Thread Rating:
  • 4 Vote(s) - 3.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందావనం
Rudra completed his 1st step. How the things unfold in Repalle would be interesting.
[+] 1 user Likes Sunny73's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Excellent update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
బృందావనమది అందరిదీ..

Sooper sooper ga undi
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Part - 88



ఉదయం రుద్ర జిమ్ చేసి గార్డెన్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు.  సంతోష్ వచ్చి ఏమైందిరా ఏదో చించుతున్నావు..

నాన్న అంటే.. సీరియస్ మేటర్ అనుకుంట..  ఏంట్రా విషయం. రేపల్లె వెళుతున్నాను.  చెప్పాలని డిసైడ్ అయ్యావా..

చెప్పాలి.  మన ద్వారానే తెలియాలి. తెలిస్తే తట్టుకోలేరేమో.. శాంభవి భయం కూడా అదే.. చిన్న మామ కూతురు గా ఉండడం కన్నా భాను మావయ్య కూతురు గా ఉండడానికే ఇష్టపడుతుంది.

ఎప్పుడు వెళ్లాలి అనుకుంటున్నావు.  రేపు.  నేను వస్తాను అన్నమాట వినపడి తండ్రి కొడుకులు పక్కకి చూస్తారు.  దేవేంద్ర కనిపిస్తాడు.

చిన్న మామ నువ్వు ఎప్పుడు వచ్చావు.  ఇప్పుడే.
  నేను ఊహించినట్టే గానే శాంభవి నీతో మాట్లాడింది. పరవాలేదు.

పుట్టుకకి కారణం అయ్యాను కానీ ఏ రోజు తండ్రి స్పర్శను ఫీల్ అవ్వలేదు.  కథంతా తెలిసి తండ్రిగా ఒప్పుకుంది కానీ తన మనసు.. ప్రాణం అన్ని ఆ కుటుంబమే. బాధపడుతున్నావా మామ.. బాధ లేకుండా ఎలా ఉంది కాకపోతే నా బాధ కన్నా ఆ కుటుంబం బాధ ఎక్కువ ఉంటుంది.

ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు.  చెప్పింది ఎలా రిసీవ్ చేసుకుని తట్టుకుంటారో తెలియడం లేదు.   ఒక సమస్య తీరింది అనుకునేటప్పటికి ఇంకొక సమస్య మొదలవుతుంది అని దేవేంద్ర తల పట్టుకుంటాడు.

ఎక్కువ ఆలోచించొద్దు చినమామ. ఇది తీరిపోయింది అంటే మనకి ఎటువంటి సమస్యలు లేవు. ఇది సమస్య అనడం కన్నా ఒక మానసిక సంఘర్షణ అనడమే బెటర్.

రుద్ర ఫోన్ రింగ్ అవుతుంది. లిఫ్ట్ చేసి వచ్చారా.. బయటే ఉన్నాము సార్. లోపలికి రండి.  ఎవరు.. ఆనంద్, విహారీలు వచ్చారు.
లోపలికి వచ్చి గుడ్ మార్నింగ్  సార్.. గుడ్ మార్నింగ్
  జర్నీ ఎలా జరిగింది. ఫైన్ సార్.. వెళ్లి ఫ్రెష్ అవ్వండి. సర్వెంట్ ని పిలిచి రూమ్ చూపించమని చెబుతాడు.

బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత... బయలుదేరదామా
సరే  సార్ ఉంటారు. ఒక్క నిమిషం అని శాంభవి దగ్గరికి వెళ్లి  ఎక్కువ ఆలోచించకు.

నువ్వు కోరుకున్నట్టుగానే జరుగుతాయి. నీ బావని నమ్ము.. అలాగే అని తలూపుతుంది.  ఆ తలఊపే బదులు ఏదో బావా అని పిలవచ్చు కదా...

నేనే బావ...  బావ.. అని చెప్పుకోవాల్సి వస్తుంది గాని ఒక్కసారి కూడా ముద్దుగా బావ అని పిలిచిందే లేదు .
చెప్పాను కదండీ...  ఎప్పుడు పిలుస్తానో..

ఇలాగే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయవే.. మీ ఆడవాళ్ళకి ఇలా సాగుతుంది.. ఏం చేస్తాము నుదుటిన  ముద్దు పెట్టుకుని జాగ్రత్త అని వెళ్ళిపోతాడు.

గదిలో ఎంతసేపు ఉన్న ఆలోచనలు తెగవు అని చారులత దగ్గరికి వెళ్లి అత్తయ్య అని పిలుస్తుంది. రా.. రా..అక్కడే నిలబడ్డావేమిటి.

మనసంతా  ఏదోలాగా ఉంది. ఎక్కడికైనా వెళ్దామా.. ఎక్కడికి వెళదాం. హ షాపింగ్ కి వెళ్దామా...నాకు పెద్ద ఐడియా లేదు.

ఇప్పుడు నుంచి అన్ని అలవాటవుతాయిలే.. మేమున్నాం కదా అని కౌసల్యకి మాధురికి ఫోన్ చేసి షాప్ కి వచ్చేయమని చెప్పి తులసి దగ్గరికి వెళ్లి రెడీ అవ్వండి.

అందరం ఈరోజు షాపింగ్ చేసి అటు నుంచి బయటే ఎక్కడైనా కుమ్మేసి వద్దాం. కోడలు మంచి హుషారుగా ఉంది కదా. మరి ఇదంతా నా కోడలు వచ్చిన వేళ విశేషం అత్తయ్య గారు..

లేడీస్ అందరూ రెడీ అయ్యి రుద్రకి మెసేజ్ చేసి బయలుదేరుతారు.  వీళ్ళ వెనకాల సెక్యూరిటీ కూడా ఫాలో అవుతుంది.
లేడీస్ అందరూ  షాపింగ్ లో ఫుల్ బిజీగా ఉంటారు. చారు ఒకటి సెలెక్ట్ చేస్తే.. కౌసల్య ఒకటి సెలెక్ట్ చేస్తుంది.
మాధురి ఇంకొకటి సెలెక్ట్ చేస్తోంది.

నీకు ఈ కలర్ బాగుంటుంది అని ఒకళ్లు.. ఈ డిజైన్స్ సూట్ అవుతుందని ఇంకొకళ్ళు చెబుతూ ఉంటే శాంభవి ముగ్గురు వంక చూస్తూ ఉంటుంది. సేల్స్ గర్ల్స్ తల పట్టుకుంటుంది.

మయూరి గదిలో కూర్చుని ఏటో చూస్తూ ఉంటుంది.. నాగేంద్ర కూతురు దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నావు మయూరి..  చేయడానికి ఏముంది నాన్న.

మీకంటే కుటుంబం ఉంది. భార్యా..  పిల్లలు... బిజినెస్ అని చాలా రకాలు ఉంటాయి. అన్నయ్యకి, అక్కకి కూడా పిల్లలు గురించి ఆలోచన.

మరి నాకేం ఉంది. కుటుంబమా..  పిల్లలా.. స్నేహితులా.. ఎవరున్నారు.  పగ పంతం అంటూ తిరిగి ఒంటరిగా మిగిలిపోయాను. ఇప్పుడు ఈ గది ఈ శూన్యమే కనపడుతుంది.

తల మీద చెయ్యి వేసి ఎక్కువ ఆలోచించకు. గదిలో ఉంటే ఇలాగే ఉంటుంది. సరదాగా షాపింగ్ కి వెళ్ళు.  వెళ్లి ఏం చేయాలి.

నీకు నచ్చినవి కొనుక్కో. ఆ చీరలు కట్టుకుని ఎవరికీ చూపించాలి. మేమందరం లేమా తల్లి. అందరూ చెప్పినది మన జీవిత భాగస్వామి చెప్పినది ఒకటి కాదు కదా...

అమ్మని వదినని చూసేదాన్ని..  ఏదైనా తీసుకోవాలి అన్న నాన్నగారికి నచ్చుతుందో....లేదో... నేను కట్టుకుంటే బాగుంది అని అంటారో లేదో అని అమ్మ ఆలోచించేది.

వదిన రెడీ అయ్యి వెళ్లి అన్నయ్యకి కనపడేది.  అన్నయ్య ఏమి చెప్పేవాడో తెలియదు కానీ వెలిగే ముఖంతో ఆరోజు అంతా తిరుగుతూ ఉండేది.

మరి నేను చీర కట్టుకున్న.. ఒక నగపెట్టుకున్న ఇది నీకు బాగుంది అని నా అన్న మనిషి చెప్పే వాళ్ళే లేరు కదా..  ఈ కలర్ నీకు సూట్ అయింది.  అంతే..  అయిపోయేది.

అందులో నాకు ఏ ఫీల్ కనిపించేది కాదు.  అప్పుడు ఆలోచించాలి అన్నా ధ్యాస కూడా లేదు కానీ ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే.. రుద్ర అన్నట్టు నాది ప్రేమ కాదేమో కదా..

మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను నిజాయితీగా నిజం చెబుతారా.. అడుగు.. నేను నిజంగా మీ కూతుర్నేనా నాన్న..

  ఆ మాటకి అహం దెబ్బతిన్నవాడు లాగా చూస్తాడు.
బాధగా మయూరి అని చేతులు పట్టుకుంటే.. నిజం చెప్పండి నాన్న..

నువ్వు నా ప్రాణం రా...  నా రక్తం..  మరి ఎందుకు నాన్న మీ అత్యాశకి నా జీవితాన్ని  బలిచేశారు.

దేవేంద్ర లహరిని పెళ్లి చేసుకున్నక నా వంక చూడడు అన్న విషయం మీకు తెలుసు. అయినా పంతం పట్టారు.  లహరి ప్రాణాలు తీసుకున్నాము. ఏమి సాధించాము.  ఆ తల్లి బిడ్డను వేరు చేయడం తప్ప...

మయూరి చెప్పిన విషయాలు నాగేంద్ర ఒప్పుకోలేక పోతాడు. కూతుర్ని డైవర్ట్ చేయడానికి.. ఇలాగే ఉంటే చిరాకుగానే ఉంటుంది.

నేను వస్తాను నీతో అని కూతుర్ని తీసుకుని షాపింగ్ కి వెళ్తాడు . శాంభవి ఉన్న మాల్ కి వస్తారు. సారీస్ సెక్షన్ దగ్గర ఉన్న హడావిడి చూసి...

ఎవరో ఫ్యామిలీ వచ్చారనుకుంటా అనుకుని శారీస్ చూస్తూ ఉంటుంది. చారు వాయిస్ గట్టిగా వినిపించి.. ఇది చారులత వాయిస్ కదా అని దగ్గరగా వెళుతుంది.

అక్కడ శాంభవిని చూస్తుంది. అప్పటివరకు ఎప్పుడూ దగ్గరగా చూడక ఒక నిమిషం అలాగే ఉండిపోతుంది. ఒళ్లంతా చెమటలు పట్టేస్తాయి.

బొమ్మలాగా నిలబడిపోతుంది.
శాంభవి వాళ్లు సెలక్షన్ చూసి మీ ముగ్గురు సెలెక్ట్ చేసేది మూడు చీరలు తీసుకుంటాను. మరి మేము సెలెక్ట్ చేసినవి తీసుకోవా అని దేవేంద్ర, జితేంద్ర,రాఘవేంద్ర, అనసూయ నలుగురు వస్తారు.

అరే మీరు కూడా వచ్చారా.. మాకు చెప్పకుండా మీరు షాపింగ్ కి వచ్చేస్తే రాము అనుకుంటున్నారా..
శాంభవి దేవేంద్ర దగ్గరికి వెళ్లి నాకు చాలా చీరలు ఉన్నాయి నాన్న. ఇప్పటికే కట్టనవే ఉన్నాయి.. అమ్మ కూడా తీస్తూనే ఉంటుంది.

అన్ని చీరలు ఏమి చేసుకుంటాను. ప్లీజ్ అంటే.. సరే చీరలు వద్దు కానీ ఇంక వేరే షాపింగ్ చేద్దాం..సరే అని నవ్వుతుంది.

మయూరి..  దేవేంద్ర శాంభవిని అలాగే చూస్తూ ఉంటుంది.
ఒక్కసారి వాళ్ళిద్దరితో మయూరిని ఊహించుకుంటుంది. నా ఆలోచన కరెక్ట్ గా లేదు..

నేను దేవేంద్ర పక్కన సరిపోను. దేవేంద్రను చూస్తూ ఉంటే మనసు ఆగదు.  ఒక్కసారైనా మాట్లాడాలి..దగ్గరికి వెళ్లి హత్తుకోవాలి అనిపిస్తుంది.

నాది ప్రేమే కానీ చూపించిన విధానం కరెక్ట్గా లేక ఒక సైకో లాగా మిగిలిపోయాను. ఆఖరిసారిగా ఒకసారి దేవేంద్ర తో మాట్లాడుతాను అని దగ్గరికి వెళ్లి బాగున్నావా దేవేంద్ర..

ఆ గొంతు వినగానే దేవేంద్ర పిడికిలి బిగిస్తాడు.  వెంటనే కూతురిని మరో పక్కకి తీసుకొని గట్టిగా పట్టుకుంటాడు. జితేంద్ర, రాఘవేంద్ర కూడా చుట్టూ కాపలాగా ఉన్నట్టుగా నిలబడతారు.

అది చూసి మయూరీకి ఒక నిమిషం బాధగా అనిపిస్తుంది. నేను నీ కూతురికి హాని తలపెట్టడానికి రాలేదు. అనుకోకుండా కనిపించావు.

ఒకసారి పలకరిద్దామని వచ్చాను. పలకరించావు కదా.. ఇంకా వెళ్ళు. ఈ మాట చెప్పేటప్పుడైనా నా వైపు చూడాలనిపించడం లేదా... లేదు.

ఒక్క నిమిషం అని అక్కడ ఉన్న ఒక పట్టుచీర తీసుకొని శాంభవి  ముందుకు వెళ్లి నేనెవరో నీకు తెలియకపోవచ్చు. నా గురించి నేనే చెప్పకుంటాను.

నా పేరు మయూరి.  మీ అమ్మ చావుకి కారణమైనదాన్ని..  ఇన్ని సంవత్సరాలు ఈ ఇంటికి నిన్ను దూరం చేసినదానిని.

శాంభవి మౌనంగా చూస్తూ ఉంటే ఏమిటి ఇన్ని చేసి.. నా
ముందుకొచ్చి పొగరుగా చెబుతుంది అనుకుంటున్నావా.. ఇది పొగరు కాదు. పశ్చాతాపం.
పెళ్లయిన తర్వాత మొదటిసారి కనిపించావు. పసుపు కుంకమ పెట్టి చీర పెట్టడానికి నేను ముత్తయిదువుని కాదు అలాగని వితంతువుని కాదు.

వయసులో పెద్దదాన్ని నీకు పెడుతున్నాను అనుకుని తీసుకో శాంభవి అంటుంది. ఆ మాటకి తండ్రి వైపు చూస్తుంది.

తండ్రి ముఖంలో కోపం కనపడుతుంది.  ఒక్క నిమిషం ఆలోచించి తండ్రి చేతిని పట్టుకుంటుంది.  దేవేంద్ర కొంచెం శాంతించి కూతురు వైపు చూస్తాడు.

కళ్ళు ఆర్పుతుంది. దేవేంద్ర వద్దు అన్నట్టుగా చూస్తే..
పరవాలేదు అని మయూరి ముందుకు వెళ్లి ఇవ్వండి అంటుంది.

ఆ మాటకే మయూరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి.  ఆ చీర చేతిలో పెట్టగానే ఆశీర్వదించండి. నువ్వు అంతా కూడా మీ అమ్మే. గుణంలో మీ నాన్నని మించిపోయావు.

నూరేళ్లు పిల్ల పాపలతో పసుపు కుంకాలుతో సంతోషంగా ఉండు. నేను ఒక్కసారి నిన్ను ముట్టుకోవచ్చా అని అడుగుతుంది.

ఊ అని తలుపితే..  గట్టిగా హగ్ చేసుకుని ముద్దు పెట్టుకుంటుంది. నన్ను క్షమించు. ఈ మాట చెప్పడం తప్ప ఏమి చెయ్యలేను అని వడివడిగా వెళ్ళిపోతుంది.

మయూరి ప్రవర్తనకి అందరూ ఒక నిమిషం ఆశ్చర్యపోతారు. ఇది మయూరినా లేక మనం ఇంకా ఎవరినైనా చూస్తున్నామా అని నోరు వదిలేస్తారు.

మయూరి ప్రయాణం....
[+] 8 users Like SivaSai's post
Like Reply
Part - 89



మయూరిలో వచ్చిన మార్పు కి అందరూ ఆశ్చర్యపోతారు.
ఇది నిజంగా మార్పా లేక నటన అని కూడా అనిపిస్తుంది. మనకెందుకులే... అనుకుని షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళతారు.

నాగేంద్ర కూతురు వెనకాల కోపంగా వెళ్లి మయూరి అని పిలిస్తే... చెప్పండి అని ముభావంగా అంటుంది. నువ్వు చేసింది ఏమిటి...

ఏమి చేశాను. నువ్వు దేవేంద్ర కూతురికి చీర పెట్టడం ఏమిటి.. క్షమించమని అడిగడం..  ముద్దు పెట్టుకోవడం..  నాకు తల తీసేసినట్టు ఉంది.

మీరు ఎందుకు అంత అవమానంగా ఫీల్ అవుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నువ్వు నా కూతురివేనా..  ఆ అనుమానం మీకెందుకు వచ్చింది.

కాకపోతే ఏమిటి.. మన శత్రువుని క్షమించమని అడిగడం.. అది అవమానం కాదా.. నాకు ఒక విషయం అర్థంకాక అడుగుతున్నాను.

శాంభవి కదా మనల్ని శత్రువుగా చూడాలి. అన్యాయంగా తన తల్లిని చంపేశాము. కానీ అవి ఏమి మనసులో పెట్టుకోకుండా నన్ను ఆశీర్వదించండి నా కాళ్ళకి దండం పెట్టింది.

శత్రువు అయినా కాళ్ళకి నమస్కారం చేస్తే సుఖీభవ అని ఆశీర్వదిస్తాము.  మనలాగా కోపం.. అసూయ.. ద్వేషము లేకుండా స్వచ్ఛంగా ఉన్న శాంభవి ఆశీర్వదించమని అడిగితే...

ఎలా కాదనగలను. నువ్వు మాట్లాడేది నాకేమీ అర్థం కావడం లేదు. శత్రువు నాశనం కోరుకోవాలి కానీ బాగు కాదు. నాకు ఎవరు శత్రువులు లేరు. నాకు నేనే శత్రువుని.

కూతురు మాట్లాడిన విధానానికి నాగేంద్ర ఏమీ మాట్లాడలేకపోతాడు.  ఇక వెళదామా అన్న కూతురి మాటకి హ అని వెనకాలే బొమ్మలాగా వెళతాడు.

రుద్ర.. ఆనంద్ విహారీలను తీసుకొని శేషాద్రి ఇంటికి వెళతాడు.  రుద్ర తో పాటు బావమరుదులు ముగ్గురు కూడా వెళతారు.

రుద్ర వెళ్లేటప్పటికి ప్రభాకర్  కూడా అక్కడే ఉంటాడు. రారు అనుకున్నాను... పరవాలేదు వచ్చారు. ఇది నా కూతురు జీవితానికి సంబంధించిన విషయం. రాకుండా ఎలా ఉంటాను.

కూతురు వైపు చూసి ఆనంద్ విహారీలు వైపు చూస్తాడు. ఆశ సైలెంట్ గా ఆనంద్ పక్కన నిలబడితే.. నిషా వెళ్లి విహారి పక్కన నిలబడుతుంది.

జంటలను చూసిన పెద్దవాళ్ళకి తృప్తిగా అనిపిస్తుంది.. రుద్ర లక్ష్మీ వైపు తిరిగి ఎలా ఉన్నారు మీ మనవళ్లు.. నీవు తీసుకొచ్చావు అంటే అన్ని విషయాలు మంచిగాఉన్నట్టే..

ఏంటండీ ప్రభాకర్ గారు ఏమీ మాట్లాడడం  లేదు. అల్లుడు నచ్చలేదా...
ప్రభాకర్ లేచి నిలబడి రుద్ర దగ్గరికి వచ్చి..

కూతురి పెళ్లి అంటే ప్రతి తండ్రి కల. తాళిబొట్టు కట్టించే ఆ క్షణం కోసం సంవత్సరాలుగా ఎదురు చూస్తాడు. కానీ ఆ రోజు వచ్చింది… తనకే తెలియకుండా పోయింది. తన శ్వాస లాంటి కూతురి పెళ్లి గృహంలో తన నీడ కూడా లేకపోవడం నా హృదయం ఎంత గాయపడి ఉంటుంది ఆలోచించలేక పోయావా.

నా కూతురి ముక్కుపుడకలో తళతళలాడే ముత్యం తనకు కనబడలేదు, కానీ నా కూతురు అయ్యోమయ్య పరిస్థితి నా హృదయంలో మండే గాయమై రగులుతుంది.

‘నాకు తెలిసి ఉంటే నా కూతురి పెళ్లి ఇంటికి పండుగలా చేసేవాడిని… ఆమె అడుగులు పూల మీద నడిచేవి… కానీ నన్ను లేకుండా ఆ ఆనందం ఎలా పండగ అవుతుంది?

నిన్ను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను రుద్ర..
“కూతురి పెళ్లికి తండ్రి అవసరం లేకపోతే… తండ్రి బతకడానికి కారణమేంటి?”

రుద్ర కూడా లేచి నిలబడి ప్రభాకర్ చేతిలో పట్టుకుని నేను చేసిన పెళ్లి మాత్రమే మీకు కనపడుతుంది.  ఈ పెళ్లి నేను చేసి ఉండకపోతే ఆ నాగేంద్ర చేతులో ఈ ఆడపిల్లల ఇద్దరి జీవితం నాశనం అయిపోయేది.

  మా నలుగురిని ట్రాప్ చేయమని వీళ్లిద్దరు పంపేవారు. వావి వరసలు కూడా పక్కన పెట్టేశారు. అంటే ఎంత నిచానికి దిగారో ఆలోచించుకోండి.

డ్రగ్ ఇవ్వడానికి కూడా వెనకడుగు వేయలేదు. ఏదైనా జరిగే మీ అమ్మాయి జీవితం నాశనం అయ్యి ఉంటే.. అప్పుడు ఏం చేసేవారు.

లక్ష్మీ గారు, జ్యోతి గారిని దృష్టిలో పెట్టుకొని ఆనంద్, విహారీలతో వీళ్ళిద్దరి పెళ్లి చేశాను. వీళ్ళిద్దరూ ఏమీ తక్కువ కాదు.  వాళ్ళకంటూ సొంత బిజినెస్ ఉంది. ఆస్తులు ఉన్నాయి.

నాకు ఒక ఆడపిల్ల బాధ తెలుసు ప్రభాకర్ గారు... మేము మా అత్తయ్యని కోల్పోయినప్పుడు నా భార్య మా ఇంటికి చేరే వరకు మేము ఆ లోటును చూస్తూనే ఉన్నాము.

ప్రభాకర్ రుద్రని కౌగిలించుకుని నీ గురించి తప్పుగా అనుకున్నందుకు క్షమించు..ఊరు తీసుకువెళ్లి మళ్లీ అంగరంగ వైభవంగా పెళ్లి జరిపిస్తాను. నా అల్లుడు అని పరిచయం చేస్తాను.

కన్యాదానం చేయాలి అంటే పక్కన భార్య ఉండాలి కదా.. ఆ విషయం మాత్రం మన మధ్యన వద్దు.. మీ భార్య ఆరోజు నుంచి కుమిలిపోతుంది.

మా అత్తయ్య చావు నరకంలాగా ఉంది.  ఇంటిలో నుంచి పంపించేస్తారురేమో అనుకుని వాళ్ళ నాన్నకి  సహాయం చేసింది.

ఇంత దారుణం జరిగినప్పటి నుంచి తను కూడా పుట్టింటికి రాలేదు కదా... అది ఎందుకు గుర్తించడం లేదు..

సునంద రుద్ర కాళ్లు పట్టుకొని నన్ను క్షమించు. తల్లిదండ్రుల పెంపకాన్ని బట్టే పిల్లలు బుద్దులు వస్తాయి.  మీ పెంపకం గొప్పది. మీ పెద్దవాళ్ళు ఔన్నత్యం కలిగిన వాళ్ళు. అందుకే మీకు ఇంత గొప్ప సంస్కారం వచ్చింది.

ఒక ప్రాబ్లం సాల్వ్ అయ్యింది ఇంక మేము వెళ్తాము. జ్యోతి వచ్చి మొదటిసారి వచ్చారు.  భోజనం చేసి వెళ్ళండి..అది మాత్రం అడగద్దు. తప్పుగా అనుకోవద్దు.

ఇంటిలో భోజనం చెయ్యకపోయినా పెళ్లి భోజనాలు మాత్రం ఖచ్చితంగా చేయాలి . మా ఆనంద్ విహారిల కోసం అయినా చేస్తాము. అంతేనా ఏంటిరా అంటే.. అందరూ సంతోషంగా నవ్వుకుంటారు.

శేషాద్రి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే ఈ టైం లో ఎవరో అనుకుని లిఫ్ట్ చేస్తాడు.  అటు పక్క నుంచి చెప్పింది విని ఎప్పుడు అని గట్టిగా అరుస్తాడు.

లక్ష్మీ కంగారుగా ఏమయిందిరా.. అమ్మ..  మనం ఆ ఇంటికి వెళ్ళాలి. నేను  రానురా.. వెళ్లి తీరాలి. ఏమైందిరా అంత కంగారు పడుతున్నావు .

మన మయూరి ఇంకా చెప్పలేక పోతాడు.. మయూరీకి ఏమైంది రా..  ప్లీజ్ పదమ్మ అని రుద్ర వస్తారా అని అడుగుతాడు.

రుద్ర బావ మరదలు వైపు చూసి.. వస్తాం పదండి అని వెనకాలే వెళ్తారు.  అందరూ నాగేంద్ర ఇంటికి వెళ్లేటప్పటికి నాగేంద్ర హాల్లో జీవం లేనట్టుగా కూర్చుని ఉంటాడు.

లక్ష్మీ మయూరి అని అరుస్తూ లోపలికి వెళుతుంది నాగేంద్రని చూసి నా కూతురు ఎక్కడ..మిమ్మల్ని అడిగేది... అలాగా బొమ్మలాగా కూర్చుంటారు ఏమిటి..

మీ పగ కోసం హాని తలపెట్టారా అని భయంగా అడుగుతుంది. నా కూతురికి నేను హాని తలపడతానా.. అని మాటలు కూడబలుక్కుని అడుగుతాడు.

ఇప్పుడు మీతో వాదించే ఓపిక నాకు లేదు.  ఎక్కడ ఉంది. మయూరి గది వైపు చూస్తాడు. సర్వెంట్స్ అందరూ కూడా భయంగా నిలబడి ఉంటారు.

లక్ష్మీ భయంగా తలుపు దగ్గరికి వెళ్లి చూసి అక్కడే కూలబడిపోతుంది. సునంద జ్యోతి వెళ్లి లక్ష్మీని పట్టుకుని గదిలోకి చూసి ఏమేమి మాట్లాడలేకపోతారు.

శేషాద్రి స్పీడుగా వచ్చి గదిలోకి చూసి మాటరాని బొమ్మలాగా బిగుసుకుపోతాడు. చలనం లేకుండా కంటి నుండి కారుతున్న నీళ్లు తుడుచుకోవాలి అన్న ఆలోచన కూడా లేకుండా అలాగే నిలబడిపోతాడు.

ఏమైంది వెళ్ళిన వాళ్ళు వెళ్లినట్టే అక్కడే ఆగిపోయారు అని ధీరజ్ అడిగితే... రుద్రాకి అనుమానం వచ్చి మొదటిసారిగా మయూరి గది దగ్గరికి వెళతాడు.

గదిలో జీవం లేని మయూరిని చూసి ఇది నేను ఊహించిందే అని అనుకుంటాడు. కాకపోతే ఇంత తొందరగా అనుకోలేదు.

లక్ష్మీ కష్టంగా వెళ్లి కూతురుని ఒళ్లంతా తడుముతూ ఉంటుంది.. నిండుగా పట్టు చీర కట్టుకొని కాళ్ళకి పసుపు రాసుకుని.. చేతిలో మంగళసూత్రం పట్టుకొని పక్కన  దేవేంద్ర మైనపు బొమ్మ పెట్టుకుని ఉంటుంది.

అమ్మ మయూరి ఏమిటే ఇంత పని చేశావు అని కూతురు మీద పడి ఘల్లుమని ఏడుస్తుంది. నువ్వు మారాలి అని కోరుకున్నాను కానీ ఇలాంటి పని చేసి నా కడుపున చిచ్చుపెట్టావు కదే.. ఇంత మొండితనం ఏమిటి నీకు..

మయూరి చేతుల్లో ఒక లెటర్ కనబడుతుంది.  రుద్రా వెళ్ళి ఆ లెటర్ తీసుకుని చదువుతూ ఉంటాడు.

నా ప్రాణంమైన దేవేంద్ర కి...
ఈ లేఖ నువ్వు చదివేసరికి నేను ఈ లోకంలో ఉండను. 23 సంవత్సరాలు… ఒక్కో రోజు శతాబ్దంలా అనిపించింది. నీ చూపు కోసం, నీ మాట కోసం, నీ నవ్వు కోసం నా గుండె ఎన్ని క్షణాలు మ్రోగిందో నాకు మాత్రమే తెలుసు. కానీ ఆ ప్రేమ నాకెప్పుడూ సొంతం కాలేదు.

నిన్ను కోరి పుట్టిన నా మనసు, నీకోసమే బతికిన నా జీవితం… చివరికి నువ్వు నాకు శత్రువయ్యాక కూడా ఆగలేకపోయింది.

నిన్ను పొందాలనే ఆతృత, నిన్ను కట్టిపడేయాలనే మూర్ఖత్వం… నన్ను మూర్ఖురాలని చేసింది. నీ జీవిత భాగస్వామిని నా వల్లే కోల్పోయావు. ఆమె మరణానికి నేను కారణమవ్వడం నా పెద్ద నేరం.

నీకు పుట్టిన బిడ్డని పురిటిలోనే దూరం చేశాను. అందుకే ఈ జన్మలో తల్లి అయ్యే అవకాశం ఆ భగవంతుడు నాకు దూరం చేశాడు.  ఆ పాపం కోసం నేనెన్నిసార్లు నన్ను శిక్షించుకున్నానో నాకు మాత్రమే తెలుసు.

క్షమించు. నువ్వు క్షమిస్తావో లేదో తెలియదు కానీ, నీ ముందు తలవంచి క్షమాపణ అడుగుతున్నాను. నేను చేసిన పాపం ఎప్పటికీ చెరగనిది..

కానీ నా ప్రేమ మాత్రం నిజం. నిన్ను ఎంతగా ప్రేమించానో ఆ నిజం మాత్రం ఎవరూ నాకోసం తీయలేరు.

నేను ఆత్మహత్య చేసుకుంది పిరికితనంతో కాదు. అది నా స్వభావం కాదు అని కూడా నీకు తెలుసు. నేను నిన్ను పొందలేకపోయాను. నిన్ను మరవలేకపోయాను.

అందుకే ఈ శరీరాన్ని వదిలి వెళ్తున్నా… కనీసం ఈ ఆత్మ అయినా నీకు శత్రువుగా కాకుండా నీకోసమే పరితపిస్తూ నిన్ను ఆరాధీస్తూ ఉంటుంది .

నన్ను ప్రేమించకపోయినా, నన్ను ద్వేషించకు.
నీకు, శాంభవి కి అభ్యంతరం లేకపోతే నాచితికి నిప్పు పెట్టి సాగనంపుతావా.. దేవేంద్ర.

ఇదే చివరి కోరిక.. అది కూడా నీకు అభ్యంతరం లేకపోతే..


నిన్ను అంతులేని ప్రేమతో,
నీ శత్రువుగానూ, నీ ప్రేమికురాలిగానూ మిగిలిపోయిన…
నీకు ఏమి కానీ ఒక ప్రాణి..

దేవేంద్ర మయూరి చివరి కోరికను తీరుస్తాడా....
[+] 6 users Like SivaSai's post
Like Reply
Part - 90



రుద్ర ఆ ఉత్తరం చదివి మయూరివైపు చూస్తాడు. జీవం లేని మయూరి శరీరాన్ని చూస్తే ఆ నిమిషం బాధగా అనిపిస్తుంది.

నీలో నిజంగా ఇంత మార్పు వచ్చిందా.. మారినదానివి ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశావు అని ధీరజ్  వైపు చూసి చిన్న మామని రమ్మని చెప్పు.

ఇక్కడకు అవసరమా...బ్రతికుండగానే ఎవరికైనా ప్రేమ.. పగ ఎక్స్ట్రా ఎక్స్ట్రా.. ఇక చనిపోయిన ఆ దేహానికి వీటి తో  ఏమి పని.. చెప్పు.

ఫోన్ చెయ్. సరే అని ధీరజ్ పక్కకు వెళ్లి ఫోన్ చేసి విషయం చెబుతాడు.. దేవేంద్ర రావడానికి ఇష్టపడక పోతే రుద్ర రమ్మని చెప్పాడు అంటే.. సరే అని తప్పక వస్తాడు.

మయూరి దేహాన్ని గదిలో నుంచి బయటికి తీసుకువస్తారు. బయట పడుకోబెడతారు. బృందావనం మొత్తం అక్కడికి వస్తుంది.

దేవేంద్ర.చూస్తాడు  అంతే.. అనసూయ.. లక్ష్మీ భుజం మీద చెయ్యి వేస్తోంది.. చూసావా వదిన ఎంత పని చేసిందో...  ఏడుస్తూ ఉంటే ఊరుకో.. లక్ష్మి అని ఓదారుస్తుంది.

దేవేంద్ర రుద్ర కోసం చూస్తూ ఉంటే... ఇక్కడ అని చేయి ఊపుతాడు. ఎందుకు రమ్మన్నావురా..  ఈ ఉత్తరం చదువు.. ఇప్పుడు అవసరమా..  అవసరమే.

సరే అని ఉత్తరం చదువుతాడు.  నీకు ఏమీ బాధగా లేదా... బాధపడడానికి తను ఏమైనా నాకు కావలసిన మనిషా..  కాదు కదా...

రోజు కొన్ని వేలమంది చనిపోతున్నారు. అలా చనిపోయిన వాళ్ళ అందరి కోసం నేను బాధపడుతూ కూర్చుంటానా.. నీకు వాళ్ల మీద కోపం ఉంది అని తెలుసు మామ.

కాకపోతే ఇప్పుడు ఈ మనిషి మన మధ్యలో లేదు.  ఆఖరి కోరిక తీర్చడం న్యాయం కదా..  నన్ను ఏం చేయమంటావు.
ఆ మనిషికి నేను తలకొరివి పెట్టాలా.. అది జరిగిన పని.

శేషాద్రి వచ్చి బ్రతిమాలుతాడు అయినా దేవేంద్ర ఏమి మాట్లాడాడు. లక్ష్మి దేవేంద్ర మందు మోకాళ్ళ మీద కూర్చుని నా కూతురు ఆఖరి కోరిక తీర్చు దేవేంద్ర..
అత్తయ్య ఏమిటిది  అని వెనక్కి జరిగితే...
నా కూతురు నీ విషయంలో చేసింది తప్పే..  ఇప్పుడు అది ప్రాణాలతో లేదు. నీ మీద పెంచుకున్న పిచ్చి ప్రేమతో ఒక ఉన్మాదిలాగ తయారయ్యింది. మనిషి మారి ఈ లోకాన్ని వదిలేసినప్పుడు కూడా నీ గురించే ఆలోచించింది.  నీ చేతులు మీదగా వెళ్లాలి అని కోరుకుంటుంది.
రాఘవేంద్ర కూడా నచ్చ చెప్పడానికి చుస్తే.. మీరు కూడా ఏమిటి.. నీకు తెలియని ఒక అనాధ శవం నీ ముందు ఉంది అనుకో..

దానికి అంత్యక్రియలు చేయడం అంటే భగవంతునికి సేవ చేయడం లాంటిదే... ఇప్పుడు మయూరి నీకు తెలిసిన మనిషిగా కాకుండా ఒక తెలియని అనాధ శవం అనుకుని చూడు..
ఎవరు ఎలా చెప్పినా దేవేంద్ర మనసు అంగీకరించలేకపోతోంది.

23 సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటన దేవేంద్ర గుండెలో ఇంకా పచ్చిగానే ఉంది.
తన భార్యను చంపి, తనను బలవంతంగా పెళ్లి చేసుకోవాలని వెంటపడిన మయూరి… ఆ పేరు వినగానే రక్తం మరిగిపోయేంత ద్వేషం.
ఆమె ముఖం అతనికి శత్రువు గుర్తుగా, తన జీవితాన్ని నాశనం చేసిన చీకటి గుర్తుగా మాత్రమే కనిపించేది.

ఇన్ని సంవత్సరాల తర్వాత  మారాను..  నన్ను క్షమించు...
నా ఆఖరి కోరిక తీర్చు ఎలా ఒప్పుకునేది
మయూరి రాసిన ఆ అక్షరాల్లో వేరే రూపం ఉంది—
నేను చేసిన పాపానికి ఆఖరి నిమిషం వరకు శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను .
జీవితం మొత్తం నన్ను తినేసింది.
నిన్ను క్షమించమని అడగలేను, కానీ… నా అంతిమ కోరిక ఒక్కటే… నా తలకు నువ్వే కొరివి పెట్టాలి. అదే నాకు శాంతి ఇస్తుంది.”

ఆ ఉత్తరం చదివిన క్షణం నుంచి దేవేంద్రలో కొత్త తుఫాను మొదలైంది.
“ఇది ఏ న్యాయం? నన్ను నాశనం చేసినవాళ్లకు నేను గౌరవం ఇవ్వాలా?
ఆమె చేసిన క్రూరత్వానికి ఇంత తేలికైన ముగింపు కావాలా?” అని గుండె అరణ్య రోదన చేసింది .

అయినా చుట్టూ ఉన్నవాళ్లందరూ అదే చెబుతున్నారు—
“చనిపోయిన మనిషి ఆఖరి కోరికను తీర్చడం పెద్దమనసు, అది నీ గౌరవాన్ని తగ్గించదు, పెంచుతుంది” అని.

కానీ దేవేంద్ర హృదయం మాత్రం మరో వాదన చేస్తోంది—
“నా భార్య ప్రాణం తీసిన ఈమెకు తలకొరివి పెట్టడం అంటే, నేను నా ప్రేమని, నా బాధని మోసం చేసినట్టే కాదా?”

అతని మనసు రెండుగా పగిలింది.
ఒకవైపు బాధ్యత, మర్యాద, సమాజం చెప్పే న్యాయం.
మరోవైపు తన గుండె లోతుల్లో రగిలే ద్వేషం, ద్రోహపు జ్ఞాపకం.

అతని చేతులు కొరివి వైపు కదలడంలేదు, వెనక్కి తగ్గడంలేదు.
ఆ క్షణం అతనికి యుద్ధరంగంలా అనిపిస్తోంది—
బయట ఎవరూ చూడని ఒక యుద్ధం, తనలో తానే సాగుతున్న రణరంగం.

రుద్ర దేవేంద్ర భుజం మీద చేయి వేసి నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను చినమామ..  కానీ కాలం మన కోసం ఆగదు కదా..

  అందరూ బలవంతం చేసి అయినా సరే నీతో ఈ పని చేయిపిస్తారు. అంతసేపు ఇక్కడ ఉండి ఈ మనుషులను చూడడం కన్నా రెండు నిమిషాలు కళ్ళు మూసుకుని కార్యక్రమం జరిపించేయడం ఉత్తమం కదా...

నాకిష్టం లేకపోయినా మీ అందరి కోసం చేస్తున్నాను.  అది ఒక్క తలకొరివి పెట్టడం మాత్రమే. మిగిలిన కార్యక్రమాలు చేయమంటే మాత్రం నా వల్ల కాదు. చెయ్యను కూడా..

అవసరం లేదు మామ..  తాతయ్య చెప్పినట్టు ఒక అనాధ శవం అనుకుని నీ పనులు నువ్వు చెయ్యి...

దేవేంద్ర కి ఇష్టం లేకపోయినా మొక్కుబడుగా కార్యక్రమం పూర్తి చేస్తాడు. ఇన్ని జరుగుతున్న నాగేంద్ర మాత్రం ఏమీ మాట్లాడకుండా రాయిలాగా ఉండిపోతాడు.


మిగిలిన కార్యక్రమాలు అన్ని శేషాద్రి చూసుకుంటూ ఉంటాడు. ప్రభాకర్ కూడా సాయం చేస్తాడు.

నాగేంద్రని ఎవరూ పలకరించరు... పట్టించుకోరు.
నిశి రాత్రిలో కూతురి ఫోటో ముందుకు వెళ్లి నిలబడతాడు. ఫోటోని తడుముతూ నేనే నీ జీవితాన్ని నాశనం చేశానా.. అని మొదటిసారిగా నిజమైన బాధని చూస్తాడు.

ఆస్తి కోసం... నేను కోరుకున్న విధంగా జరగ లేదు ఆ కుటుంబం పైన పగ పెంచుకున్నాను...
స్వంత కూతురినే కూడా కత్తిలా తయారు చేశాను.
నిండు గర్భిణీ అయినా మేనల్లుడి భార్యని చంపించి..
పురిటికందుని దూరం చేసిన పాపం ఇంత భయంకరంగా ఉంటుంది అని తెలుసుకోలేకపోయాను.


కానీ పగతో పెంచుకున్న నా కూతురే చివరికి
నా కుట్రల్లో చిక్కుకొని మరణించినప్పుడు గాని నాకు తెలియలేదు.  కన్న కూతురు దూరం అవుతే ఆ బాధ ఎలా ఉంటుందో..ఆ తండ్రి గుండె ఎలా పగిలిపోతుందో అని...

నా ఆస్తి కోరికల కోసం, నా పగ కోసం
నేను నా రక్తాన్నే త్యాగం చేశానా?
నేను తండ్రినా లేక రాక్షసుడినా?
అని తలపట్టుకొని విలపించాడు.

నేను కోరుకున్న విధంగా జరగలేదు అని.. నా పగ తీర్చుకోవడానికి సొంత చెల్లిని వాడుకొని..  చెల్లి సంసారాన్ని చిన్నాభిన్నం  చేశాను. చెల్లి సంసారం పాడైపోయిన ఆ ఇల్లు దుఃఖంలో  మునిగింది అని గర్వంగా ఫీలయ్యాను.

కానీ ఆ పాపమే నా స్వంత చేతులతోనే కూతురి చావుకి కారణం  అయ్యేలాగా చేసి నేను తీర్చలేని  పశ్చాత్తాపంగా మిగిలిపోయింది.

ఇప్పుడు నాగేంద్ర కళ్ల ముందు ఒకే ఒక జ్ఞాపకం—
తన చిన్నప్పటి కూతురు
“నాన్నా… నువ్వు నా హీరో వి ” అని చెప్పిన రూపమే.
కానీ ఆ హీరోనే రాక్షసుడై,
తన చిన్నారిని తానే మింగేశాడనే శాపంతో
జీవించి ఉండడమే నాగేంద్రకి  శిక్ష అయింది.

ఎలాంటి పరిస్థితి వచ్చినా మీ వెనక నేనున్నాను.. నా ధైర్యం మీరు.  మీ బలం నేనవుతాను అని చెప్పిన కూతురిని పగకి బలి ఇచ్చి నా బలాన్ని నేనే కోల్పోయాను.

నేను కూడా నీ దారిలో వచ్చి నిన్ను క్షమాపణ అడగాలని ఉంది.  కానీ నాలాంటి వాడికి చావు అంత తొందరగా రాకూడదు.

నీ చావు కి కారణంమైన.. నేను..  ప్రతిరోజు నీ సమాధిని చూస్తూ బ్రతికి ఉన్నంతకాలం కుళ్ళి కుళ్ళి  చస్తూ నరకం అనుభవించాలి.

ఇదే ఈ తండ్రి పాపానికి శిక్ష...

ఆలోచిస్తున్న రుద్ర దగ్గరకి శాంభవి వచ్చి ఏమి ఆలోచిస్తున్నారు. హ్మ్..  ఇలా రా అని చేయిస్తాడు. రుద్ర చెయ్యి పట్టుకుని వచ్చి పక్కన కూర్చుంటుంది.

చెప్పండి. ఏం చెప్పాలి..  అదే ఏదో ఆలోచిస్తున్నారు కదా.. దాని గురించి..

మనం శోభనం ఎక్కడ చేసుకుందామా అని ఆలోచిస్తున్నాను.  ఒక నెలలోనే నీతో పుల్లమామిడికాయలు తినిపించాలి అని ఫిక్స్ అయ్యాను. అవి ఏ మామిడికాయలా.. ఎక్కడినుంచి తెప్పించాలా అని ఆలోచిస్తున్నాను.  ఏమంటావు...
రుద్ర వెటకారానికి గుర్రుగా చూస్తుంది. ఏమైంది పాప అలా చూస్తున్నావు.  నచ్చలేదా..  నెలరోజులు అంటే ఎక్కువ..  మిమ్మల్ని అని చేతితో కొడుతూ ఉంటుంది.

అరె పాప కొట్టకు..  దెబ్బ తగులుతుంది. తగలాలనే కదా కొట్టేది. నేను చెప్పేది నాకు తగులుతుందని కాదు..  నీకు తగులుతుందని...

చూడు చేతులు ఎలా కందిపోయాయో..  మీకు అసలు నొప్పి లేదా.. శాంభవి నీ ఒళ్ళో కి లాక్కుని.. పువ్వు వచ్చి మీద పడితే ఎవరికైనా దెబ్బ తగులుతుందా...

అందులో ఏడు మల్లెలు  ఎత్తు బరువు నా పెళ్ళాం.. నాదేమో జిమ్ బాడీ. ఇంకెలా తగులుతుంది చెప్పు అని బుగ్గలు పట్టుకుని లాగుతాడు.

చాల్లే మీ వెటకారాలు.. ఏదో అడగాలని వచ్చావు కదా అడుగు. మీ గొడవలో పడి అసలు విషయమే మర్చిపోయాను. ఇందాక ఏదో అడిగాను ఏమిటి అబ్బా... హ.. దేని గురించో సీరియస్ గా ఆలోచిస్తున్నారు.

ఏమిటది.. ఒళ్ళు కూర్చున్న భార్య నడుము చుట్టూ చేతులు వేసి.. భుజంపైన గెడ్డం పెట్టి రేపు  రేపల్లె వెళుతున్నాను.

నాతో పాటు చినమామ కూడా వస్తున్నాడు. నాన్నగారు కూడానా.. అని భయంగా అడుగుతుంది.

ఎందుకు అంత భయపడుతున్నావు. భయం కాదు..ఇది అని చెప్పలేని  అంటూ రుద్రా వైపు తిరిగి గట్టిగా హగ్ చేసుకుంటుంది.

నేను ఉన్నాను కదా భయపడకు. అంత సాఫ్ట్ గా డీల్ చేసి.. అందరినీ ఎక్కడికి తీసుకువస్తాను.

రుద్ర మాట నిలబెట్టుకుంటాడా...

కథ కొనసాగుతుంది......
[+] 8 users Like SivaSai's post
Like Reply
Excellent update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
Oka thread logical ebd ayindi.
..inka andaru brindavanikii cheradame
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Wonderful...
[+] 1 user Likes Sunny73's post
Like Reply
Reading this story again.. oka question!!
Mayuri poyindi. Nagendra maaripoyadu.
Ippudu akkada రేపల్లె lo cheppalsina avasaram enti?
Cheppi అంతమందిని badha pettatam deniki?
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Part - 91



ఉదయమే రుద్ర తొందరగా రెడీ అవుతాడు. శాంభవి మాత్రం డల్ గా కూర్చుని ఉంటుంది.  రెడీ అయ్యి శాంభవి పక్కన కూర్చొని చూడు పాప..

నేను వెళ్ళే పని విజయవంతంగా జరగాలి అంటే నువ్వు నవ్వుతూ ఎదురు రావాలి. అంతేగాని మొఖం ఉమ్..అని పెట్టుకుని ఉంటే నాకు ఎలా విజయం కలుగుతుంది.

భార్య చిరునవ్వే భర్తకి విజయం. ఆ మాత్రం కూడా తెలియదా అని ముక్కు మీద టాప్ చేస్తాడు. మీరు ఏ బిజినెస్ పని మీదో.. లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అనుకుంటే అలాగే చిరునవ్వుతో ఎదురు వచ్చేదాన్ని. ఇక్కడ అని మాట్లాడలేకపోతోంది.

ఎక్కడైనా సరే నీ నవ్వే నాకు విజయం. నేను స్మూత్ గా హ్యాండిల్ చేసి అందరినీ మన ఇంటికి తీసుకువస్తాను. నువ్వు ఎప్పటికీ భాను మావయ్య కూతురువే..

నా మాట మీద నమ్మకం ఉంది కదా. హ్మ్ అని తల ఊపుతుంది. ఇంకేం  చిరునవ్వులు చిందిస్తూ రావే నా అలివేణి..

మీకు ఈ టైంలో కూడా హాస్యం వస్తుంది చూడండి అది కూడా వెటకారాలతో కలిపి అని పక్క నుంచి లేస్తుంది.
అరే శ్రీమతి నీ భర్త నిన్ను ఇలా మోటివేట్ చేస్తూ ఉంటే అప్రిషియేట్ చేయడం మానేసి నన్ను అంటున్నావు.

ఇలాగైతే చాలా కష్టం అబ్బా అని నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంటాడు.. ఏం చేస్తున్నారు మీరు అని కంగారుగా అడిగితే..

ఇంకా ఏమీ చేయలేదు.  చేయమంటే చెప్పు. ఈరోజు పని పోస్ట్ పోన్ చేసుకుని మరీ మొదలు పెడదాం. పెళ్లి అయ్యాక కూడా ఇన్ని రోజులు ఆగాలి అంటే ఉప్పు కారం తినే మనిషినే..

ఎంత కష్టమో నీకు అర్థమవుతుందా..  మరి నేను తినట్లేదు..   నువ్వు ఉప్పు కారం మాత్రమే తింటున్నావు. నీ హార్మోన్స్ని అలాగే బొజ్జుంటున్నాయి..

బట్ నా హార్మోన్స్ అలా కాదే.. నా పెళ్ళాం పెళ్ళాం అని తెగ కలవరిస్తున్నాయి.  అవునా పాపం..  అంత కలవరిస్తున్న వాటికి చెప్పండి.

ప్రశాంతమైన టైంలో అయితేనే రొమాంటిక్ ఫీలింగ్స్ వస్తాయి.  ఇప్పుడున్న టెన్షన్ లో నా పెళ్ళానికి గోళ్లు కొరక్కోవడం తప్ప ఇంకేమీ లేదు.

ఇన్నాళ్ళకి నీ నోటి వెంట రొమాన్స్ అన్నమాట వచ్చింది. ఇంక నా పొలంలో మొలకలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి అని గట్టిగా బుగ్గపైన ముద్దు పెట్టి...

ఎక్కువ ఆలోచించకు.  నన్ను నమ్ము అర్థమైందా.. ఇన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన వాడిని.. ఈ విషయం హ్యాండిల్ చేయలేనా..

రుద్రాని గట్టిగా కౌగిలించుకొని భయం లేదు కదా..  నా పాప..  రీజన్ ఏదైతే ఏమిటి..  మొదటిసారి గట్టిగా కౌగిలించికుంది.

ఈ కౌగిలి సాక్షిగా చెబుతున్నాను బంగారం. భాను మావయ్య ని నవ్వుతూ ఇక్కడికి తీసుకువస్తాను. ఒరేయ్ పాప నిన్ను ఒక విషయం అడుగుతాను చెప్పు..

ఏమిటి ఎంతసేపు మా నాన్నలు..  మా నాన్నలు.. అంటున్నావు కానీ.. అత్తయ్యలు గురించి ఏమీ మాట్లాడవే..

అమ్మ గురించి ఆలోచిస్తే  బాధగానే ఉంది.  పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.  కానీ.. నాన్న నా విషయంకు వచ్చేటప్పటికి ఆలోచన కన్నా ముందు కంగారు ఉంటుంది.  అదే నా భయం.

సరేలే  రా..  అని భుజం చుట్టూ చెయ్యి వేసి తీసుకువెళ్తాడు.  జంటగా వస్తున్న ఇద్దరినీ చూసి అందరకి తృప్తిగా అనిపిస్తుంది.. కానీ శాంభవి ముఖంలో కనపడుతున్న ఆందోళన చూసి బాధగా అనిపిస్తుంది.

దేవేంద్ర ఎదురు వచ్చి కూతురు తల పైన చెయ్యి వేసి ఎక్కువ ఆలోచించకు.  ఇద్దరము వెళుతున్నాము కదా.. పరిస్థితి ఏమిటో నచ్చచెబుతాము.

ఈ విషయం చెప్పడం మానేద్దామా..  నాన్నకి తెలిస్తే తట్టుకోలేరేమో. నేను చెప్పడమే కరెక్ట్ తల్లి. బయట మనిషి చెబితే వేరేలాగా ఉంటుంది.

నిన్ను కూడా తప్పుపడితే.. లేదు లేదు మా నాన్న గురించి నాకు తెలుసు. ఎప్పుడు నన్ను తప్పు పట్టరు.  ఎంతసేపు భాను వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నాన్న..  మా నాన్న అని చెబుతుంటే దేవేంద్ర మనసు చివుక్కుమంటుంది.

కానీ వాస్తవం అదే కదా అని సర్ది చెప్పకుని ఎక్కువ ఆలోచించకు.  అల్లుడిని చూసి వెళదామా.. పద మామ అని బయలుదేరుతూ..

హలో శ్రీమతి ఎదురు రావాలి. సరే అని ఇద్దరికీ ఎదురు వచ్చి జాగ్రత్త అని చెబుతుంది. కారు హైవే మీద పరుగులు తీస్తూ ఉంటే దేవేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు.

ఏమైంది మామ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. నీ కూతురు మాటకు ముందు...మాట తర్వాత.. భాను మావయ్య వాళ్ళని నాన్న మా నాన్న అని చెబుతుంది అని నీ మనసుకి కష్టంగా ఉంది కదా..

నీ దగ్గర మాట దాటి వేయాల్సిన అవసరం ఏముంది.. నిజంగానే కష్టంగానే ఉంది.  కాకపోతే పరిస్థితి ఏమిటి అన్నది అర్థం చేసుకున్నాను కాబట్టి...

కొంచెం నాకు నేను సర్ది చెప్పుకుంటున్నాను. ఆరోజు శాంభవి ధరణి చేతిలోకి వెళ్లకపోయి ఉంటే... ఈరోజు మన కళ్ళ ముందుకు వచ్చేదా..

ఎంత పద్ధతిగా పెంచారు.  ప్రతి ఒక్కళ్ళకి గౌరవంఇస్తుంది. ఇంత సంపదకి వారసురాలైనా సరే అహంకారం లేదు. అంతకన్నా ఏం కావాలి చెప్పు.

  గంటకొకసారి శాంభవి ఫోన్ చేస్తూనే ఉంటుంది.  రీచ్ అయ్యారా..  వెళ్లిపోయారా..  నాన్న ఏమన్నారు..  అమ్మ ఎలా ఉంది.

అప్పటికి రుద్ర ఓపికగా చెబుతూనే ఉంటాడు..ఇక విసుగు వచ్చి రేపల్లె ఏమన్నా నా ఒడిలో ఉందా... ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లాలి కదా..

మన మనసు కంగారు పడుతుంది కదా అని కారు కంగారు పడదు కదా..  అర్థం చేసుకో..  సమస్య సాల్వ్ అయిన వెంటనే ముందు నీకే ఫోన్ చేస్తాను సరేనా బంగారం . నా ఫోన్ కాసేపు సైలెంట్ లో ఉంటుంది డిస్టర్బ్ చేయకు.

కారు రేపల్లె చేరుతుంది.  రుద్ర కారు చూడగానే..  బావమరుదులు ముగ్గురు ఎదురు వస్తారు. రండి బావగారు మీకోసమే చూస్తున్నాము.

ఇద్దరినీ లోపలికి తీసుకువెళ్తారు. భాను ప్రసాద్,  శివప్రసాద్ ఎదురు వస్తారు. అతిధి మర్యాదలు అయిన తరువాత కూర్చొని మాట్లాడుతూ ఉంటే దేవేంద్ర రుద్ర వైపు టెన్షన్ గా చూస్తాడు.

రుద్ర పరవాలేదు అని కళ్ళతోనే భరోసా ఇస్తాడు. కలిసిన గంటలోనే వందసార్లు అయినా శాంభవి విషయాలు మాట్లాడుతుఉంటారు.

చిన్నప్పుడు ఇలా చేసేది.. అలా చేసేది అని ఇప్పుడు ఎలా ఉందో అని బెంగగా మాట్లాడుతూనే ఉంటారు.

దేవేంద్ర కొన్ని పేపర్స్ తీసుకొని భాను చేతిలో పెడతాడు. ఏమిటివి. ఒకసారి చూడండి. అందులో ఏదో డిఎన్ఏ రిపోర్ట్స్ కనబడతాయి.

ఎవరివండి రిపోర్ట్స్. నావి నా కూతురువి. ఓ మీ అమ్మాయి దొరికిందా....  ఎక్కడ ఉంది. పోనీలే ఇన్ని సంవత్సరాలుకి మీ తపస్సు ఫలించింది.

శాంభవి.కూడా ఈ విషయం చెప్పలేదు. పొద్దున కూడా మాట్లాడాను అని భాను తన ఫ్లోలో తన చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు.

శివప్రసాద్ కూడా  సంతోషంగా చూస్తూ  కూతురు దగ్గరికి వచ్చిందంటే ఏ తండ్రికైనా సంతోషమే కదా...మా అమ్మాయి పెళ్లయిన తర్వాత మా ఇల్లంతా బోసిపోయినట్టు ఉంది చూడండి.  ఇల్లంతా కళాకాంతులు లేకుండా ఎలా అయిపోయిందో ...

ధరణికి అనుమానం వస్తుంది. వాళ్ళ అమ్మాయి దొరికితే ఆ రిపోర్ట్స్ మనకి చూపించడమేమిటి..ఇందులో ఏదైనా మతలబు ఉందా అని భర్త చేతిలో నుంచి ఆ రిపోర్ట్ పేపర్స్ తీసుకుంటుంది.

అన్ని చూస్తూ ఉంటే బ్లడ్ సంబంధించినవి శాంభవికి రిలేటెడ్ గా కనిపిస్తాయి.  చేతులు వణుకుతూ భయంగా చూస్తూ చివరిగా పేరులు చూస్తుంది.

అవి చూడగానే కళ్ళు తిరిగి పడిపోతూ పేపర్స్ ని వదిలేస్తుంది.  లలిత్ వెంటనే పిన్ని అని పట్టుకుంటాడు.
వెంటనే మంచం మీద పడుకోబెట్టి డాక్టర్ కి కాల్ చేస్తాడు.

రుద్రా కి కూడా మొదటిసారి భయం వేస్తుంది.  అత్తయ్యే  తట్టుకోలేకపోయారు ఇక మావయ్య వాళ్ళు అని కంగారు పడతాడు.

భాను..  ధరణి పక్కనే కూర్చుని ఏమయింది అని కాళ్ళు రుద్దుతూ ఉంటే..  మిగిలిన వాళ్ళు కూడా చేతులు రుద్దుతూ కంగారుగా చూస్తూ ఉంటారు.

సులోచన కోడలు దగ్గరికి వచ్చి ఏమైంది అని తడిగుడ్డ పెడుతూ ఉంటుంది. డాక్టర్ వచ్చి చెక్ చేసి ఏదో విషయానికి టెన్షన్ పడ్డారు బీపీ పెరిగింది అని ఇంజక్షన్ చేస్తాడు.

ఇప్పుడు దాకా బాగానే ఉన్నది ఎందుకంత టెన్షన్ పడింది అని లలిత్ కి అనుమానం వచ్చి ఆ పేపర్స్ తీసుకుని చూస్తాడు.

ఆ రిపోర్ట్స్ చూడగానే .. లలిత్ కి చాలా కోపం వస్తుంది. వెంటనే ఆ పేపర్స్ ని చంపేస్తాడు. లలిత్ అని రుద్ర పిలిస్తే.. ప్లీజ్ బావగారు..

హాస్యానికి అయినా ఒక హద్దు ఉండాలి. ఇలాంటి విషయాల్లో నా కామెడీ చేసేది. పిన్ని చూడండి
తట్టుకోలేకపోయింది ...

రామచంద్రయ్య గారు ఏంటి లలిత్.. బావగారితో అలాగేనా మాట్లాడేది.  అది కాదు తాతయ్య
  తప్పుగా అనుకోవద్దు బాబు.

ఇంతకీ ఆ పేపర్స్ లో ఏముందిరా.. వాళ్ళ అమ్మాయి దొరికితే మన ధరణి ఎందుకు పడిపోవడం..అయ్యో తాతయ్య బావగారు జోక్ చేస్తున్నారు.

అందులో శాంభవి పేరు పెట్టి మనం ఎలా రియాక్ట్ అవుతామో అని చూస్తున్నారు.
ఏమిటి శాంభవి పేరు పెట్టారా అని రామచంద్రయ్య గారు కొంచెం గట్టిగానే అడుగుతారు.  అదే కదా.. అది చూసే పిన్ని పడిపోయింది.

ఆ మాటకి నవ్వుతూ శాంభవిని చూస్తే ఎవరైనా మా అమ్మాయి అయితే బాగుండును అనుకుంటారు అండి.. అంత మాత్రాన వాళ్ళ అమ్మాయి అయిపోతుందా ఏమిటి..

రుద్రా దేవేంద్ర ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటారు. రుద్ర రామచంద్రయ్య గారు చేతులు పట్టుకొని అది నిజం తాతయ్య..

ఏం మాట్లాడుతున్నావ్ బాబు అని తడబడుతూ అడుగుతారు.  జరిగింది మొత్తం చెబితే రామచంద్రయ్య గారు అక్కడే కుప్పకూలిపోతారు.

ఇంట్లో ఎవ్వరూ మాట్లాడలేక బిగుసుకుపోతారు. శకుంతల అయితే.. ఈ ఇంట్లో లేకలేక పుట్టిన ఆడపిల్ల.. ఈ ఇంటి పిల్ల కాదా..
ఇది అబద్ధం.  రేయ్ రామచంద్రయ్య ఇది అబద్ధమని చెప్పరా.. నా మనవరాలు అని ఘోల్లుమంటారు. భాను, శివ  అక్కడే కూలబడిపోతారు.

కొడుకులు ముగ్గురు దగ్గరికి వెళ్లి నాన్న మీరు టెన్షన్ పడకండి. ఇది నిజం కాదు.

అల్లుడుగారు నిజం చెప్పండి...

రుద్ర నిజం చెబుతాడా..
[+] 7 users Like SivaSai's post
Like Reply
Part - 92



అల్లుడుగారు నిజం చెప్పండి. ఎందుకు ఇలాగా జోక్ చేస్తున్నారు. మావయ్య ఇలాంటి సీరియస్ విషయంలో మీతో జోక్ చేస్తానా..

కానీ అది ఎలా సంభవం. ధరణికి కూడా తెలియకుండా ఎలా ఉంటుంది.  అత్తయ్య గారు చెప్పారుఅని కష్టంగా మాట్లాడుతూ ఉంటే..

ఆ రోజు ధరణి అత్తయ్యకు పుట్టిన బిడ్డ చనిపోతే.. అత్తయ్యకి ఏమవుతుందో అని కంగారు పడుతున్నప్పుడే..
శాంభవి అత్తయ్య ఒడిలోకి చేరింది.

ఆ విషయం ధరణి అత్తయ్య వాళ్ళ అమ్మగారికి..  బిడ్డని ఇచ్చి ఆవిడకి తప్ప ఎవరికీ తెలియదు. అందుకే ఆ విషయం మరుగున పడి పోయింది.

  మీరు చెప్పేది నిజమని ఏమిటి గ్యారెంటీ.. మా ఇంటిలో అమ్మవారు ముందు వెలుగుతున్న దీపమే సాక్ష్యం.  లహరి అత్తయ్య దూరమైన నిమిషమే ఆ ఇంటిలో దీపం కొండెక్కిపోయింది.

అప్పుడే మాకు చెప్పారు ఎప్పుడైతే ఈ ఇంటి మహాలక్ష్మి తిరిగి వస్తుందో తన చేతుల మీద గాని దీపం వెలుగుతుంది అని. శాంభవి చేతుల మీద గాని దీపం వెలిగింది .

మీరు చెప్పవలసిన అవసరం ఏమొచ్చింది.  మీరు ఎంత చెబుతున్నా.. నా మనసు ఒప్పుకోవడం లేదు అని భాను మాట్లాడలేకపోతాడు.

దేవేంద్ర పక్కనే కూర్చుని మీ మానసిక సంఘర్షణ నాకు అర్థం అవుతుంది. మాకు ఈ విషయం ఎప్పుడో తెలుసు. కానీ చెబితే మీరు ఏమైపోతారో..  శాంభవి తట్టుకోగలుగుతుందో లేదో అని ఇన్ని రోజులు చెప్పలేదు.

కానీ మా శత్రువుల ద్వారా గాని..మూడో మనిషి ద్వారాగాని మీకు తెలి స్తే మమ్మల్ని తప్పుగా అనుకుంటారు అన్న ఉద్దేశంతోనే ఇక్కడ వరకు రావలసి వచ్చింది..లేకపోతే ఈ విషయం మీకు ఎప్పటికీ తెలియనిచ్చే వాళ్ళం కాదు.

23 ఏళ్లుగా ప్రాణంగా, కంటికి రెప్పలా పెంచుకున్న ఆ అమ్మాయి ఒక్కసారిగా “మన రక్తం కాదు” అని తెలిసిన క్షణం…
ఆ తల్లిదండ్రుల గుండెలో ఆ మాట ఒక బాణంలా గుచ్చుకుంది.

భాను, శివ ని పట్టుకుని అన్నయ్య ఏమిటి ఇదిఅని ఆవేదనతో తల్లడిల్లి పోతూ ఉంటాడు :
“ఏంటి ఇది? ఇంతకాలం నా రక్తమని, నా వారసత్వమని గర్వంగా చూసుకున్న కూతురు… ఎప్పుడూ నా భుజం మీద నిద్రపోయే చిన్నారి… నా రక్తం కాదా? దానికి నేను తండ్రిని కానట్టా?” అని ఆత్మతోనే యుద్ధం మొదలవుతుంది.

స్పృహలోకి వచ్చిన ధరణి జయంతిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది.  ఆ ఇద్దరి తల్లుల కన్నీళ్లు ఒకరిని ఒకరిని తడిపేస్తూఉంటాయి.

“రక్తమా రక్తం కాదా అని ఎందుకు? నా గర్భంలో నిద్రపట్టకపోయినా, నా ఒడిలో నిద్రపోయింది. నా పాలతో పెరిగింది, నా చేతి వంటతో తిన్నది… నాకు ఆమే కూతురే!” అంతే కదా అక్క చెప్పు శాంభవి మన కూతురే కదా అని ఆవేదనతో ఏడుస్తూ ఉంటుంది.

అన్నయ్యలు  ముగ్గురు ఈ నిజాన్ని జీర్ణించుకోలేక పోతారు. చిన్నప్పటినుంచి అరచేతుల్లో పెంచిన చెల్లి తన చెల్లి కాదా అని ఎవరో వచ్చి చెబితే ఒప్పుకోవాలా..

  ఒకవైపు “అమ్మ మన చెల్లెలే!” అని గట్టిగా నిలబడతారు. కానీ మరోవైపు సమాజం చూపించే వేళ్లను ఊహించుకుంటూ లోపల చీలిపోతారు.

నానమ్మ, తాత కన్నీరు ఆపుకోలేరు.
నానమ్మ గుండెల్లో ఒక్క ఆలోచన: “మన వంశానికి రక్తం కాకపోతే, ఆమే స్థానం ఏమవుతుంది?”
కానీ వెంటనే హృదయం మరో ప్రశ్న అడుగుతుంది: “కానీ ఈ 23 ఏళ్ల బంధం, ఆ నవ్వులు, ఆ కౌగిలింతలు రక్తం కన్నా ఎక్కువ కదా?”


ఇలా కుటుంబం మొత్తంలో అంతరంగిక సంఘర్షణ మొదలవుతుంది.
ఒకవైపు సమాజపు మాటలు, రక్త సంబంధం అన్న వాస్తవం.
మరోవైపు ఇన్నేళ్లుగా పెంచుకున్న అపారమైన ప్రేమ, అనుబంధం.

ఎటు చూసి నా శాంభవి గుర్తులే.. ప్రతి ఆనందంలో ప్రతి నవ్వులో ఉన్నది శాంభవి జ్ఞాపకాలే.. అలాంటిది శాంభవి ఈ ఇంటి వారసురాలు కాదు అంటే ఆ కుటుంబం తట్టుకోలేక పోతుంది.
“రక్తం ముఖ్యం? లేక ఇన్నేళ్ల ప్రేమ ముఖ్యం?”

దేవేంద్ర రామచంద్రయ్య గారి చేతులు పట్టుకుని శాంభవి ఎప్పటికీ మీ మనవరాలే..  మీ తరవాతే మేము ఎవ్వరిమైనా..

అవును కదా...  నిజమే కదా అని అనుమానంగా అడుగుతారు.  దానికి దేవేంద్ర చిన్నగా నవ్వుతూ శాంభవికి ఈ విషయం తెలిసినప్పుడు రెండు రోజులు మనుషుల్లో లేదు.  తట్టుకోలేకపోయింది.

మాకందరికీ చాలా భయమేసింది.  ఏమైపోతుందా అని.. నా కూతురికే నేను సాక్ష్యాలు చూపించుకోవలసి వచ్చింది. నన్ను ఒప్పుకోలేక..  మీకు దూరం జరగలేక నరకం అనుభవిస్తుంది.

ఈరోజు మేము బయలుదేరినప్పుడు కూడా నాన్న జాగ్రత్త.. ఈ నిజం తెలిస్తే నాన్నకి ఏమీ అవ్వదు కదా..
అని మీ గురించి ఆలోచించింది కానీ ఎదురుగుండా ఉన్న కన్నతండ్రి ఇన్ని సంవత్సరాలునాకోసం ఎదురు చూశాడే..

నేను దగ్గర అవ్వకపోతే ఏమైపోతాడో అన్న ఆలోచన రాలేదు..రావాలని కూడా నేను అనుకోవడం లేదు. ఒక నిమిషం కళ్ళు మూసుకుని తెరిచి.. శాంభవి పుట్టడానికి కారణం అయ్యాను కానీ తండ్రి స్పర్శ..  ప్రేమ..  భరోసా ఏమి అందించలేకపోయాను.

ఇన్ని సంవత్సరాలుగా నా కూతురు కోసం నేను ఎదురుచూసాను కానీ  శాంభవి కి మాత్రం మీరే తల్లిదండ్రులు.

తన ఊహ ప్రపంచం ధైర్యం.  ఒక ఆడపిల్లకి కావలసిన అన్ని రకాల భరోసా మీరు మాత్రమే. ఈరోజుకి ఉదయం లేవగానే మీకు ఫోన్ చేసి మాట్లాడుతుంది.

నేను కనపడగానే పలకరిస్తుంది. నేను దూరమైన శాంభవి తట్టుకోగలుగుతుంది.  మీరు ఒక్క నిమిషం కూడా నా కూతురివి కాదా అని అడిగితే... ఆ నిమిషమే శాంభవి మనకి దక్కదు.

భాను కంగారుగా ఏం మాట్లాడుతున్నారు మీరు.  కూతురు గురించి అలా మాట్లాడొచ్చా.. ఇదేనండి ప్రేమ బంధం.

మీరు రక్తానికి మించిన ప్రేమని పంచారు.   మేము బయలుదేరినా గంట నుంచి శాంభవి ఫోన్ చేస్తూనే ఉంది. నాన్న ఎలా ఉన్నారు..  అమ్మ ఎలా ఉంది.

తాతయ్య అని అసలు మీ అందరి గురించి అడుగుతూనే ఉంటే.. ఇంకా వెళ్ళలేదు అన్నా సరే ఎంతసేపు డ్రైవింగ్
నాన్న నాన్న అని కలవరిస్తూనే ఉంది.

తర్వాత మాట్లాడతాను బిజీ అని ఫోన్ సైలెంట్ లో పెట్టేసాడు. మాటిచ్చాడు రుద్ర మిమ్మల్ని అందరిని నవ్వుతూ తీసుకు వస్తాను అని..

ఎప్పటికీ నువ్వు భాను మావయ్య కూతురువే అని..  నిన్ను భాను మావయ్య కూతురు గానే చూస్తాము అని చెప్పిన తర్వాతే శాంతించింది.

తన ఆరాటం ఆలోచన అన్ని మీరేనండి.  ఈ నిజం చెప్పడానికి ముఖ్య కారణం శత్రువులు. వాళ్ల ద్వారా నిజం తెలియకూడదు అన్న ఒక్క ఆలోచనతోనే... శాంభవికి మీకు చెప్పవలసి వచ్చింది .

అందుకు మమ్మల్ని క్షమించండి. శాంభవిని మీ కూతురుగానే చూడండి అని దేవేంద్ర చేతులు జోడిస్తాడు.
రుద్ర ఆ చేతిలో మీద చేతులు వేసి మావయ్యతో పాటు నేను కూడా అడుగుతున్నాను.

దయచేసి శాంభవి కి మీరు దూరం జరగవద్దు. మామా అల్లుడు చెప్పిన దానికి కుటుంబం మొత్తానికి హృదయం ద్రవిస్తోంది.

ఒక్క నిమిషం అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఇంత దూరం వచ్చి చెప్పవలసిన అవసరం వీళ్ళకి లేదు. రిపోర్ట్స్ చూపించి శాంభవికి  ఈ కుటుంబంతో ఎటువంటి సంబంధం లేదు అన్న ఏమీ చేయలేము.

కానీ అలా చేయకుండా బ్రతిమాలుతున్నారు శాంభవి ఎప్పటికీ మీ అమ్మాయే..  మీ కూతురుగానే చూడండి అని అడుగుతున్నారు.

మన ఆలోచనలు మన ప్రేమలో శాంభవి ఎప్పటికీ ఈ ఇంటి కూతురు.  ఇంకా అది మాత్రమే చూసుకోవాలి కానీ మన ఇంట పుట్టిందా లేదా అన్నది అనవసరం.

పుట్టిన క్షణం నుండే మన ఇంట బిడ్డగా పెరిగింది అదే వాస్తవం.  రామచంద్రయ్య గారు దేవేంద్ర చేతులు పట్టుకొని మీరు ఇంత ప్రాదేయపడవలసిన అవసరం లేదు.

మీరు అవునన్నా.. కాదన్నా.. శాంభవి నా మనవరాలు. ఈ ఇంటి వారసురాలు. మీరు రక్తం మాత్రమే ఇచ్చారు కానీ మా పంచప్రాణాలు మా బిడ్డ పైనే పెట్టుకున్నాము.

ఈ మాట చాలండి. శాంభవికి నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగాను.  మిమ్మల్ని నవ్వుతూ తీసుకువస్తాము అని మాట ఇచ్చాము.

దయచేసి మమ్మల్ని మన్నించి మీ అమ్మాయిని అలాగే చూడడానికి రండి అని దేవేంద్ర కన్నీళ్లుతో అడుగుతాడు.  రుద్రకి దేవేంద్రుని చూస్తే చాలా బాధగా అనిపిస్తుంది.

కూతురు అని తెలిసిన దగ్గర కాలేకపోతున్నాడు. పెంచిన వాళ్ళే జీవితాంతం తల్లిదండ్రులుగా ఉండాలి అని బ్రతిమాలుతున్నాడు.

భగవంతుడా ఏమిటి ఈ పరీక్ష..చినమామకి ఇంకా ప్రశాంతత లేదా..  సంతోషమన్నది రాదా...
శివ దేవేంద్ర చేతుల పట్టుకుని మమ్మల్ని తల్లిదండ్రులగా జీవితాంతం ఉండమంటున్నారు. అదే మాకు పెద్దవరం.

దానికి మీరు దూరం జరిగి శాంభవి నీ మా ఇంటి బిడ్డగా ఉంచనవసరం లేదు. పెళ్లయిన ఆడపిల్ల  పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్ళవలసినదే..

అలాగే మా ఇంటి నుంచి శాంభవి అత్తవారింటికి వెళ్ళింది. అదే మాకు మీరు చేసిన గొప్ప మేలు. లోకం దృష్టిలో మమ్మల్ని తల్లిదండ్రులు గానే ఉంచారు అది చాలు.

మీరు ఎప్పుడు శాంభవికి కన్న తండ్రె ఏమంటావు రా భాను..  నిజమే అన్నయ్య మన ముగ్గురమూ శాంభవికి తండ్రులమే.

లహరి గారు ఈ లోకంలో లేకపోయినా కన్నతల్లే కదా.. ధరణి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అవును అన్నట్టుగా తల ఊపుతుంది.

మరి అందరం మీ అమ్మాయి దగ్గరికి వెళదామా అత్తయ్య అని ధరణి భుజం చుట్టూ చెయ్య వేసి అడుగుతాడు.

ఇప్పుడే బయలుదేరేదాము. ఈ విషయం తెలిసినప్పటి నుంచి శాంభవి ఎంత నలిగిపోయి ఉంటుందో.. ఎవరితోను ఏమీ చెప్పుకోదు.

వాళ్ళ నాన్నలతో తప్ప మాతో కూడా చెప్పదు తెలుసా అని ధరణి కళ్ళు తుడుచుకుంటూ చెబుతూ దేవేంద్ర వైపు చూస్తుంది.

ఇందులో మీరు అనుమానించవలసిన అవసరం ఏమీ లేదమ్మా..  భాను, శివ తర్వాతే నేను.. ఇది ఫిక్స్. దీని గురించి మనం మళ్ళీ మళ్ళీ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. రాదు కూడా..  రేపు శాంభవికి పుట్టే పిల్లలకు కూడా ఇదే మొదటి అమ్మమ్మ గారి ఇల్లు.

అందరూ శాంభవి దగ్గరికి ప్రయాణం...
[+] 7 users Like SivaSai's post
Like Reply
Part - 93



రుద్ర నుంచి ఫోను రాకపోయేటప్పటికి శాంభవిలో కంగారు ఎక్కువఅవుతుంది. చారులత దగ్గరికి వెళ్లి అత్తయ్య అని పిలిస్తే...ఏంట్రా.. ఏమీ లేదు అని మళ్ళీ వెనక్కి తిరిగితే..

ఇలా రా చిట్టి తల్లి అని పిలిస్తే వెళ్లి దగ్గర కూర్చుంటుంది. ఎందుకు అంత కంగారు పడుతున్నావు.  వెళ్ళింది నా కొడుకు, అన్నయ్య.

వాళ్ళిద్దరూ విడివిడిగా వెళితేనే పనిలో అపజయముండదు.. అలాంటిది ఇద్దరూ కలిసి వెళ్లారు. ఖచ్చితంగా అందర్నీ తీసుకుని వస్తారు.

వస్తారు అని నాకు నమ్మకం ఉంది.  కాకపోతే నాన్న ఎలా ఉన్నారు అని నా భయం. తెలియగానే ఏమైపోయి ఉంటారో..  తట్టుకోలేకపోయి ఉంటారు.

శాంభవి కంగారు చూసి చేతిని తన చేతిలోకి తీసుకుని..  నిన్ను ఒక్క విషయం అడుగుతాను నిజాయితీగా నిజం చెప్పరా. అడగండి అత్తయ్య..

ఎంతసేపు భాను అన్నయ్య గురించి ఆలోచిస్తున్నావు కదా.
ఒక్కసారి కూడా నీ కన్నతండ్రి గురించి ఆలోచించాలి అని అనిపించలేదా.

ఆ తండ్రి బాధ ఏరోజు నీ హృదయాన్ని చేరలేదా..  పెంచిన తండ్రి ఏమైపోతాడో అని కంగారు పడుతున్నావు. కానీ నువ్వు కన్న తండ్రికి దగ్గర అవ్వడం లేదు అని ఆ తండ్రి ఎంత విలవిల్లాడుతున్నాడో ఒక్కసారి అయినా ఆలోచించావా...

హ్మ్.. ఆలోచించాను అందుకే కదా నాన్న అని పిలుస్తున్నాను  కానీ చిన్నప్పటి నుంచి నన్నే ప్రాణంగా.. వాళ్లే సర్వస్వం గా బ్రతికాము.

నా ప్రతి తలుపులో..  భాను నాన్న,  శివ నాన్నే వస్తారు. తర్వాత ఎవరైనా ఇది నేను మార్చలేను అలా అని నా కన్నతండ్రిని తక్కువ చేయలేను.

పరిస్థితులన్నీ నాన్నకి తెలుసు. నేనెవరో తెలిసినప్పటి నుంచి నా చుట్టూ ఉన్న వాతావరణం చూస్తూనే ఉన్నారు. ఆయనకి బాధ లేదు అని నేను అనను.

కాకపోతే భాను నాన్న వాళ్ళకి ఈ విషయం ఒక్కసారిగా విని తట్టుకోవాలి అంటే కష్టం. ఒక్క విషయం ఆలోచించండి అత్తయ్య.

పుట్టినప్పటినుంచి నేనే కూతురిని..  చాలా రోజుల తర్వాత ఇంట పుట్టిన ఆడపిల్లని అపురూపంగా పెంచుకున్నారు.

కాలు కింద పెడితే ఎక్కడ కందిపోతుందో అని గుండెల మీద పెట్టి కొని పెంచారు. అలాంటిది వాళ్ళకి ఒక్కసారిగా ఈ చేదు నిజం తెలిస్తే...

ఏమైపోతారు.  నువ్వు అన్నది కూడా నిజమేలే...కాదు అనలేను.  నీకు వాళ్ల గురించి బాధ..  నువ్వు మాకు దూరమైనప్పుడు నుంచి అన్నయ్య బాధని చూస్తున్నాను కదా..  అందుకే నాకు అన్నయ్య గురించి బాధ..

నేనొక్కసారి అమ్మ దగ్గరికి వెళతాను.  నేను రానా. లేదు అన్నయ్యకి కాల్ చేస్తాను అని విహాన్ కి కాల్ చేస్తుంది. వెంటనే లిఫ్ట్ చేసి చెప్పరా ..

బిజీగా ఉన్నారా అన్నయ్య . నీకన్నా ఏది ఇంపార్టెంట్ కాదు. విషయం ఏంటో చెప్పు తల్లి అని.  మీరు ఖాళీగా ఉంటే ఒకసారి వస్తారా.. అమ్మ దగ్గరికి వెళదాము.

ఇప్పుడే బయలుదేరుతున్నాను అని  అద్వైత్ కిఇన్ఫర్మేషన్ పాస్ చేసి బయలుదేరుతాడు. విహాన్ రాగానే శాంభవి చారులత తో చెప్పి బయలుదేరుతుంది.

లహరి దేవాలయంలోనికి వెళ్లి అక్కడ పువ్వులు అన్నీ సర్ది కూర్చుని చూస్తూ ఉంటుంది. పక్కనే కూర్చుని తల నిమురుతూ.. ఏమైంది రా..

అర్థం కావడం లేదు అన్నయ్య.  చాలా భయంగా ఉంది.  మీ బావ వెళ్ళాక ఒక ఫోను లేదు ఏమీ లేదు. లిఫ్ట్ చేయడం లేదు. అక్కడ ఏం జరిగిందో ఏం జరగబోతుందో తెలియక చాలా టెన్షన్ గా ఉంది.

అయ్యో నా బంగారు తల్లి..  వెళ్ళింది ఎవరు రుద్ర. రుద్ర వెళ్ళిన చోట ఫెయిల్ అవ్వడం అన్నది ఉండదు. నువ్వు చూస్తూ ఉండు..  అందరిని తీసుకు వస్తాడు.

బావ నీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అంటే నీకు సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటున్నాడు.  నాకు అలాంటి సర్ప్రైజ్ ఏమి వద్దు.  విషయం ఇది అని తెలిస్తే చాలు.

మోకాళ్ళ మీద కూర్చుని లహరి సమాధి పైన పడుకుని నాకు ప్రశాంతత ఇవ్వు అమ్మ.. నాన్న వాళ్ళు ఎవరూ బాధపడకుండా అందరూ సంతోషంగా ఉండాలి.

నన్ను కూతురుగా గానే చూడాలి. ఎప్పటికీ వాళ్ళు దూరం కాకూడదు.

శాంభవి మనసులోని గుండె దడగా కొట్టుకుంటుంది .
నన్ను  పెంచుకున్న తండ్రె.. నా దృష్టిలో కన్న తండ్రి..  రక్తసంబంధం లేదని నాన్న నన్ను దూరం చేసుకుంటారా..

నేను లేకపోతే నాన్నలు ఉండగలరా... వాళ్ళ మాట వినపడకపోతే నేను ఊపిరి తీసుకోగలనా.. ఈ విషయం తెలియగానే నాన్న ఏమైపోతాడో అనే భయం నన్ను నిలువనివ్వడం లేదు.

నాన్న చూపులోని ఆ ఒక చిన్న మెరుపు కూడా నా హృదయాలంకారాన్ని మెరిసిస్తుంది;
నేనెవరో నిజంగా ఆయన కూతురు కాదు అనిపిస్తే, ఆయన దూరమవుతాడా?
ఆ దూరం  నా ప్రపంచాన్ని చిదిమేస్తుంది.

నాకు నన్ను 'కూతురు'గా మాత్రమే పిలవాలని ఉంది —
ఆ పిలుపే నాకు గుర్తింపు, ఆగమనం, అవార్డు కాదు; అది జీవనాశ్రయం.

వాళ్ళ ప్రేమతో ఆ కుటుంబం నిర్మితమై ఉంది. ఇది నిజం తెలిసిన తర్వాత ఎవరు మనుషలు కాలేరు. ఆ కుటుంబం దుఃఖంలో మునిగిపోకూడదు అనే ఆశే నా నిత్యమైన ప్రార్థన.

భర్త, కన్న తండ్రి ఇంకా రాలేదు అన్న భయం.. వెళ్లిన ఇద్దరూ ఇంకా రాలేదు. ఫోన్ కూడా చేయలేదు. ఎవరు ఎన్ని చెబుతున్నా కుదురుగా ఉండలేక పోతున్నాను.

వాళ్లు రాకపోతే, అర్థం మార్చుకోమని ఊహలు హెచ్చరిస్తున్నాయి.
వాళ్ల రాక మా బంధానికి జీవం నింపుతుంది. 
నాకు ధైర్యాన్నిఇవ్వు అమ్మ.

నేను నిస్సహాయంగా ఉండను. ఏనాటి రుణమో నేను ఆ ఇంటికి చేరాను. ఆ రుణం అలాగే ఉండిపోని . ఇది నా అత్యాశ అనుకున్న పరవాలేదు.

అమ్మ..  నాకు ఉన్న ఒకే ఒక్క   ఆశ.. నన్ను భాను ప్రసాద్ కూతురుగా  బంధించు.
నాన్న ఎప్పుడు నన్ను కూతురు గానే చూస్తారు కదు అని సమాధి ని ఇంకా గట్టిగా పట్టుకుంటుంది. అది చూస్తున్న విహాన్ కి...

శాంభవి మానసిక సంఘర్షణ అర్థం అవుతూ ఉంటుంది. దగ్గరికి వెళ్లి భుజం మీద చెయ్యి వేసి కంగారు పడకురా... అన్ని నువ్వు అనుకున్నట్టుగానే జరుగుతాయి.
సమాధి మీద నుండి లేచి కళ్ళు తుడుచుకుని.. ఈ భయాల బరువు నా అరుపు కాదు — అది మా బంధానికి పటుత్వం కావాలి నన్ను ఆ కుటుంబంలో మనిషిగానే చూడాలి.

తప్పకుండా నువ్వు కోరుకున్నట్టుగానే జరుగుతుంది ఎవరో వస్తున్నట్టు అనిపించి ఇద్దరు వెనక్కి తిరిగి చూస్తే.. రాఘవేంద్ర జితేంద్ర వస్తూ ఉంటారు.

తాతయ్య వాళ్ళు ఏంటి..  ఏమో అని లేచి నిలబడతారు.  రాఘవేంద్ర మనవరాలు దగ్గరికి వచ్చి ఏర కంగారు పడుతున్నావా..


భయపడకు. అంతా నువ్వు అనుకున్నట్టుగానే జరుగుతుంది.
విహాన్ కి కాల్ వస్తే.. మాట్లాడి.. శాంభవి  వెళ్దాం పద.. ఎవరు రా ఫోను.. బావ చేశాడు నాన్న.  దారిలో ఉన్నారంట..

ఇంటికి వెళ్ళమని చెప్పాడు.  మనం ఇక్కడున్నామని ఎలా తెలుసు అన్నయ్య. అక్కడ ఉన్నది రుద్ర.  అన్ని అలాగే తెలిసిపోతాయి.

కారు నేరుగా బృందావనానికి వెళుతుంది. ఇక్కడికి వచ్చాము ఏమిటి అన్నయ్య. బావ ఇక్కడికే తీసుకురమ్మన్నాడు.

ఇల్లంత పువ్వులతో అలంకరిస్తూఉంటారు.  అనసూయ తులసి కంగారుపడుతూ అందరికీ పనులు పురమాయిస్తూ ఉంటారు.

చారులత కౌసల్య, మాధురి ఏమేమి వండాలో చెబుతూ ఉంటారు. హంగామా అంతా  ఇంత కాదు.  అసలు ఏం జరుగుతుంది ఇక్కడ.. ఎవరైనా చెబుతారా అని శాంభవి అడిగితే.. రా..రా తల్లి నీకోసమే చూస్తున్నాము.

నువ్వు వెళ్లి రెడీ అవ్వు.  రుద్ర వాళ్ళు వచ్చేస్తున్నారు.  ప్లీజ్ నానమ్మ విషయం ఏంటో చెప్పండి. టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను.

అందరూ సంతోషంగావస్తున్నారా..  ఆ ఒక్క విషయం చెప్పండి చాలు.  ధీరజ్ వచ్చి   ఒరేయ్ ఇంత మందికి బావ మీద నమ్మకం ఉంది కానీ నీకు రావడం లేదా..

నమ్మకం లేక కాదు అన్నయ్య ఒక చిన్న భయం అంతే.. అందరూ వస్తున్నారు.. మమ్మల్ని నమ్ము.  వెళ్లి రెడీ అవ్వరా...

సరే అని శాంభవి రెడీ అయ్యి ఎదురు చూస్తూఉంటుంది. కార్ సౌండ్ వినగానే బయటికి పరిగెత్తుకుంటూ వెళుతూ ఉంటే.. ఆగు  శాంభవి అని కౌసల్య ఆపుతుంది.

ప్లీజ్ పెద్దమ్మ నన్ను బయటకు వెళ్లనివ్వు. అలాకాదురా వచ్చే వాళ్ళకి నువ్వే హారతి పట్టి లోపలికి తీసుకురా..

సరే అనగానే సర్వెంట్..  హారతి పళ్లెం తీసుకువచ్చి శాంభవి చేతికి ఇస్తారు.
రేపల్లె నుంచి వచ్చినా అందరికీ శాంభవి ఎలా రిసీవ్ చేసుకుంటుందో..  మన అనుకుంటుందో లేదో అని ఒక ఆందోళనతోనే వస్తారు.

కానీ వారి అనుమాని పటాపంచలు చేస్తూ హారతి పళ్లెం తో ఎదురు వస్తుంది.  శాంభవిని అలా చూడగానే... అందరికీ హృదయంలో తడిచేరి కళ్ళల్లో నుంచి కారుతుంది.
వాళ్ళ అందరిని చూడగానే శాంభవి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది.

ఒక అపురూపమైన భావోద్వేగ పరిస్థితి...

కథ కొనసాగుతుంది...
[+] 7 users Like SivaSai's post
Like Reply
Excellent update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
inka climax ki vachesinattundi story!!
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
రెండు కుటుంబాలు కలిశాయి. ఇంట్లో పండగ వాతావరణం...
[+] 1 user Likes Sunny73's post
Like Reply
Part - 94



హారతి పళ్లెంతో తన కుటుంబాన్ని చూస్తున్న శాంభవి కళ్ళు నీటికుండలే అయ్యాయి. కూతురు తమ కోసమే ఎదురు చూస్తూ ఉండేసరికి ఆ తండ్రి హృదయం ఉప్పొంగిపోయింది.


అడుగులు తడబడుతూ ఉన్న ఒకరినొకరు పట్టుకొని మెల్లిగా గుమ్మం ముందుకు వెళ్లేటప్పటికీ శాంభవి హారతి ఇచ్చి నాన్న అని గట్టిగా పట్టుకుంటుంది.

అమ్మ చిట్టితల్లి బంగారం అని శివ,  భాను చెరో పక్కన పట్టుకుంటారు.  మీరు రారేమో అనుకున్నాను.  నన్ను కూతురిగా ఒప్పుకోరు ఏమో అని చాలా భయపడ్డాను నాన్న.

పిచ్చి తల్లి నువ్వు ఎప్పటికీ మా అమ్మాయివే.
నువ్వు పుట్టినప్పటినుంచి నా కూతురు గానే పెంచాను నాకు తెలిసిన నిజం అది మాత్రమే.. కానీ ఇప్పుడు?

అది నిజం కాదు. అనుకోని పరిస్థితుల్లో మీ బిడ్డగా చేరింది అని చెబుతూ ఉంటే  ఒక్కసారిగా నా కాళ్ల క్రింద నేల కదిలిపోయింది .

నా బంధం అబద్ధమా? రండి నాన్న అని సోఫాలో ఇద్దరినీ కూర్చోబెట్టి.. వాళ్ళిద్దరి మధ్యన మోకాళ్ళ మీద కింద కూర్చుని ఇద్దరి చేతులు పట్టుకుని...
–కళ్లలో దాచుకోలేని కన్నీరు. శాంభవి చిన్నగా, వణుకుతున్న గొంతుతో..
"నాన్నా…" ఆ పిలుపు వినగానే మళ్లీ మళ్లీ వినాలి అన్న భాను ఆశ. ఉన్న వాళ్ళందరినీ చూస్తే ఎక్కడ కూతుర్ని లాగేసుకుంటారు అన్న భయంతో  మూలుగుతూ తల వంచేస్తాడు.

భాను శివ ఇద్దరూ ఏడుస్తారు..
"ఆ పిలుపు ఇక మాకు దూరం అవుతుందేమో అని భయం ఎందుకంటే ..  నేను నీ నిజమైన తండ్రిని కాదూ. నీ కన్న తండ్రి నీ పిలుపు కోసం..  నీ ప్రేమ కోసం.. ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తూనేఉన్నాడు.

శాంభవి ఒక్క క్షణం ఆగి .. మెల్లిగా చేతులు తండ్రి వణికే చేతులపై పడతాయి.
"నిజం? నిజమంటే ఏమిటి నాన్నా? మీరు నాకు మొదటి అడుగు నేర్పించారు. రాత్రి నాకు జ్వరం వచ్చినపుడు నిద్రని త్యాగం చేశారు. మీరు కన్నీరు తుడిచారు… నా కలలను నడిపించారు. మరి ఇవన్నీ నిజం కాదు?"

"కానీ సమాజం నిన్ను అడుగుతుంది… 'నీ తండ్రి ఎవరు?' అని. నువ్వు ఏం చెప్పగలుగుతావు? నిన్ను ఎవరైనా వేలెత్తి చూపిస్తే నేను భరించలేను.


"నేను చెబుతాను - నా తండ్రి నా రక్తంలో లేడు… నా హృదయంలో ఉన్నాడు. కన్న ప్రేమ తక్కువఅని నేను అనను.

కానీ ఇన్ని సంవత్సరాలు కళ్ళల్లో పెట్టుకుని అపురూపంగా పెంచారు ఎవరైనా వేలెత్తి చూపిస్తారేమో... నీ తండ్రి ఎవరు అని అడుగుతారేమో ఆ మాట వింటే నేను ఎక్కడ బాధపడతానో అని దూరంగా ఉండాలి అనుకుంటున్నారే... ఇంతకన్నా గొప్ప ప్రేమ ఎక్కడ ఉంటుంది నాన్న.

మీరు ఎప్పటికీ మా నాన్నే.  ధరణి అమ్మే మా అమ్మ అంతే కదా అమ్మ. ధరణి పరిగెత్తుకుంటా వచ్చి కూతురి మొఖం అంతా ముద్దులు పెట్టేస్తుంది.

అంతే తల్లి నువ్వు మొదటి పాలు రుచి చూసింది నా దగ్గరే...  నా ఒడిలోనే పడుకున్నావు.  జోల పాడింది నేనే.. నా కూతురు అవ్వకుండా ఎలా ఉంటావు.

భాను తన కూతురిని కన్నీటితో ఆలింగనం చేసుకుంటాడు. భాను తడబడుతున్న స్వరంతో...
"ఎన్ని కలతలైనా, ఈ మాట విన్నాక… నేను ప్రపంచంలో అతి ధనవంతుడిని.
ఎప్పటికీ నేను మీ కూతురినే, నాన్నా.
  చూస్తున్న అందరికీ గుండె బరువెక్కి పోతుంది. భాను ఎంతగా నలిగిపోతున్నాడో అర్థమవుతూ ఉంటే భగవంతుడా పిల్లలపైనా తండ్రికి ఇంత ప్రేమ ఉంటుందా అని రుద్ర ఒక్కసారిగా రేపు ఫ్యూచర్లో నాకు పిల్లల పుడితే నేను ఇలాగే ఉంటానా...

దేవేంద్ర దగ్గరికి వచ్చి..  చెప్పాను కదా భాను ఎప్పటికీ... శాంభవి మీ ఇంట ఆడపిల్ల అని... ఆ మాట చెబుతున్నప్పుడు దేవేంద్ర గొంతు వణుకుతుంది. వస్తున్న కన్నీరుని బలవంతంగా ఆపుకుంటూ ఉంటాడు..

శాంభవి లేచి నుంచుని దేవేంద్రని కౌగిలించుకుంటుంది. నేను ఆ ఇంటికే కాదు నాన్న..  మీకు కూడా కూతురినే.. మీరు నాకు జన్మనిచ్చారు.

తండ్రి సంస్కారం కూడా పిల్లలకు వస్తుంది అంటారు. మీ రక్తం.. వాళ్ల పెంపకంతో నాకు ఒక గొప్ప వ్యక్తిత్వం వచ్చింది ఇదంతా మీ వల్ల కాదా...

అందరూ సంతోషంతో వస్తున్న కన్నీరు తుడుచుకుంటూ ఈ అపురూపమైన సంఘటన చూస్తూ ఉంటారు. కుర్ర బ్యాచ్ అందరూ ఎవరి ఫోన్లో వాళ్ళు ఈ సీన్ మొత్తం ఫొటోస్ తీస్తూ వీడియో తీస్తూ ఉంటారు .

నేను ఎంత అదృష్టవంతురాలునో కదా..  ఎవరికైనా ఒక ఫ్యామిలీ..  ఒక తల్లి తండ్రి మాత్రమే ఉంటారు కానీ నాకు చూడండి నలుగురు తండ్రులు ఉన్నారు.  ఇంత పెద్ద కుటుంబం నాకోసం ఉంది. ఇంతకు మించి ఏమీ కావాలి.

రుద్ర కూడా బాబోయ్  సెంటిమెంట్ ఎక్కువైపోతుంది ఎలాగైనా డైవర్ట్ చేయాలి అని కళ్ళు తుడుచుకుని వచ్చి హలో పాప.. నీకు నాన్నలు ఉంటే చాలా...

మొగుడు అవసరం లేదా.. నువ్వు ఎప్పటికీ నా దానివే అని దేవేంద్ర దగ్గర నుంచి లాక్కుంటాడు  రుద్ర చేసిన దానికి అందరూ నవ్వుతూ ఉంటే.. శాంభవి చిరుకోపంగా చూస్తుంది.  ఏంటి పాప నీకు కోపం వచ్చిందా..

రుద్ర నుంచి దూరం జరిగి నడుం మీద చేతులేసుకుని చూడండి మీరు నన్ను ఏదైనా అంటే నాకు ఆరుగురు అన్నయ్యలు ఉన్నారు.

మిమ్మల్ని కీమా కింద కొడతారు.  ఎవరు వీళ్ళ.. నా బావమరిదలా..  అవును కదా అన్నయ్యలు.  అంతే కదా.. మా చెల్లి తర్వాతే నువ్వు బావ అని ఆరుగురు దగ్గరికి వస్తారు. సరిపోయింది. మొత్తం ఏడుగురు..

రోజుకి ఒకరు చొప్పున నేను ఆడుకోవచ్చు అన్నమాట.. నీ ఆటలేమి మా దగ్గర సాగవు బావ. మేమందరం ఒక జట్టుగా ఉంటాము.

గుర్రాలన్నీ ఒక చోట ఉన్నా దానికి తాడుకట్టి నడిపించే రథసారధిని నేనే... బావలు.
అందరి నవ్వులతో బృందావనం నిండిపోతుంది. అలా చూసిన రాఘవేంద్ర,  అనసూయ కి కూడా ఈ జన్మకి ఇది చాలు అనిపిస్తుంది.

అనసూయ లహరి ఫోటో వైపు చూస్తూ నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం లేదు అని ఇన్ని రోజులు నలిగిపోయాను నీ కూతురికి నీ కన్నా గొప్ప సంస్కారం వచ్చింది. ఎవరు బాధపడకుండా అందరినీ కలుపుకుంది ఇది చాలు అని మనసులోనే కోడలికి నమస్కారం  చేస్తోంది.

శాంభవి దేవేంద్ర దగ్గరకు వచ్చి నాన్న.. అమ్మమ్మ తాతయ్యని కూడా ఇక్కడికి తీసుకురండి.  ఇప్పటినుంచి మనతోనే ఉంటారు.

ఈ వయసులో వాళ్ళిద్దరికీ కావలసింది మనశాంతి.  అది నా దగ్గర మాత్రమే దొరుకుతుంది. అవును తల్లి..  నిన్ను చూసుకుంటూ ఉంటే లాహరిని చూసినట్టుగానే సంతోషపడతారు.

హలో చినమామ..  నువ్వు మీ కూతురు చాలా స్లో.  ఆల్రెడీ ఆ ఏర్పాటులన్నీ అయిపోయాయి. ఎప్పుడు చేసావురా  చిద్విలాసంగా నవ్వుతాడు. నీ నవ్వు చాలు రా మాయ చేసేస్తావు.

శాంభవి మనసు ఏమిటో నాకు తెలుసు మామ. ఖచ్చితంగా వాళ్ళని ఇక్కడికి తీసుకు రమ్మని అడుగుతుంది. మరి ఆ మనసు నాదే అయినప్పుడు ఆ మాత్రం అర్థం చేసుకోలేనా ...

సరే ఇప్పటికే చాలా లేట్ అయింది.. అందరూ ఏమీ తినకుండా చూస్తూ ఉన్నారు కదా..  రండి అందరం కలిసి భోజనం చేద్దాం అని మొత్తం టేబుల్స్ సెట్ చేస్తారు.

శాంభవి మాత్రం లేదు నాకు మా నాన్నలు నలుగురు తినిపిస్తారు. ధీరజ్ ఫాదర్  రమణ వచ్చి ఆ నలుగురితో పాటు నన్ను కలుపుకో తల్లి. పంచ పాండవులు లాగా నిన్ను చూస్తూ ఉంటాము.

శాంభవి కి ఒక్కదానికే తినిపిస్తే ఎలా... మా అందరికీ తినిపించండి అని కుర్ర బ్యాచ్ అంతా అక్కడే కూర్చుంటారు.

అప్పుడు ఒక ప్లేట్ లో ఎలా కుదురుతుంది..  పెద్ద పళ్లెంలో  కలపాలి అని ఒక బేసిన్ తీసుకువచ్చి చారు మధ్యలో పెడుతుంది.

అందరూ నవ్వుల సరదాల మధ్యన పిల్లలందరికీ తినిపిస్తారు. శాంభవి తిరిగి అందరికీ తినిపిస్తుంది. ఆ రాత్రికి భాను దగ్గరే పడుకుంటుంది.

రుద్రా దగ్గరకి ధీరజ్  వచ్చి ఏంటి బావ మా చెల్లి కోసం చూస్తున్నావా.. ఇప్పుడు అప్పుడే నీకు దొరకదు. ఆ మాటకి చిన్నగా నవ్వుతూ..

ఒరేయ్ మీ చెల్లి ఎక్కడున్నా నా పిలుపుకి వచ్చేస్తుంది. కాకపోతే నిన్న.. ఈరోజు చాలా టెన్షన్ పడి ఎమోషన్స్ క్యారీ చేశారు కదా.. కాస్త వాళ్ళని రిలాక్స్ అవ్వని..

తర్వాత ఎలాగా నీ చెల్లి నా షర్టు పట్టుకుని తిరగాల్సిందే.. అదేంటి బావ ఎవరైనా పెళ్ళాం కొంగ పట్టుకుని తిరుగుతున్నాడు అంటారు.  నువ్వేంటి రివర్స్లో చెబుతున్నావు.

మనం చీరలు కట్టం కదా.. అందుకే నా షర్టు పట్టుకుని తిరుగుతుంది అంటున్నాను.  ఇంకా నయం ప్యాంటు పట్టుకుని తిరుగుతుంది అనలేదు.. ఏదైతే ఏమిటి నన్నే కదా పట్టుకునేది.

దేవేంద్ర వచ్చి రుద్ర ని గట్టిగా హగ్ చేసుకుంటాడు.  ఏమైంది మామ.. చాలా థాంక్స్ రా... నా కూతుర్ని నాకు దగ్గర చేశావు.

అలాగే ఆ కుటుంబం దూరం అవ్వకుండా చేసి నా కూతురు దృష్టిలో నన్ను ఒక మెట్టు పైనే ఉంచావు.  ఇంతకు మించి ఇంకా ఏమి కావాలి రా...

అదేంటి నువ్వొక్కడివే వచ్చి థాంక్స్ చెప్తున్నావు.. పెదమామ చెప్పడా.. నేనెందుకు చెప్పాలి రా.
  నా కూతురు నా ఇంటికి వచ్చింది.

అలాగే ఆ కుటుంబం మన కుటుంబం అయ్యింది. ఇందులో నువ్వు చేసింది ఏముంది అని జితేంద్ర వస్తాడు.  కదా..  ఆ మాట ఏదో చిన్న మామకి చెప్పు. బయట వాళ్ళకి చెప్పినట్టుగా థాంక్స్ చెబుతున్నాడు.

జితేంద్ర రుద్రాని ముద్దు పెట్టుకుని ఇంతకు మించి థాంక్స్ చెప్పలేను రా... పో మామ..  ఈ ముద్దు నీ కూతురు పెడితే అందంగాని..

నువ్వు పెడితే ఏం బాగుంటుంది ముసలి వాసన వస్తుంది. ఒరేయ్ మేము ముసలోళ్ళం కాదురా..  మిడిల్ ఏజ్.  ఏదైతే ఏంటి రిటైర్మెంట్ ఏ కదా...

ఈరోజు బృందావనం నిజమైన బృందావనం లాగా మారింది...
[+] 7 users Like SivaSai's post
Like Reply
Part - 95



ఊరి నుంచి లహరి తల్లిదండ్రులు కూడా వస్తారు. దేవేంద్ర ఎదురువెళ్లి రండి మావయ్యగారు, అత్తయ్యగారు. నమస్కారం చేస్తారు.

మీరు పెద్ద వాళ్ళు ఆశీర్వదించాలి కానీ ఇలా కాదు. ఆ కళ్లు ఆత్రంగా ఎతుకుతూ ఉంటాయి. మనవరాలు కోసమా.. ఒక్క నిమిషం అని చారులతను పిలిచి..

శాంభవి ని పిలువు..సరే అని వెళుతుంది. అనసూయ, రాఘవేంద్ర ఎదురు వచ్చి ఎన్ని రోజులకు మీ భాగ్యం మాకు కలిగింది రండి బావగారు..

అనసూయ ఆ జంట కాళ్ళకి  నమస్కరించి.. నన్ను క్షమించండి. అమ్మా..  ఏమిటి ఈ పని అని వెనకకి జరుగుతారు.

తప్పు లేదండి.. మీకు కడుపు కోత మిగలడానికి కారణం అయ్యాను. ఇన్ని సంవత్సరాలు మీరు దుఃఖంలోనే ఉండిపోయారు. అందుకు పరోక్షంగా నాదే బాధ్యత..

సరిదిద్దుకోలేని తప్పే చేశాను. దానికి ప్రాయశ్చిత్తం లేదు అని ఇన్ని రోజులు విలవిలలాడాను.  నా మనవరాలు గుణంlo అంతా నా కోడలే...

ఈరోజు నా కుటుంబం అంతా నాతో మళ్ళీ మాట్లాడుతున్నారు అంటే అదంతా మనవరాలు బిక్షే..

ఎందుకమ్మా అంత పెద్ద మాటలు. విధిరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి.
పట్టీల శబ్దం వినపడుతూ ఉంటే ఆ వృద్ధ దంపతులు ఆశగా శబ్దం వచ్చిన వైపు చూస్తారు.

శాంభవితో పాటు భాను శివ కూడా వస్తూ ఉంటారు. మెల్లిగా శాంభవి వచ్చి ఇద్దరి కాళ్ళకి నమస్కారం చేసి బాగున్నారా తాతగారు..  బాగున్నావా అమ్మమ్మ అని అడుగుతుంది.

మనవరాలని తడుముతూ కన్నీళ్లు పెట్టుకుంటారు. అచ్చు నా కూతురే అని మురిసిపోతారు.

చిట్టి తల్లి నిన్ను మా చేతులతో పెంచలేకపోయాము.  ఎక్కడ పెరుగుతున్నావో ఎలా ఉన్నావో అని ప్రతి నిమిషం మాకు దిగులుగానే ఉండేది.

అమ్మవారిని నా మనవరాలని ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉంచు తల్లి అని ప్రతి రోజు కోరుకునేవాళ్ళము. ఆ వయసు పిల్లల్ని ఎవరిని చూసినా... ఇంతయి ఉంటుందా.. అంతేయి అంటుందా?

ఊ కొడుతుందా.. బోర్లా పడిందా..  బుడిబుడి అడుగులు వేస్తుందా... అడుగులు   వేసేటప్పుడు పడిపోతే పట్టుకోవడానికి ఎవరైనా ఉన్నారా...ఎవరి దగ్గర పెరుగుతుంది అని నీ గురించే ఆలోచనలు.

అమ్మ కరుణించి ఇన్ని రోజులకి నిన్ను మాకు చూపించింది. పెద్దాయన మెల్లిగా నడుచుకుంటూ..  భాను దగ్గరకు వెళ్లి నమస్కారం చేస్తూ..

ఏమిచ్చినా మీ ఋణం తీర్చుకోలేనిది. మీ బిడ్డగా పెంచుకున్నారు..ఈరోజు నిజం తెలిసినప్పుడు మీ హృదయం ఎంత. వేదన చెంది ఉంటుందో నేను ఊహించగలను.

కానీ పెద్ద మనసుతో మా మనవరాలని మాకు దగ్గర చేశారు.. భాను తిరిగి నమస్కారం చేస్తూ..  మీరు పెద్దవారు అలా మాట్లాడకండి.

శాంభవి కి.. మాకు ఏనాటి రుణానుబంధమో మా దగ్గరికి చేరింది. మీరు అన్నది కూడా నిజమే..  నా కూతురు కాదు అని తెలిసినప్పుడు ఆ నిమిషమే..  ఈ ఊపిరి ఆగిపోతే బాగుండును అనిపించింది.

వెంటనే శాంభవి నాన్న అని కంగారుగా పిలిస్తే... ఏమీ అవలేదు రా తల్లి... అవ్వదు కూడా.. ఎందుకంటే నీ పిల్లల్ని చూడాలా...  ఎత్తుకోవాలా...

అన్ని పనులు నాకుంటే ఎక్కడికి వెళతాను చెప్పు.  మీరు అలా మాట్లాడితే నాకు ఏడుపు వస్తుంది నాన్న అని భానుని గట్టిగా పట్టుకుంటుంది.

దేవేంద్ర వచ్చి మావయ్య గారు ఇప్పటికే బాగా ఆలస్యం అయ్యింది. విశ్రాంతి తీసుకోండి..రేపు మాట్లాడుకుందాం. అమ్మ శాంభవి  అని పిలుస్తారు.

చెప్పండి తాతగారు.. నీకు అభ్యంతరం లేకపోతే ఈ రాత్రికి మా దగ్గర ఉంటావా అని బేలగా అడుగుతారు. వెంటనే శాంభవి చేతులు పట్టుకొని..

నాకు మీరు ఆర్డర్ వేయాలి.  పరిమిషన్ కాదు. పదండి అని వాళ్ళకి ఇచ్చిన గదిలోకి వెళుతుంది. దేవేంద్ర..  భాను ఏమనుకుంటాడో అని దగ్గరకి వచ్చి భాను అది అంటే...

మీరు ఇంత ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కూతురు దూరమైతే ఆ తండ్రి బాధ ఎలా  ఉంటుందో నాకు తెలుసు.

నా కూతురు ఎక్కడ ఉన్నా అందరికీ చల్లటి వెన్నెలే పంచుతుంది.  అదే మన కూతురు.  మీరు నా కూతురు అని చెప్పిన నాకు మన కూతురు అనే వినిపిస్తుంది.  మీరు నాకు ఎక్స్ప్లనేషన్ ఇవ్వకండి..

రుద్ర వచ్చి మామగారులు ఒకళ్ళకొకళ్ళకి ఎక్స్ప్లనేషన్ మానేసి కాస్త అల్లుడు మర్యాదలు చేస్తారా...చెప్పండి అల్లుడు గారు ఏం మర్యాదలు కావాలి దేవేంద్ర చేతులు కట్టుకుని  డ్రామాటిగ్గా అడుగుతాడు.

అయ్యో మామగారు మీరు అడగలే గాని.. చేయించుకోవడానికి చాలా ఉన్నాయి. రెండు రోజుల నుంచి రెస్ట్ లెస్ గా తిరిగి అలిసిపోయాను.

నేను విశ్రాంతి తీసుకోవాలి దాని ఏర్పాట్లు చూస్తారా... భాను కంగారుగా అయ్యో అల్లుడుగారు మీకన్నానా.. రండి.. గదిలో మీకు అన్ని ఏర్పాటు చేస్తాను.

దేవేంద్ర భాను చేతులు పట్టుకుని అల్లుడైనంత మాత్రాన వంగి వంగి ఉండాల్సిన అవసరం లేదు. మన అమ్మాయి కావాలి అంటే అల్లుడే మన దగ్గరికి వస్తాడు.

ఏమంటారు అల్లుడుగారు.. బాల్ మీ కోర్టులో ఉందని ఎగిరెగిరి పడుతున్నారా... ఆ బాల్  నా కోర్టులోకి వచ్చిందే అనుకో అప్పుడు మీరు ఇలా చేతులు కట్టుకుని అల్లుడుగారు ప్లీజ్ ప్లీజ్ నా కూతురు ఏది అని అడుగుతారు .

బావమరుదులు ఆరుగురు వచ్చి మీరు వెళ్ళండి నాన్న..  బావగారికి ఏం మర్యాదలు కావాలో మేము చూసుకుంటాము కదా..

ఏంట్రోయ్..  వాయిస్ లో ఏదో తేడా కనిపిస్తుంది. అయ్యో లేదు బావగారు.. బావమరుదుల మర్యాద  చూపిస్తాము అంటున్నాము.

సరే మీ ముచ్చట మాత్రం ఎందుకు కాదంటాను.  పదండి అంటే ఇక్కడ కాదు టెర్రస్ పైన అరేంజ్ చేశాము. టెర్రస్ పైన బావ, బావమరదుల సరసం ఏంట్రా..

సరసం కాదు.. మీరు కోరిన మర్యాద రండి బావగారు అని ఆరుగురు మోసుకొని తీసుకువెళ్తారు.  ఇది మర్యాద చేసేటట్టుగా లేదురా అని అరుస్తూ ఉంటే... అందరూ వీళ్ళ గోలకి నవ్వుకుంటూ ఉంటారు.

టెర్రస్ పైకి తీసుకువెళ్లి వదిలి..  మొదలుపెడదామా..  ఏమిట్రా... ఆరుగురు చుట్టూ రౌండప్ చేస్తారు. ఇదిగో ఇలా రౌండప్ చేసి  నన్ను కన్ఫ్యూజ్ చేయకండి.

తర్వాత తేడా వస్తే మీ చెల్లి అలుగుతుంది. మా చెల్లి అలగదులే బావ... ఆరుగురు దగ్గరకు వచ్చి గట్టిగా కౌగిలించుకుంటారు.

ఏంట్రా ఈ మోటు సరసం వదలండి రా..  ఊపిరాడడం లేదు...నీకు ఊపిరాడ పోయినా సరే మేము ఇలాగే కౌగిలించుకుంటాం..థాంక్యూ బావ అని అరుస్తారు...

అందరూ అయిపోయారు ఇంకా మీరు మిగిలారా... రుద్రాని వదిలి అక్కడ బొంతల పైన కూర్చుంటారు. కింద ఎమోషనల్ సీన్ నడుస్తుందనే కదా..  వాళ్ళని డైవర్ట్ చేయడానికి మర్యాదలు కావాలి అని హడావిడి చేశావు..

ఇన్ని ఐడియాలు మీకు ఎలా వస్తాయి బావ అని చరణ్ అడిగితే.. ఏదో ఫ్లో లో అలా వచ్చేస్తాయి బామ్మర్ది... ఎప్పుడైనా కావాలి అంటే ఒక ఫోన్ కొట్టు.

బావ..  బావమరదులా సందడితో... ఆ వెన్నెల రాత్రి ఆనందంతో గడిచిపోతుంది...
[+] 8 users Like SivaSai's post
Like Reply
Part - 96



ఉదయం కుర్ర బ్యాచ్ అంత లేచి కిందకి వచ్చేటప్పటికి ఆడవాళ్ళందరూ పూజ చేస్తూ శ్రావ్యంగా సంగీతం ఆలపిస్తూ ఉంటారు.

అది చూసిన పెద్ద వాళ్లకి మనసు నిండిపోతుంది. రాఘవేంద్ర కళ్ళు తుడుచుకుంటూ ఇది ఎన్ని సంవత్సరాల నా కల... ఇప్పటికి తీరింది.

లహరి దూరమై ఈ ఇంటిలో దీపం కొండెక్కిపోయినప్పుడు..  మనసు కాకవికలమైపోయింది. ఏ రోజు అయితే నా మనవరాలు దీపం వెలిగించిందో.. అప్పుడే మళ్ళీ ఈ ఇంటిలో శుభాలు మొదలయ్యాయి. ఇప్పుడు సంపూర్ణంగా నిండుకున్నాయి.

లహరి దూరమైన నాటి నుంచి ఈ ఇంటి గోడలకే వెలుగు మసకబారిపోయింది. ఆ వెలుగు కేవలం దీపం వెలుగుకాదు…

మనసుకు నింపిన ఉత్సాహం, నవ్వులు, ఆడంబరాలు అన్నీ ఆరిపోయాయి.
రాఘవేంద్ర గుండె మాత్రం... ఒక తండ్రి హృదయం లాగా ఖాళీగానూ, కన్నులు ఎప్పుడూ ఎదురుచూపుల గుమ్మం దగ్గరగానూ ఉండిపోయాయి.

“ఈ ఇంటి దీపం… ఎప్పుడో ఆరిపోయింది” అని లోలోపలే వేదనతో అనుకునే ఆయన మనసు, ఒక కొత్త ఉదయం కోసం ఎంతకాలం ఎదురుచూసిందో!

ఆ రోజు వచ్చింది.
మనవరాలు చిన్నచేతులతో ఆ దీపాన్ని వెలిగించిన క్షణం—మంచి రోజుల మొదలు.
మొన్నటిదాకా మౌనంగా ఉన్న గోడలు హాస్యధ్వనులతో నిండాయి. కిటికీల గుండా సూర్యుడు మరింత ప్రకాశవంతంగా లోపలికి వస్తున్నాడు అన్న ఆనందం .

ఆ చిన్న దీపం వెలుగు ఆయనకు లహరి జ్ఞాపకంలా, సజీవ సాక్షాత్కారంలా అనిపించింది.
“ఇప్పుడు మా ఇంటి ఆత్మ మళ్ళీ మేల్కొన్నది” అని ఆయన హృదయం మాటలకందని ఆనందంతో నిండిపోయింది.

ఆనందభాష్పాలతో ఆయన కనులు మెరుస్తుండగా, లోపల ఒక గంభీరమైన గర్వభావన పుట్టింది—
నా లహరి వెలిగించిన వెలుగే… ఇప్పుడు మనవరాలి చేతుల ద్వారా మళ్ళీ వెలిగింది. మా వంశం సంపూర్ణమైంది.

అమ్మా లహరి ఎక్కడ ఉన్న ఈ కుటుంబాన్ని చల్లగా చూడు. ఈ తరం... నీ బిడ్డని అపురూపంగా చూసుకుంటున్నారు.

ఇక రుద్ర అయితే ప్రాణాలు మొత్తం శాంభవి మీదే పెట్టుకున్నడు.  అంతా నువ్వు చేసుకున్న పుణ్యమే తల్లి.

చాలా రోజుల తర్వాత మనసు ప్రశాంతంగా ఉంది.
పూజ పూర్తయి శాంభవి అందరికీ హారతిస్తుంది. రుద్ర శాంభవిని చూసి గదిలోకి వెళ్ళిపోతాడు.

ఇప్పటిదాకా బానే ఉన్నారుగా...  ఏమైంది ఈ మనిషికి అని చూస్తూ ఉంటే.. ధరణి వచ్చి ఏం చూస్తున్నావు..వెళ్లి మీ ఆయనకి ఏం కావాలో చూసుకో.

అమ్మ... ఆయన ఏమన్నా చిన్నపిల్లోడా.. తల మీద ఒకటి చిన్న పిల్లోడా పెద్ద పిల్లోడా అని కాదు.  భార్య దగ్గరుండి చూసుకోవాలి.

ఎన్నిసార్లు చెప్పినా ఇది మాత్రం బల్బ్ వెలగదు. ఎంతసేపు నాన్నలను పట్టుకుని తిరగడమే సరిపోతుంది. వీళ్ళిద్దరూ గొడవ చూసి అందరి మనసు తేలిక పడుతుంది.

హమ్మయ్య ధరణి ముందునుంచి ఎలా ఉందో..  ఇప్పుడు అలాగే ఉంది.  ఇక వాళ్ల బంధంలో ఎటువంటి మార్పు రాదు.

శాంభవి గదిలోకి వెళ్లి ఏవండీ అని పిలుస్తుంది. అయినా రుద్ర పలకడు. ఏమైంది మీకు..  అలా వచ్చేసారు.. అందరూ ఏమనుకుంటారు అని దగ్గరకు వెళుతుంది.

ఒక్కసారిగా శాంభవి నడుం పట్టుకుని లాగుతాడు.  ఒక రౌండ్ తిరిగి వచ్చి రుద్ర గుండెల పైన పడుతుంది. ఏం చేస్తున్నారు మీరు అని కంగారుగా అడిగితే... ఇంకా ఏమీ చేయలేదు.  ఇంకా చేయవలసిన సమయం వచ్చింది ఏమంటావు పాప...

ఆ మాటకి సిగ్గుతో తలదించుకొని ఇంటిలో ఇంతమంది ఉంటే మీకు ఏదో కావాల్సి వచ్చిందా... అవును కదా నేను ఆ విషయమే మర్చిపోయాను..

నేను అలిగాను పాప.  దేనికి.. అసలు నన్ను పట్టించుకుని ఎన్ని రోజులైంది..  నాతో మాట్లాడి ఎంతసేపు అయింది..  పోనీ ఒక టి తాగుతారా..  కాఫీ తాగుతారా....తింటారా.
పడుకుంటారా అని ఏదైనా  ఉందా..

నన్ను వదిలేసి అందర్నీ పట్టుకొని ఉన్నావు. అయ్యో మీరు అలా అలిగితే ఎలాగండి అని గెడ్డం పట్టుకుని బ్రతిమాలుతుంది.

మరి ఎలా అలగాలంటావు అని నడుము మీద వేలితో గీతలు గీస్తూ ఉంటాడు. మీరు అలా చేయకండి నాకు చక్కలిగింతలు వస్తున్నాయి.

రొమాన్స్ టైంలో చక్కెలగింతలు కాదే... ఫీలింగ్స్ రావాలే నా ముద్దుల పాప... రుద్ర మెడచుట్టు చేతులు వేసి చాలా థాంక్స్ శ్రీవారు అంటుంది.

ఇక నువ్వు ఒక్కదానివే మిగిలావు ఈ మాట చెప్పడానికి...
అయినా మొగుడికి థాంక్స్ చెప్పే పద్ధతి ఇది కాదనుకుంటా...

అవునా ఎలా చెప్పాలి..  అమ్మని అడిగి వస్తాను.  మొద్దు ఇలాంటి అమ్మ లిని..  నాన్నల్ని అడగరే.. మొగుడు పెళ్ళాలే డిస్కస్ చేసుకోవాలి.

బంగారం అని పిలిస్తే... చెప్పండి అని గారాలు పోతుంది.  నీకు కావలసినవి అన్నీ చేశాను కదా.... నాకు కావలసిన పిలుపు కూడా పిలవచ్చు కదా...

ఉహూ..  నాకు సిగ్గు.  నేనే కదే... పిలవాల్సింది కూడా మిమ్మల్ని కదా..
పిలవచ్చు కదా...  ఇప్పుడు కాదు... మరి ఎప్పుడు..  మీరు కోరిన సమయంలో..  అవునా..ఈ రాత్రికి ప్లాన్ చేసేనా అని ఉత్సాహంగా అడుగుతాడు.

మీ ఇష్టం.  ఎన్ని రోజులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చావే... ఇంకా ఆగలేను. ఈరోజు మొత్తం డ్రై ఫ్రూట్స్ బాగా తిను. మళ్ళీ రాత్రికి నేను ఏమన్నా చేస్తే నాకు ఓపిక లేదు..  నీరసం...  అన్నావంటే  అసలు ఊరుకోను.

పెళ్లి అయినా ఇన్ని నెలలకి  నా బ్రహ్మచర్యం వదులుతున్నాను అంటే ఎంత ప్లాన్డ్ గా ఉండాలి. ఒక్క నిమిషం.  మళ్ళీ ఏం పిటింగ్ పెడుతున్నావు..

పిటింగు లేదు...  గీటింగు లేదు.. మన మొదటి రాత్రి ఇక్కడ కాదు. మరి ఎక్కడ..  అమ్మ దగ్గర. అర్థం కాలేదు. లహరి అమ్మ ఉన్న చోట నాన్న ఉండడానికి గెస్ట్ హౌస్ కట్టించుకున్నారు కదా..

అక్కడ ఎందుకు..  అక్కడే సృష్టికర్యం జరిగితే.. మనకిఅమ్మ బిడ్డగా రావచ్చేమో...  ఆ బిడ్డను నాన్న చేతికి ఇస్తాను. మీకు అభ్యంతరం లేదు కదా...

రుద్రా ఎమోషనల్  అవుతూ శాంభవి ముఖమంతా ముద్దులు పెట్టేస్తూ నువ్వు బంగారానివే...  నీ కోరిక నేను ఎందుకు కాదంటాను.  అత్తని దింపేద్దాము సరేనా...

ఆ రాత్రికి ఇద్దరు అక్కడికి వెళుతున్న విషయం అందరికీ చెబుతాడు. ఎందుకు అని ఎవరు అడగరు. మీ ఇష్టం అని ఒక్క మాట మాత్రమే చెబుతారు.

శాంభవి లహరి తల్లిదండ్రుల దగ్గర మాట తీసుకుంటుంది..  ఎప్పటికీ మీరు నాతోనే ఉండాలి. నాలో అమ్మని చూసుకుంటూ ఇక్కడే ఉండిపోవాలి.

అందుకు ఆ పెద్దవాళ్లు కూడా అంగీకరిస్తారు.  ఆఖరి రోజుల్లో మనవరాలతో కలిసి ఉండడం కన్నా కావలసినది ఏముంది...

ఆ జంట ఉండడానికి ఒప్పుకున్నందుకు బృందావనం అంతా సంతోషపడుతుంది.
ఆ కృష్ణయ్య దేవకీకి పుట్టి యశోద దగ్గర పెరిగిన...ఇద్దరి తల్లులకి ముద్దుల బిడ్డ అయ్యాడు.  అలాగే శాంభవి బృందావనంలో పుట్టి రేపల్లెలో పెరిగిన రెండు కుటుంబాలకి గారాల పుత్రిక అయింది.

రుద్ర తనకు ఎలాగా కావాలో ఆ రూమ్ మొత్తం డెకరేట్ చేయిపిస్తాడు.  సాయంత్రం ఇద్దరూ కలిసి గెస్ట్ హౌస్ కి చేరుకుంటారు..

బావా మరదలా తొలి సంగమం...

కథ కొనసాగుతుంది...
[+] 8 users Like SivaSai's post
Like Reply
Sooper ane maata chala chala chinnadi.. idi ela undi ani cheppataniki!!
[+] 1 user Likes ash.enigma's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)