Thread Rating:
  • 18 Vote(s) - 3.22 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పాణిగ్రహణం
(31-03-2026, 05:10 PM)ash.enigma Wrote: Sreekar - Soumya,
Surya - Vishi,
marii Vaibhav - Chandu naa?

Vaibhav Chandu kooda confirm!!! ?
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Part - 13

ఏం మావయ్య నేను చెప్పింది నిజమే కదా..  ఒరేయ్ వైభవ్ నేను నీకు ఏమన్యాయం చేశాను రా..  ప్రతిసారి నన్ను ఇలా ఇరికించేస్తావు.

అమ్మ పూజిత వీడిని  ఏ రాశిలో కన్నావు. నాకు నరకం స్పెల్లింగ్ ఈ కుటుంబంలో వాళ్లే చూపించేస్తున్నారు అనుకో...

ఎందుకు  మావయ్య నువ్వు మరీ మొహమాటపడతావు అని పక్కన కూర్చుని బుగ్గ మీద పొడుస్తాడు.

ఇవే పనులు మీ నాన్న..  అదిగో ఆ భరత్ గాడు చేసేవారు. ఇప్పుడు నువ్వు మొదలు పెట్టావు. నాకు ఇంకా ఫ్రీడం ఇవ్వరా ఏంట్రా.. ఆ ఒక్కటి అడక్కు మావయ్య.
ఇంకా ఏదైనా కావాలంటే అడుగు.

వాడు అలాగే మాట్లాడతాడు గాని అన్నయ్య...  ముందు జ్యూస్ తీసుకోండి. థాంక్స్ చెల్లిమ్మ.. ఈ ఇంట్లో నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే నా చెల్లెళ్లే..

ఏంటి సూర్య రేపు ఏదో ట్రిప్ పెట్టుకున్నారంట.. అవును మావయ్య.  అన్నవరం వెళ్లి వస్తాము. ఏదైనా స్పెషలా.. నథింగ్ వెళ్లాలి అనిపిస్తుంది అంతే.

ఓకే జాగ్రత్త.  ఏదైనా అవసరమైతే ఫోన్ చేయండి.  మనకు తెలిసిన వాళ్ళు అక్కడ చాలామంది ఉన్నారు. అరేంజ్ చేస్తాను.

షూర్ మావయ్య. చందు సూర్య పక్కకి చేరి బావ అని పిలుస్తుంది.  ఏంట్రా.. ఏదో తెచ్చానన్నావు చూపించవా..

అక్కడ పెట్టిన బాక్స్ మొత్తం నీది, సౌమ్య దే..
థాంక్యూ బావ . రా సౌమ్య అని బాక్స్ ఓపెన్ చేస్తుంది. అందులో ఒకటి సౌమ్యకి బాగా నచ్చుతుంది.

అది తీసుకుని చూస్తూ ఉంటే.. చందు చూసి ఇది చాలా బాగుంది.  నేను తీసుకోనా. హా అని ఇవ్వబోతుంది. వెంటనే శ్రీకర్ అది నువ్వు ఇష్టపడి తీసుకున్నావు కదా..

ఎందుకు ఇచ్చేస్తున్నావు. అది అని శ్రీకర్ వైపు భయంగా చూస్తుంది. చందు..  సౌమ్యతో నీకు నచ్చిందా..
  నచ్చినప్పుడు ఇది నాకు నచ్చింది నేను తీసుకుంటాను అని చెప్పొచ్చు కదా..

నా దగ్గర కూడా ఎందుకు నువ్వు ఇబ్బంది పడతావు. ఇలాగైతే కష్టం సౌమ్య. అలా చెప్పు చందు. చిన్నప్పటినుంచి చెప్పి... చెప్పి నా నోరు నెప్పి వస్తుంది కానీ ఇది మాత్రం మారదు.

ఏముందిలే శ్రీకర్.. నీతో పెళ్లి అయ్యాక అదే మారుతుందిలే అని నాలిక కరుచుకుంటుంది. శ్రీకర్ అబ్బా అని కళ్ళు మూసుకుంటే.. సౌమ్య దిక్కులు చూస్తుంది.

పెద్దవాళ్ళందరూ ఒక్కసారిగా ఏమన్నారు అన్నట్టుగా చూస్తే.. విక్రమ్ వాళ్ళు ఏదో పని చేసుకుంటున్నారు.  పిల్లల మధ్యలో మనం ఎందుకు అని డైవర్ట్ చేస్తాడు.

శ్రీకర్... విక్రమ్ వైపు చూసి థాంక్స్ అంకుల్ అని లిప్ మూమెంట్ ఇస్తాడు. భరత్ డౌట్ గా శ్రీకర్ వైపు చూస్తే.
  ఏంటి మామ అలా చూస్తున్నావు.

ఏమీ లేదు లేరా కానివ్వండి. అయ్యబాబోయ్ భరత్ మావయ్యకి అనుమానం వచ్చినట్టుంది. భరత్ పక్కకి చేరి  ఇంకేంటి మావయ్య సంగతులు.

ఒరేయ్ నాకు డౌట్ అడగనా... నువ్వు అడిగితే నేను చెప్పకుండా ఉంటానా..  అడుగు. మీ నాన్నకి నాకన్నా విక్కీ బావ మంచి దోస్త్ కదా...

అవును కదా... మరి నువ్వు ఎప్పుడు విక్కీ బావని అంకుల్ అంటావు.  నన్ను మావయ్య అని పిలుస్తావు ఏంట్రా దాని మిస్టరీ..

అమ్మ మావయ్య పట్టేసినట్టున్నాడు అనుకోని..  అలా ఏమీ లేదు.  చిన్నప్పుడు నుంచి సూర్య నాన్నను అంకుల్ అని పిలిచేవాడు కదా..

ఏదైనా నేను సూర్యనే ఫాలో అవుతాను కదా.. అలా అలవాటు అయిపోయిందన్నమాట.  నిన్ను వాడు మావయ్య అంటాడు కదా అది ఇలా అలవాటైపోయింది. నాకు మాత్రం అలా అనిపించడం లేదే... 

ఇప్పుడేంటి నిన్ను మావయ్య అనకుండా అంకుల్ అని పిలవమంటావా చెప్పు.  పిలుస్తాను. ఏదో నిన్ను మావయ్య.. విద్య అత్తయ్య అంటే హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకున్నాను.

ఇప్పటినుంచి ఆంటీ అని పిలుస్తాను. ఏమంటావు విద్య ఆంటీ అని నొక్కి పిలుస్తాడు. ఆంటీ అన్న పిలుపు నాకు నచ్చలేదు.

ఎవరిని ఎలా పిలిచినా నన్ను మాత్రం అత్తయ్య అనే పిలువు. అందుకే అత్తయ్య నువ్వు సో స్వీట్. నీ కూతురు ఇంకా సో స్వీట్ అని నాలుకరుచుకుంటాడు.

ఇక్కడ ఏమిటో నాకు తేడాగా కొడుతున్నాయి అని భరత్ అంటే... తేడా లేదు..  ఏమీ లేదు. ప్రతిదీ భూతద్దంలో చూడడం అలవాటైపోయింది అని విక్రమ్ కవర్ చేస్తాడు.

అంతేనా బావ.  అంతే.  అవని డిన్నర్ రెడీ చెయ్యి.  పిల్లలు ఎర్లీగా తిని పడుకుంటారు.   అలాగేనండి అని డిన్నర్ పనిలో పడతారు.

డిన్నర్ ఫినిష్ చేసిన తర్వాత సూర్య,  శ్రీకర్ రూమ్ లోకి వెళ్ళిపోతారు. సూర్య రూమ్ లాక్ చేసి శ్రీకర్ ని వంగోపెట్టి నాలుగు పీకుతాడు.

అబ్బా బావ  వదులు ప్లీజ్..  అంత నోటి దురద ఏంటి భరత్ మావయ్యకి ఎంత అనుమానం వచ్చిందో చూసావు కదా..

నీకే నువ్వు బానే ఎస్కేప్ అయిపోతావు. సౌమ్య ఎంత అమాయకురాలు.  అబద్ధం చెబితే పదిమందిని ఇరికించేస్తది.

బావా అని గారాలుపోతే ఏంట్రా.. కొంచెం మేనేజ్ చేయవా.. ఒకసారి సౌమ్య దగ్గరికి వెళ్లి వస్తాను.  మూసుకొని పడుకో. మావయ్య సౌమ్య గది చుట్టూనే ఉంటాడు.

శ్రీకర్ తప్పక మంచం ఎక్కి పిల్లోని హత్తుకుని పడుకుంటాడు.  శ్రీకర్ అవస్థలు చూసి సూర్య నవ్వుకుంటూ... కిటికీ దగ్గర నిలబడి చందమామను చూస్తూ క్యూటి నీకోసం వస్తున్నాను.

కనిపిస్తావా...   నీ రూపం ఎలా ఉంటుందో తెలియదు. నీ పేరు తెలియదు. ఆరోజు అంకుల్ పేరు కూడా తెలుసుకోలేదు.

ఎలా పట్టుకోవాలో తెలియడం లేదు కానీ నా ప్రయత్నం మొదలు పెడతాను.  ఆ స్వామి సన్నిధిలోనే మొదటిసారి నిన్ను చూశాను కదా...

ఇన్ని సంవత్సరాలు తర్వాత ఆ స్వామి సన్నిధిలోనే నీకై వెతుకులాట మొదలుపెడతాను.  ఇది స్నేహమా లేక మరొకటా అన్నది నాకు తెలియడం లేదు..

కానీ నిన్ను చూడాలి..  నీతో మాట్లాడాలి అని నా హృదయం పరితపిస్తుంది. ఇది ఎటు దారితీస్తుందో కాలమే నిర్ణయించాలి.

ఎంతసేపు చందమామను చూసిన క్యూటీ రూపం ఎలా ఉంటుందో తెలియదు గానీ వచ్చి పడుకో. ఒరేయ్ నువ్వు ఇంకా పడుకోలేదా..

నువ్వు పడుకోకుండా నేను ఎప్పుడైనా పడుకున్నానా.. రా బావ.. రేపటి నుంచి మనం నా చెల్లి కోసం సెర్చింగ్ మొదలుపెడదాం.

ఉదయం నాలుగింటికి సూర్య, శ్రీకర్ రెడీ అయ్యి వైభవ్ డోరో కొడతారు.  వైభవ్ ఆవలించుకుంటూ డోరు తీసి ఏమైందన్నయ్యా..  ఇంత అర్ధరాత్రి వచ్చి తలుపు కొట్టావు.

అర్ధరాత్రి ఏంట్రా పొద్దున్నే నాలుగైంది. 4:00 అర్ధరాత్రి కదా..  సన్ రావాలి.  అప్పుడు మనకి తెల్లారినట్టు. అయితే నువ్వు మాతో అన్నవరం రాను అంటావు.

చందు చేతిలో ఫుట్బాల్ ఆడతాను అంటావు అంతేనా.. నో దాని చేతిలో ఫుట్బాల్ అయ్యే కన్నా నైట్ అవుట్ చేయడం చాలా బెటర్.

ఫైవ్ మినిట్స్ లో రెడీ అయి వస్తాను అని వాష్ రూమ్ లోకి పరిగెడతాడు. వెళుతున్న వైభవ్ ని చూస్తూ ఇద్దరు నవ్వుకుంటూ..  అసలు ఫ్యూచర్లో వీళ్ళిద్దరూ జంట అయితే ఎలా ఉంటుంది బావ అని శ్రీకర్ అంటే..

ఇంకేముంది మన రాజ్ మావయ్య తల మీద ఉన్న జుట్టు అంతా చేతిలోకి వస్తుంది. వైభవ్ రెడీ అయి వచ్చి వెళదామా అంటే..

ఇంత తొందరగానా. ఎంతసేపు పదండి అని లాక్కువస్తాడు.  అవని,  పూజిత, విద్య..  ఫుడ్ ప్యాక్ చేస్తే.. అమ్మ మీరు ఎప్పుడు లేచారు అని హగ్ చేసుకుంటారు.

ఎప్పుడో లేచానులే గాని..  ఇదిగో బ్రేక్ ఫాస్ట్ దగ్గర నుంచి ఈవినింగ్ డిన్నర్ దాక అన్ని ప్యాక్ చేసేసాను.  ఈరోజుకి బయట ఎక్కడ తినొద్దు.

ఎందుకమ్మా మీకు ఇంత ఇబ్బంది.  మేం ఎక్కడోచోట తినేవాళ్ళం కదా..  వచ్చింది నిన్న. ఈరోజు వెళుతున్నారు. వాటర్ ఫుడ్ అంతా తేడా వస్తే హెల్త్ ఇబ్బంది అవుతుంది నాన్న..

ఈ ఒక్క రోజుకే అడ్జస్ట్ అవ్వండి రేపటి నుంచి ఎలా కావాల్సి వస్తే అలా తినండి. నువ్వు దేవతవి పెద్దమ్మ. నీలాంటి దేవత ఒక్కళ్ళు ఉంటే చాలు.

పిల్లలకి ఆడింది ఆట పాడింది పాట అని వైభవ్ పొగుడుతూ ఉంటే పూజగా తల మీద ఒక్కటి వేసి...  పిచ్చిపిచ్చి వేషాలు వేయకుండా..  అన్నయ్య, బావతోనే ఉండు.

ఎవరినైనా గోకావు అని తెలిసింది అనుకో...  వీడితో మాకు ఎటువంటి సంబంధం లేదు..మీకు నచ్చింది చేసుకోండి అని చెబుతాను అర్థమైందా...

నీలాంటి మాత ఒక్కళ్ళు ఉంటే చాలు.. కొడుకులు దెబ్బకి లైన్లోకి వచ్చేస్తారు.  యు ఆర్ సో గ్రేట్. చాలుగాని ఇదిగో మని అని ఇస్తుంది.  థాంక్యూ అమ్మ అని ముద్దు పెడతాడు.

ముగ్గురు అన్నవరం బయలుదేరుతారు. విశి పొద్దుటే లేచి రెడీ అయ్యి వర్క్ చేసుకుంటూ ఉంటుంది. భానుమతి కాఫీ కలిపి కూతురికి ఇస్తుంది.

థాంక్స్ అమ్మ అని కాఫీ తాగుతూ కళ్ళు మూసుకుని రిలాక్స్ అవుతుంది. ఏంట్రా వర్క్ ఎక్కువ అవుతుందా.. అలా ఏమీ లేదు.

ఈరోజు ఎందుకో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకు కావాల్సింది నాకోసం వస్తుంది అనిపిస్తుంది. ఇంకేముంది మీ నాన్నగారు వచ్చేస్తూ ఉంటారు.

వస్తూ వస్తూ నీకు ఏదైనా మంచి సంబంధం చూసి ఉంటారు. ఆ మాటకే నవ్వుతూ అవునమ్మా నాన్నగారు వచ్చేస్తున్నారు.

అందుకే నీ మనసుకి అలా కనిపించింది.  ఉండు ఈరోజు నీకు ఇష్టమైన కూర వండుతాను అని కిచెన్లోకి వెళతారు. వెళుతున్న తల్లిని చూస్తూ నువ్వు ఆ మాయలో ఉండిపోయినా పరవాలేదు.

నా కళ్ళ ముందు నవ్వుతూ తిరుగు.. నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. కాఫీ ఫినిష్ చేసి వర్క్ చేసుకుంటూ ఉంటుంది.

కాలేజ్ టైం అయిన తర్వాత గబగబా రెడీ అయ్యి కాలేజీకి వెళ్ళిపోతుంది. భవ్య ఎదురవచ్చి..  నీ ఫేసు మెరిసిపోతుంది. ఏమిటి  సంగతి.. అవునా అని ఫేస్ మీద చేయి వేసుకుంటుంది.

అరే నేను నిజమే చెబుతున్నాను. నమ్మవా.. అలా ఏమీ లేదు. ఎందుకో మనసంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది.

నాకోసం ఏదో మంచి ఎదురుచూస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకేముంది..  నీకై వెతికే నీ రాకుమారుడు నీ కళ్ళ ముందుకి వస్తాడేమో..

ఇంకా ఆపుతావా..  గౌతమ్ ఉండగా వేరే వాళ్ళు ఎందుకే..

భవ్య రియాక్షన్??
[+] 7 users Like SivaSai's post
Like Reply
Part - 14

గౌతమ్ ఉండగా వేరే వాళ్ళు ఎందుకే.. నీకు ఎప్పుడు గౌతమ్ మాయ వదులుతుందో..  ప్లీజ్ హీరో తొందరగా విశి జీవితంలోనికి రా..

ఈ పిచ్చిది కళ్ళ ముందు కనిపించేదే నిజం అనుకుంటుంది.
డ్రైవింగ్ లో ఉన్న సూర్యకి ఒకటే పులమారుతూ ఉంటుంది.  కళ్ళల్లో నుంచి నీళ్లు కూడా వచ్చేస్తూ ఉంటాయి.

కార్ సైడ్ కి ఆపి వాటర్ తాగుతాడు. ఏమైంది బావ అంతలా  దగ్గుతున్నావు. ఏమోరా..  బాగా పులమారుతుంది.

అన్నయ్య ఇలా పులమారింది అంటే మనకు కావలసిన వాళ్లు మనల్ని తలుచుకుంటున్నారు అని అర్థం. నన్ను తలుచుకునే వాళ్ళు అందరూ ఇంటి దగ్గరే ఉన్నారు కదా..

అమ్మ తలుచుకుంటుందా.. పెద్దమ్మ తలుచుకున్న దానికి నీకు నిద్రలో కూడా వస్తూనే ఉంటాయి.. ఇంకా ఎవరైనా సంథింగ్ స్పెషల్ అయ్యుండొచ్చు.

నాలాగే క్యూటీ కూడా ఆలోచిస్తుందా అని మనసులో అనుకుంటాడు. ఆ ఫీలింగ్ కే హాయిగా అనిపిస్తుంది. ఇక కారు ఎక్కడ ఆపకుండా స్పీడ్ గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు.

అన్నయ్య మనం కారులో వెళ్తున్నాము.  ఫ్లైట్లో కాదు. కొంచెం స్లోగా వెళ్ళు.  ఏదైనా డామేజ్ అయితే కారుతో పాటు మనం కూడా మాయమైపోతాము.

సొల్లు ఆపరా..  బావ డ్రైవింగ్ బానే ఉంటుంది.  నీకేం బాబు.. అన్నయ్యతో తిరిగి తిరిగి నీకు అలవాటైపోయింది.  నేను ఇప్పుడే కదా మీతో స్టార్ చేశాను.  కొంచెం ఈ అల్పప్రాణిని కూడా దృష్టిలో పెట్టుకోండి.

అనుకున్న టైం కన్నా ముందే అన్నవరం చేరుకుంటారు. రూమ్ తీసుకుని ముందు ఫ్రెష్  అయ్యి బయటకి వస్తారు.  స్వామి దర్శనం చేసుకుని సరౌండింగ్ తిరుగుతూ ఉంటారు.

ఫస్ట్ టైం క్యూటి ని కలిసిన చోటికి వెళ్లి సూర్య అక్కడ కూర్చుంటాడు. కోతితో చేసిన హంగామా గుర్తుకు వచ్చి నవ్వుకుంటాడు.

సూర్య నవ్వు చూసి వైభవ్.. శ్రీకర్ ని గోకుతూ ఉంటాడు. ఏంట్రా... ఎందుకు అన్నయ్య తనలో తానే నవ్వుకుంటున్నాడు.

ఇక్కడ  అలా నవ్వుకోవాలా... వైభవ్ నీ పైనుంచి కిందకి చూస్తూ చందు నిన్న ఆడుకోవడంలో అసలు తప్పులేదు రా ...

ఈ వయసులో అమ్మాయిలు, అబ్బాయిలు చుట్టు ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి ఇలా నవ్వుకుంటున్నారు అంటే అర్థం ఏమిటిరా..

ఏమో బావ ఇంకా నేను అలా నవ్వుకోలేదు కదా.. నాకు తెలియదు. మరి అంత మంది అమ్మాయిల్ని ఫ్లట్ చేస్తున్నావు..

ఆ ఫ్లట్ చేయడం ఇది ఒకటేనా అని..  బల్బు వెలిగి..  అన్నయ్య లవ్లో పడ్డాడా..  మా వదిన ఎవరు? ఎక్కడుంది.. పేరేంటి అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటాడు.

ఒరేయ్ నాన్ స్టాప్ కాస్త ఆగరా... అక్కడే కొద్దిగా దూరంలో కూర్చుని మనం ఫస్ట్ టైం అన్నవరం వచ్చాము గుర్తుందా..

అప్పుడు నాకు 6 ఇయర్స్ అనుకుంటా..
అప్పుడే చూశాడు. అప్పుడు అన్నయ్యకి 8 ఇయర్స్ కదా.. అవును రా... ఆ వయసులో లవ్ ఏంటి..ఒరేయ్ అది లవ్ అని నేను చెప్పానా.

నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు.. కన్ఫ్యూజన్ లేదు ఏమీ లేదు.  పూర్తిగా విను.  సరే లాగ్ చేయకుండా చెప్పు.

సూర్య ఫస్ట్ టైం క్యూటి ని చూశాడు. మే బి క్యూటికి అప్పుడు ఫైవ్ ఆర్ ఫోర్ ఇయర్స్ ఉండొచ్చు.

జస్ట్ ఫైవ్ మినిట్స్ మాట్లాడాడు. అప్పటినుండి ఆ పాప రూపం బావ మైండ్లో ఉండిపోయింది. ఓ.. వదిన పేరు క్యూటి నా. కాదు అది సూర్యా పెట్టిన పేరు.

ఆ వయసులోనే ముద్దు పేర్లు పెట్టాడా.. తల పట్టుకుని ఒరేయ్ చెప్పింది అర్థం చేసుకోవడం అయినా రావాలి లేదా సొంతంగా అయినా తెలుసుకోవాలి.

తలా తోక లేకుండా మాట్లాడకురా... నువ్వు క్లియర్ గా చెప్పకుండా నన్ను అంటే ఎలా. సరే ఫ్లాష్ బ్యాక్ అని రెండు చేతులు స్క్రీన్ లాగా ఓపెన్ చేసి చూపించి క్లోజ్ చేస్తాడు.

ఇంత జరిగిందా.. అప్పుడు నేను మిస్ అయ్యాను. అవును నువ్వు అప్పుడు నీ చందు తో ఆటల్లో ఉన్నావు. చందుతో నేను ఆడుకోవడమేంటి..

రాక్షసి...  ఎప్పుడూ నా బుర్ర తింటూనే ఉంటుంది. దాన్ని గొడవలో పడి వదినని మిస్సయ్యాను.
   
నువ్వు వదిన అని ఫిక్స్ అవ్వకు.  సూర్యకి క్లారిటీ లేదు.  అది ఫ్రెండ్షిప్ ఇంకా ఏమైనా రిలేషన్ అన్నది ఆలోచిస్తున్నాడు.

వాడికి క్లారిటీ వచ్చాక అప్పుడు నీకు కావలసిన వరుసలు పెట్టి పిలుచుకో..  ఇది మరీ బాగుంది బావ.  ఇన్ని సంవత్సరాల నుంచి ఒక అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడు అంటే అది ప్రేమ కాక ఇంకేమిటి..

ఏమో ఎవరికి తెలుసు. సూర్య మాత్రం స్నేహం అంటున్నాడు.  క్యూటి గురించి ఆలోచన వచ్చినప్పుడు వాడి మొఖంలో కనిపించే వెలుగు చూస్తే ప్రేమ అనిపిస్తుంది.

చూద్దాం అది స్నేహమా..  ప్రేమ ఇంకా ఏమిటో అన్నది..
సూర్య దగ్గరికి వెళ్లి ఎంతసేపు కూర్చుంటావు బావ..
వెళదామా...  సరే అని ఆ ప్లేస్ మొత్తం తిరుగుతాడు.

ఎలా కనిపెట్టాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైంది బావ..  క్యూటి ని ఎలా కనిపెట్టాలో అర్థం కావడం లేదు.

క్యూటి ఫాదర్ నేమ్ తెలీదు. ఏదో హోప్ తో ఇక్కడదాకా వచ్చాను కానీ అసలు ఎలా ముందుకు వెళ్లాలో అర్థం కావడం లేదు.

ఇది నిజంగా చిక్కు సమస్య.. ఒక్క నిమిషం ఆలోచించి రేయ్ బావ ఆ రోజు పుట్టినరోజు అన్నారు కదా... ప్రతి పుట్టినరోజుకి వచ్చి స్వామి కళ్యాణం చేయిపిస్తాము అన్నారు కదా...

సో ఆ రోజు వస్తే మనం క్యూటీని పట్టుకోవచ్చు.  కానీ అన్నయ్య క్యూటీ ఇప్పుడు పెద్దది అయిపోయింది కదా.. ఎలా గుర్తుపడతావు.

క్యూటీ ఫాదర్ ఐడియా ఉన్నారు. ఆరోజు వస్తారా..  కచ్చితంగా వస్తారు. వాళ్లకి చాలా ఇయర్స్ తర్వాత క్యూటి పుట్టిందంట.  అది స్వామి దయ అని అంకుల్ నమ్మకం. కాబట్టి  ఆంటీ అంకుల్ క్యూటి ముగ్గురు వస్తారు.

ఆ డేట్ అంటే అని శ్రీకర్ ఫోన్ ఓపెన్ చేసి క్యాలెండర్ చూస్తాడు.  బావ ఇంకా 2 మంత్స్ టైం ఉంది. మనం  టు డేస్ ముందు వస్తే ఈ ఏరియా మొత్తం మన గ్రిప్ లోకి తెచ్చుకోవచ్చు.

ఇంకా రెండు నెలలా అని నీరసంగా అంటాడు.  ఇన్ని రోజులు ఆగిన వాడివి ఒక రెండు నెలలు ఆగలేవా బావ.. దూరంగా ఉన్నప్పుడు తెలియలేదు కానీ దగ్గరకు వచ్చాక మాత్రం మనసు కొట్టుకుంటుంది.

క్యూటి ఏదో ఇబ్బందుల్లో ఉంది. నాకోసం ఎదురు చూస్తుంది అనిపిస్తుంది. ఖచ్చితంగా క్యూటి నీకు కనిపిస్తుంది.

మీ ప్రయాణం ఇక్కడే మొదలయ్యింది. స్వామి ఆశీస్సులు ఉన్నాయి.  తప్పకుండా మీరిద్దరూ ఎదురుపడతారు నన్ను నమ్ము బావ.

నాకు ఆ నమ్మకం ఉందిరా... కాకపోతే తొందరగా కలవాలి అని ఆరాటంగా ఉంది.  ఆకలేస్తుంది బావ ముందు తిందాం పద అని సూర్యని బలవంతంగా తీసుకు వెళతాడు.

వైభవ్ ఆలోచిస్తూ నడుస్తూఉంటే...  ఏమైందిరా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. ఏమీ లేదు బావ....  అన్నయ్య ఎప్పుడో ఒక్క 5 నిమిషాలు ఒక పాపని చూసింది ఇలా గుర్తుపెట్టుకొని మరి ఆలోచిస్తున్నాడు.

మరి చిన్నప్పుడు నుంచి నేను, చందు ఒకేచోట కలిసి ఉన్నాము.  పిచ్చకొట్టుడు కొట్టుకున్నాము.  ఇప్పుడు దూరంగా ఉన్నా..  నాకు దాని గురించి ఆలోచన రావడం లేదు ఏంటి బావ.

నువ్వు చందు ని ప్రేమిస్తున్నావా..  ఛి ఛి దాన్ని ప్రేమించడం ఏంటి... దాన్ని ప్రేమించడం అంటే... నా జీవితంలో సంతోషం మాయమైపోయినట్టే.

మరి ప్రేమించనప్పుడు నీకెందుకు ఆలోచన వస్తుంది. కదా నేను ఆ విషయమే మర్చిపోయాను.  ఎప్పుడు దానితో గొడవ పడి పడి దాని ఆలోచనలు  ఎక్కువైపోతున్నాయి బాబోయ్ అనుకుంటూ ముందుకు వెళతాడు.

వెళుతున్న వైభవ్ ని చూసి నవ్వుకుంటూ...  పిచ్చ సన్నాసి.. ఏడికి తెలియడం లేదు. ఆల్రెడీ వీడు చందు ప్రేమలోనే ఉన్నాడు.

ముగ్గురు మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ చేస్తారు. ఈసారి శ్రీకర్ డ్రైవింగ్ లో కూర్చుంటే సూర్య  ప్యాసింజర్ సీట్లో కూర్చుని బయటికి చూస్తూ ఉంటాడు.

ప్లీజ్ బావ నువ్వు అలా ఉండకు... కచ్చితంగా క్యూటి దొరుకుతుంది..  అన్నయ్య నాదొక ఐడియా.. ఏంట్రా అంటే...

క్యూటీ కూడా ఏదో ఒక కాలేజీలో చదువుతూ ఉంటుంది కదా..  మనం ఆ వేలో సెర్చింగ్ మొదలుపెడితే... పేరు తెలియదు కదా..

నాకు వదిలేయ్ అన్నయ్య.  ప్రతి కాలేజీలోనూ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు.  క్యూటి అని ముద్దు పేరు ఉందేమో  కనుక్కోమందాము.

అప్పుడు మనకు ఏదైనా దారి దొరకచ్చేమో..   చాలామంది క్యూటీలు ఉంటే..  వాళ్ల ఫాదర్స్ ఫొటోస్ చూస్తాము. క్యూటి దొరికేస్తుంది.

ఈ ఐడియా బానే ఉంది కానీ...  ఇండియా మొత్తం మీద చాలా కాలేజీలు ఉన్నాయి కదా..

ఒకటి ఆలోచించండి. క్యూటీ ఒక్కతే డాటర్ కాబట్టి దూరంగా పంపించరు. సో ఫస్ట్ మనం వైజాగ్ టు హైదరాబాద్ ఉన్న ప్రతి కాలేజ్ వెతుకుదాము.

గుడ్ ఐడియా...  ఇప్పుడే స్టార్ట్ చేద్దామని సూర్య అంటే.
  నీకెందుకన్నయ్య.  ఈ వర్క్ నాకు వదిలేసేయ్.  వదినని వెతికి నీ ముందు నుంచే పెట్టే బాధ్యత నాది..

వైభవ్ వెంటనే ఫ్రెండ్స్ అందరికి మెసేజ్ చేస్తాడు.  మొత్తం వెతకండి.  ఎవరైతే ఫస్ట్ కనిపెట్టి చెబుతారో వాళ్ళకి స్పోర్ట్స్ బైక్ గిఫ్ట్ అని చెబుతాడు.

ఫ్రెండ్స్ అందరూ ఓకే డన్ డన్ అని రిప్లై ఇస్తారు.  అది చూసి నవ్వుకుంటూ అన్నయ్య నీ క్యూటి దొరికేస్తుంది.  మా బ్యాచ్ అంతా ఆ పనిలోనే ఉన్నారు.

అంత ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యారు ఏంట్రా.. ఎందుకు అవ్వరు. స్పోర్ట్స్ బైక్ అక్కడ గిఫ్ట్ అని చెప్పాను. నువ్వు మామూలోడు కాదురా..

ఏదో రాముడు ప్రేమకి లక్ష్మణుడి ఉడత సహాయం.

సూర్య మనసులో..   క్యూటీ నీకై వస్తున్న...  నాకై ఎదురు చూడు.
మన జర్నీ ఎటు నుంచి ఎటు వెళుతుందో చూడాలి.. అనుకుంటూ చూస్తూ ఉంటాడు.

చందు నివి దగ్గరికి వచ్చి అమ్మ అని పిలుస్తుంది.  ఏంటే... బోర్ కొడుతుంది ఎక్కడికైనా వెళదామా...

నాకు పని ఉంది.  సౌమ్య దగ్గరికి వెళ్ళు.  అబ్బా వైభవ్ లేడమ్మా..  వెళ్లిన ఏమి తోచదు.
  
నివి రియాక్షన్ ??
కథ కొనసాగుతుంది
[+] 7 users Like SivaSai's post
Like Reply
Superb update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
(01-04-2026, 05:45 PM)ash.enigma Wrote: Vaibhav Chandu kooda confirm!!! ?

Chaandu Vaibhav story is going to be awesome ? ?
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Part - 15

వైభవ్ లేకపోతే నాకు ఏమీ తోచదు  అమ్మ. అవునా అంత స్పెషల్ ఏముంది వాడిలో.  వాడు ఒక ఫన్నీ.  నాకు స్ట్రెస్ అనిపిస్తే వాడిని కదిపాను అనుకో నా స్ట్రెస్ అంత గాల్లోకి ఎగిరిపోతుంది.
మరి ఎందుకు ఆస్తమాను వాడిని ప్రతిదానికి ఇరికిస్తావు. చెప్పాను కదా వాడు నాకు స్ట్రెస్ బాల్ లాగా.. రేపు వాడి పెళ్ళాం వస్తే...

అమ్మ ఆపుతావా.. వాడి పెళ్లి చేసుకున్నాక అప్పుడు ఆలోచిద్దాంలే.  ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు అని విసుక్కుంటుంది.

ఇప్పుడు నేను ఏమన్నానని దీనికి ఇంత కోపం వచ్చింది. షాపింగ్ కి వెళ్దామా అంటే..  పదా అని   బయటికి వెళతారు.

షాపింగ్ కి వెళ్ళిన దీనిమీద మనసు పెట్టదు.  అది బాగోలేదు. ఇది బాగోలేదు అని ఏదో ఒక వంక చెబుతూనే ఉంటుంది.

చందు.. నీ బ్రెయిన్ అసలు పని చేయడం లేదు.  వెళ్లి కామెడీ మూవీ పెట్టుకుని చూడు నన్ను విసిగించకు అని షాప్ బయటకు వచ్చేస్తుంది.

అమ్మ ప్లీజ్..  ప్లీజ్... అంటే..  ఏం ప్లీజ్..  నీ బుర్రంతా వైభవ్ దగ్గరే ఆగిపోయింది. అది స్నేహమా లేక నువ్వు అన్నట్టు ఫన్నీ నా లేక ఇంకేమైనా నా ఆలోచించుకో...

చందు ఏమీ మాట్లాడకుండా చూస్తూ ఉంటే..  నివి కూతురు వైపు తిరిగి చూడు చందు చిన్నప్పటి నుంచి మీరిద్దరూ ఒకే చోట ఉండడం వలన మీ మధ్యన ఏముంది అన్నది అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతున్నావు.

అది ఏమిటో క్లారిటీ తెచ్చుకో.  అది ఏ రిలేషన్ అయినా సరే నేను నీకు సపోర్ట్ ఇస్తాను అర్థమైందా.. ఇంకా ఇంటికి వెళదాం పద అని తీసుకువచ్చేస్తుంది.

అన్నవరం నుంచి ముగ్గురు వచ్చి మంచం మీద పడతారు. సూర్య దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే..  బావ నేను ఇంటికి వెళుతున్నాను.  ఎక్కువ ఆలోచించకు.

వైభవ్ గాడు చెప్పినట్టు క్యూటి సరౌండింగ్ లోనే చదువుతూ ఉంటుంది. ఎలాగైనా పట్టుకుందాం..  సరేనా...
హ్మ్.. నాకు నిద్ర వస్తుంది అని సూర్య కళ్ళు మూసుకుంటాడు.

శ్రీకర్ రూమ్ బయటకి వచ్చి స్టెప్స్ దిగుతూ ఉంటే సౌమ్య లోపలికి వస్తుంది. నా బుజ్జి పప్పీ ఏంటి ఇంట్లోనే ఉంది అని స్పీడ్ గా వెళ్తాడు.

శ్రీకర్ ని చూసి ఉలిక్కిపడుతుంది.  ఏంటి బుజ్జి పప్పీ కాలేజీకి వెళ్లకుండా ఏం చేస్తున్నావు.  మీరేప్పుడొచ్చారు.  ఇప్పుడే గాని ఏమిటి సంగతి.

నథింగ్ వెళ్లాలి అనిపించలేదు.  బయటకు ఎక్కడికైనా వెళదామా.  ఇప్పుడే కదా జర్నీ చేసి వచ్చారు. ఇంటికి వెళ్ళరా..  ఆంటీ ఎదురు చూస్తూ ఉంటుంది కదా..

అందుకేనే నువ్వు నాకు పిచ్చిపిచ్చిగా నచ్చేస్తావు. నైట్ కి ఫోన్ చేస్తాను.  వెయిట్ చెయ్ బాయ్ అని చంప మీద తట్టి వెళ్ళిపోతాడు.

వెళుతున్న శ్రీకర్ ని చూసి నవ్వుకుంటూ గదిలోకి వెళ్ళిపోతుంది.

భవ్య షాపింగ్ కి వెళుతుంది.  విశి బర్త్డే వస్తుంది. మంచి డ్రెస్ తీసుకోవాలి.  అది ఎప్పుడు అమ్మ అమ్మ అనేగాని దాని గురించి ఆలోచించడం మానేసింది.

ఏ డ్రస్సు బాగుంటుందా అని వెతుకుతూ ఉంటుంది. డ్రెస్ చూస్తూ ఉండేది ఆగిపోతుంది.  ఎదురుగుండా కనిపించేది చూసి షాక్ అవుతుంది.  వెంటనే  ఫొటోస్ తీస్తుంది.

షాపింగ్ చేసే మూడ్ లేక ఇంటికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్డే కాలేజీకి వెళ్లి విశి  కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. విశి రాగానే పరిగెత్తుకుంటూ వెళ్లి.. వచ్చావా నీకోసమే ఎదురు చూస్తున్నాను.

ఏమైంది ఎందుకు అంత కంగారు పడుతున్నావు. విశి నీకు ఒక నిజం చెప్పాలి.  అది విన్నాక మాత్రం నువ్వు ధైర్యంగా ఉండు. కాదు కాదు చూపించాలి.

అబ్బా..  ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు. నేను ధైర్యంగానే ఉంటాను. సరే అని ఫొటోస్ చూపిస్తుంది. ఆ ఫొటోస్ చూసి..  దీనిక నువ్వు ఇంత కంగారు పడింది.

నీకు ఏమీ అనిపించడం లేదా.. అక్కడ గౌతమ్ వేరే అమ్మాయితో ఉన్నాడు. తెలుసు. తెలుసు అంటే..కళ్ళు చిన్నవి చేసి అడుగుతుంది.

నిన్న షాపింగ్ కి గౌతమ్ ఈ అమ్మాయిని తీసుకుని వెళ్లాడు. వాళ్ళిద్దరూ అంత క్లోజ్ గా ఉన్నా నీకు అనుమానం రావడం లేదా.. ఎందుకు అనుమానం.

ఆ అమ్మాయి గౌతమ్ ఫ్యామిలీ ఫ్రెండ్. అబ్రాడ్ నుంచి వచ్చిందంట. షాపింగ్ కి వెళుతున్నాము అని నాకు కాల్ చేసి చెప్పాడు.

ఏ టైం కి ఫోన్ చేశాడు.  కరెక్ట్ గా గుర్తులేదు కానీ నేను రెస్టారెంట్ లో ఉన్నప్పుడు చేశాడు అని ఆలోచిస్తూ..  సిక్స్ టు సెవెన్ మధ్యన అంటుంది.

ఆ మాటకి భవ్య ఆలోచిస్తూ.. ఆ రాస్కెల్ నన్ను చూశాడు. నేను ఎలాగైనా ఈ తింగరబుచ్చికి చెబుతానని అర్థమయ్యి ముందుగానే వాడే ఫోన్ చేశాడన్నమాట.

వీడు ఎంత కంత్రిగాడు. ఇదొక పిచ్చి మాలోకం.  వాడి ఏది చెప్పినా నమ్ముతుంది.  భగవంతుడా దీన్ని కాపాడు.

సూర్య గార్డెన్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటే విక్రమ్ వచ్చి పక్కనే కూర్చుని ఎవరు ఆ అమ్మాయి.. అమ్మాయా.. అమ్మాయి ఎవరు ఇక్కడ ఎవరూ లేరే..

నేను అడుగుతుంది నీ చుట్టూ ఉన్న వాళ్ళ గురించి కాదు. నీ మనసులో ఉన్న వాళ్ళ గురించి.నాన్న అంటే..  ఆ నాన్ననే అడుగుతున్నాను.

అలాంటిదేమీ లేదు. ఒరేయ్ నేను నీ వయసు దాటి వచ్చాను.  నువ్వు ఏం ఆలోచిస్తున్నావో ఆ మాత్రం అర్థం కాదా..  ఏమిటి సంగతి..

నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ వి నాన్న.  ఏదైనా నువ్వు సలహా ఇచ్చినట్టుగా నాకు ఎవరూ ఇవ్వలేరు. అందుకే విషయం మొత్తం చెబుతాను.  ఇది ఏమిటో అన్నది చెప్పండి అని అప్పటిదాకా జరిగిందంతా చెబుతాడు.

విక్రమ్ మొత్తం విని ఆలోచిస్తూ ఉంటాడు.  మీరు చెప్పండి.. నేను ఇది స్నేహం అంటున్నాను  ఆ శ్రీకర్ గాడేమో ప్రేమ అంటున్నాడు.  వైభవ్ ఏమో వదిన అంటున్నాడు.  నాకైతే ఏమీ అర్థం కావడం లేదు  .

విక్రమ్ చిన్నగా నవ్వుతూ అందరూ చెప్పింది కాదు. నీ మనసు ఏమి చెబుతుందో అన్నది మాత్రమే ఆలోచించు. ముందు నువ్వు క్యూటీని పట్టుకో.  అప్పుడు నీకే ఒక క్లారిటీ వస్తుంది.

క్యూటీని వెతకడంలో నా హెల్ప్ ఏమైనా కావాలి అంటే అడుగు. షుర్ నాన్న..  ముందు నా ప్రయత్నం నేను చేయని.  ఈ వెతుకులాటలో నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా..

గుడ్.. మీ ముగ్గురికి నేను ఒక టాస్క్ ఇస్తున్నాను. ఆ టాస్క్ ఫినిష్ చేస్తూ నీ క్యూటిని వెతుకు. ఏమిటి నాన్న.. మన కంపెనీస్ కి సంబంధించిన ప్రతి బ్రాంచ్ దగ్గరికి వెళ్లి మీరు చెక్ చేయండి.

హాస్పటల్స్,మాల్స్, కాలేజ్స్ రెస్టారెంట్స్ మొత్తం చెక్ చేయండి. ఎక్కడ ఏది తేడా ఉన్నా సరే.. ఎలాంటి మార్పులు చేయాలి అన్నది ఆలోచించండి.

ఆ సజెషన్స్ అన్నీ కూడా నోట్ చేసుకుని మీటింగ్లో మాకు చెప్పండి.  దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకుందాము. మీరు ఆల్రెడీ పర్ఫెక్ట్ గా చేసే ఉంటారు కదా...

జనరేషన్ మారుతున్నప్పుడు ఆలోచనలు మారుతాయి.  సో మీ జనరేషన్ ఎలా ఆలోచిస్తుందో దానికి తగ్గట్టుగా మన బిజినెస్ ఉందో లేదో అన్నది కూడా చెక్ చేసుకోవాలి.

షుర్.. రేపటి నుంచే వెళతాము. ఈరోజు ఏమైనా ముహూర్తం బాగోలేదా. వాట్ అని నవ్వుతాడు. ఎప్పుడైనా పని అంటే ముందు పని మీదే ఉండాలి.

పోస్ట్పోన్ చేయకూడదు. క్యారీ ఆన్. ఓకే అని వైభవ్ కి శ్రీకర్ కి కాల్ చేసి రమ్మని చెబుతాడు.  వైభవ్ రాగానే ఏంటి అన్నయ్య..

ఏం చేస్తున్నావ్ రా. కాలేజీకి వెళ్ళాలి. త్రీ డేస్ లీవ్ తీసుకున్నాను. ఎంత వర్క్ పెండింగ్ ఉందో...   పూజిత ఆ మాటలు విని ఒరేయ్ ఒక్కసారి కూడా నిజాలు మాట్లాడవా...

నువ్వు కాలేజీకి వెళ్లి ఏ రోజు బుక్కు తీసావు.  ఈరోజు పెద్ద.మిస్ అయిపోతున్నట్టు బిల్డప్ ఇస్తున్నావు. నువ్వెక్కడ నుంచి వచ్చావమ్మా.. అన్ని అలా వినేస్తావు.

నేను ఎక్కడున్నా  ఒక కన్ను నీ మీద.. ఇంకో కన్ను మీ నాన్న మీదే ఉంటుంది. అనుకున్నాను ఇంకా నన్ను లాగలేదేంట...

ప్రశాంతంగా నన్ను ఎందుకు ఉంచిందా అని వినయ్ అంటే..  మీ బుద్ధులే మీ కొడుక్కి వచ్చాయి చూడండి ఏమంటున్నాడో...

అరే చదువుతాను అన్నా తిడుతున్నావు. చదవలేదు అన్న తిడుతున్నావు ఇలాగైతే ఎలాగే... సూర్య పూజిత మెడ చుట్టూ చేతులు వేసి..  పిన్ని చెప్పేదంతా వైభవ్ మంచి కోసమే..

నువ్వు ఒక్కడివే రా నన్ను అర్థం చేసుకుంటావు. ఇంతకీ ఎందుకు పిలిచావో చెప్పలేదు అన్నయ్య..  ఈరోజు నుంచి మనం కంపెనీస్ అన్నింటిలో చెక్ చేయడానికి వెళుతున్నాము .

అయ్యో నా ఎగ్జామ్స్..  నీ ఎగ్జామ్స్ పాస్ చేయించే బాధ్యత నాది.  అన్నయ్య మాటిచ్చాక కాదంటానా...  ఓకే ఫస్ట్ ఎక్కడికి వెళ్దాం.

హాస్పటల్ అంటాడు.  అబ్బా హాస్పిటల్ మందుల వాసన అన్నయ్య అని ముక్కు మూసుకుంటాడు. శ్రీకర్ కూడా జాయిన్ అయ్యి...  మందుల వాసన అయితే ఏమైందిరా..

అక్కడే కూర్చుని అవి ఏమైనా తింటావా ఏమిటి..  వచ్చేసావా అని..  బాయ్ మామ్ అని..  బ్లెస్స్ మీ మామ్...  దేనికి రా అంటే ఫస్ట్ టైం వర్క్ చేయడానికి వెళుతున్నాను.   బ్లెస్ చేయవా.

మొన్నేదో సీక్రెట్ జాబ్ చేస్తున్నానన్నావు.  అది వేరు ఇది వేరు. బ్లెస్స్ మీ మామ్ అని గారాల పోతాడు.  ఏదో ఒకటి చెయ్..

కానీ మన ఇంటి గౌరవానికి మచ్చ తీసుకురాకు అన్నయ్యని ఫాలో అవ్వు అర్థమైందా..  అర్థమయింది. ముగ్గురు స్టార్ట్ అవుతారు.

పూజిత నువ్వు టెన్షన్ పడకు.  వైభవ్ ఈసారి పక్కా జెంటిల్మెన్ అవుతాడు అని అవని అంటే.. నా కోరిక కూడా అదే.

వాడు అలా మారితే ఆ తిరుపతి కొండ మా వారిని నడిపించి..  గుండు కొట్టిస్తాను అంటుంది. ఆ మాటకి వినయ్ ఉలిక్కిపడి..  నీ కొడుకు పక్కా జెంటిల్మెన్ అవుతే నాకు గుండు కొట్టించడమేమిటి.

వాడికే గుండు కొట్టించవచ్చు కదా..  వాడిది అంతా మీ పోలికల కదా..  మీకు కొట్టిస్తే వాడికి కొట్టించినట్టే...

ఇది ఎక్కడి లాజిక్ ??
[+] 6 users Like SivaSai's post
Like Reply
Part - 16

కొడుకు బాగుపడితే మొగుడికి గుండు కొట్టేస్తానన్న పెళ్ళం నువ్వేనేమో.. చరిత్రలో నిలిచిపోతావు. థాంక్యూ. దేనికి.. నన్ను పొగిడారు కదా..

నీకు అలా అర్థమైందా. బావ ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నాడో నాకు బాగా అర్థం అయింది.. పోనీలే ఇన్ని సంవత్సరాలకైనా అర్థం అయింది అందుకు సంతోషించాలి.

సూర్య బ్యాచ్ ముందు హాస్పిటల్ కి వెళతారు. నార్మల్ పీపుల్ లాగా వెళ్లి ప్రతిదీ చెక్ చేస్తూ ఉంటారు. మెడిసిన్స్ ఎక్విప్మెంట్స్, డాక్టర్స్.. ప్రతిదీ ఏదీ వదలకుండా చెక్ చేస్తారు.

విశి.. భానుమతిని తీసుకుని హాస్పిటల్ కి వస్తుంది. నేను బాగానే ఉన్నాను అని చెబుతున్న వినవేంటి విశి. ఈ హాస్పిటల్ చూడు ఎంత కాస్ట్లీ గా కనిపిస్తుందో..

మన దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసేసుకుంటారు.  నాన్నగారు వచ్చేదాకా మనం జాగ్రత్తగా ఉండాలి కదా... హాస్పిటల్ పైకి అలా కనిపిస్తుంది కానీ నార్మల్ ఫీజు తీసుకుంటున్నారు అమ్మ.

నేను అన్ని కనుక్కున్నాను.  నువ్వు కొంచెం నీరసంగా కనిపిస్తున్నావు.  ఒకసారి చెక్ చేశారు అనుకో నాకు తృప్తిగా ఉంటుంది కదా..

నీరసమేమీ లేదురా..  మీ నాన్నగారు ఇంకా రాలేదు కదా.. అందుకే బెంగగా ఉంది. ఈరోజు సాయంత్రానికి వచ్చేస్తున్నారమ్మా..

ఒక్క నిమిషం ఇక్కడే కూర్చో.  డాక్టర్ ఉన్నారో లేదో చూసి వస్తాను. సరే.. ఎక్కడికి వెళ్లొద్దు. నేను ఏమైనా చిన్నపిల్లనా తప్పిపోవడానికి...

చిన్నపిల్లవి కాదు కాబట్టి నా భయం. వీళ్ళ మాటలు విన్న వైభవ్.. అక్కడికి వచ్చి నా హెల్ప్ ఏమైనా కావాలా మిస్ అని అడుగుతాడు .

విశి ఇబ్బంది పడుతూ ఉంటే.. నో, ఫార్మాలిటీస్.  మేము చెకప్ కోసమే వచ్చాము. మా బావ, అన్నయ్య లోపల డాక్టర్ తో మాట్లాడుతున్నారు.

నాకు ఆ స్మెల్ పడక బయట వెయిట్ చేస్తున్నాను.  నాకు టైం ఉంది. సో మీకు ఏ హెల్ప్ కావాలో చెప్పండి . నేను రిసెప్షన్ దగ్గరికి వెళ్లి మేము కలవాల్సిన డాక్టర్ ఉన్నారా లేదో చూసి వస్తాను.

అప్పటిదాకా అమ్మని చూసుకుంటారా.. నో ప్రాబ్లం వెళ్ళండి. భానుమతి పక్కన కూర్చుని ఐ ఆమ్ వైభవ్ అంటాడు .

నమస్తే బాబు నా పేరు భానుమతి అంటుంది. ఎక్కడ ఉంటారు.  ఇక్కడే..  అమ్మాయి చదువు కోసం అని హైదరాబాద్ వచ్చాము.

మా వారు ఇంకా రాలేదు.  ఆయన కోసమే ఎదురు చూస్తున్నాను. ఆయన రాగానే అమ్మాయి చదువు అయిపోతుంది కదా.. వెంటనే మా ఊరు వెళ్ళిపోతాము .

వైభవ్ అర్థం కాక కన్ఫ్యూషన్ గా చూస్తాడు. ఏమైంది బాబు అలా చూస్తున్నావు.  అంకుల్ షాప్ కి వెళ్లడమేమిటి.. రాగానే మీ అమ్మాయి చదువు అయిపోవడమేమిటి..

అయ్యో నీకు అర్థం కాలేదా... మా పొలానికి కావలసిన ఎరువులు కొనడానికి వెళ్లారు. అవి కొంచెం దూరం అంట. ఆ మందులు ఇంకా దొరకలేదు.  రాత్రికి ఆలస్యం అవుతుందట. రేపొద్దున్నే వచ్చేస్తారు రాగానే మేము వెళ్ళిపోతాము.

సూర్య, శ్రీకర్ వచ్చి ఏం చేస్తున్నావురా.. ఈ ఆంటీ తో మాట్లాడుతున్నాను. ఎవరు. ఇప్పుడే పరిచయమయ్యారు.  వీళ్ళ అమ్మాయి వచ్చేవరకు తోడు ఉంటున్నాను. ఓకే అని విశి కోసం వెయిట్ చేస్తూఉంటారు.

సూర్యాకి ఫోన్ వస్తుఉంటే నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను.  మీరిద్దరూ రండి అని బయటికి వెళ్ళిపోతాడు. సూర్య వెళ్లిన రెండు నిమిషాలకి విశి వస్తుంది.

విశి ని చూడగానే డాక్టర్ ఉన్నారా అని అడుగుతాడు. ఉన్నారు. థాంక్యూ సార్ అంటుంది. బలే వారే ఇంత చిన్న దానికి కూడా థాంక్స్ ఎందుకు.

ఈరోజుల్లో మన అనుకున్న వాళ్లే నిలబడడం లేదు. అలాంటిది మీరు ఎవరో... నేనెవరో..  నా కోసం ఇంతసేపు ఉండడం అంటే మాటలు కాదు కదా..

మనం ఎప్పుడూ ఖాళీయే..   ఇలాంటి చిన్న చిన్న విషయాలకి వాడడం వలన మంచిదేలే.. ఎనీ హో మీ పేరు చెప్పలేదు విశిష్ట అంటుంది.

చాలా బాగుంది. థాంక్యూ.  శ్రీకర్ దగ్గరికి వచ్చి ఇంకా వెళదామా అంటే.. సరే బావ. బాయ్ విశిష్ట.  ఏదైనా అవసరం అయితే నాకు కాల్ చేయి అని చెప్పి వెళ్ళిపోతాడు.  వెళుతున్న వైభవ్ ని చూసి నవ్వుకుంటుంది  .

అంతా బాగానే ఉంది అని సాటిస్ఫై అయ్యి బయటకి వస్తారు.  అన్నయ్య ఇప్పటికే అలసిపోయాము. కాసేపు రెస్ట్ తీసుకుందామా..

ఏం వర్క్ చేసావ్ అని అలసిపోయావు. మొత్తం అంతా ఏసీలోనే కదా తిరిగావు. ఎంత ఏసీలో తిరిగితే మాత్రం బ్రెయిన్ కి వర్క్ ఇవ్వలేదా..

బ్రెయిన్ ఎంత అలసిపోయింది. అలసిపోతే ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గ అందక లోపల ఉన్న సెల్స్ అన్ని బొజ్జుంటాయి. అవి బొజ్జున్నప్పుడు మనం కూడా బొజ్జోవాలి కదా...

నీ సెల్స్ ఎక్టివ్ అవ్వాలి అంటే ఒకటి చెప్పనా అని శ్రీకర్ అంటే..  ఏంటి బావ.. మీ కాలేజీకి వెళ్లి... నువ్వు ప్రపోజ్ చేసిన అమ్మాయిని ఒకసారి కలుద్దామా..

ఎందుకు బావ నేనంటే    నీకు అంత ప్రేమ.. అవున్రా నువ్వంటే ప్రేమే.. అందుకనే మాతో తిప్పుతున్నాము.  ఇది తిప్పుతున్నట్టు లేదు. నా బాడీలో ఉన్న కొవ్వు అంతా కరగదీస్తున్నట్టు ఉంది.

ఏదో ఒకటి నీకు ఉపయోగపడుతుంది కదా..  పద అంటే..  ఇప్పుడు ఎక్కడికి.. జస్ట్ నీకు రిలాక్సేషన్ కోసం అలా అలా తిరుగుదాం..

థాంక్స్ అన్నయ్య. నువ్వు అన్నయ్య అంటే..   పొగిడింది చాలు గానీ.. అప్పచెప్పిన వర్క్ ఎంతవరకు వచ్చిందీ. క్యూటి గురించి ఆల్రెడీ మా వాళ్ళు సెర్చింగ్ మొదలు పెట్టారు.

పేరు, ఫోటో ఏమీ లేదు కదా..  కొంచెం కష్టం అవుతుంది. కానీ దొరికేస్తుంది.
శ్రీకర్ బయటకు వచ్చిన తర్వాత ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైంది బావ హాస్పిటల్ నుంచి బయటికి వచ్చాక ఆలోచిస్తున్నావు.

నువ్వు హెల్ప్ చేసిన అమ్మాయి గురించి. ఆ అమ్మాయి చూస్తే మన సౌమ్య ఏజ్ లాగానే ఉంది. వాళ్ళ మదర్ ఏదేదో మాట్లాడుతున్నారు.

ఐ థింక్ మెంటల్గా డిస్టర్బ్ అయినట్టున్నారు. అవునురా.. ఏదైనా అవసరమైతే ఫోన్ చెయ్ అని చెప్పావు.  నీ ఫోన్ నెంబర్ ఇచ్చావా..

నాలుక కరుచుకుని మర్చిపోయాను బావ.. నిన్ను అందుకే మీ అమ్మ తిట్టేది... ఇప్పుడు ఏమైంది బావ..మన హాస్పిటల్ ఏ కదా.  డీటెయిల్స్ తెలుసుకుందాం దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు.

ఎందుకో అమ్మాయిని చూస్తే ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది.  బట్ ఎక్కడ అన్నది తెలియడం లేదు. ప్రస్తుతపు రోజుల్లో సోషల్ మీడియా ఎక్కువగా ఉంది.

ఏ ఫేస్ బుక్ లో లేకపోతే ఇంకా ఏ సోషల్ ఆక్టివిటీస్ లోనో చూసి ఉంటావులే. ఏమో అని భుజాలు ఎగరేస్తాడు. సూర్యకి ఎందుకో అలజడిగా అనిపిస్తూ ఉంటుంది.

ఏమైందన్నయ్య.. ఒక్కసారిగా డిస్టర్బ్ గా కనిపిస్తున్నావు. తెలియడం లేదురా..  నాకు కావలసింది దగ్గరగా వచ్చి మళ్ళీ దూరంగా వెళ్లినట్టు అనిపిస్తుంది.

నీకు దగ్గరగా వచ్చి దూరంగా అంటే..  అని ఆలోచిస్తూ క్యూటీనా. క్యూటి ఇక్కడ ఎందుకు ఉంటుంది. చదివితే వైజాగ్ సైడ్ చదవాలి కదా...

అలా ఎందుకనుకోవాలి మంచిర్యాంకు వస్తే ఎక్కడికైనా వచ్చి చదువుకుంటున్నారు. నీ మనసు చెబుతుంది అంటే ఖచ్చితంగా మనం హైదరాబాదులో జల్లెడ పట్టేద్దాము.

ముగ్గురు సరదాగా తిరిగి సాయంత్రానికి రెస్టారెంట్ కి వెళతారు. రెస్టారెంట్లో ముగ్గురు మూడు ప్లేసెస్ లో కూర్చుంటారు.

సూర్య కూర్చుని చుట్టూ చూస్తూ ఉంటే... ఎక్స్క్యూజ్మీ సార్ ఆర్డర్ అని ఒక స్వీట్ వాయిస్ వినపడుతుంది. ఆ వాయిస్ వినిపించిన వైపుకి చూస్తాడు.

వెయిటర్ డ్రెస్సులో ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి వైపు అలాగే చూస్తూ ఉంటే ఎక్స్క్యూజ్ ని అని మళ్ళీ పిలుస్తుంది.

ఎస్ అంటే..  ఆర్డర్ సార్.. వెజ్ ఫ్రైడ్ రైస్ అని చెబుతాడు. ఒకేసార్.. ఇంకేమైనా కావాలా.. నథింగ్.. థాంక్యూ అని చెప్పి వెళ్ళిపోతుంది.

వెళుతున్న అమ్మాయిని చూస్తూ ఉంటాడు. ఆర్డర్ వచ్చిన తర్వాత సూర్య తిని టెస్ట్ బానే ఉంది అనుకుంటాడు. కంప్లీట్ చేసిన తర్వాత..  వెయిటర్ బిల్ తీసుకోవచ్చి ఇస్తుంది.

బిల్ పే చేసేలోపు సూర్యకి వైభవ్ కాల్ చేస్తాడు.  ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా... అన్నయ్య  నీ ఫుడ్ టేస్ట్ ఎంతవరకు వచ్చింది.

నేను టేస్ట్ చూసిన చికెన్ బిర్యానీ సూపర్ ఉంది. బావ కూడా నా దగ్గరే ఉన్నాడు. బావకి కూడా ఫుడ్ బాగా నచ్చింది. ఓకే నేను తిన్నది కూడా బాగుంది అని మాట్లాడుతూ లేచి నుంచి ఉంటాడు.

ఒక్క అడుగు ముందుకు వేసేలోపు వెయిటర్ కంగారుగా ఎక్స్క్యూజ్మీ సార్ అంటుంది.  యస్ మిస్. బిల్ అంటుంది.. బిల్ అని.. ఓ మర్చిపోయాను అని చూపుడు వేలుతో కణతల మీద రబ్ చేసుకుంటాడు .

ఆ వెయిటర్ కి వేరేలాగా అర్థమయ్యి ఇంకా దగ్గరికి వెళ్లి డబ్బులు లేవా అంటుంది.  ఆ మాటకి సూర్య ఒక్కసారిగా అమ్మాయి వైపు చూసి వాట్ అంటాడు.

అదే డబ్బులు లేవా.. స్లోగా మాట్లాడు.. ఎవరైనా విన్నారు అంటే నిన్ను బయటికి వెళ్ళనివ్వరు. ఆ అమ్మాయి అడిగే విధానానికి సూర్యకి నవ్వు వస్తుంది.

అసలు ఏం చేస్తుందో చూద్దాము అని.  అవును మిస్.. డబ్బులు లేవు అంటాడు.   ఇలాంటి రెస్టారెంట్లో ఫుడ్ తినాలి అనిపించిందా.. అందుకే మంచి డ్రెస్ వేసుకొని వచ్చావు .

సూర్య తను డ్రెస్ వైపు చూసుకొని అవును అంటాడు. సరేలే నీ డబ్బులు నేను పే చేస్తాను. నువ్వు టెన్షన్ పడకు. ఆ మాటకి ఆశ్చర్యంగా అమ్మాయి వైపు చూస్తూ.. నీ దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయా..

ఆకలితో ఉన్న వాళ్ళకి భోజనం పెట్టడం కనీస ధర్మం.  రోజూ చాలామంది వస్తారు. వాళ్ళందరికీ ఇలాగే భోజనం పెట్టిస్తావా...

భగవంతుడు అంత శక్తిని ఇస్తే అలాగే పెట్టేస్తాను. మన ముందు ఆకలితో ఎవరైనా ఉంటే భోజనం పెట్టాలి అని మా నాన్నగారు చెబుతూ ఉండేవారు...

ఇక్కడ ఫుడ్ కాస్ట్లీ కదా ఎలా పే చేయగలుగుతావు. ఈరోజు నా శాలరీలో కట్ చేసుకోమంటాను.  మా మేనేజర్ మంచివారే...

అర్థం చేసుకుంటారు. నువ్వు టెన్షన్ పడకు సరేనా... ఈసారి వచ్చినప్పుడు కొంచెం డబ్బులు తెచ్చుకో.. ఆస్తమాను నేనే ఉండాలి అన్న రూలు లేదు కదా...

వీరి ప్రయాణం...

కథ కొనసాగుతుంది...
[+] 7 users Like SivaSai's post
Like Reply
Superb update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
Bagundi.. ee search episode
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
Update please
[+] 1 user Likes Reddy 211993's post
Like Reply
Part - 17

ఈసారి వచ్చినప్పుడు డబ్బులు తెచ్చుకో ఆస్తమానం నేనే ఉండాలని రూలు లేదు కదా...
తప్పకుండా ఇంతకీ మీ పేరు ఏమిటో తెలుసుకోవచ్చా...
ఏంటన్నయ్య ఎవరితో మాట్లాడుతున్నావ్ అని వైభవ్అడుగుతూ.. ఆ అమ్మాయిని చూసి..  అరే మీరా..

మీరేంటి ఇక్కడ అని ఆ అమ్మాయి అడిగితే.... గేమ్స్ కండక్ట్ చేస్తున్నారంట కదా...  ఆడడానికి వచ్చాము. అవునా అని.. ఆ ఏమన్నారు..

మరి ఏమిటండీ.. రెస్టారెంట్ కి ఎందుకు వస్తారు.  నార్మల్ గా అడిగాను. మీరు ఇక్కడ జాబ్ చేస్తున్నారా.. అవును పార్ట్ టైం జాబ్.

ఓకే మళ్లీ కలుద్దాం బాయ్ అని ముందుకి నడిచే వైభవ్ వెనక్కి వచ్చి... మిస్ విశిష్ట..  చెప్పండి సార్... సార్ వద్దులే గానీ..

హాస్పిటల్ లో నా నెంబర్ ఇవ్వలేదు. మీరు అడగలేదు. మళ్ళీ కలిసినప్పుడు తీసుకోవచ్చని. మీకు మరీ మొహమాటం ఎక్కువ అనుకుంటా..

సేవ్ చేసుకోండి అని నెంబర్ చెప్తాడు.  థాంక్యూ సార్ అంటే..  అదిగో మళ్ళీ సార్ అంటున్నారు. ఇక్కడ నా డ్యూటీ అయిన తర్వాత  ఎలా పిలవమన్నా పిలుస్తాను బాయ్ సార్ అని చెప్పి వెళ్ళిపోతుంది.

వెళుతున్న విశిష్టాని చూస్తూ ఉన్న సూర్యాని కదిపి ఏంటి అన్నయ్య అలా చూస్తున్నావు... ఈ అమ్మాయి మరీ ఇన్నోసెంట్ గా ఉందిరా అని వాళ్ళ మధ్య జరిగింది చెబుతాడు.

అది విని వామ్మో ఇలా అయితే ఈ అమ్మాయి పార్ట్ టైం జాబ్ శాలరీ మొత్తం ఇక్కడే అయిపోతుంది కదా.. మీరు నడుస్తూ ఉండండి అని సూర్య మేనేజర్ దగ్గరికి వెళ్తాడు.

మేనేజర్ దగ్గరికి వెళ్లి సూర్య ఎవరో పరిచయం చేసుకుని విశిష్ట గురించి అడుగుతాడు. విశిష్ట డీటెయిల్స్ తెలుసుకొని థాంక్యూ చెప్పి వచ్చేస్తాడు.

రాగానే ఎక్కడికి వెళ్లావు బావ... మేనేజర్ ని కలవడానికి. దేనికి... అమ్మాయి గురించి తెలుసుకుందామని..
ఎందుకు..

  చూస్తే చాలా ఇన్నోసెంట్ గా ఉంది.  పార్ట్ టైం జాబ్ చేస్తున్నానని చెప్పింది కదా..   డీటెయిల్స్ కనుక్కుందామని వెళ్లాను.  ఏం తెలిసింది బావ అని శ్రీకర్ అడిగితే....

అమ్మాయి కాలేజ్ స్టూడెంట్. ఆర్క్ టెక్చర్ ఫైనల్ ఇయర్. ఫాదర్ లేరు మదర్ హెల్త్ ఇష్యూ..  సో.. అర్థమైంది బావ. కానీ అమ్మాయిని చూస్తూ ఉంటే ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది.  నాకు అలాగే ఉంది.

అందుకే ఎవరా ఏమిటా అని తెలుసుకుందామని వెళ్లాను. సరే ఇప్పటికే లేట్ అయింది పదండి అని ఇంటికి వెళతారు. విక్రమ్ హాల్లోనే కూర్చునే ఉంటే హాయ్ నాన్న అని సూర్య పక్కన కూర్చుంటాడు.

హాయ్ పెదనాన్న అని వైభవ్ భుజం మీద వాలతాడు... ఏరా ఫస్ట్ డేనే అలిసిపోయావా..  వీళ్ళిద్దరూ పని రాక్షసులు.  అస్సలు ఎంజాయ్మెంట్ తెలీదు.

వాళ్ళిద్దరూ అంటే కంపెనీ ఎలా డెవలప్ చేయాలో అన్న ఆలోచనలో ఉంటారు కాబట్టి ఎంజాయ్మెంట్ తెలియదురా.. మనం అయితే ఎప్పుడు గాలి తిరుగుళ్లే కదా అని పూజిత వాటర్ తీసుకొచ్చి ఇస్తుంది.

అమ్మ నువ్వు ఇంకా పడుకోలేదా... గాలి తిరుగుళ్ళు తిరిగే నా కొడుకు కష్టపడి వస్తున్నాడు కదా..  అందుకే హారతి పళ్లెం పట్టుకుందామని కూర్చున్నాను.

నీ వెటకారాలు ఆపవా.. అయ్యో వెటకారం ఏముందిరా.. నిజమేగా చెప్పేది..  నేను చెప్పిన దాంట్లో ఏదైనా ఒకటి అబద్ధం ఉంది అని మీ పెద్దమ్మతో చెప్పించరా.ఇక ఎప్పుడూ అనను.

వద్దులే పెద్దమ్మని, సౌమ్య ని సపోర్ట్ తీసుకున్నాను అంటే నా పరువును గాలిలో పెట్టుకున్నట్టే... ఆ మాటలకి విక్రమ్ నవ్వుతాడు.

వినయ్ వచ్చి ఏరా ఫస్ట్ రోజు ఎలా ఉంది. సూపర్ నాన్న... బాగా హార్డ్ వర్క్ చేసాము కష్టపడ్డాము అని రెండు చేతులు పిడికిలి బిగించి చెబితే...  ఈ ఓవరాక్షనే  మానమనేది.

ఇలా ఓవరాక్షన్ చేసి మీ అమ్మకు అడ్డంగా దొరుకుతావు.  నువ్వు దొరికిందే కాక నన్ను బుక్ చేస్తావు.కాస్త మీ అన్నయ్యనో, సౌమ్యనో లేకపోతే చందునో చూసి నేర్చుకోరా...

నాన్న అని ఆవేశంగా లేచి నిలబడి..  మన ఇంట్లో పనిమనిషి చూసైనా నేర్చుకోమను.. నేర్చుకుంటాను. సెక్యూరిటీ గార్డ్ ని చూసైనా నేర్చుకోమను...  నేర్చుకుంటాను.

అంతేగాని ఆ చందును చూసి నేర్చుకో అని అన్నారంటే అని వేలు పైకి చూపిస్తూ అడుగుతాడు.  ఆ అంటే... నేనంటే ఏమిటో చూపిస్తాను.  నాకు నిద్ర వస్తుంది గుడ్ నైట్ అని రూమ్ లోకి వెళ్ళిపోతాడు.

వెళుతున్న వైభవ్ ని చూసి తల పట్టుకుంటే..  ఇప్పుడే కదా...మెల్లిగా వాడిలోనే మార్పు వస్తుంది అని భరత్ అంటాడు.

ఏమో బావ వీడిలో మార్పు వచ్చేటప్పటికి నా తెల్లబడిన జుట్టు ఊడిపోయేటట్టు ఉంది.  లేదు బాబాయ్...  వాడు అల్లరి చేస్తాడు కానీ బాధ్యత ఉంది.  కాకపోతే అల్లరి డామినేట్ చేసేస్తుంది.

ఈ రోజు హాస్పిటల్ లో ఒక అమ్మాయికి ఎంత హెల్ప్ చేశాడో తెలుసా అని జరిగింది చెబుతాడు.  పర్వాలేదు రా...  వీడిలో కూడా మానవత్వం ఉంది.

నా కొడుకులో ఎప్పుడూ ఉంది.  మీరే గుర్తించలేదు అని పూజిత అంటుంది. వాడు ఏదైనా ఎదవ పనులు చేస్తే నా అకౌంట్ లో వెయ్యి.  మంచి పని ఏదైనా చేశాడు అంటే మీరు గుర్తించట్లేదని...  నా అకౌంట్ లోనే వేయ్యి.

మరి నీ అకౌంట్ లో ఏం వేసుకుంటావు పూజిత అని వినయ్ అడిగితే.. మీ ఇద్దరినీ హ్యాండిల్ చేయడం అనేది నా అకౌంట్ లో వేసుకుంటాను అని కళ్ళు ఎగరేస్తుంది.

నేను, మా రాజ్ బావే బుక్ అయిపోయాము.  అన్నయ్య, భరత్ బావ మాత్రం సో లక్కీ.

ఆ మాటకి విక్రమ్ నవ్వుతూ అంత లేదు రా...  మీ వదినకి,  విద్య కి ప్రపంచం తెలియదు.అందరూ మంచివాళ్లే అనుకుంటారు కాబట్టి మేము ఇలా స్ట్రాంగ్ గానే ఉండాలి.

ఇక మీ ఇద్దరి విషయానికి వస్తే ఎంత మంచి వాళ్లో అంత తొందరగా మోసపోతారు. కాబట్టి నివి, పూజిత ఇలాగే ఉండాలి అప్పుడే బ్యాలెన్స్ అవుతుంది.

కరెక్ట్ గా చెప్పారు బావగారు.మీ తమ్ముడుకి పెళ్లయి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా అర్థం కాలేదు. ఎప్పటికి అర్ధం అవుతుందో ఈ మహానుభావుడికి అని వెళ్ళిపోతుంది. వెళుతున్న పెళ్ళాన్ని చూస్తూ నోరు వదిలేస్తాడు.

డ్యూటీ ఫినిష్ చేసుకుని వెళుతున్న విశి దగ్గరికి మేనేజర్ వచ్చి... అమ్మ విశి అని పిలుస్తాడు. చెప్పండి సార్... ఈరోజు నుంచి నీ శాలరీ పెరిగింది.

అదేంటి సార్ అంత సడన్గా.. నువ్వు ఎవరికో హెల్ప్ చేసావంట కదా..  అది తెలిసి మన చైర్మన్ గారు నీ మంచితనాన్ని మెచ్చుకొని శాలరీ పెంచారు.

థాంక్యూ సార్. ఇలాగ మాత్రం అస్తమానం చేయొద్దు అని కూడా చెప్పమన్నారు.

చిన్న చిరునవ్వుతో వెళ్లిపోతుంది. వెళ్ళిపోతున్న విశిని చూస్తూ సూర్యతో జరిగిన డిస్కషన్ గుర్తు చేసుకుంటాడు.

సూర్య మేనేజర్ దగ్గరికి వెళ్లి ఎక్స్క్యూజ్మీ అని పిలుస్తాడు. చెప్పండి సార్.. విశిష్ట ని చూపిస్తూ ఆ అమ్మాయి ఎవరు.. ఏమిటి..

ఇంతకీ మీరెవరో తెలుసుకోవచ్చా..  మా స్టాఫ్ డీటెయిల్స్ మీకెందుకు అని అడిగితే.. సూర్య చిన్న చిరునవ్వుతో ఎవరు అన్నది చెబుతాడు.

సోరి సార్... ఎప్పుడూ చూడక గుర్తు పట్టలేదు. ఇట్స్ ఓకే.. ఎవరు అమ్మాయి... మొత్తం డీటెయిల్స్ చెబుతాడు.  జాబ్ చేసుకుంటూ.. చదువుకుంటూనే వాళ్ళ మదర్ ని చూసుకుంటుందా.. అవును సార్.

మరి ఇక్కడ అమౌంట్ సరిపోతుందా.. తెలియదు సార్. ఏదైనా అవసరమైతే అడగమని చాలాసార్లు చెప్పాను. చిన్న చిరునవ్వే ఆ అమ్మాయి సమాధానం.

ఒక్క నిమిషం ఆలోచించి...  అమ్మాయి శాలరీ ఇంక్రీస్ చెయ్. అది కూడా చైర్మన్ సార్ చెప్పారు అన్నట్టుగానే చెప్పు.

నేనెవరు ఏమిటి అన్న డీటెయిల్స్ చెప్పొద్దు అని బయటికి వచ్చేస్తాడు.  అది గుర్తుకు వచ్చి సూర్య సార్ మీరు నిజంగా చాలా గ్రేట్. ఒక అమ్మాయి ఇబ్బందిని అర్థం చేసుకుని హెల్ప్ చేశారు.

సూర్య ఫ్రెష్ అయ్యి మంచం మీద పడుకుని  ఉంగరాన్ని పట్టుకొని.. క్యూటి ఏం చేస్తున్నావు.. ఎక్కడ ఉన్నావు.. ఈరోజు ఏం జరిగిందో తెలుసా అని విశిష్ట హోటల్ మనీ పే చేయడం అన్నీ ఆ ఉంగరానికి చెబుతూ ఉంటాడు.

ఆ అమ్మాయిని చూస్తూ ఉంటే ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంది. నీకేమైనా తెలుసు అంటావా... ఇంక నువ్వు చూడలేదు కదా..  చూస్తే గుర్తుపడతావేమో..

ఏం చేస్తున్నావు..  భోజనం చేసావా... పడుకున్నావా అని ఉంగరానికి కబుర్లు చెప్పి గుడ్ నైట్ చెప్పి పడుకుంటాడు.

విశిష్ట ఇంటికి చేరేటప్పటికీ భానుమతి హాల్లోనే కూర్చుని ఉంటుంది.  ఏంటమ్మా ఇంకా పడుకోలేదా..   నీకోసమే ఎదురు చూస్తున్నాను.

ఈరోజు ఆలస్యం అయినట్టుంది.  కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు ఆటో దొరకలేదు. మరి ఎలా వచ్చావు.  దగ్గరే కదా నడిచి వచ్చానమ్మా.

స్నానం చేసి వస్తాను అని బాత్రూం లోనికి వెళుతుంది. స్నానం చేసి ఆకలేస్తుందమ్మా.. నీకోసమే వేడివేడిగా వంట చేశాను రా అని తినిపించి మూతి తుడిచి.. కొబ్బరి నూనె వేడి చేసి తీసుకువస్తుంది.

దేనికమ్మ. నడిచి వచ్చినందుకు కాళ్లు నొప్పులు వస్తాయి కదా... నూనెతో మర్దన చేస్తే రేపొద్దునికి తేలిక ఇస్తాయి. లేకపోతే ఇబ్బంది పడతావు.
  నేను రాసుకుంటాను ఇలాగా ఇవ్వు..   ఇప్పటిదాకా అలసిపోయి ఉన్నావు సరిపోదా..  నువ్వు చదువుకో.. నేను రాస్తాను అని కాళ్ళు ఒళ్లో పెట్టుకుని నూనె రాసి మర్దన చేస్తూ ఉంటుంది.

చెంప కింద చెయ్యి పెట్టుకుని భానుమతినే చూస్తూ ఉంటుంది. ఏంటే అలా చూస్తున్నావు. నువ్వు చాలా స్వీట్
అమ్మ..  చాలా బ్యూటీ తెలుసా..

ఆ మాటకి సిగ్గుపడుతూ..  ఈ వయసులో నా అందం కనిపించిందా నీకు.. అందానికి వయసుతో సంబంధం ఏముంది. నీ మంచి మనసే నీ ఫేసులో గ్లో తెలుసా...

మీ నాన్నగారు కూడా ఇలాగే చెబుతారు.  ఆ నాన్న కూతురువే కదా.. అందుకే అన్ని ఆ నాన్న మాటలే వచ్చాయి.
అవునా నేను నాన్న కూతుర్నా.. కానీ అమ్మ కూచూని అనేవారే.. గారాలు పోవడానికి మీ నాన్న కావాలి  ఏదైనా నాతో పని ఉంటే నా దగ్గరికి వచ్చి ఇదిగో ఇలాగే కూల్ చేసే దానివి.

ఇంకా...
[+] 7 users Like SivaSai's post
Like Reply
Part - 18

ఇంకా ఏం చేసే దానిని.. అమ్మో నీ అల్లరి చెబితే ఒక పుస్తకమే రాయచ్చు. నువ్వు ఏది చేసినా మీ నాన్నకి గారమే. నన్ను అసలు కోప్పడనిచ్చేవారు కాదు.

గట్టిగా ఒక్క మాట అనేలోపు వచ్చేసేవారు.  వెంటనే బంగారం..  చిట్టితల్లి.. ఆచ్ వెళదామా అని తీసుకువెళ్లిపోయేవారు.

కాలేజ్లో కూడా నీ మీద కంప్లైంట్ వస్తే నాకు తెలియకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసేవారు.

అలాంటి నాన్న అందరికీ దొరకరు. నిజమేనమ్మా నాన్నని చాలా మిస్ అవుతున్నాను.

ఎప్పుడు వస్తున్నారు.. రేపు ఉదయమే అవునా సరే పడుకో అమ్మ..  పొద్దున్నే మళ్ళీ లెగాలి కదా అని భానుమతి నూనె తీసుకొనివెళ్ళిపోతుంది.

వెళుతున్న తల్లిని చూస్తూ ఒక నిట్టూర్పు విడిచి..  మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాము నాన్న.

ఈరోజు ఏమి జరిగిందో తెలుసా ఫోన్లో వాళ్ళ నాన్నగారు ఫోటో చూస్తూ రెస్టారెంట్లో జరిగింది చెబుతుంది.

  గౌతమ్ నుంచి వచ్చిన మెసేజ్ చూసి లాప్టాప్ ఓపెన్ చేస్తుంది. కొత్త ప్రాజెక్టు సంబంధించిన వర్క్ ఉంటుంది. దానికి సంబంధించిన వర్క్ చేయమని మెసేజ్ చేస్తాడు.

ఓకే అని ఆ వర్క్ స్టార్ట్ చేస్తుంది. ఎప్పటికో నిద్రపోయి... తొందరగా లేచి కాలేజీకి వెళ్ళిపోతుంది.
విశి ని చూసిన భవ్య హయ్ అని చెయ్యి ఊపుతుంది.  విశి వెళ్లి హాయ్ ఏమిటి.. ఈ రోజు మంచి హుషారుగా ఉన్నావు.

నీకు ఒక గుడ్ న్యూస్.. ఏమిటి.. టికెట్స్ తీసి చూపిస్తుంది. ఏమిటి టికెట్స్.  చూస్తే ఎగిరి గంతులేస్తావు.. అవునా.. అంత గొంతులేసే సంగతి ఏముంది.  ముందు చూడవోయ్..

సరే అనే టికెట్స్ ఓపెన్ చేసి విశి గంతులు వేస్తూ నిజమా అంటుంది... అబ్బా నీ ఫేసులో   కనపడుతున్న ఆనందాన్ని చూస్తూ అబద్ధం చెబుతానా...

ద గ్రేట్ అర్క్టెక్చర్ హిమ ప్రోగ్రాం. ఇప్పటిదాకా ఆవిడ చేసిన డిజైన్స్ మొత్తం ఎగ్జిబిషన్ పెడుతున్నారు.

ఇంకా పది రోజులు టైం ఉంది. అబ్బా పది రోజులా.. ఆగలేవా..  అయినా ఇప్పుడు దాకా హిమ డిజైన్స్ ఏమీ చూడలేదు కదా... ఎందుకు ఆవిడని అంతా అభిమానిస్తున్నావు.

ఆవిడ డిజైన్స్ ఏమి బయటికి రిలీజ్ చేయలేదు.  కాకపోతే చాలా పాపులర్.  చిన్న ఏజ్ లోనే గొప్ప స్థాయికి వెళ్లారు. అలాంటి వాళ్ళని కలిస్తే మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఏమిటో అన్నవి ఫైండ్ అవుట్ చేయగలుగుతాము.

నెక్స్ట్ టైం అది చేయకుండా ఉంటాము.  నీ నమ్మకమే నిజమవ్వాలని కోరుకుంటున్నాను. చూద్దాం.. ఈ ఎగ్జిబిషన్లో నీ జీవితం ఎటు మలుపు తిరుగుతుందో అని భవ్య అంటే.. ఏమో.. ఎవరం చెప్పగలం...

ముగ్గురు హీరోలు బైక్స్ ఆపి కాలేజీలోకి ఎంటర్ అవుతారు. అన్నయ్య మన కాలేజీ చూడక్కర్లేదు.  చాలా స్ట్రిక్ట్..

ఇంత స్ట్రిక్ట్ గా ఉన్న కాలేజీలోనే తమరు గంతులు వేసినట్టున్నారు. నేను గంతులు వేసింది ఈ కాలేజ్ కాదు బావ. వేరే క్యాంపస్...

అందుకే ఆ క్యాంపస్ కి వెళ్లకుండా ఈ క్యాంపస్ కి వచ్చాము పద..

వెళుతున్న వైభవ్ ఆగి..  అరే ఇన్నోసేంట్ పాప అంటాడు. ఎక్కడ అని సూర్య చూస్తే స్వచ్ఛమైన నవ్వుతో భవ్యతో మాట్లాడుతూ ఉంటుంది.

సూర్య దగ్గరకు వెళ్ళి హాయ్ మిస్... గుడ్ మార్నింగ్ అంటే... ఎవరు అన్నట్టుగా చూస్తోంది. అరే మర్చిపోయారా నిన్నా రెస్టారెంట్లో...   గుర్తొచ్చారు. సోరి..గుడ్ మార్నింగ్ అంటుంది.

మీరేంటి ఇక్కడ అని తెలియనట్టుగా అడుగుతాడు. నేను ఈ కాలేజీ లోనే చదువుతున్నాను.  ఫైనల్ ఇయర్.

భవ్య ఉహూ.. ఉహూ.. అని దగ్గుతుంది. విశి భవ్య వైపు చూసి నిన్న రెస్టారెంట్ లో పరిచయము అయ్యారు.
పేరు అని ఆలోచిస్తూ..  సూర్య వైపు చూస్తుంది.

సూర్య చిన్నగా నవ్వుతూ ఐ యాం దేవా అంటాడు.  ఓ నైస్ నేమ్.. భవ్య నా బెస్ట్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తుంది.

ఇద్దరూ చిన్న స్మైల్ తో పరిచయం చేసుకుంటారు.  నాకు క్లాస్ టైం అవుతుంది.  మళ్లీ కలుద్దాం బాయ్ అని చెప్పి వెళ్ళిపోతుంది.

వెళుతున్న విశి ని చూస్తూ ఉన్న సూర్య దగ్గరికి శ్రీకర్ వచ్చి ఏంటి బావ నీ పేరు దేవా అని చెప్పావు. నథింగ్.. సూర్య అంటే ఎలాగైనా తెలిసిపోతుంది.

మళ్ళీ ప్రాబ్లం అవుతుంది.  దేవా అంటే ఎవరికీ తెలియదు. నువ్వు సూపర్ అన్నయ్య. అందుకే బిజినెస్ లో రాకెట్ లాగ దూసుకు వెళ్ళిపోతున్నావు.
కాలేజ్ అంతా తిరుగుతూ స్టూడెంట్స్ తో మాట్లాడుతూ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ ఉంటారు.

చివరిగా ప్రిన్సిపాల్ దగ్గరకి వెళతారు సూర్య తెలియకపోయినా..  వైభవ్ బాగా ఫేమస్ అవడం వలన.. ప్రిన్సిపల్ వెంటనే రెస్పెక్ట్ ఇస్తాడు.

వైభవ్ అది చూసి చూసావా బావ మనమంటే ఎంత రెస్పెక్ట్... ఇస్తున్నాడు పాపం ఈ ప్రిన్సిపల్ చాలా మంచివాడు బావ.

అంత లేదురా..  నీకు ఇచ్చాడు మాకు ఇవ్వలేదు అంటే దాని అర్థం ఏమిటి.  నువ్వు జైసింహ ఫ్యామిలీ వారసుడివి అని తెలుసు.

సూర్య గురించి తెలియదు కదా.. అందుకే ఎవరో అనుకుంటున్నారు.  ఇప్పుడు సూర్య గురించి చెప్పు నిన్ను పక్కనపెట్టి సూర్యాకి రెస్పెక్ట్ ఇస్తాడు.
ఏమిటి బావ ఈ లోకం ఇలా ప్రవర్తిస్తుంది అని శ్రీకర్ భుజం మీద చెయ్యి వేసి వాపోతాడు.

అదే లోకం తీరు బాబు.  సక్సెస్ అయినవాడికి అడుగులకి మడుగులు వత్తుతుంది. వాడు ఏ సోది చెప్పినా ఆహా ఓహో అంటారు.
అదే ఫెయిల్యూర్ పర్సన్ నిజాలు చెప్పిన పనికిమాలిన సోదంతా చెబుతున్నాడు అంటారు.

లోకం మారదా బావ.. నువ్వు మారావా అది అంతే .
ఎక్కడికి వెళ్ళినా చివరికి నా దగ్గరికి వచ్చి ఆగితే గాని నీకు మనశ్శాంతి ఉండదే... అంతే కదా..

ప్రిన్సిపాల్తో మాట్లాడి బయటికి వచ్చిన సూర్య..  వీళ్లిద్దరి డిస్కషన్ చూసి మీ ఇద్దరికీ గొడవ ఏంటి రా.. ఏమీ లేదు లోకం తీరు గురించి బావ చెబుతుంటే నేను వింటున్నాను.

విశి బ్రేక్ మధ్యలో లైబ్రరీకి వెళ్లడానికి క్లాసులో నుంచి బయటకి వస్తుంది గొడవ పడుతూ వెళుతున్న ముగ్గురిని చూసి హలో దేవా గారు అని పిలుస్తుంది.

ఆ పిలుపుకి సూర్య నవ్వుకుంటూ చెప్పండి  విశిష్టగారు అంటే.. గారు వద్దులేండి. మీరు మాత్రం మమ్మల్ని గారు అని పిలవచ్చు గాని మేము పిలవకూడదు అని వైభవ్ అడుగుతాడు.

ఇంకా గుర్తు ఉందా...  మీరు ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నారు. ఏదైనా ఇంటర్వ్యూ కోసం వచ్చారా...

ఒక రకంగా అలాంటిదే... అవునా మా కాలేజీ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది.  మీరు ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయ్యి ఇక్కడ జాబు వచ్చింది అంటే జాకె్పాట్ కొట్టినట్టే...

అంత స్పెషల్ ఏముంది.  ఏముంది అని అడుగుతారు ఏంటి దేవాగారు.. దేవా చురుగ్గా చూస్తే..  సోరి దేవా ..
మా కాలేజ్లో ప్రతిదీ అందుబాటులో ఉంది ఎక్విప్మెంట్స్ ఉన్నాయి ఫీజు రీసనబుల్ గా ఉంటుంది ర్యాగింగ్ ఉండదు అలాగే యాక్టివిటీ క్లబ్స్ ఉన్నాయి.

ప్లేస్మెంట్స్ ఉన్నాయి ఇంకేం కావాలి చెప్పండి. ఒక ముఖ్యమైనది మర్చిపోయావు ఇన్నోసెంట్ అని వైభవ్ అంటాడు.

ఇన్నోసెంట్ అని తన వైపు వేలు పెట్టుకుని చూపిస్తూ అడుగుతుంది.  అవును నేను పెట్టిన పేరు.  నిన్ను అలాగే పిలుస్తాను.  

ఏమి మర్చిపోయాను.  క్యాంటీన్... క్యాంటీన్లో ఫుడ్ ఎలా ఉంటుంది. సోరి నేను ఎప్పుడూ టేస్ట్ చూడలేదు.. నాకు ఐడియా లేదు.

ఏమిటి ఈ ఫోర్ ఇయర్స్ లో ఒక్కసారి కూడా క్యాంటీన్ కి వెళ్ళలేదా..  ఓ మై గాడ్ అందుకే  నిన్ను ఇన్నోసెంట్ అనేది.

విశి సమాధానం...

కథ కొనసాగుతుంది...
[+] 7 users Like SivaSai's post
Like Reply
Like always, Nice episode
[+] 1 user Likes Sunny73's post
Like Reply
Superb update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
Story correct direction lo potundi.. hope these two birds meet soon
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
No update today Sivagaru?
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
(8 hours ago)ash.enigma Wrote: No update today Sivagaru?

10 mins
Like Reply
Part - 19

ఈ ఫోర్ ఇయర్స్ లో ఒక్కసారి కూడా క్యాంటీన్ కి వెళ్ళలేదా. అందుకే  నిన్ను ఇన్నోసెంట్ అనేది. ఆ మాటకి చూస్తూ  మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి చేస్తాను. డైలీ లంచ్ తెచ్చుకుంటాను.

ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోతాను.  ఇంకా క్యాంటీన్ తో పనేముంది. ఫుడ్ తెచ్చుకొని వాళ్ళకైతే కావాలి కానీ నాకేం అవసరం అండి...

అదుగో మళ్లీ... అది నాకు అలవాటండి. ఇప్పుడే కదా పరిచయమయ్యారు. మనం బాగా ఫ్రెండ్స్ అయిన తర్వాత అప్పుడు పిలవను సరేనండి.

హ్మ్.. ఇలా ఉంటే చాలా కష్టం ఇన్నోసెంట్ పాపా..  నాతో ఫ్రెండ్షిప్ చెయ్.  మొత్తం నిన్ను మార్చి చూపిస్తాను. అబ్బా అలా మార్చండి.. ఈ ఫోర్ ఇయర్స్ నుంచి నా వల్ల అవ్వలేదు అని భవ్య వస్తుంది.

హాయ్ అని వైభవ్ పరిచయం చేసుకుంటాడు. ముగ్గురిని చూసి చిన్న స్మైల్ ఇస్తుంది. మీరు చూస్తే చాలా స్పీడ్ గా ఉన్నారు.  మీ ఫ్రెండ్ ఏమిటి ఇంత స్లో..

ఇప్పుడు ఇంకా చాలా బెటర్. జాయిన్ అయినప్పుడు అయితే ఓ మై గాడ్...

మాట ముందు నాన్న... మాట తరవాత   నాన్న మా విశి ప్రపంచం మొత్తం నాన్నే..

ఆ మాటకి విశి సైలెంట్ అయిపోతే... భవ్య ఏం మాట్లాడిందో గుర్తుకు వచ్చి అబ్బా అని కళ్ళు మూసుకుంటుంది.

సోరి రా..  అంటే ఇట్స్ ఓకే...

నువ్వు చెప్పింది కూడా నిజమే కదా... మళ్ళీ కలుద్దాం దేవాగారు అని లైబ్రరీకి వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి కొంచెం స్పెషల్ అనుకుంటా అని శ్రీకర్ అడిగితే...

నా ఫ్రెండు ఒక యూనిక్ ఐటమ్. ఎప్పుడు ఎదుటివాళ్ళలో మంచినే చూస్తుంది.  తనను వాడుకుంటున్నారు అని అర్థమైనా సరే వాళ్లకి ఏం అవసరం ఉందో అని ఆలోచిస్తుంది.

అర్థం కాలేదు అని వైభవ్ అంటే..  పోను పోను నీకే తెలుస్తుందిలే..  ఇంతకీ మా కాలేజీలో ఏం జాబ్ కి అప్లై చేశారు.

స్పోర్ట్స్...
మీ ఫిజిక్ కి తగ్గ జాబ్ సెలెక్ట్ చేసుకున్నారు. ఆల్ ద బెస్ట్.
థాంక్యూ అని ముగ్గురు వెళ్ళిపోతారు.
ఆ సండే విశి, భవ్య షాపింగ్ కి వెళ్తారు. ఎందుకు భవ్య ఇప్పుడు షాపింగ్..నాకున్న డ్రెస్సులు సరిపోతాయి కదా... నువ్వు కాస్త మూసుకుంటావా...

నువ్వు వెళ్లి కలవాలి అనుకుంటున్నాది ది గ్రేట్ హిమగారిని.  అలాంటప్పుడు కాస్త మంచి బట్టలు వేసుకుని వెళ్లాలి కదా..

రోజు కాలేజీకి వేసుకొచ్చేవి అన్ని పాతవి అయిపోయాయి. ఫస్ట్ లుక్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. టాలెంట్ ఒకటే సరిపోదు అమ్మ... మనం కూడా ఆ టాలెంట్ కి తగ్గట్టుగా రెడీ అవ్వాలి అర్థమైందా...

కానీ ఇప్పుడు అని నసుగుతూ  ఉంటే..  ఇది నా ఫ్రెండ్ కి నేను కొంటున్న గిఫ్ట్. జస్ట్ షో కేసులో బొమ్మలాగా సెలెక్ట్ చేసుకున్నవన్నీ వేసుకుని చూపించు...

ఈ మాల్ లో చాలా కాస్ట్ అనుకుంటా...  క్వాలిటీ బాగుంటుంది. నువ్వు కాసేపు సైలెంట్ గా ఉండురా..  నా బుజ్జివి కదా అని డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తూ ఉంటుంది.

విశి ఎప్పుడూ చుడిదార్ మాత్రమే వేసుకుంటుంది. రాయల్ బ్లూ కలర్ అనార్కలి మోడల్ తీసి ఇది వేసుకొని రా...

ప్రైస్ ట్యాగ్ చూసి...  ఎంతుందో చూసావా...

అది నాకు తెలుసు కానీ వెళ్లి వేసుకుని రా..
అది కాదే..  నా మాట వినలేదు అనుకో.. నీతో మాట్లాడను. కాదు...  కాదు... అన్నం తినను.

ఆకలేస్తే నేను ఉండలేను అని నీకు తెలుసు కదా అని పొట్ట మీద చేతులు పెట్టుకొని పప్పీ ఫేస్ తో చెబుతుంది ఇక ఫ్రెండ్ ని బాధ పెట్టడం ఇష్టం లేక ట్రైల్ రూమ్ లోనికి వెళుతుంది.

చందు సౌమ్య కూడా అక్కడే షాపింగ్ చేస్తూ ఉంటారు.  వీళ్ళిద్దరి మాటలు వింటూ చందు నవ్వుతూ మంచి ఫ్రెండ్స్ అనుకుంటా...

భయపెట్టి మరీ కొంటుంది.  అవును అని సౌమ్య అంటుంది.  అవును అని ఆపేస్తే ఎలాగా..  మనం వెళ్లి చూద్దాం పద..

ఏం చూడాలి.. ఏం సెలెక్ట్ చేసిందో చూడాలి కదా... మన బట్టలు మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. పక్కన వాళ్ళ గొడవ మనకెందుకే..


అయ్యో ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ కి సెలెక్ట్ చేసిన డ్రెస్ చూడకపోతే మనసు లాగేస్తుందబ్బా పదా..  పదా.. అని లాక్కుని వెళ్ళి..

హాయ్ ఐ ఆమ్ చందు అంటే..  హాయ్ ఐయామ్ భవ్య. అరె.. మీ పేరు భవ్య నా డార్లింగ్ పేరు సౌమ్య అని పరిచయం చేస్తుంది.

సౌమ్య చిన్న స్మైల్ ఇస్తుంది.  మీరు కూడా మా విశి లాగానే సైలెంట్ అనుకుంటా..

విశి.. అని చందు అడిగితే..  నా బెస్టి ట్రయల్ రూమ్ లో ఉంది .
భవ్య అని మెల్లిగా పిలుస్తుంది. చూశారా తాబేలు కన్నా నిదానం అని వెనక్కి తిరుగుతుంది.

వావ్ విశి ఈ డ్రెస్ లో సూపర్ ఉన్నావు తెలుసా... నిన్ను ఇలా చూస్తూ ఉంటే అబ్బాయిగా ఎందుకు పుట్టలేదా అనిపిస్తుంది.

విశి..అక్కడ ఉన్న అద్దంలో చూసుకుంటుంది. అద్దంలో తనతో పాటు తండ్రి కూడా కనిపిస్తాడు. బంగారం..  చిట్టితల్లి సూపర్ ఉన్నావురా.. అసలు ఈ డ్రెస్ నీకోసమే రెడీ చేసినట్టు ఉన్నారు.

ఇంటికి వెళ్ళగానే అమ్మతో దిష్టి తీయించుకో అర్థమయిందా.... అద్దం  మీద చెయ్యి వేసి అలాగే నాన్న అంటుంది.

భవ్య వచ్చి కదిపి..  ఏమైందే అలా చూసుకుంటున్నావు. ఏమి లేదు.  ఈ డ్రెస్ తీసుకుంటాను కాకపోతే డబ్బులు నేనే ఇస్తాను.

నిన్ను మూసుకోమని ఇందాకే చెప్పాను.. ఇది నా ఫ్రెండ్ కి నేను ఇస్తున్న గిఫ్ట్. ఇంకా ఎక్కువ వాగేవు అనుకో... ఇంకా పది డ్రెస్సులు కొంటాను.

నాతో అన్ని డ్రెస్సులు కోనిపించుకోవాలని నీకు కోరికగా ఉంటే దీనికి నువ్వు పే చెయ్.. నీకు ఒక నమస్కారం తల్లి. నిన్ను మాటల్లో నేను గెలవలేను. తీసుకుంటాను. గుడ్ నా విశి బంగారం. చెప్పిన మాట వింటుంది. 

మీ ఫ్రెండ్ షిప్ భలే ముచ్చటగా ఉంది. ఎవరు అన్నట్టుగా విశి చూస్తే ఇప్పుడే పరిచయమయ్యారు. చందు అండ్ సౌమ్య.

హాయ్... నిజంగా విశి..  ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు. మీ ఫ్రెండ్ చెప్పినట్టుగా మేము అబ్బాయిలం అయ్యుంటే నీకు పిచ్చ కాంపిటేషన్...

ఆ మాటకి చిన్నగా సిగ్గుపడుతుంది.  అరే మీరు సిగ్గుపడితే ఇంకా క్యూట్ గా ఉన్నారు. మీ వాడు ఎవరో గానీ బీభత్సమైన మచ్చ వేసుకుని పుట్టి ఉంటాడు.

విశి కి గౌతమ్ గుర్తుకు వస్తాడు. గౌతమ్ ఏ రోజు కూడా ఇలా చెప్పలేదు. ఎప్పుడు చూసినా వర్క్ ప్రాజెక్ట్ అని మాత్రమే మాట్లాడుతాడు.

నిజంగా గౌతమ్ నన్ను లవ్ చేస్తున్నాడా లేక భవ్య చెప్పినట్టుగా వర్క్ కోసం వాడుకుంటున్నాడా...
ఎందుకో అలా అనుకోగానే...  మనసు బాధగా  రోదిస్తుంది.  

లేదు లేదు గౌతమ్ అలాంటివాడు కాదు. నేనంటే చాలా ప్రేమ.  తనే వచ్చి నాకు ప్రపోజ్ చేశాడు కదా.. బిజినెస్ డెవలప్ చేయడంలో ఉన్నాడు కదా..

అందుకనే ఎక్కువ మాట్లాడడం లేదు. నాకు వర్క్ రావాలనే ఇంత టిపికల్ ప్రాజెక్ట్ నాకు ఇస్తున్నాడు.  అంటే నా మీద ప్రేమ ఉన్నట్టే కదా అని తృప్తి పడుతుంది.

హలో విశి ఎక్కడున్నావు అని చందు చిటికలు వేస్తుంది.  అప్పుడప్పుడు మా విశి ఏదో లోకంలోకి వెళ్లి విహరించి వస్తుంది.

అలాంటిదేమీ లేదు లేండి.  వెళదామా భవ్య.. ఓకే బాయ్ చందు.. బాయ్ సౌమ్య.. అదేంటి అలా సింపుల్ గా బాయ్ చెప్పారు.

ఫోన్ నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకోరా. మీరు చాలా ఫాస్ట్ చందు. స్లో గా ఉంటే.. ఇదిగో మీ ఫ్రెండ్ ని, నా డార్లింగ్ ని లాక్కురావాలి అంటే కష్టం కదా...

నలుగురు నంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు.
చందు, సౌమ్య ఇంటికి వచ్చి సోఫాలో కులబడి... చందు.. అమ్మమ్మ వాటర్ అని అరుస్తుంది.

సౌమ్య చెవులు మూసుకొని ఎందుకే అలా అరుస్తావు.. వాటర్ ఏ కదా నేను తెస్తాను. నాతో పాటు నువ్వు తిరిగావు కదా.. నీ కాళ్లు నొప్పి రావడం లేదా..

నువ్వంటే అతి సుకుమారివి. షాపింగ్ చేయడం తప్ప మిగిలిన ఏ పని అన్న కాళ్ళు నొప్పులు వస్తాయి కానీ.. మా సౌమ్య బంగారం కదా..  పైగా డాక్టరు. అందుకే నొప్పులు ఉండవు అని వైభవ్ అంటాడు.

ఏంటి నువ్వు ఇంట్లోనే ఉన్నావు. ఈ పాటకి గాలి తిరుగుళ్ళు తిరగడానికి వెళ్తావు కదా... ఈ పిల్ల రాక్షసి వస్తుందని తెలిసి ఇంట్లోనే ఉన్నాను.

నేను పిల్ల రాక్షసినా అని గయ్య్ మంటుంది.  కాదే బ్రహ్మ రాక్షసివి. ఆడపిల్లలంటే ఎంత పద్ధతిగా ఉండాలి.  సౌమ్య ని చూసి నేర్చుకో.

నేను ఎలా ఉండాలో నాకు తెలుసు. ఇంకొకళ్లని చూసి నేర్చుకోవలసిన అవసరం లేదు. ముందు నువ్వు పెద్ద బావని చూసి నేర్చుకో...

ఇద్దరూ ఆపుతారా అని  లలిత, మాధవి వస్తారు.  సర్వెంట్స్ వాటర్,  జ్యూస్ తీసుకుని వస్తే... అవి తీసుకుని తాగుతూ..

చూడు అమ్మమ్మ  షాపింగ్ చేసి అలసిపోయి వస్తే..  చిన్న బావ ఎలా అంటున్నాడో అని కంప్లైంట్ ఇస్తుంది.
చినబావన అని వైభవ్ ఆశ్చర్యంగా అడిగితే.. ఏ నువ్వు నాకు బావవే కదా..

చినబావ పిలవద్దంటావా.... ఈ గోరోజనం ఎప్పటి నుంచి మొదలైంది.
చూసావా అత్తయ్య నేను ఎంత పద్ధతిగా బావ అని పిలిస్తే నన్ను ఎంత వెటకారాం చేస్తున్నాడో.. అంతా మావయ్య లాగానే అని పూజిత కి కంప్లైంట్ ఇస్తుంది. 

వీళ్ళిద్దరికీ ఆ బుర్రలే ఉంటే మనకి ఈ కష్టాలు ఎందుకురా..  వాడికి పిలిపించుకునే యోగం లేనప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావు.

సౌమ్య నవ్వుతూ... అత్తయ్య నీకు ఏదో ఒక వంక కావాలే...  వైభవ్ ని అనడానికి...

నువ్వు ఒక్కదానివే నా పార్టీ రా..  మా అమ్మ ఎప్పుడు ఆ చందు పార్టీనే...

ఆస్తమాను మీ ఆడవాళ్లు షాపింగ్ అని తిరుగుతారు.. ఏం కొంటారే బాబు. షాపింగ్ అంటే గుర్తొచ్చింది ఈరోజు మాల్ లో ఒక జంట ఫ్రెండ్స్ ని చూసాము.

సౌమ్య ఏం చెప్పబోతోంది...
[+] 3 users Like SivaSai's post
Like Reply
Part - 20
ఈరోజు షాప్ లో ఇద్దరు ఫ్రెండ్స్ ని చూశాము.  ఒక అమ్మాయి కామ్ గోయింగ్.  రెండు అమ్మాయి మన చందు లాగా  స్పీడ్.

ఫ్రెండ్ ని భయపెట్టి బెదిరించి మరీ డ్రెస్సెస్ కొన్నది తెలుసా... వాళ్ళ ఫ్రెండ్షిప్ చూస్తే భలే ముచ్చటగా అనిపించింది.

అవునా ఈరోజుల్లో కూడా అంత ఇన్నోసెంట్ అమ్మాయిలు  ఉన్నారా...
చాలా తక్కువ మాట్లాడుతుంది. ఏది అడిగినా ఒక చిన్న స్మైల్ మాత్రమే ఈరోజు కాలేజీలో మాకు తగిలిన క్యాండెట్ కూడా అంతే...

కాలేజ్,  రెస్టారెంట్లో వర్క్,  ఇల్లు. ఇది తప్ప వేరేది తెలియదు.  చదువుకుంటేనే జాబ్ చేస్తుందా.. అవును నీకు ఒక ఇన్స్టంట్ చెప్పనా..

మేము రెస్టారెంట్లో ఫుడ్ టేస్ట్ చూస్తుంటే.. అన్నయ్య దగ్గర డబ్బులు లేవేమో అనుకుని నేను పే చేస్తాను మీరు వెళ్ళండి అని చెప్పింది.

లేడీస్ అందరూ వైభవ్ చెప్పింది వింటూ అదేంట్రా అమ్మాయి అలా ఇచ్చేస్తే..  డబ్బులు ఏం మిగులుతాయి. అందుకే అన్నయ్య.. పెదనాన్న పేరు చెప్పి ఆ అమ్మాయి శాలరీని పెంచాడు.

ఫాదర్ లేడంట..  మదర్ ని తనే చూసుకుంటుంది. వాళ్ళ మదర్ కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయ్యారు.    ఆ అమ్మాయి..  అమ్మాయి అంటున్నావు.. పేరేమీ లేదా అని లలిత అడిగితే...

ఎందుకు లేదు నానమ్మ.  పేరు కూడా చాలా బాగుంది. ఒక నిమిషం ఆలోచించి... వి మీద స్టార్ట్ అవుతుంది.  వన్ మినిట్ అని ఫోన్ ఓపెన్ చేసి నేమ్ చూసి విశిష్ట అంటాడు.

చందు గట్టిగా ఏమన్నావు..  ఎందుకే ప్రతి దానికి అలా అరుస్తావు. మెల్లిగా అడగలేవా..  అబ్బా ముందు పేరు చెప్పు వైభవ్.

విశిష్ట..  ఆ అమ్మాయి ఫ్రెండ్ పేరు భవ్యనా... అవును మీకెలా తెలుసు..  మాకు షాపింగ్ లో కనిపించింది కూడా వాళ్ళిద్దరే...

మొత్తానికి వాళ్ళిద్దరూ మన ఫ్యామిలీకి మంచి ఫ్రెండ్స్ అయిపోయారు అన్నమాట..  ఏమంటావు అన్నయ్య అని సూర్యని అడుగుతాడు.  చిన్నగా నవ్వి ఊరుకుంటాడు.

చందు బాయ్ చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది. ఆరోజు నైట్ డిన్నర్ చేస్తూ కూడా అందరూ విశి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు.

విక్రమ్ సూర్య ని చూస్తూ.. వాళ్ళ మదర్ కి మన హాస్పిటల్ తరఫున ట్రీట్మెంట్ అంతా ఫ్రీగా చూడు. ఒక ఆడపిల్ల అంత కష్టపడుతుంది అంటే... మనం వీలయినంత సహాయంచేయాలి.

ఆల్రెడీ అన్నయ్య చేశాడు పెదనాన్న.. శాలరీ ఇంక్రీస్ చేశాడు. అమ్మాయికి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ.  ఫ్రీగా ఇస్తే ఏది తీసుకోదు.

అచ్చు మీ పెద్దమ్మలాగా అన్నమాట.. ఇప్పుడు నా విషయం ఎందుకులే.. అరే నీ టాలెంట్ ఏమన్నా తక్కువ... పెళ్లికి ముందు ఎంత హార్డ్ వర్క్ చేసావు. 

నీ కష్టాన్ని ఏ రోజు నువ్వు పెదవి దాటనివ్వలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా అలాగే ఉంది. కుదిరినప్పుడు ఒకసారి మన ఇంటికి తీసుకురండి రా...  చూద్దాం.. తప్పకుండా మావయ్య అని సౌమ్య సమాధానం చెబుతుంది.

డిన్నర్ అయిన తర్వాత సూర్య  గదిలోకి వెళ్లి మంచం మీద పడుకుని రోజు లాగానే ఉంగరాన్ని చూస్తూ కబుర్లు చెబుతూ ఉంటాడు.

చూసావా క్యూటి..  విశిష్ట కి  సేల్ రెస్పెక్ట్ ఎక్కువ అంట... నిజంగానే ఎక్కువ..  ఎంత కష్టపడుతున్నా సరే పెదవుల మీద చిరునవ్వు చెరగనివ్వడం లేదు.

ఆ అమ్మాయిని ఎందుకో రోజూ చూడాలనిపిస్తుంది. ఎందుకంటావు... నువ్వు అలగకు.  ఎవరైనా నీ తర్వాతే..  కానీ ఆ అమ్మాయిలో సంథింగ్ స్పెషల్ ఉంది. ఫ్రెండ్షిప్ చేయాలి ఇంకా ఏదో మాట్లాడాలి అనిపిస్తుంది .

చూద్దాం రేపు మళ్లీ కాలేజీకి వెళ్తాను కదా...
నెక్స్ట్ రోజు సూర్య మంచి హుషారుగా రెడీ అయ్యి శ్రీకర్ కి మెసేజ్ చేసే ఒక్కడే కాలేజ్ కి వెళ్తాడు.

భవ్య దగ్గరికెళ్ళి హాయ్ అంటాడు.  హాయ్... మీరు ఏంటి.. చెప్పాను కదా..  జాబ్ కి అప్లై చేశాను అని.. వచ్చిందా.. ఆల్మోస్ట్ ఓకే అయినట్టే...

మీ ఫ్రెండ్ ఏంటి ఇంకా రాలేదా..  దాని గురించి ఏం చెబుతారులే... ఏమయింది...

ఈ మంత్ ఆంటీ కి అని ఆపేస్తుంది.  పరవాలేదు చెప్పండి. నా ఫ్రెండ్ విషయం మీకు ఎలా చెప్పగలను.. మీ ఫ్రెండ్ ని చూస్తే రెస్పెక్ట్ ఇవ్వాలి అనిపిస్తుంది.

ఈ వయసులోనే ఇంత హార్డ్ వర్క్ చేస్తుంది అంటే దాని వెనక చాలా బలమైన కారణాలే ఉండొచ్చు..  మీ ఫ్రెండ్ గురించి తెలిస్తే నా వలన అయ్యే సహాయం చేస్తాను.

మీ మాటలు వింటూ ఉంటే నమ్మొచ్చు అనిపిస్తుంది కానీ ప్రస్తుతపు రోజుల్లో ఎవరిని నమ్మలేకపోతున్నాము. మీరన్నది కూడా నిజమేలే...

మీకు ఎప్పుడు చెప్పాలి అనిపిస్తే అప్పుడే చెప్పండి. నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. జాబ్ రిక్వైర్మెంట్ కావాలి అన్నా ఒక మాట చెప్పండి.  నేను అరేంజ్ చేస్తాను.

థాంక్యూ దేవాగారు. ఈ మాత్రం సపోర్ట్ ఇస్తే చాలు. మా బంగారాన్ని ఆ ఉచ్చు నుంచి బయటికి లాగేస్తాను .

ఉచ్చు ఏమిటి అని కంగారుగా అడుగుతాడు.. అబ్బా మళ్లీ నోరు జారానా అనుకోని... ఏమి లేదు అని మాట దాటేస్తుంది.

ప్లీజ్ భవ్య నన్ను ఒక ఫ్రెండ్ గా అనుకుని చెప్పు..  ఎందుకో విశిష్ట బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాను. అది ఇది అని నేను చెప్పలేను.

రెస్టారెంట్ లో చూసినప్పుడే అనిపించింది ఎప్పటినుంచో పరిచయం ఉంది అని.  మీరిద్దరూ ఎప్పుడు కలిశారు. ఓ నీ ఫ్రెండ్ ఈ విషయం చెప్పలేదా... అని జరిగింది చెబుతాడు.

అవునా ఇంత జరిగిందా..  రాక్షసి ఒక్క ముక్క చెప్పలేదు.  అయినా ఒకళ్ళ విషయాలు ఇంకొకరి దగ్గర అసలు మాట్లాడదు. అంత టైం కూడా ఉండదు అనుకోండి..

ఇప్పుడు నా గురించి కొంచెం అయినా నీకు తెలిసే ఉంటుంది కదా... చెబుతాను గాని.. విశి గురించి ఎప్పుడూ తప్పుగా అనుకోవద్దు.  అలాగే ఎవరి దగ్గర మాట్లాడొద్దు.. అలా అని మీరు మాటిస్తేనే నేను మీకు చెబుతాను.

ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ మా అమ్మ. మా అమ్మ సాక్షిగా చెబుతున్నాను విశికి  ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది రానివ్వను.

భవ్య విశి గురించి చెప్పడం మొదలు పెడుతుంది .

విశి వాళ్ల పేరెంట్స్ కి ఒక్కతే కూతురు.  చాలా గారాబంగా పెంచారు. వాళ్ల నాన్నగారికి అయితే  మరి అపురూపం.

ఇంజనీరింగ్  ఈ కాలేజీలో సీటు వచ్చింది అని ఫ్యామిలీ మొత్తం హైదరాబాదు షిఫ్ట్ అయ్యారు.. ఆంటీ, విశి ఇక్కడ ఉంటే అంకుల్ ఊరు వెళ్లి అక్కడ చెక్కబెట్టుకుని తిరుగుతూ ఉండేవారు.

విశి  హాస్టల్ లో జాయిన్ అవుతాను అన్నా సరే ఒప్పుకోలేదు. వాళ్ళ నాన్నగారు ఉన్నన్ని రోజులు కష్టమంటే ఏమిటో తెలియదు.

విశి ప్రపంచమంతా చదువు, పేరెంట్స్ మాత్రమే...
విలేజ్ వాతావరణం నుంచి వచ్చింది కదా ఇక్కడ అంతా కొత్త కొత్తగా ఉండి.. చాలా భయపడిపోయేది.

అంకుల్ అయితే విశి అలవాటు పడేవరకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కాలేజీలోనే ఉండిపోయేవారు.   
మేమిద్దరం బెంచ్ మేట్స్ అవడం వలన మెల్లిగా మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మొదలైంది.

సెకండ్ ఇయర్ లోకి వచ్చేటప్పటికి చంద్రగ్రహణం పట్టినట్టు ఆ గౌతమ్ గాడు ఎంటర్ అయ్యాడు.

గౌతమ్ అని సూర్య కళ్ళు చిన్నవి చేసి అడిగితే....

మన కాలేజీలోనే ఎంబీఏ ఫైనల్ ఇయర్..
  విశి నీ చూసి ఫ్లాట్ అయ్యి వెనకాలే పడ్డాడు. దగ్గర కూడా రానిచ్చేది కాదు.
ఆ గౌతమ్ కి అర్థమయ్యింది. విశి అందరిలాంటి అమ్మాయి కాదు... నీట్ గా డీల్ చెయ్యాలి అని ప్రేమ పాట మొదలుపెట్టాడు.

వాడికి ఉన్న స్టేటస్ మొత్తం విశి ముందు చూపించడం స్టార్ట్ చేశాడు.  విశి అలాంటి వాటికి లొంగేరే కాదు.

స్టడీస్ లో టాపర్ అని తెలుసుకున్నాడు.  మెల్లిగా సబ్జెక్టు గురించి మాట్లాడుతూ ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేశాడు.

థర్డ్ ఇయర్ స్టార్టింగ్లో అనుకోకుండా వాళ్ళ నాన్నగారికి యాక్సిడెంట్  అయ్యి అందరికీ దూరమయ్యారు.

అప్పటివరకు కష్టం అంటే ఏమిటో..  ప్రపంచం ఎలా ఉంటుందో తెలియని విశి బయటకి రావాల్సి వచ్చింది. అంకుల్ అకాలమరణం... ఆంటీ ని బాగా కృంగదీసింది. మెంటల్ గా బాగా డిస్టర్బ్ అయిపోయారు.   

ఊర్లో ఉన్న పొలాలు గురించి గానీ ఆస్తులు గురించి గానీ విశికి ఏమి తెలియదు. ఇంకేముంది చుట్టాలు రాబందులుగా అప్పులు చూపించారు.

ఆ టైంలోనే గౌతమ్ ఇంకా ప్రేమను వలకబోస్తూ  నీకు నేనున్నాను అని అడ్వాంటేజ్ తీసుకోబోయాడు.

నాకు మొదటిది నుంచి వాడి మీద అనుమానమే.. అందుకే ఎప్పటికప్పుడు విశిని హెచ్చరిస్తూనే ఉన్నాను.
ఏదైనా జాబ్ చూడు..  అమ్మని చూసుకోవాలి అని గౌతమ్ ని  రిక్వెస్ట్ చేసింది.

విశి టాలెంట్ వాడికి ముందే తెలుసు.  అందుకనే వాడి కన్స్ట్రక్షన్ కి సంబంధించిన వర్క్ మొత్తం ఈ పిచ్చిదానితో చేయిపిస్తూ మినిమం శాలరీ ఇస్తూ... ఇంకా డెవలప్ అవ్వాలి.

నాకు నువ్వంటే చాలా ఇష్టం అందుకే నీ వర్క్ సాటిస్ఫాక్షన్ లేకపోయినా మనీ ఇస్తున్నాను అని  ఏదో కహానీలు చెప్పేవాడు.

ఈ పిచ్చిది అదే నిజం అనుకుంటుంది. నేను ఎన్నిసార్లు చెప్పినా... నాకు అవసరమైన టైమ్ లో ఆదుకుంటున్నాడు.

స్టడీస్ కంప్లీట్ అవ్వకుండా ఎవరూ జాబ్ ఇవ్వరు కదా.. గౌతమ్ ఈ మాత్రమైన హెల్ప్ చేస్తున్నాడు అని వెనకేసుకువస్తుంది.

అది విశి కథ...

సూర్య ఆలోచిస్తూ ఉంటాడు.  ఏమైంది సార్ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు.

విశి చేసిన వర్క్ ఏదైనా నీ దగ్గర ఉందా.. ఒరిజినల్స్ అన్ని దాని లాప్టాప్ లోనే ఉంటాయి. ఒక్క నిమిషం అని లాప్టాప్ ఓపెన్ చేసి చూపిస్తుంది.

నాకు ఒకసారి ఈ ప్రింట్ పంపించింది అని చూపిస్తుంది. అది చూస్తే సూర్య   చాలా ఇంప్రెస్ అవుతాడు. వర్క్ చాలా బాగుంది.

ఇంకా స్టడీస్ కంప్లీట్ అవ్వకుండానే ఇంత టాలెంట్ చూపిస్తుంది అంటే తన ఫ్యూచర్ సూపర్ అంటాడు.  కదా.. నేను అదే చెబుతాను.

  వేరే చోట మరి ట్రై చేయొచ్చు  కదా..
స్టడీస్ అవ్వలేదు. అలా ట్రై చేస్తే గౌతమ్ కి తెలిస్తే ఈ జాబ్ కూడా ఉండదు.  ఆంటీ ట్రీట్మెంట్ కి ఇబ్బంది అవుతుంది అని ఆ ఈ వేస్ట్ ఫెలో గాడు ఎంత ఇస్తే అంతే తీసుకుంటుంది.

సూర్య రియాక్షన్...

కథ కొనసాగుతుంది...
[+] 4 users Like SivaSai's post
Like Reply
Superb update
Like Reply




Users browsing this thread: Mahesh5432, Skv89, 2 Guest(s)