30-03-2026, 11:39 AM
Cool గా రాస్తున్నారు ఫ్యామిలీ bonding, emotions. మీ పార్ట్ -1 లాగే ఈ పార్ట్ కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను
|
బృందావనం
|
|
30-03-2026, 11:39 AM
Cool గా రాస్తున్నారు ఫ్యామిలీ bonding, emotions. మీ పార్ట్ -1 లాగే ఈ పార్ట్ కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను
30-03-2026, 03:53 PM
Rudra antha straight ga.. oka ammayitho anatam konchem.. out-of-line anipinchindi.
31-03-2026, 07:55 AM
Part - 40
రుద్ర ఆలా ఆర్డర్ వేయగానే శాంభవికి పిచ్చ కోపం వస్తుంది. తన పుట్టి బుద్ది ఎరిగిన తర్వాత ఇప్పటివరకు ఎవరు తనమీద అలా ఆర్డర్ వేసింది లేదు. బ్రతిమాలతు, బుజ్జిగించి చెప్పిన వాళ్లే.
రుద్రవైపు కోపంగా చూస్తూ మీరు ఆర్డర్ వేస్తే నేను చెయ్యాలా అంటుంది. చెయ్యవా అని ఆటిట్యూడ్ గా అడుగుతాడు. ఎందుకు చేయాలి. నువ్వేమైనా నా ఫ్యామిలీ మెంబర్ వా లేక నాకు కాబోయే మొగుడువా నీ మాట వినడానికి అని రుసరుసలాడుతుంది. శాంభవి మాటలకి నవ్వుతూ కరెక్ట్ గా చెప్పావు బేబీ. నీకు కాబోయే మొగుడిని అంటాడు. ఏంటి అని గట్టిగా అరుస్తుంది. ఎందుకు ప్రతిదానికి ఒక భయంకరమైన ఎక్స్ప్రెషన్ లేదో అరవడం చేస్తావు. నీకు అర్థం అయ్యే భాషలోనే కదా చెప్పాను అని విసుగ్గా అంటాడు. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది కానీ నువ్వు అన్నదే నాకు అర్థం కాలేదు. నువ్వు నాకు మొగుడు ఏంటి.. అసలు నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నావు.. నీ ఫేస్ ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అని వెటకారంగా అడుగుతుంది. నా ఫేస్ కి ఏమి తక్కువ ఎంత మంది లైన్లో ఉన్నారో తెలుసా అని ముక్కు మీద వేలుతో టాప్ చేస్తూ అడుగుతాడు. ఇదిగో దూరంగా ఉండి మాట్లాడు ఏదైనా సరే. నన్ను టచ్ చేసావంటే మాత్రం అస్సలు మర్యాదగా ఉండదు. వెంటనే మా నాన్నకి ఫోన్ చేసి చెబుతాను అనే ఫోన్ పుచ్చుకుంటుంది. అనుకున్నాను . ఏది నీ సొంతంగా డీల్ చేయలేవు లేవు కదా.. మాట్లాడితే మా నాన్న అన్నయ్యలు అంటావు. నువ్వు సొంతంగా నన్ను డీల్ చెయ్ అప్పుడు ఒప్పుకుంటాను. ఏమని ఒప్పుకుంటావు అని అనుమానంగా అడుగుతుంది. నువ్వు అనుకున్నదే అని కన్ను గీటుతాడు. నువ్వు మాట్లాడే విధానం నాకు అస్సలు నచ్చలేదు. అవునా నచ్చలేదా.. సరే అయితే ఎలా మాట్లాడితే నచ్చుతుంది. నాన్న, నాన్న తోటకెళ్దామా.. అన్నయ్య సైకిల్ ఎక్కి ఊరంతా బలాదూర్ తిరుగుదామా.. అని మాటలు నచ్చుతాయా ఏంటి అనే వేళాకోళం చేస్తాడు. ఆ వేళాకోళానికి పళ్ళు నూరుతూ ఇప్పుడు నేను అవి అన్నానా అని అడుగుతుంది. నీ మైండ్లో రన్ అయ్యవి అవే కదా.. అందుకే అవి చెప్పాను అంటాడు. మరి నాన్నతో తోటకి వెళ్లడం కాకుండా సరదాగా ఎంజాయ్ చేయడం కాకుండా ఇంకా ఏమీ ఉంటాయి.. మీలాగా మేము సిటీ కల్చర్ లో లేము కదా.. పబ్బులు, డిస్కోలు అంటూ తిరుగుతూ మందు, సిగరెట్ తాగడానికి అంటుంది. అమ్మని ఎంత మాట అన్నావే... నేను మందు, సిగరెట్ తాగుతాను అంటావా...నీకు ఇలా కాదే.. ట్రీట్మెంట్ సెపరేట్గా చేయాలి అంటాడు. ఏయ్ మాటక ముందు ఏవే, ఏంటే అని మాట్లాడుతావ్ ఏంటి. మాటలు జాగ్రత్తగా రాని అని వేలు చూపిస్తూ మాట్లాడుతుంది. నాకే వేలు చూపిస్తూ మాట్లాడతావా అని ఆ వేలుని గట్టిగా పట్టుకుంటాడు. అబ్బా వదలరా బాబు నా వేలు నొప్పిపేడుతుంది. ఎవరు నన్ను ఇంత గట్టిగా పట్టుకోలేదు అని అరుస్తుంది. ఓ నువ్వు చిన్నపిల్లవు కదా అందుకే అందరూ నిన్ను చాలా స్మూత్ గా డీల్ చేసి ఉంటారు అని వెటకారాన్ని ఒక రేంజ్ లో చూపిస్తూ అడుగుతాడు. ఆ మాటలకి రుద్రవైపు గుర్రుగా చూస్తూ నేనేమీ చిన్న పిల్లని కాదు. నేను క్యాంపస్ సెలక్షన్ లో సెలెక్ట్ అయ్యి ఇంటెన్షిప్ కి మీ ఆఫీస్ కి వచ్చాను అంటే నేను ఎంత టాలెంటో చూసుకో అని గొప్పగా చెబుతుంది. ఆ మాటలకు పైనుంచి కిందకి ఎగాదిగా చూసి కాలేజ్ ఎవరిది మేడం అని అడుగుతాడు. మాదే అంటుంది. మరి మీ కాలేజీలో నువ్వు సెలెక్ట్ అవ్వకపోతే పక్కింటోళ్లు సెలెక్ట్ అవుతారా అనే అడుగుతాడు. అంటే ఏంటి నీ ఉద్దేశం అని అనుమానంగా అడుగుతుంది. ఉద్దేశమూ లేదు వంకాయ లేదు. కాలేజ్ మీది కాబట్టి బ్యాక్ డోర్ నుంచి మా ఆఫీసులకు ఎంటర్ అయ్యావు అని చెప్పాడు. ఇదిగో మాటలు మర్యాదగా రానివ్వు. నేను చేస్తే చేస్తానని ఒప్పుకుంటాను. రాకపోతే రాలేదు అని ఒప్పుకుంటాను. అంతేగానీ బ్యాక్ డోర్ నుంచి రావాల్సిన అవసరం నాకు లేదు. అవునా అయితే ఒక చిన్న బెట్ వేసుకుందామా అని అడుగుతాడు. ఏం బెట్ అని అనుమానంగా చూస్తుంది. నువ్వు మరీ అంత అనుమానంగా చూడకు. నీకు అంత సీన్ లేదులే.. నువ్వు ఇంకా చిన్న పిల్లవే అంటాడు. ఇదిగో మాటకు ముందు ఒకసారి, మాట తర్వాత ఒకసారి చిన్న పిల్ల అనుకు. ఆ మాట వింటుంటే నాకు చాలా చిరాగ్గా ఉంది అంటుంది. ఓ అవునా సరే అయితే నా బెట్ట విను ఇప్పటినుంచి కరెక్ట్ గా ఒక నెల రోజుల్లో నిన్ను నా లవ్ లో పడేస్తాను. నేనే నీకు మొగుడిని అవుతాను. ఈ ఒప్పందం మనిద్దరి మధ్యనే ఉండాలి. లేదు కాదు అని ఎవరికైనా చెప్పిన, సలహా తీసుకున్నావు అంటే నువ్వు చిన్నపిల్లవని అర్థం. ఆ మాటలకి శాంభవి ఉక్రోషంగా నేను ఎవరితోనో చెప్పను. అలాగే నీతో లవ్ లోనో పడను. నెల రోజుల తర్వాత నువ్వే ఓడిపోయి నా ముందు నుంచుంటావు అంటుంది. ఆ మాటలకి నేను ఓడిపోవడమా... ఇప్పటివరకు నా లైఫ్ లో ఓటమి అన్నదే చూడలేదు. ఫస్ట్ టైం నువ్వు చూపిస్తాను అంటున్నావు. చూద్దాం ఎవరు గెలుస్తారో అని కారు సడన్ బ్రేక్ వేస్తాడు. ఆ సడన్ బ్రేక్ కి ముందుకి తులిపడి గుద్దుకో పోతుంది. డాష్ బోర్డుకిని, శాంభవి తలకి మధ్యలో రుద్ర చెయ్యి అడ్డు పెడతాడు. ఇప్పుడు అర్థమైందా నువ్వు చిన్నపిల్లవే అని. కార్ ఎక్కిన తర్వాత సీట్ బెల్టు పెట్టుకోవడం కూడా తెలియదు. ఆ అని అరుస్తూ నేను చిన్న పిల్లని కాదు అని గట్టిగా అంటుంది. శాంభవి ఫ్రస్టేషన్కి చిన్నగా నవ్వుకుంటూ నువ్వు చిన్నపిల్లవు కాదు సరేనా అంటాడు. వెంటనే శాంభవి నవ్వుతూ చూసావా నువ్వే ఒప్పుకున్నావు అంటుంది. దానికి ఇదే చిన్నపిల్ల చేష్టలు అంటే.. అని కారు దిగుతూ చెప్పాను కదా నువ్వు నాతో గాని, చినమామతో గాని రావాలి. ఇంకా ఎవరితో కూడా కుదరదు. అవేమీ కాకుండా ఎవరితో అయినా వచ్చావు అంటే నువ్వు బెట్ లో ఓడిపోయినట్టే అని చెప్పి కారు దిగుతాడు. శాంభవి కోపంగా కారు దిగి వీడి పెత్తనం ఏమిటి నామీద. అయినా సరే నన్ను నేను ప్రూఫ్ చేసుకోవాలి.. వీడిచేతే శాంభవి నువ్వు గ్రేట్ అని అనిపించుకోవాలి అని మిత్ర వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. క్యాబిన్ లోకి వెళ్ళిన రుద్ర కార్లో జరిగిన డిస్కషన్ గుర్తుకు వచ్చి శాంభవి ఎక్స్ప్రెషన్స్ తలుచుకుని నవ్వుకుంటూ ఉంటాడు. బావమరదలు ముగ్గురు రుద్ర చుట్టూ చేరి సైలెంట్ గా చూస్తూ ఉంటారు. రుద్ర నవ్వుకుంటూ వాళ్లను చూసి ఏంట్రా నా మొఖంలో ఏమైనా కోతులాడుతున్నాయో అలా చూస్తున్నారు అని అడుగుతాడు. దానికి విహాన్ అదేమీ లేదు బావ..నువ్వు వచ్చినప్పుడు నుంచి ఒకటే... నీలో నువ్వే నవ్వేసుకుంటున్నవి ఏంటా సంగతి అని చూస్తున్నాము అంతే... సంగతి ఏంటో మాకు చెబితే మేము నవ్వుతాము కదా అని అడుగుతాడు. ఏముంటది ఏమీ లేదు కానీ.. మీ వర్క్ మీరు చేసుకోండి అని సీరియస్గా చెబుతాడు. వర్క్ ఎప్పుడైనా చేసుకోవచ్చుగానీ...నీ ఫేస్ లో అప్పుడప్పుడు కనపడే నవ్వు ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. విషయం ఏంటో చెప్పు బావ అని గెడ్డం దగ్గర చేయి పెట్టి అడుగుతాడు. మా చెల్లి ఏమైనా స్వీట్ మెమోరీస్ ఇచ్చిందా బావ అని ధీరజ్ గారంగా అడుగుతాడు. వాళ్లను పైనుంచి కిందికి చూసి మీ చెల్లికి అంత సీన్ ఉందా అని రివర్స్ క్యూస్షన్ వేస్తాడు. నీ నవ్వు కి అర్ధం ఏమిటి బావ. చెప్పు బావ. ఈ టెన్షన్ మేము తట్టుకోలేము అంటూ డ్రామాటిగ్గా గుండె పట్టుకుంటాడు. ఒరేయ్ కుంచెం ఎక్కువ అవ్వలేదా అనగానే.... అందుకే చెప్పమంటున్నాను బావ చెప్పవా ప్లీజ్ అని ముగ్గురు మూడు పక్కల పట్టుకుంటారు. హే.. ఆపండి రా బాబు చెబుతాను కుంచెం దూరం జరగండి అని... వాళ్ళ ముగ్గురి వంక చూస్తూ... మీ చెల్లికి,. అని సాగతీస్తాడు. హ మా చెల్లికి అని ముగ్గురు టెన్షన్ గా అరవగా... అబ్బా అరవకండి రా అని ఒక వేలు తో చెవి లో తిప్పుతాడు. నువ్వు లాగ్ చేయకు బావ. టెన్షన్ తో సచ్చిపోతున్నాము. చెప్పిన సచ్చిపోతారు... పరవాలేదు తెలిసాక సచ్చిపోతే ఆ ఫీల్ వేరుబ్బ.. చెప్పు బావ సరిలే ఇంక వెయిట్ చేయిపించను. మీ చెల్లిని వన్ మంత్ లో లవ్ లో పడేస్తాను అని చెప్పాను అని కూల్ గా చెబుతాడు. ఏమిటి అని గట్టిగ అరుస్తారు. అబ్బా ఏమిట్రా ఆ. అరుపులు.. మీ చెల్లి కూడ ఇలానే అరిచింది. అందరూ ఓకే కాలేజ్ నుంచి వచ్చినట్టు ఉన్నారు అనగానే.. నువ్వు ఇచ్చే షాక్ అలా ఉంటుంది. మా చెల్లి ఏమన్నది రా బావ అని ధీరజ్ అడుగుతాడు. సేమ్ పాట...మా నాన్నకి చెబుతా. మా అన్నయ్యలకు చెబుతా అని. మరి ఫోన్ చేసేసిందా...చెప్పేసిందా అని ఆత్రంగా అడుగుతాడు. ఒరేయ్ నీ ఆత్రం తగలెయ్య... అలా చెప్పనిస్తే నేను రుద్రాన్ని ఎందుకు అవుతాను. మీ చెల్లిని ఎలా లాక్ చేయాలో అలాగే లాక్ చేశాను.రోజు నాతోనే ఆఫీస్ కి వస్తుంది. ఇంటికి వెళుతుంది అని పొగరుగా చెబుతాడు . హ్మ్.. నువ్వు ఏమైనా చేయగల సమర్థుడువులే బావ. ఇంతకీ నిషా ఆశాల పని ఎంతవరకు వచ్చింది అని అడుగుతాడు. దానికి ముహూర్తం పెట్టేసాను. ఈ రాత్రి నుంచి వాళ్ళ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ఏం చేస్తున్నావ్ బావ అంటే.. చెప్పను చూడండి అని... నాకు వర్క్ ఉంది మీరు ఇంకా దయచేయండి అంటాడు. నువ్వు ఎప్పుడు చెప్పావని పదండి రా అని ఎవరి కేబిన్లోకి వాళ్ళు వెళ్లిపోతారు. ఆశా నిషా అని మయూరి గట్టిగా పిలుస్తుంది. ఆ వస్తున్నామని ఇద్దరూ ఎదురుగుండా వచ్చి ఏమైంది అని అడుగుతారు. మయూరి ఏమని చెబుతుంది...
31-03-2026, 07:57 AM
Part - 41
ఏమైంది పిన్ని అత్త అంటే ఇద్దరు ఒకేసారి వస్తారు. మీ ఇద్దరికీ అప్పచెప్పిన పని ఎంతవరకు వచ్చింది. ఆ బృందావనం వారసుల్లో ఎవరినైనా లైన్ లో పెట్టారా అని కోపంగా అడుగుతుంది.
ఆశ, నిషా ఇద్దరూ భయంగా మయూరి వైపు చూస్తూ అదే పనిలో ఉన్నాము అని చెబుతారు. ఇంకా ఎన్ని రోజులు మీరు టైం తీసుకుంటారు. ఆ రుద్రకి పెళ్లి చేసే ప్రోగ్రాంలో ఉన్నారు. మీరు ఇంకా అదే పనిలో ఉన్నామని ఆలోచిస్తూ ఉంటే వాళ్ళు మన చేయి దాటి పోతారు అని చెబుతుంది. లక్ష్మి గారు అక్కడికి వచ్చి వయసులో ఉన్న కుర్రోడికి పెళ్లి చేయకుండా వయసు అయిపోయిన నీలాంటి దానికి పెళ్లి చేస్తారా ఏంటి అని అడుగుతారు. అమ్మ అని గట్టిగా అరుస్తుంది. అమ్మని కాబట్టే చెబుతున్నాను . ఇప్పటికైనా ఈ పంతాలు పగలు వదిలేసేయ్. నీ జీవితం ఎటు కాకుండా అయిపోయింది. మన ఇంటికి వీళ్ళిద్దరే వారసులు. వీళ్ళ జీవితాన్ని కూడా నీ జీవితంలా ఎటు కాకుండా చేయొద్దు అని కూతురి చేతులు పట్టుకుని మరీ అడుగుతారు. అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం నేను వీళ్ళిద్దరి జీవితాన్ని నాశనం చేస్తున్నానా అని కోపంగా అడుగుతుంది. అది నిజం కాదా అని జ్యోతి ప్రశ్నిస్తుంది. నువ్వు కూడా నన్ను అడిగే అంతట దానివయ్యావా వదినా అంటుంది. అక్కడ నాశనం అవుతుంది నా కూతురి జీవితం అడగకుండా ఎందుకు ఉంటాను. నీకు పెళ్లి అయ్యి పిల్లలు ఉండుంటే ఆ కడుపు బాధ ఏంటో అన్నది తెలిసేది. పెళ్లి పెటాకులు లేకుండా పగాపగా అని తిరుగుతూ నా కూతురు జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నావు. మీ అక్క కూతురి జీవితాన్ని కూడా ఫణంగా పెట్టావు. ఏమి సాధిస్తావ్ మయూరి అని కోపంగా అడుగుతుంది. నాగేంద్ర వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది అని గట్టిగా అరుస్తాడు. చూడండి నాన్న.. అమ్మ వదిన ఏం మాట్లాడుతున్నారో... నేను ఆశా, నిషా జీవితాన్ని నాశనం చేస్తున్నాను అంట.. నాకు పెళ్లి అవ్వలేదు కాబట్టే వీళ్ళు కూడా అవ్వనివ్వడం లేదు అని తిడుతున్నారు అని ఏడుస్తుంది. మయూరి కన్నీళ్లు తుడిచి నువ్వు ఎందుకమ్మా ఏడుస్తున్నావు. వీళ్ళిద్దరికీ అంటే పౌరుషం లేదు. బయట నుండి వచ్చిన వాళ్లే కదా అందుకే అలాగే ఉంటారు. నువ్వు నా రక్తానివి తల్లి. అందుకే నీకు నా పౌరుషం వచ్చింది అని కూతుర్ని తీసుకుని గదిలోకి వెళుతూ... ఇంకొకసారి నా కూతుర్ని తప్పుపట్టారు అంటే మీరిద్దరూ ఇంటి బయట ఉంటారు అని వార్నింగ్ ఇస్తాడు. అత్త కోడలు ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని బాధపడతారు. ఆశా నిష ఎలాగైనా మయూరి చెప్పిన పని ఫినిష్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. ఆఫీసులో వర్క్ అయిపోయిన తర్వాత సాయంత్రం శాంభవి బయటకు వచ్చి వెయిట్ చేస్తూ ఉంటుంది. గౌతమ్ శాంభవి దగ్గరకు వచ్చి మనం వెళదామా అంటే... లేదు మీరిద్దరూ పొద్దుట ఎలా వచ్చారో అలాగే వెళ్ళండి నేను రుద్రా సార్ తో వస్తాను అని చెబుతుంది. ఆ మాటలకి గౌతమ్ లేదు నిన్ను ఒక్కదాన్నే ఎలా పంపిస్తాను. నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకోమని మీ అన్నయ్యలు నాకు మరి మరీ చెప్పారు అని చెబుతాడు. నిన్ను ఎలా ఒంటరిగా పంపిస్తాను. వెళితే మన ముగ్గురం రుద్రా సార్ తో వెళ్దాం లేదంటే మాతో పాటు రా అని కరాకండిగా చెప్పేస్తాడు. అబ్బా గౌతం నేను ఏమన్నా చిన్నపిల్లనా అని అడిగితే..మా దృష్టిలో నువ్వు చిన్నపిల్లవే అంటాడు. పొద్దున్న రుద్ర వెక్కిరించిన మాటలు గుర్తుకు వచ్చి నన్ను చిన్నపిల్ల అంటే మాత్రం అసలు మర్యాదగా ఉండదు. నేను అన్ని హ్యాండిల్ చేసుకోగలను. నేను రుద్రా సార్ తోనే వస్తాను మీరు ఆ కారులో రండి ఏదైనా అయితే నేను అన్నయ్యకి చెబుతాను సరేనా అని అలకగా అంటుంది. ఇప్పుడు నేను ఏమన్నాను అని నీకు అంత కోపం వస్తుంది శాంభవి అని అడుగుతాడు. కోపంగాక ఇంకేమిటి నేను చిన్నపిల్లనా చిన్నపిల్లలగా కనిపిస్తున్నానా... నేను మీ ఏజ్ ఏ కదా చిన్నపిల్లలాగా ఎలా కనిపిస్తున్నాను అని గౌతమ్ మీదకి వెళుతూ ఉంటుంది. అప్పుడే మిత్ర వచ్చి ఏమైంది అని అడుగుతుంది. జరిగిందంతా చెబుతాడు గౌతమ్ చెప్పింది నిజమే కదా... మన ముగ్గురం కలిసి వెళ్దాం కలిసి వెళ్దాం అంతే అని చెబుతుంది. అబ్బా వీళ్ళకి చెబుతున్న అర్థం కావడం లేదు. కావాలనే వీళ్ళిద్దరిని నాతో తీసుకోవచ్చానని రుద్ర సార్ అనుకుంటాడు. అప్పుడు నేను బెట్ లో ఓడిపోయినట్టు అవుతుంది కదా.. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న రుద్ర నవ్వుకుంటూ ఇప్పుడు ఏం చేస్తావో చూస్తాను పాపా అనుకుని ఇంక వెళదామా అని పార్కింగ్ ఏరియా కి వస్తాడు. విహాన్ మిత్ర వాళ్ళ దగ్గరికి వచ్చి వెళదామా అనగానే... సార్ మేము ముగ్గురం ఒకే కారులో వస్తాము అని చెబుతుంది. విహాన్ రుద్రవంక చూస్తూ నాకు ఎటువంటి ఇబ్బంది లేదు మీ ఇష్టం అని భుజాలు ఎగరేస్తాడు. రుద్ర మాత్రం సైలెంట్ గా శాంభవి వైఫై చూస్తూ ఉంటాడు. శాంభవి రుద్ర వైపు చూసి ఇప్పుడు నేను ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఎవరి హెల్ప్ తీసుకున్న ఓడిపోయినట్టే అంటాడు. ఎవరు హెల్ప్ తీసుకోకుండా నేను రుద్ర కారులో వెళ్ళాలి అంటే... నా అంతటి నేనే చెప్పాలి. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ మిత్ర ఆ కారులో నలుగురే పడతారు కదా... ఐదుగురు వెళితే ఇరుగ్గా ఉంటుంది. ట్రాఫిక్ లో ఎప్పటికి వెళతామో ఏంటో తెలియదు కదా... సో నేను రుద్రా సార్ కారులో వస్తానులే. ఇంటికి వెళ్ళాక మనం మాట్లాడుకుందాం అని ఇంకా ఎవరి వైపు చూడకుండా వెళ్లి రుద్ర పక్కన నిలబడుతుంది. రుద్ర కన్నింగ్గా నవ్వుతూ పర్వాలేదు పాప బానే కవర్ చేసావు పద అని అంటాడు. శాంభవి పళ్ళు నూరుకుంటు రుద్రా వెనకాల వెళ్లి కారులో కూర్చుంటుంది. గౌతమ్ మాత్రం వెళుతున్న శాంభవి వైఫై చూస్తూ ఉంటాడు. విహాన్ గౌతమ్ ని కదిపి నీ ఫ్రెండ్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదు. నాది హామీ. తను కూడా నాకు చెల్లెలు లాంటిదే. లాంటిదేంటి చెల్లెలే. కాబట్టి నువ్వు టెన్షన్ పడకు. ఏదైనా ఇబ్బంది ఎదురవుతే నేను హ్యాండ్ల్ చేస్తాను. లలిత్ వాళ్లకి నేను చెబుతాను సరేనా పదండి అని కాల్ స్టార్ట్ చేస్తాడు. గౌతమ్ ఇంకా తప్పక సరే అని విహన్ వాళ్ళతో బయలుదేరతాడు ఇంటికి వెళ్ళగానే ఒకసారి శాంభవితో గట్టిగా మాట్లాడాలి అనుకుని సైలెంట్ గా కూర్చుంటాడు. విహాన్ మాత్రం ఒకసారి అంకుల్ వాళ్ళతో మాట్లాడి శాంభవిని రుద్రాతో వెళ్లేటట్టుగా చూడాలి. అప్పుడే వాళ్ల ప్రేమాయణం పట్టాలు ఎక్కుతుంది అనుకుని డ్రైవ్ చేస్తూ ఉంటాడు. వెళుతున్న కారులో నుంచి శాంభవి సైలెంట్ గా బయటకు చూస్తూ ఉంటుంది. ఏంటి పాప మాట్లాడడం లేదు అని కదుపుతాడు. నన్ను డిస్టర్బ్ చేయకండి మీరు కారులో రావాలి అన్నారు. వస్తున్నాను. ఇంకా ఎందుకు నన్ను కదుపుతున్నారు అని అడుగుతుంది. అంటే.. చిరాగ్గా ఉన్నావు కదా.. ఎందుకు ఆ చిరాకు అని.. ఓ నీ ఫ్రెండ్ కూడా నిన్ను చిన్నపిల్ల అన్నాడనా అని వచ్చే నవ్వుని ఆపుకుంటూ అడుగుతాడు. శాంభవి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ మీరు మా మాటలు విన్నారా అయినా మీరు మా చుట్టుపక్కల ఎక్కడా లేరు కదా ఎలా విన్నారు అని అడుగుతుంది. మీరు మాట్లాడుకుంది మన ఆఫీసులో. ఎక్కడకక్కడ సీసీలు ఉంటాయి పాప చూసుకోవాలి కదా..అవన్నీ మా కంట్రోల్ లో ఉంటాయి. అలాంటప్పుడు ఎవరు ఎక్కడ ఎలా మాట్లాడుకుంటున్నారు? ఏం చేస్తున్నారు అన్నది తెలియకుండా ఉంటుందా... మరి ఇంత చిన్న లాజిక్ కూడా మిస్ అయిపోతే ఎలా పాపా అంటాడు. అబ్బా మాటకు ముందు పాపా పాపా అని పిలవకండి. వింటుంటే ఏంటో నాకు నేనే చిన్నపిల్లనా అనే ఫీలింగ్ వస్తుంది . శాంభవి అని మాత్రమే పిలవండి అని గట్టిగా చెబుతుంది. నో నో అందరు పిలిచినట్టు నేను పిలిస్తే ఎలాగా.. నా దృష్టిలో నువ్వు ఎప్పటికీ పాపవే. రేపు మనకు అమ్మాయి పుట్టింది అనుకో.. అప్పుడు నువ్వు పెద్ద పాపవి. పుట్టిన అమ్మాయి చిన్న పాప అవుతుంది అంటాడు. నీకు ఈ పాప గోలేంటి. అప్పుడే మనకు పెళ్లయిపోయి పాప పుట్టినట్టు కూడా ఊహించేసుకుంటున్నారా అని అడుగుతుంది. చూసావా నువ్వు కూడా రైమింగ్ లోకి వచ్చేస్తున్నావ్ అంటే.. నేనెక్కడ వచ్చాను అని అనుమానంగా అడుగుతుంది. ముందు సార్ అని మాట్లాడేదానివి. తర్వాత మీరు అని మాట్లాడేదానివి. ఇప్పుడు ఇంకా నాకు క్లోజ్ అయ్యావు కాబట్టి నువ్వు అని మాట్లాడుతున్నావు అని ఐబ్లింగ్ చేస్తాడు. మీరు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు సార్ అంటుంది. కన్ఫ్యూజ్ చేయడం లేదు పాప. క్లారిటీ ఇస్తున్నాను. అసలే చిన్నపిల్లవు కదా.. ఇలాంటి విషయాలు ఎవరో ఒకరు చెబితేనే నీకు అర్థం అవుతాయి అని ఐస్క్రీం తింటావా అని అడుగుతాడు. హ... అని గట్టిగా అరుస్తూ నాకేమీ వద్దు. అదేంటి మీ ఊర్లో ఉండగా ఐస్ క్రీమ్ బండిని ఆపి మరి తినేదాని కదా. ఇక్కడ తినటానికి ఏం మాయరోగం అని అడుగుతాడు. నేను ఊర్లో ఐస్ క్రీమ్ తినేదాన్ని నీకు ఎలా తెలుసు అని అడిగితే.. నీ గురించి ఏ టు జెడ్ అన్ని తెలుసు. ఎందుకంటే నువ్వు నా ఫ్యూచర్ వైఫ్ కాబట్టి అని నవ్వుతాడు. హలో సార్ ఎక్కువ ఊహించేసుకుంటున్నారు. మన బెట్టు నెల రోజులు ఉంది. ఈలోపు నేను మీ లవ్ లో పడాలి. అప్పుడు పెళ్లిదాకా వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లోనే నేను మీ లవ్ లో పడను. అలాంటప్పుడు మీ ఫ్యూచర్ వైఫ్ని ఎందుకు అవుతాను. మనకు పాప ఎలా పుడుతుంది అని లాజిక్ గా అడిగాను అనుకుని సంబరపడిపోతుంది. రుద్ర సమాధానం ఏమిటి...
31-03-2026, 07:58 AM
Part - 42
ఎట్టి పరిస్థితుల్లోను మీ లవ్ లో పడను. అలాంటప్పుడు మీ ఫ్యూచర్ వైఫ్ని ఎందుకు అవుతాను. మనకి పాప ఎలా పుడుతుంది అని లాజిక్ గా అడిగాను అనుకొని సంబరపడిపోతుంది.
రుద్ర శాంభవి వైపు చూసి గుడ్ క్యూస్షన్ పాప. నిన్ను నేను ఒక క్వశ్చన్ అడుగుతాను దానికి సమాధానం చెప్పు అని అంటాడు. అడుగు అన్నట్టు సైగ చేస్తుంది.ఈ పొగరుకేమీ తక్కువ లేదు అనుకుని.. నువ్వు నా లవ్ లో పడవు అన్న ధీమా ఏమిటి అని అడుగుతాడు. నా మీద నాకున్న నమ్మకం అని చెబుతోంది. ఇంట్రెస్టింగ్ అని..అలాగే నా మీద నాకు నమ్మకం ఉంది నిన్ను లవ్లో పడేస్తాను అని. అంతెందుకు పొద్దున నీకు ఏమని చెప్పాను ... ఏమని చెప్పారు అని బుగ్గ మీద వేలు పెట్టుకుని ఆలోచిస్తుంది. తల మీద ఒకటి కొట్టి నీ అంతట నువ్వే కారు ఎక్కాలి ఎవరిని మనతో రానివ్వకూడదు అది నీ బాధ్యత అని చెప్పాను కదా అంటాడు. అవును కదా.. అందుకే కదా అలాగే వచ్చాను. ఒక సైడ్ కి స్మైల్ ఇస్తూ అది ఎవరు చెప్పారు.. ఎవరు చేశారు అని అడుగుతాడు. మీరు చెప్పారు నేను చేశాను అంటుంది. కదా... దీన్ని బట్టి నీకు ఏమి అర్థమైంది. ఏం అర్థం అవ్వాలి అని తిరిగి ప్రశ్నిస్తుంది... పైకి చూస్తూ ఒరేయ్ రుద్ర నీకెన్ని కష్టాలు వచ్చాయిరా... ఇంత బల్బులేని పిల్లని లవ్ చేసి లైఫ్ లోకి తెచ్చుకుంటున్నావు. అనుభవించు అని శాంభవి వైపు చూసి... నేను చెప్పే వాడిని నువ్వు ఫాలో అయ్యే దానివని దాని అర్థం అంటే.... ఫ్యూచర్లో నేను చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది అని దాని పూర్తి అర్థం పాప అని సాగదీస్తూ చెబుతాడు. అలా ఏమీ జరగదు. ఏ విషయంలో అయినా నీకు జరుగుతుందేమో గాని...నా విషయంలో జరగదు. నేను చెప్పిందే జరుగుతుంది అని పంతంగా ఉంటుంది. నీకు సంబంధించిన జరిగినాయి మీ ఊర్లో పాప. ఇక్కడికి వచ్చాక అంతా నా కంట్రోల్లోనే ఉంటుంది. అది నీ మట్టి బుర్రకు అర్థం కావడం లేదు.కానీ ఎప్పటినుంచో నువ్వు ఫాలో అయిపోతున్నావు. నేనా అని తన వైపుకు వేలు చూపించుకుంటుంది.. ఎస్ అని కళ్ళు అరుపుతాడు. హౌ అని అడుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా అంటాడు. చెప్పు అంటుంది. నువ్వు వచ్చిన కొత్తలో ఎక్కడున్నావు అని అడుగుతాడు. మా విష్ణు మామ ఇంట్లో అని చెబుతోంది. మరి మీ విష్ణు మామ ఉండగా నువ్వు ప్రతి నెల చేసే హోమం ఎక్కడ జరిగింది అని అడుగుతాడు. రుద్రవైపు అనుమానంగా చూస్తూ దేవేంద్ర సార్ వాళ్ళ ఇంట్లో అని చెబుతుంది. హోమం అయిపోయిన తర్వాత మీ విష్ణు మామ ఇంటికి ఎందుకు వెళ్లలేదు అని మళ్ళీ తిరిగి ప్రశ్నిస్తాడు. సార్ మా తాతగారు వాళ్ళని బ్రతిమాలారు అని ఇక్కడ ఉన్నాను అని... అది కూడా నీ ప్లాన ఏమిటి అని అనుమానంగా అడుగుతుంది. అంత అనుమానం అక్కర్లేదు పాప అదే కన్ఫామ్ అని ఒక స్మైల్ ఇస్తాడు. ఎందుకు చేసావు అని కోపంగా అడుగుతుంది చెప్పాను కదా నా ఫ్యూచర్ వైఫ్ అని. మరి నా వైఫ్ ని నా ఎదురుగుండా పెట్టుకోవాలి కదా అంటాడు. అవునా.. నీ ఫ్యూచర్ వైఫ్ ను అయితే..నీ ఇంట్లో పెట్టుకోవాలి కానీ మీ మామ ఇంట్లో ఎందుకు ఉంచినట్టు అని సాగదీస్తుంది. ఏ మాటక ఆ మాట చెప్పుకోవాలి కానీ నువ్వు పెద్ద కోషన్ బ్యాంక్ కదా అని అంటాడు టాపిక్ డైవర్ట్ చేయకుండా నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అంటుంది. ఆ మాటలికి సిగ్గుపడుతూ... పెళ్ళి అవ్వకుండా మన ఇంటికి వెళ్లితే బాగోదు కదా... అందుకే మామ ఇంట్లో ఉంచాను. నీ కోసం నేను కూడ అక్కడే ఉంటాను. నువ్వు నన్ను మిస్ అవ్వకుండా చూసుకుంటాను సరేనా పాప అనగానే... అయ్యే నీ మొఖానికి సిగ్గు కూడానా... చూడలేక చస్తున్నాను. ముందు ఆ సిగ్గు పడటం మానేయ్ బాబు అని తల కొట్టుకుంటుంది. మీ ఆయన సిగ్గుపడుతుంటే బాగోలేదా..పొగరుగా ఉంటేనే బాగుంటుందా..అలాగే పాపా అంటాడు. ఇదిగో పాపా పాపా అనొద్దని ఎన్నిసార్లు చెబుతున్నారు నీకు. ఆ పిలుపు వింటుంటేనే నాకే ఏదోలా ఉంది అని అరుస్తుంది. నాకు మాత్రం చాలా బాగుంది. చిన్నప్పటినుంచి నువ్వు నా దగ్గరే పెరిగి ఉంటే ఇంకా ఎలా పిలిచేవాడినో అని అంటాడు. నీ దగ్గర నేనెందుకు పెరుగుతాను నేను ఏమన్నా నీ మేనమామ కూతుర్నా.. ఏమిటి ? ఏమో అవునేమో అంటాడు. అలా ఎలా అవుతుంది? నేను ఉంది రేపల్లె. నువ్వు ఉన్నది హైదరాబాదు. ఇప్పుడు దాకా మా నాన్న ఎవరో నీకు తెలియదు. అలాంటప్పుడు నీ మేనమామ కూతుర్ని నేను ఎలా అవుతాను అని టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకు వెళుతుంది. మీ ఆడవాళ్ళ దగ్గర ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటది అది ఏంటో తెలుసా అంటాడు. ఏం క్వాలిటీ అని అడుగుతుంది. గుడ్ క్యూస్షన్ పాపా... టాపిక్ లో మెయిన్ పాయింట్ వదిలేసి తోక పట్టుకుని వెళుతూ ఎక్కడికో వెళ్ళిపోతారు. ఆ తోకతోనే గొడవకి దిగుతారు. అది మీ ఆడవాళ్ళకే కదా సాధ్యం అంటాడు. అంటే మీరేమో మెయిన్ పాయింట్ తో ముందుకు వెళుతూ ఉంటే...మేమేమో తోక పట్టుకుని గొడవలకు దిగుతామనా నీ ఉద్దేశం అని అడుగుతుంది. ఎగ్జాక్ట్లీ పాప అని ముక్కు మీద వేలుతో టాప్ చేస్తాడు. మీకు ఎన్ని సార్లు చెప్పాను నన్ను టచ్ చేయవద్దు అని నాకు ఇలా బయట వాళ్ళు టచ్ చేస్తే అస్సలు నచ్చదు అని ఆ వేలిని ఇసురుకొడుతుంది. నిజమే బయట వాళ్ళు టచ్ చేస్తే బాగోదు కానీ.. నీ కాబోయే మొగుడు టచ్ చేస్తే కూడా ఫీల్ అవ్వలేకపోతున్నాను. అసలు నీలో రసగ్రంధులు ఉన్నాయా అని డౌట్ గా చూస్తాడు. ఏయ్ ఏంటా చూపు.. నాలో ఏ గ్రంధులు ఉంటే నీకెందుకు..లేకపోతే నీకెందుకు.. అవన్నీ ఎవరి దగ్గర చూపించాలో వాళ్లకే చూపిస్తాను గానీ ఇలా బయట వాళ్లకి కాదు అని అంటుంది. అయ్యో పాప ఎన్నిసార్లు చెప్పినా అదే మాట. నువ్వు చూపించాల్సిందే నాకు. అవి బయటకు తీసుకు రావడానికి కదా నా తిప్పలు అన్ని. నాకు ఒక డౌటు నీకు కాలేజీలో ఎవరైనా సైట్ కొట్టారా..పోనీ ఎట్ లిస్ట్ క్రష్ ఫీలింగ్, లెటర్ ఇవ్వడం అలాంటివి అని అడుగుతాడు. చి చి అలాంటివి ఎవరైనా చేస్తారా అని అంటుంది. అందుకే అన్నాను నీలో రసగ్రంధులు లేవని. అది అర్థమయ్యే ఎవరు నీకు లవ్ లెటర్ ఇవ్వడం లేదు ప్రొపోజ్ చేయలేదు అని అంటాడు. అలా నువ్వు అనుకున్నట్టుగా ఏమీ లేదు. మా కాలేజీ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది అని గర్వంగా చెబుతుంది. ఓ అవునా... మీ ఫ్రెండ్ ఉన్నది కదా తన పేరు ఏంటి అని అడుగుతాడు. మిత్ర అంటుంది. హ.. మిత్రని అడుగు ఎవరైనా ప్రపోజ్ చేశారో లేదో అప్పుడు చెప్పు పాప అంటాడు. ఇంటికి వెళ్ళగానే అడుగుతాను నువ్వు చూస్తూ ఉండు నీకు నేను జవాబు చెబుతాను అంటుంది ఐ యాం వెయిటింగ్ పాప అంటాడు. ఇంకా ఎంత చెప్పినా వినడు అని సైలెంట్ అయిపోయి విండోలో నుంచి బయటకు చూస్తుంది. ఇంతలో కార్ సడెన్ బ్రేక్ తో ఆగుతుంది. ముందుకి పడి డాష్ బోర్డుకి కొట్టుకుపోతున్న శాంభవి తలకి,డాష్ బోర్డుకి మధ్యలో చెయ్యి అడ్డుపెట్టి పొద్దున్నే చెప్పాను కదా.. సీట్ బెల్ట్ పెట్టుకోమని పెట్టుకోకపోతే ఎలా పాపా అని స్మూత్ గా చెబుతూ ఎదురుగుండా ఎవరు ఉన్నారో చూస్తాడు. ఎదురుగుండా ఆశా, నిషా నిలబడి ఉంటారు. ఉఫ్.. మంచి రొమాంటిక్ మూడ్ లో ఉన్నప్పుడు వీళ్ళ నసా ఒకటి అనుకుంటూ...విండో గ్లాస్ దించి ఏంటి మీ గోల అని అడుగుతాడు. ఇద్దరు అక్కడి నుంచుని ఏంటి రుద్ర మ్యారేజ్ ఫిక్స్ అయిందంట కదా అని అనుమానంగా అడుగుతారు. ఓ ఈ న్యూస్ అప్పుడే మీ దాకా వచ్చిందా అని అడుగుతూనే... శాంభవి చేయ మీద వేసి ఆ చేతిని గట్టిగా పట్టుకుంటాడు. శాంభవి ఏదో మాట్లాడదాం అనుకునే లోపు రుద్ర సీరియస్ గా ఒక చూపు చూస్తాడు. వెంటనే శాంభవి సైలెంట్ అయిపోతుంది. మనసులో మాత్రం ఇప్పటిదాకా చాలా సరదాగా మాట్లాడాడు. ఇప్పుడు ఏంటి ఎంత సీరియస్ గా ఉన్నాడు. ఏమై ఉంటుంది అని వాళ్ళ వంక చూస్తూ ఉంటుంది. మేటర్ తెలిసింది కదా ఇంత వెళతారా అంటాడు. క్లియర్ గా కనిపించని శాంభవిని తలవంచుకుని చూస్తూ ఉంటే... ఎందుకు అలా చూస్తున్నారు నా వైఫ్ కి దిష్టి తగులుతుంది అంటాడు. ఆ మాటకి శాంభవి పళ్ళు నూరుతూ ఉంటే.. ఆశ,నిషా ఈర్షతో రగిలిపోతూ ఉంటారు. మా చూపు మరీ అంత దిష్టి చూపేమి కాదులే రుద్ర. మాకన్నా ఎందులో ఎక్కువో మాకు తెలియాలి కదా అని అడుగుతారు. దానికి మీరు చూడవలసిన పనేముంది నేను చెబుతాను వినండి. ఫస్ట్ గుణంలో మీ కన్నా ఎక్కువ. పద్ధతిలో మీ కన్నా ఎక్కువ. చదువులో మీ కన్నా ఎక్కువ . అందంలో అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు.మా అత్త పోలికే అనుకో.. ఇది అది అని చెప్పలేను గాని నా పెళ్ళాం సూపర్ కే సూపర్ సరేనా అని చెప్పి ఒక్కసారిగా కారు స్పీడ్ అందుకుంటాడు. ఆ. స్పీడ్ కి ఇద్దరు పక్కకి తూలి పడతారు. కారు ముందుకి దూకగానే రుద్ర చేతులో నుంచి చేయి లాక్కుని అసలు ఏంటి నీ దౌర్జన్యం. నా చేతిని అంత చొరవగా పట్టుకుంటావు అయినా నేను మీ అత్త పోలిక. మా అమ్మ ని అసలు సరిగ్గా చూసావా అని గట్టిగా అరుస్తుంది. దానికి రుద్ర సమాధానం ఏమిటి... కథ కొనసాగుతుంది....
31-03-2026, 04:55 PM
Sooperooo sooper undi.. bava maradalla sarasam!!
01-04-2026, 07:47 AM
Part - 43
మా అమ్మ ని ఎప్పుడు అయినా చూసావా.. చూసింది రెండు సార్లు. నువ్వు ఎలా చెప్పగలవు నేను మా అమ్మలా ఉంటాను అంటావు.
రుద్ర ఒకసారి చూసి, అత్తయ ఎలా ఉంటుందో నీ కన్న నాకే బాగా తెలుసు. మన పెళ్లి అయ్యాక నువ్వే ఒప్పుకుంటావు. లేదు, లేదు నేను మా నాన్నలా ఉంటాను అని గొడవ చేస్తూ ఉంటుంది. ఓరిని నీ నాన్న పిచ్చి.... పాప అని పిలుస్తాడు. ఏమిటి అని గట్టిగ అరుస్తుంది. అబ్బా ఎందుకే.. ఆ అరుపులు... ఇప్పుడు నేను ఏమి అన్నాను. పాప అని పిలవద్దు అన్నానా అని వేలు చూపిస్తుంది. ఏయ్ వేలు దించు. నాకు ఆలా చూపిస్తే పిచ్చ కోపం వస్తుంది అనగానే... కదా... నాకు అంతే.. పాప అని పిలిస్తే నాకు అలానే ఉంది. నువ్వు నన్ను ఆలా పిలవకు. నీకు నేను చూపించను. పరవాలేదు పాప నువ్వు ఏమి చూపించిన నాకు ఇబ్బంది ఏమి లేదు అని మళ్ళీ టీసింగ్ మూడ్ లోకి వెళతాడు. నీలో ఏమైనా స్ప్లిట్ పర్సనాలిటీ ఉందా... అప్పుడే సీరియస్ గా ఉంటావు. వెంటనే ఇలా మాట్లాడుతావు అనగానే... ఎవరి దగ్గర ఎలా ఉండలో నాకు తెలుసు పాప అంటూ కార్ బ్రేక్ వేస్తాడు. ఏమైంది అనగానే... నాతో మాటల్లో పడి ఇల్లు వచ్చిన సంగతి కూడ మర్చిపోయావు. అంతలేదు.. నేను చూసాను అని కార్ దిగి లోపలికి వెళ్ళుతుంది. శాంభవి కోసం ఎదురు చూస్తూ ఉన్న రాఘవేంద్రగారు వచ్చేసావా బంగారం అని ఎదురు వెళతారు. నేను వస్తున్న ఉండండి అని పరిగేత్తుకుని వెళ్ళుతుంది. ఎలా జరిగింది తల్లి ఈ రోజు అనగానే అంత బాగానే జరిగింది. కొన్ని డిస్టర్బ్ తప్ప అని రుద్ర ని గుర్తు చేసుకుంటూ.. అప్పుడే లోపలికి వస్తున్న రుద్ర ఆ మాటలు విని తన గురుంచే అని అర్ధం అయ్యి నవ్వుకుంటూ వచ్చి... ఏమిటో ఆ డిస్టర్బ్ చెబితే రేపటి నుండి అవి లేకఉండా చేస్తాను తాతగారు అని వెళ్లి వాళ్ళ తాతగారి పక్కన కూర్చుంటాడు. రుద్రాన్ని చూసి పళ్ళునూరుతూ అంతగా పెద్దవేమి కాదులేండి. నేను సాల్వ్ చేసుకోగలను. ఫ్రెష్ అయ్యి వస్తాను తాతగారు అని రూమ్ కి వెళ్ళిపోతుంది. వెళుతున్న శాంభవి ని చూస్తూ ఇద్దరు నవ్వుకుంటూ మరీ ఎక్కువగా నా మనవరాలను ఇబ్బంది పెట్టకురా అని అంటారు. నేనేమీ ఇబ్బంది పెట్టడం లేదు తాతగారు.అసలు ప్రపంచమే తెలియకుండా పెరిగింది. తన ప్రపంచమంతా తన ఇల్లు, ఆ ఊరు అంతే . శాంభవి కి వాళ్ళ ఫాదర్స్ తో ఎంత భయంకరమైన అటాచ్మెంట్ ఉందంటే.. ఓ మై గాడ్ అని కార్ లో జరిగిన ఇన్సిడెంట్ చెబుతాడు. రాఘవేంద్ర గారి ఆలోచిస్తూ ఉంటారు. ఏమైంది తాతగారు అంటే... రేపున్న రోజున శాంభవికి నిజం తెలిస్తే తట్టుకోగలుగుతుందా... ఆ కుటుంబం ఏమైపోతుంది... ఇక్కడ నా కొడుకు ఏమైపోతాడు భగవంతుడా ఏమిటయ్యా మాకు ఈ పరీక్ష అని బాధగా కళ్ళు మూసుకుంటారు. రాఘవేంద్ర గారి భుజం మీద ఏదో స్పర్శ తగిలేటప్పటికి కళ్ళు తెరిచి చూస్తారు. అక్కడ దేవేంద్ర నిలబడి ఉంటాడు. ఎందుకు నాన్నగారు అంత బాధ పడుతున్నారు. నేను ఎప్పటినుంచో రాయి లాగానే బ్రతుకుతున్నాను. నాకు కూతురు ఉంది. నా ఎదుటే ఉంది. నాకు అంతే చాలు. నేను ఎవరో తనికి తెలియకపోయినా పర్వాలేదు కానీ... తన కన్నీళ్ళకి మాత్రం నేను కారణం కాకూడదు. ఏ జన్మలో ఎంత భయంకరమైన పాపం చేసుకుంటే.. ఇలాంటి పాపాత్మురాలు కడుపున పుట్టాను. అందుకనే దేవత లాంటి భార్యని దూరం చేసుకున్నాను. బంగారం లాంటి కూతురుతో నాన్న అని పిలిపించుకోలేకపోతున్నాను. ఇంకా అక్కడ ఉండలేక స్పీడుగా తన గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకుంటారు. ఈ మాటలు విన్న అనసూయ గదిలోకి వెళ్లి తలుపు వేసుకొని అక్కడే జారబడి కింద కూర్చుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంటుంది. నిజంగానే నేను పాపాత్మురాలని. అందుకే నా కొడుకు సంతోషాన్ని నా చేజేతులారా దూరం చేశాను. అన్నీ ఉన్నాయి. కానీ ప్రశాంతత లేదు. సంతోషం లేదు. నా వల్ల నా కుటుంబం మొత్తం ఎప్పుడు దుఃఖంలోనే ఉంటుంది. భగవంతుడా నేను ఒక్కదాన్నే చేసిన పాపానికి నా కుటుంబం మొత్తానికి శిక్ష వేయాలా... ఆ శిక్ష నాకు వేసి నన్ను తీసుకువెళ్ళుపో అని ఏడుస్తూ ఉంటుంది. వెళుతున్న కొడుకుని చూసి రాఘవేంద్రకి చాలా బాధగా అనిపిస్తుంది. తన పెద్దరికం పైకి ఏడవనివ్వదు. అలాగని వయసు లోపల బాధని దాయనివ్వదు. పూజ గది వైపు చూసి ఎన్నాళ్ళు తల్లి నా కుటుంబాన్నికి పరీక్ష. ఎప్పుడు కనికరిస్తావు తల్లి అని బాధగా కళ్ళు మూసుకుంటారు. రుద్ర వాళ్ళ తాతగారు భుజం మీద చెయ్యి వేసి మీరు ఎమి బాధపడకండి తాతగారు. నేనున్నాను కదా... అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి... మన కుటుంబాలని సంతోషంగా ఉంచే బాధ్యత నాది. నన్ను నమ్మండి అని చెబుతాడు. నా భరోసా మొత్తం నా మనవళ్ళు రా... మీరందరూ ఉన్నారు కదా... అదే నాకు దైర్యం. వాకింగ్ చేసి వస్తాను అన్ని గార్డెన్లోకి వెళతారు. రుద్ర ఏం చేయాలని మాత్రం సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటాడు. రూమ్ లోనికి వెళ్లిన శాంభవి ఫ్రెష్ అయ్యి మిత్ర కోసం చూస్తూ ఉంటుంది. మిత్ర రాగానే తొందరగా ఫ్రెష్ అయ్యి రా..నీతో ఒక విషయం మాట్లాడాలి అని కంగారుగా బాత్రూంలోనికి తోస్తుంది. ఏమైంది దీనికి అనుకుంటూనే ఫ్రెష్ అయ్యి వచ్చి..చెప్పు ఎందుకు అంత కంగారుగా ఉన్నావు అని అడుగుతుంది. నిన్ను ఒక విషయం అడుగుతాను ఏదీ దాయకుండా నిజం చెబుతావా అని శాంభవి అడుగుతుంది. నీ దగ్గర దాయాల్సిన అవసరం ఏముంటుంది అడుగు చెబుతాను మిత్ర భరోసా ఇస్తుంది. మన కాలేజీలో నీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా అని అడుగుతుంది. ఆ ప్రశ్న వినగానే మిత్ర ఆశ్చర్యంగా ఏమడుగుతున్నావ్ అని అంటుంది. అదే ప్రపోజ్ చేయడం గాని, లెటర్స్ ఇవ్వడం గానీ అలాంటి ఏమైనా చేశారా అని అడుగుతుంది. నువ్వు బాగానే ఉన్నావా అని నుదటి పైన చెయ్యి పెట్టి చూస్తుంది. నేను బాగానే ఉన్నాను కానీ అడిగిన దానికి మాత్రం సమాధానం చెప్పు అంటే.. ఇప్పుడు ఎందుకు నీకు అంత పెద్ద డౌటు వచ్చింది అని అనుమానంగా చూస్తుంది. నా అనుమానం తర్వాత అడిగిన దానికి చెప్పవే బాబు అంటే.. హ్మ్... అవి కామన్ కదా.. దాని గురించి ఎందుకు అంత కంగారు నీకు అంటే... ఏంటి కామన్నా అంటే...ఎంతమంది లెటర్స్ ఇచ్చారు నీకు... మిత్ర బుగ్గ మీద వేలు పెట్టుకుని ఆలోచిస్తూ ఒక 10 నుంచి 20 మధ్యలో లెటర్స్ వచ్చాయి అనుకుంటా అని అంటుంది. ప్రపోజల్ అయితే ఒక నలుగురు చేశారు అని చెబుతుంది. మరి మన కాలేజీలో మిగిలిన అమ్మాయిలకి అంటే.. నాకు తెలుసి మన ఫ్రెండ్స్ బ్యాచ్ లో అందరికీ ఇంచుమించుగా లెటర్స్ వచ్చాయి అని చెబుతోంది. మరి నాకు ఎవరూ లెటర్స్ ఇవ్వలేదు ఏంటి అని అడుగుతుంది. ఏమిటి అని గట్టిగా అరుస్తుంది. ఏయ్ మిత్ర ఎందుకు అంతలా అరుస్తున్నావు అంటే.. నువ్వు అడిగింది ఎలాగుంది మరి... నీకు ఎవరైనా లెటర్స్ ఇస్తారా.. ఇస్తే మాత్రం నీకు ఏమైనా అర్థమవుతుందా అని నాలుక కర్చుకుంటుంది. అంటే ఏంటి నీ ఉద్దేశం నాకు లెటర్ కూడా అర్థం కాదా అని కోపంగా అడుగుతుంది. నీకు లెటర్ ఎందుకు అర్థం కాదు.. బాగా అర్థమవుతుంది కానీ... దాని మీనింగ్ అర్థం కాదు కదా... ఆ ఫీల్ ని ఎంజాయ్ చేయలేవు కదా అని అంటుంది. మీరు ఎంజాయ్ చేసినప్పుడు నేను ఎందుకు ఎంజాయ్ చేయలేను అని ఉక్రోషంగా అడుగుతుంది. ఇలా చెబుతున్నానని ఫీల్ అవ్వద్దు. నీది చిన్నపిల్లల మనస్తత్వం శాంభవి. అందుకే అందరికన్నా నువ్వే అందంగా ఉన్న... ఎవరూ నీకు ప్రపోజ్ చేయలేదు. నీలో అందరికీ ఒక చిన్న పిల్ల కనిపిస్తుంది అని చెబుతుంది. వెంటనే రుద్ర మాటలు గుర్తొచ్చి ఆ... అని గట్టిగా అరుస్తుంది. ఏమైంది శాంభవి నువ్వు బాగానే ఉన్నావా అని అడిగితే... నేను బాగానే ఉన్నాను నన్ను కాసేపు వదిలేసేయ్ అని బాల్కనీలోకి వెళ్లి నిలబడుతుంది. అక్కడ గార్డెన్లో రాఘవేంద్ర గారు వాకింగ్ చేస్తూ ఉంటారు. ఆయన్ని చూడగానే నవ్వుకుంటూ కిందకి వెళ్ళిపోతుంది. కౌసల్య పిల్లలందరికీ స్నాక్స్ ప్రిపేర్ చేపించి జ్యూస్ కూడా ఎవరి రూమ్స్కి వాళ్ళకి పంపిస్తుంది. శాంభవి గార్డెన్ లో ఉందని అక్కడికి పట్టుకుని వెళుతుంది. శాంభవి కోసమని జితేంద్ర కూడా తొందరగానే ఆఫీస్ నుంచి వచ్చేస్తాడు. దేవేంద్ర కూడా కాస్త కుదుటపడి గార్డెన్ లోకి వస్తాడు. వాళ్లందరికీ అక్కడికే తీసుకువచ్చి సర్వ్ చేస్తూ ఉంటుంది. కౌసల్య అందరికీ ప్లేట్స్ ఇచ్చేసి శాంభవికి తినిపించడానికి కూర్చుంటారు. పర్వాలేదు అంటే నేను తింటాను అని ఇబ్బందిగా చెబితే.. నీకేం తినడం వచ్చు నువ్వు అసలే చిన్నపిల్లవి అని తినిపిస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన రుద్ర ఆ మాటలకి నవ్వాపుకుంటూ ఉంటాడు. శాంభవి కి మాత్రం రుద్రనే అలా చూడగానే ఇంకా ఉడుక్కుంటూ ఉంటుంది. నేనేమీ చిన్నపిల్లను కాదు ఆంటీ. నేనే తింటాను అని ప్లేట్ తీసుకుంటుంది. ఈలోపు మిగిలిన కుర్ర బ్యాచ్ కూడా వచ్చే జాయిన్ అవుతారు. రుద్ర సైలెంట్ గా శాంభవి పక్కకి వచ్చి మీ ఫ్రెండ్ ని అడిగావా అని అడుగుతాడు. హ అంటుంది. ఏమని చెప్పింది మీ ఫ్రెండ్ అని సాగదీస్తాడు. ఇప్పుడు మీకు అవసరమా అని రుసరసలాడుతుంది. అయ్యో తెలుసుకోమనే కదా నీకు చెప్పింది. మరి తెలుసుకున్నది నాకు చెప్పాలి కదా.. అప్పుడే కదా ఎవరు అన్నది నిజమో తెలుస్తుంది. శాంభవి కి చెప్పడం ఇష్టం లేక తాతగారండి అని పిలుస్తుంది. చెప్పమ్మా అని శాంభవి వైపు చూస్తారు. రుద్ర నుంచి తప్పించుకోవడానికి పిలిచిందే గాని ఏమని మాట్లాడాలో తెలియక దిక్కులు చూస్తూ ఉంటుంది. శాంభవి పరిస్థితి ఏమిటి..
01-04-2026, 07:48 AM
Part - 44
చెప్పు శాంభవి అనగానే ఏం చెప్పాలో తెలియక అది... అది అని ఆలోచిస్తూ తికమక పడుతూ ఉంటుంది. రుద్ర నవ్వుతూ చెప్పు శాంభవిఎందుకో పిలిచినట్టు ఉన్నావు కదా తాత గారిని అంటే...
హ.. తాతగారు మీరు ఎక్కడి నుండి వచ్చారు.పూర్వం నుంచి ఇక్కడే ఉన్నారా అని ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. దానికి రాఘవేంద్ర గారు నవ్వుతూ లేదమ్మా పూర్వం ఇక్కడ ఉండే వాళ్ళం కాదు. మా తాతగారు హయాం నుంచే ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాము. మనల్ని నమ్ముకుని ఒక గ్రామమే ఉంది. అందుకే మన కంపెనీస్లో వచ్చే ప్రాఫిట్ నుంచి కొంత పర్సంటేజ్ తీసి ఆవూరు డెవలప్మెంట్ కోసమే వాడుతున్నాము అని చెబుతారు. నేను చూడొచ్చా ఆ ఊరు అంటే తప్పకుండా తల్లి. ఈ దేవీ నవరాత్రులకు నిన్ను అక్కడికి తీసుకువెళ్లి అమ్మవారికి నీతో పూజ చేపిస్తాను అని చెబుతారు. హమ్మయ్య టాపిక్ డైవర్ట్ అయిందనుకుని సరే తాతయ్య గారు నేను మా నాన్నగారికి ఫోన్ చేసి వస్తాను అని చెప్పి అక్కడి నుండి మెల్లిగా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్న శాంభవిని చూసి రుద్ర నవ్వుకుంటూ తప్పించుకోవడానికి బానే ప్లాన్లు వేస్తున్నావే అని తాతగారు వైపు చూస్తూ... ఏంటండీ అప్పుడే దేవి నవరాత్రులు కి ముహూర్తం పెట్టేసారా అంటే... నాకెందుకో ఆ గుడి లోనే మీ ఇద్దరికీ వివాహం అయిపోతుంది అని చాలా గట్టిగా అనిపిస్తుంది రుద్ర అంటారు. దానికి రుద్ర ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైంది రుద్ర అంత మౌనంగా ఉన్నావు అంటే... ఏమీ లేదు మీరు ఇప్పుడే దేవీ నవరాత్రులు కి ముహూర్తం పెట్టేశారు. ఇంకా శాంభవికి ఏమి తెలియదు ఆ తర్వాత పరిస్థితి ఏమిటో ఆలోచిస్తున్నాను అంతే అని చెప్పి నా కొద్దిగా వర్క్ ఉందని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. రుద్ర పక్కకు వెళ్లి ఫోన్ చేసి ఎంతవరకు వచ్చింది అని అడుగుతాడు. ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేసేసాము సార్ అని ఫోన్ పెట్టేస్తారు. విహాన్ వచ్చి, ఏమిటి బావ ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నావు అంటే... మనకి తగులుకుంటున్న జిడ్డు మొహాల్ని దారి మళ్ళిస్తున్నాను అంతే అని చెబుతాడు. నువ్వు దారి మళ్ళిస్తున్నాను అంటే అక్కడ ఎటో తిరుగుతూ ఉండి ఉండాలి అంటే వెయిట్ చెయ్ చూద్దాం.. ఏం జరుగుతుందో అని రూమ్ కి వెళ్ళిపోతాడు. ఆశ, నిషా రుద్ర చేసిన అవమానం తట్టుకోలేక రెగ్యులర్గా వెళ్లే పబ్ కి వెళ్లి తాగుతూ ఉంటారు. ఆశ నిషా తో తాగుతూ ఏంటే అది మనకన్నా అందంగా ఉంటుందా... పద్ధతి అంట పద్ధతి. పద్ధతిగా ఉండి ఏం చేయాలి అంట... 6 గజాలు చీర కట్టుకొని నుదుటిని పెద్ద బొట్టు పెట్టుకుని దేవుడి గదిలో పూజలు చేస్తూ ఉండాలా... మన గ్రానీ, వాళ్ళింట్లో వాళ్ళు చేస్తుంది అదే కదా ఎవరైనా మనశ్శాంతిగా ఉన్నారా... మనలాగా ఎంజాయ్ చేయగలుగుతున్నారా... అని తాగిన మత్తులో ఏదేదో వాగుతూ ఉంటారు. వాళ్ళిద్దరికీ కొంచెం దూరంగా ఇద్దరు అబ్బాయిలు బార్ కౌంటర్ దగ్గర కూర్చుని.. వాళ్లకి కావలసిందే ఆర్డర్ ఇస్తూ ఆ రుద్ర ఏమనుకుంటున్నాడు రా..... మనల్ని అంత చీప్ గా చూస్తున్నాడు. మనం తలుచుకుంటే ఈ భూపతి, గజపతులు ఫ్యామిలీని చిటికె వేసే టైం లో లేపేయగలను. ఏదో తాతగారు ఆపుతున్నారు అని ఆగుతున్నాను గాని లేకపోతే నా... ఈపాటికి వాళ్ళు అంత చూసే వాళ్ మని వాళ్ళకి ఆర్డర్ ఇచ్చిన ఐటం రాగానే తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ మాటలు విన్న ఆశ, నిషా మనకి ఏదో ఉపయోగపడేటట్టు ఉంది అనుకుంటూ.. తూలుతూ వాళ్ళ దగ్గరికి వెళ్లి ఎక్స్క్యూజ్మీ అని పిలుస్తారు. వాళ్లు విసుగ్గా వెళ్లి వైపు తిరిగే ఏంటి అని అంటారు మీరు ఎవరు గురించి మాట్లాడుకుంటున్నారు ఆ రుద్ర దేవాన్ష్ గజపతి గురించా అని అడుగుతారు. అవును అయితే ఏంటి అంటే... ఆ రుద్ర మీకు ఎలా తెలుసు..ఎప్పటినుండి శత్రువు అని ఆత్రంగా అడుగుతారు. అవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు.ఇది మా ఫ్యామిలీ స్టేటస్ కి సంబంధించిందని పొగరుగా మాట్లాడుతారు. నిషా నవ్వుతూ అయ్యో మాకు కూడా రుద్రా అంటే పడదు. శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతాడు కదా...ఆ ఉద్దేశంతోనే మిమ్మల్ని అడుగుతున్నాము. మనం కలిసి ఆ రుద్రను ఏమైనా చేయొచ్చు కదా అని అంటే... మిమ్మల్ని ఎలా నమ్మేది అని వాళ్ళ అనుమానంగా అడుగుతారు. వాళ్లు తాగుతున్న గ్లాస్ చూసుకుంటూ ఎవరైనా తాగుతూ అబద్ధాలు చెబుతారా... నిలకడగా ఉన్నవాడు నిజాలు దాసేస్తాడు కానీ... మందు మీద ఉన్నవాడు అన్ని నిజాలు బయటికి కక్కేస్తాడు. నీకు అంతగా అనుమానం గా ఉంటే చూడు నీ ముందే నేను ఒక ఫోన్ చేస్తాను అని నిషా వాళ్ళ అమ్మకి కాల్ చేస్తుంది. జ్యోతి గారు ఫోన్ లిఫ్ట్ చేసి ఎక్కడున్నావు నిషా అని కోపంగా అడుగుతారు. కూల్ మమ్మీ... ఎందుకంత కోపంగా ఉన్నావు అంటే.... మీరు చేసే పనులకు కోపం రాక ముద్దు పెట్టుకోవాలా అనగానే...పక్కనున్న ఇద్దరు అబ్బాయిలు ముసిముసగా నవ్వుకుంటారు. తాగిన మత్తులో ఉన్న నిషా తర్వాత నన్ను ముద్దు పెట్టుకుందాగాని.. అమ్మ ఇక్కడ ఒక సీన్ జరుగుతుంది. ఏం చేయమంటావో చెప్పు అని.. రుద్ర నా ముందు ఉన్నాడు. వెళ్లి అందరి ముందు రుద్రని హగ్ చేసుకుని కిస్ పెట్టుకుందాము అనుకుంటున్నాను. అప్పుడు రుద్ర నన్నే పెళ్లి చేసుకుంటాడు కదా ఎలా ఉంది నా ఐడియా అని అడుగుతుంది. వెంటనే జ్యోతి గారు రుద్ర షూ తో నీ బుగ్గ మీద ముద్దు పెడతాడు. అప్పుడు అందరి ముందు ఆ షూ తో నీకు పెళ్లి చేస్తాడు సరిపోతుంది అని విసుగ్గా అంటారు. నిషా నవ్వుతూ గుడ్ సజెషన్ మమ్మీ. థాంక్యూ...ఐ లవ్ యు.. బాయ్ బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. అబ్బాయిలు ఇద్దరే వంక చూస్తూ ఇప్పుడు అర్థమైంది కదా అని అంటే... నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు.. ఫోన్లో నువ్వు మమ్మీ అని పిలుస్తున్న ఆవిడేమో ఇంకోలాగా మాట్లాడుతున్నారు అంటే... మా మమ్మీ పాత సినిమాలో సెంటిమెంట్ అమ్మలాంటిది. న్యాయం ధర్మం అనుకుంటూ ఆ రుద్ర వైపే మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి మీరిద్దరూ మాతో చేతులు కలుపుతారా అని అడుగుతారు. ఇక్కడ ఎందుకు మాట్లాడుకోవడం మా గెస్ట్ హౌస్ కి వెళ్లి మాట్లాడుకుందాం పదండి అని చెప్పి నలుగురు ఒకే కారులో గెస్ట్ హౌస్ కి చేరుకుంటారు. డోర్ తీసుకు లోపలికి వెళ్లి కూర్చుని ఇంతకీ మీ ఇద్దరి పేర్లు చెప్పలేదు అనే ఆశ అడుగుతుంది. మా పేర్లు ఏంటో తెలియకుండా ఆరుద్ర ఫ్యామిలీ మీద ఉన్న పగతో మా వెనుక వచ్చేసారా అని ఆశ్చర్యంగా అడుగుతారు. పగ కన్నా ఏది ముఖ్యం కాదు.దాని తర్వాత ఏదైనా సరే... ఇంతకీ మీ పేరు ఏంటి అని మళ్ళీ అడుగుతారు. ఆనంద్, విహారి అని చెబుతారు. మీ పేర్లు మీలాగానే బాగున్నాయి. ఇంతకీ మీ తాత గారి పేరేంటి అని అడుగుతారు. అన్ని మమ్మల్ని అడుగుతున్నారు కానీ మీ డీటెయిల్స్ ఏమీ చెప్పరేంటి..ఇంతకీ మీకు వాళ్ళకి ఉన్న పగంటి అని తిరిగి ప్రశ్నిస్తారు. అబ్బో అది చాలా పెద్ద కథ చెబుతూ ఉంటే తాగిందంతా దిగిపోతుంది అని అనగానే...మాది కూడా సేమ్ ఆన్సర్. ప్రస్తుతానికి వెళ్లి పడుకోండి. రేపొద్దున్న ఫ్రెష్ అయ్యి మాట్లాడుకుందాం అని వాళ్ళిద్దరికీ ఒక రూమ్ చూపించి.. వీళ్ళిద్దరూ వేరే రూమ్ లోకి వెళ్లి పడుకుంటారు.. శాంభవి కి మాత్రం నిద్ర రాకుండా ఉంటుంది. అందరికి నేను చిన్నపిల్లలాగా కనిపించానా... లవ్ లెటర్ ఇచ్చిన అర్థం చేసుకోలేని మనస్తత్వమా నాది. అందుకేనా రుద్రా సార్ అలా ఏడిపిస్తున్నారు. ఏది ఏమైనా సరే ఈ ప్రాబ్లంని నేనే సాల్వ్ చేసుకుని నేను చిన్నపిల్లని కాదు అని రుద్రా సార్ తోనే చెప్పించుకుంటాను. నేను రుద్రా సార్ ని లవ్ చేయను. ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు అని ఫిక్స్ అయ్యి తన్నుకుంటూ తన్నుకుంటూ ఎప్పటికో నిద్రపోతుంది. రుద్ర తన గదిలో తలగడిని గట్టిగా హత్తుకుని పడుకుంటూ అబ్బా పాప.. తొందరగా బ్రెయిన్ పెంచవే.. బాబు. నా లవ్ ని యాక్సెప్ట్ చేయి. అప్పుడు ఈ తలగడ ప్లేస్ లో నువ్వు ఉంటావు. మనిద్దరం ఇలాగే గట్టిగా హత్తుకుని పడుకోవచ్చు అని తలగడంతో కబుర్లు చెబుతూ పడుకుంటాడు. రాత్రి లేటుగా పడుకోవడం మీద శాంభవి కొంచెం లేటుగా లెగుస్తుంది. టైం చూసేటప్పటికి ఆరు చూపిస్తూ ఉంటుంది. అయ్యో ఇంతసేపు పడుకున్నానా అని గబగబా లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వెళుతుంది. అప్పటికే కౌసల్య, చారులత పూజకి కావాల్సిన అన్ని సిద్ధం చేస్తూ ఉంటారు. సారీ ఆంటీ.. లేట్ అయింది. రాత్రి పడుకునేటప్పటికీ చాలా టైం పట్టింది అని సంజయిషీ చెబుతుంది. దానికి కౌసల్య గారు తల మీద చేయి వేసి ఎందుకు నువ్వు ఇంత సంజయిషీ చేబుతూన్నావు. ఇది నీ ఇల్లు. నీ ఇంట్లో నువ్వు ఎలా ఉన్నా ఎవరు అడ్డుచెప్పే వాళ్ళు లేరు. ఇంకా నువ్వు మాకు ఆర్డర్స్ వేస్తే ఇంకా సంతోషం కూడా అని చెబుతారు. ఆ మాటలకి నవ్వుతూ అది మీ మంచితనం అండి అని పూజ దగ్గర వాళ్లతో పాటు కూర్చుంటుంది. శాంభవి పాట వినడానికి అని అందరూ ఫ్రెష్ అయిపోయి తొందరగా రెడీ అయి పూజ దగ్గరికి వచ్చేస్తారు. పూజ అయిన తర్వాత శాంభవి చేతిలో వీణ పెట్టాలని వీణ కూడా అక్కడ సిద్ధం చేస్తారు. పూజ పూర్తి చేసి మంగళహారతి ఇవ్వగానే..రాఘవేంద్ర గారి శాంభవిని వీణ దగ్గరికి తీసుకువెళ్లి... ఇది నీకు నేను ఇస్తున్న చిరుకానుక తల్లి. ఈ వీణ నా చిన్న కోడలది.తను ఉన్నప్పుడు ఎప్పుడూ ప్రతిరోజు సంగీతం వినిపిస్తూనే ఉండేది. మళ్లీ ఇన్ని సంవత్సరాలకి నీ చేతిలో ఇది ఉండాలి అని రాసిపెట్టి ఉంది. ఈ వీణ తీసుకొని ఒక చక్కటి పాటని పాడు తల్లి అని అడుగుతారు. శాంభవి ఆ వీణ ని చూడగానే చాలా ఎమోషనల్ అవుతుంది. ఎందుకు అలా జరుగుతుందో తనకే తెలియడం లేదు. శాంభవి పరిస్థితి ఏమిటి...
01-04-2026, 07:49 AM
Part - 45
ఆ వీణ ని తాకగానే శాంభవికి తనకి తెలియకుండానే చాలా ఎమోషనల్ అవుతుంది.పట్టుకుని ఏడ్చేస్తుంది. అందరూ కంగారుగా ఏమైంది అని వచ్చి శాంభవి చుట్టుముడతారు.
ఏమైంది శాంభవి అని భుజం మీద చేయవేసి అడుగుతారు.. తెలియదు అంటీ... వీణ ని టచ్ చేయగానే నాకు మా అమ్మ గుర్తుకొచ్చింది. ఎప్పుడు మా నాన్నలే మెదిలేవారు.ఎందుకో మొదటిసారి అమ్మ అన్న ఫీలింగ్ బాగా గుర్తుకు వస్తుంది. ఏడుపు వస్తుంది అని పట్టుకొని ఏడుస్తుంది. దేవేంద్ర కూడా బాగా ఎమోషనల్ అవుతారు. భార్య ఫోటో వైపు చూస్తూ.. నీ వీణని మన కూతురు తాకగానే తనకి నీ స్పర్శను అందించావా... చారులత వైపు చూసి కన్సోల్ చేయమని సైగ చేస్తారు. శాంభవి కళ్ళు తుడిచి ఎందుకు అంతలా ఎమోషనల్ అవుతున్నావు. ఒకసారి ఊరు వెళతావా అంటే...లేదు ప్రాజెక్ట్ మధ్యలో వెళ్ళకూడదు అని రుద్రాసార్ స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు అని చిన్నపిల్ల కంప్లైంట్ ఇచ్చినట్టుగా చెబుతుంది. ఆ మాటలకు రుద్ర ఓరిని తిరిగి తిరిగి నా మీదకు వచ్చి ఆగిందా.. ఇంటిలో హోమం జరగాలని ఆరోజు అలా చెబితే.. ఈరోజు నాకే మెలేసేవారు కదా అనుకుంటూ.. ఫ్యామిలీ మెంబర్స్ వైపు చూస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మ అత్తయ్య కొరకరా చూస్తూ ఉంటే... చూసింది చాల్లే గాని వర్క్ ఇంపార్టెంట్ కదా పదండి ఇంకా... ఆఫీస్ కి టైం అవుతుంది బ్రేక్ఫాస్ట్ చేయండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే లోపలికి వస్తున్న ధీరజ్ అక్కడ గంభీరంగా ఉన్న వాతావరణం చూసి ఏమైంది అని వెళతాడు. రుద్ర ఇప్పుడు వీడొక్కడే మిగిలాడు ఇంకా అని..ఏమీ అవలేదు పదా అని చెప్పి తీసుకు వెళ్ళిపోతాడు. శాంభవి ఏదో తిన్నాను అంటే తిన్నాను అన్నట్టుగా తిని వెళదామా సార్ అని అడుగుతుంది. గౌతమ్ శాంభవి వైపు చూసి శాంభవి ఈరోజు నువ్వు మాతోనే రా.. ఎందుకు రుద్రా సార్ ని ఇబ్బంది పెట్టడం. ధీరజ్ వెంటనే గౌతమ్ తో నీకు ఈరోజు కొత్త వర్క్ నేర్పిస్తున్నాము. సిస్టంలో కాదు ఫీల్డ్ లో ఉండాలి. నాతో పదా అని తీసుకుని వెళ్ళిపోతాడు. శాంభవి ముభావంగానే రుద్రా తో వెళుతుంది. దారిలో కూడా ఏమీ మాట్లాడదు. రుద్రా కూడా కదపకుండా సైలెంట్ గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఎంతసేపైనా శాంభవిలో మార్పు రాకపోయేటప్పటికి ఏమైంది పాప. ఎందుకు అంత సైలెంట్ గా ఉన్నావు అని అడుగుతాడు. శాంభవి ఏదో ఆలోచిస్తూ ఏమో తెలియడం లేదు సార్. ఆ వీణ ని టచ్ చేయగానే ఎవరిదో ఒక స్పర్శ నాకు బాగా తగిలింది. అది చాలా స్మూత్ గా చల్లగా అనిపించింది. వెంటనే అమ్మ గుర్తొచ్చింది అని కళ్ళనీళ్ళతో చెబుతూఉంటుంది. రుద్రకి వెంటనే వాళ్ళ చిన్నత్త గుర్తుకు వస్తుంది. అత్త నీ కూతురు మీద ప్రేమని ఇలా చూపిస్తున్నావా అని ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని వెంటనే... ఆ వీణ ఎప్పటినుండో గదిలోనే ఉండిపోయింది కదా... ఒకేసారి తీసేటప్పటికీ ఈ వేధర్ కి నీకు అలా అనిపించి ఉంటుంది అంతే అని చెబుతాడు. అంతే అంటారా అని తేలిక పడుతుంది. హ్మ్... అవును పాప నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అనే టాపిక్ డైవర్ట్ చేస్తాడు. అదిగో మిమ్మల్ని పాపా అని పిలవద్దన్నానా అని మళ్ళీ దెబ్బలాటకు దిగుతుంది. సరే పిలవని గాని నేను అడిగింది ఎంతవరకు వచ్చింది అని అడుగుతాడు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని ఏమీ తెలియనట్టుగానే అడుగుతుంది. బుగ్గ మీద పొడుస్తూ యు నాటీ....నీకు అన్నీ తెలిసిన తెలియనట్టు మాట్లాడుతున్నావ్ గాని... మిత్రని అడిగావా లేదా అని అడుగుతాడు. రాత్రి కొంచెం బిజీగా ఉండి నేను ఏమీ అడగలేదు అని బయటకు చూస్తూ చెబుతుంది. ఛా...నిజమా నమ్మేసానులే గాని ఇప్పుడు నా వైపు తిరిగి నిజం చెప్పు అంటాడు. నేను నిజమే చెబుతున్నాను అని కళ్ళు అటు ఇటు తిప్పుతూ ఉంటుంది. నువ్వు నిజం చెబితే సూటిగా నా వైపు తిరిగి మాట్లాడతావు. ఎప్పుడైతే నువ్వు కళ్ళు అటు ఇటు తిప్పుతున్నావో అప్పుడే అర్థమైపోయింది అది అబద్ధమని. నేను ఏమీ అనుకోను. ఎవరితోనూ చెప్పను గాని చెప్పు పాప అంటాడు. మీరు ఎవరికీ చెప్పకపోయినా నన్ను ఆడుకుంటారు కదా అంటుంది. ఓ అయితే అడిగావ్ అన్నమాట. ఏమంది అని కళ్ళు ఎగరేస్తాడు. ఇంక చెప్పక తప్పదు అని మిత్రకి తనకి మధ్యన జరిగిందంతా చెబుతుంది. రుద్ర నవ్వుతూ నేను చెప్పాను కదా అంటే.. అలాగేమీ లేదు కాలేజ్ మాదే కదా.. ఏదైనా జరిగితే మా అన్నల చేతిలో దెబ్బలు ఉంటాయని భయపడి వాళ్ళు నాకు ఇవ్వలేదు అని ఎటో చూస్తూ చెబుతుంది. అవునా అంటూ వచ్చే నవ్వును ఆపుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. రుద్ర నవ్వు చూసి ఉక్రోషంగా మీరు ఎందుకు నవ్వుతున్నారు. నేను చెప్పిందంతా నిజమే అంటుంది. నేనెక్కడ నవ్వేను. నువ్వు చెప్పిందంతా నిజమే అంటున్నాను అని కార్ ఆఫీస్ ముందు ఆపుతాడు. మీరు ఎప్పుడూ ఇంతే అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. వెళుతున్న శాంభవిని చూస్తూ నువ్వు చాలా ఇన్నోసెంట్ వి. నిన్ను చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయాలి అనుకోని కార్ పార్క్ చేసి తన చాంబర్కి వెళ్ళిపోతాడు. తాగిందంతా ఎప్పటికో దిగి.. ఆశ, నిష మంచాలు దిగి కాఫీ అని అరుస్తూ బయటకి వస్తారు. ఒక మెయిడ్ వచ్చి వాళ్ళిద్దరికీ నిమ్మరసం కలిపిన మజ్జిగ ఇచ్చి తాగండి మ్యామ్ అని ఇస్తుంది. ఏమిటిది పొద్దు పొద్దున్నే ఇది ఎవరైనా తాగుతారా అంటే... మీరు తాగింది దిగాలి అంటే ముందు ఇది తాగాలి అని ఆనంద్, విహారి అక్కడికి వచ్చి చెబుతారు. మేము ఎక్కడ ఉన్నాము అని చుట్టూ చూస్తూ.. ఇది మీ గెస్ట్ హౌస్ హ అని ఆ గ్లాసులు అందుకొని అక్కడ సోఫాలో కాలు మీద కాలేసుకుని కూర్చుని తాగుతూఉంటారు. ఆనంద్, విహారి కూడా వాళ్లకి దగ్గరగా కూర్చుని.. ఇప్పుడు చెప్పండి రుద్రా తో మీకున్న పగ. దాన్ని బట్టి ఏం చేయాలో అన్నది ఆలోచిస్తాము అని అంటారు. అది ఇప్పటిది కాదు 25 సంవత్సరాల క్రితం మొదలయ్యింది. రుద్ర చిన్న మామ అయినా దేవేంద్ర భూపతిని మా అత్త లవ్ చేసింది. పెళ్ళి వరకు వచ్చి పెటాకులు అయింది.అప్పటినుండి ఈ పగ అని చెబుతుంది. మీ అత్త లవ్ చేసింది. దేవేంద్ర రిజెక్ట్ చేశారు.ఇందులో పగ పెంచుకోవడానికి ఏముంది అంటే... అదంతా మాకు తెలియదు. అప్పుడు స్టార్ట్ అయింది ఇ వార్. ఇప్పటికే కంటిన్యూ అవుతుంది. మమ్మల్ని ఎలాగైనా సరే ఆ ఇంటి వారుసులు లో ఎవరినో ఒకడిని ట్రాప్ చేయమన్నారు. బట్ వాళ్ళు ఎవరూ మాకు లొంగుడం లేదు. రీసెంట్ గా తెలిసిన విషయం ఏమిటంటే.. రుద్రాకీ మ్యారేజ్ పిక్స్ అయింది అని. అది తెలిసి మా అత్త ఇంకా సీరియస్ అయింది. మేము ఎందుకు చేతకాని వాళ్ళని కింద జమకట్టి మాట్లాడుతుంది. ఆ మాటలకి ఆనంద్ వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి అంటే పెళ్లి ఒక్కటే మార్గమా అని అడుగుతాడు. అంటే ఏంటి మీరు అనేది అని మెయిడ్ తెచ్చిన కాఫీ తాగుతూ అడుగుతారు. నాంచకుండా మేము స్ట్రైట్ పాయింట్ కి వచ్చేస్తున్నాము. మీరిద్దరూ మా ఇద్దరికీ బాగా నచ్చారు. మాకు వాళ్ళ మీద పగ ఉంది. మీకు ఉంది. శత్రువు శత్రువు మిత్రుడే అవుతాడు కాబట్టి మన ఇద్దరం చేతులు కలిపితే మన బలం పెరుగుతుంది. అప్పుడు రుద్రా ఫ్యామిలీని మనం ఏమైనా చేయగలము ఏమంటారు అని అడుగుతారు. ఆశ,నిషా ఒకరి మొఖాలు ఒకరు చూసుకుని.. వీళ్ళ వైపు చూసి చూడడానికి మీరు బాగానే ఉన్నారు కానీ.. మన పెళ్లిళ్లకి మా ఇంట్లో ఒప్పుకుంటారా అని అనుమానంగా అడుగుతారు. ఇలాంటివి ఏదైనా చెప్పి చేయకూడదు. చేశాకే చెప్పాలి. మేము మాత్రం ఇంట్లో చెబుతామా ఏంటి..పెళ్లయ్యాక డైరెక్ట్ గా వెళ్లి కనపడడమే. ముందు కోప్పడతారు తర్వాత వాళ్లే ఒప్పుకుంటారు. ఈ ఐడియా బానే ఉంది అని ఇద్దరు ఆలోచిస్తూ ఉంటే.. ఎప్పుడు ఇంప్లిమెంట్ చేద్దామని ఆనంద్, విహారి అడుగుతారు. ఏంటి మీరు ఇంత ఫాస్ట్ గా ఉన్నారు అంటే..శత్రువుని దెబ్బతీసే ఛాన్స్ వదులుకోవడం మాకు ఇష్టం లేదు కాబట్టి అని పిడికిలి బిగించి చెబుతారు. ఆ మాటలకి ఆశ నవ్వుతూ మేము ఎప్పుడైనా రెడీ. అన్ని అరేంజ్ చేసి మాకు కాల్ చేయండి అని బయలుదేరతారు. వెళుతున్న వాళ్ళిద్దర్నీ చూసి నవ్వుకుంటూ వీళ్ళిద్దరూ లోపలకి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళగానే అత్త, పిన్ని అని గట్టిగా పిలుస్తారు. ఏమైంది అంత గట్టిగా అరుస్తున్నారు అని మయూరి కిందకి వస్తుంది. హ్మ్... గుడ్ న్యూస్ అత్త. కానీ ఇప్పుడు చెప్పను. మేము ఏం చెప్పినా వేస్ట్ అని తిడతావు కదా.. ప్లాన్ సక్సెస్ అయిన తర్వాత అప్పుడు చెబుతాను ఈ నిషా అంటే ఏమిటో అని పొగరుగా చెబుతుంది . లక్ష్మీ గారు అక్కడికి వచ్చి ఏంటి రాత్రంతా తాగి ఎక్కడో పడిపోయి రావడం మా..గుడ్ న్యూస్ అంటే అని చిరాకుగా అడుగుతారు. చూడు గ్రాని మేము ఏం చేసినా అత్త సంతోషం కోసమే... అంతేగాని శత్రువులతో చేతులు కలిపి మన ఇంట్లో వాళ్ళని దెబ్బతీయము అని పొగరుగా మాట్లాడుతుంది. ఆ మాటలకి అక్కడికి వచ్చిన నాగేంద్ర.. శభాష్ తల్లి... నీకున్న బుద్ధిలో ఒక వంతైనా మీ నానమ్మకి ఉంటే.. ఎంతో బాగుండేది. ఈ పాటికి ఎప్పుడో ఆ భూపతులు మన చేతుల్లో ఉండేవారు. శత్రువులకు సహాయం చేసి మనం బయటికి వచ్చేలాగా చేసింది. అందుకే మీ నానమ్మ అంటే నాకు అంత కోపం. కూతురి జీవితం కన్నా వాళ్లే ముఖ్యం అనుకుంది. ఆ మాటలకి లక్ష్మీ గారు బాధపడుతూ.. నా కూతురు సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను. వేరే ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసి అక్కడ మన అమ్మాయిని కూర్చోబెడితే మాత్రం సుఖపడుతుందా.. ఆ పిల్ల ఉసురు తగలదా... ఇప్పుడు జరిగింది అది కాదా అని బాధగా అడుగుతారు. మయూరి సమాధానం ఏమిటి... కథ కొనసాగుతుంది...
01-04-2026, 05:25 PM
I hope Anand n Vihari are good at heart, even though they're bluffing!!
I guess Rudra wouldn't spoil girls' lives!!
02-04-2026, 08:11 AM
Part - 46
అమ్మ అని గట్టిగా అరుస్తుంది. నిజమే చెబుతున్నాను కదా మయూరి . దేవేంద్ర భార్య ఉసురు మనకి తగలలేదా.. పెళ్లి పిల్లలు లేకుండా నువ్వు ఒంటరిగా మిగిలిపోలేదా..
నీ వయసు వాళ్ళు అందరూ పిల్లలు తో సరదాగా ఉంటే.. నువ్వు పగ, పగ అని తిరుగుతున్నావు. ఏమి సాధించారు నువ్వు, మీ బాబు. ఆ ఇంట్లో సంతోషాన్ని ఆవిరి చేసి మన ఇంట్లో ఆనందం అన్నది లేకుండా చేశారు. తప్పులన్నీ మీరు చేసి నిందలు మాత్రం నా పైన వేస్తున్నారా.. ఇంకా ఆపు లక్ష్మి వింటున్నాము కదా అని మాట్లాడుతూనే ఉన్నావు. నువ్వు ఆరోజు దేవేంద్ర భార్య గురించి చెప్పకపోయి ఉండి ఉంటే.. తను ఎక్కడికి వెళ్లిందో ఎవరికీ తెలిసేది కాదు. ఆ కోపంలో నా కూతురితో దేవేంద్ర పెళ్లి జరిగిపోయేది. పెళ్లి జరిగిన తర్వాత తెలిసిన వాళ్ళు ఏమి చేయలేకపోయేవారు. కానీ నువ్వేం చేసావు. మా గురించి, అనసూయ గురించి చెప్పింది నువ్వే. అనసూయ జీవితం ఈరోజు ఇలా అవడానికి కారణము నువ్వే. నా చెల్లి జీవితం, నా కూతురి జీవితం ఇలా అయినందుకు నీకు బాధగా లేదు. ఎప్పుడో చనిపోయిన దేవేంద్ర భార్య గురించి మాత్రం బాధపడుతున్నావు నువ్వు అసలు తల్లివేనా కోపంగా అరుస్తారు. నేను తల్లిని కాబట్టే ఎవరు ఉసురు నా బిడ్డలకు తగలకూడదు అని కోరుకుంటున్నాను. ఏం చేసుకుంటారండి ఆస్తిని. మనకున్నది సరిపోదా.. ఏనాడైనా ప్రశాంతంగా పడుకున్నారా.. సంతోషంగా నవ్వుతూ కుటుంబ సభ్యులతో మాట్లాడారా... రాత్రి అయ్యేటప్పటికి మీ అవసరాలకి మీ భార్య మీ పక్కన ఉండాలి . వీడికి వాడి భార్య కావాలి. మరి నా కూతురికి అలాగా తోడు అవసరం లేదా.. నా బాధ మీకు ఎందుకు అర్థం కావడం లేదు అని ఏడుస్తుంది. మయూరి లక్ష్మి గారి ముందుకు వచ్చి.. ఇది ఆస్తి కోసం కాదమ్మా గొడవ. నా ప్రేమని దేవేంద్ర కాదు అన్నందుకు మొదలయింది. మనిషికి తోడు అవసరమే. అలాగని ఎవరు పడితే వాళ్ళు తోడుగా ఉండాలి అనుకుంటే.. ఒక కుక్కని పెంచుకున్న సరిపోతుంది. అక్కడ దేవేంద్ర ఆయన ఇక్కడ నేనైనా ఒంటరిగా మిగిలిపోవడానికి కారణం. మా మనసుకు దగ్గరైన వాళ్ళు మాతో లేకపోవడమే.. దేవేంద్ర ఏ రోజుకైనా వచ్చి నా మెడలో తాళి కట్టి నన్ను భార్యగా స్వీకరించాలి. అప్పుడు గాని ఈ పగ చల్లారదు . ఎంత చెప్పినా మీరు మారారు కదా.. మీ నాశనాన్ని మీరే కోరుకుంటూ ఉంటే ఎవరు మాత్రం ఏమి చేయగలరు. అనుభవించండి. మీ దారిలోనే మీ మనవరాళ్ళని కూడా లాక్కెళ్తున్నారు అని బాధగా అక్కడ నుండి వెళ్ళిపోతారు. మీ గ్రామీ అలాగే అంటుంది గాని..ఏం ప్లాన్ చేశారు అని నాగేంద్ర అడుగుతాడు.అప్పుడే చెప్పము తాతయ్య. మొత్తం ఇంప్లిమెంటేషన్ అయిన తర్వాత ఒక్కసారిగా చూపిస్తాము. మాకు కొన్ని రోజులు టైం ఇవ్వండి చాలు అని చెప్పి ఇద్దరూ రూమ్ లోకి వెళ్ళిపోతారు. మాకు తెలియకుండా వీళ్లిద్దరూ ఏం ప్లాన్ చేస్తున్నారు అని ఆలోచిస్తూ... ఎందుకైనా మంచిది వీళ్ళ వెనకాల ఒక సెక్యూరిటీని పెట్టాలి అని డిసైడ్ అవుతారు . ఆఫీస్ కి వెళ్ళిన శాంభవిని ఏదో ఒక వంకతో రుద్ర తన దగ్గరే ఉంచుకుంటాడు. దానికి మాత్రం శాంభవికి పిచ్చ కోపం వస్తూ ఉంటుంది. ఎందుకు రుద్రా సార్ 24 గంటలు నన్ను మీ ముందు ఉంచుకుంటారు. ఇది కరెక్ట్ గా లేదు అని చెబుతుంది. ఏది కరెక్ట్ అవునో కాదో నాకు తెలుసుగాని.. ముందు వర్క్ చెయ్యి అని చెప్పి తన చేయాల్సిన వర్క్ కన్నా ఇంకా ఎక్కువ వర్క్ ఇచ్చి అక్కడ కూర్చోబెడతాడు. మిత్ర కి మాత్రం కొద్దిగా అనుమానం స్టార్ట్ అవుతుంది. రుద్రా సార్ ఏమైనా శాంభవిని లవ్ చేస్తున్నారా ఏంటి అని. ఎందుకైనా మంచిది ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని.. అంకుల్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే బెటర్ ఏమో అనుకుని ఆలోచిస్తూ ఉంటుంది. శాంభవిని ఎటు కదలనివ్వకుండా తన ముందే ఉంచేస్తాడు. లంచ్ కూడా అక్కడికే తెప్పిస్తాడు. సార్ ఇది అన్యాయం తెలుసా.. నా ఫ్రెండ్ ఒక్కత్తే ఉంది. తనకి కంపెనీ ఇచ్చేవాళ్ళు నేను అరేంజ్ చేశాను కానీ...లంచ్ ఫినిష్ చెయ్. ఇంకా నీకు వర్క్ నేర్పించాల్సింది చాలా ఉంది. అలాగే నిన్ను ఒక ప్లేస్ కి తీసుకు వెళ్ళాలి ఈరోజు సాయంత్రం అని చెబుతాడు. ఏ ప్లేస్ కి సార్ అని అడిగితే... ఇప్పుడు దాకా నువ్వు చూడనిది అని చెబుతాడు. గుడికా అని అడుగుతుంది. ఇంచుమించు అలాంటిదే అని చెబుతాడు. ఓకే సార్ అని చెప్పి లంచ్ ఫినిష్ చేస్తోంది. సాయంత్రం శాంభవి వర్క్ చేస్తూ ఉండగా.. సిస్టం క్లోజ్ చెయ్ వెళ్ళాలి అని చెబుతాడు. ఇంకా వర్క్ ఉంది సార్ అంటే పర్వాలేదు. రేపు చేయొచ్చు పదా అని చెయ్యి పట్టుకుని పర్సనల్ లిఫ్ట్ లో తీసుకుని వెళ్ళిపోతాడు.. మిత్రని విహాన్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. వెళుతున్నప్పుడు మిత్ర అడుగుతుంది. ఎందుకు సార్ శాంభవిని రుద్రా సార్ తో వెళుతుంది. రుద్రా సార్ తోనే డే మొత్తం ఉంటుంది. ఏమైనా ప్రాబ్లమా అని అడుగుతుంది. అలాంటిదేమీ లేదు మిత్ర. నీకెందుకు వచ్చింది ఆ డౌట్ అని అడిగితే... నొథింగ్ సార్...వచ్చినప్పుడు నుంచి రుద్రా సార్ శాంభవి తోనే ఉంటున్నారు. శాంభవిని ఎక్కడ వదలడం లేదు. ఏదైనా ప్రాబ్లం మా అని అడుగుతుంది. అలాంటిదేమీ లేదు. వర్క్ నేర్పిస్తున్నాడు కదా...రుద్ర ఏదైనా నాది అనుకుని మొదలుపెడితే..చివరిదాకా వదలడు. శాంభవికి వర్క్ నేర్పించే విషయంలో రుద్ర పర్సనల్గా తీసుకొని నేర్పిస్తున్నాడు. అంతే అని చెప్పి బాబొయ్ ఈ ఫ్రెండ్స్ ఇద్దరూ ఏంటి ఎంత సేపు శాంభవి మీదే ఫోకస్ పెట్టారు. కొంచెం జాగ్రత్తగానే ఉండాలని... మిత్ర మీ కాలేజీ విశేషాలు చెప్పు. అక్కడ రూల్స్ ఎలా ఉంటాయి.. ఎలా చెబుతారు... క్లాస్లో ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్లీగానే ఉంటారా.. అని ఏదైతే మాట్లాడుతూ ఉంటాడు. అందరూ బానే ఉంటారు మాకు ప్రొఫెసర్ కూడా చాలా బాగా చెబుతారు. లలిత్ సార్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. గర్ల్స్ తో ఎవరైనా తప్పుగా బిహేవ్ చేస్తే అసలు ఒప్పుకోరు. సో మాకు ర్యాగింగ్ కూడా ఏమీ ఉండదు అని చెబుతోంది. నైస్ కాలేజ్. కమిటీ కూడా చాలా బాగుంది కదా అని అడుగుతాడు. అవును సార్ మా కాలేజ్ ఎప్పుడు చాలా బాగుంటుంది. మీకో విషయం తెలుసా సార్.. ఒకసారి మా కాలేజ్ కి బయట కాలేజ్ నుంచి ఒక స్టూడెంట్స్ గ్రూప్ వచ్చింది. వాళ్లు కొంచెం ఫ్రీ లైఫ్ అనుకుంటా... స్మోక్, డ్రింక్ చేస్తూ ఉన్నారు. వెంటనే మా చైర్మన్ సార్ కోపం వచ్చి...ఆ కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ వెంటనే వెనక్కి పంపించేశారు. కాలేజీ రిప్యుటేషన్కి తేడా వచ్చిన సరే పరవాలేదు కానీ.. బిహేవియర్ సరిగా లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోము అనే స్ట్రిక్ట్ గా చెప్పేశారు. అంతే కాదు సార్ శివప్రసాద్ అంకుల్ అయితే ఊరు లో ఎక్కడ కూడా అన్ హెల్తి హ్యాబిట్స్ ఉండనివ్వకుండా చేశారు. అంటే మందు, సిగరెట్ ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ ఏవి మా ఊరిలో ఉండవు తెలుసా నేను చాలా ప్రౌడ్ గా చెబుతుంది. విహాన్ ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి మందు తాగడం, సిగరెట్ కాల్చడం కూడా బ్యాడ్ హ్యాబిట్స్ ఆ...అంటే మరి కాదా... సిగరెట్ కాల్చడం వల్ల వాళ్ళ హెల్త్ తో పాటు చుట్టూ ఉన్న పదిమంది హెల్త్ పాడు చేస్తారు. డ్రింక్ చేసిన వాడు అతను ఏం చేస్తున్నాడో వాడికే తెలియకుండా పిచ్చి పనులు అన్నీ చేసి.. తన హెల్త్ ప్లస్ వెల్త్ కూడా పాడు చేసుకుంటాడు. అందుకే అంకుల్ ఆ రూల్ గట్టిగా ఫాలో అవుతారు . అంటే ఇప్పుడు మా రుద్ర మందు, సిగరెట్ కి దూరంగా ఉండాలా అని మనసులో అనుకుంటూ... రుద్ర ఏమిటి.. మేము అందరం ఉండాల్సిందే... గుడ్ ఇన్ఫర్మేషన్ మిత్ర అని కారు ఆపుతాడు. ఏమైంది సార్ అంటే...ఇంటికి వచ్చేసాము అని చెప్పి చూపిస్తాడు. ఓకే థాంక్యూ సార్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. రుద్ర శాంభవిని ఒక ప్లేస్ కి తీసుకుని వెళ్తాడు. వాచ్మెన్ వచ్చి గేటు తీస్తాడు. లోపలకు ఒక పక్కన కార్ పార్క్ చేసి దిగు అని చెబుతాడు. ఎక్కడికి వచ్చాము సార్ అని అడిగితే.. ఒక్క ఐదు నిమిషాలు సైలెంట్ గా ఉండు. చూపిస్తాను కదా అని తీసుకువెళుతూ ఉంటాడు. దారికి ఇరువైపులా పూల మొక్కలు నిండుగా పువ్వులు పూసి కనపడుతూ ఉంటాయి. మరొక పక్క అన్ని రకాల పళ్ళ మొక్కలు కనపడతాయి. అవి అన్ని ఆర్గానిక్ గా పండిస్తున్నారు. జామ చెట్టు చూడగానే శాంభవి రుద్ర చెయ్యి పట్టుకుని సార్ నేను ఆ కాయలు కోసుకోవచ్చా అని అడుగుతుంది. నీకు ఏది కావాలంటే అది చేసుకో నిన్న ఎవ్వరు ఆపరు. ఒక్క పది నిమిషాలు తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేసుకుందాగాని సరేనా... నాతోరా శాంభవి అని చెయ్యి పట్టుకుని తీసుకువెళతాడు. అక్కడ చిన్న కుటీరంలాగా కనిపిస్తుంది. దగ్గరికి వెళుతూ ఉండగా అర్థమవుతుంది అది ఎవరిదో సమాధి అని. శాంభవి రుద్రా చేతిని గట్టిగా పట్టుకుంటుంది. ఏమైంది అని అడిగితే... ఇక్కడ ఎవరిదో సమాధి ఉంది. నాకు భయం వెళ్ళిపోదాం అంటుంది. శాంభవి చుట్టూ చేతులు వేసి భయపడాల్సిన అవసరం లేదురా... నాతో రా..అని దగ్గరగా తీసుకువెళ్తాడు. అక్కడ దేవేంద్ర కళ్ళు మూసుకుని గోడకి జారపడి కూర్చుని ఉంటాడు. దేవేంద్ర సార్ ఇక్కడ ఉన్నారు ఏంటి అని అడిగితే.. ఈరోజు మా చిన్నఅత్త పుట్టినరోజు. ఇది మా చిన్న అత్త జ్ఞాపకార్థం మా చిన్న మామ ఏర్పాటు చేసిన దేవాలయం. అత్తకి పువ్వులన్నా, నేచర్ అన్న చాలా ఇష్టం. ఈరోజు అంతా చిన్న మామ ఇక్కడే ఉంటాడు. ఎందుకో నిన్ను ఇక్కడికి తీసుకు రావాలనిపించి తీసుకువచ్చాను. నీకు ఇబ్బంది లేదు అనుకుంటే వెళ్లి ఒకసారి సమాధిని తాకిరా అని చెబుతాడు. మీరు నాతో పాటు వస్తారా అని అడుగుతుంది. తప్పకుండా ఎప్పటికీ నీతోనే కదా ఉండేది పదా అని చేయ పట్టుకుని తీసుకువెళ్తాడు. సమాధిని చూడగానే ఎందుకో శాంభవి ఒళ్లంతా ఒక రకమైన పులకింత వస్తుంది. ఆ సమాధిని తాకగానే ఒక చల్లని స్పర్శ తన మేనుకి తాకి తెలియని ఒక హాయిని ఇస్తుంది. ఆ విచిత్రమైన ఫీలింగ్ ఏంటో అర్థం కాక శాంభవి చూస్తూనే ఉంటుంది.
02-04-2026, 08:14 AM
Part - 47
ఆ సమాధిని తాకగానే శాంభవి ఒక విచిత్రమైన అనుభూతికి లోనుఅవుతుంది. ఎందుకో తనకి బాగా తెలిసిన వాళ్ళదిగా అనిపిస్తుంది.
ముందు భయపడిన మెల్లిగా దగ్గరికి వెళ్లి తాకుతూ ఉంటుంది. అది చూస్తున్న దేవేంద్ర, రుద్ర సైలెంట్ గా ఉంటారు. మోకాళ్ళ మీద కూర్చుని సమాధిని తడుముతూ రుద్ర గారు ఈవిడ ఎవరో నాకు తెలియదు కానీ.. ఎందుకో తన గురించి చెబుతున్న.... ఈ సమాధిని తాకుతున్న నాకు ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది. నాకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తుంది. నాకు ఏమీ అర్థం కావడం లేదు అని చెబుతుంది. శాంభవి పరిస్థితి అర్థం అయ్యి రుద్ర దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద శాంభవి పక్కన కూర్చుని..మా చిన్నత్త చాలా మంచిది. కుటుంబం అంటే చాలా ఇష్టం. మా చిన్న మామ అంటే ప్రాణం పెట్టేది అని దేవేంద్ర వైపు చూస్తాడు. మా చిన్న మామ ఏరి కోరి పెళ్లి చేసుకున్నాడు. కానీ మా చిన్నత్త డెలివరీ టైమ్ లో మాకు అందరికీ దూరమైపోయింది అని బాధగా చెబుతాడు. డెలివరీ అయినప్పుడు పాప, బాబో ఎవరో ఒకరు పుడతారు కదా.. మరి వాళ్ళు ఏరి అని అడుగుతుంది. ఆ మాటలకి నువ్వే అని చెప్పాలని ఉన్నా.. అది చెప్పే సందర్భం కాదు అని పాప పుట్టింది అని చెబుతాడు. తను ఎక్కడ అని అడిగితే..మాకు అందనంత దూరంలో ఉంది. అందుకే ఇంట్లో వాళ్ళందరూ నీలో తనని చూసుకుంటున్నారు. తనే నీ రూపంలో ఇంటికి వచ్చింది అని మురిసిపోతున్నారు అని చెబుతాడు. ఆ మాటలకి దేవేంద్ర వైపు చూస్తుంది. దేవేంద్ర కళ్ళలో నుంచి కారుతున్న కన్నీళ్లు చూసి చలించిపోతుంది. స్పీడ్ గా లేచి దేవేంద్రగారి దగ్గరికి వెళ్లి కన్నీళ్లు తుడిచి... ఎందుకు సార్ ఇంత బాధపడుతున్నారు. తప్పకుండా మీ అమ్మాయి మీ దగ్గరికి వస్తుంది. నాన్న అని పిలుస్తుంది. చూస్తూ ఉండండి. మా నాన్న ఎప్పుడూ చెబుతారు. నేను ఏదంటే అదే జరుగుతుంది అని.. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి అని భరోసా ఇస్తుంది. ఆ మాటలకు ఆయన నవ్వుతూ నువ్వు మాటిచ్చావు అంటే తప్పకుండా జరుగుతుంది తల్లి అని నుదుటన ముద్దు పెట్టుకుంటారు. కాసేపు అక్కడే గడిపి తోట అంతా చూసి తనకు నచ్చిన కాయలన్నీ కోసుకొని ఇద్దరితో కలిసి బృందావనానికి బయలుదేరుతుంది. ఈసారి రుద్ర అంటే అంత భయం ఉండదు. కొంచెం చనువుగానే మాట్లాడుతూ ఉంటుంది. శాంభవిలో వచ్చిన మార్పు కి రుద్రా నవ్వుకుంటాడు. దారి పొడుగునా దేవేంద్ర తో కబుర్లు చెబుతూనే ఉంటుంది. నవ్వుతూ లోపలికి వస్తున్న కొడుకుని చూసి... రాఘవేంద్రకు కూడా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఈరోజు చాలా డల్ గా ఉండి.. ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. అలాంటిది కూతురు పక్కనే ఉండేటప్పటికీ ప్రపంచాన్ని మర్చిపోయి నవ్వుతూ వస్తున్నాడు అని సంతోషంగా... కొడుకుని, మనవరాలను చూసుకుంటూ ఉంటారు. తమ్ముడు ముఖంలో కనిపిస్తున్న ఆనందం చూసి జితేంద్ర కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. దూరం నుండి చూస్తున్న అనసూయ కూడా చాలా ఆనందపడుతుంది. ఎన్నాళ్ళు అయ్యిందిరా నీ ముఖంలో ఈ నవ్వు చూసి అని సంబరపడతారు కానీ..దగ్గరికి వెళ్ళలేని తన నిస్సహాయ స్థితికి బాధపడతారు. జితేంద్ర కౌసల్యా దగ్గరికి వెళ్లి ఈరోజు అన్ని స్పెషల్స్ చేయి అని చెబుతాడు. ఏంటండీ ఈ రోజెంటో మర్చిపోయారా అని అడిగితే.. నాకు గుర్తుంది కౌసల్య. నా తమ్ముడు చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ సంతోషాన్ని మనమందరం సెలబ్రేట్ చేసుకోవాలి కదా.. అన్ని వెరైటీస్ చేపిచ్చేసేయ్ అని చెబుతాడు. అలాగేనండి అని చెప్పి కౌసల్య చారును తీసుకుని కిచెన్లోకి వెళ్లి చాలా రకాల డిషెస్ ప్రిపేర్ చేస్తుంది . డిన్నర్ టైంలో శాంభవి దేవేంద్ర పక్కనే కూర్చుని తనే దగ్గరుండి తినిపిస్తుంది. అది చూస్తున్న అందరికీ ఆనందంతో మనసు, కడుపు నిండిపోతుంది. బావ బావమరుదులు ముగ్గురు రుద్ర పక్కకు చేరి ఏం చెప్పావ్ రా మా చెల్లికి. ఇంతలా మార్పు వచ్చింది అంటే.. ఏమి చెప్పలేదు. చూపించాను అని చెబుతాడు. ఏం చూపించావు రా అంటే.. చిన్నత్త మందిరానికి తీసుకు వెళ్లాను అని చెబుతాడు. ఆ మాటలు వినగానే అందరూ శాంభవి, దేవేంద్ర వైపు చూస్తారు . దేవేంద్ర చాలా సంతోషంగా కనిపిస్తాడు. అందరూ సరదాగా కబుర్లు చెప్పకుంటూ డిన్నర్ ఫినిష్ చేస్తారు గౌతమ్ కి మాత్రం ఏమీ అర్థం కాకుండా ఉంటుంది. శాంభవి తో ఒకసారి మాట్లాడాలి అనుకుని డిన్నర్ అయిన తర్వాత శాంభవి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. వెళుతున్న శాంభవిని పిలిచి నీతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడాలి అంటాడు. చెప్పు గౌతమ్ అనగానే... ఈ ఇంట్లో వాళ్ళ పద్ధతి ఏమీ నాకు అర్థం కావడం లేదు. ఎందుకు నిన్ను రుద్రా సార్ తోనే ఉంచుతున్నారు. నాకు తెలుసుకోవాలని ఉంది అని అడుగుతాడు. నన్ను అనుమానిస్తున్నావా అంటే... నిన్ను అనుమానించడం కాదు శాంభవి. నీ బాధ్యత నా పైన పెట్టారు. అందుకే అడుగుతున్నాను. నిన్ను ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా అంటే... అలాంటిది ఏమీ లేదు అని... సాయంత్రం రుద్ర చెప్పిన విషయం చెబుతుంది. అందుకే వాళ్ళు నా విషయంలో అంత ప్రేమగా ఉంటున్నారు. అంతకుమించి ఎక్కువ ఊహించుకోకు అని చెప్పి పడుకోవడానికి వెళ్ళిపోతుంది. వెళుతున్న శాంభవిని చూస్తూ మిత్ర కూడా నీ ఏజ్ ఏ...కదా మరి మిత్ర విషయంలో అలా ఎందుకు లేరు అని ఆలోచిస్తూ ఉంటాడు . మరునాడు ఉదయం అందరికన్నా ముందే శాంభవి లేచి రెడీ అయ్యి కిందకి వస్తుంది. అందరూ అప్పుడే ఒకళ్ళ తర్వాత ఒకరు లేచి బయటికి వస్తూ ఉంటారు. అందరికీ శ్రావ్యంగా సంగీతం వినిపిస్తూ ఉంటుంది. ఎవరా అని అందరూ హాల్లోకి వస్తారు. అక్కడ ఉన్న అద్భుతాన్ని చూసి ఎవరి నోటి వెంట మాట రాకుండా నిలబడిపోతారు. శాంభవి లంగా వోణి వేసుకుని మహాలక్ష్మి లాగా రెడీ అయి ఉంటుంది. చేతిలో వీణ ఉంటుంది. వీణ వాయిస్తూ సంగీతం మొదలు పెడుతుంది. నిత్యానందకరీ వరాభయకరి సౌందర్య రత్నాకరీ నిర్దూతాఖిల పాపనాశనకరి ప్రత్యక్ష మహేశ్వరీ ప్రాలేయాచల వంశపావనకరి కాశీ పురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరీ మాత అన్నపూర్ణేశ్వరీ నానారత్న విచిత్ర భూషణకరి హేమాంబరాడంబరీ ముక్తాహార విళంబమాన విలసధ్వక్షోజకుంభాంతరీ కాశ్మీరాగారువాసితాంగరు చిరే కాశి పురాదీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరీ మాత అన్నపూర్ణేశ్వరీ యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైక్య నిష్టాకరీ చంద్రార్కనలభాసమానలహరీ త్రైలోక్యరక్షకరీ సర్వైశ్వర్యకరీ తపః ఫలకరీ కాశీపురాదీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరీ మాత అన్నపూర్ణేశ్వరీ కైలాసాచలకందరాలయకరీ గౌరీఉమాశంకరీ కౌమారినిగమార్థగోచారకరీ ఓంకారబీజాక్షరీ మోక్షద్వారకవాటపాటనాకరీ కాశీపురాదీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరీ మాత అన్నపూర్ణేశ్వరీ దృశ్యాదృశ్యవిభూతిపావనకరీ బ్రహ్మాండభాండోదరీ లీలానాటకసూత్రఖేలనకరీ విజ్ఞానదీపాంకురీ శ్రీ విశ్వేశమనః ప్రమోదనకరీ కాశీపురాదీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరీ మాత అన్నపూర్ణేశ్వరీ ఆదిక్షాంతసమస్తవర్ణనకరీ శంభూప్రియే శాంకరీ కాశ్మీరేత్రిపురశ్వరీ త్రినయని విశ్వేశ్వరీ శ్రీకరీ స్వర్గద్వారకవాటపాటనకరి కాశీపురాదీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరీ మాత అన్నపూర్ణేశ్వరీ ఉర్వీసర్వజనేశ్వరీజయకరి మాతకృపాసాగరీ నారీశీలసమానకుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ సాక్షాన్మోక్షకరిసదాశుభకరీ కాశీపురాదీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరీ మాత అన్నపూర్ణేశ్వరీ దేవిసర్వ విచిత్రరత్నరచిత దాక్షాయణీ సుందరీ వామాస్వాదుపయోధరాప్రియకరీ సౌభాగ్యమహేశ్వరీ భక్తాబీష్టకరీ దయాశుభకరీ కాశీపురాదీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరీ మాత అన్నపూర్ణేశ్వరీ చంద్రార్కానల కోటి కోటి సదృశ చంద్రాంశుబింబాధరీ చంద్రార్కగ్నిసమానకుండలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ మాలాపుస్తక పాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరీ మాత అన్నపూర్ణేశ్వరీ క్షత్రత్రాణకరీసదాశివకరీ మాతకృపాసాగరీ సాక్షాన్మోక్షకరీ సదాశివకరీ విశ్వేశ్వరీశ్రీధరీ దక్షాక్రంధకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరీ మాత అన్నపూర్ణేశ్వరీ అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్ధం భిక్షాం దేహి చ పార్వతీ మాత చ పార్వతి దేవీ పితాదేవో మహేశ్వరః బాంధవాoo శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ బాంధవాoo శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయమ్ కళ్ళు మూసుకుని పాడుతూ ఉంటుంది. పాట పూర్తయ్యి కళ్ళు తెరిచేటప్పటికీ అందరూ శాంభవి వైపే కన్ను అర్పకుండా చూస్తూ ఉంటారు. చారు కౌసల్యతో చిన్న వదినను చూస్తున్నట్టే ఉంది కదా అని అంటుంది. నాకు అలాగే అనిపిస్తుంది అని మరిది గారి పరిస్థితి ఏమిటో అని దేవేంద్ర వైపు చూస్తుంది. దేవేంద్ర చాలా ఎమోషనల్ అయిపోతాడు. పరిగెత్తుకుంటూ వచ్చి కూర్చున్న శాంభవిని గట్టిగా హత్తుకుని... నా బంగారం.. నా తల్లి.. ఈ తండ్రి కోసం వచ్చావా అని ఏడుస్తూ ఉంటాడు. జితేంద్ర తమ్ముడు భుజం మీద చెయ్యవేసి ఓదార్చుతాడు. శాంభవి కూర్చున్న చోటు నుంచి పైకి లేచి దేవేంద్ర చేతులు పట్టుకుని... నిన్న మీ బాధ చూసి నాకు కూడా చాలా ఏడుపు వచ్చింది. అది ఎందుకో నాకు తెలియదు. ఈరోజు ఈ వీణ వాయిస్తే మీరు సంతోషపడతారు అనుకున్నాను కానీ.. మీరు ఇలా ఏడుస్తారని అనుకోలేదు అని బుంగమూతి పెట్టుకుని చెబుతోంది. శాంభవి ఎక్స్ప్రెషన్ చూసి దేవేంద్ర కి నవ్వు వస్తుంది. కళ్ళు తుడుచుకుంటూ నేను ఏడవడం లేదు తల్లి. చాలా రోజుల తర్వాత ఈ వీణలో స్పందన వచ్చేటప్పటికి ఎమోషన్స్ ఆపుకోలేకపోయాను అంతే అని చెబుతాడు. రాఘవేంద్ర గారు కూడా శాంభవి దగ్గరకి వచ్చి చాలా సంవత్సరాలు తర్వాత ఈ ఇంటిలో నిజమైన సంతోషం వెల్లువిరుస్తుంది. దీనికి అంతటికే కారణం నువ్వే తల్లి. నీకు ఏమి కావాలో కోరుకో. ఈ తాతగా నీకు నేను ఇస్తాను అంటే... అయ్యో అలాంటిదేమీ అవసరం లేదు తాతగారు అంటుంది. లేదు తల్లి.. నా మనవరాలుకి నేను ఇవ్వాలి అనుకుంటున్నా మొదటి కానుక. అడుగు తల్లి. నువ్వు ఏది అడిగినా సరే కాదు అనకుండా ఇస్తాను అని తల పైన చేయి వేసి చెబుతారు. ఇలా సడన్గా అడిగితే నేను మాత్రం ఏమీ అడగగలను. నాకు అవసరమైనప్పుడు తప్పకుండా అడుగుతాను. అప్పుడు మాట తప్పకుండా ఇవ్వండి అని అంటుంది. తప్పకుండా తల్లి...ఈ రాఘవేంద్ర భూపతి మాట ఇచ్చాడు అంటే తప్పడం అన్నది జరగదు. వాతావరణం తేలిక చేయడానికి రుద్ర అక్కడికి వచ్చి తాతగారు మీరు ఆవేశపడి మాట ఇచ్చేయకండి. ఏదైనా తింగరి కోరిక కోరింది అనుకో..మీరు ఇరుక్కుంటారు జాగ్రత్త అని చెబుతాడు. ఆ మాటలకి అందరూ నవ్వుతారు. శాంభవి ఉడుక్కుంటూ నేను ఎలాంటి తింగర కోరికలు కోరును. కావాలంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు అడగండి అంటే... అందరూ మిత్ర, గౌతమ్ వైపు చూస్తారు. వాళ్ళిద్దరూ చెరోదిక్కుకి చూస్తూ ఉంటారు. శాంభవి వాళ్ళిద్దరి వైపు చూసి ఆ అని గట్టిగా అరుస్తుంది. బృందావనంలో ఆనందాలు మొదలయ్యాయి.
02-04-2026, 08:15 AM
Part - 48
శాంభవికి బృందావనంతో అనుబంధం పెరుగుతూ ఉంటుంది.రోజులు మెల్లిగా ముందుకు సాగుతూఉన్నాయి.
ప్రతిరోజు రేపల్లె కి ఫోన్ చేసి మాట్లాడుతునే ఉంటుంది. రుద్రతో కూడా చనువు పెరుగుతుంది. ఒకరోజు సాయంత్రం ఆఫీసు నుంచి వస్తూ ఉంటే మీతో మాట్లాడాలి రుద్ర సార్ అని అంటుంది. చెప్పు అంటే ఏదైనా ఒక లోన్లీ ప్లేస్ కి వెళదామని అడుగుతుంది. ఏమిటి ఇంత సడన్ గా అని ఆశ్చర్యంగా అడుగుతూ ఒక ప్లేస్ కి తీసుకువెళ్లి ఆపి ఐస్ క్రీమ్ తీసుకువచ్చి చేతికిచ్చి ఇప్పుడు చెప్పు అని అంటాడు. మీరు నిజంగా నన్ను లవ్ చేస్తున్నారా అని సూటిగా అడుగుతుంది. ఇన్ని రోజుల నుంచి చూస్తున్నావ్... తెలియడం లేదా అని అడుగుతాడు. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. నాకు జవాబు మాత్రమే కావాలి. ఇప్పుడు ఎందుకు వచ్చింది నీకు డౌట్. జవాబు చెప్పండి సార్ అని కొంచెం అసహనంగా ఉంటుంది. శాంభవి ఫేస్ ని తన వైపుకు తిప్పుకొని నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. నా ప్రేమ నీకు కనపడటం లేదా అని అడుగుతాడు. ప్రేమ వరకేనా పెళ్లి కూడా చేసుకుంటారా అని అడుగుతుంది. ప్రేమించేది ఎందుకే..పెళ్లి చేసుకోవడానికి కాదా... అవేం డౌట్లు నీకు అని తల మీద ఒకటి మొట్టుతాడు. చేతితో తలని రుద్దుకుంటూ ప్లీజ్ సార్ అడిగినదానికి చెప్పండి. నా ప్రాజెక్ట్ ఇంకా అయిపోవస్తుంది. అది మీకు గుర్తుందా అని అడుగుతుంది... ఆ విషయం నాకు తెలుసు. ఇప్పుడు నీ డౌటే నాకు అర్థం కావడం లేదు అంటాడు. నన్ను పెళ్లి చేసుకోవాలి అంటే ఇల్లరికం రావాలి అని చేతులు కట్టుకుని చెబుతుంది. ఏమిటి అని గట్టిగా అరుస్తాడు. నేను నిజమే చెబుతున్నాను. నేను మా నాన్నలని వదిలి ఎక్కడికి రాను. నన్ను పెళ్లి చేసుకుంటే మీరు ఇల్లరికం రావాలి. అది మీకు ఇష్టమైతే మీ పెద్దవాళ్లని వెళ్లి మా పెద్దవాళ్లతో మాట్లాడమనండి అని చెబుతుంది. ఇదెక్కడ గోలే... పెళ్లయితే అమ్మాయి అత్తారింటికి రావాలి గాని.. నేను ఇల్లరికం వస్తే చాలా చండాలంగా ఉంటుంది. ఏమి చండాలంగా ఉండదు. మా ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని చాలా గౌరవంగా చూస్తారు.అల్లుడు హోదా ఇస్తారు. ఇంతకన్నా ఇంకేం కావాలి. శాంభవి చెప్పే విధానానికి రుద్ర కళ్ళు తేలేసి చూస్తాడు. తల్లి అన్న మాటలు గుర్తుకొస్తాయి. మావయ్య కోసం ఒప్పుకోరా అని తల్లి బ్రతిమాలుతున్న విషయం గుర్తొచ్చి తల విదుల్చుతాడు. శాంభవి గెడ్డం పట్టుకుని తన వైపుకు తిప్పుకొని... చూడు శాంభవి నేను ఎవరితో కూడా ఇంత సహనంగా మాట్లాడింది లేదు. నా జీవితంలో మొట్టమొదటిసారిగా నీతోనే నేను మాట్లాడుతుంది. నీ మాటలను బట్టి నాకు అర్థం అవుతుంది. నేనంటే నీకు ఇష్టమని. ఇక్కడ అందర్నీ వదిలేసి నేను రేపల్లె ఎలా రాగలరు చెప్పు అని అనునయంగా అడుగుతూ ఉంటాడు. నేను మాత్రం వదిలేసి ఇక్కడికి రావాలా.. అది అసలే కుదరదు అని ఖరాఖండిగా చెబుతుంది. శాంభవి మాటలకి ఎలా నచ్చచెప్పాలా అని ఆలోచిస్తూఉంటాడు. శాంభవి వైపు తిరిగి మీ అమ్మలైన, మా అమ్మలైన పెళ్లయ్యాక భర్తతో కలిసి అత్తారింటికి వెళ్ళితేనే కదా వాళ్ళకి గౌరవం ఉంది. అదే మీ నాన్నలు గాని, మా నాన్నగాని అత్తారింటికి వచ్చి ఉంటే... ఈ గౌరవం ఉండి ఉండేదా... మీ విష్ణు మామయ్య మీ నాన్నకి ఇంత గౌరవం ఇస్తారా చెప్పు అని బుజ్జగిస్తూ అడుగుతాడు. వాళ్లందరి సంగతి నాకు తెలియదు. మా నాన్నలు, మా అన్నయ్యలు మాత్రం అదే గౌరవం ఇస్తారు. ఇందులో మీరు భయపడాల్సిన అవసరమే లేదు నాది హామీ అని భరోసా ఇస్తుంది. సరే నేను ఇల్లరికం వస్తాను. మరి మీ అన్నయ్యలు చేసుకునే అమ్మాయిలు కూడా అదే కండిషన్ పెట్టి..ఇల్లరికం రమ్మంటే.... ఆ అమ్మాయిల మీద ఉన్న ప్రేమతో మీ అన్నయ్యలు ఇల్లరికం వెళ్లిపోతే... అప్పుడు మీ ఇంటి పరువు ఏమి కావాలి అని అడుగుతాడు. అలా ఎలా కుదురుతుంది...మా అన్నయ్యలు అలాగ వెళ్లరు అని ఉక్రోషంగా చెబుతుంది. ఏ.... నేను రాగాలేనిది... మీ అన్నయ్యలు వెళితే తప్పేముంది. అలాంటి పరిస్థితి వస్తే నేను ఎంకరేజ్ చేస్తాను కదా అని చెబుతాడు. దానికి నేను ఒప్పుకోను అని గట్టిగా అరుస్తుంది. ఎందుకు ఒప్పుకోవు పాప... అలా మా అన్నయ్యలు ఇల్లరికం వెళితే మా ఇంటి పరువు ఏంకాను... అందరూ మమ్మల్ని చూసి నవ్వరా అని అడుగుతుంది. కదా... నేను ఇల్లరికం వచ్చినా..ఇక్కడ మమ్మల్ని చూసి కూడా నవ్వుతారు కదా... పైగా నేను ఒక్కడినే కొడుకుని. ముగ్గురు అబ్బాయిలు ఉన్న మీ ఇంటి నుంచి వెళ్ళితే నవ్వునప్పుడు.. మరి నన్ను చూసి నవ్వరా... అందులోనూ గజపతిల వంశానికి ఉన్న ఈ తరం వారసుడ్ని. అర్థం చేసుకో పాప అని గడ్డం పట్టుకుని అడుగుతాడు. అయితే దీనికి ఒకటే సొల్యూషన్ ఉంది అని ఆలోచిస్తూ చెబుతుంది. ఏమిటది అని అనుమానంగా అడుగుతాడు. మీరు ఇంకొక అమ్మాయిని చూసుకోండి అని సింపుల్ గా చెప్పేస్తుంది. ఆ మాటకి తల కొట్టుకుంటూ నిన్ను ప్రేమించి.. ఇంకొక అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటానే తింగరిదానా... ఇన్ని రోజులు నువ్వు మీ ఇంటికి దూరంగానే ఉన్నావు అలాగే పెళ్లయ్యాక కూడా అనుకో. లేదు... లేదు.. ఇప్పుడంటే ప్రాజెక్టు గురించి అని దూరంగా వచ్చాను కానీ... అయిన వెంటనే వెళ్ళిపోతాను కదా... అప్పుడు మా నాన్నల దగ్గరే కదా ఉండేది. దానికి దీనికి సంబంధం లేదు కదా అంటుంది. ఇంక లాభం లేదు సెంటిమెంట్ గా లాక్ చేయాలి అనుకుని వేలుతో శాంభవి గుండెవైపు చూపిస్తూ ఇక్కడ నన్ను పెట్టుకుని వేరే వాళ్లతో తాళి కట్టించుకో గలవా అని అడుగుతాడు. ఆ మాటలకి దిక్కులు చూస్తూ... జీరబోయిన గొంతుతో అక్కడ మీరు లేరు అని చెబుతుంది. ఆ మాట నా వైపు తిరిగి చెప్పవే.... ఎటు చూస్తూ చెప్పినా అదే నిజం. నేను మా నాన్నను విడిచి ఉండలేను. ఇక రుద్రాకి విసుగొచ్చి శాంభవిని ఒళ్ళోకి లాక్కుంటాడు. ఏం చేస్తున్నారు మీరు అని కంగారుగా అడుగుతుంది. ష్... అని నోటి మీద వేలు పెట్టి నీ మనసులో నేను లేకపోతే ఇలా చేసిన వెంటనే లాగిపెట్టి ఒక్కటి పీకేదానివి. పెళ్లికి ఎవరైనా అల్లుడికి గిఫ్ట్స్ ఇస్తారు కదా...నేను రిటర్న్ గిఫ్ట్ కింద మా మామగారికి ఇస్తాను అని చెబుతాడు. ఏమిస్తారు అని అనుమానం గా అడిగితే.. అక్కడ ఒక చాపర్...ఇక్కడొక చాపర్ అరేంజ్ చేసి ఉంచుతాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తాను సరేనా అని చెబుతాడు. అంటే నేను మా నాన్న చూడాలి అనుకున్న.. మా నాన్నలు నన్ను చూడాలి అనుకున్న బోడి ఇంకొకడు పర్మిషన్ కావాలా అని అడుగుతుంది. కొంచెం కూడా సొల్యూషన్ వైపు అడుగు వేయవే. పోనీ నన్ను కాదని ఇల్లరికం వచ్చేవాడినే పెళ్లి చేసుకున్నావే అనుకో... వాడు ముందు మంచిగా ఉండి తర్వాత ఆస్తికోసం నిన్ను టార్చర్ పెట్టి వాళ్ళందరినీ ఇంట్లో నుంచి బయటికి గెంటేసాడు అనుకో.. అప్పుడు పరిస్థితి ఏమిటి అని అడుగుతాడు. అలా ఎందుకు జరుగుతుంది జరగదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు అని అడుగుతాడు. సెలెక్ట్ చేసేది మా నాన్నలు కదా..అందుకే అని గర్వంగా చెబుతుంది. ఆ మాటలకి తల కొట్టుకుంటాడు. ఈ నాన్నల పిచ్చి ఏమిటిరా దేవుడా అని పైకి చూస్తాడు. రుద్ర చూసినట్టుగానే పైకి చూసి అక్కడ ఏముంది అని అడుగుతుంది. నా ఫ్యూచర్ కనపడుతుంది అని చెబుతాడు. హో... అలా చూస్తే ఫ్యూచర్ కనపడుతుందా అని అమాయకంగా అడుగుతుంది. నిన్ను అని చెయ్యెత్తి.. వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ చెయ్యి మెల్లిగా తల మీద పెట్టి లేదు బంగారం... ఇంత బాగా అర్థం చేసుకునే పెళ్ళాం నాకు మాత్రమే వస్తుందన్న సంతోషం అంతే అని... మన పెళ్లి మాత్రం జరిగేది పక్క. నువ్వు ఇక్కడికి రావడం ఇంకా పక్క.. అది మైండ్ లో పెట్టుకో ఇంతకుమించి బ్రతిమాలడం నావల్ల కాదు. అలా ఎలా కుదురుతుంది నేను ఒప్పుకోను అంటుంది. చూడు పాప.. మన పెళ్లి వల్ల అందరూ సంతోషంగా ఉంటారు. ఇలాంటి అల్లుడు దొరకడం మా అదృష్టం అని మీ నాన్నలు కూడా పొంగిపోతారు. ఇంక మీ అమ్మలు అయితేనా అని చెబుతూ ఉండగానే.. మా అమ్మలకు అసలు ఏమీ తెలీదు. ఉత్తి తింగర బ్యాచ్ అంటుంది. ఒకసారి పైనుంచి కిందకి చూసి నీకంటే తింగర బ్యాచ్చా అని అడుగుతాడు. నాకు కోపం వస్తుంది నేను చాలా తెలివైన దాన్ని అని చెబుతోంది. అవునవును నీ తెలివి చూసి నాకు చాలా ముచ్చట వేస్తుంది. చెప్పగానే ఎంత బాగా అర్థం చేసుకుంటావో కాదా అని బుగ్గలు లాగుతాడు. నీ ప్రాజెక్ట్ అవ్వగానే మన పెళ్లి జరిగిపోతుంది. రేపే వెళ్లి పెళ్లి విషయాలు మాట్లాడుతున్నారు అని చెబుతాడు. నేను ఒప్పుకోవద్ద అంటే...నువ్వు ఆల్రెడీ ఒప్పేసుకున్నావు. పద ఇంకా ఇంటికి వెళదామని కార్ స్టార్ట్ చేస్తాడు ఇంక ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా కూర్చుంటుంది. నివాస్ కోసం ఎదురు చూస్తున్న విష్ణు గారు సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు. సావిత్రి అక్కడికి వచ్చి ఏమైందండీ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అంటే... శాంభవి తో నివాస్ పెళ్లి విషయం ఆలోచిస్తున్నాను. నివాస్ ఒప్పుకుంటాడా లేదో అర్థం కావడం లేదు. శాంభవి నా కోడలైతే బాగుండునని ఉంది అని తన మనసులో మాట బయటకు చెబుతారు. మనం అనుకుంటే సరిపోదు కదా... వాడు మనసులో ఏముందో తెలియాలి కదా అని మాట్లాడుకుంటూ ఉండగానే... నివాస్ వస్తాడు. హాయ్ నాన్న అనుకుంటూ వచ్చి కూర్చుని... ఏమైంది ఇద్దరు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు అని అడుగుతాడు. నీ పెళ్లి గురించి ఆలోచిస్తున్నాము అని చెబుతారు. నా పెళ్ళి గురించా అని అయోమయంగా చూస్తూ ఉంటే... శాంభవితో నీకు పెళ్లి చేస్తే బాగుంటుంది అని మాకు ఉంది. శాంభవి మీద నీ అభిప్రాయం ఏమిటి కన్నా అని అడుగుతారు. నివాస్ ఏమని చెబుతాడు... కథ కొనసాగుతుంది...
03-04-2026, 09:54 AM
Part - 49
శాంభవికి నాకు పెళ్లి ఏంటి డాడీ అని అడుగుతాడు. ఏమిరా... శాంభవికి ఏం తక్కువ అంటే..అన్ని ఎక్కువే. నేనే శాంభవికి సెట్ అవ్వను అని చెబుతాడు.
అంటే ఏంట్రా నీ ఉద్దేశం అంటే.. ప్లీజ్ డాడ్ కొంచెం నేను చెప్పేది వినండి. శాంభవి అంటే నాకు ఇష్టమే. అది ఒక మరదలు లాగా. తనని చిన్నపిల్లలాగా ట్రీట్ చేసాము. అలాంటిది భార్యగా ఎలా చూడగలను. ఎవరైనా పెళ్లి చేసుకుంటే భార్య రావాలి అని కోరుకుంటారు. నేను శాంభవిని పెళ్లి చేసుకుంటే ఒక చిన్న పిల్లని తెచ్చుకున్నట్టే. మన లైఫ్ పార్టనర్ తో మనం అన్ని షేర్ చేసుకోవాలి అనుకుంటాం కదా... శాంభవిని ప్రతి నిమిషం కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉండాలి. గట్టిగా ఒక మాట కోపంగా అన్న...ఏదో మూవీలో చూపించినట్టు సైరన్ రేపల్లెలో మోగుతుంది. కోపం ఎందుకు వస్తుంది రా... రాదు అంటారు. ఎందుకు రాదు డాడ్. మీరు ఎప్పుడు అమ్మ మీద కోప్పడలేదా.. మన బిజినెస్ ఫ్రస్టేషన్తో ఇంటికి వచ్చినప్పుడు ఆ ఫ్రెస్ట్రేషన్ అంతా అమ్మ మీద మీరు ఎప్పుడూ చూపించలేదాఅని అడుగుతాడు. ఆ మాటలకి మౌనంగానే ఉంటారు. ఒక గ్లాస్ మంచినీళ్లు కూడా శాంభవిని భార్యగా అనుకుని అడగలేను. ఎందుకంటే శాంభవి ఇవ్వాలి అనుకున్న మీరు ఒప్పుకోరు. అమ్మో నా మేనకోడలు కష్టపడి పోతుంది అని ఆలోచిస్తారు. నాకు భార్య అన్న ఫీలింగ్ కూడా రాదు. ప్లీజ్ డాడ్ మా ఇద్దరినీ ఇలాగే ఉండనివ్వండి. మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అని చెప్పి రూమ్ లోకి వెళ్ళిపోతాడు. వాడు చెప్పేదంతా నిజమే కదండీ. చిన్నప్పటినుండి శాంభవిని ఒక అపురూపమైన గాజు బొమ్మలాగా చూస్తున్నాము. అలాంటిది ఒక్కసారిగా వాడు భార్యగా చూడమంటే ఎలా చూడగలడు అని చెబుతుంది. ఆ మాటలకి విష్ణు ఆలోచనలో పడతాడు. రుద్ర, శాంభవి బృందావనానికి చేరుకుంటారు. శాంభవి మాత్రం మౌనంగా తన గదిలోనికి వెళ్ళిపోతుంది. అది చూసిన రాఘవేంద్రగారు ఏమైందిరా.. నా మనవరాలు అంత మౌనంగా ఉంది అంటే... ఆవిడ గారికి ఏమీ కాలేదు పక్కనున్న వాళ్ళ బుర్ర హీటెక్కించేస్తుంది అని చెబుతాడు. అంతలా ఏం చేసింది రా అంటే చెబితే...మీరు షాక్ అవుతారు అని అంటాడు. పర్లేదు చెప్పు తట్టుకోగలం అంటే... పెళ్లి చేసుకుని ఇల్లరికం రావాలి అంట అని చెబుతాడు. బృందావనానికి రావడానికి నీకేంటి రా ఇబ్బంది అంటే... తాతగారు మీరు బుర్ర ఎక్కడ పెట్టి మాట్లాడుతున్నారు. బృందావనానికి కాదు రేపల్లెకి. అయినా నేను బృందావనానికైనా ఎందుకు వస్తాను. ఏదో నా మరదల్ని లైన్లో పెట్టుకోవాలి...మా అమ్మ చిన్నప్పటినుంచి మేనకోడల తో లైఫ్ మిస్ అయిందని ఫీలవుతుందని... పెళ్లి అయ్యేంతవరకు ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నాను కానీ.. నా ప్యాలస్ వదిలేసి ఇక్కడ ఎందుకు ఉంటాను తాతగారు అని చిరుకోపంగా అంటాడు. ఓ మర్చిపోయానురా ఇల్లరికం అంటే రేపల్లె కదు. మరి నువ్వేమన్నావురా అంటే... అదేమీ కుదరదు నువ్వే ఇక్కడికి వస్తావు.. రేపే మా పెద్దవాళ్ళు వెళ్ళి మాట్లాడతారు అని చెప్పేసాను అని చెబుతాడు. అంత సడన్ డెసిషన్ ఎందుకు తీసుకున్నావు రా అంటే... ఇంకా ఎన్ని రోజులు నాంచుతూఉండాలి. ఆ తింగరిది ప్రాజెక్ట్ అయిపోతుంది. ఇంక ఊరు వెళ్ళిపోవచ్చు అని చంకలు గుద్దుకుంటుంది. అది వెళ్ళిపోతే నేనేం చేయాలి ఇక్కడ. అందుకే తెచ్చేసుకుందామని ఫిక్స్ అయిపోయాను అని చెబుతాడు. నువ్వు అంత స్ట్రాంగ్ గా డెసిషన్ తీసుకున్నాక నేను మాత్రం ఏం చేయగలను. మీ పెళ్లి అయిపోతే నా మనవరాలు ఇక్కడే ఉంటుంది కదా..ఆ ఇల్లు అయితే ఏమిటి... ఈ ఇల్లు అయితే ఏమిటి? ఎప్పుడు కళ్ళ ముందు కనబడుతూ ఉంటుంది కదా అదే చాలు. ఇంత మంచి విషయానికి నా మనవరాలు అలిగిందా అని అనుమానంగా అడిగితే...మనకి మంచి విషయం కానీ మీ మనవరాలకు కాదు కదా అంటాడు. ఏ నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అంటే... వాళ్ళ నాన్నల్ని వదిలి రావడం ఇష్టం లేదు. అక్కడ వాళ్ళ గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు పాప లైన్లోకి వస్తుంది. అందుకే ఈ తిప్పలు అన్ని. నా జీవితంలో ఇప్పటిదాకా నేను ఎవరిని బ్రతిమాలింది లేదు. సహనంగా చెప్పింది లేదు. అలాంటిది నాకు అలవాటు లేని పనులన్నీ నీ మనవరాలు దగ్గరుండి మరీ చేపిస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన దేవేంద్ర గారు నవ్వుతూ పోనీలే రా... ఇలాగైనా నీలో కొంచెం సహనాన్ని పెంచి కోపాన్ని తగ్గిస్తుంది.ఎంతైనా నా కూతురు గ్రేట్ రా... మీసం మెలేస్తూ.. చాలా గ్రేట్. అసలు బుర్రలో గుజ్జు అనేదే ఉండదనుకో.. రేపటి నుండి నా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాక తలని గోడ కేసి కొట్టుకోవాలి. అంత కష్టం నీకు ఎందుకు బావ.. అంటే ఏంట్రా మీ ఉద్దేశం అంటే..మా చెల్లి తో నీకు అంత కష్టం ఎందుకు... నీకు కష్టమే తెలియని పిల్లని తెచ్చుకో అని చెప్పాలని మా ఉద్దేశం అంతే అని విహాన్ నవ్వుని దాచుకుంటూ ధీరజ్ వైపు తిరిగి అంతే కదరా అంటాడు. అంతే అంతే అని ధీరజ్ కూడా తల ఊపుతాడు. అవునా సరే అయితే... నేను కాకుండా మీ చెల్లిని భరించగలిగే వాడు ఈ భూ ప్రపంచం మీద ఎవడైనా ఉంటే..తీసుకొచ్చి చేయండి రా.... నేను అసలు అడ్డే చెప్పను అని రిలాక్స్డ్ గా వెనక్కి వాలి కూర్చుంటాడు. బావ అని విహాన్ బిక్కమొహం వేస్తే... ఏమైంది బామ్మర్ది అంటే... మేమేదో నీతో జోక్ చేశాము. ఆ మాత్రం దానికి నువ్వు అలిగితే ఎలాగా అని పక్కన కూర్చుని చొక్కా పట్టుకుని లాగుతూ ఉంటాడు. నాతో జోకులేస్తే రిటైర్ అయిపోతారోయ్. పట్టీల శబ్దం వినిపించి అందరూ సైలెంట్ అయిపోయి ఆ శబ్దం వస్తున్న వైపుకి తల తిప్పుతారు, శాంభవి ఫ్రెష్ అయ్యి డ్రెస్ మార్చుకొని కౌసల్య దగ్గరికి వెళుతూ ఉంటుంది. ఎక్కడికి శాంభవి ఇటు వచ్చి కూర్చో అని రాఘవేంద్ర గారు పిలుస్తారు. పర్వాలేదు తాతయ్య గారు ఆంటీ కి ఏమైనా హెల్ప్ కావాలి ఏమో అడుగుతాను అని వెళుతూ ఉంటే... ఇటు రా తల్లి అని చెప్పి పిలిచే పక్కన కూర్చోపెట్టుకుంటారు. చెప్పండి తాతయ్య గారు అనగానే ప్రాజెక్ట్ ఎలా ఉంది. రుద్ర బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడా అని అడుగుతారు. ఓరగా... రుద్రను చూస్తూ పర్వాలేదు తాతగారు అని చెప్తుంది. ఆ మాటకి రుద్ర గుర్రుగా చూస్తు నాకన్నా బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు ఉన్నారా అని అడిగితే.. ఇప్పుడు నేను ఏమన్నాను సార్ పర్వాలేదు అని చెప్పాను కదా అంటే... పర్వాలేదు అని కాదు.చాలా బాగా చెప్పానని చెప్పాలి. సరే అదేనంట బాగా చెప్పారు అంటే ఇప్పుడు ఓకేనా సార్ అంటుంది. రుద్ర అడిగినదానికి... శాంభవి చెప్పిన విధానానికి అందరికీ నవ్వొస్తుంది. బావా మరదళ్ల గొడవని అందరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంటే నేను అడిగి చెప్పించుకోవాలా...నీకు అర్థం కాలేదు కదా... ఇప్పుడు గదిలోనికి తీసుకెళ్లి స్పెషల్ గా క్లాస్ చెప్తాను అంటాడు. వద్దు వద్దు సార్ మీరు చెప్పింది బాగా అర్థమయింది. జస్ట్ ఉరికనే అన్నాను అని ఒక తింగరి నవ్వుతుంది. అయ్యో శాంభవి గారు అందరి ముందు అర్థం కాలేదని చెప్పి.. ఇప్పుడు అర్థమైంది అని చెబితే ఎలా... నేను ఫ్రీ గానే ఉన్నాను కదా అని నుంచుంటాడు. ఎందుకు సార్ ఆఫీసులో ఇప్పటిదాకా నా బుర్ర తింటూనే ఉన్నారు కదా...ఇంటికి వచ్చాక అయినా రిలాక్స్ అవ్వద్దు. ప్లీజ్ సార్ ఎప్పుడు మీ మీద జోక్స్ వేయను సారీ అంటుంది. రుద్ర దేవేంద్ర ముఖం చూస్తాడు. ఎప్పుడు ఏదో కోల్పోయినట్టు ఉండే దేవేంద్ర.. ఈసారి ఆ బాధలన్నీ మర్చిపోయి..హాయిగా నవ్వుతూ కనిపిస్తాడు. ఆ నవ్వు చూడగానే రుద్ర ఫేసులో కూడా చిరునవ్వు వస్తుంది. అందరూ సరదాగా టైం స్పెండ్ చేస్తారు. బ్యాచ్ అంతా ఆఫీస్ కి వెళ్ళగానే... చారులత, సంతోష్,జితేంద్ర, దేవేంద్ర రేపల్లె వెళ్తారు. వాళ్లని చూడగానే రామచంద్రయ్య గారు సంతోషపడతూ రండి అని చెప్పి లోపలికి తీసుకువెళ్ళతాడు. శకుంతల గారికి పరిచయం చేస్తారు. చాలా దూరం నుండి వచ్చారు కాసేపు విశ్రాంతి తీసుకోండి అంటే.. కారులో కూర్చుని కూడా అదే కదా చేసింది. సరే సరే భోజనాలు చేశాక అయినా మాట్లాడుకుందాం అని చెప్పు కోడలు వంక చూస్తారు. అప్పటికే ధరణి, జయంతి, సులోచన కలిసి భోజనాలు అన్నీ ఏర్పాటు చేస్తారు. ఆ ఇంటిని చూస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మన ఇంటి మహాలక్ష్మి ఈ ఇంటి మహాలక్ష్మి గా పెరిగింది కదా అని అన్నదమ్ములు ఇద్దరు ఇల్లంతా చూస్తూ ఉంటారు. ఏమైంది దేవేంద్ర గారు అలా చూస్తున్నారు అని శివ గారు అడిగితే.. మీ ఇల్లు చాలా బాగుంది ఎప్పుడు కట్టారు అని అడిగితే... చాలా పాతది అండి. మా తాతగారు హయాంలో కట్టారు అని చెబుతారు. అప్పటి నుండి మేము ఉమ్మడిగానే ఉన్నాము. ఒక రకంగా మేము ఉమ్మడిగా ఉన్నాము అంటే దానికి కారణం శాంభవినే అంటారు. అదేంటి అని అడిగితే..మా వంశంలో చాలా సంవత్సరాలు తర్వాత ఆడపిల్ల పుట్టింది. తనని వదిలి ఉండాలి అన్న ఆలోచన మాలో ఎవరికీ లేదు. కన్నది ధరణి అయినా సరే... నా చేతిలోనూ, భాను చేతిలోనే ఎక్కువగా ఉంది. పడుకోవడం, తినిపించడం అన్ని మేమే చేసావాళ్ళం. అందుకే శాంభవికి మాతో కనెక్షన్ ఎక్కువ అని చెబుతారు. ఆ మాటలు వింటున్న దేవేంద్ర, జితేంద్ర కి చాలా బాధగా అనిపిస్తుం.ది మనం మధ్యన పెరిగే మనం పంచుకోవలసిన ఆనందాలు..అన్ని వేరేచోట పంచుకున్నారు. ఎమోషనల్ అవుతున్న అన్నదమ్ముల మధ్య సంతోష్ వచ్చి బావ భోజనానికి రండి అని భుజం మీద చెయ్యి వేస్తాడు. సంతోష్ మాటలకి ఈ లోకంలోకి వచ్చి పదా అని వెళ్లి టేబుల్ దగ్గర కూర్చుంటారు. పెళ్లి మాటలు మొదలవుతాయా??
03-04-2026, 09:55 AM
Part - 50
అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు. భోజనం అయిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకోండి అని బలవంతంగా గదిలోనికి పంపించారు.
ఎలాగైనా పెళ్లి కాయం చేసుకోవాలని వచ్చిన వీళ్ళకి రేపల్లెలో మర్యాదలు చూసి..ఎలా మొదలు పెట్టాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటారు. ఏదైతే అది అయ్యింది. వెళ్లి మాట్లాడాలి అని డిసైడ్ అయ్యి.. కాసేపు పడుకుని లేచి బయటకి వచ్చి మాటల్లో పడతారు. జితేంద్ర రామచంద్రయ్య గారితో మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి అంటే.. మా రుద్రాకి శాంభవిని అడగడానికి వచ్చాము అని చెప్పి వాళ్ళ సమాధానం కోసం చూస్తూఉంటారు. మీరు మా పైన నమ్మకంతో ఇంత దూరం వచ్చి అడిగినందుకు చాలా కృతజ్ఞతలు అండి. కానీ మా అమ్మాయిని అంత దూరం పంపించలేము. ఎంత దూరం అండి హైదరాబాద్ ఏ కదా అంటే...ఈ నాలుగు నెలల నుంచి చాలా కష్టంగా ఉంది. పెళ్లి అయ్యి అంత దూరం అంటే మా వల్ల కాదండి. అసలు ఇల్లరికం వచ్చే సంబంధం చూడాలి అనుకుంటున్నాము. ఆ మాటలకి ఏం మాట్లాడాలో తెలియక శకుంతల గారితో మీరు పెద్దవారు. అనుభవం ఉన్నవాళ్లు. ఇల్లరికం అంటే రేపు అన్నా రోజున అదే గౌరవం శాంభవి భర్తకి ఉంటుందా.. ఒకవేళ లేకపోతే శాంభవి బాధపడుతుంది కదా.. అప్పుడు మీరందరూ బాధపడాలి కదా.. శాంభవిని మా కన్న కూతురి కన్నా ఎక్కువగా చూసుకుంటాము. ఈ ఇంట్లో ఎలా పెరిగిందో.. ఎలా స్వేచ్ఛగా తిరిగిందో.. అక్కడ కూడా అలాగే ఉంటుంది. మమ్మల్ని నమ్మండి దేవేంద్ర శకుంతల చేతులు పట్టుకుని చెబుతారు. దేవేంద్ర అడిగిన విధానానికి శకుంతల గారు కూడా ఆలోచిస్తూ...మీరన్నది నిజమే కానీ బాబు.అమ్మాయిని అంత దూరం పంపడం అంటే మాకు చాలా కష్టం. అందులోనూ శాంభవికి వరసైనవాడు ఉన్నాడు. అంత దూరం పంపేటప్పుడు విష్ణు కొడుకుకే చేసుకుంటాము కదా అని అంటారు. ఆ మాటకే అందరి గుండెలో రాళ్లు పడతాయి. ఓరి దేవుడా వీళ్ళు ఇప్పుడు విష్ణు గారి అబ్బాయికి చేస్తే.. మన అమ్మాయి ఎలా మన ఇంటికి వస్తుందని ఆలోచిస్తూ... ఒకసారి విష్ణు గారితో ఫోన్లో మాట్లాడండి. ఆయన ఏమంటారు చూడండి. దాన్ని బట్టి ముందుకు వెళదాము అని కొంచెం ధైర్యం కూడా తీసుకొని చెబుతారు. ఆ మాటలకే ఆవిడ కళ్ళుర్పుతో భాను వైపు తిరుగుతారు. భాను సరే నానమ్మ అనే విష్ణు కి ఫోన్ చేస్తాడు. ఈ టైంలో బావగారు ఫోన్ చేస్తున్నారు ఏంటి అని లిఫ్ట్ చేసి చెప్పండి బావగారు అనగానే... శాంభవి కి ఒక సంబంధం వచ్చింది కానీ... నివాస్ కైతే బాగుంటుంది అని మాకు ఉంది. దీని మీద నీ అభిప్రాయము ఏంటి విష్ణు అని అడుగుతాడు. దానికి ఏం చెప్పాలో తెలియక అది బావా అని నాన్చుతుంటే.. ఇప్పుడు నువ్వు సూటిగా చెప్పు.ఇందులో ఇబ్బంది ఏమీ లేదు. నేను ఆల్రెడీ నివాస్ తో మాట్లాడాను. శాంభవిని పెళ్లి చేసుకో. కానీ వాడు మేమిద్దరం చిన్నప్పటినుంచి కలిసిమెలిసి పెరిగాము ఎలా చేసుకుంటాను...అని వాళ్ళ మధ్యన జరిగిందంతా చెబుతాడు. అది విని నిట్టూర్చి సరే అయితే అని ఫోన్ పెట్టేస్తారు. భాను మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటే... ఏమన్నాడు విష్ణు అని అడుగుతారు. జరిగిందంతా చెబుతాడు. ఆ మాటలకి వచ్చిన నలుగురు హమ్మయ్య అనుకుంటారు. శాంభవి చేత చిన్న పని కూడా చేయించము. మీ దగ్గర ఎంత అపురూపమైన గాజు బొమ్మగా పెరిగిందో... మేము అంతకన్నా అపురూపంగా చూసుకుంటాము అని మాట ఇస్తారు. ఆ మాటలకు సంతోషపడుతూనే... శాంభవి మీద మీకు అంతా ఇంట్రస్ట్ ఎందుకు అని అడుగుతారు. మా రుద్ర కి మొదటి చూపులోనే నచ్చింది. ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటే శాంభవినే చేసుకుంటాను అని మొండిపట్టు పడ్డాడు. మాకు ఉన్నది ఒక్కడే కొడుకు. తరతరాలు తిన్న తరగని ఆస్తి ఉంది. మీరు ఇల్లరికమే కావాలి అన్నారు అని తెలిసిన సరే... వాడు ఇక్కడ మీకు ఒక చాపర్ అరేంజ్ చేస్తాను అని చెప్పాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు వచ్చి చూసుకునేటట్టు.. లేదంటే శాంభవి అయినా ఇక్కడికి వచ్చేటట్టుగా అన్ని అరేంజ్మెంట్స్ చేస్తున్నాడు అని చెబుతారు. రుద్రా కేరింగ్ కి పెద్ద వాళ్ళందరికీ తృప్తిగా అనిపిస్తుంది. ఒకసారి మా సిద్ధాంతికి కూడా చూపించి అప్పుడు మాట్లాడుకుందాము అని చెబుతారు. అందుకు ఆలస్యం ఎందుకండీ... ఇప్పుడే పిలిపించండి అని చారులత కంగారు పెట్టేస్తుంది. ఎందుకండీ అంత కంగారు అంటే... మా అబ్బాయి మమ్మల్ని కూర్చోనివ్వడం లేదు. నుంచోనివ్వడం లేదు. వెంటనే వాడికి ఇన్ఫర్మేషన్ చెప్పకపోతే... వాడే వచ్చేస్తాడు అందుకని అని నవ్వుతారు. ఆ మాటలకు నవ్వుతూ లలిత్ వైపు చూస్తారు. వెంటనే వెళ్లడానికి ఏర్పాట్లు చేస్తాను అన్ని కార్లు రెడీ చేపిస్తాడు. సంతోష్ అదేంటి ఆయన రారా అని అడిగితే.. ఆయన దేవి ఉపాసకులు అండి. అన్ని చోట్లకి అన్నివేళలా రారు. మా శాంభవి పుట్టిన తర్వాత జాతకం చూసి లలితా దేవి హోమం చేయమని చెప్పింది ఆయనే అని చెబుతారు. అవునా సరే పదండి అని అక్కడికి వెళ్తారు. అందరూ అక్కడికి వెళ్లి సిద్ధాంతి గారి కోసం చూస్తూ ఉంటారు. ఆయన శిష్యుడు వచ్చి లోపలికి రండి అని తీసుకువెళ్లి కూర్చోబెడతారు. శాంభవి, రుద్ర జాతకాలు పరిశీలించి చూసి ఒక ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుని తెరిచి రామచంద్రయ్య గారి వైపు తిరిగి.. అమ్మాయి పెళ్లి ఈ అబ్బాయి తోనే జరుగుతుంది. ఎటువంటి ఆటంకాలు లేవు. నిర్భయంగా మీరు పెళ్లి చేయవచ్చు. అమ్మాయి ఇక్కడ ఎంత సంతోషంగా ఉందో అక్కడ అంతకన్నా ఎక్కువ సంతోషంగా ఉంటుంది. దేవేంద్ర వైపు తిరిగి నీ సంతోషాలు కూడా నీ దగ్గరికి వస్తున్నాయి. కానీ జాగ్రత్తగా కాచుకో అని చెబుతారు. సిద్ధాంతి గారు ఏమి చెబుతున్నారో అన్నది రామచంద్రయ్య గారికి అర్థం కాదు కానీ.. దేవేంద్ర కి పూర్తిగా అర్థమయ్యి తప్పకుండా స్వామి అని చెబుతారు. ఈ దేవీ నవరాత్రుల్లోనే అమ్మాయి పెళ్లి జరిగిపోతుంది. అది కూడా ఇక్కడ కాదు అని చెబుతారు. దానికి రామచంద్రయ్య గారి కంగారుపడుతూ.. మా ఇంటికి ఉన్న ఒకే ఒక ఆడపిల్ల. ఇక్కడ కాకుండా ఎక్కడ స్వామి అంటే.. ఆయన నవ్వుతూ భూపతుల వంశానికి సంబంధించిన ఒక గ్రామం ఉంది. అక్కడ ఉన్న అమ్మవారి ఆలయంలోనే వీళ్ళ పెళ్లి జరుగుతుంది. ఇది అమ్మ నిర్ణయం అని చెబుతారు. దానికి అందరూ నమస్కారం చేసి బయటికి వస్తారు. దేవేంద్ర వాళ్లకి మాత్రం సంతోషంతో ఎక్కడో తేలుతూ ఉంటారు. పెళ్లి ఇక్కడ జరగదు అని తెలిసి రామచంద్రయ్య గారి ఫ్యామిలీ మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. వాళ్లు బాధ అర్థమైన దేవేంద్ర గారు చేతులు పట్టుకుని మీరు బాధపడకూడదు. ఎక్కడ జరిగిన మన అమ్మాయి సంతోషంగా ఉండటమే కదా మనకు కావాల్సింది. భూపతిల ఇల్లు అంటే శాంభవికి పుట్టినిల్లె. ఆ మాటలకి కొంచెం శాంతించిన..ఏమోనండి మన ఇంట్లో జరిగితే ఆ తృప్తి వేరు కదా కానీ..అమ్మ నిర్ణయం అలా ఉన్నప్పుడు మనం ఆచరించాలి కదా అని నచ్చచెబుతారు. ఇంక మౌనంగా ఇంటికి వెళ్తారు. వెళ్ళగానే శకుంతల గారు ఏమైందిరా అని అడిగితే.. జరిగిందంతా చెబుతారు. అమ్మ నిర్ణయం ఎందుకు అలా ఉందో మనకి తెలియదు కదా.. ఏదైతే ఏమిటి శాంభవి సంతోషంగా ఉండడమే మనకు కావలసింది. బయలుదేరుతున్న చారులతకి పసుపు కుంకములతో సారె పెట్టి... ముహూర్తం చూసి కబురు పంపిస్తాము అని చెబుతారు. ముహూర్తం కూడా మేమే చూపిస్తామండి. మీరు అసలు దేనికి టెన్షన్ పడొద్దు అని జితేంద్ర ఉత్సాహంగా చెబుతాడు. మేనల్లుడు పెళ్లి అంటే ఇంత సంతోషమా అని అడుగుతారు. అంతే కదండీ మేనల్లుడు పెళ్లి అవుతే..మా ఇంటికి కూతురు వస్తుంది. ఆడపిల్లలు లేని ఇల్లు మావి అందుకే ఇంత ఆనందం. ఆ సంతోషాలతో వీళ్ళ తిరిగి హైదరాబాదు బయలుదేరుతారు. పెళ్లి గురించి విన్న శాంభవి ఏమీ ఆలోచిస్తుంది..
03-04-2026, 09:57 AM
Part - 51
బృందావనానికి చేరుకున్న దేవేంద్ర గారు సంతోషంతో విషయం రాఘవేంద్ర గారికి చెబుతారు. ఎంత మంచి విషయం చెప్పావు రా..
పెళ్లి కూడా మన ఊరిలోనే జరుగుతుంది అని తెలిసినప్పటినుండి నా మనసు మనసులో లేదు. గాలిలో తేలుతుంది. అక్కడ పనులన్నీ పురమాయించాలి నేను వెళతాను అని చెబుతారు. లేదు నాన్నగారు.... నేను, అన్నయ్య అన్ని సిద్ధం చేసేసాము. అక్కడ మనుషులను పెట్టి చేపిస్తున్నాము. మీరు ఏమి కంగారు పడకండి. మధ్య మధ్యలో మేము ఎవరిమైనా వెళ్లి చూసి వస్తాము. మీరు అలసిపోవద్దు. ఈ పెళ్లి విషయం విన్న ధీరజ్, విహాన్, అద్వైత్ మాత్రం ఎగిరి గంతులు వేస్తారు. తొందరలోనే మన చెల్లి మన ఇంటికి వచ్చేస్తుంది. ఇక రోజు సంతోషాలే. మన బృందావనానికి అసలైన కళవొస్తుంది అని చాలా సంతోషపడిపోతూ ఉంటారు. రుద్ర మాత్రం జరిగేదంతా చూస్తూ ఉంటాడు. ఏమైంది బావ అంత సైలెంటుగా ఉన్నావు అంటే.. మయూరి ఆక్టివిటీస్ ఏమీ ఈ మధ్యన లేవు. అందుకే ఆలోచిస్తున్నాను. పెళ్లి విషయం ఎలాగో తెలిసిపోతుంది. ఈలోపే వాళ్ళకి ఏదో ఒక చెక్ పెట్టాలి. నిషా, ఆశ... ఆనంద్, విహారిలను కలుస్తారు. చెప్పండి బేబీస్ ఏమిటి ఇలా గెస్ట్ హౌస్ కి వచ్చారు అంటే... మనం ఒకసారి వెళ్లి మీ తాత గారిని కలుద్దాం అని చెబుతారు. ఎందుకు అని నొసలు ముడివేసి ఒకేసారి అడుగుతారు. ఎందుకు మీకు అంత కంగారు. ఒకసారి కలిసి మన ఇద్దరం రుద్రా కి శత్రువులమే కాబట్టి ఇలా పెళ్లి చేసుకుందామని చెబుదాము. పెద్దలంగీకారంతో పెళ్లి జరిగితే ఇంకా బలం పెరుగుతుంది కదా.. ఓ... మై బేబీస్ ఏం ఆలోచిస్తున్నారు మీరు? మా స్టేటస్ కి, మరి రేంజ్కి మీరు సరిపోతారు అనుకుంటున్నారా.. శత్రుత్వం కోసం ఇలా తక్కువ లోకి వచ్చాము అంటే..మా తాతగారు ఇంక మమ్మల్ని అక్కడే షూట్ చేసేస్తారు. మిమ్మల్ని ఫ్రెండ్స్ ని తీసుకెళ్లి పరిచయం చేస్తాము. తర్వాత మనం సీక్రెట్ గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం. ముందు వెళ్లి మీవాళ్ళకి కనపడదాం. తర్వాత మెల్లిగా మా తాత గారి దగ్గర మాట్లాడదాం. ఏమంటారు అనగానే.. ఈ ఐడియా ఏదో బాగానే ఉంది. ఎప్పుడు వెళదామని అడుగుతారు. లేడికి లేచిందే పరుగు అంటే ఎలాగా.. తాతగారు ఏం చేస్తున్నారు.. ఏంటో కనుక్కొని అప్పుడు ఏ విషయం మీకు కాల్ చేస్తాను కదా అని చెప్తారు. ఓకే బాయ్ అని చెప్పి వెళ్ళిపోతారు. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత ఆనంద్ ఫోన్ చేసి మాట్లాడతాడు. ఓకే అని ఫోన్ పెట్టేసి నిషా కి కాల్ చేసి ఎల్లుండి వెళదాం రెడీగా ఉండండి అని చెబుతాడు. ఓకే అని ఫోన్ పెట్టేస్తుంది. వీళ్ళని నమ్మొచ్చు అంటావా అని ఆశ అడుగుతుంది. అందుకే కదా ఈరోజు ఒక రాయి వేసాను. పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యారు కదా... ఎల్లుండి మనం చూసిన తర్వాత ఒక ఐడియా వస్తుంది. అప్పుడు ఆలోచిద్దాం. ఏం చేయాలో అన్నది అంటుంది. అది కరెక్టేలే అని చెప్పి సైలెంట్ అవుతుంది. శాంభవి భాను గారికి ఫోన్ చేసి మీరు ఈ పెళ్ళికి ఎలా ఒప్పుకున్నారు అని అడుగుతుంది. ఏమైంది బంగారం అంటే.. నన్ను ఇంత దూరం మీరు పంపించేస్తారా అని అలకగా అడుగుతుంది. ఆ మాటలకే నవ్వుతూ నా చిట్టి తల్లిని దూరంగా ఎందుకు పంపిస్తాను... మరి అతను ఇల్లరికం వస్తున్నాడా అని ఆశగా అడుగుతుంది. ఇల్లరికం రావడం అంత మంచిది కాదు తల్లి. నన్ను దూరంగా పంపను అని దూరంగా పంపిస్తున్నారు కదా అని ఏడుపు గొంతుతో అడుగుతుంది ఈ మాటలన్నీ వింటున్న రుద్ర కి మాత్రం బుర్ర హీటెక్కిపోతూ ఉంటుంది. రేపల్లెకి, హైదరాబాద్ ఎంత దూరం తల్లి. నేను ఏదో విధంగా సంబంధం తప్పిద్దామనే సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళాము. ఆయన మీ ఇద్దరికే పెళ్లి కచ్చితంగా జరుగుతుంది. ఇది అమ్మ నిర్ణయం అని చెప్పారు అని చెబుతారు. ఆ మాట వినగానే శాంభవి సైలెంట్ అయిపోతుంది. ఏరా బంగారు తల్లి మీ నాన్న చేసింది తప్పు అంటావా అంటే.. తప్పని నేను అనడం లేదు కానీ..రోజు మిమ్మల్ని చూడాలి కదా.. అలా చూడకుండా ఉంటే చాలా బెంగగా అనిపిస్తుంది అని ఇప్పటినుండే ఏడుపు అందుకుంటుంది. అది చూసిన రుద్ర తల కొట్టుకుంటూ శాంభవి దగ్గరికి వచ్చి వీడియో కాల్ ఆన్ చేస్తాడు. వెంటనే భాను గారు లిఫ్ట్ చేసి చిట్టితల్లి కళ్ళు తుడుచుకో. నువ్వలా ఏడుస్తూ ఉంటే.. మాకు కాళ్లు చేతులు ఆడవు అని కంగారు పడతారు. కళ్ళు తుడుచుకొని నేను ఏమి ఏడవడం లేదు అని ముక్కు ఎగబిల్చుతూ ఉంటుంది. వెంటనే రుద్ర ఫోన్ తన వైపుకు తిప్పుకొని నమస్తే మావయ్య గారు అంటాడు. నమస్తే బాబు బాగున్నావా.. అని ఇప్పటినుండి అల్లుడు మర్యాదలు మొదలుపెడతారు. అయ్యో మావయ్య గారు లలిత్ వాళ్ళు మీకు ఎలాగో.. నేను అంతే. ఇంకేంటి సంగతులు అని ఇద్దరు మాటలో పడతారు. పక్కనే ఉన్న శాంభవి మాత్రం ఉడుక్కుంటూ నేనొకదాన్ని ఉన్నానన్న విషయం ఇద్దరూ మర్చిపోయారు అని అక్కడి నుండి లేచి వెళ్ళిపోతుంది. వెళుతున్న శాంభవిని చూసి నవ్వుకుంటూ శాంభవి బాగానే ఉంది మావయ్య గారు. తనకంటి నుండి కన్నీరు రాకుండా చూసుకునే బాధ్యత నాది సరేనా అని చెబుతాడు. అర్థమయింది అల్లుడుగారు ఉంటాను అని ఫోన్ పెట్టేసి రుద్ర గురించి ఎటువంటి టెన్షన్ లేకుండా సంతోషంగా ఉంటారు. శాంభవిని వెతుక్కుంటూ వెళతాడు. గార్డెన్లో కూర్చుని ఉంటుంది. పక్కనే కూర్చుని ఏమిటి తెగ ఆలోచిస్తున్నావు అంటే.. ఏమీ లేదు అని పక్కకి తిరుగుతుంది. నేను ఇటు మాట్లాడుతుంటే.. నువ్వు అటు తిరిగేవనుకో నాకు చాలా కోపం వస్తుంది అంటాడు. చూశారా ఇప్పుడు దాకా నా మీద ఎవరూ కోప్పడలేదు. మీతో పెళ్ళి కుదిరింది అనగానే..మీరు నా పైన కోపం చూపిస్తున్నారు. అందుకే నేను ఇక్కడ ఉండను అనేది అంటుంది. ఇప్పుడు నేనెక్కడ కోపం చూపించానే.. నీకు నువ్వే ఊహించేసుకుంటున్నావు అంటే...లేదు.... లేదు... ఇప్పుడేగా అన్నారు కోపం వస్తుందని. ఇప్పుడు దాకా ఆ మాట ఎవరు అనలేదు తెలుసా అని మల్లి టాప్ ఇప్పబోతుంది. వెంటనే రెండు చేతులతో దండం పెట్టి అమ్మ శాంభవి మాటవరసకి కూడా నీ దగ్గర ఆ మాట వాడను సరేనా.. రుద్ర చేసిన విధానానికి శాంభవి వెంటనే నవ్వుతుంది. ఆ నవ్వు చూసి ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండు అని బుగ్గలు రెండు పట్టుకుని లాగుతాడు. వెంటనే దూరం జరుగుతుంది. ఏమైంది అని అడిగితే పెళ్ళికి ముందు ఇలా టచ్ చేయడం తప్పు అంటుంది. నేనేమీ రాంగ్ టచ్ చేయలేదు కదా బుగ్గలే కదా పట్టుకున్నాను అంటే.. అయినా సరే టచ్ చేయకూడదు అంటుంది. ఒక్కసారి ఇక్కడ తనకి పరిచయమైన లేడీస్ ని గుర్తు చేసుకుంటాడు. ఆశ, నిషా సందు దొరికితే ఎలా మీద పడిపోతారు గుర్తు చేసుకుని నవ్వుకుంటాడు. ఎందుకు నవ్వుకుంటున్నారు అంటే.. ఏమీ లేదులే కానీ నీకు హనీమూన్ కి ఎక్కడికి వెళ్లాలని ఉంది అని అడుగుతాడు. బుగ్గ మీద వేలు పెట్టుకుని ఆలోచిస్తుంటే... ప్లీజ్ రేపల్లె అని మాత్రం చెప్పకే అంటాడు. చెబితే ఏమవుతుంది అంటే..వెళ్ళేది హనీమూన్ కి. ఫెస్టివల్ కి కాదు కదా.. మనిద్దరం మాత్రమే ఉండే ప్లేస్ సెలెక్ట్ చేయాలి బంగారం అని చెబుతాడు. ఆ మాటలకి ఇబ్బందిగా చూస్తూ నాకేమీ తెలియదు అంటుంది. దీనికి ఎందుకు అంత ఇబ్బంది పడతావు. నీకు ఎలాంటి ఎన్విరాన్మెంట్ ఉంటే నచ్చుతుందో చెప్పు. దానికి తగ్గట్టుగా ప్లేస్ నేను సెలెక్ట్ చేస్తాను అని చెబుతాడు. అది ఇప్పుడే డిస్కస్ చేసుకోవాలా అంటే..మరి లేకపోతే షష్టిపూర్తి తర్వాత డిస్కస్ చేస్తావా అంటాడు. వాళ్ళిద్దరూ అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే అది చూసిన పెద్ద వాళ్లకి మాత్రం చాలా తృప్తిగా అనిపిస్తుంది. కౌసల్య అక్కడనుండే ఇద్దరికీ దిష్టి తీస్తుంది. కౌసల్య వాళ్ళ అత్తగారి దగ్గరికి వెళ్లి లోపలికి రావచ్చా అత్తయ్య గారు అని అడుగుతుంది. రా కౌసల్య.. రాకరాక వచ్చినట్టు ఉన్నావు ఏమైనా మాట్లాడాలా అంటే... హ్మ్... మీకు ఒక ముఖ్యమైన విషయం చెబుదామని వచ్చాను అంటుంది. రుద్రా శాంభవికి పెళ్ళి కుదురుచ్చారా అని అడుగుతుంది. అవును అత్తయ్య గారు.. అది కూడా మన ఊర్లోనే జరుగుతుంది అని చెబుతోంది. ఎంత మంచి విషయం చెప్పావు. రేపే గుడికి వెళ్లి ఇద్దరి పేరు మీద అర్చన చేపించాలి అని సంతోషంగా చెబుతారు. వద్దు అత్తయ్య గారు ఇప్పుడు మీరు ఏమీ చేయవద్దు. మీరు బయటికి వెళ్లితే ఆ విషయం ఎలాగోలాగా మయూరీకి తెలుస్తుంది. మళ్ళీ అది మీరే చెప్పారు అనుకుని ఇంకా మీ మీద కోపం పెంచుకుంటారు. ఇప్పుడు ఇవన్నీ అవసరమా.. మన ఊరు వెళ్ళాక అక్కడ అమ్మవారికి మీకు కావాల్సిన అన్ని రకాలుగా పూజలు, శాంతులు చేయిపించండి అని చెబుతోంది. అదే నిజమేలే అనే సైలెంట్ అవుతారు. ఏమిటో పరిస్థితులు ఇలా వచ్చాయి. ఇది మీ చేతుల మీద జరగవలసిన మన ఇంటి మొదటి శుభకార్యం కానీ.. ఇంకేమి మాట్లాడలేక అక్కడనుండి వెళ్ళిపోతుంది. వెళుతున్న కోడలినే బాధగా చూస్తూ భగవంతుడా నేను చేసిన తప్పుకి ఎన్ని రోజులకి ప్రాయశ్చిత్తం దొరుకుతుంది అని బాధపడతారు. దేవేంద్ర రాఘవేంద్ర గారి దగ్గరికి వచ్చి రేపు నేను గుడికి వెళదాం అనుకుంటున్నాను అని చెబుతాడు. ఏ గుడికి అని అనుమానంగా అడిగితే.. మీరు అనుకునే గుడికి అని చెబుతాడు. ఇప్పుడు అవసరమా అంటే... అవసరమే. శాంభవి గురించి చెప్పాలి. వాళ్లను కూడా పెళ్లికి రమ్మనాలి అంటే... మనల్ని క్షమిస్తారా అని బాధగా అడుగుతారు. క్షమించిన, క్షమించకపోయినా చెప్పడం నా ధర్మం. రేపు అన్న రోజున తెలిసిన తర్వాత..శాంభవి కళ్యాణానికి కూడా పిలవలేదు అని ఇంకా బాధపడతారు. సరే నీ ఇష్టం అని ఆరోజు జరిగిన విషయం గుర్తుకు రాగానే బాధగా కళ్ళు మూసుకుంటారు. బాధపడకండి నాన్నగారు..జరిగిన ఏ విషయము కూడా తిరిగి రాదు కదా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. గుడిలో ఏం జరగబోతుంది కథ కొనసాగుతుంది..... |
|
« Next Oldest | Next Newest »
|