47 PM
Excellent drama scene in Sree's house.
Chala bagundi
28-04-2026, 03:44 AM
Part - 82
సూర్య నిద్రలో లేచి కూర్చుంటాడు..ఏమిటి ఇంత దారుణంగా పులమారుతుంది అనుకుని వాటర్ తాగి ఫోన్లో ఉన్న విశి ఫోటో చూస్తూ ఏంటి క్యూటి..
నువ్వు తలుచుకున్నావా ఏమిటి నిద్రలో కూడా లేచి కూర్చున్నాను అని ఫోన్ లో ఉన్న విశి ఫోటో చూస్తూ కబుర్లు చెబుతూ ఉంటాడు. ఏమిట్రా ఇంత క్యూట్‌గా నవ్వుతూ చూస్తున్నావు ఫోన్‌లో? నిద్రలో కూడా మనసు నీ దగ్గరికి పరుగెత్తిందేమో చూడు.. ఫోటో చూస్తూ పక్కగా దుప్పటి మీద వాలుతాడు. నువ్వు ఈ ఫోటోలో ఇలా ముద్దుగా తల వంచి నవ్వడం ఏమైనా బాగుందా? ఆ స్టిల్ నచ్చే ఫోటో తీసుకున్నాను. అది గుర్తుకొచ్చినప్పుడల్లా నా మనసు వశం తప్పుతున్నది. అదే స్టిల్ తో ఇప్పుడు నా ఎదురుగా నిలబడితే.. నేనేమైనా తట్టుకోగలనా? మెల్లగా ఫోటోకి దగ్గరగా వస్తూ.. చూడూ… నీ డింపుల్ చూశాక నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇకా ఈ స్మైల్‌కి రెస్ట్ ఇవ్వు… నాకు డాక్టర్ రాసేస్తాడు స్మైల్ ఓవర్‌డోస్ అని అర్థమవుతుందా.. కొంచెం సైలెంట్‌గా పడుకుని ఫోన్‌ని ఛాతీ మీద పెట్టుకొని.. చాలా జాలిగా ఉన్నావు రా… నా నిద్రకే కాంపిటీషన్ ఇస్తున్నావు. నీ గురించి ఆలోచిస్తూ లైఫ్ సీరియస్ కాకుండా.. కామెడీగా మారిపోతోంది. తన ముక్కు మీద ఫోన్ పడుతుంటే.. అయ్యో! క్యూటి... నువ్వు స్క్రీన్ మీద నుంచే కొట్టావా ఏమిటి? అసలు నేను ఈ ప్రేమని ఫన్ ప్యాకేజ్‌గా ఉంచుకోకపోతే పిచ్చివాడినైపోతా.. తొందరగా నీ మనసులో ఉన్న మాట చెప్పేయవే బంగారం.. తిరిగి మెల్లగా ఫోన్‌కి కిస్ పెట్టి పక్కకు తిరుగుతాడు. గుడ్ నైట్ క్యూటి … నువ్వు ఫోటోలో అయినా నవ్వుతూనే ఉండు.. లేదంటే నా కలలో వచ్చి రిప్లై ఇవ్వు. అలా విశి ఫోటో చూస్తూనే నిద్రలోకి జారుకుంటాడు. సూర్య ఇంకా నిద్రలోనే, ఫోన్ ఛాతీ మీద పడి ఉంటుంది. కిటికీ నుంచి సూర్యకిరణాలు ముఖంపై పడుతుంటాయి. ఫోన్ ‘పింగ్ ’ అవుతుంది — కొత్త వాయిస్ మెసేజ్. ఫోన్ ఆటో ప్లే అవుతుంది విశి వాయిస్‌లో మెల్లగా నవ్వుతూ.. మిస్టర్ హాఫ్-స్లీప్ రొమాంటిక్.. రాత్రి ఆ టైంలో నా ఫోటోతో మాట్లాడుతున్నావా? నేను నీ ఫోటో చూసి హాయిగా నిద్రపోతుంటే, నువ్వు నా ఫోటోతో ప్రేమ కబురులు చెబుతున్నావా.. క్యూట్ కేసు నువ్వు.. సూర్య కళ్ళు తెరిచి చిరునవ్వుతో ఫోన్ చెవికి దగ్గర పెట్టుకుంటాడు.. విశి వాయిస్ మళ్లీ వినపడుతూ ఉంటుంది.. నువ్వు నిద్రలో కూడా నా గురించి ఆలోచిస్తున్నావంటే, నిజంగా నేను డ్రీమ్ టాక్స్ వేయాలి మరి ఏంటి రా.. నా డింపుల్ చూసి ‘స్మైల్ ఓవర్‌డోస్’ అంటావా? నాకైతే నీ రాత్రి టాక్స్ విన్నాక ‘లవ్ ఓవర్‌డోస్’ అయిపోయింది!” వాయిస్ నడుస్తుండగా సూర్య సిగ్గుతో నవ్వుతాడు తరువాతసారి నా ఫోటోతో మాట్లాడాలంటే వీడియో కాల్ పెట్టు రా పిచ్చోడా! అప్పుడు నేను కూడా ‘లైవ్ రిప్లై’ ఇస్తాను. సూర్య చిరునవ్వుతో.... ఏం క్యూటి.. , నువ్వు ఇలా ఒక్క మెసేజ్‌లోనే మొత్తం ఉదయాన్ని సునామీ చేసేసావు. ఫోన్‌కి మెల్లగా చూస్తూ.. సరే క్యూటి … ఈ రోజు వర్క్ కి కాదు నీ వాయిస్‌కి లేట్ అవుతా. ఫోన్లో రింగ్టోన్ గట్టిగా వస్తూ ఉంటే ఉలిక్కిపడి లెగుస్తాడు. ఏమిటి ఇదంతా నాకల.. ఇంకా క్యూటి నే ఫోన్ చేసి మాట్లాడుతుంది అనుకున్నాను అని తల వెనకాల రబ్ చేసుకుంటూ లిఫ్ట్ చేసి చెప్పరా.. ఏం బాబు ఇంకా తమరు లెగలేదా.. వర్కౌట్స్ కి రాలేదు అని వైభవ్ అడుగుతాడు. నువ్వు అప్పుడే లేచావా.. ఒకసారి టైం చూసుకోండి. ఈరోజు అసలే బాబీకి పెదనాన్నతో మీటింగ్ ఉంది. టైం చూసి అప్పుడే సెవెన్ అయిపోయిందా అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. గబగబా రెడీ అయ్యి కిందకి వస్తాడు. ఒరేయ్ టిఫిన్ చేయరా అంటే.. ఇప్పటికే లేట్ అయిపోయింది మామ్.. క్యూటి వెయిట్ చేస్తూ ఉంటుంది నేను తర్వాత ఆఫీస్ లో తింటాను అని పరుగు అందుకుంటాడు. విశి రెడీ అయ్యి దేవా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సోరి లేట్ అయ్యానా.. లేదు. వెళదామా అంటుంది. టెన్షన్ పడుతున్నావా.. కొంచెం.. సరే బైక్ ఎక్కు అని స్టార్ట్ చేస్తాడు.. బైక్ ఎక్కిన తర్వాత వెళ్లాల్సిన రూట్ లో కాకుండా వేరే రూట్ లోకి తిప్పుతాడు. ఎక్కడికి.. ఆ రూట్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యింది. కానీ మ్యాప్ లో ఏమీ చూపించడం లేదు కదా... నా మాట నమ్మవా భలేవారే మిమ్మల్ని కాకపోతే ఎవరిని నమ్ముతాను. వెళుతూ విశి అని పిలిస్తే.. చెప్పండి సార్...బాగా ఆకలేస్తుంది టిఫిన్ చేద్దామా.. మీరు తినలేదా... లేదు బ్యాచులర్స్ కదా.. ఎక్కడ అవుతుంది. సరే. ఒక చోట ఆపుతాడు. టిఫిన్ ఆర్డర్ చేసి నువ్వేం తింటావు.. నేను చేసే వచ్చాను సార్. నేను తింటూ ఉంటే అలా చూస్తూ ఉంటావా.. ఒక కాఫీ నో, టీ నో, జ్యూస్ ఏదో ఒకటి తీసుకో అని జ్యూస్ ఆర్డర్ ఇస్తాడు. విశి కి మాట్లాడే అవకాశం ఇవ్వడు. విశి టైం చూసుకుంటూ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరాదామా.. హా సార్ అంటుంది. మళ్ళీ స్లోగా తీసుకు వెళుతుంటే.. సార్ కొంచెం స్పీడుగా వెళదామా. ఏమైంది.. లేట్ అవుతుంది ఏమో అని.. కమాన్ విశి నేను ఉండగా నువ్వు అలా ఆలోచించడం ఏమైనా బాగుందా.. మీకున్న ధైర్యం నాకు లేదు లే సార్.. వై.. విక్రమ్ సార్ చాలా స్ట్రిక్ట్ అంట.. టైం మెయింటైన్ చేయకపోతే ఫస్టే బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది కదా.. సో అదొకటి ఉందా.. సరే అయితే గట్టిగా పట్టుకో అని బైక్ స్పీడ్ గా డ్రైవ్ చేస్తాడు. ఆ స్పీడ్ కి గట్టిగా కళ్ళు మూసుకుని సూర్యని అతుక్కుపోతుంది. ఆఫీస్ ముందు బైక్ ఆపి హలో విశిష్ట గారు వచ్చేసాము. కళ్ళు తెరిసి చూస్తుంది. ఏంటి సార్ ఆ స్పీడ్.. నువ్వే కదా స్పీడ్ గా తీసుకు వెళ్ళమన్నావు. వెళ్లిన, వెళ్ళకపోయినా కోప్పడుతున్నావు. ఇలాగైతే ఎలా.. సరే ముందు లోపలికి వెళ్ళు. ఆల్ ద బెస్ట్. థాంక్యూ సార్ అని ముందుకు వెళ్ళింది మళ్ళీ వెనక్కు వచ్చి ఇక్కడే ఉంటారు కదా.. నీ హ్యాపీ ఫేస్ చూసేదాకా ఇక్కడే ఉంటాను సరేనా ముందు వెళ్ళు అని స్మూత్ గా చెబుతాడు. విశి లోపలికి వెళ్ళేటప్పటికి వైభవ్ అక్కడే ఉంటాడు. రండి బాబి వెళదాం.. నువ్వు వచ్చి ఎంత సేపు అయింది. ఇప్పుడే వచ్చాను. విశి, వైభవ్ ఇద్దరు లోపలికి వెళతారు.. మీటింగ్ టైం కి మేనేజర్ వచ్చి తీసుకువెళతాడు. మీటింగ్ రూమ్ లో విక్రమ్ ని చూడగానే అలాగే నిలబడిపోతుంది. ఏమైంది బాబీ అని వైభవ్ కదుపుతాడు.. విశి ఏం చెప్పబోతోంది.......
28-04-2026, 03:45 AM
Part - 83
ఏంటి బాబి అలా నిలబడిపోయావు. వైభవ్ ఒక్కసారి అటు చూడు. హ విక్రమ్ సార్. అచ్చు మన దేవా సార్ లాగా ఉన్నారు కదా..
అబ్బా ఇది మర్చిపోయాము అనుకొని మనుషులు పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అంట..అందులో విక్రమ్ సార్ కూడా ఒకరయ్యి అంటారు. అలా ఎలా జరుగుతుంది. ఏమో... ఎవరు ఏదో చెప్పారు కదా..మనం ఫాలో అయిపోదాం. ఇప్పుడు మనకు కావలసింది ప్రాజెక్టు. ఇక మిగిలిన విషయాలు గురించి మనం మాట్లాడకుండా ఉంటే బెటర్ ఏమో బాబీ...ప్లీజ్. సరే అని వెళ్లి హాయి సార్ గుడ్ మార్నింగ్. హాయ్ మిస్ విశిష్ట గుడ్ మార్నింగ్.. ఆ వాయిస్లో వచ్చిన గంభీరానికి కొంచెం భయపడి వెనక్కి అడుగువేస్తోంది.. హే కూల్ బేబీ ఎందుకు అలా భయపడుతున్నావు. ఫస్ట్ కూర్చో. రిలాక్స్... ప్యూన్ ని పిలిచి జ్యూస్ తెప్పిస్తాడు. ఫస్ట్ రిలాక్స్ అవ్వు. కూల్ గా నీ ప్రెజెంటేషన్ వింటాను. వైభవ్ రిలాక్స్ గా కూర్చుని తాగుతూ ఉంటాడు. విశిష్ట సైలెంట్గా ఏంటి వైభవ్.. అసలు భయం లేదా.. మన ముందు ఉన్నది ది గ్రేట్ లయన్ విక్రమ్ సార్.. మనకు ఆఫర్ ఇచ్చినప్పుడు యూస్ చేసుకొవాలి. ఎంత ఇచ్చిన సరే మన లిమిట్స్ లో మనం ఉండడం మర్యాద. సరిగ్గా కూర్చో. సరే బాబి అని స్ట్రైట్ గా కూర్చుంటాడు. విక్రమ్ ఇద్దరినీ చూసి ఏమీటి మీ ఇద్దరి డిస్కషన్.. మా బాబి ఎప్పుడు ప్రజెంటేషన్ ఇద్దామా.. మిమ్మల్ని మెప్పించాలి అని వెయిట్ చేస్తుంది. ఓ.. మీ ప్రజెంటేషన్ మీద మీకు అంత కాన్ఫిడెన్సా.. అవును సార్..మేము మమ్మల్ని నమ్ముకుని ఇక్కడి వరకు వచ్చాము. అంతా నువ్వే మాట్లాడుతున్నావు కానీ మీ బాబి ఏమీ మాట్లాడడం లేదు. మా బాబి ఓన్లీ వర్క్ గురించే మాట్లాడుతుంది. మిగిలిన టైం అంతా ఇలా సైలెంట్ గానే ఉంటుంది. వైభవ్ మాట్లాడేదానికి విశి భయంగా విక్రమ్ వైపు చూస్తుంది. ఎందుకు బేబీ అంత భయపడుతున్నావు. నేను ఏమన్నా సింహంలాగా కనిపిస్తున్నానా ఏమిటి... అవును కాదు అన్నట్టుగా తల ఊపుతుంది. విశి ఎక్స్ప్రెషన్ కి నవ్వుతూ కమాన్ బేబీ.. మేము బయట మాత్రమే సీరియస్ గా ఉంటాము. వర్క్ లేకపోతే జోవియల్ గానే ఉంటాను. అది కూడా డిపెండ్స్ ఆన్ థట్ పర్సన్. నిన్ను చూస్తూ ఉంటే నాకు మా ఫ్యామిలీ మెంబర్ లాగానే అనిపిస్తుంది. సో ఫ్రీగా ఉండు.. అప్పుడే ఇంకా కాన్ఫిడెంట్గా చెప్పగలవు. ఓకే సార్. సరే ఎలా చెప్పినా నీకు ఆ భయం పోదుగానీ ప్రజెంటేషన్ స్టార్ట్ చెయ్.. విశి లాంగ్ బ్రీత్ తీసుకుని.. స్క్రీన్ దగ్గరకి నిలబడి ప్రజెంటేషన్ స్టార్ట్ చేస్తుంది. భరత్, వినయ్, రాజ్ కూడా వచ్చి కూర్చుంటారు. విశి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే డౌట్స్ అడుగుతానే ఉంటారు. ఒకవైపు నుంచి చెబుతూ ఉంటే మరోవైపు నుంచి అడుగుతూ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. కానీ విశి చాలా కాన్ఫిడెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వీళ్ళు అడుగుతున్న చిన్న చిన్న మార్పులకి కూడా ఎలా ఉంటే బాగుంటుందా కూడా క్లియర్ గా చెబుతూ ఉంటుంది. విశి చెప్పిన దానికి సాటిస్ఫై అవుతారు. క్లాప్స్ కొడుతూ వెల్డన్ విశి ఇంకా స్టడీస్ కంప్లీట్ అవ్వకుండానే ఇంత మంచి వర్క్ ఇస్తున్నావు. నీతో ఫ్యూచర్లో కలిసి వర్క్ చేయాలని మాకు గట్టిగా ఉంది. నీ అభిప్రాయం ఏమిటి. విశి సంతోషంగా వైభవ్ వైపు చూస్తే కళ్ళు ఆర్పుతాడు. నాకు మీతో కొలెబ్రేట్ అవ్వాలని ఉంది సార్. కానీ నాదొక రిక్వెస్ట్. చెప్పు విశిష్ట.. నేను నా సెల్ఫ్ గా వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. ఐ మీన్ ఇది నా సొంత బిజినెస్ ఏ అనుకోండి. మీకు కంటిన్యూస్గా నా నుంచి వర్క్ వస్తుంది కానీ మీ ఆఫీసులో ఒక ఎంప్లాయ్ గా మాత్రం నేను వర్క్ చేయలేను. ఇలా చెబుతున్నందుకు తప్పుగా అనుకోవద్దు. సోరి.. ఒకరిని ఒకరు చూసుకుని.. నవ్వుకుని.. విశిష్ట దగ్గరికి వచ్చి నీ టాలెంట్ నచ్చింది. నీ కాన్ఫిడెంట్ అంతకన్నా బాగా నచ్చింది. మేము నీతో కొలబ్రేట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాము.సో ప్రైస్ కూడా ఫైనలైజ్ చేద్దామా అనగానే... చాలా సంతోషపడుతూ థాంక్యు థాంక్యు సార్ అని విక్రమ్ చేయి పట్టుకుని ఊపేస్తుంది. వెంటనే తేరుకుని సోరి ఏదో ఎక్సైట్మెంట్లో అంటే.. విశిష్ట చేయి పట్టుకొని ఎప్పుడు ఇదే కాన్ఫిడెంట్ తో ఉండు. నీ టాలెంట్ కి ఎక్కడికో వెళ్ళిపోతావు. నీ వెనకాల వి. జె. స్ కంపెనీ మొత్తం ఉంది. ఎవరడిగినా సరే ఈ విక్రమ్ మనిషి అని చెప్పు చాలు. ఆ మాటకి విశిష్ట పొంగిపోతుంది. శ్రీ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. మీరు బయట కనిపించేది ఒకటి.. బాగా పరిచయం అవుతే మీరేమిటో అన్నది మరొకటి.. థాంక్యూ సార్. శ్రీ లోపలికి వస్తూ నేను చెప్పాను కదా విశి.. విక్రమ్ ని దగ్గరగా చూస్తే చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు అని. అంకుల్.. మీరు ఇక్కడ అని కన్ఫ్యూషన్ గా అడగుతుంది. విక్రమ్ శ్రీ భుజం మీద చెయ్యి వేసి వీడు నా బెస్ట్ ఫ్రెండ్. ఈ కంపెనీ లో ఒక పార్ట్నర్. మీరు నేను శ్రీ అంకుల్ కి తెలుసు అన్న సాఫ్ట్ కార్నర్ తో నా ప్రాజెక్ట్ ఓకే చేశారా.. వద్దు సార్ నాకు నా టాలెంట్ మీద వెళ్ళడమే ఇష్టం. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా బాగుంది. తెలిసినవాళ్ళు. జెన్యూన్ అయితే జాబ్ ఇస్తాను.. మనీ ఇస్తాను. ఏదో రకంగా హెల్ప్ చేస్తాను. రికమండేషన్ అయితే అసలు ఒప్పుకోను. టాలెంట్ లేకుండా ఇంక పెద్ద ప్రాజెక్ట్ నీకు ఎలా ఇస్తాను అనుకున్నావు. నీ డిజైన్ బేస్ చేసుకుని మా ఇంజనీర్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు. ఎంతో మంది ఎంప్లాయిస్ కి లైఫ్ అది. అలాగే కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఎంతో మంది అక్కడికి వస్తూ ఉంటారు వెళుతూఉంటారు. అలాంటి చోట రికమండేషనా.. నో వే.. టాలెంట్ కి రిలేషన్ కి అసలు లింకు పెట్టను. దేని దారి దానిదే. థాంక్యూ సార్.. మీ గురించి తెలిసి కూడా ఏదో మాట్లాడేశాను. సోరి సార్.. నో ప్రాబ్లం... ఒక్కొక్కసారి మన కళ్ళ ముందు ఉన్నదే నిజం అనిపిస్తుంది. ఆవేశపడతాము కానీ ఆ టైంలో మనం ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుని ఏమి జరుగుతుంది అన్నది అబ్జర్వ్ చేస్తే సొల్యూషన్ అక్కడే ఉంటుంది. ఓకే శ్రీ.. ప్రాసెస్ కంప్లీట్ చేయండి. అని వెళ్ళిపోతాడు. కంగ్రాట్ విశి... ఇప్పటి నుంచి నువ్వు కూడా వి. జె. స్ ఫ్యామిలీలో మెంబర్ అయ్యావు. ఆనందంతో ముఖం వెలిగిపోతు ఉంటుంది. ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి వైభవ్ కి బాయ్ చెప్పి పరిగెత్తుకుంటూ వెళుతుంది. వినయ్ అది చూసి ఎక్కడికి రా మీ బాబి అలా పరిగెడుతుంది. ఈ గుడ్ న్యూస్ మరి అన్నయ్యతో షేర్ చేసుకోవాలి కదా... ఏక్కడ ఉన్నాడు.. ఇప్పటివరకు కేబిన్ లో ఉన్నాడు. జస్ట్ టెన్ మినిట్స్ బ్యాక్ కి వెళ్ళాడు. బాబీ వచ్చే వరకు వెయిట్ చేస్తాను అన్నాడు. సో అని భుజాలు ఎగరేస్తాడు. మా అన్నయ్య తరువాత వీళ్ళే బెస్ట్ కపుల్ అయ్యేటట్టు ఉన్నారు. ఈ మాట పూజిత వింటే నీ పని అంతే.. ఇక్కడ లేదు కదా బావ. అందుకే అంత ధైర్యంగా మాట్లాడాను. పూజిత లేకపోతే ఏమైంది.. తమరి సుపుత్రుడు ఉన్నాడు కదా.. ఏరా అని భరత్ అడిగితే... అయ్యో మావయ్య మీరు అన్ని అలా అడగకూడదు. నేను చెప్పకూడదు బాయ్ అని వెళ్ళిపోతాడు. వెళ్లేవాడు మళ్లీ వెనక్కి వచ్చి మావయ్య అని రాజ్ ని పిలుస్తాడు. ఏంట్రా. చందు ఎక్కడ ఉంది. ఆ మాటకు అందరూ చూస్తే... అదే నాలుగు రోజుల నుంచి కనపడలేదు. ఏమైపోయింది అని అడుగుతున్నాను. దానికి కూడా ఎందుకు అందరూ ఏదో సెక్యూరిటీ ఆఫీసర్ దొంగను చూసినట్టు చూస్తున్నారు. అలా అని మేము అన్నామా... నీకు నువ్వ అసుకుంటున్నావు. దీన్నే అంటారు.. గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకోవడం అని.. మీ కొటేషన్స్ ఆపి చందు ఎక్కడ ఉందో చెప్పండి. వర్క్ బిజీ లో తిరుగుతుంది రా . అదేం వర్క్ చేస్తుంది. నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. అంత బిజీగా ఏమి చేస్తోంది. వెళ్లి నువ్వే అడుగు. ఈ మధ్య మేడం గారు చాలా బెట్టు చేస్తున్నారు. సైలెంట్ అయిపోయి ఏం మాట్లాడిన ఒక స్మైల్ ఇచ్చి ఊరుకుంటుంది. చూస్తాను. నాకు చెప్పకుండా అంత బిజీగా ఏం చేస్తుందో అని కోపంగా వెళ్ళిపోతాడు. వెళుతున్న వైభవ్ ని చూసి నవ్వుకుంటూ మనకి ఫ్యూచర్లో మరో రాజ్, నివి కపుల్ వస్తుందన్నమాట... కాకపోతే చిన్న కరెక్షన్.. వీళ్ళ జంటలో నివినీ చూసి అమాయకురాలు అనుకుని బుట్టలో పడ్డాడు. ఇక్కడేమో ఫస్ట్ నుంచి చందు గడుసుగా ఉండి ఇప్పుడు సైలెంట్ అయిపోయింది అంతే తేడా.. హ్మ్... ఎలాగైనా మీ సింహ ఫ్యామిలీదే కదా డామినేషన్... పోనేలే బావ అది అర్థం చేసుకుని కాంప్రమైజ్ అయిపోతే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఎప్పుడు మేమే అర్థం చేసుకోవాలి గాని మీరు ఎవరు అర్థం చేసుకోరా ఏంట్రా.. నీకు ఇప్పుడు వచ్చిన కష్టం ఏంటి బావ. మా నివి నిన్న ఎంత బాగా చూసుకుంటుంది. ఒక్క రోజైనా నిన్ను వదిలి వస్తుందా.. వినయ్ చెప్పిన దానికి పైనుంచి కిందకి చూస్తూ.. అవును.. అది ఏమో భారతదేశం మొదలు ఉంటే మీరేమో ఈ చివరన ఉన్నారు. చెప్పడానికైనా మీనింగ్ ఉండాలి. ఫోన్ చేసి పెట్టే లోపు ఏ ఇంట్లో కావలిస్తే ఆ ఇంట్లో వాలతారు. అలాంటిది ఒక్క రోజు అయినా వదిలి ఉంటుందా అని భారీ డైలాగ్ లు.. ఒక్కొక్కసారి అనిపిస్తుందిరా..పెళ్ళాం ఊరెళితే ఎలా ఉంటుందా అని. అందుకే వేరే ఊరు అమ్మాయిని చేసుకొని ఉంటే ఏదో వంకన వెళుతూ ఉండేది కదా... అప్పుడు లైఫ్ ఎలా ఉంటుందో అనేది చూసే వాళ్ళము. బట్ మనలో ఎవరికీ ఆ ఛాన్స్ లేదు. ఒక శ్రీ కి తప్ప.. శ్రీ రియాక్షన్......
28-04-2026, 03:47 AM
Part - 84
ఒక్కొక్కసారి అనిపిస్తుందిరా..పెళ్ళాం ఊరెళితే ఎలా ఉంటుందా అని. అందుకే వేరే ఊరు అమ్మాయిని చేసుకొని ఉంటే ఏదో వంకన వెళుతూ ఉండేది కదా... అప్పుడు లైఫ్ ఎలా ఉంటుందో అనేది చూసే వాళ్ళము.
బట్ మనలో ఎవరికీ ఆ ఛాన్స్ లేదు. ఒక శ్రీ కి తప్ప.. ఏమంటావు శ్రీ. ఒక సామేత ఉందిరా.. పీత కష్టాలు పీతవి అయితే.. చేప కష్టాలు చేపవి అని. అలా ఉంది మీరు చెప్పేవి. నేహాతో నీకేంటి రా ఇబ్బంది. నువ్వెలాగా నివి అమాయకురాలు అని బుట్టలో పడ్డావో మేము అంతే.. అవని నీ చూసి నేహా కూడా అంతే సాఫ్ట్... ఇన్నోసేంట్ అనుకున్నాను. తర్వాత తర్వాతే తెలిసింది ఇంక ఏం చేస్తాం ఈ బండిని ఇలా నడపాలిసిందే... భరత్ వైఫ్ విద్య కూడా అంతే కదా... వీడి కంటిచూపుకే పాపం ఆ అమాయకరాలు ఆగిపోతుంది. ఒక మాట కూడా మాట్లాడదు అంతేనా భరత్... నాకేమో స్ట్రాంగ్ గా నిలబడి రఫాడిస్తే చూడాలని ఉంటుంది..ఎన్ని సంవత్సరాలైనా విద్య గట్టిగా మాట్లాడదు. అవునంటే అవును.. కాదంటే కాదు. నేనెవరికీ చెప్పుకోవాలి.. సో మనందరిలో లక్కీ ఫెలో ఒక విక్రమ్ అన్నమాట... అన్న మాట ఏంటి ఉన్నమాట కూడా అదే.. విక్రమ్ కూడా జాయిన్ అయ్యి మూస్తారా.. అందరూ లక్కీ ఫెలోసే.. కాబట్టే మనం ఇప్పటికీ ఇలాగే కలిసి ఉన్నాము. అది అర్థం కావడం లేదా.. నువ్వు చాలురా కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అనిపించడానికి. ఈ లోపు వైభవ్ వెనక్కి వస్తాడు. ఏమైందిరా. నా ఫోన్ ఇక్కడే మర్చిపోయాను అని ఫోన్ తీసుకుని వెళ్ళిపోతాడు. వీడు ఫోన్ మర్చిపోవడమేంటి అని డౌట్ గా రాజ్ చూస్తూ ఉంటే ఏమైంది బావ.. నీ కొడుకు ఏదో చేశాడు రా.. మనకేదో బ్యాండ్ భాజ మూవీ ప్రోగ్రాం ఉందేమో అని అనుమానంగా ఉంది. ఊరుకో బావ. వాడు అల్లరి చేస్తాడేమో కానీ ఇలా అందరినీ ఇరికించడు. నువ్వు తండ్రి ప్రేమంటే ఏమిటో ఒక ముక్కలో చెప్పావు రా.. విశి పరిగెత్తుకుంటూ సూర్య దగ్గరికి వెళుతుంది. సార్ అంటే... ఇక్కడే ఉన్నా అని టీ కప్ తో నిలబడతాడు. సార్ మనం విన్ అయ్యాము. నాతో ప్రాజెక్ట్ చేయడానికి ఒప్పుకున్నారు.. నేను చెప్పిన కండిషన్ కూడా యాక్సెప్ట్ చేశారు. అసలు విక్రమ్ సార్ ఎంత బాగా మాట్లాడారో తెలుసా అని ఎక్సైట్ అవుతూ ఉంటే... కూల్ కూల్ అని అక్కడ బెంచ్ పైన కూర్చోబెట్టి టీ కప్ చేతికి ఇస్తాడు. మీరు చూడలేదు కానీ విక్రమ్ సార్ అని... సార్ అని మళ్ళీ అరుస్తుంది. ఏమయింది మీకు ఒక విషయం తెలుసా...విక్రమ్ సార్ అచ్చు మీలాగానే ఉన్నారు. నేను షాక్. వైభవ్ కన్ఫ్యూజ్ చేశాడు. ఏం చెప్పాడు... మనుషులు పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు. అందులో ఒకళ్ళు అనుకో బాబి అంటున్నాడు. ఎంత ఒకేలా ఉన్న ఇలా దగ్గరలో ఉంటారా మీరే చెప్పండి. హ్మ్.. అసలు విషయం వదిలేసి కొసరి విషయం చెబుతున్నావు. ప్రాజెక్ట్ గురించి మాట్లాడకుండా... నాలాగా ఉన్నారు. ఏడుగురు అని ఏదో చెబుతావు ఎందుకు క్యూటి.. హ అంటే.. అదే విశి.. సార్ మళ్లీ అరుస్తుంది ఏమయింది ఇక్కడ శ్రీ అంకుల్ కూడా ఉన్నారు. విక్రమ్ సార్ కి బెస్ట్ ఫ్రెండ్ అంట.. ఓ.. అవునా.. అంత సింపుల్ గా అవునా అంటారేమిటి.. నాకంటే తెలియకపోవచ్చు. మీకు తెలియాలి కదా. నాకెలా తెలుస్తుంది. భలేవారే శ్రీకర్ సార్ మీకు ఫ్రెండ్ కదా...మరి శ్రీకర్ గారు ఆ శ్రీ అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మీకెందుకు తెలియలేదు. అబ్బా ఏం లాజిక్ అడిగావు..ఇప్పుడు నువ్వు నాకు బాగా తెలుసు. అలాగని మీ చుట్టాలు అందరూ నాకు తెలుస్తారా చెప్పు. లేకపోతే ఆంటీ ఫ్రెండ్స్ నాకు తెలుస్తారా... తెలియదు కదా.. అలాగే ఇది అంతే. కానీ అంటే.. చూడు నీకు ఇచ్చిన టీ కూడా చల్లారిపోయింది..ఈ ఆనందంలో అసలు ఆకలి కూడా వేయడం లేదు సార్. అయితే ఒక ప్లాన్ చేద్దామా ఏమిటి సార్.. ఈ వీకెండ్ మనిద్దరం లాంగ్ డ్రైవ్ కి వెళ్దాం. లాంగ్ డ్రైవ్ అని స్లో అవుతుంది. హైదరాబాద్ టు వైజాగ్ బైక్ మీద వెళ్దాం. సరదాగా ఎంజాయ్ చేసి వద్దాం. కానీ అంత దూరం అంటే.. నా మీద నమ్మకం లేదా.. మిమ్మల్ని నమ్మకపోతే నేను లేను సార్. అమ్మకి ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. ఇలా దేవా సార్ తో కలిసి వెళుతున్నాను అని చెప్పు. అలా చెబితే ఊరుకుంటుందా.. ఎవరైనా పెళ్లి కాని అమ్మాయి అబ్బాయి బైక్ మీద వెళ్తాము అంటే రెండు పీకుతారు. ఆ మాటకి నవ్వుతూ నువ్వు చెప్పి చూడు.. పీకుతారో లేదో తెలుస్తుంది కదా.. వీళ్ళిద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటుంది దూరం నుంచి గౌతమ్ చూస్తాడు. ఏమిటి ఎప్పుడు చూసిన ఈ దేవతో తిరుగుతుంది. పళ్ళు ఇకలిస్తూ ఉంటుంది. అందులో వి. జె. స్. కంపెనీ దగ్గరలో ఉన్నారు. ఇక్కడ ఏమైనా జాబ్ కి ట్రై చేస్తుందా. విశిష్ట టాలెంట్ కి ఎవరైనా కళ్ళకు అద్దుకుని జాబ్ ఇస్తారు. కానీ అలా వెళ్ళిపోతే నా పరిస్థితి ఏమిటి? వెళ్ళనివ్వకూడదు. ఎలాగైనా నా దగ్గరికి తెచ్చేసుకోవాలి. ఆ అందాన్ని వదులుకోలేను. తన టాలెంట్ ని వదులుకోలేను. అనవసరంగా హిమ వెనకాల తిరుగుతున్నాను కానీ విశి ని లైన్ లో పెట్టుకుని ప్రాజెక్ట్స్ చేయిపిస్తే అంతకంత మనీ వచ్చేవి. మెల్లిగా విశి తో ప్రేమ కబుర్లు చెబుతాను. పెళ్లి చేసుకుందామని చెబుతాను.. అప్పుడు తనే లైన్లోకి వస్తుంది అనుకుంటూ కార్ ఒక పక్కకి పార్క్ చేసి వీళ్ల దగ్గరకి వస్తాడు. వాళ్ళ ముందు ఏదో నీడ ఉన్నట్టు అనిపించి పక్కకి చూస్తే గౌతమ్ నిలబడి ఉంటాడు..హాయ్ దేవా... హౌ ఆర్ యు అంటే... గుడ్. హౌ ఆర్ యు అని డౌట్ గా అడుగుతాడు. బాగున్నాను. ఏం విశి ఎలా ఉన్నావు.. ఆంటీ హెల్త్ ఎలా ఉంది అని అడుగుతాడు. వీడేంటి కొత్తగా అడుగుతున్నాడు అని సూర్య చూస్తూ ఉంటే... బాగున్నాను మిస్టర్ గౌతమ్. మా మదర్ కూడా చాలా బాగున్నారు. మీరేమిటిక్కడ.. నిన్ను చూసే ఆగాను. నీతో మాట్లాడాలి అని చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తాను. బట్ కుదరడం లేదు. అవునా ప్రాజెక్ట్ గురించి అయితే మీరు వైభవ్ ని కాంటాక్ట్ చేయండి. నో విశి పర్సనల్.. నీతో సపరేట్గా మాట్లాడాలి.. చెప్పండి. మనిద్దరమే అంటే.. దేవా సార్ నేను వేర్వేరు కాదు..ఏది చెప్పిన దేవా సార్ ముందే చెప్పండి.. ఆ మాటకి సూర్య హ్యాపీగా ఫీల్ అవుతూ.. గౌతమ్ వైపు చూసి కళ్ళు ఎగరేస్తాడు. గౌతమ్ కుతకుతా ఉడికిపోతూ ఉంటాడు. అది పైకి కనపడనివ్వకుండా మనిద్దరం ఒకప్పటి ప్రేమికులము విశి... చేయి అడ్డుపెట్టి ఇంకొకసారి ఆ మాట అన్నారు అంటే మీరు ఎక్కడ ఉన్నారు అని కూడా చూడకుండా వేరేలాగా ట్రీట్ చేయాల్సి వస్తుంది. మీకు చాలాసార్లు చెప్పాను. మన మధ్యన ఉన్నది ఓన్లీ బిజినెస్ డీల్ మాత్రమే. అది మాట్లాడాలి అనుకుంటేనే కలవండి. లేకపోతే లేదు. నాకు తెలుసు నువ్వు నా మీద కోపంగా ఉంటావు అని.. హిమ ఫాదర్ మాకు చాలా దగ్గర రెలేటివ్స్. అప్పుడు హిమ హెల్త్ అసలు బాగోలేదు. తనకి ఒక డ్రీమ్ ఉంది ఫుల్ ఫిల్ చేయమంటే కాదనలేకపోయాను. అంతేగాని నీ వర్క్ ఎవరికో ఇవ్వాలని కాదు. స్టిల్ ఐ లవ్ యు. మనం పెళ్లి చేసుకుందాం అని చెయ్యి పట్టుకుంటాడు. విశి చెయ్యి విదిల్చుకుంటూ.. మీ మధ్యన ఎటువంటి రిలేషన్ ఉంటే నాకెందుకు మిస్టర్.. ప్లీజ్ వదలండి. వదలను విశి.. ఇప్పటికే అనవసరమైన విషయాలతో మనిద్దరి మధ్యన దూరం వచ్చింది. ఎవరెవరో మన మధ్యన వచ్చి లేనిపోని అపార్ధాలు సృష్టిస్తున్నారు. విశి ఎంత ట్రై చేస్తున్న గౌతమ్ వదలడు. సూర్యకి చిరాకు వచ్చి ఆ చేతిని గట్టిగా పట్టుకొని విడిపిస్తూ చూడండి మిస్టర్.. విశిష్ట కి ఇష్టం లేదు అన్నప్పుడు మీరు దూరంగా ఉండడం బెటర్..మధ్యలో నీ పెత్తనం ఏమిటి దేవా. ఇది మేమిద్దరం డిసైడ్ చేసుకునేది. నిజమే అది ఇద్దరికీ ఇష్టమై ఉన్నప్పుడు... కానీ రోడ్డు మీద మీరు ఇలా బిహేవ్ చేస్తే రెస్పాన్సిబిలిటీ ఉన్న ఏ పర్సన్ అయినా సరే ఇలాగే బిహేవ్ చేస్తాడు. రెస్పాన్సిబిలిటీ పర్సనా లేక విశిష్ట టాలెంట్ మీద ఉన్న ఇంట్రెస్టా.. ఇప్పుడు కరెక్ట్ పాయింట్ కి వచ్చావు. విశిష్ట తో వర్క్ ఆగిపోయినప్పటి నుంచి నీ ప్రాజెక్ట్స్ అన్ని వెనక్కి వెళ్ళిపోతున్నాయి.. సో ఎంత లాస్ అవుతుందో ఏమిటో అన్నది తెలుస్తుంది. అందుకే కదా మళ్ళీ దొంగ ప్రేమ నాటకాలు ఆడుతున్నావు. నో నో దానికి దీనికి సంబంధం లేదు. నిజంగానే నాకు విశిష్ట అంటే చాలా ఇష్టం అని కంగారుగా చెబుతాడు. నీ కంగారులోనే తెలుస్తుంది నువ్వు చెప్పేది ఎంతవరకు నిజమో అన్నది. ఇంకొకసారి విశిష్ట ని ఇబ్బంది పెట్టినట్టుగా నాకు తెలిస్తే మాత్రం ఇలా కూడా నిలబడవు అర్థమవుతుందా అని స్మూత్ గా చెబుతూనే వార్నింగ్ ఇస్తాడు. ఓకే విశి నీ మూడేం బాగున్నట్టు లేదు. మళ్ళీ కలుస్తాను అని వెళ్ళిపోతాడు. ఇడియట్ ఎన్నిసార్లు చెబుతున్నా అర్థం కావడం లేదు. దీనికి సొల్యూషన్ ఒకటే.. నువ్వు తొందరగా స్టార్ట్ అప్ స్టార్ట్ చేసేయడమే.. దాని గురించే ఆలోచిస్తున్నాను..ఈ కంపెనీతో కొలబరేట్ అవుతున్నాము కదా... సో వచ్చే మనీతో మెల్లిగా పెట్టేద్దాము. అప్పుడు మీరు నాతో జాయిన్ అవ్వండి. నేనెందుకు నీతో... వైభవ్ ఉన్నాడు కదా. మీరు ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. నీకు అదే చెబుతున్నాను. ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు. నా మీద నమ్మకం ఉంది కదా చాలు. నేనే పక్కనే ఉండాలి అంటే ప్రతిసారి కుదరదు. విశి సమాధానం....
28-04-2026, 03:49 AM
Part - 85
ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు. నా మీద నమ్మకం ఉంది కదా చాలు. నేనే పక్కనే ఉండాలి అంటే ప్రతిసారి కుదరదు.
మీరు చెప్పేటప్పుడు నాకు బాగానే ఉంటుంది కానీ ఎందుకో మీరు నా కళ్ళ ముందు ఉంటే ఒక ధైర్యం వస్తుంది. మాట్లాడకపోయినా పర్వాలేదు అలా ఉంటే చాలు.. అయితే ఒక పని చెయ్యి. నా ఫోటో ఒకటి పెట్టుకో.. వెటకారమా సార్.. అయ్యో సజెషన్ ఇస్తే.. వెటకారం అంటావేమిటి.. ఇప్పటికే లేట్ అయింది పదా అని నవ్వుతాడు. మీ నవ్వే చెబుతుంది ఎంత వెటకారం ఆడుతున్నారో అని మూతి తిప్పుకుంటూ బైక్ ఎక్కుతుంది. రాజ్ ఇంటికి వెళ్ళేటప్పటికీ నివి గుమ్మం దగ్గరే ఎదురు చూస్తూ ఉంటుంది. ఏమిటి శ్రీమతి ఎవరికోసం చూస్తున్నావు. ఏదైనా ఆన్లైన్ ఆర్డర్ పెట్టావా.. అయ్యో అలా అంటారేమిటండి.. మీ కోసమే ఎదురు చూస్తున్నాను అని చేతుల్లో బ్యాగ్ తీసుకుంటుంది. బ్యాగ్ వైపు.. నివి వైపు చూస్తూ ఉంటే... ఏమిటండీ అలా చూస్తున్నారు రండి అని సోఫాలో కూర్చోబెడుతుంది ఎందుకు ఈరోజు ఇలా కొత్తగా మర్యాదలు చేస్తున్నావు. నాకు భయం వేస్తుంది. భలేవారే మర్యాదలు చేస్తే భయపడతారు ఏమిటి అని మళ్లీ గుమ్మం వైపు చూస్తుంది.. ఎవరికోసం చూస్తున్నావు. పెళ్లిళ్లు బ్రోకర్ వస్తానన్నాడు. అతని కోసమే... ఎందుకు మన చందు కి వైభవ్ ఉన్నాడు కదా.. ఉండండి స్నాక్స్ తీసుకొస్తాను అని వేడివేడిగా ఆనియన్ పకోడీ తీసుకొచ్చి చేతికి ఇస్తుంది. తింటూ ఉండండి అనగానే ఏం జరుగుతుందో అర్థం కాక మెల్లిగా తింటూ ఉంటాడు.. ఈలోపు పెళ్లిళ్లు బ్రోకర్ వస్తే.. అమ్మ ఎందుకు హడావుడిగా రమ్మన్నారు. మీరు రమ్మన్నారని ఉన్న పళంగా వచ్చేసాను. ఎవరికి సంబంధం చూడాలి. ఎవరికో ఐతే మిమ్మల్ని ఎందుకు రమ్మంటాను. మా వారికే... అంతే.. ఆ మాటకి పకోడీ అడ్డుపడి పులమారుతుంది..అయ్యో మెల్లిగా తినండి అని వాటర్ పట్టిస్తుంది. నాకు పెళ్లి ఏంటి అని రాజ్ కంగారుగా అడిగితే.. బ్రోకర్ అయోమయంగా చూస్తాడు. ఇదిగోండి మా వారి పెళ్లి చాలా దూరం నుంచి రావాలి. ఏడు గోదావరి అవతల అంటారే అలా రావాలి. పెళ్లయిన తర్వాత కూడా అమ్మాయి నెలకి ఒకసారి పుట్టింటికి వెళ్లి వెళ్లి రావాలి. మా వారు పెళ్ళాం ఊరెళితే ఎలా ఉంటుందా అన్నది ఎంజాయ్ చేయాలి. అంతేనా అండి అంటుంది. రాజ్ కి మేటర్ అర్థమయ్యి తినే ప్లేట్ పక్కన పెట్టి బ్రోకర్ వైపు చూసి మీరు వెళ్ళండి..మళ్ళీ కబురు పంపుతామని పంపించి వచ్చి నిలబడతాడు. ఏమైందండీ.. ఇంకొక బ్రోకర్ని పిలిపించానా.. గదిలోకి తీసుకువెళ్లి తలుపులు వేసి మోకాళ్ళ మీద కూర్చుని నడుం చుట్టూ చేతులు వేసి.. నీకు అంతా తెలిసిందని నాకు అర్థమైంది. ఏదో సరదాగా పిచ్చపాటి మాట్లాడుకున్నాం. మగవాళ్ళు అన్నాక ఆ స్వేచ్ఛ ఉండదా. దానిని నువ్వు ఇంత సీరియస్గా తీసుకుంటే ఎలాగా.. మన పెళ్లయినప్పటి నుంచి మీ కోరిక ఏదైనా తీరుస్తున్నాను కదా. అలాగే ఇది కూడా తీరుస్తాను. మీకు వేరే ఊరు అమ్మాయి కావాలి అనుకున్నప్పుడు అలాగే చేస్తాను రాజ్. ఇదిగో నువ్వు ఇలా అంటే నేను అలుగుతాను. హ ఏమిటి... అలా ఉంటే ఎలా ఉంటుందా అన్నాను కానీ నీ స్థానంలో ఇంకొకళ్ళు అనలేదు కదా బంగారం. మా బుజ్జి కదా ఈ అలక పాన్పు కొద్దిగా దిగు. లేదు మీకు పెళ్ళాం ఊరెళితే అన్న సినిమా కావాలి అన్నారు కదా... సో నేను పుట్టింటికి వెళుతున్నాను. ఎప్పుడు వస్తానో నాకే తెలియదు అని సర్ది ఉన్న బ్యాగ్ తీసుకొని బయలుదేరుతుంది. ఆల్రెడీ సర్దుకునే ఉన్నావా. నా మేనల్లుడు కూడా రెడీగా ఉన్నాడు. ఇదంతా వైభవ్ గాడి పనే కదా అని పళ్ళు నూరితే... వాడి చిన్న పిల్లోడు. వాడు ఏం చేసాడు అని బ్యాగ్ తీసుకుని బయటకి వస్తుంది. చూడు నివి నా మీద అలిగి వెళితే బాగోదు. అయ్యో నాలాంటి గడుసువాళ్లతో మీరు ఎలా పడగలరండి.. ఒక అమాయకురాలుని తెచ్చి పెళ్లి చేస్తాను. సరేనా నువ్వు పదరా అని వైభవ్ భుజం మీద కొడుతుంది. అలాగే అత్తయ్య అని బ్యాగు కార్ డిక్కీ లో పెట్టి రాజ్ దగ్గరికి వచ్చి.. ఏమన్నావు మామ.. నీ కూతురు ఎక్కడ ఉంది ఏం చేస్తుంది అంటే నువ్వే అడుగు అని ఫోజ్ కొట్టావు కదా.. ఇప్పుడు మా అత్తని తీసుకురావడానికి నీకు చుక్కలు కనపడతాయి. హమ్మయ్య పుట్టింటికి వెళ్ళింది అని నువ్వు రిలాక్స్ గా ఉన్నా తలపోటే... వచ్చి బ్రతిమాలి తీసుకురావడం ఇంకా పెద్ద తలపోటు. ఒరేయ్ అని ఏడుపు గొంతుతో పిలిస్తే.. అబ్బా ఎంత హాయినిస్తుంది మామ.. ఈసారి నుంచి నేను ఎప్పుడైనా అడిగినప్పుడు తిన్నగా సమాధానం చెప్పకపోతే మీకు ఇంతకన్నా బాగా జింకుచక అనుకుంటూ వెళ్ళిపోతాడు. రాజ్ కోపంగా వినయ్ కి ఫోన్ చేస్తాడు. నీరసంగా చెప్పు బావ. నీ కొడుకు ఏదో ఉత్తముడని చెప్పావు. వాడు ఏం చేసాడో తెలుసా.. నా కింద ఆల్రెడీ పేలిపోయింది. నీకేం పేలిందిరా. అయితే విను అని వేలుతో తిప్పుతూ ఉంటాడు. ఫోన్లో కూడా ఎదవ సిగ్నల్స్ ఏంటి సరిగ్గా చెప్పు.. వినయ్ ఇంటికి రాగానే పూజిత ఎక్కడా కనిపించదు. గదిలోకి వెళ్లి టై లూస్ చేస్తూ ఉండేటప్పటికీ వెనక నుండి వచ్చి హత్తుకుంటుంది. అమ్మో దయ్యం దయ్యం అని అరుస్తాడు. అదేమిటండి నేను ఎంత ముద్దుగా హత్తుకుంటే.. అలా అరుస్తున్నారు నువ్వా అని గుండెల మీద మెల్లిగా కొట్టుకుంటాడు. ఇదిగో మీకోసం కాఫీ, టీ, జ్యూస్, స్నాక్స్ ఇంకా అంటే ఆగు.. ఎందుకు ఇన్ని రకాలు..ఎవరైనా ఏదో ఒకటే కదా తాగుతారు. మీతో నేను ఉత్తమమైన ఇల్లాలు అనిపించుకుని.. మనం బెస్ట్ కపుల్ లాగా ఉండాలి కదా...ఆ డైలాగ్ కి ఒకసారి గా తలపైన వెంట్రుకలు అన్ని నిక్కబోడుచుకుంటే.. స్టార్స్ అన్ని పైన తిరుగుతున్న ఫీలింగ్ వస్తుంది. వెంటనే పూజితని అక్కడ సోఫాలో కూర్చోపెట్టి... వేళ్ళు లాగుతూ ఎందుకు బంగారం నువ్వు ఇలాంటి కష్టమైన పనులన్నీ మీద వేసుకుంటావు. నువ్వు ఎప్పటికీ నా దృష్టిలో ఉత్తమమైన ఇల్లాలివే.. మనం బెస్ట్ కప్పుల్స్ మే.. అలా కుదరదండి నా సేవతో మిమ్మల్ని మెప్పించాలి. వద్దు అని చెబుతున్నాను కదా.. నువ్వు అంత పెద్ద పెద్ద టాస్కులు నెత్తి మీద వేసుకుంటే నేనేం అయిపోవాలి. భలేవారే మీకోసమే కదా.. ఏది తాగుతారు. నువ్వు ఏది ఇచ్చినా నాకు పరవాలేదు అని భయంగా చేతులు రెండు దగ్గరకి పెట్టుకుంటాడు. అయ్యో మీరు ఎలా అంటే ఎలాగండి....మీకు నచ్చింది తీసుకోండి అని ట్రే ని ముందుకి జరుపుతుంది. ఏం చేయాలో అర్థం కాక కాఫీ, టీ, జ్యూస్ అన్నీ ఒక దాంట్లో పోసుకొని గటకట తాగేసి సంతోషమా అంటాడు. మీ కాళ్లు ఇలా పెట్టండి నొక్కుతాను. నా కాళ్ళ మీద నాకు కొన్ని రోజుల ఆశ ఉంది. ఆశ తీరిన వెంటనే నీకు అప్ప చెబుతాను..ఈరోజుకి వదిలేయవా ప్లీజ్ అని బ్రతిమాలితాడు. అలాగంటారా సరే అయితే.. మీకోసం మీకు ఇష్టమైనవన్నీ ప్రిపేర్ చేస్తాను సరేనా అని చెంప మీద తట్టి వెళ్ళిపోతుంది. ఇది బావ జరిగింది. ఏ నిమిషం ఏం జరుగుతుందో అర్థం కాక టెన్షన్తో సచ్చిపోతున్నాను. అందుకే నేను ఆఫీసు రూమ్ లోకి వెళ్లి దాక్కుంటున్నాను. అక్కడికైతే ఈ లేడీస్ రారు కదా...అన్నయ్యతో వర్క్ బిజీ అని అక్కడే ఉంచేస్తాను..మీ పనే బాగుందిరా..అందరూ ఒక చోట ఉండేటప్పటికీ ఎస్కేప్ అయిపోతున్నారు. నేను శ్రీ అనుకుని.. ఇంతకి శ్రీ, భరత్ పరిస్థితి ఏమిటి.. నాకు తెలియదు. భరత్ బావది ఏముంది.. విద్య కూర్చోమంటే కూర్చుంటుంది. నుంచో అంటే నుంచుంటుంది. ఒక శ్రీ దే ఆలోచించాలి. ఫోన్ చేద్దామా.. ఎందుకులే.. అంతా అయ్యిన తర్వాత వాడే ఫోన్ చేస్తాడు అని ఫోన్ పెట్టేసి ఆఫీస్ రూమ్ లోకి పరుగు పెడతాడు. కథ కొనసాగుతుంది.......
28-04-2026, 10:30 AM
భలే ఇరికించాడు.. భరత్ పరిస్తితి ఏంటో..! నైస్ అప్డేట్...
29-04-2026, 09:14 AM
family comedy chala baghundhi.. waiting for next episodes siva garu
29-04-2026, 09:34 AM
Part - 86
శ్రీ ఇంటికి విజిల్ వేసుకుంటూ వెళతాడు. నేహా ఎదురు వచ్చి రండి రండి అని కూర్చోబెడుతుంది..వాట్ డార్లింగ్ ఏం చేశారు ఈరోజు.
బాగా ఎంజాయ్ చేశారా.. ఏదో మీ దయ.. కాఫీ తెమ్మంటారా టీ తెమ్మంటారా. కాఫీ తీసుకురా.. సరేనండీ. కాఫీలో పాలు పోయమంటారా నీళ్లు పోయమంటారా. నో బ్లాక్ కాఫీ ఓన్లీ వైట్ కాఫీ. కాఫీ పొడి ఎంత వేయమంటారు... షుగర్ వెయ్యనా వద్దా.. ఆ మాటలకి పిచ్చి చూపులు చూస్తూ.. నేహా నుదిరిపైన చెయ్యి పెట్టి.. చెక్ చేస్తూ బాగానే ఉన్నావా.. అయ్యో నేను బాగానే ఉన్నాను అండి. అమాయకులు అంటే ఇలాగే ఉండాలి కదా అందుకనే అడుగుతున్నాను. అప్పటివరకు కాలి మీద కాలు వేసుకుని విజిల్ వేస్తున్న శ్రీ కాలికి పక్కకు పెట్టి.. అమాయకులు ఏమిటి ఏం మాట్లాడుతున్నావు. అదేమిటండి మీ భార్య అమాయకురాలుగా ఉండాలని మీరే కోరుకున్నారు కదా.. ఇప్పుడు అన్ని అడిగి చేస్తుంటే అలా చూస్తారు ఏమిటి. కాఫీ తీసుకొస్తాను అని కిచెన్లోనికి వెళుతుంది.. ఒరేయ్ వైభవ్ గా ఎంత పని చేసావురా అని తల పట్టుకుంటాడు. కాఫీ తెచ్చి చేతికిస్తుంది. భయంగా కప్పు పుచ్చుకుంటే ఏమండీ వేడి నీళ్లు పెట్టమంటారా.. సరే అని తల ఊపుతాడు. ఎంత వేడిలో కావాలి... వేలు ఊడి వచ్చే రేంజ్ లో కావాలా లేక గోరువెచ్చగా కావాలా...లేకపోతే మధ్యలోకి కావాలా.. కప్పు పక్కనపెట్టి నేహాని గదిలోకి తీసుకు వెళ్లి మంచం మీద కూర్చోబెట్టి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని గట్టిగా మాట్లాడతాడు. చేతులు కట్టుకుని చూస్తూ ఉంటే...ఇక లాభం లేదని కింద బోర్లా పడుకొని కాళ్లు పట్టుకుని... ఏదో పిచ్చపాటి మాట్లాడుకున్నాం కానీ నా పెళ్ళాం తెలివిగా అన్ని చక్కపెట్టుకునేటట్టుగా ఉంటేనే నాకు ఇష్టం. నా బంగారం కదా నా బుజ్జి కదా.. అన్ని అలా మనసులోకి తీసుకోకూడదు.. అయినా ఆఫీసులో మేము మాట్లాడుకుంది నీకు ఎలా తెలిసింది.. ఆ వైభవ్ వేనా చెప్పింది. ఇడియట్ అంటాడు. వైభవ్ ని ఏమైనా అన్నారంటే ఊరుకోను... వాడివల్లే కదా మీ మనసులో మాట తెలిసింది. ఈరోజు నుంచి మీకు అన్ని ఇలాగే ఉంటాయి అని లేచి పైట దులుపుకుని బయటికి వెళ్లి పోతుంది. కిందే ఒక పక్కకి పడుకుని నా పరిస్థితే ఇలా ఉందంటే ఇక రాజ్, వినయ్ పరిస్థితి ఇంకా ఎలా ఉందో...మా ముగ్గురు పెళ్ళాలు టార్చర్ ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి పరవాలేదు. ఇదే రేంజ్ లో విద్యా కూడా రెచ్చిపోతే.. అప్పుడు మా భరత్ గాడి పరిస్థితి ఏమిటి అని ఊహించకని గట్టిగా నవ్వుతాడు. మళ్ళీ వెంటనే కంట్రోల్ కంట్రోల్.. నైట్ కి గ్రూప్ కాల్ పెట్టాల్సిందే అనుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. భరత్ ఇంటికి వచ్చేటప్పటికి విద్య ఎక్కడ కనిపించదు. ఏమైపోయింది ఇది.. నేను రాగానే ఎదురు వస్తుంది కదా.. అంతా చూస్తూ గదిలోకి వెళతాడు. గదిలోకి వెళ్ళేటప్పటికి విద్యా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఫ్రూట్స్ తింటూ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఏమిటి విద్య.. నేను రాగానే ఎదురు రావాలని తెలియదా. ఈ టైంకి హాల్లో ఉండడం మానేసి రూంలో కూర్చున్నావు అని గట్టిగా మాట్లాడుతాడు. కూర్చుంటే ఏమైంది. రోజు ఎదురు రావాలని మన పెళ్లి అప్పుడు చెప్పలేదే.. విద్యా సమాధానానికి భరత్ ముందుకి వెనక్కి చూసుకుంటాడు. విద్య పట్టించుకోకుండా మళ్ళీ సాంగ్స్ వింటూ ఉంటే.. దగ్గరికి వచ్చి నిలబడి ఇప్పుడు మాట్లాడింది నువ్వేనా.. కాదు. నా డుబు వచ్చి మాట్లాడింది. మీకు ఏమైనా అనుమానమా.. ఏమైంది దీనికి... ఇలా కొత్త కొత్తగా మాట్లాడుతుంది. సరే తర్వాత చూద్దాంలే అనుకుని..నేను స్నానం చేసి వస్తాను. ట్రాక్ ప్యాంటు తీసి పెట్టు.. తీయకపోతే...అంతే ఆ మాటకి భూమి ఒక్కసారిగా రివర్స్లో తిరిగినట్టుగా అనిపిస్తుంది. తీయకపోతే నేనే తీసుకుంటాను అని ఆలోచిస్తూ స్నానం చేసి వచ్చి ప్యాంటు వేసుకుని టవల్ అక్కడ మంచం మీద వేస్తాడు. ఇంత వయసొచ్చింది టవల్ ఎక్కడి వెయ్యాలో కూడా తెలియదా.. అలా మంచాల మీద వేస్తే ఎలాగా... వాసన రాదా అని గట్టిగా మాట్లాడుతుంది. ఓకే ఓకే ఆరేస్తాను అని బాల్కనీలో ఉన్న దండెం మీద ఆరేసి వస్తాడు. విద్యా అని పిలిస్తే ఏంటి అని గట్టిగా అడుగుతుంది. ఏమీ లేదు. కూల్ కూల్ అని చెప్పి బయటకివస్తూ ఆలోచిస్తూఉంటాడు. అప్పుడే నివి లోపలికి రావడం.. వినయ్ ఆఫీస్ రూమ్లోకి పరిగెత్తడం రెండు చూస్తాడు. నివి వెనకాలే ఉన్న వైభవ్ ని చూసి ఇదంతా నీ పని ఏంట్రా.. చీమలగా వచ్చి దోమ లాగా కుట్టావన్నమాట. చెబుతాను ఉండు నీ పని అంటూ చూస్తూ ఉంటాడు. నివి ముక్కు చీదుకుంటూ అమ్మ అని వస్తుంది. ఏమైందే అలా ఏడుస్తున్నావు. మీ అల్లుడు గారికి నేను బోర్ కొట్టేసాను అంట. కొత్త పెళ్ళాం కావాలి అంట.. ఇంకో పెళ్లి చేసుకుంటారంట.. అది కూడా ఏడు గోదావరుల అవతల ఉన్న అమ్మాయిని తెచ్చుకుంటారంట.. ఇంక నా జీవితం ఏం కావాలి అని ఏడుస్తూ ఉంటుంది. నువ్వు చెప్పేది ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. రాజ్ ఎందుకు అలా మాట్లాడుతాడు అని కళ్యాణ్ అడిగితే.. మీకు ఎంతసేపు మీ అల్లుడు ని వేనేకేసుకుని రావడమేగాని.. కూతురు బాధ అర్థం కావడం లేదు. ఒరేయ్ చిన్నన్నయ్య, భరత్ బావ అని పిలుస్తుంది. ఇరికించేసాడు ఎదవ అనుకొని.. భరత్... రాజ్ కి ఫోన్ చేసి తమరు ఎక్కడ ఉన్నా సరే మీ పుష్పక విమానంలో అత్తవారింట్లో వాలండి. లేకపోతే మీకు అంటే.. అర్థమయ్యింది వస్తున్న అని చందు తో బయలుదేరుతాడు.. మా పరిస్థితి ఇలా ఉందంటే శ్రీ పరిస్థితి ఎలా ఉందో.. ఒకసారి కాల్ చేయాలి అని ఆఫీసు రూమ్ లోకి వెళ్లి శ్రీ ని లైన్ లోకి తీసుకుంటాడు. స్నానం చేసి వచ్చిన శ్రీ లిఫ్ట్ చేసి ఏమైంది.. ఫోన్ చేశారు. నువ్వు బాగానే ఉన్నావా.. నాకేం రా బిందాస్.. నేహా ఏమి ఇబ్బంది పెట్టలేదా.. నా పెళ్ళాం అలా ఇబ్బంది పెట్టదు. ఏమి మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయా... నీమాట ఒకటి చెబుతుంది. కళ్ళల్లోనేమో భయం కనపడుతుంది. నిజం చెప్పు. నేను నిజమే చెబుతున్నాను. ఈ లోపు నేహా వచ్చి ఏవండీ కూరలో ఉప్పు వేయమంటారా...పంచదార వేయమంటారా.. నూనె ఎన్ని స్పూన్లు వేయమంటారు. ఉల్లిపాయలు వేయించమంటారా వద్దా అని అడుగుతూ ఉంటే.. భరత్ గట్టిగా నవ్వుతూ తిక్క కుదిరింది ఎదవకి.. లేకపోతే నా దగ్గరే ఎక్కసక్కాల ఎంజాయ్ శ్రీ అని ఫోన్ పెట్టేస్తాడు. వినయ్ బిక్క మొహం వేసుకుని చూస్తూ ఉంటే.. నీకేమైంది రా.. పూజిత ఎలా ఆడుకుందో చెబుతాడు. నువ్వు సేఫ్ బావ. పాపం విద్య అక్క చాలా అమాయకరాలు కదా. ఇప్పటివరకు అలాగే అనుకున్నాను రా అని వాపోతాడు. అంటే నీకు కూడా దబిడి దిబిడేనా... చాలా.. అసలు నేను చూడని యాంగిల్ చూపించింది. సరే రా వెళ్దాము. అమ్మో నేను రాను.. నా పెళ్ళాం ఉంటుంది అంతకన్నా ఇంకొక బాంబు వచ్చి పడింది. ఏం బాంబ్.. నివి బాంబ్.. ఇప్పుడు రాజ్ ఎలా బ్రతిమాలతాడో ఏమిటో.. రాజ్ బావే కాదు. మనమందరం బ్రతిమాలుకోవాల్సిందే.. ఇంకొకసారి నీ కొడుకుని వెనకేసుకొచ్చావు అంటే.. ఇప్పుడే కదా బావ అర్థమైంది. పద అని నీరసంగా బయటకి వస్తాడు. వీళ్ళ వెళ్ళేటప్పటికి నివి హాల్లో శ్లోకాలు పెడుతూ ఉంటుంది. అందరూ చుట్టూ కూర్చుని ఓదార్చుతూ ఉంటారు. రాజ్, చందు వచ్చేటప్పటికి వింతగా వెరైటీగా కనపడుతూ ఉంటుంది. భరత్, వినయ్ ఒక పక్కగా నిలబడి ఉంటే రాజ్ వాళ్ల పక్కకి చేరి ఏం జరుగుతుంది రా ఇక్కడ.. నీ రెండో పెళ్లికి సంబంధించిన మాటలు.. రాజ్ పరిస్థితి.. నలుగురు పెళ్ళాల్ని ఎలా బుజ్జగించతారు.....
29-04-2026, 09:36 AM
Part - 87
రాజ్, చందు వచ్చేటప్పటికి వింతగా వెరైటీగా కనపడుతూ ఉంటుంది. భరత్, వినయ్ ఒక పక్కగా నిలబడి ఉంటే రాజ్ వాళ్ల పక్కకి చేరి ఏం జరుగుతుంది రా ఇక్కడ..
నీ రెండో పెళ్లికి సంబంధించిన మాటలు.. ఇంకా గొడవ వదలలేదా.. నివి వదిలితే మిగిలిన అందరూ వదిలేస్తారు కానీ నివి వదిలేటట్టుగా కనిపించడం లేదు. బుజ్జగించు బావ అని వినయ్ గెడ్డం పట్టుకుంటే ఇంటి దగ్గర ఆల్రెడీ చేశాను రా. అది సరిపోయినట్టు లేదు. ఇంకా ఎలా బుజ్జగించాలి. ఇంతకి విక్కీ ఏం చేస్తున్నాడు. ఎక్కడో పెళ్ళాంతో సేవలు చేయించుకుంటూ ఉంటాడు. వెంటనే విక్రమ్ కి కాల్ చేస్తాడు. ఏంట్రా.. ఎక్కడున్నావు.. గదిలో.. కింద ఇంత మహాభారతం జరుగుతూ ఉంటే నువ్వు గదిలో ఏం చేస్తున్నావు కిందకి రా.. మహాభారతమా... ఏం జరుగుతుంది అని నవ్వుతూ బయటికి వస్తాడు.. నీ చిన్న కొడుకు పెట్టిన పెంటకి.. నీ ముద్దుల చెల్లెలు చేస్తున్న రాద్ధాంతం. అందుకే అనేది నోరు కంట్రోల్లో పెట్టుకోవాలి అని.. అంత సీక్రెట్ ప్లేస్ లో కూడా డేటా కలెక్ట్ చేస్తారని ఎవరు అనుకుంటారు రా.. ప్లీజ్ రా బాబు వచ్చి.. నీ చెల్లిని కంట్రోల్ చెయ్. ఇన్ని సంవత్సరాలు అయిన పెళ్ళాన్ని కంట్రోల్ చేయడం రావడం లేదు. పక్కనే వస్తున్న అవని వీపు మీద ఒక్కటేస్తుంది. ఏమిటే.. అని కళ్ళు ఎగరేస్తే ఏమీ లేదని మూతి తిప్పి వెళ్ళిపోతుంది. ఈ మధ్యన భార్యామణికి అలకలు ఎక్కువైంది..అలిగే టైం లోనేమో బిక్కు బిక్కు మంటు చూసింది.. ఇప్పుడేమో ఈ సింహాన్ని వణికించాలనుకుంటుంది. ఈ యాంగిల్ కూడా బాగుందిలే అని నవ్వుకుంటూ వస్తున్న... వచ్చి చెల్లి పక్కన కూర్చుని ఏమైందిరా.. చూడు అన్నయ్య మీ బావగారు రెండో పెళ్లి చేసుకుంటారంట.. అది కూడా ఏడు గోదావరుల అవతల ఉన్న అమ్మాయిని. రాజ్ తలగోక్కుంటూ.. నేనెప్పుడూ అన్నాను అనుకుంటూఉంటాడు. వినయ్ ఏమైంది బావ అలా చూస్తున్నావు. నేను అనని డైలాగులు కూడా మీ చెల్లి కలిపేస్తూ ఉంటే నెక్స్ట్ ఎలా వెళ్లాలా అర్థం కావడం లేదు.. అవన్నీ ఇంటి దగ్గర మీ చెల్లి కొట్టినవే.. అప్పుడు నువ్వు ఏమి అనలేదా. బుజ్జిగించాను రా.. ఏమని బుజ్జగించావు .. ఒకసారి జరిగినది అంతా గుర్తుచేసుకొని.. చెప్పడం ఎందుకులే అని.. ఏదో ఒకటి.. నీ తర్వాతే ఏదైనా అని చెప్పాను. నీ తర్వాతే ఏదైనా అంటే అది ఇలా అల్లేసింది.. ఏంటి బావ అల్లుడు వచ్చే టైం అయింది ఇంకా పెళ్ళాన్ని బుజ్జగించడం రావడం లేదు. పెద్ద తమరు ఈ టాపిక్ లో పీహెచ్డీ చేసినట్టు. అదిగో పూజిత వస్తుంది. వెంటనే అలర్ట్ అయ్యి.. విక్రమ్ పక్కన కూర్చుంటాడు. వీడు మాత్రం పెళ్ళానికి సు.. సుసు.. పోస్తాడు. మనకి మాత్రం నీతి సూత్రాలు చెబుతాడు. బావ ఊరికేనే అన్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. నువ్వంటే ఎంత ప్రేమో నీకు తెలియదా.. అవన్నీ అప్పుడు అన్నయ్య. ఇప్పుడు కాదు అని ముక్కు చీదుతుంది. ఇక రాజ్ తప్పక వెళ్లి నివి ముందు కింద కూర్చొని ఇదిగో నివి.. ఎప్పుడైనా నేను నిన్ను మాత్రమే ప్రేమించాను. నేనేమన్నాను.. పెళ్ళాలు వేరే ఊరు అయితే ఎలా ఉంటుందో చూడాలి అన్నారు. అంతేగాని పెళ్ళాన్ని మారుస్తాను అనలేదు కదా. మీరైనా చెప్పండి అత్తయ్యగారు నేను అన్న దాంట్లో అంత అర్థం ఉందా.. నివి ఇంకా ఆపు. అల్లుడుగారు బ్రతిమాలుతుంటే నీ పెంకి ఏడుపు ఏమిటి.. ఎప్పటికీ అర్థం చేసుకుంటావు. ఏదో వాళ్ళ సరదాగా అనుకున్న మాటలు నువ్వు అంత సీరియస్గా తీసుకుంటున్నావు. ఇంకా అల్లుడొచ్చే టైం అయింది..ఇప్పటికీ కూడా రాజ్ నిన్ను బ్రతిమాలతూ ఉంటే వచ్చే అల్లుడు ముందు ఎంత లోకువగా ఉంటుంది. కళ్ళు తుడుచుకుని ఇంకెప్పుడూ అలా మాట్లాడనని చెప్పమనమ్మ. కలలో కూడా మాట్లాడను సరేనా.. నీకు ఏది కావాలంటే అది కొంటాను. ఇప్పుడే షాపింగ్ కి వెళ్దామా. ప్రస్తుతానికి మూడ్ లేదులే అని కళ్ళు తుడుచుకుంటుంది.అమ్మయ్య నేను సేఫ్ అనుకుంటాడు. ఒక తుఫాను వెలిసింది. భరత్ విద్యాని గదిలోకి తీసుకువెళ్లి వెనకనుంచి పట్టుకొని.. నా బంగారం కదు.. నువ్వు ఎప్పటిలాగానే ఉండవే.. నీలో ఈ రెబల్ చూస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను. మీరే కదా అంటే....ఇంక ఎప్పుడూ అలా అడగను. నా విద్య ముద్దుగా బంగారంలాగా నాకు నవ్వుతూ ఎదురు వచ్చే నా పాత పెళ్ళమే కావాలి. సరే అంతగా బ్రతిమాలుతున్నారు కాబట్టి ఈసారి ఒప్పుకుంటున్నాను. వెళదామా. తప్పకుండా శ్రీమతి. హమ్మయ్య నేను గట్టెక్కేసాను. ఇంక వినయ్ శ్రీ మిగిలారు. వినయ్ సీరియస్ గా లేచి పూజిత చేయ పట్టుకుని లాక్కు వెళతాడు. మాధవి ఒరేయ్ ఏమైంది రా అలా లాగుతున్నావు. ఇప్పుడే వస్తాను అత్తయ్య అని గదిలోకి తీసుకువెళ్లి షర్టు హాండ్స్ పైకి మడత పెడుతూ ఏంటే ఎక్కువ చేస్తున్నావు. హ అని చేతులు కట్టుకొని చూస్తుంది. వెంటనే హ్యాండ్స్ కిందకి దించి చూడు పూజిత బుజ్జులు.. నువ్విలా ఉంటే అస్సలు బాగోలేదు. నేను ఒక లైఫ్ స్టైల్ కి అలవాటు పడిపోయాను. ఈ వయసులో దాన్ని మార్చితే ఎలాగా.. ఎంత కన్ఫ్యూజ్ అవుతాను. నువ్వు నా రౌడీ బేబీ లాగా ఉంటేనే నాకు ఇష్టం. ఆ రౌడీ బేబీ ని చూసే కదా నేను ప్రేమలో పడ్డాను. ప్లీజ్ నువ్వు ఇలా ఉండి నన్ను భయపెట్టదు. అది కాదండి అంటే.. వద్దు మనం ఎలా ఉన్నా బెస్ట్ కపులే.. వదిన అలా ఉంటుంది కాబట్టే అన్నయ్య హ్యాండిల్ చేస్తున్నాడు. నేను ఇలా ఉంటాను కాబట్టి నువ్వు హ్యాండిల్ చేస్తున్నావు అంతే.. నన్ను నువ్వు కాకపోతే ఎవరు భరించగలుగుతారు చెప్పు బంగారం. ఈ మాటలకు ఏమి తక్కువ లేదు పదండి. కిందకి వెళ్లి ఏం చెబుతావు. మా ఆయన నన్ను భయపెట్టారు అని చెప్పమంటారా ? అలా చెబితే అప్పుడే పుట్టిన పసిపాప కూడా నమ్మదే.. నవ్వుతూ ఎవరు ఏమి అడగరు కానీ పదండి అని వెళుతుంది. హమ్మయ్య అని గుండెల మీద చెయ్యి వేసుకుంటాడు. శ్రీ... కిచెన్ లో నేహా ముందు మోకాళ్ళ మీద కూర్చొని నువ్వు ఎలా వండినా నేను తింటాను కదా. ఎందుకు ఇలా కొత్త కొత్తగా అడుగుతావు. మీరే కదా అమాయకంగా ఉండాలి అన్నారు.మరి అమాయకంగా అంటే అన్ని అడిగే కదండి చెయ్యాలి. నీకు ఈ అమాయకత్వం అస్సలు సూటి కాదు. అవని అవనీయే.. నువ్వు నువ్వే. దీన్ని బట్టి మీకు ఏమి అర్థమైంది. లేచి నిలబడి చేతులు కట్టుకొని ఒకరితో ఒకరిని కంపేర్ చేయకూడదు. ఎవరి నేచర్ వాళ్ళదే.. ఎవరి స్వభావం వాళ్ళదే. రకరకాల పువ్వులన్ని కలిసి దండ అయినట్టుగా స్నేహమైనా, రిలేషన్ అయినా అంతే..భిన్న మనస్తత్వాలు కలిసినదే కుటుంబం..అర్థం చేసుకుని వెళ్ళాలి. గుడ్ ఇన్ని సంవత్సరాలకు మీ బుర్ర పనిచేయడం మొదలైంది. వెళ్ళండి. నేను డిన్నర్ ప్రిపేర్ చేశాను తీసుకొస్తున్నాను. ఏంటి పంచదార వేసా.. ఏదో మిమ్మల్ని అడిగాను కానీ అలా ఎందుకు వండుతాను.. నాకు తెలియదా అని నవ్వుతుంది.. పెళ్ళాలా మజాకానా అనుకుని గుండె మీద చెయ్యి వేసుకుంటాడు. వాతావరణమంతా తేలిక పడింది అనుకునే సమయానికి సూర్య వచ్చి ఏమైంది.. అందరూ అలా ఉన్నారు? అత్తయ్య కళ్ళు ఏంటి ఎర్రగా ఉన్నాయి. ఏమైంది అత్తయ్య.. నిన్ను ఎవరు ఏమిన్నారు అని అడుగుతాడు. వెంటనే రాజ్ రెండు చేతులతో నమస్కరం చేసి ఒరేయ్ ఇప్పుడే మీ అత్తని కూల్ చేసి లైన్లో పెట్టుకున్నాను. మళ్ళీ నువ్వు అడిగి మొదటికి తీసుకురాకు. ఆ టాప్ ఇప్పి హైదరాబాద్ ని ముంచకురా.. వైభవ్ కామ్ గా చందు చేయ పట్టుకుని గదిలోకి తీసుకువెళతాడు. వదులు వైభవ్.. ఏంటిది అందరూ ఉన్నారు. అసలు ఏమైందే నీకు.. నాతో మాట్లాడటం తగ్గించేసావు. ఎక్కడ తగ్గించాను. కలిసినప్పుడు మాట్లాడుతున్నాను కదా.. ఎక్కడ మాట్లాడుతున్నావు. పొడిపొడిగా మాట్లాడుతున్నావు. అవునా కాదా ఈ అని పళ్లు బయటపెట్టి ఒక చిన్న స్మైల్ ఇవ్వడం తప్ప ఇంకేమైనా మాట్లాడుతున్నావా.. ఇప్పుడు నీకు ఏం కావాలి. ఏదో ఇంపార్టెంట్ వర్క్ మీద తిరుగుతున్నావు అంట.. ఎప్పుడైనా అలా వెళ్ళినప్పుడు నన్నే కదా పిలిచేదానివి. ఇప్పుడు ఎందుకు పిలవలేదు. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా.. పిలిచినా గొడవపడతావు. పిలవకపోయినా గొడవ పడుతున్నావు. పిలిచి నువ్వు అనే మాటలు అనిపించుకోవడం కన్నా నా పని నేను చేసుకుంటే బెటర్ అనుకుంటే దానికి 100 వంకలు పెడుతున్నావు. అనుమానంగా చూస్తూ ఈరోజు గొడవకు అంతటకే కారణం నువ్వేనా.. ఎటో చూస్తూ వాళ్ల గొడవకి నాకు సంబంధం ఏమిటి. నిజం చెప్పు అని కాలర్ పట్టుకుంటుంది. పట్టుకున్న చందు వైపు చూస్తూ ఎంత ధైర్యం ఉంటే నా కాలర్ పట్టుకున్నావే.. దీనికి ధైర్యం ఎందుకురా.. నా రెండు చేతిలో సరిపోవా.. ఇంతకీ ఏం చేశావురా. నేనేమీ చేయలేదు. నా ఫోను క్యాబిన్లో మర్చిపోయాను. వెళ్లి తెచ్చుకున్నాను అంతే.. వీళ్ళందరికీ గ్రూప్ కాల్ కనెక్ట్ చేసావా.. నేనా చేయలేదే.. అనుకోకుండా నా వేలు కాల్ మీదకు వెళ్ళిపోయినట్టు ఉంది. అయితే ఇప్పుడేమంటావు. చూడు మా నాన్న ఎలా బ్రతిమాలుతున్నాడో. మరి మర్యాదగా అడిగాను. చందు ఏం చేస్తుంది.. ఎక్కడుంది. నువ్వే కనుక్కో.. ఇంపార్టెంట్ వర్క్ మీద తిరుగుతుంది.తెలుసుకో అని పోజ్ కొట్టాడు. మరి ఆ పోజునంత దింపాలి కదా.. దింపడం అంటే ఇదా.. మా నాన్నతో పాటు మిగిలిన వాళ్ళని కూడా ఇరికించేసావు కదా. నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు చందు. ఏమిటి... చాలాసేపటి నుంచి నువ్వు నా కాలర్నే పట్టుకుని ఉన్నావు. ఇదేమన్నా మర్యాదగా ఉందా.. నీకు మర్యదా ఇచ్చేది ఏమిట్రా. పోనీలే ఆడపిల్లవి అని చూస్తూ ఉంటే తెగ రెచ్చపోతున్నావేమిటి అని నడుం మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటాడు. రేయ్ ఏం చేస్తున్నావురా అని తడబడుతూ అడుగుతుంది. ఏమైంది చందు ఇప్పుడు దాకా బెకబెకమంటూ అరిచావు కదా.. ఇప్పుడు ఎందుకు మాట తడబడుతుంది.. మర్యాదగా నడుం మీద చెయ్యి. ఏమయిందే పిల్ల రాక్షసి.. ఈ వయసులో మాట తడబడుతూ.. గొంతు తడారిపోతుంది అంటే అర్థం ఏమిటో తెలుసా.. చందు రియాక్షన్.....
29-04-2026, 09:38 AM
Part - 88
ఇప్పుడు ఎందుకు మాట తడబడుతుంది.. మర్యాదగా నడుం మీద చెయ్యి. ఏమయిందే పిల్ల రాక్షసి.. ఈ వయసులో మాట తడబడుతూ.. గొంతు తడారిపోతుంది అంటే అర్థం ఏమిటో తెలుసా..
చెయ్యి తీసి మాట్లాడు సరే అని చెయ్యి తీస్తాడు గాని దూరం జరగనివ్వడు.. నేను వెళ్ళాలి. అడిగినదానికి సమాధానం చెప్పేసి వెళ్ళు. ఏం అడిగావు. అంత మతిమరుపు వచ్చిందా.. అలాంటివి నువ్వు ఫ్లర్ట్ చేసే అమ్మాయిలని అడుగు. నన్ను కాదు. ఓ.. నిన్ను నేను ఫ్లర్ట్ చేయలేదు అని ఫీల్ అవుతున్నావా.. పోని ఇప్పుడు చేస్తాను చెప్పవే.. వే.. గి.. అన్నావంటే పళ్ళు రాలిపోతాయి. నాకు పళ్ళు లేకపోతే తర్వాత నువ్వే ఇబ్బంది పడతావు. నీ పళ్ళకి.. నా ఇబ్బందికి సంబంధం ఏముంది. మరి రేపటి నుంచి నేను ఏమీ తినలేకపోయాను అనుకో.. చిన్నపిల్లలకి పెట్టినట్టుగా స్మూతీస్ చేసి తినిపించాలి. జ్యూస్ లు పట్టించాలి. ఇవన్నీ కష్టం కదా.. నీకెందుకు నేను పట్టిస్తాను. కాబోయే శ్రీమతే కదా నాకు అవన్నీ చేయాల్సింది. ఏమిటి నీకు ఏడిపించడానికి నేను దొరకడం లేదు అని కొత్త యాంగిల్ ట్రై చేస్తున్నావా ? ఏడిపించడం కాదే తింగరి. ఐ లవ్ యు. ఒక్క నిమిషం వైభవ్ వైపు చూస్తుంది. ఏమిటే అలా చూస్తున్నావు. అంత నచ్చానా.. చూడు నీ దారి నీది.. నా దారి నాది.. ఏడిపించడానికి కూడా ఒక హద్దు ఉండాలి. ప్రేమించానని చెప్పి ఇంకా ఏమీ ఏడిపించాలని నీ ప్లాను. అయ్యో ఏడిపించడం కాదు. నిజమే చెబుతున్నాను. చేసిన ఓవర్ యాక్షన్ చాలు గాని.. నాకు దారి వదులు. నేను వెళ్ళాలి. ఇంతకీ నా ప్రేమను ఒప్పుకుంటున్నావా లేదా ? నేను అంత ఫూల్ ని కాదు. మర్యాదగా తప్పుకోకపోతే పెద్ద మావయ్యని పిలుస్తాను. వైభవ్ దారి ఇచ్చి వెళుతున్న చందు నే చూస్తూ ఉంటాడు. నేనింత ఇదిగా లవ్ చేస్తున్నానని చెబుతూ ఉంటే.. ఫూల్ చేయడం అంటుంది ఏమిటి.. నా ప్రపోజల్ అంత చండాలంగా ఉందా...ఇప్పుడు నాకు దీనికి సొల్యూషన్ చెప్పే వాళ్ళు ఎవరు.. ఎవరు.. అనుకుంటూ ఆ బాబి కరెక్ట్ గా చెబుతుంది అని విశి కి కాల్ చేస్తాడు. వైభవ్ కాల్ లిఫ్ట్ చేసి ఏమిటి ఈ టైంలో చేస్తున్నావు. నాకు ఒక ప్రాబ్లం వచ్చింది బాబి.. నీకా.. హ నాకే.. ఏమిటి. నేను ప్రపోజ్ చేస్తే.. చందు ఎలా మాట్లాడిందో చెబుతాడు. మొత్తం విన్న విశి ఆలోచిస్తూ ఉంటుంది. ఏం మాట్లాడవే బాబి. నీకు ఒక పాయింట్ అర్థం కావడం లేదు..చందు నిన్ను లవ్ చేయడం లేదు అని చెప్పడం లేదు. నిన్ను నమ్మను అంటుంది. రెండింటికి తేడా ఏముంది. నీ ప్రేమ తనకు అర్థమయ్యే విధంగా చెప్పి నమ్మకం కలిగించు. ఆటోమేటిక్గా చందు లవ్ చేస్తుంది. ఇది ఏమన్నా సినిమానా.. నమ్మించడానికి.. డ్రామాలు చూపించడానికి. సినిమాలు కూడా నిజ జీవితం నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసినవే. నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి. కానీ ఎలాగా నా లవ్ చూపించాలి బాబి.. అది నాకు తెలిస్తే ఇలా నీరసంగా ఎందుకు కూర్చుంటాను. నీది అదే ప్రాబ్లమా? అవును. మనం దీని మీద బాగా స్టడీ చేద్దాం. ఎలా.. ఏదో ఒకటి నేను ఆలోచించి నీకు చెబుతాను అని ఫోన్ పెట్టేసి చించుతూ ఉంటాడు. దీనికి సొల్యూషన్ చెప్పగలిగే వాళ్ళు ఇద్దరే ఇద్దరు. ఒక్కళ్ళు శ్రీకర్ ఐతే ఇంకొకళ్ళు అన్నయ్య. ఫస్ట్ అన్నయ్యని అడుగుదామని సూర్య గదిలోకి పరిగెడుతాడు. ఫ్రెష్ అయ్యి వచ్చి మంచం మీద వాలి ఫోన్ చూస్తున్న సూర్య మీదకు వచ్చి పడతాడు. ఒరేయ్ ఇలా వచ్చి పడ్డావు ఏమిటిరా.. లేగు. అన్నయ్య నాకు ఒక హెల్ప్ కావాలి. ఏదైనా సరే ముందు లెగిసి అడగరా.. నడుము విరిగిపోతుంది. ఓ సోరి.. ఆవేశంలో వచ్చి మీద పడ్డాను. నీ బొంద అని వైభవ్ ని పక్కకి గెంటి సూర్య లేచి నిలబడి నడుం సెట్ చేసుకుంటాడు. ఇంతకీ నీ ఆవేశం ఏంటో చెప్పు. చెప్పాక కోప్పడవు కదా.. ముందు చెప్పరా.. చందు కి ప్రపోజ్ చేశాను. ఆ మాటకి సూర్యకి పులమారుతుంది. ఏం మాట్లాడుతున్నావు రా. అవును ప్రపోజ్ చేశాను. మరి చందు ఏమంది. నేను అంత ఫుల్ ని కాదు అని వెళ్ళిపోయింది. బాగా చెప్పింది. నా ప్రేమ నిజం కాదా.. నేను దాన్ని ఏడిపించడానికి చెప్పాను అని అనుకుంటున్నావా.. వైభవ్ ఫేస్ చూస్తే సిన్సియర్గా కనపడుతుంది.. చిన్నగా నవ్వుకొని అక్కడ సోఫాలో కూర్చోబెట్టి... మీ ఇద్దరి మధ్యన ఇప్పుడు దాకా గిల్లికజ్జాలే జరిగాయి. ఒక్కసారిగా నువ్వు వెళ్లి ఐ లవ్ యు అంటే చందు ఎలా రియాక్ట్ అవుతుంది. ఫర్ సపోస్ చందు వచ్చి నీకు అలా చెప్పిందే అనుకో నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు. మరి ఎలా అన్నయ్య.. నాకు అది కావాలి అని నడుం చుట్టూ చేతులు వేసి పట్టుకుని అడుగుతాడు. నన్ను పట్టుకుంటే ఎలాగా.. దానికి నీ తిప్పలు నువ్వు పడాలి. అది తెలియకే కదా... బాబి ని కూడా అడిగాను. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలింది అన్నట్టుగా ఉంది. ఇంతకీ ఏం చెప్పింది. అది నాకు తెలిస్తే నాకెందుకు ఇన్ని బాధలు అని బాధ పడింది. ఆ మాటకి నవ్వుకుంటూ...మీ బాబి సంగతి నేను చూసుకుంటాను కానీ నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి. అదే ఎలాగా.. ప్రేమనీది.. ప్రయత్నాలు నీవే అవ్వాలి. నీ ప్రయత్నంలో సిన్సియారిటీ చూపించు. అదే తెలియడం లేదు. ఫ్లర్ట్ చేయడం వేరు. ప్రేమించానని చెప్పడం వేరు కానీ ఎలా.. ఎలా.. ప్లీజ్ అన్నయ్య హెల్ప్ మీ.. సూర్య వైభవ్ పక్కనే కూర్చుని భుజం మీద చెయ్యి వేసి.. ప్రేమ అంటే మాట కాదు రా వైభవ్… ప్రేమను నీవే చూపించాలి. ప్రేమను అర్థం చేసుకోనివ్వాలి. ప్రేమిస్తున్నావని చెప్పడానికి… పొరపాటున కూడా మూడో మనిషిని మధ్యలో పెట్టకు. చందుకు నువ్వు నిజంగా మారిపోయావా? నిజంగా సీరియస్‌వా? నీ అలవాట్లు, నీ తిట్టుకూడా ఆమె మీద ప్రేమైతే… అవి ఆమెకి కనిపించాలి. ఒక్కసారిగా ఐ లవ్ యూ అన్నంత మాత్రాన ఎవ్వరికీ నమ్మకం రాదు. రోజూ చూపించే చిన్న చిన్న జాగ్రత్తలు… మాటల్లోనూ, ప్రవర్తనలోనూ వచ్చే స్థిరత్వం… అదే నమ్మకం తెస్తుంది. నీ ప్రేమని చందు నమ్మాలంటే… నీ ప్రేమను నువ్వే లాంగ్వేజ్‌లా నేర్పించాలి. అదే నీ ప్రయత్నం. నువ్వు చెబుతుంటే అర్థమయ్యి అవనట్టుగా ఉంది. ఏదో మళయాళం సినిమా కొంకిణి లాంగ్వేజ్ లో చూసినట్టుంది. కానీ ఒక్క పాయింట్ అర్థమైంది. ప్రేమ నాది.. ఫైటింగ్ నాది.. చందూకు అర్థమయ్యే విధంగా చెప్పే బాధ్యత కూడా నాది అంతే కదా.. అబ్బా.. ఎన్ని రోజులకి నీ నోటి నుంచి బాధ్యత అన్నమాట వచ్చింది రా.. ఇంక నీకు ఎదురేలేదు. క్యారీ ఆన్.. థాంక్యూ బ్రో.. చందు వస్తున్న కాచుకో.. అంత వద్దు మామూలుగా వెళ్ళు.. ఏమిటో అన్నయ్య నీకు నా ఫాంటసీ అస్సలు అర్థం కావడం లేదు అని రూమ్ కి వెళ్లి ఎలా చెప్పాలో.. ఏమిటా అని ఆలోచిస్తాడు. ఐడియా.. లవ్ మూవీస్ చూస్తే మన కంటెంట్ దొరకచ్చు కదా అని రాత్రంతా జాగారం చేసి మరి సినిమాలు చూస్తాడు. వైభవ్ వెళ్లి సూర్య గది తలుపులు బాధేస్తూ ఉంటే.. అబ్బా ఈ టైంలో ఎవరు అని తలుపులు తీస్తే.. అన్నయ్య.. ఏంట్రా ఈ టైంలో. నేను కొన్ని ప్రాక్టీస్ చేశాను. అవి చూపిద్దామని. ఇప్పుడా ఇంత ఎర్లీ మార్నింగ్ లో ఏదైనా ఫ్రెష్ గా స్టార్ట్ చేయాలిరా. అందుకే కదా వచ్చాను అని లోపలకి వస్తాడు. చెప్పు.. అద్దం ముందు నిలబడతాడు అద్ధం వైపు ఎందుకురా అయ్యో నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి కదా.. ఎక్స్ప్రెషన్స్ అని సూర్యా పెడతాడు. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అన్నయ్య. శ్… ప్రాక్టీస్ మోడ్ లో ఉన్నా! చందుకి పర్ఫెక్ట్ గా ప్రపోజ్ చేయాలి కదా! వైభవ్...మాస్ హీరో స్టైల్ అద్దం ముందు తల వెంట్రుకలు స్టైల్ చేసి, కాలర్ కొంచెం ఎత్తి: మాస్ టోన్ తో చందు… నీకోసం ఏడు సముద్రాలు దాటి వచ్చేసానురా… ఒక్కసారి ‘అవును’ అన్నా… నువ్వు నా రాణి… నేను నీ హీరో! ఎలా ఉంది అన్నయ్య.. సూర్య తలపై చెయ్యేసుకుని: అరేయ్… చందు నిన్ను రోడ్డు మీద వదిలేసి వెళ్లిపోతుంది ఈ స్టైల్‌లో. అయ్యో... ఇది కూల్‌గా లేదేమో. ఇప్పుడు క్లాసిక్ రొమాన్స్ లో చెబుతాను.. చేతిలో ఒక పుస్తకం పట్టుకుని, గ్లాస్ నెమ్మదిగా తీసి.. వైభవ్ సాఫ్ట్ టోన్ తో.. చందు… నీ కళ్ళలో పడిన రోజు నుంచి… నా జీవితం బ్లాక్ అండ్ వైట్ నుండి కలర్ మోడ్‌కి మారిపోయింది. విత్ లవ్… వైభవ్. సూర్య నవ్వు ఆపుకోలేక: అయ్యా కవిత్వం ఆపు. నువ్వు కవి సమ్మేళనంలో ప్రపోజ్ చేస్తున్నట్టు ఉంది. ఛ.. ఇది కూడా సెట్ అవ్వలేదా మరొకటి వదులుతాను చూడు.. వైభవ్ వెనుక నుండి చేతులు చుట్టే పోజ్ ప్రాక్టీస్ చేస్తూ.. చందు… నీ దగ్గరకు రావడం… నీ వెనుక నిలబడడం… ఇవి అన్నీ నేను ప్రాక్టీస్ చేశాననుకుంటున్నావా? లేవురా… అవి నాకు ఆటోమేటిక్ గా వస్తాయి… సూర్య వెంటనే: ఒకేసారి ఇలా దగ్గరకు వెళ్లకు… చందు బలంగా మోచేతి తో ఒకటి ఇస్తుంది. ఏమిటి న్నయ్య ఎన్ని చెప్పినా ఏదో ఒకటి చెబుతున్నావు ఇది చూడు.. వైభవ్ గుండెపై చెయ్యేసుకుని, డీప్ బ్రీతింగ్ తో చందు… సూర్య వైపు చూసి బిక్కమొహం వేస్తాడు. ఏమైందిరా డైలాగ్ మర్చిపోయాను. ఓహ్ షిట్! స్లో మోషన్ పాట బాక్గ్రౌండ్ లో ఉంటేనే ఇది బాగుంటుంది బ్రో.. సూర్య తల పట్టుకుంటాడు.ఇది ఫైనల్. నా ఒరిజినల్ స్టైల్.. అద్దం ముందు నిజంగా తనలా నిలబడి.. వైభవ్ నిజాయితీగా చందు కళ్ళల్లోకి చూస్తున్నట్టుగా ఫీల్ అవుతూ.. చందు… నీతో ఉండటం నాకు బాగుంటుంది. నీతో మాట్లాడితే నా రోజు సరి అయినట్లు అనిపిస్తుంది. నీ మీద నాకు ప్రేమ… ఆ మాట చెప్పడానికి నేను నేనే ఉండాలి. ఇదే నేను… ఇదే నా ప్రేమ. సూర్య గట్టిగా చప్పట్లు కొడుతూ: అది రా! అదే నీ స్టైల్! సినిమాల్లా కాకుండా… నువ్వు నిన్ను నమ్మి చెప్పాలి. వైభవ్ అద్దంలోకి చూసి చిన్నగా నవ్వుకుంటాడు: అయితే… దీన్నే ప్రాక్టీస్ చేస్తా. చందుకి ఇది నచ్చుతుంది. వైభవ్ ప్రాక్టీస్ ఎంతవరకు వస్తుంది..........
29-04-2026, 09:39 AM
Part - 89
వైభవ్ ఇలాగే ప్రాక్టీస్ చేసి చందుకి చెబుతాను అన్నయ్య అని వెళ్ళిపోతాడు . వెళుతున్న వైభవ్ ని చూసి నవ్వుకుంటూ..
ప్రేమలో పడను పడను అంటూనే.. మాకన్నా ఎక్కువగా ఆరాటపడుతున్నావు కదరా.. ఇంతకి నా తింగరబుచ్చి ఏం చేస్తుందో.. ఇంత పొద్దున్నే ఫోన్ చేస్తే కంగారు పడుతుంది ఏమో.. ఒసేయ్ తొందరగా ప్రపోజ్ చేయవే... నాకున్న ఒకే ఒక డ్రీమ్.. ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుందా అని. నేను ప్రేమించింది నిన్నే. ప్రపోజ్ చేయవే బంగారం. అప్పుడే నిద్ర లేచిన విశికి పులమారుతూ ఉంటుంది. అబ్బా.. ఇంత పొద్దున్నే ఏమిటీ. ఎవరు తలుచుకుంటున్నారు. దేవా సార్ మీరే తలుచుకుంటున్నారా. నేను అమ్మకి చెప్పాను లేదా అని ఆలోచిస్తూ ఉండి ఉంటారు కదా. ఇదిగో ఈ రోజు అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకుంటాను. స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుంటూ.. ప్లీజ్ భగవంతుడా అమ్మ ఒప్పుకునేటట్టు చెయ్యి.. రాగానే నీ గుడికి వచ్చి కొబ్బరికాయ కొడతాను సరేనా అని దేవుడితో డీల్ పెట్టుకుని కిచెన్లో ఉన్న తల్లి దగ్గరికి వెళ్లి అమ్మ అని పిలుస్తుంది. ఏంట్రా.. నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పు. ఈరోజు వంట నేను చెయ్యనా.. ఏమిటి ఇది చెబుదామన.. ఆహా అది కాదు. నా దగ్గర నువ్వు మోహమాటపడడం ఎప్పటినుంచి మొదలు పెట్టావు. అది నిన్న ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్టు డీల్ ఓకే అయ్యింది. మంచిది. కానీ ఆ విషయం నిన్నే చెప్పావు కదా.. హ దేవా సార్.. ప్రాజెక్ట్ ఓకే అయింది కదా అన్నవరం తీసుకువెళతాను అన్నారు. నీ పర్మిషన్ అడిగి చెబుతాను అని చెప్పాను.. ఏం చెప్పమంటావు అమ్మ అని తల్లి వైపు చూస్తోంది. కూరగాయలు కట్ చేస్తున్న భానుమతి చాక్ పక్కన పెట్టి కూతురు వైపు చూస్తుంది. నీకు ఇష్టం లేకపోతే వద్దు అని చెప్పేస్తాను అని.. ఒప్పుకోవాలి అన్నట్టుగా చూస్తూ ఉన్న కూతురు కళ్ళు చూసి నవ్వుకుంటూ.. దీనికి కూడా భయపడుతున్నావా.. దేవాసార్ మీద నాకు నమ్మకం ఉంది. నేహాగారు కూడా చాలా గొప్పగా చెప్పారు. అలాంటి అబ్బాయి దొరకాలి అంటే పెట్టి పుట్టాలి అని. అన్నీ కలిసి వస్తే మన ఇంటి అల్లుడిని చేసుకోవాలని ఉంది. అమ్మ అని ఆనందంగా హత్తుకుంటుంది. పిచ్చిదానా.. మనసులో ఆశ ఉంటే సరిపోదు అది చెప్పడం కూడా రావాలి. అన్నవరం నుంచి వచ్చేలోపు నీ మనసులో మాట అబ్బాయికి చెప్పి శుభవార్తతో నా ముందు నిలబడాలి అర్థ మయిందా. నువ్వు బెస్ట్ అమ్మవి అని బుగ్గన ముద్దు పెట్టుకుంటుంది. నన్ను పొగిడింది చాలు కానీ అబ్బాయికి ఫోన్ చేసి చెప్పు సరే అని పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్లి తలుపు వేసుకొని సూర్యకే కాల్ చేస్తుంది. విక్రమ్ తో మాట్లాడుతున్న సూర్య ఫోను చూసి అబ్బా.. ఇప్పుడు ఎలా లిఫ్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే... ఏరా నా కోడలా.. మీరు ఎలా గెస్ చేశారు. నీ ఫేస్ చూస్తే మీ అమ్మ కూడా గెస్ చేస్తుంది. అలాంటిది నేను గెస్ చేయలేనా.. ఏం అవసరం వచ్చిందో వెళ్లి మాట్లాడు. ఫోన్ లిఫ్ట్ చేసి.. చెప్పండి మేడం. మాతో ఏం అవసరం వచ్చింది.. సార్.... నేను మేడం ఏమిటి.. మీ స్టూడెంట్ ని. కానీ ఇప్పుడు వి. జె. స్. కంపెనీ తోనే డీల్ కుదుర్చుకున్న బిజినెస్ ఉమెన్ కదా.. ఇదంతా మీ చలవ కాదా.. నీకు అదే చెప్పాను. నీ క్రెడిట్ ని నా ఎకౌంట్లో వేస్తావు ఎందుకు. భయపడుతుంటే మోటివేషన్ ఇచ్చాను కానీ నేనేమీ వర్క్ చేయలేదు కదా.. బేసికల్గా నీలో ఆ టాలెంట్ ఉంది. ఎక్స్పోజ్ అయ్యావు అంతే..మీలో నచ్చేది ఇదే సార్..ఎంత ఎదిగిన ఒదిగి ఉండే మీ క్యారెక్టర్ చూస్తే.. హ చూస్తే... అదే నేర్చుకోవాలి అనిపిస్తుంది. ఏదో చెప్పాలని ఫోన్ చేసి ఇంకా ఏదో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అమ్మతో మన విషయం చెప్పాను. మన విషయమా... మన విషయం అంటే ఏమిటి విశి. అదే హైదరాబాద్ టు వైజాగ్ వెళ్దాం అన్నారు కదా.. అమ్మతో అన్నవరం వెళుతున్నాము అని చెప్పాను. ఆ మాటకి నవ్వుకుంటూ మరేమన్నారు. మీ మీద నమ్మకం ఉంది వెళ్ళమని చెప్పింది. నీ మీద నమ్మకం లేదా.. సార్ నా మీద నమ్మకం లేకుండా ఎలా ఉంటుంది. నా మీద నమ్మకంతో వెళ్ళమన్నారు కానీ నీ మీద నమ్మకంతో వెళ్ళమని చెప్పలేదు కదా.. అందుకనే అడుగుతున్నాను. మీకు నన్ను ఏడిపించడం చాలా ఇష్టం కదా.. ఏడిపించడం కాదు నవ్వించడం ఇష్టం. ఆ మాటకి చిన్నగా సిగ్గుపడుతుంది. ఎప్పుడు బయలుదేరాదాము సార్. నువ్వు ఎప్పుడంటే అప్పుడు నేను రెడీ. ఈరోజు స్టార్ట్ అవుదామా. అబ్బో అమ్మాయిగారికి చాలా కంగారుగా ఉన్నట్టుంది. ఏదైనా స్పెషల్ న్యూస్ ఉందా.. ఆ మాటకి తడబడుతూ స్పెషల్ న్యూస్ ఏముంటుంది సార్. ఎంత తొందరగా వెళితే అంత మంచిది కదా. నాకు సంబంధించిన ప్రతి ఇంపార్టెంట్ విషయం అక్కడే మొదలయ్యింది అందుగురించే.. ఇప్పుడు ఇంకా ఏదైనా ముఖ్యమైన విషయం మొదలవ్వబోతుందా .. ఇంచుమించు అలాంటిదే. నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది. ఫోన్ వైపు చూస్తూ నవ్వుకుంటూ వెనక్కి తిరుగుతాడు అక్కడ ఉన్న వాళ్ళని చూసి ఉలిక్కిపడి వీపు మీద చరుచుకుని ఏంట్రా ఇద్దరు అలా చూస్తున్నారు. నువ్వు ఫోన్లో రొమాన్స్ ఒలకపోస్తూ ఉంటే నేర్చుకుందామని అన్నయ్య.. అంతేనా శ్రీకర్.. అంతే. నేను నా బుజ్జి పప్పీ తో ఎప్పటినుంచో ప్రేమలో ఉన్నాను కానీ ఇలా ట్రిప్ కి వెళ్ళానా. నువ్వు ప్రేమలో పడి పడగానే.. అని రయ్ రయ్ మంటూ వెళ్ళిపోతున్నావు. శ్రీకర్ భుజం మీద చెయ్యి వేసి మీకు నాకు తేడా ఉందిరా.. ఏమిటో ఆ తేడా. నువ్వు ఆల్రెడీ ప్రేమలో పడ్డావు. ప్రపోజ్ చేసావు. నీ ప్రేమని సౌమ్య ఒప్పుకుంది. ఇంక నా పిల్ల ఎక్కడికి వెళుతుంది లే అన్న ధీమా నీది. ఇంక వీడంటావా.. చందుని ఒప్పించే ప్రయత్నంలో ఉన్నాడు కాబట్టి వాడికి కొంచెం టైం పడుతుంది. ఇక నా సంగతి అంటావా.. నా క్యూటి నన్ను లవ్ చేస్తున్న విషయం నాకు తెలుసు. నేను ఇష్టపడుతున్న విషయం క్యూటి కి తెలుసు. అందుకే అది ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి మేము ట్రావెలింగ్ స్టార్ట్ చేసాము. అమ్మ బావ... ఇంత ఉందా.. ఇలా అనుకుంటే..నా బుజ్జి పప్పీ ని కూడా తీసుకుని రయ్... రయ్.. అంటూ తీసుకు వెళ్లి ప్రపోజ్ చేసే వాడిని. ఛ.. అనవసరంగా డైరెక్ట్ గా చెప్పేసాను. ఇది గనక భరత్ మామయ్య విన్నాడనుకో.. ఇప్పుడు అస్సలు పంపించడు జాగ్రత్త. ఆ.. అన్ని వాళ్ళకి చెప్పే చేస్తాం ఏమిటి? మేము చెప్పే చేస్తున్నాము. మీ అంత సిన్సియారిటీ మా దగ్గర లేదులే అని వెనక్కి తిరుగుతాడు. అక్కడ భరత్ చేతులు కట్టుకొని చూస్తూ ఉంటే.. మావయ్య నువ్వు వచ్చి ఎంత సేపు అయింది. ఇదిగో ఇప్పుడే వీడి ప్రేమ గురించి చెబుతూ ఉంటే.. భరత్ మావయ్యని అడుగు సలహాలు బాగా ఇస్తాడు అని చెబుతున్నాను అంతే కదా.. ఏమిట్రా అని కొంచెం గట్టిగా అంటే.. ఛీ.. ఛీ..ప్రేమలో కాదు మావయ్య. బిజినెస్... బిజినెస్ గురించి మాట్లాడుకుంటున్నాము అంతే కదరా అని సూర్య షర్టు పట్టుకుంది లాగుతూ ఉంటాడు. సూర్య నవ్వుతూ నువ్వు వచ్చి ఎంతసేపు అయింది మావయ్య. వీడు వస్తున్నాడు అని తెలిస్తే.. నేను ఇంట్లోనే ఉంటున్నాను. ఆడపిల్ల తండ్రిలము కదా.. మా జాగ్రత్తలో మేము ఉండాలి. మావయ్య అని శ్రీకర్ గుండె మీద చెయ్యి వేసుకుంటాడు. శ్రీకర్ అరుపుకి వైభవ్ రెండు అడుగులు వెనక్కి వేస్తాడు. ఎందుకురా అలా అరిచావు అని భరత్ అంటే.. నువ్వు నీ కూతురు నైనా అనుమానించొచ్చుగానీ నన్ను అనుమానించకూడదు అని డ్రామాటిక్ గా చెబుతాడు. అవునా. అవును మావయ్య. నేను ఎంత గుడ్ బోయ్ నో తెలుసా.. అసలు ఇప్పటివరకు సౌమ్యని బైక్ ఎక్కించుకున్నానే కానీ మా ఇద్దరి మధ్యన బ్యాగ్ అడ్డు పెడతాను. నీ పర్మిషన్ లేకుండా చెయ్యి కూడా పట్టుకోవడం లేదు. ఇంక సౌమ్యనే మనం ప్రేమలో ఉన్నాము కదా అంటుంది. అవునా సౌమ్య. నువ్వు అలా మాట్లాడావా. సౌమ్యనా.. అదెక్కడుంది అని పక్కకి చూస్తే అక్కడ ఉగ్రరూపం లో కనపడుతుంది. అంతే శ్రీకర్ తల మీద చెయ్యి వేసుకుని అక్కడ నేలపైన కూర్చుండిపోతాడు. భరత్ శ్రీకర్ ముందుకు వచ్చి మామగారులతో పెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి రా.. ఏది పడితే అది మాట్లాడితే ఇదిగో ఇలాగే ఇరుక్కుపోతావు. ఇందులో నీ తోకకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది అని భరత్.. వైభవ్ వైపు చూసి పళ్ళు నూరుతాడు. ఆఫీసులో సంగతి గుర్తుకొచ్చి వైభవ్ ఒక తింగరి నవ్వుతే.. నా చేతిలో నువ్వు అయిపోయావురా.. చందు కి లైన్ వేస్తున్నావు కదా.. ఎన్ని పుల్లలు పెట్టాలో అన్ని పెడతాను చూస్తూ ఉండు. అంతే వైభవ్ వెంటనే భరత్ కాళ్ళు పట్టుకుని మావయ్య ఏదో చిన్న పిల్లోడిని. మీరు ఎలా హ్యాండిల్ చేస్తారో తెలుసుకుందామని అలా చేశాను కానీ మిమ్మల్ని ఇరికిస్తానా.. ప్లీజ్ మావయ్య అసలు ఇంకా పట్టాలె ఎక్కని నా ప్రేమకి నువ్వు బ్రేకులు వెయ్యకు. ఒరేయ్ వదలరా. మీరు అడ్డుపడను అని చెప్పే వరకు మీ కాళ్లు వదలను. ఒరేయ్ నువ్వు ఊపే ఊపుడికి నేను కూడా పడిపోయేటట్టు ఉన్నాను. పర్వాలేదు. పడిపోతే దెబ్బలకి ఆయిల్ రాస్తాను కానీ మీరు ఒప్పుకోండి మావయ్య. నేను ఒప్పుకున్నా.. రాజ్ నీ మీద కారాలు మిరియాలు బాగా నూరుతున్నాడు. రాజ్ మావయ్యని నేను కన్విన్స్ చేసుకుంటాను మీరు ఒప్పుకున్నట్టే కదా.. ఒప్పుకోక చస్తానా.. వదులు అనగానే.. హమ్మయ్య అని శ్రీకర్ వైపు చూసి నేను ఎలాగైతే మావయ్యని ఒప్పించేసాను. నీదే మిగిలింది. సౌమ్యను బ్రతిమాలుకో.. మరీ ఇలాగా.. నా వే లో నేను వెళ్ళాను. నీ వేలో నువ్వు వెళ్ళు. శ్రీకర్ సౌమ్యని ఎలా బ్రతిమాలతాడు. కథ కొనసాగుతుంది.............
29-04-2026, 10:23 AM
Family emotions... Need to wait and watch how the journey of Surya & Vishi unfolds
29-04-2026, 10:31 AM
Like to see spicy Chandu Vaibhav gillikajjalu episodes!!!
Dunno... but they could be very very awesome!!! |
|
« Next Oldest | Next Newest »
|