Posts: 898
Threads: 13
Likes Received: 7,006 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
16-03-2026, 08:11 PM
Part-1
ఈ కథ పూర్తిగా కల్పితం.
దేవీ నవరాత్రులు దేశమంతటా చాలా గొప్పగా జరుగుతున్నాయి. కొందరు భక్తులు అమ్మపై భక్తితో, నమ్మకంతో ఆరాధిస్తున్నారు. కొందరు భక్తులు తమ ఆడంబరాలను చూపిస్తున్నారు.
అమ్మకు తెలియదా భక్తుల మనోభావాలు.
దేవీ నవరాత్రులు ఒకపక్క జరుగుతూ ఉంటే ఆ రాత్రి ఒక నిండు గర్భిణీ ఆయాసంతో పరుగులు పెడుతుంది. తనకి తెలుస్తుంది తన ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోవడానికి సిద్ధంగా ఉంది అని.
తన వెనుక వస్తున్న మనుషులను చూసి భయంతో పరుగు పెడుతుంది. పక్కనే కనిపిస్తున్న అమ్మవారి గుడి లోకి వెళ్లి దాక్కుంది. పరుగు పెట్టడం వల్ల నా విపరీతంగా దాహం వేస్తుంది తనకి. తన ప్రాణాలు పోయినా సరే, తన కడుపులో ఉన్న బిడ్డని కాపాడమని అమ్మవారిని ప్రార్థిస్తుంది.
అమ్మలను కన్నా అమ్మ లోక సంరక్షకురాలు తన బిడ్డ మొర ఆలకించకుండా ఉంటుందా? ఆ చల్లని తల్లి చూపు చాలు కదా! దాహం దాహం అనే కలవరిస్తున్న ఆమె దగ్గరకు సుధా అనే భక్తురాలు వచ్చి చూసింది. సుధా వచ్చి మంచినీరు ఇచ్చింది. ఆ గర్భిణీ స్త్రీ అవి తాగి ఆమెకు కృతజ్ఞతలు చెప్పింది.
ఆ గర్భిణీ స్త్రీ ని వెతుకుతూ వచ్చిన మనుషులు గుడిలోనికి వచ్చి అంతా వెతుకుతూ ఉన్నారు. అందరినీ అడుగుతున్నారు. ఎవరూ చూడలేదు అని చెబుతున్నారు. మరలా వాళ్ళు గుడి బయటకు వెళ్లి అంతా వెతుకుతున్నారు.
సుధా ఆ గర్భిణీ స్త్రీ ముఖాన్ని తెలిపారు చూసింది. ఆమె ముఖము చాలా అలసటగా ఉంది. అలాగే చాలా వర్చస్సు తో కళగా ఉంది. కలవారి కోడలుగా కనిపిస్తుంది.
ఆ గర్భిణీ స్త్రీ కి నొప్పులు కూడా మొదలైనాయి. సుధకు ఏమి చేయాలో అర్థం కాలేదు. కొందరు సహాయంతో దగ్గరలో ఉన్న హాస్పటల్ కి తీసుకు వెళ్లింది. ఆమెకు తన పరిస్థితి అర్థం అవుతుంది తన ఇంకా ఎక్కువ సేపు ఉండనని అర్థం చేసుకుని సుధతో చెబుతుంది.
అమ్మ, మన మధ్య ఉన్న బంధం ఏమిటి అన్నది నాకు తెలియదు. పుట్టే బిడ్డ ఎవరైనా సరే నా బిడ్డ అని లోకానికి తెలియనివ్వద్దు.
అమ్మవారి అనుగ్రహంతో ఎప్పుడు తన వంశంలోకి వెళ్లాలో అప్పుడు వెళుతుంది. అనాధగా పెరిగిన పరవాలేదు. ఇప్పుడు తెలియకూడదు తెలిస్తే పసికందు అని చూడకుండా చంపేస్తారు. రక్షించమని ప్రాధేయపడింది.
ఏమి చెయ్యాలో సుధకి అర్థం కాలేదు. సుధ కి కూడా భయంగా ఉంది . తను ఒక సామాన్యురాలు ఇలాంటి పరిస్థితి రావడం ఇదే మొదటిసారి. ఇటు చూస్తే గర్భిణీ స్త్రీ పరిస్థితి ప్రమాదంగా ఉంది. సరే ఏదైతే అది అయ్యిందని అమ్మవారి మీద భారం వేసి మాట ఇచ్చింది.
ఆమెను తొందరగా హాస్పిటల్ లో జాయిన్ చేసి పురిటి నొప్పులు వింటూ అమ్మవారిని ప్రార్థిస్తుంది. ఆమెకు డెలివరీ అయ్యి పండింటి ఆడపిల్ల పుట్టింది.
ఆ బిడ్డ కోసం ఒక కుటుంబం ఎదురు చూస్తూ ఉంది.
ఎప్పటికి ఆ బిడ్డ ఆ ఇంటికి చేరుతుందో కాలమే సమాధానం చెప్పాలి.
కథ కొనసాగుతూ ఉంది....
Posts: 4,804
Threads: 9
Likes Received: 3,181 in 2,464 posts
Likes Given: 11,247
Joined: Sep 2019
Reputation:
31
Posts: 898
Threads: 13
Likes Received: 7,006 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
Part - 2
21 సంవత్సరాలు తరువాత,,,
రేపల్లె గ్రామం, తూర్పుగోదావరి జిల్లా ( కల్పితం),
ఆంధ్రప్రదేశ్..
శకుంతల అమ్మ, శకుంతల అమ్మ అని ఒక మహిళ ఒక ఇంటి ముందు నుంచి పిలుస్తుంది. ఆ ఇల్లు ఒక ఎకరం విస్తీర్ణంలో ఉంది. ఇంటి చుట్టు పూల మొక్కలు, పెరటి వైపు తులసి కోట, కూర గాయల మొక్కలతో ఉంది. ఇంటి ముందు కళ్ళాపు జల్లి నిండుగా ముగ్గు వేసి ఉంది. ఆ ఇల్లు నిండుగా లక్ష్మీ కళ తో, ఆధ్యాత్మిక భావనంతో, సంతోషాల నిలయమై ఉంది.
ఆ మహిళా పిలుపు విని శకుంతల గారు బయటకు వచ్చారు. శకుంతల గారి వయసు 90 సంవత్సరాలు పైన ఉంటాయి. ఇంటికి పెద్ద దిక్కు. ఆమె మాటను ఇంటిలోని వారందరూ గౌరవిస్తారు. వయసు పై పడటంతో కర్ర సహాయంతో నడుస్తున్నారు. చాలా గంభీరంగా ఉంటారు దైవభక్తి చాలా ఎక్కువ. నిత్యం భగవంతునికి పూజ చేయనిదే గంగైనా ముట్టుకోరు.
శకుంతల గారు బయటకు వచ్చే ఏమైంది అని గంభీరంగా అడిగారు. అప్పుడు ఆ మహిళ శకుంతల గారిని చూస్తూ ముక్కు చీదుతూ, అమ్మ చూశారా మీ ముని మనవరాలు ఏమి చేసిందో అని రాగాలు తీస్తుంది.
దానికి చిరాకు వచ్చి గట్టిగా అరుస్తారు. చెప్పి అయినా ఏడువు , ఏడ్చి అయినా చెప్పు, అంతేగాని రెండు కలపకు అని అరుస్తారు.
అప్పుడు ఆ మహిళ భయపడి ఇలా చెబుతుంది. మేము పాలు తీసుకుని పక్కన ఉన్న ఆశ్రమానికి తీసుకు వెళుతూ ఉంటే మీ మనవరాలు అన్ని పారబోసింది. మాకు ₹2,000 నష్టమని శోకాలు పెట్టింది.
అది విన్న శకుంతల గారు కోపంతో ఏయ్ నోరు ముయ్. నా బంగారం తొందరపడి ఆలోచన లేకుండా చేయదు. ఏమి జరిగిందో నేను కనుక్కుంటాను అని సాంబాని గట్టిగా పిలుస్తారు.
సాంబ ఇంటి పెద్ద పాలేరు. నమ్మినబంటు. తరతరాలగా సాంబా పూర్వీకులు ఈ కుటుంబంతోనే ఉన్నారు.
సాంబ పరిగెత్తుకుని వచ్చి ఏమైందమ్మా అని అడుగుతాడు అప్పుడు శకుంతల బామ్మ జరిగింది చెప్పి ఏం జరిగింది అని గట్టిగా అడుగుతారు.
అప్పుడు సాంబా కొడుకు వచ్చి చెబుతాడు. వాడి పేరు నాని. వయస్సు 8 సంవత్సరాలు ఉంటాయి. బామ్మ గారు మరి ఏమో వీళ్ళు పాలల్లో నీళ్లు కలిపి రోజు పట్టికెళుతున్నారు. అక్క అది చూసి తప్పు అని చెప్పింది వీరు వినలేదు అందుకే ఈరోజు పారబోసాము అని చెప్పాడు.
అది విని శకుంతల బామ్మ గారు కోపంతో ఆ మహిళ మీద అరుస్తారు. తప్పు నీ వైపు ఉంది నా బంగారాన్ని అంటే ఊరుకోను అని గట్టిగా అంటారు.
ఆ మహిళ కోపంతో నీ మనవరాలు ఏం చేసినా వెనకేసుకు వస్తున్నారు. రేపు అదే మీకు పెద్ద ప్రాబ్లం అవుతుందని కోపంతో చెప్పి వెళ్ళిపోతుంది. తన చేసిన తప్పు అందరికీ తెలిసింది అని డబ్బులు పోయాయి అని ఉక్రోషంతో వెళ్లిపోతుంది.
శకుంతల గారు కోడల్ని గట్టిగా పిలుస్తారు సులోచన అని.. అంతే సులోచన గారు భయంగా పరుగున వస్తారు.
సులోచన భర్త అయిన రామచంద్రయ్య గారు భార్య పరుగు చూసి ఎక్కడికి సులోచన అ పరుగు?? నువ్వు ఏమైనా చిన్నపిల్లవి అనుకుంటున్నావా అని చిన్నగా మందలిస్తారు
ఆవిడ కోపంగా భర్త వంక చూస్తూ అత్తయ్య గారు పిలుస్తున్నారు వెళ్ళవద్దా అని అడుగుతారు. అంతే ఆ మాటకు రామచంద్రయ్య గారు బిగుసుకుపోయారు. సులోచన గారు గట్టిగా పిలుస్తారు ఏవండీ అని...
అంతే ఆయన వెంటనే స్పృహలోకి వచ్చి తొందరగా వెళ్ళు నన్ను అడిగితే పొలం వెళ్లడానికి బయలుదేరాను అని చెప్పు చెమటలు తుడుచుకుంటారు. రామచంద్రయ్య గారు పేపర్ పక్కన పెట్టి గబగబా పొలం వెళుతూ ఉంటారు.
ఇంత వయసు వచ్చిన ఈయనకే వీళ్ళ అమ్మ భయం పోలేదు నాకు అత్తగారు భయం పోతుందా ఎప్పటికైనా అని అనుకుంటారు సులోచన గారు.
ఒక్క చూపు భర్త గారిని చూసి అత్తగారి దగ్గరికి పరుగున వెళతారు సులోచన.
శకుంతలా బామ్మ గారు కోడల్ని చూడగానే అడుగుతారు బంగారం ఎక్కడ అని??
సులోచన గారికి మాత్రం ఏం తెలుస్తుంది ? మనవరాలు ఎక్కడ ఉందని?? తన కొడుకులు, మనవళ్ళు చేసే గారాబంతో ఏ అల్లరి పనిలో ఉందో ఎవరిని దుమ్ము దులుపుతుందో తెలియక ఆవిడ బిక్క మొహం వేసి అత్తగారి వంక భయంగా చూస్తూ నిలబడింది.
శకుంతల గారు కోడలి వంక చూస్తున్నారు ఏమి సమాధానం చెబుతుందా అని..
కథ కొనసాగుతూ ఉంది....
Posts: 4,804
Threads: 9
Likes Received: 3,181 in 2,464 posts
Likes Given: 11,247
Joined: Sep 2019
Reputation:
31
Posts: 1,588
Threads: 2
Likes Received: 934 in 717 posts
Likes Given: 2,110
Joined: May 2019
Reputation:
10
Baagundi.. 21 yrs later. Sudha garu eri? Aa thalli ki emaindi?
Posts: 898
Threads: 13
Likes Received: 7,006 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
(17-03-2026, 05:13 PM)ash.enigma Wrote: Baagundi.. 21 yrs later. Sudha garu eri? Aa thalli ki emaindi?
Adi Future Updates Lo Vasthadi
Friends Munde Chebutuna Emotions Control Chesukoleka Pothe Nenu Emi Cheyalenu
Posts: 898
Threads: 13
Likes Received: 7,006 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
Part - 3
శకుంతల బామ్మ గారి కుటుంబం గురించి తెలుసుకుందాము.
శకుంతల గారికి ఒక్కడే కొడుకు రామచంద్రయ్య గారు.
వీరమాచినేని రామచంద్రయ్య గారు ఆయన భార్య సులోచన .
వీరికి ఇద్దరు కొడుకులు పెద్దకొడుకు - శివప్రసాద్ అతని భార్య జయంతి.
రెండవ కొడుకు - భాను ప్రసాద్ అతని భార్య ధరణి.
శివప్రసాద్ గారికి ఇద్దరు కొడుకులు - లలిత్ ,చరణ్.
భాను ప్రసాద్ గారికి ఒక కొడుకు ఒక కూతురు- స్వరూప్, శాంభవి.
అమ్మవారి అనుగ్రహంతో ఆడపిల్ల పుట్టిందని శాంభవి అని పేరు పెట్టి, ప్రతి నెల పౌర్ణమికి లలితా దేవి హోమం ఖచ్చితంగా జరిపిస్తూ ఉంటారు.
ఊరిలో వారిది చాలా పలుకబడి ఉన్న కుటుంబం. శాంభవి పుట్టిన తర్వాత వాళ్ళ ఆస్తులు, గౌరవం అన్ని ఎన్నో రెట్లు పెరిగాయి ఇంటి మొత్తానికి ఒక్కతే ఆడపిల్ల అని చాలా గారాభం.
రామచంద్రయ్య గారు తన స్నేహితుల కూతుర్లను తన ఇంటి కోడలుగా చేసుకున్నారు. స్నేహితులయితే కలిసి ఉంటారని రామచంద్రయ్య గారి అభిప్రాయం . ఆయన అభిప్రాయాన్ని ఇంటికోడలు ఇద్దరు బాగా నిలబెట్టారు. అందరూ ఒకే మాట మీద ఉంటారు అందుకే ఈ కుటుంబం అంటే చుట్టుపక్కల అందరికీ చాలా గౌరవం.
శాంభవి పుట్టిన తర్వాత, శాంభవి పైన ఉన్న అతి ప్రేమతో బయట కాలేజ్స్ కి కాలేజెస్ కి వెళితే ఇబ్బంది పడుతుందేమో అని రామచంద్రయ్య గారు కాలేజ్స్ అండ్ కాలేజెస్ స్టార్ట్ చేస్తారు.
శాంభవి పెరుగుతున్నట్లుగానే కాలేజెస్ అండ్ కాలేజ్స్ కూడా బాగా డెవలప్ అయి చుట్టుపక్కల చాలా బ్రాంచెస్ ఓపెన్ చేస్తారు.
శాంభవి ఏకసంతాగ్రహి. ఒకసారి ఏదైనా విన్నది అంటే మర్చిపోదు. సంగీతం మంచి పట్టు ఉంది క్లాసికల్ డాన్స్ కూడా చాలా బాగా చేస్తుంది. కుదురు తక్కువ అల్లరి ఎక్కువ.
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువా అన్నట్టు క్లాసులో తక్కువ ,ఆటల్లో గొడవల్లో ఎక్కువగా ఉంటుంది. శాంభవి అల్లరి శకుంతల బామ్మ కి తెలియకుండా అన్నలు చూసుకునేవారు. ఇంకేం శాంభవి అల్లరి అడ్డు అనేది లేకుండా అయిపోయింది.
శివ ప్రసాద్ గారు లోకల్ రాజకీయాల్లో చురుగ్గా ఉంటారు. చుట్టుపక్కల ఏదైనా సమస్య వస్తే జనం ఆయన దగ్గరికి వస్తారు. జయంతి గారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన భర్త రాజకీయాల గురించి ఇంటి దగ్గరే ఉండి అన్ని వ్యవహారాలు చూసుకుంటూ ఉంటారు.
భాను ప్రసాద్ గారికి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ఆయన ఎంఎస్సీ అగ్రికల్చర్ లో గోల్డ్ మెడలిస్ట్. ఊరిలోనే వ్యవసాయంపై ప్రయోగాలు చేస్తూ సాంప్రదాయ పద్ధతిలో డెవలప్ చేస్తూ ఉంటారు. ధరణి గారు వాళ్ళ కాలేజీలోనే మ్యాథ్స్ లెక్చర్ గా చేస్తున్నారు.
ఇంట్లో మగవాళ్ళ గారాబంతో శాంభవి అల్లరికి హద్దు అనేది ఉండదు. ఎంత అల్లరి చేస్తుందో, అంతే పద్ధతిగా మన సాంప్రదాయాల్ని పాటిస్తుంది.
లలిత్, చరణ్, స్వరూప్ వాళ్ళ స్టడీస్ కంప్లీట్ చేసుకుని వాళ్ళ బిజినెస్ అయిన కాలేజ్ అండ్ కాలేజెస్ అన్నీ చూసుకుంటూ ఉంటారు. అన్నదమ్ములు ముగ్గురు ఒకే మాట మీద ఉంటారు.
హైదరాబాద్...
Rolls - Royce కార్ హైదరాబాద్ హైవే మీద చాలా ఫాస్ట్ గా వెళుతుంది.. కారు నడుపుతున్న వ్యక్తి చాలా స్పీడ్ గా అండ్ స్టైల్ గా నడుపుతున్నాడు. తన చూపు జింకను వేటాడే సింహం లాగా చాలా షార్ప్ గా ఉంది. అతను వెళ్లే స్పీడ్ కి పక్కన కూర్చున్న అతని పిఏ అండ్ ఫ్రెండ్ అయిన ధీరజ్ బిగుసుకుపోయి కళ్ళు మూసుకుని కూర్చుంటాడు.
కారు ఆఫీస్ ముందు ఆగగానే డ్రైవింగ్ ప్లేస్ లో ఉన్న అతను, తన పక్కన బిగుసుకుపోయిన ధీరజ్ ను చిరాకుగా చూసి డిప్ప మీద ఒకటి పీకుతాడు. ఏమైందిరా అలా బిగుసుకుపోయావు అని అడుగుతాడు. దానికి ధీరజ్ బిత్తరచూపులు చూస్తూ ప్లీజ్ R. D రేపటినుండి నేను సపరేట్గా వస్తాను. నీ డ్రైవింగ్ కి నాకు హార్ట్ ఎటాక్ వచ్చేలా ఉంది అని చెమటలు తుడుచుకుంటాడు.
దానికి R. D నవ్వుతూ నువ్వేగా నా డ్రైవింగ్ చూడాలని ఉత్సాహపడ్డావు ఇప్పుడు ఎందుకిలా మాట్లాడుతున్నావు అని కన్నింగ్ స్మైల్ తో అడుగుతాడు. దానికి ధీరజ్ బుద్ధి తక్కువై అని చెప్పి, కారు దిగుతాడు.
కారు దిగి ఆఫీస్ ని చూస్తారు. ఆఫీస్ మొత్తం 20 ఎంతస్తుల బిల్డింగ్ లో ఉంటుంది.
G. B సొల్యూషన్స్ అనే గోల్డ్ ఇటాలిక్ లెటర్స్ లో అందంగా చెక్కి ఉంటుంది. ఆ నేమ్ చూస్తూ R. D అండ్ అతని పిఏ లోపలికి వెళ్తారు.
R. D ఆ కంపెనీలో వన్ ఆఫ్ ద మెయిన్ రోల్.
జి బి సొల్యూషన్స్ ప్రపంచ దేశాలు అన్నింటిలో విస్తరించి ఉంది. వీరి చేయని బిజినెస్ అంటూ ఏదీ లేదు. ఎథిక్స్ అండ్ వాల్యూస్ బాగా ఫాలో అవుతారు.
పర్సనల్ లిఫ్ట్లో పైకి వెళ్లి తన ఛాంబర్ లోకి వెళ్లి డోర్ ఓపెన్ చేస్తాడు. లోపలికి వెళ్లగానే నాలుగు కళ్ళు R. D. ని చూసి నవ్వుతాయి. R. D. కూడా వాళ్ళని చూసి స్మైల్ చేస్తాడు.
ఆ నాలుగు కళ్ళు ఎవరు?
రేపల్లెలో ఉన్న శాంభవి R. D.ని ఎలా కలుస్తుంది??❤️❤️
Posts: 898
Threads: 13
Likes Received: 7,006 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
Part - 4
R. D క్యాబిన్ లోపలికి వెళ్ళగానే వాళ్ళిద్దరిని చూసి, ఏంటి బావలిద్దరికీ గాలి ఇటు మళ్ళింది. మీ క్యాబిన్ వదిలేసి నా క్యాబిల్లోకి దూరారు అని వెటకారంగా అడుగుతాడు.
వాళ్ళిద్దరూ అంత వెటకారం వద్దులే బావ. వర్క్ బిజీ లో పడి వీకెండ్ పార్టీ మిస్ అవుతున్నాం. సో ఈవినింగ్ వెళదామని నీతో చెప్పడానికి వచ్చాము అని చెబుతారు.
రుద్ర దేవాన్ష్ గజపతి ( R. D) వాళ్లకి ఓకే చెప్పి, అమ్మమ్మ, తాతయ్య ఎలా ఉన్నారు?? అని అడుగుతాడు. దానికి బావలు ఇద్దరు నిట్టూర్చి అలాగే ఉన్నారు అంటారు.
దానికి R. D నిట్టూర్చి ఈ ప్రాబ్లంకి తొందరగా సొల్యూషన్ వెతకాలి. ఆ పర్సన్ ఎవరో గాని తొందరగా వెతకాలి అని అంటాడు. దానికి ఇద్దరూ అవును అని తలూపుతారు.
అప్పుడే లోపలికి వచ్చిన ధీరజ్, వీళ్లిద్దరినీ చూసి గుడ్ మార్నింగ్ విహాన్ సార్, గుడ్ మార్నింగ్ అద్వైత్ సార్ అని చెబుతాడు.
దానికి ఇద్దరూ ఏరా బలిసిందా అని అడుగుతారు. దానికి ధీరజ్ లేదు సార్, మీ అంత కాదు సార్ ఏదో కొంచమే, అని వినయానికే వినయంగా చెబుతాడు.
వెంటనే ఇద్దరూ లేచి ఒకరు మెడ మీద చేతులు వేస్తే, ఇంకొకరు పొట్టలో గుద్దుతారు. అబ్బా ప్లీజ్ నన్ను వదలండి. పొద్దుట మీ బావ యముడికి హాయ్ చెప్పించాడు, ఇప్పుడు మీరు గెలాక్సీ చూపిస్తున్నారు. ప్లీజ్ నన్ను వదలండి బాబు అని రిక్వెస్ట్ చేస్తాడు. అలారా దారికి! ఈవినింగ్ రెడీగా ఉండు పబ్ కి వెళదామని చెబుతారు.
మనం మళ్లీ రేపల్లె వెళదాము....
శకుంతల బామ్మ గారు సులోచనను గట్టిగా పిలిచి అడుగుతారు బంగారం ఎక్కడ అని అ?? ది అత్తయ్య మరేమో అని నసుకుతూ ఉంటారు.. ఏమైంది అని అడుగుతుంటే వెంటనే నాని (సాంబ కొడుకు )వచ్చి సులోచన గారికి హింట్ ఇస్తాడు.
బంగారం గుడికి వెళ్లి అటు నుంచి అంటే కాలేజీకి వెళుతుందని అని చెబుతాడు. వెంటనే సులోచన గారు పాఠం చెప్పినట్టు గబగబా చెబుతారు.
దానికి బామ్మగారు మురిసిపోతూ బంగారం ఎప్పుడూ బంగారమే. అని గొడవ అంతా మర్చిపోయి భగవద్గీత తెరుస్తారు. సులోచన గారు ఊపిరి తీసుకుని మెల్లగా లోపలికి వెళ్తారు.
అత్తగారి అవస్థలు చూసి జయంతి, ధరణి ముసిముసి నవ్వులు నవ్వుతారు. అది చూసి సులోచన గారు ఉడుక్కుంటూ నవ్వండి, బాగా నవ్వండి . మీ ఇద్దరికీ మా అత్తగారి లాంటి అత్తగారు రాక నేను అలసిపోయానని మూతి ముడుచుకుంటారు.
వెంటనే కోడలు ఇద్దరు అత్తగారిని పట్టుకుని మా అత్తగారు సో స్వీట్, మీరు ఇలా మూతి ముడిస్తే మావయ్య గారికి చాలా కష్టమని అల్లరి చేస్తూ ఉంటారు.
దానికి సులోచన గారు సిగ్గుపడతారు. వెంటనే సులోచన గారు తేరుకుని ధరణి ఇంతకీ మన రాక్షసి ఏది? అత్తయ్య గారు అడుగుతుంటే చాలా కంగారు వచ్చింది.
కరెక్ట్ టైంకి నాని వచ్చే రక్షించాడు అని చెబుతారు. అదేంటి నాని ఇంకా కాలేజ్ కి వెళ్లలేదా అని జయంతి అడుగుతుంది.
వెంటనే ధరణి అయితే ఇది కాలేజ్ ఎగ్గొట్టి ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉంటుంది అత్తయ్యఅంటుంది. అయినా నేను ఇంకా కాలేజీకి వెళ్లలేదు కదా! కాలేజ్ టైమ్ ఇంకా ఉంది కదా అత్తయ్య అంటుంది ధరణి.
వెంటనే సులోచన గారికి పగలే చుక్కలు కనపడి చెమటలు పడతాయి. ఏమైంది అత్తయ్య?? అంత టెన్షన్ పడుతున్నారు అని అడిగితే?
వెంటనే సులోచన గారు చెప్తారు, ఆ రాక్షసి నాని గాడితో కాలేజీకి వెళ్లానని చెప్పించింది. మా అత్తగారి నన్ను అడిగేటప్పటికీ, నేను టెన్షన్ లో అదే చెప్పాను
ఇప్పుడు అత్తయ్య గారికి తెలిస్తే నా పరిస్థితి ఏంటి? అన టెన్షన్ పడుతూ ఉంటారు..
ఇప్పుడు కోడలు ఇద్దరు వాళ్ళ అత్తగారిని ఎలా సేవ్ చేస్తారు??
ఇంతకీ రాక్షసి ఎక్కడికి వెళ్ళింది??
కథ కొనసాగుతుంది...
Posts: 4,804
Threads: 9
Likes Received: 3,181 in 2,464 posts
Likes Given: 11,247
Joined: Sep 2019
Reputation:
31
Posts: 1,588
Threads: 2
Likes Received: 934 in 717 posts
Likes Given: 2,110
Joined: May 2019
Reputation:
10
Ayyababoi.. okasari cloud burst laga.. inni characters vachi padday!
But Sudha, aa thalli, aa thalli puttina bidda.. still unanswered!!
Posts: 898
Threads: 13
Likes Received: 7,006 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
(18-03-2026, 02:46 PM)ash.enigma Wrote: Ayyababoi.. okasari cloud burst laga.. inni characters vachi padday!
But Sudha, aa thalli, aa thalli puttina bidda.. still unanswered!!
I Hope Mi Question ki Answer Next 5days lo vache Updates lo Dorukuthundhi
Posts: 898
Threads: 13
Likes Received: 7,006 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
Andariki Ugadi Subhakankshalu
Posts: 898
Threads: 13
Likes Received: 7,006 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
Part - 5
రేపల్లె...
జయంతి, ధరణి అత్తగారి దగ్గరికి వచ్చి, మీరు కంగారు పడకండి అత్తయ్య. పిల్లలకి ఫోన్ చేస్తామని చెప్పి వాళ్ల ఫోను తీసుకుని కొడుకులకి ఫోన్ చేస్తారు.
లలిత్, స్వరూప్ వాళ్ళ ఫోన్ లోకి వస్తున్న కాల్ చూసి, మళ్లీ బంగారం ఏం చేసి ఉంటుందా అని ఫోన్ ఎత్తి ఏమైందమ్మా అని అడుగుతారు.
వెంటనే ఇంటిలో జరిగిందంతా చెబుతారు. సరే అమ్మ మీరు కంగారు పడకండి , మేము చూసుకుంటాం అని చెప్పి, చెల్లెలు కోసం సెర్చింగ్ మొదలు పెడతారు.
ఇంతలో ఒక మనిషి పరిగెత్తుకు వచ్చి,ఒక విషయం చెబుతాడు. వెంటనే ముగ్గురు అన్నదమ్ములు కంగారుగా బయలుదేరుతారు. వాళ్ళు వెళ్లేటప్పటికీ ఒక అబ్బాయిని కింద పడేసి కర్రతో కొడుతూ ఉంటుంది ఒక అమ్మాయి.
పక్కన ఇంకొక అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది నాని పక్కనే నుంచుని కొబ్బరి నీళ్లు బాటిల్ పట్టుకుని ఉంటాడు.
అక్క కాస్త బ్రేక్ ఇచ్చి ఇవి తాగి మళ్ళీ కొట్టు అని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు.
దెబ్బలు తింటున్నావాడు తింగరి చూపులు చూస్తూ, ఇక్కడ నా పరిస్థితి ఏమిటి? నువ్వు చెబుతున్నది ఏమిటి? అని పళ్ళు నోరుతూ ఉంటాడు.
అంతలో అక్కడికి ముగ్గురు అన్నదమ్ములు వచ్చి, బంగారం ఆగమ్మా అని కర్ర తీసుకుంటారు. దెబ్బలు తింటున్నా వాడు హమ్మయ్య అని అనుకుంటాడు.
కానీ వాడికి తెలియదు కదా! వచ్చింది యమకింకరులు అని, చెల్లి బాధకి గాని, కోపానికి గాని కారణమైన వాడిని కైమా కింద ఉతుకుతారని.
నాని ఆ అబ్బాయి వంక జాలిగా చూస్తాడు నీ పని ఇంకా అవుట్ అని పైకి చూస్తాడు.
బంగారం వాళ్ళ అన్నయ్యలు వంక కోపంగా చూస్తుంది. దానికి ఆమె అన్నయ్యలు అంత కోపం వద్దు బంగారం,, అంతసేపు కొడితే నీ చేతులు కందిపోతాయని. బంగారం నీ కళ్ళు ఎరుపు ఎక్కితే మంట వస్తుందని అంటారు.
దానికి దెబ్బలు తింటున్న వాడికి ఫ్యూజులు ఎగిరిపోయి, తింగరి చూపులు చూస్తాడు. దానికి బంగారం శాంతించి, అన్నయ్య వీడిది మన ఊరు కాదు.
నేను గుడికి వెళ్లి వస్తూ ఉంటే ఈ అమ్మాయిని ఏడిపిస్తున్నాడు. నాకు కోపం వచ్చింది అని చెబుతుంది.
దానికి ముగ్గురు అన్నదమ్ములు అబ్బాయిని చితక్కొట్టి వదులుతారు.
ఇంటికి వెళదాం బంగారం అంటే వద్దు నేను కాలేజీకి వెళ్తాను అని చెప్పాను ఇప్పుడు ఇంటికి వెళితే నానమ్మ బామ్మ దగ్గర ఇరుక్కుంటుందని చెప్పి, కాలేజ్ కి వెళుతుంది
కాలేజీ లోపలికి వెళ్ళగానే, అబ్బాయిలందరూ అలా చూస్తూ ఉంటారు. అబ్బా ఏముంటుందిరా పిల్ల! దీని అందం చూస్తే ఆగలేము. దీని వంక చూస్తే దీని అన్నయ్యలు మన తాట తీస్తారు కాలేజ్ వీళ్లది అయిపోయింది. ఏం చేస్తాము ఇంకా, అని ఉసురుమంటూ నేత్ర ఆనందం పొందుతారు.
అమ్మాయిలు గేటు వైపు చూసి, హాయ్ శాంభవి అంటారు. హాయ్ అని చెప్పి శాంభవి బెస్ట్ ఫ్రెండ్ అయినా మిత్రాన్ని చూసి ఏంటి సంగతులు అని అంటుంది. అంతా మామూలే అని పెదవి విరుస్తుంది.
ఇంకో ఫ్రెండ్ చెబుతుంది ఈసారి మన కాలేజీలో ఇంటెన్షిప్ కి ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. హైదరాబాద్ నుంచి చాలా కంపెనీస్ వస్తున్నాయంట అని చెబుతుంది.
దానికి శాంభవి రియాక్షన్ ఏమిటి??
Posts: 898
Threads: 13
Likes Received: 7,006 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
Part - 6
హైదరాబాద్....
R. D, ధీరజ్, విహాన్, అద్వైత్ కార్నర్ టేబుల్ దగ్గర కూర్చుని, వచ్చిన డ్రింక్ తాగుతూ ఉంటారు.
అప్పుడే అక్కడికి ఒక అమ్మాయి వచ్చి, హాయ్ బావ అంటూ స్వీట్ కే వేగుటు వచ్చే విధంగా పిలుస్తూ ఉంటుంది.
R. D, విసుగ్గా అమ్మాయిని చంపేసేలాగా ఒక చూపు చూస్తూ, తల పక్కకి తిప్పేస్తాడు. ఆ అమ్మాయి వెనకాల ఇంకొక అమ్మాయి వచ్చే విహాన్ న్ని పలకరిస్తుంది. ఆ అమ్మాయి చూపులకి చిరాకు వచ్చి, విహాన్ ఏంటి బావ మనకి ఇది . మనమేదో రిలాక్స్ అవుదామని పబ్బుకు వస్తే ఈ జిడ్డు మొహాలు తగులుకున్నారని మొహం వికారంగా పెడతాడు.
దానికి అమ్మాయిలు ఇద్దరు రిలాక్స్ అన్నమాట మాత్రమే మైండ్ లో పెట్టుకుని,, మేము ఇస్తాము కదా రిలాక్స్ బావ అని మత్తుగా అంటూ దగ్గరకు వస్తారు.
వెంటనే R. D కూల్ గా ఆ అమ్మాయి వంక కిల్లింగ్ లుక్స్ తో చూస్తాడు. ఆ చూపుకే అమ్మాయికి వెన్నులో వణుకు వస్తుంది. అయినా, లేని ధైర్యం తెచ్చుకుని ఫేక్ స్మైల్ తో దగ్గరికి వెళ్లి భుజం మీద చెయ్యి వేయబోతుంది.
వెంటనే R. D లాగిపెట్టి ఒకటి పీకుతాడు. దెబ్బకి పాపకి నక్షత్ర మండలం అంతా ఒకేసారి కనిపిస్తుంది. తాగిన మత్తుకి, దెబ్బ మొత్తుకి కింద పడుతుంది.
రెండో అమ్మాయి గబగబా వెళ్లి తనని లేపుతుంది. వాళ్ళ నలుగురు ఒక లుక్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు.
ఇద్దరు అమ్మాయిలు పళ్ళు నోరుతూ కోపంగా ఇంటికి వెళ్లి అత్త అని ఒకరు,, పిన్ని అని ఒకరు గట్టిగా అరుస్తారు.
ఇంటిలో ఉన్న అందరూ బయటకు వచ్చి వాళ్ళిద్దరి వాలకం చూసి ఏమైంది అని అడుగుతారు. అత్త ఎక్కడా అని మళ్లీ గట్టిగా అరుస్తుంది మొదటి అమ్మాయి.
అప్పుడే పైనుంచి గట్టిగా వినిపిస్తుంది ఏమైందో నిషా అని?? దానికి నిషా పైకి చూస్తుంది. అక్కడ ఒక నలభై మూడు సంవత్సరాల ఒక లేడీ ఉంటుంది. రాత్రిపూట అవడం వలన నైట్ వేర్ వేసుకుని ఉంటుంది.చూపు మాత్రం విషనాగు వలే ఉంటుంది.
అత్త ఆ R. D, నన్ను కొట్టాడు అంతే కాదు, ఆ విహాన్ కూడా ఆశాను అవమానించాడు. అందరి ముందు మాకు చాలా అవమానం జరిగింది అని ఇద్దరు దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటారు.
దానికి ఆ లేడీ నేను చూసుకుంటాను. చాలా లేట్ అయింది వెళ్లి పడుకోండి అని చెబుతుంది. దానికి ఆమె అన్నయ్య అయిన శేషేంద్ర వచ్చి 21 సంవత్సరాల నుంచి ఇదే మాట చెబుతున్నావు. కానీ ఏమీ చేయడం లేదు అని వంగ్యంగా మాట్లాడుతూ రెచ్చగొడతాడు.
అన్నయ్య అని గట్టిగా అరుస్తూ వాళ్ళు అన్నయ్య వంక కోపంగా చూస్తూ, మన ఎదురుగా ఉన్నది కోడి, మేక అనుకున్నావా?? సింహాలు.. ఆ గజపతి , భూపతి వారసులు. చాలా తెలివిగా ఆలోచించి దెబ్బ కొట్టాలి.
అంతేగాని పిల్లల ఆటలాగా వాళ్లను రెచ్చగొట్టి, మనం నవ్వుల పాలు కాకూడదు అనగానే,, ఆ ఇంటి పెద్దాయన నాగేంద్ర వర్మ అక్కడికి వచ్చి, మయూరి చెప్పింది నిజం. తొందరపడకూడదు శేషాద్రి అని అంటారు.
దానికి శేషాద్రి భార్య అయిన జ్యోతి, నాగేంద్ర భార్య అయిన లక్ష్మీ గారు వీళ్ళ వంక అసహ్యంగా చూస్తూ, పిల్లలు జీవితాన్ని పణంగా పెట్టి, ఈ పగలు ప్రతీకారాలు ఏమిటో అని అనుకుంటూ... వినాశకాలే విపరీత బుద్దులు అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు.
నాగేంద్ర వర్మ కి ముగ్గురు సంతానం ఒక కొడుకు ఇద్దరు కూతుళ్లు.
కొడుకు పేరు శేషాద్రి అతని భార్య జ్యోతి. వీరికి ఒక కూతురు నిషా.
పెద్ద కూతురు సరోజ ఆమె భర్త అవినాష్.
వారికి ఒక కూతురు ఆశ.
రెండవ కూతురు మయూరి ఆమె భర్త??
నాగేంద్ర వర్మ ఫ్యామిలీకి, G. B వాళ్ళ మధ్య ఉన్న సంబంధం ఏమిటి??
వారి మధ్య ఉన్న పగకు కారణం ఏమిటి??
అది ఎప్పటికీ చల్లారుతుంది??
అంతం అనేది ఉందా??
కథ కొనసాగుతుంది....
Posts: 4,804
Threads: 9
Likes Received: 3,181 in 2,464 posts
Likes Given: 11,247
Joined: Sep 2019
Reputation:
31
Superb update kaani characters ekkuva gaa vunnai readers ni kooda kastamee ee sari
Posts: 1,588
Threads: 2
Likes Received: 934 in 717 posts
Likes Given: 2,110
Joined: May 2019
Reputation:
10
Inkoka.. characters cloud burst! ?
Posts: 78
Threads: 0
Likes Received: 54 in 42 posts
Likes Given: 17
Joined: Nov 2023
Reputation:
0
శివ గారు స్టోరీ చాలా బాగుంది
కొద్దిగా ఎక్కువ ఇవ్వండి
Posts: 1,588
Threads: 2
Likes Received: 934 in 717 posts
Likes Given: 2,110
Joined: May 2019
Reputation:
10
No update today?
Ugadi holiday na?
Posts: 898
Threads: 13
Likes Received: 7,006 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
20-03-2026, 11:45 AM
(This post was last modified: 20-03-2026, 11:46 AM by SivaSai. Edited 1 time in total. Edited 1 time in total.)
ash.enigma Wrote:No update today?
Ugadi holiday na?
Undi Update Istunna Wait For 5 Mins
Please Give Ratings
•
Posts: 898
Threads: 13
Likes Received: 7,006 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
Part - 7
పబ్ నుంచి అబ్బాయిల నలుగురు ఇంటిదారి పట్టారు. నలుగురు డ్రింక్ చేసి ఉండడం వల్ల డ్రైవర్ వచ్చి వాళ్ళ నలుగురిని ఒకే మాన్షన్ లోనికి తీసుకు వెళ్ళాడు.
పొద్దుట సుప్రభాతంతో మెలకువ వచ్చినా నలుగురు ఒకరి తర్వాత ఒకరు లేచి కిందకు వచ్చారు.
కిందకు వచ్చిన నలుగురు పూజ చేసుకుని వచ్చిన కౌసల్య గారిని చూసి గుడ్ మార్నింగ్ అమ్మ అని విహాన్ అద్వైత్ చెబితే , గుడ్ మార్నింగ్ అత్తయ్య అని R. D, గుడ్మార్నింగ్ ఆంటీ అని ధీరజ్ ఒకేసారి చెబుతారు.
నలుగురిని ఒక చూపు చూసి సర్వెంట్ అయినా కాంతాన్ని పిలుస్తుంది. కాంతం నిమ్మకాయలు పిండిన నాలుగు మజ్జిగ గ్లాసులు తెస్తుంది.
తాగండి అని కౌసల్య గారు చెప్పగానే నలుగురు మాట్లాడకుండా తాగేస్తారు.
అప్పుడే వాకింగ్ పూర్తి చేసుకుని లోపలకు వచ్చిన జితేంద్ర గారు, దేవేంద్ర గారు ఏరా తాగింది దిగిందా అని కోపాన్ని నటిస్తూ అడుగుతారు.
నలుగురు బుద్ధిమంతుల్లాగా తలూపుతారు . రాత్రి పబ్బులో జరిగింది మాకు తెలిసింది.
వాళ్లతో జాగ్రత్త వాళ్ళు విష నాగులు కన్న ప్రమాదం అని దేవేంద్ర గారు పిడికిలి బిగిస్తారు. జితేంద్ర గారు తమ్ముడు భుజం మీద చేయి వేసి ప్రెస్ చేస్తారు.
అప్పుడే గదిలో నుండి బయటకు వచ్చిన అనసూయ గారు మనవళ్ళు ని చూసి పలకరిస్తారు. కొడుకులు వైపు చూస్తారు.
దేవేంద్ర గారు తల్లిని చూసి మౌనంగా అక్కడ నుండి వెళ్లిపోతారు. అది చూసి అనసూయ గారు చాలా బాధపడతారు. తన మూర్ఖత్వం వలన ఎలాంటి ఇల్లు ఎలా అయిపోయిందని బాధపడుతూ పూజ గది వైపు చూస్తారు.
పూజగది అంతా నిండు అలంకరణలతో, నైవేద్యాలతో నిండి ఉంటుంది.
కానీ చిరునవ్వు లేని పసిపాప మొఖం వలె ఆ పూజ గదిలో దీపారాధన ఉండదు. అనసూయ పూజ గదిని చూస్తూ, పక్కనే ఉన్న ఫోటోను చూసి బాధతో ఆవిడ చేసిన తప్పుకి కృంగిపోతారు. ఆ ఫోటోకి దండ వేసి ఉంటుంది.
R. D వాళ్ళ అమ్మమ్మగారి చెయ్యి మెత్తగా నొక్కి, తాతయ్య ఎక్కడ ఉన్నారు అని అడుగుతారు. దానికి అనసూయ గారు రోజు ఈ టైంకి మీ తాతగారు గార్డెన్ లోనే ఉంటారు అక్కడే ఉన్నారు అని చెబుతారు.
R. D గార్డెన్ దగ్గరికి వెళ్లి వాళ్ళ తాతగారైన రాఘవేంద్ర గారిని చూసి పలకరిస్తాడు. రాఘవేంద్ర గారు మనవడిని చూసి రా రుద్ర ఎంతసేపైంది అని అడుగుతారు.
రాత్రి వచ్చాను మిమ్మల్ని పలకరించి ఇంటికి వెళదామని ఆగాను అని చెబుతాడు. దానికి రాఘవేంద్ర గారు చిరు మందహాసం చేస్తారు.
రుద్ర వాళ్ళ తాత గారిని అడుగుతాడు ఇంకా ఎన్నాళ్ళు ఇలా అని?? దేని గురించి రుద్రా అని రాఘవేంద్ర గారు అడుగుతారు.
ఏమీ తెలియని వారి వల్ల అడగకండి అంటే, దానికి రాఘవేంద్ర గారు ఒక నిట్టూర్పు విడిచి, ఇలారా అని రుద్ర చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్తారు.
తిన్నగా పూజ గది దగ్గరికి తీసుకువెళ్లి పూజ గదిని చూపిస్తారు. అందరూ రాఘవేంద్ర గారిని పూజగదిని చూస్తారు.
ఈ పూజ గదిలో దీపం వెలిగి 21 సంవత్సరాలు అయింది. ఈ పూజ గది అనే కాదు, మనకు సంబంధించిన ఏ సంస్థలో కూడా ఎక్కడా కూడా దీపం వెలగడం లేదు. మన ఆఫీసుల్లో, ఫ్యాక్టరీల్లో కూడా ఎక్కడా కూడా దీపం వెలగడం లేదు.
దీనికి కారణం ఏమిటో కూడా మీ అందరికీ తెలుసు. దేవేంద్రకు జరిగిన అన్యాయాన్ని నేను ఎలాగా తీర్చలేను.
కానీ, మనకు సంబంధించిన ప్రతి చోట దీపాలు వెలిగి, నా కొడుకు కళ్ళల్లో సంతోషం చూసిన రోజున నేను ఈ మౌనాన్ని వదులుతాను.
ఈ సంతోషాన్ని వెనక్కి తీసుకువచ్చే బాధ్యత నా ముగ్గురు మనవళ్ళు మీద పెడుతున్నాను అని చెప్పి లోపలికి వెళ్లి పోతారు.
అక్కడి వాతావరణం అంతా గంభీరంగా ఉంటుంది. ఆ వాతావరణం తేలిక చేయడానికి ధీరజ్ అవును బావ, రాత్రి నువ్వు ఇక్కడికి వచ్చావు కదా! మరి ఆంటీకు ఫోన్ చేసి చెప్పావా అని రుద్రవంక చూసి ఐ బ్లింక్ చేస్తాడు.
దానికి రుద్రపళ్ళునూరుతూ నాకు తెలుసు. మా అమ్మని, నా డార్లింగ్ ని ఎలా కూల్ చేయాలో అని చెబుతూ అందరికీ బాయ్ చెప్పి ఇంటికి వెళతాడు.
ధీరజ్ కూడా అందరికీ బాయ్ చెప్పి బయటకు వెళుతూ, ఎంట్రన్స్ గేటు మీద ఉన్న బృందావనం అనే పేరు చూసి, ఇంటిపేరు బృందావనం.
పేరుకు తగ్గట్టు అన్ని ఉన్నాయి కానీ, సంతోషం లేదు. అనుకుంటూ వెళ్ళిపోతాడు.
రాఘవేంద్ర గారి మౌనం వెనుక ఉన్న అర్థం ఏమిటి??
బృందావనంలో సంతోషం లేకపోవడానికి కారణం ఏమిటి??
|