Posts: 898
Threads: 13
Likes Received: 7,038 in 832 posts
Likes Given: 1,545
Joined: Aug 2024
Reputation:
652
Part - 36
ప్రతిరోజు ఉదయం శ్రీనివాస్ విశికి క్లాసెస్ చెబుతూ ఉంటే తెలియని పాయింట్స్ తెలుసుకుంటూ సబ్జెక్టులో టెక్నిక్స్ నేర్చుకుంటూ ఉంటుంది.
ఒక పక్కన కాలేజ్.. సాయంత్రం రెస్టారెంట్ వర్క్...మార్నింగ్ క్లాసెస్ తో విశి లైఫ్ ఫుల్ బిజీ అయిపోతుంది.
గౌతమ్ గురించి కొంచెం కూడా ఆలోచించే సమయం లేకుండా రోజుల పరిగెడుతూ ఉంటాయి.
గౌతమ్ ఆఫీసులో చిందులు తొక్కుతూ ఉంటాడు. అందరి మీద ప్రెస్టేషన్ చూపిస్తూఉంటే... సెక్రటరీ సార్ అని పిలుస్తాడు.
వాట్ మిస్టర్ మనకొచ్చే ప్రాజెక్ట్ అన్ని వేరే కంపెనీకి వెళ్ళిపోవడం ఏమిటి... ఏం జరుగుతుంది.. హిమగారు ప్రాపర్ గా వర్క్ ఇవ్వడం లేదు సార్.
మనం సబ్మిట్ చేస్తున్న ప్రాజెక్టు ఏమీ ఓకే అవ్వడం లేదు. వాట్.. అవును సార్.. గౌతమ్ కణతల మీద రుద్దుకొని... నేను చూసుకుంటాను.
గౌతమ్ ఆఫీస్ రూమ్ లో కూర్చుని ఆలోచిస్తూఉంటాడు. ఏం చేయాలి... మళ్లీ విశిని ఎలా లైన్లో పెట్టాలి. దీనికంతటికి బెస్ట్ ఆప్షన్ వాళ్ళ మదర్..
వాళ్ళ మదర్ ని యూస్ చేసుకొని విశి ని మళ్ళీ గ్రిప్‌లోకి తెచ్చుకోవాలి. సాయంత్రం వర్క్ చేసే చోటకి వెళ్ళాలి. ఆ ప్లేస్ నాకు నచ్చకపోయినా తప్పడం లేదు.
ఆ ప్లేస్ కి కాకుండా కాలేజ్ కి వెళితే.. కాలేజీలో విశి నా లవర్ అని నలుగురికి తెలిసేటట్టు చేస్తే... అసలే అభిమానం ఎక్కువ.
పరువు కోసం ... ప్రాణాలు తీసుకునే టైపు. సో.. కాలేజ్ లో రూమర్ స్ప్రెడ్ చేస్తే.. హచ్ కుక్కలాగా నా వెనకాలే తిరుగుతుంది. నేను చెప్పినట్టుగా ఉంటుంది.
ఒక పక్కన దాని వర్కు, అందం.. ఇటు హిమతో పెళ్లి... నో ప్రాబ్లం. వాటే ఎ ఐడియా గౌతమ్... నిన్ను కొట్టేవారు లేరు..
కాలేజ్ అయ్యే టైమ్‌కి గౌతమ్ కాలేజ్ ముందు చకోరిపక్షిలాగా నిలబడి ఉంటాడు
చేతిలో రెడ్ రోజెస్ బొకే., చాక్లెట్స్ బాస్కెట్ పట్టుకుని ఎదురుచూస్తూ ఉంటాడు.
కాలేజీ నుంచి వెళ్లే అమ్మాయిలు చూస్తూ.. వావ్. క్యూట్ కదా.. ఎవరి కోసమై ఉంటుంది. వెయిట్ చేద్దామా.. అవును. భలే హ్యాండ్సమ్ గా ఉన్నాడు.
ఆ లక్కీ గర్ల్ ని చూడవలిసిందే.. విశి, భవ్య క్లాస్ బయటికి వచ్చి... పార్కింగ్ ఏరియా కి వెళతారు. అందరూ గుసగుసగా మాట్లాడుకుంటూ ఉంటుంటే..
ఏమయింది.. వెళ్లకుండా ఇక్కడే ఆగిపోయి మరీ గుసగుసలాడుతున్నారు అని భవ్య అడిగితే.. ఒక హ్యాండ్సమ్ అబ్బాయి కాలేజ్ బయట వెయిట్ చేస్తున్నాడు.
మన కాలేజీలోనే చదవాడు అంట... దానికి ఎందుకు అంత ఎక్సైట్మెంట్ అవుతున్నారు.. అయ్యో భవ్య.. ఆ అబ్బాయి.. లవర్ ఈ కాలేజ్ లోనే ఉంది.
మీకేమైనా చెప్పాడా.. ఆ అబ్బాయి వచ్చిన స్టైల్ చూస్తే అర్థం కావడం లేదు.. ఒక చేతిలో రెడ్ రోజెస్ బొకే, మరొక చేతిలో చాక్లెట్ బాస్కెట్ ..
చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. ఆ అబ్బాయి లవర్ నేనయితే ఎంత బాగుండునో అనిపిస్తుంది.. అబ్బా అంత అందంగా ఉన్నాడా. డౌటా..
ఎవరై అంటారా.. విశి నువ్వు స్కూటి తీసుకురా.. నేను చూస్తాను.. మనకి ఎందుకే.. ఒకసారి చూస్తే తప్పేముంది. చూడటానికి వెళుతుంది.
గౌతమ్ ని చూసి.. ఓరి వీడ.. ఇప్పుడు కాలేజ్ అందరం ముందు విశి కి ప్రపోజ్ చేస్తున్నాడా? అమ్మని గౌతమ్.. ఎంత మాస్టర్ ప్లాన్ వేసావు.
ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటికి రావాలి. విశిని వాడు చూడకూడదు. వాడి ఏదన్నా మిస్ బిహేవ్ చేస్తే ఇది కాలేజీలో తిరగలేదు. పరువు కోసం ప్రాణాలు ఇచ్చే టైపు. ఎలా ఈ ప్రాబ్లం నుంచి బయటికి రావాలి.
వెంటనే స్ట్రైక్ అయ్యి... అవును దేవా సార్ అయితేనే ఈ ప్రాబ్లం నుంచి బయటికి తీసుకురాగలరు. వెంటనే దేవా కి ఫోన్ చేస్తుంది.
ఈ టైం లో భవ్య ఫోన్ చేస్తుంది ఏంటి అనుకుంటూ లిఫ్ట్ చేసి చెప్పు భవ్య. సార్ ఎక్కడున్నారు మీరు.. క్యాంపస్ లోనే..
ఏమయింది.. ఆ గౌతమ్ గాడు వచ్చాడు. ఏ గౌతమ్.
అయ్యో సార్... విశి ని ట్రాప్ చేయాలనుకుంటున్నాడే ఆ ఇడియట్..
ఎక్కడున్నాడు అని శ్రీకర్ కి సైగ చేసి కంగారుగా స్టాఫ్ రూమ్ నుంచి బయటికి వస్తాడు. కాలేజ్ బయట మంచి హడావుడిగా వెయిట్ చేస్తున్నాడు.
విశి చూసిందా.. ఇంకా లేదు సార్.. అది ఎక్కడ బయటకు వచ్చేస్తుందో అని నా టెన్షన్ అంతా. సరే నువ్వు విశి దగ్గరికి వెళ్లి మేనేజ్ చేయి.
నేను వస్తున్నాను శ్రీకర్ పద అని స్పీడ్ గా పరిగెడతాడు. ఏమైందిరా.. ఆ గౌతమ్ గాడు ఏదో ట్రిక్ ప్లే చేస్తున్నాడు ఇడియట్ అనుకుని స్పీడుగా వస్తాడు.
భవ్య విశి దగ్గరికి వస్తుంది. స్కూటీని మెల్లిగా నడిపించుకొస్తూ ఉంటే.. స్కూటీ ఉన్నది మనం ఎక్కితే అది తీసుకువెళ్లడానికి..అంతేగాని బ్రతిమాలి నడిపించడానికి కాదు.
అయ్యో భవ్య నాకు స్కూటీ డ్రైవింగ్ అంత పర్ఫెక్ట్ గా రాదు కదా.. అసలు ట్రై చేయాలి కదా... రాదు అనుకుంటే ఏది రాదు.
సరే నువ్వు డ్రైవ్ చెయ్ నేను వెనకాల కూర్చుంటాను.
నాకు రెస్టారెంట్ కి టైం అవుతుంది. సరే అని స్టార్ట్ చేస్తుంది.
ఈ సార్ ఎక్కడ అని చూస్తూ ఉంటే.. దేవా వచ్చి హాయ్.. ఏమిటి ఇంకా ఫ్రెండ్స్ ఇద్దరూ వెళ్లలేదా.. ఇప్పుడే బయలుదేరుతున్నాం సార్.
నేను రెస్టారెంట్ వైపుకే వెళుతున్నాను... డ్రాప్ చేయనా.
థాంక్యూ సర్. నాకు అర్జెంటు వర్క్ ఉంది. విశిని డ్రాప్ చేస్తారా..
భవ్య చేయి పట్టుకుని.. ఏం మాట్లాడుతున్నావు.. సార్ తో నేను వెళ్లడం ఏమిటి.. అబ్బా పరవాలేదు. ప్రతిదానికి భయపడడం ఆపు..
ప్లీజ్ సార్ తీసుకువెళ్లండి. లేట్ అవుతుందని ఇప్పటికే కంగారు పడుతుంది. నో ప్రాబ్లం. విశి రా..అది... ఇబ్బందిగా చూస్తూ ఉంటే..
ప్రతిదానికి నలుగురు ఏమనుకుంటారా అన్నది ఆలోచించవద్దు. ఇక్కడ మనకి వర్క్ ఇంపార్టెంట్. నువ్వేంటో నాకు తెలుసు. నేనేంటో నీకు తెలుసు.
సో ప్రాబ్లం ఏమిటి. ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటే.. సరే ఒక పని చేయి. నీ చున్నీతో ఫేస్ అంతా కవర్ అయ్యేటట్టుగా కట్టుకో.
అప్పుడు ఎవరో చూస్తారు అన్న ఇబ్బంది నీకు ఉండదు. ఈ ఐడియా ఏదో బాగుంది విశి కట్టుకో. సరే అని చెప్పి కవర్ చేసుకుంటుంది.
గుడ్... ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు కదా.. నో సార్. సరే పదా అని దేవా బైక్ స్టార్ట్ చేస్తాడు. విశి వెనకాల కూర్చోగానే గాలిలో తేలుతున్నట్టుందే అని సాంగ్ వేసుకుంటూ ముందుకు దూకిస్తాడు. వెనకాలే శ్రీకర్, భవ్య కూడా స్టార్ట్ అవుతారు.
విశి ఎప్పుడూ నడిచే వస్తుంది అన్న ధీమాతో గౌతమ్ నడిచే వాళ్ళవైపే చూస్తూ ఉంటాడు. గౌతమ్ ముందునించే బైక్ వెళ్లిపోతున్న అబ్జర్వ్ చేయడు.
స్టూడెంట్స్ అందరూ కూడా వెళ్ళిపోతారు. వెయిట్ చేస్తున్న అమ్మాయిలు కూడా ఇంకా టైం వేస్ట్ అనుకుని వెళ్ళిపోతారు.
గౌతమ్ టైమ్ చూసుకుంటూ.. విశి ఏంటి ఇంకా రాలేదు. లైబ్రరీలో ఏమైనా ఉందా.. పర్వాలేదు వెయిట్ చేద్దాం. ఇంతసేపు వెయిట్ చేసాను అంటే ఊరికనే కరిగిపోతుంది.
అక్కడే కార్ కి జారపడి చూస్తూ ఉంటాడు. చీకటి పడిపోతున్న వేళ వాచ్మెన్ గేట్ లాక్ చేస్తూఉంటే.. అదేంటి అప్పుడే తాళం వేసేస్తున్నావు..
ఎవరండీ మీరు.. ఎవరి కావాలండి... వాచ్మెన్ అడిగేది వినిపించుకోకుండా కాలేజ్ వైపు చూస్తూ.. కాలేజీలో ఇంకా ఉన్నారు కదా.. అప్పుడే లాక్ చేసేస్తున్నావు.
అయ్యో సార్ అందరూ వెళ్లిపోయారు. చెక్ చేసావా...
అన్ని చెక్ చేసుకునే మేము లాక్ చేసుకుంటాము. స్టూడెంట్స్, స్టాప్ అందరు వెళ్ళిపోయారు.
మరి విశిష్ట . విశిష్ట అంటే ఎవరు సార్.. నాకు తెలియదు. ఓకే అని కారులో కూర్చుని.. బొకే, చాక్లెట్ బాస్కెట్ ని విసురుగా విసిరేస్తాడు.
ఇక్కడే వెయిట్ చేస్తున్నాను ఎలా వెళ్ళిపోయావు. ఈరోజు కాలేజీకి ఏమైనా రాలేదా అని ఆలోచిస్తూ.. నో వే..
అసలు కాలేజ్ మానదు. సరే ఇంకేం చేస్తాం. రెస్టారెంట్ కి వెళ్లి చూద్దాం అని రెస్టారెంట్ కి స్టార్ట్ అవుతాడు. భవ్య కి విశి వెనకాలే వెళ్లాలని ఉంటుంది.
వెళితే అనుమానం వస్తుంది అని టేక్ కేర్ సార్ అని మెసేజ్ చేసి వెళ్ళిపోతుంది. రెస్టారెంట్ దగ్గర డ్రాప్ చేసి బాయ్ విశిష్ట..
థాంక్యూ సర్.. బాయ్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. వచ్చిన మెసేజ్ చూసి డోంట్ వర్రీ... మై హోనా అని రిప్లై ఇస్తాడు .
గౌతమ్ రెస్టారెంట్ కి దగ్గరలోకి వచ్చేటప్పటికి ఎదురుగుండా ఒక బైకు వ్యక్తి సడెన్ బ్రేక్ వేస్తాడు. గౌతమ్ కూడా బ్రేక్ వేసి ఈ రోజు అసలు టైం బాగున్నట్టే లేదు.
కారు దిగి... మిస్టర్ రాంగ్ రూట్ లో వస్తావు ఏమిటి.. సోరి సార్. ఈ ఊరికి కొత్త.. సర్వీస్ రోడ్డు అనుకున్నాను. సర్వీస్ రోడ్డుకి, వన్ వేకి టు వేకి తేడా తెలియకుండానే రోడ్డు మీదకు వచ్చేస్తున్నావా...
ఏంటి సార్.. సోరి చెప్పాక కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కారు ఉంటే ఏం మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటున్నారా.. మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు.
నేనెక్కడ మర్యాద లేకుండా మాట్లాడాను. తెలుసుకుని రావాలి అని చెబుతున్నాను. అదే పద్ధతిగా చెప్పాలి కదా... చూడండి అని జనాన్ని పోగేస్తాడు.
వచ్చిన జనాన్ని చూసి గౌతమ్ చూడండి.. ఈ అబ్బాయి రాంగ్ రూట్లో వచ్చి నా మీద గొడవకి దిగుతున్నాడు. అయ్యో నేను గొడవ పడటం లేదండి.
ఈ ఊరికి కొత్త.. తెలియక వచ్చాను.. సోరి సార్.
ఏదైనా డామేజ్ జరిగితే డబ్బులు ఇస్తాను అన్నాను. ఆఫ్టరాల్ ఒక బైక్ గాడివి..
నాలాంటి రిచ్ పర్సన్స్ కి నువ్వేమీ ఇవ్వగలవు చిల్లర అని వెటకారంగా మాట్లాడాడండి..సామాన్యులు అయితే ఇవ్వలేమా..
మనకు ఆత్మ అభిమానంఉండదా.. రాని కన్నీళ్లు తుడుచుకుంటూ ఉంటాడు. అక్కడ ఏమి జరిగింది అనే విషయం కన్నా సామాన్యుడు అన్న మాటలకే పవర్ ఎక్కువగా ఉండి...
జనం గౌతమ్ మీదకి తిరగబడతారు. ఇప్పుడు నేనేమన్నానని ఇంత కథ అల్లాడు. నాదే తప్పు క్షమించండి నేనే డబ్బులు ఇస్తాను.
నీ బోడి డబ్బులు ఎవరికి కావాలయ్యా.. నీకు ఎక్కువ ఉంటే చలిమంట కాస్కో అంతేగాని జనం మీద నుంచి కారు ఎక్కించటం కాదు. నువ్వు వెళ్లి బాబు అని అబ్బాయిని పంపించేస్తారు.
గౌతమ్ కి చుక్కలు మామూలుగా కనిపించలేదుగా...
కథ కొనసాగుతుంది....
Posts: 4,838
Threads: 9
Likes Received: 3,259 in 2,498 posts
Likes Given: 11,328
Joined: Sep 2019
Reputation:
31
Posts: 1,699
Threads: 2
Likes Received: 1,020 in 780 posts
Likes Given: 2,418
Joined: May 2019
Reputation:
11
Awesome update.
కొంచెం slow గా పోతుంది story అనిపిస్తుంది
Posts: 1,159
Threads: 1
Likes Received: 732 in 475 posts
Likes Given: 11,271
Joined: Jun 2019
Reputation:
2
Posts: 898
Threads: 13
Likes Received: 7,038 in 832 posts
Likes Given: 1,545
Joined: Aug 2024
Reputation:
652
Part - 37
గౌతమ్ ని తిట్టి ఎక్కడ జనం అక్కడికి వెళ్ళిపోతారు. అంతా ఖాళీ అయిపోయి గౌతమ్, గౌతమ్ కారు మాత్రమే మిగులుతుంది.
ఇప్పుడు అసలు ఏం జరిగింది. నేనెక్కడున్నాను. ఎందుకు వాళ్ళు రివర్స్‌లో నన్ను తిట్టారు.. తప్పు ఆ అబ్బాయి కదా చేసింది. అబ్బా ఈరోజు ఆ అసలు కలిసి రాలేదు. రేపు ఫ్రెష్ మైండ్ తో వచ్చి కలుస్తాను.
కారు రివర్స్ చేసుకుని వెళ్ళిపోతాడు. విశి వర్క్ ఫినిష్ చేసుకుని వచ్చేటప్పటికి అక్కడ దేవ కనిపిస్తాడు. హలో దేవ సార్.. మీరు ఏంటి ఇక్కడ.
బ్యాచిలర్స్ మి కదా.. రెస్టారెంట్ ఫుడ్ తప్పదు కదా... రోజూ ఇలాగే తింటున్నారా.. ఏం చేస్తాం.. సరే అమ్మకి చెప్పి రేపటి నుంచి మీకు లంచ్ తీసుకొస్తాను.
నో విశి ఇది కరెక్ట్ కాదు. ఏమైంది సార్.. మీరు ఏంటో నాకు తెలుసు.. నేనేంటో మీకు తెలుసు. అలాంటప్పుడు ఇంకెందుకు మొహమాటపడుతున్నారు.
అవునా... సరే అయితే ఏదైనా తీసుకున్నప్పుడు వెంటనే రిటర్న్ ఇవ్వాలి. సో నువ్వు ఫుడ్ తీసుకొస్తావు కాబట్టి పికప్, డ్రాపింగ్ నేనే చేస్తాను.
సార్ నాతో పెట్టుకుంటే మీకు చాలా టైం వేస్ట్ అవుతుంది. కాలేజ్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం ఖాళీయే కదా..
సో ఇలా టైం స్పెండ్ చేస్తాము.
అమ్మను కూడా చూసినట్టు ఉంటుంది కదా.. ఇంతకీ అమ్మని ఎప్పుడు పరిచయం చేస్తావు. మీరు మా ఇంటికొస్తారా..
రాకపోవడానికి నాకేమైనా రెండు కొమ్ములు ఏమైనా ఉన్నాయా.. నవ్వుతూ అలాగేమీ లేదు. తప్పకుండా ఈ వీకెండ్ మీరు, శ్రీకర్ సార్ మా ఇంటికి లంచ్ కి రండి. నేను స్పెషల్ గా ఇన్వైట్ చేస్తున్నాను.
తప్పకుండా ఇప్పుడు ఎలా వెళ్తావు. బై వాక్. అంత దూరం నడిచి వెళ్తావా.. తప్పదు కదా.. సరే ఈరోజు నుంచే నా డ్యూటీ తీసుకుంటాను.
బైక్ ఎక్కు.. ఇప్పుడు వద్దులే సార్.. విశి ఎక్కు అని కొంచెం సీరియస్ ఫేస్ తో చెబుతాడు. సరే అని బైక్ ఎక్కుతుంది.
ఇదంతా చూస్తున్న శ్రీకర్.. వైభవ్ తో చూసావా.. ప్రేమ లేదు లేదు అంటూనే ఎంత కేర్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఏదైనా కదిపాము అనుకో స్నేహమే అంటాడు..
అవసరమా.. కాని ఖచ్చితంగా బయటపడతాడు. ఎలాగైనా ఫొటోస్ తీసి మనోడికి ఒక మెమరీ బుల్ గా పంపించాలి. ఎలా..
వెయిట్ బావ అని వైభవ్ కామ్ గా ఎవరూ చూడకుండా ఫ్రంట్ కి వెళ్లి సూర్య, విశి ల ఫొటోస్ తీస్తాడు. పర్ఫెక్ట్ అనుకొని శ్రీకర్ దగ్గరికి వచ్చి అయిపోయింది.
నువ్వు ఇలాంటి విషయాల్లో చాలా ఫాస్ట్. అవును బావా.. లేకపోతే అమ్మాయిలు ఫ్లట్ చేయడం చాలా కష్టం. నువ్వు బాగా ముదిరిపోయావు రా.. పద అని సూర్య వెనకాలే బైక్ తీస్తాడు.
సూర్య బైక్ స్టార్ట్ చేసి వెళదామా అంటే సరే సార్ అంటుంది. హేండిల్ పట్టుకుని కూర్చుంటుంది.
సూర్యకి ఈ ఫీల్ అంత చాలా బాగా నచ్చుతుంది. సాయంత్రం కాలేజీ నుంచి వచ్చేటప్పుడు ఆ గౌతమ్ వలన ఈ ఫీల్ ని మిస్ అయ్యాను.
కానీ ఇప్పుడు ఈ ఫీల్ ఎంజాయ్ చేస్తూ ఉంటే భలే బాగుంది. నచ్చిన అమ్మాయి బైక్ ఎక్కితే ఇంత బాగుంటుందా ...
బైక్ డ్రైవ్ చేస్తూ ఫ్రంట్ మిర్రర్ నుంచి విశిని చూస్తూ...
నీకు చెప్పాలని ఎంత కాలం నుండి అనుకుంటున్నానో తెలుసా? కానీ ఇప్పటికీ నా నోరు తెరుచుకోలేకపోతున్నది.
ఇది స్నేహమా.. ప్రేమ తెలుపుమా నా నెచ్చలి
ఈ గాలి తాకడం కంటే, నువ్వు వెనుక కూర్చున్న క్షణం నాకు నిజమైన శ్వాసలాగ ఉంది. స్నేహమైతే ఇలా అనిపిస్తుందా.. నిజంగా ఇది ప్రేమా??
నువ్వు వెనుక కూర్చుంటే ఈ రోడ్లు అంతా కలల మార్గంలా మారిపోతాయి. నువ్వు నేను మాత్రమే ఉన్నాము అనిపిస్తుంది. ఈ ఫీల్ స్నేహంలో ఉంటుందా.. లేక ప్రేమలో ఉంటుందా..
ఒక్కసారి అయినా నీ చేతిని నా భుజం మీద ఉంచితే… ఈ ప్రయాణం నాకైతే జీవితాంతం మర్చిపోలేని జ్ఞాపకంగా ఉండిపోతుంది అనిపిస్తుంది. ఇది ప్రేమేనా..
నువ్వు వెనక ఉండగా నా గుండె దడను దాచుకోవడం చాలా కష్టంగా ఉంది… కానీ నువ్వే నా గుండె దడ కారణం.
ఇది ప్రేమే..
సార్ అని పిలుస్తుంది. ఏమైంది.. మా ఫ్లాట్ వచ్చేసింది.
అవునా అని బైక్ ఆపుతాడు. సరే సార్.. గుడ్ నైట్ అని చెప్పి వెళ్ళిపోతుంది.
వెళుతున్న విశిని చూస్తూ
ఒక రోజు వస్తుంది… ఈ బైక్ మీద నిన్ను నా జీవిత భాగస్వామిగా కూర్చోపెట్టే రోజు.
నీ గురించి ఇలా ఆలోచిస్తున్నాను అంటే కచ్చితంగా నాది ప్రేమే కానీ ఇప్పుడే చెప్పను. నువ్వు లైఫ్ లో నీకంటూ ఒక స్థానం ఏర్పరచుకున్నాక అప్పుడు నీ ముందుకి వస్తాను. అప్పుడు దాకా నీకు తెలిసిన ఒక దేవా సార్ ని మాత్రమే.
చూసింది చాలుగాని ఇంకా ఇంటికి వెళదామా అని పక్కన బైక్ ఆపి శ్రీకర్ అడుగుతాడు. మీరు ఎప్పుడు వచ్చారు రా..
మేము ఎప్పుడు వదిలి వెళ్లామని... నీ వెనకాలే ఫాలో అవుతున్నాము. తమరు డ్రీమ్స్ లో ఉండి పక్కన ఏం జరుగుతుందో చూసుకోలేదు అంతే..
సరే పదండి అని ఇంటికి వెళతారు. శ్రీకర్.. నేను వెళతాను అంటే.. నైట్ ఉండిపోవచ్చు కదా.. వద్దులే ఉన్నాను అంటే మా మామయ్య నిద్రపోకుండా కూతురు దగ్గర కాపలా కాస్తూ ఉంటాడు.
నాకేమో ఇక్కడ ఉంటే సౌమ్యని కెలకుండా ఉండలేను అవసరమా...
ఇద్దరినీ చూస్తూ వైభవ్.. అందుకే ప్రేమలో పడకూడదు. నాలాగ జాలీగా ఎంజాయ్ చేయాలి. అమ్మాయి నచ్చితే పులిహార కలపాలి..డ్రైవింగ్ కి వెళ్ళాలి. బాయ్ చెప్పాలి. వచ్చేయాలి.
నీకు అంత లేదులే.. నీకు ముందు ముందు ఉంది.
ముందు లేదు వెనకాలేదు బావ. నీకు అర్థం కాని విషయం చెప్పనా... మా అందరికన్నా ముందే నువ్వే ప్రేమలో పడిపోయావు.
నేనా అని వేలు పెట్టి తన వైపు పెట్టుకుని చూపిస్తూ అడుగుతాడు. అవును. అది నీకు తప్ప నీ చుట్టూ ఉన్న మా అందరికీ తెలుసు. అవునా బావ..
నాకు తెలియకుండా నన్ను ప్రేమలో పడేసిన క్వీన్ ఎవరు అంటావు.. అది నువ్వే గుర్తించు గుడ్ నైట్ అని బైక్ స్టార్ట్ చేస్తాడు.
బావ ఇది అన్యాయం. ప్రశాంతంగా పడుకునే వాడిని..నిద్ర చెడగొట్టి నువ్వు వెళ్ళిపోతున్నావు. బట్ నాకు ఇప్పుడు నిద్ర వస్తుంది రా అని వెళ్ళిపోతే..
నువ్వు చెప్పు అన్నయ్య.. ఏమో వాడు ఏమి చెప్పాడో.. నీకేం అర్థమైందో.. మధ్యలో నన్ను లాగద్దు. నాకు బాగా నిద్ర వస్తుంది అని వెళ్ళిపోతాడు.
ఛీ.. ఛీ.. వీళ్లిద్దరిని ఆడుకుందాం అనుకుంటే నన్ను ఆడుకున్నారు అని రూమ్ కి వెళ్లి ఫ్రెష్ చేయి మంచం మీద పడతాడు.
పడుకున్నాడు అన్నమాట గాని నిద్ర రాదు. బావ ఎంత పని చేసావు అని దిండుని తల పైన పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటాడు.
నన్ను ప్రేమించి.. నన్ను ప్రేమలో పడేసిన అమ్మాయి ఎవరబ్బా.. అందరికీ తెలుసా... ఎవరై ఉంటారు. నా ఫ్రెండ్ సర్కిల్ అయితే ఎవరికీ తెలియదు.
కాలేజీలో అమ్మాయిలు అంటావా... నో ఛాన్స్.. ఇంకెవరున్నారు.. అబ్బా... అని ఆలోచించి చందు అని
... నో అని గట్టిగా అరుస్తాడు.
అమ్మో ఆ పిల్ల రాక్షసా.. సమస్యే లేదు. మేమిద్దరం కొట్టుకోవడం తప్ప ఏ రోజు కూడా మంచిగా మాట్లాడుకుందే లేదు.
ఎట్లీస్ట్ ఒక చాక్లెట్ కూడా షేర్ చేసుకుంది లేదు. అలాంటిది అది నన్ను ప్రేమించడంమా.. నేను దాన్ని ప్రేమించడమా.. బావకి పైత్యం ఎక్కువయింది.
సౌమ్య కి చెప్పి ట్రీట్మెంట్ ఇప్పించాలి. అనవసరంగా నా నిద్ర చెడగొట్టుకుని మరీ ఆలోచించాను. దుప్పటి ముసుగేస్తాడు.
చందు వచ్చి దుప్పటి లాగి కోపంగా..
నువ్వు చిన్నప్పటినుంచే నా పక్కన ఉంటే నాకెందుకు శాంతి ఉంటుంది.
వైభవ్... చందు దుప్పటి లాగింది అని విసుగు చూపిస్తూ..
అయితే నీ జీవితం నువ్వు చెప్పినట్టే బోరింగ్ అయిపోతుందేమో… నేను ఉన్నా గాబట్టి కలర్ఫుల్గా ఉంది. అర్థమవుతుందా...
చందు వెటకారంగా...
నువ్వు లేని రోజే నాకో పండుగ
వైభవ్ నవ్వుతూ..
అదే పండుగలో నేనే మొదటి ఆహ్వానితుణ్ణి అవుతాను…
ఎంత కొట్టుకున్నా, చివరికి నువ్వు నాతోనే ఎక్కువగా మాట్లాడుతావు. మరి నువ్వు నన్ను అసహ్యించుకుంటున్నావా? లేక మిస్ అవుతున్నావా?
చందు తప్పించుకుంటూ...
అది… అది వేరే విషయం
వైభవ్ చందు చెయ్యి పట్టుకుని...
అదే అసలు విషయం..ఇంకా గుర్తించలేదా? మన గొడవలే మన ప్రేమకు రుజువు.
నిజంగా మనం ప్రేమించుకుంటున్నామా చిన్న బావ అని చందు అడిగితే.. ఇంకా నీకు అనుమానమా.. అందుకే కదా చిన్నప్పటినుంచి నీతోనే గొడవ పడేవాడిని.
నీతో ఉండాలని కదా.. నిజంగానా బావ అని ఇంకా దగ్గరికి వస్తుంది. అవునే మరదలు పిల్ల అని చుట్టూ చేతులు వేస్తే.. నాతో జోక్ చేయడం లేదు కదా..
నీతో జోక్ చేస్తే నేనే జోకర్ ని అవుతాను కదా.. ఒక ముద్దు.. ఇవ్వవే అని ముందుకు వస్తాడు. అమ్మో బావ నాకు సిగ్గు.
నువ్వు కళ్ళు మూసుకొ.. నేను తీసుకుంటాను కదా.. మూతిని ముందుకు పెడుతూ ము.. మూ.. అన్న సౌండ్ చేస్తూ.. మంచం మీద నుంచి కింద పడతాడు.
అబ్బా.. నా నడుము అని నడుం మీద చేతులు వేసుకుని కళ్ళు తెరిచి చూస్తాడు..అదేమిటి మెత్తగా తగిలాల్సిన చందు ఇంత గట్టిగా ఉంది అని చేతతో తడుముతూ... ఏమిటి ఈలాగుంది అని చుట్టూ చూస్తాడు.
చీకటిగా అనిపిస్తే వెళ్లి లైట్ వేస్తాడు. ఇదంతా నా కల.. శ్రీకర్ బావ ఉన్నవాడు ఉన్నచోట ఉండడు. అనవసరంగా కెలికి వెళ్ళాడు.
లేకపోతే మేమిద్దరం ప్రేమించుకోవడమేమిటి...నిజంగా అలా ప్రేమించుకుంటే ప్రపంచంలో అదొక వింత..
సూర్య గదిలోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి మంచం మీద పడి విశి.. ఈరోజు మాత్రం గౌతమ్ కి థాంక్స్ చెప్పాలి.వాడి వల్లే కదా నువ్వు నా బైక్ ఎక్కావు. ఇప్పటిదాకా నీకోసం నేను ఆగడం.. మళ్ళీ నీతో కలిసి రావడం అబ్బబ్బ... ఆ ఫీలే వేరబ్బా..
ప్రేమ పక్షులు విహరిస్తున్నాయా...
Posts: 898
Threads: 13
Likes Received: 7,038 in 832 posts
Likes Given: 1,545
Joined: Aug 2024
Reputation:
652
Part - 38
సూర్య.. విశి గురించి ఆలోచిస్తూ మురిసిపోతూ ఉంటాడు. ఫోన్ కి మెసేజ్ సౌండ్ రావడంతో ఏమిటా అని చూస్తే డ్రీమ్స్ లో ఉన్నది చాలు గానీ వాట్సప్ ఓపెన్ చెయ్యి. ఇడియట్ నేనెప్పుడూ ఏం చేస్తాను అన్నది వీడికి బాగా తెలుసు అనుకుంటూ వాట్సాప్ ఓపెన్ చేస్తాడు.
అందులో విశి తో బైక్ మీద ఉన్న ఫొటోస్ ఉంటాయి. అవి చూస్తూ విశి ఫోటోని జూమ్ చేస్తాడు.
ఫోన్ లో మెరుస్తున్న విశి ఫోటోను చూస్తూ సూర్య కళ్ళలో ఒక వెలుగు వెలిగింది.
గుండె మాత్రం నిశ్శబ్దంగా ఒక రాగాన్ని పలికింది.
ఎంత ముద్దుగా ఉన్నావే.. ఎప్పుడు ఫోకస్డ్ గా చూడలేదు కానీ చూస్తూ ఉంటే ఇప్పుడే దగ్గరికి తీసుకుని గట్టిగా బుగ్గలు కొరికేయాలని ఉంది.
“ఏమిటో నీలో ఉంది ఒక మాయ…
ఈ ఫోటోలోనే నన్ను అలా లాగేస్తోంది.
నీ చిరునవ్వు చూసి గాలి కూడా ఆగిపోయిందేమో అనిపిస్తోంది.
ఆ కళ్ళలో చిన్న చిన్న కథలు, చిన్న చిన్న కోరికలు దాక్కున్నట్టున్నాయి.
నీ జుట్టు గాలిలో ఎగిరినప్పుడల్లా నా ఊపిరి కూడా తడబడుతున్నట్టుంది.
ఎన్నిసార్లు చూసినా కొత్తగానే అనిపించే అందం…
ఇది కేవలం ఫోటో అయితే, నిజంగా ఎదురుగా కనిపిస్తే నా మనసు ఎక్కడ దాక్కుంటుందో నాకు తెలియదు.
నీ లోని ఈ అమాయకత్వం, ఆ నవ్వు – నాకు ప్రపంచం మొత్తానికి మించిన సంపదలా అనిపిస్తున్నాయి.”
అలా ఫోన్ స్క్రీన్ మీద చూపు ఆగకపోయినా…
మనసు మాత్రం ఆ ఫోటోలోని అమ్మాయి దగ్గరికి వెళ్లి కూర్చుని, మౌనంగా మాట్లాడుతోంది.
“ఒక ఫోటోలో ఇంత అందం ఎలా దాచేస్తావు రా నువ్వు…
నీ చిరునవ్వు చూస్తుంటే, నా లోపల ఉన్న టెన్షన్ అన్నీ కరిగిపోతున్నాయ్.
ఎవరూ చూడకపోయినా, నీ కళ్ళలో మాత్రం ఎప్పుడూ ఒక మంత్రం ఉంటుంది.
అదే మంత్రం నన్ను నీ దగ్గరకి లాక్కుంటోంది.
ఇది ఫోటో మాత్రమే అని నాకు తెలుసు…
కానీ నిజంగా నీ ముందు కూర్చున్నప్పుడు నేను ఏమి మాట్లాడుతానో, మాట్లాడగలనో కూడా తెలియదు.
ఒక్కసారైనా నువ్వు ఇలా నవ్వుతూ నా వైపు చూస్తే…
అంతే, నా ప్రపంచం ఆ క్షణంలో పూర్తవుతుంది.”
“చూస్తున్నావా నన్ను ఇలా… ఫోన్ స్క్రీన్ వెనక నుంచి కూడా నా గుండెను ఎందుకు అల్లకల్లోల పరుస్తావు?
నీ కళ్ళలో పడితే… నిజంగా తప్పించుకోలేనన్న విషయం నాకు తెలుసు.
ఈ చిరునవ్వు… నాకెందుకో శ్వాసలాగే మారిపోయింది.
ఫోటోనే ఇలా ఉంటే, నువ్వు ఎదురుగా కూర్చుంటే నేను ఏమవుతానో ఊహించలేకపోతున్నా.
నువ్వు మాట్లాడకపోయినా… నీ చూపే నన్ను పూర్తిగా మత్తెక్కిస్తోంది.
ఇక ఈ గుండె మీద నువ్వే హక్కు అనిపిస్తోంది.
నిన్ను చూసుకుంటూ ఇలా రాత్రంతా గడపగలను…
నిద్రకన్నా నీ ముఖమే కావాలి నాకు.
ఇలాగే నన్ను నువ్వు పట్టేసావు…”
“ఇంత దగ్గరగా చూసుకుంటూ ఉంటే… నిజంగా నువ్వు నా కౌగిలిలోనే ఉన్నట్టుంది.
నీ ముఖం కాంతి నా కళ్ళలో పడిన క్షణం, నేను మరో లోకంలోకి వెళ్లిపోతాను.
గాలిలో తేలే జుట్టు నా ముఖాన్ని తాకుతుందనే ఆలోచనతోనే గుండె మత్తెక్కుతోంది.
నువ్వు నా గుండెపై తల వాల్చుకుని కళ్లను మూస్తే… నా శ్వాసలు నీ ఊపిరితో కలిసిపోతాయి.
ఆ క్షణం నేను బ్రతకడం కాదు… నేను పూర్తిగా నీవైపోయినట్టు ఉంటుంది.
నీ చేతిని గట్టిగా పట్టుకుని వదలకూడదనిపించే ఆ తపన…
నీ కళ్ళలోకి లోతుగా చూసి, నువ్వే నా ప్రపంచం అని చెప్పేసే ఆ కోరిక…
ఇవి అన్నీ నన్ను నిద్రలో కూడా నీతోనే జీవించేలా చేస్తున్నాయి.
ఫోటోలో చూస్తున్నా… నా మనసు మాత్రం నిన్ను తాకేసింది, ముద్దాడేసింది, నన్ను పూర్తిగా నీలో ముంచేసింది.”
ఫోన్లో ఉన్న విశి ఫోటోతో కబుర్లు చెబుతూ అలాగే నిద్రపోతాడు.
విశి ఇంటికి వెళ్లి ఫ్రెష్ అయ్యి భోజనం చేసి మంచం పైన వాలుతుంది. సూర్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ సార్ చాలా స్పెషల్ గా ఉన్నారు.
రెస్పెక్ట్ ఇస్తున్నారు. నాకు ఏదైనా అవసరం ఉంది అనుకుంటే నేను అడగకముందే వచ్చి సాయం చేస్తున్నారు ఎందుకు...
గౌతమ్ ఎప్పుడు నన్ను స్వార్థానికే వాడుకున్నాడు. అలా అని పూర్తిగా స్వార్థం అని కూడా అనలేను. తన బిజినెస్ బెనిఫిట్స్ చూసుకున్నాడు. బట్ ప్రేమ అని చెప్పడమే కొంచెం కష్టంగా ఉంది.
దేవ సార్ ఏ రోజు నా నుంచి ఎటువంటి బెనిఫిట్స్ అడగలేదు. వీలైనంతగా సాయం చేస్తూనే ఉన్నారు.
ప్రేమ పేరుతో గౌతమ్ నన్ను ఎప్పుడూ నా టాలెంట్‌కి బంధించడానికి ప్రయత్నించాడు.
అతనికి నేను కాదు… నా ప్రతిభ, నా శ్రమ, నా కలలే కావాలనిపించింది.
అతని చూపులో ప్రేమ కంటే లాభం ఎక్కువగా కనిపించింది.
కానీ… ఇక్కడ ఉన్న దేవా సార్ మాత్రం ఒక్కసారైనా తన ప్రయోజనం గురించి ఆలోచించలేదు. నా గురించి ఆలోచిస్తున్నారు. నాకు నేర్పించడానికి తాపత్రయ పడుతున్నారు.
నేను జారిపోతే అండగా నిలిచాడు… నేను పడిపోతే లేపాడు… నేను గెలిచినా ఓడినా, నా వెనుకే నిలబడ్డాడు.
అతని కళ్ళలో నేను ఒక అవకాశం కాదు… ఒక మనిషిని.
నా కలలు అతనికి భారం కావు… ఆనందం.
ఈ ఇద్దరి మధ్య తేడా ఇప్పుడు నాకు స్పష్టంగా కనిపిస్తోంది.
ఒకరు నన్ను ఉపయోగించుకోవాలనుకున్నారు…
మరొకరు నన్ను నమ్మి నిలబెట్టారు.
గౌతమ్ దగ్గర ఉన్నప్పుడు తనలో ఒక ఒత్తిడి, ఒక బంధనం అనిపించేది.
గౌతమ్ మాటల్లో ప్రేమ ఉన్నట్టు అనిపించినా, చూపుల్లో మాత్రం లెక్కలు, లాభాలు దాక్కున్నాయి.
తన టాలెంట్‌నే ఆయన ప్రేమగా మార్చుకుని, దాన్నే పట్టుకుని తనను దగ్గర ఉంచుకోవాలని ప్రయత్నించాడు.
కానీ… దేవా సార్ ఉన్నప్పుడు అలాంటి భారమేం ఉండేది కాదు.
ఆయన సాయం చేస్తూ, ఒక్కసారైనా “దీనివల్ల నాకు ఏం వస్తుంది?” అని ఆలోచించలేదు.
అతని సహాయం వెనుక లెక్కలు లేవు, ఒత్తిడి లేదు, బంధనం లేదు.
ఆయన కళ్ళలో కనిపించింది తనమీద నమ్మకం, గౌరవం, క్షణాల్లో తన బాధను తన భుజాలపై వేసుకుని నడిపించే నిజమైన మనసు.
ఇద్దరి మధ్య తేడా ఆమె హృదయాన్ని తాకింది.
ఒకరు ఆమె ప్రతిభలో లాభాన్ని చూసారు.
మరొకరు ఆమె మనసులోని నమ్మకాన్ని నిలబెట్టారు.
ప్రేమ అనే మాట చెప్పడం ఒక్కటే కాదు…
ప్రేమ అంటే ఎటువంటి ప్రయోజనం లేకుండా, ఒకరిని ఒకరు పూర్తిగా అంగీకరించుకోవడం.
గౌతమ్ ప్రేమలో ఉన్నది ఒక అవకాశవాది మాత్రమే...
దేవా సార్ స్నేహంలో ఉన్నది నా పైన నమ్మకం.
థాంక్యూ నాన్న.. ఈ చైను వేసుకోగానే దేవా సార్‌తో పరిచయం పెరిగింది ఎక్కడ ఉన్నా నన్ను ఇలాగే బ్లెస్స్ చేయండి. అమ్మని కూడా తొందరగా రికవరీ చేస్తాను అని ఆరోజు ప్రశాంతంగా నిద్రపోతుంది.
సూర్యుడు రాకముందే సూర్య లేచి వర్క్ ఔట్స్ ఫినిష్ చేసి విక్రమ్ దగ్గరికి వెళతాడు.
హాయ్ నాన్న గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి ఈ రోజు ఏదైనా స్పెషలా.. నథింగ్. ఎందుకు అడిగారు.. అప్పుడే వర్కౌట్స్ అయిపోతేను.. మీతో కొంచెం మాట్లాడాలి.
వాక్ చేస్తూ మాట్లాడుకుందాం అని గార్డెన్‌లోకి వెళతారు. చెప్పు ఏం మాట్లాడాలి. గౌతమ్ ని టెన్షన్ తో బిజీ చేయాలి.. దేనికి..
విశి ని డిస్ట్రబ్ చేయాలి అనుకుంటున్నాడు. ఏమైంది... నిన్న కాలేజ్ లో జరిగింది చెబుతాడు. విశి వర్క్ కోసం చాలా వెయిటింగ్ అనుకుంటా..
అవును.. విశి వర్క్ లేక తన కాంట్రాక్ట్స్ అన్ని మిస్ అవుతున్నాయి.. హిమ ఫాదర్ నుంచి కూడా ప్రెషర్ వస్తుంది. సో దాని గురించి మళ్ళీ విశి ని లైన్ లో పెట్టుకోవాలి అని ఉత్సాహపడుతున్నాడు.
విశి మళ్లీ గౌతమ్ ట్రాప్ లోకి వెళ్ళిపోతుందని నీ భయమా.. అలాంటి భయం ఏమీ లేదు కానీ డిస్టర్బ్ అవుతుంది కదా...
అనవసరమైన ఒత్తిడి ఎందుకు... నువ్వన్నది కూడా నిజమేలే. నేను చూసుకుంటాను. థాంక్యూ నాన్న. ఇప్పటికైనా క్లారిటీ వచ్చిందా..
దేని గురించి... తల మీద ఒక్కటేసి నేను నీ బాబుని రా... నిన్ను దాటి వచ్చాను. నాన్న అని గారాలుపోతాడు. వచ్చినట్టే ఉంది. ఎప్పుడు తీసుకొస్తావు అమ్మాయిని...
నేనింకా.విశి కి ఏమి చెప్పలేదు అదేమిటి... ప్రస్తుతం తన దృష్టి మొత్తం గోల్ మీదే ఉంది. ఇప్పుడు నేను ప్రేమ అని అని చెప్పి డిస్టర్బ్ చేయలేను.
మళ్ళీ ఒక కన్ఫ్యూజన్లోకి తీసుకువెళ్లలేను. తనకి తానుగా నా ప్రేమని గుర్తించాలి. ఇదేమన్నా సినిమా అనుకుంటున్నావా... గుర్తించాలి డాన్స్ వేయాలి అనడానికి.
మీరు ఏమైనా అనండి నాన్న.. నా ప్రేమను గుర్తించాలి..
నా దగ్గరికి రావాలి...
భరత్ వచ్చి మీ నాన్న అలాగే అంటాడు కానీ... మీ అమ్మను కూడా అలాగే లాక్కొచ్చాడు. అవునా.. అబ్బో ఎంత డ్రామా జరిగిందనుకుంటున్నావు. దానికి ప్రత్యక్ష సాక్షులు శ్రీ, రాజే...
అవునా ఏం చేశారు నాన్న.. చెప్పండి ప్లీజ్. వాడు అలాగే మాట్లాడతాడు గాని ఏమీ లేదులే. మీరు బ్లష్ అవుతున్నారంటే సంథింగ్ చేశారు.
చెప్పచ్చు కదా.. నాకు ఉపయోగపడుతుంది. ఆ రోజులు వేరు... మీ అమ్మ మైండ్ సెట్ వేరు.. ఈ రోజులు వేరు.. ఇప్పుడు అమ్మాయిల ఆలోచన వేరు.
ఎంత వేరైనా కంటెంట్ ఒకటే కదా... నాన్న... ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమాలితే.. మనకి పెళ్లెప్పుడు మేలుముసుగు ఉండడం వలన మీ అమ్మ నాకు తెలియదు. కొన్ని కారణాలు వలన నాకు దూరంగా వెళ్లిపోవాలి అనుకుంది.
మీ అమ్మ ఎక్కడ ఉందో పట్టుకుని తన నోటితోనే మీరు లేకపోతే నేను లేను అని చెప్పించాను. అదే మీ భరత్ మామ చెప్పే గోల.
అదే ఎలాగా.. హాస్పిటల్ ఇన్సిడెంట్ చెబుతాడు. అమ్మ నాన్న... పాపం మా అమ్మ ఎంత అమాయకురాలు... అమాయకురాలు కాబట్టే నా హృదయ సింహాసనం మీద పీట వేసుకుని కూర్చుంది.
మరి నీ విశిష్ట ఏమిటో అన్నది నువ్వే చూసుకో.. అందరికీ ఒకే ట్రీట్మెంట్ కరెక్ట్ కాదు.
గౌతమ్ రెడీగా ఉన్నావా...
కథ కొనసాగుతుంది....
Posts: 4,838
Threads: 9
Likes Received: 3,259 in 2,498 posts
Likes Given: 11,328
Joined: Sep 2019
Reputation:
31
Posts: 1,159
Threads: 1
Likes Received: 732 in 475 posts
Likes Given: 11,271
Joined: Jun 2019
Reputation:
2
Surya pulse rate going up...
Posts: 1,699
Threads: 2
Likes Received: 1,020 in 780 posts
Likes Given: 2,418
Joined: May 2019
Reputation:
11
Like how Srikar gets Surya's pulse!! :)
Posts: 898
Threads: 13
Likes Received: 7,038 in 832 posts
Likes Given: 1,545
Joined: Aug 2024
Reputation:
652
Part - 39
సూర్య తొందరగా రెడీ అయి విశి ని పికప్ చేసుకోవడానికి వెళతాడు. విశి ఇంకా రాలేదని ఫోన్ చేస్తాడు. లిఫ్ట్ చేసి చెప్పండి సార్.
ఇంకా రాలేదు ఏంటి... నేను వెయిట్ చేస్తున్నా. టైం చూసి ఇంకా టైం ఉంది కదా సార్.. అప్పుడే వచ్చారా... మీకు అభ్యంతరం లేకపోతే మా ఫ్లాట్ కి రండి.
పర్వాలేదా.. పరవాలేదు. మీరే కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. నువ్వు ఉన్నచోట నాకు ఇబ్బంది ఏమంటుంది. సూర్యకి ఆ ఫ్లాట్ చూడగానే ఒక నిమిషం కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి.
చిన్నప్పుడు చూసినప్పుడు బుట్టబొమ్మ లాగా పట్టు పరికిణి వేసుకుని నగలు పెట్టుకుని ముద్దు ముద్దుగా మాట్లాడిన విశి ఎక్కడ.. ఈ రోజు తల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ ఒక సింగిల్ బెడ్ రూమ్ పోర్షన్ లోఉంటున్న విశి ఎక్కడ ...
ఏంటి సార్ అలా చూస్తున్నారు. ఇల్లు చిన్నగా ఉందన.. ఇల్లు చిన్నదా పెద్దదా అన్నది కాదు. ఎంత ఒద్దికగా ఉన్నది అన్నది ఇంపార్టెంట్.
కూర్చోండి సార్ అని అమ్మ అని పిలుస్తుంది. భానుమతి వచ్చి ఎవరమ్మా.. మా కాలేజ్ లెక్చరర్ దేవా సార్.మా అమ్మ అని పరిచయం చేస్తుంది.
సూర్య భానుమతిని చూసి నమస్కారం అండీ అంటాడు. నమస్కారం బాబు..కూర్చో.. మా అమ్మాయి ఏమైనా తప్పు చేసిందా.
ఎందుకలా అడుగుతున్నారు. చిన్నప్పుడు విశి ఏదైనా అల్లరి పని చేస్తే కాలేజ్‌లో మాస్టర్ ఇంటికి వచ్చి మరి మా వారికి కంప్లైంట్ ఇచ్చేవారు.
అలాగే మీరు కూడా వచ్చారా అని భయంగా అడుగుతుంది..భానుమతి అడిగిన దానికి చిన్నగా నవ్వుతూ.. అలాగ ఏమీ లేదండి.
నేను వెళ్లే దారి ఇటే.. అందుకే విశిష్టని కూడా తీసుకువెళదామని వచ్చాను. అవునా ఇంక నేను ఏదో అనుకుని భయపడ్డాను.
కాఫీ తీసుకు వస్తాను అని కిచెన్‌లోకి వెళుతున్న భానుమతిని చూస్తూ ఉంటుంది. డోంట్ వర్రీ..అమ్మ తొందరలోనే క్యూర్ అవుతారు.
నాకున్న ఒకే ఒక్క బంధం ఆశ.. మా అమ్మే... విశిని దగ్గరికి తీసుకుని నేనున్నాను కదా.. నీకోసం ఒక పెద్ద కుటుంబమే ఉంది అని ధైర్యం చెప్పాలని ఉంటుంది.
కానీ ఆ పని చేస్తే అంతే.. ఒకటి కొట్టడమే కాదు.. ఇక నా ముఖం కూడా చూడదు. కంట్రోల్స్ సూర్య అనుకుంటూ..
మరి నువ్వు కాలేజీకి వెళ్లిన తర్వాత అమ్మని ఎవరు చూసుకుంటారు.
చూసుకోవడానికి ఎవరుంటారు సార్... బయట లాక్ చేసుకుని వచ్చేస్తాను. అమ్మ లోపలే ఉంటుంది. నాన్నగారు గుర్తుకు వచ్చారంటే బయటకు వెళ్ళిపోతుంది. మళ్ళీ దొరకడం కష్టం కదా..
అదే నిజమేలే.. మరి నీకు చుట్టుపక్కల ఫ్లాట్స్ వాళ్ళు పరిచయం అవలేదా.. నాలాంటి వాళ్ళని చూస్తే జాలి పడతారు గాని స్నేహం చేయడానికి ఒప్పుకోరు కదా...
నిన్ను చూసి జాలి పడడం ఏంట్రా... నీలాంటి బంగారంతో స్నేహం చేయాలి అంటే పెట్టి పుట్టిండాలి..
ఏంటి సార్ ఏది మాట్లాడుతున్న ఒక నిమిషం ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు. ఏమైంది నా ఫ్రెండ్ హౌస్ ఉంది.
పై ఫ్లాట్ ఖాళీయే...అక్కడకి షిఫ్ట్ అవుతారా అని అడుగుతాడు. అమ్మో ఇండివిడ్యువల్ హౌస్ అంటే రెంట్ ఎక్కువ ఏమో..
నథింగ్.. వాళ్లకి ఎవరైనా ఫ్యామిలీ ఉంటే చెప్పమని నన్ను రిక్వెస్ట్ చేశారు. పైగా ఆంటీ అమ్మతో కలిసి పోతారు. సో నీకు భయం కూడా ఉండదు.
మీరంతాగా చెబుతున్నారు అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఒకసారి రెంట్ కనుక్కోండి. మనకు అంతా ఓకే అనుకుంటే డైరెక్ట్‌గా వెళ్ళిపోతాము.
అదేంటి ఇల్లు చూడవ.. మీరు చెప్పారు అంటే అంత బాగానే ఉంటుంది. ఆ గుడ్డి నమ్మకమే వద్దు. ఎవరు చెప్పినా సరే.. క్రాస్ చెక్ చేసుకో.
ఎప్పుడైనా మోసం తియ్యటి మాటలతోనే మొదలవుతుంది. నేను ఆంటీ కి చెబుతాను.
ఈ వీకెండ్ వెళ్లి చూద్దాం . సరే సార్..
అమ్మ మేము కాలేజ్ కి వెళుతున్నాము. ఒక్క నిమిషం ఉండవే.. అబ్బాయిని కాఫీ తాగనివ్వు. తీసుకో బాబు అని ఇస్తారు.
థాంక్యూ ఆంటీ అని కాఫీ తాగి చాలా బాగుంది. ఈమధ్య కాలంలో తాగిన బెస్ట్ కాఫీ . మావారు కూడా ఇలాగే అంటారు. నా చేతి వంట అంటే ఎంత ఇష్టమో.
పొలానికి కావలసిన కొనడానికి వెళ్లి ఇంకా రాలేదు. రోజు ఎదురు చూస్తున్నాను. తప్పకుండా వస్తారు. వచ్చి ఆకలిగా ఉంది. నీ చేతి వంట తినాలి అని అడుగుతారు.
ఆ మాటకి విశికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. భానుమతి చూడకుండా పక్కకు తిరిగి తుడుచుకుని.. సరే అమ్మ ఇంకా మేము బయలుదేరుతాము.
వెళ్లేటప్పుడు మళ్ళీ తల్లికి వంద జాగ్రత్తలు చెప్పి బయట లాక్ చేసుకుని వస్తుంది. అది అంతా చూస్తున్న సూర్యకి చాలా బాధగా ఉంది.
ఒక ఆడపిల్ల ఇంత స్ట్రగుల్ ఫేస్ చేయాలంటే మాటలు కాదు. తండ్రి లేడు అన్న విషయం తల్లికి తెలియదు. తెలిసిన అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అని విశి ని చూస్తాడు.
ఏంటి సార్ అలా చూస్తున్నారు అని నవ్వితే. ఎలా విశి ఇంత నవ్వుతూ ఉండగలుగుతున్నావు.
అలవాటైపోయింది సార్.. నాన్న దూరమయ్యాక ప్రతిదానికి భయపడే దానిని.. ఏడ్చేదాన్ని..కానీ బాధను తీర్చే వాళ్ళు లేరు. ఏడిస్తే వచ్చే కన్నీళ్లు తుడిచే వాళ్ళు లేరు.
ఒకపక్క అమ్మ మెంటల్ కండిషన్. మాటకు ముందు నాన్నని.. తర్వాత నాన్నని గుర్తు చేస్తూ ఉంటే ఇంకా నరకంగా ఉండేది.
నేనే వీక్ అయిపోతే ఇంకా అమ్మ పరిస్థితి ఏమిటి ? అందుకే రాయిలాగా మారడానికి ప్రయత్నిస్తున్నాను. ఆ ప్రయత్నంలోనే ఇంకా ఉన్నాను.
చిన్నప్పటినుంచి చుట్టూ మంచిని చూడడమే అలవాటయింది కదా.. రాయిలాగా అవ్వడానికి ఇంకా టైం పడుతుంది.
అవసరం రాదు. ఏమంటున్నారు.. అదే నీకు పరిచయం చేస్తాను అన్న ఫ్యామిలీ.. నీకు మళ్ళీ ఇంకొక కొత్త ఫ్యామిలీ లాగానే...
కాబట్టి నువ్వు రాయిలాగా మారవలసిన అవసరం లేదు. పువ్వు.. పువ్వు లాగా ఉంటేనే అందం. పువ్వు... రాయిలాగా మారాలి అనుకున్నా...
రాయి పువ్వులాగా మారాలి అనుకున్నా అది ప్రకృతికే విరుద్ధం.
మీరు ఏదేదో చెబుతున్నారు సార్. ముందు ముందు అర్థమవుతుందిలే.. పదా అని కాలేజ్ కి తీసుకువెళ్తాడు.
బైక్ దిగి థాంక్యూ అని వెళ్ళిపోతుంది. వెళుతున్న విశి ని చూస్తూ నవ్వుతూ ఉంటాడు. పక్కనే ఎవరో చూస్తున్నట్టు అనిపించి చూస్తే శ్రీకర్ చేతులు కట్టుకుని సీరియస్ గా చూస్తూ ఉంటాడు.
ఏరా వచ్చి ఎంతసేపు అయింది. ఒక ఫోన్ కూడా చేయలేదు. శ్రీకర్ అలాగే చూస్తూఉంటే... అంటే పొద్దున్న నాన్నతో మాట్లాడి విశిని పికప్ చేసుకోవాలి అన్న కంగారులో అంటే..
పో బావ మా చెల్లి ఓకే చెప్పక ముందే నన్ను మర్చిపోయావు...ఇంకా ఓకే చెబితే నా పని ఇంకా అంతేనేమో.
అలా ఎందుకు వదిలేస్తారు రా.. నిన్ను నీ బుజ్జి పప్పీ తో ఇంకా టైట్ చేస్తాను కదా.. నువ్వు చేయకపోయినా నేను చేసుకుంటాను.
ఎక్స్క్యూజ్ ని అని హస్కీ గా వాయిస్ వినపడుతుంది. ఈవిడెంటి ఇప్పుడొచ్చింది అని శ్రీకర్ మెల్లిగా సూర్య చెవిలో అంటే..
నువ్వు మాట్లాడకు.. అని చెప్పండి మేడం.
హు.. హు.. ఎన్నిసార్లు చెప్పాను మేడం వద్దు. సరళ అని పిలవండి అని.. ఓకే ఓకే చెప్పండి సరళ గారు..
మా ఇల్లు ఇక్కడికి దూరం. అయితే మేమేం చేయాలి.. స్టూడెంట్స్ వాళ్ళ ఫ్రెండ్స్ తో రాగలరు.. అయితే ఏంటి... నేను లెక్చరర్ ని కదా నన్ను ఎవరు అలా తీసుకురారు.
మీరు క్లారిటీగా చెబితే బెటర్ అని సూర్య కొంచెం సీరియస్ గా అంటాడు. ఏమీ లేదు దేవాగారు.. రోజు మీరు నన్ను పికప్ చేసుకోవచ్చు కదా..
మీ బైక్ మీద వెనకాల నేను కూర్చుంటే.. లెక్చరర్స్ ఇద్దరూ కలిసి వస్తే చూశావాళ్ళకి కూడా బాగుంటుంది. అదే ఒక లెక్చరర్... స్టూడెంట్ కలిసి వస్తే.. ఇంకా ఆపుతారా అని కొంచెం గట్టిగానే అంటాడు.
సూర్య వాయిస్ కి సరళ కొంచెం జంకుతుంది. ఏంటి మేడం... మీరు చదువుకున్నారు.. ఒక లెక్చరర్ అయ్యుండి... ఇంత చీప్ గా ఎలా ఆలోచిస్తున్నారు.
ఒక స్టూడెంట్ లెక్చరర్ కలిసి వస్తే అలా తప్పుగా అనుకోవడమేనా.. నేను వచ్చే దారిలోనే.. విశిష్ట వస్తుంది. గుడ్ స్టూడెంట్.. బాగా చదువుతుంది అన్న సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టే లిఫ్ట్ ఇచ్చాను. అందులో మీకు ఏం తప్పు కనిపించింది.
మీరు ఒక లెక్చరర్ అని ఇన్ని రోజులు ఒక గౌరవం ఇచ్చాను. ఆ గౌరవం కాపాడుకుంటే మీకే మంచిది. మీరు ప్రవర్తించే తీరుకి మీ వెనకాల ఎలా మాట్లాడుకుంటున్నారో అన్నది చూసుకోండి.
పద బావ అనే శ్రీకర్ ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఏంటి బావ మరి అంత స్ట్రాంగ్ డోస్ ఇచ్చావు. లేకపోతే ఏమిటిరా... ఒక ఆడ, మగ కలిసి వస్తే వాళ్ళిద్దరి మధ్యన ఇంకా రూమర్స్ స్ప్రెడ్ చేయడమేనా..
అది ఏ యూజ్లెస్ స్టూడెంట్ స్ప్రెడ్ చేసాడో అంటే వాడికి పని పాట లేదు అనుకోవచ్చు. కానీ ఆవిడ ఒక గౌరవమైన పొజిషన్లో ఉంది.. మాట్లాడే విధానం బాగుందా..
సరే బావ కూల్. ఇంకా ఆవిడ నీ జోలికి రాదు. అసలు ముందు ఇలాంటి వాళ్ళని అపాయింట్ చేసినందుకు ప్రిన్సిపల్ ని అనాలి. చెబుతాను వీళ్ళ పని. బావ ఈ విషయం అంకుల్ దాకా వెళితే బాగోదు.
మనం ఇక్కడ ఉండేది కొన్ని రోజులే కదా... మనం వెళ్ళిపోయినా తరువాత వేరే లెక్చరర్స్ రావచ్చు లేదా ఇంకొక స్టూడెంట్ ని ఇబ్బంది పెట్టవచ్చు.
ఫస్ట్ అఫ్ ఆల్ లెక్చరర్స్ బిహేవియర్ కూడా కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేసేకే జాబ్ ఇమ్మనాలి.. లేకపోతే నాట్ అలోడ్ బోర్డు పెట్టేయాలి.
సరే నువ్వు ఛార్జ్ తీసుకున్నాక అలాగే చేద్దాము. ప్రస్తుతానికి కూల్ అవ్వు బావ.. ఈరోజు స్టూడెంట్స్ తో గేమ్స్ ఆడించాలి.
ఈ గొడవలో పడి నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ సండే విశి, అంటీ మీ పై పోర్షన్ లోకి షిఫ్ట్ అవుతారు.
అది ఫ్యామిలీ ఉండేటట్టుగా కాదు కదా.. మనం సరదాగా టైం స్పెండ్ చేయడానికి పెంట్ హౌస్ లాగా వేయించాము. నో ప్రాబ్లం వాళ్ళు ఉండేది ఇద్దరే కాబట్టి.. మేనేజ్ చేసుకుంటారు.
ఫస్ట్ అఫ్ ఆల్.. అంటీ కి కంపెనీ కావాలి. తన మైండ్ డైవర్ట్ అవ్వాలి. ఇంట్లో పెట్టి లాక్ చేసుకుని రావడం అంటే ఎందుకో కరెక్ట్ గా లేదు.
ఇటు విశి కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఓకే నేను ఈ రెండు రోజుల్లో ఏమన్నా ఆల్టరేషన్ ఉంటే చేయిపిస్తాను.
విశి కొత్త ఇంటి ప్రయాణం......
Posts: 898
Threads: 13
Likes Received: 7,038 in 832 posts
Likes Given: 1,545
Joined: Aug 2024
Reputation:
652
Part - 40
గౌతమ్ ఆఫీస్ కి రాగానే పీఏ టెన్షన్ గా ఎదురొస్తాడు. ఏమైంది అంత టెన్షన్ గా ఉన్నావు. సార్ మనకి వి. జె. స్ గ్రూప్ నుంచి కాల్ వచ్చింది.
ఆ కంపెనీ నుంచా అని గౌతమ్ ఆనందంతో అడుగుతాడు. అవును సార్... మనం ఇచ్చిన కొటేషన్ నచ్చిందంట.
ఓకే చేశారు.
మాట్లాడడానికి రమ్మంటున్నారు. ఎప్పుడో ఆరు నెలల ముందు ఇచ్చిన కొటేషన్ ఇప్పుడు ఓకే చెప్పారా.. చాలా పెద్ద కంపెనీ కదా సర్..
టైం తీసుకుంటారు కదా.. మరి ఇంత గుడ్ న్యూస్ ని ఎందుకు అంత టెన్షన్ గా చెబుతున్నావు. మీతో పాటు హిమగారిని కూడా తీసుకురమ్మన్నారు.
నడిచేవాడు ఆగి ఏమంటున్నావు. అవును సార్.. ఆర్కిటెక్చర్ తో కూడా మాట్లాడతారంట. హిమగారి స్కిల్స్ వాళ్లే పర్సనల్‌గా టెస్ట్ చేసి అప్పుడు మనకి ఓకే చేస్తామన్నారు.
క్యాబిన్ డోర్ తీసి లోపలికి వెళ్లి కూర్చొని గౌతమ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైంది సార్.. హిమ నలుగురిలో ఫ్రీగా చెప్పలేదు.
విక్రమ్ సార్ గురించి విన్నాను. ఆయన ఎంత మంచివారో.. అంత స్ట్రిక్ట్ గా ఉంటారు. అవును సార్.. ఆయన సింహం లాంటివారు..
ఏదైనా తేడా వస్తే సింహ పంజా విసిరినట్టు.. మన కంపెనీ మీద కూడా పంజా విసురుతారు. మన వర్క్ అంతా క్లియర్‌గా ఉంది కదా సార్..
హిమగారిని మోటివేట్ చేయండి.. కాన్ఫిడెంట్‌గా చెబితే చాలు. ఆ కంపెనీతో మనం టైప్ అయ్యాము అంటే ఇంక మనకి తిరిగే ఉండదు.
నువ్వు వెళ్ళు నేను ఆలోచిస్తాను అని పంపించేస్తాడు. గౌతమ్ కాసేపు ఆలోచించి హిమకి ఫోన్ చేస్తాడు. చెప్పు డార్లింగ్.. ఒకసారి ఆఫీస్ కి రా..
నేను బ్యూటీ పార్లర్ లో ఉన్నాను.. ఏదైనా ఇంపార్టెంటా.. ఫోన్లో చెప్పు. ఇది సీరియస్ మేటర్. నువ్వు తర్వాత అయినా మెరుగులు దిద్దుకోవచ్చగాని ముందు రా అని ఫోన్ పెట్టేస్తాడు. చాలా విసుగ్గా ఉంటుంది.
విశి చేయజారినప్పటి నుంచి ఆఫర్స్ తగ్గిపోతున్నాయి. ఆఫీసులో ఉన్న ఆర్కిటెక్చర్స్ బెస్ట్ వర్క్ ఇస్తున్న సరే ప్రీవియస్ వర్క్ తో కంపేర్ చేసి.. ఇంకా బెస్ట్ వర్క్ కావాలి అని చెప్పి హోల్డ్ లో పెట్టేస్తున్నారు.
విశి వర్క్ ఇవ్వడం లేదు. ఇప్పుడు విక్రమ్ సార్ డైరెక్ట్ గా ఆర్కిటెక్చర్ తో మాట్లాడతాను అంటున్నారు. హిమతో మాట్లాడితే.. ఆ వర్కు హిమ చేయలేదు అన్న విషయం తెలిసిపోతుంది.
మోసం చేసాము అని తెలిస్తే విక్రమ్ సార్ అక్కడే ప్రాణాలు ఉండగానే గొయ్యి తీసి కప్పెట్టేస్తారు. ఎలా ఈ ప్రాబ్లం నుంచి బయట పడాలి అని తల పట్టుకుంటాడు.
హిమ డోర్ తీసుకుని వచ్చి హాయ్ డార్లింగ్ ఏమైంది అని వయ్యారంగా నిలబడుతుంది . తైస్ వర్క్ ఉండే ఫ్రాక్ వేసుకుని.. హై హీల్స్ వేసుకుని.. హెయిర్ లీవ్ చేసుకుని ఉంటుంది.
చూడగానే చిరాకు వస్తుంది. ఏంటి హిమ.. ఈ డ్రెస్..ఆఫీస్ కి కదా వచ్చేది. కొంచెం మంచి డ్రెస్ వేసుకుని రావచ్చు కదా..
ఓ.. కంఆన్ గౌతమ్. ఇది లేటెస్ట్ ట్రెండ్.. మనం వేసుకునే డ్రెస్సింగ్ బట్టే మన వైపు చూస్తారు. ఎంత ఫాలోయింగ్ పెరుగుతుందో తెలుసా అని హెయిర్ ని వెనక్కి వేసుకుంటుంది.
నువ్వేంటి ఇంత చిరాగ్గా ఉన్నావు.. ఏదైనా ప్రాబ్లమా అని అక్కడ చైర్ లో కూర్చుని కాలు మీద కాలు వేసుకుని ఊపుతూ ఉంటుంది.
గౌతమ్ కి ఒక్కసారిగా విశి గుర్తుకు వస్తుంది. కాలేజీలో జాయిన్ అయిన మొదటి రోజు నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ చుడీదార్సే వేసుకునేది.
పొడుగు జడని అందంగా అల్లుకుని చక్కటి చిరునవ్వుతో మాట్లాడేది. ఎప్పుడైనా డ్రెస్సింగ్ గురించి మాట్లాడితే.. మన స్కిల్స్, బిహేవియర్ ని బట్టి ఎదుట వాళ్ళు గుర్తించాలి కానీ వేసుకునే బట్టలను బట్టి విలువ కాదు అని సున్నితంగా చెప్పేది.
అంతే.. అన్ని ఉన్న ఆకు అణిగిమనిగి ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది. అన్నట్టుగా..
స్కిల్స్ ఉన్న విశి ఓద్దికగా ఉంది కానీ హిమ అని హిమ వైపు చూస్తాడు.. ఏమైంది గౌతమ్ అలా చూస్తున్నావు.. చూపు తిప్పుకోలేకుండా ఉన్నానా.. అని కళ్ళు ఎగరేస్తుంది.
నెక్స్ట్ టైం ఆఫీసుకి వచ్చేటప్పుడు కొంచెం ప్రొపెర్ గా రెడీ అవ్వు. నన్ను కంట్రోల్ చేయాలి అనుకుంటున్నావా... గౌతమ్ కళ్ళు మూసుకుని ఒకసారి బ్రీతింగ్ తీసుకుని వదిలి..
లేచి నిలబడి హిమ వెనకాల నుంచి చేతులు వేసి.. నీ పేరు మీద ఉన్న వర్క్ అంతా చాలా ప్రొఫెషనల్ గా ఉంటుంది. ఎవరైనా నీతో మాట్లాడాలి అనుకుంటే ... నీ వే ఆఫ్ డ్రెస్సింగ్ కూడా అంతే డిగ్నిఫైడ్ గా ఉండాలి.
అఫీషియల్ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు డ్రెస్సింగ్ చాలా హుందాగా ఉండాలి. ఇలా పబ్ కి వెళ్ళినట్టుగా వస్తే బాగోదు కదా..
ఇప్పుడు ఏం చెప్పాలనుకుని నన్ను పిలిపించావు అని చేతి గోళ్లు చూసుకుంటూ అడుగుతుంది. హేమ కేర్ లెస్నెస్ కి కోపం వస్తున్న.. కంట్రోల్ చేసుకుని మనకి వి.జె. స్ కంపెనీ నుంచి కాల్ వచ్చింది.
ఏం కంపెనీ అని అడిగితే.. హిమ అని కొంచెం గట్టిగా అంటాడు. వాట్ అని చూస్తుంది. కంట్రోల్ కంట్రోల్ అనుకుంటూ కుర్చీలో ఉన్న హిమని కుర్చీతో పాటు తన వైపుకు తిప్పుకొని..
వి. జె. స్ కంపెనీ అంటే మాటలనుకుంటున్నావా... విక్రమ్ జై సింహా.. మన బిజినెస్ సర్కిల్లో మారు మ్రోగే పేరు. అయినా ఒక రోల్ మోడల్.
వాళ్లకి లేని కంపెనీ అంటూ లేదు. ఇప్పుడు విక్రమ్ సన్ కూడా బిజినెస్ ఫీల్డ్ లోకి వచ్చాడు. అతను ఎలా ఉంటాడో అన్నది ఎవరికీ తెలియదు.
ప్రస్తుతానికి అతని బ్యాక్.. విక్రమ్ సార్ వాళ్ళు ఫ్రెంటు ఉండి కంపెనీస్ రన్ చేస్తున్నారు. ఆ కంపెనీతో మనం టై అప్ అయ్యాము అంటే మనకి తిరిగే లేదు.
కాల్ వస్తే మరి నువ్వు వెళ్లొచ్చు కదా... వాళ్ళు ఇక్కడ ఒక చిన్న మెలిక పెట్టారు. నాతో పాటు నువ్వు కూడా రావాలి. నేనెందుకు అని డౌట్ గా అడుగుతుంది.
డిజైన్ చేసిన ఆర్కిటెక్చర్ తో కూడా మాట్లాడతారంట... నిన్ను టెస్ట్ చేసి అప్పుడు మనకి ఈ ప్రాజెక్ట్ ఓకే చేస్తామన్నారు.
నాకేమీ తెలియదు కదా.. మరి ఇప్పుడు ఎలా అని కొంచెం కంగారుగా అడుగుతుంది. అదే నాకు అర్థం కావడం లేదు. విక్రమ్ సార్ మోసాన్ని అసలు ఒప్పుకోరు.
ఒక పని చేద్దాం... విశిష్ట కి అమౌంట్ ఎక్కువ ఆఫర్ చెయ్యి. కాల్ లో ఉండమను.. ప్రాబ్లమ్ సాల్వ్.. అది నువ్వు అనుకున్నంత ఈజీ అనుకుంటున్నావా..
కమాన్ గౌతమ్.. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో ఏదైనా ఈజీనే.. విక్రమ్ సార్ కి దొరికాము అంటే ఇక అంతే... మనం యూత్... ఆయన సీనియర్.
అప్పటి వాళ్ళకి ఇప్పుడు టెక్నాలజీ ఎలా తెలుస్తుంది. అనవసరంగా నువ్వు భయపడుతున్నావు కానీ.. ఆ విశిష్ట తో మాట్లాడి ఫైనాలైజ్ చెయ్యి.
ఇంత చిన్న దానికి కూడా భయపడిపోయి.. నా టైం వేస్ట్ చేస్తే ఎలా... ఫ్రెండ్స్ తో పార్టీ ఉంది బాయ్ అని వెళ్ళిపోతుంది.
వెళుతున్న హిమని చూస్తూ అనవసరంగా విశిని వదిలేసుకున్నానా అనుకుంటాడు. నో.. నో...
విశిలాంటి వర్క్ చేసే వాళ్ళు ఎంతమంది అయినా దొరుకుతారు కానీ నేను ఎదగాలి అంటే హిమ ఫాదర్ సపోర్ట్ కావాలి.
హాయ్ విశి నీతో మాట్లాడాలి. ఈవినింగ్ కాలేజ్ అయిన తర్వాత కలుస్తాను అని మెసేజ్ చేస్తాడు. నాకెందుకు మెసేజ్ చేశాడు అని పక్కనే ఉన్న భవ్యతో అంటుంది.
వీడికి మళ్ళీ నీతో ఏదో పని పడి ఉంటుంది. అందుకనే ఈ స్వీట్ డైలాగ్స్ మొదలుపెట్టాడు. చూద్దాం అని సైలెంట్ గా క్లాస్ వింటుంది.
భవ్య వెంటనే ఆ మెసేజ్ సూర్యకి పాస్ చేస్తుంది. అది చూసి సూర్యా నవ్వుకుంటూ ఆల్రెడీ లైన్లో పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. చెబుతాను అని.. మీ ఫ్రీ టైం లో కలుస్తాను అని మెసేజ్ చేస్తాడు.
ఫ్రీ టైం లో గ్రౌండ్ లో కలుస్తారు.ఏంటి సార్ రమ్మన్నారు అంట అని అడిగితే... ఏమిటి ఆ గౌతమ్ గాడు మళ్ళీ మెసేజ్ చేశాడా.. ఓ భవ్య చెప్పిందా...తెలిసిందిలే... నువ్వు చెప్పలేదు కదా..
క్లాసులో ఉండగా మెసేజ్ వచ్చింది. అప్పుడు ఎలా చెబుతాను. క్లాస్ వినాలి కదా.. ఇప్పుడే కదా కలిసాము.. దీనికే మీరు అలిగితే ఎలా సార్..
ఇట్స్ ఓకే.. ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నాను. నెక్స్ట్ టైం మాత్రం ఏ టైం లో వచ్చిన నాకు వెంటనే మెసేజ్ చేయాలి. అర్థమైందా..
తప్పకుండా.. భవ్య కన్నా ముందు మీకే చెబుతాను సరేనా.. భవ్య సీరియస్‌గా చూస్తూ ఉంటుంది. శ్రీకర్ భవ్యతో ఎందుకు అలా చూస్తున్నావు.
చూశారా సార్.. ఫస్ట్ నేను దాని బెష్టి ని.. నన్ను పక్కన పెట్టి మరీ దేవసార్ కి చెబుతాను అంటుంది. దీన్ని నేను ఒప్పుకోను.
నువ్వు దీనికే ఇంత ఫీల్ అవుతున్నావు. పొద్దున్న విశి ని పికప్ చేసుకోవాలని నాకు ఫోన్ కూడా చేయకుండా వచ్చేసాడు. మరి నేనెంత ఫీల్ అవ్వాలి.
అవునా... అవును అని తల ఊపుతాడు . నాకెందుకో వీళ్ళిద్దరి మధ్యన సంథింగ్ సంథింగ్ అనిపిస్తుంది సార్.. మనసులో వాడికి ఆల్రెడీ సంథింగ్ ఎప్పుడో జరిగిపోయింది. ఇంక నీ ఫ్రెండ్ కే క్లారిటీ రావాలి అనుకొని.. ఎందుకనిపించింది.
ఆ గౌతమ్ గాడు ప్రపోజ్ చేసిన సరే విశి ఏ రోజు ఇంత ఫ్రీగా మాట్లాడలేదు. నా చెయ్యి వదల్లేదు.. గౌతమ్ తో ఎప్పుడు మాట్లాడినా నేను పక్కనే ఉండాలి.
అలాంటిదే ఇప్పుడు నేను పక్కనే లేకపోయినా దేవాసార్ తో ఫ్రీగా మాట్లాడుతుంది.. చొరవ చూపిస్తుంది అంటే దీని అర్థం ఏమిటి సార్..
నువ్వు అన్నట్టే వాళ్ళిద్దరి మధ్యనే ఏదైనా సంథింగ్ సంథింగ్ ఏమో చూద్దాం..
గౌతమ్ నీ కలుస్తావా విశి.. అదే అర్థం కావడం లేదు. కలువు కానీ నేను చెప్పినట్టేగా చెయ్యి...
సూర్య ఏం చెప్పబోతున్నాడు..
కథ కొనసాగుతుంది...
Posts: 293
Threads: 0
Likes Received: 213 in 150 posts
Likes Given: 1,241
Joined: Mar 2022
Reputation:
5
lets see how vishi play smartly
Posts: 4,838
Threads: 9
Likes Received: 3,259 in 2,498 posts
Likes Given: 11,328
Joined: Sep 2019
Reputation:
31
Posts: 1,159
Threads: 1
Likes Received: 732 in 475 posts
Likes Given: 11,271
Joined: Jun 2019
Reputation:
2
How Surya & Vishi plays the game would be interesting...
Posts: 1,699
Threads: 2
Likes Received: 1,020 in 780 posts
Likes Given: 2,418
Joined: May 2019
Reputation:
11
Surya vs Gautam.. interesting game start ayindi
Posts: 898
Threads: 13
Likes Received: 7,038 in 832 posts
Likes Given: 1,545
Joined: Aug 2024
Reputation:
652
Part - 41
గౌతమ్ ని కలువు కాకపోతే నేను చెప్పినట్టేగా చెయ్ అని ఏం చేయాలో చెబుతాడు.. అది విని భవ్య నోరు వదిలేస్తుంది.
శ్రీకర్.. భవ్యని చూసి నోరు మూసుకో. లేదంటే ఈగలు దూరతాయి. అదేంటి సార్ ఒక బిజినెస్ మ్యాన్ లాగా అంత పర్ఫెక్ట్ ప్లాన్ చెబుతున్నారు.
ఏదో వాడికి తోచింది చెప్పాడు. మీకు బయట ప్రపంచం తెలియక మీకు అలా అనిపిస్తుంది అంతే. నిజంగా అంతేనా అని అనుమానం గా అడుగుతుంది.
నీకేమైనా అనిపిస్తుందా ఏమిటి.. నాకెందుకో అనుమానంగా ఉంది. నీకు ఆన్సర్స్ కన్నా క్యూస్షన్స్ ఎక్కువగా తెలుసు అనుకుంట కదా..
సార్ అని రాగం తీస్తే.. తీసింది చాలు కానీ క్లోజ్ చెయ్ అమ్మ.
విశి గౌతమ్ కి మెసేజ్ చేస్తుంది. ఆఫ్టర్ నా రెస్టారెంట్ వర్క్ ఫినిష్ అయిన తర్వాత కలుస్తాను. అప్పుడు దాకా నాకు ఖాళీ లేదు అని.
ఆ మెసేజ్ చూసిన గౌతమ్ కి ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది. ఒకప్పుడు నా కాల్ కోసం.. నా మెసేజ్ కోసం ఆత్రంగా ఎదురుచూసిన ఈ విశిష్ట ఈరోజు నాకే టైం ఇస్తుంది.
ఒక్కసారి ఈ విశిష్టతో నా పని అయ్యి.. వి. జె. స్ కంపెనీతో టై అప్ అవ్వాలి. అప్పుడు చెబుతాను. ఎక్కడ జాబ్ రాకుండా చేసి ఆ రెస్టారెంట్ లోనే టేబుల్స్ తుడుచుకుంటూ.. వచ్చే వాళ్ళకి వెళ్లే వాళ్లకి వంగి వంగి సలాం చేసేటట్టు చేస్తాను.
ఓకే విశిష్ట.. నువ్వు ఎలాగంటే అలాగే చేద్దాం అని రిప్లై ఇస్తాడు. అది చూసి విశిష్ట నవ్వుకుని.. సార్ మీరు చెప్పినట్టుగానే పంపించాడు.
అలా.ఎలా గెస్ చేశారు. దీన్నే కామన్ సెన్స్ అంటారు. ప్రతిదీ ఎమోషనల్ తో కాదు మైండ్ తో కూడా ఆలోచించాలి.
సాయంత్రం రెస్టారెంట్ వర్క్ ఫినిషింగ్ అయ్యేటప్పటికి వైభవ్ వస్తాడు వైభవ్ చూసుకుంటాడు సరేనా..అతనికి నేను ఫస్ట్ శాలరీ ఇవ్వలేను కదా... అని ఇబ్బంది పడితే..
డోంట్ వర్రీ అదంతా గౌతమ్ ఇస్తాడు. నేను చెప్పింది చెప్పినట్టుగా చేయి చాలు. సెల్ఫ్ గా వర్క్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు.... స్ట్రిక్ట్‌గా రూల్స్ ఫాలో అవ్వాలి.
అవన్నీ వైభవ్ కి తెలుసు. నీ వర్క్ నువ్వు చేసుకో ఓకేనా.. థాంక్యూ సార్ అని వెళ్ళిపోతుంది.
విశి, భవ్య వెళ్ళిపోయిన తర్వాత శ్రీకర్ వచ్చి మా చెల్లిని ఒక మెట్టెక్కిచ్చావన్నమాట. ఇంకా పూర్తిగా ఎక్కలేదు. కొంతమందికి వర్క్ వచ్చు ఎలా ఎక్స్పోజ్ అవ్వాలో తెలియదు.
మరి కొంతమందికి ఎక్స్పోజ్ అవ్వడం తెలుసు కానీ వర్క్ తెలియదు. వీళ్ళిద్దరూ అదే కోవా... నీకు రెండు వచ్చు కదా.. అలా అని అన్ని మనకే తెలుసు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా అని ఇద్దరు స్టాఫ్ రూమ్ కి వెళ్ళిపోతారు.
సూర్య ఇచ్చిన వార్నింగ్ కే సరళ కొంచెం పద్ధతిగా మాట్లాడడం మొదలు పెడుతుంది కానీ మనసులో మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
సమయం వచ్చినప్పుడు సూర్యుని ఎలాగైనా దెబ్బ తీయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది.
సూర్య వైభవ్ కి మెసేజ్ చేస్తాడు..ఈవినింగ్ రెస్టారెంట్ కి వచ్చేయ్ నీ జాబ్ స్టార్ట్ అయింది అని..
భవ్యకి కూడా ఏం మాట్లాడతారో.. ఏం జరుగుతుందో తెలుసుకోవాలని విశి తో పాటే వెళ్తుంది. విశి రెస్టారెంట్ వర్క్ ఫినిష్ చేసుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వచ్చేటప్పటికి..
గౌతమ్ పార్కింగ్ ఏరియాలో వెయిట్ చేస్తూ ఉంటాడు.
విశి కామ్ గా వెళ్ళిపోతూ ఉంటే విశిష్ట అని పిలుస్తాడు. వెనక్కి తిరిగి చూసి హలో మిస్టర్ గౌతమ్ అని విష్ చేస్తుంది.
మిస్టర్ గౌతమ్ అని ఆశ్చర్యంగా చూస్తే... ప్రొఫెషనల్ ఫీల్డ్ కు సంబంధించిన వర్క్ మాట్లాడుకుంటున్నప్పుడు మన ప్రొఫెషనల్ గానే ఉండాలి కదా మిస్టర్.
ఓకే... ప్రొఫెషనల్ గానే మాట్లాడుకుందాం. నాకు నీ వర్క్ కావాలి. డబల్ అమౌంట్ ఇస్తాను. చేతులు కట్టుకొని చూస్తూ ఉంటుంది.
ఏమయింది.. బిజినెస్ డీల్ చేసే పద్ధతి ఇదేనా.... ఎక్కడపడితే అక్కడ బిజినెస్ గురించి మాట్లాడతారా.. కాన్ఫరెన్స్ రూమ్ బుక్ చేయాలి.. బిజినెస్ చేసే వాళ్లతో పొలైట్ గా మాట్లాడాలి అన్న మినిమం కామన్ సెన్స్ కూడా నీకు లేదా అని అడుగుతుంది.
వాట్ అని గట్టిగా అరుస్తాడు. మిస్టర్ గౌతమ్ మీకు నాతో కలిసి వర్క్ చేయాలి అంటే ప్రొఫెషనల్ గానే డీల్ చేయండి. ఇలా వచ్చి నా టైం వేస్ట్ చేయడం కరెక్ట్ కాదు. నాకు చాలా వర్క్ ఉంది.
ఓకే మిస్ విశిష్ట అని వత్తి పలుకుతాడు . చెప్పండి మిస్టర్ గౌతమ్ అనగానే.. మీరు ఇప్పుడు ఫ్రీ అయితే మన బిజినెస్ గురించి మాట్లాడుకుందాం.
టైం చూసుకుని మీకు నా పిఏ నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను. మీరు టైం ప్లేస్ అన్నీ కన్ఫర్మ్ గా ఫైనల్ చేసి ఇన్ఫామ్ చేయండి. ఆ టైం మాకు ఓకే అయితే తప్పకుండా కలుస్తాను.
బట్ నాకు డే టైం అయితే ఖాళీఉండదు. మాక్సిమం ఈ టైం అయితే ఓకే.. ప్లేస్ కూడా ఇక్కడైతేనే నాకు కంఫర్ట్ గా ఉంటుంది అని వైభవ్ నెంబర్ ఫార్వర్డ్ చేసి ఇక నేను వెళ్తాను అని వెళ్ళిపోతుంది.
వెళుతున్న విశిష్టని నోరు వదిలేసి చూస్తూ.. ఇది విశిష్ట ఏనా.. మనీ కోసం ఎంత హార్డ్ వర్క్ ఇచ్చిన చేసేది.. అలాంటిది ఇప్పుడు మనీ కన్నా ప్రొఫెషనల్‌గా డీల్ చేద్దాం అని నాకే సవాల్ విసురుతుంది.
పైగా టైము ప్లేస్ నన్ను డిసైడ్ చేయమని... నాకు ఇలాగే కావాలి అని క్లియర్ గా చెబుతుంది.. అసలు ఏం జరుగుతుంది అని వెళుతున్న విశిష్ట నే చూస్తూ ఉంటాడు.
భవ్య విశి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి వావ్ సూపర్ బేబీ.. ఏం జలక్ ఇచ్చావు వాడికి అని గట్టిగా బుగ్గ పైన ముద్దు పెడుతుంది.
ఇది దూరం నుంచి చూస్తున్న సూర్యకి కోపం వస్తుంది. స్పీడ్ గా వాళ్ళ దగ్గరికి వచ్చి ఇది పబ్లిక్ ప్లేస్ ఎక్కడ పెడతే అక్కడ అలా ముద్దులు పెట్టకూడదు.
భవ్య వెంటనే.. మేమిద్దరం అమ్మాయిలమే.. నేనేమీ అబ్బాయికి పెట్టలేదు కదా.. ఏదేమైనా సరే అలా పెట్టకూడదు.
విశి.. రా..ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అమ్మ వెయిట్ చేస్తూ ఉంటారు అని బైక్ స్టార్ట్ చేస్తాడు. భవ్యకి బాయ్ చెప్పి సూర్య బైకు ఎక్కుతుంది.
వెళుతున్న ఇద్దరినీ చూస్తూ ఉంటే.. శ్రీకర్ వచ్చి ఏమైంది అలా చూస్తున్నావు..నో డౌట్ సర్. దేవా సార్ కి సంథింగ్ సంథింగ్ జరిగింది.
సరేలే నువ్వు ఇప్పుడు ఒక ఐన్‌స్టీన్ వి. ఈ చీకటిలో ఒక కొత్త విషయం కనిపెట్టావు. నేనెప్పుడూ కనిపెడుతూనే ఉంటాను. సరే అని చెప్పి వెళ్ళిపోతుంది.
శ్రీకర్ సూర్య వెనకాల వెళతాడు. విశిని డ్రాప్ చేసి జాగ్రత్త.. ఆ గౌతమ్ ఇప్పుడు ఏమి కాల్స్ చేసినా లిఫ్ట్ చేయకు. రేపు మార్నింగ్ వరకు బ్లాక్ చేసేయ్.. అర్థమైందా..
ఓకే సార్. నేను ఏది చెప్పినా. ఊ..కొడతావా.. అవును సార్.. మొన్నే. కదా చెప్పాను. ఎవరు ఏది చెప్పిన గుడ్డిగా ఫాలో అవ్వద్దు అని చేతులు రెండు కట్టుకుని బైక్ మీద కూర్చుని అడిగితే...
మీరు అన్నది నిజమే సార్. అది మిగిలిన వాళ్ళ విషయంలో.. మీ విషయంలో కాదు. ఏమిటి నాపైన అంత నమ్మకం.
తెలియదు. మీ మాట.. మీ భరోసా చూస్తూ ఉంటే నాకు మా నాన్న గుర్తొస్తారు. నేను మా నాన్న తర్వాత అంత కంఫర్ట్ గా ఫీల్ అయింది మీ దగ్గరే.. బాయ్ సార్ అని వెళ్ళిపోతుంది.
వెళుతున్న విశి ని చూస్తూ తల వెనకాల రబ్ చేసుకుంటూ ఉంటాడు. శ్రీకర్ వచ్చి సైట్ కొట్టింది చాలు గానీ ఇంకా వెళదామా..
ఒరేయ్ క్యూటి ఏముందో తెలుసా.. అంకుల్ తర్వాత నా దగ్గరే అంత కంఫర్ట్ ఫీల్ అవుతుంది అంట.వాళ్ళ నాన్నగారి దగ్గరఎంత భరోసా ఉందో... నా దగ్గర అంత భరోసా ఉందంట.. ఇది చాలు కదా..
ఇప్పుడు నువ్వు గాలిలో తేలుతూ ఉంటావు కానీ వైభవ్ ఎక్కడున్నావని ఫోన్ చేస్తాడు. ఏం బావ..మీ అన్నగారు గాలిలో తేలుతున్నారు.
ఆ బైక్ తమరు వేసుకొస్తే మీ అన్నగారిని నేను తీసుకోవస్తాను.. అంతలా మా వదిన ఏమి ఇచ్చింది. మాటల్లో చెప్పలేని అనుభూతినిలే.. నువ్వు రారా ..
ఫైవ్ మినిట్స్ అని వైభవ్ వస్తాడు. ఏంటి అన్నయ్య రెస్టారెంట్ కి రమ్మని నన్ను వదిలేసి వచ్చేసారు. సూర్య ఏమీ పలకకపోతే.. మీ అన్నగారిని ఏమీ కదపకు. నన్ను కూడా వదిలేస్తున్నాడు.
నువ్వు రా బావ అని వెనకాల ఎక్కించుకుంటాడు. బైక్ మీద కూర్చుని శ్రీకర్ భుజం మీద చెయ్యి వేసి విశి మాటలే తలుచుకుంటూ మురిసిపోతూఉంటాడు.
సూర్య కళ్లలో ఆమె మాట తిరుగుతుంటాయి.. “మా నాన్నగారి తర్వాత మీ దగ్గరే నాకు భరోసా...” ఆ మాట తలచుకుంటే మనసు గాలిలో తేలిపోతూ... నీ చెంతనుండి నాలో ఊపిరి గా మార్చుకుంటాను.
చేతులు రెండు చాచి.. తల వెనక్కి వాల్చి.. ఆ గాలిలో విశి స్పర్శను ఫీల్ అవుతూ.. గాలిలో తేలుతూ ఉంటాడు. దేవా సార్ అని విశి పిలుస్తున్నట్టు అనిపించి చేతులు నార్మల్‌గా పెట్టుకుని పక్కకి చూస్తాడు.
వైభవ్ బైక్ మీద తను వైపుకు కూర్చుని సార్ చేతులు చాపకండి. ప్రమాదం.. ఓకే అని చేతులు నార్మల్‌గా పెడతాడు.
ఓకే ఏంటి బావ.. ఏమైంది.. మళ్ళీ పక్కకి చూస్తే వైభవ్ బైక్ మీద విశి ఉండదు. ఏమీ లేదులే... శ్రీకర్ బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటే సడన్ గా విశి సూర్య వెనకాల కూర్చుని గట్టిగా హగ్ చేసుకున్నట్టుగా ఫీల్ అవుతాడు.
ఉలిక్కిపడి వెనక్కి తిరిగి నువ్వేంటి ఇక్కడ.. మీకోసమే వచ్చాను సార్. ఇలా బాగుంది కదా.. బాగుంది కానీ..
ఇక్కడ శ్రీకర్ వైభవ్ ఇద్దరూ ఉన్నారు.
చూస్తే బాగోదు వెళ్ళిపో. ఎక్కడికి వెళ్లిపోమంటున్నావు బావ. ఎవరు చూస్తే బాగోదు. ఈ గాలిలో మాటలు సరిగ్గా వినపడటం లేదు.
సూర్య బాబు కాస్త కంట్రోల్?♂️?♂️
Posts: 898
Threads: 13
Likes Received: 7,038 in 832 posts
Likes Given: 1,545
Joined: Aug 2024
Reputation:
652
Part - 42
శ్రీకర సూర్య ని డ్రాప్ చేస్తాడు సరే. గుడ్ నైట్ రా.. అదేంటి బావ నిన్ను డ్రాప్ చేస్తే లోపలికి రా అని కూడా పిలవకుండా గుడ్ నైట్.. ఇంటికి పో.అంటున్నావు.
నువ్వే కదరా ఎప్పుడు రమ్మన్న.. నేను రాను..వస్తే సౌమ్యని కేలుకుతాను. మా మామయ్య చూస్తే హర్ట్ అవుతాడు. బ్లా.. బ్లా.. చెప్పేవాడివి.
అప్పుడప్పుడు పిల్లగాలి వీస్తూ ఉంటుంది కదా.. నీకేం బాబు. నువ్వే బానే సెట్ చేసుకుంటున్నావు. మాకు అప్పుడప్పుడే టైం దొరుకుతుంది అని బైక్ దిగుతాడు.
ఒరేయ్ రావాలి అనుకుంటే.. డైరెక్ట్‌గా రా అంతేగాని ఈ కహానిలన్నీ అవసరమా... ఆంటీ కి మెసేజ్ చేసి వచ్చేయ్ అని వెళ్ళిపోతాడు.
వైభవ్ వచ్చి మీ ఇద్దరి పనే బాగుంది. నా చుక్క ఎక్కడుందో.. నీ చుక్క నీ పక్కనే ఉంది రా బామ్మర్ది.. గుర్తించు...విజిల్ వేసుకుంటూ లోపలికి వెళ్తాడు.
శ్రీకర్ వెళ్లేటప్పటికీ సూర్య రూమ్ కి వెళ్ళిపోతాడు. హాల్లో సౌమ్య పూజితతో మాట్లాడుతూ ఉంటుంది. నైల్స్ చూపిస్తూ చెబుతూ ఉంటే.. పూజిత ఇంట్రెస్టింగ్ గా వింటూ ఉంటుంది.
శ్రీకర్ వెళ్ళి వాళ్ళిద్దరి మధ్యలో కూర్చుని ఏం చెప్పుకుంటున్నారు అని అడుగుతాడు. ఒరేయ్ ఇద్దరు ఆడవాళ్లు మాట్లాడుకునేటప్పుడు ఏం చెప్పకుంటున్నారు అని అడగకూడదు.
అవునా పోనీ మీకు తెలిసిన నిజం ఏమిటి అంటాడు. ఏంటి అతి తెలివితేటలా... శ్రీకర్ కి ఒక్కసారిగా పొలమారుతూ ఉంటే.. ఆంటీ వాటర్ ఉండు తెస్తున్న అని కంగారుగా పూజిత వెళుతుంది.
సౌమ్య వైపుకు తిరిగి ఏం చేస్తున్నావే నా బుజ్జి పప్పీ.. నోరు వదిలేసి.. ఇప్పటిదాకా దగ్గుతూ ఉన్నావు కదా..నీతో మాట్లాడాలని ఆక్ట్ చేశాను అని నాలిక బయటపెడతాడు.
శ్రీకర్ చేసిన పనికి సిగ్గుతో తల దించుకుంటుంది. అయ్యో డాక్టర్ పాపా నువ్వు అలా సిగ్గుపడకు. నా హార్మోన్స్ అన్ని కూచిపూడి, భరతనాట్యం ఆడేస్తున్నాయి.
అప్పుడు కాళ్లకున్న గజ్జలు తీసేయ్ అని వాయిస్ వినపడుతుంది. ఇది ఎక్కడినుండి వచ్చిందని చూస్తే వెనకాల భరత్ సీరియస్‌గా చూస్తూ ఉంటాడు.
మావయ్య మీరు ఇంకా పడుకోలేదా.. ఇంత రాత్రి దాకా మెలకువగా ఉంటే మీ ఆరోగ్యం ఏం కావాలి. చేసిన ఓవరాక్షన్ చాలు గానీ..
ఏంటి నా కూతురుకి ఏదో కహానీలు చెబుతున్నట్టు ఉన్నావు. ఊరుకో మావయ్య. నీ కూతురికి కహానీలు చెప్పే అంత ధైర్యం ఉందా..
వెనక సింహం లాంటి విక్రమ్ అంకుల్... ఇటు పక్కన పులిలాంటి నువ్వు ఉండగా కహానీలు చెబితే కుదురుతుందా.. అందుకే నిజాలే చెబుతున్నాను.
అవునా ఏమిటో ఆ నిజాలు.. కూర్చో మావయ్య పక్కన కూర్చోబెట్టుకుని.. ఒక కాలు సోఫాలో మడత పెట్టి కూర్చుని మీకు ఒక సీక్రెట్ చెబుతాను .
సరే చెప్పు. ఎవరికి చెప్పకూడదు. ముందు నువ్వు చెప్పు.
చెప్పాలో చెప్పకూడదు నేను డిసైడ్ అవుతాను. అలా అంటే కుదరదు మావయ్య.
సీక్రెట్ అంటే సీక్రెట్ ... ష్.. అని తల పట్టుకొని సరే చెప్పు. మన సూర్య లవ్ లో పడ్డాడు. మా చెల్లెలు సూపర్ ఉంటుంది తెలుసా.. అవని ఆంటీకి ఎదురొస్తుంది.
ఎంత లక్కీ ఫెలోస్ మావయ్య మీరందరును...ఆ మాటకి పైనుంచి కిందకి చూస్తూ ఉంటే...ప్రామిస్ మావయ్య అని కంఠం దగ్గర పట్టుకుంటాడు.
ఒరేయ్ నీ వేషాలు నా దగ్గర కాదు. సూర్య లవ్ లో పడ్డాడు అన్న విషయం ఇంట్లో అందరికీ తెలుసు అందుకనే అది పెద్ద సీక్రెట్ గా చెబుతున్నావు.
సూర్యకి సంబంధించింది ఏ విషయమైనా నువ్వు బయటికి రానివ్వవు అని నాకు తెలుసు. నువ్వు చాలా ఇంటలిజెంట్ మావయ్య అని బుగ్గలు పట్టుకుని లాగుతాడు.
సౌమ్య పుసుక్కున నవ్వుతుంది. భరత్ శ్రీకర్ చేతుల మీద ఒక్కటేసి.. ఇలాంటి వేషాలు వేస్తేనే వాయించేది. సూర్య పెళ్లి అయ్యేదాకా కుదురుగా ఉండండి.
మావయ్య నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇచ్చావా... థాంక్యూ..
థాంక్యూ.. దేనికి రా గ్రీన్ సిగ్నల్. మరి దేనికి కుదురుగా ఉండమన్నావు.
నీకు అర్థం అయిన విషయమే...నన్ను కన్ఫ్యూజ్ చేయకు మావయ్య. క్లియర్ గా చెప్పేసావు అనుకో.. ఏదో నా బుజ్జి పప్పీ తో కొన్ని రోజులు అలా.. అలా...
అదే తగ్గించుకోమనేది . సౌమ్య నువ్వు రూమ్ లోకి వెళ్లి చదువుకో. సరే నాన్న అని లోపలికి వెళ్ళిపోతుంది. వెళుతున్న సౌమ్య ని నీరసంగా చూస్తాడు.
పూజిత వాటర్ తీసుకొచ్చి ఇదిగో తాగు. థాంక్స్ ఆంటీ అని నీరసంగా పుచ్చుకుంటాడు. ఇప్పుడు దాకా బానే ఉన్నావు కదరా... ఇంతలోనే అంత నీరసం వచ్చింది. ఏమైంది..
ఏమీ లేదు పూజిత. ఇప్పుడే ఒక కొత్త రకం జ్వరం వచ్చింది. అందుకే సడన్‌గా నీరసబడిపోయాడు. అవునా అని టెంపరేచర్ చూస్తుంది.
అదేంటి బాడీ చల్లగానే ఉంది. ఇది పైకి కనిపించేది కాదులే. వయసులో వచ్చే ఒక దోమ కుట్టేది. అంటే.. ప్రేమ జ్వరమా..
ఎవరు ఆ అమ్మాయి.. చెప్పు.. చెప్పు.. ఈ పూజిత ఆంటీ ఒకటి. ఆనందం వచ్చిన కోపం వచ్చిన ఇమ్మీడియేట్ గా చూపించేస్తది.
సమయం వచ్చినప్పుడు అందరికన్నా ముందు మీకే చూపిస్తాను. మర్చిపోకూడదు అని వేలు చూపిస్తూ అడుగుతుంది.
నేను మర్చిపోయిన మీరు మర్చిపోనివ్వరు కదా.. నాకు తెలుసు కదా అని సాగదీసుకుంటూ చెప్పి.. నేను సూర్య దగ్గరికి వెళుతున్నాను. తినేసి వెళ్ళండి రా..
ఆకలిగా లేదు అని రెండు స్టెప్స్ కలిపి ఎక్కుతూ వెళతాడు. వెళుతున్న శ్రీకర్ ని చూసి భరత్ నవ్వుకుంటాడు.
ఏంటి అన్నయ్య మీలో మీరే నవ్వుకుంటున్నారు. మనం ఈ వయసులో ఎంత అల్లరి చేసామో.. వీళ్లు అంత కన్నా ఎక్కువ చేస్తున్నారు.
మీకే అన్నయ్య ఆడపిల్ల తండ్రి. అదృష్టవంతులు. సౌమ్య కుదురుగా ఉంటుంది. మేమే అబ్బాయిలను కన్నవాళ్ళము.
అమ్మో టెన్షన్ తో సచ్చిపోతున్నాము. వైభవ్ వచ్చి.. వాట్ మా.. ఏదో చచ్చిపోతున్నాం టెన్షన్ అంటున్నావు. చూసావా అన్నయ్య.. ఇది కొడుకులు కన్నా తల్లులు వరస.
నువ్వు... సౌమ్య లోపలికి వెళ్లు అనగానే ఎందుకు ఏమిటి అని అడగకుండా వెళ్ళిపోయింది. అదే నా కొడుకు చూడు సగం సగం విని ఏమైంది అని అడుగుతున్నాడు.
అంతా బాబు వరస. ఎందుకమ్మా అంత గరంగరంగా ఉన్నావు. ఇప్పుడు నాన్నని నన్ను కలిసి బ్యాటింగ్ ఆడుతున్నావు అని గెడ్డం పట్టుకుని అడుగుతాడు.
ఏమీ లేదు సుపుత్ర.. ఇప్పుడు దాకా తమరు ఏరాచకార్యాలు వెలగబెట్టారో తెలుసుకోవచ్చా.. నేను వెలగబెట్టిన రాచకార్యాలు చెబితే నువ్వు షాక్ తో బిగుసుకుపోతావు.
ముందు చెప్పరా అని నీరసంగా అడుగుతుంది. నీ కొడుకు జాబ్ లో జాయిన్ అయ్యాడు. మన కంపెనీలో నా.. అది కూడా ఒక షాకింగ్ న్యూస్ ఏనా..
నో.. మన కంపెనీలో అయితే నా టాలెంట్ తో వచ్చిందని నమ్మవు. అందుకే బయట కంపెనీలు ట్రై చేశాను. వచ్చేసింది. ఎవర్రా నీకు జాబ్ ఇచ్చినా అమాయక పక్షి..
అమాయక పక్షి కాదు మస్తు టాలెంట్ ఉన్న పక్షి. ద గ్రేట్ విశిష్ట సూర్య దేవాన్ష్.. ఏమిటి మీ వదిన నీకు జాబ్ ఇచ్చిందా.. ఇది ఎప్పుడు జరిగింది.
నిజంగానే మీ వదిన అమాయకురాలు రా... లేకపోతే నీకు ఎలా జాబ్ ఇస్తుంది. ఇదిగో తెచ్చుకున్న నీతో తంటానే... తెచ్చుకోకపోయినా తంటానే..
ఎలా అమ్మ నువ్వు నన్ను నమ్మేది. అది జన్మలో జరగని పని అని వినయ్ వస్తాడు. చూడండి నాన్న నేను జాబ్ తెచ్చుకున్నాను అమ్మ నమ్మడం లేదు అని పక్కనే కూర్చుని కాళ్లు వినయ్ మీదేసి హగ్ చేసుకుని కూర్చుంటాడు.
మీ అమ్మే కాదురా ఎవ్వరం నమ్మలేము. అందుకే నేను ఏదైనా పెద్దమ్మకే చెబుతాను. పెద్దమ్మ... పెద్దమ్మ అని అరుస్తూ ఉంటాడు.
ఎందుకురా అలా అరుస్తున్నావు అని అవని వస్తే...చూడు పెద్దమ్మ నాకు జాబు వచ్చిందంటే.. మెచ్చుకోవడం మానేసి ఎగతాళి చేస్తున్నారు.
ఎవరు... నా కొడుకుని ఎగతాళి చేసింది. నా బంగారు కొండ నీకు జాబ్ వచ్చిందా ఉండు స్వీట్ తెచ్చి నోట్లో పెడతాను. అందుకే పెద్దమ్మ నువ్వంటే నాకిష్టం.
అక్క అనవసరంగా స్వీట్ వేస్ట్ చేయకు. నీ ముద్దుల కొడుకుకి ఎక్కడ జాబ్ వచ్చిందో కనుక్కో. ఎక్కడ వచ్చిందన్నది ఇంపార్టెంట్ కాదు పూజిత..
వచ్చిందా లేదా అన్నదే ఇంపార్టెంట్. పెద్దమ్మ నీ దగ్గర ఉన్న టాలెంట్ కి అసలు మాటల్లో చెప్పలేను అనుకో.. పద మనిద్దరం స్వీట్ తెచ్చుకుందాం..
సూర్య, శ్రీకర్ విక్రమ్ వెళతారు. ఏంట్రా తోడు దొంగలు ఇద్దరు కూడబల్కొని వచ్చారు. నాన్న.. అంకుల్.. అనుకుంటు ఇద్దరూ చెరో వైపున హగ్ చేసుకుంటారు.
మేటర్ ఏంటి.. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. కారణం.. విశి లో వచ్చిన మార్పు. ఏం జరిగిందో.. గౌతమ్ తో ఎలా మాట్లాడిందో మొత్తం చెబుతాడు.
పరవాలేదు బానే ట్రైనింగ్ ఇస్తున్నావు. అంకుల్ వాడు హ్యాపీనెస్ కి మెయిన్ రీజన్ అది కాదు. మీకు ఏదేదో చెబుతున్నాడు. నువ్వు నోరు ముయ్యి రా.. వెనకనుంచి లాగుతూ ఉంటాడు.
ఏ.. నా కోడలు ఏమైనా ఐ లవ్ యు చెప్పిందా.. ఏమిటి.. అంతకుమించి అని శ్రీకర్ చెయ్యి పైకి పెడతాడు .ఏమిటో అని విక్రమ్ కూడా అలాగే అడిగితే..
మీ మీద నాకు చాలా భరోసా నమ్మకం ఉంది దేవా సార్. మా నాన్న తర్వాత మీ దగ్గరే నేను అంత కంఫర్ట్ గా ఉండగలను అని చెప్పింది.
అది విన్న దగ్గర్నుంచి మన సూర్య బాబు బైక్ మీద కాకుండా గాలిలో వచ్చాడు.. బైక్ మీద అన్ని కలవరింత మాటలే.. వినలేకపోయాను అనుకో.
ఒరేయ్ నీకు ఏమి వినిపించలేదు అన్నావు కదరా.. చూసారా అంకుల్.. నేను చెప్పానా అబ్బా.. ఇరికించేసాడు అనుకుని అది కాదు నాన్న అని గారాలుపోతూ ఉంటే..
ఒరేయ్ వేసిన వేషాలు చాలుగాని. ఆ గౌతమ్ కి చాలా మంట పెట్టాను. మళ్ళీ రేపొద్దున్న తగులుకుంటాడు. బి కేర్‌ఫుల్..
అందుకే కదా మన వైభవ్ ని పిఏగా పెట్టాను. ఇది ఎప్పుడు చేశారు. మరి నీ కోడలికి ఫుల్ సెక్యూరిటీ ఉండాలి కదా...
కాలేజీలో ఉన్నంత సేపు నేను చూసుకుంటూఉంటాను. అఫ్కోర్స్ ఇంటికెళ్లే వరకు చూసుకుంటాను అనుకో....బట్ నేను డైరెక్ట్ గా రావడం కన్నా వెనకాల ఉండడమే బెటర్ అనిపించి వైభవ్‌ని ముందుకి తీసుకోవచ్చాను.
విక్రమ్ సమాధానం...
కథ కొనసాగుతుంది.....
Posts: 4,838
Threads: 9
Likes Received: 3,259 in 2,498 posts
Likes Given: 11,328
Joined: Sep 2019
Reputation:
31
Posts: 1,159
Threads: 1
Likes Received: 732 in 475 posts
Likes Given: 11,271
Joined: Jun 2019
Reputation:
2
Posts: 1,699
Threads: 2
Likes Received: 1,020 in 780 posts
Likes Given: 2,418
Joined: May 2019
Reputation:
11
|