Posts: 506
Threads: 10
Likes Received: 4,132 in 456 posts
Likes Given: 1,137
Joined: Aug 2024
Reputation:
388
Part - 8
రేపల్లె...
శాంభవి ఉదయం నాలుగు గంటలకు లేచి, యోగా చేసి, ఫ్రెష్ అయ్యి స్నానం చేసి బయటకు రాగానే మంచం మీద పెట్టి ఉన్న లంగా వోని చూసిన నవ్వుకొని అది వేసుకొని దాని మ్యాచింగ్ సెట్ కూడా పెట్టుకుని పూజ గది దగ్గరికి వస్తుంది.
శాంభవి అన్ని పూర్తి చేసుకుని కిందకి వచ్చేటప్పటికి ఉదయం 6:00 అవుతుంది. శకుంతల బామ్మ రామాయణం చదువుతుంటే,, అత్తగారి అడుగుజాడల్లో నడుస్తున్న సులోచన గారు పూజ చేస్తున్నారు.జయంతి, ధరణి అన్ని అందిస్తున్నారు.
పూజ గది దగ్గరికి వస్తున్న శాంభవి అందెల శబ్దానికి అందరూ శాంభవి వైపు చూసి బొమ్మల్లాగా నిలబడతారు.
అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అన్నట్టు,
రవివర్మ కుంచె కు ప్రాణం పోసినట్టు,
లేలేత సూర్యకిరణాలకు విరిసిన తామర పువ్వు వలె,
వెన్నెల వెలుగులో విరిసిన కమలాన్ని చూసినట్టు, అందరూ ఒక అద్భుతాన్ని చూసినట్టుగా చూస్తున్నారు.
శాంభవి కిందకి వచ్చే రాము అని వాళ్ళ తాతగారైన రామచంద్రయ్య గారిని పిలిచి నేను ఎలా ఉన్నాను అని బొంగరం లాగా తిరుగుతూ అడుగుతుంది.
దానికి రామచంద్రయ్య గారు మురిసిపోతూ సులోచన గారిని పిలిచి మనరాలికి దిష్టి చుక్క పెట్టిస్తారు.
శివప్రసాద్, భాను ప్రసాదులు కూతుర్ని చూసి మురిసిపోతారు.
అది అంతా చూస్తున్న శకుంతల గారు సంతోషించిన వెంటనే గంభీరంగా శాంభవిని పిలిచి అన్నమయ్య కీర్తనలో ఒక కీర్తన పాడించి పూజ పూర్తి చేస్తారు.
పూజ టైం కి కుటుంబ సభ్యులందరూ ఖచ్చితంగా ఉండాలని శకుంతల బామ్మ ఆర్డర్. కాబట్టి అందరూ ఆ టైం కి పూజ దగ్గర ఉంటారు.
.,.......,..... ........................
హైదరాబాద్...
రుద్ర ఇంటికి వెళ్లగానే ఆగు అనే ఒక అరుపు వినిపిస్తుంది. ఎవరబ్బా అని చూసిన రుద్రా కి తులసి గారు కోపంగా కనిపిస్తారు.
ఏమైంది నా డార్లింగ్ కి, అని అడుగుతూ లోపలికి వస్తాడు.
తులసి గారు కోపంగా చూస్తూ, రాత్రి అంత ఎక్కడికి వెళ్లావు? ఎవరితో ఉన్నావు? ఇప్పుడు ఇంటికి వచ్చేది అని గట్టిగా అడుగుతారు.
ఏంటి అని కళ్ళు చిన్నవి చేసే తులసి గారిని చూస్తాడు. తులసి గారు సైగ చేస్తూ రుద్ర వాళ్ళ అమ్మగారిని చూపిస్తారు. రుద్ర వాళ్ళ అమ్మగారు అయిన చారులత గారు కోపంగా కిచెన్ హడలు కొట్టిస్తున్నారు.
దానికి రుద్రా చిన్న స్మైల్ తో నైట్ వర్క్ ఎక్కువ అయితే,, బావలతో కలిసి బృందావనం వెళ్లాను అని చారులత గారికి వినబడేటట్టు చెబుతాడు.
దానికి చారులత గారు కోపం పాలపొంగు వలె చల్లారిపోయి గబగబా బయటకు వస్తారు.
ఆవిడని అలా చూసిన రుద్ర నాన్నగారు అయినా సంతోష్, కొడుకుని చూసి, అమ్మ నా కొడకా మీ అమ్మ వీక్నెస్ మీద కొట్టావు కదా! ఇప్పుడు నేను ఏమీ మాట్లాడకపోవడమే బెటర్ అనుకుంటూ, పేపర్ చదువుతూ ఉంటారు .
చారులత గారు రుద్ర దగ్గరికి వచ్చి అందరూ ఎలా ఉన్నారు? నాన్నగారులు ఏమైనా మార్పు వచ్చిందా?? నాన్న, చిన్నన్నయ్య అమ్మతో మాట్లాడుతున్నారా? అని ఆత్రంగా అడుగుతారు.
చారులత గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఆవిడకి తెలిసిన సరే, ఏదైనా మార్పు వచ్చిందేమో అని ఆరాటం.
కోడలి ఆరాటం చూసిన తులసి గారు, అన్ని నీకు తెలిసి కూడా ఎందుకే ఇంత బాధ... ఈ సమస్యకు కాలమే సమాధానం చెబుతుంది అని అంటారు. అంతే కదా అత్తయ్య గారు అని కిచెన్ లోకి వెళతారు .
రుద్ర వాళ్ళ అమ్మగారిని చూస్తూ ఈ సమస్యకు సొల్యూషన్ లేదా గ్రానీ అని అడుగుతాడు.
సమస్య ఉన్న చోట సమాధానం కూడా ఉంటుంది. కొన్ని సమస్యలకు సమాధానం వెంటనే దొరుకుతుంది.కొన్ని సమస్యలకు సమయం పడుతుంది..
ఆ పరిష్కారం కోసమే మీ అమ్మ, అత్తయ్య చెయ్యని పూజ లేదు. మొక్కని దేవుడు లేడు.
ప్రతి ఒక్కరూ ఎవరి కర్మఫలం వారు అనుభవించక తప్పదు అని చెబుతారు.
అంతా వింటున్నా రుద్ర సరే గ్రానీ అని, నేను ఫ్రెష్ అయ్యి ఆఫీస్ కి వెళతాను.
ఈరోజు న్యూ ప్రాజెక్ట్ గురించి టెండర్ ఉంది అని చెబుతాడు.
ఎవరు మనకు కాంపిటేటర్ అంటే ఇంకెవరు ఆ మయూరి అని చెబుతాడు. దానికి తులసి గారు ముఖం వికారంగా పెట్టుకొని పాపి చిరాయువు అని మయూరి, నాగేంద్ర ను చూసే చెప్పొచ్చు అంటారు.
ప్రాజెక్ట్ టెండర్ ఎవరికి వస్తుంది??
Posts: 506
Threads: 10
Likes Received: 4,132 in 456 posts
Likes Given: 1,137
Joined: Aug 2024
Reputation:
388
Part - 9
రేపల్లె....
శాంభవి తన గదికి వెళ్లి డ్రస్ చేంజ్ చేసుకుని చుడీదార్ లో వస్తుంది. అందరూ బ్రేక్ ఫాస్ట్ ఫినిష్ చేసి ఎవరి పనులకు వాళ్ళు వెళుతూ ఉంటారు.
శివప్రసాద్ గారు తన ఆఫీసు రూమ్ కి వెళ్లి అక్కడ ప్రజల సమస్యలకు సొల్యూషన్స్ చూస్తున్నారు. శివప్రసాద్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ ఊరిలో మందు , సిగరెట్ నిషేధం.
భాను ప్రసాద్ గారి పొలం వెళ్లి వ్యవసాయం పనులు చూసుకుంటున్నారు. ఆ ఊరు నుండి, పక్క ఊరు నుండి యువత ఆయన దగ్గరకు వచ్చే సలహాలు తీసుకుంటూ ఉంటారు. ధరణి లెక్చరర్ గా కాలేజ్ కి వెళ్ళింది.
లలిత్, చరణ్, స్వరూప్ కాలేజ్ కి కాలేజెస్ కి వెళ్లి వాళ్ళ డ్యూటీ స్టార్ట్ చేశారు.
శాంభవి కాలేజీకి బయలుదేరగానే శకుంతలాగారు శాంభవి నీ ఆపి చెబుతూ ఉంటారు.
బంగారం తిన్నగా తలవంచుకుని, కాలేజీకి వెళ్లి బాగా చదువుకొని, తలదించుకుని ఇంటికి వచ్చాయి అమ్మ అని చెబుతారు. దానికి శాంభవి అలాగే బామ్మ అని తలు ఊపుతుంది.
అది చూసిన సులోచన పాపం అత్తయ్య గారు బంగారం ఎంతో అమాయకురాలు అనుకుంటున్నారు. అది ఎంత రాక్షసొ నాకు కథ తెలిసింది.
నేను మీకు చెప్పలేను అనుకుంటూ జయంతితో కలిసి లోపలికి వెళ్ళిపోతారు. రామచంద్రయ్య గారు భార్య మనస్సు అర్థమయ్యి నవ్వుకుంటారు.
శాంభవి కాలేజీకి వెళ్లగానే మిత్ర అడుగుతుంది మనం ఇంటర్న్షిప్ కి సెలెక్ట్ అవుతామా అని..
దానికి శాంభవి నేను సెలెక్ట్ అయినా రాను అని చెబుతుంది. ఎందుకు రావు అని మిత్ర అడిగితే??
నేను మా అన్నయ్యలను, నాన్నలను, రాముని వదిలి ఎక్కడికి వెళ్ళను అని చెబుతుంది. క్లాస్ కి వెళుతున్న ధరణి ఆ మాటలు విని ఆలోచిస్తూ క్లాస్ కి వెళుతుంది.
హైదరాబాద్...
రుద్ర ఆఫీస్ కి రెడీ అవుతూ ఉండగా సంతోష్ అక్కడికి వచ్చి రుద్రా అని పిలుస్తారు. చెప్పండి డాడీ అంటూ వేళ్ళతో హెయిర్ ని సరి చేస్తూ ఉంటాడు.
రాత్రి పబ్లో జరిగింది తెలిసింది, జాగ్రత్త రుద్ర. వాళ్లు విష నాగులు కన్నా ప్రమాదం అంటే, నీ కొడుకు గురించి తక్కువగా అంచనా వేస్తున్నావు డాడ్ అంటాడు.
లేదు, రుద్ర మిమ్మల్ని తక్కువ అంచనా వేయడం లేదు. వాళ్ళు ఎంత ప్రమాదకరం అని చెబుతున్నాను.
వాళ్లు చిమ్మిన విషానికి మీ చిన్న మామయ్య లైఫ్ ఏమయింది?? మీ మామ ఏమి తక్కువ వాడు కాదు కదా!!
అనగానే, మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు డాడ్ అని అడుగుతాడు. మీరు జాగ్రత్త శత్రువుని తక్కువ అంచనా వేయొద్దని చెబుతున్నాను అని చెప్పి, పద ఇప్పటికే లేట్ అయింది అంటూ బయటికి వెళ్తారు.
రుద్ర బయలుదేరగానే, విహాన్ నుంచి కాల్ వస్తుంది..కాల్ లిఫ్ట్ చేసి చెప్పు బావ అనగానే, బయలుదేరావా అనగానే ఆ స్టార్ట్ అయ్యాను.
డైరెక్ట్ గా టెండర్ ఆఫీసుకు వస్తున్నాను అని చెబుతాడు. ఓకే బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. దారిలో ధీరజ్ నెక్కించుకుని టెండర్ ఆఫీస్ కి బయలుదేరుతాడు.
గదిలో కూర్చున్న రాఘవేంద్ర గారికి మనసు అంతా గందరగోళంగా ఉంటుంది ఇది అని చెప్పలేని భావం మొదలవుతుంది. రాఘవేంద్ర గారు గది బయటకు వచ్చి జితేంద్ర అని పిలుస్తారు.
ఆఫీస్ కి రెడీ అవుతున్న జితేంద్ర బయటకు వచ్చి ఏమైంది నాన్నగారు అంటే, మనసంతా గందరగోళంగా ఉంది నీకు ఇంపార్టెంట్ వర్క్ ఉంటే దేవేంద్ర కి చెప్పు.
మనం ఇప్పుడే గురువుగారు వద్దకు వెళ్దాం అని చెబుతాడు. దానికి జితేంద్ర గారు పదండి అని చెప్పి, దేవేంద్ర కి ఫోన్ చేసి వర్క్ గురించి చెప్పి.. గురువుగారు ఆశ్రమం ఉన్న శ్రీశైలం వెళ్తారు. (ఆశ్రమం అంతా కల్పితం)
భర్త మాటలు విన్న అనసూయ కి కంగారు వచ్చి కౌసల్యాన్ని తీసుకొని దగ్గరలో ఉన్న అమ్మవారి గుడికి వెళుతుంది.
టెండర్ ఆఫీస్ కి బయలుదేరిన రుద్ర కారుకి పురిటినప్పులతో ఒక అమ్మాయి అడ్డు వస్తుంది. కాపాడండి అని అరుస్తూ ఉంటుంది.
రుద్ర ధీరజ్ కారు దిగి అమ్మాయిని బ్యాక్ సీట్లో పడుకోబెడతారు. ఆ అమ్మాయితో... నీతో ఎవరూ లేరు ఏంటి అని అడుగుతారు.
దానికి అమ్మాయి నా భర్త ఆటో కోసం వెళ్లి ఇంకా రాలేదు అని చెబుతోంది.
అవునా...... అంటూ కారు ని ముందుకు దూకిస్తాడు. ఇంతలో అద్వైత్ ఫోన్ చేసి, మీరు ఇంకా రాలేదేంటి?? మేము వచ్చి చాలా సేపు అయింది. చిన్నాన్న కూడా వచ్చారు అని చెబుతాడు.
దానికి రుద్ర అవునా... చిన్న మామకు మంచి గిఫ్ట్ ఉంది అని చెప్పు అని ఫోన్ పెట్టేస్తాడు.
రుద్ర ఇచ్చే గిఫ్ట్ ఏమిటి??
పురిటి నొప్పులతో బాధపడుతున్న అమ్మాయిని ఎక్కడ జాయిన్ చేస్తారు??
కథ కొనసాగుతుంది....
Posts: 4,610
Threads: 9
Likes Received: 2,939 in 2,265 posts
Likes Given: 10,772
Joined: Sep 2019
Reputation:
31
Posts: 58
Threads: 0
Likes Received: 38 in 30 posts
Likes Given: 17
Joined: Nov 2023
Reputation:
0
Shiva garu super story
Kasta pedda update ivandi
Posts: 1,221
Threads: 2
Likes Received: 678 in 489 posts
Likes Given: 1,400
Joined: May 2019
Reputation:
7
Katha chakkaga nadustundi.
inkaa characters add ayyay!!
Posts: 506
Threads: 10
Likes Received: 4,132 in 456 posts
Likes Given: 1,137
Joined: Aug 2024
Reputation:
388
Part - 10
రుద్ర కారుని ముందుకు పరుగులు పెట్టిస్తాడు. ఆ అమ్మాయి నొప్పులు ఎక్కువ అవుతూ, ప్లీజ్ తొందరగా హాస్పిటల్ కి తీసుకువెళ్లండి . తట్టుకోలేకపోతున్నాను అని అరుస్తుంది...
కంగారు పడకండి.. మేము మెసేజ్ చేస్తున్నాము హాస్పిటల్ కి అని చెబుతారు. మెసేజ్ ఎందుకు అని అమ్మాయి అడిగితే, వాళ్ళు రెడీగా ఉంటారు అని చెబుతారు.
ఆ అమ్మాయి హమ్మయ్య అనుకుంటూ చూస్తుంది. కారు హాస్పిటల్ దారి కాకుండా, టెండర్ ఆఫీస్ రూట్ లో వెళుతుంటే...
కంగారుగా మనం హాస్పిటల్ కి వెళ్ళాలి కదా! మీరేంటి టెండర్ ఆఫీస్ కి వెళుతున్నారు అని అడుగుతుంది.
దానికి ధీరజ్ అదేంటి మేం మీకు టెండర్ ఆఫీస్ తెలుసా అని అడిగితే... రుద్ర ఆమె వైపు ఒక ఈవెల్ స్మైల్ తో చూస్తాడు.
.దానికి అమ్మాయి కంగారుగా అంటే.. ఇటు హాస్పిటల్ ఉండవు కదా!!
ఆ టెన్షన్ లో హాస్పిటల్ అనబోయి టెండర్ ఆఫీస్ అన్నాను అంతే అంటుంది.
అవునా... అంటూ దీర్ఘం తీస్తారు. ఇటు టెండర్ ఆఫీసు ఉంది అని మీకు ఎలా తెలుసు మేడం అని అడిగితే మీ మాటల్లో విన్నాను అని చెబుతుంది.
దానికి ధీరజ్ పర్వాలేదు, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మిగిలిన విషయాలు పట్టించుకుంటున్నారు అని పొగుడుతాడు.
ఆ అమ్మాయికి ఏమి చేయాలో తెలియక ఒక నవ్వు నవ్వి నొప్పులు ఎక్కువగా అవుతున్నాయి. హాస్పిటల్ కి తొందరగా వెళదామని కంగారు పెడుతుంది.
కంగారు పడకండి దారిలోనే చాలా పెద్ద హాస్పిటల్ ఉంది అని చెబుతారు.
దేవేంద్ర గారు అద్వైత్ ని అడుగుతారు. రుద్ర ఇంకా రాలేదు అని...
ఆన్ ద వే అని చెప్పాడు. పైగా మీకు మంచి గిఫ్ట్ కూడా ఉంది అన్నాడు అని అంటే, నాకు గిఫ్ట్??అని ఆలోచిస్తూ ఉంటారు.
నాగేంద్ర మళ్లీ ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఒక కారు స్పీడ్ గా వచ్చి ఆగుతుంది.
కారు ముందు సీటులో నుంచి మయూరి, వెనక సీట్ లో నుంచి శేషాద్రి, నాగేంద్ర దిగుతారు.
వాళ్లని చూసి దేవేంద్ర మొఖం పక్కకు తిప్పేస్తాడు. మయూరి కోపంతో పిడికిలి బిగిస్తుంది.
శేషాద్రి దేవేంద్ర ముందుకు వచ్చి ఈసారి విజయం మాదే అని పొగరుగా చెప్తాడు.
విహాన్ కోపంగా ముందుకు రాబోతుంటే,, దేవేంద్ర ఆపి అవునా.. సరే అయితే అంటాడు. అంత వెటకారంగా అన్న దేవేంద్ర మాటలకు శత్రువులు కోపంతో రగిలిపోతుంటారు.
రుద్ర కారు టెండర్ ఆఫీస్ దగ్గరికి వస్తూ ఉంటే, ఆ అమ్మాయికి పరిస్థితి అర్థం అయ్యి గన్ తీసి రుద్రాకు గురిపెట్టి రుద్ర మర్యాదగా టెండర్ ఫైల్ ఇవ్వుఅని అరుస్తుంది.
దానికి రుద్ర కూల్ బేబీ ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతాడు. మర్యాదగా కారు ఆపు రుద్ర అని అరుస్తుంది.
దానికి ధీరజ్ ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు. ఇక్కడ డెలివరీకి ఏర్పాట్లు చేసాము అని చెబుతాడు. అంతలో రుద్ర కార్ స్పీడ్ గా బ్రేక్ వేస్తాడు.
వెనక సీటులో ఉన్న అమ్మాయి తూలి ముందుకి పడుతుంది. గన్ వెళ్లి ధీరజ్ కాళ్ళ దగ్గర పడుతుంది.
. సైరన్ సౌండ్ కి అందరూ రుద్ర కారు వంక చూస్తారు. సెక్యూరిటీ అధికారి జీప్స్ వచ్చి రుద్రకారుని చుట్టుముడతాయి.
ధీరజ్ ముందుకు పడిన అమ్మాయి చేతులను వెనక్కి మడిచి పట్టుకుంటాడు. రుద్ర గాగుల్స్ పెట్టుకుంటూ స్టైల్ గా కారు దిగుతాడు.
సెక్యూరిటీ ఆఫీసర్లు అమ్మాయిని అరెస్ట్ చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతారు. అక్కడ రుద్రాని చూడగానే మయూరి కోపంతో ఊగిపోతుంది.
శేషాద్రి కి చెమటలు పడతాయి. నాగేంద్ర పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది.
రుద్రా వెళ్లి వాళ్ళ చిన్న మామను హగ్ చేసుకుని ఎలా ఉంది గిఫ్ట్ మామ అంటే... నా అల్లుడు అని గర్వంగా అంటారు.
మయూరీ వంక చూసి, ఏంటి మయూ బేబీ రాననుకున్నావా, రాలేను అనుకున్నావా??
ఈ రోజుల్లో కూడా ఇలాంటి సిల్లీ థింగ్స్ ఏంటి అని వెటకారంగా నవ్వి, లోపలికి వెళతారు.
శేషాద్రి చెల్లి దగ్గరికి వచ్చి, ఈ టెండర్ కూడా G. B కేనా అనగానే, అన్నయ్య అని చూడకుండా లాగిపెట్టి పీకి లోపలికి వెళుతుంది.
శేషాద్రి బుగ్గపై చేయ పెట్టుకుని చెల్లిని నాన్నని ఫాలో అవుతాడు. వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ టెండర్ G.B సొంతమవుతుంది.
ఆనందంలో G. B బ్యాచ్, కోపంలో మయూరి బ్యాచ్ అక్కడి నుండి వెళతారు.
G. B సొల్యూషన్స్..
అందరూ ఆఫీస్ కి రాగానే, దేవేంద్ర గారు తన క్యాబిన్లోకి వెళ్లి పర్సనల్ రూమ్ లోకి వెళ్ళిపోతారు.
రూమ్లో గోడకి తగిలించి ఉన్న ఒక ఫోటోను చూస్తారు.
ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి అందంగా నవ్వుతూ ఉంటుంది.
ఆ ఫోటోని చూస్తూ ఈసారి కూడా మనమే గెలిచాము. కానీ.... అని బాధపడుతూ ఫోటోనే తడుముతూ ఉంటారు.
ఎవరు ఆ అమ్మాయి??
దేవేంద్ర బాధకు కారణం ఏమిటి??
Posts: 506
Threads: 10
Likes Received: 4,132 in 456 posts
Likes Given: 1,137
Joined: Aug 2024
Reputation:
388
Part - 11
అనసూయ గారు, కౌసల్య గారిని తీసుకుని గుడికి వెళతారు. గుడిలో పూజలు, అభిషేకాలు చేపిస్తారు. అన్నదానానికి డొనేషన్ ఇచ్చి గుడి ఆవరణలోకి కూర్చుంటారు.
ఎందుకు అత్తయ్య అంత కంగారు పడుతున్నారు... అంటే దానికి అనసూయ గారు తెలియదు కౌసల్య మీ మావయ్య గారు జితేంద్ర ని తీసుకుని గురువుగారి దగ్గరికి వెళ్లారు.
.ఏమి వినాలి వస్తుందా అని కంగారుగా ఉందని చెబుతారు. కంగారు పడకండి అత్తయ్య అంతా మంచే జరుగుతుంది.
ఇన్ని సంవత్సరాల నుంచి అమ్మవారిని ప్రార్థిస్తున్నాము. అమ్మ కరుణించదా చెప్పండి... అని అత్తగారికి ధైర్యం చెప్పి బయలుదేరుతారు.
గుడి ఆవరణలో చెట్టు దగ్గర కూర్చున్న బైరాగి దగ్గరకి అనసూయ వెళ్లి నమస్కరించి... పళ్ళు, ఫలహారం సమర్పిస్తుంది.
దానికి బైరాగి అనసూయను చూసి మేము స్వీకరించలేము తల్లి. తీసుకువెళ్ళు అంటే..
స్వామి ఎంత కాలం నాకి ఈ శిక్ష అని బాధపడుతుంది.
చేసుకున్న వారికి చేసుకున్నంత తల్లి అని అంటారు. నేను మూర్కోత్వంలో చేసిన పనికి... నా కొడుకు జీవితంలో సంతోషం లేదు. నా భర్త నాతో మాట్లాడడం లేదు అని బాధపడుతుంది.
దానికి బైరాగి నీది మూర్ఖత్వం కాదు..అహంకారంతో చేశావు. తప్పు అయితే సరిదిద్దుకోవచ్చు. మహాపాపం అయితే ప్రాయశ్చిత్తం ఉంటుందా తల్లి అని అడుగుతారు.
దానికి అనసూయ నాకు ఎంత కాలం ఈ శిక్ష అంటే... అమ్మ అనుమతి ఇచ్చేవరకు అని చెప్పి కళ్ళు మూసుకుంటారు. బాధతో , భారమైన మనసుతో అనసూయ, కౌసల్య ఇంటిదారి పడతారు.
రాఘవేంద్ర గారు, జితేంద్ర గారు శ్రీశైలంలో ఉన్న గురువుగారు ఆశ్రమానికి చేరుతారు.
లోపలికి వెళ్లి శిష్యులతో గురువుగారిని కలవాలి అని చెబుతారు. అప్పుడే లోపలి నుండి ఇంకో శిష్యుడు వచ్చి మిమ్మల్ని గురువుగారు పిలుస్తున్నారు అని చెప్పి లోపలికి తీసుకువెళతాడు.
ధ్యానంలో ఉన్న గురువుగారు కళ్ళు తెరిచి ఏమైంది రాఘవేంద్ర అని అడుగుతారు.
మీరు సర్వజ్ఞులు... చెప్పక ముందే మేము వచ్చిన సంగతి తెలిసినవారు. ఎందుకు వచ్చామో తెలియదా గురువుగారు అని వినయం గా అడిగితే....
దానికి ఆయన చిరునవి నవ్వి, మనసులో చెప్పలేని భావం కలిగితే ఎందుకు అంత కంగారు అని అడుగుతారు.
ఇది దేనికి సూచన అని అర్థం కావడం లేదు. మీరు చెప్పినప్పుడు నుంచి ... శాంతి హోమాలు, అమ్మవారికి అభిషేకాలు , అన్నదానాలు అన్ని చేపిస్తున్నాము.
అయినా ఇంకా అమ్మ అనుగ్రహానికి పాత్రులు కాలేదు మేము అని బాధపడతారు.
బాధపడకు రాఘవేంద్ర కాలమే అన్ని సమస్యలకు సమాధానం చెబుతుంది అని...
అమ్మవారిని ధ్యానిస్తూ కళ్ళు మూసుకుంటారు. 10 నిమిషాలకు కళ్ళు తెరిచే ప్రసన్న వదనంతో రాఘవేంద్రను చూస్తూ అమ్మ అనుగ్రహానికి దగ్గర అవుతున్నారు.
అంతా మంచికే జరుగుతుంది.వారసురాలు రాబోతుంది అని చెప్పగానే, సంతోషంతో రాఘవేంద్ర, జితేంద్ర ఉక్కిరిబిక్కిరి అవుతూఉంటే,
అవును.. రాఘవేంద్ర అమ్మ ఆజ్ఞ అయింది అని చెబుతారు.
ఎలా మేము మా వారసురాల్ని గుర్తించాలి అంటే..అన్ని వాటి అంతట అవే తెలుస్తాయి.
జాగ్రత్తగా ఉండండి. మీ వారసురాలని శత్రువుకి తెలిస్తే చాలా ప్రమాదం.
ఇప్పుడు వరకు ద్వేషం అంటే ఏమిటో తెలియని చోట ఉంది. కన్నీరు రాకుండా పెంచారు. అక్కడ అంత అపురూపంగా పెరిగింది.
మీ వారసురాలు అనే శత్రువులకు తెలిస్తే చాలా ప్రమాదం అని చెబుతారు.
అలాగే గురువుగారు అని చెబుతూ...ఒక విషయం అండి అంటారు. ఏమిటి అని అడుగుతారు.
ఆత్రం ఆగక అడుగుతున్నాము. ఎన్ని రోజుల్లో మా వారసురాలు రాగలదు అనగానే....
గురువుగారు చిన్న నవ్వి నవ్వి ఈ పౌర్ణమి అయిన మర్నాడు తను మీ సంస్థలో అడుగుపెడుతుంది. గుర్తించండి అని చెబుతారు.
దానికి సంతోషంతో పౌర్ణమి అంటే ఇంకా పదిరోజులే ఉంది. మేము అన్ని ఏర్పాట్లు చేసుకుంటాము అని గురువుగారికి కృతజ్ఞతలు చెప్పి...ఆనందంతో ఇంటికి బయలుదేరుతారు..
ఒకరిది బాధ, ఒకరిది ఆనందం, ఒకరిది చెప్పలేని ఉద్వేగం...
Posts: 506
Threads: 10
Likes Received: 4,132 in 456 posts
Likes Given: 1,137
Joined: Aug 2024
Reputation:
388
Part - 12
రాఘవేంద్ర గారు చాలా సంతోషంగా ఉంటారు. దేవేంద్ర కి సంతోషం తిరిగి రాబోతుంది అని.
జరిగిన నష్టాన్ని ఎలాగో తీర్చలేము, వారసరాలు రాకతో అయినా దేవేంద్ర సంతోషంగా ఉంటాడు అనుకుంటారు.
వెంటనే కూతురికి ఫోన్ చేస్తారు. చారులత ఫోన్ తీసుకుని చూస్తుంది. ఇదేంటి నాన్నగారు ఈ టైం లో ఫోన్ చేస్తున్నారు అనుకుని...
కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో నాన్నగారు అంటుంది. అమ్మ చారు అని సంతోషంగా పిలుస్తారు.
ఏమైంది నాన్నగారు... మీ మాటలు సంతోషం కనిపిస్తుంది అంటే.. అవును తల్లి చాలా సంతోషకరమైన విషయమే.
రేపు ఉదయం అల్లుడు గారిని, రుద్ర ని తీసుకుని ఇంటికి రామ్మ. ఇటు నుంచి ఆఫీసుకు వెళతారు.
చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి అంటారు. సరే నాన్నగారు అని చెప్పి, ఫోన్ పెట్టేస్తుంది.
విషయం ఏమై ఉంటుందని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. తులసి గారు చారులత ని పిలిచి ఏమైంది??
అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావని అడుగుతారు?? నాన్నగారు ఫోన్ చేసి రేపు ఇంటికి రమ్మన్నారు అత్తయ్య అంటే... దానికి అంత ఆలోచించడం దేనికి అంటారు.
నాన్నగారు చాలా సంతోషంగా ఉన్నారు అంటుంది. తులసి గారు కూడా ఏమి అయ్యి ఉంటుందని ఆలోచిస్తూ ఉంటారు.
చారులత ఆనందంతో అత్తయ్య గారు, నాన్నగారు అమ్మని క్షమించి అమ్మతో మాట్లాడతారు అనుకుంటా.. అది చెప్పడానికి పిలిచి ఉంటారు అని అంటుంది.
తులసి గారు కోడలతో లేదు చారు.. ఇంకా ఏదో విషయం ఉంది. అన్నయ్య క్షమిస్తే సంతోషంతో వదిన కదా ఫోన్ చేసి చెప్పాల్సింది అంటే అది నిజమేలే అత్తయ్య.. చూద్దాం రేపు ఏం చెబుతారో అని అంటుంది.
రాత్రికి రాగానే సంతోష్ కి, రుద్రకి ముందే చెప్పు. లేకపోతే ఉదయమే పరుగులు పెడతారు అంటారు. సరే అత్తయ్య అని అంటుంది.
రేపల్లె...
సాయంత్రం కాలేజ్ నుంచి వచ్చిన శాంభవి , సులోచన గారు ఇచ్చిన స్నాక్స్ తిని డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది.
ధరణి మాత్రం శాంభవినే చూస్తూ ఉంటుంది. జయంతి టీ కప్ తెచ్చి ధరణికి ఒకటి ఇచ్చి, తను ఒకటి తీసుకుని ఏమైంది ధరణి వచ్చినప్పుడు నుంచి శాంభవి మీదే ఉంది నీ చూపు అని అడుగుతుంది.
దానికి ధరణి కాలేజీలో జరిగింది చెబుతుంది. ఎందుకు అంత అలా ఆలోచిస్తున్నావు. శాంభవి చెప్పింది కూడా నిజమే కదా! అంత దూరం పంపించడం అవసరమా?? మనవాళ్ళు ఒప్పుకుంటారు అనుకుంటున్నావా??
ఆ ఇంటెన్షిప్ ఏదో ఇక్కడ అరేంజ్ చేస్తే సరిపోతుంది కదా అని అంటుంది జయంతి. నువ్వు కూడా అలా అంటావేంటి అక్క అని ధరణి అంటుంది.
అసలు నువ్వు ఏమీ ఆలోచిస్తున్నావో అది చెప్పు ధరణి అని అడుగుతారు.
శాంభవికి ప్రపంచం మొత్తం ఈ ఇల్లు,, ఈ ఊరు మాత్రమే. శాంభవి మీద ఉన్న అతి ప్రేమతో తన చుట్టూ అందమైన ప్రపంచాన్ని సృష్టించి అందులో సీతాకోకచిలుకను చేశారు.
నిజం చెప్పాలి అంటే బయట ప్రపంచం అలా లేదు. శాంభవికి ప్రపంచం తెలియాలి.
ఇంటెన్షిప్ జరిగేది నాలుగు నెలలు మాత్రమే. ఈ నాలుగు నెలలు బయటకు పంపిస్తే కొంచమైనా లోకజ్ఞానం వస్తుంది.
రేపు శాంభవికి పెళ్లి అయ్యి అత్తారింటికి వెళితే కొంచెం ఇబ్బంది పడకుండా ఉంటుంది కదా అనగానే...
దానికి జయంతి నువ్వు అప్పుడే పెళ్లి వరకు వెళ్లిపోయావా.. అయినా శాంభవిని బయటికి పంపిస్తారు అనుకుంటున్నావా?? ఇల్లరకం తీసుకు వస్తారని జయంతి అంటుంటే...
అప్పుడు కచ్చితంగా గొడవలు మొదలవుతాయి అని సులోచన గారు చెబుతూ.. కోడలు ఇద్దరితో జాయిన్ అవుతారు
దానికి జయంతి అదేంటి అత్తయ్య అలా అంటున్నారు అంటే అత్తయ్య చెప్పింది నిజం అక్క అని అంటుంది ధరణి.
పెళ్లి అయిన తర్వాత ప్రతి ఒక్కరికి తమ లైఫ్ పార్ట్నర్ అటెన్షన్ కోరుకుంటూ ఉంటారు.
పెళ్లయిన తర్వాత శాంభవి ఇక్కడే ఉంటే.. శాంభవి ఫస్ట్ ప్రిఫరెన్స్ మా నాన్నలు, మా అన్నయ్యలు అంటుంది.
మన అబ్బాయిలు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ నా చెల్లి అంటారు.
ఫస్ట్ లో బాగానే ఉన్నా ఉండగా, ఉండగా అదే పెద్ద డిస్టబెన్స్ అవుతుంది అంటుంది.
దానికి జయంతి అదే నిజమేలే. ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగితే..
ఇంటెన్షిప్ కి శాంభవిని ఎలా పంపించాలో చెబుతుంది. దానికి జయంతి టీ కప్పులో తుఫాను అంటే ఏంటో అనుకున్నాను...
మనం ఒక కప్పు టీ తాగేలోపు ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నాం. చూద్దాం రేపు సెలక్షన్స్ ఉన్నాయి కదా అంటారు.
శాంభవి ఇంటర్నషిప్ కి వెళ్లడానికి ఒప్పుకుంటుందా??
కథ కొనసాగుతుంది.....
Posts: 4,610
Threads: 9
Likes Received: 2,939 in 2,265 posts
Likes Given: 10,772
Joined: Sep 2019
Reputation:
31
Posts: 1,221
Threads: 2
Likes Received: 678 in 489 posts
Likes Given: 1,400
Joined: May 2019
Reputation:
7
Interesting storm in a tea cup!!!
Posts: 506
Threads: 10
Likes Received: 4,132 in 456 posts
Likes Given: 1,137
Joined: Aug 2024
Reputation:
388
Part - 13
హైదరాబాద్...
రాఘవేంద్ర, జితేంద్ర సంతోషంగా ఇంటికి వస్తారు. ఆనందంతో ఇంటికి రాగానే కోడల్ని పిలుస్తారు. చెప్పండి మావయ్య గారు అని కౌసల్య అక్కడికి వస్తుంది.
అనసూయ కూడా విషయం ఏమి అయ్యి ఉంటుందని బయటకు వస్తుంది.
రాఘవేంద్ర గారు కోడల్ని చూస్తే తల్లి దేవేంద్ర పక్క గది శుభ్రం చేయించు.
రేపటినుండి ఆపకుండా అమ్మవారి గుడిలో అభిషేకాలు చేయించు. అలాగే రేపు చారు వచ్చాక మిగిలిన పనులు చెబుతాను అంటారు.
అలాగే మావయ్య గారు అని భర్త వంక చూస్తుంది విషయం ఏమిటా అని?? జితేంద్ర కళ్ళు అర్పుతాడు తర్వాత చెబుతాను అని.
అనసూయ కూడా భర్త సంతోషం చూసి విషయం ఏమిటో తెలుసుకోవాలని ఉంటుంది. వెంటనే గదిలోకి వెళ్లి కూతురికి ఫోన్ చేస్తుంది.
ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు అమ్మ అంటే... విషయం ఏమిటో నీకు తెలుసా చారు.. మీ నాన్నగారు చాలా సంతోషంగా ఉన్నారు అని అడుగుతుంది.
నాకు ఆ విషయం ఏమీ తెలియదు అమ్మ.. ఫోన్ చేసి రేపు రమ్మన్నారు అని చెబుతుంది. అవునా...అని పెట్టేస్తారు.
గదిలోకి వచ్చిన జితేంద్ర గారిని కౌసల్య అడుగుతుంది. విషయం ఏమిటా అని??
వెయిట్ చెయ్ బంగారం. రేపు అందరికి ఒకేసారి నాన్నగారు చెబుతారు.
అంటే.. అబ్బా మీరు నాకు చెప్పచ్చు కదా అని గారంగా అడుగుతుంది. కుదరదు, నేను చెప్పను అంటారు.
ప్లీజ్ చెప్పండి నేను ఎవ్వరికీ చెప్పను అని బ్రతిమాలుతుంది. అమ్మో నీకు చెబితే ఏమైనా ఉందా అనగానే...
అంటే అని కౌసల్య గారు అడుగుతారు. నీకు చెప్పడం న్యూస్ ఛానల్ వాళ్ళకి న్యూస్ ఇవ్వడం రెండు ఒక్కటే.
రేపటి వరకు వెయిట్ చెయ్ బుజ్జి అని బుగ్గ మీద తట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతారు.
దానికి కౌసల్య గుర్రు గ భర్తను చూస్తూ అబ్బా ఈయిన విషయం చెప్పరు. తెలుసుకోకపోతే నాకు అత్రం తగ్గదు.
ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు.సరేలే ఒక రాత్రే కదా అడ్జస్ట్ అవుదాం అనుకుంటారు.
రేపల్లె...
మార్నింగ్ అందరూ బ్రేక్ ఫాస్ట్ చేస్తూ ఉంటే సులోచన గారు కోడలు ఇద్దరినీ చూసే సైగ చేస్తారు మాట్లాడమని.
దానికి కోడళ్ళు కళ్ళార్పి జయంతి గారు మొదలుపెడతారు.
నాన్న లలిత్ ఈరోజు మన కాలేజ్ కి ఇంటెన్షిప్ కోసం చాలా కంపెనీస్ వస్తున్నాయంట కదా అని అడుగుతారు.
అవునమ్మా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి వస్తున్నాయి. (ఇది అంతా కల్పితం )
దానికి ధరణి శాంభవి నువ్వు కూడా ఇంటర్వ్యూ లో పాటిస్పేట్ చేస్తున్నావా.. అని అడుగుతారు.
లేదు అమ్మ అంటుంది. ఎందుకు అని అడిగితే..
నేను డ్రాప్ అయ్యి ఆ ఛాన్స్ వేరొకలికి ఇద్దామని చెబుతుంది. అంతేనా లేక సెలెక్ట్ అవ్వని ఇలా చెబుతున్నావా అని రెచ్చగొడతారు.
దానికి శాంభవి కోపంతో వాళ్ళ అమ్మగారిని చూస్తూ నేను వెళితే సెలెక్ట్ అవ్వకుండా ఉంటానా అని అంటుంది.
ఏమో మాకు అలా అనిపించింది అంటారు. అంత లేదు, సెలెక్ట్ అయినా నేను ఎక్కడికి వెళ్ళను.
ఆ మాత్రం దానికి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని అని చెబుతుంది.
ఏమో మాకు అలా అనిపించడం లేదు. ఎక్కడ నువ్వు సెలెక్ట్ అవ్వకపోతే మీ నాన్నల పరువు పోతుందేమో అని బెంగ పెట్టుకున్నావా అని జయంతి గారు రెచ్చగొడతారు.
దానికి కోపంగా ఈరోజు నేను పాటిస్పేట్ చేసి సెలెక్ట్ అయి చూపిస్తాను అని కోపంగా వెళ్ళిపోతుంది.
శివ, భాను గారు ఎందుకు మీరిద్దరు బంగారాన్ని రెచ్చగొట్టారు.
ఆ ఇంటెన్షిప్ బంగారానికి అవసరమా అని అడుగుతారు. ఇంటర్నషిప్ అవసరం లేదు అండి.
కానీ, మన అమ్మాయి టాలెంట్ మనకే కాదు... బయట ప్రపంచానికి కూడా తెలియాలి కదా!
అప్పుడే కదా బామ్మ గారికి ఇంకా గౌరవం పెరుగుతుంది. శకుంతల గారి ముని మనవరాలు అని అంతా గొప్పగా చెప్పుకుంటారు అని మామ్మ గారిని మునగ చెట్టు ఎక్కిస్తారు.
హైదరాబాద్...
ఉదయం అందరూ బృందావనం చేరుకుంటారు. ధీరజ్ కూడా వస్తాడు విషయం ఏమిటా అని...
చారులత కౌసల్యని అడుగుతుంది.. విషయం నీకు తెలుసా అని
తెలియదు వదిన రాత్రి ఎంత ప్రయత్నించని మీ అన్నయ్య ఏమి చెప్పలేదు అంటారు.
సరే నాన్నగారు చెబుతారు కదా! విందాం ఇప్పుడు దాకా ఆగిన వాళ్ళం ఇంకా కొంచెం సేపు ఆగలేమా అనుకుని వెయిట్ చేస్తారు.
అందర్నీ రాఘవేంద్ర గారు రూమ్ కి రమ్మని చెబుతారు. అందరు రూమ్ లోకి వస్తారు.
ఒక్క అనసూయ గారు తప్ప. అనసూయ గారిని చూస్తూ అందరూ గదిలోనికి వెళతారు.
అనసూయ గారిని రాఘవేంద్ర గారు గదిలోనికి రానివ్వరు.
ఇప్పుడు రాఘవేంద్ర గారు ఏం చెబుతారు??
Posts: 506
Threads: 10
Likes Received: 4,132 in 456 posts
Likes Given: 1,137
Joined: Aug 2024
Reputation:
388
Part - 14
రాఘవేంద్ర గారి ముఖం చూస్తూనే అర్థమయిపోతుంది. చాలా సంతోషకరమైన విషయం అని..
రాఘవేంద్ర గారు దేవేంద్రను చూస్తూ నీ ఎదురుచూపులు ఫలించాయి రా అంటారు.
దేవేంద్ర అర్థం కాక ఏమంటున్నారు నాన్నగారు అంటే.. మేము నిన్న శ్రీశైలం గురువుగారి దగ్గరికి వెళ్ళాము.
ఈ పౌర్ణమి వెళ్లిన మర్నాడు మన వారసరాలు మన సంస్థలో అడుగుపెడుతుంది... గుర్తించండి అని చెప్పారు అని చాలా ఉద్వేగంతో చెబుతారు.
జతేంద్ర వాళ్ల నాన్నగారు చేయ పట్టుకుని ఎక్కువ ఆవేశపడకండి నాన్నగారు అంటే ....
లేదురా, నాకు ఏమీ అవ్వదు. నా మనవరాలను చూడాలి. తను అచ్చట ముచ్చట చూడాలి అని అంటారు.
అందరూ ఒక్క నిమిషం ఆనందంతో షాక్ లోకి వెళ్ళిపోతారు.
దేవేంద్ర కన్నీళ్ళతో మీరు చెప్పేది నిజమా నాన్నగారు అంటే.. గద్గత స్వరంతో నిజం దేవేంద్ర అంటారు.
దానికి మాట రానివాడై, వాళ్ళ నాన్నగారు పాదాల దగ్గర కూర్చుని.. కాళ్లు గట్టిగా పట్టుకుని ఒడిలో తలపెట్టుకుni కళ్ళు మూసుకుంటారు.
ఎవ్వరూ దేవేంద్ర ని డిస్టర్బ్ చేయరు. దేవేంద్రని అలా చూసి అందరికీ బాధతో మనసు భారం అవుతుంది.
ఏమంటున్నారు నాన్నగారు... మొదట మన సంస్థలోకి అడుగుపెట్టడం ఏమిటి అని చారులత అడిగితే... తెలీదు చారు.. గుర్తులు చెప్పమంటే ఇలాగే చెప్పారు అని.
మనవళ్ళ వంకా చూసి మీకు చాలా ముఖ్యమైన బాధ్యతని అప్పజెపుతున్నాను. వారసురాలను గుర్తించిన తర్వాత ఫుల్ సెక్యూరిటీ ఉండాలి.
మన ఇంటి పిల్ల అని తెలిస్తే చాలా ప్రమాదం. ఇప్పటివరకు తాను చాలా స్వచ్ఛమైన చోట పెరిగింది అంట అని చెబుతారు.
దానికి మనవళ్ళు మాట ఇస్తారు. తనని కంటికి రెప్పలా చూసుకుంటామని..
కౌసల్య, చారు వంక చూస్తూ... అమ్మాయికి కావలసిన బట్టలు, నగలు అన్ని సిద్ధం చేయండి అని ఆనందంగా చెబుతారు.
దానికి కౌసల్య సరే మావయ్య గారు.. అని ఇంకా పది రోజులే అంటే... పనులు చాలా ఉన్నాయి. చేతులు, కాళ్లు ఆడడం లేదు. వెంటనే అత్తయ్య గారికి చెప్పి సలహా తీసుకోవాలని ఆనందంతో అంటుంది.
భార్య తెలివికి జితేంద్ర తల పట్టుకుంటాడు.
రాఘవేంద్ర గారి సీరియస్గా ఈ విషయం మనల్ని దాటి బయటికి వెళ్ళకూడదు. నా మాట కాదని చెబితే వారికి అదే శిక్ష అని గంభీరంగా చెబుతారు.
చారు మాత్రం అది... నాన్నగారు నేను అత్తయ్య గారికి మాత్రం చెబుతాను అంటే... సరే అంటారు.
అందరూ రూమ్ బయటికి వస్తారు. అందరి ముఖాలు వెలిగిపోతున్నాయి.
అనసూయ వాళ్ళు ఏం చెబుతారా అని చూస్తూ ఉంటే..
కౌసల్య ముందుకు వచ్చి... క్షమించండి అత్తయ్య మీకు మేము ఏమీ చెప్పలేము. జరిగేది చూడడం మాత్రమే మీరు మీరు చేయవలసింది అని చెప్పి చారుని తీసుకుని కౌసల్య గదికి వెళ్ళిపోతుంది.
షాపింగ్ ఏం చేయాలో అని... చారు కూడా వాళ్ళ అమ్మ గారిని చూసి వదినతో లోపలికి వెళ్లి అత్తగారికి ఫోన్ చేసి విషయం చెబుతుంది.
దానికి తులసి గారి సంతోషపడి అయితే ఇన్ని రోజులకి బృందావనానికి మంచి రోజులు వచ్చాయి అని ఫోన్ పెట్టేస్తారు.
నలుగురు యువకులు ఒకే కారులో ఆఫీస్ కి బయలుదేరుతారు. అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఒక రుద్ర తప్ప.
చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఏమైంది రుద్ర అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు. నీ మరదలు ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నావా అని దీరజ్ అడిగితే,
రుద్ర సీరియస్గా చూస్తూ, ఈ రోజుల్లో కూడా ఇలా నమ్ముతారా అని అంటాడు.
దానికి విహాన్ ప్రతిదీ అలా కొట్టి పడేయవద్దు. ఇప్పటివరకు ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిందంట అంటాడు.
ఏమో ఎవరి నమ్మకాలు వాళ్ళవి. అందరి ముఖంలో ఆనందం చూసే గట్టిగా మాట్లాడలేకపోయాను.
కానీ మానవ ప్రయత్నం చేయాలి కదా అని రుద్రా అంటే.. ఏమిటి నువ్వు అనేది ముగ్గురు అడుగుతారు.
ఈరోజు నేను ఒక డిటెక్టివ్ ని రమ్మన్నాను ఎంక్వయిరీ కోసం అని చెబుతాడు.
దానికి సరే ఇటు ప్రయత్నం ఇటు చేద్దాం అని అనుకుంటారు.
విహాన్ ధీరజ్ ని అడుగుతాడు.ఈరోజు ఇంటర్షిప్ కోసం ఇంటర్వ్యూస్ కి పంపించారా అని... వెళ్లారు.10 కి స్టార్ట్ అవుతున్నాయని చెబుతాడు. వీరు మాట్లాడుకుంటేనే ఆఫీస్ కి రీచ్ అవుతారు.
రేపల్లె...
శాంభవి శకుంతల గారి దగ్గర ఆశీర్వాదం తీసుకుని కాలేజీకి వెళుతుంది. శాంభవి వెళ్లి మిత్రకే హాయ్ అని చెబుతుంది. మిత్ర కూడా హాయ్ చెప్పి...
ఏమైంది శాంభవి నీ ఫేస్ అలా ఉంది అని మిత్ర అడిగితే శాంభవి జరిగిందంతా చెబుతుంది.
నేను సెలెక్ట్ అయ్యి అప్పుడు చెబుతాను మా అమ్మలు ఇద్దరి పని... అని కోపంగా అంటుంది.
దానికి మిత్ర సరే పద క్లాస్ కి వెళదామని క్లాసులోనికి తీసుకు వెళుతుంది.
కాలేజ్ మొత్తం ఆరోజు ఆ హడావుడిలోనే ఉంటుంది. 10 కి సెలక్షన్స్ స్టార్ట్ అవుతాయి. ఒక్కొక్క గ్రూపు ఒక్కొక్క ప్లేస్ కి సెలెక్ట్ అవుతారు.
మిత్రా, శాంభవి, గౌతమ్ హైదరాబాదులో ఉన్న ఒక కంపెనీ కి సెలెక్ట్ అవుతారు.
సెలక్షన్స్ అయిన తర్వాత మిత్ర అంటుంది ఇంకా పది రోజుల్లోనే మనం స్టార్ట్ అవ్వాలి అని...
దానికి శాంభవి సమాధానం ఏమిటి??
Posts: 506
Threads: 10
Likes Received: 4,132 in 456 posts
Likes Given: 1,137
Joined: Aug 2024
Reputation:
388
Part - 15
G. B సొల్యూషన్స్...
రుద్ర బ్యాచ్ ఆఫీసుకు వెళ్లి వర్క్ స్టార్ట్ చేస్తారు. రుద్రా ని కలవాలి అని ఒక వ్యక్తి వచ్చి రిసెప్షన్లో అడుగుతాడు .
అపాయింట్మెంట్ ఉందా సార్ అని రిసిప్షన్స్ట్ అడిగితే అవును అని... మెసేజ్ చూపిస్తాడు. దానికి రిసిప్షన్స్ట్ ప్లీజ్ వెయిట్ సార్ వెయిట్ చేయండి. ఇన్ఫామ్ చేస్తానని చెప్పి ధీరజ్ కి కాల్ చేసి చెబుతుంది.
ధీరజ్ పంపించమని చెప్పి రుద్రాకి ఇన్ఫామ్ చేసి చెబుతాడు. రుద్ర సరే అని.. విహాన్ అద్వైత్ లను కూడా తన క్యాబ్లోనికి రమ్మని మెసేజ్ చేస్తాడు.
ఆ వ్యక్తి వచ్చేటప్పటికి మిగిలిన ముగ్గురు రుద్ర కేబిన్ లో ఉంటారు.. ఆ వ్యక్తి లోపలికి వచ్చి హాయ్ సర్. ఐయామ్ హరి అని పరిచయం చేసుకుంటాడు.
అందరూ హాయ్ చెప్పే సీట్ ఆఫర్ చేస్తారు. ప్యూన్ ని పిలిచి కాఫీ తెప్పించి ప్యూన్ పంపించేసి డోర్ లాక్ చేస్తారు.
హరి అడుగుతాడు చెప్పండి సార్ ఏంటి విషయం అని..
దానికి రుద్రాయ ఇది చాలా సెన్సిటివ్ మేటర్. అలాగే ఇది జరిగే 21 సంవత్సరాలు పూర్తయిపోయింది అని చెబుతాడు.
హరి జరిగిందంతా విని ఆలోచిస్తూ ఉంటాడు..ఏమైంది హరి అంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నాను.
హాస్పిటల్ దగ్గర స్టార్ట్ చేయాలి పుట్టిన బేబీ ఎవరో తెలియకుండా ఎక్కడ ఉందో తెలియకుండా మేనేజ్ చేశారు. అంటే మిగిలిన డీటెయిల్స్ కూడా లేకుండా చేసే ఉంటారు.
ఇదంతా చేయడానికి ఎవరో ఒకరు హెల్ప్ తీసుకుని ఉంటారు. అక్కడ పట్టుకుంటే ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది అంటాడు.
వెల్ హరి మనకి టైం చాలా తక్కువ ఉంది అంటే..
5 డేస్ లోపు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. హరి వెళ్ళాక అద్వైత్ అడుగుతాడు ఇంత రిస్క్ అవసరమా బావ అని...
వారసురాలు అని వస్తే డిఎన్ఎ టెస్ట్ చేపిస్తే సరిపోతుంది కదా! అంటే..
అది ఎలాగో చేపిస్తాము. బట్ అసలు ఏం జరిగింది అని మనకు తెలియాలి కదా! అప్పుడే మన శత్రువుల నుంచి... వచ్చే వారసరాలను కాపాడుకోవచ్చు అంటాడు.
అది నిజమేలే అనుకుంటారు. ధీరజ్ కి నోరు ఆగక బావ అని గారంగా పిలుస్తాడు. ఏంటి అని అనుమానంగా చూస్తాడు.
నువ్వు కూడా అమ్మాయి అని ఫిక్స్ అయిపోయావా అంటే... లేదు అంటాడు.
అదేంటి మరి వారసురాలు అని చెబుతున్నావు అంటే... పొద్దుట డిస్కషన్ లో ఆ పదం ఎక్కువ వాడడం వలన నాకు అలానే వచ్చేసింది అంటాడు.
దానికి ధీరజ్ జస్ట్ ఫర్ ఇమేజ్ చేసుకుందామంటే... ఏమని ని ముగ్గురు చూస్తారు..
అబ్బా ఏం లేదు బావ. అబ్బాయి అనుకో మనకి ఇంకొకటి తోడు. పంచ పాండవులు లాగా ప్యాంటు షర్ట్లు వేసుకుని తిరుగుతాం అని ఇమేజ్ చేసుకోండి అంటాడు.
అందరూ ఇమేజ్ చేసుకోగానే ఆ ఇమేజ్ బోరింగ్ గా? ఉంది అనిపిస్తుంది.మళ్లీ ధీరజ్ అబ్బాయి ఇమేజ్ చాలా బోర్ గా ఉంది.
అదే అమ్మాయి అనుకో... మన రుద్రాకి మరదలు వస్తుంది. మనకి చెల్లి వస్తుంది.
మీ ఇంట్లో, మా ఇంట్లో అందరూ అబ్బాయిలు అయిపోయి పండగ కళ ఉండటం లేదు. అమ్మాయితో ఇమేజ్ చేసుకోండి అనగానే...అందరూ ఒకసారి ఇమేజనరీ వరల్డ్ లోకి వెళ్ళిపోతారు.
విహాన్, అద్వైత్, ధీరజ్ అన్నయ్య అని పిలుస్తూ ఒక అమ్మాయి వస్తున్నట్టు ఊహించుకుంటారు.అబ్బా ఈ ఊహ నిజమైతే ఎంత బాగుందో?? అనుకుంటారు.
రుద్ర కూడా కళ్ళు మూసుకుని ఊహించుకుంటాడు. బావ అని ఒక అమ్మాయి గారంగా పిలుస్తూ, సిగ్గుపడుతూ ఉంటుంది. ఏంటి అని చూస్తాడు. అమ్మాయి తలదించుకొని ఉంటుంది.
తల ఎత్తు అంటే నాకు సిగ్గు బావ అని చేతులతో మొఖం దాచుకుంటుంది. చేతులు తీయడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ అమ్మాయి రుద్ర నుంచి తప్పించుకుని పరిగెడుతూ నన్ను పట్టుకో బావ అని అరుస్తుంది. ఆగు అని అరుస్తూ.. చైర్ లో నుంచి ఒక్కసారిగా లెగుస్తాడు.
అప్పటికే మిగిలిన ముగ్గురు వాళ్ళు ఊహా లోకము నుంచి బయటకు వచ్చి రుద్రాన్నే చూస్తూ ఉంటారు.
రుద్ర ఊహల్లో మునిగిపోయి బ్లష్ అవ్వడం, నవ్వుకోవడం చూసి బావ మరి డీప్ గా వెళ్ళిపోయాడు అని ధీరజ్ అంటాడు.
నువ్వు ముయ్, వాడిని చూడు అస్సలు దొరకడు. బాబు ఈరోజు తెలియకుండానే దొరికాడు అని... సైలెంట్ గా వీడియో తీస్తారు.
రుద్ర కంగారుగా అరవగానే ఏమైంది బావ అని ధీరజ్ అడుగుతాడు. నథింగ్ అంటే...
మేము జస్ట్ ఇమేజ్ చేసుకో అంటే నువ్వు ఏకంగా మరదలుతో డ్యూయెట్ వేసుకున్నావా అంటూ తీసిన వీడియోని రుద్రాకి సెండ్ చేస్తాడు.
.అబ్బా వీళ్ళకి ఇలా దొరికానా అనుకుంటూ... చూపుడు వీళ్ళతో నుదురు రుద్దుకుంటూ ఉంటాడు.
.రుద్ర ని అలా చూసిన విహాన్.. ఆపు, ధీరజ్ నీ అల్లరి.
మనం అనుకున్నట్టు అమ్మాయి అయితే తన ఎలాంటి వాతావరణంలో పెరిగిందో తెలియదు. రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉన్న ఫ్యామిలీ అయితే పెళ్లి చేసేసిన ఆశ్చర్య పడక్కర్లేదు.
లేకపోతే ఈ కాలంలో లవ్ మ్యాటర్ కామన్..లవర్ ఉన్నాడేమో కూడా తెలియదు అనగానే...
రుద్రాకి జలస్ ఫీలింగ్ వస్తుంది. అలా ఎలా లవర్ ఉంటాడు అని రుద్ర అంటే.. ఎందుకనో అని కోరస్ గా ముగ్గురు అంటారు.
వచ్చేది మీ చెల్లి రా! మీ చెల్లి గురించి అలా మాట్లాడుకోకూడదంటూ సిస్టంలో తలదూర్చి నాకు వర్క్ ఉంది అంటాడు.
దానికి ధీరజ్ మనల్ని మర్యాదగా దొబ్బేయ్ అంటున్నాడు అని ముగ్గురు వెళ్ళిపోతారు.
వాళ్ళు వెళ్లాక రుద్ర మళ్లీ ఆలోచనలకు వెళ్ళిపోతాడు. ఎవరు నువ్వు మరదలు పిల్ల?? ఎక్కడ ఉన్నావు??
నువ్వు ఇక్కడే ఉండి ఉంటే మన జర్నీ ఇప్పటికే చాలా బ్యూటిఫుల్ గా ఉండేది అనుకుంటాడు. మళ్లీ వెంటనే చీ నేను ఇలా ఆలోచిస్తున్నాను... ఈ ధీరజ్ గాడు మరీ చెడగొట్టేస్తున్నాడు అనుకుని వర్క్ లో బిజీ అవుతాడు.
మరదలు పిల్ల ఎక్కడున్నావమ్మా... తొందరగా రా..
రుద్ర ❤️ మరదలు...
కథ కొనసాగుతుంది...
Posts: 4,610
Threads: 9
Likes Received: 2,939 in 2,265 posts
Likes Given: 10,772
Joined: Sep 2019
Reputation:
31
Posts: 1,221
Threads: 2
Likes Received: 678 in 489 posts
Likes Given: 1,400
Joined: May 2019
Reputation:
7
Mundu undi bava maradalla saradalu.. sarasalu!!
Interesting!!
Posts: 58
Threads: 0
Likes Received: 38 in 30 posts
Likes Given: 17
Joined: Nov 2023
Reputation:
0
Bro story epude intersting ga undhi
Super bro tomorrow update kosam eduru chustu
Mi abimani
Posts: 58
Threads: 0
Likes Received: 38 in 30 posts
Likes Given: 17
Joined: Nov 2023
Reputation:
0
Bro story epude intersting ga undhi
Super bro tomorrow update kosam eduru chustu untam
•
Posts: 506
Threads: 10
Likes Received: 4,132 in 456 posts
Likes Given: 1,137
Joined: Aug 2024
Reputation:
388
Part - 16
కౌసల్య, చారులత షాపింగ్ కి వెళతారు. ముందు డిజైనర్ దగ్గరికి వెళ్లి మాట్లాడతారు. ఆ డిజైనర్ అడుగుతారు ఆ అమ్మాయి హైటు, కలర్ అండ్ సైజెస్ అని..
దానికి కౌసల్య అవి ఏమీ మాకు తెలియదు. ఇప్పుడు ఎలా వదిన అంటే... అది నిజమే అని డ్రెస్సెస్ దగ్గర నుంచి లేహంగాస్ వరకు అన్ని రకాల మోడల్స్ సెలెక్ట్ చేసి ఉంచి టెన్ డేస్ లో అన్ని చెబుతాము.
చెప్పగానే స్టిచ్ చేసి వెంటనే పంపించండి అని చెబుతారు. డిజైనర్ సారీస్ నుండి పట్టు చీరల వరకు కూడా అన్ని సెలెక్ట్ చేస్తారు.
అప్పుడే అక్కడికి వచ్చిన ఆశ, నిషా వీళ్ళిద్దరిని చూసి ఏంటి వీళ్ళు ఇన్ని ఆర్డర్ ఇస్తున్నారు. అవన్నీ మన ఏజ్ వాళ్ళవి కదా అనుకుంటారు.
వెళ్లి అడిగితే తెలుస్తుంది కదా అనుకుని హాయి ఆంటీ అని పళ్ళు ఇకిలించుకుంటూ వెళ్లి విష్ చేస్తారు.
ఆశ, నిషాలను చూసి ముఖమంతా చిట్లిస్తారు. ఆశ నిషా కి అది అర్థమైన సరే పట్టించుకోకుండా... ఏంటి ఆంటీ ఇన్ని ఆర్డర్ చేస్తున్నారు.
పైగా మా ఏజ్ అమ్మాయికి అని అడుగుతారు. దానికి చారులత ఏమీ లేదు అమ్మాయిలు నా కోడలు కోసం అని చెబుతారు.
దానికి ఇద్దరు షాక్ అవుతూ ఏంటి రుద్రాకి పెళ్లి కుదిరిందా? ఎవరితో అని కంగారుగా అడుగుతారు.
ఓరిని వీళ్ళకి ఇలా అర్థమైందా అనుకుని అవునమ్మా అని... ఒక షాక్ ఇచ్చి, మాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి అని చెప్పి వెళ్ళిపోతారు.
ఆశ వెంటనే మయూరికి ఫోన్ చేసి చెబుతుంది. దానికి మయూరి అలాఎలా జరుగుతుంది??
మీ ఇద్దరికీ ఏం చెప్పాను... ఎలా అయినా ఇంటి వారసుల ట్రాప్ చేయమన్నాను కదా!కానీ ఇప్పటికీ మీ వల్ల ఏమీ కాలేదు అని అరిచి ఫోన్ పెట్టేస్తుంది.
మయూరి కోపం చూసి నాగేంద్ర అడుగుతాడు ఏమైంది అని...
దానికి ఆశ, నిషా చెప్పిన విషయం చెబుతుంది. అది విన్న నాగేంద్ర కూడా బుసలు కొడితే.... లక్ష్మీ మాత్రం సంతోషపడుతుంది.
లక్ష్మీ జ్యోతితో రుద్ర కి పెళ్లి కుదిరిందట. మన అమ్మాయిల్లో ఒక అమ్మాయి లైఫ్ సేఫ్ అంటే... ఏంటి అత్తయ్య ఇది.
పగతో మన పిల్లల భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు. వావివరుసలు వదిలేసి ఎవరినైనా ట్యాప్ చేయమని చెబుతున్నారని బాధపడుతుంది.
ఏమి చేస్తాం జ్యోతి.. వినాశాలే విపరీత బుద్ధులు అని మన వాళ్ళని చూసే చెప్పొచ్చు అని అంటారు.
కౌసల్య, చారులతా జ్యువెలరీ సెలెక్ట్ చేసి ఆర్డర్ చేసేసి అన్ని పనులు పూర్తిచేసుకుని ఎవరి ఇంటికి వాళ్ళు చేరుకుంటారు.
హరి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఫుల్ బిజీగా ఉంటాడు.
రేపల్లె...
శాంభవి హుషారుగా కాలేజ్ నుంచి వచ్చి జయమ్మ అని గట్టిగా అరుస్తుంది. ఏమైంది అని జయంతి, సులోచన, ధరిణి వస్తారు.
అందర్నీ చూసి పొగరుగా ఏమన్నారు మీరందరూ... నేను సెలెక్ట్ అవ్వలేను అన్నారు కదా! నేను సెలెక్ట్ అయ్యాను అని చెబుతుంది.
దానికి ధరణి అందులో అంత వింత ఏముంది?? మన కాలేజ్ నుంచి యావరేజ్ స్టూడెంట్స్ కూడా సెలెక్ట్ అయ్యారు. అనగానే...
అంటే ఏంటి అమ్మ అంటే.. ఇందులో ఏముంది యావరేజ్ స్టూడెంట్ కూడా సెలెక్ట్ అయ్యారు అలాంటిదే నువ్వు సెలెక్ట్ అవ్వవా అని మీ అమ్మ ఉద్దేశమని సులోచన గారు అందిస్తారు.
అంటే నాకు యావరేజ్ స్టూడెంట్కి తేడా లేదా అని అడుగుతుంది. తేడా ఎందుకు లేదు...
నువ్వు సెలెక్ట్ అయిన ప్లేస్ కి వెళ్లి ఇంటర్నెట్ షిప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినప్పుడు కదా ఆ డిఫరెన్స్ కనిపించేది అని ధరణి అంటుంది.
అంటే అని శాంభవి అడిగితే... నీ ఇష్టంతో వెళ్లి సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకు రావాలి. అప్పుడు నువ్వు చాలా గ్రేట్ అని ఒప్పుకుంటామని రెచ్చగొడతారు.
దానికి శాంభవి ఆలోచనలో పడుతుంది. వెంటనే ధరణి చూశారా అత్తయ్య.. నేను చెప్పాను కదా! దీని టాలెంట్ అంత ఇక్కడే అని.
అది మన ఇంట్లో మగవాళ్ళని చూసి అంతే అని చిన్నగా అగ్గి రాజేస్తుంది. దానికి శాంభవి అలా ఏమీ లేదు. నేను హైదరాబాద్ వెళ్తాను అని చెబుతోంది.
ఓ.... అవునా... చూద్దాం, నువ్వు వెళ్ళాక వెళ్లావు అనుకోవాలి.. అది కూడా నీ ఇష్టంతోనే అని జయంతి గారు అంటారు.
ఈ విషయం జరిగేటప్పుడు వీళ్ళ నలుగురు మాత్రమే ఉంటారు.
రాత్రి భోజనాలు చేసేటప్పుడు తను నిర్ణయం చెబుతుంది. దానికి శివ గారు,భాను గారు కంగారుపడుతూ.. ఎందుకు అంత దూరం వెళ్లడం అని.. కానీ శాంభవి ఒప్పిస్తుంది.
దానికి రామచంద్రయ్య గారు హైదరాబాదులో ఎక్కడ ఉంటావు అంటే... దానికి ధరణి అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంటుంది.
శాంభవి, మిత్ర, గౌతమ్ అక్కడే ఉంటారు. నేను అన్నయ్యకి చెబుతాను అంటుంది. ఇంట్లో మగవాళ్ళకి ఇష్టం లేకపోయినా శాంభవి కోసం ఒప్పుకుంటారు.
రోజుల వేగంగా గడుస్తున్నాయి. హరి తన కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ని రుద్రకి చెప్పడానికి వారిని కలుస్తాడు. ఇన్ఫర్మేషన్ ఏమిటి అని అడిగితే... దానికి హరి నలుగురిని చూస్తూ చాలా కథ జరిగింది అని.. తెలుసుకున్నది అంతా చెబుతాడు.
అది విన్న నలుగురికి బాధతో హృదయం బరువెక్కుతుంది. అసలు ఈ విషయం దేవేంద్ర కి ఎలా చెప్పాలి అని అనుకుంటారు.
శత్రువుల మీద కోపం ఇంకా పెరిగిపోతుంది.
హరి చెప్పిన విషయం ఏమిటి??
Posts: 506
Threads: 10
Likes Received: 4,132 in 456 posts
Likes Given: 1,137
Joined: Aug 2024
Reputation:
388
Part - 17
హరి హాస్పిటల్ కి వెళ్లి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. రెసిప్షన్స్ట్ దగ్గరికి వెళ్లి 21 సంవత్సరాలు క్రితం డెలివరీ అయిన కేసెస్ గురించి అడుగుతాడు.
దానికి ఆ వివరాలు మీకెందుకు అని అడిగితే... ఆ టైంలో మా అత్తయ్యకి ఇక్కడ డెలివరీ అయింది అని తెలిసింది.
కొన్ని కారణాల వల్ల మేము, మా అత్తయ్య వాళ్ళు విడిపోయాము. మా నానమ్మ బెంగతో మంచం మీద ఉంది. అత్తయ్యని చూడాలని కలవరిస్తుంది.
మాకు అడ్రస్ తెలీదు. మా అత్తయ్య డెలివరీ అప్పుడు చూసిన వాళ్ళు చెప్పారంట..
కానీ, అప్పుడు పట్టించుకోలేదు.ఇప్పుడు ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరక వచ్చు అని వచ్చామని చాలా బాధగా చెబుతాడు.
దానికి రిసెప్షన్ ఫీల్ అవుతూ నేను కొత్తగా వచ్చాను. మీరు ఈ హాస్పిటల్ హెడ్ పర్మిషన్ తీసుకుంటే నేను ఇన్ఫర్మేషన్ తీసేస్తాను.
అలాగే ఇక్కడ ఒక సీనియర్ నర్స్ ఉన్నారు.ఆవిడని కలిసిన మీకు ఇన్ఫర్మేషన్ దొరకవచ్చు అని చెప్పి, నర్స్ డీటెయిల్స్ ఇస్తుంది.
హరి వెళ్లి ఆ సీనియర్ నర్స్ ని కలిసి అదే కథ చెబుతాడు. 21 సంవత్సరాల క్రితం విషయం అంటే.. నేను ఎలా చెప్పగలను??
ఏదైనా డేట్ ఉంటే అది గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అనగానే.. దేవీ నవరాత్రులు టైం అని చెబుతాడు.
. దేవీ నవరాత్రుల అని ఒకసారి ఆలోచించి... అప్పటి విషయం గుర్తుకు రాగానే చెమటలు పడతాయి. చెమటలు తుడుచుకుంటూ నాకేం గుర్తులేదు అని చెప్పి వెళ్ళిపోతుంది.
హరి అ నర్స్ టెన్షన్ చూసి అప్పటికి సైలెంట్ అయిపోయి, ఈవినింగ్ ఫాలో అవుతూ వెళతాడు. కాలింగ్ బెల్ సౌండ్ కి తలుపు తీసినా నర్స్ కి ఎదురుగుండా హరి కనిపిస్తాడు.
హరిని చూసి ఎందుకు మీరు నన్ను ఫాలో అవుతున్నారు. నాకేమీ తెలియదు అన్నాను కదా అనగానే...
నేను అసలు మిమ్మల్ని ఏం తెలుసు అని అడగలేదు కదా అంటాడు. దానికి నర్స్ సైలెంట్ అయిపోతుంది.
ప్లీజ్ అండి నిజం చెప్పండి. అక్కడ ఒక ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది అ బిడ్డ కోసం అని బ్రతిమాలుతాడు.
హరికళ్ళల్లో నిజాయితీ చేసే తనకు తెలిసిన నిజం చెబుతుంది.
నర్స్ మాటల్లో....
ఆ రోజు నాకు నైట్ డ్యూటీ ఉంది. ఒక అమ్మాయి పురిటి నొప్పులతో ఒంటిని గాయాలుతో ఉన్న ఒక్క అమ్మాయిని తీసుకువచ్చింది.
నాకు అర్థం అయ్యింది.. అమ్మాయి ఇంకా ఎక్కువ సేపు బ్రతకదు అని. డెలివరీ కూడా అయ్యేటట్టు ఉంది అని.
వెంటనే లేబర్ రూమ్ లోకి తీసుకు వెళ్ళాము. ఆవిడకి డెలివరీ అయ్యి ఆడపిల్ల పుట్టింది.
మహాలక్ష్మి కళతో ఉంది. తనని తీసుకువచ్చిన అమ్మాయిని లోపలికి తీసుకు రమ్మని మమ్మల్ని రిక్వెస్ట్ చేసింది.
ఆవిడ లోపలికి రాగానే, పాపని తన చేతిలో పెట్టి దయచేసి తీసుకువెళ్లిపొండి. పుట్టిన బిడ్డని చూస్తే చంపేస్తారు అని బ్రతిమాలుతుంది.
మాకు ఏమి చేయాలో తెలియలేదు. ఇంతలో మాకు బయట చాలా గొడవగా వినిపిస్తూ ఉంటే... నేను వెళ్లి చూశాను ఎవరా అని.
నలుగురు వ్యక్తులు కత్తులు పట్టుకుని వచ్చారు. ఇలాంటివి ఏమైనా జరిగితే ఆస్పత్రికి చెడ్డ పేరు వస్తుందని పాపని అమ్మాయి చేతిలో పెట్టి వెనక నుండి నేను, డాక్టర్ గారు పంపించేశాము.
ఆ రౌడీ లోపలకు వచ్చి అడిగితే, మృత శిశువు పుట్టింది అని, తల్లి బతకడం కూడా కష్టమే అని చెప్పాము. రెండు రోజులకి ఆవిడకి సంబంధించిన వాళ్ళు వచ్చారు. వాళ్ళని చూసి తుది శ్వాస విడిచింది అని చెబుతుంది.
దానికి హరి ఆ బిడ్డను తీసుకువెళ్ళినా అవిడ డీటెయిల్స్ చెప్పగలరా అంటే...
దానికి అ నర్స్ గుర్తు చేసుకుంటూ ఆ అమ్మాయి పేరు సుధా, తన భర్త పేరు విష్ణు అని, మియాపూర్ లో ఉంటాము. చిన్న సూపర్ మార్కెట్ నడుపుతున్నాము అని చెప్పింది అంటారు.
దానికి హరి థాంక్స్ చెప్పి సుధ ని వెతుక్కుంటూ వెళ్తాడు. సూపర్ మార్కెట్స్ అన్ని సర్చ్ చేసి సుధ అడ్రస్ పట్టుకొని వెళతాడు.
సుధా ఎదురుగుండా హరి కుర్చీని నర్స్ చెప్పిన విషయాలు అన్నీ చెప్పి, ప్లీజ్ అండి..
మీకు తెలిసినవి చెప్పండి అని రిక్వెస్ట్ చేస్తాడు.దానికి సుధా గుడి లో కలిసినది చెప్పి.. నొప్పులు పడుతున్నా ఆమెని దగ్గరలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేశాను.
ఆవిడ చెప్పారు పుట్టిన బేబీ ఎవరైనా సరే, పుట్టిన వెంటనే అనాధ శరణం లో విడిచిపెట్టమని తన కుటుంబంలో ఎప్పుడు చేరాలని రాసిపెట్టి ఉంటే అప్పుడే చేరుతుంది అని. దయచేసి తీసుకు వెళ్ళమని బ్రతిమాలారు.
ఆవిడ బాధ చూడలేక మాట ఇచ్చాను. కరెక్టుగా డెలివరీ అయిన తర్వాత, రౌడీలు వచ్చి అంతా వెతుకుతున్నారు.
నేను పాపను తీసుకుని వేరే డోర్ నుండి బయటకు వచ్చాను అని చెప్పి ఆపుతారు. తర్వాత ఏమైంది అని అడిగితే పాపని తీసుకుని బయటికి వచ్చాక నాకు ఏమి చెయ్యాలో తెలియలేదు.
పక్క రూము నుండి మాటలు వినిపిస్తున్నాయి. అది కూడా అప్పుడే డెలివరీ అయింది.
ఆ పేషెంట్ కి ఉన్న కాంప్లికేషన్స్ వల్ల పుట్టిన బేబీ చనిపోయింది. బేబీ లేదు అంటే ఆ పేషెంట్ పరిస్థితి ఇంకా దారుణం అవుతుంది.
ఆ మాటలు విన్న నేను వెంటనే లోపలికి వెళ్లి,, నా చేతిలో ఉన్న బేబీ నీ పేషెంట్ మదర్ చేతిలో పెట్టి పాపను కాపాడండి. పాప కోసం ఎవరూ రారు.
మీ అమ్మాయి కూడా బతుకుతుంది అని, పాపని ఆవిడ చేతిలో పెట్టి వచ్చేసాను. తర్వాత నాకు ఏమీ తెలియదు అని చెబుతారు.
హరి సుధా గారికి థాంక్స్ చెప్పి మళ్ళీ హాస్పిటల్ కి వెళ్లి ఎలాగోలా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుని తను ఐడెంటిఫై చేసిన పేషెంట్ డీటెయిల్స్ అన్ని రుద్ర వాళ్ళు చేతికి ఇస్తాడు.
ఆ పేషెంట్ ప్రెసెంట్ అడ్రస్ డీటెయిల్ తో సహా అందులో ఉంటాయి. కానీ ఫొటోస్ మాత్రం ఉండవు. ఫొటోస్ కలెక్షన్ కి ఇంకా కొంచెం టైం పడుతుంది. ఈ లోపు మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చాను అని చెబుతాడు హరి.
అవి చూసిన రుద్ర వాళ్లకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. హరికి థాంక్స్ చెప్పి, అమౌంట్ సెటిల్ చేసి మళ్లీ అవసరమైతే పిలుస్తామని చెప్పి పంపిస్తారు.
నలుగురు ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు ఏం చేయాలో అని.. ఆ బేబీ గర్ల్ ని ఎలా తీసుకురావాలా అని...
అద్వైత్ అ డీటెయిల్స్ చూస్తూ.. ధీరజ్ ను చూసి మన కంపెనీ వాళ్ళు కాలేజెస్ కి వెళ్లి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశారు కదా! అనగానే..
అయితే అని ముగ్గురు చూస్తారు.
అందులో ఈ ఊరి పేరు ఉందేమో చూడు అంటాడు..ఆ ఊరి పేరు ఉంటే ఏమవుతుంది అని ధీరజ్ అడుగుతాడు.
ఆ ఊరికి నియర్ బై కాలేజెస్ లో చదువుతూ ఉండొచ్చు కదా! తను కూడా సెలెక్ట్ అవ్వచ్చు కదా అని అంటాడు.
దానికి ధీరజ్ మన వాళ్ళు వెళ్ళింది టెక్నాలజీకి సంబంధించిన క్యాంపస్లకు మాత్రమే. ఆ అమ్మాయి ఇంకా వేరే గ్రూపు సంబంధించింది చదివితే... అప్పుడే ఎలా అంటే.
ధీరజ్ అన్నది కూడా నిజమే అనిపిస్తూ ఉంటుంది.
గురువుగారు చెప్పిన ప్రకారం పౌర్ణమి వెళ్ళని నెక్స్ట్ డే అని మనకి చెప్పారు. కరెక్ట్ గా అప్పుడే ఇంటర్నషిప్ బ్యాచ్ వస్తున్నారు.
సో మనం ఎవరిని వదలకుండా డిఎన్ఎ టెస్ట్ చేపిస్తే సరిపోతుంది అని విహాన్ అనగా... ఇంకా ఎన్ని డేస్ ఉన్నాయని రుద్ర అడుగుతాడు.
దానికి ధీరజ్ ఏంటి బావ మరదలు కోసం ఆరాటపడుతున్నావా అని కొంటిగా అడుగుతాడు.
Posts: 506
Threads: 10
Likes Received: 4,132 in 456 posts
Likes Given: 1,137
Joined: Aug 2024
Reputation:
388
Part - 18
ధీరజ్ అల అడగగానే రుద్ర చురుగ్గా చూస్తూ, అవును.. నాకు మరదలు అని ఆరాటం ఉంది.
మీకు చెల్లెలు కదా! అందుకే మీకు ఆరాటం లేదు అని రివర్స్ కౌంటర్ వేస్తాడు. అబ్బా బావకి బుక్కయ్యాను అనుకుని ఏదో సరదాకి అన్నానులే బావ అని పళ్ళు ఇకలిస్తాడు.
అవన్నీ ఎందుకు, ఈ ప్రూఫ్ వాళ్ళ ఇంటికి వెళ్లి చూపించి.. మన అమ్మాయిని మనం తెచ్చుకుందాం అని విహాన్ అంటాడు.
దానికి రుద్ర వద్దు విహాన్ అలా చేస్తే ఇంకా ప్రమాదం. మీ చెల్లి పెరిగిన వాతావరణం మనకు తెలియదు.
హరి చెప్పిన ప్రకారం ఆ మదర్ ప్రాణాలు అన్ని ఆ బేబీ పైనే ఉన్నాయి. అలాగే ఆ కుటుంబంతో రిలేషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండి ఉంటుంది.
ఇప్పుడు మనం వెళ్లి ఇది మేటర్ అని చెప్పి, ప్రూఫ్ చూపిస్తే, వాళ్ళు రియాక్షన్ ఎలా ఉంటుంది. ఎవరైనా తట్టుకోలేని వాళ్లు ఉంటే చాలా రిస్క్.
పైగా మీ చెల్లి మెంటాలిటీ కూడా మనకు తెలియదు కదా! అనగానే అవును అది నిజమే అని మిగిలిన ముగ్గురూ అనుకుంటారు.
ఇది చాలా సెన్సిటివ్ మేటర్. చాలా సున్నితంగా డీల్ చేయాలి. ఆ ఫ్యామిలీలో ఎవరూ బాధపడకుండా చేసి మన ఇంటికి తెచ్చుకోవాలి అని రుద్రా అనగానే... ఇది చాలా పెద్ద టాస్క్ బావ అని ధీరజ్ అంటాడు.
తప్పదు మరి ఇంకా త్రీ డేస్ మాత్రమే ఉంది అని అద్వైత్ అంటాడు. వర్క్ ఫినిష్ చేసుకుని అందరూ బృందావనం చేరుకుంటారు.
బృందావనం కొత్త రంగులతో కొత్త పెళ్ళికూతురు లాగా ముస్తాబయింది. రాబోయే యువరాణి కోసం గది అంతా ముస్తాబయింది.
యువరాణికి అవసరమైన ప్రతి చిన్న అవసరాన్ని దేవేంద్ర గారు దగ్గరుండి సెలెక్ట్ చేసి తెచ్చారు.
ఆర్డర్ ఇచ్చిన జ్యువలరీ అంతా వచ్చేసింది. అయినా దేవేంద్రకి తృప్తి చెందక స్వయంగా వెళ్లి సెలెక్ట్ చేసి మరికొన్ని తెచ్చారు.
ముత్యాలు, పగడాలు సెట్స్ స్పెషల్ గా చేపించారు. అనసూయ గారికి మాత్రమే ఏమీ అర్థం కావడం లేదు ప్యాలెస్ మొత్తం చాలా కళగా కనపడుతుంది. అందరి మొహంలో సంతోషం ఉట్టిపడుతుంది.
కానీ తనకు ఏమీ తెలియడం లేదు. కుటుంబ సంతోషంలో తను లేదు అనే బాధ చాలా ఎక్కువగా ఉంది ఎలా విషయం తెలుసుకోవాలి అని ఆలోచిస్తుంది.
కారు ఆగిన సౌండ్ వినిపించి గుమ్మం వైపు చూస్తారు. మనవళ్లు వస్తూ కనిపిస్తారు.
ధీరజ్ ని అడిగితే ఏమైనా తెలియొచ్చు అనుకుని, ధీరజ్ అని పిలుస్తారు. చెప్పండి గ్రానీ అని వెళితే, ఈ వైభోగానికి కారణం ఏమిటి?? నువ్వైనా చెప్పు అని అడుగుతారు.
దానికి ధీరజ్ క్షమించండి గ్రానీ, నేను ఈ ఇంటి వాడిని కాకపోయినా తాతగారి మాటను నేను పాటిస్తానని చెప్పి వెనక్కి తిరుగుతాడు.
ఏదో బుస కొడుతున్నట్టు అనిపిస్తుందని పక్కకి చూడగానే... రుద్ర, విహాన్, అద్వైత్ కోపంతో బుసకొడుతూ ఉంటారు..
ఇప్పుడు ఏం జరిగిందని వీళ్ళు ఇలా ఉన్నారు అని.. ఏమైందిరా అని వెళతాడు. అంతే అక్కడ సోఫాలో పడేసి ముగ్గురు మూడు పక్కల నుంచి కుమ్ముతారు.
ఒరేయ్ చెప్పి కుమ్మండి రా అని ధీరజ్ అరుస్తూ ఉంటే.. ఏరా ఏం కూసావురా నువ్వు.. ఈ ఇంటి వాడు కాదని అంటావా అని.. మళ్ళీ కుమ్ముతారు.
అబ్బా ఏదో ఫ్లోలో అలా అనేసాను. మళ్ళీ అనను వదిలేయండి ప్లీజ్ అని బ్రతిమాలుతాడు. ఇప్పటికి వదిలేస్తున్నాము. నెక్స్ట్ టైం రిపీట్ అయితే ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడదీస్తామని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వదులుతారు.
రుద్ర అనసూయ గారి ముందుకు వచ్చి గ్రాని మీ బాధ అర్థం అవుతుంది. కానీ మేము ఎవ్వరం ఏమీ చేయలేము.
నువ్వు నిజంగానే పశ్చాత్తా పడుతున్నావు అని తాతగారికి అనిపిస్తే.. ఖచ్చితంగా క్షమిస్తారు. లేదు నటన అయితే దానికి తగ్గ ఫలితం ఉంటుందని చెప్పి వెళ్ళిపోతాడు. అనసూయ గారు బాధగా లోపలికి వెళ్ళిపోతారు.
రేపల్లె...
ఇంకా మూడు రోజుల్లో శాంభవి హైదరాబాద్ ప్రయాణానికి లగేజ్ ప్యాక్ చేస్తున్నారు. భాను గారు, కూతురు ఏ రోజు ఏ డ్రస్సు వేసుకోవాలి ఏమి ఆర్నమెంట్స్ పెట్టుకోవాలి అని నీట్ గా నెల రోజులకు సరిపడా విధంగా ప్యాక్ చేస్తున్నారు.
ఆ లగేజ్ చూసి ధరణి, జయంతి నోరు వదిలేసి చూస్తున్నారు. భాను గారు ధరణిని చూసి దరు ఇంకా ఏమైనా మర్చిపోయానా అని అడిగితే... అవునండి మర్చిపోయారు అంటుంది.
ఇంకా ఏం మర్చిపోయాను అని అడిగితే....ఈ ఇంటిని, ఇంట్లోని మనుషుల్ని మర్చిపోయారు అని చెబుతుంది.
దానికి భాను గారు అంత వెటకారం వద్దులే.. ఇప్పటివరకు శాంభవి ఎక్కడికి వెళ్ళలేదు. ఏదైనా అవసరం అయితే ఇబ్బంది పడుతుందని ఒక నెలకి ప్యాక్ చేస్తున్నాను అని చెప్తారు.
ఏంటి ఇవన్నీ ఒక నెల కా అని... మరి వచ్చే నెలకి అని అడుగుతారు. అప్పుడు మళ్ళీ పట్టుకెళ్ళొచ్చు అంటారు. దానికి జయంతి వీళ్ళని మార్చలేము అని అంటుంది.
శకుంతల గారు అందర్నీ పిలుస్తారు. రామచంద్రయ్య గారు వచ్చి చెప్పమ్మా అనగానే...
రాము ఎల్లుండి పౌర్ణమి, హోమానికి ఏర్పాట్లు చూడు. అలాగే బంగారం మొదటిసారి ఊరు దాటి వెళుతుంది. సిద్ధాంతి గారిని అడిగి ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు రాకుండా ఉండడానికి ఏమైనా పూజలు చేయాలేమో కనుక్కో అని కూడా పురయించుతారు.
కోడలు ఇద్దరు అత్తగారి పక్కకు చేరి అత్తయ్య గారు అని పిలుస్తారు. ఏంటి మీ నస అంటే... శాంభవి పక్కనున్న హైదరాబాద్ వెళుతుంటే వీళ్లు ఇంత హడావిడి చేస్తున్నారు.
రేపు దానికి పెళ్లి కుదిరితే మన పరిస్థితి ఏమిటి అంటే, దానికి సులోచన గారు చేతులు పైకెత్తి చూస్తారు.
రాము గారు సిద్ధాంతిని కలిసి విషయం చెపుతారు. సిద్ధాంతి గారు అమ్మవారిని ధ్యానించి, శాంభవి జాతకం చూస్తారు.
రాము గారి వంక చూసి కంగారు పడకండి. శాంభవిది ఆ కన్నయ్య లాగానే అని.. ఒక నిమిషం ఆగి వెళ్ళిన చోట శాంభవికి రాజభోగం ఉంది.
అలాగే తన ముందు ఒక శక్తి ఉంది. ప్రపంచాన్ని శాసించే వాడు తన ముందు ఉంటాడు. ఎలాంటి దుఃఖం, కష్టం రానివ్వడు.
ఇక్కడ ఎలా ఉందో.. అక్కడ అలాగే ఉంటుందని చెప్పి పంపిస్తారు.
పౌర్ణమి రోజు రానే వచ్చింది. ఆ రోజు ఇంట్లో అందరూ ఉపవాసం ఉంటారు. సాయంత్రం హోమం పూర్తయ్యే వరకు.
తామర పువ్వులతో అమ్మవారిని అలంకరిస్తారు. సాయంత్రం హోమానికి శాంభవి చిలకపచ్చ పట్టు పరికిణి, రెడ్ కలర్ వోనీ వేసుకుని రెడీ అవుతుంది.
అందరి కళ్ళకి అప్పుడే పాలకడలో నుంచి వచ్చిన లక్ష్మీదేవి లాగా కనబడుతుంది. ఆ లక్ష్మీదేవి వచ్చి లలితా దేవి హోమం చేస్తున్న ఫీలింగ్ వస్తుంది.
అక్కడ బృందావనంలో అందరూ ఎప్పుడు తెల్లవారుతుందా అని నిద్రమని మరి ఎదురు చూస్తున్నారు.
మరి ఈ నిరీక్షణకు ఫలితం??
కథ కొనసాగుతుంది....
|