19-04-2026, 11:26 AM
Superb update
|
పాణిగ్రహణం
|
|
19-04-2026, 12:51 PM
హిమ కూడా గౌతమ్ చేతిలోనుంచి జారిపోయింది...
20-04-2026, 09:48 AM
Update pls
20-04-2026, 10:08 AM
20-04-2026, 10:47 AM
Waiting for your update
20-04-2026, 10:50 AM
20-04-2026, 10:54 AM
Part - 49
సూర్య క్యాబిన్ లోనికి వెళ్లి కం మిస్.. ఐ యాం హిమ.. నైస్ నేమ్. మీలాగే మీ పేరు కూడా చాలా అందంగా ఉంది. థాంక్యూ అని.. హెయిర్ ని చెవి వెనకాలకి పెట్టుకుంటూ మెలికలు తిరుగుతూ ఉంటుంది.
కూర్చొ.. అలా నిలబడితే ఎలా... కాళ్లు నొప్పులు వస్తాయి కదా.. నీకు లేడీస్ విషయంలో చాలా సాఫ్ట్ కార్నర్ అనుకుంట.. అందరూ విషయంలో ఉండదు. నీలాంటి మోస్ట్ టాలెంటెడ్ విత్ బ్యూటీ లో మాత్రమే.. జ్యూస్ తెప్పించి తీసుకో అని ఇస్తాడు. థాంక్యూ అని కాలు మీద కాలేసుకుని సిప్ చేస్తూ ఉంటే.. మీ ప్రాజెక్టు ఓకే అయ్యిందా.. మీ డాడీ కి నా వర్క్ సాటిస్ఫాక్షన్ గా లేదు. అవునా.. ఏది నాకు ఎక్స్ప్లెయిన్ చేయి.. విక్రమ్ వాళ్ళకి చెప్పినట్టుగానే చెబుతుంది. వాట్ ఏ టాలెంట్.. పిల్లర్స్ లేకుండా కన్స్ట్రక్షన్..ఇలా గనక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే అసలు వరల్డ్ లోనే ద బెస్ట్ అని నీకు క్యూ కట్టడంలో ఆశ్చర్యమే లేదు. ఇన్ని రోజులు ఈ టాలెంట్ ని ఎక్కడ పెట్టేశావు అని పొగుడుతూ ఉంటే.. రియల్లీ నీకు నా వర్క్ నచ్చిందా.. నీకు అంత డౌట్ ఎందుకు వచ్చింది. మరి మీ డాడీ నీకే నచ్చలేదు. గౌతమ్ కూడా సీరియస్ అయ్యాడు. కమాన్.. మనం న్యూ జనరేషన్. ఇప్పుడు టెక్నాలజీ తగ్గట్టుగా ఉండాలి. ఇన్నోవేటివ్ గా వెళ్ళినప్పుడే ట్రెండ్స్ సృష్టించగలం. మే బి గౌతమ్ కి వర్క్ గురించి ఐడియా ఉండి ఉండకపోవచ్చు. టెక్నాలజీ తెలియని వాళ్ళ కెరియర్ ఎక్కువ రోజులు ఉండదు. ఏం చేస్తాం చెప్పు. ఓకే.. మళ్లీ మనం మీట్ అవుదాము.. నాకు ఇప్పుడు ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఎప్పుడు కలుద్దాం అని లేచి నిలబడి దగ్గరికి వస్తూ ఉంటే..నీలాంటి బ్యూటీ ని కలవాలి అని నాకు ఉంటుంది కదా.. టైం ఫిక్స్ చేసి నేను మెసేజ్ చేస్తాను.. మరి నెంబర్ ఇవ్వవా.. నీ నెంబర్ నా దగ్గర ఉంటే చాలు కదా అని చూపిస్తాడు. నాకు తెలియకుండా నా నెంబర్ నీ దగ్గరకి ఎలా ఎక్సైట్మెంట్ అవుతూ ఉంటే...చెప్పాను కదా.. టాలెంటెడ్ విత్ బ్యూటీ ని ఎవరు వదులుకోరు. టచ్ లో ఉండు బేబీ.. బాయ్ అని వెళ్ళిపోతాడు. వెళుతున్న సూర్య ని చూస్తూ ఇలాంటి వాడిని గ్రిప్ లో పెట్టుకుంటే నా లైఫ్ తిరిగిపోద్ది. నాకున్న అందానికి.. ఇమేజ్కి.. ఇలాంటి వాడే సూట్ అవుతాడు. ఆ గౌతమ్ వేస్ట్.. కాకపోతే ఇప్పుడే వాడిని గెంట కూడదు. కొన్ని రోజుల సూర్యతో ట్రావెల్ చేసిన తర్వాత అప్పుడు... పక్కన పెట్టాలి. నువ్వు ఎంత లక్కీ హిమ. ఇప్పటివరకు గౌతమ్ ఉపయోగపడ్డాడు.. ఇప్పటినుంచి ఈ సూర్య.. ఈ విషయం వెంటనే డాడీతో షేర్ చేసుకోవాలి అని ఊపుకుంటూ వెళ్ళిపోతుంది.. విశి ఫోన్ పెట్టేసి.. వాళ్ళు లైన్ లోకి రాలేదు. మీరు టైం వేస్ట్ చేసుకుని నాకోసం ఉన్నందుకు థాంక్యూ. కమాన్ విశి.. చెప్పాను కదా నిన్ను చూస్తే మా చెల్లె గుర్తుకు వస్తుందని.. ఎప్పుడూ ఇల్లు షిఫ్ట్ అవుతున్నావు.. ఆ విషయం మీకు తెలుసా.. తెలుసు.. నిన్న దేవా చెప్పాడు. ఓ అవునా.. రేపు వస్తాము. గుడ్.. అమ్మకి అక్కడ అంతా చాలా బాగుంటుంది. చూస్తూ ఉండు మంచి ఫ్రెండ్స్ కూడా దొరుకుతారు... అంతా దేవా సార్ చేస్తున్న సాయమే.. ఇందులో సాయం అనే పెద్ద పెద్ద మాటలు ఎందుకు. ఉంది.. చెప్పాడు.. అది నీకు యూస్ అవుతుంది అంతే. ప్రతిదాన్ని ఎమోషనల్ గా తీసుకోకూడదు విశి.. ఒక్కొక్కసారి మన ఎమోషన్స్ మనల్ని వీక్ చేసేస్తాయి. మీరన్నది నిజమే సార్. కానీ వదల లేకపోతున్నాను.. ఎన్నిసార్లు ట్రై చేస్తున్న మళ్లీ అవే ముందుకి వస్తున్నాయి. ఈసారి నుంచి ఆ ప్రాబ్లం ఉండదు డోంట్ వర్రీ.. సరే ఇక నేను వెళ్తాను ఏదైనా అవసరం ఉంటే కాల్ చెయ్ అని వెళ్ళిపోతాడు. విశి అన్ని ప్యాక్ చేసుకుని భవ్య దగ్గరికి వెళుతుంది. అయిందా మీ మీటింగ్ అని వెటకారంగా అడిగితే.. వాళ్ళే ఎందుకో కట్ చేసారు. అవునా నీకు మాత్రం మనీ సేవ్ అయినాయి కదా... మళ్లీ వస్తే మళ్లీ అమౌంట్ అడుగు.. అవన్నీ కూడా వైభవ్ చూసుకుంటున్నాడు. మరి మాకు పార్టీ లేదా.. ఎందుకు లేదు. రేపు షిఫ్ట్ అవుతున్నాము కదా.. నువ్వు రా.. అంతా అయిపోయిన తర్వాత అక్కడే పార్టీ చేసుకుందాం. ఇంతకీ ప్లేస్ ఎక్కడ... లొకేషన్ చూపిస్తుంది. ఇది కొంచెం కాస్ట్లీ ఏరియా అనుకుంట.. నాకు అదే డౌట్ వచ్చింది. బట్ దేవా సార్ చెప్పడం.. వాళ్ళకి కలిసి పోయి ఉంటే చాలు. రెంట్ తో సంబంధం లేదు అన్నారంట.. నా బడ్జెట్ లోనే వస్తుంది.. అవునా అంత ఫ్రెండ్లీగా ఉండే వాళ్లు కూడా ఉన్నారా అని డౌట్ గా అడుగుతుంది. ఎందుకే అంత డౌటు పడుతున్నావు. అలా ఏమీ లేదు అంత స్పెసిఫిక్ గా దేవా సార్ నీ విషయంలో ఫోకస్లుగా ఉంటే అనుమానం వస్తుంది. నీ అనుమానాలు అన్ని తీసుకువెళ్లి నీ బ్యాగ్ లో పెట్టుకో. సార్ చాలా మంచి మనిషి. నా ఇబ్బందులు చూసి ఒక మనిషిగా సాయం చేస్తున్నారు. దానికి నువ్వు తోకలు తగిలించకు అర్థం అయిందా.. నేను తోకలు తగిలిస్తున్నానో లేక తగిలించిన తోక నీకు అర్థం కావడం లేదో చూద్దాం.. సరే నేను రేపు డైరెక్ట్ గా కొత్త ఇంటి దగ్గరికి వచ్చేస్తాను. ఏదైనా అవసరం ఉంటే కాల్ చెయ్. ఫ్లాట్ కి వస్తాను.. అవసరం లేదు.. నేను అమ్మే కదా.. లగేజ్ కూడా పెద్దగా లేదు. క్యాబ్ బుక్ చేసుకుంటే సరిపోతుంది. స్కూటీ నేర్చుకోవే అంటే అమ్మో భయం అంటావు. ఇప్పుడు ఎంత యూస్ అయ్యేది.. చూద్దాం అవసరమైతే అప్పుడే నేర్చుకోవచ్చు.. ఎప్పుడో ఒకప్పుడు దేవా సారే నీ భయాన్ని పోగొట్టి నేర్పిస్తారు ఏమో.. ఇంకా ఆపుతావా... హిమా వెళ్లడం చూసి సూర్య నవ్వుకుంటూ విక్రమ్ దగ్గరకి వెళ్తాడు. ఏరా ఫేస్ వేలిగిపోతుంది. ఆ అమ్మాయి నీ ట్రాప్ లో పడిందా.. ఇలాంటి బ్రెయిన్లెస్ గర్ల్స్ కాస్త పొగిడితే చాలు అలా పడుంటారు. అదే విశిని నువ్వు పొగిడినా సరే చిన్న స్మైల్ ఇచ్చే ఏదో మీ అభిమానం అని తప్పుకుంటుంది. అబ్బో మా అమ్మాయి గురించి బాగానే చెబుతున్నావే అని శ్రీ అంటే.. అవును అంకుల్. రేపు వస్తుంది కదా మీకే అర్థమవుతుంది. ఇలాంటి అమ్మాయిలు ఈ రోజుల్లో ఉన్నారా అనిపిస్తుంది.. అమ్మని చూస్తే ఎలాంటి ప్లజంట్ ఫీలింగ్ వస్తుందో.. విశి ని చూసిన అలాగే వస్తుంది. సో ఫ్యూచర్లో కూడా నీకు ప్రాబ్లం లేదు అంటావు. మా బావ మా చెల్లి తో హ్యాపీగా ఉన్నట్టు.. నువ్వు మా అమ్మాయితో ఉంటాను అంటున్నావు అంతే కదా.. మీకు అర్థం అయ్యాక మళ్ళీ ఇంక నేను చెప్పేది ఏముంది... ఎంతైనా మీ బాబు కొడుకుల ఇద్దరు అదృష్టవంతులు రా... మీరు మాత్రం కాదా.. నేహా ఆంటీ ఎంత క్యూట్ గా ఉంటారు. మీరు ఇంకా లవ్ బర్డ్స్ కదా. అవునా.. నీకు అలా కనిపించిందా.. ఒరేయ్ కళ్ళకు కనపడేవన్నీ నిజాలు కాదురా.. కళ్ళకు కనపడనవి కూడా చూడాలి. అప్పుడే తెలుస్తుంది.. లవ్ బర్డ్స్ అవునో... కాదో.. అవునా ఒక్కసారి ఆంటీ కి ఫోన్ చేసి అడగనా.. ఎందుకురా ప్రశాంతంగా సాగిపోతున్న నా సంసారంలో చిచ్చుపెట్టడానికి కాకపోతే... వీడు అలాగే మాట్లాడతాడు గాని నెక్స్ట్ స్టెప్ ఏంటి సూర్య... వెయిట్ చేద్దాం.. ఆ గౌతమ్ గాడు ప్లాన్ ఏంటో తెలుస్తుంది కదా.. ఈ లోపు ఈ హిమ వెళ్లి వాళ్ళ నాన్నతో మాట్లాడుతుంది. నా నెంబర్ తెలియదు కదా... ఒక 2 డేస్ లో మన ఆఫీస్ ముందు వెయిట్ చేసినా ఆశ్చర్య పడక్కర్లేదు. నేను వెళతాను అని సూర్య బయటకి వచ్చేస్తాడు. వీడిని చూస్తుంటే చాలా ప్రౌడ్ గా ఉంది బావ. దేనికి రా.. నువ్వు అవని విషయంలో నిలబడిందానీ కన్నా వీడు ఇంకా ఎక్కువ నిలబడుతున్నాడు. మీ మామగారు ఈ మధ్యన ఫోన్ ఏమీ చేయడం లేదా... మొన్నే మాట్లాడారు. భువనగిరి వెళ్లిపోయారు కదా ప్రశాంతంగా ఉంది అని చెబుతున్నారు. ఇక్కడ ఆయన బిజినెస్ కూడా మనమే హ్యాండిల్ చేస్తున్నాము కదా.. సో ఆయన రిలాక్స్డ్ గా ఉన్నారు. మన కంపెనీలో కలిపేయమని చెబుతున్నారు. బట్ అది కరెక్ట్ కాదు కదా.. ఆయనకి అవని తో పాటు శిల్ప కూడా ఉంది. ఎంత కాదు అనుకున్న ఇద్దరు ఆయన కూతురులే.. రేపు ఏ విషయంలో కూడా వాళ్ళ మధ్యన ఈ ప్రాపర్టీస్ గురించి చీప్ డిస్కషన్ రాకూడదు. నువ్వన్నది నిజమేలే.. ఇంతకీ ఆ శిల్పా ఉదయ్ ఎలాగున్నారు.. హ్మ్.. బాగానే ఉన్నారు. అక్కడ విలేజ్ లైఫ్ చాలా బాగుంది. ఊర్లో గౌరవం పేరు పలుకబడి అంతా బానే సంపాదించారు. దివ్యని కూడా చాలా పద్ధతిగా పెంచుతున్నారు. నాకే ఆశ్చర్యమేస్తుంది. శిల్పలో ఎంత మార్పు.. కూతురు విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటుందో చూస్తూ ఉంటే ఆశ్చర్యమేస్తుంది.. కొన్ని కొన్ని దెబ్బలు మనుషుల్లో మార్పు తీసుకువస్తాయి. అది కొంతమంది మంచిగా తీసుకొని ముందుకు వెళితే ఇదిగో శిల్ప ఫ్యామిలీ లాగా హ్యాపీగా ఉంటారు. లేదు అనుకుంటే.. మీ భార్గవి అత్త లాగ పైకి పోతారు. ఛీ.. ఛీ.. ఆ మనిషి నాకు అత్తయ్య ఏంట్రా.. ఎంత కాదనుకున్నా.. మీ మామగారి భార్య ఏ కదా.. ఇంకా టాపిక్ వదిలేయ్ రా బాబు.. ఎక్కడికో వెళ్ళిపోతావు.. సరే ఇంటికి వెళ్ళావా. వెళ్ళాలి. అసలే నా కొడుకు తొందరగా వచ్చి పై పోర్షన్ మొత్తం చూడమన్నాడు. రెండు రోజుల నుంచి అదే పనిలో ఉన్నాడు. ఒకసారి ఫైనల్ గా చూసి ఏమైనా ఉంటే చెప్పమన్నాడు. అది గనక మిస్ చేశాను అనుకో.. రేపు అమ్మ కొడుకులిద్దరూ కలిసి నన్ను వాయించేస్తారు. విశిష్ట నూతన గృహప్రవేశం.....
20-04-2026, 10:57 AM
Part - 50
హిమ ఎగురుకుంటూ ఇంటికి వెళ్లి డాడ్ డాడ్ అని అరుస్తూ ఉంటుంది. ఏమైంది బేబీ అంతలా అరుస్తున్నావు అని విస్కీ సిప్ చేస్తూ అడిగితే.. మీకు హ్యాపీ న్యూస్.
చెప్పాను అంటే ఎగిరిగంతులు వేస్తారు. అవునా అంతా ఏముంది అని రమేష్ అక్కడ సోఫాలో కూర్చొని అడుగుతాడు. ఈరోజు వి. జె. స్ కంపెనీకి వెళ్లాం కదా.. ప్రాజెక్ట్ ఓకే అయ్యిందా... లేదు డాడీ.. నా ప్రజెంటేషన్ ఆ విక్రమ్ కి నచ్చలేదు. మరి ఇంకేం హ్యాపీ న్యూస్. వాళ్ళ అబ్బాయి సూర్య.. నువ్వు కలిసావా అని ఆశ్చర్యంగా అడిగితే... తనే వచ్చి నాతో మాట్లాడాడు తెలుసా అని పొగరుగా హెయిర్ ని వెనక్కి వేసుకుంటూ చెబుతుంది. ఏమంటున్నావ్ బేబీ.. అవును నా ప్రెసెంటేషన్ ఆ విక్రమ్ కి నచ్చక గౌతమ్ కూడా సీరియస్గా వెళ్ళిపోయాడు..బట్ ఆ సూర్యకి నా ప్రజెంటేషన్ బాగా నచ్చింది. నాతో కలిసి ట్రావెల్ చేస్తాను అన్నాడు.రేపు ఫ్యూచర్లో ఇన్నోవేటివ్ గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయొచ్చు అని చెప్పాడు.. సూర్య నాకు తెగ నచ్చేసాడు అనుకో.. అందానికి అందం. ఆస్తికి ఆస్తి.. పొగరికి పొగరు.. ఎలాగైనా నేను సూర్యని పెళ్లి చేసుకుంటాను. నువ్వు నిజమే చెబుతున్నావా బేబీ... మీకెందుకు ఆ డౌట్ వచ్చింది. సూర్య విక్రమ్ కన్నా డేంజర్ అంటారు. ఇప్పుడు వరకు విక్రమ్ కొడుకుని ఎవరు చూడలేదు. అఫీషియల్ గా ఏ మీటింగ్స్ లో కూడా తను కనిపించలేదు. అలాంటిది నీతో మాట్లాడాడు... నీ టాలెంట్ కి ఇంప్రెస్ అయ్యాడు అంటే కొంచెం ఆశ్చర్యమే కదా.. మీ ఉద్దేశం ఏమిటి నాకు టాలెంట్ లేదనా అని కోపంగా అడుగుతుంది. నో బేబీ.. సూర్య నిన్ను కలిశాడు అంటేనే ఆశ్చర్యంగా ఉంది. నువ్వు అన్నట్టుగానే ఆ ఫ్యామిలీతో రిలేషన్ ఏర్పడితే మన కన్నా లక్కీ పర్సన్స్ ఎవరూ ఉండరు. మన స్టేటస్ ఇంతకీ డబల్ పెరుగుతుంది. డబల్ ఏంటి అది ఊహించిన కూడా ఊహించలేనిది. మరి ఆ గౌతమ్ ని ఏం చేస్తావు.. వేస్ట్ డాడ్.. వాడికి వర్క్ రాదు. ఎక్స్పోజ్ అవ్వడమూ రాదు. నిజంగా వాడి దగ్గర అంత టాలెంట్ ఉండి ఉంటే.. ఆ విశిష్ట ని చేయి జారనిచ్చేవాడే కాదు.. అప్పుడే వాడిని పక్కకి గెంటెయ్యకు. సూర్య నీకు పూర్తిగా కమిట్ అయ్యాడు అన్న నమ్మకం వచ్చిన తర్వాతే.. వాడిని తీసిపాడేయ్ లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఐ నో డాడ్ .. ఆ గౌతమ్ కి కూడా మన సపోర్టు కావాలి కాబట్టి అంత తొందరగా మన గ్రిప్ లో నుంచి బయటికి వెళ్ళడు. చూద్దాం.. ఏదేమైనా నీ కూతురు చాలా లక్కీ డాడ్.. అప్పుడు గౌతమ్.. ఇప్పుడు సూర్య... నీ కూతురు వరల్డ్ వైడ్ ఫేమస్ అవుతుంది. ఇంక మన కంపెనీకి వచ్చే ఇన్వెస్టర్స్ కూడా ఆ రేంజ్ లోనే ఉంటారు. ఆ మాటకి రమేష్ పొగరుగా నవ్వుకుంటూ నా కూతుర్ని అలా పెంచాను. మరో రోజు ఉదయం ఫ్రెష్ గా మొదలవుతుంది. విశి తొందరగా లేచి ఫ్రెష్ అయ్యి లగేజ్ అంతా ప్యాక్ చేస్తుంది. భానుమతి కూడా హెల్ప్ చేస్తుంది. ఈ లోపు సూర్య ఫోన్ చేస్తే చెప్పండి సార్.. అంతా రెడీయేనా అని అడుగుతాడు. అంతా రెడీ సర్. క్యాబ్ బుక్ చేసుకుని రావడమే. అవసరం లేదు నేను వస్తున్నాను. మీ బైక్ మీద ముగ్గురం వెళ్లలేము కదా సార్.. ఏమిటి జోకా.. లేదు సార్.. నిజమే చెబుతున్నాను. నాకు తెలుసు బైక్ మీద ముగ్గురం వెళ్లలేము అని.. నేను కారు తీసుకొస్తున్నాను. మీకు కారు ఎక్కడిది సార్.. అన్ని ఫోన్ లోనే చెప్పాలా అక్కడికి వచ్చాక అయినా చెప్పవచ్చా.. వచ్చాక మాట్లాడుకుందాం.. గుడ్ మొత్తం ప్యాక్ చేసి ఉంచారా.. అవ్వకపోయినా పరవాలేదు నేను వచ్చి చేస్తాను. ఎక్కువ టెన్షన్ తీసుకోకు. నో ప్రాబ్లం సార్ అయిపోయింది.. సరే అని సూర్య బయలుదేరడానికి రెడీ అయ్యి.. విక్రమ్ దగ్గరికి వెళ్లి నాన్న.. విశి ని ఈరోజు షిఫ్ట్ చేస్తున్నాను. నా కోడలతో ఈ ఇంట గృహప్రవేశం చేయించకుండా... ఆ ఇంట గృహప్రవేశం చేయిపిస్తున్నావా.. అక్కడ కూతురుగానే కదా.. నో ప్రాబ్లం వెళతాను వెయిట్ చేస్తూ ఉంటుంది.. అవని.. ఒక నిమిషం ఉండరా అని చీర తీసుకొచ్చేస్తుంది. ఇది ఎందుకమ్మా. మన ఇంటికొస్తే ఇక్కడ ఇచ్చేదాన్ని.. అక్కడికి నేను తీసుకొచ్చి ఇస్తే తెలిసిపోతుంది కదా అందుకే నువ్వే ఇవ్వు.. నేను ఎలా ఇస్తానమ్మా.. ఇందులో ఇబ్బంది పడడానికి ఏముంది. అమ్మ ఈ చీర ఇచ్చింది. చీర కట్టుకుని కొత్త ఇంట్లో పాలు పొంగించితే మంచిది అని చెప్పు. విశికి సెంటిమెంట్స్ ఎక్కువే కదా.. కాదనదు. తను ఒప్పుకుంటుందో లేదో కాస్ట్లీ అని ఫీల్ అవుతుందేమో.. అందుకే రా నేను కాస్ట్ ఎక్కువ పెట్టి తీసుకోలేదు. లేకపోతే నాకు కాబోయే కోడలికి తీసుకునే చీర ఏ రేంజ్ లో ఉంటుందో మీ నాన్నని అడుగు. ఇప్పుడు టైమ్ లేదు.. వచ్చాక క్లియర్గా అడుగుతాను ఇప్పుడు నాకు టైం అవుతుంది.. చీర తీసుకొని బయటకొస్తే వైభవ్ రెడీగా ఉంటాడు. వెళదామా అన్నయ్య.. నువ్వు ఎక్కడికి రా.. అరే మా బాబి ఇల్లు షిఫ్ట్ అవుతుంటే ఈ లక్ష్మణుడు తోడు లేకుండా ఉంటుందా.. మేమిద్దరం బిజినెస్ లోనే కాదు ఏ పనిలోనైనా పార్టనర్సమే.. లలిత ఒక్క నిమిషం ఆగిరా అని ప్రసాదం తీసుకొచ్చి ఇస్తుంది. ఇదేమిటి నానమ్మ.. గుడికి వెళ్లి అమ్మాయి పేరు మీద పూజ చేయిపించాను రా.. పట్టుకువెళ్లి కుంకుమ ఇవ్వు.. అమ్మాయికి అంత మంచే జరుగుతుంది. ఇవన్నీ పట్టికెళ్తే ఖచ్చితంగా తనకు అనుమానం వస్తుంది. రాకుండా నేను మేనేజ్ చేస్తాను కదా అన్నయ్య.. పద పద ఇప్పటికే బాబీ వెయిట్ చేస్తూ ఉంటుంది. సౌమ్య వచ్చి ఆల్ ద బెస్ట్ బావ. తొందరగా అక్కని మన ఇంటికి తీసుకువచ్చేయాలి. చిన్న స్మైల్ ఇస్తాడు. చందు కనపడటం లేదు.. రావడం లేదా. ఎందుకు రావడం లేదు. అది నిన్నే వచ్చి వెళ్ళింది. నువ్వు ఫుల్ బిజీగా ఉండి తెలియడం లేదు .. చందు వైభవ్ నీ బాగా మిస్ అవుతుంది. నిన్న ఒకటికి పది సార్లు అడిగింది అనుకో... దేనికి నాతో గొడవ పడడానికా.. నీకు అదే అర్థమవుతుంది. సరే బయలుదేరండి. లేడీస్ ఎదురు వచ్చి ఆల్ ద బెస్ట్ చెప్పి పంపిస్తారు. సూర్య కార్ తీస్తూఉంటే ఏమిటన్నయ్య బైక్ మానేసి కార్ స్టార్ట్ చేస్తున్నావు. మీ బాబిని షిఫ్ట్ చేయాలి కదా బైక్ మీద ఎలా కుదురుతుంది. ఇద్దరకి చెరో బైకు ఉంది కదా.. ఒక బైక్ మీద నువ్వు బాబిని తీసుకురా.. నా బైక్ మీద ఆంటీ ని తీసుకు వస్తాను. ఆంటీకి కొత్త వాళ్ళతో అంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది. సరే పద మరి కారు ఎక్కడిది అంటే ఏం చెబుతావు. ఒరేయ్ నువ్వు, విశి క్యూస్షన్ బ్యాంక్ ఏమన్నా మింగేసారా? ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతానే ఉంటారు. ముందుగా ప్రిపేర్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. పద పద ఇప్పటికే లేట్ అయింది. ఇద్దరూ విశి ఫ్లాట్ కి చేరుకుంటారు. అప్పటికే విశి రెడీగా ఉంటుంది. రెడీ నా.. ఎప్పుడో సార్ బయలుదేరాదామా.. లగేజ్ తీస్తూ ఉంటే ఇవి ఇక్కడే ఉంచే ప్యాకర్స్ వస్తున్నారు. వాళ్ళు తీసుకొస్తారు.. ఎంతో లేదు కదా.. చూడు విశి మేమున్నాం కదా.. ఇద్దరు జెంట్స్ ఉండి కూడా లేడీస్ ఇలా కష్టపడితే బాగోదేమో... ప్యాకర్స్ వచ్చి లగేజ్ మొత్తం తీసుకువెళ్లి మినీ ట్రక్ లో పెడతారు. అడ్రస్ చెప్పగానే ట్రక్ వెళ్ళిపోతుంది. ఇంకా మనం బయలుదేరదామా.. సరే అని రా అమ్మ.. మీ నాన్నగారికి ఫోన్ చేసావా అమ్ములు. చేశాను ముందు మనిద్దరిని వెళ్ళమన్నారు. నాన్నగారు వెనకాల వస్తాను అన్నారు.. అవని ఇచ్చిన చీర ఎలా ఇవ్వాలో అర్థం కాక సూర్య తల పట్టుకుంటాడు. వైభవ్.. నేను ఇచ్చేయనా.. లేదు ఇది నేనే ఇవ్వాలి. ఫస్ట్ గిఫ్ట్.. సరే నువ్వు గనక ఆలస్యం చేస్తే నేనే ఇచ్చేస్తాను. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు. అది చీర అమ్మ నీకు ఇమ్మంది అని ఇబ్బందిగా చెబుతాడు. చీర నాకెందుకు. అది ఇల్లు షిఫ్ట్ అవుతున్నావు కదా పాలు పొంగించేటప్పుడు చీర కట్టుకుంటే మంచిదంట.. పూజ చేయిపిచ్చి తీసుకువచ్చి ఇచ్చింది. కట్టుకో అని ఇస్తాడు. అది అని ఇబ్బంది పడుతూ ఉంటే.. కట్టుకో బాబి మా పెద్దమ్మ చేయి చాలా సెంటిమెంట్. ఏది జరిగిన సరే మా పెద్దమ్మ చేతితో జరగాల్సిందే... సరే అని కట్టుకొని వస్తుంది. ఎలా ఉన్నాను సార్ అని అడిగితే.. మొదటిసారి చీరలో చూడగానే.. సూర్య గుండె లయతప్పుతుంది. అబ్బా చంపేస్తున్నావే.. ముందు మా అమ్మ ని అనాలి. ఈ టైంలో నీతో చీర కట్టించి నా సహనానికి పరీక్ష పెడుతుంది. అన్నయ్య.. మరీ ఎక్కువగా చూడకు. బాబీకి దిష్టి తగులుతుంది.. వైభవ్ వైపు ఒక లుక్ ఇస్తే ఎస్ అని కళ్ళు ఆర్పుతాడు.. బాగున్నావు అని మెరిసే కళ్ళతో కష్టంగా చెబుతాడు. అక్కడే ఉంటే ఏమి జరుగుతుందో అన్న కంగారుతో.. సరే పదండి ఇప్పటికే లేట్ అవుతుంది అని నలుగురు కారులో స్టార్ట్ అవుతారు. కార్ స్టార్ట్ అయిన కొంచెం సేపటికి సార్ అని పిలుస్తుంది.. చెప్పు విశి.. ఒక విషయం అడుగుతాను నిజం చెబుతారా.. నీకు ఎప్పుడైనా అబద్ధం చెప్పానా.. అలా అని కాదు. మరి ఎందుకు అంత అనుమానం అడుగు.. మీరు తీసుకు వెళ్ళుతున్న ఆ ప్లేస్ చాలా కాస్ట్లీ ఏరియా కదా.. అవును. మరి మనకు అంత తక్కువ రెంట్ కి ఎలా ఇస్తున్నారు. చెప్పాను కదా.. వాళ్లకి ఫ్యామిలీ కావాలి. రెంట్ కాదు. వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ఎంత డబ్బులు ఉన్నా సరే అంత తక్కువకి ఎలా ఇస్తారు. చూశాక నీకే అర్థమవుతుంది కదా.. కార్ ఎక్కడిది సార్ అని ఇంకొక క్వశ్చన్ అడుగుతుంది. సూర్య విశిని చూస్తే.. వైభవ్ వచ్చే నవ్వుని కష్టంగా ఆపుకుంటాడు. మా ఫ్రెండ్ ది తీసుకోవచ్చాను. అవునా అడగగానే ఇచ్చాడు అంటే మీకు చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట.. అది మన బిహేవియర్ మీదే ఉంటుంది. నువ్వు మంచిగా ఉంటావు కాబట్టే కదా మేమందరం హెల్ప్ చేస్తున్నాము... సూర్య విశి తో గృహప్రవేశం.....
20-04-2026, 11:00 AM
Part - 51
సార్ అని విశి మళ్ళీ పిలవగానే సడన్ బ్రేక్ వేస్తాడు. ఏమైంది... ఇల్లు వచ్చేసింది.. అవునా...బాబి అని వైభవ్ పిలుస్తాడు.
చెప్పు వైభవ్.. కుడికాలు ముందు పెట్టి దిగండి..ఇదేమన్నా అత్తారిల్లా కుడికాలు ముందు పెట్టి దిగడానికి... ఏదైతే ఏమిటి వాతావరణం బాగుంది.. ఇల్లు చూస్తే శుభ సూచకంగా ఉంది..నీకు అంతా మంచే జరగాలి అని ఈ లక్ష్మణుడి బాధ. అయ్యో ఎందుకు అంత పెద్ద మాటలు... కుడికాలే కదా పెడతాను అని దిగుతుంది. సూర్య వైభవ్ వైపు కోపంగా చూస్తూ ఉంటే.. ఏమైంది అన్నయ్య అలా చూస్తున్నావు. ఇప్పుడు నీకు ఇంత డ్రామాటిక్ అవసరమా.. అవసరమే నువ్వు ఎలాగా వదినతో ర్యాంపో పెంచుకోవడం లేదు. నేనైనా పెంచుకుంటే.. ఫ్యూచర్లో మా ఇద్దరి మధ్యన స్ట్రాంగ్ కలెక్షన్ ఉంటుంది. కాబట్టి ఎవ్వరు నన్ను ఏమీ అనలేరు. ఎలా ఉంది నా లాజిక్.. నీ మొఖం లాగానే ఉంది. థాంక్యూ అన్నయ్య.. నిన్ను పొగడలేదు కదరా.. నా మొఖం ఎప్పుడూ అందంగా ఉంటుంది. పెద్దమ్మ చెబుతుంది.. నిన్ను మించిన అందగాడు ఎవరూ లేరు రా అని.. సూర్య తల పట్టుకుంటాడు. విశి, భానుమతి కార్ దిగి ఇల్లు చూస్తూ ఉంటారు. అమ్మో ఇల్లు చాలా పెద్దగా ఉంది అని సార్ అని పిలుస్తుంది. వస్తున్న అని కారు దిగుతాడు. ఏమైంది.. ఇల్లు చాలా పెద్దగా ఉంది. నిజంగా మనకి తక్కువకి ఎందుకిచ్చుంటారు అని షర్టు పట్టుకుని లాగుతూ అడుగుతుంది. విశి చేసే పనికి చిన్నగా నవ్వుకుంటూ దగ్గరకు రా చెబుతాను.. చెప్పండి అని జరిగితే.. సీక్రెట్ అంటాడు. సీక్రెట్.. అవును సీక్రెట్ ఎవరికి చెప్పకు అని ముందుకు నడుస్తాడు. మీరు ఏమీ చెప్పలేదు కదా.. అదే సీక్రెట్. రా.. ఆంటీ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు.. లోపలకి వెళ్ళేటప్పుడికి శ్రీకర్ ఎదురు వచ్చి వెల్కమ్ వెల్కమ్ అంటే.. మీరేంటి సార్ ఇక్కడ అని ఆశ్చర్యంగా అడిగితే.. నేను ఇక్కడ పెయింగ్ గెస్ట్ కింద ఉంటున్నాను.. అవునా భలే సర్ప్రైజ్ గా ఉంది. ఉండు అమ్మ వాళ్ళని పిలుస్తాను అని నాలిక కరుచుకుంటాడు. అమ్మ అంటే.. అదే ఆంటీ వాళ్ళ అబ్బాయి యూఎస్ లో ఉన్నాడు. వీళ్ళకి.. వాళ్ళ అబ్బాయిని మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది అని నేను అమ్మ నాన్న అని పిలుస్తున్నాను అని కవర్ చేస్తాడు. మీరు చాలా మంచి వాళ్ళు సార్.. నా మంచితనం ఏమిటో నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్ధమవుతుంది. అమ్మ అని పిలిస్తే నేహా, సురభి వస్తారు. అమ్మ, నాన్నమ్మ అని పరిచయం చేస్తాడు. లోపలికి రండి అమ్మ.. అక్కడే ఆగిపోయారేంటి..కుడికాలు ముందు పెట్టు రా తల్లి.. అలాగే ఆంటీ అని వస్తుంది. మీ ఇల్లు చాలా బాగుంది. ఏమీ చూడకుండానే చెప్పేస్తున్నావు.. అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకు పట్టుకుంటే తెలుస్తుంది. అలాగే రాగానే పాజిటివ్ ఎన్విరాన్మెంట్ కనిపించింది. బాగున్నట్టే కదా.. నువ్వు అచ్చు మా సూర్యా లాగానే ఆలోచిస్తున్నావు. సూర్య నా.. సూర్య అంటే ఎవరు మీ అబ్బాయా.. ఏరా సూర్య అంటే ఎవరో తెలియదంటుంది ఏంటి అని సురభి అడిగితే.. సూర్య ఇక్కడ లేడు కదా నానమ్మ ఎలా తెలుస్తుంది. నువ్వు మమ్మల్ని అందరినీ చూస్తున్నావ్ గానీ. నా ఫ్రెండ్ దేవాని చూడడం లేదు.. వైభవ్ ని చూడడం లేదు.. దేవ నా.. ఇంకా ఎవరో అనుకున్నాను. కూర్చోవయ్యా థాంక్స్ మామ్మగారు.. భానుమతిని పరిచయం చేస్తుంది. ఒకరికొకరు ప్రతి నమస్కారాలు చేసుకున్న తర్వాత.. ఆంటీ టైం అవుతుంది పోర్షన్ లోకి వెళదామా. అలాగేనమ్మా..ఇప్పుడే వెళదాము ఉండు...పాలు పొంగించడానికి కావాల్సిన అన్ని తీసుకొస్తాను. అయ్యో ఆంటీ అన్ని నేను తెచ్చాను. అరే ఈ కాలం పిల్లలకి ఇవి కూడా తెలుసా.. మా అమ్మాయికి అన్నీ తెలుసండి. వాళ్ళ నాన్నగారు చిన్నప్పటినుంచి ప్రతిదీ నేర్పించేవారు. దేని విలువ ఏమిటో చెప్పేవారు..అందుకే ఏ పండక్కి అయినా సరే అమ్మాయి అన్ని పద్ధతిగా చేస్తుంది. అవునా అయితే మాకు ఇంట్లో ఆడపిల్లలేని లోటు తీరిపోతుందన్నమాట.. శ్రీ, వాసు కూడా వస్తే వాళ్లని కూడా పరిచయం చేస్తారు.. శ్రీకర్ సార్ మీకు ఈ అంకుల్ కి చాలా దగ్గర ఫీచర్స్ ఉన్నాయి. అవునా... చూసిన వాళ్ళందరూ అలాగే అంటారు అమ్మ.. వీడిని చూస్తే అచ్చు మీ మనవడని చూసినట్టే ఉంది అంటారు. ఏం చేస్తాం చెప్పు వాడు అమెరికాలో కూర్చున్నాడు అని సురభి అంటే.. వెనకాల నిలబడి నమస్కారం చేస్తారు. సరే పదండి టైం అవుతుంది అని పోర్షన్ లోనికి తీసుకు వెళతారు. ఆంటీ అని పిలిస్తే చెప్పు అని నేహా అడుగుతుంది. మీరు చూస్తే చాలా మంచి వాళ్ళలాగా ఉన్నారు. మీ ఇల్లు కూడా మంచి ప్లేస్ లో ఉంది. మాకు ఎందుకు తక్కువకి ఇస్తున్నారో తెలుసుకోవచ్చా.. సూర్య అది విని ఉఫ్. అనుకుంటూ ఈ పాయింట్ మాత్రం వదలడం లేదు. యాక్చువల్ గా మాకు రెంటుకి ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ గురించి శ్రీకర్ మొత్తం చెప్పాడు. అది వినగానే ఒక ఆడపిల్ల తల్లి కోసం ఇంత ఫైట్ చేస్తుంది అని ముచ్చట వేసింది. మా అత్తయ్య మావయ్య గారు ఇద్దరు డాక్టర్స్. సో ఏ విధంగా చూసినా నీకు ఉపయోగపడుతుంది కదా.. మాకు ఆడపిల్లలు లేరు. నీలాంటి అమ్మాయిని చూస్తూ ఉంటే ఆడపిల్లలు లేని లోటు తీరుతుంది అని రెంట్ కూడా వద్దు అన్నాము. కానీ నీకు చాలా అభిమానం ఎక్కువ.. ఫ్రీగా అయితే ఒప్పుకోవు అన్నారని ఏదో నామమాత్రానికి 1000 చెప్పాను అంతే .. హమ్మయ్య ఇంక మనల్ని ఈ ప్రశ్న వదిలేస్తుంది రా బాబు అనుకుంటారు. పైకి వెళ్లి చూసేటప్పటికి ప్లేస్ అంతా కూడా చాలా ప్లసెంట్ గా అనిపిస్తుంది. ఓపెన్ ప్లేస్ ఎక్కువ వచ్చి మొక్కలు పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. చుట్టూ గాలి కూడా బాగా వస్తూ ఉంటుంది.. గుమ్మానికి కూడా పువ్వులు కట్టి ఉంటాయి. ఇవన్నీ మీరే చేశారా.. శ్రీకర్ ఖాళీగానే ఉన్నాడు కదా.. మీరు వచ్చేలోపు చేశాడు. శ్రీ.. వాసుతో చూసావా నాన్న. మనిద్దరం కూడా చేయ్యి వేసాము కదా.. మనిద్దరినీ పక్కన పెట్టేసి ఒక్క కొడుకు గొప్పలే చెప్పుకుంటుంది చూడు.. ఒరేయ్ గట్టిగా మాట్లాడకు. ఆ మాట నీ పెళ్ళాం... నా పెళ్ళాం వింటే ఇక మనకి రాత్రికి ఫుడ్ కట్ చేసేస్తారు. ఎందుకు చెప్పు పొగిడింది మనవాడినే కదా అనుకోని సర్దుకుపోవాలి.. ఎలా ఉండే మీరు ఎలా అయిపోయారు. అనుభవాలు అన్నీ అలాగే నేర్పిస్తాయి లేరా.. ముందు జరిగేది చూడు.. వైభవ్ బాబి అని పిలిస్తే.. చెప్పు.. నువ్వు దేవుడి ఫోటో పట్టుకుని అమ్మ చేతికి ఇంకో ఫోటో ఇచ్చి కుడికాలు పెట్టి లోపలికి రా.. నేను లోపలి నుంచి ఫొటోస్ తీస్తాను.. ఈ కుడికాలు సెంటిమెంట్ ఏంటి. కారు దిగేటప్పుడు అలాగే అన్నావు.. ఇప్పుడు అలాగే అంటున్నావు.. ఏదైనా నీకు మంచి జరగాలని బాబీ ఈ లక్ష్మణ్... నాకు అర్థమైంది ఇంకా ఆపేయవా ఆ డైలాగ్ ప్లీజ్.. బాగా అయింది ఎదవకి.. పొద్దున్నుంచి నన్ను చావదొబ్బేస్తున్నాడు అని వెనకనుంచి సూర్యా వెక్కిరిస్తాడు.. భానుమతి చేతికి దేవుడు ఫోటో ఇచ్చి.. విశి వాళ్ళ నాన్నగారి ఫోటో కొట్టుకుంటుంది. భానుమతి ముందు వెళుతుంది. విశి అడుగుపెట్టే టైంకి సూర్య వచ్చి పక్కన నిలబడతాడు. ఇద్దరూ కలిసి లోపలికి అడుగుపెడతారు. వైభవ్ ఫొటోస్ తీస్తాడు... సూర్యకి గాలిలో తేలిపోతున్న ఫీలింగ్ వస్తుంది. విశి నే మైమరుపుగా చూస్తూ లోపలికి వెళతాడు.. అది చూసిన శ్రీ ఈ ప్రేమ మాయ ఏమిటో గాని ఎలాంటి వాడినైనా లొంగదీస్తుంది.. అప్పుడు నేను.. ఇప్పుడు వీడు... ఏరా నీ లవ్ మేటర్ ఎంతవరకు వచ్చింది అని కొడుకుని అడిగితే...మా మామగారు ఇండైరెక్టుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అవునా.. భరత్ ఒప్పుకున్నాడా...పైకి అంత స్ట్రిక్ట్ గా కనిపిస్తాడు. నా కొడుకు లాంటి అల్లుడు రావాలి అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకునిఉండాలి. ప్రతి అమ్మ ఫీలింగ్ ఇదే అనుకుంటా కదా నాన్న.. ఒరేయ్ మీ అమ్మ ఇటే చూస్తుంది.. మనం కూడా లోపలికి వెళ్దాం పద అని వెనకాలే వెళతారు. స్టవ్ పెట్టే ప్లేసులో ముగ్గు వేసి స్టవ్ పెట్టి పాల గిన్నె కి బొట్లు పెడుతుంది. పాలు పొంగించి పాయసం చేస్తుంది.. విశి చేసే ప్రతి పనిని అందరూ శ్రద్ధగా చూస్తూ ఉంటారు.. అచ్చు అవని లాగానే ఉంది కదండీ అని నేహా అంటే.. అవును. అందుకే సూర్య అంతలా పడిపోయాడు.. దేవుడి దగ్గర పెట్టి.. అందరికీ బౌల్స్ లో పెట్టి ఇస్తుంది. సారీ సారీ లేట్ అయ్యాను అని భవ్య కంగారుగా వస్తుంది. లెహంగాలో వచ్చిన భవ్యాని చూసి వైభవ్ నోరు వదిలేస్తాడు. రా భవ్య.. ఇప్పుడే పాలు పొంగించడం అయ్యింది.. నా ఫ్రెండ్ అని పరిచయం చేస్తుంది. వైభవ్ బాబు ఏమిటి నీ పరిస్థితి....
20-04-2026, 11:02 AM
Part - 52
విశి భవ్యని అందరికీ పరిచయం చేస్తుంది. కలివిడిగా అందరితో కలిసి కబుర్లు చెబుతున్న భవ్య వైపే వైభవ్ చూపు ఉంటుంది. కళ్ళల్లో మెరుపులు మెరుస్తాయి..
ఇప్పటివరకు ఈ అమ్మాయి మీద ఫోకస్ పెట్టలేదు కానీ... నా యాక్టివ్ నెస్ కి సరిపోయే జోడి... బాబీ సైలెంట్ అయితే ఈ భవ్య తుఫానులాగా ఉంది..అప్పుడు ఇల్లంతా సందడే సందడి... ఎలాగైనా భవ్యతో మాటలు కలపాలి. ఫ్రెండ్షిప్ స్టార్ చేయాలి ఎలా అని ఆలోచిస్తూ ఉంటే... విశి అందరికీ టీ పెట్టి కప్పులో పోసి తేస్తూ ఉంటే అరే బాబీ... నేను ఇస్తాను కదా.. ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావు ఇలాగ ఇవ్వు. ఆ ట్రే పట్టికెళ్ళి అందరికీ ఇస్తాడు. భవ్య టి తీసుకో అని మెలికలు తిరిగితూ ఇస్తాడు. సోరి.. నాకు టీ అలవాటు లేదు. అవునా అని నా డల్ గా అని.. కాఫీ, జ్యూస్ అంటే.. ఇట్స్ ఓకే ఇప్పుడు ఏమి అవసరం లేదు. శ్రీకర్ డౌటుగా చూస్తూ వీడేంటి భవ్యతో పులిహార కలుపుతున్నాడు... లేక ఇంకేదైనా స్టెప్ తీసుకుంటున్నాడా.. సూర్య నాకు అదే డౌట్ గా ఉంది.. భవ్య వచ్చినప్పుడు వీడి ఫేసులో రకరకాల ఫీలింగ్స్ కనబడుతున్నాయి.. సరేమ్మ.. మీరు సర్దుకుంటారేమో మేము వెళ్తాము.. ఆంటీ లంచ్ టైం కి మాత్రం ఇక్కడికే వచ్చేసేయండి.. అందరూ ఇక్కడే భోజనాలు చేయాలి. అది మేము చెప్పాలి. నువ్వు సర్దుకుంటూ వంట కూడా చేస్తావా.. మేమే చేసి తీసుకొస్తాము. లేదు ఆంటీ.. ఎంతసేపు... ఎక్కువ వెరైటీలు చేయను. ప్లీజ్ ఫస్ట్ డే కదా. నలుగురు భోజనం చేస్తే ఇంటికి మంచిది. నీకు చాలా సెంటిమెంట్స్ ఎక్కువ అనుకుంటా.. నాన్నగారు చెప్పారు అంటుంది.. సరే నీ సెంటిమెంట్స్ కాదనడం ఎందుకు.. ఇక్కడే మేము వంట చేస్తాము. మీరు సర్దుకోండి. అయ్యో మీరు చేస్తే... చూడు విశి నువ్వు ఇక్కడికి వచ్చావు అంటే మా అమ్మాయికిందే లెక్క.. కాబట్టి ఇలాంటి ఫార్మాలిటీస్ ఏమీ లేవు. నువ్వు భవ్య లగేజ్ సర్దుకోండి.. మేము వంట చేసేస్తాము.. మరి మేమేం చేయాలి ఆంటీ అని వైభవ్ అడిగితే.. మీ పని ఏమి లేదు.. కిందకి వెళ్లి కబుర్లు చెప్పుకోండి. నో ఆంటీ. కిచెన్లో మీకు హెల్ప్ చేస్తాము. లేదు అంటే బాబీకి హెల్ప్ చేస్తాను ఏమంటావు భవ్య.. భవ్య వైభవ్ ని పైనుంచి కిందకి చూస్తూ వీడేంటి... వచ్చినప్పుడు నుంచి.. తెగ పులిహార కలుపుతున్నాడు.. అయ్యో వైభవ్ లేడీస్ సర్దుకునే చోట నువ్వు ఏం చేయగలవు చెప్పు.. ఆంటీ వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలేమో చెయ్. నువ్వు రా విశి అని లో రూమ్ లోకి తీసుకు వెళ్ళిపోతుంది. ఏరా ఉల్లిపాయలు కట్ చేస్తావా.. మీరే కట్ చేసుకోండి. నేను కిందకి వెళతాను.. అదేంటిరా ఇప్పటివరకు కిచెన్లో హెల్ప్ చేస్తానన్నావు కదా.. ఏదో మాట వరసకి అంటాము.. మేము అలా అన్నప్పుడు మీరు అయ్యో వద్దులేరా.. మీరు ఎందుకు... ఇంతమంది ఉన్నాం కదా అనాలి.. అంతేగాని ఉల్లిపాయలు కట్ చేస్తావా.. క్యారెట్ పీల్ చేస్తావా అని పనులు పురమాయించుకోకూడదు. ఎక్కడో బాగా కాలిన వాసన వస్తున్నట్టుంది అని శ్రీకర్ అంటే.. నీ షర్టు కాలింది ఏమో చూసుకో బావ అని కిందకి వెళ్ళిపోతాడు. వెళుతున్న వైభవ్ ని చూస్తూ అందరిలాగానే భవ్య కూడా అనుకుంటున్నాడెమో... సర్లే వదిలేయ్.. ఆ టాపిక్.. మనం కూడా వెళ్దాం పద అని జెంట్స్ అందరూ కిందకి వెళ్ళిపోతారు. ఇక్కడ వీళ్ళ సర్దుకోవడం అవుతుంది. వంట అయిపోతుంది. అందరూ భోజనం చేసి రెస్ట్ తీసుకోవడానికి ఎక్కడి వాళ్లు అక్కడ సర్దుకుంటారు. సూర్య.. విశిని పిలిచి రెస్టారెంట్లో వర్క్ కంటిన్యూ చేస్తావా.. అదే అర్థం కావడం లేదు. మనీ ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి. అంత హార్డ్ వర్క్ అవసరమా అనిపిస్తుంది. అలాగని నెక్స్ట్ ప్రాజెక్ట్స్ రాకపోతే పరిస్థితి ఏమిటి అని కూడా భయం వేస్తుంది. డోంట్ వర్రీ బాబీ, నేను ఉండగా నీకు ఆ ప్రాబ్లం ఉండదు. నువ్వు ఏమంటావు అన్నయ్య.. నువ్వు కాస్త మూసుకో.. ప్రస్తుతానికి నీ దగ్గర మనీ ఉన్నాయి కదా.. రెస్టారెంట్ లో చేసే వర్క్ టైం లో ఇంటికి వచ్చి నీ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి యూస్ చెయ్. శ్రీనివాస్ అంకుల్ ఇంకా కొంచెం ఫోకస్ పెడతానన్నారు. బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు నీ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఉన్న స్కిల్స్ సరిపోతాయి అనుకుంటే ఎదగడం కష్టం. ఎప్పటికప్పుడు మనల్ని మనం పదును పెట్టుకుంటూ ఉండాలి. అర్థమైందా.. అర్థమయింది సార్.. ఇక్కడి నుంచి కాలేజ్ కి వెళ్లడం కూడా కొంచెం దూరం కదా.. ఎలా వెళతావు.. అదేంటి సార్ డ్రాప్ చేస్తానన్నారు.. ఇప్పుడు ఎలా వెళ్తావు అని అడుగుతున్నారు ఏంటి అని మనసులో అనుకుంటూ బస్సు కి వెళ్ళిపోతాను. ఈ ట్రాఫిక్ లో నువ్వు బస్సులు పట్టుకుని కాలేజీకి వెళ్లి మళ్లీ వచ్చేటప్పటికి చాలా టైం పడుతుంది.. టు వీలర్ నేర్పిస్తాను.. నేర్చుకో.. ఆ మాటకి భవ్య నవ్వుతూ ఏం మాట్లాడుతున్నారు సార్.. మీరు టు వీలర్ ఇస్తే ఇక్కడి నుంచి కాలేజ్ వరకు తోసుకువెళుతుంది కానీ మా మేడం ఎక్కదు. చాలా భయం. విశి కోపంగా చూస్తుంది. నువ్వు కోపంగా చూసినా అదే నిజం. ఎన్నిసార్లు నేను నేర్పించడానికి ట్రై చేసాను. అసలు ఒక్కసారి అయినా వచ్చావా.. అమ్మో భయం నావల్ల కాదు అనడమే... నో ప్రాబ్లం నేను నేర్పిస్తాను కదా.. విశి రోజు కాలేజీ నుంచి రాగానే డ్రైవింగ్ నేర్చుకోవాలి... సా... ర్... సార్ అని రాగం తీసిన సరే వదిలేది లేదు. ఫస్ట్ టు వీలర్ నేర్చుకో తర్వాత ఫోర్ వీలర్ నేర్పిస్తాను. సరే విశి ఇక నేను బయలుదేరుతాను...వీకెండ్ కదా అందరు వెయిట్ చేస్తూ ఉంటారు. వైభవ్.. నేను డ్రాప్ చేయనా.. థాంక్యూ.. బట్ అవసరం లేదు. మరి ఎలా వచ్చారు. నాకు టూవీలర్ వచ్చు.. రానిది దానికి... సూర్య దగ్గరకు వచ్చి దేవా సార్ మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని అన్నయ్య అని పిలవచ్చా.. ఆ మాటకి వైభవ్ గుండెల్లో బాంబు పేలుతుంది. గుండె మీద చెయ్యి వేసి గట్టిగా పట్టుకుంటాడు. వైభవ్ పరిస్థితి చూశి శ్రీకర్ నవ్వుని కష్టంగా ఆపుకుంటూ ఉంటాడు. నవ్వు ఆపుకోవడం వలన బుగ్గలు పొంగి పక్కకి తిరిగి పోతాడు. వైభవ్ సూర్య చేతిని గట్టిగా పట్టుకుంటాడు. ఏమైందిరా... తల అడ్డంగా ఊపుతాడు.. అలా అడ్డంగా ఊపితే నాకేం అర్థం అవుతుంది. నోటితో చెప్పు. అయ్యో అన్నయ్య అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ పెడతాడు. వీడు ఎప్పుడు ఇంతే.. నువ్వు పిలువు భవ్య. నేను వద్దంటానా.. నాకు ఎలాగు ఓన్ సిస్టర్స్ లేరు. సో నో ప్రాబ్లం.. థాంక్యూ అన్నయ్య. మీ బ్రదర్ కదా వైభవ్... వైభవ్ అ.. అనగానే హలో హలో అని ఫోన్ వస్తున్నట్టుగా వెళ్ళిపోతాడు. శ్రీకర్ ఇంకా ఆగలేక గట్టిగా నవ్వుతాడు. ఎందుకు సార్ అలా నవ్వుతున్నారని విశి అడిగితే.. ఏమీ లేదులే కొన్ని కొన్ని చెప్పలేము. భవ్య బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. సూర్యకి వెళ్ళాలని ఉండదు కానీ ఇంకా ఎక్కువ సేపు ఉండడానికి అవకాశం లేక.. సరే విశి నేను వెళతాను. ఏదైనా అవసరం ఉంటే వెంటనే ఒక ఫోన్ చెయ్యి. అర్జెంట్ అనుకుంటే శ్రీకర్ కిందే ఉంటాడు. పిలువు అర్థమైందా.. ఒక్కదానివే బయటికి ఎక్కడికి వెళ్ళకు. అలాగే సార్.. నాకు ఏమైనా చెప్పాలా ఒక్క నిమిషం అని కిచెన్ లోకి వెళ్లి బాక్స్ తీసుకువచ్చి ఇస్తుంది. ఏమిటది.. అదే ఇప్పుడు చేసిన స్వీట్. ఆంటీ వాళ్ళకి తీసుకువెళ్ళండి. సరే అనే ఆ బాక్స్ తీసుకుని బాయ్ చెప్పి... వైభవ్ అని పిలిస్తే.. వస్తున్న అని నీరసంగా వస్తాడు. అదేంటి వైభవ్ ఇప్పుడు దాకా మంచి యాక్టీవ్ గా ఉన్నావు. అంతలోనే డల్ అయిపోయావు. ఏమైంది అని విశి కంగారుగా అడిగితే.. పిల్లగాలి పైత్యం చేసిందిలే.. అర్థం కాలేదు సార్.. వాడికి అర్థమైందిలే కానీ మీరు వెళ్ళండి బావ.. విశికి ఏదైనా అవసరమైతే నేను చూసుకుంటాను అని పంపిస్తాడు. స్టార్ట్ అయిన తర్వాత కారులో డల్లగా కూర్చున్న వైభవ్ ని చూసి ఏమైందిరా అంత డల్ అయ్యావు.. నీతో మాట్లాడను అన్నయ్య. ఇప్పుడు నేనేం చేశాను రా.. ఎన్నిసార్లు సైగ చేశాను.. అయినా అర్థంచేసుకోకుండా.. పిలువు.. నో ప్రాబ్లం అని చెబుతావా.. ఇప్పుడు నీకేమైంది రా.. నన్ను అన్నయ్య అని పిలుస్తే... అక్కడతో ఆగకుండా నన్ను కూడా అన్నయ్య వరుసలోకి కలిపేయడానికి ట్రై చేసింది. నేను ఎంత హర్ట్ అయ్యానో నీకేం తెలుసు... ఇప్పుడు పిలిస్తే ఏమైందిరా.. ఇది మరీ బాగుంది.. నిన్ను బాబి... అన్నయ్య అని పిలిస్తే ఎంత చండాలంగా ఉంటుంది. మా ఇద్దరిదీ వేరు.. ఇది కూడా అంతే అని మెలికలు తిరుగుతాడు. ఒరేయ్ నువ్వు సిగ్గుపడకురా... సిగ్గు కూడా సిగ్గుపడి పారిపోతుంది. మనకు సూట్ అయ్యే పనులు మాత్రమే చేయాలి.. ఎందుకో అన్నయ్య భవ్య మొదటి చూపులోనే నచ్చేసింది. అందర్నీ ఫ్లట్ చేసినట్టుగా భవ్యాని కూడా చేయాలి అనుకుంటున్నావా.. నో... నో.. అందరూ వేరు.. భవ్య వేరు.. తనని చూడగానే నా కళ్ళు ఫ్లేడ్లైట్ లాగా వెలిగిపోయాయి. ఎప్పటినుంచో చూస్తున్న నా పార్ట్నర్ లాగా అనిపించింది. నీది జస్ట్ అట్రాక్షన్ మాత్రమే.. నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు అన్నయ్య. కొన్ని కొన్ని అలాగే తెలిసిపోతాయి. సరే.. ఇప్పుడు ఏమి మాట్లాడుకుండా ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నీ గుండె పైన చెయ్యి వేసుకుని ఆలోచించు.. ఎవరు కనిపిస్తున్నారో చూసి చెప్పు. సరే అని కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉంటాడు. భవ్య కనిపిస్తుంది. పొద్దుటి నుంచి చూసిన ఆ లెహంగాలోనే చెంగుచెంగున పరిగెత్తుకుంటూ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఆ రూపం దగ్గరికి వచ్చే కొలది మారిపోతూ ఉంటుంది.. మారిన రూపం కనిపించగానే నో అని గట్టిగా అరుస్తాడు. సూర్య సడన్ బ్రేక్ వేసి ఏమైంది రా.. వైభవ్ సమాధానం... కథ కొనసాగుతుంది........
20-04-2026, 12:00 PM
superb sir
20-04-2026, 01:18 PM
(20-04-2026, 11:02 AM)SivaSai Wrote: For a moment Vaibhav bandi side track pattindi anukunna.. but main line ki vachesindi. Inka Vaibhav ki ravalsindi clarity!!!
20-04-2026, 01:21 PM
Thanks Sivagaru for posting 3 episodes.
But still feel we need another story from you. Dunno your position, but request you to post a new story along with panigrahanam!!
21-04-2026, 08:37 AM
Part - 53
నో అని గట్టిగా అరుస్తాడు. సూర్య సడన్ బ్రేక్ వేసి ఏమైందిరా.. ఎందుకు అలా అరిచావు... అలాగే షాక్ లో ఉండిపోతాడు.
ఒరేయ్ వైభవ్.. నిన్నే అడిగేది.. దీనికి నేనొప్పుకోను ఒప్పుకోను అని అరుస్తూ ఉంటాడు. చెంప మీద ఒక్కటి పీకుతాడు.. వైభవ్ చెంప మీద చెయ్యి వేసుకుని ఎందుకు కొట్టావు అన్నయ్య... అసలు ఒప్పుకోను ఒప్పుకోను అని అరుస్తున్నావు. ఇప్పుడు నిన్ను ఒప్పుకోమని ఎవరు మాట్లాడారు. ఏమైందిరా.. నువ్వు చెప్పిన కాన్సెప్ట్ రాంగ్ కాన్సెప్ట్..దేని గురించి...అదే గుండె పైన చెయ్యి వేసుకుని వినమన్నావు కదా.. వింటే రాంగ్ ఆన్సర్ వచ్చింది. సరిగ్గా చెప్పు చావు.. కళ్ళు మూసుకుని గుండెపైన చెయ్యవేసుకుని చూశాను. ముందు భవ్య లేడి పిల్లలాగా పరిగెత్తుకుంటూ వచ్చింది. దగ్గరికి వస్తున్నా కొలది అని సూర్య వైపు చూస్తాడు. హ.. వస్తున్నకొలది ఆ రూపం మారిపోయింది.. మారిపోవడమేంట్రా తిక్క సన్నాసి. ఏం మాట్లాడుతున్నావు. అవును.. మారిపోయి చందులాగా కనిపించింది అని బేర్ మంటాడు. సూర్య తల కొట్టుకుంటూ మేము ముందు నుంచి చెప్పేది అదే.. నీకు తెలియకుండానే చందుతో ప్రేమలో ఉన్నావు. మధ్యలో వచ్చినవి అన్ని ఫ్లయింగ్ క్లౌడ్స్ లాంటివి. నేనొప్పుకోను అన్నయ్య.. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే నిజం. ఈరోజు నుంచి నేను చందుతో అస్సలు కాంటాక్ట్ లో ఉండను. దానితో మాట్లాడను.. చూడను... అప్పుడు ఎలా లవ్లో పడతాను. దాన్ని కూడా అట్రాక్షన్ అని తేల్చేస్తాను.. చూద్దాం అని సూర్య కార్ స్టార్ చేస్తాడు. ఇద్దరూ ఇంటికి చేరుకునేటప్పటికి రాజ్ ఫ్యామిలీ అక్కడే ఉంటుంది. సూర్య వైభవ్ వైపు చూస్తే.. నేను ఏమి చూడడం లేదు. నాకు ఎవ్వరూ కనపడటం లేదు అని రూమ్ కి వెళుతూ ఉంటే.. వైభవ్ అని నివి పిలుస్తుంది. చెప్పు అత్తయ్య అని ఎవరిని చూడకుండా వచ్చి నివి పక్కన కూర్చుంటాడు. ఏంట్రా తల అలా కిందకి వాల్చేసావు. ఒంట్లో బాగోలేదా అని తలపైన మెడ పైన చెయ్యి పెట్టి చూస్తుంది. బాగానే ఉన్నాను.. ఎందుకు పిలిచావు.. ఏదైనా పని ఉందా.. మీ అత్తయ్యకి ఏ పని లేకపోతే నిన్ను పిలవదా అని రాజ్ అడిగితే.. నేను అలా అనలేదు మావయ్య. రూమ్ కి వెళుతున్న వాడిని పనిగట్టుకుని పిలిచింది అంటే పని ఉందేమో అని అడిగాను. మీరు దానికి లేనిపోని తోకలు తగిలించి.. నాకు అత్తయ్యకి గొడవలు పెట్టకండి. అలా చెప్పరా మీ మావయ్యకి.. లేకపోతే ప్రతిదానికి వెటకారాలే.. సూర్య మొఖం వెలుగుతుంది. నీ మొఖం వాడిపోయింది ఏమిటి.. చందు వైభవ్ వైపు చూస్తుంది. నిజంగానే.. చాలా డల్ గా కనిపిస్తాడు. ఏమైంది వీడికి.. ఎప్పుడు పళ్ళు అన్ని బయట పెడతాడు.. ఇప్పుడు మాత్రం ఏదో మిస్ అయ్యినట్టుగా ఉన్నాడు.. చందు మనసు ఆగక.. ఏమైందిరా.. ఆలా ఉన్నావు... ఎలా ఉన్నాను... ఏదో నువ్వు కోరుకున్నది నీ దగ్గరకి రాకుండా.. నువ్వు వద్దనుకున్నది నీ దగ్గరకి వస్తుంది అన్న విషాదంలో ఉన్నట్టున్నావు.. చందు చెప్పిన దానికి వైభవ్ కి ఫ్యూస్ లు ఎగిరిపోయి షాక్ కొట్టిన కాకిలాగా చందు వైఫై చూస్తూ ఉంటాడు. ఏంట్రా అలా చూస్తున్నావు. దీనికి మనసులో ఫీలింగ్స్ తెలుసుకునే టెక్నిక్ ఏమైనా తెలుసా లేకపోతే ఒక రాయి వేసిందా... భవ్య రూపం కనుమరుగై.. చందు రూపం కనపడింది.. అన్నయ్య ఏమో నా ప్రేమ గమ్యం చందు అంటున్నాడు. నా మనసేమో ఒప్పుకోవడం లేదు. ఇదేమో నా మనసును చదివేస్తుంది. హౌ... ఏంట్రా అలా చూస్తున్నావు. ఏమీ లేదు. ఫ్రెష్ అయ్యి వస్తాను. రూమ్ లోకి వెళతాడు. వైభవ్ లో కనిపిస్తున్న కన్ఫ్యూషన్ ని సూర్య గమనిస్తూ ఉంటారు.. గదిలోకి వెళ్లిన వైభవ్ బాల్కనీలోకి వెళ్లి టెన్షన్ గా పాకెట్స్ లో చేతులు పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటాడు.. వైభవ్ చెవుల్లో చందు స్వరం మెల్లగా వినిపిస్తూ ఉంటుంది.. మనసు దాచుకోవచ్చు రా… కానీ ఆ దాచుకున్న మనసే మనల్ని బయటపెడుతుంది. నువ్వు కోరుకున్నది దూరంగా కనిపిస్తుంది… కానీ నీ గమ్యం నువ్వు ఊహించని దగ్గర ఉంది. ఒక్క క్షణం… గది లోపల చల్లని గాలి వీచినట్టు, వైభవ్ వెన్నులో వణుకు పరిగెత్తింది. అతని కళ్ళలో భవ్య ముఖం ఒక క్షణం మెరిసి మాయమై, మళ్లీ చందు రూపం స్పష్టంగా కనబడింది. చందూ… నువ్వు ఇది ఎందుకు చెబుతున్నావు... నేను ఫీల్ అవుతున్నది నీకు ఎలా తెలుసు.. వైభవ్ స్వరం వణికిపోయింది. చందు మాత్రం సడలకుండా, కళ్ళల్లోకి సూటిగా చూస్తూ.. ఎందుకంటే నువ్వు అనుకుంటున్నది నేను వినకపోయినా, నీ మనసు మాత్రం గట్టిగా చెబుతుంది అది నేను మాత్రమే వినగలను . నువ్వు ఎవరి కోసం ఎదురుచూస్తున్నావో నాకు తెలుసు… నీ గమ్యం ఎక్కడుందో కూడా. నా గమ్యం నీకు తెలుసా.. వైభవ్ ఆశ్చర్యంతో వెనక్కి ఒక అడుగు వేసాడు. తెలుసు అనే కదా చెబుతున్నాను.. అదే … ఎలా తెలుసుకున్నావ్? చందు చిన్నగా నవ్వి.. నువ్వు ఆలోచించని చోటే సమాధానం ఉంటుంది రా… ఇప్పటివరకు నువ్వు తప్పుగా చూస్తున్నావ్ అనుకో. నేనేమీ తప్పుగా చూడలేదు. పోని మనసుపెట్టి ఆలోచించలేదు అనుకో... వైభవ్ గుండె గట్టిగా కొట్టుకుంటూ.. ఇది నిజంగా చందు నా? లేక నా మనసే ఇలా ఆటలాడుతుందా? అని లోలోపల ప్రశ్నించుకుంటూ చందు వైపు చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు. అంటే.. ఇప్పటివరకు చందు నా ఎదురుగా నిలబడి మాట్లాడినట్టుగా అనిపించింది.. ఆ.. అని గట్టిగా అరుస్తూ జుట్టు పీక్కుంటాడు. లేదు ఇదంతా అబద్ధం. చందు నా మనసులో లేదు. వీళ్ళందరూ అస్తమానం అలా చెప్పడం వల్ల నాకు అలా అనిపిస్తుంది అంతే ... ఒరేయ్ వైభవ్ నువ్వు టెంప్ట్ అవ్వకు.. ఇదంతా భ్రమ అంతే... ఫ్రెష్ అయ్యి వెళతాడు. ఈసారి తేటగా ఉన్న మొఖం చూసి ఏదో కంక్లూషన్ లోకి వచ్చినట్టు ఉన్నావు అని చందు అడిగితే.. అవును. ఇంతకీ అత్తయ్య దేనికి పిలిచావు.. ఇప్పుడు ప్రశాంతంగా కనబడుతున్నావు. టెన్షన్ తీరిందా.. మనకి టెన్షన్స్ ఏముంటాయి.. ఒక్క నిమిషం.. నివి బ్యాగ్ లో నుంచి కుంకుమ, తాడు తీసి.. వైభవ్ నుదుటన బొట్టు... పెట్టి.. తాడు చేతికి కడుతుంది. ఇదేమిటి అత్తయ్య.. నువ్వు జాబ్ లో జాయిన్ అయ్యావు కదా.. అది కూడా విశి దగ్గర.. సో నువ్వు బాగుంటే విశి కూడా బాగుంటుంది. మీరిద్దరూ బాగుండాలి అని తీసుకువచ్చాము. గుడికి మావయ్య కూడా వచ్చారా.. మీ మావయ్యకి అంత ఖాళీ ఎక్కడ ఉంది. నేను చందు వెళ్లాము. నీ గురించి దండం పెట్టుకొని... 108 ప్రదక్షిణాలు చేసి తెచ్చింది. వై భవ్ చందు వంక చూస్తాడు... చందు మాత్రం సౌమ్యతో కబుర్లు చెబుతూ ఉంటుంది..ఇది నా గురించి నిజంగానే పూజ చేసిందా.. ఎందుకని.. ఎప్పుడు చూసినా నాతో గొడవ పడుతూ ఉంటుంది కదా.. నాపైన అంత కన్సోల్ ఎందుకు.. ఒకవేళ బాబీ గురించి చేసి ఉంటుందా.. బాబీ గురించి అయితే బాబీకి ఇమ్మని చెబుతారు గాని నాకు ఎందుకు ఇచ్చారు. బాబోయ్ ఎక్కువ ఆలోచించకూడదు. ఆలోచిస్తే నా జుట్టు నేనే పీక్కునేటట్టు ఉన్నాను.. ఈ టాపిక్ నుంచి డైవర్ట్ అవ్వాలి.. థాంక్యూ అత్తయ్య సైడ్ హాగ్ ఇచ్చి.. అమ్మ ఆకలేస్తుంది మాకు ఏమైనా ఫుడ్ పెట్టేది.. ఉందా.. అక్కడ బానే మేసావు కదరా.. అంతలోనే ఆకలేస్తుందా అని సూర్య అంటాడు. నీకే.. నువ్వు కబుర్లు చెబుతూ ఉన్నావు. మేము చాలా పనులు చేశాము.. అవునవును నేను చూస్తూనే ఉన్నాను కదా.. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకులే అన్నయ్య.. అమ్మ.. ఇదిగో అని బాక్స్ ఇస్తాడు. ఏంట్రా.. విశి నీకిమ్మని చెప్పింది. స్వీట్ తనే చేసింది... అవునా.. కోడలి చేతి మొదటి స్వీట్. అందరికీ పెడతాను అని స్పూన్ తో అందరికీ పెడుతుంది. ప్రసాదంలాగా పెట్టావు పెద్దమ్మ.. మన ఇంటిలో ఇంతమంది ఉన్న విషయం విశికి తెలిసి ఉండకపోవచ్చు.. లేకపోతె ఇంక ఎక్కువే ఇచ్చేది. అది మాత్రం నిజం పెద్దమ్మ.. బాబీ కూడా ఇద్దరికీ చెయ్యాలి అంటే నలుగురికి సరిపడా ఫుడ్ రెడీ చేస్తుంది. ఇంత ఎందుకు అంటే.. తినాలి అనుకుంటే.. లేకపోతే ఏదైనా ఒక ఐటెం బాగా ఇష్టపడితే అది కావాలి అనుకుంటే.. అది లేకపోతే నాకేదోలాగా ఉంటుంది. ఫుడ్డు మిగిలితే ఎవరికైనా ఇవ్వచ్చు కానీ అలా తుడిచి పెట్టలేను అని చెబుతుంది. ఊరిలో పెరుగు వచ్చిన అమ్మాయి కదా... కొన్ని ఫాలో అవుతారులే.. గౌతమ్ ఇంటికి వచ్చి ఒక ఫుల్ బాటిల్ తాగుతూ.. విశి గురించి.. హిమ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అనవసరంగా విశి ని దూరం చేసుకున్నానా.. ఈ హిమ ఏదో పొడిచేస్తుంది అనుకుంటే.. ఈరోజు ఫుల్లుగా డామేజ్ చేసి పెట్టింది . రెడీ అయి ఉన్న ప్రాజెక్ట్ ని ఒకసారి చెక్ చెయ్ అంటే అంత అవసరం లేదు అని బిల్డప్ ఇచ్చింది. విశి కి నేను ప్రయారిటీ ఇచ్చి తీసుకువెళ్లి ఉంటే..ఈపాటికి నాకు ప్రాజెక్ట్ ఓకే అయ్యేది. హిమ ఫాదర్ వల్ల నాకు బెనిఫిట్స్ ఉంటాయి.. అనుకుంటే వాళ్ళు నన్ను వాడుతున్నట్టు ఉన్నారు. నా వలన పాపులర్ అయ్యింది కానీ నాకు ఉపయోగపడింది ఏమి లేదు. వీళ్ళని అవాయిడ్ చేసి.. విశిని దారిలోకి తెచ్చుకోవాలా.. ఒకవేళ అలా చేస్తే ఫ్యూచర్లో నాకేమీ నష్టం ఉండదు కదా.. రమేష్ ఏదైనా చేస్తాడా.. అసలు విశి నా మాట వింటుందా? ఎందుకు వినదు.. వాళ్ళ మదర్ ట్రీట్మెంట్ చేయి పిస్తాను అని చెబుతాను. పెళ్లి చేసుకుందాం.. నీకు సొసైటీలో ఒక గుర్తింపు ఇస్తాను అని చెబితే చచ్చినట్టు వింటుంది. విశి మదర్ కి ట్రీట్ చేసే డాక్టర్ తో మాట్లాడాలి. ఆ డాక్టర్ని నా గ్రిప్ లో పెట్టుకొని.. అప్పుడు విశితో గేమ్స్ స్టార్ట్ చేయాలి... ఒరేయ్ గౌతమ్ నీ తెలివితేటలు ముందు ఎవరైనా బలాదూర్ రా అని మంచం పైన వాలిపోతాడు. బాబు గౌతమ్ ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నావు..... |
|
« Next Oldest | Next Newest »
|