17-03-2026, 05:09 PM
Deeniki anthu leda?
|
Thriller మరణ శాసనం
|
|
18-03-2026, 07:05 AM
Part - 22
సరిగ్గా అప్పుడే ఒక విచిత్రం జరిగింది ....
ఆదిత్య మరో మూడు అడుగులు వేస్తే గేటు దాటుతాడు అనగా.... ఆ రాకాసి వెనకనుంచి ఒక బైక్ వేగంగా ఇంటి ఆవరణలోకి దూసుకు వచ్చింది... ఆ బైక్ మీద వెనకాల కూర్చున్న ఒక యువకుడు చేతిలో త్రిశూలం తో వేగంగా కిందికి దూకి, ఆదిత్య మెడపై చేయివేసి వెనక్కి తోసాడు... ఆ ధాటికి ఎగిరి,దూరంగా ఉన్న పెద్దగా పెరిగి ఉన్న గుబురు మొక్కలపై పడ్డాడు ఆదిత్య.. ఆ హఠాత్పరిణామానికి ఆ రాకాసి కోపంగా అరిచింది..... ఆ యువకుడు వెంటనే ఆ రాకాసి వైపు వెళ్లి, తన చేతిలో ఉన్న త్రిశూలాన్ని గాలిలోకి చూపించి.."హర హర మహాదేవ శంభోశంకర" అని అరుస్తూ దానిముందు గుచ్చాడు... అంతే.....!!! ఆకాశంలో పెద్దగా మెరుపులు మెరుస్తాయి... ఎక్కడో పిడుగులు పడిన శబ్దం వచ్చింది.. అప్పటి వరకు యాగశాలలో బీభత్సం సృష్టిస్తున్న భీకరమైన సుడిగాలి చిటికెలో మాయమైపోయింది.. అప్పటివరకు భయంకరంగా వీస్తున్న, పెనుగాలి కూడా వీచడం ఆగిపోయింది.. సరిగ్గా అప్పుడే ఒక కారు కూడా వేగంగా ఆ ఇంటి లోపలికి ప్రవేశించింది.... ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా కరెంటు వచ్చి, వెలుగు పరుచుకుంది... ఆ వెలుగులో నల్లటి దుస్తుల్లో ఉన్న ఆ యువకుడు అందరికీ కనిపించాడు.. ఆ యువకుడు మరెవరో కాదు " రుద్ర..." అతనిని బైక్ పైన తీసుకువచ్చింది సత్యం.. అసలు అంతకు ముందు ఏం జరిగిందంటే...!! అర్జెంట్ గా, ఫోన్ రావడంతో మంజునాథ రావు గారి ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత, సత్యం సెక్యూరిటీ అధికారి స్టేషన్ కు చేరుకున్నాడు.. ఆ స్టేషన్ లో కొత్తగా చేరిన కానిస్టేబుల్ కిషోర్ అతనికి ఎదురు వచ్చాడు.. అతనే సత్యం కు ఫోన్ చేసింది.. కిషోర్ ని చూడగానే సత్యం విసుక్కుంటూ.. " ఇప్పుడు అంత అర్జెంట్ గా నన్ను పిలవాల్సిన అవసరం ఏముంది కిషోర్..? నేను ముందే చెప్పాను కదా..! ఈరోజు నేను ముఖ్యమైన పనుల్లో ఉంటానని..!!" " సారీ సార్...!! ఒకతను మన ఆదిత్య సార్ కోసం రాజమండ్రి నుంచి వచ్చానని చెప్పారు.. ఆయన లీవ్ లో ఉన్నారని చెప్తే ఆయన తాతగారైన గోవింద రావు గురించి అడుగుతున్నారు.. ఆదిత్య సార్ తాతగారు ఎవరో మాకు తెలియదు.. మీకు తెలుసేమోనని, మీకు ఫోన్ చేశాను సార్...!!"అని చెప్పాడు.. "ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు..??" " అదిగో అక్కడే ఉన్నాడు సార్..!" అని కుర్చీలో కూర్చున్న, నల్లటి దుస్తుల్లో ఉన్న ఒక యువకుడిని చూపించాడు. అతని దగ్గరికి వెళ్లాడు సత్యం... సత్యం ని చూడగానే లేచి నుంచున్నాడు ఆ యువకుడు.. " మీరు..??"అని సత్యం అడిగే లోపు. " హలో సార్...!!నా పేరు రుద్ర...! మారేడుమిల్లి లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్ గా పనిచేస్తున్నాను. ఒక ముఖ్యమైన పనిమీద ఆదిత్య గారిని కలవడానికి వచ్చాను. ఆయన ఫోన్ నెంబర్ నాకు తెలియదు..ఆయన తాత గారికి ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. అందుకనేఈ స్టేషన్ లో పని చేస్తారని తెలిసి,ఆయన అడ్రస్ తెలుసుకుందామని వచ్చాను..."అంటూ తనని తాను పరిచయం చేసుకున్నాడు... "రుద్ర అంటే విజయవాడలో ఉండే శివుడు గారి కొడుకే కదా.. గోవింద రావు గారు వచ్చింది మీ కోసమే కదా...!!"అంటూ కుతూహలంగా అడిగాడు.. నవ్వుతూ తల వూపాడు రుద్ర... సత్యం వెంటనే రుద్ర చేతులు పట్టుకుని.. "దేవుడి లాగ వచ్చారు సార్...!! మీరు ఎప్పుడొస్తారా అని తలుచుకోని క్షణం లేదు..! సరిగ్గా సమయానికి వచ్చారు..! రండి సార్..!! ఆదిత్య గారి దగ్గరికి తీసుకు వెళతాను.."అని అన్నాడు.. " మీ పేరు..??" " నా పేరు సత్యం సార్...!!" " చూడండి సత్యం గారు..! నేను మొదట గోవింద రావు గారి ని చూడాలనుకుంటున్నాను. ఆయన కూడా అక్కడే ఉన్నారా...??" ఆ మాటకి సత్యం కొంచెం దిగాలుగా ముఖం పెట్టి, " లేదు సార్..! ఆయనకి యాక్సిడెంట్ అయింది.. హాస్పిటల్ లో ఉన్నారు.." "ఇప్పుడు ఎలా ఉన్నారు..?"అని కంగారు పడ్డాడు రుద్ర.. "ఆయనకేం పరవాలేదు సార్..! కానీ సత్యనారాయణ రావు గారికి మాత్రం దెబ్బలు చాలా గట్టిగా తగిలాయ్..! ఐసీయూలో ఉన్నారు.." " మరి పురుషోత్తం కి ఎలా ఉంది..?? " " పురుషోత్తం అంటే ఆ కార్ డ్రైవర్ ఆ సార్..!!?? అతని పేరు తెలియక ఇన్నిరోజులు బుర్రలు బద్దలు కొట్టుకున్నాం..!! అతను కూడా ఇప్పుడు బాగానే ఉన్నాడు.." " సరే..!! ముందు వెంటనే నేను గోవింద రావు గారిని చూడాలి.. దయచేసి నన్ను అక్కడికి తీసుకు వెళ్ళండి..." "అలాగే సార్ రండి.! నేను తీసుకెళ్తాను..! " అంటూ ఇద్దరు బైక్ మీద హాస్పిటల్ కి బయలుదేరారు... వారిని అనుసరిస్తూ రుద్ర వచ్చిన కారు బయలుదేరింది.. కొద్ది నిమిషాల ప్రయాణం తర్వాత హాస్పిటల్కి చేరుకున్నారు.. మొదట సత్యనారాయణ రావు గారు ఉంచిన ఐసియు దగ్గరికి తీసుకెళ్లాడు సత్యం.. సరిగ్గా అప్పుడే ఐసియు నుంచి డాక్టర్ గారు బయటకు వచ్చారు.. సత్యం నే చూస్తూనే.." ఆ కరెక్ట్ టైం కి వచ్చారు మీకే కబురు చేద్దాం అనుకుంటున్నాను.." " ఆయన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్..?" " గుడ్ న్యూస్..! ఆయనకి ప్రాణాపాయం తప్పింది.ఇంకో వారం రోజుల్లో లేచి తిరుగుతారు.."అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు.. " మీరు వచ్చిన వేళా విశేషము సార్..!! నిన్నటి వరకు 24 గంటలు గడిస్తే గాని ఏమి చెప్పలేమన్నారు.. ఇప్పుడు ప్రాణాపాయానికి ఏం ప్రమాదం లేదన్నారు.. ఇది నిజంగా చాలా గుడ్ న్యూస్ సార్..!!" " ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. గోవింద రావు గారి దగ్గరికి కూడా తీసుకు వెళ్ళండి..!!" " ఇక్కడే సార్.. ఈ పక్కనే రండి..!" అంటూ ఆయనను ఉంచిన గదికి తీసుకువెళ్లాడు... గదిలోకి వెళ్ళగానే నర్స్ మందులు ఇస్తుంటే వేసుకుంటున్నారు గోవింద రావు... ఆ పక్కన మరో బెడ్ పై పురుషోత్తం నిద్ర లో ఉన్నాడు.. రుద్ర నేరుగా వెళ్లి ఆయన పాదాలకు నమస్కరించాడు... " ఎప్పుడొచ్చావ్ నాయనా..!??" అంటూ ఆనందంతో గోవింద రావు లేవబోతుండగా.. " లేవద్దు గురువు గారు..!!"అంటూ ఆయన పక్కనే కుర్చీలో కూర్చున్నాడు.. " మీ అమ్మగారికి ఇప్పుడు ఎలా ఉంది..!??" " అంతా తమరి దయ గురువుగారు..!! మీ ప్రాణాలను అడ్డేసి మరీ.. నా తల్లిని కాపాడారు..మీరు ఋణం ఈ జన్మలో తీర్చుకోలేను...!!" అంటూ గోవింద రావు చేతులు పట్టుకున్నాడు... " అదంతా నీ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యఫలం నాయనా..!! వారు చేసిన మంచే, నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతోంది...! అయినా అమ్మను వదిలేసి ఇలా వచ్చావ్ ఏమిటి..??" " అమ్మకి ఇప్పుడు ఎటువంటి ప్రమాదం లేదు గురువుగారు.. రఘునాథ్ రెడ్డి గారి ఇంట్లో ఉంది. అసలు అమ్మే.. నన్ను ఇక్కడికి మీ దగ్గరికి పంపించింది..అమ్మగారి బాధ్యత రఘునాథ రెడ్డి గారు చూసుకుంటాం అన్నారు.. అందుకనే నేను రఘునాథ రెడ్డి గారు పంపిన కార్లో ఇక్కడికి వచ్చాను...!! ఆదిత్య పరిస్థితి ఎలా ఉంది గురువుగారు..??" ఆదిత్య పేరు ఎత్తగానే ఒక క్షణం ఉలిక్కిపడ్డారు . గోవింద రావు.. కంగారుగా సత్యం వైపు చూడగా.. సత్యం ఆయన కంగారు అర్థం చేసుకొని.." ఆదిత్య గారికి ఏ ప్రమాదం లేదు గురువుగారు..!! ప్రస్తుతం మంజునాథ రావు గారి ఇంట్లో ఆయన క్షేమంగా ఉన్నారు.ఆయన కోసం రుద్ర హోమం జరిపిస్తున్నారు..!! "అని చెప్పగానే.. సత్యం చెప్పిన మాట వినగానే ఒక్కసారిగా రుద్ర,గోవింద రావు ఒకరి ముఖాలు ఒకరు ఆశ్చర్యంగా చూస్తున్నారు.. "గురువుగారు ఈరోజు అమావాస్య కదా..!! దాని శక్తులు ఉచ్చ స్థితిలో ఉంటాయి..!! మరి దాన్ని ఆపడానికి రుద్రహోమం జరిపిస్తే, అది ఊరుకుంటుందా..!?? అది చాలా ప్రమాదం కదా...?"అని రుద్ర సందేహం వెలిబుచ్చగానే.. " రుద్రా..!!మనం వెంటనే బయలుదేరాలి.. అమావాస్య ఘడియలు వెళ్లడానికి ఇంకా ఎంత సమయం ఉంది..??" రుద్ర వెంటనే వాచ్ లో టైం చూసుకుని క్వాలిక్యులేషన్స్ వేసి, " ఇంకో మూడు గంటలు గడిస్తే అమావాస్య ఘడియలు వెళ్లిపోతాయి గురువుగారు...!!" "సరే వెంటనే బయలుదేరండి..!!"అనగానే తన వచ్చిన కారులో గోవింద రావు గారిని కూర్చోబెట్టి, ఆయనకి రక్షణగా కారు ముందు బైక్ మీద సత్యం రుద్ర బయలుదేరారు.. అలా బయలుదేరుతూ ఉండగా దారిలో రుద్ర కి ఒక శివాలయం కనిపించింది.. వెంటనే బైక్ ఆపి ఆ గుడి లోపలికి వెళ్ళాడు.. గోవింద రావు సత్యం కూడా అతనితో పాటే గుడిలోకి వచ్చారు.. స్వామి దర్శనం చేసుకుని తిరిగి వెళ్లబోతుండగా, గోవింద రావు అక్కడ చెట్టు కింద పాతిపెట్టి ఉన్న ఒక త్రిశూలాన్ని తీసి రుద్ర చేతికి ఇచ్చారు . దాన్ని చూసి "ఇది దేనికి గురువుగారు..??" అని అడిగాడు.. "రుద్రుని చేతిలో త్రిశూలమే అందం మరియు ఆయుధం.. ఇది నీ చేతిలోనే ఉంచు.."ఆయన నవ్వుతూ చెప్పారు... ఇక వెంటనే ముగ్గురు బయలుదేరారు.. ఈసారి సత్యం డ్రైవ్ చేస్తుంటే, రుద్ర వెనకాల కూర్చున్నాడు... ఆ ప్రాంతం మొత్తం నిర్మానుష్యం గా ఉంది.. ఎవరూ బయటకు రావడం లేదు... మంజునాథ రావు ఇంటి దగ్గరికి చేరుకోగానే వాతావరణం భీకరంగా మారిపోవడంతో పరిస్థితి అర్థమైంది.. బైక్ డ్రైవ్ చేస్తున్న సత్యం మంజునాథ రావు ఇంటికి దగ్గరలోనే బైక్ ఆపేశాడు.. " ఏమైంది సత్యం..??" అని రుద్ర అడగగా... " సార్..!! అక్కడ చూశారా...??" అంటూ మంజునాథ రావు ఇంటి ముందు నుంచుని ఉన్న భయంకర రాకాసి వైపు చూపించాడు.. రుద్ర, సత్యం చూపించిన వైపు చూడగానే అక్కడ సత్యం చెప్పినట్లుగానే ఒక భయంకరమైన రాక్షసి ఉంది. సరిగ్గా అప్పుడే అక్కడికి ఆదిత్య వచ్చాడు.. "ఆయనే సార్..! ఆదిత్య గారు..!! " అని సత్యం చెప్పగానే, జరగబోయే ప్రమాదాన్ని పసిగట్టాడు.రుద్ర.. " బైక్ ఆదిత్య దగ్గరకి పోనీ..!!!" అంటు గట్టిగా అరిచాడు.. సత్యం కూడా క్షణం ఆలస్యం చేయకుండా వేగంగా బైక్ ఆదిత్య వైపు పోనిచ్చాడు... ఆ విధంగా రుద్ర ఆదిత్య ని కాపాడాడు... ప్రస్తుతం.....!!!! గాలి ప్రభావం తగ్గిపోవడంతో మంజునాథ రావు తో సహా మిగిలిన వేద పండితులు అందరూ యాగశాల వద్దకు చేరుకున్నారు.. ఎవరికీ ఎటువంటి గాయాలు తగలలేదు.. అందరూ క్షేమంగా ఉన్నారు . అందరూ చూస్తుండగా కార్లోంచి గాయాలకి కట్టిన కట్లతో, గోవింద రావు దిగారు.. వారిని చూడగానే ఆనందంతో మంజునాథ రావు వేగంగా ఆయన దగ్గరకు చేరుకున్నారు.. "ఏరా...? ఇప్పుడు ఎలా ఉన్నావ్..!??"అని అడిగారు మంజునాథ రావు.. " తర్వాత మాట్లాడుకుందాం.!! ముందు హోమం నిర్విఘ్నంగా జరిపించాలి పదా..!! లేదంటే చాలా విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాలి..!!"అంటూ తొందరపెట్టాడు గోవింద రావు.. ఈ లోపు కిందపడిపోయిన ఆదిత్యని పైకి లేపాడు సత్యం.. "సత్యం అసలు ఏం జరిగింది..? నేను ఇక్కడ ఎలా ఉన్నాను?" అని అడిగాడు ఆదిత్య సత్యంతో.. "సార్..! ఇప్పుడు మాట్లాడే టైం లేదు.. వెంటనే రండి...!!"అంటూ ఆదిత్యని హోమగుండం వైపు తీసుకెళ్ళిపోయాడు... యాగశాల వైపు వెళ్తున్న గోవింద రావు,, దూరంగా ఉన్న రుద్ర వైపు చూసి "దాన్ని ఆపే బాధ్యత నీదే నాయన..!" అని అరుస్తూ యాగశాల వైపు వెళ్ళిపోయారు.. రుద్ర చుట్టూ చూడగా అతనికి దూరంగా పడిఉన్న, ఆదిత్య విసిరేసిన రుద్రాక్షమాల కనిపించింది.. దానిని తీసి తన చేతికి చుట్టుకున్నాడు.. వేదపండితులు, మంజునాథ రావు గోవింద రావు అందరూ కలిసి తిరిగి రుద్ర హోమం ని ప్రారంభించారు.. అలా హోమం ప్రారంభించడం చూసేసరికి.. దానికి కోపం విపరీతంగా పెరిగిపోయింది.. దాని కోపానికి సూచనగా వాతావరణం మరలా తిరిగి బీభత్సంగా మారిపోయింది... కానీ దాని ప్రభావం యాగశాల చూపలేకపోయింది... రుద్ర వెంటనే తను వచ్చిన కార్ లో డిక్కీ ఓపెన్ చేశాడు.. అందులో నల్లటి సంచి ఒక దానిని తీసుకుని, అందులో నుంచి కొన్ని రకాలైన పూజ సామాగ్రి బయటికి తీశాడు.. అందులో ఒక చెక్క బొమ్మ కూడా ఉంది.. వెంటనే తన ముందు విభూదితో ఒక చక్రం గీసి, దాని మధ్యలో ఆ బొమ్మను ఉంచాడు. కళ్ళు మూసుకుని మంత్రాలు చదవసాగాడు.. రుద్ర మంత్రాలు చదవడం మొదలు పెట్టిన,కొంతసేపటికి ఆ చక్రం నుంచి మంటలు రావడం మొదలుపెట్టాయి.. అలా మంటలు రావడంతో రాకాసి చుట్టూ కూడా మంటలు రేగాయి.. అలా మంటలు రావడంతో అది వికృతంగా అరిచింది.. ఆ మంటల నుంచి బయటపడడానికి తీవ్రంగా ప్రయత్నించింది.కానీ దాని వల్ల కాలేదు.. గట్టిగా అరవసాగింది.. కానీ...!! అది అలా అరుస్తున్నప్పుడే, హోమగుండం దగ్గర కూర్చుని ఉన్న, ఆదిత్య గుండె పై చేయి వేసి బాధతో గిలగిలా కొట్టుకోసాగాడు.. "ఆదిత్య ఏమైంది...??" అంటూ గోవింద రావు మంజునాథ రావు,భాను కంగారు పడడంతో,హోమగుండం దగ్గర కలకలం చెలరేగింది. వేద పండితులు కూడా తమ మంత్రోచ్చారణ ఆపేయడంతో, " ఇక్కడ ఏం జరిగినా సరే..!హోమం ఆపడానికి వీలు లేదు..!! మీరు కానివ్వండి..!!" అంటూ వారితో చెప్పాడు గోవింద రావు.. గోవింద రావు అలా చెప్పడంతో వారు తిరిగి మంత్రోచ్ఛారణ చేయడం మొదలుపెట్టారు. సత్యం ఆదిత్య పరిస్థితి చూసి వేగంగా గేటు దగ్గర ఉన్న రుద్ర దగ్గరికి వెళ్లి, ఆదిత్య పరిస్థితి చెప్పాడు.. రుద్ర వెంటనే లేచి ఆదిత్య దగ్గరికి వెళ్ళాడు.. ఆదిత్య గుండెనొప్పితో విలవిలలాడసాగాడు. ఆదిత్య చేసి పక్కకు తీసి చూశాడు.. అతని ఛాతి పై నల్లటి గోళ్ళ గుర్తులు ఉన్నాయి. దూరంగా ఉన్న రాకాసి వైపు చూశాడు.. అది ఆదిత్య వైపు చేతిని చూపిస్తూ అరుస్తోంది.. అప్పుడు రుద్ర కి పూర్తిగా అర్థం అయ్యింది. ఇది దాని పనే అని... బాధతో విలవిలలాడుతూ ఉన్న ఆదిత్య చెవి దగ్గరకు వచ్చి," దయచేసి కొంత సేపు తట్టుకో ఆదిత్య..!! నీవల్ల అవుతుంది..!" అంటూ సత్యాన్ని తీసుకుని పక్కకు వెళ్ళాడు.. సత్యం చెవిలో ఏదో చెప్పాడు.. సత్యం సరేనని ఇంటి లోపలికి పరిగెత్తాడు.. మరోవైపు రుద్ర తన సంచిలో మరో బొమ్మ తీసుకొని, దానికి ఆదిత్య వేలి నుంచి కొంత రక్తం తీసి, దానికి అద్దాడు... ఇప్పుడు చక్రం ముందు కూర్చుని, ఒక నల్లటి దారం తీసి, మొదట చక్రం లో ఉంచిన బొమ్మని చేతిలోకి తీసుకుని, మంత్రాలు ఉచ్చరిస్తూ ఆ ధారాన్ని ఆ బొమ్మకి చుట్ట సాగాడు. అలా చూస్తూ ఉండగానే రాకాసి చుట్టూ మెరుపులతో కూడిన ఒక వలయం ఏర్పడి, ఆ వలయంలో అది బంధించబడింది... అది బంధించబడటం పూర్తవగానే.. సత్యం ఇంక మొదలు పెట్టు అని గట్టిగా అరిచాడు... అప్పటి వరకు దాని వెనకాల చీకట్లో దాక్కుని ఉన్న సత్యం వేగంగా దానిని సమీపించి ఒక కత్తెరతో కత్తిరించాడు... దాని జుట్టు కత్తిరించడం తో అది కోపంగా సత్యం వైపు చూసి అరిచింది.. సత్యం జడుచుకుని వెనక్కి తూలి, పడిపోయాడు.. దాని గోళ్ళు కూడా కత్తిరించాలి.. కానీ దాని దగ్గరకు వెళ్లడానికి ధైర్యం సరిపోవడం లేదు. దూరం నుంచి అది గమనించిన రుద్ర " సత్యం వెంటనే పని కానివ్వు..! లేదంటే చాలా ప్రమాదం..!"అని అరిచాడు.. సత్యం ఎలాగోలా ధైర్యం తెచ్చుకుని కత్తిరించడానికి ప్రయత్నించాడు కానీ అవి చాలా గట్టిగా ఉన్నాయి.. అదే విషయాన్ని రుద్ర తో చెప్పాడు.. రుద్ర వెంటనే తన సంచిలో ఉన్న ఒక కత్తి లాంటి దాన్ని తీసుకొని అతని మీదకు విసిరాడు.. అది అందుకున్న సత్యం వెంటనే గోరు మీద ఒక్క దెబ్బ వేసాడు.. దెబ్బ పక్కకు జరిగి, దాని వేలు తో సహా తెగిపోయింది.. ఆ బాధతో అది మరింత గట్టిగా అరిచింది.. సత్యం వెంటనే అవి తీసుకుని రుద్ర వైపు పరిగెత్తాడు... రుద్ర వెంటనే వాటిని తీసుకొని, జుట్టు ని మొదట బొమ్మ కి, రెండు బొమ్మకి కట్టాడు వాటి మధ్యన ఒక తాడు లాగా ఏర్పరిచాడు. ఆ గోరు చివర కారుతున్న రక్తాన్ని తాడుపై రాశాడు... అలా ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే.. ఆ గొరుకి గుడ్డ చుట్టి, ఒక నూనెలో ముంచి దానికి నిప్పంటించాడు.. ఇప్పుడు ఆ మంట తో ఆ జుట్టుకి నిప్పంటించాడు... నిప్పు తగిలిన మరుక్షణం ఆ జుట్టు భగ్గున కాలి, మాడిపోయింది.. అది జరిగిన మరుక్షణం ఆదిత్య మామూలు స్థితికి వచ్చాడు.. రుద్ర ఆదిత్య దగ్గరకు వెళ్లగానే ఆదిత్య మామూలుగా లేచి కూర్చున్నాడు. ఆదిత్య ఛాతి మీద పరీక్షించగా, అంతకు ముందు కనిపించిన నల్లటి గొర్ల గుర్తులు ఇప్పుడు లేవు... ఆనందంగా గోవింద రావు వైపు చూసి నవ్వాడు రుద్ర... " ఆదిత్య ప్రమాదం నుంచి బయటపడ్డాడు గురువుగారు.."అని చెప్పగానే.. " శభాష్ రుద్ర.. మంత్రవాది శివుడి కొడుకు అనిపించుకున్నావ్..!!"అని మెచ్చుకున్నారు గోవింద రావు.. "మీరు హోమం పూర్తి చేయండి.. ఇంకా అమావాస్య ఘడియలు వెళ్లడానికి ఇంకా గంట సమయం ఉంది.. దాని సంగతి నేను చూసుకుంటాను..!" అంటూ తిరిగి వెళ్ళిపోయాడు.. తిరిగి యథాప్రకారంగా హోమం లో కూర్చున్నాడు ఆదిత్య... రుద్ర తిరిగి వచ్చి,ఆ చక్రం దగ్గర కూర్చుని, దానిని బంధించి ఉంచడానికి మంత్రాలు చదువుతూ దానిని చక్రంలోనే బందీగా ఉంచాడు... అలా గంటల 45 నిమిషాలకు గడిచిపోయాయి.. మరి కొద్ది నిమిషాలలో హోమం పూర్తవక బోతుండగా.. ఆ రాకాసి ఏడుస్తున్నట్టుగా పైకి చూస్తూ కర్ణకఠోరంగా ఒక అరుపు అరిచింది... అంతే.....!!! ఒక్కసారిగా ఆ ప్రాంతం భూకంపం వచ్చినట్టుగా కంపించింది.. చక్రంలో ఉన్న బొమ్మ చుట్టూ కట్టిన బంధనాలు ఒక్కొక్కటిగా తెగిపోవడం మొదలెట్టాయి... రుద్ర కి ఏం జరుగుతుందో అర్థం కాలేదు... రుద్ర చూస్తూ ఉండగానే ఆ బొమ్మ గాల్లోకి ఎగిరి, బంధనాలు తెంచుకొని గేటు దగ్గర ఉన్న రాకాసి శరీరంలో కలిసి పోయింది.. దాని బంధనాలు కూడా పూర్తిగా తెగిపోయాయి.... రుద్ర ఒక్కసారిగా లేచి నుంచున్నాడు... అసలు ఏం జరగబోతోందో అర్థం కావడం లేదు.. "గురుదేవా..!? వెంటనే రండి..!"అంటూ గోవింద రావు ని పిలిచాడు. మంజునాథ రావుతో "ఎవ్వరు హోమం దగ్గరనుండి కదలద్దు..!!" అని చెప్పి,వేగంగా అక్కడికి వచ్చాడు గోవింద రావు.. " ఏమైంది నాయనా..!!??" అని గోవింద రావు అడగగా.. గేటు దగ్గర ఉన్న నల్లటి భయంకర రాకాసి పక్కన, తెల్లటి ఆకారంలో పొడుగైన జడలతో మరొక రాకాసి ప్రత్యక్షమయింది... వాటిని చూడగానే ఇద్దరికీ మతిపోయింది.. "ఇదేంటి గురుదేవా...? ఒకటే అనుకొన్నాను.. ఇది ఎక్కడి నుంచి వచ్చింది..??" అని ఆశ్చర్యపోతూ అడిగాడు.. "ఇవి కావలి శక్తులు...!! ఒక దానిని బందించాలని చూస్తే, మరొకటి తోడు వస్తుంది.. వీటి శక్తి సామాన్యమైనది కాదు.. బంధించడం,తరిమికొట్టడం తప్ప,నాశనం చేయడం అసాధ్యం.. మా యాక్సిడెంట్ కి కారణం తెల్లగా కనిపిస్తుంది కదా..!! అదే..!! " " మరి ఇప్పుడు ఏం చేద్దాం గురుదేవా...!??నాకైతే ఏం చేయాలో అర్థం కావడంలేదు..!!" అంటూ వీరిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే, వాతావరణం భీకరంగా మారిపోయింది.. ఆకాశం మొత్తం ఉరుములు,మెరుపులు,పిడుగు శబ్దాలతో భయంకరంగా ఉంది. నేల భూకంపం వచ్చినట్టు అదరసాగింది...!! పరిస్థితి చేయి దాటిపోతుందని గ్రహించారు ఇద్దరు.. " గురుదేవ...! మీరే ఏదో ఒకటి చేయాలి..! కొద్ది నిమిషాలలో అమావాస్య ఘడియలు వెళ్లిపోతాయి.. అప్పటి వరకు వీటిని ఆపగలిగితే చాలు.. హోమం కూడా నిర్విఘ్నంగా పూర్తి అవుతుంది.....!" ఇలా మాట్లాడుకుంటూ ఉండగా.. మూసివున్న ప్రహరీ గేటు పెద్ద శబ్దంతో పేలి పోయింది.. ఆ రెండు రాకాసులు లోపలికి రావడానికి తమ శక్తినంతా ఉపయోగిస్తున్నాయి.. రుద్ర అడ్డుగా ఉంచిన త్రిశూలం ఎగిరి, అతని ముందు పడింది... అవి లోపలకి రాబోతుండగా... ఏం చేయాలో తెలీక అటూ ఇటూ చూస్తున్న గోవింద రావు గారి కళ్ళకి రుద్ర చేతికున్న రుద్రాక్ష మాల కనిపించింది... రుద్ర చేయి పట్టుకుని "ఇది నీకు ఎక్కడిది??" అని అడిగారు.. "ఈ రుద్రాక్ష మాల నాకు ఇక్కడే నేలపై దొరికింది. అందుకే తీసి చేతికి కట్టుకున్నాను.." "వెంటనే నాకు దాన్ని తీసి ఇవ్వు.."అనగానే దాన్ని తీసి గోవింద రావు గారి చేతికిచ్చారు... "ఇప్పుడు చూడు ఏం జరగబోతోందో...!!" అని కళ్ళు మూసుకొని ఒక మంత్రాన్ని జపించి, ఆ రుద్రాక్ష మాలని వాటిమీదకీ విసిరారు.. అది ఎగురుకుంటూ వెళ్లి వాటి ముందు పడింది... కిందపడిన మరుక్షణం వెలుగు రేఖలు చిమ్ముతూ, భయంకరమైన తెల్లటి సర్పం గా మారిపోయింది.. దాన్ని చూడగానే అందరూ ఆశ్చర్యపోయారు... అంతకుముందు అడవిలో వాటిలో ఒక దాని నుంచి ఆదిత్యని కాపాడింది ఈ సర్పమే.... ఆ సర్పం కోపంతో బుసలు కొడుతూ, వాటి మీదకి కోపంగా వెళ్ళసాగింది.... ఆ సర్పాన్ని చూసిన ఆ దుష్ట రాకాసులు, కోపంతో గట్టిగా అరిచాయి.. కానీ దానిని ఎదిరించే ధైర్యం చేయలేకపోయాయి... రాకాసుల ను చూసిన ఆ శ్వేత సర్పం కోపంతో వాటిపై నోరు తెరిచి అగ్ని వర్షం కురిపించింది... ఆ దాటికి తట్టుకోలేక అవి గట్టిగా అరుస్తూ తప్పించుకోబోతుండగా.. ఆ రెండింటిని తన తోకతో గట్టిగా చుట్టి, ఎక్కడికీ పారిపోనివ్వకుండా బంధించింది... ఈలోపు అమావాస్య ఘడియలు ముగిసిపోయాయి... అమావాస్య ఘడియలు ముగిసిపోయిన వెంటనే ఆ రెండు రాకాసులు గట్టిగా అరుస్తూ మాయమైపోయాయి.... ఆ సర్పం వెనుదిరిగి వేగంగా అక్కడ నుంచి ఉన్న గోవింద రావు,రుద్రల దగ్గరకు వచ్చింది.. అది దగ్గరకు వచ్చిన వెంటనే ఇద్దరు దాని ముందు సాష్టాంగ పడి నమస్కరించారు... మరుక్షణం ఆ సర్పం ఒక కాంతి పుంజంగా మారి, ఆ కాంతి పుంజం రెండుగా విడిపోయి, వారి ముందు నేల పై పడింది.. అలా నేలపై పడిన కాంతి పుంజాలు, చూస్తూ ఉండగానే రెండు రుద్రాక్ష మాలలు గా మారిపోయాయి... ఆ సన్నివేశం చూసిన అక్కడి వారందరూ ఆశ్చర్యపోయారు... ఆ దైవ సర్పానికి సాష్టాంగ పడిన ఇద్దరు పైకి లేచేసరికి, వారి ముందు రెండు రుద్రాక్ష మాలలు కనిపించాయి... గోవింద రావు గారు ఆ రుద్రాక్షమాలలను తీసుకుని, ఆనందంతో ఒకటి రుద్ర మెడలో, మరొకటి ఆదిత్య మెడలో వేసారు.. రుద్ర హోమం నిర్విఘ్నంగా పూర్తయింది..!! హోమం పూర్తయిన తరువాత జరగవలసిన మిగతా పనులన్నీ జరిపించారు.. రుద్ర హోమం నిర్విఘ్నంగా జరిపించిన, వేద పండితుల అందరికి ఘనంగా దక్షిణ తాంబూలాలు ఇచ్చి పంపించారు. మంజునాథ రావు గారు.. సమయం : తెల్లవారుజాము 3:00 అవుతోంది.. హోమం నిర్విఘ్నంగా పూర్తవడంతో, అందరూ వెళ్ళిపోయారు. చుట్టుపక్కల అసల మనుషుల జాడే లేదు... ఆకాశం మొత్తం మబ్బులు చెదిరి పోవడంతో, నిర్మలంగా ఉంది.. అమావాస్య కావడంతో నక్షత్రాలు తప్ప, చంద్రుడు కనిపించడం లేదు. చుట్టూ కీచురాళ్ళ శబ్దం తప్ప, మరేమీ వినిపించడం లేదు.. రుద్ర ఒక్కడే మేడపై ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నాడు.. ఏదో ఆలోచన అతని మెదడును తొలి చేస్తూ ఉంది.. ఆ ఆలోచనల వల్ల అతనికి నిద్ర పట్టడం లేదు.. "ఏం ఆలోచిస్తున్నావ్ రుద్ర..!?" అని పిలుపుతో ఉలిక్కిపడ్డాడు... ఇంకా ఉంది....!!!
19-03-2026, 12:56 PM
Part - 23
ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూడగా, గోవింద రావు అతని వెనకే నుంచుని ఉన్నారు..
" గురువుగారు మీరా...?" అంటూ లేవబోతుండగా అతన్ని కూర్చోమని చెప్పి, ఆయన కూడా అతని ముందు ఉన్న ఒక కుర్చీలో కూర్చున్నారు.. " ఇంత రాత్రివేళ పడుకోకుండా ఒంటరిగా కూర్చుని ఏం ఆలోచిస్తున్నావ్ నాయనా..?" "అదేం లేదు గురువుగారు..! కొత్త ప్రదేశం కదా నిద్ర పట్టలేదు అంతే...!" అంటూ మాట దాట వేశాడు. " నీకు అబద్దం ఆడడం చేతకాదని, నీ మాటలే చెబుతున్నాయి. నా దగ్గర నువ్వు ఏది దాచవలసిన అవసరం లేదు. నాకు చెప్పకూడని విషయమైతే చెప్పనవసరం లేదు.."అని నవ్వుతూ అన్నారు.. " అదేం లేదు గురువుగారు..!! ఆదిత్య గురించే ఆలోచిస్తున్నాను..!!" " ఆదిత్య గురించా..??" అంటూ ఆశ్చర్యంగా అడిగారు గోవింద రావు. "గురువుగారు..! ఈరోజు మనం ఎదుర్కొన్న దుష్ట శక్తుల గురించి మీరేమనుకుంటున్నారు..?" " ముందే చెప్పాను కదా..!! అవి కావలి శక్తులు.! పైగా శక్తివంతమైనవి..!! "అని అన్నారు గోవింద రావు " అవి కావలి శక్తులు కావని నా అభిప్రాయం గురువు గారు..!!" " అంటే..??"అని అనుమానంగా అడిగారు.. గోవింద రావు " అవి అనుచర గణాలేమొనని అనుమానంగా ఉంది.. గురువు గారు..??" " అనుచర గణాలా..?? " అంటే..?? " "ఒకసారి ఇది చూడండి...!!" అంటూ తన పక్కన ఉన్న ఒక గ్రంథాన్ని చూపించాడు.. అది పురాతన కాలం నాటి గ్రంధం.. దానిపై ఎర్రటి వర్ణంలో పెద్ద పెద్ద అక్షరాలతో ఏదో రాసి ఉంది.. "ఇది ఏంటి..!!" అని అడిగాడు గోవింద రావు.. "గురువు గారు..ఇది తాంత్రికులకు సంబందించిన పురాతన గ్రంధం.. దీని పేరు కౌమూదిక.. తాంత్రికులు శక్తి సాధన కోసం, దీనిని ఒక వేద గ్రంథంగా భావిస్తారు.తంత్ర విద్యలలో ఆరి తేరిన కౌమూదికుడు దీనిని రచించారు.. ఆయన పేరు మీద దీనికి ఆ పేరు వచ్చింది.. దీనిని మా నాన్న గారికి ఆయన గురువు గారు ఇచ్చారు... ఈ గ్రంధంలో మంత్ర విద్య సాధన గురించి, తాంత్రిక శాస్త్రంలో పూజింపబడే దుష్ట శక్తుల గురించి పూర్తిగా వివరించబడింది.!! ఒకసారి ఇక్కడ చూడండి.."అంటూ ఆ గ్రంధాన్ని తీసి,కొన్ని పేజీలు తీసిన తరువాత ఒక పేజీని ఆయనకు చూపించాడు.. ఆ పేజీలో ఒక చిత్రం కింద ప్రత్యేకమైన లిపి లో ఏదో రాసి ఉంది.. గోవింద రావు కి ఏమీ అర్థం కాక " ఇది అసలు ఏమి భాష...? ఇంత విచిత్రంగా ఉంది..??అసలు ఇప్పటివరకు ఇటువంటి రాతలను నేను ఎక్కడ చూడలేదు..?"అని అడిగాడు.. "ఇది తాంత్రిక భాష...!!ఈ భాష తాంత్రికులకు మాత్రమే అర్థమవుతుంది.. ఈ చిత్రాన్ని ఒకసారి చూడండి.." అంటూ ఆయనకు ఒక చిత్రాన్ని చూపించాడు.. ఆ చిత్రాన్ని చూడగానే గోవింద రావు గారి నొసలు ముడుచుకున్నాయి.. వెంటనే రుద్ర వైపు చూసి, " ఈ చిత్రం అచ్చం మనం ఎదుర్కొన్న దుష్ట రాకాసిలా ఉంది కదా...!!"అని అన్నారు.. " అవును గురువుగారు.. కానీ ఇది కావలి శక్తి కాదు. ఇది ఒక భయంకరమైన దుష్ట తాంత్రిక దేవత యొక్క అనుచరగణంలో ఒకటి.." " అసలు నువ్వేం మాట్లాడుతున్నావో.. నాకు అర్థం కావడం లేదు రుద్ర...!???" " గురువు గారు కొంచెం నేను చెప్పేది పూర్తిగా వినండి..!! తాంత్రికులు పూజించే దేవతలలో, దుష్ట దేవతలు కూడా ఉంటాయి.. వాటిని అదుపు చేయలేము కానీ, వాటిని వశపరచుకో గలిగితే ఏదైనా సాధించవచ్చు.. ఎవరి ప్రాణాలైన తీయవచ్చు.." "అంటే..??" అని పూర్తిగా అర్థంకాక అడిగారు గోవింద రావు.. " మీకు ఒక ఉదాహరణ చెప్తాను వినండి.. తాంత్రికులు పూజించే దుష్ట దేవతలలో కర్ణ పిశాచి ఒకటి.. దీనిని మనం వశపరచుకోగలిగితే, భూత భవిష్యత్ వర్తమానాలను మనకి చెవిలో చెప్తూ ఉంటుంది.. మన కంటికి మాత్రం కనిపించదు.. దీనిని ఆవాహన చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా కొన్ని షరతులు పాటించాల్సి ఉంటుంది.. అవి ఏమిటంటే....... ఇంట్లో దేవతలని పూజించకూడదు. గుడికి వెళ్ళకూడదు.. దైవస్మరణ చేయకూడదు... ఒకవేళ ఈ షరతులను ఎవరైనా మీరితే వాళ్లంతట వాళ్లే చనిపోయేలా ప్రేరేపిస్తుంది...!!" " అంటే..? మన ఆదిత్యని పట్టుకున్నది కూడా ఇటువంటిదేనా...!!??" అని అడిగారు గోవింద రావు.. " కాదు గురువు గారు..! క్షుద్ర దేవతలలో శక్తివంతమైన, భయంకరమైన క్షుద్ర దేవత..దాని పేరు పంచవక్రి.. అంటే వికారమైన ఐదు ముఖములు కలది అని అర్థం. దీని అనుచరగణం లో మూడు దుష్ట పిశాచ శక్తులు ఉంటాయి... వాటి పేర్లు:విర్కొర,కరోముఖి,విస్కర్ష,... వీటిలో విర్కొర,విస్కర్ష అనేవి పంచవక్రి ని ఎవరైనా ఎదిరించాలని గాని, వ్యతిరేక శక్తి ప్రయోగాలు చేయాలని గాని,చూస్తే చంపేస్తాయి.. కరోముఖి మాత్రం పంచవక్రీ కి, రక్షణగా ఎప్పుడు ఆమె చుట్టే ఉంటుంది... ఇది పూర్తిగా శత్రువుని ఏమారుస్తుంది... మాయలను సృష్టించి, శత్రువుని అంతం చేస్తుంది.. పంచవక్రీ ఎవరినైతే చంపాలో, వారిని మాత్రమే చంపుతుంది.. తన అయిదు తలలతో అతని శరీరంలో పంచేంద్రియాల నుండి పూర్తిగా జీవ శక్తిని పీల్చి, నరకం చూపించి చంపుతుంది... కానీ దాని కావలి శక్తులు మాత్రం మిగతా శత్రు నాశనం చేస్తాయి... తాంత్రిక విద్యలో శక్తివంతమైన శత్రువుని చంపడానికి,ఈ క్షుద్ర దేవతను ప్రయోగిస్తారు... దీనిని ఎవరి మీదైతే ప్రయోగిస్తారో..... వారికి ఐదు అమావాస్యల లోపు ఖచ్చితంగా మరణం సంభవిస్తుంది.... ఒక్కొక్క అమావాస్య గడిచే కొద్దీ వీరికి ప్రాణాపాయం మరింత ఎక్కువవుతుంది.. దీనిని ఒక్కసారి ప్రయోగించిన పిదప వెనక్కి తీయడం ఎవరి వల్ల కాదు.. ఒకసారి ప్రయోగించబడిన వ్యక్తి ఎక్కడ ఉన్నాసరే దాని బారి నుంచి తప్పించుకోలేడు... ఆ మనిషి మరణం పూర్తి అయిన తర్వాత మాత్రమే ఆ క్షుద్ర దేవత శాంతీస్తుంది.. ఇప్పటివరకు ఈ క్షుద్ర దేవత ప్రయోగింపబడిన వ్యక్తి బ్రతికినట్టు చరిత్రలో లేదు.... రుద్ర చెప్పిన మాటలు విన్న తరువాత నీరసంగా కుర్చీలో కూలబడి పోయారు గోవింద రావు.. " ఏమైంది గురువుగారు..??" అంటూ మోకాళ్ళపై కూర్చుని ఆయన చెయ్యి పట్టుకుని కంగారుగా అడిగాడు రుద్ర.. "మరి దీనికి పరిష్కారం మార్గమే లేదా రుద్ర.?" అని నీరసంగా అడిగారు గోవింద రావు.. "నేను చదివిన దాని బట్టి, పరిష్కార మార్గం ఏమీ లేదు గురువుగారు...!!" అని బాధగా తలవంచుకుని చెప్పాడు.. ఆ మాటలు విన్న గోవింద రావు గారు తలవంచుకుని కన్నీళ్లు పెట్టుకోసాగారు.. ఆయన బాధ చూసి రుద్ర మనసు కూడా ద్రవించి పోయింది.. బాధగా ఏదో ఆలోచిస్తున్న రుద్ర ఒక్కసారిగా ఏదో తట్టినట్టు.."గురువుగారు నాదొక చిన్న సలహా..!!" అని చెప్పాడు రుద్ర.. " చెప్పు రుద్ర..!!" అని అన్నారు గోవింద రావు.. "నాకు తెలిసిన ఒక మహా తాంత్రికుడు ఉన్నారు. ఆయన పేరు సిద్ద భైరవ.. ఆయనను కలిస్తే,తప్పకుండా మనం సమస్యకు పరిష్కారం ఉంటుంది.. గురుదేవా...!!" " అవునా..!! ఆయన ఎక్కడ ఉంటారు..!" కుతూహలంగా అడిగాడు గోవింద రావు. "నాకు కూడా పూర్తిగా తెలియదు. కానీ మా నాన్న గారు చెప్పగా తెలిసింది.. కర్ణాటక లోని హళేబీడు లో ప్రముఖ హొయసలేశ్వర ఆలయం ఉంది..ఆలయానికి కొద్ది దూరంలో ఒక మారుమూల గ్రామం ఉంది. ఆ గ్రామంలో తాంత్రికులు ఆరాధ్య దేవత అయిన ప్రత్యంగిరా దేవి మాత ఆలయం ఉంది.ఆయన అక్కడ ఉంటారని, ఆయన దగ్గరే శిష్యరికం చేశాను అని మా నాన్నగారు చెప్పారు.." "సరే..!!రేపే బయలుదేరదాం.. అమావాస్య ఘడియలు వచ్చేలోపు తిరిగి మనం ఇక్కడ ఉండాలి..!" అన్నారు గోవింద రావు.. "కానీ గురువుగారు..! మీరు ఇంకా యాక్సిడెంట్ లో తగిలిన దెబ్బల నుండి పూర్తిగా కోలుకోలేదు..ఈ పరిస్థితుల్లో అంత దూరం ప్రయాణం మీకు మంచిది కాదు. నేనొక్కడినే వెళ్లి వస్తాను.."అని అన్నాడు రుద్ర.. " నా ఆరోగ్యం గురించి నాకు ఎటువంటి భయం లేదు నాయనా..!! నా దిగులంతా వాడి గురించే..! నా ఆరోగ్యం కోసం చూసుకుని, వాడిని ఈ పరిస్థితుల్లో వదిలేయలేను.. నాకేం పర్వాలేదు రేపే బయలుదేరాలి...!!" " రుద్ర చెప్పేది నిజమే..!ఈ పరిస్థితుల్లో నువ్వు బయలుదేరడం అవసరమా.. తాతయ్య??" అని ఆదిత్య మాటలు వెనకనుండి వినిపించాయి.. ఇద్దరు వెంటనే వెనక్కి తిరిగి చూశారు... వాళ్ళ వెనకాల ఆదిత్య నుంచుని ఉన్నాడు.. " నువ్వు ఎప్పుడొచ్చావ్ బాబు..??" అని అడిగారు గోవింద రావు.. " మీరు మేడపైకి వస్తున్నప్పుడు నీ వెనకాల నేను వచ్చాను.. కానీ రుద్ర తో మీరు మాట్లాడుతూ ఉండటం చూసి మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా కిందకి వెళ్లి పోదామనుకున్నా, కానీ నా గురించి సంభాషణ వచ్చేసరికి మాట్లాడకుండా మొత్తం విన్నాను.. "అని చెప్పాడు ఆదిత్య... గోవింద రావు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు... ఆదిత్య ఆయన దగ్గరకు వచ్చి," మీరేమి నా గురించి భయపడకండి తాతయ్య..!! నేను రుద్ర ఇద్దరం కలిసి వెళ్లి ఆయనను కలుస్తాం.."అని చెప్పగానే.. " వద్దురా... ఈ పరిస్థితుల్లో ఇల్లు దాటి బయటకి వెళ్ళడం, నీకు చాలా ప్రమాదం.. నీకు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను.." అని కన్నీళ్లు పెట్టుకో సాగారు గోవింద రావు.. ఆదిత్య ఆయన భుజంపై చేయి వేసి " తాతయ్య ఎప్పుడో వచ్చే చావు గురించి నేను భయపడి చేతకాని వాడిలా ఇక్కడ కూర్చోలేను.నా గురించి మీరు అందరూ ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు.. జరగబోయే ప్రమాదాన్ని నేను ధైర్యంగా ఎదుర్కోగలను అనే నమ్మకం నాకుంది. కాబట్టి నా మీద నమ్మకం ఉంచి నన్ను బయలుదేరనివ్వండి.." అని ఆదిత్య అనగానే.. అయిష్టంగానే ఒప్పుకొని..." జాగ్రత్త ఆదిత్య..!! ఎట్టి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోవద్దు.. ఆ జగన్మాత ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి.."అంటూ ఆశీర్వదించారు.. "నువ్వేమంటావ్ రుద్ర...?!" అని ఆదిత్య అడగగానే.. రుద్ర నవ్వుతూ ఆదిత్య భుజంపై చేయి వేసి," వెరీగుడ్ ఆదిత్య..!! నీలో ఈ ధైర్యం చూస్తుంటే మనం సాధించగలం అనిపిస్తుంది.. రేపే మనం బయలుదేరుతున్నాం.." "మంచిది నాయనా..!!" జాగ్రత్తగా వెళ్లండి..! పొద్దున 10 గంటలకి శుభ ఘడియలు మొదలవుతాయి. అప్పుడు బయలుదేరండి. అంతా శుభం జరుగుతుంది..!" అని అన్నారు గోవింద రావు.. సరే అని చెప్పి అందరూ ఎవరి గదుల్లొకి వారు వెళ్ళీ నిద్ర పోయారు.. ఆ మర్నాడు ఉదయం 9 గంటలకే ఆదిత్య రుద్ర లేచి రెడీ అయ్యారు.. పొద్దున్నే నిద్ర మత్తుతో లేచి, ఆదిత్య ఏం చేస్తున్నాడని చూడడానికి అతని గదికి వెళ్ళింది భాను.. అప్పటికే ఆదిత్య రెడీ అయ్యి, లగేజ్ సర్దుకున్నాడు.. భాను కి ఆదిత్య ఎక్కడికి వెళుతున్నారో అర్థం కాక.." ఎక్కడికి సార్ ఇంత పొద్దున్నే..?? లగేజ్ కూడా సర్దుకుంటున్నారు ఎందుకు..??" అంటూ కొంచెం ఆతృతగా అడిగింది.. "హాయ్ భాను లేచావా.? సారీ..!! చెప్పడం మర్చిపోయాను.. పని మీద ఊరెళ్తున్నాను.."అని చెప్పగానే భాను మొఖం కళావిహీనం అయింది.. " అవునా ఎన్ని రోజుల్లో వస్తారు..??" అని ముభావంగా అడిగింది.. " చెప్పలేను..! ఒక పది, పదిహేను రోజులు పట్టొచ్చు. అంతకంటే ఎక్కువ కూడా అవ్వచ్చు..." అంటూ అటువైపు తిరిగి బట్టలు సర్దుకోసాగాడు. ఆ మాటల విన్న భాను ఏం మాట్లాడకుండా ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది.. ఆమె ఏడుపు శబ్దం విని వెనక్కి తిరిగాడు. కానీ అక్కడ లేదు.. ఏమైందో అని ఖంగారు పడుతూ భాను రూం కి వెళ్ళాడు.. అక్కడ మంచంపై పడుకుని ఏడుస్తూ ఉంది.. ఆదిత్య ఆమె మంచం దగ్గరికి వెళ్ళి, "ఏమైంది భాను...?"అని అడిగాడు.. తను మాత్రం సమాధానం చెప్పకుండా ఏడుస్తూనే ఉంది.. ఆదిత్య కి తన ఎందుకు ఏడుస్తుందో అర్థం కావడం లేదు. అందుకే ఆమె దగ్గరగా వెళ్లి మంచం పై ఉన్న ఆమె భుజంపై చేయి వేశాడు.. ఆదిత్య ఆమె భుజంపై చేయి వేయగానే, హఠాత్తుగా లేచి ఆదిత్యని గట్టిగా వాటేసుకుని ఏడవసాగింది.. ఈ హఠాత్పరిణామానికి ఆదిత్య ఆశ్చర్యపోయాడు.. భాను అలా గట్టిగా కౌగిలించుకోవడంతో, మొదటిసారి స్త్రీ స్పర్శ తగ్గడం వల్ల, శరీరంలో ఏదేదో జరగసాగింది.. ఆదిత్య మాత్రం ఉక్కిరిబిక్కిరవుతూ..!! " భాను ఏంటిది..? ప్లీజ్ ఎవరైనా చూస్తే బాగోదు..?" అని అంటూ ఆమె కౌగిలి నుండి బయటపడాలని ప్రయత్నిస్తున్నాడే కానీ ఆమె పట్టు నుంచి బయటికి రాలేకపోతున్నాడు.. కానీ భాను మాత్రం. " ప్లీజ్..!! నన్ను వదిలి వెళ్ళకండి... మీరంటే నాకిష్టం.. ఐ లవ్ యు..!!" అంటూ ఏడవసాగింది.. ఆ మాటలు విన్న ఆదిత్య ఆశ్చర్యపోయాడు. కానీ తనకు ఇష్టం లేదన్న మాట మాత్రం తన నోటి నుండి రావడం లేదు.. ఎందుకంటే తనకి తెలియకుండానే తను కూడా భానుని ఇష్టపడుతున్నాడు అన్న సంగతి తనకు తెలుసు.. "ప్లీజ్ బాను వదులు..!! ఎవరైనా చూస్తే బాగోదు." " లేదు..!! మీరు కూడా నన్ను ఇష్టపడుతున్నారో, లేదో చెప్తేగాని వదలను..!!"అంటూ తన గుండెలపై తలపెట్టి ఏడవసాగింది.. ఆదిత్య నవ్వుతూ " నాక్కూడా నువ్వంటే చాలా ఇష్టం.. కానీ చెప్పటం కుదరలేదు.." అని అనగానే ఆదిత్య కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ " నిజంగా నేనంటే మీకిష్టమేనా అని అడిగింది..??" ఆదిత్య ఆమె ముఖాన్ని తన రెండు చేతులలోకి తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టి "ఐ లవ్ యు" అన్నాడు.. ఆదిత్య ఐ లవ్ యు చెప్పగానే ఆనందంతో అతని ముఖం మీద ముద్దులు కురిపించింది భాను.. ఆదిత్య కూడా ఆనందంతో ఆమె పెదాలపై గాఢంగా ముద్దు పెట్టాడు.. ఇద్దరూ అలా, చాలా సేపు ఉండి పోయారు.. ఇంతలో బయలుదేరే సమయం కావడంతో, రుద్ర ఆదిత్య కోసం అతని గదికి బయలుదేరాడు.. ఆదిత్య గదికి వెళ్లే దారిలోనే ఉంది భాను గది. భాను గది కిటికీ లోంచి ఆదిత్య కనిపించగానే, గదిలోకి వెళ్ళబోయాడు.. సరిగ్గా ఆ గదిలోకి వెళ్లబోతుండగానే... ఆదిత్య భానుని ముద్దు పెట్టుకుంటున్నాడు.. ఒక్కసారిగా లోపలికి వెళ్ళేవాడు కాస్త...వెంటనే గోడకి కొట్టిన బంతిలా తిరిగొచ్చాడు.. "అబ్బో...! వీళ్లిద్దరి మధ్య ఈ మేటర్ ఎప్పటి నుండి నడుస్తుంది...??? ఇప్పుడు ఎలా పిలిచేది.?" అంటూ గది బయట కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరగసాగాడు... ఇంతలో అటువైపుగా మంజునాథ రావుగారు, గోవింద రావు మాట్లాడుకుంటూ వస్తున్నారు.. భాను గది బయట అటు ఇటు తిరుగుతున్న రుద్ర ని చూశారు.. "ఏం రుద్ర..? ఇక్కడ ఏం చేస్తున్నావ్..?ఆదిత్య ఎక్కడ..?" అని అడగడంతో సిగ్గుతో ఏం చెప్పాలో రుద్ర కి అర్థం కాలేదు.. "అదేంటంటే గురువుగారు..?? అది..? అది...?" అంటు నసగడంతో... ఇద్దరూ అనుమానంతో గదిలోకి చూశారు... గదిలో ఆ స్థితిలో ఉన్న వారిద్దరిని చూడగానే.. మంజునాథ రావు, గోవింద రావు ఒక్క క్షణం షాక్ అయి ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నారు. మరుక్షణం..!! " చూడు రుద్ర..!! వాళ్లని వెంటనే మమ్మల్ని కలవమని చెప్పు..!"అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు... రుద్ర మళ్ళా గది లోకి చూసాడు.. ఇద్దరూ ఇంకా ఆ స్థితిలోనే ఉన్నారు.. రుద్ర కి ఏం చేయాలో అర్థం కాక, తలుపు గట్టిగా కొట్టి, ముందుకు వెళ్ళాడు... తలుపు శబ్దం రావడంతో ఇద్దరూ కంగారుగా, దూరం జరిగి బయటకు వచ్చారు.. బయట రుద్ర ఉండడంతో, "నువ్వెప్పుడు వచ్చావ్ రుద్రా..??"అది కొంచెం సిగ్గుపడుతూ అడిగాడు.. " చూడు బ్రదర్...!!నేను వచ్చి చాలా సేపు అయింది.జస్ట్ ఇంతకుముందే మీ తాతగారు, భాను తాత గారు వచ్చి మిమ్మల్ని చూసి వెళ్లారు.. మిమ్మల్ని వచ్చి కలవమన్నారు.. ఇక పదండి..!!" అంటూ వెళ్ళిపోయాడు. వాళ్లు చూశారు అని తెలియగానే.. వీళ్ళిద్దరికీ కంగారు మొదలయ్యింది... ఇద్దరూ కొంచెం జంకుతూ హాల్ లోకి వెళ్లారు.. అక్కడ మంజునాథ రావు, గోవింద రావు ఉన్నారు. " ఏరా..? ఎన్ని రోజులనుంచి జరుగుతోంది. మీ వ్యవహారం..??" అని అడిగారు గోవింద రావు. "ఎన్నో రోజుల నుంచి కాదు తాతయ్య.. జస్ట్ ఇప్పుడే..."అంటూ నసిగాడు ఆదిత్య.. "మరి నువ్వు తల్లి...??"అంటూ భాను అని అడిగాడు మంజునాథ రావు.. " నాకు ఆదిత్య గారు అంటే ఇష్టం తాతయ్య...!!"అంటూ భయపడుతూ చెప్పింది.. "మరి నీ విషయం..??"అని అడిగాడు గోవింద రావు.. " నాక్కూడా తనంటే చాలా ఇష్టం తాతయ్య..!"అని చెప్పాడు ఆదిత్య.. ఏం జరగబోతుందో అని ఉత్కంఠతో చూస్తున్నాడు రుద్ర.. మంజునాథ రావు, గోవింద రావు ఇద్దరూ ఒక్కసారిగా పగలబడి నవ్వారు.. "మంచిదిరా...!! మేమే మీ పెళ్లి గురించి మాట్లాడుకుందాం అని అనుకుంటున్నాము. ఇద్దరు ప్రేమించుకొని మంచి పని చేశారు.." అని అనడంతో ఆదిత్య, భాను చాలా సంతోషించారు. రుద్ర కూడా తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు.. "ఏరా రావు..? మరి పెళ్లి ఎప్పుడు చేద్దాం.??" అని అడిగారు మంజునాథ రావు... " తాతగారు కొద్ది రోజులు ఆగండి.. నేను ఈ గండం నుంచి బయట పడ్డాక నా పెళ్లి జరుగుతుంది..!!"అని ఆదిత్య అనడంతో అందరూ సరే అన్నారు.. సమయం పది గంటలు అయింది.. పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకుని, అక్కడ నుంచి బయలుదేరారు. డ్రైవింగ్ డ్యూటీ రుద్ర తీసుకున్నాడు.. శ్రీశైలం నుంచి హళేబీడు 600 కిలోమీటర్ల పైనే దూరం ఉంటుంది.. మంచి మధ్యలో కొంచెం సేపు ఆగుతూ,16 గంటలు జర్నీ తర్వాత వాళ్లు కర్ణాటక చేరుకున్నారు.. హలేబీడు చేరుకునే సరికి బాగా రాత్రి అయిపోయింది. ఆ రాత్రికి అక్కడే ఒక హోటల్లో రూం తీసుకుని, మరుసటిరోజు ఉదయాన్నే హొయసలేశ్వర ఆలయంలో పరమేశ్వరుని దర్శించుకుని, ఆ తర్వాత సిద్ధ భైరవుల ను కలవడానికి ఆయన ఉంటున్న గ్రామానికి బయలుదేరారు.. వారు వెళ్ళవలసిన గ్రామం వారు బయలుదేరిన ప్రదేశం నుండి 18 కిలోమీటర్ల దూరం ఉంటుంది.. ఒక్క గంట ప్రయాణం తర్వాత ఆలయానికి చేరుకున్నారు.. ఆలయం లోపలికి ప్రవేశించారు.. లోపల కొంత మంది భక్తులు పూజారి ఉన్నారు. ఆయన వయస్సు 60 సంవత్సరాలు పైనే ఉంటుంది.. రుద్ర, ఆదిత్య ఆయన దగ్గరికి వెళ్లారు.. రుద్ర ఆయనతో కన్నడలో ఏదో మాట్లాడసాగాడు.. రుద్ర బెంగళూరులో చదువుకున్నాడు... అందువల్ల అతనికి కన్నడ భాష తెలుసు... అయితే ఒక నిమిషం మాట్లాడిన తర్వాత తిరిగి ఆదిత్య దగ్గరికి వచ్చాడు.. " ఆయన గురించి ఏమైనా చెప్పారా..??"అని అడిగాడు ఆదిత్య.. " అడిగాను..! ఒక్క నిమిషం మనల్ని కూర్చోమన్నారు..!!" అని చెప్పాడు రుద్ర.. సరే అని చెప్పి ఆలయ ప్రాంగణం లోనే కూర్చున్నారు. అమ్మవారి కేసి చూస్తూ ఉన్నాడు ఆదిత్య.. తను చాలా దేవతా విగ్రహాలను చూశాడు.. కానీ ముఖం సింహం రూపంలో ఉన్న ప్రత్యంగిరాదేవిని చూసి, ఆ తల్లి గురించి తెలుసుకోవాలని కుతూహలం తో రుద్ర అని అడిగాడు.. " రుద్రా..!! నేను నా దేవత విగ్రహాలను చూశాను కానీ ఈ రూపంలో ఉన్న అమ్మవారిని ఇదే మొదటిసారి చూడడం..!! ఇంతకుముందు నేను ఈ అమ్మవారి పేరు వినడం కానీ, చూడడం గానీ జరగలేదు.. నాకు ఈ అమ్మవారి కథ తెలుసుకోవాలని ఉంది..!!" అని అడిగాడు... " ఈ అమ్మవారు శక్తి స్వరూపిణి....!! పరమేశ్వరి అవతారం..!! దుష్ట శక్తులకు అమ్మవారంటే హడల్..!! ఈ అమ్మవారికి నారసింహిని అనే పేరు కూడా ఉంది..!! మావంటి తాంత్రికులకు ఆరాధ్య దైవం..!! ఎటువంటి దుష్ట పీడలైన అమ్మవారి పేరు స్మరిస్తే పారిపోతాయి..!!" అంటూ అమ్మవారి గురించి రుద్ర వివరిస్తూ ఉండగా పూజారి వారి వద్దకు వచ్చారు.. పూజారి చూసి పైకి లేవబోతు ఉండగా, అయినా వాళ్ళకి కూర్చోమని చెప్పి వాళ్ల దగ్గర కూర్చున్నారు.. " నమస్కారం..! నా పేరు సిద్ధప్ప...!! మీరు ఎక్కడి నుంచి వచ్చారు..??" అని అడిగారు పూజారి.. "నమస్కారం సిద్దప్ప గారు..!! నా పేరు రుద్ర ఇతని పేరు ఆదిత్య,మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాం..!! సిద్ధ భైరవ గారిని కలవడానికి వచ్చాము.. ఆయన ఎక్కడ ఉన్నారు చెప్పగలరా..!!??" అని అడిగాడు రుద్ర. సిద్ధప్ప కొంచెం దిగాలుగా మొహం పెట్టి, " ఆయన ప్రస్తుతం ఇక్కడ ఉండటం లేదు బాబు..!! ఈ గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయారు..!!"అని నెమ్మదిగా చెప్పారు.. ఆయన మాట విన్న రుద్ర ఒక్క క్షణం షాక్ కి లోనయ్యాడు.. ఏమైందని ఆదిత్య అడగడంతో రుద్ర ఆయన చెప్పింది చెప్పాడు.. ఆదిత్య కి కూడా మతిపోయినంత పనైంది.. " ఎందుకు వెళ్లిపోయారు స్వామి..??" అని అడిగాడు రుద్ర.. " అదంతా మేము చేసుకున్న కర్మ బాబు..!! ఒకడు చేసిన తప్పు వల్ల ఆ మహానుభావుడు మమ్మల్ని వదిలి వెళ్లిపోయారు..!" అంటూ బాధ పడ సాగారు.. " అయ్యా తమరు కొంచెం పూర్తిగా మాకు అర్థమయ్యే విధంగా వివరించి చెప్పండి.. అసలు ఏం జరిగింది..?? అని అడిగాడు. రుద్ర " సిద్ధ భైరవ స్వామి చాలా మంచివారు.. గ్రామంలో ఎవరికి గాలి సోకినా, దుష్ట పీడలు సోకినా ఆయనే నయం చేసేవారు.. ఆయన ఇక్కడ దగ్గర్లో ఉన్న అడవి నుంచి మూలికలు తెచ్చి, ఇక్కడి ప్రజలకు వైద్యం చేసేవారు. ఆయనకి ఊళ్లో అందరూ చాలా మర్యాద ఇచ్చేవారు.. ఈ ఊరిలో విజయదశమి పండుగని చాలా ఘనంగా జరుపుకుంటారు.. చుట్టుపక్కల పది గ్రామాల నుండి ప్రజలు అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తారు. ఈ గ్రామస్తులు ఎవరైనా పక్క ఊళ్ళో పని చేసుకుంటున్నా, చదువుకుంటున్న సరే ఆ రోజు అమ్మవారిని దర్శించుకోవడానికి కచ్చితంగా ఇక్కడికి వస్తారు.. అలా కిందటి సంవత్సరం విజయదశమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.. ఆ తర్వాత జరిగిన ఒక సంఘటన వల్ల, సిద్ద భైరవ గారు ఈ ఊరు వదిలి వెళ్ళిపోయారు. " ఆ సంఘటన ఏంటండీ..!!?" అని అడిగాడు రుద్ర.. " క్రితం సంవత్సరం అమ్మవారి విజయదశమి ఉత్సవాలు ఘనంగా మొదలయ్యాయి.. వాటిని మా ఊరి పెద్ద విజెంద్ర ఘనంగా జరిపించాడు.ఉత్సవాలకి తన బంధువులందరిని, తన కూతురు అత్తవారింటి వారందరినీ కూడా పిలిచాడు.. ఉత్సవాలు ఘనంగా పూర్తయ్యాయి.వారి బంధువులు అందరూ వాళ్ళ ఇళ్ళకు తిరిగి ప్రయాణం అయ్యేటప్పుడు అనుకోని ఒక సంఘటన జరిగింది.. ఆయన వియ్యంకుడు రఘురాజ్ అకస్మాత్తుగా విచిత్రంగా ప్రవర్తిస్తూ అనారోగ్యం పాలయ్యాడు.. ఇంటిలో ఆయన గురించి అందరూ బాధపడుతున్నప్పుడు, ఊరిలో ఒక పెద్దమనిషి ఇచ్చిన సలహాతో ఆయనను సిద్ధ భైరవ గారి దగ్గరికి తీసుకు వచ్చారు.. ఆయన అతన్ని పూర్తిగా పరిశీలించి, "ముందురోజు రాత్రి ఎక్కడికి వెళ్లి వచ్చారు.?" అని అడగగా.. ఆయనకు ఈవెనింగ్ వాకింగ్ అలవాటని, నిన్న ఊరి పొలిమేరలు దాటి వెళ్ళారని అతని భార్య చెప్పగా.. అయినా విజేంద్ర వైపు చూసి.." మీరు ఊరి కట్టుబాట్ల గురించి, ఉత్సవాల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వీరికి చెప్పలేదా...??" అని అడిగారు.. లేదన్నట్లుగా తల అడ్డంగా ఊపాడు.విజేంద్ర నిబంధన ఏమిటని రఘురాజ్ భార్య అడిగింది. "చూడండి తల్లి..అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఈ గ్రామస్తులు గాని ఇక్కడ నివసించే వారు ఎవరైనా సరే..ఈ ఊరి పొలిమేరలు దాటకూడదు.. ఎందుకంటే ఆ సమయంలో దృష్టశక్తులు అమ్మవారి శక్తులకు భయపడి, ఊరి పొలిమేరలు అవతల తిరుగుతూ ఉంటాయి.. ఈయన ఊరి పొలిమేరలు దాటడం వల్ల, ఈయనను ఒక దుష్ట శక్తి ఆవహించింది.. ఇప్పుడు మనం వెంటనే దానిని వదిలించాలి. వెంటనే క్రతువు జరిపించాలి..లేకపోతే ఈయన ప్రాణానికి చాలా ప్రమాదం..." అని చెప్పారు.. రఘురాజ్ కూతురు అడ్డు చెప్పినా..ఆయన భార్య ఒప్పుకోవడంతో...!! ఈ గుడిలోనే ఆయనకు పట్టిన దుష్ట శక్తిని వదిలించేందుకు ఏర్పాట్లు చేశారు.. హోమగుండం వెలిగించి,క్రతువు ప్రారంభించారు.. సిద్ధ భైరవులు మంత్రాలు చదువుతూ ఉండగా...రఘురాజ్ శరీరంలోని దుష్ట శక్తి తీవ్రంగా ప్రతిఘటించసాగింది... ఆయన మంత్రశక్తి ముందు ఆ దుష్ట శక్తి నిలబడలేక పోతోంది.. అలా నిర్విఘ్నంగా జరుగుతున్న క్రతువు ఇంకో రెండు గంటల్లో ముగుస్తుంది అనగా.... ఒక్కసారిగా హోమగుండంలో నీళ్ళు పడ్డాయి... భగ భగ మండుతున్న హోమగుండం ఆరిపోయింది... సిద్ధ భైరవులు క్రతువును భగ్నం చేసింది ఎవరా అని కోపంగా తిరిగి చూశారు... ఇంకా ఉంది......!!!!
20-03-2026, 11:57 AM
Part - 24
జరిగినదేమిటో సిద్ధప్ప కన్నడలో చెప్పుతుండగా.
రుద్ర ఆదిత్య కి తెలుగులో అర్థం చెప్తున్నాడు.. "ఎవరు అలా చేసింది.??" అని ఒక్కసారిగా ఇద్దరు సిద్దప్పను అడిగారు... అలా చేసింది రఘురాజ్ కొడుకు..!! అతను బెంగుళూరు ఉంటాడు.. తన తండ్రి కోసం చేస్తున్న క్రతువు,అతని కూతురుకు నచ్చకపోవడంతో,వెంటనే తన అన్నకు ఫోన్ చేసి చెప్పింది.. అతను వెంటనే ఇక్కడకు చేరుకుని,ఆ క్రతువు ఆపేశాడు.. ఆ క్రతువు ఆగిపోయిన వెంటనే రఘురాజ్ శరీరంలో చలనం కూడా ఆగిపోయింది. చుట్టు ఉన్న వారు అలా తీసుకు వెళ్ళొద్దని, చెప్తున్నా సరే, వినకుండా అందర్నీ తిడుతూ, తన తండ్రిని, బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకుపోయాడు.. అతని సిటీలో ఉన్న హాస్పిటల్కి తీసుకు వెళ్ళాడు. అక్కడ ఎన్ని పరీక్షలు చేసినా అతనికి వచ్చిన రోగం ఏంటో తెలుసుకోలేక పోయారు.. చివరగా రెండు రోజుల పాటు ప్రాణాల కోసం పోరాడుతూ రఘు రాజ్ కన్నుమూసాడు.. తన తండ్రి చావుకి సిద్ధ భైరవులే కారణం అంటూ, సెక్యూరిటీ అధికారి స్టేషన్లో కంప్లైంట్ చేసి, ఆయనను అరెస్టు చేయించాడు.. ఆ సమయంలో ఊర్లో వాళ్లు కూడా వాళ్ళని ఆపలేకపోయారు.. చివరికి రఘు రాజ్ భార్య సిద్ధ భైరవులను సపోర్ట్ చేయడంతో వారం రోజుల పాటు జైల్లో ఉంచిన తర్వాత, సాక్ష్యాధారాలు లేకపోయేసరికి, ఆయనను విడిచి పెట్టారు... ఆ సంఘటన వల్ల ఆయన మనసు చాలా గాయపడింది.. సిద్ధ భైరవులు చాలా శాంత స్వభావం కలిగినవారు.. ఎవరి నుంచి ధనం ఆశించే వారు కాదు. గుడి ద్వారా వచ్చిన ఆదాయంలో ఆయనకు కొంత భాగం చేరేది.. అది చాలా తక్కువ.. నిస్వార్ధంగా సేవ చేసే వారు.. ఊరు బాగు కోసం ఎంతో సేవ చేసేవారు.. రైతులు పంటలు పండించాలి అన్నా, ఎవరి ఇంట్లోనైనా శుభకార్యానికి ముహూర్తాలు చూడాలి అన్నా, ఆయనను సంప్రదించే వారు.. అటువంటి మనిషి కి కష్టం వస్తే ఊర్లో వాళ్లు ఎవరు తోడు రాకపోయేసరికి, ఆయన మనసు గాయపడింది... జైలు నుంచి విడుదలైన మరుక్షణం,ఆయన ఆ అడవిలోకి వెళ్ళిపోయారు.. ఆయన వెళ్లిన తర్వాత ఊర్లో పరిస్థితులు తారుమారు అయిపోయాయి.. పంటలు సరిగా పండటం లేదు. ఎటు చూసిన చెడు శకునాలు కనిపిస్తూ ఉన్నాయి.. ఎవరికి మంచి చెప్పే దిక్కు లేకుండా పోయింది.."అని జరిగిన సంఘటన వివరించారు సిద్దప్ప.. "అయితే ఆయన మళ్ళీ తిరిగి రాలేదా...??" అని అడిగాడు రుద్ర.. "లేదు బాబు.! " అని బాధగా సమాధానమిచ్చాడు.. సిద్ధప్ప "అయితే ఇప్పుడు ఏం చేద్దాం..??"అని అడిగాడు ఆదిత్య. "చేసేదేముంది..! మనం కూడా ఆయన కోసం వెళ్దాం..!"అని అన్నాడు.రుద్ర.. తెలుగులో మాట్లాడుకుంటున్న వారిని, చూస్తూ ఏంటని అడిగాడు... " మేము ఆయన కోసం అడవిలోకి వెళ్లబోతున్నాం..!!" అని చెప్పాడు.. ఆ మాటలు విన్న సిద్ధప్ప ఒక్కసారిగా లేచి నుంచుని.. " ఏంటి..? ఆ అడవిలో కి వెళ్తారా..??" అంటూ ఆశ్చర్యంగా అడిగాడు.. సిద్ధప్ప అలా ఒక్కసారిగా లేచి నుంచునేసరికి, వారిద్దరు కూడా కంగారుగా లేచి నుంచున్నారు.. "ఏమైంది సిద్దప్ప గారు...??"అని అడిగాడు రుద్ర... " ఆ అడవికి వెళ్ళద్దు బాబు..!! చాలా ప్రమాదం....! అడవికి వెళ్ళిన వారు చాలా మంది చనిపోయారు... మిగిలిన వారు పిచ్చివాళ్లైపోయారు..!!" అని బెదిరిపోతూ, సమాధానమిచ్చాడు.. ఆదిత్య కి సిద్ధప్ప మాట్లాడుతుంది ఏమిటో అర్థంకాక ఏమైందని రుద్రని అడిగాడు.. రుద్రకి సిద్ధప్ప చెప్పింది. ఆదిత్యకి చెప్పాడు... ఆ మాటలకి ఆదిత్య కూడా ఆశ్చర్యపోయాడు.. "అసలు అలా ఎందుకు జరుగుతోంది..? ఏమైంది..?"అని సిద్దప్పని అడిగాడు రుద్ర.. "దీనివెనుక చాలా పెద్ద కథే ఉంది బాబు..!! పూర్వం ఈ ప్రాంతమంతా పెద్ద అడవి.. ప్రస్తుతం ఉన్న ఊరు చుట్టుపక్కల గ్రామాలు కూడా ఆ అడవిలోనే ఉండేవి.. ఈ అడవిలోనే చాలామంది తాంత్రికులు క్షుద్రోపాసన చేసేవారు.జంతు బలులు, నరబలులు కూడా ఇచ్చేవారు." "వారు చేసే క్షుద్ర ఉపాసనల వల్ల,ఈ ప్రాంతమంతా భయంకరమైన ప్రేతాత్మలు, పిశాచాలు, తిరుగుతూ ఉండేది.. ఎంతోమంది అమాయకులు వాటిబారిన పడి బాధలు పడేవారు.. " "ఇలా జరుగుతూ ఉండగా ఒకనాడు ఈ ప్రాంతానికి మంచ్రేకరుడు అనే తాంత్రికుడు వచ్చారు.ఆయన ప్రత్యంగిరాదేవి ఉపాసకుడు...మహా శక్తి వంతుడు.." "ఆయన దేశ సంచారం చేస్తున్న సమయంలో ఈ ప్రాంతానికి వచ్చారు.. ఇక్కడ దుష్ట శక్తులు చేస్తున్న చూసి ఆయన ఆశ్చర్యపోయాడు.. దానికి కారణం అక్కడ ఉన్న తాంత్రికులు అని తెలుసుకొని, వాళ్ల దగ్గరికి వెళ్లి ఇటువంటి పనులు మానమని హెచ్చరించారు.." "ఆయన అలా హెచ్చరించడంతో వాళ్లకి చాలా కోపం వచ్చింది.. ఆయనను అంతం చేయడానికి,తమ అదుపులో ఉన్న దుష్టశక్తులను ఆయన మీదకి పంపించారు.." "ఆయన మహా శక్తిమంతుడు.. ప్రత్యంగిరా దేవి అనుగ్రహం కలిగినవాడు.. " "ఆయనకు వాటిని ఎలా అదుపు చేయాలో తెలుసు...వెంటనే తన మీదకి పంపిన దుష్ట శక్తులన్నిటినీ వారి మీదకే తిప్పి పంపాడు... అవి ఆ తాంత్రికులందరిని చంపేశాయి.." "అవన్నీ తిరిగి గ్రామాలలోకి రాకుండా, తన మంత్ర శక్తితో వాటిని అడవిలోనే బంధించాడు.. గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం గ్రామంలో ప్రత్యంగిరా దేవి గుడి కట్టించారు." "సామాన్యుల ఎవరు ఆ అడవిలోకి వెళ్ళకూడదని ఆనాడే శాసనం చేయబడింది.. అందుకే సిద్ధ భైరవులు గారు వెళుతున్నా సరే, ఆయనతో పాటు మేము వెళ్ళే ధైర్యం చేయలేకపోయాము.." అంటూ ఆ అడవి గురించి వివరించారు సిద్దప్ప.. సిద్ధప్ప చెప్పినదంతా విన్నారు... "అయితే ఇప్పుడు ఏం చేద్దాం??" అని అడిగాడు ఆదిత్య.. "నాకు అదే అర్థం కావడం లేదు..!!"అని అన్నాడు రుద్ర.. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుండగా గుడి బయట ఒక్కసారిగా కలకలం చెలరేగింది...!! ఏమైందో అని ఖంగారు పడుతూ ముగ్గురు గుడి బయటకు పరుగులు తీశారు... కొంత మంది గ్రామస్తులు గ్రామంలోకి పరుగులు పెడుతున్నారు.. సిద్ధప్ప వేగంగా వెళ్లి, వారిలో ఒక గ్రామస్తుడిని ఏమైందని అడిగాడు.. అతను చెప్పింది విన్న తర్వాత, తిరిగి ఆదిత్య రుద్ర వద్దకు వచ్చాడు.. " ఏమైంది స్వామి..?" అని ఆందోళనగా అడిగాడు రుద్ర.. "హొయసలేశ్వర స్వామివారిని దర్శించుకునే కొంత మంది టూరిస్టులు, ఈ అమ్మవారిని కూడా దర్శించుకోవడం మామూలే.." "నిన్న కూడా 10 మంది కాలేజీ పిల్లలు ఈ గ్రామానికి వచ్చారు.. ఈ అడవి గురించి ఇక్కడకు వచ్చే యాత్రికులకు మేము అడవిలోకి వెళ్లద్దొని చెప్తునే ఉంటాము.." "కానీ...!! నిన్న సాయంత్రం వాళ్లలో ఇద్దరమ్మాయిలు ఆ అడవిలోకి వెళ్లి, ఇప్పటి వరకు తిరిగి రాలేదట..మిగిలిన వాళ్ళు కంగారుపడుతున్నారు.." అని చెప్పాడు సిద్ధప్ప.. అదే విషయాన్ని ఆదిత్య కి చెప్పాడు రుద్ర.. వెంటనే వాళ్ళిద్దరూ కూడా గ్రామస్తులు వెళుతున్న వైపు పరుగులు తీశారు... వాళ్లు వెళ్లేసరికి కాలేజీ బస్సు దగ్గర కొంతమంది స్టూడెంట్స్ తో సెక్యూరిటీ ఆఫీసర్లు మాట్లాడుతున్నారు. " అడవిలోకి ఎంతమంది వెళ్లారు..??" అని అడిగాడు ఎస్ ఐ, స్టూడెంట్స్ ని.. " ఇద్దరు సార్...??"అంటూ ఏడుస్తూ చెప్పింది.ఒక అమ్మాయి " పేర్లేంటి..!??" " కృతిక, అలైక్య..సార్...!! " "అసలు ఆ అడవిలోకి వెళ్తే ప్రమాదమని తెలిసి,ఎందుకు వెళ్లారు...??" అంటూ కోప్పడ్డాడు ఎస్ ఐ... "నిన్న మేము ఇక్కడకు వచ్చినప్పుడు,ఇక్కడి వాళ్ళు వెళ్ళొద్దని చెప్పారు..!! కానీ మా వాళ్ళు అవి కట్టుకధలని, వెళ్దామని అంటే,మేము వెళ్ళొద్దని చెప్పాము సార్..!కానీ మాకు చెప్పకుండా నిన్న సాయంత్రం వెళ్లారు...!! వాళ్ళ ఫోన్స్ కూడా వర్క్ చెయ్యడం లేదు..! మాకు చాలా కంగారుగా ఉంది.." అంటూ ఏడవసాగింది..!! వాళ్ల సంభాషణ మొత్తం విన్నాడు రుద్ర... ఏమైందని అడిగాడు ఆదిత్య...తను విన్నది మొత్తం చెప్పాడు.. ఈలోపు ఎస్ ఐ వాళ్ల దగ్గర నుండి తన జీప్ దగ్గర ఉన్న కానిస్టేబుల్స్ దగ్గరకు వచ్చాడు.. ఏం చేయాలో తెలియక బుర్ర పట్టుకున్నాడు ఎస్ ఐ "ఇప్పుడు ఏం చేద్దాం సార్..!??" అని అడిగాడు కానిస్టేబుల్ ఒకడు.. " ఇక చేసేదేముంది అడవిలోకి వెళ్ళి వెతకాలి..!!" అన్నాడు ఎస్ ఐ.. " ఆ అడవిలోకా...?? " అన్నారు కానిస్టేబుల్స్.. " మనకి వేరే దారి లేదు.. ఎలాగైనా వాళ్ళని వెతికి తీరవలసిందే..!!" అన్నాడు ఎస్ ఐ.. "మేము రాలేము సార్...!!" అన్నారు కానిస్టేబుల్స్ అందరూ. భయంతో. "మీరందరూ రానంటే ఎలాగ....?? అంటే నేనొక్కడినే వెళ్ళాలా..??" అంటూ కొప్పడ్డాడు ఎస్ ఐ.. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటుండగా... అక్కడికి రుద్ర, ఆదిత్య వచ్చారు... "మీరు ఎవరు..?"అని వాళ్ళని చూసి అడిగాడు ఎస్ ఐ... "హలో సార్..!! నా పేరు రుద్ర..!! ఆంధ్ర ప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నా,తన పేరు ఆదిత్య,ఎస్ ఐ గా వర్క్ చేస్తున్నాడు..!!"అంటూ తమ ఐడీ కాడ్స్ చూపించి పరిచయం చేసుకున్నారు.. "ఓహ్ అలాగా..!! నాకు కూడా తెలుగు వచ్చు.. మా ఫ్యామిలీది ఆంధ్రనే..!! ఊరు కాకినాడ..!! 25 ఏళ్ళ క్రితం అక్కడ నుంచి వలస వచ్చి, బెంగళూర్ లో సెటిల్ అయ్యాం.నా పేరు అశ్వంత్..!! నేను ఇక్కడ ఎస్ ఐ నీ,...!!"తనని కూడా పరిచయం చేసుకున్నాడు.. ఒక తెలుగువాడు దొరికినందుకు వారిద్దరూ చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు.. " ఇప్పుడు వాళ్ల పరిస్థితి ఏంటి సార్...!!"అని అడిగాడు రుద్ర " వాళ్లు ఆ అడవిలోకి వెళ్ళి చాలా తప్పు చేశారు.. అది చాలా ప్రమాదకరమైన అడవి..ఇలాగే కిందటి సంవత్సరం కొంత మంది టూరిస్టులు ఇక్కడికి వచ్చారు.. వాళ్లలో ఒక బాబు తెలియక రాత్రిపూట ఆడుకుంటూ,ఆ అడవిలోకి వెళ్లిపోయాడు.. తర్వాత రోజు పొద్దున్న మేము చాలా ఫోర్స్ తో వెళ్లి వెతకగా.. రక్తంతో తడిసిన ఆ అబ్బాయి బట్టలు మాత్రమే దొరికాయి.. బాడీ ఇప్పటివరకు దొరకలేదు.." అని చెప్పాడు అశ్వంత్.. " రాత్రి కనిపించకుండా ఉంటే, పగటి పూట వరకు ఆ బాబుని వెతకడానికి ఎందుకు వెళ్ళలేదు..??" "చూడు ఆదిత్య..! డిపార్ట్మెంట్లో రూల్స్ నీకు తెలియనివి కాదు.. కానీ ఈ అడవి చాలా ప్రమాదకరమైనది.. పగలు ఈ అడవిలో కాలు పెట్టాలంటెనే, ధైర్యం సరిపోదు. అంత ప్రమాదకరమైన అడవి ఇది.. అడవిలో దుష్ట శక్తులు తిరుగుతూ ఉన్నాయో లేవో కానీ.. ప్రమాదకరమైన జంతువులు, విష సర్పాలు, క్రిమికీటకాలు తిరుగుతూ ఉంటాయి.. అందువల్లే రాత్రిపూట కంటే పగటిపూట ఈ అడవిలోకి వెళ్లడానికి ఆస్కారం ఉంది..." "మరి ఇప్పుడు అమ్మాయిలని వెతకడానికి బయలుదేరుతారా...??"అని అడిగాడు రుద్ర. " లేదు బ్రదర్..!! ఇప్పటికే సాయంత్రం అయిపోయింది.. అడవిలో వాళ్ళు ఎంత దూరం, ఎటువైపు వెళ్లారో, తెలియకుండా వెతకడం చాలా కష్టం.!!! ఇక రేపు పొద్దున్నే వెతకడానికి బయలుదేరాలి.." అంటూ ఉండగా మీడియా అక్కడికి వచ్చింది... వాళ్లకి సమాధానం చెప్పడం కోసం,అశ్వంత్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు...! "వాళ్ల సంగతి సరే.. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి.?" అని అడిగాడు ఆదిత్య.. " నాకు ఒక ఐడియా ఉంది..!!!" "ఏంటది..??" " అమ్మాయిలను వెతకడానికి ఎలాగో రేపు అశ్వంత్ వెళ్తాడు.. తనతోపాటే మనం కూడా బయలుదేరితే మంచిది.. ఎందుకంటే ఈ అడవి గురించి మనకి పూర్తిగా తెలియదు.. తనతో పాటు వెళితే ఆ అమ్మాయిలకి కూడా సహాయం చేసినట్లు ఉంటుంది. సిద్ధ భైరవ గారిని వెదికినట్టు ఉంటుంది.. ఏమంటావ్..?"అని చెప్పాడు రుద్ర.. " గుడ్ ఐడియా...!! అయితే మాట్లాడదాం.." అన్నాడు ఆదిత్య... వీళ్లిద్దరు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా మీడియా వాళ్లు వెళ్ళిపోవడంతో వారి దగ్గరికి వచ్చాడు అశ్వంత్.. " ఏంటి బాస్...?? ఏదో సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు..??"అని అడిగాడు అశ్వంత్.. "నథింగ్ బ్రదర్...! ఆ అమ్మాయిల పరిస్థితి ఎలా ఉందో అని మాట్లాడుకుంటున్నాం..! మరి రేపు ఆ అమ్మాయిలను వెదకడానికి మీరు వెళ్తున్నారు కదా..! మీ వాళ్లు రెడీగా ఉన్నారా..??"అని అడిగాడు ఆదిత్య.. " దాని గురించే ఆలోచిస్తున్నాను.. మా వాళ్ళు ఆ అడవిలోకి రావడానికి భయపడుతున్నారు.. నాకు ఎవరిని తీసుకు వెళ్లాలో అర్థం కావడం లేదు.. పోనీ స్పెషల్ ఫోర్స్ హెల్ప్ తీసుకుందామన్నా..!! పర్మిషన్ తీసుకోవడానికి,వాళ్లు రావడానికి రెండు రోజులైనా పడుతుంది..!! ఈలోపు వాళ్ళకి ఏదైనా జరగొచ్చు..!! ఏం చేయాలో అర్థం కాక బుర్ర బద్దలు అవుతోంది...!! " అంటూ తన ప్రాబ్లం చెప్పుకున్నాడు అశ్వంత్.. "నీకేమి అభ్యంతరం లేకపోతే, నీకు తోడుగా మేమిద్దరం వస్తాం..!!"అన్నాడు రుద్ర.. " వ్వాట్..!!? మీరిద్దరా..??" అంటూ ఆశ్చర్యపోయాడు అశ్వంత్. " నీకు హెల్ప్ చేద్దామని అనుకున్నాం..!! నీకు అభ్యంతరం ఉంటే, నో ప్రాబ్లం. ఆగిపోతాం..!!" అన్నాడు.. నిజానికి అశ్వంత్ కి ఆ పరిస్థితుల్లో నో చెప్పే ఛాన్స్ లేదు.. ఎందుకంటే అతను ఒక్కడే ఆ అడవిలోకి వెళ్ళలేడు.. పైగా వీళ్లిద్దరు డిపార్ట్మెంట్ వాళ్లే కావడంతో, తనకి పర్మిషన్ తీసుకోవడం ఇంకా ఈజీ అవుతుంది.. రుద్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాబట్టి అతని ఎక్స్పీరియన్స్ తనకి యూస్ అవుతుంది...అందువల్ల వాళ్లకి నో చెప్పలేదు... " నిజంగా ఈ టైంలో మీ ఇద్దరి హెల్ప్ నాకు చాలా అవసరం.. థాంక్యూ సో మచ్.. రేపు ఉదయం ఐదు గంటలకి మనం అడవిలోకి వెళ్లబోతున్నాం.. మీరిద్దరూ ఆ టైంకి ఇక్కడికి వచ్చేసేయండి.. నేను అడవిలోకి వెళ్ళడానికి మనకి అవసరమైన సామాన్లు తీసుకు వస్తాను..." అంటూ వాళ్లకి బాయ్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.. ఆదిత్య రుద్ర కూడా వాళ్ల ప్లాన్ వర్కవుట్ అయినందుకు ఆనందంగా వాళ్ళు ఉంటున్న హోటల్ కి వెళ్ళిపోయారు... ఆ మరుసటి రోజు ఉదయం.. సమయం ఉదయం 4:30 నిమిషాలు అయింది.. అశ్వంత్ తన కానిస్టేబుల్స్ తో ఆ ప్రదేశానికి చేరుకున్నాడు.. కొద్ది నిమిషాల తర్వాత ఆదిత్య,రుద్ర అక్కడికి వచ్చారు.. తమకి అవసరమైన సామానులు తీసుకుని, ఒక జీపులో అడవిలోకి బయలుదేరారు.. వాళ్ల ప్రయాణం మొదలైంది... అశ్వంత్ డ్రైవ్ చేస్తున్నాడు.. చేతికున్న వాచీ లో టైం చూసుకున్నాడు. 10:00 అయింది.. ఆ అడవి చాలా దట్టంగా ఉంది.. ఎటు చూసినా పెద్ద పెద్ద చెట్లు,పెద్ద పెద్ద పొదలు కనిపిస్తున్నాయి.. పగలైనా సరే, సూర్యకిరణాలు అడవిలో అక్కడక్కడ మాత్రమే పడుతున్నాయి.. కొంత దూరం వెళ్ళిన తరువాత అశ్వంత్ జీపుని ఆపేశాడు... తను జీప్ దిగుతూ.." రోడ్డు అస్సలు బాగోలేదు.. అందుకని నడుచుకుంటూ వెళ్లడమే మంచిది." అనగానే ఆదిత్య రుద్ర ఇద్దరూ జీప్ దిగి,తన సామాను తీసుకుని నడక ప్రారంభించారు... అశ్వంత్ మాత్రం ఒక ట్రాకర్ లాంటిది. జీప్ కి అమర్చాడు.. "అది ఏంటి..?" అని అడిగాడు ఆదిత్య.. దానికి సమాధానంగా తన చేతిలో ఉన్న రిమోట్ చూపించి, "ఇది జీపీఎస్ ట్రాకర్, శాటిలైట్ సిగ్నల్ తో పని చేస్తుంది.. ఒకవేళ ఈ అడవిలో మనం తప్పి పోతే, దీని సహాయంతో మన జీప్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.. ఈ బటన్ నొక్కితే జీప్ లైట్లు వెలిగి, అలారం మోగుతుంది.." అంటూ దాని గురించి వాళ్ళకు వివరించాడు. "గుడ్ ఐడియా బ్రదర్..!"అంటూ అభినందించాడు రుద్ర.. ముగ్గురు అడవిలో నడుస్తున్నారు.. రుద్ర కి ఆ అడవి విచిత్రంగా కనిపించసాగింది.. ఎందుకంటే పక్షుల అరుపులు లేవు..ఎటువంటి జంతువు అప్పటి వరకు వారికి ఎదురుపడలేదు.. రుద్ర మనసు ఎందుకో ఆందోళనగా ఉంది.. ఇంతలో ముందుగా నడుస్తున్న అశ్వంత్ ఒక్కసారిగా ఒక చెట్టు వైపు పరుగు తీశాడు.. తను అలా పరుగులు తీయడంతో, ఏమైందో అని అతని వెంటే వీళ్ళు కూడా పరిగెత్తారు.. అశ్వంత్ ఒక పెద్ద చెట్టు దగ్గర ఆగి, నేలపై ఉన్న ఒక వస్తువును చేతిలోకి తీసుకున్నాడు.. అది ఒక సెల్ ఫోన్... దాన్ని ఆన్ చేయడానికి ప్రయత్నించాడు.. కానీ సెల్ ఫోన్ ఆన్ అవ్వలేదు.. "ఈ ఫోన్ ఎవరిది అయి ఉంటుంది..??"అని అన్నాడు ఆదిత్య.. "ఈ ఫోన్ కృతిక ది....!!" అంటూ ఆ సెల్ ఫోన్ బ్యాక్ సైడ్ పౌచ్ మీద ఆమె ఫోటో చూపించాడు.. "తన ఫ్రెండ్స్ని అడిగినప్పుడు వాళ్ళ ఇద్దరి ఫోటోలు చూపించారు.." " అయితే వాళ్లు ఈ దారిలోనే వెళ్లుంటారు..! మనం త్వరగా వెళ్లాలి..!" అంటూ ఆ ఫోన్ తీసుకొని ముగ్గురు వేగంగా నడక ప్రారంభించారు.. అలా ముందుకు వెళ్తూ ఉండగా...!! ముందు నడుస్తున్న అశ్వంత్ ఒక్కసారిగా కదలకుండా నిలుచుండిపోయాడు..అతని వెనక నడుస్తున్న ఆదిత్య రుద్ర. అనుకోకుండా అతని దాటి ముందుకు వెళ్ళిపోయారు.. "బ్రదర్స్..!! ఒక్క నిమిషం ఆగండి..!!" అన్న పిలుపు వాళ్ళ వెనక నుండి వినిపించడంతో ఇద్దరూ ఆగిపోయారు.. ఇద్దరూ వెనక్కి తిరిగారు.... "అక్కడే నిలబడిపోయావే.? ఏమైంది అశ్వంత్.?" అని అడిగాడు రుద్ర.. "ఇద్దరూ ఒకసారి అక్కడ చూడండి..!" అంటూ తన చూస్తున్న వైపుకి చూపించాడు... తను చూపించిన వైపు చూసారు ఇద్దరు....!! ఆశ్చర్యంతో వాళ్ల కళ్ళు పెద్దవయ్యాయ్....!! ఇంకా ఉంది....!!!
21-03-2026, 07:30 AM
Part - 25
ఆశ్చర్యంతో ముగ్గురూ అలా చూస్తూ ఉండిపోయారు....
ఎందుకంటే వాళ్ల ఎదురుగా ఉన్నది ఒక అద్భుతమైన పూల వనం... అది ఎంత అద్భుతంగా ఉంది అంటే...!! మాటల్లో వర్ణించడానికి వీలైనంత సుందరంగా ఉంది.. రంగురంగుల పూలతో, ఎంతో మనోహరంగా ఉంది ఆ దృశ్యం.......! ఆ పూల వనం పై రకరకాల రంగు రంగుల సీతాకోక చిలుకలు ఎగురుతున్నాయి.. ముగ్గురు ఆశ్చర్యంతో కొన్ని నిమిషాల పాటు, రెప్పవాల్చకుండా అలా చూస్తూనే ఉండిపోయారు... ఇంతలో ఏదో మాయ చేసినట్లుగా, ముగ్గురు మెల్లగా వాళ్ళకి తెలియకుండానే ముందుకు నడవడం మొదలుపెట్టారు.. అలా మెల్లగా ఆ వనం దగ్గరికి చేరుకున్నారు.. ఇంతలో రుద్ర కి "ఆగు..!!ముందుకు వెళ్ళకు..!" అనే పిలుపు వినబడడంతో తెలివి వచ్చింది.. ఒక్కసారిగా స్పృహలోకి వచ్చాడు.. ఎవరు పిలిచింది.. అన్నట్లుగా చుట్టూ చూశాడు. కానీ ఎవరూ కనిపించలేదు.. కానీ ఆదిత్య అశ్వంత్ మెల్లగా ముందుకు వెళ్ళిపోతున్నారు.. ఎదురుగా ఉన్న పూల వనం చూసిన రుద్రకి అనుమానం వచ్చి, తీక్షణంగా ఆ మొక్కల వైపే చూడసాగాడు... అతని కళ్ళకి కనిపించిన దృశ్యం చూడగానే బుర్ర తిరిగిపోయింది... "ఆదిత్య,అశ్వంత్ ఆగండి..!!" అంటూ గట్టిగా అరిచాడు.. అయినా సరే వాళ్ళు వినిపించుకోకుండా ముందుకు వెళ్ళిపోతున్నారు.. వేగంగా వెళ్లి,వాళ్ళిద్దరి చేతులు పట్టుకుని, ఆపాలని చూశాడు.. కానీ వాళ్లు ఆగటంలేదు....!!! ఇక రుద్రకి ఓపిక నశించి, గట్టిగా వాళ్ల మెడలు పట్టుకుని, వెనక్కి నెట్టాడు.. వాళ్లు కింద పడిపోయిన వెంటనే.. వాళ్ళిద్దరి చెంపలపై ఎడాపెడా గట్టిగా కొట్టాడు.. ఆ దెబ్బలకు వాళ్లకి తెలివి వచ్చింది.. ఇద్దరూ ఏదో అప్పుడే నిద్ర లేచినట్టు,బుగ్గలు రుద్దుకుంటూ పైకి లేచారు.. "మాకు ఏమైంది..?" అని విచిత్రంగా రుద్ర వంక చూస్తూ అడిగారు.. "మనం ఇక్కడ ఎక్కువ సేపు ఉండకూడదు. చాలా ప్రమాదం. ఆ అమ్మాయిలను వెతికి పట్టుకుని, వెంటనే వెళ్లిపోవాలి.."అని కంగారుగా అన్నాడు. అశ్వంత్ కి, ఆదిత్యకి,అసలు రుద్ర ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు...!! "అసలు ఏం మాట్లాడుతున్నావ్ రుద్ర...? ఇప్పుడు ఇక్కడ అంత ప్రమాదం ఏముంది.?? ఎందుకు అంత కంగారు పడుతున్నావ్...?"అని కొంచెం చిరాకుగా అడిగాడు అశ్వంత్... ఆదిత్య కూడా అశ్వంత్ ని సపోర్ట్ చేస్తున్నట్లుగా. " నీ భయంలో అర్థం లేదు రుద్ర..!! ఇక్కడ ఏం ప్రమాదం నీకు కనిపిస్తోంది.??" అని అన్నాడు.. వాళ్లు అడిగిన ప్రశ్నలకు రుద్ర సమాధానంగా.. నేల మీద ఉన్న ఒక రాయిని చేతిలోకి తీసుకుని, అక్కడ పెద్దగా ఉన్న ఒక పూలమొక్క మీదికి విసిరాడు.. అది వేగంగా వెళ్లి ఒక పూల మొక్కను తాకగానే, అది అకస్మాత్తుగా రాకాసి మొక్కగా మారిపోయింది.. దాని పువ్వు మధ్య స్థానంలో కోరలతో ఉన్న పళ్ళు బయటపడ్డాయి.. అది ఉన్న చోట నుంచి కదలకుండా పొడవైన నాలుకను బయటకు ఆడిస్తూ వాళ్ళ వైపు కోపంగా చూస్తోంది.... ఆ మొక్కలను చూసిన అశ్వంత్ కి మూర్చపోయినంత పని అయ్యింది.. ఎందుకంటే..తను చిన్న చిన్న పురుగులు తినే మాంసాహార మొక్కలు గురించి విన్నాడు. కాని ఎప్పుడూ ఇటువంటి భయంకరమైన రాకాసి మొక్కని గురించి వినలేదు, చూడలేదు..తను ఇటువంటి మొక్కని చూడడం ఇదే మొదటి సారి.. భయంతో తనకి తెలియకుండానే రెండడుగులు వెనక్కి వేశాడు.. ఆదిత్య కూడా బుర్ర తిరిగినంత పనయ్యింది.. రుద్ర తమను ఎందుకు బలవంతంగా ఆపాడో అర్థమయింది..!! " అసలు ఇవి ఏ మొక్కలు...?? ఇంత భయంకరంగా ఉన్నాయి..!!"అని భయంతో కూడిన గొంతుతో అడిగాడు అశ్వంత్.. "ఇవి సాధారణమైన మొక్కలు కాదు.. వీటి పేరు విస్రుగందికా పుష్పాలు..... ఇవి పాతాళ జాతికి చెందిన మొక్కలు.. నరకంలో మాత్రమే పెరుగుతాయి.. ఇవి సుగంధ పరిమళమైన వాసనలు వెదజల్లుతూ, చూడడానికి చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్థాయి.. వాటికి ఆకర్షించబడి,ఏ జీవి గాని, మనిషి గాని చిక్కినా, మూడు రోజుల్లోనే దాని శరీరంలో ఉన్న జీవశక్తి మొత్తాన్ని పీల్చేసి, ఎముకల గూడుగా మార్చేస్తాయి.. అందుకే ఇప్పటివరకు మనకి ఒక పక్షి గాని,జంతువు గాని,కనిపించలేదు.."అని వాటి గురించి వివరించాడు రుద్ర.. "అసలు ఇక్కడికి ఎలా వచ్చాయి..??"అని ఆశ్చర్యంగా అడిగాడు ఆదిత్య.. "ఇవి వాటంతట అవి రాలేదు..తాంత్రిక మాయతో సృష్టించబడ్డాయి.. ఎవరో వీటిని సృష్టించారు..!!"అని చెప్పాడు రుద్ర.. "మరి అయితే ఇప్పుడు ఏం చేద్దాం..??"అని అడిగాడు అశ్వంత్.. "మనం ఎలాగైనా చీకటి పడే లోపు ఆ అమ్మాయిలని కనిపెట్టాలి.. లేకపోతే వీటి వల్ల చాలా ప్రమాదంలో పడతాం.."అని చెప్పాడు రుద్ర.. " చాలా ప్రమాదం అంటే...??"అని ఒకేసారి అడిగారు ఇద్దరు.. " ఈ మొక్కలని తక్కువ అంచనా వేయొద్దు.. ఇవి పగటి పూట మాత్రమే నెలల్లో వేళ్ళు నూరుకొని ఉంటాయి.. చీకటైతే ఆ వేళ్ళు బయటకు వచ్చి, ఇవి వేగంగా కదులుతాయి.. వీటి శక్తి కూడా చాలా పెరిగిపోతుంది.. వాటి చేతికి ఒక్కసారి చిక్కితే తప్పించుకోవడం చాలా కష్టం.. ప్రాణాల మీద ఆశ వదిలేయాల్సిందే..!!"అని చెప్పాడు రుద్ర... ఆ మాటలు వినగానే అశ్వంత్ భయంతో వణికిపోయాడు.. "అమ్మాయిల సంగతి ఏమో గానీ.. ముందు మనం వెంటనే ఇక్కడ నుండి వెళ్లిపోవాలి.. కావాలంటే మళ్ళీ వద్దాం.. రండి వెళ్ళిపోదాం.." అని అన్నాడు అశ్వంత్.. "తప్పు అశ్వంత్..! పాపం ఆడపిల్లలు..! మన సాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు.. ఎలాగైనా వాళ్లని కాపాడి మనతోపాటు తీసుకువెళ్ళిపోదాం.." అన్నాడు ఆదిత్య.. "సరే ఇప్పుడు టైమ్ ఎంత..?" అని అడిగాడు రుద్ర.. "రెండు గంటలయ్యింది..."అని అశ్వంత్ చెప్పాడు.. "సరే..! చీకటి పడడానికి ఇంకా మనకి సాయంత్రం 5 గంటల వరకు టైముంది.. ఈలోపు ఎలాగైనా మనం ఆ అమ్మాయిల వెతికి తీసుకెళ్దాం.."అని చెప్పాడు ఆదిత్య.. ముగ్గురు సరైన అనుకుని అమ్మాయిలను వెతకడం మొదలుపెట్టారు.. అడవి అంత గట్టిగా పిలుస్తూ..చాలా సేపు తిరిగారు.. కానీ వాళ్ల జాడ తెలియలేదు.. చివరికి చేసేదేమీ లేక ముగ్గురు సాయంత్రం 4:30 కి అదే చోటుకు వచ్చారు.. " ఎంత వెతికినా ప్రయోజనం లేదు.." అంటూ బాధగా నిట్టూర్చాడు అశ్వంత్... " నిజమే...!! ఇంకా ఎక్కువ సేపు ఉంటే మనం కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది...! రేపు మళ్ళీ వచ్చి వెతుకుదాం పదండి వెళ్ళిపోదాం" అన్నాడు ఆదిత్య.. ఇక రుద్ర కూడా సరేనంటూ ముందుకు కదిలాడు.. అలా వాళ్ళ బయలుదేరబోతుండగా...!! రుద్ర కి ఏదో శబ్దం వినిపించింది.. అది ఒక మూలుగు శబ్దం... నడుస్తున్న వాడు కాస్త టక్కున ఆగిపోయాడు.. ముందు నడుస్తున్న ఆదిత్య, అశ్వంత్, అక్కడే నిలబడిపోయి ఉన్న రుద్ర ని చూసి వెనక్కి వచ్చారు. '"ఏమైంది రుద్ర..? ఆగిపోయావే...??" అని అడిగాడు ఆదిత్య.. "ష్..!! ఏం మాట్లాడకు..!! ఒకసారి ఆ శబ్దం వినండి...!!" అని మెల్లగా అన్నాడు... ఆదిత్య,అశ్వంత్ లు కూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు.. ఆ శబ్దం వాళ్ళకి కూడా వినిపించింది... రుద్ర చెప్పినట్లుగా ఎక్కడినుంచో మూలుగు శబ్దం వస్తోంది.. "ఒకసారి చుట్టూ వెతకండి..! వెంటనే..!!"అంటూ వారితో కలిసి తను కూడా ఆ చుట్టుపక్కల శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో వెదకసాగాడు.. ఆ శబ్దం..!! రాకాసి మొక్కలు ఉన్న వైపు నుండి వస్తోంది... రుద్ర వెంటనే ఆ మొక్కలు ఉన్న దగ్గర ఒక ఎత్తైన గుట్ట ఉంది.. వెంటనే ఆ గుట్ట పైకి ఎక్కాడు. అక్కడ ఆ మొక్కల మధ్యలో జరుగుతున్న సంఘటన చూసి, రుద్ర కి బుర్ర తిరిగిపోయింది.. "ఆదిత్య, అశ్వంత్ వెంటనే రండి."అంటూ గట్టిగా అరిచాడు... వాళ్ళిద్దరూ ఆ గుట్ట పైకి వచ్చారు.. "ఏమైంది అలా అరిచావ్..??" అని కంగారుగా అడిగాడు ఆదిత్య.. "ఒకసారి అటు చూడండి.."అన్నాడు రుద్ర.. రుద్ర చూపించిన వైపు చూశారు ఇద్దరు.. "ఓ మై గాడ్..!!!!" అని అరిచాడు అశ్వంత్.. అసలు అక్కడ వాళ్లు చూసింది ఏమిటంటే... వాళ్లు వెతుకుతున్న ఇద్దరమ్మాయిలు ఆ మొక్కల మధ్య బంధింపబడి ఉన్నారు.. కొన్ని రాకాసి మొక్కలు వారి శరీరాన్ని తమ వేళ్ళతో చుట్టి బంధించి, వాళ్ళ శరీరం నుండి జీవశక్తిని పీల్చేస్తున్నాయి.. వాళ్ల నోళ్లు కూడా వేళ్ళతో కట్టేసి ఉన్నాయి.. వాళ్లు అరవడానికి ప్రయత్నిస్తున్నా,నీరసంతో ఆ శబ్దం మూలుగులా వస్తుంది.. వాళ్లని ఆ పరిస్థితుల్లో చూసిన ముగ్గురికీ ఏం చేయాలో అర్థం కాలేదు... పోనీ వాళ్ల దగ్గరికి వెళదాం అంటే వాళ్లకి అడ్డుగా చాలా రాకాసి మొక్కలు ఉన్నాయి... వాటి దాటుకొని ముందుకు వెళ్లడం దాదాపు అసాధ్యం... "మనం ఎలాగైనా వాళ్ళని కాపాడాలి...!! లేకపోతే వాళ్ళు చనిపోతారు...!!"అన్నాడు రుద్ర. ఇంతలో ఏదో ఒకటి చెయ్యాలని చుట్టూ చూస్తున్న ఆదిత్య కి ఒక ఐడియా వచ్చింది.. అక్కడ ఆ రాకాసి మొక్కల పైన ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. దాని ఊడలు కిందకి వేలాడుతున్నాయి.. వాటిని చూపిస్తూ.." నేను మెల్లగా వాటిని పట్టుకుని కిందకి దిగుతాను.. అందులో ఉన్న ఒక అమ్మాయికి తాడు కట్టి, మెల్లగా పైకి లాగుతాను.. ఆ తర్వాత ఇంకొ అమ్మాయికి కూడా అలాగే తాడు కట్టి పైకి లాగుదాము.."సలహా చెప్పాడు.. "కానీ అవి అమ్మాయిలను వదలకపోతే..?" అని డౌట్ అడిగాడు అశ్వంత్... తన దగ్గర ఉన్న ఒక పెద్ద పొడుగాటి కత్తిని చూపిస్తూ... "ఇంకా చీకటి పడలేదు కాబట్టి అవి కదలలేవు. అందుకే ఈ కత్తితో వాటి వేళ్లను కోసేస్తాను.ఆ తర్వాత పైకి లాగుదాము.. ఆ అమ్మాయిల దగ్గర కొన్ని మొక్కలు మాత్రమే ఉన్నాయి.. కాబట్టి ప్రమాదం కూడా తక్కువ...!!" ఆదిత్య ఐడియా చెప్పగానే ఇద్దరూ ఒప్పుకున్నారు.. ఆదిత్య వెంటనే తమ దగ్గరున్న ఒక తాడు తీసుకుని, వేగంగా ఆ చెట్టు పైకి ఎక్కాడు.. మెల్లగా ఒక ఊడ పట్టుకుని,కిందికి దిగాడు.. ఆ మొక్కల దగ్గరికి వెళ్ళగానే,అవి కోపంతో ఆదిత్య మీద దాడి చెయ్యబోయాయి.. వెంటనే తన దగ్గరున్న కత్తి తో వాటిని మధ్యగా నరికేశాడు.. వాటిని నరికేయగానే ఆ అమ్మాయిలకు చుట్టుకుని ఉన్న వేళ్ళు కూడా వాళ్ళని వదిలేశాయి.. వెంటనే ఆ అమ్మాయిల దగ్గరికి వెళ్లాడు.. వాళ్లు చాలా నీరసంగా కనిపించారు... ఇద్దరు సృహలో ఉన్న సరే మాట్లాడలేకపోతున్నారు.. ఆదిత్య వెంటనే అందులో ఒక అమ్మాయి కి తాడుతో కట్టి పైకి లాగారు.. అమ్మాయి పైకి వచ్చిన వెంటనే మరో తాడుతో తమవైపు లాక్కొన్నారు రుద్ర అశ్వంత్ లు.. ఆమెను జాగ్రత్తగా ఒక పక్కన పడుకోబెట్టాడు అశ్వంత్. ఇంకొక అమ్మాయిని కూడా పైకి తీసుకు వెళ్ళడానికి ఆదిత్య తాడును కట్టసాగాడు... ఇంతలో మెల్లగా సూర్యకాంతి తగ్గిపోవడం ప్రారంభించింది.. అది గమనించిన రుద్ర.." ఆదిత్య త్వరగా కానీ.. చీకటి పడిపోతుంది.." అంటూ హెచ్చరించాడు.. ఆ హెచ్చరిక నిజమే అన్నట్లుగా ఆ మొక్కలు కూడా తమ రూపాన్ని మెల్లగా మార్చుకోవడం మొదలుపెట్టాయి.. ఆదిత్య వెంటనే వేగంగా ఆ అమ్మాయి నడుముకి తాడు చుట్టాడు.. రుద్రా అశ్వంత్ లు వేగంగా ఆ అమ్మాయిని కూడా గుట్టపైకి చేర్చారు.. ఇంతలో మెల్లగా చీకట్లు కమ్ముకోసాగాయి.. ఆదిత్య వేగంగా మర్రిఊడ సాయంతో చెట్టుపైకి ఎక్కాడు.. రాకాసి మొక్కలు తమ ఆకారాన్ని పెద్దగా పెంచుకోవడం మొదలుపెట్టాయి.. వాటి వేళ్ళు భూమిలో నుండి పైకి వచ్చి,అవి నడవటం మొదలు పెట్టాయి... అవి గుట్టపై ఉన్న వారిపై వేగంగా వెళ్ళసాగాయి.. ఇది గమనించిన ఆదిత్య.."అశ్వంత్,రుద్ర,ఆ అమ్మాయిలను తీసుకొని పారిపోండి.. లేదంటే చాలా ప్రమాదం.. నా గురించి ఆలోచించకండి.." అంటూ అనగానే.. ఇద్దరు ఆ అమ్మాయిల చేతుల్నీ గట్టిగా పట్టుకుని, వేగంగా పరుగెత్తసాగారు.. ఆదిత్య కూడా చెట్టుపైనుండి,గుట్ట మీదకి దూకి, వేగంగా వారి వైపు పరిగెట్టసాగాడు... ఆ రాకాసి మొక్కలు వాళ్ళని వెంబడించసాగాయి.. బాగా చీకటి పడడంతో జీప్ ఎక్కడ ఉందో అశ్వంత్ కి అర్థం కాలేదు.. వెంటనే తన దగ్గర ఉన్న రిమోట్ తీసి బటన్ నొక్కాడు... వారికి కొద్ది దూరంలోనే శబ్దం చేస్తూ, కారు లైట్ వెలిగింది.. అందరూ వేగంగా ఆ కారు వైపు వెళ్లబోతుండగా... హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక పెద్ద రాకాసి మొక్క ఒక అమ్మాయిని గట్టిగా పట్టుకుంది... అది తన వేళ్లతో ఆ అమ్మాయిని లాక్కుని వెళ్ళసాగింది.. వెనకాల పరిగెత్తుకుంటూ వస్తున్న ఆదిత్య అది గమనించి ఆ మొక్క వైపు పరిగెత్తాడు... లాక్కుని వెళ్తున్న ఆ అమ్మాయిని గట్టిగా పట్టుకుని, ఆ అమ్మాయి ని పట్టుకుని ఉన్న వేళ్ళని నరికేశాడు... ఆ మొక్క కోపంతో గట్టిగా అరిచింది. ఈ సారి ఆ అమ్మాయి ని వదిలేసి ఆదిత్య ని గట్టిగా పట్టుకుని, ఈడ్చుకుంటూ వెళ్లిపోసాగింది. అది గమనించిన రుద్ర వాళ్లందరినీ జీప్ ఎక్కించాడు... "అశ్వంత్...! ఈ అమ్మాయిలని ఎలాగైనా ఈ అడవి నుంచి బయటపడెయ్.. మా గురించి ఆలోచించొద్దు..!!"అంటూ ఒక గన్ కత్తి జీపులో నుండి తీసుకుని, ఆదిత్యని లాక్కొని వెళ్ళిన వైపు పరిగెత్తాడు.. అశ్వంత్ వద్దని చెబుదామనుకునేసరికి, చాలా రాకాసి మొక్కలు వారి జీపు మీదికి దూసుకు వస్తున్నాయి.. ఇక వేరే దారిలేక జీపు ని వేగంగా అడవి బయటకి పోనిచ్చాడు..... మరోవైపు ఆదిత్య ని వెతుక్కుంటూ రుద్ర వేగంగా పరిగెత్తసాగాడు... చాలా రాకాసి మొక్కలు, అతనికి అడ్డుగా రాసాగాయి.. అయినా సరే ఏమాత్రం లెక్కచేయకుండా వాటిని నరుక్కుంటూ ముందుకు వెళ్లసాగాడు... క్రమ క్రమంగా వాటి సంఖ్య పెరిగిపోసాగింది.. కొంతసేపు వాటితో పోరాడాడు.. కానీ వాటి సంఖ్య ఎక్కువైపోయింది.. చివరికి అవి ఒక విధమైన మత్తు మందును అతని మీద చిలకరించాయి.. నీకు ఏమీ చేయలేక సృహ తప్పి వాటికి బందీ అయిపోయాడు... రుద్ర ని అవి బంధించి ఈడ్చుకుని వెళ్ళిపోయాయి..... కొద్దిసేపటి తర్వాత రుద్ర కి సృహా వచ్చింది.. ఆకాశంలో మబ్బులు ఎక్కువగా ఉండటం వల్ల, వెన్నెల కాంతి అక్కడ పడటం లేదు. చుట్టూ చీకటి గా ఉంది.. ఏమి కనిపించటంలేదు. కీచురాళ్ళ శబ్దం మాత్రమే వినిపిస్తుంది... తను బంధించబడి ఉన్నాడు..అది ఆ రాకాసి మొక్కల పని అని అర్దం అయింది.. విడిపించు కోవడానికి ఎంత ప్రయతించినా వీలు పడటం లేదు.. ఇంతలో "వదులు..! నన్ను వదులు..!" అన్న మాటలు వినిపించాయి.. ఆ గొంతు ఆదిత్య ది.. ఆదిత్య ఏదో ప్రమాదంలో ఉన్నాడని రుద్ర కి అర్థమైంది.. కానీ చుట్టూ చీకటిగా వుండడం వల్ల తనకి ఏమీ కనిపించడం లేదు.. ఆదిత్య ఎక్కడున్నావ్ అని గట్టిగా అరిచాడు.. "రుద్ర కాపాడు. నన్ను ఏదో నన్ను లాక్కెళ్తూ ఉంది...!!" అంటూ అరిచాడు ఆదిత్య.. ఆ వేళ్ళను తెంపుకోవడానికి శతవిధాల ప్రయత్నించాడు..రుద్ర.. కానీ తన వల్ల కాలేదు.... ఇంతలో ఆకాశంలో మబ్బులు తొలగిపోయాయి.. చంద్రుడు బయటకి వచ్చాడు.. అర్థ చంద్రాకారంలో మెరిసిపోతున్నాడు.. ఆ వెలుగులో రుద్ర ఆదిత్య ని చూసాడు... ఆదిత్య పరిస్థితి చూసి, తల్లో నరాలు చిట్టి పోతాయేమో అన్నంతగా బుర్ర వేడెక్కిపోయింది.. ఏం చేయాలో అర్థం కాలేదు.. ఎందుకంటే ఒక పెద్ద రాకాసి మొక్క ఆదిత్యని తన వేళ్ళతో పైకి ఎత్తి,మింగసాగింది... ఆదిత్య భయంతో అరవసాగాడు... అది ఆదిత్య ని సగం పైగా మింగేసింది.... మరోవైపు రుద్ర జరుగుతున్న దారుణాన్ని చూస్తూ.. ఉండలేకపోతున్నాడు...తన కళ్ళ వెంట నీళ్లు కారిపోతున్నాయి... "ఆదిత్య...!!!ఆదిత్య...!!!" అంటూ భాదతో గట్టిగా అరుస్తున్నాడు.. ఇంతలో........!!!!! ఒక్కసారిగా అక్కడ కుక్కల అరుపులు వినిపించసాగాయి....!! చూస్తూ వుండగానే చాలా కుక్కలు అక్కడికి చేరుకున్నాయి.... అవన్నీ నల్లగా, బలిష్టంగా,భయంకరంగా ఉన్నాయి... వాటి కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి... ఆ కుక్కలు కోపంగా నేలపై పడి ఉన్న రుద్ర దగ్గరికి వచ్చాయి.. కోపంగా చూస్తూ,తమ కోరలు బయటపెట్టి, ఒక్కసారిగా రుద్ర మీదకి దూకాయి... రుద్ర గట్టిగా అరిచాడు.....!!! అంతే......!!!! ఇంకా ఉంది.......!!!!!
21-03-2026, 07:38 AM
Part - 26
ఇక రుద్ర తన ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నాడు...
ఆ కుక్కలు రుద్ర మీద పడి, ఇష్టానుసారం కొరకసాగాయి.. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... కుక్కలు కోరుకుతున్నాయి కానీ,రుద్ర కి ఏమి కావటం లేదు.. ఎందుకంటే అవి కొరుకుతున్నది.. రుద్ర శరీరాన్ని కాదు.. అతన్ని బంధించి ఉంచిన వేళ్ళని...... అవి వేగంగా కొరుకుతూ అతన్ని ఆ వేళ్ళ నుంచి బయటపడేసాయి... వాటి బంధనాల నుంచి బయట పడిన వెంటనే, రుద్ర ఆదిత్య కోసం చూశాడు.. ఆ కుక్కలు ఎక్కడి నుంచి వచ్చాయో ఆలోచించే స్థితిలో లేడు.. తన ఆలోచనంతా ఇప్పుడు ఆదిత్యని కాపాడాలని మాత్రమే ఉంది.. అప్పటికే అది ఆదిత్యని సగానికి పైగా మింగేసింది.. వెంటనే తన దగ్గర ఉన్న కత్తిని బయటకు తీశాడు. వేగంగా ఆ రాకాసి మొక్క ఒక దగ్గరికి వెళ్ళాడు.. వేగంగా దానిమీద దాడి చేయడం మొదలుపెట్టాడు.. ఆ రాకాసి మొక్క రుద్ర ని దూరంగా విసిరి కొట్టింది... వేగంగా మరలా దానిమీదకి వెళ్ళాడు... ఈసారి కూడా రుద్ర ని విసిరికొట్టగానే,ఎగురుకుంటూ వెళ్లి ఆ కుక్కల దగ్గర పడ్డాడు. తన చేతిలో ఉన్న కత్తి దూరంగా ఎగిరిపడింది.. అలా ఎంత ప్రయత్నించినా రుద్ర దాని దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోతున్నాడు. ఆ కుక్కలు పడిపోయిన రుద్ర దగ్గరికి వెళ్లి,పైకి లెగు అన్నట్టుగా ప్రేమగా అమాయకంగా తమ ముఖంతో తోయసాగాయి.. ఇంకో కుక్క దూరంగా పడిన కత్తిని తీసుకు వచ్చి, అతని ముందు పెట్టింది.. వాటి ప్రవర్తన రుద్ర కి చాలా విచిత్రంగా అనిపించింది.. ఆదిత్య ని కాపాడాలని పైకి లేచాడు.. చుట్టూ ఉన్న కుక్కలు రుద్ర వంక అమాయకంగా చూడసాగాయి.. అవి ఏమీ చేయకుండా అలా సైలెంట్ గా ఉండడం చూసి రుద్రకీ చిరాకు పుట్టి,వాటిని చూస్తూ "నా ముఖంలో ఏముంది చూడడానికి...?? వెళ్లి దానిని నాశనం చేయండి..??" అన్నాడు.. ఇక ఆ మాట విన్న వెంటనే.. అప్పటిదాకా సైలెంట్గా బుద్ధిగా ఉన్న ఆ కుక్కలన్నీ వేగంగా దాని మీదకు వెళ్లి దాడి చేయడం మొదలు పెట్టాయి... అమ్మయ్య సాయం దొరికింది అని మనసులో అనుకున్నాడు రుద్ర.. ఆ కుక్కలన్ని కలిసి,ఆ రాకాసి మొక్క పై పడి ఇష్టానుసారం కొరకసాగాయి... రుద్ర కూడా తన కత్తితో తనకి అడ్డం వస్తున్న వాటి వేళ్ళు నరికేయసాగాడు.. అలా అన్నివైపుల నుంచి దాడి జరగడంతో, ఆ మొక్క ఉక్కిరిబిక్కిరి అయ్యింది... ఇంతలో రుద్ర కి తన కాళ్ల దగ్గర తన గన్ దొరికింది.. వెంటనే ఆ గన్ తీసుకొని, దాని రాకాసి నోటి కింద షూట్ చేశాడు... ఆ బుల్లెట్ తగలగానే అది వికృతంగా అరిచింది. ఆ దెబ్బకి గాయపడి, అది ఆదిత్య ని వదిలేసింది.. కింద పడిపోయిన ఆదిత్యని దూరంగా తీసుకెళ్లాడు రుద్ర. అప్పటిదాకా అరుస్తూ ఉండడంతో దగ్గుతున్నాడు ఆదిత్య... "ఇప్పుడు ఎలా ఉంది..?"అని అడిగాడు రుద్ర.. "థాంక్స్ రుద్ర..ఇప్పుడు బానే ఉంది.."అన్నాడు ఆదిత్య. "దెబ్బలు ఏమైనా తగిలాయా..?" " అదేం లేదు బాగానే ఉన్నాను..!!" అంటూ అక్కడ రాకాసి మొక్కతో పోరాడుతున్న కుక్కలని చూస్తూ... "ఇవి ఎక్కడినుంచి వచ్చాయి రుద్ర..?" " నిజం చెప్పాలంటే నాక్కూడా తెలియదు. కానీ అవి ఇప్పుడు మనల్ని కాపాడాయి.." ఈలోపు ఆ రాకాసి మొక్క కుక్కలని ఇష్టం వచ్చినట్టు విసిరేయసాగింది.. దానికి సాయంగా చాలా రాకాసి మొక్కలు అక్కడికి చేరుకున్నాయి... అది చూసిన ఆదిత్య "పదా..!! వాటిని కాపాడదాం..!" అని అన్నాడు.. ఆదిత్య షూటింగ్ లో ఎక్స్పర్ట్... అందుకని రుద్ర దగ్గర గన్ తీసుకొని, అతనికి బ్యాకప్ గా నిలబడ్డాడు.. రుద్ర తన కత్తితో అడ్డు వచ్చిన ప్రతి రాకాసి మొక్కని నరికేయసాగాడు.. అతనిమీద దాడి చేయబోతున్న రాకాసి మొక్కలని ఆదిత్య గన్ తో షూట్ చేయసాగాడు.. చివరగా అవన్నీ చనిపోగా.. ఆ పెద్ద రాకాసి మొక్కని ఇద్దరూ కలిసి, కుక్కల సాయంతో చంపేశారు.... ఆ యుద్దం పూర్తయిన వెంటనే ఆ కుక్కలన్నీ అడవిలో ఓ దిక్కు వైపు పరిగెత్తడం ప్రారంభించాయి.... అవి అలా వెళ్తుంటే వాళ్ళిద్దరూ అవి ఎక్కడికి వెళ్తున్నాయో అని చూస్తూ ఉండిపోయారు.. ఆ కుక్కల గుంపులోని చివరికి కుక్క వెనక్కి వచ్చి, రుద్ర వైపు చూసి రమ్మన్నట్టుగా చిన్నగా మొరిగి తిరిగి పరిగెత్తడం ప్రారంభించింది. దాని చేష్టలకి రుద్ర ఆదిత్య ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.. ఇక వాళ్ళిద్దరికీ కూడా అర్థమైంది... వెంటనే వాటి వెనకాలే పరుగు ప్రారంభించారు... అవి కొంత దూరం పరుగెత్తిన తర్వాత, ఒక గుహ ముందు ఆగిపోయాయి... వాటిని అనుసరిస్తూ పరిగెత్తుకొని, ఆ గుహ వద్దకు వచ్చారు ఇద్దరు.... అక్కడ పరిస్థితి చూసి ఆశ్చర్యపోయారు... ఎందుకంటే, ఆ గుహ చుట్టూ చాలా రాకాసి మొక్కలు కాపలాగా ఉన్నాయి.. ఆ కుక్కలన్నీ లోపలికి వెళ్లడానికి ఎంత ప్రయత్నిస్తున్నా, ఆ రాకాసి మొక్కలు వాటిని లోపలికి రాకుండా అడ్డుకుంటున్నాయి... ఆ గుహద్వారం మొత్తం, పిచ్చి పిచ్చి అడవి తీగలతో అడ్డుగోడలా మారిపోయింది... ఆ కుక్కలన్నీ అంతగా లోపలికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాయి అంటే లోపల ఏదో ఉందని వాళ్ళిద్దరికీ అర్ధం అయ్యింది.... ఇక ఆలస్యం చేయకుండా ఇద్దరు ఆ రాకాసి మొక్కల పై దాడి ప్రారంభించారు.. కొద్దిసేపటికే ఆ మొక్కలన్నీ వాళ్ళ చేతుల్లో నాశనమయ్యాయి.. ఇద్దరు ఆ గుహద్వారం ముందుకు వచ్చారు.. దారికి అడ్డంగా పిచ్చి,పిచ్చి తీగలన్ని ఉన్నాయి.. రుద్ర తన చేతిలో ఉన్న కత్తితో వాటిని నరికి పారేశాడు.. గుహ లోపలి భాగం మొత్తం చీకటిగా ఉంది.. వాళ్ళిద్దరూ అడుగుపెట్టగానే గుహ లోపల గోడలకి పెట్టి ఉన్న కాగడాలన్ని ఒక్కసారిగా వెలిగాయి.. మెల్లగా ఇద్దరూ లోపలికి ప్రవేశించారు... లోపలికి వెళ్లాలా వద్దా అని ఆలోచించసాగారు... వాళ్ళు ఆలోచిస్తూ ఉండగానే కుక్కలన్ని ఒక్కసారిగా లోపలికి పరుగెత్తాయి.. అన్నిటికంటే చివరగా లోపలికి వెళుతున్న కుక్క ఒక్క క్షణం ఆగి వెనక్కి తిరిగి రుద్ర,ఆదిత్యల వంక చూసింది... అక్కడ నుంచుని చూస్తున్న వాళ్ల దగ్గరికి వెళ్లి, రుద్ర ఫ్యాంట్ నోట పుచ్చుకుని, లోపలికి రమ్మన్నట్టుగా లాగడం మొదలు పెట్టింది.. దాని సైగలు అర్థం చేసుకున్న ఇద్దరు లోపలికి వెళ్ళసాగారు... అలా గుహ లోపలికి కొంత దూరం వెళ్ళిన తరువాత ఒక విశాలమైన ప్రాంతం కనిపించింది. కుక్కలన్నీ అక్కడే ఉన్నాయి.. చుట్టూ చూసారు.. కానీ ఏమీ కనిపించలేదు.. "అసలు ఈ కుక్కలు మనల్ని లోపలికి ఎందుకు తీసుకు వచ్చాయి..??" అని అనుమానంగా అడిగాడు ఆదిత్య... కానీ రుద్ర సమాధానం చెప్పకుండా పైకి చూస్తున్నాడు... "పైన ఏముంది...?"అంటూ పైకి చూశాడు.. పైన కనిపించిన దృశ్యం చూడగానే ఆదిత్యకి మతిపోయింది.. ఎందుకంటే పైన సిద్ధ భైరవ స్వామి గారి శరీరం పెద్ద పెద్ద అడవి తీగల మధ్య చిక్కుకొని ఉంది... కానీ అవి ఆయన శరీరాన్ని తాకలేకపోతున్నాయి. ఎందుకంటే ఆయన శరీరం చుట్టూ తెల్లని వెలుగు రక్షణ కవచంలా ఉంది... ఆ కాంతి చుట్టూ మాత్రమే ఆ అడవి తీగలు అల్లుకొని ఉన్నాయి.... "ఆయన ఎవరై ఉంటారు రుద్రా...??" అని పైకి చూస్తూ ఆశ్చర్యంగా అడిగాడు ఆదిత్య.. "ఆయన ఖచ్చితంగా మన వెతుకుతున్న సిద్ధ భైరవులు గారే అయ్యుంటారు.." అని చెప్పాడు రుద్ర... " అయితే మనం ఆయన్ని ఎలాగైనా కాపాడాలి...!" అంటూ గన్ తీసి, పైన ఆయనను బంధించిన ఒక అడవి తీగ మీదకి షూట్ చేశాడు.. ఆ బుల్లెట్టు తగిలి ఆ తీగ తెగిపోయింది.. కానీ చూస్తూ ఉండగానే మరుక్షణం ఆయనను తిరిగి అల్లుకుపోయింది.. అది చూసిన రుద్ర తన చేతిలో ఉన్న కత్తిని విసిరాడు... మళ్లీ అదే సీన్ రిపీట్ అయ్యింది... ఈసారి ఇద్దరూ కలిసి ప్రయత్నించారు.. కానీ వాటిని ఎంత నాశనం చేద్దామని ప్రయత్నించిన అవి తిరిగి వస్తూనే ఉన్నాయి.. ఇంక ఇద్దరికీ ఏం చేయాలో అర్థం కాలేదు.. "ఇపుడు ఏం చేద్దాం రుద్ర...??" అని అడిగాడు. ఆదిత్య... " మానవ ప్రయత్నం ఫలించనప్పుడు,మంత్ర ప్రయోగమే సరైనది. ఆదిత్యా..!!" అంటూనేలపై యోగాసనం వేసుకుని కూర్చున్నాడు.. కొద్దిసేపు మంత్రాలు పఠించిన తరువాత, కళ్ళు తెరిచి గట్టిగా అరుస్తూ అరచేతితో నేలపై గట్టిగా కొట్టాడు... ఒక్కసారిగా నేల ఏదో భూకంపం వచ్చినట్టు అదిరింది... రుద్ర కొట్టిన చోట నేల పెద్ద పెద్ద బీటలు వారింది... ఆ బీటలు వారిన చోటు నుండి బిలబిలమంటూ వందలాది ఎలుకలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి... అవి వచ్చిన వెంటనే గోడల మీద నుండి పాకుతూ వెళ్లి, సిద్ధ భైరవులను బంధించిన తీగలను కొరికి వేయడం మొదలు పెట్టాయి.. ఆ తీగలన్నిటిని ఎలుకలు కొరికి వేయగానే, రుద్ర భైరవుల శరీరం చుట్టూ ఉన్న తీగలన్ని మాయమైపోయాయి.. అప్పటి వరకు అక్కడ ఉన్న ఆ నల్ల కుక్కలు అన్నీ కూడా మాయమైపోయాయి... ఆ కుక్కలు అలా మాయమైపోవడంతో ఇద్దరూ ఆశ్చర్యపోయారు.. ఆ తరువాత మెల్లగా ఆయన శరీరం ఎగురుకుంటూ నేల మీదకి వచ్చింది... ఆయన శరీరం నేల మీదకి రాగానే ఆయన చుట్టూ ఉన్న కాంతి వలయం ఒక్కసారిగా మాయమైపోయింది... ఇద్దరు చూస్తూ ఉండగానే,ఆయన శరీరం సాధారణ స్థితికి వచ్చింది... ఆ తర్వాత ఇద్దరూ కలిసి,ఆయనను అక్కడ ఉన్న ఒక రాతి బండ మీద పడుకోబెట్టారు.. కొద్దిసేపటి తర్వాత ఆయన మెల్లగా కళ్ళు తెరిచారు... మెల్లగా లేచి కూర్చుని, ఇద్దరి వంక చిరునవ్వుతో చూశారు... " నన్ను కాపాడినందుకు మీ ఇద్దరికీ ధన్యవాదాలు...!"అన్నారు ఆయన.. "స్వామి..!తమరు సిద్ధ భైరవులే కదా..??" అని అడిగాడు రుద్ర.. దానికి సమాధానంగా నవ్వుతూ తల ఊపారు... ఇద్దరు వెంటనే ఆయన పాదాలకు నమస్కరించారు... " ఆ తల్లి ప్రత్యంగిరా మాత ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి.. పైకి లేవండి." అన్నారు.. ఇద్దరూ పైకి లేచి వినయంగా ఆయనకు నమస్కరిస్తూ నుంచున్నారు... " ఇంతకీ మీరు ఎవరు..?? ఈ అడవికి ఎందుకు వచ్చారు..!?" అని అడిగారు సిద్ధ భైరవులు.. " నమస్కారం స్వామి..నా పేరు రుద్ర.. నేను మీ శిష్యుడు శివుడు పుత్రుడను.ఇతని పేరు ఆదిత్య. ఇతని విషయంలో తమరి సహాయం కోరి,మీ కోసం వెతుక్కుంటూ ఈ అడవికి వచ్చాము."అంటూ ఆయనకు తమ పరిస్థితి వివరించాడు... " ఏమిటి సమస్య చెప్పండి..?" " స్వామి...! ఎవరో ఇతని మీద పంచవక్రి ని ప్రయోగించారు. దాని బారి నుండి కాపాడడం ఎలాగో తెలియటం లేదు.. తమరి ఏదైనా పరిష్కార మార్గం చూపిస్తారేమో అని వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చాము..!"అంటూ వినయంగా చెప్పాడు రుద్ర. ఆ మాట చెప్పగానే సిద్ధ భైరవులు ఒక్కసారిగా లేచి నుంచున్నారు.. " పంచవక్రిని ఇతని మీద ప్రయోగించడమా..?? అసాధ్యం..!! అంతటి శక్తివంతమైన తాంత్రికుడు ఇప్పుడు నాకు తెలిసి ఎవరూ లేరు..! అయినా అది పంచవక్రి అని నీకు ఎలా తెలుసు..?"అని అడిగారు.. " నాకు కూడా దాని గురించి తెలియదు స్వామి.. మా తండ్రిగారికి తమరు ఇచ్చిన గ్రంథం నేను చదవడం వల్లనే నాకు తెలిసింది.. కొద్ది రోజుల క్రితం దానికి కావలి శక్తుల నుండి ఆదిత్యను కాపాడడం కోసం చాలా కష్టపడవలసి వచ్చింది.ఇప్పుడు ఇతని ప్రాణం చాలా అపాయంలో ఉంది. మున్ముందు రాబోయే అమావాస్యలలో ఇతడిని ఎలా కాపాడాలో తెలియటం లేదు. దయచేసి మీరే ఏదో ఒక దారి చూపించండి.." అంటూ రుద్ర అయిన కాళ్లపై పడ్డాడు.. " దయచేసి నన్ను కాపాడండి స్వామి..!!" అంటూ ఆ వ్యక్తి కూడా ఆయన కాళ్లపై పడ్డాడు.. సిద్ధ భైరవులు వారిద్దరినీ పైకిలేపి, " బాధపడకండి నాయనలారా..!! పైకి లేవండి.. మీ ప్రాణాలకు తెగించి మరీ నా ప్రాణాలు కాపాడారు.. కచ్చితంగా నేను మీకు సహాయం చేస్తాను..కానీ పంచవక్రి ని ఎదుర్కోవడం అంటే సామాన్య విషయం కాదు.. మహా మహా తాంత్రికులే దాని శక్తి చూసి భయపడతారు.. ఒక్కసారి దేని మీదకైనా దానిని ప్రయోగిస్తే, వాళ్ల చావు చూసిన తరువాతే అది శాంతిస్తుంది. అతి ప్రమాదకరమైన దుష్టశక్తి అది.. అసలు దాని చుట్టూ ఉండే కావలి శక్తులే చాలా ప్రమాదకరమైనవి.. మీకు ఆ విషయం ఇంతకు ముందే తెలిసి ఉంటుంది.."అని అన్నారు.. "అయితే నా సమస్యకి పరిష్కార మార్గం ఏది లేదా స్వామి..??" అని విచారంగా ముఖంపెట్టి అడిగాడు ఆదిత్య.. ఒక్క క్షణం అని చెప్పి పద్మాసనం వేసుకుని కూర్చున్నారు సిద్ధ భైరవులు.. కళ్ళు మూసుకుని మంత్రాలు చూపించగానే ఆయన ముందు నేలపై వెలుగు రేఖలు కదులుతూ ఒక నక్షత్రము వంటి ఆకారం లోకి మారిపోయాయి. అలా కొద్ది సేపు ఆ ఆకారం వెలుగుతూ, మూడు వేరు వేరు ఆకారములు కలిగిన చక్రములు గా మారిపోయింది.. సిద్ధ భైరవులు కళ్ళు తెరిచారు.. ఆయన ఎదురుగుండా ఉన్న మూడు చక్రాల ని చూడగానే.. ఆయన ముఖంలో చిన్న చిరునవ్వు వచ్చింది.. ఎదురుగా నిలుచుని ఉన్న ఇద్దరి వంక చూసి... "ఒక మార్గం ఉంది..!" అని అన్నారు... "ఏంటి స్వామి..?" అని ఇద్దరు ఆత్రుతగా అడిగారు.. ఇంకా ఉంది....!!!
21-03-2026, 10:09 AM
Some solution dorikindi.
Bur what is the main reason behind all thism
22-03-2026, 06:11 AM
Part - 27
"పంచవక్రి ని ఎదిరించడం సాధారణమైన విషయం కాదు...బంధించడం దాదాపు అసాధ్యం...కానీ ఒక దారి ఉంది..కానీ అది చాలా ప్రమాదకరమైనది..
ఈ పనిలో ఒక చిన్న తప్పు జరిగినా అతనితోపాటు చుట్టూ ఉన్న వాళ్ళందరూ చనిపోతారు.."అని చెప్పారు సిద్ధ భైరవులు "ఏం పని స్వామి..?" అని అడిగారు ఇద్దరు. "పంచవక్రి చుట్టూ దాని 3 అనుచర గణాలు ఉంటాయి. వాటి శక్తి చాలా భయంకరమైనది.." " అవును స్వామి..!! మేము వాటిని ఎదిరించడానికి మేము చాలా కష్టపడ్డాం..!!" " కానీ మీరు ఎదుర్కొన్నది రెండింటిని మాత్రమే..!! అసలైనది కరోముఖి..!! దానికి ఈ రెండిటికి మించిన శక్తి ఉంటుంది. విర్కొర,విస్కర్ష శత్రు నాశనం చేస్తాయి.. కరోముఖి మాత్రం ఎవరైనా పంచవక్రిని అడ్డుకోవాలని చూస్తే తన మాయతో శత్రువుని ఏమార్చి భయంకరంగా చంపేస్తుంది.. కాబట్టి మొదట వీటిని బంధిచగలిగితే,పంచవక్రిని ఎదిరించవచ్చు." అని చెప్పారు సిద్ధ భైరవులు.. " స్వామి నాకు ఒక చిన్న సందేహం.. దాని అనుచర శక్తులను బంధిస్తే పంచవక్రిని సులభంగా ఎదిరించవచ్చా..??"అని అడిగాడు ఆదిత్య... నా మాటలకి సిద్ధ భైరవులు పగలబడి నవ్వారు... ఆయన అలా నవ్వుతుంటే ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.. "పంచవక్రీ అనుచరగణలు చాలా శక్తివంతమైనవి.. వాటిని బంధించాలి అంటే సామాన్యమైన తాంత్రికుడు వల్ల కాదు.." "వీటితో పోలిస్తే పంచవక్రి శక్తులు అసామాన్యమైనవి.. పంచవక్రిని నేరుగా ఎదిరించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఒకవేళ ఎదిరించాలి వస్తే తాంత్రిక శక్తి తో పాటు దైవానుగ్రహం కూడా మనకి ఉండాలి.. దాని శక్తి గురించి చెప్పాలి అంటే .ఒక శక్తివంతమైన అస్త్రం లాంటిది.. నిర్దిష్ట గమ్యం లేకుండా ప్రయోగిస్తే భయంకర వినాశనం జరుగుతుంది. ఇప్పుడు దానికి గమ్యం నువ్వే..!! నిన్ను తప్ప వేరే ఎవ్వరిని చంపదు.!! కానీ....!!"అంటూ మధ్యలో ఆపేశారు సిద్ధ భైరవులు.. " ఏం స్వామి..! మధ్యలో ఆపేశారే..?"అని అడిగాడు ఆదిత్య.. "కానీ నిన్ను మాత్రం చాలా హింసించి, హింసించి చంపుతుంది.. ఆ బాధ మాటల్లో చెప్పలేనిది ఆదిత్య..! ఇంతటి భయంకరమైన శక్తిని నీ మీద ఎందుకు ప్రయోగించారో నాకు అర్థం కావడం లేదు."అని బాధపడ్డారు సిద్ధ భైరవులు.. ఆ మాటలు విన్న ఆదిత్య మౌనంగా ఉండిపోయాడు.. "స్వామి అది..!! ఇందాక ఒక మార్గం ఉంది అన్నారు కదా.. అది ఏమిటి..?"అని అడిగాడు రుద్ర... "అవును.. ఒక మార్గం ఉంది కానీ.., అది చాలా ప్రమాదకరమైనది. కష్టతరమైనది.." "దయచేసి ఏమిటో చెప్పండి స్వామీ..!!" "దాని 3 అనుచర గణాలను, ఏకకాలంలో చక్ర బంధనం చేసి,కట్టడి చేస్తే,పంచవక్రి నుండి ఆదిత్యని కాపాడడం మనకి సులభమవుతుంది." "మరి పంచవక్రి ని ఎదిరించడం ఎలా స్వామి..?"అని అడిగాడు ఆదిత్య.. "ఇది సమాధానం లేని ప్రశ్న నాయనా..!! ఇప్పటివరకు దాని నుండి తప్పించుకోవడం, ఎదిరించడం ఎవరి తరమూ కాలేదు.. దాని శక్తి ముందు ఎంత పెద్ద తాంత్రికుడు అయినా సరే నాశనం కావాల్సిందే.."అంటూ బాధపడ్డారు.. " కానీ స్వామి..!! ఎవరు ప్రయోగించారో తెలుసుకుంటే ఏదైనా ఉపయోగం ఉంటుందా...??"అని అడిగాడు రుద్ర. " కొంతమేర ఫలితం ఉండొచ్చు.. ఎందుకంటే కారణం తెలిస్తే దానికి తగ్గ పరిష్కార మార్గం ఆలోచించవచ్చు..!?" " అదే ఎలా తెలుసుకోవాలో అర్థం కావడం లేదు స్వామి..!!" అని విచారంగా అన్నాడు రుద్ర.. " ఈ సమస్య మొదలైన చోటే వెతుకుదాం. ఏదైనా ఆధారం దొరికే అవకాశం ఉంది." అన్నాడు ఆదిత్య... "సరే అయితే, రేపే బయలుదేరుదాం.." అన్నాడు రుద్ర... "మంచిది..!నాయన వెళ్లి రండి...!"అన్నారు సిద్ధ భైరవులు.. "మరి మీరు మాతో రా..రా స్వామి..??" అని అడిగాడు రుద్ర.. " నేనా ఎక్కడికి..? ఇదే నా నివాసం..!" " స్వామి..!మీ కోసం గ్రామంలో అందరూ ఎదురుచూస్తున్నారు. మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు వారందరూ ఎంతో బాధ పడుతున్నారు.దయచేసి మీరు తిరిగి గ్రామానికి వెళ్ళండి. వాళ్ల పరిస్థితి అస్సలు బాగోలేదు చాలా బాధపడుతున్నారు.. మేము స్వయంగా మా కళ్ళతో చూసాము.దయచేసి మీరు కూడా మాతో పాటు వస్తే మేము చాలా సంతోషిస్తాము..." అన్నాడు ఆదిత్య.. " అవును స్వామి..!! మీరు ఒక్కరే ఇక్కడ ఉండడంలో అర్థం లేదు.. వాళ్ళు తప్పు చేశారు కాదనడం లేదు. కానీ మీరు తండ్రి స్థానంలో ఉండి ఆలోచించండి. బిడ్డలు తప్పు చేస్తే తండ్రి దండిస్తాడు తప్ప, వాళ్లని దూరం చేసుకోడు కదా..!! దయచేసి రండి స్వామి..!! " అని బ్రతిమాలాడు రుద్ర.. వాళ్ల మాటలకు సిద్ధ భైరవులు లేచి నుంచున్నారు.. వాళ్ళని చూసి నవ్వుతూ.. " మంచి మనసులు నాయనా మీవి..! మీకోసం వస్తున్నా పదండి..!"అంటూ వాళ్ళతో కలిసి బయలుదేరారు... ముగ్గురు గుహ నుంచి బయటకు వచ్చారు. అప్పుడే తెలతెలవారబోతోంది... వాతావరణం మొత్తం ప్రశాంతంగా ఉంది.. ఆ ప్రశాంత వాతావరణాన్ని చూసి ముగ్గురు ఆనందించారు... " ఒకప్పుడు ఈ అడవి శపించబడింది.. రాత్రి మీరు చేసిన పోరాటం వల్ల, ఆ దుష్ట శక్తులన్నీ అడవిని వదిలి వెళ్ళిపోయాయి..ఇప్పుడు ఈ అడవి పూర్తిగా సురక్షితం.. ఒకప్పుడు వాటితో పోరాడుతూ ఉండగానే నన్ను బంధించాయి..! మీరే నన్ను కాపాడారు.."అంటూ ముగ్గురు ముందుకు వెళ్లబోతుండగా... వాళ్ళ వెనకాల ఒక కుక్క అరుపు వినిపించింది.. వెనక్కి తిరిగి చూడగా ఆ నల్లటి కుక్క వాళ్ళ వెనుక వస్తుంది.. దాన్ని చూసిన స్వామి నవ్వుతూ.. దాని దగ్గరికి వెళ్లి ముద్దు చేయసాగారు.. " ఇది ఎవరి కుక్క స్వామి..!!?? రాత్రి మాయమై పోయింది.మళ్ళీ ఇప్పుడు ప్రత్యక్షమయింది..!" అని అడిగాడు ఆదిత్య.. "దీని పేరు భైరవ..!! ఈ అడవిలో చిక్కుకొన్న మంచి వాళ్ళ కోసం మంచ్రేకరుడు దీనిని సృష్టించి,ఈ అడవిలోకి వదిలారు.. అందుకే ఇది మీకు సహాయం చేసింది.. ఇది ఒకేసారి ఎన్ని కుక్కలగానైనా మారగలదు.. దుష్టశక్తులను ఎదిరించి పోరాడగలదు. దీనిని నాశనం చేయడం అసాధ్యం...!" దాని గురించి వివరించారు.. " మరి ఆ అమ్మాయిలను కాపాడడానికి ఇది ఎందుకు రాలేదు..??"అని అడిగాడు ఆదిత్య.. "చెప్పాను కదా..!! మంచి వాళ్ళ కోసమే వస్తుందని..! మీ ప్రాణాలకు తెగించి, ఆ అమ్మాయిలను కాపాడదామని వచ్చారు.. వాళ్లని కాపాడారు. వారిని కాపాడే ప్రయత్నంలో మీ ప్రాణాలను పణంగా పెట్టారు. అందుకే మిమ్మల్ని కాపాడడానికి ఇది వచ్చింది...!"అంటూ దాని తలపై రాస్తూ చెప్పారు సిద్ధ భైరవులు. అలా మాట్లాడుకుంటూ ముగ్గురు అడవి నుంచి బయటపడ్డారు.. వాళ్లు అడవి నుంచి బయటకు వచ్చేసరికి సెక్యూరిటీ ఆఫీసర్లు,గ్రామస్తులందరూ అక్కడే వారి కోసం ఎదురుచూస్తూ ఉన్నారు.. సిద్ధ భైరవులు తిరిగి రావడంతో, వారి ఆనందానికి అవధులు లేవు.. అందరూ సామూహికంగా వచ్చి ఆయనకు క్షమాపణ చెప్పుకున్నారు.. ఆదిత్య రుద్ర కాపాడిన అమ్మాయిలు కూడా వారి దగ్గరకు వచ్చి థాంక్స్ చెప్పారు... వారిద్దరు సిద్ధ భైరవుల తో సహా తిరిగి వచ్చినందుకు అశ్వంత్ చాలా సంతోషించాడు.. అలా అందరికీ వీడ్కోలు చెప్పి తిరిగి ప్రయాణం అయ్యారు... అలా వాళ్ళు శ్రీశైలం వచ్చేసరికి, చీకటి పడింది.. ఇద్దరూ మంజునాథ రావు గారి ఇంటికి చేరుకున్నారు.. ఇద్దరూ ఇంటికి వస్తున్నట్టు ఎవ్వరికీ చెప్పలేదు.. ఇద్దరూ ఇంట్లోకి అడుగు పెట్టేసరికి గోవింద రావు గారు, మంజునాథ రావుగారు,అప్పుడు హాల్ లోనే ఉన్నారు.. ఇద్దరూ అలా సడన్ గా వచ్చేసరికి ఆశ్చర్యపోయారు.. వెంటనే పైకి లేచి వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చారు. "మీరు రావడానికి చాలా రోజులు పడుతుందని ఇప్పుడే అనుకుంటున్నాం.. ఇంతలోనే మీరు వచ్చారు..!! నూరేళ్లు మీకు..!!"అని అన్నారు గోవింద రావు.. " ప్రయాణం బాగా జరిగిందా..?వెళ్లిన పని సుఖంగా జరిగిందా బాబు...?"అని అడిగారు మంజునాథ రావు.. " బాగానే జరిగింది గురువుగారు..!"అన్నాడు రుద్ర.. ఆదిత్య మాత్రం సమాధానం చెప్పకుండా అటు ఇటు చూడసాగాడు.. ఆదిత్య చూపులు పసిగట్టారు మంజునాథ రావు. "భాను ఇప్పుడే బయటికి వెళ్ళింది. పదినిమిషాల్లో వస్తుంది బాబు...!" అన్నారు చిన్నగా నవ్వుతూ మంజునాథ రావుగారు.. ఆ మాటలకి ఆదిత్య సిగ్గుపడుతూ.. " అదేంలేదు తాతగారు.. మంచినీళ్ళు అడగడానికి ఎవరైనా ఉన్నారా అని చూస్తున్నాను..!!" అన్నాడు.. "ఒరేయ్ రావు..! వీడికి కూడా నీ సిగ్గే వచ్చిందిరా..! నీకు తగ్గ మనవడు..!" అంటూ నవ్వుకున్నారు. "చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు కదా.. ముందు వెళ్లి స్నానం చేసి విశ్రాంతి తీసుకోండి.తర్వాత మాట్లాడుకుందాం." అన్నారు గోవింద రావు... సరేనని ఇద్దరూ తమ తమ గదుల్లోకి వెళ్లారు. కొద్దిసేపటికి రుద్ర స్నానం చేసి,హాలులోకి వచ్చాడు. ఇంతలో భాను అక్కడికి వచ్చింది.. రుద్ర చూసి ఆశ్చర్యపోయి.. " అప్పుడే వచ్చేసారా..!? ఆదిత్య గారు ఏరి..?"అని రుద్ర ని అడిగింది... రుద్ర సమాధానం చెప్పబోతుండగా, మంజునాథ రావు కలగజేసుకుని " రుద్ర ఒక్కడే వచ్చాడు తల్లి. హళేబీడులోని శివాలయంలో ఆదిత్య చేత ఏవో పూజలు చేయిస్తున్నారు.. ఆదిత్య కి సంబంధించిన సామానుల కోసం రుద్ర ఒక్కడే వచ్చాడు. ఆదిత్య రాలేదు.." అని అన్నారు.. ఆ మాటలు విన్న భాను ముఖం మాడిపోయింది. ఎవరితో మాట్లాడకుండా నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయింది.. అది గమనించిన రుద్ర " అదేమిటండీ.? అలా చెప్పారు.? పాపం చూశారా..! ఎలా బాధపడుతూ వెళ్ళిపోయిందో..?" అంటూ నోచుకున్నాడు రుద్ర.. రుద్ర మాటలను సమర్థించాడు గోవింద రావు.. " ఎందుకురా.. ఆ పిల్లని అలా బాధ పెట్టావు..నువ్వు కుదురుగా ఉండవు కదరా..!!?"అంటూ మంజునాథ రావు ని తిట్టారు.. ఆ మాటలకి పగలబడి నవ్వుతూ...!! "రేయ్ రావు..! మీకు తెలియంది కాదు కదరా..!! ఎదురు చూపుల్లోనే ప్రేమ బలపడుతుంది..! అయినా ప్రవరాక్యుడు లాగా అమ్మాయిలకు దూరంగా ఉండేవాడివి.. ఇవన్నీ నీకు ఎలా తెలుస్తాయి..??"అన్నారు మంజునాథ రావు.. ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ఆదిత్య అక్కడికి వచ్చాడు... " ఏదో మాట్లాడుకుంటున్నారు..??"అని ఆదిత్య అడగగానే, అప్పటి వరకు జరిగిందంతా చెప్పేసాడు రుద్ర.. " పాపం తాతయ్య గారు..! ఎందుకలా తనని ఏడిపించారు..?" అంటూ భాను గదికి పరిగెట్టాడు.. "ఇప్పుడు వీడు పరిగెట్టాడు..!"అంటూ నవ్వడం మొదలు పెట్టారు గోవింద రావు..ఆయన నవ్వుతూ శృతి కలిపారు ఇద్దరు.. ఆదిత్య భాను గది కి వెళ్ళేసరికి బోర్లా పడుకొని ఉంది.. మెల్లగా తన దగ్గరకు వెళ్లి తలపై చెయ్యి వేసాడు. "నాకు ఆకలిగా లేదు.. మీరు వెళ్లి తినండి.. తాతయ్య..!!" అని అంది.. " నువ్వు తినకపోతే నేను కూడా తినను..!!" అన్నాడు ఆదిత్య.. ఆదిత్య గొంతు వినగానే వెంటనే తల తిప్పి చూసింది.. ఎదురుగా ఆదిత్య కనిపించగానే ఆనందంతో గట్టిగా కౌగిలించుకుని,ముఖం పై ముద్దులతో ముంచెత్తింది... "అబ్బో..!! నన్ను చాలా మిస్ అయినట్టున్నావ్..?" అని నవ్వుతూ అడిగాడు.. ఆదిత్య.. " మరి అవ్వనా..?? మీరు వెళ్ళాక చాలా బాధపడ్డాను.. ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చెయ్యాలో అని అనుకున్నాను. కానీ లక్కీగా మీరు తిరిగి వచ్చారు.." అని చెప్పింది. "సరే పద.. ఇంకా ఎక్కువ సేపు ఇక్కడే ఉంటే,ఇక మనల్ని అందరూ ఆడేసుకుంటున్నారు." అని ఇద్దరూ కలిసి హాల్లోకి వచ్చారు.. "ఏరా బుజ్జగింపులు అయిపోయాయా..?" అని నవ్వుతూ అడిగాడు గోవింద రావు.. " మా భాను ముఖం చూడు.ఆదిత్య రాగానే వెలిగిపోతోంది.." అంటూ నవ్వారు మంజునాథ రావు.. ఆ మాటలకి అందరూ నవ్వుకున్నారు.. "సరే గాని, ఇంటికి వెళ్లిన పని ఏమైంది..?" అని అడిగారు గోవింద రావు.. ఇద్దరూ కలిసి హలేబీడు లోని జరిగిన సంగతులన్నీ వాళ్ళతో చెప్పారు. జరిగిందంతా విని అందరూ సంతోషించారు.. భోజనం టైం అవడంతో అందరూ భోజనాలు పూర్తి చేసి ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లి పోయారు. ఆ తర్వాత ఆదిత్య రుద్ర తమ తమ గదుల్లోకి వెళ్లిపోయారు.. అందరూ పడుకుండిపోయారు.. అదేరోజు రాత్రి.... సమయం 2 గంటలు కావస్తోంది. రుద్ర కి మెలకువ వచ్చింది.. మెల్లగా పైకి లేచి, అక్కడ అంతకు ముందు సిద్ధం చేసుకున్న బ్యాగ్ తీసుకొని, మెల్లగా తన గది నుండి బయటకు వచ్చాడు.. అక్కడే ఉన్న కార్ కీస్ తీసుకొని, గది బయటకు వచ్చాడు.. ఇంటి గుమ్మం దాటి బయటికి వెళ్లబోతుండగా... అప్పుడే మంచినీళ్ల కోసం బయటకు వచ్చిన గోవింద రావు రుద్ర ని చూశారు... కార్ డోర్ తీసుకుని రుద్ర వెళ్లబోతుండగా... "ఏమైంది రుద్ర..? ఇంత రాత్రివేళ ఎక్కడికి బయలుదేరావ్..??"అని కంగారుగా అడిగారు గోవింద రావు. " అమ్మ దగ్గర నుండి ఫోన్ వచ్చింది గురువుగారు..!! రెండు రోజుల్లో తిరిగి వచ్చేస్తాను...! ఆదిత్యతో చెప్పండి.."చెప్పి బయలుదేరుతుండగా.. "ఇంత రాత్రివేళ ఒక్కడివే ఏం వెళ్తావ్..! ఆదిత్యని కూడా తీసుకెళ్ళు..!! ఒక నిమిషం ఆగు..! ఆదిత్య ని పిలుస్తాను..!" అంటూ పిలవబోతుండగా.. "వద్దు గురువుగారు..! నేను ఒక్కడినే వెళ్తాను..!" అంటూ ఆయన సమాధానం కోసం ఎదురు చూడకుండా కంగారుగా వేగంగా కారు ఎక్కి వెళ్ళిపోయాడు.. రుద్ర ప్రవర్తన గోవింద రావు గారికి విచిత్రంగా తోచింది.. అతని ముఖంలో కంగారుని గమనించారు.. వెంటనే ఆదిత్య గది దగ్గరికి వెళ్ళారు.. ఆదిత్య నిద్రపోతున్నాడు. పడుకున్నవాడిని లేపారు.. నిద్రలేచిన ఆదిత్య తన గదిలో ఉన్న గోవింద రావు ని చూసి " ఏమైంది తాతయ్య.? ఇంత రాత్రి వేళ నా గదిలోకి వచ్చారు.? ఏదైనా సమస్య..??" అని కొంచెం కంగారుగా అడిగాడు.. "రుద్ర సడన్గా వాళ్ల ఇంటికి వెళ్లాడు. దేనికి అని అడిగితే వాళ్ళ అమ్మగారు నుండి ఫోన్ వచ్చిందని చెప్పి కంగారుగా వెళ్ళాడు.."అని అడిగారు. ఆ మాటలు విన్న ఆదిత్య కి నిద్ర మత్తు వదిలిపోయింది "ఇంత రాత్రి వేళ వెళ్లాడా..?? నాకు కూడా ఏమీ చెప్పలేదు.?" " ఏమో.? కంగారుగా వెళ్ళిపోయాడు.."అని చెప్పారు గోవింద రావు. ఆదిత్య వెంటనే రుద్ర మొబైల్ కి కాల్ చేశాడు.. రింగవుతున్నది గాని అటువైపు నుండి ఎటువంటి సమాధానం లేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా రుద్ర ఫోన్ అటెండ్ చేయడం లేదు.. ఆదిత్య కి ఏం చేయాలో అర్థం కాలేదు.. "తనకి కూడా చెప్పకుండా ఎంత అర్ధరాత్రివేళ ఒక్కడే ఎందుకు బయల్దేరాడు..?" అని ఆలోచించసాగాడు.. మరోపక్క.........!! ఇంటి నుంచి బయలుదేరిన రుద్ర వేగంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు... అంతకంటే వేగంగా అతని ఆలోచనలు ముందుకు సాగుతున్నాయి.. తన బయలుదేరిన కొద్ది నిమిషాలకే ఆదిత్య నుండి ఫోన్లు రాసాగాయి.. ఫోన్ ఎత్తకుండా సైలెంట్ మోడ్ లో పెట్టాడు.. మెల్లగా అతని ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి.. గుహ నుండి బయటకు వచ్చేటప్పుడు, సిద్ధ భైరవులు ఆదిత్య తెలియకుండా కొన్ని విషయాలను రుద్రతో చెప్పారు.. " చూడు రుద్ర..! ఇది నీ మనసులో పెట్టుకో.. ఆదిత్యకి తెలియనివ్వద్దు.. మీరు చెప్పింది పూర్తిగా విన్న తర్వాత, ఈ సమస్యలన్నిటికీ మూలం మీరు చెప్పిన చోటే ఉందని నాకనిపిస్తుంది.. కానీ ఆదిత్య ని ఆ ప్రదేశానికి దూరంగా ఉంచు.ఎందుకంటే వాటిని ప్రేరేపించిన స్థలం అదే అయి ఉంటుందని నాకనిపిస్తుంది. అటువంటి స్థలానికి ఆదిత్య వెళితే, మీ చేతిలో ఓటమి చవి చూశాయి కనుక, తిరిగి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.. అతని ప్రాణానికి ముప్పు రావచ్చు.. కాబట్టి ఆ ప్రదేశానికి ఆదిత్యని దూరంగా ఉంచు. నువ్వు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించు.."అని సలహా ఇచ్చారు.. " సరే గురువుగారు..!! " అన్నాడు రుద్ర.. అలా గత ఆలోచనల నుంచి బయట పడ్డాడు.. ఇంతలో వేగంగా వెళ్తున్న వాడు కాస్త, ఒక్కసారిగా రోడ్డు పక్కన కార్ ని ఆపాడు.. కార్ నుంచి బయటికి దిగాడు.. అప్పటివరకు నెలవంక తో వెలిగిన ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై, మబ్బులు పట్టి, ఏ క్షణానైన కుండపోత కురిసేలా ఉంది.. ఆ రోడ్డు పక్కనే ఒక నేమ్ బోర్డు ఉంది.. చీకటిగా వుండడం వల్ల ఏమీ కనిపించడం లేదు.. ఇంతలో అకస్మాత్తుగా ఒక పెద్ద మెరుపు మెరిసింది ఆ మెరుపు వెలుగులో ఆ నేమ్ బోర్డ్ ని చూశాడు.. దానిపై తుమ్మలబైలు అని ఉంది... రుద్ర వెళ్తుంది ఇంటికి కాదు..!! ఆ అడవిలోకి......!! ఇంకా ఉంది....!!!
22-03-2026, 09:07 AM
Deeniki readon kooda teleekunda 27 parts ayyay!!
Let's hope the reason comes out sooner |
|
« Next Oldest | Next Newest »
|