Thread Rating:
  • 25 Vote(s) - 3.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
వైభవ్ & విశి ఇద్దరు ఇంకా కన్ఫ్యూషన్ లో ఉన్నారు.
[+] 1 user Likes Sunny73's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Hope Vinay guides his son properly this time
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Part - 74



వైభవ్ ని చూసి ఏంటి సుపుత్ర ఇలా వచ్చావు..మీతో మాట్లాడాలి నాన్న.. సీరియసా..  చాలా... సరే రా..  వెళ్లి పక్కన కూర్చొని వోళ్ళో పడుకుంటాడు.

పూజిత ఆశ్చర్యంగా చూస్తుంది. కొడుకు తల మీద చెయ్యి వేసి ఏంట్రా అని అడుగుతాడు..నాన్న అని ఆ చేయ్యి పట్టుకుని ముందుకు తీసుకుంటాడు. చెప్పరా కన్నా..

నేను అడిగే దానికి మీరు సిన్సియర్ గా సమాధానం చెప్పాలి. ఇప్పుడు నాతో ఏమైనా ఐఏఎస్ ఎగ్జామ్స్ రాయిపిస్తున్నావా ఏమిటి...  ప్లీజ్ నాన్న.  సరే అడగరా..

మీరు, అమ్మ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా. ఇప్పుడు ఆ పీడకల గురించి ఎందుకురా.. పూజిత పక్కనుండి గిల్లుతుంది. అబ్బా ఉండవే..

ప్లీజ్ నాన్న... సరే అడుగు . నీకు ప్రేమ అని ఎలా తెలిసింది.
ఎలా తెలిసింది అంటే.. వయసు ప్రభావం.. ఒళ్లో నుంచి లేచి సీరియస్గా చూస్తే..

సరే సరే చెబుతాను. మీ అమ్మని చూడగానే ఏమిటో అలా గంటలు మోగేసాయి. రౌడీ బేబీ లాగా రోడ్డు మీద నిలబడి కోడుతుంది.
నివి, వదిన చాలా సాఫ్ట్ గా ఉండడం చూసి మీ అమ్మ అడ్వెంచర్స్ భలే థ్రిల్ అనిపించాయి. మళ్లీ కలిస్తే చూద్దాంలే అనుకున్నాను.

నివి ఎంగేజ్మెంట్  టైం లో మళ్ళీ కనిపించింది అంతే.. బ్రహ్మ వేసిన ముడి అని ఫిక్స్ అయిపోయాను.  ఇలా మీ అమ్మకి దొరికిపోయాను..

అందరికీ అలాగే గంటలు మోగుతాయా.. అది ఎవరి ఫీలింగ్  వాళ్ళది. ఇంతకీ నీకు ఎవరిని చూస్తే మోగాయి. ఏమీ అర్థం కావడం లేదు.

చాలా కన్ఫ్యూషన్ గా గందరగోళంగా ఉంది.  మీరైతే క్లారిటీ ఇస్తారు అని వచ్చాను. ఎవరి విషయంలో..

మౌనంగా కూర్చుంటాడు.  చందు విషయంలోన.. మీకెలా తెలిసింది. అది నీకు తప్ప అందరికీ తెలుసు. కానీ నీ ప్రేమని నువ్వే గుర్తించు.  అదే ఎలా.. మీ అమ్మ కన్నా ఇంకా కన్ఫ్యూషన్ బోయ్ వి..

ఇప్పటికీ లైట్ గా క్లారిటీ వస్తుంది కదా..  మెల్లిగా అదే పెరుగుతుంది.  ఎక్కువ ఆలోచించకుండా వెళ్లి పడుకో..
వైభవ్ గదిలోకి వెళ్లి పడుకుని ఆలోచిస్తూ ఉంటాడు..
అసలు ప్రేమంటే ఏమిటి...

కోపమా.. స్నేహమా లేక ఇంకా ఏదైననా..
చందు గురించి ఆలోచిస్తూనే నిద్రపోతాడు..

విశి వర్క్ చేసి వైభవ్ కి పంపించి దేవా ఊహల్లో తేలుతూ మంచం పైన వాలుతుంది..

సూర్య కాలేజీలో విశి చెప్పిన సమాధానానికి మురిసిపోతూ ఉంటాడు..

ఇక శ్రీకర్, సౌమ్య ప్రేమ కబుర్లు చెప్పుకుని ఎప్పటికో నిద్ర దేవికి స్వాగతం పలుకుతారు..

ఉదయం అందరూ బద్దకంగా నిద్ర లెగుస్తారు.. వీకెండ్ అవ్వడం వలన రిలాక్స్డ్ గా కూర్చుంటారు.  వైభవ్ మాత్రం అందరిలో ఉంటాడు కానీ కళ్ళు మాత్రం గుమ్మం వైపే ఉంటాయి.

అది అబ్జర్వ్ చేసిన సూర్య.. మన సింహద్వారం ఏమైనా మార్చాలా నాన్నమ్మ..  ఎందుకురా.. ఏమో వైభవ్ గాడు పొద్దున్నుంచి గుమ్మం వైపు సీరియస్గా చూస్తున్నాడు.

చేర్పులు మార్పులు కావాలేమో అని అడుగుతున్నాను. ఏరా అంటే... అలా ఏమీ లేదు క్యాజువల్ గా చూస్తున్నాను అంతే..

ఏమో నాకైతే అలా అనిపించడం లేదు.  ఏదైనా మార్పులు కావాలంటే చెప్పు.  చిటికలో చేయించేద్దాము.  అంతేనా తాతయ్య.. మీ జనరేషన్ కి ఎలా కావాలంటే అలా చేయించుకోండి రా..

నామీద కౌంటర్ వేస్తున్నావు కానీ..  ఏమిటి ఈ రోజు బాబి దగ్గరికి వెళ్లడం లేదా.. నాకు అదే పనా మీ బాబీ చుట్టూ తిరగడం తప్ప ఇంకొక పని లేదా..

అవునా అనేటప్పటికి హాయ్ అన్న వాయిస్ వినపడుతుంది.  ఈ కొత్త గొంతు ఎవరిది రా అని చూసి సూర్యా నోరు వదిలేస్తాడు.

లేడీస్ అందరూ ఎవరు అన్నట్టుగా చూస్తే.. వైభవ్ నవ్వాపుకుంటూ పక్కకెళ్ళి పెద్దమ్మ బాబీకి కాంపిటేషన్. అవునా.. అన్నయ్యని తెగ గోకేస్తుంది.

ఫోన్ నెంబర్ తీసుకోవడానికి ట్రై చేసింది గాని ఎస్కేప్ అయ్యాడు అని డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసింది.. విశి ప్లేస్ లోకి ఇంకొకళ్ళు రావడమా.. రానిస్తానా..  కాసేపు నువ్వు సైలెంట్ గా ఉండు పెద్దమ్మ. జరిగే ఫన్ చూద్దాము..

హాయ్ సూర్య అని మెలికలు తిరుగుతుంది..హాయ్ నీకు ఈ అడ్రస్ ఎలా తెలిసింది.. స్టేట్ క్యాపిటల్ కి వెళ్లి సీఎం ఇల్లు అడగాలా ఏమిటి..

జై సింహ మాన్షన్ అని గూగుల్ మాత ని అడిగితే..  ఇదిగో ఇలా దారి చూపించింది వచ్చేసాను. మంచి పని చేశావు.

వచ్చిన గెస్ట్ ని ఇలాగే నుంచో పెట్టి మాట్లాడతావా.. అత్తయ్య అనుకుంటా కదా అని అవని కాళ్ళకి నమస్కారం చేస్తుంది.

వైభవ్.. సౌమ్య తో.. దీని వేషాలు మరీ ఎక్కువగా ఉన్నాయే బాబు. చూడలేకపోతున్నాను. ఏదో ఒకటి చెయ్యి నేనేం చేస్తాను రా..

అక్కడ సూర్యనే నోరు వదిలేసాడు.  ఇక మనమెంతా..  అలా అంటే ఎలాగా.. ఒక పని చెయ్ విశి కి కాల్ చేసి రమ్మను.

అప్పుడు గాని అన్నయ్య నన్ను ఊరు మొత్తం తిప్పించి కొట్టడు..  ఎందుకు... బాబి దృష్టిలో అన్నయ్య ఒక లెక్చరర్. ఇప్పుడు ఇదంతా చూస్తే చీట్ చేసాడు  అనుకోదా..

మరి ఇప్పుడు ఏం చేయాలి రా.. జరిగా ఘోరాలని చూడడం తప్ప ప్రస్తుతం మన మాట్లాడలేము. అవని కంగారుగా లేగుమ్మ అని లేపుతుంది.

అయ్యో అత్తయ్య నన్ను బ్లెస్స్ చేయండి. ఏమని అని క్యూస్షన్ మార్క్ ఫేస్ తో కొడుకు వైపు చూస్తుంది.  శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు.. కోరుకున్న వాడిని పెళ్లి చేసుకోవాలి అని బ్లెస్స్ చేయండి.

మీరు బ్లెస్స్ చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది... అంతేనా సూర్య. వామ్మో దీని వేషాలో అని సూర్య అనుకుంటూ.. ఎలా దీన్ని బయటికి గెంటాలి.

అలాగే.. అలాగే నమ్మ..  నువ్వు ఎలా కోరుకుంటే అలాగా అని లేపి కూర్చో ...థాంక్యూ అత్తయ్య అని కూర్చుంటుంది. పూజిత వచ్చి ఈ కాలంలో కూడా చీర కట్టుకునే వాళ్ళు ఉన్నారా..

నువ్వు చాలా పద్ధతిగా కట్టుకున్నావు. నాకు చీరలే అలవాటు చిన్నత్త..   చిన్నత్త అని ఒక్కసారి అందరి కళ్ళు బయటికి వచ్చి మళ్ళీ లోపలికి సర్దుకుంటాయి.

జీన్స్ అన్న.. మోడరన్ డ్రెస్సులు అన్న నాకు అస్సలు నచ్చదు. అవునవునమ్మ నిన్ను చూస్తుంటేనే తెలుస్తుంది. చీర బానే కట్టుకున్నావు కానీ కాస్త నడవడం కూడా ప్రాక్టీస్ చేసుంటే బాగుండేది.

ఇంకా బాగా సెట్ అయ్యేది కదా విద్యా.. విద్య చిన్నగా నవ్వుతుంది.. ఆ మాటకి హిమ ముఖం మాడిపోతుంది. వెంటనే సర్దుకుని మిమ్మల్ని అందరిని చూసినా కంగారులో ఏదో అలా.. అలా అంటే..

అదేనమ్మ ఆ కంగారులో అలా అలా నడిచేసావు. ఇంతకీ ఇంత పొద్దుటే మా గృహాన్ని పావనం చెయ్యాలనుకున్న నీ ఉద్దేశ్యం ఏమిటో..

ఏమి చెప్పాలో తెలియక ఆలోచిస్తూ...హ.. చాలా రోజుల తర్వాత... ఈరోజు టైం దొరికింది అని పొద్దుటే గుడికి వెళ్లి అభిషేకం చేయించి రిటర్న్ వస్తూ మీ దగ్గరికి వచ్చాను.

ఇంత పొద్దుటే గుడికి..  ఏం గుడికి వెళ్ళావు అమ్మ అని లలిత అడుగుతుంది. ఏం గుడికి అంటే..  శివాలయానికి వెళ్లాను మామ్మగారు..

మా ఇంటి దగ్గరలో శివాలయాలు లేవే.. మీకు దగ్గరలో లేవు కొంచెం దూరంలో ఉంటే అక్కడ నుంచి ఇటు వచ్చానన్నమాట.

పూజ అయిన తర్వాత సూర్య తెగ గుర్తుకువచ్చాడు.  కలిసి అప్పుడే రెండు రోజులు అయిపోతుంది. ఎలా ఉన్నాడా ఏమిటా అని బెంగగా అనిపించి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చాను.

నేను ఇలా రావడం మీ అందరికీ ఇబ్బందిగా ఉన్నట్టు ఉంది. క్షమించండి ఇంక నేను వెళతాను..  కుర్చీ లో నుంచి లేచినా హిమ ని ఎవరు ఆపరు.

అదేమిటి వెళతాను అన్నా ఎవరు ఆపడం లేదు. నా యాక్టింగ్ ఏమైనా తెలిసిపోయిందా ఏమిటి అని ఆలోచిస్తూ మెల్లిగా అడుగులు వేస్తూ ఉంటుంది.

ఒక్క నిమిషం ఆగమ్మా అని లలిత అంటే..  హమ్మయ్య ఈ పెద్దావిడ ఆగమన్నది అనుకుని చెప్పండి మామ్మగారు అంటుంది.

అవని అని పిలిస్తే..  వస్తున్నాను అత్తయ్య గారు అని చీర పసుపు కుంకుమ తీసుకొచ్చి పెట్టి బొట్టు పెడతారు. ఇప్పుడు ఎందుకు అత్తయ్య ఇవన్నీ..

మొదటిసారి మా ఇంటికి వచ్చావు. ఇంటి ఆడపడుచు తో సమానం. ఉత్తి చేతులతో ఎలా పంపిస్తాము.  చల్లగా ఉండు అని బ్లెస్స్ చేస్తారు.

హమ్మయ్య ఒక పని అయిపోయింది అని మెల్లిగా బయట పడుతుంది. హిమా వెళ్లిపోయిన తర్వాత ఏంటమ్మా నువ్వు చేసిందని సూర్య కోపంగా అడుగుతాడు.

నేనేమి చేశాను రా.. అది అత్తయ్య అత్తయ్య అని మెలికలు తిరుగుతూ ఉంటే చీర పెట్టి మరీ చల్లగా ఉండు.. నువ్వు కావాల్సింది తీరుతుంది అని ఏదో బ్లెస్స్ చేస్తున్నావు.

ఒరేయ్ మీ అమ్మ చాలా తెలివిగా బ్లెస్ చేసింది.ఈ కాలం పిల్లలకి మాటలకి అర్థం తెలియక ఏదేదో అనుకుంటున్నారు.

ఏమంటున్నావు నానమ్మ...  మీ అమ్మ ఏమని బ్లెస్స్ చేసింది. ఇంటి ఆడపడుచు తో సమానం అని చెప్పి బ్లెస్ చేసింది అంటే దాని అర్థం ఏమిటి..

ఇంటి ఆడపడుచు ఎవరు.. అత్తయ్య. అత్తయ్య, నాన్నకి చెల్లి అంటే ఆ తింగరిదాన్ని నాకు చెల్లిని చేశారా.. అంతే కదా..

అమ్మ నువ్వు కనపడవు కానీ పెద్ద కిలాడివి..ఇప్పటికి అర్థమైందా అని విక్రమ్ వస్తాడు.. మీరు ఎప్పుడు వచ్చారు..

ఇక్కడ జరుగుతున్న డ్రామా చూడలేక స్టడీ రూమ్ లో ఉండిపోయాను. ఇదంతా మీరు వెనక ఉండి నడిపించినది కాదా ఏమిటి... అంత నా అకౌంట్లో వేసేస్తున్నారు..

పెదనాన్న గైడెన్సా... మరి మనకు అంత బుర్ర ఎక్కడుంది.  ఏదో మీ పెద్దనాన్న డైరెక్షన్లో అలా అలా గెంటుకుంటూ వెళ్ళిపోతున్నాను. లేకపోతే ఈ ముదుర్లుని నేను ఎక్కడ మేనేజ్ చేయగలను.

హిమ ఆనందంగా ఇంటికి వెళ్లి డాడీ అని అరుస్తుంది.  రమేష్ వచ్చి ఏమైందిరా అంత హుషారుగా ఉన్నావు.  మన ప్లాన్స్ సక్సెస్.

ఫ్యామిలీ మొత్తం నీ బుట్టలో పడ్డారా..  ఇదిగో చీర కూడా పెట్టారు. పెట్టి ఏమని బ్లెస్స్ చేసారో తెలుసా... నువ్వు మా ఇంటి ఆడపడుచు తో సమానం. చల్లగా ఉండు అన్నారు.

అంతే ఆ మాటకి రమేష్ పాలిపోయిన మొఖంతో కూతురు వైపు చూస్తాడు.

హిమ పరిస్థితి ఏమిటి....
[+] 8 users Like SivaSai's post
Like Reply
Part - 75



రమేష్ కూతురు వైపు చూస్తూ ఏమని బ్లెస్ చేశారు.. మా ఇంటి ఆడపడుచు తో సమానం. చల్లగా ఉండు అని బ్లెస్ చేశారు.

ఇంటి ఆడపడుచు అంటే అర్థం తెలుసా... నిన్ను ఆ సూర్యకి సిస్టర్ ని చేశారు. నో డాడ్.. నేను వెళ్ళగానే ఆ సూర్య మదర్ ని అత్తయ్య అని పిలిచాను.

పిచ్చిపిల్ల.. నువ్వు అత్తయ్య అని మాత్రమే పిలిచావు కానీ వాళ్ళు నిన్ను తెలివిగా ఆడపడుచును చేశారు. నీకు ముందునుంచి చెబుతున్నాను.

సింహ ఫ్యామిలీ తో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్లు పైకి కనిపించే అంత అమాయకులు కాదు.
ఇప్పుడు నేను డ్రాప్ అవ్వాలా అని నీరసంగా అడుగుతుంది .

మనది ఏమన్నా బ్లడ్ రిలేషనా... ఏమీ అర్థం కానట్టుగానే నువ్వు ఫాలో అయిపో..

ఆ గౌతమ్ ని ఏం చేయాలి డాడ్. ఇంకొన్ని రోజులకి ఎలాగా తట్ట బుట్ట సర్దేసుకుంటాడు.  అప్పుడు వరకు అలా మెయింటైన్ చెయ్..

సరే డాడ్ నేను డ్రెస్ చేంజ్ చేసుకుని గౌతమ్ దగ్గరికి వెళతాను. ఇప్పుడు ఎందుకురా.. షాపింగ్ పని ఉంది. ఫ్రెండ్స్ బిజీ. సో వాడిని తీసుకువెళతాను.

నాకు సెక్యూరిటీగాను ఉంటాడు.  సర్వీసు చేస్తాడు.
విశి..  సూర్య కి కాల్ చేస్తుంది.  చెప్పు విశి.. సార్ బిజీనా..
పర్వాలేదు..

మీరు ఫ్రీగా ఉంటే నాతో షాపింగ్ కి వస్తారా.. భవ్య ఏమయింది.  గెస్ట్స్ వచ్చారంట.. బిజీ అంటుంది.  నేను ఖాళీగా కనిపించానా..

అయ్యో..  మీరు బ్యాచిలర్ కదా...సండే ఫ్రీగా ఉంటారు అని కాల్ చేసాను.  ప్లీజ్ సార్.. 

హ్మ్.. నువ్వు అంత ముద్దుగా అడిగితే కాదంటానా..  రెడీగా ఉండు వచ్చి పికప్ చేసుకుంటాను. థాంక్యూ సార్.. ఫోన్ పెట్టేసి..

ఏం డ్రెస్  వేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఎదురుగుండా కనిపిస్తున్న డ్రెస్ చూసి ఎవరు పెట్టారు అని చుట్టూ చూస్తే అక్కడ భానుమతి చేతులు కట్టుకొని చూస్తూ ఉంటుంది.

నువ్వేంటి అమ్మ..  ఇక్కడ..  ఎప్పుడొచ్చావు.నువ్వు ఫోన్ మాట్లాడుతున్నప్పుడే వచ్చాను.  బయటికి వెళ్లే ప్రోగ్రాం ఉన్నట్టుంది.

షెల్ఫ్ ఓపెన్ చేసి ఇస్త్రీ బట్టలు అన్ని నువ్వు లాగకుండా ఉండాలని నేను ఆ డ్రస్ అక్కడ పెట్టాను. అది వేసుకుని బుద్ధిగా వెళ్లి వచ్చేయ్..

నేనెవరితో వెళుతున్నానో.. ఎక్కడికి వెళుతున్నానో అడగవా...  నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది కానీ రెడీ అవ్వు  అక్కడ మీ దేవా సార్ వచ్చే టైం అయింది.

సారీ అమ్మా.. ఈ మధ్యన నీకు టైం ఇవ్వడం లేదు.  వర్క్ తో సరిపోతుంది. నా గురించే మీ ఆలోచించక్కర్లేదు. నాకు కంపెనీ ఇచ్చే ఫ్రెండ్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు.

మీతో వస్తేనే నాకు బోర్.. అమ్మా..  అవును.. అది తినకు ఇది తినకూడదు..  అటు వెళ్ళకు ఇటు వెళ్ళకు అని చిన్న పిల్లలకి చెప్పినట్టుగా చెప్పి..  నా బుర్ర తినేస్తావు.

నేహా ఆంటీతో నేను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాను..నీ ఏజ్ గ్రూపు వాళ్ళు దొరికేటప్పటికీ నన్ను పక్కన పెట్టేసావు అన్నమాట..

నువ్వు దేవా సార్ తో వెళుతూ నన్ను పక్కన పెట్టలేదా... ఇది అంతే. వామ్మో  ఈ ఇంటికి వచ్చాక మా అమ్మ లో చాలా మార్పు వచ్చింది. కౌంటర్స్ మీద కౌంటర్లు వేస్తుంది.

విశి కి జడవేసి తనలో పువ్వు పెట్టి...  మనసులో ఉన్న మాట ఎదుటి మనిషికి చెప్పాలి. చెప్పకుండా తెలుసుకోవాలి.. అర్థం చేసుకోవాలి అనుకుంటే కష్టం. వాళ్లు కూడా అలాగే అనుకుంటారు కదా.. టైం చూసుకుని నీ మనసులో మాట చెప్పు..

అమ్మ అది  అని సిగ్గుపడుతూ ఉంటే.... నాకు తెలియదు అనుకున్నావా... నేను మీ అమ్మని. నువ్వు ఏ నిమిషంలో ఎలా ఉంటావో అన్నది నాకు బాగా తెలుసు.


సరే బయలుదేరు అని పంపిస్తుంది. నడుస్తూ అమ్మ కూడా గెస్ చేసింది. మీరు గెస్ చేయలేదా లేకపోతే నేనే చెప్పాలని ఎదురుచూస్తున్నారా..

విశి బయటికి వచ్చి నుంచునే లోపు సూర్య వస్తాడు. ఇంత తొందరగా వచ్చేసారా..  మీ ఆడవాళ్లు రెడీ అవ్వడానికి చాలా టైం తీసుకుంటారు కదా... అందుకే నా టైం నీకు తెలియలేదు..

చెప్పు.. ఏం మాల్ కి వెళ్దాము. మాల్ కి వద్దు సార్. అక్కడ అన్ని బ్రాండెడ్ ఉంటాయి. బాధేస్తారు..  లోకల్ స్ట్రీట్ లో చూద్దాం.  బ్రాండెడ్ అయినా క్వాలిటీ ఉంటాయి కదా...

కానీ ప్రైస్ ఎక్కువగా ఉంటుంది. అకేషన్ ఏమిటి... చెప్పాను కదా.. వి. జె. స్ కంపెనీ కొటేషన్ వచ్చింది. అది ఓకే అవుతే... ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్లాలి..సో అందు గురించి..

ఒక్క నిమిషం అని ఫోన్ చేసి మాట్లాడి  ఎక్కు అంటాడు. సరే అని మౌనంగా ఎక్కుతుంది. బైకు ఒక షాపింగ్ మాల్ ముందు ఆగుతుంది.

సార్ అంటే..   ఇక్కడ డిస్కౌంట్ ఉందంట.. ఆల్రెడీ ఇది మా ఫ్రెండ్ కి తెలిసినదే..  సో నీ బడ్జెట్లో వస్తాయి రా అని తీసుకువెళ్తాడు.

లోపలికి వెళ్లి చూస్తూ ఉంటుంది.  నచ్చాయా..  ఇక్కడ అన్ని బాగున్నాయి. నాన్న ఉన్నప్పుడైతే ఇలాంటి మాల్ కే వచ్చేదాన్ని..  ఇప్పుడంటే కష్టం కదా..

అది నీ ఆలోచనలో ఉంది. ఏమి కష్టం లేదు. కొన్ని డ్రెస్సెస్ చూడ్డానికి కాస్ట్లీ గా అనిపిస్తాయి కానీ బడ్జెట్ లోనే వస్తాయి రా అని అక్కడ సేల్స్ గర్ల్ ని పిలిచి విశికి సూట్ అయ్యే డ్రెస్సెస్ చూపించమని చెబుతాడు.


సార్ అని షర్టు పట్టుకొని లాగుతుంది.  ఏమైంది..  ముందే మన ప్రైస్ చెప్పేద్దాము.  దానికి తగ్గట్టుగా తీసుకువస్తారు. అవసరం లేదు.

క్లైమాక్స్లో వాళ్ళ డిస్కౌంట్ ఇస్తారు కదా...  వద్దు సార్. మనకి బాగా నచ్చింది మన బడ్జెట్లో రాకపోతే మనసుకు కష్టంగా అనిపిస్తుంది.

ప్లీజ్...  ప్లీజ్ . సరే ఎంత లో చెప్పమంటావు. ఆలోచించి 500 టూ 1000 మధ్యలో తీసుకురామ్మనండి.  ఓకే అని
ఆ ప్రైస్ లో చూపించమని చెబుతాడు.

ఓకే సార్ అని  డ్రెస్సెస్ తీసుకువచ్చి చూపిస్తూ ఉంటుంది. ఏది చూసినా 400, 500, 600 ఉంటాయి.  ఏంటి సార్ ఇంత చీప్ గా ఉన్నాయి.

చెప్పాను కదా కొన్ని చూడ్డానికే ఎక్స్పెన్సివ్ గా కనిపిస్తాయి. కానీ మన బడ్జెట్ లో వస్తాయి అని. ఇలా చూపిస్తే షాప్ మొత్తం కొనేయాలనిపిస్తుంది.

కొను నిన్ను ఆపేది ఎవరు..   ఈ మాటలు బాగానే ఉంటాయి అని ఒక నాలుగు సెలెక్ట్ చేస్తుంది.. అందులో నుంచి ఒకటి తీయమని సూర్య వైపు చూస్తుంది.

నాలుగు తీసేసుకో.. నీకు ఇవన్నీ సూట్ అవుతాయి. సూట్ అయినంత మాత్రాన అవసరానికి మించి తీసుకున్నది కూడా మంచిది కాదు..

సూర్య మనసులో అయ్యో క్యూటి ఈ మాల్ మనదే..  నువ్వు ఎన్ని తీసుకున్నా ఫ్రీనే  నీకన్నా ఎక్కువ ఏదీకాదు..

అక్కడికి ఆ ఫ్లోర్ మేనేజర్ వచ్చి విష్ చేసి మేడం.. ఈరోజు లక్కీ డ్రిప్ ఉంది.  అందులో  విన్నర్ తీసుకున్న ప్రతిదీ ఫ్రీ.. అవునా అలా కూడా ఉంటుందా. ఈ ఒక్క రోజే  ప్లాన్ చేశాము..
అవునా.. ట్రై చేద్దామా అనుకుని మళ్ళీ వద్దులే... ఎందుకు వచ్చిన తలపోటు అనుకుంటుంది. ఏమిటి ఆలోచిస్తున్నావు.. పార్టిసిపేట్ చేయొచ్చు కదా..

వద్దు సార్. మనకు వస్తాయా ఏమిటి...  నువ్వు ఏమన్నా డబ్బులు కట్టాలి ఏమిటి.... జస్ట్ నీ పేరు రాసి అందులో వేయడమే..

వస్తే ఓకే.. లేకపోయినా ఓకే... ఏముంది.. అయ్యో సార్. అలా మన నెంబర్ తీసుకుని బయట డేటా సెంటర్ వాళ్లకి అమ్మేస్తారు.

24 గంటలు...  వాళ్లు మీరు అది కొంటారా.. . ఇది కొంటారా మా ఇన్సూరెన్స్ అని బుర్ర తినేస్తారు. మనకు అవసరమా..

ఎలాగో ఈ లక్కీ డ్రిప్ నాకు రాదు.  కొత్త తలపోటు తెచ్చుకోవడం  ఎందుకు...  విశి చెప్పిన దానికి సూర్య నవ్వుతూ.. అన్ని మాల్స్ లో అలా జరగదు.

ఎట్టి పరిస్థితిలను డేటా బయటికి వెళ్ళదు. మీకు ఎలా తెలుసు. చెప్పాను కదా మా ఫ్రెండ్ కి తెలిసినదే అని.. నీకు అలా కాల్స్ వస్తే ఇమ్మీడియేట్గా నాకు ఇంఫార్మ్ చెయ్యి..

వెంటనే ఈ ఫ్లోర్ మేనేజర్ జాబు పోతుంది.. ఎందుకు సర్ మన వల్ల వేరే వాళ్ళు పొట్ట కొట్టడం. భయాలు వదిలి ముందు పార్టిసిపేట్ చెయ్.. తర్వాత చూద్దాం..

అంతేనంటారా...  అంతే..  మీరు ఉన్నారన్న ధైర్యంతో పాల్గొంటున్నాను.   బట్ నాకు ఏదైనా కాల్ చేస్తే మీదే బాధ్యత..

విశి నెంబరు, పేరు రాసి ఇస్తుంది. మొత్తం షాపింగ్ అయ్యి తిరుగుతూ ఉంటే.. అనౌన్స్మెంట్ స్టార్ట్ చేస్తారు. విశిష్ట అన్న పేరు వినిపించగానే..

సార్..  నా పేరే వచ్చింది అని గంతులు వేస్తోంది. చెప్పాను కదా నీకు వస్తుంది అని..  ఎలా..  నువ్వు ఎప్పుడూ లక్కీ గర్ల్ వే అందుకని..

వెంటనే విశి సూర్యని హత్తుకుని.. థాంక్యూ సర్..  మా నాన్న ఉన్నప్పుడు కూడా ఇలాగే చెప్పేవారు. ఆయనతో పాటే నా సంతోషాలు, లక్ అన్ని వెళ్ళిపోయాయి.

  మళ్ళీ మీ రూపంలో అవన్నీ నా దగ్గరికి వచ్చేసాయి. ఎప్పటికీ మీరు నాతో ఇలాగే ఉంటారా..

విశి చుట్టూ చేతులు వేసి తప్పకుండా...  అందుకే కదా నేను వచ్చింది.. సూర్య మాట పూర్తయ్య లోపు బెలూన్స్ పేలతాయి.

విశి పూర్తిగా వినదు.  వెంటనే తేరుకుని దూరం జరిగి..  సోరి..  ఏదో ఎమోషనల్ లో.. కంగారుగా చెబుతూ ఉంటే.. ఇట్స్ ఓకే అని చేతిని ప్రెస్ చేస్తాడు...

ఆ బ్యాగ్స్ తీసుకొని బయటికి వస్తారు.  విశి ముఖం వెలుగుతూ ఉంటుంది. ఏంటి మేడం గారు.. చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. ఎన్నో రోజుల తర్వాత..

మీకు ఒక విషయం తెలుసా నాన్నతో నేను ఎప్పుడు బయటకు వెళ్లినా ఇలాగే మోటివేట్ చేసేవారు గెలిచినా ఓడిన తర్వాత సంగతి ముందు నువ్వు పార్టిసిపేట్ చేయి..

గెలిస్తే గెలుస్తావు...లేకపోతే లేదు కానీ నీలో ఆడాలి గెలవాలి అనే ఒక స్పిరిట్ పెరుగుతుంది కదా అది ఇంపార్టెంట్ అనేవారు..ఇప్పుడు మీరు కూడా అలాగే చెబుతున్నారు..

సూర్య ఫీలింగ్స్.................
[+] 8 users Like SivaSai's post
Like Reply
Part - 76


గెలిస్తే గెలుస్తావు...లేకపోతే లేదు కానీ నీలో ఆడాలి గెలవాలి అనే ఒక స్పిరిట్ పెరుగుతుంది కదా అది ఇంపార్టెంట్ అనేవారు..ఇప్పుడు మీరు కూడా అలాగే చెబుతున్నారు..

నాన్న అంటే ఒక నమ్మకం ధైర్యం కదా..  నమ్మకం నాన్నతోనే వెళ్ళిపోయింది. ఇదిగో మళ్ళీ మీ రూపంలో తిరిగి వచ్చింది థాంక్యూ దేవా సార్.

సూర్య చిన్న చిరునవ్వుతో...
విశి … నమ్మకం ఎప్పుడూ మనుషుల్లో కాదు, మన లోపలే ఉండాలి.
ఎవరో మనకు నడవమన్నప్పుడు మనం నడుస్తాం..
కానీ ఒకరోజు మనమే మనల్ని నడిపించుకోవాలి.

మీ నాన్న ఇచ్చిన ధైర్యం ఇప్పుడు నీ గుండెలో ఉంది.
అది ఎప్పుడూ పోదు — కేవలం నిశ్శబ్దమై ఉంటుంది..
ఎవరో దాన్ని మళ్లీ గుర్తు చేస్తే… ఇలాగే మెల్లగా మేల్కొంటుంది.

మీ  నాన్న జ్ఞాపకం ఉంచు...
గెలుపు అంటే ఫలితం కాదు, తిరిగి లేచే ధైర్యం.
ఆ ధైర్యం నీవు చూపుతున్నావు.
ఇప్పుడే నువ్వు గెలుస్తున్నావు అంతే..

నీలో ఉన్న ధైర్యాన్ని జస్ట్ నేను గుర్తు చేస్తున్నాను అంతే..

విశి అలాగే చూస్తూ ఉంటే...ఇలా రా అని అక్కడ ఒక కార్నర్ టేబుల్ దగ్గర కూర్చోబెడతాడు.

సూర్య మృదువుగా...
నమ్మకం... కొన్నిసార్లు మనిషిలో కాకుండా, మన గుండె ధ్వనిలో దాక్కుంటుంది.
అది మనం మర్చిపోయినా, మన కదలికల్లో ఉంటుంది...
మన చూపుల్లో, మన మాటల్లో... కొద్దిగా నాన్నలాగా.

మీ నాన్న వెళ్లిపోయినా,
ఆ ధైర్యం మాత్రం నీ లోపలే ఉంది..
నీ లోపల ఏదో భయం. నాన్న లేరు. నేను ఒంటరినైపోయాను అని ఏదేదో ఆలోచించి ఆ ధైర్యాన్ని నొక్కి పెట్టేశావు.

ఇప్పుడది మళ్లీ తలెత్తి చూస్తోంది.

గెలవడం కంటే, ఆ ధైర్యాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యం.
అది నీలో ఉంది విశి..
అది చాలదు అనిపించవచ్చు...
కానీ ఆ ధైర్యాన్ని నిలబెట్టుకోవడమే.. నిజమైన గెలుపు.

సూర్య చూపు కాసేపు విశి ‌ మీదే ఉంటుంది.  విశి ఆలోచన ఎలా ఉందో చూస్తూ క్యూటి ఓపెన్..

విశి మాత్రం మెల్లగా చూపు తిప్పి సూర్య ని చూస్తు ఉంటుంది..
ఆ చూపులో ఆశ్చర్యం లేదు.. ఒక  నిశ్చింత ఉంది.
ఎంతకాలంగా ఎవరో ఇలా మనసుని తాకే మాటలు చెప్పలేదనిపిస్తుంది.
విశి హృదయం సూర్య ని చూస్తూ ఆలోచనల్లోకి వెళ్ళిపోతుంది.  సూర్య... విశి ని డిస్టర్బ్ చేయకుండా  చూస్తూ ఉంటాడు.
సార్ మాట్లాడినప్పుడు ఎందుకో మనసు నిశ్శబ్దమవుతుంది… సార్ మాటలు తప్ప ఇంక ఏమీ వినిపించవు.

నాన్నలాగే, మాటలకంటే ఎక్కువగా ఏదో భరోసా ఇస్తారు.
ఆ తలంపు రాగానే విశి మనసు తేలిక పడుతుంది చిన్న చిరునవ్వుతో సూర్య వైపు చూస్తూ ఉండిపోతుంది.

అది దేవా సార్ కి కాదు, తన మనసుకే...
అందులో కృతజ్ఞత, గౌరవం, కొద్దిగా తలమునకలైన భావన.

విశి చూపు దేవాపై నిలబడిపోతుంది.
అదే చూపులో ఒక మౌనమైన కృతజ్ఞత మెరిసిపోతుంది.

హలో విశిష్ట ఏం ఆలోచిస్తున్నావు అని చెయ్యి ఊపుతాడు. విశి తేరుకొని నథింగ్ సార్..  మీ మాటలు వింటుంటే  వెయ్యి ఏనుగుల బలం వచ్చేస్తుంది.

నిరాశలో కూరుకుపోతున్న వాళ్లకి మీ మాటలు ఒక వెలుగు రేఖను చూపిస్తాయి. మరి ఎక్కువగా పొగిడేయకు.  అసలే ఆకలేస్తుంది.

ఏమీ తినకుండానే వెళ్ళిపోతాను. ఆ మాటకి నవ్వుతూ ఈరోజు ట్రీట్ నాదే.. తప్పకుండా మేడం..

రండి అని అక్కడే ఉన్నా రెస్టారెంట్ కి  వెళ్లి చెప్పండి సార్.. ఏం ఆర్డర్ ఇవ్వను.  నీవు ఏది ఇచ్చిన నాకు ఒకే.. నో సార్.. ఈరోజు ట్రీట్ నాది.  సో మీరు ఆర్డర్ ఇవ్వాలి.

సరే అనే ప్రాన్స్ బిర్యానీ, ఫిష్ ఫ్రై,  గోంగూర చికెన్ ఆర్డర్ ఇస్తాడు.

సార్ ఈ ఐటమ్స్ అంటే నాకు చాలా ఇష్టం అవునా మన టేస్ట్ లు కూడా ఒకటే అన్నమాట..

ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేస్తారు. పక్కనే ఎవరో ఉన్నట్టు అనిపించి చూస్తే అక్కడ శ్రీకర్, సౌమ్య వైభవ్ ఉంటారు.

మీరు వచ్చి ఎంతసేపు అయింది అని సూర్య అడిగితే..  అదే ఇద్దరు టేస్ట్ లు ఒకటే అని మాటల్లో మునిగిపోయారు కదా.. అప్పుడే వచ్చాము.

మరి పిలవచ్చు కదా..  ఏమో లవ్ బర్డ్స్ కి డిస్టబ్ అవుతుందేమో అని శ్రీకర్ అంటూ ఉంటే..  సూర్య కాలు తొక్కుతాడు.

విశి చూసి ఏమన్నారు సార్..  అదే మా లవ్ బర్డ్స్ కి డిస్టర్బ్ అవుతుంది అని చెబుతున్నాను అంతే కదా సౌమ్య..  అంతే...

వైభవ్ మాత్రం డల్ గా కూర్చుంటాడు. ఏమైంది వైభవ్ అంత డల్ గా ఉన్నావు అని విశి అడిగితే... పో బాబి నేను నీతో మాట్లాడను.

ఇప్పుడు నేనేం చేశాను అని నామీద అలిగావు. మీరిద్దరూ లంచ్ కి వచ్చినప్పుడు నన్ను కూడా పిలవాలి కదా... ఏదో మీరు తిన్నాక మిగిలిన ఒక గుప్పెడు మెతుకులు పెడితే నాకు సరిపోతుంది కదా..

అయ్యో వైభవ్ ఎంత మాట అన్నావు.. ఈ లంచ్ ప్రోగ్రాం అనుకోకుండా జరిగినది. ఆక్చువల్గా నేను డ్రెస్సెస్ తీసుకోవడానికి అని సార్ హెల్ప్ అడిగాను.

అన్నయ్య నీకు డ్రెస్సెస్ కొనే వరకు వచ్చాడా.. లేదు లేదు హెల్ప్ అడిగా.  నేనే మనీ పే చేయాలి. కాని ఏం జరిగిందో తెలుసా..

వెంటనే విశి ఇంటికి వెళ్ళాలేమో.. ఆంటీ వెయిట్ చేస్తూ ఉంటారు కదా..

పరవాలేదులే అన్నయ్య.. బాబీని చెప్పనివ్వి. ఏదో మంచి ఇంట్రెస్టింగ్ విషయం చెబుతున్నట్టుంది. అవును సార్.
ఇది చెబితే సౌమ్యకి కూడా యూస్ అవుతుంది కదా..

అవునా నాకు కూడా యూస్ అయ్యే విషయమా.. అయితే చెప్పు వింటాను.  సౌమ్య...  మావయ్య ఫోన్ చేస్తున్నట్టున్నారు.

ఆల్రెడీ చెప్పాను బావ.  శ్రీకర్ వచ్చి తీసుకు వెళ్ళడం నాన్నకి తెలుసు. నువ్వు చెప్పు..

వావ్ సూపర్ అని చెప్పట్లు కొడుతూ ఒక వాయిస్ వినపడుతుంది. అంతే అప్పుడు దాకా నవ్వుతూ మాట్లాడిన విశి సైలెంట్ అయిపోయి అటు చూస్తోంది.

దగ్గరగా వచ్చి ఏంటి విశి.. రూపాయి... రూపాయి లెక్క వేసుకుని చూసుకునే నువ్వు.. నా దగ్గర 10 లక్షలు అప్పనంగా కొట్టేసి ఎంజాయ్ చేస్తున్నావా అని గౌతమ్ వెటకారంగా మాట్లాడుతాడు.

ఆ మాటకి సూర్యకి చాలా కోపం వస్తుంది. కానీ విశి చెప్పే సమాధానమే ఇంపార్టెంట్ అని చూస్తూ ఉంటాడు.

విశి కోపంగా నీ దగ్గర నేనేమీ కొట్టెయ్యలేదు.  అది బిజినెస్ డీల్. బిజినెస్ డీల్ ప్రకారమే నువ్వు నాకు ఇచ్చావు. అంతేగాని ఎక్స్ట్రా ఏమి ఇవ్వలేదు కదా...

అయినా మనం ఇప్పుడు ఫ్రెండ్స్ కాదు...  ఎనీమీస్ కాదు.. అలాంటప్పుడు నువ్వు నా పర్సనల్  స్పేస్ లోకి వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదేమో..

పరవాలేదు విశిష్ట.  మాటలు బాగా నేర్చావు. ఈ మాటలు అంతా నీ పక్కన ఉన్న ఈ దేవాని చూసే కదా ఎగురుతున్నావు.

లేదు నాలో ఉన్న ధైర్యం చూసి ఎగురుతున్నాను.
నాలో ఉన్న ధైర్యం నాకే చెందింది.
ఎవరూ నేర్పాల్సిన అవసరం నాకు లేదు.
ఎందుకంటే... నువ్వు దానిని నాలో చంపాలని ప్రయత్నించావు.
కానీ నేను దాన్ని నిలబెట్టుకున్నాను.

గౌతమ్ స్మిర్క్ చేస్తూ....
వావ్… పెద్ద మాటలు చెబుతున్నావు.

విశిష్ట చిన్న స్టెప్ ముందుకి వేస్తూ..
మాటలు కాదు గౌతమ్… సత్యం.
నువ్వు నా మీద చూపిన  దొంగ ప్రేమ, అవమానం, నమ్మకానికి చేసిన ద్రోహం..
అవి నాకు పాఠం నేర్పాయి.
ఇప్పుడు ఎవరి ఎదుట నిలబడాలో, ఎవరి కోసం మౌనంగా ఉండాలో నాకు స్పష్టంగా తెలుసు.

సూర్య సైలెంట్‌గా చూస్తూ ఉంటాడు.. కానీ  ఆ చూపులో గర్వం ఉంటుంది.
మనసులోనే.. ఇదే విశిష్ట...  నేను కోరుకుంది.  నీలో ధైర్యం తెగింపు మొదలవ్వాలి.

అది ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడే అడుగుపడాలి..
విశిష్ట అంత ధైర్యంగా నలుగురిలో సమాధానాలు చెబుతూ ఉంటే గౌతమ్ తట్టుకోలేకపోతాడు. ఎలాగైనా ఆ ధైర్యాన్ని బలహీన పరచాలి అనుకుంటూ..

గౌతమ్ స్మైల్‌తో...  కళ్ళలో కటువుతనంతో..
ఏం విశిష్ట… ఈ ధైర్యం అంతా ఒక్కసారిగా ఎక్కడి నుంచి వచ్చింది?
పాత రోజుల్లో అయితే నీ శబ్దం కూడా వినిపించేది కాదు.
ఇప్పుడు ఒక్కో మాట కత్తిలా విసుర్తున్నావు.

విశిష్ట సైలెంట్‌గా ఒక నిమిషం చూస్తూ..
ఈ ధైర్యం ఎప్పుడూ నాలోనే ఉంది. అప్పుడు మాట్లాడలేకపోయాను
ఎందుకంటే అప్పుడు నువ్వు నన్ను ఎమోషనల్ గా వీక్ చేసావు.
ఇప్పుడు నేను నా ధైర్యం మీద నిలబడ్డాను.
నా శబ్దం కూడా వినపడలేదు అంటున్నావు కదా అది భయం కాదు గౌతమ్… నిన్ను నమ్మిన పాపమే నన్ను మౌనం చేసింది.

గౌతమ్ దగ్గరకి వస్తూ, వాయిస్ పెంచుతూ..
ఓహ్… ఇప్పుడు నేనో విలన్ అయిపోయానా ?
నీ దగ్గర ఉన్న వాళ్లందరూ హీరోలే కదా...
ముఖ్యంగా ఈ దేవా...

ఎంత దగ్గరయ్యాడు చెప్పు విశిష్ట… నీ డెసిషన్స్ కూడా ఇప్పుడు అతడే తీసుకుంటాడా?

సూర్య కోపంతో ముందుకు రావాలనుకుంటాడు, కానీ ఆగిపోతాడు. విశిష్ట వైపు చూస్తూ... ఉంటాడు.  గౌతమ్ మాట్లాడే మాటలకి మిగిలిన వాళ్ళకి కూడా చిరాకు వస్తూ ఉంటుంది.

వైభవ్ అయితే లేచి కొట్టాలి అన్నంత కోపం వస్తూ ఉన్న సూర్య చూపులకి ఆగిపోతాడు.

విశిష్ట గట్టిగా... కంట్రోల్‌తో..
మాటల్లో తక్కువగా దూషణ, ఎక్కువగా గౌరవం ఉండాలి గౌతమ్.
ఎందుకంటే నీ గతం ఇప్పటికీ నన్ను అవమానించడానికి కాదు..
నువ్వు ఒకప్పుడు సాయం చేశావు  అని గుర్తు చేయడానికి ఉంది.

గౌతమ్ నవ్వి..
సాయం? నేను చేసానా నీకు సాయం?

విశిష్ట కళ్ళలో తడి తళుకుతో, కానీ గట్టిగా...
అవును. చేసావు.
కానీ ఆ సాయం పక్కనే నీ స్వార్థం  కూడా పెరిగింది.
అదే నిన్ను చిన్నవాడిని చేసింది…
అదే నన్ను పెద్దగా మార్చింది.

గౌతమ్ మాట దొరకక, కాసేపు నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. ఏంటి గౌతమ్ మాట్లాడలేకపోతున్నావా. నా వర్క్ ని అన్యాయంగా తీసుకుని ఏదో దానం చేస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చావు. కానీ ఆ రోజుల్లో నాకు ఆ డబ్బులే అవసరం అయ్యి  గొప్ప సాయంగానే భావించాను

విశిష్ట ప్రశాంతంగా
ఇంకోసారి నా వ్యక్తిగత స్పేస్ లోకి వస్తే..
అది పాత విశిష్ట కాదు అని నీకే తెలుస్తుంది.

గౌతమ్ వెనక్కి అడుగు వేస్తాడు. సూర్య చిన్న స్మైల్‌తో చూస్తాడు.

గౌతమ్ పరిస్థితి...

విశిష్టాలోఆత్మవిశ్వాసం.............
[+] 8 users Like SivaSai's post
Like Reply
Part - 77



విశిష్ట లో కనిపిస్తున్న కాన్ఫిడెన్స్ కి గౌతమ్ ఆశ్చర్యపోతాడు.  వెనక్కి అడుగు వేస్తూ నీ సంగతి తర్వాత చూస్తాను అని వెళ్ళిపోతాడు...

దేవ వైపు తిరిగి థాంక్యూ సార్...మీరు ఎన్నైనా చెప్పండి కానీ ఈరోజు నేను ఇంత ధైర్యంగా మాట్లాడాను అంటే అది మీ వల్లనే. మీకు ఎన్నిసార్లు థాంక్స్ చెప్పినా తక్కువే..

వీళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే సూర్య ఒక్కసారే ఓ మై గాడ్ అని చేతితో మొఖాన్ని కప్పుకుంటాడు.  శ్రీకర్ ఏమైందిరా అంటే..

అటు చూడు ఆ హిమ ఇటే వస్తుంది.  ఇక్కడ నన్ను చూసింది అంటే ఇంకా అంతే సంగతులు. సరే నువ్వు ఎస్కేప్ అవ్వు.

విశి ని వైభవ్ డ్రాప్ చేస్తాడు.  వైభవ్ కూడా తెలుసు కదరా...  మీ అన్నదమ్ములు ఇద్దరు నీ అని..  వాడు మాస్క్ పెట్టుకుని తీసుకువెళ్తాడు.

హిమ చూపు ఎంతసేపు నీపైనే ఉంటుంది కానీ మిగిలిన వాళ్ళ మీద ఉండదు కదా.. సరే అనే ఫోన్ వస్తున్నట్టుగా ఒక నిమిషం ఉండి..

విశి..  నాకు అర్జెంటు కాల్ వస్తుంది. నిన్ను వైభవ్ డ్రాప్ చేస్తాడు..  ప్రాబ్లం ఏమీ లేదు కదా..  అయ్యో సార్ మీరు వెళ్ళండి. ఓకే అని స్పీడ్ గా వెళ్ళిపోతాడు.

ఎంత తప్పించుకుని వెళదాము అనుకున్నా హిమ కళ్ళల్లో పడతాడు. సూర్యా.. సూర్య అని ఎగురుతుంది. వైభవ్ అడ్డుగా నిలబడి..

రా బాబీ.. ఇంకా వెళదాము నేను చాలా అలసిపోయాను అని అక్కడి నుండి తీసుకుని వెళ్లిపోతాడు.

సూర్య ఇక తప్పక వెనక్కి తిరిగే హాయ్..నువ్వేంటి ఇక్కడ. అది నేను అడగాలి మీరేంటి... మీలాంటి వాళ్లు కూడా షాపింగ్ కి వస్తారా..

ఏం మేం బట్టలు వేసుకోమా ఏమిటి.. ఆ మాటకి హిమ మెలికలు తిరుగుతూ... నా ఉద్దేశం అది కాదు.  మీకు సపరేటుగా డిజైనర్స్ ఉంటారు కదా.

ఎంతమంది  ఉన్నా ఒక్కొక్కసారి వచ్చి షాపింగ్ చేయాలి అనిపిస్తుంది. నీలాంటి ఫిగర్ ఇలా బయట తిరిగితే చాలా ప్రాబ్లం  కదా....

ఎంత మంది వెంట పడతారో.. డిజైనర్ ని ఇంటికి పిలిపించుకోవచ్చు  కదా.. ఇలా తిరిగితే టాన్ అయ్యిపోవు..

హ..  మాటకి  మురిసిపోతూ..  చెవి వెనక్కి  హెయిర్ తోసుకుంటూ.. పిలిపించుకోవచ్చు కానీ నాకు కూడా ఇలా షాపింగ్ చేయడం అంటేనే ఇష్టం.

చూశారా మనిద్దరి అభిప్రాయాలు కూడా ఒకటే.. అవునవును ఇప్పుడే తెలుస్తుంది.  అని ప్యాంటు పాకెట్లో రెండు చేతులు పెట్టుకుంటాడు.

  షాపింగ్  చేద్దామా అని అడుగుతుంది. ఓ.హిమ  సో సోరి ఇప్పుడే నా షాపింగ్ అవ్వడం... నా లగేజ్ వెళ్లిపోవడం జరిగింది.

ఇంతసేపు నేను బయట ఉన్న ప్రాబ్లం కదా.. నీ కన్నా ఎవరికి బాగా తెలుసు చెప్పు. నెక్స్ట్ టైం చేద్దాం. ఓకే.. యు క్యారీ ఆన్ అని హమ్మయ్య అనుకుని  మెల్లిగా జారుకుంటూ ఉంటే..

సూర్య అని పిలుస్తుంది. అబ్బా.. ఈ జిడ్డు వదిలేటట్టు లేదు అనుకుని చెప్పు హిమా అని కష్టంగా నవ్వుతాడు. ఈ సండే మీరు ఫ్రీ గానే ఉంటారా..

వై... డాడీ మిమ్మల్ని స్పెషల్గా లంచ్ కి ఇన్వైట్ చేశారు. ఆ రోజు మీరు ఫ్రీగా ఉంటే లంచ్ కి పిలుద్దామని.. నా షెడ్యూల్ గురించి నీకు తెలుసు కదా..

నెక్స్ట్ సిక్స్ మంత్స్ వరకు ఫుల్ షెడ్యూల్ లాక్ అయిపోయింది. ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ప్లాన్ చేద్దాం ఓకే.. సిక్స్ మంత్స్ తర్వాత అని ఆశ్చర్యంగా చూస్తోంది.

  మరి..  నా వర్క్ ఎలా ఉంటుందో నీకు తెలియదా.. అసలు ఇప్పుడైనా నాకు వర్క్ స్ట్రెస్ ఎక్కువ అయ్యి.. రిలాక్స్ అవుదామని ఒక మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చాను.

బట్ అస్తమానం అంటే బాగోదు కదా... సరేనా బాయ్.. టేక్ కేర్ అని వెళ్ళిపోతాడు.

వెళుతున్న సూర్యనే చూస్తూ ఇంత బిజీ పర్సన్ అంటే ఎంత రాయల్ లైఫ్. ఇలాంటి వాడిని పెళ్లి చేసుకోవాలి గాని..

ఆ గౌతమ్ గాడిని ఎందుకు అని మైమరపుగా చూస్తూ ఉంటుంది. గౌతమ్ లగేజ్ బ్యాగులతో అక్కడికి వచ్చి హిమ అని పిలుస్తాడు. ఏమిటి అని చిరాగ్గా అంటుంది.

లగేజ్ మొత్తం నాకు ఇచ్చేసి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు.  షాపింగ్ వచ్చినప్పుడు నాతో ఉండాలని తెలియదా..

కమాన్ గౌతమ్..  నన్ను వదిలేసి ముందు వెళ్ళింది ఎవరు.. నువ్వు కాదా.. ఆ విశిష్ట కనిపించింది అని సొల్లు కార్చుకుంటూ వెళ్ళావు.  ఇప్పుడు నన్ను అంటున్నావా..

నేను వెళ్ళింది ఎందుకో నీకు తెలియదా...ఎలా వెళ్ళినా సరే వదిలేసి వెళ్ళింది నువ్వు.  ఏదో తెలిసిన ఫ్రెండ్ కనిపిస్తే మాట్లాడుతూ ఉన్నాను. అది కూడా తప్పేనా..

అయినా ఈ మధ్యన నీకు నామీద అనుమానాలు ఎక్కువ అయిపోయాయి. ఇంత అనుమానం మనిషతో కలిసి ట్రావెల్ చేయాలంటే నావల్ల  కాదు.
ఇంటికి వెళ్ళగానే డాడీకి చెప్పేస్తాను.  గౌతమ్ కి నాకు సెట్ అవ్వదు.  బ్రేకప్..  మీ బిజినెస్ విషయాలు మాత్రం మీరిద్దరే హ్యాండిల్ చేసుకోండి. నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు అని ఖచ్చితంగా చెప్పేస్తాను.

తర్వాత మీరిద్దరూ పడండి అని రాని కన్నీళ్లు తుడుచుకుంటూ అడుగులు ముందుకు వేస్తుంది. అరె హిమా ఇప్పుడు నేను ఏమన్నానని అంతా బాధపడుతున్నావు అని చెయ్యి పట్టుకుంటాడు.

ప్లీజ్ గౌతమ్.. నా చెయ్యి వదులు.  ఇలా రా.. వచ్చి కూర్చో.. ఐస్క్రీం తెస్తానుండు అని తీసుకొచ్చి ఎదురుకుండా పెట్టి ఇది తిను.

చల్లబడతావు. నువ్వు ఈ మాల్ లో తప్పిపోతావేమో అని కంగారుగా అడిగాను కానీ నీ మీద అనుమానమా..  నిన్ను అనుమానిస్తే నన్ను నేను అనుమానించుకున్నట్టే..

అంతేనా .. నిజం. నన్ను నమ్ము. ఇంకా ఏమైనా షాపింగ్ ఉందా. లేదు గౌతమ్ ఇప్పటికే నువ్వు నాకోసం చాలా ఖర్చు పెట్టేశావు.  ఇంటికి వెళదాము అని లెగుస్తుంది.

సరే అని బ్యాగ్స్ మోసుకుంటూ వస్తాడు.  పిచ్చి గౌతమ్.. నాకు ఎంతవరకు కావాలో అంతవరకు నిన్ను వాడుకుంటానే ఉంటాను.

ఇలాంటివాడు నాకు సెక్యూరిటీగా వచ్చాడు అంటే నా లెవెల్ ఏ రేంజ్ లో ఉంటుందో నాకే తెలుసు.  తర్వాత ఆ సూర్యని తిప్పుకుంటాను.

బ్యాగ్స్ మోస్తూ.. మీ నాన్న నా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాను అన్నాడు అని సైలెంట్ గా ఉంటున్నాను. నా చేత నువ్వు వాచ్మెన్ పని దగ్గర నుంచి సర్వెంట్ పనిదాకా అన్నీ చేయిపిస్తున్నావు.

ఒకసారి వి. జె. స్. కంపెనీతో నా ప్రాజెక్టు ఓకే అవ్వాలి అప్పుడు నిన్ను ఎలా వాడాలో అలా వాడతాను. అది చూసి మీ నాన్న నా కాళ్లు పట్టుకుని బ్రతిమాలాలి.

ఏడవాలి. అప్పుడు..  నాకు చేస్తున్న అవమానాలకి రివేంజ్ తీర్చుకుంటాను.
కార్లో లగేజ్ సర్ది వెళదామా బేబీ అంటే.. హ బేబీ అని సూర్యనే ఊహించుకుంటూ ఉంటుంది.

సూర్య శ్రీకర్ కారులో కూర్చుని వాటర్ బాటిల్ తీసుకుని నెత్తిపై నుంచి పోసుకుంటాడు. సౌమ్య, శ్రీకర్ ఒకేసారి హే బావ అంటే..

అబ్బా.. అదేం జిడ్డు కేసు రా..  ఎంత వదిలించుకుందామంటే అంత పాకంలాగా పట్టుకుంటుంది.
మరి తమరి బ్రాండ్ ఏమిటి.. ఫ్యూచర్ జై సింహ కంపెనీస్ కి సీఈఓ. ద గ్రేట్ విక్రమ్ జై సింహ ముద్దుల గారాల కొడుకువి.

అది చాలదా.. నీ వెంటపడి సొల్లు కార్చడానికి..  నీ ప్లేసులో మన ఇంటి వాచ్మెన్ ఉన్నా సరే దానికి ఓకే. ఈ విషయం ముందే చెప్పుంటే వాచ్మెన్ పెట్టి హ్యాండిల్ చేసే వాడిని కదా..

  వాచ్మెన్ యస్ బాస్ అనగలడు గాని..నీలాగా స్పాంటెన్స్ గా కౌంటర్లు వెయ్యలేడు కదా..

ఛ..  ఈరోజు మొత్తం అంతా నా క్యూటితోనే ఉండాలి అనుకున్నాను. ఈ ఇడియట్స్ ఇద్దరు మూడు స్పాయిల్ చేశారు.

నీ క్యూటి తో టైం స్పెండ్ చేయాలంటే అవుట్ ఆఫ్ సిటీ వెళ్ళిపోవాలమ్మా.. అప్పుడే కుదురుతుంది. ఇలా లోకల్లో ఉంటే ఎలా కుదురుతుంది.

అందుకే ప్లాన్ చేశాను.  ఏమిటి..  కంపెనీతో  క్యూటి టైప్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక త్రీ డేస్ ఫుల్లుగా రౌండ్స్ వేస్తాము.

హైదరాబాద్ టు వైజాగ్.. అబ్బో మా బావ రొమాంటిక్ ఫెలో అవుతున్నాడా.. నేను అవితే గాని నీ చెల్లి ఓపెన్ అవ్వదు.

సరే.. రెండు జంటలు బైక్స్ మీద వెళదామా.. వద్దు మీకు కావాలి అనుకుంటే ఊటీ వెళ్లండి..ఏంటి బావ అంత మాట అనేసావు అని షర్టు బటన్స్ పట్టుకుని లాగుతూ ఉంటే..

ఆ చేతి మీద ఒకటి కొట్టి.. మీరు ఆల్రెడీ ఓల్డ్ లవర్స్..  మేము ఫ్రెష్ లవర్స్.  మీరు మాతో వస్తే ఎలా చెప్పు. మీరు ఏమో ఎక్స్పీరియన్స్ తో ఏదేదో చెబుతూ... చేస్తూ ఉంటారు.

మేము ఇప్పుడే కదా అడుగులు వేస్తున్నాము. కాబట్టి మీ దారి మీదే.. మా దారి మాదే.  ఆ మాటకి సౌమ్య..  బావ అక్కడ అంత సీను లేదు. మాటలే..

అమ్మని ఎంత మాట అనేసావు.  మొహమాట పడతావు.. బిగుసుకుపోతున్నావు అని చిన్నగా నేను హ్యాండిల్ చేస్తూ ఉంటే.. ఇంక లాభం లేదు..

ఈ శ్రీకర్  అంటే ఏంటో ఇంకా చూపించాల్సిందే..  ఒకప్పుడు పిల్లి లాగా ఉండేదానివి. ఇప్పుడు పులిలాగా మారిపోయావు.

ప్రతిదానికి కౌంటర్లు వేస్తున్నావు ఏమిటి సంగతి.  అయ్యో శ్రీకర్ నువ్వు ఉండగా కూడా నేను పిల్లిలాగా ఉంటే నువ్వు ఫీల్ అవుతావు కదా.. అబ్బా సెంటిమెంట్తో కొట్టమంటే నీ తర్వాతనే..

వైభవ్ విశి ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి సరే బాబీ ఇక నేను వెళతాను. హే వైభవ్ ఒక్క నిమిషం అని బైక్ పట్టుకుంటుంది.

చెప్పు బాబి నాతో  చందు విషయం మాట్లాడావు కదా..  నీకేం అర్థం అయింది..

బైక్ మీద అలాగే కూర్చుని ఒక చేతిని మడిచి.. రెండో చేతితో బుగ్గ మీద టాప్ చేసుకుంటూ..  అర్థమైనట్టు ఉంటుంది అర్థం కానట్టు ఉంటుంది.

అది దెబ్బలాడితే బాగుంటుంది. మౌనంగా ఉంటే చిరాకు వస్తుంది. దీనినే ప్రేమ అంటారు. నిజమా బాబి నీకు ఎలా తెలిసింది. ఈ మధ్యనే ఏదో తెలుస్తూ ఉన్నాయిలే..

ఈ వదిన మరిదిల తెలివి ఎటు వెళుతుందో..

కథ కొనసాగుతుంది................
[+] 9 users Like SivaSai's post
Like Reply
super story.. keep going
[+] 1 user Likes masalakiss's post
Like Reply
For some reason I feel Chandu Vaibhav should have been very spicy n fun filled
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Excellent update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
Nice development
[+] 1 user Likes Sunny73's post
Like Reply
nice update bhayya
[+] 1 user Likes shekhadu's post
Like Reply
Good morning siva garu me update kosam eduru chustu unam
[+] 1 user Likes Ajayk's post
Like Reply
Waiting for your update
[+] 1 user Likes Reddy 211993's post
Like Reply
Hope everything is fine at your end...
[+] 1 user Likes Sunny73's post
Like Reply
Urgent Work meda ma village ki Vachanu.so update 1Hour lo Vastundi 
[+] 3 users Like SivaSai's post
Like Reply
Part - 78



అది దెబ్బలాడితే బాగుంటుంది. మౌనంగా ఉంటే చిరాకు వస్తుంది. దీనినే ప్రేమ అంటారు. నిజమా బాబి నీకు ఎలా తెలిసింది. ఈ మధ్యనే ఏదో తెలుస్తూ ఉన్నాయిలే..

కానీ బాబి అని డల్ అవుతాడు. మళ్ళీ ఏమైంది.. ఎప్పుడు చూసినా దాన్ని కోప్పడతాను..  చిరాకు పడతాను.. సెటైర్లు వేస్తాను. ఇప్పుడు వెళ్లి ప్రేమ అంటే నన్ను నాలుగు పీకుతుంది ఏమో..

ఇవన్నీ ధైర్యంగా చేసినప్పుడు...నువ్వంటే నాకిష్టం ఐ లవ్ యు అని ఎందుకు చెప్పలేవు.. అప్పుడు దాని మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు కదా..

అందుకే ఎలా పడతే ఆలాగా మాట్లాడేవాడిని. ఇప్పుడు ఏదైనా తేడా వస్తే నేను ఫీల్ అవుతానేమో అని ఆలోచిస్తున్న..

నువ్వు ఫీల్ అవ్వడం కాదు.. మీరిద్దరూ ఎలా డీల్ చేస్తే హ్యాపీగా ఉంటారో అన్నది ఆలోచించు.  తనకంటూ కొన్ని ఇష్టాలు యాంబిషన్స్ ఉంటాయి కదా..

వాటిలో సపోర్టుగా నిలబడు. ఇప్పుడు మీ అన్నయ్య ఉన్నారు చూడు..

ముందు నాకు  ఒక వ్యక్తిగా పరిచయమయ్యారు.  తర్వాత లెక్చరర్ గా తెలుసు. ఇప్పుడు ఫ్రెండ్ అయ్యారు
ఇంకా.. 

హ..  ఇంకా చెప్పు బాబి.  ఏమీ లేదులే కానీ అలా నిలబడు.  ఆటోమేటిక్గా చందు నిన్ను ఇష్టపడుతుంది. ఆల్రెడీ అది నన్ను ఇష్టపడుతుందనే నా అనుమానం.

మరి ఇంకేంటి నీ ప్రాబ్లం. ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాను అని చెబితే కామెడీ చేశానేమో..  దాన్ని ఆట పట్టిస్తున్నాను అనుకుంటుందేమో..

అప్పుడు నీ ప్రేమలో ఉన్న సిన్సియారిటీ చూపించు.  అదే ఎలా..  అది తెలిస్తే నేనెందుకు ఇలా  నిలబడి ఎదుటి వాళ్ళకి  క్లాస్ ఇస్తాను చెప్పు.

నీది సేమ్ ప్రాబ్లమా.. హ.. అవును అని నీరసంగా అంటుంది.  నో ప్రాబ్లం బాబి. దీని మీద బాగా స్టడీ చేసి మన ఇద్దరం సక్సెస్ కొడదాం.

దాని కన్నా ముందు నాకు రేపు వి. జె. స్. కంపెనీతో మీటింగ్ ఉంది. సో నువ్వు కూడా అటెండ్ అవ్వాలి
  ఏ టైం.  పది కి..  తప్పకుండా వస్తాను.

రిలాక్స్టిగా పడుకో..  ఫ్రెష్ ఫేస్ తో  గుడ్ మార్నింగ్ చెప్పు.
హ్యాపీగా రేపు వర్క్ స్టార్ట్ చేద్దాం. సక్సెస్ కొడదాం.ఓకే బాయ్ అని చెప్పి లోపలికి వెళుతుంది.

పూల మొక్కల మధ్యన కూర్చుని నేహా భానుమతి జోక్స్ వేసుకుంటూ గట్టిగా నవ్వుతూ ఉంటారు.  వాళ్ళిద్దర్నీ అలా చూడగానే చాలా హ్యాపీగా అనిపించి..

వెళ్లి వెనక నుండి భానుమతి మెడచుట్టు చేతులు వేస్తుంది. అరే బంగారు తల్లి వచ్చేసావా...షాపింగ్ అయిపోయిందా.. అయిపోయింది. ఏం చేస్తున్నారు ఇద్దరు.

ఏమీ లేదు ఏదో చిట్.. చాట్ అంతే.. అవునా అని అక్కడే కూర్చుంటుంది ఇంతకీ ఏం కొన్నావు..ఈరోజు షాప్ లో ఏం జరిగిందో తెలుసా అంటీ..

చెప్పు వింటాము అని నేహా అడుగుతుంది ఫస్ట్ డ్రెస్సెస్ తీసుకోవడానికి వెళ్ళామా ? సెలెక్ట్ చేసినప్పుడు ఒక నాలుగు డ్రెస్సెస్ తీసాను కానీ ఒకటి చాలు అని ఫిక్స్ అయ్యాను.

కానీ ఈరోజు లక్కీ డ్రిప్ అంట.. నాకే వచ్చింది. ఎన్ని సెలెక్ట్ చేసుకున్నామో అన్ని ఫ్రీ. అవునా ఏ షాప్ ఏంటి.. షాప్ పేరు చెప్పగానే నేహా కి అర్థమవుతుంది. సూపర్..

నేహా డ్రెస్సుల బ్యాగ్‌ లైన్‌ని చూస్తూ..
విశి, నీ లక్‌కి సెల్యూట్ చెప్పాలి రా! మనమంతా ఎన్ని సార్లు వెళ్లినా ‘కూపన్ ఎక్స్‌పైర్డ్’ అని చెప్పేస్తారు. కానీ నీకు ఆ షాపులో కొన్న వెంటనే లక్కీడ్రిప్.  సో మేము కూడా వచ్చి ఉంటే బాగుండేది.

విశి నవ్వుతూ... అవును ఆంటీ మీరందరూ సెలెక్ట్ చేసుకున్నవి కూడా నా అకౌంట్లో తీసేసుకునే వాళ్ళము. విశి బ్యాగ్స్ లో నుంచి తీసి చూపిస్తూ ఉంటే కలెక్షన్ చాలా బాగుందిరా..
అదంతా మన స్టైల్ మీద డిపెండ్ అవుతుంది.  షాప్ వాళ్లకే అనిపించిందేమో — ఈ గర్ల్‌కి డ్రెస్ గిఫ్ట్ చేస్తే స్టోర్ నేమ్ వైరల్ అవుతుందనే!

నేహా నవ్వుతూ అంతే అయ్యుంటుంది లేకపోతే ఇన్ని డ్రెస్సెస్ ఎందుకు ఇస్తారు.

బానుమతి మైమరచి ఆ లైట్ పింక్ గౌన్ ని పట్టుకుని..
ఇది చూడరా …  మెత్తగా జారిపోతుంది. చాలా సాఫ్ట్ ఫాబ్రిక్ రా! ఇదే వేసుకుంటే  ఏ ఫంక్షన్‌కి  వెళ్లిన అందరూ నీ మీదే ఫోకస్ చేస్తారు.

అప్పుడు అందరూ ఎక్కడ కొన్నావు ఎక్కడ కొన్నావు అని అడుగుతారు..షాప్ నేమ్ చెబుతాను సో వాళ్లకి ఫ్రీ పబ్లిసిటీ.

వావ్ విశి నీకు ఎంత టాలెంట్ ఉంది. సరే అన్ని లోపల పెట్టుకో. భానుమతి నేను తీసుకువెళ్తానులే అని బాగ్స్ తీసుకుని వెళుతుంది.

భానుమతి వెళ్లిన తర్వాత విశి నేహా చేతులు పట్టుకుని థాంక్యూ ఆంటీ అంటుంది.  దేనికి రా.. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మలో చాలా మార్పు వచ్చింది.

హాస్పిటల్ కి తీసుకు వెళ్లిన ఎక్కువ సెషన్స్ అవసరం లేదు అంటున్నారు. ఇదంతా మీ వల్లనే..

నాదేముంది... అత్తయ్య మావయ్య  ఇద్దరు డాక్టర్స్.. వాళ్ళు డైరెక్షన్లో అమ్మకి ఎలా చేస్తే మంచిదో తెలుసుకొని అది ఫాలో అవుతున్నాను అంతే..

సరే వెళ్ళు.  వెళ్లి రెస్ట్ తీసుకో. రేపు నీకు ఇంపార్టెంట్ వర్క్ ఉన్నట్టు ఉంది కదా..  అవును అంటీ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది.

వెంటనే అవనికి కాల్ చేసి చెప్పాలి. మనవాడు చేసిన విషయం చెబితే ఎలా రియాక్ట్ అవుతుందో ఏమిటో అని ఫోన్ చేస్తుంది.

అవని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు నేహా అనగానే..  ఈరోజు తమరి సుపుత్రుడు ఏం చేసాడో తెలుసా.. ఏం చేశాడు అని అనుమానంగా అడుగుతుంది.

అప్పుడే నీకు కాబోయే కోడలికి ఫ్రీ షాపింగ్ చేశాడు.  మీ మాల్ లో ఉన్నవన్ని దోచిపెడుతున్నాడు. అవునా.. ఎప్పుడైనా నీకు ఒక చీరైనా తెచ్చాడా.. అడుగు.

వదిలేస్తే ఇప్పుడే నుంచే జారిపోతారు రేపు పెళ్లి అయ్యాక మనల్ని అస్సలు లెక్క చేయరు. నువ్వు అన్నది కూడా నిజమేలే గట్టిగా అడుగుతాను.

ఫోన్ పెట్టేసి ఆలోచిస్తున్న అవనినీ విక్రమ్ కదిపి ఏంటి శ్రీమతి గారు... ఏదో చించుతున్నారు. ఈరోజు తమరి సుపుత్రుడు ఏం చేశాడో తెలుసా?

నువ్వు చెప్పందే నాకెలా తెలుస్తుంది. అప్పుడే క్యూటి ని తీసుకుని షాపింగ్ లు అని తిరుగుతున్నాడు అంట.. ఓ. అవునా.. చేస్తున్న వర్క్ పక్కన పెట్టి మరి భార్య ముఖంలో మొఖం పెట్టి  అడుగుతాడు.

మన. మాల్ లోనే ఫ్రీ అని చెప్పి ఇచ్చాడంట. అలా జరిగిందా. ఎప్పుడైనా నాకు ఒక చీరైనా తెచ్చాడా.. అట్లీస్ట్ మీకు ఒక కర్చీఫ్ అయినా కొన్నాడా..

లేదు కదా.. అప్పుడే చూడండి కోడలు అవ్వకముందే అమ్మాయి కొంగ పట్టుకుని తిరుగుతున్నాడు. రేపు పెళ్లయిన తర్వాత అసలు నన్ను పట్టించుకుంటాడా..

అవని మాటలకి విక్రమ్ నవ్వుకుంటూ ఇప్పుడు నా శ్రీమతి ప్రాబ్లం ఏమిటి.. తల్లికి కొనకుండా కాబోయే భార్యకి కొన్నాడు అనా..

ఇది మరీ బాగుంది.  క్యూటి కి కొంటే నాకేంటి ప్రాబ్లం. మరి ఎందుకు ఇంత దారుణంగా ముక్కు చీదుతున్నావు. నిన్ను పట్టించుకోలేదనా లేకపోతే క్యూటి కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు  అనా..

అయ్యో నా బాధ మీకు అర్థం కావడం లేదు.  క్యూటి కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే నేనెందుకు బాధపడతానండి.  ఇప్పుడు నిన్ను పట్టించుకోవడం లేదు అని బాధ పడుతున్నావు అంతేనా.. అంతే కదా..

ఏమి పట్టించుకోలేదు.  రోజు బయటనుంచి రాగానే అమ్మ అని వెతుక్కుంటూ వచ్చి నీ ఒళ్ళు పడుకుని కబుర్లు చెబుతున్నాడు.

దానిని ఏమంటారు.  అలసిపోయి వచ్చాడు కదా.. అలా ఒళ్లో పడుకుని కబుర్లు చెప్తే వాడికి మనసు తేలిక పడుతుంది.  నాకు తృప్తిగా ఉంటుంది.

మరి దానిని ఏమంటారు. మీరు నన్ను మాటలతో మాయ చేస్తున్నారు. లేదు బంగారం ఆలోచించు. నీ కబోర్డ్ ఓపెన్ చేస్తే నీకున్న చీరలు లెక్క పెడితే కట్టని చీరలే ఇంకో సంవత్సరానికి సరిపడగా ఉంటాయి.

మరి క్యూటి పరిస్థితి.. మన పెళ్ళికి ముందు అవని పరిస్థితి.

రేపు మన కంపెనీ తో మీటింగ్ ఉంది. దానికోసం షాపింగ్ కి వెళ్ళి ఉంటారు. తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే ఏదో ట్రిక్ ప్లే చేసి ఉంటాడు.

అది అర్థం చేసుకోవాలి కానీ ఇలా అలుగుతారా ? ఏమో ఒక్కసారిగా నేహా చెప్పేటప్పటికి కొంచెం జలస్ వచ్చిన మాట నిజమే.

నా కొడుకు ముందు నాకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనిపించింది. మీరు చెప్పింది విన్నాక నిజమే కదా అనిపిస్తుంది.

నీ కొడుకు ఎప్పుడు మొదటి ఇంపార్టెన్స్ నీకే ఇస్తాడు. కావలిస్తే చూడు..  రాగానే ఈ విషయాలన్నీ చెబుతాడు. సరే వాడు చెప్పేదాకా మీరు అడగకూడదు.

వాడికి మెసేజ్ చేయకూడదు. నా మీద కూడా అనుమానమే..   కొడుకుల దగ్గరకు వచ్చేటప్పటికి.. మీ అమ్మలు మామూలుగా ఆలోచించరే..

అప్పుడు దాకాను నా కొడుకు బంగారం.  మా ఆయన సింగారం అని పొగుడుకుంటూ ఉంటారు..అదే ఇంకొక అమ్మాయి కొడుకు జీవితంలోకి వస్తుంది అనేటప్పటికి ఎంత సెల్ఫిష్ గా తయారవుతారో..

మీరు ఎన్నైనా చెప్పండి. వాడు ముందు నన్నే పట్టించుకోవాలి . నీలో ఈ యాంగిల్ కూడా ఉందా బంగారం. ఇప్పటివరకు చూడనే లేదు..

మరి ఎప్పుడు నువ్వు నా విషయంలో అలా ఫీల్ అవ్వలేదే.. ఎందుకు ఫీల్ అవ్వలేదు. మీరు గుర్తించలేదు అంతే.  అవునా ఎప్పుడు ఫీలయ్యావు చెప్పు.

ఆ జరిగిపోయినయని చెబుతూ కూర్చుంటే  పుణ్యకాలం కాస్తా వెళ్ళిపోతుంది. వెళ్ళదులే గాని చెప్పురా..  నేను చెప్పను.

నన్ను మాటల్లో పెట్టి మాయ చేస్తున్నారు. వాడు రావాలి..
చెప్పాలి. అప్పుడు దాకా మీ ఫోన్ నా చేతికి ఇచ్చేయండి.
నా మీదే అనుమానమా... కొన్ని విషయాల్లో ఎవరిని నమ్మకూడదు..అందులో మీరు వాడికి బాగా సపోర్టు.. అస్సలు నమ్మను.

ఏ భగవాన్.. మా ఆవిడలో అప్పుడే అత్తగారి క్యారెక్టర్ దూరేసింది. ఇక నా కొడుకు పని అంతే..

సూర్య విజిల్ వేసుకుంటూ వస్తూ ఉంటాడు. గదిలోకి వచ్చి అమ్మ అని పిలుస్తాడు. విక్రమ్ చూసావా అని కళ్ళు తిప్పితే.. అప్పుడే ఏమైంది అని కళ్లు ఆర్పుతుంది.

ఇవేమీ తెలియని సూర్య..  విశి తో షాపింగ్ అయినందుకు మంచి హ్యాపీ మూడ్లో వచ్చి అవని పక్కన కూర్చుని భుజం మీద చెయ్యి వేస్తాడు.

సూర్య చెబుతాడా...............
[+] 5 users Like SivaSai's post
Like Reply
(27-04-2026, 11:24 AM)SivaSai Wrote:
Urgent Work meda ma village ki Vachanu.so update 1Hour lo Vastundi 

బాబోయ్.. ఈ commitment ఏంటండి శివగారు?
Can't think of another person on this entire website, even nearest to you!!
Hats off!!

Iex Iex Iex Iex Iex
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Part - 79



సూర్య..  విశి తో షాపింగ్ అయినందుకు మంచి హ్యాపీ మూడ్లో వచ్చి అవని పక్కన కూర్చుని భుజం మీద చెయ్యి వేస్తాడు.

అవని కొడుకు చెంప పైన చెయ్యి వేసి ఏంటి నాన్న..  ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. అవునమ్మా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను.

అవునా.. ఆదివారం ఇంట్లో కూడా ఉండకుండా ఎక్కడికో వెళ్లినట్టున్నావు. విక్రమ్ తల పట్టుకుంటాడు.  ఈ ఆరాలు అడగడం ఏమిటో..

నిజంగా ఈ ఆడవాళ్ళందర్నీని ఏదైనా సీక్రెట్ మిషన్ లో పెడితే.. ఒప్పొనేంట్ వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేస్తారు అనుకో అనుకుంటూ కొడుకు వైపు జాలిగా చూస్తాడు.

తల్లి భుజం పైన తలవాల్సి తండ్రి వైపు చూస్తాడు.  విక్రమ్ చూపు తేడాగా అనిపించి ఏంటి అని కళ్ళు ఎగరేస్తాడు. అవని వైపు కళ్ళు తిప్పి మళ్లీ సైలెంట్ గా లాప్టాప్ ఓపెన్ చేస్తాడు.

కొంచెం కొంచెం మేటర్ అర్థమవుతూ ఉంటుంది..అమ్మ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ మాటకే అవని మొఖం వెలిగిపోతుంది.

ఏంట్రా చెప్పు. ఈరోజు మార్నింగ్ క్యూటి ఫోన్ చేసింది. అవునా..  దేనికి..  రేపు మన కంపెనీలో ప్రజెంటేషన్ ఉంది కదా..  సో దాని గురించి.

నిన్ను ఎక్స్ప్లెయిన్ చేయమందా? కాదమ్మా..  డ్రెస్ తీసుకోవడం గురించి. ఆడవాళ్ళ డ్రెస్సులు నీకెలా తెలుస్తాయి రా..

ఆ మాటకి విక్రమ్.. ఏ నీ చీరలన్నీ నేను సెలెక్ట్ చేయలేదా.. పెళ్లి అయిన తర్వాత అన్ని నేను సెలెక్ట్ చేసినవే కదా.. అది వేరు.

మనం భార్యాభర్తలం. వాళ్లు రేపు ఫ్యూచర్లో కాబోయే భార్యాభర్తలు. ఇంకా అవలేదు కదా..  మధ్యలో మీరు రాకండి.  నువ్వు చెప్పు నాన్న..

హ్మ్.. వాళ్ల నాన్నగారు ఉన్నన్ని రోజులు ఎక్కువగా సెలక్షన్ మొత్తం అంకుల్ దేనంట..  ప్రెసెంట్ ఆంటీ కండిషన్ తెలుసు కదా నీకు..

క్యూటికి ఒక వెల్విషర్ అంటే ప్రస్తుతం నేనే...అందుకే నా సజెషన్ అడిగింది అని అవని వీక్ పాయింట్ మీద కొడతాడు.

విక్రమ్ కొడుకు వైపు  చూసి సూపర్ రా అని కళ్ళు ఎగరేస్తాడు.  తండ్రి వీక్నెస్ వచ్చేటప్పటికి అవని మంచులాగా కరిగిపోతుంది.

నువ్వన్నది కూడా నిజమేలే.. నువ్వు కాకపోతే ఇంకెవరూ చెబుతారు అని మళ్లీ లాజిక్ గా అడుగుతూ..  మన మాల్ కే తీసుకువెళ్లకపోయావా.  అక్కడైతే క్వాలిటీ బాగుంటుంది.

విక్రమ్ తల పట్టుకుంటాడు. నేను కూడా నీలాగే ఆలోచించానమ్మ. మన మాల్ కే తీసుకు వెళ్లాను. క్యూటి  కూడా నీలాగానే..

జాగ్రత్త.. మొహమాటం.
అవసరం లేకపోతే  కొనడం ఎందుకు అని చెబుతుంది. క్యూటికి నాలుగు డ్రెస్సులు బాగా సూట్ అయ్యాయి. కలెక్షన్ అయిపోతే మళ్ళీ అలాగే రావు కదా..

తీసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటే... ఎందుకో క్యూట్ ప్లేస్ లో నువ్వే కనిపించావు అమ్మ.  ఎప్పుడూ నాన్న నీ పాస్ట్ గురించి చెబుతూ ఉండేవారు కదా..

అందుకే ఏమి చెయ్యాలా అని ఆలోచించి లక్కీడ్రిప్ ప్లాన్ వేశాను. నేను చేసింది తప్పా అమ్మ అని అమాయకంగా కళ్ళు టపటప కొడుతూ తల్లి చేతులు పట్టుకుంటాడు.

అవని కన్నీళ్లు పెట్టుకుంటూ కొడుకు చెంపలు నిమురుతూ.. లేదు నాన్న నువ్వు కరెక్ట్ గానే చేసావు. ఒక ఆడపిల్ల కష్టం తెలిసి నడుచుకుంటే అది చాలా మంచిది.

ఎప్పుడు క్యూటికి నువ్వు అలాగే అండగా ఉండు అని నుదుటన ముద్దు పెట్టుకుంటుంది.  అది చూసిన విక్రమ్ గుండెల పైన చెయ్యి వేసుకుని

అమ్మని.. పెళ్లి అవ్వకముందే మీ అమ్మని బుట్టలో వేయడం ప్రాక్టీస్ చేస్తున్నావన్నమాట అని మనసులో అనుకుంటాడు.

తండ్రి మాటలు అర్థం అయినట్టుగా ఎస్ డాడీ అని కళ్ళు టపటప కొడతాడు.. అవని కాస్త నాకు పాలు తీసుకు వస్తావా..

ఎందుకో ఆకలిగా అనిపిస్తుంది. అయ్యో ఇప్పుడే తెస్తానండి అని వెళుతుంది. అవని వెళ్ళగానే విక్రమ్ లాప్టాప్ పక్కన పెట్టి కొడుకు చేతిని వెనకకి విరిచి ఒరేయ్ నువ్వు నాకన్నా పెద్ద ముదురు అయిపోయావు.

మీ అమ్మని ఎక్కడ సెంటిమెంటుతో కొడితే పడుతుందో నీకు బాగా తెలుసు. మరి... అమ్మ దగ్గరికి వచ్చేటప్పటికి ఎందుకో తేడా కొట్టింది.

ఫేస్ చూస్తే ఒకలాగా ఉంది.  మాట చూస్తే ఇంకొక లాగా ఉంది.  అప్పుడే గెస్ చేశాను.  ఎలా రా..  క్యూటీ ఇంటికి వెళ్ళగానే షాపింగ్ చేసినవి మొత్తం..

ఆంటీకి, నేహా ఆంటీకి ఇద్దరికీ చూపిస్తుంది . సో నేహా అంటీ ఆ మ్యాటర్ మొత్తం అమ్మకి పోస్ట్ చేస్తారు. అలా ఎలా గెస్ చేసావురా..

సింపుల్.  ఆడవాళ్ళకి ఏదైనా షాపింగ్ చేస్తే ఎగ్జిబిషన్ పెట్టేదాకా అగరు కదా.. మన ఇంట్లో చూడడం లేదూ... అదే స్ట్రైక్ అయింది.

మీ అమ్మ వస్తుంది ఇంకా ఈ టాపిక్ ఆపేసేయ్..

ఇద్దరికీ పాలగ్లాస్ లు ఇస్తే..  అమ్మ  నా వల్ల కాదు. తాగురా పొద్దున్నుంచి షాపింగ్ లో తిరిగి తిరిగి అలిసిపోయి ఉంటావు అని పట్టిస్తూ ఉంటుంది.

ఒళ్ళో పడుకోబెట్టుకుని స్పూన్ తో పట్టించే.. నీ కొడుక్కి. మీరు ఉండండి.  తిరిగి.. తిరిగి కాళ్లు నొప్పులు వస్తూ ఉంటాయి.

కాళ్ళు నొప్పులుకి,  చేతులకి ఏమైనా సంబంధం ఉందా.. మీ నాన్న అలాగే అంటారు కానీ నువ్వు తాగరా.  మాకు లాప్టాప్ నొక్కి నొక్కి వేళ్ళు నొప్పులు వస్తున్నాయి. మాకు పట్టించొచ్చు కదా..

ఆ మాటకి సూర్య నవ్వుతూ... నాన్న జలస్ ఫీల్ అవుతున్నారు అమ్మ. అస్తమానం నిన్ను అంటారు కానీ నీ విషయంలో నాన్నకే ఎక్కువ అసూయ. క్యారీ ఆన్ అని చెప్పి గ్లాస్ తీసుకొని వెళ్ళిపోతాడు.

సూర్య వెళ్ళగానే చెంగు దోపుకుంటూ మీకు అసలు బుద్ధుందా.. పిల్లోడు ముందు ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదా..

మీకు పట్టించాలా..  బుల్లిబాబు వి కదా..  ఉయ్యాల కూడా వేయనా అని అడుగుతుంది.  వెంటనే అవని నీ ఒడిలోకి లాక్కుని పాల గ్లాసు నోటి దగ్గర పెడతాడు.

నాకు వద్దు.  మర్యాదగా తాగుతావా.. లేకపోతే నా స్టైల్ లో పట్టించిన.. అమ్మో వద్దులే అని  గ్లాస్ తీసుకుంటుంది. అది గుడ్ గర్ల్ లాగా తాగు.

సరే తాగాను. మీరు ఆకలని నాకు పట్టించారు. నువ్వు తాగితే నా ఆకలి తీరిపోతుంది గాని... ఏమిటే.. నీ కొడుకు ఏది చెప్పినా సరే ఏదో పురాణం విన్నట్టు..

అవునా అవునా అని అంత అమాయకంగా నమ్ముతావు. వాడు చెప్పేది నిజమో అబద్దమో తెలుసుకోవా..

ఆ మాటకి వెనక్కి తిరిగి భర్త మెడ చుట్టూ చేతులు వేసి.. వాడి చెప్పేది నిజమా అబద్దమా అన్నది అనవసరం. కానీ నాకు చెప్పాలి అనుకున్నాడు చూడండి. అదే చాలు.

ప్రేమించిన వాడికి.. పెళ్లి చేసుకున్న వాడికి కూడా కొన్ని పర్సనల్ ఉంటాయి. తల్లికి చెప్పేవి తల్లికి చెప్పాలి.  భార్యకు చెప్పేవి భార్యకి చెప్పాలి.

అప్పుడే సంసారం ప్రశాంతంగా ఉంటుంది. అబ్బో...మరి ఇన్ని తెలిసిన దానివి ఎందుకు వాడి మీద అంత రుసరసలాడేవు.

వాడి పర్సనల్ లైఫ్ అని వదిలేయకుండా...  అరే అలా వదిలేస్తాను వాడు నా కొడుకు అని ఒళ్ళో నుంచి లేచి గ్లాస్ పక్కన పెడుతుంది.

ఏ మాట కా మాట చెప్పుకోవాలి... అప్పుడే అమ్మ క్యారెక్టర్ ఎక్కుతావు. అప్పుడే భార్య క్యారెక్టర్ లోకి దూరుతావు వెంటనే కాబోయే అత్తగారు పోస్టులోకి వెళ్ళిపోతున్నావు.  ఇంత పరాకాయి ప్రవేశం మీ ఆడవాళ్ళకే చెల్లుతుందేమో..

మేము ఎంత పరకాయి ప్రవేశం చేసిన మమ్మల్ని వేలు మీద ఆడించేది మీ మగజాతే కదా...మొత్తం మా మగ జాతినే టార్గెట్ చేసావా..

కాదా..  నేను ఎంత కోపం చూపించిన మంచులాగా కరిగిపోవడానికి కారణం మీరు కాదా...  అంతేనా ఇంక ఏ విషయంలోనూ కరిగిపోవా అని అవని కొంగు పట్టుకుని లాగుతూ ఉంటాడు.

ఇంత వయసొచ్చినా సరే..  మీరు మాత్రం ఇంకా అప్పుడే కొత్తగా పెళ్లయిన కుర్రోడు లాగా ప్రవర్తిస్తాడు అని బుగ్గ మీద పొడుస్తుంది.

పిచ్చి మొహమా..  పెళ్లయి ఇన్నేళ్లయినా సరే బుగ్గ మీద దేనితో పోడవాలో  అర్థం కాదు అని...ఇలా పెదవులతో అని గట్టిగా ముద్దు పెడతాడు.

విక్రమ్ పెట్టిన ముద్దుకి సిగ్గుపడుతూ విక్రమ్ గుండెల్లో తలదాచుకుంటుంది.  హలో మేడం...నీ కొడుకుకి పెళ్లి అవుతే మనవళ్ళు వచ్చేస్తారు. ఇంకా సిగ్గుపడుతూనే ఉంటావా..

మనవళ్లే కాదు.. మునిమానవళ్ళు వచ్చిన సరే నా సిగ్గుపోదు.  మీ కొంటితనము తగ్గదు.

నీలాంటి అణుకువగా ఉన్న అందాలభరిణి భార్యగా వస్తే ఏమగాడైనా ఇలాగే ఉంటాడు.  ఏమో అవన్నీ నాకు తెలియదు. మీరు మాత్రం బంగారం.

శ్రీకర్ ఇంటికి వెళ్లి నేహా కోసం చూస్తూ ఉంటాడు.  శ్రీ అది చూసి ఏంట్రా మీ అమ్మ కోసం చకోరి పక్షులాగా వెతుకుతున్నావు.

ఈరోజు అమ్మ. ఎంత పని చేసిందో తెలుసా..  ఏమి చేసిందేమిటి అని ఫోన్ పక్కన పెట్టి మరీ కొడుకువైపు తిరిగి అడుగుతాడు.

ఏమి చేయడమా..  షాపింగ్ మాటర్ మొత్తం అవని ఆంటీకి పోస్ట్ చేసి..  అవని అంటీ కి,  సూర్యకి మధ్యలో చిన్న నిప్పు స్టార్ట్ చేసింది.

బట్ అక్కడ ఉన్నది ఎవరు ద లయన్ విక్రమ్ అంకుల్.. మొత్తం ఆర్పేశారు అనుకో..

అవని  అమాయకురాలు రా.. ఏది చెప్పినా నమ్ముతుంది. అందరూ మీ అమ్మలాగా గడుసుగా ఉండరు కదా..  నాన్న అని సైగ చేస్తాడు.

అది పట్టించుకోకుండా అసలు మీ అమ్మ ఎంత టార్చర్ పెట్టెదో తెలుసా.. వేలికేస్తే కాలు కేసేది..  కాలుకి వేస్తే వేలుకి వేసేది.

ఎక్కడికైనా వెళదాము అంటే ఎన్ని క్యూస్షన్స్ అడిగేదో..  అబబ్బ అస్సలు నమ్మేది కాదు. ఏదో నా మంచితనంతో మా సంసారం ఇలా సాగిపోతుంది.  లేకపోతే నా..

హ.. లేకపోతే నా.... ఏంట్రా  ఒక్కసారిగా నీ వాయిస్ మారిపోయింది.  మీ అమ్మలాగా మాట్లాడుతున్నావు. అమ్మలాగా మాట్లాడటం కాదు నాన్న అమ్మే వచ్చింది.

ఎక్కడ రా అని భయంగా అడుగుతాడు. మీ వెనకాల..  వెనక్కి తిరిగి...బంగారం నువ్వు ఎప్పుడు వచ్చావు రా..
కూర్చో నిలబడి నిలబడి కాళ్లు నొప్పులు వస్తాయి.

నేహా, శ్రీ ల టామ్ అండ్ జెర్రీ ఫైటింగ్..
[+] 6 users Like SivaSai's post
Like Reply
Part - 80



నేహాని చూసిన శ్రీ కంగారుగా బంగారం నిలబడి ఉంటే కాళ్లు నొప్పులు వస్తాయి రా.. వచ్చి కూర్చో. పరవాలేదు లేండి..

నేను నిలబడి నీకు మర్యాద ఇస్తాను.. అసలే నా వలన మీరు ఎంతో సఫర్ అవుతున్నారు కదా... ఆ మాట అన్న ఇడియట్ ఎవరు.

హా...అని చూస్తుంది. ఏదో ఫ్లోలో అన్నాను. నీ భయం నీ కొడుక్కి ఉండాలని ఏదో చెప్పాను బంగారం.. అంతేగాని నువ్వు ఎంత సాఫ్ట్  అన్నది నాకు తెలియదా అని బుజ్జగించడం మొదలుపెడతాడు.

తల్లిదండ్రులను చూసిన శ్రీకర్ నవ్వుతూ ఎందుకు నాన్న అమ్మ ని చూడగానే అలాగా కూల్ చేయడానికి చూస్తున్నారు.

ఇప్పుడు దాకా అమ్మ మీద చాలా సెటైర్లు వేశారు కదా.. ఒరేయ్ నువ్వు సైలెంట్ గా మూసుకుని వెళ్ళు. లేదు అంటే నీకు సౌమ్య కి మధ్యన నేను పుల్ల వేస్తాను.
నేనేమైనా మీరు అనుకుంటున్నారా... పుల్ల వేస్తే  భయపడడానికి.. ముందు అమ్మని కూల్ చేసుకుని ప్రోగ్రాం పెట్టండి.
ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు రా అని పెళ్ళాం వైపు చూస్తాడు. నేహా ఇంకా కోపంగా, శ్రీ బుజ్జగించే మోడ్‌లో... పక్కన సోఫా మీద శ్రీకర్ చూస్తూ..  వాసు, సురభి కూడా కూర్చుని కొడుకు ఎలా కూల్ చేస్తాడా అని చూస్తూ ఉంటారు.

బంగారం నిలబడి ఉంటే కాళ్లు నొప్పులు వస్తాయి రా.. వచ్చి కూర్చో. చాలాసేపటి నుంచి చెబుతున్నాను అయినా సరే నువ్వు నిలబడే ఉంటున్నావు.
పరవాలేదు లేండి.. నేను నిలబడి నీకు మర్యాద ఇస్తాను. అసలే నా వలన మీరు ఎంతో సఫర్ అవుతున్నారు కదా...

ఎందుకు బంగారం చెప్పిన డైలాగే మళ్లీ మళ్లీ చెబుతావు అరే తప్పు చేసిన వాడికి సరిదిద్దుకొని అవకాశం ఇవ్వరా..
నా బంగారం కదు... అంటూ మెల్లిగా నేహా చెయ్యి పట్టుకుని... స్మైల్ చేస్తూ దగ్గరవుతాడు

శ్రీకర్ ఆపిల్ తింటూ.. అయ్యో నాన్నా, ఇది ఏదో డామేజ్ కంట్రోల్ ఆపరేషన్ లా కనబడుతోంది. అమ్మను కూల్ చేయడం అంటే ఎక్సమ్ హాల్ లో లాస్ట్ మినిట్స్ లో ఆన్సర్స్ గెస్ చేయడంలా!

చాలు నీ కామెంట్స్... అందరూ భోజనానికి  రండి.. అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వాసు కొడుకువైపు చూసి.. ఇంత వయసు వచ్చినా పెళ్ళాన్ని కూల్ చేయడం రాలేదేంటిరా..

నా కడుపున  ఎలా పుట్టావురా..  సారీ డాడ్ నేను అమ్మ కడుపున పుట్టాను.  ఇలాంటి పిచ్చ డైలాగ్స్ కే.. అటు మీ ఆవిడ దగ్గర... ఇటు కొడుకు దగ్గర బకరా అవుతున్నావు.

శ్రీకరర్.... శ్రీ తో.. నాన్న, మీరు గమనించారా, ఇప్పుడు దాకా అమ్మ మీద మీరు ఎన్నో సెటైర్లు వేశారు కదా… ఇప్పుడు ఒక్కసారి కూల్ చేయాలంటే స్వేటింగ్..

ఓరేయ్ నువ్వు సైలెంట్‌గా మూసుకుని వెళ్ళు.. మీ అమ్మ పెట్టే భోజనం తినేసి దుప్పటి ముసుగువేయి.  మీ ఫైటింగ్ ఇంకా పూర్తి అవ్వలేదు కదా...

శత్రువులు ఎక్కడో ఉండరు రా... ఇలా కొడుకు రూపంలో పుట్టి నాన్నల్ని అమ్మ దగ్గర ఇరికించేస్తారు. మీరు డైలాగు రాంగ్ డైరెక్షన్ లో చెబుతున్నారు..

నాకు తెలుసులేవోయ్..  నాకు కూతురు లేదు కదా అందుకే నిన్ను వాడాను. నీకు ఇప్పుడు లంగా వోణి వేస్తే చండాలంగా ఉంటుంది కదా..

నా గొడవ వదిలేయండి..  అక్కడ అమ్మ పళ్ళాలు పగలకొట్టే పోసిషన్ లో ఉంది.  కూల్ చేసుకోండి.

శ్రీకర్ నవ్వుతూ.. లేదు అంటే నేను మామ్ టీమ్ లో జాయిన్ అవుతా… డైరెక్ట్ ట్రాన్స్ఫర్!

శ్రీ కోపంగా... ఒరేయ్... నిన్ను బయటికి గెంటేస్తాను  రా..

శ్రీకర్.. ఫేక్ షాక్ తో చూసి.. వెంటనే నవ్వేస్తూ.. ఎహ్! పర్లేదు... అప్పుడు నా డార్లింగ్ సౌమ్య దగ్గరికి వెళతాను.
ఈ టైంలో ఏమిటి అని అడిగితే...మా నాన్న మా అమ్మని కూల్ చేసే పనిలో ఉన్నాడు. మమ్మల్ని ఎవరినీ ఉండద్దని చెప్పాడు అని చెబుతాను.

అప్పుడు అందరూ ఏదో అనుకుని... నన్ను అక్కడే ఉండనిస్తారు.   హ్యాపీగా నా లవర్ తో డూయిట్లు వేసుకుంటాను. అక్కడ పీస్ఫుల్ అటమోసఫెర్ కూడా బాగుంటుంది.

నేహా స్మైల్ కంట్రోల్ చేసుకుంటూ... అయ్యో నాయనా..
శ్రీకర్ నువ్వు అలా వెళ్ళితే మీ నాన్న పరువు విక్రమ్ అన్నయ్య దగ్గర గోవిందో గోవిందా..

విక్రమ్ అంకుల్ దగ్గర కన్నా భరత్ మావయ్య దగ్గర అయితే ఇంకా గోవింద అనుకుంటా అమ్మ..
శ్రీ ఉడుక్కుంటూ.. ఇదేనా రా.. అమ్మ కొడుకులు ఒకటైపోయి నన్ను ఏడిపిస్తారా...మా ఇద్దరి మధ్య పుల్ల వేసి నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు ఏంట్రా..

శ్రీకర్ నవ్వుతూ...కాదు నాన్నా, పుల్ల కాదు.. ఫైర్ స్టార్టర్!

ఇక మాట్లాడింది చాలు కానీ వస్తారా అయ్యో డార్లింగ్ నువ్వు పిలిస్తే రాకుండా ఉంటామా అని శ్రీ బుద్ధిగా వచ్చి కూర్చుంటాడు.

సురభి, వాసు, శ్రీకర్ కూడా నవ్వుకుంటూ వస్తారు. డిన్నర్ టేబుల్ వద్ద..  నేహా సర్వ్ చేస్తూ ఉంటే..  శ్రీ  బాగా ఆలోచించి ఎలా కూల్ చేయాలా అని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు.

శ్రీకర్ పక్కన కూర్చుని.. మూవీ మధ్యలో పాపకార్న్ -లెవెల్ రియాక్షన్స్ ఇస్తూ ఉంటాడు.

శ్రీ... నేహా చెయ్యి పట్టుకుంటూ.. బంగారం… ఈరోజు కాళ్లు నొప్పిగా ఉన్నాయ్ కదా, ఇక నువ్వు సర్వ్ చేయకు. నేను చేసేస్తా.

నేహా ఊహించని సన్నివేశంలా.. వస్తున్న  నవ్వునీ ఆపుకుంటూ.. నువ్వే సర్వ్ చేస్తావా? అంత మాట అనేసావ్ ఏమిటి బంగారం నీకెప్పుడూ నేను సర్వ్ చేయలేదా..

హ్మ్.. లేచి వెళ్లి ఫ్యాన్ వెయ్యి అంటే..  స్విచ్ కూడా ఎక్కడుందో గుర్తు పెట్టుకోలేవు.

శ్రీ తింగరిగా నవ్వుతూ.. అవును గుర్తుపెట్టుకోలేను … కానీ నీ హృదయ ద్వారం ఎక్కడుందో నాకు బాగా తెలుసు కదా డార్లింగ్..

శ్రీకర్.... ఒక వింత ఎక్స్ప్రెషన్ పెడుతూ..  అబ్బా! ఈ లైన్ కి ఒక “ఐ రోల్ ” అవార్డు ఇవ్వాలి.

నేహా కొడుతూ వైపు చూసి..  వెటకారంగా  బాబు..
మీ నాన్న మీద జాలి వస్తుందా?

శ్రీకర్....లేదు అమ్మ, సింపతీ కాదు… కామెడీ అప్ప్రెసియేషన్!

ఆ మాటకి అందరూ నవ్వుతారు శ్రీ కోపాన్ని చూపిస్తున్నాను అనుకుంటాడు కానీ ఆ ముఖంలో కోపమే రాదు.

శ్రీ.. చాలు నువ్వూ మధ్యలో దూరకూడదు. నీ టీమ్ ఎవరో క్లియర్ చెయ్యి.

శ్రీకర్.. చూస్తున్నావుగా నాన్న..  నేను న్యూట్రల్ … కానీ కరెంట్లీ ఫుడ్ టీమ్ ఉన్నాను — హోవర్ గివ్స్ మీ ఎక్సట్రా పనీర్ కర్రీ, ఐ ’మ్ ఆన్ థెయర్ సైడ్.

ఒరేయ్ తండ్రి ద్రోహి.. ఫుడ్ కోసం ఇన్ డైరెక్టుగా మీ అమ్మ వైపు తిరిగి పోతున్నావా..

అంతేగా... అంతేగా...

నేహా చిరునవ్వుతో.. కొడుకే కర్రీ వడ్డిస్తుంది. మరి మాకు అని శ్రీ అంటే స్నేహ నవ్వుతూ ప్లేటులో పెట్టి.. చపాతీ తో తినిపిస్తుంది.. వావ్ నిజమైన ప్రేమ టెస్ట్.

శ్రీకర్.. గంభీరంగా  తాత్కాలిక సస్పెన్స్ టోన్ లో... బ్రేకింగ్ న్యూస్! మామ్ ఫీడ్స్ డాడ్! పీస్ ట్రీటి సిగ్నెడ్ అట్ డైనింగ్ టేబుల్!

శ్రీ డ్రామా టోన్ లో నోరు తెరిచి... ఆహా! నా కర్మకు పుణ్యం కలిసిందీ! నా బంగారం కోపాన్ని వదిలి ప్రేమగా తినిపిస్తుంది.తండ్రి వైపు చూసి కళ్ళు ఎగరేస్తాడు.

నేహా.. మొత్తం భోజనం తినిపించను ఏదో ఒక చిన్న ముక్క తినిపిస్తాను అంతే..  తర్వాత మీరే తీసుకు తినాలి.  ఎలాగా మొదలు పెట్టావు కదా కంటిన్యూ చేయొచ్చు కదా... హా అంటే....వద్దులే నేనే తింటాను.

శ్రీకర్. గట్టిగా నవ్వుతూ..  థిస్ హౌస్ ఇస్ ఆఫీషియల్లీ టామ్ & జెర్రీ కేఫ్!

ఇద్దరూ ఫైటింగ్ చేసుకుంటూ కూడా క్యూట్ గా ఉంటారు… నేను మాత్రం రెఫెరీ & ఫుడ్ ఫినిషెర్!

డిన్నర్ ఆల్మోస్ట్ పూర్తయింది — శ్రీ ప్లేట్ పక్కన చేతులు ముడుచుకుని, ఫేస్ - డౌన్ డ్రామా మోడ్ లో కూర్చున్నాడు. నేహా సైలెంట్‌గా చూస్తూ ఉంది.

ఇంకా ఏమైనా వడ్డించమంటారా అంటే వద్దు డార్లింగ్.. మరి ఎందుకు అలా కూర్చున్నారు..

శ్రీ చిన్న గొంతుతో, తాత్కాలిక పశ్చాత్తాప లుక్ తో..
ఏదో సారీ బంగారం… ఎవరు తప్పు చేసినా దేవుడు పనిష్మెంట్ చేసేశాడు.
అదే నువ్వు రోజూ నాకు డైట్ ఫుడ్ పెట్టడం!

నేహా మోడీ లోకి వెళ్ళేది వెనక్కి వచ్చి.. అదిరిపోయే సీరియస్ ఎక్స్ప్రెషన్‌తో ఏమిటి? ఇంత ఎమోషనల్ లైన్ పెట్టి డైట్ జోక్?

శ్రీ అలానే విచారంగా పెట్టి అవును రా… నా జీవితం ఒక పనిష్మెంట్ సీరియల్ అయిపోయింది.
బ్రేక్ఫాస్ట్ లో ఓట్స్ … లంచ్ లో బ్రౌన్ రైస్ … డిన్నర్ లో చపాతి....
చేతులు రెండు పైకెత్తి.. లార్డ్, ఫర్గివ్ మీ ఫర్ మై సిన్స్.. అండ్ ప్లీజ్ … వన్ బిర్యానీ!”

నేహా సీరియస్ గా చూస్తూ ఉంటే... వాసు తల కొట్టుకుంటూ ఇప్పుడే పెళ్ళాన్ని కూల్ చేశాడు అనుకున్నాను. మళ్ళీ మొదటికి వచ్చాడు వీడిని కాపాడడం కష్టం..

శ్రీకర్.. తండ్రి ఎక్స్ప్రెషన్ కి తల్లి కోపాన్ని చూస్తూ వస్తున్న నవ్వుని కష్టంగా ఆపుకుంటూ.. నాన్నా, నీకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటే కిచెన్ ప్లేట్ నే ట్రోఫీ గా ఇవ్వాలి.

శ్రీ రియాక్షన్ నేహా ఎక్స్ప్రెషన్......
[+] 7 users Like SivaSai's post
Like Reply
Part - 81



శ్రీకర్.. తండ్రి ఎక్స్ప్రెషన్ కి తల్లి కోపాన్ని చూస్తూ వస్తున్న నవ్వుని కష్టంగా ఆపుకుంటూ.. నాన్నా, నీకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలంటే కిచెన్ ప్లేట్ నే ట్రోఫీ గా ఇవ్వాలి.
ఆ మాటకి.. నేహా ముసిముసిగా నవ్వుతూ.. ఏం చెయ్యాలి..  నీ హెల్త్ కోసం నేనే స్ట్రిక్ట్ గా ఉండకపోతే ఈపాటికి పొట్ట ముందుకి వచ్చి మావయ్య గారి కన్నా పెద్దవారు లాగా కనిపిస్తారు అందుకే నా జాగ్రత్తలు..

శ్రీ రాని దుఃఖంతో.. అదే నా కర్మ! నేను నిన్ను ప్రేమించాను… నువ్వు నాకు ఫైబర్ ఇచ్చావు!

శ్రీకర్... తల కొట్టుకుంటూ పక్కనే వంగి గుసగుసగా చెబుతూ..  డాడ్ … ప్లీజ్ స్టాప్ బిఫోర్ షీ గివ్స్ యు ఎక్సట్రా ఫైబర్ విత్ రోలింగ్ పిన్!

అంటే అని అడిగితే..  మీరు వేసిన పిచ్చ సెటైర్ కి అమ్మకి కోపం వస్తే రెండు పీకుతుంది లేదు అంటే ఇంకా డైట్ మార్చి ఫుల్ ఫైబర్ పెడుతుంది అవసరమా..

నేహా.. శ్రీ చేసే డ్రామా కి.. ఆపుకోలేక గట్టిగా నవ్వుతుంది. చాలు చాలు… నీ డ్రామా కి ఫుల్ మర్క్స్!
రేపు బిర్యానీ పెట్టిస్తా — బట్ డైట్ వెర్షన్!

శ్రీ వెంటనే హ్యాపీగా ఫీల్ అవుతూ.. అబ్బా! అది కూడా ఒకే బంగారం — ప్రేమతో పెట్టిన బిర్యానీ కి క్యాలోరిస్ కౌంట్ ఉండదు.

ఎవరు చెప్పారు..  ఈ ప్రేమికుడు చెబుతున్నాడు ఆ మాటకి నేహా నవ్వుతూ టేబుల్ మీద ఉన్నవన్నీ క్లీన్ చేస్తూ ఉంటుంది.
శ్రీకర్ నిట్టూర్చుతూ.. మిషన్ అమ్మా స్మైల్..  సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్!

శ్రీ గర్వంగా కొడుకు, తండ్రి వైపు చూసి.. ఆపరేషన్ డ్రామా … సాధించాను.
తాతా మనవడు ఒకరినొకరు చూసుకొని ఏమిటో అని పెదవి విరుస్తారు.
నేహా నవ్వి తల ఊపుతూ ప్లేట్ తీసుకుని కిచెన్ వైపు నడుస్తుంది.
శ్రీ మాత్రం ఆ స్మూగ్ ఎక్స్ప్రెషన్ తో కుర్చీలో వెనక్కి వాలి, గెలిచిన మోడ్‌లో.
శ్రీకర్ స్లో క్లాప్స్ కొడుతూ చూస్తున్నాడు.

శ్రీ గర్వంగా చూశావా రా… ఫైనల్లీ పీస్ రిస్టోర్డ్!
మహా యుద్ధం తర్వాత స్మైల్ వచ్చింది..  నేను చెప్పానుగా ఎమోషన్ వర్క్స్ బెటర్ థన్ లాజిక్!

శ్రీకర్... హ్మ్… కానీ మీరు ఎమోషన్ వేయలేదు నాన్నా, ఫుల్ ఆన్ సోప్ అనే నాటకం వేసారు!
నెక్స్ట్ టైం బాక్గ్రౌండ్ మ్యూజిక్
కూడా పెట్టేస్తారా?

శ్రీ.. హాస్యంగా.. దానికోసం నీ శాలరీ మనీతో మ్యూజిక్ సిస్టం కొనిపెట్టాలి రా...

నా డార్లింగ్ ఎప్పుడూ నా డైలాగ్స్ కి క్లీన్ బౌల్ అని కాలర్ ఎగరేస్తాడు.

నేహా వెనక్కి తిరిగి డోర్ వద్ద నిలబడి చిరునవ్వుతో..
హే మిస్టర్ డ్రామా కింగ్…
ఈ స్మైల్ నీ డైలాగ్ వల్ల రాలేదు... నన్ను కూల్ చేయాలని ఏవో పిచ్చిపిచ్చి ప్రయత్నాలు చేసావు చూడు.. ఆ ఫన్నీ టాస్క్ కి నవ్వు వచ్చింది.
లేకపోతే వారం రోజులైనా మీరు కూల్ చేయలేరు.

శ్రీ: అబ్బో అని కళ్ళు గుండ్రంగా తిప్పుతూ.
అంటే నా  పిచ్చి ప్రయత్నాలు వల్లనా?

నేహా నవ్వుతూ వెళ్తూ  పిచ్చ ప్రయత్నాలు కాదు… ఇన్నోసెంట్, ఫులిష్నెస్! అదే క్యూట్ గా ఉంది.
అదిక్కడ ఉంచుకో, అది మాత్రమే నీ “డైట్ ప్లాన్ ”కి పెర్మనెంట్ హప్పినెస్!

శ్రీకర్ చప్పట్లు కొడుతూ..  లేడీస్ అండ్ జెంటలెమెన్, ఎపిసోడ్స్ ఎండ్స్ విత్ …
లవ్ సర్వడ్ హాట్, అండ్ డ్రామా వెల్ - కుక్కడ్..

శ్రీ నవ్వుతూ “బంగారం… ఓ బంగారం…” అని పిలుస్తుంటే, నేహా లైట్‌గా చూసి స్మైల్ ఇస్తుంది.

అప్పుడే కర్రీ ఇవ్వడానికి అని వచ్చిన విశి ఈ ఫ్యామిలీ డ్రామా చూసి చిన్న చిరునవ్వుతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది. గార్డెన్ లో కూర్చుని తండ్రిని  గుర్తు చేసుకుంటూ కళ్ళు మూసుకుంటుంది.

చాలా హ్యాపీ ఫ్యామిలీ నాన్న.. మీరు ఉండి ఉంటే మనం కూడా ఇలాగే ఉండేవాళ్ళము.  మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను.

పక్కనే ఎవరో కూర్చున్నట్టుగా అనిపించి కళ్ళు తెరిచి చూస్తుంది. శ్రీ ఉంటాడు.  అంకుల్ మీరు ఈ టైంలో.. గుమ్మం వరకు వచ్చి లోపలికి రాలేదేంటిరా..

అలా ఏమీ లేదు.. నాన్న గుర్తొచ్చారా...మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. నీకు నేను నాన్నలాగా కనిపించడం లేదా....

మీ నాన్నగారు ఇచ్చే అంత ప్రేమ నేను ఇవ్వలేకపోవచ్చు కానీ నేను నాన్ననే..  ఒక బిడ్డ బాధేమిటో నాకు తెలుసు.

వస్తున్నా ఏడుపుని ఆపుకుంటూ శ్రీని చూస్తుంది. ఇలా రా తల్లి అని భుజం చుట్టూ చెయ్య వేస్తాడు.  శ్రీ గుండెల్లో ఒదిగిపోతుంది.

పిచ్చి తల్లి నాన్న అంటే ఒక నమ్మకం, భరోసా..  అది నేను ఇవ్వగలను. రక్తం పంచి ఇస్తేనే తండ్రి కాదమ్మా..  ప్రేమను పంచి ఇచ్చే నాలాంటి వాడు కూడా తండ్రే అవుతాడు.

భగవంతుడు నాకు ఒక కొడుకుని ఇచ్చాడు. కూతురు ఉంటే బాగుండు అని ఎన్నోసార్లు అనుకున్నాను.  ఎందుకు ఇవ్వలేదా అనుకునేవాడిని.

విశి ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని ఈ బంగారు తల్లిని పంపించాలి అనుకున్నాడు. అందుకే ఇన్ని రోజులు మమ్మల్ని వెయిట్ చేయిపించాడు.

అంకుల్ మీ అబ్బాయి దూరంగా ఉంటున్నందుకు మీకు బాధ లేదా..  ఆ మాటకి చిన్నగా నవ్వుతూ శ్రీకర్ ఫుల్ ఫీల్ చేస్తున్నాడు కదా..

శ్రీ ఏదేదో చెబుతూ ఉంటే విశి నవ్వుతూ ఉంటుంది. చాలా రోజుల తర్వాత విశి కి తండ్రి తో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది.  హృదయ భారం తగ్గిన ఫీలింగ్ వస్తుంది.

రేపు నీకు ఇంపార్టెంట్ వర్క్ ఉన్నట్టుంది.  అవును అంకుల్.. విక్రమ్ సార్ ని తలుచుకుంటే చాలా భయమేస్తుంది. ఎందుకురా.

సార్ చాలా స్క్రిప్ట్ అంట కదా. కోపం కూడా ఎక్కువ అంట కదా.. ఏదైనా తప్పుగా చెబితే సీరియస్ అవుతారేమో అని భయం వేస్తుంది.

ఆ మాటకి శ్రీ నవ్వుతూ విక్రమ్ బయట ప్రపంచానికే అలా కనిపిస్తాడు కానీ సో స్వీట్.  నువ్వే చూస్తావు కదా రేపు.. ఒకసారి విక్రమ్ కి దగ్గరయ్యావు అంటే అస్సలు విడిచిపెట్టడు. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తాడు.

చుట్టూ ఉండే శత్రువుల గురించి  ఆ కోపాన్ని మెయింటైన్ చేయక తప్పదు. లేకపోతే  ఆ ఎంపైర్ ని నిలబెట్టడం అంటే మాటలా..

విక్రమ్ విషయంలో విశికి ఉన్న భయాలు కూడా మెల్లిగా తీసేస్తాడు.  సరే తల్లి వెళ్లి పడుకో.  రేపు ఫ్రెష్ మార్నింగ్ తో బయటకి రా..

ఏదైనా తేడా వస్తే చూసుకోవడానికి మేమందరం ఉన్నాము కదా..  థాంక్యూ గుడ్ నైట్ అంకుల్. మీతో మాట్లాడితే చాలా రిలీఫ్ గా అనిపించింది.

దేవా సార్ తర్వాత మీ దగ్గరే నేను ఇంత కంఫర్ట్ గా ఫీల్ అయ్యాను. స్టెప్స్ ఎక్కుతూ.. భగవంతుడు నా లైఫ్ లోకి అన్ని మంచి రోజులనే తీసుకువచ్చినట్టు ఉన్నాడు.

అది దేవా సార్ తోనే వచ్చింది. థాంక్యూ దేవా సార్ అనుకుంటూ మంచం పైన వాలుతుంది.  నిద్రలో ఉన్న సూర్య కి ఒకటే పులమారుతూ ఉంటుంది.

విశి విక్రమ్ ని కలిసిన వేళ...

కథ కొనసాగుతుంది.....
[+] 7 users Like SivaSai's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)