18-04-2026, 10:15 AM
Excellent update
|
బృందావనం
|
|
19-04-2026, 10:49 AM
Part - 97
ఇద్దరూ గెస్ట్ హౌస్ కి చేరుకోగానే రుద్ర కార్ పార్క్ చేసి దిగుతాడు. శాంభవి వైపుకు వచ్చి డోర్ తీసి చేయ్యి అందిస్తాడు. చిరునవ్వుతో భర్త చేతిలో చేయి వేసి దిగుతుంది.
లోపలికి వెళుతుంటే శాంభవి అడుగలు తడబడుతూ ఉంటాయి. ఏదో బిడియం అడ్డుపడుతూ అడుగులు పడను అని మొరాయిస్తూ ఉండే రుద్ర నేనున్నాను కదా అని భుజం చుట్టూ చెయ్యి వేసి తీసుకువెళతాడు. ఒక గదిలోకి తీసుకువెళ్లి వదిలి నీకు కావలసినవన్నీ ఇక్కడే ఉన్నాయి రెడీ అవ్వు. ఊ అని తల ఊపుతుంది. ఎవరైనా శోభనం అంటే అందరూ కలిసి రెడీ చేసి గుసగుసలు చెబుతారు. మన శోభనం వెరైటీ కదా... చిరు అలకగా చూస్తుంది. ఈ అలకలన్నీ తర్వాత మేడం.. వెళ్లి రెడీ అవ్వు అని రుద్ర బయటికి వచ్చేస్తాడు. అక్కడ పాలమీగడని మించిన తెలుపుతో.. ముట్టుకుంటే జారిపోయేలాగా తెల్లటి చీర ఉంటుంది. జరగబోయేది ఊహించుకుని సిగ్గుపడుతూనే చీర కట్టుకుంటుంది. పొడుగు జడలో మల్లెలు తురిమి ఎరుపు మట్టి గాజులు వేసుకుంటుంది. నడుముకి సన్నటి చైన్ పెడుతుంది. అద్దంలో చూసుకుని శోభనపు పెళ్లికూతురు ఇంత అందంగా ఉంటుందా అని ఆశ్చర్యపోతూ పైనుంచి కిందకి చూసుకుంటుంది. తలుపు శబ్దం వినిపించి మెల్లిగా తలుపు తీస్తుంది. రతిదేవినే మరిపిస్తున్నా అందాన్ని వలకబోస్తూన్న మరదలు పిల్లని చూసి బావగారు మనస్సు అక్కడే జారిపోతుంది.. ఎంతసేపైనా రుద్ర అలాగే చూస్తూ ఉంటే....మెల్లిగా గాజుల శబ్దం చేస్తుంది. రుద్ర తేరుకొని తల వెనకాల రబ్ చేసుకుంటూ ఒరేయ్ రుద్ర ఏమైందిరా.. అప్పుడే చొంగా కార్చేస్తున్నావ్.. శాంభవిని రెండు చేతులతో ఎత్తుకుంటాడు. పడిపోతానేమో అని కంగారుగా మెడ చుట్టూ చేతులు వేస్తుంది. ఏంటి పాప పడిపోతావేమో అని భయపడుతున్నావా.. నేను ఉండగా అది జరగని పని.. ఆ విషయం నాకు తెలుసు బావ అంటుంది. ఏమన్నావ్ బంగారం...మీరు అడిగిన పిలుపే. ఇంకో క్కొక్కసారి పిలవవే ప్లీజ్ ప్లీజ్.. బా.. వ.. బాగున్నానా.. ఈ కిక్కు చాలే.. రాత్రంతా జాగారం చేయడానికి... గదిలోకి తీసుకు వెళ్లి తలుపు వేస్తాడు. గది మొత్తం పువ్వులతో గమ్మత్తయిన వాసనతో మత్తు ఎక్కిస్తూ ఉంటుంది. మల్లెపూల పరిమళం, గదిలో కాంతులీనుతున్న దీపాలు, మంచం మీద తెల్లని చీర పరచి పక్కనే వెండి గ్లాసులో పాలు–పాయసం. గది మొత్తం ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే.. నచ్చిందా అని నడుం చుట్టూ చేతులు వేసి భుజం పైన గెడ్డం పెట్టి అడుగుతాడు. ఇదంతా ఎప్పుడు చేసావు బావ.. అబ్బా... ఈ పిలుపులో ఎంత గమ్మత్తుందే. నువ్వు బావ బావ అని పిలిచినప్పుడల్లా నీ పాదాల దగ్గర అలా పడి ఉంటాను. నువ్వు ఉండేది నాలో బావ అలా అనకు. ఇంతకీ గది నచ్చిందో లేదో చెప్పలేదు. నీ మనసు లాగానే ఉంది. అంటే అర్థం కాకుండానా... నీ మనసుని అర్థం చేసుకున్న వాళ్ళకి బృందావనం... అర్థం చేసుకోకపోతే కురుక్షేత్రం. అబ్బో నన్ను చదివేసినట్టున్నావు కదా... చదువుతూ ఉన్నాను. కానీ చదవాల్సింది నేనే కదా... చిన్నప్పుడు నుంచి నీతో ఆడుకోవాలి అనుకున్న ఆటలన్నీ ఇప్పుడు ఆడతాను బంగారం. ఎన్నో రోజులు ఎదురు చూశాను. మన మధ్యన ఉన్న బంధం పిలుపులోకి రావాలి అని.. ఇన్నాళ్లూ తమ మధ్య ఒక మరదలు–బావ బంధంగా ఉండేది. కానీ ఇప్పుడు అదే ప్రేమ, అదే బంధం దాంపత్యంగా మారిపోతోంది అన్న ఆలోచనే మనసంతా గుబులు పుట్టిస్తుంది పాప... నిన్ను ఇలా చూస్తూ ఉంటే.. కొంచెం సంతోషం.. కొంచెం ఆరటం. ఎప్పటినుంచో అడిగితే ఇప్పటికే బావ అని పిలిచావు. ఆ పిలుపు మన రిటైర్మెంట్ టైం లో కూడా పిలవాలి పాప. అప్పుడు మన పిల్లలు మనల్ని చూసి నవ్వుతారు. నవ్వరు... మనల్ని చూసి నేర్చుకుని లైఫ్ పార్ట్నర్ తో అంతే అందంగా ఉంటారు. నువ్వు నాకు ఎప్పటికీ.. రాధకి కృష్ణుడు లాగానే... నా ప్రేమ మొత్తం నీదే బావ. ఈ పిలుపు నా జీవితాంతం ఉంటుంది. మన పరిచయం తర్వాత ప్రేమ ఆ తర్వాత కళ్యాణం అప్పుడే కదా బావ అని నాకు తెలిసేలాగా చేసావు. కాబట్టి ఎప్పటికీ నువ్వు నాకు ప్రియమైన బావవే.. అంటే ప్రియుడివే కదా.. శాంభవిని మెల్లిగా నడిపించుకుంటూ తీసుకు వెళ్లి మంచం పైన పడుకోబెడతాడు. రుద్రని చూడలేక శాంభవి సిగ్గుతో కళ్ళు మూసుకుంటుంది. నకశిఖ పర్యాంతం చూస్తూ ఉంటాడు. పాపిట్లో సింధూరం.. నుదుటన స్టిక్కర్... కింద కుంకం.. మెడలో సూత్రాలు నల్లపూసలు.. హృదయ శిఖరాన్ని కప్పడానికి అవస్థ పడుతున్న తెల్లటి చీర.. లోతు ఎంతో కొలవమని ఊరిస్తున్న అందమైన నాభి స్తానం.. అవి కనిపించనివ్వకుండా సన్నని చైన్ అడ్డుపడుతూ ఉంటే... మగవాడి బలహీనత ఏమిటో ఆ భగవంతుడికి కూడా తెలుసు అనుకుంటా... ఆయన కూడా మగవాడే కదా.. అందుకే తన బలహీనతలన్నీ తీసుకువెళ్లి ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టినట్టు ఉన్నాడు.. నాభి పైన చెయ్యి వేస్తాడు. ఆ నిశ్శబ్దం లోపల మాటలు లేకపోయినా భావాలు అనేకం. చేతికి చెయ్యి తాకగానే శాంభవి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. "నువ్వు ఇలా సిగ్గుతో ముడుచుకుపోవడం చూస్తూ ఉంటే నిజంగానే పెళ్లి అయినట్లు ఇప్పుడు నమ్ముతున్నాను." శాంభవి నవ్వుతూ, చిన్నగా కళ్ళు తెరిచి కళ్లలోకి చూస్తూ "అయితే… ఇక ఆలస్యం చేయకు. మన కొత్త జీవితం మొదలుపెట్టు." దీపం వెలుగులో ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ, ఇన్నాళ్లుగా బావ–మరదలుగా దాచుకున్న ప్రేమను ఇప్పుడు దాంపత్య బంధంతో ముద్రవేసుకున్నారు. గదిలో మాత్రం ఇద్దరి మమకారం, కొత్త ఆరంభం మాత్రమే నిండిపోయింది. ప్రేమ బంధంతో దగ్గరయినా జంటకి ఎంత తాగినా దాహం తీరకుండా ఉంటుంది. రాత్రి అంతా ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుంటూనే ఉంటారు. శాంభవి లో ఉన్న సిగ్గు భయాన్ని మెల్లిగా దూరం చేస్తూ తనలో కలుపుకుని సంపూర్ణమైన దాంపత్య జీవితం లోనికి అడుగుపెడతాడు. పరిపూర్ణమైన జీవితం మొదలైన వేళ....
19-04-2026, 10:52 AM
Part - 98
దాంపత్య జీవితం మొదలుపెట్టిన వేళ.. అలిసి సొలసి ఇద్దరూ నిద్రలోకి జారుకుంటారు. సూర్యుడు లేలేత కిరణాలతో రుద్రా మేల్కొంటాడు.
ఉదయం సూర్యుడు తన కిరణాలను జారవిడుస్తున్నాడు. తెరల గుండా జారిన ఆ వెలుగు శాంభవి ముఖాన్ని తాకి మరింత ప్రకాశవంతం చేసింది. రుద్ర కళ్ళు మెల్లగా తెరచి చూసాడు. అతని పక్కన నిద్రలో మత్తుగా నిద్రపోతున్న తన జీవితం మొత్తం... తన భార్య. ఆ క్షణం అతని గుండె నిండిపోయింది. అతను తనలో తానే మెల్లిగా అనుకున్నాడు— "ఇది కలా? లేక నిజమా? ఇంత అందంగా, ఇంత ప్రశాంతంగా నా పక్కన నిద్రపోతుందంటే… నేను నిజంగానే అదృష్టవంతుడిని." శాంభవి ముఖంపై చిన్న చిన్న కిరణాలు ఆడుతూ ఉంటే, రుద్ర మనసు పులకరించిపోయింది. "నిన్న రాత్రి నీ మనసులో దాగి ఉన్న నాపై ప్రేమని మొత్తం చూపించావు … నా ఆత్మలో ఆత్మవై.. ఎంతకాలంగా దాచుకున్న భావాలన్నీ నువ్వు విన్నావు, నువ్వే అర్థం చేసుకున్నావు. ఇకముందు నీకు ఎప్పుడూ లోటు రాకూడదు. నీ కన్నీళ్లు నేను తుడవకముందు నీ చెంపపై జారిపోకూడదు." రుద్ర మెల్లగా దగ్గరికి లాగి ఆమెను తన ఒడిలోకి చేర్చుకున్నాడు. "నువ్వు నా ఊపిరి… నువ్వు నా విశ్వాసం. ఇంతవరకు నేను ఎక్కడో వెతికిన సుఖం… ఈ రోజు ఇక్కడ, నా హృదయానికి ఆనుకొని ఉంది. శాంభవి… నువ్వు నా భార్య అనుకోవడం మాత్రమే కాదు, నువ్వు నా లోకం." శాంభవి నిద్రలోనే అతని ఛాతీపై తల ఆనుకుంది. రుద్ర మైమరచి చిరునవ్వు నవ్వుకున్నాడు. "ఇలాగే నీ ఊపిరి నా మీద తాకుతూ ఉండాలి. నేను బ్రతికేంత వరకు నీకు నీడలా ఉండాలి. ఈ ఉదయం నా జీవితంలోని అందమైన ఆరంభం." పాప అని మెల్లిగా పిలుస్తూ చెంపలు తడుముతూఉంటాడు. ప్లీజ్ బావ అని ఇంకా గట్టిగా హత్తుకుంటుంది. ఇదిగో నువ్విలా పట్టుకుంటే నా లోపల ఏదేదో జరుగుతుంది. తర్వాత నా వల్ల కాదు అంటే ఏమీ చేయలేను. ఇప్పుడు నన్ను ఎందుకు లేపుతున్నావ్.. కాసేపు పడుకుంటాను. రాత్రంతా పడుకోనివ్వలేదు. శోభనం అంటే అలాగే ఉంటుంది. ఏమో నాకు తెలియదు.. నాకు ఇదే మొదటిసారి అని ఇంకా దుప్పటి పైకి లాక్కుంటుంది . నీ ఉద్దేశం ఏమిటి.. నాకు ఇది ఏ వందో సారా.. అని నడుం పైన చిన్నగా గిల్లుతాడు. అబ్బా అనే గిల్లిన చోట రుద్దుకుంటూ.. మగతగా ఉన్న కళ్ళు మెల్లిగా తెరిచి.. రుద్రని నిద్ర కళ్ళతో చూస్తుంది. రాత్రి పెట్టిన కాటిక చెరిగి పోయి.. నుదటిన పెట్టిన కుంకుమ కరిగి ముఖమంత రంగుల మయంగా ముద్దుగా కనపడుతుంది. పాప అని పిలిస్తే ఏడుపు గొంతుతో చెప్పు బావ. స్నానం చేద్దామా.. నువ్వు చేసి రా తర్వాత నేను చేస్తాను. ప్లీజ్ కాసేపు పడుకోనివ్వు.. స్నానం చేసి ఏదైనా తినేసి పడుకో. సాయంత్రం వరకు నిన్ను డిస్టర్బ్ చెయ్యను. బలవంతంగా లేపి స్నానానికి తీసుకువెళతాడు. నాకు సిగ్గుగా ఉంది వదులు బావ.. రాత్రంతా చూడగా లేనిది ఇప్పుడు వచ్చిందా అని చేతుల్లో పసిపాప లాగా మెలికలు తిరుగుతున్న భార్యని నవ్వుతూ అడుగుతాడు. అది వేరు.. ఇది వేరు ఏదైనా నేనే కదా నా పిచ్చి అని టబ్ లో వదిలి.. గోరువెచ్చని నీళ్లు వదులుతాడు. ఆ నీళ్లు తగలగానే శాంభవికి హాయిగా అనిపిస్తుంది. అక్కడక్కడ చురుక్కుమంటుంటే అబ్బా అని చూసుకుంటూ ఉంటుంది. ఏమైంది.. హ.. రాత్రి తమరు చేసిన ఘనకార్యం అని చెబుతూ తలదించుకుంటుంది. అప్పటికే శాంభవి బుగ్గలు కెంపు వర్ణంలోనికి మారిపోతాయి. వేడిగా నీటి చుక్కలు జారిపడుతూ స్నానంలో నిలబడి ఉన్న శాంభవి శరీరం మీద రుద్ర కళ్ళు ఆగిపోతాయి. గుండెలో ఒక ముచ్చట, ఒక గర్వం కలగలిపిన తీయని హడావిడి. ఆమె మెడపైన, భుజంపైన, ఒంటి మీద విరబూసిన తన ప్రేమగీతాల గుర్తులు — లవ్ బైట్స్ — అతనికి గర్వమా? లేక ఏదో తెలియని అలజడా... “అయ్యో… శాంభవి… రాత్రంతా నీకు చాలా ఇబ్బంది పెట్టేశానేమో…” అని అడుగుతూ.. ఆ గుర్తులు పైన పెదవులు ఉంచుతాడు. ఒక మధురమైన తడబాటు అతని ముఖంలో తేలుతుంది. సుకుమారిగా పెరిగిన నువ్వు రాత్రి నన్ను ఎలా తట్టుకున్నావు. చేతిని ముందుకు చాపి ఆ గుర్తుల మీద వేళ్లతో నిమురుతూ ఉంటాడు. వేళ్లకు తాకిన ప్రతి చిహ్నం వెనకటి క్షణాలను తిరిగి తీసుకువస్తుంది. శాంభవి తడబడి కన్నులు మూసుకున్న తీరు, తన ఛాతీకి కరిగిపడిన తాపం, ప్రతి సవ్వడి… అన్నీ అతని మదిలో రివైండ్ అవుతాయి. అతని ముఖంలో మృదువైన చిరునవ్వు, కన్నులలో కృతజ్ఞత, హృదయంలో ఒక మమకారం — “నిన్న ఇంతగా నన్ను అంగీకరించావు… నా పిచ్చి, నా ప్రేమ అన్నిటినీ భరించావు… నిజంగా నేను ఎంత అదృష్టవంతుడినో!” అని అనుకుంటూ, ఆమెను మళ్ళీ కౌగిలించుకోవాలని కోరికతో ముందుకు అడుగు వేస్తాడు. ఏం చేస్తున్నారు బావా అని కంగారుగా అడిగితే.. రాత్రంతా ఎలా భరించావే.. ఇన్ని గాయాలు అవుతున్న నాలో ఎలా కలిసిపోయావు. నిన్ను మిమ్మల్ని భరించలేదు ప్రేమించాను. ఇష్టంగా మీలో కలిసిపోయాను. నాపై మీకు ప్రేమ ఎక్కువ అవడం వలన... ఇలా తీపి గుర్తులు ఇచ్చారు. రుద్ర దగ్గర రుండి స్నానం చేయిపించి పసి పాపా లాగ.. టవల్ చుట్టి బయటికి తీసుకు వస్తాడు.. ఒక ఫైవ్ మినిట్స్ అని.. సోఫా లో కూర్చోబెట్టి.. మొత్తం క్లీన్ చేస్తాడు. బావ నేను చేస్తాను కదా.. నువ్వు సైలెంట్ గా కూర్చో అని.. క్లీన్ చేసి ఒక మాక్సి ఇస్తాడు. ఇవన్నీ ఎప్పుడు తెచ్చావు. అ త్రీ డేస్ ఇక్కడే ఉండాలి అనుకున్నప్పుడు ప్రిపరేషన్తో రావాలి పాపా.. నేను నీలాగా ట్యూబ్ లైట్ కాదు. మీ గొప్పలు మీరే చెప్పుకోవాలి అని మూతి తిప్పుతుంది. రుద్రా ట్రాక్ ప్యాంటు వేసుకుని ఫైవ్ మినిట్స్ అని కిచెన్ లోకి వెళతాడు. పాలు వేడి చేసి బ్రెడ్ రోస్ట్ చేసి తీసుకువస్తాడు. మీకు కుకింగ్ వచ్చా.. నీ మొగుడు ఆల్ రౌండర్ తిను.. టాబ్లెట్ వేసుకుని పడుకో.. నాకు టాబ్లెట్ అవసరం లేదు. నీ బాడీ కండిషన్ ఎలా ఉందో నీకున్న బాగా నాకే తెలుసు. మూసుకుని తిని టాబ్లెట్ వేసుకో.. టాబ్లెట్ వేసుకుని పడుకుంటుంది. మూడు రోజుల అక్కడే సరదాగా గడిపి.. ఇంటికి చేరుకుంటారు. కొత్త కళతోఉన్న ఇద్దరినీ చూసి ఏమి జరిగి ఉంటుందో.. ఊహించుకుంటారు. సంతోష్ కొడుకుని పక్కకి తీసుకువెళ్లి ఇప్పటివరకు మీ మధ్యన ఏమీ జరగలేదా.. మీకెందుకు అనుమానం వచ్చింది. మీ ముఖాలు చూస్తుంటేనే అర్థం అవుతుంది. అవును.. మాకు మూడు రాత్రులు ఇప్పుడే జరిగాయి. అదే ఎందుకు.. శాంభవికి నిజం తెలుసుకున్నకే.. ఒప్పుకోవాలని.. కొత్తగా ఒప్పుకోవడం ఏముంది.. ప్రేమించే కదరా పెళ్లి చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న.. నేను ఏమవుతానో.. తెలుసుకున్నాకే ముందుకు వెళ్లాలి అనుకున్నాను. అందుకే ఇన్ని రోజులు ఆగాను. రుద్ర, శాంభవి ల సరికొత్త సరిగమల ప్రయాణం.....
19-04-2026, 10:59 AM
Part - 99
రేపల్లె వాస్తవ్యులు శాంభవికి జాగ్రత్తలు చెప్పి రేపల్లెకు బయలుదేరుతారు. అందరికి కన్నీటితో వీడ్కోలు చెబుతుంది. రోజులు ముందుకు సాగుతూ ఉంటాయి.
అందరూ కలిసి ఒకే ఇంటిలో ఉండేటట్టుగా ఒక పెద్ద ప్యాలెస్ ని కట్టిస్తారు. ఇల్లు మొత్తం ఎప్పుడూ కడకడలాడుతూ అసలైన పండగ వాతావరణం మెరుపులు చిందిస్తూ ఉంటుంది. ఒకరోజు శాంభవి చారుతో కబుర్లు చెబుతూ అత్తయ్య నోరంతా ఏదో లాగా ఉంటుంది. పుల్లపుల్లగా తినాలి అనిపిస్తుంది. చేతిలో ఉన్న పని ఆపేసి ఏం మాట్లాడుతున్నావ్ అని చారు తులసి చేరో పక్కకి చేరతారు. అవును అత్తయ్య.. ఎప్పటినుంచి ఒక వారం నుంచి.. పిరియడ్స్ చెక్ చేసుకున్నావా.. ఈ మంత్ ఇంకా రాలేదు. ఆ విషయం ఇంత నెమ్మదిగా చెబుతావేమిటి.. డ్రైవర్ని పిలిచి కార్ రెడీగా పెట్టు అని... పద హాస్పిటల్ కి వెళ్దాం. నేను బాగానే ఉన్నాను అత్తయ్య. పుల్ల పుల్లగా తినాలనిపిస్తే హాస్పిటల్ కి వెళ్ళాలా.. తల మీద ఒకటి కొట్టి ఇది వేరే విషయం..డాక్టర్ కన్ఫామ్ చేస్తే అప్పుడు అందరికీ చెప్పచ్చు పద అని కంగారు పెట్టి తీసుకువెళ్తారు. హాస్పటల్ కి వెళ్లి.. అత్తయ్య ఒకసారి బావ కి ఫోన్ చేయండి. కంగారు పడతారేమో.. వాడికేం అవసరం లేదు నువ్వు సైలెంట్ గా ఊరుకో.. కానీ అప్పటికే ఫ్యామిలీ మొత్తం కంగారుగా వచ్చేస్తారు. మీరందరూ ఇక్కడ ఏమిటి.. శాంభవిని ఎందుకు తీసుకోవచ్చారు. ఏమైంది అని రాఘవేంద్ర కంగారు గా అడిగితే... రుద్రా శాంభవిని అనుమానంగా చూస్తూ ఉంటాడు. శాంభవి దిక్కులు చూస్తూ ఉంటే.. ఏమీ లేదు నాన్నగారు.. ఒకసారి డాక్టర్ కి చూపిద్దామని అంతే. సరే పదండి. ఇంతమంది లేడీ డాక్టర్ దగ్గరికి ఎందుకు.. అ నేను తీసుకువెళ్తాను. అమ్మాయిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. డాక్టర్ కి కాల్ చేస్తే ఇంటికి వస్తుంది కదా....ఎంత హాస్పటల్ మనదైనా కొన్ని కొన్ని సార్లు మనమే డాక్టర్ దగ్గరికి రావాలి నాన్నగారు. వాళ్లు ఏ పనిలో ఉంటారో మనకి తెలియదు కదా .. రుద్ర నేను తీసుకువెళతాను మీరందరూ కామ్ గా ఉండండి. అవసరం లేదు. ఇక్కడదాకా తీసుకువచ్చిన వాళ్ళము లోపలికి తీసుకువెళ్లలేమా.. నువ్వు పదవే అని తీసుకుని లోపలికి వెళ్తారు. అరగంట గడిచిన బయటికి రాకపోయేటప్పటికి అందరూ టెన్షన్ గా చూస్తూ ఉంటారు. మెల్లి గా డోర్ ఓపెన్ అవ్వగానే అందరూ కళ్ళు శాంభవి పైనే ఉంటాయి. చారు తులసి మొహం వెలిగిపోతూ ఉంటే.. శాంభవి సిగ్గుతో తలదించుకునిఉంటుంది. రాఘవేంద్ర,అనసూయ కంగారుగా వెళ్లి ఎలా ఉంది రా. నా మనవరాలకి ఏమయింది అని అడిగితే... మీరు సంతోషించాల్సిన విషయమే నాన్నగారు.. దేవేంద్ర వచ్చి ఏమంటున్నావ్ రా.. డాక్టర్ దగ్గరికి తీసుకువచ్చి సంతోషించాల్సిన విషయం అంటున్నావు. మాకు గాబరాగా ఉంది కానీ తొందరగా విషయం ఏమిటో చెప్పండి. అన్నయ్య.. మా చిన్న వదిన వచ్చేస్తుంది. ఏమంటున్నావు అని అడిగితే.. నీ ముద్దుల కూతురు తల్లి కాబోతుంది.. ఆ మాట వినగానే దేవేంద్ర ఆనందానికి హద్దులు ఉండవు. కూతురిని కౌగిలించుకుని ఎంత మంచి విషయం చెప్పావురా.. తండ్రిని కౌగిలించుకుని వారగా రుద్రను చూస్తూ ఉంటుంది. కుర్ర బ్యాచ్ అంతా రుద్రని ఎత్తుకొని... బావ మేము మేనమామలు అయ్యిపోతున్నాము. నన్ను దింపండి రా బాబు.. శాంభవి దగ్గరికి వస్తాడు. దేవేంద్ర కూతుర్ని వదిలి రుద్రను కౌగిలించుకొని చల్లగా ఉండండి రా.. చారు వచ్చి ఒరేయ్ అమ్మాయిని తీసుకుని నువ్వు వెళ్ళు.. మేమందరం వెనకాలే వస్తాము. రేపల్లె కూడా ఫోన్ చేసి విషయం చెప్పాలి. సరే అని రా...శాంభవి అంటాడు. నడుస్తుంటే అమ్మ శాంభవి అని అందరూ ఒకేసారి అరుస్తారు. ఉలిక్కిపడి ఏమైంది అని కంగారుగా అడుగుతుంది. డాక్టర్ కూడా బయటకు వచ్చి ఏం జరిగింది ఎందుకు అలా అరిచారు. నెమ్మదిగా నడువమ్మా.. అంత స్పీడుగా నడిస్తే ఎలాగా అంటే.. రుద్ర కళ్ళు బయటికి వచ్చి మళ్ళీ సర్దుకుంటాయి. డాక్టర్ బుర్రగోక్కుంటూ ఇప్పుడు అమ్మాయి నార్మల్గానే నడిచింది కదా... అలా నడిచిన సరే లోపల బేబీ ఏమైపోతుందో ఏమో.. నడవకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అని దేవేంద్ర అడిగితే... తండ్రి ప్రేమ చాలా ఎక్కువ అయిపోయింది కానీ అమ్మాయికి నడక ఉంటేనే తల్లి బిడ్డకి మంచిది. చారు వైపు చూసి ఇంట్లో లేడీస్ చాలా మంది ఉన్నట్టున్నారు. ఎలా ఉంటే మంచిదో అన్నది మగవాళ్ళకి చెప్పండి. లేకపోతే శాంభవి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. డాక్టర్ లోపలికి వెళ్ళిపోతుంది. రుద్రా శాంభవిని ఎత్తుకొని కారు దగ్గరికి తీసుకు వెళుతాడు. అయ్యో బావ నేను నడుస్తాను. వద్దు తల్లి.. ఇప్పుడు నువ్వు నడుస్తుంది చూస్తే మీ నాన్నల గోల భరించలేను. రేపు రేపల్లె నుంచి మావయ్య వాళ్ళు వస్తారు. అందరూ కలిసి నా బుర్ర తినేస్తారు. నువ్వు కామ్ గా ఉండు అని కారులో కూర్చోబెట్టి రుద్ర డ్రైవింగ్ ప్లేస్ లోకి వచ్చి కార్ స్టార్ట్ చేస్తాడు. శాంభవి రుద్ర భుజం పైన పడుకుని చేతిని తన చేతులతో చుట్టుకొంటుంది. ఏంట్రా అని అడిగితే... చాలా సంతోషంగా ఉంది బావ... అవును చాలా సంతోషంగా ఇది అని ఎక్స్ప్రెస్ చేయలేని.. లోపల సముద్రం కన్నా ఉప్పెనలాగా పొంగిపోతుంది మై డియర్ పాప. ఇదిగో ఇంకా నువ్వు నన్ను పాపా అని పిలవకూడదు నీకు నాన్నగా ప్రమోషన్ ఇచ్చాను. నాన్నగా మారినా తాతగా మారినా నా కళ్ళకి ఎప్పుడూ నువ్వు పాపవే.. నేనెప్పుడూ నీకు బావనే.. చిన్నప్పుడు నేను బాగా అల్లరి చేసే వాడిని. నాన్నగారు షేవింగ్తో ఉండవలసిందే.. కొంచెం గడ్డం కనిపించిన దగ్గరికి రానిచ్చే వాడిని కాదు. నాకు గుచ్చుకుంటుంది అని గొడవ చేసేవాడిని. అమ్మయితే నా పక్కనే పడుకోవాలి. తమరికి శాడిజం ఆవయసునుంచే ఉందా? అదేంటి అంత మాట అనేసావు. లేకపోతే అత్తయ్య నీ దగ్గరే పడుకుంటే పాపం మావయ్య.. రుద్ర గట్టిగా నవ్వుతూ.. తల్లికి పిల్లలు పుట్టే వరికే మొగుడు.. ఇప్పుడు నువ్వైనా అంతే. రేపు పుట్టబోయే బిడ్డ రాగానే అమ్మో బావ దూరం.. ఏడుస్తుంది.. లేకపోతే నిద్ర సరిపోదు అని 100 కారణాలు చెబుతావు. మనకి ఆ ఛాన్స్ లేదు. ఏ.. ఇంటిలో ఇంతమంది ఉన్నారు. పాలు తాగే వరకే నా దగ్గర ఉంచుతారు.. చూస్తూ ఉండండి.. అది నిజమేలే ఇంతకీ నీకు ఏం కావాలి.. ఏం తినాలి అనిపిస్తుంది.. పుల్ల పుల్లగా తినాలని ఉంది బావ. నాకు మామిడికాయలు పచ్చి చింతకాయలు తెచ్చి పెట్టావా... సరేలే ఇంటికి వెళ్ళగానే తెప్పిస్తాను.. థాంక్యూ బావ .. సరదాగా తిరిగి ఇంటికి వెళ్ళేటప్పటికి గంపలతో రెడీగా ఉంటాయి. అరే అప్పుడే తెప్పించేసావా.. కొన్ని నేను తెప్పించాను. కొన్ని మావయ్య తెప్పించాడు. ఇన్నెందుకు.. నీకు ఎన్ని కావాలో అన్ని తిను.. మిగిలినవి ఏం చేసుకోవాలి అన్నది అమ్మ వాళ్లు చూసుకుంటారు. ఒక కాయ నీటుగా కడిగి దేవుడి దగ్గర పెట్టి తీసుకువచ్చి తిను అని చేతికి ఇస్తాడు. శాంభవి మామిడికాయ కొరికితే రుద్ర నోట్లో నీళ్లు ఊరుతాయి. అబ్బా అంత పులుపు ఎలా తింటున్నావే.. ఒరేయ్ దిష్టి పెట్టకు రా నా కోడలికి అని చారు వస్తుంది. కౌసల్య ఒక ప్లేట్ నిండా స్వీట్స్ పెట్టి తీసుకొస్తుంది. అమ్మా.. నాకు స్వీట్స్ వద్దు. ముందు నేను పెట్టినవన్నీ తిని తర్వాత నీకు ఏం కావాలో అవి తిను. అప్పుడు గాని నీ కూతురు గుమ్మానికి పట్టకుండా అయిపోదు. మా అమ్మాయి ఎలా ఉన్నా మాకు ఇబ్బంది లేదు. నీకేమన్నా ఇబ్బంది అయితే చెప్పు అల్లుడు. ఇబ్బంది అయితే ఏం చేస్తావ్ అత్తయ్య. నిన్ను కూడా అలాగే తయారు చేస్తాను. అంతేగాని నీ కూతురు స్లిమ్ గా ఉంచుతాను అని అనడం లేదు. అనము. ఏం చేస్తావ్.. ఏం చేస్తాను... చూస్తూ ఉండడమే .. రేపల్లె నుంచి కూడా అందరూ వచ్చేస్తారు. శాంభవి తల్లి కాబోతుందన్న విషయం తెలిసి ఎవరికి కాళ్లు భూమి మీద నిలబడవు. అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. ఏడో నెల రాగానే అంగరంగ వైభవంగా సీమంతం జరిపిస్తారు. రేపల్లె నుంచి భాను కుటుంబం పుట్టింటి సుడిదలు తీసుకువస్తారు. పురిడికి భాను వాళ్ళతో కలిసి రేపల్లె వెళుతుంది. రుద్రా.. లేడీ డాక్టర్ని, నర్స్ ని అరేంజ్ చేస్తాడు. ఏ నిమిషమైనా డెలివరీ అవ్వచ్చు అని అక్కడే లేబర్ రూమ్ అరేంజ్ చేస్తాడు. రుద్ర, దేవేంద్ర శాంభవి తోనే ఉంటారు. డెలివరీ డేట్ దగ్గరికి వచ్చేటప్పటికి కుటుంబం మొత్తం ఇక్కడికి వచ్చేస్తారు. ఒక రోజు సాయంత్రం శాంభవి తలస్నానం చేసి జుట్టుకి సాంబ్రాణి పొగ వేసుకొంటుంది. చేతులకి గోరింటాకు పెట్టించుకుంటుంది. ఎర్రగా పండిన చేతులనులను చూసి మురిసి పోతూ.. బావ నా చేతులు చూడు.. ఎంత ఎర్రగా పండాయో.. ఎర్రగా పండితే బాగా చూసుకునే మొగుడు వస్తాడు అంటారు. నీ మొగుడు ఎలాంటి వాడో అని రుద్ర కన్ను కొడితే... నా మొగుడు బంగారం అని మెటికలు విరుస్తుంది. సరదాగా మాట్లాడుకుంటూ బావ అని పిలుస్తూ భుజం పైన చెయ్యి వేస్తుంది. ఏమైందిరా.. పొట్టలో ఏదో నొప్పిగా అనిపిస్తుంది.. అమ్మ అని గట్టిగా అరుస్తుంది. ధరణి జయంతి పరుగున వచ్చి ఏమైందిరా.. నొప్పిగా అనిపిస్తుంది అమ్మ.. అల్లుడుగారు అమ్మాయికి నొప్పులు మొదలైనట్టున్నాయి. డాక్టర్ని పిలవండి. శాంభవి అరుపులకి డాక్టర్ పరుగున వస్తుంది. లేబర్ రూమ్ లోకి వెంటనే తీసుకు వెళ్ళాలి అని గదిలోకి తీసుకువెళ్తారు. లోపల శాంభవి నొప్పికి అల్లాడిపోతూ ఉంటే బయట ఉన్న అందరూ విలవలలాడిపోతూ ఉంటారు. మగవాళ్ళు కూడా ఆ పురిటి నొప్పులు వాళ్లే పడుతున్నట్టుగా హైరానా పడుతూ ఉంటారు. సూర్యుడు ఉదయించే వేళ సింహ లగ్నంలో చంటి బిడ్డ ఏడుపు వినపడుతుంది. బేబీని బయటికి తీయగానే రుద్ర చేతికి ఇస్తారు. తడబడుతున్న చేతులతో బిడ్డని తాకుతాడు. ఒక తండ్రి ఫీలింగ్......
19-04-2026, 11:05 AM
బృందావనం - 100
ఏడుస్తూ ఉన్న బిడ్డని చేతిలోకి తీసుకోగానే.. రుద్ర లో తెలియని ఒక వింత అనుభూతి. ఇంకా బిడ్డని కడగకుండా రక్తంతోనే తన చేతిలోకి వచ్చిన ఆ చిన్నారిని చూడగానే రుద్ర కళ్ళు వర్షిస్తాయి.
రుద్ర గుండెలో ఆ క్షణం ఒక వింత అలజడి పుట్టింది. మొదటిసారి తన చేతిలోకి వచ్చిన చిన్న ప్రాణం… ఇంకా కడగక ముందే, తడబడి రక్తపు మరకలతో, ఆ బిడ్డ తన చిన్న చిన్న వేళ్లను వంచుకుంటూ అతని గుండెలో ఆవల చూసింది. రుద్ర కన్నీళ్లు ఎగసిపడ్డాయి—అవి దుఃఖం కాదు, భయం కాదు, కానీ ఒక అపరిమితమైన అనుబంధం. ఇంతకు ముందు ఎప్పుడూ అనుభవించని తీయని భారం… ఆ చిన్న శ్వాస ప్రతి సారి తాకినప్పుడు రుద్ర గుండె కొట్టుకోవడమే కాదు, ఆగిపోయినట్టే అనిపించింది. "ఇది నా బిడ్డా?" అని లోలోపల ప్రశ్నించుకుంటూ, అతను తన చూపు ఆ శిశువుపైనే నిలిపాడు. ప్రపంచమంతా ఒక్కసారిగా మూగబోయినట్టుగా, ఆ క్షణం రుద్రకి కేవలం ఆ చిన్న గుండె చప్పుళ్లు మాత్రమే వినిపించాయి. ఆశ్చర్యం, ఆనందం, భయము, ప్రేమ—అన్నీ కలిసిపోయి, అతని కళ్ళలో వర్షంలా జాలువారాయి. ఒక చిన్న జీవం అతని జీవితానికి కొత్త అర్థం ఇచ్చిన క్షణం అది. పుట్టిన పాప ని తీసుకుని శాంభవి దగ్గరికి వెళతాడు. నీరసంగా రుద్రనే చూస్తూ ఎవరు పుట్టారు బావ.. అత్తయ్య వచ్చేసింది. థాంక్యూ నీకు ఎలా ఉంది రా.. బాగానే ఉంది. నర్స్ వచ్చి.. పాపని ఇలా ఇవ్వండి క్లీన్ చేయాలి.. అంతసేపు ఉంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. పాప ని ఇచ్చి డాక్టర్ వైపు చూస్తాడు. మీరు బయట ఉండండి. మేడంకి డ్రెస్సింగ్ చేయాలి. రుద్ర ఒక అనిర్విచమైన అనుభూతితో బయటికి వస్తాడు. అందరూ ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటారు. రుద్రనే చూడగానే చుట్టుముట్టి శాంభవి ఎలా ఉందిరా.. ఎవరు పుట్టారు అని కంగారు పెట్టేస్తూ ఉంటారు . దేవేంద్రనీ కౌగిలించుకుని అత్తయ్య వచ్చేసింది చిన్న మామ అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. అది వినగానే అందరికీ ఆనందంతో హృదయం నిండి పోతుంది. నా కూతురు ఎలా ఉందిరా... బాగానే ఉంది. కాసేపటికి తల్లి బిడ్డని రెడీ చేసి డాక్టర్ బయటికి వచ్చి రూమ్ మార్చాలి. ఒక గది అంతా ఆ శాంభవి కోసం అప్పటికే రెడీ చేసి ఉంచుతారు. ఆ గదిలోకి మార్చుతారు. భాను, శివ కంగారుగా కూతురు దగ్గరికి వెళ్లి ఎలా ఉందిరా.. బాగానే ఉంది.. పాపని చూశారా. చూసాము తల్లి. అచ్చు నీలాగానే ఉంది మాకు మళ్ళీ బుల్లి శాంభవి వచ్చేసింది.. 21వ రోజున పురిటి స్నానం చేయిపించి నామకారణానికి ముహూర్తం పెడతారు. ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తూ ఉంటే శాంభవి భాను వైపు చూస్తుంది. భాను చిన్నగా నవ్వి వచ్చి కూతురి పక్కనే కూర్చుంటాడు. రుద్రా చెవిలో పేరు చెబుతుంది. అది వినగానే నవ్వుతూ పళ్లెంలో రాసి కూతరు చెవిలో చెబుతాడు. శాంభవి చెప్పిన తరువాత భాను జంట, శివ జంట ఆశీర్వాదం అయిన తర్వాత... దేవేంద్ర వస్తాడు. దేవేంద్ర చేతికి ఇచ్చి నాన్న... అమ్మని మీ చేతికి ఇస్తున్నాను. మీ చేతుల్లోనే పెంచండి. ఏమంటున్నావురా. అవును పాపకి లహరి అనే పెట్టాను. మీ చేతుల్లోనే పెరగాలి. మీరు కోల్పోయిన సంతోషాలన్నీ పాప రూపంలో మీకు దక్కాలి. ఆ మాట వినగానే దేవేంద్ర హృదయం కన్నీటి సముద్రం అవుతుంది. పాపని చేతుల్లోకి తీసుకొని లహరి నా కోసం వచ్చేసావా అని నుదుటన ముద్దు పెట్టుకుంటాడు. లహరి కోసం దేవేంద్ర ఆఫీస్ కి వెళ్లడం కూడా మానేస్తాడు. లేచిన పడుకున్నా ఏది జరిగినా అది లహరి తోనే.. అపురూపంగా పెంచుతూ ఉంటాడు. లహరి కి ఐదు సంవత్సరాలు వయసు వచ్చేటప్పటికి శాంభవి మళ్ళీ నెల తప్పుతుంది. ఈసారి కవల పిల్లలు పుడతారు. ఒక పాప.. బాబు పడుతారు. చారుకి చాలా ఆనందంగా అనిపిస్తుంది. మగ పిల్లలతో ఉన్న ఇల్లు ఇప్పుడు ఆడపిల్లలు కనపడుతూ ఉంటే.. ఇంటికే కళ వచ్చినట్టుగా అనిపిస్తుంది. అందమైన బృందావనం నిజమైన బృందావనంగా మారి ఇల్లంతా కళకళలాడుతూ మరోతరం వైభోగం తీసుకువచ్చింది. కథ సమాప్తం?? ఈ కథను ఆదరించిన అందరికీ ధన్యవాదములు.. ??? థాంక్యూ..
19-04-2026, 11:06 AM
(This post was last modified: 19-04-2026, 11:17 AM by ash.enigma. Edited 2 times in total. Edited 2 times in total.)
Excellent story. Kudos to Uma garu, the actual writer
And many many thanks to Sivagaru for getting this story to us everyday without fail. Thanks once again. Adagakunda undalemu.. next story eppudu Sivagaru?
19-04-2026, 12:33 PM
Thank you for giving us an excellent family story.
19-04-2026, 02:51 PM
బాగుంది సాయిగారు, ఈ కథ మొత్తనికి సుఖాంతం అయి అందరికీ ఆహ్లాదాన్ని ఇచ్చింది.
మీనుండి మరో మంచి కథను ఆశిస్తూ అభినందనలు
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
19-04-2026, 03:06 PM
Exlent and beautiful story siva garu brundavanam,panigarhanam lanti marinni stories kosam eduru chustu untam
19-04-2026, 08:21 PM
(19-04-2026, 11:06 AM)ash.enigma Wrote: Excellent story. Kudos to Uma garu, the actual writer Maro Kotha Story tho Vastha Konchem Time Padutundi....... Panigrahanam Season -2 Daily 3 Episodes Vasthayi
19-04-2026, 11:25 PM
రోజు ఉదయాన్నే ఈ స్టోరీ అప్డేట్ కోసం ఎదురు చూసేవాడిని... తొందరగా ముగిసిపోయినట్లు అనిపిస్తోంది... మంచి కథ... రచయిత చాలా డిసిప్లిన్డ్ గా రోజు అప్డేట్ ఇచ్చారు... హాట్సాఫ్.. మరో కథ కోసం వెయిట్ చేస్తాం...
19-04-2026, 11:28 PM
ఒకేసారి రెండు కథలు రాయడం చాలా కష్టం .కానీ ఇక్కడ మాత్రం చాలా చక్కగా రాశారు... హడావిడిగా రాయలేదు... టెంపో చెడకుండా కంటిన్యూ చేసారు ఓపికను మెచ్చుకోవాలి...
|
|
« Next Oldest | Next Newest »
|