Posts: 898
Threads: 13
Likes Received: 7,006 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
Part - 59
లోపలకి వెళ్ళగానే రుద్ర శకుంతల కాళ్ళకి నమస్కారం చేస్తాడు. ఆయుష్మాన్ భవ అని రుద్రని దీవించి ఆ పద్ధతికి మురిసిపోతూ ఉంటారు.
అత్తగారులు ఇద్దరూ అయితే కాబోయే అల్లుడు వచ్చాడని మర్యాదలు ఆపకుండా చేస్తూ ఉంటే.. రుద్ర ప్లీజ్ అత్తయ్య మీ ఇద్దరు నా దగ్గర ఇలా కూర్చుండి.
ఇప్పుడు దాకా కారులో ఏదో ఒకటి తింటూనే ఉన్నాము. అత్తగారులను విడిచిపెట్టకుండా కబుర్లు చెబుతూనే ఉంటాడు.
సులోచనకి కూడా రుద్రాన్ని చూడగానే చాలా సంతోషంగా అనిపిస్తుంది. మన పిల్లలతో పాటే సమానంగా కలిసి పోతున్నాడు. శాంభవిని చాలా బాగా చూసుకుంటాడు అన్న నమ్మకం సులోచనకి బాగా కలుగుతుంది.
రామచంద్రయ్య గారు కూడా రుద్రాన్ని చూసి మురిసిపోతూ ఉంటారు. తండ్రులు ఇద్దరు కూతురు తో మాట్లాడుతూ.. కార్లో కూర్చుని కూర్చుని అలిసిపోయావేమో తల్లి.
కాళ్లు నొప్పి పుట్టి ఉంటాయి కదా అని కాళ్ళు నొక్కుతూ ఉంటారు. అది చూసినా ధరణి, జయంతి తల కొట్టుకుంటూ.. అక్కడ అల్లుడుగారు వస్తే ఇక్కడ మీ కూతురు సేవలో ఉన్నారా అని కోప్పడతారు.
అందరూ అబ్బాయితోనే ఉన్నారు కదా.. అమ్మాయిని ఎవరూ పట్టించుకోలేదు అని మేము చూసుకుంటున్నాము. ఇందులో కూడా మీకు తప్పులు వెతుకుతున్నారా..
గయ్యమంటారు. అది చూసి రుద్ర నవ్వుకుంటూ పరవాలేదు అత్తయ్య. వాళ్ళిద్దరికీ కూతురు మీద మనకన్నా ఒక పర్సంటేజ్ ఎక్కువ ప్రేమలే.
వదిలేయండి అంటే.. సులోచన మా బాబే ఎంత బాగా అర్థం చేసుకున్నావో. మీ మామగారులని . మా భయం అంతా బెంగ అంతా నీ గురించే నమ్మ.
ఆ మాటకి శాంభవి నానమ్మ అని అరుస్తుంది. రుద్ర మాత్రం నవ్వుకుంటూ లలిత్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు.
కాసేపు కబుర్లు చెప్పుకున్న తరువాత ఫ్రెష్ అవ్వమని రుద్రకి గది చూపిస్తారు. బావమరుదులు ముగ్గురు వదలకుండా బావగారిని అంటిపెట్టుకొని మరీ మర్యాదలు చేస్తూ ఉంటే. ప్లీజ్ మీరు నన్ను ఇలా ఇబ్బంది పెట్టొద్దు.
అక్కడ కూడా ముగ్గురు బావలు ఉన్నారు. వాళ్ళు ఎలాగో మీరు అంతే. అయితే మీకు మొత్తం మేము ఆరుగురం బావ మరదలము.. బావగారు అని స్వరూప్ నవ్వుతాడు.
ఆరుగురు బావమరిదులను నేనే కదా జాగ్రత్తగా చూసుకోవాల్సింది అంటే... మమ్మల్ని ఎలా చూసుకున్న పర్వాలేదు కానీ.. మా చెల్లిని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి.
అది అసలే చిన్నపిల్ల. ప్రపంచం అంటే ఏమిటో తెలియదు అని అన్నగారులు ముగ్గురు ఎమోషనల్ అవుతూ ఉంటే.. ఎందుకు మీరు ఇంత ఎమోషన్లు అవుతారు.
శాంభవిని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. తన విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. అందుకే కదా ఎవరితోనో పంపించకుండా నేనే దగ్గర ఉండి తీసుకోవచ్చాను అని చెబితే..
థాంక్స్ బావగారు... ఈ మాట అన్నారు మాకు అదే చాలు అని హగ్ చేసుకుంటారు.. సులోచన.. ఒరేయ్ మనవళ్లు తొందరగా బావగారిని తీసుకుని రండిరా.
లేట్ అవుతుంది అని అరుస్తారు. రండి బావగారు అని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్తారు. టేబుల్ నిండా నిండిపోయిన ఫుడ్ ఐటమ్స్ చూసి గెస్ట్ ఎవరైనా వస్తున్నారా బామ్మ గారు అని అడిగితే...
అయ్యో గెస్ట్లు ఎవరూ లేరమ్మా. ఎందుకు అంటే.. నైట్ టైమ్ ఇన్ని వెరైటీస్ చేశారు కదా .. భలేవాడివి బాబు. కాబోయే అల్లుడువి.
ఈ మాత్రం చేయలేమా.. ఇంకా మీ అత్తగారికి టైం దొరకలేదు కానీ అసలు నీకు తినడానికి కూడా గ్యాప్ ఉండదు.
ఓ మై గాడ్ నేనెంత హెవీగా తినలేను. రామచంద్రయ్య గారు రుద్ర ని చూస్తూ ఊరుకో మనవడా.. నిన్ను చూస్తే గట్టిగా నాలుగు మేకపోతులను వేసేవాడు లాగా ఉన్నావు.
ఆ మాటకి నవ్వుతూ నేను జిమ్ చేస్తాను. అందుకే నా బాడీ అంత ఫీట్ గా ఉంటుంది కానీ ఫుడ్ విషయంలో నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను తాతగారు అని చెప్తే...
ఓ అవునా నీ ఎత్తు, శరీర దారుణ్యం చూసి అలా అనుకున్నాను ఏమీ అనుకోకు బాబు అంటే... మీరు ప్రతిదానికి ఇలా మొహమాటపడి నన్ను దూరం పెట్టకండి అని చెబుతాడు.
అందరూ సరదాగా నవ్వుకుంటూ భోజనం చేస్తారు. అత్తగారుల ప్రేమని కాదనలేక తన డైట్ ని పక్కన పెట్టి ఆ రోజు ఫుల్లుగా లాగించేస్తాడు.
శాంభవి కి మాత్రం వాళ్ళ నాన్నలు ఇద్దరూ దగ్గర ఉండి మరీ కొసరి కొసరి తినిపిస్తూ ఉంటే అది చూసి రుద్ర నవ్వుకుంటాడు.
ధరణి జయంతి భోజనాలు అయిన తర్వాత తాంబూలం సిద్ధం చేసి అల్లుడు దగ్గరికి వస్తారు. అమ్మో అత్తయ్య ఇంకా నా అంటే... ఇది తాంబూలం అల్లుడుగారు.ఇది వేసుకుంటే డైజెషన్ బాగుంటుంది అని చెబుతారు.
ఓ అవునా అని ఒక తాంబూలం తీసి నోట్లో వేసుకుంటాడు. అత్తగారులు ఇద్దరు ఏదో మొహమాటపడుతున్నారని.. నాతో ఏమైనా చెప్పాలా అని అడుగుతాడు.
అది బాబు అంటుంటే.. ప్లీజ్ నన్ను రుద్ర అని పిలవండి చాలు అని ఇద్దరి చేతుల్ని చోరవగా పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు.
ఇప్పుడు చెప్పండి అత్తయ్య ఏమిటి సంగతి... అది శాంభవి గురించి మాట్లాడదామని.. శాంభవి గురించి ఏం మాట్లాడాలి అత్తయ్య.
అది చిన్నపిల్ల బాబు. ఈ విషయం ఇందాకటి నుంచి అందరూ చెబుతూనే ఉన్నారు కదా అంటాడు. అది కాదు అని మీరు వచ్చినప్పుడు నుంచి అమ్మాయి అసలు మిమ్మల్ని పట్టించుకోలేదు.
వాళ్ళు నాన్నలు ఉంటే ఇంకా ప్రపంచమేమి అవసరం లేదు అని ఇబ్బందిగా చెబుతారు. ఆ విషయం నాకు తెలుసు అంటాడు.
అది తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేస్తే మనసులో పెట్టుకోకు. ఆ విషయం చెప్పడానికి మీరిద్దరూ ఇంత ఇబ్బంది పడాల అని ఇద్దరి చేతులు పట్టుకుని శాంభవి స్థానం ఇది అని తన హృదయం వైపు చూపిస్తాడు.
అక్కడ ఉన్న మనిషి గురించి నేను ఎందుకు తప్పుగా ఆలోచిస్తాను. పైగా మా మామలు ఇద్దరికీ అయితే ఇక్కడ ఎంత అపురూపమో అక్కడ వాళ్ళిద్దరూ అలాగే చూస్తున్నారు.
ఇక మా అమ్మా అయితే ఇంకా దారుణమని చెప్పి నవ్వుతాడు. నిజంగా అలాంటి కుటుంబం దొరకడం మా అమ్మాయి అదృష్టం.
ఆ మాటకి ధరణి, జయంతి ని చూస్తూ ఇలాంటి కుటుంబం దొరకడమే మా అదృష్టం అత్తయ్య. ఇంతమంది ప్రేమను పొందుతున్న శాంభవి నిజంగా చాలా అదృష్టవంతురాలు.
ఆ అదృష్టవంతురాలు నా జీవితంలోనికి వస్తుంది అంటే నేను ఇంకా ఎంత అదృష్టవంతుడిని. మీరు శాంభవి విషయంలో భయపడొద్దు.
తను ఎలా ఉన్నా.. ఎంత అల్లరి చేసిన.. నన్ను పట్టించుకున్న పట్టించుకోకపోయినా తనని ఎట్టి పరిస్థితుల్లోనూ కోప్పడును.
తెలియక చేసినవైతే ఓపిగ్గా కూర్చుని చెబుతాను సరేనా అని మాటిస్తాడు. ఆ మాటకి అత్తగారులు ఇద్దరు హమ్మయ్య అనుకుని స్థిమితపడతారు.
పొద్దున్నుంచి జర్నీ చేసి అలసిపోయి ఉంటారు కదా బాబు రెస్ట్ తీసుకోండి అని బయటకి వస్తారు. వెలిగిపోతున్న కోడళ్ల మొఖాలు చూసి సులోచన ఏమంటున్నాడు అల్లుడు బాబు... జరిగిందంతా చెబుతారు.
పోనీలే అల్లుడు బాబు అర్థం చేసుకున్నాడు. అంతకన్నా ఏమి కావాలి అని ఆవిడ కూడా సంతోషపడతారు. శివ, భాను, శాంభవి ని వదిలేసి అందరూ రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోతారు.
కూతుర్ని పడుకోబెట్టి జోలపాడి మరీ ఇద్దరు బయటకు వస్తారు. వాళ్ళని చూసి అయిపోయాయా కూతురితో ముచ్చట్లు అని కొడుకుల అడుగుతారు.
ఏంట్రా మీ గోల... వచ్చినప్పటినుంచి మీరు శాంభవిని వదలకుండా ఉంటే... మేము ఎప్పుడు శాంభవి తో టైం స్పెండ్ చేయాలి అని అడుగుతారు.
దీనికి కూడా ఇంత అలక.. పడుకుంది. రేపొద్దున మాట్లాడండి అని చెప్పి ఇద్దరూ వెళ్లిపోతారు. వెళుతున్న తండ్రులు ఇద్దరినీ చూసి వీళ్ళు ఇలాగ ఉంటే.. రేపు మన బావ పరిస్థితి ఏమిటంటావు అని బావ గది వైపు చూస్తారు.
ఆగది ప్రశాంతంగా కనిపిస్తుంది. ఒకసారి ముగ్గురు ఒకరి మొఖాలు ఒకరు చూసుకుని నవ్వుకొని పడుకోవడానికి వెళ్ళిపోతారు.
పడుకున్నా రుద్ర మాత్రం శాంభవి గురించి ఆలోచిస్తూ రాక్షసి కారు దిగిన తర్వాత ఒక్కసారి కూడా నా మొఖం చూడలేదు.
ఇంత నాన్నల పిచ్చి ఏమిటి.. రేపు పెళ్లి అయ్యాక అసలు నన్ను చేయ్యి వేయనిస్తుందా అంటావా ? ఒక్కసారి శోభనం రాత్రి ఊహించుకుంటాడు.
ఊహించుకున్నదంతా కలలా కనపడుతుఉంటే ఉలిక్కిపడి లేస్తాడు. బాబోయ్ ఇంత భయంకరంగా కలవచ్చిందేంటి.
పెళ్ళికి ముందు అనవసరంగా ఊరు తీసుకోవచ్చానా.. ఈ టైంలో నా పైన డైవర్ట్ చేసుకోవడం మానేసి... పోనీలే వాళ్ళ పేరెంట్స్ తో ఉంటుంది కదా అని తెచ్చి తప్పు చేశానా అని ఆలోచిస్తూ ఆ రాత్రి గడిపేస్తాడు.
ఆలోచిస్తూ ఎప్పటికో పడుకుంటాడు. పొద్దుటే తలుపు శబ్దానికి లేచి తలుపు తీస్తాడు. ఎదురుకుండా బావ మరదలు ముగ్గురు కనిపిస్తారు.
గుడ్ మార్నింగ్ బావ అనగానే గుడ్ మార్నింగ్ బావమరుదులు అని విష్ చేస్తాడు. ఏంటి బావ నీ కళ్ళు ఎర్రగా ఉన్నాయి.
రాత్రంతా నిద్ర లేదా అంటే.. కొత్త ప్లేస్ కదా పడుకునేటప్పటికి లేట్ అయింది అని కవర్ చేస్తాడు. అవునా.. ఫ్రెష్ అయ్యి రండి.
కాఫీ టీ ఏమన్నా పంపించమంటారా.. లేదు.. నేను అలాంటివి తాగను అని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు.
ఫ్రెష్ అయ్యి బయటకి వచ్చేటప్పటికి శ్రావ్యమైన సంగీతంతో అమ్మవారికి కీర్తన వినపడుతూ ఉంటుంది.
అది వింటూ రుద్ర కూడా వచ్చి పూజ గది ముందు నిలబడతాడు. పాట అయిన తర్వాత సులోచన హారతి ఇస్తుంది.
అది తీసుకున్నాక రామచంద్రయ్య గారు రుద్రని అడుగుతారు. మా మనవరాలు పాట ఎలా ఉంది. మా చిన్నత్త పాడినట్టుగా ఉంది అని టంగ్ స్లిప్ అవుతాడు.
అందరూ ఏమిటి అని చూస్తే.. అదే మా చిన్న మామ వైఫ్. తను కూడా ఇలాగే పాడేది. అప్పుడు మేము చాలా చిన్న పిల్లలము.
అత్తతోనే ఎక్కువగా ఉండే వాళ్ళము. అందుకే శాంభవి గొంతులో పాట వినిపించినప్పుడల్లా నాకు మా చిన్న అత్తయ్య గుర్తుకు వస్తుంది అని కవర్ చేస్తాడు.
Posts: 898
Threads: 13
Likes Received: 7,006 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
Part - 60
రుద్ర చెప్పినదానికి అందరూ కన్విన్స్ అవుతారు. పూజ అన్ని పూర్తయిన తర్వాత రండి బావగారు అని బావమరిదిలు ముగ్గురు తీసుకెళ్లి కొసరి కొసరి వడ్డిస్తారు.
ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడకండి అని చెప్పి లైట్ గా బ్రేక్ ఫాస్ట్ చేస్తాడు. మీరు మరీ తక్కువ తింటున్నారు అంటే.. మీరు ఎక్కువ పెడుతున్నారు.
అది మీకు అర్థం కావడం లేదు అని చెబుతాడు. మీకు మొహమాటం ఎక్కువ బాబు అని సులోచన అంటే.. మీరు ఇంత ఇదిగా పెట్టి ఇబ్బంది పెడుతుంటే మొహమాటం పడకుండా ఏం చేయగలమండి.
మీ మనవడితో పాటు సమానంగా చూడండి. మొహమాటం అటక ఎక్కేస్తుంది అని సరదాగా మాట్లాడుతుంటాడు.
రుద్ర మాట్లాడే విధానానికి అందరూ నవ్వుతూ మాటలు కలుపుతూ ఉంటే శాంభవి మాత్రం కళ్ళు నోరు వదిలేసి చూస్తుంది.
ఏమయింది అని ధరిణి అడిగితే.. అమ్మ రుద్ర గారు ఇంత సరదాగా మాట్లాడుతున్నారు ఏంటి అని అడుగుతుంది. నీకెందుకు వచ్చింది ఆ అనుమానం అంటే...
ఆఫీస్ లో ఎంత సీరియస్ గా ఉంటారో తెలుసా.. ఆయన షూ సౌండ్ వినేటప్పటికి అందరూ పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతారు.
తల అస్సలు పైకి ఎత్తరు. అందరికీ అంత భయం కానీ ఇక్కడ చూస్తే రివర్స్ లో ఉంది. తల మీద మొట్టి.. ఇది ఇల్లు. అది ఆఫీసు రెండింటికి తేడా లేదా అని అంటారు.
అమ్మ అని తల మీద చెయ్యి పెట్టి రుద్దుకుంటుంది. నీ తెలివి ఇలాగే ఉంటే అల్లుడు గారు ఎంత ఇబ్బంది పడతారో తెలుసా అని అంటుంది.
పో అమ్మ.. ఎప్పుడు నువ్వు నా వైపు మాట్లాడవు. ఎగురుకుంటూ వాళ్ళ నాన్నల దగ్గరికి వెళ్ళిపోతుంది. కర్మ రా బాబు దీనికి ఎంత చెప్పినా బుర్ర ఎలగదు.
బావ మరదలు ముగ్గురు రుద్రను తీసుకుని పొలం వెళతారు. అక్కడ అన్నీ చూస్తు అగ్రికల్చర్ లో ఇంకేమైనా మార్పులు చేయవచ్చుమో అని చుట్టూ చూస్తూ మధ్యాహ్నం దాకా అందరితో సరదాగా గడిపి లంచ్ చేసిన తర్వాత హైదరాబాద్ బయలుదేరుతాడు.
వెళ్లే ముందు శాంభవి నీ గదిలోకి పిలుస్తాడు. జయంతి వెళ్ళవే.. అల్లుడు బాబు ఎందుకు పిలుస్తున్నాడో ఏంటో. కొన్ని కొన్ని చూసుకోవలసినది నువ్వే అని బలవంతంగా పంపిస్తుంది.
ఎందుకు పిలిచారు అని లోపలకి వెళ్ళి అడుగుతుంది. బ్యాగ్ సర్దుకుంటున్నా రుద్ర ఒక్కసారిగా వెనక్కి తిరుగుతాడు.
లంగా వోణిలో ముద్దగా కనిపిస్తున్న మరదల్ని చూసి ఇంకా ఆగలేక నడుం పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు. ఆ చర్యకి బిగుసుకుపోయి రుద్రవైపే చూస్తోంది.
ఏమిటే మరదలు పిల్ల అని అడుగుతాడు. నేనెప్పుడూ మీకు మ.. ర.. ద.. ల..ని అయ్యాను అని ఒక్కొక్క అక్షరం కూడబలుక్కుంటూ అడుగుతుంది.
ఎప్పుడో అయ్యావులే గాని.. మొగుణ్ణి పట్టించుకోకుండా బొంగరం లాగ అటు ఇటు తిరుగుతావు ఏంటి. నిన్నటి నుంచి అసలు నీ మొగుడు ఏం చేస్తున్నాడు..ఏం తింటున్నాడు అని ఏమైనా చూస్తున్నావా.
ఒక చేత్తో నడుము పైన మీటూతు మరొక చేతి వేలుతో బుగ్గ పైన రాస్తూ ఉంటాడు. పాప ఎప్పుడో మ్యూట్లోకి వెళ్లిపోయి ఏం మాట్లాడాలో తెలియక కళ్ళు వదిలేసి చూస్తోంది.
ఏమైంది పాపకి ఏమీ మాట్లాడడం లేదు అని ఇంకా దగ్గరికి లాక్కుంటాడు. గొంతు తడారిపోయి పెదాలు అదురుతూ ఉంటాయి.
నేను అడిగినదానికి సమాధానం చెప్పవే.కారు దిగిన వెంటనే జింక పిల్లలాగా ఎగురుకుంటూ నాన్న నాన్న అని వెళ్ళిపోయావు.
ఈ వయసులో ఎవరైనా మొగుడా.. మొగుడా.. అని మొగుడు చుట్టూ తిరగాలి. నువ్వేంటి అంటే నాన్న నాన్న అని తిరుగుతున్నావు అని అడుగుతూ ఉంటాడు.
కానీ దేనికి సమాధానం చెప్పలేని పరిస్థితులో శాంభవి ఉంటుంది. అయినా సరే ఇప్పుడు వదిలితే చస్తే దొరకదు అని చెప్పి ఇంకా దగ్గరికి లాక్కుంటాడు.
ఇద్దరి పెదాలు మధ్యన ఇంచు గ్యాప్ మాత్రమే ఉంటుంది. ఒకరి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మరొకరికి వెచ్చగా తగులుతూ ఉంటాయి.
శాంభవి కనురెప్పలు బిడియంగా అల్లల్లాడుతూ ఉంటాయి. ఆ ముద్దు మొహన్ని చూసినా తర్వాత రుద్ర ఆగలేక నన్ను క్షమించు అని వెంటనే పెదవులు అందుకుంటాడు.
శాంభవి కళ్ళు మూసుకుని ఆ ముద్దు మైకంలో పడిపోతుంది. ఇద్దరికీ అదే తొలిమొద్దు. ఒక్క నిమిషం ఇద్దరి ప్రపంచం స్తంభించిపోయి ఆ ముద్దులోనే మునిగిపోతారు.
మెల్లిగా శాంభవి పెదవులను వదిలి టెంప్ట్ చేస్తున్నావే పాప ఇప్పుడు నుంచైనా నా గురించి ఆలోచించు అని మళ్ళీ బుగ్గ పైన గట్టిగా ముద్దు పెట్టి గబగబా బ్యాగ్ తీసుకొని బయటికి వస్తాడు.
శాంభవి మాత్రం అక్కడే నిలబడిపోయి అసలు ఏం జరిగింది అన్నది అర్థం కాక బిత్తరచూపులు చూస్తూ ఉంటుంది.
అందరికీ బాయ్ చెప్పే రుద్ర స్టార్ట్ అవుతాడు. ఎక్కడా కనపడిన శాంభవిని చూస్తూ పాపకి ఇప్పుడైనా బ్రెయిన్ పెరుగుతుందిలే అని నవ్వుకుంటూ కార్ ని స్పీడ్ గా ముందుకు దూకిస్తాడు.
శాంభవిఅక్కడే మంచం మీద కూర్చుండిపోయి పెదవులను చేతితో తడుముతూ ఉంటుంది.ఎంత తడిమినా ఆ పెదాల మీద చెయ్యి తీయబుద్ధి అవ్వదు.
తొలిముద్దు రుచి చూసిన తరువాత తనలోనే ఆడపిల్ల బయటకు వచ్చి సిగ్గుల మొగ్గ అవుతుంది. వెంటనే తేరుకుని ఎంత ధైర్యం ఉంటే నాకు ముద్దు పెడతాడు.
మళ్ళీ కనపడనప్పుడు గట్టిగా భయం చెప్పాలి అని పళ్ళునూరుకుంటూ తన గదిలోనికి వెళ్ళిపోతుంది. ఉబ్బిన పెదవులను అద్దంలో చూసుకుంటూ అయ్యో నాన్నల ముందుకి ఎలా వెళ్లగలను.
అమ్మలు అయితే ఏడిపించడం మొదలుపెడతారు. ఏదో ఒక వంక చెప్పి గదిలోనే ఉండిపోవాలి అని ఆ పెదవులకి కూల్ జెల్ రాస్తూ ఉంటుంది.
డ్రైవ్ చేస్తున్న రుద్రకి కూడా పెదవుల పైన ఆ రుచి పోను అంటుంది. పెదవులను నాలికతో తడి చేసుకోంటు.. అయ్యో నా ముద్దుల పాప..
ముద్దు ఇంత బాగుంటుంది అని తెలిసి ఉంటే రోజు ఎన్ని ముద్దులు లాక్కునే వాడినో.. ఆఖరి నిమిషంలో ముద్దు టేస్టు చూసాను.
మళ్ళీ వెనక్కి రాలేను.. అలాగని ముందుకు వెళ్ళలేను. వెంటనే పెళ్లి చేసుకోవాల్సిందే. అనవసరంగా నిన్ను తీసుకువచ్చి మీ ఇంటిలో వదిలాను.
నీ ఒక్క పిలుపుకి టెంప్ట్ అయిపోయాను కదా పాప అనుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు.
నైట్ కి ఇంటికి చేరుకుంటాడు. చారు ఎదురు వచ్చి ఏరా ప్రయాణం బాగా జరిగిందా అంటే.. సూపర్ అంటాడు.
కొడుకు మొఖంలో కనపడుతున్న కొత్త కళను చూసి ఏరా ఏమైంది.. మొఖం వెలిగిపోతుంది. నా కోడలు ఏమైనా గిఫ్ట్ ఇచ్చిందా అని అడుగుతారు.
మామ్ నువ్వు ఏమి టీనేజ్లో లేవు. ఆ విషయం మాకు తెలుసుగాని చెప్పొచ్చు కదరా అని గడ్డం పట్టుకుని అడిగితే.. అక్కడికి వచ్చిన సంతోష్..
ఏంటి నీ ఆత్రం ప్రతిదీ నీకు చెబుతారా నువ్వు అన్ని మీ అమ్మకి మీ నాన్నగారికి చెప్పేదానివా ఏంటి అంటే..ఆ ఛాన్స్ నాకు ఎక్కడికి ఇచ్చారు.
మీతో పెళ్లి కుదుర్చుకుని వచ్చి నీకు పెళ్లి అమ్మ. ఫలానా రోజు అని చెప్పారు. పెళ్లి పీటల మీదే కదా నేను మిమ్మల్ని చూసింది.
అందుకని ఇప్పుడు నీ కొడుకు విషయంలో నీ డ్రీమ్స్ అన్ని తీర్చుకోవాలి అనుకుంటున్నావా అంటే.. కూతురు పుట్టి ఉంటే కచ్చితంగా తీర్చుకునేదాన్ని..
కొడుకు పుట్టాడు వీడు ఒక మొద్దు అని తల మీద కొట్టి వెళ్ళిపోతుంది. వెళుతున్న తల్లి వైపు బిత్తర చూపులు చూస్తూ అసలు అమ్మ ఏమి మాట్లాడుతుంది అడుగుతాడు.
వెళ్లిన దగ్గర నుంచి ఫోన్ చేయలేదు. అక్కడ ఏం జరుగుతుందో మీ అమ్మకి తెలియదు. కోడల్ని మిస్ అయిపోతోంది.
అందుకే ఆ ఫ్రస్ట్రేషన్ అంత నీ మీద ఇలా చూపిస్తుంది అని చెబుతారు.
చారు వెనకాలే రుద్ర వెళ్లి అమ్మ అని వెనకనుంచి పట్టుకుంటాడు. పోరా అమ్మ ఇప్పుడు గుర్తొచ్చిందా.. చెప్పేది వినమ్మా అని మంచం మీద కూర్చోబెట్టి నీ కోడలు ఇప్పుడప్పుడే నీకు ఫోన్ చేయదు.
అక్కడికి వెళ్ళాక నన్నే పట్టించుకోలేదు ఇంకా మీకు ఫోన్ ఏమి చేస్తుంది అంటాడు. అదేంట్రా అంటే.. అది అంతేలే. అసలు ఆడపిల్లలకి ఇంత నాన్నల పిచ్చి ఏమిటమ్మా.. నువ్వు కూడా నాన్నగారు నాన్నగారు అని కలవరిస్తావు.
ఓకే నీది ఒక స్టేజ్ అనుకోవచ్చు కానీ నీ కోడలు ఉంది చూసావా? ఇందులో పీహెచ్డీ కాదు.. డాక్టరేట్ అన్ని దాటేసింది.
వెళ్లిన దగ్గర నుంచి ఒకటే నాన్నల జపం. భాను అంకుల్, శివ అంకుల్ కూడా కూతురి జపమే. ప్రపంచంతో సంబంధం లేదు.
రేపు ఈ నిజం తెలిస్తే వాళ్ళు ఏమైపోతారో అని ఒక పక్కన భయం చేస్తుంది కానీ శాంభవికి ఏదో ఒక రోజు మన ద్వారా మాత్రమే నిజం తెలుయాలి.
లేదు అంటే ఆ మయూరి శాంభవిని మనకి దూరం చేసిన ఆశ్చర్య పడక్కర్లేదు అని చెబుతాడు. ఆ మాటలకి కంగారుగా రుద్ర చెయ్యి పట్టుకుంటే అంత దూరం నేను రానివ్వను. నువ్వు టెన్షన్ పడకు అమ్మ.
శాంభవిది చిన్నపిల్లల మనస్తత్వం. ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తుంది. అందుకే 24 గంటలు మనలో ఎవరో ఒకరు శాంభవితోనే ఉండాలి. బయట వాళ్ళని ఎవరిని దగ్గరికి రానివ్వద్దు అని చెబుతాడు.
ఎన్ని రోజులు రా ఇలాగ అడిగితే.. తప్పదు శాంభవికి నిజం తెలిసి అందరిని యాక్సెప్ట్ చేసేదాకా జాగ్రత్తగా ఉండాలి అని చెబుతాడు.
.
తులసి కూడా వీళ్ళ మాటలు వింటూ రుద్ర చెప్పేది నిజమే చారు. శాంభవిపెళ్లి అయ్యే వరకు అక్కడ ఉంటేనే సేఫ్ గా ఉంటుంది.
ఇంతకీ మయూరి ఏం చేస్తుందో ఒక కన్నేసావ మనవడా అంటే.. ఇప్పుడిప్పుడే తన జుట్టు నా చేతిలోకి వస్తుంది. రేపు అసలు డ్రామా ఉంటుంది అని చెబుతాడు.
ఏం చేస్తున్నావురా అంటే సస్పెన్స్. బాగా అలసిపోయాను. వెళ్లి రెస్ట్ తీసుకుంటానని గదిలోకి వెళ్ళిపోతాడు.
వెళుతున్న కొడుకుని చారు అలాగే చూస్తూ ఉంటే.. ఏమయింది అని తులసి కదుపుతారు. ఏమో అత్తయ్య వీడు ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు.
అది అసలే త్రాచు పాము లాంటిది. దాని కోరలు తీసే క్యాపబిలిటీ ఉన్నవాడు నా మనవడు. నువ్వేమీ ఆలోచించకు పడుకో అని చెప్పి ఆవిడ కూడా బయటికి వెళ్లిపోతారు.
కథ కొనసాగుతుంది...
Posts: 4,804
Threads: 9
Likes Received: 3,180 in 2,463 posts
Likes Given: 11,247
Joined: Sep 2019
Reputation:
31
Posts: 1,156
Threads: 1
Likes Received: 730 in 473 posts
Likes Given: 10,887
Joined: Jun 2019
Reputation:
2
Posts: 1,572
Threads: 2
Likes Received: 919 in 705 posts
Likes Given: 2,076
Joined: May 2019
Reputation:
10
Sioper awesome.
Anni rasaalu pandincharu ee sari!!
Posts: 898
Threads: 13
Likes Received: 7,006 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
07-04-2026, 02:57 AM
(This post was last modified: 07-04-2026, 02:57 AM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
Part - 61
నిద్రపోతున్న మయూరి ఫోను రింగ్ అవుతూ ఉంటుంది. ఇంత పొద్దుట ఎవరు చేశారా అని కళ్ళు తెరవకుండానే ఫోను చేతితో వెతుకుతూ ఉంటుంది.
దొరికిన ఫోన్ ని చెవి దగ్గర పెట్టుకుని మత్తుగా హలో అంటుంది. ఏంటి మయూరి ఇంకా నిద్రపోతున్నావా అన్న వాయిస్ వినపడగానే..
నిద్రమత్తు అంతా ఎగిరిపోయి రుద్ర అని అంటుంది. పరవాలేదు ఎంత నిద్దట్లో ఉన్నా నా వాయిస్ ని బానే గుర్తు పడుతున్నావు. ఆ మాత్రం భయం ఉండాలి కదా అని వెటకారంగా అంటాడు.
అది భయం కాదు శత్రువు ఎక్కడున్నా సరే గుర్తుపట్టే కాపబిలిటీ అంటుంది. నీకు నువ్వే డబ్బా కొట్టుకుంటున్నావా..
సరే కానీ ఇంత జరిగినా నువ్వు అంత ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నావు మయూరి అని అడుగుతాడు. ఏం జరిగింది అని కనుబొమ్మలు ముడి వేస్తుంది.
అయ్యో ఇది కూడా నీకు తెలియదా.. నీ ఇంట్లో జరిగిందే నీకు తెలియకపోతే ఇంకా శత్రువుల గురించి ఏం ఆలోచించగలవు.
ఒకసారి నీ ఇంట్లో ఏం జరిగిందో అన్నది చెక్ చేసుకో.. తెలియకపోతే మళ్లీ నాకు కాల్ చెయ్. వివరంగా నీకు సినిమా చూపించినట్టుగా చూపిస్తాను. సరేనా ఉండనా మరి అని ఫోన్ పెట్టేస్తాడు.
ఫోన్ వైపు చూస్తూ ఉంటుంది. ఏం జరిగి ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటుంది. టైం చూస్తే ఇంకా ఐదున్నర చూపిస్తుంది.
ఇంత పొద్దున్నే వీడు ఫోన్ చేసి మరి ఏం చెబుతున్నాడు నాకు. అసలు ఇంట్లో ఏం జరుగుతుంది అని ఒక్కొక్కళ్ల గురించి ఆలోచిస్తూ ఉంటుంది.
అమ్మ, వదిన అంటే వీళ్ళకి పూజలు,మమ్మల్ని మార్చడం అన్న కాన్సెప్ట్ తప్ప ఏమీ లేదు. ఇక నాన్న ఎప్పుడూ వాళ్ళ పతనం ఎలాగా అని మాత్రమే ఆలోచిస్తారు.
ఇంక అన్నయ్య అంటే వీడికి అంత సీన్ లేదు. ఇంకా ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఆశ, నిషా గుర్తుకు వస్తారు.
అవును మొన్న నాలుగు రోజులు వీళ్ళు బయటికి ఎక్కడికో వెళ్లారు. ఏం జరిగి ఉంటుంది అని గబగబా లేచి బయటకు అలాగే వస్తుంది.
కూతుర్ని అలా చూసిన లక్ష్మీ గారు ఏమిటే అవతారం అంటే.. అమ్మ అవన్నీ తర్వాత.. మొన్న ఆశ బయటికి వెళ్లారు కదా... ఎక్కడికి వెళ్లారు.
పైనుంచి కిందకి చూస్తూ నువ్వు మమ్మల్ని అడుగుతున్నావా.. వాళ్లు మాకు ఏమైనా చెప్పి చేస్తున్నారా...
ఏది చెప్పిన నీకు, మీ నాన్నకే కదా అని మూతి తిప్పుతారు. అమ్మ ఇప్పుడు జోక్ చేసే టైం కాదు. అసలు వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారు.
మాకు తెలీదు అని చెబుతారు. ఇంట్లో ఇద్దరు ఆడవాళ్లు ఖాళీగా కూర్చుని ఆడపిల్లలు ఇద్దరు ఎక్కడికి వెళ్లారో కూడా తెలుసుకోకుండా ఉన్నారా అని అరుస్తుంది.
పొద్దు పొద్దున్నే అరుస్తున్న కూతుర్ని చూసి నాగేంద్ర దగ్గరకు వచ్చి ఏమయింది తల్లి అంటే... నాలుగు రోజులు ఆశ నిషా ఇంట్లో లేరు.
ఎక్కడికి వెళ్లారు అంటే వీళ్ళు తెలియదు అంటున్నారు. భార్య వైపు కోపంగా చూస్తూ మనవరాళ్ళు ఎక్కడికెళ్లారో కూడా తెలుసుకోకుండా ఉన్నారా...
బయటికి వెళుతుంటే ఎక్కడకి వెళ్లారో అని అడగొద్దా... ఒకసారి మేము అలా అడిగితేనే కదా వాళ్ళని వెనకేసుకొచ్చి మమ్మల్ని తిట్టారు.
అప్పటినుండి వాళ్ళు మాకు సమాధానం చెప్పడమే మానేశారు. ఇంకా ఇప్పుడు మాత్రం మాకు చెబుతారా.. మీరు మీరు తేల్చుకోండి అని చెప్పి లక్ష్మి కోపంగా వెళ్ళిపోతుంది.
ఆశ నిషా అని గట్టిగా అరుస్తుంది. నిద్రమత్తులో ఉన్న వాళ్ళిద్దరికీ ఏమీ వినిపించదు. ఇక కోపంగా వాళ్ళ గది దగ్గరికి వెళ్లి తలుపులు బాధేస్తుంది.
మత్తుగా కళ్ళు తెరిచిన నిషా లేచి తలుపు తీసి ఏమిట అత్తయ్య ఇంత పొద్దుటే తలుపు కొడుతున్నావు. ఆశ ఏది... ఇంకా పడుకునే ఉంది అని చెప్తే..
ఇద్దరూ కిందకి రండి అని కోపంగా వెళ్ళిపోతుంది. ఏమైందో అత్తయ్యకి.. ఇంత కోపంగా ఉంది అని ఆశను కూడా లేపి కిందకి తీసుకు వెళుతుంది. అక్కడ సోఫాలో కాళ్ళ మీద కాలేసుకుని కూర్చుని కోపంగా చూస్తూ ఉంటుంది.
ఆశ, నిషా ఇద్దరూ కళ్ళు నలుపుకుంటు కిందకి వచ్చి మయూరి ముందు నిలబడతారు. ఏమైంది తాతయ్య ఇద్దరూ అంత కోపంగా ఉన్నారు ఒకళ్లు చేతిలో ఒకళ్ళు పట్టుకొని అడుగుతారు.
మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను సూటిగా ఆన్సర్ చేయండి. అడుగు అత్త అని ఒకళ్ళు.. అలాగే పిన్ని అని ఇంకొకళ్లు ఒకేసారి చెబుతారు.
మొన్న నాలుగు రోజులు మీరిద్దరూ ఎక్కడ ఉన్నారు అని అడుగుతుంది. అంతే ఆ మాటకి ఇద్దరికీ టెన్షన్ తో చెమటలు పట్టేస్తాయి. ఏం చెప్పాలో అర్థం కాక చూస్తూ ఉంటే మిమ్మల్ని అడిగేది జవాబు చెప్పరే...
అది అది అత్తయ్య అని నాంచుతూ ఉంటే శేషాద్రి కూడా అక్కడికి వచ్చి నిలబడతారు. వీళ్లిద్దరూ ఏమి చెబుతారా అని ఫ్యామిలీ మొత్తం చుట్టూ నిలబడి చూస్తూ ఉంటే ఇద్దరూ ఒకరి మొఖాలు ఒకళ్ళు చూసుకుంటారు.
మీరిద్దరూ నా సహనాన్ని పరీక్షించకుండా నిజం చెప్పండి అని ఈసారి సోఫాలో నుంచి లేచి నిలబడుతుంది. మయూరి కోపానికి జడిచి అత్త మేము చెప్పేది కొంచెం కూల్ గా విను అని నిషా వణుకుతూ ఉంటే ఆశ కూడా సేమ్ ఎక్స్ప్రెషన్ పెడుతుంది.
సరే జరిగిందేమిటో చెప్పండి అని మళ్లీ కూర్చుంటుంది. అది అది అని తడబడుతూ ఉంటే ఇప్పటికే నా సహనాన్ని మీరిద్దరూ చాలా పరీక్ష పెడుతున్నారు. చాలా ఓపికగా మిమ్మల్ని అడుగుతున్నాను.
మెల్లిగా ఇద్దరూ మెడలో నుంచి తాళి తీసి చూపిస్తారు. అంతే ఆ తాళిని చూడగానే ఒక్కొక్కళ్ళకి ఫ్యూస్ లు ఎగిరిపోతాయి.
ఏం మాట్లాడాలో అర్థం కాక చూస్తూ ఉంటే మయూరి ఆవేశం గా ఇద్దరి దగ్గరికి వచ్చి ఇది మీ మెడలోకి ఎలా వచ్చాయి. ఎవరు కట్టారు అని అడుగుతుంది.
ప్లీజ్ అత్త ఏమి చెప్పేది కొంచెం కూల్ గా విను అని చేయి పట్టుకుని అడుగుతుంది కానీ.. లక్ష్మి కోపంగా వచ్చి ఇద్దరు చెంపలు వాయించేసి..
అసలు ఏమనుకుంటున్నారు మీరు. ఇంత పెద్ద విషయాన్ని మా దగ్గర దాచారా.. ఎవరిని అడిగి ఎవరిని పెళ్లి చేసుకున్నారు అని ఇద్దర్నీ గ్యాప్ లేకుండా కొడుతుంది.
అబ్బా గ్రాని కొట్టింది చాలు అని ఆవిడ చేతులు విసిరుగా తోసి... మేము అల్లాటప్ప వాళ్ళని పెళ్లి చేసుకోలేదు. ఆ బృందావనం ఫ్యామిలీకి శత్రువులైన వాళ్ళనే పెళ్లి చేసుకున్నాము అని అరుస్తారు.
ఆ మాటకి నాగేంద్ర అనుమానంగా చూస్తూ ఎవరిని చేసుకున్నారు అని అడుగుతాడు. మేము చేసుకుంది ఆనంద్, విహారి లను అని గొప్పగా చెబుతారు.
ఎవరు వాళ్ళు అని మయూరి అడుగుతుంది. మీకు వీళ్ళు తెలియదా అని వాళ్ల తాతగారి పేరు అని ఆలోచిస్తూ ఉంటారు.
ఎవరు వాళ్ళ తాతగారు అని అడిగితే..ఒక నిమిషం పిన్ని ఆలోచిస్తున్నాము కదా.. ఆ రోజు వాళ్లతో పాటు వాళ్ళ ప్యాలెస్ కి కూడా వెళ్ళాము.చాలా పెద్దగా ఉంది.
ఎంతమంది నౌకర్లు ఉన్నారో తెలుసా.. మన ఇల్లు వాళ్ళ ప్యాలెస్ లో ఒక మూలకి కూడా రాదు . వాళ్ల తాత గారిని చూస్తే మాకు ఎంత భయమేసిందో చాలా గంభీరంగా ఉన్నారు.
బృందావనం ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉంటే ఆయన చాలా కోపంగా ఊగిపోయారు. అబ్బా అవన్నీ తర్వాత ముందు ఆ పెద్దాయన పేరు ఏంటో చెప్పండి అని నాగేంద్ర విసుక్కుంటాడు.
తెలియదు తాతయ్య. ఎంత సేపు వాళ్లు మా తాతగారు తాతగారు అని చెబుతూ ఉంటే మేము అదే ఫాలో అయిపోయాము అని చెప్తే..
పోనీ వాళ్ళ పేరెంట్స్ అంటే.. అవును కదా వాళ్ళ పేరెంట్స్ అయితే మాకు అసలు ఎక్కడా కనపడలేదు అని చెబుతారు.
ఇంతకీ మీరు ఏ ఊరు వెళ్లారు అని అడిగితే బెంగళూరు తీసుకువెళ్లారు . మీరు వెళుతున్నప్పుడు రూట్ సరిగ్గా చూసారా అని మళ్లీ అనుమానంగా మయూరి అడుగుతుంది.
లేదు అత్త దారిలో వెళుతూ ఉంటే ఒకచోట ఫుడ్ కి ఆగాము. ఫుడ్ తిన్న తర్వాత బాగా నిద్ర ముంచుకొచ్చేసింది. మళ్ళీ మేము ప్యాలెస్ లో అడుగు పెట్టిన తర్వాతే మేలుకువ వచ్చింది.
ఆ మాటకి మయూరి గట్టిగా గాలి తీసుకుని వదిలి పోనీ వచ్చేటప్పుడైనా చూశారా అంటే.. ఇద్దరు ఒకళ్ళ మోకాళ్ళు ఒకళ్ళు చూసుకొని అప్పుడు చూడలేదు.
కారు ఎక్కిన వెంటనే మత్తుగా నిద్రపోయాము మళ్ళీ వాళ్ళ గెస్ట్ హౌస్ కి వచ్చిన తర్వాతే లేచాము. ఆ... అని అరుస్తూ చేతికి అందిన ఫ్లవర్ వాసు నేలకేసి కొడుతుంది.
ఆశ నిషా భయంతో ఒకరినొకళ్ళు గట్టిగా పట్టుకుంటారు. ఏమైంది అని నాగేంద్ర అడిగితే.. ఇదంతా రుద్ర ప్లాన్ నాన్న. మనకు తెలియకుండానే మనల్ని ఇరికించేసాడు. మీ పెళ్లయినట్టు సాక్షాలు ఏమైనా ఉన్నాయా అని ఈసారి కొంచెం భయంగానే అడుగుతుంది.
జ్యోతి కి ఏడుపు ఆగడం లేదు. హా...మా పెళ్లి అప్పుడే రిజిస్టర్ చేశారు అని చెబుతుంది. అంతే ఆ మాటకి మయూరి సోఫాలో కూలబడిపోతుంది.
జ్యోతి ఏడుస్తూ లక్ష్మీ గారిని పట్టుకొని వీళ్ళ పంతాలకి పగలకి నా కూతురు జీవితాన్ని నాశనం చేశారు. ఇప్పుడు నిషా తో పాటు ఆశా జీవితాన్ని కూడా నాశనం చేశారు. ఆశ పేరెంట్స్ కి ఏమైనా చెబుతారు అత్తయ్య.
ఏడ్చింది చాలు ఆపు వదినా అని విసుగ్గా అంటుంది. నీకే పెళ్లి పిల్లలు అన్న పాసం లేదు. పగ పగ అంటూ బతికావు. కానీ మాకు పిల్లలు అన్న బంధం ఉంది.
ఇక్కడ మీ అన్నయ్య వెన్నుముక లేని వాడు కాబట్టి.. మీరు ఎలా ఆడిన పడుతున్నాడు కానీ..అక్కడ మీ అక్క మొగుడికి నువ్వు ఏమని సమాధానం చెబుతావు.
ఆ మాటకు శేషాద్రి కోపంగా జ్యోతి అని అరుస్తాడు. నా మీద ఎందుకు అరుస్తారు. ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నాను.
పిల్లల్ని మీ పగల్లోకి లాగొద్దు అంటే నా మాట వినలేదు. ఇప్పుడు కట్టకలిసి అందరూ కూర్చొని ఏడవండి. ఇంతకీ మిమ్మల్ని చేసుకున్న వాళ్ళు ఎవరో మీకు తెలుసా.. వాళ్ళు ఫోన్లు చేసి పిలవండి అని జ్యోతి ఏడుస్తుంది.
ఫోన్ కి రెస్పాండ్ అవుతారా??
Posts: 898
Threads: 13
Likes Received: 7,006 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
Part - 62
ఆశ, నిషా ఇప్పుడే ఫోన్ చేస్తామని రూమ్ లోకి పరిగెత్తుకు వెళ్లి ఫోన్ తీసుకుని వచ్చి ఇద్దరికీ కాల్ చేస్తూఉంటారు. ఎంతసేపైనా ఫోన్ రింగ్ అవుతుంది కానీ వాళ్ళు లిఫ్ట్ చేయరు.
భయంగా మయూరి వైపు చూస్తూ ఉంటే ఏమైంది లిఫ్ట్ చేయడం లేదా.. ఇంత ఎర్లీ గా లెగరు కదా అత్త. అంత రాచకార్యాలు ఏం పొడి చేస్తున్నారు. వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసేదాకా చేస్తూనే ఉండండి అని టెన్షన్ పడుతూ ఉంటుంది.
జ్యోతి ఏడుస్తూ ఉంటే లక్ష్మీ ఊరుకోబెడుతూ ఉంటుంది. శేషాద్రికి కూడా మొదటిసారి భయం వేస్తుంది. తండ్రి చెల్లి వెంట తిరుగుతూ నాకు ఒరిగింది ఏమీ లేదు.
ఇప్పుడు నా కూతురు జీవితం కూడా ఎటు కాకుండా అయిపోయిందా ఏమిటి అని టెన్షన్ గా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు.
ఒక పది సార్లు చేసిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని మత్తుగా ఆనంద్ అంటాడు. నేను ఆశాని మాట్లాడుతున్నాను ఆనంద్..
ఏంటి బేబీ ఇంత ఎర్లీగా కాల్ చేసావు. అంత బాగా గుర్తొచ్చానా అని అడుగుతాడు. ప్లీజ్ ఆనంద్ మీరు ఎక్కడ ఉన్నా సరే అర్జెంటుగా మా ఇంటికి రండి అని చెబుతుంది.
ఏమైంది అని ఏమీ తెలియనట్టుగానే అడుగుతాడు. ముందు మీరు ఇక్కడికి రండి. తర్వాత మాట్లాడుకుందాం.. అయ్యో సోరి బేబీ..
నేను విహారి ఇద్దరము బిజినెస్ ట్రిప్ కి వెళ్ళాము ఇప్పుడు అప్పుడే రావడం కుదరదు. ప్లీజ్ ఆనంద్ మీరు ఎక్కడికి వెళ్లలేదని నాకు తెలుసు.
ఓ ఎలా తెలుసు. అవన్నీ తర్వాత.. మన పెళ్లి అయిన విషయం ఇంట్లో అందరికీ తెలిసింది. నేను, నిషా కంగారు పడుతున్నాము.
ఇద్దరిని పరిచయం చేయాలి. తొందరగా రండి. చెప్పాను కదా బేబీ.. ఒక వన్ వీక్ టైం పడుతుంది. వెయిట్ చేయండి అని కూల్ గా చెబుతాడు.
మయూరి ఆశ చేతిలో నుంచి ఫోన్ లాక్కొని ఏంట్రా నకరాలు పడుతున్నారా అంటే.. ఎవరిది కొత్త వాయిస్ అని అడుగుతాడు.
నేను ఆశ నిషా ల ఆంటీ ని మాట్లాడుతున్నాను. మీకు పేరు లేదా అని కొంచెం ఎగతాళిగా మాట్లాడుతాడు. రేయ్ నువ్వు నా ముందుకు వచ్చిన రోజున అంటే..
వచ్చిన నువ్వేమీ పీకలేవు గాని.. ఇంతకీ మీ పేరేంటి అంటే.. మయూరి అంటుంది. ఓ మయూరి అంటే నువ్వేనా...
నీ గురించి వాళ్ళిద్దరూ చాలా గొప్పగా చెప్పారు. అంత గొప్ప పనులు ఏం చేశారేంటి... ఆ మాటకి మయూరి పొగరుగా నవ్వుతూ నేను చేసిన పనులు తెలుసుకునే అంత వయసు నీకు లేదు లేరా అంటుంది.
అబ్బో ఇంటి అల్లుళ్లకి ఎలా మర్యాద ఇవ్వాలో కూడా మీకు తెలియదా... అసలు మిమ్మల్ని అల్లుడిగా నేను ఒప్పుకోవాలి కదా అంటుంది.
మరి ఒప్పుకోనప్పుడు మేమెందుకు అక్కడికి రావడం. మీరు ఒప్పుకున్నా రోజునే మేమిద్దరం వస్తాము అంతేనా విహారి అంటే.. అంతే అని పక్కనుంచి విహారి మాట కూడా వినిపిస్తుంది.
తోడుదొంగలు ఇద్దరు ఒకేచోట ఉన్నారా... ఎంత తోడుదొంగలమైన మీ అంత కాదులే మయూరి. రేయ్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే...మేము చాలా తక్కువ మాట్లాడుతున్నాము.
నాకు కోపం తెప్పిస్తున్నారు అంటే అంతకు మించి నువ్వేమీ పీకలేవులే గాని ఇంతకీ మా బేబీస్ ఇద్దరు ఏం చేస్తున్నారు..
ఒక్కసారి ఫోన్ స్పీకర్ లో పెట్టు అని అంటారు. ఎందుకు అంటే పెట్టు నీకే తెలుస్తుంది అంటే డౌట్ గా స్పీకర్ ఆన్ చేస్తుంది.
ఆనంద్ విహారి ఒకేసారి హాయ్ బేబీస్ అనగానే ఆశ నిషా ప్లీజ్ ఎక్కడున్నారండి మాకు ఇక్కడ చాలా టెన్షన్ గా ఉంది అని భయంగా అంటారు.
ఎందుకు టెన్షన్ బేబీస్. మేం వద్దామనుకున్నా మీ ఆంటీ ప్రవర్తన మాకు నచ్చలేదు. వాళ్ళు ఎప్పుడు మమ్మల్ని అల్లుళ్ళుగా ఒప్పుకుంటే అప్పుడే వస్తాము.
మీ హెల్త్ జాగ్రత్త. అసలే బాగా అలసిపోయారు కదా బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. ఆ మాటకి ఇద్దరూ భయంగా మయూరి వైపు చూస్తారు.
జ్యోతి కోపంగా వాళ్ళు ముందుకు వచ్చి అలసిపోవడం ఏమిటి.. తాళికాకుండా ఇంకా ముందుకు వెళ్లారా అంటే.. అమ్మ అది అది అని ఫస్ట్ టైం నిషా తల్లి కోపాన్ని చూస్తూ భయపడుతుంది.
చెప్పండి అని ఈసారి జ్యోతి కూడా కొడుతుంది. ప్లీజ్ అమ్మ నువ్వు కొట్టకు. మాకు ఏమీ తెలియదు అని ఇద్దరు ఏడుస్తూ ఉంటారు.
ఇద్దరు ఇలా ఏడుస్తూ బ్రతకండి. అత్తయ్య మీరు మీ పెద్దమ్మాయికి ఫోన్ చేసి రమ్మని చెప్పండి. కాస్త ఆశ జీవితమైన బాగుపడుతుందేమో..
నా మొగుడి కంటే ఎవరు సమాధానం చెప్పక్కర్లేదు కానీ మీ పెద్దల్లుడికి సమాధానం చెప్పాలి కదా..వీళ్ళు ఏం చెబుతారో నేను చూస్తాను అని గదిలోకి వెళ్లి తలుపేసుకుంటుంది.
పెద్దల్లుడు గుర్తుకు రాగానే నాగేంద్రకి కూడా కొంచెం భయంగానే అనిపిస్తుంది. పరువుకి ప్రాణం ఇస్తాడు. కూతురు విషయంలో జరిగింది తెలిస్తే తన తాటతీస్తాడు. ఇప్పుడు ఎలా అని తల పట్టుకుంటారు.
శేషాద్రి కూడా వాళ్ల నాన్న వైపు చూస్తూ నా కూతురి జీవితాన్ని పణంగా పెట్టి ఏం సాధించారు అని ఫస్ట్ టైం నోరు విప్పుతాడు. ఆ మాటకి మయూరి కోపంగా నీకు కూడా నోరు లెగుస్తుందా అని అడుగుతుంది.
ఇన్ని రోజులు నా నోరు లేగకపోవడమే నా కూతురు పాలిట శాపం అయింది. మీరు పగ అని తిరిగితే నాకు ఆస్తి కలిసి వస్తుంది అని ఊహల్లో బతికాను. అదే నేను చేసిన పెద్ద తప్పు.
ఆ రుద్ర కాళ్లు పట్టుకుని అయినా బ్రతిమాలి నా కూతురి జీవితాన్ని చక్కబెడతాను అని మొదటిసారిగా తండ్రి బాధ్యత తీసుకుంటాడు.
ఆ మాటకి మయూరి ఇప్పుడు నువ్వు వెళ్లి అడగగానే రుద్రా నీకు చెబుతాడు అనుకుంటున్నావా.. అయినా ఇదొక పెళ్లి.. మోసం చేసి చేసిన పెళ్లి చెల్లదు.
దీని మీద నేను కేసు పెడతాను. అప్పుడు వాళ్లే దారిలోకి వస్తారు. ఇంక ముయ్యి అని లక్ష్మి గారు కోపంగా అరుస్తారు.
ఎప్పుడూ నోరు ఎత్తని తల్లి అంత కోపంగా అనేటప్పటికి ఆశ్చర్యంగా తల్లి వైపు చూస్తూ నువ్వు నా మీద అరుస్తున్నావా అని అడుగుతుంది.
అరవడం కాదు. నిన్ను నాలుగు పీకాలి.. పెళ్లంటే ఆట అనుకుంటున్నావా.. కేసు పెడితే ఎవరి పరువు పోతుంది .
మీ బావ గారికి తెలిస్తే ముందు మీ నాన్న ప్రాణం తీసేస్తారు.
కేసు పెట్టడానికైనా వాళ్ళు ఎవరో పూర్తిగా తెలియాలి కదా ఏమీ తెలియకుండా కేసు పెడితే పలాన నాగేంద్ర మనవరాళ్ళు ఇద్దరు ఎవరో తెలియని వాళ్ళని పెళ్లి చేసుకున్నారు అని లోకం కోడై కూస్తోంది.
ఆ మాటకి తండ్రి కూతుర్లు ముఖాలు చూసుకుంటారు. నాగేంద్ర కూడా టెన్షన్ గా కనిపిస్తాడు. ఇంకా మయూరి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది.
మయూరి ఫోన్ రింగ్ అవుతుంటే గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. నాగేంద్ర అనుమానంగా కూతురు వైపు చూస్తాడు.
లాస్ట్ రింగకి లిఫ్ట్ చేసి హలోఅంటుంది. ఏంటి మయూరి ఇందాక వాయిస్ చాలా పొగరుగా వచ్చింది.ఇప్పుడేంటి మన్ను తిన్న పాములాగా నెమ్మదిగా వస్తుంది అంటే.. రుద్రా అని అరుస్తుంది.
ఎందుకు ఎప్పుడు చూసినా అరుస్తూనే ఉంటావు. ఒకసారి హాస్పిటల్ కి వెళ్లి హెల్త్ చెకప్ చేయించుకో... ఇంతకీ ఆ ముసలి నక్క ఏం చేస్తున్నాడు. సమ్మగా ఉందా విషయం అని నవ్వుతూ అడుగుతాడు.
ఆడపిల్లల్ని అడ్డుపెట్టుకుని ఏం సాధించాలనుకుంటున్నావ్ రుద్ర... నేను నీలాగా అనుకుంటున్నావా ... వాళ్లని నేనేమీ ట్రాప్ చేయలేదే అంటాడు. కానీ నీ మనుషులు ట్రాప్ చేశారు కదా... అది నా తప్పు కాదు కదా...
నీలాగానే పగ పగ అని ఎటు వెళుతున్నారో తెలియక అడుగులు అటు వేశారు. దానికి నేనేం చేయగలను.
వెంటనే శేషాద్రి ఫోన్ లాక్కుని ప్లీజ్ రుద్ర..
మయూరి వాళ్ళ మీద కోపంతో నా కూతురు జీవితాన్ని అన్యాయం చెయ్యొద్దు. అరే ఎవరిది శేషాద్రినా...
ఒకప్పుడు నిన్ను కూడా ఒకళ్ళు ఇలాగే వేడుకున్నట్టు ఉన్నారు. అప్పుడు ఏమైంది నీ బాధ అని కోపంగా అడుగుతాడు.
నేను చేసింది తప్పే. మా నాన్న చెల్లి కోసం ఆలోచించి ఆరోజు చాలా పెద్ద పాపమే చేశాను. దానికి శిక్ష నాకు వెయ్యి కానీ ఆడపిల్లలకి వద్దు అంటే..ఆరోజు మాత్రం నిన్ను బ్రతిమాలింది ఒక ఆడబిడ్డ కాదా..
ఆరోజు అహంకారంతో డబ్బు మీద ఉన్న మోజుతో కళ్ళు మూసుకుపోయి చేయకూడని తప్పులు చేశారు. ఈరోజు నీ దాకా వచ్చేటప్పటికి బ్రతిమాలడం మొదలు పెట్టావా...
వెంటనే మయూరి మాకు ఎవరిని బ్రతిమాలాల్సిన అవసరం లేదు. ఏమి చేయాలో నాకు బాగా తెలుసు. ఓకే ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.
శేషాద్రి కోపంగా నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా మయూరి అని అరుస్తాడు. ఏంటి నువ్వు అరుస్తున్నావు నామీద. ఎప్పుడు నా వెనకాల తిరిగే వాడివి. అలాంటిది నా మీద అరిచే అంతటి వాడివయ్యా..
జ్యోతి అన్నట్టుగా పెళ్లి, పిల్లలు అన్న పాసం లేని దానివి. నీకేం తెలుస్తుంది పిల్లల బాధ. నీ వెనకాల తిరిగాను అంటే ఆస్తి మీద మోజుతో.. నువ్వేదో తెలివైన దానివి అన్న నమ్మకంతో కానీ.. నువ్వు ఇంత మూర్ఖురాలు అని నాకు ఈ రోజే అర్థమైంది.
ఈరోజు నుంచి నేను మీకు ఏ విధంగా సహాయం చేయను. నిషా దగ్గరికి వచ్చి మీకు వాళ్ళు ఎక్కడ కలిశారు. వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలుసా అని అడుగుతాడు.
ఇద్దరూ భయంగా మాకు పబ్లో కలిశారు అని చెబుతారు. అక్కడికి మీరెందుకు వెళ్లారు. మయూరి వైపు భయంగా చూస్తూ వీకెండ్స్ రుద్రా బ్యాచ్ అక్కడికి వస్తారు.
అత్త అక్కడికి మమ్మల్ని రెగ్యులర్గా వెళ్ళమని చెప్పింది అని చెప్పి తలదించుకుంటారు. మొదటిసారి శేషాద్రి చెల్లెల వైపు అసహ్యంగా చూస్తాడు.
శేషాద్రి నిర్ణయం...
Posts: 898
Threads: 13
Likes Received: 7,006 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
Part - 63
మీ అత్త వెళ్ళమంటే వెళ్లడమేనా... నాకుగాని.. మీ అమ్మకిగాని చెప్పడం తెలీదా అని కోపంగా అడుగుతాడు. మీరు ముందే చెప్పారు కదా నాన్న.
ఏది అయినా సరే అత్తయ్య చెప్పినట్టే చేయమని. అందుకే అలా చేసాము అని నిషా చెబుతుంది. ఆ మాటకి చాచిపెట్టి చంప మీద కొట్టినట్టుగా అనిపించి గట్టిగా కళ్ళ మూసుకుని తర్వాత ఏం జరిగింది అని అడుగుతాడు.
అప్పుడే ఆనంద్, విహారి మాకు పరిచయమయ్యారు
వాళ్లు కూడా బృందావనం ఫ్యామిలీ అంటే కోపం పగ అని చెప్పారు.
పగ అంటే ఎలాంటి పగ అన్నారు. అది చెప్పలేదు..పోనీ మిమ్మల్ని అడిగారా... అడిగారు అని బుర్ర ఊపుతారు. మీరేం చెప్పారు అంటే... షార్ట్కట్లో చెప్పాము అంతే అంటారు.
తర్వాత రెండు మూడు సార్లు వాళ్ళ గెస్ట్ హౌస్ కి తీసుకువెళ్లారు. గెస్ట్ హౌస్ కి ఎందుకు వెళ్లారు అని కంగారుగా అడుగుతాడు.
వాళ్లతో పరిచయం పెంచుకుందామని అంతే... చేతులు కలిపితే బృందావనం ఫ్యామిలీని ఈజీగా నాశనం చేయవచ్చు అని చెప్పారు.
ఎలా ప్లాన్ చేసుకోవాలో అని మాట్లాడుకోవడానికి మాత్రమే గెస్ట్ హౌస్ కి వెళ్లే వాళ్ళము. అలా మాటలు మధ్యన మ్యారేజ్ ప్రపోజల్ తీసుకువచ్చారు.
అప్పుడు కూడా మేము ఓకే అని చెప్పలేదు. వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ చూసిన తర్వాతే ఓకే అందాము. వాళ్లు మనతో చేతులు కలిపితే మన బలం పెరుగుతుంది. అత్తయ్య పగ తొందరగా తీరుతుంది అని అనుకున్నాను నాన్న అని నిషా అమాయకంగా చెబుతుంది.
ఆ మాటకి శేషాద్రి చెల్లెలు వైపు కోపంగా చూస్తాడు. మయూరి మాత్రం నిషా, ఆశ వైపు ఏ భావం లేకుండా చూస్తుంది.
ఒకరోజు మాట్లాడుతుంటే సడన్గా వాళ్ళ తాతగారు ఫోన్ చేసి మాట్లాడారు. కంగారుగా మా దగ్గరికి వచ్చి తాతగారికి చెప్పాము. మిమ్మల్ని తీసుకురమ్మన్నారు.
ఇంట్లో చెప్తాము అంటే..ముందే చెబితే మీరు ఒప్పుకోరు. వెళ్ళొచ్చాక చెబుదాం అని మమ్మల్ని కన్విన్స్ చేసి వాళ్ళ ఊరు తీసుకువెళ్లారు.
దారి మధ్యలో అంతా పడుకునేఉన్నాము. మెలకువ వచ్చేటప్పటికి వాళ్ళ ప్యాలెస్ లో ఉన్నాము. అది చాలా పెద్ద ప్యాలస్ నాన్న.
ఇప్పటిదాకా మేము అలాంటి ప్యాలెస్ చూడలేదు. వాళ్ళ తాతగారు కూడా చాలా గంభీరంగా ఉన్నారు. ఆయన మాట్లాడుతుంటే మాకు చాలా భయమేసింది.
ఆనంద్, విహారి కూడా నాలుగడుగుల దూరంలో చేతులు కట్టుకునే మాట్లాడారు. ఎందుకు మీరు అంత భయపడుతున్నారు అంటే.. తాత గారికి కోపం ఎక్కువ.
ఆ బృందావనం ఫ్యామిలీ పతనం అయ్యేదాకా ఆయన అలాగే ఉంటారు అని మాకు చెప్పారు. అదంతా మేము నిజమే అనుకున్నాము.
సడన్గా ఆయన పిలిచి మీ నలుగురికి పెళ్లి అని చెప్పారు. ఏం మాట్లాడాలో కూడా మాకు అర్థం కాలేదు. మేము తేరుకునేలోపే.. సర్వెంట్స్ మమ్మల్ని రెడీ చేసి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టి పెళ్లిళ్లు చేసేసి రిజిస్ట్రేషన్ చేయించేశారు అని భయంగా చెబుతారు.
అదంతా విన్న మయూరికి అయితే మొత్తం సినిమా అర్థం అవుతుంది. ఇదంతా రుద్రా ప్లాన్. చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి ఇరికించేసాడు. దీనివల్ల ఇప్పుడు రుద్రకు వచ్చే ఉపయోగం ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటుంది.
శేషాద్రి మాత్రం కూతురుతో ఆ గెస్ట్ హౌస్ ఎక్కడో మీకు తెలుసా.. నాకు చూపిస్తారా అంటే హా నాన్న అంటుంది. ముందు మీరిద్దరూ వెళ్లి ఫ్రెష్ అయ్యిరండి.
గదిలోనికి పంపించి తండ్రి, చెల్లి వైపు చూసి.. దయచేసి మీరిద్దరూ ఇంకా పిల్లలు ఇద్దరు జీవితంలోకి రాకండి. బావ గారికి ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి మీరు. విసురుగా లోపలికి వెళ్ళిపోతాడు.
గదిలో ఏడుస్తున్న జ్యోతిని చూసి బాధగా పక్కకు వెళ్లి కూర్చుని జ్యోతి అని పిలుస్తాడు. ఆ పిలుపుకి జ్యోతి చాలా కోపంగా చూస్తుంది. తలదించుకుంటాడు.
ఇప్పుడు తలదించుకుని ఏమి ఉపయోగం. ముందు నుంచి చెబుతూనే ఉన్నాను. మీ పగల మధ్యలోకి పిల్లలని లాగకండి. వాళ్ళకి ఏమీ తెలియదు.
నా మాట ఎప్పుడూ వినలేదు. నా చెల్లి చెప్పింది రైట్ అన్నారు. ఇప్పుడు ఏం జరిగింది. నేను ఇంటిలో ఇంకొక నిమిషం కూడా ఉండను.
నా కూతుర్ని తీసుకుని నేను వెళ్ళిపోతాను అని ఏడుస్తుంది. ప్లీజ్ జ్యోతి ఇప్పుడు దాకా నావల్ల జరిగిన తప్పులు చాలు. ఇప్పుడైనా నా కూతురి జీవితాన్ని నేను చెక్కబెడతాను.
నువ్వు కంగారు పడకు. మీరు ఇప్పటినుంచి మీ చెల్లి, నాన్న చెప్పింది వినడం మానేస్తాను అంటేనే ఇక్కడ ఉంటాను. లేకపోతే నేను వెళ్ళిపోతాను అని కరాకండిగా చెప్పేస్తుంది.
లేదు.. లేదు... నీకు మాటిస్తున్నాను. వాళ్ళిద్దరి మాట ఇంక నేను వినను అని చేతులు పట్టుకుంటాడు. హాల్లో కూర్చున్న నాగేంద్ర తల పట్టుకుంటాడు.
ఏంటి మయూరి ఇలా జరిగింది. పిల్లలను అడ్డుపెట్టుకుని అయినా వాడిని సాధించాలి అనుకున్నాము కానీ.ఇలా రివర్స్ అవుతుందనుకోలేదు.
ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతాడు. మయూరి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. వాళ్ళ అన్నయ్య, వదిన అన్నమాటలు గుర్తుకు వస్తూఉంటాయి.
పెళ్లి, పిల్లలు ఏ పాసం లేని దానివి అని అన్న మాటలే తిరుగుతూ ఉంటే గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. వీళ్ళిద్దరూ డిస్కషన్ విన్న లక్ష్మీ గారు ఇంత జరిగినా మీకు ఇంకా సిగ్గు రాలేదా...
ఇంకా వాళ్ళ పతనం చూస్తున్నారు కానీ.. మన ఇంటిలో పతనం మొదలైంది. ముందు దాన్ని ఎలా సరిదిద్దాలో ఆలోచించండి సిగ్గులేని జన్మ అని తిట్టి వెళ్ళిపోతారు.
ఎప్పుడు నోరు ఎత్తని పెళ్ళాం అలా మాట్లాడేటప్పుటికీ నాగేంద్రకి బుర్ర గిర్రుని తిరుగుతుంది. వామ్మో నా పెళ్ళామే ఇంత ఎత్తును లెగిస్తే... ఇప్పుడు అల్లుడుగారు వచ్చారు అంటే ఇక నా పని ఏమిటో అని టెన్షన్ తో చెమటలు తుడుచుకుంటాడు.
వీటితో ఏ సంబంధం లేకుండా మయూరి మౌనంగా ఉండి పోతుంది. ఆశ, నిషా ఇద్దరూ రెడీ అయ్యి వస్తారు. వాళ్ళిద్దర్నీ తీసుకుని శేషాద్రి బయటకి వెళ్ళిపోతాడు.
అక్కడే కూర్చున్న తండ్రి కూతుర్లని మాత్రం పట్టించుకోడు. అది నాగేంద్రకి చాలా కోపం వస్తుంది.కానీ ఏమీ చేయలేక చూస్తూ ఉంటాడు.
కొడుకు చేయి జారిపోతున్నాడా అని మొదటిసారి కొడుకు వైపు నుంచి ఆలోచిస్తాడు.
ఎప్పుడూ కలిసే గెస్ట్ హౌస్ కి తీసుకువెళతారు. ఇదేనా అని అడిగితే అవును మావయ్య అని ఆశ చెబుతుంది. ఇద్దరు వైపు చూసి గేటు దగ్గరకు వెళ్లి వాచ్మెన్ ని పిలుస్తాడు.
అతను బయటికి వచ్చి ఏం కావాలి సార్ అంటే.. ఆనంద్, విహారి లను కలవాలి. అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు అని చెబుతాడు.
ఆశ, నిషా స్పీడ్ గా వచ్చి అదేంటి మేము ఇక్కడ చాలా సార్లు కలిసాము కదా.. అయినా నువ్వు వున్నావ్ ఏంటి.. ఇక్కడ వేరే వాచ్మెన్ కదా ఉండాల్సింది..
మేడమ్ మీరు ఎవర్ని చూసి ఎవరు అనుకుంటున్నారు. ఎప్పుడు నుంచో నేను ఇక్కడే పని చేస్తున్నాను. మిమ్మల్ని నేను ఎప్పుడూ చూడలేదు వెళ్ళండి వెళ్ళండి అని కసురుకుంటాడు.
శేషాద్రి కి పూర్తిగా సినిమా అర్థం అయిపోతుంది.వాళ్ళని పట్టుకోవాలి అంటే రుద్ర చెప్పినట్టు వినాలి.రుద్ర ఏదో ఆలోచన చేసే ఇరికించాడు.
అదేంటో తెలుసుకోవాలి అని వెంటనే నేను రుద్రుని కలవాలి అనే అంటాడు. రుద్రను కలవడం అంటే మనకు అపాయింట్మెంట్ ఇస్తాడా అని ఇద్దరు అనుమానంగా చూసుకుంటారు.
ఆశ నిషా ఏమనుకుంటున్నారో అర్థమయ్యి.. పర్వాలేదు.. వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్లి నేను ట్రై చేస్తాను. మీరిద్దరూ ఇంటికి వెళ్ళిపోండి అని పిల్లలు ఇద్దరినీ పంపించి శేషాద్రి జి. బి. సొల్యూషన్స్ దగ్గరికి వెళతాడు.
ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎప్పటికప్పుడు రుద్రాకీ చేరిపోతూనే ఉంటుంది. రా... శేషాద్రి.. నీకు ఇప్పుడు చుక్కలు చూపించకపోతే నేను రుద్ర దేవాన్ష్ గజపతినే కాదు...
మా అత్త కార్చిన కన్నీటి బొట్టుకు నీ కుటుంబం మొత్తంతో రక్త కన్నీరు కార్పించకపోతే... మా చిన్న మామ కన్నీటికి అర్థమే ఉండదు అని కోపంగా అనుకుంటాడు.
శేషాద్రి మెయిన్ గేటు దగ్గరికి రాగానే సెక్యూరిటీ ఆపేస్తారు. నేనెవరో తెలుసా అని శేషాద్రి కోపంగా అంటే... మీరు ఎవరైనా సరే పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్లడానికి లేదు.
మీరు ఇందులో స్టాఫ్ అయినా ఉండాలి లేదు అంటే పర్మిషన్ అయినా ఉండాలి అని క్లియర్ గా చెప్పి లోపలికి వెళ్ళనివ్వరు. ఎలా వెళ్లాలో అర్థం కాక అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు.
రుద్ర ఎప్పుడు బయటకు వస్తాడో అప్పుడే క్యాచ్ చేయాలి అని గేటు దగ్గరే పడిగాపులు కాస్తూ ఉంటాడు. ఈ పెళ్లితో మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెబుదామా అంటే.. వాళ్ల దగ్గర పక్కా సాక్షాదారాలు ఉన్నాయి.
అవి పట్టుకుని వాళ్ళు ఎక్కడైనా కేసు ఫైల్ చేసిన.. లేకపోతే సోషల్ చానల్స్ లో రిలీజ్ చేసిన పరువుపోతుంది.
పిల్లలు ఇంకా ముందుకు వెళ్లారా అంటే అది తెలియడం లేదు. ఎలా అని బుర్ర బద్దలుకొట్టుకుంటూ ఉంటాడు.
ఇదంతా లైవ్ చూస్తున్న రుద్రకి మాత్రం మహదానందంగా ఉంటుంది.
వెలిగిపోతున్న రుద్ర ముఖాన్ని చూసి బావ మరదలు ముగ్గురు ఏమైంది బావ అంత ఉత్సాహంగా ఉన్నావు...
మెయిన్ గేట్ కనిపిస్తున్న సిసివైపు చూపిస్తాడు.
అక్కడ శేషాద్రిని చూసి వీడేంటి ఇక్కడ ఉన్నాడు అని అనుమానంగా అడుగుతారు. ఏదో చాలా టెన్షన్ పడుతున్నాడు.
నన్ను కలవడానికి అని కూల్ గా చెబుతాడు. నిన్ను కలవాల్సిన అవసరం ఏముంది. కూతురు,మేనకోడలు భవిష్యత్తు ఏమిటో అర్థం కాక అని చైర్ లో తిరుగుతూ చెబుతాడు.
నువ్వు ముక్కలు ముక్కలుగా చెబితే మాకు ఒక్క ముక్క కూడా అర్థం కావడం లేదు. అసలు ఏం జరిగిందో చెప్పు బావా అని ధీరజ్ ఒళ్లో కూర్చుని అడుగుతాడు.
ఒక తోపు తోస్తాడు. కింద పడి బావ నువ్వు నన్ను తోసావు. తోయక ముద్దు పెట్టుకోవాలా.. లవర్ లాగా వచ్చి ఓళ్లో కూర్చుంటున్నావు.
మా చెల్లి లేక నీకు అలకలు ఎక్కువైనాయి... అబ్బో తీర్చడానికి ఆరుగురు బావమరుదులు ఉన్నారుగా అందుకే అలుగుతున్నాను అంటాడు.
ఇంతకీ వాడు గేటు దగ్గర కాపలా ఎందుకు కాస్తున్నాడు అది చెప్పలేదు అంటాడు.
రుద్ర సమాధానం ఏమిటి..
కథ కొనసాగుతుంది..
Posts: 4,804
Threads: 9
Likes Received: 3,180 in 2,463 posts
Likes Given: 11,247
Joined: Sep 2019
Reputation:
31
Posts: 1,156
Threads: 1
Likes Received: 730 in 473 posts
Likes Given: 10,887
Joined: Jun 2019
Reputation:
2
Reverse action started... Good game by Rudra
Posts: 1,572
Threads: 2
Likes Received: 919 in 705 posts
Likes Given: 2,076
Joined: May 2019
Reputation:
10
After a loooooooong time story mainline ki vachindi.
Posts: 898
Threads: 13
Likes Received: 7,006 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
Part - 64
ఆ శేషాద్రి బయట ఎందుకు వెయిట్ చేస్తున్నాడో నువ్వు చెప్పలేదు బావ. తెలుసుకొని ఏం చేస్తారు రా. అయ్యో నీ ఆనందంలో మేము పాలుపంచుకుంటాము చెప్పు బావ అని ముగ్గురు గోకుతూ ఉంటారు.
ఛీ వదలండి రా అని విసుక్కుని అప్పుడు దాకా జరిగిందంతా చెబుతాడు. ఏంటి బావ మాకు తెలియకుండా నువ్వు ఇంత చేసావా. ఒక్క ముక్క కూడా చెప్పలేదు.
చెప్పి చేస్తే.. మీ ఫేసుల్లో షాకింగ్ ఎక్స్ప్రెషన్ మిస్ అయిపోతానని అంటాడు. పో బావ మాకు తెలిస్తే బాగుండేది కదా. మేము ఎంజాయ్ చేసే వాళ్ళము. మంచి ఛాన్స్ మిస్ అయిపోయింది.
ఏమి మిస్ అవ్వలేదు. ఇప్పుడు చూడు మొత్తం మయూరి ఫ్యామిలీ మొత్తం మందు తిన్న పాముల్లాగా బజ్జోవాల్సిందే అంటాడు.
ఎప్పటిదాకా.. మా పెళ్లి అయ్యేదాకా అంటాడు. అప్పుడు దాకా మయూరి ఆగుతుందా.. అందుకే కదా వాడిని ఇలా కుక్కలాగా తిప్పిస్తున్నాను.
నాలుగు రోజులు వెయిట్ చేపించి అప్పుడు నా అపాయింట్మెంట్ ఇస్తాను. బావ అప్పుడు మాత్రం మమ్మల్ని మిస్ చేయకే. నీతోనే ఉంటాము.
ఒరేయ్ ఇలా మీ చెల్లి అడిగి ఉంటే ఎంత బాగుండేదో.. ఆ తింగరదానికి ఎంతసేపు నాన్న నాన్న అనడమే సరిపోతుంది. మీరేమో బావ అని నా వెనకాల తిరుగుతున్నారు ఇడియట్స్ అంటాడు.
శేషాద్రి సాయంత్రం దాకా మెయిన్ గేటు దగ్గరే పడిగాపులు కాస్తాడు. ఆకలి కేకలు వేస్తున్నా సరే పక్కకి వెళితే ఎక్కడ రుద్ర మిస్ అయిపోతాడో అని వాచ్మెన్ డ్యూటీ కన్నా దారుణంగా కూర్చుంటాడు.
శాంభవి ఏం చేస్తుందో చూడాలి అని రుద్ర వీడియో కాల్ చేస్తాడు. ఆ ఫోన్ కి పాప ఎక్కడ స్పందించకపోతే ఇక్కడ బావగారికి కోపం వచ్చి నా ఫోను కూడా తీయనంత బిజీగా ఉన్నావా? అనవసరంగా ఊరు పంపించి తప్పు చేశాను.
వెంటనే బావమరిది కి ఫోన్ చేస్తాడు. లలిత్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి బావగారు. ఏం చెప్పాలి బామ్మర్ది.. మీ చెల్లి ఎక్కడ...నాన్నతో కలిసి పొలం వెళ్ళినట్టు ఉంది అంటాడు.
ఎప్పుడు వస్తుంది. ఏదైనా ఇంపార్టెంట్ ఆ.. బావగారు.. నేను ఫోన్ చేయిపించిన.. ముందు ఆ పని చెయ్. అరే కాబోయే మొగుడు ఎలా ఉన్నాడో.. ఏమిటో ఒక ఫోన్ చేద్దామా అన్నది కూడా లేకుండా ఊర్లో కూర్చుంది.
ఆ మాటకి లలిత్ నవ్వుతూ బావగారు అలిగారా అంటాడు. మేము అలిగిన మీ చెల్లికి ఫరక్ పడదలే అంటాడు.
నేను ఇంటికి వెళుతున్నాను. వెళ్ళగానే ఫోన్ చేయిపిస్తాను అని లలిత్.. స్వరూప్ చెప్పి ఇంటికి బయలుదేరతాడు.
లలిత్ ఇంటికి వచ్చేటప్పటికి శివగారు, భానుగారు మధ్యలో కూర్చుని వాళ్ళు తినిపిస్తూ ఉంటే తింటూ కబుర్లు చెబుతూ ఉంటుంది.
లలిత్ తల కొట్టుకుంటూ అక్కడికి వచ్చి కూర్చుని నాన్న అని పిలుస్తాడు. ఏంట్రా కాలేజీ నుంచి వచ్చేసారు. అప్పుడే మీ వర్క్ అయిపోయిందా..
ఒక్కరోజు మన కాలేజ్ నుంచి మేము పక్కకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కానీ.. నువ్వేంటి శాంభవి ఇంకా చిన్నపిల్లలాగా నాన్నలు తినిపిస్తుంటే తింటున్నావు అంటాడు.
పో అన్నయ్య నీకు నన్ను చూస్తుంటే జలస్ కదా అంటుంది. అదే అనుకుంటున్నాము.. ఏరా ఈ టైం లో వచ్చావు. శాంభవి గురించి అంటాడు.
నా గురించా.. ఎందుకు అన్నయ్య. బావగారు నీకు ఫోన్ చేస్తున్నారు అంట. నువ్వు లిఫ్ట్ చేయట్లేదని కంగారు వచ్చి నాకు ఫోన్ చేశారు.
నువ్వు బాగానే ఉన్నావు అని చెప్పాను కానీ నిన్నే ఫోన్ చేయమన్నారు అంటాడు. అవునా.. ఇంత సడన్గా ఎందుకు అబ్బా అంటుంది.
ఆ మాటకి ధరణి తల మీద కొట్టి కాబోయే మొగుడు ఫోన్ చేస్తే ఎందుకు చేశారో అని అడుగుతావేంటి. వెళ్లి చూడు. తల మీద కొట్టిందని భాను గారు కోపంగా భార్యని చూస్తారు.
ఏంటా చూపు అని అడుగుతుంది. చూడడం కూడా తప్పేనా.. మీరు ఇలా గారభం చేయబట్టే అది ఫోన్ ఎందుకు చేశారా అని ఆలోచిస్తుంది.
మన టైం లోనే బెటర్ కదా అంటే అది నిజమేలే అని ఆలోచిస్తూఉంటాడు. శాంభవి గదిలోకి వెళ్లి ఫోన్ చూస్తుంది.
అప్పటికే రుద్ర నుంచి చాలా మిస్డ్ కాల్స్ ఉంటాయి.. ఎందుకు ఇంత కంగారు పడుతున్నారని వీడియో కాల్ చేస్తుంది.
లిఫ్ట్ చేసి మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటాడు. ఏమైంది. ఎందుకు అన్ని సార్లు ఫోన్ చేశారు అని అడుగుతుంది.అయినా ఏమీ మాట్లాడడు.
అలాగే కోపంగా చూస్తూ ఉంటే మీ చూపు ఎందుకు తేడాగా ఉంది. మీ కళ్ళు ఎందుకు అంత ఎర్రగా ఉన్నాయి. నిద్ర లేదా అని అడుగుతుంది.
ఉఫ్.. అనుకుని నా చూపు తేడాగా ఉంది అంటే దాని అర్థం ఏమిటి అంటాడు. నాకెలా తెలుస్తుంది మీ చూపు గురించి.
నాకు ఒక డౌట్ పాప అంటాడు. ఇదిగో మళ్ళీ పాప అంటే.. నిన్ను పాప అనకుండా అమ్మాయి అని కూడా అనలేకపోతున్నాను.
అంత చిన్న పాపని అయితే పెళ్ళెందుకు చేసుకుంటున్నారు అని అలకగా అంటుంది. కదా.. నాకు అదే అనుమానం వస్తుంది.
ఇప్పుడు అంత అనుమానం ఎందుకు వచ్చింది అని కోపంగా అడుగుతుంది. అరే ఇప్పుడు నీ చూపు ఎందుకు తేడాగా ఉంది అని అడుగుతాడు.
నాకు కోపం వచ్చింది అంటుంది. మరి ఇక్కడ మాకు అంతే అంటాడు. అవునా మీకెందుకు కోపం వచ్చింది. ఎవరేమన్నారు అని అడుగుతుంది.
పాప నీ బుర్ర ఎక్కడ పెట్టుకుని మాట్లాడతావు చెప్పు అని నీరసంగా అంటాడు. భలేవారే ఎవరి బుర్రైనా వాళ్ళ తలలోనే ఉంటుంది కదా..
నీ బుర్ర తలలో కాదే అరిపాదం కింద ఏదైనా ఉంటే అక్కడ ఉండి ఉంటుంది. మీరు నన్ను తిడుతున్నారు అని అలకగా అంటుంది.
తిట్టడం కాదు ఎదురుగుండా ఉంటే.. ఉంటే అంటే.. వద్దులే చిన్నపిల్లవి ఇంకా వినలేవు అని అంటాడు. ఆ మాటకి గుర్రు గా చూస్తూ ఉంటే..
ఏంటే ఆ చూపు ఊరెళ్ళిపోయావు. అరే కాబోయే మొగుడు ఏం చేస్తున్నాడు.. తిన్నాడా లేదా.. పడుకుంటున్నాడా అన్న ఆలోచన లేదా.. నేను ఫోన్ చేసేదాకా ఫోన్ కూడా లేదు అంటాడు.
ఆ మాటకి గారంగా అంటే మీ గురించి ఆ అత్తయ్య చూసుకుంటారు కదా.. అందుకని నేను అడిగితే బాగోదు అని మెలికలు తిరుగుతుంది.
అబ్బో ఈ గారాలకు ఏమీ తక్కువ లేదు. ఏం చేస్తున్నావ్ అని ఫోన్ మీద వేలు పెట్టి శాంభవి ఫేస్ ని చూస్తూ అడుగుతాడు.
రోజు చేసేవి అన్నీ చెబుతూ ఉంటుంది. ఇందులో నాకు ఒక్క ఐదు నిమిషాలు టైం ఇవ్వే బంగారం అంటాడు. వై అంటుంది.
ప్రేమ పాఠాలు నేర్పిద్దామని. ఆల్రెడీ మనం ప్రేమించుకుంటున్నాం కదా అంటుంది. ప్రేమంటే ఏమిటో చెప్పు బంగారం అంటాడు.
ప్రేమంటే అని బుగ్గన వేలు పెట్టుకుని ఆలోచిస్తూ ఒకరికి ఒకరు అంటే ఇష్టం అంటుంది. ఇంకా అని అడుగుతాడు.
ఒకరిపై ఒకరికి పూర్తిగా నమ్మకం ఉండాలి. ఎవరు ఏమీ చెప్పినా నమ్మకూడదు.
ఒకవేళ అనుమానించవలసిన పరిస్థితి వస్తే ఎందుకు జరిగిందా అని ఆలోచించాలి అంటుంది. ఆ మాటకి శాంభవి వైపు చూస్తూ బానే తెలుసుకున్నావు.
ఇదే మాట మీద నిలబడు అంటాడు. తప్పకుండా నేనెవరు అనుకుంటున్నారు శాంభవిని అంటుంది. ఆ తెలుస్తుందిలే..
రోజు నాకు పొద్దున్నే లెగ్గానే గుడ్ మార్నింగ్ అని నువ్వు ఫోన్ చేసి చెప్పాలి. అలాగే నైట్ పడుకునేటప్పుడు కూడా గుడ్ నైట్ చెప్పాలి అర్థమయిందా అంటాడు. అలాగే బా.. అంటుంది.
ఫోన్ పెట్టే వాడల్ల ఆగి ఏమన్నావు అంటాడు. నేనేమీ అనలేదు బాయ్ అని పెట్టేసి గుండెల మీద చెయ్యి వేసుకుని అమ్మో బావ అని పిలవాలి అంటే చాలా ధైర్యం కావాలి అనుకుని రుద్రతో మాట్లాడిందంతా తలుచుకుని నవ్వుకుంటుంది.
రుద్ర కూడా నవ్వుకుంటూ పిలవాలని ట్రై చేస్తున్నావు కదా..ఎలాగైనా నీతో పిలిపించుకుంటాను అనుకొని ఫోన్ వైఫై చూస్తూ ఉంటాడు.
ధీరజ్ మెల్లిగా పక్కన కూర్చుని ఏంటి బావ మా చెల్లి తో మాట్లాడేవా అని అడుగుతాడు. మీరు ఎప్పుడు వచ్చారు రా.. ఇప్పుడే వచ్చాము గాని.
ఆ శేషాద్రి గొడవేమిటి.. వెయిట్ అని చెప్పి కింద సెక్యూరిటీకి ఫోన్ చేసి రుద్రాసార్ వెళ్లిపోయారు అని చెప్పు అని పెట్టేస్తాడు.
సెక్యూరిటీ శేషాద్రి కి అలా చెప్పగానే అదేంటి నేను ఇక్కడే ఉన్నాను కదా ఎలా వెళ్లాడు. సార్ వెళ్లడానికి చాలా గేట్స్ ఉన్నాయి.
మీరు ఒక గేటు దగ్గర వెయిట్ చేస్తే ఎలా తెలుస్తుంది వెళ్ళండి అని చెబుతాడు. శేషాద్రి చేసేది ఏమీ లేక నీరసంగా ఇంటికి వెళతాడు.
జ్యోతి ఎదురు వచ్చి కంగారుగా రుద్రా కలిశాడా.. ఏమైనా చెప్పాడా.. ముందు మంచినీళ్లు ఇవ్వు జ్యోతి అని అక్కడ సోఫాలో కూలబడతాడు.
మంచినీళ్లు తెచ్చి ఇచ్చి ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటుంది. తాగిన తర్వాత ఆకలేస్తుంది అంటాడు. ఆ మాటకి జ్యోతి కి కళ్ళల్లోంచి నీళ్లు కారుతాయి..
ఒక్క నిమిషం అండి అని వేడివేడిగా టిఫిన్ రెడీ చేసి చేతికి ఇస్తుంది. అది తిన్న తర్వాత కాస్త కుదుటపడతాడు.
జ్యోతి చేతిని తన చేతిలోకి తీసుకుని నన్ను క్షమించు జ్యోతి అంటాడు. ఇప్పుడు ఈ క్షమాపణ దేనికండి.. ఎప్పుడైనా నువ్వు తిని వెళ్ళమంటే విసుక్కునే వాడిని.
బయట ఎక్కడైనా తినొచ్చు ఏంటి ఇంటిదగ్గర తినేది. ఇది ఎప్పుడు ఇలాగే వెంటపడుతుంది అని చిరాకు పడేవాడిని.
ఈరోజు ఆకలి విలువ తెలిసింది. నీ విలువ తెలిసింది అంటాడు. ఇప్పుడు నా విలువ తెలిసిన తెలియకపోయినా నష్టమేమీ లేదు.
రుద్రా కలిశాడా ఏమైనా చెప్పాడా అని అడుగుతుంది. లేదు కలవలేదు అని తల ఊపుతాడు. మరి ఇప్పుడు ఎలా అండి.
నువ్వు టెన్షన్ పడకు నేను ఎలా అయినా రుద్రని కలుస్తాను. రుద్ర మన నుంచి ఏదో కోరుకుంటున్నాడు. అది చేస్తాను అంటాడు. ఆ మాటకి నాగేంద్ర కోపంగా శేషాద్రి అని అరుస్తాడు.
శేషాద్రి??
Posts: 898
Threads: 13
Likes Received: 7,006 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
Part - 65
శేషాద్రి అని నాగేంద్ర గట్టిగా అరుస్తాడు. ఎందుకు నాన్న అరుస్తున్నారు ఇప్పుడు మీరు. లేకపోతే నువ్వు చేస్తున్నది ఏమిటి.
మన శత్రువు అయినా రుద్ర దగ్గరికి వెళతావా.. ఆ గజపతి, భూపతులు మనకు ఎంత శత్రువులో తెలుసు కదా...
మరి వాళ్ళ శత్రువులని తెలిసే భూపతిల ఇంటికి నీ కూతుర్ని పంపించాలనుకున్నారా.. శేషాద్రి అంటే.. ఎందుకు మాట్లాడితే అరుస్తున్నారు.
నేను అడిగిన దాంట్లో తప్పేముంది. ఆరోజు మయూరిని ఎలా చేయాలి అనుకున్నారు. కోపంతో కళ్ళు ఎర్ర చేస్తూ చేతులు రెండు బిగిస్తాడు.
మీరు ఎంత కోపంగా చూసిన అదే నిజం కదా.. ఇప్పుడు చేయడం లేదు కదా.. మీ కూతురి జీవితం ఏమైనా మీకు పరవాలేదు ఏమో గాని నా కూతురు జీవితం నాకు చాలా ముఖ్యం.
అది సంతోషంగా ఉంటే నాకు చాలు. పగ పగ అని మీరు మీ కూతురు జీవితాన్ని నాశనం చేసినట్టు నేను నా కూతురు జీవితాన్ని నాశనం చేయలేను. చెయ్యను.
త్వరలోనే అక్క బావ వస్తున్నారు. ఏం చెప్పకుంటారో చెప్పుకోండి అనే సీరియస్గా గదిలోకి వెళ్ళిపోతాడు. భర్తలో వచ్చిన మార్పు కి జ్యోతి ఆశ్చర్యపోతూ..భర్త వెనకాలే వెళుతుంది.
లక్ష్మి భర్త దగ్గరకు వచ్చి ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా అని అడుగుతుంది. లక్ష్మీ అంటే.. ఎందుకు ఈ కోపం. పగ పగ అంటున్నారు.
దేనికోసం... దీనివల్ల మీకేం వచ్చింది. అయినవాళ్ళందరూ దూరమై మీరు మీ కూతురు పగ.. పగ అని తిరిగి ఏం సాధించారు.
మయూరి జీవితం మోడుభారీపోయింది. దాని వయసు వాళ్లందరూ పిల్లాపాపలతో కళకళలాడుతూ ఉంటే ఒంటరిగా ఆ గదిలో ఆ ఫోటోలు చూస్తూ కాలం గడుపుతుంది.
ఇంత వయసు వచ్చిన మీకే భార్య అవసరం కనపడుతుంది. అలాంటిది అది అలా బతుకుతున్నా సరే మీకు ఏమీ బాధ లేదు. ఏం మనిషి అండి మీరు.
ఇదేనా మీకు మీ కూతురు మీద ఉన్న ప్రేమ అని అడుగుతుంది. కోపం తట్టుకోలేక.. ఎదురు ప్రశ్నిస్తున్న భార్యకు సమాధానం చెప్పలేక గట్టిగా కొడతాడు.
చంప మీద చెయ్యి వేసుకుని ఇంతకు మించి మీరు ఏమి చేయగలరు లెండి అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అందరూ నాకు సలహాలు చెప్పేవాళ్లే అయిపోతున్నారు.
రుద్ర నిన్ను వదలను నా అనుభవం అంత లేదు నీ వయసు. నాకే సవాలు విసురుతున్నావా.. ఏం చేయాలి అని నా మనవరాళ్ళ ఇద్దరు జీవితంతో ఆడుకుంటున్నావు అని ఆలోచిస్తూ ఉంటారు.
అల్లుడు గుర్తుకు రాగానే ఒళ్లంతా చెమటలు పడతాయి. మయూరి ఇదంతా విని మౌనంగా తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంటుంది.
దేవేంద్ర ఫోటో చూస్తూ.. నా ప్రేమ నీకు కనపడలేదా... ఎప్పుడో చనిపోయిన నీ భార్యని ప్రేమిస్తూ ఎదురుగుండా ఉన్న నన్ను వదిలేస్తున్నావు.
నేను నీకోసం పరుగులు పెడుతూ ఉంటే నీ మేనల్లుడు నా మీద పగ సాధిస్తున్నాడు. ఎందుకు దేవ్ ఇలా చేయడం. మనిద్దరం హ్యాపీగా పెళ్లి చేసుకుంటే ఈ పగలు పూర్తిగా తగ్గిపోతాయి కదా లేదు లేదు అసలు ఉండనే ఉండవు కదా..
అందరం సంతోషంగా ఉండొచ్చు. ఒప్పుకో దేవ్.. మైనపు బొమ్మని కౌగిలించుకొని కబుర్లు చెబుతూ ఉంటుంది.
రెండు రోజులు బాగా తిప్పించుకున్న తర్వాత రుద్ర అపాయింట్మెంట్ ఇస్తాడు. రుద్రా క్యాబిన్లో రుద్రాలతో పాటు మిగిలిన ముగ్గురు బావమరుదులు కూర్చుని ఉంటే శేషాద్రి మాత్రం నిలబడి ఉంటాడు.
రుద్ర చైర్ లో కూర్చుని తిరుగుతూ చెప్పు శేషాద్రి నా అపాయింట్మెంట్ కోసం ఎందుకో తెగ పరుగులు పెడుతున్నావు.
ఏమైనా అవసరం ఉందా.. ప్లీజ్ రుద్ర నీకు అన్నీ తెలుసు. తెలిసే నాతో చెప్పేస్తున్నావా.. అయ్యో మిస్టర్ శేషాద్రి... మీలాంటి గొప్పవాళ్ళ గురించి నాకేం తెలుస్తుంది చెప్పు.
ఏంటి విషయం నేను ఏమైనా సహాయం చేయలా.. మోకాళ్ళ మీద కూర్చుని నిషా, ఆశా జీవితాన్ని నిలబెట్టు అంటాడు.
మీ ఇంటి ఆడపిల్లల జీవితం నేను నిలబెట్టడం ఏమిటి.. నాకేమిటి సంబంధం. ప్లీజ్ రుద్ర వాళ్ళిద్దర్నీ నువ్వే అరేంజ్ చేసావని నాకు తెలుసు.
ఆ పెళ్లి చేసుకున్నది ఎవరో మాకు ఎవరూ తెలియదు. దయచేసి వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వు. ఇస్తే ఏమి చేస్తావ్.
వాళ్ళని చంపి మీ పిల్లలు ఇద్దరికీ మళ్లీ పెళ్లి చేస్తావా.. లేదు లేదు కాపురానికి పంపిస్తాను అంటే.. గట్టిగా నవ్వుతూ నువ్వు పంపిస్తే మాత్రం వాళ్ళు ఏలుకుంటారా..
మరి అలాంటప్పుడు ఎందుకు ఈ పెళ్లి చేశావు. మా నుంచి నువ్వు ఏం ఆశిస్తున్నావు రుద్ర . ఇప్పుడు కరెక్ట్ లైన్ కు వచ్చావు మిస్టర్ శేషాద్రి అంటాడు.
నువ్వు నాకు ఒక పని చేసి పెడితే వాళ్ళ మొగుళ్ళు ఎక్కడ ఉన్నారో చెబుతాను. చెప్పు చేస్తాను అంటే.. త్వరలో నా పెళ్లి అంటాడు.
తెలుసు అంటే.. పర్వాలేదే అని మా పెళ్లి అయ్యేవరకు మీ ఇంట్లో ఎవ్వరూ కూడా పిచ్చపిచ్చ వేషాలు వేయకూడదు. పెళ్లి చెడగొట్టాలి. పెళ్లిలో ఎవరినైనా నాశనం చేయాలి అన్న ఆలోచన రానివ్వకూడదు.
ఎవరైనా ఆ పని చేయాలి అనుకుంటే ముందుండి ఆపాల్సింది నువ్వే అంటాడు.. ఆ మాటకి శేషాద్రి ఏమీ మాట్లాడకుండా నీళ్లు నములుతూ ఉంటాడు.
ఏమిటి అల సైలెంట్ అయిపోయావు చెయ్యవా.
చెయ్యకపోతే నేనేమీ చేయలేను.. అసలే ఆశ వాళ్ళ నాన్నగారు వస్తున్నారు అనుకుంటా అన్ని వెటకారంగా అంటాడు.
ఈ విషయం నీకు ఎలా తెలుసు. శత్రువు నీడని నిద్రలో కూడా పసగడతాను. అలాంటిది మీ గురించి నేను తెలుసుకోకుండా ఉంటాను మిస్టర్.
బావగారికి ఈ విషయం తెలిస్తే మమ్మల్ని అందరినీ చంపేస్తారు అంటాడు. అది మరీ మంచిది కదా.. నాకు శత్రుశేషం ఉండదు అంటాడు.
ప్లీజ్ రుద్ర మేము చేసిన దానికి ఆడపిల్లలు ఇద్దరిని బలి చేయొద్దు. అలాంటి నీచపు పనులు చేసేది మీరు..
నీకు ఆప్షన్ ఇచ్చాను. వాడుకోమంటున్నాను నీ ఇష్టం అంటాడు.
శేషాద్రి ఇంకా అలాగే మోకాళ్ళ మీద ఉంటే నువ్వు బయటికి వెళ్తే మేము వర్క్ చేసుకోవాలి. నీలాగా పనీపాటా లేని వాళ్ళము కాదు.
శేషాద్రి మౌనంగా లేచి నీ పెళ్ళికి మా కుటుంబం నుంచి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటే నిజంగా వాళ్ల జాడ చెబుతావా అని అడుగుతాడు.
ఆ మాటకి రుద్ర నవ్వుతూ నేను మాటంటే మాటే. ఏ రోజైనా మా కుటుంబాలు మాట తప్పాయ అని అడుగుతాడు. లేదు అని తల ఊపుతాడు.
ఇంకేం నీ పనిలో నువ్వు ఉండు మా పనిలో మేము ఉంటాము. సరే అన్ని ఇంటికి వెళతాడు. వెళ్ళగానే మయూరి అని పిలుస్తాడు.
బయటికి వచ్చి ఏంటన్నయ్య అంటే.. ఇలా వచ్చి కూర్చో అని సోఫాలో కూర్చోబెట్టి కింద కూర్చుంటాడు. అన్నయ్య ఏమిటిది అని కంగారుగా అంటే.. ప్లీజ్ మయూరి నేను చెప్పేది విను.
జ్యోతి, లక్ష్మీ కూడా అక్కడే ఉంటారు.. చెప్పు అన్నట్టుగా మయూరి చూస్తే.. ఈరోజు రుద్రని కలిశాను. రుద్రా చెప్పిందంతా చెబుతాడు.
మయూరి మౌనంగా వింటూ ఉంటుంది. ప్లీజ్ మయూరి... నీ జీవితం ఎలాగో ఎటు కాకుండా అయిపోయింది. వాళ్ళిద్దరూ నీ కళ్ళముందే పెరిగారు కదా..
వాళ్ల జీవితం బాగుండాలని నీకు లేదా.. ఆలోచించు. రుద్ర పెళ్ళికి అడ్డుపడకుండా ఉండు. నీ కాళ్లు పట్టుకుంటాను అని పాదాలు టచ్ చేస్తాడు.
అన్నయ్య అంటూ కాళ్ళు వెనక్కి లాక్కుంటుంది. కన్నీళ్ళతో చూస్తున్న అన్నయ్యని నువ్వు రుద్ర మాటలు నమ్ముతున్నావా..
లక్ష్మి వెంటనే వాళ్ళు ఏమి మనలాంటి వాళ్ళు కాదు. ఆ కుటుంబాలు మాటిచ్చారంటే మాటే అంటుంది. దానికి విరక్తిగా నవ్వుతూ మరి నాకు ఇచ్చిన మాట అంటే..
ఆ మాటకి లక్ష్మీ నీకు మాట ఎవరూ ఇవ్వలేదు మయూరి. ఆరోజు అక్కడ దేవేంద్ర లేడు. అనసూయ కూడా దేవేంద్ర ఒప్పుకుంటే అని మాట్లాడింది..తర్వాత మీరిద్దరే కదా అనసూయ మనసుని పాడు చేశారు అంటుంది.
మయూరి మౌనంగా ఉంటే జ్యోతి ముందుకు వచ్చి చూడు మయూరి. నిన్ను ఏరోజు ఏ విషయంలో కూడా నేను బ్రతిమాలింది లేదు.
ఇది నా కూతురు జీవితానికి సంబంధించింది. అలాగే మన ఇంటి పరువుకు సంబంధించినది. వాళ్ళు ఇంకా ముందుకు వెళ్లారో లేదో కూడా తెలియదు.
ఒకవేళ వెళ్లి ఉంటే అప్పుడు పరిస్థితి ఏమిటి. నీ కాళ్లు పట్టుకుంటాను అని పట్టుకోపోతుంది. వదిన నువ్వు చేసేది ఏమిటి..
ఏ రోజు నువ్వు నన్ను వదినగా గుర్తించలేదు. మీ ఇంటి పనిమనిషి నిన్ను బ్రతిమాలుతుంది అనుకో మయూరి అంటుంది.
లక్ష్మీ వెంటనే అమ్మ జ్యోతి ఏమిటా మాటలు..మరి ఏమి చేయమంటారు అత్తయ్య. ఎంత బ్రతిమాలుతున్న సరే ఆ మనిషి కరుగుతుందా..
పిల్లలు భవిష్యత్తు పాడైపోయినా పరవాలేదు పగ సాధించాలి అనుకుంటుంది. చచ్చిన తర్వాత ఆ పగను తీసుకుని పైకి వెళుతుందా.. ఏం మనుషులు అత్తయ్య వీళ్ళు అని మొదటిసారి తన బాధని ఆవేశాన్ని బయటకి కక్కుతుంది.
ఏనాడు మాట్లాడని వదిన కూడా అలా మాట్లాడేటప్పటికి మయూరి గట్టిగా కళ్ళు మూసుకుని తెరిచి సరే అన్నయ్య వాళ్ళ పెళ్లి వరకు నేను ఎటువంటి ప్రయత్నాలు చెయ్యను.
వాళ్ల పెళ్లి ఆపను సరేనా అంటుంది. ఈ మాట అన్నావు అదే చాలు. నువ్వు మాటిచ్చావు అంటే నాన్నగారు కూడా ఆ మాట దాటరు.
థాంక్యూ మయూరి.. వెంటనే రుద్రా కి కాల్ చేస్తాడు. చెప్పు అని రుద్రా అనగానే.... మయూరి ఒప్పుకుంది అంటే మంచిది.
మయూరి మాత్రం మౌనంగా జరిగేది చూస్తూ ఉంటుంది. రుద్ర, శాంభవిల పెళ్లి పనులు మొదలవుతాయి. అందరూ భూపతుల స్వగ్రామానికి చేరుకుంటారు.
శాంభవి కుటుంబానికి అందరూ రాచ మర్యాదలు చేస్తూ ఉంటారు. అది చూసిన శాంభవి ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేస్తారు. నిశ్చితార్థం అయిన వారం రోజుల్లోనే పెళ్లి ముహూర్తం కూడా పెట్టేస్తారు.
కౌసల్య ధరణి దగ్గరికి ఒక బ్యాగ్ తీసుకుని వస్తుంది. ఏమిటి కౌసల్య అని ధరణి అడిగితే ఇవి మా తోటికోడలి చీర నగలు అని చెబుతుంది. దేనికోసం అంటే శాంభవి కోసం.
శాంభవి ఫ్యామిలీ రియాక్షన్...
Posts: 898
Threads: 13
Likes Received: 7,006 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
Part - 66
శాంభవి కోసం ఏమిటి అని ధరణి అంటే.. తప్పుగా అనుకోవద్దు మా తోటి కోడలు అంటే మా అందరికీ చాలా ఇష్టం. చాలా సున్నితమైన మనస్తత్వం ఉన్న అమ్మాయి.
ఏ రోజు కూడా మేము తోటికోడళ్ళు లాగ లేము. సొంత అక్కచెల్లిల్లాగా కలిసిపోయాము. అలాంటిది తన దూరమైన తర్వాత ఏదో వెలితి.
చారు, నేను ఉన్న.. ఏదో మిస్ అయ్యిన ఫీలింగ్. శాంభవి అచ్చు మా తోడికోడలులాగ అనిపిస్తుంది. అందుకే తెచ్చాను.
మీకు ఇబ్బంది అయ్యితే పెట్టదు కాని ఇవి శాంభవి దగ్గర ఉంటే మా అందరికి చాలా సంతోషం. అయ్యే కౌసల్య... నువ్వు మరి ఇంత ఇదిగా చెప్పాలా...
ఈ నగలు చాలా విలువ ఉంటాయి అనుకుంటా..అవి శాంభవికే అని ఇబ్బంది పడుతూ ఉంటే.. శాంభవి కన్నా నగలు మాకు ఎక్కువ కాదు.
అమ్మాయే మా ఇంటి పిల్ల అవుతున్నప్పుడు.. ఈ నగలు తనవి అవ్వవా అంటే.. ఇబ్బందిగానే తీసుకుంటుంది.
పెళ్లికి వారం రోజులే ఉండడం వలన అన్ని పనులు హడావుడిగా మొదలవుతాయి.
శాంభవి పూర్తిగా ఆడవాళ్ళ మధ్యన ఇరుక్కుపోతుంది. ఒక పని అయ్యేటప్పటికి ఇంకొకటి అని అలంకరణ అని ఏదో ఒకటి ముస్తాబు చేస్తూనే ఉంటారు.
తనకి ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్. బెంగగా చూస్తూ ఉంటుంది. ధరణి వచ్చి ఏమయింది శాంభవి ఎందుకలా ఉన్నావు.
అమ్మ నాన్నని చూడాలి అంటుంది. ఆ మాటకి కోపంగా చూస్తూ మీ నాన్న ఏమన్నా చంటి పిల్లోడా ఎక్కడికైనా పారిపోతారా..
ప్లీజ్ అమ్మ అసలు నాన్నలతో మాట్లాడి ఎన్నో రోజులైనట్టుంది అంటే.. ఎన్నో రోజులు ఎక్కడ.. పొద్దున్నే కదా మాట్లాడావు.
అబ్బా అలా మాట్లాడింది కూడా ఒక మాట్లాడడమేనా.. మరి ఇంకా ఎలా మాట్లాడాలి.. ఒళ్ళో కూర్చోబెట్టుకుని గోరుముద్దలు తినిపించాలా.. ఇప్పుడు నువ్వు పెళ్లి కూతురివి అని కోపంగా అంటుంది .
నువ్వు అలాగంటే నేను అలుగుతాను. ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంటుంది. అమ్మ తల్లి నువ్వు అలాంటి పిచ్చి పనులు చేయకు. ఉండు ఎక్కడున్నా పిలుచుకు వస్తాను అని చెప్పి బయటకు వెళుతుంది.
రసరసలాడుతూ వస్తున్న ధరణిని చూసి ఏమైంది పిన్ని అని లలిత్ అడుగుతాడు. ఏమవుడమేంటి.. నీ ముద్దుల చెల్లెలు చేస్తున్న తింగర పనులు.
తింగరి పనుల ఏం చేసింది .. అర్జెంటుగా మీ నాన్నలు ఇద్దరినీ చూడాలంట.. బెంగ వచ్చేసిందంట.. రేపు పెళ్లయి అత్తారింటికి వెళ్ళాక ఏం చేస్తుందో ఏమిటో నన్ను మాత్రం టెన్షన్ పెడుతుంది.
మరీ అంత టెన్షన్ పడకు పిన్ని. అందరం ఉన్నాము కదా.. మనం ఎంత మంది ఉన్నా సరే మీ చెల్లికి లెక్కలోకి రాము. అది నిజమేలే అని జయంతి వస్తుంది.
చూసావా అక్క అది చేస్తున్న తింగర పనులు. నువ్వు టెన్షన్ పడకు. ఇప్పుడు అలాగే ఉంటుంది. రేపు పెళ్లి అయ్యాక తనే మారుతుంది.
మనం మారలేదా... మన దారి వేరు అక్క. మనల్ని గారాబంగా చూశారుగాని మరీ ఇంత నెత్తినపెట్టుకోలేదు. ఈ టైంలో ఎవరైనా కాబోయే మొగుడు గురించి ఆలోచిస్తారు.
మన అమ్మాయి గారు మాత్రం నాన్నల గురించి ఆలోచిస్తుంది. ఐదేళ్ల చంటి బిడ్డ దగ్గరే ఆగిపోయింది. రేపు రుద్ర ఎలా రిసీవ్ చేసుకుంటాడు.
వదినగారు మన గురించి ఏమనుకుంటారు అని కంగారుపడుతుంది. వీళ్ళ మాటలు విన్న చారులత నేను ఏమి అనుకోను.
నాకు ఎలాగు కూతుళ్లు లేరు కోడలు రూపంలో కూతురే వస్తుంది అనుకుని మీరు ఎంత జాగ్రత్తగా చూశారో అంతే ఆపురూపంగా మేము చూసుకుంటాము సరేన..
మీరు ఇలాగే గారాభం చేస్తే అల్లుడు గారు చాలా ఇబ్బంది పడిపోతారు వదినా.. అయ్యో మీ అల్లుడు గురించి చెబుతున్నావా..
పైకి కోపంగా ఉన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు గాని అందరికన్నా ఎక్కువ గారం చేస్తున్నాడు అంటే ఇది నిజం పిన్ని అని ధీరజ్ వస్తాడు.
చెల్లెమ్మతో మాట్లాడకుండా అసలు ఉండలేడు. ఎలా దారిలోకి పెట్టుకోవాలో రుద్రకి బాగా తెలుసు. మీరు అనవసరంగా టెన్షన్ పడకుండా అన్ని ఎంజాయ్ చేయండి. మేము చూసుకుంటాం కదా అంటాడు.
ఆ మాటకి ధరణి, జయంతి కొద్దిగా ఊపిరి తీసుకుంటారు. సరే సరే అని లలిత్ వెళ్లి తీసుకు వస్తాడు..
ఇద్దరు కూతురు దగ్గరికి వెళ్లి ఏమైందిరా అంటే.. నాన్న అని ఇద్దర్నీ పట్టుకుంటుంది. ఏమైంది మా బంగారు తల్లికి బెంగగా ఉంది నాన్న.
బెంగ ఎందుకురా తల్లి. మేము ఇక్కడే ఉన్నాము కదా అని బుజ్జగిస్తూ ఉంటారు. ఇదంతా లైవ్ లో చూస్తున్న రుద్ర మాత్రం తల దేనికేసి కొట్టుకోవాలా అర్థం కాక చూస్తూ ఉంటాడు.
ఈ టైంలో నా గురించి ఆలోచించాలి. ఎవరైనా అప్పగింతలప్పుడు ఏడుస్తారు. నువ్వు ఇప్పుడు నుంచి బెంగగా ఉంది బెంగగా ఉంది అంటూ ఉంటే చూసే వాళ్ళు మొగుడు మీద ఏ మాత్రం ప్రేమ లేదు అనుకుంటారు. నిన్ను మార్చేటప్పటికి నాకు గెలాక్సీ కనపడేటట్టు ఉంది.
విహాన్ రుద్ర పక్కన కూర్చుని ఏంటి బావ మా చెల్లిని చూస్తూ ఉన్నావు. సెక్యూరిటీ అంటాడు. సెక్యూరిటీ నా లేకపోతే చూడలేకుండా ఉండలేకపోవడమా..
అంత లేదు. రేపటి నుండి నా ముందేనే ఉంటుంది కదా.. ఏమో బెంగా బెంగా అని రేపల్లె పరిగెడుతుందేమో అని నవ్వుతాడు.
ఒరేయ్ మీ చెల్లి రేపల్లె పరిగెడితే తీసుకువచ్చి అప్పజెప్పడం మీ బాధ్యత.. నాదేం పోయింది అంటాడు. మా చెల్లి కోసం నువ్వు వెళ్ళావా.. ఆరుగురు బామ్మర్దులు ఉన్నారు. నాకేం అవసరం చెప్పరా...
ఆయన ఇంతమంది బామ్మర్దిలు ఉండడం కూడా లక్కే అంటాడు. ఎందుకో అంటే.. ఎందుకు ఏమిటి.. మీ చెల్లి అలిగి వెళ్లిందే అనుకో..
రోజుకో ఒక బామ్మర్ది తీసుకొచ్చి దింపుతూ ఉంటారు. ఆస్తమాను ఒకళ్ళు మొఖమే చూసిన బోర్ కొడుతుంది కదా.....
అందుకే ముఖాలు మారుతూ ఉంటే పోనీలే పోనీలే అని మీ చెల్లిని ఎక్స్క్యూజ్ చేయడానికి ఉంటుంది. అబ్బో మా బావగారికి చాలా కోరికలున్నాయే.. ఇవి కోరికలు కాదురా... నిజాలు. మీ చెల్లి సంగతి బాగా తెలుసు కదా...
చదివేసినట్టు ఉన్నావు.. హ్మ్.. చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. ఆ మయూరి ఏ విధంగా అయినా హాని తలపెట్టడానికి ప్రయత్నించవచ్చు లేదా మనసు విరిచేలాగా ప్రవర్తించవచ్చు.
అది నిజమేలే బావ. అందుకే సెక్యూరిటీని టైట్ చేశాను. ప్రతి ఒక్కడిని బాగా చెక్ చేసి పంపించమన్నాను. రుద్ర నవ్వుతూ నువ్వు మయూరిని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు.
ఏమీ చెయ్యను అని మాట ఇచ్చిన సరే తను కదపాల్సిన పావులు కదుపుతూనే ఉంటుంది. మనకి తెలిసిన వాళ్ళతోనే ప్రయోగాలు చేయించిన ఆశ్చర్యపడక్కర్లేదు.
మరి ఏం చేయాలి బావ.. అందుకే కదా ఎవరీ మినిట్ మీ చెల్లిని వాచ్ చేస్తూ ఉన్నాను. ప్రతిదీ నా కంట్రోల్లో ఉంచుకున్నాను.
బట్ ఎందుకైనా మంచిది ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండండి. శాంభవి ఫ్యామిలీని మొత్తాన్ని కూడా వాచ్ చేస్తూ ఉండండి.
కొత్త వాళ్ళు ఎవరైనా కలుస్తున్నారా.. మాట్లాడుతున్నారా.. ఏం మాట్లాడుతున్నారో అన్నది ఈచ్ అండ్ ఎవరీ మినిట్ తెలుసుకోండి.
ముఖ్యంగా వాళ్ళ చుట్టూ ఉండే సర్వెంట్స్ అందరూ మనకు పూర్తిగా నమ్మకమైన వాళ్ళనే ఉంచండి అంటే.. అలాగే బావ అంటాడు.
పెళ్లి ఇంకా మూడు రోజులు ఉందనగా ఇద్దరికి మంగళ స్నానాలు చేయించి వధూవరులను చేస్తారు. పెళ్లికూతురుగా ముస్తాబయిన శాంభవిని చూసి భాను ప్రసాద్, శివప్రసాద్ ఎమోషనల్ అవుతారు.
ఇద్దరు కూతుర్ని హత్తుకుని ఎంత పెద్ద దానివైపోయావు. మాకు ఇంకా నువ్వు పుట్టినప్పుడు చేతుల్లో తీసుకున్నట్టుగానే ఉంది.
అప్పుడే నీకు పెళ్లి అంటే చంటిబిడ్డకి పెళ్లి చేస్తున్నట్టు ఉంది అని ఎమోషనల్ అవుతారు. దేవేంద్ర కి కూడా కూతుర్ని దగ్గరికి తీసుకుని గట్టిగా హత్తుకోవాలని ఉంటుంది.
కానీ పరిస్థితులు అనుకోలించక మౌనంగా కూతురిని కన్నీళ్ళతో చూస్తూ ఉంటాడు. అది అర్థమైన జితేంద్ర భుజం పైన తడుతూ కంట్రోల్ చేస్తూ ఉంటాడు.
చూసావా అన్నయ్య నా కూతురు బంగారపు బొమ్మలాగా ఉంది కానీ నా దురదృష్టం దగ్గరికి తీసుకుని ముద్దు చేయలేకపోతున్నాను.
అచ్చు నా భార్యని చూసినట్టే ఉంది. అవును రా నువ్వు అన్నది ప్రతిదీ నిజమే. ఇంకెంత పెళ్లయిన తర్వాత అమ్మాయి మన దగ్గరే ఉంటుంది కదా..
అప్పుడు నీ ప్రేమని అంతా చూపించు. ఆ మాటకి విరక్తిగా నవ్వుతూ ఎంత చూపించినా నేను రుద్ర మేనమామనే కానీ శాంభవి కన్న తండ్రి కాదు కదా అంటాడు.
దేవేంద్ర అని బాధగా అంటే.. నా కర్మకి నువ్వెందుకు అన్నయ్య బాధపడుతున్నావు. విధిరాతని ఎవరు మార్చగలరు.
ఆ మాటలు విన్న అనసూయ కొడుకు బాధకి నేనే కారణం కదా.. నా మూర్ఖత్వం వలెనే వాడి జీవితం ఇలా అయిపోయింది అని బాధపడుతుంది.
రాఘవేంద్ర కొడుకులిద్దరి దగ్గరికి వచ్చి ఇప్పుడు బాధపడవలసిన సమయం కాదు సంతోషపడవలసిన సమయం రండి అని తీసుకువెళతాడు.
శివ భాను లను తేలికపరచడానికి ధరణి కన్నీళ్లు తుడుచుకొని ఇంకానయం బాల్య వివాహం చేస్తున్నాం అనలేదు.
భాను చిరుకోపంగా ధరణి అంటాడు. ఇప్పుడు నేను ఏమన్నానండి.. చంటి బిడ్డకి పెళ్లి అంటే బాల్య వివాహమే అనుకుంటారు కదా..
ఆ మాటే చెప్పాను అంతే కదా అక్క.. అవునవును ఆ విషయం మనకు తెలుస్తుంది గానీ మగవాళ్ళిద్దరికీ తెలియడం లేదు.
ధరణి, జయంతి చమత్కారానికి అందరూ నవ్వుతారు. వాతావరణం తేలికయింది అనుకున్నాక అమ్మయ్య అని గుండెల మీద చేయి వేసుకుంటారు.
విహాన్, అద్వైత్ ధరణి వాళ్ళ దగ్గరకు వచ్చి మీరు చాలా తెలివైన వాళ్ళు పిన్ని అంటారు. దేనికి.. శాంభవి గురించి బాబాయిలు ఇద్దరు టెన్షన్ పడుతుంటే మీరు వాతావరణాన్ని తేలిక చేశారు కదా..
ఆ మాటకి నవ్వుతూ కూతురు మీద మాకు ప్రేమ ఉంది. అది అంటే మా అందరికీ పంచప్రాణాలు. కాకపోతే వీళ్ళిద్దరూ మరీ సెన్సిటివ్. ఇలాగ బాధపడుతూ ఉంటే శాంభవి పెళ్లిని ఎంజాయ్ చేయలేదు.
జీవితంలో ఒకే ఒకసారి వచ్చేదే పెళ్లి. అందరూ కలిసి ఎంజాయ్ చేస్తేనే మధురానుభూతిగా గుర్తుండిపోతుంది.
పిన్ని మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటారు.
ఏం చెబుతారు..
కథ కొనసాగుతుంది...
Posts: 1,572
Threads: 2
Likes Received: 919 in 705 posts
Likes Given: 2,076
Joined: May 2019
Reputation:
10
Sooper update.
When will the past be revealed?
Posts: 1,156
Threads: 1
Likes Received: 730 in 473 posts
Likes Given: 10,887
Joined: Jun 2019
Reputation:
2
Great going... Waiting for the past to be revealed... Waiting for Mayuri to make her silent moves...
Posts: 4,804
Threads: 9
Likes Received: 3,180 in 2,463 posts
Likes Given: 11,247
Joined: Sep 2019
Reputation:
31
Posts: 898
Threads: 13
Likes Received: 7,006 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
(08-04-2026, 08:00 AM)ash.enigma Wrote: Sooper update.
When will the past be revealed?
No Past Story ki Konchem Time Undi
Past Story Gurenchi Oke Roju Post Chestanu
Posts: 1,572
Threads: 2
Likes Received: 919 in 705 posts
Likes Given: 2,076
Joined: May 2019
Reputation:
10
(08-04-2026, 09:22 PM)SivaSai Wrote: No Past Story ki Konchem Time Undi
Past Story Gurenchi Oke Roju Post Chestanu
Sure Sivagaru
Posts: 898
Threads: 13
Likes Received: 7,006 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
Part - 67
విహాన్,అద్వైత్ ఒకరినొకరు చూసుకుని మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి పిన్ని. చెప్పండి విహాన్ అంటే.. ఇక్కడ కాదు కొంచెం లోపలికి వెళదామని గదిలోకి తీసుకువెళ్ళి తలుపులు వేస్తారు.
ఏదైనా సీరియస్ మేటరా.. కొంచెం అలాంటిదే. చెప్పండి బిజినెస్ పరంగా మనకి చాలా మంది రైవల్స్ ఉన్నారు. ఏవిధంగా అయినా ఈ పెళ్లి ఆపాలి అని కుట్రలు పన్నుతున్నారు.
బయట నుంచి వచ్చే ప్రతి శత్రువులని మేము ఆపగలం కానీ... మనవాళ్లే అని ముసుగేసుకోనే వాళ్ళని ఆపలేము కదా..
ఎవరైనా వచ్చి ఏదైనా చెప్పినా సరే నమ్మకండి
శాంభవి జాగ్రత్త. ఆ మాటకి ధరణి, జయంతి ఒకరినొకరు చూసుకుని సరే బాబు మేము జాగ్రత్తగానే ఉంటాము.
శాంభవి చుట్టుపక్కల కూడా ఎవరిని రానివ్వము. థాంక్యూ పిన్ని. ఇందులో థాంక్స్ చెప్పడానికి ఏముంది. ఇది మన కుటుంబం. ఆ మాటకి ఇద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
పెళ్లి టైం దగ్గరికి వచ్చేస్తుంది. పెళ్లి కూతురు, పెళ్ళికొడుకుని ఇద్దరినీ మండపం పైన కూర్చోబెడతారు. పెళ్లి అంతా చాలా ఆర్భాటంగా జరుగుతూ ఉంటుంది.
విందుకి, మర్యాదలకు ఎటువంటి లోటు రానివ్వకుండా అంగరంగ వైభవంగా చేస్తూ ఉంటారు. ఆ ఏర్పాట్లు చూసి శివప్రసాద్, భానుప్రసాద్ కూడా ఆశ్చర్యపోతారు .
అందరి సమక్షంలో శాంభవి సమ్మతంతో రుద్ర, శాంభవి మెడలో మూడు ముళ్ళు వేస్తాడు. అది చూసిన దేవేంద్ర కంటతడి పెడతాడు.
జితేంద్ర తమ్ముడిని పట్టుకునే ఊరుకో అంటే.
నా కూతురుని ఇప్పుడు దాకా ఎత్తుకొని ముద్దు చేసింది లేదు.
అలాంటిది ఒక్కసారిగా కనబడి పెళ్లి పీటల మీద కూర్చుంటే తట్టుకోలేకపోతున్నాను అన్నయ్య. ఏయ్ మరి ఎమోషనల్ అవ్వకురా..
రేపటినుండి మనకి చాలా సరదాలు ఉంటాయి. శాంభవి పిల్లల్ని నువ్వే పెంచు. ఆ మాటకి నవ్వుతూ పెంచడం ఏమిటి.. వాళ్లకి నేనే పెద్ద పనివాడిని అవుతాను.
తమ్ముడు ప్రేమకి మురిసిపోతూ నీకు ఎలా నచ్చితే అలా చేద్దాం సరేనా అంటాడు. శివప్రసాద్, భాను ప్రసాద్ కూడా ఎమోషనల్ అవుతారు.
జయంతి, ధరణి పక్కనే నిలబడి కంట్రోల్ అంటూ ఉంటారు. ఏంటి కంట్రోల్.. నా చిట్టి తల్లి చూడు అప్పుడే పెళ్లి అయిపోయింది.
మేము కూడా ఇలాగే పెళ్లి చేసుకుని వచ్చాము కదా.. ఆ.. మీరు నా బంగారం ఒకటే నా అని రుసురసలాడతారు. ఓరి దేవుడో... వీళ్ళ కూతురు ప్రేమ ఏమో గాని చంపేస్తున్నారు అక్క అంటుంది.
కూతురు అత్తారింటికి వెళితే ఎవరైనా అమ్మలు ఏడుస్తారు. మనం ధైర్యంగా ఉన్నాము వీళ్ళిద్దరూ బేర్ మంటున్నారు.
రేపటి నుంచి మనం ఎన్ని బిందులు పట్టుకోవాలో ఏమిటో.. భాను వెంటనే మీ ఉద్దేశం ఏమిటి.. మేము ఏడుస్తూ ఉంటాం అనా..
అయ్యో మీలాంటి గొప్ప వాళ్ళని మేము ఎందుకు అంటాం. కూతురు మీద ప్రేమ ఉండాలి అది ఎలా.. ఏ విషయంలో అయినా సరే మేమున్నాము అని ధైర్యం ఇచ్చే విధంగా..
మీరే ఏడుస్తూఉంటే ధైర్యం చెప్పే వాళ్ళు ఎవరు.. మేము ఎంత మంది ఎలా చెప్పినా సరే శాంభవి చూపు ఎప్పుడూ మీ ఇద్దరి పైనే ఉంటుంది.
ఆ మాటకి అన్నదమ్ములు ఒకరి మొఖం ఒకరు చూసుకుని అది నిజమేలే.. మేము ధైర్యంగానే ఉంటాము అంటారు. నమ్మొచ్చా అంటే... నమ్మొచ్చు.
కావలిస్తే చూడండి. అప్పగింతలప్పుడు నవ్వుతూ పంపిస్తాము. అబ్బో అంటారు తోటికోడళ్ళు ఇద్దరు.
అందరి నవ్వులు సరదాల మధ్యన పెళ్లి వేడుక ముగుస్తుంది. అరుంధతి నక్షత్రం చూపించమని రుద్రతో చెబితే.. శాంభవి భుజం మీద చెయ్యి వేసి దగ్గరకు లాక్కుని చెయ్యి పట్టుకుని చూపిస్తాడు.
అప్పగింతలు లేకుండానే శాంభవి తో కుడికాలు లోపల పెట్టించి అత్తరింటికి స్వాగతం చెబుతారు. సులోచన ఆ విషయమే అడిగితే...
చారు నా కోడలు కంటతడి పెడితే మేము చూడలేము పెద్దమ్మ. అందుకనే అప్పగింతలు లేకుండా గృహప్రవేశం చేపించాను.
శాంభవి పైన చారులత చూపిస్తున్న ప్రేమకి పెద్ద ఆవిడ మనసు నిండిపోతుంది. చారులత చేతులు పట్టుకొని ఎప్పుడూ ఇదే ప్రేమ నా మనవరాలు పైన చూపించమ్మా..
అది ఉత్తి అమాయకురాలు. మా ఇంట్లో మగవాళ్ళు అందరూ అతి ప్రేమతో ప్రపంచం తెలియకుండా చేశారు. అసలు లోకజ్ఞానమే లేదు.
తెల్లనివన్నీ పాలు.. నల్లనివన్నీ నీళ్లు అనుకుంటుంది. ఆ మాటకి సులోచనకి ధైర్యం చెబుతూ.. మీరు కంగారు పడకండి.
అమ్మాయిని మేము కంటికి రెప్పలాగా చూసుకుంటాము. అన్నింటికి మించి నా కొడుకు ఉన్నాడు. తన భార్యని ఎలా చూసుకోవాలో అన్నది వాడికి బాగా తెలుసు.
రెస్ట్ తీసుకోండి పెద్దమ్మ అని అందరికీ గదులు చూపిస్తుంది. పెళ్లి అలసటతో అందరూ పడుకుంటారు. శాంభవితో ధరణి జయంతి ఉంటారు.
శాంభవికి ఇద్దరు జాగ్రత్తగా చెబుతూ ఉంటే సరే అమ్మ సరే అమ్మ అని తలుపుతూనే నిద్రపోతుంది. ధరణి జయంతి కూడా పడుకుంటారు.
అందరూ ప్రశాంతంగా పడుకున్న రుద్ర మాత్రం ఆలోచిస్తూ ఉంటాడు. ధీరజ్ వచ్చి ఏంటి బావ.. పెళ్లయిపోయింది మరి ట్రీట్ ఏది.. ఒరేయ్ అని విసుగ్గా అంటాడు.
ఏమైంది బావ అంత చిరాకుగా ఉన్నావు. మయూరి స్టెప్ ఏంటా అని ఆలోచిస్తున్నాను. నువ్వంత గట్టిగా వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఎందుకు పిచ్చి పనులు చేస్తుంది.
నీ వార్నింగ్ కి భయపడే కదా పెళ్లిలో ఎటువంటి డిస్టర్బెన్స్ చేయలేదు. నువ్వు మయూరిని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. కచ్చితంగా ఏదో ప్లాన్లో ఉండే ఉంటుంది.
సరే ఏం ప్లాన్ వేసినా పెళ్లయితే ఆగలేదు కదా.. శాంభవి నీ దగ్గరే ఉంటుంది కాబట్టి భయం లేదు. ముందు ఆలోచనలు ఆపి రెస్ట్ తీసుకో బావ.
రేపు మళ్లీ నోములు ఉన్నాయి తర్వాత అంతా నీకు జింగిలాల జింగిలాలే అంటాడు. ఆ మాటికి రుద్ర బ్లష్ అవుతూఉంటాడు.
అబ్బో మా బావ కూడా సిగ్గుపడుతున్నాడే.. నీకు పెళ్లి అవుతే అప్పుడు తెలుస్తుంది లేరా.. బయటకు పో. లేదు.. లేదు.. ఈరోజు నీతోనే పడుకుంటాను బావ అని మంచం ఎక్కుతాడు.
రుద్ర నవ్వుకుంటూ వచ్చి పడుకొని శాంభవితో ఫస్ట్ మీటింగ్ నుంచి ఇప్పుడు దాకా జరిగిందంతా తలుచుకుంటూ పడుకుంటాడు.
ఉదయమే నోముల హడావిడి మొదలవుతుంది. నోములకి శాంభవి.. కౌసల్య ఇచ్చిన నగలు పెట్టుకుంటుంది.
అందంగా ముస్తాబు అయిన శాంభవి గది బయటకు రాగానే అందరూ అలా చూస్తూ ఉండిపోతారు. దేవేంద్ర కి కన్నీళ్లు ఆగనంటూ వస్తూ ఉంటాయి.
తుడుచుకుని చూస్తూ ఉంటాడు. జితేంద్ర వైపు చూసి అచ్చు నా భార్య లాగానే ఉంది కదా అన్నయ్య. అవును రా తనని చూసినట్టే అనిపిస్తుంది .
నీ భార్య ఎక్కడికి వెళ్ళలేదు రా.. నీ మీద ప్రేమతో మళ్ళీ తన రూపంలోనే నీ దగ్గరికి వచ్చింది. అవును అన్నట్టుగా తలుపుతాడు.
చారులత, కౌసల్య దగ్గరకు వచ్చి ఎంత బాగున్నావే బంగారు తల్లి. మాదిష్టే తగిలేటట్టు ఉంది అని కాటుక తీసి అరిపాదంలో పెడతారు.
అయ్యో మీరు కాలు పట్టుకోవడం ఏమిటి.. కూతురు పాదం పట్టుకుంటే తప్పేమీ లేదులే.. రా అని తీసుకువెళ్తారు.
ఇదంతా చూస్తున్నా అనసూయ మనవరాలిని దగ్గరికి తీసుకుని ముద్దాడాలి అనిపిస్తుంది. తన చేసిన తప్పుకి ఆ సాహసం చేయలేక వచ్చే బాధని ఆపుకుంటూ మౌనంగా చూస్తూ ఉంటుంది.
నోములు పూర్తయిన తర్వాత అందరూ భోజనాలు చేస్తారు. కొత్త దంపతులకు ఒకే ఆకులో వడ్డీంచి ఒకరినొకరు తినిపించుకోమని చెబుతారు.
శాంభవి ఇబ్బందిపడుతూ ఉంటే.. నువ్వు ఇబ్బంది పడవలసింది ఏమీ లేదు. ఆరుగురు అన్నయ్యలు ఉన్నాము.
నువ్వు ధైర్యంగా బావ నోట్లో కుక్కేయ్ అని ధీరజ్ అంటాడు. ఆ మాటకి రుద్ర ఒక ఐబ్రో పైకి లేపి చూస్తాడు. ఇప్పుడు నువ్వు ఎలా చూసినా మేము భయపడం బావ. మా చెల్లి మాతో ఉంది అని విహాన్, అద్వైత్ కూడా వస్తారు.
బావమరుదుల ఆనందాన్ని చూసి రుద్ర నవ్వుకుంటూ మీ చెల్లికి ధైర్యం ఉంటే కుక్కమనండిరా... ఎంతమాటన్నావు బావ.
చెల్లెమ్మ నువ్వు అసలు ఎక్కడ తగ్గడానికి వీలు లేదు అని శాంభవిని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. శాంభవి కూడా ఉక్రోషంగా నాకు ధైర్యం ఎందుకు లేదు అని రుద్ర తింటానికి గ్యాప్ ఇవ్వకుండా ఒకదాని వెనకాల ఒకటి పెడుతూఉంటుంది.
ధరణి, జయంతి తల కొట్టుకుంటూ ఉంటే మిగిలిన వాళ్ళు మాత్రమే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి శాంభవి అల్లరి మిస్ అయిన ఫ్యామిలీ.. ఏది చేసినా మురుపంగానే చూస్తూ ఉంటారు.
రుద్రకి మొత్తం తినిపించి ఇప్పుడేమంటారు.. నాకు ధైర్యం ఉంది కదా.. అదేంటి లాస్ట్ లో కి కిళ్లి ఎవరు తినిపిస్తారు బంగారం అంటాడు.
ఆ మాటకి.. మీరు కావాలని నాతో తినిపించుకున్నారా.. అంతే కదా అని భుజాలు ఎగరేస్తాడు. వెంటనే కోపంగా ధీరజ్ వాళ్ళ వైపు చూస్తుంది.
చెల్లెమ్మ నువ్వు అంత కోపంగా చూడకు. బావ అన్ని ఇలాంటి ఫిట్టింగ్లె పెడతాడు. ఒరేయ్ నువ్వు మా చెల్లికి తినిపించలేదు.
మీ చెల్లి నాకు ఎక్కడ గ్యాప్ ఇచ్చిందిరా.. ఇప్పుడు తినిపిస్తాను ఉండు అని పప్పులో ఫుల్లుగా నెయ్యి వేసి కలిపి ముద్దలు చేసి తినిపిస్తాడు.
రుద్రా కేరింగ్ కి అందరికీ చాలా సంతోషంగా అనిపిస్తుంది. శాంభవి పొట్ట పట్టుకుని నాకు చాలు అంటుంది.లాస్ట్ ముద్ద అని పెరుగు తినిపించి ఆ చేత్తోనే దిష్టి తీసి చెయ్యి కడుక్కుంటాడు.
అది చూసి సులోచన నోటి మీద చెయ్యి వేసుకుంటూ కొడుకుల వైపు చూస్తుంది. కొడుకుల మాత్రం సంతోషంగా ఒకరిని ఒకరు పట్టుకుంటారు.
సరిపోయింది సంబరం. ఇప్పుడు దాకా తండ్రులు, అన్నలే గారాబం చేసారు అనుకున్నాను. ఇప్పుడు రుద్ర కూడా తోడయ్యాడు.
ఇక మా శాంభవిని ఎవరూ పట్టుకోలేరు అంటుంది. ఆ మాటకు అందరూ నవ్వుతూ ఉంటే.. నానమ్మ అని గారంగా పిలుస్తుంది.
అంత గారం అవసరం లేదు కొంచెం తగ్గించు. మా మనవరాలు ఇలా గారంగా ఉంటేనే బాగుంటుంది అని తులసి హత్తుకుంటుంది.
అందరు సరదాలు, నవ్వుల మధ్యన ఆరోజు సందడి సందడిగా జరిగిపోతుంది.
శోభనం????
|