Posts: 897
Threads: 13
Likes Received: 7,004 in 831 posts
Likes Given: 1,543
Joined: Aug 2024
Reputation:
651
Part - 28
ఆకాశం మొత్తం కారు మబ్బులతో, పెద్ద పెద్ద మెరుపులతో చూడడానికి భయానకంగా ఉంది.
రుద్ర అడవి వైపు చూస్తూ కళ్ళు మూసుకుని గురువు గారు చెప్పిన సూచనలు గుర్తుకు తెచ్చుకోసాగాడు..
"మొదట దుష్టశక్తి తీవ్రత అంచనా వెయ్యి." అన్న మాటలు గుర్తుకొచ్చాయి..
ఆ మాటలు గుర్తొచ్చి, రోడ్డు పక్కగా కూర్చున్నాడు..
తాంత్రిక పూజలకు అవసరమయ్యే సామాగ్రి ఉన్న
తన సంచి తీసుకొని, నేలపై కుంకుమతో ఒక చక్రాన్ని గీశాడు...
గీసిన తరువాత కళ్ళు మూసుకుని, మంత్ర పఠనం చేయసాగాడు..
రుద్ర మంత్ర పఠనం మొదలు పెట్టిన కొన్ని నిమిషాలకి,
ఆ చక్రం నుండి తెల్లని వెలుగులు రావడం మొదలుపెట్టాయి..
అందులో నుండి తెల్లగా మెరిసిపోతున్న సీతాకోకచిలుకలు బయటకు వచ్చాయి.
అవి వచ్చిన తర్వాత, రుద్ర మెల్లగా కళ్ళు తెరిచి వాటిని చూశాడు..
అవి రుద్ర వైపు చూస్తూ ఎగురుతున్నాయి..
రుద్ర వాటి కేసి చూస్తూ తన కుడిచేయి అడవి వైపు చూపించాడు..
తను చూపించిన వైపు వేగంగా ఎగురుకుంటూ వెళ్ళాయి..
అవి అలా ఎగురుకుంటూ రోడ్డు దాటి, అడవి లోపలికి ప్రవేశించగానే, ఉన్నట్టుండి భగ్గున మండిపోయాయి...
రుద్ర చూస్తూ ఉండగానే అవన్నీ గాల్లోనే కాలిబూడిదైపోయాయి...
అప్పుడు అర్ధమయింది రుద్రకి.. దుష్టశక్తుల ప్రభావం అక్కడ చాలా తీవ్రంగా ఉందని..!!!
ఇటువంటి పరిస్థితుల్లో తను నేరుగా లోపలికి వెళ్లడం,
చాలా ప్రమాదకరం...!!
ఎందుకంటే... అవి తన కోసం ఎదురుచూస్తున్నాయి...
అందుకే ఇంకో మార్గం ఆలోచించాడు...
వెంటనే అక్కడ చుట్టూ ఉన్న పెద్ద పెద్ద ఎండు పుల్లలన్ని ఏరుకు వచ్చి, ఒక పెద్ద మంట వేశాడు...
దాని ముందు కూర్చుని, సంచిలో నుండి రకరకాల మూలికలు తీసి, మంత్రాలు చదువుతూ ఒక్కొక్కటిగా
ఆ మంటలో వేయసాగాడు.. అలా వేయగానే క్షణ క్షణానికి
ఆ మంట పెరిగిపోతూ ఉంది..
రుద్ర కొన్ని క్షణాల తర్వాత మెల్లగా కళ్ళు తెరిచాడు..సంచిలో నుండి కత్తి బయటకు తీసి,
ఒక్కసారిగా తన అరచేతిని కోసుకున్నాడు..
రక్తం కారుతుండగా,ఆ రక్తాన్ని మంట మీద పడేలా చేయి ఉంచి, " సింభికా...!! నాకు నీ సహాయం కావాలి. రా...!!" అని పిలిచాడు..
రుద్ర అలా పిలిచిన మరుక్షణం,ఎర్రగా వెలుగుతున్న మంట,ఒక్కసారిగా నీలం రంగులోకి మారిపోయింది...
అలా రంగుమారిన వెంటనే తన చేతిని మంటపై తీసేసి,వెంటనే తన దగ్గర ఉన్న కర్చీఫ్ తో గాయానికి కట్టు కట్టుకున్నాడు...
చూస్తూ ఉండగానే కొద్ది క్షణాలకి ఆ మంటల నుండి
ఒక విచిత్ర జీవి బయటకు వచ్చింది...
(దాని పేరు సింభిక...
ఇది ఒక మాయా రాక్షస జీవి.. పాతాళ లోకం లో జీవిస్తూ ఉంటుంది.. దీని ఎత్తు మూడు అడుగులు మించి ఉండదు.బలం తక్కువ కానీ,దీనికి అపారమైన తెలివితేటలు, మాయ శక్తులు ఉంటాయి..
రక్తం దీని ఆహారం.. దీనికి ఆకలేసినప్పుడు రక్తం తాగే మిగతా జీవులలాగా మారి, రక్తం పీల్చి బ్రతుకుతూ ఉంటుంది.. ఉదాహరణకు : దోమ,జలగ....
మనుషుల రక్తం అంటే దీనికి మహా ఇష్టం..
అలాగని ప్రమాదకరమైనది కాదు..కొంచెం అల్లరి ఎక్కువ..ఎప్పుడైనా తాంత్రికులు అవసరం పడినప్పుడు
దీనికి రక్త తర్పణం చేసి,దీని సహాయం కోరుతూ ఉంటారు..
ఇది మాట్లాడకుండానే తన సమాధానాలు ఎదుటివారి మెదడుకి పంపించుతుంది.. తనను ఎవరైతే పిలుస్తారో వాళ్ళ మాట మాత్రమే వింటుంది.. తన అవసరం తీరగానే, వాళ్ళు వెళ్ళిపోమనగానే తిరిగి వెళ్ళిపోతుంది..)
అది మంటల నుండి,రుద్ర దగ్గరకు వచ్చింది..
రుద్ర తన మోకాళ్ళ పై కూర్చుని, దాని వంక చూస్తూ..
"ఈ అడవిలోకి నేను వెళ్లడానికి నాకు సురక్షితమైన మార్గం కావాలి.." అని అన్నాడు..
అది వెంటనే వేగంగా రుద్ర భుజం పైకి ఎక్కి,
" నన్ను పైకి లేపు" అని చెప్పింది..(ఇక్కడ చెప్పింది అంటే రుద్ర మెదడు కి సూచనలు..మాట్లాడకుండా పంపించింది అని అర్థం..!!)
రుద్ర పైకి లేచాడు...
రుద్ర భుజం పై నుండి చుట్టూ చూసింది..
" ఇక్కడ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఒక వాగు వస్తుంది అక్కడికి వెళ్లాలి..!!"అని చెప్పింది..
రుద్ర వెంటనే దానితో సహా కారు ఎక్కాడు..
రుద్ర కారు డ్రైవ్ చేస్తూ ఉండగా, రుద్ర భుజాలపై కూర్చుని, రోడ్డు వైపు తీక్షణంగా చూడసాగింది..
"నా మీద కూర్చోకపోతే, పక్కన సీట్ ఖాళీగానే ఉంది.అక్కడ కూర్చోవచ్చు కదా." అని అన్నాడు.
" నేనేమి నీ అంత పొడుగు లేను.. అక్కడ కూర్చుంటే దారి గురించి ఎలా చెప్పేది..??" అంటూ విసుక్కుంది..
ఆ మాటలకి రుద్ర నవ్వుకున్నాడు..
కొంత దూరం వెళ్ళిన తరువాత ఒక వాగు వచ్చింది..
రుద్ర కార్ ని రోడ్ సైడ్ కి ఆపాడు..
సింభికతో పాటు ఒక టార్చ్ లైట్ తీసుకొని, కారు దిగాడు.. అది రుద్ర భుజం పైనే కూర్చుని వుంది... ఇద్దరూ కలిసి ఆ వాగు దగ్గరికి చేరుకున్నారు..
ఆ వాగు వంక చూస్తూ "ఇప్పుడు ఎలా వెళ్లాలి.." అని అడిగాడు..
రుద్ర ఆ మాట అనగానే.. విచిత్రంగా చేతులు గాలిలోకి ఊపింది..
వెంటనే అక్కడ నేలపై పడి ఉన్న చెక్కలు అన్నీ రుద్ర చూస్తూ ఉండగానే ఒక పడవ ఆకారంలోకి మారిపోయాయి..
ఆ పడవ మెల్లగా దానంతట అదే నీళ్లలోకి వెళ్ళింది..
ఆ పడవ కి వెలుగుతున్న ఒక లాంతరు కూడా ఉంది..
రుద్ర నవ్వుకుంటూ వెళ్లి, సింభిక తో సహా పడవలో కూర్చున్నాడు.
అది మళ్ళా తన చేతులను ఊపగానే, పడవ దానంతట అదే నీళ్లలో వెళ్ళసాగింది...
కొంతసేపటి తర్వాత......!!
"ఇలా ఎంత దూరం ప్రయాణం చెయ్యాలి?"అని చుట్టూ ఉన్న పరిసరాలను టార్చ్ లైట్ తో చూస్తూ అడిగాడు రుద్ర..
"ఇలా ఒక కిలోమీటర్ ముందుకు వెళితే,
ఈ అడవి సరిహద్దు మరోవైపు కి వెళ్తాము.. అప్పుడు నువ్వు సురక్షితంగా అడవిలోకి వెళ్ళవచ్చు..!!"
" నాకొక సమస్య ఉంది..దానికి పరిష్కారం నువ్వు చెప్పగలవా..?"
" చెప్పగలను.. ఒకసారి నీ చెయ్యి ఇలా ఇవ్వు..!"అంటూ రుద్ర ఎడమ చేయి పట్టుకొని కళ్ళు మూసుకుంది..
పట్టుకొన్న రెండు క్షణాలకే చెయ్యి వదిలేసి,
భయంతో గడగడా వణికిపోతూ " నువ్వు పంచవక్రి ని ఎదిరించడానికి సిద్ధమయ్యావా..??" అని అంది..
"ఎందుకు అంతలా భయపడుతున్నావ్..??
అసలు ఏం జరిగింది...? "అని అడిగాడు...
సింభిక చెప్పడం మొదలుపెట్టింది...
" ఒకనాకొకప్పుడు జ్వాలాసంతుడు అనే మాంత్రికుడు ఉండేవాడు.. అమాయకపు గిరిజనుల మీద తన మంత్ర శక్తిని ప్రయోగించి వాళ్ళని బానిసలుగా చేసుకొని దుష్ట కార్యాలన్నీ చేసేవాడు.. ఈ విషయం మంచ్రేకరుడు తన శక్తులను ఉపయోగించి గిరిజనులను కాపాడాడు.. మంచ్రేకరుడు మీద జ్వాలాసంతుడు పగ పెంచుకున్నాడు.
అతని మీద పంచవక్రిని ప్రయోగించాడు.. అపుడు మంచ్రేకరుడు పంచవక్రి ఎదిరించే విషయంలో నా సహాయం కోరాడు.నేను భయపడుతూనే ఆయనకి సహాయం చేశాను.. ఎందుకంటే నాకు ఎవరైనా రక్త తర్పణం చేసి
సహాయం కోరితే, కచ్చితంగా చేసి తీరాలి.. అందువల్ల వేరే దారిలేక సహాయం చేశాను.. మంచ్రేకరుడు తన తాంత్రిక శక్తులు అన్నీ ఉపయోగించి,పంచవక్రిని,తన శక్తితో
తిప్పి కొట్టాడు.. ఆ సమయంలో నేను కూడా ఉండడం వల్ల,పంచవక్రి నాపై మహా కోపంగా ఉంది.. మళ్లీ ఇప్పుడు నువ్వు నన్ను అదే పనిమీద పిలవడంతో నాకు చాలా భయంగా ఉంది... దయచేసి నన్ను వదిలేయ్...!!" అంటూ భయపడసాగింది.
ఆ మాటలకి రుద్ర.."నువ్వేమి భయపడకు..ఒకవేళ నీకు ప్రమాదకరమైన పరిస్థితులు అనిపిస్తే, నేనే నిన్ను వెళ్లిపోమని చెప్తాను..భయపడకు...!!"అని చెప్పగానే సింభిక సరేనంటూ మౌనంగా ఉండిపోయింది..
కొద్దిసేపటికి వారు ప్రయాణిస్తున్న పడవ ఒడ్డుకు చేరుకుంది..
ఆ ఒడ్డు అడవికి మరో వైపున ఉంది...
ఇద్దరూ పడవ దిగారు....
మెల్లగా అడవిలో ప్రవేశించారు...
అడవి మనుషులు సంచారం లేక చాలా దట్టంగా చీకటిగా ఉంది...
ఎటు చూసినా ముళ్ళ పొదలు, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి..
రుద్ర ముందు నడుస్తూ ఉండగా,అతని వెనకాల సింభిక నడుస్తుంది...
" నాకు ఒక చిన్న సందేహం... పంచవక్రి, ఓడిపోయిన తర్వాత ఏం జరిగింది...??" అని అడిగాడు రుద్ర..
"పంచవక్రి ప్రయోగం సామాన్యమైనది కాదు.. ఒకసారి
ఏ వ్యక్తి మీదైనా ప్రయోగిస్తే, అది కచ్చితంగా ఆ మనిషి మరణంతోనే ముగుస్తుంది.. కానీ మంచ్రేకరుడు తన శక్తితో దానిని ఓడించి తిప్పి కొట్టాడు.. కానీ అతను తిరిగి వస్తే ఖచ్చితంగా చంపి తీరుతుంది....!!" అని చెప్పింది సింభిక...
ఇద్దరూ అడవిలో కొంత దూరం వెళ్ళిన తరువాత.. ఒక పాడుబడ్డ గుహ కనిపించింది...
ఆ గుహ కనిపించగానే సింభిక రుద్ర వెనకాల రావడం మానేసి, భయంతో దిక్కులు చూస్తూ ఉంది...
అది గమనించిన రుద్ర దాని దగ్గరికి వెళ్లి,
"ఇక్కడే ఆగిపోయావే..?? రా...??" అని పిలిచాడు..
" నేను రాను..!! భయంగా ఉంది..!!"అని అంది..
" ఏమైంది..?? ఇప్పుడు దాకా బానే ఉన్నావు కదా..??"అని అడిగాడు రుద్ర.
"మనం ఇప్పుడూ ఆ ప్రదేశంలోనే ఉన్నాము..!!"అని చెప్పింది..
"ఆ ప్రదేశం అంటే ఏది...??"అని అనుమానంగా అడిగాడు రుద్ర..
" ఇంతకు ముందే చెప్పాను కదా..!!
మంచ్రేకరుడు పంచవక్రి ని ఓడించిన స్థలం ఇదే....!!"
అని చెప్పగానే రుద్ర మైండ్ కి షాక్ కొట్టినట్లయింది..
" ఏంటి..?? ఆ ప్రదేశం ఇదా...??"అంటూ ఆశ్చర్యపోయాడు రుద్ర..
" అవును..!! ఈ స్థలంలోనే దానిని ఓడించి, తిరిగి పాతాళలోకానికి పంపించాడు.. నేను కూడా పాతాళలోకంలో దానికి దొరకకుండా రహస్యంగా తలదాచుకుంటున్నాను..అదిగో అక్కడ గుహ కనిపిస్తుంది కదా..!! పూర్వం ఆ గుహలోనే మంచ్రేకరుడు నివాసం ఉండేవాడు.."అని చెప్పింది..
రుద్ర మెదడుని ఒక్కసారిగా కొన్ని వందల ప్రశ్నలు తొలచి వేయసాగాయి...
"ఏంటి అంతలా ఆలోచిస్తున్నావ్..?"అని అడిగింది సింభిక..
" అయితే పంచవక్రి మళ్ళీ తిరిగి వచ్చింది అంటే...!! మంచ్రేకరుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాడా...??"అని అడిగాడు రుద్ర..
" అవును.. కచ్చితంగా వచ్చే ఉంటాడు.. లేకపోతే అది తిరిగి రాదు...!!"అని చెప్పింది..
ఆ ప్రదేశాన్ని చూడడానికి రుద్ర ముందుకు వెళ్లబోతుండగా...
సింభిక అడ్డు పడింది...
" వద్దు.. ఆ ప్రదేశానికి వెళ్లొద్దు.. అక్కడ దాని అనుచరగణములు కాపలా ఉన్నాయి..నువ్వు ఒక్కడివే వెళ్తే ప్రాణం మీద ఆశ వదిలేసుకోవలసిందే... సూర్యోదయానికి ఇంకా రెండు గంటల సమయం ఉంది..కాబట్టి మనం ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళి పోతే మంచిది..." అని చెప్పింది..
" అయితే వేరే దారి లేదా...?? అవును..!! మంచ్రేకరుడు పంచవక్రిని ఎలా ఓడించాడో.. నీకు తెలుసా..?? అని అడిగాడు.. రుద్ర
" నాకు తెలియదు కానీ...!! దానికి సంబంధించిన ఒక తాళపత్ర గ్రంథం ఆ గుహలో ఉందని మాత్రం నాకు తెలుసు..." అని చెప్పింది..
" అవునా అయితే నా కోసం దాన్ని తెచ్చి ఇవ్వగలవా..?" అని అడిగాడు..
సింభిక కొంతసేపు ఆలోచించి సరే అంది..
రుద్ర చూస్తూ ఉండగానే.. ఒక చిన్న దోమలా మారి గాలిలోకి ఎగిరి, గుహ వైపు వెళ్ళింది..
అలా కొంతసేపటికి గోలగోలగా ఆ గుహ నుండి కొన్ని వందల కాకులు బయటకు వచ్చాయి..
అవన్నీ రుద్ర మీదుగా ఎగురుకుంటూ గాల్లోకి ఎగిరాయి...
వాటిలో ఒకటి తాళపత్రాలతో రుద్ర ముందు వాలింది..
ఆ కాకి సింభిక గా మారిపోయింది...
రుద్ర తాళపత్రాలను తెరిచి చూశాడు..
అది చాలా సంవత్సరాల క్రితం నాటిది కావడంతో, చాలావరకు పాడైపోయింది..
రుద్ర ఆ తాళపత్రాలను పరిశీలిస్తూ ఉండగా,
సింభిక పరిసరాలను పరిశీలిస్తూ ఉంది..
ఇంతలో రుద్ర తాళపత్రాలను చూస్తూ ఉండగా.
ఉన్నట్టుండి ఆకాశం ఉరుములు మెరుపులతో భయంకరంగా మారిపోయింది.
వాతావరణం ఉన్నట్టుండి అలా మారిపోవడంతో రుద్ర కూడా తాళ పత్రాలను పరిశీలించడం ఆపేసి ఆశ్చర్యంగా ఆకాశం వంక చూడసాగాడు...
"రుద్ర.. మనం వెంటనే వెళ్లిపోవాలి...!" అన్నది సింభిక..
" ఏమైంది ఇప్పుడు...??" అన్నాడు రుద్ర..
" అవి మనల్ని పసిగట్టేసాయి..!!"అంటూ దూరంగా చీకట్లో మెరుస్తూ ఉన్న రెండు ఆకారాలను చూపిస్తు అంది...
రుద్ర కూడా సింభిక చూపించిన వైపు చూశాడు..
తను చెప్పినట్టుగానే అక్కడే రెండు ఆకారాలు ఉన్నాయి..
అవి రుద్ర పోరాడిన అనుచరగణాలు.
రుద్ర వాటిని చూడగానే, అక్కడ ఉండడం ప్రమాదమని గ్రహించి, ఇక ఆలస్యం చేయకుండా తాళ పత్రాలను తన బ్యాగ్ లో పెట్టీ,.."పదా...!!వెళ్ళిపోదాం..!!" అంటూ సింభికను భుజాన వేసుకొని పరిగెట్టడం ప్రారంభించాడు..
ఆ చీకట్లో రుద్ర వేగంగా పడవ వైపు పరిగెత్తసాగాడు..
ఇంతలో వేగంగా పరిగెడుతున్న వాడు కాస్త, అదుపుతప్పి నేలపై పడిపోయాడు..
రుద్ర అలా పడిపోయినపుడు,సింభిక కూడా కింద పడిపోయింది...
సింభిక కింద పడిపోయిన వెంటనే, ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ.. కొన్ని చెట్ల వేళ్ళు సింభికను బంధించి లాక్కొని వెళ్లిపోసాగాయి.....
రుద్ర పైకి లేచి కంగారుగా దాని వెనక పరుగెత్తసాగాడు...
సింభిక ను అవి వేగంగా లాక్కొని వెళ్లసాగాయి..
సింభిక ఆ బంధనాల నుండి బయటపడదామని
ఎంత ప్రయత్నించినా దాని శక్తులు కూడా పనిచెయ్యడం లేదు..
ఇంతలో రుద్ర చుట్టూ ఒక పెద్ద సుడిగాలి ఏర్పడి,అతన్ని దూరంగా విసిరికొట్టింది....
ఆ ధాటికి చాలా దూరం ఎగిరి పడ్డాడు...
అలా దూరంగా పడడంతో, తలకి దెబ్బ తగిలింది.
దెబ్బ గట్టిగా తగలడం వల్ల,రక్తం ఎక్కువగా కారడంవల్ల, రుద్రకి సృహ తప్పి, కళ్ళు మూతలు పడుతున్నాయి..
సింభిక ను అవి లాక్కెళ్లడం, రుద్ర కళ్లముందు జరుగుతూ ఉన్నా, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో, సృహ తప్పి పడిపోయాడు..
ఆ వేళ్ళు సింభికను లాక్కెళ్తూ ఉండగా..
ఇంకా ఉంది........
Posts: 1,511
Threads: 2
Likes Received: 889 in 679 posts
Likes Given: 1,992
Joined: May 2019
Reputation:
10
Posts: 4,803
Threads: 9
Likes Received: 3,177 in 2,461 posts
Likes Given: 11,246
Joined: Sep 2019
Reputation:
31
Posts: 897
Threads: 13
Likes Received: 7,004 in 831 posts
Likes Given: 1,543
Joined: Aug 2024
Reputation:
651
Part - 29
అకస్మాత్తుగా ఆ ప్రదేశానికి ఒక బైక్ మీద వేగంగా దూసుకువచ్చాడు ఆదిత్య...
అక్కడ గందరగోళంగా ఉన్న పరిస్థితులను చూసి, ఏం జరగబోతుందో ఆదిత్యకి అర్థమయింది...
రుద్ర కోసం చుట్టూ చూశాడు..
దూరంగా నేలపై పడి ఉన్న రుద్రని చూసి, వేగంగా అతని దగ్గరకు వెళ్ళాడు..
రుద్ర ని పైకి లేపి, అతని బుగ్గలపై తడుతూ..
"రుద్ర ఏమైంది..? ఈ దెబ్బలు ఏంటి..? పైకి లే..? " అని అన్నాడు...
ఆదిత్య అలా తట్టడంతో రుద్రకు తెలివి వచ్చింది..
మెల్లగా కళ్లు తెరిచాడు. కానీ మాట్లాడలేక పోతున్నాడు...
"రుద్రా చెప్పు ఏమైంది...?!" అని అడగగానే,
మెల్లగా చెయ్యెత్తి, సింభిక వైపు చూపించి,
"దాన్ని కాపాడు...!!"అంటూ సృహ కోల్పోయాడు.
రుద్ర చూపించిన వైపు చూసాడు. ఆదిత్య ..
చెట్ల వేళ్ళ మధ్య చిక్కుకుని గింజుకుంటున్న సింభిక ను చూశాడు...
రుద్ర ని మెల్లగా నేలపై పడుకోబెట్టి, వేగంగా సింభిక దగ్గరకు వెళ్ళాడు..
ఆ చెట్ల వేళ్ళని గట్టిగా పట్టుకొని, తన దగ్గర ఉన్న కత్తి తీసి, వాటిని నరికి, సింభికని వాటి నుండి బయటకు విడిపించాడు..
సింభికని విడిపించిన వెంటనే అవి ఆదిత్యని బంధించాయి...
ఆదిత్య ని అవి బంధించడంతో,అతనికి సాయంగా రాబోతున్న సింభికను చూసి " రుద్రకి సాయం చెయ్....!!
నా గురించి ఆలోచించకు.. వెళ్ళిపో...!!" అంటూ అరిచాడు..
ఆ మాటలు విన్న వెంటనే రుద్ర దగ్గరికి వేగంగా పరిగెట్టింది సింభిక...
తలపై తీవ్ర గాయంతో, సృహ లేకుండా నేలపై పడి ఉన్నాడు.రుద్ర...
రుద్ర ప్రాణాపాయం లో ఉన్నాడని అర్థం చేసుకుని, వెంటనే రుద్ర తలపై చెయ్యి పెట్టి కళ్ళు మూసుకుని ఏవో మంత్రాలు పఠించసాగింది..
అలా పఠీస్తూ ఉండగానే రుద్ర శరీరం తెల్లగా మెరిసిపోతూ..చూస్తూ ఉండగానే కొద్ది క్షణాలలోనే మామూలు స్థితికి వచ్చేసాడు. తలపై, శరీరంపై ఉన్న గాయాలన్నీ మాయమైపోయాయి.
గాయాలు మానిపోయిన వెంటనే రుద్ర శరీరం మామూలు స్థితికి వచ్చేసింది.
కొద్ది క్షణాలకే రుద్ర లేచి కూర్చున్నాడు.. తన ఒంటిపై గాయాలన్ని ఒకసారి తడిమి చూసుకున్నాడు.. అవేమీ ఇప్పుడు లేవు.. తన ఎదురుగుండా సింభిక ఉంది..
"థాంక్యూ సింభిక..! నీ మేలు మరచిపోలేను..!"
అని అన్నాడు..
" అవతల నీ స్నేహితుడు మనల్ని కాపాడి,పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నాడు.. కాపాడాలి. పదా..!!" అంటూ ఆదిత్య వైపు చేయి చూపించింది..
రుద్ర సింభిక చూపించిన వైపు చూడగానే...తను చెప్పిన విధంగానే ఆదిత్యని ఆ వేళ్లన్ని చుట్టుముట్టాయి..
"చూస్తూ ఉండే సమయం లేదు రుద్ర..!!
ఆ రాకాసి గణాలు ఆ చెట్లను దాటి ఇవతలకు రాలేవు.. వాటి శక్తులు మాత్రమే అక్కడ పని చేస్తాయి.. ఆ చెట్ల వరుస దాటితే ఆదిత్యని మనం కాపాడలేం..!!"అంటూ తొందర పెట్టింది..
రుద్ర వెంటనే పైకి లేచి వేగంగా తన దగ్గర ఉన్న కత్తి తీసుకుని వాటి దగ్గరకు పరిగెత్తాడు..
ఆదిత్య దగ్గరికి చేరుకొని, తనని చుట్టుముట్టి ఉన్న వేళ్లపై తన కత్తితో ఒక్క వేటు వేయబోతుండగా...
మరో పక్క నుండి అవి రుద్రను బంధించాయి..
ఆ సంఘటన చూస్తున్న సింభిక కి ఏం చేయాలో అర్థం కాలేదు..
తన శక్తితో వాటి పై దాడి చేయడానికి ప్రయత్నించింది..
కానీ వాటికి కొంచెం కూడా హాని జరగలేదు...
జరిగేది అలా చూస్తూ ఉండిపోయింది.కానీ...
ఏమి చేయలేకపోయింది...
ఆదిత్య మెడకి ఆ వేళ్ళు గట్టిగా బిగుసుకుంటున్నాయి.. ఊపిరి ఆడడం లేదు..
కళ్ళు మూసుకుని,ఆ బాధ భరిస్తున్న వాడు కాస్త ఒక్కసారిగా కళ్లు తెరిచాడు..
నల్లగా ఉన్న కనుగుడ్లు ఒక్కసారిగా
పచ్చ రంగులోకి మారిపోయాయి.
చూస్తూ ఉండగానే అతని చుట్టూ పట్టి ఉంచిన వేళ్ళు,నుండి పువ్వులు చిగురించి, ఆదిత్యని మెల్లగా వదిలేయడం ప్రారంభించాయి..
ఆదిత్య ఆ వేళ్ళ నుండి బంధవిముక్తుడు అయ్యాడు..
వెంటనే అక్కడ నేలపై కూర్చొని, కళ్ళు మూసుకుని మంత్రాలు పఠించసాగాడు..
ఆదిత్య శరీరం మెల్లగా కాంతివంతంగా మెరిసిపోసాగింది...
రుద్ర సింభిక ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండగానే,ఆకాశం నుండి మబ్బులు తొలగి, మామూలు స్థితికి మారిపోయింది..
ఒక్కసారిగా వాతావరణం ప్రశాంతంగా మారిపోయింది..
రుద్ర చుట్టూ బంధించి ఉన్న వేళ్ళు కూడా అతని వదిలేసాయి.
దూరంగా ఇదంతా చూస్తున్న ఆ రెండు రాకాసులకు చాలా కోపం వచ్చింది..
కోపంతో ఆదిత్య వైపు దూసుకు రాబోతుండగా..
ఒక్కసారిగా ఆదిత్య కళ్ళు తెరిచి గట్టిగా మంత్రాలు జపించసాగాడు..
ఆ మంత్రం జపించగానే ఆదిత్య,రుద్ర ,సింభికల చుట్టూ
ఒక తెల్లని వెలుగు ప్రత్యక్షమై, ముగ్గురు హఠాత్తుగా అక్కడ నుంచి మాయమైపోయారు...
కోపంతో అక్కడికి వచ్చిన ఆ రాకాసి గణాలకి వాళ్ళు కనిపించకపోయేసరికి దిక్కులు పిక్కటిల్లేలా అరిచాయి..
ఆ అడవిలో మాయమైన ముగ్గురు రుద్ర కారు వద్ద ప్రత్యక్షమయ్యారు..
అక్కడ ప్రత్యక్షమైన మరుక్షణం ఆదిత్య సృహ తప్పి పడిపోయాడు..
రుద్ర కిందపడిపోయిన ఆదిత్య ని మెల్లగా పైకి లేపాడు.. అతనికి తెలివి తెప్పించడానికి ప్రయత్నిస్తుండగా...
"మనం వెంటనే బయలుదేరాలి..!! ఈ ప్రదేశంలో ఎక్కువ సేపు ఉండటం మంచిది కాదు పదా..!!" అంటూ సింభిక రుద్ర ని తొందర పెట్టింది...
రుద్ర కూడా ఆలస్యం చేయకుండా ఆదిత్యని వెంటనే కారులో పడుకోబెట్టి, వేగంగా అక్కడి నుంచి బయలుదేరాడు..
కొంతసేపటికి మంజునాథ రావు గారి ఇంటికి చేరుకున్నాడు రుద్ర..
కారు గుమ్మంలో ఆగేసరికి, వరండాలో కూర్చుని ఉన్న గోవింద రావు,మంజునాథ రావు, లేచి నుంచున్నారు...
కారు నుండి రుద్ర వేగంగా దిగి,వెనక నుండి నీరసంతో ఉన్న ఆదిత్య ను మెల్లగా బయటకు తీసుకువచ్చాడు..
ఇద్దరూ బట్టలు మట్టి కొట్టుకుని పోయి ఉన్నాయి... పైగా రుద్ర,ఆదిత్య ను అలా జాగ్రత్తగా తీసుకురావడం చూసిన ఇద్దరు వేగంగా ఆదిత్య దగ్గరకు వచ్చి " ఏమైంది..??" అని కంగారుపడుతూ అడిగారు..
వాళ్ల కంగారు చూసిన ఆదిత్య " ఏం లేదు..!! కొద్దిగా నీరసంగా ఉంది..!!" అన్నాడు..
రుద్ర ఆదిత్య ను తన రూం లో పడుకోబెట్టాడు...
రుద్ర ఆదిత్య గది నుండి బయటకు రాగానే, గోవింద రావు మంజునాథ రావు అసలు
ఏం జరిగింది...?"అని అడిగారు..
వాళ్లందర్నీ హాల్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి, అక్కడ జరిగిన విషయమంతా చెప్పాడు..
జరిగిందంతా విని ఇద్దరూ ఆశ్చర్యపోయారు..
వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా..
భాను అక్కడకి వచ్చింది...
" ఏమైంది..?? " అని రుద్ర వాలకాన్ని చూస్తూ, వాళ్ళని చూస్తూ అడిగింది..
"ఏం లేదమ్మా..? ఆదిత్య కి నీరసంతో కళ్ళు తిరిగాయి..బైక్ మీద నుండి ఇద్దరు పడిపోయారు..!!" అని మంజునాథ రావు చెప్పగానే భాను కంగారు పడుతూ..
" ఇప్పుడు ఆయనకు ఎలా ఉంది..?? దెబ్బలు ఏమైనా తగిలాయా..??" అని అడిగింది..
ఆ మాటలకు రుద్ర సమాధానం చెబుతూ..
" కంగారు పడొద్దు భాను.. ఏ దెబ్బలు తగలలేదు.. సడన్గా నీరసం వచ్చింది అంతే.. రూం లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు.. కావాలంటే వెళ్లి చూడు...!"అని చెప్పాడు..
రుద్ర చెప్పడం పూర్తవకుండానే ఆదిత్య రూము వైపు పరిగెత్తింది....
భాను తొందర చూసి ముగ్గురు నవ్వుకున్నారు..
"మీతో ఒక విషయం మాట్లాడదాం అనుకుంటున్నాను.. ఇక్కడ కాదు పైకి వెళ్లి మాట్లాడుకుందాం. ఎందుకంటే...ఈ విషయం భాను గాని,ఆదిత్య గాని,వినడం నాకు ఇష్టం లేదు.."అని చెప్పి మేడ పైకి వెళ్ళసాగాడు..
ఇద్దరు అతన్ని అనుసరించారు..
మేడపైన ముగ్గురు కూర్చున్నారు...
"గురువుగారు మీకు జాతకం చూడడం తెలుసు కదా..!!" అని అడిగాడు రుద్ర..
" ఆ తెలుసు.. కానీ నాకంటే వీడికి బాగా తెలుసు"
శ్రీ మంజునాథ రావు గురించి చెప్పాడు గోవింద రావు..
"సరే..! ఇప్పుడే వస్తాను..!" అంటూ కిందికి పరిగెట్టాడు..
అలా కంగారుగా పరుగులు పెడుతున్న రుద్ర వైపు విచిత్రంగా చూశారు ఇద్దరు..
సుమారు ఒక పావుగంట తర్వాత మేడ పైకి వచ్చాడు రుద్ర..
మంజునాథ శాస్త్రమందు జాతక చక్రాలు గీసిన
2 కాగితాలను వాళ్ల ముందు ఉంచాడు..
"గురువుగారు...!ఒకసారి ఈ రెండు జాతకాలను పోల్చి చూడండి...!" అని అడిగాడు..రుద్ర..
"ఈ జాతకాలు ఎవరివి..?" అని అడిగాడు మంజునాథ రావు..
"చెప్తాను.. ఫస్ట్ మీరు వాటి గురించి చెప్పండి...?"అని అడిగాడు రుద్ర.
ఆ మాట చెప్పిన తర్వాత మంజునాథ రావు మారుమాట్లాడకుండా ఆ జాతకాలను పరిశీలించసాగాడు..
ఒక అరగంట సేపు అలా పరిశీలించాక కాగితాలను రుద్ర చేతికి ఇస్తూ...." ఇవి వేరు వేరు సమయాలలో పుట్టిన వ్యక్తుల జాతకాలు కానీ,
వీరిద్దరికీ శక్తి విషయంలో గాని ఇంకా మరే విషయంలో అయినా కానీ, వీరిద్దరూ సమఉజ్జీలు.. ఎందుకంటే వీరిద్దరి జాతక చక్రం చాలా బలంగా ఉంది.. పుట్టిన ఘడియలు, నక్షత్ర స్థానాలు, పాదాలు అన్ని ఒకటే.. ఎవరికి ఎవరు తీసిపోరు.. ఒక విధంగా చెప్పాలంటే ఆ వ్యక్తి మళ్లీ పుట్టాడు అనే చెప్పాలి..."అని చెప్పారు మంజునాథ రావు..
"ఇప్పటికైనా చెప్పు రుద్ర.. ఈ జాతకాలు ఎవరివి..??"అని అడిగారు గోవింద రావు..
" ఈ జాతకాలలో ఒకటి మన ఆదిత్య ది.
మరొకటి మంచ్రేకరుడు ది..."అని రుద్ర చెప్పగానే..
"ఏంటి...??" అంటూ ఇద్దరు ఆశ్చర్యపోతూ లేచి నుంచున్నారు..
" అవును గురువుగారు.. మీరు నమ్మకపోయినా ఇదే నిజం..మంచ్రేకరుడు అంశలో మన ఆదిత్య మళ్లీ పుట్టాడు.. అందుకే అతడు బంధించిన ప్రదేశానికి అనుకోకుండా మన ఆదిత్య వెళ్లడంతో అది తిరిగి వచ్చింది... అందుకే మన ఆదిత్య ని చంపడానికి వెంట పడుతోంది.. మొదట నేను కూడా ఇది నిజం కాదేమో అనుకున్నాను.. కానీ
మంచ్రేకరుడు కి సంబంధించిన ఈ తాళపత్ర గ్రంధాలు చదివిన తర్వాత నాకు పూర్తిగా అర్థం అయ్యింది.."అంటూ ఆ తాళపత్రాలను గోవింద రావు చేతికి ఇచ్చాడు..
అందులో రుద్ర చెప్పినట్టుగా మంచ్రేకరుడు జనన సమయం,ఇతర విషయాలు ఉన్నాయి..
" అంటే మంచ్రేకరుడు మన ఆదిత్యలా పుట్టాడు అంటావా..?? "అని అడిగారు గోవింద రావు.
" కావచ్చు.. కాకపోవచ్చు.. ఎందుకంటే జాతకం ఇతర విషయాలు కలిసినంత మాత్రాన ఖచ్చితంగా మరుజన్మ అయ్యే ఉంటుందని నేను మనం చెప్పలేము.. కానీ అదే జన్మ నక్షత్రం సమయంలో ఖచ్చితంగా పుట్టడం వల్ల, అది మంచ్రేకరుడు అని అనుకొని మన ఆదిత్య వెంట పడుతోంది."అని చెప్పారు మంజునాథ రావు..
" అయితే ఇప్పుడు కారణం తెలిసింది కనుక పరిష్కార మార్గం ఏదో విధంగా కనుక్కోవాలి.."
అన్నాడు గోవింద రావు..
ఇంతలో కిందనుండి భాను భయంతో వేస్తున్న కేకలు గట్టిగా వినిపించాయి....
ఇక ముగ్గురు ఏమైందొనని వేగంగా కిందికి పరిగెట్టారు....
కిందకి వెళ్ళగానే ఆ అరుపులు వంటగదిలో నుండి వినిపించసాగాయి..
ముగ్గురు వేగంగా వంట గదిలోకి వెళ్ళగానే..
భాను దేని మీదకో సామాన్లు విసురుతూ ఉంది.
అది ఏంటంని చూడగా.. అక్కడ ఒక మూలగా
సింభిక ఉంది... భాను దానిని చూసి భయంతో అరుస్తూ దాని మీదకి సామాన్లు విసురుతోంది..
అవేమో దాని మీద పడకుండా తిరిగి భాను మీదకే వెళ్తున్నాయి...
ఆ సంఘటన చూసి మంజునాథ రావు, గోవింద రావు కూడా ఆశ్చర్యపోయారు..
"దీని సంగతి మరచి పోయానే..!" అని రుద్ర తల పట్టుకున్నాడు..
అక్కడ కంగారు పడుతున్న భాను ని గట్టిగా పట్టుకుని..
"కంగారు పడకు. అదేమీ నిన్నేమీ చెయ్యదు..!!"అంటూ దాని దగ్గరకు పరిగెట్టాడు..
సింభిక చెయ్యి పట్టుకొని వేగంగా ఇంటి వెనక వైపు తీసుకువెళ్ళాడు..
"నువ్వు కార్లో ఉండకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావ్..?"అని అడిగాడు..
" నీ పని అయ్యే అంతవరకు నేను నీతోనే ఉంటానని నీకు తెలుసు కదా..!! మరి నన్ను కార్ లో వదిలేసి వస్తే అందులో ఎలా ఉంటాను..!?"అని అడిగింది సింభిక..
"సరే ఇంట్లోకి వస్తే వచ్చావు..! ఆ పిల్లని ఎందుకు భయపెట్టావ్..??"అని చిన్నగా కోప్పడ్డాడు రుద్ర..
"ఎవరు నేనా ..?? నన్నే ఆ పిల్ల భయపెట్టింది....
నేనే రాకాసిని అనుకుంటే, అది పెద్ద రాకాసిలా ఉంది.అసలు నేను మామూలుగా ఇంట్లో వస్తుంటే, ఆ అమ్మాయి నాకు ఎదురు వచ్చింది.సరే కనిపించడం ఎందుకని ఇక్కడ దాక్కున్నాను.ఆ అమ్మాయి కూడా సరిగ్గా అక్కడికే వచ్చింది.. అక్కడ నన్ను చూసి భయంతో అరుస్తూ..
నా మీదకు సామాన్లను విసురుతూ ఉంది.. కానీ నేను ఏమీ చేయలేదు..."అని చెప్పింది.సింభిక..
వీళ్లిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి మంజునాథ రావు, గోవింద రావు, భాను వచ్చారు..
ముగ్గురు వింతగా సింభికను చూడసాగారు..
రుద్ర దాని గురించి పూర్తిగా వివరించాడు.. అది ఎవరికీ హాని చేయని మనకు సాయం చేయడం కోసమే వచ్చిందని చెప్పాడు..
కానీ భాను మాత్రం భయపడుతూ.."నాకు దాన్ని చూస్తేనే భయం వేస్తుంది.. వద్దు.. వెళ్ళిపోమని చెప్పండి..!!" అని అంది..
ఆ మాటలకి సింభిక నవ్వుతూ...!! "నన్ను చూస్తే భయం వేస్తోందా..!!?" అని భాను ని అడిగింది..
భాను భయంగా తల వూపింది...
సింభిక నవ్వుతూ.. ఒక్కసారిగా చిన్న కుక్కపిల్లలా మారిపోయింది...
అది అలా మారిపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు..
అది మెల్లగా నడుచుకుంటూ భాను దగ్గరికి వచ్చింది...
అది తల పైకెత్తి చూస్తూ.." ఇప్పుడు నన్ను చూస్తుంటే భయం లేదు కదా..!"అని అడిగింది..
అలా ముద్దుగా కుక్కపిల్ల మాట్లాడుతుంటే సంతోషం పట్టలేక పోయింది.. మెల్లగా పైకెత్తి దాని తలపై ముద్దు పెట్టింది.
రుద్ర కూడా దాని తలపై నిమురుతూ..
"తెలివైన పని. మన పని అయ్యేంతవరకు నువ్వు
ఈ రూపంలోనే ఉండు.. బయట వారు చూసినా మనకి సమస్య ఉండదు.."అని అన్నాడు.
అందరూ సంతోషంగా ఇంట్లోకి వెళ్ళారు..
ఇంకా ఉంది..
Posts: 4,803
Threads: 9
Likes Received: 3,177 in 2,461 posts
Likes Given: 11,246
Joined: Sep 2019
Reputation:
31
Posts: 1,511
Threads: 2
Likes Received: 889 in 679 posts
Likes Given: 1,992
Joined: May 2019
Reputation:
10
Posts: 897
Threads: 13
Likes Received: 7,004 in 831 posts
Likes Given: 1,543
Joined: Aug 2024
Reputation:
651
Part - 30
ఆరోజు రాత్రి
గాఢ నిద్రలో ఉన్న భాను మంచినీళ్ల కోసం నిద్ర లేచింది..
చుట్టూ చీకటి ఏమీ కనిపించడం లేదు..
తన మంచం పక్కనే ఉన్న టేబుల్ మీద ఫోన్ కోసం చేయి పెట్టింది..
కానీ అక్కడ టేబులు లేదు. ఫోను దొరకలేదు..
ఎక్కడ ఉందో చూద్దామంటే చీకటిగా ఉండడంతో తనకు ఏమీ కనిపించటం లేదు..
మెల్లగా మంచం మీద నుండి లేచి,కిందికి దిగింది.
తన కాళ్ళకి మట్టి మెత్తగా తగిలింది..
తన గదిలోకి అంత మట్టి ఎక్కడ నుండి వచ్చింది అని ఆశ్చర్యపోయింది...
ఇంతలో ఏదో విచిత్రమైన శబ్దం వచ్చింది..
ఆ శబ్దం ఏంటో అర్థం కాలేదు భానుకి....
మెల్లగా పైకి లేచింది...
ఆ శబ్దం వచ్చిన వైపు వెళ్ళింది..
కాళ్ళకి కరుకైన రాళ్ళు తగులుతున్నాయి..
అలా నడుస్తూ ముందుకు వెళుతోంది..
దారి మొత్తం ఎక్కడి నుంచో వస్తున్న వెలుగు వల్ల, మసకమసకగా కనిపిస్తుంది..
అసలు ఇది తన ఇల్లేనా అనే సందేహం వచ్చింది..
ఇంతలో ఎక్కడి నుంచో ఒక కుక్కపిల్ల బాధతో మూలుగుతూ ఉన్నట్లు వినిపించసాగింది...
వెంటనే ఆ వినిపించిన వైపుగా వెళ్లగా....
తన చూసిన చోట కుక్క రూపంలో ఉన్న సింభిక గాయాలతో రక్తసిక్తమై నేల మీద పడి ఉంది..
భాను ఏడుస్తూ దాని దగ్గరకు వెళ్ళి, చేతిలోకి తీసుకుని "ఏమైంది..?"అని అడగగా..
"మనం ఓడిపోయాము.." అంటూ అది చనిపోయింది...
భాను ఏడుస్తూ కొద్దిగా ముందుకి వెళ్ళగా..
ఒక్కొక్కటిగా శవాలు నేలపై పడి ఉన్నాయి...
ఆ శవాలు రుద్ర, మంజునాథ రావు, గోవింద రావు లవి......
ఆ శవాలను చూడగానే భాను ఒక్కసారిగా
ఆ శవాలపై పడి బోరున ఏడవసాగింది..
ఆ శవాల మధ్య ఆదిత్యని వెతక సాగింది...
కానీ ఆదిత్య కనిపించలేదు..
ఆదిత్య కోసం చుట్టూ చూస్తున్న భానుకి ఒకచోట కనిపించిన దృశ్యాన్ని చూసి మతిపోయింది..
అక్కడికి కొద్ది దూరంలో ఆదిత్య చుట్టూ నిలబడి
3 రాకాసులు ఉన్నాయి..
కొద్దిసేపటికీ అవి ఆదిత్య నుంచి పక్కకు రాగానే,
నేల పై తీవ్రమైన గాయాలతో పడి ఉన్న ఆదిత్య కనిపించాడు..
దూరం నుంచి భాను ని చూసిన ఆదిత్య "ఇక్కడి నుంచి వెళ్ళిపో..!!" అని గట్టిగా అరుస్తూ ప్రాణాలు వదిలేశాడు..
ఆదిత్య ఆ మాట అన్న వెంటనే ఆ మూడు రాకాసులు ఆదిత్య ని వదిలేసి వేగంగా భాను వైపు రావడం మొదలుపెట్టాయి.
వేగంగా ఆమె దగ్గరకు వచ్చి,ఆ మూడు రాకాసులు ఒక్కసారిగా భాను పై పడ్డాయి...
ఒక్కసారిగా భాను గట్టిగా అరవసాగింది..
ఇంతలో.....
" భాను..!!?ఏమైంది..?? పైకి లే...!" అన్న మాటలు వినిపించసాగాయి..
కళ్ళు తెరిచి చూడగా తన చుట్టూ మంజునాథ రావు,గోవింద రావు,రుద్ర ఉన్నారు.. ఆదిత్య తన పక్కనే కూర్చున్నాడు..
ఆదిత్య ని చూడగానే తనకి వచ్చింది కల అని అర్థమై.. గట్టిగా ఏడుస్తూ అతన్ని కౌగిలించుకుంది..
భాను కి ఏమైందో తెలియక, ఆదిత్య కంగారు పడుతూ...
" ఏమైంది భాను..?? ఎందుకు ఏడుస్తున్నావ్..??" అని అడిగాడు..
కొద్దిసేపటి వరకు భాను ఏడుపు ఆపలేదు..
తను తేరుకునే వరకు అందరూ వేచి చూశారు..
కొద్దిసేపటికి భాను కుదుట పడింది..
ఆదిత్య తనతో మంచి నీళ్ళు తాగించి,
"ఏమైంది భాను..?? ఏదైనా పీడ కల వచ్చిందా.?"
అని అడిగాడు..
అవునన్నట్లుగా తలూపింది..
"అసలేం జరిగిందో చెప్పమ్మ..??" అని అడిగారు గోవింద రావు..
తనకు వచ్చిన కల గురించి పూర్తిగా వివరించింది..
తనకు వచ్చిన కల పూర్తిగా విన్న తర్వాత మంజునాథ రావు మాట్లాడుతూ.."ఎప్పుడు ఇదే ఆలోచనలతో ఉంటుంది కదా...! అందుకనే ఇలాంటి కల వచ్చింది..!! ఆంజనేయస్వామి దండకం చదువుకొని పడుకో తల్లి..!!"అంటూ భానుని సముదాయించి అందరూ ఆ గది నుండి బయటికి వచ్చారు...
సమయం రాత్రి 1:30 అయ్యింది..
భాను పడుకుంది.. కానీ తనకి వచ్చిన కల గురించి విన్న తరువాత మిగిలిన వాళ్ళు ఎవరు పడుకోలేదు..నలుగురు కలిసి ఇంటి ముందు ఉన్న ఆవరణలో దీని గురించే మాట్లాడడానికి కూర్చున్నారు... వాళ్లతో పాటు సింభిక కూడా ఉంది
"దీని గురించి నువ్వేమంటావ్ రుద్ర..!??"అని అడిగారు గోవింద రావు..
" భాను కి వచ్చిన కల ప్రకారం, ఇది మనకి రాబోయే ఒక ప్రమాదంకి సూచనగా అనిపిస్తుంది.మనం త్వరగా ఆదిత్యని పంచవక్రి నుండి కాపాడాలి.."అన్నాడు రుద్ర..
"ప్రస్తుతం మనకి సమస్యకు మూలం ఏంటో తెలిసింది కానీ, పరిష్కార మార్గం మాత్రం ఇప్పటివరకు దొరకలేదు.." అన్నారు మంజునాథ రావు...
ఆదిత్య మౌనంగా ఉండడం చూసిన రుద్ర
"ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది ఆదిత్య..?"అని అడిగాడు.
"ఇంతకు ముందు నీరసంగా ఉండేది.కానీ ఇప్పుడు బానే ఉంది.." అని అన్నాడు..
"ఆదిత్య నిన్నో విషయం అడుగుతాను చెప్పు..!"అన్నాడు రుద్ర.
" ఆ అడుగు..!!"
"ఈరోజు ఉదయం మా కోసం నువ్వు వచ్చిన తరువాత మమ్మల్ని ఎలా కాపాడావో నీకు గుర్తుందా..??"అని అడిగాడు రుద్ర.
"సింభిక ను కాపాడినప్పుడు అవి నన్ను బంధించడం గుర్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో నేను ఇక్కడ వరకు ఎలా వచ్చానో. నాకు గుర్తులేదు..! నేనే నిన్ను అడుగుదామని అనుకుంటున్నాను..!"అని అన్నాడు.ఆదిత్య.
"ఆదిత్య నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి...
నీకే తెలియకుండా నీలో ఒక స్పిరిచువల్ ఎనర్జీ ఉంది.అది వేరే ఎవరిదో కాదు.మహా తాంత్రికుడైన మంచ్రేకరుడుది.. ఆయన శక్తే ఈరోజు మనల్ని కాపాడింది.. ఎందుకంటే ఆయన పుట్టిన అంశంలోనే, నువ్వు పుట్టావు..కాబట్టి
ఈ పరిస్థితుల్లో ఈ సమస్యకి పరిష్కారం నువ్వే వెతకగలవని నాకనిపిస్తోంది. ఎందుకంటే అది నిన్ను వెంబడించడానికి కారణం కూడా అదే..!!"అని రుద్ర చెప్పడంతో ఆదిత్య షాక్ అయ్యాడు..
"కాబట్టి ఈరోజు ఉదయం నువ్వు మమ్మల్ని కాపాడడానికి ప్రయత్నించినట్టు, మళ్లీ ఒకసారి ఇప్పుడు ప్రయత్నించి చూడు.." ఏదైనా మార్గం కనిపిస్తుంది అని అన్నాడు రుద్ర.
"అది ప్రయత్నించడం నావల్ల కాదేమోనని నాకనిపిస్తుంది.. అవి నన్ను బంధించినప్పుడు నేనొక తెలియని మైకంలోకి వెళ్ళిపోయాను..ఆ తర్వాత ఏం జరిగిందో కూడా నాకు తెలియటం లేదు..!!"అన్నాడు ఆదిత్య..
"ఒకసారి ప్రయత్నించి చూడు...!!" అన్నారు గోవింద రావు..
సరే అంటూ అక్కడే నేలపై పద్మాసనం వేసుకుని కళ్ళు మూసుకున్నాడు..
ఒక పదినిమిషాల తర్వాత కళ్ళు తెరిచాడు .
"లేదు.. నాకు ఏమీ తెలియడం లేదు" అన్నాడు..
"మరొక్కసారి ప్రయత్నించి చూడు" అన్నాడు రుద్ర.
మరలా ప్రయత్నించి చూశాడు..
కానీ ఫలితం లేకుండా పోయింది...
తిరిగి మళ్లీ ప్రయత్నిస్తూనే ఉన్నాడు..
అలా ఒక గంట గడిచిపోయింది..
ఇదంతా చూస్తున్న సింభిక సహనం కోల్పోయింది...
కోపంతో ఆదిత్య వైపు వస్తూ...
" నీవల్ల కాలేదంటే అది నీ ప్రయత్న లోపం వల్లే, నీలాంటి చేతకాని వాడిని ఇప్పటివరకు నేను చూడలేదు.. పొద్దున
నీ శక్తియుక్తులు చూసి నువ్వేమో గొప్పవాడివి అనుకున్నాను.. నిన్ను కాపాడాలనుకోవడం కోసం అందరం ప్రమాదంలో చిక్కుకున్నాము . అసలు నువ్వు చస్తే గానీ
ఈ సమస్య పరిష్కారం కాదు.."అంటూ కోపంతో
గాల్లో చేతులు ఊపుతూ నేల మీద చరిచాడు..
ఆదిత్య కూర్చున్నచోట ఒక సుడిగాలి పుట్టి,అతన్ని గాల్లోకి ఎత్తి దూరంగా విసిరి కొట్టింది..
దాని దెబ్బకి దూరంగా ఎగిరి ఒక చెట్టుకు గుద్దుకొని నేలపై పడ్డాడు..
ఆ పరిణామాన్ని చూసి అందరూ బిత్తరపోయారు..
రుద్ర మిగిలినవారు సింభిక ని ఆపడానికి వేగంగా వస్తుండగా... వాళ్లపై మరొక శక్తి ప్రయోగించింది..
ఆ శక్తి ప్రభావం వల్ల నేలలో నడుము లోతు వరకు కూరుకుపోయారు..
పైకి రావడానికి ఎంత ప్రయత్నిస్తున్నా వాళ్ళ వల్ల కావడం లేదు..
రుద్ర కోపంతో " ఆపు సింభిక...!! నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా..!! నువ్వు వెంటనే ఇక్కడ నుంచి.." అని మాట పూర్తవకుండానే రుద్ర నోరు మూసుకుపోయింది.
ఎందుకంటే..!!రుద్ర వెళ్ళిపొమ్మని చెప్తే, తనకు కచ్చితంగా వెళ్ళిపోవాలి..
వాళ్లు అలా బంధించబడి ఉండగానే..ఆదిత్య పైకి విచిత్రమైన శక్తులు ప్రయోగిస్తూ గాయపరచసాగింది..
ఆ శక్తి దాటికి తట్టుకోలేక ఆదిత్య సృహ కోల్పోయాడు..
ఇక చివరిగా అక్కడ దగ్గరలో ఉన్న ఒక పెద్ద బండరాయిని తన శక్తితో గాల్లోకి లేపి, ఆదిత్య మీదకు విసిరింది...
సంఘటన చూస్తున్న ముగ్గురికి నోట మాట రాలేదు...
ఏం చేయలేని అచేతన స్థితిలో ఉండిపోయారు..
ఆ బండరాయి వేగంగా ఆదిత్య ని ఢీకొట్టి, పేలిపోయి, పెద్ద దూళి చెలరేగింది..
అసలు అక్కడ ఏం జరుగుతుందో అని ముగ్గురు ఆశ్చర్యంతో, కదలకుండా కళ్లప్పగించి చూస్తూ ఉన్నారు..
ఉన్నట్టుండి అక్కడ పెద్ద గాలి వీచింది..
ఆ గాలి వల్ల ధూళి మొత్తం చెదిరిపోయింది..
ధూళి మొత్తం చెదిరి పోయిన తరువాత ఆదిత్య బెదరకుండా స్థిరంగా నుంచుని ఉన్నాడు..
సింభిక కోపంతో మరింతగా రెచ్చిపోయి,మరింత పెద్ద పెద్ద బండరాళ్లను తన శక్తితో అక్కడికి రప్పించింది..
వాటన్నిటిని ఒకేసారి రుద్ర వైపు విసిరింది..
అవి వేగంగా ఆదిత్య మీదికి దూసుకు వెళుతూ, అతని సమీపంలోకి రాగానే ఆదిత్య తన అరచేయి చాపి వాటి వైపు చూపించాడు..
వెంటనే వాటి వేగం కోల్పోయి, చలనం లేకుండా నేలపై పడిపోయాయి..
సింభిక మరోసారి ఆదిత్య పైకి శక్తులను ప్రయోగించబోతుండగా... ఆదిత్య వెంటనే తన చేతిని నేలపై పడిన బండరాళ్ళ వైపు చూపించి వాటిని గాలిలోకి పైకి లేపి, సింభిక వైపు చూపించాడు..
అవన్నీ వేగంగా సింభికని చుట్టుముట్టి,ఒక పంజరంలా మారిపోయింది.
సింభిక ఆ పంజరంలో బంధించబడింది..
ఆదిత్య తన చేతిని ఆ పంజరం వైపు చూపించి తన వైపు రమ్మన్నట్టుగా చేయి ఊపాడు.. ఆ పంజరం మెల్లగా ఎగురుకుంటూ వచ్చి, ఆదిత్య ముందు నేలపై దిగింది..
ఆదిత్య నేలలో బంధించబడి ఉన్న వాళ్ళ వైపు చేయి చూపించగానే,కూరుకుపోయిన గోతిలో నుండి ముగ్గురు పైకి లేచారు..
వాళ్లు కూడా సింభిక దగ్గరకు వచ్చి నుంచున్నారు..
సింభిక వైపు ఆదిత్య కోపంగా చూస్తూ..
"గతంలో నాకు సహాయ పడ్డావు అనే ఒకే ఒక్క విషయం వల్ల, ఈరోజు నిన్ను ప్రాణాలతో చంపకుండా వదిలేసాను.. అయినా నా మీద దాడి చేయడానికి నీకు ఎంత ధైర్యం..!!?"అంటూ గంభీరమైన స్వరంతో కొప్పడుతు అడిగాడు..
ఆ మాటలకి సింభిక తలవంచుకుని...
"క్షమించండి నాయక..!! తమరి పై దాడి చేయాలనే ఉద్దేశంతో కాదు.. మీరు ఆదిత్య లో ఉన్నారని నాకు తెలుసు.. తమరి శక్తి గురించి నాకు తెలుసు.. మిమ్మల్ని రప్పించాలని ఉద్దేశంతోనే మీ పై దాడి చేశాను.. నన్ను క్షమించండి.."అని అనగానే....
ఆ మాటలకి ఆదిత్య చిన్నగా నవ్వుతూ,
తన చుట్టూ ఉన్న పంజరాన్ని మాయం చేశాడు..
సింభిక పక్కన ఉన్న మిగిలిన వారి వైపు చూస్తూ
"నా పేరు మంచ్రేకరుడు.. ప్రత్యంగిరా మాత ఉపాసకుడిని. పంచవక్రి ని బంధించిన వాడిని నేనే.."నేను చెప్పగానే ముగ్గురు చేతులెత్తి నమస్కరించారు..
"గురుదేవా..! తమరి గురించి నేను చాలా విన్నాను.. మీతో మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉంది.. ఇది మీ మరో జన్మ కావడం మాకు సంతోషంగా ఉంది.. దయచేసి మిమ్మల్ని, అదే ఆదిత్యని కాపాడే మార్గం ఉంటే చెప్పండి.."అని వినయపూర్వకంగా అడిగాడు..రుద్ర..
" ఇది నా మరో జన్మ కాదు.నా అంశలో పుట్టిన ఆదిత్య శరీరంలో నేను ఉన్నాను.అంతే... నా మీద ఉన్న కోపంతో...,ఇప్పుడు అది ఆదిత్య ని నాశనం చేయాలని చూస్తుంది.. కాబట్టి మీకు ఒక మార్గం ఉపదేశిస్తాను.ఆ ప్రకారం చేయండి.."అని అన్నాడు ఆదిత్య శరీరంలో ఉన్న మంచ్రేకరుడు.
ఆయన చెప్తుంది శ్రద్ధగా వినసాగారు...
"ఇప్పుడున్న పరిస్థితుల్లో పంచవక్రి ని బంధించే శక్తి నా వద్ద లేదు..."
"దానికి వేరే దారేమి లేదా..గురుదేవా ..??"
"ఉంది.. దానిని అడ్డుకోవడం కోసం ఇప్పుడు మనం ఒక యాగం చేయాలి."
"అలాగే స్వామి రేపే చేద్దాం...!!"అన్నాడు రుద్ర.
" ఇక్కడ కాదు...దానికి ఒక ప్రదేశం ఉంది..నేను పంచవక్రిని బంధించిన ప్రదేశానికి కొద్ది దూరంలో మాత ప్రత్యంగిరా దేవి ఆలయం ఉంది.ఆ దేవాలయాన్ని శక్తివంతమైన తాంత్రికులు నిర్మించారని ప్రతీతి.. అక్కడ జరిపితేనే మాత అనుగ్రహం కలుగుతుంది.. అప్పుడే దానిని బంధించే శక్తి మనకు వస్తుంది.."
"ఇంతకీ ఏ యాగం చేయాలో తమరు చెప్పలేదు..??"అని అడిగారు గోవింద రావు..
" నికుంబల యాగం.."అని మంచ్రేకరుడు చెప్పగానే మంజునాథ రావు, గోవింద రావు, రుద్ర ఆశ్చర్యపోయారు..
ఎందుకంటే ఆ యాగం చేయడం చాలా కష్టతరమైనది.. క్లిష్టతరమైనది...
యాగం చేసేటప్పుడు ఎటువంటి తప్పులు,దోషాలు జరిగినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.. అమ్మవారు ఉగ్ర స్వరూపిని..నారసింహిని..
అందుకనే ముగ్గురు ఆ యాగం గురించి చెప్పేసరికి భయపడ్డారు...
కానీ అదే సరైన మార్గమని వాళ్ళకి అనిపించింది.
"అలాగే గురువుగారు.. తమరు చెప్పినట్టే చేస్తాము..
ఏ సమయంలో చేయాలో సెలవియ్యండి..?" అని అడిగాడు.రుద్ర...
"ఎల్లుండి ఉదయం 10 గంటల నుంచి గడియలు బాగున్నాయి. ఆ సమయంలో యాగం మొదలు పెట్టండి.. యాగం నిర్విగ్నంగా పూర్తి అయిన తరువాత అమ్మవారి దయవల్ల ఆదిత్య పంచవక్రి భారి నుంచి బయటపడతాడు..!!" అని చెప్పగానే ముగ్గురు సంతోషించారు...
"ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి.. ఈ యాగాన్ని
ఏ విధంగానైనా నాశనం చేయడానికి పంచవక్రి శతవిధాలా ప్రయత్నిస్తుంది.. కాబట్టి జాగ్రత్తగా ఉండండి...!! ఇక రుద్ర.. నువ్వు యాగ పరిరక్షణ బాధ్యతలు తీసుకో..!!" అని చెబుతూ ఉండగానే ఆదిత్య కుప్పకూలిపోయాడు...
మంచ్రేకరుడు ఆదిత్య శరీరాన్ని వదిలి వెళ్ళిపోయాడు అని వాళ్ళకి అర్థం అయింది..
ఆదిత్య ని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి అతని గదిలో పడుకోబెట్టారు...
ఆ మరుసటి రోజు ఉదయం....
ఆదిత్య తో సహా అందరూ ఉదయాన్నే నిద్ర లేచారు.. ముందురోజు రాత్రి జరిగిందంతా ఆదిత్యకి భానుకి చెప్పారు..
ఆదిత్య సమస్య కి పరిష్కారం దొరికినందుకు భాను చాలా ఆనందించింది..
రేపటి యాగానికి ఏమేమి కావాలో నలుగురు కలిసి మాట్లాడుకుంటున్నారు..
"అవున్రా రావు..!! యాగం చేయడానికి మనం ఇద్దరం మాత్రమే ఉన్నాం..!! ఇంకొకళ్ళు ఉంటే బాగుండేది కదా..?"అన్నారు మంజునాథ రావు.
"మనం ఇద్దరం ఏంట్రా..?? రుద్ర ఉన్నాడు కదా..?"అన్నారు గోవింద రావు..
" రుద్ర కి యాగ పరిరక్షణ బాధ్యతలు అప్పచెప్పారు కదా..!! మరీ అతనెలా యాగం లో కూర్చుంటాడు..??"అని మంజునాథ రావు అడిగేసరికి ఆలోచనలో పడ్డాడు గోవింద రావు..
" నిజమేరా..! నువ్వు అడిగే దాకా నేను కూడా
ఈ విషయం గురించి ఆలోచించలేదు..! మరిప్పుడు ఏం చేద్దాం...!!"నేను గోవింద రావు ఆలోచించసాగారు..
" అంటే నన్ను మర్చిపోయారా చిన్నాన్న..??"అన్న మాట వెనకనుంచి వినిపించగానే, వెంటనే తల ఎత్తి చూశారు గోవింద రావు..
ఎదురుగుండా గాయాలకు కట్టిన కట్లతో సత్యనారాయణ రావు నవ్వుతూ నుంచున్నాడు.
అతన్ని హాస్పిటల్ నుంచి తీసుకువచ్చింది సత్యం..
సత్యనారాయణ రావు చూడగానే అందరూ ఆనందంతో ఆయనను చుట్టుముట్టారు...
కుశల ప్రశ్నలు అన్ని పూర్తయిన తర్వాత...
" దేని గురించో మాట్లాడుకుంటున్నట్టున్నారు..?"
అన్నాడు సత్యనారాయణ రావు..
"ఇంక ఎవరు గురించి రా... మన ఆదిత్య గురించి..!!"అన్నారు గోవింద రావు...
"కొంచెం వివరంగా చెప్పండి చిన్నాన్న...!?" అన్నాడు సత్యనారాయణ రావు...
తను హాస్పిటల్ లో ఉన్నప్పుడు ఇక్కడ జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు చెప్పారు గోవింద రావు..
"ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది చిన్నాన్న..!
మొత్తానికి ఆదిత్య ని కాపాడే మార్గం దొరికింది..!!"అన్నాడు సత్యనారాయణ రావు
"అయితే ఇక మొత్తానికి ముగ్గురం సరిపోయాం.."
అన్నారు మంజునాథ రావు..
"అయితే రేపే యాగం మొదలు......!!!"అన్నాడు రుద్ర.....
అందరూ యాగానికి సిద్ధమయ్యారు.....
రేపు అసలు ఆట మొదలవుతుంది.....
ఇంకా ఉంది.....!!
Posts: 4,803
Threads: 9
Likes Received: 3,177 in 2,461 posts
Likes Given: 11,246
Joined: Sep 2019
Reputation:
31
Posts: 1,511
Threads: 2
Likes Received: 889 in 679 posts
Likes Given: 1,992
Joined: May 2019
Reputation:
10
Is it going to be that simple a solution?
Posts: 897
Threads: 13
Likes Received: 7,004 in 831 posts
Likes Given: 1,543
Joined: Aug 2024
Reputation:
651
Part - 31 (చివరి భాగం)
యాగానికి అవసరమైన సామాగ్రి అంతా
యాగశాల వద్దకు చేర్చారు...
యాగశాల వద్ద ఆదిత్య, రుద్ర, గోవింద రావు మంజునాథ రావు, సత్యనారాయణ రావు మాత్రమే ఉన్నారు..
సింభిక యాగశాలకి దూరంగా నుంచుని ఉంది..
యాగం మొదలుపెట్టే ముందు గోవింద రావు మాట్లాడుతూ.. "మనం చేసేది సాధారణమైన యాగం కాదు. మహా శక్తివంతమైనది. అత్యంత కష్టతరమైనది.చేసే యాగం లో ఎటువంటి తప్పులు జరిగినా ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి..యాగం మొదలు పెట్టిన తరువాత మన ఏకాగ్రత మొత్తం యాగం మీదే ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో యాగాన్ని మధ్యలో ఆపకూడదు..యాగం నిర్విఘ్నంగా పూర్తయితే అమ్మవారి అనుగ్రహం వల్ల ఆదిత్య ఆ దుష్టశక్తి బారి నుండి బయట పడతాడు.."
"చూడు రుద్ర..!! నువ్వు యాగ పరిరక్షణ బాధ్యతలు జాగ్రత్తగా చూసుకోవాలి.. యాగానికి ఎటువంటి విఘ్నం కలగకుండా చూసుకోవలసిన బాధ్యత నీదే...!! ఎందుకంటే యాగం మొదలు పెట్టిన తర్వాత మా వైపు నుండి నీకు ఎటువంటి సహాయం నీకు అందదు...!! జాగ్రత్తగా ఉండు...!!"అని మిగిలిన వారి వైపు చూసి "ఇక యాగం ప్రారంభిద్దాం రండి...!!"అని అన్నారు..
హోమగుండం దగ్గర ప్రత్యంగిరా దేవి అమ్మవారి విగ్రహాన్ని ఉంచారు...
హోమగుండం నాలుగు వైపున నలుగురు కూర్చున్నారు...
యాగం ప్రారంభం అయ్యింది...
హోమగుండం రగిల్చారు.. ముగ్గురు
వేద మంత్రాలతో యాగాన్ని జరిపిస్తున్నారు...
ఆదిత్య హోమగుండానికి నెయ్యి,వనమూలికలు, సమిధలు ఒక్కొక్కటిగా సమర్పిస్తున్నాడు...
రుద్ర మాత్రం యాగశాల చుట్టూ తిరుగుతూ కాపలా కాస్తున్నాడు...
కొంతసేపటి తర్వాత యాగశాల దగ్గర పద్మాసనం వేసుకుని, ధ్యానంలోకి వెళ్ళాడు...
సింభిక రుద్ర తో పాటే అక్కడే కూర్చుంది.కానీ ఎప్పుడెప్పుడు ఏం జరగబోతుందో అని భయపడుతూనే ఉంది...
మరోవైపు నికుంబల యాగం మాత్రం నిర్విఘ్నంగా జరగసాగింది...
ఇంతలో మంజునాథ రావు ఇంటివద్ద.....!!
భాను ఒక్కతే ఇంట్లో ఉంది..
యాగం మొదలు పెట్టే గడియలు మొదలవ్వకముందే గుడికి వెళ్ళమని, ఇంట్లో ఉండొద్దని,గోవింద రావు,భాను కి చెప్పారు.. కానీ గుడికి బయలుదేరే ముందు, తన స్నేహితులు రావడంతో ఆలస్యం అయింది..కొంతసేపటికి వాళ్లు వెళ్లిపోవడంతో, వేగంగా తన ఇంటి నుంచి బయటకు వచ్చి, గుడికి బయలుదేరింది..
కొద్దిసేపట్లో గుడి దగ్గరకు చేరుకుంటుంది అనేలోగా..
అకస్మాత్తుగా వాతావరణం ప్రతికూలంగా మారిపోయింది..
దట్టమైన కారు మబ్బులు కమ్ముకున్నాయి..
భీకరమైన గాలులు వీస్తూ, పెద్ద వర్షం మొదలయ్యింది..
భాను వేగంగా ఆ వర్షంలో గుడి ప్రాంగణంలోకి వెళ్లబోతుండగా, ఆకస్మాత్తుగా ఎవరో గట్టిగా తన ముఖం పై కొట్టినట్టు దూరంగా ఎగిరి పడింది..
పడిన తరువాత తను ఇంక పైకి లేవలేదు.
సృహ తప్పిపోయింది... తన పడిన చోట పెద్ద సుడిగాలి లేచి భానుని ఎత్తుకుపోయింది...
ఆ సంఘటన చూసి, చుట్టూ ఉన్న జనం ఆశ్చర్యపోయారు...
మరోపక్క యాగశాల వద్ద....
ధ్యానంలో ఉన్న రుద్ర ఒక్కసారిగా కళ్లు తెరిచి పైకి లేచాడు.. తన మనసెందుకో కీడు శంకించసాగింది..
ఉన్నట్టుండి రుద్ర అలా ఒక్కసారిగా పైకి లేవడంతో సింభిక కంగారు పడుతూ..."ఏమైంది రుద్ర...? ఏదైనా ప్రమాదమా..??"అని భయంగా అడిగింది..
రుద్ర గంభీరంగా సింభిక వైపు చూసి అవునన్నట్లుగా తల ఊపాడు..
వెనక్కి తిరిగి యాగశాల వైపు చూశాడు..
యాగం వేద మంత్రాలతో నిర్విఘ్నంగా జరుగుతోంది....
అప్పటికి సమయం మధ్యాహ్నం 1:00 దాటుతోంది..
ఇంకో మూడు గడియలు గడిస్తే యాగం నిర్విఘ్నంగా పూర్తవుతుంది..
రుద్ర అలా ఆలోచిస్తూ ఉండగానే ఆకాశంలో దట్టమైన కారుమబ్బులు కమ్ముకొసాగాయి...
ఇక రుద్ర ఆలస్యం చేయకుండా, ఒక కర్ర తీసుకొని వేగంగా యాగశాల చుట్టూ వృత్తాకారంలో వలయాలు గీయసాగాడు...
రెండు అడుగుల వెడల్పు తేడాతో మూడు వృత్తాలు యాగశాల చుట్టూ గీసాడు..
రుద్ర చేస్తున్న పనిని గోవింద రావు దూరం నుంచి గమనించసాగారు... కానీ అదేమీ పట్టనట్టు యాగాన్ని జరిపించసాగారు..
ఆ వృత్తాల నుంచి బయటకు వస్తూ...!!
"సింభికా...!! చెప్పేది శ్రద్ధగా విను...!! ఇప్పుడు ఇక్కడ జరగబోయేది, యాగం జరిపిస్తున్న వారికి కనిపించడానికి వీల్లేదు..! నీ శక్తిని ఉపయోగించి ఈ మూడు వృత్తాలను రక్షణ వలయాలుగా మార్చు... ఒకవేళ ఈ రెండు వృత్తాలను చేదించి, ఆ దుష్టశక్తులు మూడో వలయం లోపలకి రావడానికి ప్రయత్నిస్తే.. వెంటనే వాళ్లందరినీ ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపో...!! నా గురించి ఆలోచించవద్దు...!! "అని తను మూడు వలయాలు దాటి బయట రక్షణగా నుంచున్నాడు..
సింభిక రుద్ర చెప్పినట్టుగానే 3 వలయాలను శక్తి వలయాలుగా మార్చేసింది..
సింభిక మాయ వల్ల,బయట ఏం జరుగుతున్నా సరే,
లోపల ఉన్న వాళ్ళకి మామూలుగానే కనిపిస్తుంది...
ఆకాశం మొత్తం పూర్తిగా మేఘావృతమై పోయింది... మిట్టమధ్యాహ్నం కూడా అర్ధరాత్రి లాగా చీకటి గా మారిపోయింది.. గాలి కూడా ఉధృతంగా వీయడం మొదలు పెట్టింది..
జరగబోయే యుద్ధానికి నేను సిద్ధం అన్నట్లుగా రుద్ర ధైర్యంగా నుంచుని ఉన్నాడు...
నేను నీకు తోడుగా ఉంటాను అన్నట్టుగా అతని పక్కగా వచ్చి నుంచుంది సింభిక..
ఇంతలో ఒక్కసారిగా ఆకాశం పెద్దగా ఉరిమింది..
రుద్ర కొద్ది దూరంలో ఒక మెరుపు నేలను బలంగా తాకి, చిన్న పేలుడు సంభవించింది..
ఆ పేలుడు జరిగిన ప్రదేశం నుండి నేలని తోలుచుకుంటూ 2 రాకాసి శక్తులు బయటకు వచ్చాయి..
అవి పంచవక్రి అనుచరగణాలైన విర్కోర,విస్కర్ష.
ఆ యాగాన్ని ఆపడానికి అక్కడికి వచ్చాయి...
రుద్ర వాటిని చూడగానే తన నుంచొని ఉన్న చోటే నేలపై పద్మాసనం వేసుకుని కూర్చుండిపోయాడు..
తను సింభిక వైపు చూసి ఏం చేయ్యాలో నీకు తెలుసు కదా..!! అన్నట్లుగా చూసి కళ్ళు మూసుకున్నాడు..
తన అరచేతులు ముందుకు చాపి గాలిలోకి చేతులు ఊపాడు..
రుద్ర అలా చెయ్యగానే నేలనుండి వెలుగు రేఖలు చిమ్ముతూ నక్షత్ర ఆకారంలో ఉండే ముగ్గులాగా మారిపోయాయి..
ఆ రెండు రాకాసులు చూస్తూ ఉండగానే 2 రాక్షస జీవులు గా మారిపోయి, భీకరంగా అరుస్తూ రుద్ర వైపు దూసుకురాసాగాయి..
రుద్ర మాత్రం కళ్ళు మూసుకుని, మంత్ర పఠనం చేయసాగాడు..
అవి వేగంగా రుద్ర వైపు దూసుకు వస్తూ. అతనికి కొద్ది దూరంలో ఉన్న సింభిక చూసి వాటిలో ఒకటి దాని వైపు వెళ్లసాగింది...
అలా ఆ రెండు రాకాసులు చెరో వైపు నుండి దాడి చేయడానికి సిద్ధమయ్యాయి..
కానీ రుద్ర మాత్రం కదలకుండా అలాగే ధ్యాన స్థితిలో ఉండిపోయాడు..
ఇక సింభిక అలా చూస్తూ ఉండలేక తన శక్తులతో దాడి ప్రారంభించింది...
వాటి పై బండ రాళ్ల వర్షం కురిపించింది..
ఆ దాడి వల్ల వాటి వేగం కొంచెం తగ్గింది తప్ప,
వాటికి ఏ మాత్రం గాయాలు తగలలేదు...
ఈసారి వాటికి కోపం మరింతగా పెరిగిపోయింది..
రుద్ర ని వదిలేసి, సింభిక మీద దాడి చేయడం కోసం వేగంగా దానివైపు రాసాగాయి..
సింభిక కూడా ఆ రెండిటి పైకి తిరిగి దాడి మొదలు పెట్టింది.
కానీ అవి మాత్రం వాటికి ఏమీ అవ్వనట్లుగా వేగంగా వచ్చి,సింభిక మీదకు దూకాయి..
అలాగే దాని మీద పడబోయే లోపు, వాటిని ఏదో మెరుపులాంటి శక్తి వేగంగా ఢీకొట్టింది... దాని దెబ్బకి అవి దూరంగా ఎగిరి పడ్డాయి...
ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందని,సింభిక చూడగా అప్పటివరకు కూర్చున్న చోట నుండి కదలనీ రుద్ర,
లేచి నుంచుని ఉన్నాడు..
అతని కళ్ళు తెల్లగా మెరిసిపోతున్నాయి...
తమ పైకి అలా మెరుపు దాడి జరగడంతో,
వాటికి కోపం మరింతగా పెరిగిపోయింది..
తిరిగి పైకి లేచి రుద్ర పైకి రాబోతుండగా, రుద్ర తన నుంచున్న చోట నుండి చేతులు గాలిలోకి ఎత్తి ఏవో మంత్రాలు చదివాడు..
కారు మబ్బులు కమ్ముకొని ఉన్న ఆకాశం నుండి, ఒక పెద్ద మెరుపు వచ్చి నేలపై ఉన్న ఆ రాక్షసులను ఢీకొట్టింది..
ఆ దెబ్బకి అక్కడ పెద్ద ప్రేలుడు సంభవించి, ఆ రెండు దూరంగా ఎగిరి పడ్డాయి... కొద్దిసేపటికి రుద్ర,సింభిక అక్కడికి వెళ్లి చూడగా అవి తీవ్రంగా గాయపడి ఉన్నాయి..
ప్రమాదం తప్పిందని వెనక్కి తిరిగి యాగం జరుగుతున్న చోటికి వచ్చారు...
అలా వచ్చి రాగానే రుద్ర ముందు
ఒక భయంకరమైన ప్రేలుడు సంభవించింది...
ఆ దాటికి రుద్ర సింభిక దూరంగా ఎగిరి పడ్డారు.
తన శక్తుల వల్ల సింభిక తప్పించుకోగలిగింది గాని,
రుద్ర మాత్రం ఆ ఆకస్మిక దాడి నుండి తప్పించుకోలేకపోయాడు..
కొద్దిసేపటికి సింభిక ఆ దాడి ప్రభావం నుండి తేరుకుంది.. వేగంగా రుద్ర దగ్గరకు వెళ్లగా,ఆ దాడి ఎక్కడినుంచి జరిగిందని చుట్టూ చూడగా ఎవరూ కనిపించలేదు..
సింభిక అనుమానంతో పైకి చూసింది...
గాలిలో ఆకాశంలోని మెరుపుల వెలుగులో
ఒక విచిత్రమైన రాకాసి ఎగురుతూ కనిపించింది..
సింభిక చూస్తూ ఉండగానే అది నేలపై దిగింది..
దాన్ని చూడగానే సింభికకు చాలా కోపం వచ్చింది. వెంటనే ఆలోచించకుండా దాని మీదకి దాడి మొదలుపెట్టింది...
గాలిలో నిప్పుల బంతులు సృష్టించి, దాని మీదకు విసిరింది...
అవి వేగంగా దానిని సమీపించి,తిరిగి సింభిక మీదకు వచ్చి పడ్డాయి.... ఆ దాడి నుండి కొద్దిలో తప్పించుకుంది... అప్పుడు అర్థమైంది సింభికకు వచ్చింది కరొముఖి అని...
ఈ హఠాత్ పరిణామానికి సింభిక బిత్తరపోయింది....
ఏం చెయ్యాలో అర్థం కాలేదు..
వేగంగా రుద్ర దగ్గరకు వెళ్ళింది...కానీ తను సృహాలో లేడు..
ఇంతలో కరొముఖి,సింభికను తన శక్తితో బంధించి,
తన ముందు నిలిపి,కోపంగా చూస్తూ, మింగేయడానికి భయంకరంగా నోరు తెరిచింది...
సింభిక తన ప్రాణాల మీద ఆశ వదిలేసుకుంది.
కరొముఖి పూర్తిగా తన నోరు తెరిచి,సింభికను మింగేయబోతూ, ఏదో అనుమానంతో పక్కకి చూసింది...
వేగంగా ఒక శక్తి వచ్చి, కరొముఖిని ఢీ కొట్టింది..
ఆ శక్తి దెబ్బకు దూరంగా ఎగిరి పడింది...
సింభిక తనను బంధించిన శక్తి వదిలేయడంతో నేలపై పడింది.. వేగంగా రుద్ర వైపు వెళ్ళసాగింది.
ఇంతలో ఆశక్తి దాడిలో గాయపడ్డ కరొముఖి వికృతంగా అరిచింది...
అలా అరవగానే దాని ముందు కొన్ని రాక్షస జీవులు ప్రత్యక్షమయ్యాయి..
వాటిని రుద్ర,సింభికల మీదకు ఉసిగొల్పింది...
అవి వేగంగా వాళ్ళ వైపు వెళ్ళసాగాయి..
సింభిక కూడా వాటి మీద దాడి చేస్తున్న సరే, వాటికి ఏమి కావటం లేదు..
ఇక భయంతో రుద్ర ని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకుంది...
అలా కళ్లు మూసుకుని ఉన్న సింభికకు దూరంగా కుక్కల అరుపులు వినిపించాయి...
అనుమానం తో కళ్ళు తెరిచి చూడగానే.. మరో వైపు నుండి నల్లటి కుక్కలు వేగంగా రాకాసి జీవులు మీదకి దూకాయి...
ఆ కుక్కల మీద కోపంతో కరొముఖి వాటి మీదకి ఒక శక్తిని ప్రయోగించింది...
కానీ ఆ శక్తిని మరో శక్తి ఢీ కొట్టింది..
ఆ శక్తిని ప్రయోగించింది ఎవరు అని సింభిక వెనక్కి తిరిగి చూడగా అక్కడ మంత్రదండంతో దృఢంగా నుంచుని
సిద్ధ భైరవులు కనిపించారు..
తన శక్తిని అడ్డుకున్నందుకు ఆయన మీద కోపంతో మరో శక్తి ప్రయోగించ పోతుండగా,సిద్ధ భైరవులు దాని చుట్టూ శక్తిని ఆవాహన చేసి, మంత్ర బంధనం చేశారు..
ఇది ఇలా ఉండగా మరోవైపు యాగం నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది.. అసలు బయట ఏం జరుగుతుందో లోపల ఎవ్వరికీ తెలియదు...
సిద్ధ భైరవులు దానిని బంధించిన తరువాత వేగంగా రుద్ర వద్దకు చేరుకున్నారు....
అతను కరొముఖి దాడి వల్ల గాయపడ్డాడని అర్థం చేసుకున్నారు..
వెంటనే తన శక్తిని ఉపయోగించి రుద్ర గాయాలను మాన్పి,అతన్ని సృహా లోకి తెచ్చారు.
రుద్ర సృహా లోకి వచ్చాడు....
ఎదురుగుండా సిద్ధ భైరవులు కనిపించగానే ఆనందంతో "గురుదేవా..!! తమరు ఎప్పుడు వచ్చారు..?"అని అడిగాడు..
"నువ్వు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నావని తెలిసి వచ్చాను... ఇప్పుడు మనం మాట్లాడుకునే సమయం లేదు..కరొముఖితో ఇప్పుడు మనం పోరాడుతున్నాం.. దానిని మనం ఎంతో సేపు ఇలా బంధించి ఉంచలేము... యాగం జరిగే వరకు దానిని మనం ఆపగలిగితే చాలు..."అని సిద్ధ భైరవులు రుద్ర తో చెప్తూ ఉండగానే...
బంధించబడి ఉన్న కరొముఖి వికృతంగా అరిచింది..
అలా అరవడంతోనే దాన్ని పట్టి ఉంచిన బంధనాలు మాయమైపోయాయి...
అది అక్కడ నుంచి రుద్ర దాడిలో గాయపడ్డ,
విర్కోర,విస్కర్ష ల దగ్గరకు వెళ్లి తన శక్తితో వాటిని
కాపాడింది...
ఇప్పుడు అవి కూడా కరొముఖితో కలిసాయి..
వాటిని చూసిన తర్వాత జరగబోయేది ఏంటో
రుద్ర కి సిద్ధ భైరవులకి అర్థం అయింది..
సిద్ధ భైరవులు రుద్ర వైపు చూసి.." మనం వీటిని బంధించకపోతే ఏదో విధంగా యాగాన్ని నాశనం చేస్తాయి.. పంచవక్రీ ఇక్కడికి వచ్చే లోపు ఎలాగైనా సరే వీటిని బంధించాలి.."అని రుద్ర తో చెప్పి.."అయిదు విఘడియలు మా చుట్టూ రక్షణ రక్షణ వలయం ఏర్పాటు చేయగలవవా..??"అని సింభికను అడగగానే చేయగలను అన్నట్లుగా తలూపింది...
ఇక ఆలస్యం చేయకుండా రుద్ర సిద్ధ భైరవ లు ఇద్దరు నేలపై పద్మాసనం వేసుకొని మంత్ర పఠనం ప్రారంభించారు... సిద్ధ భైరవులు చెప్పినట్టుగానే తమ చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పాటు చేసింది..
రక్షణ వలయం చూసిన వెంటనే కోపంతో మూడు రాకాసులు కలిసి, దానిపై తమ శక్తి తో దాడి చేయడం ప్రారంభించాయి...
అలా కొద్ది నిమిషాలు గడిచిన తరువాత రక్షణ వలయం నాశనమైపోతుంది అనే తరుణంలో మూడు రాకాసులు నుంచున్న చోట నుండి వెలుగులు రావడం మొదలైంది..
అవి నుంచున్న ప్రదేశం నుండి కదలలేకపోయాయి..
అవి ఎటూ కదల్లేక వికృతంగా అరవసాగాయి..
ఆ వెలుగులు కాస్త పెద్దవై,ఆ మూడింటిని ఏదో అగాధంలోకి లాగేసుకున్నాయి...
అలా పంచవక్రీ అనుచరగణాల కథ సమాప్తం అయ్యింది...
వాటి పీడ విరగడయినందుకు సంతోషించారు..
కొద్ది నిమిషాలలో యాగం పూర్తవుతుంది..
(నికుంబల యాగం చివరిలో అమ్మవారికి
ఎండు మిరపకాయలు హోమ గుండంలో సమర్పిస్తారు..)
పంచవక్రీ కోసం ముగ్గురు ఎదురు చూడసాగారు.
ఇంతలో రుద్ర కి కొంచెం దూరంలో ఎవరో నుంచోని కనిపించారు..
" ఎవరది..??" అని అడిగాడు రుద్ర..
ఆకారం రుద్ర కి కొంచెం దగ్గరగా వచ్చింది..
అక్కడ రుద్ర కి నవ్వుతూ భాను కనిపించింది..
రుద్ర ఆశ్చర్యపోయాడు..!!
"ఇక్కడికి ఎందుకు వచ్చావు భాను..??"అని అడుగుతూ ముందుకి వెళ్లబోతుండగా...
సిద్ధ భైరవులు "రుద్ర ఆగు..!" అని అరిచారు.
"ఏమైంది గురుదేవా..?"అని అనుమానంగా అడిగాడు రుద్ర..
ఇంతలో ఒక్కసారిగా భాను మొఖం ఒక రాకాసి లాగా మారిపోయింది.
తన నోరు తెరవగానే నాలిక వేగంగా రుద్ర మీదకి వచ్చింది...
ప్రమాదాన్ని గ్రహించిన సిద్ధ భైరవులు వెంటనే రుద్ర ని పక్కకి తోసేశారు..
రుద్ర కింద పడడంతో ఆ నాలిక అతనికి వెనకాల ఉన్న ఒక చెట్టు లోకి చోచ్చుకుపోయింది..
హఠాత్పరిణామానికి రుద్ర ఆశ్చర్యపోయాడు..
అందరూ చూస్తూ ఉండగానే భాను ఒక పెద్ద మహా పిశాచిలా గా మారిపోయింది..
" పంచవక్రి వచ్చేసింది...!!"అని సింభిక భయంతో అరిచింది...
ఇక వాళ్ళకి తెరుకునే అవకాశం ఇవ్వకుండా
పంచవక్రి వేగంగా వాళ్ళ పై ఒక్కసారిగా తన శక్తులతో విరుచుకుపడింది...
దాని శక్తి దాటికి రుద్ర, సిద్ధ భైరవులు, సింభిక తీవ్రంగా గాయపడ్డారు..
మరోవైపు యాగం పూర్తయ్యింది అనడానికి సూచనగా ఎండు మిరపకాయలు ఆదిత్య చేతుల మీదుగా హోమ గుండానికి సమర్పించబడ్డాయి....
యాగానికి రక్షణగా ఉన్న రక్షణ కవచాలు పై,
పంచవక్రి ఒక్కసారిగా దాడి చేసింది..
ఆ శక్తి దాటికి 3 రక్షణ కవచాలు నాశనం అయిపోయాయి..
ఆ రక్షణ కవచాలు నాశనమైపోగానే,
అక్కడి పరిస్థితికి ముగ్గురికి కనిపించింది...
పంచవక్రీ కోపంగా ఆదిత్య వైపు చూస్తూ అతని మీదకి రాబోతుండగా.... ఆదిత్య వెంటనే తన చేతి నుండి ఒక శక్తి ని సృష్టించి, దాని మీదకి విసిరాడు.. ఆ ధాటికి అది కొద్ది దూరం ఎగిరి పడింది...
ఆదిత్య కోపంతో దాని మీదకి వెళ్ళసాగాడు..
అలా ముందుకు వెళ్తున్న ఆదిత్య చేతిలో ఒక మంత్రదండం ప్రత్యక్షమైంది...
దాని మీదకి మరో దాడి చేయబోతుండగా..
పంచవక్రీ, భాను గా మారిపోయింది..
ఆదిత్య తన దాడి చేసే ప్రయత్నాన్ని విరమించుకున్నాడు..
కానీ భాను శరీరంలో ఉన్న పంచవక్రీ మాత్రం ఆదిత్య మీదకి దాడి చేసింది..
ఇక ఆదిత్యకి భాను శరీరంలో అది ఉన్నంతసేపు తను ఏమీ చేయలేడు అని అర్థమయింది...
ఇక కళ్ళు మూసుకుని అమ్మవారిని ప్రార్థించి,
ఒక శక్తి ని భాను మీదకి విసిరాడు..
ఆ శక్తి భాను శరీరం నుండి పంచవక్రి ని వేరు చేసింది..
భాను శరీరంనుండి వేరుపడ్డ పంచవక్రి కోపంగా ఆదిత్య వైపు దూసుకుని వస్తుండగా....
ఒక్కసారిగా అక్కడ సింహగర్జన వినిపించింది...
ఆ గర్జన అడవి అంతా ప్రతిధ్వనించింది...
ఆకాశంలో కమ్ముకొని ఉన్న మబ్బులన్ని చెదిరిపోయాయి...
నిర్మలమైన ఆకాశం ప్రత్యక్షమైంది...
నేలపై సృహ తప్పి గాయాలతో పడి ఉన్న రుద్ర సిద్ధ భైరవులు సింబిక మామూలుగా మారిపోయి, పైకి లేచారు... భాను కూడా పైకి లేచింది..
పంచవక్రి ముందు సింహం మీద ఆసీనులై ఉన్న ప్రత్యంగిరా మాత అమ్మవారు ప్రత్యక్షమయ్యారు..
ఆ తల్లిని అలా చూడగానే అందరూ సాష్టాంగ పడి నమస్కారం చేశారు..
అమ్మవారిని అలా చూడగానే పంచవక్రీ గడగడా వణికిపోయింది..
అమ్మవారు తన కంటి చూపుతోనే దానిని నిలువునా బస్మం చేశారు... ఆ తరువాత అందరినీ ఆశీర్వదిస్తూ మాయమైపోయారు...
ఆ రోజుతో ఆదిత్య కి పట్టిన పంచవక్రీ పీడ విరగడ అయిపోయింది...
అందరూ ఆనందంగా ఇంటికి బయలుదేరారు...
కథ సమాప్తం....!!!
ఇట్లు - మీ బొల్లోజు నిరంజన్ కుమార్...
Posts: 78
Threads: 0
Likes Received: 53 in 42 posts
Likes Given: 17
Joined: Nov 2023
Reputation:
0
Shiva garu story chala bagundi
Elanti story rasinaduku meku thanks
Next panigrahanam s2 update ivandi please
Posts: 4,803
Threads: 9
Likes Received: 3,177 in 2,461 posts
Likes Given: 11,246
Joined: Sep 2019
Reputation:
31
Posts: 897
Threads: 13
Likes Received: 7,004 in 831 posts
Likes Given: 1,543
Joined: Aug 2024
Reputation:
651
(26-03-2026, 08:09 AM)Ajayk Wrote: Shiva garu story chala bagundi
Elanti story rasinaduku meku thanks
Next panigrahanam s2 update ivandi please
New Thread Lo Post Cheyala (Or) Old Thread Lo Continue Cheyala
Posts: 78
Threads: 0
Likes Received: 53 in 42 posts
Likes Given: 17
Joined: Nov 2023
Reputation:
0
Old thread lo continue cheyandi
Posts: 1,511
Threads: 2
Likes Received: 889 in 679 posts
Likes Given: 1,992
Joined: May 2019
Reputation:
10
(26-03-2026, 08:17 AM)SivaSai Wrote: New Thread Lo Post Cheyala (Or) Old Thread Lo Continue Cheyala
Ela aina parledu!! Take help of a coin!!?
Meeru start cheyandi!!
Posts: 3,869
Threads: 167
Likes Received: 12,343 in 2,409 posts
Likes Given: 8,198
Joined: Nov 2018
Reputation:
841
ఇటువంటి కథలు, చిన్నతనంలో చందమామలో; క్లుప్తంగా పిల్లలకు అర్ధమయ్యే రీతిలో, చదివాను.
గత కొన్ని సంవత్సరాలుగా వీటిని మరింత విపులంగా పెద్దలకు వ్రాసే పరిస్థితి.
ధన్యవాదములు శివసాయి గారు, ఈ కథను అందించినందుకు
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
Posts: 1,511
Threads: 2
Likes Received: 889 in 679 posts
Likes Given: 1,992
Joined: May 2019
Reputation:
10
The closure felt a bit hastened. Chaka chaka mugincharu writer Niranjan garu.
Pratyangira maatha pratyaksham tarvatha.. oka chinna fight, then akkada unnavallani karuninchi.. katakshinchi.. varaalu evaina ichi unte.. baagundedi.
Kathalo violence chala chala ekkuvaga dattinchi.. chivara urikinchesaru!!
My two cents!!
|