Posts: 898
Threads: 13
Likes Received: 7,038 in 832 posts
Likes Given: 1,545
Joined: Aug 2024
Reputation:
652
Part - 54
విశి ని ఎలా గ్రిప్ లో పెట్టుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. పొద్దున్నే తొందరగా రెడీ అయి భానుమతిని ట్రీట్ చేసే హాస్పిటల్ కి వెళ్తాడు.
కన్సల్టెంట్ డాక్టర్ దగ్గరికి వెళితే.. చెప్పండి.. ఏం ప్రాబ్లం మీద వచ్చారు. నాకు ఏం ప్రాబ్లం లేదు. మీ నుంచి ఒక హెల్ప్ కావాలి. క్యారీ ఆన్ అన్నట్టుగా డాక్టర్ చూస్తాడు.
థాంక్యూ అని కూర్చుని.. మీరు భానుమతి అనే ఒక పేషెంట్ ని ట్రీట్ చేస్తున్నారు కదా. ఎస్.. అయితే నేను చెప్పినట్టుగా చేస్తే మీరు కోరినంత అమౌంట్ ఇస్తాను.
ఏం మాట్లాడుతున్నారు అని డౌట్ గా చూస్తాడు. నథింగ్.. నేను.. భానుమతి గారి అమ్మాయి... విశిష్ట తో లవ్ లో ఉన్నాను.
ఈ మధ్యన చిన్న డిస్టర్బెన్స్ వచ్చాయి. ఆడవాళ్లు కదా అలకలు చూపిస్తున్నారు.. ఎంత బ్రతిమాలుతున్న బెట్టు చేస్తుంది.
విశిష్ట నా... ఆ అమ్మాయి అలాంటిది కాదే.. చాలా సాఫ్ట్ గా ఉంటుంది. ఆడవాళ్ళు ఎలాంటి అలకలైనా చూపించేది ఒక ప్రేమించిన వాడి దగ్గరే కదా..
మీరన్నది కూడా నిజమేలే.. దానికి ఇప్పుడు నేనేం చేయాలి. ఏమీ లేదు నేను విశికి కాల్ చేసి నేను చెప్పినట్టు వినకపోతే మీ మదర్ ట్రీట్మెంట్ ఆపించేస్తాను.
ఆ డాక్టర్ నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ అని చెబుతాను ప్లీజ్ డాక్టర్ ఈ ఒక్క హెల్ప్ చేయండి.
చెయ్యొచ్చు కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. మనీ ప్రాబ్లమా.. నేను ఇస్తాను. మీకు విశిష్ట అంటే చాలా ప్రేమ అనుకుంట..
అయ్యో మామూల ప్రేమ కాదు.. తనకోసం ఏదైనా చేయాలి అన్నంత ప్రేమ. అవునా మరి ఇన్ని రోజులు భానుమతి గారి ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు.. ఎప్పుడు రాలేదే..
అది నీళ్లు నములుతూ.. అంటే.. నేను కూడా బిజినెస్ స్టార్ట్ చేశాను. అటు ఇటు పరిగెత్తలేక.. విశిష్ట వాళ్ళ మదర్ ని హ్యాండిల్ చేస్తూ ఉంటే పై వర్క్ నేను హ్యాండిల్ చేసేవాడిని..
ఓ అవునా కానీ మీ టాపిక్ ఎప్పుడో తీసుకురాలేదే.. మీరు డాక్టర్ గా కాకుండా ఒక లాయర్ గా క్యూస్షన్స్ వేస్తున్నారు. కమాన్ మిస్టర్... గౌతమ్.
ఓకే మిస్టేక్ గౌతమ్.. మీరెవరో ఏమిటో తెలియకుండా మీరు చెప్పేది నిజమని నేను ఎలా నమ్మాలి. విశిష్ట నేను ఒకే కాలేజీలో చదువుకున్నాము. నేను ఎంబీఏ లో ఉండగా తను ఇంజనీరింగ్ జాయిన్ అయ్యింది.
చాలా ఇంకా ఏమైనా కావాలా అని ప్రెస్టేట్ అవుతూ కంట్రోల్ చేసుకుంటూ చెబుతాడు. ఎందుకు మిస్టర్ గౌతమ్ అంత ప్రెస్టేట్ అవుతారు.
ఒక ఆడపిల్ల లైఫ్ కి సంబంధించింది. మీరు అలా ప్రెస్టేట్ అవ్వకుండా నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా..
ఇంకా ఏం ప్రశ్నలు ఉన్నాయి డాక్టర్.. ఇద్దరూ ఒకే కాలేజ్ అయినంత మాత్రాన లవర్స్ అని గ్యారెంటీ ఏమిటి.. మీ ఇద్దరు కలిసి దిగిన ఫొటోస్ ఉన్నాయా..
సేఫ్టీ పర్పస్ గా మేము అలా దిగలేదు. సేఫ్టీ అంటే పబ్లిక్ కి ఇవ్వకపోవడం అంతేగాని మీ పర్సనల్ గా ఉంటాయిగా... ఓకే ఇద్దరూ కలిసి వెళ్లిన ప్లేసెస్ అంటే.. బయటకు వెళితే ఆడపిల్ల అల్లరిపాలు అవుతుంది అని ఎప్పుడూ తీసుకు వెళ్ళలేదు.
కమాన్ మిస్టర్ గౌతమ్ మీరు ఏ కాలంలో ఉన్నారు. అన్ని తలా తోకాలేని సమాధానాలు చెబుతున్నారు. నాకెందుకో ఇంకా నమ్మకం కలగడం లేదు.
ఓకే.. నేను తన అకౌంట్ కి ఎప్పుడు మనీ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాను. ఆ డీటెయిల్స్ చూపిస్తాను అని అకౌంట్ కి పంపిన డీటెయిల్స్ చూపిస్తాడు.
ఇది కొద్దిగా నమ్మేటట్టుగా ఉంది. బట్ నేను హెల్ప్ చేయలేను. వై... డాక్టర్.. ఇప్పుడు దాకా చాలా క్యూస్షన్స్ అడిగి లాస్ట్ లో ఇలా చెబుతున్నారు.
మీ ఎమోషన్ చూస్తే చేయాలని ఉన్న నా వల్ల కాదయ్యా.. అదే దేనికి.. ఎందుకంటే.. భానుమతి గారికి ఇప్పుడు నేను ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు.
వాట్ అని అరుస్తూ లేచి నిల్చుంటాడు. ఎస్ అని డాక్టర్ కూల్ గా చెబుతాడు. ఈ విషయం రాగానే చెప్పొచ్చు కదా..
ఏదో లవ్ స్టోరీ చెబుతున్నావు. ప్రెసెంట్ పేషెంట్స్ కూడా నాకు లేరు. కాస్త రిలాక్సేషన్ ఉంటుంది అని వింటున్నాను. మీ రిలాక్సేషన్ కోసం నా టైమంతా వేస్ట్ చేసారా.. నేనేమైనా నిన్ను రమ్మన్నానా ఏమిటి...
పోనీ ఆ ట్రీట్మెంట్ చేసే డాక్టర్ ఎవరు అన్నది తెలుసా.. తెలియదు అన్నట్టుగా పెదవి ఇరుస్తాడు..
గౌతమ్ కి ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటుంది. నేను నీకు ఒక సజెషన్ ఇస్తాను ఫాలో అవుతావా.. చెప్పండి అని నీరసంగా అంటాడు.
నీ వల్ల తప్పు జరిగి ఉంటే.. నీకు అమ్మాయి కావాలి అనుకుంటే.. సిగ్గుపడకుండా మొహమాట పడకుండా అందరిలోనూ వెళ్లి కాళ్లు పట్టేసుకో..
ఛి ఛి అలా చేస్తే ఈ గౌతమ్ వేల్యూ పడిపోతుంది. అయితే నీది ప్రేమ కాదన్నమాట. లేదు లేదు నాది ప్రేమే.. ప్రేమ ఉన్నచోట ప్రైడ్ ఉండదు బాబు.
వెళ్ళు.. నీకు అమ్మాయి కావాలి అంటే ప్రస్తుతానికి అదొక్కటే మార్గం. ఇంక నాకు పేషెంట్స్ వచ్చే టైం అయ్యింది.
గౌతమ్ బయటికి వచ్చి కారు దగ్గర నిలబడి ఉంటాడు. అబ్బా విశిష్ట ఎంత టార్చర్ పెడుతున్నావు. నాకు తెలియని ఆ కొత్త డాక్టర్ ఎవరు.. ఎలా తెలుసుకోవాలి..
విశిష్ట ఉదయమే లేచి కాలేజ్ కి రెడీ అవుతుంది. ప్రతిరోజు చెప్పినట్టే గానే ఆరోజు కూడా భానుమతికి జాగ్రత్తలు చెబుతూఉంటే..
నేహ వచ్చి అంత అవసరం లేదు. నేనున్నాను కదా.. నా దగ్గర ఉంటారు. అది కాదు ఆంటీ.. చూడు నువ్వు ప్రశాంతంగా కాలేజ్ కి వెళ్లి నీ వర్క్ నువ్వు చేసుకుని రా..
అమ్మ మాత్రం ఎంతసేపని ఇక్కడ ఉండిపోతారు. అత్తయ్య నేను ఫ్రీ గానే ఉంటున్నాము. సో మా ముగ్గురికి కాస్త కాలక్షేపం అవుతుంది.
రండి భానుమతి గారు అని... అబ్బో చాల లాంగ్ అయిపోయింది. భాను అని పిలుస్తాను.. భానుమతి కూడా నవ్వుతూ మీరు ఎలా పిలిచినా నాకు బాగుంది.
ఇన్ని రోజులు ఒక్కదాన్నే ఉండి బోర్ కొట్టేసింది. ఈయనేమో ఇంకా రాలేదు.. వచ్చేస్తానన్నారు. మా వారికి ఫోన్ చేసి చెప్పారు..
అవునా మా వారు మీకు తెలుసా.. చాలా బాగా తెలుసు. రండి. నువ్వు వెళ్ళు అని విశిని పంపించి భానుని తీసుకొని వెళతారు.
విశి ఫ్లాట్ నుంచి బయటికి వస్తూ దేవా సార్ వస్తారా లేక నేను బస్సుకి వెళ్లాలా.. అయినా ఆయనే కదా నన్ను కాలేజీకి తీసుకువెళ్లి తీసుకు వస్తానని మాట ఇచ్చారు.
ఇప్పుడు నన్ను ఇలా మధ్యలో వదిలేస్తారా... ఇలా వదిలేస్తే నేను ఇంకా దేవా సార్ తో మాట్లాడను అని తనలో తానే మాట్లాడుకుంటూ గేట్ తీస్తుంది.
అక్కడ సూర్య బైక్ మీద కూర్చుని చూస్తూ ఉంటాడు. ఒక్కసారిగా విశి ముఖంలో నవ్వు వస్తుంది. పరిగెత్తుకుంటూ వెళ్లి మీరు వచ్చారా.. రారేమో అనుకున్నాను.
అలా ఎందుకు అనుకున్నావు. నిన్న మీరే కదా.. ట్రాన్స్పోర్ట్ ఉంది.. స్కూటీ నేర్చుకో అని ఏదేదో చెప్పారు. ఈరోజు రారేమో అని కంగారు పడ్డాను..
బైక్ స్టార్ట్ చేసేవాడు ఆగి ఒక విషయం అడుగుతాను. కరెక్ట్ గా సమాధానం చెప్పు. అడగండి సార్.. నేను స్టడీస్ లో టాపర్‌ని.
ఇది స్టడీస్ కు సంబంధించినది కాదులే కానీ.. ఇప్పుడు నువ్వు కంగారు పడింది నేను రానేమో అన.. లేక బస్ కి వెళ్ళాలి అనా..
విశి వెంటనే కళ్ళల్లో నీళ్లు తిప్పేస్తూ బస్సుకి వెళ్లడం నాకేమైనా కొత్త.. నాన్నగారు నాకు దూరమైనప్పటి నుంచి రోజు బస్సులోనే వెళ్లి వస్తున్నాను.
ఒక్కొక్కసారి నడిచి కూడా వెళ్లేదాన్ని.. అలాంటిది బస్సులో వెళ్లడానికి ఎందుకు నేను ఇబ్బంది పడతాను. మీరు ఇలా మాట్లాడితే అసలు మీతో నేను ఎప్పుడూ మాట్లాడను అని మోచేతితో కళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది.
చిన్నపిల్లలాగా ఏడుస్తూ చెబుతున్న విశి ని చూసి సూర్యకి నవ్వు వస్తుంది. ముద్దు ముద్దుగా అనిపిస్తుంది. ఉఫ్.. అనుకుని చంపేస్తున్నావే పిల్ల అనుకుంటూ..
సరే సరే నేను ఏదో క్యాజువల్‌గా అడిగాను. దానికి కూడా ఇంత ఏడుపా.. వేలు చూపిస్తూ.. ఇంకొకసారి నన్ను ఇలా క్వశ్చన్ చేశారు అంటే..
సోరి క్యూటి ఇంకా ఎప్పుడు నిన్ను క్వశ్చన్ చేయను సరేనా.. ఈ.. క్యూటి ఏమిటి.. ఒక్కసారి ఉండు అని బైక్ మిర్రర్ లో విశి ఫేస్ ని చూపిస్తాడు.
ఏడ్చి కళ్ళు ఉబ్బి ఉంటాయి.. ఇప్పుడు నీ ఫేస్ చిన్నపిల్లల్లాగా లేదా... క్యాజువల్ గా ఒక క్వశ్చన్ అడిగితే అలా ఏడుస్తారా.. ఎవరైనా..
ఏమో సర్ ఎవరు ఎలా అడిగినా.. ఏమి చేసినా ధైర్యంగా ఉండగలను కానీ మీరు నన్ను అనుమానిస్తున్నట్టుగా మాట్లాడితే ఎందుకో తట్టుకోలేకపోతున్నాను.
సూర్య మనసులో అదే ప్రేమ. కానీ నీకు తెలియడం లేదు. నీకు తగిలిన ఎదురు దెబ్బలకి ప్రేమంటేనే భయపడుతున్నావు ..
ఆ భయాన్ని మెల్లిమెల్లిగా తీసివేస్తాను అనుకుంటూ.. ఇంకా కాలేజ్ కి స్టార్ట్ అవుదామా. ఇప్పటికే లేట్ అయింది. సరే అని బైక్ ఎక్కుతుంది.
రోజు నువ్వు ఈవినింగ్ స్కూటీ నేర్చుకోవాలి. తప్పదా సార్.. తప్పదు. అన్ని నీ సెల్ఫ్ గా చేసుకుంటున్నావు కదా.. అంత ధైర్యవంతురాలువి..
ఎందుకు ఈ విషయంలో భయపడుతున్నావు. వేరేగా ఏమీ కాదు సార్. రోజు చాలా యాక్సిడెంట్లు అవుతాయి అని వింటున్నాము కదా..
అలా నాకు ఏదైనా అవుతే అమ్మ పరిస్థితి ఏమిటి అని అంతే.. ఒక్కసారిగా సూర్య గుండె దడదడ లాడుతుంది.
ఏం మాట్లాడుతున్నావ్ అని కొంచెం కోపంగా అంటాడు.
ఏమైంది సార్.. ఏమీ లేదు పిచ్చిపిచ్చిగా ఆలోచించకు. ప్రతి దాంట్లో ప్రమాదాలు ఉంటాయి. అలా అని ఇంట్లో తలుపులేసుకుని కూర్చుంటావా..
అలా కూర్చున్నా సరే పైనుంచి వెళ్లే ఏ విమానమో వచ్చి కూలితే అప్పుడు ఏం చేస్తావు..
విశి సమాధానం.....
Posts: 898
Threads: 13
Likes Received: 7,038 in 832 posts
Likes Given: 1,545
Joined: Aug 2024
Reputation:
652
Part - 55
ప్రతి దాంట్లో ప్రమాదాలు ఉంటాయి. అలా అని ఇంట్లో తలుపులేసుకుని కూర్చుంటావా..
అలా కూర్చున్నా సరే పైనుంచి వెళ్లే ఏ విమానమో వచ్చి కూలితే అప్పుడు ఏం చేస్తావు..
ఏం మాట్లాడేవే విశి..
మీరు చెప్పేది నిజమే. నాన్న ఉన్నప్పుడు నేను అంతే ధైర్యంగా టేకటీసీగా ఉండేదాన్ని.. నాన్నతో పాటు నా బలం కూడా వెళ్ళిపోయింది. అమ్మని చూస్తే బలహీనతే గుర్తుకు వస్తుంది.
ఏం చేయాలి చెప్పండి..
ప్రతి ఒక్కరికి భయాలు ఉంటాయి, కానీ వాటిని ఎదుర్కోవడమే మనం బ్రతికున్నామనేది గుర్తు చేస్తుంది.
మీ నాన్నని నువ్వు ఎంతగా ప్రేమించావో, ఆయన నిన్ను ఎంత ధైర్యంగా తీర్చిదిద్దాడో, అదే ఆయన నిజమైన గుర్తు.
ఇప్పుడాయన లేరని నువ్వు బలహీనంగా అనిపించుకోవడం అంటే ఆయన నేర్పిన ధైర్యాన్ని మరిచిపోవడమే అవుతుంది.
అప్పుడు నువ్వు మీ నాన్నకి ఇచ్చిన విలువ ఏమిటి..
నీ బలహీనతలో నీ కన్నీళ్ళలో మీ నాన్నని దూరం చేసుకుంటావా చెప్పు..
విశి మెల్లగా.. లేదు ఎప్పటికీ దూరం చేసుకోను. నాన్న నా ఊపిరి..
అమ్మని చూస్తే నీకు బలహీనతే గుర్తుకువస్తుంది అన్నావు కదా… కానీ అది అబద్ధం.. అదే అమ్మ నీ బలం..
ఎలాగో తెలుసా..
ఈరోజు నీ సొంత కాళ్ళ మీద నిలబడి ధైర్యంగా అడుగులు వేస్తున్నావు దానికి కారణం అమ్మ కాదా... అమ్మని బాగా చూసుకోవాలి...
అమ్మకి ట్రీట్మెంట్ చేయించాలి. అమ్మని ఇంకా గొప్పగా చూసుకోవాలి అన్న నీ మనోధైర్యాన్నికి అసలు కారణం ఎవ్వరు..
నువ్వు నిలబడితే, ఆమెకు కూడా ఆత్మస్థైర్యం వస్తుంది.
నువ్వు నవ్వితే అమ్మ కళ్ళు ఆనందంతో పొంగుతాయి ఇంతకన్నా మన ధైర్యం, బలం కావాలా..
ఎవరో ఒకరు మొదట ముందడుగు వేయాలి. ఆ అడుగు నువ్వే వేయి..
ఒక క్షణం నిశ్శబ్దం. ఆత్మీయంగా, గుండె లోతుల్లోకి దిగి వెళ్లే మాటలా గాలి మధ్య ఆగిపోతుంది.
నీకు సమస్య ఎదురైనప్పుడల్లా దానికి సమాధానం కూడా దొరుకుతూనే ఉంది. ఆ విధంగా నీ అడుగులు పడే విధంగా మీ నాన్న నీకు ధైర్యాన్ని నింపి వెళ్లారు..
భయం తలుపు తడితే, ధైర్యం తలుపు తెరుస్తుంది.
అదే మీ నాన్న నీలో వదిలిన బహుమతి.
ఆ బహుమతిని వదిలేసి ఎందుకు నీలో నువ్వే భయపడుతూ కూర్చుంటావు. నేను చెప్పానని కాదు కానీ వంటరిగా కూర్చుని ఆలోచించు.
నీ సమస్యకు సొల్యూషన్ దొరుకుతుంది. బైక్ ఆపుతాడు.. ఏమైంది సార్.. కాలేజీ వచ్చింది. మీ మాటల్లో పడి నేను చూసుకోలేదు. థాంక్యూ...
బైక్ దిగి వెళుతున్న విశినే చూస్తూ ఉంటాడు. నాలుగు అడుగులు వేసిన విశి వెనక్కి వచ్చి సార్.. స్కూటీ డ్రైవింగ్ ప్రాక్టీస్ కి ఎక్కడికి రమ్మంటారు..
సూర్యా పెదవులపై గర్వంతో కూడిన చిన్న చిరునవ్వు వస్తుంది. సాయంత్రం నేనే తీసుకువెళ్తాను గో అని పంపిస్తాడు.
వాళ్ళిద్దరిని అలా చూసినా సరళకి మాత్రం పిచ్చ కోపం వస్తుంది. నేను దగ్గరికి వెళితే లెక్చరర్ ఎలా ఉండాలి అని నాకు క్లాస్ తీసుకున్నాడు.
కానీ ఇతను మాత్రం స్టూడెంట్ తో రొమాన్స్ చేస్తున్నాడు చెబుతాను అని దగ్గరకి వెళ్ళి హలో గుడ్ మార్నింగ్ సార్.. గుడ్ మార్నింగ్ అని సీరియస్‌గా చెబుతాడు.
అదేంటి సార్ నేను నవ్వుతూ విష్ చేస్తే మీరు అంత సీరియస్‌గా చెబుతున్నారు. మీరు ఒక్క విశిష్ట తోనే నవ్వుతూ మాట్లాడతారా..
సూర్య బైక్ దిగి మీ ప్రాబ్లం ఏమిటి అని అడుగుతాడు. నా ప్రాబ్లం ఏముంది.. మీరు ఎలా ఉన్న అమ్మాయిలతో నవ్వుతూ మాట్లాడతారా అని అడుగుతున్నాను.
లెక్చరర్ లెక్చరర్ మధ్యన అయితే ప్రాబ్లం ఉంటుంది కానీ స్టూడెంట్ లెక్చరర్ మధ్య ప్రాబ్లం ఉండదు అని నాకు ఇప్పుడే తెలిసింది..
మీకు స్పెట్స్ ఉన్నట్టు ఉన్నాయి. ఉన్నాయి.. ఎందుకు.. అవి మళ్లీ ఒకసారి టెస్ట్ చేయించుకుని అప్పుడు యూస్ చేయండి. ఆ స్పెడ్స్ పవర్ తగ్గినట్టు ఉంది. అందుకే మీకు అన్ని చెడుగానే కనబడుతున్నాయి.
చూడండి మిస్ సరళ మీరు ఒక లెక్చరర్ అని ఇప్పటివరకు చాలా రెస్పెక్ట్ ఇచ్చాను. బట్ మీ బిహేవియర్ ఇలాగే ఉంటే తర్వాత ఏమి జరుగుతుందో అన్నది మీ ఆలోచనకు కూడా అందదు.
అర్థమైంది అనుకుంటా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెళుతున్న సూర్యని చూస్తూ నిన్ను చూసిన మొదటి రోజే నీపై మనసు పడ్డాను కానీ నీకు ఆ విశిష్ట కావాల్సి వచ్చిందా..
ఎలాగైనా నిన్ను దక్కించుకుని తీరుతాను అక్కడ నుండి క్లాస్ కి వెళ్ళిపోతుంది..
శ్రీకర్ బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్ళతాడు. నా సౌమ్య బేబీ ఎక్కడ ఉంది అని కళ్ళతో వెతుకుతూ ఉంటే.. భరత్ టీవీ చూస్తూ కనిపిస్తాడు.
అబ్బా మా మామయ్య ఇంకా ఆఫీస్ కి వెళ్లలేదా అని పక్కనే కూర్చుని ఏంటి మావయ్య ఆఫీస్ కి వెళ్లలేదా.. వాచ్ వైపు చూసి శ్రీకర్ వైపు చూస్తాడు.
ఇంకా టైం ఉందా.. నువ్వేంటి ఇలా వచ్చావు. సూర్య ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఆ.. వాడికంటే చాలా పనులు ఉన్నాయి. అందుకే వెళ్ళిపోయాడు.
నేను ఖాళీయే కదా ఒకసారి నిన్ను చూసి వెళదామని వచ్చాను.. నా బుజ్జి పప్పీ కనపడదే అనుకుంటూ దిక్కులు చూస్తూ ఉంటాడు. నన్ను చూడ్డానికి వచ్చి దిక్కులు చూస్తావు ఎందుకో...
ఐ ఎక్సర్సైజ్ మావయ్య.. ఈ మధ్యన ఒక లేడీ డాక్టర్ చెప్పింది. కళ్ళకి ఎంత బాగా ఎక్సర్సైజ్ చేస్తే చూపు అంత బాగుంటుంది అని.. చెప్పిన డాక్టర్ ఎవరో తెలుసుకోవచ్చా..
ఏంటి మావయ్య నేను ఎప్పుడూ ఇంటికి వచ్చిన.. పోలీసోడు.. దొంగని అడిగినట్టు అన్ని క్యూస్షన్స్ అడుగుతావు.
నువ్వు సరిగ్గా సమాధానం చెబితే నాది ఒక్క క్వశ్చన్ తోనే ఆగిపోతుంది. నువ్వు వంకరగా చెబుతుఉంటే.. నాకు రావలసిన సమాధానం వచ్చే వరకు అడుగుతూనే ఉంటాను.
నీకు కావలసిన సమాధానం చెబితే నాకు కావాల్సింది ఇస్తావా.. నువ్వు చెబితేనే కదా అది నాకు కావాల్సింది అవునో కాదో తెలుస్తుంది.
అందుకే మావయ్య మిమ్మల్ని.. అని పళ్ళునూరితే.. ఇక్కడ ఆడపిల్ల తండ్రులం.. మా జాగ్రత్తలో మేము ఉండాలి కదా.. అదే కదా మీ పొగరు.
జాగ్రత్త అని చెప్పి తాళాలు వేస్తున్నారు. సరే.. డైరెక్ట్ గానే చెబుతున్నాను. నేను నా బుజ్జి పప్పీ కోసం వచ్చాను. ఎక్కడా కనపడడం లేదు.
సౌమ్య కాలేజీకి వెళ్లే టైంలో నీకేం పని. భరత్ షర్ట్ చివరన పట్టుకుని లాగుతూ ఇలా అడిగితే ఎలా చెబుతాం మావయ్య..
నువ్వు కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కదా...ఏదో నా బుజ్జి పప్పీ ని బైక్ మీద ఎక్కించుకుని అలా అలా తిప్పుతూ కాలేజ్ దగ్గర డ్రాప్ చేద్దామని..
ఎప్పుడు.. సాయంత్రానికా.. నో మావయ్య ఫస్ట్ పిరియడ్ స్టార్ట్ అవ్వకముందే డ్రాప్ చేస్తాను అని అమాయకంగా ఫేస్ పెట్టి చెబుతాడు.
ఒరేయ్ నీ వేషాలు నా దగ్గర కాదు. మేము ఇవన్నీ చూసే వచ్చాము. మరి అత్తయ్యని బైక్ ఎక్కించుకుని నువ్వు తిప్పినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా ఇలాగే ఫీలయ్యారా..
ఎవరు.. మీ అత్తయ్య.. తనకి పెళ్లి అయిన తర్వాత కూడా భయపడడం పోలేదు.. అలాంటిది పెళ్లికి ముందు బైక్ మీద తిరగడం అంత సీన్ ఏమి లేదు.
అందుకే మావయ్య.. మీరు మిస్ అయినవి కూడా మేమే ఎంజాయ్ చేద్దాం అని నా ఫిలాసఫీ. అంత వద్దు గాని ఒక చిన్న బెట్ వేసుకుందాం రా..
చెప్పు మామయ్య.. ఇప్పుడు నా కూతురు నువ్వు అడగగానే నీతో వస్తే రేపే మీ పెళ్లి చేసేస్తాను.. నిజమా మావయ్య అని భుజాలు పట్టుకుని ఊపేస్తూ ఉంటాడు.
ఒరేయ్ ఊపింది చాలు కానీ రెండోది కూడా చెబుతాను విను.. సరే చెప్పు.. చెప్పు.. చాలా ఆత్రంగా ఉందే.. మరింత మంచి ఆఫర్ ఇచ్చినప్పుడు వదులుకుంటానా ఏమిటి...
అలా కాకుండా నా కూతురు నాతోపాటు వచ్చింది అనుకో నేను ఎప్పుడు పెళ్లి చేస్తే అప్పుడే చేసుకోవాలి.. ఏమంటావు..
ఎప్పుడు పెళ్లి చేయడం అంటే.. దానికి ఏదో ఒక పిరియడ్ చెప్పాలి కదా.. సింపుల్ ఇప్పుడు సౌమ్య హౌస్ సర్జన్ చేస్తోంది కాబట్టి ఇంకా పీజీ ఫినిష్ చేసి... స్పెషలైజేషన్ అన్ని లెక్కేసుకుంటే ఇంకొక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ పట్టొచ్చు.
అప్పుడికి నేను రిటైర్ అయిపోతాను. అంత వీకా.. మావయ్య నువ్వు అవమానిస్తున్నావు.. నువ్వే కదరా రిటైర్ అయిపోతాను అంటున్నావు.
4 ఇయర్స్ కి వీక్ అయిపోతే నా కూతురు లైఫ్ ఏం కావాలి చెప్పు.. నువ్వు మరీ అంత అనుమానం పడాల్సిన అవసరం లేదు కానీ టైం వేస్ట్ అవుతుంది అని నా బాధ..
ప్రేమలో వెయిటింగ్ కూడా ఉండాలి . చిన్నప్పుడు నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాను కదా.. దానికి ప్రపోజ్ చేసి ఒప్పించడానికి తల ప్రాణం తోకకు వచ్చింది.
ఎంత భయపెడితే ఒప్పుకుందో నీకేం తెలుసు... ఒరేయ్ ప్రేమతో ఒప్పించకుండా భయపెట్టి ఎమోషనల్ గా లాక్ చేసి ఒప్పించావా? అయితే ఈ లవ్ క్యాన్సిల్..
ఇదిగో మావయ్య దానికి అసలే భయమెక్కువ.. ఏది డైరెక్ట్‌గా చెప్పదు. ఏదో మా తిప్పల మేము పడి నా బుజ్జి పప్పీ నోటితో చెప్పించుకున్నాను.
నువ్వు లేనిపోని మెలికలు వేయకు. మనవళ్ళని ఎత్తుకోవడానికి లేట్ అయిపోతుంది.. ఆ విషయంలో నువ్వు డౌట్ పడాల్సిన అవసరం లేదు అల్లుడు..
సౌమ్య రెడీ అయి వస్తుంది. విద్య శ్రీకర్ కి జ్యూస్ తీసుకొచ్చి ఇస్తుంది. థాంక్యూ అత్తయ్య. నువ్వు మంచి అత్తయ్యవి..
మావయ్య చూడు.. వచ్చినప్పుడు నుంచి నా మీద సెటైర్లు వేయడమే తప్ప వాటర్ అయినా తాగుతావా అని అడగలేదు..
అడగను ఏం చేస్తావు.. విద్య కంగారుగా ఏమిటండీ అలా మాట్లాడుతారు. ఇక్కడ ఆడపిల్ల తండ్రులం. మేము ఇలాగే మాట్లాడతాం.
ఏమంటారు అల్లుడుగారు అని సాగదీస్తే.. ఏమంటాను.. మావయ్య గారు ఎలా చెబితే అలా ఊ కొడతాము.. సౌమ్యవైపు తిరిగి రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు.
సౌమ్య భయంగా భరత్ వైపు చూసి నాన్న వెళదామా.. నాతోనే వస్తావా అని భరత్ ఏమీ తెలియనట్టుగా అడుగుతాడు.
సౌమ్య సమాధానం.....
Posts: 898
Threads: 13
Likes Received: 7,038 in 832 posts
Likes Given: 1,545
Joined: Aug 2024
Reputation:
652
Part - 56
చందును కూడా పికప్ చేసుకోవాలి. చందు ఎందుకు అని శ్రీకర్ అడిగితే.. మా కాలేజ్‌లో వాళ్ళ ఫ్రెండ్స్ కలవాలి అంది. వెళ్లేటప్పుడు పికప్ చేసుకోమంది.
దానికి కారు ఉంది కదా మళ్లీ నీతో రావడం ఏమిటి అని అరుస్తూ ఉంటాడు. సౌమ్య అయోమయంగా శ్రీకర్ వైపు చూస్తూ చందు నాతో వస్తే నీకేంటి ప్రాబ్లం..
ప్రాబ్లం నాకు కాక ఇంకా ఎవరికి..
ఏమైంది అలా అరుస్తున్నావు.. ఒంట్లో బాగోలేదా అని చెయ్యి పట్టుకుని చూస్తోంది. ఇది మబ్బు అని తెలుసు గాని.. మరి ఇంత మబ్బు అనుకోలేదు అని భరత్ వైపు చూస్తాడు.
భరత్ కళ్ళ ఎగరేస్తే... ప్లీజ్ మామ అని కళ్ళతోనే రిక్వెస్ట్ చేస్తాడు. నాకేంటి అని సైగ చేస్తే.. ఏం కావాలో అడుగు అని అలాగే మాట్లాడతాడు.
అమ్మ సౌమ్య వెళ్ళి నాకు కాఫీ తీసుకురా తల్లి... అలాగే నాన్న అని వెళుతుంది. ఏమడిగినా ఇస్తావా.. ఇవ్వక చస్తానా..
సరే నా కూతుర్ని నీతో పంపిస్తాను గాని సేఫ్ గా కాలేజీలో ఉండాలి. అంతేకాదు మీ పెళ్లి కూడా నేను ఎప్పుడు చెబితే అప్పుడే..
మరి అన్ని సంవత్సరాలు పెట్టకు మామ.. ఎప్పుడు పెట్టాలో నేను ఆలోచిస్తాను కానీ బైక్ మీద వెళుతున్నాం కదా అని అడ్వాన్స్ అయ్యావు అనుకో..
ఇక పెళ్లయ్యే వరకు నా కూతురు నీకు కనిపించదు. అర్థమవుతుందా.. అర్థం అవ్వక.. ఏం చేస్తాను.. ఏదో దూరం నుంచి చూసుకుంటూ అయినా టిఫిన్స్ కానిస్తాను..
ఒరేయ్ నాతోనే ఇలా మాట్లాడుతున్నావా.. నీతో కాకపోతే ఇంకెవరితో మాట్లాడతాను. సౌమ్య కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది.
నిన్ను శ్రీకర్ తీసుకువెళ్తాడు వెళ్ళమ్మా.. మరి చందు.. వైభవ్ కి చెప్తాను. చందుని తీసుకువస్తాడు లే.. సరే నాన్న..
వెళదామా అని శ్రీకర్ వైపు చూస్తోంది. ఓకే పద అని ఉషారుగా లెగిస్తే.. చెప్పింది అర్థమైంది అనుకుంటా.. మీరు మామయ్యలు కాదు యమకింకరులు.. భరత్ కి ఒక్కడికే వినబడేలాగా చెబుతాడు. భరత్ కాలర్ ఎగరెస్తాడు.
మీ కాలంలో అల్లుడ్ని బ్రతిమాలికొనేవారు.. మా టైం వచ్చేటప్పటికి మేము మామగారిని బ్రతిమాలు కోవలసి వస్తుంది. ఏమి చేస్తాం విధి రాత..
దీనినే సైకిల్ అంటారు బాబు.. ఒకప్పుడు అబ్బాయిలు తండ్రులు కాలర్ ఎగరేసేవారు.. ఇప్పుడు అమ్మాయిల తండ్రులు కాలర్ ఎగరేస్తున్నాము..
మాకు టైం రావాలి కదా.. ఎప్పుడు వచ్చిన మీదే పై చెయ్యి కదా.. అప్పుడు అల్లుడు హోదా.. ఇప్పుడు మామగారు హోదా..
నువ్వు పదవే అని సౌమ్య చేయి పట్టుకుని తీసుకువెళతాడు. సౌమ్య కంగారుగా ఏం చేస్తున్నావు.. నాన్న చూస్తున్నారు..
అబ్బా మావయ్యకు అన్ని తెలుసులే గాని రా అని బైక్ స్టార్ట్ చేస్తాడు. సౌమ్య నవ్వుతూ ఒక సైడ్ కి కూర్చుంటే బైక్ రైస్ చేస్తూ ఉంటాడే గానీ ముందుకు కదపడు..
అదేంటి వెళ్ళవే.. నా బైక్ కి ఇలా కూర్చుంటే నచ్చలేదు.. చిన్నగా నవ్వుకుంటూ సరే అని టూ సైడ్స్ కి కూర్చుంటుంది.
ఇప్పుడు నచ్చింది అని అదే రైసులో ముందుకు దూకిస్తాడు. శ్రీకర్ని గట్టిగా పట్టుకుంటుంది. అది చూసిన భరత్ నా అల్లుడు మరి టూమచ్ స్పీడ్ లో ఉన్నాడు..
విద్య.. ఇద్దరు బైక్ మీద వెళ్లడం చూసి అదేంటి అమ్మాయిని అలా పంపించారు. వెళితే తప్పు ఏముంది.. పెళ్లి కావలసిన అమ్మాయి అలా వెళ్లొచ్చా..
అందరూ ఏమనుకుంటారు.. ఏమనుకుంటారు.. కాబోయే వాడితో వెళ్ళింది అనుకుంటారు. అయినా సరే అలా వెళ్లకూడదు .
నీకంటే నా మీద నమ్మకం లేక నా బైక్ ఎక్కలేదు. నా కూతురికి నా అల్లుడు మీద నమ్మకం ఉంది కాబట్టి బైక్ ఎక్కింది.
నమ్మకం లేదని నేనెప్పుడూ చెప్పాను. మరి ఎందుకే... పెళ్లికి ముందు ఎన్నిసార్లు అడిగిన బైక్ ఎక్కలేదు. అది జాగ్రత్త. అదే... నమ్మకం లేనప్పుడు వచ్చేదే ఆ జాగ్రత్త.
ఇప్పుడు ఏమంటారు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తారా.. వెళ్ళు ఉపయోగం ఏముంది చెప్పు.. నా బండిని ఇలా నడుపుకొని వెళ్లాల్సిందే...
అంత కష్టం ఏమొచ్చిందో మీకు అని కళ్ళల్లో నీళ్లు తిప్పబోతుంది.. ఇంకొక్కసారి ఆ కళ్ళనుంచి చుక్క డ్రాప్ అయినా కారింది అనుకో..
నీకు మినీ స్కర్ట్ వేసి స్పోర్ట్స్ బైక్ నీ చేతికిచ్చి డ్రైవ్ చేయిపిస్తాను అర్థమైందా.. టక్కన ఆపేస్తుంది. ఈ మనిషి చేసిన చేస్తాడు అని నోటిలో గోనుక్కుంటూ ఉంటే ఎక్కువ గోనుక్కోకు కచ్చితంగా చేస్తాను .
నేను మనసులో కూడా అనుకోకూడదా.. ఇలారా అని చేయి చూపిస్తాడు. వచ్చి పక్కనే నిలబడితే.. నీలో బాగా నచ్చేదేమిటో తెలుసా..
పెళ్లికి ముందు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు.. అదే అమాయకత్వం. అప్పుడు ఇప్పుడు రోజులు మారాయి. నా కూతురు గురించి నాకు జాగ్రత్త ఉండదా ? ఎక్కువ ఆలోచించకు. అర్థమయిందా..
భరత్ వైపు అలాగే చూస్తూ ఉంటే.. ఏంటి మిని స్కర్ట్ వేయిపిస్తానేమో అనుకుంటున్నావా.. అసలు వేయిపించెను.
మన పెళ్లయిన కొత్తలోనే వేయిపించలేదు ఇప్పుడు ఎందుకు ఏయిపిస్తానే తింగరి... నువ్వు నీలాగా ఉంటేనే నీకు అందం. నాకు ఆనందం సరేనా..
అలాగే అని తల ఊపుతుంది. కాస్త నవ్వచ్చు బంగారం. ఏదో సరదాగా టీస్ చేసాను. నాకు తెలుసు మీరు టీస్ చేశారని..
మరి తెలిసి కూడా భయపడితే ఏలాగే.. ఏమో మొదటి నుంచే అదే అలా అలవాటు అయిపోయింది. నీకది అలవాటైపోయింది. నాకు ఇది అలవాటైపోయింది ..
వెళ్లొస్తాను అని చెంప మీద చెయ్యి వేసి వైభవ్ అని పిలుస్తాడు. ఎస్ మావయ్య అని ఎగురుకుంటూ వస్తే.. నువ్వు చందుని తీసుకుని సౌమ్య కాలేజ్ కి వెళ్ళు.
నేనా.. ఆ పిల్ల రాక్షసినా.. నో అని అరుస్తాడు. వైభవ్ అరుపులకి ఇద్దరూ చెవులు మూసుకుంటారు..
వైభవ్ వెళతాడా...
కథ కొనసాగుతుంది...
Posts: 898
Threads: 13
Likes Received: 7,038 in 832 posts
Likes Given: 1,545
Joined: Aug 2024
Reputation:
652
(20-04-2026, 01:21 PM)ash.enigma Wrote: Thanks Sivagaru for posting 3 episodes.
But still feel we need another story from you.
Dunno your position, but request you to post a new story along with panigrahanam!!
Oka Story Undi Maybe E 2 Days Lo Upload Chestanu
Posts: 4,838
Threads: 9
Likes Received: 3,259 in 2,498 posts
Likes Given: 11,328
Joined: Sep 2019
Reputation:
31
Posts: 1,159
Threads: 1
Likes Received: 732 in 475 posts
Likes Given: 11,268
Joined: Jun 2019
Reputation:
2
Posts: 214
Threads: 2
Likes Received: 201 in 114 posts
Likes Given: 563
Joined: Jun 2019
Reputation:
4
Posts: 78
Threads: 0
Likes Received: 54 in 42 posts
Likes Given: 17
Joined: Nov 2023
Reputation:
0
చాలా బాగా రాస్తున్నారు శివ గారు మరోక స్టౌరి రాస్తాను అంటున్నారు దానికోసం ఎదురు చూస్తూ వుంటాం
Posts: 898
Threads: 13
Likes Received: 7,038 in 832 posts
Likes Given: 1,545
Joined: Aug 2024
Reputation:
652
Part - 57
నేనా.. ఆ పిల్ల రాక్షసినా... అసలు ఎలా అనుకుంటున్నారు మావయ్య.. ఏరా చందుతో వెళితేనే ప్రాబ్లం ఏంటి... వెళ్ళితేనే ప్రాబ్లం. అసలు ఎలా నన్ను ఇరికించాల అని చూస్తుంది. నా వల్ల కాదు..
అది చిన్నప్పుడు.. ఇప్పుడు ఎందుకు చేస్తుంది రా.. చిన్నప్పుడైనా పెద్దయ్యాకైనా అది చందునే.. కాదని మీరు చెప్పగలరా.. నావల్ల కాదు...
ఇప్పుడు అసలే నేను చాలా బిజీ.. జాబ్‌లో జాయిన్ అయ్యాను. నావల్ల కాదు...మీ వదిన కాలేజీలో ఉంటే నువ్వు వెళ్లి ఏం పీకుతావు. మూసుకొని వెళ్ళు...ఎందుకు మావయ్య నా మీద మీరందరూ ఇలా పగబట్టేశారు..
వినయ్ వచ్చి ఏంటి మీ డిస్కషన్.. రా నాన్న టైంకి వచ్చావు. నన్ను కాపాడు.. ఏమిటి మేటర్.. వీళ్ళందరూ కలిసి నన్ను చందు కి బలి ఇచ్చే ప్రోగ్రాం పెట్టుకున్నారు..
పికప్ చేసుకుని ఎక్కడో డ్రాప్ చేయాలంట.. నా వల్ల కాదు అంటే వినడం లేదు.. డ్రాపింగ్ ఏ కదరా.. చేసేసిరా ఎంతసేపు..
ఆ కొంచెం సేపు చాలు నా జీవితం ఎక్కడికో పోవడానికి.. నా కొడుకు చాలా ధైర్యవంతుడు అనుకున్నాను. ఒక ఆడపిల్లకి ఇంత దారుణంగా భయపడుతున్నాడు. సో సాడ్..
నన్ను చూడు.. మీ అమ్మని చూసి కొంచెం అయినా జడుస్తానా.. పైనుంచి కిందకి చూస్తాడు. ఏంట్రా ఆ చూపు.. ఇది కొంచెం ఎక్కువ అవ్వలేదా..
అస్సలు అవ్వలేదు. పెళ్లికి ముందు మీ అమ్మ నన్ను చూస్తే వణికిపోయేది. ఇప్పుడు మీరు వణుకుతున్నారా.. అన్న వాయిస్ వినపడితే..
అబ్బా కొంచెం సేపు కూడా నా గొప్పలు నన్ను చెప్పుకోనివ్వదు.. నువ్వు ఎప్పుడు వచ్చావు పూజిత.. అదే పెళ్లికి ముందు ఏదో మీకు వణికిపోతాను అని చెబుతున్నారు కదా అప్పుడు వచ్చాను..
ఏదో మన వాడికి మోటివేటివ్ గా ఉంటుందని చెబుతున్నాను. దాన్ని కూడా సీరియస్ గా తీసుకుంటే ఎలా బంగారం..
మీరు ఇద్దరు ఇలాగే రొమాన్స్ చేసుకోండి...నేను వెళుతున్నాను.. ఒరేయ్ చందు వెయిట్ చేస్తుంది రా.
సౌమ్య మాటిచ్చింది తీసుకువెళతాను అని..
శ్రీకర్ వచ్చేటప్పటికి కాదనలేక పంపించాను. లవర్స్ కదా డిస్టర్బ్ చేయకూడదు. అర్థం చేసుకో అని భరత్ బ్రతిమలితే..
మావయ్య నువ్వు చాలా గ్రేట్. నీ కూతరిని ఒకడు లవ్ చేస్తున్నాడని తెలిసిన ఇద్దరినీ దగ్గరుండి పంపించావు. అసలు ఇంత మోడరన్ ఫాదర్ ఎలా అయ్యవు..
నాకు కూడా ఇలాంటి మామగారు వస్తేనా.. రోజు దండేసి కాళ్ళకి దండం పెడతాను.. ఏడ్చావులే కానీ.. శ్రీకర్ గురించి అన్ని తెలుసు కాబట్టి ధైర్యంగా పంపించాను..అదే వేరే వాళ్ళైతే పంపుతానా ఏమిటి..
మీ మామగారు ఆల్రెడీ రెడీగానే ఉన్నారు.. అవునా.. ఎవరు అని మెడ చుట్టూ చేతులు వేస్తే.. నేను చెప్పిన పని చేసుకుని రా నీకు చెబుతాను..
వద్దులే మీరందరూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. ఈ ఒక్కసారికే సౌమ్య కోసం వెళుతున్నాను. ఇంకొకసారి నన్ను ఇరికించారంటే మాత్రం కుదరదు అని బైక్ తీస్తాడు.
సరే జాగ్రత్త.. ఒకటే జాగ్రత్త అనుకుంటూ వెళతాడు.. వెళుతున్న వైభవ్ ని చూసి నవ్వుకుంటారు..
రేపు వీళ్ళిద్దరికీ పెళ్లి అవుతే టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటుందేమో బావ అని వినయ్ అంటే.. వాడికి తెలియడం లేదు కానీ వాడు చందుతో డీప్ లవ్ లో ఉన్నాడు.
ఇద్దరూ గొడవ పడుతున్నారు.. ఒకళ్ళు అంటే ఒకళ్ళకి ఇష్టం లేదని ఫీలవుతున్నారు అంతే.. మనందరి కన్నా ఇద్దరిష్టాలు ఒకరికి ఒకరికి బాగా తెలుసు.. కానీ వీడు ఒప్పుకోవడం లేదు.
వైభవ్ విసుక్కుంటూనే వెళతాడు. ఇంటి ముందుకు వెళ్లి ఫోన్ చేస్తాడు. వస్తున్న అని స్పీడ్ గా వస్తుంది. గేటు తీసి వస్తున్న.. చందు ని చూస్తూ ఉండిపోతాడు..
బ్లూ జీన్స్ మీద లెమన్ ఎల్లో టాప్ వేసుకుని హెయిర్ లీవ్ చేసి ఉంటుంది. స్పీడ్ గా రావడం వలన హెయిర్ ఎగురుతూ ఉంటుంది.
దగ్గరికి వచ్చి ఆయాస పడుతూ సోరి లేట్ అయింది వెళదామా. అలాగే చూస్తూ ఉంటాడు. వైభవ్ నిన్నే అని కదుపుతుంది.
ఏమిటి అన్నావు.. లేట్ అయింది సారీ.. ఎప్పుడు నువ్వు చేసే పని అదే కదా.. రా అని విసుక్కుంటూ అంటాడు.. వైభవ్ మాట్లాడిన తీరుకి చిన్న బుచ్చుకుంటుంది..
ఇట్స్ ఓకే వైభవ్.. నీకు పని ఉన్నట్టుంది.. వెళ్లు...నేను క్యాబ్‌లో వెళతాను. ఎందుకు అందరికీ వైభవ్ నన్ను పికప్ చేసుకోలేదు. నేను క్యాబ్ కి వెళ్ళాను అని చెప్పి మళ్ళీ ఇంకో క్లాస్ పీకించడానికా....
ఏమీ అవసరం లేదు. రోజు రోడ్డు మీద ఎంతోమందికి లిఫ్ట్ ఇస్తూ ఉంటాము. అలాగే నీకు లిఫ్ట్ ఇచ్చాను అనుకుంటాను.
ఎక్కు అంటాడు. ఇక ఏమి మాట్లాడకుండా మౌనంగా ఎక్కి కూర్చుంటుంది. సైలెంటుగా ఇద్దరు ప్రయాణం మొదలవుతుంది.
కాలేజీకి వచ్చిన తర్వాత బైక్ దిగి థాంక్యూ... ఇంకొకసారి నిన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టను అని వెళ్ళిపోతుంది. వెళుతున్న చందు నే చూస్తూ.. ఏమిటి ఇది బైక్ ఎక్కినప్పుడు నుంచి చాలా సైలెంట్ గా ఉంది.
నేను విసుక్కున్న.. చిరాకు పడిన ఏమీ మాట్లాడలేదు. ఏమై ఉంటుంది.. ఆ.. ఏదో పనిలో ఉండి ఉంటుంది. లేకపోతే ఇది నా మీద సెటైర్ వేయకుండా ఉంటుందా..
అక్కడి నుండి వెళ్లడానికి బైక్ రివర్స్ చేస్తాడు. మాటలు వినిపిస్తూ ఉంటే ఆగి చూస్తే.. అబ్బా ఆ ఎల్లో టాప్ అమ్మాయి ఏముందిరా..
మన కాలేజ్ కాదనుకుంటా.. ఎప్పుడు చూసినట్టు లేదు. అవును.. ఎవరై ఉంటారు.. ఒకసారి ట్రై చేద్దామా..
ఆ మాటలు విన్న వైభవ్.. ఎవరిని కామెంట్ చేస్తూన్నారు అని చూడగానే...
చందు కనపడుతుంది.. వైభవ్ కి కోపం వస్తుంది.. బయటకి వచ్చినపుడు ఇలా టిప్ టాప్ గా రెడీ అవ్వకపోతే... ఫుల్లుగా కవర్ అయ్యే ఏ చుడీదార్ వేసుకుని రావచ్చు కదా...
అలా ఎందుకు వస్తారు.. ఫ్యాషన్ షో కి వచ్చినట్టు రావాలి కదా అని బైక్ స్టాండ్ వేసి చందు అని పిలుస్తాడు. వెనక్కి తిరిగి ఏమిటి అంటే..
ఒక్క నిమిషం అని దగ్గరికి వెళ్లి పదా అంటాడు.. ఎక్కడికి.. ఇక్కడదాకా తీసుకువచ్చిన వాడిని.. సౌమ్యకు అప్పచెప్పాలి కదా...
లేకపోతే నన్ను బయటే వదిలేసాడు అని మళ్ళీ గోల చేస్తావు. నాకు అవసరమా.. నేనేమీ గోల చేయను. నీ గురించి ఏమీ చెప్పను.
నా గురించి ఇప్పటికే నీవు చాలా టైం వేస్ట్ చేసుకున్నావు.. పరవాలేదు.. నేను వస్తాను అని చెప్పినప్పుడు నాతో ఆర్గ్యు చెయకు..
పదా అని చేయి పట్టుకుని తీసుకువెళ్ళుతూ కామెంట్ చేసిన అబ్బాయిల వైపు చూస్తాడు. ఓ... ఆల్రెడీ ఈ అమ్మాయికి లవర్ ఉన్నట్టున్నాడు రా.. అని గుసగుసలాడుకుంటారు.
సౌమ్య దగ్గరికి వెళ్ళి.. ఇదిగో చందుని అప్ప చెబుతున్నాను. మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి తీసుకురా... అర్థమైందా..
సౌమ్య ఆశ్చర్యంగా చూస్తూ అలాగే అంటుంది. జాగ్రత్త ఇద్దరూ అని వెళ్ళిపోతాడు. ఏమైందే వాడు నీ విషయంలో అంత కేర్ తీసుకుంటున్నాడు.
మళ్లీ వెనక్కి వచ్చే సౌమ్య అని పిలుస్తాడు. చెప్పు వైభవ్.. శ్రీకర్ బావ వచ్చి నిన్ను పికప్ చేసుకుంటే.. నాకు కాల్ చెయ్.
దీన్ని తీసుకువెళ్లి వాళ్ళ ఇంటిదగ్గర వదిలేస్తాను. అర్థమైందా అని వెళ్ళిపోతాడు. వెళుతున్న వైభవ్ ని చూసి నవ్వుతూ..
వాడికి నీ మీద చాలా ప్రేమ ఉంది. ఎదవ బెట్ చేస్తున్నాడు. ప్రేమ కాదు దోమ కాదు. నావల్ల వాడికి క్లాస్ తీసుకుంటారేమో అన్న విసుగు అంతే..
క్లాస్ తీసుకుంటే ఎంతసేపు.. అయిదు నిమిషాలు లేదా ఒక గంట. దానికోసం వాడు నీ విషయంలో అంత కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా..
పోనీ నీ సంగతి చెప్పు.. నువ్వు వాడిని ప్రేమిస్తున్నావా.. చందు మాట దాటేస్తూ.. మా ఫ్రెండ్స్ ని కలిసి వస్తాను అని వెళ్ళిపోతుంది.
వెళుతున్న చందు ని చూస్తూ ఎన్ని రోజులు దాటివేస్తావో నేను చూస్తాను...
వైభవ్ బైక్ మీద వెళుతూ.. ఆ చందు గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు ఏముంది. ఎవరో కామెంట్ చేస్తే నాకెందుకు కోపం వచ్చింది.
చిన్నప్పటినుంచి కలిసి పెరిగాం కదా.. అలాగే ఉంటుందిలే.. సౌమ్య ని ఎవరైనా కామెంట్ చేసిన నాకు కోపం వస్తుంది కదా.. ఇది అంతేలే అని వెళ్ళిపోతాడు..
హిమ విక్రమ్ ఆఫీస్ దగ్గరికి వెళుతుంది. పర్మిషన్ లేదు అని లోపలికి వెళ్లనువ్వరు. ఏమి చేయాలో అర్థం కాక.. కాలు కాలిన పిల్లిలాగా తిరుగుతూ ఉంటుంది.
సూర్య నెంబరు నా దగ్గర లేదు. రెండు రోజుల్లో కాల్ చేస్తాను మళ్ళీ మీట్ అవుదాం అన్న మనిషి ఏమైపోయాడో తెలియడం లేదు...
ఏం చేయాలి అని గోళ్లు కొరకుతూ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన సూర్యా నవ్వుకుంటూ నాకు తెలుసు నువ్వు వస్తావని..
బట్ అప్పుడే నేను నీకు దొరికితే ఎలా.. ఇంకా కొన్ని రోజులు నిన్ను తిప్పించాలి కదా.. అప్పుడే ఎటు అడుగు వేయాలో తెలియక డాన్స్ చేస్తూ ఉంటావు అని వైభవ్ కి కాల్ చేసి ఎక్కడున్నావురా..
ఇప్పుడే ఆఫీస్ కి వెళుతున్నాను.. అవునా.. అక్కడ నీకు ఒక మేకప్ వేసుకున్న ఒక తింగరబుచ్చి కనపడుతుంది.. దాన్ని ముప్పతిప్పలు పెట్టి అక్కడ నుండి పంపించేసేయ్..
ఎవరు అన్నయ్య.. వెళ్ళు నీకే తెలుస్తుంది.. వైభవ్ మెయిన్ గేటు దగ్గరికి వెళ్ళేటప్పటికి కనిపించిన హిమని చూసి..
ఇదా అనుకొని ఏమీ ఎరగనట్టుగా పక్కనుండి వెళ్ళిపోతుంటే.. హలో మిస్టర్ అని పిలుస్తుంది. ఎస్ మిస్ అంటే..
నీకు సూర్య తెలుసా అని పొగరుగా అడుగుతుంది. తెలిస్తే... నాకు నెంబర్ కావాలి చెప్పు. మీరు ఎవరో తెలియకుండా నేను చెప్పను.
నేను టుడేస్ బ్యాక్ మీకు ఆఫీస్ కి వచ్చాను కదా గుర్తుపట్టలేదా.. మా ఆఫీస్ కి ఎంతోమంది వస్తుంటారు.. వెళుతూ ఉంటారు..
ఎంతమందిని గుర్తుపెట్టుకుంటాము. నన్ను ఎవరో అనుకుంటున్నావు.. నేను సూర్య గర్ల్ ఫ్రెండ్ ని.. వాట్ నువ్వా అని గట్టిగా నవ్వుతాడు...
ఏ మిస్టర్ ఎందుకు అలా నవ్వుతున్నావు...
వైభవ్ సమాధానం ఏమిటి.....
Posts: 898
Threads: 13
Likes Received: 7,038 in 832 posts
Likes Given: 1,545
Joined: Aug 2024
Reputation:
652
Part - 58
నన్నెవరు అనుకుంటున్నావు.. సూర్య గర్ల్ ఫ్రెండ్ ని.. వాట్ నువ్వా అని గట్టిగా నవ్వుతాడు. ఏ మిస్టర్ ఎందుకు అలా నవ్వుతున్నావు.
నవ్వక.. నువ్వు సూర్య గర్ల్ ఫ్రెండ్ అంటే పిచ్చ కామెడీగా ఉంది. ఈ మధ్యకాలంలో నేను ఇంత కామెడీ చూడలేదు తెలుసా...
నవ్వి నవ్వి పొట్ట నొప్పి వచ్చేస్తుంది తెలుసా.. స్టాపిట్ అని అరుస్తుంది. దేనికి స్టాప్.. ఇప్పుడు చెప్పు పాప.. ఎలా నువ్వు సూర్య గర్ల్ ఫ్రెండ్ అయ్యావు...
టుడేస్ బ్యాక్ నేనెక్కడ ప్రాజెక్టు గురించి వచ్చాను. అప్పుడే మేమిద్దరం లవర్స్ అయ్యాము.. ఏమిటి.. ప్రాజెక్టుకు వచ్చే లవర్స్ అయిపోయారా.. సూర్య మరీ అంత వీకా..
మాది లవ్ అట్ ఫస్ట్ సైట్.. యు.. నో.. నా టాలెంట్ కి... నా అందానికి సూర్య ఫిదా అయిపోయాడు. అవునా.. అంత ఫిదా అయినవాడు నెంబర్ ఎందుకు ఇవ్వలేదు.
నా నెంబర్ తీసుకున్నాడు బట్ సూర్య మాటల్లో పడి నేనే నెంబర్ తీసుకోవడం మర్చిపోయాను. నీ నెంబర్ తీసుకున్నప్పుడు మరి కాల్ చేయాలి కదా..
ఎందుకు కాల్ చేయలేదు. బిజీగా ఉండుంటాడు.. అందుకే నేనే వచ్చాను.. కోయి... కోయి.. ఈ కోతులు నేను కాబట్టి వింటున్నాను. అదే విక్రమ్ సార్ గాని వింటే నిన్ను ఇక్కడే నిలువునా చీరేస్తారు..
మా సూర్య ఎక్కడ.. నువ్వెక్కడ... ఇంతకీ నువ్వెవరు మిస్టర్.. సూర్య సూర్య అని మాట్లాడుతున్నావు.నేను నీలాగా కోతలు బ్యాచ్ ని కాదులే కానీ వెళ్ళమ్మా.. వెళ్లి పని చూసుకో...
గౌతమ్ స్పీడుగా వస్తాడు. హిమ అని గట్టిగా పిలుస్తాడు.. నువ్వేంటి ఇక్కడ అని అడిగితే.. అది నేను అడగాలి.. నువ్వేం చేస్తున్నావ్ ఇక్కడ..
వైభవ్ గౌతమ్ ని చూసి ఫేస్ కి స్కార్ఫ్ కట్టుకుంటాడు.. ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు.. సడన్ గా ఇదేందుకు కట్టుకున్నావు. నాకు కొంచెం డస్ట్ ఎలర్జీ ఉందిలే..
ఇంతకీ ఈ కాండిడేట్ ఎవరు. ఇంకొక లవరా.. జస్ట్ షట్ అప్ అంటుంది. గౌతమ్ దగ్గరగా వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నావు.. ఎవరు ఇతను..
ఇంతకీ నువ్వు ఎవరివి బాస్ అని అడుగుతాడు. నేను ఎవరు అన్న సంగతి పక్కన పెట్టు.. మీ ఇద్దరు ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు.
నువ్వు ప్రాజెక్టుకు ఏదైనా డామేజ్ చేయాలని చూస్తే అసలు ఊరుకోను.. ప్రాజెక్ట్.. ఏ ప్రాజెక్ట్ ఇప్పుడు దాకా నువ్వు చెబుతున్నావు దాని గురించా..
ఈవిడ టాలెంట్ చూసి మా సూర్య అడ్డంగా పడిపోయాడంట.. లవ్ ప్రపోజల్ చేసాడు.. మేమిద్దరం లవర్స్ అని చెబుతుంది.
ఇంతకీ నువ్వు ఎవరు బాస్.. వాట్ లవర్స్ అని చెబుతుందా.. ఏంటి హిమ ఇది.. గౌతమ్ మనిద్దరం తర్వాత మాట్లాడుకుందాం.
ఇక్కడ సీన్ చేయకు. సీన్ చేస్తుంది నేను కాదు.. నువ్వు రా అనే లాక్కు వెళతాడు...
వైభవ్ సూర్యకి కాల్ చేసి ఆ తింగరిదాన్ని తీసుకు వెళ్ళడానికి ఆ గౌతమ్ వచ్చాడు. నేనే వాడికి కాల్ చేశాను.
కరెక్ట్ టైం కి వచ్చాడు..
ఇప్పుడు అసలు సినిమా ఉంటుందిగా.. మామూలుగా కాదు ఒకరిని ఒకరిని నమ్మలేరు అలా అని వదులుకోలేరు..
హిమని కార్లు కూర్చోబెట్టి గౌతమ్ స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. వాట్ గౌతమ్ ఏమైంది ఎందుకు అంత స్పీడ్ గా వెళుతున్నావు.
నువ్వు చేస్తుంది ఏమైనా బాగుందా.. ఆ సూర్య నీకు లవర్ అని చెబుతావా.. మీరిద్దరూ ఎప్పుడు కలిశారు ఎలా కలిశారు ...
వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నా పని అయ్యే వరకు వీటికి సోప్ వేయాలి అనుకొని.. ఏంటి గౌతమ్.. ఆ అబ్బాయి మాట్లాడినట్టు నువ్వు అలాగే మాట్లాడతావు.
నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుని ఆ సూర్యతో ఎలా మింగిల్ అవుతాను అనుకున్నావు. మరి నేను చూసినప్పుడు జరుగుతున్న నాన్సెన్స్..
నీకు హెల్ప్ చేద్దామనే వెళ్ళాను. ప్రాజెక్టు ఎంతవరకు వాళ్ళు ఓకే చేశారు తెలుసుకోవాలి కదా.. సూర్య లవర్ అని చెబితే లోపలికి వెళ్లడానికి కన్వీనెంట్ గా ఉంటుందని ట్రై చేశాను. బట్ నువ్వు టైం కు వచ్చి అంత స్పాయిల్ చేసేసావు.
నావల్ల నీకు డామేజ్ జరిగింది కదా అని హెల్ప్ చేద్దాము అనుకుంటే నువ్వు నన్నే అనుమానిస్తున్నావు రాని కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటుంది.
సోరి నిన్ను అలా చూసి అతను అలా చెప్పేటప్పటికి నా మైండ్ పనిచేయలేదు. నువ్వు సడన్‌గా అక్కడికి ఎలా వచ్చావు. నా మీద ఏమైనా స్పై పెట్టావా.
ఛా.. ఛ.. నీవేంటో నాకు తెలియదా.. నాకు ఒక కాల్ వచ్చింది అందుకే కంగారుగా వచ్చాను. కాల్ ఎవరు చేశారు. తెలియదు. ప్రైవేట్ నెంబర్ నుంచి వచ్చింది.
ఏమి చెప్పారు.. నువ్వు సూర్యతో.. వద్దులే అంటాడు.. సూర్యతో హ చెప్పు.. వద్దులే.. సో వాళ్ళు ఎవరో నీకు బ్యాడ్ గా చెప్పారు.
నా మీద నమ్మకం లేక నన్ను వెతుక్కుంటూ వచ్చావు.. హౌ.. సో సాడ్.. ఇదేనా మన ప్రేమకి నువ్వు ఇచ్చే విలువ..
నిన్ను ఎంతగా నమ్మాను.
నీ మీద ప్రేమతోనే కదా డాడీ ని కూడా ఒప్పించి నీ ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేసేటట్టుగా చేశాను. బట్ నువ్వు నన్ను మాత్రం అనుమానిస్తున్నావా.
సోరి.. ఏదీ కావాలని చేయలేదు. ప్లీజ్ ఈ సారికి ఎక్స్క్యూజ్ చెయ్యి. నెక్స్ట్ టైం నేను ఎప్పుడూ నిన్ను అనుమానించాను.
ఇట్స్ ఓకే.. ఇదే లాస్ట్ అవ్వాలి. ఇంకొకసారి ఇలా జరిగితే నేను బ్రేకప్ చెప్పేస్తాను. అమ్మో ఇది నిజంగా చెప్పినా చెబుతోంది. నా పని అయ్యే వరకు నేను దీనితో జాగ్రత్తగా ఉండాలి అనుకొని..
ఇది మళ్లీ రిపీట్ అవ్వదని చెబుతున్నాను కదా.. నా తప్పుకి పనిష్మెంట్గా నిన్ను లంచ్ కి తీసుకువెళ్తాను. చెప్పు ఎక్కడికి వెళదాం.
నువ్వు ఎక్కడికి తీసుకువెళ్లినా నీతో వస్తాను గౌతమ్ అని భుజం పైన వాలుతుంది. కానీ ఎవరి బుర్రకి వాళ్ళు పదును పెడుతూ ఉంటారు..
కాలేజ్ అవగానే విశి భవ్యకి చెప్పి బయటికి వస్తుంది. భవ్య నేను వస్తాను.. తమరి డ్రైవింగ్ స్కిల్స్ చూడాలి కదా..
నువ్వు నన్ను కామెంట్ చేయకు. నాకు నేర్పించేది దేవా సార్ అర్ధమయ్యిందా.. అబ్బో చాలా కాన్ఫిడెంట్ వచ్చిందే..
అవును దేవా సార్ పక్కనుంటే నా కాన్ఫిడెంట్ లెవెల్స్ వేరు. ఇది ఇంతకుముందు ఎప్పుడూ లేదనుకుంటా.. ఏం మాట్లాడుతున్నావు..
అదే ఇంతకుముందు ఎప్పుడూ నువ్వు ఇంత కాన్ఫిడెంట్‌గా లేవనుకుంటా అని సాగదీస్తుంది.. ఎక్కువ సాగదీయకు దేవా సార్ నాకు మంచి ఫ్రెండ్. వెల్ విషర్ అర్థమయిందా.
అర్థమైందిలే.. దేవా సార్ వెయిట్ చేస్తూ ఉంటారు అని సాగదీస్తూ ఉంటే.. నీకు చెప్పలేను అని స్పీడ్ గా వెళుతుంది.
దేవా పార్కింగ్ ఏరియాలో వెయిట్ చేస్తుంటే.. సోరి సార్.. లేట్ అయిందా.. ఇట్స్ ఓకే వెళదామా..
సూర్య బైక్ స్టార్ట్ చేయగానే వెనకాల కూర్చుంటుంది. ఇవన్నీ సరళ కాముగా ఫొటోస్ తీస్తూ ఉంటుంది. భవ్య కూడా వెనకాలే వెళుతుంది.
శ్రీకర్ కి కాల్ వస్తే లిఫ్ట్ చేసి.. ఏంటి బుజ్జి పప్పీ ఎప్పుడు నేనే ఫోన్ చేసే వాడిని..ఈసారి తమరు ఫోన్ చేశారు.. అంతగా మిస్ అయ్యావా..
చేసింది చాలుగాని.. వచ్చి నన్ను పికప్ చేసుకో.. ఏమిటి ఇంత బంపర్ ఆఫర్. పొద్దున డ్రైవింగ్ నచ్చిందా.. ఎక్స్‌ట్రాలు చేయకు.
నువ్వు వస్తే.. వైభవ్ కి కాల్ చేసి చందుని పికప్ చేసుకోమనాలి . ఏంటి ఈ సడెన్ చేంజ్.. ఇద్దరికీ ఒకళ్ళ మీద ఒకరికి ప్రేమ ఉంది కానీ దీనికి చెప్పడం రావడం లేదు. వాడికి తెలియడం లేదు.
సో మనము వాళ్ళిద్దరికీ ప్రైవసీని క్రియేట్ చేస్తూ ఉంటేనే.. ఓపెన్ అవుతారు. అమ్మో నా డాక్టర్ బేబీకి ఎన్ని తెలివితేటలు. అందుకే డాక్టర్ అయిపోయినట్టు ఉంది..
పొగిడింది చాలుగాని.. వస్తావా లేదా నేను క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోనా.. అయ్యో నా బుజ్జి పప్పీ ఇంత మంచి ఆఫర్ నేను ఎలా వదిలేసుకుంటాను..
అసలే నీకు ఈ రోజు మా సిస్టర్ ని కూడా పరిచయం చేస్తాను. ఎవరిని విశిష్ట నా.. హ.. మా బావ దగ్గరుండి మరీ డ్రైవింగ్ నేర్పిస్తున్నాడు.
నీకు నేర్పించిన.. నాకు అవసరం లేదు. నాకు వచ్చు. వస్తే మాత్రం నేర్పించు అని అడగొచ్చు కదా.. ఆ డ్రైవింగ్ లో ఎంత రొమాన్స్ ఉంటుందో నీ మట్టి బుర్రకేం తెలుసు.
పొద్దున్న చూసాను కదా.. జాగ్రత్తగా తీసుకువెళ్ళు అని డాడీ చెప్పారు అని జాగ్రత్తగా పట్టుకో పట్టుకో అని నా చేతులతో నీ నడుము ను గట్టిగా పట్టుకునేటట్టు చేసావు..
ఇంకా దగ్గరికి జరుగు అని హత్తుకునేలాగా చేశావు. నీ రొమాన్స్ ఏంటో నాకు తెలియదా.. ఎంజాయ్ చేశావు కదా మళ్లీ ఇంకా ఈ అలక ఎందుకు..
అబ్బబ్బా నీతో మాట్లాడలేను కానీ.. వస్తావా రావా.. ఇదిగో దారిలోనే ఉన్నాను. నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉండు. ఫైవ్ మినిట్స్ లో అక్కడ ఉంటాను. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం కరెక్ట్ కాదు ...
ఆ విషయం నాకు తెలుసు కానీ నా ఫోన్ కి తెలియదు కదా.. సరే బాబు నువ్వు రా.. ఈలోపు వైభవ్ కి కాల్ చేయాలి అని ఫోన్ పెట్టేస్తుంది.
రాక్షసి ఊరించి చంపడం మీ ఆడవాళ్లు తర్వాతేనే.. వైభవ్ కి కాల్ చేసి ఎక్కడున్నావు.. శ్రీకర్ వచ్చి పికప్ చేసుకుంటున్నాడు.
మరి చందు ని క్యాబ్ కి పంపించనా.. చెప్పాను కదా నేను వస్తానని.. మళ్ళీ క్యాబ్ ఎందుకు.. నాకు అనవసరంగా క్లాస్ తీసుకోవడానికా..
సరే తొందరగా రా మాకు చాలా పనులు ఉన్నాయి. ఏంటో లవర్స్ అందరూ బిజీగా ఉంటున్నారు. నేనే ఖాళీగా ఉంటున్నాను. నువ్వెక్కడ ఖాళీగా ఉంటున్నావు..
ఒక పక్కన జాబు ఒక పక్కన పికప్ డ్రాపింగ్‌లు.. ఇంకొక పక్కన.. ఇంకా ఆపుతావా.. ఈ పికప్ డ్రాపింగ్ కూడా కేవలం నీకోసమే..
నా కోసమా.. నువ్వు చందుకి మాటిచ్చావు అంట కదా.. తీసుకువెళ్తానని. మావయ్య బ్రతిమాలితే దాన్ని తీసుకొచ్చి అక్కడ పడేసాను..
సౌమ్య రియాక్షన్.....
Posts: 898
Threads: 13
Likes Received: 7,038 in 832 posts
Likes Given: 1,545
Joined: Aug 2024
Reputation:
652
Part - 59
నీ గురించి దానిని అక్కడికి తెచ్చి పడేసాను లేకపోతే నాకు పని ఏమిటి.. నా గురించి తీసుకొచ్చావు సరే..మరి ఇప్పుడు ఎవరి గురించి తీసుకు వెళుతున్నావు.
ఆ మాటకి వైభవ్ సడన్ బ్రేక్ వేస్తాడు. ఏమైంది వైభవ్ మాట్లాడవేమిటి...
కొన్ని కొన్ని పనులు ఎదుట వ్యక్తి మీద మనకున్న ఫీలింగ్స్ చెబుతాయి. అది నచ్చిన ఫీలింగ్ అయినా నచ్చని ఫీలింగ్ అయినా..
నీకు చందు మీద ఎలాంటి ఫీలింగ్ ఉన్నదో నీకు నువ్వే క్రాస్ చెక్ చేసుకో.. అందరూ చెబుతున్నారు.. ప్రేమించడం ఏమిటి అని రివర్స్‌లో కాకుండా... నీ మనసు ఏం చెబుతుందో అన్నది ఆలోచించు...
సరే శ్రీకర్ వచ్చాడు. నేను వెళుతున్నాను అని ఫోన్ పెట్టేస్తుంది. వైభవ్ బైక్ స్టార్ చేసి సౌమ్య కాలేజ్ దగ్గరికి వస్తాడు. చందు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది.
ఫ్రెండ్స్ తో నవ్వుతూ మాట్లాడుతున్న చందుని చూసి నిజంగానే ఇది నన్ను లవ్ చేసిందా.. లేకపోతే.. చూద్దాం . కొన్ని రోజులు అబ్జర్వేషన్ లో పెడితే నాకు తెలుస్తుంది.
పిలవకుండా హార్న్ కొడతాడు.. చందు చూసి.. ఫ్రెండ్స్ కి బాయ్ చెప్పి.. వైభవ్ దగ్గరికి వచ్చి చూసుకోలేదు.. ఎంతసేపు అయ్యింది..
మమ్మల్ని ఏమి చూస్తావులే.. ఉప్పర్ మీటింగ్‌లో బిజీగా ఉన్నావు కదా.. వాట్... గర్ల్స్ అందరూ ఒక చోట చేరితే ఉప్పర్ మీటింగ్ ఏ కదా..
సీరియస్ గా చూస్తూ.. గర్ల్స్ ఒక చోటచేరితే.. ఉప్పర్ మీటింగ్ తప్ప.. ఇంక ఏమి ఉండవా.. ఏముంటాయి.. మేము చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుంటాము.
ఏం మాట్లాడుకుంటారు.. డ్రెస్సులు గురించి.. మేకప్ గురించి లేకపోతే ఏ సినిమా గురించో.. అంతే కదా.. అందులోనువ్వు..
నీకు చెప్పడం వేస్ట్ పదా అని బైక్ ఎక్కుతుంది...
శ్రీకర్ బైక్ ఎక్కిన సౌమ్య సీరియస్ గా ఉంటే.. ఏమైయింది నా బుజ్జి పప్పీకి....అంత సీరియస్ గాఉంది.. సీరియస్ గా కాక ఎలా ఉండాలి..
పొద్దున్నే చేసింది ఏమైనా బాగుందా.. నేను అప్పుడే మర్చిపోయాను నువ్వు ఇంకా గుర్తుపెట్టుకున్నావు అంటే.. ఇంకా కావాలనే కదా..
ఎప్పటికీ డైరెక్ట్ గా చెప్పడం నేర్చుకుంటావు బుజ్జి పప్పీ అని బైక్ స్పీడ్ పెంచుతాడు. నా ఉద్దేశం అది కాదు.. నాకు అలాగే అర్థమైంది.
ప్రేమలో ఉన్నప్పుడు లవర్స్ ఎలా చెప్పినా మనకు అనుకూలంగానే అర్థం చేసుకోవాలి.. అప్పుడే బండి ఇంకా స్మూత్ గా వెళ్ళిపోతుంది అని హాస్కీగా చెబుతాడు.
నీకు అసలు సిగ్గులేదు. ప్రియురాలు దగ్గర సిగ్గుపడితే ముద్దు ముచ్చట్లు ఎలా తీరుతాయి. అమ్మో ముద్దు ముచ్చట్లు నావల్ల కాదు.
నువ్వు చదువుతుంది డాక్టర్.. ఏ టెన్త్ క్లాసో కాదు. నాన్నకు తెలుస్తే కోప్పడతారు. అవును మనిద్దరం ఎన్నిసార్లు ముద్దు పెట్టుకున్నామని వెళ్లి మావయ్య కు చెప్తావా... సిగ్గు లేకపోతే సరి..
మనిద్దరి మీద నమ్మకంతో పంపించినప్పుడు మనం కూడా నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. అప్పుడే వాళ్ల ముందు గర్వంగా మనం తలెత్తుకుని తిరగ గలుగుతాము.
బాబోయ్ నా బుజ్జి పప్పీకి చదువుతోపాటు లోకజ్ఞానం కూడా చాలా వచ్చేస్తుంది. నిన్ను చూసి తింగరిబుచ్చితో ఎలా వేగాలో ఏమిటో అనుకున్నాను కానీ నీ దగ్గర చాలా మ్యాటర్ ఉంది..
బైక్ ఆపి దిగు అంటాడు. వచ్చేసామా.. అక్కడ చూడు మా బావ ఎన్ని కుస్తిలు పడుతున్నాడో.. మనిద్దరికీ ఈ పిలుపు దగ్గరే చాలా ఇబ్బంది అయిపోతుంది కదా..
నాకు ఏమో వరుసకి బావ.. నీకేమో ఫ్రెండ్. ఇప్పుడు విశిష్ట ని నువ్వేమో చెల్లి అని పిలుస్తున్నావు. మరి నాకేమో కజిన్ అవుతుంది. ఎలా..
ఇప్పుడు అదంతా ముఖ్యమా.. అబ్బా ఒక క్లారిటీ కోసం అడుగుతున్నాను. మీది బ్లడ్ రిలేషన్.. వరుసకి మరదలు వైన వాడి దృష్టిలో నువ్వు చెల్లివే కాబట్టి నో ప్రాబ్లం..
మాది ఫ్రెండ్ రిలేషన్స్ సరేనా... మూసుకొని పదా..
విశి డ్రైవింగ్ ప్లేస్ లో కూర్చుని భయంగా చూస్తూంటే.. సూర్య ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఇది క్లచ్,. బ్రేక్, ఎక్స్ లెటర్, ఇది ఆటో స్టార్ట్ బటన్ అని చెబుతూ ఉంటే ఓకే ఓకే అని తల ఊపుతుంది..
ఇప్పుడు అర్థమైంది కదా. స్టార్ట్ చేయి.. బండి పడిపోతుంది ఏమో సార్. పడదు. నువ్వు బ్యాలెన్స్ చెయ్. ఏమీ అవ్వదు అని పక్కకి తప్పుకుంటాడు.
స్కూటీ స్టార్ట్ చేసి ఊపేస్తూ ఉంటే వచ్చి పట్టుకుని టెన్షన్ పడకు. కూల్ గా వెళ్ళు.. మీరు రండి సార్ నాకు భయం వేస్తుంది.
సరే ఒక టు రౌండ్స్ కి నీతో పాటు కూర్చుంటాను. తర్వాత నువ్వు సెల్ఫ్ గా చేయాలి..
సూర్య వెనక్కి కూర్చుంటాడు.
విశి భయంతో హ్యాండిల్‌కి గట్టిగ పట్టుకుని...
“సార్, మీరు బలంగా పట్టుకోండి… పడిపోతే నాకు లైఫ్ అంతే!” అంటుంది.
సూర్య నవ్వుతూ...
“ఏం పడిపోతావ్ … నేను ఉన్నా కదా వెనక!”
అని తేలికగా ఆమె భుజం దగ్గర హ్యాండిల్ పట్టుకుంటాడు.
స్కూటీ నెమ్మదిగా కదులుతుంటే...
విశి ఊపిరి బిగబట్టి – “ఏయ్ ఏయ్ తప్పుకో … బ్రేక్ ఏది సార్?”
“ఇది బ్రేక్ కాదు, నీ భయమే బ్రేక్!” అంటూ నవ్వుతాడు సూర్య.
చుట్టూ గాలి తాకి ఆమె జుట్టు సూర్య ముఖాన పడుతుంది.
ఆ సైలెంట్ మోమెంట్‌లో సూర్య కళ్లలో చిన్న స్మైల్.
సూర్య ఆ గాలిలో తేలుతూ విశి నే చూస్తూ..
ఇలా ఎప్పుడూ నెమ్మదిగా, పక్కన నువ్వు ఉండి సాయంత్రం చల్లగా నడిచే ఫీలింగ్… అదీ జీవితంలో ఎప్పుడూ ఉండాలి. ఉండేలాగా చేస్తాను క్యూటి..
స్కూటీ ఆగగానే విశి ఊపిరి పీలుస్తూ..
హమ్మయ్య డ్రైవ్ చేసేసాను. మళ్ళీ వెళదామా..
“అయ్యో సార్… ఇక మళ్లీ నా వల్ల కాదండి. గుండె ఒక్కసారిగా బయటికి వచ్చింది.”
“అదే ఫీలింగ్ రావాలి, అప్పుడే రైడ్ సరదా!”
అని సరదాగా చెబుతాడు సూర్య,
మెల్లగా కాళ్లను స్టాండ్ మీద ఉంచి బైక్ నిలిపేస్తాడు.
ఎవరో అడ్డు వస్తే ఎందుకు భయపడుతున్నావు. ఎక్సలేటర్ స్లో చేసుకుని బ్రేక్ వేసుకుంటే అయిపోతుంది కదా.. సార్ అన్ని పనులు ఒకేసారి ఎలా చేస్తారు..
భవ్య కూర్చుని ఇద్దరినీ చూస్తూ ఉంటుంది. శ్రీకర్ వచ్చి హాయ్ అని పక్కన కూర్చుంటాడు. హాయ్ సార్.. పక్కనున్న సౌమ్యని చూసి సౌమ్యనా అని అడుగుతుంది.
నీకు ఎలా తెలుసు.. మీటైనా ఫస్ట్ డేనే నీ గురించి చెప్పారు..
ఏం జరుగుతుంది అక్కడ.. అదే చూస్తున్నాను సార్.. డ్రైవింగ్ పేరుతో రొమాన్స్ జరుగుతున్నట్టు ఉంది..
ఎందుకనిపించింది. ఏమో.. దూరం నుంచి చూస్తూ ఉంటే అలాగే ఉంది.. కుచ్ కుచ్ హోతా హై లాగా..
ముగ్గురు చూస్తూ ఉంటారు..
సూర్య సీరియస్‌గా చూస్తూ ఉంటే సార్ మీరు అలా చూడకండి నాకు భయం వేస్తుంది. కొంచెం ఎక్కువ అవ్వలేదా...ఎక్సలేటర్ వేయకుండా బ్రేక్ వేస్తే ముందుకు దూకుతుంది.
విశి శ్వాస తీసుకుని వదిలి.. చిన్న ధైర్యంతో...
ఇప్పుడు రండి సార్… ఇంకోసారి ప్రయత్నిస్తాను. ఈసారీ పడిపోను. పడనివ్వను.. అని కళ్లలో ఒక కాంతితో చెబుతుంది..
సూర్య కాస్త ఆశ్చర్యంగా చూస్తూ...
“అదే స్పిరిట్!”
అని గట్టిగా చప్పట్లు కొడతాడు.
చల్లని సాయంత్రం లైట్లో స్కూటీ మళ్లీ స్టార్ట్ అవుతుంది,
గాలి ఊపిరితో ఇద్దరి మధ్య ఒక కొత్త కంఫర్ట్…
భయం కరిగి, ఫీలింగ్ మొదలవుతుంది.
ఇద్దరిలో తెలియని అలజడి మొదలవుతుంది. విశి బ్రేక్ వేసి ఆపుతుంది. ఏమైంది... నథింగ్ సార్.. హెయిర్ ని వెనక్కి అనుకుంటూ నేర్వోస్ ఫీల్ అవుతుంది. విశి ఇబ్బంది అర్థమైన సూర్య బైక్ దిగి నిలబడతాడు.
విశి చూస్తూ ఉండగానే... సూర్య కాస్త దూరంగా వెనక్కి వెళ్తాడు.
“సరే… ఇప్పుడు నువ్వే డ్రైవ్ చెయ్. నేను నీతో రాను,” ఇక్కడే ఉంటాను అంటాడు నవ్వుతూ.
విశి కాసేపు సూర్య ని చూస్తూ –
“నిజంగానే ఉంటారా?”
“అవును, నేను చూస్తుంటాను… నిన్ను నమ్ము,” అని చెబుతాడు సూర్య.
ఆ మాటలో ఒక నిశ్చింత, ఒక నమ్మకం ఉంటుంది.
స్కూటీ స్టార్ట్ అవుతుంది.
మొదట తడబడుతూ, తర్వాత బలంగా రైడ్ మొదలుపెడుతుంది.
గాలి తాకుతూ జుట్టు వెనక్కి ఎగురుతుంటే, విశి కళ్లలో ఫ్రీడమ్ ఫీలింగ్.
చుట్టూ ఉన్న భయం మెల్లగా చెదిరిపోతుంది.
సూర్య దూరంగా నిలబడి చూస్తూ ఉంటాడు —
చిరునవ్వు పెదవుల పైన నిలిచిపోతుంది.
అతని చూపుల్లో గర్వం, ప్రేమ, శాంతి కలిసిపోతాయి.
“ఇదే కావాలి... భయం కాదు, నమ్మకం కావాలి” అని మెల్లగా మనసులో అనుకుంటాడు.
స్కూటీ రోడ్‌పై మెల్లగా దూరమవుతుంది,
సూర్య కళ్ళల్లో విశి రైడ్ రిఫ్లెక్ట్ అవుతుంది.
కొన్నిసార్లు మనం నేర్పేది డ్రైవింగ్ కాదు… ధైర్యం.
రిటర్న్ వస్తున్న విశి నే చూస్తూ ఉంటాడు. సూర్య ముందు స్కూటీ ఆపి.. సార్ నాకు వచ్చేసింది. మిమ్మల్ని ఎక్కడి డ్రాప్ చేయమంటారో చెప్పండి అని టాప్ కి లేని కాలర్ ఎగరేస్తుంది..
అప్పుడే అంత కాన్ఫిడెన్స్...ఇది మీరు ఇచ్చింది కదా...
నీలో ఉంది. జస్ట్ నేను దాన్ని గుర్తు చేసాను అంతే..
రేపటి నుంచి కాలేజీకి వెళ్లిపోవచ్చా సార్.. అప్పుడే కాదు.. ఇంకొక వన్ వీక్ ప్రాక్టీస్ చేశాక అప్పుడు స్టార్ట్ చెయ్..
సౌమ్య విశి నే చూస్తూ.. భలే క్యూట్ గా ఉంది కదా..
విశి భవ్య దగ్గరికి వచ్చి.. నాకు డ్రైవింగ్ వచ్చేసింది.. చూడు.. రేపటి నుంచి నీకు ఎక్కడికి కావాలి అన్న నేనే తీసుకుని వెళ్ళిపోతాను..
అబ్బో ఈ డ్రైవింగ్ మేము నేర్పిస్తామన్నప్పుడు నేర్చుకోలేదు. ఇప్పుడు దేవా సార్ ఇలా నేర్పించగానే నేర్చేసుకున్నావు ఏమిటి సంగతి?
నువ్వు ఇవ్వని కాన్ఫిడెంట్.. దేవా సార్ ఇచ్చారు.. అందుకే వచ్చేసింది... అంతలా మా బావ ఏమిచ్చాడు అని సౌమ్య వాయిస్ వినపడగానే...
బావ నా... హ.. మా బావ..
విశి చూస్తూ ఉంటే.. ఏమైంది అలా చూస్తున్నావు..
విశి సమాధానం....
Posts: 898
Threads: 13
Likes Received: 7,038 in 832 posts
Likes Given: 1,545
Joined: Aug 2024
Reputation:
652
Part - 60
ఏమైంది విశి అలా చూస్తున్నావు.. మీ దేవా సార్ కి మరదలు ఉండదు అనుకున్నావా.. అలా ఏమీ లేదు. ఎప్పుడూ మీ గురించి తెలియలేదు.
అవునా.. దేవా పక్కన నిలబడి మా పెయిర్ ఎలా ఉంది అని అడుగుతుంది. భవ్య ఏంటి ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది..
శ్రీకర్ ఉక్రోషంగా చూస్తూ ఉంటాడు. బాగుంది . ఏం బాగుంది. మా బావ పక్కన నేను ఎలా సరిపోతాను. ఇదిగో నా కాబోయే వుడ్ బి.. అని శ్రీకర్ భుజం పైన తలవాల్చుతుంది..
బ్రతికిపోయేవే బుజ్జి పప్పి.. లేకపోతే నేనుఏంటో నీకు వారంరోజులు చూపించేవాడిని.. ఊరుకో శ్రీకర్.. విశి మనసులో ఏముందో తెలుసుకోవాలి కదా..
ఈ మధ్యన ప్రేమికులని కలపాలి అని కాంట్రాక్టు ఏమైనా తీసుకున్నావా ఏమిటి? అక్కడ వాళ్ళిద్దరూ... ఇక్కడ వీళ్ళిద్దరిని...
బావ పెళ్లి అయిపోతే నెక్స్ట్ మనమే కదా.. అందుకనే నా తాపత్రయం. అయ్యో నా బుజ్జిపప్పీ ఈ విషయం ముందే చెబితే ఇంకా కోపరేట్ చేసే వాడిని కదా..
చూడు ఈరోజు నుంచి.. ఒక గంట బావ గురించి ఊదరగొట్టేస్తారు బావ గురించి ఆలోచించేలా చేస్తాను..
నువ్వు చేయవలసిన అవసరం లేదు. విశి ఆల్రెడీ అదే పనిలో ఉంది. నేను బావ పక్కన నిలబడగానే.. నవ్వుతూ ఉన్న విశి ముఖం డల్ అయిపోయింది..
ఏంట్రా ఇందాక నుంచి మీ ఇద్దరి గుసగుసలు.. ఏమీ లేదు బావ నేను సౌమ్య ని డ్రాప్ చేస్తాను. మా చెల్లిని డ్రాప్ చేసేయ్..
మీ చెల్లా ఎవరు సార్ అని విశి ఈ సారి కొంచెం కోపంగా అడిగితే.. నిన్నే సిస్టర్. నాకు ఎలాగు సిబ్లింగ్స్ లేరు. నిన్ను చూస్తూ ఉంటే పోయిన జన్మలో మనిద్దరం అన్నా చెల్లెలు అన్న ఫీలింగ్ వస్తుంది. అందుకే పిలిచాను.
నువ్వు వద్దంటే చెప్పు మానేస్తాను.. కానీ ఈ అన్నయ్య మనసు అర్థం చేసుకో అని డ్రామాటిక్ గా చెబుతూ ఉంటాడు.
శ్రీకర్ చెప్పినదానికి విశి కళ్ళు తేలేస్తుంది. భవ్య పొట్ట పట్టుకుని మరీ నవ్వుతుంది..
ఇంకా ఆపుతావా.. మీరు వెళ్ళండి విశి ని నేను డ్రాప్ చేస్తాను. రా.. విశి అని చేయి పట్టుకుని తీసుకువెళతాడు. ఇంకా షాక్ లోనే ఉన్న విశి బొమ్మ లాగా వెళుతుంది.
భవ్య నవ్వి నవ్వి.. కష్టంగా ఆపుకుంటూ అక్కడ కింద కూర్చుని.. మీరు కనిపించరు కానీ చాలా కామెడీ చేస్తారు.
సరే సార్ బయలుదేరుతాను అని భవ్య వెళుతూ ఉంటే.. శ్రీకర్ పిలుస్తాడు. చెప్పండి సార్. మొన్న నీకు వైభవ్ ఫీలింగ్ అర్థం కాలేదా..
సార్ తనది ఓన్లీ అట్రాక్షన్ అండ్ ఫ్లర్ట్ చేస్తున్నాడు అంతే.. నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు. నిజంగా నిన్ను లవ్ చేస్తున్నాడేమో...
నో సార్ జస్ట్ ఎట్రాక్ట్ అయ్యాడు అంతే..అది ప్రేమ కాదు. నిజంగా ప్రేమ అయితే ఆ స్పందన నాలో కూడా తెలుస్తుంది.
బట్ అతనినీ ఒక తెలిసిన మనిషిగానే చూసాను. ఆల్రెడీ నువ్వు ఎవరినైనా లవ్ చేసావా అంత క్లియర్ గా చెబుతున్నావు.
నేను లవ్ కి చాలా దూరం సార్. మా పేరెంట్స్ ఎవరిని చూపిస్తే వాళ్ళని చేసుకుంటాను. ఈరోజుల్లో అలాగ ఎవరు ఉంటున్నారు.
మనకి నచ్చిన వాళ్ళు తీసుకువెళ్లి చూపిస్తే సరిపోతుంది కదా.. నో సార్.. మా పేరెంట్స్ కి నేను ఒక్కదాన్నే. నాకు ఊహ తెలిసినప్పటునుంచి నేను ఏది అడిగినా సరే కాదు అనకుండా నాకు ఇచ్చారు.
నేను ఇవ్వగలిగే... మంచి మెమొరబుల్ గిఫ్ట్ నా పెళ్లి మాత్రమే. అది వాళ్ళ కోరుకున్న విధంగా జరిగితే.. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంతకుమించి నాకు కావాల్సింది ఏముంది...
భవ్య చెప్పిన దానికి ఆశ్చర్యపోతారు. గుడ్ డెసిషన్ ఆల్ ద బెస్ట్. ఓకే సార్.. ఇంటిదగ్గర అమ్మ వెయిట్ చేస్తుంది బాయ్ అని వెళ్ళిపోతుంది.
భవ్య వెళ్ళగానే సౌమ్య కోపంగా శ్రీకర్ ని చూస్తూ ఉంటుంది. ఏమైందే నా బుజ్జి పప్పీ అలా చూస్తున్నావ్? నువ్వు చేస్తున్నది ఏంటి..
భవ్య, వైభవ్ ని కలపాలి అనుకుంటున్నావా.. అప్పుడు చందు ఏమైపోతుంది. అందుకే బుర్రవాడ మనేది.. అసలు భవ్య మనసులో ఏముందో తెలుసుకోవడానికి ఈ ట్రిక్ ప్లే చేశాను.
నిజంగా భవ్య కూడా ఎట్రాక్ట్ అయితే ఏదో ఒక రోజు వీళ్ళ ఇద్దరూ పెయిర్ అయిపోతారు. అప్పుడు చందు పరిస్థితి ఏమిటి..
స్టార్టింగ్ లోనే కట్ చేయొచ్చు కదా అని అడిగాను. అర్థం అయిందా.. అమ్మో నీకు కూడా నాతో తిరిగి తిరిగి చాలా తెలివితేటలు పెరిగిపోయాయి. తల కొట్టుకుంటూ పద అని తీసుకువెళ్తాడు..
బైక్ మీద వెళుతున్న విశి సూర్య సైలెంట్ గా ఉంటారు. మిర్రర్ లో నుంచి విశి ని చూస్తూ ఉంటాడు. ఒక్క నిమిషం తనలో తానే గోనుక్కుంటూ తిట్టుకుంటూ ఉంటుంది.
ఒక్క నిమిషం సీరియస్ గా ఉంటుంది.. మరో నిమిషం నవ్వుకుంటుంది. ఏమైంది ఈ పిల్లకి అనుకొని విశిష్ట అని పిలుస్తాడు.
చెప్పండి సార్. ఏమైంది.. ఏమైంది సార్... అదే అడుగుతున్నాను. దేని గురించి సార్.. ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా.. బైక్ ఎక్కిన దగ్గర్నుంచి విచిత్ర విన్యాసాలు చేస్తున్నావు...
నాలిక కరుచుకుని ఏమీ లేదు సార్.. ఏదో ప్రాజెక్టు గురించి ఆలోచిస్తున్నాను. అంతేనా.. అంతే సార్.. మీ దగ్గర దాయాల్సిన అవసరం ఏముంది.
సరే అని ఇంటి దగ్గర డ్రాప్ చేసి రేపు మార్నింగ్ వస్తాను. వెళ్లి రెస్ట్ తీసుకో. ఒకే సార్.. బాయ్ చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళేటప్పటికి భానుమతి నవ్వులు వినిపిస్తూ ఉంటాయి .
విశి అడుగలో వేగం తగ్గి మెల్లిగా వెళుతూ ఉంటుంది. అక్కడ భానుమతి, నేహా, సురభి జోక్స్ వేసుకుంటూ ఉంటారు.
చాలా రోజుల తర్వాత తల్లి అలా నవ్వడం చూసి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి... అక్కడే ఆగిపోయి చూస్తూ ఉంటుంది.
విశి ని చూసిన నేహ ఎంతసేపయింది వచ్చి.. కళ్ళు తుడుచుకొని ఇప్పుడే ఆంటీ. మీ మమ్మీ దగ్గర చాలా టాలెంట్ ఉంది.
ఈరోజు ఎన్ని రకాలు పిండి వంటలు చేశారో తెలుసా.. అవి అన్ని ఆపకుండా తింటే కచ్చితంగా లావైపోతాను. ఇంత మల్టీ టాలెంటెడ్ అని అనుకోలేదు..
ఆ మాటలకి భానుమతి సిగ్గుపడుతుంది. చదువు కోసం ఇక్కడికి రాకమందు ఊర్లోనే ఉండే వాళ్ళము కదా.. ఇంటికి వచ్చే జనం కూడా ఎక్కువ. అందుకే అమ్మ ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉండేది.
ఈరోజు వంట పని ఏమి పెట్టుకోవద్దు. అన్ని నేను పంపిస్తాను. పొద్దున్నుంచి అమ్మ రెస్ట్‌లెస్ గా ఉన్నారు. సరే ఆంటీ అని భానుమతి వైపు చేసే వెళదామా..
సరే అని కూతురుతో వెళుతూ కబుర్లు చెబుతూ ఉంటుంది. వాళ్ళిద్దర్నీ చూసిన సురభి.. విశి చాలా కష్టపడుతుంది కదా.
అందుకే మన సూర్యాకి అంత బాగా నచ్చింది. అమ్మాయిలో నిజాయితీ ఉంది. మంచి మనసు ఉంది. మన అవనికి తగ్గ కోడలు అవుతుంది..
నెక్స్ట్ జనరేషన్ గురించి కూడా నాకు అసలు టెన్షన్ లేదు. నిజమే అత్తయ్య.. ఇటు సౌమ్య... అటు విశిష్ట ఇద్దరు కూలే..
చందు కూడా కలిసిపోతుంది కాబట్టి మనం ఎవ్వరం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. విశి ఫ్లాట్ కి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయ్యి చేసిన స్నాక్స్ అన్ని ఒక్కదాని తర్వాత ఒకటి టేస్ట్ చూస్తూ ఉంటుంది.
అన్ని స్నాక్స్ రెండు బాక్స్‌ల్లో ప్యాక్ చేస్తుంది. ఎవరికి..ఒక బాక్స్ భవ్యకి.. ఇంకో బాక్స్ దేవా సార్ కి...
పడుకునే ముందు కిటికీ దగ్గర నిలబడి చందమామను చూస్తూ ఉంటుంది. ఎందుకు దేవా సార్... మీ పక్కన వేరే అమ్మాయి ఊహ వస్తే నాకు అంత కోపం వస్తుంది.
ఎప్పుడూ గౌతమ్ విషయంలో నేను అలాగా ఫీల్ అవ్వలేదు. కానీ మీ విషయం వచ్చేటప్పటికి ఒప్పుకోలేకపోతున్నాను...
సూర్య కూడా ఫ్రెష్ అయ్యి విశి ఫోటో చూస్తూ.. ఏంటి క్యూటి నా పక్కన సౌమ్యాని చూడగానే అంత కోపం వచ్చింది.
శ్రీకర్ మా సిస్టర్ ని తీసుకువెళ్ళు అన్నా ఒప్పుకోలేకపోయావు ఎందుకో నీకు తెలుస్తుందా..
నా పక్కన ఎవరిని ఊహించలేకపోతున్నావు. నీకు తెలియకుండానే చాలా పోసివేనెస్ వస్తుంది.. అదే పెరగాలి. అది పెరిగితేనే ఏది ప్రేమో తెలుస్తుంది.
విశి సూర్య గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతుంది. ఉదయం భానుమతి వచ్చి లేపితే.. ఒక ఫైవ్ మినిట్స్ అమ్మ అని దుప్పటి కప్పుకుంటుంది.
కాలేజీకి రావా అని సూర్య గొంతు వినపడగానే.. తల పైన కప్పుకున్న దుప్పటి తీసి ఉలిక్కిపడి కూర్చుంటుంది. సార్ మీరు ఇక్కడ..
నిన్ను పికప్ చేసుకోవడానికి వస్తానన్నాను కదా.. ఎంతసేపు చూసిన రాలేదు అని పైకి వచ్చాను. తొందరగా ఫ్రెష్ అయ్యి రా..
మీరు బయటికి వెళ్ళండి సార్.. అమ్మ చూస్తే ఇంకా అంతే సంగతులు. ఏమవుతుంది. నువ్వు తొందరగా లేగు.. వస్తాను సార్ మీరు వెళ్ళండి.
ఎవరిని సార్ అని పిలుస్తున్నావు అని భానుమతి గొంతు వినిపిస్తుంది. కళ్ళు ఒకసారి మూసి తెరిచి చూస్తుంది. అక్కడ భానుమతి తప్ప ఎవరూ ఉండరు.
నువ్వు ఒక్కదానివే ఉన్నావా.. లేదు నాతో పాటు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చారు. ఎంతసేపు లేపిన లెగడం లేదని వాళ్ళందరూ సుప్రభాతం పాడి లేపడానికి వచ్చారు.
చాలామ్మ నీ వెటకారాలు. ఏదో డ్రీమ్ వచ్చింది. విశి స్నానం చేసి డ్రెస్ వేసుకొని అద్ధం ముందు నిలబడి హెయిర్ దువ్వుకుంటూ ఉంటుంది.
జడలుసుగా వేసుకుని.. స్టిక్కర్ పెట్టుకుని... ఎలా ఉన్నారు అని అద్ధంలో కనపడుతున్న ప్రతిబింబాన్ని అడుగుతుంది.
పర్ఫెక్ట్ అన్న వాయిస్ వినపడుతుంది.. ఎవరు అని చూస్తే.. అక్కడ సూర్య కాఫీ తాగుతూ ఉంటాడు. సార్ మీరు మళ్ళీ వచ్చారా..
అప్పటినుంచి ఇక్కడే ఉన్నాను. అమ్మ వచ్చేటప్పుడు మీరు కనపడలేదు. అందరికీ కనిపిస్తానా ఏమిటి... నేను నీ మనసులో ఉన్నాను. నీకు మాత్రమే కనిపిస్తాను..
ఏమిటి మీరు నా మనసులో ఉన్నారా అని నోరు వదిలేస్తుంది..
భానుమతి తల మీద ఒకటి కొట్టి ఏమిటే పొద్దుటినుంచి పైత్యపువాగుడు వాగుతున్నావు ఏదైనా పిడకల వచ్చిందా.. భానుమతి వైపు చూసి సూర్యను చూసిన ప్లేస్ ని చూస్తుంది..
విశి కన్ఫ్యూషన్...
కథ కొనసాగుతుంది.....
Posts: 1,699
Threads: 2
Likes Received: 1,020 in 780 posts
Likes Given: 2,418
Joined: May 2019
Reputation:
11
Awesome update.
Chandu n Vaibhav romance spicy untundi anukunna
Posts: 4,838
Threads: 9
Likes Received: 3,259 in 2,498 posts
Likes Given: 11,328
Joined: Sep 2019
Reputation:
31
Posts: 1,159
Threads: 1
Likes Received: 732 in 475 posts
Likes Given: 11,268
Joined: Jun 2019
Reputation:
2
పైత్యం కాదు... Loveria అంటారు
Posts: 214
Threads: 2
Likes Received: 201 in 114 posts
Likes Given: 563
Joined: Jun 2019
Reputation:
4
Posts: 78
Threads: 0
Likes Received: 54 in 42 posts
Likes Given: 17
Joined: Nov 2023
Reputation:
0
Good morning me update kosam eduru chustu unam
Posts: 898
Threads: 13
Likes Received: 7,038 in 832 posts
Likes Given: 1,545
Joined: Aug 2024
Reputation:
652
(23-04-2026, 09:11 AM)Ajayk Wrote: Good morning me update kosam eduru chustu unam
Coming
•
Posts: 898
Threads: 13
Likes Received: 7,038 in 832 posts
Likes Given: 1,545
Joined: Aug 2024
Reputation:
652
23-04-2026, 09:26 AM
(This post was last modified: 23-04-2026, 09:27 AM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
Part - 61
భానుమతి తల మీద ఒకటి కొట్టి ఏమిటే పొద్దుటినుంచి పైత్యపువాగుడు వాగుతున్నావు ఏదైనా పిడకల వచ్చిందా.. భానుమతి వైపు చూసి సూర్యను చూసిన ప్లేస్ ని చూస్తుంది.
సూర్య అక్కడ కూర్చుని కళ్ళు ఎగరేస్తూ ఉంటాడు. మళ్ళీ భానుమతి వైపు చూస్తుంది. ఏమిటే ఆ చూపు.. సూర్య కూర్చున్న చోటు వైపు చూస్తే అక్కడ ఎవరూ కనిపించరు..
ఆ... అని అరుస్తూ.. నాకు బ్రేక్ ఫాస్ట్ పెట్టు.. నేను కాలేజ్ కి వెళ్ళాలి అని అరుస్తూ బయటకి వస్తుంది. ఏమైంది దీనికి...
ఈరోజు దిష్టి తీసి పంపించాలి అని అక్కడ కూర్చోబెట్టి దిష్టి తీస్తుంది.
అమ్మ నేను బాగానే ఉన్నాను. ఏం బాగుండడం పొద్దున్నే లేపినప్పుడు ఒక రకమైన వాగుడు.. రెడీ అవుతుంటే ఇంకొక రకమైన వాగుడు...
టిఫిన్ చేసి టైం అవుతుందని బయటికి వస్తుంది. అక్కడ సూర్య వెయిట్ చేస్తూ ఉంటాడు. దేవా సార్ కాదు.. పొద్దున్నుంచి ఇలాగే కన్ఫ్యూజ్ అవుతున్నాను. సార్ ఇంకా రాలేదు అని ఎదురు చూస్తూ ఉంటుంది.
సూర్య చెయ్యి ఊపిన పట్టించుకోదు.. క్యూటి కి ఏమైంది.. నిన్న బైక్ మీద విచిత్ర విన్యాసాలు చేసింది..ఇప్పుడు పిలుస్తున్న పలకడం లేదు అని దగ్గరికి వెళ్లి బైక్ హార్న్ కొడతాడు.
ఉలుక్కుబడి చూస్తూ సార్ మీరు నిజంగానే వచ్చారా.. ఆ డౌట్ ఎందుకు వచ్చింది అని చేతులు కట్టుకుని అడుగుతాడు.
చూపుడువేలుతో సూర్య భుజం మీద పొడుస్తూ అవును అవును నిజంగానే వచ్చారు. ఏమైంది నీకు... నాకా.. నాకేం అవుతుంది సార్.
పదండి కాలేజ్ టైం అయిపోతుంది అని బైక్ పైన కూర్చుంటుంది..మళ్ళీ డౌటుగా బైక్ ని గట్టిగా పట్టుకుని చుట్టూ చూస్తూ ఉంటుంది.
నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు.. నేను బైక్ మీద కూర్చున్నానా లేక డ్రీమ్ లో ఉన్నానా అని చెక్ చేసుకుంటున్నాను.
వచ్చి రాని నవ్వుతో వాట్ అని అడుగుతాడు. అవును సార్ పొద్దున్నుంచి ఏంటో డ్రీమ్స్ లాగా వస్తుంది. ఉన్నట్టుంటుంది... లేనట్టు ఉంటుంది. లేదు అనుకుంటే ఉంటుంది. ఉంది అనుకుంటే ఉండడం లేదు...
ఎందుకు సార్.. అది నీకే తెలియాలి అని బైక్స్ స్టార్ట్ చేస్తాడు..
కాలేజ్ కి వెళ్ళగానే బైక్ దిగి కన్ఫ్యూషన్ గా వెళుతున్న విశిని పిలిచి చాక్లెట్ ఇస్తాడు. దేనికి సార్...చాక్లెట్ తింటే మైండ్ కొంచెం రిఫ్రెష్ అవుతుందంట..
నిన్నటి నుంచి ఏదో కన్ఫ్యూషన్ లో ఉన్నావు కదా.. చాక్లెట్ తింటూ ఆలోచించు. నీ కన్ఫ్యూషన్స్ కి క్లారిటీ రావచ్చు.. బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు. చాక్లెట్ పట్టుకుని సూర్య వైపు చూస్తూ ఉంటుంది.
హాయ్ అన్న వాయిస్ వినపడి చూస్తుంది. అక్కడ గౌతమ్ రెడ్ రోజెస్ బొకే పట్టుకొని ఉంటాడు. నువ్వా...ఇంకెవరు అనుకున్నావు.. వెళుతున్న లెక్చరర్ దేవా అనుకుంటున్నావా...
దేవ సార్ గురించి ఎందుకు గాని.. దేనికి పిలిచావు.. ఐ యాం సారీ.. నేను నీకు దూరమైతే గానీ నీ విలువ నాకు తెలియలేదు.
ప్రతి నిమిషం నిన్ను చాలా మిస్ అవుతున్నాను. విశి చేతులు కట్టుకుని చూస్తూ ఉంటుంది..నేను నిజమే చెబుతున్నాను నన్ను నమ్ము అని గొంతు దగ్గర పట్టుకుంటాడు.
అసలు మేటర్ ఏంటో చెప్పు.. నాకు క్లాస్ టైం అవుతుంది. నా మాటలు నమ్మడం లేదా.. సరే మనం ఈవినింగ్ ఫ్రీగా మాట్లాడుకుందాం.
నువ్వు వర్క్ చేసే రెస్టారెంట్ దగ్గరికి వచ్చేస్తాను సరేనా.. సారీ నేను అక్కడ వర్క్ చేయడం మానేశాను.. అవునా మరి ఎక్కడ జాబ్ చేస్తున్నావు.
అవన్నీ నీకు అనవసరం. నువ్వు ఏది చెప్పాలనుకుంటున్నావో క్లియర్‌గా టూ మినిట్స్ లో చెప్పు. నాకు క్లాస్ టైం అవుతుంది అని ఖరాఖండిగా చెప్పేస్తుంది.
ఏంటి విశిష్ట ఎప్పుడు ఎంత సున్నితంగా మాట్లాడేదానివి.. నువ్వు ఈ సారీ ఇంత హార్షగా మాట్లాడుతున్నావు... కొంచెం డబ్బులు చూసుకునేటప్పటికీ నీలో కూడా పొగరు పెరిగినట్టుంది ..
దాన్ని పొగరు అనరు. కాన్ఫిడెన్స్ అంటారు. అది ఏమిటో నీలాంటి వాళ్ళకి తెలియదు కానీ మళ్ళీ ఇదే టాపిక్ గురించి నా దగ్గరికి వచ్చేటట్టు అయితే రావడం మానేశాయ్.. ఈసారి ఇంత సున్నితంగా అయితే చెప్పను.
వెళుతున్న విశి ని చూస్తూ చేతిలో ఉన్న బొకేని విసిరేస్తాడు.. బొకే విసిరేయడం వల్ల లాభం ఏముంది మిస్టర్..
గౌతమ్ చూస్తూ మీరు.. ఐ యాం సరళ.. లెక్చరర్ అని చెబుతుంది. మీకేంటి విశిష్ట మీద అంత స్పెషల్ ఫోకస్.. అది ఫోకస్ కాదు రివెంజ్ ప్రోగ్రాం.
కొంచెం క్లియర్ గా చెబుతారా.. మీరు ఈవినింగ్ కాలేజ్ అయిపోయే టైంకి రెస్టారెంట్ కి రండి. అక్కడ కూర్చుని మాట్లాడుకుందాం...
ఓకే.. అని వెళ్ళిపోతాడు. సరళ కన్నింగ్ గా నవ్వుకుంటూ ఇప్పుడు చిక్కావు విశిష్ట. దేవా ని నా నుంచి దూరం చేస్తావా... ఇప్పుడు నిన్ను దేవా ఎలా కాపాడుతాడో నేను చూస్తాను..
విశి క్లాస్ కి వెళ్లి భవ్య కోసం వెతుకుతూ ఉంటుంది. భవ్య అప్పుడే క్లాస్ లోకి వచ్చి హాయ్ విశి అంటే...ఇంత లేటుగానే వచ్చేది. నీకోసం ఎప్పటినుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా..
వాచ్ వైపు చూసుకుని రోజు వచ్చినట్టే వచ్చాను కదా.. అవన్నీ తర్వాత నీతో చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి.
అంత అర్జంట.. చాలా.. క్లాస్ పోయినా పర్వాలేదు కానీ ముందు ఈ విషయం మాట్లాడాలి. అమ్మో అయితే చాలా సీరియస్ మేటర్ అన్నమాట.. చెప్పు.. ఇక్కడ వద్దు మనిద్దరం గ్రౌండ్ లోకి వెళ్ళదాం.
గ్రౌండ్లో భవ్య బెంచ్ పైన కూర్చుంటే విశి కాలుగాలిన పిల్లలాగా తిరుగుతూ ఉంటుంది. ఇప్పటికీ మనం వచ్చి అరగంట అయింది. ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
అబ్బా నువ్వు ఆగు భవ్య.. ఎలా చెప్పాలో తెలియక చాలా టెన్షన్ గా ఉంది.. నా దగ్గర కూడా టెన్షన్ పడుతున్నావా..
చెబితే నువ్వు ఎలాగా రియాక్ట్ అవుతావో అని భయం కానీ నీతో చెప్పకుండా నేను ఉండలేను కదా.. నేను ఎలాగా రియాక్ట్ అవ్వని గాని ఏంటో చెప్పు...
భవ్య పక్కన కూర్చుని ఈరోజు మార్నింగ్.. హ.. మార్నింగ్.. దేవా సార్.. హ.. దేవా సార్.. అదే దేవసార్ ఇదిగో నసగకుండా మ్యాటర్ చెప్పు.. లేకపోతే నేను వెళ్ళిపోతాను..
వద్దు... వద్దు వెళ్ళద్దు చెబుతాను అని చేయి పట్టుకుంటుంది. సరే చెప్పు.. ఈరోజు దేవా సార్ నా బెడ్ రూమ్ లోకి వచ్చారు.
వాట్ అని అరుస్తుంది. ష్.. మెల్లిగా మాట్లాడు.. వచ్చి ఏం చేశారే అని మెల్లిగా అడుగుతుంది. అది అంటే.. అబ్బా టెన్షన్ పెట్టకుండా మ్యాటర్ చెప్పవే..
అది అని గోళ్లు కొరకుతూ ఉంటే...భవ్య మెల్లిగా దేవా కి ఫోన్ కనెక్ట్ చేస్తుంది. ఈ టైమ్ లో ఏమిటి అని లిఫ్ట్ చేసి హలో అనే లోపు విశి గొంతు వినపడుతుంది...
ఎయిర్ పొడ్స్ పెట్టుకునే సైలెంట్ గా ఏమీ తెలియనట్టుగా వర్క్ చేసుకుంటూ ఉంటాడు.
చెప్పవే.. దేవా సార్ నీ బెడ్ రూమ్ లోనికి వచ్చి ఏం చేశారు. ఆ మాట వినగానే ఇక్కడ సూర్య ఉలిక్కిపడతాడు. నేనెప్పుడూ విశి బెడ్రూంలోనికి వెళ్లాను.
ఈరోజు మార్నింగ్ వచ్చి నిద్ర లేపారు.. తర్వాత చూస్తే మాయమైపోయారు.. తర్వాత నేను రెడీ అవుతున్నప్పుడు కూడా వచ్చి కాంప్లిమెంట్ ఇచ్చారు.
అమ్మ వచ్చేటప్పటికి మళ్ళీ మాయమైపోయారు అని రెండు చేతులు తిప్పుతూ చెబుతుంది. ఆ మాటలకి భవ్య సీరియస్‌గా చూస్తే అక్కడ సూర్య నవ్వుకుంటూ ఉంటాడు.
ఎందుకే అలా చూస్తున్నావు. నీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను. వచ్చిన మనిషి ఎక్కడికి మాయమైపోతారు. అదే కదా నా అనుమానం కూడా...
ఎలా మాయమైపోయారో అర్థం కాలేదు. తర్వాత చూస్తే కింద పార్కింగ్ ప్లేస్ లో ఉన్నారు. రూమ్ కి వచ్చినప్పుడు ఒక షర్ట్ వేసుకున్నారు.
కింద బైక్ దగ్గర ఉన్నప్పుడు ఇంకొక షర్టు వేసుకున్నారు. ఎలాగ అని బుగ్గ మీద టాప్ చేసుకుంటూ అడుగుతుంది. భవ్య తల పట్టుకుని నీకు వచ్చింది డ్రీమ్..
లేదు.. నా మంచం మీద క్లియర్ గా కూర్చున్నారు. నేను అప్పుడు కాన్షియస్లోనే ఉన్నాను...
మెలకువగా ఉండి కలగన్నట్టున్నావు లేకపోతే వెంటనే షర్ట్ ఎలా మార్చుకుంటారు..అమ్మ వచ్చేటప్పటికి ఎలా మాయమైపోతారు.
అంటే ఇదంతా డ్రీమా.. కాకా నిజమనుకుంటున్నావా.. విశి డల్ అయిపోతుంది.. ఏమైంది.. నేను నిజంగానే సార్ వచ్చారనుకున్నాను.
సార్ రావాలి అని నువ్వు కోరుకున్నావా... అది అని తలకిందకి దించుతుంది. నా విశి ఎప్పుడు తప్పు చేయదు. నీ మనసులో ఏముందో క్లియర్ గా నాకు చెప్పు..
ఏమో తెలియడం లేదు. దేవ సార్ పక్కన ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ గౌతమ్ గురించి తెలిసిన తర్వాత.. ఆ ఇడియట్ గురించి ఎప్పుడైనా నువ్వు ఇలా ఫీల్ అయ్యావా..
విశి ఏం చెబుతుందా అని సూర్యా అక్కడ పెన్ టాప్ చేస్తూ వింటూ ఉంటాడు..
మాట్లాడవే.. గౌతమ్ గురించి నేను ఎప్పుడూ ఇలా ఫీల్ అయింది లేదు. మేమిద్దరం ఎప్పుడు మాట్లాడుకున్నా ప్రొఫెషనల్ గానే మాట్లాడుకున్నాము.
ఇంక వేరే మ్యాటర్ లేదు. ఆఖరికి ఆ రోజు స్టాల్ దగ్గర వేరే అమ్మాయితో ఉన్న నాకు పెయిన్ అనిపించలేదు. జస్ట్ కోపం వచ్చింది..
కాని.. దేవా సార్ పక్కన ఎవరు ఉన్నా ఒప్పుకోలేకపోతున్నాను. ఇది ఏమిటి అన్నది నాకు తెలియడం లేదు...
ఆ మాట వినగానే సూర్య గాలిలో తేలిపోతూఉంటాడు.. ముఖం వెలిగిపోతూ ఉంటుంది. శ్రీకర్ పక్కనే కూర్చుని సూర్యనే చూస్తూ ఉంటాడు...
దానినే ప్రేమ అంటారు. ప్రేమ నా.. హ.. ప్రేమ ఉన్నచోటే ఇదిగో ఇలా పోసివేనెస్.. కంగారు... మన ఎదుట మనిషి లేకపోయినా ఉన్నట్టుగా ఏవేవో పిచ్చి పనులు చేస్తారు.
నువ్వు ప్రేమలో పడలేదు కదా నీకు ఎలా తెలుసు.. నేను లవ్ మూవీస్ చాలా చూశాను. అందులో ఇలాగే ఉంటుంది. అవునా.. వెంటనే దేవా సార్ కి ప్రపోజ్ చెయ్యి..
విశి సమాధానం......
Posts: 898
Threads: 13
Likes Received: 7,038 in 832 posts
Likes Given: 1,545
Joined: Aug 2024
Reputation:
652
Part - 62
వెంటనే దేవాసార్ కి ప్రపోజ్ చెయ్యి. ఆ మాటకి విశి మౌనం వహిస్తే.. ఏం చెబుతుందా అని సూర్య సైలెంట్ గా ఉంటాడు.
ఆ మౌనం సూర్య హార్ట్ బీట్ పెంచేస్తూ ఉంటుంది. ఏంటే మాట్లాడవు. ఏమని మాట్లాడాలి.. నువ్వు అన్నట్టుగా నాది ప్రేమే కావచ్చు కానీ దేవాసార్కి నా మీద ఉన్నది జాలేమో..
జాలా.. అలా ఎందుకు అనిపించింది. ఆ మాటకి సూర్య తల పట్టుకుంటాడు. నేను ఉన్న పరిస్థితి చూసి జాలిపడి నాకు సహాయం చేస్తున్నారు.
ఆ సహాయాన్ని నేను ప్రేమగా అనుకుని వెళితే తప్పుగా అనుకుంటారేమో.. అంత మంచివ్యక్తిని దూరం చేసుకోవడం నాకు ఇష్టం లేదు.
మాతల్లె ఎంత గొప్పగా ఆలోచిస్తున్నావు. ఇంత గొప్ప గొప్పగా ఆలోచించే టాలెంట్ నీకు తప్ప ఎవ్వరికి ఉండదేమో...
భవ్య అని పిలిస్తే.. లేకపోతే ఏమిటే.. స్నేహానికి, జాలికి, ప్రేమకి కూడా తెలియదు. నువ్వు అనుకున్నట్టేగా జాలే అయితే.. కనపడినప్పుడు సింపతి చూపిస్తారు లేదా క్లాసులో హెల్ప్ చేయొచ్చు.
స్నేహం అయితే ఇంకొంచెం ముందుకు వెళతారు. జాబ్ చూసి పెట్టొచ్చు. ఇది ప్రేమ కాబట్టే నీకు ప్రతిదీ నేర్పిస్తున్నారు. అండగా నిలబడుతున్నారు.
దేవా సార్ తమ్ముణ్ణి నీకు తోడుగా ఉంచారు అని ఆయాస పడుతూ బ్రేక్ తీసుకుంటుంది... విశి గబగబా వాటర్ బాటిల్ ఇస్తుంది.
అవి తాగి ఇప్పుడు చెప్పు. అది ప్రేమ కాదా...నాకేమీ అర్థం కావడం లేదు. ఒసేయ్ మొద్దు అది ప్రేమ కాబట్టే నిన్ను వైభవ్ బాబి అని పిలుస్తున్నాడు. శ్రీకర్ సార్ చెల్లి అంటున్నారు.
ఇంకా అర్థం కాకపోతే ఎలాగే.. ఏమో నాకు అంత కన్ఫ్యూషన్ గా భయంగా ఉంది. సార్ నన్ను తప్పుగా అనుకుంటే మాత్రం నేను తట్టుకోలేను.
సార్ చూపు ల్లో ఒక నిర్లక్ష్యం చూసిన భరించలేను అనిపిస్తుంది. ప్రేమించాను అని చెప్పడం కన్నా ఇ లా స్నేహంగా ఉండి పోవడమే మంచిది.
ఎప్పటిదాకా ఉంటావు.. ముసలిదానివి అయ్యేదాకా.. లేకపోతే దేవసార్ కి వేరే వాళ్లతో పెళ్లి అయ్యేవరకా.. భవ్య అని కంగారు పడితే...
నేను చెబుతుంది నిజమే కదా.. ఒకవేళ దేవా సార్ కి పెళ్లి అయిపోయింది అనుకో.. లేడి దేవదాసులాగా నీ చున్ని నీ శాలువ లాగా వేసుకుని ఒక కోక్ చేతిలో పెట్టుకొని.. కుక్కలు అంటే భయమే కదా ఒక పిల్లి పిల్లని సంకనేసుకుని తిరుగుతావా...
నీకు అంతా వెటకారం అయిపోయింది. వెటకారం కాదే నిజం చెబుతున్నాను. ప్రేమించడం తప్పు కాదు అది కరెక్ట్ టైం లో చెప్పకపోవడం తప్పు . నీ ఇష్టం.. ఒక ఫ్రెండ్ గా నేను చెప్పవలసిందిగా చెప్పాను.
సరే ఎంతసేపు కూర్చున్నా ఈ డిస్కషన్ అవ్వదు కానీ క్లాస్ కి వెళదామని లాక్కువెళ్తుంది సూర్య అదంతా విని టేబుల్ పైన టాప్ చేస్తూ ఉంటాడు.
శ్రీకర్.. ఏమైంది బావ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. నీ చెల్లి మనసులో ప్రేమ మొలకలు మొలకెత్తాయి కానీ భయంతో ఆగిపోతుంది.
ఏమంటున్నావు.. భవ్య ఫోన్లో వినిపించిన సంగతి మొత్తం చెబుతాడు. ఇప్పుడు ఏం చేస్తావు బావ..చూద్దాం ఏం చేస్తుందో. బట్ ఈ ఆట కూడా బాగుంది.
నీకే బానే చెబుతావు. పాపం నా చెల్లి నీకు చెబితే ఏమవుతుందో.. చెప్పకపోతే ఎవరినైనా తగులుకుంటావో అని టెన్షన్ పడుతూ ఉంటుంది.
పడని.. ఎంత టెన్షన్ పడితే అంత ప్రేమ పెరుగుతుంది. నేను ఇన్ని సంవత్సరాలు ఎదురు చూశాను. నీ చెల్లిని కొన్ని రోజులు టెన్షన్ పడనివ్వవా.. నువ్వు ఎదురు చూసింది వేరు.. నా చెల్లి పడే టెన్షన్ వేరు...
సాయంత్రం కాలేజ్ అయిన తర్వాత గ్రౌండ్ కి వెళతారు. విశి సూర్యని చూడలేక దిక్కులు చూస్తూ ఉంటే... ఆ చూపులకు అర్ధం తెలిసిన సూర్య...
నవ్వుకుంటూ ఏమీ తెలియనట్టుగా.. డ్రైవింగ్ స్టార్ట్ చేస్తావా.. అని అడిగితే.. ఒకేసార్ అంటుంది. నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వు ఎక్కడో చూస్తున్నావు. ఏమైంది... ఏమీ అవ్వలేదు సార్.. డ్రైవింగ్ మొదలుపెడదాం అని తడబాటుగా చెబుతుంది..
డ్రైవింగ్ స్టార్ట్ చేస్తుంది కానీ ఆలోచనలో డ్రైవింగ్ తడబడుతుంది. సూర్య ఆగు అని వచ్చి వెనకాల కూర్చుని ఎప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోకస్ మొత్తం డ్రైవింగ్ మీదే ఉండాలి..
అంతేగాని మన ఆలోచనలు ఒకచోట.. మనం ఒకచోట ఉంటే ఎలాగా అని హ్యాండ్ మీద ఉన్న విశి చేతులు మీద చేతులు వేసి మెల్లిగా రైస్ చేస్తాడు..
ఆ స్పర్సకే విశి గుండె అదురుతుంది బుగ్గలు కందిపోతాయి..కానీ ఆ సౌండ్ మధ్యలో కూడా ఆమె గుండె మాత్రం సూర్య స్వరంను మాత్రమే వింటోంది.
స్టీరింగ్ తడబడుతుంది.
సూర్య వెంటనే... ఆగు విశి…
స్కూటీ ఆపి చూస్తోంది. ఏమైంది నీకు... చాలా కన్ఫ్యూషన్ డ్రైవింగ్ చేస్తున్నావు.. బి కేర్‌ఫుల్..
ఆ దగ్గర తాకిన వేడి గాలి, అతని ఉచ్ఛ్వాసం విశి మెడ వెనుక తగిలి గుండెను వణికిస్తుంది.
ఫోకస్… డ్రైవింగ్ అంటే కేవలం హ్యాండిల్ పట్టడం కాదు. మనసు కూడా స్టేబుల్‌గా ఉండాలి.
అని చెప్పుతూ ఆమె చేతుల మీద తన చేతులు మళ్ళీ వేసి.. ఇలా… మెల్లిగా రైస్ చేయి…
అతని చేతుల స్పర్శ , స్వరం, దగ్గర తాకిన ఆ సుగంధం..
విశి కళ్లలో ప్రపంచం బ్లర్ అయిపోతుంది.
ఆలోచనలు ఒక్కటే..
‘ఇదేనా ప్రేమ… ఇంత దగ్గరగా ఉన్నా, చెప్పలేకపోవడం?’
స్కూటీ ముందుకు కదులుతుంది, కానీ ఆమె మనసు మాత్రం ఆ నిమిషంలో ఆగిపోతుంది.
సూర్య కాస్త దగ్గరగా వాలి...
గుడ్… ఇదే కరెక్ట్ బ్యాలెన్స్. డ్రైవ్ కంట్రోల్లో ఉంది. నేనెక్కడ డ్రైవ్ చేశాను చేసిందంతా మీరే కదా అని మనసులో అనుకుంటూ ఉంటుంది..
ఆ మాటల్లోనూ, విశి కి తనలోని టెన్షన్, ఆకర్షణ, ఆనందం.. ఒక్కేసారి కలిసిన గందరగోళం.
సూర్య డ్రైవింగ్ ప్రాక్టీస్ చేయిస్తున్నట్టు ఉన్నా,
అతనికి ప్రతి సెకను విశి స్పందనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కానీ ఏమీ చెప్పడు…
సైలెంట్‌గా ఆమె మెల్లగా నేర్చుకుంటూ, తడబడుతూ, తడబడి నవ్వుతుంటే,
అతని ముఖం మీద చిన్న స్మైల్ మాత్రమే..
బాగుంది… ఇలానే కొనసాగించు.
విశి మౌనంగా తల ఊపుతుంది.
స్కూటీ ముందుకు కదులుతుంది…
ముందు రోడ్ కనిపించినా, ఆమె చూపులు మాత్రం సూర్య ప్రతిబింబం మీదే నిలబడి ఉంటాయి.
ఇంత దగ్గరగా ఉన్నా… ఏం చెప్పలేకపోతున్నాను.
ఆయన స్వరం విన్న ప్రతిసారి హృదయం ఒక్కసారిగా గడగడలాడుతుంది.
నేను డ్రైవింగ్ నేర్చుకుంటున్నానా లేక ఆయనని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నానా?
ఆలోచనలతో చేతులు కాస్త తడబడ్డాయి.
సూర్య స్వరం మళ్ళీ —
ఫోకస్ విశి…
ఓకే సార్… అని తల ఊపుతుంది కానీ మనసు మాత్రం సూర్య వైపుకి తిప్పుకుంటోంది.
ఇది ప్రేమా? లేక మనసు పుట్టిన కొత్త భావమా?
ఎందుకింత భయం… దేవా సార్ చూసి ఏం అనుకుంటారో అన్న టెన్షనా…
కానీ దేవా సార్ ఉన్నంతసేపు నా చుట్టూ సమయం ఆగినట్టుంటుంది.”
స్కూటీని పార్క్ చేసిన తర్వాత కాసేపు సైలెంట్‌గా కూర్చుంది.
విశి కి కాసేపు ఏకాంతం ఇవ్వాలి అనుకుని నేను 5 మినిట్స్ లో వస్తాను.. వెయిట్ చెయ్ అని చెప్పి పక్కకు వెళతాడు..
చేతుల మీద ఇంకా సూర్య స్పర్శ మిగిలే ఉంది.
ఒక్క క్షణం కూడా ఉండలేము ఏమో ఒకరిని మరిచిపోలేకపోవడానికి…
తన చేతులను చూస్తూ చిన్నగా నవ్వుకుంది...
అదే నవ్వులో ప్రేమ మొదటి చిహ్నం ఉంది..
దూరం నుంచి సూర్య విశి నే చూస్తూ ఉంటాడు
అదే తడబాటు సూర్య మనసులో మొదటి అలజడి అవుతుంది.
చూపు చాలు… ఏమీ మాట్లాడక్కర్లేదు.
ఆమె తడబాటు, చేతులు స్టీరింగ్ మీద కుదుపు,
నా పేరు విన్నప్పుడల్లా కంట్లో పడే ఆ చిన్న మెరుపు..
ఇవన్నీ చెబుతున్నాయి నీ మనసు ఏ దిశలో వెళ్తుందో.
విశి చేతులు చూసుకుంటూ డ్రైవింగ్ చేసిన సమయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది..
విశి చేతులు తడబడగానే ముందుకు వాలి, నెమ్మదిగా సర్దిచెప్పాడు...
“ఇలా కాదు విశి… మెల్లిగా, స్టేడీ గా…”
ఆ మాటల్లో స్పష్టమైన శిక్షణ ఉంది,
కానీ స్వరంలో మాత్రం ప్రేమ దాచిన చలనం.
విశి ని అలా చూసిన సూర్యకి...
నవ్వు వస్తుంది… కానీ చెప్పలేడు.
క్యూటీ ఎందుకు కంగారు పడుతున్నావు... మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు .
నీ కంగారు చూసి నేను అక్కడ ఓపెన్ అవుతానేమో అని..
నేనూ బిజీగా ఉన్నట్టు నటిస్తున్నాను..
నిజానికి ప్రతి సెకను నీ స్పందనలను చదువుతూనే ఉన్నాను.
డ్రైవింగ్ టైంలో జరిగిన సీన్ సూర్య గుర్తు చేసుకుంటూ ఉంటాడు..
స్కూటీ కాస్త ముందుకు కదలగానే గాలి ఆమె జుట్టు తీసుకుని సూర్య చెంపకు తగిలింది.
ఒక్క క్షణం సూర్య చూపు దానిపైనే ఆగిపోయింది..
తనలోనే నవ్వుకున్నాడు.
మనసులో ఏమి జరుగుతుందో నీకు తెలియదు…
నేనూ తెలీకుండా ఎప్పుడో నీ మనసు పక్కన నిలబడ్డాను.
నువ్వు తడబడుతూ “అవును సార్…” అన్నప్పుడు,
నా లోపల కదిలింది ఓ సైలెంట్ ఫీలింగ్...
ఈ ‘సార్’ వెనక ఉన్న ఆ మౌనం ఏదో ఒక రోజు ‘సూర్య’గా మారుతుందేమో.
విశి సూర్యాని తలుచుకుంటూ స్మైల్ చేస్తే...ఆ స్మైల్ చూసి సూర్య స్మైల్ ఇస్తాడు
కానీ ఆ స్మైల్ వెనక… అదుపులో పెట్టుకున్న ప్రేమ, ఎదురుచూపు, ఆశ… అన్నీ ఉన్నాయి.
సూర్య వెళ్ళిన తర్వాత — గ్రౌండ్ చివర సాయంత్రపు వెలుతురు తేలిపోయినట్టుగా అనిపిస్తుంది.
స్కూటీ మీద విశి ఇంకా కూర్చునే ఉంటుంది.
గాలి కదిలినా, ఆమె మాత్రం కదలదు.
చేతులు స్టీరింగ్ మీదే — అక్కడే ఇంకా సూర్య చేతుల వేడి మిగిలి ఉన్నట్టుంది.
ఇదేనా ఆ స్పర్శ… క్షణం మాత్రమే కానీ గుండె అంతా తాకిపోయింది.
ఆయన చెప్పిన మాటలన్నీ డ్రైవింగ్ పాఠాల్లా ఉన్నా,
ప్రతి పాఠం వెనక నాకు అర్ధమయ్యేది వేరే.
‘ఫోకస్ చేయ్’ అన్నప్పుడు దేవా సార్ రోడ్డును కాదు,
నా మనసునే గమనిస్తున్నట్టున్నారు..
విశి కళ్ళు మూసుకుంటుంది.
సూర్య స్వరం, ఆ నవ్వు, జుట్టు తాకిన క్షణం — అన్నీ ఒక్కసారిగా తిరిగి వినిపిస్తాయి.
తన గుండె మీద చేతి వేసి స్వల్పంగా నవ్వుకుంటుంది.
మాటల్లో చెప్పలేని అనుభూతి ఇది…
ఎవరో మనని సైలెంట్‌గా గమనిస్తున్నారనే భద్రత,
కానీ అదే సమయంలో దాచుకోవలసిన భయం…
దూరంలో సూర్య వెళ్తున్న నీడ కనిపిస్తుంది.
విశి చూపు దానిపై ఆగి, నెమ్మదిగా అనుకుంటుంది..
ఇదేనా ప్రేమ మొదలయ్యే క్షణం…
ప్రేమ మొదలయ్యిందా ??
కథ కొనసాగుతుంది...
|