Posts: 898
Threads: 13
Likes Received: 7,010 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
12-04-2026, 07:50 AM
(This post was last modified: 12-04-2026, 07:51 AM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
బృందావనం - 78
దేవేంద్ర అన్నంత పని చేస్తాడు అన్న భయంతో శేషాద్రి నిజం చెబుతాడు.. ఆ మాట వినగానే అనసూయ అక్కడే కుప్పకూలిపోతుంది.
ఏమంటున్నవురా నువ్వు.. ఊరికినే భయపెడుతున్నాం అన్నారు కదా.. అది అత్తయ్య అని నీళ్లునములుతూ ఉంటాడు.
నువ్వు అసలు ఆడదానివేనా... కడుపుతో ఉన్న పిల్లని అలా లాక్కొని వెళుతూ ఉం..టే భయపెడుతున్నారు అనుకున్నావా..
లహరికి ఏదైనా జరిగింది అంటే మన భార్యాభర్తల బంధం కూడా ఇంకా అంతే.. ముందు అమ్మాయిని వెతకుదాం పదండి అని తండ్రి కొడుకులు ముగ్గురు బయలుదేరతారు.
అనసూయకి టెన్షన్ తో బీపీ డౌన్ అవుతుంది . ఈ విషయం తెలిసిన చారులత కూడా స్పీడ్ గా ఇంటికి వస్తుంది.
డాక్టర్ వచ్చి మెడిసిన్ ఇచ్చి వెళతాడు. కౌసల్య కూడా కొడుకుని తీసుకుని ఇంటికి వచ్చేస్తుంది. అందరూ టెన్షన్ గా లహరి కోసం చూస్తూ ఉంటారు.
లహరి తల్లిదండ్రులు ఏకధాటిగా ఏడుస్తూనే ఉంటారు. ఎంత బ్రతిమాలిన ఆ ఇంట పచ్చిగంగా కూడా ముట్టుకోరు. అనసూయ సిగ్గుతో చచ్చిపోతూ ఉంటుంది.
చారులత తల్లిని కోపంగా చూస్తూ ఉంటుంది. కౌసల్య కోడలు అవడం వలన ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది.
అందరి దృష్టిలో అనసూయ దోషిగా మిగిలిపోయింది. శేషాద్రి చెప్పిన గుర్తులను పట్టుకుని హాస్పిటల్ కి చేరుకుంటారు.
డాక్టర్ దగ్గరికి వెళ్లి అడిగితే.. ఎవరూ ఏమిటి అని వివరాలు అడిగితే.. దేవేంద్ర మొత్తం చెప్పి నా భార్య ఎక్కడ ఎలా ఉంది..
ఒక నిట్టూర్పు విడిచి.. రండి సార్ అని మార్చురీ రూమ్ కి తీసుకువెళ్లి లహరి డెడ్ బాడీని చూపిస్తుంది. అది చూడగానే దేవేంద్ర అక్కడే కుప్ప కూలిపోతాడు.
జితేంద్ర మరిపుట్టిన బిడ్డ అనే అడిగితే... ఆడపిల్ల పుట్టింది. ఎక్కడ ఉంది పాప అని ఆత్రంగా అడుగుతారు. రాత్రి వచ్చిన రౌడీల నుంచి కాపాడడానికి హాస్పిటల్లో అడ్మిట్ చేసిన ఆవిడ.. పాపని తీసుకుని వెళ్ళిపోయారు.
ఎక్కడికి వెళ్లారో ఏమిటో అన్నది నాకు తెలియదు. అసలు ఆవిడ ఎవరో కూడా ఐడియా లేదు. దేవేంద్ర రాయిలాగా ఉండిపోతాడు.
రాఘవేంద్ర కూడా ఏమీ మాట్లాడలేకపోతాడు. భార్య చేసిన పనివల్ల ఒక పచ్చి బాలింతరాలుప్రాణాలు పోగొట్టుకుంది.
పుట్టిన బిడ్డ ఎక్కడ ఉందో తెలియదు. ఆ ఇంట పుట్టిన మహాలక్ష్మి ఎవరింట పెరుగుతుందో తెలియక నలిగిపోతాడు.
జితేంద్ర అన్ని ఫార్మాలిటీస్ పూర్తిచేసి.. లహరి డెడ్ బాడీ ని తీసుకుని దేవేంద్రని కష్టంగా ఇంటికి తీసుకువెళతాడు. వస్తున్న కారును చూసి... సర్వెంట్స్ లోపలికి వెళ్లి చెబుతారు.
అందరూ కంగారుగా బయటకు పరిగెత్తుకోస్తారు. జీవం లేని కొడుకు ని చూస్తూ ఉంటే.. అనసూయ కి చాలా భయంగా అనిపిస్తుంది.
వెనకాలే వచ్చినా అంబులెన్స్ చూడగానే ఇంకా భయం పెరిగిపోతుంది. అందులోనుంచి లహరి డెడ్ బాడీని దింపగానే... లహరి తల్లిదండ్రులు అక్కడే కుప్పకూలిపోతారు.
అనసూయ ఏడుస్తూ లహరి దగ్గరికి వెళ్లబోతుంటే రాఘవేంద్ర గట్టిగా అరుస్తాడు.
ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఆ దేవతని తాకడానికి వీలు లేదు. అంతేకాదు ఈరోజు నుంచి నువ్వు నాతో మాట్లాడడానికి గాని.. ఈ ఇంటి పెద్దగా ఉండడానికి గాని వీలు లేదు.
సమాజం కొరకు మాత్రమే నువ్వు నా భార్యగా ఉంటావు. అది కాదండి నేను చెప్పేది వినండి అని భర్తని ప్రాధేయపడుతూ ఉంటే...
ఏమి చెబుతావు. అదిగో అక్కడ ఏడుస్తున్నారే ఆ తల్లిదండ్రులకి సమాధానం చెప్పు.. సర్వం కోల్పోయిన నీ కొడుకుకి చెప్పు.
పురిట్లోనే బిడ్డను కనీ చనిపోయిన మహా ఇల్లాలికి చెప్పు. పుట్టిన మహాలక్ష్మి ఎక్కడ ఉందో తెలియక విలువిల్లాడుతున్నాము.. ఆ మహాలక్ష్మి కి వెళ్లి చెప్పు.
చారులత వచ్చి ఏమంటున్నారు నాన్నగారు.. అమ్మాయి పుట్టిందా.. అవునురా బంగారు తల్లి పుట్టింది కానీ మనం ఎంత దురదృష్టవంతులం అంటే...ఆ చిట్టితల్లిని చూసుకునే భాగ్యం లేదు.
దీనికంతటికీ కారణం మీ అమ్మే.. పుట్టింటి పైనున్న మమకారంతో ఒక నిండు గర్భిణీని చంపేసింది. అనసూయ చెవులు మూసుకుంటూ.. నేను అంత పాపాత్మురాలిని కాదు.
మన ఇంటి పరువు ప్రతిష్టల కోసం అంటే... ఇంకా నువ్వు మాట్లాడకు. నీ నోటి నుండి ఒక మాట వచ్చిన మరుక్షణం నా శవం కూడా వెళుతుంది.
లక్ష్మీ, జ్యోతి కూడా వస్తారు. భర్త చేసిన ఘాతుకానికి లక్ష్మి సిగ్గుతో చచ్చిపోతూ ఉంటుంది. అనసూయ దగ్గరకి వెళ్లి.. మీ తమ్ముడు ఎలాంటి వాడో తెలిసి కూడా ఎలా ఆయన మాయలో పడ్డారు.
మీ కొడుకు జీవితాన్ని మీ చేతులతోనే నాశనం చేశారు కదా వదిన అని ఏడుస్తుంది.
అందరూ గోల మధ్యన లహరి తండ్రి వచ్చి నా కూతురిని నా ఇంటికి తీసుకువెళతాను. అన్ని కార్యక్రమాలు నేనే చేసుకుంటాను.
దానికి రాఘవేంద్ర చేతులు జోడించి.. మమ్మల్ని క్షమించండి బావగారు. మీకు ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయాను.
మొదటిసారిగా నా జీవితంలో మాట తప్పాను. మీకు చెప్పే అంతటి వాడిని కాను. మీరు మహాజ్ఞాని. అన్ని తెలిసిన సర్వజ్ఞులు. ఒక్కసారి నా కొడుకుని చూడండి.
లహరి సంగతి తెలిసినప్పటి నుంచి వాడీలో ప్రాణం లేదు. అలాగా రాయిలాగా ఉండిపోయాడు. మీరు ఇప్పుడు ఇలా తీసుకువెళితే అని కన్నీళ్లు పెట్టుకుంటారు .
మిగిలిన పెద్దవాళ్లు కూడా పుణ్యస్త్రీకి భర్త చేతుల మీద చేస్తేనే మంచిది. అర్థం చేసుకోండి అని నచ్చచెప్పి దేవేంద్ర చేతులు మీదేగానే అన్ని జరిపిస్తారు.
లహరి దహనపరిచిన ఆ స్థలంలోనే ఒక మందిరం కట్టి చుట్టూ పూల మొక్కలు.. పండ్లు మొక్కలు పెంచుతూ ఒక దేవలయం లాగా చేస్తాడు..ప్రతిరోజు వెళ్లి అక్కడే గడుపుతూ ఉంటాడు.
ఇదమ్మా నా కథ అని దేవేంద్ర చెబుతాడు. అదంతా విన్న శాంభవి ఏడుస్తుంది. ఇంత బాధని ఎలా భరించారు అంకుల్.
మీకు చాలా పలుకుబడి ఉంది కదా... మీ అమ్మాయిని కనిపెట్టి తీసుకు రాలేకపోయారా అంటే ఆ మాటకి విరక్తిగా నవ్వుతూ...
నా భార్య దశదినకర్మలు అయిన తరువాత.. మాకు సంబంధించిన ఎక్కడా కూడా దీపం వెలగలేదు.
ఎవరు వెలిగించిన వెలగలేదు. అది ఆఫీస్ అయినా.. ఇంటిదగ్గరైనా.. ఎక్కడైనా సరే మాకు సంబంధించిన ప్రతి చోటా కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యింది.
నేను ఏమీ పట్టించుకునే స్థితిలో లేను. ఏమి జరుగుతుందో అర్థం కాక నాన్నగారు శ్రీశైలం వెళ్లి గురువుగారిని కలిశారు అన్నయ్య అప్పటికే పుట్టిన బిడ్డ కోసం వెతికిస్తున్నాడు.
నాన్నగారు వెళ్లి విషయం చెప్పగానే గురువుగారు ధ్యానంలో కూర్చుని జరిగిందంతా చూసి వెంటనే పాపని వెతికించడం ఆపేయండి.
మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా పాప మీకు ఇప్పుడు దొరకదు. అలాగే మీకు సంబంధించిన ఎక్కడా కూడా దీపం అన్నది వెలగదు.
మరి దీనికి పరిష్కారం లేదా గురువుగారు.. అమ్మని ధ్యానిస్తూ ఎదురు చూడవలసిందే.. మీ ఇంటి వారసురాలుతోనే.. మళ్లీ మీకు సంబంధించి ప్రదేశాలలో దీపం వెలుగుతుంది.
నీ కార్యాలయం లో మొదటిగా దీపం వెలుగుతుంది. తర్వాత నీ గృహంలో వెలుగుతుంది. జమీందారీ వంశానికి సంబంధించిన వారసురాలు.. ఎక్కడ పెరుగుతుందో ఎలా పెరుగుతుందో అని భయంగా ఉంది గురువుగారు.
భయపడవలసిన అవసరం లేదు. ఆ పుట్టిన బిడ్డకి అమ్మ రక్షణ కవచంగా ఉంది. అపురూపంగా పెరుగుతుంది. సమయం వచ్చినప్పుడు ఆ బిడ్డ మిమ్మల్ని కలుస్తుంది. జాగ్రత్తగా వెళ్ళండి.
శాంభవి ఆలోచిస్తూ... ఆఫీసుకి వచ్చిన రోజున వెలిగిస్తే వెలిగింది కదా.. అంతకముందే మీ అమ్మాయి వచ్చిందా.. ఇప్పుడు దాకా కనిపించలేదు. ఎక్కడికైనా దూరంగా పంపించారా అని అడుగుతుంది.
రుద్ర లోపలికి రమ్మని ధీరజ్ వాళ్లకి మెసేజ్ చేస్తాడు. దేవేంద్ర... నువ్వు వెలిగించినప్పుడే దీపం వెలిగింది అని చెబుతాడు.
అది ఎలా అని అంటే.. అని వణికిపోతుంది. వెంటనే కూర్చున్న చోటునుంచి లేచి వెనక్కి అడుగులు వేస్తుంది. రుద్ర స్పీడుగా శాంభవి దగ్గరికి వెళతాడు.
నా దగ్గరికి ఎవరు రావద్దు. ఇది అబద్ధం.. మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని గట్టిగా అరుస్తూఉంటుంది.
దేవేంద్రకే దుఃఖం తన్నుకొస్తూఉంటుంది. ఏమిటి నాకు ఈ పరీక్ష. నా కన్నకూతురు ముందే నీ తండ్రిని అని చెప్పుకోవాల్సి వస్తుంది.
కానీ నా కూతురు ఒప్పుకోలేకపోతుంది. ఇంకా ఎన్ని రోజులు నాకి ఈ గడ్డుకాలం.. మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తూ ఉంటాడు.
విహాన్ స్పీడ్ గా వెళ్లి బాబాయ్ అని పట్టుకుంటే నేనింక ఈ బాధని భరించలేకపోతున్నాను రా... నేను ఏ పాపం చేశాను అని నాకు ఇంత శిక్ష.
ఇప్పుడే కదా శాంభవి కి నిజం తెలిసింది కొంచెం ఓపిక పట్టండి.
వెనక్కివెళుతూ.. బయటకి పరుగు పెడుతున్న శాంభవిని రుద్ర గట్టిగా పట్టుకుంటాడు. నన్ను వదులు.. వదులు అని అరుస్తూ ఉంటుంది.
ప్లీజ్ పాప నేను చెప్పేది విను. నా బంగారం కదా.. నా బుజ్జి కదా.. ఇదంతా అబద్ధమని చెప్పండి. నేను భరించలేకపోతున్నాను.
మా నాన్నలకు నేను దూరంగా ఉండలేను. ఇది అబద్దం అని అరుస్తూ స్పృహ తప్పి పడిపోతుంది. వెంటనే శాంభవిని రెండు చేతులతో ఎత్తుకొని ఒరేయ్.. ధీరజ్ కారు తీయరా అని అరుస్తాడు.
ధీరజ్ స్పీడ్ గా వెళ్లి కార్ స్టార్ట్ చేస్తే... శాంభవిని తీసుకుని వెళ్లి వెనక సీటులో కూర్చుంటాడు. కార్ స్పీడుగా వెళ్ళిపోతుంది.
వెనకాల మిగిలిన వాళ్ళు కూడా బయలుదేరి వెళతారు. శాంభవిని హాస్పిటల్ అడ్మిట్ చేస్తే డాక్టర్ చెక్ చేసి కొంచెం సేపటికి స్పృహ వస్తుంది. టెన్షన్ పడకండి అని చెప్పి వెళ్ళిపోతారు.
దేవేంద్ర అక్కడే కూలబడిపోతాడు. మిగిలిన కుటుంబ సభ్యులందరూ కూడా హాస్పిటల్ కి పరిగెత్తుకొనివస్తారు.
జితేంద్ర దేవేంద్ర దగ్గర ఉంటాడు. ఆడవాళ్ళందరూ ఒకచోట నిలబడితే.. రుద్ర కి మాత్రం చాలా టెన్షన్ గా ఉంటుంది.
రుద్రా శాంభవి పక్కనే కూర్చుని ఉంటాడు. శాంభవి కి మెలుకువ వచ్చి చుట్టూ చూస్తూ ఉంటుంది. కదులుతున్న శాంభవిని చూసి రుద్ర చెయ్యి పట్టుకుని ఎలా ఉందిరా అని అడుగుతాడు.
వెంటనే రుద్ర చెయ్యి తోసేసి నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. ఇక్కడ ఉండను..
ప్లీజ్ రా.. నువ్వు స్ట్రెస్ తీసుకోకు.. నీకు ఎలాగా కావాలంటే అలాగే చేద్దాం. ముందు రెస్ట్ తీసుకో...
శాంభవి నిర్ణయం...
కథ కొనసాగుతుంది....
Posts: 4,804
Threads: 9
Likes Received: 3,182 in 2,464 posts
Likes Given: 11,247
Joined: Sep 2019
Reputation:
31
Posts: 1,610
Threads: 2
Likes Received: 952 in 732 posts
Likes Given: 2,133
Joined: May 2019
Reputation:
11
Romaalu nikkaboduchukune update idi..
bagundi ani enni cheppina takkuve.
Shambavi.. inka thana kutumbam ela teeskuntundo choodali!!
Posts: 1,156
Threads: 1
Likes Received: 730 in 473 posts
Likes Given: 10,905
Joined: Jun 2019
Reputation:
2
Very critical phase in the story
Posts: 1,610
Threads: 2
Likes Received: 952 in 732 posts
Likes Given: 2,133
Joined: May 2019
Reputation:
11
12-04-2026, 02:53 PM
(This post was last modified: 12-04-2026, 02:53 PM by ash.enigma. Edited 1 time in total. Edited 1 time in total.)
Shambhavi ki iddaru kaadu.. ikaninchi mugguru nannalu anukunte.. katha sukhantame ga?!!!
Posts: 898
Threads: 13
Likes Received: 7,010 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
Part - 79
నీకు ఎలాగా చేయాలి అనిపిస్తే అలాగే చేద్దాం ప్రస్తుతానికి ఏమీ ఆలోచించకుండా రెస్ట్ తీసుకో అని తలపైన చేయి వేస్తాడు. వెంటనే ముఖాన్ని పక్కకి తిప్పుకుంటుంది.
రుద్రాకీ చాలా బాధగా అనిపిస్తుంది కానీ శాంభవి పరిస్థితి ఏమిటో అన్నది తెలుసు కాబట్టి మౌనంగా బయటికి వచ్చేస్తాడు.
రుద్రాని చూడగానే అందరూ చుట్టుముట్టి ఏరా ఎలా ఉంది.. మాట్లాడుతుందా. ప్రస్తుతం ఎవరు డిస్టర్బ్ చెయ్యొద్దు. తనని ఒంటరిగా వదిలేయండి. కొంత టైం ఇవ్వండి అని దేవేంద్ర పక్కన కూర్చుని మావయ్య అంటాడు.
చెప్పురా అని నిర్లప్తంగా మాట్లాడితే.. ప్లీజ్ మావయ్య నువ్వు ఇలా ఉండకు. ఖచ్చితంగా శాంభవి ఒప్పుకుంటుంది.
ఇప్పటిదాకా ఇలాంటి పరిస్థితి ఎదురవలేదు కదా... అందుకే డైజెస్ట్ అవ్వడం లేదు. నాదేముందర.. వెళ్ళిపోయే వాడిని.
నీ విషయంలో తప్పుగా అనుకోకుండా ఉంటే చాలు. అంత దూరం వెళ్ళదు. వెళ్ళనివ్వను. మీరు ఎక్కువ ఆలోచించకండి. రెస్ట్ తీసుకోండి అని ధీరజ్ వైపు చూస్తాడు.
నేను చూసుకుంటాను బావ అని ప్లీజ్ బాబాయ్ రండి అని బలవంతంగా వేరే రూమ్ కి తీసుకువెళ్లి ఫుడ్ తినిపించడానికి ట్రై చేస్తాడు. ఆకలిగా లేదురా..
మీరు తినకపోతే ఎలా.. అందరిని చూడండి. మీరు డల్ గా ఉండేటప్పటికీ అందరూ మోకాలు కూడా వాడిపోయాయి.
అందరినీ చూస్తాడు. సరే ఇలాగ ఇవ్వు అని చెప్పి తీసుకుని తింటే జితేంద్ర కూడా వచ్చి పక్కన కూర్చుని నాకు ఆకలేస్తుంది.
అన్నయ్య నువ్వు తినలేదా.. నా తమ్ముడి ఇంత బాధలో ఉంటే నేను ఎలా తింటాను రా అని ఇద్దరు కలిసి తింటారు.
చారులతకి ఇదంతా చూసి దుఃఖం తన్నుకొస్తుంది. స్పీడ్ గా బయటకు వెళితే చారు వెనకాలే అద్వైత్ పరిగెత్తుకుంటూ వెళ్లి అత్తయ్య ఎక్కడికి.
ఒరేయ్ కారు తీయరా. ఎక్కడికి అత్తయ్య...నువ్వు తీయరా నేను చెబుతాను అని కార్లో కూర్చుంటుంది.
అద్వైత్ డ్రైవింగ్ ప్లేస్ లో కూర్చుని చూస్తే.. బృందావనానికి పదా.. సరే అని కారు ఇంటికి పోనిస్తాడు.
కారు మెయిన్ గేట్ లోకి ఎంటర్ అయ్యి గుమ్మం ముందు ఆగేలోపే చారులతో స్పీడుగా దిగి అమ్మా అని అరుస్తూ వెళుతుంది.
చారులత అరుపుకి సర్వెంట్స్ కూడా ఉలిక్కిపడతారు. అనసూయ బయటకు వచ్చి ఏమైంది చారు.. అంత కోపంగా ఉన్నావు. అందరూ బాగానే ఉన్నారా అని కంగారుగా అడిగితే...
నువ్వు ఎందుకు అమ్మ కంగారు పడుతున్నావు.
నీకు నీ తమ్ముడు కుటుంబం బాగుంటే చాలు కదా..
ఎవరు ఎలా అయిపోతే నీకేమిటి..
ఏంటి చారు అలా మాట్లాడతావు..మీకన్నా నాకు నా తమ్ముడు ఎక్కువ. అవునో కాదో నీకే తెలుసు. నువ్వు చేసిన ఘాతకానికి చిన్నన్నయ్య ఇప్పటికి బాధపడుతున్నాడు.
కూతురికి దగ్గర కాలేక... దూరం అవ్వలేక నలిగిపోతున్నాడు. ఆ కూతురికి నిజం తెలిసి తట్టుకోలేక పోతుంది.
ఇదంతా ఎవరి వల్ల... నీ వల్ల కాదా.. నేను ఏదీ కావాలని చేయలేదు చారు. ఆరోజు పరిస్థితులు అంటే... ఇంకా ఆపు అమ్మ.
ఇంటి పెద్దగా ఎలాంటి పరిస్థితులైన చక్కబెట్టడం రావాలి. పోనీ నీకు రాకపోతే నాన్నగారి కోసమైనా ఎదురు చూడాలి. ఎవరు మీ తమ్ముడు...
మన ఇంటి విషయంలో వేలు పెట్టడానికి.. పెడితే చెక్కబెట్టాలి. అది మంచికై ఉండాలి. కానీ తన స్వార్థం కోసం మన ఇల్లుని వల్లకాటి చేస్తూ ఉంటే నువ్వు దానికి సై అన్నావు.
ఇప్పుడు చూడు అక్కడ చిన్నన్నయ్య ఎంత నలిగిపోతున్నాడో.. శాంభవి ఎలాంటి పరిస్థితుల్లో ఉందో.. నా కొడుకు భవిష్యత్తు ఏమిటో నీకు ఏమైనా అర్థమవుతుందా..
అయినా నీకు ఇవన్నీ కూడా అవసరం లేదు కదా... అద్వైత్ వచ్చి అత్తయ్య కూల్.. కొంచెం శాంతించు. ఏంట్రా శాంతించేది..
అసలు హాస్పిటల్లో శాంభవి కోలుకునే వరకు అందరు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉన్నాము. కానీ ఈ మనిషి... అమ్మ అని పిలవాలన్నా సరే చిరాకుగా ఉంది అని మళ్ళీ వచ్చిన దారిని వెనక్కి వెళ్ళిపోతు రా అని అరుస్తుంది.
వస్తున్నాను అత్తయ్య అని అద్వైత్ కూడా పరుగు పెడతాడు.
అనసూయ కంగారుగా పనిమనిషి కాంతాన్ని పిలిచి నా మనవరాలకు ఏమైంది. తెలియదమ్మ గారు. మనం హాస్పిటల్ కి వెళ్దాం పద..
ఇప్పుడు మీరు అక్కడికి వెళ్లడం అవసరమా అమ్మ.. వెళ్ళాలి నా మనవరాలు హాస్పటల్లో ఉంది. ఎవరు ఏమన్నా పరవాలేదు.
డ్రైవర్ ని కారు తీయమను. అలాగే అమ్మగారు అని డ్రైవర్ ని పిలిచి చెబుతుంది. వెంటనే అనసూయ హాస్పిటల్ కి బయలుదేరుతుంది.
అద్వైత్ కార్ లో కూర్చుని ఇప్పుడు ఎటు వెళ్దాము..ఆ పాములోడింటికి.. పాములోడ.. అలాంటి వాళ్లు నాకు ఎవరో తెలియదు అత్తయ్య.
తల మీద ఒక్కటి వేసి ఆ నాగేంద్ర ఇంటికి. వాడి పేరుని ఇలా మార్చావా.. నువ్వు సూపర్ అత్తయ్య అని కార్ స్టార్ట్ చేస్తాడు.
ఇంకా కోపంగానే ఉంటే కొంచెం శాంతించు అత్తయ్య. నువ్వు కోపంలో మరీ ఆకాశాన్ని అంటుతున్నావు. ఎప్పుడూ ఇంత కోపాన్ని చూడలేదు.
ఇది కోపం కాదు రా... బాధ. ఈ బాధ తీరక వస్తున్న ఆవేశం. ముందు వాడినేసేసి.. వాడి కూతురుని ఉప్పు పాత్ర వేసేస్తే గాని నాకు ఈ బాధ తీరదు.
కారు డైరెక్ట్ గా నాగేంద్ర ఇంటి ముందు ఆగుతుంది. వాచ్మెన్ ఎవరిని కలవాలి అంటే....ఆ పాములోడు ఉన్నాడా అని ఛీ... ఛీ.. నాగేంద్ర ఉన్నాడా అని అడుగుతాడు.
ఇంట్లోనే ఉన్నారు. సరే నేను వచ్చానని చెప్పు అని చారులత అంటుంది..నేను అంటే ఏమని చెప్పాలి మేడం. బృందావనం నుంచి వచ్చాము అను... అర్థమవుతుంది లే.
సరే అని స్పీడ్ గా లోపలకి వెళ్లి చెబితే... నాగేంద్ర ఆశ్చర్యంగా ఆ ఇంటి నుంచి మన ఇంటికి వచ్చారా.. రమ్మను అని కూతుర్ని చూస్తాడు.
మయూరి కూడా సైలెంట్ గా ఉంటుంది. లోపలికి వచ్చి స్పీడ్ గా వెళ్లి మయూరి రెక్క పట్టుకుని లేపి ఆచెంప ఈ చెంప వాయించుతుంది.
నాగేంద్ర కోపంగా చారులత అని అరుస్తాడు. ఏయ్.. అరవకు. నేను అసలే తిక్కలో ఉన్నాను. ఆ తిక్క పెరిగితే పెద్దవాడివి అని కూడా చూడకుండా నిన్ను వాయించేస్తాను.
మయూరి చెంప పైన చెయ్యి పెట్టుకుని చారు వైపు చూస్తుంది. ఏంటే ఆ చూపు నిన్ను.. ఆ రోజే వేసేసి ఉంటే..
మా కుటుంబానికి పట్టిన శని వదిలిపోయేది..
నువ్వు, మీ బాబు మాకు రాబందుల కన్నా దారుణంగా తగిలారు. ఇంతకీ మీ అమ్మ ఎక్కడ అని... అత్తయ్య అని అరుస్తుంది.
సర్వెంట్ ముందుకొచ్చి అమ్మగారు ఇక్కడ ఉండడం లేదు. కొడుకు దగ్గరికి వెళ్లిపోయారు. పెద్దఅమ్మాయిగారు కూడా వచ్చారు. అక్కడే ఉన్నారు.
ఈ దరిద్రులతో కలిసి ఉండటం కన్నా విడిగా ఉండటమే నయమనుకున్నట్టుంది. నాగేంద్ర వైపు చూసి ఒరేయ్ పాములోడా అంటుంది.
నాగేంద్ర చుట్టూ చూస్తూ ఇక్కడకి పాములు వచ్చాయా అంటే... నువ్వు ఉండగ ఇంకొక కొత్త పాము ఎందుకు... నిన్నేరా నేను పిలిచింది.
చారు పిలుపుకి మయూరి నాగేంద్ర కరెంట్ షాక్ తిన్నా కాకులు లాగ చూస్తూ ఉంటే.. ఏంట్రా చూపు నాకు తిక్క రేగింది అంటే.... ఆ కనుగుడ్లు పీకే గోలీల ఆడుకుంటాను.
ఇప్పటికే చాలా ఓపికగా ఉన్నాను. అద్వైత్ చారు వంక చూసి ఇది ఓపిక... మా అత్త దృష్టిలోకి కోపం వస్తే అమ్మో ఒక ప్రళయమేనా అని వీపు మీద చేతులతో తట్టుకుంటాడు.
ఇంతకీ నువ్వు వచ్చిన సంగతేమిటో చెప్పు అని గంభీరంగా అంటాడు. ఇంకొకసారి నువ్వు గాని.. నీ కూతురు గాని మా ఇంటి వైపు చూసినా... మా అన్నయ్యని తలుచుకున్న నేనే ఎక్కడున్న వాళ్ళని అక్కడే గొయ్యి తీసి కప్పేట్టేస్తాను.
అది చంపాక అనుకుంటున్నారేమో.. కాదు ప్రాణంతోనే... కప్పెట్టేస్తాను. లోపల గాలి ఆడక... చెమటలు పట్టి ఉక్కిరిబిక్కిరి అయ్యి గిలగిలా కొట్టుకుని చస్తారు.
అర్థమయిందా .. పదరా ఇంకా కాసేపు ఇక్కడే ఉంటే నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది అని వెళ్ళిపోతుంది. చారు వెనకాల అద్వైత్ కూడా వెళ్లి ఇప్పుడు ఎక్కడికి అత్తయ్య..
హాస్పిటల్ కి. సరే అని కార్ హాస్పిటల్ కి పోనిస్తాడు. మయూరి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే తీసుకుని లిఫ్ట్ చేసి హలో అంటుంది.
అటు నుంచి చెప్పినది విని సరే అని పెట్టేసి తండ్రి వైపు చూస్తుంది. ఏమైందిరా... దేవేంద్ర కూతురు ఎవరో తెలిసింది.
ఏంటి.. ఎవరు.. శాంభవి. ఆ మాటకి గట్టిగా పులమారుతూ ఉంటే సర్వెంట్ వాటర్ తెచ్చి ఇస్తుంది. అది తాగి ఏం మాట్లాడుతున్నావు.
నిజమే చెబుతున్నాను. వీళ్ళకి శాంభవి ఎవరో ముందే తెలుసు అన్నమాట. అందుకే ప్లాన్ చేసి మరీ పెళ్లి చేసుకున్నాడు.
మనల్ని నిషా, ఆశ వంకన లాక్ చేశాడు. ఇప్పుడు ఏం చేద్దాం. మయూరి సమాధానం చెప్పకుండా గదిలోకి వెళ్లి తలుపేసుకుంటుంది.
ఇంక గదిలోకి వెళితే బయటికి రాదు అని అర్థమై నాగేంద్ర కూడా సైలెంట్ అవుతాడు.
అనసూయ హాస్పిటల్ కి వెళ్లి శాంభవి దగ్గరికి వెళ్ళబోతుంటే.. రాఘవేంద్ర ఆగు అని అరుస్తాడు. అది కాదండి అంటే.. అసలు నిన్ను ఇక్కడికి ఎవరూ రమ్మన్నారు.
నీలాంటి దాన్ని ముఖం చూడడమే మహాపాపం. అలాంటిది నువ్వు నా మనవరాల్ని పలకరించడానికి వచ్చావా.. ఎంత ధైర్యం నీకు...
మీకే నా మనవరాలు. నాకు కూడా మనవరాలే... నాకు ఉండదా ఆ పాసం. గట్టిగా నవ్వుతారు. ఎందుకండీ అలా నవ్వుతున్నారు.
నువ్వు చెబుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నాయి. నీకు ప్రేమ ఉందా.. అలాగే ఉండి ఉంటే లహరి ని నిండు గర్భిణీ అని కూడా చూడకుండా బయటికి గెంటేస్తూ ఉంటే చోద్యం చూస్తూ ఉంటావా...
ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదు. అప్పటి పరిస్థితులు అంటే.. ఇంకా ఆపు నువ్వు నా మనవరాలని చూడడానికి వీలు లేదు.
ఇక్కడి నుంచి వెళ్ళు లేకపోతే తర్వాత జరిగే దానికి నువ్వే బాధ్యురాలు అవుతావు.
అనసూయ అడుగు....
Posts: 898
Threads: 13
Likes Received: 7,010 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
Part - 80
నువ్వు ఇక్కడ నుంచి వెళ్లకపోతే తర్వాత జరిగే పరిణామాలు నువ్వే బాధ్యురాలు అవుతావు అర్థమవుతుందా...
ఎందుకండీ ఇన్ని సంవత్సరాలు అయినా సరే మీరు అక్కడే ఆగిపోయారు. మనవరాలు తిరిగి వచ్చింది కదా.. ఇప్పటికైనా క్షమించవచ్చు కదా అని పైట చెంగు నోటికీ అడ్డుపెట్టుకుంటుంది.
మనవరాలు తిరిగివచ్చిందా.. మరి ఇన్ని సంవత్సరాలు మనవరాలు ముద్దు ముచ్చటలు మేము కోల్పోయాము. నా ఇంటి చిన్న కోడలు శాశ్వతంగా దూరమయ్యి నా కొడుకు మోడుగా మిగిలిపోయాడు.
ఇవి ఏమైనా తిరిగి వస్తున్నాయా.. వెళ్ళిపోయిన కాలాన్ని తిరిగి తెచ్చే శక్తి నాకే ఉంటే మీరు కోరినట్టే చేసేదాన్ని. కొన్ని విషయాలకు క్షమాపణఉండదు.
ఇక్కడి నుంచి వెళ్ళిపో. అందరూ చూస్తున్నారు. నా ఇంటి పరువు పోవడం ఇష్టం లేదు. విహాన్ వచ్చి నానమ్మ ప్లీజ్ మీరు ఇంటికి రండి. తర్వాత మాట్లాడుకుందాం.
అది కాదురా...ప్లీజ్ నానమ్మ ఇప్పుడు ఏమి గొడవ చేయకండి. శాంభవి పరిస్థితి ఏమీ బాగోలేదు. ఎవరితోను మాట్లాడడం లేదు.
ఇప్పుడు మీరు కొత్త గొడవ మొదలుపెట్టొద్దు. అర్థం చేసుకోండి. అందరినీ నేనే అర్థం చేసుకుంటున్నాను కానీ నా బాధను మాత్రం ఎవరు అర్థం చేసుకోవడం లేదు.
అనసూయ తిరిగి వెళ్ళిపోతుంది. దారిలో గుడి దగ్గర ఆగి... లోపలకి వెళుతుంది . పరమేశ్వర ఇంకా ఎన్ని రోజులు నాకు ఈ శిక్ష.
గుడిలో ఉన్న లక్ష్మి.. అనసూయని చూసి వదిన అని వెళుతుంది. అనసూయ కన్నీళ్లు తుడుచుకుని నువ్వేంటి ఇక్కడ..
మనశాంతి కోసం గుడికి వచ్చాను. మీరేంటి ఈ టైంలో.. నా పాపనికి.. ఎప్పుడు క్షమాపణ దొరుకుతుందా అని ఆ పరమేశ్వరుని అడగడానికి వచ్చాను.
ఏమైంది వదిన ఏదో బాధలో ఉన్నట్టున్నారు అని చెయ్యి పట్టుకుంటుంది. నా బాధ చెబితే తీరేది కాదు కానీ పంచుకుంటే వేదన తగ్గుతుంది కదా...
నా తమ్ముడిని నమ్మినందుకు నా కుటుంబాన్ని చిన్నభిన్నం చేశాడు. తన కూతురి కోసం... మా పేరు ప్రఖ్యాతలకి ఆశపడి.. నా ఇంటి మహాలక్ష్మిని ఏమి చేస్తున్నా మౌనంగా చూసేటట్టు చేశాడు.
ఇంత చేసి వాడు ఏం బాగుపడ్డాడు. అక్క సంసారాన్ని నాశనం చేసి సుఖపడుతున్నాడా.. వదిన అని బాధగా అంటే..
నీ భర్త గురించి మాట్లాడితే.. నీకు బాధ రావచ్చు కానీ ఇక్కడ నా బాధ చెప్పుకోవడానికి నా.. అన్న వాళ్ళు లేక నేను ఎంత వేదనా అనుభవిస్తున్నానో ఎవరికి తెలుసు.
హ్మ్.. మీరు రాముడు లాంటి భర్తకి దూరమయ్యి బాధపడుతున్నారు. నేను రావణాసురుడు లాంటి భర్తకి దూరంగా జరిగి గుడులు చుట్టూ తిరుగుతున్నాను.
ఏమంటున్నావు లక్ష్మీ. అవును... మీ తమ్ముడిని అంటే... దయచేసి వాడిని తమ్ముడు అని మాట్లాడకు. అదే మా వారిని, మయూరిని ఆ ఇంటిలో వదిలేసి నేను బయటికి వచ్చేసాను.
మరి ఎక్కడుంటున్నావు అని కంగారుగా అడిగితే... నా కొడుకు కోడలు కూడా వచ్చేసారు. ప్రస్తుతానికి వాళ్ల దగ్గరే ఉంటున్నాను.
భర్త ఉండి కూడా కొడుకు దగ్గర ఉంటే లోకవే కదా.. జ్యోతి ఏమైనా అన్నదా.. జ్యోతి అనే కోడలు కాదు. కాకపోతే నాకు నేనే గిరిగీసుకున్నాను.
అందుకే ఎక్కువగా గుడిలోనే కాలక్షేపం చేస్తున్నాను. పెద్దమ్మయి, అల్లుడు కూడా వచ్చారు. వాళ్ళు ఎక్కడున్నారు.
అందరమూ శేషాద్రి దగ్గరే ఉన్నాను. ఆశా, నిషా జీవితం ఎటు వెళుతుందో అర్థం కాక అందరూ తలపట్టుకుని కూర్చున్నారు. రుద్ర నోరు విప్పితే కానీ ఇంటి అల్లుళ్లు బయటికి రారు.
మీ బాధకి కారణం తెలుసుకోవచ్చా వదిన.. ఏమని చెప్పను. నా మనవరాలు హాస్పిటల్ పాలయ్యింది. మనవరాలు అంటే రుద్ర భార్య నా..
అవును శాంభవి రుద్ర భార్యా మాత్రమే కాదు. నా దేవేంద్ర కూతురు కూడా... ఏమంటున్నారు వదిన.. దేవేంద్ర కూతురు దొరికిందా...
ఇంత సంతోషకరమైన విషయాలు ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు...మీరు మాట్లాడారా.. దగ్గరికి తీసుకున్నారా.. శాంభవి చుట్టూ కంచే కాసినట్టుగా కాస్తున్నారు.
నన్ను దరిదాపుల్లోనికి కూడా వెళ్లనివ్వడం లేదు. నేను ఏదైనా హాని తలపడతానేమో అని మీ అన్నయ్య గారే కాపలా కాస్తున్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకా ఏమైనా ఉంటుందా..
బాధపడకండి వదిన. ఖచ్చితంగా అన్నయ్యగారు మిమ్మల్ని క్షమిస్తారు. ఆ చిన్న ఆశతోనే బ్రతుకుతున్నాను.
అద్వైత్, చారు హాస్పిటల్ కి చేరుకుంటారు. ధీరజ్ పక్కన కూర్చొని ఫుల్ కూలింగ్ ఉన్న వాటర్ బాటిల్ తలపై నుంచి పోసుకుంటాడు.
ఏమైందిరా కార్ లోనే వచ్చారు కదా.. అంతా వేడి పుట్టిందా... వామ్మో అత్తయ్య ఇంత ఫైర్ బ్రాండ్ అనుకోలేదు. హడల్ ఎత్తేచ్చిసింది.
ఏం మాట్లాడుతున్నావు .. జరిగింది మొత్తం చెప్పి అందుకే బావ అంతా ఫైర్ బ్రాండ్ లాగా ఉంటాడు. పాపం మావయ్య ఎలా తట్టుకుంటున్నాడో.
ఇప్పటికైనా మీకు నా బాధ అర్థం అయ్యిందా అని సంతోష అంటాడు. నీ పేరులో ఉన్న సంతోష్ నీ దగ్గర లేదా మావయ్య అని బాధగా అంటే.. కొన్ని కొన్ని అలా అడగకూడదు రా.. ఫాలో అయిపోవాలి.
రుద్ర శాంభవి దగ్గరికి వెళ్లి పక్కన కూర్చొని రేయ్ అంటాడు. శాంభవి పలకకపోతే నాకు బ్రతిమాలడం.. తగ్గడం అసలా రాదు. కానీ నీ దగ్గర ఇంత తగ్గుతున్నాను అంటే అర్థం చేసుకో.
నేను మా ఊరు వెళ్ళిపోతాను. మా ఇంటికి వెళ్ళిపోతాను. అస్తమాను అదే పాట పాడుతున్నావు గాని ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవేమిటి అని కొంచెం వాయిస్ రైస్ చేస్తాడు.
శాంభవి కి వెంటనే కన్నీళ్లు జలజల రాలిపోతూ ఉంటాయి. ఉఫ్.. అనుకొని శాంభవి కన్నీళ్లు తుడిచి.. నేను చెప్పేది వినురా... నాకు నీ మీద కోపడాలని లేదు.
అర్థం చేసుకో.. అర్థమయింది కాబట్టే వెళ్ళిపోతాను అంటున్నాను. ఏం అర్థమైంది. నువ్వు నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు.
ఎవరికోసమో నన్ను చేసుకున్నావు. బలవంతంగా ఒక బంధంలో ఉండలేము.. ఇప్పుడు చూడు.. నీకు అనుకూలంగా లేను అని నామీద కోప్పడుతున్నావు. నిజంగా నా మీద ప్రేమ ఉంటే అసలు కోపం ఎందుకు వస్తుంది.
ఏమి లాజిక్ ఏ పాప.. అందుకే నిన్ను పాప అనేది. ప్రేమ ఉన్న చోట కోపం కూడ ఉంటుంది. అబద్ధం.. మా ఇంట్లో ఎవరూ ఇప్పటివరకు నామీద ఒక్కసారి కూడా కోప్పడలేదు.
చిన్నగా కూడా విసుక్కోలేదు. ఓ.. ఇప్పుడు వాళ్లు నా వాళ్లు కాదు కదా.. నేను ఒక అనాధని కదా...
ఏం మాట్లాడుతున్నావ్. కొట్టే నంటే గూబ గుయ్యి మంటుంది. ఇంతమంది నీ చుట్టూ ఉంటే నువ్వు అనాధ అంటావు ఏమిటి...
అనాధ కాక మరి ఏమిటి.. ఇన్ని రోజులు ప్రాణం గా పెంచిన వాళ్ళు నాకు ఏమీ కారు అంటున్నావు. ఏ విధమైన సంబంధంలేని వాళ్ళు నా వాళ్ళు అంటున్నావు.
ఎలా ఒప్పుకోవాలి. నా స్థానంలో నువ్వు ఉండి ఆలోచించు. నీకు నచ్చినది.. ఇష్టం లేనిది చొక్కా అయినా వేసుకోలేవు కదా... అలాంటిది నన్ను... అని ఏడుపు గొంతుతో మాట్లాడుతుంది.
శాంభవి ఏడుపు చూసి రుద్రాకి మనసు మెలిపెట్టినట్టు అవుతుంది. వెంటనే శాంభవిని మంచం మీద నుంచి లేపి గట్టిగా కౌగిలించుకుంటాడు.
ఎవరి కోసమో నిన్ను చేసుకోలేదు. నువ్వంటే నాకు నిజంగానే చాలా ప్రేమ. అత్తయ్య కడుపుతో ఉన్నప్పుడు ఎప్పుడూ అత్తయ్య చుట్టూనే తిరిగావాడేని.
పొట్టలో ఎవరున్నారు అత్తయ్య .. నీ పెళ్ళాం రా జాగ్రత్తగా చూసుకుంటావా. చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. ఎప్పుడు ఆ చిన్న పాపతోనే ఉంటాను ప్రామిస్ అత్తయ్య.
ఎందుకో తెలియదు కానీ... నువ్వు పుట్టిన వెంటనే కనపడకుండా పోవడం అత్తయ్య చనిపోవడం తర్వాత మాట్లాడలేకపోతాడు.
నాలో ఉన్న అల్లరి అంతా వెళ్ళిపోయింది. మౌనంగా,, కోపంగా మారిపోయాను. చదువు బిజినెస్ మన అనుకున్న వాళ్ళ తప్ప బయట ప్రపంచాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయాను.
పెరిగేకొద్దీ ఆ నాగేంద్ర వలన మన ఫ్యామిలీ ఏం కోల్పోయిందో అర్థమైంది..టార్చర్ చేయడం మొదలు పెట్టాను..నీ గురించి వెతకాలి అని చేయని ప్రయత్నం అంటూ లేదు.
నిన్ను తీసుకువచ్చి మావయ్యకి అప్పజెప్పాలి అనుకున్నాను. నువ్వు ఎవరో తెలిసేలోపే... నిన్ను చూసి ప్రేమ లో పడ్డాను.
నువ్వు నా మరదలు వే అని తెలిసిన రోజున నా ఆనందం ఇది అని మాటల్లో చెప్పలేని అనుభూతి. బావల దగ్గర కూడా నేను షేర్ చేసుకోలేదు.
ఎందుకో తెలుసా.. అత్తయ్యతో పాటే నా ఆనందం కూడా వెళ్ళిపోయినట్టు అనిపించింది.. మళ్ళీ నీ రాకతోనే మళ్లీ నా దగ్గరికి వచ్చింది అనిపించింది.
నీతో కూర్చుని కబుర్లు చెప్పాలి.. నీతో అల్లరి చేయాలనిపించేది. అందుకే ఎప్పుడూ నువ్వు నా కళ్ళ ముందే ఉండాలి అని ఏదో ఒక వంకతో లాక్ చేసేవాడిని.
నువ్వు బయట ప్రపంచానికి తెలిస్తే ప్రమాదం అని మావయ్య హేండిల్ చేసేవాడు.
నీ గురించి తెలిసినా రోజునే నువ్వు ఎలా పెరిగావో ఏమిటో అన్నది అందరికీ అర్థం అయింది.. అందుకే ఎవరు నీ ముందు బయటపడలేదు.
ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్పారు అనుకుంటున్నావా... నీ ఉనికి బయట ప్రపంచానికి తెలుస్తుంది..మన శత్రువులు వచ్చి విషయం నీకు చెప్పి నీ మనసుని పొల్యూట్ చేయడం కన్నా ముందు చెప్పితే మంచిది అనిపించింది..
అందుకే నీకు చెప్పాల్సి వచ్చింది..లేకపోతే ఎప్పటికీ నువ్వు భానుప్రసాద్ మావయ్య కూతురుగానే ఉండేదానివి. చిన్న మామ నిన్ను దూరం నుంచి చూసి మురిసిపోయేవాడు.
అలాగే ఉండడానికి కూడా సిద్ధపడ్డాడు. అత్తయ్య దూరమయ్యాక మావయ్య ఒక రాయిలాగా మారిపోయాడు.
ఎవరితోను కలిసేవాడు కాదు. ప్రపంచాన్ని వదిలేశాడు. ఒక పండగ అని.. ఒక ఈవెంట్ అని ఎందులోనూ ఉండేవాడు కాదు.
నువ్వు వచ్చిన తర్వాతే చినమామ ప్రపంచంలోకి వచ్చాడు. నలుగురిలో కూర్చుని నవ్వుతూ మాట్లాడుతున్నాడు.
కేవలం నువ్వున్నచోట మాత్రమే చిన్న మామ ఉంటున్నాడు. నువ్వు లేకపోతే గదిలోకి వెళ్లి అత్తయ్య ఫోటోతోనే కబుర్లు చెబుతూ కాలాన్ని కరిగిస్తాడు.
అత్తయ్య అంటే అంత ప్రేమ.. అర్థం చేసుకోరా.. శాంభవి ముఖాన్ని దోసిట్లోకి తీసుకొని... నీ పైన ప్రేమ ఎంత ఉంది అంటే చూపించలేను.. నాకు కోపం ఎక్కువే ఒప్పుకుంటాను.
కానీ ఆ కోపం కన్నా నీ మీద ప్రేమ ఎక్కువ.
రుద్ర ఫీలింగ్స్ ???
Posts: 898
Threads: 13
Likes Received: 7,010 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
Part - 81
నా జీవితంలో ప్రేమించిన మొట్టమొదటి అమ్మాయివి నువ్వే . నన్ను తిట్టినా.. కొట్టిన.. కోప్పడినా బాధపడను కానీ నా ప్రేమని అనుమానిస్తే తట్టుకోలేను.
నువ్వు నా ప్రాణం. నువ్వు చిన్నపిల్లలాగా అల్లరి చేస్తూ.. నా ముందు తిరిగినా నాకు సంతోషమే. భార్యగా నాకు నువ్వు ఏమీ చేయవలసిన అవసరం లేదు.
ఒక దాసుడిగా నేనే నీకు అన్నీచేస్తాను. ఎవరికోసమో చెప్పడం లేదు. నా కోసం నేనే చెబుతున్నాను. ఇంతకుమించి చెప్పడం ఎలాగో కూడా నాకు తెలియడం లేదు.
శాంభవి మౌనంగా చూస్తూ ఉంటుంది. ఏంట్రా అనగానే... నాకు నిద్ర వస్తుంది. సైలెంట్ గా రుద్ర చేతుల్లో నుంచి విడిపించుకుని పడుకుంటుంది.
ఆలోచించుకోనివ్వాలి అని రుద్ర కూడా సైలెంట్ అయ్యి దుప్పటి కప్పి జో కొడుతూ ఉంటాడు. రుద్రనే చూస్తూ నిద్రలోకి జారుకుంటుంది.
శాంభవి నిద్రపోయిన తర్వాత పక్కనే పడుకొని రెండు చేతులతో శాంభవిని బంధించి నిద్రపోతాడు. ముందురోజు.. నిద్ర లేక.. శాంభవి టెన్షన్ కి... కుదిరిలేని ప్రాణం ఇప్పుడు కాస్త స్థిమిత పడి నిద్రలోకి జారుకుంటాడు.
ఇద్దరినీ అలా చూసిన ధీరజ్ తలుపు దగ్గరికి వేసి శాంభవి పర్వాలేదు. అందరూ ఇంటికి వెళ్లిపోండి. వాడు తీసుకొస్తాడు..
లేదురా శాంభవితోనే వెళదాం అ. తాతగారు ఇప్పటికే మీరు హాస్పిటల్ కి వచ్చి చాలా గంటలు అయ్యింది. ఇలాగే ఉంటే మీ ఆరోగ్యానికి మంచిది కాదు. నా మాట వినండి.
చారు కూడా నచ్చచెప్పి ఇంటికి తీసుకువెళుతుంది. కూతురు దగ్గరే ఉంటాను. ఎక్కడికి రాను.ఇబ్బంది పెట్టొద్దు అని దేవేంద్ర అక్కడే ఉండిపోతాడు.
దేవేంద్రకీ తోడుగా కుర్ర బ్యాచ్ అంతా ఉండిపోతారు. మెలకువ వచ్చిన శాంభవి ఎటు కదలలేకపోతే.. కొంపదీసి నేను ఎటైనా వెళ్ళిపోతాను అని కట్టేశారా ఏమిటి..
వీళ్లు అలాగా చేసినా ఆశ్చర్య పడక్కర్లేదు అని ఎక్కడ కట్టేశారు అని కంగారుగా చూసుకుంటుంది. కాళ్ళు కదులుతున్నాయి కట్టలేదు.
నా చేతిలో ఏంటి అబ్బా ఉడుము పట్టుకున్నట్టుగా గట్టిగా ఉన్నాయి. రుద్రా చేతులు కనపడుతాయి. రుద్రవైపు కోపంగా చూస్తుంది.
రుద్ర మత్తుగా నిద్రపోతూఉంటే... శాంభవి కోపం అంతా మంచులాగా కరిగిపోయి మెల్లిగా రుద్రా వైపుకు తిరిగి మొఖం పైన చెయ్యి వేస్తుంది. అంత నిద్రలో కూడా రుద్ర నవ్వుతాడు . వెంటనే చెయ్యి తీసేస్తుంది.
రుద్ర నవ్వు మాయమైపోతుంది. ఏమిటి ఈయన పడుకున్నట్టుగా యాక్ట్ చేస్తున్నారా... అంతే అయ్యుంటుంది.
లేకపోతే చేయి వెయ్యగానే ఎందుకు నవ్వుతారు. తీయగానే ఎందుకు మానేస్తారు. ఇలాంటి కోతి వేషాలకి ఏమీ తక్కువ లేదు. చెబుతాను మీ పని అని చేతి మీద గట్టిగా గిల్లుతుంది.
అబ్బా అని అరుస్తూ లెగుస్తాడు. శాంభవి లేచి కూర్చుంటుంది. ఏమైందే అలా గిల్లేవు. మరి నన్ను అలా పట్టుకుని పడుకుంటే నా బాడీ చూడు ఎలా పట్టేసిందో..
ఎక్కడ పట్టేసిందిరా చూస్తాను అని మీదకు లాక్కుంటాడు. ఇదిగో ఇలాంటి వేషాలు వేస్తేనే నాకు కోపం వచ్చేది. ఏమి వేషాలు వేసాను.
నువ్వే కదా ఒళ్లంతా పట్టేసింది అన్నావు. మరి నేను కాకపోతే ఎవరు చెక్ చేస్తారు. అంత అవసరం లేదు కానీ నువ్వు వదిలితే నేను మంచం తిగి నాలుగు అడుగులు వేస్తాను.
ఇద్దరం కలిసి వేద్దాం పాప. అవసరం లేదు నా అడుగులు నేను వేస్తాను. నీ అడుగులు నువ్వే వేసుకో. లేదు.. నేను ఒప్పుకోను. నువ్వు నాతో కలిసి అడుగులు వేయాల్సిందే.
లేకపోతే... హ.. లేకపోతే..
నేనే నీతో కలిసి అడుగులు వేస్తాను. రెండు ఒకటే కదా.. రెండు అలా ఎలా అవుతుంది. నువ్వు నాకు ముద్దు పెట్టింది.. నేను నీకు ముద్దు పెట్టింది ఒకటేనా...
అది ఎలా అవుతుంది. అది ఎలాగో ఇది అంతే. మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. లేదు బుర్రవాడ మంటున్నాను.
నాకు బుర్ర లేదు అంటున్నారా... ఉన్నదాన్ని వాడమంటున్నాను.
మీరు చెప్పినవి విని వాడుతుంటే తల పగిలిపోతుంది. ఇప్పటిదాకా వాడక రెస్ట్ ఇచ్చేసావు కదా.. ఫస్ట్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఒళ్ళు నొప్పులు ఎలా మొదలవుతాయో ఇది కూడా అంతే.
చేయగా.. చేయగా.. బాడీ ఫ్లెక్సిబిలిటీ అయినట్టు నీ బుర్ర కూడా షార్పగా పనిచేసి ఈ బావకు తగ్గ మరదలు అవుతావు. నేను మిమ్మల్ని బావగా ఒప్పుకోలేదు.
నువ్వు ఒప్పుకున్నావని నాకు తెలుసు పాప ఎక్కువ బెట్టు చేయకు... పెళ్లయ్యి ఇన్ని రోజులైనా బ్రహ్మచర్యంలో ఉండాలి అంటే కష్టంగా ఉంది.
నువ్వు బావ అని ఒప్పుకో బ్రహ్మచర్యంను వదిలేస్తాను. నేను బావా అని ఒప్పుకోకపోతే.. జీవితాంతం ఇలాగే ఉంటావా..
మన భార్యాభర్తల బంధం అది దాటి లేదా.. ఎందుకు లేదు బంగారం. కాకపోతే బావ మరదళ్ళ సరసం వేరుగా ఉంటుందంట.. మీకు ఎలా తెలుసు? అరే ఎన్ని సినిమాల్లో చూడలేదు.
ఏమో నాకు తెలవదు. నువ్వంటే సినిమాలు చూడవు కాబట్టి నీకు తెలవదు. నేను అన్ని రకాల సినిమాలు చూస్తాను కాబట్టి నాకు తెలుస్తుంది. అన్ని రకాలు అంటే ఎన్ని రకాలు ఏమిటి...
అవి చెప్పేవి కాదు. చూసేవి.. నువ్వు చూస్తానంటే చెప్పు.. ఇప్పుడే అరేంజ్ చేస్తాను. నేను చూడను. మీరు ఏ బూతు సినిమాలో చూపిస్తారు. చూడకముందే అలా ఎలా డిసైడ్ అయిపోతావు.
ముందు నీ కళ్ళతో చూడు... చెవుతో విను... మనసుతో ఆలోచించు.. అప్పుడు మాట్లాడు. అంతేగాని వెంటనే ఆవేశపడిపోయి అరిచేసి... గొడవ గొడవ చేసి నువ్వు మంచం మీద పడి చుట్టూ ఉన్న మమ్మల్ని అందరినీ కంగారుపెట్టడం ఏమీ బాగోలేదు పాప.
కోపంగా చూస్తుంది. ఇదిగో.. కోపంగా కళ్ళు పెద్దవి చేసి చూడకు. ఆ కళ్ళను చూస్తూ ఉంటే నీ పెదవులు అందుకోవాలని అనిపిస్తుంది.
హ.. అని బ్లాంక్ ఫేస్ తో చూస్తోంది. ఏమిటే ముద్దుల పెళ్ళామా అలా చూస్తున్నావు. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా...
నాకు అర్థమవుతుంది నీకు అర్థం కావడం లేదా అని బుగ్గలు పట్టుకుని లాగుతాడు. అమ్మో నా బుగ్గ అంటుంది. నీ బుగ్గలు మరి జున్ను ముక్కల్లాగా జారిపోతున్నాయి.
ఏం సోప్ వాడుతున్నావు. ఇన్ని రోజుల నుంచి ఇద్దరం ఒకే గదిలో ఉంటున్నాము. నేను ఏం వాడుతున్నానో తెలియదా...
అరే.. బంగారం ఎప్పుడు చూడనిచ్చావు. ఒక పని చేద్దామా.. ఇద్దరం కలిసి స్నానం చేద్దాం. అప్పుడు నువ్వు వాడే సోప్ ఏంటో నాకు తెలుస్తుంది కదా.. ఏమంటావు.
నాకు ఆకలేస్తుంది అంటున్నాను. నాక్కూడా ఆకలేస్తుంది డోర్ లాక్ వేసి రానా.... ఆకలి వేయడానికి... డోర్ లాక్ చేయడానికి సంబంధం ఏమిటి...
అందుకే నిన్ను చిన్నపాపా అనేది. నీకేం ఆకలేస్తుంది. పొట్ట మీద చేతులు పెట్టుకుని చూపిస్తుంది. నాకు ఈ ఆకలేస్తుంది అని గుండె పైన చెయ్యి పెట్టుకుని చూపిస్తాడు.
అక్కడే ఎలా ఆకలివేస్తుంది. అది అర్థం కావాలంటే నువ్వు చిన్న పాపలో నుంచి పెద్ద పాపగా ఎదగాలి. ఎదగవే బాబు.. అని ధీరజ్ కి కాల్ చేసి ఫుడ్ తీసుకురమ్మని చెబుతాడు.
రుద్ర.. శాంభవి మనసు మార్చగలుగుతాడా..
కథ కొనసాగుతుంది....
Posts: 4,804
Threads: 9
Likes Received: 3,182 in 2,464 posts
Likes Given: 11,247
Joined: Sep 2019
Reputation:
31
Posts: 1,156
Threads: 1
Likes Received: 730 in 473 posts
Likes Given: 10,905
Joined: Jun 2019
Reputation:
2
How Rudra and his family handles the situation is important in the coming episodes.
Posts: 1,610
Threads: 2
Likes Received: 952 in 732 posts
Likes Given: 2,133
Joined: May 2019
Reputation:
11
I guess Anasuya has to make a logical end by completely disowning her brother.
Posts: 898
Threads: 13
Likes Received: 7,010 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
Part - 82
ధీరజ్ ఫుడ్ తీసుకువచ్చి ఇవ్వగానే నువ్వు వెళ్ళు . ఒకసారి శాంభవిని చూసి వెళతాము రా.. ఇప్పుడు వద్దు. ఇప్పుడిప్పుడే ఫామ్ లోకి వస్తుంది.
మళ్ళీ అందరినీ చూస్తే డిస్టర్బ్ అవుతుంది. ఈ పూటకు వదిలేయండి. రేపటికి సెట్ అవుతుంది. సరే జాగ్రత్త. ఇద్దరికీ ఉంది భోజనం.
సరే అని చెప్పి డోర్ లాక్ చేసుకుని వస్తాడు. ఎందుకు తలుపు వేశారు. నువ్వే కదా ఆకలి వేస్తుంది అన్నావు. మన ఆకలి ఎవరు చూడకూడదు అని..
ఏ.. దిష్టి తగులుతుందా.. ఒక రకంగా అలాంటిదేలే పాప నీరసంగా అని.. ప్లేట్లో అన్ని వడ్డించి శాంభవి ముందు కూర్చుంటాడు.
మరి నాకు. ఇది ఇద్దరికీ. నా భోజనం నేనే తింటాను. కుదరదు నేనే తినిపిస్తాను. మీరు ఎందుకు తినిపించడం. నువ్వు నీరసంగా ఉన్నావు. సరిగ్గా తినవు. అందుకనే..
మరి మీరు కూడా తినలేదు కదా.. మీకు నీరసంగానే ఉందా... పర్వాలేదు. చాలా రోజులకి నేను తినలేదు అని గుర్తించావు.
నేను మనిషిని నాకు తెలుసు. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో.. అవునా.. ఎప్పటినుంచి తెలుసుకుంటున్నావు. చిన్నప్పటినుంచి. మా నాన్న నాకు నేర్పించారు.
మొదలుపెట్టింది అని అనుకొని.. సరేలే ముందు భోజనం చేయ్. నాకు ఆకలేస్తుంది.. శాంభవి కి తినిపిస్తూ రుద్ర కూడా తింటాడు.
ఇంక నాకు చాలు. ఈ ఒక్క ముద్దే ఒక్క ముద్దె అని ఫుల్లుగా తినిపిస్తాడు. ఇప్పుడు చూడు నా పొట్ట ఎంత పైకి వచ్చిందో...
వద్దు అన్నప్పుడు ఆపేయొచ్చు కదా.. నీ ఆకలి నీకు తెలియదు పాప.. ఆకలి లేకపోతేనే ఇలా తింటే ఆకలితో ఉంటే ఇంకెలా తింటావో.. అని నవ్వుతాడు.
మీరు కావాలని ఏడిపిస్తున్నారు. నీకు అలా అర్థమైందా అని మూతి కడిగి పడుకుంటావా.. నిద్ర రావడం లేదు. ఇంటికి వెళ్ళిపోదాము.
సరే అయితే... డాక్టర్ తో మాట్లాడివస్తాను. ఉండగలవా
.. ఉంటాను అంటుంది. బయటకి వచ్చి చూస్తాడు. దేవేంద్ర కంగారుగా వచ్చి ఎలా ఉందిరా..
పర్వాలేదు మావయ్య. ఇంటికి వెళ్ళిపోదాం అంటుంది
నేను ఒకసారి వెళ్లి చూడనా.. ఇప్పుడు వద్దు మావయ్య. ఒక్కరోజుకి వదిలేయండి.
ఇప్పుడిప్పుడే పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంది. మొదటి కి వెళ్ళింది అంటే కష్టం. కూతురిని చూడలేకపోతున్నాను అని దేవేంద్ర డల్ అవుతే.. జితేంద్ర వచ్చి ఇంటికి వచ్చేస్తుంది కదరా..
కొన్ని రోజులు వదిలేస్తే మన అమ్మాయి మనతో కలిసిపోతుంది. ఇన్ని రోజులు ఆగినవాడివి... ఇంకొన్ని రోజులు ఆగలేవా..
నువ్వు అన్నది కూడా నిజమేలే అన్నయ్య. డాక్టర్ పరిగెత్తుకుంటూ వస్తాడు. చెప్పండి సార్. ఒక ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా..
ఇట్స్ ఓకే... శాంభవిని తీసుకువెళ్లొచ్చా.. ప్రాబ్లం ఏమీ లేదు. మేడం టెన్షన్ తీసుకోకుండా చూసుకోండి. సరిపోతుంది. ఓకే అని చెప్పి లోపలికి వెళ్లి వెళదామా..
సరే అని రుద్ర వెనకాలే బయటకివస్తుంది. బయట అందరూ శాంభవి వైపు చూస్తూ ఉంటే తలదించుకొని భయంగా రుద్రా చెయ్యి పట్టుకుంటుంది.
అందరి వైపు చూసి కళ్ళు ఆర్పుతాడు. శాంభవి తల దించుకుని వెళుతూ ఉంటే ఒక్కసారైనా చూడకపోతుందా అని దేవేంద్ర ఆశగా చూస్తూ ఉంటాడు.
మౌనంగా కారు ఎక్కి కళ్ళు మూసుకుంటుంది. కళ్ళ వెంట నీళ్లు కారిపోతూ ఉంటే.. రుద్ర కార్ స్టార్ట్ చేస్తాడు. బయటికి మౌనంగా ఉన్న.. లోపల లోపల ఏడుస్తున్న శాంభవి పొట్ట అదురుతూ ఉంటుంది.
ఎంత ఆపుతున్నా ఆ కళ్ళు వర్షిస్తూనే ఉంటాయి. రుద్ర వెళుతున్న కారు ఒక లోన్లీ ప్లేస్ లో ఆపి శాంభవి అని పిలుస్తాడు.
వచ్చేసామా అని అడుగుతుంది. ఆ మాట చాలా బొంగురుగా వస్తుంది. నా వైపు చూడు అని టర్న్ చేసుకొని ఏంట్రా ఇది అని కళ్ళు తుడుస్తాడు.
నాకు ఏమి చేయాలో అర్థం కావడం లేదు.. ఒప్పుకోలేకపోతున్నాను. అలా అని అది నిజం కాదు అంటే అదే నిజం.
ఎలా దీని ఫేస్ చెయ్యాలి. నేను ఒప్పుకుంటానేమో అన్న ఆశతో అంకుల్ ఉన్నారు..ఒప్పుకోలేని పరిస్థితుల్లో నేనున్నాను. భగవంతుడు నన్ను ఎంత క్లిష్ట పరిస్థితుల్లో నుంచో పెట్టాడో చూసారా....
మనం సరిగ్గా ఆలోచిస్తే ప్రతి సమస్యకి ఒక సమాధానం ఉంటుంది. ఈ సమస్యకి సమాధానం ఏముంది. ఎందుకు లేదు. ముందు నిన్ను నువ్వు సమాధానం పరుచుకో.
పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. చిన్నమామని నాన్నగా ఒప్పుకోమంటే భాను మావయ్య వాళ్ళకి దూరం జరగమని కాదు అర్థం.
ఎప్పటికి నువ్వు భాను మావయ్య కూతురువే అది మార్చలేని నీ జీవితం. కాకపోతే నీ పుట్టుక.. చిన్నమామ కూతురిగా ఈ భూమి మీదకి వచ్చావు.
పరిస్థితులు ఏమిటో అన్నది నీకు బాగా తెలుసు. ముందు మావయ్యని అర్థం చేసుకుని దగ్గర అవ్వు. ఈ విషయం భాను మావయ్య వాళ్లకి చెప్పాల్సిన అవసరం లేదు.
తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. నా వరకు వస్తారనుకున్న శత్రువులు నాన్న దగ్గరికి వెళ్ళరు అని ఎందుకనుకుంటున్నారు.
పరవాలేదు మా మరదలకి బుర్ర బానే పనిచేస్తుంది. మీకు ఎన్ని సార్లు చెప్పాను నేను మీకు మరదల్ని కాదు అని.. సరేలే నేనే నీకు బావని అవుతాను.
ప్రస్తుతం ఇక్కడ కార్ ఎందుకు ఆపారో చెబుతారా.. నువ్వు ఏడవడం ఆపేసేయ్.. లోపల లోపల ఏడవలసిన అవసరం లేదు.
నీకు బాధగా అనిపిస్తే పైకి ఏడ్చేయ్.. ఎవరూ చూడకూడదు అంటావా... నేను కూడా కారు దిగుతాను ఎంతసేపు కావాలో అంతసేపు ఏడ్చి తర్వాత పిలువు.
ఫ్రెష్ గా ఇంటికి తీసుకువెళతాను. ఏమంటావు. నాకు ఏడవలసిన అవసరం లేదు. తప్పు చేసిన వాళ్ళు ఏడవాలి గాని నేనెందుకు ఏడుస్తాను.
అబ్బా ఎన్నాళ్లకు ఒక మంచి మాట చెప్పావే.. తప్పు చేసినోళ్లు కదా ఏడవలసింది మరి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు పద అని కార్ స్పీడ్ పెంచుతాడు.
ఎక్కడికి.. తప్పు చేసిన వాళ్ళ దగ్గరికి. ఒక్కసారి వాళ్ళ మక్కేలు ఇరగదీన్నితే... నీ ఏడుపుకి ఒక న్యాయం ఉంటుంది.
నీ బాధ కొంచమైనా తీరితే నేను రిలాక్స్ అవుతాను.
ఏమంటావు పాప అని కారు తీసుకు వెళ్లి నాగేంద్ర ఇంటి ముందు ఆపుతాడు .
ఎవరిది ఈ ఇల్లు... తప్పు చేసిన గాడిదది.. రా అని చేయి పట్టుకుని లాక్కెళ్ళి నాగేంద్ర అని అరుస్తాడు. రుద్ర పిలుపు సింహం గర్జించినట్టుగా అనిపించి..
స్పీడ్గా గదిలో నుంచి బయటికి వచ్చి ఇది నా ఇల్లు రుద్ర అందుకే కదారా.. పిలిచింది..
మర్యాద లేకుండా ఆ పిలుపు ఏమిటి.. నీలాంటోడుకి కూడా మర్యాద ఇస్తే ఆ మర్యాద సిగ్గుపడుతుంది గాని ముందు నువ్వు ఇలా రా..
ఇంతకీ నీ ముద్దుల కూతురు ఎక్కడ... దాన్ని కూడా బయటికి రమ్మను. మీకు ఒక సినిమా చూపించాలి.
మయూరి మౌనంగా వస్తుంది. అబ్బా ఏమి వస్తున్నావే...
ఏంటి మయూరి ఇది నీలో ఉండే యాంగిల్ కాదే..
కోరలు తీసిన పాములాగా వస్తున్నవే.. బస్సులు కొడుతున్న బురద పాములాగా రావాలి కదా...
ఏంటి రుద్ర బాల్ నీ కోర్టులో ఉంది కదా అని ఎగిరెగిరి పడుతున్నావా.. నేను రంగంలో దిగిన తర్వాత బాల్ ఎప్పుడు నా. కోర్ట్ లోనే ఉంటుంది కానీ..
రా వచ్చి కూర్చో మీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేద్దామని తీసుకోవచ్చాను. నా భార్య శాంభవి. మొదట ప్రియురాలు.. తర్వాత మరదలు.. ఇప్పుడు నా భార్య ఎలా ఉంది.
రుద్ర వేరియేషన్స్ కి శాంభవి నోరు వదిలేసి చూస్తూ ఉంటే.. ఏమైందిరా అలా చూస్తున్నావు. కాళ్ళు నొప్పులు వస్తున్నాయా..
రా ఇలా వచ్చి కూర్చో అని పక్కనే కూర్చోబెట్టుకొని... గెస్ట్లు వస్తే మినిమం వాటర్ తాగుతారా అని కూడా అడగడం లేదు.
ఏం ఫ్యామిలీయో.. ఏంటో.. అవునులే పక్కనోళ్ళి రక్తం తాగడానికి అలవాటు పడిన వాళ్ళు.. మీ ఇంట్లో నుంచి ఇవ్వాలి అంటే మనస్సు అంగీకరించదు కదా...
మయూరి శాంభవి వైఫై చూస్తూ ఉంటుంది. నాగేంద్ర కోరలు తీసిన పాములాగా బుసలు కొడుతూ ఉంటాడు.
ఏంటి మయూరి అలా చూస్తున్నావు.
అచ్చు నా డార్లింగ్ చిన్నత్త లాగా కనిపిస్తుందా... నా పెళ్ళానికి అన్నీ మా అత్త పోలికలే... కాకపోతే మావయ్య లో ఉన్న కోపం వచ్చింది.
అత్తయ్య లో ఉన్న నిదానమే అస్సలు లేదు. మీ విషయం తెలిసినప్పటి నుంచి మిమ్మల్ని ఎప్పుడు కలవాలా... మిమ్మల్ని ఎప్పుడూ ఉప్పు పాత్ర వేయాలా అని తెగ ఆరాటపడుతుంది.
నేనుండగా.. నా పెళ్ళాం చేతులకు కందనిస్తాన... అందుకే నా బంగారాన్ని తీసుకుని వచ్చాను. నువ్వు చూస్తూ కూర్చో..
వీళ్ళ మక్కెలు నేనే ఇరగదీస్తాను అని చెప్పాను. ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరి మక్కేలు ఇరగదీయాలి. నువ్వేమో ఆడదానివి అయిపోయావు.
ఆడవాళ్ళ మీద నేను చేయి వేయను కదా... అందులోనూ నీలాంటి బురద పాము మీద అస్సలు వేయను. కాబట్టి ఇక మిగిలింది మీ నాన్న.
మీ నాన్న మక్కేలు ఇరగదీస్తే ఈ వయసులో తట్టుకోగలడంటావా.. ఏరా నాగేంద్ర ఏమిటి సంగతి.. రుద్ర నా గురించి తెలియక నాతో పెట్టుకుంటున్నావు.
నీ గురించి ఎందుకు తెలియదు. కూతురిని పక్కన వాడి పక్కలోకి పంపైనా సరే నువ్వు అనుకున్నది సాధించాలి అనుకున్నావు. అంత నీచుడివి.. అంతేనా మయూరి .
మయూరి ఏమి మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది. నేను చెప్పింది తప్పా.. ఆరోజు మావయ్యని మోసం చేసి గదిలోకి దూరావు. మరి నీలాంటి వాళ్ళని ఏమంటారు.
పోనీ అదేమైనా గుట్టుగా ఉంచారా.. నీ బాబు పబ్లిసిటీ కోరుకుని పేపర్లోకి ఎక్కించాడు. కస్టమర్స్ పెరుగుతారు అనా లేకపోతే... రుద్ర అని మయూరి గట్టిగా అరుస్తుంది.
వీళ్ళ గొడవలు వీళ్లు ఉండగానే అక్కడికి నాగేంద్ర పెద్ద కూతురు అయిన సునంద అల్లుడు ప్రభాకర్ వస్తారు. ప్రభాకర్ కోపంగా రుద్ర కాలర్ పట్టుకుని నా ఇంటి పరువుతో ఆడుకుంటావా...
ఏమనుకుంటున్నావు.. నా గురించి తెలిసే నాతో పెట్టుకున్నావా ... రుద్రా కాలర్ వంక... ప్రభాకర్ వంక.. చూస్తూ ఉంటాడు.
ప్రభాకర్ మెల్లిగా చేతులు తీసివేసి నా కూతురిని పెళ్లి చేసుకున్న వాడు ఎక్కడ...
రుద్రా చెబుతాడా....
Posts: 898
Threads: 13
Likes Received: 7,010 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
Part - 83
నా కూతురిని పెళ్లి చేసుకున్న వాడు ఎక్కడ.. తెలుసుకుని ఏం చేస్తావు.. చంపేస్తావా లేక నీ కూతురికి ఇంకో పెళ్లి చేస్తావా.
ఏం మాట్లాడుతున్నావు. పెళ్ళి అంటే ఆటలు అనుకుంటున్నావా.. అరె సునంద. నీ మొగుడు ఏదో అంటున్నాడు.
పెళ్లంటే ఆటలా అని.. మరి నువ్వు చేసింది ఏమిటో మీ ఆయనకి తెలియదా.. లేక తెలిసిన తెలియనట్టు ఉన్నాడా..
ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు రుద్ర. ఎప్పుడో జరిగినవి ఇప్పుడు మాట్లాడుకోవడం అవసరమా.. అరే ఎప్పుడు జరిగిన అదే కదా. నీ కూతురు పెళ్లి జరిగి కూడా చాలా రోజులు అయింది కదా మరి వదిలేస్తున్నారా..
సునంద మోకాళ్ళ మీద కూర్చుని ప్లీజ్ రుద్ర.. ఆరోజు నా చెల్లికి సపోర్ట్ చేసి ఎంత తప్పు చేశానో నాకు అర్థమయింది. రోజు చస్తూ బతుకుతున్నాను .
నువ్వు ఎలా బ్రతికితే నాకెందుకు.. మీరు ఆడిన నాటకం వలన నాశనమైంది మా చిన్నమామ జీవితం. దూరమైంది మా చిన్న అత్త .
ఇప్పుడు మాత్రం నీ కూతురు దగ్గరికి వచ్చేటప్పటికి విలవిలలాడుతున్నావా... మన పెద్దలు ఊరికే చెప్పరు. నువ్వు ఏదైతే ఇస్తావో అదే తిరిగి వస్తుందని.
నువ్వు మా అత్త విషయంలో చేసిన దానికి భగవంతుడు నీ కూతురు విషయంలో చేశాడు. దానికి నేను మాత్రం ఏం చేయగలను.
ప్రభాకర్ కోపంగా అసలేం జరుగుతుంది ఇక్కడ.. సునంద ఏమి చేసావు.. తప్పు చేశానండి తప్పు అనడం కన్నా మహాఘోరం చేశాను.
శాంభవి అర్థంకాకుండా చూస్తూ ఉంటే మయూరి కంగారుగా అక్క అంటుంది. ఇప్పటికైనా చెప్పనివ్వు. ఈ పాప భారాన్ని మోయలేక 23 సంవత్సరాలు నుంచి నరకం అనుభవిస్తున్నాను.
నీకేం భర్త, సంసారం పిల్లలు అనేటువంటి బంధాలు లేనిదానివి... ఎలాగైనా బ్రతకగలవు కానీ నాకు నా భర్త నా కూతురు భవిష్యత్తు కావాలి.
సునంద మాట్లాడిన మాటలు మయూరీకి రంపపు కోతలాగా ఉంటాయి. ఏమంటున్నావ్ అక్క. నిజమే కదా చెబుతున్నాను.
ఆ రోజు నీ స్వార్థానికి లహరిని బలి తీసుకున్నావు. ఇప్పుడు ఆశా, నిషా ల జీవితాన్ని నాశనం చేస్తున్నావు.
నీకంటూ పిల్లలు ఉండి ఉంటే ఆ కన్నపేగు బాధ ఏమిటో తెలిసేది..
మయూరి అక్కడే కూలబడిపోతుంది. నాగేంద్ర కంగారుగా దగ్గరికి వెళ్ళి అమ్మ మయూరి అని పట్టుకొని.. సునంద నువ్వు చెల్లితో ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా..
ఇప్పటికే ప్రేమించిన వాడు దక్కలేదు అని కుంగిపోతూ ఉంటే నువ్వు మాటలతో కుల్లబడుస్తున్నావా... ప్రభాకర్ కి చిరాకు నడి నెత్తికి చేరి ఆపుతారా..
నాకు నిజం చెప్పు సునంద.. లేకపోతే నువ్వు కూడా నీ చెల్లితో పాటు పుట్టింటి లో ఉండు.. ఒకరు పెళ్లయి ఉంటే మరొకరు పెళ్లి కాకుండా ఉంటారు అంతే తేడా..
చెబుతాను. బాంబే దేవేంద్ర ప్రాజెక్టు వర్క్ మీద వెళ్లినప్పుడు మయూరి ఎటువంటి జాబ్ కోసం వెళ్లలేదు. కేవలం దేవేంద్రని ట్రాప్ చేయాలని అక్కడికి వెళ్ళింది.
అదంతా మాకు తెలుసు. అలాగే ఆ న్యూస్ కూడా పేపర్లో రాలేదు. బృందావనం ఫ్యామిలీకి సంబంధించి కొన్ని ఫ్యామిలీస్ కి మాత్రమే అందేటట్టు చేసాము.
అలాగే జితేంద్ర చిన్న కొడుకుని కూడా అన్నయ్య స్టెప్స్ మీద నుంచి పడిపోయేటట్టుగా చేశాడు. మయూరి విషం తాగడం కూడా అబద్ధమే..
ఆఫీసులో మనుషులను కొనేసి మావయ్యని ఆ రాత్రికి అక్కడ ఉండిపోయేలాగా చేసింది మేమే...
ప్రభాకర్ సునంద చెంప పైన గట్టిగా కొడతాడు. చెంప పైన చెయ్యి పెట్టుకుని కన్నీళ్ళతో భర్తను చూస్తుంది.
ఛీ.. ఛీ.. మీ కుటుంబం నీచులు అని తెలుసు గాని ఎంతకైనా దిగజారే వాళ్ళు అని తెలుసుకోలేకపోయాను. కూతుర్నే తార్చడానికి సిద్ధపడిన వాడు..
మన అమ్మాయి విషయంలో ఇంకెంత దిగజారిపోయే ఉంటాడో... మనమ్మాయి కాదు నా కూతురు మాత్రమే ఈరోజు నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు .
ఒక విషయం అడుగుతాను సమాధానం చెప్పు. ఏమిటి అన్నట్టుగా చూస్తుంది . ఆశ నాకు పుట్టినదేనా..
ప్రభాకర అలా అడగగానే సునంద ప్రాణం విలవిలాడుతుంది. ఆ నిమిషమే ప్రాణం వదిలేస్తే ఎంత బాగుంటుంది.
ఈ నింద భరించడం కన్నా చావడం చాలా మేలు. ఏడుస్తూ ఎందుకండి మాటలతో కుల్లబోడుస్తున్నారు. నేను ఎటువంటి ద్రోహం చెయ్యలేదు.
ఇన్ని సంవత్సరాలలో ఏరోజు అయినా మీ మాట జవదాటనా... మీ కుటుంబాన్ని నమ్మితే నా అంత మూర్ఖుడు ఇంకొకళ్ళు ఉండరు.
నేను ఒకసారి నా కూతురు అవునా కాదా అని టెస్ట్ చేయిస్తాను. ఆశ నా కూతురు అయితే తీసుకుని వెళ్ళిపోతాను.
కాకపోతే నువ్వు నీ కూతురు ఇక్కడే ఉండండి.. ఇన్ని సంవత్సరాలు నా కూతురు అనుకుని పెంచినందుకు కొన్ని రోజులు బాధ ఉంటుంది.
కానీ నీలాంటి మోసగత్తితో విడిపోయినందుకు సంతోషిస్తాను. రుద్ర వైపు తిరిగి నేను చేయవలసిన పనులు పూర్తి చేసుకుని మళ్లీ నిన్ను కలుస్తాను.
ఈ కుటుంబంతో నాకు ఎటువంటి సంబంధం లేదు . మీ అత్తయ్య విషయంలో జరిగింది కూడా నాకు తెలియదు. తెలుసుకోవాలి అని కూడా నేను అనుకోలేదు.
ఎందుకంటే.. మాకు పెళ్లయి ఎన్నో సంవత్సరాలు అవ్వలేదు. ఏదో సునందకి మేనత్త కుటుంబం అనే పరిచయాలు తప్ప వీళ్ళు ఇంత కుట్ర పన్నారు అన్న విషయం నాకు తెలియదు.
ప్రభాకర్ స్పీడుగా వెళ్ళిపోతూఉంటే.. సునంద పరిగెత్తుకుంటూ నన్ను క్షమించండి నన్ను వదిలి వెళ్లొద్దు అని వెనకాలే వెళుతుంది.
అప్పటికే ప్రభాకర్ వెళ్ళిపోతాడు. సునంద అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. హమ్మయ్య నీ కన్నీళ్ళకి కొంచెం అయినా సాటిస్ఫై అయ్యావా బంగారం? ఇంక మనం వెళదామా అని శాంభవిని తీసుకుని బయటకి వస్తాడు.
శాంభవి బొమ్మలాగా రుద్రా వెనకాలే నడుస్తూ ఉంటుంది. బయటకి వచ్చేటప్పటికి సునంద ఏడుస్తూ ఉంటే అయ్యో పాపం అనుకుంటుంది.
ఏంటి పాప.. అలాంటి వాళ్ళ మీద జాలి పడుతున్నావా. అసలు జాలి పడకు . వీళ్లంతా పాము కన్న ప్రమాదం.
సునంద మందు వంటి కాలు మీద కూర్చుని ఎందుకు సునంద ఏడుస్తున్నావు. ఇప్పుడు ఏమైందనీ... హ్యాపీగా మీ నాన్న, చెల్లితో కూర్చుని ఇంక ఎవరు కొంపలు కూల్చాలా అని ఆలోచించు.
మీ చెల్లితో ఎవరిని ట్రాప్ చేయాలా అని ప్లాన్ చెయ్యి. ఇప్పుడు మీ చెల్లి ఏజ్ బార్ అయిపోయింది కదా..ఎవరైనా ట్రాప్ లో పడతారంటావా?
మీ నాన్న వయసు వాళ్ళు ఎవరైనా పడతారేమో ప్రయత్నించు.. సునంద చెవులు మూసుకుంటూ ప్లీజ్ రుద్ర.. ఇప్పుటికే చచ్చి బతుకుతున్నాను.
ఇంకా నీ మాటలతో హింసించవద్దు . అరే మీరు చేసింది చెబితేనే మీకు ఇలాగుంది. మరి నిండు గర్భిణి.. కదలలేని పరిస్థితుల్లో ఉన్న ఒక ఆడపిల్లని నిస్సహాయ స్థితిలోకి గెంటి మీ కుటుంబం అంతా వేడుక చూసింది కదా...
అక్కడితో ఆగకుండా పురిటి బిడ్డతో సహా చంపేయాలి అనుకున్నారు కదా... ఆ పాపం ఎక్కడికి పోతుంది. నిండు నెలలతో ఉన్న ఆడపిల్ల అంటే గర్భగుడిలోని అమ్మవారితో సమానం అంటారు.
అలాంటి అమ్మవారికి ద్రోహం చేస్తే ఆ అమ్మ ఊరుకుంటుందా... నాలాంటి వాడితో శివతాండవం చేయిపిస్తుంది.
ఇంకా ముందు ముందు నువ్వు చూడాల్సింది చాలా ఉంది. ధైర్యంగా ఉండు సునంద అని లేచి నిలబడి రా పాప అని శాంభవిని జాగ్రత్తగా తీసుకువెళతాడు.
వెళుతున్న రుద్రాని చూస్తూ పిచ్చిగా నవ్వుతూ లేచి నిలబడుతుంది. లోపలకి వెళ్లి చప్పట్లు కొట్టి బాగా సాధించారు నాన్న. ఇంత గొప్ప తండ్రి మాకు తప్ప ఇంకెవరికీ ఉండరేమో..
సునంద అని మొదటిసారి బాధగా అంటాడు. అయ్యో ద గ్రేట్ నాగేంద్ర గారు బాధపడకూడదు. పగ... పంతం... ప్రతీకారం అనుకుంటూ..
ఎవరి కుటుంబాన్నో నాశనం చేయాలి అనుకుని కన్న కూతుళ్ళ జీవితాన్ని నాశనం చేసిన గొప్ప తండ్రి. దీనికన్నా నా జీవితం కొంచెం బెటర్.
ఎందుకంటే మొగుడు, సంసారం అని కొన్ని సంవత్సరాలైనా ఉన్నాను. నా బిడ్డ నా భర్తకే పుట్టింది అన్న విషయం అందరికీ తెలుసు.
కానీ దీని జీవితం ఇంకా అస్తావ్యస్తం చేశారు. ఇది ఇప్పటికే కన్నెపిల్ల కానీ లోకం దృష్టిలో చెడిపోయింది. మీపగ కోసం ఎవరి పక్కనో పడుకోబెట్టారు.
అక్క అని అరుస్తుంది. నిజం కాదా.. ఆరోజు దేవేంద్ర నిన్ను రక్షించడానికి సహాయపడితే... దానిని మనకు అనుకూలంగా మార్చుకొని ఇద్దరూ ఛ.. నా నోటితో మాట్లాడలేకపోతున్నాను .
నీ స్థానం ఏమిటో నీకు అర్థం అవుతుందా.. లేక ద గ్రేట్ నాగేంద్ర గారు అర్థం కానివ్వకుండా చేస్తున్నారా.. బయట వాళ్ల సంగతి వదిలెయ్.
మన కుటుంబంలోనే అందరికీ అర్థమై.. మీ ఇద్దరికీ దూరం జరుగుతున్న మీ మూర్ఖత్వం వదలరా.. ఇంకెప్పటికీ మారతారు.
నాకు ఒక మాట ఇవ్వండి నాన్న.. ఏమిటి అని లేని గంభీరాన్ని తెచ్చుకుని అడుగుతాడు..దయచేసి ఈ మిగిలిన జీవితంలో ఎక్కడా కూడా మీరు నా తండ్రి అని చెప్పవద్దు.
అనాధనే పెళ్లి చేసుకున్నాడు అనుకున్న పరవాలేదు కానీ మీ కూతురు అని చెబితే నన్ను కూడా మయూరి లాగానే అనుకుంటారు.
నాకంటూ ఒక వ్యక్తిత్వం, శీలం ఉంది..ఎప్పుడు నా గుమ్మం కూడా తొక్కద్దు. నిన్ను నీ భర్త రానివ్వడు కదా అమ్మ.. ఎక్కడికి వెళతావు అని కూతురు మీద ప్రేమను చూపిస్తూ అడిగితే...
గుమ్మం బయటే కూర్చుంటాను. ఆయన క్షమించి పిలిచేదాక ఎదురు చూస్తాను. పనిమనిషిగా నైనా సరే భర్త దగ్గర ఉంటే ఒక విలువ ఉంటుంది. నేను వెళుతున్నాను. దయచేసి మీరిద్దరూ ఎప్పుడు నన్ను కలవద్దు.
సునంద వెళ్ళిపోయిన తరువాత మయూరి బొమ్మలాగా అక్కడే కూలబడిపోతుంది. నాగేంద్ర... మయూరి దగ్గరికి వచ్చి ప్రభాకర్ అలా చేసేటప్పటికి భయంతో ఏదేదో మాట్లాడుతుంది. నువ్వు ఇలాంటివేమీ మనసులోకి తీసుకోకు...
తండ్రి వైపు సమాధానం లేని ప్రశ్న లాగా చూస్తూ విరక్తిగా నవ్వుతుంది. ఏమైందిరా.. నువ్వు అలా ఉంటే నాకు భయమేస్తుంది.
ఈ తండ్రికి బలం అంతా నా చిన్న కూతురే.. బలమా లేక మీ పగ ప్రతీకారాలు తీర్చుకోవడానికి ఒక పావునా...
నాగేంద్ర సమాధానం.....
Posts: 898
Threads: 13
Likes Received: 7,010 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
Part - 84
మయూరి అడిగిన దానికి నాగేంద్ర విభ్రాంతి చెందుతాడు. కూతురువైపు చూస్తూ నువ్వు కూడా వాళ్ళ లాగానే మాట్లాడుతున్నావా..
నువ్వు దేవేంద్రని ప్రేమించాను అన్నావనే కదా వెళ్ళి నా చెల్లిని అడిగాను. నీ ప్రేమని గెలిపించడానికే కదా లహరి ని ఇంటి నుంచి బయటికి వెళ్లే లాగా చేశాను.
అలాంటిది నన్ను.. నువ్వు.. మయూరిని వదిలి లేచి వెళ్లి సోఫాలో కూర్చుంటాడు.
తండ్రి కూతుర్లు ఇద్దరూ మౌనంగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు.
రుద్ర డైరెక్టుగా ఇంటికి తీసుకువెళతాడు. కారులో మాట్లాడాలి అన్న భయం వేసి శాంభవి సైలెంట్గా కూర్చుంటుంది.
అది అర్థమైన అర్థం కానట్టుగానే ఇంటికి తీసుకువెళ్తాడు. శాంభవిని గుమ్మం దగ్గరే ఆపేసి.. చారులత, కౌసల్య ఎర్ర నీళ్లు దిష్టి తీస్తారు.
ఎంతమంది కళ్ళు పడ్డాయో బిడ్డ పైన.. అందుకే అలా పడిపోయింది అని లోపలికి రా అని తీసుకువెళతారు. వాళ్ళ వెనకాలే వెళుతుంది .
అందరూ శాంభవి ఏమైనా మాట్లాడుతుందేమోఅని చూస్తూ ఉంటారు. అందరూ చూపులు అర్థం అవుతున్న మౌనంగా గదిలోకి వెళ్లి మంచం పైన పడిపోతుంది.
రుద్ర అక్కడే కూర్చుంటాడు. ఏమైందిరా.. మీరు ఎప్పుడో బయలుదేరారు కదా.. ఇంత ఆలస్యం అయ్యింది. అమ్మాయి ఇంటికి రావడానికి ఒప్పుకోలేదా.
ఎవరికి తోచిన ప్రశ్నలు వాళ్ళు అడుగుతూ ఉంటారు.
రుద్ర మౌనంగా చూస్తూ ఉంటే... ఇంతమంది ఇన్ని ప్రశ్నలు అడుగుతుంటే.. సమాధానం చెప్పవేంట్రా అని చారులత అడిగితే..
మీరు పదిమంది ఉన్నారు. పది ప్రశ్నలు అడుగుతారు. నేను ఉన్నది ఒక్కడినే.. నాకున్నది ఒక్క నోరే..
వీడు....వీడు వెటకారాలు అని సంతోష్ చిన్నగా అంటాడు.
వినపడింది. వినపడాలనే నేను అన్నది. అబ్బబ్బ.. మీ తండ్రి కొడుకుల గొడవ ఆపి విషయం ఏంటో చెప్పరా...
చెప్పడానికి ఏముంది అంతా మనం అనుకున్నదే..
ప్రస్తుతం జరిగేది ఒప్పుకోలేక పోతుంది.. అలాగని తప్పుకోలేకపోతుంది. నలుగుతుంది. ఎవరితో మాట్లాడాలి అనుకున్న ఏదో అడ్డుపడుతుంది.
తన బాధ చూడలేక... కొంచెం ఆ బాధలో నుంచి బయటకు రావాలని... ఆపి అందరిని చూస్తాడు. హ.. ఆపాలని అని అందరూ ఒకేసారి అడిగితే...
చెవులు మూసుకుని.. ఎందుకు సౌండ్ బాక్స్ లాగా అరుస్తారు. మైక్ ఏమైనా మింగారా. నువ్వు సాగదీసుకుంటూ చెబుతూ ఉంటే.. అలాగే ఉంటుంది.
తర్వాత ఏం జరిగిందో చెప్పు. ఆ నాగేంద్ర ఇంటికి తీసుకు వెళ్లాను. ఏమంటున్నావ్ రా... మన శత్రువులకి నా ముద్దుల పెళ్ళాన్ని పరిచయం చేద్దామని..
శాంభవిని వాళ్ళు ఏమీ చెయ్యలేదు కదా అని తులసి కంగారుగా అడుగుతుంది. ఓ గ్రానీ... నేను ఉండగా నా పెళ్ళాం వైపు చూడాలంటేనే వణికిచస్తారు. అలాంటిది ఏదైనా చేయడమా..
మరి అక్కడ ఏం జరిగింది. సినిమా చూపిస్తాను. మొత్తం జరిగింది చెబుతాడు. ఆ ప్రభాకర్ కి ఇప్పుడు దాకా వీళ్ళు చేసిన పాపాల గురించి తెలియదా.. తెలియదనే అనుకోవాలి.
సునంద మారింది అనుకుంటా అని తులసి అంటే.. మారితే మాత్రం ఉపయోగమేముంది అత్తయ్య. చిన్న వదిన తిరిగి వస్తుందా...
మన మధ్యన అల్లారు ముద్దుగా పెరగాల్సిన శాంభవి అచ్చట ముచ్చట మనం చూడగలమా..
ప్రతీదీ.. ప్రశ్నలు వేసుకుంటూ వెళితే సమాధానాలు ఉండవు చారు. కొన్ని కొన్ని సార్లు సర్దుకుపోవాలి. తప్పు చేశాను అని క్షమాపణ వేడుకుంటున్నప్పుడు..క్షమించడం మంచిది.
ఎందుకు అంటే.. తప్పును సరి చేసుకోలేరు. కాలాన్ని వెనక్కి తిప్పలేరు.
దేవేంద్ర మౌనంగా ఉంటే.. నువ్వేం మాట్లాడవేమిటి చిన్న మామ. నేను చేసింది తప్పా... నా మేనల్లుడు ఎప్పుడూ తప్పు చేయడు .
ఇప్పుడు ఏం చేయాలి. మీరు అందరూ ఎప్పటిలాగానే శాంభవితో ఉండండి. అంతేగాని మీరందరూ ఎలా మిస్ అయిపోయారో అని చెబుతూ శాంభవిని కన్ఫ్యూజ్ చేయకండి.
ఇప్పటికే ఎటు తేల్చుకోలేక నలిగిపోతుంది. అది నిజమేలే..
ప్రభాకర్ నేరుగా శేషాద్రి ఇంటికి వెళ్లి ఆశ అని పిలుస్తాడు. చెప్పండి నాన్నగారు అని వస్తే.. నాతో రా అని తీసుకువెళ్తాడు.
ఎక్కడికి అల్లుడుగారు అని లక్ష్మి అడిగితే.. హాస్పిటల్ కి వెళుతున్నాము అని అక్కడనుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు హాస్పిటల్ కి ఏమిట్రా..
ఎవరికైనా బాగోలేదా శేషాద్రి అని అడిగితే.. ఏమోనమ్మ.. సునంద రాలేదు. ఒకవేళ... అయ్యో సునంద అని లక్ష్మి కంగారుగా బయటకు వెళుతుంది.
లక్ష్మీ వెనకాల శేషాద్రి, జ్యోతి కూడా బయటికి వస్తారు. ప్రాణం లేని బొమ్మలాగా నడుచుకుంటూ వస్తున్న సునందని చూసి కంగారుగా దగ్గరికి వెళ్లి..
ఏమైంది ఇలా అయిపోయావు. లోపలికి చూస్తూ ఉంటుంది. ఎవరిని వెతుకుతున్నావు. మీ వారిన.. ఇప్పుడే ఆశ ని తీసుకొని హాస్పిటల్ కి వెళ్ళారు. ఎవరికైనా బాగోలేదా...
హాస్పిటల్ కి వెళ్ళారు అనగానే విరక్తిగా నవ్వుతుంది.
ఏమిటే నీ చూపులు.. నీ నవ్వు తేడగా ఉంది. మాట్లాడవేమిటి అని కదిపితే...
మాట్లాడటానికి ఏముందమ్మా. అంతా అయిపోయింది. ఏమైపోయిందే... మీ అల్లుడు నా కూతుర్ని హాస్పిటల్ కి ఎందుకు తీసుకువెళ్లారో తెలుసా.. తన కూతురు అవునో కాదో తెలుసుకోవడానికి.
లక్ష్మీ భయంగా చూస్తూ ఏం మాట్లాడుతున్నావు. అవునమ్మా.. చేసిన పాపం ఎక్కడికి పోతుంది. ఆరోజు లహరి జీవితం నాశనమైనా పరవాలేదు. నా చెల్లి జీవితం బాగుండాలి అని కోరుకున్నాను.
అదే శాపమై ఈరోజు నా శీలాన్ని పరీక్షిస్తుంది. మీరు అనుకున్నది సాధించడం కోసం మయూరిని ఎవరి పక్కలోకో పంపడానికి సిద్ధపడినప్పుడు...
ఆశ నాకే పుట్టింది అనడానికి గ్యారెంటీ ఏమిటి అని అడిగారు అమ్మ..ఆయన కూతురైతే తీసుకుని వెళ్ళిపోతారంట..
ఒకవేళ కాకపోతే నాకే వదిలేసి ఆయన ఒక్కరే వెళ్లిపోతారంట.. చూసావమ్మా విధి. మనం ఆడుతున్నప్పుడు మనదే పై చేయి అనుకుని విర్రవీగుతాము.
ఆట న్యాయంగా లేనప్పుడు ఎక్కడ మెలిపడితే మనం ప్రాణాలు ఉండగానే ఏమీ లేనట్టుగా అయిపోతామో అక్కడే మెలిపడుతుంది.
మనం తెలుసుకోము. ఏ జన్మలో ఏ పాపం చేసామో ఇప్పుడు ఇలా అనుభవిస్తున్నాం అనుకుంటాము కానీ.. ఈ జన్మలో చేసిన పనులు గురించి ఆలోచించము.
నువ్వు అలా మాట్లాడకు సునంద. నాకు భయం వేస్తుంది.. ఎందుకమ్మా భయం. మాలాంటి సంతానాన్ని కన్నందుకు... నువ్వు బ్రతికున్నంత కాలం ఏడుస్తూ ఉండమని ఆ దేవుడు నీ నుదుటిపైన రాసాడు.
లేదు అల్లుడుగారు అలా వెళ్లరు. నేను రుద్రా తో మాట్లాడుతాను. రుద్రతో చెప్పిస్తాను. ఏమని చెప్పిస్తావు. ఈ గొడవ అంతా జరిగేటప్పుడు రుద్ర అక్కడే ఉన్నాడు.
రుద్రా ఆ ఇంటికి వచ్చాడా.. భార్యని తీసుకుని వచ్చాడు. శాంభవిని తీసుకువచ్చాడా.. నీకు తెలుసా ఆ అమ్మాయి... తెలుసు.
దేవేంద్ర లహరి కి పుట్టిన సంతానం. అవును. తన భార్య కి విషయం తెలిసి బాధపడిందంట... భార్య భాద తీర్చడానికని ఆ ఇంటికి వచ్చి అల్లకల్లోలం చేశాడు.
నా భర్త ముందు.. నా నోటితోనే నేను చేసిన తప్పును చెప్పించాడు. మమ్మల్ని అక్కడికి రప్పించింది కూడా రుద్రనే..
ఏం మాట్లాడుతున్నావ్ సునంద.. అవునమ్మా రుద్ర మా వారికి ఫోన్ చేసి మీ అల్లుడు గురించి తెలియాలి అంటే ఆ ఇంటికి రా అని ఫోన్ పెట్టేసాడు.
మేము వెళ్లేసరికి మయూరికి నాన్నగారికి పెట్టాల్సిందంతా పెడుతున్నాడు. మేము వెళ్ళాక నాకు పెట్టాల్సింది పెట్టాడు. ఇప్పుడు నేను మొగుడు వదిలేసిన సుమంగళిని .
అలా మాట్లాడకు సునంద. రుద్ర గురించి నాకు తెలుసు. తప్పు చేసిన వాళ్ళకి శిక్షిస్తాడేమోగాని... హింసించడు. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా... తప్పకుండా క్షమిస్తాడు .
రుద్ర క్షమాపణతో నాకు సంబంధం లేదమ్మా..మా వారు నన్ను క్షమించి మా ఇంట్లో నన్ను పనిమనిషిగా ఉంచినా చాలు...
మా వారు రానివ్వకపోతే నాకు చావే శరణ్యం. ముందు లోపలికి రా.. తీసుకువెళ్లి కూర్చోబెట్టి.. జ్యోతి. కొంచెం మంచినీళ్లు, టీ తీసుకురా..
అలాగే అత్తయ్య అని తెచ్చిస్తుంది..ముందు మంచినీళ్లు తాగు అని పట్టించి టీ తాగు తర్వాత మాట్లాడుకుందాం. వీళ్ళు వెళ్లి ఎంతసేపయిందమ్మా..
నువ్వు వచ్చే ముందే వెళ్లారు. శేషాద్రి వైపు చూస్తూ ఒకసారి మీ బావగారికి ఫోన్ చేయరా.. సరే అని ప్రభాకర్ కి ఫోన్ చేస్తాడు.
లిఫ్ట్ చేసి చెప్పు.. ఎక్కడున్నారు బావగారు.. చెప్పాను కదా హాస్పిటల్ లో ఎవరున్నారు.. ఎవరికి బాగోలేదో చెబితే మేము వస్తాము.
ఆల్రెడీ సునంద ఇంటికి చేరినట్టుంది.. విషయం మొత్తం చెప్పే ఉంటుంది కదా... అది కాదు బావగారు..ఇంకా మీరు వరుసలు.. పిలుపులు మానేస్తే మంచిది.
నా కూతుర్ని తీసుకోని వెళ్ళిపోతున్నాను. మీ ఇంటి మనుషులు పొరపాటున కూడా నా ఇంటి గుమ్మం తొక్కదు.
ఇది హెచ్చరిక అనుకుంటావో ఇంకా ఏదైనా అనుకుంటావో నీ ఇష్టం. మళ్లీ నన్ను కదిపితే ఇంత సౌమ్యంగా మాత్రం సమాధానం చెప్పను.. నా సంగతి మీకు బాగా తెలుసు అనుకుంటా అని ఫోన్ పెట్టేస్తాడు.
శేషాద్రి స్పీకర్ పెట్టి మాట్లాడడం వలన అందరూ వింటారు. సునంద ఏడుస్తూ తల్లిని పట్టుకుని ఇంకా నా జీవితం ఇంతేనా...
ఈ వయసులో భర్తకి, కన్నబిడ్డకి దూరంగా బ్రతకాల.. నలుగురికి తెలిస్తే కాకులు లాగ పొడుచుకుని తింటారు. దీనికన్నా నేను చచ్చిపోవడమే మంచిది.
సునంద పరిస్థితి...
కథ కొనసాగుతుంది......
Posts: 4,804
Threads: 9
Likes Received: 3,182 in 2,464 posts
Likes Given: 11,247
Joined: Sep 2019
Reputation:
31
Posts: 1,610
Threads: 2
Likes Received: 952 in 732 posts
Likes Given: 2,133
Joined: May 2019
Reputation:
11
14-04-2026, 09:27 AM
(This post was last modified: 14-04-2026, 09:27 AM by ash.enigma. Edited 1 time in total. Edited 1 time in total.)
Very very interesting.. how Rudra is handling the issue.
All credit to the writer for the excellent story telling!!
Posts: 1,156
Threads: 1
Likes Received: 730 in 473 posts
Likes Given: 10,905
Joined: Jun 2019
Reputation:
2
Nagendra and his family are able to understand what mistakes that have done. Waiting for how Mayuri talks to her father.
Posts: 898
Threads: 13
Likes Received: 7,010 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
Part - 85
సునంద ఏడుస్తూ ఉంటే బాధగా అనిపిస్తుంది. నువ్వు బాధపడకు. అల్లుడుగారితో నేను మాట్లాడతాను. నా మాట వింటారు సరేనా..
జ్యోతి లోపలికి తీసుకు వెళ్లు అని పంపించి రుద్రకి ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ చూసి నవ్వుకుంటూ లిఫ్ట్ చేసి చెప్పండి.. ఏమిటి నువ్వు చేసింది.
నేనేం చేశాను. సునంద పుట్టింటిలో ఉండిపోయింది. అవునా.. నీకు తెలియదా.. తెలిసి కూడా తెలియనట్టుగా మాట్లాడుతున్నావా.
మరి బాగుంది. మొగుడు పెళ్ళాలు ఇద్దరు ఏదో అనుకుంటే దానికి నేను ఎలాగా కారణం అవుతాను.. ఆ రోజు నమ్మించగా లేనిది ఈరోజు తన భర్తని ఏదో ఒకటి చెప్పి నమ్మించి వెళుతుంది. మీరు టెన్షన్ పడకండి.
లేదు రుద్ర సునంద మారింది. అప్పటి సునంద కాదు. తల్లి ప్రేమ కదా.. మీకు అలాగే అనిపిస్తుంది. ఇదిగో మీ అల్లుడు ఫోన్ చేస్తున్నాడు.
మళ్ళీ మాట్లాడతానని పెట్టేసి లిఫ్ట్ చేసి చెప్పండి..నా కూతుర్ని తీసుకుని నా ఊరు వెళ్ళిపోతున్నాను. ఇక ఈ మనుషులతో నాకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు నా అల్లుడు నీ అప్పచెబితే ...
మళ్లీ గ్రాండ్గా పెళ్లి చేసి అందరికీ పరిచయం చేస్తాను. అతను ఎలాంటి వాడో తెలుసుకోకుండా అల్లుడు అని చెప్పుకుంటున్నారు.. ఒక్క నిమిషం ప్రభాకర్ సైలెంట్ గా ఉంటాడు. నీ మీద నాకు నమ్మకం ఉంది రుద్ర.
జరిగిన అన్యాయనికి బదులు తీర్చుకోవాలి అనుకుంటున్నావు కానీ కొత్తగా అన్యాయం నువ్వు చెయ్యలేవు. అది మీ రక్తంలోనే లేదు ఉంటాను అని ఫోన్ పెట్టేస్తారు.
శాంభవి ఏం చేస్తుందో అని గదిలోకి వెళ్తాడు. మౌనంగా కూర్చుని ఉన్న శాంభవి దగ్గరికి వెళ్లి పాప అని పిలుస్తాడు. మౌనంగా చూస్తుంది.
ఏంట్రా ఇలా ఎన్ని రోజులు ఉంటావు. నాకు బెంగగా ఉంది అంటుంది. ఇలా రా అని ఒళ్ళో కూర్చోబెట్టుకుని.. ముంగురులు సవరుచేస్తూ.. దేనికి బెంగ.
రేపల్లె వెళతావా.. మామయ్య వాళ్ళతో టైం స్పెండ్ చేసి వస్తావా.. ఉహూ.. తల అడ్డంగా ఊపుతుంది మరి ఇంకేమిటి...
నన్ను ఒకసారి అ.. మ్మ.. ఉహూ..కాదు. మీ చిన్నత్త దగ్గరికి తీసుకువెళతావా.. రుద్రకి ఆనందం, ఆశ్చర్యం రెండు ఒకేసారి కలుగుతాయి.
తప్పకుండా తీసుకువెళతాను. దానికి ఇంత మొహమాటంగా అడగాలా.. రేపే తీసుకువెళ్ళు.. మనిద్దరమే వెళదాము. తప్పకుండా బంగారం.
నేను ఎంతసేపు ఉండాలి అనుకుంటున్నానో.. అంతసేపు నాతోపాటు ఉంటారా... బోర్ అని ఫీల్ అవ్వరు కదా..
నీతో బోర్ ఫీల్ అవ్వడం ఏమిటిరా...
నువ్వు ఎక్కడుంటే అక్కడే నాకు సంతోషం ఉంటుంది. నిజంగానా.. అది నీకు తెలియదా.. వెంటనే ఒళ్ళో ఉన్న శాంభవి రుద్రని హగ్ చేసుకుని అలాగే ఉండిపోతుంది.
శాంభవి చుట్టూ చేతులు బిగించి గట్టిగా పట్టుకుంటాడు. వదలొద్దు. నా ప్రాణం ఉండగా అది జరగని పని. ఇంకా గట్టిగా పట్టుకో. సరే అని ఇంకా దగ్గరికి లాక్కుని పట్టుకుంటాడు.
శాంభవిలో జరుగుతున్న సంఘర్షణ అర్థమవుతూ ఉంటే... మౌనంగా శాంభవిని దగ్గరకి లాక్కుని కళ్ళు మూసుకుంటాడు. రుద్ర భుజం మీద నిద్ర పోతుంది.
శ్వాసలో తేడా అర్థమయ్యి మెల్లిగా ఎత్తుకొని తీసుకువెళ్లి మంచం మీద పడుకోబెట్టి పక్కన పడుకుని దగ్గరికి లాక్కుని చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకుంటాడు.
ఉదయం తొందరగా లేచి రెడీ అవుతుంది. రుద్ర కూడా రెడీ అవుతాడు. శాంభవి మాత్రం మౌనంగానే ఉంటుంది. శాంభవి చేసే ప్రతి పని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు.
రెడీ అయి వచ్చి చారులత దగ్గరికి వెళ్లి అమ్మ మేమిద్దరం చిన్న అత్తయ్య దగ్గరకు వెళుతున్నాము. ఇప్పుడా.. నీ ముద్దుల మేనకోడలు అడిగింది.
ఏమంటున్నావ్ రా అని వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ అడిగితే.. అవును రాత్రి అడిగింది. అమ్మ అని పిలవాలని ఉంది పిలవలేకపోతుంది.
ప్రస్తుతం చాలా సంఘర్షణ జరుగుతుంది. . దేనికి తీసుకువెళ్లమంది. తెలియదు చూద్దాం అని... శాంభవి వస్తుంటే సైలెంట్ అవుతాడు.
మౌనంగా ఉన్న శాంభవిని చూసి టిఫిన్ చేసి వెళ్ళండి రా.. ఆకలిగా లేదండి అని స్లోగా చెబుతుంది. అండినా...
సరేలే.. ప్యాక్ చేసేస్తాను..బయట ఫుడ్ వద్దు అని చెప్పి టిఫిన్ ప్యాక్ చేసి ఇచ్చి.. లంచ్ పంపిస్తాను.
సరే అని ఇద్దరూ కలిసి బయలుదేరుతారు. దగ్గరకి వచ్చేసాం అనగా కార్ సైడ్ కి ఆపితే.. ఎందుకు అన్నట్టుగా చూస్తుంది.
ముందు టిఫిన్ తిను. ఇప్పుడు ఏమి వద్దు అంటుంది. నిన్నటిదాకా మంచం మీద ఉన్నావు. రాత్రి కూడా సరిగ్గా తినలేదు. తినరా అని తినిపిస్తాడు.
ఏమీ మాట్లాడకుండా తింటుంది. చూడు పాప.. నీకు సూట్ గాని క్యారెక్టర్ లోకి నువ్వు దూరి ఎందుకు సైలెంట్ గా ఉంటావు.
ఇప్పుడు ఏం జరిగిందని.. నువ్వు ఎంత లక్కీనో తెలుసా.. ఎవరికైనా పేరెంట్స్ ఒక్కరే ఉంటారు. ఒక అమ్మ, ఒక నాన్న, ఒకళ్లు లేక ఇద్దరు సిబ్లింగ్స్.. ఎక్స్పెక్ట్ రా..
బట్ నీకు రెండు ఫ్యామిలీస్. అక్కడ ఇద్దరు నాన్నలు ఇక్కడ ఇద్దరు నాన్నలు.. అక్కడ ఇద్దరు అమ్మలు.. ఇక్కడ ఇద్దరు అమ్మలు.
అక్కడ ముగ్గురు అన్నయ్యలు.. ఇక్కడ ముగ్గురు అన్నయ్యలు. ఇలాంటి బంపర్ ఆఫర్ ఎంతమందికి ఉంటుంది చెప్పు.
ఆఫర్ ని ఎంజాయ్ చేయాలి కానీ నాకెందుకు వచ్చిందా అని ఏడుస్తూ కూర్చుంటే ఎలాగా అని మాటలు చెబుతూ మొత్తం తెనిపించి...
నువ్వు తింటే సరిపోయిందా మొగుడు తిన్నాడో లేదో అవసరం లేదా.. రుద్ర వైపు చూస్తుంది. నాకు ఆకలేస్తుంది. తినండి అంటుంది.
నీకు ఎవరు తినిపించారు. నేనే కదా.. మరి అలా నాకు నువ్వు తినిపించాలి కదా.. నువ్వు తినిపిస్తే తింటాను. లేకపోతే వద్దు.
రాత్రి నువ్వు సరిగ్గా తినలేదని నేను కూడా తినలేదు. బాగా ఆకలేస్తుంది అంటాడు..సరే నాకు ఇవ్వండి అని తినిపిస్తుంది.
తినిపిస్తూ ఉంటే కావాలనే వేళ్ళు లీక్ చేస్తూ ఉంటాడు. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు. ఏం చేశాను. మీరు ఏం చేశారో మీకు తెలుసు.. నాకు తెలుసు.
మళ్లీ నా నోటితో చెప్పించాలని ఎందుకు మీకు అంత సరదా.. చెబితే ఎలా ఉంటుందో తెలుసుకుందాం అని...
అంత అవసరం లేదు గాని సైలెంట్ గా తినండి అని తినిపించి చెయ్యి కడుక్కుంటుంది.
రుద్ర మళ్లీ కార్ స్టార్ట్ చేస్తాడు..డైరెక్ట్ గా అది లహరి సమాధి ఉన్న ప్లేస్ కి వెళుతుంది..కారు దూరంగానే ఆపుతాడు.
ఇద్దరూ దిగి నడుచుకుంటూ వెళతారు..శాంభవి చుట్టూ చూసి వద్దాం పద అంటే...సరే అని శాంభవి వెనకాలే నడుస్తాడు.
ప్రతి చెట్టు.. ప్రతి పండుని పువ్వుని అనువణువును చూస్తూ ఉంటుంది. రుద్ర మౌనంగా శాంభవిని చూస్తూ నడుస్తూ ఉంటాడు.
మొత్తం అంతా తిరిగి దేవాలయంగా చూస్తున్న లహరి సమాధి దగ్గరకి వస్తుంది. అప్పటికే ఆ ప్లేస్ మొత్తం శుభ్రం చేసి ఫ్రెష్ పువ్వులు పెట్టి ఉంటాయి.
రుద్ర వంక చూస్తుంది. చిన్నగా నవ్వుతూ రోజు చినమామే పొద్దుటే వచ్చి పెడతాడు. ఇంత దూరం వచ్చా.. నా అనుకునే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళతారు.
ఒక పక్కకు తలతిప్పి చూపిస్తాడు. అక్కడే చిన్నగా ఫామ్ హౌస్ వేసి ఉంటుంది..మావయ్య నువ్వు రాకముందు ఇక్కడే ఎక్కువ ఉండేవాడు.
ఓ అని సైలెంట్ అవుతుంది. లహరి సమాధి ముందు కూర్చుని తదేకంగా చూస్తూ ఉంటుంది. రుద్ర పక్కనే కూర్చుంటే... రుద్ర ఒళ్లో తల పెట్టుకొని కాళ్లు ముడుచుకొని పడుకొని అలాగే చూస్తూ ఉంటుంది.
రుద్ర డిస్టర్బ్ చేయకుండా తల పైన చెయ్యివేసి నిమురుతూ.. సమాధి వైపు చూస్తూ అత్తయ్య నీ కూతురు చాలా నలిగిపోతుంది.
సమస్య అంటే సమస్య కాదు... అలాగని వదిలేసేది కాదు.. శాంభవి మనసుని కుదుటపరుచు. సరైన నిర్ణయం తీసుకునేటట్టుగా చూడు అని మనసులోనే ప్రార్థిస్తాడు.
చెట్లు నుంచి చల్లటి గాలి వీస్తూ ఉంటుంది.గాలికి సమాధి పైన ఉన్న పువ్వులు వచ్చి శాంభవి పైన పడతాయి. రుద్రా కి చాలా సంతోషంగా అనిపిస్తుంది.
శాంభవి చూస్తూనే రుద్ర ఒళ్ళో నిద్రపోతుంది. రుద్ర కదలకుండా అలాగే కూర్చొని ఉంటాడు. చాలాసేపటికి రుద్రా కి ఫోన్ వస్తూ ఉంటే... ఆ వైబ్రేషన్ కి డిస్టర్బ్ అయ్యి శాంభవి కళ్ళు తెరుస్తుంది.
సోరి డిస్ట్రబ్ అయ్యావా... ఇప్పటివరకు మీ ఒళ్ళోనే పడుకున్నానా.. కాళ్లు పట్టేసాయా.. నథింగ్.. నీకు నిద్ర పట్టింది కదా అది చాలు.
మళ్లీ ఫోన్ రింగ్ అవుతుంది. ఒక్క నిమిషం అని లిఫ్ట్ చేసి చెప్పరా.. లోపలికి రావచ్చా అని అడుగుతాడు. శాంభవి మొహం చూసి రండి.
ఎవరు అంటే... మీ అన్నలు ముగ్గురు వచ్చారు. శాంభవి ముఖం వెలుగుపోతుంది. ఎప్పుడు వచ్చారు. నాకు ఫోన్ కూడా చేయలేదు.
పెళ్లయ్యాక చెల్లి కన్నా బావగారే ఎక్కువైపోయినట్టున్నారు.. లోపలికి రాని.. చెబుతా.. ఆవేశంగా మాట్లాడుతూ.. ఏం మాట్లాడిందో గుర్తుకు వచ్చి రుద్ర ఫేస్ చూసి సైలెంట్ అయిపోతుంది.
ఏమైందని అంత సడన్ గా సైలెంట్ అయిపోయావు. నే.. ను.. మా అన్నయ్యలు.. అదే రేపల్లె... ముక్కలు ముక్కలుగా చెబుతూ ఉంటే...
నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది. ఇప్పటివరకు నీకు అన్నయ్య అంటే వాళ్ళ ముగ్గురే కాబట్టి వాళ్లే మెదిలారు.
దీనికి నువ్వెందుకు గిల్టీగా ఫీల్ అవుతున్నావు. మీరు తప్పుగా అనుకోలేదా.. ఇందులో తప్పుగా అనుకోవడమేముంది.
ఒక్కసారిగా వీళ్ళ ముగ్గురిని కూడా అన్నయ్యలు అనుకోవాలి అంటే కొంచెం టైం పడుతుంది. ఆ మాత్రం అర్థం చేసుకోలేనా..ఏమిటి..
నిన్న అక్కడ అరిచినా అరుపులకి నిజంగానే నాకు భయం వేసింది. ఇప్పుడు కూడా నా మీద అలాగే కోప్పడతారేమో అని..
ఈసారి రుద్ర సీరియస్గా చూస్తాడు. ఇప్పుడే కదా కోపం రాలేదు అన్నారు.. మళ్ళీ అలా చూస్తున్నారు ఎందుకు? నీ ఉద్దేశం ఏమిటి..
నేను ఎప్పుడు ఎవరో ఒకళ్ళ మీద అరుస్తూ ఉంటాను అనా.. నేను అలా అనలేదే.. లేకపోతే నువ్వు... వాళ్లు ఒకటే ఆన.. అలా అని నేనెప్పుడూ అన్నాను.
ఇప్పుడు నువ్వు అన్నదానికి ఉద్దేశం అదే..
ఏంటి బావ మేము ఎవరం లేకుండా చూసి మా చెల్లి మీద అరుస్తున్నావు. ఇక్కడ మేము ముగ్గురం ఉన్నాము.
శాంభవి రియాక్షన్......
Posts: 898
Threads: 13
Likes Received: 7,010 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
Part - 86
ఏంటి బావ మేము లేకుండా చూసి మా చెల్లిని ఏదో అంటున్నావు.. ఇక్కడ మేము ముగ్గురం ఉన్నాము.
ఆ మాటలకే శాంభవి వెనక్కి తిరిగి చూస్తుంది.
ఏరా.. మేము లేకుండా చూసి బావ నిన్ను ఏమైనా అంటున్నాడా.. చెప్పు.. ఇక్కడే బావతో గుంజీళ్లు తీయిపిస్తాము.
శాంభవి పక్కన కూర్చుంటారు. అబ్బో వచ్చారండి ముగ్గురు మొనగాళ్లు.. శాంభవి మౌనంగా చూస్తూ ఉంటే.. విహాన్ ఫుడ్ మొత్తం తీసి అక్కడ సర్దుతాడు.
అన్నీ ఒక ప్లేటులో సర్ది లహరి ముందు పెడతారు. శాంభవి మౌనంగా తన ప్లేటు తీసుకుంటుంది... విహాన్, అద్వైత్, ధీరజ్ మొదటి ముద్ద కలిపి నోటి దగ్గర పెడతారు.
వాళ్ళ ముగ్గురిని చూస్తూ ఉంటే.. ఏంట్రా మా చేతితో పెడితే తినవా.. చిన్నప్పటినుంచి నీకు ఇలాగే తినిపించాలి అనుకున్నాము.
కాళ్ళకు పట్టీలు పెట్టుకుని పట్టు పరికిణి వేసుకొని.. వెనకాలే తిరుగుతూ ఉంటే ఒక రక్షణగా నిలబడాలి అని ఎంతో ఆశ పడ్డాము.
అన్నయ్యలు అయితే వేదనలో మునిగిపోయారు.
తమ రక్తమాంసాల బంధం ఎదుటే కూర్చుంది.., కానీ తాకనీయని దూరంలో ఉందని గ్రహించిన క్షణం —
అది హృదయాన్ని ఛిద్రము చేసే మౌనం.
మా కోరిక చాలా పెద్దది అనుకుంటా.. అందుకే భగవంతునికి కూడా ఇంత సమయం పట్టింది. వెంటనే శాంభవి నోరు తెరుస్తోంది.
ముగ్గురు మోచేతితో కన్నీళ్లు తుడిచుకుని తినిపిస్తారు. ఒక ముద్ద అన్నది మొత్తం అన్నం అంతా తినిపిస్తారు. ఇంక నాకు చాలు అన్న..... ఆ పిలుపు గొంతులోనే ఆపేసి చాలండి అంటుంది.
ఆ చెల్లెలి కళ్లలో ఆవేదన కనిపిస్తూనే ఉంది.
ఆమె చెప్పకపోయినా, తన మౌనం మాటలకన్నా బలంగా అన్నయ్యల హృదయాలను తాకింది.
తమ ప్రేమను అర్థం చేసుకున్నదని తెలుసుకున్నారు, కాని అంగీకరించలేని బాధను కూడా అర్థం చేసుకున్నారు.
ఏరా.. అన్నయ్య అని పిలవాలి అంటే ఇంకా ఇబ్బంది పడుతున్నావా... శాంభవి ప్లేటులో అన్నం కలుపుతూ వాళ్ల ముగ్గురికి తినిపిస్తుంది. రుద్రకి కూడా ముద్ద పెడుతుంది.
నలుగురికి చాలా సంతోషాంగా అనిపిస్తుంది. చెల్లి చేతిని ముద్దు పెట్టుకుంటూ ఎంత తింటున్నారో తెలియకుండా పొట్ట పగిలేలాగా తింటారు.
అన్నయ్య అని పిలవాలని ఉన్న గుండెల్లోంచి ఒక అడ్డంకి తన్నుకొస్తుంది.. ఎప్పుడు పిలిచే సులువైన ఆ మాట, ఇప్పుడు మాత్రం భారంగా మారింది.
ఒప్పుకోలేక… కాదనలేక… ఆ కళ్ల మధ్య ఒక నిర్ఘాంతు గోడలా నిలిచింది.
అదే క్షణం అన్నయ్యల ఆవేదన విరబూసింది –
మనకు ఉన్న బంధం నీకు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు రా.. ఒప్పుకుంటే మా అంత అదృష్టవంతులు లేరు ఎందుకంటే... మా గుండెల్లో నువ్వు ఎప్పటినుంచో ఉన్నావు. నీ మౌనం కూడా నీ ప్రేమే.
అన్నయ్యలా మాటలతో శాంభవికి కన్నీళ్లు ఉబికి, మాటలకందని బంధం మౌనంలోనే మరల కలిసింది.
కన్నీళ్ళతో ముగ్గురిని చూస్తూ అన్నయ్య అని గట్టిగా పట్టుకుంటుంది.
వెంటనే ముగ్గురు శాంభవి చుట్టు చేతులు వేసి బావ మా చెల్లి మమ్మల్ని అన్నయ్య అని పిలిచింది. విన్నావా.. విన్నాను లేరా...
ఇందాకటి నుంచి మీ సెంటిమెంట్ డ్రామా చూడలేకపోతున్నాను. కాస్త క్లోజ్ చేయండి రా బాబు...
నీకు కుళ్ళు బావ.. మమ్మల్ని ఇలా చూసి.
అవును మిమ్మల్ని చూసి నేను కుళ్ళు కోవాలి.
ఇంకా వెళదామా అని శాంభవిని అడిగితే... హ.. అంటుంది. లేదుఅంటే కాసేపు ఉందామన్న ఇక్కడే ఉందాము.
పర్వాలేదు మళ్ళీ వద్దాము. ఒకే కదా.. అరే నా చెల్లి పరవాలేదు అని చెబుతుంటే మళ్ళీ అన్నిసార్లు అడిగి విసిగిస్తావు ఎందుకు?
ఒరేయ్ నువ్వు మాతో రారా.. బావ ఒక్కడే వస్తాడు. నేను మాత్రం మీకు అడ్డొచ్చానా. మా అన్న చెల్లెలు మధ్యన నువ్వు ఎందుకులే..
అబ్బో ఆ ముక్క ఏదో నీ చెల్లిని చెప్పమను.. శాంభవి ఇబ్బందిగా చూస్తూ ఉంటే.. పోనీ అందరం ఒక్క కారులోనే వెళదాము.
అక్కడున్న సెక్యూరిటీని పిలిచి ఇంకో కారు తీసుకురమ్మని మొత్తం అందరూ ఒకే కార్ లో సంతోషంగా సరదాగా కబుర్లు చెప్పకుండా ఇంటికి వస్తారు.
కారు దిగాక వీళ్లు నవ్వుల శబ్దం వినపడి పెద్దవాళ్ళు అందరూ బయటకి వచ్చి చూస్తారు.
రాఘవేంద్ర కళ్ళు తడిచేరితే... రుద్ర ఏంటి తాతగారు మీ ముద్దుల మనవరాలిని ఇలా చూసి మురిసిపోతున్నారా... రుద్ర చుట్టూ చేతులు వేసి అవునురా.. ఇదంతా నీవల్లే... మళ్లీ మన జీవితంలోకి వెలుగుని తీసుకువచ్చావు.
శాంభవి మెల్లిగా రాఘవేంద్ర గారి ముందుకి వచ్చి తాతగారు అని పిలుస్తుంది. ఆ పిలుపు కోసమే ఎన్నో సంవత్సరాలగా ఎదురుచూస్తున్న ఆ పెద్దాయన గుండె వణుకుతుంది.
మిగతా మనవలు చూడండి, తాతయ్య ఆనందంతో ఎంత మెరిసిపోతున్నారో అని చెప్పుకుంటే, ఆయన మాత్రం ఒక మాట మాత్రమే పలికారు....
నా జీవితంలో నాకొచ్చిన గొప్ప వరం ఇది. నా రక్తం, నా బంధం దూరం కాదు—ఇప్పుడే సంపూర్ణమైంది.
ఆ క్షణం తాతగారి గుండె నిండిపోయింది.
ఆనందంతో ఆయనకి అనిపించింది—ఇక తన వయసు, కష్టాలు అన్నీ చిన్నవే, ఎందుకంటే తన వారందరూ ఇప్పుడు తన వద్దే ఉన్నారు.
మనవరాలిని గట్టిగా పట్టుకొని నా బంగారు తల్లి.. నా ముద్దుల తల్లి.. మా అమ్మే.. మళ్లీ మా అమ్మ నా దగ్గరికి వచ్చేసింది అని ముఖమంత ముద్దులు పెట్టేస్తూ ఉంటారు.
చారు వచ్చి నాన్నగారు కొంచెం మీ ఆనందానికి అడ్డుకట్ట వేయండి. ఈ ఆనందాన్ని నేను ఆపలేను రా... ఒరేయ్ మనవళ్ళు...
చెప్పండి తాతగారు. రేపు కంపెనీకి అందరికీ బోనస్ ప్రకటించండి. రెండు నెలలు కాదు... ఆరు నెలలు కాదు... సంవత్సరం బోనస్ ఇచ్చేయండి.
శాంభవి రాఘవేంద్ర గారి దగ్గర నుంచి దూరం జరుగుతుంది. దేవేంద్ర వైపు చూస్తోంది. కూతురి రాక కోసమే కన్నీళ్ళతో ఎదురుచూస్తున్న తండ్రి దగ్గరికి మెల్లిగా వెళుతుంది.
అందరూ మౌనంగా చూస్తూ ఉంటారు. ఇప్పుడు శాంభవి ఏమి మాట్లాడుతుందా.. దేవేంద్ర ఎలా స్పందిస్తాడా అని టెన్షన్ గా చూస్తూ ఉంటారు.
శాంభవి దేవేంద్ర ముందు నిలబడి కాళ్లకి నమస్కరించి నాన్నగారు అని పిలుస్తుంది.
23 సంవత్సరాల తర్వాత పురిటిలోనే దూరమైన కూతురు "నాన్న" అని పిలిచిన క్షణం…
ఆ ఒక్క మాటలోనే తండ్రి హృదయం కదిలిపోతుంది.
చిన్నప్పుడు ఒకసారైనా గుండెలపై పెట్టుకొని చూడలేకపోయిన తన రక్తమాంసాలు కదిలే కూతురు, ఇప్పుడు ఎదుగిన యువతిగా ఎదుట నిలబడింది.
కూతురు పెదవుల మీద జారిన ఆ మధురమైన "నాన్న" అన్న పిలుపు, ఆయన చెవుల్లో ఓంకార శబ్దంలాగా మోగుతుంది—కాలం, దూరం, తపన అన్నీ ఒక్క క్షణంలో మాయమవుతాయి.
గుండె లోతుల్లో ఎన్నేళ్లుగా ఖాళీగా ఉన్న మూల ప్రదేశం, ఆ ఒక్క పిలుపుతో నిండి పొంగిపోతుంది.
కన్నీళ్లతో కూతురిని కౌగిలించుకుంటూ—
"నువ్వు రాలేని ప్రతి పండుగ, నువ్వు లేకపోయిన ప్రతి వేళ, నువ్వు గుర్తొచ్చిన ప్రతి రాత్రి… ఇవన్నీ నువ్వు పిలిచిన నాన్న అనే ఒక్క పిలుపుతో తక్కువైపోయాయి" అని ఆ తండ్రి అంతర్మధనంతో కన్నీళ్ళ తో చెప్పకుంటాడు .
చిన్న చిన్న పిల్లలు కాలేజ్ కి వెళుతున్నప్పుడు.. చూస్తూ ఉంటే నా కూతురు ఇప్పుడు ఎంత ఉంటుందో... కాలేజ్ కి వెళ్తుందా..
ఎలా చదువుకుంటుందో... ఎవరైనా సరైన గైడెన్స్ ఇస్తున్నారా.. లేదా.. మంచి కాలేజ్లో జాయిన్ చేశారో లేదో అని ఆలోచించేవాడిని.
నీ వయసు పిల్లలు కనపడుతున్నప్పుడల్లా నా కూతురు ఎంత ఉంటుంది... అంత ఉంటుందా.. ఒక తండ్రిగా నా అవసరం ఉన్నప్పుడు పక్కన లేకపోయానే అని నేను నలిగి పోయేవాడిని.
నా బంగారు తల్లి నా ఎదురుగా వచ్చినప్పుడు నేనే నీ తండ్రిని అని చెప్పాలని ఆరాటపడ్డాను కానీ పరిస్థితులు అనుకూలించక మౌనంగా మారిపోయాను.
కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. నాన్న చూశారా... నా కూతురు నన్ను నాన్న అని పిలిచింది. అన్నయ్య విన్నావా. చారు విన్నావా అని సంబరంగా చెబుతూ ఉంటారు.
కూతురు కళ్లల్లోనూ కలిసే జ్ఞాపకాల తాపం, తండ్రి కౌగిలిలో గమ్యమవుతుంది.
నాన్న–కూతుళ్ళ మధ్యన మాటల్లో చెప్పలేని బంధం, కన్నీటి గుళికలతో మాత్రమే బయటపడుతుంది.
ఆ క్షణంలో తండ్రికి అనిపించేది ఒక్కటే... ఇంక నా కూతురి ని ఎప్పటికీ విడిచి పెట్టను.
బావగారు అని పిలిస్తే చెప్పండి.. నా కూతుర్ని నా ఇంటికి తీసుకువెళుతున్నాను. మీకు అభ్యంతరం లేదు కదా.. భలే వారే బావగారు.
మీ కూతుర్ని మీరు తీసుకువెళ్లడానికి మాకేం అభ్యంతరం ఉంటుంది. నాన్న అని గట్టిగా రుద్ర అరుస్తాడు. అబ్బా... ఎందుకురా అరుస్తావు.
అందరం ఇక్కడే ఉన్నాము కదా.. నా పెళ్ళాన్ని తీసుకు వెళితే అభ్యంతరం లేదని చెప్పడానికి మీరెవరు... అది నా పెళ్ళాం అని దగ్గరికి లాక్కుంటాడు.
ఒరేయ్ శాంభవి నా కూతురు అని దేవేంద్ర మరో పక్కన పట్టుకుంటాడు. నారి నారి నడుమ మురారిలాగా.. తండ్రి భర్త మధ్యలో శాంభవి నా అని ధీరజ్ అంటాడు.
శాంభవి ఇద్దరి వైపు బిక్కుబిక్కుమంటూ చూస్తుంది. నా కూతురు కావాలి అనుకుంటే ఇల్లరికం వచ్చేయ్ అల్లుడు... నేనేమీ కాదనను.
నీ కూతురు కావాలి అనుకుంటే నువ్వే అల్లుడురికం వచ్చేయండి మామగారు.. నేను అస్సలు మొహమాట పడను.
మీరిద్దరూ కొట్టుకుని అమ్మాయిని నలపడం కాదు. అసలు శాంభవి ఏమి చెబుతుందో అది ఫాలో అవ్వండి అని కౌసల్య అంటుంది.
అది నిజమే... నువ్వు చెప్పు పాప అని రుద్ర అడుగుతాడు. బంగారు తల్లి చెప్పరా నాన్నతో ఉంటాను అని దేవేంద్ర అడుగుతాడు.
శాంభవి సమాధానం....
Posts: 898
Threads: 13
Likes Received: 7,010 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
Part - 87
శాంభవి ఎటూ చెప్పలేక ఇద్దరు వైపు చూస్తూ ఉంటుంది. జితేంద్ర వచ్చి ఏరా నిన్నటిదాకా నా కూతురు నన్ను నాన్న అని పిలిస్తే చాలు అనేవాడివి...
నువ్వేమో ఈ రిలేషన్స్ ఒప్పుకుంటే చాలు మావయ్య అనే వాడివి... ఇప్పుడు అన్ని ఒప్పుకునేటప్పటికీ ఇద్దరూ కలిసి నా కూతుర్ని నలేపిస్తున్నారు కదా..
ఇద్దరి నుంచి విడిపించి శాంభవి చుట్టూ చేతులు వేసి వాళ్ళిద్దరూ అలాగే వాగుతారు గాని.. ఆడపిల్లకి పెళ్లి అయ్యాక అత్తారింట్లో ఉంటేనే గౌరవం.
మేము అందరంపొద్దున్నే వచ్చి సాయంత్రం దాకా ఉండి వెళతాము. సరైన మాట చెప్పావు మావయ్య.. అలా కాదు కానీ ఇంకొక పని చేద్దాం అని చారు అంటుంది.
ఏమిటి అది... మొత్తం అందరూ ఒకే చోట ఉండేటట్టుగా ప్లాన్ చేయండి. రేపటి వచ్చే కోడళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఒకే కాంపౌండ్ లో కన్స్ట్రక్షన్ చేయించండి అన్నయ్య.
ఈ ఐడియా బాగుంది. అబ్బో మా అమ్మ కూడా బానే ఆలోచిస్తుంది. ఊరుకో బావ.. అత్తయ్యని ఏం చూసావు. ఆరోజు అత్తయ్య నాగేంద్రకి ఇచ్చిన ఝలక్ చూస్తే... నాకు భయమేసింది.
పైకి చూడడానికి ఏమీ తెలియని అమాయకురాల్లాగా ఉంటుంది. సమయం వచ్చినప్పుడు టాలెంట్ మొత్తం చూపిస్తుంది.
ఈరోజు స్పెషల్ స్వీట్ చేయాలి అని చారు, కౌసల్య కిచెన్ లోకి వెళుతుంటే.. శాంభవి తాతగారు అని పిలుస్తుంది. చెప్పురా...
మిమ్మల్ని ఒకటి అడుగుతాను కాదనరు కదా.. మొట్టమొదటిసారి నా మనవరాలు కావాలని అడుగుతుంది.
ఎలా వద్దంటాను.. అడుగు. నువ్వు ఏది అడిగినా ఇస్తాను. మాట తప్పరు కదా....ఈ రాఘవేంద్ర ఏనాడు మాట తప్పలేదు అడుగుతల్లి.
నానమ్మని క్షమించండి. ఈ వయసులో ఆవిడకి అంత పెద్ద శిక్ష వేయకండి. అందరూ సైలెంట్ అయిపోతారు. శాంభవి దేవేంద్ర వైపు చూస్తూ ఇన్ని సంవత్సరాలుగా ఆవిడకి వేసిన శిక్ష చాలు.
అందరూ చుట్టూ ఉన్న దూరంగా బ్రతకాలి అంటే ఎంత కష్టమో మీకు కూడా తెలుసు.. మన అనుకున్న మనిషిని దగ్గరికి తీసుకోలేకపోతే ఆ బాధ ఎంత దారుణంగా ఉంటుందో మీకన్నా ఎవరికీ తెలుసు నాన్నగారు.
దేవేంద్ర కూతురి తల పైన వేసి అచ్చు నువ్వు మీ అమ్మ లాగానే ఆలోచిస్తున్నావు. మీ అమ్మ కూడా అంతే. ఎంత ద్రోహం చేసిన వాళ్ళనైనా సరే... ఊరికినే క్షమించేది.
ఒప్పుకోండి నాన్నగారు. నాకు ఇష్టం లేకపోయినా నా మనవరాలు అడిగిన మొదటి కోరిక కాదనలేను కదా... నీకోసం ఒప్పుకుంటాను తల్లి. బంగారం రా నువ్వు.
ఒరేయ్ మనవడా... నా మనవరాలని చాలా అపురూపంగా చూసుకోవాలి. అడుగులకి మడుగులు వత్తాలి. ఇంకేమీ అవసరం లేదా తాతయ్య.
ఏది చేసినా పరవాలేదు కానీ నా చిట్టి తల్లి కంటతడి పెట్టకుండా చూసుకో.
శాంభవి విహాన్ వాళ్ళ వైపు చూసి అన్నయ్య వెళ్లి నానమ్మని తీసుకురండి. తాతగారు తీసుకురమ్మన్నారు అని చెప్పండి.
అలాగే ఇప్పుడే వెళ్లి తీసుకు వస్తాము. మీరు వెళ్లనవసరం లేదు. అక్కడ కార్స్ ఉన్నాయి. డ్రైవర్స్ ఉన్నారు. వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి.
తాతయ్య అని శాంభవి పిలిస్తే అలా కాదురా...అందరం ఇక్కడే ఉన్నాం కదా... ఈ సంతోష సమయంలో ఒక్కళ్లు మిస్ అయిన బాగోదు.
మీ అన్నయ్యలు వెళ్లి తీసుకురావడానికి సమయం ఎక్కువ పడుతుంది. అవకాశం ఉంది కదా.. సరే తాతయ్య మీ ఇష్టం అని చెబితే...
విహాన్ వెంటనే ఇంటికి ఫోన్ చేసి విషయం చెబుతాడు. నిజమే చెబుతున్నావురా.. నిజం నానమ్మ. తొందరగా రండి. ఇదిగో ఇప్పుడే వస్తున్న అని కూతురింటికి వస్తుంది.
లోపలికి వచ్చిన అనసూయ కుటుంబం మొత్తాన్ని చూసి అక్కడే మోకాళ్ళ మీద కూర్చుండిపోతుంది. అమ్మ అని చారు వెళితే.. కౌసల్య అత్తయ్య అని వెళుతుంది.
ఎన్ని రోజులకి నా కుటుంబాన్ని ఇలా చూశాను.. నా కూతురు, నా కోడలు మళ్ళీ నా దగ్గరికి వచ్చి అభిమానంగా మాట్లాడుతున్నారు.
ఇదంతా నా మనవరాలు వల్లే కదా.. ఇటు రా తల్లి అని చెయ్యి చాపుతుంది. శాంభవి దగ్గరికి వెళ్లి ముందు మీరు పైకి లేగండి అని అక్కడ సోఫాలో కూర్చోబెడుతుంది.
శాంభవి నీ ముద్దు పెట్టుకుంటు.. నా బంగారు తల్లి. నువ్వు నా మనవరాలేవే అని తెలిసిన రోజున నుంచి దగ్గరికి తీసుకోవాలి అని నా మనసు ఎంతో తహతలాడింది.
ఇన్ని రోజులకి కుదిరింది. అమ్మవారు ఇప్పటికీ నన్ను అనుగ్రహించారు. నేను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తమే లేదు.
నన్ను క్షమించు తల్లి అని కాళ్లు పట్టుకోపోతే... నానమ్మ అని కాళ్ళు వెనక్కి తీసుకొని.. మీరు పెద్దవారు... ఇలా చేయొచ్చా... ఆశీర్వదించాలి కానీ కాళ్లు మొక్కకూడదు.
ఇది అంతా లహరి గుణమే. లహరి కూడా ఎప్పుడు ఇలాగే మాట్లాడేది.
రుద్ర ఆనంద్ కి ఫోన్ చేసి మీరిద్దరూ హైదరాబాద్ వచ్చేయండి అని చెబుతాడు. సరే సార్ అని పెట్టేస్తే.. ఏంటి బావ.. ఆనంద్ వాళ్ళని రమ్మన్నాను.
అప్పచెప్పుతావా.. ఆ ప్రభాకర్ ని నమ్మొచ్చా.. నమ్మొచ్చు. మనిషి పైకి కట్టువుగా ఉంటాడు కాని.. కూతురి విషయానికి వచ్చేటప్పటికి చాలా ఆలోచిస్తున్నాడు.
పరువు ప్రతిష్ట.... అంటే ప్రాణం పెడతాడు కదా... ఏదైనా తేడా వస్తే కూతురు ఫోటోలు ఎక్కడా నెట్ లో హల్చల్ చేస్తాయేమో అని భయం.
ఎప్పుడు వస్తున్నారు. రేపే...
మరి నాగేంద్ర, మయూరి. వాళ్ళిద్దరూ ఎప్పుడో చచ్చిన పాముల్లాగా అయ్యారు. నాగేంద్రని.. భార్య, కొడుకు కూతురు.. టోటల్ ఫ్యామిలీ అసహ్యించుకుంటున్నారు.
ఇక మయూరి సంగతి అంటావా.. చెప్పనవసరం లేదు. ఏదో సాధించాలి అనుకుంది. ప్రేమ... ప్రేమ అని వెంటపడింది కానీ అది ప్రేమ కాదు.. పగ కాదు. ఒక మూర్ఖత్వంలో వెళ్ళిపోయింది.
వయసులో ఏర్పడిన అట్రాక్షన్ కి నాగేంద్ర.. ఆజ్యం పోసాడు. తండ్రి ఏది చెప్పినా తన మంచి కోసమే అనుకుంది. ఇప్పుడు ఇలా ఒంటరిగా మిగిలిపోయింది.
అందరికీ ఆరోజు ఆనందంతో గడిచి పోయింది. రుద్ర రాత్రి గదిలోకి వెళ్లి శాంభవి కోసం వెతుకుతూ ఉంటే..బాత్రూంలో నుంచి వాటర్ శబ్దం వినపడుతూ ఉంటుంది.
మా పాప గారు స్నానం చేస్తున్నారు అనుకుంట.. సోఫాలో కూర్చుని లాప్టాప్ ఓపెన్ చేస్తాడు. స్నానం చేసి నైట్ వేరే వేసుకుని వస్తుంది.
పాప అని పిలిస్తే హ..అని దగ్గరికి వస్తుంది. ఇలా కూర్చో అని లాప్టాప్ పక్కన పెడతాడు. చెప్పండి అంటుంది. ఇది అన్యాయం పాప.
ఇప్పుడేమయ్యింది. అందర్నీ అన్ని రిలేషన్స్ తో.. పిలుస్తున్నావు. నా దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం పిలవడం లేదు.
అయ్యో భర్తగా మీకు మర్యాద ఇస్తున్నాను కదండీ.. బోడి మర్యాద ఎవరికి కావాలి. మరి ఏం కావాలి. బావ అని పిలవవే..
నువ్వు అలా ముద్దుగా.. గారంగా పిలుస్తూ ఉంటే వినాలి అని ఎంతో ఆశగా ఉంది..చిన్నప్పటి నుంచి మిస్ అయిపోయాను.
నువ్వు ఇక్కడే ఉంటే ఇన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు పిలిచే దానివో కదా... అన్నీసార్లు నాకు కావాలి. చాలా..
లేకపోతే జీవితాంతం పిలవనా..
మన షష్టిపూర్తిగా కూడా నువ్వు అలాగే పిలవాలి. లంగా వోని వేసుకొని జడ గంటలు పెట్టుకుని తిప్పుకుంటూ వస్తూ ఉంటే అంటే... ఇంక చాల్లే ఆపండి.
మిమ్మల్ని అలా పిలవాలి అంటే ఒక కండిషన్. ఒకటి ఏమిటి.. 100 కండిషన్స్ పెట్టిన నేను రెడీ...
శాంభవి మౌనంగా మారిపోతుంది... ఏమైంది రా గెడ్డం కింద చెయ్యి పెట్టి అడుగుతాడు. కళ్ళనీళ్ళతో చూస్తూ ఉంటే.. అరే పాపా ఇప్పుడు దాకా బానే ఉన్నావు కదా..
ఇప్పుడు ఈ కన్నీళ్లు దేనికి.. నాన్న గుర్తొచ్చారు. ఈ విషయం తెలిస్తే.. నాన్న తట్టుకోగలరా..
నువ్వు అన్నది కూడా నిజమే.. భాను మావయ్య వాళ్ళు తట్టుకోలేరు. కాని వాళ్లకి నిజం తెలియాలి. శాంభవి కళ్ళు తుడుచుకుంటూ.. నేను అదే మాట్లాడాలనుకుంటున్నాను.
నాన్న వాళ్ళు బాధపడకుండా ఈ విషయం మీరే చెప్పాలి. అలాగే వాళ్ళు ఎప్పటికీ నన్ను కూతురు గానే చూడాలి కానీ పరాయిదానిలాగా చూడకూడదు.
అప్పుడే మిమ్మల్ని బావ అని పిలుస్తాను ఆపైన మీరు కోరుకున్నది కూడా ఇస్తాను.
ఇది అన్యాయం .. ఇప్పటికీ ఇవన్నీ సాల్వ్ చేసి అలసిపోయాను. మాకు కొంచెం బూస్ట్ కావాలి కదా అని నడుం మీద చేతులు వేసి కితకితలు పెడుతూ ఉంటాడు.
మీరు ఎన్ని వేషాలు వేసిన సరే నేను ఒప్పుకోను. నాకు మనస్పూర్తిగా అటు ఇటు అందరూ కావాలి. రేపు మనకి పుట్టబోయే పిల్లలకి రెండు అమ్మమ్మ ఇళ్లు ఉండాలి.
ఇలాంటి ఆఫర్ నాకు తప్ప ఎవరికీ ఉండదేమో పాప. సరే మీ ఆనందం కోసం.. కాదు.. కాదు.. మన ఆనందం కోసం తప్పకుండా చేస్తాను.
రెండు రోజుల్లో రేపల్లె వెళతాను. నువ్వు వస్తావా.. రాను.
నాన్న కన్నీళ్లు చూడలేను. ఇక్కడే మీకోసం నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంటాను.
రుద్ర రేపల్లె ప్రయాణం...
కథ కొనసాగుతుంది.....
|