Thread Rating:
  • 25 Vote(s) - 3.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
superb update siva garu
[+] 1 user Likes shekhadu's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
రచయిత గారు, అవనికి సూర్య తో విశిష్ట గురించి మీ మార్క్ సంభాషణతో నీ కోడలు నీ కంటే అమాయకురాలు అని, నాన్న మీ పెళ్ళయిన తర్వాత మీ దాగుడు మూతల ప్రేమ గురించి చెప్పారు అంటూ విక్రం దగ్గర ఉండగానే చెప్పించండి!!
[+] 2 users Like yekalavyass's post
Like Reply
Part - 43



నీ ప్లాన్ బాగానే ఉంది.  గౌతమ్ మన గ్రిప్ లోకి పూర్తిగా వచ్చేవరకు జాగ్రత్తగా ఉండు.  ఇంకొక టూ డేస్ లో వాడు నా ముందుకి రావాలి.

కాబట్టి ఎలాగైనా  విశిని ఇబ్బంది పెట్టడానికి..  తన వర్క్ కోసం ప్రెషర్ ఇవ్వడానికి చూస్తాడు.. నాకు అనుమానం వచ్చింది అందుకే ఇల్లు కూడా షిఫ్ట్ చేస్తున్నాను. ఎక్కడికీ..

వీడి పై పోర్షన్ లోకి. ఆంటీ కి కూడా మైండ్ ఫ్రెష్నెస్ కావాలి.  అంకుల్ ఆలోచనల దగ్గరే ఆగిపోయారు. విశికి హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంది.

సో ఇక్కడ అనుకో..  సేఫ్టీ కి సేఫ్టీ..  ఆంటీకి కంపెనీ ఇవ్వడానికి ఉంటారు.   ప్లాన్ బాగానే ఉంది.. వైభవ్ కూడా కొంచెం దారిలో పడతాడు.

బాబాయ్ కి టెన్షన్ తగ్గుతుంది. మీరు అనుకున్నంత వేస్ట్ గాడు కాదు నాన్న..అల్లరి చేస్తాడు గాని రెస్పాన్సిబిలిటీ కూడా అలాగే ఉంటుంది.

నా పిల్లల గురించి నాకు తెలియదా.  ఏదో మేము ఆ భయమైనా చూపించకపోతే మీరు ఇంకా ఎగురుతారు.
కిందేదో హడావిడి చేస్తున్నట్టున్నారు.  అవని, వైభవ్ కలిసి పదండి.

కిందకి వెళ్ళేటప్పటికి పూజిత గరంగరం గా చూస్తూ ఉంటుంది.  విద్య... నువ్వు ఆగు పూజిత.. చూడు వాళ్ళిద్దరూ.

అసలు ఏమైనా అర్థం ఉందా.. ఎవరైనా ఫస్ట్ మంత్ శాలరీ తీసుకున్నాక పార్టీ చేసుకుంటారు.  జాబ్ కన్ఫర్మ్ కూడా అవ్వకముందే పార్టీ చేసుకుంటున్నా తల్లి కొడుకులు వీళ్ళిద్దరే అయ్యిఉంటారు.

సూర్య వినయ్ పక్కన కూర్చుని ఏం జరుగుతుంది బాబాయ్.  పిన్ని ఎందుకు అంతగా కోపంగా ఉంది. నువ్వు నన్ను కదపక రా బాబు.

ఇప్పుడు నేను మాట్లాడడం చూసిందంటే కొడుకు మీద కోపం నామీదకి షిఫ్ట్ అవుతుంది.  నాకు అవసరమా అని లిప్స్ కదిలి కదలకుండా చెబుతూ ఉంటాడు.

మేటర్ తెలిస్తే పిన్నిని కూల్ చేయొచ్చు కదా..  అదేదో మీ పిన్ని నే అడుగు. ఏమైంది పిన్ని... ఎవరైనా ఏమైనా అన్నారా.. నాకు చెప్పు. నేను చూసుకుంటాను.

మీ పిన్నిని అనే ధైర్యం ఎవరికి ఉంది రా అని వినయ్ నాలుక కరుచుకుంటాడు.  పూజిత కోపంగా చూస్తూ ఉంటే సారీ అని లిప్ మూమెంట్ ఇస్తాడు. మీ పని తర్వాత చెబుతాను అని కళ్ళతోనే వార్నింగ్ ఇస్తుంది.

నాకు చెప్పు పిన్ని అని భుజం మీద చెయ్యవేస్తే.. ఒక్కసారి కిచెన్లోకి చూడు రా..  ఏమైంది..  అక్కడ అమ్మ వైభవ్ ఏదో హడావిడి చేస్తున్నారు.

వైభవ్ కి ఇష్టమైన స్వీట్ ప్రిపేర్ చేస్తుంది..వావ్ అవునా.. వావ్ ఏమిటి.. ఎందుకో అడగవా... నువ్వు అడగకపోయినా చెబుతావు కదా పూజిత...అందుకే సూర్య వెయిట్ చేస్తున్నాడు అని వినయ్ సమాధానం చెబుతాడు .

మీరు అంటే... నాకు వర్క్ ఉంది అని ఫోన్లో తలదూర్చుతాడు.  ఈ మొగుడు పెళ్ళాలు చిలిపి తగాదాలకి అందరూ ముసిముసిగా నవ్వుకుంటూఉంటారు.

నువ్వు చెప్పు పిన్ని... బాబాయ్ మాటలు పట్టించుకోకు. జాబు వచ్చింది అన్నాడు అంతే  వెంటనే చేయడానికి వెళ్ళిపోయింది.

ఎవరైనా ఫస్ట్ మంత్ శాలరీ వచ్చిన తర్వాత చేసుకుంటారు పోనీ జాబ్ కన్ఫర్మ్ అయ్యింది అన్నాక చేసుకున్న అదొక అర్థం.

వీళ్ళిద్దరి హడావిడి చూస్తూ ఉంటే...  కూల్ పిన్ని. మనవాడు జాబ్లో జాయిన్ అయ్యాడు అంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా..

హ్యాపీ మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకోని.  రేపు ఏదైనా తోక జాడిచ్చాడు అనుకో... ఆల్రెడీ సెలబ్రేట్ చేసుకున్నాను ఇప్పుడు జాబ్ మానేశాను అంటే అందరి ముందు  పరువు పోతుంది కదా అని సైలెంట్ గా పని చేసుకుంటాడు.

నువ్వు అన్నది కూడా నిజమే సూర్య... వినయ్ విక్రమ్ తో వీడు ఈ తరాన్ని హ్యాండిల్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంది. మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన ఎంపైర్ కి అసలైన కింగ్ వచ్చాడు.

కొడుకు గురించి నలుగురు చెబుతూ ఉంటే మనసులో గర్వంగా అనిపిస్తుంది కానీ పైకి మాత్రం చూపించకుండా... మన పిల్లలందరూ టాలెంట్ ఉన్నవాళ్లే ..  ఒక్కొక్కరిది ఒక్కొక్క రకం అంతే...

లలిత సూర్యని పిలిచి మనవరాలను ఎప్పుడూ పరిచయం చేస్తావు. మాకు చూడాలని ఉంది రా.. కళ్యాణ్.. ఈ ఆత్రమే తగ్గించుకుంటే మంచిది.

ఆ అమ్మాయి సెటిల్ అవ్వాలి. గోల్ రీచ్ అవ్వాలి . ఇంకా చాలా ఉన్నాయి.  అవన్నీ అవ్వకుండా మన సూర్య ఓపెన్ అవ్వడు.

సూర్య ఎవరు అన్నది చెప్పమని మేము అడగడం లేదు. మాకు పరిచయం చెయ్యి అంటున్నాము.  ఏదో ఒక రోజు గుడికి తీసుకురారా..

అప్పుడు మేము చూస్తాము. ఏమంటావు మాధవి..నువ్వు అన్నది నిజమే వదిన..  వీళ్ళకి కంగారు లేకపోవచ్చు కానీ మన ఇంటికి రాబోయే కోడలు గురించి మనమే కదా చూసుకోవలసినది.

రమేష్..  కళ్యాణ్ తో ఎందుకు బావ నీకు దురద.   లేడీస్ ఎలాగైనా పడతారు. వాళ్ళు ఫిక్స్ అయ్యారు అంటే చూడాల్సిందే. మాట్లాడాలిసిందే..

మధ్యలో దూరావు అనుకో.. నిన్ను పుష్పాన్ని చేస్తారు.. నీతో పాటు నేను పుష్పం అవ్వాలి. ఇప్పుడు నువ్వు నాతోపాటు పుష్పం అవుతావు అని బాధ లేక నేను పుష్పం అవుతున్నానని బాధ..

ఏదైనా బాధ బాదే కదా బావ. వైభవ్ బౌల్స్ లో స్వీట్ పట్టుకుని వచ్చి..  రండి రండి అందరూ ఈ తీపి టేస్ట్ చూసి.. నాకు కంగ్రాట్స్ చెప్పండి.

అడిగి కంగ్రాట్స్ చెప్పించుకోకూడదు రా తింగర సన్నాసి.. అమ్మ నువ్వు ఇంత హ్యాపీ మూడ్లో కూడా నన్ను తిడుతున్నావు. ఇలాగైతే నేను హర్ట్ అవుతాను.

విక్రమ్ కంగ్రాట్స్ రా.. మీ అన్నయ్య కన్నా నువ్వే బెటర్ పొజిషన్ లో ఉన్నావు. థాంక్స్ పెదనాన్న.  నా టాలెంట్ ని గుర్తించేది మీరు, పెద్దమ్మే..

ఆ మాటకి నవ్వుతూ నీకు తెలియని విషయం చెప్పనా.. మా అందరికన్నా ముందు గుర్తించిందే మీ అమ్మ.  ఏదో అందరి ముందు పొగిడితే దిష్టి తగులుతుంది అని అమ్మ బాధ అని అవని అంటుంది.

కావాలంటే చూడు స్వీట్ ఇంకా తినకుండా స్పూన్ ని అలాగే పట్టుకుని కూర్చుంది. వైభవ్ పక్కన కూర్చొని అవునా అమ్మ..  నా కోసమేనా..

అంత లేదులే గాని పట్టు అని స్పూన్ నోట్లో పెడుతుంది. ఇదేమి తల్లి ప్రేమో..  రాక్షసి ప్రేమను మించిపోతుంది. ఒరేయ్ సుపుత్ర నేను కూడా ఒక స్పూన్ పెడతాను రారా.. లేకపోతే జీవితాంతం నువ్వు, మీ అమ్మ నన్ను దెప్పుతూనేఉంటారు.

అందరూ నవ్వులు సరదాలతో ఆ రాత్రి వెళ్ళిపోతుంది. విశి ఫ్లాట్ కి వెళ్లి మెడ చుట్టూ చేతులు వేసి  ఏం చేశావు అమ్మ అని అడిగితే..

ఏముంది ఖాళీయే... పని అయిపోయిన దగ్గర నుంచి నాన్నగారి కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను..  అవునా...
అమ్మ నీకు ఒక విషయం చెప్పాలి.  చెప్పురా..

మనం ఇల్లు మారుతున్నాము.  ఈ ఇల్లు బాగానే ఉంది కదా..  ఎందుకు. అది నాకు తెలిసిన వాళ్ళ హౌస్.. కాలేజ్ కి దగ్గరగా ఉంటుంది అని అక్కడకి షిఫ్ట్ అవుతున్నాను.

సరేలే ఏరోజు.. ఈ సండే వెళ్లి చూసి వద్దాము.  నీకు నచ్చింది అంటే షిఫ్ట్ అయిపోదాము.  నాకు నచ్చడం ఏముంది. నీకు కాలేజ్ కి ఇబ్బంది లేకుండా ఉంటే చాలు..

స్నానం చేసి రా..  భోజనం చేద్దాము. అలాగే అమ్మ అని ఫ్రెష్ అవ్వడానికి వెళుతుంది. స్నానం చేసి వచ్చి తల్లి చేత గోరుముద్దలు తిని మంచం పైన వాలి...

ఈరోజు నాకు చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంది.  ఆ గౌతమ్ కి గట్టిగా సమాధానం చెప్పాను. దీనికి అంతటికీ కారణం దేవా సార్.. థాంక్యూ సార్..  మీరు ఇస్తున్న సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేనిది.

దేవా గురించి ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంటుంది. గౌతమ్ ఇంటికి వెళ్లి మందు బాటిల్ పుచ్చుకుంటాడు. విశిష్ట ఆ కాన్ఫిడెన్స్ ఏమిటి..

నాకే ఎదురు చెబుతున్నావు.  భరించలేకపోతున్నాను. నువ్వు నా ముందు ఎప్పుడూ అణిగిమణిగి ఉండాలి. నా చూపు కోసం నా పిలుపు కోసం నువ్వు పిచ్చిదానిలాగా ఎదురు చూస్తూ ఉండాలి.

నీకు డబ్బులు ఎంత అవసరమో నాకు తెలుసు. అలాంటిది నాతో బిజినెస్ డీల్ చేస్తాను అని చెబుతున్నావా..

నేను వర్క్ ఇవ్వకపోతే మీ మదర్ కి ట్రీట్మెంట్ కి కూడా దిక్కులేదు.  అసలు ముందు మీ మదర్ ట్రీట్మెంట్ ఆపేస్తే.. అప్పుడు నువ్వు నా కాళ్ళ దగ్గరికి వచ్చి పడతావు.

నువ్వు ఎలా చెప్పినా వింటాను గౌతమ్ అని ప్రాదేయపడతావు.  రేపే మీ మదర్ కి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ తో మాట్లాడతాను.

నిన్ను ఎలాగైనా నా కాళ్ళ దగ్గరికి తెచ్చుకొని..నీ అందం టాలెంట్ నా కోసము మాత్రమే ఉపయోగపడేలాగా చేసుకుంటాను. అలా చేసుకోకపోతే నేను గౌతమ్ నే కాదు అని బాటిల్ మొత్తం ఖాళీ చేస్తాడు.

మత్తుగా తూలుతూ ఉంటే..  హిమ అక్కడికి వచ్చి వాట్ గౌతమ్..  ఈ టైం లో ఇంత డ్రింక్ చేస్తున్నావు. నువ్వేంటి ఇక్కడ అని ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటే...

డాడీ, నేను ఇద్దరమూ వచ్చాము.. నాకు నిన్ను చూడాలనిపించింది అని అడిగితే వెంటనే తీసుకోవచ్చారు. సో స్వీట్ కదా..

ఆ మాటకి గట్టిగా నవ్వుతూ మీ డాడీ స్వీట్ కాదు విలన్. తాగి న మైకంలో ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా.. నిజమే మీ డాడీ నా పాలిట పెద్ద విలన్..

గౌతమ్ మా డాడి గురించి మాట్లాడితే నాకు కోపం వస్తుంది. ఓ మై డియర్ స్వీట్ హార్ట్..  విలన్ అంటే ఇంత అందమైన బొమ్మని ఎదురుగుండా ఉంచి టెస్ట్ చెయ్యనివ్వడం లేదు.

మరి విలన్ అవునా కాదా చెప్పు అని నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరకి లాక్కుంటాడు. ఓ గౌతమ్ మా డాడీ ఏది చేసినా మన ఫ్యూచర్ బాగుండాలి అనే..

ఆ విశి తో మాట్లాడేవా..  ఎంతవరకు వచ్చింది వర్క్. ఎప్పుడు ఇస్తానంది. ఈ ఇన్ఫర్మేషన్ కోసం వచ్చావా.. ఫోన్లో అడిగి ఉంటే చెప్పేవాడిని కదా...

హిమ సమాధానం....
[+] 8 users Like SivaSai's post
Like Reply
Part - 44



విశి తో మాట్లాడావా.. వర్క్ ఎప్పుడు ఇస్తానంది. మనం విక్రమ్ సార్ ని కలవాలి కదా... ఎప్పుడు వెళదాము. ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వచ్చావా...

హిమని వదిలి సోఫాలో కూలబడతాడు. నో..  నా ఉద్దేశ్యం అది కాదు.  నిన్ను చూడాలనే వచ్చాను. బట్ ఎలాగా కలిసాము కదా అని బిజినెస్ విషయం మాట్లాడుతున్నాను. నాకు నీ తర్వాతే ఏదైనా సరే...

హిమని వళ్ళోకి లాక్కుని..  అందుకే బేబీ నువ్వంటే నాకంత ఇష్టం. ఆ విశి కి ఒళ్ళు అంతా పొగరే..టాలెంట్ ఉన్న వాళ్లకి పొగరు ఎక్కువ ఉంటుంది.

అలా ఎందుకు అనుకుంటున్నావు నాకు టాలెంట్ ఉంది.. అందము ఆస్తి అన్ని ఉన్నాయి.  కానీ నేను అణుకువగా ఉండడం లేదా..

ఆ విశిలాంటి వాళ్ళు ఎక్కడో కొంత మంది ఉంటారు. అందరినీ అలా చూడకూడదు.  నువ్వు అన్నది కూడా నిజమే బేబీ అని బుగ్గ నిమురుతూ ఉంటాడు.

తాగిన మైకంలో  హిమ.. విశిలాగా కనపడుతూ ఉంటే ఎలాగైనా విశిని  సొంతం చేసుకోవాలి అన్న ఆలోచనతో ఉండి దగ్గరగా వెళ్లి పెదవులు అందుకోబోతాడు.

గౌతమ్ ఏం చేస్తున్నా నువ్వు స్పీడ్ గా ఒళ్ళో నుంచి లెగుస్తుంది.  ఏమైంది బేబీ ఇప్పుడు దాకా బానే కోపరేట్ చేస్తావు కదా.. ఇవన్నీ పెళ్లయిన తర్వాత..

ఇలాంటివి తెలిస్తే డాడీ కోప్పడతారు. నువ్వు రాంగ్ మూడ్ లో ఉన్నావు మళ్ళీ కలుద్దాం బాయ్ అని వెళ్ళిపోతుంది. వెళుతున్న హిమని చూసి తల పట్టుకుంటూ..

ఛ అనుకొని...  నా వర్క్ అయ్యే వరకు హిమతో జాగ్రత్తగా ఉండాలి.  నేను నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలి అంటే హిమని లైన్ లో పెట్టుకోవడమే...

ఎప్పుడైనా నా చేయి జారిపోతుంది అనిపిస్తే లొంగ దీసుకోవడమే.  ప్రస్తుతానికి మాత్రం గుడ్ బాయ్ లాగానే ఉండాలి అని మంచం మీద పడతాడు .

వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి వెళదామా అంటే సరే అని చెప్పి బయలుదేరుతారు. ఏమైంది బేబీ అంత సైలెంటుగా ఉన్నావు అని హిమా ఫాదర్ అయిన రమేష్ అడుగుతాడు.

నథింగ్ డాడ్.. ఈ డాడీ తో కాక ఇంకెవరితో షేర్ చేసుకుంటావు.. కమాన్ బేబీ . ఎనీ ప్రాబ్లం..  విశిష్ట కి నిజం తెలిసింది.

విశిష్ట.. ఎవరు..  అదే గౌతమ్ కాలేజ్ లో లవ్ చేశాను అని చెప్పి వర్క్ చేయిపిస్తున్నాడు కదా. ఆ వర్క్ తోనే నేను ఫేమస్ అయ్యింది .

ఓ థట్ గర్ల్.. హ్మ్.. గౌతమ్ చీట్ చేశాడని తెలిసిన దగ్గరనుంచి దూరంగా ఉంటుంది. ఈ అమ్మాయి కాకపోతే ఇంకొకళ్ళు ఇస్తారు.

తన కోసమే చూడాల్సిన అవసరం ఏముంది బేబీ. నో డాడ్ తన వర్క్ లో స్పార్క్ ఉంటుంది. దానితోనే నాకు ఒక క్రేజ్ వచ్చింది..

ఆ స్పార్క్ వేరే చోట దొరుకుతుంది అన్న హోప్ లేదు. వి.జె.స్ కంపెనీతో మాకు మీటింగ్ ఉంది.  ఆ మీటింగ్లో డైరెక్ట్గా విక్రమ్ నన్ను ఇంటర్వ్యూ చేస్తాను అన్నారు.

ప్రీవియస్ వర్క్ గురించి అడిగితే నేను దొరికిపోతాను. దొరకకుండా ఉండాలి అంటే ఆ విశిష్ట నాకు ఆ వర్క్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి హౌ టు హ్యాండిల్ అన్నది చెప్పాలి.

బట్ ఇప్పుడు దాకా ఈ గౌతమ్ ఏమీ చేయకుండా బాటిల్ ఎత్తాడు. గౌతమ్ వల్ల కాకపోతే నేనున్నాను కదా.. డైరెక్ట్ గా నేనే హ్యాండిల్ చేస్తాను.  ఎంత మని కావాలన్నా ఇచ్చేద్దాము .

మనం డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయితే కరెక్ట్ గా ఉండదు. ఇది గౌతమే హేండిల్ చేయాలి. మన సపోర్టు లేకపోతే గౌతమ్ నథింగ్.

సపోర్ట్ కోసం ఏమైనా చేస్తాడు..సపోర్టుతో పాటు ఆ విశిష్ట వర్కు కూడా చాలా ఇంపార్టెంట్.. ఎప్పుడైతే విశిష్ట స్టాప్ చేసిందో అప్పటినుంచి గౌతమ్ కి వచ్చే ప్రాజెక్ట్ కూడా తగ్గిపోయాయి.

వాళ్ళు ఆఫీసులో ఉన్న అర్క్ టెక్చర్స్ అంతా క్వాలిటీ ఇవ్వలేకపోతున్నారు.  సో కాంపిటీషన్ పెరుగుతుంది. ఒక అమ్మాయినే హ్యాండిల్ చేయలేని వాడు రేపు మనతో కలిసి ఎలా ట్రావెల్ చేయగలుగుతాడు కాబట్టి పడనివ్వండి..

నువ్వేమీ అడ్వాన్స్ అవలేదు కదా బేబీ.. అలాంటి వాడితో అడ్వాన్స్ అవడమా..  నాకు ఎంతవరకు ఉపయోగపడతాడో అంతవరకే నొక్కుతున్నాను.

అడ్వాన్స్ తీసుకోవాలని చాలా తాపత్రయ పడుతున్నాడు. బట్ ఇక్కడ ఉన్నది ఎవరు... హిమ. హేమతో గేమ్స్ ఆడడం అంటే వాడు చావు వాడు కోరుకున్నట్టే..

బట్ కేర్ఫుల్ బేబీ.  ఇలాంటి వేస్ట్ గాళ్ళు ఎలాంటి పనులు చేయడానికి అయినా వెనకడుగు వేయరు. నేను కూడా రేపు ఫోన్ చేసి గౌతమ్ కి ప్రెషర్ ఇస్తాను.

ఉదయమే గౌతమ్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే బద్దకంగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటే...హలో గౌతమ్ నేను రమేష్ ని మాట్లాడుతున్నాను.

వెంటనే నిద్రమత్తు మొత్తం ఎగిరిపోయి చెప్పండి అంకుల్.. ఏమిటి ఇంకా లెగలేదా..  రాత్రి తాగింది దిగలేదా.. అలాంటిదేమీ లేదు.  దేనికో ఫోన్ చేశారు.

రేపే అనుకుంటా మీకు వి. జె. స్. కంపెనీతో మీటింగ్. అవును అంకుల్. మరి ఎంత వరకు వచ్చింది నీ ప్రోసెస్. రేపు అమ్మాయి  పేరుకి ఏదయిన డామేజ్ జరిగితే మాత్రం నేను అసలు ఊరుకోను.

నాకు నా బేబీ తరువాతే ఎవరైనా... నా బేబీ నిన్ను ఇష్టపడింది అన్న ఒకే ఒక్క రీజన్ తో నా రేంజ్ కి సరిపోకపోయినా మీ మ్యారేజ్ కి ఒప్పుకున్నాను.

అది కూడా నువ్వు నాకు ప్రామిస్ చేసావు  అనే.. నా కూతురి  ని వరల్డ్ లోనే టాప్ అర్క్ టెక్చర్ గా నిలబెడతాను అని..  ఇప్పుడు దాకా నువ్వు ఏం చేసావో నాకు కనపడటం లేదు.

అదేంటి అంకుల్ అలా మాట్లాడుతారు. లాస్ట్ టైమే కదా హిమా వర్క్ ని ఎగ్జిబిషన్ పెట్టి స్టాల్ ఓపెన్ చేశాను.   అది నా కూతురు కోసం చేసావా..  నీ బిజినెస్ ఎస్టాబ్లిష్ కోసం చేసావో తెలియనంత ఫుల్ ని కాదు.

రేపు ప్రోగ్రాం మాత్రం సక్సెస్ అవ్వాలి. ఇది చెబుదామనే ఫోన్ చేశానని పెట్టేస్తాడు.  నైల్ పాలిష్ వేసుకుంటున్న హిమ.. ఏమంటున్నాడు డాడ్.

  ఏదో పిచ్చివాగుడు  వాగుతున్నాడు. అయినా వాడిని నువ్వెలా లైక్ చేశావు బేబీ.  కమాన్ డాడ్.. నా గురించి తెలిసి కూడా మీరు ఎలా అనుకుంటున్నారు.

ఒకసారి అనుకోకుండా వాడి దగ్గర కన్స్ట్రక్షన్స్ సంబంధించిన ప్రింట్స్ చూశాను.  చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది.

వాడే చేశాడు ఏమో...మనకి బాగా యూస్ అవుతాడు అనుకున్నాను. బట్ మాటల్లో పెట్టిన తర్వాత గాని తెలియలేదు వాడు గర్ల్ ఫ్రెండ్ వర్క్ అని .

సో మన స్టేటస్ చూపించేటప్పటికి ఆటోమేటిక్ టర్న్ అయ్యాడు. నేను వాడుతున్నాను. జాగ్రత్త బేబీ.  రేపు మన కన్నా ఇంకా బాగా యూస్ అయ్యే వాళ్ళు దొరికితే నిన్ను వదిలేస్తాడు కూడా..  వాడికి అంత సీన్ లేదు. ఎప్పుడో నా గ్రిప్ లోకి వచ్చాడు.

గౌతమ్ ఫోన్ పెట్టేసి తల పట్టుకు కూర్చుంటాడు.  విశిష్ట నువ్వు నాకు ఈ రోజు ఎలాగైనా దొరకాలి అని... హాయ్ విశిష్ట.. ఈరోజు ఈవినింగ్ కలుద్దాము.

నీ వర్క్ అవ్వగానే అక్కడే మీట్ అవుదాము. క్యాబిన్ కూడా బుక్ చేశాను అని  మెసేజ్ చేస్తాడు. మెసేజ్ రిసీవ్ అయినట్టుగా ఉండదు.  బ్లాక్ అయినట్టుగా చూపిస్తూ ఉంటే విశిష్ట అని పళ్ళు నూరుతూ..

వైభవ్ నెంబర్ కి మెసేజ్ చేస్తాడు. వైభవ్ అది చూసి పర్వాలేదు గురుడు నాకు మెసేజ్ చేశాడు అనుకుని ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయండి.

మేడం ఫ్రీగా ఉన్నారా లేదో కనుక్కొని చెబుతాను అని రివర్స్ మెసేజ్ పెడతాడు. అది చూసి గౌతమ్ ఫ్రస్టేషన్ పీక్ లోకి వెళుతుంది.

ఇంకా వర్క్ స్టార్ట్ చేయకుండానే వీళ్ళంత బిల్డప్ ఇస్తున్నారు అసలు స్టార్ట్ చేస్తే ఇంకా దొరుకుతుందా.. ఈ లోపే నా గ్రిప్ లోకి తెచ్చుకోవాలి అనుకుని ఓకే అని పెడతాడు.

ఫైవ్ మినిట్స్ తర్వాత వైభవ్... మేడం నైట్ షార్ప్ ఎయిట్ కి కలుద్దాం అన్నారు. లేట్ అవుతే మాత్రం మేడం దొరకరు అని పెడితే.. నేను 7:30 కే అక్కడే ఉంటాను అని పెడతాడు.

ఓకే.. ఆల్ ద బెస్ట్ అని మెసేజ్ చేస్తే..  నాకు ఆల్ ద బెస్ట్ పెడతారు ఏంట్రా.. ఇది నేను నీకు ఇచ్చే ప్రాజెక్ట్.. మీకు చెప్పాలి..

  చూద్దాం అని గౌతమ్ సాయంత్రం ఎప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు.  ఈ విషయం తెలిసిన సూర్య అలర్ట్ గా ఉంటాడు.
నైట్ విశి వర్క్ ఫినిష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకోనేటప్పటికీ వైభవ్ వస్తాడు.  హాయ్ బాబి అంటే.. బాబీ నా... పోనీ వదిన.

హలో మనం ప్రొఫెషనల్ గా ఉన్నప్పుడు ప్రొఫెషనల్ గా మాట్లాడుకోవాలి.  మన వర్క్ అయిపోయిన తర్వాత ఎలా పిలుచుకున్న పర్వాలేదు కదా..

నువ్వు చాలా ఫన్నీగా మాట్లాడతావో తెలుసా? దేవాసార్ ప్రొఫెషనల్ గా మాట్లాడతారు.  మీ ఇద్దరికీ ఎలా రిలేషన్ ఉందో అర్థం కావడం లేదు.


దేవా సార్ నాకు బ్రదర్ లే.. అవునా ఎప్పుడూ చెప్పలేదు. ముందు ముందు ఇంకా తెలుసుకోవాల్సింది ఉందలే బాబి. అదిగో..ఇంకా మన ప్రొఫెషనల్ గా స్టార్ట్ అవ్వలేదు.

నిన్ను చూస్తుంటే మా చిన్నప్పుడు తప్పిపోయిన మా బాబీ లాగా కనిపిస్తున్నావు.  అవునా మీ బాబి తప్పు పోయిందా అని బాధగా అడుగుతుంది.

అవును బాబి చాలా క్యూట్గా చబ్బీ గా ఉండేది. ఎక్కడ తప్పిపోయింది. అన్నవరంలో. అన్నవరంలోనా అని కొంచెం దిగులుగా మాట్లాడుతుంది.

నీకేమైంది బాబి.. ఒక్కసారిగా అలా డల్ అయిపోయావు. అన్నవరం అనగానే నాకు మా నాన్న గుర్తొస్తారు. మా నాన్నగారు ఉన్నన్ని రోజులు నా ప్రతి పుట్టినరోజుకి అన్నవరం తీసుకు వెళ్లేవారు.

ఇప్పుడు మాత్రం ఏమైంది బాబి నేను తీసుకువెళతాను కదా.. సూర్య మాస్క్ తో వస్తాడు.  మీరేంటి సార్ ఇలాగా..  లైట్ గా కోల్డ్ చేసింది.

ఏమిటి మీ ఇద్దరూ డిస్కషన్.  ఆ గౌతమ్ వచ్చినట్టున్నాడు.  ఇంకా 10 మినిట్స్ టైం ఉంది అన్నయ్య..

సోరి సార్ మీ పెయిన్ నాకు  తెలియలేదు.  దేని గురించి.. మీ బాబీ తప్పిపోయారు అంట కదా..  బాబి అని వైభవ్ వైపు చూస్తే వైభవ్ నాలిక కరుచుకుంటాడు.

బాబి నాకు...  మా అన్నయ్యకి మరదలు అవుతుంది అవునా అంటే సరే తర్వాత మాట్లాడుకుందాం ముందు మీరు ఇద్దరు వెళ్లండి అని పంపిస్తాడు.

ఈ బాబీ మరదలు గోల ఎక్కడికి తీసుకు వెళుతుందో ??

కథ కొనసాగుతుంది...
[+] 8 users Like SivaSai's post
Like Reply
గౌతమ్ కి సినిమా స్టార్ట్
[+] 1 user Likes Sunny73's post
Like Reply
Super update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
Interesting update.
Hope that Ramesh doesn't do anything nonsense to Vishi!!
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Part - 45



విశిష్ట వైభవ్ వెళ్లేసరికి గౌతమ్ ఎదురు చూస్తూ ఉంటాడు. ఇద్దరు క్యాబిన్లోకి రాగానే హాయ్ విశిష్ట.. చాలా లేట్ అయినట్టుంది.

కస్టమర్స్ ని మీట్ అయ్యేటప్పుడు టైం మెయింటైన్ చేయాలనుకుంట..అని సెటైర్ వేస్తాడు. వెంటనే వైభవ్ మీకిచ్చిన టైం స్టార్ట్ అవ్వడానికి ఇంకా టూ మినిట్స్ ఉంది సార్.. ముందే వచ్చి మా టైం వేస్ట్ చేసుకోలేం కదా..

చూడండి మిస్టర్ పిఏ అంటే..  ఐ యాం వైభవ్..  అదేలే ఏదో ఒకటి.  మీరు ఇప్పుడే వర్క్ స్టార్ట్ చేస్తున్నారు.  నేను ఆల్రెడీ బిజినెస్ లో ఉన్నాను.

  మీరు ముందుగా వచ్చి మా కోసం వెయిట్ చేయాలి. అవునా..  సరే మేడం మనం బయలుదేరాదామా..  గౌతమ్ కంగారుగా ఎక్కడికి..

మీరే కదా ముందు వచ్చి వెయిట్ చేయాలి అన్నారు.  సో ఈరోజు మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని రేపు పెట్టుకుందాము.  రేపు మీ కన్నా ముందు మేము వస్తాము అప్పుడు సరిపోతుంది కదా...

వైభవ్ చెబుతున్న సమాధానాలకి గౌతమ్ కి ఫ్రస్టేషన్ పీక్ లోకి వెళ్ళిపోతుంది.  కానీ  అవసరం తనది కాబట్టి...
  విశిష్ట నీతో మాట్లాడాలని వచ్చాను.  కూర్చుందామా...

  సరే అని ముగ్గురు కూర్చుంటారు.  వర్క్ నీతో డిస్కస్ చేసేటప్పుడు కూడా పీఏ కావాలా.. తప్పకుండా నాకు వర్క్ మాత్రమే తెలుసు కానీ నా పిఏ కి ఎదుటి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలుసు.

నో డౌట్... విశిష్టని ఎవరో వెనక ఉండి నడిపిస్తున్నారు.. లేకపోతే ఈ మబ్బుకి అంత ధైర్యం కూడానా..  అందులోనూ నాకు ఎదురు చెప్పడమా అని చూస్తూ ఉంటాడు.

వైభవ్ కి గౌతమ్ చూపు చిరాకు వచ్చి హలో సార్ వర్కు గురించి డిస్కస్ చేసుకుంటే మేము బయలుదేరుతాము.. మా టైం వేస్ట్ చేయకండి..

గౌతమ్ ప్రొఫెషనల్ గా మాట్లాడుకుందాం అని స్టార్ట్ చేస్తాడు. విశి చేతులు కట్టుకొని కూర్చుని వింటూ ఉంటుంది.

మాకు రేపు వి.జే. స్. కంపెనీతో మీటింగ్ ఉంది.. ఆర్కిటెక్చర్ తో మాట్లాడాలి అని క్లియర్ గా చెప్పారు. ఈ వర్క్ అంతా  హిమ చేస్తున్నట్టుగా ఎక్స్పోజ్ అయింది. అక్కడ డీల్ చెయ్యాలి.

వైభవ్ కి మ్యాటర్ అర్థమయ్యి చేసుకోండి సార్..  దానికి మా మేడం ఏం చేయాలి.  నువ్వు పిఏవి..  పిఏ లాగా ఉండు.

పూర్తిగా నేను చెప్పిన తర్వాత అప్పుడు మీ మేడం మాట్లాడతారు అని విశి వైపు చూస్తూ... రేపు మేము ఇంకా వర్క్ ఎక్స్పోజ్ చేయాల్సింది ఉంది.

సో నాకు నువ్వు వర్క్ ఇవ్వడంతో పాటు రేపు హిమని గైడ్ చేయాలి.  మీరు అక్కడ మీటింగ్ లో ఉంటే నేనేలా గైడ్ చేస్తాను.

కమాన్ విశి ఏ కాలంలో ఉన్నావు.  ఇప్పుడు టెక్నాలజీ ఎంత హై లెవెల్ లో ఉంది. కొంచెం అర్థమైయేటట్టు చెబుతావా..

ఫోన్ టచ్ లో ఉండు..  పొడ్స్ కనెక్షన్ లో ఉంటుంది. సో అక్కడ వాళ్ళు అడిగేది అన్నీ కూడా నీకు ఇక్కడ అర్థమవుతూ ఉంటాయి కదా...

నువ్వు చెబుతూ ఉంటే హిమ అక్కడ ప్రెసెంట్ చేస్తుంది ఏమంటావు..  అది చీటింగ్ కాదా..  దాన్ని తెలివితేటలు అంటారు. చీటింగ్ అంటే మోసం చేయడం...

సూర్య ఇదంతా ఫోన్లో వింటూనే ఉంటాడు. నేను చెప్పేది నువ్వు సైలెంట్ గా విను వైభవ్ అని ఏం చేయాలో మొత్తం చెబుతాడు.

నా వల్ల అనే లోపు..  మా మేడం ఒప్పుకుంటారు అని టక్కని చెబుతాడు. విశి ఆశ్చర్యంగా వైభవ్ వైపు చూస్తే కళ్లు అర్పుతాడు.
కాకపోతే మొత్తం బిజినెస్ డీల్ అంతా ఈ రోజే మాట్లాడుకుని ప్రైస్ కూడా ఫైనలైజ్ చేసుకుందాము.ఆ మాటకి గౌతమ్ హ్యాపీగా ఫీల్ అయ్యి..

ఎప్పుడు ఇచ్చినట్టుగానే ఇచ్చేస్తాను.. కాకపోతే ఈసారి ముందే ఇస్తాను. ఏమంటారు.. హలో ప్రైసు ఎంత అన్నది మేము డిసైడ్ చేస్తాము.

అది మీకు ఓకే అయితే ఫైనలైజ్ అవుతుంది. ఈ విషయాలన్నీ నేను హ్యాండిల్ చేస్తాను.  మేడం ఎప్పుడూ ఈసార్ మీకు ఎంత అమౌంట్ పే చేస్తున్నారు...

నా వర్క్ అంత సాటిస్ఫాక్షన్ గా లేదు అని అమౌంట్ ఇలా ఇస్తున్నారు అని ఫోన్లో డీటెయిల్స్ చూపిస్తుంది.ది. ఓ మై గాడ్ మీ వర్క్ ని ఇంత చీప్ గా కొట్టేశారా...

ఒకసారి వర్క్ చేసి ఇస్తేనే మినిమం 2 లాక్స్ ఛార్జ్ చేస్తారు...  అలాంటిది మీరు ఒక్కొక్క వర్క్ కి 10000 ఇస్తున్నారా..

సుమారుగా  ఇప్పటిదాకా మీరు మా మేడం కి ఒక ఫిఫ్టీ లాక్స్ అయినా ఇవ్వాలి అనుకుంటా కదా ...
ఆ మాటకి విశి ఆశ్చర్యంగా చూస్తే...  గౌతమ్ కి చెమటలు పడతాయి.  చూడు మిస్టర్ జరిగిపోయిన వర్క్ గురించి ఇప్పుడు డిస్కషన్ అనవసరం.  ప్రజెంట్ జరిగేది మాట్లాడుకుందాం ...

మీరు చెబుతున్నది చాలా పెద్దది. వర్క్ ఇవ్వడంతో పాటు ఎక్స్ప్లెయిన్ చేయడం.. ఎట్ ద సేమ్ టైం అక్కడ క్యూస్షన్స్ కి మా మేడం ఆన్సర్ చేయడం..

సో దీనికి అంతటికి అని ఆలోచించి...  టెన్ లాక్స్ పే చేయాల్సిందే.. ఏమిటి అంత అమౌంటా..  చూడు విశి నీ దగ్గరికి వచ్చాను కదా అని ఇష్టం వచ్చినట్టుగా అడిగితే... నీకు ఎవరు వర్క్ ఇవ్వరు.

నో ప్రాబ్లం సార్..  మా మేడంకి వర్క్ ఎలా వస్తుందా అన్నది మా  ప్రాబ్లెమ్.. మీకు ఓకే అనుకుంటే ప్రొసీడ్ అవ్వడం లేకపోతే లేదు..

ఇందులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఏమీ లేదు ఏమంటారు మేడం..  అంతే అని.. సరే గౌతమ్ మేము బయలుదేరుతాము..

ఏ విషయమో డిసైడ్ అయ్యి.. మెసేజ్ పెట్టు వెళదామా వైభవ్ అనగానే..  ఎందుకు విశి అంత కంగారు.. డీల్ మాట్లాడుకునేటప్పుడు ఓపికగా ఉండాలి.

అంత అమౌంట్ ఒకేసారి అంటే నా వల్ల అవ్వదు అని ఎస్కేప్ అవ్వడానికి చూస్తాడు. మా మేడంకి కూడ అంత వర్క్ ఒకేసారి ఇవ్వాలి అన్నా కష్టమే...

ఏంటి విశి నువ్వు మాట్లాడకుండా అంత నీ పి.. ఎ.. నే మాట్లాడుతున్నాడు. నా గురించి నీకు పూర్తిగా తెలియదు...

నాతో పెట్టుకుంటే నీకే ఇబ్బంది.. మీ మదర్ ట్రీట్మెంట్ కి కూడా నీకు మనీ కావాలి అన్ని ఆలోచించుకో..  చూడు గౌతమ్..మన బిజినెస్ డీల్ మాట్లాడుకుంటున్నప్పుడు బిజినెస్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం.

అంతేగాని ఫ్యామిలీ విషయాలు... పర్సనల్ విషయాలు మాట్లాడుకోవడానికి అయితే నీ దగ్గర చాలా టైం ఉండొచ్చు కానీ నా దగ్గర లేదు.

నా టైం వేస్ట్ చేసే పనులు ఏది నేను చెయ్యను అని ఈసారి స్పీడ్ గా లేస్తుంది. వెంటనే గౌతమ్ లేచి హేయ్..కూల్ కూల్ కూర్చో..

సరే ఒప్పుకుంటాను.  అమౌంట్ కూడా ఇప్పుడే క్రెడిట్ చేసేయండి అని వైభవ్ అంటే... నువ్వేంటి ప్రతి దానికి కంగారు పెడుతున్నావు...

లేదు సర్ ప్రొఫెషనల్ గా ఉంటున్నాను.  అలాగే మేము అయితే వర్క్ ఆ టైం కి ప్రొవైడ్ చేస్తాం. మీరు  ఆ టైమ్ కి అక్కడ ఫెయిల్ అయిన ఐ మీన్ మీరు కాంటాక్ట్ లోకి రాకపోయినా.. మీ మీటింగ్ క్యాన్సిల్ అయిన... ఏం జరిగినా మాకు ఎటువంటి సంబంధం లేదు.

మనీ కూడా రిఫండ్ ఇవ్వము. ఇవన్నీ మీకు ఓకే అయితే అగ్రిమెంట్ మీద సైన్ చేసి అమౌంట్ మాకు ట్రాన్స్ఫర్ చేసేయండి.

అదేంటి అలా చెబుతున్నారు. మా వర్క్ అయ్యే వరకు మాతో ఉండాలి కదా..  హలో సార్ మీతో అంత టైం స్పెండ్ చేయడానికి  మాకు కుదరదు.

ఇంకా మిగిలిన ప్రాజెక్ట్ ఉన్నాయి.. మీరు పర్టికులర్గా మీ మీటింగ్ టైం చెప్పండి. ఆ టైం మాత్రమే మీకు ఇస్తాము. అంతేగాని రోజు మొత్తం ఇవ్వాలి లేకపోతే నెలలు ఇవ్వాలి అంటే దానికి సపరేట్గా చార్జ్ ఉంటుంది.  మీకు ఓకే అంటే చెప్పండి...

గౌతమ్ ఆలోచిస్తూ ఉంటాడు. విక్రమ్ సార్ టైం ఇచ్చారు అంటే ఆయన టైం ఫాలో అవుతారు.  సో అనవసరంగా వీళ్ళకి ఎగస్ట్రా మని ఇవ్వడం ఎందుకు..

ఇప్పటికే చాలా ఎక్కువ ఇచ్చేసాను..  నో ప్రాబ్లం.. మాది టైమ్ అంటే టైమే..  ఏ టైం సార్.. 10:30 టు 11:30 అని చెబుతాడు.

ఓకే..  ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేసి మనీ ట్రాన్స్ఫర్ చేయండి..  అగ్రిమెంట్ ఎందుకు.. ఏమో రేపు మీరు మనీ ఇచ్చాను మాకు కావాల్సినట్టుగా చేయాలి అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు అనుకోండి... మా మేడం అసలే సెన్సిటివ్.. అందుకే ముందు జాగ్రత్త...

మనీ నీ అకౌంట్ కా లేక విశిష్ట అకౌంట్ కా.. మనీ విషయం అంత మా మేడం  హ్యాండిల్ చేస్తారు.. నేను జస్ట్ పి ఎ ని మాత్రమే..

అగ్రిమెంట్ మీద సైన్ చేసి మనీ ట్రాన్స్ఫర్ చేస్తాడు.  మాకు ప్రొఫెషనల్ గానే ఉండాలి. రేపు ఏమాత్రం తేడా వచ్చినా అసలు బాగోదు.

మీరు ఇచ్చిన టైం కి మేము కాంటాక్ట్ లోకి వస్తాము. మీరు మిస్ చేస్తే మాకు ఏమీ సంబంధం లేదు అని మేడం వెళదామా..

సరే బాయ్ అని చెప్పి వెళ్ళబోతుంటే విశి అని పిలుస్తాడు...  కాల్ మీ విశిష్ట.. అదే విశిష్ట.. చెప్పండి మిస్టర్ గౌతమ్..

నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఏం మాట్లాడాలి... ప్లీజ్  విశిష్ట ఒక ఫైవ్ మినిట్స్ నాకు టైం ఇవ్వు.. సరే బయట లాన్ లో కూర్చుందాం. పదండి.

లేదు ఇక్కడే మాట్లాడుకుందాం.. సారీ మిస్టర్ గౌతమ్..  తెలియని వాళ్ళతో ఇలా క్యాబిన్లో ఉండడం ఒక అమ్మాయిగా నాకు సేఫ్టీ కాదు.

మీకు అంతగా మాట్లాడాలి అనుకుంటే ఓపెన్ ప్లేస్ లోనే మనిద్దరం సెపరేట్గా నిలబడి మాట్లాడుకుందాం. అది మీకు ఓకే అయితేనే..

సరే నీకు ఎలా కంఫర్ట్ అంటే అలాగే మాట్లాడుకుందాం అని పళ్ళునూరుతూ వెళతాడు.  పరవాలేదు బాబీ...  మీరు బానే హేండిల్ చేస్తున్నారు.

ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాను.. పదా వాడు ఏమి సోది చెప్పాలనుకుంటున్నాడో విందాం అని వచ్చి చెప్పండి మిస్టర్ గౌతమ్...

గౌతమ్ ఏం చెప్పబోతున్నాడు.....
[+] 10 users Like SivaSai's post
Like Reply
Part - 46



బాబీ ఒక్క నిమిషం. ఏమిటి వైభవ్... నీ ఫోన్ ఆన్ లో ఉంచవా ప్లీజ్.. ఎందుకు.. నువ్విచ్చే కోటింగ్ ఏంటో నాకు వినాలని ఉంది.

పర్సనల్గా మాట్లాడాలి అంటే దగ్గరలో ఉండలేను కదా.. ప్లీజ్ ప్లీజ్ మెలికలు తిరుగుతూఉంటాడు.

సరే అని ఫోన్ ఆన్ చేసి గౌతమ్ దగ్గరకి వెళుతుంది.
చెప్పండి మిస్టర్ గౌతమ్ ఏం మాట్లాడాలి... ప్లీజ్ విశిష్ట మనం ఒకప్పటి లవర్స్ లాగా మాట్లాడుకుందాం..

ఇంకా ఆపుతావా అని చేతితో చూపిస్తుంది.. ఇక్కడ వైభవ్ ఫోన్ స్పీకర్లు ఉంచుతాడు. మనిద్దరం లవర్స్ మా ఎప్పుడు..  అలా అంటావేంటి విశి ఎంత గాఢంగా ప్రేమించుకున్నాము..

అవునా..  సరే నాకు ఇష్టమైన పువ్వు ఏది అని అడుగుతుంది. ఆ మాటకి తడబడుతూ ఆడవాళ్ళకి ఎక్కువ రోజ్ సే కదా ఇష్టం అని చెప్పి రెడ్ రోజ్ అంటాడు.

రాంగ్ ఆన్సర్.. పోనీ నాకు ఇష్టమైన కలర్...  పింక్.  రాంగ్ ఆన్సర్.. చూసావా ఒక పువ్వు..  రంగులోనే.
నాకేం ఇష్టమో నీకు తెలియదు. అలాంటిది మన ఇద్దరం లవర్స్ అని చెబుతున్నావు.

అవి తెలియనంత మాత్రాన లవర్స్ మీ కాదా...  ఇంకా నీకు లవర్స్ అని నమ్మకం  ఉంది కదా.
  సరే మనిద్దరం కలిసి వెళ్ళిన మొదటి డేట్ ఎప్పుడు.. ఎక్కడ..

ఆ మాటకి గౌతమ్ నీళ్లు నములుతూ ఉంటాడు.  లేదు కదా..  పోనీ నువ్వు కాలేజ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనిద్దరం పర్సనల్గా కలిసింది ఎప్పుడు ? అది..   లేదు కదా...

ఇప్పటికీ కూడా మనం లవర్స్ అని నీకు అనిపిస్తుందా...
ఐ యాం సారీ విశి..  నేను ఇప్పుడు తెలుసుకుంటాను. నీకు ఇష్టమైన కలర్..  ఫుడ్..

అలాగే డేట్ కి తీసుకువెళ్తాను.  వీకెండ్ పర్సనల్గా మీట్ అవుతాను. ఇంకా ఆపుతావా... అడిగిన తర్వాత చేసేదాన్ని ప్రేమ అనరు. అడగకుండా చేసేదానినే ప్రేమ అంటారు.

ఇన్ని రోజుల్లో నీకు అనిపించినది.. ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడేటప్పటికీ ఎందుకనిపిస్తుంది. ప్రతిసారి నువ్వు మా అమ్మ పేరు చెప్పి నన్ను ఎమోషనల్ గా లాక్ చేసి నాతో నీ వర్క్ చేయించుకునే వాడివి.

ఇప్పుడు నా వర్క్ కి ఉన్న వాల్యూ ఏమిటో తెలుసుకుని నేను స్ట్రాంగ్ గా నిలబడేటప్పటికీ కాళ్ళ బేరానికి వస్తున్నావు.

నిజంగా నువ్వు నన్ను ప్రేమించే ఉంటే హిమతో పెళ్లికి ఎంత ఒప్పుకుంటావు. హిమంటే నాకు ఇష్టం లేదు.  పెద్దవాళ్ల ఫోర్స్ కి ఒప్పుకోవాల్సి వచ్చింది.

ఆ మాటకి గట్టిగా నవ్వుతుంది. నవ్వి నవ్వి కళ్ళల్లో నీళ్లు వస్తాయి. గౌతమ్ అలాగే చూస్తూ ఉంటే..  సోరి అని కష్టంగా నవ్వు ఆపుకుంటూ..

నేను ఏమన్నా నీ కళ్ళకి ఒక త్రీ ఇయర్స్ బేబీగా కనిపిస్తున్నానా..  ఏది చెప్పినా నమ్మడానికి... స్టాల్ జరిగిన రోజు నువ్వు చెప్పిన ఏ మాట నేను మర్చిపోలేదు.

నా రేంజ్ ఏంటో నా లైఫ్ ఏంటో అన్నది చూపించావు. జస్ట్ నీ వరకు మాత్రమే వర్క్ చేయాలి.. నీకోసమే నేనుండాలి.  కానీ బయట ప్రపంచానికే మాత్రం నీ భార్యగా మాత్రం హిమ ఉండాలి.

  అప్పుడు నన్ను ఏమంటారో తెలుసా.. ఆ పిలుపుకి ఎలాంటి విలువ ఉంటుందో తెలుసా..  నీకు ఒక సిస్టర్ ఉండి.. ఆ అమ్మాయికి కూడా నీలాంటి వాడే ఇలాంటి ఆఫర్ ఇస్తే అర్థమవుతుంది.

ఒకరకంగా నేను నీకు థాంక్స్ చెప్పాలి..  ఎందుకో తెలుసా...  ఆరోజు నువ్వు అలా మాట్లాడకపోయి ఉండి ఉంటే...

నేను అలాగే నీకోసం వర్క్ చేస్తూ నాలో నిజంగానే టాలెంట్ లేదేమో అని అలాగే ఉండిపోయేదాన్ని..

మనిద్దరి మధ్యన అసలు ప్రేమే లేదు.  ప్రేమ ఉండి ఉంటే నువ్వు నన్ను మోసం చేయడానికి చూసేవాడివి కాదు. నువ్వు నాకు దూరం అయితే ఆ పెయిన్ తట్టుకోలేక నేను నరకం చూసేదాన్ని...

బట్ నువ్వు నన్ను మోసం చేశావు అన్న బాధ తప్ప... నిన్ను మిస్ అవుతున్నానే అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడూ లేదు.

అలాంటప్పుడు మన మధ్యన ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది. జస్ట్ ఒక బిజినెస్ డీల్ మాత్రమే..  నువ్వు నాకు మనీ ఆఫర్ చేశావు. దానికి తగ్గట్టుగా నా వర్క్ నీకు ఇస్తూన్నాను.

థట్స్ ఇట్.. ఇంకేమైనా మాట్లాడాలా.. ఇది నువ్వు కాదు.  నువ్వేంటో నాకు తెలుసు కదా నీతో ఎవరో మాట్లాడిస్తున్నారు ...

బిజినెస్ పరంగా దెబ్బతీయ లేక పర్సనల్గా దెబ్బతీయడానికి నిన్ను వాడుకుంటున్నారు.  ఎవరో చెప్పు...   భుజాలు పట్టుకుని కుదిపేస్తూ ఉంటాడు.

మిస్టర్ గౌతమ్ మీరు దూరంగా ఉండండి. ఇలా మిస్ బిహేవ్ చేశారంటే  అరిచి అందరినీ పిలుస్తాను. పిలువు విశి...

నా ప్రియురాలు  నన్ను వద్దని వెళ్ళిపోతుంది.. అందరూ కలిసి నచ్చచెప్పండి అని నేనే చెబుతాను.  నువ్వు చెప్పగానే అందరూ నమ్ముతారు అనుకుంటున్నావా...

పిచ్చి.. విశి..  ఎవరు ఏడుస్తూ మాట్లాడుతారో వాళ్ళది నిజం అనుకునే మాయలోకం..

వీళ్ళ సంభాషణ వింటుంటే..  సూర్యకి కోపం వస్తుంది. అక్కడున్న స్టాప్ కి చెప్పి... అక్కడ ఒక అమ్మాయిని హెరాస్ చేస్తున్నారు..  చూడండి అని పంపిస్తాడు..

స్టాఫ్ వచ్చి.. హలో మిస్టర్ అమ్మాయిని వదలండి..   తను నా లవర్..  కాదు భయ్యా..  ఇతను ఏడిపిస్తున్నాడు. మాకు విశిష్ట గురించి బాగా తెలుసు. మాతో పాటు వర్క్ చేస్తుంది.  మీరు మర్యాదగా వదిలితే మంచిది. లేదు అంటే సెక్యూరిటీ ఆఫీసర్లని పిలుస్తాను.


ఆలోచించుకో.. విశి అని వెళ్ళిపోతాడు. థాంక్స్ భయ్యా... జాగ్రత్త విశి అని వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే ముగ్గురు అక్కడికి వస్తారు.  సూర్య మాత్రం చాలా కోపంగా ఉంటాడు.

వాళ్ళ ముగ్గురిని చూడగానే కన్నీళ్లు తుడుచుకుని.. హాయ్ సార్ అంటుంది. సూర్య మాత్రం సీరియస్ గానే  ఉంటాడు.
ఏమైంది.. సార్ అంతా కోపంగా ఉన్నారు. ఏమీ లేదు బాబి.. ఏదో వర్క్ టెన్షన్.. అవునా...  వైభవ్ నీ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వు..

  ఎందుకు బాబి..  పంపించు.. సరే అని సెండ్ చేస్తాడు.
వెంటనే అకౌంట్కి 1 లాక్ పంపిస్తుంది. ఎందుకు బాబి ఇంత అమౌంట్ పంపించారు.

ఈరోజు నీ వల్లే నాకు అంత అమౌంట్ వచ్చింది. ఫుల్ అమౌంట్ ఇవ్వలేను కదా.. అందులో టెన్ పర్సెంట్ ఇస్తున్నాను.

ఎవ్రీ టైం నా వర్క్ లో 10% నీకే..  సాలరీ కన్నా ఇదే బాగుంది కదా అని శ్రీకర్ అక్కడ వాతావరణాన్ని తేలిక చేస్తాడు.

సూర్య కూడా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. విశిలో ఉన్న ఆ స్వచ్ఛతే సూర్య ని ఎప్పుడూ లాగుతూ ఉంటుంది.

బాబీ రేపు మరి 10:30 టు 11:30 అంటే...  మరి కాలేజీలో ఉంటావు కదా.. ఎలా.. మాది లాస్ట్ సెం కదా... సెల్ఫ్ వర్క్ ఎక్కువ ఉంటుంది.

సో ఆ టైం మేనేజ్ చేస్తాను. మరి నన్ను ఆలో చేయరు కదా.. నువ్వు హ్యాండిల్ చేసుకుంటావా..  సూర్య వైపు చూస్తుంది.

  నాకు రేపు అర్జెంట్ వర్క్ ఉంది.  లేకపోతే నేను విశికి తోడుగా  ఉండేవాడిని.  శ్రీకర్ నువ్వు హ్యాండిల్ చేయి. వర్క్ అయ్యే వరకు అక్కడే ఉండు..

సరే బావ.  విశి ముగ్గురిని అలాగే చూస్తూ ఉంటే.. ఏమైంది బాబీ అలా చూస్తున్నావు..  ఏమీ లేదు.. మీరెవరో... నేనెవరో...

కానీ పరిచయమైనప్పటి నుంచి మీ ముగ్గురు నన్ను చాలా ప్రొటెక్ట్ చేస్తున్నారు. అది ఏమిటో అన్నది అర్థం కావడం లేదు అలా అని ఈ బంధాన్ని నేను తప్పుపట్టను.

ఎందుకంటే కలిసిన రోజు నుంచి కూడా మీ ముగ్గురు నాతో చాలా స్వచ్ఛంగా ఉన్నారు. థాంక్యూ ..

ఇదిగో బాబి.. థాంక్యూ అని చెప్పి మన మధ్యన దూరాన్ని పెంచకు. చెప్పాను కదా నువ్వు  తప్పిపోయిన మా బాబీ లాగా కనిపిస్తున్నావు.

  శ్రీకర్ వెంటనే... అవును విశి నిన్ను చూస్తుంటే మా చెల్లె గుర్తుకు వస్తుంది. ఏమంటావు బావ అని కన్ను కొడతాడు. సూర్య ఏమి సమాధానం చెప్పాలో తెలియక..

సరే ఇప్పటికే లేట్ అయింది. అమ్మ ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు పదా అని చెయ్యి పట్టుకుని తీసుకు వెళ్లిపోతాడు.

చూసావా బావ మనిద్దరం అలా చెబుతూ ఉంటే అన్నయ్యకి ఎంత కోపం వస్తుందో... కానీ బయటపడడం లేదు.

విశి ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు.  బైక్ దిగి బాయ్ సార్ అంటే..  అలాగే చూస్తూ ఉంటాడు. నాతో ఏమైనా చెప్పాలా.. జాగ్రత్త..

అలాంటి ఎదవలు పట్టుకున్నప్పుడు వదులు వదులు అని కాదు...  చేతులు పట్టుకుంటే..  కాళ్లు ఉన్నాయి కదా...
సెంటర్ పాయింట్ లో ఒక కిక్ ఇచ్చామంటే వాడే మూసుకుని కూర్చుంటాడు..

మన చుట్టూ ఆస్తమాను జనం ఉండరు కదా.. అని బైక్ ని రివర్స్ చేసుకుని వెళ్ళిపోతాడు.  వెళ్ళుతున్న సూర్యనే చూస్తూ ఉండిపోతుంది.

ఇంటికి వెళ్లిన సూర్య కి కోపం తగ్గదు. వెళ్లి  షవర్ కింద నిలబడతాడు. ఆ చన్నీళ్లలో తడిసి తడిసి కాసేపటికి శాంతిస్తాడు.

డ్రెస్ చేంజ్ చేసుకుని విక్రమ్ దగ్గరకి వెళతాడు. విక్రమ్ చేస్తున్న వర్క్ ని పక్కన పెట్టి.. ఏమైందిరా అంత డిస్టర్బ్డ్ గా ఉన్నావు..

రేపు నేను ఆఫీస్ కి వస్తాను.. ఏమంటున్నావు రా..  అవును వస్తాను.. నా కోడల్ని వాడు ఏమైనా చేశాడా..  జరిగింది చెబుతాడు.

వాడికి ట్రీట్మెంట్ మామూలుగా ఇవ్వడం లేదు కదా.. మన ఇంటి ఆడవాళ్ళ జోలికి వస్తే ఏం జరుగుతుందో వాడికి రేపు మనం చూపిద్దాము.

నువ్వు ఎవరో తెలిస్తే ప్రాబ్లం కదా..  వాడికి నేను కనిపించను.. కానీ వాడి వెనక ఒక తోక ఉంటుంది కదా దానికి ఇస్తాను..

అర్థమయింది...  రాంగ్ రూట్లో వెళ్ళి గొప్పవాడు అవ్వాలి అనుకున్నా గౌతమ్ కి రేపటి నుంచే కటింగ్ పడుతుందన్నమాట..

ఉంచుకున్నది పోయే...  కట్టుకున్నది పోయే అన్నట్టుగా  ఉంటుంది గౌతమ్ పరిస్థితి..

వైభవ్ సంతోషంగా పెదనాన్న అనుకుంటూ పరిగెత్తుకొస్తాడు. ఏమైందిరా..  నాది ఈ ఒక్కరోజు శాలరీ ఎంతో తెలుసా.. వన్ లాక్ అంటాడు.

అవునా అంత అమౌంట్ ఎలా రా..  బాబీకి ఈరోజు కాంట్రాక్టులో 10 లాక్స్ వచ్చాయి. తను ప్రతి వర్క్ లో నాకు 10% ఇస్తుంది.

చెప్పాను కదా.. నా కొడుకులు టాలెంటెడ్ అని.. కాకపోతే నీలో ఇంకా చిన్నపిల్లాడి లక్షణాలు ఉన్నాయి.  చూస్తూ ఉండు మీ వదినతో కలిసి నువ్వు ఒక టాప్ బిజినెస్ మాన్ అయిపోతావు.

గౌతమ్ రేపటి నీ పరిస్థితి ???

కథ కొనసాగుతుంది...
[+] 11 users Like SivaSai's post
Like Reply
Waiting for Gautam tomorrow!!
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
waiting for surprise
[+] 1 user Likes shekhadu's post
Like Reply
Superb update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
Movie opens tomorrow at Surya's office.
[+] 2 users Like Sunny73's post
Like Reply
Weekend late aa Sivagaru?
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Siva garu,

Hats off to you andi.. season-1 super ankuntee.. daaani minchi season - 2 ndusthundhi..
Ee season loo ;ove romantic tracks chala bagha nadusthunnayi.. super


Alage.. bhavya ki pair evaru inka set avvaledhu.. thanaki kooda pair unna inka scene loki raledha??

Any how fantastic, marvelous story. keep going.. waiting for next update..
[+] 1 user Likes masalakiss's post
Like Reply
Siva garu,

Hats off to you andi.. season-1 super ankuntee.. daaani minchi season - 2 ndusthundhi..
Ee season loo ;ove romantic tracks chala bagha nadusthunnayi.. super


Alage.. bhavya ki pair evaru inka set avvaledhu.. thanaki kooda pair unna inka scene loki raledha??

Any how fantastic, marvelous story. keep going.. waiting for next update..
[+] 1 user Likes masalakiss's post
Like Reply
(19-04-2026, 09:25 AM)ash.enigma Wrote: Weekend late aa Sivagaru?

Noo

10 minutes
[+] 1 user Likes SivaSai's post
Like Reply
(19-04-2026, 10:46 AM)SivaSai Wrote: Noo

10 minutes

Sure Sivagaru
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Part - 47



వెరీ గుడ్ వైభవ్..  వెళ్లి విషయం మీ అమ్మకు చెప్పు.. సంతోషిస్తుంది. లేదులే పెదనాన్న..  ఏదో ఒక కౌంటర్ వేస్తుంది.

అదే నీకు తెలిసింది. వెళ్లి చెప్పి చూడు...  సరే బాయ్ అని పూజిత దగ్గరికి వెళతాడు. అమ్మ అని పిలిస్తే.. ఏంట్రా ఈ టైంలో వచ్చావు.

తన అకౌంట్ ఓపెన్ చేసి చూపిస్తాడు.  వన్ లాక్ అని అయోమయంగా చూస్తూ ఉంటే..  థిస్ ఇస్ మై ఫస్ట్ సాలరీ అంటాడు.

వినయ్ చూస్తున్న ఫైల్ పక్కన పెట్టి ఇంత అమౌంట్ ఎలా వచ్చింది..  మీకు అన్ని అనుమానాలే..  నా కొడుకుకి టాలెంట్ ఉంది వచ్చింది.

కొడుకుని వెనకేసుకురావడం కాదు.. ఎలా వచ్చింది?  షార్ట్ పీరియడ్ లో అంత ఎక్కువ అమౌంట్ అంటే ఆలోచించవా...  ఎలా వచ్చింది రా..

జరిగింది మొత్తం చెబుతాడు. వెరీ గుడ్.. మీ వదినని బాగా ప్రొటెక్ట్ చేస్తున్నావురా..  సీతకి లక్ష్మణుడు లాగా తోడు ఉంటున్నావు అన్నమాట...

ఏమో అవన్నీ నాకు తెలియదు కానీ.. బాబీతో ఉంటే భలే బాగుంటుంది..  చాలా ఇన్నోసెంట్..
అందరూ మంచివాళ్లే తన దృష్టిలో.. ఎలా బ్రతుకుద్దో ఏమిటో అనిపిస్తుంది.  సూర్య ఉండగా ఆ భయం లేదులే...

అమ్మ అని పిలిస్తే.. ఏంట్రా..  నువ్వు హ్యాపీయేనా అని అడుగుతాడు. ఒరేయ్ పిచ్చి సన్నాసి.. నువ్వు ఎంత అమౌంట్ సంపాదించావు అన్నది పెద్ద విషయం కాదు.

బాధ్యతతో ఉన్నావా లేదా అన్నదే నాకు కావాలి. నీకు బాధ్యత తెలిసింది అంటే నాకన్నా సంతోషించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు.

నువ్వు  విశి విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నావు.. ప్రొటెక్ట్ చేస్తున్నావు. అంతకుమించి నాకు కావాల్సిందేముంటుంది అని చెంప పైన చేయి వేస్తుంది.

తల్లిని హగ్ చేసుకుని థాంక్యూ మా అంటాడు.  సరే వెళ్లి రెస్ట్ తీసుకో..  అలసిపోయినట్టున్నావు.

గౌతమ్ ఇంటికి వెళ్లి విస్కీ తాగుతూ విశి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నీలో ఇంత మార్పు ఎలా వచ్చింది... నా చెయ్యి జారిపోతున్నావా..

అలా జరగనివ్వను. ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నావు..  నీ వెనక ఉండి నడిపించేది ఎవరు... ఆజ్ఞాత వ్యక్తిని తొందరగా కనిపెట్టాలి లేకపోతే నాకు చాలా ప్రమాదం.

సూర్యుడు అందరికీ ఒకేలాగా శుభోదయం చెబుతాడు. కొంతమందికి ఉత్సాహంగా.. కొంత మందికి టెన్షన్ గా మొదలవుతుంది.

గౌతమ్ ఆఫీస్ కి బయలుదేరే ముందే వైభవ్ కి మెసేజ్ చేస్తాడు. మాకు గుర్తు ఉంది సార్. మీరు ఆ టైం కల్లా మేడమ్ కి కాల్ చేయండి.. అని మెసేజ్ చేస్తాడు.

హిమకీ కాల్ చేస్తే.. వెయిట్ బేబీ రెడీ అవుతున్నాను. కమాన్ హిమా..   ఇంకా రెడీ అయ్యే దగ్గరే ఉన్నావా.. మనం వెళ్లేదే గ్రేట్ జైసింహ కంపెనీకి..

అలాంటప్పుడు ఎంత గ్రాండ్ లుక్ తో ఉండాలి. ఉండాల్సింది గ్రాండ్ లుక్కుతో కాదు ప్రొఫెషనల్ గా మాట్లాడడం..

డోంట్ వర్రీ ఐ కెన్ హండిల్.  ఇంతకీ ఆ విశిష్ట ని లైన్ లో పెట్టావా.. హ టెన్ లాక్స్ తీసుకుంది.  వాట్ అంత అమౌంట్ ఎందుకిచ్చావు.. నీకు మనీ ఏమన్నా ఫ్రీగా వస్తున్నాయా..

ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం నువ్వు ఆఫీస్ కి వస్తే ఇద్దరం కలిసి డైరెక్ట్ గా వెళదాము.  నో బేబీ ఆఫీస్ కొచ్చి అక్కడికి వెళ్ళేటప్పటికి నాకు టైం సరిపోదు. నేను డైరెక్ట్ గా అక్కడికి వచ్చేస్తాను..

సరే నీవు గౌతమ్ ఆఫీస్ కి వెళ్లి అక్కడ నుంచి డైరెక్ట్ గా వి.జె. స్.. కి వెళతాడు 10 అవుతున్న సరే హిమ జాడ కనిపించదు.

గౌతమ్ కి టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది.  ఇంకా రాలేదేంటి ఫోన్లు మీద ఫోన్లు చేస్తూ ఉంటాడు.  రింగ్ అవుతున్న లిఫ్ట్ చేయదు.

ఇంకొక పది నిమిషాలు ఉంది అనగా కారు దిగుతుంది. ఏమిటి  హిమ.. ఇంత లేటుగా వస్తే ఎలాగా..  ఇంకా టెన్ మినిట్స్ టైం ఉంది కదా.. ఎందుకు అంత టెన్షన్ గౌతమ్..

మనం ప్రజెంటేషన్ స్టార్ట్ చేయాల్సిన టైం అది.  ముందుగా వచ్చి అన్ని ప్రిపేర్ చేసుకోవాలి కదా..   చేసుకోవాల్సిందంతా ఆ విశిష్ట..

నేను కాదు..  జస్ట్ నేను యాజ్ టీజ్ గా ప్రజెంటేషన్  ఇస్తాను అంతే కదా...

అది తెలియాలి అన్నా నువ్వు విశి ని కాంటాక్ట్ చేయాలి కదా.. కమాన్ ప్రతి ఒక్కరినే నేను బెగ్ చేయాల్సిన అవసరం లేదు.

అవన్నీ చూసుకోవాల్సిందే నువ్వు పద టైం అవుతుంది.  ఇంతకన్నా మంచి డ్రెస్ లేదా.. ఈ డ్రెస్ కి ఏమైంది.మనం వచ్చింది అఫీషియల్ మీటింగ్ కి..

ఏ బిజినెస్ సూటో.. చుడీదార్  ఆర్ శారీ వేసుకోకుండా.. ఈ స్లీవ్ లెస్ టాప్..  టైట్  జీన్స్ దేనికి.. నా డ్రెస్సింగ్ ఎలా ఉండాలో నేను డిసైడ్ చేసుకుంటాను.  నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు..

ఇంకా ఆర్గ్యు పెరిగితే మొదటికే మోసం వస్తుందని సరే పద.. బేబీ అని.. తన చేతితో గౌతమ్ చేతి  వేళ్ళని లాక్ చేస్తుంది.

హిమ అఫీషియల్ గా ఉండు.. మనం వచ్చింది ఎక్కడికో తెలుసా..  ఇది మన పర్సనల్ క్యాబిన్ కాదు..  ఈరోజు నువ్వు చాలా క్యూట్ గా హ్యాండ్సమ్ గా ఉన్నావు బేబీ..

గౌతమ్ కి ఆ కాంప్లిమెంట్ కి ఎక్కడికో తేలుతూ..  సరే సరే మనం తర్వాత మాట్లాడుకుందాం..  ఏదైనా క్వశ్చన్ చేస్తే తడబడకు అర్థమైందా..

  నో ప్రాబ్లం బేబీ.. నేను చూసుకుంటాను కదా.. ఇద్దరు మీటింగ్ జరిగే ప్లేస్ కి వెళతారు.  వెళ్లేముందే విశికి కాల్ చేసి లైన్లో పెడతారు..

విశి కాలేజ్ ఓపెన్ ప్లేస్ లో కూర్చుంటుంది.  శ్రీకర్ కొంచెం దూరంగా కూర్చుని విశి మీదే ఫోకస్ పెడతాడు.

గౌతమ్ హిమా క్యాబిన్లోనికి వెళ్లగానే  అక్కడున్న అసిస్టెంట్ వాళ్ళు కూర్చోవలసిన ప్లేస్ చూపిస్తాడు. థాంక్యూ అని కూర్చుంటే...

హిమ కాలు మీద కాలేసుకుని.. మీ విక్రమ్ సార్ ఎప్పుడు వస్తారు..  టైం పంచ్వాలిటీ లేదా అనగానే.. గౌతమ్.. హిమ చేయి పట్టుకుని ఏం మాట్లాడుతున్నావు.  సైలెంట్ గా ఉండు..

కమాన్ బేబీ..  వర్కు ప్రొఫెషనల్ గా ఉండాలి. మనకి ప్రతి మినిట్ క్యాలిక్యులేటడ్ ఏ కదా... ఇది ఫోన్లో వింటున్న విశి అబ్బో అని పెదవి విరుస్తుంది.

అసిస్టెంట్ హిమ వైపు చూసి ఒక నవ్వు నవ్వి మా సార్ వస్తున్నారు.  మీ ప్రజెంటేషన్ అంత రెడీ గానే ఉంది కదా.. మీరు ఏ మాత్రం తడబడిన ఇక్కడతో మీ డీల్ క్లోజ్ అయిపోతుంది. తర్వాత మీదే బాధ్యత..

అందులో మీరు అనుమాన పడాల్సిన అవసరమే లేదు. నా గురించి మీకు ఇంకా పూర్తిగా తెలియదు అనుకుంటా..  ఐ యాం  గ్రేట్ వరల్డ్ వైడ్ ఫేమస్ అర్క్ టెక్చర్.

ఈ మధ్యన వర్క్ మొత్తం స్టాల్ కింద కూడా పెట్టాము. మీరు చూడలేదా..  చూసాము.. అది చూసే మీకు ఈ ఆఫర్ ఇచ్చాము.

అసిస్టెంట్ కి మెసేజ్ వస్తుంది.  అది చూసి విక్రమ్ సార్ వస్తున్నారు. బి అలెర్ట్..  నో ప్రాబ్లం అని అంతే పొగరుగా చెబుతుంది.

గౌతమ్ పక్కననుంచి నువ్వు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఉన్నావు.  తగ్గించుకో అని స్లోగా చెబుతాడు.

విక్రమ్, శ్రీ లోపలికి వస్తారు.   గుడ్ మార్నింగ్ సార్  అని చెప్పగానే.. గుడ్ మార్నింగ్ ఆనంద్..  మనతో మీటింగ్ అరేంజ్ చేసిన వాళ్ళు వచ్చారా..

ఎస్సార్ మేము వచ్చాము అని గౌతమ్ నిలబడి చెబుతూ షేక్ హ్యాండ్ ఇవ్వడం కోసం ముందుకి చెయ్యి చాపుతాడు విక్రమ్,  శ్రీ ఇద్దరు కూర్చుని కాలు మీద కాలు వేసుకుని చూస్తూ..  అది మన టై అప్ అయిన తర్వాత ఇస్తాము ..

ఇక మీ వర్క్ స్టార్ట్ చేస్తారా.. ఎస్ సార్.. షీ ఇస్ హిమ..  మా కంపెనీలో బెస్ట్ ఆర్కిటెక్చర్.. ఇప్పటివరకు చేసిన వర్క్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ.. ఫర్దర్ వర్క్ కూడా మీకు చూపిస్తాము.

సూర్.. ఏదైనా సరే మీకు ఇచ్చిన టైమ్ లోపే ఫినిష్ అవ్వాలి.. ఆనంద్ అనగానే..  ఎస్సార్ అని.. ఎక్స్క్యూజ్ మీ ఇద్దరి మొబైల్స్ మాకు  ఇవ్వండి.

మీరు వెళ్లే ముందు ఇస్తాము..  వాట్ ఇదేమిటి అని హేమ గట్టిగా మాట్లాడుతుంది. నా ముందు ఎవరైనా వాయిస్ రైస్ చేస్తే నాకు అస్సలు నచ్చదు.

నీ వర్క్ మొత్తం పెన్ డ్రైవ్ లో ఉంది  కదా.. అది అక్కడ మా సిస్టంకి కనెక్ట్ చేస్తే సరిపోతుంది కదా.. ఇక మిగిలిన గాడ్జెట్స్ తో మీకేం పని.

బట్ ఇది మా పర్సనల్.. ఎదుటి వాళ్ల పర్సనల్స్ ని టచ్ చేసే అంత చీప్ మెంటాలిటీ మా కంపెనీలో ఎవరికీ లేదు.  ఇది మీకు నచ్చకపోతే ఇమీడియట్గా ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు..

గౌతమ్ కి చాలా టెన్షన్ వస్తుంది.  ఇప్పుడు ఏమి చేయాలి.. ఫోన్ లేకపోతే హిమ ఎలా చెప్పగలుగుతుంది అని ఫుల్ గా ఏసి ఉన్నా సరే పట్టిన   చెమటలు   తుడుచుకుంటూ ఉంటాడు.

ఏంటి మిస్టర్ మీ ఆర్కిటెక్చర్ కి గాడ్జెట్స్ లేకపోతే చెప్పే టాలెంట్ లేదా.. అంత డిపెండెడా అని  శ్రీ వెటకారంగా అడుగుతాడు..

నో సార్ అలా ఏమీ లేదు. ఒక్కసారిగా మీరు అన్ని  ఇమ్మనేటప్పటికీ అని తడబడుతూ ఉంటే.. మాకు సెల్ఫ్ టాలెంట్ కావాలి.

గూగుల్ సర్చ్ చేసి.. ఎక్సక్ట్రా ఎక్సట్రా యాప్స్ సెట్ చేసి సబ్జెక్టు మాకు వద్దు. మీరు చెప్పగలరా లేదా అది మాత్రమే క్లియర్ గా చెప్పండి..

అసలే మీ అర్క్ టెక్చర్ టాలెంట్ తో ఎగ్జిబిషన్ స్టాల్ ఏవేవో పెట్టినట్టున్నారు.  అలాంటిది ఈమాత్రం కూడా చెప్పలేదా.. సో సాడ్ ..

హిమకి పౌరుషం వచ్చి ఎందుకు చెప్పలేను..  నా టాలెంట్ ని మీరు అనుమానిస్తున్నారు. ఫోన్,  లాప్టాప్ ఇస్తుంది అవి వీళ్ళకి కొంచెం దూరంగా పెడతారు.

పర్వాలేదు దగ్గర్లోనే  ఉన్నాయి.బ్లూటూత్ కనెక్షన్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు అనుకొని పెన్ డ్రైవ్ తీసుకుని వెళ్లి కనెక్ట్ చేస్తోంది.

హిమ టాలెంట్ కి గౌతమ్ సినిమా......
[+] 7 users Like SivaSai's post
Like Reply
Part - 48



పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి బ్లూటూత్ ఆన్ చేస్తుంది. చెప్పండి మిస్ అని విక్రమ్  వాయిస్ గంభీరంగా వస్తుంది. ఒక్క నిమిషం కంగారుపడుతుంది.

అటు పక్క నుంచి.. విశి నేను రెడీ అని చెబుతోంది. ఓకే అని ప్రీవియస్ ప్రాజెక్ట్  ఎక్సప్లయిన్ చేయడం స్టార్ట్ చేస్తుంది.

కంటిన్యూ చేస్తూ ఉంటే.. విక్రమ్ స్టాప్  అనగానే ఏమైంది సార్ అని గౌతమ్ కంగారుగా అడుగుతాడు.. ప్రీవియస్ వర్క్ గురించి అవసరం లేదు.

ప్రెసెంట్ మీరు మాతో కోలాబరేషన్ అవ్వాలనుకున్న ప్రాజెక్ట్ స్టార్ట్ చేయండి అనగానే.. ఓకే అని హిమవైపు చూస్తాడు. తప్పకుండా సార్.. ప్రెసెంట్ ప్రాజెక్టు గురించే   చెబుతాము అని విశి కి హిట్ ఇస్తుంది..

విశి చెప్పడం స్టార్ట్ చేయగానే..  గౌతమ్ ఫోన్ రింగ్ అవుతుంది.  విక్రమ్ కోపంగా చూస్తాడు. శ్రీ వెంటనే ఇలాంటి మీటింగ్స్ లో ఫోన్ సైలెంట్ లో పెట్టుకోవాలి అన్న విషయం కూడా తెలియదా..

ఆనంద్ అనగానే...  ఎస్ ఆర్ అని ఇద్దరు ఫోన్స్ తీసుకుని... గౌతమ్ దగ్గరకు వచ్చి సైలెంట్ లో పెట్టండి అని ఇస్తాడు
దానికి కన్న ఏరోప్లేన్ మోడ్ లో పెట్టండి.  అది అయితే ఇంకా ప్రాబ్లం ఉండదు అనగానే.. సార్ అని గౌతమ్ బిక్క మొహం వేస్తాడు.

ప్లీజ్ కానివ్వండి..  గౌతమ్.. 

సైలెంట్ లో పెడితే సరిపోతుంది కదా సార్..  ఇక్కడ నువ్వు డిసైడ్ చేస్తే మేము వినడం కాదు. మేము డిసైడ్ చేస్తే నువ్వు వినాలి.

క్యారీ ఆన్ అనగానే ఇక తప్పక గౌతమ్ అతి తెలివితేటలు చూపిస్తూ గౌతమ్ ఫోన్ లో ఏరోప్లేన్ మోడ్ లో పెట్టి..  హిమ ఫోన్ సైలెంట్ లో పెట్టి ఇస్తాడు.

హలో మిస్టర్ గౌతమ్ అనగానే చూసుకోలేదు అని ఏరోప్లేన్ మోడ్ లో పెడతాడు రెండు ఫోన్స్ దూరంగా పెట్టగానే విశి చెబుతున్న  వాయిస్ ఏమీ రాక హిమకి ఏం చెప్పాలో తెలియక టెన్షన్ పడుతూ ఉంటుంది.

చెప్పండి మిస్ అనగానే... గౌతమ్ వైపు చూస్తుంది.  గౌతమ్ తల పట్టుకుంటాడు.  అటు పక్కనుంచి విశి ఎంత చెప్పడానికి ట్రై చేస్తున్నా సిగ్నల్స్ దొరకవు.

ఏమయింది వీళ్ళకి సడన్ గా..  నాకెందుకులే...  నాకు ఇచ్చిన టైం వరకు ఆన్లైన్ లో ఉంటాను. తర్వాత వాళ్ళ ఇష్టం..

ఫోన్ ఆన్ లోనే ఉంచి వర్క్ చేసుకుంటూ ఉంటుంది
శ్రీకర్ వచ్చి ఏమైంది.. ఏమో సార్ వాళ్ళు  సడన్ గా రెస్పాండ్ అవ్వడం లేదు.

నాకిచ్చిన టైం వరకు వెయిట్ చేస్తాను. తర్వాత మనకు సంబంధం లేదు..

హిమ  స్క్రీన్ వైపు..  గౌతమ్ వైపు చూస్తూ ఉంటే... ఏంటి మిస్ ఏమీ చెప్పరేంటి... ఇందాక టైం పంచువాలిటీ  గురించి మా ఆనంద్ కేదో చెప్పినట్టున్నారు..  ఇప్పుడేంటి మా టైం వేస్ట్ చేస్తున్నారు.

అది సార్..  ఇంతకీ మీకు తెలుసా లేక మా ముందు.. నో సర్ ఇవంతా నేను డిజైన్ చేసినదే..   మరి ఇంకేంటి నీ వర్క్ మీరు చెప్పలేకపోతున్నారు.

మీలాంటి పెద్ద వాళ్ళని చూసేటప్పటికి కొంచెం నేర్వోస్ గా అనిపిస్తుంది.  ఇంకొక రోజు ప్లాన్ చేసుకుందామా అని భయంగా అడుగుతుంది.

వాట్ మిస్టర్ గౌతమ్..  నీ అర్క్ టెక్చర్ బిహేవియర్ ఇలాగుంది మీరు మాతో కొలాబరేట్ అవ్వడానికి ఎన్ని నెలలు నుంచి ట్రై చేస్తే ఇప్పటికీ మీకు ఛాన్స్ వచ్చింది.

మళ్ళీ అంటే ఏమో చెప్పలేం అని కమాన్.. శ్రీ బయలుదేరదాం..  ప్లీజ్ సార్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము.

హిమ టెన్షన్ పడకు.. స్క్రీన్ మీద చూసి ఎక్స్ప్లెయిన్ చెయ్.. ఓకే ఓకే అని స్క్రీన్ వైపు చూస్తుంది. అక్కడ కనిపిస్తున్న డిజైన్ చూసి హిమకి ఎక్కడ స్టార్ట్ చేయాలో అర్థం కాదు..

ఏదైతే అది అయ్యింది ఎక్కడో ఒకచోట స్టార్ట్ చేద్దాము అని..  డిజైన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది.  సార్ ఇది మొత్తం ఫైవ్ ఫ్లోర్ బిల్డింగ్.

ఇక్కడ సెల్లార్ పార్కింగ్ వస్తుంది. ఫస్ట్ టూ ఫ్లోర్స్ కమర్షియల్ బ్లాక్స్ సెట్ చేసాము.   పైన రెస్టారెంట్స్.. బెస్ట్ ఎమినిటీస్ తో పాటు పార్టీస్ చేసుకునేటట్టుగా డిజైన్ చేశాము అని చెప్పి ఓకేనా అని గౌతమ్ వైపు చూస్తుంది.

గౌతమ్ కి అర్థమైపోతుంది.  ఈ ప్రాజెక్టు వచ్చినట్టే అని.. ఏమీ మాట్లాడలేక చూస్తాడు. శ్రీ వెంటనే.. టెర్రస్ పైన మాకు స్విమ్మింగ్ పూల్ కూడా కావాలి.

ఇక్కడ అరేంజ్ చేస్తున్నాము  పైన చూపిస్తుంది.  అంత పైకి  వాటర్ ఎలా వెళతాయి అని అడిగితే.. ఏముంది సార్..  డ్రమ్స్ తో  వాటర్ పైకి తీసుకెళ్లి.. ఫిల్ చేస్తారు.

అంతే గౌతమ్ కి ఫ్యూస్ లు ఎగిరిపోయి లోపల నుంచి కాలిపోతున్న వాసన బయటికి కొడుతూ ఉంటుంది. హిమ టాలెంట్ కి.. మిగిలిన వాళ్ళకి వస్తున్న నువ్వునీ కష్టంగా ఆపుకుంటారు.

విక్రమ్..  మిస్ మీరు బాగా టాలెంటెడ్ అనుకుంటా...   విక్రమ్ పొగడగానే ఆకాశంలో తేలిపోతూ ఉంటుంది. ఆ పొగడ్తలో ఉన్న వెటకారం గౌతమ్ కి అర్థమవుతుంది..

మాకు ఈ ప్రాజెక్టులో ఇంకొక బెస్ట్ ఆప్షన్ కూడా కావాలి.  చెప్పండి సార్.. ఏదైనా సరే చిట్టుక్కున చేసేస్తాను. కొంతమంది కస్టమర్స్ కి సెల్లార్లో, ఫస్ట్ ఫ్లోర్ లోను స్విమ్మింగ్ పూల్ కావాలి అంటారు.

వాటర్ తో అక్కడ ఎంజాయ్ చేస్తాము అని..  అప్పుడు ఈ ప్లాన్ లో ఏమైనా మార్పు చేయగలరా..  గౌతమ్ కంగారుగా సార్ మేము ఆలోచించి డిజైన్ చేసి ఇస్తాము..

దీనికి ఆలోచించాల్సిన అవసరం ఏముంది గౌతమ్..  నేను చెబుతాను కదా అని ఈ ప్లేస్ లో పెట్టొచ్చు అని ఒక చోట మార్క్ చేసి చూపిస్తుంది.

అక్కడ ఎలా కుదురుతుంది మిస్.. అక్కడ పిల్లర్స్ ఉన్నాయి కదా.. ఏముంది సార్.. ఈ పిల్లర్స్ తీసి పక్కనపెట్టి ఇక్కడ స్విమ్మింగ్ ఫుల్ సెట్ చేస్తే సరిపోతుంది.

సేమ్ అలాగే ఫస్ట్ ఫ్లోర్లో కూడా అలా చేయడమే అనగానే..  గౌతమ్ తల పట్టుకుంటాడు. అయిపోయింది ఈరోజుతో నా కెరియర్ మొత్తం క్లోజ్ అయిపోయింది.

ఈ తింగరిది చెప్పినా విధానానికి విక్రమ్ సార్ కి అర్థమైపోయిఉంటుంది. ఈ ప్రాజెక్టు చేసింది హిమ కాదు అని.. ఇప్పుడు ఆ పాయింట్ అడిగితే నేను ఏం చెప్పాలి.

ఓరి భగవంతుడా...  దీనికి ఎన్నిసార్లు చెప్పాను.. ఏమైనా జరగొచ్చు.. విశి తో ఒక్కసారి ప్రాజెక్టు గురించి మాట్లాడుఅంటే లెక్క చేయలేదు.

బ్యూటీ మీద పెట్టిన ఫోకస్ ప్రాజెక్ట్ మీద పెట్టలేదు...  వాట్ మిస్టర్ గౌతమ్ ఇదేనా మీ ప్రాజెక్ట్ ఎక్స్ప్లనేషన్ అని విక్రమ్ కోపంగా అడుగుతాడు.

అది సార్.. ఈ మిస్ మీ కంపెనీలో చాలా బెస్ట్అర్క్ టెక్చర్ అని చెప్పారు. అంటే మిగిలిన వాళ్ళు వర్కింగ్ ఎంత వరెస్ట్ గా ఉంటుందో..

ఇలాంటి ప్రాజెక్ట్ పుచ్చుకొని మా దగ్గరికి వచ్చారా..  మిస్టర్ ఆనంద్ అనగానే.. చెప్పండి సార్..  స్టాల్స్  ఈ అమ్మాయే కదా పెట్టింది.

బాగా ఎక్స్పోజ్ చేసింది.  అవార్డ్స్ వచ్చాయి. వరల్డ్ వైడ్ బ్లా.. బ్లా..  అని చెప్పారు. పిల్లర్స్ తీస్తే ఏం జరుగుతుందో కూడా తెలియని అమ్మాయికి అవార్డ్స్ ఎలా వచ్చాయి..  సంథింగ్ ఫిషీ..

అసలు ఏం జరిగిందో అన్నది ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి నాకు సబ్మిట్ చేయండి. వీళ్ళు గనక నన్ను చీట్ చేయడానికి ట్రై చేశారని తెలిస్తే మాత్రం..

గౌతమ్ వైపు ఫింగర్ చూపిస్తూ నీ కంపెనీ మీద నువ్వు హోప్స్ వదిలేసుకో...  రోడ్డు మీదకు తీసుకోవచ్చేస్తాను. నాకు మోసం అన్న...  అబద్ధం అన్నా పరమ చిరాకు.

కమాన్ శ్రీ అని విక్రమ్ కోపంగా వెళ్ళిపోతాడు. ఏమైంది గౌతమ్ నేను బాగానే చెప్పాను కదా అని హిమ వస్తే.. అది చెప్పడం అంటారా..

పిల్లర్స్ లేకపోతే బిల్డింగ్ ఏమవుతుంది అన్నది చిన్నపిల్లల కైనా తెలుస్తుంది.. అలాంటిది  నీకు తెలియలేదా..  న్యూ టెక్నాలజీతో కన్స్ట్రక్ట్ చేస్తాము.

టెక్నాలజీని వాడుకోవాలి.   పిల్లర్స్ లేకుండా బిల్డింగ్ కట్టే టెక్నాలజీ రాలేదు.  వచ్చినప్పుడు నువ్వు సెపరేట్గా కట్టు..

ఈసారి ప్రిపేర్ అయి వద్దాము..  నీకు మళ్ళీ ఛాన్స్ ఇస్తారని అనుకుంటున్నావా.. ఇన్వెస్టిగేషన్ చేయించమంటున్నారు.

అది చేస్తే కనుక మనం చేసిన ఫ్రాడ్ బయట పడుతుంది.. అప్పుడు మన పరిస్థితి ఏమిటో నీకు అర్థం అవుతుందా.. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశావు కదా..  పిల్లర్స్ లేకపోతే ఏమవుతుంది అన్నది కూడా నీకు తెలియదా..

ఏమో.. నేను ఏ రోజు కాలేజీకి వెళ్లాను.. సర్టిఫికెట్ కొనడమే కదా.. ఫస్ట్ నుంచి నీకు చెబుతున్నాను. ఈ కంపెనీకి వస్తున్నాము అంటే మనం ప్రొఫెషనల్ గా ఉండాలి..

అట్లీస్ట్ మినిమం అయినా తెలుసుకోవాలి అని..  కానీ నువ్వు ఏం చేసావో తెలుసా నన్ను నడిరోడ్డు మీదకు తీసుకువస్తున్నావు.

కమాన్ గౌతమ్.. ప్రతిదాన్ని భూతద్దంలో చూసి నాతో ఆర్గ్యు చేయకు. ఇది చాలా సింపుల్ ప్రాబ్లం. ఈ కంపెనీ లేకపోతే మనకి ఇంకా ఏ కంపెనీలు లేవా ఏమిటి..

విక్రమ్ సార్ తో పెట్టుకుంటే ఏమవుతుందో వెళ్లి మీ నాన్న ని అడుగు అని సీరియస్ గా బయటికి వెళ్లిపోతాడు. హే గౌతమ్ ఆగు నేను వస్తున్నా అని వెనకాలే వెళుతుంది.

కానీ అప్పటికే గౌతమ్ వెళ్ళిపోతాడు. ఛ.. వీడు ఇలా చేసాడు ఏంటి.. నిజంగా నేను అంత పెద్ద మిస్టేక్ చేశానా.. నా టాలెంట్ వీళ్ళకి అర్థం కాలేదా లేక నన్ను రీచ్ అవ్వలేకపోతున్నారా...

నిన్నే రీచ్ అవ్వలేకపోతున్నారు. ఎవరు అని చూస్తుంది.. ఐ యాం సూర్య సన్నాఫ్ విక్రమ్..  సూర్య ని చూడగానే ఫ్లాట్ అయిపోతుంది.

ఆరడుగుల అందగాడు..  షార్ప్ లుక్ తో విక్రమ్ కి ప్రింట్ లాగా కనిపిస్తాడు.  నిన్ను చూస్తూ ఉంటే  విక్రమ్ సార్ కి జిరాక్స్ కాపీ లాగా ఉన్నావు. సో హ్యాండ్సం..

థాంక్యూ మిస్ బ్యూటీ.. ఇలా పబ్లిక్ లో మాట్లాడడం కరెక్ట్ కాదు.. మనిద్దరం  క్యాబిన్ లో కూర్చుని మాట్లాడుకుందాం..

తప్పకుండా సూర్య అని తిప్పుకుంటూ వెళుతుంది..

సూర్య ప్లాన్...

కథ కొనసాగుతుంది......
[+] 8 users Like SivaSai's post
Like Reply




Users browsing this thread: