Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బృందావనం
#61
Part - 28

   అందరి ఆత్రం తీర్చడానికి సూర్యుడు తను వెలుగు రేఖలతో గుడ్ మార్నింగ్ చెబుతాడు. రేపల్లె నుంచి వాళ్ళ వెహికల్స్ లో హైదరాబాద్ బయలుదేరుతారు.

భాను గారు శాంభవి కి ఫోన్ చేసి మేము డైరెక్ట్ గా మీ ఆఫీస్ దగ్గరకు వచ్చేస్తాము తల్లి అని చెబుతారు. సరే నాన్న నేను వెయిట్ చేస్తాను అని చెప్పి వాళ్లు మావయ్యతో సాయంత్రం డ్రైవర్ అవసరం లేదు.

నాన్న వాళ్ళు వస్తున్నారు డైరెక్టుగా కాలేజ్ క్ అని చెబుతుంది. మేము కూడా వస్తున్నాము మీ ఆఫీస్ నుంచి అటే డైరెక్ట్ గా చార్మినార్ వెళ్ళిపోదాము లేకపోతే టైం సరిపోదు అని చెప్తాడు.

సరే మావయ్య అని చెప్పి ముగ్గురు ఆఫీస్ కి వెళ్ళిపోతారు.  నివాస్ నువ్వు కూడా వస్తావా అంటే.. నాన్న మీరు వెళ్ళేది లేడీస్ షాపింగ్ కి.

మీరు వెళ్లడమే ఎక్కువ అంటే.. మళ్ళీ నన్ను కూడా రమ్మంటున్నారా నన్ను వదిలేయండి. నాకు ఆఫీసులో చాలా వర్క్ ఉంది అని ఆఫీస్ కి వెళ్ళిపోతాడు.

విష్ణు సావిత్రితో వీడేంటి బాబు..  అస్తమానం ఆఫీస్ ఆఫీస్ అంటాడు.  శాంభవికి దగ్గరగా ఉంటేనే కదా నేను బావ తో పెళ్లి సంబంధం మాట్లాడగలను.

వీడు అంటి ముట్టినట్టుగా ఉంటే శాంభవిని ఎలా ఇచ్చి పెళ్లి చేస్తారు. ఏంటో వీడి తింగర వేషాలు అంటారు. దానికి సావిత్రి నవ్వుతూ వాళ్ళిద్దరికీ రాసిపెట్టి ఉంటే ఎలాగైనా భగవంతుడు ముడి వేస్తాడు. రాసిపెట్టి లేకపోతే మనం ఏ ప్రయత్నాలు చేసినా అవ్వదు

ఎవరు ఎలా ఉంటున్నారో అలాగే ఉండనివ్వండి. మీరు కూడా ఆఫీసుకు తొందరగా వెళ్తే సాయంత్రం తొందరగా వచ్చేయొచ్చు కదా అని చెబుతుంది.

అంటే ఇండైరెక్ట్ గా నన్ను బయట పొమ్మని చెబుతున్నావా అని ఆఫీస్ కి బయలుదేరుతారు.

కౌసల్య, చారులత కూడా సాయంత్రం మీ ఆఫీస్ అయ్యే టైపు మేము అక్కడికి వచ్చేస్తాము.  మీ అరేంజ్మెంట్స్ మీరు చేయండి రా అని చెప్తారు.

మీరు ఎవరు ఏం చెప్పినా వినరు కదా మీరు ఏది అనుకుంటే అదే మేం చేయాలి కదా అని ఎవరి కొడుకుల వాళ్ళ అమ్మలతో దెబ్బలాడుతారు.

పోనీ అలాగే అనుకోండి రా వెళ్ళండి తొందరగా ఆఫీస్ కి అని బయటకి గెంటేస్తారు. ఆఫీసుకు వెళ్లిన ఈ నలుగురు అబ్బాయిలు అసలు మన మాటంటేనే లెక్క చేయడం లేదు.

శాంభవితో షాపింగ్ అంటే ఎక్కడ భూమ్మీద ఆగడం లేదు. శాంభవి వీళ్లకు దగ్గరకు వచ్చి అత్తమ్మ పెద్దమ్మ అని పిలిస్తే మనల్ని మనం ఉన్నామా లేదా అని కూడా పట్టించుకోరేమో వీళ్ళు అని అనుకుంటారు.

అది మాత్రం నిజమే బావ మా అమ్మ కూడా మొహమాట పడకుండా బయటికి గెంటేసింది అని ధీరజ్  చెప్తాడు.

మాధురి అత్తయ్య కూడా వస్తుందా అంటే... నీకు అందులో ఏమైనా డౌట్ ఉందా!

రాత్రి చారత్త, కౌసల్య అమ్మ ఫోన్ చేసి మరీ చెప్పారు రెడీ అయిపో పికప్ చేసుకుంటాను అని...

వీళ్ళ ముందు ఎంత కాస్ట్లీ సారీస్, ఆర్నమెంట్స్ పెట్టిన ఇంత ఆనంద పడలేదేమో..  మనకి మాత్రం పిచ్చ టెన్షన్ లేపుతున్నారు అంటూ...

ధీరజ్ మన ఆఫీసులో వాళ్ళు ఫోన్స్ అన్ని ట్రాప్ చేసావా ఎవరు అని తెలిసిందా అంటే... ఆ తెలిసింది బావ అని లిస్ట్ ఇస్తాడు.

అందులో ఉన్న ఇద్దరు పేర్లు చూసి వీళ్ళకి మన ఆఫీసులో మంచి పొజిషన్లోనే ఉన్నారు కదా! ఆయన ఈ కక్కుర్తి ఏంటో..

మనకి విషయం తెలిసింది అన్నట్టు కాకుండా ఇద్దరినీ చెరో ఒక బ్రాంచ్ కి వర్క్ మీద పంపించేయండి. అలాగే అందరు ఫోన్స్ మాత్రం ట్రాప్ చేసి ఉంచండి.

ఆఫీస్ విషయాలు గానీ, శాంభవి విషయాలు గానీ బయటికి వెళితే మాత్రం ఈసారి వెరైటీగా పనిష్మెంట్ ఇద్దాం.

ఆ పని చూడు  ధీరజ్ అని చెబుతాడు.  సరే బావ అని చెప్పి ఎంప్లాయిస్ ఇద్దరినీ చెరో ఒక  బ్రాంచ్ కి షిఫ్ట్ చేసేస్తాడు.

దేవేంద్ర క్యాబిల్లోనికి వచ్చి శాంభవి వాళ్ళ టీం కి వర్క్ నేర్పిస్తూ ఉంటారు.  వర్క్ విషయంలో మాత్రం శాంభవి ఫోకస్ ఎప్పుడు సీరియస్ గానే ఉంటుంది.

ఎటు డిస్టర్బ్ అవ్వదు.  లంచ్ బ్రేక్ దాకా అసలు ఎవరిని డిస్టర్బ్ చేయకుండా వర్క్ చేస్తూనే ఉంటుంది. లంచ్ చేసిన తర్వాత ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది.

ఆఫీస్ టైం అయ్యేటప్పటికి కౌసల్య, చారులత, మాధురి అక్కడికి వస్తారు. డైరెక్ట్ గా రుద్ర క్యాబిన్ కెళ్ళి ఏరా ఇంతసేపు వర్క్ చేపిస్తున్నారు.  వదిలేయచ్చు కదా అంటే...

అమ్మ మీరు షాపింగ్ కి వెళ్ళాలి అని చెప్పి ఆఫీస్ అవర్స్ తగ్గించగలమా కాసేపు వెయిట్ చేయండి అని విసుగ్గా చెబుతాడు.

ఎందుకురా అంత కోపం ఇప్పుడు మేము ఏమన్నామని అంటే..  నిన్నటి నుంచి మీరు ఎక్కడ నడుస్తున్నారు.  నేల మీద నడవడం మర్చిపోయారు. గాల్లో,  ఊహల్లో ఉంటున్నారు.

అనుకోకుండా కలిసి వెళ్తున్నట్టుగా బిల్డ్అప్ ఇస్తున్నారు. నిజంగా రేపు అన్న రోజు శాంభవి మిమ్మల్ని రిలేషన్తో పిలిచి షాపింగ్ కి వెళితే..  ఇంక మమ్మల్ని పట్టించుకుంటారా మీరు అని అడుగుతాడు.

ఓరిని మీ అలకంత దాని కోసమా..  ఇన్నాళ్లు మిమ్మల్ని పట్టించుకోలేద ఏంటి అని చారూలత అడుగుతుంది.

అంటే ఇన్నాళ్లు పట్టించుకున్నారు కాబట్టి ఇప్పటినుంచి శాంభవిని మాత్రమే పట్టించుకుంటాను అని చెబుతున్నావా అమ్మ అని అడుగుతాడు.

నీకు ఎలా కావాల్సితే ఆలా అర్థం చేసుకోరా..  మమ్మల్ని మాత్రం ఇప్పుడు డిస్టర్బ్ చేయకు.  మంచి మూడ్ లో ఉన్నాము.

ఇంకా ఎంత టైం ఆఫీస్ టైం అవ్వడానికి అని మళ్ళీ అడుగుతుంది.  అప్పుడే అక్కడికి వచ్చిన ధీరజ్, విహాన్,అద్వైత్  రుద్ర ఫేస్ ఫీలింగ్స్ చూసి నవ్వుకుంటారు.

ధీరజ్  విహాన్ తో వీడి అలక అత్తయ్య  శాంభవి ని ఎక్కువగా  పట్టించుకుంటుందని లేక వీడు శాంభవితో కలిసి వెళ్ళలేకపోతున్నందుకా అని అడుగుతాడు.

నీకు ఆ డౌట్ వచ్చింది కదా వెళ్లి వాడినే అడుగు అంటే.. ఎందుకు పై ఫ్లోర్ తీసుకెళ్లి అక్కడి నుంచి కిందకు తోసేస్తాడు.

నాకు అవసరమా అని సైలెంట్ గా కూర్చుని ఆ సినిమా చూస్తే సరిపోతుంది కదా అని సైలెంట్ గా సోఫాలో కూర్చుంటాడు.

సీసీలో నుంచి ఎంట్రెన్స్ వైపు చూస్తున్నా రుద్ర బ్రకటి ముడి వేస్తాడు.  ఏమైంది రుద్రా అని విహాన్ వస్తే సీసీ వైపు చూపిస్తాడు.

అక్కడ శాంభవి  ఫ్యామిలీ మొత్తం ఉంటుంది. శకుంతల గారు తప్ప అందరూ వస్తారు.

రుద్ర వాళ్ళ అమ్మ వంక చూస్తూ అదిగో శాంభవి ఫ్యామిలీ మొత్తం వచ్చింది.  ఆ ఫ్యామిలీతో శాంభవి కి  చాలా ఎమోషనల్ కనెక్షన్ ఉంది.

అది చూసి మీరు గాని, మావయ్య గాని ఎమోషనల్ అయితే మాత్రం మర్యాదగా ఉండదు. జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి అని చెప్పి సీసీ లో చూస్తూ ఉంటాడు.

దేవేంద్ర కూడా బయటికి వెళ్లడానికి అని ఆఫీసు నుంచి బయటికి వస్తాడు.  శాంభవి ఇంకా ఆఫీస్ టైం అయిపోయిందని చెప్పి గబగబా ప్యాక్ చేసుకుంటూ మిత్ర, గౌతంల వంక చూస్తూ తొందరగా రండి.

నాన్న వాళ్ళు వచ్చారు అని స్పీడ్ గా బయటకు వెళ్ళిపోతుంది.  దేవేంద్ర కార్ డోర్ ఓపెన్ చేయగానే నాన్న అన్న పిలుపు వినిపిస్తుంది.

ఆయన ఆనందంగా వెనక్కి తిరిగి చూస్తారు. శాంభవి పరిగెత్తుకుంటూ దేవేంద్ర వైపుగా వస్తుంది. దేవేంద్ర అన్ని విషయాలు మర్చిపోయి శాంభవి తన కోసమే వస్తుందని ఎంత ఆనందంగా ఎదురు చూస్తూ ముందుకు అడుగు వేస్తారు.

శాంభవి దేవేంద్ర ని తప్పుకొని పరుగున వెళ్లి వెనక ఉన్న శివ గారిని హత్తుకుంటుంది. అది చూడగానే దేవేంద్రకి గుండెలో ఎవరో గుణపంతో గుచ్చినంత బాధ కలుగుతుంది.

నా కూతురు నా కళ్ళు ఎదుటి వేరే ఒకళ్ళుని నాన్న అని పిలుస్తుంది. నేను ఆ పిలుపుకి నోచుకోలేకపోయాను అని బాధగా కళ్ళు మూసుకుంటారు.

అదంతా సీసీ లో చూస్తున్న అందరికీ చాలా బాధగా ఉంటుంది. చారులత అయితే కౌసల్యని పట్టుకుని ఏడ్చేస్తోంది.

ఎందుకు వదిన అన్నయ్యకి ఇంత బాధ. తన కళ్ళ ముందే తన కూతురు తన గుర్తుపట్టకుండా వేరే వాళ్ళ నాన్న అని పిలుస్తుంటే ఎంత కష్టమో కదా అన్నయ్య ఎలా భరిస్తున్నాడు అని ఏడుస్తుంది.

దానికి రుద్రా గట్టిగా కళ్ళు మూసుకుని అమ్మ మీకు చెప్పింది ఇదే.. ప్రతిదీ ఎమోషనల్ అవ్వద్దు అని శాంభవి కి నిజ నిజాలు తెలియదు కదా మీరే ఇలా అయిపోతే ఇక చిన్న మామ పరిస్థితి ఏంటి..

  నిజంగా ఫస్ట్ టైం అమ్మమ్మ మీద చాలా కోపం వస్తుంది నాకు. ఎవరి మాటలకో విలువిచ్చి కొడుకు జీవితాన్ని పణంగా పెట్టింది .

ఏమి సాధించింది ఇటు కొడుకు జీవితం నాశనం అవ్వడమే కాక ఇటు అందరూ ఉన్న ఒంటరిగా మిగిలిపోయింది.

కింద ఏమి జరుగుతుందని మళ్లీ సిసి లో చూస్తారు. దేవేంద్ర గట్టిగా కార్ డోర్ పట్టుకుని నిర్లిప్తంగా  శాంభవి వైపు చూస్తారు.

శివ గారు శాంభవిని హత్తుకొని మా అమ్మ,బంగారం, తల్లి అంటూ ముద్దు చేస్తూ ముద్దులు పెడుతూ ఉంటారు.

దేవేంద్ర వెంటనే శాంభవి దగ్గరికి వెళ్లి చేయి పట్టుకుని వెనక్కి లాగి నువ్వు నా కూతురివి తల్లి అని చెప్పాలని గట్టిగా అనిపిస్తుంది కానీ...

వాస్తవం గుర్తుకు వచ్చి వాళ్ళని అలాగే చూస్తూ ఉంటారు. చాలా అందమైన ఫ్యామిలీ.  ఉమ్మడి కుటుంబం.. అందరికీ శాంభవి అంటే ప్రాణం అని తెలుస్తుంది.

రేపు అన్న రోజున నిజం తెలిస్తే వీళ్ళు తట్టుకోగలరా అని ఆలోచిస్తూ ఉంటారు.  శాంభవి శివ గారి చెయ్యి పట్టుకుని ఊపుతూ కబుర్లు చెబుతూ ఉంటుంది.

తనని ఎవరో చూస్తున్నట్టుగా అనిపించి వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ దేవేంద్ర గారు కనిపిస్తారు.

హలో సార్ గుడ్ ఈవెనింగ్ అని చెబుతుంది. గుడ్ ఈవెనింగ్ అమ్మ అంటే... మా పేరెంట్స్ అని అందరిని పరిచయం చేస్తుంది.

వాళ్ళ అన్నయ్యలని కూడా పరిచయం చేస్తుంది..అందరికీ నమస్తే అని చెబుతారు.

మీరు బయటకు ఎక్కడికో వెళుతున్నట్టు ఉన్నారు సార్. సారీ ఆపినందుకు అంటే..  అలా ఏమీ లేదు చార్మినార్ దగ్గర పని ఉండి వెళుతున్నాము అని చెబుతాడు..

అవునా సార్ మేము కూడా అటే వెళ్తున్నాము.  మీరు మాతో జాయిన్ అవుతారా అని చొరవ గా అడుగుతుంది.

దానికి దేవేంద్ర సమాధానం ఏమిటి??
[+] 5 users Like SivaSai's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
Part - 29

   శాంభవి దేవేంద్ర గారితో మీరు కూడా మాతో కలిసి వస్తారా అని అడుగుతుంది. తను ఎందుకు అలా అడిగిందో తనకే తెలియదు.

  దేవేంద్ర గారు  నాతోపాటు మా సిస్టర్స్ కూడా అన్నారు మా వాళ్ళు వస్తున్నారు అని చారు  కి ఒక ఫోన్ చేసి నువ్వు వదిన అందరూ కిందికి రండి మనము శంభావి వాళ్ళతో కలిసే వెళ్తున్నాము అని చెబుతాడు.

దానికి ఏంటి అన్నయ్య నువ్వు అనేదేంటి... అవును  శాంభవి  ఇన్వైట్ చేసింది. వాళ్ళతో కలిసి రమ్మని తొందరగా రండి వెళదాము అంటే గబగబా లేడీస్ ముగ్గురు బయలుదేరి కిందకి వస్తారు

దేవేంద్ర చారు కౌసల్య మాధురిని శాంభవి వాళ్ళ ఫ్యామిలీకి పరిచయం చేస్తారు. అంతే చారు ధరణి దగ్గరికి వెళ్లి మీరు హైదరాబాద్ ఎప్పుడైనా వచ్చారా..

ఇదే ఫస్ట్ టైం ఆ..  షాపింగ్ కి మేము వెళుతూ ఉంటాము అందరం కలిసి చేద్దాం షాపింగ్ అని మాటలు కలిపేస్తుంది.

ధరణి నవ్వుతూ నేను ప్రాపర్ హైదరాబాద్. మ్యారేజ్ అయిన తర్వాత అటు వెళ్ళాను బట్ నేను తక్కువే వెళ్లే దాన్ని అని చెబుతుంది

సీసీ లో చూస్తున్న నలుగురు ఆశ్చర్యంగా వీళ్ళ వంకే చూస్తా ఉంటారు ధీరజ్ రుద్ర తో చూసావా బావ అప్పడే మీ అమ్మ పులిహార కలిపేస్తుంది.

ఆవిడ కూడా మొహమాటంగా అయినా సరే కలపడం స్టార్ట్ చేసింది.  ఫ్యూచర్లో వియ్యంకులు అవుతారు కదా అని అంటాడు.

రుద్ర కి తులసి గారి మాటలు  గుర్తొస్తాయి. ఆడవాళ్ళు ఒకచోట కలవాలే గాని ఎలాంటి ప్రాబ్లం కైనా సొల్యూషన్ తీసుకొస్తారు అన్నమాట.

డార్లింగ్ నువ్వు చెప్పింది నిజమే..  ఇక్కడ అమ్మ ఆల్రెడీ పులిహార కలిపేస్తుంది.  ఈ షాపింగ్ అయ్యేలోపు లేడీస్ అందరూ ఒక బ్యాచ్ అయిపోయిన ఆశ్చర్య పడక్కర్లేదు అని నవ్వుకుంటాడు.

ధీరజ్ సెక్యూరిటీ మాత్రం చాలా టైట్ గా పెట్టు.  ఏమాత్రం అనుమానం వచ్చినా మన గౌడన్ కి తీసుకొచ్చేయమను.

వెళ్లదామా సార్ అని శాంభవి అడుగుతుంది. ఎలా వెళ్ళేది అని చారులత అడుగుతుంది. దానికి భాను గారు అన్ని కార్లు ఉన్నాయి కదా అమ్మ.

ఎవరు కారులో వాళ్ళు వెళదాము అంటే.. ఈ మాత్రం దానికి అందరూ కలిశాల్లెడం ఎందుకండీ..  అందరం కలిసి ఒక వెహికల్ లోనే వెళ్ళదామా అప్పుడు జర్నీ కూడా బాగుంటది అంటే...

ఒక వన్ అవర్ జర్నీయే కదా అమ్మ అంటే..  ఆ వన్ ఎవరైనా మనం ఎంజాయ్ చేయడానికి ఉంటుంది కదా అని వాళ్ళ అన్నయ్య వంక చూస్తుంది.

అర్థమైంది అని విహాన్ కి కాల్ చేసి మినీ బస్సు ని అరేంజ్ చేయమని చెబుతాడు. సరే అని చెప్పి.. సెక్యూరిటీ కి ఫోన్ చేసి ఆ విషయం చెప్తాడు.

విహాన్ రుద్ర తో అత్తయ్య మంచి స్పీడ్ గా ఉంది అంటే.. అమ్మకి ఏది వచ్చినా పట్టలేము. సంతోషం వచ్చినా అలాగే ఉంటది కోపం వచ్చినా మా పని అయిపోతుంది ఇంట్లో.

ఎమోషన్ లో ఏదైనా మాట్లాడింది అంటే ఇంక అంతే సంగతులు. వాళ్ళ అమ్మాయి ని  కావాలని మనం ట్రాప్ చేసి తీసుకెళ్లి పోతున్నట్టు ఫీల్ అవుతారు  ఇప్పుడు ఆ ఫ్యామిలీ అంతా అని తల పట్టుకుంటాడు.

నువ్వేం టెన్షన్ పడకు రుద్రా అక్కడ బాబాయ్ కూడా ఉన్నారు కదా హ్యాండిల్ చేస్తారు అంటే... చిన్న మామ కి కూతుర్ని చూసుకునే పనిలోనే ఉంటున్నాడు చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోవట్లేదు.

ఇంకా అమ్మని హ్యాండిల్ చేసే వాళ్ళు ఎవరున్నారు అంటే మన ఫాలోఅప్ చేస్తూ ఉంటాం కదా ప్రాబ్లం ఏమీ లేదు అని..

ఒకసారి ఫోన్ చేసి  వార్నింగ్ ఇవ్వి అంటే..
అదే బెటర్ అనుకుని చారుకి ఫోన్ చేస్తాడు.   ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా అంటే...

అమ్మ నువ్వు చాలా ఎమోషన్లు అవుతున్నావు.కొంచెం కంట్రోల్లో ఉండు ఎమోషన్ లో ఏదైనా మాట్లాడేవో అనుకో తన కూతురు కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారనుకుని ఇప్పుడే వాళ్ళు రేపల్లె తీసుకెళ్లిపోతారు జాగ్రత్త అని భయపెడతాడు.

అమ్మో ఇలా కూడా జరుగుతుందా..  సరే అని చెప్పి మా జాగ్రత్తలో మేముంటాం లేరా అని ఫోన్ పెట్టేస్తుంది. అందరూ కలిసి బస్సు ఎక్కి కూర్చుంటారు.

ధరణి, జయంతి ఒకచోట కూర్చుంటారు.  కౌసల్య, మాధురి ఒకచోట కూర్చుంటారు. శివ గారు, భాను గారు ఒక చోట కూర్చొని శాంభవిని ఒడిలో కూర్చోబెట్టుకుంటారు.

చారు,  దేవేంద్ర ఒకచోట కూర్చుంటారు. చారు ఆశ్చర్యంగా అంతసేపు జర్నీ అంటే మీకు కాళ్లు నొప్పులు వస్తాయి కదా ఇలా పక్క సీట్లో కూర్చోబెట్టండి అంటే..

పర్వాలేదు అమ్మ మా అమ్మాయి మాకు ఏమీ బరువు కాదు. ఐదు రోజులు అయిపోయింది చూసి అని అంటారు.

అదేంటండి  సోమవారమే కదా డ్రాప్ చేశారు. మధ్యలో మూడు రోజులే కదా అని.. సోమవారం సాయంత్రం అంటే నైట్ పడుకునేటప్పుడు కూతురు కనపడలేదు.  పొద్దుటే లెగిసిన వెంటనే కూతురు కనబడలేదు.

అవన్నీ లెక్కే నండి అని  ధరణి చెబుతుంది. శాంభవి మీద వాళ్లకు ఉన్న ప్రేమను చూస్తే ముచ్చటేస్తుంది. అలాగే ఒక నిమిషం భయం కూడా వేస్తుంది .

రేపు అన్నా రోజున నిజం తెలిస్తే  వీళ్ళ అసలు తట్టుకోగలరా.. అసలు శాంభవి ఒప్పుకుంటుందా... విహాన్ అన్నయ్య అని పిలవమంటేనే..  పిలవనని కరాకండిగా చెప్పేసింది.

రేపు అన్నయ్యని ఒప్పుకుని నాన్న అని పిలుస్తుందా..  మా అన్నయ్య ముఖంలో నిజమైన సంతోషం వస్తుందా అని బాధగా దేవేంద్ర వంక చూస్తుంది.

దేవేంద్ర ఈ లోకంతోనే సంబంధం లేదు అన్నట్టు శాంభవిని చూస్తూ ఉంటారు.  శాంభవి వాళ్ల నాన్నలతో ముచ్చట్లో పడి మిగిలిన అందర్నీ వదిలేస్తుంది.

ధరణి ఏమే మేము కూడా ఉన్నాము. మమ్మల్ని కాస్త పట్టించుకోవచ్చు అంటే.. అమ్మ మీతో మాట్లాడేది ఏముంటది అమ్మ.

పిచ్చపాటి తప్ప.. అదే నాన్నతో అయితే సూపర్ కబుర్లు చెప్తారు తెలుసా అంటుంది. అవును నీకు మీ నాన్నలు అన్నయ్యలు తప్ప ఇంక ప్రపంచమే కనిపించదు కదా అని అలకగా అంటుంది.

ఎందుకమ్మా అంత కోపం నీకు. నువ్వే కదా నన్ను రెచ్చగొట్టావు ఇక్కడదాకా వెళ్ళాలి అని నీ మాటకి విలువచ్చా కదా వచ్చాను.

కానీ మా నాన్నలని మాత్రం మిస్ అయిపోయాను.  మమ్మల్ని మిస్ అవ్వలేదా అంటే...  మిమ్మల్ని మిస్ అవ్వడం ఏముంటది అమ్మ అంటుంది.

అవునా రేపు నీకు పెళ్లయి పిల్లలు పుట్టేక తెలుస్తది అమ్మ ని మిస్ అవ్వడం అంటే ఏంటో అని అంటుంది. పెళ్లి టాపిక్ వచ్చిందని వెంటనే చారూలత అమ్మాయికి పెళ్లి సంబంధం చూస్తున్నారా అనే అడుగుతుంది.

ఇవన్నీ ఫోన్లో వింటున్నా రుద్రా బ్యాచ్ తల కొట్టుకుంటూ ఉంటారు.  అమ్మ కి ఉన్నా నోటు దురద ఎవరికి ఉండదు అని..

దానికి జయంతి ఇంకా లేదండి చూడాలి అని చెబుతోంది. ఎలాంటి క్వాలిఫికేషన్ కావాలి చెప్పండి.  మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తాను అని చారూలత అనగానే..

వెంటనే శివ గారు మేము అంత దూరం పంపించమండి అమ్మాయిని అని చెబుతారు.  ఎంత దూరమండి రేపల్లె నుంచి హైదరాబాద్ కి అడిగితే...

దగ్గర దగ్గర 10 గంటలు పట్టిందండి అనే చాలా ఆవేశంగా చెబుతారు.  మరి ఎంత దూరంలో ఉన్న అబ్బాయి కావాలండి మీకు అని అనుమానంగా అడుగుతుంది.

మా ఇంటి ఎదురుకుండా ఉంటే చాలండి అని చెప్తారు. అంటే ఆల్రెడీ ఎవరినైనా చూశారా అని భయంగా అడుగుతుంది.

లేదండి చూసిన ఇల్లరికం వచ్చే అబ్బాయిని మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తాం అని చెప్తారు.  అంతే బస్సులో ఉన్న బృందావనం ఫ్యామిలీకి, కాల్ లో వింటున్న నలుగురు అబ్బాయిలకి ఒక్కసారి బుర్ర గిర్రును తిరుగుతుంది.

మాధురి ఉండబట్ట లేక ఇల్లరికం వస్తే అబ్బాయికి విలువ ఏముంటదండి. పైగా నిగారింపు ఉండరు అని అంటారు కదా!

రేపు ఏదన్నా మీకు వచ్చే కోడలు ఎవరైనా ఇల్లరికం అని చులకనగా చూస్తే.. మీ అమ్మాయే కదా బాధపడుతుంది అని ఒక రాయి వేస్తుంది.

అది వెన్న ధీరజ్ పరవాలేదు మా అమ్మ కి కూడా కొంచెం బుర్ర పనిచేస్తోంది అంటే.. నువ్వు సైలెంట్ గా ఉండరా అని ఒకటే వేస్తారు.

అందుకేనండి ఇల్లరికం తీసుకురాము.  మా ఇంటి ఎదురుగుండా  ఇంకొక ఇల్లు కట్టి ఆ ఇంట్లో మా అమ్మాయిని ఉంచుతాము అని చెప్తారు.

అప్పుడైనా అబ్బాయి అక్కడ ఉండడం అంటే ఇల్లరికం కింద వస్తుంది కదా అంటే.. అలా రాదండి   ఫ్యాక్టరీ కూడా ఒకటి కట్టే ప్లాన్లో ఉన్నాము.

అది అమ్మాయికి వచ్చే అబ్బాయికి కలిపి రాసేస్తాము. అప్పుడు ఇల్లరికం అనే మాటే ఉండదు కదా!

రాత్రి పడుకునే ముందు మా అమ్మాయి కనపడుతుంది. పొద్దుటే లెగ్గానే నా చిట్టి తల్లి కనపడుతుంది అని తండ్రులు ఇద్దరు ముద్దు చేస్తారు.

ప్రపంచంలోనే మీరు బెస్ట్ నాన్నలు అని ఇద్దరికీ ముద్దుపెడుతుంది..  అలాగే సిగరెట్టు, మందు లాంటి అలవాట్లు అస్సలు ఉండకూడదు అండి.

మా ఊర్లో అవి నిషేధం కూడా అని చెబుతారు.  మా ఊరు వచ్చి సెటిలై అబ్బాయి ఉంటే చెప్పండి అప్పుడు ఆలోచిస్తామో అని మొహమాటం  లేకుండా చెబుతారు.

ఆ మాటలు విన్నాక ఏం మాట్లాడాలో అర్థం కాక చారులత కామ్ అయిపోతుంది.  లైవ్ లో ఉన్నా రుద్ర ఏంటి మా అమ్మ మాట ఏమి వినిపించట్లేదు.

కామ్ అయిపోయింది అంటే.. వాళ్ళు అంత షాకింగ్ న్యూస్ చెప్పాక మీ అమ్మ ఏంటి ఇక్కడ మన నోళ్లు కూడా మ్యూట్ అయ్యిపోయాయి.

బావ ఇప్పుడు నువ్వు రేపల్లె లో సెటిల్ అవుతున్నావా.. అలాగైతే అక్కడ పల్లెటూరు ఎన్విరాన్మెంట్ ఇప్పుడు నుంచి అలవాటు చేసుకో బావ నువ్వు.

నువ్వు నోరు ముయ్యి రా! నేను అక్కడికి ఎందుకు వెళ్తాను.   అంటే శాంభవి ని  పెళ్లి చేసుకుంటే వెళ్లాలి కదా అంటాడు.

నేను చెప్పానా శాంభవి ని పెళ్లి చేసుకుంటానని అంటే.. పో బావ నువ్వు, నీ ఎదవ మొహమాటం.  శాంభవి ఎవరితో అయినా మాట్లాడుతుంది అంటే నువ్వు ఎంత జలస్ ఫీల్  అవుతున్నావ్.

నేను చూడట్లేదా అని అంటే నువ్వు  ఎక్కువ ఊహించేసుకున్నవు. అక్కడ అంత సీన్ లేదు.

దానికి లవ్ ఫీలింగ్స్ గురించి అసలు తెలియదు.  ఎంతసేపు మా నాన్న మా నాన్న అనడం తప్ప ఎదుటవాళ్ళు ఏ ఇంటెన్షన్  తో మాట్లాడుతున్నారో కూడా అర్థం కాదు.

కాలేజ్ వాళ్లది,, ఊరు వాళ్లది కాబట్టి ఎవరు తనతో తప్పుగా బిహేవ్ చేయలేదు. ఇక్కడ సిటీలో ఎవరు ప్రపంచం వాళ్ళదే..

చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించడం తెలియదు. దానితో నాకు పెళ్లి ఏంటి రుద్ర అనగానే.. విహాన్,  అద్వైత బావ అని గట్టిగా అంటారు.

ఏంట్రా బామ్మర్దులు ఇద్దరికీ కోపం పోడుచుకొచ్చినట్టుంది అంటే.. మరి మా చెల్లిని అంటే రాదా అంటే అవునా...

అయితే మీ చెల్లికి లోకజ్ఞానాన్ని పెంచండి. అందుకు నువ్వు ఉన్నావు కదా బావ అని నవ్వుతారు. దానికి రుద్ర చిన్నగా నవ్వుతూ నా మీద చాలా గట్టి హోప్సే పెట్టుకున్నట్టున్నారు మీరందరూ అంటే...

విషయం నీకు తెలుసు కానీ ఇప్పుడు నుంచి నువ్వు కాశియాత్ర చేయాలనుకుంటున్నావేమో అంత సీన్ లేదు.

బావ ఎంత తాగాలనుకుంటావో అంత ఇప్పుడే తాగేసేయాలి.  ఇంటి అల్లుడు అయ్యాక పొరపాటున కూడా మందు వాసన చూడనివ్వరు అని అంటారు.

దానికి రుద్ర  మాదారులు మాకు ఉన్నాయిలే అంటాడు. ఏంటా దారులు అని అడుగుతారు.

రుద్ర సమాధానం ఏమిటి..
[+] 6 users Like SivaSai's post
Like Reply
#63
Part - 30

   అందర్నీ తీసుకుని బస్సు చార్మినార్ వైపుకు వెళ్ళింది. చార్మినార్ దగ్గరలో బస్సు ఆగగానే అందరూ దిగారు అక్కడినుంచి అందరూ నడక లేదంటే ఆటో పట్టుకుని వెళ్లాలి. 

కానీ  శాంభవి ఫస్ట్ టైం చార్మినార్ రావడంతో అందరూ నడకనే ఎంచుకున్నారు. ప్రతిదీ వింతగా చూస్తూ ఆశ్చర్యపోతున్న శాంభవి ఎక్స్ప్రెషన్స్ అన్ని దేవేంద్ర గారు ఫోన్లో ఫొటోస్ తీస్తూ ఉంటారు. శాంభవి ట్రై చేసిన ప్రతిది ప్యాక్  చేపిస్తుంటారు.

గాజులు చాలా ఎక్కువగా కొంటుంది.  ధరణి అది చూసి నువ్వు అక్కడైనా షాప్ పెట్టడానికి కొంటున్నావా  ఎందుకే అన్ని కొంటున్నావు అని అడిగితే..   భాను గారు ఏంటి ధరణి నా కూతురు ఎన్ని కొనుక్కుంటే నీకేమైంది మోసేవాళ్ళము మేము ఉన్నాము అది వాడుకుంటుందో ఎవరికైనా పంచిపెడుతుందో బంగారం ఇష్టం.

మీరు సైలెంట్ గా మీ పని మీరు చూసుకోండి అని అంటారు.  కూతురు ని ఒక్క మాట అననివ్వరు ఎంత గారం చేస్తాయి ఎలాగా అని జయంతి
ధరణి షాపింగ్ చేస్తూ ఉంటారు.

చారులతా,కౌసల్య మాధురి ఇవన్నీ చూస్తూ ఉంటారు. దేవేంద్ర గారు మురుపెంగా కూతుర్ని చూస్తూ ఉంటారు
నా కూతురు నా దగ్గరే ఉండుంటే నేను ఇంతలాగా ఎంజాయ్ చేశా వాడిని కదా!

ఇన్ని సంతోషాలు నాకు దూరం చేసిన మయూరిని మాత్రం ఎప్పటికీ క్షమించలేను అనుకుంటూ శాంభవి వంక చూస్తారు.

శాంభవి కంటికి నచ్చితే చాలు అన్నలు, తండ్రులు అవి కొనేస్తూ ఉంటారు.  ఇవన్నీ సెక్యూరిటీ ద్వారా ఆన్లైన్లో చూస్తున్న రుద్ర బ్యాచ్  మొత్తం రుద్రవంక చూస్తూ ఉంటారు.

ఎందుకు నా వంక అలా చూస్తున్నారు అంటే..   ఫ్యూచర్లో నువ్వు కూడా అలాగే కొనాలి కదా ఏదైనా సరే అంటే అక్కడ కొంటుంది ఎవరు అని అడుగుతాడు.

  శాంభవి వాళ్ళ నాన్న, అన్నయ్యలు అంటే మరి తర్వాత అయినా ఎవరూ కొనేది అంటే  మేమా అని అడుగుతారు డౌటా అని రుద్ర అంటే..

అప్పుడైనా మాకు ఛాన్స్ వస్తదంటావా బావ అని విహాన్  అంటాడు. నీకెందుకు వచ్చింది ఆ డౌటు అని అడిగితే.. ఇప్పుడు వీళ్లు తర్వాత బాబాయి హేండిల్ చేస్తారు కానీ మన వరకు ఛాన్స్ రానివ్వరు.

పొరపాటున వచ్చిన అత్తయ్య లాగేసుకుంటది అని విహాన్ అంటాడు.  ఆ మాటలు విన్న రుద్ర అది నిజమే లే.

మా అమ్మ ఉత్సాహం చూస్తుంటే రేపే పెళ్లి చేసి తీసుకొచ్చేసా లాగా ఉంది అని అంటాడు.  అత్తయ్యకుందా ఆత్రం నీకుందా బావ అని ధీరజ్ అడుగుతాడు.

  నాకెమీ అలాంటి ఆత్రం లేదు. దాన్ని ఇప్పుడు పెళ్లి చేసుకున్న ఒక చిన్న పిల్లని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టే అది చాలా ఎదగాలి అంటాడు.

ధీరజ్ వస్తున్న నవ్వుని ఆపుకుంటూ హైట్ బానే ఎదిగింది కదా బావ మా చెల్లి అంటే.. హైట్ ఎదిగితే చాలా బ్రెయిన్ ఎదగాలి కదా!

ఆ బ్రెయిన్ లో ఉన్న ఈ రెండే రెండు సెల్స్ ఒకటి నాన్న రెండు అన్నయ్య.  మొగుడు అనే సెల్ ఓపెన్ అవడానికి చాలా టైం పడుతుంది..

ఇప్పుడు ఆ టాపిక్ మనకి అంత అవసరం లేదు కానీ ముందు వాళ్ల మీద ఫోకస్ పెట్టండి అని ఆ వీడియో కూడా వాళ్ళ తాతయ్యకి జితేంద్ర గారికి పంపిస్తారు.

రాఘవేంద్ర గారు ఆ వీడియోస్ చూస్తూ నా మనవరాలు నాతో కలిసి అల్లరి చేయాల్సింది. ఇంకొకరితో కలిసి అల్లరి చేస్తుంది.

దీనికి అంతటికి కారణం అయినా అనసూయ ని మాత్రం ఎప్పటికీ క్షమించలేను.  అనసూయ చూపు మాత్రం శాంభవి మీద పడనివ్వను అని గట్టిగా అనుకుంటారు.

దేవేంద్ర ఫ్యామిలీ కొంతమంది కొత్త వాళ్ళతో కలిసి   షాపింగ్ కి వెళ్ళారు అని మయూరి కి ఇన్ఫర్మేషన్ వెళుతుంది.


మయూరి ఆలోచిస్తూ ఉంటుంది.  ఎవరా కొత్త వాళ్లు... అక్కడికి షాపింగ్  కోసం చారు,కౌసల్య వెళ్లారు అంటే ఒక అర్థం ఉంది.

దేవేంద్ర కూడా పనిగట్టుకుని వెళ్ళాడు అంటే ఆ ఫ్యామిలీతో ఉన్న కనెక్షన్ ఏమిటి?  వాళ్ల గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుని తన పీఏ అని పిలిచి వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం కనుక్కోమని చెబుతోంది.

వీళ్ళకి సంబంధించిన అమ్మాయితోనే రుద్రకి పెళ్లి చేస్తున్నారా..  లేకపోతే ఇంకా ఏమైనా ఉందా అని ఆలోచిస్తూ ఉంటుంది.

షాపింగ్ మొత్తం ఫినిష్ చేసే ఫుడ్ కూడా అక్కడే తీసుకుంటారు. తినే ప్రతి ఫుడ్డు కూడా ఫస్ట్ శాంభవి అన్నయ్యలు గాని నాన్నలు గాని టేస్ట్ చూసి బాగుంది అన్నాకే శాంభవికి పెడుతూ ఉంటారు.

ధరణి,  జయంతి గుర్రు గా చూస్తూ ఇక్కడ మేము కూడా ఉన్నాము అంటే..  అందుకే మీకు ఆర్డర్ ఇచ్చాము తినండి ఆనీ శాంభవికి  తినిపిస్తూ ఉంటారు.

కూతురు ఉంటే ఇంకేమీ అక్కర్లేదా మీకు అని రుసురసలాడుతూ తింటూ ఉంటారు.  వీళ్ళ ఫ్యామిలీ లో ఉన్న అండర్స్టాండింగ్ చూసి దేవేంద్రికి చాలా ముచ్చటగా అనిపిస్తుంది.

అమ్మ కూడా ఇలాగే ఉండుంటే మా ఫ్యామిలీ కూడా ఇలాగే ఉండేది కదా! లేనిపోని ఆహాలకు పోయి మా ఇంటి దీపాన్ని వేరే ఇంటి దీపంగా మార్చింది

ఏమి చేస్తే మాత్రం ఈ 20 ఏళ్ల వెనక్కి వస్తాయి.నా కూతురు నా దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మని క్షమించాలి అనుకున్నాను కానీ..

ఇవన్నీ చూస్తుంటే ఎప్పటికీ అమ్మని క్షమించలేనేమో అనిపిస్తుంది.  శాంభవి కి నిజం తెలిస్తే తట్టుకోగలుగుతుందా?

అసలు ఈ ఫ్యామిలీ ప్రాణాలతో ఉంటుందా.. భగవంతుడు నన్ను ఎలాంటి పరిస్థితుల్లో నిలబెట్టావు.   నా కూతుర్ని నేను దగ్గరికి తీసుకునే రోజు అంటూ వస్తుందా అని బాధగా శాంభవి వంక చూస్తారు.

ఇవేమీ తెలియని శాంభవి ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. బాగా లేట్ నైట్ అవడంతో ఇంకా అందరూ ఇంటికి బయలుదేరుతారు.

  శాంభవి వాళ్ళని విష్ణు గారి ఇంటి దగ్గర డ్రాప్ చేసి బస్సు బృందావనానికి వెళ్ళిపోతుంది.  దేవేంద్ర లోపలికి వెళ్ళగానే వెంటనే రాఘవేంద్ర గారి దగ్గరికి వెళతాడు.

రాఘవేంద్ర దేవేంద్ర ని చూసి ఏమైంది నాన్న అని అడిగితే.. నాన్నగారు అని  వెళ్లి ఒళ్ళో తల పెట్టుకుని పడుకుంటాడు. కొడుకు పరిస్థితి అర్థం అయ్యి తలనిమురుతూ ఉంటారు.

దేవేంద్ర తండ్రి ఒడిలోనే పడుకొని ఈరోజు చాలా సంతోషంగా ఉంది.  నా కూతురుతో కలిసి షాపింగ్ చేశాను.  ప్రస్తుతం తనిఖీ పరాయి వాడిన కావచ్చు కానీ..

ఏదో ఒక రోజు తన తండ్రిని నేను అని తెలుస్తుంది కదా ఆ రోజు కూడా నాతో ఇంతే సంతోషంగా షాపింగ్ చేస్తుంది కదా అని వాళ్ళ నాన్నని అడుగుతాడు.

కొడుకుని అలా చూసి రాఘవేంద్ర హృదయం ద్రవిస్తుంది. తప్పకుండా ఆ రోజు వస్తుంది దేవేంద్ర.  నువ్వు బాధపడవద్దు.

ఇన్ని సంవత్సరాలు మన అమ్మాయి కోసం ఎదురు చూశాము. కనిపించింది కదా!  అలాగే తను నీ దగ్గరికి వచ్చే రోజు కూడా వస్తుంది అని కొడుకుని ఓదారిస్తారు.

దేవేంద్ర తండ్రిని చూస్తూ శాంభవి అంటే వాళ్ళందరికీ చాలా ప్రాణం నాన్న.  శాంభవి దూరం అయితే వాళ్ళు ఎవరూ తట్టుకోలేరు.

ఈ విషయం చాలా స్మూత్ గా డీల్ చేయాలి.   మనం రుద్ర కి ఇచ్చి పెళ్లి చేస్తే మన దగ్గరవుతుంది అనుకున్నాము కానీ వాళ్ళ అసలు ఇల్లరికం వచ్చే సంబంధమే చేయాలి అని అనుకుంటున్నారు.

ఎలా రుద్రతో పెళ్లికి ఒప్పించాలి.. ఎలా మనింటికి తీసుకురావాలి అన్నది ఏమీ అర్థం కావడం లేదు.  ఈ సమస్యకు ఏమైనా పరిష్కారం ఉందా అని బెలగా అడుగుతాడు.

కొడుకుని అలా చూసిన రాఘవేంద్ర గారు గట్టిగా పట్టుకుని నువ్వు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు.  నా మనవరాలు కచ్చితంగా మన ఇంటికి వస్తుంది.

ఆ కుటుంబం మన కుటుంబము కూడా సంతోషంగా ఉంటాయి అని దేవేంద్ర ని జో కొడుతూ ఉంటారు.  తండ్రి ఒడిలోనే ప్రశాంతంగా కళ్ళు మూసుకుని పడుకుంటాడు.


ఇదంతా బయటినుంచి చూసిన జితేంద్ర భారంగా ఒక నిట్టూర్పు విడిచి గదిలోకి వెళతాడు.  గదిలోకి వెళ్లాక భార్యని చూస్తాడు.

కౌసల్య ముభవంగా కూర్చుని ఉంటుంది.  ఏమైంది కౌసల్య అలా ఉన్నావు అని అడుగుతారు. వాళ్లందరికీ శాంభవి అంటే చాలా ఇష్టం అండి.

ఇష్టం అన్నమాట చాలా చిన్నది.   శాంభవి కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తారు.  రేపు ఈ విషయం తెలిస్తే తట్టుకోగలరా అని భయమేస్తుంది.

మన స్వార్థం కోసం ఒక కుటుంబం బలవుతుందా అని భయంగా ఉందండి అనే భర్త వంక చూస్తుంది.  భార్య మాటలు, తమ్ముడు ఆలోచన కి జితేంద్ర కి ఏమి చెప్పాలో అర్థం కాకుండా ఉంటుంది.

భార్య పక్కన కూర్చుంటూ ఇది చాలా సున్నితమైన విషయం. కాలమే ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తుంది. ఎక్కువ ఆలోచించకుండా పడుకో.

ఇప్పటికే చాలా లేట్ అయింది అని నడుము వాలుస్తారు. చారులత కూడా ముభావంగానే ఇంట్లోకి వెళుతుంది .


సంతోష్ చారు లత ని చూసి వెళ్ళేటప్పుడు అంత ఉత్సాహంగా వెళ్లావు. ఇప్పుడు ఎందుకు అంత డల్ గా ఉన్నావు.

నీ మేనకోడలతో షాపింగ్ సరిపోలేదా అని అడుగుతాడు. దానికి చారులత  షాపింగ్ బాగానే చేసాము. అసలు శాంభవికి ఏమి కావాలో అన్నది అమ్మల కన్నా వాళ్ళ నాన్నలకే  ఎక్కువ తెలుసు.

శాంభవి ఒక ఆలోచన వస్తుంది అనుకునే లోపే ఆ ఇంట్లో మగాళ్లు  ఆచరణలో పెట్టేస్తున్నారు. శాంభవి వాళ్ళ తాతగారు,  నాన్నలు, అన్నయ్యలతో ఉన్న రిలేషన్ చూస్తుంటే మన ఇంట్లో వాళ్ళు ఎంత మిస్సయిపోయారో అన్నది కనిపిస్తుంది.

ఏమి చేసిన ఆ రోజులైతే తిరిగి రావు కదా అని బాధపడుతుంది. దానికి సంతోష్ జరిగిపోయిన దాని గురించి ఎందుకు??

రేపు రుద్ర పెళ్లి అయిన తర్వాత శాంభవి ఇక్కడికి వచ్చేస్తుంది కదా! అప్పుడు అన్ని తన అర్థం చేసుకుంటుంది అని చెబుతాడు.

వెంటనే చారులత ఏవండీ మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానని గట్టిగా అరుస్తుంది. ఎందుకే అంత గట్టిగా అరుస్తావు పక్కనే ఉన్నాను కదా అని అంటాడు.

దానికి చారులత భర్త అరుపును పట్టించుకోకుండా వాళ్లు శాంభవికి ఇల్లరికం వచ్చే సంబంధమే చుస్తునారండి.  ఇప్పుడు మన రుద్రనే ఇల్లరికం పంపించాలా అని అడుగుతుంది.

తలుపు దగ్గర నిలబడి ఆ మాటలు వింటున్న రుద్ర గట్టిగా ఒక్క సారి గా అమ్మ అని అరుస్తాడు.  ఏమైందిరా అలా అరిచావు అని అడుగుతుంది.

లేకపోతే నీ డిసిషన్ ఏమిటది అని అడుగుతాడు. మా అన్నయ్య కోసం  నిన్ను ఇల్లరికం పంపడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు.

మీ మావయ్య కోసం నువ్వు స్టెప్ తీసుకోలేవా రుద్ర అని జాలిగా అడుగుతారు.  సంతోష్ వస్తున్న నవ్వుని పంటి కింద బిగబడతారు.

ఇప్పుడు రుద్ర సమాధానం ఏమిటి??
కథ కొనసాగుతుంది...
[+] 7 users Like SivaSai's post
Like Reply
#64
Superb update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
#65
శివ గారు సూపర్ అప్డేట్

ఇలాంటి టోరీస్ తో మమ్మల్ని ఆనంద పిలుస్తున్నాం దుకు
మిణుకు మరియు మి కుటుంబ సభ్యులకు

శ్రీరామ నవమి శుభాకాంక్షలు
[+] 1 user Likes Ajayk's post
Like Reply
#66
Good update. Konchem lengthy ga anipinchindi.. but valla emotions baaga choopincharu
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
#67
Part - 31

   అన్నయ్య కోసం నువ్వు ఇల్లరకం వెళ్లలేవా రుద్ర అని గడ్డం పట్టుకుని అడుగుతారు. సంతోష్ వస్తున్నా నవ్వుని పంటి కిందపెడతారు.

ఆ నవ్వుకి బుగ్గలు ఉబ్బుతూ ఉంటాయి. ఎందుకు నాన్న అంత కష్టంగా నవ్వుని ఆపుకుంటున్నారు. అయినా నువ్వేంటి అమ్మ ఎవరైనా కోడల్ని తెచ్చుకుంటారు.

నువ్వు ఏకంగా మీ అన్నయ్య కోసం నన్ను ఇల్లరికం  పంపించడానికి రెడీ అయిపోయావు.  పోని అది ఏమైనా ఇక్కడ అంటే వెళ్లి రేపల్లె లో.

ముందు మీరు ఒక పని చేయండి. వాళ్లతో ఫ్రెండ్షిప్ ని స్ట్రాంగ్ చేసుకోండి. తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. నువ్వు ఇల్లరికం   పంపించే ఆలోచన మైండ్ లో నుంచి తీసేయ్ అని రుసరసలాడుతూ తన గదిలోకి వెళ్ళిపోతాడు.

అప్పటిదాకా కష్టంగా నవ్వుని ఆపుకున్న సంతోష్ ఇంకా ఆపుకోలేక గట్టిగా నవ్వేస్తాడు.  ఎందుకండి మీరు అలా నవ్వుతున్నారు అంటే... నీ కొడుకు పాట్లు చూడలేక .

అయినా నువ్వేంటి చారు ఎలా శాంభవి ని మన ఇంటికి తీసుకురావాలని ఆలోచించడం మానేసి ఇలా ఎలాగైనా పెళ్లి చేసేయాలని కంగారు పడుతున్నావు.

నువ్వు మరీ అంత టెన్షన్ పడకు ముందు రుద్ర చెప్పినట్టుగా ముందు ఆ వాళ్లతో ఫ్రెండ్షిప్స్ చెయ్. అది స్ట్రాంగ్ అయిన తర్వాత అప్పుడు ఏం చేయాలి అన్నది ఆలోచించవచ్చు.

బాగా అలసిపోయావు పడుకో అని చెప్పి వెళ్లి పడుకుంటాడు.  రోజులు అలా మెల్లిగా సాగుతూ ఉన్నాయి.

దేవేంద్ర గారికి శివ,భాను ప్రసాద్ గారితో మంచి ఫ్రెండ్షిప్ అవుతుంది.. చారులత కౌసల్య కూడా ధరణి జయంతితో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు.

విహాన్, అద్వైత్ కూడా లలిత్, చరణ్, స్వరూప్ తో మంచి బాండింగ్  ఏర్పడుతుంది. అప్పుడప్పుడు వీళ్ళతో ధీరజ్ కూడా కలుస్తూ ఉంటాడు.

రుద్ర మాత్రం వీళ్ళందర్నీ అబ్జర్వ్ చేస్తూ మయూరి బ్యాచ్ మీద ఒక లుక్ వేస్తా ఉంటాడు. 

మయూరి పెట్టిన ఇన్ఫర్మర్ తెలుసుకున్న విషయం మొత్తం మయూరీకి చెబుతాడు. అందులో ఎక్కడా కూడా అనుమానించవలసిన విషయం ఏమీ ఉండదు.

శాంభవి వాళ్ళ ఫ్యామిలీకి కాలేజెస్ ఉండడం వల్ల బిజినెస్ పర్పస్ కోసం దేవేంద్ర కి వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఉంది అని అనుకుంటుంది.

రోజులు అలా ముందుకు వెళుతూ ఉండగా పౌర్ణమి దగ్గరికి వస్తుంది.  ప్రతి పౌర్ణమికి శాంభవితో లలితా దేవి హోమం తప్పనిసరిగా జరిపిస్తూ ఉంటారు.

ఈసారి పౌర్ణమి కి శాంభవిని రేపల్లెకి తీసుకురావాలి అంటే తను స్టడీస్ పర్పస్ గా అక్కడ కంపెనీలో ఉండిపోతుంది. ఆ ఒక్క రోజుకి లీవ్ పెట్టి అయినా తీసుకురావాలి అని ఫిక్స్ అవుతారు.

ముందుగా విషయం దేవేంద్ర గారితో మాట్లాడాలి అని శివ గారు దేవేంద్ర కి ఫోన్ చేస్తారు. దేవేంద్ర గారు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి శివ ఏంటి విశేషాలు అంటే...

మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని ఇబ్బందిగా చెబుతారు.  చెప్పండి ఏమిటి నా దగ్గర మీరు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని అనగానే...


ప్రతి పౌర్ణమి కి శాంభవితో లలితా దేవి హోమం  చేయించాలి. అది శాంభవి ఆయుష్ కి, సౌభాగ్యానికి సంబంధించినది అని చెబుతారు.

అందుకే మీ పర్మిషన్ అడుగుదామని ఫోన్ చేశాను అని చెబుతాడు. దానికి ఎందుకు మీరు అంతలా ఆలోచిస్తున్నారు.

నేను ఏ విషయం అన్నది రుద్రని అడిగి చెబుతాను. ఆఫీసు  లో వర్క్ మొత్తం పిల్లలే చూసుకుంటున్నారు.  నేను ఎప్పుడైనా వెళ్లి చూస్తూ ఉంటాను.

ఒక్క శాంభవి టీం కి మాత్రమే నేను గైడ్ చేస్తున్నాను అని చెబుతారు. సరేనండి మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తారు.

రాఘవేంద్ర గారు జితేంద్ర,   దేవేంద్ర వంక చూస్తూ ఏంటి శివ అడుగుతున్నాడు అంటే... వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ అంతా చెబుతాడు.

దానికి రాఘవేంద్ర గారు సీరియస్గా ఆలోచిస్తూ ఉంటారు. ఏమైంది నాన్నగారు అంతా అలా ఆలోచిస్తున్నారు అంటే ఆ హోమం ఏదో మన ఇంట్లోనే జరిపిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను.

అది ఎలా సాధ్యం దానికి శివ ఫ్యామిలీ మొత్తం ఒప్పుకోవాలి కదా అని అంటాడు. అదే ఆలోచిస్తున్నాను అని నేను ఇప్పుడే గురువుగారికి ఫోన్ చేస్తాను అని ఫోన్ తీసుకొని శ్రీశైలం ఫోన్ చేస్తాడు.

ఆశ్రమంలో ఉన్న ఒక శిష్యుడు ఫోన్ తీసుకుని వెళ్లి గురువు గారికి ఇచ్చి రాఘవేంద్ర గారి దగ్గరి నుంచి అని  ఇస్తాడు.

దానికి గురువుగారు చిరునవ్వుతో  చెప్పు రాఘవేంద్ర ఎందుకు అంత ఆలోచనలో ఉన్నావు అంటే.. నేనేమీ చెప్పకుండానే మీకు ఎలా తెలిసింది అంటే...

మనవరాల గురించే కదా ఈ పౌర్ణమికి నేనే దగ్గర ఉండి హోమం చేపిస్తాను. నీ మనవరాలు నీ ఇంట అడుగుపెట్టే సమయం ఆసన్నమైంది.

ఆ తల్లి కోరిక కూడా త్వరలోనే నెరవేరబోతుంది. మేము పౌర్ణమి కి  అక్కడికి చేరుకుంటాము అని చెబుతారు. సంతోషం గురువుగారు అని చెప్పి ఫోన్ పెట్టేసి కొడుకు వైపు చూసి ఆరోజు హోమం మన ఇంట్లోనే జరుగుతుంది.

గురువుగారు స్వయంగా వస్తున్నారు అని ఆనందంగా చెబుతారు.  అయితే ఇప్పుడు ఎలాగా వీళ్ళని ఒప్పించాలి అంటే ఒకసారి పిల్లలతో కూడా మాట్లాడి వాళ్ళు సలహా కూడా తీసుకుందాము అని మనవలకి కాల్ చేసి రమ్మని చెబుతారు.

అలాగే చారుకు కూడా ఫోన్ చేసి రమ్మంటారు.  ఏంటి ఇంత సడన్గా అందరిని రమ్మన్నారు అని అందరూ వస్తారు. రుద్ర ఏంటి తాతయ్య అంత సంతోషంగా ఉన్నారు మమ్మల్ని అందరినీ రమ్మన్నారు అని అడుగుతాడు.

దానికి రాఘవేంద్ర గారు సంతోషంగా నా మనవరాలు మన ఇంటికి వచ్చే టైం వచ్చేసింది అని జరిగిందంతా చెబుతారు. అందరికీ చాలా సంతోషంగా అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఆ ఫ్యామిలీ ని ఎలా ఒప్పించాలి అని ఆలోచిస్తారు.

దానికి రుద్ర ఇందులో అంత ఆలోచించడానికి ఏముంది ప్రాజెక్ట్ వర్క్ మధ్యలో బ్రేక్ ఇవ్వడానికి అసలు కుదరదు అని చెప్పండి.

ఒకవేళ ఇవ్వాల్సి వస్తే కంపెనీ రూల్స్ ప్రకారం ప్రాజెక్ట్ ఫినిష్ అవ్వదు కాబట్టి హోమం మనం ఇక్కడే చేద్దాము అని ఒప్పించండి అని చెబుతాడు.

ఈ ఆలోచన ఏదో బాగుంది అని వెంటనే శివ గారికి ఫోన్ చేస్తాడు. దేవేంద్ర ఫోన్ కోసమే ఎదురు చూస్తున్న శివ గారు వెంటనే లిఫ్ట్ చేసి చెప్పండి దేవేంద్ర అనగానే...

రుద్ర చెప్పినట్టే గానే మొత్తం చెబుతాడు.ఇప్పుడు ఎలా అనే డల్ అవుతారు.  మీరు ఏమీ అనుకోను అంటే శాంభవి తో హోమం  మా ఇంట్లో చేపిద్దాము.

మీ ఇంటికి మా ఇంటికి కలిపి తను ఒక్కర్తె ఆడపిల్ల. మా ఇంటి ఆడపిల్లగానే అనుకునే మేము అడుగుతున్నాము. మీకు ఇబ్బంది లేదు అనుకుంటే ఇక్కడ పురమాయిస్తాను అని చెబుతాడు.

కానీ శివ గారు ఏమంటారు అన్న టెన్షన్ లోనే ఉంటారు. ఒకసారి నేను నాన్నగారితో,  నానమ్మతో మాట్లాడి మీకు ఏ విషయం చెబుతాను అని ఫోన్ పెట్టేస్తారు.

రామచంద్రయ్య గారు ఏమైంది శివ అని అడిగితే దేవేంద్ర గారు చెప్పిన విషయం మొత్తం చెబుతాడు.

దానికి శకుంతల గారు ఆలోచిస్తూ ఎక్కడ జరిగిన శాంభవి చేతుల మీద గానే కదా జరుగుతుంది. పురమాయించండి పర్వాలేదు అని చెబుతారు.

అలాగే అని చెప్పి దేవేంద్ర కి ఫోన్ చేసి అక్కడే పురమాయించుదాము అని చెబుతాడు. దానికి  బృందావనం అంతా చాలా సంతోషంతో ఉంటుంది.

మేమే అన్ని ఏర్పాట్లు చేస్తాము అమ్మాయిని తీసుకురండి సరిపోతుంది అని ఫోన్ పెట్టేస్తారు.  రాఘవేంద్ర గారి సంతోషంగా కొడుకులతో ఇల్లంతా రంగులు వేయించండి.

కూతురు, కోడలతో చెబుతారు శాంభవి కి కావాల్సిన ప్రతి అవసరాన్ని చూడండి. అలాగే ఆరోజు నా మనవరాలు పెట్టుకోవడానికి ఏడు వారాల నగలు తెప్పించండి అని సంతోషంతో చెబుతారు.

దానికి చారులత నాన్నగారు మీరు అంత ఆవేశపడకండి. అన్నయ్య ఎప్పుడో శాంభవిగా కావాల్సిన ప్రతి వస్తువు తెప్పించేసాడు.

మనం ఆ రోజుకు హోమానికి కావలసిన ఏర్పాట్లు చేస్తే సరిపోతుంది అని... మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను  కోప్పడకండి అంటే...

నేను చాలా సంతోషంగా ఉన్నాను పర్వాలేదు అడుగు   చారు అంటే.. మరి అమ్మకి ఈ విషయం చెబుతారా అని అడుగుతుంది.

చారు అని గట్టిగా అరుస్తారు.  కోప్పడకండి నాన్న అమ్మ సెపరేట్ గా ఉంటే వాళ్ళు అనుమానంగా అడుగుతారు కదా..  ఎందుకు అలాగా ఉన్నారని అప్పుడు మనం ఏం సమాధానం చెప్పాలి.

మన ఇంటి గుట్టు మనమే ఎందుకు బయట పెట్టాలి అని అడుగుతుంది. ఈ వంకనైనా అనసూయ ని క్షమిస్తారేమో అని చిన్న ఆశతో కౌసల్య, చారు లత చూస్తూ ఉంటారు.

ఆ మాటలకి ఒక్క నిమిషం రాఘవేంద్ర గారు ఆలోచించి మనకు బాగా కావాల్సిన వాళ్ళతో ఇక్కడ హోమం చేపిస్తున్నామని మాత్రమే చెప్పు.

ఆరోజు మాకు నచ్చకపోయినా మా పక్కనే ఉండాలి అని చెప్పు.  అంతకుమించి ఎలాంటి విషయాలు తెలియనివ్వద్దు అని అక్కడి నుండి వెళ్లిపోతారు.

దేవేంద్ర కూడా సైలెంట్ గా వెళ్ళిపోతాడు. హమ్మయ్య ఒక గండం గడిచింది అని ఊపిరి తీసుకుంటారు.  అనసూయ గారికి ఈ విషయాలు  గురించి ఏమీ తెలియదు కదా... ఆవిడ ఎప్పుడు గదిలోనే ఉంటారు.

అమ్మ అన్న పిలుపుకి అనసూయ గారు తల పైకెత్తి చూస్తారు. అక్కడ చారులత,  కౌసల్య కనిపిస్తారు. వాళ్ళిద్దరూ వంక అనుమానంగా చూస్తూ చెప్పు చారు ఏంటి ఇలా వచ్చారు అని అడుగుతుంది.

దానికి చారులత వెళ్లి అనసూయ పక్కన కూర్చుని నీకు ఒక విషయం చెప్పాలి అమ్మ అని... రాఘవేంద్ర గారు ఎలాగైతే చెప్పమన్నారు అలాగే చెబుతుంది.

ఎవరు అంత ముఖ్యమైన వాళ్ళు అని అడుగుతారు. దానికి చారులత అది అన్నయ్య బిజినెస్ మీటింగ్లో పరిచయమయ్యారు బాగా క్లోజ్ అయ్యారు.

ఒక రకంగా చెప్పాలి అంటే మన ఫ్యామిలీ లాగా నే. అందుకనే నాన్నగారు ఇక్కడ ఏర్పాటు చేశారు అని చెబుతుంది.

దానికి అనసూయ ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అంటే...ఏమీ లేదు మీరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా అని కూతురు వైపు, కోడలు వైపు చూసి అడుగుతారు.

దానికి చారులత,  కౌసల్య సమాధానం ఏమిటి...
[+] 6 users Like SivaSai's post
Like Reply
#68
Part - 32

    అనసూయ కూతురు, కోడలు వంక చూస్తూ నా దగ్గర మీరు ఏమైనా దాస్తున్నారా అని అడుగుతారు.  దానికి చారు, కౌసల్య ఒకరి మోకాలు ఒకరు చూసుకుని అలా ఎందుకు అనుకుంటున్నావు అమ్మా అని అడిగితే...

ఏమో మరి ఎప్పుడూ లేనిది మన ఇంట్లో హోమం జరగడం.  అది కూడా వేరే కుటుంబం వాళ్లు వచ్చి మన ఇంటిలో చేయడం.

వాళ్లు మన కుటుంబంతో సమానమని చెబుతూ ఉంటే అనుమానంగా ఉంది ఏమైనా ఉంటే చెప్పండి అని ఆత్రంగా వాళ్ళు మోకాలు ఇంకా చూస్తారు.

తల్లి మనసులో భావం అర్థమైనా సరే... చారు ఏమీ చెప్పకుండా అలా ఏమీ లేదమ్మా ఆ అమ్మాయి మన కంపెనీలోనే ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంది.

వాళ్ళ ఫ్యామిలీతో మన ఫ్యామిలీ బాగా అటాచ్మెంట్ పెరిగింది. అందుకనే ఒక ఆడపిల్లతో మన ఇంట్లో హోమం చేపిస్తే మన ఇంటి ఆడపిల్ల త్వరగా మన ఇంటికి వచ్చేస్తుంది అన్న ఒక నమ్మకం అంతే అమ్మ అని చెబుతుంది.

నిజంగా అంతేనా అని అడిగితే...ఇంతకన్నా ఇంకేం ఉంటుంది అమ్మ అని అడుగుతారు. దానికి ఏమీ లేదు అని మళ్లీ భగవద్గీత చదువుతూ ఉంటారు.

క్షమించు అమ్మ.  ఇప్పుడు ఏమీ చెప్పలేము. కానీ ఏదో ఒక రోజు నీ క్షమాపణన్ని నాన్నగారు స్వీకరిస్తారు అనుకుంటున్నాను అనుకుని పదా వదిన అని చెప్పి బయటకు వచ్చేస్తుంది.

ఇక్కడ కుర్ర బ్యాచ్ అంతా కలిసి రుద్రని ఆట పట్టిస్తూ ఉంటారు.  ఇంకేంటి బావ మా చెల్లి వచ్చేస్తుంది ఇంక తర్వాత పిప్పి డుం డుం డుం అని ఆడుకుంటూ ఉంటారు.

దానికి రుద్ర మాత్రం పి పి డుం డుం డుం  తర్వాత ముందు మీ చెల్లికి కావలసినవి చూడండి.  లేకపోతే తాతగారు మన అందరి మీద సీరియస్ అవుతారు నాకు కొంచెం వర్క్ ఉంది నేను ఆఫీస్ కి వెళుతున్నాను అని వాళ్లకు దొరక్కుండా బయటికి వచ్చేస్తాడు.

నడుస్తూ తనలో తానే నవ్వుకుంటూ శాంభవి నిన్ను చూసిన మొదటి రోజునే నా మనసు నీ వైపుకు లాగేసింది. కానీ ఒక చిన్న అనుమానం నువ్వు నా మరదలు వి అవునా కాదా అని.

అది కన్ఫర్మ్ అయిన రోజున మాత్రం నా ఆనందానికి హద్దులు లేవు కానీ.. ఇలా అని బయటపెట్టానో వీళ్ళు ఇంకా నన్ను ఒక మాదిరిగా ఆడుకోరు అని నవ్వుకుంటూ ఆఫీస్ కి వెళ్ళిపోతాడు.

ధీరజ్ మాత్రం రుద్రను వెనకనుంచి అనుమానంగా చూస్తూ వీడు మనల్నించి తప్పించుకోవడానికి ఆఫీస్ అని చెబుతున్నాడు.

కానీ మనకు తెలియని వర్కు ఉందా.. వీడెప్పుడో శాంభవికి పడిపోయాడు అలా చెప్పకుండా ఎదవ స్టోరీలన్నీ చెబుతున్నాడు అని ఏమేం కావాలో అని కౌశల్య దగ్గరికి వెళతాడు.


విహాన్, అద్వైత్ కు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇన్ని రోజులకి మనకంటూ ఒక చెల్లి ఉంది.  తన మన ఇంటికి వస్తుంది.

ఆ ఫీల్ చాలా గొప్పగా ఉంది హార్ట్ చాలా హెవీ అయిపోతుంది అని అనుకుంటారు. శాంభవి వచ్చే రోజుకి మనం అన్ని సెట్ చేయాలి.

తనకి వాళ్ళు ముగ్గురితో పాటు మన ఇద్దరం కాదు.. మనం ఇక్కడ ముగ్గురు అన్నలు ఉన్నారు అని చెప్పాలి అనుకుంటారు.

అందరూ పౌర్ణమి ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటారు.  వీళ్ళందరూ ఎదురుచూస్తున్న ఘడియలు రానే వచ్చాయి

విష్ణు గారికి మాత్రం మేనకోడలతో హోమం వాళ్ళ ఇంట్లో చేయించాలని ఉంటుంది.  కానీ దేవేంద్ర గారికి మాట ఇవ్వడం మీద ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అవుతారు.

ఎక్కడ ఉన్న శాంభవి సంతోషంగా ఉంటే చాలు అనుకుంటారు. ఎందుకంటే శాంభవి అంటే అందరికీ పంచప్రాణాలు కాబట్టి.

హోమం ముందు రోజుకి రేపల్లె నుండి అందరూ ఇక్కడికి చేరుకుంటారు.  ఒక్క శకుంతల గారు తప్ప వయసు ప్రభావంతో ఆవిడ ఎక్కడికి దూర ప్రయాణాలు చేయలేకపోతుంటారు.

ఆవిడకి వీడియో కాల్ అంతా చూపించొచ్చు అని మిగిలిన వాళ్ళు అందరూ వస్తారు.  అందరూ ముందుగా విష్ణు వాళ్ళ ఇంటికి వెళతారు.

అక్కడ అంతా ఫ్రెష్ అయిన తర్వాత శివ గారు దేవేంద్రకి కాల్ చేసి మేము ఇక్కడ విష్ణు దగ్గర ఉన్నాము. మీకు అభ్యంతరం లేకపోతే మేము అక్కడికి వస్తాము అని అడుగుతారు.

దానికి దేవేంద్ర ఎందుకు శివ అంత మొహమాటపడుతున్నారు.  ఇది మీ ఇల్లే అనుకోమని ఎన్నిసార్లు చెప్పాను.

ఇక్కడ అన్నీ రెడీ చేసాము. మీరు ఒకసారి వచ్చి చూశారా అనుకో ఏమైనా మిస్ అయితే చెప్పడానికి ఉంటుంది.. మేము మొదటిసారిగా ఇక్కడ చేపించేది అందరూ వచ్చేసేయండి అని చెబుతారు.

ఒకసారి విష్ణుకి కూడా ఫోన్ ఇవ్వు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇన్వైట్ చేస్తారు. దానికి విష్ణు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తప్పకుండా వస్తాము అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు.

విష్ణు గారి నివాస్ తో కూడా గట్టిగా చెబుతారు. హోమం జరిగే టైం అంతా నువ్వు అక్కడే ఉండాలని. తప్పకుండా డాడ్ అని చెప్పి ఆఫీస్ కి వెళ్ళిపోతాడు.

అందరూ ఒకసారి బృందావనానికి బయలుదేరుతారు. అక్కడికి రాగానే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక గుడ్ ఫీల్ వస్తుంది.

అందరికి ఒక పాజిటివ్ వైబ్రేషన్ లాగా అనిపిస్తుంది . వాళ్లు అందరూ కార్లు దిగి  నుంచోగానే కౌసల్య, చారులత గబగబా బయటకు వచ్చి రండిలోపలికి అని చెప్పి ఇన్వైట్ చేస్తారు.

వాళ్లకి అసలు కాళ్లు చేతులు ఆడనట్టుగా ఉంటాయి. శాంభవి ఏది అని ఆత్రంగా అడుగుతారు. శాంభవి ఆఫీస్ కి వెళ్ళింది.

సాయంత్రం లలిత్ వెళ్లి తీసుకు వస్తాడు అంటే దానికి కౌసల్య ఎందుకు మళ్ళీ లలిత్ ని ఇబ్బంది పెట్టడం.  మన అబ్బాయిలు ఆఫీసులోనే ఉన్నారు.

వచ్చేటప్పుడు వాళ్లతో పాటు వచ్చేస్తుందిలే నేను ఇప్పుడే విహాన్ కి ఫోన్ చేసి చెబుతాను అని ఫోన్ చేస్తారు.

వాళ్ళ అభిమానానికి రామచంద్రయ్య గారికి చాలా ఆనందం గా అనిపిస్తుంది.  ఈ రోజుల్లో ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా అని ఇల్లంతా చుట్టూ చూస్తూ ఉంటారు.

అక్కడ ఒక చోట ఒక ఫోటోకి దండ వేసి ఉంటుంది. ఆ ఫోటో చూసి ఆయన అలా నిలబడిపోతారు. అది చూసిన చారులత దగ్గరికి వచ్చి ఎందుకు పెదనాన్నగారు అలా చూస్తున్నారు అని అడిగితే..

ఏమీ లేదమ్మా ఆవిడని చూస్తుంటే ఎక్కడో చూసిన ఫీలింగ్ వస్తుంది. ఆ ఫోటోలో ఉన్న మనిషికి చెయ్యెత్తిదండం పెట్టాలి అనిపిస్తుంది అని అంటారు.

దానికి చారు మనసులో ఆవిడ శాంభవి తల్లి..ఆ విషయం మీకు తెలియదు కానీ అది మేం బయటికి చెప్పలేము అనుకుని..

ఆవిడ దేవేంద్ర భార్య. పురిటిలోనే బిడ్డను దూరం చేసుకుని మాకు అందరికీ అందనంత దూరం వెళ్ళిపోయిందని బాధగా చెబుతుంది. అవునా తల్లి అని ఆయన కూడా బాధపడతారు.

ఇంతలో అక్కడికి రాఘవేంద్ర గారు వస్తారు. రాఘవేంద్ర గారికి రామచంద్ర గారి ఫ్యామిలీ మొత్తాన్ని పరిచయం చేస్తారు.

రాఘవేంద్ర గారు రామచంద్రయ్య గారిని గట్టిగా కౌగిలించుకుని మీ ఫ్యామిలీని చూస్తుంటే నాకు చాలా ముచ్చటగా ఉంది.

ఏమిచ్చిన ఈ రోజుల్లో ఇలాంటి ఫ్యామిలీలు కనపడవు అని అంటే..  మనదేముందండి అంత ఆడవాళ్ళ చేతిలోనే ఉంటుంది.

వాళ్ళందరూ ఒక మాట మీద ఉంటే మనం మాత్రమే ఏం మాట్లాడగలం.  అది మాత్రం నా కుటుంబంలో ఉందని చాలా గర్వంగా చెబుతారు.

నిజంగా మీరు చాలా అదృష్టవంతులు అని చెబుతూ ఉండగానే అక్కడికి అనసూయ వస్తుంది. రాఘవేంద్రగారు ఎటు మాట్లాడకుండా ఉంటే చారు కంగారుగా వచ్చి తిను మా అమ్మ అనసూయ అని పరిచయం చేస్తుంది.

దానికి రామచంద్రయ్య గారి నమస్కారం చేసి తిను నా భార్య సులోచన అని పరిచయం చేస్తారు. తర్వాత కొడుకులిద్దర్నీ కోడల్ని పరిచయం చేస్తారు.

దానికి అనసూయ నమస్కారం అని చెబుతుంది. చాలా రోజుల తర్వాత భర్త పక్కన కూర్చున్నందుకు అనసూయ కి చాలా సంతోషంగా అనిపిస్తుంది.

వీళ్ల వల్ల అయినా సరే నా భర్తతో కొంచెం సేపైనా గడపగలుగుతాను.  నా కుటుంబంతో ఉండగలుగుతాను అని ఆ ఫ్యామిలీ వంక చాలా కృతజ్ఞతతో చూస్తూ ఉంటారు.

కౌసల్య విహాన్ కి ఫోన్ చేసి మీతో పాటు శాంభవిని కూడా తీసుకురండి.  వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసారు.

వీలైతే తొందరగా వచ్చేయండిరా అమ్మాయిని చూడాలని చాలా ఆశగా ఉంది అందరికీ అని చెబితే... అమ్మ నువ్వు అలా కంగారుపడి ప్రతిదీ దొరక పెట్టకు.

మేము టైం కి వస్తాము. రుద్ర ముందే చెప్పాడు అని చెబితే..  ఓ రుద్ర ఆల్రెడీ ప్లాన్ చేశాడా....సరే అయితే జాగ్రత్తగా రండి అని చెబుతారు.

సరే అని ఫోన్ పెట్టేస్తే రుద్ర పక్కనుంచి ఏంటి అత్తయ్య కంగారు పడుతుందా అంటాడు. నీకు మీ అత్తయ్య సంగతి తెలిసిందే కదా...

కుదిరితే ఇప్పుడే వచ్చాయమని చెబుతాన్నారు అని నవ్వుతాడు.  వాళ్లు ఆత్రంతో ఇప్పుడే బయట పెట్టేసేటట్టు ఉన్నారు.

ఇలా జరిగింది అనుకో ఇంకా అంతే సంగతులు . అయినా ఆఫీస్ టైం అయ్యాక మనం నిదానంగానే వెళదాం. అప్పుడు దాకా మీ చెల్లిని బిజీ చేసేయండి అని చెప్పి దేవేంద్ర గారు ఇవ్వాల్సిన వర్క్ కూడా రుద్రే ఇచ్చి వర్క్ చేపిస్తూ ఉంటాడు.

దాంతో ధీరజ్ వచ్చి బావ ఇది కొంచెం టూమచ్ గా లేదా అంటే... దేని గురించి...

ఈరోజు అందరూ ఇంట్లో మంచి హ్యాపీగా ఉంటారు కానీ మమ్మల్ని ఎవరినీ వెళ్లనివ్వకుండా ఇక లాక్ చేసేస్తున్నావు కదా అని అడుగుతాడు.

దానికి రుద్ర ఒక ఐ బ్రో పైకి ఎత్తి ఇప్పుడు వెళ్లి నువ్వు ఏం చేస్తావో అని అడుగుతాడు. వెళ్లితే ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేస్తారు.

శాంభవితో వాళ్ళ ఫ్యామిలీ చాలా బాగా ఉంటారు కదా అంటే...  అదే కదా నేను చెప్పేది శాంభవి వెళ్ళగానే నాన్న నాన్న అని వెళ్లి వాళ్ళ నాన్న లు ఇద్దరి పక్కన కూర్చుని గారాలు పోతూ ఉంటుంది.

వాళ్లే దగ్గరుండి తినిపిస్తూ ఉంటారు ఇదంతా చూస్తున్న చిన్న మామ పరిస్థితి ఏంటి..  దగ్గరికి తీసుకోలేక దూరంగా ఉండలేక ఎంత నలిగిపోతాడు అది కూడా ఆలోచించలేరా అనే అంటాడు.

రుద్ర ముందు ఆలోచనకి ముగ్గురు అవును ఇది నిజమే కదా అంత దూరం ఆలోచించలేదు బావ.  శాంభవి ఇంటికి వస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అని మాత్రమే అనుకున్నాము.

నిజంగా నీ ముందు చూపు మాత్రం సూపర్ అని చెప్పి ఎవరికి వారు  బిజీ అయిపోతారు. సాయంత్రం అయిన తర్వాత వర్క్ మొత్తం ఫినిష్ చేసుకుని శాంభవి దగ్గరికి విహాన్ వెళతాడు.

శాంభవి అని పిలవగానే చెప్పండి సార్ అంటే..  నీకు మీ నాన్నగారి దగ్గర నుంచి కాల్ వచ్చినట్టుంది కదా వెళదామా అంటే...

ఆ తప్పకుండా అని చెప్పి బయటకు వస్తుంది. శాంభవితో ఉన్న మిత్ర,  గౌతమ్ మాత్రం విష్ణు వాళ్ళ ఇంటికి వెళ్లి పోతారు.

శాంభవిని తీసుకుని నలుగురు బృందావనానికి చేరుకుంటారు.  శాంభవి ఆ ఇంటిని చూస్తూ అలాగే ఉండిపోతుంది.

శాంభవి పరిస్థితి ఏమిటి...
[+] 6 users Like SivaSai's post
Like Reply
#69
Part - 33

   శాంభవి కారు దిగి ఆ ఇంటిని చూస్తూ ఉంటుంది. రుద్ర మాత్రం శాంభవి ఫీలింగ్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. మిగిలిన ముగ్గురు అన్నలు తన పక్కకి వచ్చిన ఏమైంది శాంభవి అలా చూస్తున్నావు అంటే....

ఏమి లేదు సార్ ఈ ఇంటిని చూస్తుంటే ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది.  అది ఏంటి అన్నది నాకు తెలియడం లేదు కానీ...  నేను ఎప్పుడో ఇక్కడికి వచ్చాను అని అనిపిస్తుంది.

ఎంత ఆలోచించినా నేను ఎప్పుడూ మా ఊరు దాటి బయటికి రాలేదు. కానీ ఇది ఎలా సంభవం అని వాళ్ళ వంక చూస్తూ అడుగుతుంది.

దానికి ఆ నలుగురు శాంభవి వంక చూస్తూ నీకు తెలియకుండానే నీ మనసు గుర్తిస్తున్నట్టుంది.  ఇది నీ పుట్టిల్లు అని...  కానీ ఇది బయటకు మేము చెప్పలేము అని అనుకొని..

ఒక్కొక్కసారి మనకు అలాగే అనిపిస్తూ ఉంటుంది పద లోపలికి వెళ్దాం అని అంటారు.  శాంభవి మాటలన్నీ దేవేంద్ర గారు వింటారు.

ఆయనకి కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి. భార్యని తలుచుకుంటూ మన కూతురు  కి తనకే తెలియకుండా ఇదే తన ఇల్లే అని గుర్తించింది.

ఇదేనేమో రక్తసంబంధం  అనుకొని ఎవరూ చూడకుండా కన్నీళ్లు తుడుచుకుంటాడు. కానీ అది రుద్ర కళ్ళల్లో పడుతుంది.

రుద్ర దేవేంద్ర గారి దగ్గరికి వెళ్లి భుజం మీద చేయి వేసి చిన్నమామ అని పిలిస్తే.. నేనేమీ బాధపడటం లేదు రుద్ర..

ఇన్నాళ్ళకి నా కూతురు మన ఇంటికి వచ్చింది కానీ... అది వేరే వాళ్ళ బిడ్డగా ఇంట్లోకి అడుగుపెడుతుంది.  అదే కొంచెం కష్టంగా ఉంది అని...  పద లోపలికి వెళ్దాం అని తీసుకుని వెళ్తారు.

శాంభవి గుమ్మం దగ్గరకి రాగానే ఆగు అన్న మాట వినిపిస్తుంది. కంగారుగా ఆ మాట వినిపించిన వైపు చూస్తుంది.

అక్కడ రాఘవేంద్ర గారు కనిపిస్తారు.  శాంభవి భయంగా అయిన వైపు చూస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులందరు అయోమయంగా చూస్తూ ఉంటే....

అమ్మ చారు అని పిలుస్తారు.  అర్ధమైంది నాన్నగారు అని చెప్పి గబగబా లోపలికి వెళ్లి దిష్టి తీయడానికి అని ఎర్ర నీళ్లు తీసుకుని వస్తోంది.

అది చూడగానే అందరూ ఊపిరి తీసుకుంటారు.  శాంభవి కూడా హమ్మయ్య అని అనుకుంటుంది. చారులత,  మాధురి కలిపి దిష్టి తీస్తారు.

కుడికాలు ముందు పెట్టి లోపలికి రా తల్లి బుగ్గ మీద చెయ్యి వేసి చెబుతారు.  దానికి సరే అని తల ఊపి లోపలికి కుడికాలు పెట్టి వస్తుంది.

ఆమాత్రం దానికే కుటుంబ సభ్యులందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.  వాళ్ళ ఆనందం చూసిన రామచంద్రయ్య గారి మాత్రం ఎందుకు వీళ్ళు అందరూ ఇంత సంతోషంగా ఉన్నారు అని ఆలోచిస్తూ ఉంటారు.

ఆయన ఆలోచన పసిగట్టిన రుద్ర మా తాతగారు వంశంలో ఆడపిల్ల కోసమే చూస్తున్నారు. అందుకే మీ మనవరాల్ని చూడగానే తన సొంత మనవరాలే వచ్చినట్టుగా సంతోష పడుతున్నారు.

మేమందరం అబ్బాయిలం అయిపోయాం కదా..  ఆయన చిన్న చిన్న కోరికలు ఏమీ తీరలేదు అని చెబుతాడు. అవునా అని ఆయన మనసు తేలిక పడుతుంది.

రుద్ర మాత్రం హమ్మయ్య మీ అనుమానం తీరింది అని అనుకుంటాడు.  ధీరజ్ కి సైగ చేస్తాడు. ఏమైంది బావ అని దగ్గరకు వస్తే అమ్మ వాళ్ళు కొంచెం ఎమోషనల్ కంట్రోల్ చేసుకోమని చెప్పు.

ఇప్పటికే ఆ పెద్దాయనకి అనుమానం వచ్చింది.  ఏదో విధంగా సర్ది చెప్పాను కానీ.. ఏదైనా తేడా వచ్చింది అనుకో ఇక ముందుకు వెళ్లడం చాలా కష్టం.

వీళ్ళ కన్నా ముందు మయూరి కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది అంటే....  శాంభవికి చాలా ప్రమాదం అని చెబుతాడు.

అది నిజమేలే అని చెప్పి సైలెంట్ గా చారు పక్కకెళ్ళి అత్త ఒక విషయం మాట్లాడాలి అని చెప్పి లోపలికి తీసుకెళ్లి జరిగింది చెబుతాడు.

సరే రా... మేము జాగ్రత్తగానే ఉంటామని చెప్పి బయటకు వచ్చి లేడీస్ తో కబుర్లు చెబుతూ ఉంటారు. ఆఫీసు నుంచి వచ్చారు అని చెప్పేసి స్నాక్స్  కౌసల్య తీసుకువచ్చి ఇస్తుంది.

అవి చూడగానే శాంభవి మెరిసే కళ్ళతో చూస్తూ ఆంటీ ఇవి నాకు ఇష్టము మీకు ఎలా తెలుసు అని అడుగుతుంది.

అందరూ ఏంటా అని చూస్తే అవి మిరపకాయ బజ్జి అండ్ బెల్లం జిలేబి . అవి దేవేంద్ర కి కూడా చాలా ఇష్టం.  తండ్రి అలవాట్లే వచ్చాయని అందరూ మనసులో హ్యాపీగా ఫీల్ అయిపోతా ఉంటారు.

  కౌసల్య నీకు ఇష్టమని మాకు తెలియదు అమ్మ. మామూలుగా చేశాను. నీకు ఇష్టం కదా మాకు చాలా సంతోషంగా ఉంది తిను తల్లి అని....

నేను తినిపించిన అని అడుగుతారు. దానికి అద్వైత్, విహాన్ తల కొట్టుకుంటూ  రుద్రవంక చూస్తారు.

శాంభవి మొహమాటంగా మీకెందుకండి ఇబ్బంది. నేను తింటాను అని చెబుతుంది.  కౌసల్య నాకు ఆడపిల్లలు లేరు తల్లి....

నిన్ను చూస్తుంటే నాకు కూతురు ఉంటే బాగుండును కదా అనిపించింది. అందుకే తినిపిస్తాను అన్నాను నీకు ఇష్టం లేకపోతే వద్దులే అని వెనక్కి తీసుకుంటారు.

కౌసల్య గారిని బాధ పెట్టడం ఇష్టం లేక తినిపించండి ఆంటీ అని చెబుతోంది.  అంతే ఆవిడ ఫేస్ వెలిగిపోతుంది.  చారు, మాధురి ఈ ఛాన్స్ మనం మిస్ అయిపోయాయమే అన్నట్టుగా చూస్తూ ఉంటారు.

వాళ్ల వంక చూసిన ధీరజ్ బావ వీళ్ళిద్దరూ ఎందుకు అలా చూస్తున్నారు అంటే... ఈ ఛాన్స్ నేను మిస్ అయిపోయామని వాళ్ళిద్దరూ ఇన్నర్ ఫీలింగ్ అని చెప్తాడు.

పాపం కదా శాంభవి అని అంటాడు. ఎందుకురా అంటే అక్కడ వాళ్ళు తినిపించి... ఇక్కడికి వచ్చాక కూడా ఇలాంటి ప్రేమతో తను తినే దానికన్నా ఎక్కువగా తినిపించి నాస్లిమ్ గా ఉండే నా చెల్లెలుని లావుగా తయారు చేస్తారేమో అని అంటాడు.

రుద్ర ధీరజ్ వంక చూస్తా ఉంటే ఫ్యూచర్లో నీకు కష్టమని చెప్తున్నాను బావ అంటే... తింటున్న శాంభవి వంక చూస్తాడు.

చాలు  ఆంటీ అని చెబుతున్న సరే కౌసల్య గారు వినిపించుకోకుండా ఇది తినుమ్మ...కొంచెం తినాలి అని చెప్పి ఆవిడ పెట్టాలనుకుంత తినిపించేస్తూ ఉంటారు.

ధరణి, జయంతి మాత్రం వాళ్ళని చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు.  ఏంటి ఆడపిల్ల లేకపోతే వీళ్ళు ఇంత అతి ప్రేమ చూపిస్తున్నారు.

నిజంగా ఇంట్లో ఆడపిల్ల ఉండి ఉంటే మనకంటే ఎక్కువ గారాబంగా చూసేటట్టు ఉన్నారు కదా అని ఒకరికొకరు  అనుకుంటారు.

శాంభవి తినటం అయిపోయిన తర్వాత లెగిసి నుంచుంటుంది. ఏమైంది తల్లి అంటే అదే ఆంటీ కొంచెం హెవీగా ఉంది.

జస్ట్ అలా వాక్ చేద్దాం అని చెబుతోంది. చారులత చొరవగా శాంభవి దగ్గరికి వచ్చి పదా నీకు ఇల్లంతా చూపిస్తాను అని చెప్పి చేయ్యిపట్టుకుంటుంది.

ఇదంతా కూడా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఆనందంగా చూస్తూ ఉంటారు. ముందుగా పూజగది దగ్గరికి తీసుకువెళ్లి ఇది నిత్యం మేము పూజ చేసే గది అని చెప్పి దేవుడి గదిలో నుంచి కుంకం తీసుకువచ్చి పెడుతుంది.

అలా ఇల్లంతా చూపిస్తూ ఉంటుంది కానీ శాంభవి చూపులు మాత్రం ఒక ఫోటో దగ్గర ఆగిపోతాయి.. ఈ ఫోటో ఎవరిది అండి అని అడుగుతుంది.

ఆ ఫోటో వంక అందరూ చూసి చాలా బాధపడతారు. దేవేంద్ర మనసు చాలా బాధగా మారిపోతుంది.  చారు ఒక నిట్టూర్పు విడిచి తను మా చిన్న వదిన. దేవేంద్ర అన్నయ్య భార్య అని చెబుతుంది.

ఆ ఫోటో దగ్గరకి వెళ్లి చేతితో తడుముతు ఎందుకో శాంభవి కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటాయి. సడన్గా ఉలుకబడి వెనక్కి తిరుగుతుంది.

శాంభవి ఏమైంది   అని శివ గారు, భాను గారు వస్తారు. ఏమో నాన్న నన్ను ఎవరో చిట్టితల్లి  అని పిలుస్తున్నట్టు అనిపించింది అని చెబుతుంది.

అంతే ఆ మాటకి దేవేంద్ర గారు ఉలిక్కిపడతారు. శాంభవి వంక, భార్య ఫోటో వంక చూస్తూ నీ ప్రేమ మన కూతురి మనసును తాకింది.

నువ్వు నాతో కూతురే పుడుతుంది అని ఖచ్చితంగా చెప్పావు. అందుకే కడుపుతో ఉన్నప్పుడు కూడా చిట్టి తల్లి చిట్టి తల్లి అని కబుర్లు చెప్పావు.

అదే తనకి తెలియకుండానే ఆ పిలుపు తనకి వినిపిస్తుంది. నీ ప్రేమ స్వచ్ఛమైనది కాబట్టే.... మన కూతురు ఇక్కడికి వచ్చింది.

భవిష్యత్తులో ఇక్కడే ఉండిపోయేటట్టుగా చూస్తాను అని భార్య ఫోటో వంక చూస్తూ మనసులో అనుకుంటారు.  అందరూ శాంభవి వైపు చూస్తూ ఉంటే... రాఘవేంద్ర, రుద్ర మాత్రం దేవేంద్ర వైపు చూస్తూ ఉంటారు.

అక్కడ వాతావరణన్ని తేలికపరచడానికి  ధీరజ్ తాతగారు రేపు హోమానికి ఏమైన కావాలా... అన్ని ఏర్పాట్లు అయిపోయిన ఇంకా ఏమన్నా అవసరం ఉందా అని టాపిక్ డైవర్ట్ చేస్తాడు.

అన్ని అయిపోయినాయి నాన్న... శ్రీశైలం నుంచి గురువుగారు కూడా వస్తున్నారు అని చెబితే....


రామచంద్రయ్య గారు కంగారుగా అంత పెద్దాయన ఎందుకండి ఇబ్బంది పెట్టడం. ఇక్కడ మనకు దొరుకుతారు కదా అంటే...

మాకు తరతరాలుగా మా వంశానికి, ఆశ్రమానికి సంబంధం ఉంది.  అందుకే మా ఇంటిలో ఏది జరిగినా ఆశ్రమం నుంచి గురువులే వచ్చి చేస్తారు.

ఇందులో ఇబ్బంది ఏమీ లేదు అని చెబుతారు. అందరూ సరే అని అంటారు. దేవేంద్ర మాత్రం కూతురు ఎటువైపు వెళుతుంటే అటువైపు చూపులు వెళ్ళిపోతూ ఉంటాయి.

అందరిలో ఉన్న సరే ఎవరి మాటలు తన చెవులకి వినపడవు.  ఒక్క శాంభవి నవ్వు,మాటలు తప్ప. డిన్నర్ అయిన తర్వాత వాళ్ళందరికీ గదులు చూపిస్తారు.

ఎవరి రూమ్ లో వాళ్ళు వెళ్లి పడుకుంటే శాంభవి దగ్గర మాత్రం శివప్రసాద్, భానుప్రసాద్ కూర్చొని కబుర్లు చెబుతూ జో కొడుతూ పడుకోబెడతారు.

  ఇదంతా గుమ్మం బయట నిలబడి చూస్తున్న దేవేంద్ర నా కూతురు దగ్గర నేను ఎప్పుడూ ఇలా ఉంటాను అని బాధగా అనుకుంటూ తన గదిలోకి వెళ్లి భార్య ఫోటో వైపు చూస్తూ ఉంటారు.

ఆ ఫోటో లో అతని భార్య మాత్రం చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది.  నా ఒక్క రోజు ఆలస్యం నువ్వు నాకు దూరం అవ్వడం.

ఆ దూరం 22 ఏళ్లు చూపించింది.  ఏలాగైనా సరే శాంభవి రుద్ర కి  పెళ్లి చేసి మన కూతురు  ని ఇంటికి తెచ్చేసుకోవాలి.

మయూరీకి తెలిసేలోపే వీళ్ళిద్దరి పెళ్లి జరిగి పోవాలి అని గట్టిగా అనుకుంటాడు. ఇంతలో తలుపు కొట్టిన శబ్దం వస్తుంది  ఈ టైం లో ఎవరైనా ఉంటారు అనే వెళ్లి తలుపు తీస్తాడు.

వచ్చింది ఎవ్వరు??
కథ కొనసాగుతుంది...
[+] 8 users Like SivaSai's post
Like Reply
#70
Superb update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
#71
Tik tik tik
Knock knock knock???
[+] 1 user Likes ash.enigma's post
Like Reply
#72
Part - 34

తలుపు శబ్దం విని దేవేంద్ర వెళ్లి తలుపు తీస్తాడు.అక్కడ రుద్ర,  జితేంద్ర ఉంటారు.ఏంటి అన్నయ్య ఈ టైం లో వచ్చారు అని లోపలికి రావడానికి అని పక్కకు తప్పుకుంటాడు.

ఇద్దరూ లోపలికి వచ్చి తలుపు వేసి జితేంద్ర గట్టిగా దేవేంద్ర ని కౌగిలించుకుంటాడు. దేవేంద్ర అయోమయంగా జితేంద్ర చుట్టూ చేతులు వేసి ఏమైంది అన్నయ్య అని అడిగితే...

ఎలా దేవేంద్ర ఇంత బాధని మనసులో దాచుకుంటున్నావు. నాకే శాంభవిని దగ్గరికి తీసుకోవాలనిపించింది. నువ్వు మాత్రం మౌనంగా కూతుర్నే చూస్తూ ఉన్నావు అని బాధగా ఉంటాడు.

దానికి దేవేంద్ర, జితేంద్ర ని తీసుకువెళ్లి సోఫాలో కూర్చోబెట్టి ఒళ్ళో పడుకుంటాడు. తమ్ముడు తల నిమురుతు ఉంటారు.

వాళ్ళిద్దర్నీ చూస్తూ రుద్ర మంచం మీద కూర్చుంటాడు. దేవేంద్ర జితేంద్ర తో శాంభవిని చూడగానే గట్టిగా గుండెలుకి హత్తుకోవాలని అనిపించింది.

పుట్టినప్పుడు నా చేతుల్లోకి తీసుకోవాల్సిన పిల్ల ఇన్ని సంవత్సరాల తర్వాత నా కళ్ళకి కనిపించింది. దగ్గరికి తీసుకోలేని నిస్సహాయ పరిస్థితి నాది.

శాంభవి మాట్లాడే ప్రతి మాటలో కూడా నాకు నా భార్య కనిపిస్తుంది. అదే రూపం అదే గుణం. ఎప్పుడైనా అమ్మని చూసినప్పుడు నా కూతురు నా దగ్గరికి రాగానే క్షమించాలి అని అనిపించేది.

కానీ ఇలా చూస్తూ ఉంటుంటే అమ్మని అసలు క్షమించలేకపోతున్నాను. ఇంత చెడులో కూడా ఒక మంచి విషయం ఏంటో తెలుసా అన్నయ్య అని ఓడిలో నుంచి లేసి జితేంద్ర వైపు చూస్తారు.

ఏంట్రా అని అడిగితే... శాంభవి ఒక మంచి కుటుంబంలో పెరిగింది. విలువలు తెలిసిన కుటుంబం. శాంభవి ఇక్కడికి రాగానే ముందుగా వెళ్లి మావయ్య వాళ్లకి చూపించాలి.

తన కూతుర్ని దూరం చేసినందుకు భగవంతుడు నాకు నా కూతుర్ని ఇన్నాళ్లు దూరం చేసే శిక్ష వేశాడు. ఆ శిక్షకి ఇన్ని సంవత్సరాలకు ప్రాయశ్చిత్తం దొరికింది.

నా ఒక్క రోజు ఆలస్యం నా భార్య నాకు దూరమైపోయింది. కానీ ఇప్పటినుండి మాత్రం ఒక్కరోజు కూడా నా కూతురుని దూరంగా ఉంచను అని రుద్రవైపు చూసి...వీలైనంత తొందరగా వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించాలి అని రుద్రతో నీకు శాంభమైన పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని అడుగుతారు.

అది ఏంటి మామ అని అడిగితే... లేదురా ఇష్టం లేకుండా మాత్రం ముడి పెట్టను. ఎందుకంటే మీ ఇద్దరిలో ఎవరు బాధపడినా ఎవరం తట్టుకోలేము.

అందుకే నీ మనసులో ఏది ఉంటే అదే చెప్పేసేయ్. మా గురించి అని మాత్రం పెళ్లికోప్పుకోవద్దు అని చెబుతాడు.

రుద్ర మంచం మీద నుంచి లేచి వచ్చి మోకాళ్ళ మీద కూర్చుని దేవేంద్ర చేతులు పట్టుకొని మామ నీకు ఒక విషయం చెప్తాను విను.

శాంభవి నాకు మరదలు అని తెలియక ముందే శాంభవి వైపుకు నా మనసు లాగేసింది. శాంభవినే నా మరదలు అని అనిపించింది.

కానీ రిపోర్ట్స్ అన్ని వచ్చేదాకా మాత్రం వెయిట్ చేశాను. ఎప్పుడైతే శాంభవి నా మరదలు అని తెలిసిందా అప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను.

ఇంకా నీ కూతురు అంటావా.. ఎవరిని ప్రేమించలేదు.ఇంట్లో ఎవరిని చెబితే వాళ్లనే పెళ్లి చేసుకుంటది కాబట్టి ఆటు నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు.

ఒకవేళ వచ్చినా సరే వాటిని ఎలాగైనా క్లియర్ చేసి నీ కూతుర్ని మన ఇంటి మహారాణి ని చేస్తాను సరేనా అని చేతుల్లో చేయి వేసి చెబుతాడు.

దానికి దేవేంద్ర జితేంద్ర ఇద్దరు ఒక్కసారిగా రుద్రాని హత్తుకుని చాలు రా ఈ ఒక్క మాటతోనే మా మనసులో ఉన్న భారం అంతా తీసేసావు.

సరే ఇంక పడుకోండి రేపు తొందరగా లెగాలి కదా అని చెప్పి ఎవరు రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోతారు. దేవేంద్ర కూడా చాలా తేలికబడిన మనసుతో పడుకుంటారు చాలా రోజుల తర్వాత చాలా ప్రశాంతంగా నిద్ర పడుతుంది.

సూర్యోదయానికి ముందే ఇంట్లో ఆడవాళ్లు అందరూ లేచి శుభ్రంగా తల స్నానాలు చేసి ఇల్లంతా ధూపం వేస్తారు.

చారు, కౌసల్య పూజ చేస్తారు. కానీ దీపం మాత్రం వెలిగించరు.  అది చూసిన సులోచన అదేంటి పూజాంతా చేశారు కానీ దీపం పెట్టలేదు అని అడిగితే....

దానికి చారులత సాయంత్రం హోమం ఉంది కదా.. గురువుగారు వచ్చిన తర్వాత అప్పుడు వెలిగించాలన్నారు అనే మాట దాటేస్తుంది.

అవునా అనే సైలెంట్ అవుతుంది. ఇంతకీ శాంభవి లేచిందా అని అడిగితే.... లేచింది రెడీ అవుతుంది అని చెబితారు.

సులోచన గారితో మిమ్మల్ని ఇలా అడుగుతున్నందుకు తప్పుగా అనుకోవద్దు. ఈరోజు మొత్తం శాంభవిని మా ఇంటి అమ్మాయిగా రెడీ చేస్తాము అని చెబుతుంది.

సులోచన గారు అర్థం కాక  అయోమయంగా చూస్తూ ఉంటే అంటే మా ఉద్దేశం శాంభవి పెట్టుకునే బొట్టు దగ్గరనుంచి నగలు,డ్రెస్సు అన్నీ మేమే సిద్ధం చేస్తాము.

ఆల్రెడీ తెప్పించి ఉంచాము కానీ మీ అనుమతి కూడా ముఖ్యం కదా  అనే సులోచన వైపు చూస్తారు దానికి సులోచన మీరు ఎందుకు అంత మొహమాటపడుతున్నారు..
అలాగే కానివ్వండి అని చెబుతుంది.

థాంక్యూ పెద్దమ్మ గారు అని చెప్పి గబగబా దేవేంద్ర దగ్గరకు వెళ్లి అన్నయ్య శాంభవిని  రెడీ చేస్తాము.
నగలు బట్టలు ఇవ్వు అని చెబుతోంది. దానికి ఆయన ఆనందంతో వాళ్ళు ఒప్పుకున్నారా అని అడిగితే... అవును అని చెబుతుంది.

వెంటనే శాంభవి కి కొన్న నగలు బట్టలు అన్నీ తెచ్చి ఇస్తారు.  అన్నీ ఇప్పుడే పెట్టను అన్నయ్య కొన్ని సాయంత్రం హోమం దగ్గరికి పెడతానని చెప్పి తీసుకువెళ్లి శాంభవి తలుపు కొడతారు.

ధరణి తలుపు తీసి అక్కడ ఉన్న చారులతను చూసి లోపలికి రండి అని పక్కకు తప్పుకుంటుంది. ఇవన్నీ శాంభవికి అలంకరిద్దామని తీసుకు వచ్చాను.

పెద్దమ్మ గారితో మాట్లాడితే పెట్టమన్నారు అని చెబుతుంది.  అయ్యో దీనికి ఎందుకు మీరు అంత మొహమాటపడుతున్నారు అని చెప్పి శాంభవికి వేసుకోవడానికి తీసిన బట్టలను పక్కన పెట్టేసి అవి అక్కడ పెడతారు.

ఈరోజు శాంభవిని నేను రెడీ చేయనా అని అడుగుతారు. తప్పకుండా అని మీకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అనుకుంటా అని అంటుంది.

అవును మా ఇంట్లో కూడా ఒక ఆడపిల్ల ఉండాల్సింది కానీ మా చిన్న వదిన తోనే తను దూరమైంది అని చెబుతోంది. బాధపడకండి అని చెప్పి మీరే రెడీ చేయండి అని చెబుతుంది.

స్నానం చేసి వచ్చిన శాంభవికి లంగా వోణి ఇచ్చే రెడీ అవ్వమంటారు తల్లి వంక చూస్తే రెడీ అవ్వన్నట్టుగా కళ్ళు ఆరిపోతారు.

సరే అని అవి తీసుకుని తీసుకుని వేసుకొని వస్తుంది. అందం ముందు  కూర్చోబెట్టి   తడిగా ఉన్న జుట్టుకు సాంబ్రాణి ధూపం వేస్తారు.

పొడుగ్గా ఉన్న జుట్టుని అందంగా అల్లి తల నిండా పువ్వులు పెడతారు. పాపిడి బిళ్ళ దగ్గర నుండి రాలి పట్టీలు దాకా అన్నీ అలంకరిస్తారు.

మొత్తం అలంకరించిన తర్వాత తృప్తిగా చూసుకొని ఎవరి దిష్టి తగలకుండా కళ్లకున్న కాటుక తీసి చెవి వెనకాల దిష్టి చుక్క కింద పెడతారు.
ఇదంతా చూస్తున్న జయంతి మీ ఇంటికి వచ్చే కోడలు ఎవరో గాని చాలా అదృష్టవంతురాలు అంటే...అవును నా కోడలే నా కూతురు.

కాలి కింద పెట్టకుండా చూసుకుంటాను అని శాంభవి నుదుటిన ముద్దు పెట్టుకుని పదా వెళదామా అని చెప్పి గదిలో నుంచి బయటికి తీసుకు వస్తారు.

గది తలుపులు తీసుకుని బయటికి  వస్తారు.అడుగు బయటకు పెడుతున్నా  శాంభవి అందెల శబ్దం అందరి చెవులకు వినిసంపుగా వినిపిస్తుంది.

దేవేంద్ర కూతురు కోసం ఎంత ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటాడు. గది బయటికి వచ్చి మెల్లిగా మెట్లు దిగుతూ ఉంటుంది.

తన పక్కన చారులత ఉంటుంది. ఆ దృశ్యం చూడగానే ఇంట్లో వాళ్ళందరికి కడుపు నిండిపోతుంది. రుద్ర మనసు మాత్రం అక్కడే స్కిడ్ అయిపోతుంది.

అమ్మ రాక్షసి ఎంత ముద్దుగా ఉన్నావే. అమ్మ నువ్వు ఒకే ఫ్రేమ్ లో ఉంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు.

ఏదో ఒకటి చేసి నీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేలోపు పెళ్లి పీటలు ఎక్కించేల్సిందే అనుకుంటు  మరదలు వైపే కన్నార్పకుండా చూస్తూ ఉంటాడు.

ఇంట్లో వాళ్ళందరూ కూడా కళ్ళు ఆర్పితే ఆ దృశ్యం ఎక్కడ మిస్ అయిపోతుందో అని కనురెప్ప కూడా వేయకుండా చూస్తూ ఉంటారు.

అనసూయ మాత్రం శాంభవిని అలా చూడగానే ఆశ్చర్య పోతుంది. ఏవేవో గతం తాలూక దృశ్యాలు కళ్ళ ముందు కనపడుతూ ఉంటాయి.

ఒక్కసారి తల విధించుకుని తన కుటుంబ సభ్యుల వైపు చూస్తుంటే శాంభవిని ఎంతో అపురూపంగా చూస్తూ ఉంటే అను మనమే లేదు ఖచ్చితంగా తిను దేవేంద్ర కూతురే కానీ ఇది ఎలా సంభవం అయింది అని ఆలోచిస్తుంది.

ఏదైతే అది అయ్యింది ఇన్ని రోజులు కైనా నా కుటుంబంలో సంతోషం కనబడుతుంది. నా మనవరాలు వంక నైనా నా కుటుంబం నన్ను క్షమిస్తే చాలు.

గబగబా శాంభవి దగ్గరికి వెళుతుంది.  అది చూసిన రాఘవేంద్ర గారు కోపంతో అమ్మ చారులత అని పిలుస్తారు. ఆ మాటకి అనసూయ అక్కడే ఆగిపోతుంది.

చెప్పండి నాన్నగారు అంటే.. అమ్మాయికి ముందు దిష్టి తీయి.  ఎవరి పాపిష్టికళ్ళు కూడా చిట్టితల్లి మీద పడకూడదు అని చెబుతారు.

అలాగే నాన్నగారు అని తీసుకెళ్లి ఎండుమిరపకాయలు, ఉప్పు, నిమ్మకాయలు తెలిసి వన్నీ తీస్తూఉంటారు.

రుద్ర  కళ్ళు మాత్రం శాంభవి వెనకాలే పరుగు పెడుతూఉంటాయి. ధీరజ్, విహాన్,అద్వైత్ కామ్ గా రుద్ర పక్కకు వచ్చి మా చెల్లి ఎలా ఉంది అని అడిగితే....

ఒక రకమైన ట్రాన్సలో ఉన్న రుద్ర చంపేసింది రా బాబు అంటాడు.ఆ మాటకి ముగ్గురు నవ్వుతారు. వెంటనే రుద్ర  తేరుకొని ఏమన్నాడో అర్థమయ్యి మీరేంటి నా చుట్టూ అని అడుగుతాడు.

అంటే ఇప్పుడు నుంచి బావగారికి మర్యాదలు చేసుకుందామని అని అమాయకంగా ధీరజ్ అంటాడు. అవునా మీరు ఎలా మర్యాదలు చేయాలో తర్వాత చెప్తాను గాని బామ్మర్ది...ముందు పద అని శాంభవి అన్నయ్యల దగ్గరికి తీసుకువెళ్తాడు.

వీడు దొరికినా మాత్రం భలే తప్పించుకుంటాడు ధీరజ్ అంటూ వెనకాలే ఫాలో అవుతాడు.

హోమం ఏర్పాట్లు...
[+] 6 users Like SivaSai's post
Like Reply
#73
Part - 35

రుద్ర మనసు,,దేవేంద్ర కళ్ళు శాంభవి చుట్టూనే ఉంటాయి. ఆరోజు ఉదయం నుంచి సాయంత్రం ఉపవాసంలో ఉంటుంది అందుకనే శాంభవిఫ్యామిలీ అందరూ కూడా ఉపవాసంలోనే ఉంటారు.

అది తెలియని చారులత,  కౌసల్య టిఫిన్ రెడీ చేసి టేబుల్ మీద పెట్టి అందరిని బ్రేక్ ఫాస్ట్ కి పిలుస్తారు. దానికి ధరణి ఈరోజు మేము ఎవరిము తినమండి అని చెబుతారు.

దేనికి అంటే... సాయంత్రం హోమం ఉంది కదా హోమం దాకా అమ్మాయి ఏమీ తినదు. అందుకనే మేము ఎవరిము కూడా ఏమీ తినము అని చెబుతుంది.

ఓ అవునా మాకు ఆ విషయం తెలీదు కదా సరే అయితే అని చెప్పి పెదనాన్న గారిని పెద్దమ్మ గారి నాయనా పిలవండి అంటే...వాళ్ళు కూడా తినరు అని చెబుతుంది.

  అందరూ ఉపవాసమే ఉంటారా అంటే... అవును సాయంత్రం హోమం అయ్యాకే భోజనం చేస్తాము అని చెబుతుంది.

సరేలెండి అని దేవేంద్ర వాళ్లని టిఫిన్ కి పిలుస్తారు.  శివ గారు వాళ్ళు ఎవరూ రావడం లేదు ఏంటి అంటే ఈరోజు శాంభవి ఉపవాసంలో ఉంటుంది కదా అందుకే వాళ్ళు ఎవరు కూడా తినరు అన్నయ్య అంటే....

నా కూతురు ఉపవాసంలో ఉంటే నేను మాత్రం ఎలా తినగలను అని చెప్పి ఆయన కూడా వద్దు అని చెబుతారు.

ఇంకా అందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు అందరూ మానేస్తారు. అందరూ హోమం అయిన తర్వాత భోజనం చేద్దామని ఫిక్స్ అయిపోతారు.

రాఘవేంద్ర గారు కూడా నా మనవరాలు కోసం నేను ఉపవాసం ఉండలేనా అని ఆయన ఆగిపోతారు. సాయంత్రం హోమానికి సరిపడా అన్ని పనులు జరుగుతూఉంటాయి.

శ్రీశైలం నుంచి గురువుగారు కూడా వస్తారు.  అయినా లోపలకి రావడంతోనే రాఘవేంద్ర గారు ఎదురు వెళ్లి నమస్కారం చేసి తీసుకొచ్చి కూర్చోబెడతారు.

గురువుకి చేయవలసిన అన్ని మర్యాదలు చేసి అందర్నీ పరిచయం చేసే శాంభవి ఫ్యామిలీని కూడా పరిచయం చేస్తారు.

అందరినీ చిరునవ్వుతో ఆశీర్వదించి శాంభవిని దగ్గరికి పిలుస్తారు.  శాంభవి భయం భయంగానే ఆయన ముందుకు వెళ్లి నిలబడుతుంది.

ఎందుకు తల్లి అంత భయపడుతున్నావు. నీకు ఆ తల్లి ఆశీర్వాదం నిండుగా ఉంది అని చెప్పి ఒక రుద్రాక్ష తీసి ఇది అమ్మాయి మెడలో వేయండి.

ఎటువంటి చెడు శక్తి అమ్మాయి వైపు చూడలేదు అని చెప్పి ఇస్తారు. రుద్రను కూడా పిలిచి  ఇద్దరికీ ఒకేసారి ఆశీర్వాదం ఇస్తారు.

శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు... ఇష్ట  కామ్యార్థ సిద్ధిరస్తు అని ఆశీర్వదిస్తారు.   బృందావనానికి మాత్రం ఆ ఆశీర్వాదం చాలా సంతోషంగా అనిపిస్తుంది.

కానీ శాంభవి ఫ్యామిలీకి మాత్రం అయోమయంగా ఉంటుంది కానీ పైకి ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటారు.

శాంభవి కాలు కింద పెట్టనివ్వకుండా  అపురూపంగా చూస్తూ ఉంటారు.  గురువుగారు తన శిష్యులు వైపు తిరిగి ఈరోజు హోమం ఎటువంటి విఘ్నాలు రాకుండా జరగాలి.
ఆ ఏర్పాట్లు చూడండి.

రాఘవేంద్ర వైపు తిరిగి ఈరోజు నుంచి నీ కుటుంబానికి మంచి రోజులు వస్తున్నాయి.  అమ్మాయి చేత పూజ గదిలో కూడా దీపం వెలిగించు అని చెబుతారు.

ఆ మాటకే సంతోషంగా చేతులెత్తి నమస్కరిస్తారు. నువ్వు ఎప్పటికైనా రుణపడి ఉండాల్సి వస్తే అది ఆ కుటుంబానికే..

ఎప్పుడూ ఆ కుటుంబం బాధపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది రాఘవేంద్ర అని చెబుతారు.

తప్పకుండా గురువుగారు అని సాయంత్రం హోమానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తారు. అది ఒక వేడుకలాగా వాళ్ళు చేస్తూ ఉంటే... రామచంద్రయ్య గారి ఫ్యామిలీ అంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు.

జితేంద్ర రామచంద్రయ్య గారి దగ్గరకు వచ్చి మా ఇంటిలో ఆడపిల్లలు లేక ఆ ఆడపిల్ల అందం ఇన్ని రోజులకి కనిపించేటప్పటికీ మా వాళ్ళ ఆగలేకపోతున్నారు అని కవర్ చేస్తాడు.

అవునా అని చెప్పి ఇంకా అందరూ ఆ విషయం పట్టించుకోవడం మానేస్తారు. సాయంత్రం దీపాలు పెట్టే వేళ అయిన తర్వాత మళ్లీ అందరూ రెడీ అయి వస్తారు.

అప్పుడే మళ్ళీ శాంభవి మళ్లీ రెడీ అయి బిస్కెట్ కలర్ పట్టు పరికిణికి, మెరూన్ కలర్ వోని వేసుకుని...చంద్రహారం, కాసులపేరు, పచ్చల నక్లీస్ పెట్టుకుని ఉంటుంది.

రెండు చేతులకి వంకీలు పెడతారు.  చేతినిండా గాజులు వేస్తారు. నుదుటిన పాపడి చైన్, నడుముకి వడ్డాణం, సారీ చైన్, కాళ్ళకి పట్టిలు తో మొత్తం అలంకరించేస్తారు.

శాంభవి ఇబ్బందిగా చారు ని చూస్తూ ఎందుకు అంటీ మరి ఇలా పెట్టేశారు అంటే... అరే ఆడపిల్ల అలా అనకూడదు ఎంత బాగా రెడీ అవుతే ఇంటికి అంత లక్ష్మి కళ.

ఏంత ముద్దుగా ఉన్నావో అని రెండు చేతులతో మెటికలు విరిచి  దిష్టి చుక్క పెడుతుంది. బుట్ట బొమ్మ లాగా ఉన్నవు. పద వెళదాము అని చెప్పి తీసుకుని బయటికి వస్తుంది.

గురువుగారు పూజ గది అంతా ప్రక్షాళన చేసి పూజకు కావలసినవన్నీ ఏర్పాటు చేసి శాంభవితో పూజ చేపిస్తారు.
పూజ చేపించి శాంభవితో దీపం పెట్టిస్తారు.

ఆ దీపపు వెలుగులో బృందావనం అంతా వెలిగిపోతూ ఉంటుంది. పూజ అయిన తర్వాత లలితాదేవి హోమం మొదలుపెడతారు.

శాంభవి హోమం  దగ్గర కూర్చొగానే రుద్రను కూడా పిలిచి శాంభవి  పక్కన కూర్చోమని ఇద్దరు చేత హోమం చేపిస్తారు.

శాంభవి ఫ్యామిలీకి మాత్రం అంతా గందరగోళంగా అనిపిస్తుంది. విష్ణుకు మాత్రం అది నచ్చదు. శాంభవి పక్కన తన కొడుకుని ఊహించుకుంటూ ఉంటే....

రుద్ర తో హోమం చేపించడం  ఎందుకో మనసుకి కష్టంగా అనిపిస్తుంది.  ఎక్కడినుండో వచ్చి శాంభవి తో  హోమం చేపిస్తున్నారు అని సైలెంట్ గా చూస్తూ ఉంటాడు.

హోమం పూర్తయిన తరువాత అందర్నీ దీవించి రామచంద్రయ్య గారి వైపు తిరిగి మీ మనవరాలకి కళ్యాణ ఘడియలు దగ్గరికి వచ్చేసాయి.

తనని ప్రాణంగా చూసుకునే కుటుంబం ఎదురు చూస్తూ ఉంది. తన మనస్సు లో మెదిలే ఆలోచనని తనకంటే ముందే పసిగెట్టే వ్యక్తి తనకు భర్తగా వస్తాడు.

మీ దగ్గర ఎంత సంతోషంగా, స్వేచ్చగా ఉందో ఆ ఇంట్లో కూడా అలాగే ఉంటుంది.  శుభం భూయాత్ అని దీవించి రాఘవేంద్ర ఇంక మేము బయలుదేరుతాము.

వచ్చిన పని అయిపోయింది అని చెప్పి మరలా శ్రీశైలం వెళ్ళిపోతారు. ఆ మాటలకి బృందావనం అంతా సంతోషంతో వెలిగిపోతూ ఉంటుంది.

కానీ శివ గారు, భాను గారికి చాలా బెంగగా అనిపించి శాంభవిని రెండు పక్కల నుంచి పట్టుకుని శాంభవి వైపే చూస్తూ ఉంటారు.

ధరణి జయంతి కి మాత్రం గురువుగారు చెప్పిన మాటలకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. తన కూతురు మెట్టినింట కూడా అలాగే సంతోషాలతో ఉంటుంది అంటే ఏ తల్లి కైనా ఆనందమే కదా...

వాళ్ళిద్దరూ సంతోషంగా భర్తల వైపు చూస్తే చాలా బెంగగా కనిపిస్తారు. ఏంటి వీళ్ళిద్దరూ  ఇలా ఉన్నారు అని దగ్గరికి వెళ్లి ఏమైందండీ అని అడుగుతారు.

అప్పుడే శాంభవికి పెళ్లి ఏంటి...  మా చిట్టి తల్లి  కి లోకజ్ఞానం తెలియదు. అది ఇంకా చిన్న పిల్ల అని  శాంభవిని  ఇంకా గట్టిగా పట్టుకుంటారు.

ఆ మాటకే అక్క చెల్లెలు ఇద్దరు నోరు వదిలేసి చూస్తారు. వీళ్ళ వెనక ఉన్న రుద్రకి ఆ మాటలు విని గట్టిగా పొలమారుతుంది.

ధీరజ్ వెంటనే మంచినీళ్లు ఇచ్చి ఎందుకు బావ అంత గట్టిగా పోలమారింది  అని తలపై కొడుతూ ఉంటాడు. ఏమీ లేదు బామ్మర్ది  నా ఫ్యూచర్ కనపడింది అని చెప్పి వాటర్ తాగుతూ ఆ తండ్రి కూతుర్ని చూస్తూ ఉంటాడు.

ధరణి కోపంగా భర్త వంక చూస్తూ మన పెళ్లి అప్పటికి నా వయసెంత... మళ్ళి మనది లవ్ మ్యారేజ్ అని రుసరసలాడుతుంది.

నువ్వు నా కూతురు ఒక్కటేనా... అని అడిగితే అంటే మీ ఉద్దేశం ఏమిటి?  అని అడుగుతుంది.  నా ఉద్దేశం ఏమీ లేదు...పద బంగారం భోం చేద్దాం అని కూతురిని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతారు.

చూసావా అక్క వీళ్ళిద్దరి ఎలా తయారయ్యారో..అసలు దానికి రేపు పెళ్లి అయితే వచ్చే అల్లుడు మీద మనం జాలిపడాలి అక్క అనగానే...

దానికి జయంతి  అది నిజమే లే ధరణి... శోభనపు గదిలో కూతురు ఎక్కడ నలిగిపోతుందా అని గదిలో కూడా పంపించేటట్లు లేరు బాబులిద్దరూ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు.

వీళ్ళ వెనక ఉండి ఈ మాటలు విన్న రుద్ర, ధీరజ్ మాత్రం నోరు  వదిలేసి మరి చూస్తారు. ధీరజ్ తేరుకుని రుద్రను చూసి గట్టిగా నవ్వుతాడు.

బావ నీకు ఎంత కష్టం వచ్చింది. శత్రువులు నీకు ఎక్కడో లేరు బావ...  నీ మామ లు, బావల రూపంలోనే ఉన్నట్టున్నారు అని నవ్వుతాడు.

నువ్వు ఆగారా అని ధీరజ్ వెనకాల పరిగెడితే...  నేను ఆగను బావోయ్...ఆగితే నీ చేతిలో నా పని అయిపోతుందని చెప్పి వెళ్లి జితేంద్ర పక్కన సెటిల్ అవుతాడు.

రుద్ర ఇంకా ఏమీ చేయలేక వెళ్లి సైలెంట్ గా కూర్చుంటాడు అందరికీ భోజనాలు వడ్డిస్తారు శాంభవి మాత్రం శివ గారు భాను గారు మధ్యలో కూర్చుని భోంచేస్తూ ఉంటుంది.

భోజనాలు అయిన తర్వాత అందరూ రెస్ట్ తీసుకోవడానికి ఎవరు గదిలోకి వాళ్ళు వెళ్లి పడుకుంటారు శాంభవి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి మళ్ళీ చారునే హెల్ప్ చేసి దిష్టి తీసి పడుకోబెట్టి బయటికి వస్తుంది.

బయటకు వచ్చిన  చారులతని అనసూయ గారు పిలుస్తారు . ఏంటమ్మా అని అడిగితే ఒకసారి నాతో గదిలోకి రా అని లోపలికి తీసుకువెళ్లి....

తలుపులు వేసి చారులత చేతులు పట్టుకుని నాకు నిజం చెప్పు చారు.  ఆ అమ్మాయి మన దేవేంద్ర కూతురా అని ఆత్రంగా అడుగుతారు.

అవ్వన్నీ నీకు ఎందుకు అమ్మ... రెస్ట్ తీసుకో అని చేతులు వెనెక్కి తీసుకుంటుంది. మన ఇంట్లో దీపం వెలిగగించింది.
అది చేయగలిగేది ఒక్క దేవేంద్ర కూతరు మాత్రమే అని నాకు తెలుసు.

నీ నోటి వెంట వినాలి అని చిన్న ఆశ అనగానే చారు వాళ్ళ అమ్మ వంక చూస్తూ నీకు నిజం తెలిసింది కదా. శాంభావి కి ఆ మయూరి తో కలిసి ఎలాంటి హాని తలపెట్టకు.
ఈసారి  నా కొడుకు ఊరుకోడు అని గట్టిగా చెబుతారు.

ఆ మాటలకి అనసూయ సమాదానం ఏమిటి...
[+] 7 users Like SivaSai's post
Like Reply
#74
Part - 36

చారులత మాటలకి అనసూయ గారు బాధగా చూస్తూ అంటే ఏంటి చారు నేను నా మనవరాలుకి హాని తలపెడతానని చెబుతున్నావా అంటే..

మరి ఇదంతా నువ్వు చేసింది కాదా అమ్మ. మన ఇంట్లో అల్లారుముద్దుగా పెరగవలసిన ఆడపిల్ల..వేరే వాళ్ళ ఇంటి దీపమై వెలుగుతుంది.

ఒక్కగాన ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి..అసలు ఈరోజు మన ఇల్లు కళాకాంతులు లేకుండా పోవడానికి కారణం ఎవరు నువ్వు కాదా అని కోపంగా అడుగుతుంది.

దానికి అనసూయ గారి బాధగా మంచం మీద కూర్చుని నిజమే.. ఆ రోజు మయూరి, నాగేంద్ర మాయలో పడి నా కొడుకు జీవితాన్ని నేనే నాశనం చేశాను.

అందుకు శిక్ష ఇన్ని సంవత్సరాలుగా అనుభవిస్తూనే ఉన్నాను. నాలోని మార్పు మీకు ఎవరికీ కనిపించడం లేదా అని బాధపడతారు.

నువ్వు మారాను అని అంటున్నావు కానీ అమ్మ...దేవేంద్ర  అన్నయ్య జీవితాన్ని వెనక్కి తీసుకురాగలవా.. పోయిన అన్నయ్య సంతోషం మల్ల వస్తుందా చెప్పు అని అడుగుతుంది.

కొన్ని తప్పులు కి క్షమాపణ ఉండదమ్మా. నువ్వు తల్లివి కాబట్టి మేము ఇలాగైనా మాట్లాడుతున్నాము.  అదే బయట మనిషివి అయ్యుంటే గనక ఈపాటికి నీ పరిస్థితి ఏంటో అన్నది నువ్వే అర్థం చేసుకో.

నీతో ఇలా మాట్లాడే  ఒక రోజు వస్తదని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు అమ్మ.  ఒక విషయం గుర్తుపెట్టుకో నువ్వు మారితే మంచిది. లేదు అప్పటిలాగానే ముసుగు వేసుకొని శాంభవికి ఏదైనా హాని తలపెట్టావంటే మాత్రం నా చేతులతో నేనే చంపేస్తాను నిన్ను అని కోపంగా వెళ్ళిపోతుంది.

వెళ్ళిపోతున్న కూతురు వైపు బాధగా చూస్తూ ఒకప్పుడు నేను ఏది చెప్పితే అదే వినేదానివి.  కానీ ఈరోజు నా పిల్లల అసహ్యాన్ని చూడాల్సి వస్తుంది. ఇదంతా నా చేతులారా నేను చేసుకుందే కదా అని బాధపడుతుంది.

వీళ్ళందరూ పడుకున్న తర్వాత రుద్రా కుర్ర బ్యాచ్ అందరిని మీటింగ్ రూమ్ లోకి పిలుస్తాడు. ఈ టైం లో బావ ఎందుకు పిలిచాడా అని మిగిలిన ముగ్గురు కూడా వెళ్లి ఏమైంది బావ అని అడిగితే...

కూర్చోండి అని ఇప్పుడు నుండి శాంభవి కే కాదు రేపల్లెలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి కూడా టైట్ సెక్యూరిటీని పెట్టాలి అని చెబుతాడు.

దేనికి అని అయోమయంగా అడిగితే మయూరి అని చెబుతాడు. అంటే అని ధీరజ్ అడిగితే... మయూరీకి ఇక్కడ హోమం జరిగిన విషయం తెలిసిపోయింది.

తనకు అనుమానం కూడా మొదలైంది   శాంభవినే చిన్న మామ కూతురు ఏమో అని. మయూరి గురించి మనకు తెలిసిందే కదా....

తన పంతం నెగ్గించుకోవడానికి ఎంత దూరమైనా వెళుతుంది.  శాంభవిని వాళ్ల ఫ్యామిలీని అడ్డుపెట్టుకుని తన అనుకున్న పని సాధించడానికి కూడా వెనకడుగు వేయదు అని ఆలోచిస్తూ చెబుతాడు.

ఇప్పుడు ఏం చేయాలి బావ అని ధీరజ్ అడుగుతాడు. శాంభవి ఈరోజు నుంచి ఈ ఇంట్లోనే ఉండేటట్టు చేయాలి.. ఇక్కడ నుండే ఆఫీస్ కి వెళ్ళాలి.

మనమే ఎవరో ఒకళ్ళమో శాంభవి తో ఉండాలి కానీ ఒక్కదాన్నే ఎక్కడికి పంపకూడదు అని చెబుతాడు. దానికి ఏం చేయాలి అని నలుగురు ఆలోచిస్తారు.

వెంటనే రుద్ర కి ఒక ఆలోచన వచ్చి అది మిగిలిన ముగ్గురికి చెబుతాడు. ఇదేదో బాగానే ఉంది ఇంప్లిమెంట్ చేద్దామని అందరూ ఒకరికొకరు గుడ్ నైట్ చెప్పు కొని రూమ్ కి వెళ్లి పడుకుంటారు.

రుద్ర పడుకున్నాడు అన్నమాట గాని మూసిన కనురెప్పల వెనకాల శాంభవి రూపమే కనపడుతూ ఉంటుంది.  ఆ లంగా వోణిలో ముద్దుముద్దుగా తిరుగుతూ ఉంటే నిద్ర రాక కొట్టుకుంటూ ఉంటాడు.

అబ్బా రాక్షసి చంపుతున్నావు కదా..చిన్నప్పటినుండి ఇక్కడే ఉండి ఉంటే మన అచ్చక బుచ్చుకలు ఎన్ని అయ్యుండేదో కదా..

నిన్ను నేను ఏడిపించడం నువ్వు అది మీ అన్నలకి మామలకి కంప్లైంట్ చేయడం.. వాళ్లు నన్ను అడగడం ఎంత సరదాగా ఉండేది ఈ ఆటంతా??.

ఎవరి స్వార్థానికో మన లైఫ్ లో ఉండాల్సిన మెమొరబుల్ డేస్ అన్ని మిస్ అయిపోయాయి. అయినా ప్రాబ్లం ఏమీ లేదు.

రేపటి నుంచి అయినా సరే ఆ మెమోరీస్ అన్ని కలెక్ట్ చేద్దాం సరేనా అని తనకి తానే చెప్పుకుంటూ ఎప్పటికో నిద్దట్లోకి జారుకుంటాడు.

పడుకున్న విష్ణుకు మాత్రం నిద్ర రాకుండా ఉంటుంది. శాంభవి  పక్కన నివాస్ నే ఊహించుకుంటూ ఉంటే రుద్ర నిలబడడం నచ్చడం లేదు.

నివాస్ కి గట్టిగా చెప్పాలి. శాంభవి తో క్లోజ్ గా ఉండమని. శాంభవిని నా ఇంటి కోడలుగా తెచ్చుకుని జాగ్రత్తగా చూసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు.

శివ గారు, భాను గారు ఎప్పటిలాగానే కూతురిని మధ్యలో వేసుకుని పడుకుంటారు. రాత్రి అలసిపోయి ఉండడం వల్ల శాంభవి కొంచెం లేటుగానే నిద్ర లేస్తుంది.

మెల్లిగా కళ్ళు తెరిచి తన ఎక్కడ ఉందో చూసుకొని గబగబా లేచి కూర్చుంటుంది.  అయ్యో నేను సార్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా...

అమ్మా  అయినా లేపాలి కదా అనుకుని గబగబా ఫ్రెష్ అయ్యి నీట్ గా చుడీదార్ వేసుకుని కిందికి వస్తుంది.
లేడీస్ బ్యాచ్ అంతా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు.

శాంభవి మెల్లిగా వాళ్ళ అమ్మ వెనకాల వెళ్లి నిలబడి నన్ను లేపచ్చు కదా మెల్లిగా మాట్లాడుతుంది. ఇప్పుడు ఏమైంది అని ధరణి అడిగితే...

ఇదేమైనా మన ఇల్లు అనుకుంటున్నావా నేను ఎంత లేటుగా లేచాను చూసావా అసలు అని గొణుకుతూ ఉంటుంది.

ఆ మాటలు విన్న కౌసల్య ఇది నీ ఇల్లే తల్లి అని అంటుంది. దానికి జయంతి, ధరణి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే.. అదే ఇంట్లో హోమం నీ చేతుల మీదుగా జరిగింది కదా అంటే నువ్వు ఇంటి ఆడపిల్లలనే కదా అర్థం.

నీ ఇంట్లో నువ్వు ఇలా మొహమాట పడాల్సిన పని లేదు అని చెబుతున్నాము అంతే. నువ్వు మమ్మల్ని మేడం, సార్ అని పిలిచినా అమ్మ నాన్న అన్నయ్యలు అన్న పిలిచినట్టే అనిపిస్తుంది.

కాబట్టి మేము ఎవరిము అలాగా ఫీల్ అవ్వము సరేనా అని చంప పైన చేయి వేసి లాలనగా చెబుతారు. దానికి శాంభవి సరే అన్నట్టుగా తల ఊపుతుంది.

చారులత శాంభవి వైపు తిరిగి ఇప్పుడు దాకా నేను ఒక్కదాన్నే ఆడపడుచును అయ్యి డామినేషన్ తక్కువ అయిపోయింది.

ఇప్పుడు నువ్వు కూడా ఆడపడుచువే కాబట్టి మన డామినేషన్ పెరగాలి.  వీళ్ళందర్నీ ఒక ఆట ఆడుకోవాలి కానీ అలా సైలెంట్ గా ఉండకూడదు శాంభవి అని చెబుతోంది.

దానికి సులోచన గారు నవ్వుతూ ఏంటి ఇది సైలెంటా... అలా అనుకున్నా వాళ్లే పెద్ద అమాయకులు అని చెబుతారు.  నానమ్మ అని గారంగా పిలుస్తుంది.

  ఆ మాటలకి ధరణి జయంతి కూడా నవ్వుతూ ఉంటే ఎందుకు మీరు అలాగా నవ్వుతున్నారు అని చారులత అడుగుతుంది.

అసలు మా శాంభవి ఎంత అల్లరి చేస్తుందో తెలుసా కాలేజీలో తక్కువ ఊరు మీద ఎక్కువ ఉంటది. ఎన్ని గొడవలు ఇంటి మీదకు తీసుకొస్తాదో తెలుసా... బామ్మ గారికి తెలియకుండా మేనేజ్ చేయడానికి ఇంట్లో మగాళ్ళకి తల ప్రాణం తోకకు వస్తది.

పొరపాటున విషయం బామ్మ గారి దగ్గరికి వెళ్లిందో అనుకో  శాంభవి ముందు కోప్పడినట్టు నటిస్తారు గాని కంప్లైంట్ తీసుకొచ్చిన వాళ్ళ మీద గట్టిగా అరుస్తారు.  అందుకే శాంభవికి భయం అన్నది తెలియకుండా అయిపోయింది అని చెబుతారు.

ఎందుకమ్మా మీరందరూ నా మీద అలా కంప్లైంట్లు చెబుతారు మా నాన్నలే బెస్ట్ అని చెప్పి వెళ్లి శివ గారి దగ్గర కూర్చుంటుంది.

ఏమైంది బంగారం అని అడిగితే..చూడండి నాన్న, అమ్మలు ఇద్దరూ కలిసి నా మీద ఎన్ని కంప్లైంట్లు చెబుతున్నారు అని అలకగా చెబుతుంది.

ఆ మాటలు వింటున్న దేవేంద్ర గారు నవ్వుతూ అయితే ఇప్పుడు మా శాంభవి అలిగింది అన్నమాట.  ఎన్ని కంప్లైంట్ లు ఇచ్చారు నీ మీద అడుగుతారు.

శాంభవి కూడా దేవేంద్ర గారితో ఫ్రీగా మాట్లాడుతూ ఇప్పుడు దాకా ఇస్తూనే ఉన్నారు ఇంకా నేను అక్కడ ఉంటే ఇంకా అది కంటిన్యూ చేస్తానే ఉంటారని నవ్వుతుంది.

నీ నవ్వు చూస్తే చాలా తల్లి ఎంత టెన్షన్ ఉన్నా సరే అలా గాలిలోకి వెళ్ళిపోతుంది.  పున్నమి జాబిల్లి లాగా స్వచ్ఛంగా ఉంటుంది బంగారం అని నుదుటన ముద్దు పెట్టుకోవాలి అని అనిపించిన కష్టంగా ఆపుకునే చెంప పైన చేయి వేస్తారు.

అనసూయ గారు కొంచెం దూరంగా కూర్చుని ఇవన్నీ చూస్తూనే ఉంటారు.  చొరవగా కిచెన్ లోకి వెళ్లి వాళ్ళతోనో మాట్లాడలేకపోతున్నారు.

ఇక్కడ కొడుకుల దగ్గర కూర్చుని వీళ్లతోనూ మాట్లాడలేకపోతున్నారు. నా జీవితం ఇంకా ఇంతే అనుకుని వీళ్ళతో కాసేపు ఇలాగే ఉంటే...వాళ్లందరికీ అనుమానం వస్తుందని గదిలోకి వెళ్ళిపోతారు.

సులోచనగారు కౌసల్యతో మీ అత్తగారు ఎక్కడా కనిపించడం లేదు.  కాసేపు అయినా కూర్చుని మాట్లాడదాము అనుకుంటే ఎప్పుడూ గదిలోనే ఉంటున్నారు.

ఏదైనా హెల్త్ బాగోలేదా అని అడుగుతారు. దానికి కౌసల్య కొంచెం అలాంటిదే నండి చెబుతుంది. మీకు అభ్యంతరం లేకపోతే నేను గదిలోకి వెళ్లి మాట్లాడవచ్చా అని అడుగుతారు.

దానికి చారులత మీరు ఎందుకండి అంత ఇబ్బంది పడుతున్నారు.  పదండి నేను తీసుకువెళతాను అని వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకువెళ్లి... నీతో పెద్దమ్మ గారు మాట్లాడతారు అంట అని చెప్పి నాకు కొంచెం పని ఉంది అని వాళ్ళ అమ్మకి జాగ్రత్త అని సైగ చేసి వెళ్ళిపోతుంది.

సులోచన అనసూయ తో మీ ఆరోగ్యం ఎలా ఉందండి కొంచెం బాగోలేదు అంట కదా అని అడుగుతుంది. దానికి అనసూయ నవ్వుతూ ఇప్పుడు కొంచెం పరవాలేదు అని మాటల్లో పెట్టి చిన్నప్పటినుండి శాంభవి విషయాలు అన్ని అడుగుతూ ఉంటారు.

ఇంకా మనవరాలు విషయం వచ్చేటప్పటికి ఆవిడ ప్రతిదీ చెబుతూ నవ్వుతూ ఉంటే...ఆ ఆనందం అంతా నాది కదా..

నేను ఒకరికి చెబుతూ ఉండాల్సింది నేను వినాల్సి వస్తుంది అని ఒక నిమిషం బాధగా అనిపించిన కృష్ణుడు లీలలు విన్నట్టుగా శాంభవి చిన్నప్పుడు విషయాలన్నీ వింటూ ఉంటారు.

బృందావనం సంతోషాలు ఎటువైపు...

కథ కొనసాగుతుంది...
[+] 8 users Like SivaSai's post
Like Reply
#75
Excellent update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
#76
Ikkada 3 updates istunna.. takkuve anipistundi.
Ento.. ee krishna leela!!
[+] 2 users Like ash.enigma's post
Like Reply
#77
Part - 37

అందరి సంతోషాలు మధ్యన ఆ రోజంతా తొందరగా గడిచిపోతుంది ఇంకా శివ గారు వాళ్ళు బయలుదేరుతాము అనగానే... రుద్ర రాఘవేంద్ర కి సైగ చేస్తాడు.

రాఘవేంద్ర, రామచంద్రయ్య గారితో మీతో ఒక్క విషయం మాట్లాడాలి అని ఆపుతాడు. చెప్పండి అనగానే...
మీకు అభ్యంతరం లేకపోతే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేదాకా శాంభవిని ఇక్కడ ఉంచుతారా అని అడుగుతారు .

ఎందుకు అని అడగగానే ఆడపిల్లలు లేని ఇల్లు కళగానే ఉండదు. శాంభవి వచ్చిన తర్వాత మా ఇల్లు కొంచెం కళకళలాడుతూ ఉంది.

మీకు అభ్యంతరం లేకపోతేనే...  విష్ణు కి కూడా ఉంటుంది కదా..మేనకోడల్ని ఇంట్లో ఉంచుకోవాలి అని.. మా పిల్లలు ఎవరో ఒకరు పెళ్లిళ్లు అయితే వచ్చే అమ్మాయి  లో అన్ని చూసుకోవచ్చు అనుకుంటే...

వీళ్ళేమో అప్పుడే పెళ్లిళ్లు చేసుకోము అని పోస్ట్పోన్ చేస్తున్నారు. ఏమంటారు రామచంద్రయ్య గారు అని అడుగుతారు.

దానికి రామచంద్రయ్య గారు మొహమాటం పడుతూ.. ఇప్పటికే మీకు చాలా పని పెట్టేసాను. అమ్మాయిని ఇక్కడ అంటే... మీరు ఇబ్బంది పడిపోతారు.

దానికి రాఘవేంద్ర గారు నవ్వుతూ మేమేమైనా అమ్మాయిని ఎత్తుకొని ఆడించాలా లేకపోతే కూర్చోబెట్టి చదివించాలా... తనతో మాట్లాడుతూ ఏదో తెలియని ప్రశాంతత వస్తుంది.

కొన్ని రోజులైనా సంతోషంగా ఉన్నట్టు ఉంటుందని ఇంత ఇదిగా అడుగుతున్నాము అని ఇబ్బంది పెడతారు.  ఇక ఆయన మాట కాదనలేక సరే.

కాకపోతే అమ్మాయితో పాటు అమ్మాయి ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళ బాధ్యత కూడా మాదే అని చెబుతారు.

దానికి ఎందుకండి అంత మొహమాట పడతారు. వాళ్ళిద్దరూ కూడా ఇక్కడే ఉంటారు. ఆఫీస్ నుంచి వస్తూ ఇటు వచ్చేయమంటే  సరిపోతుంది కదా అని కోడలిని పిలిచి వాళ్ళిద్దరికీ కావాల్సినవి కూడా చూడమని చెబుతారు.

అలాగే మావయ్య గారు అని సంతోషంతో వెళ్లి శాంభవి ని హద్దుకుంటుంది.   ఏమైంది ఆంటీ అనగానే ఈరోజు నుంచి నువ్వు ఇక్కడే ఉంటున్నావ్ తెలుసా....

ఆ మాట వినగానే చాలా సంతోషంగా అనిపించింది నీకు ఏమేమి ఇష్టమో లిస్ట్ ఇచ్చేసేయ్. నేనే వండుతాను అని చాలా సంతోషంగా చెబుతారు.

అన్ని నువ్వే చేసేస్తే నేనేం చేయాలి వదిన. సరే అయితే నేనైతే షాపింగ్ చేస్తాను.  తనకు ఫుల్లుగా అన్ని మ్యాచింగ్ సెట్స్ రెడీ చేస్తాను అని చెబుతుంది.

హైదరాబాదులో మనకు తెలియని షాప్ ఏ లేదు. జీన్స్ దగ్గర్నుంచి సారీస్, స్కట్స్ అన్ని కొనేద్దామని చెబుతోంది.

అయ్యో ఆంటీ నేను జీన్స్ వేయను.  ఓన్లీ చుడీదార్స్ లేకపోతే ఆఫ్ సారీస్ అని చెబుతోంది. వాటిలోనే డిజైన్స్ తెచ్చేసుకుందాము.

మనము ఇంటి ఆడపడుచులము. అస్సలు ఎక్కడ తగ్గకూడదు. తగ్గేదేలే అని చెబుతారు. వీళ్ళందరూ ఇలా నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటే చూస్తున్న మగవాళ్ళకి చాలా సంతోషంగా అనిపిస్తుంది.

ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేలోపు అందరూ శాంభవికి దగ్గర అవ్వాలి అని ఫిక్స్ అయిపోతారు. విష్ణు కి ఇష్టం లేకపోయినా..  పెద్దాయన మాటిచ్చారు అని చెప్పి ఏమీ మాట్లాడరు.  ఇంటికెళ్లక నివాస్ కి గట్టిగా చెప్పాలి. బావగారు తో కూడా మాట్లాడాలి అనుకుంటారు.

అందరూ మధ్యాహ్నం భోంచేసిన తర్వాత శాంభవి ని అక్కడే ఉంచేసి వీళ్లు విష్ణు గారి ఇంటికి వెళ్లిపోతారు. రుద్ర హమ్మయ్య ఇప్పుడు టైం దొరికింది నా పిల్ల కి లైన్ వేసుకోవాలి.  లైన్లో పెట్టాలి.
చాలా పనులు ఉన్నాయి నువ్వు వందల కోట్లు ప్రాజెక్ట్ ప్రాఫిట్ వచ్చినా సరే ఈ  టెన్షన్,సంతోషం ముందు అన్ని చిన్నవిగానే కనపడుతున్నాయి.

ఆ నిషా,ఆశ వద్దు అన్న సరే మీద పడిపోతారు. దీనికి ఏమో ఎలాగా చెప్పినా అర్థం కాదు. ఎందుకు శివయ్య నన్ను ఎంత ఇరగటం లో పడేసావు అని పైకి చూస్తూ ఉంటాడు.

బావమరుదులు ముగ్గురు పక్కనే వచ్చి కూర్చుని ఏంటి బావ మా చెల్లిని ఎలా లైన్లో పెట్టాలో తెలియక భగవంతుడికి రికమండేషన్ లెటర్ పెడుతున్నావా అని వెటకారాలు ఆడతారు.

నా రికమండేషన్ సంగతి పక్కన పెట్టండి ముందు మీ రికమండేషన్ సంగతి చూసుకోండి. ముగ్గురికి ముగ్గురు ఉన్నారు.

అన్నయ్య అని పిలిపించుకోలేకపోతున్నారు.మళ్ళీ నాకు సెటైర్లు వేస్తున్నారు అని తిరిగి కౌంటర్ వేస్తాడు. దానికి ధీరజ్,, అన్నయ్య అని ఏముందిలే బావ.

ఈరోజు కాకపోతే రేపైనా మా చెల్లి పిలుస్తుంది. కాకపోతే మేమెరబుల్స్ మీకు కావాలి కదా... ఎలాగైనా పెళ్లి చేసేసుకుంటావు కానీ....

పెళ్ళికి ముందు మీకు ఏవో చిలిపి కోరికలు ఉంటాయి కదా..  వాటి సంగతి చెబుతున్నము అంతే కదా విహాన్ అని వాళ్ళిద్దరు వైపు చూసి కన్ను కొడతాడు.

అంతే అంతే అని ఇద్దరు నవ్వుతారు.  నా తిప్పలు నేను పడతాను గాని ముందు వెళ్లి మీ చెల్లిని ఆ లేడీస్ ఇద్దరు దగ్గర నుంచి బయటికి లాక్కు రండి.

లేకపోతే ఒకళ్ళు వంటలు, ఇంకొకళ్ళు  షాపింగ్ అని  దాని బుర్రని హీట్ ఎక్కించేస్తారు. అసలే ఆ బుర్రలో గుజ్జు తక్కువ.

ఆ వేడికి ఆవిరి అయిపోయిందే అనుకో ఇక మనం ఏం చెప్పినా అర్థం అవ్వదు అని అంటాడు.  ఖాళీగా ఉంటే అప్పుడు మనం ఫిల్ చేసుకోవచ్చు ఏమో బావ అని అద్వైత్ అమాయకంగా అడుగుతాడు.

ఏమి ఫీల్ చేస్తావురా అని డౌట్ గా మిగిలిన ముగ్గురు అడుగుతారు.  అదే మనకు ఎలా కావాలంటే అలాగా ఫీల్ చేసుకోవచ్చు కదా అని చెబుతున్నాను.

ఒరేయ్ నువ్వు దానికి అన్నయ్య అనిపించుకున్నారు  రా.. అని రెండు చేతులతో రుద్ర దండం పెడతాడు. పో బావ నువ్వు అలా పొగుడుతుంటే నాకు సిగ్గేస్తుంది అని మెలికలు తిరుగుతాడు.

ఎక్కువ సిగ్గుపడకరోయ్ ఆ మెలికలు మేము చూడలేక చచ్చిపోతున్నాము అని. తీసుకెళ్లి తాత గారి దగ్గర కూర్చోబెట్టు.

శాంభవితో ఎప్పుడెప్పుడు  మాట్లాడాలా అని ఎదురు చూస్తున్నారు అని చెప్పి పంపిస్తాడు. అద్వైత్ కౌసల్య దగ్గరికి వెళ్లి ఏంటి మీ ముగ్గురు లేడీస్ మీటింగ్..

నాకు చెప్పొచ్చు కదా అని వాళ్ళ పక్కన కూర్చుంటాడు. ఆడవాళ్ళు విషయాలు నీకెందుకురా పోరా ఇక్కడి నుంచి అని ఇద్దరు ఒక్కసారి అంటారు.

ఎందుకలా మీద పడిపోతున్నారు. నేను ఏదో క్యాజువల్ గా అడిగితే.. అలా నా మీద సీరియస్ అయిపోతున్నారు. చూడు శాంభవి అస్సలు వీళ్ళిద్దరి మాట వినకు.

నీకు ఏం కావాల్సిన నాకు ఆర్డర్ వేయి. నీకు చిటికలో నేను తెచ్చి పెడతాను అని చెబుతాడు. దానికి శాంభవి నవ్వుతూ చూస్తుంది.

అబ్బో వీడికి అన్నీ తెలిసినట్టు. మీవే మీకు షాపింగ్ చేసుకోవడం రాదు.  ఇంకా శాంభవికి తెస్తారా.. వెళ్లి చంప పిన్నిసులు  తెచ్చి పెట్టండిరా...మంచి డిజైన్స్ వి కావాలి అని చెబుతుంది.

వాట్ వాట్ ఏంటది అని నోరు తిరక్క మళ్ళీ అడుగుతాడు. అర్థమైందా ఆడవాళ్ళకి కావాల్సినవన్నీ మీకు తెలియదు.  చెబితే తెలుస్తుంది అంట పోరా అని చారులత గారు వెటకారంగా అంటారు.

అత్త ఇది టూ మచ్. మా చెల్లి ముందు నువ్వు నన్ను చాలా అవమానిస్తున్నావు. ఇలాగే చేసేవనుకో నీ కూతుళ్లు వచ్చినప్పుడు కూడా నీ కొడుకుని ఇలాగే అవమానిస్తాం ఖబర్దార్  అనగానే..

చారు ఒక ఐబ్రో పైకి లేపి చూస్తుంది.  ఏంటి అత్తయ్య అలా చూస్తున్నావ్ అంటే..  నువ్వు ఏదేదో ప్రగల్భాలు పలుకుతున్నావు కదా అందుకే చూస్తున్నాను.

మీరు ముగ్గురు కలిసి నా కొడుకు ఒక్కడికే సమాధానం చెప్పలేకపోతున్నారు గాని... రేపు వచ్చే నా కూతుర్లు ముందు అంటారట.

అది మేము నమ్మాలి.  జోక్ వేసిన ఇప్పుడు నవ్వే మూడు లేదు కానీ..  తర్వాత వెయ్యి అని చెప్పి మళ్ళీ మాటల్లో పడిపోతారు.

సరే మీరు మాట్లాడుకోండి కానీ.. శాంభవి నిన్ను తాతయ్య గారి పిలుస్తున్నారు రా అని చెప్పి తీసుకెళ్లిపోతాడు.
ఒరేయ్ నేను తీసుకెళ్తానులే నాన్నగారి దగ్గరికి అని చెప్పి చారులత కూడా బయలుదేరుతుంది.

కౌసల్య సాయంత్రానికని టీ స్నాక్స్ ప్రిపేర్ చేయించడానికి కిచెన్ లోకి వెళ్తారు. శాంభవిని రాఘవేంద్ర గారి గది దగ్గరికి తీసుకెళ్లి తాతగారు అని పిలుస్తాడు.

రా అద్వైత్ అనగానే శాంభవి వచ్చింది అంటే.. అంత సేపు బయట నుంచో పెట్టావ్ ఏంటి అమ్మాయిని లోపలకి తీసుకురా అని చెబుతారు.

శాంభవి వెళ్లి రాఘవేంద్ర గారి పక్కన కూర్చుంటుంది. శాంభవి చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకుని బంగారు తల్లివి అమ్మ నువ్వు అని మురిసిపోతూ ఉంటారు.

శాంభవి నవ్వుతు చూస్తూ ఉంటే మీకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అనుకుంటూ కదా తాతయ్య అని సారీ తాతగారు అంటుంది.

నువ్వు తాతయ్య అని పిలువు పర్వాలేదు. ఆ పిలుపే బాగుంది అని చెబుతారు. అందరు మిమ్మల్ని మర్యాదగా పిలుస్తూ ఉంటే నేను తాతయ్య అని ఎలా పిలవగలను అని అంటుంది.

వాళ్ళు పిలవాలి తప్పదు. మగ పిల్లలు కదా... క్రమశిక్షణ లేదు అనుకో ఇంకా కోతుల్లాగా తయారవుతారు. ఈ ఇంటిమహాలక్ష్మి వి నువ్వు.

ఎవరిని ఎలా పిలిచినా సరే అందరికీ సమ్మతమే తల్లి అని బుగ్గల పట్టుకుని లాగుతారు. రాఘవేంద్ర గారి చిన్న పిల్లోడి లాగా మారిపోయి శాంభవి ముందు చాలా సరదాగా ఉంటారు.

మెల్లిగా అక్కడికి దేవేంద్ర,  జితేంద్ర, సంతోష్, రమణ కూడా చేరుతారు.  అందరూ వాళ్ళ వయసును మర్చిపోయి శాంభవి తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

వీళ్ళని ఇలా చూసిన కుర్ర బ్యాచ్ మాత్రం చూసావా బావ ఎప్పుడైనా మనతో ఇలా ఉన్నారా... రూల్స్ మాట్లాడేవారు మనవరాలు వచ్చేటప్పటికి అన్ని రూల్స్ ని వీళ్ళే బ్రేక్ చేసేస్తున్నారు.

దీన్ని మనం ఎలాగైనా ఖండించాలి అని ధీరజ్ మంగమ్మ శబదం చేస్తాడు. ధీరజ్ డిప్ప మీద ఒకటి పీకి ముందు పద.

మనం కూడా వెళ్లి జాయిన్ అవుదామని రుద్ర ముందుకు నడుస్తాడు.  మరదలు దగ్గరికి వెళ్ళడానికి ఎంత ఆత్రం. ఒక్కడే వెళితే అందరూ ఏడిపిస్తారని.. తోకలలాగా మనల్ని తగిలించుకొని వెళ్తున్నాడు.

లేకపోతే ఎప్పుడో మన ముగ్గురిని బయటికి గెంటేసేవాడు అని గుసగుసగా వాళ్ళిద్దరూ చెవుల్లో చెబుతూ ఉంటాడు.  ఏంట్రా మీ ముగ్గురు గుసగుసలు వస్తున్నారా లేదా అని అడుగుతాడు.

వస్తున్నాము. రాక చస్తామా అయినా నీ గురించి కాదులే మా చెల్లి తో టైం స్పెండ్ చేయాలని వస్తున్నాము అని చెప్పి  రుద్రని ఒక చూపు చూసి గదిలోకి వెళతారు .

ఇప్పుడు రుద్ర రియాక్షన్ ఏమిటి...
[+] 6 users Like SivaSai's post
Like Reply
#78
Part - 38

వాళ్లు వేషాలకి రుద్ర నవ్వుకుంటూ వెనకాలే వెళ్లి అక్కడ కుర్చీలో కూర్చుని అందరినీ చూస్తూ ఉంటాడు.  శాంభవి కళ్ళు అటు ఇటు తిప్పుతూ చేతులు తిప్పుకుంటూ విషయాలు చెబుతూ ఉంటే వీళ్ళందరూ ఆశ్చర్యంగా వింటూ ఉంటారు.

అవన్నీ తెలిసిన విషయాలే అయినా సరే శాంభవి చెబుతూ ఉంటే చిన్నప్పటినుండి శాంభవి మాటలు మిస్ అయినందుకు అందరూ చాలా ఓపికగా ఇంట్రెస్ట్ గా వింటూ ఉంటారు.

చారులత, మాధురి, కౌసల్య కూడా స్నాక్స్ టీ పట్టుకుని వచ్చి వాళ్లతో జాయిన్ అవుతారు. అందరితో మాట్లాడుతూ ఆంటీ అని పిలుస్తుంది.

చెప్పు శాంభవి అనగానే... అందరం ఉన్నాము కానీ...
మామ్మగారు ఎక్కడా కనపడడం లేదు ఏంటి అని అడుగుతుంది.

అందరూ ఒక్క నిమిషం సైలెంట్ అయిపోతారు. ఎవరికి ఏం చెప్పాలో తెలియక అది అది అని అంటూ ఉంటే.. వెంటనే రాఘవేంద్ర గారు ఆవిడకి ఆరోగ్యం అంత బాగోదులే.. నలుగురితో కలిసి ఉంటే ఎలర్జీ వస్తుంది అందుకే ఒంటరిగా జీవితాన్ని గడిపేస్తుంది అని చెబుతారు..

ఓ అవునా అని మళ్ళీ వీళ్ళతో మాటల్లో పడిపోతుంది. అందరూ హమ్మయ్య అనుకుంటే.. రుద్ర మాత్రం తాతగారు ఇంకా అమ్మమ్మని క్షమించరా అని ఆలోచిస్తూ ఉంటాడు.

ముందు ఆ మయూరి బ్యాచ్ కి చెక్ పెట్టాలి ఇటువైపు తిరగకుండా.. శాంభవి గురించి ఆలోచించకుండా వాళ్ళని ఫుల్ బిజీ చేసేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు.

ధీరజ్ మాట్లాడుతూ రుద్రవైపు చూసి ఏంటి వీడు ఇందాక నుంచి తెగ ఆలోచిస్తున్నాడు అని...పక్కకు వచ్చి కూర్చుని ఏంటి బావ ఎదురుగుండా కోవా  లాంటి మరదలు పిల్ల ఉంటే...

దీర్ఘంగా  దేని గురించో ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. ఒరేయ్ అని విసుగ్గా అంటే...ఏమైంది బావ అని అడుగుతాడు.

మన ఇల్లు ఎప్పుడు ఇలా సంతోషలనిలయమై ఉండాలి అంటే ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. మయూరి,  నాగేంద్రకి ఎలా చెక్ పెట్టాలా అన్నదే ఆలోచిస్తున్నాను అని చెబుతాడు.

దీనికి ఇంత ఆలోచించాల్సింది ఏముంది  బావ వెరీ సింపుల్ అంటాడు. ఏమిటి అని నొసములు దగ్గరకి ముడి వేసి అడుగుతాడు.

సింపుల్ బావ నీకు, శాంభవి కి పెళ్లి అయిపోయిందే అనుకో.. ఆ నిషా,  ఆశాలు నీ మీద ఆశ వదిలేసుకుంటారు. మిగిలిన వాళ్ళిద్దరి మీద అంటావా.. వీళ్ళు దగ్గరికి రాలేరు.

అలాగే శాంభవి కూడా సేఫ్టీ గా ఉంటుంది ఏమంటావు అని కళ్ళు ఎగరేస్తాడు. నువ్వు చెప్పిన ఐడియా బాగానే ఉంది కానీ ఇంప్లిమెంటేషన్ ఎలాగ..

మిగిలినవి అయిపోవచ్చు కానీ పెళ్లి దగ్గరకు వచ్చేటప్పటికి.. ఆ ఫ్యామిలీని మేనేజ్ చేసి ఒప్పించి, ఎవరు ఇబ్బంది పడకుండా, బాధపడకుండా పెళ్లి జరగాలి.

అది ఎంత తలనొప్పి తెలుసా.. దీనికన్నా ఒక పది ప్రాజెక్టులు ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అని అంటాడు. అది నిజమేలే ఇప్పుడు ఏం చేద్దాం అనే అంటాడు.

అదే ఆలోచిస్తున్నా అని ఒక కన్నింగ్ స్మైల్ ఇస్తాడు. నువ్వు ఈ స్మైల్ ఇచ్చావ్ అంటే అక్కడ వాళ్లకు మూడింది అనే అర్థం కానీ అని చెప్పి విహాన్ వాళ్ళ పక్కకెళ్ళి కూర్చుంటాడు.

ఏమిటి నువ్వు బావ చెవులు కొరికేసుకుంటున్నారు అని అడిగితే..  మీ పెళ్లిళ్లు ఎలా చేయాలో అని మీ బావ తెగ ఆలోచిస్తున్నాడు అని చెబుతాడు.

దానికి పైనుండికి కిందుకు చూసి అంత వెటకారం వద్దులే గానీ ఏంటి సంగతి మయూరి గురించి ఆలోచిస్తున్నారా అని అడుగుతాడు.

ఎలా కనిపెట్టావ్ రా అంటే మనకున్న ప్రాబ్లమే ఆ మయూరి ఫ్యామిలీ. వాళ్ళు ఎలా ట్రాప్ చేయాలో అన్నదాని మీదే ఉంటారు.

బావకి,  శాంభవి కి పెళ్లి జరిగిన సరే ఆ నిషా ఆశ లు బావని మాత్రం వదలరు అని చెబుతాడు.  అది నిజమేలే కానీ అక్కడున్న మన బావగారు మాత్రం ఏదో ప్లాన్ వేశాడు.

అది ఏమిటి అన్నది ఇంప్లిమెంటేషన్ లోనే మనకు తెలుస్తుంది అని చెబుతాడు.  కొంపతీసి మనల్ని ఎవర్ని బుక్ చేయడు కదా అంటే.. ఏమో అని భుజాలు ఎగరేస్తాడు.

వీడు బుక్ చేసిన చేస్తాడు అనుకుని టీ తాగుతూ ప్రజెంట్ సిచువేషన్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు.  రుద్ర మాత్రం తను చేయాలనుకున్న పనిని అప్పటినుండి ఇంప్లిమెంటేషన్ లో పెట్టేస్తాడు.

చారులత అతయ్య అయిన తులసి గారిని కూడా బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చి ఉంచేస్తారు. శాంభవి ఉన్నన్ని రోజులు అందరూ ఇక్కడే ఉండాలి అని ఫిక్స్ అయిపోతారు

సాయంత్రానికి మిత్ర, గౌతమ్ కూడా అక్కడికి చేరుకుంటారు. శాంభవి, మిత్ర ఒక గదిలో ఉంటే గౌతమ్ సపరేటుగా వేరే గదిలో ఉంటాడు.

పొద్దున్నే లేచి అలవాటు ఉన్న శాంభవి తొందరగా లేచి.. ముగ్గు పెట్టడానికని చూస్తుంది. సిటీ రావడం వలన ఆవు పేడ దొరకక..పసుపు నీళ్ళు జల్లి సింహద్వారం దగ్గర నుంచి గేటు వరకు ముగ్గులు పెట్టేస్తుంది.

శాంభవి ముగ్గు పెడుతున్నప్పుడే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ లెగిసి ఫ్రెష్ అయ్యి బయటికి వస్తారు.  రుద్ర అలా చూస్తూ అబ్బ బంగారం నీ దగ్గర ఇలాంటి లక్షణాలు కూడా ఉన్నాయా...

పర్వాలేదు నాన్న భజనే  అనుకున్నాను. మిగిలిన ఆక్టివిటీస్ కూడా ఉన్నాయి అన్నమాట అనుకుంటాడు. అన్నగార్లు ముగ్గురు చెల్లెలి టాలెంట్ చూసి మురిసిపోతూ ఉంటారు.

శాంభవి  ముగ్గు పెడుతుంటే పక్కన వచ్చి కూర్చుని నీకు ముగ్గు పెడడ్డం వచ్చా బంగారం అని అడుగుతారు. దానికి శాంభవి నవ్వుతూ నాకు అన్ని పనులు వచ్చు.

వంట కూడా సూపర్ చేస్తాను. ఈరోజు బ్రేక్ ఫాస్ట్ నేనే ప్రిపేర్ చేస్తాను అని చెబుతోంది.  నీకెందుకు శ్రమ. ఇప్పటికే చాలా అలసిపోయి ఉంటావు కదా.. చేతులు చూడు ముగ్గు పెట్టి కందిపోయి ఉంటాయి అని విహాన్ చేతిలోకి తీసుకుని చూస్తూ ఉంటాడు.

దూరం నుంచి చూస్తున్న రుద్రకి చాలా జలసి వస్తుంది. నేను పట్టుకోవాల్సిన చేతుల్ని మా బావమరుదులు పట్టుకుని మరి చూస్తున్నారు.

ముగ్గురిని తప్పించి నేను ఆ ప్లేస్ లో ఉండాలి అనుకుని ఎలా అని ఆలోచిస్తూ..  డ్రీమ్స్ లోకి వెళ్ళిపోతాడు. శాంభవి దగ్గరికి వెళ్లి ముగ్గు గిన్నె పక్కన పెట్టి చేతులు తీసుకుని  ముగ్గిని అంతా తుడిచి ఎత్తుకొని రౌండ్స్ తిరుగుతూ ఉంటాడు.??

ఆ డ్రీమ్ లోకి వెళ్ళిపోయి పక్కన ఉన్న సంతోష్ గారిని గట్టిగా పట్టుకుంటాడు.  సంతోష్, బాబు నాన్న అప్పుడే డ్రీమ్స్ లోకి వెళ్ళకు. ఇంకా నువ్వు పట్టుకుని తిరగడానికి ఇంకా చాలా టైం ఉంది అని చెబుతారు.

రుద్ర కంగారుగా పక్కకు జరిగే నేనేమీ డ్రీమ్స్ లోకి వెళ్లలేదు ఇంకా నిద్రమత్తు వదలక మిమ్మల్ని పట్టుకున్నాను అంతే అని ఎటో చూస్తూ చెబుతాడు..

దానికి సంతోష నవ్వుతూ మేము నీ వయసు దాటి వచ్చిన వాళ్ళమే...ఈ టైంలో కాబోయే పెళ్ళాం ఎదురుగుండా ఉంటే..ఎలాంటి డ్రీమ్స్ వస్తాయో మాకు తెలుసులే అని చెబుతాడు.

మీరు మరీ ఇంటెలిజెంట్ నాన్న.  కానీ నా బామ్మర్దుల ముగ్గురు ఉన్నారు చూశారా... ఎప్పుడు చాన్స్ దొరుకుతుందా చెల్లెలు చుట్టూ బొంగారంలాగా తిరుగుదామా అని చూస్తారు అని కంప్లైంట్ ఇస్తూ ఉంటాడు.

నీకు చాలా కష్టాలు ఉంటాయి రా బాబు నాకు ఉన్నది ఇద్దరు బామ్మర్దులే. నీకు ఇక్కడ ముగ్గురు అక్కడ ముగ్గురు మొత్తం ఆరుగురు బామ్మర్దులు పైగా అక్కడ ఇద్దరూ ఎక్కడ ఇద్దరు మామగారులు. ఇద్దరు తాతలు ఎంత బంపర్ ఆఫర్ నీకు కదా సో లక్కీ రా అని కొడుకుని ఉడికిస్తూ ఉంటారు.

హోమం రోజున ధరణి, జయంతి అన్న మాటలు గుర్తొచ్చి తన మీద తానే జాలి పడతాడు. మరి ఇంత బంపర్ ఆఫర్ ఆ నాన్న అంటే.. తప్పదురా సుపుత్ర కొంతమంది అలా మచ్చేసుకుని పుడతారు ఎంజాయ్ చేయాలి కానీ బాధపడకూడదు అని కొడుకుని ఇంకొంచెం సేపు ఉడికిస్తారు.

అబ్బా చాల్లే నాన్న ఇప్పటికే ఎక్కువ అయిపోయింది. వాళ్లని అక్కడ నుంచి కదపకపోతే ఆ ముగ్గు ఎలా పెట్టిందో ఏంటో కూడా డిస్కషన్ పెడతారు పదండి అనగానే...

అక్కడికి దేవేంద్ర వెళుతూ ఉంటాడు. మనం వెళ్ళక్కర్లేదు రా మీ మామయ్య వెళుతున్నాడు కదా..

కూతురు ఇప్పుడుదాకా కష్టపడి పోయిందని లోపలికి తీసుకువచ్చేస్తాడు చూస్తూ ఉండు అని అక్కడే ఆపేస్తారు .

దేవేంద్ర అక్కడికి వెళ్లి కూతురు పెట్టిన ముగ్గులు చూసి మురిసిపోతూ ఇప్పటికే బాగా అలసిపోయావు తల్లి లోపలికి పదండి అని అక్కడ సర్వెంట్ ని పిలిచి ముగ్గు గిన్నె అవన్నీ వాళ్ళ చేతికి ఇచ్చేసి లోపలికి తీసుకువెళ్తారు.

చెప్పేనా అన్నట్టు  సంతోష్ చూస్తారు చెప్పేవులే అని రుద్ర ఎక్స్ప్రెషన్. దేవేంద్ర తో మాట్లాడుతూ రుద్రని క్రాస్ చేసుకుంటూ  లోపలికి వెళ్ళిపోతుంది.

రుద్ర మాత్రం వెళుతున్న శాంభవిని చూస్తూ ఉంటాడు. ధీరజ్ పక్కకు వచ్చి ఏంటి బావ మా చెల్లి తో టైం స్పెండ్ చేయడం కుదరడం లేదు అని ఆలోచిస్తున్నావా...

మమ్మల్ని చూడు చక్కగా ముగ్గు వేస్తుంటే వెళ్లి మరీ కంపెనీ ఇచ్చాము అని గొప్పగా చెబుతాడు. దానికి రుద్ర పైనుంచి కిందకు చూస్తూ ఒరేయ్ బామ్మర్ది నీకు ఒక సీక్రెట్ చెబుతాను జాగ్రత్తగా విను.

మీరు ముగ్గురు కలిసి ఉప్పర్ మీటింగ్ వేశారు కదా కానీ... ఆఫీసుకు వెళ్లేటప్పుడు, ఆఫీసులో కూడా మీ చెల్లి ఒక్కతే నాతో ఉంటుంది చూస్తూ ఉండు.

హౌ? బావ అని అడిగితే    వెయిట్ ?బామ్మర్ది అని చెప్పి కనుగొట్టి లోపలికి వెళ్ళిపోతాడు . దానికి ధీరజ్ మాత్రం అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరిగినివ్వను.

ప్రతిసారి నీదే పై మాట అవుతుంది కదా... ఈసారి మేమే నెగ్గించుకుంటాము అని బ్రదర్స్ దగ్గరికి వెళ్తాడు. ఎలాగైనా శాంభవిని వాళ్లతో తీసుకువెళ్లాలని ఫిక్స్ అయిపోతారు.

చారులత,కౌసల్య,మాధురి పూజగది దగ్గర అన్ని సిద్ధం చేస్తారు. శాంభవి బయట నిలబడి దండం పెట్టుకుంటే... లోపలికి రా తల్లి వచ్చి నీ చేతులతో పూజ చెయ్యి అని చెబుతారు.

నేనా అని అడుగుతుంది.  నువ్వే తల్లి అంటే.. మీరందరూ ఉండగా నేను ఎందుకు అని మొహమాటంగా చెబుతుంది.

నువ్వు మా ఇంటి ఆడపడుచువి అని చెప్పాము కదా పూజ చెయ్ అమ్మ అని..  బలవంతంగా లోపలికి తీసుకువెళ్లి... శాంభవి చేతే పూజ చేయిపిస్తారు.
[+] 6 users Like SivaSai's post
Like Reply
#79
Part - 39

శాంభవి పద్ధతిగా పూజ చేసి లక్ష్మీ అష్టోత్తరం చదివి, అమ్మవారికి మంగళహారతి పాడుతుంది. అది వింటున్న అందరికీ ఇలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అందరికీ దేవేంద్ర భార్య గుర్తుకు వస్తుంది

అందరూ హారతి తీసుకున్న తర్వాత రెడీ అవ్వడానికి అని ఎవరు రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోతారు. రుద్ర గదిలోకి వెళ్లి అద్దంలో చూసుకుంటూ ఏంటి ఇది...

అసలు నన్ను చూడడం లేదు. నేను దానికి కనబడటం లేదా ఏంటి.. ఎంతమంది నాకు సైట్ కొడుతూ ఉంటారు. ఒక నైట్ స్టాండ్ అడిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు.

అయినా నేను ఎవరికీ లొంగకుండా ఉంటే.. ఇది మాత్రం నా వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు ఎలా అని ఆలోచిస్తూ ఉంటాడు.

అరగంట నుంచి అద్దం ముందే నిలబడతాడు. హెయిర్ స్టైల్స్ మార్చుతూ ఉంటాడు. షర్ట్స్ మార్చుతూ ఉంటాడు. ప్రతి షర్టు వేసుకుని చెక్ చేసుకుంటూ ఉంటాడు.

తలుపు సందులో నుంచి బామ్మర్దుల ముగ్గురు చూస్తూ చూసావా.. మన బావ పాట్లు. మన చెల్లి కన్ను ఎత్తి చూడడం లేదని చెప్పి ఎన్ని ట్రైల్స్ ఎస్తున్నాడో...

ఎంతమంది అమ్మాయిలు చూసిన సరే పొండేహే అని పొగరుగా చూసావాడు. ఇప్పుడు మన చెల్లి కన్నెత్తి చూస్తే చాలు అని తెగ రెడీ అవుతున్నాడు అని ధీరజ్ అనగానే...

మరే అని చెప్పి సైలెంట్ గా ముగ్గురు వెళ్లి అద్దం పక్కన నిలబడి చూస్తూ ఉంటారు.  ఎవరో ఉన్నట్టు అనిపించి పక్కకు చూసి ఉలిక్కిపడి మీరేంట్రా ఇక్కడ అని అడుగుతాడు.

అంటే బావ నువ్వు ఇంకా కిందకి రాలేదు. ఆఫీస్ టైం అయిపోతుంది కదా.. మా చెల్లిని నువ్వు సపరేట్గా తీసుకువెళతాను అన్నావు కదా...

ఎలా తీసుకువెళ్తావా ఏంటా అని వచ్చాము అని విహాన్ అంటాడు. అప్పుడే ఊదేశాడా సరే పదండి అని చెప్పి కోట్ బటన్ పెట్టుకుంటూ వస్తాడు.

వెళుతున్న రుద్రని ఆపి బావా నాకో డౌట్ అంటాడు. చెప్పు అద్వైత్ అనగానే.. నువ్వు ఇంత హాట్ గా ఉంటావు కదా.. మా చెల్లి నిన్ను ఎందుకు చూడడం లేదు అంటావు. ఏదైనా తేడా ఉందంటావా అని పైనుంచి కిందకి చూస్తాడు.

ఆ మాటకి డిప్ప మీద ఒకటి పీకి చెప్పాను కదా.. మీ చెల్లి బ్రెయిన్ లో అన్ని సెల్స్ ఓపెన్ అవలేదు అని. నాన్న సెల్ ఒక్కటే గట్టిగా ఓపెన్ అయింది.  తర్వాత అన్న సెల్ మాత్రమే ఓపెన్ అయ్యింది.

లవ్ సెల్ ఓపెన్ అయినప్పుడు నేను ఎలా కనపడాలో అలాగే కనిపిస్తాను గాని మూసుకుని పద ఎదవ డౌట్ లు నువ్వు అని విసుక్కుంటూ వెళ్తాడు.

రుద్ర ప్రెస్టేషన్ చూసి ముగ్గురు వెనకాల నవ్వుకుంటూ వెళ్తారు. వీళ్లు కిందకి వెళ్ళేటప్పటికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని నవ్వుతూ మాట్లాడుతూ బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటారు.

అలా అందరినీ చూస్తున్న ఈ కుర్ర బ్యాచ్ కి మాత్రం మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది.  విహాన్ రుద్ర తో బావ మన ఇల్లు ఇలా ఉంటే ఎంత బాగుంది .

వీలైనంత తొందరగా మయూరి ప్రాబ్లం కి చెక్ పెట్టేసి.. మా చెల్లిని పెళ్లి చేసుకో బావ. ఇల్లు ఎప్పుడు ఇలాగే ఉంటుంది అంటే.. ఆల్రెడీ దానికి ప్లాన్ చేసేసాను.

పదా అని చెప్పి వెళ్లి వాళ్ళు కూర్చుంటారు. ఏంటమ్మా మేము రాకుండానే మీరు స్టార్ట్ చేసేసారు అని అద్వైత్ అడుగుతాడు.

ఆ మాటలకి మీరు వచ్చి స్పీడుగా తిని తినకుండా పరిగు పెడతారు.  మీ గురించి అని చెప్పి పిల్లలు ముగ్గురు కూడా కంగారుగా రావాలి. అందుకని ముందే స్టార్ట్ చేశామని చెప్పి కొసరి కొసరి తినిపిస్తూ ఉంటారు.

మాధురి టిఫిన్ చేస్తూ శాంభవి నువ్వు ఇందాక మంగళహారతి చాలా బాగా పాడావు.ఎక్కడ నేర్చుకున్నావు అని అడుగుతారు.

అది నాకు చిన్నప్పుడు నుంచి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అంటీ. అందుకే నాన్నగారు దగ్గరుండి మరి నేర్పించారు అని చెబుతోంది.

ఆ మాటలకు మిత్ర, వీణ కూడా చాలా బాగా ప్లే చేస్తుంది. ఎప్పుడైనా వాళ్ళ జేజిని కూల్ చేయాలి అనుకుంటే..  వీణ పట్టుకుంటుంది.

అంతే ఎంత కోపంలో ఉన్న సరే ఆవిడ వెంటనే కూల్ అయిపోయి మా బంగారమే అని చుట్టూ మెటీకలు విరుస్తారు అని చెబుతోంది.

ఆ మాటలకి రాఘవేంద్ర గారు మీసం  మెలేస్తారు. దేవేంద్ర, జితేంద్ర ఎంతో మురిపంగా చూస్తూ ఉంటారు. అది చూసిన రుద్ర తల కొట్టుకుంటూ ఉంటాడు.

అవునా నీకు వీణ వచ్చా ? సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక వీణ ప్రోగ్రాం పెడదాము. మన ఇంట్లో ఉంది. ఏమంటావు అని దేవేంద్రని అడుగుతుంది.

దేవేంద్ర నవ్వుతూ తల ఊపుతారు. ధీరజ్ మాత్రం రుద్ర వైపే చూస్తూ ఉంటాడు. వీడు ఏం ప్లాన్ చేస్తున్నాడు శాంభవిని తీసుకువెళ్లడానికి.

ధీరజ్ వైపు తిరిగే ఏంటి అని కళ్ళు ఎగరేస్తాడు. నీ ప్లాన్ ఏమిటో అర్థం  కాక చూస్తున్నాను బావ అంటే చూస్తూ ఉండు అని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి జ్యూస్ తాగుతు ఉంటాడు.

ఇక అందరూ ఆఫీసుకు బయలుదేరుతు ఉంటే.. చారు వచ్చి మిత్ర, గౌతమ్ ను మీ కార్ లో తీసుకువెళ్ళండి. మళ్ళీ వాళ్ళు ఇక్కడి నుంచి రావాలంటే ఇబ్బంది పడతారు కదా..

మరి శాంభవి అని అడుగుతారు. అన్నయ్య, రుద్ర ఒక కార్ లో వెళ్తున్నారు కదా..వాళ్లతో పాటు వెళుతుంది అని అల్టిమేట్ జారీ చేసి వెళ్ళిపోతుంది.

అమ్మ నా బావ నువ్వు ఎకంగా అత్త తో నే పెట్టించావు కదా అని నోరు వదిలేసి చూస్తాడు.  మరీ ఎక్కువగా నోరు తెరవకు.

దోమలు ఈగలతో పాటు బొద్దింకలు కూడా వెళ్లిపోతాయి జాగ్రత్త అని బుగ్గ మీద చిన్నగా టాప్ చేస్తాడు. డైరెక్ట్ గా అత్తయ్య తో నే చెప్పించావు.

ఇందులో నీ ఇన్వొల్మెంట్ ఏమి లేదు అన్నట్టుగా ఎంత బిల్డప్ ఇచ్చావు. మరి ఇప్పుడు బాబాయి ని ఎలా తప్పిస్తావో అంటే...

ఉండరా బామ్మర్ది అని చెప్పి, అమ్మ నీ కోసం తీసుకువెళతాను అని చెప్పి...  మిస్ శాంభవి మీరు రెడీనా అని చాలా అఫీషియల్ గా అడుగుతాడు.

హా రెడీ సార్ అని గబగబా అక్కడికి వస్తుంది. విహాన్ కార్ వెళ్లేదాకా రుద్ర ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. వారి కార్ గేటు దాటిన వెంటనే... మామ రా వెళదామా అని చెప్పి పిలుస్తాడు.

దేవేంద్ర గారి బయలుదేరితు ఉంటే... ధీరజ్  మాత్రం టెన్షన్తో గోళ్లు కొరికేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేస్తాడా వీడు అని.

దేవేంద్ర కి ఇంతలో ఫోన్ వస్తుంది. ఫోన్ మాట్లాడిన తర్వాత రుద్ర... నాకు నీతో రావడం అవ్వడం లేదు అని ధీరజ్ మన ఇద్దరం  అక్కడికి వెళ్దాం పదా అని  తీసుకుని వెళ్ళిపోతారు.
వెళుతున్న ధీరజ్ వెనక్కి తిరిగి నువ్వు సూపర్ బావ అని సైగ చేస్తాడు. ఆ సైగ కి రుద్ర నవ్వుకుంటూ వెళదామా అని పిలుస్తాడు.

భయంగా రుద్ర వెనకాల బయటికి వస్తుంది.  ధీరజ్ మాత్రం దేవేంద్ర గారితో బాబాయ్ వాడు కావాలనే మిమ్మల్ని తప్పించాడు.

వాడు సింగిల్ గా శాంభవి తో వెళ్లాలని ప్లాన్ చేశాడు అంటే.. అదంతా నాకు తెలుసు కానీ మూసుకుని పదా అంటే...

ఇద్దరు తోడు దొంగలు అయిపోయారా..  ఇందాకటి నుంచి వాడు ఏం ప్లాన్ చేస్తున్నాడని టెన్షన్తో చచ్చిపోయాను.  ముందే చెబితే నాకే టెన్షన్ ఉండేది కాదు కదా అని అంటాడు.

ముందే చెబితే ఆ ప్లాన్ నువ్వు అట్టర్ ప్లాప్ చేస్తావు కదా అందుకే చెప్పలేదు అని చెప్పి వేరే ఆఫీస్ కి తీసుకుని వెళ్తారు.

రుద్ర వెళ్లి డ్రైవింగ్ సీటులో కూర్చుంటాడు. శాంభవికి ముందు కూర్చోవాలా వెనుక కూర్చోవాలా అర్థం కాక కారు దగ్గర నిలబడి చేతులు నలిపివేస్తూ ఉంటుంది.

ఏమైంది అక్కడే నిలబడ్డావు అంటే... ఎక్కడ కూర్చోవాలో అర్థం కాక అన్నట్టుగా చూస్తుంది.  ఆ చూపుల్లో అర్థం  తెలుసుకుని ఫ్రంట్ డోర్ ఓపెన్ చేస్తాడు.  కామ్ గా వెళ్లి కూర్చుంటుంది.

మరదలితో ఫస్ట్ టైం కలిసి వెళుతున్న ఆనందం రుద్రాలో...  కానీ పైకి కనపడకుండా సీరియస్ గా ఉంటాడు.

బాబోయ్ ఈయన ఎప్పుడు చూసినా సీరియస్ గానే ఉంటారా..  ఆఫీస్ కి వెళ్లే వరకు నా పరిస్థితి ఏమిటి అన్న టెన్షన్ లో శాంభవి..

టెన్షన్ పడుతున్న శాంభవి వైపు చూసి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు. ఇక్కడ పులులు, సింహాలు ఏమీ లేవే అని అడుగుతాడు.

దానికి శాంభవి మనసులో వాటిని రూల్ చేసే రూలర్ నువ్వు ఉన్నావు కదా అనుకుని....అదేమీ లేదు సార్ అని అంటుంది.

ఇది  ఆఫీసు ఏమీ కాదు.  జస్ట్ బి లైక్ ఫ్రెండ్ అంతే అని చెబుతాడు.  బాబోయ్ రుద్ర గారేనా ఇలా మాట్లాడేది అన్నట్టుగా చూస్తుంది.

ఓయ్ ఏంటి అలా చూస్తున్నావ్.  నేను ఏమి అడిగినా, మాట్లాడిన భయంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తావ్ ఎందుకు అని అడుగుతాడు.

వెంటనే  తేరుకుని ఏమీ లేదు సార్.  మీరు ఇంత కూల్ గా మాట్లాడుతుంటే కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది అంతే అని అంటుంది.

నేనేమన్నా యాంగ్రీ మ్యాన్ అనుకుంటున్నావా అని అడుగుతాడు.  నేనెప్పుడు అన్నాను సార్  మాట అంటే... ఇప్పుడు నువ్వు అన్న మాటకి ఉద్దేశం అదే కదా అని అంటాడు.

ఏంటి నా మాటలు మీకు అలా అర్థమైందా అని అడుగుతుంది.  మరి అంతే కదా అంటే... నేను మీరు సీరియస్గా ఉంటారు అన్నాను అంతేగాని యాంగ్రీ మ్యాన్ అనలేదు సార్.

ఈయనతో ఎలా మాట్లాడినా తిరిగి నా మీదే సెటైర్ వేస్తారు.  ఎందుకొచ్చిన గొడవ.  ఆఫీస్ కి వెళ్లేవరకు కామ్ గా ఉంటే సరిపోతుంది.

సాయంత్రం మిత్రతో కలిసి వచ్చేస్తాను అనుకుంటుంది.
తన మనసులో మాట అర్థం అయినట్టే...  రుద్ర ఈ రోజు నుంచి మార్నింగ్, ఈవినింగ్ కూడా నువ్వు నాతోనే వస్తున్నావు. వెళ్తున్నావు.

ఇంకా ఎవరితో కూడా కలిసి వెళ్లడానికి వీల్లేదు.  ఎప్పుడైనా వెళితే చిన్న మామతో అంతే. ఇది ఆర్డర్ అనుకున్న పర్వాలేదు. రిక్వెస్ట్ అనుకున్న పరవాలేదు.

కానీ నువ్వు మా ఇద్దరిలో ఎవరు ఒక్కరితోనే బయటికి రావాలి అర్థం అయిందా అని చెబుతాడు.

శాంభవి రియాక్షన్ ఏమిటి...

కథ కొనసాగుతుంది...
[+] 7 users Like SivaSai's post
Like Reply
#80
Excellent update
[+] 1 user Likes Sachin@10's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)