28-03-2026, 10:43 AM
Excellent update
|
పాణిగ్రహణం
|
|
28-03-2026, 08:37 PM
Sooper nadustundi story.
Just waiting fir the conflict point. Will the kids grow and start something between them? Koppu koppu pakkana unte.. rajyale koolatayani.. yenakatiki oo peddayana cheppadu!!
29-03-2026, 10:54 AM
Part - 5
పెదనాన్నకి మాటిచ్చానని ఓపికగా ఉన్నాను కానీ అన్నవరంలో అని కన్నింగ్ గా నవ్వుతాడు. ఆ నవ్వుకి రాజ్ కి భయమేస్తోంది.
ఒరేయ్ నీకు దండం పెడతాను రా... హైదరాబాదు వెళ్లిన తర్వాత నీకు ఏం కావాలంటే అది కొంటాను. ఇక్కడ మాత్రం దాన్ని కదపకు రా. సరిపోలేదు మావయ్య. ఏం సరిపోలేదు. అదే నువ్వు ఏదో కొంటాను అంటున్నావు కదా అవి. పోనీ ఇంకేం కావాలో అడగరా.. అడిగాక నో అంటే.. నాకు అంత ధైర్యం ఉందా. చందు ఏడవకుండా, పేచీలు పెట్టకుండా మీ అత్త విసిగించకుండా రిటర్న్ వెళితే నాకు అదే చాలు. అక్కడికి వెళ్లాక నువ్వు ఏది అడిగితే అది ఇమ్మీడియేట్ గా చేసి పెడతాను. ఇదే మాట మీద ఉంటావా. కచ్చితంగా ఉంటాను. ఒకవేళ లేవనుకో... నీ సంగతి నాకు తెలుసు కదరా.. ఇక్కడ టార్చరు డబల్ చేసి హైదరాబాదులో చూపిస్తావు. దానికన్నా మీ మీద డబ్బులు ఖర్చు పెట్టడం చాలా సుఖం. నువ్వు చాలా తెలివైన వాడివి మావయ్య. ఓకే అనుకుంటూ సూర్య వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వెళుతున్న వైభవ్ ని చూసి విరక్తిగా ఒక నవ్వు నవ్వుతూ.. ఎవరైనా ఇంటి అల్లుడికి భయపడతారు. నాదంతా రివర్స్. ఇంటి అల్లుడు... వీళ్ళకి భయపడాల్సిన పరిస్థితి. ఏంటో నా జీవితం అని పైకి చూస్తాడు. మరి పైకి చూడకు బావ. కాకలు ఏమైనా వెళ్లాయి అనుకో... ఇంకా ఆపేయ్.. పద అని వాళ్ళకి ఇచ్చిన క్వార్టర్స్ లోకి వెళతారు. కళ్యాణం ఎప్పుడు అని ఇందిరా గారు అడిగితే రేపు ఉదయమే నానమ్మ అని విక్రమ్ సమాధానం చెబుతాడు. సరే అయితే కాస్త ఏదైనా తినేసి పడుకోండి. మళ్ళీ పొద్దుటే లెగాలి అంటే కష్టమవుతుంది. అలాగే అని పిల్లలకి లైట్ ఫుడ్ పెట్టి పెద్దవాళ్ళు కూడా ఏదో కాస్త తిని పడుకుంటారు. సూర్యుడు రాకముందే అందరూ లేచి రెడీ అవుతారు. సూర్య మంచి హుషారుగా ఉంటే విక్రమ్.. చూసి ఏంటి సూర్య చాలా సంతోషంగా కనపడుతున్నావు. ఐ డోంట్ నో నాన్న. ఇక్కడ బస్సు దిగిన దగ్గర నుంచి తెలియని ఒక హ్యాపీనెస్ నా చుట్టూ వైఫై లాగా తిరుగుతుంది. ఏదో నాకు ఒక చాలా ఇష్టమైనది ఇక్కడ ఉంది అని సెన్స్ అవుతుంది. భరత్ వచ్చి మీ వయసు పిల్లలకి అంత హ్యాపీనేస్ ఇచ్చేది ఇక్కడ ఏముంటుందిరా.. ఏమో అని పెదవి ఇరుస్తాడు. ఐ థింక్ ఇక్కడ ప్రసాదం వరల్డ్ ఫేమస్. అవునా.. ఇంకా అంటే ఏమైనా టాయ్స్ అంటే నువ్వు టాయ్స్ తో ఆడుకునే టైపు కాదే... సరేలే చూద్దాం. వాడు హ్యాపీనెస్ ఏమిటో.. పదండి ఇప్పటికే లేట్ అయ్యింది. అక్కడ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అని ఫ్యామిలీ మొత్తం వెళతారు. నిండుగా కనిపిస్తున్న కుటుంబాన్ని చూస్తున్నా జనానికి చాలా ముచ్చటగా అనిపిస్తుంది. పిల్లల్ని మదర్స్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు. సూర్య,శ్రీకర్ మాత్రం ఒకచోట ఉంటారు. శ్రీకర్... నీ హ్యాపీనెస్ కి కారణం తెలిసిందా బావ. ఇంకా తెలియలేదు. బట్ తెలుసుకుంటాను. నువ్వు తెలుసుకునే వరకు వదలవు కదా.. చిన్న స్మైల్ ఇస్తాడు. ఈ స్మైల్ చాలు బావ. అందరూ కల్యాణం లో కూర్చుంటారు. వీళ్ళతోపాటు బయట జంటలు కూడా కూర్చుంటారు. అందరూ పూజ చేస్తూ ఉంటే.. ఒక చిన్న పాప చేతులు ముందుకి వెనకకి కదులుతూ కనబడుతూ ఉంటాయి. సూర్య ఆ చేతిలో వైపు చూస్తూ ఉంటాడు. చేతినిండా గాజులు వేసుకొని ఉంటుంది. అరచేతులకు గోరింటాకు కనిపిస్తుంది. చూడడానికి చాలా క్యూట్గా అనిపించి ముఖం చూడాలి అని సూర్య ముందుకి వెనకకి జరుగుతూ ఉంటాడు. కానీ పాప ఫేసు కనిపించదు. అక్కడ ఉన్న పసుపు కుంకుమ అన్ని పూజలో పాప వేస్తూ ఉంటే వాళ్ళ అమ్మ చేయబట్టుకుని ష్ సైలెంట్ గా ఉండు అని నోటు మీద వేలు పెట్టుకుని చూపిస్తూ ఉంటుంది. ఒక నిమిషం కుదురుగా ఉన్నట్టు ఉండి మళ్ళీ మొదలు పెడుతుంది. పాప మదర్ సీరియస్గా చూస్తూ ఉంటే. పాప ఫాదర్ చిన్నపిల్ల వదిలేసేయ్. ఇటు రా తల్లి అని ఒళ్ళో కూర్చోబెట్టుకుని.. ఏంట్రా నీ హంగామా అని ముద్దు చేస్తూ ఉంటాడు. సూర్యకి కళ్ళు మాత్రమే కనపడుతూ ఉంటాయి. ఆ పాప తండ్రి చేతితో ఆడుతూ ఉంటుంది. అందుకే ఎంత ప్రయత్నిస్తున్న మొఖం కనిపించదు. సూర్య మొత్తం ఫోకస్ పెట్టి మరీ చూస్తూ ఉంటాడు. అవని కదిపి ఏం చూస్తున్నావు. ముందు పూజ మీద ఫోకస్ పెట్టు. సరే అమ్మ అని పూజ చేస్తూనే ఆ పాప మీద ఒక కన్ను వేస్తాడు. అక్కడ స్వామివారి పూజా, కళ్యాణం పూర్తయి అందరూ హారతి తీసుకుంటారు. హారతి సమయంలో విక్రమ్... పిల్లలందరిని ముందు నుంచో పెడతాడు. సూర్య హారతి తీసుకునే స్పీడ్ గా బయటికి వస్తుంటే.. ఆగు తీర్థం తీసుకోవా.. ఎందుకంత కంగారు అని చేయ పట్టుకుని ఆపేస్తుంది. ఒక్క నిమిషం అమ్మ. ముందు చెప్పింది చేయి. మనం వచ్చింది ఎందుకు.. తర్వాత ఏదైనా.. ఇంకా తల్లి మాట కాదనలేక సరే అని తీర్థం, శఠగోపం అన్ని అయిన తర్వాత ఇప్పుడు వెళ్లొచ్చా... ఎక్కడికి రా.. ఎక్కడికో ఒకచోటికి నేను వస్తాను కదా అని శ్రీకర్ చేయి పట్టుకుని బయటకు పరుగు పెడతాడు. ఏమైంది వీడికి అని చూస్తూ ఉంటే.. టెన్షన్ పడకు సెక్యూరిటీ ఉంది అని విక్రమ్ చెప్పగానే ఒక చిన్న స్మైల్ ఇస్తుంది. బయటికి వచ్చిన సూర్య చుట్టూ చూస్తూ ఉంటాడు. ఏమైంది బావ. ఒరేయ్ మనం పూజలో ఉన్నప్పుడు ఒక పాపని చూశాను రా. ఏమిటి.. శ్రీకర్ అర్థం కాకుండా చూస్తూ ఉంటే... అబ్బా ఆ పాప ఫేసు కనిపించలేదు కానీ భలే క్యూట్గా అనిపించింది. ఒకసారి చూడాలి అనిపించి బయటికి వచ్చాను. బావ ఒక్క నిమిషం ఉండు.. పాపని చూడలేదు అంటున్నావ్. క్యూట్గా అంటున్నావు. ఎలా అబ్బా. చేతికి గోరింటాకు పెట్టుకుంది.. గాజులు వేసుకుంది కళ్ళు చూశాను అంతే. నువ్వేం చెబుతున్నావో నాకు ఒక్క ముక్క అర్థం కావడం లేదు. నాకు అర్థం కావడం లేదు. అయినా నేను బయటకు వచ్చి చూడడం లేదా.. అలాగే నువ్వు నన్ను ఫాలో అవ్వు ఇంకా కొంచెం ముందుకు వెళతాడు. రక్షించండి రక్షించండి అని అరుపులు వినిపిస్తూ ఉంటే ఏమయింది అని ఇంకా ముందుకు వెళతాడు. అక్కడ ఒక కోతి పాప చెయ్య పట్టుకుని లాగుతూ ఉంటుంది. పాప ఏడుస్తూ ఉంటుంది. పాప ఫాదర్ దగ్గరకు వెళదాము అనుకుంటే కోతి ఇంకా రెచ్చిపోతూ ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాకుండా భయంగా చూస్తూ ఉంటాడు. చుట్టూ జనం కూడా ఎలాగైనా కోతి నుంచి పాపని కాపాడాలి అని ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ కోతి ఆ పాపని వదలదు. సూర్య శ్రీకర్ ఆ పాపని వెనకనుంచి చూస్తారు...శ్రీకర్ కంగారుగా అయ్యో ఆ పాప డేంజర్ లో ఉన్నట్టుంది సెక్యూరిటీని పిలుస్తాడు. పాపను సేవ్ చేయండి అండి. సరే అని ముందుకు వెళతారు. సూర్య మాత్రం ఫోకస్డ్ గా పాపని కోతిని చూస్తూ ఉంటాడు. ఆ చెయ్యిని చూడగానే అర్థమవుతుంది. సూర్య వెతుకుతున్న పాప.. ఈ పాపే అని. సూర్య గుండె కూడా చాలా స్పీడుగా కొట్టుకుంటుంది. సూర్య ఒక్క నిమిషం ఆలోచించి పక్కనే ఉన్న షాప్ లో ఒక మంకీ డ్రమ్స్ వాయించుతున్న బొమ్మని, అరటి పళ్ళు, ఇంకా కొబ్బరికాయ తీసుకుంటాడు. ఆ కొబ్బరికాయను పగలగొట్టి... అరటి పళ్ళు కొంచెం దగ్గరగా పెట్టి ఆ మంకీ బొమ్మకు కీ ఇచ్చి వదులుతాడు. ఆ బొమ్మ పైకి కిందకు ఎగురుతూ డ్రమ్స్ వాయిస్తూ ఉంటే... కోతి పాపని వదిలేసి వాటి దగ్గరికి వస్తుంది. వెంటనే ఆ పాప నాన్న అని పరిగెత్తుకుంటా వెళ్లి గట్టిగా వాళ్ళ నాన్నని పట్టుకుంటుంది. భయంతో వణికిపోతున్న పాపని గట్టిగా పట్టుకుని ఏం భయం లేదు కన్న... నేను ఇక్కడే ఉన్నాను అని ధైర్యం చెబుతూ ఉంటాడు. కానీ పాప వెక్కిళ్లు పెట్టి ఏడుస్తూ ఉంటుంది. సూర్య వాళ్ళ ముందుకు వచ్చి.. హాయ్ క్యూటీ అంటాడు. తండ్రి భుజాల పైనుంచి తల కొంచెం పక్కకి తిప్పి చూస్తుంది. ఏంటి భయపడ్డావా... అది ఏమీ చెయ్యదు. ఇదిగో చాక్లెట్ అని ఇస్తూ ఉంటే వద్దు అంటుంది. ఎందుకు వద్దు... ఈ చాక్లెట్ ఇష్టం లేదా.. ఇంకొకటి తీసుకోనా... కొత్త వాళ్ళ దగ్గర ఏమీ తీసుకోకూడదు. అవునా.. కాసేపు ఇలా కూర్చుందాం రండి అంకుల్ అని అక్కడ గట్టు మీద కూర్చోబెడతాడు. పాప కొంచెం స్థినిత పడింది అనుకున్నాక... ఎవరు బాబు నువ్వు.. సమయానికి వచ్చి సమయస్ఫూర్తిగా ప్రవర్తించావు. నా కూతురిని రక్షించావు. ఏమిచ్చి నీరుణం తీర్చుకోగలను. అయ్యో అంకుల్ ఇది చాలా చిన్న హెల్ప్. మీరు ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నారు. లేదు బాబు.. మాకు లేక లేక కలిగిన సంతానం. నా కూతురు మీదే పంచప్రాణాలు పెట్టుకున్నాము. ఈ విషయం నా భార్యకి తెలియదు. తెలిస్తే ఇంకా అంతే... తండ్రి మాట్లాడే మాటలు కొంచెం కొంచెం అర్థమవుతూ ఉంటే సూర్య వంక చూస్తుంది. మీరు ఎక్కడ ఉంటారు అంకుల్. మాది ఇక్కడ దగ్గరలో ఉండే గ్రామం బాబు. అమ్మాయిది ఈరోజు ఐదో పుట్టినరోజు. అందుకే స్వామివారి కల్యాణం చేయిపిద్దామని వచ్చాము. హ్యాపీ బర్త్డే అని శ్రీకర్, సూర్య ఇద్దరూ చెబుతారు. చిన్నగా స్మైలీస్తోంది. నీ స్మైల్ చాలా బాగుంది క్యూటి. థాంక్యూ అని ముద్దు ముద్దుగా చెబుతుంది. నీకు బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలి కదా.. అవును అని తల ఊపుతుంది. రేయ్ తప్పు అని క్యూటీ ఫాదర్ చెబుతుంటే.. ఇట్స్ ఓకే అంకుల్ అని ఆలోచించి ఏమి ఇవ్వాలో అర్థం కాక.. చేతికున్న రింగ్ తీసి ఇది నా బర్త్ డే గిఫ్ట్. ఎప్పుడు నీ దగ్గరే ఉండాలి. ఆ ఉంగరం తీసుకుని బాగుంది అని వేలుకు పెట్టుకుంటుంది. కానీ అది జారిపోతూ ఉంటుంది.. అయ్యో ఉంగరం జారిపోతుంది. ఇప్పుడు ఎలా అని బిక్క మొహం వేస్తుంది. సూర్య ఏం చేస్తాడు..
29-03-2026, 10:59 AM
Part - 6
అయ్యో ఉంగరం జారిపోతుంది ఇప్పుడు ఎలా అని క్యూటి బిక్కమొహం వేస్తోంది. క్యూటి ఫాదర్.. ఆ రింగ్ తీసుకుని... ఇంత విలువైనవి గిఫ్ట్స్ గా ఇవ్వకూడదు బాబు.
అందులో మనకు అసలు పరిచయమే లేదు. ఇట్స్ ఓకే అంకుల్. బర్త్డే కదా.. అంతకన్నా విలువైనదే ఇచ్చావు కదా.. నువ్వు నా కూతుర్ని కాపాడావు. అంతకు మించిన గిఫ్ట్ మాకు ఏముంటుంది అని రింగు తిరిగిఇవ్వబోతాడు. ఉహూ... నేను ఇవ్వను. నాకు నచ్చింది. అది కాదు బంగారం.. ఈ ఉంగరం నీకు పెట్టిన ఉండదు కదా.. జారిపోతుంది. నీకు ఇంటికి వెళ్ళాక.. ఇలాంటివి చాలా కొంటాను సరేనా.. అలాగే అని తల ఊపుతూ కష్టంగా తండ్రి చేతికి ఇస్తుంది. సూర్య వెంటనే ఆ చేతిని పట్టుకొని.. ఒకసారి గిఫ్ట్ కింద ఇచ్చింది మళ్ళీ తీసుకోకూడదు. చిన్నపిల్ల బాబు... పెట్టిన ఉంచుకోదు కదా.. అర్థం చేసుకో... ఒక నిమిషం ఆలోచించి క్యూటి నీ మెడలో ఉన్న చైన్ ఇలా ఇవ్వు. ఎందుకు... చెబుతాను కదా.. ఇవ్వు... ఇది రావడం లేదు. అంకుల్ మీరు తీసి ఇవ్వండి. ఇంక సూర్య ఎంత చెప్పినా వినడు అని అర్థమైంది. చైన్ తీసి సూర్య చేతికి ఇస్తే.. ఆ రింగ్ చైన్ లో వేసి... ఇప్పుడు క్యూటి మెడలో వేయండి. క్యూటీ ఫాదర్ నవ్వుతూ చైన్ మెడలో వేసి ఇప్పుడు హ్యాపీ నా... చాలా అని రెండు చేతులు పెద్దగా చాపి చెబుతుంది. నువ్వు గిఫ్ట్ తీసుకున్నావు మరి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వవా బంగారం. ఏమి ఇవ్వాలి నాన్న. నా దగ్గర ఏమీ లేదు కదా అని తండ్రి మెడ చుట్టూ చేతులు వేసి అడుగుతుంది. ఒక నిమిషం ఆలోచించి పాప చేతికి ఉన్న ఉంగరం సూర్య చేతికి ఇస్తాడు. ఏంటి అంకుల్ నేను రింగ్ గిఫ్ట్ గా ఇచ్చాను అని దాని ఖరీదు కట్టి ఇంకొక రింగ్ ఇస్తున్నారా. లేదు బాబు నీ అభిమానానికి నేను విలువ కట్టలేను. ఎక్కడినుండి వచ్చావో నాకు తెలియదు కానీ ఈ రోజు మాకు ఆత్మబంధువులాగా మారిపోయావు. కొన్ని కొన్ని పరిచయాలు ఆ నిమిషమే జరిగిన... ఎప్పటినుంచో ఆ బంధం ఉంది అనిపిస్తుంది. నీతో పరిచయం కూడా అంతే. ఇది మా గుర్తుగా నీ దగ్గర ఉంచు. నా మాట కాదనకు. సరే అంకుల్. మీకోసం ఎప్పుడు నా దగ్గరే ఉంచుకుంటాను. ఇంతకీ నీ పేరు ఏమిటి బాబు.. ఎక్కడ నుండి వచ్చారు. నా పేరు అనేలోపు సూర్య అని విక్రమ్ వస్తాడు. నాన్న ఇక్కడే ఉన్నాము. దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నారు. జస్ట్ క్యాజువల్ గా కూర్చున్నాము. క్యూటీ వైపు చూసి ఎవరు.. ఇప్పుడే పరిచయం అయ్యారు. వెళ్ళొస్తాం అంకుల్.. బాయ్ క్యూటీ అని సూర్య శ్రీకర్ ఇద్దరు వెళ్లిపోతారు. విక్రమ్ ఫ్యామిలీ దర్శనం అయ్యి భోజనం చేసి రెస్ట్ తీసుకుంటారు. ఏమైనా కావాలిఅంటే లేడీస్ షాపింగ్ చేసుకోండి. బయలుదేరిన తర్వాత అంటే కష్టం. నివి, పూజిత.. వెంటనే మేము షాపింగ్ చేసుకుంటాము. రాజ్ వెంటనే ఇక్కడే మీకు షాపింగ్ చేయడానికి ఏముంది.. అంత క్వాలిటీ ఉండవు కదా... ప్రతిసారి క్వాలిటీ చూసుకోకూడదు. ఏదో ఇంత దూరం వచ్చాము కదా.. అందుకు గుర్తుగా కొనుక్కోవాలి కదా.. నివి తల మీద చేయి వేసి నువ్వు సూపర్ రా బంగారం. షాపింగ్ చేయడానికి నీకు ఏదో ఒక వంక భలే దొరుకుతుంది కదా... ఏమిటి సెటైరా... ఛ.. ఛ.. నీ మీద సెటైర్ వేస్తే నేను రిటైర్ అయిపోతాను అని నాకు తెలుసు. వెళ్లి బాగా షాపింగ్ చేసుకునిరండి. చందు అంటే.. చందుని నేను హ్యాండిల్ చేస్తాను. నీతో మాత్రం వద్దు అని పంపిస్తాడు. వినయ్.. అదేంటి బావా పంపిస్తే నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు కదా... ఏంటి పంపించేది.. అక్కడికి వెళ్లి ఏదో కావాలి అంటుంది. మళ్లీ దాన్ని మ్యాచింగ్ ఇంకో చోటికి అంటే... నావల్ల కాదురా.. ప్రశాంతత కోసం ఇంత దూరం వచ్చాము. అదే ప్రశాంతత్వం హైదరాబాద్ వెళ్లాలి. నా కొడుకు కూడా నీకు ప్రశాంతత ఇస్తున్నాడా.. వాడు మీ కన్నా ముదురురా... ఇక్కడ నా కూతుర్ని ఏడిపించకుండా ఉండడానికి ఎంత లంచం అడిగాడో తెలుసా.... నువ్వు ఇవ్వగలవని వాడికి తెలుసు బావ .. ఇలాగే వెనకేసుకుని.. రా... రా.. రేపటి నుంచి ఇంకా నీకు బిపి పెంచుతాడు. నాకేంటి కూతురు ఉన్నవాడిని. ఎప్పటికీ రాజానే.. కొడుకులు ఉన్నావాళ్లు టెన్షన్ పడాలి. నాకెందుకు బావ టెన్షన్. ఒకటి చెప్తాను క్లియర్ గా మైండ్లో పెట్టుకో. ఇప్పుడు నా కూతురు బాగా చదువుకుంది అనుకో... సొంత టాలెంట్ తో ఒక కంపెనీ పెట్టుకోవడం.. లేదంటే ఏదో ఒక సెల్ఫ్ వర్క్ చేసుకుంటుంది. లేదు తు.. తూ మంత్రంగా ఉంది అనుకో.. అదిగో వాళ్ళ అమ్మని ఫాలో అవ్వడమో లేకపోతే నాతోపాటు కంపెనీకి వచ్చి వర్క్ నేర్చుకుంటుంది. అదే కొడుకైతే... కొడుకు అయినా అదే పని కదా. అక్కడే రాంగ్ స్టెప్పు వేస్తున్న బావమరిది. కచ్చితంగా బాగా చదవాలి. ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు అవ్వకూడదు. మనం మన పేరెంట్స్ కళ్ళు కప్పి ఎన్ని ఎదవ వేషాలు వేసాము. అలాంటి ఎదవ వేషాలు వేశారు అనుకో చాలా కష్టం. ప్రస్తుతపు రోజుల్లో అమ్మాయిలు చాలా కాంపిటీషన్ ఇస్తున్నారు. ఆ కాంపిటీషన్ అబ్బాయిలు తట్టుకోవాలి లేకపోతే ఈగో ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అయిపోతాయి. ఇప్పుడు చెప్పు బామర్ది.. కొడుకులు ఉన్నవాళ్లు అదృష్టవంతులా.. కూతుళ్లు ఉన్నావాళ్ళు అదృష్టవంతులా... అందుకే నా భరత్ బావ అంత కూల్ గా ఉంటున్నాడు. భరత్ నవ్వుతూ ఒరేయ్ రాజ్ బ్రో అలాగే చెబుతాడు గాని ఎవరైనా ఒకటే.. పిల్లలు అలాగేఉంటారు. వయసు వచ్చేటప్పటికి ఆటోమేటిగ్గా టర్న్ అవుతారు. నువ్వు చిన్నప్పుడు ఇంతకన్నా ఎక్కువ అల్లరి చేసేవాడివి కదరా.. ఇప్పుడు మారలేదా.. వాడు అంతే... రాత్రి కి బయలుదేరి అందరూ హైదరాబాద్ చేరుకుంటారు. కాలం ఎవరికోసం ఆగనంటూ పరుగు పడుతుంది. సూర్య, శ్రీకర్ హయ్యర్ స్టడీస్ కోసం అబ్రాడ్ వెళ్ళిపోతారు. సౌమ్య మెడిసిన్ వైపుకు వెళితే.. చందు ఫ్యాషన్ డిజైనింగ్ వైపు వెళుతుంది. ఇంక మన వినే బాబు కష్టంగా బీటెక్ ఫైనల్ ఇయర్లోకి వస్తాడు. ఏదో ఒక టైం లో చందు నీ ఏడిపిస్తూ.. పూజితతో దెబ్బలు తింటూ... రాజ్ తో బ్రతిమాలించుకుంటూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. హైదరాబాద్ లోని ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫోర్త్ ఇయర్ క్లాస్లో ఒక అమ్మాయి నోట్స్ రాసుకుంటూ ఉంటుంది. సీరియస్ గా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్న అమ్మాయి పక్కన ఇంకొక అమ్మాయి వచ్చి కూర్చుంటుంది. తల పైకి ఎత్త కుండానే ఏమి చూస్తున్నావు. నువ్వు ఎందుకు ఇంత వర్క్ డెడికేషన్ తో ఉంటావా అని చూస్తున్నాను. తల పైకెత్తి.. కష్టపడాలి... బాగా చదువుకోవాలి.. నా స్టడీస్ కంప్లీట్ అయ్యేలోపే జాబ్ తెచ్చుకొని అమ్మని బాగా చూసుకోవాలి. ఆ అమ్మాయి అలాగే చూస్తూ ఉంటే... ఏంటి భవ్య అలా చూస్తున్నావు. నిన్ను చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది విశిష్ట. ఈ కాలేజీలో జాయిన్ అయినా సంవత్సరం ఎలా ఉన్నావు.. ఇప్పుడు ఎలా ఉన్నావు.. ఎలా ఉన్నాను... అప్పుడు ఇలాగే కదా ఉన్నాను.. నేను మాట్లాడుతుంది నీ చదువు, క్యారెక్టర్ గురించి కాదు. ప్లీజ్ భవ్య జరిగినా విషయాలు తలుచుకుంటూ ఉంటే ముందుకు వెళ్లలేము. నా ముందు ఉన్నది ఒక్కటే.. అమ్మని బాగా చూసుకోవాలి.. ట్రీట్మెంట్ చేయించాలి. నీ లవర్ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి కదా.. అడగొచ్చు కదా.. ప్రేమ అంటూ చెప్పుకుని డబ్బులు అడగమంటావా... ఇప్పుడు తీసుకుని తర్వాత వడ్డీతో సహా తిరిగి ఇచ్చేయ్.. ఒకవేళ నేను ఇవ్వలేకపోతే అప్పుడు పరిస్థితి ఏమిటి.. అది నాకు ఇష్టం లేదు. కానీ ఎన్ని రోజులని ఇలా కష్టపడతావు. ప్రస్తుతానికి గౌతమ్ వర్క్ ఇచ్చాడు కదా... నీ ఆర్క్ టెక్చర్ టాలెంట్ తో మంచి మంచి డిజైన్స్ చేసి గౌతమ్ కి ఇస్తున్నావు. ఆ డిజైన్ తీసుకుంటూనే ఇంకా ఇంప్రూవ్ కావాలి అని చెబుతున్నాడు. ఏదో ఒకటి. మనం స్టూడెంట్స్. ఇప్పుడు నాకు డబ్బులు అవసరం.. స్టడీస్ కంప్లీట్ అవ్వకుండా ఎవరూ జాబ్ ఇవ్వరు కదా.. బట్ నీ టాలెంట్ కి గౌతమ్ ఇచ్చే జీతం సరిపోదు అని నా ఉద్దేశం. ఇంకెంత భవ్య.. ఈ ఇయర్ కష్టపడ్డాను అంటే తర్వాత ఎఫిషియన్స్ జాబ్ వెతుక్కోవచ్చు. అప్పటిదాకా తప్పదు. మరి ఇంత హార్డ్ వర్కా.. ఒక పక్కనే జాబ్ చేస్తూనే ఈవినింగ్ పార్ట్ టైమ్ జాబ్ రెస్టారెంట్లో చేస్తున్నావు. ఇలాగైతే నీ హెల్త్ ఏమవుతుంది. నేను బాగానే ఉన్నాను. నా గురించి ఆలోచించే ఇంత మంచి ఫ్రెండ్ నాతో ఉంది. నన్ను ఎప్పుడు ప్రేమగా చూసుకునే గౌతమ్ ఉన్నాడు. ఇంకా ఏమిటి నాకు ఇబ్బంది. భవ్య మనసులో ఆ గౌతమ్ నిన్ను వాడుకుంటున్నాడు. నీ టాలెంట్ మొత్తం వాడుకుని ఎదుగుతున్నాడు. ఇది నీకెప్పటికీ అర్థం అవుతుందో.. చుట్టూ ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్లే అనుకుంటావు. గౌతమ్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. విశిష్ట ఫోన్ లిఫ్ట్ చేసి హలో గౌతమ్.. ఏం చేస్తున్నావు విశి.. అని అడుగుతాడు. కాలేజీలో ఉన్నాను.. బిజీ గా ఉన్నావా. పరవాలేదు చెప్పు. నీకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఇద్దామని ఫోన్ చేశాను. మనకి ఒక మ్. న్. సి ప్రాజెక్టు వచ్చింది. దానికి బిల్డింగ్ డిజైన్ నీతో చేయిపించి నీ టాలెంట్ ప్రపంచానికి చూపించాలి అని నా కోరిక. ఈసారైనా వర్క్ పర్ఫెక్ట్ గా చేసి ఇస్తావా విశి.. ఆ మాటకి ఒక నిమిషం డల్ అవుతుంది. తప్పకుండా... నా ఎఫెక్ట్స్ పెట్టి ఈసారి బాగా చేసి ఇస్తాను. డీటెయిల్స్ అన్ని నీకు పంపిస్తాను. నాకు ఇంపార్టెంట్ వర్క్ ఉంది బాయ్ అని ఫోన్ పెట్టేస్తాడు. గౌతమ్ నిజంగా అవకాశవాద... కథ కొనసాగుతుంది...
29-03-2026, 01:17 PM
So, Vishishta.. it is!! Vishishtamaina peru!!
30-03-2026, 06:54 AM
Part - 7
విశి డల్ అవడం చూసి ఏమయింది.. గౌతమ్ కి ప్రాజెక్టు వచ్చింది అంట.. ఈసారి పర్ఫెక్ట్ గా చెయ్యి అని చెబుతున్నాడు.
బట్ నేను ఎఫెక్ట్స్ మొత్తం పెడుతున్న. ఎక్కడో మైనస్ జరుగుతుంది. పిచ్చిమొహం.. నిజంగానే వర్క్ లో తేడా ఉంటే అంత పెద్ద ప్రాజెక్ట్ నీతో ఎందుకు చేయిస్తారు. ఒకసారి ఆలోచించు. గౌతమ్ కి నా మీద ప్రేమ ఎక్కువ. నన్ను ఎలాగైనా ప్రపంచంలో ఒక గొప్ప ఆర్కిటెక్చర్ గా చూపించాలి అన్న కోరిక. తల పట్టుకుని నిన్ను ఎవరు బాగుచేయలేరు. భగవంతుడా దీన్ని బాగు చేసి సరైన దారిలో పెట్టే వాళ్ళని తొందరగా తీసుకువచ్చి దీని ముందు నుంచో పెట్టు. అప్పుడు గాని దీనికి అసలు నిజం తెలియదు. ఆపు అని గౌతమ్ పెట్టిన వర్క్ చూస్తూ ఉంటుంది. వైభవ్ కాలేజ్ నుంచి ఇంటికి విజిల్ వేసుకుంటూ వెళతాడు. చందు పూజిత చెవిని కొరికేస్తూ ఉంటుంది. ఏంటిది.. ఎప్పుడు వచ్చింది.. మా అమ్మ చెవి ని ఇలా కోరికేస్తుంది. నాకేమైనా బ్యాండ్ మేళం ప్రోగ్రామ్ ఉందా.. సౌమ్య బేబీ ఎక్కడుంది. ఆ మరదలు అయితేనే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. వెతుకుతూ ఉంటే.. ఎవరిని వెతుకుతున్నావు రా.. మమ్మీ.. నిన్నే వెతుకుతున్నాను. నిన్ను చాలా మిస్ అయిపోయాను. ఐ లవ్ యు సో మచ్ మమ్మీ అని మెడ చుట్టూ చేతులు వేసి గారాలుపోతూ ఉంటాడు. అవునా.. కొంగును దులిపి దోపుకుని ఆ బాధలోనే కాలేజీలో అమ్మాయికి బొకే ఇచ్చావా.. వాట్.. అమ్మాయా.. బోకేనా ఏం మాట్లాడుతున్నావ్? ఎవరు అలాంటి చెత్త ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. చెత్త ఇన్ఫర్మేషన్ కాదు రా.. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ . ఏరా కాలేజీకి వెళ్లి చదువుకోమంటే అమ్మాయిల వెంట తిరుగుతున్నావా అని చెవి పట్టుకుంటుంది. మమ్మీ ప్రూఫ్స్ లేకుండా మాట్లాడొద్దు. ఎవరో నా మీద ఏదో చెబితే అది నమ్ముతావా.. అందులో చందు. అది ఎప్పుడు నాకు యాంటీనే అని కోపంగా చూస్తాడు. నీకు ప్రూఫ్స్ కూడా కావాలా చూడు అని ఫోన్లో వీడియో చూపిస్తుంది. అందులో వైభవ్ బైక్ ని రైస్ చేసుకుంటా వెళ్లి ఒక అమ్మాయి ముందు ఆపి.. హాయ్ బేబీ యువర్ సో బ్యూటిఫుల్. నిన్ను చూస్తూ ఉంటే నా మనసు తేలుతుంది గాలిలో... ఈ బొకే తీసుకొని నా బైక్ ఎక్కితే ఇద్దరం ఎగురుదాము మేఘాలలో... ఏమంటావు మై డియర్ బ్యూటిఫుల్ బేబీ.. ఇందులో ఏముంది వైభవ్. తప్పకుండా బైక్ ఎక్కుతాను. కాకపోతే ఇప్పుడే కాదు రేపు. వై బేబీ.. ఈరోజు డాడీ వస్తున్నారు అని మెలికలు తిరుగుతోంది. ఓకే ఓకే క్యారీ ఆన్.. బైక్ ని ముందుకి దూకిస్తాడు. అది చూడగానే వైభవ్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. టెన్షన్ గా పూజిత వైపు చూస్తూ మమ్మీ నా మీద నువ్వు స్పై పెట్టావా... ఇది తూచ్ నేను ఒప్పుకోను. ఏరా నీలాంటి వాడి మీద కూడా పెట్టాలా.. నువ్వు ఎంత ఎదవ్వో నాకన్నా బాగా ఎవరికి తెలుసు.నువ్వు పెట్టకుండా ఎలా వచ్చింది. ఇలా అని చందు ఫోన్ చూపిస్తుంది. ఒసేయ్ రాక్షసి నీకెందుకే నా విషయాలు. టీస్ చేస్తున్న అమ్మాయి నా ఫ్రెండ్ బావ. నాకు కాల్ చేసి.. ఏమే మీ బావ నాకు లైన్ వేస్తున్నాడు. ఒప్పుకోనా అని అడిగింది. సరే అత్తయ్యకు ఒక మాట చెబితే బ్లెస్సింగ్స్ ఉంటాయి. నీకు మంచి జరుగుతుంది అని వచ్చి చెప్పాను . తప్పా బావ.. పళ్ళు నూరుతూ మా కాలేజీలో నీకు ఫ్రెండ్స్ ఎలా ఉన్నారే. నీది ఫ్యాషన్ డిజైనింగ్. నాది ఇంజినీరింగ్. ఆ అమ్మాయి టెన్త్ లో ఫ్రెండ్ బావ. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా చందు తో గొడవపడతావు ఏంట్రా.. రెండు సంవత్సరాల ముందు అవ్వాల్సిన చదువు ఇంకా చదువుతూనే ఉన్నావు. సిగ్గులేదు ఏంట్రా... అమ్మ నీకు తెలియక మాట్లాడుతున్నావు. నేను సీక్రెట్ జాబ్ చేస్తున్నా అని పాకెట్లో చెయ్యి పెట్టుకుని చెబుతాడు. పైనుంచి కిందికి చూస్తూ నీది జాబ్ చేసే ఫేస్ నా.. చందు పుసుక్కున నవ్వుతుంది. చందు నవ్వు చూసి మండిపోతు కావాలంటే పెదనాన్నని అడుగు. మన కాలేజీలో నే ఇంకా ఎందుకు చదువుతున్నానో చెబుతారు. అప్పుడే నువ్వు మీ పెదనాన్న గారిని లైన్ లో పెట్టుకుని వచ్చావా.. ఇక్కడికి వచ్చేదాకా మీ ఇద్దరి టాపిక్కే నాకు తెలవదు. అలాంటిది ఎలా లైన్లో పెట్టుకుని వస్తానమ్మా.. పెద్దమ్మ నువ్వైనా చెప్పు అని అవని పక్కన కూర్చుంటాడు. ఏదో జాబ్ చేస్తున్నాడు అంట కదా... నువ్వు ఊరుకో అక్క. వాడేది చెప్పినా సరే అవునా అంటావు. కాలేజ్లో అమ్మాయిలు ఏడిపిస్తూ... వాళ్ళ వెనకాల తిరుగుతూ... ఫ్లర్ట్ చేస్తున్నవాడు జాబ్ ఏం చేస్తున్నాడు అంట... అవని వైభవ్ వైపు తిరిగి అవునా అన్నట్టు చుస్తే.. నాలుక బయటపెట్టి ఏమీ లేదు అంటాడు. తల మీద ఒకట్టివేసి... పెద్దమ్మని మాయ చేయగలవు గాని నన్ను మాయ చేయలేవు. అయ్యో నిజం చెబుతున్నాను అమ్మ. మన కాలేజీలో ఎవరైనా ర్యాగింగ్ చేస్తున్నారేమో.. లేకపోతే ఏదైనా ఏంటి సోషల్ ఆక్టివిటీస్ జరుగుతున్నయేమో అని ఇంకా కాలేజీలో ఉన్నాను. ఛ నిజమా.. నువ్వు నన్ను ఎప్పుడు నమ్మవు. ఆ చందునే నమ్ముతావు. సౌమ్య నువ్వు చెప్పు అని సౌమ్యని అడుగుతాడు. సౌమ్య అది నిజమే అనుకుంటా అత్తయ్య. దీనికి అబద్ధం చెప్పడం కూడా రాదు అని తల పట్టుకుంటాడు. సరే అత్తయ్య ఇంటికి వెళతాను. అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది అని చందు బయలుదేరుతూ ఉంటే ఏదైనా తినేసి వెళ్ళు. లేదు పెద్ద అత్తయ్య. పొట్ట చాలా ఫుల్ గా ఉంది. అసలు ఇప్పుడు జరిగిన దానితో రాత్రంతా డాన్స్ చేసిన అరగదు. బాయ్ అని చెప్పి వెళుతూ వైభవ్ కి కన్ను కొట్టి వెళ్ళిపోతుంది. రాక్షసి నన్ను ఇరికించి ఇది మాత్రం ఎంజాయ్ చేస్తుంది. ఎప్పుడో దీన్ని గట్టిగా ఇరికించకపోతే నేను వైభవ్నే కాదు. అవని ఫోన్ రింగ్ అవుతూ ఉంటే.. పెద్దమ్మ అన్నయ్య ఫోన్ అనుకుంటా.. అవును ఈ టైంలో వాడే చేస్తాడు. లిఫ్ట్ చేసి హలో కన్నా అంటుంది. ఏం చేస్తున్నారు అమ్మ.. ఏమీ లేదు నాన్న... వైభవ్ జాబ్ చేస్తున్నాడు కదా... ఆ విషయాలు చెబుతున్నాడు అని వైభవ్ వైపు చేస్తుంది. పూజిత నవ్వు ఆపుకుంటూ తిక్క కుదిరింది ఎదవకి... పెద్దమ్మ ఇలా ఇరికించేసావేమిటి అని ఏడుపు ముఖం పెడతాడు. అదేంట్రా.. నువ్వేగా జాబ్ చేస్తున్నావు అని చెప్పావు. నిన్ను, ఆ సౌమ్య ని సాక్ష్యంగా పెట్టుకుంటే నా బతుకు బస్టాండ్ అయిపోతుంది. వీడియో కాల్ ఆన్ చెయ్ అమ్మ. అన్నయ్య ఇప్పుడు అలాంటివన్నీ అవసరం లేదు. నేను నీతో తర్వాత మాట్లాడుతాను. మూసుకుని ఆన్ చేయి. అవని వీడియో కాల్ ఆన్ చేయగానే... సూర్య కనిపిస్తాడు. అప్పుడే జిమ్ చేసే రావడం వలన... ఒళ్లంతా చెమటలు పట్టి సిక్స్ ప్యాక్ బాడీ ఇంకా హాట్ కనపడుతుంది. అన్నయ్య నువ్వు ఇలాగా కనిపిస్తే అక్కడ అమ్మాయిలు ఆగుతున్నారా.. ఒరేయ్ అమ్మాయిలను చూసి సొల్లు కార్చుకునే టైపు కాదు నేను. ఇంతకీ ఏం జాబ్ వెలగపెడుతున్నారు తమరు అని ఒంటికి పెట్టిన చెమటలు తుడుచుకుంటూ అడుగుతాడు. జాబ్ అంటే మన కాలేజ్ ని అంత కంట్రోల్ లో పెడుతున్నాను. అవునా సరే నేను కొన్ని డీటెయిల్స్ అడుగుతాను. క్లియర్గా చెప్పు. అన్నయ్య బిజినెస్ విషయాలు అందరి ముందు మాట్లాడుకోకూడదు. మనిద్దరం సపరేట్గా మాట్లాడుకుందాం అని పూజిత చూడకుండా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు వస్తున్నారు మీరిద్దరూ... ఇంకో 15 డేస్ లో బయలుదేరుతున్నాము. ఇక్కడ వర్క్ అంతా ఫినిష్ అయ్యింది. నాన్న చెప్పిన ప్రాజెక్ట్ కూడా లైన్ లో పెట్టేసాము. మంచిది నాన్న.. తొందరగా రండి చూసి చాలా రోజులైపోయింది. రోజులు కాదు సంవత్సరాలయిపోయింది. ఎంత చిక్కిపోయారో ఇద్దరూ అంటుంది. నీ కళ్ళకు నేను చిక్కినట్టు కనిపిస్తున్నానా... ఫోన్ లో అలాగే బొద్దుగా కనబడతారు. నాకు తెలియదా.. శ్రీకర్ వచ్చి హాయ్ ఆంటీ.. హాయ్ రా ఎలా ఉన్నారు. మాకేంటి సూపర్ అని చూస్తూ ఉంటాడు. సౌమ్య దొంగ చూపులు చూస్తూ ఉంటే చిన్నగా నవ్వుకుంటాడు. తొందరగా వచ్చేయండిరా చాలా బెంగగా ఉంది. మాకు అలాగే ఉంది. వచ్చేస్తాము. ఏరా వైభవ్ కాలేజీలో ఏదో గడిబిడి చేస్తున్నావంట. ఈఇయర్ బయటికి వస్తావా లేక అలాగే కంటిన్యూ చేస్తావా... లేదు బావ నేను చాలా సీరియస్ గా చదువుతున్నాను. అవునా చందు పంపిన వీడియోలో అలా లేదే.. ఆ రాక్షసి మీకు కూడా పెట్టిందా.. ఫ్యామిలీ గ్రూప్ లో పెట్టింది చూడలేదా... ఏంటి బావా నువ్వు అనేది. అవును రా గ్రూప్ లో పెట్టింది. అది చూసే నిన్ను అడుగుతున్నాను. సరే బావ నాకు పని ఉంది అని నీరసంగా ఫోను అవని చేతికి ఇచ్చి.. ఇప్పుడు ఈ గండం నుంచి నన్ను కాపాడే వాళ్ళు ఎవరున్నారు.. నానమ్మ అంటే అబ్బే కష్టం. తాతయ్య అని ఎటు మాట్లాడతారో ఏంటో... విక్రమ్, పూజితని తప్పించి అందరిని ఒక రీల్ వేసుకుంటాడు. కానీ ఎక్కడ హోప్ కనిపించదు. ఒక్క రాజ్ తప్ప. ఎస్ రాజ్ మావయ్య అయితేనే నాకు హెల్ప్ చేయగలుగుతాడు. రూమ్ లోకి పరిగెత్తుకు వెళ్లి లాక్ చేసుకుని రాజ్ కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చూసి తల కొట్టుకుంటూ వెదవకి ప్రాబ్లం వచ్చినప్పుడల్లా నేనే కనపడతాను. మళ్ళీ ఆ ప్రాబ్లం క్రియేట్ చేసేది నా కూతురే. సాల్వ్ చేస్తే నా కూతురుతో ప్రాబ్లం. చేయకపోతే వీడితో ప్రాబ్లం. ఇద్దరూ కలిసి నన్ను బంతి ఆట ఆడేసుకుంటున్నారు. లిఫ్ట్ చేసేదాకా చేస్తూనే ఉంటాడు అని లిఫ్ట్ చేసి చెప్పరా.. మామ అని రాగం అందుకుంటాడు. ఫోన్ ని దూరంగా పెట్టి... చెవులు మూసుకుంటాడు. వైభవ్ బాధ ???
30-03-2026, 06:56 AM
Part - 8
మామ వింటున్నావా అని వైభవ్ రాగం అందుకుంటే... ఒరేయ్ ముందు ఏడుపు ఆపి విషయం ఏంటో చెప్పరా... ఇంకా చెప్పడానికి ఏముంది మామ..
నా బతుకు బస్టాండ్ అయిపోయింది. అంత బస్టాండ్ అయ్యే ప్రోగ్రాం ఏం జరిగింది రా... అంతా నీ కూతురు వల్లే.. చందూనా... ఏం చేసింది. నువ్వు ఇంకా మన గ్రూప్లో పోస్ట్ చేసిన వీడియో చూడలేదా? అవునా.. ఇప్పటివరకు వర్క్ బిజీ లో ఉన్నాం రా... ఆన్ చేయలేదు. మామయ్య.. ప్లీజ్ వెంటనే పెదనాన్న ఫోన్లో నుంచి ఆ వీడియో డిలీట్ చేయవా.. ఒరేయ్ ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా.. నేను వెళ్లి ఫోన్ తీసుకుని డిలీట్ చేయడం. అప్పుడు గాని నా వీపు విమానం మోత ఎక్కదు. ఇంత పెద్ద వాడివైనా సరే నువ్వు భయపడతావ్ ఏంటి మావయ్య.. అందులోనూ నువ్వు మా ఇంటి అల్లుడువి. మా పెద్దనాన్నకి ఆ రెస్పెక్ట్ ఉంటుందిలే... ఒరేయ్ పిచ్చి సన్నాసి ఇంటి అల్లుడిని నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా... నా పెళ్ళికి ముందు నుంచి కూడా మీ వాళ్ళందరూ నన్ను ఎలా ఆడుకున్నారో కథలుగా చెబితే.. అది నా షష్టిపూర్తి అయిన అవ్వదు. అలాంటిది ఇప్పుడు సపరేటు రెస్పెక్ట్.... అంత సీన్ లేదు. ఇంతకీ ఆ వీడియో ఏంటి.. నన్ను ఒక్కసారి చూడని.. అని ఆన్ చేస్తాడు. అది చూసి పగలబడి నవ్వుతూ ఏరా అదేం ప్రపోజ్ చేయడం. ఏదో సరదాగా చేసాము. వయసులో ఉన్న వాళ్ళు ఆ మాత్రం అల్లరి చేయరా ఏంటి... ఏ మీరు మాత్రం చేయలేదా... ఒరేయ్ మేము అల్లరి చేశాము కానీ ఇలాగ అమ్మాయిలని ఫ్లట్ చేయలేదు. ఏదోలే మావయ్య.. ప్లీజ్ సేవ్ చెయ్యి. ఆ రాక్షసి గ్రూప్లో పోస్ట్ చేసింది. ఇంటికి రాగానే అమ్మ నాకు బడిత పూజ చేసింది. పెదనాన్న ఇంటికి వచ్చాక... అమ్మో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఆల్రెడీ అన్నయ్య చేతిలో అక్షింతలు పడబోయి... జస్ట్ తప్పించుకున్నాను. నువ్వు సాక్షాలతో దొరికిపోతే ఎలా సేవ్ చేయాలి రా... అదంతా నాకు తెలియదు. నువ్వు.. నన్ను సేవ్ చేయాల్సిందే. చేయకపోతే నా సంగతి తెలుసు కదా... నీ కూతురు గదిలోకి వస్తా... రాత్రంతా చందు గదిలోనే ఉంటా.. కాలేజీకి వెళ్లేటప్పుడు దాని కార్ టైర్లు పంచర్ చేస్తా..దాని డ్రెస్సెస్ మ్యాచింగ్ ఐటమ్స్ అన్ని ఎత్తుకుపోతా... ఒరేయ్ నువ్వు ఏదైనా చెయ్యగాని ఆ మ్యాచింగ్ ఐటమ్స్ మాత్రం తియ్యకురా... తీయకుండా ఉండాలి అంటే నన్ను సేవ్ చేయాల్సిందే. సాయంత్రం ఇక్కడికి వచ్చి.. ఎవరూ నన్ను ఏమీ అనకుండా సేవ్ చెయ్. అప్పుడు చందు ని ఏ విధంగాను ఇబ్బంది పెట్టను లేకపోతే... ఛీ ఎదవ అని ఫోన్ పెట్టేస్తాడు. హమ్మయ్య మావయ్య వచ్చి నన్ను సేవ్ చేస్తాడు. అప్పుడు దాకా నేను గదిలోనే ఉంటే నాకు చాలా మంచిది. రాజ్ తల పట్టుకుని కూర్చుంటే.. వినయ్ చూసి ఏమైంది బావ. తలపోటా... టాబ్లెట్ తెప్పించనా.. కాఫీ తెప్పించనా.. ఒరేయ్ మీ బాబు కొడుకులు ఎందుకురా నా జీవితంతో ఆడుకుంటారు. మళ్ళీ నా కొడుకు ఏం చేశాడు. ఒక్కసారి ఈ వీడియో చూడమ్మా అని ఇస్తాడు. వీడియో చూసి ఈ ఎదవ ఇలాంటివి కూడా చేస్తున్నాడా.. ప్లీజ్ రా మీ అందరికీ కాళ్లు పట్టుకుంటాను. వాడిని ఏమీ అనకండి..బావ నువ్వు అలా గారం చేయబట్టే మరి రెచ్చిపోతున్నాడు. అసలు ఇంటికి వెళ్ళాక వాడిపని... ఎందుకు అలా అరుస్తావు. మనం చేయలేదా అల్లరి. అలాగే వాడు చేస్తున్నాడు. అరే మనం అల్లరి చేసినా శుభ్రంగా చదువుకునేవాళ్ళము. అంతేగాని ఆడపిల్లలు వెనకాల చండాలంగా పడేవాళ్ళం కాదు. వాడుఇంత ఎదవ పని చేస్తుంటే ఇంకా వెనకేసుకొస్తావేంటి బావ. భరతు వచ్చి ఏముంది వినయ్.. బ్రో నీ... బ్లాక్మెయిల్ చేసి ఉంటాడు. అంతేనా బ్రో. అంతే అని నీరసంగా అంటాడు. ఏంటి వీడు బ్లాక్ మెయిల్ కూడా మొదలుపెట్టాడా.. ఇంటికి వెళ్లేటప్పుడు నాలుగు స్ట్రాంగ్ బెల్ట్ తీసుకువెళ్లి ఒళ్లంతా చీరేయాలి. ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను. వాడిని ఏదైనా అంటే... నేను అందరిని వదిలేసి సన్యాసం తీసుకుని హిమాలయాల్లోకి వెళ్ళిపోతాను. నేను ఎవరి టార్చర్ భరించలేను. అంత దారుణంగా ఏం భయపెట్టాడు. ఏదో ఒకటిలే.. ఏదో ఒకటి ఏమిటో నేను చెప్పనా... చెప్పు బావ అని వినయ్ భరత్ వైపు తిరుగుతాడు. ఏముంది చందు మ్యాచింగ్ ఐటమ్స్ ఏదైనా మిస్ చేసేస్తాను అని చెప్పి ఉండాలి. అందుకే మా బ్రో గుండెల్లో విమానాలే కాదు రాకెట్లు కూడా పరిగెడుతున్నాయి. అవునా బావా అని వినయ్ అంటే.. అవును రా అందుకే చెబుతున్నాను.దయచేసి వాడిని ఏమీ అనవద్దు. అరే వాడిని ఏమీ అనకపోతే ఇంక ఎప్పటికీ నేర్చుకుంటాడు. ఇలా అల్లరిగా తిరుగుతూ ఉంటాడా అని విసుగ్గా అంటే... ఇంకెంత రా... 15 రోజుల్లో సూర్య వచ్చేస్తున్నాడు కదా... సూర్య చేతుల్లో పెడితే నీ కొడుకుని చేపను తోమినట్టు తోముతాడు. దెబ్బకి వాడే లైన్లోకి వస్తాడు అని భరత్ అంటే అది నిజమేలే... ఏమిటి మేమిద్దరం లేకుండా మీ ముగ్గురు డిస్కషన్ పెట్టారు అని విక్రమ్, శ్రీ వస్తారు. ఏముంది ఎప్పుడూ ఉంటే బాగోతమే.. వీడి కూతురు వాడి కొడుకు హంగామా... మళ్లీ ఏం చేశారు అని ఫోన్ లో వీడియో చూసి విక్రమ్ చిన్నగా నవ్వుకుంటాడు. ఏంటి అన్నయ్య నవ్వుతున్నావు కోపం రావడం లేదా... ఒరేయ్ ఈ వయసులో పిల్లలు ఇలా కాకపోతే ఎలా ఉంటారు. సూర్య గాని, శ్రీకర్ గాని ఇలా ఉన్నారా వీడే తేడా.. తేడా కాదు అది లైఫ్ ఎంజాయ్ చేయడం..వాళ్ళిద్దరికీ లైఫ్ ఎంజాయ్ చేయడం రాదు అని శ్రీ అంటే... అవునవును వాళ్లకి రాదు వీడికి బాగా వచ్చు. ఏదో ఒకటి చేసి వాడిని లైన్ లో పెట్టు అన్నయ్య లేకపోతే చాలా కష్టం. టెన్షన్ పడకు. వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత ముగ్గురికి ఒక టాస్క్ ఇస్తాను. అప్పుడు వాడే లైన్ లోకి వస్తాడు. సూర్య ఆఫీస్ కి వెళ్లడానికి రెడీ అవుతూ ఉంటాడు. షర్ట్ బటన్ పెట్టుకుంటూ మెడలో చైను చూసుకుంటాడు. చైన్ కి ఉన్న రింగ్ ని చూసి ఎక్కడున్నావు క్యూటి ? నీ గుర్తుగా నేను ఎప్పుడూ ఇది మెడలోనే ఉంచుకుంటున్నాను. మరి నా గుర్తుగా నీ దగ్గరే ఉంచుకుంటున్నావా? చిన్నపిల్లవి అని ఆంటీ దాచేసారా... ఎందుకో ఈ మధ్యన చాలా ఎక్కువగా గుర్తుకు వస్తున్నావు. ఇండియా వచ్చిన తర్వాత ఒకసారి అన్నవరం రావాలి. నీ గురించి ఎంక్వైరీ చేయాలి. ఎలా ఉన్నావో.. ఏం చదువుతున్నావో... చదువుతున్నావా లేక పెళ్లి చేసేసుకున్నావా... పెళ్లి అన్నం విషయం వచ్చినప్పుడు సూర్యకి ఎందుకో నచ్చదు.. అప్పుడే నీకు పెళ్ళి ఏమిటి... చదువుకో.. స్టడీస్ అయిపోతే మన కంపెనీలోనే నీకు జాబ్ ఇస్తాను. నీకు మంచి సెక్యూర్డ్ లైఫ్ అరేంజ్ చేస్తాను అని చైన్ చూసుకుంటూ మనసులో మాటలు చెప్పుకుంటూ ఉంటాడు. శ్రీకర్ అది చూసి ఏంటి బావ మళ్ళీ నీ క్యూటి తో మాట్లాడుతున్నావా.. ఎందుకోరా ఈ మధ్యన బాగా గుర్తుకువస్తుంది. చాలా డిస్టర్బెన్స్ గా అనిపిస్తుంది. బావ నిన్న ఒక విషయం అడుగుతాను సిన్సియర్గా జవాబు చెప్పు. నీ దగ్గర ఏదైనా దాచేనా.. నువ్వు క్యూటి ని లవ్ చేస్తున్నావా.. ఒరేయ్ ఏం మాట్లాడుతున్నావ్. నేను సీరియస్ గా అడుగుతున్నాను. ఆ వయసులో ప్రేమ ఏంట్రా.. ఎందుకో చూడగానే నచ్చింది. మనసులో ఆ రూపం అలా ముద్ర పడిపోయింది. అంతేగాని లవ్వు కొవ్వు లాంటి ఏమీ లేదు. ఏమో బావ నీతో చాలామంది ఫ్రెండ్షిప్ చేయడానికి చూస్తున్నారు. కానీ ఎవరిని దగ్గరికి రానివ్వవు. ఎప్పుడో మన చిన్నప్పుడు ఒక్క ఐదు నిమిషాలు మాట్లాడిన ఆ పాపను మాత్రం ప్రతిరోజు గుర్తు చేసుకుంటావు. చెప్పాను కదా మనసులో ముద్ర పడిపోయింది అని... ఈ చైన్ తో మాట్లాడుతూ ఉంటే.. క్యూటీతో మాట్లాడినట్టే ఉంటుంది. ఆ రోజంతా చాలా బాగుంటుంది. అదే మాట్లాడకుండా వర్క్ స్టార్ట్ చేస్తే చాలా డిస్టర్బెన్స్ గా అనిపిస్తుంది . ఇది ఏమిటో తెలియదు. అందుకే ఇండియా వెళ్ళిన వెంటనే మనం అన్నవరం వెళదాం. క్యూటీని వెతుకుదాం. క్యూటీ ఊరు ఎక్కడో మనకు తెలియదు కదా... ఎలా వెతుకుతావు. పైగా పేరు కూడా తెలియదు చూద్దాం.. మనం ప్రయత్నం అంటూ మొదలుపెడితే ఏదోకదారి కనిపిస్తుంది. ఇద్దరూ రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్తారు. కారు దిగి లోపలికి వెళుతూ ఉంటే రెండు లయన్స్ కలిసి వస్తున్నాయా అన్నట్టు స్టాప్ అందరికీ గుండెల్లో దడదడగా ఉంటుంది. ఒకళ్ళు రాకుమారుడు అయితే మరొకరు గ్రీకువీరుడు లాగా ఉంటారు. వర్క్ విషయంలో మాత్రం రాక్షసులే. సిన్సియర్గా వర్క్ చేసే వాళ్లకి బాగా రెస్పెక్ట్ ఇస్తారు. అందుకే స్టాఫ్ మొత్తం కూడా సిన్సియర్గా వర్క్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కాలేజ్ అయిపోయిన తర్వాత విశిష్ట భవ్య కి బాయ్ చెప్పి రెస్టారెంట్ కి వెళుతుంది. డ్రెస్ చేంజ్ చేసుకుని.. వెయిటర్ డ్రెస్ వేసుకొని డ్యూటీలోకి వెళ్ళుతుంది. తన తోటి వర్కర్స్ అందర్నీ నవ్వుతూ విష్ చేసి కస్టమర్స్ దగ్గరకు వెళ్ళి ఆర్డర్స్ తీసుకుంటుంది. వర్క్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళుతూ మేనేజర్ని కలుస్తుంది. మేనేజర్ కి విశిష్ట అంటే చాలా రెస్పెక్ట్.. ఈ వయసులో చదువుతూ జాబ్ చేసుకుంటుంది.. తల్లి విషయంలో చాలా కేర్ తీసుకుంటుంది. వీలైనంత సహాయం చేస్తూ ఉంటాడు..మనీ విధంగా ఏ విధమైన హెల్ప్ చేయాలి అనుకున్న విశిష్ట సున్నితంగా తిరస్కరిస్తుంది. వర్క్ ఉంటేనే తీసుకుంటాను అని జాబ్ పరంగా మాత్రమే మనీ తీసుకుంటుంది. అందుకే విశిష్ట అంటే ఒక తెలియని రెస్పెక్ట్. విశిష్ట ని చూడగానే మేనేజర్ ఏమ్మా ఏమైనా మాట్లాడాలా.. అవును సార్. అది అని ఇబ్బందిపడుతూ ఉంటే... నువ్వు నా దగ్గర ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు..నా చెల్లెలు లాంటి దానివి చెప్పు. ఈ మంత్ శాలరీ కొంచెం ముందుగా ఇవ్వగలుగుతారా... ఏరా అమ్మని హాస్పిటల్ కి తీసుకువెళ్లాలా... విశిష్ట సమాధానం... కథ కొనసాగుతుంది..
31-03-2026, 06:31 AM
superb bro manchi gripping toh nadustunnadi story
31-03-2026, 07:50 AM
Part - 9
ఈ మంత్ శాలరీ ముందు ఏమైనా ఇవ్వగలరా సార్.. ఏరా అమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్లాల.
అవును కొన్ని ఎక్స్ట్రా టెస్టులు రాశారు. అవి చేయించాలి . సరే నేను అరేంజ్ చేస్తాను. థాంక్యూ సార్. అమ్మ విశిష్ట.. చెప్పండి సార్.. అన్నయ్య అని పిలవచ్చు కదరా అంటే వద్దు సార్ బంధాలు మనుషుల్ని ఎప్పుడూ మోసం చేస్తాయి. నాకు ఇలా ఉంటేనే బాగుంది. తప్పుగా అనుకోవద్దు. చచ్చా.. నిన్ను తప్పుగా అనుకోవడమేంటిరా.. ఒక్క పది నిమిషాలు వెయిట్ చెయ్ నేను ప్రాసెస్ కంప్లీట్ చేసి నీకు శాలరీ అరేంజ్ చేస్తాను. సరే అని అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది. టెన్ మినిట్స్ లో మేనేజర్ వచ్చే శాలరీ ఇచ్చి ఎక్స్ట్రా అమౌంట్ కావాలంటే చెప్పరా.. నేను ఇస్తాను. నెక్స్ట్ మంత్ చూసుకుందాంలే. ఊరికినే కాదు. అవసరం అయితే నేను అడిగే ఫస్ట్ పర్సన్ మీరే సార్ థాంక్యు అని బయటికి వస్తుంది. వెళుతున్న విశిష్టాని చూస్తూ ఈ రోజుల్లో ఇంత ఆత్మ అభిమానం ఉంటే బతకలేరు. ఎలా నెట్టుకొస్తావో ఏంటో అనుకుంటూ చూస్తూ ఉంటాడు. ఇంటికి వెళ్ళిన విశిష్ట లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళుతుంది. అది సింగిల్ బెడ్ రూమ్ ఫ్లాట్. ఒక పక్కగా చిన్న కిచెన్, ఒక బెడ్ రూమ్ వాష్ రూమ్ మాత్రమే ఉంటాయి . విశిష్ట ఫాదర్ చనిపోయిన తర్వాత విశిష్ట మదర్ అయినా భానుమతి డీప్ షాక్లోకి వెళ్లిపోతారు. ఎంతసేపు ఆమె భర్త బ్రతికున్నారు అన్న ఊహలోనే ఉండిపోతారు. ఏమండీ ఏవండీ అని కలవరిస్తూ బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. అందుకనే విశిష్ట కాలేజీ కి వెళ్లే ముందు భానుమతికి జాగ్రత్తలు చెప్పి బయటే లాక్ చేసుకుని వెళ్ళిపోతుంది. విశిష్ట రాగానే భానుమతి వచ్చావా.. రా భోజనం చేద్దువు గానీ. నువ్వు తిన్నావా అమ్మ. మీ నాన్నగారు ఇంకా రాలేదు రా.. నేను ఎదురు చూస్తున్నాను. వచ్చాక ఇద్దరం కలిసి తింటాము. అయ్యో చెప్పడం మర్చిపోయానమ్మా. నాన్నగారు ఫోన్ చేశారు. పొలానికి సంబంధించి ఎరువులు కావాలంట. సిటీకి వెళ్తున్నాను. ఈ రాత్రికి రావడం అవదు. అమ్మ నువ్వు జాగ్రత్త అని చెప్పారు. అవునా.. సరేలే పొలం కన్నా ముఖ్యమైనది ఏముంటుంది. అక్కడ భోంచేసారో లేదో ఒకసారి ఫోన్ చెయ్ తల్లి. చేశానమ్మ భోజనం చేసారు. పడుకున్నారు. ఈసారి ఫోన్ చేసినప్పుడు నాకు ఇవ్వు. వచ్చేటప్పుడు బంగారపు కొట్టుకు వెళ్లి నగలు తెమ్మని చెప్పాలి. సరే అమ్మ అని తల్లి వైపు వచ్చే ఏడుపు ఆపుకుంటూ చూస్తోంది. ఇద్దరూ భోజనం చేసి పడుకుంటారు. ఉదయం విశిష్ట లేచేటప్పటికీ భానుమతి లేచి ముగ్గు పెట్టి తులసి కోటకి పూజ చేసి వంట చేస్తూ ఉంటారు. ఎప్పుడు లేచావమ్మా అన్ని పనులు అయిపోతున్నాయి. మీ నాన్నగారు వస్తారేమో అని రాత్రంతా నిద్ర పట్టలేదు విశి. అందుకే తొందరగానే లేచాను. నీకు కాలేజ్ టైం అవుతుంది కదా... స్నానం చేసి రా... టిఫిన్ చల్లారిపోతుంది . ఇప్పుడే ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను. స్నానం చేసి దేవుడి ముందు నిలబడి కుంకం పెట్టుకుని.. భగవంతుడా సమస్యలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వు. అమ్మ ఎప్పుడూ నాతో ఉండేలాగా చూడు. నాకు ఈ ప్రపంచంలో మిగిలిన బంధం ఏదైనా ఉంది అంటే అది అమ్మ మాత్రమే. దండం పెట్టుకొని తల్లి దగ్గరికి వెళుతుంది. రా కూర్చో నేను తినిపిస్తాను అని కొసరి కొసరి తినిపిస్తారు. చాలా మా అన్న సరే ఏం చాలు. ఇప్పుడు తిని మళ్లీ సాయంత్రం కాలేజీ అయ్యే వరకు తినడం లేదు. అన్ని కాలేజీలు అయిదింటికి అయిపోతే.. మీ కాలేజ్ వాళ్ళు మాత్రం లేటుగా పంపిస్తున్నారు. నువ్వు తొమ్మిదింటి దాకా రావడం లేదు. స్పెషల్ క్లాసులు అమ్మ. ఫైనల్ ఇయర్ కదా అందుకని.. ఏం క్లాసులో ఏమో.. వచ్చేటప్పటికి తోటకూర కాడలాగా వాడిపోతున్నావు. పెళ్లి కావలసిన దానివి నీకెందుకే ఈ చదువులు. ఇంకొకసారి పెళ్లి అన్నావంటే ఊరుకోను. నేను బాగా చదువుకుని నాన్నగారి పేరు నిలబెట్టాలి. ఇదంతా మీ నాన్నగారు చేస్తున్న గారాబమే. రాని ఇంటికి.. ముందు మీ నాన్నగారితో చెప్పిస్తే అప్పుడు నువ్వు లైన్లోకి వస్తావు. సరే అమ్మ నేను కాలేజ్ కి వెళుతున్నాను. నువ్వు అసలు బయటికి రావద్దు. నాన్నగారు గాని, నేను గాని వచ్చాకే లాక్ తీస్తాము. అప్పుడు దాకా లోపలే ఉండు. ఒకటికి 100 జాగ్రత్తలు చెప్పి బయట లాక్ చేసుకుని బాధగా ఫ్లాట్ వైపు చూస్తూ ఇంకా ఎన్నిరోజులు అమ్మ మనకి బాధ అనుకుంటూ ఆ కాలేజీకి బయలుదేరుతుంది. కాలేజీకి వెళ్లిన విశి డల్ గా ఉంటే... భవ్య ఏమైంది అలాగ ఉన్నావు. అమ్మ గురించా.. నాకు ఈ ప్రపంచంలో ఉన్న బంధం అమ్మ మాత్రమే. కాలేజ్ నుంచి ఇంటికి వెళ్ళగానే అమ్మతో ఆరోజు జరిగినవన్నీ చెప్పుకుని ఒళ్లో పడుకోవాలిని ఉంది. కానీ అమ్మనే ఒక చంటి బిడ్డ లాగా చూసుకోవాల్సి వస్తుంది. అలసిపోతున్నాను భవ్య. భవ్య బాధగా విశిష్ట చేతిని పట్టుకుంటుంది. వెంటనే విశిష్ట సర్దుకుని.. ఐయామ్ ఓకే. ఎందుకో కొంచెం రిలాక్స్ కావాలి. నా అన్న మనిషితో నా బాధ చెప్పుకోవాలి అనిపిస్తుంది. గౌతమ్ కి కాల్ చేయకపోయావా . గౌతమ్ తో ఎందుకో ఇలాంటివి నేను మాట్లాడలేను. ఎంతసేపు ప్రొఫెషనల్ గా మాట్లాడుతాడు తప్ప మిగిలిన విషయాలు గురించి మాట్లాడడు. అలాంటప్పుడు నేను ఏమి చెప్పగలను. అర్థం చేసుకో విశి గౌతమ్ ఓన్లీ నీ టాలెంట్ ని యూస్ చేసుకుంటున్నాడు. బయట అయితే ఎక్కువ అమౌంట్ ఇవ్వాలి అని నిన్ను ప్రేమ పేరుతో ట్రాప్ చేస్తున్నాడు. లేదు.. గౌతమ్ ఒక బిజినెస్ మ్యాన్ అందుకే ప్రొఫెషనల్ గా ఉంటున్నాడు. మిగిలిన టైం ఖాళీ ఉండదు కదా.. నువ్వు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఇంకా వాడుకుంటారు విశి. ఎలా చెబితే నీకు అర్థం అవుతుందో నాకు తెలియడం లేదు అని మనసులో అనుకుంటుంది ప్లీజ్ భగవంతుడా దీనికి సూట్ అయ్యే అసలు హీరోని తొందరగా తీసుకువచ్చి దాని జీవితంలోనికి ఎంటర్ చెయ్. నీ గుడికి వచ్చి 108 కొబ్బరికాయలు కొడతాను. నిద్రలో ఉన్న సూర్యకి ఒకటే పొలమారుతూ ఉంటుంది. లేచి మంచినీళ్లు తాగి కాసేపటికి స్థిమితపడతాడు. చైను పట్టుకుని ఏమైంది క్యూటి.. నా గురించి ఆలోచిస్తున్నావా.. ఎప్పుడులేనిది ఈరోజు ఎక్కువ ఇబ్బంది పడుతున్నాను. చాలా అనేసిగా అనిపిస్తుంది. వెంటనే ఇండియా వచ్చేయాలి అనిపిస్తుంది. ఈ దూరం తగ్గి దగ్గరతనం కావాలి. మన మధ్యన ఉన్న బంధం ఏమిటో తెలుసుకోవాలి అని ఇంక పడుకోకుండా ఉంగరం చూస్తూనే ఉంటాడు. ఆ రాత్రి కరిగి తెల్లారుతుంది. శ్రీకర్ సూర్య దగ్గరికి వచ్చి ఏంటి బావ.. రాత్రంతా పడుకోకుండా నీ క్యూటీతో మాట్లాడుతూనే ఉన్నావా... సూర్య మౌనంగా ఉంటాడు. ఏమైంది బావ.. ఏమో తెలియదు. క్యూటి ఇబ్బందుల్లో ఉంది. సంథింగ్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అనిపిస్తుంది. మనం వెంటనే ఇండియా వెళ్ళిపోవాలి. ఇంకా పది రోజులు ఉంది కదా బావ. లేదు ఇమీడియట్ గా వర్క్ ఫినిష్ చేసి బయలుదేరదాం. నేనింకా ఇక్కడ ఉండలేకపోతున్నాను. సరే మాక్సిమం కంప్లీట్ చేద్దామని చెప్పి.. ఆరోజు తొందరగా ఆఫీసుకు వెళ్లిపోతారు. సూర్య ఎంప్లాయిస్ ని పరుగులు పెట్టిస్తాడు. వాళ్లు కోరుకున్నట్టుగానే పది రోజులు వర్క్ ని ఐదు రోజుల్లో ఫినిష్ చేసి ఇండియా ఫ్లైట్ ఎక్కుతారు. ఫ్లైట్ ఎక్కిన సూర్య మనసు మాత్రం ఒక పక్కన సంతోషంగా... మరోపక్కన గందరగోళంగా ఉంటుంది. ఎందుకు నా మనసు నన్ను పదే పదే హెచ్చరిస్తుంది. ఏం జరుగుతుంది.. ఇంట్లో ఎవరికైనా ఇబ్బందా అని ఆలోచిస్తాడు. లేదు అక్కడ అంతా బానే ఉన్నారు. అందరికీ ఫుల్ సెక్యూరిటీ ఉంది. నాన్న హ్యాండిల్ చేస్తున్నారు. ఇంకా ఎవరి గురించి ఆలోచించాలి. క్యూటి నా... క్యూటి ఎలా ఉన్నావు? నీ రూపం ఎలా ఉంటుందో తెలియదు. నేను ఎలా పట్టుకోవాలి. నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నా నీ దరికి చేరుకుంటాను. ఒక్కసారి నువ్వు క్షేమంగా ఉన్నావు అని తెలిస్తే చాలు. నా మనసు కుదుటపడుతుంది. విశిష్ట కాలేజ్ అయిన తర్వాత రెస్టారెంట్ వర్క్ ఫినిష్ చేసుకుని ఇంటికి వెళుతుంది. కూతురు కోసమే ఎదురుచూస్తున్న బానుమతి వచ్చావా.. ఇంకా మీ నాన్నగారు రాలేదు. మనిద్దరి దగ్గర ఉంది ఒకే ఫోన్ కదమ్మా.. నాకు చేశారు.. ఆ ఎరువులు స్టాక్ అయిపోయినాయి అంట. అక్కడే వెయిట్ చేస్తేనే దొరుకుతాయి అంట. అందుకనే ఉండిపోయారు. అవునా.. అమ్మ నాకు కొంచెం వర్క్ ఉంది. డిస్టర్బ్ చెయ్యొద్దు అని గౌతమ్ ఇచ్చిన ప్రాజెక్టు చూస్తూ ఉంటుంది. భానుమతి గారు అన్నం కలిపి తీసుకు వస్తారు. నోరు తెరువు. అమ్మ వర్క్ లో ఉన్నాను. నీ పని నువ్వు చేసుకో. నేను తినిపిస్తాను. ఒక పని చెయ్ నాకు తినిపిస్తూ నువ్వు తినేయ్. ఇద్దరి భోజనం ఒకేసారి అయిపోతుంది.. సరే అని కూతురికి తినిపిస్తూ భానుమతి కూడా తినేస్తోంది. భోజనం అయిన తర్వాత వంటిల్లు క్లీన్ చేసి చేతులు తుడుచుకుంటూ వస్తారు. ఏరా పడుకోవా.. కొద్దిగా వర్క్ ఉంది అమ్మ. నువ్వు పడుకో పొద్దున్నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావు కదా.. అలసిపోయి ఉంటావు. సరే అని భానుమతి గదిలోకి వెళ్లి భర్త ఫోటోను చూస్తూ ఇంకా ఎన్ని రోజులకి వస్తారండి. ఇప్పటికే ఎరువులు కోసం వెళ్లి చాలా రోజులైంది. అమ్మాయి, నేను ఉంటున్నాము. ఆడవాళ్ళు ఇద్దరే ఉంటే ఎంత ఇబ్బందో తెలుసా... తొందరగా వచ్చేయండి అని భర్తతో కబుర్లు చెబుతూ మాత్రలు వేసుకోవడం వల్ల మత్తుగా నిద్రపోతుంది. తల్లి పడుకోవడం చూసి ఒక నిట్టూర్పు విడిచి మళ్ళీ ప్రాజెక్ట్ చూస్తూ ఉంటుంది. సాటిస్ఫాక్షన్ గా వర్క్ చేసాను అనుకున్నాక టైం చూస్తుంది. అమ్మో అప్పుడే టైం ఒంటిగంట దాటిందా... అన్ని సర్ది వర్క్ మొత్తం గౌతమ్ కి ఫార్వర్డ్ చేసి పడుకుంటుంది. సూర్య ప్రయాణం...
31-03-2026, 07:52 AM
Part - 10
సూర్య వస్తున్న ఫ్లైట్ హైదరాబాద్ చేరుకుంటుంది. ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్ బయటికి రాగానే ఒక గుడ్ ప్లేస్సెంట్ గా అనిపిస్తుంది.
ఒక్క నిమిషం కళ్లు ముసుకుని ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఏంటి బావ అలా ఉండిపోయావు.ఏమో శ్రీకర్ నాకు కావాల్సింది నాకు దగ్గరలో ఉంది అనిపిస్తుంది. చూద్దాం అది ఏమిటో.. పద ఇంటికి. చెప్పకుండా వచ్చేసాం అని అమ్మ చిందులు తొక్కుతూ ఉంటుంది. మనం చెప్పకపోయినా బయలుదేరిన విషయం అంకుల్ కి తెలియదా ఏమిటి... తెలిసిన మన నోటితో చెప్పకపోతే అమ్మ అలకలు మామూలుగా ఉండవు. ఆంటీని కన్విన్స్ చేయడం ఈజీ బావ. మా అమ్మని కన్విన్స్ చేయడం ఉంది చూడు పెద్ద తలపోటు.. సరే బాయ్ జాగ్రత్త అని ఎవరి ఇంటికి వాళ్ళు వెళతారు. విక్రమ్ ఆఫీస్ కి వెళ్లకుండా ఇంటి దగ్గరే ఉంటాడు. అదేమిటి ఈరోజు మీరు ఆఫీస్ కి వెళ్లడం లేదు. ఈరోజు మా ఆవిడగారి సేవలో ఉందామని కన్ను కొడతాడు. సిగ్గు లేకపోతే సరి.. ఏమిటా పనులు అని సిగ్గుపడుతుంది. ఇన్ని సంవత్సరాలైనా నువ్వు సిగ్గుపడడం మాత్రం మానలేదు. కొన్ని రోజులు పోతే.. కోడలు వస్తుంది. తర్వాత మనవలు వస్తారు. అయినా నువ్వు ఇలాగే సిగ్గుపడుతూ ఉంటావా... ఏంటి మనవలు వచ్చాక కూడా మీరు ఇలాగే కన్ను కొడుతూ ఉంటారా... ఏ ఎందుకు కొట్టకూడదు. చూసుకోండి మీ జుట్టు రంగు మారుతుంది. రంగు మారితే ఓల్డ్ అయిపోయినట్టేనా.. ఇది బాల మెరుపు. అచ్చ.. ఏ వయసులో వచ్చిన బాల మెరుపు... నేను ఎప్పటికీ బాలుడినే కాబట్టే అది ఎప్పుడొచ్చినా బాల మెరుపే. అయ్యయ్యో ఇంత బాలుడుకి అంత పెద్ద కొడుకు అంటే.. జనం నవ్వుతారు ఏమో కదా.... అయితే ఒక పని చేద్దాం. ఏమిటో మళ్లీ రెండోవాళ్ళకి ప్లాన్ చేద్దాం. అప్పుడు బాలుడికి, ముసలమ్మ కి కలిపి ఒక చిన్న బేబీ వచ్చింది అని చెప్పుకుంటారు. ఏమంటావ్ అని చేయ పట్టుకుని లాగుతాడు. నేను ముసలమ్మ న.. మరి అన్ని ముసలోళ్ళు మాటలే మాట్లాడుతున్నావు. వయస్సు శరీరానికి ఏమోగానీ.. మనసుకు కాదు. నా మనసేప్పుడు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఊ అన్నా సరే... నెలరోజులు గది దాటనివ్వకుండా నీతో పుల్ల మామిడికాయలు తినిపిస్తాను. ఏమంటావ్ భార్యామణి అని బుగ్గపై పెదవులు ఉంచుతాడు. ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా.. ఈ వయసులో మీకు ఇంకొకళ్ళు కావాలా.. మీ అబ్బాయికి తొందరగా పెళ్లి చేయండి. అప్పుడు వచ్చే పిల్లలతో ఆడుకోండి. చూసావా నేను ఫిట్ గానే ఉన్నాను. నువ్వే ముసలిదానివి అయిపోయావు. ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు నేను ముసలిదాన్ని కాదు అంటే పుల్ల మామిడికాయలు తినాలా.. అవును అంటే మీరు బాలుడు నేను ముసలిదాన్ని అని ఒప్పుకోవాలా.. అలా.. ఏమి కుదరదు. మీరు బాలుడైతే.. నేను బాలికనే.. నేను ముసలిదాన్ని అయితే మీరు ముసలోడే అంతే అంటుంది. ఏం చేస్తాం ఎంతటి కింగ్ అయినా పెళ్ళాలు ముందు సలాం కొట్టాల్సిందే.. ఆఫట్రాల్ విక్రమ్ మాత్రం ఎంత.. తలుపు సౌండ్ అవుతూ ఉంటే... ఒక్క నిమిషం అని తలుపు తీస్తుంది. వైభవ్ ఆయాస పడుతూ ఉంటే ఏమైందిరా ఇంత ఆయాస పడుతున్నావు అని గుండెల దగ్గర సవరచేస్తుంది. పెద్దమ్మ అన్నయ్య... అన్నయ్య.. ఆయాసంగా మిగిలిన మాట మింగేస్తాడు. ఏమైందిరా సూర్యకి.. ఏవండీ సూర్యకి ఏమైంది.. విక్రమ్ తల కొట్టుకుంటూ ఒరేయ్ నువ్వు సరిగ్గా చెప్పు. నువ్వు అన్నయ్య... అన్నయ్య.. అని సాగదీస్తే మీ పెద్దమ్మకు బీపీ పెరిగిపోతుంది. అబ్బా పెద్దమ్మ.. అన్నయ్య వచ్చాడు. అవునా సూర్య వచ్చాడా ఏరా ఈ విషయం ఇలాగేనా చెప్పేది అని పరిగెడుతుంది. హలో మేడం మీరేమీ పడుచు పిల్ల కాదు. కొంచెం స్లోగా వెళ్ళు. గుమ్మందాకా వచ్చిన నీ కొడుకు అటే వెళ్ళిపోడు. అవునా అందుకేనా ఆఫీసుకి వెళ్ళకుండా ఇంట్లో కూర్చున్నారు. తర్వాత చెబుతాను మీ పని అని స్పీడ్ గా వెళుతుంది. వెళుతున్న అవనినీ చూసి వైభవ్.. అన్నయ్య చాలా లక్కీ కదా. ఎందుకనిపించింది... పెద్దమ్మ చూడు.. సో స్వీట్.. సో సాఫ్ట్.. అన్నయ్య వచ్చాడు అనగానే చెంగుచెంగున లేడి పిల్లలాగా పరిగెడుతుంది. అదే మా అమ్మ ఉందనుకో ఎప్పుడు నాకు బడితిపూజ చేద్దామా అన్న ప్రోగ్రాంలోనే ఉంటుంది. మీ అమ్మ నిన్ను ఎందుకు కోడుతుంది. పెద్దమ్మ ఎందుకు కొట్టడంలేదు. పెద్దమ్మ స్వీట్. ఇంకొక పాయింట్ లో చెప్పు. అది పెదనాన్న అంటే... అదే చెప్పురా నేను వింటాను కదా అని భుజం మీద చెయ్యి వేసి స్టెప్స్ దిగుతూ ఉంటాడు అన్నయ్య గుడ్ బాయ్ లాగా పెద్దమ్మని విసిగించలేదు. అన్నిట్లో ఫస్ట్ ఉన్నాడు. మరి నువ్వు అంటే... కాలేజ్ నుంచి చాలా కంప్లైంట్స్ వచ్చాయి. అఫ్కోర్స్ ఇప్పటికీ అనుకో.. మరి అలాగా ఉంటే ఏ పేరెంట్స్ కైనా బాధే కదరా.. మీ అమ్మ కొడుతుంది తిడుతుంది అని ఆలోచిస్తున్నావు గాని.. ఇంత వయస్సు వచ్చిన కొడుకుని తిట్టాలి అంటే అమ్మలకి ఎంత బాధో తెలుసా... ఎప్పుడు చిల్ మూడ్ లో ఉండే నా తమ్ముడు కూడా బాధపడుతున్నాడు. నాకు చదవాలని.. అన్నిట్లో టాప్ లో ఉండాలని ఉంటుంది పెదనాన్న. ఏమిటో బుక్ ఓపెన్ చేయగానే నిద్ర వచ్చేస్తుంది. కుదురుగా కాలేజ్ కి వెళదాం అనుకుంటాన.. ఎంటర్ అయ్యేటప్పటికీ రంగురంగుల సీతాకోకచిలుకలు ఎగురుతూ ఉంటాయి. వాటిని చూడగానే మనసు వశం తప్పుతుంది ఏం చేయను చెప్పు. సో తప్పు నీది కాదు. కాలేజ్ అన్నమాట.. అంతే కదా పెదనాన్న. సరే నేను దీని గురించి ఒకసారి ఆలోచించి డెసిషన్ తీసుకుంటాను. దానికి నువ్వు కట్టుబడి ఉండాలి. పెదనాన్న కాలేజ్ మార్చేయాలి అనుకుంటున్నారా... పెద్ద పెద్ద డెసిషన్ తీసుకోకండి. మన కాలేజీ నాకు సేఫ్టీ. ఒరేయ్ ఇప్పుడు నిన్ను కాలేజ్ మార్చిన ఎవరు తీసుకోరు. తొందరగా పదండి పెదనాన్న. హడావిడి చూడాలి అని గుమ్మం దగ్గరకి వస్తాడు. సూర్య నీ బయట ఆపి లలిత దిష్టి తీస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు తీస్తావు నానమ్మ. నువ్వు ఆగరా... వెళ్లి మూడేళ్లు అయింది.. ఇదిగో ఇప్పుడు వచ్చావు. ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏమిటో.. చూడు ఎలా చిక్కుపోయావో... పైనుంచి కిందకి చూసుకుంటాడు. వైభవ్ వచ్చి అన్నయ్య నువ్వు ఎలా చూసుకున్నా సరే వీళ్ళ దృష్టిలో చిక్కిపోయినట్టే... దిష్టి తీయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు లోపలికి రావచ్చా .. రా.. రా బంగారం అని చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువస్తారు. అవని రెండు చేతులు కట్టుకొని పక్కకి తిరిగి ఉంటుంది. సూర్య వెళ్లి అమ్మ ఐ మిస్ యు అని పట్టుకుంటాడు. పోరా వచ్చే ముందు ఒక ఫోను లేదు. సర్ప్రైజ్ గా వద్దామని ఫోన్ చేయలేదు అమ్మ. నువ్వు ఇలా అలిగితే నాకు చాలా బాధగా ఉంటుంది అని సాడ్ గా ఫేస్ పెడతాడు. అయ్యో సూర్య ఊరికినే అన్నాను. నువ్వు డల్ అవ్వకు చెంప మీద చెయ్యి వేసి ఎలా ఉన్నావురా... ఈ అమ్మని ఇన్ని రోజుల్లో చూడాలని అనిపించలేదా... రోజు వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నాడు కదా.. ఇంకా స్పెషల్ గా చూడడం ఏముంటుంది భార్యామణి. ముందు మీరు మాట్లాడకండి. ఎమ్మెస్ చేయాలి. అక్కడ కంపెనీ హ్యాండిల్ చేయాలి అని పిల్లలు ఇద్దరినీ పంపించేశారు. వీడియో కాల్ లో చూసినంత మాత్రాన బెంగ తీరుతుందా.. తినాలి అనుకున్న ఐటమ్ నోటితో తినాలి.. అంతేగాని కళ్ళతో చూస్తే ఆకలి తీరదు... తినాలి అన్న ఫీలింగ్ పోదు. సౌమ్య వచ్చి ఎలా ఉన్నావ్ బావ. గుడ్ నువ్వు ఎలా ఉన్నావు. నీ స్టడీస్ ఎలా ఉన్నాయి రా... బాగుంది అని గుమ్మం వైపు చూస్తుంది . శ్రీకర్ ఇంటికి వెళ్ళాడు అమ్మ అని సౌమ్య ని చూస్తూ అవనికి చెబుతాడు. వెంటనే సౌమ్య తలదించేసుకుంటుంది . సూర్య చిన్నగా నవ్వుకుంటాడు. వరుసకి మరదలు అయినా సరే చెల్లిల్లాగానే చూస్తాడు. ఫ్యామిలీ మెంబర్స్ అందరిని వరసగా పలకరిస్తాడు. సరే ముందు నువ్వు వెళ్లి ఫ్రెష్ అయ్యి రా... టిఫిన్ చేద్దువుగాని అమ్మ నాకు ఇప్పుడు ఆకలిగా లేదు. కాసేపు పడుకుంటాను అని రూమ్ కి వెళ్ళిపోతాడు. సూర్యకి ఇష్టమైనవి చేయాలి అని అవని కిచెన్లోనికి వెళుతుంది. అవనికి తోడుగా పూజిత, విద్య కూడా వెళతారు. విక్రమ్ ఇంటి దగ్గర ఉండిపోతే వినయ్ భరత్ ఆఫీస్ కి వెళతారు. శ్రీకర్ ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ కొడతాడు. వాసుగారు తలుపు తీసి రేయ్ శ్రీకర్ అని ఎత్తుకుని తిప్పుతారు. అబ్బా తాతయ్య నన్ను దింపు. నువ్వేమైనా పడుచు పిల్లోడివి అనుకుంటున్నావా... నిన్ను చూసిన ఆనందంలో నేను కుర్రోడిని అయిపోయాను రా.. తాతకి ఫ్రెండ్ మనవడు అంటే... మనవడు వయసే తాతది. అబ్బో అవునా అనుకుంటూ సురభి వస్తుంది. ఎలా ఉన్నావ్ నానమ్మ... నాకేంటి రా మీ అమ్మ ఉండగా.. సూపర్ అని ఒక నిమిషం ఆగు అని మనవడికి దిష్టి తీస్తుంది. లోపలికి వచ్చి సురభిని గట్టిగా హాగ్ చేసుకొని ఐ మిస్ యు నానమ్మ. ఐ మిస్ యు రా బంగారం. ఈరోజు నా చేతితోనే నీకు వండి పెడతాను. ఇంతకీ వేర్ ఇస్ లవ్ బర్డ్స్.. ఇక్కడ అని ఇద్దరు వస్తారు. డాడ్ అనుకుంటా వెళ్లి శ్రీ చంక ఎక్కుతాడు. ఒరేయ్ ఇంకా నువ్వు చిన్న పిల్లోడివి అనుకుంటున్నావా.. ఇలా ఎక్కుతున్నావు . మిమ్మల్ని మిస్ అయ్యి మీ చంక ఎక్కితే మీరు ఇలా అనడం ఏమీ బాగోలేదు డాడ్.. అదే తాతయ్య చూడండి. నన్ను ఎత్తుకుని రౌండ్స్ తిప్పారు. తిప్పుతారు.. ఆయనదేం పోయింది. నడుం పట్టేసింది అంటే వెనకాల చేయడానికి మళ్లీ నలుగురు కావాలి. అంతేనా నాన్న.. ఒరేయ్ నేను నీలాగా ముసలోడిని కాదురా... ఐ యాం యూత్.. అంత యూత్ అయితే హాస్పిటల్ కి వెళ్లడం ఎందుకు మానేశారు. రిటైర్మెంట్ ఎందుకు తీసుకున్నారు. ఏంటి తాతయ్య మీరు రిటైర్మెంట్ తీసుకున్నారా.. ఎస్ నాతోపాటు మీ నానమ్మ కూడా... ఎందుకు.. లైఫ్ ని ఎంజాయ్ చేయాలి కదా రా.. ఇప్పుడు దాక వర్క్ అని తిరిగాము... ఈ ఏజ్ లో అయినా సరే ఒకరికోసం ఒకరం ఉండి మిగిలిన జీవితాన్ని ఎంజాయ్ చేస్తాం అని కన్ను కొడతారు. క్యూట్ ఫ్యామిలీ ❤️? కథ కొనసాగుతుంది....
31-03-2026, 05:10 PM
Sreekar - Soumya,
Surya - Vishi, marii Vaibhav - Chandu naa?
01-04-2026, 07:52 AM
Part - 11
ఇప్పుడైనా లైఫ్ ని ఎంజాయ్ చేయాలి కదా అని కన్ను కొడతారు. అది చూసిన సురభి సిగ్గు లేకపోతే సరి... ఈ వయసులో ఎంజాయ్ చేస్తారంట.
కృష్ణా రామా అనుకోవడం మానేసి గోవా తిరుగుతారా ఏమిటి... గోవా బీచ్ తిరగాలా ఏమిటి? నువ్వెక్కడుంటే అక్కడే నాకు గోవా బీచ్.. ఏమంటావ్ మనవడా.. నువ్వు సూపర్ తాత. నేను నిన్నే ఫాలో అవుతాను. ముందు బిజినెస్ ని సరిగా హ్యాండిల్ చేయి. తర్వాత మీ తాతని ఫాలో అవ్వడం అని శ్రీ అంటే... నిన్ను చూస్తే జాలేస్తుంది అమ్మ. ఇలాంటి మిషన్ ని ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. కొన్ని కొన్ని విషయాలు అమావాస్య రోజుల్లో జరుగుతాయి రా.. ఇంకేమీ చేయలేము అలా నెట్టుకుంటూ వెళ్లిపోవాల్సిందే... నీ కొడుకుని పౌర్ణమి రోజుల్లో ప్రేమించమను. నాకు ఆఫీస్ టైం అవుతుంది. ఈరోజుకి రెస్ట్ తీసుకో. రేపటి నుంచి ఆఫీసుకు రావచ్చు. లేదు మాకు కొన్ని వర్క్స్ ఉన్నాయి అవి అయిన తర్వాత ఆఫీసుకు వస్తాము. రాగానే ఏం వర్క్ పెట్టుకున్నారు. అది యూత్ కి సంబంధించింది నాన్న. మీలాంటి మిషన్ కి కాదు . నేను మిషన్ లాగా ఉన్నాను కాబట్టే తమరు ఏ వేషాలు వేసిన కుదురుతుంది. నేను కూడా నీలాగే ఎంజాయ్మెంట్ అని తిరిగితే అప్పుడు తెలిసేది. వాడు రాగానే నీ గొడవ మొదలు పెట్టావా... అయినా నా మనవడు అమెరికాలో ఖాళీగా కూర్చున్నాడా ఏంటి.. అక్కడ స్టడీస్ కంప్లీట్ చేశాడు. వర్క్ చేసాడు. నీ బాధ ఏంట్రా.. ఇలాగే వెనకేసుకొరండి . సరే ఎంజాయ్ చేయండి నేను వెళుతున్నాను అని నేహా కి కళ్ళతోనే బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు. వెళుతున్న భర్త వెనకాలే కార్ వరుకు వెళ్లి జాగ్రత్త అంటుంది. ఈ మాటలకేమీ తక్కువ లేదు. వాడు ఎప్పుడు తిన్నాడో ఏమిటో... వాడికి ఇష్టమైనవి చేసి పెట్టు. అబ్బో ఈ ప్రేమ ఎదురుగుండా చూపించొచ్చు కదా.. వెనకాల చెప్పకపోతే... నేను నాన్నను ఇలాగే ఉండాలి. నువ్వు అమ్మవి అలాగే ఉండాలి. నేను కూడా నీ రూట్ లోకి వచ్చాను అనుకో ఇంక నీ కొడుక్కి ఎక్కడలేని కొమ్ములు వచ్చేస్తాయి అని నవ్వుతూ కారు స్టార్ట్ చేస్తాడు. వెళుతున్న భర్తకి చెయ్యి ఊపి లోపలికి వస్తుంది. ఏమంటున్నారు అమ్మ మీవారు.. నీ చెవులు మెలియమన్నారు వెయ్యనా.. వద్దు మమ్మీ. నా చెవులను అలాగే ఉంచు. నేను ఫ్రెష్ అయి వస్తాను అని రూమ్ కి వెళ్తాడు. రూమ్ కి వెళ్లి స్నానం చేసి సూర్యకి కాల్ చేస్తాడు. చెప్పరా .. ఏం చేస్తున్నావ్ బావా. నీ మీద బెంగ పెట్టుకుని చిక్కుపోయాను రా. అదేంటి బావ వన్ అవర్ కూడా అవ్వలేదు. అలా అలా చిక్కిపోతావు. కదా.. మరి ఇంతలోనే ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్తాను రా.. రూమ్ కి వచ్చి స్నానం చేసి రిలాక్స్ అవుతున్నాను. అవునా ఇంకేమన్నా విశేషాలు ఉన్నాయేమో అని ఫోన్ చేశాను. డైరెక్ట్ గా సౌమ్య ఏం చేస్తుందని అడగొచ్చు కదా... సౌమ్య గురించి నాకెందుకు బావ అని తడబడుతూ అడుగుతాడు. ఒరేయ్ నీ వేషాలు నా దగ్గర వేయకు. మీ ఇద్దరిది సైలెంట్ లవ్ అని నాకు తెలుసు. ప్రపోజ్ చెయ్యి. ఉత్తి పిరికిది బావ. ప్రపోజ్ చేసిన ఎక్స్ప్రెస్ చేయడం రాదు. భయంగా చుట్టూ చూస్తూ ఉంటుంది. ఆ భయం లో కూడా ప్రేమ ఉంది. నీ గురించి గుమ్మం వైపే కళ్ళు కాయలు కాచేలాగా చూసింది. నువ్వు రాలేదు అనగానే మొహం చిన్నబుజ్జుకుంది. నాకు తెలుసు బావ దానికి నా మీద బోలెడంత ప్రేమ ఉంది కానీ చెప్పడం రాదు. పోనీ నేను చెబుదాము అంటే నన్ను చూడగానే పరుగుపడుతుంది. ఇంకా ఎలా బావ. ఆ పరుగుకి సంకెళ్లు వెయ్యి. ఆటోమేటిక్గా ఆగిపోతుంది. థాంక్స్ బావ అంటాడు. దేనికి రా అంటే అదే కాలేజీకి వెళ్లి కలవమంటున్నావు కదా అందుకు.. నేనెప్పుడూ చెప్పాను రా.. ఇప్పుడే కదా పరుగుకు సంకెళ్లు వెయ్యమన్నావు. అక్కడయితేనే బుజ్జి పప్పీ దొరుకుతుంది. బాయ్ అండ్ ఫోన్ పెట్టేస్తాడు. వీడికి ఏది వచ్చిన పట్టుకోలేను. సూర్య రెడీ అయ్యి అవని దగ్గరికి వెళతాడు. ఏంటమ్మా ఇన్ని వెరైటీలు చేసావు. చూడు ఎలా చిక్కిపోయావో... అమ్మ నేను బానే ఉన్నాను అని లలిత మాధవి పక్కన కూర్చుని గ్రానీస్ ఇద్దరూ ఏం చేస్తున్నారు. మీ గ్రాండ్పా స్ కాళ్లు నొక్కుతున్నాము అని మాధవి అంటుంది. ఓ మై గాడ్ మీ సుకుమారమైన చేతులతో వాళ్ళిద్దరూ అంత సర్వీస్ చేయించుకుంటున్నారా.. అసలు ఏమనుకుంటున్నారు రాగానే.. నేను ఫైట్ చేస్తాను. వైభవ్ వచ్చి ఆహా అన్నయ్య ఏం సోప్ వేసావు ఓల్డ్ లేడీస్ ఇద్దరికీ. ఇంకా అలా పడుంటారు. ఎవర్రా ఓల్డ్ లేడీస్.. మేము ఇప్పటికీ యూతే అనగానే.. అవని కంగారుగా చూస్తుంది. విక్రమ్ ఆఫీస్ కి వెళ్ళిపోవడంతో హమ్మయ్య అనుకుని కొడుక్కి కొసరి కొసరి వడ్డిస్తుంది. పూజిత, విద్య కూర్చుని సూర్యకి కబుర్లు చెబుతూ ఉంటారు. నానమ్మ ఒకసారి నేను అన్నవరం వెళదాం అనుకుంటున్నాను. ఇంత సడన్గా ఏంట్రా.. ఎందుకో వెళ్లాలి అనిపిస్తుంది. నేను శ్రీకర్, వైభవ్ ముగ్గురం వెళతాము. జస్ట్ త్రీ డేస్ అంతే. సరే వెళ్లి రండి. ఎప్పుడు ప్రయాణం ఒక 2 డేస్ లో వెళతాము. ఏమంటావు అమ్మ. ఆ స్వామి దగ్గరికి వెళతాను అంటే నేను మాత్రం ఎందుకు వద్దంటాను. వెళ్లి వచ్చిన తర్వాత మాత్రం నా దగ్గరే ఉండాలి. ఎక్కడికి వెళ్ళకూడదు అని చిన్న పిల్లలాగా వేలు పెట్టి చూపిస్తుంది. ఓ మై ప్రెట్టి మమ్మీ నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు. విశి గౌతమ్ ఫోన్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. టెన్షన్ పడుతున్న విశిని చూసి.. భవ్య ఏమైందే... అంత కంగారు పడుతున్నావు. గౌతమ్ ఇంకా ఫోన్ చేయలేదు. నేను చేసిన వర్క్ ఎలా ఉందో అర్థం కావడంలేదు. భవ్య.. ఉఫ్ అనుకుని.. నీ వర్క్ నచ్చుతుంది కాకపోతే ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలి అని చెబుతాడు చూడు. నీకు ఎలా తెలుసు. రెండు సంవత్సరాల నుంచి వింటున్న డైలాగు అదే కదా. నా వర్క్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి ఏమో భవ్య అంటుంది. నీలాగా స్టూడెంట్ లైఫ్ లోనే ఇంత ప్రొఫెషనల్ వర్క్ చేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఆ విషయం అందరికీ తెలుసు నీకు మాత్రం తెలియడం లేదు. గౌతమ్ నిన్ను వాడుకుంటున్నాడని ఎన్నిసార్లు చెప్పినా నీ బుర్రకి ఎక్కడం లేదు. నీ వర్క్ కి బయట ఇంకా మంచి అమౌంట్ వస్తుంది. నా మాట విని అప్లై చేయ్. విశి సైలెంట్ గా ఉంటుంది. ఏమైంది విశి నేను చెప్పింది తప్పా.. గౌతమ్ చెప్పేది అదే అని నాకు తెలుసు. బట్ ఏదైనా ఆ మాటల్లో మార్పు వస్తదేమో అన్న చిన్న ఆశ. నువ్వు అన్నట్టు బయట కంపెనీలో ట్రై చేస్తే అమౌంట్ ఎక్కువే రావచ్చు కానీ మనం ట్రై చేసే లోపు అమ్మకి ట్రీట్మెంట్ కి అవసరం అయినా డబ్బులు కావాలి. గౌతమ్ ఎలా ఇచ్చినా నాకు ట్రీట్మెంట్ కి ఉపయోగపడుతున్నాయి. అందుకే.. సారీ రా నీ పరిస్థితి ఏమిటో తెలిసి కూడా నేను అలా మాట్లాడాను. కానీ నీ వర్క్ ని అతను అలా దోచుకుంటూ ఉంటే నాకు నచ్చడం లేదు. ఇంకెంత కొన్ని రోజులు.. ఇలా స్టడీస్ కంప్లీట్ అయిపోయినాయి అంటే ఏదో ఒక దారి దొరుకుతుంది. అమ్మ ట్రీట్మెంట్ అయిపోతుంది. తర్వాత అంటే.. తర్వాత చెప్పు.. ఒక సంవత్సరం ఆగి గౌతమ్ నేను పెళ్లి చేసుకుంటాము. గౌతమ్ నిన్ను పెళ్లి చేసుకుంటాడనే నమ్ముతున్నావా.. ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ కి చెప్పాడు. వాళ్లు కూడా ఒప్పుకున్నారు. నీ ముందు చెప్పాడా... కాదు.. తను మాట్లాడాడంట వాళ్ళు ఒప్పుకున్నారు అని తలదించుకుంటుంది. గెడ్డం పట్టుకుని పైకి లేపి మరి ఈ సమాధానం ఎందుకు ధైర్యంగా చెప్పలేకపోతున్నావు. భవ్యని గట్టిగా కౌగిలించుకుని నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు.. నువ్వు చెబుతున్నది ప్రతిదీ నిజమే అనిపిస్తుంది. మళ్ళీ గౌతమ్ తో మాట్లాడినప్పుడు కాదు అది అబద్ధం అనిపిస్తుంది. నాకు ముందు అమ్మ కోలుకోవడమే ముఖ్యం. తర్వాతే మిగిలిన విషయాలు కానీ ఒక్కొక్కసారి చాలా భయం వేస్తుంది. విశి చుట్టూ చేతులు వేసి భయపడకు. నీ మంచి మనసుకు అంతా మంచే జరుగుతుంది. విశి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే గౌతమ్ చేస్తున్నట్టున్నాడు అని ఫోన్ లిఫ్ట్ చేస్తోంది. హలో అనగానే అటుపక్క నుంచి ఒక మేల్ వాయిస్ వినపడుతుంది. చెప్పు గౌతమ్ అనగానే.. నీ వర్క్ ఈసారి కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అందుకే అమౌంట్ ఎగస్ట్రా పంపిస్తున్నాను. అమ్మకి కూడా ట్రీట్మెంట్ కి కావాలి కదా దానికి ఉపయోగపడతాయి. థాంక్యూ గౌతమ్. అమ్మకి హెల్త్ బాగోనప్పుడు నాకు చెప్పాలి కదా.. నేను హాస్పిటల్లో ఎడ్మిట్ చేయుద్దును. బెస్ట్ డాక్టర్స్ ని అరేంజ్ చేసేవాడిని కదా. అంత అవసరమైతే తప్పకుండా చెబుతాను. ఏం చెప్పడం.. నాకసలు ఏమీ చెప్పడం లేదు. ఆ రెస్టారెంట్లో వర్క్ చేయాల్సిన అవసరం ఏముంది. అంత అలసిపోతే నీ హెల్త్ ఏం అవ్వాలి చెప్పు. ముందా రెస్టారెంట్ లో జాబ్ మానేసేయ్. నేను మనీ పంపిస్తాను. నా వర్క్ కి సూట్ అయ్యే విధంగా మనీ పంపించు చాలు. నేను చేసే పని నామోషీ అనుకోను గౌతమ్. నా దగ్గర మనీ తీసుకోవడానికి ఏమిటి ఇబ్బంది. మనం ఇంకా భార్యాభర్తలు కాలేదు. అయిన తర్వాత అప్పుడు నీ డబ్బులు ఎలాగైనా వాడుకుంటాను. ఇప్పుడు మాత్రం వద్దు. ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వు ఎప్పుడూ ఇలాగే చెబుతావు. బట్ ఎప్పుడు అవసరం ఉన్న నాకు ఒక ఫోన్ చెయ్ చాలు. ఎట్లీస్ట్ మెసేజ్ సరిపోతుంది. వెంటనే నేను పంపిస్తాను సరేనా.. వచ్చి కలవాలని ఉంది. కానీ పబ్లిక్ లో రూమర్స్ స్ప్రెడ్ అవుతాయి. మళ్ళీ నీకు ఇబ్బంది అని ఆగిపోతున్నాను. ఐ మిస్ యు విశి.. బాయ్ అని ఫోన్ పెట్టేస్తాడు. బాయ్ అని ఫోన్ పెట్టేసి గౌతమ్ చెప్పిందంతా చెప్పి... గౌతమ్ కి నేనంటే చాలా ప్రేమ. నువ్వే నమ్మడం లేదు. భవ్య రియాక్షన్??
01-04-2026, 07:53 AM
Part - 12
గౌతమ్ కి నా మీద చాలా ప్రేమ. నువ్వే నమ్మడం లేదు. అవునా ఏం చెప్పాడు ఏంటి. ఐ మిస్ యు అన్నాడు. ఐ లవ్ యు అన్నాడా...
మిస్ అవుతున్నాను అంటే ప్రేమ ఉన్నట్టే కదా... ఇప్పుడు మనకి ఒక సబ్జెక్ట్ బాగా నచ్చింది అనుకో... ఆ సార్ ఒక వన్ వీక్ రాలేదు అనుకుంటే... దాన్ని మిస్ అవుతున్నాము అనుకుంటాము కదా.. అవును. మరి ఆ సార్ ని లవ్ చేస్తున్నట్టా.. ఛి ఛి అలా ఎందుకు అవుతుంది. ఇదే అంతే.. ఆ సార్ సబ్జెక్టు మనకు ఇష్టం కాబట్టి మిస్ అవుతున్నాము అనుకుంటాము. ఇక్కడ కూడా నీ వర్క్ గౌతమ్ కి కావాలి కాబట్టి మిస్ అవుతున్నా అంటున్నాడు. నీకు అసలు ప్రపోజ్ చేసి ఎన్ని రోజులైంది. తర్వాత ఎన్ని సార్లు ఐ లవ్ యు చెప్పాడు. వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి ఒక్కసారైనా నిన్ను తీసుకువెళ్లాడా... బయట కలిస్తే ప్రాబ్లంగాని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడానికి ప్రాబ్లం ఏముంది. ఆలోచించుకో విశి. నువ్వు ట్రాప్ లో పడొద్దు. అమ్మకి నువ్వు తప్ప ఎవరూ లేరు. నీకు ఏదైనా అవుతే అమ్మని చూసుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు. విశి భయంగా భవ్య వైపు చూస్తే... నేనున్నాను భయపడకు. పద.. క్లాస్ టైం అవుతుంది అని బలవంతంగా క్లాస్ కి తీసుకువెళుతుంది. సౌమ్య కాలేజ్ అయ్యి బయటికి వచ్చేటప్పటికి శ్రీకర్ అక్కడ బైక్ మీద కూర్చుని ఉంటాడు. శ్రీకర్ ని చూడగానే కళ్ళు ఒక్కసారిగా మెరిసిపోతాయి. స్పీడ్ గా దగ్గరికి వెళుతుంది. సౌమ్య వస్తుంది చూసిన చూడనట్టుగా ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. దగ్గరికి వెళ్లి సౌమ్య ఏం మాట్లాడాలో తెలియక దిక్కులు చూస్తూ ఉంటుంది. ఇంక లాభం లేదు అనుకునే హాయ్ సౌమ్య అంటే. హాయ్ శ్రీకర్.. ఏం చేస్తున్నావ్ ... మా కాలేజీకి వచ్చావు ఏదైనా పని ఉందా . అవును చాలా ఇంపార్టెంట్ పని. అవునా ఏమిటి అది చున్నీ నలిపేస్తూ ఉంటుంది. ప్లీజ్ శ్రీకర్ నాకోసమే వచ్చాను అని చెప్పు... చెప్పు.. అని మనసులో కోరుకుంటూఉంటుంది. నీకేంటి.. క్లాసెస్ అయిపోయినయా... అయిపోయాయి. ఇంటికైనా వెళ్లేది.. అవును అంటుంది.సరే నేను అటే వెళ్తున్నాను. డ్రాప్ చేస్తాను అని బైక్ స్టార్ట్ చేస్తాడు. బైక్ మీద.... ఏం లేకపోతే నడిచి వెళదామా... అలా కాదు.... అందరూ చూస్తున్నారు. దగ్గరికి రా... ఒక పక్కకి చూపిస్తాడు. అక్కడ ఒక అమ్మాయి అబ్బాయి బైక్ మీద వెళుతూ ఉంటారు. మరో పక్కకి చూపిస్తాడు. అలా నాలుగు జంటలను చూపించి.. వీళ్ళని నువ్వు ఎప్పుడైనా చూసావా... లేదు అంటుంది. చూసావా నీ కాలేజీలో వాళ్ళని చూడడానికే నీకు టైం లేదు. అలాగే నిన్ను చూడడానికి వాళ్లకి టైం ఉండదు కదా.. మూసుకుని ఎక్కు సరే అని ఇద్దరి మధ్యన కాలేజ్ బ్యాగ్ పెట్టి ఒక సైడ్ కి కూర్చుంటుంది. నువ్వు చదివేది ఏమిటి బుజ్జి... మెడిసిన్ అంటుంది. ఒక డాక్టర్ అవుతూ హ్యూమన్ బాడీ గురించి తెలియడం లేదు అంటే ఏమనుకోవాలి అని స్టార్ట్ చేస్తాడు. బైక్ ఇంటిదారి కాకుండా వేరే రూటుకి వెళుతూ ఉంటే... అయ్యో... రూటు మర్చిపోయావు. మన ఇంటికి వెళ్లాల్సింది అటు.. అవునా... నేను ఇంకా ఇటు అనుకున్నాను లే... ఒక ప్లేస్ కు తీసుకువెళ్ళి ఆపుతాడు. ఇక్కడికి తీసుకొచ్చావు ఎందుకు... నీతో ఇక్కడ ప్రాక్టీస్ మొదలు పెడతామని. ఏం ప్రాక్టీస్ అని కంగారు పడుతుంది. నువ్వు ఏది అనుకుంటున్నావో అదే అని కన్నుకొట్టి వెళ్ళిపోతాడు. ఏం మాట్లాడుతున్నాడు. నాకు చాలా టెన్షన్ వచ్చేస్తుంది. ఎక్కడికి వెళ్ళిపోయాడు అని గొనుక్కుంటూ ఉంటుంది. ఐస్ క్రీమ్ తెచ్చి చేతిలో పెట్టి.. తిను కొంచెం కూల్ అవుతావు. ఇప్పటికే టెన్షన్ తో చచ్చిపోతున్నట్టు ఉన్నావుగా ... నాకెందుకు టెన్షన్... తినబోతూ మరి నీకేది.. చెప్పాను కదా ప్రాక్టీస్ మొదలు పెడదామని.. అందుకే ఒకటే తీసుకువచ్చాను. ఒక్క ఐస్క్రీమ్ తో ప్రాక్టీస్ ఏమిటి..అది ఎలా ప్రాక్టీస్ చేయాలో నీకు నేను నేర్పిస్తాను కానీ నువ్వు స్టార్ట్ చెయ్ బుజ్జి. శ్రీకర్ మాటలు కొత్తగా ఉంటే సౌమ్యకి ఏం మాట్లాడాలో అలా అర్థం కాక ఐస్క్రీం వైఫై చూస్తూ ఉంటుంది. ఎంతసేపు చూస్తావు.. అది కరిగిపోయి మెల్ట్ అయింది అనుకో... చెయ్యి అంతా జిగురు అవుతుంది. స్టార్ట్ చెయ్. అలాగే అని నోట్లో పెట్టుకుంటుంది. బాగుందా అంటే బాగుంది అంటుంది. అవునా వాడి ఈ ఫ్లేవర్ ఏదో డిఫరెంట్ గా ఉంటుంది అన్నాడే అని సౌమ్య చేతిలోది తీసుకుని టేస్ట్ చూస్తాడు. అయ్యో నా ఎంగిలి. అవును నీ ఎంగిలే బాగుంది. ఇప్పుడు తిను. సౌమ్య శ్రీకర్ వైపు చూడలేక సిగ్గుతో తలదించుకుంటుంది. ఓయ్ ఎంతసేపు తల దించుకుంటావు. ముందు తిను బుజ్జి... భుజం పైన చెయ్యి వేస్తాడు. ఏం చేస్తున్నావ్ నువ్వు అని కంగారు పడుతుంది. ఏం చేశాను. ఇలా పబ్లిక్ లో నామీద చెయ్యి వేస్తే చూసే వాళ్ళు ఏమనుకుంటారు.... ఏమనుకుంటారు బుజ్జి... నీకు తెలియదా... నీ నోటితో చెబితే తెలుసుకుంటాను. ఎంతైనా డాక్టర్ వి కదా... నువ్వు బిజినెస్ మాన్ వి కదా నీకు తెలియకుండా ఉంటుందా.. నాకు బిజినెస్ మాత్రమే తెలుసు. పబ్లిక్ ఏమనుకుంటుందో అన్న విషయం అయితే నాకు తెలియదు. నీకు తెలుసు కాబట్టి నువ్వే చెప్పు. నేను చెప్పాక నువ్వు తప్పుగా అనుకుంటే... ముందు చెబితేనే కదా అది తప్ప ఒప్పో అని తెలిసేది. ఒప్పు అయితే పరవాలేదు. తప్పయితే ఉన్న స్నేహం దెబ్బతింటుందేమో.... నా వైపు చూసి ఇది తప్పు అని చెప్పు. చెప్పలేను అని తలదించుకుంటుంది. నువ్వు ఇన్నిసార్లు తలదించుకోకే.. నేను అస్తమానం ఎత్తలేకపోతున్నాను. సౌమ్య చిరుకోపంగా చూస్తే... నవ్వుతూ నా బుజ్జి పప్పీ కి కోపం కూడా వస్తుందా.... నేను ఇలా చెయ్యి వేస్తే నీ దృష్టిలో అది తప్పు కాదు అవునా... అవును కాదు అన్నట్టుగా తల ఊపుతుంది. మరి భూమి తిరిగినట్టుగా తిప్పకు కళ్ళు తిరుగుతాయి. తప్పు కాదు అంటే అది ఒప్పు అనే కదా అర్థం. ఇప్పుడు చెప్పు. నీ మీద నేను చెయ్యి వేయడాన్ని ఏమనుకుంటుంది పబ్లిక్... లవర్స్ లేకపోతే కాబోయే జంట అనుకుంటారు. హమ్మయ్య ఇన్ని రోజులకి నీ నోటి వెంట లవర్స్ అన్నమాట వచ్చింది. ఎప్పుడు పెళ్లి చేసుకుందాం బుజ్జి. అప్పుడే పెళ్లా... చిన్నప్పటి నుంచి నిన్ను ఇలా చూస్తూ చూస్తూ ఉండిపోయానే. స్టెప్ తీసుకుందామంటే పారిపోతావేమో అని భయం. ఈరోజు నువ్వే నాకు ప్రపోజ్ చేశావు కాబట్టి నేను పెళ్లి చేసుకుందాం అని డిక్లేర్ చేస్తున్నాను. ఏమంటావ్... నేనెప్పుడూ ప్రపోజ్ చేశాను అని అయోమయంగా అడుగుతుంది. లవర్స్ అని చెప్పింది ఎవరే... నేనే అంటుంది. కాబోయే జంట అని చెప్పింది... అది నేనే. అప్పుడు ప్రపోజ్ చేసింది ఎవరు అవుతున్నారు దీన్ని ప్రపోజ్ చేయడం అంటారా.. మరి ఎలా ప్రపోజ్ చేస్తారు. మా కాలేజీలో చూశాను అబ్బాయే వచ్చి అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. బొకే తీసుకుని చాక్లెట్స్ పుచ్చుకొని వచ్చాడు. నా నుంచి నువ్వు అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా.. అసలు చేయకు. మనదంతా ఓపెన్..నువ్వు నా దానివి అంతే. సూర్య బావ పెళ్లి అయిన వెంటనే మనం కూడా పెళ్లి చేసేసుకుందాం పెళ్లి తర్వాత చదువుకో. లవ్ చేసిన అమ్మాయి దూరంగా ఉంటే బాగోదు కదా.. అర్థమైందా... ఏదేదో చెబుతున్నావు.. ముందు అమ్మకి నాన్నకి చెప్పాలి. మావయ్య వాళ్ళతో మాట్లాడాలి. అందరూ ఒప్పుకోవాలి.. అవన్నీ నీకెందుకే.. నన్ను ప్రేమిస్తూ నా గురించి ఆలోచిస్తూ ఉండిపో.. మిగిలినవన్నీ నేను చక్కబెడతాను కదా పద అని తీసుకువెళ్తాడు. ఇంటికి జంటగా వచ్చిన ఇద్దరిని చూసి.. విక్రమ్ ఏంట్రా సౌమ్య ఎక్కడ కలిసింది... నేనే కాలేజ్ కి వెళ్లి తీసుకు వస్తున్నాను. ఆ మాటకి సౌమ్య కంగారుగా విక్రమ్ వైపు చూస్తుంది. కాలేజీకి వెళ్లి తీసుకువచ్చే వరకు వచ్చిందా వ్యవహారం. మావయ్య అది అని కంగారుపడితే.. నువ్వు టెన్షన్ పడకురా.. నీ గురించి తెలియదా.. వెళ్లి ఫ్రెష్ అయ్యి రా.. అమ్మ వాళ్ళు వేడివేడిగా బజ్జీలు వేస్తున్నారు. ఒక పట్టు పడదాం అని పంపించి.. శ్రీకర్ చెవి మెలి వేస్తాడు..అబ్బా ప్లీజ్ అంకుల్ వదులు.. ఏరా నా మేనకోడలు ఉత్తి అమాయకురాలు. దాన్ని భయపెట్టి మరీ బండి ఎక్కించుకుంటావా. ఎవరు అది అమాయకురాలా... ఎవరి పిల్లలు వాళ్లకి అలాగే కనిపిస్తారు. నేను లవ్ చేస్తున్న విషయం తెలిసినా తెలియనట్టుగా... నేనే ప్రపోజ్ చేయాలని వెయిట్ చేస్తుంది. మన తెలివితేటలు ముందు బుజ్జి పప్పి తెలివితేటలు ఏం పని చేస్తాయి.. ఒరేయ్ ఇది నా మేనకోడలితో చెప్పించుకున్నావా.. అంతే కదా అని భుజాలు ఎగరేస్తాడు. సూర్య వచ్చి ఎంత సేపు అయింది రా.. ఇప్పుడే ఏం చేస్తున్నారు అబ్బాయిగారు... రేపొద్దున్నే ఎర్లీగా బయలుదేరడం గురించి ఆలోచిస్తున్నాను. అవునా సరే అయితే నేను ఇంటికి వెళ్లి ప్యాక్ చేసుకొని వచ్చేస్తాను. నీ డ్రెస్సెస్ ఆల్రెడీ తెప్పిచ్చాను.. మూసుకుని రాత్రికి ఉండిపో.. అమ్మకు ఒక మాట చెప్పాలి కదా.. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్లిపోయింది. తమరు ఆవేశపడకండి. చందు, నివి, రాజ్ వస్తారు.. సూర్య వెళ్లి హాయ్ అత్త అని హగ్ చేసుకుంటే.. ఏరా ఎలా ఉన్నావు ఇలా చిక్కిపోయావు ఏంట్రా... నీకోసం ఒక సర్ప్రైజ్ తీసుకోవచ్చాను. అవునా ఏం తెచ్చావు.. ఏముంటాయి అత్తయ్య.. నీకు ఆ పిల్ల రాక్షసి కి కలిపి ఏ మేకప్ కిట్టో.. మ్యాచింగ్ యాక్సెసరీస్ తెచ్చుంటాడు అంతేనా అన్నయ్య.. నేను పిల్ల రాక్షసిని అయితే నువ్వు ఎవరివి.. సాదు జీవిని యోగిని అంటాడు. నువ్వు యోగివా... యోగి అంటే ఎలా ఉంటారో తెలుసా.. ప్రశాంతంగా మనం చెప్పేది వింటూ మనకి కావాల్సింది ఇస్తూ ఉంటారు.. నేను కూడా నీ విషయంలో అదే కదా చేస్తాను. నువ్వు ఎంత టార్చర్ పెట్టినా.. ఎంత ప్రశాంతంగా ఉంటాను. నువ్వు చెప్పే సోది అంతా ఎవరు భరిస్తున్నారు. ఏం మావయ్య నేను చెప్పింది నిజమే కదా... నువ్వు నేను యోగుల లిస్టులోకే వస్తాము కదా... రాజ్ పరిస్థితి ?? కథ కొనసాగుతుంది.... |
|
« Next Oldest | Next Newest »
|