23-03-2026, 08:03 AM
Bro exlent update super bro
Story muduku velle kodhi marintha
Internet prigipothndi
Story muduku velle kodhi marintha
Internet prigipothndi
|
బృందావనం
|
|
23-03-2026, 08:03 AM
Bro exlent update super bro
Story muduku velle kodhi marintha Internet prigipothndi
24-03-2026, 07:22 AM
Part - 19
రేపల్లె....
హోమం పూర్తి చేసి భోజనాలు అయ్యేటప్పటికి రాత్రి 10 అవుతుంది. మిత్ర, గౌతమ్ తన లగేజ్ తొ అక్కడికి వచ్చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ 10:00 a.m కి హైదరాబాద్ కంపెనీకి వెళ్లి జాయిన్ అవ్వాలి. అందుకే ఇప్పుడే బయలుదేరాలి అని అక్కడికి వస్తారు. శాంభవి ని హైదరాబాద్ తీసుకు వెళ్లడానికి ఫ్యామిలీ మొత్తం బయలుదేరుతారు. ఫ్యామిలీ మొత్తం ఎక్కడికైనా వెళ్లడానికి అని స్పెషల్ గా ఒక బస్సుని రెడీ చేపిస్తారు. శకుంతల బామ్మ, రామచంద్రయ్య గారు, సులోచన ఇంటి దగ్గర ఉండిపోతారు. మిగిలిన వాళ్ళు అందరూ బయలుదేరుతారు. భాను గారు, శివ గారు ఆస్తమానం కూతుర్ని చూసుకుంటూ ఉంటారు. ఉదయం 6:00 అయ్యేటప్పటికి బస్సు బంజారాహిల్స్ వస్తుంది. అక్కడ ధరణి అన్నయ్య విష్ణు గారు ఉంటారు. విష్ణు భార్య సావిత్రి. వీరికి ఒక్కడే కొడుకు నివాస్. విష్ణుది కన్స్ట్రక్షన్ బిజినెస్. బస్సు రాగానే ఎదిరి వెళ్లి చెల్లిని హగ్ చేసుకుంటారు. ఎన్ని రోజులు అయింది ధరు నిన్ను చూసి అని.. బాగున్నావా అన్నయ్య అని పలకరిస్తుంది. జయంతిని చూసి రా చెల్లెమ్మ అని సాదరంగా ఆహ్వానిస్తారు. మావయ్య నేను కూడ వచ్చాను అని శాంభవి అలకగా అంటుంది. అరే నా మేనకోడలు కి కోపం వచ్చిందా అని ముద్దు చేస్తారు. సావిత్రి వచ్చి అందర్నీ లోపలికి రానివ్వండి లేటవుతుంది అని లోపలికి తీసుకు వెళుతుంది. లోపలికి వెళ్లే ఫ్రెష్ అయ్యి వస్తారు. శాంభవి వైట్ అండ్ పింక్ కాంబినేషన్ లో ఉన్న చుడీదార్ వేసుకుంటుంది. మిత్ర రెడ్ కలర్ చుడిదార్ వేసుకుంటుంది. గౌతమ్ కూడా రెడీ అయ్యి వస్తాడు. అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే నివాస అడుగుతాడు.. ఏ కంపెనీ ఇంతకీ అని G. B సొల్యూషన్స్ అని చెప్తారు. గుడ్ కంపెనీ, మీరు వర్క్ ఎంత బాగా నేర్చుకుంటే మీ ఫ్యూచర్ అంత బాగుంటుందని నేను డ్రాప్ చేస్తాను ముగ్గురిని అంటాడు. దానికి భాను గారు ఈరోజుకి మేము వస్తాము. రేపటి నుండి ఒక కారు అరేంజ్ చేస్తాను అందులో వెళతారు అని అంటే...అన్ని అరేంజ్ చేసేసావా బావ అని విష్ణు అడుగుతాడు. నా బంగారం కోసం ఏమైనా చేస్తాము అంటారు. బృందావనంలో కూడా అందరూ తొందరగా లేచి రెడీ అయిపోతారు. చారులత భర్త, కొడుకుని తీసుకుని వచ్చి ఇంకా రెడీ అవ్వలేదా అంటే... మేము అందరం రెడీ గానే ఉన్నామని చెప్పి బయలుదేరుతారు. అనసూయకు అసలు ఏమీ అర్థం అవ్వడం లేదు. మనశ్శాంతి కోసమని గుడికి వెళుతుంది. అక్కడ లక్ష్మి, జ్యోతి కనిపిస్తారు. చూసిన చూడనట్టు వెళ్ళిపోతుంది. లక్ష్మి అనసూయని చూసి వదినా అని ఆనందతొ పిలుస్తుంది. వాళ్లు వంక చిరాగ్గా చూసి గుడి ప్రాంగణంలోకి వెళుతుంది. వదిన ఒక నిమిషమని వెళ్లి మీరు మాట్లాడరని తెలుసు. మీ కుటుంబానికి జరిగిన నష్టం మేము ఎప్పటికీ తీర్చలేము అని బాధపడుతుంది. ఇప్పుడు మీ సోది వినే ఓపిక నాకు లేదు అని అనసూయ విసుగ్గా అంటుంది. అవేం పట్టించుకోకుండా, రుద్రకి పెళ్లి కుదిరింది అంట కదా! ఇంత మంచి విషయం విన్నాక చాలా సంతోషంగా అనిపించింది అంటుంది. దానికి అనుసయ ఏమీ సమాధానం చెప్పకుండా.. నా మనవడికి పెళ్లి కుదిరింది. నాకు తప్ప అందరికీ తెలుసు. ఆఖరికి మా ఇంటి శత్రువులు కూడా తెలిసింది. అంటే...నా కుటుంబ దృష్టిలో నా విలువ ఎక్కడ ఉంది అని బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోతుంది. G. B సొల్యూషన్స్.... చైర్మన్ రూమ్ లో అందరూ కూర్చుని ఎంట్రెన్స్ వైపు సీసీ లో చూస్తూ ఉంటారు. రుద్ర అందరినీ చూస్తా అలా చూస్తే తెలిసిపోతుందా? మనం పది కాలేజీల స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేశాము . వారిలో ఎవరు అనేది తెలియదు కదా! కన్ఫర్మ్ చేసుకున్నాక రావొచ్చు కదా అంటే.... అంతవరకు మేము ఆగలేము. కావలిస్తే అప్పటివరకు నువ్వు ఆగు అని చారు మళ్ళీ ఎంట్రన్స్ వైపు చూస్తారు. అమ్మ అని గుర్రుగా పిలుస్తాడు. దానికి సంతోష గారు ఇప్పుడు మీ అమ్మనే కాదు ఎవరిని కదపకు అంటాడు అంటారు. ఆఫీస్ టైం అవుతుంటే ఎంప్లాయిస్ అందరూ వస్తూ ఉంటారు. ఇంటెన్షిప్ స్టూడెంట్స్ కూడా వస్తూ ఉంటారు. శాంభవి ని డ్రాప్ చేయడానికి ఫ్యామిలీ మొత్తం వస్తుంది. మిత్ర, గౌతమ్ కారు దిగుతారు. శాంభవి కార్ డోర్ తీసి అనుకోకుండా కుడికాలు ముందు పెట్టి దిగుతుంది. చుట్టూ మొత్తం చూస్తుంది. నాన్న ఆఫీసు చాలా బాగుంది. మన ఏరియాలో కూడా ఒకటి స్టార్ట్ చేద్దాం నాన్న అంటుంది. అలాగే బంగారం అని అంటారు. ధరణి, జయంతి ఒకసారి చూసి పెదవి విరుస్తారు. క్యాబిన్లో ఉన్న రుద్ర గుండె చాలా గట్టిగా కొట్టుకుంటూ ఉంటుంది. ఏంటిది ఇలా ❤️కొట్టేసుకుంటుంది అని ఎంట్రెన్స్ వైపు చూస్తాడు. ఇద్దరమ్మాయిలు వెనక్కి తిరిగి ఉంటారు. ఒక అమ్మాయి వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉంటే, ఇంకొక అమ్మాయి రెడ్ కాంబినేషన్లో ఉంటుంది. దేవేంద్ర గారు కూడా చాలా ఆతృతతో ఉంటారు. శాంభవి ని డ్రాప్ చేసి మేము బయలుదేరుతాము తల్లి. సాయంత్రం నివాస్ వస్తాడు అని చెప్పి రేపల్లెకు బయలుదేరుతారు. ముగ్గురు అన్నయ్యలు కూడా శాంభవికి చాలా జాగ్రత్తలు చెబుతారు. గౌతమ్ ని ఇద్దరిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి వెళతారు. శాంభవి, మిత్ర, గౌతమ్ మిగిలిన కాలేజ్ స్టూడెంట్స్ తో కలిసి లోపలికి వెళతారు. స్టూడెంట్స్ అందరినీ ఒక కాన్ఫరెన్స్ రూమ్ లో కూర్చోబెడతారు. స్టూడెంట్స్ మొత్తం 30 మెంబెర్స్ ఉంటారు. అమ్మాయిలు 10 మంది ఉంటే, అబ్బాయిలు 20 మంది ఉంటారు. ఈ పది మంది అమ్మాయిల్లో నా కూతురు ఉంది అనిపిస్తుంది నాన్నగారు అని దేవేంద్ర ఎమోషనల్ అవుతాడు. నిదానంగా ఉండు దేవేంద్ర మనం తెలుసుకుందామని కాన్ఫరెన్స్ హాల్ కి వెళతారు. మేనేజ్మెంట్ అంతా రాగానే స్టూడెంట్స్ లేచి నుంచుంటారు. ప్లీజ్ సిట్ డౌన్ అండ్ రిలాక్స్ అని చెప్పి, అందరి చూపులు అమ్మాయిల వైపు వెళ్తాయి. ఉన్న పదిమంది అమ్మాయిలు ఐదుగురు జీన్స్ అండ్ టాప్ వేస్తారు. ఇద్దరు కుర్తి అండ్ లెగ్గిన్స్ వేస్తారు. ఒక అమ్మాయి లాంగ్ ఫ్రొక్ వేస్తుంది. ఇద్దరమ్మాయిలు చుడీదార్ వేస్తారు.. రుద్ర కళ్ళు మాత్రం చూడీదార్ వేసుకున్న అమ్మాయిలు దగ్గర లాక్ పడిపోతాయి. అందర్నీ ఇంటర్వ్యూస్ చేసుకోమని రాఘవేంద్ర గారితో సహా అందరూ కూర్చుంటారు. వైజాగ్ టు హైదరాబాద్ డిఫరెంట్ ప్లేసెస్ చెప్తారు. శాంభవి దగ్గరికి రాగానే మీ గురించి చెప్పండి మిస్ అనగానే..... ఐ యాం శాంభవి, రేపల్లె అని చెబుతుంది. అంతే ఆ నలుగురు అబ్బాయిల శాంభవి వంక చూస్తారు. నెక్స్ట్ మిత్ర, గౌతమ్ కూడా చెబుతారు. నలుగురు అబ్బాయిలు ఏం ఆలోచిస్తున్నారు?? రుద్ర గుండే ఎవర్ని చూసి గట్టిగా కొట్టుకుంటుంది??
24-03-2026, 07:24 AM
Part - 20
అబ్బాయిలు నలుగురు శాంభవి,మిత్ర వంక చూస్తూ ఉంటారు. దేవేంద్ర గారు ఈ పది మంది అమ్మాయిలు నా కూతురు ఉంటదా అని ఆలోచిస్తూ అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తాను.
అప్పుడు స్పర్శ ఏమైనా నాకు తెలుస్తుందేమో అనుకుంటారు. దేవేంద్ర గారి స్టూడెంట్స్ అందరి దగ్గరకు వచ్చి పరిచయం చేసుకుంటూ షేక్ హ్యాండ్ ఇస్తారు. అయిన అమ్మాయిలు చూసుకుంటూ నడుస్తూ ఉంటారు. అనుకోకుండా కాల్ స్లిప్ అవుతే అప్పుడు శాంభవి అంకుల్ జాగ్రత్త అని పట్టుకుంటుంది. దానికి దేవేంద్ర గారు శాంభవి వంక చూస్తారు. సారీ సార్ అనుకోకుండా అంకుల్ అనేసాను పడిపోతున్నారు అన్న కంగారులో అని చెప్పి చేతులు వెనక్కి తీసుకుంటుంది. ఇట్స్ ఓకే అమ్మ థాంక్యూ సేవ్ చేసినందుకు అని చెప్పి మిగిలిన వాళ్ళు అందరికీ షేక్ అండ్ ఇస్తారు. బట్ ఆయనకి ఏ స్పర్సని కూడా ఫీల్ అవ్వలేకపోతున్నారు. అందరూ వేరే వేరే ప్లేసెస్ నుంచి వచ్చారు కాబట్టి ఒకసారి మెడికల్ టెస్ట్ చేపిస్తాము బట్ ఇది స్మాల్ టెస్ట్ అంతే బ్లడ్ టెస్ట్ చేపిస్తామంటే ఏమన్నా ఉంటే తెలుస్తాయి అంతేగాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది కాదు అని ధీరజ్ చెప్తాడు. డాక్టర్స్ ని లోపలికి రమ్మని టెస్ట్ చేయమని చెప్తారు. అక్కడినుండి మేనేజ్మెంట్ మొత్తం వెళ్ళిపోతే ధీరజ్ అండ్ అద్వైత్ మాత్రమే ఉండి అన్ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. డాక్టర్స్ అందరినీ టెస్ట్ చేస్తూ వరుసగా వస్తు శాంభవి దగ్గరికి వస్తారు. మిత్ర గౌతమ్ శాంభవి వంక చూస్తారు. శాంభవి చాలా భయపడుతూ ఉంటుంది బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి... డాక్టర్ మీరు వేరే ఏ విధమైన టెస్టులైనా చేయండి. బ్లడ్ టెస్ట్ మాత్రం వద్దు అని చెబుతుంది. దానికి ఏమైందమ్మా ఇందులో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు అంటే.. లేదు నాకు ఇది ఇష్టం ఉండదు అని భయంగా చెబుతుంది. ధీరజ్ వచ్చి ఏంటి ప్రాబ్లం అని అడుగుతాడు. దానికి మిత్ర నవ్వుతూ శాంభవి కి ఇంజక్షన్ అంటే భయం ఇప్పుడు బ్లడ్ తీయడానికి ఇంజక్షన్ పెడతారు కదా అందుకే టెన్షన్ పడుతుంది.. ఈ టైంలో పక్కన వాళ్ళ నాన్నలు గాని వాళ్ళ అన్నయ్యలు గాని గట్టిగా పట్టుకుని ఉంటారు. ఇప్పుడు ఎవరూ లేరు కదా అందుకే చాలా టెన్షన్ పడుతుంది అని నవ్వును దాస్తూ చెబుతుంది. ధీరజ్ శాంభవి వంక చూస్తాడు. శాంభవి కళ్ళు మూసుకుని వణుకుతూ ఉంటుంది. గౌతమ్ మిత్ర ని నువ్వు ఆగుమిత్ర శాంభవి గురించి తెలిసిందే కదా! సార్ శాంభవి కి రేపు ఏమైనా టెస్ట్ చేపిద్దామా...ఈలోపు వాళ్ళ ఫాదర్ని రమ్మని చెబుతాను అని అంటాడు. ధీరజ్ అద్వైత్ వంక చూస్తాడు. అద్వైత్ అర్థం చేసుకొని ముందుకు వచ్చి శాంభవి లుక్కెట్ మీ అంటాడు. శాంభవి అద్వైత్ వంక చూస్తూ ఉంటే.... నన్ను నీ బ్రదర్ అనుకో.. నా చేయి గట్టిగా పట్టుకో. నీకు ఫీల్ ఫ్రీ అనిపిస్తే అప్పుడు టెస్ట్ కి కోపరేట్ చెయ్యి లేదు అంటే ఇంకో ఆల్టర్నేట్ చూద్దాం అని చెప్పి పక్కనే కూర్చుంటాడు. శాంభవి అద్వైత్ వంక చూస్తూ సరే అని చెప్పి అద్వైత్ చెయ్యి పట్టుకుంటుంది. చాలా భరోసాగా అనిపిస్తుంది. తనకు తెలియకుండానే డాక్టర్ కి కోపరేట్ చేస్తుంది. బ్లడ్ శాంపిల్ తీసుకున్న తర్వాత అయిపోయింది అమ్మా అని చెబుతారు. ధీరజ్ డాక్టర్ వంక చూస్తూ మాక్సిమం రిపోర్ట్స్ మీరు ఈవినింగ్ కైనా రేపటికైనా ఇచ్చేటట్టుగా చూడండి అని చెబుతాడు. ఓకే అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు. ఇదంతా సీసీ లో రుద్ర, విహాన్ చూస్తూ ఉంటారు. ఫైవ్ మెంబర్స్ని గ్రూపుగా స్టూడెంట్స్ ని డివైడ్ చేస్తారు. లంచ్ టైం కి సావిత్రి గారు లంచ్ బాక్స్ పంపిస్తారు. అది చూసి మిత్ర ఏంటి మన ముగ్గురికి ఇంత పంపించారు. ఈజీగా ఇంకొక ఇద్దరికి వచ్చేస్తుంది కదా అంటే.. అత్త చేయ్యి అలాగే ఉంటుంది అని.. తమ గ్రూపులో యాడ్ అయిన ఇంకొక ఇద్దరిని పిలిచి లంచ్ కి ఇన్వైట్ చేస్తారు. లంచ్ చేస్తూ శాంభవి శివ గారికి ఫోన్ చేస్తుంది. చెప్పు బంగారం అనగానే... నాన్న ఈరోజు ఏం జరిగిందో తెలుసా అని మొత్తం జరిగిందంతా చెబుతుంది. అది వినగానే భాను గారు, శివ గారు కంగారు పడిపోతారు. మేము వెంటనే వెనక్కి వస్తున్నాము ఇబ్బందిగా ఉందా తల్లి అని అడుగుతారు. దానికి శాంభవి ఏమి లేదు నాన్న మీరు కంగారుపడి వెనక్కి రావద్దు. అలా వస్తే దరు అమ్మ, జయమ్మ కామెంట్ చేస్తారు. ఏడిపిస్తారు వద్దు అని చెబుతుంది. మీ అమ్మలకి పనేముంది మన మీద పడి ఏడవడం తప్పఅని శివ గారు అలకగా ఉంటారు. వెంటనే లలిత్ ఫోన్ తీసుకొని ఎలా ఉన్నావ్ బంగారం అని అడిగితే నాకేం పరవాలేదు అన్నయ్య బానే ఉన్నాను. మీరు టెన్షన్ పడకండి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే అని చెబుతోంది. సరే అనిచెప్పి ఫోన్ పెట్టేస్తారు. లలిత్ నివాస్ కి కాల్ చేసి శాంభవి దగ్గరికి వెళ్ళమని చెబుతాడు.బావా అలా వెళ్ళిన వాళ్ళు ఆలో చేయరు.ఈవినింగ్ వర్క్ అయ్యేటప్పటికి నేను అక్కడ ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ధీరజ్ క్యాబిన్లోనికి వెళ్లి మనకి రేపటికల్లా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. వీళ్లల్లో ఉన్నారా లేదా అని అప్పుడు దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకుందామని చెబుతాడు. ఫ్యామిలీ మెంబర్స్ వంక చూసి మీరు ఇంకా ఇంటికి వెళ్లి రిలాక్స్ అవ్వండి ఏ విషయం అన్నది రేపు రేపు మీకు క్లియర్ గా తెలిసిపోతుంది అని చెప్పి ఇంటికి పంపిస్తారు. ధీరజ్ రుద్ర పక్కకు చేరి బావ నాకెందుకొ శాంభవి ని చూస్తే నీ ముద్దుల మరదలు అనిపిస్తుంది అని కెలుకుతాడు. దానికి రుద్ర, శాంభవి నా మరదలు అయితే మిత్ర కు లైన్ వేద్దామా అని సెటైర్ వేస్తాడు. నీతో ఏం మాట్లాడిన తిప్పలే బావ అని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. ఆరోజు స్టూడెంట్స్ అందరిని ఫ్రెండ్లీగా మూవ్ అయ్యేటట్టుగా చేస్తారు. ఆఫీసులో స్టాఫ్ కి మాత్రం డౌట్ వస్తోంది ఏంటి ఈ బ్యాచ్ ని ఇంత ఫ్రెండ్లీగా చూస్తున్నారు అని . సాయంత్రం ఆఫీసు అయ్యి బయటకు వస్తూ ఉంటే ఎంట్రన్స్ లోపల ఉన్న అమ్మవారి విగ్రహం మీద శాంభవి చూపు పడుతుంది. ఆ విగ్రహం దగ్గరికి వెళ్లి నిలబడుతుంది. మిత్ర ఏమైంది అని అడిగితే.. చూడు మిత్ర అమ్మవారి ని పూలతో అలంకరించారు. నైవేద్యాలు పెట్టారు. కానీ దీపం మాత్రం వెలిగించలేదు ఇక్కడ అని అంటుంది. దానికి గౌతమ్ వచ్చి వెలిగిస్తే ఫైర్ ఏమన్నా అవుతుందేమో అని సెక్యూరిటీ పర్పస్ అయ్యుండొచ్చు కదా అని అంటాడు. దానికి శాంభవి అమ్మవారి ముందు దీపం వెలగకపోతే ఎలా అని అక్కడ చుట్టూ చూస్తది కానీ అక్కడ దీపానికి సంబంధించి ఏమీ ఉండదు.. సరే రేపు నేను తీసుకొచ్చి వెలిగిస్తాను ఏమైనా అంటే అప్పుడు చూసుకుందాంలే అని చెప్పి బయటకు వస్తుంది. తను వచ్చేటప్పటికి నివాస్ అక్కడే ఉంటాడు ఏమైంది బావ అంటే నీకు టెస్టుల కోసమని బ్లడ్ తీశారు అంట కదా ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతాడు.. పర్లేదు బావ బానే ఉంది పద ఇంటి కి అని చెప్పి వాళ్ళు కారు ఎక్కుతారు. ఇదంతా సీసీ లో చూస్తున్నా రుద్ర విహాన్ తో ఈ అమ్మాయి కొంచెం డిఫరెంట్ గా ఉంది. విహాన్ దానికి రేపటి వరుకు వెయిట్ చేస్తే తెలిసిపోతుంది కదా అంటాడు. చినమామ ఎక్కడ అంటే ఇప్పుడే వెళ్లారు. బాగా టెన్షన్ పడుతున్నారు. వీళ్ళలో ఉండాలి అని. అమ్మ వాళ్ళు గుడి కి వెళతాము అన్నారు ఏమిటో వీళ్ళ నమ్మకాలూ అని సరే పద వెళదాం అని బయటకు వస్తారు. ఆఫీస్ దాటాగానే వీళ్ళ కార్ కి ఒక కార్ అడ్డు వస్తుంది. ఎవరా అని చూస్తా కారులో నుంచి నిషా, ఆశ దిగుతారు అబ్బా ఈ జిడ్డు మొహాలు మళ్ళీ బయలుదేరారా అనుకుంటూ చూస్తారు. ఆశ రుద్ర కార్ దగ్గరికి వచ్చి కంగ్రాట్స్ బావ అంటుంది. మీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా నన్ను బావ అని పిలవద్దు అని. చెప్పిన మీకు బుద్ధి రాదా అని విసుగ్గా అంటాడు. అది సరేలే రుద్ర కంగ్రాట్స్ చెప్తే థాంక్స్ అని కూడా చెప్పవా అంటుంది మళ్ళీ . దేనికి అన్నట్టుగా చూస్తే పెళ్లి కుదిరింది అంట కదా! మాకు ఎవరికీ చెప్పనేలేదు అంటూ అడుగుతుంది. అవునా... నా పెళ్లి విషయం నీకు ఎలా తెలిసింది అంటే... ఎలాగో తెలిసిందిలే అంటే.. పర్లేదు మొహమాట పడకు చెప్పు అంటాడు. షాపింగ్ లో మీ మమ్మీ కలిస్తే చెప్పారు లే అని వెటకారంగా ఉంటుంది. దానికి రోడ్డు మీద కార్ అపి మరి విష్ చేయాలా అని అంటే... నీకు ఎక్స్పీరియన్స్ ఉందో లేదో తెలియదు కదా నేర్పిద్దామని అని వల్గర్ గా మాట్లాడుతుంది. దానికి రుద్రా చిరాకుగా ఆడపిల్లవి అయిపోయావు పైగా రోడ్డు మీద ఉన్నావు. ఒక్కటి పీకితేఏ కారు కింద అయినా పడ్డావు అనుకో సాల్టీ గల్లంతు అయిపోద్ది మూసుకొని పో! ఇక్కడి నుంచి అని విసుక్కుని కారు ముందుకు దూకిస్తాడు. అమ్మ నువ్వు అసలు ఏం చెప్పావ్ వీళ్ళకు అసలు.. అప్పుడే నాకు పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసేసారు అందరూ కలిసి అని విసుక్కుంటూ వెళ్తాడు. శాంభవి ఫ్యామిలీ మొత్తం రేపల్లెకి చేరుకుంటుంది. బృందావనంలో అందరూ గేదర్ అవుతారు. అందరూ డాక్టర్ రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ధీరజ్ తో అప్పటికే పది సార్లు ఫోన్ చేపిస్తారు వచ్చాయా లేదా అని. మనం ఎన్నిసార్లు చేసినా వాళ్ళు టైంకి ఇస్తారు తాతగారు అని అంటాడు. టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన సరే ఈ మెడికల్ రిపోర్ట్స్ ఇంత లేటా అంటే... తాతగారు అది కరెక్ట్ గానే ఉన్నాయి. మనకే కంగారుగా ఉండి అలా అనిపిస్తుంది అని చెప్పి నవ్వుతాడు. మీకు నవ్వులాట గానే ఉంటుంది కానీ.. ఇక్కడ మా టెన్షన్ నీకు అర్థం కావట్లేదు కదా అని అంటే... ఎందుకు అర్థం కావట్లేదు. మీరు ఒక యాంగిల్ లో చూస్తున్నారు. మేము ఇంకో యాంగిల్ లో మేము సెర్చ్ చేస్తున్నాము అని చెప్పి రుద్రవంక చూస్తాడు. రుద్ర ఏంటి మొఖం అలాగుంది అంటే.. అమ్మ నువ్వు ఆ జిడ్డుమొహాలు కి ఇద్దరికీ ఏమని చెప్పావు.. నాకు పెళ్లి కుదిరింది అని చెప్పావా అంటే.. అలా నేను ఎవరికి చెప్పానురా అంటే.. అదే ఆశ, నిషా వచ్చి మరీ విషెస్ చెప్తున్నారు. నీకు పెళ్లి కుదిరింది కదా అని అంటే...ఓహో వాళ్ళు అలా చెప్పారా అని నవ్వుతుంది. ఎందుకమ్మా నవ్వుతున్నావు అంటే.. మొన్న కలిసినప్పుడు ఏం జరిగిందో చెబుతుంది. వాళ్లు గొర్రెలు అంతకుమించి ఆలోచించలేరు. ఈ బుర్రలు పెట్టుకుని మయూరి మనల్ని సాధించారని చూస్తుంది. సరే ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోండి రిపోర్ట్స్ రాగానే నేను అందరికి ఇంఫాం చేస్తానని అందరిని బలవంతంగా రూముల్లో కి పంపించి.. చారులత, రుద్ర, సంతోష్ గారు వాళ్ళ ఇంటికి వెళతారు. అందరూ సూర్యోదయం కోసం వెయిటింగ్.. రిపోర్ట్స్ ఏమి వస్తాయి అని..
24-03-2026, 07:25 AM
Part - 21
శాంభవి ఉదయమే లేచి రెడీ అయ్యి,పూజ చేసుకుని కిచెన్ లోకి వస్తుంది. ఏమన్నా కావాలా శాంభవి అని సావిత్రి అడుగుతారు.
ఈరోజు నేను ఒక స్వీట్ చేసి ఆఫీస్కి పట్టుకెళ్దాం అని వచ్చాను అంటుంది. ఏం స్వీట్ కావాలో చెప్పు చేసి పెడతాను అని సావిత్రి గారు అంటే... నేనే చేస్తాను. నిన్న నేను భయపడుతుంటే మా సార్ నాకు చాలా ధైర్యం చెప్పారు. అందుకే ఈరోజు స్వీట్ చేసి థాంక్స్ చెబుదామని అని చెప్పి ఏం చేయాలా అని చూస్తుంది. క్యారెట్ హల్వా చేద్దాము అనుకుని...క్యారెట్ తీసుకుని హల్వా చేస్తుంది. భాను గారు శాంభవి కి ఫోన్ చేస్తారు. ఫ్యామిలీ మొత్తం వీడియో కాల్ లో రెడీగా ఉంటారు. శాంభవి హల్వా చేస్తూనే కాల్ అటెండ్ అవుతుంది. చెప్పండి నాన్న అంటే..ఏం చేస్తున్నావ్ బంగారం అంటే.. నిన్న సార్ నాకు హెల్ప్ చేశారు కదా! అందుకే ఆ సార్ కోసమని క్యారెట్ హల్వా చేస్తున్నాను అని చెబుతుంది. నొప్పి ఏమైనా వస్తుందా అమ్మ అని శివ గారు అడుగుతారు. దానికి ధరణి బావగారు అది చాలా చిన్న ఇంజక్షన్. జస్ట్ బ్లడ్ తీస్తారు అంతే.. అదొక 10 మినిట్స్ కు సెట్ అయిపోతుంది అనగానే.. అలా ఏమీ లేదు ధరణి మనం ఎవరం పక్కన లేము కదా భయపడి ఉంటుంది అని అడుగుతున్నాను అని చెప్తారు. ధరణి, జయంతి నవ్వుకుంటారు. చూడండి నాన్న మీరు అలా అడుగుతుంటే అమ్మలు ఇద్దరు ఎలా నవ్వుతున్నారు. అందుకే వాళ్ళ ముందు ఏమీ అడగకండి అని అలకగా చెబుతుంది. మీ అమ్మల గోల ఎప్పుడూ ఉండేదే కానీ అమ్మ జాగ్రత్త కొత్త వాళ్ళు ఎవరైనా ఏదైనా ఇస్తే తినకమ్మ అని చెబుతారు. పక్కనుంచి జయంతి అది ఏమైనా చిన్నపిల్ల. ఆలా చెబుతున్నారు అంటే.. నీకెందుకు జయంతి మేమేదో చెప్పుకుంటుంటే ఎందుకు మధ్యలోకి వచ్చేస్తారు అని శివ గారు చిరాకు పడతారు. సరే బాబు మేము ఎవరో రాము బాబు కూతుర్లు మాట్లాడుకోండి. పద ధరణి మనకు టైం అవుతుంది అని చెప్పి తీసుకెళ్లి పోతుంది. సరే నాన్న నాకు టైం అవుతుంది సాయంత్రం చేస్తాను అని చెబుతుంది. సరే అమ్మ జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. ఫోన్ పెట్టేసి పక్కకు తిరగగానే నివాస్ చూస్తూ ఉంటాడు. ఏమైంది బావ అలా చూస్తున్నావు అంటే.... నిన్ను మరీ ఇలా చిన్న పిల్లల ట్రీట్ చేస్తూ ఉంటే, రేపు అన్న రోజు నీకు చాలా కష్టం కదా శాంభవి అంటాడు. ఎందుకు కష్టం బావ అంటే.. అది ఇప్పుడు అర్థం కాదులే అనుకుంటు వెళ్ళిపోతాడు. బృందావనం రిపోర్ట్స్ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. దేవేంద్ర గారు అయితే రాత్రంతా నిద్ర పోకుండా తిరుగుతూ పచార్లు చేస్తూనే ఉంటారు. విహాన్, అద్వైత్ ఫ్రెష్ అయ్యి బయటికి రాగానే రాఘవేంద్ర గారు అడుగుతారు. విహాన్ రిపోర్ట్ వచ్చాయా అని... హ, తాతగారు ధీరజ్ ఇప్పుడే మెసేజ్ చేశాడు. చూస్తున్నాను అని చెప్పి... స్టూడెంట్స్ అందరివి వరుసగా చూస్తూ ఉంటాడు. ఏమైనా మ్యాచ్ అవుతున్నాయా అని... ఒక రిపోర్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి విహాన్ చేతిలో వణుకుతున్నాయి. ఏమైంది విహాన్ అనగానే, ఆ రిపోర్ట్స్ దేవేంద్ర గారి ముందు పెడతాడు. దేవేంద్ర కి ఆ రిపోర్ట్స్ చూసి కళ్ళంట నీళ్లు కారిపోతూ ఉంటాయి. రాఘవేంద్ర, జితేంద్ర,, కౌసల్య చాలా ఆత్రుతగా చూస్తూ ఉంటారు. విషయం ఏంటో చెప్పు రా ముందు.. నిన్ను అలా చూస్తుంటే మాకు చాలా కంగారుగా ఉంది అంటే... నాన్న నా కూతురు దొరికేసింది అని ఆనందంతో చెప్తారు. రాఘవేంద్ర గారు పూజ గది వైపు చూస్తా అమ్మా ఇన్ని సంవత్సరాలకు మమ్ములు కరుణించావా. అమ్మాయిని ఎలాగైనా తీసుకు వస్తాను అని దండం పెట్టుకుంటారు. ఇంటి ముందు కారు ఆగుతుంది. రుద్ర చాలా స్పీడ్ గా వస్తాడు చారులత సంతోష్ తులసి గారు కూడా వస్తూ ఉంటారు. రాఘవేంద్ర తులసిని చూసి చెల్లమ్మా ఇన్నాళ్లకు మా ఇంటి దీపం మళ్లీ తిరిగి మా ఇంటికి వస్తుంది .. ఈ ఆనందాన్ని ఎలా చూపించాలో కూడా తెలియడం లేదు అని భావోద్వేగంతో చెబుతారు. అన్నయ్య మీరు ఇంత ఆవేశపడకండి. మనవరాలు వస్తుంది కదా! మనవరాలు తో ఎన్నో ముచ్చట్లు చెప్పాలి. ఇన్నేళ్లు తన జీవితంలో ఏం జరిగిందో మనం తెలుసుకోవాలి అని ఆనందంగా చెబుతుంది. ధీరజ్ కూడా తన పేరెంట్స్ రమణ, మాధురి తీసుకుని చాలా ఆనందంగా అక్కడికి వస్తాడు. రమణ స్పీడ్ గా వచ్చి దేవేంద్రుని హత్తుకొని ఎంత మంచి విషయం విన్నాము, చాలా ఆనందంగా ఉంది అనిచెబుతాడు. అవును రమణ నాకు ఇప్పుడే వెళ్లి నా కూతుర్ని చూడాలని ఉంది. నన్ను నాన్న అని పిలిస్తే వినాలని ఉంది అని చాలా సంతోషంగా చెబుతాడు. దానికి అందరూ అవును ఇప్పుడే వెళదాము అంటే...రుద్ర ఆపుతాడు ఆగండి తాతయ్య అనగానే... ఎందుకు రుద్ర మమ్మల్ని ఆపుతున్నావు అని అడుగుతారు. మీకు మనవరాలను తెలిసింది కానీ... తనకి మీరు ఫ్యామిలీ అని తెలియదు కదా! ఇప్పుడు వెళ్లి మేమే నీ ఫ్యామిలీ, ఇప్పుడు దాకా నీతో ఉన్న వాళ్ళు కాదు అని చెబితే తన పరిస్థితి ఏమిటి?? తన అర్థం చేసుకోగలుగుతుందా, తట్టుకోగలుగుతుందా... ఒకసారి ఆలోచించండి తాతయ్య అనగానే... అందరూ ఒక్కసారిగా నీరు కారిపోతారు. ఇప్పుడు ఎలా రా అని దేవేంద్ర చాలా బెలగా అడుగుతాడు. చిన్న మామ మీరు కంగారు పడకండి. మనం మెల్లిమెల్లిగా తనకి దగ్గరవుతాము. పరిస్థితి ఇది అని అర్థమయ్యేటట్టుగా చెబుదాము. ఇప్పుడే మనం చెప్పాము అనుకుంటే... తన తప్పుగా అర్థం చేసుకుంటే అది ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. శత్రువులకు కూడా మనం ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. అవును బాబాయి రుద్ర చెప్పింది కూడా నిజమే అని విహాన్ ముందుకు వస్తాడు. తను మన ఆఫీసులోనే ఉంది కదా! మెల్లిగా దగ్గరవుదాము అని చెప్పి అందర్నీ ఆపుతారు. సరే అయితే నా కూతుర్నే మాత్రం నేను వెంటనే చూడాలి రెడీ అయ్యి ఆఫీస్ కి వెళ్తాను అని చెప్పి రెడీ అవ్వడానికి అని దేవేంద్ర వెళతారు. తులసి రాఘవేంద్రని అన్నయ్య అని పిలుస్తుంది. చెప్పమ్మా అనగానే.. ఇప్పటికైనా వదిన క్షమించి మాట్లాడొచ్చు కదా అంటే... నువ్వు ఏమైనా అడుగు ఇస్తాను. అది మాత్రం అడగవద్దు. ఒక తండ్రి నన్ను అడిగిన దానికి ఇప్పటికి నేను సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. ఆ పరిస్థితికి అంతటికి కారణం ఎవరు తులసి అని చెప్పి ఆయన కూడా వెళ్ళిపోతారు. అందరూ రెడీ అవ్వడానికి వెళ్తే కౌసల్య, చారులత స్వీట్ తయారు చేస్తూ ఉంటారు. ఈరోజు ఎలాగైనా మనమే తినిపించాలి వదిన అనుకుని స్వీట్ చేస్తారు. అందరూ ముందే ఆఫీస్ కి వెళ్ళిపోయి వెయిట్ చేస్తూ ఉంటారు. ఎంప్లాయిస్ అందరూ ఒకరి తర్వాత ఒకళ్ళు వస్తూ ఉంటారు. రాఘవేంద్ర గారు ఇంకా రాదేంటిరా అమ్మాయి అంటే తాతయ్య మనకి తెలిసింది కదా అని చెప్పి తను వస్తదా, తన టైంకి తను వస్తది అని చెప్పి రాఘవేంద్ర గారిని శాంతింప చేస్తూ ఉంటారు. దేవేంద్ర మాత్రం ఎంట్రన్స్ దగ్గరే ఉంటాడు. ఎప్పుడెప్పుడు తన కూతుర్ని చూస్తానా అని. అప్పుడే ఒక కారు వచ్చి ఆగుతుంది. అందులో నుండి నివాస్, గౌతమ్, మిత్ర, శాంభవి దిగుతారు. శాంభవి, సాయంత్రం మీకోసం ఇంకొక కారు వస్తుంది. డ్రైవర్ కూడా వస్తాడు. బట్ నాకు కాల్ చేసి చెప్పిన తర్వాత మాత్రమే మీరు బయలుదేరండి అని చెప్పి జాగ్రత్త శాంభవి అని ఒకటికి పది జాగ్రత్తలు చెప్తాడు. బావ నేను జాగ్రత్తగా ఉంటాను మీరు టెన్షన్ పడకండి అని చెప్పి లోపలికి వస్తుంది. మిత్ర, శాంభవి కలిసి వస్తూ ఉంటారు. వాళ్ళని అలా చూసిన దేవేంద్ర గారికి వెంటనే వెళ్లి కూతురిని గుండెలకి హత్తుకోవాలి అని అనిపిస్తుంది. అలా చేస్తే తన కూతురికి ప్రమాదం అని ఆయన చాలా కంట్రోల్లో ఉంటారు. దేవేంద్రని అలా చూసిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కళ్ళల్లో నీళ్లు వస్తాయి. నా కొడుకుకి భగవంతుడు ఎంత పరీక్ష పెట్టాడో చూడు జితేంద్ర. కూతురు కళ్ళు ఎదుట ఉన్నా సరే దగ్గరికి తీసుకోలేని నిస్సహాయ స్థితి. ఐశ్వర్యం, పేరు ప్రఖ్యాతలు అన్నీ ఉన్నాయి. కూతురి ప్రేమ కోసం అల్లాడిపోతున్నా ఒక బికారి లాగా నా కొడుకు నుంచున్నాడు అని రాఘవేంద్ర బాధపడతాడు. నాన్న ఏంటా మాటలు అని చారులత దగ్గరికి వస్తుంది. నిజమే కదా అమ్మ అని బాధగా అంటారు. ఆ మాటలకు అందరికీ గుండెలు బరువెక్కుతాయి. శాంభవి, మిత్ర అమ్మవారి ముందు నుంచుంటారు. వాళ్ళు వెనకాల దేవేంద్ర నిలబడి చూస్తూ ఉంటాడు. ఒకసారి ఆలోచించు శాంభవి మనకెందుకే ఇవన్నీ, వాళ్ళు ఏ పర్పస్ మీద ఇక్కడ దీపం పెట్టలేదు తెలియదు కదా అంటే.. సరే అయితే ఒకసారి మనం పర్మిషన్ అడుగుదాము ఇస్తే అప్పుడు దీపం పెడదామని చెప్పి, ఎవరైనా ఉన్నారా అని వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ దేవేంద్ర గారు కనిపిస్తారు. సార్ అని పిలుస్తుంది. చెప్పమ్మా అనగానే.. ఇక్కడ ఎందుకు దీపం పెట్టడం లేదో నాకు తెలియదు. కానీ దీపం లేకుండా అమ్మవారి విగ్రహం ఉంటే ఎందుకో వెలితిగా ఉంది. మీకు ఇబ్బంది లేదు అనుకుంటే.. దీపం పెట్టమంటారా అని అడుగుతుంది. దానికి దేవేంద్ర గారు సంతోషంగా వెలిగించి తల్లి అని చెబుతారు. ఇదంతా సీసీలో చూస్తున్న రాఘవేంద్ర గారు నేను కూడా కిందకి వెళుతున్నాను. ఎవరైనా రావాలి అనుకుంటే రండి లేదు అంటే పైనే ఉండండి అని చెప్పి రాఘవేంద్ర గారు కిందకు వస్తారు. రుద్ర మాత్రం చాలా ఫోకస్ గా శాంభవి ని చూస్తూ ఉంటాడు. ఆరోజు శాంభవి మెరున్ కలర్ చుడీదార్ వేసుకుంటుంది. శాంభవి నీ నే చూస్తున్నా రుద్ర గుండె చాలా గట్టిగా కొట్టుకుంటూ ఉంటుంది. ఎందుకు నా హార్ట్ ఇంత రైస్ అవుతుంది అనుకుంటూ చుట్టూ చూస్తూ ఉంటాడు. కానీ శాంభవిని చూస్తూనే ఇలా అవుతుంది అని మాత్రం అర్థం అవ్వదు. శాంభవి అమ్మవారు ముందు అన్ని అలంకరణ చేసి దీపం వెలిగించి. అమ్మవారి అష్టోత్తరం చదువుతుంది..ఆ గాత్రం వినగానే దేవేంద్ర కి పాత స్మృతుల గుర్తుకు వస్తాయి. రాఘవేంద్ర కి కూడా దీపం వెలగగానే ఎంతో సంతోషం వస్తుంది. ఇన్నాళ్లకు మమ్మల్ని కరుణించావా తల్లి అని నమస్కారం చేసుకుంటారు. జితేంద్ర విహాన్ వంక చూస్తూ శాంభవికి ఫుల్ సెక్యూరిటీ పెట్టండి. ఈ విషయం మయూరి వాళ్ళకి తెలిస్తే ఏదో విధంగా అటాక్ చేయడానికి చూస్తారు. దానికి ధీరజ్ ఆల్రెడీ మేము పెట్టేసాము అంకుల్ అని చెబుతాడు. చాలా స్పీడ్ గానే ఉన్నారు అంటే...ఎప్పుడో అని. ఇంకా మీకు చాలా విషయాలు తెలియాలి అంటాడు. రుద్ర వెంటనే అవన్నీ ఇప్పుడు కాదు...సైలెంట్ గా ఉండని చెబుతాడు. దీపం వెలిగించిన తర్వాత తను తీసుకొచ్చిన హల్వా కూడా అక్కడ పెట్టి దండం పెట్టుకుంటుంది. పూజ పూర్తి చేసిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే దేవేంద్ర, రాఘవేంద్ర గారి అక్కడే నిలబడి చూస్తుంటారు. శాంభవి ఇబ్బందిగా చూస్తూ నిలబడి ఉంటుంది. ఎందుకమ్మా అంత ఇబ్బంది పడుతున్నావు. ఈరోజు నువ్వు చాలా మంచి పని చేశావు అని రాఘవేంద్ర గారు వచ్చి తల మీద చేయి వేస్తారు. చిన్న చిరునవ్వుతో సమాధానం ఇస్తుంది. నైవేద్యం కూడా ఏదో చేసుకుని వచ్చినట్టున్నావు అని అడుగుతారు. దానికి శాంభవి నిన్న అద్వైత్ సార్ నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. సార్ కి థాంక్స్ చెప్పి ఇద్దామని స్వీట్ చేసుకొచ్చాను అని చెబుతోంది. రాఘవేంద్ర గారు ఆ బాక్స్ తీసుకొని నేను ఇస్తాను లేమా అని అంటారు. థాంక్యూ సార్ అంటే.. సార్ వద్దు తాతయ్య అని పిలువు అంటారు. మీరు ఈ కంపెనీ చైర్మన్ సర్. మిమ్మల్ని ఎలా పిలిచేది అంటే.. మీ తాతగారి వయసే కదా! పర్వాలేదు పిలువమ్మా అని చెబుతారు సరే తాతగారు అని చెప్పి, శాంభవి, మిత్ర, గౌతమ్ తో కలిసి లోపలికి వెళ్ళిపోతుంది. ఆ బాక్స్ దేవేంద్ర చేతికిచ్చి నీ కూతురి చేతి వంట ముందు నువ్వే టెస్ట్ చూడు దేవేంద్ర అనే క్యాబిన్లోనికి తీసుకువెళ్తారు. చారులత ధీరజ్ ని పిలిచి ఎలాగైనా ఈ స్వీటు మా చేతులతో మేమే శాంభవికి తినిపించాలి. అరేంజ్మెంట్స్ ఏమైనా చేయగలవా అంటే... అత్త మీకు ఆనందం వచ్చిన, ఆవేశం వచ్చిన తట్టుకోలేము. అలా వెళ్లి ఎలాగా చేయగలము అని అడుగుతాడు. ఏదో ఒకటి చేయండి రా! ఇంత వరకు వచ్చాక ఆగాలంటే చాలా కష్టంగా ఉంది అంటే... సాయంత్రంలోపు ఏదో ఒకటి చేద్దాం. మీరు ఆవేశపడకండి అని ఆపుతాడు. రాఘవేంద్ర దేవేంద్ర లోపలికి వస్తారు. దేవేంద్ర చేతులోని బాక్స్ చూసి..ఏమిటి అది అని అడుగుతారు. నా కూతురు చేతి వంట చారు అని చెప్పి బాక్స్ ఓపెన్ చేస్తాడు. అన్నయ్య నీకు ఇష్టమైన స్వీట్ నీ కూతురు చేసుకుని వచ్చింది. అద్వైత కోసం తెచ్చిందంట అని చెప్పి నవ్వుతారు. ముందు నువ్వే టెస్ట్ చూడు అన్నయ్య అని ఒక స్పూన్ తీసుకోని నోట్లో పెడుతుంది. దేవేంద్ర కు ఆనందంతో కళ్ళలోంచి నీళ్లు కారుతాయి. అందరూ శాంభవి వంట రుచి చూడాలి అని ఒక్కొక్క స్పూన్ నోట్లో పెట్టుకుని టేస్ట్ చూస్తారు. ధీరజ్ ఒక స్పూన్ తో దుద్ర దగ్గరికి వెళ్లి బావ ఈరోజు నీ డైట్ పక్కనపెట్టి నీ మరదలు చేతి వంట టేస్ట్ చూడు అంటే... అది నాకు తెలుసులే గాని నువ్వు ముయ్యి అని చెప్పి ఒక స్పూన్ తీసుకొని నోట్లో పెట్టుకుంటాడు. పర్వాలేదు మరదలు వంట బానే ఉంది అనుకుంటాడు. అందరూ అద్వైత్ కి థాంక్స్ చెప్పాలని ధీరజ్ అంటే... దేనికి అంటాడు. నీ గురించే స్వీట్ చేసుకోవచ్చింది . అందరం టేస్ట్ చేసాము కదా అని అంటే.. అందరూ నవ్వుతారు. చాలా రోజుల తర్వాత అందరూ చాలా మనస్ఫూర్తిగా నవ్వుతారు.. ఈ నవ్వులు ఇలాగే ఉంటాయా?? G. B యూత్ ఆ నవ్వులకి కాపలాగా ఉండగలుగుతారా?? కథ కొనసాగుతుంది.....
25-03-2026, 10:35 AM
Part - 22
జి బి సొల్యూషన్ లో ఉన్న మయూరి ఇన్ ఫార్మర్ ఈరోజు జరిగింది ఇన్ఫార్మ్ చేస్తాడు. అది విని ఎవరా అమ్మాయి?? ఇన్ని సంవత్సరాలుగా దీపం పెట్టినది ఇప్పుడు సడన్ గా ఎందుకు పెట్టారు?? ఇదేదో తెలుసుకోవాలి అని ఆలోచిస్తుంది.
నిషా వాళ్ళు చెప్పినట్టుగా తను రుద్రకి కాబోయే భార్య అని డౌట్ కూడా వస్తుంది. అలా జరగడానికి వీలు లేదు. జి.బి సొల్యూషన్స్ నా హస్తగతంలోనికి రావాలి. వీళ్ళందర్నీ నా కంట్రోల్లో పెట్టుకుని ఆడించాలి. అప్పుడు గాని నా పగ చల్లారదు అనుకుంటూ... ఆ ఇన్ఫార్మర్ కి కాల్ చేసి అమ్మాయి డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేసి ఇమ్మని చెబుతుంది. మేడం కొంచెం టైం పడుతుంది. అవి ధీరజ్ సర్ కంట్రోల్లో ఉన్నాయి. సరే ఏదో విధంగా నాకు 2 డేస్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వని ఫోన్ పెట్టేసి ఆలోచిస్తుంది. నా వైపు నుంచి కూడా నేను ప్రయత్నం చేయాలి. ఒకసారి అత్తయ్య ని కలిస్తే ఏమైనా తెలియొచ్చు. రేపొద్దున నేను గుడికి వెళ్ళాలి. అత్త ఎలాగా గుడికి వస్తుంది కదా అక్కడ కలిసి మాట్లాడతాను అని ఎవరికో ఫోన్ చేస్తుంది. జి. బి సొల్యూషన్స్... దేవేంద్ర గారు కేబిన్ లో కి వచ్చి నా కూతురికి దగ్గర అవడం ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఏమైనా చినమామ అంతలా ఆలోచిస్తున్నాను అని రుద్ర అడిగితే... ఎలా నా కూతురికి దగ్గర అవ్వాలి అని ఆలోచిస్తున్నాను అంటే... డోంట్ వర్రీ మామ, మేము ఆల్రెడీ ప్లాన్ చేసేసాము అని చెప్తాడు. ఏం ప్లాన్ చేశారని మెరిసే కళ్ళతో అడుగుతారు. స్టూడెంట్స్ ని గ్రూప్స్ కింద డివైడ్ చేసాం కదా. శాంభవి గ్రూప్ ని మీరు హ్యాండిల్ చేయండి. థాంక్స్ రుద్ర అని.. అలాగే శాంభవి ఎక్కడ ఉందో ఆ ఫ్యామిలీ డీటెయిల్స్,,ఇప్పుడు ఎక్కడ ఉంటుంది ఆ డీటెయిల్స్ కలెక్ట్ చేశారా అని అడుగుతాడు. ఇదిగో చూడు మామ అని చెప్పి మొత్తం డీటెయిల్స్ ఇస్తాడు. అవి చూసినా దేవేంద్ర గారు నా కూతురు చాలా మంచి ఫ్యామిలీలో పెరిగింది కదా రుద్ర అంటారు. అవును మామ అని అక్కడ చాలా గారాబంగా పెరిగింది ఇక్కడ వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంట్లో ఉంటుందని చెప్తారు. విష్ణు గారి డీటెయిల్స్ చూసి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నారు కదా! టై అప్అవ్వండి. నా కూతురు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం ఉండాలి రుద్ర అంటారు. మామ మీరు కూడా జాయిన్ అవుతే ఇక నీ కూతుర్నే ఆపలేము. ఇప్పటికే ఆ ఫ్యామిలీ చాలా గారాబంగా చూస్తుంది. దానికి జితేంద్ర గారు నవ్వుతూ మన అందరి ఇళ్ళకి ఒక్కటే ఆడపిల్ల అయ్యింది. ఆ మాత్రం గారాబం ఉండదా?? రుద్ర నిన్ను ఒక విషయం అడుగుతాను. సూటిగా జవాబు చెప్పరా అంటారు. ఏంటి పెద్ద మామ అంటే నీకు శాంభవి నచ్చిందా అని అడుగుతారు. అందరూ రుద్ర ఏం చెబుతాడు అని చూస్తారు. ఇప్పుడు ఎందుకు మామ ఆ క్వశ్చన్ అని అంటే... శాంభవిని నీకు ఇచ్చి పెళ్లి చేద్దామని,, వేరే ఇంటికి వెళితే ఇబ్బంది పడుతోంది కదా! ఇప్పుడు దాకా మన మధ్యన లేదు.. ఇప్పుడు నుంచి అయినా ఉండాలి కదా అని అంటున్నారు. అంటే నీ కూతురే సంతోషం కోసం నన్ను లవ్ చేయమని చెబుతున్నావా అంటే.. జితేంద్ర గారి నవ్వుతూ నీకు ఇష్టమైతేనేరా... నీకు ఇష్టం లేకపోతే ఇల్లరకం వచ్చేవాన్ని చూసి పెళ్లి చేసి అమ్మాయిని ఇంట్లో పెట్టేసుకుంటాము అంటారు. దానికి చారు బయటికి వద్దన్నయ్య మన రుద్రాకే చేసేద్దాం అంటుంది. అమ్మ నాతో పని లేకుండా మీరు మీరే డిసైడ్ అయిపోతున్నారా అంటే... మేము డిసైడ్ అయిపోయాము. నువ్వు శాంభవిని ఎలా లవ్ చేయాలి. లైన్లో ఎలా పెట్టుకోవాలి అనేది మాత్రమే ఆలోచించు అని... ధీరజ్ ని చూస్తూ ఒరేయ్ స్వీట్ ఎలా తినిపించాలో ప్లాన్ చేసావా అని అడుగుతారు. ధీరజ్ పళ్ళు నూరుతూ లంచ్ టైం లో ప్లాన్ చేస్తాను. మీరు కంగారు పడకండి అని చెప్పి, సంతోష్ తో ఎలా మామ వేగుతున్నావు అంటాడు. తప్పదు కదరా అనే జాలిగా మొఖం పెడతారు. సరే మన గొడువ ఎప్పుడు ఉండేదే కానీ, స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవ్వాలి పదండి అని రుద్ర సీరియస్ గా చెప్పి బయటకు వస్తాడు. సిక్స్ గ్రూప్స్ గా ఉన్న స్టూడెంట్స్ దగ్గరికి వచ్చి నాలుగు టీమ్ లుకు నలుగురి హెడ్స్ ని అరేంజ్ చేసి, ఒక టీం కి ధీరజ్ ని, ఒక టీం కి దేవేంద్ర గారిని అరేంజ్ చేస్తారు. ఎవరికి అనుమానం రాకుండా ఉండాలి అని.. దేవేంద్ర స్టూడెంట్స్ ని హ్యాండిల్ చేయడం చూసి మిగిలిన స్టాఫ్ అంతా ఆశ్చర్యపోతారు. ఏంటి ఎప్పుడు లేనిది దేవేంద్ర సార్ స్టూడెంట్స్ తో ఇంటర్ఆక్ట్ అవ్వడం ఏంటని. కానీ ఈ స్టూడెంట్ బ్యాచ్ ఏదో సంథింగ్ స్పెషల్ అనుకొని సైలెంట్ అయిపోతారు. ఏదైనా క్వశ్చన్ రైస్ చేస్తే వాళ్ళు జాబ్ రిస్క్ లో పడుతుంది అని. మయూరి ఇన్ ఫార్మర్ వెంటనే ఈ విషయం మొత్తం మయూరి కి పాస్ చేస్తాడు. ఆరు టీమ్ లకి సపరేట్ కేబిన్స్ అరేంజ్ చేస్తారు. దేవేంద్ర శాంభవి టీమ్ ని తీసుకుని తనకు ఎలా చేసిన క్యాబేనికి తీసుకువెళ్లి వర్క్ ఎక్స్ప్లైన్ చేస్తూ ఉంటారు. వర్క్ లో బిజీగా ఉన్న వాళ్ళకి కేబిన్ డోర్ నాక్ అయ్యిన సౌండ్ వచ్చి తలతిప్పి చూస్తారు. అక్కడ చారులత, కౌసల్య ఉంటారు. ఏంటి చారు ఇలా అనగానే... అన్నయ్య మీరు టైం చూసుకోలేదు లంచ్ టైం అయిపోయింది అని చెబుతుంది. ఓకే రండి అమ్మ లోపలికి అనగానే.. ఓకే సర్ మీరు లంచ్ చేయండి మేము కాంటీన్ కి వెళతాము అని గౌతమ్ అనగానే మిగిలిన బ్యాచ్ అంతా కూడా లెగుస్తారు. దానికే చారు ఏమీ అవసరం లేదు. ఈరోజు మీ అందరికీ నేనే లంచ్ ప్రిపేర్ చేసుకోవచ్చాను. అందరూ భోన్జనం చేయండి అంటే శాంభవి ఇబ్బందిగా చూస్తుంది. శాంభవి ఫీలింగ్స్ చూసి ఏమైందమ్మా ముఖం అలా పెట్టావు అని కౌసల్య అడుగుతుంది. మా అత్త ఆల్రెడీ లంచ్ పంపించింది మేడం అని చెప్తుంది. చారు మనసులో అయ్యో నేను నీకు అత్తని అవుతానే బాబు అనుకొని... పర్వాలేదు ఈరోజుకి మేము తెచ్చింది భోజనం చేయండి. రేపటినుండి మీ అత్త పంపిన లంచ్ చేద్దురు గాని అని చెబుతారు. ఇంకా శాంభవి ఇబ్బందిగానే ఉంటే... మిత్ర పక్కనుంచి ఈరోజుకి చేద్దాం బాగోదు . మీ అత్తయ్యకి ఇంటికి వెళ్లాక చెబుదాము అర్థం చేసుకుంటారు అని రిక్వెస్ట్ చేస్తుంది. మీరు చేస్తూ ఉండండి నేను ఒక ఫోన్ చేసి వస్తాను అని చెప్పి ఎక్స్క్యూజ్మీ మేడం అని బయటకు వెళుతుంది. చారులత శాంభవి వంక చూసి ఎక్కడికి వెళుతుంది ఈ అమ్మాయి అని అడుగుతారు. దానికి మిత్ర ఇబ్బందిగా వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేయడానికి వెళుతుంది. లంచ్ టైం కదా అని కవర్ చేస్తుంది. శాంభవి గురించి తెలుసుకోవాలని అంత కనెక్టెడ్ ఆ వాళ్ళ నాన్నగారికి అని అడుగుతుంది. చాలా ఎక్కువ మేడం అని గౌతమ్ చెబుతాడు. శాంభవి చాలా అల్లరి చేస్తుంది తన అల్లరి కి ఫుల్ సపోర్ట్ వాళ్ల నాన్నలు అన్నయ్య లే మేడం అంటాడు. ఎవరెవరు ఉంటారు వాళ్ళ ఇంట్లో అని అడిగితే.. వాళ్లది చాలా పెద్ద ఫ్యామిలీ మేడం. జేజి, తాతగారు, నానమ్మ,, పెదనాన్న పెద్దమ్మ వాళ్ళ నాన్నగారు అమ్మ ముగ్గురు అన్నయ్యలు అని చెబుతారు.అందరికీ శాంభవి అంటే ప్రాణం మేడం అంటారు. ఎవరి వలన అయినా శాంభవి బాధపడింది అని తెలిస్తే వాళ్ళ అన్నయ్యలు ముందు కొట్టి తర్వాత మ్యాటర్ ఏంటో తెలుసుకుంటారు మేడం అని చెప్తారు. శాంభవి గురించి మాత్రమే తెలుసుకుంటే మిగిలిన స్టూడెంట్స్ కి అనుమానం వస్తుంది అని మిగిలిన వాళ్ల గురించి కూడా చెప్పమని అడుగుతారు. గౌతమ్ నేను సింగిల్ చైల్డ్ ని అని చెబుతాడు. మిత్ర నాకు ఒక అన్నయ్య ఉన్నాడు అని చెబుతుంది మిగిలిన ఇద్దరు స్టూడెంట్స్ కూడా వాళ్ళ డీటెయిల్స్ చెబుతారు. బయటికి వచ్చిన శాంభవి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేస్తుంది. చెప్పరా తల్లి అంటే.. నాన్న అని జరిగిందంతా చెప్పి, వాళ్ళు భోంచేయమని ఫోర్స్ చేస్తున్నారు.నాన్న ఇప్పుడు ఏం చేయను అని అడుగుతుంది. ఒక్క నిమిషం భాను గారు ఆలోచించి.. చెయ్ తల్లి అని చెబుతారు. పొద్దుట తెలియని వాళ్ళు ఏమైనా ఇస్తే తినొద్దని చెప్పారు కదా అని అడుగుతుంది. వాళ్లు అక్కడ మేనేజ్మెంట్ ఏ కదా అమ్మ. పరవాలేదు అందరూ ఉన్నారు కదా అని చెప్పి, జాగ్రత్త తల్లి అంటే సరే నాన్న అని ఫోన్ పెట్టి వెనక్కి తిరుగుతుంది. వెనకాల ఉన్న రుద్రాన్ని చూసి ఉలుక్క పడుతుంది. రుద్ర చాలా సీరియస్గా శాంభవి ని చూస్తూ ఉంటాడు. ఈసార్ ఏంటి నా వంక అలా చూస్తున్నారు అని రుద్రను చూస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. సారీ మేడం నేను లేట్ అయ్యాను అని కూర్చుంటుంది. పర్వాలేదు తల్లి కూర్చో అని భోజనం వడ్డిస్తారు. దేవేంద్ర శాంభవి పక్కన కూర్చుంటారు. ఎలాగైనా కూతురికి తినిపించాలని ఆయన ఆశ. చారులత కి స్వీట్ తినిపించాలని ఆత్రుత. మొదటిసారి కదా అన్నయ్యగా ఛాన్స్ ఇచ్చేద్దాం అని అందరికీ స్వీట్ వడ్డిస్తుంది. దేవేంద్ర స్వీట్ కొంచెం తీసుకునే శాంభవి తినమని నోటి దగ్గర పెడతారు. శాంభవి ఇబ్బందిగా చూస్తూ నేను తింటాను సార్ అంటే... నేను తినిపిస్తే తినవా తల్లి అని అడుగుతారు. నేను ఇప్పుడుదాకా మా నాన్నలు తినిపిస్తేనే తిన్నాను సార్. బయట వ్యక్తులు దగ్గర ఎప్పుడూ తినలేదు అని చెబుతోంది. తన కూతురు తనను బయట వ్యక్తిగా చెబుతుంటే దేవేంద్ర గుండె మెలుపెట్టినట్టుగా అవుతుంది. రూమ్ లో జరిగేదంతా సీసీలో చూస్తున్న అందరికీ దేవేంద్ర బాధ అర్థం అవుతుంది. వెంటనే దేవేంద్ర నార్మల్ అవ్వుతు పర్వాలేదులే అమ్మ అని చెయ్యి వెనక్కి తీసుకుంటారు. శాంభవి వెంటనే చేయ పట్టుకుని ఆపుతుంది. ఏమైందమ్మా అని అడిగితే మీరు అంత ప్రేమగా పెడుతున్నారు కదా పెట్టండి సార్ అని నోరు తెరుస్తుంది. సంతోషంతో దేవేంద్ర శాంభవి కి స్వీట్ తినిపిస్తారు. మిగిలిన స్టూడెంట్స్ అయోమయంగా చూస్తుంటే.. చారులత అందరినీ చూసి, ఈరోజు శాంభవి దీపం వెలిగించింది కదా! ఆ సంతోషంతో అన్నయ్య శాంభవికి తినిపించారు అని కవర్ చేస్తుంది. అవునా అనుకుని ఎవరు భోజనం వాళ్ళు చేస్తారు. తండ్రిగా మొదటిసారి తన కూతురికి తినిపించినందుకు దేవేంద్ర కే ఆనందంతో కళ్ళు చెమ్మర్చుతాయి. ఏమైంది సార్ అని శాంభవి అడుగుతుంది. దానికి దేవేంద్ర సమాధానం ఏమిటి?
25-03-2026, 10:36 AM
Part - 23
లంచ్ అయిపోయిన తర్వాత దేవేంద్ర గారి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తారు. శాంభవి స్కిల్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి చెప్పగానే అర్థం చేసుకునే క్యాపబిలిటీ ఉంది అని అర్థమవుతుంది.
దేవేంద్ర కి టైం తెలియకుండానే అయిపోతూ ఉంటుంది. సాయంత్రం అయిన తర్వాత ఓకే లీవ్ ఏమన్నా డౌట్స్ ఉంటే చెక్ చేసుకోండి. రేపు క్లారిటీ ఇస్తాను వర్క్ ఇంకా ఫాస్ట్ గా చేద్దామని చెబుతారు. ఒకే సార్ థాంక్యూ అని చెప్పి, బయటకు వస్తారు. శాంభవి బ్యాచ్ బయటికి రాగానే అక్కడ కారు రెడీగా ఉంటుంది. వెంటనే శాంభవి నివాస్ కి ఫోన్ చేసి బావ కారు వచ్చింది నేను స్టార్ట్ అవుతున్నాము అని చెబుతుంది. జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. మిత్ర శాంభవి తో మీ బావ నీ విషయంలో చాలా కేరింగ్ గా ఉంటున్నాడు. ఏంటి సంగతి అని అడిగితే... అలా ఏముంది అంత ఫ్యామిలీ కదా అని నవ్వుతుంది శాంభవి కి తెలియకుండా సీక్రెట్ గా పెట్టిన సెక్యూరిటీ ఫోన్ నుండి ఇవన్నీ వెంటనే రుద్రకి పిడికిలి బిగుస్తోంది. ముఖం కోపంగా ఉంటుంది అది చూస్తున్న ధీరజ్ మెల్లిగా రుద్ర చెవులు దగ్గర ఏంటి బావ నీ మరదలు ఇంకొకరిని బావ అని పిలుస్తుంది అని కోపం వస్తుందా అని అడుగుతాడు. నేను అలానే ఏమన్నా చెప్పాన నీకు అని రుద్ర అంటే. నీ మొఖం చూస్తే అలాగే అనిపిస్తుంది. నీకు కాంపిటేషన్ ఏమో బావ! ఒకసారి చెక్ చేసుకోరాదు అంటూ రుద్ర వంక చూస్తాడు. రుద్ర ధీరజ్ కాలు నీ గట్టిగా తొక్కుతాడు చచ్చాను రా బాబోయ్అని ఆరిస్తే... చాలా తెలుసుకోవడం ఇంకా తెలుసుకోన అనే కళ్ళు ఎగరేస్తాడు. నీకు దండం రా బాబు, ఏదో నిన్ను కాసేపు ఏడిపిద్దామని అనుకుంటే... ? నన్ను ఏడ్చేలా చేసావ్ రా అని ఏడుపు మొహం పెడతాడు. బావ పబ్ కి వెళ్దామా! ఈ పది రోజుల నుంచి వర్క్ లో పడి స్ట్రెస్ ఎక్కువ అయ్యింది అంటాడు వీకెండ్ ప్లాన్ చేద్దాం ఇప్పుడు కాదు అని రుద్ర కూడా బయటికి వస్తాడు. రుద్ర ఇంటికి వెళ్లగానే అమ్మ అని గట్టిగా అరుస్తాడు. ఏమైందిరా అంతలా అరుస్తున్నావ్ మీ అమ్మని అని తులసి అడిగితే... డార్లింగ్ ఈరోజు మీ కోడలు ఏం చేసిందో తెలుసా అని అడుగుతాడు. చెప్పు అంటే... నాకు తెలియకుండానే నాకు పెళ్లి ఫిక్స్ చేసారు. శాంభవిని లైన్లో పెట్టాలంట వీళ్ళ ఆర్డర్ మళ్ళీ నాకు అంటూ రుసరుసలాడతాడు. శాంభవి కే రా బంగారం లాగా ఉంది. మీ ఇద్దరి పేర్లు కూడా చక్కగా మ్యాచ్ అయినాయి. శాంభవి రుద్ర అనగానే... దానికి రుద్ర అది నాన్నకు కూచి నీకు తెలుసా ఆ విషయం అంటాడు.. అయితే ఏమైందిరా నాన్న కూచి నుంచి బావ కుచ్చిగా మార్చుకో అని వెటకారంగా చెబుతుంది. అంత వెటకారం వద్దు డార్లింగ్. అది అంత ఈజీ అనుకుంటున్నావా! చినమామతో వర్క్ లో లేదా వాళ్ళ నాన్నలతో ఫోన్లో ఉంటది. ఆఫీస్ అయిపోతే కార్ ఎక్కేస్తుంది. అసలు బయట ప్రపంచమే తెలియదు అని చిరాగ్గా అంటాడు. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి.... శాంభవి కి నీతో కలిసి ఉండే టైం ఇవ్వడం లేదా అనా లేక మేము మ్యాచ్ ఫిక్స్ చేసేస్తున్నామన్న అని డౌట్ గా రుద్రవంక చూస్తారు. దానికి నాకు టైం ఇవ్వాల్సిన అవసరం లేదు ముందు మామతో కనెక్ట్ అవ్వనివ్వండి. మెల్లిగా తనని ఇక్కడ అన్ని పరిస్థితులకు అలవాటుపడనివ్వండి అని చెప్పి రూమ్ లోకి వెళ్ళిపోతాడు. ఆ మాటలకు తులసి గుమ్మనంగా నవ్వుకుంటుంది. నీకు మనసులో శాంభవి అంటే ఇష్టం ఉందిరా.. కాకపోతే బయటికి ఎదవ బిల్డ్ అప్ ఇస్తున్నావు. చారులత కిచెన్లోంచి వస్తూ ఏంటి అత్తయ్య గారు మీ మనవడు ఎగురుతున్నాడు అంటే....శాంభవి గురించి అని నవ్వుతారు. ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటి చారు ఎలా శాంభవిని ఇంటికి తీసుకురావాలి అంటే ఇంకా ఏమీ అర్థం కావడం లేదు అత్తయ్య చూడాలి. ముందు శాంభవి పెరిగిన ఇంట్లో వాళ్లతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేయండి. వాళ్లు క్లోజ్ అయ్యారు అనుకో... మనకి ఏదో ఒక దారి కనిపిస్తుంది కదా అని తులసి గారు సలహా ఇస్తారు. ఇది బానే ఉంది అత్తయ్య అని కౌసల్యకు ఫోన్ చేసి అదే విషయం చెబుతారు. కౌసల్య కి.కూడా ఈ ప్లాన్ నచ్చుతుంది. విహాన్ దగ్గర డీటెయిల్స్ ఉంటాయి కదా అడిగి తెలుసుకుందాంలే వదినా అని కౌసల్య ఫోన్ పెట్టేస్తుంది. తన వెనకే వస్తున్న ప్రమాదాన్ని గుర్తించక ఉదయమే అనసూయ గుడికి వెళుతుంది. అమ్మవారి దర్శనం చేసుకుని .ఆలయ ప్రాంగణంలో కూర్చుంటుంది. అత్తయ్య అన్నా వాయిస్ వినిపించిన వైపుకి చూస్తుంది అక్కడ మయూరి కనిపిస్తుంది చిరాగ్గా మొఖం పెట్టుకొని పక్కకు తిప్పేస్తుంది. ఏంటి అత్తయ్య నన్ను చూడగానే మొఖం అలా తిప్పేసావు అని నవ్వుతుంది నాకు నీతో మాట్లాడాలని లేదు దయచేసి నా దగ్గరకు రాకు అని లేచి నుంచి ఉంటారు. ఎందుకత్తయ్య నామీద అంత కోపం? నేనేం చేసినా బావ కోసమే కదా చేశాను. బావ ని ప్రేమించాను కాబట్టే కదా ఇప్పటికే అలాగే ఉన్నాను అంటే.. నీది ప్రేమ కాదు ఉన్మాదితత్వం. ఒకసారి నేను మాయలో పడి చాలా పెద్ద తప్పు చేశాను. మళ్ళీ నీ మాటలు నమ్ముతానని ఎలా అనుకున్నావు మయూరి అని చాలా సీరియస్ గా అడుగుతారు. దానికి మయూరి నవ్వుతూ నేనేమీ మాయ చేయలేదు అత్తయ్య, అంతా నిజమే చెప్పాను. రుద్ర కి పెళ్లి కుదిరింది అంట కదా! అమ్మాయి ఎవరు అని అడుగుతుంది. ఆ విషయాలన్నీ నీకు అనవసరం. నా కుటుంబానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని కోపంగా చెబుతుంది. నాకు అనవసరమా లేక నీకే తెలియదా అత్తయ్య అని వెటకారంగా అడుగుతుంది . నీకు ఒకసారి చెబితే అర్థం కాదా మయూరి ఎందుకు ప్రతిసారి ఇలాగే విసిగిస్తావు అని చిరాకు పడుతుంది. అయ్యో అత్తయ్య నీకు ఎలాగా మీ ఇంట్లో చెప్పరు కదా! నేనైనా చెబుదాము అని నా ప్రయత్నం అంతే అని అమాయకంగా ముఖం పెడుతుంది. నీకు నిన్న ఆఫీసులో జరిగిన విషయం కూడా తెలియదు కదా అత్తయ్య సాగదీస్తుంది . దేని గురించి నువ్వు మాట్లాడుతున్నావ్ మయూరి అంటే... అందుకే అత్తయ్య నేనే నీకు చెప్పాలి అనేది. సరే చెబుతాను విను. నిన్న ఆఫీసులో రుద్ర కి కాబోయే కాబోయే భార్య దీపం వెలిగించింది అని ఓరగంట అనసూయ ని అబ్జర్వ్ చేస్తుంది. అనసూయ ఆ విషయం వినగానే బిగుసుకుపోతుంది. అత్తయ్య ఏమైంది నీకు అని మయూరి కదుపుతుంది. నువ్వు చెప్పేది నిజమా అని అడిగితే... నీతో నేను ఎందుకు అబద్దం చెబుతాను అత్తయ్య. ఆరోజు నిజమే చెప్పాను, ఈరోజు నిజమే చెబుతున్నాను. నువ్వే నన్ను నమ్మడం లేదు అని బాధగా చెబుతుంది. ఆ విషయం వినగానే ఒకపక్క ఆనందం, ఒకపక్క ఆశ్చర్యంతో అనసూయ గబగబా బయటకు వస్తుంది. వెంటనే డ్రైవర్ ని కారు తీయమని ఇంటికి వచ్చే కౌసల్య అని పిలుస్తుంది ఏమైంది అత్తయ్య గారు అంటే... మీరందరూ రెండు రోజుల నుంచి ఆఫీస్ కి ఎందుకు వెళ్తున్నారు అని అడుగుతుంది. ఇప్పుడా విషయాలన్నీ ఎందుకు అత్తయ్య అంటే.... నాకు నిజం చెప్పు కౌసల్య నిన్న అమ్మవారి ముందు కూడా దీపం వెలిగించారంట కదా అని సంతోషంగా అడుగుతుంది. ఈ విషయం మీకు ఎవరు చెప్పారు అత్తయ్య అంటే... ఎవరు చెప్పారు అన్నది కాదు. నాకు నిజం చెప్పు కౌసల్య తనే రుద్రకి కాబోయే భార్య అంట కదా అని చాలా ఆత్రంగా అడుగుతారు. జితేంద్ర అనే రాఘవేంద్ర గారు చాలా గట్టిగా పిలుస్తారు. ఏమైందో అని అందరూ కంగారుగా హాల్లోకి వస్తారు. జితేంద్ర కంగారుగా ఏమైంది నాన్నగారు అంత కోపంగా ఉన్నారు అంటే.... ఆ మనిషికి ఆఫీసులో జరిగిన విషయం ఎలా తెలిసిందో కనుక్కో అని గట్టిగా అంటారు. భర్త మాట తీరుకి అనసూయ కి భయం వేస్తుంది. జితేంద్ర అనసూయ ముందుకు వచ్చి చెప్పమ్మా నీకు ఎలా తెలిసింది అని అడిగితే... మయూరి విషయం చెబితే ఇంట్లో వాళ్ళందరికీ కోపం ఇంకా ఎక్కువ అవుతుంది అని టెన్షన్ తో చెమటలు పడతాయి. నిజం మాత్రమే చెప్పమని చెప్పు జితేంద్ర అని రాఘవేంద్ర గారు మళ్ళీ గట్టిగా మాట్లాడతారు. అమ్మా, నాన్న గారికి కోపం తెప్పించకు నీకు ఎలా తెలిసిందో చెప్పు అని కొంచెం సీరియస్ గానే జితేంద్ర అడుగుతాడు. దానికి అనసూయ గారు కొంచెం కంగారు పడుతూనే మయూరి చెప్పింది అని చెబుతారు నువ్వు ఇంకా మయూరిని కలుస్తున్నావా అని అసహ్యంగా చూస్తారు. భర్త చూపులోని అసహ్యాన్ని, కొడుకుల చూపులోని చిరాకుని చూసేటప్పటికి అనసూయకి ప్రాణం చివుక్కుమంటుంది. లేదురా నేను కలవడం లేదు. ఇందాక గుడిలో అనుకోకుండా కలిసి నాకు విషయం చెప్పింది. అది తెలుసుకోవాలని ఆనందంతో నేను ఇంటికి వచ్చాను అని చెబుతారు. భర్త కొడుకు మొఖంలో కనిపిస్తున్న విసుగుని కూడా పక్కన పెట్టేసి దీపం వెలిగించారు అంటే.. దేవేంద్ర కూతురు కనిపించినట్టేనా అని చాలా ఆత్రంగా అడుగుతారు. అత్తగారు ఆత్రం చూసి కౌసల్యకి జాలి వేస్తుంది. మామగారిని కాదు అని నిజం చెబితే ఆయన తీసుకునే నిర్ణయాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఏమీ చేయలేక మౌనంగా జరిగేది చూస్తూ ఉంటుంది. జితేంద్ర నిట్టూర్చి ఇప్పుడు నువ్వు తెలుసుకుని మాత్రం ఏం చేస్తావ్ అమ్మ అని అడుగుతాడు. అంటే నేను ఏమీ తెలుసుకోకూడదా జితేంద్ర. నాకు అంత అర్హత లేదా అని బాధగా అడుగుతుంది. అవన్నీ నీకే తెలుసు కదా అమ్మ! ఇంకా దయచేసి ఈ విషయాల గురించి మాట్లాడి నాన్నగారికి కోపం తెప్పించకు అని రూమ్ లోకి వెళ్లి పోతారు. భర్త వెనకాల కౌసల్య కూడా రూమ్ లోకి వెళ్ళిపోతుంది. రాఘవేంద్ర గారి కోపంగా చూస్తూ అక్కడినుండి వెళ్ళిపోతారు. విహాన్, అద్వైత్ కూడా ఏం చేయాలో తెలియక సైలెంట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇప్పుడు హాలులో అనసూయ ఒక్కతే మిగులుతుంది. అందరూ ఉన్న ఒంటరిగా మిగిలిపోవడం అంటే ఇదేనేమో అని మనసు లోపలే బాధపడుతూ ఉంటారు ఇంతకీ అనసూయ చేసిన తప్పు ఏమిటి??
25-03-2026, 10:38 AM
Part - 24
రేపల్లె...
శాంభవి లేని ఇల్లు పెద్దవాళ్లందరికీ కళావిహానంగా కనిపిస్తుంది. లేచామా,తిన్నామా,పడుకున్నామా అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. కూతురి మీద బెంగతో ఎప్పుడు శుక్రవారం వస్తుందా.. హైదరాబాద్ వెళ్లాలా అని శివ గారు, భాను గారు ఎదురు చూస్తూ ఉంటారు. శకుంతల గారికి కూడా పొద్దుటే పూజ దగ్గర శాంభవి పాడే పాట లేక పూజ కూడా పూర్తయిన అనుభూతి రాదు. సులోచన గారికి సెటైర్లు వేసే వాళ్ళు, టెన్షన్ పెట్టే వాళ్ళు లేక ఏమి తోయడం లేదు. ధరణి, జయంతి వీళ్ళని ఎంత డైవర్ట్ చేస్తున్నా సరే చివరికి శాంభవి టాపిక్ దగ్గరకు వచ్చే ఆగుతారు. ఈ వీకెండ్ ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ వెళ్లాలని ఫిక్స్ అయిపోతారు. హైదరాబాద్.. శాంభవి బ్యాచ్ ఆఫీస్ కి వచ్చి వాళ్ళకి చేయవలసిన వర్క్ చేస్తూ ఉంటారు ఇందులో దేవేంద్ర గారి కూడా వచ్చే జాయిన్ అవుతారు. ఎలా ఉంది ఎస్టర్డే వర్క్ అర్థమయిందా అని.. అందరిని పేరుపేరునా అడుగుతారు. అంత బాగుంది సార్ అని చెప్పి నెక్స్ట్ వర్క్ నేర్చుకోవడానికి స్టార్ట్ అవుతారు. జితేంద్ర గారు అన్ని టీమ్స్ ని చెక్ చేసుకుంటూ వచ్చి శాంభవి టీమ్ ఉన్న ఛాంబర్ లోకి వస్తారు. నేను మీ వర్క్ అబ్జర్వ్ చేస్తాను అని చెప్పి అక్కడే కూర్చుని శాంభవి ని చూస్తూ ఉంటారు. అందరూ వర్క్ బిజీ లో పడి జితేంద్ర గారిని అబ్సర్వ్ చేయరు. కానీ గౌతమ్ కి డౌట్ వస్తుంది ఎందుకు వీళ్ళందరూ మా టీమ్ మీద స్పెషల్ గా ఫోకస్ పెడుతున్నారు. ఈ విషయం ఒకసారి లలిత సార్ తో మాట్లాడాలి అనుకుని సైలెంట్ అవుతాడు. శాంభవి ని రుద్రకి దగ్గర చేయాలి అంటే శాంభవినే ముందుకే కదపాలి. వాడికి అసలే కోపం ఎక్కువ వాడి ముందుకు రాడు. శాంభవితోనే అడుగు ముందుకు వేపిస్తే సరి అనుకుని శాంభవి చేతికి ఒక ఫైల్ ఇచ్చి ఇది రుద్రకి ఇచ్చి చెక్ చేయమను అలాగే సైన్ చేయించుకుని రా అమ్మ. సైన్ అయ్యేదాకా అక్కడే ఉండు అని పంపిస్తారు. ప్యూన్ వచ్చి శాంభవిని రుద్రా ఛాంబర్ దగ్గరకి తీసుకు వెళ్తాడు. ఇదంతా సీసీ లో చూస్తున్న రుద్ర ఏంటి శాంభవి ఇలా వస్తుంది. చూద్దాం ఏం చేస్తుందో అనుకుని శాంభవి వైపే ఫోకస్ పెడతాడు. జితేంద్ర మిగిలిన ముగ్గురికి మెసేజ్ చేస్తారు. ఎవరు డిస్టర్బ్ చెయ్యొద్దు. శాంభవి వెళుతుంది రూమ్ లోకి అని. శాంభవి డోర్ దగ్గరికి వెళ్లి ఎక్స్క్యూజ్మీ సార్ అని అడుగుతుంది. ప్లీజ్ కమింగ్ అని గంభీరంగా చెబుతాడు. శాంభవి లోపలికి రాగానే రుద్ర గుండే చాలా గట్టిగా కొట్టుకుంటూ ఉంటుంది. ఏంటిది అస్తమానం ఇలా కొట్టేసుకుంటుంది. దీన్ని చూసా అని డౌట్ గా శాంభవివంక చూసి అలాగే కళ్ళు అప్పచెప్పేస్తాడు . శాంభవి ఎక్స్క్యూజ్మీ సార్ అని మళ్ళీ పిలుస్తుంది. దానికి రుద్రా తేరుకుని చెప్పండి మిస్ అనగానే... జితేంద్ర సార్ ఫైలు మీకు ఇచ్చి, చెక్ చేయమన్నారు. అలాగే సైన్ చేసి వెంటనే నాకు ఇమ్మన్నారు అని చెప్పి నిలబడుతుంది. ఓకే అని ఫైల్ తీసుకుని జితేంద్ర ఫోన్ చేస్తాడు. అవతల నుంచి జితేంద్ర చెప్పు అనగానే... ఏంటిది మామ అని అడుగుతాడు. మీ ఇద్దరికీ ప్రైవసీ ఇద్దామని ప్లాన్ చేశాను. టైం యూట్లెస్ చేసుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అబ్బా ఇప్పుడు దీనితో ఎలా మాట కలపాలి. చూస్తే స్టాట్యూ లాగా నిలబడింది అనుకొని కూర్చోండి మిస్ అని.. మీ పేరు అని అడుగుతాడు. శాంభవి అని చెబుతుంది. ఫైల్ చెక్ చేస్తున్నట్టుగా ఉంటూ, ఎక్కడ నుంచి వచ్చారు అని అడుగుతాడు. రేపల్లె అని చెప్తుంది. ఓ విలేజా అని అంటే... విలేజ్ అయితే ఏంటి సబ్జెక్టు ఉంది కదా అని కొంచెం రోషంగా చెబుతుంది. ఇప్పుడు నేను ఏమన్నాను మిస్ శాంభవి,, విలేజా అని మాత్రమే కదా అడిగాను అని రెచ్చగొడతాడు. నేను అదే అంటున్నాను సార్. విలేజా అని రాగం తీయాల్సిన పని ఏముంది నార్మల్గా అడగొచ్చు కదా! అక్కడ చదివిన వాళ్ళకి సబ్జెక్టు ఉండదా అని మళ్ళీ కోపంగా ఉంటుంది. నేను ఏమన్నానని మిస్ మీరు అన్ని చదువుతున్నారు అని మళ్ళీ అంటాడు. అంటే నేను మీకు దెబ్బలాడే దానిలాగా కనిపిస్తున్నానా! మరి మీరు చేసేది ఏంటి అని రుద్ర అడుగుతాడు. దీన్ని దెబ్బలాట అనరు. సమాధానం చెప్పడం అంటారు అని చెబుతుంది. మరి దెబ్బలాడుతాం అంటే ఇంకెలా ఉంటది అని అడుగుతాడు. ఇంతకు పదింతలు నోరేసుకొని పడిపోవడమా అని మళ్ళీ డౌట్ గా అడుగుతాడు. అంటే ఇప్పుడు నేను నోరేసుకు పడిపోతున్నానని అంటున్నారా... లేదు మిస్ మీరు చాలా స్మూత్ గా మాట్లాడుతున్నారని చెబుతున్నా అని వెటకారంగా అంటాడు. అంత వెటకారం వద్దులే సార్ నాకు సైన్ చేసి ఇస్తే నేను వెళ్తాను అని కోపంగా ఉంటుంది. ఆ కోపానికి బుగ్గలు కందిపోయి, ముక్కు చిలక ముక్కలాగా ఎర్రగా అయిపోతుంది. అలా చూసినా రుద్రకి గుండె స్కిప్ అయ్యి, అబ్బా ఇది కోపంలో భలే క్యూట్ గా ఉంది. చూస్తే నాకే ఆ బుగ్గలు కొరకాలనిపిస్తుంది. అమ్మో ఇది చాలా డేంజర్ గానే ఉంది అనుకుంటూ... కాసేపు టీజ్ చేయాలనిపించి.. సైన్ చేయకపోతే అని అడుగుతాడు. నేను డైరెక్ట్ గా వెళ్లి జితేంద్ర సార్ కి చెప్తాను రుద్రా సార్ సైన్ చేయడం లేదు అని అంటుంది. దానికి రుద్ర నవ్వుతూ నేను వర్క్ విషయంలో చాలా సీరియస్ గా ఉంటాను అని మా పెద్ద మామకి బాగా తెలుసు. నువ్వే సైన్ చేసేదాకా ఆగలేదు అని చెబుతాను. అప్పుడు ఎవరి మాట నమ్ముతారు అని కళ్ళు ఎగరేస్తాడు. అయితే తొందరగా సైన్ చేసి ఇవ్వండి సార్ కింద వర్క్ జరుగుతుంది అని చెబుతుంది. నువ్వు సైన్ చేయమనగానే ఎలా చేస్తాను. ఫైల్ స్టడీ చేయాలి కదా! కూర్చో అని చెప్పి అలా కూర్చోబెట్టేస్తాడు. ఇలాగ కూర్చోవాలంటే నాకు చాలా బోరింగ్ గా ఉంది సార్ అనే సాగదీస్తుంది. అవునా అయితే నీ సిస్టం ని పైకి తెప్పిస్తాను ఉండని కిందకి ఫోన్ చేసి ప్యూన్ తో సిస్టం పైకి తెప్పిస్తాడు. ఇక్కడ వర్క్ చేసుకో. ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను. నా వర్క్ అయ్యేదాకా డిస్టర్బ్ చేయకు అని ఫైల్ లో తల దూరుస్తాడు. శాంభవి కూడా వర్క్ చేసుకుంటూ బిజీ అయిపోతుంది. లంచ్ బ్రేక్ కూడా చూసుకోదు. ధీరజ్ విహాన్ తో రుద్ర ఏంటి లంచ్ బ్రేక్ అయినా మనకి ఏమి కాల్ చేయలేదు. మరదలుతో అంత బిజీ అయిపోయాడు అంటావా అని చూస్తాడు. వాడికి అంత సీన్ లేదు. నా ఎస్టిమేషన్ కరెక్ట్ అయితే శాంభవితో కూడా ఫుల్ గా వర్క్ చేపిస్తూ ఉంటాడు. కావాలంటే చెక్ చెయ్ అని చెప్తాడు . సరే అది చూద్దాం పదండి అని విహాన్, అద్వైత్ ని తీసుకుని వెళ్లి రుద్ర డోర్ నాక్ చేస్తాడు. కమెన్ అని గంభీరంగా చెబుతాడు. లోపలికి వచ్చి ముగ్గురూ నోరు వదిలిపెట్టి చూస్తారు. రుద్ర తన వర్క్ లో బిజీగా ఉంటే.. శాంభవి తన వర్క్ లో బిజీగా ఉంటుంది. ఎటువంటి సౌండ్ రావడం లేదు అని రుద్ర తల పైకెత్తి చూస్తాడు. ముగ్గురు అలాగే వీళ్ళని చూస్తా ఉంటే ఏమైంది అని అడుగుతాడు. లంచ్ బ్రేక్ బావ అని ధీరజ్ అంటాడు. అప్పుడే లంచ్ బ్రేక్ అయ్యిందా అంటే... చిన్నగా మరదలు పక్కన ఉంటే టైం కూడా తెలియట్లేదు వీడికి అని విహాన్ తో అంటాడు. చెప్పాను కదా ఆడు వర్క్ లో పడ్డాడు మరదలు ఉందని కాదు అని నవ్వుతాడు. శాంభవి రుద్రవంక చూస్తోంది. రుద్ర ధీరజ్ తో లంచ్ అరేంజ్ చెయ్ అని చెప్తాడు. ఓకే సార్ నేను లంచ్ చేసి వస్తాను. కింద నా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తూ ఉంటారని లెగుస్తుంది. దానికి ధీరజ్ వెంటనే పర్వాలేదు. ఈరోజుకి నువ్వు ఇక్కడ చేసేయి. మీ ఫ్రెండ్స్ కి మెసేజ్ చేస్తాను. వాళ్ళు చేసేస్తారు అంటే... మీతో నా అని ఇబ్బందిగా ఫేస్ పెడుతుంది. శాంభవి ఫేస్ చూసి రుద్రం మేము ఏమన్నా గ్రహాంతరవాసులుమా ఫేస్ అంత చిరాగ్గా పెట్టావు అని అడుగుతాడు. దానికి శాంభవి చిన్నబుచ్చుకొని నేను కొత్త వాళ్లతో కలిసి ఎప్పుడు బోంచేయలేదు సార్ అనే చెబుతుంది. ఇప్పటినుండి అలవాటు చేసుకో. కొత్త కొత్త వాళ్ళని కలుస్తూ ఉంటావు.అప్పుడు భోజనం చేయవలసి వస్తుంది. నేను మీతో కలిసి చెయ్యను, నాకు తెలిసిన వాళ్ళు,మా ఫ్యామిలీ మెంబర్స్ అయితేనే చేస్తానని చెబితే చలా చండాలంగా ఉంటుంది అని ధీరజ్ వంక చూస్తాడు. అరేంజ్ చేసేసాను బావ అని.. విహాన్ తో వీడేందుకు అంత సీరియస్ గా చెప్తాడు అని అంటే... వాడి సంగతి మనకు తెలిసిందే కదా అని సైలెంట్ అవుతాడు. శాంభవి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఎవరా అని చూస్తే అది భాను గారి దగ్గర నుంచి. అంతే ఫోన్ చూడగానే శాంభవి మొఖం థౌసండ్ వాలా బల్బులాగా వెలిగిపోతుంది. ఎక్కడ ఉన్నదో చూసుకోకుండా ఫోన్ ఎత్తి చెప్పండి నాన్న అని గట్టిగా మాట్లాడుతుంది. బంగారం ఏం చేస్తున్నావ్ రా అంటే భోంచేస్తున్నాను నాన్న అని. నాన్న ఈరోజు ఏం జరిగిందో తెలుసా అని మళ్లీ మొదలు పెడుతుంది. వీళ్ళు నలుగురు భోజనం మానేసి మరి శాంభవి వంక చూస్తా ఉంటారు. అసలు ఏం చెబుతుందా అని.. ఆఫీసుకు వచ్చినప్పుడు నుంచి లంచ్ బ్రేక్ దాకా జరిగిందంతా పూసగుచ్చినట్టు చెబుతూ ఉంటుంది. అదంతా విన్న భాను గారు బంగారం ఈ శుక్రవారం మేమందరం వస్తున్నాము అని చెబుతారు. నిజంగా నా నాన్న అని సంతోషంగా అరుస్తూ నాన్న నన్ను చార్మినార్ తీసుకెళ్తారా అని అడుగుతుంది. ఎందుకు తల్లి అని అడగగానే... అక్కడ గాజులు చాలా బాగుంటాయి నాన్న. వెళదాము ప్లీజ్ నాన్న అని గారంగా అడుగుతుంది. నువ్వు అడిగితే మేము కాదంటామా అలాగే వెళదాము అని ఫోన్ పెట్టేస్తారు. ఫోన్ పెట్టేసాక గానీ శాంభవి ఎక్కడ ఉంది అన్నది గుర్తుకు రాదు. వెంటనే భయంతో బిక్క మొహం వేసుకుని ఆ నలుగురు వంక చూస్తుంది. ఆ నలుగురు శాంభవినే చూస్తూ ఉంటారు. ఇప్పుడు శాంభవి సమాధానం ఏమిటి?? కథ కొనసాగుతుంది...
25-03-2026, 01:07 PM
Interesting
ఇతర ధారావాహికాలు
శక్తి ఆగమనం (https://xossipy.com/thread-71346.html) ___________________________________________ ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు మా తెలుగు తల్లికి మల్లె పూదండ
25-03-2026, 01:57 PM
Baboi.. intha innocence yet crafty!!
Awesome undi
26-03-2026, 07:11 AM
Part - 25
శాంభవి వాళ్ళ వంక చూసి అంటే నాన్న ఫోన్ చేశారు ఎక్కడ ఉన్నానో చూసుకోలేదు అని ఇబ్బందిగా చెబుతుంది.
రుద్ర వెటకారంగా నువ్వు ఎప్పుడు చూసుకుని మాట్లాడావులే అని అంటారు. అంతకు ముందు జరిగిన ఇన్సిడెంట్ గుర్తుకు వచ్చి. నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు కదా సార్. ఎందుకు మీరు అస్తమాను నామీద కోపం చూపిస్తున్నారు అని మళ్లీ ఉక్రోషంగా మాట్లాడుతుంది. మిగిలి ముగ్గురు వీళ్ళు ఇద్దరి వంక అలాగే చూస్తూ ఉంటారు. ధీరజ్ విహన్ తో మనోడే నా ఇలా ఒక ఆడపిల్లతో మాట్లాడుతున్నాడు అంటే.. మరదలు అనే హక్కుతో అనుకుంటా అని చిన్నగా అంటాడు. అంతే అయ్యుంటుంది అని.. బావ మాకు చాలా ఆకలిగా ఉంది ముందు లంచ్ చేద్దామా అని ధీరజ్ ఆపుతాడు. శాంభవి ఇబ్బంది పడుతుంటే విహాన్ పక్కన కూర్చుని నువ్వు మా చెల్లి తో సమానము. కూర్చో అని చెప్పి విహాన్ ఒక పక్కన అద్వైత్ మరో పక్కన కూర్చుంటారు. సైలెంట్ గా ధీరజ్ ఫోటో తీస్తాడు రుద్రా ముగ్గురు వంకే చూస్తూ ఉంటాడు. ధీరజ్ రుద్ర తో ఏంటి బావ నువ్వు కూర్చోవాల్సిన ప్లేస్ లో మీ బావలు కూర్చున్నారని చూస్తున్నావా అంటే... ఒక్క లుక్కు వేస్తాడు. అర్థమైంది లే నేను సైలెంట్ అవుతున్నాను అని కామ్ గా కూర్చుంటాడు. ప్యూన్ వచ్చి సర్వ్ చేయబోతుంటే శాంభవి ఆపి నేను సర్వ్ చేస్తాను అని చెప్పి ప్యూన్ చేతుల నుంచి తీసుకుంటుంది.. పర్వాలేదు నువ్వు కూర్చో శాంభవి ప్యూన్ సర్వ్ చేస్తాడు అని ధీరజ్ అంటాడు. పర్వాలేదు సార్ నాకు ఇష్టమే ఇలాగ అని చెప్పి ముందు కర్రీస్ వేసి రైస్ పెడుతుంది. శాంభవి కి భోజనంలో నెయ్యి అలవాటు ఉందని ఫస్ట్ రోజే అర్థమయ్యి నెయ్యి కూడా పెట్టి లంచ్ పంపిస్తారు. సైలెంట్ గా భోంచేస్తున్న శాంభవి తో మాట కలుపుతారు. తన ఫ్యామిలీ విషయాలైతే యాక్టీవ్ గా ఉంటుందని వాళ్ళ అన్నయ్యలు గురించి అడగడం స్టార్ట్ చేస్తారు . అంతే ఏం చెబుతుందో తెలియకుండా అన్నయ్యలు గురించి చెబుతూనే ఉంటుంది. ముగ్గురు అన్నయ్యలు తను ఎంత పాంపర్ చేస్తారో చెబుతూ ఉంటుంది. వాళ్ల జేజి నుంచి ముగ్గురు ఎలా సేవ్ చేస్తారో చెబుతుంది. అవన్నీ వింటున్న విహాన్, అద్వైత్ కి తను ఏం మిస్ అయ్యారో అర్థం అవుతుంది. శాంభవి వాళ్ళతోనే ఉండుంటే మేము ఇంత అల్లరి చేసే వాళ్ళం కదా అనుకుంటారు. ధీరజ్ కి కూడా అలాగే అనిపిస్తుంది. శాంభవి వాళ్లతో మాట్లాడుతునే భోజనం కంప్లీట్ చేస్తుంది. కానీ విహాన్, అద్వైత శాంభవి చెప్పేది వింటూ అన్నాన్ని కేలుకుతూ ఉంటారు. వాళ్లను చూసి అదేంటి సార్ మీరు భోజనం చేయడం లేదు అంటే.. అదేంలేదు నువ్వు చెబుతూ ఉంటే మాకు మా చెల్లి కూడా మాతో ఉంటే మేమే ఎంజాయ్ చేసేవాళ్ళం కదా అని అనిపించింది అని చెప్పి భోంచేస్తారు. మీ చెల్లి ఇప్పుడు మీతో లేదా అంటే.. ప్రస్తుతానికి దూరంగా ఉంది కానీ త్వరలో వచ్చేస్తది అని చెబుతారు. స్టడీస్ కోసం అవుట్ ఆఫ్ వెళ్ళారా అని అడుగుతుంది .ఒక రకంగా అలాంటిదే అని చెబుతారు. చెల్లి దూరంగా ఉంటే చాలా పెయిన్ కాద సార్. మా అన్నయ్యలు కూడా అలాగే సఫర్ అవుతున్నారు. అసలు నేను ఇంత దూరం రావడానికి కారణమే మా అమ్మలు ఇద్దరు అని కోపంగా ఉంటుంది. ధీరజ్ అయోమయంగా ఇద్దరమ్మాలేంటి నువ్వు సెలెక్ట్ అయితే కదా వచ్చావు అని అడుగుతాడు. ధీరజ్ వంక చూస్తూ నేను పాటిస్పేట్ చేస్తే సెలెక్ట్ అవుతాను సార్ . రుద్ర శాంభవి ని చూస్తూ ఓరిని దీని కాన్ఫిడెన్స్ లెవెల్స్ అని అనుకుంటాడు. ధీరజ్ ఉత్సాహంగా మీ అమ్మలు ఇద్దరు ఏం చేశారు అని అడిగితే... సెలెక్ట్ అవ్వవు అని రెచ్చగొట్టారు సార్.ఓకే సెలెక్ట్ అయితే సరిపోతుంది కదా అని పార్టిసిపేట్ చేశాను. సెలెక్ట్ అయ్యాను అని గొప్పగా చెబితే... యావరేజ్ స్టూడెంట్ కూడా సెలక్ట్ అయ్యారు నువ్వు సెలెక్టె అవ్వడం గొప్ప అని తీసి పడేసారు అని ఉక్రోషంగా చెబుతోంది. శాభవి చెప్పే విధానానికి అందరికీ నవ్వు వస్తూ ఉంటుంది నవ్వితే ఫీల్ అవుతుంది అని అందరూ చాలా కష్టంగా నవ్వు ఆపుకుంటారు. తర్వాత ఏం జరిగిందని ఉత్సాహంగా అడుగుతారు. దానికి బాధగా అందరినీ చూస్తూ నువ్వు ఇంటర్నషిప్ చేసి సక్సెస్ అవుతే అప్పుడు నువ్వు, మీ నాన్నలు గొప్ప లేకపోతే అందరూ జీరోనే అని రెచ్చగొట్టారు. మా నాన్నలకు మాట రాకూడదు సార్. అందుకే ఇష్టం లేకపోయినా ఇంత దూరం వచ్చాను అని చెబుతుంది. మీ నాన్నలు అంటే నీకు అంత ఇష్టమా అని అడిగితే.. చాలా సార్ అని చెబుతూంది. మా నాన్నలకి కూడ నేను అంటే ప్రాణం. నేను ఎవరీ డే వేసుకునే డ్రెస్సెస్ దగ్గర్నుంచి అన్ని మా నాన్న సెలెక్ట్ చేస్తారు. ఏ రోజు ఏం చేసుకోవాలన్నది కూడా మా నాన్నలే సెలెక్ట్ చేస్తారని చాలా గొప్పగా చెబుతోంది. ఇవన్నీ వింటున్న నలుగురికి, ఫోన్లో వింటున్న ఫ్యామిలీ మెంబర్స్ కి,ఆ ఫ్యామిలీతో శాంభవి కి ఉన్న అటాచ్మెంట్ ఎలాంటిదో అర్థమవుతుంది. ఇంకా ఎవరు ఉంటారు మీ ఫ్యామిలీలో అని అడుగుతారు. నానమ్మ, తాతయ్య.మా తాతయ్య రాము నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ తెలుసా అని చెబుతోంది. నేను చేసే పనులకి మా జేజి దగ్గర ఎక్కువగా బుక్ అయ్యేది మా నాన్నమ్మ అని నవ్వుతుంది. అది ఎలా అంటే.. మా జేజి చాలా స్ట్రిక్ట్. మా నానమ్మ కి చాలా భయం. నేను ఇంట్లో ఉండేది తక్కువ. ఉంటే కాలేజ్ లేకపోతే నాన్నతో పొలం లో ఉంటాను. సడన్గా జేజి అడుగుతూ ఉండేది బంగారం ఎక్కడ ఉంది అని.. మా నానమ్మకి తెలియదు కదా నేను ఎక్కడ ఉంటానో అని ఆవిడ టెన్షన్ తో మా అమ్మల వంక చూసేది. మా అమ్మలు కవర్ చేస్తూ ఉండేవారు. లేకపోతే నానితో చెప్పించేదాన్ని అని చెప్తుంది. మధ్యలో ఈ నాని ఎవరు అంటే.. నా ఫ్రెండ్ అని చెబుతోంది. అబ్బాయి ఫ్రెండ్ అనేటప్పటికి రుద్ర కి కొంచెం జలసి వస్తుంది. నువ్వు కాలేజీలో ఉంటే తన కూడా కాలేజీలోనే ఉంటాడు కదా అని ధీరజ్ అడుగుతాడు అయ్యో సార్ తన కాలేజ్ ఫ్రెండ్ కాదు. తన ఇంకా స్కూలే అని చెప్తుంది. అప్పుడు రుద్ర కొంచెం శాంతిస్తాడు. ధీరజ్ రుద్ర పేస్ చూస్తాడు. మా బావకి జెలసి మామూలుగా లేదు కదా అనుకుని నవ్వుకుంటాడు. రేపు వీకెండ్ కదా సార్. మా ఫ్యామిలీ మొత్తం వస్తుంది నాకోసం అని చెప్తుంది. మీరు వచ్చి ఇంకా వన్ వీక్ కూడా అవలేదు కదా! అప్పుడే వస్తున్నారా అంటే.. సార్ 4 డేస్ అయిపోయింది. ఇప్పుడు దాకా నేను ఎప్పుడూ మా ఫ్యామిలీ ని విడిచి ఉండలేదు . ఇదే ఫస్ట్ టైం నేను దూరంగా ఉండటం. దేవేంద్ర సార్ ని అడిగి రేపు వర్క్ కూడా ఈరోజు మాక్సిమం ఫినిష్ అయిపోయేటట్టు చూసుకోవాలి అని చెబుతుంది. విహన్, శాంభవితో నిన్ను మా సిస్టర్ లాగా అనుకుంటున్నాం కదా అన్నయ్య అని పిలవచ్చు కదా అని అడుగుతాడు. దానికి శాంభవి ఇబ్బందిగా చూస్తూ.. సారీ సార్ తప్పుగా అనుకోవద్దు.నేను మా అన్నయ్యల ని తప్ప ఎవరిని పిలవను. ఆ పిలుపు మనస్ఫూర్తిగా రావాలి కానీ...పెదాలతో పిలవకూడదు అని తలదించుకుంటుంది. శాంభవి పిలవను అన్నందుకు కొంచెం బాధగా ఉన్నా, ఎలాగైనా తనతో కొంచెం టైం స్పెండ్ చేసాము అని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. రుద్ర శాంభవి తో ఇక నువ్వు మీ టీం తో వెళ్లి వర్క్ చేసుకో అని చెప్పి పంపించేస్తాడు . థాంక్యూ సార్ అని చెప్పి శాంభవి వెళ్లిపోతుంది. ఏంటి బావలు ఫీలయ్యారా అని రుద్ర అడుగుతాడు. ధీరజ్ కూడా ఫ్యామిలీ మెంబర్స్ తో ఉన్న ఫోన్ కట్ చేసి సైలెంట్ అవుతాడు. కొంచెం బాధగానే ఉంది రుద్ర. శాంభవి మన ఇంట్లో ఉండి ఉంటే మన ఇల్లు కూడా అంతే సందడిగా ఉండేది కదా! మమ్మల్ని అన్నయ్య అని పిలవడానికి తను ఒప్పుకోలేక పోతుంది. ఇక బాబాయ్ విషయంలో ఎలా రియాక్ట్ అవుతుందో అన్నది అర్థం కావడం లేదు అని తల పట్టుకుంటాడు. ధీరజ్ అక్కడ వాతావరణం తేలిక చేయడానికి భావ గ్రూపులో ఒక ఫోటో పెట్టాను చూడు. ఎంత క్యూట్ గా ఉన్నారో ముగ్గురు అని అంటాడు. ఏంటి ఆ ఫోటో అని ముగ్గురు ఓపెన్ చేసి చూస్తారు. అది విహాన్,శాంభవి, అద్వైత్ లది. ఫోటో చాలా బాగా వస్తుంది ఎప్పుడు తీసావు అంటే.. మీరు ముగ్గురు ఫుల్ కాన్సన్ట్రేషన్ గా ఉన్నారులే అప్పుడు తీశాను. బాగుంది కదా అనగానే.. అవును చాలా బాగుంది అని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ ఫోటో లాగానే ఎప్పుడో శాంభవి మనల్ని అన్నయ్య అని పిలుస్తుంది అని ధీరజ్ అనగానే... అద్వైత్ కి ఇంట్లో జరిగిన విషయం గుర్తొచ్చి రుద్ర నానమ్మ గుడికి వెళ్ళినప్పుడు మయూరి కలిసింది. శాంభవి మన ఆఫీసులో దీపం వెలిగించిన విషయం తనకి తెలిపింది అని చెబుతాడు. మన ఆఫీసులో జరిగిన విషయాలు తెలుస్తున్నాయి అంటే మన ఆఫీసులోనే ఎవరో ఇన్ ఫార్మర్ ఉన్నారు. ముందు అది కనిపెట్టాలి అని.. సెక్యూరిటీ నుంచి హైర్ ఆఫీసర్స్ దాకా అందరి ఫోన్లు ట్రాక్ చేయండి. రేపు శాంభవి ఫ్యామిలీతో చార్మినార్ వెళ్లే ప్రోగ్రాం లో ఉంది. ఆ ఫ్యామిలీకి తెలియకుండా ఫుల్ సెక్యూరిటీని పెట్టండి. మనం కూడా రేపు చార్మినార్ వెళదామా అని అద్వైత్ అంటాడు. మనమా ఎందుకు? రేపు ధీరజ్ వీకెండ్ పార్టీ అడిగాడు అని రుద్రా అంటాడు. బావ మనకు ఇప్పుడు పార్టీ అవసరమా! ఈ విషయం తెలిస్తే మన ఫ్యామిలీ కూడా చార్మినార్ రెడీ అయిపోతారు. వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి అయినా మనం వెళ్లాల్సిందే కదా అని ధీరజ్ అంటాడు దానికి రుద్ర సమాధానం ఏమిటి?
26-03-2026, 07:12 AM
Part - 26
మనం కూడా వెళితే మన శత్రువులకు డౌట్ వస్తుంది అని రుద్ర అంటాడు. ఇప్పుడేం చేద్దాం అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా...
రుద్ర ఫోన్ రింగ్ అవుతుంది. చూడగానే అమ్మ అని స్క్రోల్ అవుతూ ఉంటుంది. అమ్మ ఎందుకు ఈ టైం లో ఫోన్ చేస్తుంది అని డౌట్ గా ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా అనగానే.. ఒరేయ్ రేపు మేము కూడా చార్మినార్ వెళ్తున్నాము. అరేంజ్మెంట్స్ చేయండి రా అని చెప్పి రుద్ర చెప్పేది కూడా వినకుండా ఫోన్ పెట్టేస్తుంది. మనం నలుగురం ఇక్కడే ఉన్నాం కదా అప్పుడే న్యూస్ ఎలాగా స్ప్రెడ్ అయిందని డౌట్ గా ధీరజ్ వంక చూస్తాడు. నీళ్లు నములుతూ అంటే బావ.. శాంభవి మనతో టైం స్పెండ్ చేస్తుంది కదా! మన వాళ్ళు కూడా వింటారు అని గ్రూప్ కాల్ పెట్టాను అని చెబుతాడు. నీ చెల్లి ది అసలే పెద్ద బిబిసి నోరు. ఈపాటికి అందరికీ మా నాన్న వస్తున్నారు, మా నాన్న వస్తున్నారు అని ఎగురుకుంటూ చెబుతూ ఉంటది. ఈ విషయం ఆ ఇన్ ఫార్మర్ కూడా తెలిసిందంటే మయూరి కి పాస్ చేస్తాడు. ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలంటే మీ తర్వాతే రా ఎవరైనా అని విసుగ్గా అంటాడు. బావ నువ్వు మరి మమ్మల్ని అలా తీసి పడేయకు అని గోముగా అంటాడు. ఒరేయ్ నువ్వు ఆడపిల్లవు కాదు రా! మరి అలా మెలికలు తిరగకు అంటే.. నేను ఆడపిల్లనైతే నీకు పర్వాలేదా బావ అని నవ్వుతాడు. రేయ్ నువ్వు ఆగరా అని రుద్ర కుర్చీలోంచి లెగుస్తాడు. నేను ఆగను బావ.. ఆగితే నీ చేతిలో నేను అయిపోతాను అని బయటికి పరుగు అందుకుంటాడు. అద్వైత్ ఇప్పుడు ఏం చేద్దాం బావ అంటే... ముందు మనోళ్ళయినా కన్విన్స్ చేయాలి. లేదా ఫుల్ సెక్యూరిటీ నైనా అరేంజ్ చేయాలి. రుద్ర ఇంటికి ఫోన్ చేస్తాడు. చెప్పు రుద్ర అరేంజ్మెంట్స్ అయిపోయినాయి అంటే... అమ్మ ప్లీజ్ ముందు నేను చెప్పేది విను మన ఆఫీసులోనే మయూరి ఇన్ఫార్మర్ ఉన్నాడు. మేము తెలుసుకునే వరకు మీరు శాంభవి తో క్లోజ్ అవ్వకండి అంటే... ఒరేయ్ అదంతా మీ ప్రాబ్లం రా. ఇన్ని రోజులు దూరంగా ఉన్నాము. ఇంకా ఉండాలంటే మా వల్ల కాదు అంటే.. ప్లీజ్ అమ్మ అర్థం చేసుకోండి అని కొంచెం వాయిస్ పెంచుతాడు. ఏంట్రా వాయిస్ పెంచుతున్నావు అంటే మరి పెంచక ఏం చేయమంటావు. నేను ఒక ఐడియా చెబుతాను అంటుంది. ఏంటి చెప్పమ్మా అంటే మేము రేపు సాయంత్రం కదా వెళ్ళేది. ఈలోపు అందరు ఫోన్ లు ట్రాక్ చేయండి. ప్రెసెంట్ అయితే జామర్ ఆన్ చేసి ఫోన్లు పని చేయకుండా చేయండి. మీరు ఇప్పుడు మొదలుపెడితే ఎంతో కొంతమంది అయినా ఫోన్లు ట్రాక్ చేయొచ్చు కదా అని చెబుతోంది. అమ్మ ఆల్రెడీ మేము ట్రాక్ చేసే దాంట్లోనే ఉన్నాము. నీ బ్రెయిన్ బలే షార్ప్ గా ఉంటదమ్మా అంటే.. మరి ఏమనుకుంటున్నావ్ ఇక్కడ ఉన్నది రాఘవేంద్ర డాటర్ ని అని గర్వంగా చెబుతోంది. అమ్మ మీ అమ్మాయిలకి ఎంతసేపు నాన్న భజన తప్ప ఇంకేమీ కనిపించదా! వేరే వాళ్ళు మనుషులు కాదా అని ప్రెస్టేట్ అవుతాడు. ఎందుకురా అంత కోపం. రేపు నీకు కూతురు పుడితే నీ కూతురు కూడా అదే జపం చేస్తుంది. ముందు చెప్పిన పని చేయండి అని ఫోన్ పెట్టేస్తారు. చారులత గారికి మొట్టమొదటిసారి వాళ్ళ అమ్మగారి మీద చాలా కోపం వస్తుంది. నువ్వు చేసిన తింగరి పని వల్లే కదా నా మేనకోడలికి మేము ఇంత దూరంగా ఉండవలసి వచ్చింది. ఏమి సాధించావు అమ్మ నువ్వు. అందరికీ దూరమవడం తప్ప అని బాధపడతారు. నీ మీద కోప్పడాలో, నిన్ను చూసి బాధపడాలో అర్థం కావడం లేదు అని మనసులో అనుకుంటూ.. రేపు చార్మినార్ వెళ్ళినప్పుడు ధరణి,,జయంతి గారితో ఎలాగైనా మాట కలపాలి క్లోజ్ అవ్వాలి అని ఆలోచిస్తారు. తులసి గారు వచ్చి ఏమైంది చారు అంతలా ఆలోచిస్తున్నావు అంటే.. రేపు చార్మినార్ వెళ్లే ప్రోగ్రాం ఉంది అత్తయ్య. ఎలాగా ధరణి, జయంతి గారితో మాట కలపాలని ఆలోచిస్తున్నాను అంటే... దీనికి అంత ఆలోచించవలసిందేముంది. ఆడవాళ్లు ఒకచోట కలిస్తే పరిచయం లేకపోయినా మాటలు కలిసిపోతాయి. రేపు ఏ గాజుల దగ్గర మాటలు మొదలుపెట్టండి. ఆటోమేటిగ్గా కలిసిపోతారు అని చెబుతుంది. మీరు సూపర్ అత్తయ్య అని బుగ్గ మీద కిస్ చేస్తుంది. నేను వదినకి కాల్ చేస్తాను అని చెప్పి, కౌసల్య కి ఫోన్ చేసి.. రేపు వెళ్లే ప్రోగ్రాం గురించి మాట్లాడుతూ ఉంటుంది. శాంభవి తన టీం తో కలిసి వర్క్ ఫాస్ట్ గా ఫినిష్ చేస్తోంది. శాంభవి రుద్ర వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఫోన్లో అంతా విన్న దేవేంద్ర కూడా రేపు వర్క్ వీళ్లకు తక్కువ ఇవ్వాలని డిసైడ్ అవుతాడు. మెల్లిగా సార్ అని పిలుస్తుంది. చెప్పు శాంభవి అంటే... మా వర్క్ అయిపోయింది కదా! రేపటి వర్క్ ఈరోజు ఏమైనా చెబుతారా అని అడుగుతుంది. ఏమీ తెలియనట్టుగానే అంత కంగారు ఏముంది. రేపు నేర్చుకోవచ్చు కదా అని దేవేంద్ర అడుగుతారు. అంటే రేపు వర్క్ తొందరగా అయిపోతే మేము వెళ్ళిపోవచ్చు కదా అని అంటుంది. అంత అర్జెంట్ పనులు ఏమున్నాయి శాంభవి అంటే.. రేపు మా పేరెంట్స్ వస్తున్నారు సార్. అందుకని అని కుదిరితే ఈరోజు కొంచెం ఫాస్ట్ గా ఫినిష్ చేద్దామని అని చెబుతుంది. అంత అవసరం లేదులే.. రేపు వీకెండ్ కదా కొంచెం తక్కువ వర్క్ నేర్పిస్తాను అని చెప్పి,, ఓకే బాయ్ చెప్పి డౌట్స్ ఏమన్నా ఉంటే క్రాస్ చెక్ చేసుకోండి. రేపు క్లియర్ చేస్తాను అని బయటకు వచ్చేస్తారు. దేవేంద్ర కూడా రేపు నేను కూడా చార్మినార్ వెళ్లేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి నా కూతురికి నచ్చినవన్నీ నేనే కొనాలి అనుకుంటూ క్యాబిల్లోకి వెళ్లి రుద్రకి కాల్ చేస్తాడు. చెప్పు చిన్న మామ అంటే.. ఒరేయ్ రేపు నేను కూడా చార్మినార్ వెళ్తాను అని చెబుతారు. మామ మీ అందరికీ ఏమన్నా పిచ్చా... అమ్మ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది. ఇప్పుడు మీరు అలాగే చెబుతున్నారు సెక్యూరిటీ ఎంత కష్టమవుతుందో అర్థం అవుతుందా మీకు అని కోపంగా ఉంటాడు. దానికి దేవేంద్ర నా కూతురుతో ఫస్ట్ టైం షాపింగ్ కి వెళుతున్నాను రా! ఆ మాత్రం అరేంజ్ చేయలేరా మీరు. ఒకరికి నలుగురు ఉన్నారు అని గట్టిగా అంటారు. సెక్యూరిటీ గురించి కన్నా మయూరితోనే ఎక్కువ ప్రాబ్లం చిన్న మామ. ఆల్రెడీ మన ఆఫీసులో ఎవరో ఇన్ఫార్మర్ ఉన్నారని మాకు డౌటుగా ఉంది అని చెబుతాడు. ఆ డౌట్ నీకెందుకు వచ్చింది అని దేవేంద్ర అడిగితే.. పొద్దున ఇంటి దగ్గర జరిగిన విషయం అద్వైత్ చెప్పాడు. అప్పుడే నాకు డౌట్ మొదలయ్యింది. నేను అందరి ఫోన్లు ట్రాక్ చేపిస్తున్నాను. మాక్సిమం ఈవినింగ్ లోపు మనకు తెలిసిపోవచ్చు లేదు అంటే రేపు మార్నింగ్ కి తెలుస్తుంది. కానీ ఈలోపే మయూరీకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది కదా అందుకని నేను టెన్షన్ పడేది అని చెబుతాడు. ఇప్పుడు ఏం చేద్దాం అని దేవేంద్ర అడుగుతారు. మీరు టెన్షన్ పడకండి చిన్న మామ. నేను అరేంజ్ చేస్తాను కదా! నిన్ను నీ కూతుర్ని కలిపి షాపింగ్ పంపుతాను సరేనా కొంచెం నవ్వండి అని ఫోన్ పెట్టేస్తాడు. ఫోన్ పెట్టేసాక దేవేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. మయూరి ఇప్పటిదాకా నువ్వు ఏం చేసినా భరించాను. ఆడదానివాని వదిలేసినప్పుడల్లా నువ్వు రెచ్చపోతున్నావు.నా కూతురు జోలికి వస్తే మాత్రం నిన్ను ఎవరు రక్షించలేరు. ఈసారి నా కోపానికి నువ్వు బలి అవ్వాల్సిందే అని కళ్ళు మూసుకుంటారు. మయూరి తన ఆఫీసులో బిజీగా ఉన్నప్పుడు ఒకటే ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి . ఎంత వాటర్ తాగుతున్న కంట్రోల్ అవ్వడం లేదు. ఏంటి ఇంత దారుణంగా ఎక్కిళ్ళు వస్తున్నాయి .నన్ను అంతగా తలుచుకునే ప్రియమైన వాళ్ళు ఎవరు ఉన్నారు. నా ప్రియమైన శత్రువు తలుచుకుంటున్నాడా ఏంటి అని దేవేంద్రని తలుచుకుంటుంది. కళ్ళు మూసుకుని కుర్చీలో తల వెనకేవాల్సి పాత విషయాలను గుర్తు చేసుకుంటుంది. చాలా డిస్టర్బ్ గా అనిపించి ఇక వర్క్ ఆపేసి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చిన మయూరిని చూసి లక్ష్మీ గారు ఏంటి ఈ టైంలో ఇంటికి వచ్చావు అంటే.. ఏ రాకూడదా అని అడుగుతుంది. నిన్న ఆపగలుగేవాళ్లు ఇక్కడ ఎవరు ఉన్నాము ఇంత సడన్గా వస్తే ఎవరు కొంప కూల్చడానికా అని డౌట్ వచ్చింది అంతే అని చెప్పి లోపలకి వెళ్ళిపోతారు. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన కూతుర్ని అడగవలసిన ఇదేనా అనుకుంటూ.. రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసేసుకుంటుంది. ఆ రూమ్ కి అటాచ్డ్ గా ఇంకొక చిన్న రూమ్ ఉంటుంది. ఆ డోర్ ఓపెన్ చేయగానే ఆ రూమ్ మొత్తం వయసులో ఉన్న దేవేంద్ర ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ తడుముతు.. ఎందుకు దేవేంద్ర నా ప్రేమ నీకు అర్ధం కాలేదు. నాలాగా ప్రేమిచే వాళ్ళు నీకు దొరుకుతారా చెప్పు అని ఫొటోస్ తడుముతు కిస్ చేస్తుంది. నీకు ఎప్పటికైనా నా ప్రేమ అర్ధం అవుతుంది. అప్పుడు నువ్వే నా దగ్గరికి వస్తావు. అప్పటివరకు నేను వెయిట్ చేస్తూనే ఉంటాను. నీ కోసం ఏమైనా చేస్తాను అని ఒక ఉన్మాది లాగా బెహేవ్ చేస్తూ నీలెవెత్తు రూపం లో దేవేంద్ర మైనపు బొమ్మని కౌగిలించుకుంటుంది. తలుపు గట్టిగా కొడుతున్న శబ్దం వినిపించి చిరాగ్గా తలుపుతీస్తుంది. ఎదురుగా లక్ష్మీ గారు కాఫీ కప్పుతో ఉంటారు. రామ్మ అని పక్కకు తప్పుకుంటుంది. కూతురు మొహం చూసి ఏమైంది మయూరి అలా ఉన్నావు అంటే... ఎందుకమ్మా నా ప్రేమను దేవేంద్ర అర్థం చేసుకోవడం లేదు అని బేలగా అడుగుతుంది. కూతురి ని అలా చూసిన లక్ష్మి గారికి మనసు చివుక్కుమంటుంది. ఇలా కూర్చో మయూరి అని సోఫాలో కూర్చోబెట్టి,పక్కన కూర్చొని... నువ్వు దేవేంద్ర ని కోరుకున్నావు. కానీ దేవేంద్ర మనసు వేరేవాళ్లుని కోరుకుంది. మరి నాది ప్రేమ కాదా అని అడుగుతుంది. లక్ష్మీ గారి సమాధానం ఏమిటి??
26-03-2026, 07:13 AM
Part - 27
నాది ప్రేమ కాదా అమ్మ అని మయూరి అడుగుతుంది.
దానికి లక్ష్మి గారు మయూరి కళ్ళల్లోకి చూస్తూ నీది ప్రేమే కానీ...దేవేంద్ర మనస్సు నీ ప్రేమ కి స్పందించలేదు. మరొకరిని చూసి స్పందించింది. ఇప్పుడు మా మధ్యన తన లేదు కదా అమ్మ అంటే.. లేకుండా పోవడానికి కారణం ఎవరు మయూరి?? ఇద్దరి మనుషుల మధ్యకి ఒక బంధం ఏర్పడక ముందు తప్పయినా కొంచెం వెళ్లడానికి ప్రయత్నించవచ్చు కానీ ఆ బంధం బలోపేతం అయిన తర్వాత వెళ్లడం మాత్రం మహా పాపం మయూరి. నువ్వు మీ నాన్న చేసింది మాత్రం మహా ఘోరం. ఎలా దేవేంద్ర నిన్ను తన జీవితంలోనికి రానిస్తాడు అనుకుంటున్నావు. నువ్వే దేవేంద్ర ని మర్చిపోలేక అతని వెంట తిరుగుతున్నావు. మరి దేవేంద్ర తన భార్యతో కొన్ని రోజులు దాంపత్య జీవితం సాగించాడు. మరి తనే ఎలా మర్చిపోతాడు అని అడుగుతుంది. అయినా మయూరి అర్థం చేసుకోకుండా నా ప్రేమ ఒప్పుకోవాలి కదా అని అడుగుతుంది. అంత ఓపికగా చెప్పిన లక్ష్మీ గారు కూడా విసుగు వచ్చి నీది ప్రేమ కాదు. ఉన్మాది తత్వం. అందుకే ఇంతమంది నాశనాన్ని కోరుకుని అయినా సాధించాలి అనుకుంటున్నావు. నీ జీవితంతో పాటు ఆశ, నిషా జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నావు అది అర్థం అవుతుందా నీకు అని గట్టిగానే అడుగుతారు. ఒక్కటి మాత్రం గుర్తించుకో మయూరి నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంతమందిని నాశనం చేసిన దేవేంద్ర నీకు దక్కడు. నువ్వు ఇప్పటివరకు ఎన్ని తప్పులు చేసినా ఆడపిల్లవి అని జితేంద్ర, దేవేంద్ర కనికరం చూపించారు ఏమో గాని ఈ జనరేషన్ లో ఉన్న ఆ ముగ్గురు వారసులు అస్సలు క్షమించరు. అంటే ఏంటమ్మా అని కోపంగా అడుగుతుంది. నీకు అర్థమైందని నాకు తెలుసు మయూరి. నిన్ను అడ్డుపెట్టుకొని మీ నాన్న వాళ్ల ఆస్తిని సొంతం చేసుకోవాలి అనుకున్నాడు. సొంత చెల్లి సంసారం నాశనం అవుతున్న పట్టించుకోలేదు. ఇప్పుడు కూతురు జీవితాన్ని కూడా అలాగే చేశారు. మీరు ఎన్ని చేసిన మీ ప్రయత్నాలు వృధా ప్రయాస ఇప్పటికైనా మేలుకొని మనుషుల్లాగా మారండి అని విసుక్కుని వెళ్ళిపోతారు. మయూరి వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు ఆలోచిస్తూ, ఒక్కసారిగా తల విదిల్చిచి అమ్మ నా మైండ్ ని పొల్యూట్ చేస్తుంది. ఎప్పటికైనా దేవేంద్ర నా ప్రేమని నమ్మి నా దగ్గరికి వస్తాడు అమ్మ అన్నీ అలాగే చెబుతుంది అనుకుంటూ మళ్ళీ దేవేంద్ర ఫొటోస్ చూస్తూ ఉంటుంది. ఎవరి పిచ్చి వాళ్లకు ఆనందం అంటే ఇదేనేమో... బృందావనం.. అనసూయ గారు అందర్నీ అబ్సర్వ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడు లేని కొత్త కళతో అందరూ ముఖాలు వెలిగిపోతూ ఉంటాయి. ఆవిడకి అర్థం అవుతుంది దేవేంద్ర కూతురు దొరికింది అని.. ఈ సంతోషాన్నా నేను ఇన్ని రోజులు దూరం చేసాను నా కుటుంబానికి అన్ని బాధపడతారు. దేవేంద్ర కూతురిని నేను చూడాలి అని బలంగా అనుకుంటూ కోడలు వంక చూస్తారు. కౌసల్య దగ్గర ఏమైనా ఫొటోస్ ఉన్నాయేమో కనుక్కోవాలి. అందరి డిన్నర్ అయ్యేదాకా వెయిట్ చేస్తూ ఉంటారు. ఎవరు రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కౌసల్య అని పిలుస్తారు చెప్పండి అత్తయ్య అని దగ్గరకు వస్తుంది. నేను ఒక విషయం అడుగుతాను నిజం చెబుతావా అని అడుగుతారు. దేని గురించి అత్తయ్య అని అనుమానంగా చూస్తుంది. దేవేంద్ర కూతురు కనిపించింది కదా అని ఆశగా అడుగుతారు. మీకెందుకు అత్తయ్య ఆ విషయాలు అన్నీ అని ఇబ్బందిగా చెబుతుంది. ప్లీజ్ కౌసల్య దయచేసి నాకు నిజం మాత్రమే చెప్పు అని బ్రతిమాలితారు. ఆవిడ బాధ చూడలేక అవును అత్తాయ్య కనిపించింది. ఎలా ఉంటుంది కౌసల్య అని అత్రంగా గా అడుగుతారు. కుందనపు బొమ్మ లాగా ఉంటుంది. తను పెరిగిన వాతావరణం కూడా చాలా మంచిది అత్తయ్య. బాగా విలువలు నేర్పించారు అని వాళ్ళ అత్తయ్య గారి వంక చూస్తుంది. అమ్మాయివి ఏమైనా ఫొటోస్ ఉన్నాయా ఉంటే ఒకసారి చూపించు కౌసల్య చూడాలని ఉంది అని అడుగుతారు. నా దగ్గర తన ఫొటోస్ ఏమీ లేవు అత్తయ్య అంటే ప్లీజ్ కౌసల్య ఒక్క ఫోటో చూపించూ... నిజమే చెబుతున్నాను అత్తయ్య నా దగ్గర లేవు. మీతో ఈ విషయాలు మాట్లాడాలని తెలిస్తే నాపై మావయ్య గారికి కోపం వస్తుంది ఇంకా దయచేసి అడగకండి అని ఆవిడ రూమ్ లోకి వెళ్ళిపోతుంది. రూమ్ లోనికి వెళ్ళిన తర్వాత ఏవండీ అని భర్తని పిలుస్తుంది చెప్పు కౌసల్య అంటే అత్తయ్య గారు చాలా బాధపడుతున్నారు అండి శాంభవి ని చూడాలని అంటే... అమ్మకి ఎలా తెలిసింది అని అడుగుతారు. తనకి, వాళ్ళ అత్తయ్య గారికి మధ్య జరిగిన విషయం అంతా చెబుతుంది. అంతా విన్న జితేంద్ర గారు భార్య వంక చూస్తూ.. ఇంక అమ్మకు శాంభవి గురించి ఏమీ తెలియని వ్వకు. పేరు కూడా చెప్పకు. అత్తయ్య గారు మారారు కదండీ అంటే.. శాంభవి, దేవేంద్ర విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోలేము. ఇప్పటికే వాడు జీవితంలో చాలా విలువైన కాలాన్ని కోల్పోయాడు. ఇప్పుడు అమ్మని నమ్మి ఎలాంటి ప్రమాదాన్ని తీసుకురాలేము అర్థమైందా అనగానే అర్థమయింది అని తల ఊపుతుంది. రేపు చార్మినార్ వెళ్లే ప్రోగ్రాం ఉన్నట్టుంది కదా జాగ్రత్త. చుట్టూ ఉన్న మనుషులను కూడా అబ్సర్వ్ చేస్తూ ఉండండి. మా జాగ్రత్తలో మేమున్నం సెక్యూరిటీని అరేంజ్ చేసాము. బట్ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఇంక పడుకో చాలా లేట్ అయింది అని నడుము వాలుచుతారు. రుద్ర చారులత గారితో గొడవ పడుతూ ఉంటాడు అమ్మ మీకు ఇంత దురద ఏంటి? శాంభవి ఎవరో తెలుసాకా అసలు వదలము అంటున్నారు. మీరు వెళితే అందరికీ రిస్క్ అని తెలుసు కదా అమ్మ అని అంటాడు. ఒరేయ్ మేము ఏదో క్యాజువల్ గా వెళ్లినట్టు వెళ్తాము రా! మేము శాంభవి ఫ్యామిలీకి దగ్గర అవ్వడానికి మా ప్రయత్నాలు ఏం చేస్తున్నాం. మా లేడీస్ మధ్యన బాండింగ్ పెరిగితేనే కదా రేపు అన్న రోజున ఏమన్నా చేయడానికి ఉంటుంది. ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు రిస్కుందని మానేస్తే ఎలా రా అని అంటారు. చారులత వంక చూస్తూ ఈ ఐడియా మాత్రం నీది కాదు నీకు ఎవరు ఇచ్చారు అని డౌట్గా తులసి గారి వంక చూస్తాడు. ఏంట్రా నువ్వు నా వైపు చూస్తున్నావు నాకేమీ తెలియదు అంటే.. నిన్ను నేను ఏమీ అడగలేదు కదా! అయినా నువ్వు అలా మాట్లాడేవా అంటే కచ్చితంగా ఈ బుడబుక్కల ఐడియా నీదే కదా అని గుర్రుగా చూస్తాడు. ఒరేయ్ నా అనుభవంతో చెబుతున్నాను ఆడవాళ్లు కలిశారు అంటే ఎలాంటి సమస్యకైనా సొల్యూషన్ దొరుకుతుంది. వాళ్లు జుట్టు జుట్టు పట్టుకున్నారంటే సొల్యూషన్ దొరికే చోట కూడా క్రిటికల్ గా మారిపోతుంది. అవునా అని వెటకారంగా అంటూ చూద్దాం ఈ ఆడవాళ్ళందరూ కలిసి ఈ సమస్యకి ఎలాంటి సొల్యూషన్ చెబుతారో గుడ్ నైట్ అని చెప్పి రూమ్ కి వెళ్ళి మంచం మీద పడుకుని శాభవి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. పొద్దున్నే శాంభవి తో జరిగిన గొడవ గుర్తొచ్చి నవ్వొస్తుంది. నా మరదలు పిల్ల అందమైనదే కాదు, గొడవ కూడా బాగానే పడుతుంది. పరవాలేదు పెళ్లయిన తర్వాత మనకి అంత బోరింగ్ ఉండదు. రేపు ఫుల్ ఫ్యామిలీని చూడాలి. వాళ్లతో శాంభవికున్న బాండింగ్ డైరెక్ట్ గా చూడాలి . శాంభవి తో ఎలా షాపింగ్ చేయాలి అని లేడీస్, కూతురికి ఏమేమి కొనాలా అని దేవేంద్ర. వీళ్ళందరూ సెక్యూరిటీ ఎలా అని అబ్బాయిల ఆలోచన. తన ఫ్యామిలీ కోసం ఎదురుచూపులతో శాంభవి ఇలా ఎవరి ఆలోచనలతో వాళ్ళు నిద్రకు ఉపక్రమిస్తారు. మయూరి శాంభవి ని కనిపెట్టగలుగుతుందా?? కథ కొనసాగుతుంది...
26-03-2026, 08:54 AM
SivaSai
Part - 27
నాది ప్రేమ కాదా అమ్మ అని మయూరి అడుగుతుంది...
... రేపు ఫుల్ ఫ్యామిలీని చూడాలి. వాళ్లతో శాంభవికున్న బాండింగ్ డైరెక్ట్ గా చూడాలి . శాంభవి తో ఎలా షాపింగ్ చేయాలి అని లేడీస్, కూతురికి ఏమేమి కొనాలా అని దేవేంద్ర. వీళ్ళందరూ సెక్యూరిటీ ఎలా అని అబ్బాయిల ఆలోచన. తన ఫ్యామిలీ కోసం ఎదురుచూపులతో శాంభవి ఇలా ఎవరి ఆలోచనలతో వాళ్ళు నిద్రకు ఉపక్రమిస్తారు. మయూరి శాంభవి ని కనిపెట్టగలుగుతుందా?? కథ కొనసాగుతుంది... Inni emotions okesari!! Awesome update ? |
|
« Next Oldest | Next Newest »
|