Posts: 898
Threads: 13
Likes Received: 7,006 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
Part - 68
శాంభవి రెస్ట్ తీసుకుంటుంది అని గదిలోకి తీసుకుని వెళ్తారు. రుద్ర గదిలో వర్క్ చూసుకుంటూ ఉంటే ధీరజ్ వచ్చి.. ఏంటి బావ ఇప్పుడు కూడా వర్క్ ఎనా.. మరి ఏం చేయమంటావో చెప్పు అంటాడు.
బావ నేను ఒక విషయం అడుగుతాను నిజం చెప్పు.
అడుగు అంటాడు. నువ్వు కావాలనే శాంభవికి తినిపించలేదు కదా.. నీ భోజనం అయిన తర్వాత తినిపించాలి అనుకున్నావు. ఎందుకు.
ఫుడ్ లో ఏమన్నా కలిసిందేమో అన్న అనుమానం. అందుకే నేను టేస్ట్ చూసిన తర్వాత శాంభవికి పెట్టాను. ధీరజ్ కంగారుగా నువ్వెందుకు టేస్ట్ చూసావు. నీకు ఏదైనా జరిగితే...
నాకేమీ అవ్వదు. నేను స్ట్రాంగ్. వెంటనే హాస్పిటల్ కి వెళ్తాను. ట్రీట్మెంట్ తీసుకుంటా.. శాంభవి విషయంలో అలా కాదు. ముందు శాంభవి నే పానిక్ అవుతుంది..
మావయ్య వాళ్ళు కూడా కంగారుపడతారు. ఎంతమంది హెల్త్ మీద తెచ్చుకుంటారో తెలియదు. శాంభవి విషయంలో ఏదైనా సరే నెగ్లెట్ చేయను అంటాడు.
నువ్వు పైకి కోపంగా ఉన్నట్టు ఉంటావు కానీ ఎంత ప్రేమ బావ అంటాడు. కొంచెం ఎక్కువ చేసావు గాని తగ్గించు. రేపు నీకు పెళ్లి అయితే నువ్వు ఇదే పని చేస్తావు.
మనకు అంత శత్రువులు ఎవరూ లేరులే.. నీకు శత్రువుని అని చెప్పి రారు. మనకు మనమే జాగ్రత్తగా ఉండాలి. బావ నీకేమీ ప్రిపరేషన్ లేదా... దేనికి రా..
రేపు శోభనం కదా.. ఆ మాటకి రుద్రా లైట్ గా బ్లష్ అవుతూఉంటాడు. వెంటనే తమాయించుకుని అయితే అంటాడు. ఏంటి బావ అన్నీ తెలుసా ఆ.. ఆ... అంటాడు.
నీకు అన్నీ తెలిసినట్టు ఉన్నాయి. నేను ఇంకా బ్యాచిలర్ ని బావ అంటాడు. మరి ఒక బ్యాచిలర్.. పెళ్లి అయిన వాడి దగ్గరకు వచ్చి మరీ అడుగుతున్నాడు అంటే ఒకటి ఆత్రం ఆగడం లేదు అయి ఉండాలి లేదా అన్నీ తెలుసైనా ఉండాలి అంటాడు.
బావ ఇది అన్యాయం. నిన్ను ఏదో విడిపిద్దాము కాసేపు టీస్ చేద్దామనుకుంటే రివర్స్లో నాకే ఫిట్టింగ్ పెడుతున్నావు. ఇక్కడ ఉన్నది రుద్ర. రుద్ర తో ఆటంటే అంతా ఈజీ నా అంటాడు.
శోభనం టైం దగ్గరికి వచ్చేసింది. మగవాళ్ళు అందరూ రుద్రని సరదాగా ఏడిపిస్తూ ఉంటే... శాంభవికి ధరణి జయంతి జాగ్రత్తలు చెబుతూ ఉంటారు.
అబ్బాయితో ఎలా నడుచుకోవాలో ఏమిటో చెబుతూ ఉంటే అబ్బా నాకు తెలుసులే అని విసుక్కుంటుంది
తల మీద ఒకటి కొట్టి ఏం తెలుసు నీకు.. ఒకటి చెప్పవే. ఏం చెప్పాలి అంటుంది.
అదే ఏదో తెలుసన్నావు కదా.. అమ్మ అది ఏమైనా స్టోరీ నా చెప్పడానికి... కదా.. ఇది ఎవరు పుస్తకాల్లో రాయరు. పెద్దవాళ్ళు చెబుతారు తెలుసుకో. అలాగే తెలుసుకుంటాను సరేనా..
తులసి వచ్చి అమ్మాయి రెడీ అయిందా.. కంగారు పెడుతున్నారంటే అయిపోయింది. వస్తుందండి అని తీసుకువెళ్తారు.
వదిలిపెట్టి తలుపులు వేసి ధరణి పైకి చూస్తూ ఒక నమస్కారం పెడుతుంది. తులసి అది చూసి ఏమైందమ్మా అలా దండం పెట్టావు. అల్లుడుగారు గురించి.
రుద్రకే.. రుద్ర బానే ఉన్నాడు కదా.. ఈరోజు నుంచి నా కూతురుతో తిప్పలు పడాలి కదా.. అందుకే రుద్ర బాగుండాలి అని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను.
కూతురి మీద చాలా నమ్మకం అనుకుంటా.. మా మొగుళ్ళ మీద మాకు నమ్మకం ఎక్కువ లేండి అని జయంతి అంటుంది.
గదిలోకి వచ్చిన శాంభవి తలదించుకునిఉంటుంది. రుద్ర శాంభవినే చూస్తూ ఉంటాడు. పాలమీగడలాంటి తెల్లటి చీరలో దేవకన్య లాగా మెరిసిపోతూ ఉంటుంది.
మెడలో పచ్చడి పసుపుతాడు, నల్లపూసలు చేతినిండా మట్టి గాజులు తలనిండ మల్లి పువ్వులతో అపరంజి బొమ్మ లాగా ఉంటుంది.
రుద్ర మెల్లిగా శాంభవి దగ్గరికి వచ్చి అక్కడే ఆగిపోయావు రా అని చెయ్యి పట్టుకోపోతాడు. వెంటనే చేతిని వెనక్కి తీసుకుంటుంది.
ఏమిటి ఇదంతా సిగ్గే.. నిన్న నాకు భోజనం మాత్రం కుక్కి కుక్కి తినిపించావ్. అప్పుడు మీ అన్నయ్యలు పక్కన ఉన్నారనా ఏమిటి అని అల్లరిగా అడుగుతాడు.
శాంభవి సూటిగా రుద్రనే చూస్తుంది. చూపు తేడాగా ఉండేటప్పటికీ రుద్ర అనుమానంతో.. ఏమైంది పాప ఎలా ఉన్నావు..
ఎవరు నువ్వు అని అడుగుతుంది ఆ ప్రశ్నకి ఆశ్చర్యంగా చూస్తూ నేను రుద్రని అంటాడు. నేను అడుగుతుంది నీ పేరు కాదు.. ఎవరు నువ్వు.. నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నావు... ఏం సాధించాలని...
శాంభవి అడిగే విధానానికి ఆశ్చర్యపోతాడు. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు. నేను అడిగిన దానికి సమాధానాలు చెప్పు. ఏం చేయాలి అనుకుని పెళ్లి చేసుకున్నావు.
రుద్రకి మెల్లిమెల్లిగా అర్థమవుతూ ఉంటుంది. మయూరి కి సంబంధించిన వాళ్ళు ఎవరో శాంభవి మనసులో విషాన్ని నింపారు అని..
వెంటనే నవ్వుతూ నిన్ను ప్రేమించాను కాబట్టి పెళ్లి చేసుకున్నాను. కాదు అది అబద్ధం అంటుంది. అవునా మరి నీకు తెలిసిన నిజం ఏమిటి..
నువ్వు నన్ను ప్రేమించలేదు. మీ చినమామ కోసమే నన్ను పెళ్లి చేసుకున్న అంటుంది. అలా అని ఎవరు చెప్పారు. ఎవరో చెప్పారు లే..
ఎంతసేపని నిలబడతావు. ముందు వచ్చి కూర్చో అని చెయ్యి పట్టుకోబోతాడు. వెంటనే చేతిని మళ్లీ వెనక్కి తీసుకుంటుంది.
ఇక లాభం లేదు అనుకుని శాంభవి చేతిని ఒక గుంజు గుంజి బలవంతంగా తీసుకువెళ్లి కూర్చోబెడతాడు. ఈ హడావిడిలో చేతిలో ఉన్న పాలగ్లాసులో పాలు తుణికిసాలాడుతూ ఉంటాయి.
రుద్ర ఆ పాలు కిందపడనివ్వకుండా పట్టుకుని పక్కన పెట్టి ఇప్పుడు చెప్పు ఏమిటి నీ బాధ అంటాడు. బాధ కాదు కోపం అంటుంది.
అదే ఎందుకు.. నన్ను ప్రేమించకుండా ప్రేమించానని అబద్ధం ఎందుకు చెప్పావు? ఎందుకు నన్ను చీట్ చేసావు అంటుంది.
నా కళ్ళల్లోకి చూడు.. నేను నీకు అబద్ధం చెప్పానా.. నిన్ను చీట్ చేశానా. నీ కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయి అంటుంది.
ఆ మాటకి చిన్నగా నవ్వుతూ అందుకే నిన్ను పాప అనేది. చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తున్నావు అంటాడు. నేనేమీ చిన్నపిల్లను కాదు నాకు అన్ని నిజాలు తెలుసు అంటుంది.
ఓ అవునా ఎవరు చెప్పారు ఆ నిజాలు... ఎవరు చెబితే ఏమిటి. అది నిజం కదా.. పోనీ అలాగే అనుకుందాం. మా చిన్న మామ కోసం ఎందుకు చేసుకుంటాను.
మా చినమామకి నీకు ఏమిటి సంబంధం.. ఆ మాటకి ఆలోచిస్తూ మీ చిన్న మామ వైఫ్కి కొంచెం నా పోలికలే ఉన్నాయి కదా..
కాదు మా చిన్నత్త పోలికలే నీకున్నాయి. నేను ఎవరిలాగా ఉండను. నేను నాలాగానే ఉంటాను అంటుంది. సరే సరే నీ లాగానే ఉంటావు.
నీ పోలికలే మా చిన్నఅత్తలో ఉన్నాయి అయితే.. మీ చినమామ కి పుట్టిన పాప మిస్ అయింది కదా.. ఆ పాప వచ్చే వరకు నన్ను ఆ ప్లేస్లో ఉంచుతున్నారు కదా..
ఏం మాట్లాడుతున్నాను నువ్వు.. ఎప్పుడూ అదే విషయం చెప్పేవారు కదా అది నిజం చేస్తున్నారా.. మా నాన్నకి నన్ను దూరం చేయడానికి ఇంత ప్లాన్ చేశారా అంటుంది.
తల పట్టుకుని కూర్చుని శాంభవి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా.. ఎవరు నీకు ఈ సోది అంతా చెప్పారు..
అది మాత్రం చెప్పను అంటుంది. సరే నీకు ఒకరి గురించి చెబుతాను క్లియర్గా విను. మయూరి.. మనకి బద్ధ శత్రువు. విడదీయడానికి చాలా ప్లాన్లు వేస్తూ ఉంటుంది.
విషాన్ని నింపడానికి చూస్తుంది. ఈ విషయం కూడా చెప్పారు. ఏమని అంటే.. మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో సేమ్ అలాగే చెబుతారు అని...
నీ అమాయకత్వాన్ని మయూరి బాగా క్యాష్ చేసుకుంది అనుకొని... పెళ్లయిన తర్వాత ఆడపిల్ల అత్తారింట్లోనే కదా ఉంటుంది.
ఆ లాజిక్ లో ఆలోచిస్తే మీ నాన్నకి దూరంగానే ఉంటావు కదా.. ఈ దూరంగా ఉండడం వేరు.. మీరు చెప్పే దూరం వేరు అంటుంది..
ఏ దూరమైనా ఒకటేగాని నా బుర్ర వేడెక్కిపోతుంది. వెళ్లి పడుకో అంటాడు. చూశారా వాళ్ళు చెప్పిందే నిజం అని ఏడుపు ముఖం పెడుతుంది.
ఇప్పుడు నేనేమన్నాను పాప.. మీకు నా మీద ప్రేమ లేదు. అందుకనే నన్ను విసుక్కుంటున్నారు. వెళ్లి పడుకోమంటున్నారు.
నిజంగా మీరు నన్ను ప్రేమించి ఉండి ఉంటే నా బాధ అర్థం చేసుకునేవారు. నన్ను బుజ్జగించి.. మా నాన్నలాగా లాలించి నా బాధ తీర్చేవారు.
మీరు అలా చేయడం లేదు అంటే వాళ్ళు చెప్పిందంతా నిజమే నాకు మా నాన్న కావాలి అని ఏడవడం మొదలు పెడుతుంది.
రుద్ర గది సౌండ్ ప్రూఫ్ అవడం మీద శాంభవి రాగాలు బయటకి వినిపించవు. రుద్ర ఆరామంగా కూర్చుని కాళ్లు చాపుకుని నీకు ఎంతసేపు ఏడవాలనిపిస్తే అంతసేపు ఏడువు.
నేనేమీ ఆపను. నా ఏడుపు బయటకి వినిపిస్తుంది కదా.. మా నాన్న వస్తారు కదా.. ఆ మాటకి గట్టిగా నవ్వుతూ మన గది సౌండ్ ప్రూఫ్.
గదిలో ఏం జరిగినా బయటికి వినిపించవు. నువ్వు బయటికి వెళ్లలేవు వాళ్ళు లోపలికి రాలేరు. కాబట్టి నీకు ఎనర్జీ ఉన్నంత సేపు ఏడ్చి ఎనర్జీ అయిపోయిన తర్వాత ఇదిగో ఈ గ్లాసులో ఉన్న పాలు తాగి హాయిగా బొజ్జో. పొద్దున్నే మాట్లాడుకుందాం అంటాడు.
ఆ మాటకు ఉక్రోషంగా నేను ఎందుకు ఏడుస్తాను. ఏడవలసిన అవసరం నాకేంటి అని కళ్ళు తుడుచుకుని.. ఇదిగో పాలు కూడా నేను తాగుతున్నాను.
ఇది ఎనర్జీ కోసం కాదు నేను బాగానే ఉన్నాను అని చెప్పడం కోసం అని పాలు ఒక్క చుక్క కూడా ఉంచకుండా మొత్తం తాగేసి మంచం ఎక్కి పడుకుంటుంది.
మీరు మాత్రం నా పక్కన పడుకుంటే అస్సలు బాగోదు అంటుంది. మరి పెళ్ళాం పక్కన పడుకోకుండా ఎక్కడో పడుకోవడానికి నాలో మేటర్ లేదు అనుకుంటున్నావా ఏమిటి..
కావాలనే మంచం మీద కూర్చుంటాడు. నువ్వు ఇక్కడ కూర్చుంటే నేను అరుస్తాను అంటుంది. నువ్వు అరిచిన ఎవరికి వినపడదని చెప్పాను కదా పాప.. మూసుకొని పడుకో అని రుద్ర పడుకుని శాంభవిని ఒక లాగు లాగుతాడు. శాంభవి వచ్చి రుద్ర మీద పడుతుంది.
శాంభవి అలక... రుద్ర రొమాన్స్...
Posts: 898
Threads: 13
Likes Received: 7,006 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
Part - 69
శాంభవిని లాగి గుండెలపైన పడుకోపెట్టుకుంటాడు. నేను ఇక్కడ పడుకోను నాకు దూరం జరుగు అని అరుస్తూ ఉంటే... నువ్వు గప్చుప్ గా కళ్లు మూసుకొని పడుకో.
లేదనుకో నువ్వు కింద నేను పైన ఉంటాను. రాత్రంతా నన్ను మోయాల్సి వస్తుంది. అది ఇష్టమైతే నీకు ఇష్టం వచ్చిన అంతసేపు అరువు అంటాడు.
దెబ్బకి కామ్ అయిపోయి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. నిన్ను ఇలా భయపెడితేనే దారిలోకి వస్తావు. అమ్మ... పాప... బుజ్జి అంటే చిందులు తొక్కుతున్నావు.
నిన్ను కాదు అనాల్సింది. ముందు మా మామల ఇద్దరినీ అనాలిని. రెండు పీకితే నువ్వు లైన్ లోకి వస్తావు అని మనసులో అనుకుని శాంభవిని చూస్తాడు.
అప్పటికే నిద్రలోకి జారిపోతుంది. కుయ్యో కుయ్యో అని అరుస్తావు. చిటికెలో నిద్ర పోతావు. నీలో చిన్నపిల్లల లక్షణం ఎప్పుడూ పోవాలి.. ఎప్పుడూ సంసారం మొదలు పెడతామో.. మా అత్త ఎప్పుడు నీ ఒడిలో పడుతుందో అంటూ పైకి చూస్తాడు.
పొద్దుటే లేటుగా లేచిన శాంభవి మత్తుగా చేతులతో తడుతూ పిల్లో ఇంత గట్టిగా ఉంది. మెత్తగా లేదేమిటి అనుకుంటూ మెల్లిగా కళ్ళు తెరుస్తోంది.
రుద్ర మీద పడుకుని ఉండడం చూసి గబుక్కున లేచి ఏమిటి నేను ఇలా నిద్రపోయాను. ఇతను భయపెడితే మాత్రం నేను అలా పడుకోవడమేనా..
ఛి ఛి అనుకుంటూ లేస్తుంది. పైట రుద్రా వీపు కింద ఇరుక్కుని మళ్ళీ ఎంత స్పీడుగా లేచిందో అంత స్పీడ్ గా వెనక్కి వచ్చి పడుతుంది.
మీద పడిన శాంభవి చుట్టూ చేతులు వేసి నన్ను వదిలి వెళ్ళలేక పోతే ఉండిపోవచ్చు కదా పాపా. నిన్ను వెళ్ళమని నేను అనలేదు కదా.. ఎందుకు ఈ ఫీట్లు.
నేనేమీ కావాలని వచ్చి పడలేదు. నువ్వు ఎలా పడ్డావు అని నేను అడగలేదు. నీ మాటలు అర్థం నాకు తెలుసులే.. నా చీర.
చీర నా తీసుకో. నా చీర నీ కింద ఉంది. చిలిపి..
నీ చీర నేను విప్పకుండానే నా కింద ఎలా ఉంటుంది పాప. తల కొట్టుకుంటూ నాచీర నీకింత ఉంది. సరిగ్గా చూడు.
ఓ అవునా అని చూసి ఆ ఉంది అయితే... నేను వెళ్ళాలి. ఇలాగే బయటికి వెళతావా... వెళితే ఏమవుతుంది. అందుకే నిన్ను చిన్నపిల్ల అనేది..
ఇలా బయటికి వెళితే అందరూ నవ్వుతారు. ముందు వెళ్లి స్నానం చేసి రెడీ అవ్వు. అప్పుడు వెళ్ళు. నా బట్టలు ఇక్కడ లేవు.
అన్నీ ఇక్కడే ఉన్నాయి. డ్రెస్సింగ్ ఏరియాలోకి వెళితే నీ క్లోసెట్స్ లో అన్ని సర్దిపెట్టి ఉన్నాయి . ఎప్పుడొచ్చాయి ఇక్కడికి.. నీకోసం నేనెప్పుడో కొన్నానులే.
నాకోసం కాదు. నీకోసం కాకపోతే ఇంకెవరి కోసం కొంటానే తింగరి. మీ అత్త కూతురు కోసం కొన్నావు. అవును మా అత్త కూతురు కోసమే కొన్నాను అయితే ఇప్పుడు ఏమిటి అని ఉడికిస్తాడు.
ఆ మాటకు ఉక్రోషంగా నేను ఒకళ్ళ బట్టలు వేసుకోను. అవునా ఈ చీరలు ఎలా కట్టుకోవో నేను చూస్తాను కదా అని ఎత్తుకొని తీసుకువెళ్లి టబ్లో దించి వాటర్ వదులుతాడు.
ఇదిగో రుద్ర అంటుంది. అబ్బా మొగుడిని పేరు పెట్టి పిలవకూడదు. లేదు నేను అలాగే పిలుస్తాను. నా చీర తడిపేసావు. నేను ఎలా వెళ్లాలి.
చెప్పాను కదా చీరలు అక్కడ ఉన్నాయి. కట్టుకో. నేను కట్టుకోను అంటున్నాను కదా.. ఇప్పుడా చీరలు కట్టుకోకుండా ఎలా వెళ్తావో నేను చూస్తాను.
నేను ఇలాగే ఉంటాను అని దెబ్బలాడుతుంది. బంగారం నీకు ఇలాంటి కోరిక ఉందని చెప్పలేదే అని కన్ను కొడతాడు.
ఎలాంటి కోరిక అని భయంగా వెనక్కి బెండ్ అవుతుంది. అదే నా చేతులతోనే చీర విప్పించాలని. నువ్వు పైకి కనపడవు గాని పెద్ద నాటివి.
నీ కోరిక నేను మాత్రం ఎందుకు కాదంటాను అని భుజం మీద చేయి వేస్తాడు . మర్యాదగా అక్కడే ఆగు అని వెంటనే పట్టుకుంటుంది.
ఏమైంది బంగారం పగలు అని ఆలోచిస్తున్నావా.. పరవాలేదు మొగుడు పెళ్ళాలకి పగలేంటి రాత్రి ఏంటి.. ఆ మాటకి కళ్ళుతేలేసి చూస్తూ ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు.
అదే రాత్రి జరిగంది ఇప్పుడు ఇలా వాటర్ టబ్ లో జరగాలనే కదా.. నేను అలా అనలేదు. నాకు అలాగే అర్థమైంది. నాకు వద్దు అంటుంది.
ఏమి వద్దు.. నువ్వు అన్నదే... నేనేమన్నాను.. ఏవండీ అని ఏడుపు గొంతుతో అంటుంది. చెప్పు పాప అని ఇంక ముందుకు వస్తూ ఉంటే నేను స్నానం చేసి నువ్వు ఇచ్చిన చీర కట్టుకుంటాను అంటుంది.
నిజంగా అంటే నిజంగా ప్రామిస్. సరే అయితే. నీకు బొజ్జగించి చెబుతుంటే నచ్చడం లేదు.. ఇలా రివర్స్లో వెళితేనే దారిలోకి వస్తావు అని అనుకుంటాడు.
ఏడుపు ముఖంతో ఉన్న శాంభవిని చూసి..ఏడవకుండా కట్టుకో అని దగ్గరికి వచ్చి.. అవి కొన్నది మొత్తం నీకే. ఎవరికో కాదు.
ఎవరో ఏదో చెబితే అది బుర్రలో పెట్టుకుని మన సంతోషటైం అంతా పాడు చేయకు . చెప్పి స్పీడ్ గా బయటికి వెళ్లిపోతాడు. వెళుతున్న రుద్రనే చూస్తూ ఉంటుంది.
రుద్ర బాల్కనీలో నిలబడి ఆలోచిస్తూఉంటే ఫోన్ రింగ్ అవుతుంది. లిఫ్ట్ చేసి హలో అంటే ఏమిటి రుద్ర.. రాత్రి బాగా జరిగిందా అన్న వాయిస్ వినపడి మయూరి అంటాడు.
పరవాలేదే... నిద్రమత్తు వదిలి నా గొంతు బానే గుర్తుపట్టావు అని గట్టిగా నవ్వుతుంది. మయూరి మాటకి కన్నింగా నవ్వుతూ రాత్రి ఎక్కడ నిద్ర మయూరి...
ఒళ్ళంతా ఒకటే నొప్పులు. నీ దగ్గర ఏమైనా రెమిడి ఉందా అని అడుగుతూ.. ఓ.. సోరి నీకు పెళ్లి అవ్వలేదు కదా..పెళ్లి అయిన వాళ్లకైతే ఈ నొప్పులు సంగతి తెలుస్తుంది.
పెళ్లి కాని వాళ్లని అడిగితే ఎలాలే పాపం. నీకు ఎలా తెలుస్తుంది అంటాడు. రుద్ర అని కోపంగా అంటే.. అరే ఏమైంది మయూరి అంత కోపంగా అరుస్తున్నావు.
నేను అన్నం దాంట్లో తప్పేమైనా ఉందా. నన్ను అనవసరంగా రెచ్చగొడుతున్నావు. బురదపాముని ఎంత రెచ్చగొట్టిన ఉపయోగమేమీ లేదు కానీ ఏమిటి ఇంత పొద్దున్నే చేశావు.
స్వీట్ మెమోరీస్ బయటికి చెప్పకూడదు కదా నువ్వు తెలుసుకోవాలనుకున్న... ఒక పని చెయ్ మయూరి. పెళ్లి చేసుకో..
అప్పుడు నీకు స్వీట్ మెమోరీస్ వస్తాయి. లేటు వయసులో ఘాటు రొమాన్స్ అనుకుని ఎంజాయ్ చెయ్. అప్పుడు పక్కన వాళ్ళ విషయాలు తెలుసుకోవాలి అన్న ఆరాటం తగ్గుతుంది.
ఏమంటావు... రుద్ర.. నేను పెళ్ళంటూ చేసుకుంటే అది దేవేంద్ర ని మాత్రమే. నువ్వు అన్న ఆ ఘాటు రొమాన్స్ కూడా దేవేంద్ర తోనే అని పొగరుగా అంటుంది.
చింత చచ్చిన పులుపు చావలేదు అంటే ఇదేనేమో.. రిటైర్మెంట్ వయసులో నీకు పెళ్లి కావాలా.. అది కూడా మళ్ళీ మా చినమామతో. అసలు మా చిన్న మామ పక్కన ఏ విధంగా సూట్ అవుతావని నీ కోరిక.
నాకేం తక్కువ.. వినయం తక్కువ. ఏ మగాడికైనా అందం పొగరు ఉన్న అమ్మాయిలు కన్నా వినయంగా పద్ధతిగా ఉన్న అమ్మాయిలు అంటేనే నచ్చుతారు.
అందుకే మా చిన్న మామ కి మా చిన్నత్తంటే ప్రాణం అర్థమైంది అనుకుంటా... చూస్తూ ఉండు మీ చినమామే వచ్చి పెళ్లి చేసుకుంటానని చెబుతాడు.
నువ్వు ఇలా పగటి కలలు కంటూనే డైరెక్ట్ గా నరకానికి వెళ్ళేటట్టు ఉన్నావు ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.
శాంభవి రెడీ అయ్యి తలుపు తీయడానికి ట్రై చేస్తుంది. ఎంత ట్రై చేస్తున్నా రాకపోతే కోపంగా రుద్ర దగ్గరికి వెళ్లి తలుపు రావడం లేదు అంటుంది. వెనక్కి తిరిగి ఫ్రీజ్ అయిపోతాడు .
లేత కనకాంబరం రంగు షిఫాన్ చీరలో మెరిసిపోతూ ఉంటుంది. తలస్నానం చేసింది అనడానికి గుర్తుగా నీటి తుంపరులు ముఖంపైన అక్కడక్కడ ఉంటాయి.
హలో అని చేయి ఊపోతుంది. ఏమిటి అంటే తలుపు రావడం లేదు. బ్యూటిఫుల్ అంటాడు. హ.. ఏమన్నావు.. చాలా అందంగా ఉన్నావు అని చెబుతున్నాను.
నీ కాంప్లిమెంట్ నాకు అవసరం లేదు. తలుపు తీస్తే నేను మా నాన్న దగ్గరికి వెళతాను. పైనుంచి కిందకి చూసి అలంకరణ అయిపోయిందా. ఆ అంటుంది.
ఏదో తేడా కొడుతుంది పాప. లేదు నేను బాగానే రెడీ అయ్యాను అని ముఖం పైన చేయి వేసుకుంటుంది. ఒకసారి ఇలా రా అని అద్దం ముందు నుంచో పెట్టి పాపిట్లో కుంకుమ పెట్టి ఇప్పుడు పర్ఫెక్ట్ అంటాడు.
శాంభవి అద్దంలో చూసుకుంటుంది. నిజంగానే తన ముఖంలో కొత్త మెరుపు కనపడుతుంది. ఇంకా దగ్గరికి వెళ్లి చూసుకుంటూ పాపిట్లో ఉన్న కుంకాన్ని టచ్ చేస్తుంది.
మైమరుపుగా చూసుకుంటూ ఉంటే నచ్చిందా అంటే.. హా అంటుంది. ముందు అలంకరణ బాగుందా... ఇప్పటి అలంకరణ బాగుందా..
ఇప్పుడే అంటుంది. చూసావా పెళ్లి ఎంత అందాన్ని తెచ్చిందో. నిజమే.. అయినా సరే నువ్వు నాకు దూరంగా ఉండు.
నాకు క్లారిటీ వచ్చేదాకా డిస్టెన్స్ మెయింటైన్ చెయ్ అంటుంది. నడుం జుట్టు చెయ్యివేసి దగ్గరికి లాక్కుని నీకు ఎం క్లారిటీ కావాలి పాప.
నువ్వు నన్ను ప్రేమించలేదు నాకు తెలుసు అని మళ్ళీ ఏడుపు అందుకోపోతుంది. ష్.. పెదాలు మీద వేలు ఉంచుతాడు.
ఆస్పర్సకే శాంభవి బిగిసుకుపోయి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోతుంది. చూడు పాప.. చెప్పేది బుర్ర పెట్టి విను.
ప్రేమించకుండానే ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకునే.. టైపు కాదు. ఎవరు ప్లేసులోనూ నేను ఉంచాల్సిన అవసరం నాకు లేదు.
నువ్వు ఉండే ప్లేస్ ఇది అని శాంభవి చేతిని గుండెలపైన పెట్టుకుని చూపిస్తాడు. ఎప్పటికీ నువ్వు మాత్రమే ఉంటావు అర్థమవుతుందా...
ముఖ్యంగా మీ నాన్న నుంచి నిన్ను దూరం చేసే ఆలోచన ఎప్పటికీ లేదు. రాదు కూడా.. ఎందుకో తెలుసా మనిషిగా ఎక్కడున్నా నీ ఊపిరి మీ నాన్న.
నువ్వు నా ప్రాణం. నీ ఊపిరికేదైనా అవితే నా ప్రాణం ఎలా నిలబడుతుంది.
శాంభవి సమాధానం..
కథ కొనసాగుతుంది...
Posts: 4,804
Threads: 9
Likes Received: 3,181 in 2,464 posts
Likes Given: 11,247
Joined: Sep 2019
Reputation:
31
Posts: 1,588
Threads: 2
Likes Received: 934 in 717 posts
Likes Given: 2,110
Joined: May 2019
Reputation:
10
Food tinipinche sambaram lo story twist oohinchaledu. Baagundi.
Shambhavi ni Rudra ela gelustado.. waiting!!
Posts: 77
Threads: 0
Likes Received: 31 in 29 posts
Likes Given: 23
Joined: Jun 2019
Reputation:
3
Another Super Story siva sai garu..Excellent.. waiting for next update.. keep going.
Posts: 1,156
Threads: 1
Likes Received: 730 in 473 posts
Likes Given: 10,898
Joined: Jun 2019
Reputation:
2
As expected, Mayuri's silent move is working. How Rudra overcomes it and makes Shambhavi understand in the coming episode...
Posts: 898
Threads: 13
Likes Received: 7,006 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
Part - 70
రుద్ర చెప్పిన దానికి శాంభవి చూస్తూ ఉండిపోతుంది. ఏంటి పాప అలా చూస్తున్నావు. మరి ఎందుకు వాళ్ళు అలా చెప్పారు. ఎవరు చెప్పారు.
శోభనం గదిలోనికి రావడానికి ముందు జరిగింది గుర్తు చేసుకుని చెబుతూ ఉంటుంది. శోభనపు పెళ్లికూతురు లాగా రెడీ చేసిన తర్వాత మా దిష్టి తగిలేటట్టు ఉంది అని ధరణి మెటికలు విరుస్తుంది.
మిత్ర వచ్చి ఆంటీ మీరు బయట వెయిట్ చేయండి. కొన్ని సీక్రెట్స్ చెప్తాను. పెళ్లి అవ్వకుండానే మీ ఫ్రెండ్ కి చెప్పే అన్ని విషయాలు నీకు తెలుసా అని పరాచకాలు ఆడతారు.
అయ్యో ఆంటీ.. ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో అన్నీ తెలుస్తున్నాయి. శాంభవి అంటే ఏమీ చూడదు కదా.. అందుకే తెలియదు.
నేను కొన్ని ఫ్రెండ్ గా చెబుతాను. సరే సరే అని వాళ్ళు బయటికి వెళ్లిపోతారు. అందరూ వెళ్ళగానే మిత్ర తలుపులు వేస్తుంది.
ఎందుకు మిత్ర తలుపులు వేస్తున్నావు. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ముఖ్యమైన విషయమా.. ఏమిటి...
నీ పెళ్లి ఒక పెద్ద మోసం. ఏం మాట్లాడుతున్నావు... అవును నేను చెప్పేదంతా నిజమే. నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు.
లేదు రుద్ర గారికి నేనంటే చాలా ఇష్టమంటుంది. అయ్యో పిచ్చిమొద్దు.. నువ్వు ఎవరు ఏది చెబితే అదే నమ్ముతావు. నీతో వీళ్ళందరూ గేమ్ ఆడుతున్నారు.
అంత అవసరం ఏముంది. ఇదిగో నాకు ఒక ఫోను వచ్చింది. నేను నీలాగే మాట్లాడితే.. నీతోనే మాట్లాడతాను అన్నారు.
ఫోన్ కలిపి ఇస్తుంది. శాంభవి చెవి దగ్గర పెట్టుకొని హలో అంటుంది. అటు నుంచి హలో అని గంభీరంగా ఒక లేడీ వాయిస్ వినిపిస్తుంది.
ఎవరు.... నీ మేలుకోరేదాన్ని.. మీరు ఎవరో నాకు తెలియదు కదా ఎలా నమ్మేది.. తెలివైనదానివే...
నేను దేవేంద్ర కి బాగా కావలసినదాన్ని..
మా పెళ్ళికి వచ్చారా.. రాలేదు. మరి బాగా కావలసిన వాళ్లు అన్నారు. అవును..నేను ఎక్కడ నీకు నిజాలు చెబుతానో అని నన్ను పెళ్లికి రానివ్వలేదు.
ఏమిటా నిజాలు... నిన్ను దేవేంద్ర కూతురు వచ్చేదాకా ఆ ప్లేస్ లో ఉంచుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు మీరు. నాకు ఏమీ అర్థం కావడం లేదు.
నీ మీద చూపిస్తున్నదంతా కపట ప్రేమ. అంత అవసరం ఏముంది. ఆ అమ్మాయి వచ్చిన తర్వాతే రుద్ర గారికి పెళ్లి చేస్తే సరిపోతుంది కదా.. నా మీద ప్రేమ చూపించి నన్ను ఆ ప్లేస్ లో ఎందుకు ఉంచుతారు.
రుద్రాకీ ప్రాణగండం ఉంది. ఈ సంవత్సరంలో పెళ్లి అవ్వకపోతే ప్రమాదం. దేవేంద్ర కూతురు ఇంకా దొరకలేదు. నువ్వంటే ఒట్టి వెర్రిబాగులుదానివి.
అందుకే నిన్ను ఇచ్చి పెళ్లి చేస్తున్నారు. మీరు చెప్పేదంతా అబద్ధం. అలా జరిగితే మా నాన్నలు ఎందుకు ఊరుకుంటారు.
మీరు వచ్చింది ఒక పల్లెటూరి నుంచి. వీళ్ళది జమీందారులు ఫ్యామిలీ. పైగా కంటి చూపుతోనే ఏదైనా శాసించగలరు.
అందుకే మెల్లిగా నిన్ను మీ నాన్న దగ్గర నుంచి దూరం చేసి ఆ అమ్మాయి రాగానే నిన్ను పైలోకానికి పంపించేయాలని వాళ్ళని ఆలోచన.
పై లోకాలు అంటే.. పై లోకాలంటే ఏముంది.. నీ ప్రాణాలు తీసేయడమే... ఇది అబద్ధం. ఇదే నిజం. కావాలి అంటే దేవేంద్ర ని అడుగు.
నువ్వు నా కూతురు లాంటి దానివి అని చెబుతాడు. ఎవరైనా అదే మాట అంటారు. అవును మొదటినుంచి అలాగే చెబుతున్నారు.
అది అబద్ధం. మోసపూరితమైన ప్రేమ. నన్ను కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.
అప్పటినుండి నేను అలాగే ఉండిపోయాను. ఆస్తి మొత్తం దేవేంద్ర కూతురి పేరు మీద ఉంది అని తనకోసం చూస్తూ ఉన్నారు అంతేగాని నీ మీద ప్రేమ ఏమి కాదు.
జాగ్రత్తగా ఉండు. నా కూతురులాంటి దానివని నిన్ను హెచ్చరిస్తున్నాను. ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది. శాంభవి బొమ్మలాగా నిలబడిపోతుంది.
మిత్ర కదుపుతూ.. ఏమైంది అలా అయిపోయావు. నాకు ఏమీ అర్థం కావడం లేదు. రుద్రా సార్ నే గట్టిగా అడుగు. అప్పుడే నీకు నిజాలు తెలుస్తాయి.
అడిగితే చెబుతారా అని భయంగా అంటుంది. ఎందుకు చెప్పరు.. చెప్పకపోతే ఊరుకుంటామా.. రేపొద్దున్న అంకుల్ వాళ్ళ ముందు పంచాయతీ పెడదాము.
ఇది మన ఊరు కాదు కదా... ఎక్కడైనా పంచాయితీ... పంచాయితి. టెన్షన్ పడకు. ధరణి తలుపు కొడుతూ ఉంటుంది.
వస్తున్నా అంటీ అని తలుపు తీస్తుంది. అయినయా మీ ఫ్రెండ్ కి చెప్పే జాగ్రత్తలు.. హా అంటుంది. శాంభవిని చూస్తే ఫేస్ అంతా భయంగా కనబడుతుంది.
ఏమైందిరా ముఖమంతా అలాగా ఉంది. అమ్మ అది అని చెప్పబోతు ఉంటే మిత్ర చేయ పట్టుకుంటుంది. చెప్పురా.. ఏమీ లేదు ఆంటీ...
ఫస్ట్ నైట్ కదా భయపడుతుంది అంతే.. పిచ్చిమొహం భయమెందుకే.. రుద్ర బాబు నీకు ఇష్టం లేనిది ఏది చేయడు. టెన్షన్ పడకు అని గదిలోకి పంపిస్తారు.
ఇది జరిగింది అంటుంది. ఆ మాటకి తల మీద పొడుస్తూ రాత్రి అడిగి ఉంటే క్లారిటీ ఇచ్చేవాడిని కదా.. అనవసరంగా ఫస్ట్ నైట్ పాడు చేశావు.
లేదు లేదు నాకు ఇంకా క్లారిటీ రాలేదు. మీకు చెప్పింది అంతా... మీ నుంచి సమాధానం కోసం... ఏం సమాధానం కావాలి పాప.
ఆవిడ ఎవరు.. ఎందుకు చెప్పారు.. మీ చిన్న మామ కి ఆవిడకి అంటే ఇంకా ఆపుతావా... ధైర్యంగా ఎదురుగా వచ్చి మాట్లాడలేని వాళ్లు ఏదో చెబితే అది నమ్ముతావా...
నిజంగా వాళ్లకి ధైర్యం ఉంటే నీ ఎదురుగుండా వచ్చి నా ముందు చెప్పమను. అప్పుడు నువ్వు ఎవరినైనా అనుమానించు అర్థమైందా..
అర్థమయింది. సరే సరే క్లారిటీ వచ్చింది కదా.. నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకి లాక్కుంటాడు. ఇద్దరి మధ్యన చేతిలో పెట్టి ఇంకా నాకు రాలేదు.
ఇంక ఏం కావాలి పాప... క్లారిటీ... ఉఫ్... ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు. శాంభవి రుద్ర చెప్పగానే కళ్ళల్లోకి చూస్తుంది.
నా కళ్ళు ఏం చెబుతున్నాయి.. నిన్ను మోసం చేస్తున్నాను అని చెబుతున్నాయా.. లేదు అని తల ఊపుతుంది. మరి ఏం చెబుతున్నాయి.. ఆ కళ్ళమైకంలో పడిపోయి అంతులేని ప్రేమ నీ మీద ఉంది అని చెబుతున్నాయి.
మరి నా ప్రేమ నీ చూడకుండా నీ కళ్ళకి కనపడని మనిషి చెప్పిన మాటలు ఎలా నమ్ముతున్నావు.. నమ్మాలని నాకు లేదు. నాన్న నుంచి దూరం చేస్తున్నారు అంటే భయమేసింది.
నీ భయాన్ని వాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు.
ఒకటి గుర్తుపెట్టుకో పాప... ఎప్పుడైనా మన భయాన్ని ఎదుట మనిషికి చూపించకూడదు. ముఖ్యంగా మన శత్రువులకి.
పద అని తీసుకువెళతాడు. వెళుతూనే ఆలోచిస్తూ ఉంటాడు. శాంభవికి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నిజాన్ని చెప్పాలి. లేదు అంటే ఆ మయూరి మరొక మెలిక వేస్తుంది.
శాంభవిని చూసిన ధరణి జయంతి దగ్గరికి వచ్చి పక్కకి తీసుకువెళ్తారు. ఎక్కడికమ్మా.. ఇలా రా అని గదిలోకి తీసుకువెళ్లి తలుపులు వేస్తారు.
దేనికి తలుపులు వేశారు. రాత్రంతా సవ్యంగా జరిగిందా... ఏంటి జరిగేది... అయ్యో పిచ్చి నా కూతురా.. రాత్రి భయపడ్డావు కదా...
రుద్ర అని ఇంక నేను అడగలేను అక్క. నువ్వు అడుగు. నేను మాత్రము ఏం అడగనే దీన్ని... అదే రాత్రి బానే పడుకున్నావా? ఒళ్ళు నొప్పులు ఏమైనా ఉన్నాయా...
ఎందుకు పడుకోలేదు. శుభ్రంగా పడుకున్నాను. నాకేమీ ఒళ్ళు నొప్పులు ఏమీ లేవు. అది కాదే... సరే ఎక్కడ పడుకున్నావు..
రాత్రి అనిఒక నిమిషం ఆలోచించి అది... పరవాలేదు. మేమే కదా చెప్పు అంటారు. రాత్రి నేను రుద్ర గుండెల మీద పడుకున్నాను.
ఆ మాటకి అమ్మలిద్దరూ ముఖాలు వెలిగిపోతూ నిజమా... సరే.. సరే.. నిద్రొస్తే వెళ్లి పడుకో. నాకేమీ నిద్ర రావడం లేదు. సరే పద.. అని తీసుకువెళతారు.
నేనేం చెప్పానని వీళ్లిద్దరూ ఇంత హ్యాపీగా ఉన్నారు. పడుకున్నానని చెప్పిన దాంట్లో కూడా సంతోషంగా ఉంటుందా.. ఏమిటో వీళ్ళిద్దరూ అనుకుని భుజాలు ఎగరేసి వాళ్ల వెనకాలే వెళుతుంది.
ముగ్గురిని చూసినా రుద్రాకి మేటర్ అర్థమై నవ్వుకుంటాడు. ధీరజ్ పక్కకి చేరి బావ అంటాడు. చెప్పు..
రాత్రి అంతా ఓకేనా... ఏంట్రా నీ బాధ... అదే నీలో నువ్వు నవ్వుకుంటున్నావు కదా... రాత్రి మెమోరీస్ ఏమైనా గుర్తొచ్చినాయా... చెప్పు బావా అని గోకుతూఉంటాడు.
నువ్వు చిన్నపిల్లాడివి. బావ నేను చిన్నపిల్లోడిని ఏంటి..
నీకు నాకు నెలలే డిఫరెన్స్. అయినా నాకు పెళ్లి అయిపోయింది.
అంటే నేను పెద్దవాడిని. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లయిన వాళ్ల విషయాలు చెప్పకూడదు. ఇది తొండి... తూచ్.. నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోతే మానేయ్.. ఒప్పుకోమని నేనేమీ బ్రతిమాలడం లేదే...
రుద్ర ఫోన్ రింగ్ అవుతుంటే ఎవరా అని చూస్తాడు. శేషాద్రి నుంచి వస్తున్న కాల్ ని నవ్వుకుంటూ లిఫ్ట్ చేసి చెప్పు అంటాడు.
నువ్వే చెప్పాలి రుద్ర. పెళ్లి అయ్యేదాకా డిస్టర్బ్ చెయ్యొద్దు. ఎవరు మీ పెళ్లి ఆపకుండా చూడమన్నావు. అన్నీ చేశాను ఇప్పుడైనా వాళ్ళ డీటెయిల్స్ చెప్పు.
ఎక్కడ నీకు ఇచ్చిన డ్యూటీని సక్రమంగా చేశావు. ఎవరు మీ పెళ్లిని ఆపలేదు కదా.. మరి మయూరిని ఎందుకు కంట్రోల్ చేయలేదు.
నా పెళ్ళాంతో చాలా తింగరి వాగుడువాగింది. ఏమంటున్నావ్ రుద్రా... భయంగా అడుగుతాడు. నేను నిజమే చెబుతున్నాను.
రాత్రి ఫోన్ చేసి మరీ పిచ్చిపిచ్చి వాగుడంతా వాగింది. నా పెళ్ళాం తెలివైంది కాబట్టి ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసింది.
ఇంకొకసారి ఇలాంటివి చేస్తే వాళ్ళిద్దర్నీ నీకంటికి కనపడకుండా మాయం చేస్తాను అర్థమైందా అని ఫోన్ పెట్టేస్తాడు.
రుద్ర ఫోన్ పెట్టేసిన తరువాత ధీరజ్.. ఏమైంది బావ..ఏమీ లేదు వదిలేయ్. చెప్పు బావ నువ్వు అంత టెన్షన్ తీసుకోకు.
టెన్షన్ ఏమీ లేదు లేరా అని శాంభవి చెప్పింది అంతా చెబుతాడు. ఆ మయూరి ఇంతకీ తెగించిందా అసలు ఏమనుకుంటుంది. ఒక ఆడదేనా.. అలాంటి ఎథిక్స్ ఉంటే అది మయూరి ఎందుకు అవుతుంది.
శేషాద్రి కోపంగా మయూరి మయూరి అని అరుస్తూ ఉంటాడు..
మయూరి...
కథ కొనసాగుతుంది...
Posts: 898
Threads: 13
Likes Received: 7,006 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
Part - 71
మయూరి అని కోపంగా అరుస్తూ వెళతాడు. ఎందుకు అన్నయ్య.. ఇక్కడే ఉన్నాను కదా.. నువ్వు రుద్ర భార్యతో ఏం మాట్లాడావు.
అప్పుడే నీ దాకా వచ్చిందా.. రుద్ర చెప్పింది నిజమేనా.. రాత్రి ఏమీ జరగలేదు అని చెప్పాడా... ఆ మాటకి నవ్వుతూ రుద్ర గురించి తక్కువ అంచనా వేస్తున్నావు చూడు. అందుకు నిజంగా నువ్వు పిచ్చిదానివే..
అన్నయ్య అని కోపంగా అంటే.. ఏ కోపం పొడుచుకొచ్చిందా... చిలక్కి చెప్పినట్టు చెప్పాను. ఇది ఇద్దరు ఆడపిల్లల జీవితానికి సంబంధించినది.
నువ్వు కల్పించుకోకు. నీ పంతం తప్ప ఇక్కడ ఏమీ కనిపించడం లేదా... ఆపుతావా అని చెయ్యి చూపిస్తుంది. నువ్వు ఏం చెప్పావు పెళ్ళి వరకు మాట్లాడద్దు అన్నావు.
పెళ్లి అయ్యేంతవరకు నేనేమీ మాట్లాడలేదు కదా..
ఏదో కార్యం ఆపడానికి నాకు తోచింది చెప్పాను. దాన్ని కూడా ఆపాడు కదా రుద్ర అని గోళ్లు చూసుకుంటూ చెబుతుంది.
కానీ నువ్వు చెప్పడం వల్ల రుద్రకి మన మీద కోపం వచ్చింది. అల్లుళ్లు ఇద్దరినీ కనపడనివ్వను అని వార్నింగ్ ఇచ్చాడు.
రేపు అక్క బావగారు వస్తున్నారు. నువ్వే సమాధానం చెప్పుకో. జ్యోతి అని పిలుస్తాడు. ఏమిటండి.. మన లగేజ్ సర్దు.
మన అమ్మాయిని తీసుకుని మనం బయటికి వెళ్లిపోదాము. ఏం మాట్లాడుతున్నావ్ అన్నయ్య.. నీలాంటి దాని నీడలో ఉంటే పాము పడగలో కాపురం చేసినట్టే..
ఎలాగో నా జీవితాన్ని పగ పంతాల మధ్యన నలిపేసావు. ఇక నా కూతురు జీవితం అలా నలగడం నాకు ఇష్టం లేదు. జ్యోతి పదా అని కోపంగా చెబుతాడు.
వస్తున్నాను అండి. నిష గదికి వెళ్లి . సర్దుకో మనం వెళ్ళిపోతున్నాము. ఎక్కడికి అమ్మ. తెలియదు నాన్నగారు బయలుదేరమన్నారు.
ఆశ వచ్చి అత్తయ్య నన్ను వదిలేసి వెళ్ళిపోతారా.. నా పెళ్లి జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు నాకంటూ ఒక ఆలోచన అభిప్రాయము ఏదీ లేదు.
ఏదైనా మీ పిన్ని చెప్పినట్టుగానే నడుచుకోవలసి వచ్చింది. ఇప్పుడు నా భర్త చెబుతున్నాడు. నా జీవితంలో సొంత నిర్ణయం తీసుకునే అధికారం, హక్కు లేదు.
ఒకవేళ ఉండి ఉంటే నిన్ను కూడా నాతోపాటే తీసుకువెళ్లేదాన్ని. జాగ్రత్తగా ఉండు. మీ పిన్ని ఏది చెబితే అది గుడ్డిగా ఫాలో అవ్వకు. నిషా తొందరగా సర్దుకో అని బయటికి వచ్చేస్తుంది.
ఆశ నిషా చేయి పట్టుకుని నన్ను వదిలేసి వెళ్ళిపోతావా... నిషా వెంటనే ఆశాని కౌగిలించుకొని నాకు నిన్ను వదిలి వెళ్ళడం అసలు ఇష్టం లేదు.
పరిస్థితులన్నీ మన చేయి జారిపోయాయి. ఇప్పుడు నాన్న చెప్పినట్టు వింటేనే మన జీవితాలు మళ్ళీ చక్కబడతాయి.
ఆనంద్ విహారి ఎక్కడ ఉన్నారో మనకి తెలుస్తుంది. జాగ్రత్తగా ఉండు అని బ్యాగ్ తీసుకుని బయటికి వస్తుంది. ఆశ కూడా వెనకాలే వస్తుంది.
లక్ష్మి కోడలి దగ్గరికి వెళ్లి జాగ్రత్త జ్యోతి. ఇప్పుడు నుంచి అయినా నీ జీవితం బాగుండాలని కోరుకుంటున్నాను. మయూరి అమ్మ అని ఆరుస్తుంది.
ఎందుకే అరుస్తున్నావు. ఇక్కడ ఉంటే వదిన జీవితానికి వచ్చిన నష్టమేముంది. పెళ్లయి ఉంటే ఆ నష్టం ఏమిటో అర్థం అయ్యేది.
ఏమి లేని దానివి. నీకెలా తెలుస్తుంది ఒక ఇల్లాలి బాధ. నువ్వు అసలా నాకన్న తల్లివేనా. ఆ అనుమానం నీకెందుకు వచ్చింది. వెళ్లి మీ నాన్నని అడుగు కరెక్ట్ గా చెబుతారు.
నువ్వు మాకన్న బిడ్డవో.. కాదో.. నాగేంద్ర కోపంగా లక్ష్మీ అంటే.. నేను అన్నది ఏమైనా తప్పుందా? ఎవరైనా పిల్లలు జీవితం బాగుండాలి అని కోరుకుంటారు.
మన పెద్దమ్మాయికి, శేషాద్రి కి పెళ్లి చేశారు. వాళ్లకి పిల్లలు ఉన్నారు. ఇప్పుడు శేషాద్రి కూతురు జీవితం కోసం ఆరాటపడుతున్నాడు.
నిజంగా మయూరి మీకన్న కూతురే అయితే మీరు కూడా అలాగే ఆరాటపడేవారు కదా.. మీ పగ కోసం దాని జీవితాన్ని నాశనం చేసేవారు కాదు కదా..
అడుగు మయూరి . మీ నాన్నని గట్టిగా అడుగు నువ్వు ఎవరికి పుట్టావో... నాన్న అని కన్నీళ్ళతో చూస్తే..
మీ అమ్మ ఏదో పిచ్చివాగుడు వాగుతుంది. నా కన్నా బిడ్డ వేరా...
నిషా మయూరి దగ్గరికి వచ్చే అత్తయ్య అని పిలుస్తుంది. మయూరి నిషా వైపు చూస్తే.. నీకోసం నేను చాలా చేశాను. నాకోసం ఒకే ఒక చిన్న పని చేసే పెడతావా..
ఏమిటది.. దయచేసి నా సరౌండింగ్లోకి ఎప్పుడో రావద్దు . నీ పగ కోసం ఇప్పటికే మా జీవితాల్ని ప్రశ్నర్ధకంగా మార్చావు. ఇంకా నువ్వు మా చుట్టూ తిరిగితే ఈ ప్రశ్న కూడా సమాధానం లేకుండా శూన్యంలో కలిసిపోతుంది.
మీరు కూడా రావద్దు తాతయ్య అని చెప్పి వెళ్ళిపోతుంది. మనవరాలు చెప్పిన విధానానికి నాగేంద్ర సోఫాలో కూలబడిపోతాడు. వెళుతున్న ముగ్గురికి లక్ష్మి, ఆశ బాయ్ చెప్పే లోపలికి వస్తారు.
ధరణి జయంతి ముసి ముసిగా నవ్వుకుంటూ ఉంటే.. చారులత వచ్చి ఏమైంది. ఆ విషయం మాకు చెబితే నేను నవ్వుతాను కదా..
ఏమీ లేదు వదినగారు శాంభవి చెప్పింది విని మాకు సంతోషంగా అనిపించింది. ఏం చెప్పింది రాత్రంతా సవ్యంగానే జరిగిందా..
హ.. అంతా సవ్యంగానే ఉంది. అందుకే మాకు ఆనందం. పోనిలే.. మంచి విషయం చెప్పారు. వెంటనే మా వారిని ఏడుకొండలు నడిపించి గుండు కొట్టిస్తాను.
ఆ మాటకి సంతోష్ మండిపడుతూ ఇది మరీ బాగుంది. నీ కొడుకు సుఖంగా ఉంటే నాకు గుండు కొట్టించడం ఏమిటి.. మగవాళ్ళు జుట్టూ ఎంతలో వస్తుందిఅండి.
మా జుట్టు తీయడం అంటే కష్టంగాని. నీ కొడుకు జుట్టు తీయించుకో. నా కొడుకు అందం పాడవదు. నీ కొడుకు అందం పాడవ్వకూడదు కానీ నేను ఎలా ఉన్నా నీకు పర్వాలేదా. మీరు ఎలాగున్నా చుక్కల్లో చంద్రుడు అండి .
నా పెళ్లయినప్పటి నుంచి ఇలా పొగిడే.. నన్ను ఇలా నుంచోబెట్టావు.
శాంభవి గదిలోకి వెళ్లి నోట్లో వేలు పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటుంది. రుద్ర అది చూసి ఏమైంది పాపా.. నీ చిట్టి బుర్రని అరగతీస్తున్నావు.
ఏమీ లేదు రుద్రా సార్.. అమ్మ వాళ్ళు రాత్రంతా సవ్యంగానే జరిగిందా.. బాగ పడుకున్నావా అని అడిగారు.
అంతా సవ్యంగానే ఉంది నేను రుద్ర గుండెల మీద పడుకున్నాను అని చెప్పాను. అప్పటినుంచి ముసి ముసగా నవ్వుకుంటున్నారు. ఇందాక అత్తయ్య కూడా దగ్గరకు వచ్చి ముద్దు పెట్టుకుంది. ఎందుకంటావు...
శాంభవి చెప్పిన దానికి రుద్ర తల కొట్టుకుంటూ నవ్వుకుంటాడు. మీరు ఎందుకు నవ్వుకుంటున్నారు. నా పెళ్ళాం మరి ఇంత తెలివయిందా అన్న ఆనందంతో...
ఓ.. అవునా.. ఏంటి అవును అని తల మీద ఒక్కటి వేస్తాడు ఎందుకు కొట్టారు నన్ను అని తల మీద చేయి వేసుకుని అడుగుతుంది.
లేకపోతే ఎవరైనా అలా సమాధానం చెబుతారా. ఏం చెప్పాను. రాత్రి బాగా పడుకున్నాను. ఎక్కడ పడుకున్నాను. మీ గుండెల మీదే కదా..
దాని అర్థం ఏమిటో తెలుసా... పడుకోవడానికి కూడా అర్థం ఉందా.. భార్యాభర్తల పడుకునే దాంట్లో చాలా అర్థాలు ఉంటాయి పాప.
అవునా ఏమిటి అంటుంది. అది చెప్పేది కాదు చూపించేది. ప్లీజ్ రుద్రాగారు నాకు చూపించరా.. అని గారాలు పోతుంది.
అబ్బా నీ గారాలతో చంపేస్తున్నవే.. రుద్రా అని కాకుండా బావ అని పిలువు. వెంటనే చూపిస్తాను. నేను పిలవను నాకు సిగ్గు.
నీ సిగ్గు పోయిన రోజునే చూపిస్తాను. అయితే నేను వెళ్ళి అమ్మని అడుగుతాను. ఓయ్ ఇలాంటివి అమ్మని, నాన్నల్ని అడగకూడదు.
ఇది మనిద్దరమే తేల్చుకోవాల్సిన విషయం. అర్థమైందా....
ఏదో కొంచెం కొంచెం అర్థమవుతుంది లే.. పోనీలే ఇది ఇలా చెప్పడం వల్ల మా ఇద్దరి మధ్యన అంతా బాగానే ఉంది అనుకుంటున్నారు.
అలాగే అనుకోని అని మనసులో అనుకుంటూ శాంభవిని చూస్తాడు. ఏంటి రుద్ర గారు అలా చూస్తున్నారు. దగ్గరికి రా అంటే.. పక్కనే కూర్చున్నాను కదండీ. కొంచెం దగ్గరికి రా ...
సరే అని జరుగుతుంది. ఇంకా అంటాడు. ఇంకా జరుగుతుంది. ఇంకా అంటే... మనిద్దరి మధ్యన ఇక్కడ గ్యాప్ లేదు.
అవునా లేదా అని చుట్టుకున్న నడుం పట్టుకుని ఒడిలో కూర్చోబెట్టుకుంటాడు. ఏం చేస్తున్నారు మీరు అని భయంగా చూస్తుంది.
నువ్వే కదా భార్యాభర్తలు పడుకోవడం ఏమిటో చూపించమన్నావు. చూపిస్తున్నాను పాప. ఇదేం చూపించడం.
మరి ఇంకా ఎలా చూపించాలి అని ముక్కుతో బుగ్గ మీద రాస్తూ ఉంటాడు. అయ్యో మీరు ఇలా చేయకండి నాకు చెక్కిలిగింతలు వస్తున్నాయి అని మెలికలు తిరుగుతుంది.
ఇలా చేస్తే రావాల్సింది రొమాన్స్ ఫీలింగ్ పాపా... చెక్కిలగింతలు కాదు. ఉహూ.. నాకు భయం. భయం అంటే ఇక రేపు మనకి పిల్లలు పుట్టినట్టే.
అయ్యో ఎందుకు పుట్టరండి. రోజు దేవుడికి పూజ చేస్తే పుట్టేస్తారు. నువ్వు ఏం చదువుకున్నావ్.. మీకు తెలియదా...
పర్లేదు నీ నోటితో చెప్పు.. ఇంజనీరింగ్ అంటుంది. అసలు ఎక్కడైనా ఇంజనీరింగ్ చదువుకున్న లక్షణాలు ఉన్నాయా..
చదువుకొని మొద్దులు చెప్పినట్టు చెబుతున్నాను. పూజలు చేస్తే పిల్లలు ఎలా పుడతారు. లాప్టాప్ లో పిల్లలు ఎలా పుడతారు అన్న ఆర్టికల్ ఓపెన్ చేసి శాంభవి ముందు పెడతాడు.
అది అంతా చదివి... నోటి మీద చెయ్యి వేసుకుని రుద్రవైపు చూస్తోంది. ఇప్పుడు అర్థమైందా పాప అని కన్ను కొడతాడు.
మరి మా శక్కు జేజి అలా చెప్పింది ఎందుకు. ఎలా చెప్పారు. ఒకసారి పిల్లలు ఎలా పుడతారు జేజి.. పూజలు చేస్తే దేవుడు ఇస్తాడు అని చెప్పింది.
అప్పుడు నీ వయసెంత.. ఆలోచిస్తూ ఏమో గుర్తులేదు.. చిన్నపిల్లలకి అలా చెప్పక ఇలా జరిగితే పుడతారు అని చెబుతారా...
అయినా ఇంజనీరింగ్ చదువుకున్నావు కదా.. ఫ్రెండ్స్ మధ్యన రొమాన్స్, కిస్ టాపిక్స్ వస్తాయి కదా... మా కాలేజీలో అలాంటివి మాట్లాడుకోకూడదు.
ఓన్లీ స్టడీస్ గురించి మాత్రమే. అది నీలాంటి వాళ్ళకి. మూవీస్ లో అయినా చూపిస్తారు కదా... నాకు మూవీస్ చూసే అంత టైం ఉండదు.
రోడ్ల మీద పడి తిరిగేడంలో ఉన్న టైం ఇలాంటివి తెలుసుకోవడంలో ఉండవులే...
శాంభవి??
Posts: 898
Threads: 13
Likes Received: 7,006 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
Part - 72
రోడ్లు మీద పడి తిరగమంటే టైం ఉంటుంది కానీ ఇలాంటి విషయాలు తెలుసుకోవడంలో నీకు బుర్ర ఉండదు కదా.
మీరు నన్ను అవమానిస్తున్నారు. నాకు కోపం వస్తుంది.
అది తప్ప నీకు ఇంకొక ఎమోషన్ ఏమీవచ్చు పాప.
నాకు చాలా ఎమోషన్స్ తెలుసు.. అవునా చెప్పు. ఆలోచిస్తూ సంతోషం తెలుసు. బాధ తెలుసు. ఇంకా.. చెప్పు వింటున్నాను కదా..ఫ్రెండ్షిప్ ఎమోషన్ తెలుసు.
అసలు తెలియాల్సింది తెలియదు కదా పాప నీకు..ఇంకేం తెలియాలి. ప్రేమ అనే ఎమోషన్. ఆల్రెడీ మనిద్దరం ప్రేమించుకునే కదా పెళ్లి చేసుకున్నాము.
ప్రేమించుకుంటే ఎన్ని చేసుకుంటారు తెలుసా... మనం ఒక్కటైనా చేసుకున్నామా.. ఏం చేసుకుంటారు రుద్ర గారు. ఏం చేసుకుంటారా పెళ్లికి ముందే ఇలా ముద్దులు పెట్టుకుంటారు అని బుగ్గ పైన ముద్దు పెడతాడు.
అవ్వ తప్పు కదా... నీకు పెళ్లి అయ్యాక పెట్టిన తప్పే కదా..
నడుం పైన చేయి వేసి మీటుతు ఇలా చక్కెలగింతలు పెడతారు. ఇంకా అని ఆ నడుముని గట్టిగా ప్రెస్ చేస్తాడు.
అబ్బా అని ఒక రకమైన సౌండ్ తో రుద్రా కాలర్ పట్టుకుంటుంది. శాంభవిలో వచ్చిన డిఫరెన్స్ కి రుద్ర చిన్నగా నవ్వుతూ ఇవన్నీ ప్రేమకు సంబంధించినవే.
అది ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య మాత్రమే ఉంటుంది పాప. ఇలాంటివి కొన్ని కొన్ని తెలుసుకోవాలి. అప్పుడే జీవితంలో రొమాన్స్ అన్న ఒక చాప్టర్ ఓపెన్ అవుతుంది. లేకపోతే భక్తి సన్యాసంతోనే జీవితం వెళ్ళిపోతుంది.
అయ్యో మీరు అప్పుడే సన్యాసం తీసుకోవద్దండి.నాకు పిల్లల కావాలి. మా అమ్మె పిల్లల కోసం సన్యాసం తీసుకోవద్దు అంటున్నావా..
సరే ఎంతమంది పిల్లలు కావాలి. నాకు ఆలోచిస్తూ ముగ్గురు అంటుంది. అందులో ఒక అమ్మాయి కచ్చితంగా ఉండాలి.
పాపని మా నాన్నకి ఇస్తాను. తర్వాత ఇద్దరు బాబులు ఒక బాబుని అమ్మకి ఇస్తాను. ఇంకో బాబు మన దగ్గర ఉంటాడు.
ఇది నేను ఒప్పుకోను. నాకు పాపే కావాలి. ఇక్కడే పెరగాలి అమ్మో ఇంతమందా... నో ప్రాబ్లం... ట్విన్స్ ట్రై చేద్దాం. ముందు ఇద్దరు అబ్బాయిలు. తర్వాత ఇద్దరమ్మాయిలు. ఏమంటావు.
ఖచ్చితంగా అలా ఎలా పుడతారండి. మనం కోరుకోవాలే గాని ఏదైనా జరుగుతుంది. అది జరగాలి అంటే ముందు నీకోపరేషన్ ఉండాలి పాప...
రుద్ర మనసులో మాత్రం పూర్తి నిజం చెప్పిన తరువాత శాంభవి అంగీకారంతో దాంపత్య జీవితం మొదలు పెట్టాలి.
రోజులు ముందుకు పరిగెడుతూఉంటాయి. రేపల్లె వాస్తవ్యులు రేపల్లెకి చేరుకుంటారు. శాంభవి నీ అందరూ అపురూపంగా చూసుకుంటూ ఉంటారు.
దేవేంద్ర తో అనుబంధం ఇంకా పెరుగుతుంది. ఒకరోజు చూడకపోయినా ఫోన్ చేసి దెబ్బలాడే స్థితికి వస్తుంది. శాంభవి అలా గొడవ పడుతూ ఉంటే దేవేంద్రకి మనసు ఉప్పొంగిపోతూ ఉంటుంది.
సీరియస్ గా ఆలోచిస్తున్నా రుద్ర దగ్గరికి ధీరజ్ వస్తాడు. ఏంటి బావ తెగచించుతున్నావు.. శాంభవికి నిజం చెప్పేద్దామనుకుంటున్నాను.
ఆ మాటకి గట్టిగా పొలమారుతుంది. ఏమంటున్నావు బావ. అందరూ ప్రశాంతంగా ఉన్నాము. బాబాయ్ శాంభవి తో మంచి రిలేషన్ లో ఉన్నారు.
చెబితే తారుమారైపోతుందేమో... అవ్వకుండా చూసుకోవడానికి నేను ఉన్నాను కదా... ఏ నిజమైన నా ద్వారా తెలిస్తేనే మంచిది. అందుకే వీకెండ్ అత్తయ్య దగ్గరికి తీసుకు వెళుతున్నాను.
మేము వస్తాము బావ. కాకపోతే బయట ఉంటాము. ఏదైనా అవసరమైతే ఒక కాల్ చెయ్.
రుద్రా పి ఎ ఫోన్ చేసి మిమ్మల్ని శేషాద్రి కలవాలి అని వెయిట్ చేస్తున్నారు. ఏం చెప్పమంటారు. అబ్బా వీడి గొడవ ఉంది కదా అని రమ్మని చెప్పు.
శేషాద్రి లోపలికి వస్తాడు. చెప్పు శేషాద్రి ఏంటి ఇలా వచ్చావు. రుద్ర నీకు అన్నీ తెలిసి అడిగితే.. నేనేమీ చెప్పను.
ప్లీజ్ వాళ్ళిద్దరూ జాడ చెప్పు. ఇది నిజంగా మార్పా లేకపోతే వచ్చిన తర్వాత వాళ్ళని వేసయ్యడానికా.. లేదు లేదు నిజమైన మార్పే.
నేను ఆ ఇంట్లో ఉండడం లేదు . నా భార్య కూతురిని తీసుకుని బయటికి వచ్చేసాను. ఆశ... అమ్మ, నాన్న కూడా వచ్చారు. మా బావగారు కోపంతో ఊగిపోతున్నారు.
పరువు పోయింది అని గొడవ గొడవ చేస్తున్నారు. పరువు పోయిందని బాధపడుతున్నారు గాని కూతురు జీవితం ఏమిటి అన్న బాధ లేదా...
నువ్వు కాలికేస్తే మెడకేస్తావు. మెడకేస్తే కాలికేస్తావు. ఎలా మాట్లాడినా నీతో కష్టం. కూతురు జీవితం బాగుంటేనే కదా పరువు..
నాన్న మయూరి పరిస్థితి బావగారు చేతిలో ఉంది. ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చింది మీ నాన్న మయూరి గురించా...
లేక మీ ఇంటి అమ్మాయిలను కాపురానికి పంపించడానికా...
మా ఇంటి అమ్మాయిలు గురించే వచ్చాను..సరే అయితే వాళ్లని పిలిపిస్తాను. కాకపోతే ఒక కండిషన్. చెప్పు. నువ్వు ఏది చెప్పినా ఒప్పుకుంటాను.
అబ్బో ఇదంతా నిజమేనా మార్పే అని ధీరజ్ వెటకారంగా అంటే... నీకు ఒక కూతురు ఉంటే అప్పుడు తెలుస్తుంది బాధ. ఇంకా పెళ్లి కాలేదు కదా అయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది.
నువ్వు చెప్పు రుద్ర కండిషన్ ఏమిటో... వాళ్లని పిలిపిస్తాను. పిలిపించిన వెంటనే రిసెప్షన్ అరేంజ్ చేసి మా అమ్మాయిలు ప్రేమ వివాహం చేసుకున్నారు.
ఆ ప్రేమను మేము గౌరవించి అంగీకరించాము అని అనౌన్స్ చేయాలి. అలాగే వాళ్ళిద్దరికీ కూడా ఎటువంటి హాని ఎవరి నుంచి రానివ్వను అని అగ్రిమెంట్ మీద సంతకం చేసి ఇవ్వాలి.
సరే ఇప్పుడే చేస్తాను. హలో నువ్వు ఒక్కడివే కాదు. మీ ఇంటిలో వాళ్లందరూ ఇంక్లూడింగ్ మీ బావగారు తో సహా.... అందరి సంతకాలు అయ్యి ఆ పేపర్లు నా చేతికి వస్తే... అప్పుడు వాళ్ళిద్దర్నీ తీసుకువస్తాను.
లేకపోతే మీ అమ్మాయిలకి వేరే పెళ్లి చేసుకోండి. నేనేమీ అడ్డుపడను. ఏంటి రుద్ర నువ్వు మాట్లాడేది. పెళ్లయిన ఎవరికైనా ఆ మనిషి బ్రతికుండగా మరొక పెళ్లా..
అరే అలా అంటావేంటి శేషాద్రి. మరి మా అత్త ఉండగానే మా చిన్నమామ కి మీ ముద్దుల చెల్లిని ఇచ్చి పెళ్లి చేయాలని ముచ్చటపడ్డారు.
ఇప్పుడు అదే విషయం చెబుతుంటే ఎందుకు నచ్చడం లేదు. మేము చేసింది తప్పే. ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి కూడా దారిలేదు అని నాకు తెలుసు.
జరిగిన వాటి గురించి మాట్లాడుతూ కూర్చుంటే ఇప్పుడు ఉపయోగం లేదు కదా... ఉపయోగం లేదా... మరి అయిపోయిన కాలాన్ని తిరిగి తీసుకురాగలవా..
మా చిన్నమామ జీవితంలోని సంతోషాన్ని తీసుకుపోయారు. అది తీసుకుని వచ్చి మీరు ఇవ్వగలరా...
మీ వరకు వస్తే మాత్రం న్యాయం ధర్మం మాట్లాడాలా.. ఎదుటివాళ్ల జీవితాలతో మాత్రం ఏమైనా ఆడుకుంటారా ..
శేషాద్రి మోకాళ్లపై కూర్చుని ఆరోజుల్లో అహంకారంతో ఉన్నాను. మా నాన్న ఏది చెబితే అదే చేశాను కానీ ఇప్పుడు ఒక తండ్రిగా ఆలోచిస్తున్నాను.
అందుకే కూతురు భవిష్యత్తు బాగుండాలి అని వాళ్ళ నీడ కూడా పడకూడదు అని బయటికి వచ్చేసాను. నీ కోపం తీరాలి అంటే మీ అత్తయ్య సమాధి అంటే... సమాధి కాదు దేవాలయం అని కోపంగా అంటాడు.
అదే ఆ దేవాలయం లో మీ అత్తయ్య పాదాలకి నా రక్తంతో అభిషేకం చేస్తాను. ఛీ.. ఛీ.. మీలాంటి నీచులు రక్తం మా అత్తయ్య మీద పడితే మా అత్తయ్య అపవిత్రం అయిపోతుంది.
పోనీ నువ్వే చెప్పు రుద్ర ఏం చేస్తే మీ కోపం తీరుతుంది. నువ్వు ఏమి చేసినా మా కోపం, బాధ తీరదు. ఏదో మారాను అంటున్నావు కదా...
నేను చెప్పిన పని చేసుకుని రా... అప్పుడు ఆనంద్ విహారీలని మీ ముందుకు తీసుకువస్తాను.
ఇప్పుడే సంతకాలు చేయిపిస్తాను. ధీరజ్ అని పిలవగానే డాక్యుమెంట్స్ తీసుకువచ్చి ఇస్తాడు. ఈ డాక్యుమెంట్స్ లో మీ కొంపలో ఉన్న వాళ్ళందరితో సంతకాలు చేయించు.
అన్ని ఒరిజినల్ ఉండాలి. నా దగ్గర నాటకాలు ఆడాలి అనుకున్నారు అనుకో... లేదు లేదు నీ గురించి తెలిసి కూడా నాటకాలు ఆడతానా... వెళ్ళు అని పంపిస్తాడు.
శేషాద్రి అ డాక్యుమెంట్స్ తీసుకుని ఇంటికి వెళతాడు. కొడుకుని చూసిన లక్ష్మీ రారా ఎలా ఉన్నారు. ఒకసారి మీవారిని పిలువమ్మా అని కోపంగా అంటాడు.
మీ వారు ఏంట్రా.. ప్లీజ్ అమ్మ ఇప్పుడు మీ అందరితో కూర్చుని బుజ్జగించి మాట్లాడే అంత టైం నాకు లేదు. దయచేసి పిలుస్తావా.
ఒక్క నిమిషం కూర్చోరా.. ఈ ఇంటి గాలి కూడా నాకు నచ్చడం లేదు.. అవునా... నచ్చకుండానే ఈ ఇంటిలో ఇన్ని రోజులు ఉన్నావా అని నాగేంద్ర కోపంగా అడుగుతాడు.
అదే నా దౌర్భాగ్యం... శేషాద్రి అని కోపంగా అరుస్తాడు. ప్లీజ్ నాన్న ఇప్పుడు మీరు అరిచి... బి పి తెచ్చుకుని మీరు హాస్పటల్లో ఎడ్మిట్ అయితే నా పిల్లల భవిష్యత్తుకు ఇబ్బంది అవుతుంది.
ఆ మాటకి నాగేంద్ర కొడుకు ముందుకు వచ్చి నాకు ఏమైనా పరవాలేదు కానీ ఆశా నిషా కి ఏమీ కాకూడదు అంతేనా..
మాది పేగు బంధం కదా అలాగే అనిపిస్తుంది. సరే వచ్చిన విషయమేమిటో చెప్పు. బావగారిని అక్కను కూడా పిలవండి.
శేషాద్రి అక్క సునంద వచ్చి ఏరా ఎలా ఉన్నావు..మేము వచ్చామని తెలిసినా రాలేదు. బావగారు ఏరి అక్క.. వస్తున్నారు అని భయంగా చెబుతుంది.
ప్రభాకర్ వస్తూ ఉంటే సునంద మాత్రం భయంతో వణుకుతూ ఉంటుంది. శేషాద్రి గౌరవంగా ఎలా ఉన్నారు బావగారు. మీ ఇంట్లో వాళ్ళు చేసిన దానికి ఎలా ఉంటాము. పరువు రోడ్డు మీదకు వచ్చింది.
ఆ పరువు మళ్లీ ఇంట్లోకి తీసుకురావడానికి వచ్చాను. ఏం చేబుతున్నావు రుద్ర పెట్టిన కండిషన్ మొత్తం చెప్పి డాక్యుమెంట్స్ చూపిస్తాడు.
ప్రభాకర్ డాక్యుమెంట్స్ తీసుకుని మొత్తం చదువుతాడు. మన మాట మీద నమ్మకం లేదా... అది మన కుటుంబంలోనే లేదు కదా...
మీ కుటుంబం ఇలాంటిదని తెలిసి ఉంటే మీ అక్క మెళ్ళలో తాళి కట్టేవాడినే కాదు. మీ అత్తింటి వారు ఎవరు అని నన్ను అడుగుతుంటేనే సిగ్గుతో చచ్చిపోతున్నాను.
ప్లీజ్ బావ జరిగిపోయిన విషయాలు గురించి ఎందుకు... అందరూ ఇందులో సంతకాలు చేస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది...
కథ కొనసాగుతుంది...
Posts: 1,156
Threads: 1
Likes Received: 730 in 473 posts
Likes Given: 10,898
Joined: Jun 2019
Reputation:
2
Shesadri is turning hostile... Hope he keeps his words for his daughter's life
Posts: 4,804
Threads: 9
Likes Received: 3,181 in 2,464 posts
Likes Given: 11,247
Joined: Sep 2019
Reputation:
31
Posts: 1,588
Threads: 2
Likes Received: 934 in 717 posts
Likes Given: 2,110
Joined: May 2019
Reputation:
10
Asalu madam santakam chestunda mari?
Posts: 898
Threads: 13
Likes Received: 7,006 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
Part - 73
ప్లీజ్ బావ. పంతాలకి వెళ్లొద్దు. సంతకం చేయండి. మనకి మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం. సునంద కూడా ఒప్పుకోండి.
అల్లుడుగారు రాగానే అమ్మాయిని అల్లుడిని తీసుకుని మనం వెళ్ళిపోదాము. నేను ఇంకా పుట్టింటి వైపు కూడా చూడను.
లక్ష్మీ బాధగా సునంద అంటే... అవునమ్మా పుట్టిల్లు అంటే ఆడపిల్ల మంచి కోరుకుంటుంది..కానీ మీరేం చేస్తున్నారు. మీ పగలు కోసం నా కూతురి జీవితాన్ని పణంగా పెట్టారు.
ఏం మయూరి.. నిన్ను చెల్లి కన్నా.. కూతురులాగా చూసుకున్నాను కదా.. దేవేంద్ర ని ఇష్టపడుతున్న అన్నప్పుడు కూడా నీ వైపే మాట్లాడాను.
నా కూతురికి బిజినెస్ లో టిప్స్ నేర్పిస్తాను. నెంబర్ వన్ పొజిషన్ లో నిలబెడతానని చెప్పి తీసుకువచ్చి ఇలా చేస్తావా..
నువ్వు అసలు ఆడదానివేనా.. బావగారు ముందు నా పరువు ఏమవుతుందని ఆలోచించావా.. నా కూతురిని ఎవరికో తార్చాలని చూస్తావా..
అసలు ఇలా తయారయ్యవే.. దేవేంద్రని దక్కించుకోవడం కోసం ఎవరినైనా ఫణంగా పెడతావా... ఇలా తయారైంది ఏంటమ్మా...
ఏమి చెబుతాను సునంద.. పగ పగ అని మీ నాన్న దాన్ని ఒక పాములాగా తయారు చేశారు. అమ్మ అని కోపంగా మయూరి అరిస్తే..
నేను అన్నది తప్పా.. పాము తన పిల్లల్ని తానే చంపుకుని తింటుంది అంట.. అలాగా నీ నాన్న పగ కోసం నీ జీవితాన్ని నాశనం చేస్తే..
నువ్వు పగ కోసమే అన్న అక్క కూతుళ్లు జీవితాన్ని నాశనం చేశావు. ఇంకా ఏం మాట్లాడుతున్నావు అని.. కొడుకు వైపు తిరిగి..
ఏరా నన్ను కూడా నీతో పాటు తీసుకు వెళ్లిపో. ఈ రాక్షసుల మధ్య నేను ఉండలేను.
అందరూ సంతకాలు చేస్తారు మీరు కూడా చేయండి నాన్న అల్లుడు మొహం చూసి నాగేంద్ర... మయూరి మౌనంగా సంతకం చేస్తోంది.
మీరిద్దరూ ఈ స్మశానం లాంటి ఇంటిని ఏలుకుంటూ పగ పగ అని తిరగండి. బావగారు మీరు మా ఇంటికి వస్తారా లేక ఇక్కడే ఉంటారా...
ఇలాంటి నీచులను చూడలేను పదండి అని అక్కడ నుండి ప్రభాకర్ సునందా కూడా వెళ్ళిపోతారు.
వెళుతున్న లక్ష్మీని నాగేంద్ర కోపంగా పిలుస్తాడు. ఎందుకు అరుస్తున్నారు. నువ్వు వెళ్ళిపోతే నాకు ఎలా కుదురుతుంది.
ప్రతి పనికి నీ మీద ఆధారపడడం అలవాటు అయిపోయింది. ఈ వయసు వచ్చిన భార్య పక్కనఉండాలి.
కూతురు మాత్రం మోడిచెట్టులాగా ఉండాలి. చూసావా మీ నాన్నగారు స్వార్థం. ఇప్పటికైనా తేరుకో...
పదరా అని కొడుకుతో వెళ్ళిపోతుంది. వెళుతున్న భార్యని చూస్తూ కోపంగా పిడికిలి బిగిస్తాడు. మీ అమ్మ లేకపోతే నాకు ఏమీ జరగదు అనుకుంటూ.. పొగరు చూపిస్తుంది.
వెళ్ళని.. మొగుడు దగ్గర ఉంటే ఎంత గౌరవమో... కొడుకు దగ్గర ఉంటే ఎంత గౌరవమో తెలుస్తుంది. నువ్వేం బాధపడకు మయూరి.
ఎప్పటికైనా దేవేంద్ర నీకు దక్కుతాడు. నా మాట నమ్ము. తండ్రి వైపు చూసి మౌనంగా గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంటుంది.
అందరినీ ఇంటి దగ్గర దింపి.. రుద్ర దగ్గరికి వెళతాను అని కారు వెనక్కి తిప్పితే... ప్రభాకర్ నేను వస్తాను అని శేషాద్రితో వెళతాడు.
శేషాద్రి వచ్చాడు అని తెలిసి రుద్ర రమ్మంటాడు. శేషాద్రి తో పాటు ఉన్న ప్రభాకర్ ని కేర్లెస్ గా చూస్తాడు. ఆ చూపుకి ప్రభాకర్ కి చాలా కోపం వస్తుంది కానీ ...
తమ ఇంటి పరువు రుద్రా చేతిలో ఉంది అని కష్టంగా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. ఏంటి శేషాద్రి నీకు తోడుగా ఎవరో పెద్ద మనిషిని తీసుకొచ్చినట్టు ఉన్నావు.
ఎవరు అంటే.. మా బావగారు. అంటే... మా బావగారు.. ఆశా నాన్నగారు. అవునా ఎందుకొచ్చినట్టు. అన్నీ తెలిసే ఎందుకు అలా అడుగుతావు అని ప్రభాకర్ కోపంగా అంటే....
నా ముందు వాయిస్ రేస్ చేస్తే నాకు అస్సలు నచ్చదు. ఏం శేషాద్రి మీ బావకి చెప్పలేదా నా గురించి. బావగారికి ఇక్కడ వాతావరణం కొత్త కదా.. కోపం తెచ్చుకోకు..
బావగారు మీరు కొంచెం శాంతంగా ఉండండి. రుద్ర నువ్వు అడిగినట్టుగా అందరితో సంతకాలు చేయించాను.. గుడ్.. ధీరజ్ ని పిలిచి ఈ పేపర్స్ ఒకసారి మనం లీగల్ అడ్వైజర్ తో చెక్ చేయిపించు.
మా మీద నమ్మకం లేదా అని ప్రభాకర్ అడిగితే... ఎవరు నువ్వు అని నీ మీద నేను నమ్మకం చూపించాలి. నా గురించి పూర్తిగా తెలియక మాట్లాడుతున్నావు రుద్ర.. నాతో శత్రుత్వం అంత మంచిది కాదు.
బురద పాము కూడా బస కొడుతుంది. అంతమాత్రాన అది తాచుపాము అవుతుందా.. అవదు కదా మీరు కూడ అంతే..
వచ్చిన వాళ్ళని కూర్చోమనడం సంస్కారం. అందులో నీకన్నా పెద్ద వాళ్ళము.. ఆ మాత్రం తెలియదా.. వయసులో పెద్దవాళ్ళు అయితే సరిపోదు. సంస్కారంలో కూడా ఉండాలి.
నాకు సంస్కారం లేదు అనుకుంటున్నావా.. ఉంది అని మీరు అనుకుంటున్నారా మిస్టర్..
ఉంది కాబట్టే పెళ్లి ని గౌరవించాను. రుద్ర గట్టిగా నవ్వుతూ.. సంస్కారం ఉండి కాదు.. ఆ ఫోటోలు లీక్ అవుతే మీ ఇంటి పరువు ఏమవుతుందో అన్న భయం.
ప్రభాకర్ ఏమి మాట్లాడలేక పోతాడు. ధీరజ్ వచ్చి అవి ఒరిజినల్ సంతకాలే అని చెబుతాడు.
ఓకే మంచి రోజు చూసి అల్లుడ్ని తీసుకువచ్చి నీకు అప్పచెబుతాను. ఇప్పుడు తీసుకువస్తే ఏమైంది.. అయ్యో... మంచి రోజు చూసి కదా... అల్లుడిని ఇంట్లోకి తీసుకు వెళ్ళాలి ఆమాత్రం కూడా తెలియదా..
సరే అని వెళుతున్న ప్రభాకర్ ని చిటిక వేసి పిలుస్తాడు. ఏమిటి అంటే.. మీకు మర్యాద ఇవ్వలేదు అని అగ్గి మీద గుగ్గిలం అవుతున్నావే...
ఆరోజు మా అత్తయ్య జీవితాన్ని ఈ కుటుంబం మొత్తం నాశనం చేస్తూ ఉంటే మీ సంస్కారం ఏమైపోయింది.. నాకేమీ సంబంధం లేదు అని కళ్ళు మూసుకుని ఉన్నావు కదా... మరి ఇప్పుడెందుకు తెగచించుకుంటున్నావు.
శేషాద్రి ప్రభాకర్ చెయ్యి పట్టుకుని నువ్వు రా బావ అని తీసుకువెళ్లిపోతాడు. ప్రభాకర్ మాత్రం మౌనంగా బావమరిది వెనకాల వెళతాడు.
ధీరజ్ రుద్రా వైపు అనుమానంగా చూస్తూ.. వాళ్ళిద్దరిని నిజంగా వీళ్ళతో పంపిస్తావా... ప్రాణాలతో ఉండనిస్తారా... మనకోసం ఇంత చేసిన వాళ్ళ జీవితాన్ని ఎందుకు పణంగా పెడతాను.
ఆ ఆశ, నిషా బేసిగ్గా పరవాలేదు. వాళ్ళ బుర్రని మయూరి పొల్యూట్ చేసింది. ఎందుకు ఆనంద్ విహారి నే సెలెక్ట్ చేసుకున్నావు.
లక్ష్మీ జ్యోతి గారు కోసం. వాళ్ళిద్దరూ మంచివాళ్లు రా.. పిల్లలు భవిష్యత్తు బాగుండాలి.. మన కుటుంబం బాగుండాలి అని రోజు ఆ దేవుడుకి పూజ చేస్తూనే ఉన్నారు.
నా దగ్గరికి వచ్చి బ్రతిమాలారు పిల్లలు ఇద్దరి జీవితాన్ని సరి చేయమని. వాళ్ళ పంతాలకి నాశనం అవ్వనివ్వద్దు అని.. అందుకే ఆనంద్ విహారిని సెలెక్ట్ చేసుకున్నాను.
సరే నేను ఇంటికి వెళ్తాను. మీ చెల్లి నాకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏమో బావా నువ్వు ఇచ్చే ట్విస్ట్ లకి తల పగిలిపోతుంది.
పబ్ కి వెళదాము అంటే మా చెల్లికి ఆ వాసనే పడదు. మా చెల్లి కోసం మేము ఎన్ని త్యాగాలు చేస్తున్నామో.. ఎప్పటికీ మమ్మల్ని దగ్గరికి తీసుకుంటుందో అర్థం కావడం లేదు . నా ప్రయత్నం కూడా అదే కదా..
ఈ వీకెండ్ అందరూ వెయిట్ చేయండి బాయ్ అని నవ్వుతూ వెళ్ళిపోతాడు. నీకే కూల్ గా ఉంటావు. బాంబు మాత్రం మా ఒళ్లో పెట్టావు.
శాంభవి ఎలా రియాక్ట్ అవుతుందో.. తర్వాత రేపల్లెలో పరిస్థితి ఏమిటో.. ఇక్కడ బృందావనం సిచువేషన్ ఏమిటో ఆలోచిస్తూ ఉంటే పెళ్లికి ముందే నా జుట్టు మొత్తం ఊడిపోయేటట్టు ఉంది.
రుద్ర ఇంటికి వెళ్లేటప్పటికీ చారు, శాంభవి, కౌసల్య, తులసి కబుర్లు చెప్పకుంటూ ఉంటారు. హాయ్ అత్తయ్య అని కౌసల్య పక్కన కూర్చుంటాడు.
హాయ్ రా ఎంతసేపు అయింది.. ఇప్పుడే.. ఏమిటి లేడీస్ అందరూ ఉప్పర్ మీటింగ్ పెట్టారు. శాంభవి కోపంగా చూస్తోంది.
ఏమీ లేదురా ఈ వీకెండ్ అందరం కలిసి బయటికి ఎక్కడికైనా వెళదాం అనుకుంటున్నాము. శాంభవి రేపల్లె వెళదాం అంటుంది.
దాని గురించి డిస్కస్ చేస్తున్నాము. లేదు నెక్స్ట్ వీక్ ఎండ్ ప్లాన్ చేసుకోండి. ఈ వీకెండ్ కాదు. ఏరా.. నాకు శాంభవితో పని ఉంది.
ఏం పని.. అబ్బా అన్ని మీకు చెప్పాలా.. ఓల్డ్ ఫెలోస్... రేయ్ మమ్మల్ని ఓల్డ్ ఫెలోస్ అంటావా... రేయ్ శాంభవి ఈ వీకెండ్ ఫిక్స్ మనం వెళదాము..
నో వే.. నా పెళ్ళాం నాతోనే వస్తుంది. దేవేంద్ర వచ్చి ఏమిటి నా కూతురు మీద మీరందరూ బెట్టు వేసుకుంటున్నారు. శాంభవి నవ్వుతూ దేవేంద్ర దగ్గరికి వెళ్లి టైం కి వచ్చారు.
మీరు చెప్పండి ఈ వీకెండ్ రేపల్లె వెళదాము అంటున్నాను. మీ మేనల్లుడు మాత్రం ఎక్కడికో అంటున్నారు. ఎక్కడికి అంటే చెప్పడం లేదు. మీరు గట్టిగా అడగండి.
ఎక్కడికి రా అంటే అమ్మవారి గుడికి అంటాడు. ఆ మాటకి దేవేంద్ర రుద్రవైపు సూటిగా చూస్తాడు. రుద్రా చూపులో భావం అర్థమయ్యి..
ఈసారి కి రుద్ర చెప్పినట్టుగా వెళ్ళు రా.. నెక్స్ట్ టైం వారం రోజులు నువ్వు రేపల్లె వెళ్ళి ఉండచ్చు. నిజంగానా అని సంతోషంగా అడుగుతుంది.
నీకెప్పుడైనా మాటిచ్చి తప్పానా.. లేదు అంకుల్. థాంక్యూ అని సైడ్ హాగ్ చేసుకుంటుంది.
సరే అల్లుడికి ఏం కావాలో చూసుకో అమ్మ.. రుద్ర రా అని తీసుకువెళ్తాడు. ఏంటి మేడం పుట్టిల్లు అనేటప్పటికీ మొఖం వెలిగిపోతుంది.
మరి వెలగదా వెళ్లి ఎన్ని రోజులు అయిందో.. మా నాన్నలని చూసి చాలా రోజులైపోయింది. రోజు వీడియో కాల్ లో చూస్తున్నావు కదా..
అబ్బా అలా చూస్తే మాత్రం బెంగ తీరుతుందా ఏమిటి? ఎప్పుడు నెక్స్ట్ వీక్ ఎండ్ వచ్చేస్తుందా అని వెయిట్ చేస్తున్నా..
ఇలా రా అని పక్కన కూర్చోబెట్టుకుని శాంభవి చేతిని ముద్దు పెట్టుకుంటాడు. నేను ఒక ప్లేస్ కి తీసుకువెళతాను అన్నాను కదా అది ఏమిటో తెలుసుకోవా..
చెప్పారు కదా ఏదో అమ్మవారి దేవాలయం అని..
రుద్రా సమాధానం...
Posts: 898
Threads: 13
Likes Received: 7,006 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
Part - 74
ఆ దేవాలయం గురించి తెలుసుకోవా... అక్కడికి వెళ్ళాక చెప్పండి. మీరు చెబుతూ ఉంటే ప్రతీది చూస్తూ తెలుసుకుంటాను.
సరే ఈరోజు ఏం చేశారు అని అడుగుతాడు. పొద్దున్న నుంచి అందరితో గడిపిన విషయాలు చెబుతుంది. తాతగారు వచ్చి వెళ్లారు.
తాతగారితో టైం స్పెండ్ చేస్తూ ఉంటే భలే ఉంది తెలుసా... నాకు మా తాతయ్య తో ఉన్నట్టే ఉంది. మా తాతయ్యతో చిన్నప్పుడు నుంచి ఎలా ఆడుకునేదాన్నో..
ఇక్కడ ఈ తాతగారితో కూడా అలాగే ఉన్నాను. అసలు నేనేమి చేస్తున్న... ఎంత అల్లరి చేస్తున్న ఒక్క మాట కూడా అనడం లేదు. పైగా నన్నే వెనకేసుకొస్తున్నారు.
ఇక్కడ అందరూ మంచి వాళ్ళే... చెప్పాను కదా.. నువ్వు ఏం చేసినా అందరికీ మురుపమే.
నీతో ఇలా మాట్లాడుతూ ఉంటే టైమే తెలియదు నేను ఫ్రెష్ అయి వస్తాను అని వెళతాడు. వెళుతున్న రుద్రాని చూస్తూ మీరు పైకి కనిపించే అంతా రఫ్ కాదు.
లోపల మీరు చాలా స్మూత్. నన్ను చిన్నపిల్ల లాగా ట్రీట్ చేస్తున్నారు. ఛీ.. ఛీ... ఇలా ఆలోచిస్తున్నాను ఏంటి. నేను చాలా పెద్దదాన్ని. ఇప్పుడు పెళ్లి అయిపోయింది. అమ్మ లాగా ఉండాలి.
రుద్రా ఫ్రెష్ అయ్యి వచ్చి ఏంటి పాప బుర్రని ఏదో అరగదీస్తున్నట్టున్నావు. అమ్మలాగా ఉండాలి అంటే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను.
ఇప్పుడు ఇంత సడన్ గా అంత పెద్ద డెసిషన్ ఎందుకు తీసుకున్నావు. అరే పెళ్లయిన తర్వాత ఎవరైనా అలాగే ఉండాలి. నేను ఏమైనా చిన్నపిల్లనా..
కాదు బంగారం. నీ బుర్ర మరీ ఇంత పాదరసంగా పరిగెడుతుంది అని ఊహించలేదు. సరే పదఅని తీసుకువెళ్తాడు.
ఇద్దరు కిందకి వెళ్ళేటప్పటికి కుటుంబం మొత్తం అక్కడే ఉంటుంది. అరే అన్నయ్యలు కూడా వచ్చారే. అవును రా నీకోసమే అని చాక్లెట్స్ ఇస్తారు.
థాంక్యూ అన్నయ్య. ఇంకా ఏమైనా కావాలి అంటే అడగరా తీసుకొస్తాము. కుటుంబం మొత్తం అక్కడే ఉండి కళకళాడుతూ ఉంటే.. తులసి మురుపెంగా శాంభవి చుట్టూ మెటికలు విరిచి.. మనవరాలు వచ్చిన వేళా విశేషం. ఇల్లంతా సందడిగానే ఉంటుంది.
నా కూతురు ఎక్కడ ఉంటే అక్కడే సందడి అత్తయ్య గారు అని జితేంద్ర అంటాడు. అది నిజమేలే.. అందుకే అంటారు ఇంటికి ఒక ఆడపిల్ల అయినా ఉండాలి.
అప్పుడే ఆ ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది అని... చిన్నప్పటి నుంచి ఈ లాగు చొక్కాలని చూడలేక విసుగువచ్చేది.
పండగ వచ్చినా అయ్యే బట్టలు... రోజు అవే బట్టలు. ఒక పని చెయ్యి గ్రానీ అని రుద్రా అంటే.. ఏంట్రా.. ఆడపిల్లలకి చిన్నప్పటి నుంచి వెయ్యాలనుకున్నవన్ని నీ మనవరాలు వేసి మురిసిపో... ఏమంటారు మావయ్య..
నా కూతురికి ఎందుకులే గాని.. నువ్వు ఒక కూతురుని ఇవ్వు. ఆ కూతురికి వేసి మురిసిపోతాము. అవున్రా ఇంట్లో పిల్లల సందడి ఉంటే ఆ ఆనందమే వేరు.
అన్నయ్య ఒక పని చేదాం.. అందరం ఒకే చోట ఉండేటట్టుగా ఒకే కాంపౌండ్ వాల్ లో రెండు ఇళ్లు ఉండేలాగా చూడండి.
మరి మేము ఎక్కడ ఉండాలి అత్తయ్య అని ధీరజ్ వస్తే.. అవును కదా మూడిళ్లు వచ్చేలాగా ప్లాన్ చేయండి. అప్పుడు మనకి ఇల్లంతా సందడే సందడి.
ఏమంటారు అత్తయ్య. మంచి ఆలోచన. ఒరేయ్ ఆ ప్లాన్ లో ఉండండి. ఇంకొక తరం వచ్చేటప్పటికి ఇంటి పని పూర్తి చేయండి.
శివగామి గారి ఆర్డర్ కదా అలాగే పూర్తి చేద్దాం అని రుద్రా అంటాడు. నా మనవడు మాటిచ్చాడు అంటే ఆ పని అయిపోతుంది. ఇంకా శాంభవి తీపి వార్త చెప్పడమే మిగిలింది.
అందరి నవ్వుల మధ్యన వారం రోజులు ముందుకు వెళ్లిపోతాయి. ఆదివారం రానే వస్తుంది. శాంభవి చాలు అంటున్న సరే పీకల దాకా తినిపిస్తారు.
అత్తయ్య ఇలా తింటే నా పొట్ట పట్టదు. ఏమీ అవ్వదు రా.. ఒక రోజుకి. మీరు వెళ్ళేది చాలా దూరం. ఎప్పటికి వస్తారో.. ఏమిటో తిను అని తినిపిస్తుంది.
గుడికి వెళ్లే ముందు తినకూడదు అత్తయ్య. అలా రూలేమీ లేదు. తిను అని తినిపించి కొడుకువైపు చూస్తుంది. పరవాలేదు అని కళ్ళతోనే ధైర్యం చెప్పి వెళదామా.. హా నేను రెడీ అంటుంది.
దేవేంద్ర వచ్చి నేను వస్తాను అంటే.. మావయ్య అని చూస్తాడు. పరవాలేదు నా కథ నేనే చెప్పుకుంటాను అని బయలుదేరుతాడు.
ముగ్గురు ఒకే కారులో వెళతారు. ఇంకొక కారులో విహాన్, అద్వైత్, ధీరజ్ వెళ్లి బయట ఆగిపోతారు. రుద్ర కార్ లోపలకి వెళ్లగానే చుట్టూ చూస్తూ ఉంటుంది.
ఇక్కడికి ఒకసారి వచ్చాము కదా.. అవును..
కారు ఒకచోట ఆపి దిగు అంటాడు. ముగ్గురు కలిసి నడుస్తూ ఉంటారు. దేవేంద్ర కి ఆ ప్లేస్ చూడగానే భార్య గుర్తుకు వస్తుంది.
భార్య సమాధి దగ్గరికి వెళ్లి పువ్వులు అలంకరిస్తాడు. ఎప్పుడు చూసినా ఆ ప్రదేశం అంతా శుభ్రంగానే ఉంటుంది. శాంభవి దేవేంద్ర పక్కన కూర్చుంటే... రుద్ర నాలుగడుగుల దూరంలో స్తంభానికి ఆనుకుని కూర్చుంటాడు.
భార్య సమాధిని తడుముతూ నా భార్య చాలా సున్నితమైనది. తన నవ్వు చూస్తే వెన్నెల కురిసినట్టుగా ఉంటుంది. నేను తన నవ్వుకే పడిపోయాను.
భార్య చిరునవ్వు గుర్తుచేసుకుని మురిసిపోతూ ఉంటాడు. మొదటిసారి ఎక్కడ చూశారు అని శాంభవి అడిగితే... అమ్మతో కలిసి.. నిన్ను రుద్రాని ఒకసారి గుడికి తీసుకువెళ్లేనే.. ఆ గుడికి మొదటిసారి వెళ్లాను.
సెక్యూరిటీ ఇబ్బంది ఉంటుంది అని ఉదయమే నాలుగు గంటలకే వెళ్ళాము. నేను ఒక నమస్కారం చేస్తాను కానీ పూజలు హోమాలు అంటే నా వల్ల అయ్యేది కాదు ఆ టైం ని వర్క్ లో పెడితే భగవంతుడే చూస్తాడు అన్నది నా పాలసీ.
మా అమ్మ గోల పడలేక మొదటిసారి ఆ గుడికి వెళ్లాను అప్పుడే చూశాను. లంగా వోని వేసుకుని గుడి ముందు ముగ్గు పెడుతుంది.
తల స్నానం చేసింది కాబోలు... జడనీ లూసుగా అల్లి తలలో మందార పువ్వు పెట్టింది. జడ కూడా చాలా పొడుగు తెలుసా... అచ్చు నీ జడ లాగానే ఉండేది.
చేతికి మట్టి గాజులు ఉన్నాయి ఆ గాజులు శబ్దం నా చెవులకి వినసంపుగా వినిపించి నా కాళ్లు అక్కడే ఆగిపోయాయి. మొఖం చూద్దామని ప్రయత్నిస్తున్న ఆ జడ ముందుకుపడి కనిపించలేదు.
నా కష్టాన్ని చూసి ఆ దేవుడికి కూడా జాలిసిందేమో... అమ్మ లహరీ అని వాళ్ళ నాన్నగారు పిలిచారు. వస్తున్నాను నాన్నగారు అంటూ జడ వెనక్కి వేసింది.
తని రూపం చూడగానే నా హృదయం అని గుండె పైన చెయ్యి వేసుకుని అక్కడే ఆగిపోయింది. లేడిపిల్ల లాగా చెంగుచెంగున పరిగెడుతూ ఉంటే...
ఆ కాలికి పెట్టిన పట్టీలు ఘల్లు ఘల్లున మోగుతూ ఉంటే... నా అడుగులు తెలియకుండానే ఆ పాదాల వెనకాలే వెళ్లాయి.
గుడిలో వాళ్ళ నాన్నగారు ప్రధానార్చకులు. అవసరమైనవి అన్నీ అందిస్తూ ఉంది. తన ధ్యాస అంతా అమ్మవారి పైనే.. చిన్నప్పటినుంచి అక్కడే పెరిగింది అనుకుంటా...
నరనరాలలో అమ్మవారి పైన భక్తే. నుదుటన కూడా కుంకుమతోనే బొట్టు పెట్టుకునేది . అమ్మ అభిషేకం చేయిపించి...
నా పెళ్లి ఎప్పుడు జరుగుతుందో చూడమని అడిగింది. ఒక్క అరగంట కూర్చోండి. ఖాళీ అయిన తర్వాత చూసి చెబుతాను అని చాలా మర్యాదగా చెప్పారు.
అమ్మ నేను మండపంలోనే కూర్చుని ఉన్నాము లహరి గుడి మొత్తం తిరుగుతూనే ఉంది. ఎవరికి ఏమీ అవసరం ఉన్నా చూస్తూ... తనకి తోచిన విధంగా సహాయం చేస్తూనే ఉంది.
నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఈ అమ్మాయికి కాళ్లు నొప్పులు రావా.. చూస్తే ఎప్పుడో లేచినట్టు ఉంది. అప్పటినుండి అలాగే తిరుగుతూ ఉంది.
ముఖంలో అలసట కనపడటం లేదు. చిరునవ్వు మాత్రమే దర్శనమిస్తుంది. ఆ చిరునవ్వు చూడడానికైనా నిత్యం గుడికి రావాలి అని అనిపించింది.
లహరి నాన్నగారు వచ్చి అమ్మ ముందు కూర్చుని జాతకం ఇమ్మని అడిగారు. నా జాతకం అంతా చూసి అబ్బాయికి కళ్యాణ ఘడియలు దగ్గరకి వచ్చేసాయి. త్వరలోనే మీ ఇంట ఆ కళ్యాణ వైభోగం జరుగుతుంది.
చాలా సంతోషం పూజారి గారు. మా అన్న కూతురినే అనుకుంటున్నాము. త్వరలోనే ముహూర్తం పెట్టుకోవడానికి వస్తాము.
మంచిది తల్లి.. అమ్మ లహరి.. అమ్మ వారి కుంకుమ, నైవేద్యం తీసుకుని రా తల్లి . అలాగే నాన్నగారు అంటూ వచ్చింది.
మా అమ్మ అడిగినది... ఆ పెద్దాయన చెప్పినది ఏది నా చెవులకి చేరలేదు. నా కళ్ళు మొత్తం లహరి ఎటు వెళితే అటే ఉన్నాయి. నా చెవులకి తన అందేల శబ్దం, గాజుల శబ్దం తప్ప మరి ఏమీ వినిపించను అని మారం చేశాయి.
ప్రసాదం తీసుకుని.. పూజారి గారికి వీడ్కోలు చెప్పి బయలుదేరాము. నా మనసు రాను రాను అని మారం చేస్తూ ఉన్న.. మళ్లీ వద్దాము అని నచ్చచెప్పి కష్టంగా కారులో కూర్చున్నాను.
అమ్మ సంతోషంగా ఏదేదో చెబుతోంది కానీ నాకు ఏమీ వినపడడం లేదు. నా మనసు మొత్తం లహరి నిండిపోయింది. ఆశ్చర్యంగా అనిపించింది.
అప్పుడే చూసి వెంటనే ప్రేమలో పడిపోయానా. నా ప్రేమను చెబితే ఒప్పుకుంటుందా.. వాళ్ళు బ్రాహ్మణులు మనం నాన్ బ్రాహ్మణులం. ఎలా...
దేవేంద్ర? లహరి ప్రయాణం...
కథ కొనసాగుతుంది..
Posts: 1,156
Threads: 1
Likes Received: 730 in 473 posts
Likes Given: 10,898
Joined: Jun 2019
Reputation:
2
Flashback started, How Shambhavi takes it, how Rudra controls the situation would be interesting.
Posts: 1,588
Threads: 2
Likes Received: 934 in 717 posts
Likes Given: 2,110
Joined: May 2019
Reputation:
10
Atlanta.. The big reveal!!
Posts: 4,804
Threads: 9
Likes Received: 3,181 in 2,464 posts
Likes Given: 11,247
Joined: Sep 2019
Reputation:
31
Posts: 898
Threads: 13
Likes Received: 7,006 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
Part - 75
నేను రోజు గుడికి వెళ్లడం మొదలు పెట్టాను లహరిని చూడడమే నా దేవి పూజ. నా దేవి పూజ ని మా అన్నయ్య కనిపెట్టేసాడు.
అది ఎలా అంకుల్.. ఎందుకు కనిపెట్టారు..గుడికి అంటే వంకలు చెప్పే నేను... ఏదో ఒక వంకతో గుడికి వెళుతూ ఉంటే... కనిపెట్టారా..
ఒకరోజు నాతోపాటు గుడికి వచ్చి లహరిని చూశాడు. లహరి పద్ధతి చూసి.. వాళ్ళ నాన్నగారిని ఆచారాలు చూసి ఒప్పుకుంటారా అని అనుమానంగా అడిగాడు.
నా ప్రయత్నం నేను చేస్తాను. చాలా రోజుల నుంచి వస్తున్నావు. ఆ అమ్మాయి నీ వైపు చూస్తున్నట్టే లేదు. లహరి దృష్టి మొత్తం అమ్మవారి మీదే ఉండేది. పూజ అయిపోయిన తర్వాత తల ఎత్తకుండా ఇంటికి వెళ్ళిపోయేది.
సంతోషంగా రోజులు వెళితే ఎవరికీ నచ్చదేమో... నా జీవితంలో అమావాస్య రోజులు మొదలవుతున్నాయి అన్నట్టుగా... మేనమామ అయిన నాగేంద్ర కుటుంబంతో సహా మా ఇంటికి వచ్చాడు.
తనకి ముగ్గురు పిల్లలు సునంద, శేషాద్రి, మయూరి. సునందకి, శేషాద్రి కి పెళ్లి అయిపోయింది. మయూరీకి నాతో పెళ్లి చెయ్యాలి అని...
ఆ విషయం గురించి మాట్లాడాలి అని వచ్చాడు. మయూరి కి కూడా నేనంటే ఇష్టమే కానీ ఎందుకో నేనే మయూరిని ఆ దృష్టితో చూడలేకపోయాను.
అప్పటికే నా మనసులో లహరి పీఠం వేసుకుని కూర్చుంది. మయూరి, సునంద అమ్మతో ప్రేమగా మాట్లాడుతూ మచ్చిక చేసుకుంటున్నారు.
మా మేనమామ భార్య అయిన లక్ష్మి అత్తయ్య మాత్రం చాలా మంచిది. దేవేంద్ర కి ఇష్టం లేకపోతే పెళ్లి చేయవద్దు అని కచ్చితంగా చెప్పేది. అమ్మతో కూడా అదే మాట చెప్పేది .
ఆడవాళ్ళకి ఎంత లేదు అనుకున్నా ఒక మెట్టు పుట్టింటి వైపు ఉంటుంది కదా.. మా అమ్మ ఆలోచన కూడా అలాగే ఉండేది.
మయూరిని చేసుకుంటే చెప్పినట్టు వింటుంది. ఇల్లు ఎప్పుడు కలిసే ఉంటుంది అని ఏవేవో ఆలోచించింది. అలాగే నా మొండి పట్టుదల కూడా మా అమ్మకి తెలుసు.
అందుకే తొందరపడి మాట ఇవ్వలేదు. దేవేంద్రకి ఇష్టమైతే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు.. వాడు ఒప్పుకుంటే నిన్ను వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని మయూరితో చెప్పింది.
ఆ మాట పుచ్చుకొని అత్తయ్య మా పెళ్ళికి ఒప్పుకుంది అని అందరితో చెప్పింది..మా నాన్నగారికి కూడా మయూరిని చేసుకోవడం ఇష్టం లేదు.
కానీ అమ్మ మాట కాదనలేక మౌనంగా ఉన్నారు. పెళ్లి మాటలు గట్టిగా మొదలయ్యేటప్పటికీ ధైర్యం చేసి లహరిని ప్రేమిస్తున్న విషయం చెప్పాను.
మా మావయ్య అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. మాట ఇచ్చి తప్పుతారా...నా కూతురు ఈ ఇంటి కోడలు అవుతుంది అని అందరికీ చెప్పుకున్నాను. ఇప్పుడు నీ కొడుకు ఇలా ప్రవర్తిస్తే ఎలా అక్క అని అమ్మ దగ్గర మొసలి కన్నీరు కార్చాడు.
ఆ కన్నీరు నిజమే అనుకుని.. మా అమ్మ ఏది ఏమైనా మయూరియే నా ఇంటి కోడలు. నువ్వు టెన్షన్ పడకు అని మాట ఇచ్చింది.
నాకు తెలియకుండా అమ్మ, మావయ్య, అత్తయ్య గుడికి వెళ్లారు. అత్తయ్య ఎంత చెబుతున్నా వినకుండా లహరి నీ, వాళ్ళ నాన్నగారిని గుడిలో అందరూ ముందు నిలబెట్టి మావయ్య ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు.
నేను ప్రేమిస్తున్న విషయం లహరికి ఏమాత్రం తెలియదు. అందుకే మావయ్య ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాక ఏడుపు ముఖంతో.. చూస్తూ..
మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు ఏమీ తెలియడం లేదు. అసలు ఎవరు మీరు..ఎందుకు నాపై ఇలాంటి నిందలు వేస్తున్నారు అని ఏడ్చింది.
శేషాద్రి భార్య అయిన జ్యోతి ద్వారా విషయం తెలిసి నేను, నాన్నగారు, అన్నయ్య వెనకాలే గుడికి వెళ్ళాము. అప్పటికే జరగాల్సిన గొడవ జరిగిపోతుంది.
నాన్నగారిని చూడగానే మావయ్య భయంతో బిగుసుకుపోయాడు. అమ్మ కూడా మౌనంగా ఉండిపోయింది.
నాన్నగారు వెంటనే లహరి వాళ్ళ నాన్నగారు చేతులు పట్టుకుని క్షమించమని అడిగారు. దైవం తప్ప తెలియని వాళ్ళకి ఇది చాలా పెద్ద అవమానం.
కాస్త గొడవ సద్దుమణిగిన తర్వాత అక్కడే అందరిముందే లహరిని నాకిచ్చి పెళ్లి చేయమని నాన్నగారు అడిగారు. ఆత్మ అభిమానం ఎక్కువ కదా అసలు ఒప్పుకోలేదు.
ఎన్నో విధాలుగా నచ్చజెప్పిన తరువాత అప్పుడు ఒప్పుకున్నారు. అది కూడా అమ్మతో చెప్పించిన తర్వాతే ...
ఆ గుడిలోనే మా పెళ్లి జరిగింది. మయూరి మాత్రం పంతం పట్టింది. నన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని... నేను కూడా ఎన్నో విధాలుగా నచ్చచెప్పాను.
నీపై నాకు ఎటువంటి ప్రేమ లేదు. నిన్న ఆ దృష్టితో ఏ రోజు చూడలేదు. రెండో భార్యగా అయినా ఉంటాను పెళ్లి చేసుకో అని సైకో లాగా ప్రవర్తించేది.
లహరి మా వదినతోను, చారుతో బాగా కలిసిపోయింది. తన నిత్య పూజకి ఇంటిలో ఎటువంటి ఆటంకం రానివ్వకుండా చూసుకునేవాళ్ళము.
ప్రపంచం లో ఉన్న కుళ్ళు కుతంత్రాలు తెలియని ఒక అందమైన పసిపాప లాంటిది లహరి.. అమ్మవారికి పూజ చేయడం. ఇంట్లో అందరికీ ఏమేమి కావాలో చూసుకోవడం. సంగీతం నాట్యం తప్ప మరో ప్రపంచం తెలియదు.
మా సంతోషానికి మరో సంతోషం కలుస్తూ లహరి నెల తప్పింది. అప్పటికే అన్నయ్య ఇద్దరూ అబ్బాయిలే.. చారుకు కూడా అదుగో వీడు పుట్టేశాడు.
అందుకే అందరూ ఈసారి ఆడపిల్ల పుట్టాలి అని ఎదురు చూశారు . అమ్మ కూడా లహరి మంచితనానికి మురిసిపోతూ కాలు కింద పెట్టనివ్వకుండా జాగ్రత్తగా చూసుకునేది.
నెలలు నిండుతున్న సమయంలో అనుకోకుండా నేను ప్రాజెక్టు విషయం బొంబాయి వెళ్లాను. వదిన చారు అమ్మ ఉన్నారు అన్న ధైర్యంతోనే వెళ్లాను. అదే నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అని తర్వాత తెలిసింది.
ప్రాజెక్ట్ ఫినిష్ చేసుకుని నేను ఉంటున్న హోటల్ కి వచ్చేటప్పటికి మయూరి భయంగా పరిగెత్తుకుంటూ వస్తూ కనిపించింది.
నాకు ఆశ్చర్యమేసింది. మయూరి ఏమిటి ఇక్కడ అని వెనకాలే వెళ్లాను. మయూరిని ఇద్దరి అబ్బాయిలు ఏడిపిస్తూ ఉంటే వాళ్ల ఇద్దరినీ నాలుగు పీకి అక్కడ ఉన్న రెస్టారెంట్లో కూర్చోబెట్టి కాఫీ ఆర్డర్ ఇచ్చాను.
ఇక్కడికి ఎలా వచ్చావు.. ఏ పని మీద వచ్చావు అని అడిగితే.. నాన్న నాకు పెళ్లి చేస్తాను అన్నారు అని తలదించుకుని చెప్పింది. మంచిదే కదా... నాకు నచ్చాలి కదా...
నీకు ఎలాంటి వాడి కావాలో చెప్పు. మావయ్యతో నేను మాట్లాడతాను. నాకు కావలసిన వాడు నాకు అందనంత దూరంలో ఉన్నాడు. వేరే వాళ్ళని నేను ఆ స్థానంలోకి తీసుకురాలేను.
అందుకే నా ఫ్రెండ్ ఇక్కడ జాబ్ చూశాను అంటే వచ్చాను. కానీ... కానీ చెప్పు అంటే.. ఇక్కడికి వచ్చాక మోసం చేశారు అని అర్థమయింది. వాళ్ల నుంచి తప్పించుకునే వెళుతూ ఉంటే... నాకు దొరికావు అంతే కదా...
చూడు మయూరి.. మన పెద్ద వాళ్ళు ఏది చెప్పినా మన మంచి కోసమే.. మీ నాన్న నీకు సరైన సంబంధమే తీసుకు వస్తాడు.
కొన్ని రోజులకి నీ భర్త మంచితనానికి నువ్వే ప్రేమించడం మొదలుపెడతావు. నా మాట విను.. నా జీవితంలో ఎవరి మాటైనా వింటాను అంటే అది నీదే దేవేంద్ర .
సరే రూమ్ తీసుకున్నావా... తీసుకోనా... నాకు ఒక్కదాన్నే ఉండాలి అంటే భయంగా ఉంది. మళ్ళీ వాళ్ళు వస్తారేమో..
మరి ఇప్పుడు ఎలా.. రేపు ఎలాగు బయలుదేరుతున్నాము కదా.. ఈ ఒక్క రాత్రికి నీ రూములోనే ఉంటాను. నా రూములోన...
నా పైన నమ్మకం లేదా... అలా అని కాదు. చూసే వాళ్ళకి బాగోదు. ఇక్కడ మనం ఎవరికీ తెలుసు దేవేంద్ర. లేకపోతే నేను ఇక్కడ క్యాబిన్లోనే కూర్చుని ఉంటాను. ఉదయమే నువ్వు వెళ్లేటప్పుడు నీతో వస్తాను.
ఎందుకో ఆడపిల్లని అలా వదలడం ఇష్టం లేక నా గదిలోకి తీసుకు వెళ్లాను. మయూరిని మంచం మీద పడుకోమని నేను బయట బాల్కనీలో పడుకున్నాను.
మయూరి కంగారుగా నా దగ్గరికి వచ్చి ఎవరో తలుపు కొడుతున్నారు. భయంగా ఉంది అంటే వెంటనే నేను చూస్తాను అని డోర్ దగ్గరికి వచ్చాను. మయూరి నా వెనకాలే నిలబడి నా షర్ట్ ని గట్టిగా పట్టుకుంది.
భయపడుతుందేమో అనుకుని ఒక చెయ్యి మయూరి చేతి మీద వేసి తలుపు తీశాను. అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ల్ని చూసి ఆశ్చర్యపోయాను.
ఏమిటి అని అడిగితే ఈ హోటల్ లో రాంగ్ పర్సన్స్ ఉన్నారు అని మాకు కాల్ వచ్చింది. మీరిద్దరూ ఎవరు.. ఏమవుతారు...
ఫ్రెండ్స్ అనే నేను చెప్పబోయే లోపు భార్యాభర్తల మని మయూరి చెప్పింది. ఓ అవునా అని వాళ్ళు వెళ్ళిపోయారు.
నేను కోపంగా ఎందుకు అలా చెప్పావు. మనం ఫ్రెండ్స్ అని చెప్పినా వాళ్లు నమ్మరు. మనల్ని కూడా తప్పుగా అనుకోని స్టేషన్ కి తీసుకువెళ్తే మావయ్య పరువు ఏమవుతుంది.
మన ఇంటి పరువు గురించి ఆలోచించి అలా చెప్పాను. ఇందులో నా స్వార్థం ఏమీ లేదు అని వెళ్లి సోఫాలో కూర్చుంది.
నాకు ఇంకా నిద్ర రాలేదు. ఆ మిగిలిన టైం అంతా జాగారమే చేసి ఉదయమే బయలుదేరి హైదరాబాద్ వచ్చేసాము.
నేను ఇంటికి వచ్చేటప్పటికి నాగేంద్ర అందరం ముందు చిందులు తొక్కుతూ ఉన్నాడు. నా భార్య కన్నీళ్ళతో చూస్తూ ఉంది. వదిన, చారు లహరి ని ఓదార్చుతున్నారు.
ఏమైంది అని నేను లహరి దగ్గరికి వెళితే... లహరి భయంగా నా చేతులు పట్టుకుని నన్ను దూరం చేయరు కదా ...
ఏమైంది ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఆరోగ్యమేమైనా బాగోలేదా అని కంగారుగా అడిగాను. ఆ మాటకి మా అమ్మ కోపంగా నీ భార్య ఆరోగ్యం బాగానే ఉంది.
కానీ మన ఇంటి పరువే... ఏమైందమ్మా.. ఇదిగో ఈ పేపర్ చూడు అని మా ఇద్దరి ఫోటోలు ఉన్న న్యూస్ పేపర్ నా ముఖం మీదకి కొట్టింది.
ఆ పేపర్లో ఉన్న న్యూస్ చూసి ఆశ్చర్యపోయాను. ఇది ఎలా వచ్చింది. అది మేము నిన్న అడగాలి.. పెళ్ళికాని ఆడపిల్లని నీ గదిలో పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది.
మయూరి మీద నీకు అంత ప్రేమ ఉంటే మీ ఇద్దరికే పెళ్లి చేసే వాళ్ళము కదా.. ఎందుకు ఈ రహస్య ప్రేమ.. అమ్మ ఆవేశంగా మాట్లాడింది.
దేవేంద్ర నిర్ణయం....
Posts: 898
Threads: 13
Likes Received: 7,006 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
Part - 76
మయూరి ని ప్రేమిచడం ఏమిటి.. ఆ న్యూస్ అంత అబద్దం.
అబద్ధం అయితే పేపర్లో ఎలా వస్తుంది. ఎందుకు నువ్వు నా కూతురి జీవితాన్ని నాశనం చేసావు అని నాగేంద్ర ఏడుస్తూ అడుగుతాడు.
ప్లీజ్ మావయ్య ఇది ఎవరో కావాలని చేసినట్టున్నారు. ఒకసారి మయూరిని అడగండి నిజం చెబుతోంది. అత్తయ్య మయూరి ఎక్కడ...
ఇక్కడ లేదు బాబు ఇంటి దగ్గరే ఉంది. పొద్దున్నే వచ్చింది. అలసటగా ఉంది పడుకుంటాను. డిస్టర్బ్ చెయ్యొద్దని చెప్పింది.
నేను వెళ్లి మయూరిని తీసుకువచ్చి నిజం చెప్పిస్తాను. అప్పుడు తెలుస్తుంది కదా..
నాన్నగారు మీరు నన్ను నమ్ముతారు కదా.. నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది. వెళ్లి తీసుకురా.. అమ్మా లహరి నీ భర్తని అనుమానించకు.
వాడికి నీ మీద ఎంత ప్రేమ ఉందో అందరికన్నా బాగా నీకే తెలుసు. లేదు మావయ్య గారు నా భర్తని అనుమానించడం లేదు కానీ ఏమీ అర్థం కాకుండా ఉంది .
పేపర్లో ఆ వార్త వచ్చింది అంటే ఇంటి పరువు ఏం అవ్వాలి దాని గురించే నా భయం అంతా...
అది మగవాళ్ళుగా మేము చక్కగా పెడతామమ్మా అని జితేంద్ర కూడా ధైర్యం చెబుతాడు.
దేవేంద్ర మయూరి కోసం ఇంటికి వెళతాడు. జ్యోతి బయట నిలబడి మయూరి తలుపు బాదుతూఉంటుంది. దేవేంద్ర కంగారుగా వెళ్లి ఏమైంది అక్క..
మయూరి కాఫీ తాగడానికి బయటకి వచ్చి న్యూస్ చూసి మళ్లీ గదిలోకి వెళ్లి తలుపు వేసుకుంది..ఏం జరుగుతుందో అని నాకు భయంగా ఉంది.
దేవేంద్ర తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళతాడు. అక్కడ మయూరి చేయి కట్ చేసుకుని కనపడుతుంది. వెంటనే మయూరిని హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు.
ఆ వార్త తెలిసి లహరి దగ్గర కౌసల్యని ఉంచి అందరూ హాస్పిటల్ కి వెళతారు.
ట్రీట్మెంట్ జరిగి మయూరి ప్రమాదం నుంచి బయట పడుతుంది. ఒక 24 గంటల హాస్పిటల్ లో ఉంచండి. తర్వాత ఇంటికి తీసుకు వెళ్ళండి అని డాక్టర్ చెప్పగానే... సరే అని దేవేంద్ర ఇంటికి వెళతాను అని బయలుదేరబోతాడు.
నాగేంద్ర వెంటనే దేవేంద్ర చేయి పట్టుకుని నువ్వు నా కూతురు దగ్గరే ఉండు. నేను ఉండడమేమిటి మావయ్య అని చిరాకుగా అంటాడు
లేదు ఈ టైం లో మేమందరం ఎలా ధైర్యం చెప్పినా నువ్వు చెప్పినట్టు కాదు. నువ్వు మనుషుల్ని బాగా హ్యాండిల్ చేస్తావు.
మళ్ళీ మయూరి ఇలాంటి పిచ్చి పని చేయకుండా చూడు. బావ నువ్వైనా చెప్పు అని రాఘవేంద్ర చేతులు పట్టుకుంటాడు.
ఒక ఆడపిల్ల ప్రాణాపాయ స్థితిలో ఉంది అని రాఘవేంద్ర కూడా దేవేంద్ర వైపు చూసి ఉండు అన్నట్టు కళ్ళ ఆర్పుతాడు.
ఇక తండ్రి మాట కాదనలేక అక్కడే ఉండిపోతాడు. దేవేంద్ర కి తోడుగా లక్ష్మీ, జ్యోతిని ఉంచి అందరూ ఇంటికి బయలుదేరుతారు.
ఇంటికి వచ్చిన అందరు మౌనంగా ఉండిపోతారు. అందరికీ చాలా బాధగా ఉంటుంది.
కౌసల్య సర్వెంట్స్ ఏమేమి వంటల్లో చెబుతూ ఉంటుంది అద్వైత్ ఆడుకుంటూ అమ్మ అని అరుస్తూ స్టెప్స్ మీద నుంచి పడిపోతాడు.
కొడుకు అరుపు విని జితేంద్ర, కౌసల్య పరిగెత్తుకుని వస్తారు. తలకి దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటుంది.
కంగారుగా కొడుకుని తీసుకొని హాస్పిటల్ కి పరిగెడతారు. విహాన్.. లహరి దగ్గర ఉండిపోతాడు.
రాఘవేంద్ర కి ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది. ఇన్కమ్ టాక్స్ రైడ్ జరుగుతుంది అర్జెంటుగా రమ్మని ఫోన్ చేస్తారు. అనసూయకి చెప్పి రాఘవేంద్ర కంగారుగా వెళతాడు.
నాగేంద్ర ఇక పావులు కదపడం మొదలు పెడతాడు మెల్లిగా అనసూయ పక్కకు చేరి అక్క నీ చిన్న కోడలకి పురుడు రాకముందే ఎన్ని అనర్ధాలు జరుగుతున్నాయో చూసావా.. ఏం మాట్లాడుతున్నావ్ రా నువ్వు.
అవునక్కా.. రేపో.. మాపో డెలివరీ అవ్వబోతుంది. పుట్టబోయే బిడ్డ పాదం మంచిది కాదు కాబట్టే కదా ఇన్ని అనర్ధాలు ఒకదాని వెంట ఒకటి వెంట వెంటనే జరుగుతున్నాయి.
ఇంకా ముందుకు వెళ్లి పెద్ద ప్రాణానికి ఏమైనా అయితే... అనసూయ భయంగా ఏం మాటలు రా.. నిజమే చెబుతున్నాను అక్క.
ముందు మన ఇంటి పరువు పేపర్లోకి వచ్చింది. దాన్ని కాపాడుకోవాలి. ఏం చేయాలి రా...
మయూరిని దేవేంద్రకి ఇచ్చి పెళ్లి చేయడమే దీనికి పరిష్కారం. అది ఎలా కుదురుతుంది. వాడికి పెళ్లయిపోయింది లహరి కడుపుతో ఉంది.
అక్క ఒకటి ఆలోచించు లహరి ఎవరికి తెలుసు... మన బంధు వర్గంలో వరకే తెలుసు కానీ మయూరి మన బిజినెస్ సర్కిల్లో కూడా అందరికీ తెలుసు.
మయూరిని దేవేంద్ర ఉంచుకున్నాడు అంటే అది మన ఇంటికి ఎంత మాయని మచ్చ. నీ పుట్టింటి పరువు గంగ పాలు అవుతున్న నీకు బాధ లేదా అని అనసూయ వీక్నెస్ మీద కొడతాడు.
దేవేంద్ర ఏ తప్పు జరగలేదు అంటున్నాడు కదా.. మయూరీకి స్పృహ వచ్చిన తర్వాత పేపర్లో స్టేట్మెంట్ ఇప్పిద్దాము.
పిచ్చి అక్క మనం ఎలా స్టేట్మెంట్ ఇప్పించిన జనం నమ్మరు. మన కుటుంబ పరువు కోసం మాత్రమే చేసాము అనుకుంటారు. ఇంక ఇప్పుడు నా కుటుంబం మొత్తం చావాల్సిందే...
అంత మాట అనకురా .. మరి నువ్వు ఒప్పుకోవడం లేదు కదా.. లహరి ఉండగా వాడికి రెండో పెళ్లి ఎలా చేస్తాము. ఒక పని చెయ్ అక్క...
లహరికి విడాకులు ఇప్పిద్దాము. ఎంత భరణం కావాలంటే అంత తీసుకోమందాము. తను అమాయకురాలు. నా కొడుకు తప్ప మరొక ప్రపంచం తెలియని పిల్ల.
అలా చేస్తే తట్టుకోలేదేమో... డబ్బు మనిషిని ఎలాగైనా ఆడిస్తుంది. రేపు పుట్టబోయే బిడ్డని మనకి ఇచ్చేయమను. మయూరి తన సొంత బిడ్డ లాగా పెంచుకుంటుంది.
ప్రపంచానికి ఏమిటి... ఆ పుట్టే బిడ్డకు కూడా మయూరినే తల్లి అన్నంతగా ప్రేమని పంచుతుంది. లహరిని ఒప్పించి ఇంకో పెళ్లి చేద్దాం ఏమంటావు.
దీనికి నేను ఒప్పుకోను అని లహరి గట్టిగా అరుస్తుంది. లహరి అరుపుకి ఉలిక్కిపడిచూస్తారు.. అనసూయ కంగారుగా దగ్గరికి వెళ్లి నువ్వు బయటికి ఎందుకు వచ్చావు.
ఏమిటి అత్తయ్య ఇది.. మీ పుట్టింటి పరువు కోసం నా జీవితాన్ని నాశనం చేయాలి అనుకుంటున్నారా.. పుట్టబోయే బిడ్డ మీద లేనిపోని నిందలు వేస్తున్నారా.. ఇది మీకు న్యాయంగా ఉందా...
నన్నే ప్రశ్నిస్తున్నావా లహరి. ప్రశ్నించడం కాదు అత్తయ్య. నా ఆవేదన చెబుతున్నాను. నాగేంద్ర లహరి దగ్గరికి వచ్చి చూడు అమ్మాయి...
నీ మీద మాకు ఎటువంటి పగలేదు. ఇన్ని రోజులు మా అక్క నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంది. ఈరోజు ఈ కుటుంబానికి ఇంత పెద్ద ఆపద వస్తే ఇంటి కోడలుగా నువ్వు కాపాడడం మానేసి ఈ సుఖాలన్నీ ఎక్కడ దూరం అవుతాయో అని బాధపడుతున్నావా...
సుఖాలు అని నవ్వి ఈ భోగభాగ్యాలు కోసం నేను వెంపర్లాడలేదు. నాకు కావాల్సింది నా భర్త మాత్రమే. మా వారు రాగానే నేనే అడుగుతాను.
మీరందరూ ఇలా చేస్తున్నారు అని కూడా చెబుతాను. శేషాద్రి వచ్చి మా అత్తయ్య నిన్ను హింసిస్తుంది. నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలి అనుకుంటుంది అని బావకి మావయ్యకి చెబుతావా...
చూసావా అత్తయ్య నువ్వు ఎంత ప్రేమగా చూసుకున్న... ఆ అమ్మాయి తన స్వార్థమే చూపిస్తుంది. ఆపద కాలంలో నిలబడడం మానేసి ఎలా మాట్లాడుతుందో చూడు.
ఈ విషయం మావయ్యకి తెలిసింది అంటే నిన్ను బ్రతకనిస్తాడా. ఇప్పుడు ఏం చేయాలి రా అని భయంగా అడుగుతుంది.
ఇదిగో చూడమ్మా.. మా అక్క నిన్నేమీ ఉత్తి చేతులతో వెళ్ళిపోమనడం లేదు. నీకు కావలసినంత డబ్బు ఇస్తాను అంటుంది.
ఇంటి పరువు పోతూ ఉంటే చూస్తూ ఉండడానికి మా అక్క నీలాగా చిన్న ఫ్యామిలీ నుంచి రాలేదు. జమిందార్లు కుటుంబం .
జమీందారులు కుటుంబం అయితే ఏమిటి.. నా స్థానంలో మీ అమ్మాయి ఉంటే ఇలాగే ప్రవర్తిస్తారా...
అనసూయ లహరి చేయి పట్టుకుని నువ్వు కంగారు పడకు. నీకు అన్యాయం జరగదు. ఏదో కుటుంబం గురించి ఆలోచించి నా తమ్ముడి ఏదేదో చెబుతూ ఉంటే డిస్టర్బ్ అయ్యాను. నువ్వు నాకు కూతురుతోనే సమానము.
ఒక తల్లిగా నిన్ను అడుగుతున్నాను.. అర్థిస్తున్నాను అనుకో.. నా ఇంటి పరువుని కాపాడు..ఇప్పుడంతా నీ చేతుల్లోనే ఉంది.
మావయ్య గారు ఈ విషయం చూసుకుంటాను అన్నారు కదా అత్తయ్య గారు. ఏం చూసుకోవడం. మీ మామయ్య గారికి ఫోన్ వచ్చి టెన్షన్ గా ఆఫీస్ కి వెళ్లారు.
పెద్దోడు ఏమో కొడుకు గురించి హాస్పిటల్ కి పరిగెత్తాడు. ఏం జరుగుతుందో ఏమిటో అని టెన్షన్ తో నా గుండె ఆగిపోయేటట్టు ఉంది.
అక్క నువ్వు కాసేపు ఊరుకో. ఇది మేము హ్యాండిల్ చేస్తాము. ఈ ఇంటి పరువు అంటే మాకు ప్రాణంతో సమానము. అది పోతూ ఉంటే మేము కుదురుగా ఉండలేము.
ఇదిగో అమ్మాయి నీకు కావాల్సినంత భరణం తీసుకో. నా అల్లుడ్ని వదిలేసి వెళ్ళిపో. అది నా కంఠంలో ప్రాణం ఉండగా జరగదు.
నీ కంఠంలో ప్రాణం తీసిఅయినా సరే ఇంటి పరువు నిలబడతాము. అనసూయ కంగారుగా ఏమంటున్నావ్ రా..
ఊరికనే అత్తయ్య...అలా భయపడితే తనే వెళ్ళిపోతుంది. నువ్వు కూడా అదే మాట మీద ఉండు. లేకపోతే మన ఇంటి పరువు...
అనసూయ కి ఇష్టం లేకపోయినా.. ఇంటి పరువు ఎక్కడ పోతుందో అన్న భయంతో నా తమ్ముడు చెప్పినట్టుగానే చేస్తాను. ఒప్పుకుంటే నీకే మంచిది లహరి అని బెదిరిస్తుంది.
మీరు ఇంత దారుణంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు అత్తయ్య...
నాగేంద్ర ఇంకా రెచ్చిపోతూ. మా అక్క చెప్పింది కదా పద అని జుట్టు పట్టుకుని బయటికి లాక్కు వెళతాడు.
అనసూయ కంగారుగా కడుపుతో ఉన్నపిల్ల...
అలా చేయకు.. అత్తయ్య నువ్వు కంగారు పడకు. నాన్న ఊరుకనే భయపడుతున్నారు అంతే.. మన మనుషులు లహరిని ఫాలో అవుతూనే ఉంటారు. తన క్షేమంగా ఇంటికి చేరింది అన్న వార్త వస్తుంది చూడు..
ఇది మొత్తం విహాన్ చూస్తూనే ఉంటాడు..
లహరి గమ్యం.....
Posts: 898
Threads: 13
Likes Received: 7,006 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
12-04-2026, 07:45 AM
(This post was last modified: 12-04-2026, 07:45 AM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
నాగేంద్ర లహరి జుట్టు పట్టుకుని స్పీడుగా తీసుకు వెళుతూ ఉంటాడు. ఒక చేతిని పొట్ట పైన పెట్టుకుని.. మరొక చేతిని తలపై వేసుకుని.. కడుపుతో ఉన్నాను అని చూడకుండా ఇంత దారుణం చేస్తున్నారు.
ఆ అమ్మవారు చూస్తూ ఊరుకోరు. ఇంతకీ ఇంత అనుభవిస్తారు. ఏమిటే నువ్వు శాపాలు పెడుతున్నావా...
ఏరోజైనా రాయి పలికిందా..
ఆరాయి ముందు నైవేద్యం చూపించి అన్నీ మనమే తింటాము కానీ ఆ రాయి వచ్చి తింటుందా ఏమిటి ? అలాంటిది మళ్లీ ఏదో చేస్తుందా అని గట్టిగా నవ్వుతాడు.
వినాశాలే విపరీత బుద్ధులు అనే ఊరికే అనరు. అనసూయ వైపు చూస్తూ.. ఇంటికి పెద్దవారు... తల్లి స్థానంలో ఉన్నవారు.. ఇంత అన్యాయం మీరే చేస్తూ ఉంటే...
ఆ తల్లి స్థానానికే కళంకం. అనసూయ ఏమీ మాట్లాడాలేక... తమ్ముడు చేసే పనిని వద్దు అనలేక.. నలిగిపోతూ ఉంటుంది.
శేషాద్రి మాత్రం నువ్వు టెన్షన్ పడకు అత్తయ్య. అలా భయపడితే లహరి మనకి లొంగుతుంది. జమిందారీ వంశంలో ఎంతమంది రెండు పెళ్లిళ్లు చేసుకోలేదు.
నాగేంద్ర బయట గేట్ బయటకు తీసుకువెళ్లి వదిలేస్తాడు. నీ అందం మీద మోజుతో నా అల్లుడు కొన్ని రోజులు నిన్ను వాడుకున్నాడు అనుకో...
ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాం ఇక్కడి నుండి వెళ్ళు.. డబ్బు డబ్బు అని ఎగురుతున్నారే.. ఒక ఆడపిల్ల మాంగల్యం కన్నా ఆ డబ్బు ఎక్కువ..
మర్యాదగా నీ పుట్టింటికి వెళితే ప్రాణాలుతో అయినా ఉంటావు. లేకపోతే ఏమి జరుగుతుందో నువ్వు ఊహించలేవు.
చంపేస్తారు అంతే కదా.. ఈ వంశాంకురాన్ని నా భర్త చేతిలో పెట్టి ప్రాణాలైనా విడిస్తాను కానీ.. ఇక్కడ నుండి మాత్రం వెళ్ళను.
కడుపుతో ఉన్నావు అని జాలి చూపిస్తూ ఉంటే మమ్మల్ని చేతగాని వాళ్ళు అనుకుంటున్నావా...
నా మనుషులకి ఒక్క సైగ చేశాను అంటే ఈ ఇంటికే నిన్ను బలి ఇస్తారు.
మీరు బలి ఇస్తాను అంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నారా..
ఏమి చేస్తావు.. నీ వెనక ఏమైనా బ్యాగ్రౌండ్ ఉంది అనుకున్నావా.. ఆఫ్టరాల్ ఒక ఆడదానివి..
ఆడది అని తక్కువ అంచనా వేస్తున్నావు. నీ కూతురు కూడా ఒక ఆడదే కదా.. ఆడదాన్ని అడ్డుపెట్టుకుని ఇంట్లోకి రావాలి అనుకుంటున్నావు.
మరి నువ్వు ఏ జాతి. నన్నే అంతమాట అంటావా అని చెంప మీద గట్టిగా కొడతాడు. ఆ దెబ్బకి లహరి కింద పడిపోతుంది.
కష్టంగా పైకి లెగుస్తూ.. ఈ దేవి నవరాత్రుల సమయంలో మీరు చేస్తున్న అరాచకానికి ఆ అమ్మవారే గట్టిగా సమాధానం చెబుతారు.
నీకు ఇంత జరుగుతున్నా బుద్ధి రావడం లేదా... ఎక్కడ మీ అమ్మవారు. పచ్చి గంగ కూడా తాగకుండా నిత్యం పూజిస్తావు కదా.. మరి ఈరోజు నిన్ను కాపాడడానికి రావడం లేదే...
నీ కర్మ పండిన రోజున.. తెలుస్తుంది. చేసిన తప్పు ఏమిటో... ఆ మాటకు వికట్టహాసంగా నవ్వుతూ.. ఎప్పుడో జరిగే దానికి ఇప్పుడు ఎదురుగుండా ఉన్న బంగారు పళ్లాన్ని వదిలేసుకోమంటావా....
నీకు ఎంత మంచిగా చెబుతున్నా అర్థం కావడం లేదు. ఒరేయ్ అని రౌడిలను పిలుస్తాడు. చెప్పండి బాస్ అని వాళ్ళు రాగానే..
బిడ్డతో సహా దీన్ని ఆ అమ్మవారికే బలి ఇచ్చేయండి. సరే బాస్ అని చెరో రెక్క పట్టుకుని లాక్కువెళుతూ ఉంటారు. లోపలికి వచ్చిన నాగేంద్ర దగ్గరికి అనసూయ వెళ్లి...
ఏరా లహరి ఏది.. మన మనుషులతో పుట్టింటికి పంపించాను. ఎలాగైతేనే ఒప్పుకుంది. పురుడు వచ్చేలోపే ఇద్దరికీ పెళ్లి చేసేయాలి..
లేకపోతే పురిటి మైలు అని ఇంకా ఏవేవో అనుకుంటూ రోజులు ముందుకు వెళ్ళిపోతాయి. మన పరువు ముఖ్యం కదా..
అవునవును అది నిజమే. రేపు రాగానే మాట్లాడతాను. లహరి క్షేమంగానే ఉంది కదా.. నన్ను నమ్ము. నాకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు కదా... ఏదో కొంచెం భయపెట్టాను అంతే...
ఇదంతా చూసిన విహాన్ మాత్రం భయంతో వణికిపోతూ.. గదిలోకి వెళ్లి ఒక మూలన దాక్కుంటాడు.
లహరి రౌడీలను బ్రతిమాలతూ ఉంటుంది. ప్లీజ్ అన్నా నన్ను వదిలేయండి. కడుపుతో ఉన్నాను. నీ చెల్లెలు లాంటి దానిని.
ఇదిగో అమ్మాయి సైలెంట్ గా ఉండు. మాకు కావాల్సింది డబ్బు. మీకు ఎంత కావాలన్నా ఇస్తాను. అయితే ఇవ్వు... వదిలేస్తాము.
ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు. నా భర్తని అడిగి ఇస్తాను. ఏమిటి వెటకారమా... లేదు నిజమే చెబుతున్నాను. నిన్ను తీసుకుని వెనక్కి వెళితే ఆ నాగేంద్ర మమ్మల్ని చంపేస్తాడు .
వెంటనే చేతికి ఉన్న గాజులు.. మెడలో ఉన్న నగలు అన్ని ఇచ్చి.. అన్న ప్రస్తుతానికి ఇవి ఉంచండి. ఆ నగలు చూడగానే రౌడీలకి ఆశపుడుతుంది.
నగలన్ని తీసుకుని కారు దిగుతారు. ఏరా ఏమి చేద్దామురా... ఒరేయ్ మనకు కావలసింది డబ్బు. ఇప్పుడు ఈ అమ్మాయిని వదిలేసాము అనుకో ఆ నాగేంద్ర మన రక్తం తాగుతాడు.
కాబట్టి సైలెంట్ గా తీసుకువెళ్లి చంపేద్దాము. అప్పుడు దాకా కాస్త ఊపిరి తీసుకోనివ్వండి. నువ్వు అన్నది కూడా నిజమే అని కారు ఎక్కుతారు.
కారులో లహరి కనిపించదు. అరె ఇప్పుడు దాకా ఉండాలి కదరా.. ఏమైంది.. అదిగో పారిపోతుంది చూడండి. మళ్లీ కారు దిగి లహరి వెనకాల పరిగెడతారు.
దగ్గరలో కనిపిస్తున్న గుడిలోకి వెళ్లి దాక్కుంటుంది. అలసిపోయి పరుగు పెట్టడం వలన ఉమ్మనీరు జారుతుంది.
నెప్పులు పడుతూ ఉంటే ఆ గుడిలో ఉన్న కొంత మంది ఆడవాళ్లు చూసి లహరి చుట్టూ చేరూతారు. ఒక ఆవిడ చెయ్యి పట్టుకుని నా బిడ్డని చంపేస్తారు. రక్షించండి అని కష్టంగా చెబుతుంది.
కంగారుపడకండి అని చుట్టూ చూస్తూ.. అమ్మ నెప్పులు పడుతున్నారు... హాస్పిటల్ తీసుకువెళదాం సాయంపట్టండి...
ఆ మహిళ... కొంతమంది ఆడవాళ్ల సహాయంతో హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. దూరం నుంచి చూసిన రౌడీలు వెంటనే నాగేంద్రకి ఫోన్ చేసి విషయం మొత్తం చెబుతారు.
వాళ్ళని నాలుగు తిట్టి హాస్పిటల్ లోనే తల్లి బిడ్డని లేపేయండి. ఆ రౌడీలు మారువేషంలో హాస్పిటల్లోకి ఎంటర్ అవుతారు.
లహరి బిడ్డని ప్రసవించి కన్నుమూస్తుంది. అప్పుడే మరొక వార్డులో ఒక తల్లి కన్న బిడ్డ కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది.
నా బిడ్డను రక్షించాలి అని డాక్టర్ తెలివిగా బిడ్డని మార్చి చనిపోయిన బిడ్డని వాళ్లకి చూపించింది.
బిడ్డ చనిపోయింది అన్న ఆనందంతో నాగేంద్ర కి కబురు అందించారు.
హాస్పిటల్లో ఉన్న నా మనసు ఎందుకో చాలా అలజడిగా అనిపించి ఇంటికివచ్చాను. నన్ను చూడగానే అమ్మ, మావయ్య చాలా కంగారు పడ్డారు.
లహరి ఏది అని అడిగితే.... వాళ్ళ నాన్నగారు వచ్చారు తీసుకువెళ్లారు అని చెప్పారు. ఈ టైంలో ఏమిటి... నీ మీద పడ్డ నిందకి చాలా బాధపడ్డారు.
కూతురు వాళ్ళ దగ్గర ఉంటే మంచిది అని తీసుకువెళ్లారు. అది నిజమేలే అనుకుని గదిలోకి వెళ్ళి పడుకున్నాను. నిద్ర రాలేదు.
పొద్దుటే ముందు లహరి దగ్గరికి వెళ్లాలి అనుకోని... ఆ కొన్ని గంటలు కరిగించాను. ఉదయం నేను రెడీ అయ్యే టైంకి అన్నయ్య హాస్పిటల్ నుంచి వచ్చాడు.
ఎక్కడికి వెళ్లావు అన్నయ్య.. జరిగింది చెప్పాడు. మరి విహాన్ ఏడి.. లహరి దగ్గరే ఉన్నాడు. రాత్రి వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది.
అమ్మ విహాన్ని ఏడి అని అడిగితే.. అప్పటికి గానీ వాళ్లకి విహాన్ గుర్తుకురాడు. అనసూయ టెన్షన్ గా ఏమోరా.. రాత్రి నుంచి నేను చూడలేదు.
ఏమిటమ్మా నువ్వు అనేది... జితేంద్ర స్పీడుగా గదిలోకి వెళతాడు. ఒక మూలన వణుకుతూ పడుకున్న కొడుకు దగ్గరికి వెళ్లి పిలుస్తాడు.
తండ్రి పిలుపుతో ఉలిక్కిపడి లేచి నాన్న అని గట్టిగా పట్టుకుని గుక్కపెట్టి ఏడుస్తాడు. భయపడ్డావా.. పిన్ని వెళితే నానమ్మ దగ్గర ఉండాలి కానీ ఒక్కడివే పడుకుంటారా...
నాన్న.. పిన్నిని వాళ్ళందరూ కొట్టారు. వెనకాలే వచ్చిన దేవేంద్ర మోకాళ్ళ మీద కూర్చుని ఏమంటున్నావురా.. అవును బాబాయి నేను చూశాను.
పిన్ని జుట్టు పట్టుకుని లాక్కుని వెళ్లారు. వెంటనే విహాన్ ని ఎత్తుకొని స్పీడ్ గా అనసూయ దగ్గరికి వెళ్లి వీడు ఏదో చెబుతున్నాడు ఏమిటమ్మా..
చిన్న పిల్లోడు వాడికి ఏం తెలుసు... మరి నీకు తెలిసింది ఏమిటి... మావయ్య లహరి జుట్టు పట్టుకుని లాక్కు వెళ్ళాడు అంటున్నాడు. నిజం చెప్పమ్మా..
టెన్షన్ తో చెమటలు పట్టేస్తాయి. అది అంటుంటే... అమ్మ నువ్వు నిజం చెప్పు. ఆఫీస్ నుంచి అలిసిపోయి వచ్చిన రాఘవేంద్ర ఏం జరిగింది అని గట్టిగా అడుగుతారు.
మీరెక్కడికి వెళ్లారు నాన్న. నిన్న సాయంత్రం ఆఫీసు నుంచి కాల్ వచ్చింది. ఏదో ఫ్రాడ్ జరిగింది అని అది వెళ్లి చెక్ చేసి సెట్ చెయ్యడానికి ఈ టైం అయింది.
ఎవరైనా కావాలని చేశారా అని.. నిజం చెప్పు అమ్మ అని దేవేంద్ర గట్టిగా అరుస్తాడు. అనసూయ టెన్షన్ గా అవేమీ నాకు తెలియదు రా..
కానీ ఇంటి పరువు పోకూడదు అని తలదించుకుంటే.. రాఘవేంద్ర కోపంగా పోకూడదని ఏం చేసావు. మయూరీ కి దేవేంద్ర తో పెళ్లి చేస్తే పోయిన పరువు వెనక్కి వస్తుంది కదా..
దాని గురించి లహరి ని ఏం చేసావు ముందు అది చెప్పు. ఏమి చేయలేదండి. తమ్ముడు కొంచెం భయపెట్టాడు. క్షేమంగా పుట్టింటికి పంపించాము.
లహరి కూడా ఒప్పుకుంది. ఇది నేను నమ్మను. ఇంకా ఏదో జరిగింది నేను వెళ్లి చూస్తాను దేవేంద్ర కంగారుగా బయటికి వెళ్ళబోతాడు.
అప్పుడే లోపలికి వస్తున్న లహరి తల్లిదండ్రులను చూసి మావయ్య గారు మీరు... రాత్రి అంతా ఒకటే పీడకలలు బాబు.
లాహరికి ఏదో అయినట్టుగా ఒకటే కలవరపాటు. అందుకే మనసు ఉండబట్ట లేక వచ్చాము. లహరి రాత్రి ఇంటికి రాలేదా.. లేదు బాబు అని కంగారుగా నా కూతురు ఎక్కడ..
అసలే నిండుచూలాలు. మీరు టెన్షన్ పడకండి మావయ్య. లహరి ఎక్కడ ఉన్నా నేను తీసుకువస్తాను అని అక్కడే ఉన్న శేషాద్రిని గట్టిగా కొడతాడు.
ప్లీజ్ బావ నన్ను కొట్టకు. లహరి ని ఏం చేశారో చెప్పండి. లేకపోతే ప్రాణాలు తీసేస్తాను...
శేషాద్రి నిజం చెబుతాడా......
|