Posts: 3,673
Threads: 166
Likes Received: 11,655 in 2,319 posts
Likes Given: 7,707
Joined: Nov 2018
Reputation:
794
ఆ ఇంతి దమయంతి
రచన: వీరేశ్వర రావు మూల
నలుడు చాలాకాలం తర్వాత తన శయనమందిరమున ఏకాంతముగా ఉన్నాడు. శని ప్రభావం తప్పించుకుని మరల గ్రహణము వీడిన భానుడి వలే భాసించు చున్నాడు.
అతని శయనమందిరము నానా పుష్ఫ సుగంధములచే పరిమళభరితమైనది. కల కూజితములచే ఆ మందిరము రస రంజితమైనది. అతని విశాల వక్ష స్థలమును పూల పుప్పొడి తాకి విరహజ్వాలలు రేపు చున్నది.
"ఏల దమయంతి రాలేదు? ఇంకనూ అలంకారము పూర్తి కాలేదా? స్త్రీలు అలంకార ప్రియులు. నా మనస్సు ఆ మనోహర సౌందర్య రాశి ని చూడవలెనని ఉవ్విళ్ళూరుచున్నది. ఆమెకు అందమే కాదు. ప్రజ్ఞ యందు ఎవ్వరికి తీసిపోదు. కనుకనే తన యుక్తిని ఉపయోగించి దేవతల నుండి తనను రక్షించింది.
స్వయంవరమున వరించింది. దేవతల ఈర్ష్య అసూయలకు కారణమై, జీవితమే రణమైనది. ఒహో అది గతము. ఎన్ని క్లేశములు అనుభవించినా మొక్కవోని ఆమె ధైర్యమే ఆమె సౌందర్య కీలకం కాబోలు. ప్రస్తుతం హంస లేదు వర్తమానం పంపడానికి. హంస ఏ హంసను కూడుటకు పోయినదో!
ఘడియలు గడుచుచున్నవి. దమయంతి కానరావడం లేదు. అలుక కాదు కదా! దమయంతి అనగా దమం కలిగిన ఇంతి కదా! ఇంద్రియ నిగ్రహం పాటించుచున్నదా?
అద్వైతమై రసాంబుధిలో మునక వేసి తరించవలిసిన క్షణాలు కదా!
నలుడు పరి పరి విధముల తలపోసి, వేచి వేచి అలసటచే నిద్రించెను.
********
మనస్సును సుగంధ పరిమళం చుట్టుకొనుటచే కనులు
విప్పెను. పక్కలో, పక్కనే దమయంతి. కాని ఏమి లాభం? అటు తిరిగి నిద్రించుచున్నది.
"దేవీ"
జవాబు లేదు. దమయంతి అటు వైపునే ఉన్నది.
నలుడు ఆమె చరణములను ముద్దాడి, ‘నా వల్లే కదా నాడు అడవిలో ఈ పాదములు గాయములు పాలయినవి’ అని కించిత్ చింతించినాడు.
"ఇటు తిరిగి నలునిడిని కాంచవా?"
"కాంక్ష లేనప్పుడు ఎటు తిరిగిన ఏమి?"
"అదేమి? నాడు నీ గాఢ పరిష్వంగమున లోకములను మరిచితినే. నేడు ఇదేమి? ఐననూ నష్టం లేదులే" అని పద్యం చదివెను.
వరబింబాధరమున్ పయోధరములున్ వక్రాలకంబుల్ మనోహర లోలాక్షులు చూప కవ్వలి మొగంబైనంత నేమాయె నీ గురు భాస్వజ్జఘనంబు క్రొమ్ముడియు మాకున్ జాలవే! గంగకద్దరి మేలిద్దరి కీడనన్ గలదె యుధ్యద్రాజబింబాననా!
(ఏమయిందో ఏమో నాయిక పెడమొగం పెట్టి అటు తిరిగిపోయింది. చూసే చూపు, మనసులో ప్రేమ ఉండాలి కానీ అందగత్తె ఎటు తిరిగితే ఏమవుతుంది? సౌందర్యం ఎక్కడికి పోతుంది? నాయిక అందాన్ని ఆస్వాదించడంలో నాయకుడిది ఎంత గడుసుదనమో!
దొండపడులాంటి పెదవులు, ఎత్తయిన పయో ధరాలు, వంపులు తిరిగిన ముంగురులు చూపకుండా నువ్వు వెనక్కి తిరిగి నిలబడితే మాత్రం ఏమిటీ? వెనుకవైపు ఉన్న నీ విశాల జఘన భాగం, చక్కనైన నల్లని నాగుపాము వంటి వేణి(జడ) నాకు చాలవేంటి? గంగానదికి అవతలి వైపు మంచిది, ఇవతలి వైపు చెడ్డది అని ఉంటుందా? అలాగే అందమైన నిన్ను ఏ వైపునుంచి చూసినా కనువిందే కదా!)
దమయంతి నలుని గడుసుతనానికి సంతసించి,
"స్వామి, రెండు వరములు ఇచ్చిన అటు తిరిగెదను" నవ్వూతూ అన్నది.
నలుని కరము ఆమె వెన్ను నుండి పాకి కుచ గిరులపై క్రీడించుచున్నది. చిరు కోపమును క్రీగంట ప్రదర్శించింది.
"వరములన్న భయము దేవి. నాడు దశరథుడు కైకకు వరములు ఇచ్చి ఎట్లు ఇక్కట్ల పాలయ్యినాడో చూచితిమి కదా" అన్నాడు నలుడు చిరు ఆందోళనగా.
"అది సమర సందర్భం" అంది దమయంతి.
"ఇది మాత్రం తక్కువా? శృంగార సమరం"
చెరకు వింటి వేలుపు తన శరములు సంధించగా, నలుడు దమయంతి అధరామృతం గ్రోలవలెనని, స్థనాగ్రముల స్పర్శతో కనురెప్పలు సరసీరుహములుగా రూపాంతరం చెందాలని, అతని మనస్సు మోహతీరమున మీనము వలే కొట్టుకునుచున్నది.
"సరే దేవి, రెండు వరములు కోరుకొనుము"
"స్వామి రెండు వరములు"
"చెప్పు" అన్నాడు నలుడు సుగంథభరిత నల్లని జడను కంఠానికి చుట్టుకుంటూ.
"ఒకటి మీ వంట రుచిచూడవలెనని. రెండు మీరు శాశ్వతంగా జూద క్రీడను విరమించవలెను."
"రమించు సమయమున ఈ వరములా?"
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,673
Threads: 166
Likes Received: 11,655 in 2,319 posts
Likes Given: 7,707
Joined: Nov 2018
Reputation:
794
27-12-2025, 06:48 PM
(This post was last modified: 27-12-2025, 06:49 PM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
"వంట.." అంటూ నలుడు గొణుగు చుండెను.
"బాహుకుడి గా మీ పాక నైపుణ్యం ఋతుపర్ణుని రాజ్యమున చూపలేదా? "
"అవును"
"జూదమే గదా మనల్ని దు:ఖ లోయ లోకి తోసినది"
"అవును"
నలుడు రెండు వరములు ఇవ్వగానే దమయంతి లేచి అతని పాదములకు నమస్కరించినది.
నలుడు సంతసించి దమయంతిని బిగియార కౌగలించుకొనెను. అకస్మాత్తుగా అతని దృష్టి అంత:పుర మున మూలనున్న వస్త్రము పై పడినది.
"అది"
" మీరు నన్ను అడవినందు వదలి, కొంత భాగం చింపుకుని వెళ్లిన చీర"
"ఎందులకు దాచావు?"
"మనకు దిక్సూచి గా ఉపయోగపడుతుందని"
దమయంతి ఎప్పుడూ ఆతనికి ఆశ్చర్యం గొలుపుతూ ఉంటుంది.
"నీకు వరములు దక్కినవి. మదన కదన రంగమున
శక్తి పరీక్షించుకుందునా"
"చూద్దాం" అని అతనికి దొరకకుండా పరుగెత్తినది. నలుని బలమునకు ఓడి అతనికి చిక్కినది.
అతని పెదవులు ఆమె అధరామృతం ను తనివితీరా గ్రోలినవి.
అతని మోము ఆమె కుచకుంభములతో క్రీడించి, సైకత శ్రేణిని తలపించు ఉదరభాగమును చేరినది.
మన్మధుని సతి ఆమెను ఆవహించి రతి కి ప్రేరేపించుచున్నది. చంద్రుడు వారి సమాగమమును చూచి సిగ్గుపడి మేఘ సుందరి పరదాలలో తలదాచుకున్నాడు.
నాభి అతనికి శృంగార ఊబి ని చూపించగా, మునక వేసి,
అద్భతమై డెందాలకు ఆనందమై, అనఘమై, అద్వైతమై
విల్లు లా ఒంగిన దేహాలు ఖజరహో శిల్పాలై...
ఆనందానికి అంచులు చేరి ఇద్దరూ విజేతలయిన
రస వితర్ధిక పై సైనికులై..
ఆ క్షణం
అమృత క్షణం..
రస జ్వలన అను క్షణికం....
సమాప్తం
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,673
Threads: 166
Likes Received: 11,655 in 2,319 posts
Likes Given: 7,707
Joined: Nov 2018
Reputation:
794
బార్బరీకుడు
రచన: Ch. ప్రతాప్
భారతీయ పురాణాలలో బార్బరీకుడు ఒక అసామాన్య వీరుడు. మహాభారతంలోని మహా పాండవ యోధుడు భీమసేనుడి మనవడు.
ఘటోత్కచుడు నాగవంశానికి చెందిన మౌర్వి దేవితో వివాహం చేసుకోవడం ద్వారా జన్మించిన పుత్రుడే బార్బరీకుడు. ఈ వీరవంశంలో పుట్టిన అతడు చిన్ననాటి నుంచే యుద్ధ విద్యలో అసాధారణ ప్రతిభను కనబరిచాడు.
అస్త్రశస్త్రాల పట్ల అతడిలో ఉన్న ఆసక్తి, సాధన చూసి దేవతలు సంతుష్టులై, బార్బరీకునికి మూడు దివ్య బాణాలను వరంగా ప్రసాదించారు. ఈ మూడు బాణాల శక్తి అద్భుతమైనది; వాటి సహాయంతో ఏ యుద్ధాన్నైనా క్షణాల్లో ముగించే సామర్థ్యాన్ని అతడు పొందాడు. అందుకే ఆయనకు “త్రిబాణధారి” అనే అపూర్వ బిరుదు లభించింది.
కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమయ్యే వేళ, ఈ ధర్మయుద్ధంలో పాల్గొనాలనే సంకల్పంతో బార్బరీకుడు బయలుదేరాడు. వెళ్లే ముందు తల్లి మౌర్వి అతడికి ఒక గంభీరమైన మాట తీసుకుంది— “యుద్ధంలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో, వారికే నీ సహాయం అందించాలి.” తల్లిపట్ల విధేయుడైన బార్బరీకుడు ఆమె మాటకు కట్టుబడ్డాడు. అయితే ఈ ప్రమాణంతో యుద్ధరంగంలోకి అడుగుపెట్టిన అతడు, తన మూడు బాణాల శక్తిని ఉపయోగిస్తే, రెండూ పక్షాలు పూర్తిగా నశించి, చివరికి తానే ఒక్కడిగా మిగిలే పరిస్థితి ఏర్పడుతుందని గ్రహించాడు.
ఈ అపూర్వ శక్తి యుద్ధ ఫలితాన్ని వక్రీకరించవచ్చని భావించిన శ్రీకృష్ణుడు, బ్రాహ్మణ వేషంలో బార్బరీకుణ్ని పరీక్షించాడు. “మూడు బాణాలతో కొలిమి వంటి ఈ యుద్ధాన్ని ఎలా ముగిస్తావు?” అని ప్రశ్నించగా, బార్బరీకుడు తన దివ్య బాణాల శక్తిని వివరించాడు— మొదటి బాణం శత్రువులని గుర్తిస్తుంది, రెండోది తనవారిని రక్షిస్తుంది, మూడోది లక్ష్యాన్ని నిర్మూలించి తిరిగి వస్తుంది. ఈ శక్తితో యుద్ధాన్ని నిమిషాల్లో ముగించగలనని అతడు ధైర్యంగా తెలిపాడు.
బార్బరీకుని వీరశక్తి, ప్రమాణం కలిసిపోతే ధర్మయుద్ధం యొక్క అసలు ప్రయోజనం నష్టపోతుందని అర్థం చేసుకున్న శ్రీకృష్ణుడు, తన దివ్యరూపం చూపించి, యుద్ధం ప్రారంభానికి ముందే బార్బరీకుని తలను బలిగా కోరాడు. ఈ బలి ద్వారా యుద్ధ ఫలితం నిష్పాక్షికంగా తెలిసేలా అవుతుందని వివరించాడు. ధర్మం కోసం ప్రాణం అర్పించడం ఆనందంగా స్వీకరించిన బార్బరీకుడు, తల బలి ఇచ్చాడు. తన త్యాగాన్ని యుద్ధాన్ని పర్యవేక్షించే మహాశక్తిగా నిలబెట్టాలని ప్రార్థించగా, శ్రీకృష్ణుడు కలియుగంలో “ఖటూశ్యామ్”గా పూజలు అందుకుంటావని వరం ఇచ్చాడు.
యుద్ధం అనంతరం, బార్బరీకుని తల రాజస్థాన్‌లోని ఖటూ గ్రామంలో దర్శనమిచ్చింది. అప్పటి నుంచి ఆయన “ఖటూశ్యామ్”గా భక్తుల పూజలు అందుకుంటూ వస్తున్నారు.
నేటికీ భక్తులు “జయ శ్యామ్” నామస్మరణతో ఆయన త్యాగాన్ని స్మరించి కృప కోరుతారు. ధైర్యం, త్యాగం, విధేయత, ధర్మనిష్ఠ— ఈ నాలుగు మహిమాన్విత గుణాలకు బార్బరీకుడు నిత్య ప్రతీకగా నిలిచాడు.
బార్బరీకుని కథ మనకు అందించే శాశ్వత ఉపదేశం— శక్తి స్వార్థానికి కాదు, ధర్మానికి; అహంకారానికి కాదు, త్యాగానికి వినియోగించబడాలి. తల్లి మాట, ధర్మ నియమాలు అన్నిటికంటే గొప్పవిగా భావించి ప్రాణం అర్పించిన ఈ మహాత్ముని గాథ భారతీయ పురాణాల్లో శాశ్వతంగా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది.
సమాప్తం
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,673
Threads: 166
Likes Received: 11,655 in 2,319 posts
Likes Given: 7,707
Joined: Nov 2018
Reputation:
794
అశ్వద్ధామ ఘాతుకం
రచన: Ch. ప్రతాప్
మహాభారత సంగ్రామం కేవలం ఆయుధాల యుద్ధం కాదు; అది కోపం, ప్రతీకారం, ధర్మం, అధర్మం మధ్య నడిచిన అంతర్యుద్ధం. యుద్ధం చివరి రోజుల్లో జరిగిన అశ్వత్థామ ఘాతుకం ఈ మహాకావ్యంలోని అత్యంత హృదయ విదారక ఘట్టం. అశ్వత్థామ తన తండ్రి ద్రోణాచార్యుల మరణాన్ని అంగీకరించలేకపోయాడు. పాండవులు “అశ్వత్థామ హతః” అని అబద్దం చెప్పి ద్రోణుణ్ణి ఆయుధాలు వదిలించడంతో, ఆచార్యుడు నిరాయుధంగా వధింపబడ్డాడు. ఈ మోసంతో కూడిన వధ అశ్వత్థామ మనసును బద్దలుకొట్టింది. ఆ బాధ అతని హృదయాన్ని అగ్నిపర్వతంలా మండేలా చేసింది.
తండ్రిపై ఉన్న భక్తి, గౌరవం, ప్రేమ — ఇవన్నీ ఒక్కసారిగా ప్రతీకారాగ్నిగా మారిపోయాయి. అతనికి అప్పటి నుండి పాండవులను ఎలాగైనా శిక్షించాలన్న ఆవేశం అతనిలో ఆవహించింది .
ఆ ప్రతీకారభావంతో ఒక రాత్రి వేళ పాండవుల శిబిరంలోకి రహస్యంగా ప్రవేశించి, నిద్రలో ఉన్న ద్రౌపది ఐదుగురు కుమారులను పాండవులని భావించి వధించాడు. వారి చేతుల్లో ఆయుధం లేదు. వారు యుద్ధంలో లేరు. వారికీ , ద్రోణాచార్యుడి మరణానికి ప్రత్యక్ష సంబంధం అసలు లేనే లేదు.
ఇది శౌర్యం కాదు — అవివేకం. ఇది ప్రతీకారం కాదు — ఆవేశం.
ఆ దారుణమైన అపరాధానికి, ఆ కపట చర్యకు ప్రతిఫలంగా సాక్షాత్తు యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడి శాపం అతనికి లభించింది. ఆ శాపం కేవలం మరణంతో అంతమయ్యేది కాదు.
ఆ శాపం ప్రభావంతో, అతడికి మరణమనే మోక్షం దక్కకుండా పోయింది. అతడి శరీరం నశించదు, కానీ ఆత్మకు శాంతి లభించదు. ఆ శాపం అతడిని యుగయుగాల పాటు వెంటాడే ఒక నశించని జీవితాన్ని, నిత్యం వెంటాడే దుర్భరమైన బాధను ప్రసాదించింది. ప్రతి యుగంలో, ప్రతి కాలంలో అతడు జీవించి తీరాలి; తాను చేసిన నేరం యొక్క భయంకరమైన జ్ఞాపకాలు అతడి అంతరంగంలో నిప్పుల కొలిమిలా మండుతూనే ఉండాలి.
అతడి కళ్ల ముందు కాలాలు మారినా, ప్రపంచాలు నశించినా, తన శరీరం మాత్రం ఆ పాపపు ఫలితాన్ని భరిస్తూ, అమరత్వపు భారాన్ని మోస్తూనే ఉండాలి. ఆ శిక్ష కేవలం వేదన కాదు; అది పశ్చాత్తాపం అనే అగ్నిలో నిత్యం కాలిపోతూ, మరణం కోసం వేడుకుంటూ జీవించే దైవ నిర్ణయం. అతడి ఉనికి, ఇకపై కృష్ణుడి న్యాయానికి ఒక శాశ్వత ప్రతీకగా మిగిలిపోయింది.
భారతంలో ఈ ఘట్టంలో ఉదహరింపబడిన ఒక ప్రముఖ శ్లోకం అశ్వత్థామ భయంకరమైన కోపాన్ని, ఆవేశాన్ని నొక్కి చెబుతుంది.
శ్లోకం:
క్రాధ్దూత బుద్ధిం నిధనేషు కృత్వా ధర్మం విముచ్య రణే చ రాత్ర్యాం
పాండవానాం చ శిబిరం ప్రవిశ్య నిహతాః సుప్తాన్ అపి బాలకాన్ సః
ఆవేశంతో, ప్రతీకారంతో బుద్ధిని, వివేక విచక్షణాలను కోల్పోయి, ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి, అసుర స్వభావంతో అశ్వత్థామ రాత్రివేళ పాండవుల శిబిరంలోకి ప్రవేశించి అక్కడ నిద్రపోతున్న అభం శుభం తెలియని ఆ పసి బాలలను (ఉపపాండవులను) సైతం నిర్దాక్షిణ్యంగా వధించాడు.
మరొక శ్లోకం అశ్వత్థామ నిద్రలో ఉన్నవారిని చంపడం ద్వారా చేసిన ఘోరమైన అకృత్యాన్ని వివరిస్తుంది.
శ్లోకం:
సుప్తానిమాన్ శిషువన్ నిహత్య ధర్మస్య మార్గం సమతిక్రమ్య |ద్రౌపద్యాః పుత్రాన్ పంచైవ హత్వా ధర్మజస్య సభాసనాన్ గతాః
అశ్వద్ధామ ధర్మ మార్గాన్ని పూర్తిగా అతిక్రమించి ,నిద్రపోతున్న ఈ శిశువులను (ఉపపాండవులను) చంపే ఒక దారుణ కార్యాన్ని ఆచరించాడు.
ఈ శ్లోకాలు, ఎంతటి శక్తిమంతుడైనా, ఆవేశం మరియు విచక్షణారాహిత్యం కారణంగా దారుణమైన అధర్మానికి పాల్పడతారని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అందుకే ధర్మం, న్యాయం ఎప్పుడూ పాటించాలని మహాభారతం బోధిస్తుంది.
ఎంతటి బలం ఉన్నా — ఆవేశం మనల్ని దుర్బలుల్ని చేస్తుంది. కోపం, తొందరపాటు స్వభావం మనిషి పతనానికి ప్రధాన కారణాలు అవుతాయని వ్యక్తిత్వ వికాస నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.. అదుపులేని కోపం, ఆలోచనా శక్తిని హరించి, మనిషిని విచక్షణారహితంగా వ్యవహరించేలా చేస్తుంది. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు, నోటి నుంచి జారిన కఠిన వాక్యాలు దీర్ఘకాలికంగా సంబంధాలను నాశనం చేస్తాయి. శత్రుత్వాన్ని పెంచుతాయి.
ప్రతి చిన్న విషయానికీ కోపం తెచ్చుకునే వ్యక్తి మానసిక ప్రశాంతత కోల్పోతాడు, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాడు. ఉన్నత స్థానంలో ఉన్నా సరే, ఒక్క క్షణం ఆగ్రహం వల్ల వృత్తిపరంగా, వ్యక్తిగతంగా గౌరవాన్ని కోల్పోయి, పతనం దిశగా పయనించక తప్పదు. అందుకే, శాంతమే మనిషికి నిజమైన బలం. ఈ అంశాలను మనం అశ్వద్ధామ జీవితం నుండి నేర్చుకోవచ్చు.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,673
Threads: 166
Likes Received: 11,655 in 2,319 posts
Likes Given: 7,707
Joined: Nov 2018
Reputation:
794
17-01-2026, 06:23 PM
(This post was last modified: 17-01-2026, 06:26 PM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
నిజమైన వీరుడు ఎవరంటే శత్రువును ఓడించేవాడు కాదు.తనలోని కోపాన్ని జయించేవాడు.అశ్వత్థామ వద్ద శక్తి , సాహసం,జ్ఞానం మరియు గురు భక్తి వున్నాయి. అపారమైన శాస్త్ర పాండిత్యం కూడా ఉంది. అయితే ఏం లాభం ? అన్ని వున్నా కూడా తన ఆవేశాన్ని, ప్రతీకారేచ్ఛను ఆపలేకపోయాడు.అందుకే అతను చరిత్రలో వీరుడిగా కాక ఒక పిరికిపందలా, కనీస మానవత్వం మిగలని ఒక అసుర స్వభావం కలవాడిగా చరిత్రలో మిగిలిపోయాడు.
ప్రతీకారంలో ఎన్నటికీ నిజమైన విజయం ఉండదు. అది కేవలం ఒక క్షణికావేశం, అంతిమంగా అంతులేని దుఃఖానికి దారితీసే ఒక విష వలయం మాత్రమే. నిజమైన శాంతి నిబిడీకృతమైంది క్షమాగుణంలో మాత్రమే. మనసును స్థిరంగా ఉంచుకొని, విచక్షణతో కూడిన నిర్ణయం తీసుకున్నప్పుడే, ఆ చర్యలో శాశ్వత విజయం సాధ్యమవుతుంది.
కోపం అనే అగ్ని జ్వాల మన అంతరంగాన్ని దహించడానికి ఉవ్వెత్తున లేచినప్పుడు, అశ్వత్థామ అనే ప్రతీకార రూపం మనలో మేల్కొనడానికి సిద్ధమవుతుంది. అటువంటి క్లిష్ట సమయంలో, ఆ ఆవేశాన్ని అదుపు చేయడానికి, మనం మనసులో ఒక్కసారి గంభీరంగా, స్థిరంగా ‘ఇది ప్రతీకారం చూపే సమయం కాదు; ఇది ధర్మాన్ని, న్యాయాన్ని నిలబెట్టే సమయం’ అని చెప్పుకోవాలి.
ఆగ్రహం యొక్క అంధకారం మనల్ని ఆవరించినప్పుడు, మనం దానిని తక్షణమే నిలువరించాలి. ఆవేశంలో తీసుకున్న ప్రతి నిర్ణయం, దాని వెనుక ఉన్న తార్కికతను ధ్వంసం చేస్తుంది. మనలో మెదిలే ప్రతి స్పందనకూ వెంటనే ప్రతిచర్య చూపకుండా, ఒక్క క్షణం ఆగి, విచక్షణ అనే కవచాన్ని ధరించాలి.
ఎందుకంటే, ఆవేశాన్ని జయించినవాడే నిజమైన యోధుడు, నిజమైన విజేత. అంతరంగంలో జరిగే ఈ ధర్మ యుద్ధంలో గెలిచినప్పుడే, బాహ్య ప్రపంచంలో శాంతి, గౌరవం, స్థిరత్వం అనే పతాకాలు ఎగురుతాయి. మన శాంతి మన చేతుల్లోనే ఉంది.
సమాప్తం
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,673
Threads: 166
Likes Received: 11,655 in 2,319 posts
Likes Given: 7,707
Joined: Nov 2018
Reputation:
794
శకటాసుర వధ
![[Image: image-2026-02-02-092803806.png]](https://i.ibb.co/N2trjfgW/image-2026-02-02-092803806.png)
రచన: Ch. ప్రతాప్
శ్రీకృష్ణుని బాల్యలీలల్లో శకటాసుర వధ ఒక అద్భుతమైన ఘట్టం. మధురానగరాధిపతి కంసుడు తన వధకుడు వ్రేపల్లెలో పుట్టాడని తెలిసి, వరుసగా రాక్షసులను పంపిస్తూనే ఉండేవాడు. ఆ రాక్షసుల్లో శకటాసురుడు ఒకడు. ఈ లీల కేవలం ఒక రాక్షసుని నాశనం కాదు, కృష్ణుని దివ్యశక్తి లోకానికి తెలిసే ఘట్టం.
శకటాసురుడు గతజన్మలో ఉత్కచుడనే గంధర్వుడు. అహంకారంతో అష్టావక్ర మహర్షిని అవమానించడంతో, మహర్షి శపించి రాక్షసునిగా జన్మించేలా చేశాడు. ఆ శాపం వల్ల కంసుడి సైన్యంలో చేరి, శకటాసురుడయ్యాడు.
భాగవతం ఇలా చెబుతుంది:
“స కృత్వా రౌరవం ఘోరం బ్రహ్మస్వం చోపజీవతి ।శకటాఖ్యో మహాఘోరః ప్రాప్తస్ తద్బాలఘాతకః ॥” (10.7.7)
అంటే, బ్రాహ్మణ సంపదను అన్యాయంగా వినియోగించినందుకు రౌరవ నరకంలో పడి, రాక్షసరూపం ధరించి, శకటాసురుడిగా కృష్ణుని వధించేందుకు వచ్చినాడని భావం.
ఈ సంఘటన కృష్ణుని నామకరణం అనంతరం జరిగింది. యశోద మాత అతడిని ఒక పాత శకటం క్రింద ఉయ్యాలలో పెట్టింది. ఆ శకటంలో పాల పదార్థాలు నిండిపోయి ఉండేవి. ఇదే సమయం కోసం శకటాసురుడు వేచిచూస్తున్నాడు. శకటరూపంలోనే దాగి, బండిని కృష్ణునిపై పడేయాలని ప్రయత్నించాడు.
అప్పుడే ఊయలలో పడి ఉన్న పసికృష్ణుడు తన చిన్నపాటి పాదంతో బండిని తన్నాడు. ఒక్క క్షణంలో శకటమంతా విరిగి నలుదిక్కులా చెల్లాచెదురైంది.
భాగవతంలో ఈ దృశ్యాన్ని ఇలా వర్ణించింది:
“శయాన్యస్యాధరే శకటం విప్రో జనార్థితమ్ ।పదాఘాతం కరోతి స్మ స శకటం వ్యధూనయత్ ॥” (10.7.8)
అంటే, నేలపై ఉన్న బాలుడు పాదంతో తాకగానే ఆ బండి మొత్తం కూలిపోయిందని భావం.
ఆ శబ్దం విని యశోద, నందుడు, గోపికలు అక్కడికి పరుగెత్తారు. పసికృష్ణుడు క్షేమంగా ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. ఇంత పెద్ద బండి విరగడానికి కారణం ఏమిటో వారికర్థం కాలేదు. పెద్ద పిల్లలు “ఈ బాబు పాదంతో తన్నాడు” అని చెప్పినా, వారు నమ్మలేకపోయారు. యశోద దీనిని ఏదో అపశకునం లేదా అదృశ్యశక్తి ప్రభావంగా భావించింది.
శకటాసురుడు విముక్తి పొంది, మునుపటి రూపంలోకి తిరిగి చేరుకున్నాడు.
ఈ లీలకు లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది. శకటం అంటే మనిషి జీవితాన్ని కట్టిపడేసే అహంకారం, గతకర్మలు, అదృష్టం వంటి బంధనలు. కృష్ణుడు చిన్నపాటి పాదంతో వాటిని ధ్వంసం చేశాడు. దీని ద్వారా ఆయన భక్తుల జీవితాన్ని అడ్డుకునే శక్తులను సైతం తొలగించగల పరమాత్ముడని ఈ లీలా తెలియజేస్తుంది.
మన జీవితాల్లో కూడా అహంకారం, క్రోధం, లోభం వంటి ప్రతికూల శక్తులే శకటాసురాల్లాంటివి. ఇవి మనలో దాగి, మన శాంతి–ఆనందాలను నాశనం చేయాలనుకుంటాయి. కృష్ణభక్తి అనే విశ్వాసం పాదఘాతం అయితే, ఆ బంధనలు ఒక్కసారిగా చెదిరిపోతాయి. ఈ లీల మనకు అందించే గాఢమైన సందేశం ఇదే.
***
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,673
Threads: 166
Likes Received: 11,655 in 2,319 posts
Likes Given: 7,707
Joined: Nov 2018
Reputation:
794
గోడగూచి
రచన: సుధావిశ్వం ఆకొండి
'మాతా చ పార్వతీదేవీ - పితాదేవో మహేశ్వరః.
బాంధవాః శివ భక్తశ్చ - స్వదేశో భువన త్రయమ్'
జీవులు అందరికీ అమ్మ పార్వతీదేవి అయితే, తండ్రి పరమేశ్వరుడు, శివునికి నిజమైన భక్తులు అయినవారు బంధువులు అయితే, ముల్లోకాలు కూడా మన దేశమనే భావన కలిగివుండాలి అని శంకర భగవత్పాదులు చెప్పారు.
అటువంటి భావనలు ఉంటే సులభంగా ఆయన అనుగ్రహం కలుగుతుంది. ఆయన వద్ద ఏమి తెలియని పసిపాపలాగే ఉండాలి. తల్లిదండ్రుల పైన పసిపిల్లలు ఎంతటి ప్రేమను కలిగివుంటారో, వారిని వదిలి ఉండలేకపోతారో అలాంటి భావనలు భగవంతునిపై కలిగివుండాలి.
తనకు తినమని అమ్మనాన్నలు ఇచ్చిందే వాళ్లకు పెడతానని, వాళ్లు కూడా తినాలని మారాం చేసే పసిపిల్లల వలె ఉంటే గనుక, జగత్తుకే తల్లిదండ్రులు అయినా, అంతటివారు ఆ ప్రేమకు పొంగిపోయి తాము దిగివస్తారు. అనుగ్రహించి, చివరకు తమలోకి తీసుకుని మోక్షాన్ని కూడా ఇస్తారు. అందుకు సాక్ష్యం ఏమిటి అనే ప్రశ్నలు వేసుకుంటే, ఎందరో భక్తుల చరిత్రలు అందుకు ఉదాహరణలు!
శివ భక్తులైన నాయనార్లలో ఎంతోమంది అలా స్వామి అనుగ్రహం పొందినవారే! ఇంకా ఎందరో శివభక్తులు ఉన్నారు. కొందరు ముసలితనంలో ముక్తిని పొందితే, కొందరు మధ్యవయస్సులో, మరికొందరు పసి వయస్సులోనే ఈ లోకం పోకడలు తెలిసి, సంసారం అనే సాగరం ఈదులాడకుండానే ముక్తిని పొందారు. వారి పూర్వజన్మ సుకృతం! ఆ భోళా శంకరుని అనుగ్రహం!
అటువంటి వారిలో చాలా పసిపిల్లలా ఉన్నప్పుడే, శివుని వద్ద అలాగే మారాం చేసి, ఆయన అనుగ్రహాన్ని పొంది, ముక్తిని పొందిన ఒక పసిపాప కథనే ఈ గోడగూచి.
పూర్వం శివదేవుడు అనే ఒక గృహస్తు ఉండేవాడు. అతడు మహా శివభక్తుడు. తమ ఊళ్లోని శివాలయంలో అర్చకుడు అతడు. ఆయన రోజూ శివాలయానికి బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలు పట్టుకెళ్లేవాడు. శివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసిన తరువాత ఆ పాలను ఇంటికి తీసుకెళ్లేవాడు. ఇలా పరమనిష్ఠతో ప్రతిదినం కుంచెడు పాలను శివుడికి ఆరగింపు చేసేవాడు. స్వామిని ప్రతిరోజూ ఎంతో భక్తితో అర్చించేవాడు.
అలా గడిచిపోతుండగా ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్లకతప్పని పని పడింది. దాంతో తాను నిష్ఠగా చేసే శివ పూజ, శివుడికి పాలని నివేదించే పని ఎలాగని ఆలోచించాడు.
చివరికి తన కూతురిని దగ్గరికి పిలిచాడు.
“అమ్మా గోడగూచీ! నేనూ, అమ్మ ఊరికి వెళ్తున్నాం! మేము ఊరు నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు తల్లీ!
అలాగే ఇంకో ముఖ్యమైన పని నీకు అప్పజెప్పి వెళ్తాను! జాగ్రత్తగా చేయాలి! అదేంటంటే మనం రోజూ శివాలయంలో శివునికి పాలను ఆరగింపు చేస్తాం కదా! ప్రతిరోజూ నేను శివుడికి పాలు ఇచ్చి వస్తాను కదా! ఇప్పుడు ఆ పని ఎలాగని ఆలోచించాను. శివుడికి రోజూ పాలు ఆరగింపు చేయకపోతే ఎలా? అందుకని ఆ పని నువ్వు చేయాలి! నీకు అప్పజెప్పి వెళ్తాను. రోజూ జాగ్రత్తగా స్వామికి పాలు ఇవ్వాలి నువ్వు. ఆటలు అంటూ ఎటూ వెళ్ళకు తల్లీ!
జాగ్రత్తగా కాచి చల్లార్చిన మంచి గోవుపాలను కుంచెడు కొలిచి ఈ పాత్రలో పోసుకొని గుడికి వెళ్లాలి, అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి. వెళ్తావు కదూ! ఇది మన నియమము తల్లీ! వ్యర్థం కానివ్వకు. ఆటలని, పాటలని సావాసకత్తెలతో ఊరంతా తిరగకుండా ఇంటిపట్టునే వుండి చెప్పిన పని చేయమ్మా! మరచిపోవు కదూ! మా బంగారం కదూ!” అని గడ్డం పట్టుకొని బతిమిలాడి మరీ చెప్పాడు.
"అలాగే నాన్నగారూ! తప్పకుండా చేస్తాను. మీరు పనులు చూసుకుని త్వరగా ఇంటికి వచ్చేయండి!' అంది.
అలా ప్రతిరోజూ గుడికి వెళ్లి, పాలు సమర్పించే పని కూతురు గోడగూచికి అప్పగించాడు శివదేవుడు. తర్వాత శివదేవుడు భార్యతో కలిసి పొరుగూరు వెళ్ళాడు.
మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా స్నానాదులు ముగించుకొని, మంచి గోవు పాలను మరగ కాచి చల్లార్చి, సరిగ్గా కుంచెడు పాలు కొలుచుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేతపట్టుకొని తను కట్టుకున్న పలుచని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరింది.
గర్భాలయంలో కొలువై ఉన్న శివ లింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచింది. రెండు చేతులెత్తి స్వామికి భక్తిగా మొక్కింది.
తర్వాత పాల వైపు చేతులు చూపిస్తూ......
“శివయ్యా! ఇవిగో పాలు నీకోసమే తెచ్చాను! ఆరగించవయ్యా!” అని శివుడికేసి చూస్తూ చెప్పింది.
శివుడు మాట్లాడలేదు. పాలు తాగలేదు.
'ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు? నేను ఇలాగే చూస్తుంటే తాగడం ఎలా అని తాగడం లేదో!' అని అనుకుంది మనసులో.
వెంటనే కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడింది. కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలోకి తొంగి చూసింది. గిన్నెలో ఉన్న పాలు అలాగే ఉన్నాయి. ఆ గిన్నె వైపు విచిత్రంగా చూసింది.
"అయ్యో! శివయ్యా! పాలు తాగలేదా? నీకోసమే తెచ్చాను. నీకు తాగటానికి ఏమిటి ఇబ్బంది? ప్రతిరోజూ నాన్నగారు తెచ్చి ఇస్తారు కదా నీకు! అలాగే తీసుకుని వచ్చాను. కానీ కొంచెం కూడా తాగలేదు నువ్వు. ఎందుకు? అన్ని పాలు అలాగే ఉన్నాయి. నేను తెచ్చిన తాగవా! తాగు తాగు!" అంటూ శివుడికేసి చూసి ఆదేశించినట్లుగా అంది.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,673
Threads: 166
Likes Received: 11,655 in 2,319 posts
Likes Given: 7,707
Joined: Nov 2018
Reputation:
794
ఊహు! శివుడు తాగలేదు. మాట్లాడలేదు.
ఆ చిన్నపిల్లకు చింత మొదలైంది. రకరకాలైన ఆలోచనలు వచ్చాయి.
'అమ్మానాన్నలు చెప్పి వెళ్ళారు. నాన్న చెప్పినట్లు నేను చేసాను. ఎలా పాలు తీసుకుని శివునికి ఇవ్వమని నాన్న చెప్పారో అలాగే తీసుకుని వచ్చానే! మరి లోపం
ఎక్కడ జరిగిందో! శివుడేమో ఈ రోజు పాలు త్రాగడం లేదు? పోనీ తనకి ఒంట్లో ఏమైనా బాధగా ఉందేమో!' అనుకుని మళ్లీ అడిగింది ఆయన్ని.
"ఏమైంది శివయ్యా? నీకేమైనా ఒంట్లో బాగులేదా? అయినా పాలు మంచివే కదా! అవి తాగితే అన్నీ బాధలు తగ్గుతాయి. అమ్మ చెబుతుంది ఎప్పుడూ! నేను అందుకే అమ్మ ఇవ్వగానే తాగుతాను. నువ్వు కూడా పాలు తాగు! అన్నీ తగ్గిపోతాయి! సరేనా! మంచివాడివి కదా! తాగు త్వరగా!" అంది గోడగూచి మళ్లీ.
అయినా పాలు తాగలేదు సరికదా, ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నాడు.
దాంతో గోడగూచికి భయం పట్టుకుంది.
'శివుడు పాలు త్రాగకపోతే అమ్మానాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది కదా! నాన్న నియమాన్ని ఖచ్చితంగా పాటించమని మరీ మరీ చెప్పి వెళ్ళారు. ఇప్పుడు చూస్తే శివుడు పాలు త్రాగడం లేదు!' అనుకుని
శివుడి వైపు దీనంగా చూస్తూ...
"పాలు ఎందుకు తాగడంలేదు? తాగవయ్యా! ఓ లింగమూర్తి!" ప్రాధేయపడింది.
అయినా మాట్లాడకపోయేసరికి...
"పాలు సరిగ్గా కాచలేదా! రుచిగా లేవా? సద్దిపాలు అనుకున్నావా? పొద్దెక్కిందనా లేక పొగ వాసన వస్తుందా? నీళ్లు కలిపానని అనుకుంటున్నావా? ఒకవేళ ఆవుపాలు కావేమో అని అనుకుంటున్నావా?
పోనీ ఆకలిగా లేదా? రోజూ పాలేనని మొగం మొత్తిందా? లేదంటే కుంచెడు పాలు లేవని అనుకుంటున్నావా? నేనేమైనా వీటి మీద మనస్సు పెట్టుకున్నానని అనుకుంటున్నావా? అలా అనుకుంటే నువ్వు అనుకునేది తప్పు! నేను నీళ్లు కలపకుండా మంచి ఆవుపాలు చక్కగా కాచి, నాన్న చెప్పినట్లే చేసి, తీసుకుని వచ్చాను.
నాన్న ఇస్తే రోజూ చక్కగా త్రాగుతున్నావు కదా! ఇప్పుడు ఎందుకు త్రాగడం లేదు? ఓహ్! ఇప్పుడు అర్థం అయ్యింది. ఈ చిన్నపిల్ల పాలు తెస్తే నేను తాగాలా? అని కోపమా? ఎందుకు అలా కోపం? చిన్నపిల్లలను అయితే ఏమిటి! నాన్న చెప్పినట్లే తీసుకుని వచ్చాను కదా! తాగవయ్యా!" అంటూ నిలదీయటం మొదలెట్టింది.
అయినా పాలు తాగలేదు శివుడు.
“పరమశివా! పసిపాపను చేసి ఏమిటి ఈ సతాయింపు? ఆకలిగా లేదంటే, పోనీ అదైనా నోరు తెరచి చెప్పాలి కదా! ఏం మాట్లాడవు!
చెప్పలేదు పోని నీకు ఆకలిగా లేకపోతే ఒక్క గుటక అన్నా తాగు! నేను తృప్తి చెందుతాను! నాన్నకు శివుడికి ఆకలిగా లేదని చెప్పాడని చెబుతాను" అంటూ ఆ పసిపిల్ల పరమశివుడిని బ్రతిమాలుతూనే ఉంది.
"నువ్వు పాలు త్రాగలేదంటే మా అమ్మానాన్నలు నన్ను కొడతారు! అలా కొట్టిస్తావా? అలా కొట్టిస్తే నీకు సంతోషమా? నామీద ప్రేమతోనైనా త్రాగవా?
నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఇలా నన్ను సాధిస్తున్నావు! పోనీ ఇవి ఈ పాలు కాకుండా ఇంకా ఏమైనా కావాలా? అవైనా అడుగు! నిమిషంలో తీసుకొస్తా! కానీ పాలు తాగకుండా మాత్రం నన్ను ఏడిపించకు లింగమూర్తి! మఠంలో పాయసం తింటావా? వీరభద్రుడి జాతర అప్పుడు నిన్ను పంపిస్తాగా! మా నాయన కదూ! మా శివయ్య కదూ! తాగవయ్యా!" అంటూ అన్నం తినకుండా మారాం చేసే వాళ్ళ తమ్ముడిని వాళ్ళమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ బ్రతిమాలుతోంది. ఏడుస్తోంది.
ఆ పరమేశ్వరుడు చిన్నపాప అమాయకత్వానికి నవ్వుకున్నాడు కానీ పలకలేదు. ఇంకా ఏం చేస్తుందో అని చూస్తూ వున్నాడు. ఆ పరమ కరుణామూర్తి భక్తికి వశం కాకుండా ఎలా ఉంటాడు? అయినా పరిక్షిస్తూ వున్నాడు ఆ పాపను.
గోడగూచి కిందపడి ఏడుస్తూ గిలగిలా కొట్టుకోసాగింది.
'ఈ శివుడు పాలు త్రాగమంటే బెల్లం కొట్టిన రాయిలా వున్నాడు? నాన్నగారు వస్తే నన్ను కోపగిస్తారు. కొడతారు!' అని అంటూ ఏడవసాగింది.
స్వామి వైపు చూస్తూ...
"నువ్వు ఈ పాలు తాగలేదంటే, నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు, కోపంతో నన్ను చంపేస్తారు.
నాన్నగారు పదేపదే చెప్పిన ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావడం ఖాయం! అంతకంటే ఇక్కడ నీ ముందే చావడం మేలు!" అని తలను శివలింగానికేసి బాదుకుంది ఏడుస్తూ.
ఆ సర్వేశ్వరుడు, భక్త వత్సలుడు ఒక్క క్షణం ఆగకుండా ఆ పాపను పట్టుకొని ఆపాడు తలకు దెబ్బ తగలకుండా. ఆ వెంటనే చిన్నారి ముందు చిద్విలాసంగా నిలబడ్డాడు. పాలగిన్నెను తీసుకొని అందులోని పాలు మొత్తం తాగేశాడు. పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది.
"హమ్మయ్య! త్రాగావా! ఇంత ఏడిపించావు! అమ్మానాన్న వచ్చేవరకూ రోజూ నేను పాలు తెస్తాను! ఇలాగే చక్కగా త్రాగాలి. నన్ను ఏడిపించకుండా తాగాలి! సరేనా!" అంది.
ఆయన సరేనని చిరునవ్వు నవ్వి, ఆశీర్వదించాడు.
శివుడు ప్రత్యక్షమయ్యాడు కానీ ఆ రూపం అరుదైనది అని పాపకు తెలీదు. ఆయన దేవుడనీ, పిలిస్తే పలుకుతాడనీ, పెట్టినవన్నీ ప్రేమగా పెడితే తింటాడనీ, మన మాటలు వింటాడనీ అనుకుని ఆనందించింది ఆ పసి పాప.
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,673
Threads: 166
Likes Received: 11,655 in 2,319 posts
Likes Given: 7,707
Joined: Nov 2018
Reputation:
794
తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త నాలుగైదు రోజులయింది, పాప రోజు తానే పాలు తేవడం శివుడికి నివేదించడం, ఆయన త్రాగడం జరుగుతోంది. అది శివుడికి కూడా నచ్చింది ఇలా ప్రతిరోజు పాలు తేవడం శివుడు త్రాగడం జరిగి పోతున్నాయి.
ఒకరోజు ఊరెళ్లిన తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు ఆ సమయంలోనే గోడగూచి పాలను శివుడికి అరగింపు పెట్టి, తిరిగి ఇంటికి వెళ్తూ ఉంది.
అమ్మానాన్నలు రావడం చూసి ఎగిరి గంతేసింది. ఇంతలో ఆమె తండ్రి శివదేవుడు పాప చేతిలో పాలగిన్నెను చూసాడు. పాత్రలో పాలు లేవు.
"ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడినుంచి వస్తున్నావు?" అని సందేహంగా అడిగాడు కూతురును.
పాప గుడిలో శివుడు పాలు త్రాగిన వ్యవహారం అంతా చెప్పింది. శివదేవుడు పాప మాటలు నమ్మలేదు.
"శివుడు పాలు త్రాగడమేంటి? నువ్వు ఏదో అబద్దం చెప్పుతున్నావు. శివుడి పేరు చెప్పి పాలు నువ్వే త్రాగేశావా? నిజం చెప్పు! శివుడికి నేను చేసే వ్రతాన్ని నేలపాలు చేశావు కదూ! మన నియమాన్ని పాడుచేశావు కదా!" అంటూ ఆగ్రహంతో కూతురును తిట్టాడు.
పాప ఎంతచెప్పినా తన మాటలు నమ్మని శివదేవుడు మరునాడు కూతురు వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్లారు. రోజూలాగే పాప పాలను శివుని ముందు ఉంచింది.
"లింగమూర్తి అరగించవయ్యా!" అని పిలిచింది. స్వామి పలకలేదు.
"అయ్యో! నిన్నటివరకూ బాగానే త్రాగావు కదా! మళ్లీ ఏమైంది? నాన్న నా మాటలు నమ్మడం లేదు. రోజూలాగే వచ్చి పాలు త్రాగవయ్యా!" అని మళ్లీ.
అయినా శివుడు రాలేదు. త్రాగలేదు.
అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపం వచ్చింది.
"ఓసి! రోజు పాలు త్రాగే శివుడు ఇవాళ త్రాగలేదే? కనీసం చూడను కూడా లేదు? కన్నతండ్రినే అబద్దపు మాటలతో మోసం చేస్తావా? ఎన్ని కథలు చెప్పి మోసం చేసావే? ఎంత శివ ద్రోహం చేసావే? శివుడికి తెచ్చిన పాలను నీపొట్టలో పోసుకున్నావా? ఉండు! నీ పని చెప్పుతా ఎంత నాటకం ఆడావే? నిన్ను వూరికే వదిలి పెట్టను. నీ పొట్ట చీలుస్తా!" అంటూ వెర్రి కోపంతో కూతురి పైకి ఉరికాడు ఆ తండ్రి.
ఆ పసిపాప భయంతో వణకిపోయింది. ఎటు వెళ్లాలో తేలిక గట్టిగా ఏడుస్తూ...
"హా! లింగ! హా! లింగ!" అంటూ ఆ లింగస్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది ఏడుస్తూ.
"ఇదిగో నేనున్నాను! భయపడకు!" అత్యంత దయతో మహాలింగ మూర్తి ఆ పసిపాప మీద వాత్సల్యంతో తన వక్షస్థలాన్ని తెరిచాడు. పాప అందులోకి చొరబడింది.
వెర్రి కోపంతో కూతురు వెంట పడుతున్న ఆ శివదేవునికి పాప దాక్కోవడానికి వెళ్ళింది ఎక్కడ అనేది గ్రహింపుకు రానేలేదు. కోపంగా తండ్రి వెంటపడుతూ కూతురు వెంట్రుకలను చిక్కించుకున్నాడు.
"ఎక్కడికి పారిపోతావే?" అంటూ ఇవతలకి లాగబోయాడు. అప్పటికే ఆ పసి గోడగూచి శివుడిలో ఐక్యమైపోయింది.
ఆ దివ్యలింగం లోనికి వెళ్లి, ఆ పాప మాయమైపోయింది. కొద్దిసేపటికి శివదేవునికి జరిగిన విషయం అర్థం అయ్యింది.
ఎంతో నిశ్చలమైనది ఆ పసిపాప భక్తి! ఆ అమాయకత్వం శివుడికి ఇష్టమైనది అందుకే భక్తుడే అయినా తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చి, తనలో ఐక్యం చేసుకున్నాడు ఆ భక్తవశంకరుడు. భక్తికి ఈశ్వరుడు వశం అవుతాడని అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది!
కార్తీక సోమవారం గోడగూచి కథలో గోడగూచితో పాటుగా, ఆ కథలోకి మన మనసు ప్రవేశిస్తే, ఆ పరమేశ్వరుని దర్శనం, సాన్నిహిత్యం మనకూ లభిస్తుంది!
నమః శివాయ!
పార్వతీపతయే హర హర మహాదేవ!
������శ్రీకృష్ణార్పణమస్తు����������
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,673
Threads: 166
Likes Received: 11,655 in 2,319 posts
Likes Given: 7,707
Joined: Nov 2018
Reputation:
794
సుషేణుడు
రచన: Ch. ప్రతాప్
భారతీయ ఇతిహాసాలలో, ముఖ్యంగా రామాయణంలో, యుద్ధరంగంలో ధైర్యసాహసాలు చూపేవారితో పాటు, తమ జ్ఞానం మరియు నైపుణ్యంతో కథాగమనాన్ని మార్చిన ముఖ్య పాత్రలు కూడా ఉన్నాయి. అలాంటి కీలకమైన పాత్రలలో ఒకరు సుషేణుడు. ఈయన లంకాధిపతి రావణుడి ఆస్థాన వైద్యాచార్యుడిగా ప్రసిద్ధి చెందారు. కానీ, రామాయణ యుద్ధంలో ఈయన పోషించిన పాత్ర రావణుడి వైపు కాకుండా, రామచంద్రుడి విజయం వైపు ఉండటం విశేషం.
సుషేణుడిని రావణుడి ఆస్థానంలో అత్యంత గౌరవనీయుడైన, మేధావియైన వైద్యుడిగా వర్ణిస్తారు. అద్భుతమైన ఆయుర్వేద జ్ఞానం, అసాధారణమైన మూలికా వైద్య నైపుణ్యాలు ఆయన సొంతం. రావణుడు సుషేణుడిని ఎంతగానో విశ్వసించేవాడు. అయితే, సుషేణుడు ధర్మపరుడు, న్యాయాన్ని పాటించేవాడు. ఆయుర్వేదం, వైద్య ధర్మం ప్రకారం, ఆయనకు ప్రాణం ముఖ్యం.
సుషేణుడి పాత్ర యొక్క ప్రాముఖ్యత రామాయణ యుద్ధ సమయంలో స్పష్టమవుతుంది. ఇంద్రజిత్తు వేసిన శక్తి ఆయుధం తాకిడికి లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు, వానర సైన్యం, శ్రీరాముడు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఆ శక్తి అసాధారణమైనది కావడంతో, హనుమంతుడు, జాంబవంతుడు వంటివారు కూడా చికిత్స చేయలేకపోయారు.
ఆ సమయంలో, లక్ష్మణుడి ప్రాణాలను కాపాడగలిగే ఏకైక వ్యక్తి సుషేణుడు మాత్రమే అని జాంబవంతుడు తెలియజేస్తాడు. ఇక్కడ సుషేణుడి ధర్మనిరతి ప్రముఖంగా కనిపిస్తుంది. ఆయన రావణుడి ఆస్థానంలో ఉన్నా, మానవత్వం మరియు వైద్య ధర్మాన్ని అనుసరించి, శత్రుపక్షంలో ఉన్న లక్ష్మణుడికి చికిత్స చేయడానికి అంగీకరిస్తారు.
సుషేణుడు లక్ష్మణుడిని పరీక్షించి, ఆయన ప్రాణాలను కాపాడటానికి గల ఏకైక మార్గం హిమాలయ పర్వతాలలోని ద్రోణగిరి శిఖరంపై లభించే నాలుగు దివ్య ఔషధాలైన సంజీవకరణి, విశల్యకరణి, సంధానకరణి మరియు సవర్ణకరణిని వినియోగించడమే అని చెబుతారు. ఈ మూలికలను తెచ్చే పనిని పరాక్రమవంతుడైన హనుమంతుడికి అప్పగిస్తారు.
హనుమంతుడు ద్రోణగిరి పర్వతాన్ని మోసుకొచ్చిన తర్వాత, సుషేణుడు తన అపారమైన వైద్య పరిజ్ఞానంతో ఆ మూలికలను సరిగ్గా గుర్తించి, వాటిని కలిపి లక్ష్మణుడికి చికిత్స చేస్తారు. సుషేణుడి చికిత్స ఫలితంగా లక్ష్మణుడు మళ్లీ ప్రాణం పోసుకుని, ఆరోగ్యంగా యుద్ధరంగంలోకి అడుగుపెడతారు.
సుషేణుడు తన జీవితాన్ని, వైద్య వృత్తిని ధర్మానికి అనుగుణంగా నడిపించారు. ధర్మాన్ని బలపరుస్తూ, దాని విజయానికి సహకరించడం చాలా ముఖ్యం. ధర్మం ఎప్పుడూ ఏ పక్షానికీ చెందదు, ఇది విశ్వవ్యాప్తం. సుషేణుడు రావణుడి ఆస్థానంలో ఉన్నప్పటికీ, మానవ ధర్మాన్ని (ప్రాణాలు కాపాడటం) అనుసరించడం వలన ధర్మానికే మద్దతునిచ్చారు. తన వైద్య జ్ఞానాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా, ప్రాణాలను రక్షించడానికి ఉపయోగించడం ద్వారా, సుషేణుడు తన జ్ఞానానికి సార్థకత చేకూర్చారు. సుషేణుడి చర్యలు శత్రు-మిత్ర భేదం లేకుండా, న్యాయం మరియు నీతిని సమతుల్యం చేశాయి, ఇది అంతిమంగా ధర్మ విజయాన్ని సులభతరం చేసింది.
ఈ సందర్భం సుషేణుడి గొప్పతనాన్ని, ఆయన వైద్య నీతిని నిరూపిస్తుంది. సుషేణుడి దృష్టిలో రోగికి సహాయం చేయడమే పరమ ధర్మం, యుద్ధంలో పక్షాలకంటే ప్రాణానికి ఎక్కువ విలువనిచ్చారు. ఆయన లక్ష్మణుడిని రక్షించాలనే నిర్ణయం రామాయణంలో కీలక మలుపునకు దారితీసింది. లక్ష్మణుడు బ్రతకడం వలన శ్రీరాముడికి ధైర్యం వచ్చి, యుద్ధాన్ని ముందుకు నడిపించగలిగారు.
సుషేణుడి పాత్ర ద్వారా రామాయణం మనకు, జ్ఞానం, నైపుణ్యం ఏ పక్షానికీ చెందినవి కావు, అవి మానవ శ్రేయస్సు కోసం ఉపయోగపడాలని సందేశాన్ని ఇస్తుంది. ఒక గొప్ప వైద్యుడిగా, మానవతావాదిగా సుషేణుడి పాత్ర చిరస్మరణీయం. ఈయన నిస్వార్థ సేవ మరియు అపారమైన వైద్య జ్ఞానం వల్లే లక్ష్మణుడి జీవితం నిలబడింది, యుద్ధ ఫలితం రామచంద్రుడికి అనుకూలంగా మారింది.
సమాప్తం
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,673
Threads: 166
Likes Received: 11,655 in 2,319 posts
Likes Given: 7,707
Joined: Nov 2018
Reputation:
794
గోదాదేవి
రచన: Ch. ప్రతాప్
తమిళనాట 'ఆండాళ్'గా, తెలుగునాట 'గోదాదేవి'గా కీర్తించబడిన వైష్ణవ ఆళ్వారుల పరంపరలో ఏకైక మహిళా భక్తురాలు ఆమె. మానవ జన్మ ఎత్తి, అసాధారణ భక్తితో సాక్షాత్తు శ్రీరంగనాథుడిని పతిగా పొందిన ఆ దివ్యమైన ప్రేమకథ, యుగయుగాలుగా భక్తులకు మార్గదర్శకం.
గోదాదేవి సుమారు ఎనిమిదవ శతాబ్దంలో తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో జన్మించారు. ఆమె తండ్రి విష్ణుచిత్తుడు (పెరియాళ్వార్), పన్నెండు మంది ఆళ్వారులలో ఒకరు. ఆయన స్వామివారికి పూలమాలలు అల్లడం, కైంకర్యాలు చేయడంలోనే జీవితాన్ని అంకితం చేశారు. ఒక శుభదినాన, విష్ణుచిత్తుడు తులసివనంలో మొక్కలకు నీరు పోస్తుండగా, దివ్యతేజస్సుతో కూడిన ఒక ఆడ శిశువు ఆయనకు లభించింది. పసిపాప రూపంలో ఉన్న సాక్షాత్తు భూదేవి అంశే ఈ గోద. విష్ణుచిత్తుడు ఆ పాపకు కోదై (గోద) అని నామకరణం చేసి, అల్లారుముద్దుగా పెంచారు.
గోదాదేవి చిన్ననాటి నుంచే అపారమైన కృష్ణభక్తిలో పెరిగారు. ఆమెకు శ్రీకృష్ణుడే ప్రియుడు, పతిగా భావించేవారు. తన తండ్రి పూజ కోసం రంగనాథుడికి అల్లే పూలమాలలను, ముందుగా తాను ధరించి, అద్దంలో తన రూపాన్ని చూసుకొని, ఆ మాలలు తనకు ఎంతవరకు సరిపోతాయో, అవి స్వామికి సమర్పించడానికి తగినవా కాదో అని పరీక్షించుకునేవారు. ఆ తర్వాత మాలలను మళ్ళీ తండ్రికి ఇచ్చేవారు. విష్ణుచిత్తుడు ఆ విషయం తెలుసుకోకుండా, ఆ మాలలనే స్వామివారికి సమర్పించేవారు.
ఒక రోజు, విష్ణుచిత్తుడు పూలమాలలో గోదాదేవి వెంట్రుకను చూసి, జరిగిన సంగతి తెలుసుకుని ఎంతో బాధపడ్డారు. 'మాలిన్యాన్ని' స్వామికి సమర్పించినందుకు పశ్చాత్తాపంతో మాల అల్లడం మానేశారు. ఆ రాత్రి విష్ణుమూర్తి ఆయన కలలో కనిపించి, "గోద ధరించిన మాలలే నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవి, రేపటి నుండి అవే సమర్పించు" అని ఆదేశించారు. భగవంతుడికి ప్రీతి కలిగించిన కారణంగా గోదాదేవికి 'శూడిక్కొడుత్త నాచ్చియార్' (ధరించి ఇచ్చిన తల్లి) అనే పేరు వచ్చింది.
2. శ్రీరంగం వైభవాన్ని చూడటం
గోదాదేవికి రోజురోజుకూ రంగనాథుడిపై విరహం పెరిగేది. స్వామి దర్శనం, ఆయన లీలల గురించి వినడానికి ఆమె తహతహలాడేవారు. ఒకసారి, ఉత్తర దిశ నుంచి శ్రీరంగం ఆలయ రథ చక్రాల శబ్దాలు వినిపించాయి. గోదాదేవి ఆ చక్రాల శబ్దాలను విని, సాక్షాత్తూ రంగనాథుడే తన కోసం వస్తున్నాడని భ్రమపడి, పరవశించిపోయారు. ఆ క్షణంలో ఆమె హృదయంలో కలిగిన ఆనందం, విరహం కలగలిసిన భావాలు ఆమె భక్తి తీవ్రతను తెలియజేశాయి. శ్రీరంగం వైభవాన్ని, అక్కడి ఉత్సవాల గురించి తెలుసుకోవడం, అక్కడికి ఎలా చేరుకోవాలి అని తండ్రిని పదేపదే అడగడం ఆమె నిత్యకృత్యంగా మారింది.
3. తిరుప్పావై – గోపికా వ్రతం
తన ప్రియుడైన శ్రీరంగనాథుడిని చేరుకోవడానికి, ఆ స్వామిని అనుభవించడానికి గోదాదేవి ధనుర్మాసంలో వ్రతాన్ని ఆచరించారు. ఆమె తమను గోపికలుగా, శ్రీకృష్ణుడిని పతిగా భావించి, రాత్రి వేళల్లో గోదాదేవి రచించిన ముప్పై పాశురాల (గీతాలు) సంకలనం 'తిరుప్పావై'. ఈ గీతాలు అద్భుతమైన సాహిత్యాన్ని, లోతైన తత్వాన్ని కలిగి ఉన్నాయి.
తిరుప్పావై నుండి ఒక పాశురం:
పాశురం (12వ పాశురం):
కనైత్తిళం కత్తెరుమై కన్ఱుక్కిరఙ్గి,
నినైత్తు ములై వళియే నిన్ఱు పాల్ శోర,
ననైత్తిళం శేఱాక్కుమ్ నఱ్చెల్వ నంగాయ్!
పనిత్తలై వీళ నిన్ వాశల్ కడై పత్తి,
శినత్తినాల్ తెన్నిలఙ్గైక్ కోమానైచ్చెత్త,
మనత్తుక్కినియానై పాడవుమ్ నీ వాయ్ తిఱవాయ్;
ఇనిత్తాన్నెళున్న్దాయ్! ఇన్నదమ్మావునక్కు?
అనైత్తిల్లత్తారుమ్ అఱిన్న్దేలో రెమ్బావాయ్.
"ఓ గొప్ప ఐశ్వర్యవంతురాలా (పొరుగునున్న గోపికా)! లేత గేదెలు (ఎరుమై), తమ లేగదూడలను తలచుకొని ప్రేమతో (కనైత్తు) పొదుగుల నుండి పాలు స్రవించడంతో, ఆ పాలతో నేలంతా తడిచి బురదగా మారింది. అటువంటి నీ ఇంట్లో ఉండి కూడా, మంచుతో తలంతా తడిసిపోతున్నా మేము నీ వాకిట నిలబడి, రావణుడిని (దక్షిణ లంక రాజును) కోపంతో సంహరించిన శ్రీరాముని (శ్రీమన్నారాయణుని) గురించి పాడుతున్నా కూడా, నీవు నోరు తెరవవేం? ఇప్పుడైనా లేచి వస్తావా? నీ కిది న్యాయమా? ఇంట్లో ఉన్న అందరికీ ఈ విషయం తెలిసిపోయింది కదమ్మా!" అని పై శ్లోకం అర్ధం.
గోదాదేవి వ్రతం పూర్తి చేసి, రంగనాథుడిని కీర్తించిన తర్వాత, శ్రీరంగనాథుడు విష్ణుచిత్తుడి కలలో కనిపించి, గోదాదేవిని శ్రీరంగం తీసుకురావాల్సిందిగా ఆజ్ఞాపించారు. ఆ తర్వాత రాజు, భక్తులు గోదాదేవిని గొప్ప ఊరేగింపుతో శ్రీరంగం ఆలయానికి తీసుకువెళ్లారు. అక్కడ, అలంకరణలతో అద్భుతంగా వెలుగుతున్న గోదాదేవి గర్భగుడిలోకి ప్రవేశించి, రంగనాథుడి దివ్యమంగళ స్వరూపంలో లీనమైపోయారు.
గోదాదేవి భక్తి, కేవలం పూజలు చేయడం కాదు, ఆత్మార్పణ. ఆమె ఆచరించిన ప్రేమపూర్వక శరణాగతి, భగవంతుడిని చేరుకోవడానికి కులం, సంపద, వయస్సుతో సంబంధం లేదని నిరూపించింది. ఈ రోజుకు కూడా ధనుర్మాసంలో శ్రీవైష్ణవులు తిరుప్పావై పఠించి, ఆమె ఆశీస్సులు పొందుతారు.
సమాప్తం
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,673
Threads: 166
Likes Received: 11,655 in 2,319 posts
Likes Given: 7,707
Joined: Nov 2018
Reputation:
794
ఉలూకుడు
రచన: Ch. ప్రతాప్
మహాభారతం కేవలం ఒక యుద్ధకథ కాదు; అది మానవ హృదయాలలో నిత్యం సాగుతున్న ధర్మ–అధర్మ సంగ్రామానికి ప్రతిరూపం. ఆ మహాగ్రంథంలో మహావీరుల మధ్య మెరిసిన తేజస్సు ఎంత గొప్పదో, నీడల్లో నడిచిన చిన్న పాత్రల సందేశం కూడా అంతే లోతైనది. అటువంటి పాత్రల్లో ఒకడు ఉలూకుడు.
ఉలూకుడు—గాంధార రాజు శకుని కుమారుడు. శకుని ఎవరు? అసూయ, పగ, కుతంత్రం, అహంకారం—ఈ నాలుగు విషబీజాలు గుండెల్లో నాటుకున్న అధర్మమూర్తి. అలాంటి తండ్రి గర్భంలో పుట్టిన ఉలూకుడు కూడా అదే మార్గంలో నడవడం విధివశంగా మారింది. ఇక్కడే ఒక సూక్ష్మ సత్యం వెల్లడవుతుంది—తండ్రి సంస్కారం సంతానంలో ఎలా ప్రతిఫలిస్తుందో మహాభారతం ఉలూకుడి ద్వారా మనకు చూపిస్తుంది.
పాండవుల అరణ్యవాసం, అజ్ఞాతవాసం ముగిశాక, ధర్మరాజు ధర్మమార్గం విడిచి యుద్ధానికెళ్లకూడదనే ఉద్దేశంతో శ్రీకృష్ణుణ్ణి దుర్యోధనుని వద్దకు పంపాడు. శాంతి మార్గమే ధర్మ మార్గమని కృష్ణుడు ప్రపంచానికి చూపించ దలచుకున్నాడు. కానీ దుర్యోధనుడి అహంకారం ఆ శాంతి సందేశాన్ని తాకి చెదరగొట్టింది. “సూది మొన మోపినంత భూమి కూడా ఇవ్వను” అన్న వాక్యం, అహంకారానికి పరాకాష్ట.
ఆ అహంకారాన్ని పాండవుల వద్దకు చాటిచెప్పేందుకు ఉలూకుడిని దుర్యోధనుడు రాయబారిగా పంపాడు. ఉలూకుడు పాండవ శిబిరానికి చేరి, ధర్మరాజు, భీమార్జునులు, ద్రౌపది, శ్రీకృష్ణుని సమక్షంలో అవమానపు మాటలతో కూడిన సందేశాన్ని వినిపించాడు. ఈ ఘట్టం మనకు ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని బోధిస్తుంది—అధర్మపు వ్యక్తి నోటి నుంచి ధర్మవాక్యం రాదు; అతని మాటల్లో విషమే పులుముకుని ఉంటుంది.
ఉలూకుడి మాటలు పాండవుల గుండెల్లో అగ్నిపర్వతంలా పేలాయి. అయితే, అక్కడే శ్రీకృష్ణుడి తత్త్వదర్శనం వెలుగులోకి వచ్చింది. ఆగ్రహంతో కాదు, ఆత్మజ్ఞానంతో ఆయన ప్రతివాక్యం వెలువడింది. “అహంకారమే పతనానికి మూలం; దురాశే విధ్వంసానికి ద్వారం” అన్న అంతర్లీన సందేశం శ్రీకృష్ణుని వాక్యాల్లో మెరిసింది. భీముడు ప్రతీకార ప్రతిజ్ఞ చేసాడు; కానీ ఆ ప్రతిజ్ఞ కూడా ధర్మ పరిరక్షణ కోసమే అన్న భావన ఇక్కడ స్పష్టమవుతుంది.
ఉలూకుడు తిరిగి వెళ్లి ఈ సమాధానాన్ని దుర్యోధనునికి తెలియజేశాడు. అప్పుడు మూసివేయబడినది కేవలం రాయబార ద్వారం కాదు— శాంతి మార్గానికి కూడా తెరపడింది. అక్కడినుంచి ధర్మచక్రం యుద్ధయంత్రంగా మారింది. ఇది మనకు చెప్పేది ఏమిటంటే— శాంతికి అవకాశమిచ్చిన ప్రతిసారి దాన్ని త్రోసిపుచ్చినవాడు తన విధ్వంసాన్ని తానే ఆహ్వానించుకున్నట్టే.
కురుక్షేత్ర యుద్ధరంగంలో ఉలూకుడు కూడా ఆయుధం ధరించాడు. శకుని కుమారుడిగా కౌరవ పక్షాన నిలబడి పోరాడాడు. నకులుని కుమారుడైన శతానీకుడితో అతడు ఘోరంగా యుద్ధం చేశాడు. వీరత్వం ప్రదర్శించినప్పటికీ, అధర్మ పక్షాన నిలిచిన శక్తి ఎంత గొప్పదైనా, చివరికి పతనం తప్పదన్న నిత్యసత్యం ప్రకారం ఉలూకుడికీ విషాదాంతమే ఎదురైంది.
ఇక్కడ ఒక గొప్ప ఆధ్యాత్మిక బోధ దాగి ఉంది. ఉలూకుడు దుష్టుడిగా పుట్టలేదేమో; కానీ దుష్టత్వాన్ని ఆదర్శంగా తీసుకున్న వాతావరణంలో పెరిగాడు. తండ్రి శకుని మార్గమే తన మార్గమని నమ్మాడు. ఫలితంగా, తన స్వంత విచక్షణను వినియోగించుకోలేకపోయాడు. మన జీవితాల్లోనూ ఇది ఒక హెచ్చరిక— పెద్దల మార్గం పేరుతో అధర్మాన్ని అనుసరించటం కూడా పాపమే.
మహాభారతం ఉలూకుడి ద్వారా మనకు ఒక నిగూఢ సందేశాన్ని అందిస్తుంది— ధర్మం పక్షాన నిలబడటం ఒక ఎంపిక; అధర్మం పక్షాన నిలబడటం కూడా ఒక ఎంపికే. అయితే ఆ రెండు మార్గాల ఫలితాలు మాత్రం ఒక్కటే కావు. ఉలూకుడు అధర్మాన్ని ఎన్నుకున్నాడు; అందుకే అతని పేరు యోధుడిగా కాదు, అధర్మపు సందేశ వాహకుడిగా చరిత్రలో నిలిచిపోయింది.
మనందరిలోనూ ఒక ఉలూకుడు ఉన్నాడు. ఎవరి మాటనో గుడ్డిగా అనుసరించి, సత్య–అసత్య విచక్షణను విస్మరించే మనసే ఆ ఉలూకుడు. ఆ ఉలూకుడిని జయించిన రోజే మనలో కృష్ణతత్త్వం జాగృతమవుతుంది. అదే మహాభారతం ఇచ్చిన పరమార్థం.
సమాప్తం
***
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,673
Threads: 166
Likes Received: 11,655 in 2,319 posts
Likes Given: 7,707
Joined: Nov 2018
Reputation:
794
త్రిపురాసుర సంహారం
[size=undefined]
త్రిపురాసుర సంహారం - Ch. ప్రతాప్
[/size]
[size=undefined]
“వెయ్యి సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే క్షణం…
ఒకే బాణంతో మూడు నగరాలను నాశనం చేసిన శివుడు!
అదే త్రిపురాసుర సంహారం.”
సి.హెచ్.ప్రతాప్ గారి ఉత్కంఠ భరితమైన కథలో లీనమవ్వండి.
పురాణ కాలంలో అసుర వంశంలో తారకాసురుడు అత్యంత శక్తిమంతుడైన రాజు. ఆయన కుమారులైన తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అనే ముగ్గురు సోదరులు తమ తండ్రి మరణం తర్వాత అధికారం కోసం కాకుండా, అజేయమైన శక్తి కోసం తపస్సు చేయాలని నిశ్చయించుకున్నారు. మేరు పర్వత శిఖరాలపై వేల సంవత్సరాల పాటు వారు సాగించిన కఠోర తపస్సుకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు.
చాకచక్యంగా వారు మరణం లేని వరం కోరగా, సృష్టి నియమం ప్రకారం అది సాధ్యం కాదని బ్రహ్మ నిరాకరించాడు. దాంతో వారు ఒక అసాధారణమైన ఉపాయంతో వరం కోరారు. పితామహా! మా కోసం మాయాసురుడు మూడు అద్భుత నగరాలను నిర్మించాలి. ఒకటి స్వర్గంలో బంగారంతో, రెండోది అంతరిక్షంలో వెండితో, మూడోది భూమిపై ఇనుముతో ఉండాలి. ఇవి నిరంతరం సంచరిస్తూ ఉండాలి. కేవలం వెయ్యి సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ మూడు నగరాలు ఒకే సరళరేఖపైకి వస్తాయి. ఆ తరుణంలో ఒకే ఒక్క బాణంతో ఆ మూడింటినీ ఎవరైతే ఛేదిస్తారో, వారి చేతిలోనే మాకు మరణం సంభవించాలి అని కోరారు.
అసాధ్యమని భావించిన ఈ కోరికను బ్రహ్మ మన్నించాడు. మాయాసురుడు ఆ మూడు అద్భుత నగరాలను అత్యంత వైభవంగా నిర్మించాడు. వాటినే త్రిపురాలు అని పిలిచేవారు. అసురులు ఆ నగరాల్లో ఉంటూ ముల్లోకాలను గడగడలాడించడం ప్రారంభించారు. దేవతలను పదవుల నుంచి తొలగించి, ఋషుల యజ్ఞాలను ధ్వంసం చేస్తూ అహంకారంతో విర్రవీగారు.
ఈ దుస్థితిని చూసి కలత చెందిన దేవతలు విష్ణుమూర్తిని ఆశ్రయించారు. త్రిపురాసురులు శివభక్తులు కావడం వల్ల వారిని నేరుగా సంహరించడం సాధ్యం కాదని గ్రహించిన విష్ణువు, అరిహుడు అనే మాయాపురుషుడిని సృష్టించి వారి వద్దకు పంపాడు. ఆ మాయాపురుషుడు అసురుల మనస్సులను మార్చి, వారిని వేద విహిత ధర్మాల నుంచి, శివభక్తి నుంచి దూరం చేశాడు. ఎప్పుడైతే వారు ధర్మభ్రష్టులయ్యారో, వారి శక్తి క్షీణించడం మొదలైంది. ఇదే సరైన సమయమని భావించిన దేవతలు పరమశివుడిని వేడుకున్నారు.
లోకకల్యాణం కోసం శివుడు త్రిపురాసురులను సంహరించడానికి సిద్ధమయ్యాడు. అందుకోసం దేవతలు ఒక అద్భుతమైన దివ్య రథాన్ని సిద్ధం చేశారు. ఈ రథం సామాన్యమైనది కాదు; భూమి రథపీఠంగా, సూర్యచంద్రులు చక్రాలుగా, వేదాలు గుర్రాలుగా, సాక్షాత్తు బ్రహ్మదేవుడు సారథిగా నిలిచారు. మేరు పర్వతం విల్లుగా, వాసుకి అనే సర్పం వింటినారిగా మారగా, శ్రీమహావిష్ణువు బాణంగా అవతరించాడు. శివుడు ఆ దివ్య రథాన్ని అధిరోహించి యుద్ధ భూమికి చేరుకున్నాడు. అసురులు తమ త్రిపురాల నుంచి భయంకరమైన ఆయుధాలతో దాడి చేశారు. కానీ శివుడు వెయ్యి సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆ అరుదైన క్షణం కోసం వేచి చూశాడు.
చివరకు ఆ సమయం రానే వచ్చింది. ఆకాశంలో సంచరించే బంగారం, వెండి, ఇనుప నగరాలు మూడూ సరిగ్గా ఒకే సరళరేఖలోకి వచ్చాయి. ఆ క్షణంలో శివుడు చిరునవ్వు చిందిస్తూ తన వింటిని ఎక్కుపెట్టాడు. విష్ణువు అంశతో కూడిన ఆ దివ్య బాణం శివుని నుండి వెలువడి ప్రచండమైన వేగంతో దూసుకుపోయింది. ఒకే ఒక్క దెబ్బకు ఆ మూడు నగరాలు అగ్ని కీలల్లో చిక్కుకుని భస్మమైపోయాయి. త్రిపురాసురులు ఆ అగ్నిలో అంతమొందారు. ముల్లోకాలు అసుర బాధ నుంచి విముక్తి పొందాయి. దేవతలు పుష్పవృష్టి కురిపిస్తూ శివుడిని త్రిపురాంతకుడు అని కొనియాడారు.
యుద్ధం ముగిసిన తర్వాత శివుడు తన విజయానికి కారణమైన వారందరినీ అభినందిస్తూ ఇలా అన్నాడు. "వరాలు అనేవి లోక రక్షణ కోసం ఉండాలి కానీ అహంకార ప్రదర్శన కోసం కాదు. త్రిపురాసురులు తమ తెలివితేటలతో మరణాన్ని జయించాలనుకున్నారు కానీ ధర్మాన్ని విస్మరించారు. ఎంతటి బలవంతులకైనా అహంకారం తలకెక్కినప్పుడు పతనం తప్పదని ఈ సంఘటన నిరూపిస్తోంది. ఐక్యతతో కూడిన ధర్మం ఎప్పుడూ అధర్మంపై విజయం సాధిస్తుంది. సృష్టిలో ఏ శక్తి కూడా శాశ్వతం కాదు, కేవలం సత్యం మరియు ధర్మం మాత్రమే నిలబడతాయి. ఇకపై లోకాల్లో శాంతి వర్ధిల్లాలి, ప్రతి జీవి తన ధర్మాన్ని పాటిస్తూ జీవించాలి. అహంకారాన్ని వీడి లోకహితం కోసం పనిచేసే వారికే నా అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది.."
అపరిమితమైన శక్తి మరియు సంపద ఉన్నప్పుడు అహంకారం రావడం సహజం, కానీ అది నాశనానికి దారితీస్తుంది. ధర్మ మార్గాన్ని వీడినప్పుడు ఎంతటి వరాలైనా వ్యక్తిని రక్షించలేవు. లోక క్షేమం కోసం దైవశక్తులన్నీ ఏకమవుతాయి, ఐక్యమత్యమే మహాబలం. తెలివితేటలను ఇతరులను ఇబ్బంది పెట్టడానికి కాకుండా ఉన్నతి కోసం ఉపయోగించాలి. అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి గుర్తుగా మనం కార్తీక పౌర్ణమి జరుపుకుంటాము.
సమాప్తం
[/size]
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,673
Threads: 166
Likes Received: 11,655 in 2,319 posts
Likes Given: 7,707
Joined: Nov 2018
Reputation:
794
షడ్రుచుల సమ్మేళనంలా మీ జీవితం తీపి, వగరు, చేదుల కలయికతో సాఫీగా సాగాలని..
ఈ ఉగాది మీకు సకల శుభాలను చేకూర్చాలని కోరుకుంటూ..
మీకు మీ కుటుంబ సభ్యులకు పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,673
Threads: 166
Likes Received: 11,655 in 2,319 posts
Likes Given: 7,707
Joined: Nov 2018
Reputation:
794
సైంధవుడు
రచన: Ch. ప్రతాప్
మహాభారతం మనకు చెప్పే మహత్తర సత్యం ఒక్కటే— మనిషి చేసే ప్రతి కర్మకూ తప్పని సరిగా ఫలితం ఉంటుంది. ఆ ఫలితం వెంటనే రావచ్చు, ఆలస్యం కావచ్చు; కానీ అది తప్పదు. ఈ కర్మసిద్ధాంతానికి జ్వలంత సాక్ష్యంగా నిలిచిన పాత్ర సైంధవుడు, అనగా జయద్రథుడు. కురుక్షేత్ర సంగ్రామంలో పదమూడవ రోజు జరిగిన మహావిషాద ఘట్టాలకు మూలకారణమైన ఇతని జీవితం, అహంకారం మనిషిని ఎలా అంధుడిగా మార్చి వినాశనానికి నడిపిస్తుందో స్పష్టంగా దర్శింపజేస్తుంది.
జయద్రథుడు సింధు దేశానికి అధిపతి. రాజ్యాధికారం, బంధుత్వ బలం— ఈ రెండింటి మదంలో అతని అంతఃకరణం క్రమంగా మసకబారిపోయింది. దుర్యోధనుడి ఏకైక చెల్లెలైన దుశ్శలను వివాహం చేసుకున్నప్పటి నుంచి అతడు కౌరవ వంశానికి అత్యంత సమీప బంధువయ్యాడు. కానీ ఆ బంధం ధర్మానికి చేరువ చేయక, అతడిని అధర్మానికి బంధించింది. మహాభారతం ఇక్కడ మనకు ఒక సూక్ష్మసత్యాన్ని బోధిస్తుంది—ధర్మానికి దూరమైన బంధం ఒక ఆశీర్వాదం కాదు, అది ఒక పాశమే.
పాండవుల అరణ్యవాస కాలంలో ద్రౌపదీ అపహరణ యత్నమే జయద్రథుడి పతనానికి తొలి విత్తనం. ఆశ్రమంలో ఒంటరిగా ఉన్న ద్రౌపదిని చూసి అతని లోపల దాగి ఉన్న కామం, రాజగర్వం, అహంకారం ఒక్కసారిగా ఉగ్రరూపం ధరించాయి. ఒక పతివ్రతను అవమానించగలనన్న దుర్మోహమే అతడిని పాపపు అగాధంలోకి నెట్టింది. భీమార్జునులు అతడిని తరిమి పట్టుకుని శిక్షించగా, ధర్మరాజు కరుణ వల్ల అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ శిక్ష నుంచి తప్పించుకున్నాడేగాని, కర్మబంధం నుంచి అతడు తప్పించుకోలేకపోయాడు.
ఆ అవమానాన్ని జయద్రథుడు పశ్చాత్తాపంగా మలచుకోలేదు; ప్రతీకారంగా మలచుకున్నాడు. ఇక్కడే అతని ఆత్మ పతనం మొదలైంది. పాపాన్ని పశ్చాత్తాపంతో కాల్చివేయాలి; ప్రతీకారంగా పెంచుకుంటే అది విధ్వంసాగ్నిగా మారుతుంది— ఇదే మహాభారత ధర్మబోధ.
కురుక్షేత్ర రణభూమిలో పదమూడవ రోజున, ద్రోణాచార్యుడు నిర్మించిన అతి క్లిష్టమైన చక్రవ్యూహంలోకి ధైర్యంగా అభిమన్యుడు అడుగుపెట్టాడు. వ్యూహంలో ప్రవేశించే విద్య అతనికి తెలిసింది; కాని ఆ మాయావ్యూహం నుంచి నిష్క్రమించే మార్గం మాత్రం అతనికి అజ్ఞాతమే. ఆ క్షణంలోనే, సైంధవుడు తనలో పెరిగిపోయిన అహంకారాన్నే ఆయుధంగా మలచుకొని, అర్జునుడిని తప్ప మిగతా పాండవ వీరులందరినీ అడ్డుకున్నాడు. కుమారుణ్ని కాపాడుకునేందుకు తండ్రి పరుగెత్తుకొచ్చే దారిని కూడా అతడు నిర్ధాక్షిణ్యంగా మూసివేశాడు. ఆ ఒక్క క్షణమే— సైంధవుడి జీవితంలో అతడు స్వయంగా తన విధ్వంసానికి సంతకం పెట్టుకున్న అత్యంత భయానకమైన కర్మగా మారింది.
అభిమన్యుడు ఒంటరిగా, నియమాలను ఉల్లంఘించిన యుద్ధంలో వీరమరణం పొందాడు. ఆ రక్తబిందువులు ధర్మభూమిపై పడినప్పుడే, జయద్రథుడి విధికి అంతిమ తీర్పు వ్రాయబడింది. కుమారుడి మరణవార్త విన్న అర్జునుడు శోకాగ్నిలో దహనమయ్యాడు; అదే శోకం ధర్మజ్వాలగా మారింది. “రేపు సూర్యాస్తమయం లోపల జయద్రథుడిని సంహరించకపోతే, నేనే అగ్నిలో ప్రవేశిస్తాను”— అన్న అతని ప్రతిజ్ఞ ప్రతీకారం కాదు, ధర్మప్రతిజ్ఞ.
పద్నాలుగో రోజు అంతా అర్జునుడు జయద్రథుడి కోసం కౌరవ సైన్యాన్ని చీల్చుకుంటూ ముందుకు దూకాడు. దుర్యోధనుడు, కర్ణుడు, ద్రోణుడు—అందరూ కలిసి అతడిని రక్షించడానికి ప్రయత్నించారు. కానీ అధర్మాన్ని ఎన్ని శక్తులు కాపాడినా, కర్మఫలాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు.
సూర్యుడు అస్తమిస్తున్న వేళ శ్రీకృష్ణుడు తన యోగమాయతో చీకటి కమ్మించాడు. సూర్యుడు అస్తమించాడని భ్రమించిన జయద్రథుడు గర్వంతో బయటకు వచ్చాడు. అదే అతని ఆఖరి గర్వక్షణం. ఆ మాయను తొలగించిన కృష్ణుడు సూర్యుడిని మళ్లీ దర్శనమిచ్చాడు. క్షణాల్లో అర్జునుడి బాణం సైంధవుడి శిరస్సును ఛేదించింది.
తండ్రి వరం కారణంగా ఆ తల నేల పడకూడదని జాగ్రత్తపడి, అర్జునుడు ఆ శిరస్సును బాణాలపై మోసుకుంటూ తీసుకెళ్లి, తపస్సులో లీనమైన వృద్ధ క్షత్రుడి ఒడిలో వేసాడు. నిద్ర లేచిన అతడు తెలియక ఆ తలను నేలపై పడేయగా, వర ప్రభావంతో అతని శిరస్సు కూడా బద్దలై, జయద్రథుడి పతనానికి సంపూర్ణత చేకూరింది.
సైంధవుడి జీవితం మనకు ఒక నిత్యనిజాన్ని గుర్తు చేస్తుంది. స్త్రీకి చేసిన అవమానం, నిరపరాధిపై చేసిన అన్యాయం, అహంకారంతో చేసిన అధర్మం— ఈ మూడు కలిసిన చోట ఏ వరమూ రక్షించదు, ఏ రాజ్యమూ నిలబడదు, ఏ బంధమూ కాపాడదు. కర్మ ఎప్పుడూ నిద్రపోదు; అది నిశ్శబ్దంగా ఎదురు చూస్తుంది. తగిన క్షణం రాగానే అది తన తీర్పును తప్పక అమలు చేస్తుంది.
జయద్రథుడు రాజుగా జన్మించాడు; కానీ ధర్మాన్ని ఆశ్రయించలేదు. గర్వాన్ని ఆశ్రయించాడు. బంధాలను ఆయుధంగా చేసుకున్నాడు. కామాన్ని తన అధిపతిగా చేసుకున్నాడు. ఫలితం— వినాశనం. మహాభారతం ద్వారా వ్యాసుడు మనకు చెబుతున్న పరమార్థం ఇదే—
ధర్మాన్ని విస్మరించిన క్షణం నుంచే మన పతనం ప్రారంభమవుతుంది. కర్మను ఎవరూ మోసం చేయలేరు. న్యాయాన్ని అడ్డుకున్నవాడే చివరికి న్యాయానికి ఆహుతి అవుతాడు.
ఇదే సైంధవుడి జీవితం మనకు అందించిన శాశ్వత ఆధ్యాత్మిక సందేశం.
సమాప్తం
***
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,673
Threads: 166
Likes Received: 11,655 in 2,319 posts
Likes Given: 7,707
Joined: Nov 2018
Reputation:
794
జయ-విజయులు
రచన: Ch. ప్రతాప్
శ్రీమహావిష్ణువు నివాసస్థానమైన వైకుంఠ ధామంలో జయ-విజయులు ద్వారపాలకులుగా సేవ చేసేవారు. పరమ భక్తులైన వీరు నిరంతరం భగవత్ సేవలో తరిస్తూ, వైకుంఠానికి వచ్చే భక్తులకు మార్గనిర్దేశం చేసేవారు. అయితే, భాగవత పురాణంలో వీరి కథ ఒక విశిష్టమైన మలుపు తిరుగుతుంది. ఒక్క క్షణం ఆవరించిన అహంకారం మరియు విధి సంకల్పం వారి నిత్య కైంకర్యాన్ని ఎలా మార్చివేసాయో, ఈ కథ భక్తి, శాపం మరియు భగవంతుని అవతార లీలల అద్భుత సంగమంగా నిలుస్తుంది.
ఒకనాడు బ్రహ్మ మానస పుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు విష్ణు దర్శనం కోసం వైకుంఠానికి చేరుకున్నారు. నిరంతర బ్రహ్మజ్ఞానంతో అలరారే ఈ మునులు చూడటానికి దిగంబరులైన చిన్నపిల్లల వలె కనిపిస్తారు. ఆరు ద్వారాలు దాటిన వారిని, ఏడవ ద్వారం వద్ద జయ-విజయులు అడ్డుకున్నారు. వారి బాహ్య రూపాన్ని చూసి పసిపిల్లలుగా భ్రమించి, లోపలికి వెళ్ళడానికి సమయం కాలేదని తూలనాడారు. జ్ఞానవృద్ధులైన ఆ మునులు ఆగ్రహించి, "వైకుంఠంలో ఉండి కూడా విచక్షణ కోల్పోయిన మీరు, పుణ్యలోకానికి అనర్హులు. భూలోకంలో రాక్షసులుగా జన్మించండి" అని శపించారు.
ఈ శాపంతో దిగ్భ్రాంతి చెందిన జయ-విజయులు వెంటనే తమ తప్పు తెలుసుకుని, పరమాత్మ పాదాలపై పడి శరణు వేడారు. అప్పుడే అక్కడకు విచ్చేసిన శ్రీమహావిష్ణువు మునుల శాపాన్ని సమర్థిస్తూనే, తన భక్తులైన జయ-విజయులకు ఒక వెసులుబాటు కల్పించారు. "మీరు ఏడు జన్మల పాటు నా భక్తులుగా పుట్టి తిరిగి వైకుంఠానికి వస్తారా? లేక మూడు జన్మల పాటు నాకు పరమ శత్రువులుగా జన్మించి, నా చేతిలోనే మరణించి త్వరగా తిరిగి వస్తారా?" అని ప్రశ్నించాడు. భగవంతుని ఎడబాటును భరించలేని ఆ ద్వారపాలకులు, త్వరగా స్వామి చెంతకు చేరుకోవాలనే ఉద్దేశంతో మూడు జన్మల శత్రుత్వాన్నే ఎంచుకున్నారు. ఇది వారిలోని అనన్యమైన భక్తికి నిదర్శనం. శత్రువుగానైనా సరే, నిరంతరం భగవంతుడిని స్మరిస్తూ ఆయన చేతిలోనే ప్రాణాలు వదలాలన్నది వారి ఆకాంక్ష.
ఆ శాపం ప్రకారం వారు కృతయుగంలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా జన్మించారు. వారిని సంహరించడానికి స్వామి వరాహ మరియు నరసింహ అవతారాలను ఎత్తవలసి వచ్చింది. త్రేతాయుగంలో రావణ, కుంభకర్ణులుగా ఉద్భవించగా, శ్రీరాముడు వారిని హతమార్చి శాప విముక్తి కలిగించాడు. చివరగా ద్వాపరయుగంలో శిశుపాల, దంతవక్రులుగా జన్మించి శ్రీకృష్ణుని చేతిలో మరణించి శాపం నుండి పూర్తిగా విముక్తులయ్యారు. ప్రతి జన్మలోనూ భగవంతుడే స్వయంగా వచ్చి వారిని తనలో లీనం చేసుకోవడం గమనార్హం. ఈ కథ మనకు భక్తి యొక్క గొప్పతనాన్ని, అహంకారం వల్ల కలిగే పతనాన్ని బోధిస్తుంది. జయ-విజయులు చేసిన పొరపాటు వల్ల వారు భూలోకానికి రావలసి వచ్చినా, వారి నిశ్చల భక్తి వల్ల భగవంతుడే వారి కోసం భువికి దిగివచ్చాడు.
నేటికీ మనం విష్ణు ఆలయాలకు వెళ్ళినప్పుడు గర్భాలయ ద్వారం వద్ద జయ-విజయుల విగ్రహాలను దర్శించుకుంటాము. తిరుమల వంటి పుణ్యక్షేత్రాలలో గరుడాళ్వార్‌కు అభిముఖంగా వీరి ఉనికి భక్తులకు అహంకార త్యాగాన్ని గుర్తుచేస్తుంది. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు, "మమైవాంశో జీవలోకే సర్వభూతాని" – సమస్త జీవులు పరమాత్మ అంశలే. జయ-విజయుల గాథ మనకు నేర్పే పాఠం ఏమిటంటే, భక్తి మార్గంలో నడిచేవారికి శాపాలు కూడా భగవంతుడిని చేరువ చేసే సోపానాలుగా మారుతాయి. అచంచలమైన విశ్వాసంతో చేసే ఆరాధన ఏ రూపంలో ఉన్నా, అది చివరకు మోక్షానికే దారి తీస్తుంది.
జయ-విజయుల గాథ ద్వారా మనం జీవితానికి ఉపయోగపడే ఎన్నో విలువైన పాఠాలను నేర్చుకోవచ్చు. ఈ ఘట్టం కేవలం ఒక పురాణ కథ మాత్రమే కాదు, మానవ ప్రవర్తనకు మరియు ఆధ్యాత్మిక ఉన్నతికి ఒక దిక్సూచి.
వైకుంఠంలో మహావిష్ణువు చెంతనే ఉన్నప్పటికీ, జయ-విజయులు అహంకారానికి లోనయ్యారు. సనకాది మునుల బాహ్య రూపాన్ని చూసి తక్కువగా అంచనా వేయడం వారి పతనానికి కారణమైంది. ఇది మనకు నేర్పే పాఠం ఏమిటంటే—మనం ఎంతటి ఉన్నత పదవిలో ఉన్నా, ఎంతటి జ్ఞానాన్ని కలిగి ఉన్నా, గర్వం దరిచేరనివ్వకూడదు. బాహ్య రూపాన్ని చూసి ఎవరినీ తక్కువ చేయకూడదు.
శాపం పొందిన తర్వాత జయ-విజయులు వాదించలేదు, బదులుగా భగవంతుని పాదాలను ఆశ్రయించారు. శిక్షను తప్పించుకోవడం కంటే, భగవంతుడికి దూరంగా ఉండటమే పెద్ద శిక్షగా వారు భావించారు. అందుకే ఏడు జన్మల భక్తి కంటే, మూడు జన్మల శత్రుత్వాన్నే ఎంచుకున్నారు (త్వరగా స్వామిని చేరుకోవాలని). భక్తి అంటే కేవలం పూజలు చేయడం కాదు, భగవంతుడి పట్ల అనన్యమైన ఆరాధన కలిగి ఉండటమని ఇది నిరూపిస్తుంది.
చేసిన తప్పుకు ప్రతిఫలం అనుభవించక తప్పదని ఇక్కడ స్పష్టమవుతుంది. అయితే, భగవంతుడు తన భక్తులను శిక్షించేటప్పుడు కూడా వారి హితాన్ని కోరుకుంటాడు. రాక్షసులుగా పుట్టించినా, తానే స్వయంగా వచ్చి వారికి శాప విముక్తి కలిగించడం భగవంతుని అపారమైన కరుణకు నిదర్శనం.
శత్రువులుగా పుట్టినప్పటికీ, వారు నిరంతరం భగవంతుడిని ద్వేషంతోనైనా స్మరించారు (దీనినే 'వైర భక్తి' అంటారు). అంటే ఏ రూపంలోనైనా మనసు భగవంతునిపై లగ్నం కావడం ముఖ్యం. మన లక్ష్యం పట్ల మనం ఎంతటి ఏకాగ్రతతో ఉండాలో ఇది బోధిస్తుంది.
జ్ఞానులను, పెద్దలను గౌరవించకపోతే ఎంతటి వారికైనా కష్టాలు తప్పవు. సనకాది మునుల పట్ల వారు చూపిన అగౌరవం వారిని వైకుంఠం నుండి దూరం చేసింది. అందుకే పెద్దల పట్ల, గురువుల పట్ల గౌరవం కలిగి ఉండటం మన ప్రాథమిక కర్తవ్యం.
సమాప్తం
***
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,673
Threads: 166
Likes Received: 11,655 in 2,319 posts
Likes Given: 7,707
Joined: Nov 2018
Reputation:
794
భీష్ముడు
రచన: Ch. ప్రతాప్
గంగాదేవి తన ఎనిమిదవ కుమారుడైన దేవవ్రతుడిని తీసుకుని అంతర్థానమైన తర్వాత, శంతన మహారాజు తీవ్రమైన విరహ వేదనకు లోనవుతాడు. అయితే, గంగాదేవి ఇచ్చిన మాట ప్రకారం, కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె తిరిగి శంతనుడి వద్దకు వస్తుంది. ఆమె వెంట యవ్వనంలో ఉన్న ఒక తేజోవంతుడైన యువకుడు ఉంటాడు. అతడే దేవవ్రతుడు. గంగాదేవి అతడిని వశిష్ఠుడి వద్ద వేదాలు, పరశురాముడి వద్ద అస్త్రవిద్యలు మరియు బృహస్పతి వద్ద రాజనీతి శాస్త్రం నేర్పించి, సకల కళా వల్లభుడిగా తీర్చిదిద్దింది. తన కుమారుడి అద్భుతమైన పరాక్రమాన్ని చూసి శంతనుడు అమితానందపడి, అతడిని హస్తినాపురానికి యువరాజుగా పట్టాభిషిక్తుడిని చేస్తాడు. దేవవ్రతుడి రాకతో హస్తినాపురానికి కొత్త వెలుగు వస్తుంది, ప్రజలు కూడా తమ కాబోయే రాజు పట్ల ఎంతో గౌరవంతో ఉంటారు.
అయితే, విధి మరొక మలుపు తిరుగుతుంది. ఒకనాడు శంతనుడు యమునా నది తీరంలో విహరిస్తుండగా, దాశరాజు కుమార్తె అయిన సత్యవతిని చూసి మోహిస్తాడు. ఆమెను వివాహం చేసుకోవాలని ఆమె తండ్రిని కోరగా, దాశరాజు ఒక కఠినమైన షరతు విధిస్తాడు. సత్యవతికి పుట్టబోయే కుమారుడే హస్తినాపురానికి తదుపరి రాజు కావాలని ఆయన పట్టుబడతాడు. అప్పటికే పట్టాభిషిక్తుడైన దేవవ్రతుడికి అన్యాయం చేయడం ఇష్టం లేక శంతనుడు మౌనంగా వెనుదిరుగుతాడు. కానీ, తన తండ్రి పడుతున్న మానసిక వేదనను గమనించిన దేవవ్రతుడు, విషయం తెలుసుకుని స్వయంగా దాశరాజు వద్దకు వెళ్తాడు. తన తండ్రి కోరికను నెరవేర్చడానికి, తాను రాజ్య సుఖాలను త్యాగం చేస్తానని, సత్యవతి కుమారులకే రాజ్యాధికారం దక్కుతుందని మాటిస్తాడు.
దాశరాజుకు ఇంకా ఒక సందేహం మిగిలి ఉంటుంది. ఒకవేళ దేవవ్రతుడు వివాహం చేసుకుంటే, అతని సంతానం భవిష్యత్తులో సత్యవతి సంతానంతో యుద్ధం చేయవచ్చు కదా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు దేవవ్రతుడు లోకం అదిరిపోయేలా ఒక భీషణమైన ప్రతిజ్ఞ చేస్తాడు. తాను జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని, తనకు సంతానమే కలగదని ప్రమాణం చేస్తాడు. ఈ అసాధారణమైన మరియు కఠినమైన త్యాగాన్ని చూసి ఆకాశం నుండి పూల వాన కురుస్తుంది, దేవతలు అతడిని 'భీష్ముడు' (భయంకరమైన ప్రతిజ్ఞ చేసినవాడు) అని కొనిాడుతారు. ఈ ప్రతిజ్ఞ వల్లనే ఆయనకు తన తండ్రి నుండి 'స్వచ్ఛంద మరణం' (తాను కోరుకున్నప్పుడే మరణించడం) అనే వరం లభిస్తుంది.
భీష్ముడి ఈ మహోన్నత త్యాగం వల్ల సత్యవతి శంతనుల వివాహం జరుగుతుంది, కానీ అది కురు వంశంలో ఒక అనిశ్చితికి తెరలేపుతుంది. సత్యవతి కుమారులైన చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు అకాల మరణం చెందడంతో, రాజ్యాన్ని కాపాడవలసిన భారం మళ్ళీ భీష్ముడిపైనే పడుతుంది. తన ప్రతిజ్ఞకు కట్టుబడి ఉన్న భీష్ముడు, రాజు కాకపోయినా రాజ్యాధికారానికి రక్షకుడిగా మిగిలిపోతాడు. ఇది భవిష్యత్తులో ధృతరాష్ట్రుడు, పాండురాజుల మధ్య అధికారం కోసం జరిగే పోరాటానికి, తద్వారా కురుక్షేత్ర యుద్ధానికి పరోక్షంగా దారితీస్తుంది. భీష్ముడి నిస్వార్థ త్యాగం ఒకవైపు కీర్తిని తెచ్చినా, మరోవైపు వంశాభివృద్ధి విషయంలో క్లిష్ట పరిస్థితులను సృష్టించింది.
ఈ ఘట్టం యొక్క ప్రాముఖ్యత మహాభారతంలో వెలకట్టలేనిది. భీష్ముడి ప్రతిజ్ఞ కురు వంశం యొక్క భవిష్యత్తును పూర్తిగా మార్చివేసింది. ఒక కొడుకు తన తండ్రి సంతోషం కోసం తన జీవితాంతం సుఖాలను త్యాగం చేయడం అనేది పితృభక్తికి పరాకాష్ట. ఈ సంఘటన వల్లనే మహాభారత యుద్ధంలో భీష్ముడు ధర్మసంకటంలో చిక్కుకోవాల్సి వస్తుంది. తాను రాజ్యానికి కట్టుబడి ఉంటానని ప్రతిజ్ఞ చేయడం వల్ల, దుర్యోధనుడి వంటి వారు అధర్మం చేస్తున్నా ఆయన మౌనంగా ఉండక తప్పలేదు. అంటే, ఒక వ్యక్తి తీసుకునే కఠినమైన నిర్ణయాలు, అవి ఎంత నిస్వార్థమైనవి అయినప్పటికీ, భవిష్యత్తులో సంక్లిష్టమైన ఫలితాలను ఇస్తాయని ఈ కథ మనకు బోధిస్తుంది.
ఈ కథ నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటంటే, నిస్వార్థమైన త్యాగం మనిషిని దైవంతో సమానం చేస్తుంది, కానీ అదే సమయంలో మరీ మొండిగా ఉండే ప్రతిజ్ఞలు కొన్నిసార్లు ధర్మాచరణలో అడ్డంకులుగా మారవచ్చు. భీష్ముడు తన ప్రతిజ్ఞకు కట్టుబడి ఉండటం వల్ల వ్యక్తిగతంగా గొప్పవాడైనప్పటికీ, దేశం మరియు ధర్మం దృష్ట్యా ఆయన మౌనం వినాశనానికి దారితీసింది. పితృభక్తి, త్యాగనిరతి మరియు మాట మీద నిలబడటం వంటి గొప్ప విలువలను భీష్ముడి పాత్ర ద్వారా మనం గ్రహించవచ్చు. ఈ విధంగా దేవవ్రతుడు భీష్ముడిగా మారిన ఈ ఘట్టం మానవ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన త్యాగగాథగా నిలిచిపోయింది.
సమాప్తం
***
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
Posts: 3,673
Threads: 166
Likes Received: 11,655 in 2,319 posts
Likes Given: 7,707
Joined: Nov 2018
Reputation:
794
19-04-2026, 04:33 PM
(This post was last modified: 19-04-2026, 05:38 PM by k3vv3. Edited 1 time in total. Edited 1 time in total.)
నియోగ ధర్మం
రచన: Ch. ప్రతాప్
మహాభారతంలో విచిత్రవీర్యుడి మరణం మరియు అనంతరంగా అమలైన నియోగ ధర్మం కేవలం వంశ పరిరక్షణ కథ మాత్రమే కాదు; ఆ కాలపు సామాజిక నైతికత, ధర్మబద్ధ రాజకీయం, మానవ మానసిక సంక్లిష్టతలకు ప్రతిబింబం. ఈ ఘట్టం కురు వంశ భవిష్యత్తుని మలిచిన మలుపు.
శాంతనుని అనంతరం రాజ్యానికి వారసుడిగా ఎదిగిన విచిత్రవీర్యుడు యవ్వనావస్థలోనే సింహాసనం అధిరోహించినా, ఆయన్ను నిలబెట్టినది భీష్ముని రక్షణా ఛత్రం. రాజు అయినప్పటికీ విచిత్రవీర్యుడు పరిపక్వత సాధించేలోపే క్షయవ్యాధితో కన్నుమూశాడు. అతడు నిస్సంతానుడిగా మరణించడంతో కురు వంశంలో వారస సంక్షోభం ఉత్పన్నమైంది. రాజ్యానికి వారసత్వం అనేది కేవలం కుటుంబ విషయం కాదు; అది ప్రజాశాంతి, రాజ్యస్థిరత్వంతో ముడిపడి ఉంటుంది. అందువల్లే ఈ సంక్షోభానికి ధర్మబద్ధ పరిష్కారం అవసరమైంది.
ఇక్కడే ప్రవేశిస్తుంది నియోగ ధర్మం. అప్పటి సామాజిక వ్యవస్థలో వంశ నిరంతరత కోసం, నిస్సంతాన మరణం సంభవించినప్పుడు, స్త్రీ సమ్మతితో, ధర్మనియమాల ప్రకారం, సంతానం కలిగించడాన్ని నియోగం అంటారు. ఇది కామప్రేరిత వ్యవహారం కాదు; రాజధర్మంలో భాగంగా పరిగణించిన బాధ్యత.
సత్యవతి, భీష్ముని ప్రతిజ్ఞను గౌరవిస్తూ, వేదవ్యాసుడిని ఆహ్వానిస్తుంది. వేదవ్యాసుడు అంటే కేవలం ఋషి కాదు; ధర్మాన్ని కాలానికి అనుగుణంగా ఆచరణలో పెట్టిన మహర్షి.
వ్యాసుడు నియోగ ప్రక్రియ ద్వారా అంబిక, అంబాలికల వద్దకు వెళ్లి సంతానం ప్రసాదిస్తాడు. అయితే ఈ ప్రక్రియ కేవలం శారీరక సంఘటనగా నిలవలేదు; మానసిక స్థితులే సంతాన లక్షణాలను నిర్ణయించినట్టుగా ఇతిహాసం వివరిస్తుంది. భయంతో కన్నులు మూసుకున్న అంబికకు జన్మించినవాడు అంధుడైన ధృతరాష్ట్రుడు. భయాన్ని లోపల దాచుకున్న అంబాలికకు పాండురోగంతో పాండు పుట్టాడు. సేవకీ కన్యకు జన్మించిన విదురుడు ధర్మబుద్ధితో, ప్రాజ్ఞతో వెలిగాడు. ఈ ముగ్గురి జన్మలోని సంకేతాత్మకత మహాభారత కథానకానికి మూలస్తంభంగా నిలుస్తుంది.
ధృతరాష్ట్రుడు శారీరక అంధత్వంతో పుట్టినా, రాజ్యంపై అపారమైన అనురాగం కలవాడు. కానీ ఆ అంధత్వమే అతని నిర్ణయాల్లో పాక్షికతకు కారణమైంది. పాండు శారీరక బలహీనతతో ఉన్నా, రాజధర్మాన్ని అవగాహన చేసుకున్న యోధుడిగా ఎదిగాడు. విదురుడు మాత్రం రాజ్యానికి సింహాసనం దక్కకపోయినా, ధర్మబోధకుడిగా, నైతిక మార్గదర్శిగా రాజసభలో కీలక పాత్ర పోషించాడు.
నియోగం ద్వారా పుట్టిన ఈ సంతానం మహాభారత యుద్ధానికి బీజాలు వేశారు. ధృతరాష్ట్రుని కుమారులైన కౌరవులు, పాండు కుమారులైన పాండవుల మధ్య సంఘర్షణలకు మూలం ఈ జన్మలలోనే ఉంది. అదే సమయంలో, విదురుని ధర్మవాక్యాలు కథానాయకులకు మార్గదర్శకంగా నిలిచాయి. అంటే నియోగం కేవలం వంశాన్ని నిలిపిన సాధనం కాదు; అది భవిష్యత్తు సంఘర్షణలకు దారితీసిన శక్తి కూడా.
ఈ ఘట్టం ద్వారా మహాభారతం ఒక కీలక సందేశాన్ని ఇస్తుంది: ధర్మం అనేది కాలబద్ధం. అప్పటి సమాజంలో రాజ్యస్థిరత్వం కోసం తీసుకున్న నియోగ నిర్ణయం ధర్మబద్ధమే. కానీ దాని ఫలితాలు మానవ దౌర్భల్యాలను, మానసిక స్థితుల ప్రభావాన్ని బలంగా చూపిస్తాయి. అందుకే విచిత్రవీర్యుడి నిస్సంతాన మరణం నుంచి నియోగం వరకు సాగే ఈ ఘట్టం మహాభారత కథలో ఒక మానవీయ–నైతిక అధ్యాయంగా నిలుస్తుంది.
సమాప్తం
***
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
•
|