Posts: 701
Threads: 11
Likes Received: 5,607 in 647 posts
Likes Given: 1,375
Joined: Aug 2024
Reputation:
489
ఎపిసోడ్ - 1
1999 కార్గిల్ వార్ లో భారత్ విజయం సాధించిన తర్వాత లడక్ ప్రాంతం సరిహద్దులలో చొరబాట్లు ఎక్కువ జరుగుతూ ఉండడంతో చైనా, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతమైన కారకొరం పాస్ తూర్పు భాగం లడక్ ప్రాంతంలో భారీ బలగాలను మోహరించింది నిఘా పెంచింది ఇండియన్ ఆర్మీ.
ఒకరోజు సరిహద్దులో గస్తి కాస్తు ఆర్మీ పోస్ట్ లో ఉన్న మేజర్ దగ్గరికి వచ్చి సెల్యూట్ చేసి "సార్! చైనా సరిహద్దు ప్రాంతం జింజ్ యాంగ్ నుండి పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న గిల్లెట్ ప్రాంతానికి వాహనాలు వెళుతున్న కదలికలు కనిపించాయి." అని చెప్పాడు సోల్జర్.
ఆ మాట విని మ్యాప్ మీద సరిహద్దు ప్రాంతాలు చూస్తూ "నాకు తెలిసి వీళ్ళు కారకొరం పర్వతల దగ్గర ఏదో చేస్తున్నారు ఇప్పుడు విపరీతమైన మంచు ఉంటుంది ఆర్మీ పోస్టులు కూడా ఉండవు ఈ టైమ్ లో ఎందుకు వెళ్ళినట్లు!" అని ఆలోచించి హెడ్ కోటర్స్ కి మెసేజ్ ఫార్వర్డ్ చేసి వైర్లెస్ సెట్ లో "ఎవరీ మినిట్ అలర్ట్!" అని బోర్డర్ లో ఉన్న సోల్జర్స్ కి చెప్పాడు మేజర్.
లడక్ పోస్ట్ నుంచి వచ్చిన మెసేజ్ చదివి డస్క్ లోనుంచి పేజర్ తీసి మెసేజ్ ఫార్వర్డ్ చేశాడు అక్కడ ఉన్న ఆఫీసర్.
గిల్లెట్ నుంచి హిమాలయాలకు వెళ్లే ప్రాంతంలో గొర్రెలను కాస్తూ తన చేతిలో ఉన్న గొర్రె పిల్ల మెడలో లాకెట్ రెడ్ కలర్ లో మెరవడం చూసి అక్కడి నుంచి గొర్రెలను తోలుకొని తన ఇంటి వెళ్లి సీక్రెట్ గా ఉంచిన ప్లెజర్ బయటికి తీసి మెసేజ్ చదివి రిప్లై ఇచ్చి గన్ తీసుకుని అక్కడ వంట వండుతున్న ఇద్దరి వైపు చూసి
"పాండే, సాదిక్! మనకి పని పడింది హెడ్ క్వార్టర్ సెంచి మెసేజ్ వచ్చింది బోర్డర్లో ఏదో జరుగుతుంది." అని చెప్పాడు ఏజెంట్ ప్రకాష్.
ప్రెజర్ లో ఉన్న మెసేజ్ చూసి "ప్రకాష్! ఈ టైంలో మంచు ఎక్కువుగా ఉంటుంది మనల్ని ఎవరైనా చూస్తే తప్పించుకోవడం కష్టం!" అని చెప్పాడు సాదిక్.
ఆ మాటకి నవ్వుతూ "అలా అయితే దేశం కోసం ప్రాణాలు ఇచ్చేదాము, ముగ్గురిలో ఒక్కరు తప్పించుకున్న అక్కడ ఏం జరుగుతుందో ఆర్మీకి తెలుస్తోంది." అని చెప్పాడు పాండే.
"గుడ్!" అని సీక్రెట్ గా ఉంచిన ఆంజనేయ స్వామి ఫోటో తీసి నమస్కారం చేసుకుని "జై భజరంగబలి!" అని చెప్పి ఇద్దరితో కలిసి స్టార్ట్ అయ్యాడు ప్రకాష్.
ముగ్గురు వేషాలు మార్చుకుని గొర్రెల తోలుకుంటూ వెహికల్స్ వెళ్లిన గుర్తులు చూస్తూ కారకొరం కొండల దగ్గరకు వెళ్లి పైన కొంతమంది మిషన్స్ ఫిట్ చేయడం చూసి "అసలు వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆ మిషన్స్ ఏమిటి?" అని ఆశ్చర్యంగా అడిగాడు పాండే.
"రెండు దేశాల వాళ్ళు కలిసి ఇక్కడ ఏదో ప్రయోగం చేస్తున్నారు." అని తన దగ్గర ఉన్న మైక్రో కెమెరాతో ఫోటోలు తీస్తూ ఉన్నాడు సాదిక్.
అంతలో ఒక వ్యక్తి ఆ మిషన్ దగ్గరకు వచ్చి చక్క బాక్స్ ఓపెన్ చేసి ఒక వస్తువుని బయటకు తీసి చూసి నవ్వుతూ "దీనిని సంపాదించడానికి కైలాస పర్వతం నుంచి మానససరోవరం వరకు 20 సంవత్సరాలు వెతకాల్సి వచ్చింది ఇంకా నా కల ఫలించబోతుంది." అని చెప్పి ఆ వస్తువుని మిషన్ లో పెట్టి తన చేతిలో ఉన్న ఫైల్ చూస్తూ "ఆన్ చేయండి యాక్టివేట్ అవుతుంది." అని చెప్పాడు.
మిషన్స్ ఆన్ అవడంతో ఆ వస్తువు నుంచి వచ్చిన మెరుపు ఆకాశంలోకి భూమిలోకి వెళ్లడం ఆశ్చర్యంగా చూస్తూ
"ఏంటది? దాంతో ఏం చేస్తున్నారు? " అని కంగారుగా అడిగాడు సాధిక్.
"ఏం చేస్తున్నారు అనేది మనకి అనవసరం దానిని వెంటనే ఆపాలి ఆ మిషన్ లో ఉన్న వస్తువు అతని చేతిలో ఉన్న ఫైల్ మనకి హ్యాండ్ ఓవర్ అవ్వాలి." అని చెప్పాడు ప్రకాష్.
"ఓకే!" అని ముగ్గురు మూడు వైపుల నుంచి మంచులో నెమ్మదిగా పాకుతూ దగ్గరకు వెళ్లి అక్కడ సెక్యూరిటీగా గన్స్ తో నుంచున్న ఇద్దరిని కాళ్లు పట్టుకుని కిందకి లాగి తలని మంచులో నొక్కి పట్టి "ఎటాక్!" అని చెప్పాడు పాండే.
ఆ మాట విని పరుగున వెళ్లి అక్కడ ఉన్న వ్యక్తి తల మీద కొట్టి చేతిలో ఉన్న ఫైల్, మిషన్ లో ఉన్న వస్తువుని తీసుకుని గన్స్ తో అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తున్న వాళ్ళని చూసి షూట్ చేస్తూ "సాదిక్! ఇక్కడనుంచి వెళ్ళిపోదాము." అని చెప్పి ఫాస్ట్ గా పరిగెడుతూ కిందకి దూకేసాడు ప్రకాష్.
అంతలో చాలామంది గన్స్ పట్టుకు రావడం చూసి "ప్రకాష్! నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో వీళ్ళ సంగతి మేము చూసుకుంటాము." అని వచ్చే వాళ్ళని షూట్ చేస్తూ ఉన్నాడు పాండే.
తల మీద కారుతున్న రక్తానికి చెయ్యి అడ్డుపెట్టుకొని పైకి లేచి "ఆ వస్తూవు తీసుకుని పారిపోతున్నాడు ఫైల్ కూడా అతని దగ్గరే ఉంది పట్టుకోండి." అని గట్టిగా అరిచాడు ఆ వ్యక్తి.
అక్కడి నుంచి వేగంగా పరిగెడుతూ సాదిక్ బుల్లెట్స్ తగిలి కొండ మీద నుంచి కింద పడడం అక్కడి నుంచి కొంతమంది తన వైపుకి రావడం చూసి రూమ్ కి వెళ్లడం సేఫ్ కాదని అర్థమై అడవులలో నుంచి సిటీ వైపుకి పరిగెత్తాడు ప్రకాష్.
*********
రెండు రోజుల తర్వాత లడక్ చేరుకుని ఒక షాపులోకి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుని తలకి మంకీ క్యాప్ పెట్టుకుని పబ్లిక్ టెలిఫోన్ బూత్ కి వెళ్లి ఫోన్ చేసి "జైహింద్ సర్!" అని చెప్పాడు ప్రకాష్.
ఫోన్లో మాట విని "ప్రకాష్! ఎక్కడ ఉన్నావు? అసలు అక్కడ ఏం జరిగింది?" అని కంగారుగా అడిగాడు ఆఫీసర్.
"సార్! అక్కడ రెండు దేశాల వాళ్లు కలిసి ఏదో ప్రయోగం చేస్తున్నారు నేను ఆ వస్తువుని ఫైల్ తీసుకుని పారిపోయి వచ్చేసాను." అని చెప్పాడు ప్రకాష్.
"పాండే, సాధిక్ లు చనిపోయారు మీరు ఉంటున్న రూమ్ ని వాళ్లు తెలుసుకున్నారు ఆ ఇద్దరి బాడీ లని చూపించి ఇండియాన్ ఏజెంట్స్ అని చైనా, పాకిస్తాన్ అమెరికా అంబాసి ఆఫీసర్స్ ఇండియన్ గవర్నమెంట్ మీద ప్రెజార్ తీసుకువస్తున్నారు.
మా మనుషులు కాదు అని గవర్నమెంట్ చెప్పింది ఆ ప్రయోగం వాళ్లకి ఎంతో ఇంపార్టెంట్ అనుకుంటా! నీ గురించి కూడా వాళ్ళు తెలుసుకున్నారు ఈ టైంలో నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు మీ ఊరు వేళ్ళు ఈ ప్రాబ్లం అంత క్లియర్ అయిన తర్వాత నాకు టచ్ లోకి రా..!" అని చెప్పాడు ఆఫీసర్.
"సార్! సాదిక్, పాండే దేశం కోసం చనిపోయారు వాళ్ళ ఇద్దరు ఇంటికి వెళ్లి ఐదు సంవత్సరాలు అవుతుంది కనీసం వాళ్ల బాడీలు అయ్యినా ఫ్యామిలీస్ కి ఇవ్వండి." అని బాధగా చెప్పాడు ప్రకాష్.
"నాకు కూడా బాధగానే ఉంది కానీ ఏమీ చేయలేని పరిస్థితి నువ్వు సేఫ్ గా ఉండు, అసలు అక్కడ చేస్తున్న ప్రయోగం ఏమిటో తెలుసుకున్నావా..?" అని అడిగాడు ఆఫీసర్.
"నో సర్! అక్కడ ఉన్న వ్యక్తి ఈ ప్రయోగం కోసం 20 ఏళ్లు శ్రమ పడ్డాము అని చెప్పడం విన్నాను నా దగ్గర ఉన్న ఫైల్ స్టడీ చేస్తే కానీ ఏమీ తెలియదు.." అని దూరం నుంచి ఇద్దరు తన వైపే చూస్తూ ఉండడం చూసి ఫోన్ కట్ చేసి అక్కడినుంచి ఫాస్ట్ గా వెళ్లి జనాలలో కలిసిపోయాడు ప్రకాష్.
*********
మూడు రోజులు తర్వాత ఉదయం కాలింగ్ బెల్ సౌండ్ అవడంతో "ఎవరో వచ్చారు." అని నిదానంగా లేచి తన కడుపు మీద చెయ్యి పెట్టుకుని "అల్లరి చేయకురా.. మీ డాడీ ఫోన్ కలవలేదని అసలే కంగారుగా ఉంది." అనుకుంటూ డోర్ ఓపెన్ చేసి ఎదురుగా భర్త నిలబడి ఉండడం చూసి
"వాట్ ఏ సర్ప్రైజ్! వస్తున్నారని కాల్ కూడా చేయలేదు పుట్టబోయే బిడ్డని చూడాలి అనిపించిందా..?" అని నవ్వుతూ లోపలికి తీసుకువెళ్లింది ప్రకాష్ భార్య తులసి
డోర్ క్లోజ్ చేస్తూ "సిగ్నల్ లేని ఏరియా కి వెళ్ళాను వచ్చిన తర్వాత లీవ్ పెట్టి వెంటనే ఇంటికి వచ్చేసాను డెలివరీ అయ్యేంతవరకు ఇక్కడే ఉంటాను." అని భార్యని దగ్గర తీసుకుని చెప్పాడు ప్రకాష్.
"మీరు నిజంగా చెబుతున్నారా?" అని సంతోషంగా అడిగింది తులసి.
"ఎస్! నాకు బాగా ఆకలిగా ఉంది." అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి రూమ్ లోకి వెళ్లి బ్యాగ్ లో ఉన్న ఫైల్ ఆ వస్తువుని చూసి జాగ్రత్తగా బీరువాలో పెట్టాడు ప్రకాష్.
సాయంత్రం ఫైల్ చూస్తున్న ప్రకాష్ దగ్గరికి వచ్చి "ఏమండీ ఇంటి ముందు ఏదో కారు ఆగింది చాలామంది ఉన్నారు మన ఇంటి వైపే చూస్తున్నారు." అని చెప్పింది తులసి.
"అవునా?" అని నిదానంగా సోఫాలోంచి లేచి వెళ్లి కార్టెన్ జరిపి చూసి "మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని రూమ్ లోకి వెళ్లి ఫైల్ బ్యాగ్ లో పెట్టి భుజానా వేసుకుని వెనకవైపు డోర్ ఓపెన్ చేసి గ్యారేజ్ లో ఉన్న కార్ స్టార్ట్ చేసి భార్యను సీట్ లో కూర్చోబెట్టి ఇంట్లోకి వెళ్లి గ్యాస్ సిలిండర్ ఆన్ చేసి బయటికి వచ్చి కార్ లో ఫాస్ట్ గా వెళ్ళాడు ప్రకాష్.
డ్రైవింగ్ చేస్తున్న భర్త వైపు చూసి "అసలు ఏం జరుగుతుంది ఎవరు వాళ్లంతా..?" అని కంగారుగా అడిగింది తులసి.
అంతలో కార్ సైడ్ గ్లాస్ లో నుంచి ఇల్లు బ్లాస్ట్ అవ్వడం చూసి వెనకాల కార్ రావడం గమనించి "అన్ని విషయాలు చెబుతాను కాసేపు ప్రశాంతంగా ఉండు." అని ఫాస్ట్గా వెళ్ళాడు ప్రకాష్.
చేజింగ్ చేస్తూ ప్రకాష్ వాళ్లు వెళ్లే కారు మీదకి షూట్ చేస్తూ ఉన్నారు వెనకాల కార్లో వచ్చే మనుషులు.
వాళ్ళని తప్పించుకుని వేరే రూట్ లో ఫాస్ట్ గా వెళ్లి చీకటి పడి ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడుతూ ఉండగా పెయిన్స్ స్టార్ట్ అవ్వడంతో "ఏమండీ చాలా నొప్పిగా ఉంది." అని కడుపు పట్టుకుని బాధపడుతు చెప్పింది తులసి.
అరవకొండ అని బోర్డు కనిపించడంతో ఆ రూట్ లో కారుని తిప్పి భార్య వైపు చూసి "కాస్తా ఓపిక పట్టు గుడి దగ్గర లైట్లు వెలుగుతున్నాయి ఎవరైనా ఉన్నారేమో చూసి వస్తాను." అని హడావిడిగా లోపలికి వెళ్లి గుడి శుభ్రం చేస్తున్న పంతులు గారిని చూసి దగ్గరకు వెళ్లి
"సర్! నా భార్య పురిటి నొప్పులతో బాధపడుతుంది ప్లీజ్ హెల్ప్ మీ!" అని అడిగాడు ప్రకాష్.
ఆ మాట విని ఇంట్లో ఉన్న భార్యని పిలిచి హడావిడిగా కారు దగ్గరికి వెళ్లి తులసిని గుడిలోకి తీసుకువెళ్లారు ముగ్గురు.
ప్రకాష్ దగ్గరికి వచ్చి మెడ మీద వెన్ను మీద గాయాలు అయ్యి రక్తం కారడం చూసి "బాబు! నా పేరు నారాయణ రావు ఈ గుడి అర్చకుడిని, మీరు ఏదో ప్రమాదంలో ఉన్నట్టు ఉన్నారు?" అని అడిగాడు నారాయణ రావు.
"అవును సర్! సమయానికి దేవుడిలాగా కనిపించారు." అని భుజాన ఉన్న బ్యాగ్ ఓపెన్ చేసి ఆ వస్తువుని హుండీలో వేసి ఫైల్ చేత్తో పట్టుకుని అక్కడ స్తంభానికి అనుకుని కింద కూర్చుని ప్రాణాలు వదిలాడు ప్రకాష్.
అక్కడికి వచ్చి "ఏవండీ ఆ అమ్మాయి పరిస్థితి ఏమి బాలేదు." అని చెప్పింది నారాయణ రావు భార్య.
ఆ మాట విని గర్భగుడిలోకి వెళ్లి స్వామి పాదాల దగ్గర ఉన్న తీర్థంలో తీసుకువచ్చి తులసికి పట్టించి ప్రకాష్ కి ఇస్తూ "తీసుకో బాబు అంత మంచే జరుగుతుంది." అని చనిపోయి ఉండడం చూసి బాధపడుతూ ఉన్నాడు నారాయణ రావు
అక్కడకి వచ్చి "ఏమండి దేవుడి దయవల్ల పండంటి బాబు పుట్టాడు, కానీ ఆ అమ్మాయి దక్కలేదు." అని బాధగా చెప్పింది నారాయణ రావు భార్య.
పుట్టిన బిడ్డని చేతుల్లోకి తీసుకొని "దైవ సన్నిధిలో భూమి మీదకి వచ్చినందుకు సంతోషపడాలో పుట్టగానే తల్లిదండ్రులని కోల్పోయినందుకు బాధపడాలో అర్థం కావడం లేదు." అని ఆ బిడ్డ గుండెల మీద 'గద' ఆకారంలో ఉన్న పుట్టుమచ్చని చూసి "యోధుడు పుట్టాడు వీడి పేరు యోధ!" అని చేతిలో ఉన్న బాబుని స్వామివారి పాదాల దగ్గర ఉంచాడు నారాయణ రావు.
![[Image: cover?pratilipiId=6755373547155350&versi...7bb9f10118]](https://static-assets.pratilipi.com/pratilipi/cover?pratilipiId=6755373547155350&version=4de13340-68c3-43ef-9e09-ff7bb9f10118)
Posts: 1,123
Threads: 1
Likes Received: 696 in 440 posts
Likes Given: 10,582
Joined: Jun 2019
Reputation:
2
24-04-2026, 11:48 AM
(This post was last modified: 24-04-2026, 11:48 AM by Sunny73. Edited 1 time in total. Edited 1 time in total.)
Patriotic Story...
Posts: 78
Threads: 0
Likes Received: 53 in 42 posts
Likes Given: 17
Joined: Nov 2023
Reputation:
0
Super story siva garu
Arambam super ga undhi
Ilage konasgimchandi
Posts: 4,723
Threads: 9
Likes Received: 3,070 in 2,377 posts
Likes Given: 11,053
Joined: Sep 2019
Reputation:
31
Posts: 2,154
Threads: 4
Likes Received: 3,283 in 1,511 posts
Likes Given: 4,593
Joined: Nov 2018
Reputation:
72
బావుంది బ్రో, పేట్రియాటిజం తో మొదలెట్టి దైవాన్ని కలిపారు...యోధుడు ఏం చేస్తాడో చూడాలి
: :ఉదయ్
Posts: 78
Threads: 0
Likes Received: 53 in 42 posts
Likes Given: 17
Joined: Nov 2023
Reputation:
0
ఈ కథ దైవిక శక్తులు ఉంటాయని అనుకుంటాను
Posts: 701
Threads: 11
Likes Received: 5,607 in 647 posts
Likes Given: 1,375
Joined: Aug 2024
Reputation:
489
రుద్రం భజే! ఎపిసోడ్ - 2
ప్రకాష్, తులసి చనిపోవడంతో భార్య చేతిలో ఉన్న బిడ్డని తీసుకుని గుండెల మీద గద ఆకారంలో ఉన్న పుట్టుమచ్చని చూసి యోధుడు పుట్టాడు వీడి పేరు యోధ అని స్వామివారి పాదాల ముందు ఉంచాడు నారాయణ రావు.
**************
ఉదయం విషయం తెలుసుకుని గుడి దగ్గరికి ఊరు జనాలు చేరుకోవడంతో ఆ గ్రామ పెద్దయిన భూపతి వర్మ సెక్యూరిటీ ఆఫీసర్లకు కబురు పంపించాడు.
అక్కడికి వచ్చిన ఎస్ఐ చనిపోయిన ప్రకాష్ దగ్గరికి వెళ్లి చూసి బాడీ మీద బుల్లెట్ మార్క్ కనిపించడంతో నారాయణ రావు గారి దగ్గర జరిగిన విషయం తెలుసుకొని
ప్రకాష్ చేతిలో ఉన్న ఫైల్ తీసుకుని చూస్తూ కార్ దగ్గరికి వెళ్లి లోపల డైరీ కనిపించడంతో తీసి చూస్తూ 'నెంబర్లు అన్నీ చాలా వింతగా ఉన్నాయి.' అనుకుని పేజీలు తిప్పుతూ "నాయక్ సార్ ఢిల్లీ అని ఒక నెంబర్ ఉంది ఆయనకి ఫోన్ చేస్తే అసలు వీళ్ళు ఎవరో తెలుస్తుంది." అని చెప్పాడు ఎస్ఐ.
"ఎస్సై గారు మా ఇంటి దగ్గర ఫోన్ ఉంది ఇక్కడికి దగ్గరే వెళ్ళండి." అని చెప్పాడు భూపతి వర్మ.
"సరే!" అని అక్కడ ఉన్న జనాలు వైపు చూసి "బాడీలను ఎవరు ముట్టుకోకండి కారు దగ్గర కూడా ఎవరు వెళ్ళకండి." అని చెప్పి భూపతి వర్మ ఇంటికి వెళ్లి డైరీలో ఉన్న నెంబర్ కి కాల్ చేశాడు ఎస్ఐ.
కాసేపటికి లిఫ్ట్ చేసి "నాయక్ స్పీకింగ్!" అని చెప్పాడు
"సార్! నేను ఆంధ్రప్రదేశ్ అరవకొండ ఎస్ఐని మాట్లాడుతున్నాను ఇక్కడ ఒక ఫ్యామిలీ చనిపోయారు ఆయన డైరీలో మీ నెంబర్ దొరికింది అందుకే కాల్ చేశాను." అని చెప్పాడు ఎస్ఐ.
"నా నెంబర్ ఉందా?" అని కాసేపు ఆలోచించి "ఇది ఇండియన్ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ నా పేరు కమల్ నాయక్ ఆ చనిపోయిన వ్యక్తి దగ్గర ఇంకా ఏమైనా దొరికాయా?" అని అడిగాడు.
" జైహింద్ సర్! అతని దగ్గర ఒక ఫైల్ దొరికింది లాంగ్వేజ్ చాలా డిఫరెంట్ గా ఉంది చూస్తుంటే చైనీస్ అనిపిస్తుంది." అని చెప్పాడు ఎస్ఐ.
ఆ మాట విని "అతని పేరు ప్రకాష్ ఇండియన్ సోల్జర్! నేను వెంటనే బయలుదేరుతున్నాను ఆ ఫైల్ చాలా జాగ్రత్తగా ఉంచండి. కేస్ ఫైల్ చేయకండి మీ పై ఆఫీసర్ తో నేను మాట్లాడుతాను." అని చెప్పాడు నాయక్.
"ఓకే సార్ జైహింద్!" అని ఫోన్ పెట్టేసి హడావిడిగా గుడి దగ్గరికి వచ్చి "భూపతివర్మ గారు! చనిపోయిన వ్యక్తి పేరు ప్రకాష్ సోల్జర్ అంట! ఢిల్లీ నుంచి మిలటరీ వాళ్ళు వస్తున్నారు." అని కానిస్టేబుల్స్ ని పిలిచి "చుట్టుపక్కల మొత్తం వెతకండి అనుమానంగా ఎవరైనా కనబడితే అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకురండి." అని చెప్పాడు ఎస్ఐ.
ఆ మాట విని చనిపోయిన ప్రకాష్ వైపు చూస్తూ "జవాన్లు దేశం కోసమే చనిపోతారు ఈ మనిషి కూడా కచ్చితంగా దేశం కోసం ఈ ప్రాణం వదిలి ఉంటాడు, అందుకే భగవంతుడు ఆ బిడ్డని అనాధ అవ్వకుండా దైవ సన్నిధికి రప్పించుకున్నాడు." అని చెప్పాడు నారాయణ రావు.
"ఎస్ఐ గారు మిలటరీ వాళ్ళు వస్తున్నారు సరే మరి అ పసిబిడ్డ పరిస్థితి ఏంటి?" అని అడిగాడు భూపతి వర్మ.
"సార్! ఈ కేస్ ఇప్పుడు మన కంట్రోల్ కాదు మిలట్రీ కంట్రోల్ మనం ఏ డెసిషన్ తీసుకోకూడదు వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయడమే అప్పటివరకు నారాయణ రావు గారి దగ్గరే ఉండనివ్వండి." అని చెప్పాడు ఎస్సై.
కాసేపటికి గుడి దగ్గరకి వచ్చి ఎస్ఐకి సెల్యూట్ చేసి "సార్! ఇక్కడికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఒక కారు లోయలో పడిపోయింది దాంట్లో ఆరుగురు చనిపోయారు వాళ్ల దగ్గర గన్స్ కూడా ఉన్నాయి." అని చెప్పాడు కానిస్టేబుల్.
"ఓ మై గాడ్! అయితే వాళ్లే ఈ ఫ్యామిలీ ని అటాక్ చేసి ఉంటారు." అని కానిస్టేబుల్ తో పాటు వెళ్ళాడు ఎస్ఐ.
************
రెండు రోజుల తర్వాత మిలిటరీ ఆఫీసర్స్ తో పాటు అక్కడికి వచ్చి హాస్పిటల్లో ఉన్న ప్రకాష్, తులసి బాడీలను చనిపోయిన ఆరుగురుని వాళ్ళ దగ్గర దొరికిన గన్స్ చూసి ఎస్సై దగ్గర ఉన్న ఫైల్ తీసుకుని చూస్తూ "ఇంకా ఏమీ దొరకలేదా?" అని అడిగాడు నాయక్.
"నో సార్! ఆయన దగ్గర ఈ ఫైల్ మాత్రమే ఉంది కార్లో ఈ డైరీ దొరికింది." అని గుడి దగ్గరికి తీసుకు వెళ్ళాడు ఎస్ఐ.
అక్కడ ఉన్న కారుని చూసి "సోల్జర్స్ మొత్తం చెక్ చేయండి." అని చెప్పి నారాయణ రావు దగ్గరకు వెళ్లి నమస్కారం చేసి "పంతులుగారు ఆ వ్యక్తి చనిపోయేటప్పుడు మీతో ఏమైనా చెప్పాడా?" అని అడిగాడు నాయక్.
"ఏమి చెప్పలేదు బాబు! ఆయన భార్య ప్రసవవేదనతో ఉంది ఆ బాధలో ఉన్నారు, ఆయనకి కూడా గాయాలయ్యాయి హాస్పిటల్ కి తీసుకువెళదామంటే అర్ధరాత్రి అయిపోయింది ఎవరినైనా పిలుద్దాము అనుకునే లోపు ఇద్దరు చనిపోయారు." అని చెప్పాడు నారాయణ రావు.
ఆ మాట విని చేతిలో ఉన్న బిడ్డని చూసి "ఆ వస్తువు ఎక్కడ పెట్టాడు.' అని మనసులో అనుకుని "ఆ బిడ్డని మా ఆఫీసర్స్ కి ఇవ్వండి మిలిటరీ హౌస్ కి పంపిస్తాను అక్కడ పెరుగుతాడు." అని చెప్పాడు నాయక్.
"అయ్యా! మీకు అభ్యంతరం లేకపోతే ఈ బాబుని మేము పెంచుకుంటాము ఆ భగవంతుడు మాకు ప్రసాదించాడు అనుకుంటాము." అని చెప్పింది నారాయణ రావు భార్య అన్నపూర్ణ.
ఆ మాట విని 'దేశం కోసం ప్రాణాలు వదిలాడు తన బిడ్డ అనాధగా పెరగకూడదు.' అని మనసులో అనుకుని "సంతోషంగా పెంచుకోండి ఎటువంటి అభ్యంతరం లేదు మా ఆఫీసర్స్ ఒక అప్లికేషన్ ఇస్తారు దాని మీద సంతకం పెట్టండి." అని చెప్పాడు నాయక్.
అక్కడికి వచ్చి "సార్! బాడీస్ పోస్టుమార్టం కంప్లీట్ అయింది." అని చెప్పాడు ఎస్ఐ.
"ఆ ఆరుగురుని ఒక గొయ్యి తీసిపాతి పెట్టండి. ఆ ఇద్దరికి మిలటరీ గౌరవంతో దహన సంస్కారాలు జరుగుతాయి." అని చెప్పి తనతో పాటు వచ్చిన ఆఫీసర్స్ ని పిలిచి ప్రకాష్ దగ్గర ఫైల్ తో పాటు ఒక వస్తువు ఉండాలి అది ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు.
దానిని ఎక్కడో ఒక చోట సేఫ్ గా పెట్టి ఉంటాడు బ్లాస్టింగ్ తన ఇంటిని కారులో ప్రతి అంగుళం వెతకండి ఏదైనా వింతగా కనిపిస్తే హ్యాండ్ ఓవర్ చేసుకోండి." అని చెప్పాడు నాయక్.
"ఓకే సార్!" అని సెల్యూట్ చేసి అక్కడి నుంచి వెళ్లారు ఆఫీసర్స్.
రెండు రోజుల తర్వాత గెస్ట్ హౌస్ లో ఉన్న నాయక్ దగ్గరికి వచ్చి "సార్! ఎక్కడ ఏమి దొరకలేదు." అని చెప్పారు ఆఫీసర్స్.
"ఓకే ఇట్స్ ఆల్ రైట్! కచ్చితంగా ప్రకాష్ దానిని వాళ్లకి దక్కనివ్వడు అది మన చేతికి అందే విధంగా ఎక్కడో ఒకచోట ఉంచుతాడు తప్పకుండా ఎప్పటికైనా దొరుకుతుంది." అని చెప్పి అక్కడి నుంచి గుడికి వెళ్లి
"నారాయణ రావు గారు ఇది నా నెంబర్ ఏ అవసరమైన సరే కాల్ చేయండి ఒక సోల్జర్ కొడుకుని సోల్జర్ లాగే పెంచండి. బాబుకి ఏం పేరు పెడుతున్నారు?" అని అడిగాడు నాయక్.
"బాబు పేరు యోధ సార్ ఒక యోధుడిలానే పెరుగుతాడు పెంచుతాను." అని చెప్పాడు నారాయణ రావు.
ఆ మాటకి నమస్కారం చేసి చిన్నగా నవి అక్కడినుంచి తన స్టాప్ తో కలిసి వెళ్లిపోయాడు నాయక్.
*************
మూడు నెలలు తర్వాత హనుమజ్జయంతి ఉత్సవాలు ప్రారంభం అవడంతో ధర్మ డిబ్బి తెరిచి లోపల ఉన్న డబ్బులు లెక్కపెడుతూ ప్రకాష్ వేసిన వస్తువుని కనిపించడంతో చేతిలోకి తీసుకుని చూస్తూ
"చాలా విచిత్రంగా ఉంది అసలు ఏంటిది బంగారం లాగా కూడా లేదు స్వామివారికి అర్పించాలి అనుకుంటే చేతికి ఇవ్వాలి కానీ దీంట్లో వేశారు ఎందుకో!" అనుకుని శుభ్రంగా కడిగి సింధూరం పూసి స్వామి వారి పాదాల దగ్గర పెట్టి "అమ్మ గౌరీ" యోధని ఇక్కడికి తీసుకురా పూజ మొదలుపెడదాము. " అని పిలిచాడు నారాయణ రావు.
"సరే నాన్నగారు!" అని యోధ అని ఎత్తుకుని నిదానంగా నడుచుకుంటూ వచ్చి స్వామివారి ముందు కూర్చుంది నారాయణ రావు కూతురు గౌరీ.
"అన్నపూర్ణ! ప్రసాదాలు అయితే తీసుకురా స్వామి వారికి నైవేద్యం పెడదాము, భక్తులు వచ్చే సమయం అయింది." అని చెప్పాడు నారాయణ రావు.
"కాస్త టైం పడుతుంది మన యోధ వచ్చిన తర్వాత మొదటి హనుమాన్ జయంతి కదా నాలుగు ప్రసాదాలు ఎక్కువ చేస్తున్నాను కాసేపు ఉండండి." అని చెప్పింది అన్నపూర్ణ.
ఆ మాట విని ఏమిటో బిడ్డ కోసం భగవంతుడిని కూడా వేచి ఉండమంటుంది. " అని నవ్వుకున్నాడు నారాయణ రావు
**************
బీజింగ్ ఒక ల్యాబ్ లో తలకి కట్టు కట్టుకుని కూర్చున్న వ్యక్తి వైపు చూసి "మిస్టర్ జింగ్! మనం ఆ వస్తువుని వెతకడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టామో ఈ ప్రయోగం కోసం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేసామో తెలుసు కదా మీరు అంత నిర్లక్ష్యంగా ఉంటారు అనుకోలేదు." అని సీరియస్ గా చెప్పాడు మిలటరీ ఆఫీసర్.
"జనరల్! ఐ యాం ఎక్స్ట్రీమ్లీ సారి ఆ టైం కి అక్కడికి వాళ్ళు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు ముగ్గురిలో ఇద్దరు చనిపోయారు ఒకడు ఆ వస్తువుని తీసుకుని పారిపోయాడు ఇండియాలో ఉన్న మనవాళ్లు అతని కోసం వెతుకుతున్నారు." అని చెప్పాడు జింగ్.
"నో! వాళ్లు కూడా యాక్సిడెంట్ లో చనిపోయారు ఆ వస్తువుని తీసుకెళ్లిన వ్యక్తి ఏమైపోయాడో తెలియదు, ఆల్రెడీ మిషన్ లో పెట్టి ఆక్టివేట్ అయింది కదా ప్రయోగం కంటిన్యూ చేయడం కుదరదా..?" అని అడిగాడు ఆఫీసర్.
"నో సార్! పూర్తిగా ఆక్టివేట్ అవ్వలేదు కచ్చితంగా ఆ వస్తువు ఉండవలసిందే!" అని చెప్పాడు జంగ్.
"ఈ ప్రయోగం కోసం పాకిస్తాన్ ప్లేస్ ని వాడుకుంటున్నామని వాళ్ళకి కొన్ని కోట్ల రూపాయలు ఫండింగ్ చేసాము ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ఫైల్ మొత్తం తయారుచేసి నాకు త్రీ మంత్స్ లో హ్యాండ్ ఓవర్ చేయండి.
అలాంటి వస్తువు మరొకటి ఉంది అని తెలిసింది దానికోసం వెతకడం ప్రారంభించండి. ఇండియా వెళ్లిపోయిన ఆ వస్తువు కోసం అక్కడ ఉన్న మన వాళ్ళతో కుడా మాట్లాడతను." అని చెప్పాడు ఆఫీసర్.
"ఓకే సార్!" అని అక్కడి నుంచి వెళ్ళాడు జింగ్....
Posts: 1,374
Threads: 2
Likes Received: 789 in 592 posts
Likes Given: 1,704
Joined: May 2019
Reputation:
10
Wow.. sooper ga undi story.
A completely different storyline. Idi thriller genre aa?
Posts: 4,723
Threads: 9
Likes Received: 3,070 in 2,377 posts
Likes Given: 11,053
Joined: Sep 2019
Reputation:
31
Posts: 1,123
Threads: 1
Likes Received: 696 in 440 posts
Likes Given: 10,582
Joined: Jun 2019
Reputation:
2
Posts: 701
Threads: 11
Likes Received: 5,607 in 647 posts
Likes Given: 1,375
Joined: Aug 2024
Reputation:
489
రుద్రం భజే! ఎపిసోడ్ - 3
మిలిటరీ హెడ్ కోటర్స్ నుంచి అరవకొండ వచ్చి చనిపోయిన ప్రకాష్ కి దహన సంస్కారం చేసి నీలకంఠ రావు భార్య అడగడంతో యోధ ని పెంచుకోవడానికి అప్లికేషన్ మీద సంతకం తీసుకుని ఒప్పుకున్నాడు నాయక్.
బీజింగ్ లో ప్రకాష్ చేతీలో దెబ్బలు తిన్న జింగ్ తో మాట్లాడుతూ మిస్ అయిన వస్తువు కోసం ఇండియాలో మనవాళ్లు వెతుకుతారు అలాంటిది మరొక వస్తువు ఉంది అని తెలిసింది అది దొరికిన చోట మళ్లీ వెతకడం ప్రారంభించండి అని చెప్పాడు ఆఫీసర్.
*******************
25 సంవత్సరాల తర్వాత ఇండియన్ హై కమిషనర్ ఆఫీస్ ముందు కార్ దిగి ఫైల్స్ తీసుకుని హడావుడిగా లోపలికి వెళుతూ అక్కడ వెయిట్ చేస్తున్న తన కూతురు వైపు చూసి "దీప్తి లెట్స్ గో ఈ రోజు మీటింగ్ లో నువ్వు కూడా జాయిన్ అవుతున్నావు." అని చెప్పాడు నాయక్.
"డాడ్! నేను ఒక ఇస్రో సైంటిస్ట్ ని మిలిటరీ ఆఫీసర్స్ మీటింగ్ కి నన్నెందుకు పిలిచారు? నాతో అవసరం ఏముంది?" అని డౌట్ గా అడిగింది దీప్తి.
ఆ మాటకి సీరియస్ గా చూస్తూ "ఇప్పుడే చెప్పాలా? మీటింగ్ హాల్లో తెలుసుకుంటావా..?" అని అడిగాడు నాయక్.
"సారీ!" అని చెప్పి వెనకాలే మీటింగ్ హాల్లో కి వెళ్లి డిఫెన్స్ మినిస్టర్, త్రివిధ దళాధిపతులతో పాటు మరి కొంతమంది హైయర్ అఫీషియల్ ఆఫీసర్స్ ఉండడం చూసి సైలెంట్ గా వెళ్లి అక్కడ ఉన్న సీట్ లో కూర్చుంది దీప్తి.
"మిస్టర్ నాయక్! మీరు ప్రైమ్ మినిస్టర్ గారితో చెప్పిన దానినిబట్టి అవసరమైన వాళ్ళందరినీ ఈ మీటింగ్ కి పిలిపించాము మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ అందరకి అర్థమయ్యేటట్టు క్లియర్ గా చెప్పండి." అని చెప్పాడు డిఫెన్స్ మినిస్టర్.
"ఓకే సార్!" అని అక్కడ ఉన్న వారికి వైపు చూసి "నేను చెప్పే విషయాలు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి నేను చెప్పడం పూర్తయిన తర్వాత మీ డౌట్స్ అడగండి." అని చెప్పి
"రెండు నెలల క్రితం లడక్ బోర్డర్ లో కారకొరం పర్వతాల దగ్గర ఆర్మీ బేస్ క్యాంప్స్ ఉన్నట్టు శాటిలైట్ లో కనిపించడం తో అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఏజెంట్స్ వెళ్లారు.
అక్కడ చైనా, పాకిస్తాన్ సోల్జర్స్ కొంతమందితో కలిసి టిబెట్ ని ఆనుకుని ఉన్న హిమాలయాల దగ్గరికి వెళ్లి పోస్ట్ లు ఏర్పరచుకుని మారి మిషనరీ సహాయంతో ఆ ప్లేస్ మొత్తం వెతుకుతున్నారు.
మాకు తెలిసిన విషయం ఏమిటంటే ఆ ఏరియాలో వెతకడం స్టార్ట్ చేసి చాలా సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు వెతకడానికి ఉపయోగించే మిషన్ ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు ఈ మిషన్ రేడియేషన్ ప్రభావన్ని కనిపెట్టడానికి వాడతారు." అని చెప్పాడు నాయక్.
"వాట్! హిమాలయాలలో రేడియేషన్ క్యాచ్ చేసే మిషన్స్ తో వెతకడం ఏమిటి? అసలు అక్కడ ఏముంటుంది?" అని డౌట్ గా అడిగాడు ఒక ఆఫీసర్.
"ప్లీజ్! నేను ముందే చెప్పాను చెప్పాల్సింది మొత్తం చెప్పిన తర్వాత మీ డౌట్స్ అడగమని!" అని చెప్పాడు నాయక్.
"సారీ! ప్లీజ్ కంటిన్యూ!" అని చెప్పాడు ఆఫీసర్.
"అక్కడి నుంచి వస్తున్న మన ఆఫీసర్స్ కి మంచులో ఒక మినీ కెమెరా దొరికింది అది చాలా సంవత్సరాలుగా మంచులో ఉండిపోవడం వల్ల మనవాళ్లు రెండు నెలలు కష్టపడి దాంట్లో ఉన్న కొన్ని ఫోటోలు మాత్రం బయటకు తీయగలిగారు ఇవి 25 సంవత్సరాల క్రితం తీసిన ఫొటోస్ అని తేల్చారు.
అసలు విషయం ఏమిటంటే ఈ కెమెరా మన ఇండియన్ ఆర్మీకి చెందిన ఒక ఏజెంట్ ది 25 సంవత్సరాల క్రితం అక్కడ ఒక ప్రయోగం జరుగుతుంది అని తెలిసి నా టీం మెంబెర్స్ ముగ్గురు వెళ్లారు.
వాళ్లలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు నాకు తెలిసి వాళ్ళు తీసిన ఫోటోలే ఇవి, ఈ ఫోటో చూడండి చాలా విచిత్రంగా ఉంది ఒక మిషన్లో చిన్న వస్తువుని పెట్టి దాని ద్వారా సిగ్నల్స్ ని భూమి లోకి, ఆకాశంలోకి పంపుతున్న మెరుపు మనం చూస్తున్నాము అసలు ఈ ప్రయోగం ఎందుకు చేస్తున్నారు అనేది అర్థం కాలేదు.
అప్పుడు ఈ ప్రయోగం జరగకపోవడానికి కారణం మన ఏజెంట్స్ అక్కడ నుంచి బతికి బయటపడ్డ ఒక ఏజెంట్ నాకు కాల్ చేసి అక్కడ ఒక ప్రయోగం జరుగుతుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్న ఫైల్ ని ప్రయోగం చేస్తున్న మిషన్లో ఉన్న ఒక వస్తువుని నేను తీసుకు వచ్చేసాను అని చెప్పాడు.
కానీ అతను ఇప్పుడు ప్రాణాలతో లేడు ఫైల్ అయ్యితే మన హ్యాండ్ ఓవర్ అయింది కానీ ఆ వస్తువు ఎక్కడ దాచి పెట్టాడో ఇప్పటికి తెలుసుకోలేకయము.
25 సంవత్సరాల తర్వాత మళ్లీ ఆ రెండు దేశాలు ఇటువంటి ప్రయోగం చేయడానికి రెడీ అవుతున్నాయని అర్థమైంది. ఎందుకంటే మనం ఈ ఫోటోలో చూస్తున్న వస్తువు కోసమే వాళ్ళ హిమాలయాలలో వెతుకుతున్నారు ఇలాంటిది ఒక వస్తువు మన ఏజెంట్ ద్వారా ఇండియాలోకి ఒకటి వచ్చింది దానికోసం కూడా వెతకడం ప్రారంభించారు.
ఆ పనిని మహమ్మద్ మీర్జా కి అప్పచెప్పారు అతని గ్యాంగ్ లో ఒక వ్యక్తి దగ్గర మనకి ఇలాంటి వస్తువు ఫోటో దొరికింది కానీ అతను నుంచి ఎటువంటి డీటెయిల్స్ రాబట్టలేకపోయాము.
అసలు ఈ వస్తువు ఏంటి వాళ్ళు దాంతో ఎటువంటి ప్రయోగం చేయడానికి రెడీ అవుతున్నారు అనేది అర్థం కాలేదు ఇప్పుడు మీరు ఏదైనా అడగాలనుకుంటే అడగండి. " అని చెప్పాడు నాయక్.
"సార్! మే ఐ!" అని చెయ్యి పైకి ఎత్తింది దీప్తి.
అది చూసి "ప్లీజ్ చెప్పండి." అని అడిగాడు నాయక్.
"సార్! మీరు చూపించిన ఫోటోలో చూసిన దాన్నిబట్టి ఆ మిషన్ లో ఉన్న వస్తువుకి వాళ్లు పవర్ జనరేట్ చేస్తున్నారు దానివల్ల ఒక రేడియేషన్ క్రియేట్ అయ్యి సిగ్నల్ ఆకాశంలోకి భూమిలోకి వెళుతుంది.
దానివల్ల ఏర్పడే అయస్కాంత శక్తి తో అక్కడ బ్లాక్ హోల్ ఏర్పడే ఛాన్స్ ఉంది. మీకు దొరికిన ఫైల్ ఇస్తే నేను స్టడీ చేసి దీని గురించి ఇంకా వివరాలు చెబుతాను." అని చెప్పింది దీప్తి.
"గుడ్! ఇంకా ఎవరైనా దీని గురించి మాట్లాడతారా..?" అని అడిగాడు నాయక్.
"సార్! మై నేమ్ రఘు ఆర్కియాలజిస్ట్! ఫస్ట్ ఈ మీటింగ్ నన్ను ఎందుకు పిలిచారు అనుకున్నాను కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి ఆ ఫోటోలో చూసినా దాని బట్టి నాకు ఒకటి అర్థమైంది. ఇది వినడానికి మీకు కొంచెం ఫులిష్ గా ఉండొచ్చు కానీ ఇది నిజం
వాళ్ళు వెతికే ప్లేస్ కైలాస పర్వతం దగ్గర నుంచి మానస సరోవరం వరకు ఉంది అక్కడ పరమశివుడు కొలువై ఉంటాడని అంటారు ఆ ప్లేస్ నుంచి వేరే లోకాలకు కూడా దారి ఉంది అని చెబుతారు.
నా ఐడియా కరెక్ట్ అయితే ఆ వస్తువు కచ్చితంగా చాలా పురాతనమైనది వాళ్లకి అక్కడే దొరికి ఉంటుంది దాంతో వాళ్లు వేరే లోకాల తలుపులు తెరవడానికి ప్రయత్నిస్తున్నారు అనుకుంటున్నాను
ఇప్పుడు బ్లాక్ హోల్ అంటున్నారు కానీ పురాణాలలో దాని గురించి ఎప్పుడో ఉంది. ఒక లోకం నుంచి ఒక లోకానికి ప్రయాణం ఈజీగా చేసేవారు అలాంటి ప్రయాణానికి మార్గం చూపే వస్తువు ఆదే అయ్యి ఉండొచ్చు ఆ వస్తువు మిస్ అయింది కాబట్టి అలాంటి దానికోసం మళ్లీ వెతుకుతున్నారు అనుకుంటున్నాను." అని చెప్పాడు రఘు.
"గుడ్ థింకింగ్! దీంట్లో మీ ఇద్దరి వాదనలు కొట్టి పారాయలేము ఎందుకంటే వాళ్లు ఆ వస్తువు కోసం వెతుకుతున్న ఏరియా అటువంటిది.
ఫస్ట్ ఇండియాలోకి వచ్చిన వస్తువు ఎక్కడ ఉందో మనం తెలుసుకోవాలి నెక్స్ట్ అసలు ప్రయోగం ఏమిటో కనిపెట్టాలి ఇప్పటివరకు ప్రకాష్ దగ్గర ఉన్న వస్తువు ఎలా ఉంటుందో మనకి తెలియదు కానీ ఇప్పుడు దాని ఫోటో మన దగ్గర ఉంది." అని చెప్పాడు నాయక్.
"సర్! మై నేమ్ ఇస్ రీతు ఇంటెలిజెన్స్, చనిపోయిన మన ఏజెంట్ మీకు ఎక్కడ కనిపించడో కచ్చితంగా ఆ ఏరియా లోనే ఆ వస్తువుని దాచిపెట్టి ఉంటాడు." అని చెప్పింది.
"అరవకొండ అనే ఏరియాలో ఏజెంట్ డెడ్ బాడీ మాకు ఒక గుడిలో దొరికింది లక్ ఏమిటంటే ఆయనను చంపడానికి చూసిన ఆరుగురు యాక్సిడెంట్లో చనిపోయారు.
చనిపోయిన ఏజెంట్ దగ్గరే ఫైల్ ఉంది కాబట్టి ఆ వస్తువు కూడా కచ్చితంగా ఆ ఏరియా లోనే ఉంటుంది అనుకుని బ్లాస్ట్ అయిన తన ఇంటి దగ్గర నుంచి చనిపోయిన ప్లేస్ వరకు మొత్తం వెతికాము కానీ కనిపెట్టలేకపోయాము." అని చెప్పాడు నాయక్.
"సర్! నాకు తెలిసి అది ఆ ఏరియాలోనే ఎక్కడో ఉండి ఉంటుంది ఇప్పుడు ఎలా ఉంటుందో మనకి తెలిసింది కాబట్టి దానిని వెతకడం ఈజీ అవుతుంది." అని చెప్పింది దీప్తి.
"మిస్టర్ నాయక్! మీరు ఒక టీమ్ ని ఫామ్ చేసి ఆ ఏరియా కి పంపించండి ఎలాగైనా ఆ వస్తువు ఎక్కడ ఉందో మనం కనిపెట్టాలి శత్రుదేశం వాళ్ళు చేసే ప్రయోగం ఏమిటో తెలుసుకోవాలి ఈ మిషన్ చాలా సీక్రెట్ గా జరగాలి." అని చెప్పాడు డిఫెన్స్ మినిస్టర్.
"ఓకే సార్!" అని చెప్పి "ఆ వస్తువు కోసం మీర్జా గ్యాంగ్ కూడా వెతుకుతుంది. మనం ఆ ఏరియాలో వెతుకుతున్నాము అని తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎంటర్ అవుతారు ఒకవేళ అది వాళ్ళకి దొరికి శత్రుదేశం చేతికి వెళ్లితే వాళ్ళు ఏం చేస్తారో కూడా మనకి తెలియదు." అని చెప్పాడు నాయక్.
"సార్! మేము ఒక టీమ్ గా ఫామ్ అయ్యి టూరిస్టులుగా వెళతాము కానీ ఆ ఏరియా మొత్తం తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు మాకు హెల్ప్ గా ఉండాలి." అని చెప్పింది రీతూ.
"చనిపోయిన ఏజెంట్ కొడుకు ఇప్పుడు అక్కడే ఉన్నాడు అతను మీకు తోడుగా ఉంటాడు టీమ్ ఫామ్ చేసుకుని వెళ్లడానికి రెడీ అవ్వండి." అని చెప్పాడు నాయక్.
Posts: 4,723
Threads: 9
Likes Received: 3,070 in 2,377 posts
Likes Given: 11,053
Joined: Sep 2019
Reputation:
31
Posts: 63
Threads: 0
Likes Received: 28 in 26 posts
Likes Given: 13
Joined: Jun 2019
Reputation:
3
Sai garu,
super andi.. you come back another interesting awesome story..
Please continue..
Posts: 701
Threads: 11
Likes Received: 5,607 in 647 posts
Likes Given: 1,375
Joined: Aug 2024
Reputation:
489
Story Ki Taggattu Evaruina Images Pettandi
Posts: 1,374
Threads: 2
Likes Received: 789 in 592 posts
Likes Given: 1,704
Joined: May 2019
Reputation:
10
Super natural thriller.. wow!!
భగవంతునికి సంబంధించిన story.. good story point.
Initial ga.. ఎప్పుడో 60s, 70s లో USA హిమాలయాల్లో ఒక radioactive generator ని మంచులో కోల్పోయింది.
మన army తో కలిసి చాలా వెతికించారు.. still not found.
దానికి సంబందించినది అనుకున్నా
Posts: 177
Threads: 2
Likes Received: 170 in 90 posts
Likes Given: 429
Joined: Jun 2019
Reputation:
4
Posts: 1,123
Threads: 1
Likes Received: 696 in 440 posts
Likes Given: 10,582
Joined: Jun 2019
Reputation:
2
Posts: 74
Threads: 0
Likes Received: 27 in 22 posts
Likes Given: 4
Joined: Apr 2021
Reputation:
0
Posts: 701
Threads: 11
Likes Received: 5,607 in 647 posts
Likes Given: 1,375
Joined: Aug 2024
Reputation:
489
రుద్రం భజే! ఎపిసోడ్ 4
మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత నీతూ వాళ్ళ వైపు చూసి టీమ్ ఫామ్ చేసుకుని అరవకొండ వెళ్ళండి చనిపోయిన ఏజెంట్ కొడుకు అక్కడే ఉన్నాడు మీకు హెల్ప్ గా ఉంటాడు అని చెప్పాడు నాయక్.
***************
మూడు రోజులు తర్వాత అరవకొండ చేరుకుని భూపతి వర్మ కి కాల్ చేసింది దీప్తి.
రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకువెళ్లి "మీ నాన్నగారు ఫోన్ చేశారు ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా ఈ ఏరియా చూడటానికి వచ్చారంట కదా! ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడే ఉండి సరదాగా ఎంజాయ్ చేయండి." అని చెప్పాడు భూపతి వర్మ.
"సర్! ఇక్కడ ఆంజనేయస్వామి గుడి ఫేమస్ అని అంకుల్ చెప్పారు ఎక్కడ ఉంది?" అని అడిగింది నీతూ.
"ఈరోజు హనుమత్ జయంతి కదా ఉత్సవాలు జరుగుతున్నాయి మీరు ఫ్రెష్ అవ్వండి తీసుకువెళతాను." అని చెప్పాడు భూపతి వర్మ.
"సరే అంకుల్! 15 మినిట్స్ లో రెడీ అయ్యి వస్తాము." అని చెప్పింది దీప్తి.
భూపతి వర్మ అక్కడి నుంచి వెళ్లడం చూసి "మేడం! ఇక్కడ చనిపోయిన ఏజెంట్ కొడుకు మనకి హెల్ప్ గా ఉంటాడు అన్నారు మారి తనని కలవకుండా వీరిని కలిసాము ఏమిటి?" అని డౌట్ గా అడిగాడు నీతూ అసిస్టెంట్ పుష్కర్.
"ఎస్! అతను ఈ ఏరియా చూపించడానికి హెల్ప్ గా ఉంటాడు మనం దేనికి వచ్చేమో అతనికి కూడా తెలియకూడదు." అని చెప్పింది రీతూ.
"ఈ ఏరియా మొత్తం చాలా బాగుంది ఎప్పటినుంచో ఇలాంటి అడవులు కొండలు వాటర్ ఫాల్స్ ఉన్నా ఏరియాలో స్టే చేయాలి అనుకుంటున్నాను. ఇప్పటికి నా కోరిక తీరింది." అని చెప్పింది దీప్తి కొలీగ్ పూజా.
"మనం వచ్చిన పని అవ్వకపోతే అప్పుడు ఉంటది అసలు మజా!" అని చెప్పాడు నీతూ మరొక అసిస్టెంట్ ఏకవీర.
బ్యాగ్ లో నుంచి మిషన్స్ తీసి ఇచ్చి "మనం బయటికి వెళ్లినప్పుడు ఇవి మన దగ్గర ఉండాలి ఈ మిషన్ రేడియస్ లోకి రేడియేషన్ ఉన్న వస్తువు ఏదైనా ఉంటే వెంటనే సిగ్నల్ ఇస్తుంది." అని చెప్పింది దీప్తి.
"ఓకే!" అని రెడీ అయ్యి మిషన్ కనపడకుండా సీక్రెట్ గా పెట్టుకుని భూపతి వర్మ తో పాటు గుడి దగ్గరికి బయలుదేరారు అందరు
గుడి దగ్గర ప్రసాదాలు పెడుతూ హడావిడిగా ఉన్న నారాయణ రావు దగ్గరికి తీసుకువెళ్లి "రావు గారు! నాయక్ గారు ఫోన్ చేశారని చెప్పాను కదా!" అని దీప్తి ని చూపించి "వాళ్ళ అమ్మాయి తన ఫ్రెండ్స్!" అని పరిచయం చేశాడు భూపతి వర్మ.
"అవునా?" అని దీప్తి వైపు సంతోషంగా చూస్తూ " మీరు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. మీ నాన్నగారు చాలా మంచివారు మాకు చాలా సహాయం చేశారు.
ఈరోజు హనుమజ్ జయంతి కదా ఉత్సవాలు జరుగుతున్నాయి కాసేపట్లో ఊరేగింపు కూడా ప్రారంభమవుతుంది మంచి సమయానికి వచ్చారు." అని ఆకుల్లో పెట్టి ప్రసాదం ఇస్తూ పక్కనే ఉన్న అమ్మాయిని చూపించి "నా కూతురు గౌరీ!" అని పరిచయం చేశాడు నారాయణ రావు.
గౌరీ వైపు చూస్తూ "నీ శారీ సూపర్ గా ఉంది." అని చెప్పింది దీప్తి.
" థాంక్యూ! మీ టీ షర్ట్ కూడా చాలా బాగుంది." అని చెప్పింది గౌరీ.
అంతలో అక్కడికి వచ్చి "రావు గారు! ఎమ్మెల్యే గారు ఇంకా రాలేదు ఊరేగింపు మొదలు పెడదామా? కాసేపు ఆపుదామా?" అని అడిగాడు ఒక వ్యక్తి.
"ఎవరి కోసం భగవంతుడి కార్యక్రమం ఆగదు మొదలు పెట్టండి." అని చెప్పాడు నారాయణ రావు.
ప్రసాదం తింటూ "పులిహార భలే ఉంది. " అని చెప్పాడు పుష్కర్.
ఆ మాట విని నవ్వుతూ "కొంచెం పెడతాను పట్టండి బాబు!" అని చెప్పాడు నారాయణ రావు.
సీరియస్ గా చూస్తున్న నీతూ వైపు చూసి పులిహార పెట్టించుకుని "మీరు కోపంగా చూసినా నేను తినకుండా ఆగలేను." అని చెప్పాడు పుష్కర్.
అంతలో ఊరేగింపు దగ్గర గొడవ జరుగుతున్నట్లు అనిపించి హడావిడిగా వెళ్ళాడు నారాయణ రావు.
"ఎమ్మెల్యే గారు రాకుండా ఊరేగింపు కదలడానికి వీల్లేదు సాయంత్రం అయినా సరే అలా ఉండాల్సిందే!" అని చెప్పాడు అక్కడ ఉన్న ఎమ్మెల్యే మనిషి.
"మీరు పోరుగు ఊరి నుంచి వచ్చారు మా ఊరి కట్టుబాటు మీకు తెలియదు భగవంతుని ఊరేగింపు ఎవరి కోసం ఆగదు." అని చెప్పాడు అక్కడ ఉన్న ఒక వ్యక్తి.
అక్కడికి వచ్చి గొడవ పడుతున్న వ్యక్తిని ఆపి మందు వాసన రావడంతో "బాబు! తాగి ఇక్కడికి రాకూడదు మీరు వెళ్ళండి ఎమ్మెల్యే గారు వస్తే మేము సర్ది చెప్పుకుంటాము." అని ముక్కు మూసుకుంటూ చెప్పాడు నారాయణ రావు.
"ఏంట్రా! నన్ను చూసి ముక్కు మూసుకుంటున్నావు? అయ్యినా ఆ మాట చెప్పడానికి నువ్వు ఎవరు?" అని పొగరుగా అడిగాడు అక్కడ ఉన్న మరొక వ్యక్తి.
"మీరు తాగి ఉన్నారు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి." అని గట్టిగా చెప్పాడు నారాయణ రావు.
"మమ్మల్ని తాగుబోతులు అంటావా..?" అని నారాయణ రావు ని బలంగా ఒక్క తోపు తోసాడు ఆ వ్యక్తి.
బలంగా తోయడంతో కింద పడ్డ నారాయణ రావుని చూసి "యోధ! నాన్నగారి మీద చేయి చేసుకున్నారు కింద పడిపోయారు." అని గట్టిగా అరిచింది గౌరీ.
ఆ అరుపు విని "యోధ అంటే చనిపోయిన ఏజెంట్ కొడుకా?" అని డౌట్ గా అడిగింది నీతూ.
"అతను వచ్చి వీళ్ళని బతిమిలాడతాడేమో!" అని వెటకారంగా అన్నాడు పుష్కర్.
ఆవేశంగా పరిగెత్తుకుంటూ వస్తున్న వ్యక్తిని చూసి "అతనే యోధ అనుకుంటా! చూస్తుంటే బతిమిలాడేటట్లు లేడు ఆ హైట్, ఆ బాడీ ఆ స్ట్రక్చర్ చూడండి." అని కళ్ళు అర్పకుండ చూస్తూ చెప్పింది పూజా.
"హనుమంతుడే పరిగెత్తుకుంటూ వస్తున్నట్లు ఉన్నాడు." అని చూస్తూ చెప్పాడు ఏకవీర.
నారాయణ రావు దగ్గరికి వెళ్లి "నాన్నగారు! మీకు ఏమీ అవలేదు కదా!" అని అడిగి ఎదురుగా ఉన్న వాళ్ళ వైపు కోపంగా చూస్తూ "నాన్న గారి మీద చెయ్యి వేసింది ఎవరు?" అని ఆవేశంగా అడిగాడు యోధ.
"నాన్న యోధ! నా మీద ఎవరు చెయ్యి వేయలేదురా... నువ్వు వెళ్లి స్వామి వారి అలంకరణ చూడు." అని సర్ది చెప్పాడు నారాయణ రావు.
"యోధ! నాన్నగారు అబద్దం చెబుతున్నారు అతనే నాన్న గారి మీద చెయ్యి వేసాడు." అని కోపంగా చూస్తూ చూపించింది గౌరీ.
"అవును యోధ! తాగి వచ్చి ఇక్కడ గొడవ చేయడమే కాకుండా ఊరేగింపు వెళ్ళకుండా రోడ్డుకి అడ్డంగా కారు పెట్టారు అడిగిన అయ్యగారిని తోసేసారు." అని చెప్పాడు అక్కడ ఉన్నా ఒక వ్యక్తి.
అక్కడికి తూలుకుంటూ వస్తూ "అవునురా.. నేనే మీ అయ్యని కొట్టాను ఇప్పుడు ఏంటి? ఎమ్మెల్యే గారు వచ్చే వరకు ఊరేగింపు కదలడానికి వీల్లేదు, దారికి అడ్డుగా ఉన్న మా కారు కూడా తీయము." అని యోధ దగరకి వచ్చి తల ఎత్తి పైకి చూస్తూ చెప్పాడు వాళ్లలో ఒక వ్యక్తి.
"మేడం! వాడు చూడండి యోధ తో మాట్లాడడానికే తల పైకి ఎత్తి చూసి మాట్లాడుతున్నాడు." అని నవ్వుతూ చెప్పాడు పుష్కర్.
"ఎస్!" అని చూస్తూ "దీప్తి యోధ హైట్ 6.5 ఉంటాడా? " అని అడిగింది నీతూ.
"యా.. ఒక అంగుళం ఎక్కువే ఉంటాడు." అని చెప్పింది దీప్తి.
తన ముందు ఉన్న మనిషిని రెండు చేతులతో పట్టుకుని పైకి లేపి గాలిలో గిరగిరా తిప్పి దూరంగా గిరాటు వేసాడు యోధ.
అది చూసి కోపంతో మీదకు వస్తున్న ఒక పది మందిని రెండు చేతులతో అపి వెనక్కి తోసి "ఈరోజు హనుమజ్జయంతి కాబట్టి నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను నాకు కోపం రాకముందే ఇక్కడ నుంచి వెళ్ళిపొండి." అని గంభీరమైన గొంతుతో గట్టిగా అరుస్తూ చెప్పాడు యోధ.
"ఆ బాడీ చూసిన తర్వాత ఇంకా ఎవడైనా ముందుకు వస్తాడా.. ఆంజనేయస్వామి వచ్చి అక్కడ నుంచున్నట్లు ఉంది చేతిలో గద ఒక్కటే లేదు." అని చెప్పింది పూజా.
"మేడం! మనం వెతుకుతున్న వస్తువు ఒకవేళ ఇక్కడే ఉన్నా మీర్జా కాదు కదా వాడి బాబు కూడా వచ్చి తీసుకు వెళ్ళలేడు." అని చెప్పాడు ఏకవీర.
"ఇలాంటి వాడు బోర్డర్ లో ఉండాలి సగం పాకిస్తాన్ ఖాళీ అయిపోతుంది." అని చెప్పింది నీతూ.
ఊరేగింపు వెళ్ళనివ్వకుండా కారుని అడ్డంగా పెట్టి అక్కడ నుంచున్న వాళ్ళని చూసి పరిగెత్తుకుంటూ వెళ్లి పిడి గుద్దులు గుద్దుతూ ఉన్నాడు యోధ.
"ఒరేయ్! దొరికితే చచ్చిపోతాము పారిపోండి." అని అక్కడి నుంచి పరుగెత్తారు ఎమ్మెల్యే మనుషులు.
రోడ్డుకి అడ్డంగా ఉన్న కారుని ఒక వైపు రెండు చేతులతో పట్టుకొని "జై భజరంగబలి!" అని పైకి లేపి పక్కకి పడేసాడు యోధ.
"హే...చూడండి కారుని రెండు చేతులతో లేపి పక్కకి పడేసాడు." అని ఆశ్చర్యంగా చూస్తూ ఫోటోలు తీస్తూ ఉంది దీప్తి.
అంతలో అక్కడకి హడావిడిగా వచ్చి దెబ్బలతో కిందపడి ఉన్నాయి ఎమ్మెల్యే మనుషుల వైపు చూసి "ఒరేయ్! ఈరోజు మీ టైం బాగుంది. యోధ ప్రశాంతంగా ఉన్నాడు తనకి కోపం రాకముందే ఇక్కడ నుంచి వెళ్లిపోండి లేకపోతే మీతో పాటు మీ ఎమ్మెల్యే కూడా తన్నులు తింటాడు." అని చెప్పాడు భూపతి వర్మ.
కారుని రోడ్డు పక్కకి తోసి "ఊరేగింపు మొదలు పెట్టండి జై శ్రీరామ్! జై హనుమాన్!" అని చెప్పాడు యోధ.
అక్కడికి వస్తున్న యోధ వైపు చూసి "ఒరేయ్! నీకు అంత కోపం ఎందుకు రా...!" అని అడిగింది అన్నపూర్ణ.
"అమ్మ! నాన్నగారి మీద వాళ్ల చెయ్యి పడింది. స్వామి వారి ఊరేగింపు కి అడ్డు వచ్చారు అది నాకు నచ్చదు." అని చెప్పి గుడి దగ్గరకి వెళ్ళాడు యోధ.
దీప్తి వాళ్ళ దగ్గరికి వస్తూ "మీరేమీ కంగారు పడకండి అమ్మ! మా యోధ కి కోపం వస్తే అంతే మొండోడు ఎవరి మాట వినడు కానీ మనసు చాలా మంచిది." అని సంతోషంగా చూస్తూ చెప్పాడు నారాయణ రావు.
భూపతి వర్మ వైపు చూసి "యోధ! ఈ గుడి దగ్గరే ఉంటాడా? ఇంకేమీ చేయడా?" అని డౌట్ గా అడిగింది దీప్తి.
ఆ మాటకి నవ్వుతూ "యోధ గుడిలో ఉండడు రెండు నెలల క్రితమే సస్పెండ్ అయ్యి వచ్చాడు." అని చెప్పాడు భూపతి వర్మ.
ఆ మాట విని డౌట్ గా చూస్తూ "సస్పెండ్ అయ్యాడా? ఎక్కడ జాబ్ చేస్తున్నాడు?" అని అడిగింది నీతూ.
"మా తమ్ముడు జాబ్ కాదు డ్యూటీ చేస్తున్నాడు ఇండియన్ మిలిటరీలో బ్లాక్ కాట్ కమాండో, సుపీరియర్స్ ఆర్డర్ ఫాలో చేయకుండా 24 మంది చంపేశాడు అందుకే పనిష్మెంట్ గా ఇంటికి పంపించేశారు." అని చెప్పింది గౌరీ.
తను చెప్పింది విని "ఏంటి? యోధ బ్లాక్ కాట్ కమాండో నా...?" అని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది దీప్తి.
" రుద్రం భజే! ఎపిసోడ్ 4 " రచనకు రేటింగ్ ఇవ్వండి
Posts: 701
Threads: 11
Likes Received: 5,607 in 647 posts
Likes Given: 1,375
Joined: Aug 2024
Reputation:
489
రుద్రం భజే! ఎపిసోడ్ 5
గౌరీ చెప్పింది విని ఏంటి యోధ బ్లాక్ క్యాట్ కమాండో నా అని ఆశ్చర్యంగా అంది దీప్తి.
*************
ఆ మాట విని "బ్లాక్ క్యాట్ కమాండో అంటే అందరు అంత ఆశ్చర్యపోతున్నారు ఎందుకు? అతను కూడా సోల్జర్ ఏ కదా!" అని డౌట్ గా అడిగింది పూజా.
"బ్లాక్ క్యాట్ కమాండో అంటే సోల్జర్ ఏ కానీ వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనైనా శత్రువుతో యుద్ధం చేయగలరు చేతిలో ఆయుధం లేకపోయినా సరే శత్రువుని ఎదుర్కోగలరు." అని చెప్పింది నీతూ.
"ఎటువంటి పరిస్థితుల్లోనైనా అంటే నాకు అర్థం కాలేదు." అని డౌట్ గా చూసింది పూజ.
"ఎయిర్, వాటర్, హీల్స్, ఎర్త్ ఎక్కడైనా సరే ఎనీ వెపన్ యూజ్ చేయగలరు, టెర్రరిస్టులు మీద మెరుపు దాడి చేయడానికి ఇండియన్ మిలటరీ ఈ బ్లాక్ క్యాట్ కమాండో కి ట్రైనింగ్ ఇస్తుంది దాంట్లో సెలెక్ట్ అవ్వడం చాలా కష్టం ట్రైనింగ్ కూడా చాలా హార్డ్ గా ఉంటుంది." అని చెప్పింది నీతూ.
"గ్రేట్!" అని చెప్పింది పూజా.
"అసలు ఈ విషయం డాడ్ మనకెందుకు చెప్పలేదు." అని అనుమానంగా అడిగింది దీప్తి.
"ఈ మిషన్ గురించి యోధ కి తెలియకూడదు అనుకున్నారేమో ఎందుకంటే తన తండ్రి ఈ మిషన్ లోనే చనిపోయాడు దానివల్ల దీనిని పర్సనల్ గా తీసుకుంటాడు పర్సనల్ ఎలిగేషన్స్ మిలిటరీలో పని చేయవు అలాంటి వాళ్ళని దూరంగా ఉంచుతారు." అని చెప్పింది నీతూ.
"అవును! యోధ 24 మందిని చంపేశాడు అని గౌరీ చెప్పింది. అసలు ఎవరిని చంపాడు? ఈ న్యూస్ బయటికి రాలేదు." అని డౌట్ గా అడిగాడు పుష్కర్.
అక్కడకి వచ్చి "పూజ మొదలైంది రండి." అని గౌరీ పిలవడంతో గుడి దగ్గరికి వెళ్లారు అందరు.
అక్కడికి వచ్చిన దీప్తిని చూపిస్తూ "యోధ! నాయక్ గారి అమ్మాయి!" అని చెప్పాడు నారాయణ రావు
"నాకు తెలుసు నాన్నగారు! ఇందాక చూసినప్పుడే గుర్తుపట్టాను మీరు ఇస్రోలో వర్క్ చేస్తున్నారు కదా! మా ఊర్లో ఏదైనా రాకెట్ టెస్ట్ చేయడానికి వచ్చారా..?" అని నవ్వుతూ అడిగాడు యోధ.
ఆ మాటకి నవ్వుతూ "అలాంటిదేమీ కాదు జాబ్ టెన్షన్ తో రిలాక్స్ లేకుండా పోయింది అందుకే మీ ఏరియా బాగుంటుందని డాడ్ చెప్పారు, ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా ఒక వన్ వీక్ ఎంజాయ్ చేద్దామని వచ్చేసాను, అవును నేను మీకు తెలుసా..?" అని డౌట్ గా అడిగింది దీప్తి.
"మీ గురించి నాయక్ సర్ ఒక్కసారి చెప్పారు ఇంటికి వెళ్ళినప్పుడు ఫోటో చూశాను అందుకే గుర్తుపట్టాను, ఇక్కడ ఉండే ప్రశాంతత మీకు ఎక్కడ దొరకదు హ్యాపీగా ఎంజాయ్ చేయండి." అని చెప్పాడు యోధ.
"మాకు ఈ ఏరియా పెద్దగా తెలియదు నువ్వు హెల్ప్ గా ఉంటావా..?" అని అడిగింది నీతూ.
"మీరేమీ కంగారు పడకండి యోధ మీకు మా ఊరు చుట్టుపక్కల అన్ని ప్రదేశాలు చూపిస్తాడు నాయక్ గారి అమ్మాయి అంటే మా ఇంటి అమ్మాయితో సమానం!" అని చెప్పాడు నారాయణ రావు.
"సరే! మార్నింగ్ వెళదాము పూజ ప్రారంభమవుతుంది కూర్చోండి." అని చెప్పి లోపలికి వెళ్ళాడు యోధ.
పూజ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇంటికి వెళ్లి "యోధ! అంత స్వీట్ గా మాట్లాడుతున్నాడు 24 మందిని చంపేశాడు అంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు." అని చెప్పింది పూజా.
అంతలో అక్కడికి వచ్చి "భూపతి వర్మ గారు మీకు ఈ పళ్ళు ఇవ్వమన్నారు ఇక్కడ ఉండే అడవిలో కాసినవే తినండి." అని చెప్పి రూమ్ డోర్ క్లోజ్ చేశాడు ఆ వ్యక్తి.
"మిస్టర్! డోర్స్ క్లోజ్ చేసావ్ ఎందుకు?" అని సీరియస్ గా అడిగింది నీతూ.
"హాయ్! ఐయామ్ జితిన్ స్పెషల్ ఏజెంట్! మీరు ఇక్కడికి వస్తున్నారని నాయక్ సార్ చెప్పారు యోధ దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడండి లేకపోతే వెంటనే పసిగెట్టేస్తాడు." అని చెప్పాడు.
"మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు?" అని డౌట్ గా అడిగింది నీతూ.
"మేడం! మిలటరీ ఈ మిషన్ స్టార్ట్ చేసి మూడు నెలలు అవుతుంది అప్పుడే నేను ఇక్కడికి వచ్చి భూపతి వర్మ గారి దగ్గర పనిలో చేరాను, మీరు ఆ వస్తూవుని వెతకడానికి వచ్చారు, నేను ఆ వస్తువు కోసం బయట వ్యక్తులు ఎవరైనా వస్తే తెలుసుకోవడానికి వచ్చాను." అని చెప్పాడు జీతిన్.
"మరి నీ గురించి యోధకి కి తెలియదా?" అని డౌట్ గా అడిగింది దీప్తి.
"నేను RAW లో వర్క్ చేస్తాను మా గురించి ఎవరికీ తెలియదు నా పేరు కూడా జీతిన్ కాదు అసలు పేరు నా ఒక్కడికి మాత్రమే తెలుసు!" అని స్మైల్ ఇచ్చాడు.
"అవును! అసలు యోధని ఎందుకు సస్పెండ్ చేశారు?" అని అడిగింది దీప్తి.
"మూడు నెలల క్రితం కారకొరం హిల్స్ దగ్గర ఏదో జరుగుతుందని తెలుసుకుని కొంతమంది ఏజెంట్స్ ని అక్కడికి పంపించారు అక్కడ వెతుకుతున్న చైనా, పాకిస్తాన్ సోల్జర్స్ మన ఏజెంట్స్ ని పట్టుకుని ఇండియన్ సిటిజన్స్ అని తెలుసుకున్నారు.
ఆ విషయం తెలుసుకుని నాయక్ సార్ రెండు గవర్నమెంట్స్ తో మాట్లాడి గొర్రెలు కాచుకునే వాళ్ళు రూట్ తప్పి వచ్చారు అని చెప్పి ఆ ఏజెంట్స్ ని రిలీజ్ చేయడానికి ఒప్పించి వాళ్ళని తీసుకురావడానికి నలుగురు రిస్క్యూటిమ్ ని పంపించారు దాంట్లో ఒక మెంబర్ యోధ.
సరిహద్దు రేఖ వెంబడి అంతర్జాతీయ రూల్స్ ప్రకారం ఎటువంటి వెపన్ యూజ్ చేయకూడదు ఎవరి వైపు నుంచి కాల్పులు జరిగాయో వాళ్లు యుద్ధం మొదలుపెట్టినట్లు అవుతుంది. అందుకే వెళ్ళిన నలుగురు పని ఏజెంట్స్ ని భద్రంగా తీసుకురావడమే అక్కడ ఎటువంటి ఎటాక్ చేయకూడదు ఎవరిని చంపకూడదు.
కానీ వీళ్ళ నలుగురు వెళ్లేసరికి అక్కడ ఉన్న మన ఏజెంట్స్ ని బట్టలు లేకుండా మంచులో పడుకోబెట్టి చిత్రహింసలు పెడుతూ ఉన్నారు ఆ విషయం వెంటనే నాయక్ సార్ కి కాల్ చేసి చెప్పాడు యోధ.
అక్కడ ఎటువంటి గొడవ జరగకూడదు మన వాళ్ళని తీసుకుని వెనక్కి వచ్చేయండి అని ఆర్డర్స్ ఇచ్చారు మిలటరీలో ఫస్ట్ రూల్ సుపీరియర్ ఆర్డర్స్ స్టిట్ గా ఫాలో చేయడమే దానికి కట్టుబడి ఏటువంటి గొడవ చేయకుండా ఏజెంట్స్ ని విడిపించి అక్కడి నుంచి వెళ్లడానికి రెడీ అయ్యారు యోధ టీమ్.
కానీ అప్పుడే ఒక ఏజెంట్ బట్టలు వేసుకుంటూ ఉండగా సీక్రెట్ గా దాచుకున్న జైశ్రీరామ్ అని రాసి ఉన్న పేపర్ అక్కడ ఉన్న శత్రుదేశం దేశం సోల్జర్ కి దొరికింది.
జై శ్రీరామ్ అంటే మీ దేవుడి పేరు కదా అని చెప్పి కాలు కింద పెట్టి యూరిన్ పోయడానికి ట్రై చేశాడు, అప్పుడు వచ్చింది యోధ కి అసలైన కోపం ఒక్క దూకులో వెళ్లి వాడి గుండెల మీద ఒక్క గుద్దు గుద్దాడు వాడు మళ్ళీ పైకి లేగలేదు.
అక్కడ ఉన్న మిగతా వాళ్ళు యోధ ని మిగిలిన వాళ్ళని రౌండ్ చేసి చంపేయడానికి గన్స్ బదులు ఐరన్ రాడ్స్ కత్తులు బయటకు తీశారు." అని చెప్పాడు జీతిన్.
తను చెపుతుంది సీరియస్ గా వింటూ "తర్వాత ఏమైంది? చెప్పడం ఆపేసారేమిటి?" అని ఆత్రుతగా అడిగాడు ఏకవీర.
"అక్కడ ఉంది యోధ ఏం జరుగుతుందో ఎక్స్పెక్ట్ చేయలేరా..? రెండు దేశాలకి వాళ్ళ సోల్జర్స్ ఏమైపోయారో తెలియలేదు ఇంకా వెతుకుతూనే ఉన్నారు.
ఆ పని చేసినందుకు అందరూ మెచ్చుకున్నారు కానీ ఆర్డర్స్ బ్రేక్ చేసినందుకు నాయక్ సర్ యోధ ని సస్పెండ్ చేశారు. ఆ కెమెరా కూడా తనకే దొరికింది దాంట్లో ఉన్న ఫోటోలు చూసే ఈ మిషన్ స్టార్ట్ చేసి మిమ్మల్ని ఇక్కడికి పంపించారు." అని చెప్పాడు జీతిన్.
"అది సరే! అక్కడ ఉన్న శత్రుదేశం సోల్జర్స్ ని యోధ ఏం చేశాడు? మూడు నెలలు వెతికిన కనపడకుండా ఏమైపోయారు?" అని డౌట్ గా అడిగింది నీతూ.
"ఆ విషయం యోధ తో పాటు వెళ్లిన ముగ్గురు బ్లాక్ క్యాట్ కమాండోస్ చెప్పాలి, లేకపోతే ఏజెంట్స్ చెప్పాలి ఎవరు నోరు విప్పలేదు నాకు తెలిసి నాయక్ సార్ కి తెలిసే ఉంటుంది." అని చెప్పాడు జీతిన్.
"యోధ చాలా మంచి పని చేశాడు డాడ్ చేసిన పని నాకు నచ్చలేదు." అని చెప్పింది దీప్తి.
"అక్కడ జరిగింది విన్న వాళ్ళకి అలాగే ఉంటుంది. కానీ ఏదైనా తేడా వస్తే యుద్ధం మొదలవుతుంది ఆ విషయం ఎవరు ఆలోచించరు." అని చెప్పాడు జీతిన్.
"సరేగాని! ఆ వస్తువుని వెతుక్కుంటూ ఎవరైనా ఇక్కడికి వచ్చారా..?" అని అడిగింది నీతూ.
"ఇప్పటివరకు ఎవరు రాలేదు కానీ దానిని వెతకడం కోసం మీర్జా గ్యాంగ్ దగ్గరికి ఫోటో వచ్చింది. ఆ వస్తువు మిస్ అయింది ఈ ఏరియాలోనే కాబట్టి తప్పకుండా ఎవరో ఒకరు వస్తారు." అని చెప్పాడు జీతిన్.
"మిలిటరీ ఆ వస్తువుని వెతుకుతున్న విషయం యోధాకి తెలుసా?" అని అడిగింది పూజ.
"యోధ సస్పెండ్ అయిన తర్వాత ఈ మిషన్ స్టార్ట్ చేశారు కాబట్టి తనకి దీని గురించి తెలియదు మనం కూడా చెప్పకూడదు." అని చెప్పాడు జీతిన్.
"ఆ వస్తువు ఈ ఏరియాలో మిస్ అయ్యి 25 సంవత్సరాలు అవుతుంది. కానీ ఆ రెండు దేశాలు ఇప్పుడు ఎందుకు వెతకడం స్టార్ట్ చేశాయి." అని డౌట్ గా అడిగింది నీతూ.
"ఆ విషయం గురించి నాకు కూడా తెలియదు." అని చెప్పాడు జీతిన్
"యోధకి తన తండ్రి ఒక ఏజెంట్ అని దేశం కోసం చనిపోయాడని తెలుసా?" అని అడిగింది దీప్తి.
"ఆ విషయం కూడా నాకు తెలియదు మీరు కూడా యోధ దగ్గర ఏమీ మాట్లాడకండి." అని చెప్పాడు జీతిన్.
"సరే! మనం ఫస్ట్ యోధ తల్లిదండ్రులు ఉన్న ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాము." అని చెప్పింది నీతూ.
"జీతిన్! మనం వెళ్లడానికి మంచి వెహికల్ అరేంజ్ చేయండి." అని చెప్పింది దీప్తి.
"సరే! ఆ విషయం నేను చూసుకుంటాను మీ దగ్గర ఉన్న రేడియేషన్ మిషన్స్ యోధ కి కనబడకుండా చూసుకోండి." అని చెప్పాడు జీతిన్.
" రుద్రం భజే! ఎపిసోడ్ 5 " రచనకు రేటింగ్ ఇవ్వండి తద
|