Thread Rating:
  • 25 Vote(s) - 3.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Part - 64



సూర్య విశి నే చూస్తూ ఉంటాడు..
గాలి జుట్టులో ఆడుతుంది.
స్కూటీ సైలెంట్‌గా నిలబడి ఉంటుంది —
కానీ ఆ నిశ్శబ్దంలోనే ఆమె హృదయం మొదటిసారి ఆయన పేరును మెల్లగా పలికినట్టుంటుంది.

ఇదంతా చూస్తున్న భవ్య తలా రుద్దుకుంటూ శ్రీకర్ సార్ ఇక్కడ అసలు ఏమి జరుగుతుంది. సైలెంట్ లవ్ యాక్షన్... అంటే...  నీకు ఎందుకమ్మా...

లవ్వుకి దూరంగా ఉంటానన్నావు కదా... అలాగే చూడు.. నాకు ఏమీ అర్థం కావడం లేదు సార్.. కొరియన్ డ్రామా మళియాళం  సబ్ టైటిల్స్ తో చూసినట్టు ఉంది..

సూర్య విశి దగ్గరికి వచ్చి వెళదామా అంటే...  ఓకే సార్ అంటుంది.  ఇద్దరు బైక్ మీద వెళుతున్న ఒక నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం కూడా ఇద్దరి మధ్యన.తెలియని ఒక వింత ఫీలింగ్.

సూర్య బైక ఆపిన..  ఇల్లు వచ్చిన.. దిగాలి అన్న ఆలోచన లేని విశి..  వెళ్లొద్దు అని మౌనంగా చెబుతున్న సూర్య మనసు..సూర్యనే చూస్తూ ఉంటుంది. సూర్య కష్టంగా ఇల్లు వచ్చేసింది అంటే..  అప్పుడు బైక్ దిగి థాంక్యూ సార్ అని చెప్పి లోపలికి వెళుతూ ఉంటుంది. నాలుగడుగులు వేసి వెనక్కి తిరిగి చూస్తూ మళ్ళీ వెళుతూ ఉంటుంది. 

విశి చూపులకి సూర్య బాగా డిస్టర్బ్ అవుతూ... మెల్లిగా బైక్ స్టార్ట్ చేసి గాలిలో తేలుతూ ఇంటికి వెళతాడు..

రాత్రి — విశి రూమ్‌లో.
టేబుల్ ల్యాంప్ కాంతి తేలికగా గోడపై పడుతుంది.
పుస్తకాలు ఓపెన్‌గా ఉన్నా, ఆమె చూపులు మాత్రం వాటిపై లేవు.
గాజు కిటికీ బయట చంద్రుడు అందంగా కనిపిస్తున్నాడు.

విశి చేతిని చెంపపై ఉంచుకుని నిశ్శబ్దంగా కూర్చుంది.
గాలిలో ఇంకా సాయంత్రపు సువాసన మిగిలి ఉంది.
ఆలోచనలు ఒక్కటే... దేవా సార్..
సార్.. చెప్పిన ప్రతి మాట డ్రైవింగ్ గురించే అయినా..
నా హృదయం మాత్రం ప్రేమ పాఠం నేర్చుకుంది.



చేతులు ఆటోమాటిక్‌గా కిందికి వెళ్లి,
స్కూటీ హ్యాండిల్ పట్టిన చోట ఉన్న వేడి గుర్తు చేసుకుంటుంది.
చిన్నగా నవ్వు వస్తుంది...
ఆ నవ్వు వెనక సిగ్గు, ఆనందం, ఆశ — మూడూ కలిసిపోతాయి.
ఎందుకింత సంతోషం ఒక సాయంత్రం కోసం?
ఎందుకింత తడబాటు ఒక స్పర్శ కోసం?”



తనకు తానే చిన్నగా స్మైల్ ఇచ్చుకుంటుంది.
గాజు మీద చెయ్యి వేసి చంద్రుని చూసి మెల్లగా గుసగుసలాడుతుంది...
థాంక్యూ సార్… నేడు నేను డ్రైవింగ్ కాదు,
నా హృదయాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకున్నాను.



లైట్ ఆఫ్ చేసి పడుకునే ముందు మరోసారి ఆ స్పర్శ గుర్తుకువచ్చి,
చిన్న నవ్వు ఆమె పెదవులపై ఆగిపోతుంది.
ఆ నవ్వే ఆ రాత్రి యొక్క చివరి వెలుగులా మెల్లగా మెరుస్తుంది.


సూర్య రూమ్ లో...
ల్యాప్‌టాప్ స్క్రీన్ వెలుతురు ముఖంపై పడుతుంది.
ఫైల్ ఓపెన్‌గా ఉంది, కానీ కర్సర్ మాత్రం కదలదు.

చేతిలో పెన్ ఉంది, కానీ కాగితం మీద ఒక్క అక్షరం రాయలేడు.
బుర్ర లో మాత్రం తిరుగుతున్నది — విశి నవ్వు, తడబాటు, ఆ సాయంత్రపు స్కూటీ సన్నివేశం.

సైలెంట్ గదిలో అతని మనసు మాట్లాడుతుంది..
ఇంతకాలం చాలామంది అమ్మాయిలను  చూసాను…
కానీ క్యూటీ చూపులో ఏదో నిశ్శబ్ద ఆకర్షణ ఉంది.
అర్థం కాని సౌమ్యత… చెప్పకపోయినా వినిపించే భావం.

కళ్ళు మూసుకుంటే ఆమె నవ్వు వినిపిస్తుంది,
ఆ స్పర్శ గుర్తుకు వస్తుంది.
తనకు తానే చిన్నగా నవ్వుకుంటాడు..
ఇది ఏమిటో నాకు తెలియదు…
ఇండియా రాగానే నిన్ను వెతకాలి..  నీకు ఏదైనా సహాయం కావలిస్తే చెయ్యాలి.. స్నేహాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అనుకున్నాను .నీకు ఎన్నో నేర్పించాలి అనుకున్నాను కానీ నేర్చుకుంటున్నది నేనే అనిపిస్తోంది.



ల్యాప్‌టాప్ క్లోజ్ చేస్తాడు.
గదిలోని నిశ్శబ్దం మరింతగా విస్తరిస్తుంది.
చందమామ కాంతి కిటికీ లోపలికి వచ్చి పడుతుంది.

సూర్య కిటికీ వైపు చూసి మెల్లగా అనుకుంటాడు...

క్యూటీ … నీ స్మైల్ ఏదో చెబుతోంది,
కానీ నేను వినకూడదన్నట్టుగా ప్రవర్తిస్తున్నాను.
ఎందుకో తెలుసా... ఆ స్మైల్ చూస్తే నేనే ముందు ఓపెన్ అయిపోతానేమో అని భయం.  నువ్వు ప్రేమిస్తున్నానని చెబితే వినాలి అన్న నా ఆశ ఎక్కడ దూరమైపోతుంది అన్న కంగారు..

చిన్న స్మైల్ ముఖంపై ఆగిపోతుంది.

విక్రమ్ సైలెంట్ గా వచ్చి కొడుకు పక్కన నిలబడతాడు. అది కూడా తెలుసుకోలేని తన్మయత్వంలో ఉండిపోతాడు. చూసిచూసి సుపుత్ర ఇంకా కలలో నుంచి బయటికి వస్తావా..

డాడ్ మీరెప్పుడొచ్చారు.. నువ్వు నా కోడలతో డ్రీమ్ లో ఉన్నప్పుడు వచ్చాను. ఆ మాటకి సిగ్గుపడుతూ పొండి డాడీ..

అబ్బో నా కొడుకు సిగ్గుపడడం కూడా మొదలుపెట్టాడు అంటే వ్యవహారం చాలా దూరం వెళ్ళినట్టు ఉంది.  మీరు ఈ టైం లో వచ్చి మరీ టీస్ చేయాల్సిన అవసరం లేదు.

ఏంటి మేటర్..  నువ్వు ప్రేమ మత్తులో పడి వెనక జరుగుతున్నది చూసుకోవడం లేదు.  ఏం జరుగుతుంది.. ఏం జరుగుతుందా..

ఆ గౌతమ్, సరళ ప్లాన్ చేస్తున్నారు అని ఫొటోస్ చూపిస్తాడు.  వీళ్ళిద్దరూ రెస్టారెంట్లో ఎందుకు కలిశారు. విశిని ఎలాగా బ్యాడ్ చేయాలి అన్న ప్లాన్ తో..

అర్థం కాలేదు.  అర్థం కాకపోవడానికి ఏముంది... ఆ సరళ నీ మీద మోజు పడింది. ఆ గౌతమ్ ఎలాగైనా విశి ని కంట్రోల్లో పెట్టుకోవాలి అనుకుంటున్నాడు కదా..

ఇద్దరు ప్లాన్ వర్కౌట్ అవ్వక ఏం చేయాలని ఈరోజు సాయంత్రం రెస్టారెంట్లో కలిశారు.  నువ్వు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఫొటోస్.. నవ్వుతూ ఉన్నప్పుడు తీసిన ఫొటోస్ అన్నీ రేపు కాలేజీలో బోర్డు మీద పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

అలా చేస్తే ఎలా  విశి తట్టుకోలేదు డాడ్ అని కంగారు పడతాడు. నా కోడలు గురించి నాకు తెలియదా.. అందుకే నా ప్లాన్లో నేను ఉన్నాను.

ఏం చేస్తున్నారు..  రేపటి వరకు వెయిట్ చేయి పుత్ర.. గుడ్ నైట్. ఇది అన్యాయం..  చెప్పి చెప్పకుండా చెబితే ఎలాగా.. మనం కరెక్ట్ గా ఉంటేనే సరిపోదు.

ఎదుటి వచ్చే ప్రమాదాలను కూడా అంచనా వేయడం రావాలి.  అప్పుడే ఒక లవర్ గా...  ఒక బిజినెస్ మాన్ గా.
  ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ మెన్ గా ఉండగలుగుతావు.  గుడ్ నైట్ అని వెళ్ళిపోతాడు..

సూర్య కోపంగా ఒరేయ్ గౌతమ్ రేపు విశికి ఏదైనా డామేజ్ జరగాలి నా చేతిలో కుక్క చావు చస్తావు అని పిడికిలి బిగిస్తాడు..

విక్రమ్ ప్లాన్ ఏమిటి..  గౌతమ్ దొరుకుతాడా.......
[+] 6 users Like SivaSai's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Part - 65



సూర్యకి ఆ రాత్రి కలత నిద్ర అవుతుంది. ఎప్పుడు తెల్లవారుతుందా..  ఎప్పుడు విశి దగ్గరికి వెళ్లాలా అని నిద్రనే త్యాగం చేస్తాడు.

పొద్దున్నే తొందరగా రెడీ అవుతూ... అద్దంలో చూసుకుంటాడు. బాగానే ఉన్నాను అని టైం చూసి ఇంకా సెవెన్ ఏ అయ్యిందా..

ఇంత పొద్దున్నే వెళ్తే క్యూటి ఏమనుకుంటుంది... కానీ క్యూటి ని చూసేదాకా నాకు కంగారు తగ్గదే..  ఎలా ఎలా అనుకుంటూ కాసేపు డాడీతో మాట్లాడితే టెన్షన్ ఫ్రీ అవుతానని విక్రమ్ దగ్గరికి వెళ్తాడు.

అవనినీ టీస్ చేస్తూన్న విక్రమ్ కొడుకుని చూసి ఏరా... మీ ఇద్దరు పని బాగుంది. ఎవరి గ్రీన్ కపుల్ కదా. అది మనం డిజైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది కానీ ఏంటి సంగతి..

పొద్దున రెడీ అయ్యావు.  కోడలు దగ్గరికి వెళ్లడానికా.. అలాగే అనుకున్నాను కానీ ఇంత పొద్దున్నే వెళ్ళితే బాగోదని.. ఆగిపోయాను.

కొత్త పెళ్ళికొడుకుకి ఆత్రం ఆగదని ఒక సామెత ఉంది రా.. అంటే..  మేటర్ తెలిసిన వెంటనే పరిగెత్తుకు వెళ్ళిపోయే నీలాంటివాడు గురించే అలాంటి సామెతలు వచ్చినవి.

చూడు మీ అమ్మ మా పెళ్లి అయినప్పుడు ఎంత టార్చర్ పెట్టింది అనుకుంటున్నావు.  అయినా సరే నిగ్రహంగా నిలబడి మెల్లగా పావులు కదిపాను.

అందరికీ మీకు కుదిరినట్టు కుదురుతుందా ఏమిటి అని అవని మూతి తిప్పుతుంది. ఇదిగో ఇప్పటికి పోలేదు మూతి తిప్పుళ్లు...

నా మూతి తిప్పులు కనపడుతున్నాయి గానీ మీరు చేసే అల్లరి మాత్రం కనిపించదు అంతే కదా..  అని పైట నడుం దగ్గర దోపి మీదకి  వస్తూ ఉంటుంది.

ఇప్పుడు నేను ఏమన్నాను అని అంత కోపం వస్తుంది.. పాపం నీ సుపుత్రుడు ఏదో సలహా కోసం వచ్చాడే.. వాడు గొడవ ముందు చూడని.. తర్వాత ఇద్దరం తీరిగ్గా దెబ్బలాడుకుందాం.

ఏంట్రా సంగతి.. ఏమో డాడీ మీరు చెప్పినప్పటి నుంచి నాకు కుదురుగా లేదు. ఆ గౌతమ్ గాడు ఎలాంటి వేస్ట్ ప్లాన్ వేశాడా అని టెన్షన్ గా ఉంది.

ఎలాంటి ప్లాన్ వేసిన సరే నా కుటుంబం దగ్గరికి రానిస్తానా.. మహామహులనే తొక్కేసిన వాడిని. అలాంటిది పిల్ల బచ్చా వీడు..

నా కోడలు జోలికి వస్తూ ఉంటే నేను చూస్తూ ఉంటానా.. నువ్వు రిలాక్స్డ్ గా నీ టైం కి నువ్వు వెళ్ళు.. కాలేజీలో జరిగే షో చూడు.  తర్వాత ఆఫీసుకి వచ్చి ఆ హిమ సంగతి చూడు...

థాంక్యూ డాడీ యువర్ మై బెస్ట్ హీరో అని కిస్ చేసి..  ఐ లవ్ యు అమ్మ అని  హగ్ చేసుకుని బయటికి వెళ్తాడు. చూసారా వాడు ముందు మీకే కిస్ చేశాడు. తర్వాత నా దగ్గరికి వచ్చాడు.

సో ముందు నీకు కిస్ చేయలేదని బాధగా ఉంది అంతే కదా.. అంతే కదా మరి.  ఫస్ట్ అమ్మ దగ్గరకే కదా రావాలి.. ఎప్పుడు వాడు మీతోనే ఉంటాడు అని మూతి తిప్పబోతు ఉంటే ఈసారి విక్రమ్ గట్టిగా ముద్దు పెడతాడు.

ఆ సౌండ్ కి కంగారుగా చుట్టూ చూసి వీపు మీద ఒక్కటేస్తుంది.  అబ్బా ఎందుకు కొట్టావే. ఏం చేస్తున్నారు మీరు.. పిల్లలు తిరుగుతున్నారు..

ఎవరి కళ్ళల్లో అయినా పడితే.. పడితే ఏముంది.  నువ్వు అడిగావు..  నేను ఇచ్చాను.  దాన్ని కూడా కొట్టడమేనా.. ఏంటో ఈ ఆడవాళ్లు అస్సలు అర్థం కారు.

అడిగింది ఇచ్చిన కోప్పడతారు.. ఇవ్వకపోయినా కోప్పడతారు. ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. అవును అర్థం అవ్వకుండానే ఇన్ని సంవత్సరాలు ముందుకెళ్ళిపోయాయా..

నీకు డౌటా నిన్ను అర్థం చేసుకుంటూ చేసుకుంటూ ఇలా నా జీవితం సాగిపోతుంది అని డ్రామాటిక్గా చెబుతాడు. మిమ్మల్ని అని చుట్టూ చూస్తూ ఉంటే..  దేనికి వెతుకుతున్నావు.

కర్ర ఏమైనా ఉందేమో అని చూస్తున్నాను. నాలుగు దెబ్బలు పడితే ఆ వాగుడు తగ్గుతుంది.  అవి దెబ్బలు పడితే తగ్గవోయ్..  ముద్దులు పెడితే తగ్గుతుంది.

బాబోయ్ శ్రీవారు కాస్త నోటికి తాళం వేయండి అని సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది.  ఇప్పటికి నీకు సిగ్గుపోలేదు..  రేపు మనవలు వచ్చే టైం కైనా పోతుందో లేదో చూడాలి ..

సూర్య ని చూసిన వైభవ్..  ఏంటన్నయ్య  ఎర్లీ గా రెడీ అయిపోయావు.  బాబి దగ్గరికి వెళ్లాలా..  అంతే కదా..  ఈ రోజు నువ్వు కాలేజీకి వస్తావా..

వై ఎనీ స్పెషల్. సంథింగ్ స్పెషల్ జరగబోతుంది. అవునా.. అయితే వస్తాను.  కాకపోతే నాకు ఎలో ఉండదేమో.  అది మన కాలేజ్.

ఏదో ఒకటి చెప్పేయ్.. నువ్వు ఇంత కోఆపరేట్ చేస్తే ఎందుకు రాను.  ఇప్పుడే వచ్చేస్తాను అని రెడీ అవ్వడానికి వెళతాడు.

వైభవ్ కూడా రెడీ అయ్యి పదా అంటే.. నేను మీ బాబీ దగ్గరికి వెళ్లి అటు నుంచి వస్తాను.  నువ్వు డైరెక్ట్గా కాలేజ్ కి వచ్చాయ్.  సూర్య  విశి ని పికప్ చేసుకోవడానికి వెళతాడు..

విశి కూడా ఆరోజు తొందరగా లేచి రెడీ అవ్వడం మొదలు పెడుతుంది.  షెల్ఫ్ లో ఉన్న డ్రస్సులన్నీ తీసి వేసుకొని చూసుకుంటూ ఉంటుంది.

ఇది బాగోలేదు..  ఇది కలర్ సూట్ అవ్వలేదు.. డిజైన్ బాగోలేదు అని ఒక పది జతలు అయిన పక్కన పెడుతుంది.

అది చూసిన భానుమతి నీకేమైనా పెళ్లి చూపులు జరుగుతున్నాయా.. ఇస్త్రీ బట్టలు అన్ని మడతలు విప్పేసావు.

ఎప్పుడు కాలేజీకి వెళ్లిన ఏమి పట్టించుకునే దానివి కాదు.  ఇప్పుడు కొత్తగా అద్దంలో తెగ చూసుకుంటూ ముస్తాబు అవుతున్నావు..

ఏమ్మా చూసుకోకూడదా..  చూసుకోకూడదని నేను అనడం లేదు. ఈ మధ్యన స్పెషల్ గా చూసుకుంటున్నావు.. ఏమిటా సంగతి అంటున్నాను.

ఏమీ లేదు.  ఇంకా కాలేజ్ అయిపోతుంది కదా... లాస్ట్ లో సీనియర్స్ కాబట్టి కొంచెం బిల్డప్ ఇద్దామని అంతే. ఇప్పుడు నిజం చెప్పవే..

నేను అబద్ధం చెప్పానని నమ్మకమా? కాదా.. నువ్వు బిల్డప్ ఇచ్చే  రకానివా... అది నేను నమ్మాలి. నమ్మినా నమ్మకపోయినా అదే నిజం అని బ్యాగ్ తీసుకుంటుంది..

తినేసి వెళ్ళు మళ్ళీ నీరసం వస్తుందని కూర్చోబెట్టి తినిపిస్తూ ఉంటుంది. తింటుంది అన్నమాటే గాని.. చూపు మాత్రం రోడ్డు మీద ఉంటుంది.

టిఫిన్ ఎలా ఉందే.. ఇడ్లీ సూపర్ అమ్మ.  కొబ్బరి పచ్చడి అదిరిపోయింది.. ప్లేటు వంక చూసి విశి తల మీద ఒక్కటి వేస్తారు.

అబ్బా అని తల రుద్దుకుంటూ  ఏమైందమ్మా.. ఒకసారి టిఫిన్ ప్లేట్ చూడు... చూసి ఏమైంది ..నువ్వేం తింటున్నావు. దోశ...  మరి ఏది బాగుందని చెప్పావు..

దోశే బాగుందని చెప్పాను. ఈసారి నిజంగానే కొడతాను. ఏం ఆలోచిస్తున్నావు.. నీ మనసు ఏం కోరుకుంటుంది.  దోశ తింటూ ఇడ్లీ బాగుంది అంటున్నావు. తినేది పల్లీ చట్నీ అయితే కొబ్బరి చట్నీ అంటున్నావు.

అది అమ్మ ఒక ప్రాజెక్టు గురించి ఆలోచనలో ఉన్నాను. అది సక్సెస్ అవుతుందా లేదా అని టెన్షన్ పడుతూఉన్నాను. నిజంగా అంతేనా.. ఇంకా ఏదైనా ఉందా..

నా బంగారు తల్లి.. నా బుజ్జి తల్లి..  మా అమ్మకి అబద్దం చెబుతానా..  చెప్పి నేను ఉండగలనా..  నువ్వు మీ నాన్నలాగా మాయ చేయడంలో ముందు ఉంటున్నావు.. అని మొత్తం తినిపించి.. ఇదిగో లంచ్ బాక్స్ అని ఇస్తారు థాంక్యూ అని గబగబా పరిగెడుతుంది.

విశి కూల్..  ఇంట్లో అమ్మే నిన్ను కనిపెట్టేస్తుంది.  అలాంటిది దేవా సార్ కనిపెట్టలేరా...జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. లేకపోతే  పెద్ద బఫూన్ లాగా మారిపోతావు అనుకుంటూ నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది.

అది చూసిన భానుమతి ఏమిటో ఈ పిల్ల..  అప్పుడే పరిగెడుతుంది అప్పుడే నడక స్పీడ్ తగ్గించింది..  తనలో తానే నవ్వుకుంటది. ఏదేదో ఆలోచిస్తుంది.  ఈయన రాగానే వెంటనే మంచి సంబంధం చూడమనాలి...

విశి గేటు బయటకు వెళ్లి దేవా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.  చూడాలని ఉన్నా చూడలేకపోతూ ఉంటుంది. బ్యాగు నలిపేస్తూ ఉంటుంది.

బైక్ సౌండ్ వినపడగానే విశి గుండెలు అదురుతాయి... బుగ్గలు సిగ్గుతో కందిపోతాయి.  పెదవులు అదురుతూ ఉంటాయి.

సూర్య కి ఇంచుమించుగా అలాగే ఉంటుంది.  కంట్రోల్స్ సూర్య. నువ్వు బయటపడ్డావు అంటే  నీ డ్రీమ్ ఎగిరిపోతుంది..
గేటు దగ్గర నిలబడి ఉన్న విశి చేతిలో బ్యాగ్ కొంచెం వణుకుతోంది.
బైక్ సౌండ్ దగ్గరపడుతున్న కొద్దీ గుండె తడబడుతోంది.
తన మీదేకే వస్తున్నాడన్న ఫీలింగ్... అయినా చూపు పైకెత్తలేకపోతుంది.
చూడాలని ఉన్నా చూడలేకపోవడం... అదే ప్రేమని బాధగా మార్చే క్షణం.

సూర్య ఆగి హెల్మెట్ తీసేసినపుడు ఇద్దరి కళ్ళు క్షణం కలుస్తాయి.
వెంటనే దృష్టి వేరే దిశలోకి తిప్పేస్తారు.
ఎంత తెలుసుకున్నా, ఎంత చెప్పాలని ఉన్నా.. ఒక మాట చెప్పేస్తే...
ఎదుట మనిషి ఏమనుకుంటారో అన్న సంకోచం.. ఈ స్నేహం ఏమైపోతుందో అన్న భయం..
ఆ బంధం మొత్తం వాడిపోతుందేమోనని భయంతో,
ఇద్దరూ తమ మనసు తాళం వేసుకున్నట్టుంటారు.

గాలి తాకిడిలో మెల్లగా విశి జుట్టు సూర్య చెంప మీద తగులుతుంది..
అతని ఊపిరి కదిలిపోతుంది.
ఆ క్షణంలో ప్రేమ శబ్దం లేని ఒక అరుపు లా మారిపోతుంది.



విశి సూర్యనే చూస్తూ మనసులో..
“ఎందుకిలా దగ్గరగా ఉన్నా... ఎంత దూరంగా అనిపిస్తావు దేవా సార్...”

విశి మనసులోమాటలు అర్థమైన సూర్య  అంతర్గతంగా..
“నీ కళ్ళలో నేనుంటానని నాకు తెలుసు విశి... కానీ నువ్వు బయటపడ్డావంటే..
నా కలలే నిజం అవుతాయి .”
ఓపెన్ అవ్వు క్యూటీ..

ఒక చిన్న చిరునవ్వు, ఒక సైలెంట్ బ్రేక్.
విశి తల వంచుకుంటుంది, సూర్య దృష్టి వేరే దిశలోకి.
ఇద్దరి మధ్య గాలి కూడా ఏం చెప్పాలో తెలియక నిశ్శబ్దంగా ఆగిపోతుంది.


విశి సైలెంటుగా బైక్ ఎక్కుతుంది..
బైక్ మెల్లగా కదులుతోంది.
సూర్య దృష్టి రోడ్డుపైనే ఉంది, కానీ చెవులు వెనుక నుండి వచ్చే విశి ఊపిరి తాకిడిని మాత్రమే వింటున్నట్టుంటాయి.

విశి హెల్మెట్ లోపల మెల్లగా కళ్ళు మూసుకుంది..
గాలి జుట్టు తాకుతూ చెంపలపై ఆడుకుంటుంది.
ఆ తాకిడిలో సూర్య వాసన ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది.

మాటలు లేవు.
కానీ ప్రతి మలుపు, ప్రతి బ్రేక్ దగ్గర..
సూర్య వేళ్ళు క్లచ్‌పై తడబడినపుడు,
విశి మనసు ఒక్క క్షణం అతని చేతి దగ్గరే ఆగిపోతుంది.

వెనుకనుంచి పట్టుకున్న గ్రిప్‌లో ఒక జాగ్రత్త,
అదే సమయంలో ఒక మౌనం.
ఎవరూ చెప్పలేని, కానీ ఇద్దరికీ అర్థమయ్యే దూరం.

ఆ మధ్యలో గాలి కూడా ఒకసారి నిట్టూరుస్తుంది.
ఒకరి హృదయమంతా మరొకరి వెనుక కదిలిపోతూ ఉంటుంది.


బైక్ నీడ రోడ్డుపై సాగిపోతూ ఉంటుంది.
మధ్యలో ఒక నిశ్శబ్దపు దారంలా వారిని కట్టేసినట్టుగా.
సూర్య కళ్ళలో చిన్న స్మైల్, విశి పెదవులపై ఒక మృదువైన నిట్టూర్పు...
“ఎదురుచూసే మనసు... చెప్పలేని ప్రేమ...”

  కాలేజ్ వస్తుంది.  బైక్ ఆపగానే విశి  బైక్ దిగి మెల్లిగా థాంక్యూ అని చెప్పి పరుగు అందుకుంటుంది. వెళుతున్న విశి నే చూస్తూ ఉంటాడు.

కాలేజీలో...

కథ కొనసాగుతుంది...
[+] 8 users Like SivaSai's post
Like Reply
Excellent update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
Good one.. a bit too poetic!!
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
ఇక్కడ విశీ కి, అక్కడ సూర్య కి Loveria టెంపరేచర్ పెరుగుతుంది

గౌతమ్ గాడికి కాలేజీ లో సినిమా స్టార్ట్
[+] 1 user Likes Sunny73's post
Like Reply
Part - 66



కాలేజీలో అప్పటికే గుసగుసలు మొదలవుతాయి. ఒకరిని ఒకరు చూసుకుంటూ ఎవో చెప్పుకుంటూఉంటారు. సూర్య అందరినీ అబ్సర్వ్చేస్తూ ఉంటాడు.

విశి ఏది చూసే పరిస్థితుల్లో ఉండదు. బ్యాగ్ ని నలుపుతూ తల కిందకి దించి నవ్వుకుంటూ క్లాస్ కి వెళుతుంది. సూర్య కూడా బైక్ పార్క్ చేసి చూసుకుంటూ స్టాఫ్ రూమ్ కి వెళతాడు.

శ్రీకర్..  వచ్చావా నీ కోసమే వెయిటింగ్..  నా కన్నా ముందే వచ్చావు.. నువ్వు విశిని తీసుకొస్తావు కదా అని వచ్చేసాను.

వచ్చేటప్పటికీ ఇక్కడ ఎంత హాట్ టాపిక్ జరుగుతుందో తెలుసా...ఓ మై గాడ్ అసలు అనుకోలేదు.  విషయం ఏంటో చెప్పరా బాబు..

నిన్న నాన్న అలాగే చెప్పి చెప్పకుండా చెప్పారు. ఇప్పుడు నువ్వు అదే పని చేస్తున్నావు.. అంకుల్ చెప్పారా అని ఆశ్చర్యంగా అడిగితే.. హ అవును.

అయితే నువ్వు వచ్చి మీటింగ్ బోర్డు మీద ఉన్నది చూడాల్సిందే రా అని చెయ్యి పట్టుకుని లాక్కువెళతాడు. విశి క్లాసులోకి వెళ్ళేటప్పటికి భవ్య ఎదురవచ్చి విశి రా.. రా అని అరుస్తుంది.


ఏమైంది ఎందుకలా అరుస్తున్నావు.. నీకు ఇంపార్టెంట్ విషయం చూపించాలి రా అని లాక్కు వెళుతుంది. అబ్బా వస్తున్నాను బాబు అని వెళుతుంది.

చూడు అని బోర్డు వైపు చూపిస్తుంది. శ్రీకర్ కూడా అలాగే చూపిస్తే.. విశి సూర్య ఇద్దరు ఆశ్చర్యపోతారు.  ఆ ఫోటోలు వైపు మార్చి మార్చి చూస్తారు..

విశి కళ్ళు నలుపుకొని చూస్తూ ఉంటే..  సూర్య కన్నింగ్ గా నవ్వుతాడు. ఏమిటే ఈ వైపరీత్యం అని అడిగితే.. నీ వల్ల వర్క్ అవుట్ అవ్వదేమో అనుకుని ఆ గౌతమ్ గాడు సరళ మేడం ని పట్టుకున్నట్టు ఉన్నాడు.

గౌతమ్ కి కావాల్సింది ఆర్కిటెక్చర్ కదా కంప్యూటర్ మేడంతో ఏం పని.. ఆ మాటకి సూర్య..  రావాల్సిన చోట్ల డౌట్స్ రావు కదా అనుకుంటూ ఉంటాడు.

ఏమో అవన్నీ మనకేలా తెలుస్తాయి. రెస్టారెంట్లో మీటింగ్ అంట.. నిన్న కాలేజీలో అబ్బో ఇద్దరి మధ్యన చాలా స్టోరీ నడుస్తుంది  అంట..

నువ్వు చూసావా అని అడుగుతుంది.  చూడడం ఎందుకు.. డైరెక్ట్ గా కనపడుతున్నాయి కదా.  చూడు..
మన కళ్ళతో చూడనివి, చెవులుతో వినని ఏ విషయం అయినా సరే గుడ్డిగా ఫాలో అవ్వకూడదు.

ఒకవేళ అది నిజమైన అది పూర్తిగా వాళ్ళ పర్సనల్ మ్యాటర్.  మనకి ఎటువంటి సంబంధం లేనిది. ఎదుటి మనిషిని జడ్జ్ చేయడానికి మనం ఎవరని చెప్పు...

విశి చెప్పిన సమాధానానికి సూర్య అబ్బురంగా చూస్తాడు. ఎంత మెచ్యూరిటీగా ఆలోచిస్తున్నావు.నీకు హాని తల పెట్టాలి అనుకున్న వాళ్ల గురించి కూడా తప్పుగా అనుకోవడం లేదు.

నిజంగా నువ్వు చాలా గ్రేట్ క్యూటి.. రోజు రోజుకి నచ్చేస్తున్నావు. బావ మరీ అలా సొల్లు కార్చేలాగా చూడకు..  స్టూడెంట్స్ అందరూ ఇక్కడే ఉన్నారు.

వెంటనే సూర్య తమాయించుకుని ఏం చేస్తున్నారు..  అందరు క్లాసులకు వెళ్ళండి అని ప్యూన్ ని పిలిచి ఆ ఫొటోస్ అన్నీ రిమూవ్ చేసేయ్ అని చెబుతాడు..

సూర్య శ్రీకర్ స్టాఫ్ రూమ్ లోకి వెళ్ళేటప్పటికి సరళ ఏడుస్తూ ఉంటుంది.  తెలిసిన లెక్చరర్స్ కొంతమంది ఊరుకో పెడుతూ ఉంటే.. కొంతమంది ఈవిడకి ఇలాగే అవ్వాలి.

ప్రతి ఒక్కరితో ఎలా మాట్లాడుతుంది. కొంతమంది లెక్చరర్స్ ని తినేసేలాగా చూస్తుంది అని గుసగుసలాడుకుంటూ ఉంటారు.

ఆ మాటలు వినిపిస్తూ ఉంటే సరళ తలకొట్టేసినట్టుగా ఉంటుంది. ఏం చేయాలి అనుకుంటే ఏం జరిగింది అని ఇంకా కుంగిపోతు ఉంటే.. సూర్య వాటర్ బాటిల్ తీసుకువెళ్లి సరళ టేబుల్ మీద పెట్టి తాగండి మేడం అని చెబుతాడు.


ఆ పిలుపుకి పైకి చూసి దేవా సార్ అని మళ్ళీ రాగం అందుకుంటుంది. ఎందుకు మేమ్ ఏడుస్తున్నారు.. ఇప్పుడు ఏమైందని...

ఆ ఫొటోస్ చూసి ఎవరైనా ఏమి అనుకుంటారు. మీరు.
మీ వుడ్ బి కలిసి దిగారు అనుకుంటారు. అంతే కదా అని కొంచెం మంట రాజేస్తాడు.

సార్.. అతను నాకు కాబోయే హస్బెండ్ ఏమిటి.
ఎవరు చెప్పారు అని రంకెలు వేస్తూ ఉంటే..  భలే వారే అంత క్లోజ్ గా ఉండేది ఎవరితోనో తెలియదా..

  ఊరుకో పెడుతున్న బ్యాచ్ అంతా అవునా సరళ మేమ్.. మాకు ఎవరికీ చెప్పలేదు. పార్టీ అడుగుతామన.. అందుకే ఏడుస్తున్నారా..

గుసగుసలాడుతున్న బ్యాచ్ కూడా వచ్చి కంగ్రాట్స్ మామ్.. పార్టీ ఎక్కడ.. ఎంగేజ్మెంట్ ఎప్పుడు జరిగింది.. మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా..

ఒక్కసారే వెడ్డింగ్ కార్డ్ తో పాటు స్వీట్స్ ఇవ్వాలి అనుకున్నారా..  ఈ విషయం మీరు చెప్పకుండా తెలిసిపోయింది అని బాధపడుతున్నారా అని ఎవరికి తోచిన విధంగా వాళ్ళ మాట్లాడుతూ ఉంటే...

సూర్య, శ్రీకర్ వాళ్ళ ప్లేస్ కి వెళ్ళి కూర్చుని ఈ డ్రామా అంతా చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు.

కాలేజీలో ఏం జరిగిందో తెలుసుకోవాలి అని గౌతమ్ అప్పుడే సరళకి కాల్ చేస్తాడు. ఆ ఫోన్ చూసి సరళ తల పట్టుకుంటే.. మీ ఫియాన్సీ కాల్ చేసినట్టు ఉన్నాడు మేడం..

మాట్లాడండి అని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అందులో కొంచెం యాక్టివ్గా ఉన్న లెక్చరర్ స్పీకర్లో పెట్టండి మేడం.. మేము కూడా వింటాము.

ఎంత రొమాంటిక్ పర్సన్ అన్నది మాకు తెలుస్తుంది.. ఏమంటారు.. అని మిగిలిన లెక్చరర్స్ ని అడిగితే పక్కనోళ్ళ విషయాలు వినడం అంటే జనానికి మహా సరదా కదా...

అందరూ అవును అవును అని అరుస్తూ ఉంటారు. ఇప్పుడు ఎందుకులే అని సరళ వెంటనే ఫోన్ కట్ చేస్తోంది. మీరిద్దరే సీక్రెట్ గా మాట్లాడుకోవాలా..

ఇలాగంటే మేము డిస్టర్బ్ చేసేవాళ్ళం కాదు కదా...  మీరు చేయండి మేము పక్కకి తప్పుకుంటాం అని లెక్చరర్స్ అందరు ఎవరు ప్లేస్ కి వాళ్ళు వెళ్లిపోతారు.

కట్ అయిన ఫోన్ చూస్తూ..గౌతమ్..  ఎందుకు కట్ చేసింది. అక్కడ మేటర్ ఏంటో నాకు తెలియాలి కదా అని మళ్ళీ కాల్ చేస్తాడు.

ఈసారి లిఫ్ట్ చేయకపోతే బాగోదు అని కొన్ని లిఫ్ట్ చేసి మళ్ళీ కాల్ చేస్తాను పెట్టేయ్ అని స్లోగా అంటుంది.  ఏమయింది  సరళగారు.. నాకు ఏ విషయం చెప్పలేదు..

ఇక్కడ నేను ఎంత కంగారు పడుతున్నాను తెలుసా అని ఇటు పక్కన సరళ పరిస్థితి అర్థం చేసుకోకుండా తన ఫ్లోలో అడుగుతూ ఉంటే తల పట్టుకుంటుంది.


సరళ తల పట్టుకోవడం చూసి పక్కన ఉన్న ఒక లెక్చరర్ ఏంటి మేడం..  మీ వారు ముద్దడుగుతున్నారా ఏమిటి.. సిగ్గుపడుతున్నారు. 

ఈవీడికి ఇలా అర్థమయిందా అనుకొని పళ్ళు అన్ని బయటపెట్టి కొంచెం అలాంటిదే. జస్ట్ ఎ మినిట్ అని బయటికి వచ్చి నేను తర్వాత చేస్తాను అని చెబుతున్న..

మీ ఫ్లోలో మీరు మాట్లాడకుంటు వెళ్ళిపోతారేమిటి. అసలు ఏం జరిగిందో చెప్పండి. అ...అని అరుస్తూ మనం అనుకున్నది ఒకటి జరిగింది ఇంకొకటి...పెట్టేయండి అని ఫోన్ పెట్టేస్తుంది.

లోపలికి వస్తున్న సరళ కి సూర్య ఎదురు వెళ్తాడు. సూర్యని చూడగానే కళ్ళల్లో నీళ్లు తిప్పేస్తూ సార్ ఆ అబ్బాయి ఎవరో నిజంగా నాకు తెలియదు.

  ఆ అబ్బాయితో కలిసే కదా విశిష్ట ని ఆన్ పాపులర్ చేయాలి అనుకున్నారు...

ఆ మాటకి భయంగా చూస్తూ ఈ విషయం మీకు ఎలా తెలుసు. చెప్పాను కదా ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే నేనేమిటో చూపిస్తాను అని.

మేడం.. మిమ్మల్ని విశిష్ట ఏమి చేసింది.  తను ఒక హార్డ్ వర్క్ ర్... సిన్సియర్ గా చదువుకుంటుంది. ఫాదర్ అర్ధాంతరంగా లోకాన్ని విడిచి వెళ్ళిపోతే  పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ... తల్లిని చూసుకుంటుంది.

అలాంటి అమ్మాయి మీద పగ పెంచుకుంటారా.. ఇదేనా మీరు చదువుకున్న చదువుకి అర్థం..

కర్మ అనేది ఒకటుంటుంది మేడం. మనం ఏదిస్తే అదే తిరిగి వస్తుంది. అది తెలుసుకోకుండా వెర్రి వేషాలు వేస్తే ఇదిగో ఇలాగే బొక్క బోర్లపడతాము.

ఇప్పుడైనా మనిషిగా మారండి అని సూర్య వెళ్ళిపోతాడు. సరళ సిగ్గుతో తలదించుకొని తన ప్లేస్ కి వెళ్లి కూర్చుంటుంది.

సరళ నిజంగా మారిందా.....
[+] 7 users Like SivaSai's post
Like Reply
Part - 67



సూర్య శ్రీకర్ వైపు చూస్తూ నేను ఆఫీస్ కి వెళుతున్న.  నువ్వు వస్తావా.. పద.  ఇక్కడుండి ఈ ఏడుపులు చూసేదానికి అన్న అదే బెటర్.

వైభవ్ వస్తానన్నాడు.  వచ్చాడా..  వచ్చాడు.  బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు అని వైభవ్ దగ్గరికి  వెళ్తారు.
వైభవ్ అక్కడ వెయిట్ చేస్తూ... ఎంతసేపు అన్నయ్య..

మేటర్ తెలిసిందా.. చూశాను చాలా డ్రామా జరిగింది కదా.. ఇప్పుడు అక్కడ ఇంకో డ్రామా మొదలవుతుంది పదండి అని ముగ్గురు వెళతారు.

హిమ ఆ రోజు కూడా ఆఫీసు ముందు వెయిట్ చేస్తూ ఉంటే.. బైక్స్ దూరంగా ఆపి... వాళ్ల కోసం వెయిట్ చేస్తున్న కారులో ముగ్గురు వెళతారు.

కావాలనే హిమ ఉన్న వైపుకి సూర్య.. కూర్చుని..కార్ విండో కొద్దిగా దించి ఉంచుతాడు. హిమ ముందే నుంచి వెళ్లేటప్పుడు చాలా స్లోగా వెళతారు.


హిమా సూర్యని చూసి..  సూర్య సూర్య అని పిలుస్తూ ఉంటుంది.  ముందు విననట్టే వెళ్లి..  తర్వాత చూసి కారు ఆపు అని దిగుతాడు.

సెక్యూరిటీ వైపు చూసి పంపించండి అని చెబితే..  గేట్స్ తీస్తారు.  హిమ సెక్యూరిటీని పొగరుగా చూసి సూర్య ముందుకు వెళ్లి అమాయకంగా ఫేస్ పెట్టి నుంచుంటుంది.

ఏమైంది ఏదైనా ప్రాబ్లమా.. చాలా టైడ్ గా ఉంది.  నుంచోలేక పోతున్నాను హెల్ప్ చేస్తావా.. వైభవ్ అది చూసి ఓరిని దీని వేషాలో..

ఇప్పుడు అన్నయ్య దీన్ని ఎత్తుకుని తీసుకువెళ్లాలా... అది జరుగుతుంది అనే అనుకుంటున్నావా..  జరగదని తెలుసు కానీ.. అసలు ఏం చేయాలనుకుంటుందో చూడాలి అని కారుకి జారిపడి చూస్తూ ఉంటారు.

ఒక్క నిమిషం అని ఆఫీసులో ఉన్న మెడికల్ హెల్ప్ కి ఫోన్ చేస్తాడు.  వీల్ చైర్ తీసుకురమ్మని చెబుతాడు. ఆ మాట వినగానే హిమ కంగారుపడుతూ..

ఇప్పుడు వీల్ చైర్ ఎందుకు.. నువ్వే కదా హెల్ప్ చేయమని అడిగావు.  సో కాల్ చేశాను.. అయ్యో సూర్య నేను అలా వెళ్ళితే అందరూ పేషంట్ అనుకుంటారు.

నువ్వు నా చెయ్యి పట్టుకుని నా భుజం మీద చేయి వేసి తీసుకు వెళితే చాలు.. నో హిమా మనిద్దరం అలా వెళ్ళాము అంటే ఆఫీస్ లో రుమర్స్ స్ప్రెడ్ అవుతాయి.

అది నీకు అస్సలు మంచిది కాదు.  నీకు ఏదైనా బ్యాడ్ నేమ్ వస్తే నేను అసలు తట్టుకోలేని అంతే ఇన్నోసెంట్ గా చెబుతాడు.

హౌ సో స్వీట్ సూర్య అని మెలికలు తిరుగుతుంది. శ్రీకర్ అది చూసి ఇక నావల్ల కాదు చూడడం. నేను వెళ్ళిపోతున్నాను. నేను వచ్చేస్తాను బావా అని ఇద్దరు వెళ్ళిపోతారు.

హెల్పర్స్ వీల్ చైర్ తీసుకోవస్తే..  హిమని అందులో కూర్చోబెడతారు.  సూర్య వాళ్ళ వైపు చూసి మీటింగ్ రూమ్ దగ్గరికి తీసుకురండి.

ఓకేనా.. వాళ్ళతో వచ్చేయ్..  నేను లిఫ్ట్ లో వెళ్ళిపోతాను అని చెప్పి.. హిమ పిలుస్తున్న సరే వెళ్ళిపోతాడు.
ఛా..  నా ప్లాన్  అంతా రివర్స్ అయ్యింది. ఈ విధంగా నలుగురు చూస్తారు. మా ఇద్దరి మధ్యన సంథింగ్ సంథింగ్ ఉంది అనుకుంటారు అనుకుంటే.. సూర్య ఇలా హ్యాండ్ ఇస్తాడు అనుకోలేదు అని తల పట్టుకుంటుంది.

హెల్పర్ అది చూసి మేడం హెడేక్ గా ఉందా..  మెడిసిన్ ఇమ్మంటారా.. ప్రస్తుతానికి అవసరం లేదు తీసుకువెళ్ళండి.
సూర్య లిఫ్ట్‌లోకి వెళ్లిపోతూ కూడా వెనక్కి ఒక్కసారి తలతిప్పి హిమ వైపు చూస్తాడు.

హిమ మాత్రం అలా వీల్‌చైర్‌లో కూర్చుని — బయటకు నవ్వుతూ, లోపల మాత్రం ఏదో రగిలే ఈగోతో తాను బలహీనంగా కనిపించానేమోనని అసహనంగా ఊహల్లో పడుతుంది.


క్లోజ్ అయిపోతున్న లిఫ్ట్ ను చూస్తూ హిమ.. నువ్వు చూపిస్తున్న.. కేర్ అంతా నాదే.. నిన్ను వదలను సూర్య.. నిన్ను గెలిచి..  ఈ సామ్రాజ్యానికి ఫ్యూచర్ రాణిని  అవుతాను.

సూర్య క్యాబిన్లోనికి వెళ్ళేటప్పటికి శ్రీకర్, వైభవ్ ఫన్నీ కామెడీ చేస్తూ ఉంటారు. ఏంట్రా నేను రాకుండానే ఇద్దరు ఏదో జోక్స్ వేసుకుంటున్నారు.

అయ్యో మేమేం వేసుకోగలం. నీ లవ్వరి కానీ లవర్  వేసిన వేషాల గురించి మాట్లాడుకుంటున్నాము.. ఇక్కడ ఈవిడ... అక్కడ వాడు...

అబ్బబ్బ ఇద్దరికీ ఇద్దరే... అందుకే కదా ఇద్దరికీ జోడి బాగా కుదిరింది.  వైభవ్ నువ్వు చేయవలసిన పని ఇంకొకటి ఉంది.  ఏమిటి.

మొత్తం చెప్పగానే సూపర్. అది నిన్ను ట్రాప్ చేయాలి అనుకుంటుంది. ఈ దెబ్బతో ఒళ్లంతా కారం పూసుకొని పరిగెడుతుంది.

హిమని మీటింగ్ రూమ్ లో వదిలి వెళ్ళిపోతారు.. కొంచెం సేపు కూర్చుని మెల్లిగా లేచి నిలబడుతుంది.  చుట్టూ చూస్తూ ప్రతిది చెక్ చేస్తూ ఉంటుంది.

ఇదంతా కూడా సిసి లో చూస్తూ ఉంటారు.  ఏం చేస్తుంది బావ.   చేయడానికి ఏముంటుంది.. ఏదో  తెలిసిందాని లాగా మనం వెళ్ళేవరుకు హడావిడి చేయడానికి ట్రై చేస్తోంది..

ఎక్కువసేపు భరించలేను గాని పదండి వెళదామని... ముగ్గురు వెళతారు.  వాళ్ళని చూసి హాయ్ అని మళ్లీ పలకరిస్తుంది.

కూర్చో హిమ.. ఏంటి మాట్లాడాలి అన్నావు.  అక్కడ కూర్చుంటూ..  మళ్ళీ మీట్ అవుదాం అన్నావు కదా.. నేను నీ నెంబర్ తీసుకోవడం మర్చిపోయాను.

అందుకే ఆఫీస్ కి వచ్చాను. బట్ నువ్వు నిన్న రాలేదనుకుంటా కానీ నిన్ను చూడాలనిపించే ఈరోజు కూడా వచ్చి వెయిట్ చేస్తున్నాను..  అవునా..

మీ సెక్యూరిటీ నన్ను ఆలో చేయలేదు. వాట్ అల బయటే నిలబెట్టేసారా..  వాళ్ల పని చెప్తాను అని ఫోన్ చేసి..  ఎప్పుడు హిమ వచ్చిన ఆలో చేయండి..  ఆపడానికి వీలు లేదు..

అది వినగానే హిమ పొంగిపోతూ ఉంటుంది.. ఇంకేంటి సంగతులు..  సూర్య మనిద్దరం ప్రైవేట్ గా కలుద్దామా.. తప్పకుండా..

నేను అరేంజ్ చేసి నీకు ఇన్ఫామ్ చేస్తాను సరేనా... నాకు నీ నెంబర్ ఇవ్వు సూర్య.. నువ్వు ఫుల్ బిజీగా ఉంటావు కదా..

నేనే మూన్ లైట్ డిన్నర్ అరేంజ్ చేసి నీకు కాల్ చేస్తాను.  వైభవ్ శ్రీకర్ వైపు చూసి స్లోగా.. లవర్ లవర్ అని తిరుగుతావు.

ఎప్పుడైనా ఇలా ట్రీట్ ఇచ్చావా..  అదిగో  హిమ ని చూడు.. మా అన్నయ్యని పడేయడానికి ఎలాంటి ట్రీట్స్ ఇస్తుందో..  అది పడేయాలి అనుకుంటుంది కాబట్టి ఇస్తుంది.  నాకు అవసరం లేదు కాబట్టి ఇవ్వక్కర్లేదు.

ఇప్పుడు అన్నయ్య నెంబర్ ఇస్తాడా..  ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వడు. ఆ జిడ్డు మొహం వదిలేటట్టు లేదు కదా.. నీకు మెసేజ్  వస్తుంది చూస్తూ ఉండు..

శ్రీకర్ చెప్పడం అయ్యే లోపే వైభవ్ కి మెసేజ్ వస్తుంది. అది చూసి ఎలా గెస్ చేసావ్ బావ. చిన్నప్పటినుంచి బావతోనే ఉన్నాను.. నాకు తెలవదా ఏమిటి..

కానీ..  కానీ..  సరే అని చేయవలసిన పని చేస్తాడు. సూర్య నిన్ను అడిగేది నెంబర్ అనే లోపు వాట్సప్ కి ఫొటోస్  వస్తున్న బీప్ సౌండ్ వస్తుంది.

అవి ఆగకుండా వస్తూ ఉంటే...  ముందు ఏమిటో చూడు.. నీకు ఇంపార్టెంట్ అనుకుంటా. ఓకే అని ఓపెన్ చేస్తుంది. ఏదో ప్రైవేట్ నెంబర్ నుంచి వస్తున్నాయి అంటూ.. ఫొటోస్ ఓపెన్ చేయగానే...

అవి చూసి వాట్ అని గట్టిగా అరుస్తుంది. ఏమైంది... నథింగ్ ఏమీ లేదు అని మెల్లిగా చూస్తూ ఉంటుంది.  పంపించిన వాళ్లు ఎవరు అని చూస్తే డీటెయిల్స్ ఏమీ కనిపించవు.

వాళ్ళకి ఫోన్ చేయడానికి ట్రై చేస్తుంది. బట్ రీచ్ అవ్వదు ఏమైంది హిమ అంత టెన్షన్ పడుతున్నావు..
మనం మళ్ళీ కలుద్దాము నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది..  సూర్య పిలుస్తున్న వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది.

వెళుతున్న హిమని చూసి ముగ్గురు నవ్వుకుంటూ.. ఇప్పుడు ఇంకొక సినిమా స్టార్ట్ అవుతుంది.  హిమ కారు. డ్రైవ్ చేస్తూ కూడా ఫొటోస్ చూస్తూ..గౌతమ్ నువ్వు ఇంత చీట్ చేస్తావా..

అటు విశిష్ట... ఇటు నేను..  ఇప్పుడు ఇంకొకళ్ళు..  హౌ డేర్ యు.. నా సంగతి తెలిసి కూడా నువ్వు ఇలాంటి స్టెప్స్ వేస్తావా అని ఆ ఫొటోస్ అన్ని సురేష్ కి పంపించి.. కాల్ చేసి డాడీ అని రాగం అందుకుంటుంది.

బేబీ... ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు.. మీకు గౌతమ్ ఫొటోస్ పంపించాను చూడండి. వెంటనే ఫోన్ ఓపెన్ చేసి చూసి..  ఏమి చేస్తున్నాడు  ఇడియట్..

ఇంకొక అమ్మాయితో తిరుగుతున్నాడు.  వాట్ వాడికి అంత ధైర్యం వచ్చిందా..  అది కనుక్కోవడానికి ఆఫీస్ కి వెళుతున్నాను. మీకు మళ్ళీ కాల్ చేస్తాను అని పెట్టేస్తుంది..

గౌతమ్ కి కాలేజీలో జరిగినవి తెలియక పిచ్చెక్కిపోతూ ఉంటుంది. ఈ పాటికి విశిష్ట ఏడుస్తూ బయటికి వస్తుంది.. నా మనుషులకి కనపడుతుంది అనుకుంటే.. అలాంటిది ఏమీ జరగడం లేదు.

ఆ సరళ ఏమో ఫోన్ తీయడం లేదు.  ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు అని తల పట్టుకుంటాడు. హిమ గౌతమ్ ఆఫీస్ కి వెళ్లి స్పీడ్ గా క్యాబిన్ డోర్ తీసి గౌతమ్ అని అరుస్తుంది.


ఆ అరుపుకి ఏమైంది హిమ అలాగా అరుస్తున్నావు.. వచ్చి కూర్చో అని మంచినీళ్లు చేతికి ఇస్తాడు. ఆ బాటిల్ విసిరేసి ఏం చేస్తున్నావు నువ్వు..

అసలు అలా చేయడానికి నీకు ఎంత ధైర్యం. దేని గురించి మాట్లాడుతున్నావు.  నువ్వు చేస్తున్న పని గురించి. నేనేం చేశాను.

ఓ కాలేజీలో జరిగిన విషయం గురించా..  అంత ధైర్యంగా నాకే ఎలా చెప్పగలుగుతున్నావు..

గౌతమ్ సమాధానం......
[+] 8 users Like SivaSai's post
Like Reply
Part - 68



ఓ కాలేజీలో జరిగిన విషయం గురించా..  అంత ధైర్యంగా నాకే ఎలా చెప్పగలుగుతున్నావు..

నీకు ముందే చెప్పాలి అనుకున్నాను.. బట్ సర్ప్రైజ్ గా ఉంటుంది అని చెప్పలేదు.. ఎలా ఉంది. అయినా నీకెలా తెలిసింది.

నా వరకు రాకుండా అప్పుడే నీకు ఇన్ఫర్మేషన్ వచ్చిందా.. నువ్వు అసలు ఏం మాట్లాడతున్నావు. నువ్వు చేసింది చెండాలం..

మళ్ళీ అది నాకు ముందే చెప్పాలి అనుకున్నావా.. అందులో ఏముంది..  మనకు యూస్ అయ్యేదే కదా నేను చేసింది.

మనకు యూస్ అయ్యేది ఏముంది..  నువ్వు ఒక అమ్మాయితో కలిసి ఎంజాయ్ చేస్తున్నావు. చి.. చి.. ఎవరు చెప్పారు.

ఎవరు చెప్పడం ఏంటి..  చూడు ఈ ఫొటోస్ అని ఫోన్ కి వచ్చిన ఫొటోస్ చూపిస్తుంది. వాట్ సరళ తో నేను ఉన్న ఫొటోస్... నీ దగ్గరికి ఎలా వచ్చాయి..

ఇదంతా నిజమే అన్నమాట.. అబ్బా హిమ విసుగించకు.. అసలు ఎవరు పంపారు ఏమిటో చెప్పు. అసలు నువ్వేం చేసావో ముందు అది చెప్పు.

ఉఫ్... టై లూస్ చేసుకుంటూ ఆ సరళ విశిష్ట కాలేజీలో లెక్చరర్.  విశిష్ట కి హెల్ప్ చేస్తున్న దేవా అంటే పడి చచ్చిపోతుంది.

విశిష్ట దూరమైతే.. ఆ దేవా తనికి లొంగుతాడు అని నాకు హెల్ప్ చేసింది. మేము అనుకున్నది ఒకటి అయితే ఇక్కడ జరిగింది ఇంకొకటి అన్నమాట..

ఏం చేయాలనుకున్నావు..  ఆ విశిష్ట, దేవా ఉన్న ఫొటోస్ మేము బోర్డ్ మీద పెట్టి కాలేజ్ మొత్తం అల్లరి చేయాలి అనుకున్నాము.. బట్ రివర్స్ లో మా ఇద్దరి ఫొటోస్ వచ్చాయి.

రేపు కాలేజీకి వెళ్లి మళ్లీ విశిష్టతో మాట్లాడాలి అన్న ఛాన్స్ లేకుండా అయింది.. నువ్వు నిజమే చెబుతున్నావా అయ్యో డార్లింగ్ నీకు అబద్ధం చెబితే నాకేం వస్తుంది..

మరిప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు.. అదే ఆలోచిస్తున్నాను..

నాకు అర్థం కాని విషయం ఒకటే.. ఆరోజు నువ్వు సూర్య కోసం ఉంటే ఎవరో కాల్ చేసి చెప్పారు.  ఈరోజు నీకు ఫొటోస్ పంపించారు. ఎవరైనా మనల్ని వాంటెడ్ గా టార్గెట్ చేస్తున్నారా..

హిమా వెటకారంగా నీ దగ్గర ఏం మేటర్ ఉందని టార్గెట్ చేస్తారు.  బిజినెస్ లో ఏమన్నా టాప్ మోస్ట్ లెవెలా.. లేకపోతే ఒక నలుగురైదుగురు అమ్మాయిలు నీకోసం పడి చచ్చిపోతున్నారా.

రెండు లేదు కదా ఇంకెందుకు నిన్ను టార్గెట్ చేస్తారు.. ఆ మాటకి గౌతమ్ రగిలిపోతూ ఏమో ఎవరికి తెలుసు నాతోనే ఉంటూ నా వెనక ఎవరైనా గోతులు తీసుకున్నారేమో...

ఆ మాట నువ్వు అనుకోకూడదు ఏమో.. ఏమిటి నీ ఉద్దేశం.  అదే మనలాంటి వాళ్ళు ఈ మాట అనుకోకూడదు ఏమో.. మనమే ఒకళ్ళ కింద గోతులు తీస్తాము.. మళ్లీ మన కింద తీసే వాళ్ళు ఎవరు ఉంటారు..

నువ్వు చెప్పేది నిజమే అని నమ్మి వెళుతున్నాను కానీ ఇందులో ఏదైనా మోసం ఉందని తెలిస్తే మాత్రం.. నో హిమ నన్ను నమ్ము.

సరే అని వెళ్ళిపోతుంది. హిమ వెళ్లిన తర్వాత గౌతమ్ మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు.  ఎవరో సంథింగ్ నా వెనకాల ఉన్నారు.

వాళ్ళు ఎవరు...ముందుకు రాకుండా నన్ను టార్గెట్ చేస్తున్నారు...విశిష్టనా..  సపోర్ట్ చేస్తున్న ఆ లెక్చరర్ కి అంత సీన్ లేదు..

ఏదో క్లాసులు చెప్పి వెళ్లే అతని దగ్గర ఇంత బిజినెస్ మైండ్ ఉంటుందా.. నో వే..  మరి ఎవరై ఉంటారు...

ఏది ఏమైనా సరే రేపు వెళ్లి విశిష్టాని  కలవాలి...ఎలాగైనా కూల్ చేసి ఇది ఎవరో ట్రాప్ చేశారని చెప్పాలి..

ఆఫీస్ నుంచి హిమా వెళ్లిపోయిన తరువాత శ్రీకర్ నేను నా డార్లింగ్ దగ్గరికి వెళుతున్నాను.  నువ్వు కాలేజీకి వెళతావా.. వెళ్ళాలి కదా అని వైభవ్ వైపు చూస్తాడు.

నాకు వర్క్ ఉంది...సరే నువ్వు వెళ్లేటప్పుడు ఈ బ్యాగ్ చందు కి ఇచ్చి వెళ్ళు ఏమిటిది నాకు తెలియదు రాజ్ మావయ్య ఇచ్చారు..

చాలా ఇంపార్టెంట్ జాగ్రత్త అని చెప్పారు . ఏముంటది ఏ మేకప్ ప్రోడక్ట్.. లేకపోతే డిజైనర్ డ్రెస్ అయి ఉంటుంది. సూర్య వైభవ్ భుజం మీద చెయ్యి వేసి... ఈరోజు నేను ఒక బెస్ట్ కొటేషన్ విన్నాను రా..

అది ఏమిటో తెలుసా...  మన కళ్ళతో చూడనిది.. మన చెవులతో విననిది ఏది కూడా బ్లైండ్ గా నమ్మకూడదు . చూసింది కూడా నిజమో కాదో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకో..

విన్నది కూడా చెక్ చేసుకుని అప్పుడు మాట వదలాలి..  దెబ్బ తగిలితే ఏ నిమిషమైనా అది తగ్గిపోవచ్చు కానీ మాట రక్తం చిందని గాయాన్ని చేస్తుంది.  అది ఎప్పటికీ మానదు. అర్థమైందా అని సూర్య వెళ్ళిపోతాడు.

ఇప్పుడు నేను ఏమన్నానని అన్నయ్య ఇంత క్లాస్ తీసుకున్నాడు.. నీకు ఎంత చెప్పినా అర్థం కాలేదు అంటే నిన్ను ఎవరు ఏమి చేయలేమని శ్రీకర్ కూడా వెళ్ళిపోతాడు.

ఏమిటో వీళ్ళందరూ చందుకే సపోర్టు..ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను... ఎప్పుడు చూసినా షాపింగ్ గురించి తప్ప ఇంకొక విషయం మాట్లాడిందా..

నాకు అస్సలు చందు దగ్గరకు వెళ్లడం ఇష్టం లేదు కానీ అన్నయ్య కోసం మాత్రమే వెళుతున్నాను. ఆ బ్యాగ్ వైపు చూస్తూ ఇదేమీ ప్రేమ కాదు..  జస్ట్ అన్నయ్య కోసం మాత్రమే అర్థమయిందా..

సూర్య కాలేజీకి వెళ్తాడు.  కాలేజీ మళ్ళీ ప్రశాంతంగా ఉంటుంది. ప్యూన్ వచ్చి..  సార్ ఎక్కడికి వెళ్లారు.  ఏమయింది.

సరళ మేడమ్ రిజైన్ చేశారు.. ఇక్కడ నుండి వెళ్ళిపోతారంట.. ఎందుకు... భలేవారే సార్.. కాలేజీలో అంత అల్లరి అయితే ఆవిడ మాత్రం ఎలా ఉంటారు.. ఎక్కడున్నారు..

ప్రిన్సిపల్ రూమ్ లో ఉన్నారు.  సరే అని అక్కడికి వెళ్లి డోర్ నాక్ చేస్తాడు.  ఎస్ అని ప్రిన్సిపాల్  అనగానే...  లోపలికి రావచ్చా సార్..

  కం  దేవా.. సూర్య లోపలికి వెళ్లి మీకు అభ్యంతరం లేకపోతే సరళ మేడమ్ తో నేను ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడొచ్చా..

తప్పకుండా.. ప్లీజ్ క్యారీ ఆన్.. పక్కనే ఉన్న చైర్స్ లో కూర్చుంటారు.. ప్రిన్సిపాల్.. తన వర్క్ లో బిజీ అవుతే.. సూర్య... ఎందుకు మేడం మీరు రిజైన్ చేస్తున్నారు.

మీరు చాలా ఎఫిషియన్ లెక్చరర్.. మీలాంటి లెక్చరర్ ఈ కాలేజ్ కి చాలా అవసరం. అన్నీ తెలిసే అడుగుతున్నారా సార్..

తెలుసు కాబట్టి అడుగుతున్నాను.. ఇలాంటివి మీరు ఎక్కడికి వెళ్ళినా జరుగుతాయి. మన తప్పు లేనప్పుడు ధైర్యంగా నిలబడాలి. తప్పు ఉంటే సరి చేసుకోవాలి..

అంతేగాని అక్కడి నుంచి పారిపోతారా..  అది చెప్పినంత సులువు కాదు. రేపు నేను క్లాస్ చెప్పిన స్టూడెంట్స్ వింటారా..

స్టూడెంట్స్ కి కావాల్సింది సబ్జెక్టు మాత్రమే.. అది మీరు ఎఫిషియెంట్గా వాళ్లకి అర్థమయ్యేలాగా చెబితే మిగిలిన విషయాలు అన్నీ నథింగ్..

మీరు ఇంకో కాలేజ్ కి వెళ్ళిన ఆ గౌతమ్ మిమ్మల్ని వదులుతాడా...అక్కడికే కూడా వచ్చి విశిష్ట విషయంలో సాయం చేయమనే మొదలు పెడతాడు.

అప్పుడు ఏం చేస్తారు.. ఈ కాలేజీలో చెప్పడం లేదు కాబట్టి మీ వల్ల కాదు అని చెబుతారా.. అలా చెప్పినా అతను వదులుతాడా..

మీ ద్వారా ఇంకొకళ్ళు పట్టుకుంటాడు కదా... మరి ఇప్పుడు నన్ను ఏం చేయమని చెబుతున్నారు.. మీరు ధైర్యంగా ఈ సమస్యను ఎదుర్కొండి.

ఆ గౌతమ్ కలిస్తే నా వల్ల కాదు నేను చెయ్యను అని క్లియర్గా చెప్పండి. స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవ్వండి. లెక్చరర్స్ తో ప్రొఫెషనల్ గా మాట్లాడండి.  మీకు ఎప్పటికీ నేను ఒక ఫ్రెండ్ గా సపోర్టు ఉంటాను..

సూర్య చేతి మీద చేయి వేసి థాంక్యూ దేవా సార్.. నేను రాంగ్ రూట్ లో వెళుతూ ఉంటే కరెక్ట్ చేశారు.  నిజంగా ఒక లెక్చరర్ అంటే మీలాగే  ఉండాలి..

ఎక్కువ ఆలోచించకండి.. క్లాస్ కి వెళ్ళండి.. సరళా క్లాస్ కి వెళ్ళేటప్పటికి స్టూడెంట్స్ అందరూ ఎప్పటిలాగానే నార్మల్గా విష్ చేస్తారు.

సరళ ఆశ్చర్యపోతుంది. క్లాస్ సీరియస్గా చెబుతూ ఉంటే స్టూడెంట్స్ అందరూ ఇంట్రెస్ట్ గా వింటూ ఉంటారు. క్లాస్ అయ్యిపోయి..  బయటికి వచ్చిన ఎక్కడ రూమర్ గురించి మాట్లాడుకోరు.

ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ వెళుతూ ఉంటే ప్యూన్ ఎదురవుతాడు. ఆపి ఏం జరుగుతుంది కాలేజీలో... దేని గురించి మేడం..

అదే పొద్దున్న నా గురించి అని ఇబ్బంది పడుతూ ఉంటే.. ఆ విషయమా.. అది అప్పుడే క్లియర్ అయిపోయింది. దేవ సార్ వెంటనే ఆ ఫొటోస్ మొత్తం తీయించేశారు.

అలాగే పైనుంచి స్ట్రిక్ట్గా ఆర్డర్స్ వచ్చాయి.  అన్ని క్లాసెస్ కి మెసేజ్ వెళ్ళింది.  అందుకే స్టూడెంట్స్ గాని లెక్చరర్స్ గాని ఎవరు ఆ విషయం గురించి మాట్లాడడం లేదు.

అవునా అని స్టాప్ రూమ్ కి వెళ్లి తన ప్లేసులో కూర్చుని బుక్ ఓపెన్ చేస్తుంది..అనుమానంగా ఒకసారి మిగిలిన లెక్చరర్స్ వైపు చూస్తుంది కానీ ఎవరు వర్క్ లో వాళ్ళు బిజీగా ఉంటారు.

సాయంత్రం దేవా కోసం విశిష్ట ఎదురు చూస్తూ ఉంటుంది.. దేవా రాగానే సార్ మీకోసమే ఎదురు చూస్తున్నాను. దేనికోసం..

ఈరోజు శ్రీనివాస్ సార్ కాల్ చేశారు. ఎందుకో..  అయ్యో.. మీకు వి. జె. స్.  కంపెనీ గురించి తెలుసు కదా.. విన్నాను. ఏమైంది.  ఆ కంపెనీ నుంచి ఒక ఆఫర్ వచ్చింది..

క్లియర్ గా చెప్పు విశి.. ఆ కంపెనీకి బెస్ట్ ఆర్కిటెక్ డిజైన్ కావాలి అంట.. కొటేషన్ ఇమ్మన్నారు..  మనది ఓకే అయితే మనతో కలిసి వర్క్ చేస్తారంట..

బెస్ట్ ఆఫర్. మరి ఏం చేయాలి అనుకుంటున్నావు..  మీతో ఒక మాట మాట చెప్పిన తర్వాత..  మీరు ఏమంటారో దాన్నిబట్టి శ్రీనివాస్ సార్ కి చెబుదాం అనుకుంటున్నాను.

ఏం చెప్పమంటారు సార్..  ఎస్ చెప్పమంటారా..  నో చెప్పమంటారా... సొంతంగా డెసిషన్ తీసుకోవడం నేర్చుకో..

ఏమవుతుంది.. కంపెనీ కి వెళతావు.. నీకంత ఓకే అనుకుంటే ముందుకు వెళతావు.  అయినా నీకు వైభవ్ ఉండగా వైభవ్ ని కాంటాక్ట్ చేయకుండా నన్ను అడుగుతావెందుకు...

విశి సమాధానం............
[+] 8 users Like SivaSai's post
Like Reply
Part - 69



ఏమవుతుంది.. కంపెనీ కి వెళతావు.. నీకంత ఓకే అనుకుంటే ముందుకు వెళతావు.  అయినా నీకు వైభవ్ ఉండగా వైభవ్ ని కాంటాక్ట్ చేయకుండా నన్ను అడుగుతావెందుకు...

ఆ మాటకి ముఖం చిన్న బుచ్చుకుంటుంది.  ఏమైంది విశి అని కొంచెం స్మూత్ గా మాట్లాడితే..  మీరు, అందరూ ఒకటేనా..

ఏముంది తేడా...  తేడా ఉంది.  మీరు చెబితే నాకు అదొక తృప్తి.  ఎంత చెప్పినా సలహా వరకే ఉండాలి కానీ ప్రతిదీ డిపెండ్ అయిపోకూడదు.

నువ్వు నా మీద అలా డిపెండ్ అవ్వడం నాకు నచ్చడం లేదు. విశిష్ట అంటే ఒక స్ట్రాంగ్ ఉమెన్ గా ఎదగాలి..  నలుగురికి నువ్వేంటో చూపించాలి. అర్థమవుతుందా..

నీ కొటేషన్ పంపించు..  వాళ్ళకి ఓకే అనుకుంటే ప్రజెంటేషన్ కి రమ్మంటారు. నీ స్కిల్స్ కూడ డెవలప్ అవుతుంది కదా..

సెల్ఫ్ గా స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు అన్ని చోట్లకి వెళ్ళాలి. చిన్న కంపెనీయా..  పెద్ద కంపెనీయా.. అని చూడకూడదు.

నీకు వచ్చిన వర్క్ ని 100% ఎఫెక్ట్తో చేసి ఇవ్వు చాలు.. సక్సెస్ అదే పరిగెత్తకు వస్తుంది. మీతో మాట్లాడితే చాలా ధైర్యంగా అనిపిస్తుంది సార్..

మా నాన్నే నాతో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. థాంక్యూ..  ఈ థ్యాంక్స్లన్నీ నీ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని బైక్ ఎక్కు.. వెళదాం..

బైక్ ఎక్కి ఆలోచిస్తూ ఉంటే.. ఏమయింది అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు.  ఆ కంపెనీ చైర్మన్ విక్రమ్ సార్ చాలా స్టిక్ అంట కదా..   చిన్న మిస్టేక్ కూడా ఒప్పుకోరు అంట కదా..

నువ్వు అన్నది నిజమే..  స్ట్రిక్ట్ గా ఉంటారు.  మిస్టేక్ ఒప్పుకోరు.  అందుకే అంత పెద్ద కంపెని రన్ చేస్తున్నారు. మరి నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను కోప్పడతారా.. తిడతారా..

నువ్వేమైనా కాలేజ్ కి వెళ్తున్నావా..  టీచర్ తిట్టినట్టు తిట్టడానికి... సార్ అని రాగం తీస్తే.. లేకపోతే ఏమిటి.. మిస్టేక్స్ ఉంటే మాక్సిమం కరెక్షన్ చేయడానికి చూస్తారు.

ఎంత స్ట్రిక్ట్ గా ఉన్న సెల్ఫ్ డెవలప్ అవుతున్న అమ్మాయిలకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు..ఎంకరేజ్ చేస్తారు.  మరి మిమ్మల్ని అడిగితే ఆ కంపెనీ గురించి అవునా అని లైట్ గా మాట్లాడారు.

ఇప్పుడు ఆ సార్ గురించి అన్ని తెలిసినట్టు చెబుతున్నారే..  నాలుక కరుచుకుని జనరల్ గా చెబుతున్న.  అంత పెద్ద వాళ్ళు అలాగే ఉంటారు కదా అని..

నీకు అంతగా డౌట్ గా అనిపిస్తే శ్రీ అంకుల్ తో మాట్లాడు ఏమైనా హెల్ప్ చేస్తారు. పర్వాలేదులే సార్... మీరు ఉండగా వేరే వాళ్ళని అడగడం అనవసరం.

విశికి తన పైన ఉన్న నమ్మకానికి సూర్యా మురిసిపోతూ ఉంటాడు.
ఇంటి దగ్గరికి రాగానే బైక్ ఆపుతాడు.  బైక్ దిగి ఈ ఇంటికి వచ్చిన వేళా విశేషం..  అమ్మ సెట్ అవుతుంది.  నాకు ఫ్యూచర్ కనిపిస్తుంది..  ఇదంతా మీ వల్లనే సార్..

అమ్మని చూసి చాలా రోజులైంది ఎలా ఉన్నారు? ఈ ఇంటికి వచ్చాక నాన్న ధ్యాస చాలా తగ్గింది..ఆంటీ వాళ్ళతో బాగా టైం స్పెండ్ చేస్తుంది. నాకు ఒక రకంగా బెంగ తీరినట్టే..

అయితే ఇంక నీ కెరియర్ మీద ఫోకస్ పెట్టు.  తప్పకుండా సార్. ఈ ప్రాజెక్టు ఓకే అవ్వగానే నీకు మంచి ట్రీట్ ఇస్తాను. వెయిట్ చేస్తూ ఉంటాను.  బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు.

వైభవ్ బ్యాగ్ తీసుకుని చందు ఇంటికి వెళతాడు. సెక్యూరిటీ గేట్ తీసి విష్ చేయగానే... చందు ఉందా..
లోపలే ఉన్నారు సార్.

సరే అని ఆ బ్యాగ్ సెక్యూరిటీ చేతికి ఇవ్వబోయి.. వద్దులే చాలా ఇంపార్టెంట్ అన్నారు కదా..  నేనే ఇస్తాను. అత్తయ్యను కూడా కలిసినట్టు ఉంటుంది.

  అత్తయ్య అని అరుస్తూ లోపలికి వెళ్తాడు.  అక్కడ చందు గోళ్ళకి నైల్ పాలిష్ వేసుకుంటూ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది.

బ్యాగ్  చందు ముందు పెట్టి ఏదో ఇంపార్టెంట్ అన్నావ్ అంట కదా..  ఆ మాట వినగానే నేను మళ్ళీ చేస్తాను అని ఫోన్ పెట్టేసి థాంక్యూ..

జ్యూస్ తీసుకొస్తాను అంటే.. వద్దులే తమరు ఏవో సోకులు చేసుకుంటున్నట్టున్నారుగా కానివ్వండి అని రిలాక్స్ గా కూర్చుని అత్తయ్య లేదా..  ఉంది వస్తుంది.

చందు ఇంకా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా నైల్ పాలిష్ వేసుకుంటూ ఉంటుంది. అది చూసి..  చెట్టు అంత మనిషి ఎదురుగుండా ఉంటే మాట్లాడవేమిటి..

ఏం మాట్లాడాలి.. ఇది నువ్వేనా.. చందు అంటే ఒక ఫైర్ బ్రాండ్ కదా.. అందులో నన్ను చూస్తే ఇంకా ఎగిరిపోతావు కదా..

అలాంటిది ఈ మధ్యన ఎందుకు సైలెంట్ గా ఉంటున్నావు.  ఆ మాటకి వైభవ్ ని చూసి చిన్నగా నవ్వి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని తెలిసింది.

దేనికి.. నీ ఆరోగ్యానికా.. ఒకరకంగా అలాంటిదే.. నీకు సూట్ కాని ఆ వేదాంతం ఎందుకే..  నువ్వు ఎప్పటిలాగానే ఉండు అదే నీకు బాగుంది.

ఇలా ఉంటే  బాగోలేదా.. నిజంగా నాకైతే బాగోలేదు.. పిచ్చ బోర్ కొడుతుంది.  నువ్వు వచ్చి నాతో అర్గు చేస్తూ దెబ్బలాడుతూ ఉంటే నీకు రిటర్న్ కౌంటర్లు వేస్తూ ఉంటే ఆ మజానే వేరు..

ఇప్పుడు నేను ఎవరికి కౌంటర్లు వేయాలి.  నువ్వు కౌంటర్లు వేయడానికి నేను లోడాలోడా వాగుతూ ఉండాలా..  అవి పడాలి అన్న కొంచెం కష్టంగానే ఉంటుంది కదా..

ఏమంటున్నావు..  ఏమీ లేదు అదిగో అమ్మ వస్తుంది. వైభవ్..  నివి ని చూసి హాయ్ అత్తయ్య అంటే...  హాయ్ రా.. ఎంతసేపయింది.

ఏమైనా తిన్నావా..  తాగావా..  నువ్వు లేవు కదా నాకు ఇచ్చే వాళ్ళు ఎవరుంటారు.  తలమీద ఒక్కటి వేసి చందు ఉంది కదా.. అది బిజీగా ఉంది లే..

వైభవ్ నీ ఒకసారి చూసి నైల్ పాలిష్ బాటిల్ అన్ని ప్యాక్ చేసుకుని రూమ్ లోకి వెళుతుంది.  ఏమిటిది..ఇంత సైలెంట్ అయిపోయింది.

నేను ఇలా అంటే ఇది పడదు కదా... ఈపాటికి నా మీదకి యుద్ధానికి రావాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఏంట్రా ఆలోచిస్తున్నావు..

అత్తయ్య నాకు ఒక డౌటు.. ఈ మధ్యన చందు ఏదైనా మెడిటేషన్ క్లాసెస్ కి వెళ్తుందా.. ఎందుకు అలా అడిగావు. చాలా సైలెంట్ అయిపోయింది.

నాతో దెబ్బలాడటం లేదు. నీతో దెబ్బలాడటం లేదని బెంగపెట్టుకున్నావా.. అలాంటిదేమీ లేదు కానీ ఏమైనా హెల్త్ బాగోలేదా ఏమిటి..

ఆడపిల్లలు కదా ఒక స్టేజ్లో అలాగే సైలెంట్ అయిపోతారు. మరి నువ్వు అవ్వలేదు ఏంటి అత్తయ్య...ఒరేయ్ ఎంత మాట అన్నావురా..

అప్పుడే లోపలికి వస్తున్న రాజ్ నేను అనలేని మాట నువ్వు అన్నావురా..  ఏమిటి మీ ఉద్దేశం..  నేను ఎప్పుడూ మీతో దెబ్బలాడుతూ ఉంటాను అనా..

చూసావా ఇంటికి రాగానే మంచినీళ్లు తాగుతారా... ఆకలిగా ఉందా ఏమైనా తింటారా అని అడగకుండా ఆకలి మీద ఉన్న ఆడపులి లాగా నా మీద పడిపోతున్నావు.. దీనిని ఏమంటారు..

ఇద్దరూ దెబ్బలాడుకుంటూ ఉంటే వైభవ్ లేచి చందు రూమ్ దగ్గరికి వెళ్ళి తలుపు తీస్తాడు.  బుక్స్ చదువుతున్న చందును చూసి సైలెంట్గా వెనక్కి వచ్చేస్తాడు.  చందు అది చూసిన ఏమి పట్టించుకోదు..

బాయ్ చెప్పి వైభవ్ బయటికి వచ్చేస్తాడు.  బైక్ మీద వెళుతున్న చందు మౌనమే వెంటాడుతూ ఉంటుంది. చాలా చిరాకుగా ఉంటుంది.

ఇంటికి వెళ్ళగానే సౌమ్య కనపడితే...సౌమ్య నీతో అర్జెంటుగా మాట్లాడాలి రా అని గార్డెన్లోకి తీసుకువెళ్ళి అక్కడ బెంచ్ పైన కూర్చోబెడతాడు.

చెప్పు ఏంట్రా... చందు ఎందుకు అంత సైలెంటుగా ఉంటుంది. నాకేం తెలుసు...మీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కదా.. ఎందుకు తెలియదు.

నాతో అయితే బాగానే మాట్లాడుతుంది..  నీతో ఎందుకు మాట్లాడటం లేదు అంటే నాకు ఎలా తెలుస్తుంది రా..  అరే నేను ఏమి కౌంటర్ వేసిన ఒక చూపు చూస్తుంది.

సైలెంట్ అయిపోతుంది.  అంతకు ముందు ఇలా లేదు ఏమైంది.. మిస్ అవుతున్నావా.. ఛీ.. ఛీ..నేను దాన్ని మిస్ అవ్వడమేమిటి.

మరి మిస్ అవ్వనప్పుడు అది ఎలా ఉంటే నీకెందుకు. మిస్ అవుతుంటే మాత్రం ఎందుకు ఉంటుందో ఆలోచించు. అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకొని నా టైం వేస్ట్ చేయకు అర్థం అయిందా..

ఇదిగో శ్రీకర్ ఫోన్ చేస్తున్నాడు అని వెళ్ళిపోతుంది. వీళ్లందరికీ ఏమైంది.. దీనికి కరెక్ట్ సమాధానం పెదనాన్నే చెబుతారు. విక్రమ్ గదికి వెళతాడు.

సూర్య విక్రమ్ మాట్లాడుకుంటూ ఉంటారు.  వైభవ్ సైలెంట్ గా వెళ్లి కూర్చుంటే... వైభవ్ వైపు చూసి చిన్న స్మైల్ ఇస్తాడు.

సూర్య విక్రమ్ తో నాన్న మీ కోడలికి మీరంటే చాలా భయం. అదేంటిరా మేమిద్దరం కలవలేదు. ఫ్యూచర్లో మంచి ఫ్రెండ్స్ గా ఉండాల్సిన వాళ్ళం.. అప్పుడే భయపడితే ఎలా.

మీరు చాలా స్ట్రిక్ట్.. మిస్టేక్ వస్తే ఒప్పుకోరు అని టీచర్ కి ఎల్కేజీ స్టూడెంట్ బయపడినట్టు భయపడుతుంది.  ఈ రోజుల్లో ఎవరు భయపడుతున్నారు అన్నయ్య..

స్టూడెంట్ కి టీచర్ భయపడుతుంటే... కరెక్ట్ చెప్పావు రా..
నువ్వేంటి తేడాగా ఉన్నావు. ఏమైంది బాగానే ఉన్నాను కదా చెంపల పైన చేతులు పెట్టుకుని అడుగుతాడు.

నేననేది నీ ఫేస్ ఎలా ఉంది అని కాదు.. నువ్వు తేడాగా ఉన్నావు ఏమిటి కథ అంటున్నా..  తేడాగానా అంటే... ఏదో చిరాకుగా ఉన్నావు.

నీకు కావాల్సింది ఏదో మిస్సయిన ఫీలింగ్ లో ఉన్నావు. ఏం జరిగింది.. అంత తేడాగా ఉన్నానా అని అద్దంలో చూసుకుంటాడు.

ఏమో మీరు చెబుతున్నారు..  నాకేమీ అనిపించడం లేదు అని విక్రమ్ పక్కన కూర్చుని భుజం పైన తల వల్చుతాడు. ఏం జరిగింది రా..

ఆ చందు నాతో సరిగా ఉండడం లేదు. గొడవ పడడం లేదు.  నేను ఏమంటున్నా సైలెంట్ గా చూస్తుంది. అది గొడవ  పడితేనే కదా నేను కౌంటర్ వేయగలను.

అది అలా ఉంటే నాకు నచ్చడం లేదు. ఏం జరిగిఉంటుంది పెదనాన్న.. ఆ మాటకి తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకరి మోఖాలు ఒకరు చూసుకుని నవ్వుకుంటారు.

వైభవ్ అది చూసి నేను అడుగుతుంటే మీరిద్దరూ నవ్వుకుంటారు ఏమిటి.. సరే నిన్ను ఒక విషయం అడుగుతాను. నిజం చెప్పరా..

అడగండి.. ఇప్పుడు చందు నీతో గొడవ పడడం లేదని నీకు నచ్చడం లేదా లేక నువ్వు తిరిగి రీకౌంటర్ వెయ్యలేకపోతున్నావని నచ్చడం లేదా.

రెండు ఒకటే కదా.. సరిగ్గా ఆలోచించి సమాధానం చెప్పు..  నీ ప్రశ్నకి అక్కడే జవాబు దొరుకుతుంది.

వైభవ్ కి జవాబు దొరుకుతుందా..

కథ కొనసాగుతుంది..
[+] 9 users Like SivaSai's post
Like Reply
శివ గారు సూపర్ అప్డేట్ మిణుకు తిరుగే లేదు
రేపటి ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ వుంటాం
[+] 1 user Likes Ajayk's post
Like Reply
Excellent update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
వైభవ్ & చందు line clear అవుతే next generation అందరూ సెటిల్.
శిల్పా మరియు తన ఫ్యామిలీ ని కథ లో ఎక్కువ ఇన్వాల్వ్ చెయ్యలేదు.
[+] 1 user Likes Sunny73's post
Like Reply
https://xossipy.com/thread-73461.html

New Story
Like Reply
Vaibhav is missing Chandu
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Please give big update
[+] 1 user Likes Reddy 211993's post
Like Reply
Part - 70



ఇప్పుడు చందు నీతో గొడవ పడడం లేదని నీకు నచ్చడం లేదా లేక నువ్వు తిరిగి రీకౌంటర్ వెయ్యలేకపోతున్నావని నచ్చడం లేదా.

రెండు ఒకటే కదా.. సరిగ్గా ఆలోచించి సమాధానం చెప్పు..  నీ ప్రశ్నకి అక్కడే జవాబు దొరుకుతుంది.

ఏమో పెదనాన్న.  అందరూ నన్ను ఇలాగే కన్ఫ్యూజ్ చేస్తున్నారు. పొద్దుట అన్నయ్య..  రాగానే సౌమ్య.. ఇప్పుడు మీరు.

నాకు బాబీనే కరెక్ట్ గా జవాబు చెబుతుంది.  అవును ఒక సామెత ఉందరా..  జోగి జోగి రాసుకుంటే బూడిది రాలింది అని..

అలాగే నువ్వు మీ బాబి కలిస్తే అంతే అని సూర్య అంటాడు. అన్నయ్య నువ్వు మా ఇద్దరిని అవమానిస్తున్నావు.  మా టాలెంట్ నీకు తెలియడం లేదు.

వద్దురా బాబు ఇద్దరి టాలెంట్ ని తట్టుకోలేక ఏం చేయాలో తెలియక ఇలా నాన్న దగ్గరికి వచ్చాను. ఆ మాటకి విక్రమ్ నవ్వితే...

వైభవ్ కోపంగా లేచి నేను మా బాబి తో మాట్లాడతాను. మీ ఇద్దరితో కటీఫ్ అని వెళ్ళిపోతాడు.  వీడికి ఇంకా చిన్న పిల్లోడు లక్షణాలు పోలేదు.

కోపంగా వెళుతున్న వైభవని  అవని ఆపి..ఏమైందిరా అలాగ ఉన్నావు.. చూడు పెద్దమ్మ వాళ్ళిద్దరూ కలిసి నన్ను ఏడిపిస్తున్నారు.

నేను ఈరోజు నుంచి వాళ్ళిద్దరితో మాట్లాడడం లేదు అని వెళ్ళిపోతాడు. మీ ఇద్దరికీ పనేమీ లేదా... చిన్నపిల్లోడిని అలా ఏడిపిస్తున్నారు.

అమ్మ వాడిని చిన్న పిల్లోడు అంటున్నావు..వాడు చేసే పనులు ఎంత పెద్దగా ఉంటాయో తెలుసా.. ఏదో అప్పుడప్పుడు చేస్తాడు.

పిల్లలు అన్నాక చేయరా ఏమిటి.. చిన్నప్పుడు నువ్వు ఎంత అల్లరి చేసేవాడివి. నేను చిన్నప్పుడు చేసిన అల్లరి..
ఇప్పుడు వాడు చేసేది రెండు ఒకటేనా..

పిల్లలు ఎప్పుడు చేసినా నాకు ఒకటే..  మీ అమ్మతో వాదించలేం లేము గాని గౌతమ్ ట్రీట్మెంట్ కి ఎలా ఉన్నాడు.. నా గెస్ కరెక్ట్ అయితే వాడు ఇప్పుడు ఆలోచనలో పడతాడు.

వాడికి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది... ఈరోజు హిమకి ఫొటోస్ పంపించింది ఎవరు అని ఆలోచిస్తారు. ఎంత ఆలోచించినా వాడి పీత బుర్రకి ఏమీ తట్టదులే..

కానీ నువ్వు జాగ్రత్త సూర్య.  ఇద్దరికీ ఒకేసారి ఎదురుపడకు.  హిమకి నువ్వు ఎవరో తెలుసు.. ఆ గౌతమ్ నిన్ను ఒక లెక్చరర్ మాత్రమే అనుకుంటున్నాడు.

సో బి కేర్ఫుల్.  నో ప్రాబ్లం..  సరళ కూడా లైన్లోకి వచ్చింది. కాబట్టి ఆ గౌతమ్  క్యూటి జోలికి రాకుండా  తనే అడ్డుగా ఉంటుంది.

అలా అని గుడ్డిగా నమ్మొద్దు... మనుషులు తమకు అనుకూలంగా ఎటు ఉంటే అటు మారిపోతారు..

అవని మంచం మీద కాళ్లు రెండు పైకి పెట్టుకుని  కూర్చుని ఇద్దరినీ చూస్తూ ఉంటుంది. ఏంట్రా అలా చూస్తున్నావ్ అని విక్రమ్ అడిగితే...

ఇద్దరూ ఏదో దేశ రాజకీయాలు చర్చించుకుంటున్నారు కదా...  డిస్టర్బ్ చేయడం ఎందుకని చూస్తున్నాను. అబ్బో మా అమ్మ కూడా ఈ మధ్యన సెటైర్లు వేస్తుందే అని లేచి వెళ్లి అవని పక్కన కూర్చుంటాడు.

పోనీలే రా బాబు ఇప్పటికైనా నీకు ఒక అమ్మ ఉందని గుర్తించావు.. అలా అంటావేమిటి అమ్మ. నిన్ను గుర్తించకుండా మేము ఉంటామా..

చెప్పరేమి డాడీ.. ఆ విషయం మీ అమ్మకి కూడా తెలుసు.  ఈ మధ్యన అలకలు ఎక్కువ అయ్యాయి.. నాకేమీ అలకలు ఎక్కువగా అవ్వలేదు.

మీరు ఇద్దరు బిజీ అయిపోయి నన్ను పట్టించుకోవడం లేదు.  మీరు మీ బిజినెస్ గొడవలో..  వీడికి వీడి ప్రేమ గొడవ.  అప్పుడే కోడలు రాకుండానే అత్తగారి అలకలు చూపిస్తున్నావా..

అలా అన్నారంటే మాత్రం నేను అలిగి మా పుట్టింటికి వెళ్ళిపోతాను.  మా నాన్న దగ్గరికి వెళ్లి మీరు ఎంత బ్రతిమాలిన రాను.

హ్మ్.. నీకు ఇప్పుడు పుట్టింటి వైపు గాలి మళ్ళింది. వెళ్ళాలి అనుకుంటే వెళ్ళు.  వద్దని నేను ఆపలేదు కదా.. చూశారా అంతకుముందేమో ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదు.నాతోనే ఉండు అనేవారు.

ఈ మధ్యన ప్రేమ తగ్గిపోయింది. అందుకే వెళితే వెళ్ళు అంటున్నారు కానీ ముక్కు చీదుతూ కొడుకు వైపు చూస్తూ నువ్వు మాత్రం నా కోడలని ఇలా ఇబ్బంది పెట్టకు రా..

ఇప్పుడు నేనేమన్నాను అని నీ కొడుకుకి కంప్లైంట్ ఇస్తున్నావు.  మీరేగా వెళ్ళిపోమన్నారు.. నేనెక్కడ వెళ్ళమన్నాను.

నువ్వు వెళతాను అంటే సరే అన్నాను. దానికి నేను వెళ్ళిపోమన్నట్టా..  అంతే కదా..  సూర్య నవ్వుతూ మీ ఇద్దరి గొడవలోకి నేను రాను. ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అని వెళ్ళిపోతాడు.

సూర్య వెళ్లిన తర్వాత విక్రమ్ డోర్ లాక్ చేసి అవని పక్కన కూర్చుని రెండు చేతులతో గట్టిగా పట్టుకుంటాడు.  ఏం చేస్తున్నారు.

ఎక్కడికి వెళ్ళనివ్వకుండా పట్టుకున్నాను.  ఇందాక వెళ్ళిపోమన్నారు.  ఇదిగో తల తోక లేకుండా మాట్లాడకు. నువ్వే అలిగావు..  నువ్వే వెళ్ళిపోతాను అన్నావు.

మళ్ళీ నేను వెళ్ళిపోమ్మన్నాను అని దెబ్బలాడుతున్నావు. ఏమైందిరా.. భర్త వైపు తిరిగి... గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంటుంది.  ఏంట్రా బెంగగా అనిపిస్తుందా..

తెలియదు కానీ ఏంటోలాగా ఉంది. సరే రా అని గుండెలపై పడుకోబెట్టుకుని జో కొడుతూ ఉంటాడు.  శ్రీవారు అని పిలిస్తే..  చెప్పండి శ్రీమతి గారు.

మన పెళ్లయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ నన్ను ఇలాగే పడుకోబెట్టుకుని జో కొడుతున్నారు కదా..  మీకు ఎప్పుడూ విసుగు రాలేదా..

అదేం ప్రశ్న..ప్లీజ్ ప్లీజ్ చెప్పరా... చెబితే నాకేంటి.. ఏం కావాలో దొరగారికి.. నువ్వు ఏది ఇచ్చినా నేను కాదనను.. నన్ను డైవర్ట్ చేయకుండా సమాధానం చెప్పండి..

నాలో ఉన్న ప్రాణాన్ని విసుక్కుంటే నాకు శ్వాస ఎలా అందుతుంతే తింగరి. నేను తింగరిని కాదు. చాలా తెలివైన దాన్ని..  అవునవును నీ తెలివి ఏ పాటిదో.. నాకు కాక ఇంకెవరికి తెలుసు..

వైభవ్ గదిలోకి వెళ్లి విశికి కాల్ చేస్తాడు.  చెప్పు. బాబీ నేను హర్ట్ అయ్యాను.  నేను కూడా... ఆ చందు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. సైలెంట్ గా ఉంది. దానికి ఏదైనా హెల్త్ బాగోలేదు ఏమో అని నేను కన్సల్ చూపిస్తే...

దానికి ఎలాగుంటే నీకెందుకు.  నువ్వు ఏమైనా మిస్ అవుతున్నావా అని నన్నే తిరిగి క్వశ్చన్ చేస్తున్నారు.  నాకు అలాగే ఉంది వైభవ్..

ఈరోజు ఒక పెద్ద కంపెనీ నుంచి ఆఫర్ వచ్చింది. దాని గురించి మీ అన్నయ్యని సలహా అడిగితే... నన్ను అడుగుతావేమిటి..  నీకు తెలియదా అంటున్నారు.

అరే చెప్పాలి కదా.. వీళ్లు క్లియర్గా చెప్పరు. మళ్ళీ తిరిగి మనల్నే క్యూస్షన్స్ అడుగుతున్నారు..

ఆ చందు మరీ సైలెంట్ గా ఉంటుంది..అంతకుముందు నేను కౌంటర్ వేస్తే నాకు రీకౌంటర్ వేసి... దెబ్బలాడి నన్ను మా అమ్మ దగ్గర ఇరుక్కించేదాకా ఊరుకునేది కాదు. అలాంటిది ఇప్పుడు నేను ఎంత రెచ్చగొడుతున్న ఒక చిన్న స్మైల్ ఇచ్చి తన పని తను చేసుకుంటుంది.

అవునా..  ఎందుకని...  అదే కదా నేను ఎవరిని అడుగుతున్నా మా అందరితో బాగానే ఉంటుంది. నీకే అలా అనిపిస్తుందంటే నువ్వే ఆలోచించుకో అంటున్నారు.

అరే.. ఇదేమన్నా ఐఏఎస్ ఎగ్జామా ఏమిటి.. ఆలోచించుకుని సమాధానం చెప్పడానికి..

చందుని అడగకపోయావా.. అడిగాను. అడిగితే ఏంటో వేదాంతం చెబుతుంది. దాని ఫిగర్ కి అసలు వేదాంతం సెట్ అవుతుందా.

ఏమో నేనెప్పుడూ అమ్మాయిని చూడలేదు కదా.. నేను చెబుతున్నాను కదా.. సరే ఎలా ఉంటుందో చెప్పు వింటాను..

ఎలా ఉంటుంది అంటే ఆలోచిస్తూ బయటకి చూస్తూ ఉంటాడు..
చందు... అచ్చు ఆ చందమామ లాగా   ఉంటుంది.
మొదట చూడగానే సాధారణంగా అనిపిస్తుంది. అమావాస్య చంద్రుడు లాగా ఏమీ అర్థం కాదు.  గొడవపడే అమ్మాయిలాగా ఉంటుంది.
కానీ దగ్గరగా చూసినవాళ్లకే తెలుస్తుంది...  ఆమెలో ఉన్న సింపుల్ బ్యూటీ ఎంత రేర్ అని.
అది ఎప్పుడూ నాతో గొడవ పడుతూ ఉంటేనే నాకు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్టు ఉంటుంది..
కానీ ఇప్పుడు సైలెంట్ గా ఉంటుంది.
ఆ సైలెన్స్‌లోనే ఎన్ని మాటలు దాగి ఉన్నాయో అనిపిస్తుంది కానీ అర్థం కావడం లేదు.

విశి  ఆశ్చర్యంగా కాస్త నవ్వుతూ
అంతగా గమనిస్తావా నువ్వు ఆమెను..

వైభవ్ తెలియకుండానే  మనసులో మాట చెబుతూ ఉంటాడు.
ఎవరినైనా అర్థం చేసుకోవాలంటే, వాళ్లను గమనించాల్సిందే కదా...
చందు మాట్లాడకపోయినా, ఆమె కళ్లలో ఉన్న ఏకాగ్రత... ఏదో చెబుతుంది.
మరి ఆ చెప్తున్నదేమిటో... నాకు ఇంకా అర్థం కాలేదు.

ఒక క్షణం మౌనం.

విశి  నెమ్మదిగా..
వైభవ్... నీకు చందమామ అందంగా కనిపించటమా లేక చందు లాగా కనిపించటమా?

తెలియదు... కాని చాలాసార్లు ఆ చందమామలో చందు నన్ను చూసి  నవ్వినట్టుంది.

ఆ నవ్వు ఎలా ఉంటుంది. వెన్నెలంతా చల్లగా ఉంటుంది. కానీ ఈ మధ్యనే బాబి... బెట్టు చేస్తుంది. మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయి అనుకుంటుంది.

ఎందుకు నీతో అలా ఉంటుంది.. తెలియదు. తెలియదు కాదు...నీ దగ్గరే సమాధానం ఉంది.  ఇప్పటిదాకా నువ్వు మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ చేశాను. నీకే పంపుతున్నాను.

విను.  ఈ మధ్యకాలంలో మీ ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్ గురించి కూడా ఆలోచించు.. ఎందుకు నీకు దూరంగా ఉంటుందో ఆలోచించు.. ఎవరిని అడగవలిసిన అవసరం లేదు.

నీ మనసే నీకు సరైన దారి చూపిస్తుంది. థాంక్యూ బాబి.. నువ్వు ఒక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావు.  మిగిలిన అందరూ నువ్వు మిస్ అవుతున్నావు.. మిస్ అవుతున్నావు అని నన్ను టార్చర్ పెడుతున్నారు అనుకో..

నీ గురించి నాకు తెలిసినంతగా మిగిలిన వాళ్ళకి తెలియదు కదా.. సరే నీకు ఒక గుడ్ న్యూస్. మనకి వి.జె.స్  కంపెనీ నుంచి ఒక ఆఫర్ వచ్చింది.

రేపు నువ్వు ఏ టైం లో ఫ్రీ గా ఉంటావో చెప్పు కొటేషన్ ప్రిపేర్ చేద్దాము..  వావ్ సూపర్ గుడ్ న్యూస్. నీ కాలేజ్ అయిన తర్వాత మీట్ అవుదాం. ఓకే గుడ్ నైట్ అని ఫోన్ పెట్టేస్తుంది.

విశి చందమామ ని చూస్తూ.. మనం ఇష్టపడుతున్న మనిషి చందమామలో కనిపిస్తారా..మరి నా మనసులో ఎవరున్నారు.

నేను ఇష్టపడుతున్న వ్యక్తి ఎవరు తెలుసుకోవాలి అని.. కళ్ళు మూసుకుని శ్వాస తీసుకుని వదిలి.. చందమామ ప్లీజ్ చూపించు అని మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తుంది.

ఎవరు కనిపిస్తారు..........
[+] 7 users Like SivaSai's post
Like Reply
Part - 71



నేను ఇష్టపడుతున్న వ్యక్తి ఎవరు తెలుసుకోవాలి అని.. కళ్ళు మూసుకుని శ్వాస తీసుకుని వదిలి.. చందమామ ప్లీజ్ చూపించు అని మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తుంది.

చందమామలో కనిపిస్తున్న రూపం చూసి నోరు వదిలేస్తుంది. బాబోయ్ ఇలా జరుగుతుంది ఏమిటి.. ఎవరికి చెప్పాలి అని ఆలోచిస్తూ వెంటనే భవ్య కి కాల్ చేస్తుంది.

ఫోన్ లిఫ్ట్ చేసి ఏమిటే ఈ టైంలో ఫోన్ చేసావు. అంతా ఓకే నా.. నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇంపార్టెంట్ విషయమా.. ఆంటీ బాగానే ఉన్నారా అని కంగారుగా అడిగితే..

అమ్మ బాగానే ఉంది.  నేను చెప్పేది వేరే విషయం.  సరే చెప్పు అని కూల్ గా అడుగుతుంది. నీకు లాస్ట్ టైం చెప్పాను గుర్తు ఉందా..

ఏ విషయం గురించి అని నీరసంగా అడుగుతుంది.. అదే.. దేవాసార్ నా రూమ్ కి వచ్చారు అని చెప్పాను.. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు.

ఇప్పుడు ఏకంగా చందమామలో కనిపిస్తున్నారు అని ఒక సీక్రెట్ చెప్పినట్టుగా చెబుతుంది..అవునా మరి కనిపించినప్పుడు హాయ్ చెప్పకపోయావా..


చెబితే రెస్పాండ్ అవుతారంటావా... చెప్పి చూడు తెలుస్తుంది కదా.. నేను చెప్పాక సార్ చెప్పకపోతే.. ఒసేయ్ మొద్దు చందమామలో కనిపిస్తున్నారు అంటే.. అది నీ డ్రీమ్.

నీ ఊహలోకంలో ఉన్న మనిషి నువ్వు ఎలా అంటే అలా మాట్లాడుతారు కదా.. ఏమిటి ఇదంతా నా ఊహనా కాక చందమామలో ఎలా కనిపిస్తారే..
మనం బాగా ఇష్టపడిన వాళ్లు... మన ఊహల్లో..  మన ఆలోచనల్లో  ముందు ఉంటారు..
ఫోన్ పెట్టేయ్..  నువ్వు డ్రీమ్స్ లో ఉండి పడుకోవడం లేదు.  కానీ నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్.

దేవా సార్ ఇదంతా నా డ్రీమా.  నిజం కాదా.. భవ్య చెప్పినట్టు మనకి బాగా ఇష్టమైన వాళ్ళు అలాగే కనిపిస్తారా..  అంటే నా మనసులో ఉన్నది మీరేనా..

  ఎప్పుడు మనిద్దరం అలా మాట్లాడుకోలేదు. మన చూపులు అలా లేవు కదా అని నోట్లో చూపుడు వేలు పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటుంది.
ఫోన్ పెట్టి, విశి కాసేపు నిశ్శబ్దంగా మొబైల్ స్క్రీన్ వైపు చూస్తూ ఉంటుంది. చెవుల్లో ఇంకా  భవ్య వాయిస్‌ మోగుతూనే ఉంటుంది –

మనకి బాగా ఇష్టమైన వాళ్లు మన ఊహల్లో, మన కలల్లోనే ముందుగా కనిపిస్తారు విశీ…

ఆ మాటలు ఆమె మనసులో గాలి తాకినట్టుగా మెల్లగా తేలుతాయి.

కిటికీ దగ్గరకి వెళ్లి బయట చందమామ వైపు చూస్తుంది. ఆ వెన్నెల ఆమె ముఖంపై తాకుతుంది.. కళ్ళల్లో చిన్న తడిమిన వెలుగు.

దేవా సార్... నిజంగా మీరు నా కలల్లోకే వచ్చారా? నేను మీ ఊహా లోకంలోనే ఉంటున్నానా..

విశి ఆ చందమామనే చూస్తూ.. మెల్లగా కుర్చీలో కూర్చుని చేతిలో పెన్ తిప్పుకుంటుంది.  పక్కన ఉన్న డైరీని తీసుకుని ఆలోచిస్తూ పేజీ మీద గీతలు గీస్తుంది.

ఆమె మనసు మరో లోకంలో..
దేవా సార్ చిరునవ్వు, ఆయన చూపులో ఉన్న సౌమ్యం, మాట్లాడినప్పుడు వచ్చే నెమ్మది.. నాకు గైడ్ చేసేటప్పుడు కమాండింగ్.. ఒక్కో స్మృతి ఒకొక మృదువైన సంగీతంలా నడుస్తూ ఉంటుంది.

దేవా సార్ వాయిస్‌లో ఉన్న ఆ శాంతి…
ఆ చూపులో ఉన్న ఆ మాయ…
తనకు అర్థం కాకపోయినా, ఆలోచనల్లో ఎప్పటికప్పుడు ఆయనే.
మన చూపులు అలా లేవు కదా… అని మళ్లీ మళ్లీ అనుకుంటూనే.... చూపుడు వేలు పెదవుల దగ్గర పెట్టుకుంటుంది.
మంచు కాంతిలో ఆమె కళ్ళు మెరిసిపోతాయి.

ఆలోచిస్తున్న కొలది విశి మనసు తేలిపోతుంది..
దేవా సార్ నవ్వుతూ చెప్పిన వాక్యాలు, కాఫీ కప్పులో మసకగా కరిగే స్మైల్, ఆయన వాయిస్‌ లొని లోతు అన్నీ ఒక్కసారిగా చుట్టుముడతాయి.

చందమామలో ఆయన ముఖం మసకగా కనిపిస్తుంది.
విశి చిన్నగా నవ్వుకుంటూ..
అవును… ఇదే నా మనసు లోకం…
మీరు కనిపించేది కేవలం వెన్నెలలో కాదు… నా ఊహల్లో కూడా.

ఆ వెన్నెలలో ఆమె కళ్ళు తేలిపోతూ, నెమ్మదిగా మంచం మీద పడుకుంటుంది.
మెల్లగా కన్నులు మూసి దేవా సార్ ముఖం మరోసారి మెరుస్తుంది..
అది కలనా… నిజమా… విశి కి అర్థం కాదు.

చందమామ కాంతి అలా ముఖంపై తాకుతుంటే…
మనసు ఎందుకో చల్లగా, మృదువుగా మారిపోతోంది.
దేవా సార్ పేరు వినగానే కదిలే ఈ స్పర్శ ఏమిటి?

ఫోన్‌లో  భవ్య నవ్వుతూ చెప్పిన మాటలు ఇంకా చెవుల్లో
మనకి ఇష్టమైన వాళ్లు మన ఊహల్లో ముందుగా కనిపిస్తారు విశీ...
అదేనా ఇది?
నాకు నిజంగా ఇష్టమా దేవా సార్ అంటే?
లేదా… మనసు అలా ఒక మాయ చేసిందా?

మాట్లాడినప్పుడు ఆయన చూపులు ఎంత శాంతిగా ఉంటాయో… నా చూపులు నన్ను సూటిగా తాగుతున్నట్టుగా ఉంటాయి.
అవి మాటలకంటే ఎక్కువ చెప్పేవి.

సార్ నాతో మాట్లాడుతూ ఉంటే..
నేను వినేది ఆయన మాటలకన్నా ఆయన స్వరం.
ఆ తేలికపాటి మృదుత్వం…
మనసును ఏదో తెలియని లోకానికి తీసుకెళ్తుంది.

దేవా సార్ నా రూమ్‌కి వచ్చారు" — అప్పుడు భవ్యకి చెప్పాను.
ఇప్పుడు “చందమామలో కనిపించారు” అంటున్నా…
అది జోక్ కాదు, నిజంగానే కనిపించారు.
ఆ వెలుతురులో ఆయన ముఖం… స్పష్టంగా కనిపించింది.
కలలా అనిపించింది కానీ…
హృదయం మాత్రం చెప్పింది – “ఇదే నిజం.”

ఎప్పుడూ ఆయనతో అలా మాట్లాడలేదు,
కానీ మాటలకంటే ఎక్కువ జరిగినట్టుంది.
ఆ చూపుల్లో ఏమో ఒక సైలెంట్ ప్రామిస్‌.
నిన్ను తెలుసుకుంటున్నాను విశి అని చెప్పినట్టుగా.

ఎందుకు ఇలా అనిపిస్తుంది నాకు…
ఒక చిరునవ్వు కూడా ఆలోచనల్ని గజిబిజి చేస్తోంది.
ఇది ప్రేమనా? లేక కృతజ్ఞతా?
లేక కేవలం ఆయన సాన్నిధ్యం వదలని మంత్రం?

చందమామ వైపు చూస్తూ మెల్లగా నవ్వుకుంటుంది.

దేవా సార్… మీరు నా ఊహలోనా లేక నా లోకంలోనా?”



చెవుల్లో ఇంకా ఆయన స్వరం,
కళ్ళలో ఆయన ప్రతిబింబం,
హృదయంలో మాత్రం — నిశ్శబ్దంగా మొలకెత్తిన ప్రేమ.

విశి మెల్లగా...
దేవా సార్... నిజంగానే మీరు నా కలల్లోకే వస్తారా?

ఆలోచనల మధ్య కమ్ముకున్న నిశ్శబ్దం వెన్నెలతో కలిసి కలగా మారుతుంది.
కదులుతున్న వెన్నెలలో ఒక మసక కాంతి,
దానిలో ఆయన అడుగుల శబ్దం…

తెల్లటి మసక ప్రదేశం, గాలిలో తేలే చందమామ కాంతి...

దేవా సార్ అక్కడ నిలబడి ఉన్నారు.. చిరునవ్వుతో, సైలెంట్‌గా.

విశి ఆశ్చర్యంగా చూస్తూ...
సార్… మీరు… నిజంగానే ఉన్నారా?

సూర్య నవ్వుతూ..


నీ కలలో నేను ఎలా ఉండగలను విశి… నువ్వే నన్ను ఇక్కడకు పిలిచావు.

విశి నిశ్శబ్దంగా సూర్య ని చూస్తూ....
అయితే నా ఊహలన్నీ నిజమవుతాయా?
సూర్య చూపులో సాంత్వన..

నిజమవుతాయ్… మనసు చెప్పినది ఎప్పుడో ఒకరోజు నిజమే అవుతుంది.

విశి చూపులు వెన్నెలతో తడుస్తాయి.
అయితే… మీరు ఎందుకు ఇలా దూరంగా ఉంటారు?

దేవా సార్ తేలికగా...
దూరం అనేది కనిపించేది మాత్రమే…
మనసు దగ్గరగా ఉంటే, దూరం కేవలం వెన్నెల దూరం.

విశి నవ్వుకుంటూ సూర్య ని చూస్తూ...
ఇది కలనా?
సూర్య చిరునవ్వుతో దగ్గరకి వచ్చి చెబుతాడు..
అవును, కలే… కానీ నీ మనసులో పుట్టిన నిజమైన కల.

ఆ మాటతో చందమామ కాంతి మరింత మసకబారుతుంది.
విశి కళ్ళు మూసుకుని ఆ క్షణాన్ని గుండెల్లో దాచుకుంటుంది.
సూర్య వాయిస్‌ తేలికగా మోగుతుంది..

గుడ్ నైట్, విశి. గుడ్ నైట్ సార్..

కిటికీ అంచున సూర్యరశ్మి చందమామ వెన్నెలను తాకినట్టుగా లోపలకి జారుతుంది.
విశి కళ్ళు మెల్లగా తెరుస్తుంది.

తల పక్కనే ఉన్న డైరీ పేజీ తెరిచి ఉంది.. నిన్న రాత్రి వేసిన గీతలు ఇంకా అలా మసకబారుతూ...

కొన్ని క్షణాలు కదలకుండా తలపట్టుకుని పడ్డట్లే ఉంటుంది.
గత రాత్రి దేవా సార్‌తో మాట్లాడిన కల ఒక్కసారిగా స్పష్టమవుతుంది.
ఆ స్వరం... ఆ చూపు... ఆ  గుడ్ నైట్, విశి అన్న మాట..
ఇప్పటికీ చెవుల్లో నిశ్శబ్దంగా ప్రతిధ్వనిస్తోంది.

విశి నిశ్శబ్దంగా తనకు తానే..
అది నిజంగా కలేనా?.. కానీ ఆ క్షణం ఎంత నిజంగా అనిపించింది.

ఆలోచనల్లో చిన్న చిరునవ్వు తేలుతుంది.

సార్ మాట్లాడినప్పుడు ఆ మృదుత్వం…
అదే కలలోనూ అలాగే ఉంది.
మనసు ఎలా ఇంత సరిగ్గా గుర్తుంచుకుంటుంది సార్ మాటల టోన్‌ని?

విశి లేచి కిటికీ దగ్గరకి నడుస్తుంది.
బయట ఆరుణ కాంతి, చెట్లపై పక్షుల గళం.
ఆమె చూపు ఆ వెలుతుర్లో తేలిపోతుంది.

మిమ్మల్ని ఎంత ఆలోచిస్తున్నానో, దేవా సార్…
మీకు తెలిస్తే నవ్వుతారా… లేక సైలెంట్‌గా చూస్తారా?



మొబైల్‌ పక్కన ఉంది..
దేవా సార్ పేరుతో ఉన్న కాంటాక్ట్‌ వైపు కాసేపు చూసింది.
ఒక క్షణం ఫోన్ తీయబోతుంది,
తర్వాత మెల్లగా వదిలేస్తుంది.

కలలో మాట్లాడాను… ఇప్పుడే మళ్లీ మాట్లాడాలా?
కాదు విశి… ఈ అనుభూతిని అలాగే ఉంచుకో.
ఈ నిశ్శబ్దం చాలా అందంగా ఉంది.



ఆమె ముఖంపై ఒక ప్రశాంతమైన చిరునవ్వు.
మనసులో తేలికగా మారుమ్రోగిన రియాలిజషన్..

ఇది ప్రేమే అయి ఉంటుందేమో…
కానీ ఏ దూకుడు లేదు, ఏ బలవంతం లేదు…
ఇది మనసు గుండా నెమ్మదిగా నడిచే ఒక వెన్నెల వాక్యం.

సార్ కి నా ప్రేమ విషయం చెప్పాలా.. చెబితే ఎలా తీసుకుంటారు.  ఇప్పుడు కాదు.. నేను ఒక పోసిషన్ లో నిలబడి..  నన్ను తీర్చి దిద్దుతున్న సార్ ముందు గర్వం గా నిలబడే అప్పుడు చెబుతాను..

ఆయన మలుస్తున్న శిల్పం ఆయనకే సొంతమని చెబుతాను.  ఆయన కోసం మాత్రమే ఉన్నాను అని అర్థమయ్యే లాగా నా ప్రేమని చూపిస్తాను..

విశి ఎలా చెప్పబోతోంది......
[+] 8 users Like SivaSai's post
Like Reply
Part - 72



గౌతమ్ ఆరోజు ఎర్లీగా రెడీ అయ్యి కాలేజ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు.  విశి ని గేటు దగ్గరే పట్టుకోవాలి. నేను నిజం చెప్పాలి.

ఆ సరళ కి నాకు ఎటువంటి కనెక్షన్ లేదు అని.. అప్పుడే సరళ కాలేజ్ లోకి ఎంటర్ అవుతూ గౌతమ్ ని చూస్తుంది.
వీడేంటి ఇక్కడున్నాడు అని దగ్గరికి వెళ్లి హలో మిస్టర్ గౌతమ్..

మీరేంటి ఇక్కడ.. హలో సరళ..  ప్లీజ్ మీరు వెళ్ళండి.  మీతో మాట్లాడడం చూస్తే నన్ను తప్పుగా అనుకుంటున్నారు.

ఆ మాటకి కోపంగా చూస్తూ మీతో మాట్లాడటం వల్లే నా క్యారెక్టర్ బ్యాడ్ అయ్యింది.  ఇప్పటివరకు కాలేజ్ లో నేను ఇలాంటి రీమార్క్ ఎదుర్కోలేదు.

మీరు కాలేజ్ కి రాకుండా ఉంటేనే మంచిది..హలో మేడం నేను మీకోసమే మీరు రాలేదు. నేను నా ప్రేయసి విశిష్ట కోసం వచ్చాను. వాట్ మీ ప్రేయసినా..  జోక్ బాగుంది కానీ నవ్వే ఇంట్రెస్ట్ లేదు.

వాట్ డు యు మీన్ అని కోపంగా అడిగితే...మీ ప్రేయసి అయితే నేను తనకి  క్యారెక్టర్ ని డామేజ్ చేస్తాను అంటే ఎందుకు ఒప్పుకున్నారు.

ఓన్లీ మీరు రివేంజ్ తీర్చుకునే పనిమీద మాత్రమే ఉన్నారు. నాకు దేవా సారు మీద ఉన్న ఇంట్రెస్ట్ ని తెలివిగా  క్యాచ్ చేసుకుని...

నా లవర్ నా నుంచి దూరం జరిగిందని ఏదో కహాని చెప్పారు. నో నేను చెప్పిందంతా నిజమే.  నిజంగా ప్రేమిస్తే వాళ్లకోసం మన ఎదురుచూస్తూ ఉంటాము.. అంతేగాని మనలాగా అడ్డదారులు తొక్కరు.

ఏంటి సరళ సడన్గా ఇంత జ్ఞానోదయం అయ్యింది.. ఒక్కొక దెబ్బ తగిలినప్పుడే మనిషిలో మార్పు మొదలవుతుంది. నేను మారాను..  నువ్వు మారితే నీకే మంచిది.. లేకపోతే నీ కర్మ అని వెళ్ళిపోతుంది.

ఆఫ్ట్రాల్ ఒక లెక్చరర్ కూడా నాకు క్లాస్ తీసుకోవడమేనా... ఛ... ఈ విశిష్ట దగ్గర అనవసరంగా ఇరుక్కున్నాను.

వేరే అర్క్ టెక్చర్  పట్టుకుందాము అంటే.. ఏదో స్ట్రోక్స్ డ్రా చేస్తూ తన సిగ్నేచర్ చేస్తుంది.  అదే హిమకి చూపించడం ఇప్పుడు పెద్ద ప్రాబ్లం అయిపోయింది అని చూస్తూ ఉంటాడు.

అప్పుడే సూర్య బైక్ మీద విశి నవ్వుతూ వస్తుంది. ఈ నవ్వులు ఎప్పుడూ నాతో ఉన్నప్పుడు లేవే... ఇప్పుడు చూడు ఆ దేవా ను పట్టుకుని ఎంత కిలకిల నవ్వుతుందో..

గౌతమ్ కి ఇన్నర్ వాయిస్  వినపడుతుంది.  నువ్వు ఎప్పుడైనా విశిష్టతో టైం స్పెండ్ చేసావా పోనీ తనకి ఏం కావాలో అన్నది ఇచ్చావా..

ఎంతసేపు నాకు ఈ ప్రాజెక్ట్ కి చేసి పెట్టు...ఆ ప్రాజెక్టుకి చేసి పెట్టు అని బిజినెస్ ఏ కదా మాట్లాడావు. సరేలే..  ఏదైతే ఏమిటి ప్రపోజ్ చేసినప్పుడు నా దగ్గరే నవ్వాలి.

అదొక ప్రపోజల్.. ఏం చెప్పావు.. విశి ఐ లవ్ యు.. నువ్వు నాతో ఉంటూ అనే కదా నువ్వు చెప్పింది. అంతకుమించి ఎప్పుడైనా ఒక చాక్లెట్ ఇచ్చావా.. ఒక రోజ్ ఇచ్చావా...

వెళ్ళవయ్య బాబు.. నువ్వు మూసుకొని ఉంటే నీకే మంచిది. ఏంటి ఇదంతా  పొసెసివ్ నెస్సా..  నీకు అంత సీన్ లేదు.

నువ్వు మాట్లాడకుండా మూసుకుని వెళ్ళు అని ఇన్నర్ వాయిస్  నొక్కి పెట్టి విశిష్ట అని పిలుస్తాడు. బైక్ దిగుతున్న విశి ఆ వాయిస్ విని వెనక్కి తిరిగి చూస్తుంది.

విశి చూడగానే గౌతమ్ షర్ట్ ని నీట్ గా సర్దుకుంటూ కారులో ఉంచిన బొకే తీసుకుని..  వచ్చి హాయ్ విశిష్ట నిన్ను కలవాలని ఎప్పటినుంచో ట్రై చేస్తున్నాను.

ఇప్పటికి దొరికావు అని బొకే ముందుకే పెడతాడు. అలాగే చూస్తూ ఉంటే..  కమాన్ విశిష్ట నీకు రోసెస్ ఇష్టం కదా..  అందుకే నీకోసమే తీసుకోవచ్చాను.

సూర్య అక్కడ బైక్ మీద కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఉంటాడు.. మిస్టర్ మీరు డ్రాప్ చేయడం అయిపోయింది కదా..

ఇంక మీ స్టాఫ్ రూమ్ కి వెళ్ళచ్చు.. నేను ఎక్కడ ఉండాలో ఎలా ఉండాలో చెప్పడానికి మీరు ఎవరు మిస్టర్. నేను ఈ కాలేజీలో లెక్చరర్ ని.

సో నేను ఎప్పుడు వెళ్లాలో అన్నది నాకు తెలుసు.  నీతో నాకు అనవసరం.. విశిష్ట అని  ప్రేమగా పిలుస్తాడు.  ఏంటి మిస్టర్ గౌతమ్ అని అడిగితే..

మనిద్దరం కొంచెం సపరేటుగా ఒక పక్కకి వెళ్లి మాట్లాడుకుందామా...నీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి.  ఏదైనా ఇక్కడే మాట్లాడండి.

నేను అంటుంది మనిద్దరం మాత్రమే ఉండాలి అని.. నాకు సేఫ్టీ చాలా ఇంపార్టెంట్.  నలుగురిలో ఉండే మాట్లాడుతాను..

నాతో ఉంటే నీకు భయమా.. నీలాంటి వాళ్ళని చూసి కూడా భయపడతానా..   కానీ నా సేఫ్టీ నాకు ఇంపార్టెంట్ కొంతమందికి దూరంగా ఉంటే చాలా మంచిది కదా.. అందుకని..

ఇంతకుముందు నువ్వు ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు.  మీ ప్రవర్తన కూడా ఇలా లేదు.   ఒకప్పుడు నన్ను లవ్ చేస్తున్నా అన్నారు.

తర్వాత ఇంకొక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటున్నా అన్నారు.  తర్వాత చూస్తే  మా లెక్చరర్ తోనే డేటింగ్ కి వెళ్లారు.

అలాంటప్పుడు మిమ్మల్ని నమ్మి ఎలా ఒంటరిగా మాట్లాడుతాను చెప్పండి. ఆ మాటకి గౌతమ్ మొఖం మాడిపోతే.. సూర్య ఫోన్లోనే సూపర్ రా నీ కౌంటర్ కే అసలు తిరిగే లేదు..

గౌతమ్ వెంటనే..  విశిష్ట ఇదంతా ఎవరో కావాలని నా మీద బురద జల్లుతున్నారు.  ఫేక్ న్యూస్..అయితే నాకేంటి మిస్టర్.

నీకు సంబంధించి రియల్ న్యూస్ వస్తే నాకేంటి..  ఫేక్ న్యూస్ వస్తే నాకేంటి.. అది పూర్తిగా నీకు సంబంధించిన విషయం. నాకెందుకు చెబుతున్నావో అర్థం కావడం లేదు.

నేను నిన్ను మాత్రమే ప్రేమించాను. నువ్వు తప్పుగా అనుకుంటే తట్టుకోలేను.  అందు గురించే వచ్చాను అని ముసలి కన్నీరు కారుస్తూ ఉంటాడు.

చూడు మిస్టర్..  నిజమైన ప్రేమ ఉన్నచోట ఇలాంటి అనుమానాలు ఉండవు.  అనుమానాలు ఉన్నాయి అంటే అది ప్రేమే కాదు.

అసలు మీరు ఎవరితో వెళుతున్న నాకు ఎటువంటి ఫీలింగు లేదు అంటే..  అది అసలు నథింగ్ అని అర్థం. జస్ట్ మీరు ఒక తెలిసిన మనిషిగా మాత్రమే నా దృష్టిలో ఉన్నారు.

ఒకరకంగా నేను మీకు థాంక్స్ కూడా చెప్పాలి ఎందుకో తెలుసా... మా ఫాదర్ దూరమై ఒంటరిగా నిలబడినప్పుడు నాకు మనీ అవసరం అవుతే.. అది నా వర్క్ కి తగ్గ మనీ కాకపోయినా సరే ఎంతోకంత ఇచ్చారు.

దానితో నేను మా మదర్ ని సేవ్ చేసుకున్నాను.  ఆ విషయంలో ఎప్పటికీ మీకు నేను థాంక్స్ చెబుతూనే ఉంటాను.  అలాగని నా లైఫ్ మీకు ఇవ్వలేను కదా..

మీరు ఫస్ట్ డేనే.. విశిష్ట నాకు నీ వర్క్ కావాలి. దానికి ఇలా అమౌంట్ ఇస్తాను అని చెప్పి ఉన్న మన మధ్యన ఈరోజు ఈ గ్యాప్ వచ్చిండేది కాదు.

ప్రేమ అనే ఒక నాటకం ఆడుతూ నా టాలెంట్ ని వాడుకోవాలి అనుకున్నారు చూశారు..  అక్కడే మీరు చాలా కిందకి వెళ్ళిపోయారు.

వైభవ్ డీల్ చేసే వరకు నా వర్క్ కి ఇంత ప్రాఫిట్ వస్తుంది అన్న విషయం కూడా నాకు తెలియదు. అన్నీ తెలిసి మీరు ఎలా చీట్ చేశారు.

అందులోనూ నేను మా మదర్ కోసం బతుకుతున్నాను..  ప్రతి నిమిషం ప్రతి రూపాయి నాకు చాలా ఇంపార్టెంట్ అని మీకు తెలిసి కూడా క్యాష్ చేసుకోవడానికి చూశారు.  మరి అది ప్రేమ ఎలా అవుతుంది సార్..

అది బిజినెస్ విశిష్ట.. బిజినెస్ వేరు ప్రేమ వేరు.. అవును సార్. నేను అదే చెబుతున్నాను.  రెండు వేరు..  వేరు..
బిజినెస్ పర్పస్ గా మీరు మాట్లాడాలి అనుకుంటే ప్రొఫెషనల్ గా మనం కలుద్దాం.

మాట్లాడుకుందాం డీల్ ఓకే చేసుకుందాం. అంతేగాని  ప్రేమా ప్రేమా అని ఇలాగ వచ్చి నిలబడి ఇంకా మీరు దిగజారి పోకండి.


ఆల్రెడీ కాలేజీలో మీ గురించి చాలా బ్యాడ్ గా రూమర్ స్ప్రెడ్ అవుతున్నాయి.  అవి ఎంతవరకు నిజమో అన్నది నాకు తెలియదు కాబట్టి దయచేసి మీరు ఇలా నన్ను మీట్ అవ్వకుండా ఉంటే అదే మీరు నాకు ఇచ్చే విలువ అనుకుంటాను.

ఇక నేను వెళ్ళనా మిస్టర్ గౌతమ్ అని అడుగుతుంది. ఇంకేం సమాధానం చెబుతాడు అన్ని మూసుకుని వెళ్లాల్సిందే అని సూర్య అంటే.....


మిస్టర్ దేవా.. ఏమైంది నేను ఫోన్లో మాట్లాడుతున్నాను అని ఫోన్ చూపిస్తాడు. ఉఫ్ అనుకుని సరే మనం ప్రొఫెషనల్ గా  మీట్ అవుదాం. ఎప్పుడు కలుద్దాం.

ఈరోజు నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది..2 డేస్ తర్వాత ఎక్కడ మీట్ అవ్వాలా అన్నది నా పిఏ చెబుతాడు. ఆఫీసు లేదు ప్రాపర్ గా ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు.

అప్పుడే పీఏనా... నా వర్క్ మీద నాకు నమ్మకం ఉంది నా టాలెంట్ కావాలి అనుకున్న వాళ్ళకి నాకు ఆఫీస్ ఉందా..  ఏసీ వేసి కూర్చోబెట్టేనా లేకపోతే చెట్టు కింద కూర్చో పెట్టానా అని చూడరు.

ఓన్లీ హైఫే కావాలనుకున్న వాళ్ళు మాత్రమే అది చూస్తారు. వాళ్ళతో నాకు డీల్ చేయాల్సిన అవసరం లేదు. అబ్బబ్బ ఏం చెప్పావురా..

మిస్టర్ దేవ మీరు ఫోన్లో మాట్లాడుతున్నట్టు లేదు నాకు కౌంటర్ వేస్తున్నట్టు ఉంది. మీకు ఎలా కావాలంటే అలా తీసుకోండి మిస్టర్.


బట్ నేను మాట్లాడుతుంది ఫోన్లోనే..  కావాలి చూడండి అవుట్ గోయింగ్ వెళుతుంది. ఎందుకు వెళ్ళదు. అవతల పక్కన ఏ బకరానో నుంచో పెట్టి నన్ను అంటున్నావు.

నువ్వు ఏమన్నా సూపర్ ఫిగర్ వా ఏంటి.. ఇన్ డైరెక్ట్ గా నిన్ను అనడానికి డైరెక్ట్ గానే అంటాను.

విశిష్ట చెప్పిన దాంట్లో ఏమి తప్పు ఉంది. అంత కరెక్ట్ గానే చెప్పింది. ఒక బిజినెస్ డీల్ చేయాలి అనుకున్నప్పుడు టాలెంట్ మాత్రమే చూస్తారు..

ఆ టాలెంట్ లేకపోతే ఎన్ని అంతస్తుల బిల్డింగ్ లో కూర్చుని డెమో ఇద్దామనుకున్న గెటవుట్ అంటారు. ఆ మాటకి గౌతమ్ ఉలిక్కిపడతాడు.

ఏంటి బ్రో అలా ఉలిక్కిపడ్డావు.  కొంపతీసి ఏదైనా అలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందా ఏమిటి..

గౌతమ్ చెబుతాడా......
[+] 8 users Like SivaSai's post
Like Reply
Part - 73



ఏంటి బ్రో అలా ఉలిక్కిపడ్డావు.  కొంపతీసి ఏదైనా అలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందా ఏమిటి..

నాకా..  నాకెందుకు జరుగుతుంది అని కంగారు పడతాడు.  ఏమో నీ వాలకం చూస్తే నాకు అలాగే అనిపించింది.

ఎనీ హో.  విశిష్ట నీకు క్లాస్ టైం అవుతున్నట్టుంది. అవును సార్ అని చెప్పి వెళ్ళిపోతుంది. దేవా వెళుతుంటే హలో దేవా అని పిలుస్తాడు.

చెప్పండి మిస్టర్.. మీరు విశిష్ట కి దూరంగా ఉంటే మంచిది. ఎందుకో తెలుసుకోవచ్చా.  తను నాది.  ఇంకా..  నేను సీరియస్ గానే చెబుతున్నాను.

ఎప్పటికైనా విశిష్ట నా కాళ్ళ దగ్గరికి రావాల్సిందే.. మీకు పగటి కలలు కనడం అంటే చాలా ఇష్టం అనుకుంటా.. వాట్ డు యు మీన్..

లేకపోతే ఏమిటి..  విశిష్ట మీ కాళ్ళ దగ్గరికి రావడం ఏంటి. ఒకసారి చూసుకోండి.  ఎవరు ఎవరి దగ్గరికి వచ్చి నిలబడుతున్నారో..

ఇది బిజినెస్.. అయితే.. విశిష్ట కి బ్యాక్ గ్రౌండ్ ఏమీ లేదు.
  ఒక ఆడపిల్ల ఈ సొసైటీలో బ్రతకాలి అంటే..ఒక మగవాడి అండ కావాలి.

అది నేనే.. విశి నా కాళ్ళ దగ్గరికి వస్తుంది. నేను చెప్పినట్టు వింటుంది.  ఆ మాటకి సూర్య నవ్వుతూ..  ఓ మై గాడ్ అసలు మీరు కామెడీ చేస్తారని తెలుసు కానీ మరి ఇంత బఫూన్ అనుకోలేదు..
మైండ్ యువర్ టోన్ దేవా....
విశిష్ట ఏమైనా మిషన్ అనుకుంటున్నావా లేకపోతే  కీ.. ఇచ్చే బొమ్మ అనుకుంటున్నావా...

నీ దృష్టిలో విశిష్ట అదే అనుకొని ఏమైనా చేయాలి అనుకుంటే...
ఆమెను ప్రొటెక్ట్ చేయడమే నా సమాధానం.

గౌతమ్ చిన్నగా నవ్వుతూ: ప్రొటెక్ట్?
నువ్వు అనుకుంటున్నావా విశిష్ట నీతో సేఫ్ అని? ఆఫ్ట్రాల్ ఒక లెక్చరర్ వి..
నేను అనుకుంటే… ఎవరు ఆమె చుట్టూ తిరగలేరు.
నన్ను కాదని నువ్వు ఎలా ప్రొటెక్ట్ చేయగలవు..

సూర్య  గౌతమ్ కి దగ్గరగా వచ్చి సూటిగా చూస్తూ...
ధమ్కీలు నాకు పెద్దగా పనిచేయవు గౌతమ్...
ఒక రోజు విశిష్ట ఎవరి దగ్గర నిలబడాలో ఆమె నేర్చుకుంటుంది…
ఆమె స్వయంగా తీసుకునే నిర్ణయం ఎవరి చెప్పులు కింద ఉండదు.

అది చూస్తాను నువ్వు ఎలా ప్రొటెక్ట్ చేస్తావో .. ఆ విశిష్ట నా కంట్రోల్ లోకి ఎలా రాకుండా ఉంటుందో... వెయిట్ అండ్ సి అని వెళ్ళిపోతాడు.

వెళుతున్న గౌతమ్ ని చూసి చిన్నగా నవ్వుకుంటూ లోపలికి వెళ్తాడు.  దూరం నుంచి చూస్తున్న విశిష్ట గోళ్లు కొరుక్కుంటూ చూస్తూ ఉంటుంది.

భవ్య ఏమైందే అలా చూస్తున్నావు. సార్..  గౌతమ్ తో ఏం మాట్లాడి ఉంటారు. ఇద్దరు నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు కానీ మ్యాటర్ చూస్తే డిఫరెంట్ గా అనిపిస్తుంది.

ఏమై ఉంటుంది.. కనుక్కొని రానా...  నువ్వు అడిగితే చెబుతారా... చెప్పేవాళ్ళు అయితే ఎప్పుడో చెప్పేవారు. ఏమని..  నీకు చదువు తప్ప మిగిలిన లోకజ్ఞానం లేదు. చెప్పిన వేస్ట్..  పద క్లాస్ కి..

సాయంత్రం కాలేజ్ అయ్యే టైంకి వైభవ్ వస్తాడు. వైభవ్ ని చూసి హాయ్ అని చెయ్యి ఊపుతుంది. హాయ్ బాబి.. ఏమైంది అంత డల్ గా ఉన్నావు.

ఏమీ లేదులే గాని వర్క్ ఏదో వచ్చిందన్నావు కదా..  కొటేషన్ ప్రిపేర్ చేద్దామా. అది తర్వాత అయినా చేయొచ్చు ముందు నీ ప్రాబ్లం ఏమిటో చెప్పు.

నువ్వు ఇలా డల్ గా ఉంటే నాకు అస్సలు నచ్చలేదు. సూర్య వచ్చి ఏంటి వదిన మరిది మంచి డిస్కషన్ లో ఉన్నారు అని టంగ్ స్లిప్ అవుతాడు.

ఏమిటి అని విశిష్ట అడిగితే.. అదే వైభవ్ నిన్ను బాబి అని పిలుస్తాడు కదా ఆ ఫ్లోలో అడిగాను. అదే సార్ ప్రాజెక్టు గురించి డిస్కస్ చేద్దాము అని..

ఇంటికి వెళ్లి చేసుకోవచ్చు కదా.. ఇక్కడ ఎందుకు. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను.  నువ్వు రారా అని విశిష్టని బైక్ ఎక్కించుకుంటాడు.

వీళ్లను ఫాలో అవుతూ చూస్తూ ఉంటాడు.  నేను.. చందు బైక్ మీద ఎప్పుడు ఇలా వెళ్ళలేదు.  కూల్ గా లేమే.. కొట్టుకుంటానే ఉన్నాము.

ఏదో ఒకటి నేను అంటూనే ఉంటున్నాను.. ఒకప్పుడైతే సమాధానం చెప్పేది. ఇప్పుడు మాత్రం మౌనంగా ఉంటుంది. ఏమై ఉంటుందంటావు అనుకుంటూ చూస్తూనే ఇంటికి చేరుతారు.

సరే మీరిద్దరూ రూమ్ కి వెళ్లి ప్రిపేర్ అవ్వండి అని చెప్పి వెళ్ళిపోతాడు.  భానుమతి వైభవ్ ని చూసి రా బాబు.. ఈ మధ్యన రావడం లేదు.  కొంచెం వర్క్ ఉంటుంది.

అమ్మ మా ఇద్దరికీ స్నాక్స్ అంటుంది. సరే నేను ప్రిపేర్ చేస్తాను అని చెప్పి భానుమతి చేసి తీసుకొచ్చి... విశిష్ట కి ఇచ్చి మీ నాన్నగారు ఫోన్ చేశారా అని అడుగుతుంది.

చేశారమ్మా ఎల్లుండి వస్తారంట..  అసలు ఈ మధ్యన మనిషికి భయం ఉండడం లేదు.  అరే ఇక్కడ నేను కంగారు పడతానని కూడా ఉండడం లేదు.

ఎంతసేపు ఎరువుల షాప్ దగ్గరేన కూర్చునేది అని గట్టిగా అరుస్తూ వెళ్ళిపోతుంది.  వెళుతున్న భానుమతిని చూసి చిన్నగా నవ్వుకుంటుంది.

ఎందుకు బాబీ నవ్వుతున్నావు. నీకు ఒక విషయం తెలుసా మా అమ్మకి మా నాన్న అంటే చాలా ప్రేమ ఎక్కువ. కానీ ఆ ప్రేమ ఎలా చూపిస్తదో తెలుసా ఇలా కోపంలో చూపిస్తుంది.
అరుస్తూ ఉంటే ప్రేమ అంటావేమిటి...
అది ప్రేమే..
అర్థం కాలేదు బాబి..
విశిష్ట నవ్వు ఆగిపోతూ, మెల్లగా..

ఆమె కోపంలో చెప్పే ప్రతి మాట వెనుక — భయం ఉంటుంది, ప్రేమ ఉంటుంది.
నాన్న ఎక్కడ ఉన్నాడో, ఏమి చేస్తున్నాడో తెలియక కంగారు పడుతుంది. నాన్న మాకు పూర్తిగా దూరమైపోయారు అని తెలియక...

తెలియక కాదు గుర్తులేక తన మనసు ఒప్పుకోక అంటే కరెక్ట్ గా ఉంటుంది ఏమో..
కానీ ఆ కంగారును ఆమె ఎప్పుడూ ‘ప్రేమ’గా చూపించలేదు..
‘కోపం’గా మాత్రమే చూపిస్తుంది.

అమ్మ ఫీలింగ్ ఏంటో తెలుసా ప్రేమగా చూపిస్తే అమ్మ భయాన్ని కనిపెట్టేసి..  ఆడేసుకుంటారేమో  అని..కోపాన్ని చూపిస్తే భయపడి టైం కి వచ్చేస్తారేమో అని. చిన్న పిల్లలు లాగా ఉంటుంది..

వైభవ్ ఆలోచిస్తూ..
హ్మ్... అంటే కొంతమంది ప్రేమ కూడా మనకు అర్థం కావడానికి కొంత సమయం పడుతుందనమాట...

విశిష్ట చిరునవ్వుతో..
అవును... కానీ అది మనసుపెట్టి ఆలోచిస్తేనే తెలుస్తుంది. పై పైన చూసేది అంతా నిజము కాదు.  అలాగని మనకు కనపడనిదంతా అబద్ధము కాదు..
అమ్మకి ప్రేమ అంటే... తిట్టడం..
కోపంగా అడగడం,
ఎంతసేపు ఎరువుల షాప్ దగ్గర కూర్చుంటావ్? అనడమే...

అది నేను చెబుతున్న అబద్ధమని తెలియదు అది తెలిసిన రోజున ఏమవుతుందో అని భయం..

ఎక్కువ ఆలోచించకు బాబి. ఆ టైం కల్లా ఆంటీ సెట్ అయిపోతారు.  నా ఆశ కూడా అదే.. సరేలే ఇలా మాట్లాడుతూ ఉంటే అలాగే టైం వేస్ట్ అవుతుంది కానీ వర్క్ గురించి చూద్దామా అని శ్రీనివాస్ పంపించిన డీటెయిల్స్ చెక్ చేస్తూ ఉంటుంది.

వైభవ్ మాత్రం అవి చూస్తూనే ఆలోచనలోకి వెళ్ళిపోతాడు. చందు కూడా నాతో గొడవ పడుతుంది. అరుస్తుంది. ఎవరైనా అమ్మాయిని నేను ఫ్లర్ట్ చేస్తూ ఉంటే అమ్మకి తెలిసేలాగా చేస్తుంది. దీని ఉద్దేశం ఏమిటి..

ప్రేమను చూపించడంలో తడబాటు పడే వాళ్లలో చందు ఉందా..
ప్రతి సారి నేను ఎవరితోనైనా సరదాగా మాట్లాడితే..
అరుస్తుంది, రగిలిపోతుంది... నన్ను ఏదో ఒక పనిలో ఇరికించేస్తుంది..

అప్పుడు నాకు కోపం వస్తుంది.
కానీ ఇప్పుడు ఆలోచిస్తే..
ఆ కోపం వెనుక ఇంకేదో ఉంటుంది...
ఒక భయం.
నేను దూరం అవుతాను అన్న భయమా..

ప్రేమ అనేది ఎప్పుడూ తీపి మాటల్లోనే ఉండదు కదా...
కొన్నిసార్లు గొడవల్లో, తిట్టుల్లో,
చిన్న చిన్న అనుమానాల్లో దాగి ఉంటుంది.

చందు కూడా అదే చెబుతోంది కాబోలు,
“నిన్ను నేను చూసుకుంటా” అని —
కానీ తన విధానంలో, అరుస్తూ, తిడుతూ...

అది సున్నితంగా చెప్పడానికి అత్త మామ ఎప్పుడైనా స్మూత్ గా మాట్లాడుకున్నారా..  ఒకరికొకళ్ళు కౌంటర్ వేసుకుంటూనే ప్రేమను చూపించుకుంటారు ఇది కూడా అలాగే అనుకుంటుందేమో..

ప్రేమ ఉన్నప్పుడు మనం గెలవాలనుకునేది వాదన కాదు...
ఆ మనిషినా.. తెలియకుండానే పైకి అనేస్తాడు..

విశిష్ట చిరునవ్వుతో..
హ్మ్... ఈ మాట ఒక్కటే చాలు వైభవ్.
ఇప్పుడే నీ ఆలోచనకి దారి దొరికింది అనుకుంటా...

దొరికిందనే అనుకుంటున్నాను.  నాకు ఈరోజు మూడ్ లేదు బాబీ.. రేపు చూద్దామా..  నో ప్రాబ్లం నువ్వు వెళ్ళు. నేను చూసుకుని నీకు మెయిల్ చేస్తాను. సరే అని బయటికి వచ్చేస్తాడు..

బైక్ మీద వెళుతూ చందు గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఎవరితోనూ మాట్లాడకుండా గదిలోకి వెళ్లి మంచం పైన పడతాడు.

చందు... నీతో గొడవపడకపోతే రోజు పూర్తయినట్టే అనిపించదు.
నువ్వు లేకపోతే ఇంత సైలెన్స్ ఎందుకు గుచ్చుకుంటుందో కూడా తెలియదు.

నిన్ను చూసినప్పుడల్లా ఇది మాట్లాడకపోతే బెటర్ అనుకుంటూనే నేనే కదుపుతాను..
కానీ నీ దగ్గర లేకపోతే మాటలే మంటలవుతాయి.

నువ్వు అరిస్తే నాకు కోపం వస్తుంది.. ఇరిటేషన్ వస్తుంది..
కానీ నువ్వు సైలెంట్‌గా ఉంటే మాత్రం భయం వస్తుంది.

ఇది ప్రేమేనా? లేక అలవాటా?
అలవాటు అయితే ఇంత లోతుగా ఎందుకు వెళ్తుంది...
ప్రేమ అయితే నువ్వు ఎందుకు దాచేస్తున్నావు..

తలని చేతులతో పట్టుకుని కిటికీ వైపు చూస్తాడు...
చందమామలో చందు నవ్వుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంది.
బాబీ చెప్పింది నిజమే..
కొంతమంది ప్రేమను కోపంలో చూపిస్తారు.
అదేనా నీ కోపం చందు?
అదేనా నీ ప్రేమ?

అలా అయితే...
నువ్వు కోపంగా ఉన్నా, నువ్వే కావాలి నాకు.

మెల్లగా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు.  ఈ ప్రేమ మాయ ఏమిటో తెలియడం లేదు.  ప్రేమ అంటే ఒప్పుకోలేకపోతున్నాను అలాగని కాదు అంటే కోపం వస్తుంది.

ఏమిటిది.. దీనికి సొల్యూషన్ చెప్పేవారు ఎవరున్నారు..  ఆలోచిస్తూ డాడీ అయితేనే కరెక్ట్. వాళ్లది లవ్ మ్యారేజ్ ఏ కదా అని వినయ్ దగ్గరికి వెళ్తాడు.

వైభవ్ ని చూసి ఏంటి సుపుత్ర ఇలా వచ్చావు ..

వైభవ్ ఏం అడుగుతాడు..

కథ కొనసాగుతుంది........
[+] 9 users Like SivaSai's post
Like Reply
Excellent update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)