Thread Rating:
  • 25 Vote(s) - 3.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
Great going...
[+] 1 user Likes Sunny73's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Wonderful update
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
నాలో ఊపిరి -21



ఏంటి సార్ ఆలోచిస్తున్నారు.  ఒక చిన్న డౌట్ భవ్య.. ఆ సో కాల్డ్ పర్సన్ ప్రపోజ్ చేస్తే విశి ఒప్పుకుందా... హ్మ్.. ఏం చెప్పమంటారు సార్..

అప్పుడెప్పుడో..  వరదలు వచ్చినట్టుగా వాడు కాలేజీ నుంచి బయటికి వెళ్లేటప్పుడు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ తో ప్రపోజ్ చేశాడు.

ఇది ఒప్పుకోవాలా వద్దా అన్న డైలామా లో ఉండగానే.. నీకోసం జాబ్ చూశాను. ఆంటీ ట్రీట్మెంట్కి కావాలి కదా అని బ్లా బ్లా అని చెప్పి సెంటిమెంట్ వలకబోసాడు.

మళ్లీ వాడి మొఖం మేము చూడలేదు.  వర్క్ ఉన్నప్పుడు.. కాల్ చేసి స్వీట్ గా మాట్లాడుతూ వర్క్ ఇస్తాడు. ఈ పిచ్చిది చేసి పంపించిన తర్వాత చాలా మిస్టేక్స్ ఉన్నాయి .బట్ నువ్వంటే నాకు ఇష్టం.. అందుకే ఈ మిస్టేక్స్ అన్నిటిని ఈస్క్యూజ్ చేస్తున్నాను అనగానే..

ఇది నిజమే అనుకుని..  నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. గౌతమ్ కి నేను అంటే చాలా ప్రేమ.  అందుకే నాకు సపోర్ట్ చేస్తున్నాడు అనుకుంటుంది.

నేను ఎంత చెబుతున్నా ఆ మాయలోనే ఉండిపోతుంది. అది మాయ కాదు  భవ్య. ఒక రకమైన భయం. ఏమంటున్నారు సార్.

అవును.  వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాతే ప్రపంచాన్ని చూడడం మొదలుపెట్టింది.  చేతిలో డబ్బులు లేకుండా..  తల్లికి ట్రీట్మెంట్ చేయించుతూ ఒక ఆడపిల్ల నిలబడాలి అంటే...

ఈ సమాజం లో చాలా మంది అవకాశం కోసమే చూస్తారు. ఇక్కడ విశి కి కావాల్సినది..  ముఖ్యంగా తనని తాను కాపాడుకోవడం.. రెండోది తల్లికి ట్రీట్మెంట్ చేయించడం.

  వాడు తెలివిగా  విశిని టచ్ చేయకుండా నాలెడ్జ్ ని వాడుకుంటున్నాడు. అది అర్థం అవ్వక  ఆ ఇడియట్ ఎలా చెప్పినా వింటుంది.  ఆ మాటలు నిజం అనుకుంటుంది.

నా బాధ కూడా అదే సర్.  ఎలా బయటకు తీసుకురావాలో అర్థం కావడం లేదు. కాలేజీలో క్యాంపస్ సెలక్షన్స్ జరుగుతాయి కదా.. మీకు ఇంకా ఏమీ తెలియలేదా..

ఆ గౌతమ్ గాడు దీన్ని పాటిస్పేట్ చేయిస్తేనే కదా... ఏమంటున్నావ్..  నువ్వు బయట ఎక్కడ చేయవద్దు. నీ స్టడీస్ అవ్వగానే డైరెక్ట్గా నా కంపెనీకి వచ్చేయొచ్చు.

నీ స్కిల్స్ ని డెవలప్ చేస్తాను.  ఆఫ్టర్ వన్ ఇయర్ మన రిలేషన్ స్టార్ట్ చేద్దాం అని ఏదో కహనీలు చెబుతున్నాడు.

వాడు చాలా తెలివిగా మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ గేటు వైపు చూస్తారు. విశి వస్తూ కనపడుతుంది.

ఇద్దరూ సైలెంట్ అయ్యిపోతారు. విశి దగ్గరికి వచ్చి హాయ్ అని..  హలో సార్ అంటుంది. హౌ ఆర్ యు విశి..  గుడ్ సార్..

మీరేంటి... జాబ్ కన్ఫామ్ అయ్యిందా.. ఆల్మోస్ట్..
మీ ఫేస్ ఏంటి విశి ఈరోజు మంచి బ్రైట్ గా ఉంది. ఎనీ సంథింగ్ గుడ్ న్యూస్..

అవును.  మార్నింగ్ హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. అమ్మకి సంబంధించిన ట్రీట్మెంట్ అంతా ఫ్రీగా చేస్తామన్నారు.

కొన్ని టెస్ట్ లకి మాత్రమే ఫీజు తీసుకుంటున్నారు. అది కూడా చాలా నార్మల్ గా కట్టించుకుంటున్నారు.

భవ్య.  సంతోషంగా ఇది నిజంగా చాలా గుడ్ న్యూస్. అవును.  నాకు మంచి రోజులు స్టార్ట్  అయ్యాయి. అమ్మకి ట్రీట్మెంట్  జరిగి క్యూర్ అయిపోతే చాలు.

నిన్న నువ్వు ఎగ్జిబిషన్ టోకెన్స్  ఇచ్చావు. ఈరోజు అమ్మ ట్రీట్మెంట్ కి సంబంధించిన కాల్ వచ్చింది.  అంత మంచే జరుగుతుందనే కదా...

నీ మంచి మనసుకి ఎప్పుడు మంచే జరుగుతుంది. హలో.. ఇక్కడ నేను ఒకడిని ఉన్నాను గుర్తించండి. ఓ.. సోరి.. ఏదో మా ఆనందంలో మాట్లాడేసుకుంటున్నాము.

ఎగ్జిబిషన్ అంటున్నారు దేని గురించి... అదా ది గ్రేట్ అర్క్టెక్షర్ హిమగారి ఎగ్జిబిషన్... ఇప్పుడు వరుకు హిమ వర్క్ బయటికి రాలేదు.

ఫస్ట్ టైం ఎక్సపోజ్ చేస్తున్నారు. అవునా నేను అటెండ్ అవుతాను.  ఎప్పుడు..  కమింగ్ సండే.

మీరు స్టార్ట్ అయ్యే టైం కి నాకు కాల్ చేయండి.  నేను వస్తాను అని సూర్య నెంబర్ ఇస్తాడు. ఓకే సార్ బాయ్ అని చెప్పి వెళ్ళిపోతారు.

వెళుతున్న ఇద్దరినీ చూస్తూ మంచి ఫ్రెండ్షిప్...
ఈ అమ్మాయి కోసం ఏదైనా చేయాలి అనిపిస్తుంది.  విశి వర్క్ గురించి ఒకసారి నాన్నతో డిస్కస్ చేయాలి.

ఇలాంటివి నాన్న అయితేనే బాగా హ్యాండిల్ చేయగలుగుతారు. కాలేజ్ బయటికి వచ్చేటప్పటికి శ్రీకర్ అక్కడే ఉంటాడు.

ఎంతసేపు అయింది. ఇప్పుడే..  నువ్వేంటి కాలేజీ కి వచ్చావు.  పద అని సూర్య బైక్ స్టార్ట్ చేస్తాడు. ఎప్పుడు వెళ్లే కేఫిన్ కి వెళ్లి కూర్చుంటారు.

శ్రీకర్ కాఫీ తీసుకొచ్చి ఇచ్చి.. ఇప్పుడు చెప్పరా  ఏమిటి సంగతి... విశిష్ట గురించి తెలుసుకుందామని వచ్చాను. ఆ అమ్మాయిగురించి అంత స్పెషల్గా  తెలుసుకోవలసింది ఏముంది..

నైట్ నాన్న అమ్మ గురించి మాట్లాడుతూ విశి కూడా అలాగే ఉంది అన్నారు. ఆ మాట నా మైండ్ ని బాగా డిస్టర్బ్ చేసింది.

అందుకే కాలేజ్ కి వచ్చి భవ్యాని కలిసాను. నువ్వు అడగగానే చెప్పిందా.. అంతలేదు. వాళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్.

మన స్కిల్స్ అన్ని ఉపయోగించి మ్యాటర్ బయటకి లాగాను.  విశి గురించి తెలుసుకుంటే చాలా బాధగా అనిపించింది రా ...

  విశి విషయం టుకిగా చెబుతాడు. ఈ అమ్మాయి మరి ఇన్నోసెంట్ రా.. మన వైభవ్ పెట్టిన పేరు కరెక్ట్ గా సరిపోతుంది.

ఈ సండే ఏం ప్రోగ్రామ్స్ పెట్టొద్దు. మనం కూడా ఆ ఎగ్జిబిషన్ కి వెళ్ళదాము. తన టాలెంట్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా కష్టపడుతుంది.

సో మన వల్ల అయ్యే హెల్ప్ చేద్దాం. ఈ విషయం గురించి నాన్నతో కూడా డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు బావ నువ్వు విశి విషయం లో అంత కేర్ తీసుకుంటున్నావు.

ఏమో అది నాకు అర్థం కావడం లేదు. విశి బాధపడుతుంటే తట్టుకోలేకపోతున్నాను. అలాగని మా ఇద్దరి మధ్య ఏదైనా పరిచయం ఉందా అంటే అది లేదు.

ఒక పక్కన క్యూటిని వెతుకుతున్నాను.  మరొక పక్కన విశి డిస్టర్బ్ చేస్తుంది.  నాకు ఏమీ అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏమీ లేదు బావ.

క్యూటి నీకు చైల్డ్హుడ్ మెమొరీ... విశి ప్రెసెంట్... ఇంక  మూస్తావా అని సూర్య కోపంగా అంటాడు. అరేయ్ ఇప్పుడు నేను ఏమన్నాను.

నీ కన్ఫ్యూషన్ కి ఒక క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. నువ్వు ఇచ్చిన క్లారిటీ చాలు కానీ... ఈ కాఫీ చల్లారిపోయింది వెళ్లి ఇంకొక కాఫీ తీసుకురా..


ఏమిటో నిజాలు చెబుతున్న ఎవరికీ నచ్చడం లేదు అని పెదవి విరుస్తూ వెళ్లి మరొక కాఫీ తెచ్చి ఇస్తాడు. 

ఎదురు చూస్తున్న సండే రానే వచ్చింది... భవ్య తీసుకున్న డ్రెస్ వేసుకొని  తల్లి దగ్గరికి వెళ్లి ఈరోజు ఇంపార్టెంట్ వర్క్ మీద బయటకు వెళుతున్నాను.

నేను వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుంది. నా గురించి చూడకుండా నువ్వు భోజనం చేసేయ్.. అర్థం అవుతుందా.  అర్థమయింది కానీ ఆదివారం కాలేజ్ ఏముంటుంది రా...

  కాలేజ్ కాదమ్మా... నా చదువుకి సంబంధించిన ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది. అది చూడడానికి నేను, భవ్య వెళుతున్నాము అని తల్లికి అర్థం అయ్యే విధంగా చెబుతుంది.

అవునా ఒక్క నిమిషం ఉండు అని గదిలోకి వెళ్లి సూట్కేసులో నుంచి ఒక బాక్స్ తీసుకుని వచ్చి ఇస్తుంది. ఏమిటమ్మా...

నాన్నగారు ఎప్పుడు చెప్పేవారు కదా.. ఈ చైను మీ నాన్నగారి గుర్తు. నిన్ను ఎప్పుడు ఇది తీయొద్దు అనేవారు...

నువ్వే ఈ మధ్యన తీసేసి లోపలపెట్టావు. ముఖ్యమైన పనిమీద వెళుతున్నావు  కదా.. మెడలో వేస్తారు.  చైన్ చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది.

ఎందుకు ఏడుస్తున్నావు..  నాన్న గుర్తొచ్చారా.. వచ్చేస్తారు  ఏడవకు అని కన్నీళ్లు తుడుస్తుంది.. ఆ చేతిని ముద్దు పెట్టుకుని వెళ్ళొస్తాను.

నువ్వు జాగ్రత్త. బయటికి రావద్దు అని వంద జాగ్రత్తలు చెప్పి బయట లాక్ చేసుకుని వెళ్ళిపోతుంది.   విశి బయటకు వచ్చేటప్పటికి భవ్య స్కూటీ మీద రెడీగా ఉంటుంది.

సోరి లేట్ అయ్యాను.   నీ సోరిలు..  నీ పర్స్ లో పెట్టుకుని ఎక్కు ముందు... మళ్లీ లేట్ అవుతే నువ్వే గోల గోల చేస్తావు.

స్కూటీ ఎక్కుతూ దేవాగారికి కాల్ చేసావా..  హా చేశాను. వాళ్ళు బయలుదేరారు. మనం వెళ్లేలోపు  వచ్చేస్తామన్నారు.

ఇద్దరూ స్టాల్ జరిగే ప్లేస్ కి చేరుకుంటారు. ఆలోచిస్తున్న విశిని కదిపి ఏం ఆలోచిస్తున్నావు. దిగు. ఒకసారి గౌతమ్ కి కూడా కాల్ చేయాల్సిందేమో....
ఎందుకు..  ఎందుకు అంటావు ఏమిటి..  వచ్చేవాడు కదా.. రాడు... నిన్ను రానిచ్చేవాడు కాదు.  అలా అంటావు ఏమిటి...

గౌతమ్ ది కూడా ఈ ఫీల్డ్ ఏ కదా.. నేనెక్కడ మిస్టేక్స్ చేస్తున్నా నాతో పాటు తను ఐడెంటిఫై చేస్తాడు.  అప్పుడు నా వర్క్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది.

నడిచేదల్లా ఆగి విశి వైపు తిరిగి.. ఒక నమస్కారం చేసి ప్రపంచంలో ఆ గౌతమ్ ని నమ్మేది నువ్వొక్కదానివే... ఒక్క మాట చెప్పు..

ఈ టు ఇయర్స్ ఫోన్లో మాట్లాడడం తప్ప ఏ రోజైనా డైరెక్ట్ గా కలిసాడా.. చెప్పాడు కదా రూమర్స్ స్ప్రెడ్ అవుతాయని..

బయట కలిస్తే స్ప్రెడ్ అవుతాయి.. నిజంగా నీ మీద ప్రేమ ఉంటే ఆ రూమర్స్ రాకుండా ఎలాగైనా మీట్ అవ్వచ్చు. అంతెందుకు..  నిన్ను వాళ్ళింటికి తీసుకు వెళ్ళవచ్చు..

వాళ్ళ పేరెంట్స్ కి పరిచయం చేయొచ్చు.  అప్పుడు రూమర్స్ ఎలా స్ప్రెడ్ అవుతాయి...

ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు.  మనం ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చాము. దానిమీద మాత్రమే ఫోకస్ పెట్టు. ఏదైనా అడిగితే చాలు..  మాట దాటాయడంలో ముందు ఉంటావు.

అదిగో దేవాగారు,  శ్రీకర్ గారు వచ్చారు.  పద అని లాక్కొని వెళుతుంది.

హాయ్ సార్.. ఎప్పుడువచ్చారు. ఇప్పుడే.  ఏమిటి ఫ్రెండ్స్ ఇద్దరు గొడవ పడుతూ వస్తున్నారు..మా ఇద్దరికీ ఎప్పుడు ఉండేదే కానీ..  స్టార్ట్ అయినట్టు ఉంది వెళదామా...

నలుగురు లోపలికి వెళతారు. భవ్య చుట్టూ చూస్తూ విశి అని అరుస్తుంది.

భవ్య ఏం చూసింది...
[+] 7 users Like SivaSai's post
Like Reply
నాలో ఊపిరి -22


విశి అని గట్టిగా అరుస్తుంది. అబ్బా పక్కనే ఉన్నాను కదా.. ఎందుకే అరుపు.. అటు చూడు అని ఒక ఫ్రేమ్ ని చూపిస్తుంది.

అది చూస్తూ విశి బొమ్మలాగా బిగుసుకుపోతుంది. భవ్య  కదుపుతూ... ఏం చూస్తున్నావు..  ఇది ఇది అని టెన్షన్ గా అడుగుతుంటే...

హ అది నీదే..  దేవాగారు... మీకు ఈ వర్క్ చూపించాను కదా.. అవును ఇక్కడికి ఎలా వచ్చింది.  అదే మాకు అర్థం కావడం లేదు.

ఇది ఒక్కటేనా లేక ఇంకేమైనా ఉన్నాయా..  చెక్ చేయండి అని మొత్తం ఫ్రేమ్స్ చూస్తూ ఉంటారు. అవి చూస్తూ ఉంటే విశి కి కళ్ళు తిరిగినట్టుగా అనిపించి... భవ్యని గట్టిగా పట్టుకుంటుంది.

టెన్షన్ పడకు విశి..  ఇలా కూర్చొ.. అక్కడ ఒక చైర్ లో కూర్చోబెట్టి వాటర్ ఇస్తుంది.  వాటర్ తాగి కాసేపు కళ్ళు మూసుకొని ఉండిపోతుంది.

శ్రీకర్, దేవా కూడా విశినే చూస్తూ ఉంటారు. శ్రీకర్ మెల్లగా ఏం జరుగుతుంది రా... ఈ వర్క్ విశి చేసినదే...  ఇక్కడికి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదు.

ఇది ఒకటేనా లేక మిగిలిన ఫ్రేమ్స్ కూడానా..  తెలియదు తను మాట్లాడితే కానీ...

విశి కళ్ళు తెరిచి నా వర్క్ మొత్తం ఇక్కడికి ఎలా వచ్చింది భవ్య. అది నన్ను అడుగుతావేంటే... నువ్వే కదా చేసిన ప్రాజెక్ట్ స్ అన్ని గౌతమ్ కి ఇచ్చావు.

నా వర్క్ అంత సాటిస్ఫాక్షన్ గా లేదు అని చెప్పేవాడు కదా... మరి ఇక్కడ నా వర్క్ హిమ గారి పేరుతో ఉండడమేమిటి.. నాకసలు ఏమీ అర్థం కావడం లేదు.

ఒకసారి గౌతమ్ కి ఫోన్ చేస్తాను. ఎందుకు..  ఏదో కహాని చెబుతాడు. అవునా అని గొర్రె బిడ్డలాగా తల ఊపుతావు.

ప్లీజ్ భవ్య కాసేపు సైలెంట్ గా ఉండు అని గౌతమ్ కి కాల్ చేస్తుంది. గౌతమ్ నెంబర్ బిజీ బిజీ అని వస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు చేసినా సరే డిస్కనెక్ట్ అవుతూ ఉంటుంది. మెసేజ్ చేస్తుంది. అర్జెంటుగా కాల్ చెయ్ గౌతమ్ మాట్లాడాలి అని ...

స్టాల్ దగ్గర అంతా గోల గోల కింద ఉంటుంది హిమగారు వస్తున్నారు అందరూ సైలెంట్ గా ఉండండి అని అనౌన్స్ చేస్తారు.

వస్తున్న హిమని చూసి భవ్య నోరు వదిలేస్తుంది. నీస్ లెంగ్త్ ఫ్రాక్ వేసుకుని..  హెయిర్ లీవ్ చేసి హెవీ మేకప్ తో స్టైల్ గా నడుచుకుంటూ వస్తుంది.

భవ్య ని చూసి ఈసారి విశి కదుపుతుంది.. ఏమైందే అలా బిగుసుకుపోయావు. ఒసేయ్ పిచ్చి మాలోకమా..  ఆరోజు మాల్లో గౌతమ్ తో చూసింది ఈ అమ్మాయినే...

హిమగారు గౌతమ్ కి ఎలా తెలుస్తుంది. నువ్వు ఎవరో అనుకోని పొరపడినట్టు ఉన్నావు. నీ మొఖం.. ఉండు అని గేలరీ ఓపెన్ చేసి.. ఫొటోస్ చెక్ చేసి.. గౌతమ్ హిమ ఉన్న ఫోటో చూపిస్తుంది.

ఇప్పుడు చూసి చెప్పు... ఆ ఫోటో చూడగానే...  నాకు తలంతా తిరిగిపోతున్నట్టు ఉంది భవ్య.. అసలు ఏం జరుగుతుంది అని ఫోను వదిలేస్తుంది.

వెంటనే సూర్య ఫోన్ క్యాచ్ పట్టుకుంటాడు. సూర్య  ఆ ఫోటో చూసి.. వీడేనా గౌతమ్... అని అడుగుతాడు.  అవును దేవాగారు..

నేను ఫస్ట్ నుంచి చెబుతూనేఉన్నాను.  వాడు ఒక పెద్ద చీటర్ అని.. ఇదే నమ్మలేదు.

భవ్య నువ్వు కొంచెం కూల్ గా ఉండు.  అసలు ఏం జరుగుతుందో అన్నది చూద్దాం. తర్వాత ఏం చేయాలో అన్నది ఆలోచిద్దాం.

నీ ఫ్రెండ్  ని మాత్రం వదలకు. మీరిద్దరూ ఏమీ తెలియనట్టుగానే హిమతో మాట్లాడి ఆటోగ్రాఫ్ తీసుకోండి. వర్క్ గురించి డిస్కషన్ చేయండి.

నిజంగా ఆ అమ్మాయి టాలెంటెడ్ అయితే వర్కు గురించే మాట్లాడుతుంది.  ఆ విషయంలో హ్యాపీగా ఫీలవుతుంది. బట్ ఫ్రాడ్ అయితే గనక ఎలా ఎస్కేప్ అవ్వాలి అన్నది ఆలోచిస్తుంది.

సో మీరు అలా ప్రొసీడ్ అవ్వండి.  మిగిలింది నేను చూస్తాను. ఇంతకీ గౌతమ్ గాడి కంపెనీ పేరేమిటి...
గౌతమ్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పాడు.

ఓకే.. విశి నువ్వు డల్ అవ్వకు.  ఒక్కొక్కసారి మనకు ఎదురయ్యే సమస్య వల్ల మనం స్ట్రాంగ్ గా తయారవుతాము.

ఆ విధంగా నిన్ను నువ్వు తయారు చేసుకోగాని వీక్ అవ్వద్దు. అర్థమైందా..  నీతో మేమంతా  ఉన్నాము.

సూర్య శ్రీకర్ కి సైగ చేస్తాడు.  అర్థమైంది బావ అని శ్రీకర్ పక్కకు వెళ్లి ఎవరికో ఫోన్ చేసి మాట్లాడి వచ్చి ఫైవ్ మినిట్స్ లో ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది.

భవ్య... మీరిద్దరూ వెళ్లి హిమతో మాట్లాడడానికి ట్రై చేయండి.

రా విశి నువ్వైతేనే మాట్లాడడానికి కరెక్ట్... ఎందుకంటే ఆ వర్క్ గురించి  ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ నీకే తెలుసు.  కాబట్టి ఏ పాయింట్ అడిగితే తను మాట్లాడలేదో ఆ పాయింట్ మాట్లాడడానికి ఉంటుంది రా అని లాక్కుని వెళుతుంది.

వెళుతున్న ఇద్దరినీ చూస్తూ... శ్రీకర్..  సూర్యతో ఏంటి బావ ఇంత దారుణం.  ఒక ఆడపిల్ల వర్క్ ని వేరే వాళ్ళకి ఇవ్వడమా.. అది కూడా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న అమ్మాయి వర్క్.

సూర్య చేతులు కట్టుకుని..  నువ్వు టెన్షన్ పడకు. అసలు ఈ ప్రాబ్లంని విశిష్ట ఎలా హ్యాండిల్ చేస్తుందో చూద్దాము.  విశిష్ట వల్ల అవ్వనప్పుడు మనం హ్యాండిల్ చేద్దాము.

భవ్య విశి వెళ్లి హలో మామ్ అని పలకరిస్తారు. వెంటనే హిమ అసిస్టెంట్ మేడం ఎవరితోనూ మాట్లాడరు. అపాయింట్మెంట్ తీసుకోవాలి.

చిన్న ఇన్ఫర్మేషన్ కోసం అంతే...  మీలాగా అందరూ అడుగుతారు. మేడం ఇక్కడే లాక్ పడిపోతే ఎలా చెప్పండి.

ప్లీజ్.. మేము స్టూడెంట్స్ మి.  మీ వాల్యుబుల్ సజెషన్స్ మాకు బాగా యూస్ అవుతాయి. క్యాంపస్ సెలక్షన్స్ లో సెలెక్ట్ అవుతాము. ప్లీజ్ ప్లీజ్ అని భవ్య రిక్వెస్ట్ చేస్తుంది.

హిమ ప్రౌడ్ గా ఫీల్ అవుతూ..  అడగండి.. వెంటనే విశి ఆర్చిటెక్ట్ అండ్ ఆర్కిటెక్చర్ డిజైనర్ కి ఉన్న తేడా ఏమిటి మామ్...

ఆ క్వశ్చన్ కి హిమ తెల్ల మొఖం వేసుకొని చూస్తుంది. పోనీ చార్టర్డ్ ఆర్కిటెక్ అండ్ ఆర్కిటెక్చర్ డిజైనర్ కి ఉన్న తేడా ఏమిటి..

వర్డ్స్ డిఫరెంట్ కానీ వర్క్ అంతా ఒకటే..  ఇబ్బందిగా చెబుతుంది. అలా ఎలా ఒకటి అవుతుంది.  మాకు ఒక ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడిగారు.

మాకు అర్థం కాలేదు. అందుకనే మిమ్మల్ని అడుగుతున్నాము. మీరు చాలా ప్రొఫెషనల్ కదా... దీని గురించి బాగా తెలిసి ఉంటుంది.  ప్లీజ్ మామ్ హెల్ప్ చేయండి.

హిమ అసిస్టెంట్ వైపు చూస్తుంది.  వెంటనే ఫోన్ తీసుకుని హలో హలో అని...  మామ్ మీకు అర్జెంట్ ఫోన్ వచ్చింది. 

అవునా...  ఎవరూ అంటూ ఫోన్ తీసుకుంటుంది.  మీ డిజైన్స్ నచ్చి యూకే కంపెనీ మీతో టై అప్ అవ్వడానికి ట్రై చేస్తుంది కదా...

ఆ కంపెనీ సెక్రటరీ.. రోజుకి పదిసార్లు అయినా కాల్ చేస్తున్నారు. మీరు ఖాళీగా లేరు అని చెప్పినా వినడం లేదు.

మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడే వర్క్ స్టార్ట్ చేద్దాం అంటున్నారు. నేను మాట్లాడుతాను అని ఫోన్ పుచ్చుకుని పక్కకి వెళ్ళిపోతుంది.

అసిస్టెంట్ వెంటనే భవ్యతో చెప్పాను కదా..  మేడం చాలా బిజీ అని.. మీ అదృష్టం బాగుండి మేడంని మళ్ళీ కలిసే అవకాశం వస్తే.. అప్పుడు మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందురు గాని ఓకేనా అని స్పీడ్ గా వెళ్ళిపోతాడు.

భవ్య విశి సూర్య దగ్గరకి వస్తారు. ఏమయింది.. నేను చెప్పాను కదా దేవాగారు.  ఈ వర్క్ మొత్తం విశిదే..  ఏం అడుగుతున్నా సరే సమాధానం చెప్పలేకపోతున్నారు.

ఇదిగో మొత్తం రికార్డ్ చేశాను అని వినిపిస్తుంది. ఇది ఎప్పుడు చేసావే అని విశి అడిగితే..  తమరు ట్యూబ్ లైట్ కదా అందుకే నా జాగ్రత్తల్లో నేనున్నాను.

భవ్య చేతులు పట్టుకుని నిజంగా నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టమే... ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుంటే నీలాంటి ఫ్రెండ్ దొరికి ఉంటుంది.  ఇదిగో నువ్వు మరీ ఇంత సెంటి అవ్వకు...

నాకసలే చాలా తిక్కగా ఉంది.  ఆ గౌతమ్ ఎదురుపడిని..  వాడు చొక్కా పట్టుకుని నాలుగు గుంజి వాయించేయకపోతే అని పళ్ళు నూరుతుంది.

మీకెందుకు భవ్య అంతా స్ట్రెస్... ఈ ప్రాబ్లం విశిది. విశినే సాల్వ్ చేసుకోవాలి. ఏమంటావు విశిష్ట.

అవును దేవాగారు  నేనే ఫైట్ చేస్తాను.  అసలు గౌతమ్ ఏం చెబుతాడో చూస్తాను. విశి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే లిఫ్ట్ చేసి హలో అంటుంది.

ఎక్కడున్నావు విశి..  ఏమిటి అంత అర్జెంటుగా మాట్లాడేది. నువ్వెక్కడున్నావు గౌతమ్.  నేను ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కు సంబంధించి స్విట్జర్లాండ్  వెళ్ళాను.

నేను నిన్ను అర్జెంటుగా కలవాలి ఎప్పుడు కలుద్దాం.. పర్వాలేదు ఫోన్లో చెప్పు.. ఇది ఫోన్లో మాట్లాడుకునేది కాదు. డైరెక్ట్ గానే మాట్లాడాలి.  రాగానే కలుస్తాను.
 
ఉంటాను బాయ్ అని ఫోన్ పెట్టేస్తాడు. ఏమంటున్నాడు గురుడు అని భవ్య అంటే.. స్విట్జర్లాండ్ వెళ్ళాడంట. వచ్చాక కలుస్తాను అంటున్నాడు.

వీడి బొంద స్విట్జర్లాండ్ వెళ్లి ఏం చేస్తున్నాడు అంట.... హిమా దగ్గరికి ఒక పర్సన్ వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. హిమ టెన్షన్ చూసి... నాప్కిన్ తో హిమ నుదుటనా పట్టిన చెమటలు తుడుస్తాడు.

హిమ ఏదో చెబుతూ ఉంటే... వింటూ ఉంటాడు. భవ్య చూస్తూ ఉంటుంది కానీ ఫేస్ కనిపించదు.  ఆ పర్సన్ బ్యాక్ సైడ్ మాత్రమే కనపడుతూ ఉంటుంది.

విశి... విశి.. అని గోకుతుంది.  ఏమిటి..  ఈ బ్యాక్ పోర్షన్స్ చూస్తూ ఉంటే ఎక్కడో చూసినట్టు ఉంది... నీకేమైనా తెలుసా..  నాకు అలాగే అనిపిస్తుంది.

పద ముందుకు వెళ్లి చూద్దాం అని ఇద్దరూ వెళ్తారు. సూర్య శ్రీకర్ ఇద్దరు మాస్క్ వేసుకుని వీళ్ళిద్దరి వెనకాలే వెళతారు.
ఆ పర్సన్ దగ్గరిగా వెళ్లి ఎలా పలకరించాలో అర్థం కాక ఒకరి మొఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు.

విశి ఆ పర్సన్ వెనకాలే నిలబడి ఎక్స్క్యూజ్మీ సర్ అంటుంది.
ఎస్ అని వెనక్కి తిరుగుతాడు.

ఆ పర్సన్ ఎవరు...

కథ కొనసాగుతుంది...
[+] 8 users Like SivaSai's post
Like Reply
గౌతమ్
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply
wow nice update sir but i expected this one
[+] 1 user Likes shekhadu's post
Like Reply
Superb update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
Vishi is similar to Avani.
[+] 1 user Likes Sunny73's post
Like Reply
Past - 23



ఎక్స్క్యూజ్మీ  సార్ అని విశి అనగానే ఎస్ అని వెనక్కి తిరుగుతాడు. విశిని చూడగానే ఆ వ్యక్తి బిగుసుకు పోతాడు.

విశి నువ్వేంటి ఇక్కడ అని తడబడుతూ అడిగితే.. మాకు ఇండియాలో వేడి ఎక్కువయ్యి చల్లదనం కోసం స్విట్జర్లాండ్ వచ్చాము అని భవ్య వెటకారంగా చెబుతుంది.

ఆగు భవ్య..  ఏంటి గౌతమ్ స్విజర్లాండ్ నుంచి ఇంత ఫాస్ట్ గా తీసుకువచ్చిన  ఫ్లైట్ ఏది అని అడుగుతుంది.  ప్లీజ్ విశి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మాట్లాడటానికి ఏంటి ప్రాబ్లం.

చెప్పేది అర్థం చేసుకో విశిష్ట.  ఇప్పుడు చాలామంది విఐపిలు వస్తున్నారు. నీతో డిస్కస్ చేస్తూ కూర్చొనా..  అసలు నీకు ఇక్కడ ఏం పని అని ఉంది అది చెప్పు.

హిమ గౌతమ్ పక్కకి వచ్చి..  ఎవరు గౌతమ్... ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా...
అంత ముఖ్యమైన పర్సన్ ఏమి కాదు. జాబ్ కోసం రిక్వెస్ట్ చేస్తుంది. ప్రజెంట్ వేకెన్సీస్ లేవు అని చెబుతున్నాను.

అవునా..  మా గౌతమ్ చాలా బిజీ.  మీరు కంపెనీకి మెయిల్ చేయండి.  ఎప్పుడైనా వేకెన్సీస్ ఉంటే మీకు ఇన్ఫార్మ్ చేస్తారు.

విశి అలాగే చూస్తూ ఉంటుంది.  భవ్య వెంటనే మీరు గౌతమ్ సార్ కి ఏమవుతారో తెలుసుకోవచ్చా... గౌతమ్ కోపంగా ఇప్పుడు ఇవన్నీ మీకు అవసరమా..

ప్రొఫెషనల్ లైఫ్ లోకి పర్సనల్ లైఫ్ ఎందుకు తీసుకోవస్తున్నారు. అయ్యో సార్ మీలాంటి సెలబ్రిటీస్ గురించి తెలుసుకుంటే ఏదో మాకు అదోక తృప్తి.

మీరు చెప్పండి మేడం..  మీలాంటి బ్యూటీ ఇలాంటి సార్ పక్కన ఉంది అంటే సంథింగ్ సంథింగ్ అని అడుగుతుంది. హిమ సిగ్గుపడుతూ చేతితో జుట్టుని చెవి వెనక్కి తోసుకుంటూ..  త్వరలో మేము పెళ్లి చేసుకోబోతున్నాము.

మా ఎంగేజ్మెంట్ డేట్ కూడా ఫిక్స్ అయ్యింది అని చెబుతుంది.  వావ్.. సూపర్ జోడి మామ్.. కంగ్రాట్స్ అని విశి వెళదామా అంటుంది.

అలాగే చూస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. గౌతమ్ తల పట్టుకుంటాడు.  ఏమైంది డార్లింగ్ అని అడిగితే...  ఇప్పుడు అవసరమా..  మన పర్సనల్ లైఫ్ గురించి ఇక్కడ చెప్పడం.

అరే ఇప్పుడు ఏమైందని నువ్వు అంత టెన్షన్ పడుతున్నావు.. నథింగ్ ఏమీ లేదు పద అని చేయి పట్టుకుని తీసుకువెళతాడు.

విశి మౌనంగా బయటికి వచ్చేస్తుంది.   వెనకాలే మిగిలిన ముగ్గురు వచ్చేస్తారు.  పక్కనే ఉన్న టీ స్టాల్ దగ్గర కూర్చుని సూర్య టి ఆర్డర్ ఇస్తాడు. మౌనంగా టీ తాగుతున్న విశి ని చూసి ఏంటి తెగచించుతున్నావు...

ఏమి లేదు దేవాగారు.. రేపు వచ్చే సమస్యని ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తున్నాను.  దేని గురించి మాట్లాడుతున్నావు.

గౌతమ్ గురించి..  వాడు గురించి మాట్లాడడానికి ఏముంది అని శ్రీకర్ చిరాగ్గా అంటాడు.  శ్రీకరర్ వైపు చూస్తూ ఇన్ని రోజులు నా వర్క్ బాగోలేదు ఏమో...

నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. నిజంగానే నాకు హెల్ప్ చేస్తున్నాడు అనుకున్నాను. బట్ ఈరోజు అర్థమయింది నా వర్క్ చాలా బాగుంటుంది అని ...

గౌతమ్ ఫియన్స్ కోసం నా దగ్గరికి వస్తాడు.  ఏదో ఒక స్టోరీ చెప్పి వర్క్ చేయించుకోవడానికి చూస్తాడు  . చెయ్యను అని చెప్పేయ్ సరిపోతుంది అని భవ్య అంటుంది.

అలా చెబితే ఏమొస్తుంది... అంటే ఏమిటి.. ఇంకా ఆ వేస్ట్ ఫెలో గాడికి నీ వర్క్ ఇస్తాను అంటున్నావా... ఇస్తాను కానీ ఇలాగా కాదు..  నువ్వేం చెప్పాలి అనుకుంటున్నావో క్లియర్ గా చెప్పు నాకేమీ అర్థం కావడం లేదు.

సింపుల్ భవ్య... ఇప్పుడు నేను చెయ్యను అన్నాను అనుకో వెంటనే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడానికి చూస్తాడు.  అప్పటికి లొంగకపోతే అమ్మ ట్రీట్మెంట్ విషయంలో ఏదైనా చేయడానికి చూస్తాడు.

నాకు కావాల్సింది అమ్మ ట్రీట్మెంట్ కూల్ గా జరిగిపోవడం. ఖచ్చితంగా కలిసినప్పుడు ఓపెన్ అవుతాడు.  అప్పుడు నేను ఒక బిజినెస్ డీల్ కిందే మాట్లాడతాను.

అది కూడా నార్మల్ వర్క్ ఇస్తాను.. నేను ఏ వర్క్ ఇచ్చినా సరే గౌతమ్ తీసుకుంటాడు. ఎందుకంటే అతను ఫియాన్సీ నాలెడ్జ్ సున్న.

నిన్ను గౌతమ్ చీట్ చేశాడని బాధగా లేదా అని భవ్య అడుగుతుంది.  ఒక నిమిషం సైలెంట్ గా ఉండి ఏమో....
మొదటి నుంచి కూడా గౌతమ్ విషయంలో నేను పాజిటివ్గా రెస్పాండ్ అవ్వలేకపోయాను.

నేనున్నా సిచువేషన్ లో హెల్ప్ చేస్తున్నాడు అనుకున్నాను. మిస్ యు..  లవ్ యు అంటే నిజమే అనుకున్నాను.

కానీ నా మనసు మాత్రం స్పందించలేదు. నేనున్నా పరిస్థితులను బట్టి అలాగున్నానేమో అనుకున్నాను. ఈరోజు కూడా వాళ్ళిద్దర్నీ పక్కపక్కన చూసినప్పుడు కూడా నాకేమీ అనిపించలేదు.

కాకపోతే ఒకటే    బాధ.. ఏమిటే అంటే... ఎందుకు మనుషులు ఇంత దారుణంగా ఉంటున్నారు.  చీట్ చేయడానికి చూస్తున్నారు.

దీనివల్ల ఏమిటి ఉపయోగం.  ఏమొస్తుంది. తాత్కాలికమైన సంతోషం కోసం ఎదుటి మనిషిని బాధ పెడుతున్నారు.  అది తప్పు అనిపించడం లేదా అని కన్నీళ్లు పెట్టుకుంటుంది.

విశి కన్నీళ్లు చూడగానే సూర్య కదిలిపోతాడు. పిడికిలి బిగించి కోపంగా ఉంటాడు.  భవ్య వెంటనే విశిని హాగ్ చేసుకుని... పిచ్చిదానా నీలాంటి బంగారాన్ని దూరం చేసుకున్నందుకు వాడు ఏడవాలి.

నీకు నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాను వాడిది ప్రేమ కాదే ట్రాప్ చేస్తున్నాడు అని... నువ్వే నమ్మలేదు.  ఆ మాటకి విశి నవ్వుతూ.. ఆ పరిస్థితుల్లో నమ్మడం నమ్మకపోవడం అన్నది ఉందా...

అది నిజమేలే..  ఆ రాస్కెల్ ఈ టూ ఇయర్స్ నుంచి నీకు కనపడకుండా ఫోన్లో మెయింటైన్ చేయడం  నీ మంచికే లేకపోతే రోజు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఏదో ఒక రోజు నువ్వు డిస్టర్బ్ అయ్యేదానివి..

అది నిజమేలే అని...  చైన్ పట్టుకొని థాంక్యు నాన్న అంటుంది. అంకుల్ కి ఎందుకు థాంక్స్ చెబుతున్నావు.
హ్మ్... స్టాల్ కి బయలుదేరేముందు నాన్న గుర్తుగా మిగిలిన ఈ చైన్ ఇచ్చి వేసుకోమని చెప్పింది.

నాన్న మాకు దూరమైన తర్వాత ఈ చైన్ తీసేసాను..మళ్ళీ ఈ రోజే పెట్టుకున్నాను.  ఇది నా మెడలోకి రాగానే నాకు చాలా మంచి జరిగింది.

అలాగైతే ఈ చైన్ ఎప్పుడు నీ మెడలోనే ఉంచుకో..చిన్నగా నవ్వుతుంది... ఈ నవ్వు చాలే బాబు ...

థాంక్యూ దేవాగారు, శ్రీకర్ గారు అని చెబుతోంది. హలో ఈ గార్లు తీసేయ్ తల్లి... వినలేకపోతున్నాము. నువ్వు అలా పిలుస్తూ ఉంటే మేమేదో ఏజ్ బార్ పర్సన్స్ లాగా అనిపిస్తుంది.

సూర్య మాత్రం విశినే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు.  ఆ పెదాలు నవ్వుతున్నాయి కానీ కళ్ళల్లో అంతులేని బాధ కనిపిస్తుంది.  అది సముద్రానికి మించిన లోతు అని అర్థమవుతుంది.

ఎలా విశి బాధ పోగొట్టాలి అనే ఆలోచనతో...  ఇప్పుడే వస్తాను అనే పక్కకి వెళ్లి విక్రమ్ కి కాల్ చేస్తాడు. చెప్పరా.. డాడ్ నాకు తెలిసిన ఒక అమ్మాయికి జాబ్ ఇవ్వాలి..

ఎవరూ విశిష్టానా.. అవును.. ఇంకా స్టడీస్ అవ్వలేదు ఏమో.. సిచువేషన్ మొత్తం చెప్తాడు. ఓ అవునా సరే అయితే మన కంపెనీకి అప్లై చేయమను.

నేను చూసుకుంటాను. ఓకే థాంక్యూ అని చెప్పి వచ్చి కూర్చుంటాడు. క్యాజువల్ గా మాట్లాడుతూ విశి.. మీరు జైసింహ కంపెనీలో జాబ్ కి అప్లై చేయొచ్చు కదా...

అమ్మో అది చాలా పెద్ద కంపెనీ.. నాకు ఇస్తారా..  వస్తుందా అంటుంది. ముందు నీ ప్రయత్నం నువ్వు చేయాలి కదా.. ఏమో నీ టాలెంట్ కి అదే బెస్ట్ కంపెనీ అవ్వచ్చు ఏమో.. ఎవరికీ తెలుసు.

ముందు నిన్ను నువ్వు నమ్ముకో. తర్వాత ఏదైనా సరే.. వేకెన్సీస్ ఉన్నాయి ఈ కంపెనీలో. భవ్య డౌటుగా చూస్తూ మీకెలా తెలుసు సార్.

మేము కూడా జాబ్ సెర్చింగ్ లో ఉన్నాము.  ఆ మాత్రం తెలియదా అని శ్రీకర్ సమాధానం చెబుతాడు.. అవును కదా మర్చిపోయాను. మాకు గుర్తు ఉందిలే.. 

ఇంటికి వెళ్లగానే అప్లై చేస్తాను.  ఇప్పుడు ఏమైనా రాహుకాలం ఉందా ఏమిటి.. అర్థం కాక ఏమన్నారు.. ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు వెంటనే చేసేయాలి.

మీనవేషాలు లెక్కిస్తూ పోస్ట్ పోన్ చేయకూడదు.. నీ దగ్గర మొబైల్ ఉంది కదా తీసుకుని అప్లోడ్ చెయ్.. ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేస్తాను అని పక్కనే కూర్చుంటాడు.

సక్సెస్ఫుల్గా అప్లోడ్ చేయించి గుడ్.. రెస్యూమ్ ఫార్వర్డ్ చేశాము.  ఆ కంపెనీ నుంచి మెయిల్ రాగానే వెంటనే వెళ్ళు అర్థమైందా.. అర్థమయింది సార్ అని తల ఊపుతుంది.

శ్రీకర్ ఇద్దరిని చూస్తూ నో డౌట్...వీడు తెలియకుండానే విశిష్టకి దగ్గర అవుతున్నాడు.  ఒక పక్కన క్యూటీ కోసం వెతుకుతున్నాడు.

క్యూటి కూడా వీడుకోసమే చూస్తూ ఉంటే..  నారీ నారీ నడుమ మురారి పరిస్థితా ఏమిటి నా ఫ్రెండ్ కి అని ఒకసారి సీను ఊహించుకుని..  అమ్మో అలాగా మాత్రం వద్దు.

ఒక భార్యే ముద్దు.   సరే ఇంకా మేము వెళతాము.  ఎక్కువ ఆలోచించద్దు విశిష్ట.  ఏది జరిగిన మన మంచికే అనుకో.. అని జాగ్రత్తలు చెబుతాడు.

నేను ఫైన్ సార్.. ఇలాంటి వాటి గురించి ఆలోచించే అంత టైం నా దగ్గర లేదు. ఒన్స్ అగైన్ థాంక్యూ. యువర్ వెల్కం అని నవ్వుతారు.

నలుగురు నవ్వుకుంటూ అడుగులు ముందుకు వేస్తూ ఉంటే... అడ్డుగా ఒక ఆకారం వచ్చి నిలబడుతుంది. విశిష్ట ఉలిక్కిపడి వెనక్కి అడుగు వేయబోయి..  పడబోతే...

జాగ్రత్త అని ఒక పక్కన సూర్య.. మరో పక్కన భవ్య పట్టుకుంటారు. తమాయించుకుని నిలబడి ఎవరా అని చూస్తే గౌతమ్ ఉంటాడు.

కోపంగా విశిని, పక్కనే ఉన్న సూర్యని చూస్తూ ఉంటాడు. భవ్య చిరాకుగా నువ్వా అంటే.. ఏ ఇంకా నీకోసం మహేష్ బాబు వచ్చాడు అనుకున్నావా..

మేము అలాంటి గాలిలో మేడలు కట్టంగాని.. ఏమిటి నీ ఫియాన్సీ ని వదిలేసి ఇటు వచ్చావు అని వెటకారంగా అడుగుతుంది.

భవ్య నువ్వు కాసేపు సైలెంట్ గా ఉంటే మంచిది..విశిష్ట నేను నీతో మాట్లాడాలి ప్లీజ్ అంటాడు.
ఏం మాట్లాడాలి మిస్టర్ గౌతమ్ అని అడిగితే... మిస్టర్ గౌతమ్ అని ఆశ్చర్యంగా నోరు వదిలేసి చూస్తాడు...

గౌతమ్ ఏం మాట్లాడాలి అనుకుంటున్నాడు...
విశిష్ట రియాక్షన్...
[+] 9 users Like SivaSai's post
Like Reply
Part - 24



మిస్టర్ గౌతమ్.. కొత్తగా పిలుస్తున్నావ్ ఏమిటి... పరిచయం లేని వ్యక్తులను రెస్పెక్ట్ తో పిలవాలి కదా..  అంతకు ముందు గౌతమ్ గారు అనే దానివి కదా... మరి ఇప్పుడేమిటి...

మా ఊరు సైడ్ అయితే అలాగే పిలిచేదానిని.. కానీ మీది అంతా డిఫరెంట్ కల్చర్ కదా అందుకే మీకు అనుకూలంగా ఉండే రెస్పెక్ట్ తో పిలుస్తున్నాను.

ప్లీజ్ విశిష్ట.. ముందు నేను చెప్పేది విను అని చెయ్యి పట్టుకోకబోతే వెనక్కి జరుగుతుంది.  ఓకే కూల్... పర్సనల్గా మాట్లాడాలి.

ఏం మాట్లాడాలి అన్న మా ముందే మాట్లాడు అని భవ్య అంటే..  భవ్య... ఇది పూర్తిగా నాకు విశిష్ట కి సంబంధించిన విషయం.

మధ్యలో నువ్వు ఎంటర్ అవ్వకపోతే మంచిది.  అవునా ఇది నా ఫ్రెండ్ లైఫ్ కి సంబంధించిన విషయం నేను కాకపోతే ఇంక ఎవరు ఎంటర్ అవుతారు.

నువ్వు ఆగు భవ్య.. ఏం మాట్లాడాలనుకుంటున్నావు. ప్లీజ్ విశిష్ట ఒక్క ఫైవ్ మినిట్స్ నాకు టైం ఇవ్వు.. సరే రా అని అక్కడ సపరేట్గా ఉన్న బెంచ్ దగ్గర కూర్చుంటుంది.

ఇక్కడ అంటే నా బడ్జెట్ కి ఇక్కడే వస్తుంది. చెప్పాలి అనుకుంటే చెప్పు లేకపోతే నీ ఇష్టం.

గౌతమ్ తప్పక అక్కడే కూర్చుని నువ్వు చూసింది అబద్ధం. ఇంకా... నన్ను నమ్ము నేను నిన్నే ప్రేమించాను. మరి హిమతో పెళ్లి...

హిమ కొద్ది రోజుల్లో చనిపోబోతుంది అందుకే తన ఆఖరి కోరికగా నాతో పెళ్లి. అవునా మరి నా వర్క్ అంత హిమ పేరు మీదకి ఎలా వెళ్ళింది..

  నీకు ఇప్పుడే నేమ్ వస్తే వర్క్ కన్నా ప్రైడ్ ఎక్కువ అవుతుంది. అది నీ కెరియర్ కి మంచిది కాదు అని నీళ్లు నమ్ములుతూ ఉంటాడు.

ఓ.. మంచిది కాదు అని నాకు రావాల్సిన క్రెడిట్ అంతా వేరే వాళ్ళకి ఇచ్చావ్ అన్నమాట... మరి నిజంగా నా మీద నీకు ప్రేమే ఉంటే ఆ వర్క్ అంత నువ్వు హోల్ చేసి ఉంచి ఎప్పుడు రిలీజ్ చేస్తే మంచిదో అప్పుడే ఎక్స్పోజ్ చేసే వాడివి.

నువ్వు అలా చేయలేదు.  నా వర్క్ మొత్తం నీ ఫియాన్సీ కి ఇచ్చావు.  తనని హైలైట్ చేసావు ఎందుకో తెలుసుకోవచ్చా...

చెప్పాను కదా కొన్ని రోజుల్లో చనిపోబోతుంది.  తన ఆఖరి కోరిక తీర్చాలని అంతే.  నా జీవితంలో ప్రేమించిన ఒకే ఒక అమ్మాయివి నీవు.

శ్రీకర్ భవ్య పక్కన నిలబడి ఇదంతా చూస్తూ ఉంటాడు.  ఏం చెబుతున్నాడు వీడు.  ట్రాప్ చేయాలనుకున్నవాడు 100 చెబుతాడు. మనం పడకుండా ఉండడం ఇంపార్టెంట్ అని సూర్య అంటాడు.

శ్రీకర్ కి విసుగు వచ్చి మనం ఇక్కడ కూర్చుందాం నిలబడి నిలబడి కాళ్లు లాగుతున్నాయి అని ముగ్గురు ఒకచోట కూర్చుంటారు.

శ్రీకర్ భవ్యని చూస్తూ విశికి వాళ్ళ నాన్నగారంటే చాలా ఇష్టం అనుకుంటా.. దానికన్నా ఇంకా ఏదైనా పదం ఉంటే వాడొచ్చు.

అవునా.. ఇందాక ఏదో చెబుతుంది. మీరు విన్నారా.. చూసారా.. మరి లేడీస్ మెడలో ఏం చూస్తాము.  అందులో తను చున్నీ వేసుకున్న డ్రస్సు..  ఎలా కనపడుతుంది.

క్లారిటీ కోసం అడుగుతున్నాము. వాళ్ళు డిస్కషన్ అయ్యేలోపు మాకు కూడా టైం పాస్ అవుతుంది కదా.. మీకు టైం పాస్ అవ్వడానికి నా ఫ్రెండ్ స్టోరీ చెప్పాలా...

ఏదైతే ఏమిటి ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్ అంటారు కదా...  సూర్యా కూడా భవ్య ఏం చెబుతుందా అని చూస్తూ ఉంటాడు.

విశి నాన్నగారు 4వ సంవత్సరం ఏజ్ లో ఆ చైన్  ఇచ్చారంట.  అప్పటినుంచి విశి దగ్గరే ఉంది.  లాస్ట్ ఇయర్ అంకుల్ చనిపోయినప్పుడు...  ఎటు చూసినా ఫైనాన్షియల్ ఇబ్బందే.

మెడలోనే ఉంటే ఎక్కడా చైన్ అమ్మాల్సివస్తుందో...  వాళ్ళ నాన్నగారు గుర్తుగా ఉన్నది పోగొట్టుకోవడం ఇష్టం లేక చైన్ తీసేసింది.

ఆ చైను చాలా సెంటిమెంటు. వాళ్ల నాన్నగారు ఎప్పుడూ చెప్పేవారు అంట.. ఎప్పుడు తీయొద్దు.  ఇంపార్టెంట్ పని మీద వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నీ దగ్గర ఉంచుకో అని..

ఈరోజు అనుకోకుండా వాళ్ళ అమ్మగారు ఇస్తే వేసుకుని వచ్చింది. అదే చెప్పింది. ఒక చైన్ కి కూడా ఇంత స్టోరీ ఉంటుందా అని అడిగితే ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళవి.

అది నిజమేలే.. ఏమంటావు బావ. చిన్న నవ్వే సమాధానం.
నా జీవితంలో ప్రేమించిన ఒకే ఒక అమ్మాయివి నువ్వు విశి నమ్ము.. నిజంగా నువ్వు నన్ను ప్రేమించి ఉంటే నాపైన నమ్మకం ఉండేది.  ఇది విషయం అని ముందే నాకు చెప్పేవాడివి.

నీకు చెప్పాలని అనుకున్నాను కానీ నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఈ ప్రాబ్లం కూడా ఎందుకు అని చెప్పలేదు. అవునా.. పోనీ ఒక పని చెయ్యి మీ ఇంటికి వెళదాము.

మీ పేరెంట్స్ కి నేనెవరో పరిచయం చేయి. నా మాట మీద నమ్మకం లేదా అని బాధగా అడుగుతాడు.. ఎలా నమ్మమంటావు..

ఫోన్ చేస్తే స్విజర్లాండ్ లో ఉన్నాను అని చెప్పావు. ఆ అమ్మాయితో వీళ్ళెవరో మాకు తెలియదు అని చెప్పావు.
ఇన్ని రోజులు నా వర్క్ బాగోలేదు.  నీ మీద ప్రేమతో నీకు సపోర్ట్ ఇస్తున్నాను అంటే నిజమే అనుకున్నాను.

   నా వర్క్ కి ఇంత డిమాండ్ ఉంది అని ఈ రోజే అర్థమయింది.  ఇంత చిన్న వయసులో పాపులర్ అయిన హిమ గారిని కలిసి నా డౌట్స్ క్లారిఫై చేసుకోవాలని ఇక్కడికి వచ్చాను.

అలా రావడం మంచిదయింది కదా..  నీ నిజ స్వరూపం కూడా నాకు తెలిసింది. ఎందుకు విశి ఏదేదో ఊహించుకుని మాట్లాడుతున్నావు.

చెబుతుంటే అర్థం కావడం లేదా... త్వరలో చనిపోబోతుంది.  అందుకునే ఈ పెళ్లి. తను నన్ను ఎప్పటినుంచో ప్రేమించింది.

ఎలాగా కాదంటాను చెప్పు..  అవునా ఒకవేళ తన అదృష్టం బాగుండి బ్రతికితే అప్పుడేం చేస్తావు.  మీ పెళ్లిని కంటిన్యూ చేస్తావా...

గౌతమ్ ఏమి మాట్లాడలేకపోతాడు.  ఏమీ చెప్పవేమిటి తను ఇప్పుడు ఒక సెలబ్రిటీ కూడా కదా... మరి డబ్బు ఫేమస్ అన్నీ కలిసి ఉన్న అమ్మాయిని వదిలేసుకొని నాకోసం రాగలుగుతావా...

ఇప్పుడా విషయాలన్నీ ఎందుకు.  ఎప్పటిలాగానే నువ్వు వర్క్ చేసి ఇవ్వు. అమ్మకి ట్రీట్మెంట్ కి కూడా కావాలి కదా.. అనవసరమైన డిస్కషన్ తో నీ మైండ్ పొల్యూట్ చేసుకుని నాకు దూరం జరిగితే నీకే నష్టం.

ఇప్పటిదాకా బ్రతిమాలావు. నేను లొంగక పోయేటప్పటికి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావు.  నువ్వు మొదటినుంచి కూడా నన్ను ఇలాగే కదా బ్లాక్మెయిల్ చేశావు.

అప్పుడు అంటే నాకు పరిస్థితులు అర్థం కాక నువ్వు చెప్పింది నిజమో అనుకున్నాను కానీ... ఇప్పుడు కూడా నీ బ్లాక్ మెయిల్ కి ఎలా లొంగుతాను అనుకుంటున్నావు.

ఇది బ్లాక్ మెయిల్ కాదు విశిష్ట... నిజం.. బ్యాక్ గ్రౌండ్ లేదు ట్రీట్మెంట్ కి మనీ కావాలి.. ఎంత రెస్టారెంట్లో పని చేస్తే మాత్రం ఆ డబ్బులు ఎలా సరిపోతాయి.

హిమనీ హైలెట్ చేయడం నాకు చాలా ఇంపార్టెంట్.  ఎందుకో తెలుసుకోవచ్చా.. నీ దగ్గర దాయాల్సిన అవసరం లేదు.  చెబుతాను జాగ్రత్తగా విను.

హిమ ఫాదర్.. మా ఫాదర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్.  అలాగే బిజినెస్ లో ఇద్దరిదీ మంచి రిలేషన్.  హై సొసైటీ ఫ్యామిలీస్..  మేమిద్దరం పెళ్లి చేసుకుంటే మా రిప్యుటేషన్ ఇంకా పెరుగుతుంది.

మరి నన్నేం చేద్దాం అనుకుంటున్నావు. నీ దగ్గర అందం ఉంది వర్క్ ఉంది అంతకు మించి ఇంకా ఏముంది.  నిన్ను పెళ్లి చేసుకున్న లైఫ్ లో నేను ఎదగడం కష్టం.

కానీ నీ వర్క్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. అందుకే ఇదే కంటిన్యూ చేద్దాం. నేను నీకు వర్క్ ఇస్తానని ఎలా అనుకుంటున్నావు.

కమాన్ విశిష్ట చిన్న పిల్లలాగా మాట్లాడకు. నాకు కావాల్సింది వర్క్.  నీకు కావాల్సింది మనీ.  సో ఇద్దరం ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాము. నేను ఎవరి నేమ్ పెట్టి ఎక్స్పోజ్ చేస్తే నీకెందుకు...

నువ్వు అన్నది కూడా నిజమే కానీ ఇప్పుడు నాకు మనీతో అంత అవసరం లేదు.  కాబట్టి నా వర్క్ ని నేను బిజినెస్ లెవెల్ లోనే ఎక్స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాను.

ఆ మాటకి గౌతమ్ గట్టిగా నవ్వుతాడు. కళ్ళల్లోంచి నీళ్లు కూడా వచ్చేస్తూ ఉంటాయి. విశిష్ట చేతులు కట్టుకొని కూర్చుని అలానే చూస్తూ ఉంటుంది.

దూరం నుంచి చూస్తున్న ముగ్గురికి..  అసలు ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉంటుంది .  వాడేమో పిచ్చోడు లాగా నవ్వుతున్నాడు. విశి ఏమో సైలెంట్ గా చూస్తుంది.

వినాల్సిందే అని భవ్య అంటే...  నీ ఫ్రెండ్ ని ప్రాబ్లం ని హ్యాండిల్ చేసుకోవడం అలవాటు చేసుకోనివ్వు.  నువ్వు దూరద్దు అని సూర్య అంటాడు..

అది అమాయకురాలు ఏమీ తెలియదు. తెలుసుకొనివ్వు. ప్రపంచం తెలియాలి. అక్కడ ఏం జరుగుతుందో తెలియకపోతే టెన్షన్ తో నా నరాలు చిట్లుపోతాయి.

నీ ఫోన్ ఇవ్వు.  దేనికి..  అబ్బా ఇవ్వు అని సూర్య ఆ నెంబర్ కి ఫోన్ చేసి సైలెంట్లో పెడతాడు.  ఏం చేస్తున్నావు. కాసేపు మాట్లాడకుండా ఉండు అని వాళ్ళిద్దరూ పక్కనుంచి వెళుతూ సైలెంట్ గా విశి పక్కన.. చూడకుండా ఫోన్ పెట్టి వాష్రూమ్ లోకి వెళ్తాడు.

మళ్ళీ అలాగే వెళ్లి భవ్య దగ్గర కూర్చుంటాడు.  ఫోన్ స్పీకర్లో పెట్టి ఇప్పుడు విను అంటాడు.

గౌతమ్ నవ్వి నవ్వి ఈ మధ్యకాలంలో నేను విన్న బెస్ట్ జోక్ ఇదే.. ఏమిటి బిజినెస్ స్టార్ట్ చేస్తావా.. నీ వర్క్ నేను కాకుండా ఎవరైనా తీసుకుంటారా.  తీసుకొనిస్తానా..

చూడు విశి ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ మాట్లాడేశావు. నువ్వు ఎప్పటికీ నా కోసము మాత్రమే ఉండాలి.  నీ అందం, వర్క్ పూర్తిగా నాకోసం మాత్రమే.

ఏమిటి నీ ఉద్దేశం... ఇంతవరకు వచ్చింది కాబట్టి ఓపెన్ గా చెబుతున్నాను విను. ఫస్ట్ రోజు నిన్ను చూసినప్పుడే నా మైండ్ లోకి ఎక్కేశావు.

ఎప్పుడెప్పుడు నిన్ను తెచ్చుకోవాలా అనుకున్నాను.. కానీ నీ పద్ధతి చూశాక అర్థమైంది నువ్వు ఆ టైపు కాదు అని. అందుకే ప్రేమను వలకబోసాను.

అది అంత ఫాస్ట్.  ఇప్పుడు నేను ఒక బిజినెస్ మ్యాన్ ని. సో నీ వర్క్ చూసిన తరవాత నిన్ను అస్సలు వదులుకోకూడదు అనుకున్నాను.

అందుకే నీతో ఫోన్లో మాట్లాడుతూ నిన్ను నా గ్రిప్ లో పెట్టుకున్నాను.  హిమతో నా లైఫ్ చాలా రాయల్ గా ఉంటుంది.  నువ్వు నాకోసం చేస్తూ ఉంటే నా బిజినెస్ కూడా పెరుగుతుంది.

అలాగే నీ అందం కూడా నా సొంతం అవుతుంది.
మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే నేను నీకు ఎలా సొంతం అవుతాను.

గౌతమ్ సమాధానం...
కథ కొనసాగుతుంది...
[+] 9 users Like SivaSai's post
Like Reply
Superb update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
Fraud is getting exposed
[+] 1 user Likes Sunny73's post
Like Reply
(07-04-2026, 02:55 AM)SivaSai Wrote:
Part - 24



... 


అలాగే నీ అందం కూడా నా సొంతం అవుతుంది.
మీరిద్దరూ పెళ్లి చేసుకుంటే నేను నీకు ఎలా సొంతం అవుతాను.

గౌతమ్ సమాధానం...
కథ కొనసాగుతుంది...

ఈ మాట అంటే.. ఎవరైనా లాగి పెట్టి కొడతారు..
Reverse లో question చేయరు!!

Felt a bit inconvcing!!

But great going so far.
Wanna know Vishi side of her story!!
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Part - 25



కమాన్ విశిష్ట..  ఏ కాలంలో ఉన్నావు. నేను పెళ్లి చేసుకునేది హిమనే.. కానీ నువ్వు నాతోనే ఉంటావు. అర్థం కాలేదా..

మీ మదర్ ట్రీట్మెంట్ కి డబ్బులు కావాలి. సో లైఫ్ లాంగ్ నువ్వు నా దగ్గర ఉండిపోతే..  మీ మదర్ కి ట్రీట్మెంట్..  మీకు మంచి హౌస్. కావలసిన అన్ని సౌకర్యాలు ఇస్తాను.

కాకపోతే నా బ్యాక్ మాత్రమే ఉంటావు.  అర్థమైంది అనుకుంటా అని ఫోను తిప్పుతూ అడుగుతాడు. నువ్వు నన్ను ఉంచుకుంటాను అని ఇండైరెక్టుగా చెబుతున్నావా..

ఇన్ డైరెక్ట్ గా కాదు డైరెక్ట్ గానే చెబుతున్నాను.  నీ అందం వర్క్ నాకు కావాలి. సో అది ఏ రూపం అయితే ఏమిటి... నిన్ను పెళ్లి చేసుకుంటే హిమ నాకు దూరం అవుతుంది.

హిమకి నేనంటే చాలా ఇష్టం. వాళ్ళ ఫాదర్ హెల్ప్ తో ఇంకా ఎదుగుతాను. అప్పుడు నీ లైఫ్ ఇంకా లగ్జరీ గా ఉంటుంది. ఏమంటావు..

ఆ మాటలు ఫోన్లో వింటున్న ముగ్గురికి బీపీ సర్రునలెగుస్తుంది. సూర్యకి వెంటనే వచ్చి గౌతమ్ ని రెండు చెంపలు వాయించాలి అన్నంత కోపం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు..

నీ డీల్ బాగానే ఉంది కానీ ఇందులో ఒక చిన్న మార్పు చేద్దాం.. ఏమిటి. నన్ను మీ పేరెంట్స్ అండ్ హిమ ఫాదర్ దగ్గరికి తీసుకు వెళ్ళు...

నేనెవరో..  నా వర్క్ ఏమిటో..  నేను నీకు ఏమవుతానో అన్నది క్లియర్గా చెప్పు.  హిమ చనిపోయిన మరుక్షణమే నన్ను పెళ్లి చేసుకుంటా అన్న విషయం కూడా క్లియర్గా చెప్పు.

హిమకి మాత్రం చెప్పకు ఏమంటావు. ఏమిటి....
  నాతో జోక్ చేస్తున్నావా. అయ్యో ఇందులో జోక్ చేయడానికి ఏముంది.

నువ్వు ఎంత క్లియర్ గా ఉన్నావు...  నేను కూడా అంతే క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాను ..

నిన్ను పరిచయం చేయాలా..  నా కీప్ అని పరిచయం చేయాలా.. అసలు ఏం మాట్లాడుతున్నావో అర్ధం అవుతుందా...

నువ్వు మాట్లాడేది నీకు అర్థం అవుతుందా.. ఎలా కనిపిస్తున్నాను నీ కళ్ళకి. నాకు మనీ అవసరం కానీ దానికోసం ఏదైనా చేస్తాను అనుకోవడం నీ అవివేకం..

నా తల్లిదండ్రులు నాకు సంస్కారం నేర్పించారు. కష్టపడతాను అయినా ఉపయోగం లేదు అనుకుంటే బాడీలో ఏదో ఒక పార్ట్ అమ్మి అయినా మా అమ్మని రక్షించుకుంటాను.

అంతేకానీ నువ్వు చెప్పిన నీచానికి మాత్రం దిగజారను.  ఇక్కడ ఉన్నది విశిష్ట.   ఇప్పటినుంచి నా  వర్క్ కూడా నీకు ఇవ్వను.

నాతో చాలెంజ్ చేస్తే నీకే ప్రమాదం. ఇది చాలెంజ్ కాదు నా ఆత్మ అభిమానం.  ఒక ఆడపిల్లతో మాట్లాడే పద్ధతి కూడా నీకు నేర్పించలేదు అంటే మీ తల్లిదండ్రులను చూసి జాలి పడుతున్నాను.

డబ్బు ఉంటేనే అన్నీ వస్తాయి అనుకోవడం పొరపాటు.  ఎప్పుడు నువ్వు నన్ను కలవాలి అని ప్రయత్నించకు అని లేచి నిలబడుతుంది.

ఒకసారి ఆలోచించుకో ఇంతకన్నా బెస్ట్ ఆపర్చునిటీ నీకు ఉండదు. మీ మదర్ కి  బెస్ట్ డాక్టర్స్ చేత ట్రీట్మెంట్ ఇప్పిస్తాను.

ఒక విషయం అడుగుతాను సిన్సియర్ గా జవాబు చెప్పు గౌతమ్. ఏమిటి..  ఈరోజు నాకు ఈ నిజం తెలియకపోయి ఉంటే నువ్వు అంటున్నా బెస్ట్ డాక్టర్స్ కంటికి కూడా కనపడే వారు కాదు కదా..

అఫ్కోర్స్ నేను ఒక బిజినెస్ మాన్ ని..  బిజినెస్ని బిజినెస్ లాగానే చేస్తాను కానీ ఎమోషన్స్ తో కాదు.  బట్ నేను మనిషిని కొన్ని ఎమోషన్స్ని నేను ఎమోషన్స్ లాగానే చూస్తాను.

గుడ్ బాయ్ అని ముందుకు వెళుతుంది. గౌతమ్  కోపంగా లేచి చేయి పట్టుకుంటాడు.  రేయ్ వదులు అని గింజుకుంటూ ఉంటే...

ఏమిటే బ్రతిమాలుతిన్నాను ఉంటే.. ఓ రెచ్చిపోతున్నావు. ఇప్పుడే నిన్ను నాతో తీసుకువెళతాను.  ఒక్కసారి నువ్వు నా సొంతం అయ్యావు అంటే అప్పుడు... అప్పుడు..  ఏం చేస్తావు.

చచ్చినట్టు నా కాళ్ళ కింద పడి ఉండాల్సిందే కదా.. ప్రాణం పోయినా సరే నేను నీకు లొంగను.  వదులు అని అరుస్తూ ఉంటుంది.

శ్రీకర్ కంగారుగా ఒరేయ్ పరిస్థితి చేయి దాటుతున్నట్టు ఉంది పదా... ముగ్గురు కంగారుగా వెళతారు. విశి గించుకుంటూ గౌతమ్ ని తోస్తుంది. గౌతమ్ కోపంగా విశి చెంపపైన కొడతాడు.

గౌతమ్ కొట్టిన ఫోర్స్ కి  కళ్ళు తిరిగినట్టుగా అయ్యి పడబోతుంది. వెంటనే సూర్య పట్టుకుంటాడు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను..

ఎవడు వీడు.. నీ కొత్త బాయ్ ఫ్రెండ్ ఆ ... మాటలు మర్యాదగా రానివి గౌతమ్ అని భవ్య కోపంగా ఉంటుంది. మధ్యలో నీ గోడవ ఏమిటి..

అది మౌనంగానే ఉంది కదా..  అప్పటికే విశి మాట్లాడలేక సూర్య షర్ట్ ని గట్టిగా పట్టుకుంటుంది. గౌతమ్ కి ఫోన్ వస్తూ ఉంటే లిఫ్ట్ చేసి చెప్పు డార్లింగ్ అంటాడు.

ఇప్పుడే వస్తున్నాను నువ్వు జాగ్రత్త..  మళ్లీ మనం మాట్లాడుకుందాం విశి. ఈలోపు ఆలోచించుకో.  ఇంతకన్నా బెస్ట్ ఛాన్స్  నీకు లైఫ్లో రాదు అని వెళ్ళిపోతాడు.

శ్రీకర్ వాటర్ తీసుకొచ్చి ఇస్తే భవ్య ఫేస్ కడుగుతుంది.  విశి ని అక్కడ కూర్చోబెట్టి శ్రీకర్ టీ తీసుకొచ్చి ఇస్తాడు. మౌనంగా చూస్తూ ఉన్న విశిని కదుపుతూ ఎక్కువ ఆలోచించకు టీ తాగు అని చేతికి ఇస్తాడు.

సూర్య కాం గా విశి కూర్చున్న చోటకి వెళ్లి ఫోన్ తీసుకోవచ్చి భవ్యకి ఇస్తాడు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు.  ఏమీ అర్థం కావడం లేదు సార్.

  ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది.  నీ వర్క్ మీద నువ్వు ఎఫెక్ట్స్ పెట్టి స్టార్ట్ చెయ్..నువ్వు బిజినెస్ చేయాలి అనుకుంటే మేము సపోర్ట్ ఇస్తాము.

  ఆ వేస్ట్ ఫెలో గాడి గురించి ఆలోచించకు. వాడు నీ వీక్నెస్ మీద కొట్టాలని చూస్తున్నాడు.  నీ వెనక మేమున్నాము కదా ధైర్యంగా అడుగు వేయి అని ఆ చేతిని మెల్లిగా ప్రెస్ చేస్తాడు.

శ్రీకర్ వెంటనే మీ నాన్నగారు ఇచ్చిన చైను ఎప్పుడూ నీ దగ్గరే ఉంచుకో...  చూసావా ఈరోజు లక్ ఎలా కలిసి వచ్చిందో..

లేకపోతే ఆ ఇడియట్ ఇంకా నిన్ను చీట్ చేస్తూనే ఉండేవాడు.. మీరన్నది కూడా నిజమే సార్..మా నాన్నగారి ఇచ్చింది ఎప్పుడు లక్కీనే అని చున్నీ పైనుంచి పట్టుకుంటుంది.

శ్రీకర్ కి ఎందుకో చూడాలి అనిపించి ఒకసారి ఆ చైన్ ని చూపించు... ఎందుకు సార్.. జస్ట్ చూడాలి అనిపిస్తుంది. అందుకేనే...

సరే అని చైన్ పైకి తీసి చూపిస్తుంది . ఒకసారి తీసి ఇవ్వు. మరి అమ్మాయి మెడలోకి తొంగిని చూడలేము కదా..
చిన్నగా నవ్వి సరే అని చైన్ తీసి శ్రీకర్ చేతికి ఇస్తుంది.

శ్రీకర్ చైన్ తీసుకొని చూస్తూ ఉంటాడు. చైన్ మోడల్ చాలా బాగుంది. మా నాన్న టేస్ట్ ఎప్పుడూ సూపరే...

ఈ లాకెట్ ఏంటి డిఫరెంట్ గా ఉంది. ఏమో నాకు తెలియదు.  ఆ లాకెట్ ఎప్పుడు తీయొద్దు అని మాత్రమే చెప్పారు.

అవునా అని ఇంకా పర్టికులర్ గా చూస్తూ.. ఇది లాకెట్ కాదనుకుంటా అని డౌట్ గా రేయ్ బావ ఒకసారి ఇది చూడు అని కంగారుగా అంటాడు.

అప్పటివరకు ఫోన్ చూస్తున్న సూర్య.. ఏంట్రా నీ గోల అని చైన్ చూస్తాడు.  చైన్ కాదురా..  లాకెట్ చూడు.. లాకెట్ చూసి ఆశ్చర్యంగా విశి వైపు చూస్తాడు.

మళ్ళీ మళ్ళీ కళ్ళు నలుపుకొని మరి లాకెట్ పట్టుకుంటాడు.. ఇది రింగ్ కదా ఉద్వేగంతో సూర్య అడుగుతాడు...

విశిష్ట సమాధానం...
[+] 8 users Like SivaSai's post
Like Reply
Part - 26



ఇది రింగు కదా.. అని సూర్య అడిగితే.. ఏమో నాకు తెలియదు అది స్పెషల్గా డిజైన్ చేయిపించారు. ఆ లాకెట్ ని పట్టి పట్టి చూస్తూ ఉంటాడు.

మధ్యలో రింగ్ ఉంది. దాన్ని చుట్టూ స్టోన్స్ తో ఒక లాకెట్ షేపులో తీసుకొచ్చారు. ఇది నీకు ఎప్పుడు ఇచ్చారు... ఎవరిచ్చారు...

వీళ్ళ ప్రశ్నలకి భవ్య పిచ్చి చూపులు చూస్తూ ఉంటే... నాకు కరెక్ట్ గా గుర్తులేదు.  చిన్నప్పుడు అన్నవరం వెళ్ళినప్పుడు ఎవరో నన్ను సేవ్ చేశారంట.

వాళ్ళు ఇది నా దగ్గర ఉంచుకోమని ఇచ్చారు అని నాన్నగారు చెప్పారు. ఇప్పుడే వస్తాను అని సూర్య పక్కకు వెళ్లి డాన్స్ చేస్తాడు.

శ్రీకర్ చైన్ విశి చేతికిచ్చి..   మీ నాన్నగారు నీకు ఎప్పుడు మంచే  చేస్తారు. నీ మెడలోనే ఉంచుకో..  అస్సలు తీయొద్దు.

హ్మ్.. సైలెంట్ గా తీసుకుని పెట్టుకుంటుంది.  సూర్య ఐదు నిమిషాలకి వచ్చే కామ్ గా కూర్చుంటాడు.. మొఖం వెలిగిపోతూ ఉంటుంది.

ఇంకా అక్కడే ఉంటే ఓపెన్ అయిపోతాను అన్న భయంతో.. శ్రీకర్ న్ని తీసుకుని వెళ్ళిపోతాడు. వెళుతున్న ఇద్దరినీ భవ్య డౌటుగా చూస్తూ ఉంటుంది.

ఎందుకే అలా చూస్తున్నావు. ఈ చైన్ చూసినప్పటి నుంచి వాళ్ళిద్దరిలో చాలా తేడా కనపడుతుంది..ఎందుకైనా మంచిది  చైన్ జాగ్రత్త.

అసలు ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేకుండా ఉన్నాము. నీ జాగ్రత్తలుకు నమస్కారంగాని పద అని బయలుదేరుతారు.
డైరెక్ట్ గా ఇంటికి వస్తారు.

భవ్య వెళుతుంటే.. లేదు ఈరోజు నువ్వు ఇక్కడే భోజనం చేయాలి. నేను స్పెషల్ బిర్యానీ చేస్తాను. ఎందుకు అంత స్పెషల్.

ఈరోజు నేను చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాను. అందుకు మరి పార్టీ చేసుకోవాలి కద.. రా అని లాక్కు వెళుతుంది.

లోపలికి వెళ్ళేటప్పటికి భానుమతి కుర్చీలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు...ఏమీ లేదురా.. మీ నాన్నగారి ఇంకా ఫోన్ చేయలేదు అందుకే చూస్తున్నాను.

నాకు చేసి మాట్లాడారు అమ్మ.  పొద్దుటే బయలుదేరుతున్నారంట.. అలాగ.. భవ్య కదా అంటుంది. పరవాలేదు ఆంటీ నన్ను బానే గుర్తుపట్టారు.

భలే దానివే.... నువ్వు విశికి ఫ్రెండు అంటే నాకు కూతురువే కదా.. రండి. ఒక్క అరగంట కూర్చోండి వంట చేసేస్తాను.

లేదమ్మా..  ఈరోజు నేనే చేస్తాను.. బిర్యాని వండుతాను అని వెళ్లి వెజిటేబుల్స్ అన్ని తీసుకువెళ్లి ప్రిపేర్ చేస్తూ ఉంటుంది.

ఏమైంది విశి చాలా సంతోషంగా ఉంది.. అవును అంటీ.
ఈరోజు తనకి చాలా లక్కీ డే. నేను చెప్పాను కదాఆ చైను మెడలో ఉంటే విశి కి ఎప్పుడు కలిసొస్తుంది అని.

నా మాట వినదు కదా..  మొండిది. ఇప్పటినుంచి తీయదులే..
వీళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ ఉండగానే విశి వంట ఫినిష్ చేసి వేడివేడిగా బిర్యాని తీసుకువచ్చి ఇద్దరు ముందు పెడుతుంది.

అరే. ఇంత ఫాస్ట్గా చేసేసావా.. మీరు కబుర్లో పడి టైం చూసుకోలేదు. తినండి.  టేస్ట్ చూసి వావ్ సూపర్ ఉంది. ఎంతైనా విశి టాలెంటె వేరు.

నువ్వు కూడా చేస్తావా భవ్య.  లేదు ఆంటీ తింటాను. మనకు తినడం వరకు మాత్రమే వచ్చు చేయడం అంటే అమ్మో నావల్ల కాదు.

సూర్య, శ్రీకర్ డైరెక్ట్ గా విక్రమ్ ఆఫీస్ కి వెళ్తారు. విక్రమ్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకుని సూర్య స్పీడుగా వెళ్లి నాన్న అని ఎత్తుకొని తిప్పుతాడు.

ఒరేయ్ ఏమిట్రా.. నీ ఆనందం.  నేను ఎక్కడున్నానో చూసుకో. ఆనందం తట్టుకోలేకపోతున్నాను.. నీతో షేర్ చేసుకోవాలని వచ్చేసాను.

ముందు దింపు..  ఓకే ఓకే అని దింపుతాడు. విక్రమ్ కళ్ళతోనే చూడు అని చూపిస్తాడు.  చుట్టూ చూసి సూర్య తల వెనకాల రబ్ చేసుకుంటూ సోరి అంటాడు.

మీటింగ్లో  ఉన్నవాళ్లందరూ నోరు వదిలేసి చూస్తూ ఉంటారు. సరే నువ్వు వెళ్లి  రూమ్లో కూర్చో..  ఒక హాఫ్ ఎన్ అవర్ లో వస్తాను.

అబ్బా  అంతసేపా... ఇది చాలా ఇంపార్టెంట్ మీటింగ్. గో అని పంపిస్తాడు..గైస్ అనగానే ఎస్సార్ అని అందరూ అటెన్షన్ లోకి వస్తారు.

సూర్య రూమ్లోకి వెళ్ళి గంతులు వేస్తూ ఉంటే.. శ్రీకర్ సోఫాలో  కూర్చుని  బావ కొంచెం ఆగరా బాబు..
నీ క్యూటి ఎవరో తెలిసినప్పటినుంచి నిన్ను పట్టుకోలేక పోతున్నాను.

విశి ముందు ఎక్కడ బయట పడిపోతావో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా... గంతులు వేసే వాడల్లా ఆగి శ్రీకర్ పక్కన కూర్చుని నాకు అలాగే అనిపించింది.

ఇంకొక్క ఐదు నిమిషాలు అక్కడే ఉన్నాము అంటే నేనెవరో చెప్పేవాడిని..  కానీ నో యూస్ కదా.. అప్పుడు తను చిన్నపిల్ల కదరా...

అందులోని వాళ్ళ నాన్నగారు ఎవరో ఇచ్చారు అని మాత్రమే చెప్పారు కానీ మిగిలిన డీటెయిల్స్ ఏమీ చెప్పలేదు కదా..

మనకు ఎలా తెలియదో వాళ్లకే అలాగే తెలియదు. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు. తెలియదు అంటాడు.

బావ నాకు ఒక చిన్న డౌట్ అడగనా..  ఈ ఆనంద సమయంలో నువ్వు ఏది అడిగినా చెబుతాను.  అబ్బో అని...

ఇప్పుడు విశినే క్యూటి అని తెలిసింది కదా..  నీకున్నది స్నేహమా, ప్రేమ లేక చిన్ననాటి తీపి గుర్తు కింద చూస్తావా..
సూర్య సమాధానం చెప్పేలోపు విక్రమ్ లోపలకు వచ్చి ఇప్పుడు చెప్పరా..

వెంటనే వెళ్లి తండ్రి ఒడిలోకి వచ్చిని చాలా హ్యాపీ న్యూస్ నాన్న.  క్యూటి ఎవరో తెలిసిందా.. ఎలా గెస్ చేశారు. నీ ఆనందమే చెబుతుంది.

ఐ లవ్ యు నాన్న అని బుగ్గ మీద ముద్దు పెడతాడు. ఒరేయ్ ముందు ముద్దుల ఆపి మేటర్ ఏంటో చెప్పు. క్యూటీ నే విశి అంకుల్..

వాట్.. అవును అంకుల్. విశిష్టానే..  క్యూటి.
ఎలా తెలిసింది.. ఈరోజు చాలా పెద్ద స్టోరీ జరిగిందిలే నాన్న అని మొత్తం చెబుతాడు.

ఈ గౌతమ్ ఎవరో గాని మంచి కిలాడీలాగా ఉన్నాడు.  ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు సూర్య.  నీ క్యూటి ఎవరో తెలుసుకోవాలి అనుకున్నావు.  తెలిసింది.

ఇక్కడితో వదిలేస్తావా లేక ముందుకి వెళతావా. ఏం చేద్దాం అనుకుంటున్నావు. నాది అదే డౌట్ అంకుల్. నీకేమి డౌట్ వచ్చింది రా.

మీరు వచ్చేముందు ఇదే ప్రశ్న అడుగుతున్నాను.  విశి మీద నీకున్నది స్నేహమా ప్రేమ ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా అని బాబు గారు ఇంకా ఎటువంటి సమాధానం చెప్పలేదు.

నాకే ఒక క్లారిటీ లేదు. ఇంక నీకేం చెబుతాను రా.  కానీ నీ ఫేస్లో గ్లో మాత్రం వేరే చెబుతోంది.  చెప్తుంది అన్నావు కదా తీసుకో.

ముందు విశితో ఫ్రెండ్షిప్ చేయాలి నాన్న. అంకుల్ ఉన్నప్పుడు తను చాలా సంతోషంగా ఉంది.  కష్టమంటే ఏమిటో తెలియకుండా పెరిగింది కానీ ఇప్పుడు అంతా రివర్స్ లో ఉంది.

తన టాలెంట్ నీ ప్రూఫ్ చేసుకోవాలి అనుకుంటుంది బ్యాక్ బోన్ గా నేను నిలబడతాను. అంకుల్ చనిపోయాక మోసం చేసి తీసుకున్న ఆస్తులన్నీ వెనక్కి రప్పిస్తాను.

ఆ గౌతమ్ గాడి నీడ కూడా పడనివ్వను.  ముందు విశిని స్ట్రాంగ్ చేయాలి. అప్పటికి మా మధ్య ఉన్నది స్నేహమా లేక ఇంకా ముందుకు వెళుతుందా అన్నది చూస్తాను.

విశితో ఫ్రెండ్షిప్ చేయాలి అంటే దగ్గరగా ఉండాలి కదా.. మరి ఎలా కుదురుతుంది రా..  కొంచెం బుర్రవాడు.
మనిద్దరం కాలేజీలో జాబ్ కోసం వచ్చాము అనుకుంటున్నారు కదా..

సో నేను అక్కడ పి టి సార్ గాజాయిన్ అవుతాను. విశి అసలు గేమ్స్ ఆడదనుకుంటా.. ఒరేయ్ ఇన్ని డౌట్స్ ఏంట్రా..

గేమ్స్ ఆడకపోయినా దగ్గరగా ఉంటుంది కదా...  మనకు ఎలాగో పరిచయం ఉంది.  దాన్ని ఇంకొంచెం ముందుకి తీసుకు వెళ్లడమే కదా..

ఇంక నువ్వు ప్రశ్నలు ఆపేయ్. నాన్న ఈరోజు మంచి ట్రీట్ ఇస్తాను. బయటికి వెళదాం. మేము కూడా జాయిన్ అవ్వచ్చా అని వినయ్, శ్రీ, రాజ్, భరత్ వస్తారు.

అరే మీ నలుగురు లేకుండా ఎలాగా..  వైభవ్ కి కూడా కాల్ చేస్తాను. డైరెక్ట్ గా వచ్చేస్తాడు అని ఫోన్ చేయడానికి పక్కకి వెళ్తాడు.

సూర్యని చూసి విక్రమ్ నవ్వితే.. స్నేహం అంటున్నాడు కానీ అంకుల్ అది ప్రేమే.  అసలు విశినే క్యూటి అని తెలియక ముందే చాలా కేర్ తీసుకున్నాడు..అలాంటిది ఇప్పుడు ఓన్లీ ఫ్రెండ్షిప్ అని మనకి కహానీలు చెబుతున్నాడు.

అందరికీ నీకు ఉన్నంత క్లారిటీ ఉండదు కదరా..  అందుకే అది ఫ్రెండ్షిప్ అనుకుంటున్నాడు..చూద్దాం వాడి ఫ్రెండ్షిప్ ఎక్కడి వరకు వెళుతుందో.

ఏంటి నా కొడుకు క్లారిటీ అని మాట్లాడుతున్నావు. కొంపతీసి ఎవరినైనా లైన్లో పెట్టాడా ఏమిటి. శ్రీకర్ కంగారుగా అలాంటిది  ఏమీ లేదు నాన్న.

అంకుల్  జోక్ చేస్తున్నారు.  ఏదైనా ఉంటే చెప్పేయ్ రా బాబు..  ముందు అమ్మాయిలని వెతికే పని తప్పుతుంది.  ఈరోజుల్లో అన్ని క్వాలిటీస్ ఉన్నా అమ్మాయి దొరకాలంటే చాలా కష్టం.

మీరు టెన్షన్ పడకండి నాన్న.  మీకు అన్ని విధాలుగా సూట్ అయ్యే అమ్మాయిని తెచ్చుకుందాము. నీ వాలకం చూస్తూ ఉంటే ఆల్రెడీ సెట్ చేసుకున్నట్టే కనపడుతున్నావు.

ఏ కేటగిరి అని అడిగితే.. కేటగిరి ఏమిటి నాన్న. అదే ప్రొఫెషనల్గా బిజినెస్, సాఫ్ట్వేర్, టీచర్, డాక్టర్ ఎక్సట్రా..
ఎక్సెట్రా..

డాక్టర్ అయితే బెటర్ అనుకుంటున్నాను. ఎందుకో.. తాతయ్య నానమ్మ డాక్టర్స్ ఏ కదా... సో  వచ్చే అమ్మాయి కూడా డాక్టర్ అయితే తాతయ్య నాలెడ్జ్ వేస్ట్ అవ్వకుండా ఉంటుందని...

ఏమంటారు మావయ్య అని భరత్  అడుగుతాడు. భరత్ మాత్రం అనుమానంగా చూస్తూ ఉంటే..  శ్రీకర్ తడబడుతూ ఎందుకు మావయ్య అలా చూస్తున్నారు.

  ఏమీ లేదు లేరా... కొన్ని కొన్ని డౌట్స్ కి ఆన్సర్స్ దొరుకుతున్నాయి. అందుకనే చూస్తున్నాను.
సూర్య వచ్చి బయలుదేరిదామా...  వైభవ్ డైరెక్ట్ గా వచ్చేస్తున్నాడు.

సరే పదండి ఈరోజు మళ్లీ యూత్ లైఫ్ లోకి వెళ్లి ఎంజాయ్ చేసి వద్దాం.  అయితే కార్లు పక్కన పెట్టేసి బైక్స్ తీద్దామా.  ఇది ఇంకా బెస్ట్ ఐడియా పదండి అని అందరూ బయలుదేరతారు.
 
శ్రీకర్.. హమ్మయ్య కరెక్టు టైం కు వచ్చి రక్షించాడు అనుకోని నోటితో గాలి వదిలి.. నడుస్తూ ఉంటాడు.

యూత్ జర్నీ...

కథ కొనసాగుతుంది...
[+] 9 users Like SivaSai's post
Like Reply
Sooper update. Great going.
Now the task is set for Surya.. and we now know how looooong this story can go!! :-)
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Superb update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
Surya starts his journey with Vishi... Waiting for how the story unfolds.
[+] 1 user Likes Sunny73's post
Like Reply
Part - 27



ఏడుగురు కిందకి వచ్చేటప్పటికి బైక్స్ రెడీగా ఉంటాయి. సూర్య బైక్ స్టార్ట్ చేస్తే విక్రమ్ వెనకాల కూర్చుంటాడు. శ్రీకర్ శ్రీ అలాగే కూర్చుంటే...

భరత్, రాజ్ ఒక బైకు మీద వినయ్ ఒక బైక్ మీద స్టార్ట్ అవుతారు.  అందరూ కలిసి ముందు రెస్టారెంట్ కి వెళతారు వైభవ్ కూడా వచ్చే జాయిన్ అవుతాడు.

ప్రైవేట్ రూమ్ లో కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఎన్ని రోజులైందిరా ఇలా మన కోసం మనం టైమ్ స్పెండ్ చేసి..

ఒకసారి ఫ్యామిలీ ట్రిప్ పెట్టుకోవాలి.  మన బిజీలో మనం ఉంటున్నాము.  లేడీస్ ని వదిలేస్తున్నాము అని భరత్ అంటే అది నిజమే బావ..

వీళ్ళ చిన్నప్పుడు వెళ్ళాము. మళ్ళీ కుదరనే లేదు. ఒకళ్ళు ఫ్రీ అయ్యేటప్పటికి మరొకళ్ళు బిజీ అయిపోతున్నారు.

బిజినెస్ బిజినెస్ అని పరిగెడుతూనే ఉన్నాము. ఇంకా ఈ కుర్ర బ్యాచ్ వచ్చారు కదా..  వీళ్ళకి అప్పజెప్పి మనం రిలాక్స్ అయిపోదాం.

హ్యాపీగా సెకండ్ హనీమూన్ ప్లాన్ చేసుకుని ఎగిరిపోదాము ఏమంటారు...

శ్రీకర్ వెంటనే ఇది అన్యాయం అంకుల్. ఇప్పుడే కదా మాకు రెక్కలు వచ్చాయి. మా రెక్కలు ఫ్రీగా ఎగిరే వరకు మాతో ఉండరా అని గారాలు పోతే..

అస్సలు ఉండము.  ఇప్పటికే మీకు చాలా ఫ్రీడం ఇచ్చాము.  మీ వయసులో నేను  అబ్బో..  ఎంత వర్క్ చేసేవాడిని అనుకుంటున్నావు.

వెంటనే విక్రమ్ రాజ్ శ్రీ వెంటనే ఛ అంటారు.  అదే...  అందరం చేసే వాళ్ళము అని చెబుతున్నాను. భరత్ వెంటనే నిజం చెప్పరా..

నువ్వు ఎప్పుడు చేసావు వర్క్.  పూజిత నీ లైఫ్ లోకి ఎంటర్ అయ్యాకే కదా..  బిజినెస్ మీద ఫోకస్ పెట్టావు.  అప్పుడు దాకా గాలి తిరుగుళ్లే కదా...

అవునా.. బాబాయ్ ఏమి వర్క్ చేసేవారు కాదా అని సూర్యా అడిగితే...  వీడు అలాగే చెబుతాడు నేను చాలా సిన్సియర్గా వర్క్ చేసే వాడిని.

మరి ఎందుకు నాన్న..  అమ్మ ఎప్పుడు బాబు బుద్ధులే వచ్చాయి.. మీ నాన్న లాగానే నువ్వు బద్దకంగా తయారవుతున్నావని నన్ను తిడుతుంది.

ఈ అమ్మలకి పనేముంటుందిరా...  కొడుకుని డైరెక్టుగా తిట్టలేక మమ్మల్ని వంక పెట్టుకుని తిడతారు.  అలా తిడితే అయినా మీరు లైన్లోకి వస్తారని వాళ్ళు చిన్న ఆశ.

కానీ బాబాయ్..  అమ్మ ఎప్పుడు అలా తిట్టలేదు. మా వదిన దేవత రా.. అందుకే నీకు, మీ నాన్నకి ఎన్ని ఆటలాడినా సాగుతున్నాయి.

మీ నాన్న తర్వాత లక్కీ ఫెలో... భరత్ బావ.  నేను మా రాజ్ బావ దొరికిపోయాము.  అదేంటి అందరిలో మీ ఇద్దరిదే లవ్ మ్యారేజ్ అనుకుంటా..

మొదటిసారి చూసినప్పుడు  పూజిత పెద్ద కంచు అని నాకు తెలుసు.  కాకపోతే ప్రేమలో పడ్డాను కదా వెనకాల తిరిగాను.

రాజ్ బావే..  మా చెల్లి ఉత్తి అమాయకురాలు అనుకుని వెనకాల తిరిగాడు. అప్పటికి నేను భరత్ బావ హింట్ ఇస్తూనేఉన్నాము..

అయినా సరే నా నివి అమాయకరాలు. ప్రపంచం తెలియదు..  నేను పక్కన లేకపోతే ఏమైపోతుందో  బ్లా.. బ్లా అనుకుంటూ చొంగ కార్చుకుంటూ తిరిగాడు.

ఒరేయ్ ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకురా... అయ్యో తెలుసుకుని బావ.  వాళ్లకు ఉపయోగపడతాయి.  నువ్వు చెప్పు నాన్న అని వైభవ్ అడిగితే..

నువ్వు ఎందుకురా అంత ఉత్సాహం చూపిస్తున్నావు. అత్తయ్య చూస్తే చాలా అమాయకంగా ఉంటుంది కదా... మావయ్య అంత బుక్కయ్యాడా అని అడిగితే..

రాజ్ తాగే వాటర్ ని ఊసేసి..  ఒరేయ్ మీ అత్తయ్య ఏ యాంగిల్ లో అమాయకంగా కనిపించిందో.. ఒక యాంగిల్ చూపించరా.

మరి నీకెలా కనిపించింది మావయ్య.  ప్రేమ గుడ్డిది అంటారు కదా..  అలా కనిపించింది. ఓ.. ప్రేమిస్తే గుడ్డి వాళ్ళం అయిపోతాం అన్నమాట.

అందరం అవ్వరు రా...  నాలాంటి వాళ్లే అవుతారు.  అక్కడ మీ పెదనాన్న ఉన్నాడు చూడు... వేధించి, సాధించి మరీ ప్రేమని వెనక్కి తెచ్చుకున్నాడు.

పెద్దమని టార్చర్ పెట్టాడా .. విక్రమ్ సీరియస్ గా చూస్తాడు. టార్చర్ కాదురా... అదంతా ఒక పెద్ద కథలే. ఇప్పుడు చెబితే ఇక్కడే తెల్లారిపోతుంది.

అబ్బా మీ అందరవి చెప్పినట్టిగానే పెదనాన్న లవ్ స్టోరీ కూడా షార్ట్కట్లో చెప్పొచ్చు కదా..   షార్ట్ కట్ లో చెప్తే మీకు అర్థం కాదురా.  తీస్తే ఒక సినిమానే అవుతుంది.

అవునా అన్ని ఎమోషన్స్ ఉన్నాయా..  చాలా...  కాకపోతే ట్రాజిడిని లవ్ లోకి దింపి... మరీ సక్సెస్ చేసుకున్నాడు.  నన్ను శ్రీని భయంకరంగా వాడుకున్నాడు.

అప్పుడే నేను మీ అత్త ప్రేమలో పడడం. మీ పెద్దమ్మని చూసి అమ్మాయిలు అందరూ ఇలాగే ఉంటారు అనుకుని పై పూతలకి మోసపోయాను.

ఏం చేస్తాం ఈ జీవితం ఇలా వెళ్ళిపోవడమే.. నా చెల్లితో నీకేం ఇబ్బంది వచ్చిందిరా అని విక్రమ్ కోపంగా అడుగుతాడు.

ఈ లోపు ఫుడ్ వస్తుంది. లోపల పేగులు కేకలు పెడుతున్నాయి. వాటిని శాంతింపచేసి అప్పుడు చెబుతాను.

కొంచెం తినగానే ఇప్పుడు చెప్పు మావయ్య అని వైభవ్ అడుగుతాడు. ఏంట్రోయ్ మంచి ఉత్సాహంగా ఉన్నావు. మేము పప్పులో కాలు వేయకూడదని.

మీరు దేశముదురులు.  మీరు పడరు మమ్మల్నే పడేస్తారు. మీ అత్తయ్య ఈ శ్రీ ఎంగేజ్మెంట్ కి బుట్ట బొమ్మలా రెడీ అయ్యి పదహారణాల తెలుగు పిల్లల్లాగా అమాయకంగా చూస్తూ వస్తే..

ప్రపంచంలో ఉన్న అమాయకత్వం నా పిల్ల దగ్గరే ఉందా అనుకున్నాను.  తర్వాత అర్థమయింది నాఅంతా బకరా గాడు లేడు అని...

ప్రేమలో పడి ఒప్పించడం చాలా కష్టం అనుకున్నాను. నిజంగానే కష్టపడ్డాను కాకపోతే నా కష్టం ఫలించే లోపు నేను మీ అత్త చేతిలో కీలుబొమ్మ అయిపోయాను.

అదేంటి మావయ్య.. అదంతే రా కొన్ని కొన్ని చెప్పలేము. వామ్మో మీ అత్త కున్న షాపింగ్ పిచ్చికి పెళ్లికి ముందే నన్ను అక్కడికి ఇక్కడికి అని తిప్పేది.  రాను అంటే అమాయకంగా  మొఖం పెట్టుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టను.

ఆ ముఖం చూడలేక నేను వెళ్లేవాడిని.  మా నాన్న దొరికిందే చాన్స్ అనుకుని మా అమ్మకి ఎక్కించి వదిలేవాడు.

ఇటు మా అమ్మకి,  అటు మీ అత్తకి మధ్యలో నేను నలిగిపోతూ ఉంటే మా నాన్న సినిమా చూస్తూ ఎంజాయ్ చేసావారు.  ఆ కష్టాలు పగవాడికి కూడా రాకూడదు రా...

ఏడ్చావు.. నా చెల్లి చూసుకున్నంత ప్రేమగా నిన్ను ఎవరైనా చూసుకుంటారా అని విక్రమ్ అడిగితే.. అది నిజమే బావ.

నీ చెల్లి ప్రేమ తట్టుకోవడం చాలా కష్టం. ఆ విషయంలో మాత్రం నివిని మెచ్చుకోవాల్సిందే... శ్రీకర్ సూర్య ఇద్దరూ ఆలోచిస్తూ ఉంటారు.

శ్రీకర్ ఏమో సౌమ్యతో నా లైఫ్ ఎలా ఉంటుంది..  ఇది కూడా అలాగే ప్రేమగా టార్చర్ పెడుతుందా లేక మౌనంగా టార్చర్ పెడుతుందా అని ఆలోచిస్తూఉంటాడు.

సూర్య... నా లవ్ స్టోరీ ఎలా మొదలవుతుంది. నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటానా లేక పెళ్లయ్యాక ప్రేమిస్తానా.. నిజంగా ఈ లవ్ లో అంత మ్యాజిక్ ఉందా...

వైభవ్..  నేను ఎవరిని ప్రేమించినా...  ప్రేమించకపోయిన పరవాలేదు కానీ ఆ చందును మాత్రం ప్రేమించకూడదు. అమ్మో..  లేకపోతే నేను రాజ్ మావయ్య లాగా అయిపోతాను.

వీళ్ళు షాపింగ్ పిచ్చికి తిప్పడం నావల్ల కాదు.. నేను దొరికాను అంటే ఇక మావయ్య రిలాక్స్ అయిపోతాడు.

వీళ్ళ ముగ్గురి ఆలోచనని..  చెదరగొడుతూ ఏమీ ఆలోచిస్తున్నారు రా...  ఫ్యూచర్ గురించి అని ముగ్గురు ఒకేసారి చెబుతారు.

మీ లవర్ తో నా అని రాజ్ అడిగితే ఇంచుమించు అలాంటిదే అని శ్రీకర్ నాలుక కరుచుకుంటాడు . భరత్ గుర్రుగా చూస్తూ ఉంటే...

అదే ఫ్యూచర్లో ఎవరినైనా ప్రేమిస్తే మీరు చెప్పినట్టుగా ఉంటుందా లేక ఇంకొక స్టోరీ నడుస్తుందా అని ఆలోచిస్తున్నాము అంతే కదరా సూర్య అని కష్టంగా చెబుతాడు.

అంతే అని వస్తున్న నవ్వు ని ఆపుకుంటూ సమాధానం ఇస్తాడు.
లంచ్ ఫినిష్ అయిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి..  అక్కడికి ఇక్కడికి అని లేదు. బైక్స్ తీసుకుని వెళ్లడమే... ఎక్కడ పాపలు కనిపిస్తే అక్కడ ఆగి కలరింగ్ ని ఎంజాయ్ చేయడమే అని రాజ్ అంటే...

ఈ ముక్క ఏదో మా చెల్లి ముందు చెప్పు.  నీకు ఎక్కడ కలరింగ్ కావాలి అంటే అక్కడికి తీసుకు వెళ్తాను. అప్పుడు గాని నాకు సన్యాసం ఇప్పించి హిమాలయాల్లో కూర్చోబెట్టదు.

ఎందుకు బావ ఇప్పుడు కూడా పెళ్ళాన్ని తలుచుకుని మూడ్ స్పాయిల్ చేసుకుంటావు. అదేంటి వీళ్లు అని వినయ్ అయోమయంగా చూస్తూ ఉంటే..  ఎవరు..

ఎదురుగుండా ఒక్కసారి చూడు బావ అని ముఖాన్ని తిప్పుతాడు.  వస్తున్నా వాళ్ళని చూసి వినయ్ వైపు కోపంగా చూస్తూ దరిద్రుడా..  ఇప్పుడే కదరా సరదాగా తిరుగుతాము అనుకున్నాము.

నువ్వు తలుచుకున్నావు వచ్చేసారు. ఇంత శాడిస్ట్ వేంటిరా నువ్వు... ఊరుకో బావ...  నేను తలుచుకోగానే రావడానికి నేను ఏమైనా మాయలు పకీరునా...

వాళ్లేమైనా దేవకన్యలా.. ఎవరో కాల్ చేసి   ఉంటారు. అది ఎవరేయుంటారు అబ్బా అని అందరి వైపు చూస్తూ ఉంటే విక్రమ్ మాత్రం అవనినీ చూసి చెయ్యి ఊపుతాడు.

ఇంకెవరు ఆ ఎవర్గ్రీన్ లవ్ పెయిరే.. చూడు అన్నయ్య ఎంత ఎనర్జిటిక్ గా వదినకి చేయ్యి ఊపుతున్నాడో..
వీడొకడు...

వీడు ఎంజాయ్ చేయడు. మనల్ని చేయనివ్వడు. మనం బయట ప్రపంచంలో ఎంజాయ్మెంట్ చూస్తాము.  అన్నయ్య వదినతోనే ఎంజాయ్మెంట్ చూస్తాడు. ఏం చేస్తాం తప్పదు.

లేడీస్ వచ్చి ఏమిటి సడన్గారమ్మన్నారు అని అవని అడిగితే..  చిన్న సర్ప్రైజ్ అంటాడు. అవునా..  మీ అందరి కోసం సర్ప్రైజ్ ఎదురుచూస్తుంది అని రాజ్ కష్టంగా నవ్వుతూ కదరా బామ్మర్ది. వినయ్ అంతేగా..  అంతేగా...

విద్య సైలెంట్ గా భరత్ పక్కకు వచ్చి నుంచుంటుంది. నివి రాజ్ చేయి పట్టుకుని ఏమిటండి ఆ సర్ప్రైజ్ అని అడిగితే...

తినే ముందు రుచి చూడడం ఎందుకు. పదండి అని బయటికి తీసుకువెళ్లతూ..  విక్రమ్ వైపు చూస్తూ బావ అంటాడు. ఏంట్రా నీ గోల..

నేను  సంతోషంగా ఉంటే నీకు ఎంత ఆనందమో కదా... అందుకే అంటారు కదా...  బావమరిది అంటే బావ బ్రతుకు కోరతారు అని.. నీ ఆనందమే నా సంతోషం బావగారు అని సాగదీస్తాడు.  మరి ఇంత ఇలాగా...

ఫ్యామిలీ టైం??
[+] 7 users Like SivaSai's post
Like Reply
Part - 28



అందరూ బయటికి వచ్చి..  హస్బెండ్స్ బైక్స్ స్టార్ట్ చేస్తారు.  ఏమిటి ఇప్పుడు బైక్స్ మీద వెళ్లడమా అని అవని ఆశ్చర్యంగా అడిగితే..  నేనైతే యూత్ తమరు కాదా ఏమిటి అని చిన్నగా అడుగుతాడు..

మీరైనప్పుడు నేనెందుకు కాను అని చిన్న జెలసితో  చెబుతుంది. మరి ఇంకేంటి ప్రాబ్లం..ఎక్కు..  సరే అని ఒక పక్కకి కూర్చుంటుంది.

హలో మేడం నేను..  అమ్మమ్మలాగా కూర్చోమనలేదు. మన పెళ్లి అయిన కొత్తలో ఎలాగో అలాగా.. అవ్వ సిగ్గు లేకపోతే సరి...

పక్కనే పిల్లలు ఉన్నారు. వాళ్ళు మనల్ని చూసి నేర్చుకోవాలని ఉత్సాహపడుతున్నారు..ఎక్కండి మేడం.. పక్కన వాళ్ళ గురించి ఆలోచించొద్దు.

ఇది మన లైఫ్. మనం ఎంజాయ్ చేయాలి. ఒక్కసారి మీ ఆడపడుచుని, తోటి కోడల్ని, నీ  సీనియర్ ని చూడు అనగానే...నివి, పూజిత, నేహా టు సైడ్స్ కూర్చుని  భుజాల మీద చేతులు వేస్తారు.

ఇప్పుడు అర్థమైందా ఎవరి లైఫ్ వాళ్ళ ఎంజాయ్ చేయాలి. ఎవరో వచ్చి చెప్పారు.  మీరు మరి కుర్రోడు అయిపోతున్నారు.

చెప్పాను కదా నేను యూతే అని మరి నా పెళ్ళాన్ని కూడా యూత్ చేద్దామని నా తాపత్రయం అంతా.. ఏం చేద్దాం చెప్పు.

ఇక తప్పక అవని టూ సైడ్స్ కి కూర్చుంటుంది.  భరత్ లుక్ విద్యాకి అర్థమయి... విద్య కూడా అలాగే కూర్చుంటుంది.

సూర్య శ్రీకర్ భుజం మీద చేయి వేసి మీ మామగారు చూడరా..  ఒక్క కంటి చూపుతోనే మీ అత్తయ్య ని కంట్రోల్ లో పెట్టేస్తున్నాడు.

ఫ్యూచర్ లో నేను కూడా అదే ఫాలో అవుతాను బావ.  నువ్వు అది కాదు ఫాలో అయ్యేది. మరి ఇంకేం ఫాలో అవుతాను.

మా సౌమ్య కంటి చూపుకి నువ్వు ఫాలో అవుతావు. అంత ఉందా మీకు.. ఎంత ఉందో చిన్నప్పటినుంచి చూడడం లేదా..

ఎక్కడికైనా డేట్ కి తీసుకువెళ్లావా.. లేదు...ఏదైనా అంటే సౌమ్య భయపడుతుంది. కంగారు పడుతుందని కహానీలు చెబుతున్నావు.

అప్పుడెప్పుడో ఏదో ప్రపోజ్ చేశావు. ఇంకా అంతే అయిపోయింది. ఏం చేయను బావ.. ఎప్పుడు బయటికి తీసుకువెళ్లదామన్నా..

అమ్మో కాలేజ్ ల్యాబ్ లు, టెస్ట్ లు అది కోయడం..  ఇదిగో అని పారిపోతూనే ఉంటుంది.

నాకు మాత్రం ఉండదా నా బుజ్జి పప్పీ తో లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాలి అని..  వీక్ డేస్ కాలేజ్ అని పారిపోతుంది.  వీకెండ్స్.. అమ్మో నాన్న అంటుంది.

మరి ఎలా రా... ప్రయత్నించు...  సాధించు అప్పుడే ఆ ప్రేమలో ఉన్న గమ్మత్తు తెలుస్తుంది.. నేనంటే ప్రేమలో ఉన్నాను కాబట్టి నేను చెబితే అర్థం ఉంటుంది.

నువ్వు అసలు ప్రేమలో పడకుండానే చెబుతున్నావు.  ఏంటి కథ.. దీనికోసం ప్రేమలోనే పడాల ఏమిటి..  ఎన్ని సినిమాలు చూడటం లేదు.

నేత్ర ఆనందం వేరు... మానసిక అనుభూతి వేరు. ఏమో అవన్నీ నాకు తెలియదు. చెప్పాలనిపించింది చెప్పాను.  నచ్చితే ఫాలో అవ్వు. నచ్చకపోతే ఇక్కడే వదిలేసి బైక్ ఎక్కు...

ఆ యూత్ కపుల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. మనమే లేటు. ఇంకా లేట్ చేసామనుకో... మనల్ని ఓల్డ్ పీపుల్ కింద లెక్క వేస్తారు.

  అందులో రాజ్ మామ, శ్రీ అంకుల్ ముందుంటారు. మనకి అవసరమా పదా.. అది నిజమేలే మా నాన్న మరీ ఆడేసుకుంటున్నారు.

వైభవ్ ఒక బైక్ మీద... శ్రీకర్, సూర్య ఒక బైక్ మీద వెళుతూఉంటారు. ఎలాగైనా మనం వయసును వేస్ట్ చేసేస్తున్నాం బావ.

ఎందుకనిపించిందిరా.. మరి లేకపోతే చూడు..  నా పిల్ల పక్కన ఉన్నా సరే ఒక ముద్దు ముచ్చట ఉండదు. ఆ వైభవ్ గాడికి ప్రేమలో పడిన అది ప్రేమ అని వాడికి తెలియదు. అమ్మో దానితోనా అంటాడు.

ఇక. నీ సంగతి.. ఇంక నిన్ను ఆపమన్నానా... అరే నిజాలు మాట్లాడుతున్నప్పుడు యాక్సెప్ట్ చేయాలబ్బా.. ఏమిటో ఈ సమాజం..

సమాజం గురించి ఎందుకులేగాని... మన గురించి మాట్లాడుకుందాం. మన గురించి మాట్లాడుతుంటేనే కదా తమరికి నచ్చడం లేదు.

నువ్వు ఊహించుకుంటున్నంత సీను లేదు విశి నాకు మంచి ఫ్రెండ్ అంతే..  తను ఇబ్బందుల్లో ఉంది ఒక ఫ్రెండ్ గా నేను ఎంత హెల్ప్ చేయగలనా అని మాత్రమే ఆలోచిస్తున్నాను.

అవునా అని ఒరేయ్ వైభవ్ అని పిలిస్తే..  పక్కనే వెళుతూ చెప్పు బావ. మీ వదిన దొరికేసింది రా.. ఎప్పుడు..  ఎక్కడ.. ఎలా..

నాకు ఇప్పటివరకు చెప్పలేదు. నేను అలిగాను. ఐ హర్ట్ అబ్బా. ఒరేయ్ నీ అలకలు పక్కన పెట్టు. నీకు ఇన్ఫర్మేషన్ కావాలా వద్దా అని శ్రీకర్ అడిగితే.. సూర్య కోపంగా నిన్ను ముయ్యమన్నానా...

చూసావా వైభవ్.. క్యూటి ఇన్ఫర్మేషన్ కావాల్సినంత వరకు నిన్ను వాడుకున్నాడు.. ఇప్పుడు తెలిసిన తర్వాతే నీకే చెప్పొద్దంటున్నాడు .

అంతే బావ.. ప్రేమ వచ్చేటప్పటికి రక్తసంబంధాలకి విలువ లేకుండాపోతుంది. ఏమి చేద్దాం అని రాని కన్నీరు తుడుచుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు.

నీ ఎకసక్కలు వదిలి ముందుకు చూస్తూ డ్రైవ్ చేయ్.. లేకపోతే రాని కన్నీరు నిజంగానే వస్తుంది. నా చూపు  రోడ్డుమీద... నా చెవులు బావ చెప్పే క్లూ మీద ఉంది అన్నయ్య. పర్వాలేదు..  నువ్వు చెప్పు బావ.
క్లూ అన్నావు కాబట్టి మీ వదిన గురించి నీకు ఒక క్లూ ఇస్తాను బామ్మర్ది... క్యాచ్ చెయ్..  చెప్పు బావ. మా అందరికన్నా ఫస్ట్ నువ్వే కలిసావు. నువ్వే మాట్లాడావు. ఎవరో చెప్పుకో చూద్దాం..

ఇది నిజంగానే అగ్నిపరీక్షలాగా ఉంది. రోజుకి నేను చాలామంది అమ్మాయిలతో మాట్లాడతాను. గోకుతాను.  అలాంటిది వదిన ఎవరు అన్నది ఎలా తెలుసుకోవాలి.

అందుకే రా నిన్ను చందు... నాలుగు పీకేది. ఇంత ఆనందకరమైన  సమయంలో ఆ రాక్షసి గురించి ఎందుకు బావ.

నీ రాక్షసి నీకు ముద్దుగా ఉంటుంది కదా అందుకనే గుర్తు చేశాను.. ఏరా బాగోలేదా..  టాపిక్ డైవర్ట్ చేయకు.  చెప్పు బావ. నీకు ఇంత పెద్ద క్లూ ఇచ్చిన నువ్వు కనుక్కోకపోతే నిజంగానే వేస్ట్ రా...

ఈసారి ఇంకొక క్లూ ఇవ్వు పట్టేస్తాను.  సరే ఇప్పుడు ఇచ్చేది మాత్రం చాలా ఈజీ క్లూ.. నలుగురికి భోజనం పెట్టాలి అనుకునే అన్నదాత.

ఎవరి గురించి చెప్తున్నావు బావ.  విశిష్ట కదా ఈ పనులు చేసేది... చాలా దగ్గరికి వచ్చేసావు. క్యూటీనే.. విశిష్టాన... విశిష్ట నాకు కాబోయే వదిన... 

యాహువా అని అరుస్తాడు.  ఒరేయ్ అరుపులేమిటిరా...  డీసెంట్ గా డ్రైవ్ చేయి.. ఎలా అన్నయ్య ఇంత హ్యాపీ న్యూస్ తెలిసాక కూడా అంత స్టేబుల్ గా ఉండగలుగుతున్నావు.

హలో బామ్మర్ది... మీ అన్నయ్య ఏమి స్టేబుల్ గా లేడు. అక్కడే పక్కకు వెళ్లి డాన్స్ చేశాడు..ఈరోజు ట్రీట్ అంత ఇచ్చేదే మీ అన్నయ్య.

నేను డాన్స్ చేసిన విషయం నీకు ఎలా తెలుసురా... మాకు వెనకాల కూడా కళ్ళు ఉంటాయి బాబు.  తమరు ఏం చేస్తున్నా నాకు తెలిసిపోతుంది.

చిన్నప్పటినుంచి నిన్ను చూడడం లేదా ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తావో నాకన్నా బాగా ఎవరికి తెలుసు..ఇంతకీ వదినకి విషయం చెప్పారా.

వదినని కూడా తీసుకువచ్చి ఉంటే ఫ్యామిలీకి పరిచయం చేసేవాళ్లం కాదా... నువ్వు మరీ అంత అడ్వాన్స్డ్గా వెళ్లకు. అసలు విశిష్ట కి సూర్య ఎవరో తెలియదు.

అదేమిటి.. మీ వదిన గుర్తుగా మీ అన్నయ్య దగ్గర రింగ్ ఉన్నట్టే.. మీ అన్నయ్య గుర్తుగా మీ వదిన దగ్గర కూడా ఉంది.

కాకపోతే అది సూర్య ఇచ్చినదే అన్నది తెలియదు.  వాళ్ళ నాన్నగారు ఏదో స్టోరీ చెప్పారు. అదే నిజం అనుకుంటుంది. అవునా...  ఇప్పుడు ఎలా..

అదంతా సూర్య చేతిలోనే ఉంది.  మీరిద్దరూ ఇంక మూస్తారా.. ఏమీ లేని దానికి ఒక సినిమా క్రియేట్ చేస్తున్నారు.

ఏంటి బాబు... మేము సినిమా క్రియేట్ చేస్తున్నామా... క్యూటినే విశిష్ట అని తెలియగానే నీ మొఖం చిచ్చుబుడ్డి లాగా వెలిగిపోలేదా...

అంటే అప్పటికే మనం వెతుకుతూఉన్నాం కదా..  దొరికేటప్పటికీ హ్యాపీగా అనిపించింది. ఏ నీకు మాత్రం కావాల్సింది దొరకగానే సంతోషపడవ ఏమిటి..

మేమనేది కూడా అదే సూర్య. నీకు కావాల్సింది నీ ఎదురుగుండా ఉంది. గుర్తించు అంటున్నాము.  తమరే ఇంకా స్నేహం స్నేహం అంటున్నారు.

ముగ్గురు ఒకచోట ఆగితే... వైభవ్ వెళ్లి సాఫ్ట్ డ్రింక్స్ తీసుకొచ్చి ఇస్తాడు.   డ్రింక్ తీసుకుని సూర్య మౌనంగా తాగుతూ ఉంటే..  ఏంటి సూర్య ఏదో చించుతున్నట్టున్నావు.

ఏమోరా... మీరేమో ప్రేమ అంటున్నారు. నేనేమో స్నేహం అంటున్నాను.  విశి ఏమో తెలిసిన మనిషి అనుకుంటుంది. ఇంత ట్రయాంగిల్ లో ఏది కరెక్ట్ ఓ తెలియడం లేదు.

మేమందరం చెప్పడం కాదు. నీకేమనిపిస్తుందో అది ఆలోచించు... చాలా కన్ఫ్యూషన్ గా ఉంది..  కన్ఫ్యూషన్ లో నుంచి వచ్చేదే ప్రేమ.  అలా అని ఫోర్స్ చేయము.  నువ్వే ఆలోచించు.

విశి గురించి తెలియగానే అంకుల్ ఎక్కడ ఉన్నారు అని కూడా చూడకుండా నీ హ్యాపీనెస్ షేర్ చేసుకున్నావు.  సడన్ గా ట్రీట్ ఇచ్చావు.

విశిని స్ట్రాంగ్ చేయాలి అనుకుంటున్నావు.  మరి ఇవన్నీ ఏమిటిరా..  అది.. ఫ్రెండ్ అని మాత్రం చెప్పకు. అంతకుమించి మీ ఇద్దరి మధ్యన ఉంది. అది ఏమిటో నువ్వే చెక్ చేసుకో.. అంతేనా వైభవ్.

ఏమో బావ ఈ ప్రేమల గురించి  నాకు ఏమీ తెలియదు.  తెలిసిన తర్వాత నేను కూడా నీలాగే సలహాలు ఇస్తాను.
మనగోల లో పడి ఇక్కడే ఆగిపోయాము.  ఈ లవ్ కపుల్స్ ఎక్కడికి వెళ్లిపోయాయి. వాళ్లతో మనకెందుకురా... ఎక్కడికో ఎగురుకుంటూ వెళ్ళుంటారు.

రాత్రికి గూటికి చేరుకుంటాయి కదా.. అప్పుడు తెలుస్తుందిలే...
ఆ గౌతమ్, హిమల గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయమన్నాను. ఎంతవరకు వచ్చింది. ఆల్మోస్ట్ మొత్తం కలెక్ట్ అయింది.

రేపటి నుంచి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఆపరేషన్లో నన్ను కూడా ఇన్వాల్వ్ చేయొచ్చు కదా అన్నయ్య..

ఇక్కడ నేను కనబడను రా..  అంతా విశిష్టనే.. నేను జస్ట్ బ్యాక్ బోన్ గా ఉంటాను.  వదినకి నన్ను అసిస్టెంట్ చెయ్యి.. 

ఇంకొకసారి వదిన అన్నావు అంటే...  సరే...  సరే నా ఫ్రెండ్ కి నన్ను అసిస్టెంట్ ని చేయి.

సూర్య నిర్ణయం...
కథ కొనసాగుతుంది...
[+] 8 users Like SivaSai's post
Like Reply




Users browsing this thread: