Thread Rating:
  • 4 Vote(s) - 3.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందావనం
Excellent update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
పెళ్లి విషయం లో చాలా ట్విస్ట్ లు ఉంటాయి అని expect చేశా, చాలా సింపుల్ గా అయింది. Overall your both stories పాణిగ్రహణం & బృందావనం చాల excellant గా రాస్తున్నారు.
[+] 2 users Like Sunny73's post
Like Reply
Good update
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Update please
[+] 1 user Likes Reddy 211993's post
Like Reply
Part - 52

దేవేంద్ర పొద్దున్నే రెడీ అయ్యి గుడికి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు చాలా టెన్షన్ గా అనిపిస్తుంది కానీ చెప్పడం తన ధర్మం అని వెళ్లి.. వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.

గుడి తెరిచే టైంకే వచ్చేయడం వలన భక్తులు ఎక్కువ ఉండరు.  పల్చ పల్చగా ఇద్దరు ముగ్గురు కనిపిస్తూ ఉంటారు.

ఒక పెద్దాయన ఒక పక్క మంత్రాలు చదువుకుంటూ.. అభిషేకానికి నీళ్లు తీసుకువెళుతూఉంటారు.  దేవేంద్ర స్పీడ్ గా వెళ్లి మావయ్య గారు అని పిలుస్తారు.

ఎవరా అని చూస్తూ... ఎవరు  మీరు.... నన్ను గుర్తుపట్టలేదా అంటే... క్షమించండి బాబు.  నాకు ఈ మధ్యన చూపు మందగించ్చింది.

తప్పుగా అనుకోకుండా మీరు ఎవరో చెబుతారా... నేను దేవేంద్ర ని.  ఆ మాట వినగానే ఆయన కోపంగా దయచేసి మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోండి.

అమ్మవారి సేవకి వెళుతున్నాను. నా నోటి నుండి ఇప్పుడు ఎటువంటి చెడు మాటలు మాట్లాడనివ్వద్దు అని కోపంగా అడుగు ముందుకు వేస్తుంటే....

మీ మనవరాలు కనిపించింది అని చెబుతారు.  అది వినపడి ముందుకు పడే అడుగు ఆపి ఏమంటున్నారు మీరు...

నేను నిజమే చెబుతున్నాను మావయ్యగారు...మీ మనవరాలు కనిపించింది. మన నిరీక్షణ ఫలించింది అని చెబితే..

ఒక్క అరగంట మీరు ఆగండి ఇప్పుడే వస్తాను అని గుడిలోకి వెళ్లి అమ్మవారి అభిషేకం అన్ని స్వయంగా చేతులతో చేసి బయటకు వచ్చి కూర్చుంటారు.

అక్కడే ఒక చెట్టు కింద అరుగు మీద కూర్చుని ఇప్పుడు చెప్పండి. మీరు చెప్పేది ఏమిటో అడుగుతారు.  నేను నిజమే చెబుతున్నాను.

మీ మనవరాలు కనిపించింది. కాకపోతే  నేనే తండ్రిని అని తెలియదు.  ఆయన విరక్తిగా నవ్వుతూ...ఇప్పుడు ఈ విషయం చెప్పడం వలన మీ ఆంతర్యం ఏమిటి అని అడుగుతారు.

దానికి దేవేంద్ర పెళ్లి కుదిరింది. అమ్మాయి పేరు శాంభవి అని చెబుతారు.  శాంభవి నోట్లోనే మననం చేసుకుంటూ ఉంటారు.

పెళ్లి కూడా నా మేనల్లుడు రుద్రతోనే అని చెబుతారు.  ఇప్పటికి కూడా వదలడం లేదా...ఆ నరకంలోనికే ఇప్పుడు ఆ పసిప్రాణాన్ని కూడా లాగుతున్నారా అని అడుగుతారు.

ఆ మాటక ఆయన బాధగా మీలాంటి గొప్ప వారి నోటి వెంట  చెడు మాటలు వద్దు.  నా కూతురు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండడమే నాకు కావాలి.

సంతోషం... ఇంకా ఏమీ మాట్లాడలేక అంతా అమ్మ లీలా  అనుకొని... రేపు ఒక్కసారి అమ్మాయిని గుడికి తీసుకు రాగలరా అని అడుగుతారు.  తప్పకుండా..

నా కూతురు ఎప్పుడు పచ్చగాఉండాలి. దయచేసి నామీద కోపాన్ని బిడ్డ మీద చూపించవద్దు.  మేము మరీ అంత మూర్ఖులం కాదు.

తను మీ బిడ్డ అనే దాని కన్నా..
ముందు నా కూతురు బిడ్డ. మేము అలాగే చూస్తాము అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతారు.

వెళుతున్న పెద్దాయన చూస్తూ కళ్ళు మూసుకుని అమ్మవారి వైపు చూస్తూ ఇంకా ఎంతకాలం అమ్మ ఈ శిక్ష అనుకోని వెళ్లిపోతారు.

దేవేంద్ర కి కొంచెం మనసు శాంతిఇస్తుంది.  శాంభవి వంకనైనా వాళ్ళ మామగారు మాట్లాడారు.

రేపు మనవరాలని చూస్తే ఇంకొంచెం మనసు మెత్తబడవచ్చు. అత్తగారిని కూడా క్షమాపణ అడిగి శాంభవి ని చూపించాలి అనుకుంటారు.

దేవేంద్ర ఇంటికి వెళ్లేటప్పటికీ శాంభవి ఎదురు వస్తూ ఉంటుంది.  అలా చూసిన దేవేంద్రకి మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది.

శాంభవి తల పైన చేయి వేసి ఏంటి తల్లి అని అడుగుతారు.  పొద్దుట నుండి నాకు మీరు కనపడలేదు. ఏంటో వెలితిగా అనిపించింది.

ఎక్కడికి వెళ్లారు నాకు చెప్పకుండా అని అలకగా అడుగుతుంది.  శాంభవి మాటలకు నవ్వుకుంటూ గుడికి వెళ్లాను అని చెబుతారు.

అయ్యో చెబితే నేను వచ్చేదాన్ని కదా అంటుంది. రేపొద్దున్న నిన్ను తీసుకువెళ్తాను. వస్తావా అని అడుగుతారు.

తప్పకుండా వస్తాను అని చెబుతుంది.  సరే అని చెప్పి ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తారు. 
వస్తున్న ఇద్దరినీ చూసి రుద్ర ఏంటి తండ్రి కూతుర్లు ఇద్దరూ తిప్పుకుంటూ   వస్తున్నారు అని అడుగుతాడు.  ఆ మాటకి శాంభవి....తండ్రి కూతుర్లు ఏమిటి అని అడుగుతుంది.

అదే...నువ్వు నాకు కాబోయే పెళ్ళాం. ఈయన నాకు మేనమామ అంటే...వరుసకు నువ్వు కూతురివే అవుతావు కదా అలా చెప్పాను అంటాడు.


రుద్రా రేపు నువ్వు కూడా మాతోపాటు గుడికి రావాలి అని దేవేంద్ర చెబుతారు.  ఏ గుడికి మామ అంటే..  శాంభవిని తీసుకుని వెళుతున్నాను.

నువ్వు కూడా రా అని ఇండైరెక్టుగా ఏ గుడో చెబుతారు.  సరే మామ నాకు కాబోయే పెళ్ళంతో అంటే ఎందుకు రాను అంటాడు.

ఈయన..  ఈ వెటకారాలు.. ఎవరి ముందు ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు అని పళ్ళనూరుతూ ఉంటుంది.

ఎక్కువ నూరకు... అరిగిపోయాయి  అనుకో మాటలు కూడా సరిగ్గా రావు అని కౌంటర్ వేస్తాడు.  ఎందుకురా అస్తమాను నా కూతురుని ఏడిపిస్తూ ఉంటావు...

అలా అడగండి అంకుల్.ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. శాంభవిని చూసి రుద్ర నవ్వుకుంటాడు.  సార్ నుంచి అంకుల్ కి వచ్చింది పరవాలేదులే అనుకుని...

ఏంటే నా మీదే మా మామకి కంప్లైంట్ ఇస్తున్నావా... ఎవరికి కంప్లైంట్ ఇచ్చిన నాకు ఫరక్ పడదు అని అంటాడు.

అవునా మీరు ఎప్పుడో ఒకప్పుడు... ఎవరో ఒకరికి భయపడతారు చూడు... అప్పుడు అది నేను చూడాలి అని డ్రీమ్స్ లోకి వెళుతూ ఉంటే....

హలో పాప నీకు అంత సీన్ లేదు. నన్ను భయపెట్టే వాళ్లు ఇంకా పుట్టలేదు.  పుట్టినప్పుడు సంగతి ఆలోచిద్దాంలే అంటాడు.


పుట్టాలి అని నేను కోరుకుంటున్నాను అని గట్టిగా అంటుంది. వాళ్ళిద్దరు గొడవ చూసి నవ్వుకుంటూ దేవేంద్ర తండ్రి దగ్గరికి వెళతాడు.

నన్ను భయపెడితే నీకెందుకే అంతా ఆనందం అని అడిగితే... అస్తమాను మీరు నన్ను ఏడిపిస్తున్నారు కదా అందుకే అని అంటుంది.

అక్కడి నుంచి దేవేంద్ర వెళ్ళిపోయిన సంగతి కూడా శాంభవి పట్టించుకోకుండా రుద్రతో గొడవ పడుతూ ఉంటుంది.

సరే తొందరగా రెడీ అవ్వు.  కార్ లో వెళుతూ కూడా మనం గొడవ పడొచ్చు అని అక్కడి నుండి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు.

పక్కకు చూస్తే.. అప్పటికీ దేవేంద్ర కనపడడు. ఎక్కడికి వెళ్ళిపోయారు అనుకుంటూ చుట్టూ చూస్తుంది హాల్లో శాంభవి ఒక్కతే ఉంటుంది.

చాలా నిశ్శబ్దంగా అనిపిస్తుంది. తన గదికి వెళదామని మెల్లిగా అడుగులు వేస్తూ ఉంటే...  చల్లటి గాలి వచ్చి చెంపని తాకుతుంది

ఆ గాలి స్పర్శ ఎందుకో తెలియని ఆత్మీయతను చూపిస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. చంప పైన చెయ్యి వేసుకుని ఆ గాలిని ఆస్వాదిస్తూ చుట్టూ చూస్తూ ఉంటుంది.

అక్కడ నిలువెత్తు ఫోటో కనపడుతుంది. అది చూడగానే అడుగులు అటువైపుకు వేస్తుంది. అది దేవేంద్ర గారి భార్య ఫోటో.  ఎందుకో ఆ ఫోటోని చూడగానే శాంభవిని పిలుస్తున్నట్టే గానే ఫీలవుతూ దగ్గరికి వెళ్ళిపోతుంది.

దేవేంద్ర తండ్రి దగ్గరికి వెళ్లి గుడిలో జరిగిందంతా చెబుతారు. అది అంతా విని రాఘవేంద్ర కొడుకు వైపు చూసి వాళ్ళది చాలా పెద్ద మనసులు రా..

వెన్నకంటే మెత్తన. ఊరికే కరిగిపోతారు. రేపు మనవరాలను చూసిన తర్వాత ఇంకా మెత్తబడిపోతారు. తప్పకుండా మనల్ని క్షమిస్తారు అని చెబుతారు.

సరే నాన్న ఇంక నేను బయలుదేరుతాను అని లెగిస్తే నేను వస్తాను పద అని తండ్రి కొడుకులు ఇద్దరు గది బయటికి వచ్చి నిలబడిపోతారు.

శాంభవి ఫోటో దగ్గరకు వెళ్లి తాకుతూ..  మీరు ఎవరో నాకు తెలియదు. మిమ్మల్ని చూస్తూ ఉంటే ఏదో తెలియని ఒక ఆత్మీయత భావన కలుగుతుంది.

అది ఏమిటో కూడా అర్థం కావడం లేదు. మిమ్మల్ని పదేపదే చూడాలి... మీతో మాట్లాడాలి అని ఎందుకో నా మనసు ఆరాటపడుతుంది.

ఎవరు మీరు... మీకు నాకు ఉన్న సంబంధం ఏమిటి.. మనిద్దరికీ పూర్వజన్మ సంబంధం ఉన్నదా... అని ఫోటోతో మాట్లాడుతూ ఉంటుంది.

అది చూసిన దేవేంద్ర కన్నీళ్లు పెట్టుకుంటూ.. చూసావా నాన్న నా కూతురు తన తల్లి ఎవరో తెలియకుండానే నా భార్య ఫోటో వైపు అడుగులు వేస్తుంది.

తన తల్లితో మాట్లాడుతుంది. మీకు ఒక విషయం తెలుసా..  పొద్దుట నేను కనపడలేదు అని...చెప్పకుండా బయటికి వెళ్లాను అని... నాపైన అలిగింది కూడా అని మురుపెంగా చెబుతారు.

ఆ మాటలకి రాఘవేంద్ర కొడుకు భుజం పైన చేయి వేసి శాంభవి దగ్గరకి వస్తారు.  ఇదంతా దూరం నుంచి చూస్తున్న అనసూయ నోటికి చెయ్యి అడ్డు  పెట్టుకుని మరీ ఏడుస్తూ ఉంటుంది.

అనసూయని చూసిన చారులత ఇప్పుడు ఏడవడం వల్ల ఏంటి ఉపయోగం. నీ అహంకారం చూడు... తండ్రి కూతుర్లు ఇద్దరినీ ఎంత దూరంలో నుంచో పెట్టిందో...

నేనే తండ్రిని అని  తన కూతురికే చెప్పుకోలేక నా అన్న పడే ఆవేదన నీకు కనపడుతుందా.... ఇంత ఐశ్వర్యం ఉండి ఏమీ ఉపయోగం.

నా అన్న బాధను తీర్చగలుగుతుందా..  నిన్ను ఎప్పటికైనా నాన్నగారు క్షమిస్తే బాగుండును అనుకునే దాన్ని.  కానీ అన్నయ్య బాధ చూస్తూ ఉంటే..

నాకే నిన్ను ఛా.... అని అక్కడనుండి వెళ్ళిపోతుంది.  వెళుతున్న కూతురు వైపు చూస్తూ నేను ఈ ఛీత్కారాలకి అర్హురాలనే అనుకొని గదిలోనికి వెళ్ళిపోతారు.

చారులత కూడా శాంభవి దగ్గరికి వెళుతుంది.

రాఘవేంద్ర గారు శాంభవి భుజం పైన చెయ్యి వేస్తారు. శాంభవి ఉలుక్కుపడి వెనక్కి తిరుగుతుంది.  ఏమైంది తల్లి అని..ఎందుకు ఆ ఫోటో వైపు అంత తదేకంగా చూస్తున్నావు అని అడుగుతారు.

శాంభవి ఏమని చెబుతుంది...
[+] 7 users Like SivaSai's post
Like Reply
Part - 53

తెలీదు తాతగారు. ఆ ఫోటో చూస్తూ ఉంటే ఎందుకో  నాకు చాలా దగ్గరగా అనిపిస్తుంది. కొంతమందిని చూస్తూ ఉంటే పూర్వజన్మ సంబంధమా అనిపిస్తుంది.

ఈ ఫోటోని నేను చూస్తున్న నాకు అలాగే అనిపిస్తుంది. చూడగానే కనెక్ట్ అయిపోతుంది. అది ఏమిటో నాకు అర్థం కావడం లేదు.

రాఘవేంద్ర గారి మనసులో ఆవిడ నీకు కన్నతల్లి. నిన్ను కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నం చేసిందో మాకు తెలుసు అమ్మ.

అందుకే ఆ బంధం నిన్న అలా లాగుతుంది అనుకుని తల మీద చేయి వేసి నా చిన్న కోడలు నిజంగా బంగారం తల్లి. మనసు వెన్న.

భగవంతుడు దయతో నాకు బంగారం లాంటి ఇద్దరు కోడల్ని ఇచ్చాడు కానీ కొంతమంది చూపు తగిలి నా చిన్న కోడలు వెళ్ళిపోయింది అని బాధపడతారు.

బాధపడకండి తాతగారు.  మీరు బాధపడితే అంకుల్ కూడా బాధపడుతున్నారు చూడండి అనగానే.. చారు అక్కడికి వచ్చి ఇప్పుడు మన సంతోషపడే సమయం లో మీరు బాధపడితే ఎలా చెప్పండి.

నిజమే చారు నువ్వు అన్నదే అని కూతుర్ని దగ్గరికి తీసుకుంటారు. అది చూస్తున్న మనవళ్ళు ముగ్గురు కొంచెం ఎమోషనల్ అవుతారు.

వెంటనే సెట్ అయ్యి మీ సెంటిమెంట్ డ్రామా అయిపోతే బ్రేక్ ఫాస్ట్ చేద్దాం రండి. అసలే చాలా వర్క్స్ ఉండిపోయినాయి.

మళ్ళీ పెళ్లి టైం దగ్గరకొస్తే లీవ్స్ మనమే పెట్టాలి కదా అని శాంభవి వైపు చూసి కన్ను కొడతాడు  అది చూసి శాంభవి ఉలిక్కిపడుతూ చుట్టూ చూస్తుంది.  ఎవరైనా చూశారా  అని.

ఎవరి పనిలో వాళ్ల బిజీగా ఉంటే హమ్మయ్య ఎవరు చూడలేదు అనుకుని రుద్రాన్ని కోపంగా చూస్తుంది. ఆ కోపాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ బ్రేక్ ఫాస్ట్ ఫినిష్ చేస్తారు.

రుద్ర తో తో పాటు శాంభవి ఆఫీస్ కి వెళుతుంది. వెళుతున్నప్పుడు సార్ అని పిలుస్తుంది.  అబ్బా ఇంకా సార్ అని పిలుపు ఎందుకు గాని..

బావ అని పిలవచ్చు కదా అని అడుగుతాడు.  ఏంటి అని గట్టిగా అరుస్తుంది.  ఇప్పుడు ఎందుకు అలా చెవులు చిల్లులు పడేలాగా అరుస్తావు.

లేకపోతే మీరు అడిగింది ఎలా ఉంది. ఎవరినైనా బయటి వాడిని అని పిలుస్తారా అంటుంది. నేను బయట వాడిని ఎందుకు అవుతాను.

నేను నీకు కాబోయే మొగుడు. అది అయిన తర్వాత కదా..  ఎవరైనా ఆ పిలుపు పిలిచేది మేనత్త, మేనమామ కొడుకుని.  అంతేగాని కాబోయే వారిని కాదు అని మూతి తిప్పుతుంది.

నాకు మాత్రం మరదలు ఎవరున్నారు.  చేసుకునే అమ్మాయే మరదలు వరుస కూడా అవుతుంది కదా ... పిలవచ్చు కదా అని  గారంగా అడుగుతాడు.

అమ్మో నేను పిలువను నాకు సిగ్గు బాబు అంటుంది. మరి నివాస్ ని పిలుస్తావు కదా అని ఉడుక్కుంటూ అడుగుతాడు.

బావ అంటే చిన్నప్పుడు నుంచి కలిసి పెరిగాము అది అలవాటు. ఇప్పుడు మిమ్మల్ని విహాన్,అద్వైత్ సార్ వాళ్ళ పిలవడం లేదు అలాగే అది అంతే అంటుంది.

అది వేరు,  ఇది వేరు నువ్వు నన్ను బావ అని పిలవాల్సిందే అంటాడు.  ఇది ఎక్కడ గోల మీతో.  ఎవరైనా పిలుస్తారా ఇబ్బందిగా అడుగుతుంది.

ఎవరి సంగతి మనకెందుకు బంగారం. నువ్వు పిలవచ్చు కదా..  నిన్ను చూడు నేను పాప అని ముద్దుగా పిలవడం లేదు అలాగే నువ్వు కూడా పిలువు అని బ్రతిమాలతు ఉంటాడు.

సార్ అని గట్టిగా పిలుస్తుంది. ఏమైంది అని కంగారుగా అడిగితే.. మీ మాటల్లో పడి అసలు విషయం మర్చిపోయాను.

ఏం విషయం అని అడిగితే... నేనుఊరు వెళ్తాను. పెళ్లి అయ్యేవరకు అక్కడే ఉంటాను అని చెబుతోంది. నువ్వు అక్కడ ఉంటే ఇక్కడ నేనేం చేయాలి అని అడుగుతాడు.

ఇదేం ప్రశ్న..  మీరు ఆఫీస్ కి వెళ్తారు. మీ ఇంటికి వెళతారు.  చేయాల్సిన పని చాలా ఉందని ఇందాకే కదా చెప్పారు అంటుంది.

ఒసేయ్ తింగరబుచ్చి... పెళ్లి కుదిరితే లైఫ్ పార్ట్నర్ తో టైం స్పెండ్ చేయాలి అనుకుంటారు. నువ్వు మాట్లాడితే మా ఊరు వెళ్తాను.

మా నాన్నను చూడాలి. పొలం గట్ల మీద ఆడుకోవాలి అని అడుగుతావేంటి అని అడుగుతాడు. అయినా నీ ప్రాజెక్ట్ ఇంకా అవలేదు కదా..

అది అయ్యేటప్పటికి మన పెళ్లి టైం వచ్చేస్తుంది అని చెబుతాడు.  అయ్యో ఇప్పుడు ఎలా..  నేను మా నాన్న వాళ్లతో టైం స్పెండ్ చేయాలి కదా అని అడుగుతుంది.

ఒక పని చెయ్ పెళ్లయిన తర్వాత అందరినీ ఇక్కడికి తీసుకువచ్చేయ్. అలా తీసుకో వస్తే వేరు. నేను అక్కడికి వెళ్ళితేనే బాగుంటుంది అంటుంది. అసలు చాన్సే లేదు కదా అంటాడు.

అంతేనా... అంతే...  ఏమి చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది.  ఉన్నదే చిట్టి బుర్ర.  దానితో ఆలోచించి అరగదీయ్యకు. అది అరిగిపోతే నాకు చాలా కష్టం  అని వేళాకోళం ఆడతాడు.

నాది చిట్టి బుర్ర అంటావా చెబుతాను నీ పని అని.. ఒక్క నిమిషం శ్వాస తీసుకుని వదిలి..  బావ అని గారంగా పిలుస్తుంది.

అంతే కార్డు సడెన్ బ్రేక్ వేసి ఏమని పిలిచావు  తడబడుతూ అడుగుతాడు. బావ అని పిలిచాను బావ.. తప్ప అని కళ్ళు టపటప కొడుతుంది.

తప్పు ఎందుకు అవుతుంది పాప. ఎప్పుడు పిలుస్తావానే కదా నేను చూస్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి పిలవవవా అంటూ శాంభవి వేలుతో  ఆడుతూ అడుగుతాడు.

పో బావ నువ్వు అల అడుగుతూ ఉంటే నాకు సిగ్గేస్తుంది అంటుంది. ఆమ్మో నా పిల్లకి సిగ్గు కూడా వచ్చేసిందే... ఇది మాత్రం సెలబ్రేట్ చేసుకోవాల్సిందే అని ఎక్కడికి వెళ్దాం చెప్పు.

ఈరోజు ఆఫీస్ లేదు ఏమీ లేదు అని అంటాడు
  అయ్యో బావ అలా అంటే ఎలాగా.. వర్క్ డిలే అయిపోతుంది కదా...

నేను కూడా చేయాల్సింది చాలా ఉంటుంది కదా అంటుంది.  పాప అవన్నీ నేను చూసుకుంటాను కదా..నీ వర్క్ అంతా నేను..  నేనే.. చేస్తాను కదా అంటాడు.

నిజమా బావ అని అడుగుతుంది. నిజం పాప.. నువ్వు అలా బావ... బావ... అని పిలుస్తూ ఉంటే నాకు చెవుల్లో తేనే పోసినట్టుగా ఉంది అని అంటాడు.

అదేంటి బావ అక్కడ తెనే పడితే చీమలు కుడతాయి కదా నోటిలో అనాలి అంటుంది. నువ్వు బావ అని పిలుస్తూ  ఉంటే ఏం మాట్లాడుతున్నానో అర్థం కావడం లేదు.

బావా అని మళ్ళీ పిలుస్తుంది. చెప్పు పాప అంటాడు. మరి నాకు పెళ్ళికి ముందు ఊరు వెళ్లి నాన్న వాళ్లతో టైం స్పెండ్ చేయాలని ఉంది. 

దాని గురించి ఆలోచించు బావ అని అంటుంది. వెళ్ళు పాపా నిన్న అడ్డుకునేది ఎవరు? నీకు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళు అంటాడు.

ప్రామిస్ అని అడుగుతుంది. ఈ రుద్ర మాటిస్తే తప్పడు. ఏమో బావ.. ఇప్పుడు అలాగని తర్వాత కుదరదు అంటావేమో.

నా మాట మీద నమ్మకం ముంచు పాపా వెళ్ళు అని చెబుతాడు.  థాంక్యూ సార్ అంటుంది.

అప్పుడు బావ అనే పిలుపు ట్రాన్స్లో నుంచి బయటికి వచ్చి అమ్మని...ఎంత మాయ చేసావే... బావా అని పిలిచి నీ పని కానించుకున్నావా అని గుర్రుగా అడుగుతాడు.

లేకపోతే అస్తమాను పాపా పాపా అని పిలిచి నన్ను ఇరిటేట్ చేయడం లేదా...నీకు కావాల్సింది అన్ని చేయించుకోవడం లేదా ఇది అంతే అని లేని కాలర్ని ఎగరేస్తుంది.

వెయ్యి... వెయ్యి..  ఎన్ని రోజులు ఎగరేస్తావో నేను చూస్తాను. అవన్నీ తర్వాత గాని సార్, రేపే నేను ఊరు వెళ్దాం అనుకుంటున్నాను.

రేపు ఆ కుదరదు అంటాడు. ఇప్పుడే కదా ఒప్పుకున్నావు. రుద్ర మాటిస్తే తప్పడని ఏదో బిల్డప్ ఇచ్చావు కదా..
   అవన్నీ ఉత్తుత్తి మాటలేనా అని అడుగుతుంది.

నీక్కూడా ఆడుకోవడం బాగా వచ్చేసిందే ... ఎంతైనా మీ ట్రైనింగ్ కదా సార్. గురువు అడుగుజాడల్లో నడవాలి కదా అని రెండు చేతులు నమస్కారం చేస్తూ చెబుతుంది.

ఆ మాటలకు నవ్వుకుంటూ సరే.. ఒక రెండు రోజులు ఆగు.  నేనే తీసుకెళ్లి డ్రాప్ చేస్తాను అంటాడు.  లేదు... లేదు..  నేను వెళ్ళిపోతాను అంటుంది.

చెప్పింది వినడం నేర్చుకో పాప.  వెళుదువు అన్నాను కదా.. నీతో కలిసి నాకు ట్రావెలింగ్ చేయాలని ఉంది.  మా అత్తగారి ఊరు కూడా చూడాలి కదా అంటాడు.

సరేలే అని డల్ గా చెబుతుంది. ఒక్క రెండు రోజులకే ఇంత నీరసమా.. నీకేం తెలుసు రేపు వెళ్ళిపోతున్నాను అన్న హుషారుని అంతా బెల్లోన్ లో గాలి తీసినట్టు తీసేసావు అంటుంది.

ప్రతిదానికి ఇలా డల్ అయిపోకూడదు.  ఎలాంటి సిచువేషన్ అయినా సరే ఫేస్ చేయడం అలవాటు చేసుకో అంటాడు.

హ్మ్... అని సైలెంట్ గా కూర్చుంటుంది..  కార్ స్టార్ట్ చేసి ఇద్దరూ ఆఫీస్ కి వెళ్ళిపోతారు. వెళ్లిన తర్వాత శాంభవితో వర్క్ మొత్తం చేపిస్తూ ఉంటాడు.
 
నిషా, ఆశ ని తీసుకుని ఆనంద్, విహారి వాళ్ళ తాతగారు ఊరు వెళతారు. అది చాలా పెద్ద రాజమహల్ లాగా ఉంటుంది.

అది చూసి ఆశ, నిషా నోరు వదిలేస్తారు. ఏంటి మీ ఇల్లు చాలా పెద్దగా ఉంది. అవును తాతగారు ఇక్కడే ఉంటారు. ఆయన ఈ ఊరు విడిచి రారు అని చెబుతారు.

అవునా చాలా పెద్దగా ఉంది అని అంటుంది.  లోపలికి పదండి అని తీసుకువెళ్తారు.  అక్కడ ఒక పెద్దాయన గంభీరంగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు.

మీరు ఇద్దరు ఇక్కడే దూరంగా నిలబడి ఉండండి. ముందు మేము మాట్లాడి వస్తాము అని వాళ్ళిద్దరూ వెళ్లి చేతులు కట్టుకుని నిలబడతారు.

ఆ పెద్దాయన కోపంగా వీళ్ళిద్దరూ వంక చూసి తిడుతూ ఉంటారు.  కొంచెం సేపు తర్వాత పెద్దాయన చల్లబడతారు.

ఆశ, నిషా న్ని చూపిస్తూ ఏదో చెబుతారు.అది విని వాళ్ళిద్దర్నీ ఇక్కడికి రమ్మనండి అని చెబుతారు. సైగ చేసి రమ్మని పిలుస్తారు.

ఇద్దరూ వచ్చి నమస్కారం తాతగారు అని చెబుతారు. ఏ ఊరు మీది. మీకు మా మనవళ్ళు ఎలా పరిచయమని గంభీరంగా అడుగుతారు. ఆ మాటకే ఇద్దరికీ వణుకు వస్తుంది.

ఇద్దరూ ఏమని చెబుతారు...
[+] 8 users Like SivaSai's post
Like Reply
Part - 54

ఆ పెద్దాయన అంత గంభీరంగా అడుగుతూ ఉంటే.. ఆశ, నిష భయంతో వనికిపోతూ ఉంటారు.  ఆనంద్, విహారి మీరు కంగారు పడకండి అని..తాతగారు మీకు ముందే చెప్పాము కదా...

వీళ్ళిద్దరూ మా ఫ్రెండ్స్ అంటారు.  సరే అయితే వీళ్ళని లోపలికి తీసుకువెళ్లి విశ్రాంతి తీసుకోమను. తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పి పంపిస్తాడు.

హమ్మయ్య అనుకుని ఇద్దరు మెల్లిగా లోపలికి వెళ్తారు. వాళ్లు వెళ్లిన తర్వాత పెద్దాయన ఎవరికో ఫోన్ చేసి మాట్లాడతారు.

లోపలికి వెళ్ళిన ఆశ,నిషా అయ్యబాబోయ్ మీ తాతగారు ఏంటి అలా ఉన్నారు. ముందే చెప్పాము కదా మా తాతగారు చాలా స్ట్రిక్ట్ అని.

ఆ కుటుంబం మీద కూడా చాలా కోపంగా ఉన్నారు అని. మిమ్మల్ని ఎవరు ఏమిటి అని అడిగితే.. సమాధానం చెప్పకుండా అలా చూస్తారు ఏమిటి అని విసుగ్గా అంటారు

ఏంటి మాట్లాడేది.. ఆయన అలా అడుగుతూ ఉంటే.. టెన్షన్ తో చెమటలు పట్టేసాయి.  ఇప్పుడు మళ్లీ సమాధానం చెప్పాలి అంటే ఎలాగా..

సరేలే ప్రస్తుతానికి వెళ్లి రెస్ట్ తీసుకోండి. తర్వాత మాట్లాడుకుందాం అని వాళ్ళిద్దరికీ ఒక గది చూపిస్తారు. రూమ్ లోకి వెళ్ళగానే..  చూసి చాలా బాగుంది కదా అని అనుకుని ఫ్రెష్ అయ్యి మంచం మీద పడుకుంటారు

ఇంతలో మేయిడ్ వచ్చే డోర్ నాక్ చేస్తుంది. కమింగ్ అని చాలా పొగరుగా పిలుస్తారు. జ్యూస్ మేడం అని. అక్కడ పెట్టు అని  పొగరుగానే చెబుతారు.

వాళ్ళని పైనుంచి కిందకి ఒకసారి చూసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది.  వెళ్ళిపోయిన తర్వాత ఎందుకే ఆ అమ్మాయి మనల్ని అలా చూసింది.

మన లాంటి బ్యూటిఫుల్ గర్ల్స్ ని ఎప్పుడూ చూసి ఉండరులే అని జ్యూస్ తీసుకుని తాగుతూ అంటుంది.

ఇద్దరూ జ్యూస్ తాగి ఫ్రెష్ అయి పడుకుంటారు. ఇద్దరు సాయంత్రం దాకా లెగరు.  మళ్లీ ఆ అమ్మాయి  వచ్చి డోర్ నాక్ చేసి పెద్దయ్య గారు రమ్మంటున్నారు అని చెబుతోంది.

ఇద్దరూ గుడ్ గర్ల్స్ లాగా బయటికి వెళ్తారు. పిలిచారంట తాతగారు అని చాల వినాయంగా అడుగుతారు. వాళ్ళిద్దర్నీ పైనుంచి కింద వరకు చూసి మీ ఇద్దరి గురించి మా మనవళ్ళు చెప్పారు .

మీ గురించి చెప్పిందంతా నాకు బాగా నచ్చింది. పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారంట అనిఅడుగుతారు. దానికి తడబడతు ..వీళ్ళిద్దరూ ఏం చెప్పుఉంటారే అని చెవులు కొరుక్కుంటూ ఉంటారు.

అది...  అది  అని నాన్చుతూ ఉంటే... అంటే మీకు ఇష్టం లేదా.. మీకు ఇష్టం లేకుండానే మా మనవళ్లతో కలిసి మా ప్యాలెస్ కి వచ్చారా అని కోపంతో కళ్ళు ఎర్ర చేస్తారు.

ఆయన కోపానికి భయపడి మాకు ఇష్టమే అని గబగబా పాఠం చెప్పినట్టుగా చెబుతారు. వెంటనే ప్రసన్న వదనంతో మంచిది అమ్మాయిలు.

మిమ్మల్ని ఇద్దరినీ మా మెయిడ్స్ రెడీ చేస్తారు. వెళ్లి రెడీ అవ్వండి అని చెబుతారు. ఎక్కడికి అని అడిగితే..ఈరోజు మీ పెళ్లి అని చెబుతారు.

ఆ మాట వినగానే ఇద్దరి నెత్తి మీద బాంబు పడినట్టుగా ఉలిక్కిపడి... పెళ్లా అని గట్టిగా అరుస్తారు. ఏమైంది అలా అరుస్తున్నారు అని మళ్లీ సీరియస్ గా మొఖం పెట్టుకుని అడుగుతారు.

  ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పాలి కదా..  మా తల్లిదండ్రుల తీసుకువచ్చి అందరి మధ్య గ్రాండ్గా చేసుకుందాము అని భయంగా చెబుతారు.

ఈ పెళ్లి గురించి చెబితే మీ అత్తయ్య, తాతయ్య ఒప్పుకుంటారా అని అడుగుతారు.  వాళ్ళు లేదు అనే తలుపుతారు.

మరి ఇంకేంటి? మీకు నాకు కావాల్సింది పగ తీరడమే. మీకు అంతగా ఇష్టం లేకపోతే పగ తీరిన తర్వాత డివోర్స్ తీసుకోండి అని చెబుతారు.

ఆ మాట ఏదో బాగుందే అనుకుని సరే అని చెప్పి రెడీ అవ్వడానికి వెళ్తారు. వాళ్ళిద్దరూ వెళ్లిన తర్వాత ఆనంద్ విహారి అక్కడికి వచ్చి ఏమైంది తాతగారు అంటే...

వీళ్ళిద్దరూ ఇలా ఉన్నారు ఏంట్రా అని అడుగుతారు..ఆ మాటకి ఇద్దరు సైలెంట్ అయిపోయి ఆలోచిస్తూ ఉంటారు.
ఒక్క నిమిషం తాతగారు అని వీళ్లిద్దరూ వాళ్ళిద్దరూ వెనకాల వెళ్లి తలుపు కొడతారు.

తలుపు తీసి ఏంటి అని అడిగితే... మీకు ఈ పెళ్లి నిజంగానే ఇష్టమేనా..  అసలు మీలో ఎవరు మమ్మల్ని చేసుకుంటున్నారు అదైనా తెలుసా అని అడుగుతారు.

ఇందులో తెలుసుకోవడానికి ఏముంది. ఇప్పుడు దాకా మనకు ఎవరికీ పరిచయాలు లేవు కదా...  ఎవరికి ఎవరు మ్యాచ్ అవుతుంటే వాళ్ళ పెళ్లి చేసుకోవడమే.

తర్వాత మన అందరికీ ఓకే అనుకుంటే ట్రావెల్ చేద్దాం లేకపోతే అప్పుడే బ్రేకప్ చేసేసుకోవచ్చని చాలా సింపుల్గా చెబుతారు. ఆ మాటకి ఇద్దరిలోనూ కమింగ్ స్మైల్ వస్తుంది. సరే సరే కానివ్వండి అని చెప్పి బయటకు వచ్చేస్తారు.

ఆశ నిషా రెడీ అయ్యేటప్పటికి ఆనంద్ విహారి కూడా రెడీ అవుతారు. సింపుల్ గా ప్యాలెస్ లోనే  ఆశ ఆనంద్ కి, నిషా విహారికి పెళ్లి చేసి మ్యారేజ్ రిజిస్టర్ చేస్తారు..

ఈ రోజుకి రెస్ట్ తీసుకోండి. రేపు మీ ఇంటికి వెళ్లి అక్కడ కూడా కనబడుదురు గాని అని చెబితే... అమ్మో మా ఇంటికా...  ఇద్దరు భయంగా అంటారు.

చెప్పకపోతేనే ఇంకా తప్పు అవుతుంది. అమ్మాయిలు ఇద్దరికీ ఒక గది చూపించండి అని చెప్పి వెళ్ళిపోతారు.
ఆశ నిషాని రెస్ట్ తీసుకోమని ఆనంద్ విహారి వేరే గదిలోకి వెళ్లి పోతారు

మయూరి ఇంటి దగ్గర ఆలోచిస్తూ ఉంటుంది. ఏవో నెగటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి. వీళ్ళిద్దరూ రెండు రోజుల నుంచి కనపడటం లేదు.

ఎక్కడికి వెళ్లి ఉంటారు.  ఫోన్ చేస్తున్న స్విచ్ ఆఫ్ వస్తుంది. అసలు ఏమై ఉంటుంది.  రుద్రాఏమైనా చేసి ఉంటాడా అని ఆలోచిస్తూ ఉంటుంది.

ఒకసారి ఇన్ఫర్మేషన్ కనుక్కుంటే అనుకొని బృందావనంలో తన మనిషి కాల్ చేస్తుంది. అక్కడ ఏమైనా తేడాగా ఉందా...

లేదు మేడం అంత నార్మల్గానే ఉంది. రుద్ర ఎక్కడున్నాడు. చాలా రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారు. సాయంత్రం ఆఫీసు నుంచి తొందరగానే వచ్చేస్తున్నారు అని చెబుతోంది.

సరే అని ఫోన్ పెట్టేస్తుంది. ఇక్కడ ఇన్ఫర్మర్ మాత్రం చెమటలు తుడుచుకుంటూ పక్కకి చూస్తుంది. అక్కడ ధీరజ్, విహాన్ చెరుకో పక్కన చాకు పట్టుకునే ఉంటారు.

సార్ నన్ను వదిలేయండి అని భయంగా అడుగుతుంది. ఈ తప్పుడు పని చేయకముందు ఆలోచించాలి.ఇక్కడ విషయాలు అక్కడికి చేరవేయడానికి ఎంత ధైర్యం నీకు.

ఏదో డబ్బులకు కక్కుర్తి పడ్డాను కానీ ఏమీ చెప్పలేదు కదా...  చెప్పడానికి అసలు నీకు ఏం తెలుసు అని.  ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అని ధీరజ్ అడిగితే మన కంట్రోల్ లోనే ఉంటుంది.

ఫోన్ తీసుకుని మనమే మాట్లాడదాం అని విహాన్ ఫోన్ లాక్కుంటాడు.

మయూరి ఆలోచిస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్లారు వీళ్ళు ఇద్దరు.  సమాధానం లేని ప్రశ్న ఎదురవుతుంది.

శాంభవి దేవేంద్ర గారిని అడుగుతుంది. పొద్దుటే నన్ను తీసుకువెళతాను అన్నారు మర్చిపోరు కదా...  లేదమ్మా తప్పకుండా తీసుకువెళ్తాను అని చెబుతారు. సరే అని పడుకోవడానికి వెళ్ళిపోతుంది.

బావమరిదులు  ముగ్గురు బావ పక్కన కూర్చుని ఏంటి బావ.. శాంభవి వెళ్లడానికి పర్మిషన్ ఇచ్చావు అంట. ఏంటి సంగతి అని అడుగుతాడు.

అందులో అంతా అనుమానం ఎందుకు. పెళ్లి ఎలాగు దగ్గర పడుతుంది కదా..  ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని ఉంది అన్నది. సరే అని ఒప్పుకున్నాను అని చెబుతాడు.

కానీ నీ మొఖం చూస్తే మాకు అలా అనిపించడం లేదే.. ఇంకా ఏదో జరిగింది అనిపిస్తుంది.  ఏమయి ఉంటుంది బావ అని ముఖాన్ని అటు ఇటు తిప్పుతూ అడుగుతాడు.

నా ముఖంలో ఏమైనా కోతులు ఆడుతున్నాయా అని అడుగుతాడు. కోతులు కాదు గాని ఏదో కొత్త కళ కనపడుతుంది.

అది ఏంటో మాకు అర్థం కావడం లేదు. అర్థం అవ్వాలి అంటే...ఒక పని చేయాలి అంటాడు..  ఏం పని బావ.. ప్రేమలో పడండి.. ఆటోమేటిగ్గా ఆ కళ వచ్చేస్తుందని పక్క నుంచి దేవేంద్ర గారు అంటారు.

అంటే ఇది ప్రేమలో ఉన్న కళ మా బాబాయ్. హ్మ్.. అందులో ఉన్న మ్యాజిక్ ఏ అది అని..  దేవేంద్ర గారు ఆయన ప్రేమలో పడిన రోజులు గుర్తు చేసుకుంటారు.

ఆయన భార్యని గుర్తు చేసుకుంటూ ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా.. మండుటెండలో కూడా వెన్నెల కురిపిస్తుంది. చెప్పుల్లేకుండా ఎడారిలో నడిచిన హాయిగానే అనిపిస్తుంది అంతా మత్తు ఉంటుంది ప్రేమకి.

మనం ప్రేమించిన అమ్మాయి చిరునవ్వు చాలు.ఎలాంటి కష్టాన్నయినా దాటివేయగలము. అది దూరమైతే మాత్రం ఎన్ని సుఖాలు మన చుట్టూ ఉన్న ఊపిరాడినట్టుగానే ఉంటుంది అని కళ్ళు మూసుకుంటారు.

ఆ  ముసిన కళ్ళు వెనకాల అందమైన చిరునవ్వుతో చూస్తూ ఉన్న తన భార్య రూపమే కనిపిస్తుంది. ఒక్క నిమిషం ఆ రూపాన్ని చూస్తూ అలాగే ఉండిపోతారు.

ఎంతసేపు ఉన్నా ఆయన బయటికి రాలేకపోతుంటే జితేంద్ర తమ్ముడు చేతి మీద చెయ్యి వేసి చిన్నగా తడతాడు.

వెంటనే దేవేంద్ర కళ్ళు తెరిచి నేను బాగానే ఉన్నాను అన్నయ్య అని పిల్లల వైపు చూస్తారు.  నలుగురు ఈయన వైపే చూస్తూ ఉంటే...

నేను బాగానే ఉన్నాను.  రుద్ర నాకు ఒక్క మాట ఇవ్వు అంటారు. చెప్పు చిన్న మామ అనగానే నా కూతుర్ని మాత్రం ఎలాంటి పరిస్థితుల్లో కూడా వదలొద్దు.

మన చుట్టూ చాలా దుష్టశక్తులు ఉన్నాయి. రేపన్న రోజున శాంభవికి మాయ మాటలు చెప్పి నీకు దూరం చేయడానికి కూడా ప్రయత్నించవచ్చు అని గద్గద స్వరంతో చెబుతూ ఉంటే...

ఎలాంటి పరిస్థితి వచ్చినా..  ఆఖరికి నీ కూతురు నన్ను చీకొట్టి దూరంగా వెళ్ళాలి అనుకున్నా సరే.. ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను సరేనా చిన మామ అని చేతిలో చేయి వేసి చెబుతాడు.

చాలు రా..  ఈ ఒక్క మాటతో నా మనసులో ఉన్న బాధనంత తీసివేసావు అని రుద్రని హత్తుకుంటాడు.
అది చూసిన రాఘవేంద్ర గారికి కూడా చాలా బాధగా అనిపిస్తుంది.

వీళ్ళని దూరంగా నిలబడి చూస్తున్నా అనసూయ వైపు చూసి ఛీ.. అన్నట్టుగా చూస్తారు.  భర్త చూపులో అసహ్యాన్ని  చూసి అనసూయ తట్టుకోలేక పోతుంది.

అనసూయ పరిస్థితి ఏమిటి...

కథ కొనసాగుతుంది...
[+] 9 users Like SivaSai's post
Like Reply
Excellent update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
Beautiful...
[+] 2 users Like Sunny73's post
Like Reply
I think Rudra is making mayuri taste her own medicine
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
No update today Sivagaru?
Weekend party aa?

Regular ga updates peduthu.. alavatu aipoyindi
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Part - 55

భర్త అసహ్యాన్ని చూసి అనసూయ తట్టుకోలేకపోతుంది. వెంటనే తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకొని..
ఆతలుపుకే జారబడి కూర్చొని ఎక్కి ఎక్కి ఏడుస్తుంది. నేను చాలా పెద్ద తప్పు చేశాను. క్షమించలేని పాపం
అది.

ఒక తల్లికి కడుపు కోత మిగిల్చాను. అందుకే ఎదురుగుండానే నా బిడ్డలు ఉన్నా సరే దగ్గరికి వెళ్లి అక్కున
చేర్చుకోలేకపోతున్నాను అని ఏడుస్తారు.

మర్నాడు ఉదయమే సూర్యోదయం అవ్వకముందే శాంభవి రెడీ అయిపోతుంది. హాల్లోకి వచ్చి దేవేంద్ర
గారి కోసం చూస్తూ ఉంటే రుద్ర కూడా అక్కడికి వస్తాడు.

శాంభవిని అలా చూసి మైమరిచిపోతాడు. తనకు తెలియకుండానే అడుగులో అడుగు వేసుకుంటూ
శాంభవికి దగ్గరగా వెళ్ళిపోతాడు.

తన మెడ దగ్గర తగిలే వెచ్చని గాలికి ఉలిక్కిపడి వెనక్కి తిరుగుతుంది. రుద్రని చూసి ఒక అడుగు వెనక్కి
వేసి స్లిప్ అయ్యి పడబోతుంటే హే.. జాగ్రత్త అని నడుం చుట్టూ చేయి వేసి పట్టుకుంటాడు.

ఒక భంగిమలో ఉన్న శాంభవి నడుము రుద్ర చేతుల్లో చిక్కుకుంటుంది. ఎంతసేపు ఆపోజిషన్లో ఉన్నారో.
ఇద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోతారు.

దేవేంద్ర గారు వచ్చి వెళదామా అనగానే.. వెంటనే చేరుకొని హా... మామ. శాంభవిని సరిగ్గా నిలబెట్టి
కొంచెం ముందు వెనక చూసుకో అని చెప్పి స్పీడ్ గా అడుగులు ముందుకు వేస్తాడు.

శాంభవి కోపంగా రుద్రవైపు చూస్తూ నన్ను భయపెట్టి ఇప్పుడు మళ్ళీ ఎలా అంటున్నాడో అనుకుంటూ
దేవేంద్ర గారి వైపు చూసి పదండి అంకుల్ అంటుంది.

ఏమైందమ్మా అలా కోపంగా ఉన్నావు అని తల మీద చెయ్యి వేసి అడిగితే... మీ మేనల్లుడికి అస్తమాను
నన్ను భయపెట్టడమే పెద్ద పని.
 నన్ను భయపెట్టి మళ్లీ నా మీదే కోప్పడతాడు అని కంప్లైంట్ చేస్తోంది.
ఆ మాటకి నవ్వుతూ రుద్ర ప్రేమని అర్ధం చేసుకోవాలి అంటే మనకి చాలా ఓపిక కావాలి.
 వాడి ప్రేమఆనంతం.
 వాడి కోపం ప్రళయం.
వాడి ప్రేమ అర్థం అయితే మన అంత అదృష్టవంతులే ఈ భూమి మీద ఉండరు తల్లి. అర్థంచేసుకోవడానికి ప్రయత్నించు అని చెప్పి కారు దగ్గరికి తీసుకు వస్తారు.

అప్పటికే డ్రైవింగ్ సీట్లో రుద్ర కూర్చొంటే... పక్క సీట్లో దేవేంద్ర గారు కూర్చుంటారు. వెనక సీట్లో శాంభవి
కూర్చుంటుంది.

రుద్ర కార్ స్టార్ట్ చేసి బృందావనం దాటిస్తాడు. శాంభవి దారి పొడుగు అంతా గుడి గురించి అడుగుతూనే
ఉంటుంది.

దేవేంద్ర గారి ఓపిగ్గా చెబుతూనే ఉంటారు. రుద్ర ఉన్న సంగతి మర్చిపోయి ఇద్దరు కబుర్లో పడిపోతారు.
అది చూసిన రుద్ర కి విసుగువచ్చి పక్కన నేనొక్కడినే ఉన్నాను.

ఆ సంగతి బాబు కూతురుకి అర్థం అవుతుందా అని అడుగుతాడు.. ఆ మాటకి శాంభవి ఏంటి అని
అడుగుతుంది.

అదే నేను అడుగుతున్నాను. పక్కన నీకు కాబోయే వాడు ఉన్నాడు. 
వాడిని కూడా కలుపుకోవాలని
లేకుండా బాబు కూతురు ఇద్దరు మాటలో పడిపోతే ఎలాగా అని కొంచెం కోపంగా అడుగుతాడు.


రుద్ర కోపాన్ని ఎంజాయ్ చేస్తూ.. అయ్యో మీరు డ్రైవింగ్ లో ఉన్నారు కదా.. మిమ్మల్ని డిస్టర్స్ చేయడం.
ఎందుకు అని నేను అంకుల్ మాట్లాడుకుంటున్నాము అంతే.

అంతే కదా అంకుల్ అని కన్ను కొడుతుంది. దేవేంద్ర కూడా అంతే కదరా అంటే.. ఓహె... మీ అమ్మాయి
వచ్చేటప్పటికి మేనల్లుడిని పక్కన పెడుతున్నావా చిన్న మామ అని కొంచెం ఉక్రోషంగానే అడుగుతాడు.

రుద్ర ఉడుక్కోవడం చూసి దేవేంద్ర గారు నవ్వుతూ ఒరేయ్ ఆడపిల్ల లాగా ఆ ఉడుక్కోవడం ఏమిటిరా
అని అడుగుతారు.

దానికి రుద్ర ఇది ఉడుక్కోవడం కాదు మామ. నన్ను కలుపుకోవడం లేదు అని అడుగుతున్నాను. ఏదైనా
అదే అర్థంలే కానీ..

ఇంకా గుడికి వెళ్లడానికి ఎంత టైం పడుతుంది. ఇంకా ఐదు నిమిషాల్లో వెళ్ళిపోతాము అని చెబుతాడు.
దేవేంద్ర సైలెంట్ అయిపోతారు.

అది చూసిన శాంభవి ఏమైంది అంకుల్. ఇప్పుడు దాకా బాగానే ఉన్నారు కదా... మొట్టమొదటిసారిగా నా భార్యని ఈ గుడిలోనే చూశాను అని చెబుతారు.

రుద్ర కూడా సైలెంట్ అయిపోయి మామ వంక చూస్తాడు. వెంటనే ఆయన సర్దుకుని.. ఐయామ్ ఓకే అని
చెబుతారు. మీది లవ్ మ్యారేజ్ కదా అని అడుగుతుంది.

అవును. తను నిత్యం అమ్మవారి పూజలోనే ఉండేది. ప్రతి మనిషిలోనూ మంచినే చూసేది. ఆ మనసుకే
నేను ఇప్పటికీ ఎడిక్ట్ అయిపోయాను .

భార్య గురించి చెబుతూ తనను తానే మరిచిపోతారు. ఇంతలో రుద్ర కార్ బ్రేక్ వేస్తాడు.. ఏమైందిరా అంటే
గుడి వచ్చేసింది మామ అని చెబుతాడు.

సరే అని కారు దిగి రా తల్లి అని శాంభవి వైపుకు వచ్చి డోర్ తీస్తారు. రుద్ర కూడా కారు పార్క్ చేసి వాళ్ళిద్దరి
దగ్గరికి వస్తాడు.

అప్పుడే గుడి తెరుస్తూ ఉంటారు. భక్తులు కూడ పలచగానే ఉంటారు. గుడిని చూసిన శాంభవి ఇది చాలా
పురాతనమైన గుడి లాగా ఉంది కానీ... చాలా బాగుంది అంకుల్.

అవును తల్లి చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. రా తల్లి అని చెయ్యి పట్టుకుని
తీసుకొ
వెళుతూ ఉంటారు. ఉండు మామ.. నేను వస్తున్నాను...

శాంభవి ఇంకొక చేయిని రుద్రా పట్టుకుంటాడు. శాంభవి ఉలిక్కిపడి తన చెయ్యి వైపు చూసి రుద్రవైపు
చూస్తుంది. ఏంటి అన్నట్టు కళ్ళు ఎగిరేస్తాడు. ఏంటిది అన్నట్టు కళ్ళతోనే చూపిస్తుంది.

నా భార్య చెయ్యి నేను పట్టుకున్నాను తప్పేంటి అని చిన్నగా అడుగుతాడు. మనకు ఇంకా పెళ్లి కాలేదు.
అది అర్థమవుతుందా అంటే....

ఎలాగు అయిపోతుంది కదా.. నీకు ఒక విషయం తెలుసా
ఈ గుడిలోకి దంపతులుగా కాలు పెడితే ఎప్పటికీ ఆ బంధం అలాగే నిలిచిపోతుందంట.

ఓ.. ఇది ఎవరు చెప్పారు అని వెటకారంగా అడుగుతుంది. నేనే చెబుతున్నాను అంటాడు. నాకు తెలుసు
ఇలాంటివి అన్ని మీరే కనిపెడతారని.

ముందు చెయ్యి వదలండి. అంకుల్ చూస్తున్నారు అంటే.. ఏమి అనుకోరు పద. ఇంకా ఎక్కువ చేసావ్
అమరో యం చుటూ చెయ్యి వేసి దగ్గరికి తాము ని మరి తీసుకువెళ్తాను అంటారు.

అనుకో.. భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుని మరి తీసుకువెళ్తాను అంటాడు.
రుద్ర చేసినా చేస్తాడు అనుకుని సైలెంట్ గా నడుస్తుంది.
 తండ్రి కాబోయే భర్త మధ్యలో నడిచి వస్తున్న శాంభవిని గుడిలో ఉన్న పెద్దాయన చూస్తూ ఉంటారు.

కళ్ళకి నీటి చెమ్మ అడ్డుపడుతుంటే తుడుచుకొని మరి శాంభవి వైపే చూస్తూ ఉంటారు.
అక్కడే కూర్చుని ఉన్న భార్యని పిలిచి శాంభవి వైపు చూపిస్తారు. ఆవిడ కూడా శాంభవిని చూసి కళ్ళు తుడుచుకుంటారు.

దేవేంద్ర శాంభవిని ఆ పెద్దాయన ముందుకు తీసుకువచ్చి నమస్కారం చేస్తారు. ఆయన కూడా ప్రతి
నమస్కారం చేయగానే....

నా మేనల్లుడు రుద్ర. తనకి కాబోయే భార్య శాంభవి అని పరిచయం చేస్తారు. ఆ మాటకి ఆ పెద్దాయన
దేవేంద్ర వైపు చూస్తారు. దేవేంద్ర కళ్ళల్లో కూడా నీటి చెమ్మ కనపడుతుంది.

శాంభవి వైపు తిరిగి ఈ పెద్ద వాళ్ల దగ్గర ఆశీర్వాదం తీసుకో తల్లి. వీళ్ళ ఆశీర్వాదం తల్లి స్పర్శ కన్నా
గొప్పది. ఆ అమ్మే దిగివచ్చి ఆశీర్వదించినట్టే అని చెబుతారు.

శాంభవి సరే అని చెప్పి ఆ పెద్ద వాళ్ళు ఇద్దరు కాళ్ళకి నమస్కారం చేస్తుంది. రుద్ర కూడా శాంభవితో
కలిసి ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు.

శాంభవి పెద్దవాళ్ళు ఇద్దరు పాదాలు తాకగానే ఏదో ఆత్మీయమైన వాళ్లని తాకినట్టుగా అనుభూతి
చెందుతుంది.

పెద్ద వాళ్ళిద్దరికీ కూడా శాంభవి ని ఆశీర్వదించి భుజాల మీద చెయ్యి వేసి పైకి లేపుతారు. వెంటనే ఆ
పెద్దావిడ దగ్గరికి హత్తుకుని కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకుంటారు.

కన్నీళ్లు శాంభవి భుజం పైన పడతాయి. ఏమైంది అని శాంభవి పెద్దవిడి వైపు చూస్తుంది. అయ్యో.
అమ్మమ్మ గారు ఎందుకు ఇలాగ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అని కన్నీళ్లు తుడుస్తోంది.

శాంభవి చెయ్యి చేతితో పట్టుకుని ముద్దు పెట్టుకుని. ఏమీ లేదు తల్లి నిన్ను చూస్తుంటే దూరమైపోయిన
నా కూతురు గుర్తుకు వచ్చింది అంతే అని చెబుతారు.

దేవేంద్ర తో మాట్లాడాలి అని శాంభవి, రుద్రాకీ కోనేటిలో నుంచి నీళ్లు తెచ్చి చెట్టు కింద ఉన్న నాగేంద్రుడికి అభిషేకం చేయమని చెబుతారు.

సరే అని చెప్పి వాళ్ళిద్దరూ వెళ్లగానే.. దేవేంద్ర వైపు తిరిగి ఏమిటిది.. మేనల్లుడు భార్య అని
చెబుతున్నావు. మీకు నిన్ననే చెప్పాను కదా...

నా కూతురికి నేనే తండ్రి అని తెలియదు. తను చాలా ఉన్నతమైన విలువల కలిగినా కుటుంబంలో
పెరిగింది. అపురూపం వాళ్లకి.

కుటుంబం మొత్తం ప్రాణాలు అన్నీ శాంభవి పైనే ఉన్నాయి. ఇప్పుడు నేను తనకి తండ్రిని అని చెప్పినా...
వాళ్లు తన సొంత తల్లిదండ్రులు కాదని చెప్పిన ఎవరూ తట్టుకోలేరు.

అందుకే ముందుగా రుద్రతో పెళ్లి జరిపించి మెల్లిగా నా కూతురికి దగ్గర అయిన తరువాత విషయం.
చెప్పాలి అనుకుంటున్నాను అని బాధగా అంటాడు.

దేవేంద్ర భుజం మీద చెయ్యి వేసి కుతురు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో మాకు తెలుసు.
 నీకు
ఇక ఎదురుగుండా కూతురి ఉన్న సరే. నాన్న అని పిలిపించుకోలేకపోతున్నావు అని
బాధపడతారు.

మీకు మీ అమ్మాయిని దూరం చేసిన పాపం ఊరికే పోదు కదా మాపయ్య అంటే.. అందులో నీ తప్పు.
ఏముంది. విధిని ఎవరు ఎదిరించగలరు దేవేంద్ర అని దంపతులిద్దరూ బాధపడతారు.

ఈలోపు అభిషేకం పూర్తి చేసి వచ్చిన శాంభవితో అమ్మవారికి దగ్గరుండి పంచామృతాలతో అభిషేకం
చేపించి కుంకుమ పూజ చేపిస్తారు.

ఆ కుంకము శాంభవికి ఇచ్చే రోజు పెట్టుకో తల్లి. అప్పుడప్పుడు వచ్చి ఈ పెద్ద వాళ్ళిద్దరికీ కనిపించు అని
చెబుతారు.

తప్పకుండా అమ్మమ్మ అనగానే.. ఒక్క నిమిషం అని చెప్పి గబగబా వెళ్లి శాంభవి కోసం తెచ్చిన చీర,
పసుపు కుంకుమ గాజులు అన్ని కలిపి శాంభవికి పెడతారు.

ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అమ్మమ్మ.. మొదటిసారి నా మనవరాలు నా దగ్గరికి వచ్చింది. నోరార అమ్మమ్మ
అని పిలిచింది.

ఉత్తి చేతులతో ఈ మనవరాలను ఎలా పంపిస్తా అని చెప్పి... ఏదో మా తాహతుకు తగ్గట్టుగా తీసుకున్నాను.
తీసుకో తల్లి.

శాంభవి ఆవిడని ఎత్తుకొని ప్రేమ దగ్గర తాహతులు ఉండవు అమ్మమ్మ అని చెబుతుంది. అంతా కూతురికి
ఉన్న గొప్ప మనసే కనిపిస్తూ ఉంటే.. నుదుటిన ముద్దు పెట్టుకుని నీ మనసు చాలా గొప్పది తల్లి.

ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే నీ పెనిమిటి చెయ్యి వదలకు. రుద్ర చేతుల్లో చేయి పెట్టి రుద్రవైపు తిరిగి..
శాంభవి ఉత్తీ అమాయకురాలు.

పరిస్థితులు ఏమైనా రాని.. ఎలాంటి దుష్టశక్తులు రాని.. ఎత్తై పరిస్థితుల్లోనూ నా మనవరాలు చెయ్యి
వదిలిపెట్టదు అని కన్నీళ్లు పెట్టుకుంటారు.

వెంటనే రుద్ర ఆవిడ కన్నీళ్లు తుడిచి మీరు ఎక్కువ ఆలోచించకండి మామ్మగారు.. శాంభవి నా ప్రాణం.
ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శాంభవిని బాధ పెట్టను. వదలను.

ఇది నేను మీకు ఇస్తున్న మాట అని చెబుతాడు. చాలు బాబు. ఈ వృద్ధ దంపతులకు ఇంతకన్నాకావాల్సిందేమీ లేదు అని చెప్పి సాగనంపుతారు.
[+] 6 users Like SivaSai's post
Like Reply
Part - 56


గుడి నుంచి ముగ్గురు ఇంటికి వచ్చేస్తారు. శాంభవి కి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అది గుడికి వెళ్లి
వచ్చినందుకు అనుకుంటుంది.

దేవేంద్రకి కూడా నిశ్చింతగా అనిపిస్తుంది. తండ్రి దగ్గరికి వెళ్లి అంతా చెబుతాడు. పోనీలే ఈ విధంగా
నయినా ఆ దంపతులకు కొంత ఉపసమనం దొరుకుతుంది అని మౌనంగా ఉంటారు.

ఆశ, నిషా జంటలు ఊరు నుంచి మళ్లీ హైదరాబాద్ వచ్చేస్తారు. గెస్ట్ హౌస్ కి చేరుకుంటారు. ఇప్పుడు ఏం
చేద్దాం అని ఆశ, నిషా అడిగితే.. కొన్ని రోజులు సైలెంట్ గా ఉండండి.

మెల్లిగా మీ వాళ్ళ దగ్గరికి వెళ్లి నిజం చెబుతాము. తరువాత ఏం చేయాలో ఆలోచిద్దాము అని అంటారు.
మీరు చెప్పిన ఐడియా కూడా బాగానే ఉంది.

ఇప్పటికే రెండు రోజులు అయిపోయింది. ఇంటికి వెళ్లకపోతే అందరికీ అనుమానం వస్తుంది. ఇంకా
మేము బయలుదేరుతాము అని లెగుస్తారు.

వెంటనే ఆనంద్, విహారి భార్యలు చేయి పట్టుకొని ఒక నిమిషం.. తాళిని మాత్రం తీయకండి. తాతగారికి

ఆ విషయం తెలిసింది అంటే.. చాలా కోప్పడతారు. కవర్ చేసుకోండి అని చెప్పి సైడ్ హగ్ చేసుకుని
ఇద్దర్ని పంపిస్తారు.

శాంభవి రుద్రతో కలిసి ఆఫీసుకి వెళుతుంది. దారి పొడుగు అంతా కూడా గుడి గురించి.. గుడిలో కలిసిన
పెద్ద వాళ్ల గురించే మాట్లాడుతూ ఉంటుంది.

శాంభవి చెబుతున్నదంతా కూడా ఓపిగ్గా వింటూ ఉంటాడు. సడన్గా శాంభవి అవును రుద్ర గారు.. ఎందుకు
ఆ పెద్దావిడ నన్ను పట్టుకుని అంత ఎమోషనల్ అయ్యారు అని అడుగుతుంది.

దానికి ఏం చెప్పాలో అర్ధం కాక కాసేపు ఆలోచించి.. చెప్పారు కదా.. నిన్ను చూస్తే వాళ్ళ అమ్మాయి
గుర్తుకు వచ్చిందని.

అంటే వాళ్ళ అమ్మాయి లేదా అని అడిగితే.. లేదు దేవుడి దగ్గరికి వెళ్ళి పోయింది అని బాధగా చెబుతాడు.
ఆ విషయం మీకు ఎలా తెలుసు.

ఆవిడ చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థం అయిందిలే...


నువ్వు చిన్న పాపవి కదా.. నీకు అర్థం కాలేదు అని టాపిక్ ని తేలిక చేస్తాడు.

ఆ మాటలకు గుర్రుగా చూస్తూ.. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పాప అన్నమాట వదలరు కదా మీరు. ఎట్టి
పరిస్థితుల్లోనూ వదలను.

రేపు మనకి పిల్లలు పుట్టి.. ఆ పిల్లలకు మళ్ళీ పిల్లలు పుట్టిన సరే నువ్వే నా మొదటి పాప ఏ అని బుగ్గ
పట్టుకుని లాగుతాడు.

పిల్లల టాపిక్ వచ్చేటప్పటికి శాంభవి ఇబ్బంది పడుతూ తల పక్కకి తిప్పేస్తోంది. శాంభవి ఇబ్బందిని
చూసి నవ్వు కుంటూ...

ఏమైంది పాప అంతలా ఇబ్బంది పడుతున్నావు అంటే.. ఏమీ లేదులే కానీ మీకు పిల్లలు అంటే అంత
ఇష్టమా అని అడుగుతుంది.

ఏం నీకు ఇష్టం లేదా అంటే.. ఎందుకు ఇష్టం లేదు నేను ఎంతమంది పిల్లలతో ఆడతానో తెలుసా అని
ఊరి విషయాలు దగ్గరికి వెళ్ళిపోతుంది.

భగవంతుడా ఏది మాట్లాడినా ఇది ఊరి దగ్గరికి వెళ్ళిపోతే.. నా కాపురం సంగతి ఏంటి అని పైకి చూస్తాడు.

ఏమైంది రుద్రా సార్ అలా చూస్తున్నారు అంటే.. నా ఫ్యూచర్ ఏమిటా అని చూస్తున్నాను. ఆ మాటకి కోపంగా చూస్తుంది. ఎందుకు అంత కోపంగా చూస్తున్నావు అని టీస్ చేస్తాడు.

అలా పైకి చూస్తే ఫ్యూచర్ కనపడుతుందా నా మాటలు మీకు అంత బోర్ గా ఉన్నాయా ? అదే మా నాన్నలు అయితే నేను ఎన్ని కబుర్లు చెప్పినా సరే ఎంత హ్యాపీగా నవ్వుతూ వింటారో తెలుసా...

మీకు ఒక్క విషయం చెప్పగానే నన్ను ఏడిపిస్తారు అని ఏడుపు ముఖం పెడుతుంది. ఆ ముఖాన్ని చూసి నవ్వుకుంటూ.. ఓ మై డియర్ పాప ఎందుకే అంత ఏడుపు మొఖం పెట్టావు.

నేను కాకపోతే నిన్ను ఇంకా ఎవరి ఏడిపిస్తారు చెప్పు. పెళ్లయ్యాక నా ఫ్యూచర్ ఏంటో చెప్పనా అని అడుగుతాడు. చెప్పండి అంటే...


మనకి పిల్లలు పుడతారు కదా అని రుద్ర తను లెఫ్ట్ హ్యాండ్ చేతి వేళ్లతో తో శాంభవి రైట్ హ్యాండ్ చైతి వేళ్ళతో పెనవేస్తాడు.

ఆ స్పర్సకే శాంభవి మౌనంగా బిగుసుకు పోతుంది. ఏమి మాట్లాడకుండా ఉన్న శాంభవిని చూసి ఏమైంది

పాప అంటాడు.

తల అడ్డంగా ఊపుతూ ఉంటుంది. ఏమైంది అని మళ్ళీ అడిగితే.. కళ్ళని చేతి వైపుకి తిప్పుతుంది. అది చూసి దీనిక నువ్వు ఇంతలా బిగిసుకుపోయావు అని కొంచెం చేతిని లూస్ చేస్తాడు. కానీ చేతిని మాత్రం
వదలడు.

మీరు మామూలుగా కూడా మాట్లాడొచ్చు కదా అని మెల్లిగా అంటుంది. పొద్దుటే కదా మామ్మగారికి మాటే ఇచ్చాను అంటాడు.

ఏమని అంటే ఎట్టి పరిస్థితుల్లోను నీ చెయ్యి వదిలిపెట్టను అని..మరి అలాంటిది నీ చెయ్యి వదిలేసి ఎలా మాట్లాడగలుగుతాను అని అడుగుతాడు.

ఆ మామ్మగారు చెప్పింది నీకు అలా అర్థమైందా అని ఆశ్చర్యంగా అడుగుతుంది. మరి నీకు ఎలా I అర్థమయింది అని కళ్ళు ఎగరేస్తాడు.

ఆ పెద్దావిడ చెప్పిన దానికి అర్థం ఎలాంటి పరిస్థితుల్లో కూడా నన్ను వదిలిపెట్టదు అని.. అంతేగాని ఎక్కడ ఉన్నా సరే చేతిలో చేయి వేసి గట్టిగా పట్టుకోమని కాదు అని చెబుతుంది.

ఇప్పుడు దాకా బాగానే ఉన్నారు కదా.. ఇంతలోనే ఏమైంది అనుకుంటూ... వెనకాలే వెళుతుంది. శాంభవిని చూసి ధీరజ్ ఏమైందమ్మా మొఖం అదొక లాగా ఉంది అంటే...


ఏమో సార్ ఇప్పుడు దాకా రుద్ర గారు బాగానే మాట్లాడారు. వెంటనే సీరియల్స్ గా మారిపోయారు. ఎందుకో అర్థం కావడం లేదు.

దానికి ధీరజ్ నవ్వుతూ అదా.. ఇంటిదగ్గర మన వాళ్ళ దగ్గరే సరదాగా ఉంటాడు. ఆఫీసుకు రాగానే ఇలాగే సీరియస్ మూడ్లోకి వెళ్ళిపోతాడు.

ముందు ముందు నువ్వు అర్థం చేసుకోవాల్సిందే అని చెప్పి లోపలికి తీసుకువెళతాడు. సాయంత్రం దాకా ఎవరు వర్క్ లో వాళ్లు బిజీగా గడిపేస్తారు.

ఇక్కడ ఆశ, నిష మెల్లిగా ఇంటికి చేరుకుంటారు. లోపలికి వెళ్లకుండా తాతయ్య ఉండుంటారా అని ఆలోచిస్తూఉంటారు.

లక్ష్మీ గారు గుమ్మం దగ్గరకు వచ్చి ఇద్దరూ లోపలికి రాకుండా తొంగి చూస్తున్నారు ఏంటి అని అడుగుతే.. తాతగారు ఉన్నారా అని అడుగుతారు.

లేరు బయటికి వెళ్లారు. హమ్మయ్య అనుకుని.. ఇద్దరు లోపలికి వస్తారు. ఏమైపోయారు. రెండు రోజుల
నుంచి ఫోన్ చేస్తే పలకరు.


మాకు ఇక్కడ ఎంత కంగారుగా ఉంటుంది అని మనవరాళ్ళు ఇద్దరినీ కోప్పడతారు. ఓ గ్రానీ నువ్వంత సీరియస్ అవ్వకు.

ఇంపార్టెంట్ పని మీద వేరే ఊరు వెళ్ళాము అని చెబుతారు. ఏం పని ఆ కుటుంబాన్ని ఎలా నాశనం చేయాలి అని ఆలోచించడానికా అని జ్యోతి గారు కూడా కోప్పడతారు.

అత్తయ్య, అమ్మ అని ఇద్దరూ జ్యోతికి చేరోవైపు వెళ్లి పట్టుకుని నువ్వు అలా కోప్పడకు. నువ్వు ఇలా ఉంటే అసలు బాగోవు తెలుసా...

నవ్వుతూ ఉంటే ఎంత క్యూట్ గా ఉంటావా అని ఐస్ వేయడం మొదలుపెడతారు. నాకేమి ఐస్ వెయ్యక్కర్లేదు గాని....

ఎప్పుడు తిన్నారో ఏమిటో ముందు వెళ్లి ఫ్రెష్ అయ్యి రండి భోజనం వడ్డిస్తాను అని చెప్పి కిచెన్లోనికి వెళతారు. జ్యోతి గారిని అలా చూసి నవ్వుకుంటూ ఎవరు రూమ్ లోకి వాళ్ళు వెళ్లి ఫ్రెష్ అయ్యి వస్తారు. ఇద్దరినీ కూర్చోబెట్టి తినిపిస్తూ ఉంటారు.

ఇద్దరూ భోంచేసి గదిలోకి వెళ్లి రెస్ట్ తీసుకుంటారు. ఈ పెళ్లి గురించి ఎలా చెప్పాల అని ఇద్దరు ఆలోచిస్తూ
ఉంటారు.


సాయంత్రమే ఇంటికి వచ్చిన మయూరీకి పిల్లలు ఇద్దరు వచ్చేసారు అని తెలుస్తుంది. రెస్ట్ తీసుకుంటున్నారని లక్ష్మి గారు చెబితే సరే రేపు మాట్లాడతాను అని తన గదిలోనికి వెళ్లిపోతుంది.

సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి రాగానే శాంభవి తన లగేజ్ అంత ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది. అది చూసిన కౌసల్య ఎందుకు అంతా ప్యాక్ చేసేస్తున్నావు.

రేపు ఎర్లీ మార్నింగ్ మా ఊరు వెళ్తున్నాను ఆంటీ అని చెబుతుంది. ఓ... రుద్ర చెప్పాడు పెళ్లి అయ్యేవరకు అక్కడే ఉంటాను అన్నావ్ అంట కదా...

నేను పుట్టిన తర్వాత ఎప్పుడు ఇన్ని రోజులు మా ఊరిని, మా ఇంటిని వదిలేసి లేను. ఇదే ఫస్ట్ టైం చాలా
బెంగగా ఉంది.

పెళ్లయ్యాక ఇక్కడికే వచ్చేయాలంటే కష్టంగానే ఉంది అని ఏడుస్తుంది. దానికి పిచ్చి పిల్ల ఎందుకు ఏడుస్తున్నావు.

ఇది కూడా నీకు పుట్టిల్లె కదా.. ఎప్పుడు కావాలంటే అప్పుడు నిన్ను రేపల్లె తీసుకువెళ్తారు.

హ్మ.. సరే అని తల ఊపుతుంది. ఇటు చూడు బంగారం.. నువ్వు ఇలా కంటతడి పెట్టకు. నీ కంటి తడి మేమెవ్వరమూ చూడలేము.

సరేనా నీకు ఏది కావాలి అన్నా సరే మా అందరికి ఆర్డర్ వెయ్యి. అంతే క్షణాల్లో నీ ముందు ఉంచుతాము. ఎందుకు అంటీ మీ అందరికీ నా మీద ఇంత ప్రేమ. రుద్ర గారు పెళ్లి చేసుకుంటున్నా అమ్మాయిని

అనా...

కౌసల్య ఏమని సమాధానం చెబుతుంది..
[+] 5 users Like SivaSai's post
Like Reply
Part - 57


రుద్ర గారు చేసుకుంటున్న అమ్మాయిని అనా నామీద మీరు ఇంత ప్రేమను చూపిస్తున్నారు అని అడుగుతుంది.
 
ఆ మాటకి ఏం చెప్పాలో తెలియక కౌసల్య మౌనంగా ఉంటే.. మాట్లాడరేమిటి అని చేయ పట్టుకుని కదుపుతుంది.

కౌసల్య తేరుకొని పక్కన కూర్చుని.. శాంభవి చేతిని తన చేతిలోకి తీసుకుని... ఆ చేతి మీద చిన్నగా తడుతూ.. అలాగే ఏమీ లేదు.

నిన్ను చూడగానే మా అన్న ఫీలింగ్ వచ్చింది. రుద్రతో పెళ్లి ఈ మధ్యన అనుకున్నాము కానీ.. ముందు నుంచి నీతో మేము అలాగే ఉన్నాము కదా.

నిన్ను చూస్తూ ఉంటే దూరమైన మా ఇంటి అమ్మాయి మళ్లీ మా దగ్గరికి వచ్చింది అనిపిస్తుంది అని చెబుతారు. అంటీ మీకు ఒక విషయం తెలుసా అని అడుగుతుంది.

ఏమిటమ్మా అంటే.. పొద్దుట దేవేంద్ర సార్ తో కలిసి గుడికి వెళ్ళాము కదా.. అక్కడ పెద్దవాళ్లు ఇద్దరూ
కలిశారు.

నిత్యం అమ్మవారి కి పూజ చేస్తూ ఉంటారంట. ఆ అమ్మమ్మగారు ఐతే నన్ను చూసి చాలా ఎమోషనల్ అయ్యారు తెలుసా అని చెబుతుంది.

ఆ మాటలు వినగానే కౌశల్యకి అర్థం అవుతుంది వాళ్ళ ఎవరో. వాళ్లు చాలా మంచి వాళ్ళు. చీమకు కూడా హాని తల పెట్టని గొప్ప వాళ్ళు అని ఆ రోజులు తలుచుకుని కంటతడి పెడతారు.


అయ్యో ఆంటీ మీరు ఎందుకు బాధ పడుతున్నారని కళ్ళు తుడుస్తోంది. సరే.. సరే.. మనం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఎంతసేపన్న టైం సరిపోదు.

పడుకో. పొద్దున్నే లెగాలి కదా అని చెప్పి శాంభవిని పడుకోబెట్టి దుప్పటి కప్పి ఎ. సి. అడ్జస్ట్ చేసి తలుపు దగ్గరికి వేసి వచ్చేస్తారు.

గదిలోకి వచ్చిన కౌసల్య ముభావంగానే ఉంటుంది. అది చూసి జితేంద్ర ఏమైంది.. ఎలా ఉన్నావు. శాంభవితో జరిగిందంతా చెబుతుంది.

ఎందుకండి వాళ్ళకి ఇంత బాధ. సొంత మనవరాలని దగ్గరికి తీసుకోలేకపోతున్నారు. మన కుటుంబానికి ఇంకా ఎన్ని రోజులండి ఈ పరీక్ష అంటే అన్ని సద్దుమణుగుతాయి. నువ్వు ఎక్కువ ఆలోచించకు. పడుకో అని లైట్ ఆపేస్తారు.

ఉదయం అందరికన్నా ముందే లేచి శాంభవి గబగబా రెడీ అయిపోతుంది. హాల్ లోకి వచ్చి రుద్రా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.

అప్పుడే లేచి బయటికి వచ్చిన కౌసల్య, చారు శాంభవిని చూసి ఏంటి అప్పుడే రెడీ అయిపోయావా.. ఎప్పుడో ఆంటీ. రుద్ర సార్ వస్తే బయలుదేరడమే.

రుద్ర అప్పుడే లేచి బయటకు వచ్చి గుడ్ మార్నింగ్ అమ్మ అని చెబుతాడు. రుద్రాన్ని అలా చూడగానే శాంభవికోపం పిక్స్ లోకి వెళ్ళిపోతుంది.


ఏంటి సార్ మీరు ఇంకా రెడీ అవ్వలేదు అంటే... అప్పుడు శాంభవిని చూసి ఏంటి ఎప్పుడు రెడీ అయ్యావు
అని అడుగుతాడు.

మీకు నిన్ననే చెప్పాను కదా ఎర్లీ మార్నింగ్ బయలుదేరాదామని . అవును ఇంకా తెల్లారలేదు కదా.. బయట చూడు సన్ ఇంక రాలేదు.

మనం ఇప్పుడు బయలుదేరితే ట్రాఫిక్ లో ఇరుక్కోకుండా ముందుకు వెళ్ళిపోవచ్చు. మీరు ఇప్పుడు వెళ్లి ఎప్పుడు ఫ్రెష్ అవుతారు. ఎప్పుడు రెడీ అయ్యి వస్తారు అని కంగారు పడుతూ ఉంటుంది.

కూల్... కూల్... శాంభవి నిన్ను జాగ్రత్తగా సాయంత్రం లోపు మా అత్తారింటి దగ్గర దింపే బాధ్యత నాది. సరేనా అని చెప్పి వాళ్ళ అమ్మకి ఒక కిస్ ఇచ్చి రూమ్ లోకి వెళ్ళిపోతాడు.

రుద్ర తో పాటు విహాన్, అద్వైత్ కూడా రెడీ అయ్యి వస్తారు. ధీరజ్ కూడా రెడీ అయ్యి వచ్చేస్తాడు. కారు మొత్తం రకరకాల స్వీట్స్ తో నింపేస్తారు.

ఆంటీ ఏంటి ఇవన్నీ... ఇక్కడి నుండి మొదటిసారి ఇంటికి వెళుతున్నావు కదా.. ఉత్తి చేతులతో ఎలా పంపిస్తాము. అందుకే ఏవో కొన్ని చేసి పెట్టాను అంతే అంటారు.

ఇవి కొన్నినా ఆంటీ. కారు మొత్తం స్వీట్స్ స్మెల్ వచ్చేస్తుంది. దేవేంద్ర గారి రుద్ర దగ్గరికి వచ్చి నా కూతురు జాగ్రత్త.


ఎక్కువ ఏడిపించకు అని చెప్తే.. మామ అని గారాలు పోతాడు. చేసిన ఓవరాక్షన్ చాలు. ఎక్కువ ఏడిపించకు రా..
అమ్మాయికి ఇప్పుడు దాకా ఇలాంటివి తెలియదు కదా.. చిన్నబుచ్చుకుంటుంది. అంత లేదు ఎంజాయ్ చేస్తుంది. పైకి అలా బిల్డప్ ఇస్తుంది.

నేను చూసుకుంటాను కదా.. టెన్షన్ పడకండి అని హగ్ చేసుకుంటాడు. రాఘవేంద్ర గారు కూడా మనవరాలు దగ్గరికి వచ్చి చాలా జాగ్రత్తలు చెబుతూ ఉంటారు.

వెనుక సీట్లో పడుకుని దుప్పటి కప్పుకో. కూలింగ్ ఎక్కువైతే తగ్గించమను. నీకు ఏదైనా అవసరం అయితే రుద్రాకి చెప్పు గాని కారు దిగకు అమ్మా ఎండ పెరిగిపోతుంది.

కోడల్ని చూస్తూ టిఫిను, లంచ్ అన్ని ప్యాక్ చేసావా అమ్మ అని అడుగుతారు. అన్ని పెట్టేసాను మావయ్య గారు. జ్యూసెస్ కూడా కారులో పెట్టాను అని చెబుతుంది.

ఆ మాటలకు రుద్రా నోరు వదిలేసి... అదేమైనా నాలుగైదు రోజులు ట్రిప్ వెళుతుందా ఏంటి. గట్టిగా ఇక్కడ కారు తొక్కితే 6:00 గంటల్లో అక్కడికి చేరుకుంటాము.

దానికి ఇన్ని ప్రిపరేషన్స్ అవసరమా అని అడుగుతాడు. నీకు ఏమి తెలీదు. నువ్వు కామ్ గా ఉండు అసలే శాంభవి చిన్న పిల్ల.నిన్ను అడగడానికి మొహమాట పడవచ్చు. అందుకే అన్ని సర్దాము అని చారులత గారు కూడా వెనకేసుకొస్తారు.


సరిపోయింది ఇలాగైతే మా జర్నీ సాగినట్టే అని వెళదామా అని అడుగుతాడు. సరే అని కార్ ఎక్కి అందరికీ బాయ్ చెబుతుంది.

జాగ్రత్త తల్లి. జాగ్రత్త రుద్ర.. స్పీడ్ గా వెళ్లకు. మళ్ళీ అమ్మాయికి కళ్ళు తిరుగుతాయి అని 100 జాగ్రత్తలు చెప్పి పంపిస్తారు.

అన్నగార్లు ముగ్గురు కూడా కంగారుగా వచ్చి శాంభవి చేతికి చాక్లెట్స్ ఇస్తారు. మధ్యలో ఏమైనా తినాలి అనిపిస్తే ఉంటాయి ఉంచుకో తల్లి.

రుద్ర కోపంగా వాళ్ళని చూస్తూ ఇంకా ఏమైనా ఉంటే ఒక ట్రక్కులో నింపి కార్ కి కట్టండి రా అని అరుస్తాడు. ఎందుకు బావ అంత కోపం.

దారి మధ్యలో శాంభవి ఇబ్బంది పడకూడదు అనే మా తాపత్రయం అంతా అని చెబుతారు. నేను ఉన్నది ఎందుకు..

మా ఏదైనా అవసరం అయితే నేను చూసుకోనా... నాకు ఇంకా ఛాన్స్ ఇవ్వరా మీరు అని అడిగితే.. నువ్వు డ్రైవింగ్ చేస్తావు కదా బావ.డిస్టర్బ్ అవ్వడం ఎందుకు అని మేము అన్ని సర్దాము అని వచ్చె నవ్వును ఆపుకుంటూ చెబుతారు.

చేసిన ఓవర్ యాక్షన్ చాలు కానీ మూసుకుని దొబ్బేయండి అని చెప్పి కార్ ని ముందుకు పోనిస్తాడు.

వెళుతున్న రుద్ర కొంచెం సీరియస్ గానే ఉంటాడు. ఎందుకు సార్ మీరు అంత కోపం. ఆ సార్ వాళ్ళు ఏం చేశారు అని అడుగుతుంది.

నా కోపం వాళ్ల మీద కాదు నీ మీద అంటాడు. మధ్యలో నేనేం చేశాను. వాళ్ళు అన్ని చాక్లెట్స్ ఇస్తుంటే.. అయ్యో అన్నయ్యలు వద్దు.

మా వారు ఉన్నారు కదా.. ఆయన నాకేం కావాలన్నా చూసుకుంటారు అని చెప్పడం మానేసి... థాంక్యూ.. థాంక్యూ అనుకుంటు అవన్నీ పుచ్చుకుంటావా అని వెటకారంగా అంటాడు.

ఇది మరీ బాగుంది ప్రేమతో ఇస్తే వద్దు అనాలా అంటే.. మరి నా ప్రేమను అంత ఎప్పుడు చూపించాలి. పోనీ ఒక పని చేయనా అంటాడు.

ఏంటి అని అడిగితే వాళ్లందరూ నీకే ఇబ్బంది లేకుండా ఉండాలని ఈ విధంగా ప్రేమను చూపించారు కదా.. నేను ఇంకొక విధంగా చూపించనా అని అడుగుతాడు.

ఎలా చూపిస్తారు అని క్యూరియాసిటీతో అడుగుతుంది. చాలా ఆత్రంగా ఉన్నట్టుంది పాపకి అంటే.. ఇదిగో మళ్లీ పాప అంటున్నారు.

నేనొక్కడినేమీ అనడం లేదు. ఇంటి దగ్గర కూడా అందరూ ఏమన్నారో ఒకసారి గుర్తు చేసుకో అని అంటాడు. ఏమన్నారబ్బా అని బుగ్గ మీద వేలు పెట్టుకుని ఆలోచించి చిన్నపిల్ల అన్నారు.


అంటే మీ అందరి దృష్టిలో నేను అంత చిన్న పిల్లనా అని అడుగుతుంది. చెప్పాను కదా మనకి పిల్లలు పుట్టిన... ఆ పిల్లలకు మళ్ళీ పిల్లలు పుట్టిన నువ్వు ఎప్పటికీ అందరూ దృష్టిలో పాపవే అని నవ్వుతాడు.

రుద్ర నవ్వుని చూసి ఉడుక్కుంటూ ఉంటుంది. ఇంతకీ నా ప్రేమని ఎలా చూపిస్తానో నువ్వు తెలుసుకోలేదు అని టాపిక్ మళ్ళీ మార్చుతాడు.

చెప్పు... చెప్పు.. అని రుద్ర వైపుకి తిరుగుతుంది. నిన్ను ఈజీగా డైవర్ట్ చేసేయొచ్చు పాప అని మనసులో
అనుకొని...

చెప్పనా అని శాంభవి ముందుకి వంగుతాడు. మీరు సరిగ్గా డ్రైవింగ్ చేస్తూ కూడా చెప్పవచ్చు. ఇలా మరి
నా మీదకు వచ్చి చెప్పక్కర్లేదు అని వెనక్కి బెండ్ అవుతుంది.

అయ్యో నీకు అర్థం కావడం లేదు పాప. ఇంత దగ్గరికి వస్తేనే చెప్పడం కుదురుతుంది అని అంటాడు. అలాగైతే ఏమీ అవసరం లేదు. నాకు మీరు ఏమి చెప్పక్కర్లేదు డ్రైవింగ్ చేయండి అని మూతితిప్పుతుంది.

అయితే అవసరం లేదు అంటావు అంటాడు. అవును అవసరం లేదు. సరే అయితే తర్వాత నువ్వు బ్రతిమాలిన నేను చెప్పను అంటాడు.ఏమి చెప్పనవసరం లేదు. మీరేం చెబుతారో నాకు తెలుసు అంటుంది. ఓ అవునా ఏం చెబుతాను. కొంచెం చెప్పవా..


నేను చెప్పను అంటుంది. ఒక బెట్టు వేసుకుందామా.. ఏమిటి అంటే... నేను అనుకున్నది నువ్వు అనుకున్నది ఒకటే అయితే నువ్వు విన్ అయినట్టు.

కాకపోతే అని ఉత్సాహంగా అడుగుతుంది. నేను విన్ అయినట్టు అంటాడు. నాకు తెలుసు... నేనే విన్ అవుతాను అంటుంది.

అయితే ఏమనుకున్నానో చెప్పు అంటాడు. అమ్మ అలా ఎలా చెబుతాను. నేనేమనుకున్నానో చెప్పించేద్దామనే. అంత సీన్ లేదు.

అప్పుడు నేను విన్ అయినట్టు. నేను విన్ అయితే నేను చెప్పింది నువ్వు చేయాలి అంటాడు. లేదు లేదు అని దెబ్బలాటకి దిగుతుంది.

అడ్డంగ ఇల దెబ్బలాడకూడదు. ఏదైనా స్ట్రెట్ గా ఉండాలి అంటాడు. నేనేమి దెబ్బలాడడం లేదు. మీరు అనుకున్నది చెబితే నీ మనసులో ఇది ఉందా అని మొదలు పెడతారు.

నాకు తెలుసు అంటుంది.

శాంభవి మనసులో ఏముందో చెబుతుందా...

కథ కొనసాగుతుంది...
[+] 7 users Like SivaSai's post
Like Reply
(05-04-2026, 02:34 PM)ash.enigma Wrote: No update today Sivagaru?
Weekend party aa?

Regular ga updates peduthu.. alavatu aipoyindi

Laptop Problem Undi So Update Late Avthundi...

రేపటి నుంచి ఎర్లీ మార్నింగ్ ఏ వస్తాయి......
[+] 2 users Like SivaSai's post
Like Reply
Excellent update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
Great going...
[+] 1 user Likes Sunny73's post
Like Reply
(05-04-2026, 04:13 PM)SivaSai Wrote: Laptop Problem Undi So Update Late Avthundi...

రేపటి నుంచి ఎర్లీ మార్నింగ్ ఏ వస్తాయి......

Thanks Sivagaru.. for being so prompt!!
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Sooper update.
Just who r the ones married to Asha n Nisha
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Part - 58



నువ్వు ఓడిపోయినట్టు కాదా అని అడుగుతాడు. కాదు కాదు నేనే విన్ అయాను.  అదే చెప్పు ఎలా విన్ అయ్యావు అంటే...

మీరు అనుకునేది ఏంటో నాకు తెలుసు అంటున్నాను కదా ఇంక అంతే ఇంక అడగద్దు అని మూతి బిగించేస్తుంది.
చిన్నపిల్లల ప్రవర్తిస్తున్న శాంభవిని చూస్తూ  కారు ముందుకు దూకిస్తాడు.

కొంచెం దూరం వెళ్ళేటప్పటికి శాంభవి ఫేస్ లో కనపడుతున్న ఎక్స్ప్రెషన్స్ అర్థమయ్యి దగ్గర్లో ఉన్న రెస్టారెంట్ దగ్గర ఆపి వెళ్లి ఫ్రెష్ అయ్యి రా అని పంపిస్తాడు.

చెప్పకుండానే తన ఫీలింగ్స్ బట్టి అర్థం చేసుకున్న రుద్రని చూస్తూ  ఫ్రెష్ అయ్యి వస్తుంది. శాంభవి కారు ఎక్కిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళి ఖాళీ ప్లేస్ దగ్గర కార్ ఆపి బ్రేక్ ఫాస్ట్ ఓపెన్ చేస్తాడు.

రుద్ర తినిపిస్తుంటే నేను తింటాను కదా అంటే పరవాలేదు తిను అని చెప్పి తినిపిస్తూ ఉంటాడు. మీకు లేట్ అవుతుంది కదా...

మీరు తినండి.  నేను తింటాను అని ఇబ్బందిగా చెబుతుంది. ఇప్పుడు నేను తినడం లేదు అని నువ్వు బెంగ పెట్టుకున్నావా...

సరే అయితే ఉండు అని శాంభవికి తినిపిస్తూనే రుద్ర కూడా తింటూ ఉంటాడు. అయ్యో నా ఎంగిలి అని కంగారుపడుతుంది.

అయితే ఏమైంది తినిపించేది నా చేతి వేళ్ళే కదా పరవాలేదు.. మీరు అలా నా ఎంగిలి తినకూడదు అని చెబుతుంది. అని ఎవరు చెప్పారు నీకు.

ఇది కూడా తెలియదా.. పెళ్లి అవ్వకుండా  ఒకరిఎంగిలి ఒకళ్ళు తినకూడదు. పెళ్లి అయిన తర్వాత ఇద్దరికీ కలిపి ఒకే ఆకులో వడ్డిస్తారు. అప్పుడు తినాలి అని చెబుతోంది.

అబ్బో మా పాపకి చాలా విషయాలు తెలుసే.. మరి శాంభవి అంటే ఏమనుకుంటున్నారు.. నేనేమనుకుంటాను ఒక చిన్న పాపా అనుకుంటాను అంతే అని టీస్ చేస్తూ మాటల్లో పెట్టి ఎప్పుడు తినేదాన్ని కన్న ఎక్కువ తినిపించేస్తాడు.

అమ్మో మీరు చాలా ఎక్కువ తినిపించేశారు. ఇలా తింటే నా పని అంతే.  ఏమవుతుంది అంటాడు.  చాలా లావు అయిపోతాను తెలుసా అంటుంది.

ఎంత లావైనా భరించేది నేనే కదా...  నాకు లేని ఇబ్బంది నీకు ఎందుకు పాప నువ్వు ఫుల్లుగా తిను అని ఇంకా కుక్కుతాడు.

తినిపించి మూతి కూడా కడిగి నీట్ గా నాప్కిన్ తో తుడిచి కాసేపు రెస్ట్ తీసుకుంటావా అంటాడు.  మీరు పెట్టిన ఫుడ్ కి కళ్ళు మూతలు పడిపోతున్నాయి.

ఒక్క నిమిషం అని సీట్  అడ్జస్ట్ చేసి పడుకో అని చెప్పి కార్ స్టార్ట్ చేస్తాడు . పడుకుంటూ రుద్రనే చూస్తూ ఉంటుంది.

ఏంటి పాప.. మరీ ఓపెన్  సైట్ కొడుతున్నావు. వెంటనే చూపు తిప్పి..  ఎందుకు నా మీద మీరు ఇంత కేర్ చూపిస్తున్నారు అని అడుగుతుంది.

అదేం ప్రశ్న తింగరి.  నువ్వు నాకు కాబోయే భార్యవి.  పైగా నా మనసు దోచిన చిన్నదానివి అంటే.. అబ్బ మీ కవిత్వం ఆపి నిజం చెప్పండి.

మీ ఇంట్లో కూడా అందరూ నన్ను చాలా అపురూపంగా చూస్తున్నారు.  నేను ఏదంటే అదే కరెక్ట్ అంటున్నారు. మా ఇంట్లో అంటే ఒక అర్థం ఉంది. కానీ ఇక్కడ కూడా ఎందుకలా ఉంటున్నారు.  నాకు నిజం మాత్రమే చెప్పండి ప్లీజ్ అని అడుగుతుంది.

రుద్రా శాంభవి వైపు చూస్తూ ఫస్ట్ అఫ్ ఆల్ మీ, మా.. కాదు. అది మన ఇల్లు అర్థమైందా అంటాడు. ఇంకొక ముఖ్యమైన విషయం నీకు అన్నయ్యలు లలిత్,  చరణ్, స్వరూప్ తో పాటు విహాన్,  అద్వైత్ ధీరజ్ కూడ.

వాళ్లందరూ ఎప్పుడు నువ్వు అన్నయ్య అని పిలుస్తావా అని ఎదురుచూస్తున్నారు. అదే ఎందుకు అని అడుగుతున్నాను.

ఏదేదో చెబుతున్నారు కానీ నేను అడిగిన దానికి మాత్రం సరైన సమాధానం చెప్పడం లేదు. చెప్పాము కదా మా చిన్న మామ కూతురు అచ్చు నీలాగానే ఉంటుంది.

దూరమై చాలా సంవత్సరాలు అయింది.  నిన్ను చూస్తుంటే తనే మాకు అందరికీ కనిపిస్తుంది.  అందుకే నువ్వంటే మా అందరికీ అపురూపం అంటాడు.

అంటే మీ చిన్న మామ కూతురు నా వయసు ఉంటుంది కాబట్టి మీరు నన్ను ఇష్టపడ్డారా అని అడుగుతుంది. ఆ మాటకి రుద్ర వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అలాగే అనుకో అంటాడు.

అంటే నాలో మీ చిన్న మామ కూతురిని చూసుకుని తినిపించారా అని కొంచెం కోపంగానే అడుగుతుంది . శాంభవి కోపాన్ని పట్టించుకోకుండా ఒకసారి బావ అని పిలవవా అని అడుగుతాడు.

శాంభవి కి వస్తున్న నిద్ర మొత్తం ఎగిరిపోయి.. ఇప్పుడు మిమ్మల్ని నేను బావ అని పిలవాలా... పిలిస్తే నాలో పూర్తిగా మీ మరదల్ని చూసుకుంటారా...

  అంతేగా... అంతేగా... అంటాడు. అలా ఎలా కుదురుతుంది. నాకు నచ్చదు.   నేను...  నేనే.  తను...  తనే అంటుంది.

నేను చెప్పేది అదే కదా అంటాడు.  కాదు మీరు నాలో తనని చూసుకుని  ఇష్టపడ్డారు  అలాంటి ప్రేమ నాకు వద్దు. నన్ను నన్నుగా చూసి ఇష్టపడాలి అని ఈసారి టాప్ విప్పేస్తుంది.

శాంభవి కన్నీళ్లు చూసి కారు ఓ పక్కకి ఆపి. పిచ్చి ఎందుకే ఏడుస్తున్నావ్ అని కన్నీళ్లు తుడిచి... నిన్ను ఏదో సరదాగా ఆటపట్టిస్తున్నాను.

నువ్వు బంగారం. యూనిక్ పీస్ వి. నిన్ను ఎవరితోను కంపేర్ చేయడం లేదు. నిజంగానా అని వేలు పెట్టి చూపిస్తూ అడుగుతుంది.

నిజంగా బంగారం ఇంత అమూల్యమైన బంగారం ఎవరితో పోల్చిన అది తక్కువే అవుతుంది కదా ... మరి ఎందుకు నా పైన అంత ప్రేమ చూపిస్తున్నారు అని మళ్లీ మొదటికే వస్తుంది.

చెబితేనేమో ఫీలవుతున్నావు..  చెప్పకపోతే నేమో ఎందుకు అంటున్నావ్... ఎలాగమ్మాయి నీతో అని కార్ స్టార్ట్ చేస్తాడు.

ఇద్దరు గిల్లికజ్జాలు ఆడుకుంటూ మెల్లిగా రేపల్లెకు చేరుకుంటారు.  మధ్యలోనే లంచ్ కూడా ఫినిష్ చేసి సాయంత్రానికి ఇంటికివస్తారు.

రేపల్లె ను చూడగానే శాంభవికి ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది.  రుద్రవైపు తిరిగి ఇదే మా ఊరు అని ఉత్సాహంగా చెబుతుంది.

ఓ...అవునా ఇంకా నేను మా అత్తగారి ఊరు  అనుకున్నానులే అంటాడు.  ఈ వెటకారాలే మీకు వద్దనేది అంటూ...

అదిగో అటు వెళితే మా కాలేజ్ అని చెబుతుంది. పర్వాలేదు పాప.. నీకు దారి బానే గుర్తుంది అంటాడు. అదేంటి మా కాలేజ్ నాకెందుకు తెలవదు...

నువ్వు కాలేజీలో తక్కువ.  రోడ్లమీద ఎక్కువ కదా.. అందుకే అన్నానులే అంటాడు. ఇదిగో మిమ్మల్ని...  మీరు గనక నన్ను ఇలాగే ఏడిపించారనుకో మాములుగా ఉండదు.

అసలే మా ఊరు వచ్చారు అని కుర్త హాండ్స్ ని కొంచెం పైకి మడత పడుతుంది. మీ ఊరి చూసేటప్పటికి నీలో లేని బలం వచ్చిందా...

మాలో ఎప్పుడూ ఉంది. కాకపోతే అవసరం లేనప్పుడు ఎందుకులే అని వదిలేసాను. అవునవును... మీ ఊరు చూసేటప్పటికి బలం కనిపించిందా అంటే...

అంత లేదమ్మా శాంభవి సింగిల్ గా వెళ్లిన సరే వేటాడిరాగలదు అంటుంది. అ.. బ్బో...  అంటాడు.

మరీ ఎక్కువ సాగదీయకండి అని మూతితిప్పుతుంది. శాంభవి అలకలు... రాగాలు అన్నీ చూస్తూ ఇంటి ముందుకు వచ్చి కారు ఆపుతాడు.

హై... మా ఇల్లు వచ్చేసింది.  ఎన్ని రోజులైందో మా ఇల్లు ని చూసి అంటూ కారు దిగుతుంది. శాంభవి వెనకాలే రుద్ర కూడా కారు దిగుతాడు.  అప్పటికే ఇంటిల్లిపాది శాంభవి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు.

అన్నలు ముగ్గురు వచ్చి శాంభవిని గట్టిగా కౌగిలించుకొని ఎన్ని రోజులైపోయింది రా బంగారం.. నేను కూడా మిమ్మల్ని అందరిని చాలా మిస్ అయ్యాను అన్నయ్య అని ఏడుపందుకుంటుంది. 

సరే ఏడవకు.  బావగారితో కలిసి వచ్చావు కదా ఇలా ఏడుస్తే బాగోదు అని కన్నీళ్లు తుడిచి.. రండి బావగారు అని రుద్ర  చేయిపట్టుకుని లోపలికి తీసుకువస్తూ ఉంటే...

గుమ్మం దగ్గరకి రాగానే ఆగండి అన్న పిలుపు వినిపిస్తుంది.  అయ్యో మా శక్కు బేబీ అంటుంది. 

ఆ పిలుపుకి రుద్ర ఒక్కసారిగా శాంభవి వైపు చూస్తాడు. వెంటనే శాంభవి ఒక చిన్న నవ్వు నవ్వి...  మా జేజి.. ఇప్పుడు మొదలు పెడుతుంది చూడు అనగానే...

వెంటనే పనమ్మాయి ఒక గుమ్మడికాయ తెచ్చి దిష్టి తీసి వెళుతుంది. రుద్ర ఒక అడుగు ముందుకు వేయగానే మళ్ళీ ఆగండి అని ఆపుతారు.  ఈసారి ఎర్రనీళ్ళతో దిష్టి తీసి పడేస్తారు.

ఇప్పుడు లోపలికి రావచ్చా అన్నట్టుగా రుద్ర  చూస్తే...జేజి నా కాళ్లు లాగుతున్నాయి అని శాంభవి బిక్క మొహం వేస్తుంది.

వెంటనే శకుంతలాగారు కంగారు పడిపోతూ అయ్యో నా మనవరాలు కాళ్లు లాగుతున్నాయంట. కోడళ్లు ఏం చేస్తున్నారని కంగారుపెట్టేస్తారు.


అది చూసి రుద్ర నవ్వుకుంటూ..  నీ పనే బాగుంది కదా.. ఎక్కడ చూసినా రాజ భోగమే అని మెల్లిగా అంటాడు.  మరి శాంభవి అంటే ఏమనుకుంటున్నారు అని లేని కాలర్ ఎగరేస్తుంది.

రేపల్లెలో రుద్ర అనుభవాలు...
[+] 7 users Like SivaSai's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)